
అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రకటించిన కొత్త సుంకాల ప్రభావం వల్ల.. ఈ సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తుందని 'జేపీ మోర్గాన్' అంచనా వేసింద. ఈ మాంద్యం వల్ల యూఎస్ఏలో నిరుద్యోగం రేటు 5.3 శాతానికి చేరుతుందని.. మైఖేల్ ఫెరోలి అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం.. ఉద్యోగాల మీద మాత్రమే కాకుండా, దేశ జీడీపీ మీద కూడా ప్రభావం చూపిస్తుందని జేపీ మోర్గాన్ చీఫ్ యూఎస్ ఆర్థికవేత్త 'మైఖేల్ ఫెరోలి' వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులు కూడా 20 శాతం తగ్గుతాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేశారు. దీనివల్ల అగ్రరాజ్యంలో ఉద్యోగాలు ఉండవని చెబుతున్నారు.
ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల దిగుమతులు తగ్గుతాయి. జీడీపీలో దిగుమతులు 1986 ముందు స్థాయికి చేరుకుంటుందని.. యూబీఎస్ చీఫ్ యూఎస్ ఆర్థికవేత్త జోనాథన్ పింగిల్ ఒక నోట్‌లో తెలిపారు. దీనివల్ల ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్ధిక నష్టాన్ని అమెరికా చూడబోతోందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్‌గేట్స్ ఎదుటే ఉద్యోగుల నిరసన (వీడియో)
డొనాల్ట్ ట్రంప్ భారతదేశం మీద మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల మీద సుంకాలను విధించారు. అంతే కాకుండా మనుషులు లేని ఆస్ట్రేలియన్ దీవుల మీద కూడా 10 శాతం సుంకాలను ప్రకటించడం గమనార్హం. భారత్పై విధించిన సుంకాలలో 10 శాతం సుంకం ఈ రోజు (ఏప్రిల్ 5) నుంచి అమలులోకి వస్తుంది. మిగిలిన శాతం ఏప్రిల్ 10 నుంచి అమలులోకి రానుంది.