Cryptocurrency
-
నేరం చేసేలా ఒత్తిడి చేస్తారు..తప్పు ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు
సాక్షి, హైదరాబాద్ : ‘థాయ్‌లాండ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం పేరిట నన్ను బ్యాంకాక్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి మయన్మార్‌లోని కేకేపార్క్ ప్రాంతంలోకి జాంటు అనే కంపెనీకి ఒక చైనీయుడు నన్ను తీసుకెళ్లాడు. అక్కడున్నవారు నన్ను సైబర్ మోసాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. తర్వాత వారే సైబర్ మోసాలు ఎలా చేయాలి? ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి? వారితో నమ్మకంగా ఎలా మెలగాలి? చివరకు ఎలా మోసగించాలి? ఇలా అన్నింటికి సంబంధించి శిక్షణ ఇచ్చారు. తర్వాత నాకు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసాలు చేసే పని అప్పగించారు’ అంటూ మహమ్మద్ అర్బాజ్ బిన్బా బేజర్ తన ప్రత్యక్ష అనుభవాన్ని చెప్పారు. నగరానికి చెందిన మహమ్మద్ అర్బాజ్ బిన్బా బేజర్ ఉద్యోగం కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లి సైబర్ నేరగాళ్ల ముఠా చేతికి ఎలా చిక్కాడు..ఎలా బయటపడ్డారో టీజీ సైబర్‌సెక్యూరిటీ బ్యూరో అధికారులకు గురువారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఏజెంట్ రూ.60,000 తీసుకొని...ఫలక్‌నుమాలోని మీ సేవ కేంద్రంలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసే తనకు థాయ్‌లాండ్‌లో అదే ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ బషీర్ రూ. 60,000 తీసుకొని తనను 2025 జనవరి 1న బ్యాంకాక్ పంపినట్టు మహమ్మద్ అర్బాజ్ చెప్పాడు. ‘బ్యాంకాక్ విమానాశ్రయంలో ఒక చైనీయుడు నన్ను రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత ఒక ట్యాక్సీలో థాయ్‌లాండ్‌లోని మే సాట్లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతను నన్ను మే సాట్లోని నది పాయింట్‌కు తీసుకెళ్లి, చిన్న పడవలో నదిని దాటించి మయన్మార్‌లోని మైవాడికి, ఆ తర్వాత కారులో కేకే పార్క్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ క్రిప్టోకరెన్సీలో పెట్టుబడుల పేరిట మోసాలు చేసే పని అప్పగించారు. ఆ ముఠావారు ముందు నకిలీ వివరాలతో ఒక ఫేస్బుక్ ఖాతా తెరిపిస్తారు. దానిలో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టాలి. స్పందించిన వ్యక్తులతో ఫొటోలు, శుభాకాంక్షలు పెడుతూ, వారి అభిరుచులు, అలవాట్లపై చర్చిస్తూ పరిచయం పెంచుకోవాలి. అలా వారి నమ్మకాన్ని పొందిన తర్వాత, టీమ్ లీడర్ మాకు నిజమైన యూఎస్ వాట్సాప్ నంబర్ ఇస్తాడు. వాట్సాప్‌లో సంభాషణను కొనసాగిస్తూ, చైనీయులు నిర్వహించే వెబ్సైట్ ద్వారా క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని, నాకు కూడా మీరు పెట్టే పెట్టుబడిలో ఒక శాతం కమీషన్ అందుతుందని ఒప్పించాలి.ఎదుటి వ్యక్తికి అనుమానం వస్తే వారి నమ్మకాన్ని తిరిగి పొందడానికి మేము వీడియో కాల్ చేస్తాం. ఇలా పెట్టుబడులు పెట్టించి మోసగించాలి. నేను ఇలా ఒకటిన్నర నెల పనిచేసిన తర్వాత, నాకు అప్పగించిన టార్గెట్ చేరుకోలేదని నా జీతం తగ్గించారు. భారత్‌తోపాటు ఎన్నో దేశాల వారు అక్కడ పనిచేస్తున్నారు. ఇటీవల మాలాంటి వారిని అక్కడి సైన్యం కాపాడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు మా కంపెనీ వారు మమ్మల్ని పిలిచి..ఆసక్తి లేనివారు కంపెనీని విడిచి వెళ్లిపోవచ్చని చెప్పారు. 2025 ఫిబ్రవరి 23న సైన్యం మా కంపెనీ కార్యాలయానికి వచ్చింది. అప్పుడు నేను సైనిక బృందంతో భారత రాయబార కార్యాలయానికి వచ్చి, 2025 మార్చి 11న భారత్‌కు చేరుకున్నాను’ అని టీజీసీఎస్బీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు బషీర్, ఇతరులపై కేసు నమోదు చేసిన టీజీసీఎస్బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. -
క్రిప్టో సీజ్..'ఓ కొత్త కథ'!
సాక్షి, హైదరాబాద్: నగలు, నగదు, వస్తువులు, వాహనాల సీజింగ్.. బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్, ఆస్తుల అటాచ్మెంట్.. ఇవన్నీ పోలీసులకు సుపరిచితమే. వీటిలోకి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా వచ్చి చేరింది. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు దోచిన సొమ్మును దేశం దాటించేందుకు క్రిప్టో కరెన్సీని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో నేరస్తులు పట్టుబడితే వారి నుంచి ఆ క్రిప్టో కరెన్సీని పోలీసులు రికవరీ చేస్తున్నారు. అయితే, క్రిప్టో సీజింగ్ కొత్త కావడంతో పెద్ద ప్రహసనంగా మారింది.పెరుగుతున్న క్రిప్టో సీజింగ్ గెయిన్ బిట్ కాయిన్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత బుధవారం ఐదు రాష్ట్రాల్లో దాడులు చేసి రూ.23.94 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని సీజ్ చేసింది. గోల్డ్ కాస్ట్ సోలార్ స్కామ్‌లో ఢిల్లీ పోలీసులు గత ఏడాది అక్టోబర్‌లో రూ.80 లక్షల విలువైన క్రిప్టోను సీజ్ చేశారు. రూ.2.06 కోట్లతో ముడిపడిన ట్రేడింగ్ ఫ్రాడ్ కేసును ఛేదించి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జనవరి 29న రూ.40 లక్షల విలువైన బిట్ కాయిన్లు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదే తొలి అధికారిక క్రిప్టో కరెన్సీ/బిట్ కాయిన్ సీజింగ్. సైబర్ నేరాలతో బిట్ కాయిన్స్‌కు విడదీయరాని బంధం ఉన్న నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం అత్యవసరంగా మారింది. క్రిప్టో రూపంలో దేశం దాటుతున్న మోసం సొమ్ము ప్రస్తుతం యాప్‌ల ఆధారంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో చాలావరకు చైనీయులే సూత్రధారులుగా ఉంటున్నారు. నేపాల్, చైనా, ఇండోనేసి యా, దుబాయ్ తదితర దేశాల్లో కూర్చుని, ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దందా చేస్తున్నారు. ఏజెంట్ల కమీ షన్ పోగా మిగిలిన దోపిడీ సొమ్ము విదేశా ల్లోని ఆ సూత్రధారులకు చేరాల్సిందే. ఒకప్పుడు ఈ లావాదేవీలన్నీ హవాలా రూపంలో జరిగేవి. కొన్ని దేశాలకు హవాలా కష్టసాధ్యం కావడంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సూత్రధారులు క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక్కడి పాత్రధారుల ఖాతాల్లోకి నగదు వెళ్లిన తర్వాత దాన్ని బిట్ కాయిన్ రూపంలోకి మార్చి తమ వద్దకు వచ్చేలా చేసుకుంటున్నారు. క్రిప్టో వాలెట్స్‌లో రెండు రకాలుగూగుల్ ప్లేస్టోర్స్, యాపిల్ యాప్ స్టోర్స్‌లో క్రిప్టో కరెన్సీకి సంబంధించి అనేక యాప్స్ ఉన్నాయి. వాలెట్స్‌గా పిలిచే వీటిని డౌన్లోడ్ చేసుకుని, బ్యాంకు ఖాతాకు అనుసంధానించుకోవడం ద్వారా క్రిప్టో కరెన్సీ క్రయవిక్రయాలు చేయవచ్చు. ఈ వాలెట్స్‌లో బినాన్స్, కాయిన్ బేస్ వంటి కస్టోడియన్ వాలెట్స్‌తో పాటు సేఫ్ పాల్, ట్రస్ట్ వంటి నాన్ కస్టోడియన్ వాలెట్స్ ఉంటాయి. కేంద్ర ఆర్థిక శాఖ అదీనంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) అనుమతి తీసుకుని నడిచేవి కస్టోడియన్ వాలెట్స్. అనుమతి లేకుండా నడిచేవి నాన్ కస్టోడియన్ కిందికి వస్తాయి. కస్టోడియన్ వాలెట్స్ ఆపరేట్ చేయడానికి వినియోగదారుడి నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాల నమోదు, వర్చువల్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇలా చేస్తే పోలీసుల దర్యాప్తులో తమ ఉనికి బయటపడుతుందనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా నాన్ కస్టోడియన్ వాలెట్స్ వాడుతున్నారు. 12 వర్డ్ పాస్ ఫేజ్ నమూనా అంకెలు, అక్షరాల సమాహారమేబిట్ కాయిన్‌గా పిలిచే క్రిప్టో కరెన్సీ 25 నుంచి 50 అంకెలు, అక్షరాలతో కూడిన వాలెట్ అడ్రస్ రూపంలో ఉంటుంది. కేవలం ఈ వాలెట్ అడ్రస్ ఆధారంగా క్రిప్టో కరెన్సీ ఏ వాలెట్లో ఉందో గుర్తించడం సాధ్యం కాదు. నిందితుల ఫోన్లో ఆ వాలెట్ ఉండి, అందులో వాలెట్ అడ్రస్ దొరికితేనే ఆ కరెన్సీ, దాని విలువ తెలుస్తుంది. వాలెట్ ఉన్న ఫోన్‌ను సీజ్ చేసినంత మాత్రాన క్రిప్టో కరెన్సీని సీజ్ చేసినట్లు కాదు. ఓ వినియోగదారుడు క్రిప్టో కరెన్సీ వాలెట్ అడ్రస్‌ను పోగొట్టుకుంటే దాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి. కస్టోడియన్ వాలెట్స్‌లో క్రిప్టో కరెన్సీని కేవైసీ ద్వారా, నాన్ కస్టోడియన్ వాలెట్స్‌లో 12 పదాలతో కూడిన ‘12 వర్డ్ పాస్ ఫేజ్’, ఎంపిక చేసుకున్న ప్రశ్నలు–సమాధానాల ద్వారా రిట్రైవ్ చేసుకోవాలి. ఈ విధానంలో సదరు నాన్ కస్టోడియన్ వాలెట్ 12 పదాలను ఓ వరుస క్రమంలో చూపిస్తుంది. దాన్ని రాసుకుని, రహస్యంగా దాచుకునే వినియోగదారుడు.. అవసరమైనప్పుడు క్రిప్టో కరెన్సీ రిట్రైవ్ చేసుకోవడానికి వినియోగిస్తాడు. ఈ పాస్ ఫేజ్ ఎవరి దగ్గర ఉన్నా... దాన్ని వినియోగించి క్రిప్టో అసెట్స్‌ను రిట్రైవ్ చేసుకోవచ్చు.సైబర్ ఠాణాలకు అధికారిక వాలెట్స్ ఓ నిందితుడి వాలెట్లో ఉన్న క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పాస్ ఫేజ్ అతడి కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితుల వద్దా ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉంటే నిందితుడిని అరెస్టు చేయగానే వాళ్లు పాస్ ఫేజ్ వినియోగించి ఆ క్రిప్టో కరెన్సీని తమ ఫోన్లలో యాక్టివేట్ చేసుకుని, మరో దాంట్లోకి మార్చేయడం, ఎన్‌క్యాష్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా చూసేందుకు దర్యాప్తు అధికారులు అధికారికంగా కస్టోడియన్ వాలెట్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. నిందితుడి వాలెట్లోని క్రిప్టోను ఇందులోకి బదిలీ చేసుకుని న్యాయస్థానానికి సమాచారం ఇస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా సబ్ ఇన్స్పెక్టర్ వినయ్‌కుమార్ ఇలాగే రూ.40 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేశారు. ఈ కేసుతో వచి్చన అనుభవంతో ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ ఠాణాల్లో ఉన్న ప్రతి టీమ్‌కు క్రిప్టో వాలెట్స్ ఓపెన్ చేయించారు. భవిష్యత్‌లో సైబర్ నేరగాళ్ల నుంచి క్రిప్టో కరెన్సీ స్వా«దీనం చేసుకుంటే దాన్ని భద్రపరచడం కోసం వీటిని వినియోగించనున్నారు. -
లక్కీభాస్కర్ రమేశ్ వెనుక గాడ్‌ఫాదర్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇటీవల విడుదలైన లక్కీభాస్కర్ సినిమాలో మాదిరిగా క్రిప్టో కరెన్సీ పేరుతో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి దుబాయ్ పారిపోదామనుకున్న రమేశ్‌గౌడ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. జీబీఆర్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన డబ్బులతో ఆయన సీఐడీ దర్యాప్తు అధికారులను ప్రభావితం చేస్తున్నారా..? అతడిని రక్షించేందుకు తెరవెనుక గాడ్‌ఫాదర్ ఎవరైనా ఉన్నారా..? అతని ఇంటి మీద జరిగే దాడుల సమాచారం ముందే లీకైందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అతడి అరెస్టు సమయంలో సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోకపోవడం.. కేసు నెమ్మదిగా సాగుతుండటంపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు కేవలం ఆరోపణలకే పరిమితం కాలేదు. దర్యాప్తు అధికారులను రమేశ్ తన వశం చేసుకున్నాడని పలు వీడియోలు, ఫొటోలు, ఆడియోరికార్డింగులు సంపాదించి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇక్కడ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న డీఎస్పీని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం బాధితుల ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.నిందితుడితో సీఐడీ అధికారుల సమావేశాలు?జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరిట అమాయకుల నుంచి కోట్లు వసూలు చేసిన జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన రమేశ్‌గౌడ్ వ్యవహారం కొత్త చర్చకు దారి తీస్తోంది. సీఐడీ అధికారులతో తాను ముందే మాట్లాడుకున్నానని, వారు తనను ఏం చేయలేరని బాధితులతో గొప్పలు చెప్పుకున్నాడు. ఈ వ్యవహారంలో సీఐడీ విచారణ నెమ్మదించడం.. అక్టోబర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనా అతనిపై చర్యలు తీసుకోకపోవడంతో వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో వారు రమేశ్‌గౌడ్ ప్రతి కదిలికను వీడియో రికార్డు చేశారు. సీఐడీ పోలీసులు, నిందితుడు రమేశ్‌గౌడ్‌తో డబ్బుల వ్యవహారంపై చర్చించిన మాటలు రికార్డు చేశారు. ఈ క్రమంలోనే రమేశ్‌గౌడ్ సీఐడీ అధికారులతో హైదరాబాద్, వరంగల్‌లో పలుమార్లు రహస్యంగా సమావేశమైనట్లు తెలుసుకున్నారు. కరీంనగర్ శివారులోని రేకుర్తిలో కరీంనగర్ సీఐడీ అఫీసుకు చెందిన ఓ ఉన్నతాధికారి వాహనంలో రమేశ్‌గౌడ్, అతని బావ అయిన ఓ కానిస్టేబుల్, రమేశ్‌గౌడ్ రియల్ ఎస్టేట్ పార్టనర్లు కలిసి సమావేశమయ్యారు. ఈ వ్యవహారాన్ని మొత్తం రహస్యంగా వీడియో చిత్రీకరించిన బాధితులు సదరు అడియో, వీడియో క్లిప్పింగ్‌లను డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగానికి అందించారు. రమేశ్‌గౌడ్, అతని మనుషులు సీఐడీ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, అతడితో పలుమార్లు సీఐడీ అధికారులు సమావేశమవ్వడమే అందుకు నిదర్శనం అంటూ సదరు వీడియోలను చూపించారు. ఈ నేపథ్యంలోనే గతనెల 29న కరీంనగర్ సీఐడీ డీఎస్పీని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.వారి సంగతేమిటి..?సీఐడీ ఎఫ్ఐఆర్లో నిందితుడు రమేశ్‌తోపాటు అతని భార్య ఉమారాణి, డ్రైవర్ సురేష్ పేర్లు కూడా నిందితుల జాబితాలో ఉన్నాయి. రమేశ్‌గౌడ్ బాధితుల నుంచి సేకరించిన డబ్బును వీరి ఖాతాల్లోకి మళ్లించినట్లు సీఐడీ విభాగం గుర్తించినా ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అలాగే నిందితుడు రమేశ్‌గౌడ్ అరెస్టయిన రోజు అతని మూడు యాపిల్ సెల్ఫోన్లను తన డ్రైవర్‌కు అప్పగించి పంపించడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి ఆర్థిక లావాదేవీలన్ని ఆ మూడు సెల్ఫోన్లలోనే ఉన్నాయని తెలిసినప్పటికీ వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీస్తున్నారు. సీఐడీ అధికారులు రమేశ్గౌడ్పై దాడులు చేసేందుకు వెళ్లే సమాచారం ముందే లీకై ందని ఆరోపిస్తున్నారు. మొత్తం సీఐడీ దర్యాప్తు సాగుతున్న తీరు చూస్తుంటే తమకు న్యాయం దక్కదేమోనని బాధితులు వాపోతున్నారు. ఈ కేసులో మన రాష్ట్రం నుంచి హవాలా మార్గంలో రూ.కోట్ల డబ్బు దుబాయికి చేరిందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో మనీల్యాండరింగ్ జరిగిందని, నిర్ధారణ అయ్యిందని ఈ నేపథ్యంలో కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐకి అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
క్రిప్టో కరెన్సీకి జాతీయ ప్రాధాన్యత.. ట్రంప్ యోచన!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలిచాక క్రిప్టో కరెన్సీకి (cryptocurrency) కొత్త ఊపు వచ్చింది. ట్రంప్ మొదటి నుంచి కూడా క్రిప్టో కరెన్సీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా క్రిప్టో కరెన్సీని మార్చేందుకు ఉత్తర్వులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది.ఈ చర్య అమెరికా విధాన మార్పును సూచిస్తుందని, ప్రభుత్వ నిర్ణయాలను రూపొందించడంలో క్రిప్టో పరిశ్రమకు మరింత ప్రాముఖ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. నివేదికలో పేర్కొన్న మూలాల ప్రకారం.. ఈ ఉత్తర్వులు క్రిప్టోకరెన్సీని జాతీయ ఆవశ్యకతగా నిర్దేశిస్తాయి. క్రిప్టో పరిశ్రమకు ప్రభుత్వ ఏజెన్సీలు సైతం సహకారం అందిస్తాయి. అంతేకాకుండా పరిశ్రమ విధాన అవసరాల కోసం క్రిప్టోకరెన్సీ సలహా మండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కాయిన్‌బేస్, రిపుల్ వంటి ప్రముఖ సంస్థల నుండి విరాళాలతో సహా క్రిప్టోకరెన్సీ పరిశ్రమ నుండి గణనీయమైన మద్దతును పొందారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో రానున్న కొత్త ప్రభుత్వంతో తమ బంధాన్ని సూచించేలా వాషింగ్టన్లో క్రిప్టో పరిశ్రమ వేడుకలకు సిద్ధమైందిజాతీయ బిట్‌కాయిన్ నిధియూఎస్లో జాతీయ బిట్‌కాయిన్ (Bitcoin) నిధిని సృష్టించడం పరిశీలనలో ఉన్న మరో కీలక అంశంగా నివేదిక పేర్కొంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్‌ను కలిగి ఉంది. నవంబర్ ఎన్నికల నుండి బిట్‌కాయిన్ ధర దాదాపు 50% పెరిగింది. భవిష్యత్తులో క్రిప్టో నిల్వలు పెరుగుతాయన్న ఊహాగానాల కారణంగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు చేరుకుంది.ప్రతిపాదిత నిధి ప్రభుత్వం బిట్కాయిన్లను కలిగి ఉండటాన్ని లాంఛనప్రాయంగా మారుస్తుంది. క్రిప్టోకరెన్సీ పట్ల ప్రభుత్వ వైఖరిలో వ్యూహాత్మక మార్పును ప్రతిబింబిస్తుంది. బిట్‌కాయిన్ 2024లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. దాని విలువ సంవత్సరంలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది.బైడెన్ పాలనలో ఒడుదొడుకులుఅధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో అనేక నియంత్రణ సవాళ్లను ఎదుర్కొన్న క్రిప్టో రంగానికి ఈ చొరవ భారీ మార్పును సూచిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)తో సహా ఫెడరల్ ఏజెన్సీలు ఇటీవలి సంవత్సరాలలో క్రిప్టో కంపెనీలకు వ్యతిరేకంగా 100 కుపైగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాయి. -
ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టేసిన బిట్‌కాయిన్
ప్రముఖ క్రిప్టో కరెన్సీల్లో ఒకటైన బిట్‌కాయిన్ ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను కొట్టేసింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో ఆయన పరిపాలన క్రిప్టోకరెన్సీలకు స్నేహపూర్వక నియంత్రణ వాతావరణాన్ని సృష్టిస్తుందనే అంచనాల క్రమంలో గురువారం మొదటిసారిగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు పైగా పెరిగింది.బిట్‌కాయిన్ విలువ ఈ ఏడాదిలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన ఈ నాలుగు వారాల్లోనే దాదాపు 45 శాతం ఎగిసింది. "మనం ఒక నమూనా మార్పును చూస్తున్నాం. నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రక్షాళన తర్వాత, బిట్‌కాయిన్‌తోపాటు మొత్తం డిజిటల్ అసెట్ ఎకోసిస్టమ్ ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి ప్రవేశించే అంచున ఉన్నాయి" అని యూఎస్ క్రిప్టో సంస్థ గెలాక్సీ డిజిటల్ వ్యవస్థాపకుడు, సీఈవో మైక్ నోవోగ్రాట్జ్ అన్నారు."బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లు దాటడం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఫైనాన్స్, టెక్నాలజీ, జియోపాలిటిక్స్‌లో మారుతున్న ఆటుపోట్లకు ఇది నిదర్శనం" అని హాంకాంగ్‌కు చెందిన స్వతంత్ర క్రిప్టో విశ్లేషకుడు జస్టిన్ డి'అనేతన్ అన్నారు. చాలా కాలం క్రితం ఫాంటసీగా కొట్టేసిన ఈ ఫిగర్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందన్నారు.ట్రంప్ తన ప్రచార సమయంలో డిజిటల్ అసెట్స్‌ను ప్రోత్సహిస్తామని, యునైటెడ్ స్టేట్స్ను "క్రిప్టో రాజధాని"గా చేస్తానని వాగ్దానం చేశారు. దీంతో క్రిప్టో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. కాగా ప్రస్తుతం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న గ్యారీ జెన్స్లర్.. ట్రంప్ అధికారం చేపట్టాక జనవరిలో పదవీవిరమణ చేస్తానని గత వారం చెప్పారు. ఈ పదవికి ఎస్ఈసీ మాజీ కమిషనర్ పాల్ అట్కిన్స్ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. -
రూ.5,900 కోట్ల విలువైన బిట్కాయిన్లు చెత్తకుప్ప పాలు!
లండన్: అనగనగా ఒక పాత హార్డ్‌డ్రైవ్. బ్రిటన్‌కు చెందిన 39 ఏళ్ల జేమ్స్ హావెల్స్ అనే వ్యక్తి క్రిప్టోకరెన్సీ తొలినాళ్లలో అంటే 2009 ఏడాదిలో 8,000 బిట్కాయిన్లను మైనింగ్ చేశాడు. వాటికి సంబంధించిన డిజిటల్ కీని ఆ పాత హార్డ్‌డ్రైవ్‌లో దాచి ఉంచాడు. అయితే అది తర్వాత కనిపించకుండా పోయింది. తన ప్రియురాలు హఫీనా ఎడీ ఎవాన్స్‌తో కలిసి ఈ హార్డ్‌డ్రైవ్ కోసం వేట మొదలెట్టాడు. అది కనిపించట్లేదని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది 2013 ఏడాదిదాకా ఇంట్లోనే ఒక గదిలో సొరుగులో ఉండిపోయింది. అయితే 2013లో ఇంటిని ప్రియురాలు హఫీనా శుభ్రంచేస్తుండగా పాత కంప్యూటర్ విడిభాగాలున్న ఒక పాత నల్ల సంచి కనిపించింది. దీనిని పడేయాలా? అని జేమ్స్‌ను హఫీనా అడగ్గా అవసరం లేదు పడేసెయ్ అని చెప్పాడు. దీంతో బయటికెళ్తూ దారిలో ఉన్న చెత్తకుప్పలో దానిని పడేసి వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరూ దాని కోసం వేట కొనసాగించారు. అయితే తాజా దర్యాప్తులో.. ఆమె గతంలో పడేసిన సంచిలోనే హార్డ్‌వేర్ ఉందని తాజాగా వెల్లడైంది. హార్డ్‌వేర్‌లోని డిజిటల్ కీ సాయంతో అందుబాటులోకి వచ్చే 8,000 బిట్కాయిన్ల ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ.5,900 కోట్లు కావడం గమనార్హం. విషయం తెల్సి హఫీనా హుతాశురాలైంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడిపోయారు. ‘‘జేమ్స్ సంపదను తెలీకుండా చెత్తపాలు చేశాను. దాని కోసం అతను పడుతున్న వేదనను చూడలేకపోతున్నా’’అని తాజాగా హఫీనా వాపోయారు. హఫీనా పడేసిన చెత్తకుప్పలోని వ్యర్థ్యాలు సాధారణంగా వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో ఉన్న డాక్స్వే భారీ డంపింగ్ యార్డ్‌కు చేరుకుంటాయి. అక్కడ ఏకంగా 14,00,000 టన్నుల చెత్తకుప్ప కొండ ఉంది. అందులో ఎలాగైనా తన హార్డ్‌డ్రైవ్‌ను తిరిగి సంపాదిస్తానని జేమ్స్ బయల్దేరారు. అయితే అంత చెత్తను కింది నుంచి మొత్తం తిరగతోడితే కాలుష్యం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ససేమిరా అంటోంది. యార్డ్‌లోకి అతనికి అనుమతి నిరాకరించింది. దీంతో జేమ్స్ కోర్టును ఆశ్రయించాడు. మొత్తం గాలించి హార్డ్‌డ్రైవ్ దొరికితే కుబేరుడినయ్యాక సంపదలో 10 శాతాన్ని న్యూపోర్ట్ అభివృద్ధికి కేటాయిస్తానని, నగరాన్ని దుబాయ్, లాస్ వెగాస్ సిటీలా తీర్చిదిద్దుతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశాన్ని డిసెంబర్లో విచారిస్తామంటూ ఈ కేసును కోర్టు వాయిదావేసింది. -
ఈ అరటి పండు రూ. 52 కోట్లు
వీధుల్లో దొరికే పెద్ద సైజు అరటి పండు ఒకటి మహా అంటే ఐదారు రూపాయలు ఉంటుందేమో. అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటి పండును గోడకు ఒక గట్టి టేప్‌తో అతికించాక దాని విలువ ఎంత అంటే.. అనవసరంగా పండును పాడుచేశావని పిల్లాడిని అంతెత్తున కోప్పడతాం. అయితే అచ్చం అలాంటి అరటి పండునే, అలాగే ఒక ఫ్రేమ్‌కు గట్టి టేప్‌తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా రూ.52 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా?. కానీ ఇది వంద శాతం వాస్తవం. అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపాటలో ఇది 6.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారిజో కాటెలాన్ మనోఫలకం నుంచి జాలువారి ఫ్రేమ్‌కు అతుక్కున్న కళాఖండమిది అని అక్కడి కళాపోషకులు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది. బుధవారం ప్రఖ్యాత ‘సోత్వే’ వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక్కినెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసిమరీ సొంతంచేసుకున్నారు. ‘‘ ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం. ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది. త్వరలో దీనిని అమాంతం ఆరగిస్తా’ అని జస్టిన్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యున్నత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు రూ.30 ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందని సోత్బే సంస్థ పేర్కొంది. వేలంపాటల చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపాట వర్గాలు వెల్లడించాయి. 2019లో మియామీ బీచ్‌లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా ‘కమేడియన్’ పేరిట ఈ పండును ప్రదర్శించారు. దానిని చూసినవారంతా ‘అసలు ఇదేం ఆర్ట్?. దీనిని కూడా ఆర్డ్ అంటారా?’ అంటూ పలువురు విమర్శించారు. అయితే ఐదేళ్ల క్రితమే ఇది 1,20,000 డాలర్ల ధర పలికి ఔరా అనిపించింది. గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ సన్ స్పందించారు. ‘‘ ఈ ఘటనను కేవలం కళగానే చూడకూడదు. ఇదొక సాంస్కృతిక ధోరణుల్లో మార్పుకు సంకేతం. కళలు, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు. పండు ఇంతటి ధర పలకడం ఏంటబ్బా ? అని మనుషుల ఆలోచనలకు, చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. చరిత్రలోనూ స్థానం సంపాదించుకుంటుంది’ అని జస్టిన్ వ్యాఖ్యానించారు. మారుతున్న పండు !వాస్తవానికి 2019లో ప్రదర్శించిన పండు ఇది కాదు. 2019లో దీనిని ప్రదర్శించినపుడు అది పాడయ్యేలోపే అక్కడి కళాకారుడు డేవిడ్ డట్యూనా తినేశాడు. ఆకలికి ఆగలేక గుటకాయ స్వాహా చేశానని చెప్పాడు. ‘‘ప్రపంచంలో క్షుద్బాధతో ఎంతో మంది అల్లాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా?. అయినా 20 సెంట్లు విలువచేసే పండు నుంచి కోట్లు కొల్లకొ డుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి’’ అని డేవిడ్ వ్యాఖ్యానించాడు. 1,20,000 డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు. తర్వాత మరో పండును ప్రదర్శనకు పెట్టారు. దానిని గత ఏడాది దక్షిణకొరియాలోని సియోల్ సిటీలోని ‘లీయిమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శనకు ఉంచినపుడు నోహ్ హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు. ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు. అత్యంత గట్టిగా అతుక్కునే ‘డక్ట్’ టేప్‌తో ఫ్రేమ్‌కు ఈ పండును అతికించారు. ఈ కళాఖండాన్ని సృష్టించిన మారి జో కాటెలాన్ గతంలో ఇలాంటి వింత కళారూ పాలను తయారుచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో నిజమైన టాయిలెట్‌ను రూపొందించారు. దానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రదర్శనకు పెట్టుకుంటే అప్పుగా ఇస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఈయన గతంలో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడట. కొన్న వ్యక్తిపై గతంలో ఆరోపణలుపండును కొనుగోలుచేసిన జస్టిన్ సన్ ప్రస్తుతం చైనాలో ట్రోన్ పేరిట బ్లాక్‌చైన్ నెట్వర్క్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను పర్యవేక్షిస్తు న్నారు. ట్రోన్ క్రిప్టో టోకెన్ అయిన టీఆర్ఎస్ విలువను కృత్రిమంగా అమాంతం పెంచేసి మోసానికి పాల్పడుతున్నాడని జస్టిన్‌పై అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ కేసు కూడా వేసింది. అయితే ఆ ఆరోపణలను జస్టిన్ తోసిపు చ్చారు. 2021–23లో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో గ్రెనడే దేశ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రిప్టో కరెన్సీ ప్రమాదం!.. ఆర్బీఐ గవర్నర్
క్రిప్టో కరెన్సీ ఆర్థిక స్థిరత్వానికి భారీ నష్టం కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వెల్లడించారు. పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే థింక్-ట్యాంక్ కార్యక్రమంలో 'శక్తికాంత దాస్' ఈ వ్యాఖ్యలు చేశారు.క్రిప్టో కరెన్సీ ద్రవ్య స్థిరత్వానికి మాత్రమే కాకుండా.. బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆర్ధిక వ్యవస్థపైన క్రిప్టోల ఆధిపత్యం ఉండకూడదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాపై సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ కోల్పోయే పరిస్థితిని కూడా ఇది సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు.క్రిప్టో కరెన్సీ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకోవాలి. ఈ సమస్య మీద అందరికి అవగాహన ఉండాలి. క్రిప్టోకరెన్సీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు కూడా తెలుసుకుంటున్నాయని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల గురించి ప్రశ్నించిన మొదటి దేశం భారత్ అని ఆయన అన్నారు.భారతదేశ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశంలో క్రిప్టో అంశం మీద అవగాహన పెంపొందించడానికి ఒక ఒప్పందం జరిగింది. అప్పట్లో దీనిపైన తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసిన మొదటి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కావడం గమనార్హం. ఈ విషయంలో ఇప్పటికే కొంత పురోగతి సాధించాము. దీనిపై ఇంకా పనిచేయాల్సి ఉందని శాంతికాంత దాస్ అన్నారు. క్రిప్టోల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. -
Tamannaah Bhatia: తమన్నాను ప్రశ్నించిన ఈడీ
గువాహటి: బిట్కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చని హెచ్పీజెడ్ టోకెన్ యాప్‌లో చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా భాటియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ప్రశ్నించారు. యాప్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి నేరసంబంధ కేసు నమోదుకాలేదని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యాప్ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటిదాకా 299 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా అధీనంలో నడుస్తున్నాయి. వాటిలో పది మంది డైరెక్టర్లు చైనా జాతీయులుకాగా రెండు సంస్థలను విదేశీయులు నడిపిస్తున్నారు. బిట్కాయిన్లు, క్రిప్టో కరెన్సీల మైనింగ్ ద్వారా ఊహించని లాభాలు గడించవచ్చని ఆశపెట్టి కోట్లు దండుకున్నారని యాప్‌పై కోహిమా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, బిట్‌కాయిన్ మైనింగ్ కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు కళ్లజూస్తారని ప్రచారం చేయడంతో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. రూ.57వేల పెట్టుబడికి మూడు నెలలపాటు ప్రతిరోజూ రూ.4,000 ఇస్తామని చెప్పి కేవలం ఒకే ఒక్కసారి ఇచ్చి మానేశారని బాధితులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీ ఏకంగా రూ.455 కోట్ల విలువైన స్థిర,చరాస్థులను జప్తుచేసింది. అసలు డైరెక్టర్లు లేకపోయినా డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద బ్యాంక్ ఖాతాలు, మర్చెంట్ ఐడీలు తీసుకున్నారని తేలింది. -
PM Narendra Modi: దేశాల సమన్వయంతోనే న్యాయ వితరణ
న్యూఢిల్లీ: నేరగాళ్లు ఖండాంతరాల్లో నేరసామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వేళ దేశాలు సత్వర న్యాయ వితరణ కోసం మరింతగా సహకరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘కామన్వెల్త్ దేశాల అటార్నీలు, సొలిసిటర్ జనరళ్ల సమావేశం’లో ఆయన ప్రసంగించారు. ‘‘ఒక దేశ న్యాయస్థానాన్ని మరో దేశం గౌరవించిన నాడే ఈ సహకారం సాధ్యం. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది. క్రిప్టోకరెన్సీ, సైబర్ దాడుల విజృంభిస్తున్న ఈ తరుణంలో ఒక దేశ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులు మరో దేశంలోనూ అమలుకు సాధ్యమయ్యేలా సంస్కరణలు తేవాలి. అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం అందుతుంది. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నౌకాయానంలో ఇది సాధ్యమైంది. ఇకపై ఈ ఉమ్మడి విధానాన్ని కేసుల దర్యాప్తు, న్యాయవ్యవస్థలకూ విస్తరింపజేయాలి’’ అని అభిలషించారు. ఒక దేశంలో జరిగిన ఆర్థిక నేరాలు ఇంకొక దేశంలో అలాంటి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. లా స్కూళ్లలో మహిళల అడ్మిషన్లు పెరగాలని, అప్పుడే న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం: సీజేఐ న్యాయ వితరణలో న్యాయ స్థానాలకు సాంకేతికత అనేది శక్తివంతమైన పరికరంగా ఎదిగిందని సర్వో న్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అటార్నీల సదస్సులో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. ‘‘ సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ సాంకేతికతను శక్తివంతమైన ఉపకరణంగా వాడుతూ సద్వినియోగం చేస్తోంది. సాంకేతికతలను ఎల్లప్పుడూ సమాన త్వం, సమ్మిళితత్వాన్ని దృష్టిలో ఉంచుకునే అభివృద్ధిచేయాలి. న్యాయం అందించేందుకు కామన్వెల్త్ దేశాలు ఉమ్మ డిగా కట్టుబడి ఉండాలి. న్యాయ వితరణ లో రాజకీయాలకు ఏమాత్ర జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత న్యాయా ధికారులైన అటార్నీలు, సొలిసిటర్ జనరళ్లదే. అప్పుడే న్యాయవ్యవస్థ నైతిక త నిలబడుతుంది. సత్వర న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం తోడైంది. ప్రభుత్వాధికారులకు అనవసరంగా సమన్లు జారీ చేసే సంస్కృతి పోవాలి’’ అని సీజేఐ అన్నారు. -
ఈజీ మనీ వెంట పరుగెత్తి ఆత్మహత్య
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంకామ్ విద్యార్థి నవీన్ క్రిప్టో ట్రేడింగ్‌లో నాలుగు లక్షల రూపాయలు నష్టపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. జగిత్యాల జిల్లాకు చెందిన నవీన్ పేద కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి వడ్రంగి. బహూశా ఆ పేదరికం నుంచి త్వరగా బయటపడాలనే ఆలోచనే నవీన్‌ను క్రిప్టో ట్రేడింగ్ వైపు నడిపి ఉండవచ్చు. త్వరగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో నవీన్ క్రిప్టో ట్రేడింగ్ కోసం.. నవీన్ తన పేరుపై ఒకటి, తండ్రి పేరుపై ఒకటి క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. భారీగా పెట్టుబడి పెట్టి అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నా కానీ డబ్బు సరిపోలేదు. క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించలేకపోయాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువతను బుట్టలో వేసుకునేలా ఈజీ మనీ పేరుతో ఈ మధ్యకాలంలో చాలా రకాల స్కీములు వస్తున్నాయి. అవి యువతను సులువుగా ఆకర్షిస్తాయి. కానీ ఈజీ మనీ స్కీమ్‌లలో రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఈ విషయం తెలియని యువత నవీన్‌లా ఆ వలలో చిక్కుకుపోతారు. అప్పుల భారం నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తుంది. ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చినవారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుల భారం నుంచి తప్పించుకోలేమనే భయం వెంటాడుతుంది. తన కష్టం చెప్తే తల్లిదండ్రులు మరింత బాధపడతారని ఆ విషయం ఇంట్లో చెప్పలేరు. ఎగతాళి చేస్తారని స్నేహితులతో పంచుకోలేరు. క్రమక్రమంగా ఒంటరితనంతో బాధపడతారు. ఎటుచూసినా కష్టాలే కనిపిస్తాయి. పరిష్కారం గురించి ఆలోచించే శక్తిని కోల్పోతారు. గ్యాంబ్లింగ్ డిజార్డర్.. నవీన్ ప్రవర్తన గ్యాంబ్లింగ్ డిజార్డర్‌కు దగ్గరగా ఉంది. ఇది ఒక బిహేవియరల్ అడిక్షన్. జూదం ఆడకుండా ఉండలేకపోవడం దీని ప్రధాన లక్షణం. నిరంతరం జూదం గుర్తించి లేదా జూదానికి డబ్బు ఎలా సంపాదించాలనే దానిగురించి ఆలోచిస్తుంటారు. తమకు కావాల్సిన స్థాయి ఎక్సయిట్మెంట్ కోసం పెద్ద మొత్తంలో పందేలు వేస్తుంటారు. సమస్యలు వస్తున్నాయని తెలిసి ఆపేయాలని ప్రయత్నించినా ఆపలేకపోతారు. జూదంలాంటి వ్యాపారంలో వచ్చిన నష్టాలను మళ్లీ దానితోనే భర్తీ చేయాలని ప్రయత్నిస్తారు. ఆ విషయాన్ని దాచడానికి అబద్ధాలు చెప్తారు, విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా.. జీవితంలో, కెరీర్లో సమస్యలు ఎదురవుతున్నా గుర్తించలేరు. వీటన్నింటివల్ల యాంగ్జయిటీ, డిప్రెషన్ లేదా ఇతర మానసిక రుగ్మతలకు లోనవుతారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో నవీన్‌లా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? ఆత్మహత్య భావనలున్నవారు తమ బాధను మాటల్లో, చేతల్లో పరోక్షంగా వెల్లడిస్తూనే ఉంటారు. ఈ విషయాలను గమనించి, మద్దతుగా నిలవడం ద్వారా వారిని కాపాడుకోవచ్చు. • ఎవరితో మాట్లాడకపోవడం, ఒంటరిగా ఉండటం, పనితీరు క్షీణించడం వంటి మార్పులను గమనించాలి. • ఎవరైనా తరచూ నిస్సహాయ భావాన్ని వ్యక్తం చేసినా, బయటపడే మార్గం లేనట్లు మాట్లాడుతున్నా వారి బాధను అర్థం చేసుకోవాలి. • ఎవరైనా క్రమబద్ధీకరించని వ్యాపారం లేదా అప్పులు పేరుకుపోవడం వంటి ప్రమాదకర ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటే మద్దతుగా నిలవాలి. • తీవ్రమైన మానసిక కల్లోలం, తీవ్రమైన అపరాధం లేదా అవమానం గురించి మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాలి. • ఎమరేమనుకుంటారో అని భయపడకుండా తమ సవాళ్లను చర్చించే వాతావరణాన్ని సృష్టించాలి. • ఆర్థిక కార్యకలాపాలలో ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడంలో ఫైనాన్షియల్ లిటరసీని ప్రోత్సహించాలి. • కష్టాలు, నష్టాల వల్ల వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కల్పించాలి. కౌన్సెలింగ్ తీసుకునేలా ప్రోత్సహించాలి. • స్నేహితులు, కుటుంబం, సలహాదారులతో బలమైన మద్దతు వ్యవస్థలను రూపొందించాలి. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
క్రిప్టోలపై మా వైఖరిలో మార్పు లేదు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలను వ్యతిరేకించడంపై తమ వైఖరిలో ఎటువంటి మార్పూ లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. నియంత్రణల విషయంలో ఇతర దేశాలను ఆర్బీఐ అనుకరించబోదని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కు అమెరికాలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్ఈసీ అనుమతించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వేరే దేశానికి మంచిదైనంత మాత్రాన అది మన దేశానికి కూడా మేలు చేస్తుందనేమీ లేదు. కాబట్టి క్రిప్టోలపై రిజర్వ్ బ్యాంక్, అలాగే వ్యక్తిగతంగా నా అభిప్రాయాల్లో కూడా ఎటువంటి మార్పూ లేదు. (బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లను అనుమతించినప్పటికీ) వాటితో రిసు్కల విషయంలో జాగ్రత్త వహించాల్సిందేనని ఎస్ఈసీ ఒక హెచ్చరిక కూడా చేసిన సంగతిని గమనించాలి‘ అని ఆయన చెప్పారు. వర్ధమాన మార్కెట్లు, సంపన్న దేశాలు.. క్రిప్టోకరెన్సీల బాటలో వెళితే భారీ రిస్కులు తప్పవని, భవిష్యత్తులో వాటిని అధిగమించడం చాలా కష్టమవుతుందని దాస్ చెప్పారు. క్రిప్టో మేనియా భరించలేం.. వర్ధమాన మార్కెట్లు, ప్రపంచ దేశాలు ’క్రిప్టో మేనియా’ను భరించగలిగే పరిస్థితి లేదని దాస్ తెలిపారు. ‘గతంలో నెదర్లాండ్స్‌లో టులిప్ మేనియా ఏ విధంగా అసెట్ బబుల్‌కి దారి తీసిందో మనకు తెలుసు. దాదాపు అలాంటి పర్యవసానాలకే దారి తీసే క్రిప్టో మేనియాను వర్ధమాన మార్కెట్లు, ప్రపంచం భరించే పరిస్థితిలో లేవని నేను భావిస్తున్నాను‘ అని చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వ గత ట్రాక్ రికార్డు చూస్తే ఎన్నికల ముంగిట కేంద్రం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ .. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచే విధంగా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. యూపీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానం.. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానమని దాస్ ప్రశంసించారు. యూపీఐ వృద్ధి చెందేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని, పేమెంట్స్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగగలదని చెప్పారు. యూపీఐ సృష్టికర్త నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)ది గుత్తాధిపత్యంగా మారిందంటూ కొన్ని వర్గాల నుంచి వచి్చన విమర్శలపై దాస్ స్పందించారు. ఎన్‌పీసీఐకి పోటీగా మరేదీ రాకూడదని ఆర్బీఐ కోరుకోవడం లేదని, వాస్తవానికి అటువంటి సంస్థ ఏర్పాటు కోసం దరఖాస్తులను కూడా ఆహా్వనించిందని ఆయన తెలిపారు. కానీ, తమకు అందిన ప్రతిపాదనలు వేటిలోనూ కొత్తదనమేమీ కనిపించలేదన్నారు. అటు, దివాలా కోడ్ (ఐబీసీ) కింద బ్యాంకర్లు మొత్తం క్లెయిమ్‌లలో 32 శాతం బాకీలను రాబట్టుకోగలిగాయని దాస్ చెప్పారు. 2023 నాటికి ఐబీసీ కింద రూ. 9.92 లక్షల కోట్ల క్లెయిమ్‌లను అడ్మిట్ చేసుకోగా రుణదాతలు రూ. 3.16 లక్షల కోట్లు రాబట్టుకోగలిగారని దాస్ చెప్పారు. అయితే, సదరు చట్టం ఇప్పటిదాకా అమలైన తీరుతెన్నులను అధ్యయనం చేసిన మీదట కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మొండి పద్దు పరిష్కారానికి గణనీయంగా సమయం పడుతోందని, క్లెయిమ్‌లలో హెయిర్‌కట్ (మొండి బాకీ వసూలులో వదులుకుంటున్న మొత్తం) భారీగా ఉంటోందని ఐబీసీపై ప్రధానంగా రెండు విమర్శలు ఉన్నాయి. -
వెల్కమ్ టు వెబ్3 వరల్డ్
టెక్నాలజీ ప్రేమికులైన యువతరం తాజా ఆసక్తి... వెబ్3 విశాలమైన వెబ్ 3 స్పేస్‌లో స్టార్టప్‌ల నుంచి ఉద్యోగాల వరకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ చెయిన్ సాంకేతికత ఆధారిత వెబ్3 యువత కోసం ఎన్నో ద్వారాలను తెరవనుంది. స్వయంప్రతిపత్తిని అందించనుంది... ఒకప్పుడు... ‘మాకు వెబ్‌సైట్‌తో పనిలేదు. ప్రింట్ మీడియా టీవీ చాలు’ ‘ఇ–కామర్స్‌తో పనిలేదు. ఇన్–స్టోర్ చాలు’‘మొబైల్ వెబ్సైట్, యాప్‌లతో పనిలేదు’ ‘వెబ్3 స్ట్రాటజీ మాకు అవసరం లేదు’ అన్నట్లుగా ఉండేది. 90ల నుంచి 2020 వరకు సాంకేతికతకు సంబంధించిన అభిరుచులు, అభిప్రాయాలలో ఎంతో మార్పు వచ్చింది. ‘మాకు అవసరం లేదు’ అన్నచోటే ‘మాకు తప్పనిసరిగా అవసరం’ అనే మాట వినిపిస్తోంది. వెబ్3 సాంకేతిక విషయంలోనూ ఇదే మార్పు చోటు చేసుకుంది. ‘ఇలా వచ్చి అలా వెళ్లి పోయే ట్రెండ్ ఇది’ అనుకున్న కంపెనీలు కూడా వెబ్3 సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. యూత్‌తో కనెక్ట్ కావడానికి ‘వెబ్3’ అనేది బలమైన సాధనం అని నమ్ముతున్నాయి. వెబ్3 మార్కెటింగ్‌పై రకరకాల కోణాలలో ఆలోచిస్తున్నాయి. వెబ్3 బ్రాండ్స్ జెన్ జెడ్ మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి సంప్రదాయ విధానాలకు భిన్నంగా కొత్తదారిలో పయనిస్తున్నాయి. బ్లాక్‌చెయిన్–బేస్డ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్, వర్చువల్ వరల్డ్స్ అభివృద్ధి వల్ల డిజిటల్ స్పేస్‌లో ఎక్కువ సమయం గడుపుతోంది యువతరం. వెబ్–3 బేస్డ్ గేమ్స్, వర్చువల్ వరల్డ్స్ యువ ప్లేయర్స్‌కు అటానమస్, వోనర్షిప్, మానిటైజేషన్ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లాంటి సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫామ్స్ మీద ఆధారపడకుండా కంటెంట్ క్రియేట్ చేయడానికి, షేర్ చేయడానికి, కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి వెబ్3 టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ‘వెబ్3 విశ్వరూపాన్ని మనం ఇంకా చూడనప్పటికీ కొత్తరకం అవకాశాలతో క్రియేటర్లను ఆకట్టుకుంటోంది. మధ్యవర్తుల అవసరం లేకుండానే డైరెక్ట్–కన్యూ్జమర్ ఇంటరాక్షన్‌కు వీలు కల్పిస్తుంది. సంప్రదాయ పద్ధతుల కంటే భిన్నంగా ఆదాయ మార్గాలను విస్తరించుకోవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే వెబ్3 అనేది సంప్రదాయ మోడల్స్‌ను సవాలు చేసేలా ఉంటుంది. క్రియేటర్లు ఒక అడుగు ముందుకు వేసేలా చేస్తుంది’ అంటున్నాడు ఏఐ పవర్డ్ క్రియేటర్ టెక్ కంపెనీ ‘యానిమెటా’ సీయివో దేవదత్తా. ‘వెబ్3 జెన్–జెడ్, మిలీనియల్స్‌ను ఆకట్టుకుంటుంది. వెబ్3 నుంచి మరిన్ని ప్రయోజనాలను ఆశిస్తున్నారు. వెబ్3 యాప్ ఫౌండర్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన కసరత్తు చేస్తే, ఆసక్తికరమైన ఐడియాలతో ముందుకు వస్తే గేమ్‌లో ముందు ఉంటారు’ అంటున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీ ‘యాప్టోపియా’ ఫౌండర్, సీయివో జోనాథన్ కె. వెబ్ 3 రంగంలో భారత్ వేదికగా ఎన్నో కంపెనీలు పని చేస్తున్నాయి. వీటిద్వారా యువతకు ఎన్నో ఉద్యోగావకాశాలు దొరుకుతాయి. సాలిడిటీ డెవలపర్, మార్కెటింగ్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, బ్లాక్ చెయిన్ ఆఫీసర్, కమ్యూనిటీ మేనేజర్, యూనిటీ డిజైనర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఈవెంట్స్ మేనేజర్, ఎనలిస్ట్, బీటా టెస్టర్, టెక్నికల్ రైటర్, డెవలపర్, డిజైనర్, ఇన్ఫ్లూయెన్సర్ మేనేజర్... ఇలా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నయా ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ వెబ్(డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ)కు సంబంధించి వెబ్ 1 నుంచి వెబ్ 2 వరకు జరిగిన ప్రస్థానాన్ని గమనిస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. వెబ్ 1 దశలోని వెబ్సైట్ల నుంచి వెబ్2 దశలోని సోషల్ మీడియా విస్తృతి వరకు ఆ మార్పును ప్రతిబింబిస్తాయి. అయితే ‘అభివృద్ధి’గా చూపుతున్న మార్పు బడా కంపెనీలకే మేలు చేసిందనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద కంపెనీల ఆధిపత్యానికి, నియంత్రణకు వీలు లేని వెబ్3 టెక్నాలజీపై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. వెబ్3 స్టార్టప్‌లు భారతీయ మార్కెట్లో ఊపందుకోవడం ఈ మార్పును సూచిస్తోంది. వెబ్ 3లో డీసెంట్రలైజ్డ్ విధానంలో డేటా ఒకదానితో ఒకటి అనుసంధానం అవుతుంది. వెబ్ 3 అనేది ఒక తరం మార్పునకు ప్రతిబింబం. ‘వెబ్ 3కి కొలమానం ఏమిటి?’ అనే విషయానికి వస్తే ఒక యాప్‌లో డాటా, ఐడెంటిటీ, ప్రైవసీ, ప్లే–టు–ఎర్న్లాంటి ఎలిమెంట్స్ తప్పకుండా ఉండాలి. స్వెట్‌కాయిన్ (ఫిట్నెస్), ట్విగ్(ఫైనాన్స్)లాంటి వెబ్3 రైజింగ్ స్టార్స్ ఆచరణ స్థాయిలో వెబ్3 ఎలిమెంట్స్‌ను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. మైరాతో అంతర్జాతీయ స్థాయికి... వెబ్ 3 వరల్డ్ ఇనోవేషన్‌కు సంబంధించి ఘనంగా చెప్పుకునే వారిలో శిల్పా కర్కెరా ఒకరు. నాగ్‌పుర్‌కు చెందిన శిల్ప ఏఐ అండ్ బ్లాక్‌చెయిన్ సొల్యూషన్స్, ప్రాడక్ట్ కంపెనీ ‘మైరా టెక్నాలజీకి’ ఫౌండర్, సీయివో. ప్రస్తుతం ఈ కంపెనీ ఆరు దేశాల్లో పనిచేస్తోంది. ‘మైరా బ్లాక్స్’ అనే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్‌తో పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తోంది. ఎన్నో కొత్త కంపెనీలకు టెక్నాలజీ అడ్వైజర్‌గా పనిచేసింది. ‘మీకు సాంకేతిక విషయాలపై ఆసక్తి ఉంటే మీలాగే ఆసక్తి ఉన్నవారితో స్నేహం చేయండి. నిపుణులతో మాట్లాడండి’ అంటుంది శిల్ప. -
ఫెరారీ కారు ఇలా కూడా కొనేయొచ్చు! అక్కడ మాత్రమే..
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' (Ferrari) తమ బ్రాండ్ కార్లను క్రిప్టోకరెన్సీ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. యూరోపియన్ దేశాలలోని సంపన్న కస్టమర్ల అభ్యర్థమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెరారీ పేర్కొంది. ఫెరారీ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ 'ఎన్రికో గల్లీరా' (Enrico Galliera) దీని గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో క్రిప్టోకరెన్సీ ద్వారా విక్రయాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ ద్వారా కార్లను కొనుగోలు చేస్తే ధరల్లో ఏమార్పు ఉండదని, ఎలాంటి అధిక ఫీజులు ఉండవని స్పష్టం చేశారు. ఫెరారీ ఈ క్రిప్టోకరెన్సీ ద్వారా ఎన్ని కార్లను విక్రయించనుంది? నిర్దిష్ట సంఖ్య (లిమిట్) ఏమైనా ఉందా? అనేదానికి సంబంధించిన అధికారికి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. క్రిప్టోకరెన్సీ చెల్లింపుల ద్వారా విక్రయాలు ప్రారంభమైతే యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్లలో విక్రయాలు భారీగా పేరే సూచనలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు! గతంలో బిట్‌కాయిన్ ద్వారా టెస్లా విక్రయాలు 2021లో టెస్లా కంపెనీ అధినేత 'ఎలాన్ మస్క్' (Elon Muck) బిట్‌కాయిన్ చెల్లింపుతో టెస్లా కార్లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతి తక్కువ కాలంలోనే ఈ విధానానికి ముగింపు పలికేసాడు. అయితే ఇప్పుడు ఫెరారీ ఈ విధానానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇది సజావుగా ముందుకు సాగుతుందా? ఏదైనా సమస్యలను ఎదుర్కుంటుందా? అనే వివరాలు భవిష్యత్తులో తెలుస్తాయి. -
G20 Summit: క్రిప్టో సమాచారం ఇచ్చిపుచ్చుకుందాం
న్యూఢిల్లీ: క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచార వ్యవస్థ క్రిప్టో అసెట్ రిపోరి్టంగ్ ఫ్రేమ్‌వర్క్ (సీఏఆర్ఎఫ్) ఏర్పాటును వేగంగా అమలు చేయాలని జీ–20 సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. ఆర్థికేతర ఆస్తులపై సమాచార మార్పిడిని 2027 నాటికి ప్రారంభించాలని నిర్ణయించాయి. 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్టుగా ప్రపంచవ్యాప్తంగా న్యాయ, స్థిర, ఆధునిక అంతర్జాతీయ పన్నుల వ్యవస్థ పట్ల సహకారాన్ని కొనసాగించాలనే నిబద్ధతను అభివృద్ధి చెందుతున్న, చెందిన 20 దేశాల నాయకులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పెద్ద కంపెనీల కోసం పన్ను నియమాలను మార్చడానికి, బహుళజాతి సంస్థల పన్ను ప్రణాళికను పరిమితం చేయడానికి మరింత శాశ్వత, సమర్థవంత ప్రణాళికను కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) చర్చిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలు పన్నులు చెల్లించే అంశాలను మార్చడం, ప్రపంచవ్యాప్తంగా కనీస పన్నును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను రెండు మూల స్తంభాలుగా పేర్కొంటూ కసరత్తు చేస్తున్నారు. రెండు స్తంభాల పరిష్కారంలో జీ–20 దేశాలు గణనీయమైన పురోగతిని సాధించాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఓఈసీడీ సహకారంతో పన్ను, ఆర్థిక నేర పరిశోధన కోసం దక్షిణాసియా అకాడమీ పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. -
సింగిల్ ట్రాన్సాక్షన్లో కోటి తగలెట్టేశా, ఈ ఘోర తప్పిదం నావల్లే!
సాక్షి, ముంబై: ట్రేడింగ్ అంటేనే చాలా అవగాహన అంతకుమించిన అప్రతమత్తత అవసరం. అందులోనూ ఇక క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా క్రిప్టో లావాదేవాల్లో చోటుచేసుకున్న ఒక్క పొరపాటు అతని జీవితాన్ని నాశనం చేసింది. అనుకోకుండా కోటిరూపాయల ఎన్ఎఫ్టీలని కోల్పోయాడు. అంతేకాదు అతని నికర విలువ దాదాపు మూడో వంతు తుడిచి పెట్టుకు పోయింది. ఆనక పొరబాటు గుర్తించి లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని బాధితుడు స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశాడు. వివరాలను పరిశీలిస్తే.. బ్రాండన్ రిలే ఎన్ఎఫ్టీ కలెక్టర్. ఈక్రమంలో CryptoPunk #685 అనే NFTని 77 ఈథర్లు లేదా దాదాపు 1 కోటి రూపాయలకు కొన్ని వారాల కిందట కొనుగోలు చేశాడు. దీన్ని ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం మార్కట్ ప్లేస్‌లో ర్యాపింగ్ (ర్యాపింగ్అంటే ఓపెన్‌సీ లేదా రారిబుల్ వంటి Ethereum మార్కెట్‌ప్లేస్‌లలో NFTల ట్రేడింగ్) చేసే సమయంలో పొరపాటున బర్న్ ఎడ్రస్‌కి షేర్చేశాడు. (బర్న్ ఎడ్రస్ కి చేరితే ఇక జీవితంలో అది తిరిగి రాదు. ప్రైవేట్ కీ లేని దీన్ని యాక్సెస్ చేయలేరు) డిజిటల్ వాలెట్లోని నిధులను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీ..వర్చువల్ వాలెట్ ‘బర్న్’ అడ్రస్‌కి చేరితే సంబంధిత ఎన్ఎఫ్టీ శాశ్వతంగా నాశన మవుతుంది. రిలే విషయంలో అదే జరిగింది. తనుకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రిలే తనకు ఈ విషయాలపై అవగాహన లేదనీ అన్ని సూచనలను కచ్చితంగా పాటించినప్పటికీ లావాదేవీలో చిన్న పొరపాటు నాశనం చేసిందని వాపోయాడు. అసలు ర్యాప్డ్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో అవగాహన లేదు..ఇది కచ్చితంగా నేను చేసిన తప్పే..అదే నన్ను ముంచేసింది..దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. Today I accidentally burned a @cryptopunksnfts trying to wrap punk 685. I was so focused on following the instructions exactly, that I slipped up, destroying a third of of my net worth in a single transaction. @yugalabs please sell me the @v1punks 685 as a consolation. 🙏🏼 pic.twitter.com/jHoTGvlc7j — Brandon Riley (@vitalitygrowth) March 25, 2023 -
క్రిప్టోలపై అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ ఎలెన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన రిస్కులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయి నియంత్రణ ప్రమాణాలు అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ ఎలెన్ అభిప్రాయపడ్డారు. క్రిప్టోల ద్వారా అక్రమ మార్గంలో నిధుల మళ్లింపును అడ్డుకోవడంలో అమెరికా చెప్పుకోతగ్గ పురోగతి సాధించగలిగిందని ఆమె చెప్పారు. భారత్, అమెరికాలో వ్యాపార అవకాశాలపై ఇరు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజాలు, ఆర్థికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఎలెన్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, సంక్షోభంలో చిక్కుకున్న క్రిప్టో ఎక్సే్చంజీ ఎఫ్‌టీఎక్స్ తాజాగా దివాలా తీసింది. ఇందుకు సంబంధించి ఎఫ్టీఎక్స్తో పాటు దాని అనుబంధ హెడ్జ్ ఫండ్ అలమెడా రీసెర్చ్, డజన్ల కొద్దీ ఇతర సంస్థలు డెలావేర్ కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన ఎఫ్‌టీఎక్స్ .. నిధుల గోల్మాల్ సంక్షోభంతో కుప్పకూలింది. -
క్రిప్టో కరెన్సీ ట్రేడ్.. 20 శాతం కమీషన్.. టెకీ నుంచి రూ.22 లక్షలు స్వాహా
సాక్షి, హైదరాబాద్: క్రిప్టో కరెన్సీలో మీరు చేసిన ట్రేడ్‌కు లాభాలు వచ్చాయి. ఆ లాభాలు మీకు చెందాలంటే మాకు 20శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంటూ సైబర్ కేటుగాళ్లు నగరానికి చెందిన ఓ టెకీకి వల వేశారు. మొదట్లో 208 యూఎస్డీ డాలర్లు(రూ.17వేలకు పైగా మన కరెన్సీలో) క్రిప్టో కొనిపించారు. దీనికి రెండింతలు లాభాలు వచ్చాయంటూ నమ్మించి నిండా ముంచేశారు. తనని గుర్తు తెలియని వారు మోసం చేశారంటూ హబ్సిగూడకు చెందిన యేగేశ్ శర్మ మంగళవారం సిటీసైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా చేస్తున్న యేగేశ్ శర్మ ఫోన్ నంబర్‌ను టెలిగ్రామ్ గ్రూప్‌లో గుర్తుతెలియని వ్యక్తి యాడ్ చేశాడు. ఈ గ్రూప్‌లో అంతా క్రిప్టో లాభాలపై చర్చ, లాభాలు వచ్చినట్లు స్క్రీన్‌షాట్స్‌తో ఫొటోలు కనిపించాయి. గ్రూప్‌లో ఓ వ్యక్తి యేగేశ్‌శర్మతో మాట కలిపాడు. కేకో కాయిన్ డాట్‌కామ్ అనే లింకును పంపి ఆ లింకులో రిజిస్టర్ అయ్యాక మొదట్లో 208 ఎస్డీ డాలర్ల క్రిప్టో కొనుగోలు చేశాడు. దీనికి రెండింతలు లాభాలు వచ్చాయని చెప్పిన కేటుగాడు 20శాతం కమీషన్ ఇస్తేనే మీ లాభాలు మీ కొచ్చేలా చేస్తామన్నారు. దీనికి సరేనంటూ కేటుగాళ్లు చెప్పిన విధంగా యూఎస్, యూకే డాలర్లను క్రిప్టో పేరుతో కొనుగోలు చేయిస్తూనే ఉన్నారు. యేగేశ్‌శర్మకు ఇవ్వాల్సిన లాభాలు మాత్రం ఇవ్వట్లేదు. ఇలా వారు చెప్పిన విధంగా రూ.22 లక్షలు సమర్పించాడు. అంతటితో ఆగక మరో రూ.1.50 లక్ష క్రిప్టో కొనుగోలు చేసి తాము చెప్పిన అకౌంట్ నంబర్స్‌కు ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
వజీర్ ఎక్స్‌లో 40 శాతం ఉద్యోగులపై వేటు!
ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సైతం ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నాయి. తాజాగా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ‘వజీర్ఎక్స్’ 40 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కాయిన్ డెస్క్ తెలిపింది. వజీర్‌ఎక్స్‌లో 150 మంది పని చేస్తుండగా..వారిలో 50 నుంచి 70 మందికి ఇక ఆఫీసుకు రావద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఫైర్ చేసిన ఉద్యోగులకు 45 రోజుల వేతనం చెల్లించినట్లు సమాచారం. -
కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి పేరుతో వెళ్లి కంబోడియా సైబర్ స్కాం గ్యాంగ్ చేతిలో చిక్కుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి వెళ్లి.. క్రిప్టోకరెన్సీ, క్రెడిట్‌కార్డ్, హనీట్రాప్ పనులు చేయిస్తుండటంతో ఆందోళనలో పడ్డారు. ఆ పనులు చేయలేక, చేయబోమంటే వారు పెడుతున్న చిత్ర హింసలు భరించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? కరీంనగర్‌లోని గాంధీరోడ్ చౌరస్తా సమీపంలో ఓ కన్సల్టెన్సీ ఉంది. కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని, మంచి జీతం వస్తుందని కన్సల్టెన్సీ నిర్వాహకుడు స్థానిక ముస్లిం యువకులకు చెప్పాడు. దీనితో కొందరు యువకులు రూ.2 లక్షల చొప్పున అతడికి చెల్లించారు. కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఈ ఏడాది ఆగస్టు చివర్లో, సెప్టెంబరు మొదటివారంలో ఆరుగురు యువకులను కంబోడియాకు పంపాడు. అక్కడికెళ్లాక ఓ కంపెనీ వాళ్లు ఆ యువకులను చుట్టూ ఎత్తయిన గోడలు, విద్యుత్ కంచె లు, సాయుధ పహారాతో ఉన్న ఓ టౌన్‌షిప్‌కు తీసుకెళ్లారు. అమెరికా, యూరప్ వాసుల నంబర్లు ఇచ్చి.. వారిని వాట్సా ప్ ద్వారా సంప్రదించి క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే బాగా డబ్బులు వస్తాయంటూ ఒప్పించాలని చెప్పారు. ఆ పని చేయలేమంటే.. పాస్‌పోర్టులు ఇవ్వబోమని, జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారని యువకులు వాపోతున్నారు. నేరాలు ఇలా చేయిస్తూ.. కరీంనగర్‌కు చెందిన బాధిత యువకుడు షాబాజ్‌ఖాన్ చెప్పిన వివరాల మేరకు.. ఈ యువకులు అమెరికా, యూరోపియన్ కస్టమర్లను వాట్సాప్‌లో, ఫోన్లలో సంప్రదించాలి. సాఫ్ట్వేర్ సాయంతో మహిళల్లా గొంతు మార్చి మాట కలపాలి. బాగా డబ్బులు వస్తాయని మెల్లగా వారిని ఒప్పించి ఓ క్రిప్టోకరెన్సీ యాప్‌లో కనీసం 100 డాలర్లు పెట్టుబడి పెట్టించాలి. రెండు, మూడు రోజుల్లో.. లాభం వచ్చి ఆ సొమ్ము 1000 డాలర్లకు పెరిగినట్టు చూపిస్తుంది. ఇది చెప్పి.. వారిని మరింత ఆశపెట్టి భారీగా డబ్బు పెట్టుబడి పెట్టించాలి. తర్వాత ఫోన్ స్విచాఫ్. ఆ సొమ్మంతా ఈ సైబర్ నేర గ్యాంగ్ కాజేస్తుంది. తర్వాత మరొకరికి గాలం వేయాలి. తమకు రోజూ ఇదే పని అని షాబాజ్‌ఖాన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విలపిస్తూ చెప్పాడు. తనను వదిలేయాలంటే 3,000 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.2.4 లక్షలు) చెల్లించాలని, లేదా తనకు బదులు మరో యువకుడిని అక్కడికి పిలిపించాలని ముఠా సభ్యులు తేల్చిచెబుతున్నారని వివరించాడు. తనతోపాటు సిరిసిల్ల, చింతకుంట, వేములవాడ, మానకొండూరుకు చెందిన యువకులు కూడా బందీగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకున్నాడు. అయితే వారిని ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అక్కడి ప్రజాప్రతినిధుల అండదండలతోనే.. కాంబోడియాలో సైబర్ మాఫియా ముఠాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తాయని.. మాఫియా నిర్వాహకుల్లో కొందరు అక్కడ ప్రజాప్రతినిధులు కూడా అని ప్రచారం ఉంది. ఆ ముఠాలు క్యాసినోలు, సైబర్ స్కాం కేఫ్‌లు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటుంటాయి. స్థానికులు తిరగబడే అవకాశం ఉంటుందని.. మలేసియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ తదితర దేశాల నుంచి యువతీ యువకులను ఉద్యోగాల పేరిట వల వేసి రప్పించుకుంటాయి. సైబర్ నేరాల్లో శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటాయి. ఇచ్చిన టార్గెట్ చేరకపోతే కొట్టడం, కరెంటు షాక్‌లు ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. చిత్ర హింసలు భరించలేని విదేశీయులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు, అక్కడి అకృత్యాలపై ఇంటర్నెట్లోనూ వార్తలు ఉన్నాయి. బాధితులు ముందుకురావాలి కంబోడియాలో చిక్కుకున్న యువకుల గురించి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తాం. – సత్యనారాయణ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ -
రాబోయే రోజుల్లో రియల్టీలో భారీ నష్టాలు - ఎలాన్ మస్క్
సంపదను సృష్టించే స్టాక్ మార్కెట్ మంచు పర్వతంలా కరిగిపోతుంది. తారాజువ్వలా ఎగిసిపడే మార్కెట్ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. భవిష్యత్తు తమదే అంటూ గప్పాలు కొట్టుకున్న క్రిప్టో మార్కెట్ కుదేలైంది. పెట్టుబడికి ప్రధాన సాధానాలుగా చెప్పుకునే ఒక్కో రంగం నష్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఈ తరుణంలో తిక్కతిక్కగా వ్యవహారించినా భవిష్యత్తును పక్కాగా అంచనా వేస్తాడనే పేరున్న ఎలన్ మస్క్ నెక్ట్స్ సంక్షోభం ఏ రంగంలో రాబోతుందనే అంశంపై స్పందించారు. కరోనాతో మొదలు కరోనా వైరస్ తెచ్చిన కష్టాలతో ప్రపంచ దేశాలు నెమ్మదిగా ఆర్థిక సంక్షోభం వైపుగా అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో తెర మీదకు వచ్చిన రష్యా ఉక్రెయిన్ వార్ మరింత చేటు తెచ్చింది. ఫ్యూయల్ ధరలు అడ్డగోలుగా పెరిగిపోయాయి. కరోనా కారణంగా సరఫరా వ్యవస్థలో తలెత్తిన సమస్యలు మరింతగా ముదిరాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వీటికి సంబంధించిన ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంపద ఆవిరవుతోంది ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో ప్రపంచ కుబేరుల సంపద హరించుకుపోతుంది. గడిచిన ఆరు నెలల్లో ఎలాన్ మస్క్ 100 బిలియన్ డాలర్లు, జెప్ బేజోస్ 66 బిలియన్ డాలర్లు, బిల్‌గేట్స్ 24 బిలియన్ డాలర్లు, వారెన్ బఫెట్ 6 బిలియన్ డాలర్లు నష్టపోయారు. మరోవైపు బిట్ కాయిన్, ఈథర్, సోలానో వంటి క్రిప్టో కరెన్సీలు నేల కరుచుకుపోయాయి. దీంతో క్రిప్టోకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గళాల సంఖ్య పెరిగింది. నకమోటో ఏమన్నారంటే స్టాక్‌మార్కెట్, క్రిప్టోలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో తదుపరి ఏ రంగంలో నష్టాలు సంభవించే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. డోజోకాయిన్ సృష్టికర్త షిబెటోషి నకమోటో ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. అందులో హాలోవీన్ స్క్రీమ్ ముందుగా స్టాక్‌మార్కెట్‌ను, ఆ తర్వాత క్రిప్టో కరెన్సీని నాశనం చేసిందని ఫోటోను పోస్ట్ చేశారు. మస్క్ సైతం అదే మాట నకమోటో అభిప్రాయం ప్రకారం ఇప్పటికే స్టాక్‌మార్కెట్, క్రిప్టోలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని వాటి తర్వాత నష్టపోయే రంగం రియల్టీ అంటూ హాలోవీన్ మీమ్ ద్వారా తెలిపారు. అవునంటూ కొందరు మిగిలిన రంగాలను సూచిస్తూ మరికొందరు కామెంట్ చేశారు. కానీ గత ఆరునెల్లలో ఎక్కువ సంపదను కోల్పోయిన వ్యక్తిగా ప్రపంచ కుబేరుడిగా ఎలన్‌మస్క్ ఏం చెబుతారనే ఆసక్తి నెలకొంది. నకమోటో అభిప్రాయంతో ఎలాన్‌మస్క్ కూడా ఏకీభవిస్తూ. రాబోయే రోజుల్లో రియల్టీలో భారీ నష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 🎵 it’s the end of the world as we know it 🎵 🎵 and i feel fine 🎵 pic.twitter.com/f1UIyZXSk3 — Shibetoshi Nakamoto (@BillyM2k) June 15, 2022 చదవండి: భారత్‌తో డీల్ జాప్యం.. టెస్లాకు భారీ షాక్, మనుజ్ ఖురానా రాజీనామా! -
యూట్యూబ్‌లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం!
మీరు బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం యూట్యూబ్‌లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీ వీడియో ప్రిడిక్షన్‌ను నమ్ముతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. యూట్యూబ్‌లో ఎలన్ మస్క్ స్కామ్ జరుగుతోంది. జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిట్కాయిన్లపై ఎంతమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి? ఎంత ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ రోజుల్లో భారీ లాభాల్ని ఎలా అర్జిస్తామో? వివరిస్తూ ఎలన్ మస్క్‌కు చెందిన వీడియోలు, టెస్లా యూట్యూబ్ ఛానల్‌కు చెందిన వీడియోలతో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతోంది. వాస్తవానికి ఆ లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించేది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈజీ మనీ కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్న సైబర్ నేరస్తులే ఆ వీడియోల్ని టెలికాస్ట్ చేస్తున్నట్లు తేలింది. ఎలన్ మస్క్ వీడియోలతో లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి కేటుగాళ్లు భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. ఫేక్ క్రిప్టో ట్రేడింగ్ వెబ్సైట్లను తయారు చేస్తున్నారు. ఎలన్ మస్క్ చెప్పినట్లుగా ఆ వెబ్సైట్లో క్రిప్టో ట్రేడింగ్ నిర్వహిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవ్వొచ్చని నకిలీ యాడ్స్‌తో ఊదరగొట్టేస్తున్నారు. దీంతో టెక్నాలజీ సాయంతో ఎలన్ మస్క్ వీడియోల్ని ప్రసారం చేయడంతో ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. అలా వారం రోజుల వ్యవధిలో బిట్ కాయిన్లపై పెద్దమొత్తంలో 23 ట్రాన్సాక్షన్లు, ఎథేరియంపై 18 ట్రాన్సాక్షన్లు నిర్వహించారు. ఇలా 243,000 డాలర్లు మోసపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విచిత్రం ఏంటంటే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ క్రిప్టో ట్రేడింగ్ నిజమని నమ్మి ప్రముఖ చిలీ సంగీతకారుడు ఐసాక్ సైతం మోసపోయాడు. లైవ్ స్ట్రీమింగ్ వీడియో లింకుల్ని క్లిక్ చేయడంతో హ్యాకర్లు ఐసాక్ య్యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేశారు. తాము అడిగినంత ఇస్తే ఛానల్‌ను తిరిగి ఇచ్చేస్తామంటూ ఐసాక్ను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో తన పేరుమీద జరుగుతున్న మోసాలపై ఎలన్ మస్క్ స్పందించారు. తన వీడియోలు, టెస్లా యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ వీడియోలతో తన పేరుతో స్కామర్లు అమాయకుల్ని దోచుకుంటున్నారని, అలాంటి స్కామ్ యాడ్స్‌ను యూట్యూబ్ సంస్థ కట్టడి చేయలేకపోతుందంటూ మండిపడ్డారు. వెంటనే లైవ్ స్ట్రీమింగ్ వీడియోలపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేయాలని ఎలన్ మస్క్ యూట్యూబ్‌కు విజ్ఞప్తి చేశారు. చదవండి👉 ‘ఇదే..తగ్గించుకుంటే మంచిది’! -
బిట్ కాయిన్ క్రాష్: మార్కెట్ క్యాప్ ఢమాల్!
సాక్షి, న్యూఢిల్లీ: క్రిప్టో మార్కెట్ మరోసారి ఘోరంగా కుప్పకూలింది. గత 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్రాష్ అయ్యి 1.24 ట్రిలియన్ల డాలర్లకు పరిమితమైంది. బిట్‌కాయిన్, ఎథరమ్ వంటి టాప్ క్రిప్టో కరెన్సీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం బిట్‌కాయిన్ 6.14 శాతం తగ్గి 29,823 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథరమ్ కూడా మేజర్ డౌన్ట్రెండ్ని నమోదు చేసింది. 5.63 శాతం కుప్పకూలి 1,826 డాలర్ల వద్ద ఉంది. బీఎన్బీ టోకెన్ 5.59 శాతం క్షీణించింది. సోలానా గణనీయంగా 12.73 శాతం పడిపోయింది. ఫలితంగా సోలానా బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌ను గత రాత్రి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసి, 4 గంటల తర్వాత పునరుద్ధరించారు. అటు ఎక్స్ఆర్పీ కూడా గత 24 గంటల్లో 5.98 శాతం పడిపోయింది. ఏడీఏ టోకెన్ 7.47 శాతం తగ్గింది. డాజీకాయిన్ 5.95 శాతం క్రాష్ అయింది. మొత్తంమీద, ప్రధాన టాప్ టోకెన్లు గత 24 గంటల్లో భారీగా పతనాన్ని నమోదు చేయడం గమనార్హం అయితే యూఎస్డీటీ టెథర్ గత 24 గంటల్లో దాని విలువలో 0.02 శాతం అప్‌ట్రెండ్‌ని, యూఎస్డీసీ స్టేబుల్కాయిన్లు 0.01 శాతం అప్‌ట్రెండ్‌ని కనబర్చాయి. కాగా ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇపుడు అందరిపైనా కనిపిస్తోందినీ, ఇది క్రిప్టోల కదలికలపై కూడా ఉంటుందని ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ సూచించారు. -
క్రిప్టో కరెన్సీలపై సంప్రదింపుల పత్రం!
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై వివిధ భాగస్వాములు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ తదితర సంస్థల అభిప్రాయాలతో సంప్రదింపుల పత్రాన్ని త్వరలోనే ఖరారు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్ వెల్లడించారు. వర్చువల్ (ఆన్లైన్)గా చేతులు మారే క్రిప్టో కరెన్సీల నియంత్రణలో సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్పందన అవసరమన్నారు. క్రిప్టో కరెన్సీలు స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అని, దేశీయంగా నియంత్రించలేని పరిస్థితుల్లో వీటిని అనుమతించొద్దంటూ ఆర్బీఐ కేంద్రానికి తన అభిప్రాయాలను స్పష్టం చేయడం తెలిసిందే. అజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించే ‘ఐకానిక్ వీక్’ కర్టెన్ రైజర్ కార్యక్రమం సందర్భంగా సేత్ మాట్లాడారు. ‘‘దేశీయ భాగస్వాములు, సంస్థలతోపాటు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నాం. దీంతో అతి త్వరలోనే సంప్రదింపుల పత్రం సిద్ధం కానుంది’’అని తెలిపారు. కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీలను నిషేధించిన అంశాన్ని సేత్ ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ ఏకాభిప్రాయం లేకుండా ఈ విషయంలో అవి విజయం సాధించలేవన్నారు. ‘‘డిజిటల్ ఆస్తులను డీల్ చేసే విషయంలో విస్తృతమైన కార్యాచరణ అవసరం. ఈ విషయంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు కలసికట్టుగా నడవాలి. ఏ దేశం కూడా ఏదో ఒక వైపున ఉండడాన్ని ఎంపిక చేసుకోకూడదు. క్రిప్టోల నియంత్రణలపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం అవసరం’’అని సేత్ వివరించారు. వేగవంతమైన వృద్ధి దిశగా ప్రయాణం అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆశాభావాన్ని సేత్ వ్యక్తం చేశారు. ప్రస్తుత సవాళ్లే కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సైతం అధిగమిస్తామని చెప్పారు. ద్రవ్య, మానిటరీ పరమైన చర్యలతో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణపై కొనసాగుతున్న కసరత్తు రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించే విషయంలో ముందస్తు చర్యలు కొనసాగుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. కనీసం రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించనున్నట్టు 2021–22 బడ్జెట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదన చేయడం గమనార్హం. బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి నివేదిక పార్లమెంటు ముందున్నట్టు మల్హోత్రా గుర్తు చేశారు. -
లావాదేవీలపై టీడీఎస్‌ను తగ్గించండి
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలలో ట్రేడింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలపై చెల్లింపులకు సంబంధించి టీడీఎస్‌ను ప్రతిపాదిత 1 శాతం నుండి 0.01 లేదా 0.05 శాతానికి తగ్గించాలని క్రిప్టో పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ఒక టీడీఎస్ రిటైల్ వ్యాపారుల ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. ఇక క్రిప్టోకరెన్సీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చాలా ఎక్కువని, ఈ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కాయిన్ డీసీఎక్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా పేర్కొన్నారు. కొత్త పన్ను నిబంధనలు, వాటి అమలు విషయంలో తన ప్లాట్‌ఫారమ్‌లోని వ్యాపారులతో కాయిన్ డీసీఎక్స్ సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన చెప్పారు. క్రిప్టో అసెట్స్‌పై ఆదాయపు పన్నుకు సంబంధించి 2022–23 బడ్జెట్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. గుర్రపు పందెం లేదా ఇతర స్పెకిలేటివ్ లావాదేవీల నుండి గెలుపొందిన మొత్తాలపై ఏప్రిల్ 1 నుండి 30 శాతం ఆదాయపు పన్ను, సెస్, సర్‌చార్జీలు విధించనున్న సంగతి తెలిసిందే. వార్షికంగా రూ. 10,000 దాటిన వర్చువల్ కరెన్సీల చెల్లింపులపై, అంతే పరిమాణానికి సంబంధించి బహుమతులపై 1 శాతం టీడీఎస్ విధించాలని బడ్జెట్ 2022–23 ప్రతిపాదించింది. ఆదాయపు చట్టం ప్రకారం ఖాతాలను ఆడిట్ చేయాల్సిన నిర్దిష్ట వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు టీడీఎస్ పరిమితి సంవత్సరానికి రూ. 50,000గా ఉంది. 1 శాతం టీడీఎస్‌కు సంబంధించిన నిబంధనలు 2022 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. -
క్రిప్టో ఢమాల్.. భారీగా నష్టోతున్న బిట్‌కాయిన్..
భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీదే రాజ్యం అంటూ ఓ వైపు భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నా... మరోవైపు చాలా దేశాలు క్రిప్టో లావాదేవీలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దీంతో క్రిప్టోలపై అనిశ్చిత్తి పకూర్తిగా వీడటం లేదు. కాగా ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సైతం డిజిటల్ కరెన్సీపై నమ్మకం కోల్పోతున్నారు. ఫలితంగా క్రిప్టో కరెన్సీ విలువలు పడిపోతున్నాయి. క్రిప్టో కరెన్సీలో లార్జెస్ట్ కాయిన్‌గా పేరొందని బిట్ కాయిన్ విలువకి భారీ ఎత్తున కోత పడుతోంది. గడిచిన ఐదు రోజుల్లో బిట్ కాయిన్ విలువ 14 శాతం క్షీణించింది. మే 5న బిట్‌కాయిన్ విలువ ఇండియన్ కరెన్సీలో రూ. 30.14 లక్షలు ఉండగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రూ. 25.90 లక్షలకు పడిపోయింది. ద్రవ్యోల్బణం కారణంగా డిజిటల్ ఆస్తుల కంటే రెగ్యులర్ ఆస్తులపై ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మరోవైపు రెండో అతి పెద్ద డిజిటల్ కాయిన్ అయిన ఈథెరమ్ సైతం తన విలువను గత ఐదు రోజుల్లో 15 శాతం కోల్పోయింది. ప్రస్తుతం ఈథేమర్ విలువ రూ.1.89 లక్షలుగా ఉంది. ఐదు రోజుల్లో ఏకంగా రూ. 33.64 వేల మేరకు కోత పడింది. చదవండి: భారత్‌లో క్రిప్టో కరెన్సీ! నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! -
కౌబెక్.. ఏషియాలోనే మొదటి ఎడ్యుకేషన్ మెటావర్స్ క్రిప్టో ప్రాజెక్ట్
ఈమధ్య కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ఎక్కువ మంది నోట నానుతున్న మాట క్రిప్టో కరెన్సీ లేదా క్రిప్టో కాయిన్స్. ఎందుకు ఈ క్రిప్టోకరెన్సీ గురించి ఇంత మధ్య చర్చిస్తున్నారనేందుకు సింపుల్ ఉదాహారణగా శిబా ఐఎన్‌యూ కాయిన్ గురించి చెప్పుకోవాలి. ఈ కాయిన్ విలువ 2021 జనవరి 1న 100 డాలర్లు ఉంటే అదే ఏడాది అక్టోబరు నాటికి దాని విలువ 47 మిలియన్లకు చేరుకుంది. రియల్ ఎస్టేట్, బంగారం ఆఖరికి జాక్పాట్లో కూడా ఈ స్థాయి రిటర్నులు రావడం కష్టం. అందుకే అందరి దృష్టి క్రిప్టో కరెన్సీ మీద పడింది. క్రిప్టో కాయిన్లలో లాభాలు అధికంగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు ఈ కాయిన్లను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎకనామిక్స్‌కి మరో ప్రత్యామ్నయంగా టోకెనామిక్స్ అనేట్టుగా పరిస్థితి మారింది. ఉదాహారణకు ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ కర్ట్ ఏంజెల్, క్రికెటర్ క్రిస్‌గేల్ తదితరులు ఇప్పటికే ఇందులో పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో కాయిన్ల వ్యవహారం అంతా సెలబ్రిటీలకేనా సామాన్యుల పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చింది కౌబెక్ ప్రాజెక్ట్. బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై అమితమైన ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎంతో లోతైన పరిశోధనలు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. ఏషియాలోనే మొదటి మెటావర్స్ క్రిప్టో ప్రాజెక్టుగా ముందుకు వచ్చిన కౌబెక్ ప్రాజెక్టు ఇప్పుడు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ, టోకెనామిక్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, మెటావర్స్, క్రిప్టో టోకెన్ల ట్రేడింగ్ అంశాల్లో లోతైన అవగాహన కల్పించే ఎడ్యుటెక్‌గా కౌబెక్ సేవలు అందిస్తోంది. ఇదే పరంపరలో కౌబెక్ ప్రాజెక్ట్ నుంచి కౌబెక్ టోకెన్లు మార్కెట్లోకి వచ్చాయి. విలువ తరగడమన్నదే లేకపోవడంతో అనతి కాలంలోనే సగానికి పైగా కాయిన్లు ఇప్పటికే అయిపోయాయి. కౌబెక్ ప్రాజెక్టు ప్రారంభమైన రెండు నెలల్లోనే కౌబెక్కు తొమ్మిది వేల మందికి పైగా హోల్డర్లు, 12 వేల మందికి పైగా సోషల్ మీడియా మెంబర్లను సాధించి ఇండియాలో టాప్ 10 క్రిప్టో సర్వీసెస్ జాబితాలో చోటు సాధించింది. అంతేకాదు ప్రఖ్యాతి చెందిన క్రిప్టో ఎక్సేంజీలైన కాయిన్ ఎక్సేంజీ వరల్డ్, కాయిన్స్ బిట్, కాయిన్గైకో, ఎల్ బ్యాంక్ తదితర చోట్లలో సుస్థిర స్థానం సాధించింది. కౌబెక్ ప్రాజెక్టులో డెవలపింగ్, మార్కెటింగ్ టీమ్స్ ప్రత్యేకంగా పని చేస్తున్నాయి. కౌబెక్ కాయిన్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు డిజిటల్ గురుకుల్ ఎడ్యుటెక్ కంపెనీతో ఒప్పందం జరిగింది. దీంతో డిజిటల్ గురుకుల్ 44,850 విద్యార్థులు ఆన్లైన్లో లావాదేవీలు జరిపేందుకు ఆస్కారం ఏర్పడింది. అంతేకాదు ఏషియాలో మరో 37 ఎడ్యుటెక్ సంస్థలతో కూడా సంప్రదింపులు సాగుతున్నాయి. 2022 మే 1 నుంచి కౌబెక్ స్టోర్ కూడా ప్రారంభమైంది. డాలర్ కౌబెక్ టోకెన్ చెల్లింపుల ద్వారా ఇక్కడ సేవలు/సర్వీసులు పొందే వీలుంది. (అడ్వెటోరియల్) -
ఓరి భగవంతుడా! కళ్ల ముందే రూ.80 లక్షలు.. కానీ, తీద్దామంటే..!
సాక్షి, హైదరాబాద్: స్నేహితుల మాట విని క్రిప్టో కరెన్సీలో డబ్బు ఇన్వెస్ట్ చేసిన వ్యాపారస్తుడు లక్షల రూపాయిలు మోసపోయాడు. కంటికి లక్షలు కనిపించినా తీసేందుకు ఒక్క రూపాయి రాకపోవడంతో బాధితుడు సోమవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీ నగర్‌కాలనీకి చెందిన మహేష్ వృతిరీత్యా వ్యాపారస్తుడు. తన స్నేహితులు కొందరు ప్రాన్‌డాట్ ఏసీ డాట్ వెబ్సైట్లో క్రిప్టో కరెన్సీ చేస్తే లాభాలు వస్తాయని సూచించారు. చదవండి👉 ‘మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్.. అమ్మా, నాన్నా క్షమించండి..’ దీంతో వారిచ్చిన టెలిగ్రామ్ లింకులో జాయిన్ అయ్యి చాట్ చేశాడు. తొలుత రూ.30వేలు పెట్టగా రూ.50వేలు వచ్చాయి. ఆశతో పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.80 లక్షలు పెట్టాడు. రూ.80 లక్షలకు కోటికి పైగా లాభం కంటికి కనిపిస్తుందే కానీ తీసేందుకు ఒక్క రూపాయి రావడం లేదు. ఫేక్ అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి👉 వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి -
క్రిప్టోకరెన్సీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు..!
క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోకరెన్సీలు అన్నిదేశాలకు అతిపెద్ద ప్రమాదంగా తయారయ్యే అవకాశం ఉందని అన్నారు. క్రిప్టోకరెన్సీలతో మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్‌ను సమీకరించేందుకు ఉపయోగపడతాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) స్ప్రింగ్ మీట్ సందర్భంగా జరిగిన సెమినార్లో నిర్మలా సీతారామన్ క్రిప్టోకరెన్సీలపై ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలతో అన్ని దేశాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. వీటితో మనీలాండరింగ్, తీవ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. క్రిప్టో లాంటి డిజిటల్ కరెన్సీలపై టెక్నాలజీ సహాయంతో నియంత్రించాలని అభిప్రాయపడ్డారు. అన్ని దేశాలు, ఐఎంఎఫ్ సమన్వయంతో క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ చేయాలని వెల్లడించారు. ప్రపంచబ్యాంక్, జీ20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మీటింగ్‌లో నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా ఐఎంఎఫ్ నిర్వహించిన"మనీ ఎట్ ఎ క్రాస్‌రోడ్" అనే అంశంపై ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో సీతారామన్ క్రిప్టోకరెన్సీలపై మాట్లాడారు. దాంతో పాటుగా డిజటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు భారత్ తీసుకున్న నిర్ణయాలను సీతారామన్ సమావేశంలో హైలైట్ చేశారు. చదవండి: వేతన జీవులకు శుభవార్తను అందించనున్న కేంద్రం..! 75 లక్షల ఉద్యోగులకు లబ్ధి..! -
Cryptocurrency: నకిలీ క్రిప్టో యాప్స్ దందా.. రూ.17 కోట్లు సీజ్
బనశంకరి: ప్రజల అమాయకత్వం, ఆశను అనువుగా చేసుకుని కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన ముఠా చివరకు కటకటాల పాలైంది. త్వరగా సంపన్నులు కావచ్చని వీరిని నమ్మిన వేలాది మందికి కడగండ్లే మిగిలాయి. క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు బడా నేరగాళ్లను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ.17 కోట్ల నగదు, సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. సోమవారం జాయింట్ పోలీస్ కమిషనర్ రమణ్గుప్తాతో కలిసి కమల్‌పంత్ మీడియాతో మాట్లాడారు. నకిలీ యాప్‌ల ద్వారా దందా.. రమేశ్ ఉల్లాఖాన్, శీతల్ బస్త్వాడ్, ఇమ్రాన్ రియాజ్, జబీఉల్లాఖాన్ అనే నలుగురు 2021లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో క్రిప్టో కరెన్సీ లాభాలతో పాటు క్రిప్టో మైనింగ్ యంత్రం ఇస్తామని ప్రజలకు వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా సంప్రదించేవారు. వీరందరూ కూడా కర్ణాటకకు చెందినవారే. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా షేర్ హ్యాశ్ అనే యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోమనేవారు. దాని ద్వారా ప్రజల నుంచి నగదును పెట్టుబడి పెట్టించేవారు. తరువాత ఆ డబ్బును వివిధ నకిలీ కంపెనీల ఖాతాలకు మళ్లించేవారు. 2022 జనవరిలో షేర్‌హ్యాశ్ యాప్‌లో ఖాతాదారులకు లాగిన్ లోపం తలెత్తిందని తెలిపారు. దీంతో షేర్‌హ్యాశ్ 2.0 యాప్‌ను మదుపుదారులతో డౌన్లోడ్ చేయించారు. ఆ యాప్ కూడా పనిచేయలేదు. కంపెనీ సిబ్బందిని సంప్రదిస్తే సమాధానం రాలేదు. దీంతో తమ డబ్బు ఇరుక్కుపోవడంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. వివిధ బ్యాంకు అకౌంట్లలో ఉన్న సుమారు రూ.17 కోట్లను సీజ్ చేశారు. 1.6 కేజీల బంగారు నగలు, రూ.70 లక్షల నగదును, కొన్ని మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీసీపీ శరణప్ప పాల్గొన్నారు. ఇది చదవండి: కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం -
క్రిప్టో కరెన్సీలపై అనుమానాలు, నివృత్తి చేసే పనిలో కేంద్రం!
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలు, వర్చువల్ డిజిటల్ అసెట్లపై పన్నులకు సంబంధించి తరచుగా తలెత్తే సందేహాలను (ఎఫ్ఏక్యూ) నివృత్తి చేయడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ), రిజర్వ్ బ్యాంక్, రెవెన్యూ విభాగం, న్యాయ శాఖ మొదలైనవి ఎఫ్ఏక్యూలకు సమాధానాలను సిద్ధం చేస్తున్నాయి. ఇవి కేవలం సమాచారం ఇవ్వడానికి ఉద్దేశించినవే తప్ప క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత కల్పించేవి కాకపోయినప్పటికీ .. ఎలాంటి లొసుగులు ఉండకూడదనే ఉద్దేశంతో న్యాయ శాఖ అభిప్రాయం కూడా తీసుకుంటున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధింపునకు సంబంధించి క్రిప్టోకరెన్సీ అనేది వస్తువుల విభాగంలోకి వస్తుందా లేక సర్వీసు కింద పరిగణిస్తారా అనే దానిపై ఎఫ్ఏక్యూల్లో స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం క్రిప్టో ఎక్సే్చంజీలను ఆర్థిక సేవలు అందించే సంస్థలుగా పరిగణిస్తూ 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ప్రత్యేకంగా క్రిప్టోను వర్గీకరించలేదు. క్రిప్టో అసెట్స్ ద్వారా వచ్చే ఆదాయాలపై పన్నులు విధించేలా 2022–23 బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ప్రతిపాదనల ప్లకారం డిజిటల్ అసెట్స్ ఆదాయాలపై 30 శాతం ఆదాయపు పన్ను (సెస్సు, సర్‌చార్జీలు అదనం) ఉంటుంది. వర్చువల్ కరెన్సీల చెల్లింపులపై 1 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. -
షాకింగ్ నిర్ణయం..! యూపీఐ పేమెంట్స్‌తో వాటిని కొనలేరు...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు భారీ ఆదరణను పొందుతోంది. భారత్‌లో కూడా క్రిప్టోపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత క్రిప్టోకరెన్సీ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ అమెరికన్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్ కూడా భారత్‌లో ఏప్రిల్ 7 న ఎంట్రీ ఇచ్చింది.మన దేశ క్రిప్టో ఇన్వెస్టర్లు సదరు క్రిప్టో కరెన్సీలను కొనుగోలుచేసేందుకుగాను యూపీఐ పేమెంట్స్ ఆప్షన్స్‌ను కాయిన్‌బేస్ తీసుకొచ్చింది. కాగా 3 రోజుల క్రితమే తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్స్ ఫీచర్‌పై కాయిన్‌బేస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్రిప్టోకరెన్సీలను యూపీఐ పేమెంట్స్ ద్వారా కొనుగోలుచేసే ఆప్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు క్రిప్టో ట్రేడింగ్ ఫ్లాట్‌ఫాం కాయిన్‌బేస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇతర ప్రత్యామ్నాయ పేమెంట్స్ ఆప్షన్స్‌ను ఉపయోగించి క్రిప్టోలను కొనుగోలు చేయాలని కాయిన్‌బేస్ సదరు క్రిప్టో ఇన్వెస్టర్లకు వెల్లడించింది. గతంలో ప్రముఖ మొబైల్ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ వ్యాలెట్ కూడా దిగ్గజ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అయితే కొద్ది రోజుల్లోనే క్రిప్టో ట్రేడింగ్‌పై మద్దతును మొబిక్విక్ ఉపసంహరించుకుంది. ఎన్పీసీఐ సీరియస్..! ప్రపంచంలోని అతి పెద్ద క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్ ఏప్రిల్ 7 న బెంగళూరులో జరిగిన మెగా ఈవెంట్లో యూపీఐ ద్వారా క్రిప్టోకరెన్సీలను కొనుగోలుచేయవచ్చునని వెల్లడించింది. కాయిన్‌బేస్‌పై వచ్చిన తాజా నివేదికలపై...నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అలర్ట్ అయ్యింది. కాయిన్‌బేస్ నిర్ణయంపై ఎన్పీసీఐ సీరియస్ కాగా, భారత్‌లో యూపీఐ పేమెంట్ల ద్వారా క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసుకోవడాన్ని అనుమతించిన కంపెనీ నిర్ణయం ప్రస్తుతం రెగ్యులేటరీ స్క్రూటీనిలోకి వచ్చిందని ఎన్పీసీఐ పేర్కొంది. యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించే క్రిప్టో ఎక్సేఛేంజ్ల గురించి తెలియదని ఎన్పీసీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. Statement by NPCI as on 7th April 2022. With reference to some recent media reports around the purchase of Cryptocurrencies using UPI, National Payments Corporation of India would like to clarify that we are not aware of any crypto exchange using UPI. Please see attached document pic.twitter.com/lGTcaSLKeC — NPCI (@NPCI_NPCI) April 7, 2022 చదవండి: గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..! వారు రూ. 5 వేలకు మించి విత్ డ్రా చేయలేరు..! -
క్రిప్టోల్లో ట్రేడ్ చేస్తే.. ఐటీకి సమాచారం
న్యూఢిల్లీ: వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టో కరెన్సీలు, ఎన్ఎఫ్టీలు)లో లాభాలు సంపాదించి.. రిటర్నుల్లో ఆ విషయాన్ని వెల్లడించకపోతే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు. ఎందుకంటే వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీలను 30 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ 2022–23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేర్చడం తెలిసిందే. దీని ప్రకారం క్రిప్టో లావాదేవీల్లో వచ్చిన లాభంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఈ లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లింపుదారులే స్వయంగా తమ రిటర్నుల్లో వెల్లడించేవారు. స్వయంగా కోరి తీసుకుంటే తప్ప ఆదాయపన్ను శాఖకు ఆ లావాదేవీల వివరాలు ఇప్పటి వరకు తెలిసేవి కావు. కానీ, ఇక మీదట స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల మాదిరే వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల వివరాలు కూడా ఆటోమేటిగ్గా ఆదాయపన్ను శాఖకు వెళ్లనున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం అన్ని బ్యాంకులు, క్రిప్టో ఎక్సేంజ్‌లను వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల వివరాలను నివేదించాలని కోరనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్యాంకులు, క్రిప్టో ఎక్సేంజ్‌లకు ఈ ఆదేశాలు వెళితే.. అనంతరం క్రిప్టోలు, ఎన్ఎఫ్టీ లావాదేవీల వివరాలు ఇన్వెస్టర్ల పాన్ నంబర్ ఆధారంగా ఆదాయపన్ను శాఖకు చేరతాయి. అవి వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ప్రతిఫలిస్తాయి. ఏఐఎస్ అన్నది 46 ఆర్థిక లావాదేవీల వివరాలతో కూడిన రిపోర్ట్. ప్రతీ పన్ను చెల్లింపుదారు ఆదాయపన్ను శాఖ పోర్టల్‌కు వెళ్లి దీన్ని పొందొచ్చు. రిటర్నులు దాఖలు చేయడానికి ముందు ఏఐఎస్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. లీకేజీలకు చెక్..: వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల వివరాలు సైతం ఏఐఎస్‌లో చేరితే.. వాటిని ఎప్పుడైనా తనిఖీ చేసేందుకు, పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఆదాయపన్ను శాఖకు వెసులుబాటు ఉంటుంది. ‘‘ఒక్కసారి పన్ను నిబంధనలు అమల్లోకి వస్తే.. డిజిటల్ అస్తుల లావాదేవీల వివరాలను సైతం నిర్ధేశిత ఆర్థిక లావాదేవీల (ఎస్ఎఫ్టీలు) మాదిరే నివేదించాలని కోరొచ్చు’’ అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే, ఎస్‌ఎఫ్‌టీలన్నవి పన్ను చెల్లింపుదారు ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత పరిమితికి మించి చేసిన లావాదేవీలు, పెట్టుబడుల వివరాలకు సంబంధించినది. క్రిప్టోకరెన్సీ కఠిన పన్ను నిబంధనలు క్రిప్టోకరెన్సీలపై పన్ను నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం గురువారం ప్రతిపాదించింది. ఈ దిశలో ఫైనాన్స్ బిల్లుకు సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది. లోక్‌సభ సభ్యులకు ఈ మేరకు ఫైనాన్స్ బిల్లు, 2022కి సవరణ బిల్లు సర్క్యులేట్ అయ్యింది. వర్చువల్ డిజిటల్ ఆస్తుల నష్టాలపై పన్ను ప్రయోజనాలు పొందడాన్ని సవరణలు నిరోధిస్తున్నాయి. -
షాకింగ్ నిర్ణయం..! ఐపీఎల్-2022లో వాటి సప్పుడు ఉండదు..!
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో అత్రుతగా వెయిట్ చేస్తున్నారు. వీరితో పాటుగా పలు కంపెనీలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే సదరు కంపెనీలు ఐపీఎల్-2022 మ్యాచ్‌లో తమ ప్రకటనలను బ్రాడ్కాస్ట్ చేసేందుకు ఊవిళ్లురుతున్నాయి. అడ్వర్టైజింగ్ విషయంలో ఎంతైనా చెల్లించేందుకు కంపెనీలు రెడీగా ఉన్నాయి. కాగా ఐపీఎల్-2022 నేపథ్యంలో భారత్‌కు చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్సేఛేంజ్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. ప్రకటనలకు దూరం..! భారత్‌లో క్రిప్టోకరెన్సీ భారీ ఆదరణను పొందాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పలు కంపెనీలు క్రిప్టో ఎక్సేఛేంజ్లను నెలకొల్పాయి. ఇండియాలో వజీర్ ఎక్స్, కాయిన్ డీసీఎక్స్, కాయిన్ స్విచ్ కుబేర్ లాంటి క్రిప్టో ఎక్సేఛేంజ్‌లు భారీ ఆదరణను పొందాయి. ఐపీఎల్-2022 నేపథ్యంలో ఈ కంపెనీలకు చెందిన ప్రకటనలు కన్పించవు. ఐపీఎల్-15 ఎడిషన్ అడ్వర్టైజింగ్ స్పాట్స్‌ను బుక్ చేసుకునేందుకు సిద్దంగా లేన్నట్లు సమాచారం. ఆయా కంపెనీలు ప్రకటనలకోసం డబ్బులను వెచ్చించేందుకు రెడీగా లేవని తెలుస్తోంది. ఈ కంపెనీలు 2021లో దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. గత ఏడాది ఐపీఎల్ పది సెకన్ల యాడ్‌కు సుమారు రూ. 13 నుంచి 18 లక్షల వరకు ఛార్జ్ చేసినట్లు సమాచారం. కారణాలు అవేనా..? క్రిప్టోకరెన్సీలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో సదరు కంపెనీలు వెనకడుగు వేసినట్లు సమాచారం. 2022-23 బడ్జెట్లో క్రిప్టో కరెన్సీలు, ఇతర డిజిటల్ ఆస్తుల ద్వారా వచ్చేఆదాయంపై 30 శాతం పన్నులను, రూ. 10 వేల కంటే ఎక్కువ వర్చువల్ కరెన్సీల చెల్లింపులపై 1 శాతం టీడీఎస్ విధిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిప్టో ఇన్వెస్టర్లకు, ఎక్సేఛేంజ్లకు కొంత మేర నష్టాలను కల్గించే అవకాశం ఉంది. క్రిప్టోమార్కెట్‌ను నియంత్రించేందుకు కేంద్రం తీసుకునే నిర్ణయాలను బట్టి ముందుకుసాగాలని క్రిప్టో ఎక్సేఛేంజ్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగానే పలు చర్యలను తీసుకోవడం మంచిదని కంపెనీలు భావించినట్లుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..! -
నిధుల సమీకరణే లక్ష్యంగా..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక నిర్ణయం..!
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర పోరు జరుగుతుంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అల్లాడిపోతుంది. రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ శాయశక్తుల ప్రయత్నాలను చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెల్‌న్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్దం కల్పించారు. అందుకు సంబంధించిన బిల్లుపై జెలెన్స్కీ సంతకం చేశారు. క్రిప్టో కరెన్సీల చట్టబద్దతపై ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. తమ దేశంలో క్రిప్టో ఎక్స్ఛేంజీలు చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతించబడతాయని పేర్కొంది.దీంతో క్రిప్టో ఖాతాలను జారీ చేయడానికి బ్యాంకులకు కూడా వెసులుబాటు కలగనుంది.ఇక క్రిప్టో ఆస్తుల మార్కెట్‌ను ఉక్రెయిన్ నేషనల్ కమీషన్ ఆన్ సెక్యూరిటీస్, స్టాక్ మార్కెట్ పర్యవేక్షిస్తుందని పేర్కొంది. రష్యా సైనికచర్యను తిప్పికొట్టే పనిలో భాగంగా నిధుల సేకరణలో ఉక్రెయిన్ బిజీగా ఉంది. అందులో భాగంగా క్రిప్టోకరెన్సీలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు 100 మిలియన్ డాలర్లకు పైగా క్రిప్టో విరాళాలను అందుకుంది.ఇదిలా ఉండగా... క్రిప్టో కరెన్సీకి సంబంధించి సెప్టెంబర్ 2021 లో తెరమీదకొచ్చిన ఓ బిల్లు సంస్కరణను జెలెన్స్కీ తిరస్కరించడం గమనార్హం. చదవండి: మరో కంపెనీలో భారీగా వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్ రిటైల్! -
క్రిప్టోకరెన్సీలపై కేంద్రం కీలక నిర్ణయం..!
క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై త్వరలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకొనుంది. క్రిప్టోకరెన్సీలను జీఎస్టీ చట్టం కిందకు తీసుకొచ్చేందుకు కేంద్రం పనిచేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రిప్టో ఎక్సేఛేంజ్‌లు అందించే సర్వీసులపై మాత్రమే కేంద్రం 18 శాతం జీఎస్టీను విధిస్తోంది. వీటిని ఆర్థిక సేవల కేటగిరీగా పన్నులను వేస్తోంది. జీఎస్టీ కిందకు వస్తే..! క్రిప్టోకరెన్సీలను జీఎస్టీ చట్టం కిందకు తీసుకొస్తే..క్రిప్టో లావాదేవీ మొత్తం విలువపై పన్ను విధించే అవకాశం ఉంటుంది. ఇక కొందరు జీఎస్టీ అధికారులు క్రిప్టోలను లాటరీలు, క్యాసినోలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, హార్స్ రేసింగ్ కిందకు వస్తాయని అభిప్రాయ పడుతున్నారు. వీటిపై 28 శాతంగా జీఎస్టీ రేటు ఉంది. మరికొందరు క్రిప్టోకరెన్సీలను గోల్డ్ లాగా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.కాగా ప్రస్తుతం గోల్డ్‌తో జరిపే లావాదేవీ మొత్తంపై 3 శాతం జీఎస్టీను వసూలు చేస్తున్నారు. స్పష్టత అవసరం..! క్రిప్టో కరెన్సీలపై విధించే జీఎస్టీపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం వాల్యుపై పన్ను విధించాలా? లేదా? అన్నది నిర్ణయించాల్సి ఉంది. ఒకవేళ క్రిప్టో కరెన్సీలను గూడ్స్‌గా లేదా సర్వీసెస్‌గా వర్గీకరిస్తే.. వాటిపై తప్పనిసరిగా పన్ను విధింపు ఉండే అవకాశం ఉండనుందని సదరు జీఎస్టీ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక క్రిప్టో కరెన్సీల మొత్తం లావాదేవీపై జీఎస్టీ విధిస్తే ఈ రేటు 0.1 శాతం నుంచి 1 శాతంగా ఉండనుంది. కాగా ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రేటు 0.1శాతామా లేదా 1 శాతామా అని నిర్ణయించడానికి ముందు.. వీటి వర్గీకరణను ఖరారు చేయాల్సి ఉంది. క్రిప్టో కరెన్సీల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇటీవల బడ్జెట్లోనే క్రిప్టో అసెట్స్‌ను ఆదాయపు పన్ను కిందకు తీసుకొస్తూ.. ప్రభుత్వం 30 శాతం పన్నును ప్రతిపాదించింది. అంతేకాక క్రిప్టో ఆస్తుల బదిలీపై రూ.10 వేలు మించితే 1 శాతం లెక్కన టీడీఎస్ ఉంటుంది. 1 శాతం టీడీఎస్ జూలై 1, 2022 నుంచి అమల్లోకి వస్తుండగా.. క్రిప్టోలపై పన్ను మాత్రం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అంతేకాక ఈ కరెన్సీలను రెగ్యులేట్ చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోంది. చదవండి: మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి… లేకపోతే మీకే నష్టం..! -
అమితాబ్, సచిన్, ధోని బాటలో నాగార్జున ! ఈ చర్చలు అందుకేనా?
ఒకప్పుడు సినిమా తెరపై సైకిల్ చెయిన్ తెంపి నాగార్జున సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముప్పై ఏళ్లు దాటినా ఇప్పటికీ సైకిల్ చెయిన్ ఎఫెక్ట్ తగ్గలేదు. ఇప్పుడు నాగార్జున కొత్తగా బ్లాక్‌చెయిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కొత్త ఇంట్రెస్ట్ ఫ్యూచర్లో ఏ సంచలనాలకు కేంద్రం కానుందో.... వెండితెర హీరోగానే కాదు సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్‌గా నాగార్జునకి తెలుగు ఇండస్ట్రీలో పేరుంది. కొత్త టాలెంట్‌ని పట్టుకోవడంలో భవిష్యత్తుని సరిగా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడంలో ‘కింగ్’ని దిట్టగా చెప్పుకుంటారు. మరోసారి నాగార్జున తన ఇమేజ్‌కి తగ్గట్టుగా కొత్త స్టెప్ వేయబోతున్నారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ! స్పెషల్ మీటింగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా షూటింగ్లో భాగంగా నాగార్జున ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. నాగార్జునతో ఫోటోలు దిగేందుకు సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు, విదేశీయులు పోటీ పడ్డారు. అయితే దీనికి భిన్నంగా నాగార్జునానే ఓ వ్యక్తితో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించారు. అంతేకాదు ఆ వ్యక్తి ప్రత్యేకతలను చెబుతూ ఏకంగా ట్విట్టర్లో ఫోటో కూడా పెట్టడం కొత్త చర్చకు దారి తీసింది. ఫ్యూచర్ టెక్నాలజీ దుబాయ్‌లో షూట్లో ఉన్న నాగార్జున ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో ఫుల్‌క్రేజ్ ఉన్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై సర్వీస్ అందిస్తున్న ఓఎక్స్ పాలిగాన్ సంస్థ కో ఫౌండర్ సందీప్ నైల్వాల్ని కలిశారు. ఈ సందర్భంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, ఇతర ఫ్యూచర్ టెక్నాలజీలపై చర్చించామని నాగార్జున స్వయంగా తెలిపారు. It was nice to meet and chat with @sandeepnailwal Co-founder @0xPolygon !!the man who put india on the world map of blockchain and talk about future tech!! Godbless🙏 pic.twitter.com/kRbSpczyeM — Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2022 ఎవరీ సందీప్ ముంబైకి చెందిన సందీప్ నైల్వాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకి వచ్చాక ఏంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత డెలాయిట్, వెల్స్పన్ సంస్థల్లో పని చేశారు. 2017లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై వర్క్ చేసే మాటిక్ సంస్థను స్థాపించాడు. అనంతరం 2019లో దాన్ని ఓఎక్స్పాలిగాన్గా మార్చాడు. 2020లో కరోనా సంక్షోభ సమయంలో ఇండియా క్రిప్టో కోవిడ్ రిలీఫ్ ఫండ్ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చారు. దేశీ క్రిప్టో అడ్డా ఇండియాకు సంబంధించి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, ఈథేరియం లావాదేవీలు, బినాన్స్, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వ్యవహరాలకు ఈ సంస్థ పెట్టింది పేరు. ఈ సంస్థ యూజర్ బేస్‌లో మూడు లక్షల మంది క్రిప్టో ట్రేడర్లు ఉన్నారు. గడిచిన మూడేళ్లలో 27 బిలియన్ డాలర్ల విలువైన ఈథేరియమ్, బినాన్స్, స్మార్ట్చైయిన్ లావాదేవీలను నిర్వహించింది. బ్లాక్‌చెయిన్ బాట పట్టిన సెలబ్రిటీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్మేన్లు, సినిమా పర్సనాలిటీస్, స్పోర్ట్స్ ఐకాన్స్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ వంటి వ్యక్తులు ఇప్పటికే క్రిప్టోలో భారీగా ఇన్వెస్ట్ చేయగా సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, మహేంద్రసింగ్ ధోని వంటి మూవీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్ఎఫ్టీ)లను రిలీజ్ చేస్తున్నారు. కింగ్ మదిలో ఏముందో ? ఈ నేపథ్యంలో నాగార్జున సందీప్ నైల్వాల్ని కలుసుకోవడం బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై సుదీర్ఘంగా చర్చించడం చర్చనీయాంశంగా మారింది. నాగార్జున త్వరలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టవచ్చంటూ కొందరు అంచనా వేస్తుండగా మరికొందరు ఎన్ఎఫ్టీలు తీసుకు రావచ్చని అనుకుంటున్నారు. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుకి సంబంధించిన సినిమా విశేషాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ఫ్యూచర్ టెక్నాలజీ అయిన బ్లాక్‌చెయిన్ గురించి నాగార్జున తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. - సాక్షి వెబ్ ప్రత్యేకం చదవండి: ఎన్ఎఫ్టీ అమ్మకాల్లో అమితాబ్ బచ్చన్ రికార్డు! -
క్రిప్టో అకౌంట్ హ్యాక్.. అకౌంట్లో కోట్ల విలువైన కరెన్సీ.. రూ. 92 లక్షలు స్వాహా
సాక్షి, హిమాయత్‌నగర్: క్రిప్టో కరెన్సీ చేసే ట్రేడర్ అకౌంట్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ అకౌంట్లో ఉన్న రూ. 2 కోట్లలో సుమారు రూ. 90 లక్షలకు పైగా సొమ్మును వారి వారి ఖాతాల్లోకి మళ్లించారు. ఇది గమనించిన జూబ్లీహిల్స్‌కు చెందిన ఉషారాణి బుధవారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఐటీ రంగానికి చెందిన ఉషారాణి కొన్నేళ్లుగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీకి చెందిన బినాన్స్‌లో ఈమెకు అకౌంట్ కూడా ఉంది. ఆ అకౌంట్లో రూ. కోట్లు విలువ గల కరెన్సీ ఉంది. ఇటీవల ఉషారాణి అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. యూఎస్డీ కింద ఉన్న కరెన్సీ (1.22 లక్షలు) ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 92 లక్షలను మన దేశ కరెన్సీ కింద కన్వెర్ట్ చేసి వివిధ అకౌంట్లకు బదిలీ చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మహిళ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఎస్బీఐ ఖాతా నుంచి... తన అకౌంట్‌ను హ్యాక్ చేసి డబ్బు కాజేశారంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి బుధవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలివీ... సదరు వ్యక్తి కొంతకాలంగా ఆస్ట్రేలి యాలో నివాసం ఉంటున్నారు. అతనికి జూబ్లీహిల్స్‌లోని ఎస్బీఐలో ఖాతా ఉంది. ఈ ఖాతా ద్వారానే తన లావాదేవీలన్నీ జరుగుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి ఆయనకు కాల్ చేసి ఎస్బీఐ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. మీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పి నమ్మించాడు. ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేయించి, పాస్వర్డ్ తెలుసుకున్నాడు. అనంతరం తన ఖాతా నుంచి రూ. 13.84 లక్షలను వేరే అకౌంట్‌కు బదిలీ చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
దేశంలో క్రిప్టోకరెన్సీ ప్రవేశపెట్టే ఆలోచన లేదు: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలో క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఆలోచనలు ఏమి లేవని ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి నేడు రాజ్యసభకు తెలియజేశారు. భారతదేశంలో ప్రస్తుతం క్రిప్టోకరెన్సీలపై ఎలాంటి నియంత్రణ లేదని ఆయన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. "ఆర్బీఐ ఎలాంటి క్రిప్టోకరెన్సీని జారీ చేయదు. ఆర్బీఐ చట్టం, 1994 ప్రకారం.. సంప్రదాయ పేపర్ కరెన్సీని మాత్రమే జారీ చేస్తుంది. సంప్రదాయ పేపర్ కరెన్సీకి డిజిటల్ రూపం ఇచ్చి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)గా తీసుకొని రానున్నట్లు" ఆయన అన్నారు. ఆర్బీఐ ప్రస్తుతం సీబీడీసీని ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆయన మరో సమాధానంలో తెలిపారు. సీబీడీసీని ప్రవేశపెట్టడం వల్ల నగదుపై ఆధారపడటం తగ్గుతుంది, దీంతో ఆ కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చు కూడా మిగిలే అవకాశం ఉన్నట్లు పంకజ్ చౌదరి అన్నారు. నోట్ల ముద్రణ కొంతకాలం తగ్గిందని, 2019-20 కాలంలో రూ.4,378 కోట్ల విలువైన నోట్లు ముద్రిస్తే, ఇది 2020-21లో రూ.4,012 కోట్లకు తగ్గిందని ఆయన తెలిపారు. ఇంకా, ఆర్థిక, భౌగోళిక రాజకీయ సంఘటనల వల్ల స్వల్పకాలం స్టాక్ మార్కెట్లు అనిశ్చితికి లోనైనా కొలుకుంటాయని ఆయన అన్నారు. (చదవండి: ఇక దేశీయ రోడ్ల మీద చక్కర్లు కొట్టనున్న హైడ్రోజన్ కార్లు..!) -
అనూహ్య నిర్ణయం! ఏటీఎంలు అన్నీ బంద్..!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రిప్టోకరెన్సీలు బిట్‌కాయిన్, ఈథిరియం, డోజీకాయిన్ విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయా క్రిప్టోకరెన్సీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా అమాంతం పెరిగాయి. ఇదిలా ఉండగా బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీ ఏటీఎంలపై యుకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్దమైనవే..! యూకేలోని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఆ దేశ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) గట్టి షాక్‌ను ఇచ్చింది. క్రిప్టో ఎక్సేఛేంజ్స్పై కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. క్రిప్టో ఏటీఎం ఆపరేటర్లు వారి మెషీన్లు క్లోజ్ చేయాలని ఆదేశించింది. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్ సర్వీసులు అందించే క్రిప్టో కరెన్సీ ఏటీఎంలు అన్నీ ఎఫ్సీఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఏటీఎంలు అన్నీ యూకే మనీ ల్యాండరింగ్ నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుంది. చట్టవిరుద్దంగా క్రిప్టో కరెన్సీ ఏటీఎం సర్వీసులు అందిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలను జారీ చేసింది. క్రిప్టో లావాదేవీలు సులువు..! యుకేతో పాటుగా పలు దేశాల్లో ఇన్వెస్టర్లకు సులవుగా క్రిప్టోలను కొనుగోలు లేదా సేల్ చేసేందుకుగాను క్రిప్టో ఎటీఎంలను ఎక్సేఛేంజ్స్ ఏర్పాటుచేశాయి. ఇవి సాధారణ ఎటీఎం వలె కన్పిస్తాయి. ప్రజలు తమ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి బిట్‌కాయిన్ వంటి క్రిప్టో-కరెన్సీ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.కాగా యుకేలోని క్రిప్టో-కరెన్సీ సేవలను అందించే ఏ కంపెనీకి క్రిప్టో-ATMని ఆపరేట్ చేయడానికి లైసెన్స్ లేదు. క్రిప్టో ఏటీఎం డైరెక్టరీ కాయిన్ ఎటీఎం రాడార్ ప్రకారం..యుకేలో సుమారుగా 81 ఫంక్షనల్ క్రిప్టో ఎటీఎంలు ఉన్నాయి.ఎఫ్సీఏ నిర్ణయంతో ఆ దేశ క్రిప్టో ఇన్వెస్టర్లకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుంది. చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
పబ్జీకి చుక్కలే.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై కొత్త గేమ్.. ఊహించని రివార్డులు
హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ గేమింగ్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనాలకు తెర తీస్తోంది. బ్లాక్ చెయిన్ , మెటావర్స్ టెక్నాలజీను అనుసంధానం చేస్తూ సరికొత్త గేమ్‌ని రూపొందించింది. ఈ గేమ్‌లో హై లెవల్స్‌కి వెళ్లే కొద్ది క్రిప్టో టోకెన్లను బహుమతిగా గెలుచుకోవచ్చు. ఇలా గెలుచుకున్న టోకెన్లను క్రిప్టో ఎక్సేంజీల్లో సొమ్ము చేసుకోవచ్చు. యూత్ టార్గెట్ చేసి మరీ ఈ గేమ్‌ని మార్కెట్లోకి తెస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన బ్లాక్ చెయిన్ స్టార్టప్ క్లింగ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాక్సే ఇన్ఫినిటీని స్ఫూర్తితో సరికొత్త గేమ్‌ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి బీటా వెర్షన్ 2022 మార్చిలో రిలీజ్ చేయనుంది. ఆ తర్వాత 2022 జూన్‌లో ఫుల్ వెర్షన్‌ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ గేమ్‌లో పలు స్థాయిల్లో విజేతలుగా నిలిచిన వారికి క్లింగ్ టోకెన్లను జారీ చేస్తారు. ఈ టోకెన్లను మనీ మార్చుకునేందుకు వీలుగా పాన్కేక్ స్వాపింగ్ డీ సెంట్రలైజ్డ్ ఎక్సేంజీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థకు హాంగ్‌కాంగ్, కజకిస్తాన్, గిఫ్ట్ సిటీ (గుజరాత్)లలో కూడా ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో డెవలప్మెంట్ సెంటర్ ఉంది. ఇండియాలో ఎంతో ఫేమస్ పబ్జీ. ఈ గేమ్‌లో చికెన్ డిన్నర్ వంటి గిఫ్ట్‌లు, ఒకేసారి టీమ్‌లుగా అడుతూ ఛాలెంజ్‌లు బెట్టింగ్‌లు చేసుకునే వీలుంది. ఆన్లైన్లో ఒకేసారి చాలా మంది ప్లేయర్లు కూడా ఆడొచ్చు. ఇక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తీసొకొచ్చే గేమ్‌లో మెటావర్స్ టెక్నాలజీని పొందు పరిచారు. దీంతో వర్చువల్ రియాల్టీలో ఒకే సారి ఎక్కువ మంది ఈ గేమ్ ఆడే వీలుంటుంది. అంతేకాదు చాలా కఠినంగా ఉండేలా గేమ్‌ని రూపొందించారు. ఈ గేమ్‌లో పై స్థాయిలకు వెళితే క్లింగ్ టోకెన్లు పొందవచ్చు. -
క్రిప్టో కరెన్సీ.. ఇది చాలా రిస్క్ గురూ!
ముంబై: క్రిప్టో కరెన్సీలు, నాన్–ఫంజిబుల్ టోకెన్ల ప్రకటనలకు సంబంధించి అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలి ఏఎస్సీఐ మార్గదర్శకాలు ప్రకటించింది. వీటి ప్రకారం ఇకపై ఈ సాధనాల ప్రకటనల్లో ఇవి ‘అవ్యవస్థీకృతమైనవి, అత్యధిక రిస్కులకు అవకాశమున్నవి‘ అని పేర్కొనడం తప్పనిసరి కానుంది. ఇలాంటి లావాదేవీల వల్ల నష్టం వాటిల్లితే నియంత్రణ సంస్థలపరంగా పరిష్కార మార్గాలేమీ ఉండకపోవచ్చని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. క్రిప్టోలుగా వ్యవహరించే అన్ని వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ), నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)కు ఇవి వర్తిస్తాయి. వివాదాస్పద క్రిప్టో సాధనాలు, సర్వీసుల ప్రకటనలు మార్కెట్‌ను ముంచెత్తుతున్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వం, ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు ఏఎస్సీఐ తాజా గైడ్‌లైన్స్ రూపొందించింది. ఈ అసెట్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఇంకా చట్టమేదీ చేయకపోయినప్పటికీ.. వీటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద పన్ను వేయాలని మాత్రం ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఓవైపు క్రిప్టోలను పూర్తిగా నిషేధించాలని ఆర్బీఐ పట్టుబడుతుండగా మరోవైపు ప్రభుత్వం మాత్రం పన్ను విధించాలని ప్రతిపాదించడం అనేది వీటికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నంగా భావించవచ్చని పరిశ్రమ చెబుతోంది. నిబంధనలు.. ► ప్రింట్ ప్రకటనల్లో అయిదో వంతు స్థలాన్ని డిస్‌క్లెయిమర్ కోసం కేటాయించాలి. వీడియో ప్రకటన అయితే, ఆఖర్లో సాదా బ్యాక్‌గ్రౌండ్‌పై టెక్ట్స్‌ను సాధారణ వేగంతో వాయిస్ ఓవర్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది. వీడియో యాడ్లలో కనీసం అయిదు సెకన్ల పాటైనా చూపాలి. అదే రెండు నిమిషాలు పైగా సాగే ప్రకటనల్లోనైతే యాడ్ ప్రారంభం కావడానికి ముందు, ఆ తర్వాత ఆఖర్లోనూ చూపాలి. ఆడియో, సోషల్ మీడియా పోస్టులు మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ► కరెన్సీ, సెక్యూరిటీలు, కస్టోడియన్, డిపాజిటరీలు మొదలైన పదాలన్నీ నియంత్రణ సంస్థ పరిధిలోని ఉత్పత్తులుగా ప్రజలు భావించే అవకాశం ఉన్నందున వీడీఏ సాధనాలు లేదా సర్వీసుల ప్రకటనల్లో అడ్వర్టైజర్లు వీటిని వాడకూడదు. ► ఆయా సాధనాలకు సంబంధించి గత పనితీరు గురించి పాక్షికంగా కూడా చూపకూడదు. మైనర్లతో యాడ్స్ తీయకూడదు. ► భవిష్యత్తులో కచ్చితంగా లాభాలు పెరుగుతాయనే హమీ ఇచ్చే పదజాలం వాడకూడదు. ► వీడిఏ సాధనాల్లోని రిస్కులను తగ్గించి చూపే విధంగా ప్రకటనలు ఉండకూడదు. అలాగే నియంత్రిత అసెట్స్‌తో పోల్చి చూపకూడదు. ► వినియోగదారులు తప్పుదోవ పట్టకుండా చూసే క్రమంలో.. యాడ్స్‌లో నటించే సెలబ్రిటీలూ ప్రకటనల్లో చెప్పే విషయాల గురించి క్షుణ్నంగా తెలుసుకుని వ్యవహరించాలి. -
లాభాల కోసం క్రిప్టోల రిస్క్‌లో పడొద్దు
క్రిప్టో మార్కెట్ పట్ల మిలీనియల్స్ (26–41), జనరేషన్ జెడ్ (25 ఏళ్ల వరకు) వారిలో ఆసక్తి పెరిగిపోయింది. యువ ఇన్వెస్టర్లు క్రిప్టో పెట్టుబడుల పట్ల తమకు తెలియకుండానే ఆకర్షితులవుతున్నారు. స్వల్పకాలంలోనే ఊహించలేనంత లాభాలే ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా చెప్పుకోవాలి. పెట్టుబడి కోణంలో క్రిప్టో కరెన్సీలు/ఎన్ఎఫ్టీలకు చోటు ఇస్తున్న వారు కూడా ఉంటున్నారు. కానీ, క్రిప్టోలకు మనదేశంలో చట్టబద్ధతకు అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాభాలపై 30 శాతం పన్ను విధించింది. ప్రతీ లావాదేవీ రూపంలో వచ్చే లాభంపై 1 శాతం టీడీఎస్ నిబంధన తీసుకొచ్చింది. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. క్రిప్టో లాభాల కోసం పరుగులు తీసే ఇన్వెస్టర్లు.. ఈక్విటీ పెట్టుబడులతో పోల్చి చూస్తే క్రిప్టో పెట్టుబడులు ఏ మేరకు అనుకూలం? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలను అందించే కథనమే ఇది. ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రిప్టో మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 2021లో గణనీయంగా పెరిగింది. 2020 నాటికి 4.2 కోట్లుగా ఉన్న ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్య 2021 డిసెంబర్ చివరికి 8 కోట్లను దాటింది. ఒక నివేదిక ప్రకారం క్రిప్టో సాధనాల అనుసరణ విషయంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశీయంగా సుమారు 1.5 కోట్ల వరకు క్రిప్టో ఇన్వెస్టర్లు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ శాతం యువ ఇన్వెస్టర్లే. 32 శాతం 18–24 వయసులోని వారు. మరో 33 శాతం మంది 25–34 వయసు గ్రూపునకు చెందిన వారు. క్రిప్టోలనే కాదు ఎన్ఎఫ్టీలు, ఇతర ఏ రూపాల్లో ఉన్న డిజిటల్ ఆస్తులు (వర్చువల్ అసెట్స్) కూడా 30 శాతం మూలధన లాభాల పన్ను రేటు కిందకు వస్తాయి. ‘‘వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 30 శాతం పన్ను రేటు పడుతుంది. కొనుగోలు వ్యయాన్నే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. మరే ఇతర వ్యయాలను మినహాయింపు కింద క్లెయిమ్ చేసుకోలేరు. పైగా క్రిప్టోలపై వచ్చే లాభాల నుంచి మరే ఇతర నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు అనుమతి లేదు’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుధాకర్ సేతురామన్ తెలిపారు. అనుకూలతలు/రిస్క్ క్రిప్టోలతో పోలిస్తే ఈక్విటీల్లో వ్యయాలు తక్కువ. క్రిప్టోల్లో రిస్క్ చాలా అధికం. త్వరితగతిన లాభాలను చూసే ఇన్వెస్టర్లు ఈ రిస్క్ అంశాన్ని ఆలోచించడం లేదు. ఈక్విటీలు మెరుగైన నియంత్రణ వాతావరణంలో పనిచేస్తుంటాయి. కానీ, క్రిప్టోలన్నవి నియంత్రణ పరిధిల్లో లేని సాధనాలు. రిస్క్, వ్యయాల పరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం అని విశ్లేషకులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు.. క్రిప్టో కరెన్సీల్లో అతిపెద్దది అయిన బిట్‌కాయిన్ విలువ 2021 సంవత్సరంలో గరిష్ట స్థాయి 68,789 డాలర్ల నుంచి, కనిష్ట స్థాయి 28,130 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 సూచీ 14,018 పాయింట్ల నుంచి 17,345 మధ్య ట్రేడ్ అయింది. మరో నిదర్శనం బిట్ కాయిన్ ధర 2021 సెప్టెంబర్ 29న 41,041 డాలర్ల స్థాయి నుంచి నవంబర్ 9న 67,553 డాలర్లకు పెరిగింది. అంటే కేవలం నెలన్నర వ్యవధిలోనే 70 శాతం పెరిగింది. అక్కడి నుంచి మరో నెలన్నర రోజుల్లో డిసెంబర్ 31 నాటికి 47,128 డాలర్లకు పడిపోయింది. 30 శాతానికి పైగా నష్టపోయింది. భారీ అస్థిరతలకు బల మైన నిదర్శనాలు ఇవి. పన్ను ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 10 శాతంగా ఉంది. ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు దీర్ఘకాల మూలధన లాభం (ఏడాదికి మించి కొనసాగిన పెట్టుబడులపై/ఎల్టీసీజీ) గడించినప్పుడు పన్ను ఉండదు. రూ.లక్షకు మించి పొందే లాభంపైనే 10 శాతం పన్ను, 4 శాతం సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. అదే కొనుగోలు చేసి ఏడాది నిండకముందు విక్రయించే ఈక్విటీ పెట్టుబడులపై లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభంగా (ఎస్టీసీజీ) చట్టం పరిగణిస్తోంది. ఈ మొత్తంపై పన్ను 15 శాతంగా అమల్లో ఉంది. కనుక క్రిప్టోలతో పోల్చి చూసినప్పుడు ఈక్విటీలే ఆకర్షణీయమని ఐడీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ హెడ్ అనూప్ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించింది. అంతేకాదు ఈ లాభంపై వెంటనే ఒక శాతాన్ని తగ్గించుకునే టీడీఎస్ నిబంధన కూడా తీసుకొచ్చింది. అంటే ఇన్వెస్టర్ లాభం నుంచి ఒక శాతాన్ని క్రిప్టో ఎక్సేంజ్‌లు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమచేయాల్సి ఉంటుంది. క్రిప్టోల్లో మూలధన లాభం రూ.50లక్షలు మించితే 30 శాతం పన్నుపై సర్‌చార్జ్ కూడా అమలవుతుంది. వర్చువల్ అసెట్స్‌ను బంధువు కాని వారికి బహుమానంగా ఇస్తే, ఇలా ఇచ్చే వాటి విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ లావాదేవీని విక్రయంగానే చట్టం పరిగణిస్తుంది. కనుక ఈ మొత్తంపైనా మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కనుక క్రిప్టోలకు సంబంధించి ప్రతిపాదిత పన్ను పెద్ద ప్రతికూలమని అనూప్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘‘చిన్న ఇన్వెస్టర్లు, సాధారణంగా పన్ను చెల్లించేంత ఆదాయం పరిధిలో లేని వారు సైతం ఇప్పుడు క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది వారిని నిరుత్సాహానికి గురి చేస్తుంది’’ అని క్రిప్టో సలహాదారు అజీత్ ఖురానా పేర్కొన్నారు. కానీ, నష్టాలు వస్తే పరిస్థితి ఏంటి? ఇన్వెస్టర్ల నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినప్పుడు నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం కింద, ఏడాదికి మించిన పెట్టుబడులను విక్రయించగా వచ్చిన నష్టాన్ని దీర్ఘకాల మూలధన నష్టంగా పరిగణిస్తారు. వీటిని ఏడు సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలన్నింటినీ లాభాలతో సర్దుబాటు చేసుకోలేకపోతే.. తర్వాతి ఏడు ఆర్థిక సంవత్సరాల్లో (లావాదేవీ జరిగిన సంవత్సరం సహా మొత్తం ఎనిమిది అసెస్మెంట్ సంవత్సరాలు) వచ్చే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. దాంతో పన్ను పరంగా క్రిప్టో ఇన్వెస్టర్లతో పోలిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఎంతో ప్రయోజనం ఉందని చెప్పుకోవాలి. క్రిప్టో నష్టాలకు ఈ క్యారీ ఫార్వార్డ్ సదుపాయం లేదు. నష్టాలు ఏవైనా అదే ఏడాది క్రిప్టో లాభాలతోనే సర్దుబాటుకు పరిమితం కావాలి. మరే ఇతర మూలధన లాభాల నుంచి మినహాయించి చూపించుకునే వెసులుబాటు కల్పించలేదు. అలాగే, మరే ఇతర మూలధన నష్టాన్ని క్రిప్టో లాభాల నుంచి మినహాయించుకునే అవకాశం కూడా కల్పించలేదు. నియంత్రణలు నియంత్రణపరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం. స్టాక్‌బ్రోకర్, మ్యూచుల్ ఫండ్, మార్కెట్ పార్టిసిపెంట్, ఇంటర్ మీడియరీ ఇలా మార్కెట్ వ్యవస్థలో భాగమైన ప్రతీ సంస్థ కూడా సెబీ నియంత్రణల పరిధిలోనే పనిచేయాలి. అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీనివల్ల రిస్క్ చేయిదాటి పోకుండా సెబీ చర్యలు తీసుకుంటుంది. కానీ, క్రిప్టో కరెన్సీలపై ఈ నియంత్రణ లేదు. ఈక్విటీల విషయంలో లావాదేవీల గురించి, సేవలు, చార్జీల గురించి సెబీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్ల సెక్యూరిటీలను తన పూల్ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని వాటిని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం తెలిసిందే. ఈ అంశంలో సెబీ వెంటనే జోక్యం చేసుకుని తనఖాలో ఉన్న షేర్లను ఇన్వెస్టర్లకు దక్కేలా వేగంగా చర్యలు తీసకుంది. కానీ, క్రిప్టో లావాదేవీల విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రభుత్వం లాభాలపై 30 % పన్ను విధించింది కానీ, నియంత్రణ అంశం జోలికి పోలేదు. ఎందుకంటే క్రిప్టో ఆస్తులన్నవి అంతర్జాతీయంగా ట్రేడ్ అవుతున్నవి. కొనుగోలు చేసిన వర్చువల్ అసెట్స్‌ను ఎక్కడ హోల్డ్ చేస్తున్నారు? సైబర్ మోసాల నుంచి వాటికి రక్షణ ఉంటుందా? పెట్టుబడి పెట్టిన వారికి జరగరానిది జరిగితే, వారి వారసులు ఆ వర్చువల్ ఆస్తులను పొందగలరా? ఇలాంటి అంశాలన్నింటినీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఈక్విటీలకు సంబంధించి ఈ రిస్క్ ఉండదు. లావాదేవీల ట్రాకింగ్ క్రిప్టో లాభాలపై ఒక శాతం టీడీఎస్ అమలు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రతీ లావాదేవీ సమాచారం ఆదాయపన్ను శాఖకు వెళుతుంది. కనుక పన్ను ఎగవేతకు అవకాశం ఉండదనే భావించాలి. ఇప్పటి వరకు క్రిప్టో ఎక్సేంజ్‌లు ఇచ్చిన సమాచారంపైనే ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ, ఇక మీదట టీడీఎస్ నిబంధనతో వివరాలు పక్కాగా తెలుస్తాయి. ‘‘టీడీఎస్ రూపంలో ప్రభుత్వం క్రిప్టో లావాదేవీలను గుర్తించగలదు. డేటాను తీసుకోగలదు. ఇది భవిష్యత్తులో క్రిప్టోల నియంత్రణ విషయంలో సాయపడొచ్చు’’అని క్రిప్టో ఎక్సేంజ్ ‘జెబ్‌పే’ సీఈవో అవినాష్ శేఖర్ తెలిపారు. టీడీఎస్ నిబంధనతో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీలను నియంత్రించగలదని, ఆదాయం రాబట్టుకోగలదని ఫెలిక్స్ అడ్వైజరీ పార్ట్నర్ అమిత్ జిందాల్ పేర్కొన్నారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్ అనే వ్యక్తికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో బిట్ కాయిన్లో ట్రేడింగ్‌పై రూ.6 లక్షలు లాభం వచ్చిందనుకుందాం. అలాగే, ఎథీరియం ట్రేడింగ్‌లో రూ.2 లక్షలు నష్టం వచ్చిందనుకుంటే, అప్పుడు నికర లాభం రూ.4లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై 30 శాతం పన్ను రేటు అమలవుతుంది. లాభం రూ.50లక్షల్లోపు ఉంది కనుక సర్‌చార్జీ లేదు. 30 శాతంపై 4 శాతం సెస్సు అమలవుతుంది. అంటే 1.2 శాతం సెస్సు కూడా కలుపుకుంటే వచ్చిన లాభంపై చెల్లించాల్సిన నికర పన్ను 31.2 శాతం అవుతుంది. -
క్రిప్టోలపై ఆర్బీఐతో కేంద్రం చర్చలు.. క్రిప్టో వద్దంటున్నఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీల విషయంలో వ్యవహరించాల్సిన తీరు గురించి రిజర్వ్ బ్యాంకుతో చర్చలు జరుగుతున్నాయని, సంప్రదింపుల అనంతరం తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకింగ్ రంగ పరిస్థితి మెరుగుపడిందని, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మెరుగ్గా రాణిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మంత్రి ఈ విషయాలు వివరించారు. ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ.. ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయడంపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. మరోవైపు, బోర్డు సమావేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయ ..అంతర్జాతీయ సవాళ్లు తదితర అంశాలను బోర్డు సమీక్షించింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందని.. ఇటు ధరల కట్టడి అటు ఆర్థిక వృద్ధి మధ్య సమన్వయం పాటించే విధానాలను కొనసాగిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలను తట్టుకునేందుకు భారత్ వద్ద తగిన స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ వర్గాలు, కొత్తగా నియమితులైన ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏబీజీ కేసులో తక్కువ సమయంలోనే చర్య ఏబీజీ షిప్‌యార్డ్ దాదాపు రూ. 22,842 కోట్ల మేర మోసానికి పాల్పడినా .. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. ఏబీజీ తీసుకున్న రుణాలను 2016లో మొండిబాకీలుగా వర్గీకరించగా, ఎస్బీఐ 2019లోనే సీబీఐకి తొలి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి అంశాలపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవడానికి 52–54 నెలల సమయం పట్టేస్తుందని.. కాన్నీ అంతకన్నా తక్కువ సమయంలోనే ఫిర్యాదు నమోదైందని స్పష్టం చేశారు. సాంకేతికంగా చూస్తే గత యూపీఏ హయాంలోనే ఏబీజీ డిఫాల్ట్ అయ్యిందని పేర్కొన్నారు. క్రిప్టోలను నిషేధించాల్సిందే: ఆర్బీఐ డిçప్యూటీ గవర్నర్ రవి శంకర్ క్రిప్టో కరెన్సీలనేవి పోంజీ స్కీముల కంటే దారుణమైనవని ఆర్బీఐ డిçప్యూటీ గవర్నర్ టి. రవి శంకర్ వ్యాఖ్యానించారు. వీటితో దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలను నిషేధించడం ఒక్కటే పరిష్కారం కాగలదని 17వ వార్షిక బ్యాంకింగ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్, పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నియంత్రణలను తప్పించుకోవాలన్నదే క్రిప్టో టెక్నాలజీ ప్రధాన ఉద్దేశమని, నియంత్రిత ఆర్థిక వ్యవస్థ కన్నుగప్పి లావాదేవీలు నిర్వహించేందుకే దీన్ని సృష్టించారని శంకర్ తెలిపారు. -
క్రిప్టోల్లో పెట్టుబడులకు జియోటస్ ‘బాస్కెట్స్’
హైదరాబాద్: క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేందుకు రెండు ఆప్షన్లను తమ యాప్, వెబ్సైట్లలో అందుబాటులోకి తెచ్చినట్లు జియోటస్ క్రిప్టోకరెన్సీ ఎక్సేంజీ వెల్లడించింది. బాస్కెట్స్ ఆప్షన్‌తో నిపుణులు ఎంపిక చేసిన క్రిప్టో అసెట్స్‌లో అతి తక్కువగా రూ. 100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపింది. డిఫై, మెటావర్స్, గేమింగ్, మీమ్ వంటి వివిధ థీమ్స్ ఆధారిత క్రిప్టోకరెన్సీలు వీటిలో ఉంటాయని వివరించింది. అలాగే హెచ్చుతగ్గులతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) మార్గంలో పెట్టుబడులు పెట్టే ఆప్షన్ కూడా ఉందని సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ తెలిపారు. -
అణు, మిసైల్ ప్రోగ్రాంలకు నిధుల కోసం... ఉత్తర కొరియా సైబర్ దాడులు
ఐరాస: అణు, మిసైల్ కార్యక్రమాలకు నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్ దాడులకు తెగబడుతోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. సైబర్ స్పెషలిస్టులను ఉటంకిస్తూ ఐరాస నిపుణుల ప్యానల్ సోమవారం ఈ మేరకు వెల్లడించింది. ‘‘ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాల్లోని మూడు క్రిప్టో ఎక్స్చేంజీల నుంచి 2020 నుంచి 2021 మధ్య కనీసం 5 కోట్ల డాలర్లను ఉత్తర కొరియా కొట్టేసింది. అలాగే వాటిపై ఏడుసార్లు సైబర్ దాడులకు తెగబడి 40 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీనీ దొంగిలించింది. ఆ సంస్థల ఇంటర్నెట్ కనెక్టెడ్‌హాట్ వాలెట్ల నుంచి మాల్వేర్, ఫిషింగ్, కోడ్ ఎక్స్‌ప్లాయిట్స్, ఇతర అధునాతన సోషల్ ఇంజనీరింగ్ మార్గాల్లో కాజేసిన ఈ నిధులను డీపీఆర్కే నియంత్రిత అడ్రస్‌లకు తరలిస్తోంది. తర్వాత పకడ్బందీ మనీ లాండరింగ్ ప్రకియ ద్వారా క్రిప్టో కరెన్సీని సొమ్ము చేసుకుంటోంది’’ అని ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే ఈ ప్యానెల్ వివరించింది. డీపీఆర్కే అంటే డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. 2019–2020 మధ్య కూడా సైబర్ దాడుల ద్వారా 32 కోట్ల డాలర్లకు పైగా ఉత్తర కొరియా కొట్టేసిందని ఏడాది కిందే ఈ ప్యానెల్ ఆరోపించింది. నిషేధాలను ఉల్లంఘిస్తూ అణు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉందని తాజా రిపోర్టులో పేర్కొంది. ‘‘అణు పరీక్షల్లాంటివి జరిపినట్టు ఆధారాల్లేకున్నా కీలకమైన యురేనియం, ఫ్లూటోనియం తయారీ సామర్థ్యాలను పెంచుకుంటూ వస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల ప్రయోగంపై విధించుకున్న నాలుగేళ్ల స్వీయ నిషేధాన్ని పక్కన పెడతామని కొరియా ఇటీవల హెచ్చరిస్తూ వస్తుండటం తెలిసిందే. -
ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్ క్యూబ్!!
A Gold Cube Worth $11.7 Million Appeared In New York's Central Park: ఇంతవరకు మనం బంగారానికి సంబంధించిన వస్తువులను, గోల్డ్ బిస్క్ట్లు గురించి విన్నాం. గోల్డ్‌తో తయారు చేసే మాస్క్‌ల దగ్గర నుంచి రకరకాల బంగారపు కళాకృతులు గురించి విని ఉన్నా. కానీ ఒక భారి సైజులో ఉండే గోల్డ్ క్యూబ్ గురించి విని ఉండటమే కాదు చూసి కూడా ఉండం. పైగా అంత పెద్ద క్యూబ్‌ని ఒక ఓపెన్ పార్క్‌లో స్వయం భద్రతా నడుమ ఆరు బయట ఉండటం గురించి అసలు విని ఉండరు. అసలు విషయంలోకెళ్తే...న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో బంగారంతో చేసిన భారీ క్యూబ్ ఉంది. దీనిని దాదాపు 186 కిలోగ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంతో జర్మన్ కళాకారుడు నిక్లాస్ కాస్టెల్లో రూపొందించారు. ఆ కళాకారుడు కొత్త క్రిప్టోకాయిన్ ప్రచార నిమిత్తం అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ సెంట్రల్ పార్క్‌లో ఉంచాడు. అంతేకాదు మానవజాతి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇంత భారీ మొత్తంలో బంగారు క్యూబ్‌ని రూపొందించ లేదు. కాస్టెల్లో ఈ క్యూబ్‌ని అన్ని కోణాల్లోని సంభావిత కళాఖండంగా పేర్కొన్నాడు. అయితే కాస్టెల్లో ఈ క్యూబ్‌ని అమ్మకానికి పెట్టడం లేదని తెలిపాడు. ఈ మేరకు ఈ గోల్డ్ క్యూబ్ ధర దాదాపు రూ.87 లక్షలు. అంతేకాదు ఈ క్యూబ్‌ని చేతితో తయారు చేసిన కొలిమి సాయంతోనే రూపొందించగలం అని వివరించాడు. ఈ భౌతిక కళాకృతి క్రిప్టోకరెన్సీలో భాగంగా క్యాస్టెల్లో కాయిన్ని ప్రారభించటమే కాక సంబంధించిన ఎన్‌ఎఫ్‌టీల్లో వేలం వేయనున్నట్లు న్యూయర్క్ టైమ్స్ పేర్కొంది. View this post on Instagram A post shared by Niclas Castello (@niclas.castello) (చదవండి: మ్యాజిక్ ట్రిక్ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి) -
క్రిప్టోకి ఎప్పటికీ నో ఎంట్రీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ డిజిటల్ కరెన్సీల చట్టబద్ధతపై స్పష్టతనిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలు ఎన్నటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు కాబోవని ఆయన స్పష్టం చేశారు. ‘క్రిప్టో ఎప్పటికీ లీగల్ టెండర్ కాబోదు. లీగల్ టెండర్ అంటే చట్టం ప్రకారం రుణాల సెటిల్మెంట్ కోసం ఆమోదయోగ్యమైనదని అర్థం. క్రిప్టో అసెట్ల విషయంలో భారత్ అలా చేయబోదు. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ రూపీకి మాత్రమే లీగల్ టెండర్ హోదా ఉంటుంది‘ అని సోమనాథన్ పేర్కొన్నారు. బంగారం, వజ్రాలలాగే విలువైనవే అయినప్పటికీ వాటిలాగే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు అధికారిక గుర్తింపు ఉండదని తెలిపారు. 2022–23 బడ్జెట్లో వర్చువల్ డిజిటల్ అసెట్స్ మీద వచ్చే లాభాలపై 30 శాతం పన్నులు, నిర్దిష్ట పరిమాణానికి మించిన లావాదేవీలపై 1 శాతం ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) విధించేలా ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. క్రిప్టో ఆదాయాలను వెల్లడించేందుకు ఆదాయ పన్ను రిటర్నుల్లో ప్రత్యేక కాలమ్ కూడా ఉండనుంది. గత శీతాకాల పార్లమెంటు సెషన్లో క్రిప్టో నియంత్రణ బిల్లును అంశాన్ని లిస్టు చేసినప్పటికీ .. తాజా బడ్జెట్ సెషన్ జాబితాలో దాన్ని చేర్చకపోవడంపై స్పందిస్తూ.. ‘దీన్ని చట్టం చేయడానికి ముందు నియంత్రణ స్వభావం ఎలా ఉండాలి, నియంత్రణ ఉండాలా లేక పన్ను మాత్రమే విధించాలా వంటి అంశాలపై మరింత విస్తృతంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది‘ అని ఆయన తెలిపారు. గ్లోబల్‌గా ఏకాభిప్రాయం కావాలి.. క్రిప్టోకరెన్సీలను నియంత్రించేందుకు దేశీయంగా తీసుకునే చర్యలు సరిపోవు కాబట్టి, ప్రపంచ దేశాల ఏకాభిప్రాయానికే భారత్ మొగ్గుచూపుతోందని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అజయ్ సేఠ్ చెప్పారు. ఇలాంటి సాధనాలు ఏ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి రాకుండా ఆన్లైన్లో ట్రేడవుతుండటమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రించాలా లేదా నిషేధించాలా .. క్రిప్టో కరెన్సీల విషయంలో పాటించాల్సిన విధానాలపై కసరత్తు జరుగుతోంది. ఇవి ఎప్పటికీ తేలతాయన్నది ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుత బడ్జెట్ సెషన్లో అయితే జరగకపోవచ్చని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. క్రిప్టోలను నియంత్రించడంపై చర్చలు జీ20 సదస్సులో ప్రారంభం కావచ్చని సేఠ్ పేర్కొన్నారు. మరోవైపు, సీమాంతర లావాదేవీలు కూడా జరుగుతాయి కాబట్టి క్రిప్టోకరెన్సీల నియంత్రణపై అంతర్జాతీయంగా కూడా ఏకాభిప్రాయం అవసరమవుతుందని సోమనాథన్ చెప్పారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన చేశాక దానిపై అభిప్రాయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంటోంది. వాటి ఆధారంగా ఏం చేయాలి, ఎలా చేయాలన్న దానిపై తుది నిర్ణయానికి వస్తుంది. అయితే, అప్పటివరకూ పన్నులపై స్పష్టత ఇవ్వకుండా కూర్చోవడం కుదరదు. ఎందుకంటే, క్రిప్టో కరెన్సీల లావాదేవీల పరిమాణం భారీగా పెరిగిపోతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. -
క్రిప్టోకు చట్టబద్ధత వచ్చినట్లు కాదు
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను రిటర్ను ఫారంలలో ప్రత్యేకంగా ఉంటుందని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. క్రిప్టో ఆదాయాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. ‘ఈ కరెన్సీలకు సంబంధించిన ట్యాక్సేషన్‌పై స్పష్టత తెచ్చేందుకే ఫైనాన్స్ బిల్లులో వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై పన్నుల నిబంధన చేర్చారు. ఈ నిబంధనల్లో వీటి చట్టబద్ధత గురించి ఏమీ లేదు. క్రిప్టోకరెన్సీల నియంత్రణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాతే ఆ వివరాలు వెల్లడవుతాయి‘ అని బజాజ్ తెలిపారు. ‘క్రిప్టో అసెట్స్ ఆదాయంపై పన్ను విధించే విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. అందుకే గరిష్టంగా 30 శాతం రేటు పరిధిలోకి దాన్ని చేర్చాం. టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తింపచేస్తున్నాం. ఇకపై ఈ లావాదేవీలన్నింటినీ ట్రాక్ చేస్తాం‘ అని ఆయన వివరించారు. క్రిప్టోల చట్టబద్ధత గురించి ప్రస్తావించకుండా.. గుర్రపు పందేలు, ఇతర స్పెక్యులేటివ్ లావాదేవీల తరహాలోనే ఈ కరెన్సీల ద్వారా వచ్చే లాభాలపైనా 30% పన్ను (సెస్సు, సర్‌చార్జీలు అదనం) విధించాలని బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి పన్ను, జులై 1 నుంచి టీడీఎస్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం కూడా క్రిప్టో లాభాలపై పన్ను వర్తిస్తుందని, 2022 ఏప్రిల్ 1కి ముందు చేసిన క్రిప్టో లావాదేవీలను ఐటీఆర్‌లోని ఏదో ఒక హెడ్ కింద చూపితే అసెస్మెంట్ అధికారి దానిపై తగు నిర్ణయం తీసుకుంటారని బజాజ్ తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్లకు టెక్నాలజీ తప్ప ఎటువంటి ఆర్థిక విలువ ఉండదు కాబట్టి డిడక్షన్లకు తావు ఉండదని ఆయన చెప్పారు. పన్నుతో మార్కెట్ పరిస్థితి తెలుస్తుంది: సీబీడీటీ చీఫ్ మహాపాత్ర క్రిప్టో కరెన్సీలపై పన్నుల వడ్డనతో దేశీయంగా ఈ మార్కెట్ ’లోతు’ ఎంత ఉందో తెలుస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్ర చెప్పారు. అలాగే ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడుల స్వభావం మొదలైన వివరాల గురించి కూడా వెల్లడవుతుందని పేర్కొన్నారు. అయితే పన్ను విధించడమనేది.. ఈ లావాదేవీలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే డిజిటల్ వ్యాపారం ద్వారా లాభాలు ప్రకటించిన పక్షంలో.. దానికి అవసరమైన పెట్టుబడులు ఎక్కడ నుంచి తెచ్చారన్నది కూడా వెల్లడించాల్సి ఉంటుందని మహాపాత్ర తెలిపారు. ఒకవేళ పెట్టుబడి సరైనదే అయితే లాభాలపై పన్ను వర్తిస్తుందని చెప్పారు. అలా కాకుండా లెక్కల్లో చూపని డబ్బును లేదా బినామీగా ఇన్వెస్ట్ చేసినట్లు తేలితే దానికి అనుగుణంగా ఇతర చర్యలు ఉంటాయన్నారు. ట్యాక్సేషన్ వల్ల ఇవన్నీ బైటపడతాయని మహాపాత్ర చెప్పారు. అనధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి చూస్తే దేశీయంగా క్రిప్టో లావాదేవీల పరిమాణం ఏటా రూ. 30,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకూ ఉంటోంది. -
భారత్‌లో క్రిప్టోకరెన్సీ.. ఇక గ్యాంబ్లింగ్ తరహాలోనే!
క్రిప్టో ఆస్తుల చట్టబద్ధతపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం.. లావాదేవీలపై 30 శాతం ట్యాక్స్ ప్రకటనతో క్రిప్టో హోల్డర్స్‌కు పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి మరింత స్పష్టత ఇచ్చారు ఇవాళ. జూదంలో ఎలాగైతే గెలిచిన వాళ్ల దగ్గరి నుంచి పన్నులు వసూలు చేస్తారో.. అదే తరహాలో క్రిప్టో ట్రాన్జాక్షన్స్పై పన్నుల వసూలు ఉండబోతుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. తద్వారా ప్రత్యేక చట్టంపై ఇప్పటికిప్పుడు తొందర పాటు నిర్ణయం తీసుకోకుండా.. క్రిప్టో ట్రాన్జాక్షన్స్ ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం పన్నులు విధించే నిర్ణయం అమలు చేయనుంది. ‘‘క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం చట్ట వ్యతిరేకం ఏం కాదు. ప్రస్తుతానికి ఇదొక సందిగ్ధావస్థ. గుర్రపు పందేలు గెలవడం, బెట్టింగులు, ఊహాజనిత ట్రాన్జాక్షన్స్.. నుంచి ఎలాగైతే ట్యాక్సుల పరిగణనలోకి తీసుకుంటామో.. అదే విధంగా క్రిప్టో ఆస్తుల కోసం ఒక ప్రత్యేకమైన ట్యాక్సేషన్ ఫ్రేమ్‌వర్క్‌ని వర్తింపజేస్తాం’’ అని సోమనాథన్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ధరల అస్థిరత నెలకొంటుందని ఆర్బీఐ మొదటి నుంచి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్యాక్స్ మోత మోగించడం వల్ల పై కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు ఇప్పటికే క్రిప్టోకరెన్సీ నియంత్రణకు ప్రత్యేక చట్టం.. త్వరలో కేబినెట్ నుంచి క్లియరెన్స్ ద్వారా పార్లమెంట్లో చర్చకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వం సంప్రదింపులు, అంతర్జాతీయ పరిణామాల తర్వాతే ముందకు వెళ్లాలని యోచిస్తోంది. -
అటు బడ్జెట్ అయిపోగానే.. ఇటు 342 కోట్లు వచ్చిపడ్డాయ్
ఆసక్తిగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ 2022.. మేజర్ వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ పరిణామాలు.. స్టాక్ మార్కెట్‌పై కొన్ని గంటలు ప్రతికూల ప్రభావం చూపాయి కూడా. ఈ క్రమంలో బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇంట మరోసారి కాసుల వర్షం కురిసింది. టాటా గ్రూప్ టైటాన్ కంపెనీ స్టాక్ ధరలు లాభాల బాట పట్టడంతో ఏకంగా 342 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడాయన. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌పోలియోలోని టైటాన్ కంపెనీ స్టాక్ ధరలు ఫిబ్రవరి 1వ తేదీన ఇన్వెస్టర్లకు విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగం తర్వాత కాసేపు మార్కెట్ డౌన్ కాగా.. కొన్ని గంటల తర్వాత పుంజుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన టైటాన్ స్టాక్ ధర మధ్యాహ్నాం 1గంట సమయంలో 2,358రూ. టచ్ అయ్యి.. క్లోజింగ్ 2,436రూ. వద్ద ముగిసింది. ఇది జనవరి 31 తేదీన ముగింపు ధర కంటే 75రూ. ఎక్కువ. ఈ ధరతో 61 ఏళ్ల వయసున్న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సంపద.. మరో 342 కోట్లు పెరిగింది. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తి విలువ 6బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే! చైనా రూట్లో వెళ్తున్నామా? ఇదిలా ఉంటే స్టాక్మార్కెట్లో అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్టర్‌గా పేరున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా బడ్జెట్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందంటూ పేర్కొన్న ఆయన.. మరోవైపు క్రిప్టో విషయంలో మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ 2022 భారత్‌లో క్రిప్టోకరెన్సీకి చావు దెబ్బలాంటిదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్.. పొరుగు దేశం చైనాను ఫాలో అవుతున్నట్లు ఉంది. అక్కడి డిజిటల్ కరెన్సీ నిబంధనలను పాటిస్తున్నట్లు అనిపిస్తోంది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేసే ఉద్దేశం వల్ల ఇతర క్రిప్టోలను అంతం అవుతాయి. అసలు క్రిప్టోకరెన్సీ బిల్లు పార్లమెంట్‌కు రాకముందే ఈ తరహా నిర్ణయం తీసుకోవడమే అందుకు నిదర్శనం. అఫ్కోర్స్.. ఒక రకంగా ఈ రూట్లో వెళ్లడమే సరైంది కూడా’’ అంటూ కామెంట్లు చేశారాయన. -
క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త !
క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త ! కేంద్రం బడ్జెట్లో క్రిప్టోకి అనుకూలంగా నిర్ణయం వెలువడింది. భారత ఆర్థిక వ్యవస్థకు పురోగతి అందించే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘డిజిటల్ రూపీ’ 2022-23లో ప్రవేశపెట్టబోతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వర్చువల్ డిజిటల్ ఆస్తుల లావాదేవీలపై 30 శాతం టాక్స్ విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు. ప్రైవేట్ క్రిప్టో లావాదేవీల్లో పన్ను విధానం లేదు. కానీ ప్రభుత్వం తెచ్చే డిజిటల్ రూపీలో పన్ను విధానం ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీకి భారత్‌లో అనుమతులు ఇవ్వాలంటూ ఇటీవల డిమాండ్లు వినిపించాయి. కేంద్రం సైతం శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చిస్తామని చెప్పింది. అయితే ఆర్బీఐ అధికార వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాలేదు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ నేరుగా బడ్జెట్ ప్రసంగంలో క్రిప్టో అంశాన్ని చేర్చింది కేంద్రం. ఇప్పటికే పలు దేశాల్లో ప్రభుత్వ ఆధీనంలో క్రిప్టో వ్యవస్థలు పని చేస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఓన్లీ ఫైలింగ్ అప్డేట్కి అవకాశం.. స్టాబుల్లో నో ఛేంజ్ -
‘టీకా’ వేశాం.. ఢోకాలేదు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సవాళ్లను అధిగమిస్తూ భారత్ అధిక వృద్ధి బాటలో ముందుకు దూసుకెళ్లనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా తన స్థానాన్ని నిలబెట్టుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 8–8.5% స్థాయిలో వృద్ధి సాధించనుంది. భారీ స్థాయిలో కొనసాగుతు న్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి వంటివి ఇందుకు దోహదపడనున్నాయి. సోమ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఎకానమీకి తోడ్పాటునిచ్చేందుకు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థికపరంగా తగినంత వెసులుబాటు ఉందని సర్వే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకోతగిన చర్యలను సూచించే దీన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మంగళవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా మంత్రి తగు ప్రతిపాదనలు చేస్తారన్న అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సర్వేలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదుపులోనే ద్రవ్యోల్బణం.. సరఫరా వ్యవస్థను మెరుగ్గా నిర్వహించడంతో పాటు ఇంధనాలపై సుంకాలను తగ్గించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ధరలు దాదాపు అదుపులోనే ఉన్నాయని సర్వే పేర్కొంది. వంటనూనెలు, పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల రేట్లు పెరిగిపోయాయని .. కానీ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి కొంత మేర కట్టడి చేసిందని తెలిపింది. రిస్కులూ ఉన్నాయ్.. ఇంధన ధరలు అధిక స్థాయిల్లో ఉంటున్న నేపథ్యంలో దిగుమతిపరమైన ద్రవ్యోల్బణం కాస్త ఆందోళనకరంగా ఉండవచ్చని ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు, ఎకనమిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. భారత్ తన ఇంధన అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంధన ధరలు అధికంగా ఉంటే ద్రవ్యోల్బణ రేటు కూడా భారీగా ఎగుస్తుంది. ‘‘ప్రపంచ ఎకానమీకి ఇది కష్టకాలం. మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితితో ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రభావాలు ఉండనున్నాయి. టెక్నాలజీలు, వినియోగదారుల ధోరణులు, సరఫరా వ్యవస్థలు, భౌగోళిక రాజకీయాం శాలు, వాతావరణం మొదలైన వాటన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ అనంతర ప్రపంచం గురించి అనిశ్చితి నెలకొంది’’ అని సన్యాల్ తెలిపారు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ప్రస్తుతం 90 డాలర్ల స్థాయిలో తిరుగాడుతున్నప్పటికీ.. వచ్చే ఏడాది 70–75 డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని సర్వే అంచనా వేసింది. అలాగే వర్షపాతం సాధారణంగానే ఉంటుందని, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు లిక్విడిటీ ఉపసంహరణను ఎకాయెకిన కాకుండా క్రమపద్ధతిలోనే చేయవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంకా అనిశ్చితి నెలకొందని, మిగతా దేశాల్లో అధిక వడ్డీ రేట్లు గానీ లభిస్తే భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. సర్వేలో పేర్కొన్న 2022–23 వృద్ధి.. ప్రపంచ బ్యాంకు అంచనాలకు అనుగుణంగా, ఎస్అండ్పీ.. మూడీస్ అంచనాలకన్నా కాస్త అధికంగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 9% కన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ప్రైవేట్ పెట్టుబడుల జోరు.. ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడే స్థాయిలోనే ఆర్థిక స్థితిగతులు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోగలవని సర్వే తెలిపింది. పన్ను వసూళ్లు మెరుగుపడటంతో ప్రభుత్వం తగు స్థాయిలో వ్యయాలు చేసేందుకు వెసులుబాటు లభించగలదని పేర్కొంది. క్రిప్టో కరెన్సీ పట్ల తటస్థ విధానం: సంజీవ్ సన్యాల్ దేశ ఆర్థిక స్థిరత్వంపై క్రిప్టో కరెన్సీల ప్రభావం ఉంటుంది కనుక.. వాటి నియంత్రణ విషయంలో తటస్థ వైఖరిని ప్రభుత్వం తీసుకుంటుందని సంజీవ్ సన్యాల్ అన్నారు. ప్రస్తుతానికి దేశంలో క్రిప్టో కరెన్సీల నిషేధం, అనుమతికి సంబంధించి ఎటువంటి చట్టాలు అమల్లో లేవు. సోమవారం పార్లమెంట్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఆర్థిక సర్వేలోనూ క్రిప్టోల ప్రస్తావన లేకపోవడంపై సన్యాల్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘మీకు తెలిసిందే ఈ అంశంపై ప్రభుత్వంలోను, ఆర్థిక శాఖ పరిధిలో, పార్లమెంట్‌లోనూ చర్చ నడుస్తోంది. ఆర్థిక స్థిరత్వ సమస్యలున్నాయి. మరోవైపు ఆవిష్కరణల కోణంలో చర్చ కూడా నడుస్తోంది. కనుక తటస్థ విధానాన్ని ఈ విషయంలో తీసుకోవడం జరుగుతుంది’ అని సన్యాల్ వివరించారు. సర్వేలో ఇతర హైలైట్స్.. ► ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కరోనా పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. 2022–23లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎకానమీ సర్వసన్నద్ధంగా ఉంది. ► కరోనా సవాళ్లను అధిగమించేందుకు ఇతర దేశాల తరహాలో ముందస్తుగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం కాకుండా భారత్ .. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా విధానాలను అమలు చేసింది. డిమాండ్ నిర్వహణ కాకుండా సరఫరా వ్యవస్థపరమైన సంస్కరణలతో మహమ్మారి సృష్టించిన సమస్యలను ఎదుర్కొంది. ► భారీ ఎగుమతుల వృద్ధి, మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న వెసులుబాటు తదితర అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధికి తోడ్పడనున్నాయి. ► ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉండటంతో ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా పుంజుకుని ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడగలవు. ► అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లోటు, రుణ భారాలు భారీగా పెరిగిపోయినప్పటికీ 2021–22లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది. ► విదేశీ మారకం నిల్వలపరంగా ‘బలహీనమైన అయిదు’ దేశాల్లో ఒకటిగా కొనసాగిన భారత్ ప్రస్తుతం అత్యధికంగా ఫారెక్స్ నిల్వలున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎదిగింది. దీంతో విధానపరంగా మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు లభించనుంది. ► బేస్ ఎఫెక్ట్ కారణంగానే టోకు ధరల ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంటోంది. ఇది క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ► అంతర్జాతీయంగా కంటైనర్ మార్కెట్లో అవాంతరాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్యంపై ఈ ప్రభావం కొనసాగనుంది. మహమ్మారి తొలగితే పెట్టుబడులు రయ్: నాగేశ్వరన్ కరోనా మహమ్మారి నియంత్రణలోకి వస్తే సానుకూల పెట్టుబడుల వాతావరణం జోరందుకుని, ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని నూతనంగా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) ఎ.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. తక్కువ ఆదాయ వర్గాల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కువ ఉపాధి కల్పించే నిర్మాణ రంగం ఇప్పటికే పుంజుకోవడం మొదలైనట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం 4 అంచెల విధానం అనుసరిస్తోంది. అనిశ్చిత సమయాల్లో ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా బాధిత వర్గాలకు అండగా నిలవడం. అదే సమయంలో ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం. మహమ్మారి కారణంగా నిర్మాణాత్మక, సరఫరా వైపు సంస్కరణల అవకాశాలను విడిచిపెట్టకపోవడం.. ఇలా ఎన్నో చర్యలు తీసుకుంది. సంస్కరణల ప్రక్రియపై ఎంతో శ్రద్ధ, ప్రాధాన్యం చూపిస్తోంది’ అని చెప్పారు. ‘‘ప్రపంచ ఎకానమీకి ఇది కష్టకాలం. పలు దఫాలుగా విజృంభిస్తున్న మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితితో ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రభావాలు ఉండనున్నాయి. టెక్నాలజీలు, వినియోగదారుల ధోరణులు, సరఫరా వ్యవస్థలు మొదలైన వాటన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ తర్వాత ప్రపంచమంతా అనిశ్చితి నెలకొన్నా భారత్ వీటిని అధిగమిస్తోంది ’’ – ఎకనమిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్ ఈసారి 9.2%, వచ్చేసారి 8.5%.. 2021–22 సర్వే అంచనా ► కరోనా కష్టకాలంలోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా భారత్ స్థానాన్ని నిలబెట్టుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 8–8.5% స్థాయిలో వృద్ధి సాధించనుంది. ► భారీ స్థాయిలో కొనసాగుతున్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. సోమవారం పార్ల మెంటులో ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ► 2025 ఆర్థిక సంవత్సరానికల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలని నిర్దేశించుకున్న క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై 1.4లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. ► ఎయిరిండియా విక్రయ వ్యవహారం.. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకే కాకుండా ప్రైవేటీకరణ ప్రక్రియకు గణనీయంగా ఊతం ఇవ్వగలదు. ► ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.6 శాతం. ఈ నేపథ్యంలో పంటల్లో వైవిధ్యానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. -
Cryptocurrency: బాబ్బాబు.. కొట్టేసిందంతా వెనక్కి ఇచ్చేయండ్రా!
ఊహించని రీతిలో లాభాలను కురిపిస్తున్నాయనే ఆనందమే కాదు.. క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా హ్యాకర్ల ముప్పు పొంచి ఉండడంతో అభద్రతా భావానికి లోనవుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వాలు, ఆర్థిక విభాగాలు లేవనెత్తుతున్న అభ్యంతరాల్లో ఇది కూడా ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ ‘క్యూబిట్ ఫైనాన్స్’ నుంచి సుమారు 80 మిలియన్ డాలర్ల (600 కోట్ల రూపాయలకు పైనే) క్రిప్టోకరెన్సీ చోరీకి గురైంది. పక్కాగా ప్లాన్ చేసిన హ్యాకర్లు ఈ ఏడాది ఆరంభంలోనే ఈ భారీ చోరీకి పాల్పడ్డారు. ఇది గ్రహించిన క్యూబిట్ ఫైనాన్స్.. హ్యాకర్లతో బేరానికి దిగింది. మొదట కొంచెం సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చిన క్యూబిట్.. అటుపై కొంచెం తగ్గి ట్వీట్లు చేసింది. The protocol was exploited by; 0xd01ae1a708614948b2b5e0b7ab5be6afa01325c7 The hacker minted unlimited xETH to borrow on BSC. The team is currently working with security and network partners on next steps. We will share further updates when available. — Qubit Finance (@QubitFin) January 28, 2022 కొట్టేసిందంతా తిరిగి ఇచ్చేయాలని, బదులుగా.. మంచి నజరానా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు ఎలాంటి న్యాయపరమైన చర్యలకు వెళ్లమని మాటిస్తోంది కూడా. ఇక క్రిప్టోకరెన్సీలో అరుదైన సర్వీస్‌ను క్యూబిట్ అందిస్తోంది. దీని ప్రకారం.. బ్రిడ్జ్ అనే సర్వీస్‌లో వివిధ రకాల బ్లాక్‌చెయిన్స్ ఉంటాయి. డిపాజిట్ చేసిన క్రిప్టోకరెన్సీని వేరొకదాంట్లోనూ విత్‌డ్రా చేసుకోవచ్చు. An appeal to the exploiter: It's not too late to return to funds. We will pay the maximum bounty reward as mentioned as well as not seek any legal charges if you return the funds and do right by the community. — Qubit Finance (@QubitFin) January 28, 2022 అయితే 2020లో బినాన్స్ స్మార్ట్‌చెయిన్‌ను లాంఛ్ చేసినప్పటి నుంచి డెఫీ(అప్‌కమింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ) ప్రాజెక్టులకు హ్యాకింగ్ తలనొప్పులు ఎదురవుతున్నాయి. కిందటి ఏడాది ఏప్రిల్‌లో యురేనియం ఫైనాన్స్ నుంచి 50 మిలియన్ డాలర్లు, మే నెలలో వీనస్ ఫైనాన్స్ నుంచి 88 మిలియన్ డాలర్లు హ్యాకర్ల బారినపడింది. చదవండి: క్రిప్టో దెబ్బకి మిలియనీర్ల నుంచి బికారీలుగా మారిన వేలమంది! -
క్రిప్టో పరిశ్రమ.. బడ్జెట్లో నిర్మలమ్మ కరుణించేనా?
భారత్‌లో క్రిప్టో కరెన్సీ మీద ప్రభుత్వ స్టాండర్డ్ ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆంక్షలు, నియంత్రణ తప్పదని, ఆర్బీఐ ప్రత్యేక కరెన్సీల.. ఊహాగానాల నడుమే రోజురోజుకీ ఆదరణ మాత్రం పెరిగిపోతోంది. ప్రస్తుతం మన దేశంలో రెండు కోట్ల మందికిపైగా క్రిప్టో ఇన్వెస్టర్లు ఉండగా.. పరిశ్రమ విలువ 5 బిలియన్ డాలర్లు ఎప్పుడో దాటేసిందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ట్రేడర్స్‌లో క్రిప్టో కరెన్సీ మీద ఉన్న ఆసక్తి ఏపాటిదో భారత్‌లోని క్రిప్టో పెట్టుబడులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ ఆసక్తి నుంచే క్రిప్టో యూనికార్న్‌లు పుట్టుకొస్తున్నాయి. 2032 నాటికి విలువ 1.1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ అస్సెట్స్కి చేరుతుందని అంచనా. కాబట్టే క్రిప్టో ఇన్వెస్టర్లు బడ్జెట్ సెషన్స్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అసలు కొత్త క్రిప్టో బిల్.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే చర్చకు వస్తుందనే అనుకున్నారంతా. కానీ, తుది మెరుగుల పేరుతో జాప్యం చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్లో ఉంటుందో లేదో గ్యారెంటీ లేదుగానీ.. కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మాత్రం క్రిప్టో ఇండస్ట్రీ కొన్ని ఆశలు, అంచనాలు మాత్రం పెట్టుకుంది. పన్ను వర్గీకరణ క్రిప్టో ఆదాయాల పన్నుకు సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. అయినప్పటికీ అన్ని క్రిప్టో ప్లేయర్ల దృష్టి ఇప్పుడు పన్నుల అంశాలపై స్పష్టత కోసం వెతుకుతోంది. క్రిప్టోస్‌పై పన్ను విధించడం గురించి, దాని వర్తించే పన్ను రేట్లు, వర్గీకరణ, TDS/TCS, క్రిప్టోల అమ్మకం.. కొనుగోలుపై GST చిక్కులు లాంటి విషయాల్లో స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి, క్రిప్టో పరిశ్రమ క్రిప్టో పన్నుల కోసం ఒక నిర్దిష్ట నిబంధనను తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే ప్రభుత్వం గతంలో క్రిప్టోకరెన్సీలను వినియోగాన్ని బట్టి వర్గీకరిస్తామని పేర్కొన్న విషయాన్ని క్రిప్టో పరిశ్రమ గుర్తు చేసుకుంటోంది. ఈ ప్రకటనే ట్యాక్సేషన్ కోణంలో పరిశ్రమకు సాయం చేకూర్చవచ్చని భావిస్తున్నారు. పన్ను విధానం ద్వారా క్రిప్టో సెక్టార్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ఉత్సాహం అందుతుందని ఆశిస్తున్నారు. రెగ్యులేషన్స్ క్రిప్టో వృద్ధికి ఆటంకం కలిగించే ముఖ్యమైన అంశం.. నిబంధనలు. రెగ్యులేటరీ బాడీ అనేది క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ ప్లేయర్ల పరిధిని మించి ఉండకూడదు. కాబట్టి క్రిప్టో స్పెక్ట్రమ్ ‘పెరుగుతున్న వాటాదారుల సంఖ్య’ను దృష్టిలో ఉంచుకుని ప్రొగెసివ్ రెగ్యులేటర్ గైడ్‌లైన్స్ తీసుకురావాలని క్రిప్టో పరిశ్రమ ఆశిస్తోంది. SEBI యొక్క పర్యవేక్షణలో, క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధమైన ట్రేడబుల్ ఆస్తిగా గుర్తించడం ద్వారా కూడా మరింత స్థిరత్వం దక్కనుంది. మరోవైపు పబ్లిక్-లెడ్జర్-ఆధారిత క్రిప్టో-ఆస్తులను.. ట్రేడింగ్ కోసం రిజిస్టర్ చేయమని ప్రోత్సహించడం కూడా గొప్ప పోటీతత్వానికి దారి తీయనుంది. ఈ అంశాల్ని రాబోయే బడ్జెట్లో కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే గనుక.. క్రిప్టో మార్కెట్‌ను ప్రోత్సహించవచ్చు, డిజిటల్ ఇండియా తో పాటు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళ్లవచ్చు. అడాప్షన్ ఈ రోజుల్లో బహుళ లావాదేవీలను సులభంగా వెరిఫై చేయడం కోసం, ట్రేస్ చేయడం కోసం ఉపయోగపడుతోంది బ్లాక్‌చెయిన్. కాబట్టి, బ్లాక్‌చెయిన్‌ను ప్రభావితం చేయడానికి ప్రభుత్వం పరిపాలనా నమూనాలను రూపొందించగలిగితే అది మంచిదే అవుతుంది. బ్లాక్‌చెయిన్ విధానంలో లావాదేవీలను సురక్షితం చేయడం, ఖర్చులను తగ్గించడం, డాటా బదిలీ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా నగరాల్లో సాంకేతికతను ముందుకు తీసుకెళ్లినట్లు అవుతుంది. క్రిప్టో విషయంలో కొన్ని ఆందోళనలు ఉన్నమాట వాస్తవమే. అయితే ఇంతకు ముందు బడ్జెట్లు ఆర్థిక సమ్మేళనానికి సంబంధించినవి, అయితే రాబోయే బడ్జెట్ కొత్త సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి కీలకంగా వ్యవహరించనుందని నిపుణులు భావిస్తున్నారు. 2022 సంవత్సరం క్రిప్టో పరిశ్రమకు అద్భుతమైన సంవత్సరంగా భావిస్తోంది క్రిప్టో ఇండస్ట్రీ. పన్నులు, నియంత్రణ.. వర్గీకరణపై స్పష్టత, జనాభాలో విశ్వాసాన్ని త్వరగా తీసుకువస్తే క్రిప్టో పరిశ్రమ ఆశించిన మేర దూసుకుపోవడం మాత్రం ఖాయం. -
జుకర్‌బర్గ్‌కు భారీ దెబ్బ..! తగ్గేదేలే అన్నాడు...ఇప్పుడు పూర్తిగా అమ్మేసే పరిస్థితి..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై నెలకొన్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకుగాను మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా భారీ ప్రణాళికలను రచించాడు. స్వంత క్రిప్టోకరెన్సీని నిర్మించాలనే జుకర్‌బర్గ్ ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక పూర్తిగా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పడు పూర్తిగా అమ్మేసే పరిస్థితి..! బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం...డైమ్ డిజిటల్ కరెన్సీ అభివృద్ధిని పర్యవేక్షిస్తోన్న డైమ్ (Diem) అసోసియేషన్‌కు చెందిన ఇన్వెస్టర్ల మూలధనాన్ని తిరిగి ఇచ్చేందుకు కంపెనీ సిద్దమైందని పేర్కొంది. అంతేకాకుండా ఈ సంస్థ ఆస్తుల విక్రయం కూడా పరిశీలనలో ఉందని తెలిపింది. ఇందులో పనిచేసిన ఇంజనీర్ల కోసం కొత్త గమ్యాన్ని కనుగొనడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ఈ విషయంపై డైమ్ అసోసియేషన్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై మెటా కూడా స్పందించలేదు. యూఎస్ కాంగ్రెస్‌కు ఎదురెళ్లి మరీ..! జుకమ్ బర్గ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌ను ఒకానొక సమయంలో యూఎస్ కాంగ్రెస్ ముందు సమర్థించుకున్నాడు. స్వంత క్రిప్టోకరెన్సీ విషయంలో మార్క్ వెనకడుగు వేసేదిలేదంటూ మందుకు వెళ్లాడు. ఇప్పుడు అది కాస్త బెడిసి కొట్టింది. వారి ఒత్తిడి కారణంగానే..! డైమ్ అసోసియేషన్‌లో జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంస్థ మూడింట ఒక వంతు వాటాలను కల్గి ఉంది. మిగిలినది ఆండ్రీసెన్ హోరోవిట్జ్, యూనియన్ స్క్వేర్ వెంచర్స్, రిబ్బిట్ క్యాపిటల్ వంటి అసోసియేషన్ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. జుకర్‌బర్గ్ స్వంత క్రిప్గోకరెన్సీని జూన్ 2019లో మొదటిసారిగా ప్రకటించినప్పటి నుంచి క్రిప్టోప్రాజెక్టు పూర్తిగా చిక్కుల్లో పడిపోయింది. ఆ సమయంలో డైమ్ డిజిటల్ కరెన్సీకి లిబ్రా అని నామకరణం కూడా చేశారు. యూఎస్ సెంట్రల్ బ్యాంకర్లు, రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా లిబ్రా డిజిటల్ కరెన్సీ పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఏర్పాడయని సమాచారం. చదవండి: పాలపుంతలోని ఆ మిస్టరీ ఏంటబ్బా? 18 నిమిషాలకొకసారి రేడియో తరంగాలు, చేధించే పనిలో రీసెర్చర్లు -
పాపం.. మిలియనీర్ల పుట్టి ముంచుతున్న బిట్‌కాయిన్
Bitcoin Crash Effect Thousands Of Investors Vanished: బిట్‌కాయిన్.. క్రిప్టోకరెన్సీలో అత్యంత విలువైంది. దీని దరిదాపుల్లో మరే కరెన్సీ లేకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి వీటికి నమ్ముకున్న వాళ్లకు అదృష్టం కలిసొచ్చి.. ఇప్పుడు విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యకాలంలో పరిణామాలతో బిట్‌కాయిన్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది!. ప్రస్తుతం ఇది చేస్తున్న నష్టం మాత్రం మామూలుగా ఉండడం లేదు. సుమారు 30 వేలమంది బిట్‌కాయిన్ మిలియనీర్లు క్రిప్టో మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగు అయిపోయారు. కారణం.. గత మూడు నెలల్లో బిట్‌కాయిన్ డిజిటల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు. నవంబర్‌లో 69,000 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ తాజాగా(గురువారం) 36,000 డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీపై పలు దేశాల నియంత్రణ పరిశీలన, భౌగోళిక రాజకీయ అశాంతి, అల్లకల్లోలం అవుతున్న మార్కెట్లు, కరోనా పరిస్థితుల వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిన్బోల్డ్ అనే పోర్టల్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ నుంచి జనవరి మధ్య 1 మిలియన్ డాలర్ కంటే ఎక్కువ ఉన్న బిట్‌కాయిన్ కలిగి ఉన్న వాలెట్లు 28,186( 24.26 శాతం) తగ్గాయి. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో గతంలో బిట్‌కాయిన్ ద్వారా ధనవంతులైన ఎంతో మంది.. భారీ నష్టంతో బికారీలుగా మారిపోయారు. అంతేకాదు ‘‘1,00,000డాలర్లు కంటే ఎక్కువ ఉన్న వాలెట్లు 30.04 శాతం పడిపోయి 505,711 నుండి 353,763కి చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్, అంతకు మించి ఉన్నవి 105,820 నుండి 80,945కి 23.5 శాతం పడిపోయి 80,945కి పడిపోయింది. 10 మిలియన్ల డాలర్లు.. అంతకంటే ఎక్కువ ఉన్న వాలెట్లు కూడా 32.08 శాతం తగ్గి 10,319 నుండి 7,008కి పడిపోయాయి’’ అని ఫిన్బోర్డ్ నివేదిక పేర్కొంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణగా బిట్‌కాయిన్‌ను అభివర్ణిస్తున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. బిట్‌కాయిన్ చేస్తున్న డ్యామేజ్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్తూ.. ముందు మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలు కనిష్టానికి చేరుకోవడంతో పాటు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో 1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లజేశాయి మరి!. చదవండి: బిట్‌కాయిన్ చెల్లదంటే చెల్లదు- ఐఎంఎఫ్ -
అసలు తగ్గేదే లే..! సమంత ఖాతాలో మరో బ్రాండ్..!
భారత్‌లో క్రిప్టోకరెన్సీపై నెలకొన్న ఆదరణను పలు కంపెనీలు క్యాష్ చేసుకునేందుకు సిద్దమైనాయి. వజీర్ఎక్స్, కాయిన్ డీసీఎక్స్, కాయిన్ స్విచ్ కుబేర్ లాంటి క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్ ఇండియన్ క్రిప్టో ఇన్వెస్టర్లకు మరింత దగ్గరవుతున్నాయి. క్రిప్టో నియంత్రణపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనప్పటికీ ఆయా ఇండియన్ క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫామ్స్ మాత్రం భారతీయుల్లో క్రిప్టో మరింత అవగాహన తెచ్చేందుకు ప్రముఖులతో ప్రమోషన్స్‌ను చేపట్టాయి. తాజాగా కాయిన్‌స్విచ్ కుబేర్ క్రిప్టో యాప్‌కు ప్రచారకర్తగా సమంత మారింది. చిన్న మొత్తాలతో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు సంపాదించొచ్చని తెలిపే వీడియోను సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది. రూ. 100తో మొదలు..! పలు క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆయుష్మాన్ ఖురానా, రణ్వీర్ సింగ్ లాంటి దిగ్గజ నటులు భారత్‌లో ప్రచార కర్తలుగా మారారు. క్రిప్టోకరెన్సీ ప్రచారంలో తాజాగా సమంత కూడా వచ్చి చేరింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సమంత చేస్తున్న ప్రచారం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాయిన్‌స్విచ్‌కుబేర్ క్రిప్టోపై ఇన్వెస్ట్ చేయడం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినట్లు షేర్ చేసిన వీడియోలో పేర్కొంది. కేవలం రూ.100 నుంచి క్రిప్టోపై ఇన్వెస్ట్ చేయవచ్చునని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీపై సందేహాలను కాయిన్‌స్విచ్ కుబేర్ నివృత్తి చేస్తోందని వీడియోలో తెలిపింది. అసలు తగ్గేదే లే..! ఫ్యామిలీమెన్-2 సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌తో గ్లోబల్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న సమంత తన బిజినెస్‌ని కూడా విస్తరిస్తుంది . వ్యాపార పరంగా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది సమంత. ఇప్పటికే ఆర్బన్ కిసాన్, సాకీ పలు ఇతర బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా సమంత వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: LIC: ఎల్ఐసీ దూకుడు..తొలి ఆర్నెళ్లలో రాకెట్లా.. -
క్రిప్టో కరెన్సీ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు..!
మొన్నటి దాకా మంచి లాభాలను తెచ్చిపెట్టిన క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు భారీ నష్టాలను తెచ్చిపెడుతుంది. క్రిప్టో కరెన్సీ దెబ్బకు ఇన్వెస్టర్లు అందరూ విలవిల్లాడుతున్నారు. క్రిప్టో మార్కెట్లు నేడు(జనవరి 21) భారీగా పతనం అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీ దెబ్బకు ట్రేడర్లు విక్రయాలు చేపట్టారు. గత 24 గంటల్లో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ 5.97 శాతం తగ్గి రూ.28.44 లక్షల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ రూ.55.00 లక్షల కోట్లుగా ఉంది. ఒక్క రోజులోనే రూ.5 లక్షల కోట్ల మేర విలువ ఆవిరైంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 7.71 శాతం తగ్గి రూ.205,958.68 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.25.55 లక్షల కోట్లుగా ఉంది. దాదాపు రూ.2 లక్షల కోట్లు తగ్గిపోయింది. బైనాన్స్ కాయిన్ 7.50 శాతం తగ్గి రూ.34,461, టెథెర్ 0.03 శాతం పెరిగి రూ.81.21, సొలానా 11.41 శాతం తగ్గి రూ.9,819 వద్ద కొనసాగుతున్నాయి. టెథర్, యూఎస్డీ స్వల్పంగా పెరగడం మినహా మరేవీ లాభాల్లో లేవు. లూప్‌రింగ్, లైవ్‌పీర్, యార్న్ ఫైనాన్స్, హార్మొని, ఎన్‌కేఎన్, కీప్ నెట్వర్క్, అల్గొరాండ్ 13 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పెరిగిన కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య తలెత్తిన ఉద్రిక్తల వల్ల క్రిప్టో మైనింగ్ పరిశ్రమకు నిలయమైన రష్యా అన్ని క్రిప్టోకరెన్సీల వినియోగం, మైనింగ్ పై నిషేధాన్ని విధించాలని చూస్తుంది. రష్యాలోని సుమారు 17 మిలియన్ క్రిప్టో వాలెట్లలో 7 ట్రిలియన్ రూబుల్స్ (92 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ కు చెందిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ Crypto.com, తమ క్రిప్టో కరెన్సీ దొంగిలించినట్లు పలువురు వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో ఈ వారం కొద్ది సేపు భద్రతల నేపథ్యంలో ట్రెండింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. (చదవండి: రిపబ్లిక్ డే రోజున మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్..!) -
ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్!! ఏం చేశారంటే..
సాంకేతికతలోనూ గోప్యత పాటించే ఉత్తర కొరియాలో హ్యాకర్లు చెలరేగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అదీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలను లెక్కలేయకుండా!. చాలా కాలంగా సొంత దేశం, వినోదరంగంపై మాత్రమే ఫోకస్ హ్యాకర్లు.. ఈ మధ్యకాలంలో ప్రపంచం మీద పడ్డారు. 2021 ఒక్క ఏడాదిలో ఏకంగా 400 మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 30 కోట్ల రూపాయల్ని) విలువైన డిజిటల్ ఆస్తుల్ని కాజేశారు. వివిధ క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌పై ఏడు దాడుల ద్వారా ఈ మొత్తం కాజేసినట్లు బ్లాక్‌చెయిన్ అనాలసిస్ కంపెనీ ‘చెయినాలైసిస్’ ప్రకటించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీలను లక్క్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తమ దేశంలో హ్యాకర్లు లేరని, అలాంటి వాళ్లు దొరికితే మరణశిక్ష నుంచి తప్పించుకోలేరంటూ స్వయంగా అధ్యక్షుడు కిమ్ పలు సందర్భాల్లో బయటి దేశాలు(ప్రత్యేకించి అమెరికా) చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ వస్తున్నాడు. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘లజారస్ గ్రూప్’.. నార్త్ కొరియా ఇంటెలిజెన్సీ బ్యూరో వెన్నుదన్నుతోనే నడుస్తోందని అనుమానాలు ఉన్నాయి. తద్వారా వెనకాల నుంచి ప్రొత్సహిస్తూ.. కిమ్ ప్రభుత్వం ఈ తతంగం నడిపిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. అందుకే ఈ గ్రూప్ మీద కఠిన ఆంక్షలు విధించింది. ఇక ఉ.కొరియాలో 2020-2021 మధ్య.. నాలుగు నుంచి ఏడు శాతానికి సైబర్ నేరాలు పెరగ్గా.. దొచుకున్న సొత్తు విలువ సైతం 40 రెట్లు అధికంగా ఉందని చెయినాలైసిస్ చెబుతోంది. కిందటి ఏడాది ఫిబ్రవరి నెలలో 1.3 బిలియన్ డాలర్ల డబ్బు, క్రిప్టోకరెన్సీని చోరీ చేశారని ఆరోపిస్తూ ముగ్గురు నార్త్ కొరియన్ కంప్యూటర్ ప్రోగ్రామర్లపై నేరారోపణ అభియోగాల్ని నమోదు చేసింది. చిన్న చిన్న కంపెనీల దగ్గరి నుంచి హాలీవుడ్ ప్రముఖ స్టూడియోలు లక్క్ష్యంగా ఈ సైబర్ దాడి జరిగినట్లు అమెరికా న్యాయ విభాగం సైతం నిర్ధారించుకుంది. చదవండి: భారత్‌లో మెటావర్స్ ద్వారా వెడ్డింగ్ రిసెప్షన్! -
మీరు ఈ టెక్నాలజీలో ఎక్స్‌పర్టా? అయితే మీకు జాబులే జాబులు!!
మార్కెట్లోకి కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా చేసే పనితీరు మార్చుకోవాల్సి ఉంటుంది. లేదని మూసధోరణిలో ఉంటే వెనకబడి పోతాం. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉద్యోగాల విషయంలో వర్తిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మార్కెట్ రీసెర్చ్ ప్రకారం..ప్రస్తుతం ఉద్యోగులు ఎంపిక చేసుకుంటున్న ఉద్యోగాలకంటే.. ట్రెండింగ్‌లో ఉన్న పలు టెక్నాలజీలలో నిష్ణాతులైన ఉద్యోగుల కోసం ఆయా సంస్థలు అన్వేషిస్తున్నట్లు తేలింది. ప్రముఖ ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ లింక్డ్ఇన్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా.. క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ రంగంలో పరిజ్ఞానం, నిపుణులైన అభ్యర్ధుల కోసం సంస్థలు వెతుకుతున్న ఉద్యోగాల జాబితా రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు తేలింది. గతేడాది యూఎస్‌లో పై టెక్నాలజీ ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్న శాతం 395పెరిగింది. ఇదే 2020తో పోలిస్తే 2021లో 5 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, సాధారణ సాంకేతిక రంగాల్లో ఉద్యోగ డిమాండ్ కేవలం 98శాతం పెరిగిందని లింక్డ్ఇన్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. జాబ్ డిస్క్రిప్షన్‌తో పాటు జాబ్ టైటిల్స్‌లో బిట్‌కాయిన్, ఎథెరియం, బ్లాక్‌చెయిన్, క్రిప్టోకరెన్సీ వంటి పదాల్ని జత చేస్తూ కంపెనీలు ఉద్యోగుల్నిఎంపిక చేసుకుంటున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతం, టెక్సాస్‌లోని ఆస్టిన్, న్యూయార్క్ నగరం, మయామి ఫోర్ట్ లాడర్డేల్,డెన్వర్ ప్రాంతాల్లో క్రిప్టో టెక్నాలజీ జాబ్స్ అందించే ప్రధాన ప్రాంతాలుగా అవతరిస్తున్నాయి. 2020 నుంచి ట్రెండ్ మారింది 2020 నుంచి అమెరికాకు చెందిన పలు ప్రాంతాల్లో ఉద్యోగాల రూపకల్పన విషయంలో ట్రెండ్ మారినట్లు లింక్డ్ఇన్ తెలిపింది. 2020 నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, న్యూయార్క్ నగరం, నార్త్ కరోలినాలోని రాలీ డర్హామ్ చాపెల్ హిల్ ప్రాంతం, గ్రేటర్ ఫిలడెల్ఫియా, లాస్ ఏంజిల్స్ ప్రాంతాల్లో క్రిప్టోకరెన్సీతో పాటు అందుకు అనుబంధంగా ఉన్న టెక్నాలజీలో ఉద్యోగ అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. గతంలో బ్లాక్‌చెయిన్ డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఎక్కువగా కోరుకోగా..సాఫ్ట్వేర్, ఫైనాన్స్ లీడింగ్‌లో ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత అకౌంటింగ్, కన్సల్టింగ్, స్టాఫింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ డెవలప్మెంట్ కోసం నిపుణుల కోసం మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో లింక్డిఇన్ నివేదిక ఆధారంగా మార్కెట్ నిపుణులు పలు అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా అక్కడి పరిస్థితులకు తగ్గట్లు టెక్నాలజీలను ఫాలో అవ్వాలని సలహా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాల్ని అంచనా వేస్తూ..ఆయా టెక్నాలజీల్లో తర్ఫీదు పొందితే ఉద్యోగులు రాణిస్తారని సూచిస్తున్నారు. చదవండి: 'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు! -
ఫోటో, వీడియో అమ్మకాలతో సుమారు రూ. 1.8 లక్షల కోట్ల బిజినెస్..! ఎందుకంత క్రేజ్..?
ఫోటోలను, వీడియోలను నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) రూపంలో జరిపిన అమ్మకాలు 2021లో భారీ ఎత్తున పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీతో పాటుగా ఎన్ఎఫ్టీలపై భారీ ఆదరణ లభిస్తోంది. తమ అభిమాన వ్యక్తుల వాయిస్‌ను, వీడియోలను ,ఫోటోలను దక్కించుకునేందుకు ఎన్ఎఫ్టీ ప్రేమికులు కోట్ల రూపాయలను వెచ్చించారు. 25 బిలియన్ డాలర్లకు...! కార్టూన్ ఏప్స్ నుంచి వీడియో క్లిప్‌ల వరకు అన్నింటీని ఆయా ఎన్ఎఫ్టీ ఔత్సాహికులు 2021లో భారీ ఎత్తున అమ్మకాలను జరిపారు. గత ఏడాదిలో ఎన్ఎఫ్టీ అమ్మకాలు దాదాపు 25 బిలియన్ల (సుమారు రూ. 1,84,690 కోట్లు) డాలర్లకు చేరుకుంది. ఈ ఊహాజనిత క్రిప్టో ఆస్తులపై భారీ ఎత్తున ఆదరణను పొందాయి. ఎన్ఎఫ్టీ మార్కెట్ ట్రాకర్ DappRadar(డాప్రాడర్) డేటా ప్రకారం...2021లో ఎన్ఎఫ్టీల అమ్మకాలు మందగించాయని సూచించింది. గత ఏడాది ఆగస్ట్‌లో అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తరువాతి నెలల్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో క్షీణించాయి. డిసెంబరులో మళ్లీ పుంజుకుంది. సెప్టెంబరు నుంచి నవంబర్ మధ్య కాలంలో బిట్‌కాయిన్, ఈథర్ విలువ పెరిగినందున ఎన్ఎఫ్టీ అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. 2021లో దాదాపు 28.6 మిలియన్ వాలెట్లు ఎన్ఎఫ్టీలను సేల్ చేయగా, అది 2020లో దాదాపు 5,45,000గా ఉంది పుట్టగొడుగుల్లా ఎన్ఎఫ్టీ కంపెనీలు..! ప్రపంచవ్యాప్తంగా ఎన్ఎఫ్టీలను నిర్వహించే కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిచాయి. అనేక కళాకారులు తమ చిత్రాలను అమ్ముతూ భారీ ఎత్తున సంపాదించారు. 2021 మార్చిలో ఒక ఎన్ఎఫ్టీ ఏకంగా రూ. 510 కోట్లకు అమ్ముడైంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా ఆటోమొబైల్, దిగ్గజ మల్టీనేషన్ కంపెనీలు కూడా ఎన్ఎఫ్టీలను అమ్మేందుకు సిద్దమయ్యాయి. కొకాకోలా, గుచి లాంటి కంపెనీలు కూడా ఎన్ఎఫ్టీలను విక్రయించాయి. భారత్‌లో బూమ్..! భారత్‌లో క్రిప్టోకరెన్సీతో పాటుగా ఎన్‌ఎఫ్‌టీపై భారీ ఆదరణే వచ్చింది. అమితాబ్ బచ్చన్, సన్నీ లియోన్, సల్మాన్ ఖాన్, దినేశ్ కార్తీక్, యూవీ, రిషబ్ పంత్ లాంటివారు కూడా తమ ఆడియో, వీడియో, ఫోటోలను ఎన్ఎఫ్టీ రూపంలో వేలం వేసేందుకు సిద్దమయ్యారు. ఇక భారత్‌కు చెందిన మెటాకోవన్ అని పిలువబడే విఘ్నేష్ సుందరేశన్ సుమారు 69.3 మిలియన్ల డాలర్ల(సుమారు రూ.500 కోట్ల)ను వెచ్చించి ‘Every Day: The First 5000 Days’ అనే డిజిటల్ ఫోటో ఎన్ఎఫ్టీను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! అది కూడా మన కోసమే.. -
సింగిల్ డేలో...ఒక లక్షను కాస్త రూ. 26 లక్షలు చేసిన మీమ్ కాయిన్..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీలో అగ్రగణ్యుడైన బిట్‌కాయిన్‌తో సరిసమానంగా ఆయా ఆల్ట్ కాయిన్స్ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చి పెడుతున్నాయి. డోజీ కాయిన్, షిబా ఇను లాంటి మీమ్ కాయిన్స్ కూడా భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. వీటితో పాటుగా కొత్తగా వచ్చిన ఎలియన్ షిబా ఇను కాయిన్ కూడా సింగిల్ డేలోనే భారీ లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. ఒక్కరోజులోనే 26 రెట్లు..! బిట్‌కాయిన్, ఈథెరియం వంటి అన్ని ప్రధాన క్రిప్టోకరెన్సీలు గత కొద్ది రోజుల నుంచి నేలచూపులు చూస్తున్నాయి. కాగా ఆల్ట్ కాయిన్స్ మాత్రం భారీ లాభాలను గడిస్తున్నాయి. క్రిప్టోమార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎలియన్ షిబా ఇను కాయిన్ ఆదివారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏలియన్ షిబా ఇను లేదా ASHIB కాయిన్ విలువ దాని మునుపటి విలువ కంటే 26 రెట్లు పెరిగింది. అంటే ఒక్క రోజులో ఏలియన్ షిబా ఇనులో శనివారం నాడు రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఆదివారం మధ్యాహ్నానికి రూ. 26 లక్షలకు పైగా రాబడిని తెచ్చి ఇచ్చింది. షిబా ఇను ఆదరణను క్యాష్ చేసుకునేందుకుగాను ఏలియన్ షిబా కాయిన్‌ను కొందరు డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. షిబా ఇను బుల్‌రన్‌ను కోల్పోయిన ఇన్వెస్టర్ల కోసం ఎలియన్ షిబా కాయిన్ అవకాశం కల్పిస్తోందని ఈ కాయిన్ డెవలపర్స్ అన్నారు. అంతేకాకుండా...ది ఏలియన్ ఇన్వేషన్ ఈజ్ఫైనల్ హియర్...! అనే ట్యాగ్‌లైన్ కూడా టాగ్ చేస్తూ ఇటీవల ఐలాండ్ బాయ్స్ పాడిన పాట కొద్ది రోజుల క్రితం సంచలనమైంది. CoinMarketCap డేటా ప్రకారం...Alien Shiba Inu ధర ఆదివారం మధ్యాహ్నం USD 0.009869 ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతకుముందు USD 0.000376 గా ఉంది. కాగా మళ్లీ కొద్ది క్షణాల్లోనే ఏలియన్ షిబా ఇను బుల్ రన్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ కాయిన్ దాదాపు USD 0.0025 వద్ద ట్రేడవుతోంది. చదవండి: మళ్లీ అదే అంధకారమా..! తెరపైకి మరోసారి Y2K సమస్య..! ప్రభావమెంతంటే..? -
అదిరిపోయే ఆఫర్! క్రిప్టో కరెన్సీపై ఉచిత కోర్సు
న్యూఢిల్లీ: హరిద్వార్ కేంద్రంగా నడిచే ప్రముఖ విద్యా సంస్థ గురుకుల కంగ్రి.. క్రిప్టో ఎక్సేంజ్ వాజిర్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ఉచిత కోర్సును ఆఫర్ చేయనుంది. కోర్సు పూర్తయిన తర్వాత గురుకుల కంగ్రి ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తుంది. గురుకుల కంగ్రికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది. మల్లగుల్లాలు ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలు క్రిప్టో కరెన్సీకి భవిష్యత్తు ఉందని చెబుతున్నారు. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ వంటి వారు ఇప్పటికే ఇందులో భారీ ఎత్తు పెట్టబడులు పెడుతున్నారు. అమెరికా తర్వాత అత్యధికంగా క్రిప్టో వైపు చూస్తున్న యువత ఇండియాలోనే ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీకి చట్టపరమైన అనుమతులు ఇచ్చే అంశాన్ని ఇటీవల కేంద్ర కేబినేట్ పరిశీలించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డిజిటల్ కాయిన్ తేవాలనే డిమాండ్ కూడా తెర మీదకు వచ్చింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు క్రిప్టోకి వ్యతిరేకంగా వద్దంటూ గళం విప్పాయి. దీంతో క్రిప్టో అనుమతుల విషయంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. చదవండి: అఫీషియల్: భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్ -
Cryptocurrency: కాయిన్ డీసీఎక్స్లో పాలీట్రేడ్ లిస్టింగ్
న్యూఢిల్లీ: డీసెంట్రలైజ్డ్ లెండింగ్ సేవల సంస్థ పాలీట్రేడ్.. క్రిప్టో ఎక్సేంజ్ ‘కాయిన్‌డీసీఎక్స్’లో లిస్ట్ అయినట్టు ప్రకటించింది. దీంతో ‘ట్రేడ్’ టోకెన్‌లో లిక్విడిటీ పెరుగుతుందని.. 75 లక్షలకు పైగా ఉన్న భారతీయ యూజర్లకు అదనపు ఆదాయ వనరు అందుబాటులోకి వచ్చినట్టు అయిందని పేర్కొంది. చిన్న, మధ్య స్థాయి సంస్థల మూలధన అవసరాలను చేరుకునేందుకు లిస్టింగ్ చేసినట్టు వివరించింది. 2014లో పాలీట్రేడ్ కార్యకలాపాలు మొదలు పెట్టగా.. 5,000కు పైగా రుణ గ్రహీతలు నమోదు చేసుకున్నారు. 250 మందికి 500 మిలియన్ డాలర్లక పైగా రుణాలను మంజూరు చేసింది. -
భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ వచ్చేసింది
India First Cryptocurrency Index IC15: భారత్ మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ సూచీ అధికారికంగా లాంఛ్ అయ్యింది. ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ సూపర్ యాప్‌గా గుర్తింపు పొందిన క్రిప్టోవైర్ ఈ కరెన్సీ సూచీని తీసుకొచ్చింది. ఇంతకీ దీని పేరేంటో తెలుసా?.. ఐసీ15 (IC15). క్రిప్టోమార్కెట్‌ను.. దాని తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వివరించడమే ఈ సూచీ చేసే పని. ఈ సూచీ డ్యూటీ ఏంటంటే.. బాగా ట్రేడింగ్‌లో, లీడింగ్ ఎక్స్ఛేంజ్లో ఉన్న క్రిప్టోకరెన్సీల పనితీరును పర్యవేక్షించడం.. ఆ వివరాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ద్వారా తెలియజేడం. ట్రిక్కర్ప్లాంట్ లిమిటెడ్‌లో స్పెషల్ బిజినెస్ యూనిట్‌గా ఉన్న క్రిప్టోవైర్.. క్రిప్టో లెక్కల వివరాల్ని పక్కాగా తెలియజేస్తుంటుంది. తద్వారా క్రిప్టో ఇన్వెస్టర్లకు మాత్రమే కాదు.. ఆసక్తి ఉన్నవాళ్లకు, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లకు సైతం క్రిప్టో మార్కెట్ తీరుతెన్నులు ఎప్పటికప్పుడు అర్థమవుతుంటాయి. పనిలో పనిగా ఈ ఇండెక్స్(సూచీ).. క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ ఇకోస్టిస్టమ్ మీద అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుంటుంది కూడా. డొమైన్ ఎక్స్పర్ట్స్, విద్యావేత్తలు, మేధావులతో కూడిన గవర్నెన్స్ కమిటీ(IGC) ఐసీ15లో ఉంటుంది. ఏదైనా ఒక క్రిప్టోకరెన్సీకి ఇండెక్స్‌లో చోటు దక్కాలంటే.. రివ్యూ ప్రకారం ట్రేడింగ్ రోజుల్లో కనీసం 90 శాతం అయినా ట్రేడ్ అయ్యి తీరాలి. గడిచిన నెలలో మార్కెట్ క్యాపిటలైజేషన్ సర్క్యులేటింగ్ పరంగా టాప్ 50లో ఉండాలి. IC15 ఇండెక్స్‌లో లిస్టింగ్‌కు అర్హత పొందేందుకు మాత్రం.. ట్రేడింగ్ విలువ పరంగా అది టాప్ 100 అత్యంత లిక్విడ్ క్రిప్టోకరెన్సీలలో ఒకటిగా ఉండాలి. -
2021లో జరిగిన క్రిప్టోకరెన్సీ లావాదేవీల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు భారీ ఆదరణను నోచుకున్నాయి. 2021లో క్రిప్టో ట్రేడర్స్ పెద్ద ఎత్తున లావాదేవీలను జరిపినట్లు ప్రముఖ గ్లోబల్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ఓకేఎక్స్ఛేంజ్ (OKEx) ఒక నివేదికలో వెల్లడించింది. 21 ట్రిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు..! ప్రపంచవ్యాప్తంగా ఓకేఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ను అనువైన ప్లాట్‌ఫాంగా మారింది. కేవలం ఈ ప్లాట్‌ఫాంలోనే 2021లో సుమారు 21 ట్రిలియన్ డాలర్ల విలువైన 25 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే క్రిప్టోలావాదేవీలు ఆల్‌టైం రికార్డుగా నిలిచిందని కంపెనీ వెల్లడించింది. 2022 క్రిప్టో భవితవ్యం ఎలా ఉంటుందంటే..! OKEx.com అంచనాల ప్రకారం..2022లో క్రిప్టో మార్కెట్ స్థిరమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తుందని విశ్వసించింది. క్రిప్టోకరెన్సీలతో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ప్లాట్‌ఫామ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయని అభిప్రాయపడింది. 2022లో పెట్టుబడిదారుల క్రిప్టో పోర్ట్‌ఫోలియోలో స్టేబుల్కాయిన్లు ప్రముఖ స్థానాన్ని సృష్టిస్తాయని ఓకేఎక్స్ఛేంజ్ తెలిపింది. స్టేబుల్‌కాయిన్ అనేది యూఎస్ డాలర్ వంటి జాతీయ కరెన్సీ లేదా బంగారం వంటి విలువైన లోహం వంటి అంతర్లీన ఆస్తికి అనుసంధానించబడిన డిజిటల్ కరెన్సీ. ఇక క్రిప్టోకరెన్సీలపై ఆయా దేశాల నిర్ణయాలు ఎలా ఉన్నా.... క్రిప్టోకరెన్సీ 2022లో స్థిరమైన ఒడిదుడుకులతో వృద్ధిని సాధిస్తాయని వెల్లడించింది. ఓకేఎక్స్ఛేంజ్ టాప్-5లో ఒకటి..! స్పాట్ అండ్ డెరివేటివ్స్ విభాగాలలో ట్రేడింగ్ వాల్యూమ్ల పరంగా ప్రపంచంలోని మొదటి ఐదు క్రిప్టో ఎక్స్ఛేంజీలలో ఓకేఎక్స్ఛేంజ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 20 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ప్లాట్‌ఫారమ్ ఓకేఎక్స్ఛేంజ్. 2021లో సుమారు 220 కొత్త క్రిప్టో కరెన్సీలు ఈ ప్లాట్‌ఫాంలో లిస్టింగ్ అయ్యాయి. చదవండి: The Most Popular Crypto In 2021: అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..? -
2021లో అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..?
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. 2021లో చూసుకుంటే క్రిప్టో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్ అత్యంత ప్రజాదరణను పొందింది. అయితే గత ఏడాదిలో బిట్‌కాయిన్ కాకుండా ఇతర ఆల్ట్ కాయిన్స్ భారీ ఆదరణను పొందాయి. బిట్‌కాయిన్ కంటే దీనిపైనే..! క్రిప్టోకరెన్సీల్లో బిట్‌కాయిన్ కంటే షిబా ఇను గత 12 నెలల్లో సుమారు 188 మిలియన్లకు పైగా ఇన్వెస్టర్లు వీక్షించినట్లు కాయిన్‌మార్కెట్‌క్యాప్ వెల్లడించింది. అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ 145 మిలియన్ల వీక్షణలతో రెండవ స్థానంలో ఉంది. షిబా ఇను అనేది ఇప్పటికే ఉన్న మీమ్ కాయిన్ డోజ్‌కాయిన్‌కు స్పిన్-ఆఫ్. ఎలన్ మస్క్ అపారంగా నమ్మే డోజీకాయిన్ సుమారు 107 మిలియన్ వీక్షణలతో జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. కారణం అదే..! క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్ అత్యంత విలువను కల్గి ఉంది. ఒకానొక సమయంలో బిట్‌కాయిన్ సుమారు 50 లక్షలకు కూడా చేరింది. ఈ కాయిన్ ఇన్వెస్ట్ చేయాలంటే పెట్టుబడిదారులు కొంతమేర భయపడ్డారు. బిట్‌కాయిన్ కంటే ఆల్ట్‌కాయిన్స్ విలువ తక్కువగా ఉండడంతో వీటిపై ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. ఇకపోతే షిబా ఇను వచ్చి కేవలం 15 నెలలు అయినప్పటికీ, ప్రస్తుతం 18 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే 13వ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉంది. అక్టోబర్‌లో ఈ క్రిప్టోకరెన్సీ నాలుగు రోజుల్లోనే 133 శాతం పెరిగి, ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 0.000088 డాలర్లకు చేరింది. రాబిన్ హుడ్ యాప్‌లో షిబా ఇను ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ యాప్, రాబిన్‌హుడ్‌లో జాబితా చేయబడే అవకాశం ఉందనే పుకార్లు ఈ కాయిన్ విలువ భారీగా పెరిగింది. షిబా ఇను ఇన్వెస్టర్లు రాబిన్ హుడ్ లో లిస్ట్ చేయాలని ఆన్లైన్లో సంతకాల సేకరణ కూడా చేపట్టారు. షిబా ఇను కాయిన్‌ను ఇప్పటికే ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ కాయిన్‌బేస్‌లో లిస్ట్ అయ్యింది. చదవండి: క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్.. -
భవిష్యత్‌లో కరెన్సీ మాయం..పెత్తనం అంతా బిట్ కాయిన్లదే!
భవిష్యత్ అంతా బిట్ కాయిన్లదే. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న కరెన్సీ త్వరలోనే కనుమరుగవుతుంది. క్రిప్టో వినియోగం పెరుగుతుంది. సాధారణ కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్ధిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది అంటూ ఓ దేశాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వరల్డ్ వైడ్‌గా బిట్ కాయిన్ మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లకు చట్టబద్ధత (అధికారిక కరెన్సీ) కల్పించిన ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె..ఆ కరెన్సీపై మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం ఉపయోగించే కరెన్సీ త్వరలో కనుమరుగవుతుంది. ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న 'రియల్ రివల్యూషన్' బిట్‌కాయిన్ అని బుకెలె ట్వీట్ చేశారు. పైగా బిట్‌కాయిన్ యుగానికి ఎల్ సాల్వడార్ నాయకత్వం వహిస్తోందని జోస్యం చెప్పారు. ప్రపంచం మొత్తం ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు క్రిప్టోకరెన్సీని వినియోగించాలని చూస్తోంది. అయితే బిట్కాయిన్ల వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. క్రిప్టోతో ఆర్ధిక వ్యవస్థకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటే భవిష్యత్‌లో వాడుకలో ఉన్న కరెన్సీ వినియోగం ఆగిపోతుందని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు వినియోగంలో ఉన్న కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీని ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. దీని కోసం చేయాల్సిందల్లా దేశ ఆర్థిక వ్యవస్థకు సాధారణ కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీ మెరుగైందని నిరూపించుకోవడమేనని అన్నారు. $400 మిలియన్ డాలర్ల భారం తగ్గించాలనే బిట్ కాయిన్ వినియోగంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నా..ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు మాత్రం..ఆ దేశ ఆర్ధిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఇతర దేశాల నుంచి ఆదేశానికి మధ్య జరిగే ఆర్ధిక లావాదేవీలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సుమారు 400 మిలియన్ల డాలర్ల అధిక రుసుముల్ని తగ్గించే మార్గాల్ని అన్వేషించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో సెప్టెంబరులో బిట్‌కాయిన్‌ను చట్టబద్ధం చేసినప్పుడు ఎల్ సాల్వడార్ ప్రభుత్వం తరుపున మొత్తం 400 బిట్కాయిన్లు, అంతకంటే ఎక్కువగానే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కాయిన్ల సంఖ్య 1000కి చేరింది. ఆ బిట్ కాయిన్ల సేకరణ మరింత పెంచేందుకు ఏటీఏం తరహాలో దేశ వ్యాప్తంగా 200 బిట్ కాయిన్ టెల్లర్ మెషీన్లను ఇన్స్టాల్ చేసింది. ఆ మెషిన్ల ద్వారా బిట్ కాయిన్లను కొనుగోలు చేసే పౌరులకు ప్రత్యేకంగా రాయితీలు అందించేలా చర్యలు తీసుకున్నారు. బుకెలెకు వార్నింగ్ బిట్‌కాయిన్ బాండ్లతో బిట్ కాయిన్‌సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు కొద్ది నెలల క్రితం నయిబ్ బుకెలె ప్రకటించారు. అలా ప్రకటించిన రెండు రోజులకే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) షాకిచ్చింది. బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బిట్ కాయిన్ల వల్ల వినియోగదారుల రక్షణ, ఆర్థిక సమగ్రత, ఆర్థిక స్థిరత్వానికి గణనీయమైన నష్టాల్ని కలిగిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. అయితే బుకెలే మాత్రం ఐఎంఎఫ్ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటున్నారు. బిట్ కాయిన్లతో లాభాల్ని గడిస్తున్నారు. లాభాలు ఎల్ సాల్వడార్ దేశాధ్యక్షుని తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నా..బిట్ కాయిన్లపై ఆర్ధిక కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. ఎల్ సాల్వడార్ దేశం బిట్కాయిన్లపై ఆర్ధిక లావాదేవీల్ని నిర్వహిస్తుంది. క్రిప్టో కాయిన్ కొనుగోలు చేసే సమయంలో దాని ధర తక్కువగా ఉండడం, ఆ తర్వాత వాటి ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో భారీ లాభాల్ని చవిచూస్తుంది. కానీ దేశ ఆర్ధిక ప్రయోజనాల కోసం బిట్ కాయిన్లపై ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడం ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది.లేదంటే కోలుకోలేని నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని పలువురు ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వార్వెవా..! ప్రపంచంలోనే తొలి "బిట్‌కాయిన్ సిటీ" నిర్మాణం, ఎక్కడంటే..! -
వెబ్ 3.0 అంటే ఏమిటి? వాళ్లకు ఎందుకంత కళ్లమంట?
Elon Musk Jack Dorsey Hates Web 3.0: web3.. మనలో చాలామందికి ఈ పదం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, రాబోయే రోజులు మాత్రం వెబ్3 గురించి పదే పదే వినాల్సి రావడం ఖాయం. ఎందుకంటే.. ఇది ఇంటర్నెట్లో ఓ తరం కాబట్టి. అయితే దీనిపై కొందరు టెక్ మేధావులకు తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకు కారణాలేంటో తెలుసుకునే ముందు.. అసలు వెబ్3 అంటే ఏంటో చూద్దాం. టిమ్ బెర్నర్స్ లీ 1989లో వరల్డ్ వైడ్ వెబ్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని ‘వెబ్ 1’గా పరిగణనలోకి తీసుకోకపోయినా.. జనాల్ని ఆన్లైన్లోని వెళ్లేలా చేసింది మాత్రం ఇదే. కానీ, ఆ తర్వాతి తరంలో వచ్చిన ఇంటర్నెట్కు వెబ్ 2.0 అనే పేరు అధికారికంగా వచ్చింది. 1999 నుంచి ఇది అనేక రకాలుగా యావత్ ప్రపంచం విస్తరించి కోట్ల మందిని ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు దగ్గర చేసింది. ఇక మూడో తరం ఇంటర్నెట్ పేరే ‘వెబ్ 3.0’. దీనికి బీజం పడింది 2014లోనే!. నో డామినేషన్ 2014లో బ్రిటన్ కంప్యూటర్ సైంటిస్ట్ గావిన్ వుడ్ ‘ఎథెరియం’(క్రిప్టోకరెన్సీ) రూపొందించాడు. ఎథెరియం ప్రకారం.. ఇంటర్నెట్ను వికేంద్రీకరించడమే 3.0 ఉద్దేశం. అంటే.. బ్లాక్‌చెయిన్ ఆధారంగా ఇంటర్నెట్ను డీసెంట్రలైజ్డ్ చేయడం. తద్వారా గూగుల్, ఫేస్‌బుక్‌లాంటి దిగ్గజాల ఆధిపత్యం ఇంటర్నెట్లో నడవదు. ఇంటర్నెట్ యూజర్ కాస్త యజమాని అవుతాడు. ఇందులో భాగంగానే ప్రతీదానికి బ్లాక్చెయిన్స్తో ముడిపడి ఈ తరం ఇంటర్నెట్ నడుస్తోంది. టైం పట్టొచ్చు వెబ్3.0లో ఎలాంటి సేవలు వినియోగించుకోవాలన్నా.. ఎవరి అనుమతులు అక్కర్లేదు. ఎవరూ బ్లాక్ చెయ్యరు. సేవల్ని వినియోగించుకోవడానికి తిరస్కరించరు. టోకెన్స్, క్రిప్టోకరెన్సీల ఆధారంగా చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. ఒకరకంగా వెబ్ 3.0 వల్లే క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్టీలు చాలా ఏళ్ల క్రితమే వాడుకలోకి రాగలిగాయన్నమాట. అయితే ఇది ఇంటర్నెట్ను చూసే తీరును మార్చేస్తుందా? అంటే అవుననే చెప్పొచ్చు. కానీ, అందుకు చాలా టైం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ కావాలి కాబట్టి అని చెప్తున్నారు. ఎందుకు మెచ్చట్లేదు థర్డ్ జనరేషన్.. ఈ పదం వినడానికే టెక్ దిగ్గజాలు ఇష్టపడడం లేదు. వినడానికే దరిద్రంగా ఉందంటూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇంతకు ముందు కామెంట్ చేశాడు. తాజాగా ‘ఎవరైనా చూశారా? నాకైతే కనిపించలేదు. జస్ట్ అదొక మార్కెటింగ్ బజ్‌వర్డ్’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే ‘ఇంటర్నెట్ అనేది వెంచర్ క్యాపిటలిస్ట్‌లకు మాత్రమే సొంతమని, జనాలు దానిని పొందలేర’ని సోమవారం ట్వీట్ చేశాడు. వీళ్లిద్దరిదే కాదు యాపిల్ సీఈవో టిమ్ కుక్ సహా చాలామంది అభిప్రాయమూ ఇదే. ఈ తరహా ఇంటర్నెట్ను సాధారణ పౌరులు ఉపయోగించడం కష్టమని, కాబట్టి, ఇదొక విఫలయత్నంగా అభివర్ణిస్తున్నారు. అయితే థర్డ్జనరేషన్ ఇంటర్నెట్ ద్వారా యూజర్ సులువుగా బిలియనీర్ అయిపోవచ్చు. విపరీతంగా సంపాదించొచ్చు. రిస్క్ రేటు తక్కువే. ఈ కారణం చేతనే కుళ్లుకుంటున్నారని వాదించేవాళ్లు లేకపోలేదు. ఇక 90లో ఫోన్ల రాక సమయంలోనూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం అయ్యింది. కట్ చేస్తే.. పరిస్థితి ఏంటో తెలిసిందే కదా. అలా థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్ కూడా సక్సెస్ అయ్యి తీరుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: భార్య చేసిన తప్పు.. వేల కోట్లు చెత్తపాలు! -
భార్య చేసిన తప్పు! బిలియనీర్ కావాల్సినోడు...ఇప్పుడు..
Man Hires NASA Linked Experts To Find Hard Drive With 7500 Bitcoins: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ భారీ ఆదరణ నోచుకుంటుంది. వీటికి అంతస్థాయిలో ఆదరణ రావడానికి ముఖ్య కారణం ఒకటి ట్యాక్స్ ఫ్రీ, మరోకటి పకడ్బంది భద్రత. క్రిప్టోకరెన్సీల లావాదేవీలను బ్లాక్‌చైయిన్ టెక్నాలజీ ఉపయోగించి చేస్తారు. ఆయా యూజర్లు క్రిప్టోకరెన్సీలను ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీతో భద్రంగా ఒక హర్డ్ డిస్క్‌లో సేవ్ చేసుకోవచ్చును. కాగా యూకేకు చెందిన జేమ్స్ హూవెల్స్ మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు అతడిని బిలియనీర్ కాకుండా చేసింది. చెత్త బుట్టలో పడేసిన భార్య..! ప్రపంచంలోని అత్యంత దురదృష్టవంతుడు అంటే ఇతడేనెమో...! బహుశా..! 36 ఏళ్ల జేమ్స్ హోవెల్స్ మాజీ భార్య చేసిన పొరపాటుతో ఏకంగా 7500 బిట్కాయిన్లను పొగొట్టుకున్నాడు. అతడి భార్య 2013లో 7500 బిట్కాయిన్ల హార్డ్ డిస్క్‌ను చెత్త బుట్టలో పడేసింది. ఈ హర్డ్ డిస్క్‌ను వెతకడం కోసం నాసా శాస్త్రవేత్తలను నియమించుకున్నాడు. బిలియనీర్ కావాల్సినోడు.. జేమ్స్ హూవెల్స్ మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు బిలియనీర్ అవ్వకుండా చేసింది. నేడు 7500 బిట్కాయిన్ల విలువ నేడు ఇండియన్ కరెన్సీలో దాదాపు 3,404 కోట్లకు సమానం. పొగొట్టుకున్న హర్డ్ డిస్క్‌ను సంపాదించేందుకు అమెరికా ఒన్ట్రాక్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వీరు గతంలో కొలంబియా స్పేస్ షటిల్ భూమిపై కూలిపోయినప్పుడు నాసాకు సహయాన్ని అందించింది. ఈ హార్డ్ డిస్క్‌ను పొందేందుకు ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నాడు జేమ్స్. ఈ హర్డ్ డిస్క్ వెతుకులాటలో ఒన్ట్రాక్ విజయవంతమైతే దానిని క్రాక్ చేయడంతో జేమ్స్ రాత్రికి రాత్రే బిలియనీర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడి స్ధానిక సౌత్ వేల్స్ పోలీసులు హార్డ్‌డిస్క్ వెతికేందుకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. చదవండి: ఇండియన్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్...! షావోమీ నుంచి..ధర ఏంతంటే..? -
నెలకు కోటి రూపాయల జీతం వదిలేసి మరీ..
Korea Man Quits Crores Salary Job And Became Youtuber Because Of Mother: కంపెనీలో చేరిన ఏడాదికే ఇంక్రిమెంట్. అది అలాంటి ఇలాంటిది కాదు. నెలకు కోటికి పైగా(మన కరెన్సీలో) జీతం. ప్రొఫెషనల్ కెరీర్‌ను పీక్స్‌కు చేర్చే టైం అది. కానీ, ఆ సమయంలో ఉద్యోగం వదిలేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా?.. దక్షిణ కొరియాకు చెందిన బెన్ చోన్(28) ఆ నిర్ణయం తీసేసుకున్నాడు మరి!. అయితేనేం తనకు తెలిసిన విద్యతో లక్షలు(మన కరెన్సీలోనే) సంపాదిస్తూ.. సొంతంగా బాస్‌గా ఉండడంలో కిక్కును వెతుక్కుంటున్నాడు. జేపీ మోర్గాన్.. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం. ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అలాంటి కంపెనీలో 2017లో చేరాడు బెన్ చోన్. పుట్టి, పెరిగింది దక్షిణ కొరియాలోనే అయినా. స్కాలర్షిప్ మీద అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదివి.. జాబ్ తెచ్చుకున్నాడు. ఏడాది తిరగకుండానే అతని టాలెంట్‌కి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది జేపీ మోర్గాన్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ప్రమోషన్‌తో పాటు నెలకు లక్షా యాభై వేల డాలర్ల జీతం(అదనంగా బోనస్) ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే రెండు నెలల జీతం అందుకున్నాడో లేదో.. పిడుగులాంటి వార్త అతని చెవిన పడింది. తల్లి ప్రమాదకరమైన వ్యాధి బారినపడిందన్న విషయం అతన్ని స్థిమితంగా ఉంచలేదు. ఆ సమయంలో అతనికి తల్లే ప్రపంచంగా కనిపించింది. ఆమె పక్కనే ఉండి.. ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంతూరికి బయలుదేరాడు. అక్కడ ఓ చిన్న బట్టల దుకాణంలో కొంతకాలం పని చేశాడు. బట్టల షాపులో.. దాచుకున్న సొమ్మంతా కేవలం మూడు నెలల్లోనే తల్లి ట్రీట్మెంట్కి ఖర్చైంది. బ్యాంకింగ్ సలహాలిచ్చే బెన్ చోన్.. సొంతూరులోనే ఓ బట్టల షాపులో పని చేశాడు. ఆపై ఇంట్లో బట్టల దుకాణం తెరిచాడు. కొన్నాళ్లు పోయాక తల్లి మందులకు ఖర్చులు పెరిగాయి. ఆ టైంలోనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆదాయం సంపాదించొచ్చనే విషయం అతనికి గుర్తొచ్చింది. యూట్యూబ్‌లో రోజూ రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో చాలావరకు వీడియోలను చూసి తిట్టుకుంటాం.. నవ్వుకుంటాం. కొన్నింటిని చూడకుండానే స్కిప్ చేస్తుంటాం. కానీ, వాటి వ్యూస్ ద్వారా యూట్యూబర్లకు ఆదాయం వస్తుంది. అంటే.. ఏదో ఒకరకంగా తమ శ్రమను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారు వాళ్లు. అలా బెన్ చోన్ మాత్రం తనకు తెలిసిన విద్యతోనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాడు. తెలిసిన విద్యతోనే.. 2019లో రేర్లిక్విడ్ rareliquid పేరుతో యూట్యూబ్ఛానెల్ మొదలుపెట్టాడు బెన్. ఇన్వెస్ట్మెంట్, కెరీర్ గైడెన్స్ వీడియోలతో నెమ్మదిగా ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న క్రిప్టోకరెన్సీ గురించి, బ్లాక్ చెయిన్ మార్కెట్ తీరు తెన్నులు, టిప్స్‌తో పాటు టెక్, మార్కెటింగ్ సలహాలు అందిస్తాడు. ‘‘ జేపీ మోర్గాన్‌లో చేరిన తొలినాళ్లలో వారానికి 70 నుంచి 110 గంటల పని. ఒక్కోసారి ఏకధాటిగా 28 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు నేనే బాస్. నాకు తెలిసిన విద్య. కోట్ల జీతం పోతేనేం.. నాకు ఉన్న వనరులతో, తక్కువ శ్రమతో సంతోషం, మనశ్శాంతిని సంపాదించుకుంటున్నా. నాలాగే ప్రతీ ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనసు పెడితే డిజిటల్ ప్రపంచంతో సంపాదించుకోవచ్చు.. ఒక అడుగు ముందుకేసి అద్భుతాలూ చేయొచ్చు. సిగ్గు-మొహమాటం పడాల్సిన అవసరం అస్సలు లేదు. నా వరకు నేను బాగానే సంపాదిస్తున్నా. అన్నింటికి మించి మా అమ్మ పక్కనే ఉంటున్నా. ఇది చాలాదా నాకు’’ అంటున్నాడు బెన్ చోన్. ప్రస్తుతం rareliquid ఛానెల్లో టెక్, మార్కెట్, క్రిప్టోకరెన్సీ తీరు తెన్నులపైనా అతని సలహాలు, డెమో వీడియోలు ఉంటాయి. రెజ్యూమ్(సీవీ) సలహాలు, రకరకాల కోర్సుల గురించి వివరిస్తాడు. ఇదంతా చిన్న చిన్న వ్యాపారాల కలయికగా చెప్తాడు బెన్ చోన్. క్రియేటివ్ వేలో మరికొందరికి పాఠాలు, సలహాలు ఇవ్వడం సంతోషాన్ని ఇస్తుందని అంటున్నాడు ఈ యూట్యూబర్. యూట్యూబ్ వ్యూస్ ప్రకారం.. జులైలో బెన్ జీతం 19, 161 డాలర్లుకాగా, నవంబర్‌లో 26,000 డాలర్లు సంపాదించాడు. మన కరెన్సీలో ఇది 17 లక్షల రూపాయలు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
Cryptocurrency Bill: క్రిప్టో బిల్లు ఇక లేనట్లేనా?
క్రిప్టోకరెన్సీ బిల్లు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు నుంచే మొదలైన హడావిడి. ప్రైవేట్ క్రిప్టో అడ్డుకట్టవేయడం, ఆర్బీఐ సొంత డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నాలకూ ఈ సమావేశాల్లోనే లైన్ క్లియర్ అవుతుందని అంతా భావించారు. అయితే బిల్లు డ్రాఫ్ట్ సర్వం సిద్ధమైందన్న ఆర్థిక మంత్రి ప్రకటన.. కేవలం ప్రకటనకే పరిమితం కావడం, మరో మూడు రోజుల్లో సమావేశాలు ముగుస్తుండడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. బిజినెస్ న్యూస్ ఏజెన్సీ బ్లూమరాంగ్.. క్రిప్టోకరెన్సీ బిల్లు ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు రాకపోవచ్చనే ఓ కథనం ప్రచురించింది. మరో మూడు రోజుల్లో (డిసెంబర్ 23తో) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చట్టానికి సంబంధించిన విధివిధానాల గురించి కేంద్రం తుది నిర్ణయానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్మలమ్మ చెప్పినా కూడా.. ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీల చట్టంపై అనవసర ఊహాగానాలు మీడియాలో ప్రచారమైన నేపథ్యంలో ఆమధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని, కేబినెట్ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు దాదాపు ఖరారు చేసేసుకున్నారు. కానీ, బిల్లు ఇప్పటికీ కేబినేట్ అనుమతి పొందలేదు. వేగిరపాటు వద్దనే.. సిడ్నీ డైలాగ్ వర్చువల్ కీనోట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ‘ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఆ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో వ్యవహారంపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు భావించారు. నిజానికి క్రిప్టో బిల్లు ప్రస్తావనను శీతాకాల సమావేశాల షెడ్యూల్లో చేర్చిన కేంద్రం.. పార్లమెంట్ వెబ్సైట్లో సైతం ఆ విషయాన్ని పేర్కొంది. కానీ, ఇప్పుడు క్రిప్టో బిల్లు విషయంలో తొందరపాటు నిర్ణయం వద్దనే కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు చేర్పులతో ఆర్డినెన్స్గానీ, ప్రత్యేక ఆర్డర్‌గానీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక.. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం, నియంత్రణపై స్పష్టమైన చేర్పులతో కూడిన చట్టం చేయవచ్చనే(పార్లమెంట్ సమావేశాలు లేకున్నా చట్టం చేసే వెసులుబాటు ఉండడం) అంచనా. అంశాలు.. క్రిప్టోకరెన్సీ బిల్లు (నియంత్రణ)పై ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ.. అందులో అంశాల గురించి మాత్రం విస్తృత చర్చ జరిగింది. ఆర్బీఐ క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కోరుతోంది. కానీ, కేంద్రం మాత్రం అందుకు సుముఖంగా లేదు. క్రిప్టోకరెన్సీ హోల్డర్స్ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను సూత్రప్రాయంగా అంగీకరించిందని, క్రిప్టో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇరవై నుంచి యాభై కోట్ల జరిమానా, ఏడాదిన్నర శిక్ష.. ఇలాంటి అంశాలు చేర్చిందని గతంలో బ్లూమరాంగే ఓ కథనం ప్రచురించింది. అంతేకాదు క్రిప్టో కరెన్సీ నియంత్రణను ఆర్బీఐకి, క్రిప్టో ఆస్తుల పర్యవేక్షణ(నియంత్రణ)ను సెబీకి అప్పగించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలిసిస్ నివేదిక ప్రకారం...2021లో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్ నిలిచింది. దాదాపు కోటిన్నరమంది ఇన్వెస్టర్లు.. 45 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో ఆస్తుల్ని కలిగి ఉన్నారు. -
క్రిప్టోల ఫండమెంటల్స్ విశ్లేషించడం ఎలా?
ఫండ్స్‌లో లాభాలపై పన్ను ఆదా చేసుకోవచ్చా? మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చే లాభాలపై పన్ను ఆదా చేసుకునే మార్గం ఉందా? –జగన్మోహన్ 2018 వరకు ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేదు. 2018లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో దీన్ని ప్రతిపాదించారు. ఏడాదికి మించిన దీర్ఘకాల పెట్టుబడులపై మూలధన లాభం రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఉండదు. అంతకుమించిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక మీరు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. లాభం రూ.లక్ష వరకు ఉంటే విక్రయించుకోవాలి. లాభాలను కాపాడుకోవడానికి మార్గం ఇదే. నిర్ణీత కాలానికి మీ పెట్టుబడులపై పన్నుల్లేని లాభాలను సమకూర్చుకోవచ్చు. అంటే మినహాయింపుల పరిమితి మేరకు లాభం తీసుకుంటూ, తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం. కానీ, దీని గురించి పెద్దగా పట్టించుకోవద్దన్నది నేనిచ్చే సలహా. మీరు 15–20 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇదేమీ పెద్దదిగా అనిపించదు. ప్రతీ రూ.లక్ష లాభంపై ఆదా చేసేది కేవలం రూ.10,000. ఇంత చిన్న మొత్తానికి తలపోటు పని పెట్టుకోవడం అనవసరం. ఒకవేళ ఇదేమీ శ్రమగా భావించడం లేదనుకుంటే లాభం రూ.లక్షకు చేరగానే వెనక్కి తీసుకోవచ్చు. క్రిప్టోల ఫండమెంటల్స్ విశ్లేషించడం ఎలా? ఈక్విటీ షేర్ల మాదిరిగా.. క్రిప్టోలను వాటి ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు) ఆధారంగా విశ్లేషించే మార్గం ఏదైనా ఉందా? – పీఎం అన్నాదురై క్రిప్టో కరెన్సీలను వాటి మూలాల ఆధారంగా విశ్లేషించే మార్గమే లేదు. ఒక దేశం గురించి తెలుసుకోవడం ద్వారా కరెన్సీని విశ్లేషించగలరు. ఒక దేశంగా భారత్ మరిన్ని డాలర్లను కొనుగోలు చేయగలదు. లేదా విక్రయించగలదు. ఎందుకంటే మనం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఎన్నో స్థూల ఆర్థిక వ్యత్యాసాలున్నా కానీ ఒక దేశ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా కరెన్సీని విశ్లేషించుకోవచ్చు. క్రిప్టోలకు సంబంధించి విశ్లేషించేందుకు అటువంటి అంశాలేవీ లేవు. ఒకే ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తున్నా కానీ వివిధ ఇండెక్స్ ఫండ్స్ ఎన్ఏవీల్లో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? – అశోక్ కుమార్ ఒక్కో పథకం ఒక్కో సమయంలో ప్రారంభం కావడం వల్లే ఈ అంతరం కనిపిస్తుంది. ఉదాహరణకు బీఎస్ఈ సెన్సెక్స్ ఆధారితంగా 2000 సంవత్సరంలో ఒక పథకం రూ.10 ఎన్ఏవీతో ప్రారంభమై ఉంటే.. సెన్సెక్స్ పనితీరు ఆధారంగా ఇప్పుడు అదే పథకం ఎన్ఏవీ ఎన్నో రెట్లు పెరిగి ఉంటుంది. ఒకవేళ ఏడాది క్రితం ప్రారంభమైన సెన్సెక్స్ ఆధారిత పథకం ఎన్ఏవీ రేటు భిన్నంగా ఉంటుంది. ఇండెక్స్ ఫండ్ ఎన్ఏవీ అన్నది ఇక్కడ కీలకం కాదు. మీరు పెట్టుబడులు పెట్టిన తర్వాత సంబంధిత పథకం రాబడి రేటు.. ఇండెక్స్ రాబడికి అనుగుణంగా ఉందా, లేదా అన్నదే చూసుకోవాలి. సిప్‌లు అన్నింటికీ ఒకటే తేదీ ఉండడం సరైనదేనా? నేను ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ప్రతీ నెలా మొత్తం మీద రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇలా పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలన్నది నా ప్రణాళిక. తద్వారా రిటైర్మెంట్ కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాలకూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) తేదీ 15వ తేదీనే ఉంది. ఇలా ఉంటే ప్రతికూలమా? – విష్ణు కుమార్ మీ పెట్టుబడులను ప్రణాళికకు అనుగుణంగా కొనసాగించుకోండి. ప్రతీ నెలా అనుకున్నట్టుగానే, అనుకున్న రోజున నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లేలా చూసుకోండి. పెట్టుబడి కొనుగోలు వ్యయం సగటుగా మారడం వల్ల ప్రయోజనం లభిస్తుంది. దీర్ఘకాలంలో ఇది మెరుగైన ఫలితాన్నిస్తుంది. ఐదు మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లకు నెలలో భిన్నమైన తేదీలను నిర్ణయించుకోవడం అన్నది క్లిష్టమైనది. కనుక అన్నింటికీ ఒక్కటే తేదీ సిప్‌గా ఉండడం ప్రతికూలమేమీ కాదు. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే -
క్రిప్టోకరెన్సీలపై పూర్తి నిషేధమే మేలు: ఆర్బీఐ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. డిజిటల్ కరెన్సీ, ప్రైవేటు క్రిప్టోకరెన్సీలపై సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్టర్ల 592వ సమావేశంలో ఆర్బీఐ పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి నిషేధమే మేలు..! క్రిప్టో కరెన్సీలపై పూర్తిస్థాయి నిషేధం విధించాల్సిందేనని ఆర్బీఐ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలపై పాక్షిక ఆంక్షలు ఫలితాలు ఇవ్వబోవని ఆర్బీఐ బ్యాంకు బోర్డు సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం. క్రిప్టోలపై ఆర్బీఐ వైఖరిని సెంట్రల్ బోర్డు కూడా సమర్థించినట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీలను తీవ్రమైందిగా భావించాలని ఆర్బీఐ గవర్నర్ ఈ సమావేశంలో వెల్లడించారు. క్రిప్టో ఆస్తులను నియంత్రించడం కష్టంతో కూడుకున్న పని అని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో కొందరు సభ్యులు బ్యాలెన్స్డ్ విధానాలను అనుసరించాలని కోరారు. క్రిప్టో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎటువంటి వైఖరిని వెల్లడించలేదని తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ-2021 బిల్లుపైనా కూడా ఆర్బీఐ బోర్డు చర్చించింది. చదవండి: యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..! అయితే వీటిని కచ్చితంగా గుర్తుంచుకోండి..! -
హైటెక్ ఘరానా మోసగాళ్లు..! నమ్మించి సింపుల్‌గా రూ. 58 వేల కోట్లు స్వాహా..!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీలు భారీ ఆదరణను నోచుకున్నాయి. ఈ ఏడాదిలో క్రిప్టోకరెన్సీల మార్కెట్ విలువ కూడా గణనీయంగా పెరిగింది. పలు కొత్త క్రిప్టోకరెన్సీలు కూడా పుట్టుకొచ్చాయి. 2021లో క్రిప్టోలపై ఎంత ఆదరణను నోచుకుందంటే రగ్ పుల్స్(సైబర్ నేరస్తులు) సింపుల్‌గా లక్షలాది మంది ఇన్వెస్టర్లను నమ్మించి గొంతుకోశారు. ఈ ఏడాదిలో సుమారు అనేక స్కామ్‌ల ద్వారా రగ్ పుల్స్ ఏకంగా 7.7 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 58,697 కోట్లు)ను కాజేశారని డిజిటల్ కరెన్సీ పరిశోధన సంస్థ చైనాలిసిస్ వెల్లడిచింది. చదవండి: ఇది నిజమా? జూదాన్ని చట్టబద్ధం చేస్తే భారీ ఆదాయం! గత ఏడాదితో పోలిస్తే అధికం..! నకిలీ క్రిప్టో టోకెన్లను సృష్టించి ఆయా ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తంలో లాగేశారు రగ్‌పుల్స్. గత ఏడాదితో పోలిస్తే క్రిప్టో స్కామ్స్ 2021లో 81 శాతం మేర పెరిగాయని చైనాలిసిన్ పేర్కొంది. నకిలీ క్రిప్టోకరెన్సీలతో పలు ఇన్వెస్టర్లకు భారీ దెబ్బ తగలడంతో డిజిటల్ కరెన్సీలపై పెట్టుబడి పెట్టేందుకు ఒక్కింతా జంకుతున్నారని చైనాలిసిస్ వెల్లడించింది. స్క్విడ్ గేమ్ పేరుతో ఇన్వెస్టర్లకు కుచ్చు టోపి..! ఈ ఏడాది నవంబర్‌లో వచ్చిన స్క్విడ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను నోచుకుంది. స్క్విడ్ గేమ్ నుంచి ప్రేరణ పొందిన రగ్‌పుల్స్ స్క్విడ్‌గేమ్ అనే క్రిప్టో టోకెన్‌ను ప్రవేశపెట్టారు. ఈ టోకెన్‌పై ఇన్వెస్టర్లు ఏగబడ్డారు. అదును చూసుకొని రాత్రికి రాత్రే ఈ క్రిప్టోకరెన్సీ కనుమరుగైంది. ఈ టోకెన్‌తో సుమారు దాదాపు $3.3 మిలియన్లు (దాదాపు రూ. 22 కోట్లు)ను కాజేశారు. అసలు ఎవరీ రగ్‌పుల్స్..? రగ్ పుల్స్ సింపుల్‌గా చెప్పలాంటే..క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సైబర్ నేరస్తులు. వీరు హైటెక్ ఘరానా మోసగాళ్లు. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోపై వస్తోన్న ఆదరణను క్యాష్ చేసుకునే వారు. వీరు హైటెక్ డెవలపర్లు, డిజిటల్ కరెన్సీలో పలు టోకెన్లను సృష్టించి...వాటిపై ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగేలా చేసి అదును చూసుకొని ఇన్వెస్టర్లు పెట్టిన మొత్తం పెట్టుబడిని క్షణాల్లో ఉడ్చేశారు. సాధారణంగా వికేంద్రీకృత ఫైనాన్స్ (DeFi)లో రగ్ పుల్స్ ఎక్కువగా కనిపిస్తారు. చదవండి: 20 కోట్ల సార్లు కాల్స్..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్..! -
అమెరికాకు వచ్చినప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేదు: ఎలోన్ మస్క్
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ అమెరికాలో గడిపిన తన ప్రారంభ రోజుల గురించి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అసలు తాను విద్యార్థిగా అమెరికాకు వచ్చిన తొలిరోజుల్లో తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని గుర్తు చేసుకున్నారు. హోల్ మార్స్ కేటలాగ్ అనే వ్యక్తి మస్క్‌ను ప్రశంసిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు.. "ఎలోన్ మస్క్ 17 సంవత్సరాల వయస్సులో అమెరికాకు వచ్చాడు. అతను మన దేశానికి సంపద సృష్టించారు. మస్క్ మన ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎంతో ఆదాయాన్ని కల్పించారు, అలాగే అమెరికా దేశ ఎగుమతులను కూడా పెంచారు. నా అభిప్రాయం ప్రకారం, అతను జాతీయ భద్రతను ముందుకు తీసుకువెళ్ళాడు. మస్క్ మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఎంతో మందిని లక్షాధికారులను చేశారు’ అంటూ చాలా గొప్పగా చెప్పారు. లక్ష డాలర్ల రుణం.. ఆ వ్యక్తి చేసిన ట్వీట్‌కు మస్క్ బదులు ఇస్తూ ఇలా అన్నారు.. "నేను చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అమెరికాకు వచ్చాను. పాఠశాలలో ఉన్నప్పుడే రెండు ఉద్యోగాలు చేశాను. స్కాలర్షిప్ వంటివి వచ్చినప్పటికీ నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేనాటికి లక్ష డాలర్ల రుణం ఉంది" అని మస్క్ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. మస్క్ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే 48 వేల మందికి పైగా ఆ ట్వీట్‌ను లైక్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్ మస్క్ టైమ్ మ్యాగజైన్ "2021 పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికచేయబడ్డారు. I came to the US with no money & graduated with over $100k in debt, despite scholarships & working 2 jobs while at school — Elon Musk (@elonmusk) December 16, 2021 క్రిప్టో మార్కెట్‌ను శాసిస్తున్న మస్క్ సోషల్ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో మార్కెట్‌ను ఒకే ఒక్క ట్వీట్‌తో శాసిస్తూ వస్తున్నాడంటూ మ్యాగజైన్ కూడా ఆకాశానికి ఎత్తేసింది. సోలార్, రోబోటిక్స్, క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఎన్నో రంగాల్లో తన సత్తా చాటుతున్న మస్క్.. 250 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అపర కుబేరుడు ఎలోన్ మస్క్ కెరీర్ తొలిరోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడినట్లు ఆయనే స్వయంగా చెప్పడం ఎంతో మంది యువపారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిని కలిగిస్తోంది. (చదవండి: Electric Mobility: ఐదేళ్లు.. రూ. 94,000 కోట్ల పెట్టుబడులు) -
క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్..!
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. వివిధ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కోరుతుండగా... ఈ నిర్ణయాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) మద్దతు తెలిపింది. కాగా త్వరలోనే ఐఎమ్ఎఫ్కు డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ పదవి స్వీకరించనున్న ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసింది. చదవండి: చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్.. ఎక్కాలే రాని చిన్నారి.. ఇప్పుడు ఏకంగా ఐఎంఎఫ్‌లో నెం.2!! నిషేధం బదులుగా..నియంత్రణే మేలు..! నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) నిర్వహించిన కార్యక్రమంలో గీతా గోపినాథ్ క్రిప్టోకరెన్సీలపై వ్యాఖ్యానించారు. క్రిప్టోకరెన్సీలను నిషేధించే బదులుగా వాటిని నియంత్రణలోకి తీసుకురావడం చాలా మంచిదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందే దేశాల ఆర్థిక వ్యవస్థలకు క్రిప్టోకరెన్సీలు ప్రత్యేక సవాలుగా నిలుస్తాయని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు క్రిప్టోకరెన్సీలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు . అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు మారకపు రేటు నియంత్రణలను కలిగి ఉంటాయి. మూలధన ప్రవాహ నియంత్రణలను క్రిప్టోకరెన్సీలు ప్రభావితం చేసే అవకాశం ఉందని గీతా పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలను ఇన్వెస్టర్లు ఒక పెట్టుబడి ఆస్తిలాగానే ఉపయోగిస్తున్నారని, ఆయా దేశాల్లో పెట్టుబడికి సంబంధించిన నియమాలను డిజిటల్ కరెన్సీపై కూడా వర్తించేలా చూడాలని గీతా సూచించారు. భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తున్న తరుణంలో గోపీనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23తో ముగియనున్నాయి. కాగా క్రిప్టోకరెన్సీ బిల్లుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం బిల్లును తెచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ప్రధాని మోదీని కలిసిన ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ -
క్రిప్టోకరెన్సీ.. కీలక నిర్ణయం దిశగా ఆర్బీఐ
RBI On Cryptocurrency Control And Digital Currency: క్రిప్టోకరెన్సీ నియంత్రణ చట్టం విషయంలో కేంద్రం ఆచితూచీ వ్యవహరించాలని నిర్ణయించుకుంది. క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని ఓవైపు చెబుతూనే.. వాటిని ఆస్తులుగా పరిగణించే దిశగా చట్టంలో మార్పులు చేసినట్లు సంకేతాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో తన స్టాండర్డ్‌ను ప్రకటించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఈ మేరకు డిసెంబర్ 17న లక్నో(ఉత్తర ప్రదేశ్)లో జరగబోయే ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చింది ఆర్బీఐ. ఆర్బీఐ తరపు నుంచి డిజిటల్ కరెన్సీని(క్రిప్టో పేరుతో కాకుండా) జారీ చేయడం? దాని రూపు రేఖలు.. ఎలా ఉండాలనే అంశాలపై ఓ నిర్ణయానికి రానుంది. ఇక ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?.. ఒకవేళ ప్రైవేట్ క్రిప్టో నియంత్రణ బాధ్యతల్ని ముందుగా అనుకున్నట్లు సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి కేంద్రం అప్పగిస్తే.. ఆ నిర్ణయాన్ని స్వాగతించాలా? లేదంటే వ్యతిరేకించాలా? అనే విషయాలపై బోర్డులో చర్చించనుంది ఆర్బీఐ. క్లిక్ చేయండి: క్రిప్టోతో పెట్టుకోవడం ఆర్బీఐకి మంచిది కాదు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం (13 డిసెంబర్, 2021)న ఆర్థిక మంత్రిత్వ శాఖ.. క్రిప్టోకరెన్సీ కోసం బిల్లు, నియంత్రణ మీద బిల్లు తుది రూపానికి వచ్చిందని, కేబినెట్ అంగీకారం ఒక్కటే మిగిలిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ వేగం పెంచింది. నిజానికి 17వ తేదీన జరగబోయే ఆర్బీఐ బోర్డు మీటింగ్ ఎజెండాలో ఈ కీలకాంశం ప్రస్తావనే లేదు!. కానీ, ఇలా ఎజెండాలో లేని కీలకాంశాలపై చర్చించడం బోర్డుకు కొత్తేం కాదని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. చదవండి: క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఎలా జరుగుతాయో తెలుసా? -
బిట్‌కాయిన్ గాలి తీసేసిన బిలియనీర్ కింగ్
క్రిప్టోమార్కెట్లో అతిపెద్ద డిజిటల్ కరెన్సీగా బిట్‌కాయిన్‌కి పేరుంది. అలాంటిది బిట్‌కాయిన్ కంటే.. ఎక్కడో క్రిప్టోకరెన్సీ జాబితాలో అట్టడుగున ఉండే మీమ్ కాయిన్ డోజ్‌కాయిన్‌కు ప్రయారిటీ ఇవ్వాలంటున్నాడు ఎలన్ మస్క్. బిలియనీర్ ఎలన్ మస్క్ టైమ్ మ్యాగజైన్ వారి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ ఘనత దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో టైమ్ ఇంటర్వ్యూలో క్రిప్టోకరెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎలన్ మస్క్. క్రిప్టో కరెన్సీని ప్రచారం చేసే ఎలన్ మస్క్.. బిట్‌కాయిన్ వరెస్ట్ అని, దీంతో పోలిస్తే డోజ్కాయిన్ చాలా బెస్ట్ అని చెప్తున్నాడు. అందుకు కారణాలేంటో కూడా వివరించాడాయన. రోజూవారీ ట్రాన్జాక్షన్స్ పరంగా చూసుకుంటే.. డోజ్‌కాయిన్‌ను బెటర్ క్రిప్టోకరెన్సీగా అభివర్ణించాడు. ‘బిట్‌కాయిన్ ట్రాన్జాక్షన్ వాల్యూ తక్కువ. ట్రాన్జాక్షన్కు అయ్యే ఖర్చు ఎక్కువ. ఒకానొక స్థాయిలో దాచుకోవడానికి ఇది పర్వాలేదనిపించొచ్చు. కానీ, ప్రాథమికంగా ట్రాన్జాక్షన్ కరెన్సీకి బిట్‌కాయిన్ ప్రత్యామ్నాయం కాదు’ అని పేర్కొన్నాడు ఎలన్ మస్క్. డోజ్‌కాయిన్‌ను హైలెట్ చేయడం జోక్‌గా మీకు అనిపించొచ్చు. కానీ, ట్రాన్జాక్షన్స్ పరంగా చూసుకుంటే ఇదే బెస్ట్. బిట్‌కాయిన్ ఒకరోజులో చేసే ట్రాన్జాక్షన్స్ కంటే డోజ్కాయిన్ చేసే ట్రాన్జాక్షన్స్ ఎక్కువ. పైగా డోజ్కాయిన్ అనేది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. బిట్కాయిన్లలాగా నిల్వ గురించి కాకుండా.. జనాల చేత ఖర్చు చేయిస్తుంది. అలా ఇది ఎకామనీకి మంచిదే కదా అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఎలన్ మస్క్. ఇదిలా ఉంటే క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ విలువ నష్టాల్లోనే నడుస్తోంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో పాటు భారత్‌లో క్రిప్టో పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నేపథ్యంలో బిట్‌కాయిన్ విలువ పడిపోతూ ట్రేడ్ అవుతోంది. Watch: TIME's 2021 Person of the Year @elonmusk discusses cryptocurrency #TIMEPOY https://t.co/FfwEGxW7LX pic.twitter.com/5BXAZky0LS — TIME (@TIME) December 13, 2021 చదవండి: కనిపించని కరెన్సీ గురించి తెలుసా..! -
పన్ను పోటు లేని ప్రదేశం.. క్యూ కడుతున్న కోటీశ్వరులు
ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు చాలా దేశాల్లో కఠినతరంగా అమలు అవుతున్నాయి. ఒకరకంగా చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే.. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే చట్టపు మినహాయింపులతో కొంచెం ఊరట లభిస్తోంది. ఈ తరుణంలో అమెరికా, ఇతర దేశాల నుంచి పన్ను పోటును తప్పించుకునేందుకు ఓ చిన్న కరేబియన్ ద్వీపానికి క్యూ కడుతున్నారు క్రిప్టో కుబేరులు. ప్యూర్టో రికా.. మూడున్నర వేల చదరపు మైళ్ల విస్తీర్ణం, 32 లక్షలకు పైగా జనాభా ఉన్న చిన్న కరేబియన్ టెర్రిటరీ. కార్యనిర్వాహణ, కరెన్సీ మొత్తం వ్యవహారాలన్నీ అమెరికా దేశ పరిధిలోనే నడుస్తోంది. ఈ దీవిలోని సెయింట్ రెగిస్ బహియా బీచ్ రిసార్ట్ ఇప్పుడు తెర మీద చర్చనీయాంశంగా మారింది. 483 ఎకరాల ప్రకృతి రిజర్వ్‌లో గోల్ఫ్ కోర్స్, సముద్ర ముఖ నివాసాలు ఉంటాయి ఈ రిసార్ట్‌లో. కానీ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి హాట్ డిమాండ్ ఏర్పడింది. పన్ను మినహాయింపులతో కూడిన ఆ రిసార్ట్ వెబ్సైట్ చూసి.. అక్కడికి క్యూ కడుతున్నారు క్రిప్టో కోటీశ్వరులు. ఒకరి తర్వాత ఒకరు.. ఐకిగాయ్ అసిస్టెంట్ మేనేజర్ ఆంటోనీ ఎమ్ట్మ్యాన్.. ఈ ఏడాది మార్చ్‌లో లాస్ ఏంజెల్స్‌ను వీడి ఈ దీవిని కొనుగోలు చేసి సెటిల్ అయ్యాడు. క్రిప్టో కమ్యూనిటీ మొత్తం ప్యూర్టో రికా క్యూ కట్టడానికి మూల కారణం ఇతగాడే. ఇక ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిణి, విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సిస్ హ్యూగెన్ కూడా.. ప్యూర్టో రికోలో తన క్రిప్టో స్నేహితులతో కలిసి జీవించనున్నట్లు ఈ మధ్యే ప్రకటించారు. మరోవైపు న్యూయార్క్ మేయర్-ఎలెక్ట్ ఎరిక్ ఆడమ్స్ కిందటి నెలలో క్రిప్టో బిలియనీర్ బ్రాక్ పియర్స్‌తో కలిసి ప్యూర్టో రికా గవర్నర్పెడ్రోతో కలిసి ఏకంగా డిన్నర్ చేశాడు. ఇలా అమెరికా కుబేరులు.. ప్రత్యేకించి డిజిటల్ కరెన్సీతో సంబంధం ఉన్నవాళ్లంతా ఇప్పుడు ఈ దీవి పట్ల ఆసక్తికనబరుస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ నామమాత్రమే! క్రిప్టో కుబేరులంతా ప్యూర్టో రికాకు క్యూ కట్టడానికి కారణం.. ఇక్కడ పన్ను మినహాయింపులు ఉండడం. అవును కొత్తగా వస్తున్న నివాసితులంతా.. తాము సంపాదించే దాని మీద నామమాత్రపు పన్ను ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. పైగా క్రిప్టో కరెన్సీ విషయంలో ఆ మినహాయింపు ఇంకా ఎక్కువే ఉంది. అదెందుకో చెప్పే ముందు.. అసలు వాళ్లు అమెరికాను ఎందుకు వీడుతున్నారో చూద్దాం.. అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం.. అమెరికాలో ఇన్వెస్టర్లు 37 శాతం తక్కువ రాబడి వచ్చినా సరే 20 శాతం దాకా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు కుబేరుల నుంచి మరింత పన్నులు వసూలు చేయాలంటూ బైడెన్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు డెమొక్రట్లు. ఈ ప్రయత్నాలతో పాటు కొత్తగా రాబోతున్న చట్టాలతో మిలీయనీర్లకు, బిలీయనీర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఈ క్రమంలోనే తమకు ‘మినిమమ్’ ట్యాక్స్ వెసులుబాటు అందిస్తున్న కరేబియన్ ద్వీపం ప్యూర్టో రికాకు తరలిపోతున్నారు. లోకల్ కంటే నాన్-లోకల్‌కే.. ప్యూర్టో రికా చట్టాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇక్కడి శాశ్వత నివాసితులు ఫెడరల్ ట్యాక్సులు కట్టాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల మీద వాళ్లకొచ్చే ఆదాయం ఆధారంగా చెల్లించాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. అదే అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చే ‘బోనా ఫైడ్ రెసిడెన్స్’ నామినల్ ట్యాక్సుల కింద 4 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్యూర్టో రికా ట్యాక్స్ చట్టం.. స్థానికుల కంటే పొరుగు వాళ్లకే ఎక్కువ లాభం చేకూరుస్తోందన్నమాట. అందుకే ఇప్పుడు ప్రతీ కుబేరుడి చూపు అటువైపు ఉంటోంది. ఇది తట్టుకోలేకే ప్యూర్టో రికా ప్రజలు.. యూఎస్ఏలో 51వ దేశంగా ప్యూర్టో రికాను గుర్తించాలని పోరాటాలు చేస్తున్నారు. తద్వారా తమకు దక్కని మినహాయింపులు.. ఇతరులకు దక్కడంపై వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. మినహాయింపు కారణం.. కరెన్సీ కొరత, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు 2012 లో ప్యూర్టో రికన్ ప్రభుత్వం ట్యాక్స్ చట్టానికి సవరణ చేసి.. మినహాయింపులు ఇచ్చింది. ఈ కారణంతోనే రియల్ ఎస్టేట్ ధరలు ఈ నేలపై ఎప్పుడో ఆకాశాన్ని అంటాయి. నిజానికి 2017లోనే క్రిప్టో కరెన్సీ రన్ కొనసాగుతున్నప్పుడు.. ఎంతో మంది ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ, ఆ టైంలో ఆ ఐడియా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ ఏడాది క్రిప్టో బూమ్ కొనసాగుతుండడంతో ఏకంగా 1,200 అప్లికేషన్లు ‘ఇన్వెస్టర్స్ యాక్ట్’ ప్రకారం దాఖలు అయ్యాయట. దీంతో క్యాపిటల్ గెయిన్(సంపాదన) మీద పైసా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక అమెరికా నుంచి వస్తున్న ఈ అప్లికేషన్ల సంఖ్య గతంలో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని రిపోర్టులు చెప్తున్నాయి. ఇదే తొలి కాదు.. చివరా కాదు క్రిప్టో మార్కెట్స్ పెరుగుదల, రిమోట్ వర్క్ కారణంగా చాలా మంది ప్యూర్టో రికాలో సెటిల్ అయ్యేందుకు, బిజినెస్ లావాదేవీల కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రిసార్ట్ కమ్యూనిటీలో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. పంటేరా క్యాపిటల్, రెడ్‌వుడ్ సిటీ వెంచర్స్.. కార్యాలయాలు నెలకొల్పి జోరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్యూర్టో రికా రాజధాని శాన్ జువాన్‌కి 26 మైళ్ల దూరంలోని బహియా, డోరాడో బీచ్ రీసార్ట్, కొండాడో (శాన్ జువాన్లోని సిటీ).. డిమాండ్ ఊపందుకుంటోంది. మినీ మియామీగా కొండాడోను అభివర్ణిస్తున్నారు. ట్యాక్స్ బచాయించడానికి ఇక్కడికి చేరుకుంటున్న క్రిప్టో కుబేరులు.. డిసెంబర్ 6న ఏకంగా బ్లాక్‌చెయిన్ వీక్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఒకరకంగా ‘బ్లాక్‌చెయిన్ క్యాపిటల్’గా గుర్తింపు దక్కిందని చెప్తున్నారు బిట్యాంగిల్స్ ఫౌండర్ మైకేల్ టర్పిన్. అయితే ఇలా డిజిటల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ప్రాంతంగా ప్యూర్టో రికా మొదటిదేం కాదు. చివరిది కూడా కాదు. చిన్న దేశం ఎల్ సాల్వడర్ ఇందులో(బిట్ కాయిన్‌కి అధికారికత కట్టబెట్టడం..తయారీ) ఎప్పటి నుంచో ముందంజలో ఉంది. ఇక పోర్చుగల్ కూడా క్రిప్టోకరెన్సీ క్రయవిక్రయాల మీద ట్యాక్స్‌లు విధించకుండా(ప్రధాన ఆదాయ వనరు కానంత వరకే).. డిజిటల్ మార్కెట్‌ను ఆకట్టుకుంటోంది. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
కొత్త ఏడాది ‘కొత్త’ ముసుగుతో చెలరేగిపోనున్న సైబర్ దొంగలు!
2021కు ముగుస్తోంది. కొత్త ఏడాది.. కొత్త ఆశలతోపాటు... కొత్త సమస్యలు కూడా ఉండబోతున్నాయన్నది నిపుణుల మాట. సైబర్ సెక్యూరిటీ విషయంలో రానున్న 12 నెలలు ఎంతో ఆసక్తికరమని అంటోంది ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ ల్యాబ్స్. క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం దక్కుతున్న తరుణంతో దీన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వాళ్లూ ఎక్కువవుతారని, అకాల వర్షాలు, వరదల్లో చిక్కుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ స్కామర్లు కొంగొత్త స్కీములు రచిస్తారని అంచనా వేస్తోంది. అంతేకాదు.. వీటన్నింటి విరుగుడే లక్ష్యంగా సైబర్ ఆక్టివిజమ్ కూడా ఊపందుకుంటుందని చెబుతోంది. 2022 సంవత్సరంలో సైబర్ ప్రపంచంలో సంభవించగల ఐదు అంశాలు.. నార్టన్ ల్యాబ్స్ అంచనాల మేరకు... క్రిప్టో కరెన్సీ తోడుగా... 2022లో క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల వినియోగానికి అంగీకరించే కంపెనీలు పెరుగుతాయి. అదే సమయంలో ఈ డిజిటల్ కరెన్సీ తీరుతెన్నులు తెలియని అమాయకులను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కాయిన్లు ఉచితంగా ఇస్తున్నామని కొందరు, నకిలీ యాప్‌లతో ఇంకొందరు ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ఆధారిత నేరాలకు పాల్పడుతుండగా.. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త కుయుక్తులు పన్నే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐడీలు? వర్క్ ఫ్రమ్ హోమ్, జూమ్ కాల్, ఆన్లైన్లో అవసరమైనవి తెప్పించుకోవడం... కరోనా కారణంగా ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిన కార్యక్రమాలివి. ఈ క్రమంలోనే స్మార్ట్ఫోన్లతో అవసరమైన డాక్యుమెంట్లను అటూ ఇటూ పంపుతుండటమూ కద్దు. అయితే వీటితో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో మరింత సురక్షితమైన రీతిలో మన వ్యక్తిగత వివరాలను పంపేందుకు వాటిని గుర్తించే అవసరం ఏర్పడింది. కంప్యూటర్ రంగంలో ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందిన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం వచ్చే ఏడాది జరగనుంది. ఎలక్ట్రానిక్ ఐడీ లేదా ‘ఈఐడీ’ పేరుతో బ్లాక్‌చెయిన్ ఆధారిత గుర్తింపు కార్డుల జారీకి కొన్ని ప్రభుత్వాలూ పట్టుబడుతున్నాయి. సైబర్ నిరసనలు, ఉగ్రవాదమూ... సైబర్ టెర్రరిజమ్, ఆక్టివిజమ్ 2021లోనూ భారీగానే నడిచింది. కాకపోతే వచ్చే ఏడాది ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బు కోసం నేరాలకు పాల్పడటం సైబర్ క్రిమినల్స్ చేసే పనైతే.. హ్యాకింగ్ మాత్రం కొన్నిసార్లు నిరసనలకూ ఉపయోగపడుతున్నాయి. హ్యాక్టివిస్టులంటారు ఇలా నిరసనలకు పాల్పడే వారిని! ఈ రకమైన హ్యాక్టివిజమ్ వచ్చే ఏడాదీ కొనసాగనుంది. ప్రభుత్వాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని బహిరంగపరచడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. నేరగాళ్లకూ అండగా ఏఐ... మానవాళి మరికొంచెం సుఖంగా ఉండేందుకు కృత్రిమ మేధ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వచ్చే ఏడాది ఈ అత్యాధునిక టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల పని కూడా సులువు చేయనుంది. డీప్‌ఫేక్ వంటి టెక్నాలజీల కారణంగా అసలు, నకిలీల మధ్య అంతరం చెరిగిపోతుండటాన్ని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకోనున్నారు. కష్టాల్లో డబ్బులేరుకునే రకాలు... మనిషి కష్టాలతో కూడా డబ్బులు సంపాదించుకునే రకాలు 2022లో మరింత ఎక్కువవుతారు. చోరీ చేసిన సమాచారం సాయంతో ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బు లాగేసేందుకు వీరు ప్రయత్నిస్తారు. -
క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఎలా జరుగుతాయంటే..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీ ఆదరణ లభిస్తోంది. క్రిప్టోకరెన్సీతో ఎలాంటి మోసాలకు తావు ఉండదు. ఎందుకంటే లావాదేవీలు మొత్తం పూర్తిగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో నడుస్తాయి. అసలు ఈ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తోంది, వాటి ప్రయోజనాలు ఎలా ఉంటాయనే విషయాల గురించి తెలుసుకుందాం... బ్లాక్‌చెయిన్‌తో బోలెడు ప్రయోజనాలు... బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో కేవలం క్రిప్టో కరెన్సీ వ్యవహారాలు మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 1. నగదు చెల్లింపులు/వసూళ్లు 2. స్టాక్ ఎక్స్చేంజీ తరహా ఆర్థిక వ్యవహారాలు 3. ఇన్సూరెన్స్ సేవలు. 5. రియల్ ఎస్టేట్. 6. వ్యక్తిగత సమాచార భద్రత 7. ఎన్నికల ఓటింగ్: మీ వ్యక్తిగత సమాచారం మొత్తం బ్లాక్చెయిన్లలో ఉంటుంది. కాబట్టి దాని ఆధారంగా ఓటింగ్ నిర్వహించడం సులువు. భద్రంగా, ఎలాంటి అవ్యవహారాలకు తావు లేకుండా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ 8. ప్రభుత్వ ఫథకాల వితరణ: రేషన్ సరుకుల నుంచి ఇళ్లపట్టాల వరకూ ప్రతి ఒక్కటి అర్హులకు మాత్రమే దక్కేలా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయపడుతుంది. మోసాలకు తావులేదు. అమలు చాలా చౌక కూడా. డిజిటల్ వ్యవహారాల కంటే వేగంగా లబ్ధిదారులకు సాయం అందుతుంది. 9. ఇంటర్నెట్కు అనుసంధానమైన పరికరాల (ఐఓటీ) భద్రత. బ్లాక్ చెయిన్ పనిచేసేదిలా... కొనుగోలు, కాంట్రాక్ట్ వంటి వ్యవహారం కోసం అభ్యర్థన ఈ అభ్యర్థన నెట్‌వర్క్‌లోని కంప్యూటర్ల (నోడ్)కు ప్రసారమవుతుంది. అభ్యర్థన తాలూకు సమాచారంతో ఒక బ్లాక్ ఏర్పడుతుంది. నోడ్ కంప్యూటర్లు ఆమోదిస్తాయి. అప్పటికే ఉన్న బ్లాక్‌లకు ఈ కొత్త బ్లాక్ లింక్ ఏర్పరచుకుని నిక్షిప్తమవుతుంది. ఇలా బ్లాక్‌ల శ్రేణి ఉండటం వల్లనే దీన్ని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అంటారు. ఇతర అంశాల సమాచారంతో కలిపి ఈ వ్యవహారానికి సంబంధించిన ఒక బ్లాక్ సిద్ధమవుతుంది. వ్యవహారంలో క్రిప్టోకరెన్సీ, స్మార్ట్కాంట్రాక్ట్, మెసేజీల్లాంటి ఏ సమాచారమైనా ఉండవచ్చు. ప్రతి బ్లాక్‌లోని సమాచారం భద్రంగా ఉంటుంది. మార్పులు చేయాలంటే.. ఆ వ్యవహారంలో పాల్గొన్న నోడ్ల అనుమతి తప్పనిసరి. చదవండి: కనిపించని కరెన్సీ గురించి తెలుసా..! -
కనిపించని కరెన్సీ గురించి తెలుసా..!
‘ధనమేరా అన్నిటికీ మూలం...ఆ ధనము విలువ తెలుసుకొనుటె మానవ ధర్మం’ అంటాడు ఓ సినీకవి. అక్షర సత్యమే. కానీ ఇప్పుడంటే బ్యాంకులు ప్రభుత్వాలు ఇన్ని నోట్లు ముద్రించి.. వాటికి విలువను నిర్దేశిస్తున్నాయి కానీ.. ఒకప్పుడు ఇవేవీ లేవు. వస్తువులకు, సేవలకు విలువ కట్టి అంతకు సమానమైన విలువ అని భావించి మార్పిడి చేసుకున్న దశ నుంచి... బంగారం తదితరాలను విలువకు ప్రమాణంగా చేసుకోవడం.. తరువాతి కాలంలో బ్యాంకు నోట్లు.. క్రెడిట్/డెబిట్ కార్డుల వరకూ ధనం అనేక విధాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ పరిణామక్రమంలో తాజా మజిలీ క్రిప్టో కరెన్సీ!! బిట్‌కాయిన్ అనండి.. ఎరిథ్రియం అనండి.. లేదా ఇంకోటి అని పిలవండి... అన్నీ హైటెక్ యుగపు డిజిటల్ టెక్నాలజీ ప్రతిరూపాలే! పలుదేశాల్లో ఇప్పటివకే విస్తృత వాడకంలో ఉన్న ఈ క్రిప్టో కరెన్సీ.. దాంతో చేసే వ్యవహారాలపై దేశాద్యంతం చర్చలు జరుగుతున్న తరుణంలో ఒక్కసారి.. దీని గతం.. వర్తమానం.. భవిష్యత్తులను సమీక్షిస్తే... ఈమధ్యకాలంలో క్రిప్టో కరెన్సీ గురించి బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. తక్కువకాలంలో ఎక్కువ లాభాలకు ఇవి మేలు మార్గాలన్న ప్రచారం జరుగుతోంది. స్టాక్ మార్కెట్లో కంపెనీల షేర్ల మాదిరిగానే క్రిప్టో వ్యవహారాల కోసం ఎక్సే్చంజీలూ పుట్టుకొచ్చాయి. బోలెడన్ని టీవీ, న్యూస్ పేపర్ ప్రకటనలూ కనిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అతితక్కువ మందికి మాత్రమే తెలుసు. అబ్బే.. అదంతా హైటెక్ వ్యవహారం. మనకర్థం కాదులే అనే వాళ్ల మాటేమో కానీ.. ఈ కథనం పూర్తయ్యేలోపు ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థను మీరు ఎంతో కొంత అర్థం చేసుకోవడం గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం? చదివేయండి మరి.. చిన్నప్పుడు కాగితపు నోట్లతో ఆడుకున్న గుర్తుందా మీకు? క్రిప్టో కరెన్సీ కూడా దాదాపు ఇలాంటిదే. కాకపోతే డిజిటల్ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది. పైగా ఈ కరెన్సీని చూడవచ్చు. వాడుకోవచ్చు కానీ.. అసలు నోట్లు, నాణేల మాదిరిగా ముట్టుకోలేము. పర్సుల్లో దాచుకోలేము. అన్నీ ఇంటర్నెట్లోనే! ఇంకో సంగతి. వంద రూపాయల నోటు విలువ... ప్రభుత్వం రద్దు చేయనంత వరకూ అంతే ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీకి ఉండే విలువ మాత్రం.. చెల్లించే వారిపై ఆధారపడి హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది. ఫలానా క్రిప్టో కరెన్సీకి డిమాండ్ బాగా ఉంది.. కానీ సరఫరా తక్కువ ఉందీ అంటే విలువ పెరుగుతుంది. అలాగే మైనింగ్ పద్ధతి ద్వారా ఒక క్రిప్టో నాణేన్ని ఉత్పత్తి చేసేందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశంపై కూడా దాని విలువ ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో ఉన్న ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా ఒక్కోదాని విలువను నిర్ణయిస్తూంటాయి. డాలర్, యూరో... ఎన్, యాన్, రూపాయిల మాదిరిగానే క్రిప్టో ప్రపంచంలో బిట్‌కాయిన్, ఎరిథ్రియం, రిపుల్, లైట్‌కాయిన్, కార్డానో బిట్‌కాయిన్ క్యాష్ అని బోలెడన్ని వేర్వేరు కరెన్సీలు ఉన్నాయి! ప్రహేళికలు పరిష్కరిస్తే.. కాయిన్ బహుమతులు! రూపాయిలు, డాలర్లంటే.. ఉద్యోగం, వ్యాపారం ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటాం. మరి డిజిటల్ కరెన్సీ క్రిప్టో రూకల మాటేమిటి? ఇందుకోసం ప్రస్తుతం అనేక మార్గాలున్నాయి. కొన్ని కంపెనీలు ఈ–కామర్స్ వ్యవహారాలకు సాధారణ నగదును స్వీకరించి అందులో కొంత భాగాన్ని మనకు క్రిప్టో కరెన్సీ రూపంలో ఇస్తున్నాయి కూడా. ఇంకో పద్ధతి ఏమిటంటే.. అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్ అల్గారిథమ్ ద్వారా సృష్టించిన ఒక గణితశాస్త్రపు చిక్కుముడిని విప్పడం. దీన్నే మైనింగ్ అంటారు. ఇక మూడో పద్ధతి. ఎవరో మైనింగ్ ద్వారా సంపాదించుకున్న కరెన్సీని ఎక్సే్చంజీల్లో డబ్బులు పెట్టి కొనుక్కోవడం. దాని విలువ పెరిగితే మనకూ లాభాలొస్తాయని వేచిచూడటం. అచ్చం స్టాక్ ఎక్సే్చంజీల మాదిరిగా అన్నమాట. మైనింగ్ వ్యవహారం మొత్తం బిట్‌కాయిన్‌తో మొదలైనప్పటికీ ఇప్పుడు దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలూ ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలు మొత్తం పనిచేసేది బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగానే. సమాచారం అత్యంత భద్రంగా ఉంచేందుకు ఉపయోగపడే ఈ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని క్రిప్టో కరెన్సీలను తవ్వి తీసుకునేందుకు మాత్రమే కాకుండా.. ఇతర అవసరాలకూ వాడుకోవచ్చు. క్రిప్టో కరెన్సీతో లాభాలేమిటి? మోసాలకు తావే లేదు: క్రిప్టో కరెన్సీ మొత్తం డిజిటల్ వ్యవహారం. పైగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయంతో నడుస్తుంది. కాబట్టి ఇందులో మోసాలకు అస్సలు తావు ఉండదు. చెల్లింపులైనా, ఒప్పందాలైనా డిజిటల్ ప్రపంచపు నెట్‌వర్క్‌లో అందరికీ అందుబాటులోనే ఉంటాయి కానీ.. ఏ ఒక్కరు కూడా అందులో మార్పులు చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ చేస్తే ఆ మార్పుకు నెట్‌వర్క్‌లోని మిగిలిన వారందరూ ఓకే అనాలి కాబట్టి మోసం చేయాలని ఎవరైనా అనుకున్నా సాధ్యం కాదు. పైగా మార్పులు చేసేందుకు చేసిన ప్రయత్నం కూడా డిజిటల్ రూపంలో భద్రంగా నిక్షిప్తమవుతుంది కాబట్టి.. దొంగ ఇట్టే దొరికిపోతాడు!! వ్యక్తిగత వివరాలు భద్రం క్రెడిట్/డెబిట్ కార్డుతో ఏం చేసినా మన కొనుగోళ్ల వ్యవహారాలు మొత్తం అవతలివైపు వారికి అందుబాటులోకి వచ్చేస్తాయి. క్రిప్టో కరెన్సీతో ఈ సమస్య ఉండదు. కార్డు ద్వారా డబ్బు తీసుకునేందుకు బ్యాంకులు, ఇతర సంస్థలు ‘పుల్’ అంటే డబ్బు కావాలని అడగడం.. అకౌంట్ నుంచి లాక్కోవడం జరగుతుంది. క్రిప్టో వ్యవహారం దీనికి భిన్నం. డబ్బు కావల్సిన వ్యక్తి/సంస్థకు ‘పుష్’ పద్ధతిలో మన అకౌంట్ నుంచి తగిన విలువ మాత్రమే అందుతుంది. మిగిలిన వివరాలేవీ ఉండవు. మధ్యవర్తుల్లేకుండా ఇల్లు, పొలం లేదా ఇంకేదైనా స్థిరాస్తి కొన్నప్పుడు సహజంగా డీలర్లు, బ్రోకర్లు, న్యాయవాదులు (ఒప్పందం రాసుకునేందుకు) వంటి మధ్యవర్తుల ప్రమేయం వచ్చేస్తుంది. క్రిప్టో వ్యవహారాల్లో వీరి అవసరం ఏమాత్రం ఉండదు. అమ్మే, కొనేవాళ్లు ఇద్దరి మధ్య మాత్రమే వ్యవహారం ఉండిపోతుంది. అదే సమయంలో సాక్షుల మాదిరిగా నెట్‌వర్క్‌లోని వారందరూ ఒప్పందాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది. అందరికీ అందుబాటులో క్రిప్టో వ్యవహారాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 466 కోట్ల మంది ఈ వ్యవహారాలను నడపవచ్చునన్నమాట. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్/డెబిట్ కార్డులు వంటివేవీ లేకుండానే! అంతా ఉచితమే ప్రస్తుతానికి క్రిప్టో వ్యవహారాలకు సంబంధించినంత వరకూ ఎలాంటి ఛార్జీలూ లేవు. ప్రాథమికంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వ్యవహారం కావడం దీనికి కారణం. అయితే క్రిప్టో కరెన్సీలను మార్చుకోవడం వంటి విషయాల్లో ఇటీవలే మొదలైన కొన్ని ఎక్సే్చంజీల్లో మాత్రం కమిషన్ల రూపంలో కొంత విలువను చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఇబ్బందులేవీ లేవా? బోలెడు. ముందుగా చెప్పుకున్నట్లు క్రిప్టో కరెన్సీ వ్యవహారాలన్నీ ప్రైవేట్ వ్యక్తులతో కూడిన నెట్వర్క్లలోనే జరుగుతూంటాయి. పర్యవేక్షించేందుకు, నియంత్రించేందుకు అధికారిక సంస్థలంటూ ఏవీ ఉండవు. దీనివల్ల లాభాలెన్నో... నష్టాలూ అన్నే ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది హెచ్చుతగ్గుల గురించి... బిట్‌కాయిన్ కానివ్వండి, ఇంకో క్రిప్టోకరెన్సీ ఏదైనా కానివ్వండి.. ప్రతిరోజూ విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది. ఒక రోజు లక్షల్లో పలికిన క్రిప్టో విలువ మరుసటి రోజే రూపాయిల్లోకి పడిపోవచ్చు. కాబట్టి క్రిప్టోలో పెట్టుబడులతో లక్షలు, కోట్లు ఆర్జించేయవచ్చు అనుకునేవారు కొంచెం జాగ్రత్త వహించడం మేలు. ఈ స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అందరికీ మాత్రం కాదు. వందలో 90 శాతం మంది నష్టపోయేందుకే అవకాశాలు ఎక్కువని కొంతమంది నిపుణులు చెబుతూండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. బోలెడన్ని కట్టుబాట్లు, నిబంధనలు ఉన్న స్టాక్మార్కెట్లోనూ స్కామ్‌లు జరుగుతున్నట్లే క్రిప్టో వాణిజ్య ప్రపంచం లోనూ మోసగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బిట్‌కాయిన్ వ్యవహారాలు నడిపేవారిలో 25 శాతం మంది అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అలాగే 46 శాతం వ్యవహారాలు అక్రమాలకు సంబంధించినవి. మత్తుపదార్థాలు, ఆయుధాల విక్రయం వంటివన్నమాట. అన్ని రకాల క్రిప్టో కరెన్సీలను పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంచుతారన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. బిట్కాయిన్ల సంఖ్య 2.1 కోట్లు మించదని ఇందుకు తగ్గ పద్ధతులు బ్లాక్‌చెయిన్ అల్గారిథమ్లోనే ఉన్నాయని చెబుతారు. అయితే మఖలో పుట్టి పుబ్బలో చచ్చినట్లు ఇప్పటికే ప్రతిరోజూ కొన్ని కొత్త కరెన్సీలు పుట్టుకొస్తూండగా.. మరికొన్ని గిట్టిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అపరిమిత కాయిన్లు అందుబాటులోకి వస్తే వాటి విలువ పడిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆర్బీఐ వంటి ప్రభుత్వ సంస్థలు తమదైన క్రిప్టో కరెన్సీలు అందుబాటులోకి తెస్తే ప్రైవేటు రంగంలో ఉన్న బిట్‌కాయిన్, లైట్‌కాయిన్, డాగే కాయిన్ వంటి వాటి విలువ పడిపోయే అవకాశం ఉంది. పుట్టిందిలా... ఇప్పుడంటే బోలెడన్ని క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి కానీ.. ఇదంతా మొదలైంది బిట్‌కాయిన్‌తో. 2008 ఆగస్టులో బిట్‌కాయిన్.ఓఆర్జీ పేరుతో ఓ డొమైన్ నమోదుతో క్రిప్టో వ్యవహారాలకు శ్రీకారం పడింది. అదే ఏడాది అక్టోబరులో సతోషి నకమోటో పేరుతో ఈ వెబ్సైట్లో ఒక లింక్ ప్రత్యక్షమైంది. ‘‘బిట్‌కాయిన్: ఈ పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్’’ శీర్షికతో బ్యాంకుల్లాంటి కేంద్రీకృత వ్యవస్థలేవీ లేకుండా ఇంటర్నెట్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల ఆధారంగా డబ్బు ఎలా పంపిణీ చేయవచ్చో వివరించారు. నకమోటో బిట్‌కాయిన్ సాఫ్ట్‌వేర్‌ను అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్కోడ్గా 2009లో విడుదల చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నకమోటో ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొంతమంది ఒక వ్యక్తి అంటూంటే.. కొందరు వ్యక్తుల బృందమన్నది మరికొందరి అంచనా. 2009 జనవరి మూడున నకమోటో తన సాఫ్ట్వేర్ అల్గారిథమ్ మైనింగ్ ద్వారా బ్లాక్చెయిన్లోని తొలి బ్లాక్‌ను సిద్ధం చేశారు. ఈ బ్లాక్‌ను జెనిసిస్ బ్లాక్ అంటారు. ‘ద టైమ్స్’ మ్యాగజైన్లో ప్రచురితమైన ఒక శీర్షికను ఈ బ్లాక్ తాలూకు కాయిన్‌బేస్‌లో పొందుపరచారు. తొలి బిట్‌కాయిన్ వ్యవహారం.. రెండు పిజ్జాల కొనుగోలు 2010లో ఓ కంప్యూటర్ ప్రోగ్రామర్ పదివేల బిట్కాయిన్లతో రెండు పిజ్జాలు కొనుగోలు చేయడం ప్రపంచంలో తొలి క్రిప్టో వ్యవహారంగా నమోదైంది. ఈ రోజుల్లో పదివేల బిట్కాయిన్ల విలువ కొంచెం అటు ఇటుగా నలభై లక్షల రూపాయలు!! అప్పట్లో బిట్‌కాయిన్ విలువ లక్షల్లోకి చేరుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ చిత్రమైన ఘటనను గుర్తుంచుకునేందుకు ఇప్పటికీ ఏటా మే 22వ తేదీని ‘బిట్‌కాయిన్ పిజ్జా డే’ గా జరుపుకుంటూంటారు. మైక్రోసాఫ్ట్, హోండిపో, నేమ్‌చీప్, హోల్ఫుడ్స్, న్యూఎగ్స్, స్టార్‌బక్స్ వంటి కంపెనీలు, కొన్ని దేశాల బ్యాంకులు కూడా క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల కొనుగోళ్లకు అంగీకరిస్తున్నాయి. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించిన తొలి దేశం ఎల్ సాల్వడార్. ఈ ఏడాది జూన్ తొమ్మిదిన బిట్‌కాయిన్‌ను దేశంలో అన్ని రకాల వ్యవహారాలకూ వాడవచ్చునని ఆ దేశం ప్రకటించింది. ప్రధాన కరెన్సీ ఇప్పటికీ అమెరికన్ డాలరే! బిట్కాయిన్లను వాడుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు ‘వ్యాలెట్లు’ ఉపయోగపడతాయి. యూపీఐ ఆధారిత డిజిటల్ వాలెట్లు గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం మాదిరిగా అన్నమాట. నిషేధమా? నియంత్రణా? క్రిప్టో కరెన్సీలపై భారత్‌లో కొన్నేళ్లుగా తర్జనభర్జనలు నడుస్తున్నాయి. 2016లో వీటిపై పూర్తి నిషేధం విధించగా ఆ తరువాత సుప్రీంకోర్టు జోక్యంతో పరిమిత స్థాయిలో లావాదేవీలు నడిచాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ‘ద క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్’ పేరుతో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ బిల్లుపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిట్, లైట్ ఎరిథ్రియం వంటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై నిషేధం ఉంటుందని, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై నిషేధం ఉండదని ఒక వర్గం వాదిస్తూండగా... ఇంకోవర్గం వ్యవహారాలను గుర్తించేందుకు వీలైన పబ్లిక్ లెడ్జర్ (పద్దు) లేని క్రిప్టో కరెన్సీలపై మాత్రమే నిషేధం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లు వివరాలు పూర్తిగా తెలిస్తేగానీ అసలు విషయం ఏమిటన్నది స్పష్టం కాదు. దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ఒక ప్రకటన చేస్తూ క్రిప్టో కరెన్సీని చట్టబద్ధమైన కరెన్సీగా గుర్తించే అవకాశం లేదని చెప్పడం గమనార్హం. భారత్‌లో టాప్–10 క్రిప్టో కరెన్సీలు... బిట్‌కాయిన్ ఎరిథ్రియం కార్డానో రిపుల్ యూఎస్డీ కాయిన్ పోల్కాడాట్ డాగే కాయిన్ షిబా ఇనూ లైట్‌కాయిన్ యునీస్వాప్ నవంబరు 2021 నాటికి 7557ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో కరెన్సీలు 20,000 + పైగా 2021 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిట్‌కాయిన్ ఏటీఎంల సంఖ్య 10.7 కోట్లుభారత్‌లో క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య రూ. 75,000 కోట్లు భారతీయుల క్రిప్టో పెట్టుబడుల మొత్తం నవంబరు 24నాటికి ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ! 2.4 లక్షల కోట్ల డాలర్లు – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
‘అలా చేస్తే ఆర్బీఐకు ఇక్కట్లు తప్పవు..!’
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. క్రిప్టోకరెన్సీలపై పలువురు భారత ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వారిలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా చేరారు. ఆర్బీఐ నియంత్రణను కోల్పోయే అవకాశం..! నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) , న్యూయార్క్ యూనివర్శిటీ , స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన వెబినార్‌లో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ....క్రిప్టోకరెన్సీతో ఆర్బీఐ తన పట్టును కోల్పోయే అవకాశం ఉందని దువ్వూరి అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే ద్రవ్య, పరపతి విధానాల పైన ఆర్బీఐ నియంత్రణను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నగదు సరఫరా, ద్రవ్యోల్భణ నిర్వహణ అదుపు తప్పుతాయని హెచ్చరించారు. డిజిటల్ కరెన్సీ అప్పుడే సాధ్యం..! పటిష్టమైన డేటా పరిరక్షణ చట్టాలు మూలధన నియంత్రణలు ఉన్నందున సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (CBDC)ని జారీ చేయడానికి భారత్ అంత బలంగా ఉండకపోవచ్చునని దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణతో భారత్‌లో కరెన్సీ నోట్ల వాడకం భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. కరోనాతో తలెత్తిన లాక్ డౌన్ కారణంగా దేశంలో కరెన్సీ నోట్ల చలామణి భారీగా పెరిగిందని పేర్కొన్నారు. పటిష్టమైన డేటా పరిరక్షణ చట్టాలు ఉంటే తప్ప, ఆర్బీఐ తన సొంత డిజిటల్ కరెన్సీకి వెళ్లడం మంచిది కాదని సూచించారు. చదవండి: క్రిప్టో కరెన్సీకి అనుమతి? సీఐఐ సూచనలు -
క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం డెడ్‌లైన్..! ఉల్లంఘిస్తే భారీ జరిమానా..!
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. బిల్లు వస్తోన్న నేపథ్యంలో...భారత్‌లోని క్రిప్టోకరెన్సీ హోల్డర్స్ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు బ్లూమ్‌బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. ఆస్తులుగా పరిగణించే అవకాశం..! ముఖ్యంగా క్రిప్టోకరెన్సీలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలను ఫైనాన్షియల్ ఆస్తులుగానే పరిగణించే అవకాశం ఉంది. ఇటీవల సర్క్యులేట్ చేయబడిన క్యాబినెట్ నోట్ ప్రకారం...క్రిప్టోకరెన్సీలకు బదులుగా బిల్లులో 'క్రిప్టో ఆస్తులు' అనే పదాన్ని చేర్చనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్బీఐ రిలీజ్ చేస్తోన్న డిజిటల్ కరెన్సీలకు, క్రిప్టో కరెన్సీలకు స్పష్టమైన వ్యత్యాసం ఉండనుంది. ఉల్లంఘిస్తే రూ. 20 కోట్ల జరిమానా..! క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం తెస్తోన్న బిల్లును క్రిప్టో ఇన్వెస్టర్లు ఉల్లంఘిస్తే ఏకంగా రూ. 20 కోట్ల జరిమానా లేదా 1.5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అంతేకాకుండా చిన్న పెట్టుబడిదారులను రక్షించడానికి క్రిప్టో ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి కనీస థ్రెషోల్డ్ లేదా పరిమితిని కేంద్రం సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్చువల్ కరెన్సీల ద్వారా జరిపే లావాదేవీలపై పన్నులను విధించే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. భారత్‌లో 641 శాతం మేర వృద్ధి..! చైనాలిసిస్ నివేదిక ప్రకారం...2021లో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్ నిలిచింది. చదవండి: క్రిప్టోకరెన్సీ బిల్లు..! ఆర్థిక శాఖ కీలక వ్యాఖ్యలు..! -
సుడిగాడు.. 2 లక్షల కోట్ల జరిమానా తప్పించుకున్నాడు
Self-Described Bitcoin Creator Must Pay 100 Million Dollars in Suit : బిట్‌కాయిన్.. క్రిప్టోకరెన్సీలోకెల్లా అత్యంత విలువైన కరెన్సీ. 2008 నుంచి డిజిటల్ మార్కెట్లో ఇది చెలామణి అవుతుండగా.. అసలా ఈ కరెన్సీని కనిపెట్టింది ఎవరై ఉంటారనే చర్చ చాలా ఏళ్ల పాటు కొనసాగింది. ఈ లోపు సతోషి నాకామోటో అనే పేరు తెర మీదకు రాగా.. 2016లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ క్రెయిగ్ రైట్ ఒరిజినల్ సతోషి నాకామోటో తానేనంటూ ఓరోజు తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు. బిట్‌కాయిన్‌ను తానే రూపొందించానని, మారు పేరుతో అదంతా చేశానని సంచలన ప్రకటన విడుదల చేశాడు. అయితే క్రిప్టో కమ్యూనిటీ మాత్రం ఆ ప్రచారాన్ని నమ్మలేదు. ఈ లోపు ఈ వ్యవహారంలో క్రెయిగ్‌కు పెద్ద ఝలకే తగిలింది. బిట్ కాయిన్ తయారీలో రైట్‌కు కంప్యూటర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డేవిడ్ క్లెయిమన్(చనిపోయాడు) సహభాగస్వామిగా సాయం చేశాడని, కాబట్టి, హక్కుల కింద రైట్(సతోషి నాకామోటో) దగ్గర ఉన్న క్రిప్టో సంపదలో(54 బిలియన్ డాలర్ల.. మన కరెన్సీలో దాదాపు 3 లక్షల 80 వేల కోట్లు).. సగం వాటా(దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు) దక్కాలంటూ క్లెయిమన్ కుటుంబికులు (ఎస్టేట్) కోర్టు గడప తొక్కింది. క్రెయిగ్ రైట్ అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు క్రెయిగ్‌కు భారీ ఊరట లభించింది. తన వ్యాపార భాగస్వామి(మాజీ) కుటుంబానికి బిలియన్ల డాలర్ల కొద్ది క్రిప్టో కరెన్సీ చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. మియామీ(వెస్ట్ పామ్ బీచ్) కోర్టులో ఈ పిటిషన్‌పై మూడు వారాలపాటు వాదనలు జరగ్గా.. సోమవారం మియామీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరూ కలిసి బిట్‌కాయిన్‌ను రూపొందించినట్లు స్పష్టమైన ఆధారాల్లేవని, రైట్ తరపు నుంచి బిట్‌కాయిన్ సంపద ఏదీ కూడా క్లెయిమన్ ఫ్యామిలీకి చెందాల్సిన అవసరం లేదని తీర్పు వెల్లడించింది. డేవిడ్ క్లెయిమన్ (పాత చిత్రం) అయితే డబ్ల్యూ అండ్ కే ఇన్ఫో డిఫెన్స్ రీసెర్చ్ ఎల్ఎల్సీ కి వ్యవహారాలను క్లెయిమన్-రైట్లు సంయుక్తంగా(జాయింట్ వెంచర్) చూసుకున్నారని, ఆ సమయంలో కంపెనీకి చెందిన బిట్‌కాయిన్ సంబంధిత సంపదను క్రెయిగ్ రైట్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని రుజువైంది. దీంతో మేధో సంపత్తి హక్కులకు సంబంధించి క్రెయిగ్ రైట్.. 100 మిలియన్ డాలర్లు చెల్లించాలని(750 కోట్ల రూ. మన కరెన్సీలో) తీర్పు వెల్లడించింది. ఆ డబ్బును క్లెయిమన్ ఎస్టేట్‌కు కాకుండా డబ్ల్యూ అండ్ కే కు నేరుగా అందించాలని తీర్పు ఇచ్చింది. క్రెయిగ్ రైట్ ఇక ఈ దావా హైప్రొఫైల్ కేసుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణం.. సతోషి నాకామోటో మిస్టరీ. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం సమయంలో సతోషి నాకామోటో పేరుతో తొమ్మిది పేజీలతో కూడిన ఒక శ్వేతపత్రం విడుదలైంది. కొన్ని నెలలకే ఈ క్రిప్టోకరెన్సీ తయారీ కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రిలీజ్ అయ్యింది. 2011 వరకు బిట్‌కాయిన్‌కి ఏకైక కోడర్(కోడింగ్ ఇచ్చిన వ్యక్తి) నాకామోటో ఒక్కడే. అయితే ఆ తర్వాత సతోషి అనే పేరు డిజిటల్ మార్కెట్ నుంచి క్రమంగా కనుమరుగు అయ్యింది. అయితే సతోషి పేరు మీద ఏకంగా 1.1 మిలియన్ బిట్కాయిన్లు (ఇప్పటి విలువ ప్రకారం.. 54 బిలియన్ డాలర్లు.. ) ఉన్నాయి ఇప్పుడు. ఈ తరుణంలో ఒకవేళ రైట్ గనుక కేసు ఓడిపోయి ఉంటే.. సతోషి పేరు హోదాలో క్లెయిమన్ ఎస్టేట్‌కు భారీగా పరిహారం(27 బిలియన్ డాలర్లు.. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు) చెల్లించాల్సి వచ్చేది. కానీ, రైట్ సుడి బాగుండి కేసు గెలిచాడు. కాబట్టే బతికిపోయాడు. అంతేకాదు బిట్‌కాయిన్‌ని తానే సృష్టించానని(సతోషి) కోర్టులో నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తాను గనుక కేసు గెలిస్తే.. తన దగ్గర ఉన్న బిట్‌కాయిన్ సందపతో కొంత ఛారిటీలకు ఇస్తానన్న ప్రకటన కూడా అతనికి అనుకూలంగా తీర్పు రావడానికి ఒక కారణంగా మారింది. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 -
క్రిప్టోకరెన్సీపై అవన్నీ ఊహాగానాలే!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీల చట్టంపై అనవసర ఊహాగానాలన్నీ ప్రచారమవుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని ఆమె పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ‘ఆర్బీఐ కరెన్సీ, డిజిటల్ కరెన్సీలకు ఆమోదం!, క్రిప్టో ఎస్సెట్’.. ఇలా రకరకాల కథనాలు కొన్ని మీడియా హౌజ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి స్పందించారు. వివిధ అవసరాలకు క్రిప్టో టెక్నాలజీని వినియోగించేందుకు కొన్ని మినహాయింపులు ఇవ్వడం తప్ప దేశీయంగా ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలన్నింటిని నిషేధించే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయని మంత్రి సంకేతాలు అందించారు. ఇదిలా ఉంటే బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీని.. అధికారిక కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేం చేయలేదంటూ ఇంతకు ముందు ఆర్థిక మంత్రి స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. గ్లోబల్ క్రిప్టో మార్కెట్: ఒమిక్రాన్‌తోనూ లాభాలు.. కానీ, భారత పరిణామాలతో ఢమాల్ -
కుప్పకూలుతున్న క్రిప్టో మార్కెట్.. భారత్ వల్లే!
క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సస్పెన్స్ నడుమ రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ తరుణంలో భవిష్యత్తు ఆందోళనల నడుమ గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో కరెన్సీలు దారుణమైన పతనాన్ని చవిచూస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళన నేపథ్యంలో గ్లోబల్ స్టాక్ మార్కెటన్నీ దారుణంగా కుదేలు అయిన వేళ.. క్రిప్టో మార్కెట్ మాత్రం లాభాల బాట నడిచింది. అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు మార్కెట్ పతనం దిశగా కొనసాగుతోంది. అందుకు కారణం.. క్రిప్టో కరెన్సీ మీద భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో అనే బెంగ. అవును.. క్రిప్టో కరెన్సీపై ప్రత్యేక చట్టం తేవాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలు ఊపందుకున్న వేళ.. అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ భారీ పతనం చవిచూస్తోంది. ఈ ఏడాది నవంబర్ 10న 69వేల డాలర్ల హై వాల్యూతో ఆల్‌టైం హైలో బిట్‌కాయిన్ నిలిచిన విషయం తెలిసిందే. అలాంటి కరెన్సీ ఇప్పుడు ఏకంగా 31 శాతం పతనం చవిచూసింది. శనివారం మధ్యాహ్నానికి ఏకంగా 12.50 శాతం పతనంతో ట్రేడ్ అవుతోంది. ఇక ఎథెరియం దాదాపు 10 శాతం, కార్డానో 14 శాతం పతనంతో కొనసాగుతున్నాయి. టెథెర్ కొంచెం మెరుగైన ఫలితం (3.94 లాభం)తో, యూఎస్డీ కాయిన్ 3.91 శాతం పెరుగుదలతో ట్రేడ్ అవుతున్నాయి. ► బిగ్గెస్ట్ గెయినర్: కోక్స్స్వాప్(COX) ► బిగ్గెస్ట్ లాసర్: జెమ్(DGM) గరిష్టంగా పతనం అయ్యింది ఇదిలా ఉంటే క్రిప్టో కరెన్సీని ‘క్రిప్టో అస్సెట్’గా మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ పరిధిలోకి దీనిని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని కథనాలు వెలువడుతున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోందని, మనీ లాండరింగ్‌ను అరికట్టడానికి ఈ బిల్లులో ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’(పీఎమ్ఎల్ఏ) నిబంధనలను సైతం పొందుపరచనున్నారని ఆ కథనాలు ఉటంకిస్తున్నాయి. ఇక ‘ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ బిల్లుకు సంబంధం లేకుండా ఇది విడిగా ఉంటుందని, డిజిటల్ కరెన్సీకి, క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్‌గా వర్గీకరించడానికి మధ్య అంతరం ఉండేందుకు ఇలా చేయనున్నారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో మీమ్ కాయిన్స్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే కొనసాగుతోంది. డోజ్కాయిన్, షిబా ఇను, డోజ్లన్ మార్స్, సామోయెడ్కాయిన్లు కూడా పతనం దిశగానే కొనసాగుతున్నాయని కాయిన్‌మార్కెట్ క్యాప్ డాట్ కామ్ వెల్లడించింది. ► డోజ్కాయిన్ 4.53 శాతం పతనం అయ్యింది ► షిబా ఇను 4.22 శాతం పతనం అయ్యింది మొత్తంగా ఈ ఉదయానికి క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్(2.43 ట్రిలియన్ డాలర్లు విలువ) 6.16 శాతం పతనం చవిచూసింది. అయితే గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 20 శాతం క్రిప్టో మార్కెట్ వాల్యూమ్ పెరిగి.. 137 బిలియన్ డాలర్లపైకి చేరుకుంది. చదవండి: చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్.. వందల కోట్లు హాంఫట్! -
జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! అది కూడా మన కోసమే..
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ట్రెండ్ భారీగా కొనసాగుతోంది. క్రిప్టోకరెన్సీతో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) హవా కూడా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్టిస్టులు వారి ఫోటోలను, ఆడియోలను, వీడియోలను ఎన్ఎఫ్టీ రూపంతో అమ్ముతున్నారు. ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! మెటాకోవన్ అని కూడా పిలువబడే భారత్‌కు చెందిన విఘ్నేష్ సుందరేశన్ సుమారు 69.3 మిలియన్ల డాలర్ల(సుమారు రూ.500 కోట్ల)ను వెచ్చించి ‘Every Day: The First 5000 Days’ అనే డిజిటల్ ఫోటో ఎన్ఎఫ్టీను సొంతం చేసుకున్నారు. ఈ ఎన్ఎఫ్టీ అందరికీ అందుబాటులో ఉంచేందుకుగాను కొన్నట్లు బ్లూమ్‌బర్గ్ ఇంటర్వూలో పేర్కొన్నారు. ఇంతపెద్దమొత్తాన్ని చెల్లించి ఎన్ఎఫ్టీను సొంతం చేసుకోవడంతో ఎన్ఎఫ్టీ మార్కెట్‌పై ఇతరులు ఆకర్షించడానికి ఎంతో ఉపయోగపడినట్లు తెలుస్తోంది. ‘Every Day: The First 5000 Days’ ఎన్ఎఫ్టీను మైక్ వింకెల్మాన్ రూపొందించిన డిజిటల్ కళ. దీనిని వృత్తిపరంగా బీపుల్ అని పిలుస్తారు. ఈ ఎన్ఎఫ్టీలో 5000 చిత్రాలను ఒకే ఫోటోగా సృష్టించాడు. చదవండి: అనుకోని అతిథిలా వచ్చి..! మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బేసింది..! అసలు ఏవరి విగ్నేష్ సుందరేషన్..! విఘ్నేష్ సుందరేశన్ అలియాస్ మెటాకోవన్. బ్లాక్ చైయిన్ టెకీ. వై-కాంబినేటర్ పూర్వ విద్యార్థి . విఘ్నేష్ బిట్యాక్సెస్ను సహ-స్థాపన చేసి ఆరు నెలల్లో 18 దేశాల్లో 100 బిట్‌కాయిన్ ఎటీఎంలను ఏర్పాటు చేసిన ఘనత విఘ్నేష్ది. అతను బ్లాక్‌చెయిన్‌లో ఆర్థిక సేవలకు శక్తినిచ్చే క్రెడిట్ ఇంజిన్ ఐనా లెండ్రాయిడ్ ఫౌండేషన్ కోసం విజయవంతమైన టోకెన్ విక్రయాన్ని స్థాపించారు. పోర్ట్కీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కూడా స్థాపించాడు. మే 2013లో సుందరేశన్ ఒక వార్తాపత్రికలో డెవలపర్‌గా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. కాయిన్స్-E అనే ఆన్లైన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ను ప్రారంభించారు. దీంతో ఆసక్తి కల్గిన కస్టమర్లు క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేయడానికి ,విక్రయించడానికి వీలు కల్పింస్తోంది. Every Day: The First 5000 Days ఎన్ఎఫ్టీ ఎన్ఎఫ్టీ అంటే..! ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్ఎఫ్టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్లో 10 శాతం ఎన్ఎఫ్టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది. చదవండి: స్పేస్ ఎక్స్ దివాళా..! ఉద్యోగులకు ఎలన్ మస్క్ వార్నింగ్..! -
Cryptocurrency: ఒమిక్రాన్ పేరులోనే మ్యాజిక్ ఉంది
ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన పేరు.. ఒమిక్రాన్. కరోనా వైరస్ వేరియెంట్లలో ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాప్తిస్తుండడంతో ఎంతటి విపత్తుకు దారితీస్తుందోనని హడలిపోతున్నారంతా. అయితే ఈ పేరు మాత్రం అక్కడ లాభాలు కురిపిస్తోంది. ఒమిక్రాన్ ఇదే పేరుతో క్రిప్టో స్పేస్‌లో ఓ కాయిన్ ఉంది. నవంబర్ 27న ఈ క్రిప్టోకరెన్సీ విలువ 64 డాలర్లుగా ఉండింది. అయితే డబ్ల్యూహెచ్‌వో ‘ఒమిక్రాన్’ వేరియెంట్ ఆందోళన ప్రకటన తర్వాత వేరియెంట్ గురించి విస్తృత స్థాయిలో జరిగిన చర్చ.. ఈ కాయిన్ విలువను అమాంతం పెంచేసింది. నవంబర్ 29న ఒమిక్రాన్ మార్కెట్ వాల్యూ 692 డాలర్లకు చేరుకోగా.. నవంబర్ 30న ప్రారంభ విలువకు 900 శాతం పెరిగి 689 డాలర్లకు చేరుకుంది. చివరికి మంగళవారం 420 డాలర్ల వద్ద ఉండిపోయి.. క్రిప్టో మార్కెట్లో తన జోరు కొనసాగిస్తోంది. ఒమిక్రాన్ కరెన్సీకి ఎలాంటి మద్దతు లేదు. డోజ్కాయిన్ లాగే ఇది కూడా అంచనాల నడుమే తన విలువను పెంచుకోవడం, పడిపోవడం జరుగుతోంది కూడా. ఇక ఒమిక్రాన్ అలర్ట్ పరిణామాల తర్వాత డిజిటల్ ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్, ఇతరత్ర కాయిన్స్ విలువ లాభాలతో కొనసాగుతుండడం విశేషం. కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్ B.1.1.529కు గ్రీకు 24 అక్షరాల్లోని 15వ అక్షరం ఒమిక్రాన్ ఆధారంగా పేరును నిర్ణయించింది ఫైలోజెనెటిక్ ఎసైన్మెంట్ ఆఫ్ నేమ్డ్ గ్లోబల్ ఔట్‌బ్రేక్ కంపెనీ. చదవండి: చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు! -
ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచ దేశాలు గజగజ..! వారికి మాత్రం కాసుల వర్షమే..!
ఇప్పుడిప్పుడే కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న ప్రపంచదేశాలకు ఒమిక్రాన్ రూపంలో భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ భారీ నష్టాన్ని కల్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీకాలను వేసుకున్న వారిని కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణుల హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచదేశాలు గజగజ వణికిపోతుంటే కొంతమందికి ఈ వేరియంట్ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇన్వెస్టర్లకు కాసుల వర్షమే...! ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ట్రెండ్ నడుస్తోంది. సుమారు 6000కుపైగా క్రిప్టోకరెన్సీలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అందులోని ఒక క్రిప్టోకరెన్సీయే ఒమిక్రాన్. తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్ వేరియంట్‌కు డబ్లూహెచ్‌వో ఒమిక్రాన్‌గా నామకారణం చేసింది. ఏ ముహుర్తాన కరోనా వైరస్ కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ పేరు పెట్టారో లేదో..! ఒమిక్రాన్ క్రిప్టోకరెన్సీ విలువ ఏకంగా 945 శాతం మేర ఎగబాకింది. CoinGecko ప్రకారం నవంబర్ 27న ఒమిక్రాన్ క్రిప్టోకరెన్సీ విలువ 65 డాలర్ల(రూ. 4,883) వద్ద ఉండగా..ప్రస్తుతం దీని విలువ 576.48 డాలర్లకు(43,311) కు చేరింది. ఒకానొక సమయంలో ఒమిక్రాన్ టోకెన్ గరిష్టంగా 689 డాలర్లను తాకింది. ఒమిక్రాన్ క్రిప్టో మార్కెట్ వాల్యూయేషన్ ఏకంగా 400 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రిప్టో టోకెన్‌పై ఇన్వెస్ట్ చేసిన వారికి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కాసుల వర్షం కురిపిస్తోంది. కరోనా పేరుతో భారీ నష్టాలు..! ఒమిక్రాన్ వేరియంట్‌తో ఒమిక్రాన్ క్రిప్టో టోకెన్‌కు కాసుల వర్షం కురిపించగా...ఇందుకు విరుద్దంగా కోవిడ్-19 ప్రారంభంలో ప్రముఖ మెక్సికన్ బీర్ బ్రాండ్ కరోనా ఎక్స్ట్రా భారీ నష్టాలను మూటకట్టుకుంది. ఏకంగా రెండునెలల్లో 170 మిలియన్ డాలర్ల నష్టాలను కరోనా ఎక్స్ట్రా బీర్ కంపెనీ చవిచూసింది. A crypto token named after the new COVID-19 variant ‘Omicron’ is up over 650% within the 3 days, and is now worth over $400 million. If this isn’t a sign we’re in a giant bubble, I don’t know what is. pic.twitter.com/7ESD1v9wgF — Mr. Whale (@CryptoWhale) November 28, 2021 చదవండి: చైనా ఎఫెక్ట్! క్రిప్టో మైనర్ల ఒప్పందాలు.. కరెంట్ కోతలతో పక్కదేశాల వైపు చూపు -
చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు!
క్రిప్టోకరెన్సీకి భారీ మార్కెట్ అవుతుందేమోనని భావించిన చైనా.. దానిని పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదంటూ బ్యాన్‌తో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మూర్ఖంగా ముందుకు పోతోందంటూ విమర్శలు సైతం వినిపించాయి. అయితే ఆ నిర్ణయం సరైందేమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు కొన్ని దేశాలు. ఈ ఏడాది మే నెలలో చైనా స్టేట్ కౌన్సిల్ ఏకంగా బిట్‌కాయిన్ మైనింగ్‌ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు వెలువడుతాయని ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని, పైగా ఎనర్జీ విపరీతంగా ఖర్చై కరెంట్ కొరతలు ఏర్పడతాయని ప్రకటించుకుంది చైనా. ఆపై ఏకంగా క్రిప్టోకరెన్సీలను మొత్తంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో క్రిప్టోకరెన్సీ తయారీ కోసం ఇంతకాలం చైనాలో థర్మల్ కేంద్రాలపై ఆధారపడ్డ క్రిప్టోకరెన్సీ కంపెనీలు.. నిషేధం దెబ్బకు వేరే దేశాలకు క్యూ కట్టాయి. ఇదే ఇప్పుడు కొత్త సమస్యకు కారణమైంది. చైనాకు పొరుగున ఉన్న దేశాలతో ఖర్చు ఎంతైనా పర్వాలేదనుకుని ఒప్పందాలు చేసుకుంటున్నాయి క్రిప్టో కంపెనీలు. అయితే ఒప్పందాలు చేసుకున్న దేశాలు ఇప్పుడు నాలిక కర్చుకుంటున్నాయి. సాధారణంగా క్రిప్టోకరెన్సీ ఉత్పత్తికి భారీ స్థాయిలో ఎనర్జీ అవసరం పడుతుంది. ఇది ఊహించని కజకిస్తాన్ లాంటి దేశాలు కరెంట్ కోతలను అనుభవిస్తున్నాయి. కంప్యూటర్ ఫామ్‌లకు నెలవైన కజకిస్తాన్‌లో ఇప్పుడు పట్టుమని నాలుగైదు గంటల సేపు కూడా పవర్ ఉండడం లేదు. దీనికితోడు ఏర్పడిన కోతలను అధిగమించేందుకు రష్యా నుంచి అధిక ధరలు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది కజకిస్తాన్. ఊహించని పరిణామాల నడుమ నష్టనివారణ చర్యలు చేపట్టింది కజకిస్తాన్ ప్రభుత్వం. 2022 జనవరి నుంచి క్రిప్టోమైనింగ్‌కు అవసరమైన విద్యుత్ సప్లయ్‌కి కఠిన నిబంధనలను విధించబోతోంది. రేషన్ విధానంలో క్రిప్టో మైనర్లకు విద్యుత్ అందిస్తామని కజకిస్తాన్ గ్రిడ్ ఆపరేటర్ స్పష్టం చేసింది.ఒక్క కజకిస్తాన్ మాత్రమే కాదు.. ముప్ఫైకి పైగా దేశాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. క్లిక్ చేయండి: తెలివైన అడుగు.. అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ల తయారీ -
Bitcoin: బిట్‌కాయిన్‌పై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
క్రిప్టోకరెన్సీపై రకరకాల ఊహాగానాల నడుమ బిట్‌కాయిన్ భవితవ్యంపై పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. Parliament Winter Session 2021 సోమవారం మొదలైన విషయం తెలిసిందే. లోక్‌సభ కాసేపు వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన తరుణంలో బిట్‌కాయిన్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేశారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం చేస్తోందా? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘అలాంటిదేం లేదు సర్’ అని సమాధానం ఇచ్చారు. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది తమ ప్రభుత్వం చేయట్లేదని, అలాగే బిట్‌కాయిన్ ట్రాన్జాక్షన్స్కు సంబంధించి వివరాలు సేకరించామన్న రిపోర్టులు నిజం కాదని ఆమె స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉన్న బిట్‌కాయిన్ విషయంలో కేంద్రం వైఖరి స్పష్టమైంది. ఇక ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తుందన్న కథనాలు నిజమేనని(వచ్చే ఏడాది నుంచి పైలట్ ప్రాజెక్ట్ మొదలు).. ఇందుకోసం 1934 చట్టానికి సవరణలు (డిజిటల్ కరెన్సీని ఫిజికల్ నోట్లతో సమానంగా గుర్తించాలనే!) ప్రతిపాదన ఆర్బీఐ, కేంద్రం ముందు ఉంచిదనే సమాచారం అందుతోంది. ఈ లెక్కన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు పంపింది. ఇక 2008 నుంచి చెలామణిలోకి వచ్చిన బిట్‌కాయిన్.. డిజిటల్ కరెన్సీగా చెలామణి అవుతోంది. బిట్‌కాయిన్‌తో వస్తువుల కొనుగోలు, సేవలు, బ్యాంకులతో సంబంధం లేకుండా మనీ ఎక్స్ఛేంజ్ ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటోంది. నిర్మలా సీతారామన్ తాజా ప్రకటనతో బిట్‌కాయిన్ ఇన్వెస్టర్లకు నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. చదవండి: బిట్‌కాయిన్‌పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్ -
క్రిప్టోకరెన్సీ.. ఇలాంటి నేరాలే జరుగుతాయ్ జాగ్రత్త!
ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ చెలామణిపై ఆర్బీఐ ఆందోళన నేపథ్యంలో.. కేంద్రం సానుకూల కోణంలోనే స్పందించే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే క్రిప్టోకరెన్సీ ద్వారా ఆర్థిక నేరాలతో పాటు అమాయకులూ బలి అవుతారంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ కరెన్సీ విషయంలో కొత్త తరహా నేరాలు తప్పవని సైబర్ నిపుణులు సైతం వారిస్తున్నారు. అందుకు ఉదాహరణగా తాజాగా రికార్డైన క్రిప్టోకరెన్సీ భారీ చోరీ కేసును ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఓ టీనేజర్ ఏకంగా 46 మిలియన్ కెనడా డాలర్లు( 36.5 మిలియన్ అమెరికా డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 270కోట్ల రూపాయలపైనే) క్రిప్టోకరెన్సీని కాజేశాడు. కెనడా హామిల్టన్‌కు చెందిన 17 ఏళ్ల ఆ పిలగాడు.. అంత డబ్బుతో ఏం చేశాడో తెలుసా? ఆన్లైన్ గేమింగ్‌లో అరుదైన ఓ యూజర్‌నేమ్‌ను కొనుగోలు చేశాడు. స్విమ్ స్కాపింగ్(సెల్యూలార్ నెట్వర్క్ ఉద్యోగుల్ని డూప్లికేట్ నెంబర్ల ద్వారా బురిడీకొట్టించి.. బాధితుల అకౌంట్లను హ్యాక్ చేయడం) ద్వారా ఆ టీనేజర్ ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక వ్యక్తి ఇంత భారీస్థాయిలో క్రిప్టోకరెన్సీ చోరీకి పాల్పడడం ఇదే తొలిసారి అని ప్రకటించారు. నిజానికి ఈ చోరీ జరిగింది కిందటి ఏడాదిలో. బాధితుడు కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జోష్ జోన్స్!. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. క్లిక్ చేయండి: క్రిప్టోకరెన్సీ.. నీటి బుడగల్లాంటివి హామిల్టన్ సిటీ పోలీసుల సహకారంతో దర్యాప్తు కొనసాగించింది ఎఫ్‌బీఐ. అయితే అరుదైన ఆ యూజర్ నేమ్ దొంగను పట్టించింది. అంతేకాదు మొత్తం సొమ్ములో కేవలం ఏడు మిలియన్ల సొమ్ము మాత్రమే రికవరీ అయ్యిందని తెలుస్తోంది. కంటికి కనిపించని ఈ కరెన్సీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, లేనిపక్షంలో ఇలాంటి నేరాలకు గురై భారీగా మోసపోవాల్సి వస్తుందని క్రిప్టో ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. చదవండి: క్రిప్టో కరెన్సీ చేతికి రాలేదని.. ఖమ్మంవాసి బలవన్మరణం -
Cyptocurrency : క్రిప్టోకరెన్సీ చట్టం.. అనూహ్య పరిణామం!
Coinstore Exchange India: క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వ నియంత్రణా? ఆంక్షలా? లేదా పూర్తి నిషేధమా?.. అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ తరుణంలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా మరో ప్రైవేట్ బిట్‌కాయిన్‌స్టోర్ భారత్‌లో అడుగుపెట్టింది. సింగపూర్‌కి చెందిన వర్చువల్ కరెన్సీ ఏజెన్సీ ఎక్సేంజ్ కాయిన్‌స్టోర్ భారత్‌లో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. క్రాస్‌టవర్(సెప్టెంబర్‌లో లాంఛ్ అయ్యింది) తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన రెండో గ్లోబల్ ఎక్సేంజ్ కాయిన్‌స్టోర్ కావడం విశేషం. బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై బ్రాంచ్‌లతో కాయిన్‌స్టోర్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంతేకాదు 20 మిలియన్‌డాలర్ల బడ్జెట్‌తో భారత మార్కెట్లో పెట్టనున్నట్లు.. ప్రస్తుతానికి వంద మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు కాయిన్‌స్టోర్ మార్కెటింగ్ హెడ్ చార్లెస్ టాన్ వెల్లడించారు. అయితే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల పట్ల ఇవాళ్టి నుంచి(నవంబర్ 29, 2021) మొదలుకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని తరుణంలో.. కాయిన్‌స్టోర్ వేసిన అడుగు సాహసోపేతమనే చెప్పాలి. అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశాభావంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, క్రిప్టోకరెన్సీల కోసం భారత ప్రభుత్వం హెల్తీ ఫ్రేమ్‌వర్క్‌తో ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు చార్లెస్ టాన్ తెలిపారు. భారత్‌తో పాటు జపాన్, కొరియా, ఇండోనేషియా, వియత్నాంలలోనూ కార్యకలాపాలకు Coinstore సిద్ధమైంది. Cryptocurrency.. దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇదిలా ఉంటే ప్రపంచలోనే అతిపెద్ద(విలువైన) క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్.. ఈ ఏడాది ఆరంభంలో కంటే రెట్టింపు విలువతో భారత పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. కానీ, క్రిప్టోబిల్లు పరిణామాల తర్వాత వాటి విలువ పడుతూ.. లేస్తూ ఇన్వెస్టర్లను కంగారుపెడుతోంది. మరి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై కేంద్రం నిర్ణయం ఎలా ఉండబోతుందో అనేది మరికొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: క్రిప్టోకరెన్సీ ఎక్కడికీ పోదు -
Cryptocurrency: క్రిప్టోకరెన్సీ ఎక్కడికీ పోదు
కోల్‌కతా: క్రిప్టో కరెన్సీ ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్ శర్మ. సురక్షిత సమాచార సాంకేతికతల ఆధారంగా క్రిప్టోలు ఏర్పాటైనట్టు చెప్పారు. ఐసీసీ వర్చువల్‌గా నిర్వహించిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి శర్మ మాట్లాడారు. ‘‘క్రిప్టో పట్ల నేను ఎంతో సానుకూలంగా ఉన్నాను. ఇంటర్నెట్ మన నిత్యజీవితంలో భాగమైనట్టుగా, కొన్నేళ్లలో ఇదొక ప్రధాన టెక్నాలజీగా అవతరిస్తుంది’’అని శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతానికి క్రిప్టోలను స్పక్యులేటివ్ విధానంలో వినియోగిస్తున్నట్టు చెప్పారు. క్రిప్టోల్లేని ప్రపంచాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే, క్రిప్టోలన్నవి సార్వభౌమ కరెన్సీలకు ప్రత్యామ్నాయం కాబోవని తేల్చేశారు. అభివృద్ధి చెందిన దేశాలకూ పేటీఎంను తీసుకెళతామని చెప్పారు. ప్రస్తుతానికి జాయింట్ వెంచర్ భాగస్వామ్యంతో జపాన్‌లో అతిపెద్ద పేమెంట్ సిస్టమ్‌ను నిర్వహిస్తున్నామని, త్వరలో సొంతంగానే దీన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భారత సంస్థలను ఇక్కడి వారికంటే విదేశీ ఇన్వెస్టర్లే చక్కగా అర్థం చేసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
క్రిప్టోకరెన్సీపై నరేంద్ర మోదీ కీలక నిర్ణయం, దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా?
త్వరలో కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకూ పార్లమెంటు సీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్బీఐ ఆందోళనకు అనుగుణంగా దేశంలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై బ్యాన్ విధించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ పలుమార్లు క్రిప్టో కరెన్సీ వల్ల దేశ ఫైనాన్షియల్, ఆర్థిక స్థిరత్వాలకు విఘాతం కలుగుతుందనే విషయాన్ని స్పష్టం చేయగా, ఇదే అంశంపై ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రిప్టో కరెన్సీని నిషేదం విధించేలా ప్రధాని నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే క్రిప్టో కరెన్సీ బ్యాన్ పై భారతీయుల అభిప్రాయం ఎలా ఉందో' తెలుసుకునేందుకు పలు సంస్థలు దేశ వ్యాప్తంగా సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 342జిల్లాల్లో సర్వే దేశంలోని 342 జిల్లాలలో డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ క్రిప్టో కరెన్సీపై ప్రజల అభిప్రాయాల్ని సేకరించింది. ఈ సర్వేలో 56వేల మందికి పైగా పాల్గొన్నారని లోకల్ సర్కిల్స్ తెలిపింది. ఇండియా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 54 శాతం మంది దేశంలో క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధం చేయడానికి ఇష్టపడడం లేదు. అయితే అందుకు బదులుగా విదేశాలలో డిజిటల్ ఆస్తులుగా పరిగణించాలని కోరుతున్నట్లు లోకల్ సర్కిల్స్ తన నివేదికలో పేర్కొంది. మనదేశంలో క్రిప్టోకరెన్సీలను ఎలా నిర్వహించాలనే ప్రశ్నకు 8,717 ప్రతిస్పందనలు వచ్చాయి. వారిలో 26 శాతం మంది ఈ కరెన్సీలను చట్టబద్ధం చేసి, భారతదేశంలో పన్ను విధించాలని చెప్పారు. అయితే 54 శాతం మంది మాత్రం చట్టబద్దత చేయకూడదని, 20శాతం మంది మాత్రం భారత్ మినహయించి ఇతర దేశాల మాదిరిగానే డిజిటల్ ఆస్తిలా పరిగణించి, వాటిపై పన్ను విధించాలని అన్నారు. సర్వే ప్రకారం 87 శాతం మంది భారతీయలు క్రిప్టోకరెన్సీలలో వ్యాపారం, లేదా పెట్టుబడి పెట్టేందుకు ఇష్టం పడడం లేదని తేలింది. క్రిప్టోకరెన్సీ ప్రకటనలపై ప్రశ్నించగా 9,942 స్పందించారు. ఇందులో 74 శాతం మంది క్రిప్టోకరెన్సీ వచ్చే ప్రకటనలు ఆకర్షిస్తున్నాయని, కానీ నష్టాలు హైలెట్ చేయకపోవడాన్ని ప్రస్తావించారు. -
క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు..!
రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో క్రిప్టో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. తాజాగా క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలను చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6000కు పైగా క్రిప్టోకరెన్సీ చెలామణీలో ఉందని, రాబోయే రోజుల్లో కేవలం ఒకటి లేదా రెండు క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉండవచ్చుని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుత క్రిప్టో ధరలు పూర్తిగా నీటి బుడగలాంటిదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నడుస్తోన్న క్రిప్టో క్రేజ్‌ను 17వ శతాబ్దం నాటి నెదర్లాండ్స్ తులిప్ మానియాతో అభివర్ణించారు. చదవండి: క్రిప్టో ప్రపంచంలోనూ స్టార్టప్స్ హవా అన్ రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్..! క్రిప్టో కరెన్సీలను అన్-రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్‌తో రఘురాం రాజన్ పోల్చారు. చిట్‌ఫండ్స్ నుంచి డబ్బులు పొందిన వారిలాగే క్రిప్టో ఆస్తులు కలిగినవారు కూడా రాబోయే రోజుల్లో బాధపడక తప్పదని అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి అసలు వ్యాల్యూ లేదన్నారు. క్రిప్టోలో కొన్ని మాత్రమే చెల్లింపుల కోసం మనుగడ సాగిస్తాయని..వాటిలో కూడా క్రాస్ బార్డర్ పేమెంట్స్ వాడతారని తెలిపారు. భారత్‌లోని 15-20 మిలియన్ల క్రిప్టో ఇన్వెస్టర్లు సుమారు 5.39 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీను కల్గి ఉన్నారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని లోకసభలో ప్రవేశపెట్టనుంది. ఈ క్రిప్టో బిల్లులో ఆర్బీఐచే జారీ చేయబడే అధికారిక డిజిటల్ కరెన్సీ కోసం ప్రేమ్ వర్క్, దేశంలో అన్ని ప్రయివేటు క్రిప్టోల నిషేధం లేదా కఠిన నిబంధనలతో పాటు క్రిప్టో కరెన్సీ అంతర్లీన టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చదవండి: క్రిప్టో నియంత్రణకు సమయం ఇదే! -
‘క్రిప్టో కరెన్సీ’ చేతికి రాలేదని.. ‘స్వాతీ.. పిల్లలు జాగ్రత్త.. అర్థం చేసుకో’
సాక్షి, సూర్యాపేట క్రైం: క్రిప్టో కరెన్సీపై మదుపు చేసిన డబ్బులు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లా వాసి ఒకరు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన రామలింగ స్వామి (36), ఆనంద్ కిశోర్, నరేశ్ అనే వ్యక్తులతో కలసి క్రిప్టో కరెన్సీ యాప్‌లో రూ.10 లక్షలతో ట్రేడింగ్ చేశాడు. పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావడంతో మరికొంత మందితో ఓ యాప్‌లో పెద్ద మొత్తంలో ట్రేడింగ్ చేయడంతో మొదట మూడు వారాలు లాభాలు వచ్చాయి. దీంతో మరింత భారీ పెట్టుబడి పెట్టడంతో లాభాలు రాగా డబ్బులు డ్రా చేద్దామనుకున్న సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు నిలిచిపోయాయి. చదవండి: హైదరాబాద్: తనువు చాలిస్తూ.. పలువురికి ఊపిరి పోశారు ఇన్వెస్టర్ల ఒత్తిడి.. పెట్టిన డబ్బులు చేతికి రాకపోవడంతో ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టిన మదుపరులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ రామలింగ స్వామిపై ఒత్తిడి తీసుకు వచ్చారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇటీవల రామలింగస్వామి కారును లాక్కెళ్లడంతో అవమానంగా భావించాడు. దీంతో మనస్తాపం చెందిన రామలింగ స్వామి మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అతడి గది నుంచి దుర్వాసన రావడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామలింగస్వామి మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చదవండి: ఇదో గమ్మత్తు కథ.. సీజ్ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా! భారీగా పెట్టుబడి.. రామలింగ స్వామి క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ కోసం భారీగా పెట్టుబడి పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మొదట ముగ్గురు స్నేహితులతో రూ.10 లక్షలతో మొదలు పెట్టగా వారంవారం లాభాలు రావడంతో మరికొంత మందితో కలిసి దాదాపు రూ.1.3 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్టు వెల్లడించారు. పెట్టిన పెట్టుబడిలో రూ.60 లక్షలు తిరిగి రాగా రూ.70 లక్షల వరకు యాప్‌లో సాంకేతిక కారణాలవల్ల విత్ డ్రా చేసుకోవడం వీలుకాలేదని.. దీంతో రామలింగ స్వామిపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. స్వాతీ.. పిల్లలు జాగ్రత్త ‘ఆన్లైన్ బిజినెస్‌లో లాసయ్యాను. నాతో పాటు చాలా మంది నష్టపోయారు. అంతేకానీ నేను ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వాతీ.. పిల్లలు జాగ్రత్త. ఇలా చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ, ఒత్తిడి తట్టుకోలేక ఇలా చేశాను. అర్థం చేసుకో’అంటూ సూసైడ్ లెటర్లో రామలింగ స్వామి భార్యనుద్దేశించి రాసినట్టు పోలీసులు తెలిపారు. -
మీ పిచ్చి తగలెయ్యా..? డబ్బులుంటే చాలు..చార్మినార్‌ను ఈఫిల్ టవర్‌ను కొనేస్తారు
మీ పిచ్చి తగలెయ్యా..? ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే చేతిలో డబ్బులుంటే చాలు హైదరాబాద్‌లో చార్మినార్‌ను అంతెందుకు పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్‌ను ఈజీగా కొనేస్తారు. ఆ పిచ్చితోటే వర్చువల్ రియాల్టీ సంస్థ డిసెంట్రాల్యాండ్‌లో ఔత్సాహికులు 2.4 మిలియన్ల విలువైన క్రిప్టో కరెన్సీతో వర్చువల్ రియల్ ఎస్టేట్ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఏమిటీ డీసెంట్రాల్యాండ్? డిసెంట్రలైజ్డ్ 3డీ వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్ ఇది.మ్యాప్‌బాక్స్ టెక్నాలజీతో సృష్టించిన వర్చువల్ ల్యాండ్ ఇది. భూగ్రహాన్ని డిజిటల్ గ్రిడ్ లేయర్స్, టైల్స్గా విభజిస్తారు. ఈ టైల్స్ విలువ యూఎస్‌లో ఒకరకంగా, ఆస్ట్రేలియాలో ఒక రకంగా, ఇండియాలో ఒకరకంగా ఉంటుంది. దీన్ని డిజిటల్ ఎస్టేట్ అని కూడా పిలుస్తున్నారు. ఈజీగా చెప్పాలంటే ఫేస్బుక్ అధినేత జుకర్ బెర్గ్ మెటా పేరుతో కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నారు. ఈ టెక్నాలజీతో మీరు ఎక్కడ ఉన్నా అవతార్ రూపంలో ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ఇప్పటికే ఫేస్బుక్ ఇంటర్నల్‌గా జరిగే మీటింగ్‌లో ఉపయోగిస్తుంది. ఇక డిసెంట్రాల్యాండ్ కూడా అంతే ఇందులో మనకు కావాల్సిన ల్యాండ్స్‌ను, బిల్డింగ్స్‌ను నిర్మించొచ్చు. డిజిటల్ భూభాగంలో కొనవచ్చు. వాటిని డెవలప్ చేయవచ్చు.అమ్మవచ్చు. జుకర్ దెబ్బకు పెరిగిన డిమాండ్ డిసెంట్రాలాండ్లోని ల్యాండ్ ఇతర వస్తువులు నాన్-ఫంగబుల్ టోకెన్ల (NFTలు) రూపంలో విక్రయిస్తారు. ఇది ఒక రకమైన క్రిప్టోకరెన్సీ తరహాలో డిజిటల్ మనీగా చెప్పుకోవచ్చు. డిసెంట్రాల్యాండ్‌లో కరెన్సీ 'మన' రూపంలో కొనుగోలు చేయొచ్చు. సోమవారం 618,000 కరెన్నీతో రియల్ ఎస్టేట్ ప్లాట్ల అమ్మకాలు జరిగాయి. వాటి విలువ సుమారు $2,428,740 అని డీసెంట్రాల్యాండ్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ డిజిటల్ భూమిలో 6,090 వర్చువల్ చదరపు అడుగుల పరిమాణంలో ఒక్కొక్కటి 52.5 చదరపు అడుగులో 116 చిన్న చిన్న ప్లాట్లను తయారు చేశారు. అయితే వాటిని పలువురు ఔత్సాహికులు 2.4 మిలియన్ల తో కొనుగోలు చేశారు. కాగా మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నట్లు జుకర్ ప్రకటించారు. ఆ ప్రకటనతో డిసెంట్రాల్యాండ్‌లో డిజిటల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో డిసెంట్రాల్యాండ్కు చెందిన అధికారిక కరెన్సీ 'మన' వ్యాల్యూ 400శాతం పెరిగినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. -
బ్యాన్ ఎఫెక్ట్! బిట్‌కాయిన్‌కి భారీ దెబ్బ.. కుదేలవుతున్న క్రిప్టోకరెన్సీ
శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ద్వారా క్రిప్టోకరెన్సీ జోరుకు భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏకంగా బ్యాన్ చేస్తున్న కథనాల నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ భారీగా కుదేలు అయ్యింది. బిట్‌కాయిన్, ఎథెరియమ్, టెథర్‌లు భారీ పతనాన్ని చవిచూశాయి. The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI పర్యవేక్షణలో డిజిటల్ కరెన్సీ నియంత్రణకు ఒక ప్రణాళిక రూపొందించాలని, బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీలను నిషేధించడమో లేదంటే కఠిన నిబంధనలతో మినహాయింపులు ఇవ్వడమో లాంటివి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకోసం క్రిప్టోకరెన్సీ బిల్లు 2021ను ప్రవేశపెట్టనుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని డిజిటల్ కరెన్సీలు, డిజిటల్ మార్కెట్లో పతనం చవిచూశాయి. ప్రపంచంలో అతిపెద్ద, విలువైన క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్18.53 శాతం, ఎథెరియమ్ 15.58 శాతం, టెథెర్ 18.29 శాతం పడిపోయాయి. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. తాజా పతనంతో వీళ్లకు పెద్ద దెబ్బే పడింది. నియంత్రణ సరిపోతుందా? గత పదేళ్లుగా ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ బాగా పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక క్రిప్టోకరెన్సీ అడ్వర్టైజ్మెంట్లు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. ఈజీగా, ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయవి. ఈ క్రమంలో భారీ మోసాలు సైతం వెలుగుచూస్తున్నాయి. అందుకే ఆర్బీఐ మాత్రం క్రిప్టోకరెన్సీ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకతనే వ్యక్తం చేస్తోంది. క్రిప్టోకరెన్సీ వల్ల దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం క్రిప్టోకరెన్సీ ప్రయోజనాలను సైతం పరిగనణలోకి తీసుకుంటోంది. కిందటి వారం బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో క్రిప్టో ఎక్సేంచెజ్, బ్లాక్ చెయిన్, క్రిప్టో ఎస్సెట్స్ కౌన్సిల్ BACC, ఇతరులు సమావేశం అయ్యారు. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని, వాటి మీద నియంత్రణ ఉంటే సరిపోతుందని ఈ భేటీలో ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించబోతోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ►ఇక వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులు మరియు దానిచే నియంత్రించబడే సంస్థలను నిషేధిస్తూ గతంలో(ఏప్రిల్ 6, 2018) RBI ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే మార్చి 4, 2021న సుప్రీంకోర్టు ఆ సర్క్యులర్‌ను పక్కన పెట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ►ప్రస్తుతం ఎల్ సాల్వడర్ దేశం ఒక్కటే బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇచ్చుకుంది. మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే సిడ్నీ డైలాగ్ సందర్భంగా నవంబర్ 18న భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘‘క్రిప్టోకరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి, జాగ్రత్త పడాల’’ని ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి అడుగు వేయబోతుందన్న ఆసక్తి నెలకొంది. Cryptocurrency: భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్.. చెల్లనే చెల్లదంటూ స్టేట్మెంట్ -
క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం..!
క్రిప్టోకరెన్సీపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 29 నుంచి ప్రారంభమై డిసెంబర్ 23న ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం సుమారు 26 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో క్రిప్టోకరెన్సీ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 'క్రిష్టొకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు" ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. క్రిప్టోపై కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే పలు అధికారిక డిజిటల్ కరెన్సీ భారత్‌లో అందుబాటులోకి రానుంది. మరోవైపు అన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై కేంద్రం నిషేధం విధించనున్నుట్లు తెలుస్తోంది. ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని..! క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్ కూడా ముందు స్థానాల్లో నిలుస్తోంది. భారత్‌లో సుమారు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాగా క్రిప్టోకరెన్సీపై ఓ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు.క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. Crypto bill is listed for the #WinterSession #IndiaWantsCrypto https://t.co/Lr4aHdJjhl — Nischal (WazirX) ⚡️ (@NischalShetty) November 23, 2021 చదవండి: ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట.. ఏడాదిలో రూ.25 లక్షలు లాభం! -
Bitcoin: బిట్‌కాయిన్‌పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్
Bitcoin Not Official Currency Says IMF: క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ విషయంలో మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది ఎల్ సాల్వడర్ దేశం. సంప్రదాయ విద్యుత్ బదులు ఏకంగా అగ్నిపర్వతాల శక్తిని ఉపయోగించి కంటికి కనిపించని క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లను రూపొందిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పుడు ఎల్ సాల్వడర్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పెద్ద షాకిచ్చింది. బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీ ద్వారా రిస్క్ రేటు ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లో దానిని చట్టబద్ధంగా అనుమతించడానికి వీల్లేదని ఎల్ సాల్వడర్‌కు స్పష్టం చేసింది ఐఎంఎఫ్. కాగా, మధ్యఅమెరికా దేశమైన ఎల్ సాల్వడర్ సెప్టెంబర్‌లో యూఎస్ డాలర్‌తో పాటుగా బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ప్రకటించింది. అయితే బిట్‌కాయిన్ చట్టాలకు అనుమతిస్తే ఆర్థిక నేరాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని, దీనికి బదులు కొత్త పేమెంట్ వ్యవస్థలను తీసుకురావడం లేదంటే అభివృద్ధి చేయడం లాంటివి చేయాలని ఎల్ సాల్వడర్‌కు సూచించింది ఐఎంఎఫ్. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇవ్వొద్దని, అది అఫీషియల్ కరెన్సీ కాదని కుండబద్ధలు కొట్టి తేల్చేసింది ఐఎంఎఫ్. చదవండి: బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత! ఎలాగంటే.. ఇదిలా ఉంటే బిట్‌కాయిన్ బాండ్లతో ఏకంగా బిట్ కాయిన్‌సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) ప్రకటించిన రెండు రోజులకే ఐఎంఎఫ్ నుంచి ఈ ప్రతికూల ప్రకటన వెలువడడం విశేషం. అయితే దేశ అవసరాలు, ఆసక్తి మేర కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని అధ్యక్షుడు బుకెలె చెప్తున్నాడు. బిట్‌కాయిన్ చట్టబద్దత కోసం మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఐఎంఎఫ్ ప్రకటన ఆ ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు కొందరు భావిస్తున్నారు. చదవండి: ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..! చదవండి: సంచలనం.. అగ్నిపర్వతాలతో బిట్‌కాయిన్ తయారీ -
క్రిప్టో కరెన్సీపై ఆర్ఎస్ఎస్ శాఖ కీలక వ్యాఖ్యలు
క్రిప్టో కరెన్సీపై విధాన పరమైన నిర్ణయం తీసుకునే విషయంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుండగా.. రాష్ట్రీయ స్వయం సేవక్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంఛ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. అసెట్ క్లాస్ క్రిప్టో కరెన్సీని చట్ట బద్దంగా గుర్తించాలంటూ స్వదేశీ జాగరణ్ మంఛ్ కో కన్వీనర్ అశ్వినీ మహాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీపై ఆయన మాట్లాడుతూ ‘ ప్రస్తుతం ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తోన్న క్రిప్టో ఎక్సేంజీలలో పెట్టుబడులు పెడుతున్నారు. వీటిపై ప్రభుత్వాల నిర్వాహణ ఉండటం లేదు. ఇందులో పెట్టుబడిగా వస్తున్న కరెన్సీ ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ఇలా జరగడం ఎవరికీ మంచింది కాదు. కాబట్టి ప్రభుత్వాలు అస్సెట్ క్లాస్‌గా క్రిప్టో కరెన్సీని గుర్తించాలి. ఆ తర్వాత నియంత్రణను చట్టపరమైన విధానాలు రూపొందించాలి’ అని పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి.బంగారంతో సమానం కాదు క్రిప్టో కరెన్సీని అసెట్ క్లాస్‌గా గుర్తించాలని చెప్పిన మహాజన్ మరో కీలక వ్యాఖ్య చేశారు. అసెట్ క్లాస్‌తో ఉన్న బంగారంతో క్రిప్టో కరెన్సీ సమానం కాదన్నారు. బంగారం తరహాలో క్రిప్టో కరెన్సీకి ఇంట్రిన్సిక్ వ్యాల్యూ (అంతర్గత విలువ) లేదన్నారు. క్రిప్టో కరెన్సీలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని, వాటిని ఎవరూ ఇష్యూ చేస్తున్నారు. ఎవరు కొంటున్నారు. అలా కొన్నవారు ఆ కరెన్నీతో ఏం చేస్తున్నారో తెలియక పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తలోమాట క్రిప్టో కరెన్సీకి చట్ట బద్దత కల్పించే విషయంపై ఇటీవల జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఇందులో అధికార పక్షం క్రిప్టోకు మద్దతుగా అభిప్రాయం వ్యక్తం చేయగా ప్రతిపక్ష కాంగ్రెస్ క్రిప్టోను నిషేధించాలని కోరింది. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ సైతం క్రిప్టోతో ఇబ్బందులు వస్తాయన్నట్టుగా మాట్లాడారు. కాగా తాజాగా స్వదేశీ జాగరణ్ మంఛ్ తరఫున అభిప్రాయం వ్యక్తం అయ్యింది. చదవండి:క్రిప్టోలతో మనీలాండరింగ్ భయాలు - ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆందోళన -
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..దిగ్భ్రాంతిలో ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై దేశీయ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. తాను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. This would be highly amusing if it wasn’t so unethical &, in fact, dangerous. Someone saw this online & alerted me. I need to make people aware that this is completely fabricated & fraudulent. Takes fake news to a new level. Ironically, I’ve not invested a single rupee in cryptos pic.twitter.com/cfWRDY1J88 — anand mahindra (@anandmahindra) November 19, 2021 అంతేకాదు ఆనంద్ మహీంద్రా క్రిప్టోలో పెట్టుబడి పెట్టారంటూ వచ్చిన కథనాల్ని ట్విట్టర్లో షేర్ చేశారు. కథనాలన్నీ అవాస్తవం. ఈ వార్తలపై పలువురు తనని అప్రమత్తం చేశారని అందుకే స్పందించాల్సి వచ్చిందన్నారు. చదవండి: ఎంత మంచి పని ! ఈ స్టార్టప్‌కి నేను అండగా ఉంటా - ఆనంద్ మహీంద్రా -
దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, క్రిప్టో కరెన్సీకి చట్ట బద్ధత కల్పించడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భావిస్తున్న 2022–23 బడ్జెట్లోనే ఈ మేరకు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన సూచించారు. క్రిప్టో కరెన్సీని కొందరు అసెట్‌గా భావిస్తున్నారని అన్నారు. తద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ తెలిపారు. ఇతర కొన్ని సేవల తరహాలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా క్రిప్టోకి వర్తిస్తుందని చట్టం ‘చాలా స్పష్టంగా‘ చెబుతోందని వివరించారు. ‘‘క్రిప్టోపై పన్ను అంశాలపై మేము దృష్టి సారిస్తాము. ఇప్పటికే ప్రజలు దానిపై పన్నులు చెల్లిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొనుగోళ్ల పరిమాణం నిజంగానే చాలా పెరిగింది. ఈ అంశంపై పన్నులకు సంబంధించి కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకురాగలమా లేదా అని చూద్దాం. అయితే ఇది బడ్జెట్ నాటికి సిద్ధం అవుతుంది. మనం ఇప్పటికే బడ్జెట్‌కు దగ్గరగా ఉన్నాము. బడ్జెట్లో ప్రతిపాదనలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించాలి’’ అని బజాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిప్టో ట్రేడింగ్ విషయంలో టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. వేగంగా పరిణామాలు... క్రిప్టో కరెన్సీపై దేశంలో నియంత్రణకానీ, నిషేధంకానీ లేవు. ఈ వర్చువల్ కరెన్సీల వల్ల ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర విఘాతమని ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రకటనల నేపథ్యంలో మీడియాలో దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడుతున్నాయి. సినీ స్టార్ నుంచి క్రీడాకారుల వరకూ క్రిప్టోకు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. -
క్రిప్టోలతో మనీలాండరింగ్ భయాలు - ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆందోళన
ముంబై: క్రిప్టో కరెన్సీల వేల్యుయేషన్‌పై స్పష్టత లేకపోవడం, మనీలాండరింగ్ అవకాశాలు ఉండటం వంటి అంశాలే వీటికి సంబంధించి సెంట్రల్ బ్యాంకుల్లో నెలకొన్న ప్రాథమిక అందోళనలని ఆర్బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రభుత్వం గానీ వీటిని అనుమతిస్తే బ్యాంకర్లు ఆచి తూచి వ్యవహరించాలని ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన సూచించారు. విశ్వనాథన్ సూచనలు క్రిప్టో ఆస్తులను బట్టి వ్యక్తుల సంపదను లెక్కగట్టొద్దని పేర్కొన్నారు. క్రిప్టో అసెట్స్‌ను తనఖా పెట్టకపోయినా.. వాటి విలువ ఆధారంగా రుణాలు ఇవ్వరాదని తెలిపారు. క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును నవంబర్ 29న ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో విశ్వనాథన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే క్రిప్టో కరెన్సీల విషయంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఆందోళన చెందుతుంటే.. ప్రభుత్వాలు మాత్రం వీటివైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయో తెలియడం లేదని విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..! -
క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..!
Narendra Modi Warns Bitcoin Could Spoil Young Indians Urges Cooperation Of Nations: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీగా ఆదరణ పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్ కూడా ముందు స్థానాల్లో నిలుస్తోంది. భారత్‌లో సుమారు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీపై సిడ్నీ డైలాగ్ వర్చువల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలను చేశారు. తప్పుడు చేతుల్లోకి వెళ్తే ప్రమాదమే..! సిడ్నీ డైలాగ్ వర్చువల్ కీనోట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ‘ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో వ్యవహారంపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: జాతీయ గీతం వింటూ కన్నీరు పెట్టుకున్న విజయ్ శేఖర్ శర్మ! సిడ్నీ డైలాగ్ సందర్భంగా...పీఏం మోదీ తన ప్రసంగంలో....ప్రపంచ పురోగతి, శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలపై దృష్టి సారించాలని అన్నారు. నేటి ప్రపంచంలో సాంకేతికత ఇప్పటికే ప్రపంచ దేశాలకు ప్రధాన సాధనంగా మారిందని వెల్లడించారు. అదే సాంకేతికత పలుదేశాలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం లేకపోలేదని తెలిపారు. Take crypto-currency or bitcoin for example. It is important that all democratic nations work together on this and ensure it does not end up in wrong hands, which can spoil our youth: PM @narendramodi — PMO India (@PMOIndia) November 18, 2021 చదవండి: క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం? ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం -
క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
RBI Governor Shaktikanta Das on Cryptocurrencies: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ వారంలో రెండవసారి క్రిప్టో కరెన్సీలపై తన ఆందోళన వ్యక్తం చేశారు. వర్చువల్ కరెన్సీతో ‘చాలా లోతైన సమస్యలు’’ ఇమిడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వానికి కూడా దీనివల్ల ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ అంశంపై సమగ్ర, లోతైన చర్చ అవసరమని కూడా స్పష్టం చేశారు. ఆర్బీఐ అంతర్గత సమావేశాల్లోనూ ఇవే అభిప్రాయాలు వ్యక్తమయినట్లు వెల్లడించారు. ఎస్బీఐ ఎనిమిదవ బ్యాంకింగ్, ఎకనామిక్ కాన్క్లేవ్ను ఉద్దేశించి గవర్నర్ మంగళవారం చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► పార్లమెంటరీ స్థాయి సంఘం క్రిప్టో కరెన్సీలపై ఏమి చర్చించిందన్న విషయం నాకు తెలియదు. ► క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సవివరమైన నివేదికను సమర్పించింది. ఇది ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉంది. ► క్రిప్టో కరెన్సీకి సంబంధించి ప్రస్తుత ట్రేడింగ్ పరిమాణంపై అనుమానాలు ఉన్నాయి. రుణ ఆఫ ర్లు ఇవ్వడం ద్వారా ఖాతాలను తెరవడానికి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారన్న సమాచారం ఉంది. ► ఖాతాలను తెరవడానికి రుణ సౌలభ్యతసహా పలు రకాల ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ► క్రిప్టో మార్కెట్లో పెట్టుబడుల సంఖ్య పెరుగుతోంది తప్ప, పరిమాణం పెరగడంలేదన్నది సుస్పష్టం. ఎక్కువ మంది పెట్టుబడిదారులు రూ.500, రూ. 1,000 లేదా రూ. 2,000 వంటి కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్నట్లు సమాచారం. 70 నుండి 80 శాతం ఖాతాలు ఈ తరహావే ఉంటున్నట్లు తెలుస్తోంది. ► వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది ► భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టంగా ఉంది. ► ఆర్థిక వ్యవస్థలో మూల స్తంభాలు పటిష్టంగా ఉండడంతోపాటు, వేగవంతంగా వ్యాక్సినేషన్ పక్రియ జరుగుతుండడం, పండుగల సీజన్ వంటి అంశాలు దేశంలో డిమాండ్ రికవరీ పటిష్టతకు దారితీస్తోంది. ► కోవిడ్ ప్రతికూల పరిస్థితులు క్రమంగా తగ్గుతుండటంతో దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధికి తగిన అన్ని అవకాశాలూ ఉన్నాయి. ► వినియోగ డిమాండ్ గణనీయంగా మెరుగుపడుతోంది. అయితే ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరగాల్సి ఉంది. ► తీవ్ర సవాళ్లు ఎదురయినప్పటికీ, భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ కరోనా ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొంది. ► ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకునే అవకాశాలున్నాయి. ఇందుకు తగిన మూలధన పటిష్టతతో బ్యాంకులు సిద్ధంగా ఉండాలి. క్రిప్టోకు కేంద్రం సిద్ధమన్న వార్తల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలపై శక్తికాంత దాస్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘క్రిప్టో ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వ నిర్ణయించినట్లయితే, ఆ విధులను ఆర్బీఐ నిర్వహిస్తుందా?’ అని ఇటీవల ఒక కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నపై వ్యాఖ్యానించడానికి గవర్నర్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెల్లో కూడా దాస్ క్రిప్టో కరెన్సీ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: క్రిప్టోపై కేంద్రం కీలక అడుగులు.. నిషేధానికి నో -
క్రిప్టోపై కేంద్రం కీలక అడుగులు.. నిషేధానికి నో
Parliamentary Panel Meeting on Cryptocurrency: క్రిప్టోలకు సంబంధించి నియంత్రణలు ఉండాలంటూ బీజేపీ నేత జయంత్‌సిన్హా అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఫైనాన్స్) సోమవారం నిర్వహించిన సమావేశంలో అభిప్రాయాలు వినిపించాయి. క్రిప్టో ఫైనాన్స్‌తో (ఆర్థిక లావాదేవీలు) లాభ, నష్టాలపై ప్యానెల్ చర్చించింది. కొందరు సభ్యులు క్రిప్టో కరెన్సీల ఎక్సేంజీలు, లావాదేవీలపై నియంత్రణ ఉండాలే కానీ, పూర్తిగా నిషేధించడం సరికాదన్న అభిప్రాయాన్ని వినిపించారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు తెలిపాయి. పొంజి కాకుడదు క్రిప్టో ఆస్తుల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుండడం, దేశీయంగాను కోట్లాది మంది వీటిల్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్న క్రమంలో వచ్చే రిస్క్‌లపై ఆందోళనలు వ్యక్తమవుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటరీ ప్యానెల్ నిర్వహించిన ఈ సమావేశంలో క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్‌ల చీఫ్‌లు, బ్లాక్‌చైన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ సభ్యులు, సీఐఐ తదితర పరిశ్రమల మండళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. క్రిప్టో ఫైనాన్స్‌పై తమ అభిప్రాయాలను వీరు ప్యానెల్‌కు తెలియజేశారు. ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న క్రిప్టోలు పొంజి స్కీమ్లుగా మారిపోకూడదన్న ఆందోళనను కమిటీ సభ్యులు వ్యక్తం చేశారు. అనుమతి వద్దు ‘‘కరెన్సీ అనేది దేశ సారభౌమాధికార సాధనం. కానీ, క్రిప్టో కరెన్సీ అలా కాదు. అది కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇంటర్నెట్ వేదికగానే దీని నిర్వహణ ఉంటుంది. కొనుగోలు, యూజర్లే వీటి విలువను నిర్ణయిస్తుంటారు. ఇది చట్టవిరుద్ధం’’ అని కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెప్పారు. మొత్తానికి క్రిప్టో లావాదేవీల వ్యవహారాలు అలా వదిలివేయడం కాకుండా, నియంత్రణ అయితే ఉండాలన్న విస్తృతాభిప్రాయానికి సమావేశం వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. క్రిప్టోలపై ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వహించిన తొలి సమావేశం ఇది. సమావేశానికి వచ్చిన వారి అభిప్రాయాలను విన్నామని, ఇది ఇక ముందు కూడా కొనసాగుతుందని సిన్హా తెలిపారు. చదవండి:క్రిప్టో.. తగ్గేదేలే! -
క్రిప్టో.. తగ్గేదేలే!
బిట్‌కాయిన్.. ఎథీరియమ్.. షిబా ఇను, డోజికాయిన్.. ఇన్వెస్టర్ల ప్రపంచం క్రిప్టోల గురించి తెగ చర్చించుకుంటోంది. స్పెక్యులేటివ్ మద్దతుతో ఉన్నట్టుండి ఏదో ఒక క్రిప్టో టోకెన్ 24 గంటల్లోనే వందలు, వేల రెట్లు పెరిగేస్తోంది. దీంతో ఇన్వెస్టర్లలోనూ, ముఖ్యంగా యువ ఇన్వెస్టర్లలో చెప్పలేనంత ఆసక్తి ఏర్పడుతోంది. క్రిప్టోల గురించి పెద్దగా తెలియకపోయినా.. ఫోన్ నుంచే డిజిటల్‌గా క్రిప్టో ట్రేడింగ్ ఖాతా తెరిచేసి ఎంతో కొంత పెట్టుబడితో తమ దృష్టిలో పడిన క్రిప్టోను కొనుగోలు చేసే వాతావరణం నెలకొందనడంలో సందేహం లేదు. మనదేశంలోనే అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెట్టుబడులన్నీ క్రిప్టోలను వెతుక్కుంటూ వెళుతున్నాయి. సామాన్య ఇన్వెస్టర్లకే ఈ ధోరణి పరిమితం కాలేదు. ప్రముఖ కంపెనీల దగ్గర్నుంచి, ఫండ్ మేనేజర్ల వరకు అందరూ క్రిప్టోల్లో పెట్టుబడుల అవకాశాలను వెతుక్కుంటున్నారు. కాకపోతే, వీటితో ఎలా వేగాలో ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులకు అర్థం కాకుండా ఉంది. క్రిప్టో కరెన్సీ అంటే..? క్రిప్టోకరెన్సీలు అనేవి డిజిటల్ ఆస్తులు. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే క్రిప్టో కాయిన్లు, టోకెన్లను క్రిప్టోకరెన్సీలుగా పిలుస్తున్నారు. వీటిని పెట్టుబడి సాధనాలుగాను, ఆన్లైన్లో కొనుగోళ్లకు చెల్లింపుల సాధనాలుగానూ వినియోగిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ అన్నది భౌతికంగా ఉండదు. డిజిటల్లోనే ఉంటుంది. రూపీ, డాలర్, యూరో మాదిరిగా ఇవి ఫియట్ కరెన్సీలు కావు. ఎవరో ఒకరు నియం త్రించేవి కావు. వీటిపై సెంట్రల్ బ్యాంకుల నియంత్రణ ఉండదు. కనుక వీటిని డీసెంట్రలైజ్డ్గా పేర్కొంటారు. ఇంటర్నెట్ వేదికగా యూజర్ల మధ్య ఇవి చెలామణి అవుతుంటాయి. ప్రతీ కాయిన్ లేదా టోకెన్ ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ లేదా కోడ్‌తో రూపొందించబడి ఉంటాయి. కనుక వీటిని ట్రాక్ చేయడం, గుర్తించడం సులభతరం. క్రిప్టోగ్రఫీ, కరె న్సీ రెండింటి కలయికే.. క్రిప్టోకరెన్సీగా వాడుకలోకి వచ్చింది. క్రిప్టోకరెన్సీ లు క్రిప్టోగ్రఫిక్ సాంకేతికత ఆధారంగా లావాదేవీలను ధ్రువీకరిస్తుంటాయి. బ్లాక్ చైన్.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్‌చైన్ వేర్వేరు. క్రిప్టోకరెన్సీల అస్తిత్వానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీ తోడ్పడుతుంది. బ్లాక్‌చైన్ అన్నది డిజిటల్ లెడ్జర్. మొత్తం కంప్యూటర్ల నెట్వర్క్ పరిధిలో ప్రతి ఒక్క లావాదేవీని రికార్డెడ్‌గా నిర్వహిస్తుంటుంది. ప్రతీ నూతన లావాదేవీ నెట్వర్క్ పరిధిలోని ప్రతీ భాగస్వామి లెడ్జర్లో నమోదవుతుంది. ఎవరో ఒకరు నియంత్రించేది కాకుండా అవతరించిన సాంకేతికతే బ్లాక్‌చైన్. దీనికి ఉన్న ప్రత్యేకత ఇదే. బ్లాక్‌చెయిన్ అన్నది సమాచారాన్ని ప్యాకెట్ల రూపంలో కలిగి ఉంటుంది. దీన్ని బ్లాక్‌లుగా పిలుస్తారు. ఈ బ్లాక్‌లు ఒక చైన్ (గొలుసుగా)గా అనుసంధానమై ఉంటా యి. ఈ బ్లాక్‌లతో కూడిన చైన్‌ను ఎడిట్ చేయడానికి (దిద్దడానికి), మార్చడానికి అవకాశం ఉండదు. ఎంతో పటిష్టంగా ఉంటుంది. బ్లాక్ చైన్‌లో ప్రతీ లావాదేవీ సురక్షితంగా నమోదై ఉంటుంది. అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. బిట్‌కాయిన్, ఎథీరియమ్ ఇవన్నీ బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారంగా ఏర్పడినవే. కాకపోతే వీటిల్లో ఎథీరియమ్, సొలానా తదితర బ్లాక్ చెయిన్లు.. తమ నెట్‌వర్క్‌పై స్మార్ట్ కాంట్రాక్టుల (కోడ్)ను సృష్టించి, నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో నాన్ ఫంగిబుల్ టోకెన్లను ఏర్పాటు చేసుకుని విక్రయించుకోవచ్చు. ఈ నెట్ వర్క్‌ల సాయంతో ఎన్నో క్రిప్టో టోకెన్ల సృష్టికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పాలిగాన్ (మేటి క్) అన్నది ఎథీరియమ్ బ్లాక్ చైన్‌పై ఏర్పడిందే. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం క్రిప్టో ఇన్వెస్టర్లు 18–34 ఏళ్లలోపు వారే. మరో 20 శాతం మంది 35–44 ఏళ్ల వయసులోపు వారున్నట్టు ఫైండర్స్ క్రిప్టోకరెన్సీ నివేదిక స్పష్టం చేస్తోంది. టెస్లా, ఫేస్బుక్, పేపాల్, వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్, మైక్రో స్ట్రాటజీ, బ్లాక్‌రాక్, ఏఆర్కే ఇన్వెస్ట్మెంట్స్ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టడం, ఈ టెక్నాలజీపై పనిచేయడం మొదలు పెట్టాయి. టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ సైతం బిట్‌కాయిన్, డోజికాయన్ తదితర క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసినట్టు స్వయంగా ప్రకటించారు. ఏది చేస్తే మెరుగు..? క్రిప్టోలను అధికారిక కరెన్సీలుగా ఆమోదించే పరిస్థితి లేదు. పెట్టుబడి సాధనాలుగా వీటిని పరిగణించి, పన్నుల రూపంలో ఆదాయం రాబట్టుకోవాలన్న యోచనను కేంద్రంలోని కొందరు సీనియర్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వినూత్న సాంకేతికతకు దారిచూపుతున్న క్రిప్టోలను పూర్తిగా నిషేధించినట్టయితే భారత్ మంచి అవకాశం కోల్పోయినట్టు అవుతుందని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గత శనివారం క్రిప్టోలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ టెక్నాలజీపై నిపుణులు, భాగస్వాములతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా క్రిప్టోలపై ప్రచారం, ప్రకటనలను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, క్రిప్టోలను అనుమతించడానికి ఆర్బీఐ సుముఖంగా లేదు. స్థూల ఆర్థిక పరిస్థితులకు వీటితో పెద్ద సమస్య వచ్చి పడుతుందని, ప్రపంచవ్యాప్తంగా నియంత్రణల పరిధిలో లేని ఇవి పెట్టుబడి సాధనాలుగా ఆమోదనీయం కాదని ఆర్బీఐ తన అభిప్రాయంగా కేంద్రానికి తెలియజేసింది. క్రిప్టోల్లో పెట్టుబడులకు అనుమతిస్తే.. అవి ఉగ్రవాదులకు, మనీలాండరింగ్ కార్యకలాపాలకు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళలను కూడా దర్యాప్తు సంస్థలు, ఆర్బీఐ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. క్రిప్టో లావాదేవీలపై కఠిన నియంత్రణలు ఉండాలని, లేదంటే ఇంటి పొదుపులు అనియంత్రిత సాధనాల్లోకి మళ్లితే ప్రమాదంలో పడినట్టు అవుతుందన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. దేశంలో క్రిప్టోల నిషేధం లేదా నియంత్రణకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చట్టం లేనందున రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఎన్ని క్రిప్టోలు ఉన్నాయి? బిట్ కాయిన్‌ను మొదటి క్రిప్టోకరెన్సీగా చెబుతారు. 2009లో ఇది ఏర్పడింది. దీని ఆవిష్కర్త సతోషి నకమొటో. ఎవరైనా ఇందులో పాల్గొనే విధంగా డీసెంట్రలైజ్డ్ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశారు. ఎవరో ఒకరికి పరిమితం కాకుండా.. అందరికీ చెందేలా దీన్ని రూపొందించడం విశేషం. క్రిప్టో కరెన్సీ యూనిట్లను మైనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టిస్తారు. క్లిష్టమైన మ్యాథమేటికల్ ఆల్గోరిథమ్‌ల కంప్యూటేషన్తో వర్చువల్ కాయిన్లను మైనింగ్ చేస్తుంటారు. క్రిప్టోలకు సంబంధించి అపరిమిత మైనింగ్‌కు అవకాశం లేకుండా పరిమితి ఉంటుంది. బిట్కాయిన్లను 21 మిలియన్లకు మించి మైనింగ్ చేయకుండా సతోషి నకమొటో పరిమితి విధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి 6,000కు పైగా క్రిప్టోలున్నాయని అంచనా. మన దేశంలో సుమారు 10 కోట్ల మంది ఇప్పటికే క్రిప్టోల్లో పెట్టుబడులు కూడా పెట్టేశారు. క్రిప్టో ఇన్వెస్టర్ల పరంగా భారత్ మిగతా దేశాలను వెనక్కి నెట్టేసింది. అగ్రరాజ్యం అమెరికాలోనూ క్రిప్టో ఇన్వెస్టర్ల సంఖ్య 2.74 కోట్లుగానే ఉంది. మొత్తం జనాభాలో క్రిప్టో ఇన్వెస్టర్ల శాతం (7.30) పరంగా భారత్ ఐదో స్థానంలో ఉంది. ఉక్రెయిన్ 12.73 శాతంతో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. భారతీయుల క్రిప్టో పెట్టుబడులు సుమారు 10 బిలియన్ డాలర్లు (రూ.75,000 కోట్లు) చేరి ఉంటాయని ఒక అంచనా. మనదేశంలో సుమారు 100కు పైనే క్రిప్టో కాయిన్లు కొనుగోళ్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. బిట్‌కాయిన్, ఎథీరియమ్, టెథర్ (యూఎస్డీటీ), షిబా ఇను, డోజికాయన్, పాలీగాన్ (మ్యాటిక్), కార్డనో, సొలాన, పోల్కడాట్, లైట్‌కాయిన్ వీటికి మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ ఆదరణ ఉంది. కాయిన్ డీసీఎక్స్, వాజిర్ఎక్స్, యునోకాయిన్, కాయిన్‌స్విచ్ కుబేర్, జెబ్‌పే సంస్థలు మన దేశంలో క్రిప్టో సేవలు అందిస్తున్నాయి. వీటి ల్లో వ్యాలెట్‌ను తెరిచి ట్రేడింగ్ చేసుకోవచ్చు. -
క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం? ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం
నలువైపుల నుంచి విమర్శలు వెల్లువలా వచ్చి పడుతున్న క్రిప్టో కరెన్సీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత క్రిప్టో కరెన్సీపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నవారు మన దేశంలోనే ఉన్నారు. దీంతో క్రిప్టో కరెన్సీపై ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు దేశంలో పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ వేదికగా జరిగే ఈ వ్యవహరంలో ఎవరి జోక్యం లేకుండా పోయింది. దీంతో క్రిప్టోలో పెట్టుబడులు మంచిది కాదనే ప్రచారం జరుగుతున్నా.. క్రిప్టో వ్యాప్తి ఆగడం లేదు. దీంతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వ పరంగా ఎలా వ్యవహరించాలి, ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి ఏ తరహా సూచనలు ఇవ్వాలనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగినట్టు ఏఎన్ఐ వెల్లడించింది. The meeting chaired by PM Modi on the way forward for cryptocurrency & related issues was also an outcome of a consultative process as RBI, Finance Ministry, Home Ministry had done an elaborate exercise on it as well as consulted experts from across the country & world: Sources — ANI (@ANI) November 13, 2021 క్రిప్టోకరెన్సీపై ఏదో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో బిట్ కాయిన్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. బిట్‌కాయిన్ కుంభకోణంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీం కోర్టును కోరుతోంది. మరోవైపు బిట్‌కాయిన్ వివాదం రోజురోజుకి ముదరడంతో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్పలతో పాటు కర్నాటక బీజేపీ చీఫ్ నళీని కుమార్‌లు అత్యవసర సమావేశం జరిపారు. మార్కెట్లో బిగ్‌ప్లేయర్లు, ప్రభుత్వాల జోక్యం లేకుండా పూర్తిగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుగుతాయి. మార్కెట్‌ను ఎవరూ కృత్రిమంగా ప్రభావితం చేయలేకపోవడం ఇందులో సానుకూల అంశం. అయితే సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల పెట్టుడులకు ఎటువంటి చట్టపరమైన రక్షణ ఉండదు. అందువల్ల గతంలో సుప్రీం కోర్టు క్రిప్టోపై నిషేధం విధించింది. చైనాతో సహా పలు దేశాలు క్రిప్టో లావాదేవీలను ప్రోత్సహించడం లేదు. ప్రభుత్వాల వైఖరి ఎలా ఉన్నా బిజినెస్ మ్యాగ్నెట్స్ క్రిప్టో కరెన్నీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే ఎలన్‌మస్క్ క్రిప్టో కరెన్సీకి అనధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా తాజాగా యాపిల్ సీఈవో టిమ్‌కుక్ సైతం క్రిప్టోలో తాను ఇన్వెస్ట్ చేసినట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. చదవండి:యాపిల్ ఫోన్ లాంటిదే క్రిప్టో కరెన్సీ- టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు -
యాపిల్ ఫోన్ లాంటిదే క్రిప్టో కరెన్సీ- టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు
Tim Cook says he owns cryptocurrency : యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాస్పద కరెన్సీగా చెలమని అవుతోన్న క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా మాట్లాడారు. ఎలన్‌మస్క్ , జాక్డోర్సేల తర్వాత మరో దిగ్గజ కంపెనీ సీఈవో క్రిప్టో పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. యాపిల్ లాంటిదే స్మార్ట్ఫోన్లలో యాపిల్ ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉందో కరెన్సీ విషయంలో క్రిప్టో కరెన్సీ కూడా అలాంటిదేనంటూ క్రిప్టో కరెన్సీ , ఆగ్యుమెంటెడ్ రియాల్టీలకు సంబంధించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో టిమ్ కుక్ పేర్కొన్నారు. ఈ మేరకు బిజినెస్ ఇన్సైడర్ ఓ కథనం ప్రచురించింది. తన పోర్ట్‌ఫోలియోలో క్రిప్ట్ కరెన్సీ కూడా ఉందని టిమ్ కుక్ చెప్పినట్టు ఆ పత్రిక రాసుకొచ్చింది. అయితే ఏ క్రిప్టో కరెన్సీలో టిమ్ కుక్ ఇన్వెస్ట్ చేశారనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడే అనుమతించం క్రిప్టో కరెన్సీ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేసినంత మాత్రానా యాపిల్ ప్రొడక్టులకు సంబంధించిన లావాదేవీల్లో క్రిప్టోను ఇప్పుడప్పుడే అనుమతించబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటీవల టెస్లా కార్ల కొనుగోలు సమయంలో క్రిప్టో కరెన్సీని అనుమతిస్తామంటూ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. చదవండి:ఈ దేశంలో క్రిప్టో కరెన్సీపై నిషేధం! షరియాకి విరుద్ధమన్న మత పెద్దలు -
ఈ దేశంలో క్రిప్టో కరెన్సీపై నిషేధం! షరియాకి విరుద్ధమన్న మత పెద్దలు
ఓ వైపు ఫ్యూచర్ కరెన్సీగా బిజినెస్ టైకూన్లు మద్దతు ఇస్తున్నా మరోవైపు అదే స్థాయిలో క్రిప్టో కరెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏషియా దేశాల్లో క్రిప్టో కరెన్సీపై ఆంక్షలు, నిషేధాలను ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మత పెద్దలు సైతం రంగంలోకి దిగారు. క్రిప్టోపై ఎలా ప్రపంచలోనే అత్యధికమంది ముస్లింలు నివసిస్తున్న దేశంగా ఇండోనేషియాకు గుర్తింపు ఉంది. ఇటీవల ఇండోనేషియా సెంట్రల్ బ్యాంకు, అక్కడి ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలో తెలపాలంటూ నేషనల్ ఉలేమా కౌన్సిల్‌ని కోరింది. షరియాకి విరుద్ధం క్రిప్టో కరెన్సీ తయారీ, చలామనీ తదితర విషయాలపై చర్చలు చేపట్టిన ఉలేమా బోర్డు చివరకు దాన్ని నిషేధించాలంటూ నిర్ణయం తీసుకుంది. క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్కి భద్రత లేకపోవడాన్ని కారణంగా చూపిస్తూ.. షరియా చట్టాలకు అది విరుద్ధమంటూ పేర్కొంది. పెట్టుబడికి తప్పకుండా లాభం వస్తుందని ఆధారాలు చూపిస్తే క్రిప్టో ట్రేడింగ్ చేసుకోవచ్చంటూ తెలిపింది. ఏం జరగవచ్చు నేషనల్ ఉలేమా కౌన్సిల్ నిర్ణయంతో దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పూర్తిగా నిలిచిపోకున్నా ముస్లిం మతస్తులు మాత్రం ఇన్వెస్ట్ చేసేందుకు వెనుకాడుతారని నిపుణులు అంటున్నారు. ఈ నిర్ణయం గల్ఫ్ దేశాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అనే ఆసక్తి నెలకొంది. -
ఇకపై బ్యాంకుల్లో క్రిప్టో కరెన్సీపై ట్రాన్సాక్షన్లు, మాస్టర్ కార్డ్ గ్రీన్ సిగ్నల్
Mastercard Allow Cryptocurrency Purchases: క్రిప్టోకరెన్సీ పెరిగిందంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. పడిందంటే పాతాళం అంచుల దాకా పడిపోతుంది. మళ్లీ అంతలోనే రాకెట్లా ఆకాశానికి రివ్వున దూసుకెళ్లిపోతుంది. అంత బజ్ క్రియేట్ చేస్తున్న ఈ క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. అయితే వారిలో మరింత జోష్‌ను నింపేందుకు ప్రముఖ ఫైనాన్షియల్ దిగ్గజం మాస్టర్ కార్డ్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్, క్రిడెట్ కార్డ్‌ల నుంచి క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. మాస్టర్ కార్డ్ అనేది బ్యాంకులకు, వినియోగదారులకు మధ్య వారధిగా నిలుస్తోంది. మాస్టర్ కార్డ్ అందిస్తున్న కార్డ్‌ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు బ్యాంకుల్లో ఆర్ధిక లావాదేవీల్ని నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా మాస్టర్ కార్డ్ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు నిర్వహించే సంస్థ 'బక్ట్' తో ఒప్పొందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాంకుల్లో మాస్టర్ కార్డ్ ద్వారా క్రిప్టో కరెన్సీలపై లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కల్పించింది. ఆయా బ్యాంకుల నుంచి బక్ట్లో క్రిప్టో కరెన్సీలపై లావాదేవీలు నిర్వహించినందుకు మాస్టర్ కార్డ్ రివార్డ్ పాయింట్లను అందించనుంది. ప్రాధమికంగా మాస్టర్ కార్డ్ గ్లోబల్ పేమెంట్స్ నెట్వర్క్ కు చెందిన బ్యాంకుల్లో మాత్రమే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై క్రిప్టో లావాదేవీల్ని నిర్వహిస్తే రివార్డ్ పాయింట్లను అందిస్తున్నట్లు మాస్టర్‌కార్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షెర్రీ హేమండ్ సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు వినియోగదారులకు క్రిప్టో లావాదేవీలు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు, బ్యాంకులు, ఫిన్‌టెక్, వ్యాపారులు ఇలా ఎవరైనా బక్ట్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం అవ్వడం ద్వారా క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయడం, అమ్మే వెసలుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇండియాలో మాస్టర్ కార్డ్‌లపై నిషేధం ఈఏడాది జూలై 14న ఆర్బీఐ స్థానిక డేటా నిల్వ నిబంధనలను పాటించనందుకు కొత్త క్రెడిట్, డెబిట్,ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయకుండా మాస్టర్ కార్డ్‌పై నిషేదం విధించింది. జూలై 22, 2021 నుండి అమల్లోకి వచ్చేలా మాస్టర్ కార్డ్ కొత్త దేశీయ కస్టమర్లను తన కార్డ్ నెట్‌వర్క్‌కు జోడించకుండా సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. డేటా స్థానికీకరణ నియమాల ప్రకారం, కంపెనీ భారతీయ వినియోగదారుల డేటాను దేశంలోనే ఉంచాల్సిన అవసరం ఉందని వివరించింది. చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..వెయ్యి పెట్టుబడితో 3.45 లక్షలు సంపాదించారు -
అదృష్టం అంటే వీళ్లదే.. వెయ్యి పెట్టుబడితో 3.45 లక్షలు సంపాదించారు
Squid Game Cryptocurrency turn 1000 into 3 point 45 lakh in less than 100 hours.లేటెస్ట్ సౌత్ కొరియన్ డ్రామా 'స్క్విడ్ గేమ్' మరో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్క్విడ్ పేరుతో ఏర్పాటైన క్రిప్టో కరెన్సీలో రూ.1000 పెట్టుబడిన పెట్టిన ఇన్వెస్టర్లు కేవలం 100 గంటల్లో వెయ్యి రూపాయిల నుంచి రూ.3.45లక్షల్ని సంపాదించారు. కాయిన్ మార్కెట్ క్యాప్ (coinmarketcap.com)ప్రకారం..నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్న దక్షిణ కొరియా వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో కూడా సంచలనంగా మారింది. నెట్ ఫ్లిక్స్‌లో స్క్విడ్ గేమ్‌కు వస్తున్న ప్రజాదరణని క్యాష్ చేసుకునేందుకు ఓ పేరు తెలియని వ్యక్తి 'స్క్విడ్' పేరుతో సొంత క్రిప్టో కరెన్సీని ప్రారంభించారు. ఇందులో వరల్డ్ వైడ్‌గా సుమారు 30 వేల మంది పెట్టుబడి పెట్టారు. అయితే ఈ గేమ్ నెట్ ఫ్లిక్స్ వ్యూయర్ షిప్లో నెంబర్ వన్‌గా కొనసాగుతుండగా..స్వ్కిడ్ పేరుతో ఉన్న క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. స్క్విడ్ క్రిప్టో కరెన్సీ విలువ అక్టోబర్ 26న $0.01236 నుంచి అక్టోబర్ 29కి $4.5 కి కేవలం 100 గంటల్లో 34,285 శాతానికి ఎగబాకింది.అంటే ఇక ఈ స్వ్కిడ్ కరెన్సీలో రూ.1000 పెట్టుబడి పెట్టిన మదుపర్లకు నాలుగు రోజుల్లో రూ.1000 నుంచి రూ.3,43,850 అర్జించారు. దీంతో అక్టోబర్ 29న ఆ క్రిప్టో $335 మిలియన్ల మార్కెట్ క్యాపిటల్‌కు చేరినట్లైందని కాయిన్ మార్కెట్ క్యాప్ వెల్లడించింది. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరక్కెక్కిన స్క్విడ్ గేమ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించింది. ఇటీవల (అక్టోబర్ 17)ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ గురించి తెలిపిన వివరాల ప్రకారం..సెప్టెంబర్ 17న నెట్ ఫ్లిక్స్‌లో విడుదలై ఏకంగా 90 దేశాల్లో నెంబర్ 1 వెబ్ సిరీస్‌గా నిలిచినట్లు తెలిపింది. కేవలం 27 రోజుల్లో 111మిలియన్ వీక్షకులకు చేరువైందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఇక తాజాగా ఫోర్బ్స్ సెప్టెంబర్ 27 తేదీన విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఒక్క యూఎస్‌లో వారం రోజుల వ్యవధిలోనే టీవీ స్క్రీన్లపై స్క్విడ్ గేమ్ 9 ఏపీసోడ్‌లను ఆడియన్స్ 3.26 బిలియన్ మినిట్స్ వీక్షించారని, దీంతో ఈ గేమ్ మరో రికార్డ్ సృష్టించినట్లైందని ఫోర్బ్స్ వెల్లడించింది. చదవండి: స్క్విడ్ గేమ్ క్రేజ్ మాములుగా లేదుగా..! -
ఎలన్‌మస్క్ కూడా ఏం చేయలేకపోయాడే..! రయ్‌రయ్‌మంటూ..
క్రిప్టోకరెన్సీలో మీమ్ డిజిటల్ కరెన్సీ భారీ లాభాలను పొందుతూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. షిబా ఇను ఐతే మరీను...! ఒక్కసారిగా గరిష్టలాభాలను గడించింది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. డోగీకాయిన్ స్ఫూర్తితో వచ్చిన షిబా ఇను మీమ్ క్రిప్టోకరెన్సీ సరికొత్త రికార్డులను నమోదుచేస్తోంది. తాజాగా షిబా ఇను మీమ్ క్రిప్టోకరెన్సీ విలువ ఆల్‌టైమ్ గరిష్టాలను తాకింది. చదవండి: టెస్లా కార్లపై ఎలన్ వ్యాఖ్యలు, ఇప్పుడు వైరల్ ఆన్లైన్ పిటిషన్స్‌తో రయ్...! రాబిన్‌హుడ్ లిస్టింగ్‌లో షిబా ఇను ట్రేడ్ చేయాలని ఆన్లైన్లో వస్తోన్న దరఖాస్తులతో ఈ మీమ్ క్రిప్టోకరెన్నీ సరికొత్త రికార్డులను తాకింది. ఇప్పటికి వరకు సుమారు 4 లక్షలకు పైగా యూజర్లు ఆన్లైన్లో పిటిషన్స్ దాఖలు చేశారు. షిబా ఇను మార్కెట్ క్యాప్ విలువ బుధవారం రోజున సుమారు 38 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాయిన్‌మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రకారం..షిబా ఇను 0.00008456 డాలర్లకు చేరుకుంది. ముందురోజు కంటే 72.62 శాతం మేర పెరిగింది. ఎలన్ మస్క్ ప్రభావం అంతంతే..! కొద్ది రోజుల క్రితం ఎలన్ ట్విటర్లో తన దగ్గర ఉన్న క్రిప్టోకరెన్సీ హోల్డింగ్స్ గురించి ఒక నెటిజన్ అడిగాడు. మీరు షిబా ఇను క్రిప్టోకరెన్సీ కలిగి ఉన్నారా..అని అడిగినందుకు సమాధానంగా..ఎలన్ మస్క్ తన దగ్గర కేవలం బిట్‌కాయిన్, ఈథిరియం, డోగీ కాయిన్ ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా డోగీకాయిన్ ప్రజల కరెన్సీ అంటూ ట్విటర్లో సమాధానమిచ్చారు. షిబా ఇను క్రిప్టోకరెన్సీను సపోర్ట్ చేసే లిస్ట్‌లో లేదని తెలిసిన ఎలన్ మస్క్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు కొంతమేర షిబా ఇను ఇన్వెస్టర్లకు భయాన్ని కల్గజేశాయి. ఎందుకంటే డోగీకాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలను శాసించడంలో మస్క్ ముందుంటాడు. కాగా ఈ మీమ్ క్రిప్టోకరెన్సీపై ఎలన్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాడు. చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..! -
ప్రపంచంలో ఎవరు చేయలేని ప్రయోగానికి సిద్దమైన ఆర్జీవీ..! ఇక డేంజరసే..
ఆర్జీవీ అంటే ప్రయోగాలకు పెట్టింది పేరు. మనోడు ఏదీ చేసిన ఒక కొత్తే. ఫిల్మ్ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో సినిమాలను డైరక్ట్ చేస్తుంటాడు ఆర్జీవీ. రాజ్ పాల్ యాదవ్, ఆప్సరా రాణి, నైనా గంగూలీ జంటగా నటించిన లెస్బియన్ చిత్రం డేంజరస్ త్వరలోనే సరికొత్త రికార్డును సృష్టించనుంది. ఎన్ఎఫ్టీ రూపంలో డేంజరస్...! భారత్‌లో క్రిప్టోకరెన్సీతో సమానంగా పలు సెలబ్రిటీలు నాన్‌ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ)పై ఆదరణను చూపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్, సల్మాన్ ఖాన్, దినేష్ కార్తీక్, రిషబ్‌పంత్ లాంటి వారు తమ వీడియోలను, ఆడియోలను ఎన్ఎఫ్టీ రూపంలో బ్లాక్ చెయిన్‌లో విక్రయించే ఏర్పాట్లలో ఉన్నారు. కాగా ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ చేయలేని ప్రయోగానికి ఆర్జీవీ సిద్దమయ్యాడు. చదవండి: సన్నీలియోన్ అరుదైన ఫీట్.. తన ఎన్ఎఫ్టీ కలెక్షన్స్‌తో వేలం రామ్ గోపాల్ వర్మ డైరక్ట్‌చేసిన చిత్రం డేంజరస్‌ను బ్లాక్ చెయిన్ ఎన్ఎఫ్టీగా విక్రయించబడుతోందని ఆర్జీవీ ట్విటర్లో పేర్కొన్నారు. 90 నిమిషాల ఈ ఫీచర్ ఫిల్మ్‌ను ఎన్ఎఫ్టీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేస్తున్నారు. డేంజరస్ సినిమాను థియేటర్స్‌లోనే కాకుండా పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో, పే పర్ వ్యూ ద్వారా ప్రేక్షకులు చూడవచ్చును. ఈ సినిమాను డేంజరస్ టోకెన్స్ లేదా క్రిప్టోకరెన్సీతో మన ఇండియన్ కరెన్సీతో కొనుగోలు చేయవచ్చును. అందుకోసం సపరేట్గా rgvdangertoken.com వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ఆర్జీవీ ప్రకటన ప్రకారం..డేంజరస్ సినిమాను ప్రేక్షకులు డేంజర్ టోకెన్లతో కొనుగోలు లేదా ఇన్వెస్ట్ కూడా చేయవచ్చును. డేంజరస్ సినిమాను సుమారు 6 లక్షల యూనిట్లుగా విలువగట్టారు. ఒకో యూనిట్ విలువ రూ. 100 సమానం. ఇన్వెస్టర్లు 5 లక్షలకు పైగా యూనిట్లను సొంతం చేసుకోవచ్చును. ఒకే ఇన్వెస్టర్ ఈ మొత్తాన్ని కూడా దక్కించుకోవచ్చును. మిగిలిన లక్ష యూనిట్లను ఆర్జీవీ, చిత్ర బృందం దగ్గర ఉండనున్నాయి. దీంతో సినిమా నుంచి వచ్చే లాభాలను ఇన్వెస్టర్లు కూడా పొందుతారు. పే పర్ వ్యూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన వ్యూస్ మేరకు ఇన్వెస్టర్లకు డబ్బులు కేటాయించడం జరుగుతుంది. ఎన్ఎఫ్టీ అంటే..! ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్ఎఫ్టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్లో 10 శాతం ఎన్ఎఫ్టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది. DANGEROUS India’s 1st LESBIAN crime/action/love film Trailer https://t.co/5dutBpWuko DANGEROUS India’s 1st LESBIAN DUET SONG https://t.co/BE2zmMYkdS 1st time in WORLD, a 90 minute film for sale as an NFT on BLOCKCHAIN ..For details visit https://t.co/YPS9lEftBN — Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2021 చదవండి: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత...! -
Elon Musk: అది ప్రజల క్రిప్టోకరెన్సీ ..! అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీ ఆదరణనే లభిస్తోంది. ఎలన్ మస్క్, మార్క్ క్యుబాన్ లాంటి బిలియనీర్లు సైతం క్రిప్టోకరెన్సీలను ఆదరిస్తున్నారు. ఎలన్ మస్క్ ఐతే మరీను..! డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎలన్‌మస్క్‌ను డోగీకాయిన్ ఫాదర్‌గా ఇన్వెస్టర్లు ముందుగా పిలుస్తారు. కాగా తాజాగా ఎలన్‌మస్క్ డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానే విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...! ప్రజల క్రిప్టోకరెన్సీ...! అమెరికాలో ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో అమెరికాలో 33 శాతం మంది పౌరులు డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను సపోర్ట్ చేస్తున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ప్రముఖ డోగికాయిన్ మిలియనీర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ విషయంపై ఎలన్‌మస్క్ స్పందిస్తూ...అవును నిజమే..డోగీ కాయిన్ క్రిప్టోకరెన్సీ ప్రజలది. టెస్లా, స్పేస్ఎక్స్లో పనిచేసే వారు కూడా డోగీకాయిన్ ఎక్కువగా కల్గిఉన్నారు. వారు అంత పెద్ద ఆర్ధిక నిపుణులు మాత్రం కాదు. అందుకనే నేను డోగీకాయిన్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని’ మస్ తన ట్విట్లో వెల్లడించారు. అప్పడప్పుడు తన పెంపుడు కుక్క షిభా ఫ్లోకీను ఫోటో పెడితే చాలు షిభా ఇను క్రిప్టోకరెన్సీ రయ్‌మని పెరుగుతాయి. అసలు ఎలన్‌మస్క్ దగ్గర షిబా ఇను క్రిప్టోకరెన్సీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం డోగీ కాయిన్, బిట్‌కాయిన్, ఈథిరియం క్రిప్టోకరెన్సీలనే కల్గి ఉన్నట్లు వెల్లడించారు. Lots of people I talked to on the production lines at Tesla or building rockets at SpaceX own Doge. They aren’t financial experts or Silicon Valley technologists. That’s why I decided to support Doge – it felt like the people’s crypto. — Elon Musk (@elonmusk) October 24, 2021 శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ అదే..! గతంలో అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబాన్ క్రిప్టోకరెన్సీలో డోగీకాయిన్ మీడియం ఆఫ్ ఎక్సేచేంజ్లో అత్యంత శక్తివంతమైన కమ్యూనీటీ కలిగి ఉందని చేసిన వ్యాఖ్యలకు ఎలన్ మస్క్ మద్దతు పలికారు. మార్క్ క్యూబాన్కు రిప్లే ఇస్తూ... నేను విషయాన్ని ఎప్పటినుంచో చెప్తున్నాను..అంటూ ఎలన్ రిప్లే ఇచ్చారు. చదవండి: తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు -
నేర్చుకో.. లాభాలు అందుకో
ఈక్విటీలు నూతన గరిష్టాలకు చేరుతుండడం యువ ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పెట్టుబడులపై చక్కని రాబడులు సొంతం చేసుకునే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే నేటి తరానికి ఉన్న అనుకూలత.. డిజిటల్ వేదికలపై సమాచారం పుష్కలంగా లభిస్తుండడం. లెర్నింగ్ యాప్‌ల సాయంతో ఈక్విటీలపై మరింత అవగాహన పెంచుకునేందుకు టెక్కీ యువత ఆసక్తి చూపిస్తోంది. జెరోదా పెట్టుబడుల మద్దతు కలిగిన ‘లెర్న్‌యాప్’కు యూజర్ల సంఖ్య ఏడాదిలోనే మూడింతలు పెరిగింది. 2020లో యూజర్ల సంఖ్య 70,000 కాగా, ఈ సంఖ్య ప్రస్తుతం 2,00,000 దాటిపోయింది. అంతేకాదు 10 లక్షల మంది ఇతరులు ఈ యాప్‌పై సమాచారాన్ని ఆన్వేషిస్తున్నారు. స్టాక్స్, క్రిప్టోలకు సంబంధించిన పాఠాలు ఇందులో వీడియోల రూపంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. 50 లక్షల మంది యూజర్లకు చేరువ కావాలన్నది లెర్న్‌యాప్ లక్ష్యం. ‘‘2020 నుంచి మా ఆదాయంలో 300 శాతం వృద్ధి కనిపిస్తోంది. గతేడాది ఆదాయంతో పోలిస్తే 2021లో ఆదాయం 350 అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని లెర్న్‌యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రతీక్‌సింగ్ తెలిపారు. డాక్యుమెంటరీ రూపంలోని వీడియోలు, క్విజ్‌లతో ఇందులోని సమాచారాన్ని మరింత ఆసక్తికంగా మార్చే ప్రయత్నాలను లెర్న్‌యాప్ అమలు చేస్తోంది. సాధారణంగా ఆర్థిక అంశాల పట్ల ఎక్కువ మందిలో ఆసక్తి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా రూపొందించడంపై ఈ సంస్థ దృష్టి పెట్టడం గమనార్హం. మహిళలకు ప్రత్యేకంగా.. పట్టణ మహిళల కోసం ఉద్దేశించినది ‘బేసిస్’ యాప్. క్రిప్టోలు, పెట్టుబడులపై ఈ యాప్‌లో ఆసక్తికర చర్చలు కూడా సాగుతుంటాయి. మార్కెట్లకు సంబంధించి తమ ఐడియాలను యూజర్లు ఇతరులతో పంచుకుంటుంటారు. 2019లో బేసి స్ మొదలు కాగా.. ఈ ప్లాట్‌ఫామ్‌పై మహిళా యూజర్ల సంఖ్య లక్ష దాటిపోయింది. వీరిలో ఎక్కువ మంది మిలీనియల్స్ కావడం గమనార్హం. కాలేజీ విద్యార్థినులు కూడా ఇందులో యూజర్లుగా ఉన్నారు. పెట్టుబడులను మెరుగ్గా నిర్వహించే విషయంలో నేర్చుకోవాలన్న ఆకాంక్ష వీరి లో వ్యక్తం కావడం భవిష్యత్తు పట్ల వారు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నారో తెలుస్తోంది. ‘‘సభ్యు లు మా ప్లాట్ఫామ్లో చేరిన తర్వాత తమ ఆదాయంలో సగటున 40 శాతం మేర ఆదా చేయగలుగుతున్నారు’’ అని బేసిస్ సహ వ్యవస్థాపకురాలు దీపికా జైకిషన్ తెలిపారు. నిపుణుల సాయంతో తమ ఖర్చులను క్రమబదీ్ధకరించుకోవడం వల్లే ఇది సాధ్యమవుతున్నట్టు చెప్పారు. ఈ యాప్‌లో సభ్యత్వానికి వార్షిక చందా రూ.9,000. ‘ఫైనాన్స్’కు సంబంధించి ఎన్నో ఆరి్టకల్స్ ఈ యాప్‌పై అందుబాటులో ఉన్నాయి. ‘‘ఫైనాన్స్’ గురించి సౌకర్యవంతంగా నేర్చుకునేందుకు మహిళలకు ఒక సురక్షితమైన వేదికను ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’’ అని జైకిషన్ వెల్లడించారు. సొంత సామర్థ్యాలపై ఆసక్తి నేటి తరానికి తాము స్వయంగా ఆర్థిక అంశాలను తెలుసుకుని, తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోవాలన్న ఆసక్తి పెరుగుతున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాదారులపై ఆధారపడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. లెర్న్యాప్ను బెంగళూరు, పుణె, ముంబై తదితర పట్టణాల నుంచి ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు వినియోగిస్తున్నారు. ప్రాంతీయ మార్కెట్లకూ చేరువ కావాలని, హిందీతోపాటు కనీసం రెండు భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందించాలన్న ప్రణాళికతో ఉన్నట్టు ప్రతీక్‌సింగ్ తెలిపారు. ప్రతీ నెలా రూ.375 చందా చెల్లించడం ద్వారా లెర్న్‌యాప్‌పై ఎన్ని కోర్స్‌లను అయినా నేర్చుకోవచ్చు. యూజర్ల విచారణలకు నిపుణులతో జవాబులను కూడా ఇప్పిస్తోంది. నాణ్యతపై దృష్టి.. ఆన్లైన్లో ఎన్నో వేదికలపై ఫైనాన్స్‌కు సంబంధించి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ, నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో లెర్న్‌యాప్, బేసిస్ పనిచేస్తున్నాయి. లెర్న్‌యాప్‌పై పరిశ్రమలకు చెందిన నిపుణులు, దిగ్గజాలు చెప్పిన అనుభవ పాఠాలు అందుబాటులో ఉంటాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ రామ్‌దియో అగర్వాల్, బీఎస్ఈ సీఈవో ఆశిష్ చౌహాన్, ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో రాధికా గుప్తా, రాకేశ్ జున్‌జున్‌వాలాకు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ సీఈవో ఉత్పల్సేత్ తదితరులు చెప్పిన అంశాలతో వీడియోలో ఈ వేదికపై ఉన్నాయి. ‘‘పరిశ్రమలకు చెందిన దిగ్గజ నిపుణులు పాఠాలు చెప్పడం సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే. అంతేకానీ, యూజర్ల నుంచి డబ్బులు సంపాదించుకోవాలని కాదు’’ అని ప్రతీక్‌సింగ్ తెలిపారు. లెర్న్‌యాప్ స్టోరీ రూపంలో వీడియోలను రూపొందిస్తోంది. తద్వారా ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి రోజూ 45 నిమిషాల వర్క్‌షాప్‌ను, అనంతరం ప్రశ్న/జవాబుల సెషన్‌ను నిర్వహిస్తోంది. దీంతో తాము నేర్చుకున్న అంశాలపై వారిలో మరింత అవగాహన ఏర్పడే దిశగా పనిచేస్తోంది. ‘‘మేము ప్రత్యక్ష ఫలితాలను కూడా అందిస్తున్నాం. ఈ రోజు నేర్చుకుని.. పెట్టుబడులు వృద్ధి చెందేందుకు 20 ఏళ్లు వేచి చూసే విధంగా ఇది ఉండదు’’ అని ప్రతీస్ సింగ్ చెప్పడం గమనార్హం. -
ఇలా చేస్తే రూ.5000 ఉచితం..!
Crosstower Offers Indian Users 5000 Credit For Learning Crypto Trading: ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం ఊపందుకుంది. అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్‌లో కూడా క్రిప్టోకరెన్సీపై భారీగానే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రముఖ బ్రోకింగ్ అండ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం బ్రోకర్‌చూసర్ పేర్కొన్న విషయం తెలిసిందే. సుమారు 10 కోట్లకుపైగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తేలింది. భారత్‌లో పలు క్రిప్టో ట్రేడింగ్ కంపెనీలు కూడా క్రిప్టోపై అవగాహనను కల్పించేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. జియో ఫ్రీ ఆఫర్ తరహాలో..! టెలికాం రంగంలో జియో రాకతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జియో ప్రారంభంలో సుమారు ఆర్నెల్ల పాటు ఉచిత డేటా, కాలింగ్‌ను అందించిన విషయం మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇప్పుడు జియో తరహాలో క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్‌ను ప్రొత్సహించేందుకుగాను క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ క్రాస్‌టవర్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. క్రాస్టవర్తో క్రిప్టో ట్రేడింగ్ ప్రారంభించే యూజర్లకు ఉచితంగా రూ. 5 వేలను వారి వ్యాలెట్‌లో క్రెడిట్ చేయనుంది. ఆయా యూజర్ కేవైసీ పూర్తికాగానే రూ. 5 వేలు వ్యాలెట్లోకి వస్తాయి. కంపెనీ ప్రకారం..వీటితో వచ్చే లాభాలను యూజర్లు సులువుగా రిడీమ్ చేసుకోవచ్చును. ట్రేడింగ్ చేసే సమయంలో వచ్చే నష్టాలను కంపెనీ భరిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని ఇతర వ్యాలెట్లకు ట్రాన్స్ఫర్ చేసేందుకు అనుమతి ఉండదు. ఈ ఫీచర్‌తో భారత యూజర్లు ఎలాంటి ఖర్చు లేకుండా క్రిప్టో ట్రేడింగ్‌లో పాల్గొనే సామర్థ్యాన్ని పొందుతారని క్రాస్‌టవర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ అహుజా అభిప్రాయపడ్డారు. చదవండి: వర్క్‌ఫ్రం హోమ్ ఓల్డ్ మెథడ్... కొత్తగా ఫ్లెక్సిబుల్ వర్క్‌వీక్ సరికొత్త పంథాతో ట్రేడింగ్ కంపెనీలు..! భారత్‌లో క్రిప్టోకరెన్సీపై మరింత ఆదరణను తెచ్చేందుకు పలు క్రిప్టోట్రేడింగ్ కంపెనీలు సరికొత్త పంథాలో వెళ్తున్నాయి. క్రిప్టోకరెన్సీపై మరింత అవగాహనను తెచ్చేందుకుగాను పలు ట్రేడింగ్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ప్రముఖ నటులను నియమించుకుంటున్నారు. కొద్ది రోజల క్రితం కాయిన్స్విచ్చ్కుబేర్కు రణ్వీర్ సింగ్‌ను, కాయిన్డీసీఎక్స్కు ఆయుష్మాన్ ఖురానాను నియమించిన విషయం తెలిసిందే. వీరిని ప్రచారకర్తలుగా నియమాకంతో భారత్‌లోని టైర్-1, టైర్-2 నగరాలోని ప్రజల్లో క్రిప్టోకరెన్సీపై అవగాహనను కల్పించేందుకు క్రిప్టోకంపెనీలు సిద్ధమయ్యాయి. చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...! -
ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీగానే ఆదరణ పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీపై పెరుగుతున్న ఆదరణను కొంతమంది సైబర్ నేరస్తులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లపై హ్యకర్లు దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. దాడికి గురవుతున్న వారిలో ఎక్కువగా ఐఫోన్ యూజర్లే ఉండడం గమనార్హం. తాజాగా బ్రిటన్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ ఐఫోన్ యూజర్లను హెచ్చరించింది. చదవండి: ఈ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా పెంచిన వివో...! డేటింగ్ యాప్స్‌తో దాడులు..! బంబుల్, టిండర్ వంటి డేటింగ్ యాప్స్‌తో క్రిప్టో స్కామర్లు ఐఫోన్ యూజర్లపై విరుచుకపడుతున్నట్లు సోఫోస్ పేర్కొంది. ఐఫోన్ యూజర్ల క్రిప్టోకరెన్సీలను దొంగలించడంతో పాటుగా, ఆయా వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారని సోఫోస్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు సుమారు రూ. 10 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీలను సైబర్ నేరస్తులు దొంగిలించారని సోఫోస్ వెల్లడించింది. క్రిప్టో స్కామర్లు ఎక్కువగా ఆసియాలోని వ్యక్తులనే లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఈ స్కామర్లు యూరప్, యూఎస్ నుంచి తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు సోఫోస్ పేర్కొంది. క్రిప్టో ఇన్వెస్టర్లు సురక్షిత క్రిప్టో లావాదేవీలను సులభతరం చేయడానికి ఆపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ధృవీకరించబడిన ఎక్స్ఛేంజ్, ట్రేడింగ్ సైట్లను మాత్రమే ఉపయోగించాలని సోఫోస్ సూచించింది. ఒక నివేదిక ప్రకారం.. 2020 ఏప్రిల్‌లో సుమారు 10.52 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 79,194 కోట్లు) మేర క్రిప్టోకరెన్సీ దొంగిలించబడిందని తెలుస్తోంది. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! -
క్రిప్టోకరెన్సీపై బిలియనీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
క్రిప్టోకరెన్సీపై ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబాన్ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ ఏది అనే విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. క్రిప్టోకరెన్సీలోకి కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకు పలు సూచనలను చేశారు. క్రిప్టోకరెన్సీలో..బిట్‌కాయిన్, ఈథర్, డోగీకాయిన్స్ ఎక్కువగా లాభాలను తెస్తాయని మార్క్ సూచించారు. చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...! ‘బంగారం కంటే మెరుగైనది’ బిట్‌కాయినే అని మార్క్ క్యూబాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. బంగారం కంటే బిట్‌కాయిన్ ఎక్కువ లాభాలను ఇస్తోందని పేర్కొన్నారు. డోగీకాయిన్ అత్యంత శక్తివంతమైన ట్రాన్సక్షన్ రేట్‌ను కల్గి ఉందని వెల్లడించారు.మీమ్ క్రిప్టోకరెన్సీఐనా డోగీ కాయిన్ టాప్-10 క్రిప్టోకరెన్సీలో నిలిచింది. గతంలో మార్క్ క్యూబాన్ ఎలన్‌మస్క్‌తో డోగీకాయిన్పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బిట్‌కాయిన్ దూకుడు..! ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.క్రిప్టోకరెన్సీలో అత్యంత ఆదరణను పొందిన బిట్‌కాయిన్ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ 15 న బిట్‌కాయిన్ 60 వేల డాలర్ల మార్కును దాటింది. దాదాపు ఆరు నెలల తర్వాత బిట్‌కాయిన్ ఈ మార్కును తాకింది. అదే రోజు ఒకానొక సమయంలో 62,535.90 డాలర్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. చదవండి: సై అంటే సై అంటూన్న దిగ్గజ టెక్ కంపెనీలు..! -
Bitcoin: ఆర్నెల్లలో తిరిగి మళ్లీ అదే స్థానం..!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ట్రెండ్ కొనసాగుతుంది. క్రిప్టోకరెన్సీకు భారీగానే ఆదరణ లభిస్తోంది. క్రిప్టోకరెన్సీలో అత్యంత ఆదరణను పొందిన బిట్‌కాయిన్ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ 15 న బిట్‌కాయిన్ 60 వేల డాలర్ల మార్కును దాటింది. దాదాపు ఆరు నెలల తర్వాత బిట్‌కాయిన్ మార్కును తాకింది. అదే రోజు ఒకానొక సమయంలో 62,535.90 డాలర్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అంతలోనే తిరిగి క్షీణించి 61 వేల డాలర్లకు చేరుకోగా ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 60,847.50 వద్ద ట్రేడ్ అవుతోంది. చదవండి: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..! గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ 2.48 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు వారంతో పోలిస్తే పలు క్రిప్టోకరెన్సీలు 4.52 శాతం లాభపడింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత 24 గంటల్లో 132.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారిగా 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అదేనెలలో బిట్‌కాయిన్ సుమారు 53 శాతం మేర పడిపోయింది. దీంతో బిట్‌కాయిన్ విలువ సుమారు 30 వేల డాలర్లకు చేరుకుంది. తిరిగి ఆర్నెల్ల తరువాత బిట్‌కాయిన్ మరోసారి 60 వేల మార్కును దాటింది. ఎలన్ మస్క్ వ్యాఖ్యలు, చైనాలో క్రిప్టోకరెన్సీపై నిర్ణయాలు బిట్‌కాయిన్ క్రాష్‌కు కారణాలుగా నిలిచాయి. చదవండి: గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి గుడ్‌న్యూస్..! -
‘బిట్‌కాయిన్ ఓ చెత్త.. పనికిమాలిన వ్యవహారం’
ప్రపంచమంతా క్రిప్టోకరెన్సీకి దాసోహం అవుతున్న తరుణంలో.. డిజిటల్ కరెన్సీ మీద ఓ బ్యాంకింగ్ దిగ్గజ సీఈవో సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిట్‌కాయిన్ అనేది చెత్త వ్యవహారం అని, అది ఎందుకు పనికిరాదంటూ వ్యాఖ్యలు చేశారాయన. అమెరికా మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సేవలు అందించే ‘జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో’ సీఈవో జేమీ డిమన్(65) క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిట్‌కాయిన్‌ను విలువ లేని ఇన్వెస్ట్మెంట్గా పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగతంగా నా దృష్టిలో అదొక నాన్సెన్స్. సీరియస్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం మూర్ఖత్వం. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా క్లయింట్లు విషయపరిజ్ఞానం ఉన్నవాళ్లు. వాళ్లు కూడా దీనిని అంగీకరించరు”అంటూ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఈవెంట్లో ఇలా ముక్కుసూటి వ్యాఖ్యలు చేశారాయన. చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...! ఇదిలా ఉంటే మొదటి నుంచి ఆయన బిట్‌కాయిన్ పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీలను ‘మూర్ఖుల బంగారం’గా అభివర్ణించిన డిమన్.. అమెరికాలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజమైన తాము(జేపీ మోర్గాన్) ప్రొత్సహించబోదని, దానిపై ప్రభుత్వాల నియంత్రణ కచ్చితంగా ఉండాలని గతంలో ఆయన వ్యాఖ్యానించారు కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఎదిగిన చైనా.. దానివల్ల పర్యవసనాలు చెడువే జరుగుతున్నాయంటూ ఈమధ్యే నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఓవైపు ఎలన్ మస్క్ లాంటి కుబేరులు క్రిప్టోకరెన్సీకి తెగ ప్రమోట్ చేస్తుంటే.. మరోవైపు ఇంకొందరు ధనికులు మాత్రం పూర్తిగా దానికి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. చదవండి: Bitcoin.. సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్‌కాయిన్..! -
సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత...!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం జోరు మీద ఉంది. పలు దేశాలు ప్రజలు డిజిటల్ కరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్, ఈథిరియం, డోగ్ కాయిన్ వంటివి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో డిజిటల్ టోకెన్ అందరినీ ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి సమానంగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ)పై కూడా ఆసక్తి పెరుగుతుంది. చదవండి: ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..! బిగ్ బీ.. ఇప్పుడెమో సల్మాన్ ఖాన్....! భారత్ లాంటి దేశాల్లో కూడా ఎన్ఎఫ్టీ టెక్నాలజీ దూసుకుపోతుంది. ఎన్ఎఫ్టీలపై ఇండియన్స్ కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. భారత్‌లో ఎన్ఎఫ్టీను పరిచయం తొలి వ్యక్తిగా అమితాబ్ బచ్చన్ నిలిచాడు. తరువాతి స్థానంలో బేబి డాల్ సన్ని లియోన్ నిలిచింది. తాజాగా ఎన్ఎఫ్టీ లోకి సల్మాన్ ఖాన్ కూడా వస్తోన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ తన ఎన్ఎఫ్టీ కలెక్షన్లను బాలీకాఇయిన్. కామ్ అందుబాటులో ఉంటాయని ట్విటర్ ద్వారా తెలిపారు. సల్మాన్ ఖాన్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో... “ఆ రహా హూన్ మెయిన్, ఎన్ఎఫ్టీ లేకే.... సల్మాన్ ఖాన్ స్టాటిక్ NFT కమింగ్ అన్ bollycoin.com స్టే ట్యూన్ బాయ్ లోగ్ అంటూ..ట్విట్ చేశాడు. బాలీకాయిన్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ వెబ్‌సైట్‌ను ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్మకుడు అతుల్ అగ్నిహోత్రి ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో ప్రముఖ చలనచిత్రాల ఐకానిక్ డైలాగ్‌లు, పోస్టర్లు, రేర్ ఫుటేజ్‌లు, సోషల్ మీడియా కంటెంట్, సెలబ్రిటీల వస్తువులు, వారి స్టిల్స్ ఎన్ఎఫ్టీ రూపంలో అభిమానులను లభించనున్నాయి. ప్రముఖుల ఎన్ఎఫ్టీ సేకరణలు ఈథిరియం బ్లాక్‌చెయిన్‌లో విక్రయించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ అభిమానులు తమ ఇష్టపడే బాలీవుడ్ చిత్రాల ఎన్ఎఫ్టీలను సొంతం చేసుకునేందుకు ఒక వేదికను బాలీకాయిన్. కామ్ అందించనుంది. ఎన్ఎఫ్టీ అంటే.. ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. Aa raha hoon main, NFTs leke. Salman Khan Static NFTs coming on @bollycoin. Stay tuned, bhai log! https://t.co/auNNbccZJX 🌟#BollyCoin #NFTs #ComingSoon pic.twitter.com/u8ZWUSwuq0 — Salman Khan (@BeingSalmanKhan) October 13, 2021 చదవండి: సన్నీలియోన్ అరుదైన ఫీట్.. తన ఎన్ఎఫ్టీ కలెక్షన్స్‌తో వేలం -
భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. భారతే నెంబర్ వన్....! క్రిప్టోకరెన్సీను అనుమతించాలా..! వద్దా..! అనే విషయంపై భారత ప్రభుత్వం సందిగ్ధంలో ఉండగా.. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో భారత్ నెంబర్ వన్‌గా నిలిచినట్లు ప్రముఖ బ్రోకింగ్ అండ్ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫాం బ్రోకర్ చూసర్ వెల్లడించింది. భారత్‌లో సుమారు 10.07 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు బ్రోకర్ చూసర్ పేర్కొంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారనే పేరున్న అమెరికాలో కేవలం 2.74 కోట్ల మందే క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ దేశం రెండో స్థానానికే పరిమితమైంది. ఇండియా, అమెరికా తర్వాత స్థానాల్లో రష్యా(1.74 కోట్లు), నైజీరియా(1.30 కోట్లు) నిలిచాయి. చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...! వివిధ రకాల క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లను ఆయా దేశాల జనాభాతో పోలిస్తే భారత్ 7.30శాతం ఇన్వెస్టర్లతో ఐదో స్థానంలో నిలిచింది. రష్యా (11.91%), కెన్యా (8.52%), యుఎస్ (8.31%)గా ఉన్నారు. 12.73 శాతం ఇన్వెస్టర్లతో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంది. పోర్టల్ బ్రోకర్‌చూసర్ తన వార్షిక క్రిప్టో విస్తరణ సూచికతో చేసిన పరిశోధనలో ఈ విషయాలను బయటపెట్టింది. వాస్తవానికి టెక్నాలజీని వాడటం, ఇన్వెస్ట్ చేయడంలో పాశ్యత్య దేశాలతో పోల్చితే భారతీయులు వెనుకే ఉంటారు. సంప్రదాయ బద్దంగా రియల్టీ, బంగారం, ఎఫ్‌డీలలోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టేవారు. కానీ క్రిప్టో విషయానికి వచ్చేసరికి పాత సంప్రదాయాన్ని బద్దలు కొడుతున్నారు. పాశ్యాత్య దేశాలను సవాల్ విసురుతూ అన్నింటా అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారు. చదవండి: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..! స్టాక్స్ వద్దు..డిజిటల్ కరెన్సీ ముద్దు...! స్టాక్స్, మ్యూచుఫల్ ఫండ్స్, గోల్డ్ వంటి కంటే ఎక్కువగా డిజిటల్ కరెన్సీపై భారీగా లాభాలను గడించవచ్చునని భారత ఇన్వెస్టర్లు అనుకుంటున్నట్లు బైయూకాయిన్ సీఈవో శివమ్ ఠక్రమ్ పేర్కొన్నారు. అందువల్లే డిజిటల్ కరెన్సీ భారత ప్రజలను భారీగా ఆకర్షిస్తోందని వారు చెబుతున్నారు. క్రిప్టోకరెన్సీ లాంటి డిజిటల్ కరెన్సీలో భారత్‌లోని 25 నుంచి 40 మధ్య వయసు వారు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఇప్పటికే చైనాలసిస్ పేర్కొన్న విషయాన్ని ఠక్రమ్ గుర్తుచేశారు. ప్రపంచంలోని గొప్ప క్రిప్టోకరెన్సీ ఐనా బిట్‌కాయిన్ ఈ ఏడాదిలో 50శాతం కంటే ఎక్కువ మేర లాభపడింది. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం...! -
అన్న కుక్కను దువ్వుతుంటే.. తమ్ముడి ఆస్తులు పెరుగుతున్నాయ్
స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ పరిచయం అక్కర్లేని పేరు. సింగిల్ యాక్షన్ సీన్‌తో ఆయా కంపెనీల తలరాతలు మార్చే మేధావి. అందుకే ఆయన ఏం చేసినా సంచలనమే అవుతుంది. అంతెందుకు ఆయన పెంచుకునే పెంపుడు కుక్కను దువ్వినా సరే కోట్లు కురుస్తున్నాయి.అందుకు ఉదాహరణే ఈ సంఘటన. కాయిన్ మార్కెట్ క్యాప్ లెక్కల ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా 200రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. ఆ వర్చువల్ కరెన్సీలను ఎలన్ మస్క్ సందర్భాన్ని ప్రమోట్ చేస్తుంటాడు. ఆ ప్రచారంతో వాటి విలువ అమాంతం పెరిగిపోతుండడం ఇన్వెస్టర్లకు వరంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఎలన్ మస్క్ తన పెంపు కుక్క షిబా ఇను జాతికి చెందిన 'ఫ్లోకి' ని షేర్ చేశాడు. అంతే ఎలన్ మస్క్ తమ్ముడు కింబాల్ మస్క్ అఫిషియల్ పార్ట్నర్గా ఉన్న క్రిప్టో కరెన్సీ 'ఫ్లోకీ ఇను' కాయిన్ వ్యాల్యూ ఒక్కసారిగా పెరిగింది. కేవలం ఈ కాయిన్ పై ట్రాన్సాక్షన్లు ప్రారంభమైన 3 నెలల్లో దాని విలువ 1500 శాతం పెరిగింది. Floki Frunkpuppy pic.twitter.com/xAr8T0Jfdf — Elon Musk (@elonmusk) October 4, 2021 రాకెట్ వేగంతో వ్యాల్యూ అక్టోబర్ 4 ఫ్లోకి గురించి ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌తో ఫ్లోకీ ఇను వ్యాల్యూ రోజురోజకీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఆగస్ట్ 8 ఆ కాయిన్ విలువ $0.00000002 ఉండగా.. ఎలన్ ట్వీట్‌తో రెండు నెలల్లో 3,40,150 శాతం పెరిగి అక్టోబర్ 8 నాటికి $0.00006805 చేరింది. ఆ వ్యాల్యూ ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1000 నుంచి రూ.34లక్షలకు పెరిగిందన్న మాట.దీంతో ఇన్వెస్టర్లు ఎలన్ తన పెంపుడు కుక్కను దువ్వినా తమ్ముడు కింబాల్ మస్క్‌కు చెందిన ఫ్లోకీ ఇను కంపెనీ ఆస్తులు పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వీళ్లిద్దరూ ఏక్ నెంబర్ 'పిసినారులు' -
మరో రికార్డును బిట్‌కాయిన్ నెలకొల్పనుందా...!
Bitcoin Gets Closer To 60000 Dollors: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అధిక ద్రవ్యోల్భణ పరిస్థితులు...క్రిప్టోకరెన్సీపై చైనా తీసుకున్న నిర్ణయాలు పలు క్రిప్టోకరెన్సీలు ఒక్కసారిగా పతనమైన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఎల్ సాల్వాడర్ బిట్‌కాయిన్ మైనింగ్‌పై తీసుకున్న నిర్ణయాలు తిరిగి బిట్‌కాయిన్ పుంజుకునేందుకు దోహదం చేశాయి. చివరి వారంలో బిట్‌కాయిన్ ఏకంగా 30 శాతం మేర పురోగతిని సాధించింది. దీంతో ఐదెన్నెల్ల గరిష్టానికి బిట్‌కాయిన్ విలువ చేరుకుంది. 60 వేల డాలర్లకు చేరువలో...! బిట్‌కాయిన్ విలువ మరో సరికొత్త రికార్డులకు దగ్గరలోనే ఉంది. బిట్‌కాయిన్ విలువ 60 వేల డాలర్లకు చేరనుంది. మే తర్వాత మొదటిసారి బిట్‌కాయిన్ 57 వేల డాలర్లు(రూ. 42 లక్షలు) దాటింది. బినాన్స్, కాయిన్మర్కెట్ క్యాప్ వంటి ఎక్సేచేంజ్లో 57, 490 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇండియన్ ఎక్సేచేంజ్ కాయిన్స్ స్విచ్ కుబేర్‌లో బిట్ కాయిన్ విలువ 59 వేల డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో క్రిప్టోకరెన్సీ ఆల్‌టైమ్ హై 65 వేల డాలర్లను తాకింది. బిట్‌కాయిన్ ర్యాలీ ఇదే విధంగా కొనసాగితే మరికొన్ని రోజుల్లో కొత్త రికార్డును తాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈథర్ వంటి క్రిప్టోకరెన్సీ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఈథిరియం విలువ 3,740 వద్ద ట్రేడవుతోంది. సోమవారం రోజున సుమారు 1.29 శాతం మేర లాభపడింది. అయితే ఈథర్‌లో స్థిరమైన ర్యాలీ కన్పించడంలేదు. మిగిలిన ఇతర అల్ట్‌కాయిన్స్ కార్డానో, టెథర్, రిపుల్, పోల్కాడోట్ అన్నీ సగటున 2-3 శాతం మేర తగ్గుతూ కన్పించాయి. చదవండి: చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్..! -
తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...!
భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య 2018 మార్చిలో జరిగిన నిదాహస్ ట్రోఫీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫైనల్ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ ఆడిన తీరు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 8 బంతుల్లో 29 పరుగులతో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతికి కార్తీక్ కొట్టిన ఫ్లాట్ సిక్స్ ఇప్పటికీ మన కళ్లలో మెదులుతూనే ఉంటుంది. దినేష్ కార్తీక్ చివరి సిక్స్ ఇప్పడు ఎన్ఎఫ్టీ రూపంలో...! దినేష్ కార్తీక్ కొట్టిన చివరి సిక్స్ మూమెంట్ అంతమనేది లేకుండా నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) రూపంలో త్వరలోనే లభించనుంది. భారత్‌ను గెలిపించాక దినేష్ కార్తీక్ సెలబ్రెట్ చేసుకున్న విన్నింగ్ మూమెంట్‌ను యానిమేషన్ రూపంలో ఎన్ఎఫ్టీగా రానుంది. విన్నింగ్ పరుగులను సాధించినప్పుడు కార్తీక్‌లోని ఆలోచనలు, భావోద్వేగాలను ఈ ఎన్ఎఫ్టీ యానిమేషన్ రూపంలో పొందుపర్చనున్నారు. చదవండి: పబ్లిసిటీ కోసం రోజు రూ. 2.6 లక్షల ఖర్చు..! ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ మాట్లాడుతూ...‘నిదాహస్ ట్రోఫి ఫైనాల్ నా జీవితంలో అత్యుత్తమ క్షణాల్లో అది ఒకటి. ఆ క్షణాలు ఇప్పుడు గ్రాఫికల్ ఎన్ఎఫ్టీ రూపంలో రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంద’ని అన్నారు. ఈ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్‌ను కార్తీక్ సమీప బంధువు, అగ్రశ్రేణి స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ సహకారంతో చేపట్టారు. దినేష్ కార్తీక్ ఎన్ఎఫ్టీ అక్టోబర్ 12 నుంచి వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్ఎఫ్టీ అంటే..! బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..! -
కంపెనీల మధ్య పోటాపోటీ..! నిన్న అమితాబ్ బచ్చన్..నేడు రణ్‌వీర్‌సింగ్..!
ప్రపంచవ్యాప్తంగా సంప్రాదాయ కరెన్సీ స్థానాల్లో పలు డిజిటల్ కరెన్సీలు(క్రిప్టోకరెన్సీలు) గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. ప్రపంచదేశాల్లోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోని ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీకు స్వీకరణలో భారత్ రెండో స్థానంలో నిలవడం గమనర్హం. క్రిప్టోకరెన్సీపై భారతీయులు ఎక్కువ ఆదరణను చూపడంతో పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రిప్టోకరెన్సీపై అవగాహన కల్పించేందుకు గాను కాయిన్‌స్విచ్, వజీర్ఎక్స్, కాయిన్ డీసీఎక్స్ వంటి కంపెనీలు సమయాత్తమయ్యాయి. చదవండి: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్‌న్యూస్...! నిన్న అమితాబ్ బచ్చన్..నేడు రణ్‌వీర్‌సింగ్..! భారత్‌లో క్రిప్టోకరెన్సీపై ఆదరణను మరింత క్యాష్ చేసుకునేందుకు పలు కంపెనీలు సిద్దమైనాయి. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ను కాయిన్ డీసీఎక్స్ అంబాసిడర్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో భారత క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం కంపెనీ కాయిన్‌స్విచ్ కుబేర్ రణ్‌వీర్‌సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. కొద్ది రోజుల క్రితమే కాయిన్‌స్విచ్ కుబేర్ యూనికార్న్ క్లబ్లో జాయిన్ అయ్యింది. కంపెనీ వాల్యూయేషన్ సుమారు 1.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీ విషయంలో కాయిన్ స్విచ్ రణ్‌వీర్‌సింగ్‌తో మూడు యాడ్స్‌ను రూపోందించనున్నట్లు తెలుస్తోంది. కాయిన్‌స్విచ్ కుబేర్ ‘కుచ్ తో బద్లేగా..’ క్యాంపెయిన్‌తో టైర్-2, టైర్-3 నగరాల్లో క్రిప్టోకరెన్సీపై అవగాహన కల్పించాలని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్మెంట్ చేసేలా ప్రోత్సహించనుంది. చదవండి: అదిరిందయ్యా ముఖేశ్ అంబానీ.. ! జెప్‌బెజోస్, ఎలన్ మస్క్‌తో పాటు.. -
ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుంది.. వచ్చింది
ప్రపంచ అపర కుబేరుడిగా, టెస్లా బాస్‌గా, స్పేస్ఎక్స్ సీఈవోగా.. పరిచయం ఉన్న ఎలన్ మస్క్.. ఇంటర్నెట్లో మీమ్స్ పోస్ట్ చేయడంతో పాటు అప్పుడప్పుడు క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను సైతం ప్రభావితం చేస్తుంటాడు. నమ్మరా?.. అయితే ఏప్రిల్‌లో మీమ్ క్రిప్టోకరెన్సీ డోజ్కాయిన్ విలువను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చిన విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు తన పెంపుడు కుక్క పోస్ట్‌తో మరోసారి అంతర్జాతీయ క్రిప్టోకరెన్సీ విలువలో తీవ్రమార్పులు తీసుకొచ్చాడు. డోజ్‌కాయిన్లను రెగ్యులర్‌గా ప్రమోట్ చేసే మస్క్.. ఇప్పుడు తన కోసం రంగంలోకి దిగాడు. సోమవారం ఉదయం మస్క్ తన పెంపుడు కుక్క ఫ్లోకి(షిబా ఇను జాతికి చెందిన పప్పీ) ఫొటోను షేర్ చేశాడు. దీంతో డోజ్కాయిన్, ఫ్లోకి ఇను కాయిన్ విలువలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే రెండు రోజులు గడిచినప్పటికీ ఈ విలువలో ఎలాంటి పతనం కనిపించకపోవడం విశేషం. Floki Frunkpuppy pic.twitter.com/xAr8T0Jfdf — Elon Musk (@elonmusk) October 4, 2021 తన పెంపుడుకుక్క మీద క్రిప్టోకరెన్సీ మొదలుపెట్టిన మస్క్.. ఇప్పుడు వాటిని తెలివిగా ప్రమోట్ చేస్తుండడం విశేషం. అయితే క్రిప్టోకరెన్సీ మీద జనాల ఫోకస్ మళ్లేలా చేస్తున్న ఎలన్ మస్క్ మీద గతకొంతకాలంగా నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. నమ్మించి తెలివిగా జనాల్ని ముంచేస్తున్నాడంటూ తిట్టిపోస్తున్నారు. ఈ తరుణంలో మస్క్‌ను ఉల్టా పెద్ద షాక్ ఇచ్చారు. #స్టాప్ఎలన్ (#StopElon) పేరుతోనూ క్రిప్టోకరెన్సీని డిజిటల్ లావాదేవీల్లోకి తీసుకురావడం విశేషం. చదవండి: సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్‌కాయిన్..! ఇక గత ఇరవై నాలుగు గంటల్లో ఫ్లోకి ఇను కాయిన్.. 22.13 శాతం పెరగ్గా.. ఆ క్రిప్టోకరెన్సీ విలువ 0.00006116డాలర్‌గా ఉంది. ఇక షిబు ఇను కాయిన్(SHIB) విలువ ఏకంగా 55 శాతం పెరిగి, 0.00001312డాలర్‌గా నిలిచింది. ఇదంతా మస్క్ చేసిన మాయాజాలం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే గుర్తతెలియని బయ్యర్(అది ఎలన్ మస్క్ ఏమో అని ఒక అనుమానం కూడా) ఒకరు SHIB కాయిన్స్‌ను 6.3 ట్రిలియన్ కాయిన్స్(సుమారు నాలుగున్నర కోట్ల డాలర్ల విలువచేసేవి) కొనుగోలు చేయడం విశేషం. చదవండి: చిలిపి మస్క్.. ‘అడల్ట్’ కరెన్సీ ప్రమోషన్ -
సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్‌కాయిన్..!
Bitcoin Rises: క్రిప్టోకరెన్సీపై చైనా నిషేధం విధించడంతో ఒక్కసారిగా బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు భారీగా పతనమయ్యాయి. దీంతో గత కొన్నిరోజులుగా పలు ఇన్వెస్టర్లు స్టాక్స్, గోల్డ్ వంటి వాటిపై చేయడం మొదలు పెట్టారు. బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీపై మోహం చాటేశారు. అంతర్జాతీయంగా ఎల్ సాల్వాడార్ వంటి దేశాల నిర్ణయం, ఎలన్ మస్క్ అభిప్రాయాలు పలు క్రిప్టోకరెన్సీ పెరుగుదలకు అండగా నిలిచాయి. చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..! పుంజుకున్న బిట్‌కాయిన్..! చైనా నిర్ణయం, అధిక ద్రవ్యోల్భణం వంటివి కాస్త ఒడిదుడుకులను సృష్టించినా...పలు క్రిప్టోకరెన్సీలు తిరిగి మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా బిట్‌కాయిన్ సరికొత్త రికార్డులను నమోదుచేసింది. గత ఏడు రోజుల్లో బిట్‌కాయిన్ 30 శాతం కంటే ఎక్కువ పురోగతిని సాధించింది. అక్టోబర్ 6 న బిట్‌కాయిన్ విలువ సుమారు 54,079 డాలర్లకు చేరింది. బిట్‌కాయిన్ విలువ ఐదున్నెల్ల గరిష్టానికి చేరుకుంది. క్రిప్టోకరెన్సీ ట్రాకర్ కాయిన్జెక్కో ప్రకారం.. ఇతర డిజిటల్ నాణేలు కూడా భారీగా పెరిగాయి. ఈథర్, బినాన్స్ కాయిన్, సోలానా , డోగ్కోయిన్ విలువ గత ఏడు రోజుల్లో భారీగా పెరిగింది. క్రిప్టో ఎక్స్ఛేంజ్ క్రాకెన్ ప్రకారం, అక్టోబర్ ప్రారంభం నుంచి బిట్‌కాయిన్ ట్రేడింగ్ వాల్యూమ్‌లు ఈథర్ కంటే మూడింట రెండు వంతుల పెద్దవిగా ఉన్నాయి. చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...! -
75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్ బచ్చన్ ఎంట్రీ...!
ప్రపంచవ్యాప్తంగా సంప్రాదాయ కరెన్సీ స్థానాల్లో పలు డిజిటల్ కరెన్సీలు(క్రిప్టోకరెన్సీలు) గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. ప్రపంచదేశాల్లోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోని ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీకు స్వీకరణలో భారత్ రెండో స్థానంలో నిలవడం గమనర్హం. క్రిప్టోకరెన్సీపై పలు కంపెనీల దృష్టి..! క్రిప్టోకరెన్సీపై భారతీయులు ఎక్కువ ఆదరణను చూపడంతో పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రిప్టోకరెన్సీపై పలు ఇన్వెస్టర్లకు థర్డ్‌పార్టీ వెండర్‌గా ఉండేందుకు సమయాత్తం అయ్యాయి. ఇప్పటికే కాయిన్స్‌స్విచ్, వజీర్ఎక్స్, కాయిన్‌డీసీఎక్స్ వంటి కంపెనీలు క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్‌చేసేవారికి వారధిగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా భారత ప్రజల్లో క్రిప్టోకరెన్సీపై మరింత అవగాహన కల్పించడం కోసం పలు దిగ్గజ నటీనటులను బ్రాండ్ అంబాసిడర్స్‌గా నియమించుకుంటున్నాయి. చదవండి: బిగ్‌బీ ఆగయా..! కాయిన్స్‌డీసీఎక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నియమితులయ్యారు. ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు ఎడ్వర్డో సావెరిన్స్ బి క్యాపిటల్ గ్రూప్, ఇతర ఇన్వెస్టర్లతో సారథ్యం వహించిన సిరీస్-సి ఫండింగ్ రౌండ్లో కాయిన్‌డీసీఎక్స్ సుమారు 90 మిలియన్ డాలర్లను సేకరించి భారత తొలి క్రిప్టో యునికార్న్‌గా అవతరించింది. అమితాబ్ బచ్చన్ కొద్ది రోజుల క్రితమే వారి నాన్ ఫంగిబుల్ టోకెన్‌ను కూడా ప్రారంభించారు. అమితాబ్ రాకతో క్రిప్టోకరెన్సీపై భారత్‌లో మరింత అవగాహన వస్తోందని కాయిన్ డీసీఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుమిత్ గుప్తా అభిప్రాయపడ్డారు. చదవండి: క్రిప్టో కరెన్సీ బ్యాన్.. చైనా కాదు కదా ఏదీ ఏం చేయలేవు -
వాటిని ఎవరు నాశనం చేయలేరు..!ఎలన్ మస్క్ షాకింగ్ కామెంట్స్..!
ట్రెండ్‌ను పట్టుకోవడంలో మిగిలిన బిజినెస్మెన్ల కంటే ఒక అడుగు ముందుండే ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోన్న క్రిప్టోకరెన్సీని ప్రభుత్వాలు ఏం చేయలేవంటూ తేల్చి చెప్పారు. కాలిఫోర్నియాలో జరిగిన కోడ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజిటల్ టెక్నాలజీలో ఆయన ప్రసంగించారు. క్రిప్టో కరెన్సీపై వచ్చిన ప్రశ్నలకు ఎలన్ మస్క్ స్పందిస్తూ.. క్రిప్టో కరెన్సీని ప్రభుత్వాలు ఏం చేయలేవన్నారు. అయితే క్రిప్టో కరెన్సీ వేగంగా అభివృద్ధి చెందడాన్ని కొంత మేరకు ప్రభుత్వాలు అడ్డుకోగలవన్నారు. ఇటీవల చైనాకి చెందిన పీపుల్స్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమెరికా సెనెట్ సైతం క్రిప్టో కరెన్సీకి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ భవిష్యత్తుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. తాజాగా ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీని సమర్థిస్తూ మాట్లాడటంతో ఈ రంగంలో ట్రేడ్ చేస్తున్నవారికి కొండంత అండ లభించినట్టయ్యింది. సాధారణ మార్కెట్లో బిగ్ ప్లేయర్లు మార్కెట్‌ను శాసిస్తుంటారు. ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ అధికారికంగా బిగ్ ప్లేయర్లకు అనుగుణంగా మార్కెట్ కదలికలు ఉంటాయి. ఇలా మార్కెట్‌పై ఎవరి ఆధిపత్యం లేకుండా పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడి ట్రేడ్ నిర్వహించడం క్రిప్టో కరెన్సీ ప్రత్యేకత. ఇందులో ప్రభుత్వ నియంత్ర ఉండదు. అలాగే జవాబుదారీతనం కూడా ఉండదు. ఆర్థిక లావాదేవీలు అన్నీ వర్చువల్‌గానే జరుగుతాయి. దీంతో క్రిప్టో కరెన్సీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు దీన్ని సమర్థిస్తుండగా మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి : పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...! -
పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి మంచి ఆదరణ లభిస్తోంది. బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు ప్రజల్లో ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందాయి. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు పూర్తిగా ఆన్లైన్లో జరుగుతాయి. శక్తివంతమైన కంప్యూటర్ల సహయంతో, బ్లాక్‌చైన్ టెక్నాలజీనుపయోగించి క్రిప్టో లావాదేవీలను జరుపుతుంటారు. బిట్‌కాయిన్స్‌ను కల్గిన పలు వ్యక్తులు తమ బిట్‌కాయిన్ వ్యాలెట్‌కు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోనే సౌకర్యం ఉంటుంది. బిట్‌కాయిన్ వ్యాలెట్‌కు శక్తివంతమైన పాస్వర్డ్ సహాయంతో ఇతరులకు బిట్కాయిన్ల లావాదేవీలను చేయవచ్చును. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! పది లక్షల కోట్ల రూపాయలు గాల్లోనే...! బిట్‌కాయిన్ వ్యాలెట్ల పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం బిట్‌కాయిన్ యూజర్లు తిరిగి పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ బిట్‌కాయిన్ వ్యాలెట్ పాస్వర్డ్ మర్చిపోతే... బిట్కాయిన్లు ఆన్లైన్లో అలానే ఉండిపోతాయి. ది న్యూయర్క్ టైమ్స్ ప్రకారం...దాదాపు 140 బిలియన్ డాలర్లు (రూ. 1,03,66,51,70,00,000 సుమారు పది లక్షల కోట్ల రూపాయలు) బిట్‌కాయిన్ వ్యాలెట్ల పాస్వర్డ్స్ మర్చిపోవడంతో ఈ మొత్తాన్ని బిట్‌కాయిన్ యూజర్లు క్లెయిమ్ చేసుకోలేదని వెల్లడించింది. క్రిప్టోకరెన్సీ డేటా సంస్థ చైనాలిసిస్ నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. 18.6 బిలియన్ బిట్కాయిన్ల మైనింగ్‌లో 20 శాతం మేర బిట్‌కాయిన్స్‌లో ఏలాంటి లావాదేవీలు లేకుండా నిద్రాణస్థితిలో ఉన్నాయని తెలిపింది.ఆయా బిట్‌కాయిన్ వ్యాలెట్ల యూజర్లు పాస్‌వర్డ్స్‌ను మర్చిపోవడమే దీనికి కారణమని చైనాలిసిస్ పేర్కొంది. ఆశాదీపంగా హ్యాకర్లే వారికి దిక్కు...! బిట్‌కాయిన్ వ్యాలెట్ల పాస్‌వర్డ్స్‌ను మర్చిపోయినా బిట్‌కాయిన్ యూజర్లకు డార్క్‌వెబ్‌లోని ఆన్లైన్ హ్యాకర్లే దిక్కుగా కన్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా బిట్‌కాయిన్ వ్యాలెట్లను యాక్సెస్ చేసేందుకు బిట్‌కాయిన్ యూజర్లు హ్యకర్ల సహయాన్ని తీసుకుంటున్నారు. బిట్‌కాయిన్ వ్యాలెట్లను రికవరీ చేసిన హ్యకర్లకు కొత్త మొత్తాన్ని బిట్‌కాయిన్ యూజర్లు చెల్లిస్తున్నట్లు క్రిప్టో అసెట్ రికవరీ టీమ్ వెల్లడించింది. కాగా బిట్‌కాయిన్ వ్యాలెట్లను రికవరీ చేసే సంభావ్యత కేవలం 27 శాతంగానే ఉంది. చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! -
క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై అనేక మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీపై అనేక దేశాలో నిషేధం ఉన్నప్పటికీ ఆయా దేశ పౌరులు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాయి. ఎల్ సాల్వాడార్, పరాగ్వే వంటి దేశాలు బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలను చట్టబద్దత కల్పిస్తామని పేర్కొన్నాయి. ఈ నిర్ణయంలో పలు క్రిప్టోకరెన్సీలు కొత్త రికార్డులను నమోదు చేస్తూ గణనీయంగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఆరు వేలకుపైగా క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటిలో బిట్‌కాయిన్, ఈథిరియం, డాగ్‌కాయిన్ వంటివి ఎక్కువ ఆదరణను పొందాయి. చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు... తాజాగా క్రిప్టోకరెన్సీలకు పోటీగా ఆఫ్రికన్ దేశాలు సరికొత్త వ్యూహంతో ముందుకువస్తున్నాయి. క్రిప్టోకరెన్సీకి బదులుగా సొంత డిజిటల్ కరెన్సీలను అందుబాటులోకి తీసుకురానుంది. పశ్చిమ ఆఫ్రికాలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన నైజీరియా, ఘనా దేశాల సెంట్రల్ బ్యాంకులు డిజిటల్ కరెన్సీను త్వరలోనే ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది క్రిప్టో దత్తతలో నైజీరియా ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. నైజీరియా, ఘనా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు విదేశీ కరెన్సీల డిజిటల్ వెర్షన్లను రూపొందించడానికి విదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలతో భాగస్వామ్యమయ్యాయి. డిజిటల్ కరెన్సీపై పనిచేస్తోన్న దేశాల వరుసలో నైజీరియా, ఘనా కూడా చేరాయి. త్వరలోనే ట్రయల్స్...! పలు విదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలతో నైజీరియా, ఘనా దేశాలు డిజిటల్ కరెన్సీ ఏర్పాటులో కీలక అడుగువేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో నైజీరియా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కల్గి ఉంది. వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి ‘ఈనైరా’ అనే డిజిటల్ కరెన్సీ ప్రారంభించనుంది. మరోవైపు ఈ నెల నుంచి ‘ఈసేడీ’ డిజిటల్ కరెన్సీలను ట్రయల్ చేయనున్నట్లు సమాచారం. పడిపోతున్న కరెన్సీ విలువ...! గత కొన్ని రోజుల నుంచి నైజీరియా క్రిప్టో కరెన్సీ వాడకంలో బూమ్ కన్పించినా... అక్కడి బ్యాంకులు క్రిప్టోపై బ్యాన్ విధించాయి. నైజీరియన్ పౌరులు ఎక్కువగా క్రిప్టోలో లావాదేవీలను జరుపడంతో నైజీరియన్ కరెన్సీ విలువ పూర్తిగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో క్రిప్టోకరెన్సీలకు పోటీగా డిజిటల్ కరెన్సీలను తీసుకురావాలని నైజీరియా నిర్ణయించుకుంది. చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..! -
అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ.6 లక్షల నుంచి రూ.216 కోట్లు.!
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, క్రిప్టోకరెన్సీ.. ఇవ్వన్నీ సామాన్య జనాలకు అర్థం కాని సబ్జెక్ట్. ఒక్కసారి వీటిలో ప్రావీణ్యం సాధిస్తే డబ్బులే..డబ్బులు..! స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలో ప్రావీణ్యం ఉంటే రాత్రికి రాత్రే కుబేరుడు అవ్వచు లేదా బికారీ కూడా అవ్వచును. స్టాక్మార్కెట్లో పలు కంపెనీల షేర్లు పడిపోతున్నాయనో లేదా నాకు వచ్చిన లాభాలు సరిపోతాయని చెప్పి వెంటనే వెనక్కి తీసుకుంటారు. అలా చేస్తే నష్టాల నుంచి కాస్త ఉపశమనం కల్గిన..చాలా కాలంపాటు షేర్లను వెనక్కి తీసుకోకుండా కొంత కాలం పాటు వేచిచూస్తే భారీ లాభాలనే ఆర్జించవచ్చును. చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..! ప్రస్తుతం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ కంటే క్రిప్టోకరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2009లో మొదలైన క్రిప్టోకరెన్సీలో ఒకటైన బిట్‌కాయిన్ ప్రస్థానం నేడు గణనీయంగా పెరిగింది. క్రిప్టోకరెన్నీ వచ్చిన తొలినాళ్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జంకేవారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి 2012లో సుమారు 616 బిట్‌కాయిన్ టోకన్లను కొన్నాడు. 2012లో బిట్‌కాయిన్ విలువ సుమారు 13 డాలర్లు(రూ. 978) గా ఉండేది. 616 బిట్కాయిన్ల మొత్తం 8,195 డాలర్లు (రూ. 6 లక్షలు). ఆ వ్యక్తి సుమారు తొమ్మిది సంవత్సరాలు పాటు తన బిట్‌కాయిన్ వ్యాలెట్‌ను చూసుకొలేదు. బిట్‌కాయిన్ ఒక్కసారిగా గణనీయంగా వృద్ధి చెందడంతో...బిట్‌కాయిన్ వ్యాలెట్ విలువ సుమారు రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్ల పెరిగింది. బిట్‌కాయిన్ వ్యాలెట్‌ను వేరే వ్యాలెట్లోకి మార్చేప్పడు జరిగిన లావాదేవీలను బ్లాక్‌చైన్. కామ్ నిర్ధారించింది. ఇలాంటి సంఘటన ఈ ఏడాది జూలైలో కూడా జరిగింది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టి, ఓపికగా ఉంటే భారీ మొత్తాలు చేతికి వస్తాయనడంలో ఇదొక ఉదాహరణగా చెప్పకోవచ్చునని సోషల్‌మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! -
బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..!
గత కొద్ది రోజుల నుంచి బిట్‌కాయిన్ తీవ్ర అస్థిరతను చవిచూసింది. బిట్‌కాయిన్‌కు ఎల్ సాల్వాడార్ దేశం చట్టబద్దతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్‌కాయిన్‌కు చట్టబద్దతను కల్పించడంతో ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బిట్‌కాయిన్‌లో అనిశ్చితి నెలకొంది. కాగా ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ తిరిగి పుంజుకుంది. తాజాగా బిట్‌కాయిన్‌పై బ్లూమ్‌బర్గ్ విశ్లేకుడు మైక్ మెక్‌గ్లోన్ సంచలన ప్రకటన చేశాడు. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! ఈ ఏడాది చివర్లో బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్ల (సుమారు రూ. 73.65 లక్షలు)కు చేరుకుంటుందని తన ట్విట్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్‌ను ఎక్కువ మంది ప్రజలు స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో బిట్‌కాయిన్ 2021 చివర్లో గణనీయమైన పురోగతిని సాధిస్తుందని తెలిపారు. బిట్‌కాయిన్ పూర్వ ట్రేడింగ్ గణాంకాలను మూలంగా చేసుకొని బిట్‌కాయిన్ విలువ రెట్టింపు అవుతోందని అభిప్రాయపడ్డారు. 2021 ఏప్రిల్-మేలో జరిగిన బిట్‌కాయిన్ క్రాష్‌తో ప్రస్తుత ట్రేడింగ్ గణాంకాలతో సరిసమానం చేసుకుందని, భవిష్యత్తులో బిట్‌కాయిన్ భారీ ర్యాలీని నమోదుచేస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 45,542 డాలర్ల (సుమారు రూ. 33.54 లక్షలు) వద్ద ట్రేడవుతోంది. బిట్‌కాయిన్ త్వరలోనే 50వేల డాలర్ల మార్కును దాటేందుకు ప్రయత్నిస్తోంది. Can Bitcoin Reach $100,000 in 2021? Five Charts Show Potential - Past #Bitcoin trading trends and the crypto's declining supply vs. mainstream adoption suggest a significant advance in 2021, potentially to $100,000, we believe. pic.twitter.com/0tH7PS7QEI — Mike McGlone (@mikemcglone11) September 16, 2021 చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...! -
క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!
క్రిప్టోకరెన్సీ కంటికి కనిపించని ఒక డిజిటల్ కరెన్సీ. 2009 నుంచి మొదలైన క్రిప్టోకరెన్సీ ఇంతింతై వటూడింతై అన్న చందంగా పలు క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ గణనీయంగా పెరుగుతూనే ఉంది. క్రిప్టోకరెన్సీలో అగ్రగణ్యుడు బిట్‌కాయిన్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఆయా క్రిప్టోకరెన్నీలు పూర్తిగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి లావాదేవీలను, జరుపుతుంటారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డులు కచ్చితంగా వాడాలి. కొన్ని రోజుల క్రితం క్రిప్టోకరెన్సీ మైనింగ్ కంప్యూటర్లలో వాడే గ్రాఫిక్స్ కార్డు ధరల్లో మార్పులు వచ్చేలా చేశాయి. అత్యంత బలమైన కంప్యూటర్లతో సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించవచ్చును. తాజాగా క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడంపై విస్తుపోయే విషయాలను ఒక నివేదిక వెల్లడించింది. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..! పొంచి ఉన్న పెనుముప్పు...! బిట్‌కాయిన్ ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్ చేయడంతో గణనీయమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వెలువడుతున్నట్లు ఒక సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. ఎలక్ట్రనిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన బిట్‌కాయిన్ మైనింగ్ కోసం వాడే కంప్యూటర్ల సగటు జీవితకాలం 1.3 సంవత్సరాలు మాత్రమే. డచ్ సెంట్రల్ బ్యాంక్ ఎకనామిస్ట్, రిపోర్ట్ సహ రచయిత అలెక్స్ డి వ్రీస్ మాట్లాడుతూ... ఐఫోన్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పోలీస్తే బిట్‌కాయిన్ మైనింగ్ నుంచి వచ్చే ఎలక్ట్రినిక్ ఉద్గారాల సంఖ్య చాలా తక్కువ. బిట్‌కాయిన్ మైనింగ్ ద్వారా గడిచిన పన్నెండు నెలల్లో ఉత్పత్తి చేయబడిన వ్యర్థాల మొత్తం 30,700 టన్నులు. ఈ మొత్తం నెదర్లాండ్స్ లాంటి దేశాల ఎలక్ట్రనిక్ వ్యర్థాలకు సమానమని తెలియజేశారు. రానున్న రోజుల్లో బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల మార్కెట్ భారీగా పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, స్టోరేజ్ విషయంలో క్రిప్టోకరెన్సీలను మైనింగ్ చేయడం కచ్చితం. దీంతో విపరీతంగా కంప్యూటర్ల వాడకం పెరగడంతో ఎలక్ట్రానిక్స్ ఉద్గారాలు అనులోమనుపాతంలో పెరుగుతాయని రిపోర్ట్ సహ రచయిత అలెక్స్ డి వ్రీస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 53.6 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ ఉద్గారాలు వెలువడ్డాయి. చదవండి: Bitcoin: ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..! -
కాలేజీ చదువు వదిలేసి.. రూ.660 కోట్ల భారీ మోసం
ఓ యువకుడు 'తాను కాలేజీ చదివే రోజుల్లో అందరిలా కాకుండా.. ఒంటి మీద కోటు నలగకుండా..కోటీశ్వరుడు అవ్వాలని అనుకున్నాడు. ఆ అత్యాశతోనే కాలేజీ మానేసి క్రిప్ట్రో కరెన్సీ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. 'హెడ్జ్ ఫండ్' స్కామ్‌తో పెట్టుబడి దారుల్ని వందల కోట్లలో మోసం చేశాడు. ఆ మోసం వెలుగులోకి రావడంతో కోర్టు నిందితుడికి ఏడున్నరేళ్లు జైలు శిక్ష విధించింది. ఆస్ట్రేలియాకు చెందిన 24ఏళ్ల స్టెఫెన్ క్విన్ డబ్బులు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కాడు. మధ్యలో చదువు మానేసి 2017లో ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు వచ్చాడు. ఇక్కడ న్యూయార్క్ సిటీలో 'వర్జిల్ సిగ్మా ఫండ్ ఎల్పీ' పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ సంస్థలో పెట్టుబడులు పెడితే తక్కువ ధరకే క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయోచ్చని నమ్మించాడు. అంతేకాదు క్రిప్టోకరెన్సీపై ట్రేడింగ్ నిర్వహించేందుకు 'టెంజిన్' అనే స్పెషల్ ట్రేడింగ్ అల్గారిథంను డెవలప్ చేశాడు. ఆ అల్గారిథంతో క్రిప్టో ఎక్స్ఛేంజ్లో బిటక్ కాయిన్ కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించి లాభాలు గడించవచ్చని నమ్మించాడు. 2017లో వర్జిల్ సంస్థ 500 శాతం వార్షిక రాబడిని పొందిందని చెప్పుకున్నాడు. 2018లో క్విన్ గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ సైతం కథనాల్ని ప్రచురించింది. అ పబ్లిసిటీని క్యాష్ చేసుకోవాలని ఇన్వస్టర్లకు లాభాల్ని అందించే సంస్థ తన దేనంటూ సుమారు 100 మంది నుంచి సుమారు (90మిలియన్లు) రూ. 660 కోట్లు పెట్టుబడులు పెట్టించాడు. ఆ డబ్బును తన వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నాడు.పెట్టుబడిదారులకు లాభాలు వస్తున్నాయని నమ్మించేందుకు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి క్రిప్టోకరెన్సీలతో సంబంధం లేని రియల్ ఎస్టేట్, బ్యాంకులు ఇచ్చిన రుణాల్ని చెల్లించలేక మూలన పడిన సంస్థల్ని కొనుగోలు చేశాడు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం..''ఇన్వెస్టర్లు పెట్టుబడుల గురించి అడిగినప్పుడు..తమ సంస్థ పెట్టుబడులు పెట్టిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయనిఫేక్ డాక్యుమెంట్లు చూపించి తప్పించుకునేవాడు. చివరికి ఇన్వెస్టర్లు నిందితుడు స్టెఫెన్ క్విన్‌పై అనుమానం రావడంతో కోర్ట్‌ను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన న్యూయార్క్ సౌత్రన్ డిస్ట్రిక్ కోర్ట్ జడ్జ్ వాలెరీ కాప్రోనీ నిందితుడికి ఏడున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. నిందితుడు పక్కా ప్లాన్‌తో పెట్టుబడిదారుల్ని మోసం చేసినట్లు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. చదవండి : బిట్ కాయిన్స్‌ను తలదన్నేలా, ఇండియాలో డిజిటల్ కరెన్సీ -
Elon Musk : ఫోటో షేర్ చేశాడో లేదో...! ఒక్కసారిగా పెరిగిన కరెన్సీ విలువ...!
వాషింగ్టన్: క్రిప్టోకరెన్సీ విలువ పెంచడంలో లేదా తగ్గించడంలో టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల అధినేత ఎలన్ మస్క్ పాత్ర ఎంతగానో ఉంది. క్రిప్టోకరెన్సీపై ఎలన్ మస్క్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. డాగ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లు ఎలన్ మస్క్‌ను ముద్దుగా డాగీ ఫాదర్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే డాగ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ విలువ పెరగడంలో మస్క్ పాత్ర ఎంతగానో ఉంది. చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..! తాజాగా ఎలన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో ఫ్లోకీ వచ్చేసింది అంటూ.. షిబా ఇను అనే బ్రీడ్‌ను పెంపుడు జంతువుగా తెచ్చుకున్నట్లు షేర్ చేశాడు. ఎలన్ మస్క్ ట్విటర్లో షేర్ చేశాడో లేదో... డాగ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం డాగ్‌కాయిన్ మాత్రమే కాకుండా బేబీ డాగ్ వంటి ఆల్ట్ నాణేలు కూడా గణనీయంగా పెరిగాయి. మస్క్ తన పెంపుడు జంతువును షేర్చేయడం...డాగ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ విలువ పెరగడానికి సంబంధం ఏమిటనీ ఆలోచిస్తున్నారా... దీనికి కారణం డాగ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ సింబల్‌ను షిబా ఇను అనే బ్రీడ్ కుక్కతో చూపిస్తారు. మరికొన్ని క్రిప్టోకరెన్సీలను కూడా ఈ బ్రీడ్తోనే చూపిస్తారు. షిబా ఫ్లోకీ థీమ్‌తో ఉన్న క్రిప్టోకరెన్సీల విలువ సుమారు 24 గంటల్లో రికార్డు స్థాయిలో 958.09 శాతం మేర పెరిగింది. మరో క్రిప్టో, ఫ్లోకి ఇను గత 24 గంటల్లో 59.08 శాతం మేర ఫ్లోకి శిబా 23.46 శాతం మేర పెరిగింది. బేబీ డాగ్ కాయిన్ విలువ 1.80 శాతం జంప్ అయ్యింది. డాగ్ కాయిన్ గడిచిన 24 గంటల్లో +0.36 శాతం మార్పును నమోదు చేసింది. Floki has arrived pic.twitter.com/2MiUKb91FT — Name (@elonmusk) September 12, 2021 చదవండి: VIDEO: టెస్లా సంచలనం.. విండ్‌షీల్డ్ ముందర కనిపించని వైపర్స్! ఆన్ చేయగానే నీళ్లకు బదులు లేజర్ కిరణాలు -
ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..!
గత కొన్ని రోజుల క్రితం నేల చూపులు చూసిన క్రిప్టోకరెన్సీ ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటుంది. బిట్‌కాయిన్‌తో పాటు ఈథిరియం, డాగీకాయిన్, వంటి ఇతర క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరుగుతుంది. ఒకానొక సందర్భంలో నేలచూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీకి ఎల్‌సాల్వాడార్, పరాగ్వే దేశాలు తీసుకున్న నిర్ణయాలు కాస్త ఉపశమానాన్ని కల్గించాయి. తాజాగా బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీకు ఎల్‌సాల్వాడార్ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్‌కాయిన్‌ను లీగల్ టెండర్‌గా గుర్తిస్తామనీ ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. చదవండి: Afghanistan: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఎల్‌సాల్వాడార్ ప్రభుత్వం బిట్‌కాయిన్‌ను లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌సాల్వాడర్ పౌరులకు 30 డాలర్ల విలువ గల బిట్కాయిన్లను అందించింది. ఎల్‌సాల్వాడర్ ప్రభుత్వం సుమారు 550 బిట్కాయిన్లను కలిగి ఉంది. ఈ బిట్‌కాయిన్స్ సుమారు 26 మిలియన్ డాలర్లతో సమానం. బిట్‌కాయిన్‌ను స్వీకరించడంతో సుమారు 400 మిలియన్ డాలర్ల లావాదేవీలు ఇతర దేశాలనుంచి వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇష్టంగా లేని ఎల్‌సాల్వాడర్ పౌరులు..! మరోవైపు బిట్‌కాయిన్‌ను లీగల్ టెండర్‌గా గుర్తించినందుకు ఆ దేశ పౌరుల నుంచి తీవ్రమైన నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది పౌరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. బిట్‌కాయిన్ మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ సాల్వడార్ ప్రజలు బిట్‌కాయిన్‌ను స్వీకరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎల్ సాల్వడార్లో ఉన్న యూనివర్సిటీడ్ సెంట్రోఅమెరికానా జోస్ సిమెన్ కనాస్ అనే జేసూట్ కాలేజీ ఇటీవల నిర్వహించిన పోల్‌లో, 67.9 శాతం మంది పౌరులు బిట్‌కాయిన్‌ను చట్టపరమైన కరెన్సీగా ఉపయోగించడాన్ని అంగీకరించలేదు. నిరసనలతో భారీగా పతనం.. ఎల్ సాల్వడార్ కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణంతో బిట్‌కాయిన్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. సెప్టెంబర్ ఆరో తేదిన బిట్‌కాయిన్ ఏకంగా ఒక నెల కనిష్ట స్థాయికి పడిపోయింది. 52 వేల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న బిట్‌కాయిన్ ఏకంగా 42 వేల డాలర్లకు పడిపోయింది. కాగా బిట్‌కాయిన్‌ను ఎక్కువ మంది స్వీకరించేందుకుగాను బిట్‌కాయిన్ ట్రేడర్స్ ఈ క్రిప్టోకరెన్సీ విలువను తగ్గించి ఉంటారని ఊహగానాలు వస్తోన్నాయి. చదవండి: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో చెప్పిన ఎలన్ మస్క్...! -
క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. పలు క్రిప్టోకరెన్సీల విలువ ఆకాశమే హద్దుగా పెరుగుతూనే ఉంది. తాజాగా బిట్‌కాయిన్ 51 వేల డాలర్ల మార్క్‌ను దాటిపోయింది. బిట్‌కాయిన్ తరహాలోనే మరొక క్రిప్టోకరెన్సీ ఈథిరియం కూడా గణనీయంగా వృద్ధి చెందింది. తాజాగా ఈథిరియం విలువ 3907.61 డాలర్లకు చేరుకుంది. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీలో భారత్ స్థానం ఎంతో తెలుసా...! తాజాగా ఈథిరియం విలువ పెరగడంతో పలు కంప్యూటర్లలో వాడే జీపీయూ(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. మై డ్రైవర్స్ నివేదిక ప్రకారం చైనా లో ఎన్విడియా జీపీయూ ధరలు 18 శాతం పెరిగాయని వెల్లడించింది. సెప్టెంబర్‌లో ఎన్వీడియా జీపీయూ గ్రాఫిక్ కార్డుల కొనుగోళ్లు 50 శాతం తగ్గుతాయని పేర్కొంది. గతంలో ఈథిరియం విలువ తగ్గడంతో గ్రాఫిక్స్ కార్డు ధరలు గణనీయంగా తగ్గాయి. గత వారంలో ఈథిరియం విలువ 23 శాతం పైగా పెరిగింది. క్రిప్టోకరెన్సీ పెరుగుదలతో ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డులు మాత్రమే కాకుండా ఏఎమ్‌డీ ఎక్స్ 6000 సిరీస్, గిగా బైట్ గ్రాఫిక్స్ కార్డు ధరలు కూడా పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీ గ్రాఫిక్స్ కార్డు ధరలు ఎలా నియంత్రిస్తుదంటే..! క్రిప్టోకరెన్సీ కంటికి కనిపించని ఒక డిజిటల్ కరెన్సీ. క్రిప్టోకరెన్సీ పూర్తిగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి లావాదేవీలను జరుపుతుంటారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డులు కావాల్సి ఉంటుంది. గ్రాఫిక్స్ కార్డులనుపయోగించి సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించవచ్చును. క్రిప్టోకరెన్సీ మైనింగ్ జరిపే వారితో ఈ గ్రాఫిక్స్ కార్డుల ధరలు గణనీయంగా పెరుగుతాయని టెక్నాలజీ నిపుణులు వెల్లడించారు. చదవండి: Elon Musk: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో తేల్చిచెప్పిన ఎలన్ మస్క్...! -
అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..!
ఆఫ్గనిస్తాన్ మళ్లీ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లడంతో దేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరగుతుందనే భయం అఫ్గన్ పౌరులను వెంటాడుతుంది. మెజారిటీ ప్రజలు దేశం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ఎటీఎమ్‌లు మూతపడ్డాయి. అఫ్గన్ పౌరులు తమ బ్యాంకు ఖాతాలనుంచి డబ్బులను ఉపసంహరించడం కోసం భారీగా క్యూ కట్టారు. దేశ వ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. స్ధానిక మార్కెట్లో ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. చదవండి: దాల్ సరస్సులో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్ తాలిబన్ల రాకతో స్థానిక కరెన్సీ విలువ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఓకవైపు మూసివేసిన దేశ సరిహద్దులతో అఫ్గన్ పౌరులు నానా అవస్థలను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల రాకతో అఫ్గన్ పౌరుల జీవితాల్లో ఆర్థిక అస్థిరత నెలకొంది. దేశంలో ఉన్న తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొడానికి, అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్‌లో ఇప్పటీకి ఎక్కువగా నగదు చెలామణీలో ఉంది. అఫ్గనిస్తాన్‌లో ఉన్న గడ్డు పరిస్థితులను ఎదుర్కోడానికి అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం కోసం..క్రిప్టోకరెన్సీ వాడకాన్ని ఎలా వాడాలనే విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు ఎక్కడా ట్రాక్ చేస్తారనే భయంతో వీపీఎన్, ఐపీలను చేంజ్ చేస్తూ క్రిప్టోకరెన్సీ గురించి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీ గురించి తెలిసిన అఫ్గన్ పౌరులను అడిగిమరి తెలుసుకుంటున్నారు. కాబూల్‌లో తిరుగుబాటు జరగడానికి ముందు జూలైలో ఆఫ్ఘనిస్తాన్‌లో “బిట్‌కాయిన్” “క్రిప్టో” కోసం వెబ్ సెర్చ్‌లు బాగా పెరిగాయని గూగుల్ ట్రెండ్స్ డేటా చూపించింది. తాజాగా ఇప్పుడు గూగుల్ క్రిప్టోకరెన్సీపై మరింత సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలిసిస్ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో క్రిప్టోకరెన్సీ స్వీకరణపరంగా అఫ్గనిస్తాన్ 20వ స్థానంలో నిలవడం గమనార్హం. చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..! -
క్రిప్టోకరెన్సీలో భారత్ స్థానం ఎంతో తెలుసా...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ కొత్త రికార్డులను నమోదు చేస్తూనే ఉంది. పలు క్రిప్టోకరెన్సీలు భారీగా లాభాలను గడించాయి. బిట్‌కాయిన్ ఐతే ఏకంగా 50వేల డాలర్ల వరకు కూడా చేరుకుంది. ఒకానొక సమయంలో క్రిప్టోకరెన్సీ నేలచూపులు చూస్తూ ఇన్వెస్టర్లకు పీడకలనే మిగిల్చింది. ఈక్వెడార్, పనామా వంటి దేశాలు, ఎలన్ మస్క్, మార్క్ క్యూబాన్ వంటి దిగ్గజ బిలీయనీర్లు క్రిప్టోకరెన్సీకి మద్దతు పలకడం వంటి అంశాలు క్రిప్టోకరెన్సీకి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..! తగ్గేదేలే అంటున్న భారతీయులు..! క్రిప్టోకరెన్సీపై భారతీయులు ఎక్కువగానే ఇన్వెస్ట్‌చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ స్వీకరణ విషయంలో భారత్ రెండో స్థానంలో ఉంది. వియత్నాం క్రిప్టోకరెన్సీ స్వీకరణలో మొదటి స్థానంలో నిలిచింది. క్రిప్టోకరెన్సీ స్వీకరణ విషయంలో అమెరికా ఎనిమిదో స్థానంలో, చైనా పదమూడో స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. బ్లాక్‌చైన్ డేటా ప్లాట్‌ఫాం చైనాలిసిస్ కొత్త నివేదిక ప్రకారం భారత్ క్రిప్టోకరెన్సీను దత్తత తీసుకునే విషయంలో రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు పేర్కొంది. చైనాలిసిస్ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 154 దేశాల్లో క్రిప్టోకరెన్సీను గత సంవత్సరం కంటే ఎక్కువగా 881 శాతం స్వీకరిస్తున్నల్లు వెల్లడించింది. 2019 మూడవ త్రైమాసికం నుంచి క్రిప్టోకరెన్సీపై గ్లోబల్ అడాప్షన్ 2,300 శాతంగా పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ దేశాల కంటే క్రిప్టోకరెన్సీను స్వీకరించడంలో ముందున్నాయి, పీర్-టు-పీర్ ప్లాట్‌ఫారమ్ ట్రేడింగ్ ద్వారా క్రిప్టోకరెన్సీ చలామణీలో నడుస్తోందని చైనాలిసిస్ నివేదిక వెల్లడించింది. రిజర్వ్ బ్యాంకు , కేంద్ర ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా భారతీయులు క్రిప్టోకరెన్సీపై విపరీతంగా ఇన్వెస్ట్‌చేస్తున్నారు. తాజాగా ఆర్థిక శాఖ మంతి నిర్మలా సీతారామన్ కేబినెట్ ముందు త్వరలోనే ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీ బిల్లు ఎప్పుడు తెస్తారనే కుతుహాలంతో భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వాజిర్ ఎక్స్ వంటి క్రిప్టో ఎక్స్ఛేంజ్లలో యూజర్ సైన్-అప్లు మార్చి 2020 నుంచి గణనీయంగా 4937శాతం మేర పెరిగాయి , అయితే భారత తొలి క్రిప్టో యునికార్న్ కాయిన్‌డీసీఎక్స్ యూజర్ బేస్ ఈ సమయంలో దాదాపు 700 శాతం మేర పెరిగింది. యువతకు పోటీగా... క్రిప్టోకరెన్సీ మార్కెట్లో భారత్ నుంచి యువత భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం భారత్‌లో ఎక్కువగా 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువతి, యువకులే ఎక్కువగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారని చైనాలసిస్ పేర్కొంది. ఇప్పుడు ప్రస్తుతం 45 సంవత్సరాలు వయసు ఉన్న భారతీయులు కూడా క్రిప్టోకరెన్సీపై భారీగా ఇన్వెస్ట్‌చేస్తున్నారు. (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
అపర కుబేరుడికి ‘అడల్ట్’ సినిమాల ఆఫర్!
స్మార్ట్ ఫోన్లు-ఇంటర్నెట్ వాడకం పెరిగాకే.. అడల్ట్ కంటెంట్ జనాలకు ఎక్కువగా రీచ్ అవుతోంది. ఈ తరుణంలో బిజినెస్ పెంచుకోవడం కోసం అడల్ట్ సైట్లు భారీ ఆఫర్లతో సెలబ్రిటీలను ఆకర్షిస్తుండగా.. సినిమా అవకాశాల కోసం ఈ రొంపిలోకి దిగుతున్న జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కొందరు. ఈ తరుణంలో క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసే ప్రపంచ కుబేరుడికి పో* సినిమాల్లో నటించే అవకాశం దక్కడం విశేషం. టెస్లా సీఈవోగా నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఎలన్ మస్క్. క్రిప్టో కరెన్సీలు బిట్‌కాయిన్, డోజ్కాయిన్ల విలువను కేవలం ట్వీట్లతోనే శాసిస్తున్నాడు మస్క్. ఇది చాలదన్నట్లు ఆమధ్య అడల్ట్ థీమ్డ్ క్రిప్టో కరెన్సీలను సైతం ప్రమోషన్ చేసి.. వాటి విలువను అమాంతం పెంచాడు. ఈ నేపథ్యంలో నాఫ్టీ అనే కంపెనీ మస్క్‌కు బంపరాఫర్ ప్రకటించింది. అడల్ట్ సినీ పరిశ్రమకు ఫైనాన్స్ సమకూర్చే నాఫ్టీ.. సుమారు 6.9 మిలియన్ డాలర్ల విలువైన సొమ్ము, నాఫ్టీ టోకెన్లను ఇచ్చేందుకు మస్క్‌కు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మన కరెన్సీలో వాటి విలువ 51 కోట్ల రూపాయలకు పైనే. పైగా నచ్చిన టైంలో, నచ్చిన ప్లేసులో, తనకు నచ్చిన వాళ్లతో నటించే బంపరాఫర్ ప్రకటించింది. చదవండి: ఆకాశమే హద్దుగా! ఏం చేయబోతున్నాడంటే.. ఆయన అడల్ట్ కాయిన్ల కోసం ఆయన చేసే ప్రమోషన్.. ఈ పరిశ్రమ పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. అందుకే నటించడం లేదంటే డైరెక్ట్ చేసే అవకాశం ఆయనకు ఇస్తున్నాం అంటూ నాఫ్టీ సీఈవో రాబ్ కెమెనిఫై వెల్లడించాడు. మరి చావును మార్స్‌పై కోరుకునే ఈ ‘మూర్ఖపు మేధావి’ .. ఈ బంపరాఫర్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి. -
క్రిప్టోకరెన్సీ.. భారీగా ఉద్యోగావకాశాలు
క్రిప్టోకరెన్సీల లావాదేవీలపై ప్రభుత్వం, నియంత్రణ సంస్థల వైఖరి ఎలా ఉన్నప్పటికీ.. దేశీయంగా వీటి ట్రేడింగ్, మైనింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలు పెద్ద సంఖ్యలో నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. వీటికి సాంకేతిక నైపుణ్యాలు అవసరం కావడంతో ఎక్కువగా తత్సంబంధ అంశాల్లో పరిజ్ఞానమున్న ఇంజనీర్లకు డిమాండ్ ఉంటోంది. బ్లాక్‌చెయిన్ డెవలపర్, బ్యాక్ఎండ్ డెవలపర్, క్రిప్టో ఇంజినీర్లు మొదలైన వారికోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. వీరితో పాటు ప్రోడక్ట్ డెవలప్మెంట్, మార్కెటింగ్ సిబ్బంది నియామకాలు కూడా మొదలైనట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. సాంప్రదాయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలతో పోలిస్తే క్రిప్టో ప్లాట్‌ఫాంలలో ప్రారంభ వేతనాలు కనీసం 25–30 శాతం అధికంగా ఉంటుండటంతో.. ఇంజినీర్లు వీటిపై ఆసక్తి చూపుతున్నట్లు వివరించాయి. దేశీయంగా క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలలో ప్రారంభ వేతనాలు వార్షికంగా రూ. 9.5 లక్షల నుంచి ఉంటున్నాయి. రెండేళ్ల దాకా అనుభవం ఉన్నవారికి దాదాపు రూ. 22 లక్షల దాకా ప్యాకేజీ ఉంటోంది. ఇక సాలిడిటీ వంటి వినూత్న టెక్నాలజీలో కేవలం కొన్నాళ్ల అనుభవం ఉన్నవారికైతే ఏకంగా రూ. 45 లక్షల దాకా వార్షిక వేతన ప్యాకేజీ ఉంటోంది. ఇతర ఉద్యోగాలకు సంబంధించి మార్కెటింగ్, ప్రోడక్ట్ డెవలపర్లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఉదాహరణకు, అమెరికాలో లిస్టయిన కాయిన్‌బేస్ అనే భారీ క్రిప్టో ఎక్సే్చంజీ ప్లాట్‌ఫాం పెద్దయెత్తున నియామకాలు చేపడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నట్లు కంపెనీ భారత విభాగ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ గుప్తా ఇటీవల వెల్లడించారు. వచ్చే ఏడాది.. రెండేళ్ల వ్యవధిలో భారత్‌లో పూర్తి స్థాయి హబ్‌ను ఏర్పాటు చేసుకునే దిశగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ తదితర విభాగాల్లో భారీగా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు. 2012లో ప్రారంభమైన కాయిన్‌బేస్ ప్లాట్‌ఫాంపై బిట్‌కాయిన్, ఎథీరియం, లైట్‌కాయిన్ వంటి పలు క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ జరుగుతోంది. భిన్నమైన నైపుణ్యాలు.. ఇతర టెక్నాలజీ ప్లాట్‌ఫాంలతో పోలిస్తే క్రిప్టో రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు భిన్నంగా ఉంటాయి. ఇవి మార్కెట్లో నేర్చుకోవడానికి అంత సులువుగా లభించవు. క్రిప్టో రంగానికి బ్లాక్‌చెయిన్ సాంకేతికతలో సుశిక్షితులైన ఇంజినీర్లు అవసరమవుతారు. కోడ్‌ను వేగవంతంగా రూపొందించడం, వినియోగంలోకి తేవడంతో పాటు కోడ్ భద్రతపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి వినియోగంలోకి తెచ్చాక సొల్యూషన్స్‌లో మార్పులు చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు కాబట్టి ఏ కాస్త తప్పిదం జరిగినా అటు యూజర్లు, ఇటు ప్లాట్‌ఫాంలు భారీగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కనుక హ్యాకింగ్ దాడులనూ సమర్ధంగా తట్టుకునేలా ప్లాట్‌ఫాంలు సురక్షితంగా ఉండాలి. హ్యాకింగ్ జరిగితే సెకన్లలో కోట్ల డబ్బు తుడిచిపెట్టుకుపోతుంది. దీనికి కోడర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంతటి రిస్కీ వ్యవహారం కాబట్టి కోడర్లకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. సందిగ్ధంలో ఉద్యోగార్థులు.. జీతభత్యాలు ఆకర్షణీయంగా ఉన్నా, క్రిప్టో సంస్థలపై నియంత్రణపరంగా స్పష్టత లేకపోవడంతో వీటిలో చేరడానికి ఉద్యోగార్థులు వెనుకాడుతున్నారు. క్రిప్టో కరెన్సీకి తాను అనుకూలమా లేక ప్రతికూలమా అన్న దానిపై రిజర్వ్ బ్యాంక్ ఇప్పటిదాకా స్పష్టతనివ్వలేదు. ఈ అనిశ్చితితో హైరింగ్‌పైనా ప్రభావం పడుతోంది. పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియని క్రిప్టో రంగంలోని సంస్థల్లో చేరడానికి చాలా మంది ఇష్టపడటం లేదని క్రిప్టో ఎక్సే్చంజీ నిర్వాహకులు అంటున్నారు. ఉద్యోగార్థులు చేరాలనుకున్నా వారి కుటుంబాల ఆందోళన వల్ల సదరు అభ్యర్థులు కూడా వెనక్కి తగ్గుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక కోర్సులు... అర్హులైన ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తున్న వారు, మైనింగ్ చేస్తున్నవారిని కూడా రిక్రూట్ చేసుకునేందుకు క్రిప్టో సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. అవసరమైతే వారు రిఫ్రెషర్ కోర్సులు నేర్చుకునేందుకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రత్యక్షంగా ట్రేడింగ్ చేయడం ద్వారా వచ్చే అనుభవమనేది ఇతరత్రా విద్యాసంస్థల్లో నేర్చుకున్న దానికి మించి ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. క్రిప్టో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్లుగా ప్రత్యేక కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోని ఎంఐటీ మీడియా ల్యాబ్ .. క్రిపోకరెన్సీలపై ఆరు వారాల స్వల్పకాలిక ఆన్లైన్ కోర్సు అందిస్తోంది. గెట్స్మార్టర్ అనే డిజిటల్ ఎడ్యుకేషన్ కంపెనీ భాగస్వామ్యంతో అందించే ఈ కోర్సు ఫీజు రూ. 1.93 లక్షలుగా ఉంది. ఇటీవలే సింప్లీలియర్ అనే అంతర్జాతీయ డిజిటల్ నైపుణ్యాల సంస్థ .. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై నాలుగు నెలల ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం అందించేందుకు ఐఐటీ కాన్పూర్‌తో జట్టు కట్టింది. నిపుణుల కొరత... మధ్యవర్తి ప్రమేయం లేకుండా రెండు వర్గాలు క్రిప్టో లావాదేవీలు నిర్వహించడానికి ఉపయోగపడే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను స్మార్ట్ కాంట్రాక్టులుగా వ్యవహరిస్తారు. కొన్ని ప్రోగ్రామ్‌లలో శిక్షణ పొందిన వారికి డిమాండ్ అధికంగా ఉంటోంది. ఉదాహరణకు బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫాంలలో స్మార్ట్ కాంట్రాక్టులను అమలు చేసేందుకు ఉపయోగించే సాలిడిటీ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఇది 2014లో తెరపైకి వచ్చింది. ఈ లాంగ్వేజీలో కేవలం కొన్నాళ్ల అనుభవం ఉన్న వారు కూడా వార్షికంగా రూ. 45 లక్షల దాకా వేతనం అందుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సుశిక్షితులైన వారి కొరత తీవ్రంగా ఉండటంతో ఎంతైనా ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉంటున్నాయి. బ్లాక్‌చెయిన్ ఇంజినీర్లకు నెలకు రూ. 1.45 లక్షల దాకా వేతనం ఇచ్చి తీసుకునేందుకు యునోకాయిన్ వంటి సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ నిపుణులు దొరకడం లేదు. దీంతో ప్రతిభావంతులైన ఇంజనీర్లను నియమించుకుని, వారికి శిక్షణనిచ్చుకోవాల్సి వస్తోంది. కాయిన్‌బేస్ వంటి పెద్ద సంస్థలు నియామకాలను గానీ చేపడితే.. పరిస్థితులు మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. దీనివల్ల మరింత మంది శిక్షణ పొంది, నిపుణుల కొరత కొంత తీరవచ్చని పేర్కొన్నారు. కేవలం ఇంజినీర్లే కాకుండా క్రిప్టో ఎక్సే్చంజీల్లో ఇతరత్రా సిబ్బంది అవసరం కూడా ఉంటోంది. -
క్రిప్టోకరెన్సీపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ (బిల్లు)పై కేబినెట్ నోట్ సిద్దమైందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బిల్లుకు క్యాబినెట్ ఆమోదం గురించి తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిప్టోపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక మంత్రిత్వ స్థాయి కమిటీ ఇప్పటికే దీనిపై తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీచేసే ఏదైనా వర్చువల్ కరెన్సీ మినహా అన్ని ప్రైవేటు క్రిప్టోకరెన్సీలనూ భారత్‌లో నిషేధించాలని కమిటీ సిఫారసు చేసింది. కాగా,గతంలో ఓ వర్చువల్ కార్యక్రమంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ మాట్లాడుతూ.. త్వరలోనే డిజిటల్ కరెన్సీని చూడనున్నాం!. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని దశలవారీగా అమలు చేసే విషయమై ఆర్బీఐ పనిచేస్తోంది. హోల్‌సేల్, రిటైల్ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని సాధారణ కరెన్సీ మాదిరే వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్ బ్యాంకులు దీన్ని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తుండగా.. పలు దేశాలు ఇప్పటికే కొన్ని ప్రత్యేక అవసరాల కోసం వినియోగిస్తున్నాయి. చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు