India First Cryptocurrency Index IC15: భారత్ మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ సూచీ అధికారికంగా లాంఛ్ అయ్యింది. ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ సూపర్ యాప్‌గా గుర్తింపు పొందిన క్రిప్టోవైర్ ఈ కరెన్సీ సూచీని తీసుకొచ్చింది. ఇంతకీ దీని పేరేంటో తెలుసా?.. ఐసీ15 (IC15). క్రిప్టోమార్కెట్‌ను.. దాని తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వివరించడమే ఈ సూచీ చేసే పని.
ఈ సూచీ డ్యూటీ ఏంటంటే.. బాగా ట్రేడింగ్‌లో, లీడింగ్ ఎక్స్ఛేంజ్‌లో ఉన్న క్రిప్టోకరెన్సీల పనితీరును పర్యవేక్షించడం.. ఆ వివరాల్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ద్వారా తెలియజేడం. ట్రిక్కర్‌ప్లాంట్ లిమిటెడ్‌లో స్పెషల్ బిజినెస్ యూనిట్‌గా ఉన్న క్రిప్టోవైర్.. క్రిప్టో లెక్కల వివరాల్ని పక్కాగా తెలియజేస్తుంటుంది. తద్వారా క్రిప్టో ఇన్వెస్టర్లకు మాత్రమే కాదు.. ఆసక్తి ఉన్నవాళ్లకు, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్లకు సైతం క్రిప్టో మార్కెట్ తీరుతెన్నులు ఎప్పటికప్పుడు అర్థమవుతుంటాయి.
పనిలో పనిగా ఈ ఇండెక్స్(సూచీ).. క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ ఇకోస్టిస్టమ్ మీద అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుంటుంది కూడా. డొమైన్ ఎక్స్‌పర్ట్స్, విద్యావేత్తలు, మేధావులతో కూడిన గవర్నెన్స్ కమిటీ(IGC) ఐసీ15లో ఉంటుంది.
ఏదైనా ఒక క్రిప్టోకరెన్సీకి ఇండెక్స్‌లో చోటు దక్కాలంటే.. రివ్యూ ప్రకారం ట్రేడింగ్ రోజుల్లో కనీసం 90 శాతం అయినా ట్రేడ్ అయ్యి తీరాలి. గడిచిన నెలలో మార్కెట్ క్యాపిటలైజేషన్ సర్క్యులేటింగ్ పరంగా టాప్ 50లో ఉండాలి. IC15 ఇండెక్స్‌లో లిస్టింగ్‌కు అర్హత పొందేందుకు మాత్రం.. ట్రేడింగ్ విలువ పరంగా అది టాప్ 100 అత్యంత లిక్విడ్ క్రిప్టోకరెన్సీలలో ఒకటిగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment