‘బిట్​కాయిన్​ ఓ చెత్త.. పనికిమాలిన వ్యవహారం’ | JPMorgan CEO Jamie Dimon Thinks Bitcoin Is Worthless | Sakshi
Sakshi News home page

Bitcoin: బిట్​కాయిన్​పై బ్యాంకింగ్​ టైకూన్​ సంచలన వ్యాఖ్యలు

Published Thu, Oct 14 2021 2:05 PM | Last Updated on Thu, Oct 14 2021 7:54 PM

JPMorgan CEO Jamie Dimon Thinks Bitcoin Is Worthless - Sakshi

ప్రపంచమంతా క్రిప్టోకరెన్సీకి దాసోహం అవుతున్న తరుణంలో.. డిజిటల్​ కరెన్సీ మీద ఓ బ్యాంకింగ్​ దిగ్గజ సీఈవో సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిట్​కాయిన్​ అనేది చెత్త వ్యవహారం అని, అది ఎందుకు పనికిరాదంటూ వ్యాఖ్యలు చేశారాయన.


అమెరికా మల్టీనేషనల్​ ఇన్వెస్ట్​మెంట్​​ బ్యాంక్​, ఫైనాన్షియల్​ సేవలు అందించే ‘జేపీ మోర్గాన్​ చేజ్​ అండ్​ కో’ సీఈవో జేమీ డిమన్​(65) క్రిప్టోకరెన్సీ బిట్​కాయిన్​ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిట్​కాయిన్​ను విలువ లేని ఇన్వెస్ట్​మెంట్​గా పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగతంగా నా దృష్టిలో అదొక నాన్​సెన్స్​. సీరియస్​ ఇన్వెస్ట్​మెంట్​ అనుకోవడం మూర్ఖత్వం. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా క్లయింట్లు విషయపరిజ్ఞానం ఉన్నవాళ్లు. వాళ్లు కూడా దీనిని అంగీకరించరు”అంటూ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్​ ఈవెంట్​లో ఇలా ముక్కుసూటి వ్యాఖ్యలు చేశారాయన.


చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్‌ దేశాలు...!


ఇదిలా ఉంటే మొదటి నుంచి ఆయన బిట్​కాయిన్​ పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. బిట్​కాయిన్​లాంటి క్రిప్టోకరెన్సీలను ‘మూర్ఖుల బంగారం’గా అభివర్ణించిన డిమన్​.. అమెరికాలోనే అతిపెద్ద బ్యాంకింగ్​ దిగ్గజమైన తాము(జేపీ మోర్గాన్​) ప్రొత్సహించబోదని,  దానిపై ప్రభుత్వాల నియంత్రణ​ కచ్చితంగా ఉండాలని గతంలో ఆయన వ్యాఖ్యానించారు కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఎదిగిన చైనా.. దానివల్ల పర్యవసనాలు చెడువే జరుగుతున్నాయంటూ ఈమధ్యే నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఓవైపు ఎలన్​ మస్క్​ లాంటి కుబేరులు క్రిప్టోకరెన్సీకి తెగ ప్రమోట్​ చేస్తుంటే.. మరోవైపు ఇంకొందరు ధనికులు మాత్రం పూర్తిగా దానికి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు.

చదవండి: Bitcoin.. సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్‌కాయిన్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement