jp morgan
-
రిఫైనింగ్ మార్జిన్లు పెరిగినా.. రిటైల్‌పై అనిశ్చితి
రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు ఇటీవల మందగించడానికి కారణమైన రిఫైనింగ్ మార్జిన్లు పుంజుకున్నా, రిటైల్ విభాగం తీరుతెన్నులను అంచనా వేయడం కష్టతరమేనని బ్రోకరేజి సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. రిటైల్ ఆదాయంపై అనిశ్చితి నెలకొన్నట్లు ఒక నివేదికలో వివరించింది. మార్కెట్లు బలహీనంగా ఉండడంతో జియో/రిటైల్ విభాగాల లిస్టింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.నివేదిక ప్రకారం జూన్ నుంచి గణనీయంగా పడిపోయిన రిఫైనింగ్ మార్జిన్లు క్రమంగా మెరుగుపడ్డాయి. అయితే, రిటైల్ రంగం మందగమనంతో పాటు కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రభావాలు ఉండటంతో రిలయన్స్ రిటైల్‌కి సంబంధించి సమీప భవిష్యత్తు అంచనాలను వేయలేని పరిస్థితి నెలకొందని నివేదిక వివరించింది. జులై 8 నాటి గరిష్ట స్థాయి నుంచి రిలయన్స్ షేరు 22 శాతం క్షీణించిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా వాటితో పోలిస్తే రిలయన్స్ ఆకర్షణీయమైన ధరలో లభిస్తోందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌కు ఛాతీ నొప్పిరిలయన్స్లో ప్రధానంగా మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. మొదటిది ఆయిల్ రిఫైనింగ్.. పెట్రోకెమికల్, రెండోది టెలికం విభాగం జియో, మూడోది రిటైల్ సెగ్మెంట్. వీటితో పాటు మీడియా, న్యూఎనర్జీ వ్యాపారాలూ ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయంలో సుమారు 50 శాతం వాటా రిటైల్, టెలికం విభాగాలదే కావడం విశేషం. -
JP Morgan: మోదీ పనితీరు అద్భుతం
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారంటూ జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ ప్రశంసించారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్స్ సంస్థ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ సంస్కరణలను డిమోన్ కొనియాడారు.‘‘సమ్మిళిత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారత్‌లో ప్రధాని మోదీ 40 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారు. అక్కడ పలు రాష్ట్రాల్లోని పన్ను వ్యవస్థల సంక్లిష్టతలను ఛేదించి సంస్కరించారు. సానుకూల మార్పు దిశగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు’’ అంటూ మోదీని పొగిడారు. -
వివాదాలకు కేరాఫ్.. ఫైర్‌బ్రాండ్ మహువా
చిన్న కుక్కపిల్ల కస్టడీకోసం మాజీ సహచరునితో కావచ్చు.. పార్లమెంటులో ఏకంగా ప్రధాని మోదీతో కావచ్చు... మహువా మొయిత్రా అంటేనే పోరాటం. తెలివైన వ్యక్తి. ఆధునికంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఎక్కడ తప్పు జరిగినా ప్రశి్నస్తారు. పార్లమెంటులో బలమైన స్వరం. ఎంపీగా ఎన్నికైన నాటినుంచే మోదీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. ఆ క్రమంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. అంతే వివాదాస్పద రీతిలో నోటుకు ప్రశ్నల కేసులో లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు కూడా. కాంగ్రెస్‌లో మొదలై... దాదాపు 15 ఏళ్ల క్రితం ‘ఆమ్ ఆద్మీ కా సిపాహీ’ ప్రచారానికి నాటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎంపిక చేసిన యువజన కాంగ్రెస్ నాయకురాలిగా తొలిసారిగా మీడియా దృష్టిని ఆకర్షించారు మహువా. 1974 అక్టోబర్ 12 న అస్సాంలోని కచార్ జిల్లా లాబాక్‌లో జన్మించిన ఆమె అమెరికాలోని మసాచుసెట్స్‌లో మౌంట్ హోలియోక్ కాలేజీలో పై చదువులు చదివారు. అమెరికన్ మల్టీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్‌లో బ్యాంకర్‌గా న్యూయార్క్‌లో, లండన్‌లో పనిచేశారు. 2009లో ఉద్యోగం వదిలి భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత కాంగ్రెస్‌లో చేరినా 2010లో తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2016 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. 2019లో కృష్ణానగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అక్కడా అదే వాగ్ధాటి కొనసాగించారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో ప్రధాని మోదీ సంబంధం గురించి పదేపదే సభలో ప్రశ్నలు లేవనెత్తారు. ఈసారీ కృష్ణానగర్ నుంచే పోటీ చేస్తున్నారు... కొత్త రోల్ మోడల్స్ కావాలి.. ఖరీదైన బూట్లు, బ్రాండెడ్ బ్యాగులు కొనడానికి తనకు లంచాలు అవసరం లేదంటూ ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు మొయిత్రా. తనపై ఆరోపణలను భారత రాజకీయాల్లో ఇమిడి ఉన్న స్త్రీ ద్వేషంలో భాగంగా అభివర్ణించారు. ‘‘నేను ప్రగతిశీల కుటుంబంనుంచి వచ్చాను. భారతీయ స్త్రీ ఇలాగే ఉండాలనే మూస పద్ధతిలో పెరగలేదు. తృణమూల్ ఓ మహిళ సారథ్యంలో ఉంది. మమత మహిళలను ప్రోత్సహిస్తారు. అందుకే ఆ పార్టీలో చేరా. పార్లమెంటులో సగం మంది మహిళా ఎంపీలు టీఎంసీ వాళ్లే. ఎందుకంటే బెంగాల్లో స్త్రీలను శక్తిగా భావిస్తాం. మెదడున్న, గా చదువుకున్న, ఆర్థిక అవగాహన, ఆత్మవిశ్వాసమున్న స్త్రీని సగటు భారతీయ పురుషుడు, నాయకుడు ఎదుర్కోలేడు’’ అంటూ కుండబద్దలు కొడతారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళలకు సరికొత్త రోల్ మోడల్స్ అవసరమంటారు. ‘కుక్కపిల్ల కస్టడీ’ తో సీటుకే ఎసరు... పెంపుడు కుక్కపిల్ల కస్టడీ వ్యవహారం పార్లమెంటు నుంచి మొయిత్రా బహిష్కరణకు దారితీసింది. మాజీ సహచరుడు జై అనంత్ దెహద్రాయ్ నుంచి తమ పెంపుడు కుక్కపిల్ల కస్టడీ కోరుతూ కోర్టుకెక్కారు. ప్రతిగా అదానీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మొయిత్రా భారీగా లంచం, బహుమతులు తీసుకుంంటున్నారంటూ సీబీఐకి ఫిర్యాదు చేశారు. వ్యవహారం పార్లమెంటు ఎథిక్స్ కమిటీ విచారణ దాకా వెళ్లింది. పార్లమెంట్ లాగిన్ ఐడీని ఇతరులతో పంచుకున్నందుకు ఆమెను దోషిగా తేల్చి 2023 డిసెంబర్ 8న లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లాభాలు అదిరెన్.. పరిహారం కింద 299 కోట్లు దక్కించుకున్న సీఈఓ
2023లో అమెరికన్ బ్యాంకింగ్ చరిత్రలో ఇతర బ్యాంకుల కంటే జేపీ మోర్గాన్ భారీ లాభాల్ని అర్జించింది. దీంతో జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ పరిహారం దాదాపు 4.3 శాతం పెరగడంతో 36 మిలియన్లను (రూ. 299 కోట్లకు పైగా) దక్కించుకున్నారు. ఈ మొత్తంలో 1.5 మిలియన్ల మూల వేతనం, 34.5 మిలియన్లను ప్రదర్శించిన పనితీరు ఆధారంగా సొంతం చేసుకున్నట్లు ఫార్చ్యూన్ నివేదించింది. ‘2023 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక డిమోన్ పనితీరు కారణంగా సంస్థ లాభాల్లో గణనీయైమన వృద్ధిని సాధించింది’ అని బ్యాంక్ ఒక ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో జేపీ మోర్గాన్ 2023కి 49.6 బిలియన్ డాలర్ల లాభాల్ని అర్జించినట్లు తెలిపింది. ఈ వార్షిక ఆదాయాలు.. గతంలో వచ్చిన ఫలితాల్ని కంటే గణనీయంగా పెరిగాయి. 67 ఏళ్ళ వయసులో జామీ డిమోన్ అమెరికాలోనే అతిపెద్ద బ్యాంక్‌కు ఎక్కువ కాలం సీఈఓగా పనిచేస్తున్న ఘనతను సాధించారు. 2005 నుండి జేపీ మోర్గాన్ సీఈఓగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం అతని నికర విలువ 1.7 బిలియన్లని అంచనా -
24 ఏళ్లకే ఉద్యోగం.. 29 ఏళ్లకే రిటైర్మెంట్.. గూగుల్ ఉద్యోగి స్ట్రాటజీ అదిరింది!
24 ఏళ్లకే ఉద్యోగం..29 ఏళ్లకే రిటైర్మెంట్. ఆహా! జీవితం అంటే ఇది’ అని అనుకుంటున్నారా? ఐఐటీ బాంబే పూర్వ విద్యార్ధి డేనియల్ జార్జ్ (29) ఇలాగే అనుకున్నాడు. 6 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి చివరికి రిటైర్మెంట్ తీసుకున్నాడు. డేనియల్ జార్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణుడు. 2018లో జార్జ్ ఐఐటి బాంబే నుండి బిటెక్ పూర్తి చేశాడు. 24 ఏళ్ల వయస్సు అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఏడాదికి 265,000 డాలర్ల (సుమారు రూ. 2.20 కోట్లు) ప్యాకేజీతో జాబ్ సంపాదించాడు. అంత డబ్బు ఎలా ఆదా చేశాడు అతను గూగుల్‌లో పనిచేసే సమయంలో సంపాదించిన డబ్బును ఆదా చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో లెక్కలేసుకుని తన శాలరీని ఎంత మొత్తంలో ఆదా చేసే త్వరగా రిటైర్ అవ్వచ్చు? అనంతరం తన సొంత దేశమైన భారత్‌లో ఎలా నివసించవచ్చో గుర్తించాడు. అంతే అప్పటి నుంచి రిటైర్మెంట్ కోసం శాలరీని సేవ్ చేయడం మొదలు పెట్టాడు. గూగుల్‌లో పనిచేయడం ఓ కల గూగుల్‌లో పనిచేయడం ఒక కల. అదో ‘మాయా అద్భుత భూభాగం’లాంటిదని అభివర్ణిస్తూ డబ్బుల్ని ఎలా సేవ్ చేశాడో చెప్పుకొచ్చాడు. ముందుగా గూగుల్‌లో అపరిమిత ఆహారం, పానీయాలు, పింగ్ పాంగ్ టేబుల్స్ , వీడియో గేమ్ రూమ్‌లు, సాకర్ ఫీల్డ్‌లు, జిమ్, టెన్నిస్ కోర్ట్లు, ఫ్రీ మసాజ్ వంటి మరిన్ని సౌకర్యాలను అందించింది. వాటిని వినియోగించుకున్నాడు. కానీ అప్పుడే జార్జ్ గూగుల్‌లో తాను సంపాదించే జీతంలో సగానికిపైగా మొత్తాన్ని ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గుర్తించాడు. ట్యాక్స్ తగ్గించుకునేందుకు అప్పటి నుంచి జార్జ్ తన ట్యాక్స్‌ను తగ్గించుకోవడానికి రిటైర్మెంట్ అకౌంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. ఆఫీస్‌కి నడిచి వెళ్లడం, గూగుల్‌లో పని చేసే సమయంలో మూడుపూటలా అక్కడే భోజనం చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆహారాన్ని ఖర్చు చేసినట్లు చెప్పాడు. సాధారణంగా సిలికాన్ వ్యాలీలో ఇంటి రెంట్ చాలా ఖరీదైన వ్యవహారంతో కూడుకుంది. అయినప్పటికీ, తన స్నేహితులతో కలిసి అపార్ట్‌మెంట్‌ని షేర్ చేసుకోవడం వల్ల అద్దె తగ్గిందని అన్నాడు. ట్యాక్స్ చెల్లింపులు ఎంతంటే? జార్జ్ ప్రతి సంవత్సరం పన్ను ఆదా చేసుకునేందుకు రూ.62లక్షలు పెట్టుబడి పెడుతూ వచ్చాడు. రిటైర్మెంట్ అయ్యేందుకు కావాల్సినంత మొత్తాన్ని సమకూర్చుకున్నాడు. గత ఏడాది జార్జ్ 29 ఏళ్ళ వయసులో థర్డ్ ఇయర్ ఏఐ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. “ఇప్పుడు నేను జీతం సంపాదించడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను నా కంపెనీని ప్రారంభించడం కోసం రిస్క్ చేయగలను. నా భార్య పిల్లల కోసం కావాల్సినంత సంపాదించాను. అందుకే త్వరగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అంటూ ఆర్ధిక పాఠాలు చెబుతున్నాడు. -
ఐటీ రంగం నెత్తిన మరో పిడుగు: టెకీల గుండెల్లో గుబులు
సంక్షోభంలో ఉన్న భారతీయ ఐటీ రంగానికి చెందిన తాజా నివేదిక ఒకటి సంచలనం రేపుతోంది. 2024 ఆర్థిక సంవత్సరం కూడా అతలాకుతలమేనని ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్ విశ్లేషకులు బాంబు పేల్చారు. అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్ట్స్ డీల్స్ మెరుగుపడే అవకాశం ఉందని భావించారు. ఇటీవలి తమ పరిశీలనలో భారత ఐటీ రంగంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదంటూ నిరాశను ప్రకటించారు. దీంతో ఐటీపై తమ నెగటివ్ ధోరణిని కొనసాగిస్తామని జేపీ మోర్గాన్ విశ్లేషకులు అంకుర్ రుద్ర, భావిక్ మెహతా తాజా నోట్లో తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఐటీ కంపెనీల ఆదాయాలు నిరుత్సాహకరంగా ఉండ బోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, గైడెన్స్‌ను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తారని జేపీ మోర్గాన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024 ని "వాష్అవుట్"గా ఇన్వెస్టర్లు పేర్కొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ 2025 వ్యూహంపై దృష్టి పెట్టాలని వారు భావిస్తారన్నారు. (స్పెషల్ఫీచర్తో డైసన్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయ్..యాపిల్‌కు కష్టమే!) వివిధ పరిశ్రమల ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన సమావేశంలో ఎలాంటి ఆశావమదృక్పథం కనపించలేదన్నారు డిమాండ్ ఇంకా పుంజుకోనందున్న ఐటీ పరిశ్రమపై తమ దృక్పథం బేరిష్‌గా ఉంది. మొత్తం పరిస్థితి మునుపటి త్రైమాసికంతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గాలేదని వెల్లడించారు. అలాగే దీర్ఘకాలం అధిక వడ్డీరేట్లు కొనసాగితే ఆర్థిక వృద్ధి మందమనం భయాలతొ పరిస్థితి ప్రతికూలమని ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో ,హెచ్‌సిఎల్‌టెక్‌తో సహా అన్ని ప్రధాన ఐటి సంస్థలు గతంలోనే హెచ్చరించాయి, ఎక్కువ యుఎస్ బేస్డ్ క్లయింట్లు కావడంతో తమ ఐటి వ్యయాన్ని తగ్గించడం, కాంట్రాక్టులను కూడా రద్దు లేదా ఆలస్య మవుతున్నాయని తెలిపాయి. ( క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు) ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు FY24 ఒక వాష్అవుట్ అని భావించారనీ, రీబౌండ్ ఆశలతో FY25కి దృష్టి మరల్చారని విశ్లేషకులు చెప్పారు. అలాగే గత మూడు నెలల్లో బ్లూ-చిప్ నిఫ్టీ 50, నిఫ్టీ IT ఇండెక్స్‌ను అధిగమించిందనికూడా వివరించారు. వచ్చే వారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ తమ ఫలితాలను ప్రకటనుంచ నున్నారు. ఈసమయంలో జేపీ మోర్గన్ నివేదిక కీలకంగా మారింది. అంతేకాదు త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఎదురుచూస్తున్న టెకీలకు నిరాశే ఎదురైంది. (గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా) కాగా ఇప్పటికే భారత్ సహా, దిగ్గజ ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఆదాయాలు క్షీణించాయి. ఫలితంగా ఉద్యోగ నియామకాలు గణనీయంగా పడి పోయాయి. ప్రాజెక్టులు లేక బెంచ్ మీద ఉద్యోగులను చాలామందిని ఇంటికి పంపించేశాయి. ఆన్‌బోర్డింగ్ జాప్యంతోపాటు, క్యాంపస్ రిక్రూట్మెంట్లపై దెబ్బ పడింది. ఐటీ, టెక్ కంపెనీల్లో వేలాదిమంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. (ICC పురుషుల ప్రపంచ కప్ 2023: ఫ్యాన్స్‌కు ఎయిర్టెల్ గుడ్ న్యూస్) -
వర్ధమాన మార్కెట్ల ఇండెక్స్‌లో జీసెక్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి వర్ధమాన మార్కెట్ల(ఈఎం) ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ సెక్యూరిటీ(జీసెక్)లను చేర్చే ప్రణాళికల్లో ఉన్నట్లు గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం జేపీ మోర్గాన్ తాజాగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ బాండ్ల ద్వారా సమీకరించే రుణ వ్యయాలు తగ్గే వీలుంది. భారత ప్రభుత్వ బాండ్ల(ఐజీబీ)ను 2024 జూన్ 28 నుంచి 2025 మార్చి 31వరకూ 10 నెలలపాటు ఇండెక్సులో చేర్చనుంది. ఫలితంగా ఇండెక్స్ వెయిటేజీ ప్రతీ నెలా ఒక శాతంమేర పెరగనుంది. వెరసి జీబీఐ–ఈఎం గ్లోబల్ డైవర్సిఫైడ్ ఇండెక్స్‌లో ఇండియా వెయిటేజీ గరిష్టంగా 10 శాతాన్ని తాకవచ్చని అంచనా. ఇక జీబీఐ–ఈఎం గ్లోబల్ ఇండెక్స్‌లో సుమారు 8.7 శాతానికి చేరే వీలున్నట్లు జేపీ మోర్గాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పలు విదేశీ ఫండ్స్.. గ్లోబల్ ఇండెక్సుల ఆధారంగా పెట్టుబడులు చేపట్టే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు భారీగా పుంజుకునేందుకు ఇది సహకరించనుంది. అంతేకాకుండా విదేశాల నుంచి ప్యాసివ్ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలి వచ్చేందుకు వీలుంటుంది. పరిశ్రమలకు దేశీయంగా మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆహా్వనించదగ్గ పరిణామం జేపీ మోర్గాన్ తాజా ప్రణాళికలపై స్పందనగా.. ఇది ఆహా్వనించదగ్గ పరిణామమంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పట్టిచూపుతున్నదని వ్యాఖ్యానించారు. ఇది జేపీ మోర్గాన్ సొంతంగా తీసుకున్న నిర్ణయంకాగా.. భారత్‌కున్న భారీ వృద్ధి అవకాశాలు, స్థూల ఆర్థిక విధానాలపట్ల ప్రపంచ ఫైనాన్షియల్ సంస్థలు, మార్కెట్లకున్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. దేశీ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా భారీగా లాభపడుతున్న దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల మాదిరి భారత్ ప్రభుత్వ బాండ్లలోనూ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు లబ్ది పొందుతారని తెలియజేశారు. దేశీ కరెన్సీ బలపడేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఇండెక్సులలో లిస్టయ్యే వీటికి లాకిన్ అవసరం ఉండదని స్పష్టం చేశారు. 10 శాతం వాటా జేపీ మోర్గాన్ ఇండెక్స్‌కుగల 240 బిలియన్ డాలర్ల విలువలో ఇండియాకు 10 శాతం వాటా లభించనుంది. వెరసి 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలుంది. ఇది భారత్ బేస్ రేటులో మార్పులు తీసుకురానుండగా.. ఈల్డ్ భారీగా తగ్గనుంది. దీంతో భారత ప్రభుత్వ రుణ వ్యయాలు దిగిరానున్నట్లు ఏయూఎం క్యాపిటల్ నేషనల్ హెడ్ వెల్త్ ముకేష్ కొచర్ పేర్కొన్నారు. ఇక గ్లోబల్ ఇండెక్సులలో ఐజీబీకి చోటు లభించడం ద్వారా రిస్కులకంటే లాభాలే అధికంగా ఉండనున్నట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నెలకు 1.5–2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలున్నట్లు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. ఇది ప్రపంచస్థాయిలో భారత ప్రొఫైల్‌కు బలిమినివ్వడంతోపాటు.. దేశీయంగా మూలాలు మరింత పటిష్టంకానున్నట్లు అభిప్రాయపడింది. ప్రభుత్వ సెక్యూరిటీలకు డిమాండును మరింత పెంచనున్నట్లు యాంఫి పేర్కొంది. -
జేపీ మోర్గాన్ చేతికి ఫస్ట్ రిపబ్లిక్
న్యూయార్క్: ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌లో తలెత్తిన సంక్షోభం మొత్తం వ్యవస్థకు వ్యాపించకుండా చూసేందుకు అమెరికా బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, అసెట్లలో చాలా మటుకు భాగాన్ని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌నకు విక్రయించాయి. అమెరికా చరిత్రలో ఓ భారీ స్థాయి బ్యాంకు విఫలం కావడం ఇది రెండోసారి. 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో వాషింగ్టన్ మ్యూచువల్ కుప్పకూలింది. ప్రస్తుత ఫస్ట్ రిపబ్లిక్ తరహాలోనే అప్పట్లో వాషింగ్టన్ మ్యూచువల్‌ను కూడా జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంకే టేకోవర్ చేసింది. సోమవారం నుంచి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 84 శాఖలు .. జేపీమోర్గాన్ చేజ్ బ్యాంక్ బ్రాంచీలుగా పనిచేయడం ప్రారంభమవుతుందని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) వెల్లడించింది. ఏప్రిల్ 13 గణాంకాల ప్రకారం ఫస్ట్ రిపబ్లిక్కు 229 బిలియన్ డాలర్ల అసెట్లు, 104 బిలియన్ డాలర్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. పరిమాణం ప్రకారం అమెరికన్ బ్యాంకుల్లో 14వ స్థానంలో ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సమస్య పరిష్కారానికి డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్‌పై 20 బిలియన్ డాలర్ల భారం పడగా, ఫస్ట్ రిపబ్లిక్పరంగా మరో 13 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడవచ్చని ఎఫ్‌డీఐసీ అంచనా వేసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లు సంక్షోభంలో చిక్కుకున్న ప్రభావంతో మార్చి నుంచి ఫస్ట్ రిపబ్లిక్ సైతం సవాళ్లు ఎదుర్కొంటోంది. తక్కువ వడ్డీ రేట్లకు ఎక్కువగా రుణాలివ్వడం, అధిక శాతం డిపాజిట్లకు బీమా భద్రత లేకపోవడం వంటి అంశాల కారణంగా బ్యాంకుపై డిపాజిటర్లలో నమ్మకం సన్నగిల్లింది. ఫలితంగా బిలియన్ల కొద్దీ డాలర్ల విత్‌డ్రాయల్స్ వెల్లువెత్తాయి. ఒక దశలో ఫస్ట్ రిపబ్లిక్కి సహాయం చేసేందుకు ఇతర బ్యాంకులు కూడా ముందుకు వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత వారాంతంలో భేటీ అయిన అమెరికా నియంత్రణ సంస్థలు పరిష్కార మార్గాన్ని అమలు చేశాయి. -
యూనికార్న్‌ల కీలక భేటీ
న్యూఢిల్లీ: ఐపీవోకు రావాలనుకుంటున్న 10 యూనికార్న్‌లతో జేపీ మోర్గాన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ఇటీవల సమావేశాన్ని నిర్వహించాయి. బెంగళూరులో ఈ నెల 3, 4వ తేదీల్లో ఇది జరిగింది. వచ్చే మూడేళ్లలో ఐపీవోకు వచ్చే సన్నాహాలతో ఉన్న స్విగ్గీ, అన్అకాడమీ తదితర యూనికార్న్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం ఇందులో పాల్గొన్నాయి. మామాఎర్త్, లెన్స్‌కార్ట్, అకో, మీషో, ఎలాస్టిక్‌రన్, ఇన్‌మొబి సైతం ఇందులో పాల్గొన్నాయి. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, యూటీఐ తదితర 14 దేశీయ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం పాలు పంచుకున్నాయి. పబ్లిక్ మార్కెట్ ఇన్వెస్టర్లను యూనికార్న్‌లు మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, యూనికార్న్‌ల మధ్య మెరుగైన సమాచార సంప్రదింపులకు వీలుగా ఈ సమావేశం నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది వచ్చిన పేటీఎం, జొమాటో సెకండరీ మార్కెట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యం నెలకొంది. -
ఇండియాలో వ్యాపారానికి ‘మెట్రో’ గుడ్‌బై ?
జర్మన్‌కి చెందిన ప్రముఖ రిటైల్ బిజినెస్ సంస్థ మెట్రో స్టోర్స్ ఇండియాలో తన వ్యాపార కార్యకలాపాలకు పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 19 ఏళ్ల పాటు ఇండియాలో కొనసాగిన ఆ సంస్థ చివరకు ఇక్కడ ఫలితాలు ఆశజనకంగా లేకపోవడంతో వీడి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. వంద శాతం విదేశీ పెట్టుబడులతో దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో స్టోర్లు ఏర్పాటయ్యాయి. 2003లో ఇండియాలో మెట్రో బిజినెస్ మొదలు కాగా.. దేశంలోని 21 నగరాల్లో 31 స్టోర్లు ఆ సంస్థకు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో తొలిసారి మెట్రో స్టోరు ఏర్పాటు కావడం అప్పట్లో సంచనలంగా మారింది. మెట్రో తర్వాత అనేక సంస్థలు ఇదే మోడల్‌ను అనుసరిస్తూ రిటైల్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇండియాలో ఇండియాలో రిటైల్ స్టోర్లతో పాటు కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్బెంగాల్లలో ఐదు కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. ఏడు వేల రకాలకు పైగా వస్తువులు మెట్రో స్టోర్లలో అమ్ముతున్నారు. 2025 నాటికి ఇండియాలో మెట్రో బిజినెస్ అంచనా 1.25 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక చాలు పందొమ్మిదేళ్లు గడిచినా ఇండియాలో మెట్రో వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. పైగా మెట్రో తరహాలోనే అనేక సంస్థలు రిటైల్ బిజినెస్‌లోకి వచ్చాయి. ఇంత పోటీలో ఇక్క భవిష్యత్తు మరింత కష్టంగా ఉండవచ్చనే అంచనాలు మెట్రో యజమాన్యానికి ఉన్నాయి. దీంతో ఇండియాలో తమ బిజినెస్‌కి పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించింది. జేపీ మోర్గాన్ ఇండియాలో ఆ సంస్థకు ఉన్న 31 స్టోర్లు, 5 కలెక్షన్ సెంటర్లు ఇతర స్థిర, చర ఆస్తులను కొనేందుకు అనువైన బయ్యర్‌ను వెతికి పెట్టాల్సిందిగా జేపీ మోర్గాన్ సంస్థను మెట్రో కోరింది. ఈ మేరకు 1.5 నుంచి 1.75 బిలియన్ డాలర్ల రేంజ్లో అమ్మేందుకు రెడీ అయ్యింది మెట్రో. రిలయన్స్, అమెజాన్, డీ మార్ట్ వంటి ప్రముఖ సంస్థలు మెట్రో డీల్ పట్ల ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ‘ప్రపంచ వ్యాప్తంగా మెట్రోకు వ్యాపారాలు ఉన్నాయి. ప్రతీ ఏడు మేము నిర్ధేశించుకున్న లక్ష్యాలు వాటిని చేరుకున్న తీరును మదింపు చేసుకుని వ్యూహాలు అమలు చేస్తుంటాం. అందులో భాగంగానే ఇండియా విషయంలో నిర్ణయం తీసుకుంటాం తప్పితే ప్రత్యేక కారణాలు ఏమీ లేవు’ అంటూ మెట్రో గ్లోబల్ హెడ్ జెర్డ్ కోస్లోవ్స్కీ అన్నారు. అక్కడ కూడా మెట్రో స్టోర్స్ అనేక దేశాల్లో ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా ఆ సంస్థ పలు దేశాల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో ఇప్పటికే రష్యా, జపాన్, మయన్నార్ల నుంచి వైదొలగింది. తాజాగా ఈ జాబితాలో ఇండియా కూడా చేరింది. చదవండి: ధన్యవాదాలు.. కానీ మేము ఆ పని ఇక్కడ చేయలేం.. -
యాపిల్‌కి షాకిచ్చిన జేపీ మోర్గాన్
కరోనా ఆర్థిక వ్యవస్థకు చేసిన గాయాలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎఫెక్ట్ వెరసి స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్‌కి ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. స్మార్ట్‌ఫోన్ డిమాండ్ పడిపోతుండటంతో ఆ కంపెనీ లాభాలు పరిమితం కావచ్చంటూ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ సూచించింది. అందుకు తగ్గట్టుగా మోస్ట్ ఫ్రిఫరెడ్ స్టాక్స్ జాబితా నుంచి యాపిల్‌ను తొలగించింది. మార్కెట్ కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ అనేక బడా కార్పోరేట్ కంపెనీలకు సేవలు అందిస్తోంది. అదే విధంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కూడా విలువైన సూచనలు చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆయా కంపెనీల లావాదేవీలు, మార్కెట్ ఎత్తుగడలు, ప్రపంచ పరిస్థితులను అంచనా వేస్తూ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు మోస్ట్ ఫ్రిఫరెడ్ స్టాక్స్ పేరుతో ఓ జాబితా రూపొందిస్తుంది. ఈ జాబితాలో యాపిల్ సంస్థ కొన్నేళ్లుగా సుస్థిర స్థానం సంపాదించుకుంది. అయితే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆ వెంటనే సప్లై చెయిన్ దెబ్బతినడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూలికే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇంతలో ఉక్రెయిన్, రష్యా వార్ వచ్చిపడింది. దీంతో ఆదాయ వనరులు తగ్గిపోయాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు క్షీణిస్తున్నాయి. వీటిని నిలబెట్టుకునేందుకు అప్పటికీ యాపిల్ సంస్థ పలు మోడళ్ల ధరలకు కోత పెట్టింది. ఐనప్పటికీ అమ్మకాలు మెరుగుపడే అవకాశం లేకపోవడం. పైగా యాపిల్ ఫోన్లు ఎక్కువగా తయారయ్యే చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఫలితంగా యాపిల్ ఆశించిన మేరకు లాభాలు అందించలేకపోవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. యాపిల్‌తో పాటు ప్రముఖ చిప్ మేకర్ కంపెనీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ సైతం మోస్ట్ ప్రిఫరబుల్ స్టాక్స్ జాబితాలో చోటు కోల్పోయింది. ఈ రెండింటి స్థానంలో నెట్వర్క్ ఎక్వీప్మెంట్ కంపెనీలైన ఆరిస్టా నెట్వర్క్, సియన్నా కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. చదవండి: యాపిల్ మాస్టర్‌ప్లాన్...అందరికీ అందుబాటులో ఐఫోన్..! -
నెలకు కోటి రూపాయల జీతం వదిలేసి మరీ..
Korea Man Quits Crores Salary Job And Became Youtuber Because Of Mother: కంపెనీలో చేరిన ఏడాదికే ఇంక్రిమెంట్. అది అలాంటి ఇలాంటిది కాదు. నెలకు కోటికి పైగా(మన కరెన్సీలో) జీతం. ప్రొఫెషనల్ కెరీర్‌ను పీక్స్‌కు చేర్చే టైం అది. కానీ, ఆ సమయంలో ఉద్యోగం వదిలేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా?.. దక్షిణ కొరియాకు చెందిన బెన్ చోన్(28) ఆ నిర్ణయం తీసేసుకున్నాడు మరి!. అయితేనేం తనకు తెలిసిన విద్యతో లక్షలు(మన కరెన్సీలోనే) సంపాదిస్తూ.. సొంతంగా బాస్‌గా ఉండడంలో కిక్కును వెతుక్కుంటున్నాడు. జేపీ మోర్గాన్.. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం. ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అలాంటి కంపెనీలో 2017లో చేరాడు బెన్ చోన్. పుట్టి, పెరిగింది దక్షిణ కొరియాలోనే అయినా. స్కాలర్షిప్ మీద అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదివి.. జాబ్ తెచ్చుకున్నాడు. ఏడాది తిరగకుండానే అతని టాలెంట్‌కి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది జేపీ మోర్గాన్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ప్రమోషన్‌తో పాటు నెలకు లక్షా యాభై వేల డాలర్ల జీతం(అదనంగా బోనస్) ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే రెండు నెలల జీతం అందుకున్నాడో లేదో.. పిడుగులాంటి వార్త అతని చెవిన పడింది. తల్లి ప్రమాదకరమైన వ్యాధి బారినపడిందన్న విషయం అతన్ని స్థిమితంగా ఉంచలేదు. ఆ సమయంలో అతనికి తల్లే ప్రపంచంగా కనిపించింది. ఆమె పక్కనే ఉండి.. ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంతూరికి బయలుదేరాడు. అక్కడ ఓ చిన్న బట్టల దుకాణంలో కొంతకాలం పని చేశాడు. బట్టల షాపులో.. దాచుకున్న సొమ్మంతా కేవలం మూడు నెలల్లోనే తల్లి ట్రీట్మెంట్కి ఖర్చైంది. బ్యాంకింగ్ సలహాలిచ్చే బెన్ చోన్.. సొంతూరులోనే ఓ బట్టల షాపులో పని చేశాడు. ఆపై ఇంట్లో బట్టల దుకాణం తెరిచాడు. కొన్నాళ్లు పోయాక తల్లి మందులకు ఖర్చులు పెరిగాయి. ఆ టైంలోనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆదాయం సంపాదించొచ్చనే విషయం అతనికి గుర్తొచ్చింది. యూట్యూబ్‌లో రోజూ రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో చాలావరకు వీడియోలను చూసి తిట్టుకుంటాం.. నవ్వుకుంటాం. కొన్నింటిని చూడకుండానే స్కిప్ చేస్తుంటాం. కానీ, వాటి వ్యూస్ ద్వారా యూట్యూబర్లకు ఆదాయం వస్తుంది. అంటే.. ఏదో ఒకరకంగా తమ శ్రమను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారు వాళ్లు. అలా బెన్ చోన్ మాత్రం తనకు తెలిసిన విద్యతోనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాడు. తెలిసిన విద్యతోనే.. 2019లో రేర్లిక్విడ్ rareliquid పేరుతో యూట్యూబ్ఛానెల్ మొదలుపెట్టాడు బెన్. ఇన్వెస్ట్మెంట్, కెరీర్ గైడెన్స్ వీడియోలతో నెమ్మదిగా ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న క్రిప్టోకరెన్సీ గురించి, బ్లాక్ చెయిన్ మార్కెట్ తీరు తెన్నులు, టిప్స్‌తో పాటు టెక్, మార్కెటింగ్ సలహాలు అందిస్తాడు. ‘‘ జేపీ మోర్గాన్‌లో చేరిన తొలినాళ్లలో వారానికి 70 నుంచి 110 గంటల పని. ఒక్కోసారి ఏకధాటిగా 28 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు నేనే బాస్. నాకు తెలిసిన విద్య. కోట్ల జీతం పోతేనేం.. నాకు ఉన్న వనరులతో, తక్కువ శ్రమతో సంతోషం, మనశ్శాంతిని సంపాదించుకుంటున్నా. నాలాగే ప్రతీ ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనసు పెడితే డిజిటల్ ప్రపంచంతో సంపాదించుకోవచ్చు.. ఒక అడుగు ముందుకేసి అద్భుతాలూ చేయొచ్చు. సిగ్గు-మొహమాటం పడాల్సిన అవసరం అస్సలు లేదు. నా వరకు నేను బాగానే సంపాదిస్తున్నా. అన్నింటికి మించి మా అమ్మ పక్కనే ఉంటున్నా. ఇది చాలాదా నాకు’’ అంటున్నాడు బెన్ చోన్. ప్రస్తుతం rareliquid ఛానెల్లో టెక్, మార్కెట్, క్రిప్టోకరెన్సీ తీరు తెన్నులపైనా అతని సలహాలు, డెమో వీడియోలు ఉంటాయి. రెజ్యూమ్(సీవీ) సలహాలు, రకరకాల కోర్సుల గురించి వివరిస్తాడు. ఇదంతా చిన్న చిన్న వ్యాపారాల కలయికగా చెప్తాడు బెన్ చోన్. క్రియేటివ్ వేలో మరికొందరికి పాఠాలు, సలహాలు ఇవ్వడం సంతోషాన్ని ఇస్తుందని అంటున్నాడు ఈ యూట్యూబర్. యూట్యూబ్ వ్యూస్ ప్రకారం.. జులైలో బెన్ జీతం 19, 161 డాలర్లుకాగా, నవంబర్‌లో 26,000 డాలర్లు సంపాదించాడు. మన కరెన్సీలో ఇది 17 లక్షల రూపాయలు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
చైనాపై జోక్.. నోరు జారి నాలిక కర్చుకున్నాడు
JPMorgan CEO Comments On China: ‘కమ్యూనిస్ట్ పార్టీ కంటే మా బ్యాంక్ దీర్ఘకాలం కొనసాగుతుంది.. కావాలంటే పందెం’ అంటూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ ఆపై నాలిక కర్చుకున్నాడు. భారీ నష్టం జరగక ముందే తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మంగళవారం బోస్టన్ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్లో డిమోన్ మాట్లాడుతూ.. నేను హాంకాంగ్‌లో ఉన్నా. అప్పుడు ఓ జోక్ చేశా. కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సంబురాలు చేస్తోంది. జేపీ మోర్గాన్ కూడా అంతే. కానీ, మేం వాళ్ల (కమ్యూనిస్ట్ పార్టీ) కంటే ఎక్కువ కాలం ఉంటామని పందెం కాస్తాను. ఇదే మాట నేను చైనాలో చెప్పలేను. అయినా వాళ్లు నా మాటలు వింటున్నారు’’ అంటూ మంగళవారం బోస్టన్ ఈవెంట్లో వ్యాఖ్యలు చేశాడు. అమెరికా అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజమైన జేపీ మోర్గాన్ చేజ్.. ఆగష్టులో చైనా రెగ్యులేటరీ నుంచి నుంచి సెక్యూరిటీ బ్రోకరేజ్‌కు అనుమతులు దక్కించుకుంది. తద్వారా చైనా నేలపై ఆధిపత్యం ఆలోచనకు అడుగేసింది. ఈ తరుణంలో డిమోన్ తాజా వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు కమ్యూనిస్ట్ పార్టీని ఆగ్రహానికి గురి చేయడంతో పాటు చైనాలో అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ కొంప ముంచే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అయ్యింది. అందుకే 18 గంటలు గడవకముందే డిమోన్ క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. దీంతో వ్యవహారం సర్దుమణిగినట్లేనని అంతా భావిస్తున్నారు. మరోవైపు డిమోన్‌కు ఇలా నోరు జారడం కొత్తేం కాదు. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మీదే ఏకంగా కామెంట్లు చేశాడు. ట్రంప్ కంటే తానే దమ్మునోడినని, అవకాశం ఇస్తే ఎన్నికల్లో ఓడించి తీరతానని కామెంట్లు చేశాడు. ఆ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని క్షమాపణలు చెప్పాడు. చదవండి: జేపీ మోర్గాన్ వర్సెస్ ఎలన్ మస్క్.. సిల్లీ కామెడీ! -
వింత బ్లాక్‌మెయిలింగ్.. అన్నంత పని చేస్తానంటున్న ఎలన్ మస్క్
Elon Musk Warns To JP Morgan: అమెరికా వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ వెరైటీ వార్నింగ్‌కు దిగాడు. అమెరికా బ్యాంకింగ్ దిగ్గజ కంపెనీ జేపీ మోర్గాన్ చేజ్, టెస్లాపై వేసిన దావాను వెనక్కి తీసుకోవాలని, లేని తరుణంలో తన ప్రతీకార చేష్టలు ఊహించని రేంజ్లో ఉంటాయని బెదిరిస్తున్నాడు. 2014లో జరిగిన ఒక ఒప్పందానికి సంబంధించి(బ్యాంకుకు అమ్మిన వారెంట్ల విషయంలో) ఉల్లంఘనలకు పాల్పడింది టెస్లా. దీంతో గతవారం జేపీ మోర్గాన్ చేజ్, టెస్లా మీద దక్షిణ న్యూయార్క్ న్యాయస్థానంలో దావా వేసింది(నవంబర్ 15న). మొత్తం 162 మిలియన్ డాలర్ల దావా ఇది. అయితే చెల్లింపులకు సంబంధించి టెస్లాకు చాలా అవకాశాలు ఇచ్చి చూశామని, కానీ అవతలి నుంచి స్పందన లేకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని జేపీమోర్గాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే మస్క్ ఈ దావా వ్యవహారాన్ని చాలా తేలికగా తీసుకున్నాడు. అంతేకాదు జేపీ మోర్గాన్ గనుక కేసును వెనక్కి తీసుకోకపోతే యెల్ప్(అమెరికాలో బిజినెస్ వ్యవహారాలకు సంబంధించిన జనాలు రివ్యూలు ఇచ్చే వెబ్సైట్) లో జేపీమోర్గాన్ను వన్‌స్టార్ రేటింగ్ రివ్యూ ఇస్తానని, ఈ వ్యవహారంలో ఇదే తన చివరివార్నింగ్ అంటూ బెదిరింపులకు దిగాడు ఎలన్ మస్క్. అసలు విషయం ఏంటంటే.. జేపీ మోర్గాన్‌తో టెస్లాకు సత్సంబంధాలు లేకపోయినా.. గత ఏడేళ్లుగా చిన్నస్థాయి బిజినెస్‌లు నడుస్తున్నాయి. కానీ, జేపీ మోర్గాన్ చేస్ సీఈవో జేమీ డిమోన్‌కు ఎలన్ మస్క్‌కు అస్సలు పొసగడం లేదు. దీంతో 2016 నుంచి ఆర్థిక సంబంధమైన లావాదేవీలు మాత్రం నడవడం లేదు. ఇక 2014లో జేపీ మోర్గాన్ సహకారంతోనే టెస్లా పటిష్టం అయ్యింది. అయితే 2018లో గంజాయి మోజుతో మస్క్ చేసిన ఓ ట్వీట్.. టెస్లా షేర్ల ధరల్ని ఆకాశానికి చేర్చింది. ఈ వ్యవహారంపై అదే ఏడాది అక్టోబర్‌లో సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (SEC) టెస్లా, ఎలన్ మస్క్‌లకు 20 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది కూడా. అప్పటి నుంచి బ్యాంక్ చెల్లింపుల ఒప్పందం ఉల్లంఘనకు సంబంధించిన వ్యవహారంపై జేపీ మోర్గాన్ -టెస్లా మధ్య జగడం నడుస్తోంది. తాజాగా జేపీ మోర్గాన్ కోర్టును ఆశ్రయించగా.. టెస్లా మాత్రం ఆ విషయాన్ని లైట్ తీస్కుంటూ వస్తోంది. ఈ తరుణంలో విషయం కోర్టుకు చేరినప్పటికీ ఈ వ్యవహారాన్ని మాత్రం కామెడీగా తీసుకుంటున్నాడు ఎలన్ మస్క్. -
‘బిట్‌కాయిన్ ఓ చెత్త.. పనికిమాలిన వ్యవహారం’
ప్రపంచమంతా క్రిప్టోకరెన్సీకి దాసోహం అవుతున్న తరుణంలో.. డిజిటల్ కరెన్సీ మీద ఓ బ్యాంకింగ్ దిగ్గజ సీఈవో సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిట్‌కాయిన్ అనేది చెత్త వ్యవహారం అని, అది ఎందుకు పనికిరాదంటూ వ్యాఖ్యలు చేశారాయన. అమెరికా మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సేవలు అందించే ‘జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో’ సీఈవో జేమీ డిమన్(65) క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిట్‌కాయిన్‌ను విలువ లేని ఇన్వెస్ట్మెంట్గా పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగతంగా నా దృష్టిలో అదొక నాన్సెన్స్. సీరియస్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం మూర్ఖత్వం. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా క్లయింట్లు విషయపరిజ్ఞానం ఉన్నవాళ్లు. వాళ్లు కూడా దీనిని అంగీకరించరు”అంటూ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఈవెంట్లో ఇలా ముక్కుసూటి వ్యాఖ్యలు చేశారాయన. చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...! ఇదిలా ఉంటే మొదటి నుంచి ఆయన బిట్‌కాయిన్ పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీలను ‘మూర్ఖుల బంగారం’గా అభివర్ణించిన డిమన్.. అమెరికాలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజమైన తాము(జేపీ మోర్గాన్) ప్రొత్సహించబోదని, దానిపై ప్రభుత్వాల నియంత్రణ కచ్చితంగా ఉండాలని గతంలో ఆయన వ్యాఖ్యానించారు కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఎదిగిన చైనా.. దానివల్ల పర్యవసనాలు చెడువే జరుగుతున్నాయంటూ ఈమధ్యే నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఓవైపు ఎలన్ మస్క్ లాంటి కుబేరులు క్రిప్టోకరెన్సీకి తెగ ప్రమోట్ చేస్తుంటే.. మరోవైపు ఇంకొందరు ధనికులు మాత్రం పూర్తిగా దానికి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. చదవండి: Bitcoin.. సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్‌కాయిన్..! -
ఎల్ఐసీకి మర్చంట్ బ్యాంకర్లు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలు ఊపందుకున్నాయి. ఇష్యూ నిర్వహణకు ప్రభుత్వం తాజాగా 10 మర్చంట్ బ్యాంకర్ సంస్థలను ఎంపిక చేసింది. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, సిటీగ్రూప్, నోమురా హోల్డింగ్స్ తదితరాలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్)కు దరఖాస్తు చేశాయి. చదవండి : Aadhar Link: టెక్నికల్ ఇష్యూస్‌పై యూఐడీఏఐ క్లారిటీ.. తుది తేదీలు ఇవే! -
రూ. కోటి పెట్టి కొన్న విస్కీ.. కానీ తాగలేరు
బోస్టన్/వాషింగ్టన్: వస్తువులు, దుస్తులు, ఇతరాత్ర ఏవి తీసుకున్న ఎంత పాతవైతే అంత తక్కువ ధర పలుకుతాయి. కానీ మద్యం విషయంలో మాత్రం ఇది రివర్స్‌లో జరుగుతుంది. ఏళ్ల నాటి మద్యం ఖరీదు ఎక్కువ చేస్తుంది. గతంలో ఓ వైన్ బాటిల్ ఏడు కోట్లు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ విస్కీ బాటిల్ కూడా ఇదే రేంజ్లో భారీ ధర పలికింది. ఒక్క విస్కీ బాటిల్ కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా చెల్లించారు. అంత ఖరీదు ఎందుకు.. దాన్నేమైన స్వర్గం నుంచి తీసుకువచ్చారా ఏంటి అని భావిస్తే.. తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ విస్కీ బాటిల్ చాలా పురాతనమైనది. దాదాపు 250 ఏళ్ల క్రితం నాటిది కావడంతో ఈ విస్కీ బాటిల్ ఇంత ధర పలికింది. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత ఖరీదు పెట్టి కొన్న విస్కీని తాగలేరు. ఎందుకో తెలియాలంటే ఇది చదవండి.. వేలం పాట నిర్వహించే అమెరికా బోస్టన్‌కు చెందిన హౌస్ స్కిన్నర్ ఇంక్. అనే కంపెనీ ఈ విస్కీ బాటిల్‌ని వేలం వేసింది. ఇక దీని ధర 20-40 వేల డాలర్ల మధ్య అమ్ముడవుతుందని భావించింది. కానీ అది అనూహ్యంగా అంతకు ఆరింతలు పలికింది. ఈ ఏడాది జూన్ 30న ముగిసిన వేలంలో ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మాన్హాటన్లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీకి 1,37,500 డాలర్లకు (1,02,63,019 రూపాయలకు) విక్రయించారు. విస్కీ బాటిల్ చరిత్ర ఏంటి.. డెయిలీ మెయిల్ కథనం ప్రకారం... ఇంగ్లెడ్యూ విస్కీని 1860లో బాటిల్లో నింపారు. ఆ తర్వాత దీన్ని మోర్గాన్ లైబ్రరీకి అమ్మారు. ఆ కాలపు ప్రసిద్ధ ఫైనాన్షియర్ జాన్ పియర్ పాయింట్ మోర్గాన్ ఈ విస్కీ బాటిల్‌ను కొనుగోలు చేశారు. సీసా వెనుక భాగంలో ఉన్న లేబుల్ మీద ఇలా ఉంది ‘ఈ బౌర్బన్ బహుశా 1865 కి ముందే తయారు చేసి ఉండవచ్చు. ఇది మిస్టర్ జాన్ పియర్‌పాయింట్ మోర్గాన్ గదిలో ఉంది. అతని మరణం తరువాత ఆయన ఎస్టేట్ నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నాం’’ అని ఉంది. నిపుణలు ప్రకారం జేపీ మోర్గాన్ ఈ బాటిల్‌ని 1900 లలో జార్జియా పర్యటనలో కొన్నారని నిపుణులు భావిస్తున్నారు. ఆయన తరువాత బాటిల్ మోర్గాన్ కొడుకుకు చేరింది. అతను దానిని 1942 -1944 మధ్య దక్షిణ కెరొలిన గవర్నర్ జేమ్స్ బైర్నెస్‌కు ఇచ్చాడు. జేమ్స్ బైర్నెస్ ఆ బాటిల్‌ని తెరకుండా అలానే ఉంచాడు. 1955 లో పదవీవిరమణ చేసిన తరువాత బైర్నెస్ తెరవని బాటిల్‌ని స్నేహితుడు, ఆంగ్ల నావికాదళ అధికారి ఫ్రాన్సిస్ డ్రేక్‌కు పంపాడు. అతను దానిని మూడు తరాల పాటు భద్రంగా దాచాడు. ఈ విస్కీ దాదాపు రెండు శతాబ్దాల క్రితం తయారు చేసినది కావున దీన్ని తాగేందుకు కుదరదు. సాధారణంగా మూత తెరవకుండా ఉంటే విస్కీ పది సంవత్సారాల పాటు అలానే ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని తాగలేం. -
2020లో వారెన్ బఫెట్ సంపదకు చిల్లు
కోవిడ్-19 ప్రపంచ దేశాలను.. ప్రధానంగా అమెరికాను సునామీలా చుట్టుమడుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు రోజురోజుకీ బలపడుతున్నాయి. యూఎస్ ఇండెక్సులలో నాస్డాక్ ఈ ఏడాది(2020) పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంది. ఇందుకు ప్రధానంగా ఫాంగ్(FAANG) స్టాక్స్ సహకరించాయి. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ దిగ్గజం ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మాత్రం వెనకడుగులో ఉంది. ఈ ఏడాది బెర్క్‌షైర్ షేరు 16 శాతం తిరోగమించింది. ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ బెర్క్‌షైర్ హాథవే మార్కెట్ క్యాపిటలైజేషన్లో 90 బిలియన్ డాలర్లమేర ఆవిరైంది. వెరసి కంపెనీ మార్కెట్ విలువ 460 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇదే సమయంలో ఫాంగ్ స్టాక్స్‌గా ప్రసిద్ధమైన అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌తోపాటు ఇటీవల ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. కారణాలేవిటంటే? 2020లో ఇప్పటివరకూ అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, గూగుల్.. విడిగా 560-100 బిలియన్ డాలర్ల మధ్య మార్కెట్ క్యాపిటలైజేషన్ను జమ చేసుకున్నాయి. ఇదే కాలంలో బెర్క్‌షైర్ హాథవే 90 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఇందుకు ప్రధానంగా బెర్క్‌షైర్ హాథవే పోర్ట్‌ఫోలియోలోని నాలుగు దిగ్గజ కంపెనీల వెనకడుగు కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బెర్క్‌షైర్ పోర్ట్‌ఫోలియోలో బ్యాంకింగ్ దిగ్గజాలు జేపీ మోర్గాన్, వెల్స్‌ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికాతోపాటు.. ఇంధన రంగ దిగ్గజం ఎగ్జాన్ మొబిల్కు ప్రాధాన్యత ఉంది. ఈ నాలుగు కంపెనీల షేర్లు సైతం ఇటీవల నీరసించడంతో వీటి మార్కెట్ విలువలోనూ 110-140 బిలియన్ డాలర్ల మధ్య ఆవిరైంది. ఇది బెర్క్‌షైర్ హాథవే మార్కెట్ క్యాప్‌ను దెబ్బతీసినట్లు నిపుణులు విశ్లేషించారు. -
కరోనా కన్నా లాక్డౌన్ మరణాలే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టడం కోసం దాని బారిన పడిన దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్లు విధించాయి. కొన్ని దేశాలు లాక్డౌన్లు పూర్తిగా ఎత్తివేయగా, మరికొన్ని దేశాలు పాక్షికంగా కొనసాగిస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు దశల వారిగా ఎత్తివేస్తున్నాయి. కరోనాను అరికట్టడంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ల ప్రభావం ఎంత? ఆశించిన ఫలితాలు వచ్చాయా? కరోనా వైరస్ మహమ్మారి విస్తరణను అరికట్టడంలో లాక్డౌన్లు విఫలం అవడమే కాకుండా వాటివల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారని ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘జేపీ మోర్గాన్’ ఓ అధ్యయన నివేదికలో తెలిపింది. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పలు దేశాల్లో కరోనా ఇన్ఫెక్షన్లు తగ్గాయని, మరికొన్ని దేశాల్లో ఇన్ఫెక్షన్లు పెరిగాయని.. ఇలా తగ్గడానికి, పెరగడానికి ప్రత్యక్షంగా లాక్డౌన్ కారణం కాదని, కరోనా వైరస్ సొంత ‘గతి’ క్రమమే అందుకు కారణం కావచ్చని జేపీ మోర్గాన్ సంస్థ తరఫున నివేదికను రూపొందించిన ఫిజిసిస్ట్, స్ట్రాటజిస్ట్ అయిన మార్కో కొలనోవిక్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తిపై లాక్డౌన్ల ప్రభావం తక్కువేనని, లాక్డౌన్ చర్యలు సరిపోలేదని అధ్యయనం పేర్కొంది. విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్ తెరచిన తర్వాత కూడా డెన్మార్క్‌లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయని, అదే జర్మనీలో లాక్‌డౌన్‌ను సడలించాక ముందులాగా కేసులు తక్కువగానే ఉన్నాయని అధ్యయనం తెలిపింది. (అక్కడ విమాన సర్వీసులు వాయిదా?) లాక్డౌన్ చర్యలను ఉపసంహరించుకున్నాక అమెరికాలోని అలబామా, విస్కాన్సిన్, కొలరాడో, మిసిసిపిలలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. నెవడా, నార్త్ డకోడాలో కేసులు పెరిగాయి. భారత్‌లో కూడా కేసులు పెరిగాయి. లాక్డౌన్ ఎత్తివేశాక అన్ని చోట్ల జనసమూహాలు పెరుగుతాయి కనుక కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నది మోర్గాన్ సంస్థ వాదన. లాక్డౌన్లు ఎత్తివేశాక ఎక్కువ దేశాల్లో కరోనా కేసులు పెరగకుండా తగ్గడం అనేది లాక్డౌన్లకు సంబంధించిన విషయం కాదని, అది కరోనా వైరస్ ‘గతి’కి సంబంధించిన అంశంమని మోర్గాన్ అభిప్రాయపడినట్లు స్పష్టం అవుతుంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉండడం కూడా కరోనా వైరస్ ‘గతి’కి సంబంధించిన అంశమని పలువురు శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల కన్నా లాక్డౌన్ల వల్ల సంభవిస్తున్న మరణాలు ఎక్కువగా ఉన్నాయని, ఇక ముందు కూడా ఉంటాయని మోర్గాన్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
ఉద్యోగులు మెచ్చే కంపెనీలు ఇవే!
లండన్ : ‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదు’ అని అంటారు. అది మూటా ముళ్లె మోసే మోటు పనులకు వర్తిస్తుందేమో కానీ, ఆఫీసులో కంప్యూటర్ల ముందు కూర్చొని గంటలు గంటలు పనిచేసే వారికి వర్తించకపోవచ్చు! ఉల్లాసంగా పనిచేసే సంస్కృతి ఆఫీసులో ఉండడం, చేసే పనికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తే చేసే పని పట్ల ఉద్యోగులకు తృప్తి, సంతృప్తి ఉంటుంది. ఏవో కొన్ని కంపెనీల్లో తప్పా ఎక్కువ కంపెనీల్లో ఇలాంటి సంస్కృతి మచ్చుకైనా కనిపించకపోవచ్చు! కంపెనీ యాజమాన్యం ఉత్తమ సంస్కృతిని పాటించడం, ఉద్యోగాలకు తగిన భద్రత, ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు ఇవ్వడమే కాకుండా అందుకు తగినట్లుగా పదోన్నతులు కల్పించడం, ఉద్యోగులకు ఉల్లాసానికి క్రీడా కార్యక్రమాలతోపాటు అప్పుడప్పుడు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అన్నింటికన్నా జీత భత్యాలు మెరుగ్గా ఇవ్వడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని బ్రిటన్‌లో ఏయే కంపెనీలు ఉత్తమమైనవి? వాటిలో నెంబర్ వన్, నెంబర్ టూ, త్రీ... లు ఏమిటీ? అన్న విషయంలో ఉద్యోగావకాశాలను కల్పించే ప్రముఖ సంస్థ ‘ఇండీడ్’ అధ్యయనం జరిపింది. అనూహ్యంగా రైతులకు క్రిమి సంహారక మందులను విక్రయించే బ్రిటన్‌లోని ‘రెంటోకిల్ ఇన్సియల్’ అనే కంపెకీ నెంబర్ వన్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఇలా 25 ఉత్తమ కంపెనీలను ఎంపిక చేయగా, గతేడాది మొదటి స్థానాన్ని సాధించిన అమెరికా దిగ్గజ సంస్థ ‘ఆపిల్’ ఈసారి రెండో స్థానానికి పడిపోయింది. బ్రిటన్‌లో ఉన్న దేశ, విదేశ కంపెనీలకే ఈ అధ్యయనాన్ని పరిమితం చేశారు. వేలాది మంది ఉద్యోగుల అభిప్రాయలతోపాటు నిపుణుల సమీక్షలను, కంపెనీ పత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ఆశ్చర్యంగా మొదటి ఐదు కంపెనీల్లో నాలుగు కంపెనీలు బ్రిటన్‌కు చెందినవే కాగా, మొదటి పదిలో ఆరు కంపెనీలు బ్రిటన్‌కు చెందినవే. ఉత్తమ ఐదు కంపెనీలో బ్రిటన్‌కు చెందని కంపెనీ ‘ఆపిల్’ అని సులభంగానే గ్రహించవచ్చు. ఆపిల్ బ్రిటన్ బ్రాంచ్‌లో ఆరున్నర వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉత్తమ పాతిక కంపెనీల్లో ఆర్థిక, ఐటీ, గృహోపకార, ఆహార కంపెనీలే కాకుండా వివిధ రకాల కంపెనీలు ఉన్నాయి. ‘ది అగిన్కేర్ గ్రూప్’ మూడో స్థానంలో రాగా, ఆ తర్వాత వరుసగా రెన్ కిచెన్స్, లష్ కాస్మోటిక్స్, ఈ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ), బర్క్లీస్, నండోస్, కుమన్, జేపీ మోర్గాన్ చేజ్, సైమన్స్ ఏజీ, పీడబ్ల్యూసీ, రోల్స్ రాయిస్, ఐ, మార్క్స్ అండ్ స్పెన్సర్, ఐకియా, బక్కావోర్, గ్లాక్సోస్మిత్‌క్లైన్, జాన్ లెవిస్ అండ్ పార్టనర్స్, వెయిట్రోజ్ అండ్ పార్టనర్స్, ఆర్బీఎస్, క్లార్క్స్, బేసిస్టమ్స్, లాయిడ్స్ బ్యాంక్, ఆర్నాల్డ్స్ క్లార్క్ కంపెనీలు ఎంపికయ్యాయి. -
ట్రంప్‌కు లేఖ : దిగ్గజాలు కలవరపాటు
వాషింగ్టన్ : ఆపిల్, జేపీ మోర్గాన్, పెప్సీ వంటి దిగ్గజ కంపెనీలు సైతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకునే హెచ్-1బీ వీసా పాలసీలో ట్రంప్ తీసుకొస్తున్న మార్పులు, దిగ్గజాలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇప్పటికే పలుమార్లు ట్రంప్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఆయన నా దారి రహదారి అన్నట్టు ప్రయాణిస్తున్నారు. హెచ్-1బీ వీసా విధానంలో మార్పులపై తాజాగా మరోసారి దిగ్గజ కంపెనీలు ట్రంప్ కార్యాలయానికి తమ గోడును వెల్లబుచ్చుకున్నాయి. ఇమ్మిగ్రేషన్ పాలసీలో ట్రంప్ కార్యాలయం తీసుకుంటున్న మార్పులు.. చాలా ఆందోళకరంగా ఉన్నాయంటూ టాప్ యూఎస్ బిజినెస్ లీడర్లు రాసిన లేఖలో పేర్కొన్నారు. వీరిలో ఆపిల్ ఇంక్ సీఈవో టిమ్ కుక్, జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కంపెనీ జమీ డిమోన్, పెప్సికో ఇంక్ ఇంద్రా నూయీ ఉన్నారు. ఈ లేఖలో అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకునే ఇమ్మిగ్రేషన్ విధానం, ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న మార్పులను వీరు ఎక్కువగా ఫోకస్ చేశారు. అస్థిరమైన వలస విధాన నిర్ణయాలు, ఇమ్మిగ్రెంట్ల జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్లను తగ్గించడం వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పులతో అనవసరమైన ఖర్చులు, ఇబ్బందులు పెరుగుతాయే తప్ప, పెద్దగా ప్రయోజనాలేమీ ఉండవని సీఈవోలు చెప్పారు. చట్టాన్ని గౌరవించే వేలమంది జీవితాలను అతలాకుతలం చేయొద్దని వేడుకున్నారు. అమెరికాలో పోటీతత్వానికి ఇది గండికొడుతుందని ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. అమెరికా టాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లందరూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, ఈ లేఖను రూపొందించారని ఫార్చ్యూన్ రిపోర్టు చేసింది. కాగ, హెచ్-1బీ వీసాలపై పరిమితులు తీసుకొస్తున్న ట్రంప్ కార్యాలయం, అత్యంత ప్రతిభావంతులైన విదేశీయులను నియమించుకోవడం తగ్గించేసింది. అయితే విదేశీ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వల్ల అమెరికా బాగా ప్రయోజనం పొందుతుందని, ఇప్పుడు వారిపై ఆంక్షలు విధిస్తే అమెరికాలోఆర్థిక వ్యవస్థకే దెబ్బ అని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు. -
అమెజాన్‌లో ప్రముఖ కార్డియాలజిస్ట్
అమెజాన్ అంటే ప్రపంచ ఈ-కామర్స్ మార్కెట్లో ఓ సంచలనం. ఈ కంపెనీ కన్ను ఇప్పుడు 3 ట్రిలియన్ డాలర్ల హెల్త్ కేర్ రంగంపై పడింది. హెల్త్ కేర్ రంగంలోనూ తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ మౌలిక్ మజ్ముదార్ను నియమించుకుంది. అమెజాన్‌లో తనను నియమించుకున్నట్టు తెలుపుతూ.. మజ్ముదార్ తన ట్విటర్ అకౌంట్లో కొత్త రోల్ గురించి ప్రకటించారు. ఈ టెక్నాలజీ కంపెనీ మజ్ముదార్ను నియమించుకోకముందు, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో హెల్త్ కేర్ ట్రాన్సఫర్మేషన్ ల్యాబ్‌కు కార్డియాలజిస్ట్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించేవారు. ఎంఐటీలో లెక్చరర్ కూడా. ల్యాబ్‌లో ఆయన అధునాతన మెడికల్ టెక్నాలజీస్‌ను ఔషధాల్లో ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలపై పరిశోధనలు చేసేవారు. అయితే అమెజాన్‌లో ఆయన కొత్త ఏ బాధ్యతలను నిర్వర్తించనున్నారో మాత్రం వెల్లడించలేదు. కేవలం ఉత్తేజకరమైన, సవాల్‌తో కూడిన బాధ్యతలను తాను స్వీకరించనున్నట్టు మాత్రమే పేర్కొన్నారు. ఇప్పటికే హెల్త్‌కేర్‌లో కూడా పలు టీమ్స్‌తో అమెజాన్ పనిచేస్తోంది. మెడిసిన్లను హాస్పిటల్స్‌కు, క్లినిక్స్‌కు అమ్మేలా ఓ బిజినెస్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని అమెజాన్ యోచిస్తున్నట్టు తెలిసింది. హెల్త్ కేర్ కంపెనీలకు ఏఐ ఆధారిత టెక్నాలజీస్, ఇతర అధునాతన టెక్నాలజీలను తన క్లౌడ్ టీమ్ విక్రయించబోతున్నట్టు సమాచారం. హెల్త్ కేర్‌లో వాయిస్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి అలెక్సాలో ఓ మంచి బృందమే పనిచేస్తుంది. జూన్‌లో అమెజాన్ ఆన్లైన్ ఫార్మసీ పిల్ప్యాక్ను కూడా కొనుగోలు చేసింది. తన ఉద్యోగులకు వైద్య ఖర్చులు తగ్గించడానికి ఈ కంపెనీ, జేపీ మోర్గాన్, బెర్క్ షైర్ హాత్వేలతో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హెల్త్ కేర్‌పై కన్నేసిన టెక్నాలజీ కంపెనీల్లో కార్డియాలజిస్ట్‌లకు భారీ డిమాండ్ ఉంది. దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్, గూగుల్, ఆపిల్ కంపెనీలు వీరి నియామకాలపై ఎక్కువగా దృష్టి సారించాయి. 1/ Very emotional day: After decade of medical training (@NorthwesternMed @HopkinsMedicine @BrighamWomens), five years on the faculty @MGHMedicine and @harvardmed, leading #digitalhealth @mgh_htl, I have decided to leave academia to take on an exciting & challenging role @amazon — Maulik Majmudar, MD (@mdmajmudar) August 20, 2018 -
పండుగ సీజన్‌కు స్మార్ట్ఫోన్ల జోష్
♦ మెరుగుపడనున్న సెంటిమెంటు ♦ జేపీ మోర్గాన్ నివేదికలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల విపణి మూడో త్రైమాసికంలో మంచి జోష్‌మీద ఉంటుందని జేపీ మోర్గాన్ తన ‘ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్’ నివేదికలో వెల్లడించింది. మెరుగైన సెంటిమెంటుతోపాటు పండుగల సీజన్ కోసం విక్రేతల వద్ద సరుకు నిల్వలు పెరగడం ఇందుకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం.. జీఎస్టీ అమలుతీరుపై స్పష్టత లేక సరుకు నిల్వ చేసుకోవడాన్ని విక్రేతలు వాయిదా వేయడంతో ఏప్రిల్–జూన్‌లో డిమాండ్ సాధారణంగా ఉంది. అలాగే ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు మళ్లే ప్రక్రియ నెమ్మదించడం కూడా స్మార్ట్ఫోన్ల డిమాండ్ తగ్గడానికి కారణమైంది. జూలై ప్రారంభం నుంచే సెంటిమెంటు మెరుగుపడింది. జూలై–సెప్టెంబరులో విక్రయాలు గణనీయంగా ఉంటాయి. ఈ కాలంలో అమ్మకాలు క్రితం త్రైమాసికంతో పోలిస్తే 25–30 శాతం, 2016 జూలై–సెప్టెంబరుతో పోలిస్తే 7 శాతం వృద్ధి నమోదు చేస్తాయి. నాల్గవ త్రైమాసికం ప్రారంభం వరకు అమ్మకాల జోష్ ఉంటుంది. స్మార్ట్ఫోన్ల వాటా 45 శాతం.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో అమ్ముడైన మొత్తం మొబైల్స్‌లో స్మార్ట్ఫోన్ల వాటా 45 శాతం ఉంటుందని జేపీ మోర్గాన్ నివేదిక వెల్లడించింది. ‘స్మార్ట్ఫోన్ల విభాగం జూలై–సెప్టెంబరులో ఇదే స్థాయిలో కొనసాగుతుంది. ఈ త్రైమాసికంలో అందుబాటులోకి రానున్న రూ.1,500 విలువగల జియో ఫీచర్‌ఫోన్ ఇందుకు కారణం. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు మళ్లే ప్రక్రియ మందగించే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ ప్రభావం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై తాత్కాలికమే.‘ అని వివరించింది. -
ఎడెల్వీజ్ చేతికి జేపీ మోర్గాన్ ‘ఫండ్’
డీల్ విలువ రూ. 110 కోట్లు! న్యూఢిల్లీ: ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్‌కు భారత్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఎడెల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ మంగళవారం తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 110 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ఫండ్ దాదాపు రూ. 7,000 కోట్ల పైచిలుకు అసెట్స్‌ను నిర్వహిస్తోంది. డీల్ అనంతరం ఏర్పడే సంయుక్త సంస్థ ఆధ్వర్యంలో దాదాపు రూ. 8,757 కోట్ల అసెట్స్ ఉంటాయి. జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియాకి సంబంధించిన మెజారిటీ ఉద్యోగులను తీసుకోనున్నట్లు ఎడెల్వీజ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి గత కొన్నాళ్లుగా పలు అంతర్జాతీయ సంస్థలు వైదొలుగుతున్నాయి. ఈ కోవలో జేపీ మోర్గాన్ 11వది. రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ గతేడాది గోల్డ్‌మన్ శాక్స్ భారత ఫండ్ వ్యాపారాన్ని రూ. 243 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాండర్డ్ చార్టర్డ్ తన ఫండ్ వ్యాపారాన్ని 2008లో ఐడీఎఫ్సీకి విక్రయించింది. -
లేమన్ బ్రదర్స్ కు జేపీమోర్గాన్ పరిహారం
న్యూయార్క్: ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు లేమన్ బ్రదర్స్‌తో వివాదాన్ని కొంత మేర పరిష్కరించుకునేందుకు 1.42 బిలియన్ డాలర్లు చెల్లించడానికి జేపీమోర్గాన్ చేజ్ అంగీకరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి తెరతీస్తూ 2008లో లేమన్ బ్రదర్స్ దివాలా ప్రకటించింది. తమకు క్లియరింగ్ బ్యాంక్‌గా వ్యవహరించిన జేపీమోర్గాన్ అక్రమంగా నిధులు కైంకర్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని లేమన్ బ్రదర్స్ దావా వేసింది.