వైఎస్ జగన్ ఈస్టర్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, కరుణ ఎప్పటికీ ఓడిపోవన్న సత్యాన్ని ఏసుక్రీస్తు పునరుత్థాన తెలుపుతుంది. ఈస్టర్ పండుగ ప్రతి ఇంటినీ ప్రేమ, ఆశ, శాంతి, శ్రేయస్సుతో నింపాలని కోరుకుంటున్నా. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Today, as we celebrate the miracle of His resurrection, let us remember that truth and compassion can never be defeated. May this Easter fill every household with love, hope, peace and prosperity. Happy Easter!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2026
Delhi: మళ్లీ కృత్రిమ వర్షం.. సక్సెస్ అయ్యేనా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కృత్రిమ వర్షం కురిపించేందుకు రంగం సిద్ధమవుతోంది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసే అత్యవసర చర్యల్లో భాగంగా, ఈ వేసవిలో (ఏప్రిల్ - జూన్ 2026 మధ్య) ‘క్లౌడ్ సీడింగ్’ ప్రయోగాలను నిర్వహించేందుకు ఐఐటీ కాన్పూర్ సన్నాహాలు చేస్తోంది.ఈ ప్రయోగాల కోసం ఐఐటీ కాన్పూర్ ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి కోరింది. అధికారిక ఆమోదం లభించిన వెంటనే ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఢిల్లీ పర్యావరణ శాఖ, ఐఐటీ కాన్పూర్ మధ్య 2025 సెప్టెంబర్ 25న ఒక కీలక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే గత ఏడాది అక్టోబర్‌లో రెండుసార్లు ప్రయోగాలు నిర్వహించినప్పటికీ నగరంలో వర్షం కురవలేదు.మేఘాల్లో తేమ శాతం తక్కువగా (కేవలం 15 నుంచి 20 శాతమే) ఉండటం కారణంగానే నాటి ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. అయితే ఆ వైఫల్యం ద్వారా భవిష్యత్తు ప్రయోగాలకు పనికొచ్చే కీలక వాతావరణ పరిస్థితుల గురించి నేర్చుకున్నామని తెలిపింది.క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి?మేఘాల నుంచి వర్షం పడే అవకాశాలను కృత్రిమంగా పెంచే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు. విమానాల ద్వారా మేఘాల్లోకి సిల్వర్ అయోడైడ్, అయోడైజ్డ్ ఉప్పు, రాక్ సాల్ట్ వంటి రసాయనాలతో కూడిన ఫ్లేర్లను వదులుతారు. ఇవి మేఘాల్లో మంచు స్ఫటికాలు లేదా నీటి బిందువులు త్వరగా ఏర్పడేలా చేసి, వర్షం కురిసేలా చేస్తాయి. దీనివల్ల గాలిలోని కాలుష్య కణాలు కిందికి చేరి గాలి శుభ్రపడుతుంది.గత అక్టోబర్ ప్రయోగాల వల్ల వర్షం పడకపోయినా, లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతాల్లో కాలుష్య కారకాలు (పర్టిక్యులేట్ మ్యాటర్) తగ్గాయని ఢిల్లీ ప్రభుత్వం ఒక నివేదికలో పేర్కొంది. ఇటీవలే విడుదలైన ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఢిల్లీ 2025-26’ సైతం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సహకారంతో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, చేయబోయే ఈ ప్రయోగం సక్సెస్ అయి, ఢిల్లీవాసులకు కాలుష్యం నుంచి ఊరటనిస్తుందేమో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: Iran: 30కి పైగా యూనివర్సిటీలు ధ్వంసం
సోషల్ మీడియాలో ధురంధర్-3.. కథ-స్క్రీన్ ప్లే రెడీ
గత నెల రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్-2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం (ధురంధర్-2) ఎలా ముగిసిందో సినిమా చూసిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. భార్య, కొడుకును వదిలి ఇండియా వచ్చేస్తాడు హీరో. ఆ తర్వాత ‘RAW’ కనుసన్నల నుంచి తప్పించుకొని నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అయితే దూరం నుంచే తన తల్లిని, చెల్లిని చూసి తిరిగి వెనుదిరుగుతాడు. ఇలా సాగిన ధురంధర్-2 క్లయిమాక్స్ నుంచి ధురంధర్-3 కథను అల్లేస్తున్నారు సోషల్ మీడియాలోని కొంతమంది జనం. అయితే హీరో మరోసారి రా ఏజెంట్‌గా పాకిస్థాన్‌లో అడుగుపెడతాడని, కొత్త గెటప్‌లో పాకిస్టాన్‌లో మరోసారి అడుగుపెట్టి తన భార్య, కొడుకును కలుస్తాడంటూ ఎవరికివారు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అల్లేస్తున్నారు. ఇలా ధురంధర్ ఫ్రాంచైజీపై ఓ కొత్త చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ధురంధర్-3పై దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల ఇదే ప్రశ్న ఆదిత్య ధర్కి ఎదురైంది. దానికి 'ఏమో చెప్పలేం' అన్నట్టు మాత్రమే ఆయన స్పందించాడు. అంతేకానీ ధురంధర్-3 తప్పకుండా తీస్తానని ఆదిత్య ధర్ అనలేదు.కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథలని నిజానికి ఓసారి పరిశీలిస్తే ఈ దర్శకుడికి కచ్చితంగా పార్ట్-3కి ఓ లైన్ దొరికే అవకాశం ఉందనే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు.
ఒక హత్య.. ముగ్గురు హంతకులు
సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు... హైదరాబాద్ శివార్లలోని ఒక విలాసవంతమైన విల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖర్జీ దారుణ హత్యకు గురయ్యాడు. గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి, ముఖర్జీ సోఫాలో ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. అతని మెడపై గట్టిగా నొక్కిన గుర్తులు ఉన్నాయి. హత్యకు గురైంది ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో కమిషనర్ కూడా వచ్చాడు. క్లూస్ టీమ్ తన పని తాను చేసుకుపోతోంది.క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ వైపు చూసి అన్నాడు కమిషనర్... ‘‘మీరు ఎంత త్వరగా కేసు క్లోజ్ చేస్తే అంత మంచిది. ఈ కేసులో అనుమానితులు ముగ్గురు...ముఖర్జీ మేనల్లుడు అజయ్ భారీ అప్పుల్లో వున్నాడు.సెక్రటరీ స్నేహ– ముఖర్జీ తనను ఉద్యోగంలోంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మరో వ్యక్తి ముఖర్జీ బిజినెస్ పార్టనర్ వినాయక్... ఈ ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరో కనిపెట్టాలి.’’ఇన్స్పెక్టర్ విక్రమ్ క్రైమ్ స్పాట్‌ను నిశితంగా గమనిస్తున్నాడు. టేబుల్ మీద మూడు కాఫీ కప్పులు ఉన్నాయి. కాని, గదిలో ఇద్దరు మాత్రమే ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఏసీ ఇంకా ఆన్‌లోనే వుంది. గదిలో ఏసీ 16 డిగ్రీల వద్ద ఉంది. ‘‘సర్ ... వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తాగితే ఈ కూల్లో వెచ్చగా ఉంటుంది’’ పనిమనిషి ఏసీ ఆఫ్ చేయబోతుంటే వారిస్తూ అన్నాడు. ఇన్స్పెక్టర్ విక్రమ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ తెలిసిన కమిషనర్ కాఫీ తీసుకురమ్మని వంటమనిషికి పురమాయించాడు. ముఖర్జీ మేనల్లుడు అజయ్‌ని గదిలోకి పిలిచాడు. ‘‘మీ మేనమామను చంపాలనే బ్రిలియంట్ థాట్ ఎలా వచ్చింది?’’ సూటిగా చూస్తూ అడిగాడు.‘‘నేను చంపడం ఏంటి సర్! మా మామయ్య చనిపోతే నాకేంటి లాభం? బతికుంటే ఎంతోకొంత చిల్లర అయినా వస్తుంది’’ అని చెప్పాడు. అజయ్‌ని బయటకు పంపించి సెక్రటరీ స్నేహను పిలిచాడు. ‘‘పనిలో నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చినందుకు లైఫ్‌లో నుంచే మీ బాస్‌ను తీసేశావా?’’ ఆమె వైపే చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్.‘‘సర్! నేను ఒక మాములు ఉద్యోగిని. నేనెలా చంపగలను? చంపితే నాకు ఒరిగేది ఏముంది?’’ సెక్రటరీ స్నేహ అంది.‘‘గుడ్ ఆన్సర్... యు మే గో...’’ అన్నాడు.స్నేహ బయటకు వెళ్ళగానే, ఆ గది మొత్తం మరోసారి పరిశీలించాడు. ఏసీ ఆఫ్ చేయడానికి వెళ్లి రిమోట్ తీసుకుని, ఒకసారి ఏసీ వంక చూశాడు. వంటమనిషి కాఫీ తెచ్చింది. కాఫీ తాగి వంటమనిషిని బయటకు పంపించి, మంచం ఎక్కి ఏసీని పరిశీలనగా చూశాడు.ఒక చిక్కుముడి వీడిపోయింది. ఇన్స్పెక్టర్ విక్రమ్ కిందకి దిగి ముఖర్జీ బిజినెస్ పార్టనర్‌ను పిలిపించాడు.‘‘మిస్టర్ వినాయక్! మీ లాయర్‌కు ఫోన్ చేస్తే మనం బయల్దేరుదాం’’ అన్నాడు.‘‘ఎందుకు ఎక్కడికి?’’ అయోమయంగా అడిగాడు వినాయక్.‘‘మీ బిజినెస్ పార్టనర్‌ను హత్య చేసినందుకు’’ అన్నాడు.‘‘ముఖర్జీ మేనల్లుడు అజయ్, సెక్రటరీ స్నేహ అంతా ఒప్పుకున్నారు’’ వినాయక్ వంక చూస్తూ చెప్పాడు.‘‘వాళ్ళ మాటలు విని నన్ను అరెస్టు చేస్తారా? సాక్ష్యం లేకుండా’’ వినాయక్ కోపంగా అన్నాడు.‘‘ఈ సాక్ష్యం సరిపోతుందా? నువ్వూ... అజయ్... స్నేహ కలిసి ముఖర్జీని చంపడం... ఎలాంటి ఎడిటింగులు లేకుండా ఉన్న ఆధారం ఓకేనా?’’ వినాయక్‌ను అడిగాడు.కమిషనర్ అలానే చూస్తుండిపోయాడు. ‘‘మీరు అన్నంత మాత్రాన అది నిజం అవుతుందా?’’ వినాయక్ అన్నాడు.‘‘అవుతుంది... ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సార్ కెమెరా ఉంది. అందులో మీ ముగ్గురి ముఖాలు స్పష్టంగా పడ్డాయి. నువ్వు అజయ్‌ని, స్నేహను ఇరికించాలనుకున్నావు. అజయ్ అప్పులను తీరుస్తానని ప్రామిస్ చేశావు. స్నేహను మంచి జీతంతో నీ దగ్గర సెక్రెటరీగా పెట్టుకుంటానన్నావు.స్నేహ నిద్రమాత్రలు ఇచ్చింది. అజయ్ నువ్వు రహస్యంగా ఇంట్లోకి రావడానికి సహకరించాడు.’’ముఖర్జీ చనిపోతే అతడి అన్ని వ్యాపారాలనూ తన వ్యాపారంలోకి కలిపేసుకోవచ్చని వినాయక్ అనుకున్నాడు.‘‘ముగ్గురూ కలిసి హత్య చేశాక గది లోపల గడియ పెట్టి కిటికీ గుండా బయటకు వెళ్లారు. కాని, వినాయక్ గమనించని విషయం ఏంటంటే, ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సర్ కెమెరా! అందులో రికార్డు అయిన వాళ్ళ మొహాలు...’’ అంటూ కమిషనర్ వైపు తిరిగి.‘‘ఇదిగోండి ఎవిడెన్స్ ఒక హత్య... ముగ్గురు హంతకులు.’’హత్య చేసినందుకు వినాయక్‌ను; డబ్బు మీద ఆశతో సహకరించినందుకు అజయ్‌ను, క్షణకాలం ఆవేశంతో, స్వార్థంతో చేతులు కలిపినందుకు స్నేహను అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ విక్రమ్! కేవలం గంట వ్యవధిలోనే కేసును మైండ్ గేమ్‌తో సాల్వ్ చేశావు’’ అభినందిస్తూ అన్నాడు కమిషనర్.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిపాజిట్లలో ‘కొత్త మార్క్’
మంచి జీర్ణక్రియకు మండూకాసనం
ఖానాపూర్ మున్సిపాలిటీ.. బీజేపీ-బీఆర్ఎస్ కైవసం
అదృష్టం అంటే ఆమెదే.. చెత్తలో ‘టికెట్’కు రూ. కోటి!
టోవినో థామస్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
అతడిని వదిలి సీఎస్కే తప్పు చేసిందా?
టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు
జయమ్మ కోసం రణబాలి శుభాకాంక్షలు
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు
పెళ్లయిన నెలకే 'ముగ్గురమయ్యాం' అంటూ రష్మిక పోస్ట్.. ప్రెగ్నెంట్?
భానుప్రియ మతిస్థిమితం బాగోలేదా? సోదరి ఏమందంటే?
మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..!
సమ్మక్క పూజారి కుమారుడి కాలు తొలగింపు
గ్యాస్ లేకుండా వంట ఎలా చేయాలో చెప్పమంటున్నారు సార్!!
ఒక్క అక్షరమే కదా సార్! మార్చేద్దాం..!
పెళ్లికి ముందు సూది మందు
ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
టికెట్ నిరాకరణ.. మౌనం వీడిన అన్నామలై
‘బైకర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!
‘4 గంటలకే అన్నీ ఆఫీసులు మూసేయండి’
టిఫిన్ చేసే అలవాటు లేదు, రోజుకు 10 గంటలు నిద్ర!
ఒరాకిల్ బాస్‌కు షాక్.. రూ.16 లక్షల కోట్లు లాస్!
100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్
ఉన్నపళంగా పాక్ నుంచి వెళ్లిపోయిన డేవిడ్ వార్నర్?
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో విజయం
హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిపాజిట్లలో ‘కొత్త మార్క్’
మంచి జీర్ణక్రియకు మండూకాసనం
ఖానాపూర్ మున్సిపాలిటీ.. బీజేపీ-బీఆర్ఎస్ కైవసం
అదృష్టం అంటే ఆమెదే.. చెత్తలో ‘టికెట్’కు రూ. కోటి!
టోవినో థామస్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
అతడిని వదిలి సీఎస్కే తప్పు చేసిందా?
టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు
జయమ్మ కోసం రణబాలి శుభాకాంక్షలు
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు
పెళ్లయిన నెలకే 'ముగ్గురమయ్యాం' అంటూ రష్మిక పోస్ట్.. ప్రెగ్నెంట్?
భానుప్రియ మతిస్థిమితం బాగోలేదా? సోదరి ఏమందంటే?
మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..!
సమ్మక్క పూజారి కుమారుడి కాలు తొలగింపు
గ్యాస్ లేకుండా వంట ఎలా చేయాలో చెప్పమంటున్నారు సార్!!
ఒక్క అక్షరమే కదా సార్! మార్చేద్దాం..!
పెళ్లికి ముందు సూది మందు
ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
టికెట్ నిరాకరణ.. మౌనం వీడిన అన్నామలై
‘బైకర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!
‘4 గంటలకే అన్నీ ఆఫీసులు మూసేయండి’
టిఫిన్ చేసే అలవాటు లేదు, రోజుకు 10 గంటలు నిద్ర!
ఒరాకిల్ బాస్‌కు షాక్.. రూ.16 లక్షల కోట్లు లాస్!
100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్
ఉన్నపళంగా పాక్ నుంచి వెళ్లిపోయిన డేవిడ్ వార్నర్?
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో విజయం
ఫొటోలు
బర్త్‌డే స్పెషల్.. రష్మిక చిన్నప్పటి క్యూట్ ఫోటోలు
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)
ఉప్పల్‌లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)
పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)
సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)
‘బైకర్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సినిమా
ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది.. థ్రిల్ అవుతారు: అడివి శేష్
‘‘ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎన్ని మంచి చిత్రాలు చేశామన్నదే నా లైఫ్ ఫిలాసఫీ. ప్రాణం పెట్టి చేసిన సినిమా ‘డెకాయిట్’. ఇందులో ముఖ్యమైన విషయాలున్నాయి. కానీ, వాటిని ట్రైలర్లో చూపించలేదు. మా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అడివి శేష్ మాట్లాడుతూ–‘‘మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడు? అనే అంశమే ‘డెకాయిట్’లో ప్రధానంగా ఉంటుంది. ఇది యూనివర్సల్ కథ’’ అని పేర్కొన్నారు. ‘‘డెకాయిట్’లో నేను చేసిన సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది’’ అని మృణాల్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఈ తరహా పాత్రలో నేను ఇంతవరకు నటించలేదు’’ అని చెప్పారు అనురాగ్ కశ్యప్. ‘‘మంచి లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్ ఫిల్మ్ ఇది’’అని చె΄్పారు షానియల్ డియో. ‘‘మహేశ్ బాబు, ఎన్టీఆర్గార్లు మా సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా ఎప్పుడూ విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత సుప్రియ.
‘వారణాసి’ క్రేజీ అప్డేట్.. ‘మందాకిని’తో పాట స్టార్ట్!
హైదరాబాద్‌లో మళ్లీ అడుగుపెట్టారు మందాకిని. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’లో ప్రియాంకా చోప్రా పోషిస్తున్న పాత్ర పేరు మందాకిని అని తెలిసిందే. ఈ టైమ్ ట్రావెల్ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాలో రుద్ర, శ్రీరాముడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూట్లో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్నారు ప్రియాంకా చోప్రా. ఈ షూటింగ్ ప్రిపరేషన్ వీడియోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. తన స్కిన్ మరింత గ్లోతో కనిపించేందుకు ఆమె తన ముఖానికి షీట్ మాస్క్‌ను ధరించినట్లుగా ఆ వీడియోతో స్పష్టం చేశారు ప్రియాంక. ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రియాంకా చోప్రా హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో మొదలైన ఈ షూట్ షెడ్యూల్లో మహేశ్‌బాబు కూడా పాల్గొంటారని, కొంత టాకీ పార్టుతో పాటు ఓ పాట చిత్రీకరణను కూడా మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఆ తర్వాతి షెడ్యూల్ కోసం ‘వారణాసి’ యూనిట్ అంటార్కిటికా వెళుతుందని తెలిసింది. అంటార్కిటికా లొకేషన్స్‌లో ఈ సినిమా షూట్ జరగనున్నట్లుగా ఇటీవల ప్రియాంకా చోప్రా ‘ఎక్స్’ వేదికగా కన్ఫార్మ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. On the move 🙌✨Priyanka Chopra heading for Varanasi work 👀Style on point. Focus locked.Another big moment loading ⚡From global icon to grounded roots…she does it all effortlessly 💛#PriyankaChopra #Varanasi pic.twitter.com/XHituw8UAL— Viral Celeb X (@ViralCelebX) April 4, 2026
రష్మిక బర్త్ డే.. మైసా టీమ్ స్పెషల్ పోస్టర్
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లీడ్ రోల్లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రవీంద్ర పూలే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌లో రష్మిక లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.తాజాగా ఇవాళ రష్మిక బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రష్మిక జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్‌ను పంచుకున్నారు. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ కలర్లో రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మోడ్‌లో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో రష్మిక కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2026లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతేకాకుండా రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా వస్తోన్న రణబలిలోనూ నటిస్తున్నారు.She ruled with charm…She conquered with grace…Now she’s coming with pure RAGE🔥Team #Mysaa wishes the ever-stunning @iamRashmika a blazing Happy Birthday ❤️🔥Get ready for her most explosive performance yet In cinemas 2026.💥#HappyBirthdayRashmika pic.twitter.com/0XXdcpBhPf— MYSAA (@MysaaTheFilm) April 5, 2026
'రామాయణ' టీజర్‌పై విమర్శలు.. హృతిక్ రోషన్ కౌంటర్
రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణ’ టీజర్‌పై షోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా విడుదలైన టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆశించినంత రేంజ్లో లేవని చిత్ర దర్శకుడు నితీశ్ తివారీపై కామెంట్లు చేస్తున్నారు. ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను ఎదుర్కొంటున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్పందించారు. విజువల్ ఎఫెక్ట్స్‌పై తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వివరణాత్మక నోట్‌ను పంచుకున్నారు. ఆయన ఏ సినిమా పేరు ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు చేసిన సమయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న చర్చలో భాగంగానే నిలుస్తోంది.నాసిరకం విఎఫ్ఎక్స్ (VFX) ఉన్నాయని హృతిక్ అంగీకరించినప్పటికీ, విజువల్స్‌ను కేవలం వాస్తవికత ఆధారంగానే అంచనా వేయకూడదని స్పష్టం చేశారు. సినిమాలు, ముఖ్యంగా ఫాంటసీ, పౌరాణిక చిత్రాలు, వాస్తవికతను ప్రతిబింబించేలా మాత్రమే విజువల్స్ ఉంటాయని పేర్కొన్నారు. వీఎఫ్ఎక్స్ అంటే కేవలం వాస్తవానికి దగ్గరగా ఉండటమే కాదంటూనే.. ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఎంచుకుంటారని క్లారిటీ ఇచ్చారు. కొన్నిసార్లు అది ‘స్టోరీ బుక్’ తరహాలో కూడా ఉండవచ్చిని పేర్కొన్నారు.ఇలాంటి ప్రాజెక్టుల వెనుక ఉండే కృషి స్థాయిని కూడా హృతిక్ రోషన్ నొక్కిచెప్పారు. విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే చిత్రాల కోసం సంవత్సరాల తరబడి మేకర్స్ పనిచేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రేక్షకుల అభిప్రాయాన్ని కొట్టిపారేయకుండా వారి అంచనాలకు మించి విఎఫ్ఎక్స్ ఉండాలని సూచించారు.కల్కి 2898 AD, బాహుబలి, రామాయణ వంటి భారీ సినిమాలు నిర్మించిన వారు అసలైన హీరోలని ప్రశంసించారు. గతంలో ఎవరూ చేయలేని సాహసాన్ని చేస్తున్నారని గుర్తుచేశారు. రామాయణ సినిమాలోని వీఎఫ్ఎక్స్ వీడియో గేమ్ లాగా ఉన్నాయన్న విమర్శలపై హృతిక్ టెక్నికల్‌గా సమాధానమిచ్చారు.
క్రీడలు
మొదట్లో చితక్కొట్టినా చివర్లో వణికించాడు!
భారత్‌లో ఫాస్ట్ బౌలర్ల కన్నా మీడియం ఫాస్ట్ బౌలర్లే ఎక్కువగా ఉంటారు. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి వంటి ఫాస్ట్ బౌలర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా మరో ఫాస్ట్ బౌలర్ వెలుగులోకి వచ్చాడు. అతడే గుజరాత్ టైటాన్స్‌కు చెందిన అశోక్ శర్మ. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి నిప్పులు చెరిగాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని అశోక్ శర్మ 154.2 కి.మీ వేగంతో విసిరాడు. మెరుగు వేగంతో వచ్చిన బంతిని ధ్రువ్ జురేల్ భారీ షాట్ ఆడడంలో విఫలమై డిఫెన్స్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో అశోక్ శర్మ సంధించిన బంతి అత్యంత వేగవంతమైనదిగా రికార్డులకెక్కింది. అశోక్ శర్మ కంటే ముందు లక్నో సూపర్‌జెయింట్స్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే (150.9), కార్తిక్ త్యాగి (149.7), రబాడ (149.1) ఉన్నారు. అయితే తొలి స్పెల్‌లో అశోక్ శర్మను రాజస్తాన్ బ్యాటర్లు దంచికొట్టారు. 2 ఓవర్లు కలిపి 9 సగటుతో 18 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే రెండో స్పెల్‌లో మాత్రం అశోక్ శర్మ దుమ్మురేపాడు. ఒక వికెట్ తీయడంతో పాటు తన ఫాస్ట్ బౌలింగ్‌తో వణికించాడు. అంతేకాదు గుజరాత్ బౌలర్లలో అందరూ దాదాపు భారీగా పరుగులిచ్చుకోగా.. అశోక్ శర్మ మాత్రం మిగతా వాళ్లతో పోలిస్తే తక్కువ ఎకానమీ నమోదు చేయడం విశేషం. గుజరాత్ ఓడినప్పటికీ అశోక్ శర్మ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరీ అశోక్ శర్మ? ఎక్కడి నుంచి వచ్చాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఎవరీ అశోక్ శర్మ?రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మను ఐపీఎల్ 2026 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. అశోక్ శర్మ తండ్రి హుకుమ్ చంద్ శర్మ.. రాజస్థాన్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. కొడుకును క్రికెటర్‌గా చూడాలనేది ఆయన కోరిక.తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన అశోక్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించడం అతని ప్రత్యేకత. కుడిచేతి వాటం పేసర్ అయిన అశోక్ శర్మ.. తనను తాను హార్డ్ లెంగ్త్ బౌలర్‌గా చెప్పుకుంటాడు.ముస్తాక్ అలీ ట్రోఫీతో వెలుగులోకిముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 19 వికెట్లతో అల్లాడించాడు. 12.10 సగటు, 8.84 ఎకానమీతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. అశోక్ శర్మ తొలినాళ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో నెట్ బౌలర్‌గా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఇతనికి మంచి పట్టు ఉంది. 2022 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని రూ. 55 లక్షలకు కొనుగోలు చేయగా, 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళాడు. ఇక 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 90 లక్షలు వెచ్చించి అశోక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టిన ఈ యువ స్పీడ్‌స్టర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మంచి రికార్డును కలిగి ఉన్నాడు.Ashok Sharma clocks the fastest ball of the season🚄#AshokSharma #IPL2026 #GTvsRR pic.twitter.com/wfyPT9UeC7— CREX (@Crex_live) April 4, 2026చదవండి: రవి బిష్ణోయ్ అరుదైన రికార్డు!
రవి బిష్ణోయ్ అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. అయితే మొదట బ్యాటింగ్‌లో ధ్రువ్ జురేల్, జైస్వాల్ మెరిస్తే.. ఆ తర్వాత బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే సూపర్ బౌలింగ్‌తో రాజస్తాన్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్, గ్లెన్ పిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియాలు రవి బిష్ణోయ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే గ్లెన్ పిలిప్స్ వికెట్ తీయడం ద్వారా రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అయితే భారత్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (25 ఏళ్ల 211 రోజులు) బిష్ణోయ్ నిలిచాడు. 171 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు భారత్ తరఫున టీ20ల్లో 200 వికెట్లు తీసిన 19వ బౌలర్‌గా, 9వ స్పిన్ బౌలర్‌గా రవి బిష్ణోయ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా చూసుకుంటే టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రషీద్ ఖాన్ (23 ఏళ్ల 119 రోజులు) పేరిట రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇక ఐపీఎల్లో ప్రస్తుతం రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన రవి బిష్ణోయ్ గతలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్‌కు కూడా ఆడాడు. టీమిండియా తరఫున 44 టీ20లు ఆడిన రవి బిష్ణోయ్ 64 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. జురేల్ (75), జైస్వాల్ (55) రాణించారు. అనంతరం కడదాకా పోరాడిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులకు పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: ‘ఆ తప్పిదం మా కొంపముంచింది’
‘ఆ తప్పిదం మా కొంపముంచింది’
ఐపీఎల్ 2026 సీజన్లో తొలిసారి థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు రాజస్తాన్ రాయల్స్‌నే విజయం వరించింది. గుజరాత్ టైటాన్స్ సీజన్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ తమ పోరాట పటిమతో అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్ మ్యాచ్ ఓటమిపై స్పందించాడు. రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘నిజానికి మేము మంచిగానే బౌలింగ్ చేశాం. తొలుత రాజస్తాన్ మరింత భారీ స్కోరు చేస్తుందని అనుకున్నాం. కానీ మా బౌలర్లు కట్టడి చేయడంతో 210 పరుగులకు కట్టడి చేశాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మంచి ఆరంభమే దక్కింది. ముఖ్యంగా ఇద్దరు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. కానీ మిడిల్ ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం. అయితే భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒత్తిడి ఉండడం సహజం. ఇలాంటి పిచ్‌పై ఓవర్‌కు 9-10 పరుగులు చేయడం కష్టమేమీ కాదు. బౌండరీలు ఈజీగా వచ్చాయి. అయితే మిడిల్ ఓవర్లలో వరుసగా కొన్ని వికెట్లు కోల్పోవడంతో ఆఖరి వరకు దూకుడును కొనసాగించలేకపోయాం. ప్రతి ఆటగాడికి ఒక స్వంత ప్రణాళిక ఉంటుంది. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాలను అర్థం చేసుకుని ఆడటం ముఖ్యం. ఇది టోర్నీ ఆరంభం మాత్రమే, మేం చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఆఖరి ఓవర్ లో మా మధ్య (రబాడతో) జరిగిన సంభాషణ ఒక్కటే... మాకు కేవలం ఒక బౌండరీ అవసరమైంది. తుషార్ దేశ్‌పాండే అద్భుతమైన యార్కర్లు వేశాడు. అయితే అతను మిస్ చేసిన ఆ ఒక్క బంతిని నేను సిక్సర్‌గా మలచాల్సింది. ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఇది సుదీర్ఘమైన టోర్నీ. మేం ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో రాణిస్తాం. మా రెగ్యులర్ కెప్టెన్ గిల్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు.’ అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్!
‘హోం’లో పోరుకు రెడీ!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2026 సీజన్లో హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. హోం టీమ్ సన్‌రైజర్స్ ఉప్పల్ మైదానంలో నేడు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడినా... ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి రైజర్స్ జోరు మీదుంది. మరో వైపు లక్నో తాము ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో సొంతగడ్డపైనే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైంది. 2025 సీజన్లో ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. మార్పుల్లేకుండా... తిరుగులేని బ్యాటింగ్ బలగం ఉన్న సన్‌రైజర్స్ మరోసారి అదే విధ్వంసక ఆటను సొంత గడ్డపై చూపించాలని పట్టుదలగా ఉంది. హెడ్, అభిషేక్ మెరుపు బ్యాటింగ్‌లో చెలరేగితే జట్టుకు తిరుగుండదు. హైదరాబాద్ ఓపెనర్లను లక్నో ఏమాత్రం నిలువరించగలదనేదే ఆసక్తికరం. వీరి తర్వాత అదే ధాటిని కొనసాగించేందుకు ఇషాన్ కిషన్, క్లాసెన్ సిద్ధంగా ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైనా...అనికేత్ వర్మ ప్రతిభావంతుడైన బ్యాటర్. వీరికి తోడు లోకల్ బాయ్ నితీశ్ కుమార్ రెడ్డి ఫామ్‌లోకి రావడం మరో సానుకూలాంశం. కోల్‌కతాలో పోరులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన నితీశ్ తన జోరును కొనసాగించాలని కొనసాగించాలని భావిస్తున్నాడు. ఏడో స్థానంలో వచ్చే సలీల్ కూడా ధాటిగా ఆడగల సమర్థుడు. అన్నింటికి మించి హైదరాబాద్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు బాగా అనుకూలమే. పరుగుల విషయంలో ఎన్నో రికార్డులు ఈ మైదానంలో బద్దలయ్యాయి. ఈ నేపథ్యంలో రైజర్స్ బ్యాటింగ్ ఏ స్థాయికి చేరుతుందనేది చూడాలి. అయితే బ్యాటింగ్‌తో పోలిస్తే సహజంగానే రైజర్స్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. డేవిడ్ పేన్ ప్రధాన పేసర్ కావడం కాస్త ఆశ్చర్యపరుస్తుండగా...ఉనాద్కట్, మలింగ, దూబే ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చర్చనీయాంశం. పంత్‌పై తీవ్ర ఒత్తిడి... గత సీజన్లో అంతంతమాత్రంగానే ఆడిన లక్నోకు ఈసారి కూడా సరైన ఆరంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో కేవలం 141 పరుగులకే పరిమితమైన ఆ జట్టు ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోలుకొని మళ్లీ దారిలో పడటం టీమ్‌కు ఎంతో కీలకం. ఓపెనర్‌గా వచ్చిన పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు కాబట్టి ఈ సారి కూడా అతను ఓపెనర్‌గా మరో ప్రయత్నం చేయవచ్చు. మార్‡్ష, మార్క్రమ్ తమ స్థాయికి తగినట్లు దూకుడుగా ఆడాల్సి ఉంది. రెండు అగ్రశ్రేణి జట్ల టి20 కెపె్టన్లు అయిన వీరిద్దరు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు. పూరన్ ఐదో స్థాయిలో బరిలోకి దిగడం జట్టుకు ఏమాత్రం మేలు చేయదు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బదోని కంటే ముందు నాలుగో స్థానం అతను ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఆదుకున్న సమద్ తమ మాజీ జట్టుపై మరో మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. లక్నో పేస్ దళం చాలా పటిష్టంగా ఉంది. షమీ, మొహసిన్, నోర్జే, ప్రిన్స్ జట్టు భారం మోస్తున్నారు. నాణ్యమైన స్పిన్నర్ లేని లోటును టీమ్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.స్వదేశానికి కమిన్స్ సన్‌రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ్రస్టేలియాకు పయనమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను దానికి స్కానింగ్ చేయించుకునేందుకు స్వదేశానికి వెళ్లాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పర్యవేక్షణలో ఈ పరీక్ష జరుగుతుంది. దీని తర్వాత అతని ఫిట్‌నెస్‌పై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే ఐపీఎల్ రెండో దశ పోటీల్లో ఆడతాడా లేదా తేలుతుందని ఆసీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.చెన్నై X బెంగళూరు సా.7:30నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో తమ విజయపరంపరను కొనసాగించేందుకు సిద్ధమైంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగళూురు తలపడుతుంది. సీజన్ తొలి పోరులో సన్‌రైజర్స్‌ను ఓడించి అమితోత్సాహంతో మొదలు పెట్టిన ఆర్సీబీ సొంత గ్రౌండ్లో అభిమానులకు మళ్లీ గెలుపు సంబరం అందించాలని భావిస్తోంది. మరో వైపు వరుసగా రెండు పరాజయాల తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న చెన్నై ఎలా రాణిస్తుందనేది చూడాలి. ఆటగాళ్ల వైఫల్యంతో పాటు మైదానంలో ధోని మార్గనిర్దేశనం లేక సీఎస్కే తడబడుతోంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
లోక్‌సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్‌లో సర్వత్రా చర్చ...
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా...మొత్తం 10 బిల్లులకు ఆమోదం
ఆంధప్రదేశ్‌లో ప్రభుత్వ ‘రియల్’ దందా.. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ పందేరం
ఆంధ్రప్రదేశ్‌లో డైవర్షన్ డ్రామా.. రాజధాని, ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే కూటమి సర్కారు పన్నాగం...
మనమంతా ‘టీమ్ ఇండియా’గా కలిసి పనిచేద్దాం... ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
పశ్చిమాసియాలో ఇక భీకర యుద్ధమే.. చర్చలపై అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిష్టంభన... హార్మూజ్‌పై పట్టు బిగించిన ఇరాన్
బిజినెస్
గ్లోబల్‌గా పోటీకి సెజ్‌ల దన్ను
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత్ మరింతగా పోటీపడేందుకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్) తోడ్పడుతున్నాయి. దీనితో వీటిని బలోపేతం చేసే దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్లో సమగ్ర సంస్కరణలు ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్య మార్పులు, సరఫరా గొలుసు సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సెజ్‌లను తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు కీలకమని పేర్కొన్నారు. వీటిలో తయారైన ఉత్పత్తులను పరిమితంగా దేశీయ మార్కెట్లో తక్కువ సుంకంతో విక్రయించుకునే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో సెజ్‌ల పురోగతిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి దేశీయంగా నోటిఫై అయిన సెజ్‌ల సంఖ్య 368గా ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్ వరకు) రూ.11.70 లక్షల కోట్ల ఎగుమతులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 32.02 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం పెట్టుబడులు రూ.7.86 లక్షల కోట్లకు చేరగా, 31.73 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది. ఈ గణాంకాలు భారత ఆర్థిక వృద్ధికి ఎస్ఈజెడ్ల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయని పీఐబీ పేర్కొంది. సెజ్‌ల పరిణామక్రమం ఇలా: 1965లో కాండ్లాలో ఆసియాలోనే తొలి ఎగుమతి ప్రాసెసింగ్ జోన్ (ఈపీజెడ్)ని ఏర్పాటు చేసిన అనుభవంతో 2000లో సెజ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చట్టం–2005 అమల్లోకి తెచ్చి, 2006 నుంచి అమలు ప్రారంభించారు. దీని కింద సింగిల్ విండో క్లియరెన్స్, సరళతరంగా నియంత్రణ, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించారు. వాణిజ్య, పెట్టుబడి వ్యవస్థకు మూల స్తంభాలైన సెజ్‌లు దేశీయంగా ప్రత్యేక డ్యూటీ–ఫ్రీ ప్రాంతాలుగా, కస్టమ్స్ పరిధి వెలుపల పని చేస్తున్నాయి. ఇక్కడి యూనిట్లలో ఉత్పత్తుల తయారీ, సేవలు, గిడ్డంగుల తదితర కార్యకలాపాలు ఉంటున్నాయి. 2026–27 బడ్జెట్లో కీలక నిర్ణయం సాధారణంగా సెజ్‌ల నుంచి దేశీ టారిఫ్ ప్రాంతానికి (డీటీఏ) సరఫరాను దిగుమతులుగా పరిగణించి పూర్తి సుంకాలు విధిస్తారు. అయితే తాజా పరి స్థితుల నేపథ్యంలో ఉత్పత్తిలో కొంత భాగాన్ని త క్కువ సుంకాలతో డీటీఏలో విక్రయించునేందుకు సర్కార్ వెసులుబాటు కల్పించింది. ఖర్చులు తగ్గి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, సెజ్‌లు బలోపేతం అయ్యేందుకు ఈ చర్యలు తోడ్పడనున్నాయి. మరో వైపు, టెక్నాలజీ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని సెజ్‌లలోని డేటా సెంటర్లకు పన్ను రాయితీలు, గ్లోబల్ టెక్ కంపెనీలను ఆకర్షించేలా విధానాల్లో మార్పు లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ప్రత్యేక సెజ్‌ల ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించింది. 2025 జూన్‌లో సాణంద్, ధార్వాడ్ ప్రాంతాల్లో కొత్త సెజ్‌లను నొటిఫై చేసింది. పెట్టుబడులకు ఊతమిచ్చేలా డ్యూటీ ఫ్రీ దిగుమతులు, రాష్ట్ర పన్ను రాయితీలు, సింగిల్ విండో అనుమతులు మొదలైన చర్యలు ఉంటున్నాయి.
సన్‌ఫ్లవర్ ఆయిల్ అమ్మకాలకు దెబ్బ
ముంబై: దేశీయంగా శుద్ధి చేసిన పొద్దుతిరుగుడుపువ్వు(సన్‌ఫ్లవర్) నూనె అమ్మకాల పరిమాణం 10 శాతం నీరసించనున్నట్లు రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ తాజా నివేదికలో అంచనా వేసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో సరఫరా సమస్యలకుతోడు.. పెరుగుతున్న ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. వెరసి వినియోగదారులు ఇతర చౌక నూనెలవైపు దృష్టి సారించనున్నట్లు నివేదికలో క్రిసిల్ తెలియజేసింది. దీంతో డిమాండ్ మందగించి ఈ ఏడాది సన్‌ప్లవర్ ఆయిల్ అమ్మకాల పరిమాణం 10 శాతం క్షీణించనున్నట్లు అభిప్రాయపడింది. లాజిస్టిక్స్ వ్యయాలు పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే సరఫరా సవాళ్లు తలెత్తగా.. పెరుగుతున్న లాజిస్టిక్స్ వ్యయాలు అధిక ధరలకు దారితీస్తున్నట్లు నివేదికలో క్రిసిల్ వివరించింది. ఫలితంగా వినియోగదారులు తవుడు నూనె, సోయాబీన్ ఆయిల్ తదితరాలవైపు మళ్లనున్నట్లు పేర్కొంది. అయితే సన్‌ఫ్లవర్ అమ్మకాల ఆదాయం మాత్రం యథాతథంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. అధిక ధరల కారణంగా అమ్మకాల పరిమాణం వెనకడుగు వేయనున్నట్లు తెలియజేసింది. కాగా.. తక్కువ వ్యయాలలో గతంలో కొనుగోలు చేసిన నిల్వల కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ రిఫైనరీల లాభదాయకత నిలకడను చూపనున్నట్లు విశ్లేషించింది. దీంతో అమ్మకాల పరిమాణం నీరసించినప్పటికీ చౌక వ్యయాల నిల్వలతో లాభాలపై ప్రభావం పడకపోవచ్చని అభిప్రాయపడింది. దేశీయంగా 2.5–2.6 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ 12–14 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. వంట నూనెల పరిశ్రమ ముడిసన్ఫ్లవర్ ఆయిల్ కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించింది. దీంతో ప్రపంచ వాణిజ్య విఘాతాలు, రాజకీయ భౌగోళిక అంశాలు పరిశ్రమను ప్రభావితం చేయనున్నట్లు వివరించింది. ఉక్రెయిన్, రష్యా నుంచి అత్యధికంగా దిగుమతులు నమోదవుతుంటాయి. అయితే హ ర్ముజ్ జల రవాణాకు విఘాతం ఏర్పడితే కేప్ఆఫ్ గుడ్‌హోప్ తదితర దూర తీరాల నుంచి వీటిని సమకూర్చుకోవలసి వస్తుందని తెలియజేసింది.
వీసీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రైవేట్ క్యాపిటల్ మార్కెట్లు నెమ్మదించినప్పటికీ, భారత్‌లో వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు మాత్రం గతేడాది జోరుగానే వచ్చాయి. 2025లో 16 బిలియన్ డాలర్ల మేర వీసీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అధికం. వివిధ స్థాయుల్లో 1,300 పైగా లావాదేవీలు జరిగాయి. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ, ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) సంయుక్తంగా రూపొందించిన ఇండియా వెంచర్ క్యాపిటల్ రిపోర్ట్ 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, లిక్విడిటీ కఠినతరం కావడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులు వృద్ధి చెందడం గమనార్హం. 2023లో రీసెట్ అయిన తర్వాత దేశీ వెంచర్ క్యాపిటల్ వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టిందని బెయిన్ అండ్ కంపెనీ అసోసియేట్ పార్ట్నర్ ఆదిత్య మురళీధర్ తెలిపారు. మెరుగైన గవర్నెన్స్, సమర్ధవంతంగా పెట్టుబడుల వినియోగం, నిష్క్రమించేందుకు అవకాశాల పునాదులతో ఈ వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలకడగా వృద్ధి చెందే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → 50 మిలియన్ డాలర్ల లోపు డీల్స్ గణనీయంగా నమోదయ్యాయి. → భారీ డీల్స్ కూడా పుంజుకున్నాయి. 250 మిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే ఒప్పందాల సంఖ్య నాలుగు నుంచి రెట్టింపై ఎనిమిదికి చేరింది. యూనిట్ ఎకనామిక్స్ పటిష్టంగా ఉండి, మానిటైజేషన్‌పై స్పష్టత ఉన్న కంపెనీల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. తీరుతెన్నూ లేని విస్తరణ కన్నా వ్యాపార నాణ్యతకే ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → కన్జూమర్ టెక్ సంస్థలకు నిధులు నెమ్మదించాయి. అయితే దీర్ఘకాలిక సత్తాను ప్రదర్శిస్తూ, ఈ విభాగంలోకి పెట్టుబడులు 2023 నుంచి వార్షికంగా 25 శాతం స్థాయిలో పెరిగాయి. → అన్ని ఉత్పత్తులు కాకుండా నిర్దిష్ట ప్రోడక్టులను మాత్రమే సత్వరం డెలివరీ చేసే క్విక్ కామర్స్ సంస్థల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చాయి. → టెక్నాలజీ ఆధారిత రంగాలు ఫండింగ్ రికవరీలో కీలక పాత్ర పోషించాయి. ఇందులో ఫిన్‌టెక్ రంగం ప్రత్యేకంగా నిల్చింది. ఈ విభాగంలో డీల్స్ విలువ వార్షికంగా సుమారు 2.2 రెట్లు పెరిగింది. పెట్టుబడుల్లో పేమెంట్స్ కేటగిరీ అత్యధిక వాటా దక్కించుకోగా, డిజిటల్ వినియోగం, కుటుంబాల పొదుపు మొత్తాల పెరుగుదలతో వెల్త్‌టెక్ డీల్స్ విలువ అయిదు రెట్లు పెరిగింది. → సాఫ్ట్వేర్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) ఫండింగ్ 1.5 రెట్లు పెరిగింది. ఓ స్థాయికి చేరుకున్న ప్రస్తుత సంస్థలు కూడా మళ్లీ నిధుల బాట పట్టాయి. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జనరేటివ్ ఏఐ–నేటివ్ బీ2బీ కంపెనీలకు, ప్రధానంగా బ్యాంకింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో వాటికి ఆదరణ లభిస్తోంది. → దీర్ఘకాలిక ఇన్వెస్టర్లలో ధీమాని ప్రతిఫలిస్తూ, భారత్‌పై ఫోకస్ చేసే వీసీలు, గ్రోత్ ఈక్విటీ ఫండ్స్ సమీకరించిన నిధులు వార్షికంగా రెట్టింపై 5.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించుకుని వైదొలిగేందుకు కూడా గత ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. మొత్తం ఎగ్జిట్ విలువలో పబ్లిక్ మార్కెట్ల మార్గంలో జరిగినది 65 శాతంగా నమోదైంది.
ఏడాదిలో 50వేలు.. మహీంద్రా సరికొత్త రికార్డ్!
మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది. ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరంలోనే భారతదేశంలో దాని ఎలక్ట్రిక్ SUV శ్రేణి మొత్తం అమ్మకాలు 50,000 యూనిట్లను అధిగమించాయి.మార్చి 2025లో డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6లతో కూడిన ఎలక్ట్రిక్ వెహికల్స్ శ్రేణి అధిక ప్రజాదరణ పొందగలిగింది. INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ మోడళ్లు.. ఎలక్ట్రిక్ SUV రంగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నాయి.మహీంద్రా కంపెనీ మొదటి ఏడు నెలల్లో 30,000 యూనిట్లు, 10 నెలల కాలానికి 41000 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇప్పుడు తాజాగా 50000 యూనిట్ల మార్క్ చేరుకుంది. కంపెనీ సేల్స్ పెరగడానికి కారణం పండుగ సీజన్ అని తెలుస్తోంది. కాగా ఈ మోడల్స్ రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప అమ్మకాలను పొందగలవని సమాచారం.
ఫ్యామిలీ
హోమియోలో మనమే టాప్
ప్రపంచంలోని ప్రధాన వైద్యవిధానాల్లో ఒకటైన హోమియోపతికి పుట్టినిల్లు జర్మనీ. పద్దెనిమిదో శతాబ్ది చివరినాళ్లలో జర్మన్ వైద్యుడు శామ్యూల్ హానిమన్ ఈ వైద్యవిధానాన్ని రూపొందించాడు. తొలినాళ్లలో ఆనాటి వైద్యుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నా, హానిమన్ తన ప్రాక్టీసు కొనసాగించాడు. ఆయన వద్దకు రోగులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేవారు. వార్ధక్యంలో జర్మనీని విడిచిపెట్టి 1835లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌కు వలసవెళ్లిపోయి, అక్కడే తాను 1843లో మరణించేంత వరకు విజయవంతంగా ప్రాక్టీసు కొనసాగించాడు. జర్మనీలో పుట్టిన హోమియో వైద్య విధానం యూరోపియన్ మిషనరీల ద్వారా పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో భారత్‌లోకి అడుగుపెట్టింది. గడచిన రెండు శతాబ్దాల కాలంలో భారత్ హోమియో వైద్యానికి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా హోమియో వైద్యులు, రోగుల సంఖ్యలో టాప్–5 దేశాలను ఒకసారి పరిశీలిద్దాం...
మరణములో నుండి జీవములోనికి
దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు (ఎఫెసీ 1:20,21). అన్నదే విశ్వసించదగ్గ అపొస్తలుల సువార్త సంబంధిత బోధయై ఉంది.సత్యవాక్యమను రక్షణ సువార్తగా కూడా ఇది ఉంది. లేచాడు అన్నది సువార్త కాదు. సర్వశక్తి సంపన్నుడైన అద్వితీయ సత్య దేవుని చేత యేసు మృతులలో నుండి సజీవంగా లేపబడ్డాడు అనునదే లేఖనానుసార సత్య సువార్త. తండ్రికి విలువిచ్చే క్రీస్తు అపార విధేయతను ఇదే ఘనంగా చాటుతుందనుటలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ’వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు’ (రోమా 10: 8–10). యేసు సజీవుడుగు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది అపొస్తలుల అమూల్య విశ్వాసం. దేవుని కుమారుడు అంటే ఆయన ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్థం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతూ ఆయన నామమందు జీవము పొందాలి అన్నదే ప్రతి ఒక్కరి ఆత్మ సంబంధ విజయానికి మూలం. ఈ లోకం మీద విజయం యేసు దేవుని కుమారుడు అనుటలోను , ఆయన్ను దేవ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పంపాడని విశ్వసించుటలోనే విజయం దాగి ఉంది (1యోహాను 5:5 ).మరి క్రీస్తు విజయానికి మూలం ఎక్కడ అన్నది లోతుగా పరీశీలన చేస్తే అది ఒక్క ఆయన విధేయతే అనేది బహు తేటగా వెల్లడవుతూ ఉందన్నది ఆశ్చర్యకర విశేషం.ఆజ్ఞలకు లోబడి పాపం చేయకపోవడం ద్వారా పరిశుద్ధత, దాని విధేయత ఈ రెండూ ఎప్పుడు నిలుపుకొనే వేకువ ప్రార్థనలతో అవిశ్రాంత విన్నపాలతో క్రీస్తు అసాధారణ విజయుడిగా, జగజ్జేతగా చరిత్రకెక్కాడు.దేవుడు తనకు అత్యంత విధేయుడైన తన కుమారుడను మరణంలో నుండి జీవములోనికి దాటించాడు. మరణంలోనుండి జీవములోనికి రావడం, పునరుత్థానం చెందడం ఇలా యేసు మరణాన్ని జయించడం దేవుని గొప్ప సంకల్పం.అయితే తనను మరణం నుండి రక్షింపగల తండ్రియైన దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించినందున యేసు అంగీకరించబడ్డాడనేది ఇదే ఆయన సాహసోపేత విజయానికి మూలం అయ్యింది. ఇక్కడ మరణం అంటే సిలువ మరణం కాదు, ఆత్మ సంబంధ మరణం. యేసుకు సిలువ మరణం తప్పదు. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. ఆయన మరి ఎలాంటి మరణం మీద గురిపెట్టి విజయం సాధించాలనుకున్నాడు అన్నది చూస్తే అదే ఆత్మ సంబంధ మరణం. ఆయన పరిశుద్ధుడు గనుక మరణం ఆయన మీద ఏలుబడి చేయుటకు అన్ని కోణాల్లో అన్ని దారులు వెదకి అది బాగా అలసిపోయింది. పారదర్శకంగా పరిశుద్ధ జీవితం ఆచరించి చూపుతూ యేసు మరణానికి సంపూర్తిగా తలవంచాడు. అంతే, మరణం ఆయన ముందు తలవంచి మోకరిల్లి సాగిలపడింది.మతంతో సంబంధం లేని మార్గంమన తోటి ఇరుగు పొరుగు వాని చుట్టురా ఉన్న సమాజం మేలుకై ప్రతి పని, పరిచర్య, సేవా విధానం శుద్ధ హృదయంతో ఆచరించుట ద్వారానే దేవుని మెప్పు పొందగలం. నిత్య సత్య జీవమనే క్రీస్తు మార్గం మతంతో ఎలాంటి సంబంధం లేనిది. ఇదొక ఆత్మ సంబంధ అసాధారణ ఆధ్యాత్మిక జీవన విధానం. ఇందులో వ్యక్తిగతమైన స్వయం స్వశక్తితో కూడిన పాప నివారణ సంబంధిత పరిశుద్ధ అభ్యాస ప్రయత్నాలు మచ్చుకైన కనపడవు. క్రీస్తును బట్టి దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఏంతో పురోగమనం సాధించే స్థితిలో ఉంటుంటాయి. తమ మానవ జ్ఞానంతో ముడిపెట్టక తమ మంచి చెడ్డల విచక్షణ విషయమైన జ్ఞానం దేవునికే అప్పగించి అన్నింటా దేవునికే మహిమ చెందేలా ఆయన్ను ఘన పరచుటే అతి శ్రేష్టమైన సద్భక్తి జీవిత విధానం.నిత్యజీవము పొందుటకు నేనేం చేయాలి? అన్నదానికి సమాంతర ప్రశ్నయే ‘మరణంలో నుండి జీవంలోనికి దాటుట ఎట్లు?’ అనేది. మరణంలో నుండి జీవములోనికి దాటుటలో గొప్ప అనుభవం సంపాదించినవాడు, అత్యంత ప్రతిభ, ప్రభావ సంపన్నుడు యేసు మాత్రమే అన్న సర్వసత్యాన్ని బహు తేటగా గ్రహించినవారై మొదటగా ఆయన శిష్యులైన అపొస్తలులు ఆ తదుపరి ఆదిమ సంఘము ఆయన అడుగుజాడలలోనే నడిచి అన్నింటా గెలిచింది. ఆ ఆదిమ సంఘాన్ని అనుసరించి ఒక్కటే క్రీస్తు శరీరమను సంఘాలు నేడునూ పాపం నుండి పరిశుద్ధతలోనికి అనగా మరణంలో నుండి జీవములోనికి విజయవంతంగా దాటుతున్నాయి. అనేకులను దాటించుటలో పేరొందిన గొప్ప సువార్త పరిచర్యను అవి నిరంతరాయంగా చేస్తూ వారివలె ముందుకు కొనసాగిస్తూ విధేయంగా ఎంతో శ్రమిస్తున్నాయి. దేవదేవుడు తనదైన బలాతిశయం చేత యేసును మృతులలో నుండి లేపాడు అన్నదే నేటి పునరుత్థాన దినం. ఇదే క్రైస్తవ నిరీక్షణ జీవితానికి గొప్పదైన పునాది. సమభావపు ఏకత్వం కలిగించే ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడిన వారు ధన్యులు అంటుంది గ్రంథము.‘‘నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక ‘మరణములో నుండి జీవము లోనికి’ దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’– యేసుక్రీస్తు – జేతమ్
మలి దశ... మరో కోణం
జీవితం మలి దశలో భావోద్వేగ పరంగా మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటున్నారు మనస్తత్వ నిపుణులు. మగవారిలోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ మహిళలు ఇటీవల కాలంలో దీని వల్ల ఎక్కువ మోసపోతున్నారని చెబుతున్నారు. జీవితం మలిదశలో ఏర్పడిన శూన్యతను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఏం చేయాలో అవగాహన కలిగి ఉంటే అధిగమించడం సులువు అవుతుంది.చదువు, సంపాదన, వివాహం, కుటుంబ బాధ్యతలు.. ఒక్కోదశ ను దాటుకుంటూ ప్రయాణం చేస్తుంటాం. ఐదు పదులు దాటిన తర్వాత బాధ్యతల బరువు తగ్గి కొంత విశ్రాంతి లభిస్తుంది. ఎప్పుడో వదిలేసిన భావాలు మనసును ముట్టడిస్తాయి. ఖాళీ సమయాన్ని టీవీ కో, సోషల్ మీడియాకో కేటాయిస్తుంటారు చాలా మంది. కొందరు లోపలి ఖాళీని పూరించడానికి మానసికంగా కొత్త సంబంధాలవైపు మొగ్గు చూపుతారు. ఇటీవలి కాలంలో వయసు పైబడిన వారిలో అన్లైన్ డేటింగ్ పెరుగుతోందని అమెరికన్ ఫ్యూ రీసెర్చి సెంటర్ ఓ నివేదికను విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏజింగ్ ఆన్లైన్ డేటింగ్ను ఎంచుకునేవారికి సూచనలూ ఇచ్చింది.తమకు తామే మోసం..వయసు పైబడిన వారిలో అప్పటికే శారీరక మార్పులు చుట్టుముడతాయి. దీంతో హఠాత్తుగా లైఫ్స్టైల్లో మార్పులు చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇన్నాళ్లూ తాము ఏం కోల్పోయోమో అర్థం అవుతుంది. వదిలేసిన అన్నింటినీ తిరిగి జీవితంలోకి తెచ్చుకోవాలనే ఆతృత పెరుగుతుంది. పూర్తి చేయలేక ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఫలితం గా తమను తాము హింసించుకోవడమూ పెరుగుతుంది.అర్థం చేసుకోవడం ముఖ్యం..ఈ వయసులో‘అందరూ ఏవేవో సాధిస్తున్నారనో, తాము వెనకబడిపోయామనో, గుర్తింపు కోసమో, ఖాళీని భర్తీ చేయడం కోసమో.. పరిగెత్తడం కాదు. తమని తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.→ మెనోపాజ్ సమస్యల వల్ల వచ్చే భావోద్వేగాల సమతుల్యతనూ సాధించాలి. → నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం, ప్రశాంత జీవితాన్ని గడపడం, లోపలి స్వరాన్ని వినడం, సేవ, సృజన, ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లించాలి. → సెకండ్ లైఫ్‌కి ఇది ప్రారంభ దశగా గుర్తించాలి.రిలేషన్స్ కూలిపోవచ్చు.. యవ్వనంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అవసరం, భద్రత, కలిసి బతకడం.. వంటివే వారిని కలిపి ఉంచే బంధాలు. మధ్య వయసుకొచ్చేసరికి అర్థం చేసుకోవడం, భావోద్వేగ కలయిక, నిజాయితీగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కొత్త బంధాలను ఏర్పరుచుకోవడంతో ఇద్దరి మధ్య తెలియకుండానే చీలిక ఏర్పడుతుంది. ఆ తర్వాత బంధాల పట్ల విముఖత ఏర్పడుతుంది. అనవసరపు ప్రయాస అనిపిస్తుంది.దంపతుల మధ్య దూరం..పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక బాధ్యత తగ్గుతుంది. అలాగే, వారితో సమయం కేటాయించడం కూడా తగ్గిపోతుంది. దంపతులుగా ఇన్నాళ్లూ పిల్లల కోసమే కలిసి ఉన్నామా.. అనే ఆలోచన మొదలవుతుంది. చెప్పుకోలేని సందేహాలతో దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఓపిక, సహనం తగ్గుతాయి. అప్పటివరకు నొక్కి పెట్టిన నిర్లక్ష్యం, అవమానం, త్యాగం.. అన్నీ పైకి ఉబికి వస్తాయి. ఇక ‘ఇప్పుడు భరించలేను’ అనే దశ వస్తుంది. ‘అందరూ నన్ను చీట్ చేశారు. వీళ్లకోసమా నేను త్యాగం చేశాను’ అనే ఆలోచన కలుగుతుంది.ప్రయోజనకరంగా! పాజిటివ్ ఆలోచనలవైపు మొగ్గు చూపాలి. శారీరక–మానసిక వ్యాయామాలు నిరాశను తగ్గిస్తాయి. మానసికంగా చురుకుగా ఉండటానికి పజిల్స్ పూరించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, వదిలేసిన అభిరుచులను తిరిగి మెరుగుపెట్టడం, స్వచ్ఛంద సేవ.. వంటి అర్థవంతమైన కార్యకలాపాల్లో పాల్గొనడం మేలు చేస్తుంది. ఈ దశలో శరీరంలో వచ్చే ప్రకృతి సిద్ధ మార్పుల (మెనోపాజ్, వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవడం, చర్మంలో కాంతి తగ్గడం..) వల్ల నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. పోషకాహార, చర్మ వైద్య నిపుణుల సూచనలతో శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసు కుంటూనే ఆరోగ్యకరమైన బంధాలపై అవగాహన పెంచుకోవడం అవసరం.అవగాహనతోనే వికాసంసంబంధాలలో ఏర్పడిన మార్పుల వల్ల మన ఆలోచనా విధానంలోనూ చాలావరకు మార్పు వస్తుంది. శారీరకంగా కన్నా మానసికపరమైన మోసం ఎక్కువ హానికరంగా అనిపిస్తుంది. అది తమ భాగస్వామి, పిల్లలు, బయటి వ్యక్తులు.. ఎవరైనా కావచ్చు. భావోద్వేగ బంధం స్పర్శకంటే లోతైనా సాన్నిహిత్యాన్ని సృష్టిస్తుంది కాబట్టి, దానిని కోల్పోవడం అంటే ఆ బంధాన్ని కోల్పోయినట్టే అనిపిస్తుంది. అప్పుడు మోసం జరిగింది అనుకుంటారు. ఇలాంటప్పుడు నిపుణులను సంప్రదించి, సూచనలు తీసుకోవడం మేలు కలిగిస్తోంది.– డాక్టర్ డోనాసింగ్, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
పసి గుండెకు గురిపెట్టే ఫీవర్
చిన్నపిల్లల్లో జలుబు చేయడం చాలా మామూలు విషయం. జలుబు తర్వాత కాస్తంత గొంతునొప్పి రావడమూ మామూలే. వీటితో పాటు జ్వరం కనిపించడం చాలా సాధారణమే. అయితే ఇలా జ్వరమూ (హైఫీవర్), జలుబూ, గొంతునొప్పి కనిపించడమన్నది సాధారణమే కదా అంటూ మామూలుగా తీసుకోవడం సరికాదంటున్నారు వైద్య నిపుణులు. ఈ మామూలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదనీ, అదే చాలా తీవ్రమైన రుమాటిక్ ఫీవర్‌గా పరిణమించి చిన్నారుల ‘గుండె’నూ దెబ్బతీస్తుందంటే అది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అది వాస్తవం. అందుకే ఒక్కోసారి ఈ చిన్న లక్షణాలనూ చాలా సీరియస్‌గా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. అదెప్పుడో తెలుసు కునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం.చిన్న పిల్లల్లో వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. చిన్న పిల్లలకు జలుబు చేశాక వారు గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఓ చిన్న సమస్యగానే చూడకూడదని తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే... జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఇక కొందరిలో గ్రూప్–ఏ స్ట్రె΄్టోకోకస్ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చినట్లయితే... దానికి డాక్టర్ సూచించే పూర్తి స్థాయి యాంటీబయాటిక్స్ కోర్సు వాడాలి. అలా వాడకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే మరో సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. అలా జలుబు, జ్వరాల తర్వాత మళ్లీ మరోసారి జ్వరం... మునుపు డాక్టర్లు ఇచ్చిన అవే మందులు వాడుతూ నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే అది రుమాటిక్ ఫీవర్‌కు దారి తీసే ప్రమాదమూ ఉందని తల్లిదండ్రులకు ఏమాత్రం తెలిసే అవకాశం ఉండదు. అందుకే జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి.రుమాటిక్ ఫీవర్‌తో ఎలాంటి ప్రమాదం వస్తుందంటే... రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రుమాటిక్ ఫీవర్ వచ్చిన తర్వాత భవిష్యత్తులో అది గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతుంది.లక్షణాలు.. మొదట జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ మరోమారు జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటి మీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్‌గా అనుమానించాలి. అలాగే తొలుత ఈ లక్షణాలు కనిపించిన పిల్లల్లో... తర్వాత శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్‌ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలుగా పరిగణించి... ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇక్కడ పేర్కొన్న అంశాలను బట్టి ఇది ఎంతో పెద్ద సమస్యగా అనిపిస్తున్నప్పటికీ... కేవలం ఒక పూర్తి కోర్సు యాంటీబయాటిక్ మందులతో దీన్ని పూర్తిగా నివారించవచ్చనీ, దాంతో పిల్లల అద్భుతమైన భవిష్యత్తును కాపాడుకోవచ్చని తల్లిదండ్రులు అవగాహన పెంచుకుంటే చాలు... పేరెంట్స్ ఆ చిన్నారి గుండెకు తగిన రక్షణ కల్పించినవారవుతారు. చికిత్స / నివారణవాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా తగిన చికిత్స అందిస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్తోనే సమస్య పూర్తిగా సమసిపోతుంది. కానీ తొలిదశల్లో ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె వైఫల్యానికీ (హార్ట్ ఫెయిల్యూర్‌కూ) దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది గానీ... చాలా కొద్దిమంది పిల్లల్లోనే ఇలా జరిగే అవకాశముంది. మరికొందరు చిన్నారుల్లో జీవితాంతమూ బ్లడ్‌థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు... వారికి ఆ గర్బధారణ కూడా ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జబులు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకుండా ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి. అంతేకాదు... ఇలా జలుబు, గొంతునొప్పి, జ్వరం వచ్చిన పిల్లల విషయంలో వారు తగినంత వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించేలా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే.డా‘‘ శివనారాయణ రెడ్డి వెన్నపూససీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్నిర్వహణ: యాసీన్
అంతర్జాతీయం
దిగిరాకుంటే నరకమే!
దుబాయ్: హార్మూజ్ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేదంటే కనీవినీ ఎరగని వినాశనానికి ఆ దేశం సిద్ధపడాల్సి ఉంటుందన్నారు. శనివారం ఈ మేరకు స్వీయ సామాజిక మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఆయన పోస్టు పెట్టారు. ‘‘హార్మూజ్‌ను తెరిచేందుకు మీకిచ్చిన గడువు ఏప్రిల్ 6తో ముగుస్తోంది. ఆలోపే ఒప్పందానికి రండి. లేదంటే భారీ దాడులతో మీకు అక్షరాలా నరకం చవిచూపిస్తాం’’అంటూ బెదిరింపులకు దిగారు. అయితే, ఇరాన్ శక్తిసామర్థ్యాలు గొప్పవంటూ ఈ సందర్భంగా ట్రంప్ అంగీకరించడం విశేషం. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకదానితో 32 రోజులుగా మేం సైనిక పోరాటం చేస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు! టెహ్రాన్‌పై బాంబుల వర్షం ఇరాన్‌పై శనివారం కూడా ఇజ్రాయెల్, అమెరికా ముమ్మరంగా దాడులు కొనసాగించాయి. బుషెహర్‌లోని అణు విద్యుత్కేంద్రమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ప్లాంటుపై క్షిపణి దాడులు జరిగినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. ‘‘దాడిలో సెక్యూరిటీ గార్డు మరణించాడు. కాకపోతే రేడియేషన్ లీకేజీ వంటిదేమీ సంభవించకపోవడం కాస్త ఊరట’’అని తెలిపింది. ఇది ఇటీవలి కాలంలో ఇరాన్ అణుకేంద్రాలపై జరిగిన నాలుగో దాడి. టెహ్రాన్‌లో ఒక పెట్రో కెమికల్ ప్లాంట్‌పైనా భారీగా క్షిపణి దాడులు జరిగాయి. రాజధాని టెహ్రాన్ దాడులతో దద్దరిల్లింది. నగరంలోని పలు క్షిపణి నిల్వ కేంద్రాలను నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై భారీగా ప్రతి దాడులకు దిగింది. దుబాయ్‌లోని ఒరాకిల్ ప్రధాన కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో భవనానికి భారీ రంధ్రం పడ్డ ఫుటేజీ వైరల్‌గా మారింది. తమపైకి ఇరాన్ ప్రయోగించిన 23 బాలిస్టిక్ క్షిపణులు, 56 డ్రోన్లను కూల్చేసినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. తమపై 8 డ్రోన్ దాడులు జరిగినట్టు బహ్రెయిన్ తెలిపింది.పైలట్ కోసం వేట! శుక్రవారం నాటి ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానంతో పాటు కె–10 వార్ థగ్ ఫైటర్ జెట్‌ను కూడా అమెరికా కోల్పోయిట్టు తెలుస్తోంది. అయితే, ‘‘కె–10 తాలూకు శకలాలు కువైట్ భూభాగంలో పడ్డాయి. దాంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు’’అని అమెరికాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఎఫ్–15ను ఇరాన్ తమ గగనతనంలోనే కూల్చేయడం తెలిసిందే. అందులోని పైలట్‌తో పాటు గన్నర్ సురక్షితంగా బయటపడ్డారు. వారు నైరుతి ఇరాన్‌లోని కొగిలుయె, బోయర్–అహ్మద్ కొంత ప్రాంతంలో కిందకు దూకారు. అమెరికా ప్రత్యేక సైనిక దళాలు వెంటనే రగంలోకి దిగి వారిలో ఒకరిని కాపాడి తీసుకెళ్లాయి. మరొకరి కోసం శనివారం కూడా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఇరాన్ కూడా అతన్ని ఎలాగైనా నిర్బంధించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. శుక్రవారం నాటి రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా రెండు అమెరికా హెచ్‌హెచ్–60డబ్లు్య జాలీ గ్రీన్–2 బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బ తిన్నట్టు సమాచారం. అవి కష్టమ్మీద ఇరాన్ భూభాగాన్ని దాటి సురక్షిత స్థానానికి చేరినా వాటి పైలట్లు గాయపడ్డట్టు తెలుస్తోంది. శుక్రవారమే మరో కె–10 యుద్ధ విమానం కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బ తిన్నట్టు అమెరికా సైనిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి వార్తా సంస్థలు పేర్కొనడం విశేషం. ‘‘ఒక ఇంజన్ విఫలమైంది. దాంతో అది సింగిల్ ఇంజన్‌తోనే అతి కష్టమ్మీద గల్ఫ్‌లోని వైమానిక స్థావరానికి చేరుకుంది’’అని వెల్లడించాయి! అయితే ఈ ఉదంతం చర్చల ప్రక్రియను ప్రభావితం చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంపై అమెరికా యుద్ధవిమానాలను కోల్పోవడం ఇదే తొలిసారి కావడం విశేషం! అగ్ర రాజ్యం చివరిసారిగా 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో ఏ–10 థండర్‌బోల్ట్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది.మీ కుమారులకు ట్రంప్‌తోనే ముప్పు హాని తలపెట్టొద్దన్న పైలట్ తల్లి విజ్ఞప్తికి ఇరాన్ కౌంటర్ టెహ్రాన్: శత్రు దేశ పైలట్ అనే ప్రతీకారేచ్ఛతో తన కుమారుడికి హాని తలపెట్టొద్దని అమెరికా పైలట్ తల్లి చేసిన విజ్ఞప్తికి ఇరాన్ తనదైన రీతిలో బదులిచ్చింది. దాడి కోసం వచ్చి తమ గగనతలంపై చక్కర్లు కొడుతున్న అమెరికా యుద్ధవిమానాలను ఇరాన్ శుక్రవారం నేలకూల్చడం తెల్సిందే. దీంతో పైలట్లు బయటకు దూకేయగా ఒకరిని అమెరికా, ఇజ్రాయెల్ సేనలు రక్షించి వెంటతీసుకెళ్లాయి. మరో పైలట్జాడ తెలీడం లేదు. అతడిని ఇరాన్ బంధించిందని కథనాలు వెలువడ్డాయి. దీంతో ఒక పైలట్ తల్లి విజ్ఞప్తిచేశారు. ‘‘ఎఫ్–15 ఫైటర్‌జెట్ పైలట్లకు హాని తలపెట్టకండి. వారిలో ఒకతను నా కుమారుడు’’అని ఆమె వేడుకున్నారు. దీంతో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు దీటుగా స్పందించాయి. ‘‘ఇరాన్ కస్టడీకంటే మీ కుమారులకు డొనాల్డ్ జూనియర్ ట్రంప్‌తోనే ముప్పు ఉంది. అమెరికా రెస్క్యూ టీమ్‌లకు దొరక్కుండా మా కస్టడీలోనే వాళ్లు ఉంటే బాగుంటుందని కోరుకోండి. అమెరికాకు దొరికితే ఏమేం రహస్యాలు వెల్లడించారని చెప్పి చిత్రవధ చేస్తారు. ముస్లింలుగా, నాగరికత తెల్సిన ఇరానియన్లుగా మాకు మీ వాళ్లను ఎలా చూసుకోవాలో తెలుసు. మర్యాదతో, గౌరవప్రదంగా చూసుకుంటాం. అమానవీయ యూదనీతుల కంటే యుద్ధనీతులు మాకు బాగా తెలుసు. యుద్ధఖైదీలను పద్ధతిగా చూసుకుంటాం. మేం ఆలోచనల్లో అమెరికా మాదిరి రాతియుగంలో బతకట్లేము’’అని ఎంబసీలు బదులిచ్చాయి. బోర్ కొడుతోంది, ఏమన్నా మాట్లాడండి! ట్రంప్ బెదిరింపులపై ఇరాన్ ఎద్దేవా ట్రంప్ తాజా హెచ్చరికలను ఇరాన్ తేలిగ్గా తీసిపడేసింది. అమెరికాతో చర్చలకు తామే దిగొచ్చామన్న ట్రంప్ వ్యాఖ్యలను మరోసారి ఖండించింది. అధ్యక్షుని మాటలకు ఇప్పుడెవరూ పెద్దగా విలువ ఇవ్వడం లేదనే అర్థం వచ్చేలా జింబాబ్వేలోని ఇరాన్ దౌత్య కార్యాలయం శనివారం ఎక్స్‌లో పోస్టు పెట్టింది! ‘‘మాకు బాగా బోర్ కొడుతోంది. ఏదో ఒకటి మాట్లాడండి’’అంటూ ట్రంప్ మాటతీరును ఎద్దేవా చేసింది. చర్చలకు ఇరాన్ సుముఖత! అమెరికాతో కాల్పుల విరమణ చర్చలకు ఇప్పటిదాకా ససేమిరా అంటూ వచ్చిన ఇరాన్ ఎట్టకేలకు అందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. చర్చల నిమిత్తం పాక్ వెళ్లేందుకు తామెప్పుడూ తిరస్కరించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం స్పష్టం చేశారు.
"నాకుమారుడిని రక్షించండి".. ట్రంప్ కంటే మేమే బెటర్: ఇరాన్
ఇరాన్ నిన్న ( శుక్రవారం) అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చివేయడంతో దాని ఫైలట్ ఇరాన్ భూభాగంలో దూకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఫైలట్ తల్లి ఎక్స్ వేదికగా తన గోడు వెల్లగక్కింది. దీనిపై పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది.నిన్న (శుక్రవారం) జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇరాన్ రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు ఇరాన్ భూభాగంలో దూకారు. వీరిలో ఒక పైలట్ ఆచూకీ లభించగా, మరో పైలట్ గల్లంతయ్యారు. అయితే తన కుమారుడు కూడా ఫైటర్ పైలట్ అని, అతని గురించి ఎటువంటి సమాచారం తెలియడం లేదని ఆందోళన చెందుతూ ఒక అమెరికన్ మహిళ X (ట్విట్టర్) లో పోస్ట్ చేసింది. "నా కుమారుడి కోసం, ఇతర పైలట్ల కోసం ప్రార్థించండి" అని ఆవేదన వెల్లగక్కింది.దీనిపై పాక్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. పాక్‌లోని కార్యాలయం "డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉండటం కంటే, ఇరాన్ కస్టడీలో ఉండటమే మీ కుమారునికి సురక్షితం. అమెరికా రెస్క్యూ టీమ్స్ కంటే ఇరాన్ అతన్ని బందీగా పట్టుకోవాలని ప్రార్థించండి. ముస్లింలుగా, నాగరికత కలిగిన ఇరానియన్లుగా మేము యుద్ధ ఖైదీలను గౌరవంగా చూస్తాము," అని పేర్కొంది.దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ: "అమెరికా లేదా వారి మిత్రదేశాల వలె మేము అనాగరికంగా ప్రవర్తించము. మాకు గొప్ప నాగరికత ఉంది, యుద్ధ ఖైదీల హక్కుల గురించి మాకు బాగా తెలుసు," అని విమర్శించింది. అయితే యుద్ధం మెుదలై నెలరోజులు దాటినా ఇంకా పరిస్థితులు ఉదృతంగానే కొనసాగుతున్నాయి.
భారత్‌తో మాది వేల ఏళ్ల అనుబంధం: ఇరాన్
ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. అయితే భారత్ నౌకలు మాత్రం జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ ఎల్పీజీ ట్యాంకర్ జలసంధి గుండా భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా భారత్ ధన్యవాదాలు తెలుపగా ఇరాన్ దానికి స్పందించింది.చమురు నౌక గుజరాత్ చేరుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఈ ట్యాంకర్ ప్రయాణాన్ని భారతీయ దౌత్య విజయంగా అభివర్ణించారు. దీనిపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. "భారతదేశం, ముఖ్యంగా గుజరాత్, మా ఉమ్మడి చరిత్రలో ఒక మధురమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. శతాబ్దాల క్రితం మా దేశం నుండి వచ్చిన వారిని మీరు సాదరంగా ఆహ్వానించారు. ఈ నాగరికత సంబంధాల ఆధారంగా, మన మధ్య స్నేహం మరియు సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము." అని తెలిపింది.కాగా ఇరాన్ కాన్సులేట్ తన సందేశంలో సింధూ నాగరికతకు చెందిన లోథల్ ఓడరేవును ఉద్దేశించి మాట్లాడింది. సుమారు 4,000 ఏళ్ల క్రితమే సింధు లోయ నాగరికతకు మరియు పర్షియా తీరానికి మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను ఇది గుర్తుచేస్తుంది. కాగా గ్రీన్ సాన్వీ అనే నౌక 46,650 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో హర్ముాజ్ జలసంధిని దాటింది.అయితే హర్మూజ్ జలసంధి విషయమై ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దానిని ఎట్టిపరిస్థితుల్లో తెరవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేస్తుండగా ఇరాన్ ససేమిరా అంటుంది. దీంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ కేవలం 5 మిత్ర దేశాలకు భారతదేశం,రష్యా, చైనా, ఇరాక్,పాకిస్థాన్ అనుమతినిచ్చింది.
ప్రళయానికి సమయం ఆసన్నమవుతోంది: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. మరో 48 గంటల సమయమే మిగిలి ఉందని చెప్పారు. ఒప్పందం చేసుకోవాలని లేదా హార్మూజ్ తెరవాలని గడువు విధించామన్నారు. సమయం మించిపోతోందంటూ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ప్రళయానికి మరో 48 గంటలే మిగిలి ఉందని ట్రంప్ చెప్పారు. ‘ఇరాన్‌కు నేను 10 రోజుల గడువు ఇచ్చిన విషయం గుర్తుందా? ఒప్పందం చేసుకోవాలి లేదా హార్మూజ్ జలసంధిని తెరవాలి. సమయం ముగియనుంది. ఇంకా 48 గంటల తర్వాత అన్నీ విధ్వంసం అవుతాయి’ అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్‌లో పేర్కొన్నారు.కాగా, అమెరికా సైనిక విమానాలకు జరిగిన నష్టం ఇష్యూ ఇరాన్‌తో దౌత్య చర్చలపై ప్రభావం చూపదని ఇవాళ ఉదయం ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విమానాల కూల్చివేత ఘటన చర్చలను దెబ్బతీస్తుందనే వాదనలను ట్రంప్ తిరస్కరించారు.మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యం స్పందిస్తూ.. ఇరాన్ రాజధానిలో కీలక మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. తమ వైమానిక దళం టెహ్రాన్‌లో బాలిస్టిక్, వైమానిక రక్షణ క్షిపణి నిల్వ కేంద్రాలపై దాడి చేసిందని చెప్పింది. అదే దాడుల్లో ఆయుధ తయారీ కేంద్రాలు, సైనిక పరిశోధన అభివృద్ధి సదుపాయాలు కూడా ఉన్నాయి అని తెలిపింది.
జాతీయం
మైనార్టీలపై దాడిచేసిన వారితో దోస్తీనా!
అలప్పుజ/ఇడుక్కి/కొచ్చి: మణిపూర్, ఛత్తీస్‌గఢ్‌ల లో మైనార్టీలపై దారుణ దాడులకు తెగబడిన బీజేపీతో కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి అంటకాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపణల నిప్పులు కురిపించారు. కేరళ శాసనసభ ఎన్నికల సందర్భంగా శనివారం అలప్పుజ, ఇడుక్కి, ఇర్నా కులం జిల్లాలోని కట్టప్పణ, ఫోర్ట్ కొచ్చి, కున్నథునాడ్ల లో ప్రచార ర్యాలీల్లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు కేరళ నర్సులపై దాడులు జరిగా యి. మణిపూర్‌లో చర్చిలను తగలబెట్టారు. ఇలాంటి హే యదాడులకు పాల్పడుతు న్న (బీజేపీ) వాళ్లతో సీఎం విజయన్ చెలిమి చేస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కు లపై దాడిచేసే వాళ్లతో సీఎం రహస్య పొత్తు పెట్టుకున్నా రు. వామపక్ష సిద్ధాంతాలు ఒంటబట్టించుకుని కూడా సీఎం ఎలా ఇలాంటి వాళ్లతో జతకడతారు? ఆయన కు కనీసం సిగ్గు అన్పించట్లేదా? దీనికి సీఎం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. తన కుమార్తె (వీణ)ను ఒక కేసు నుంచి కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తునకు, ప్రధాని మోదీకి సీఎం భయపడుతున్నారు’’ అని అన్నారు. కేరళలో వెలుగుచూసిన కొచ్చి మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్), ఎక్సోలాజిక్ సొల్యూషన్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని వీణపై కేసు నమోదవడం తెల్సిందే. ‘‘మన వామ పక్ష నేత(సీఎం) తన కుమార్తెను కాపాడుకునేందుకు మతవాద(బీజేపీ) పార్టీ పంచనచేరారు. తన పిల్లల కోసం సీఎం ప్రజలను గాలికొదిలేశారు. మతవాద పార్టీ ఎలా ఆడిస్తే సీఎం అలా ఆడుతు న్నారు’ అని రాహుల్ అన్నారు. ‘‘ఎల్డీఎఫ్ను అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఆ అదృశ్య శక్తి ఒక మత శక్తి. అది భారతరాజ్యాంగాన్ని యథాతథంగా ఒప్పుకోదు. విడగొట్టడం, విద్వేషం రెచ్చగొట్టడం దాని ఏకైక లక్ష్యం. కేరళలో ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, సీపీఐ(ఎం) బంధాన్ని స్పష్టంగా చూడొచ్చు’’ అని అన్నా రు. ‘‘అమెరికా అధ్యక్షుడి అనుమతి లేకుండా మోదీ సర్కార్ ఏ దేశం నుంచీ చము రు కొనలేని దుస్థితి దాపురించింది. ఏ దేశం నుంచి మనం చమురు, గ్యాస్ కొనాలో ట్రంపే నిర్ణయిస్తున్నారు’’ అని రాహుల్ ఆరోపించారు. ‘‘కేరళలో రైతులకు ఎల్డీఎఫ్ సర్కార్ నుంచి తోడ్పాటు కరువైంది. తేయాకు, రబ్బర్, యాలకుల సాగు తగ్గిపోయింది. రైతులు రుణాల ఊబిలో చిక్కుకుంటున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. ఇడుక్కిలో వైద్యసంరక్షణ వ్యవస్థ నాశనమైంది. అందుకే అత్యవసర వైద్యం కోసం జనం కొట్టాయంకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉద్యోగం లేదు. మేం అధికారంలోకి వస్తే యూడీఎఫ్ కూటమి హామీలను నెరవేరుస్తుంది’’ అని రాహుల్ భరోసా ఇచ్చారు.
ఓటింగ్‌పై గల్ఫ్ దెబ్బ!
కేరళలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రవాస ఓటర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. వీరిలో అత్యధికులు గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డవారే. కన్నూర్ మొదలుకుని పాలక్కాడ్ దాకా కనీసం 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రవాసుల ఓట్లు నిర్ణాయకంగా మారుతుంటాయి. దాంతో ఎన్నికల వేళ పార్టీలన్నీ గల్ఫ్ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెడతాయి. వారిని ఓటింగ్‌కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల్లోని మలయాళీలు ఈసారి ఓటేసేందుకు వచ్చే అవకాశాలు పెద్దగా కన్పించడం లేదు. ఇది పార్టీల విజయావకా శాలను గణనీయంగా ప్రభావితం చేయడం ఖాయమని భావిస్తున్నారు.కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ గల్ఫ్ ఓటర్లది కీలక పాత్రగా ఉంటూ వస్తోంది. ఆ దేశాల్లో 2.25 లక్షల మంది దాకా ఓటర్లున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వారిలో కనీసం 60 శాతం పైచిలుకు ఓటింగ్ నమోదవడం పరిపాటి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం దెబ్బతో ఈసారి మాత్రం పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. గల్ఫ్ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు టికెట్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. రూ.8 వేల నుంచి 13 వేలలోపు ఉండే టికెట్లు ఏకంగా రూ.60 వేల దాకా ఎగబాకాయి! పైగా సెలవులు తీసుకుని వస్తే ఉద్యోగం ఊడే పరిస్థితి! దాంతో ఈసారి ఓటింగ్ కోసం వచ్చే మలయాళీల సంఖ్య బాగా తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. 10 శాతం ఓటింగ్ నమోదైనా గొప్పేనని భావిస్తున్నారు!మలబార్లో కీలకంఉత్తర కేరళ ప్రాంతంలో, ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో ప్రవాసుల ఓట్లు కీలకంగా మారుతుంటాయి. ఇక్కడ వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే గాక అతి స్వల్ప మెజారిటీలు నమోదవుతుండటమే ఇందుకు కారణం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పెరింతల్మన్న అసెంబ్లీ స్థానంలో కేవలం 38 ఓట్ల తేడాతో, కుట్టియాడిలో 333 ఓట్ల మెజారిటీతో ఫలితం తేలింది! తనూర్, త్రితల వంటి చోట్ల మెజారిటీ 5,000 ఓట్ల లోపే నమోదైంది. ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లు వేలాదిగా ఉండటం విశేషం. కుట్టియాడి అసెంబ్లీ స్థానం పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 16 వేల పైచిలుకు ప్రవాస ఓటర్లున్నారు!! నాదపురంలో 12,424 మంది, తిరూర్‌లో 8,601, కళ్లియసెరిలో 8,097 మంది ప్రవాస ఓటర్లున్నారు. స్వల్ప మెజారిటీలు నమోదయ్యే ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లే నిర్ణాయకంగా ఉంటూ వస్తున్నాయి. కానీ ఈసారి వారు భారీ సంఖ్యలో స్వదేశానికి వచ్చి ఓటేసే పరిస్థితులు కన్పించకపోవడంతో పార్టీలు కూడా వారిపై ఆశలు వదులుకుంటున్నాయి. స్థానిక ఓట్లపైనే మరింతగా దృష్టి పెడుతూ గెలుపు వేటలో పడ్డాయి. గల్ఫ్ ఓటర్లపై గట్టి పట్టున్న విపక్ష యూడీఎఫ్ కూటమికి ఇది ఒకరకంగా ఎదురుదెబ్బేనని ఓవర్సీస్ ఇండియన్ కల్చరల్ కాంగ్రెస్ (ఓఐసీసీ) పశ్చిమాసియా కన్వీనర్ కె.టి.ఎ.మునీర్ అభిప్రాయపడ్డారు. ‘‘గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డ యూడీఎఫ్ కార్యకర్తల్లో 30 శాతం మంది, మద్దతుదారుల్లో 60 శాతం మంది ఈసారి ఓటింగ్‌కు రాలేకపోవచ్చు. విమాన టికెట్ల ధరలు నాలుగింతలు, అంతకుమించి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం’’ అంటూ ఆయన వాపోయారు. వారు గల్ఫ్ నుంచే ఓటేసేలా ఇ–ఓటింగ్ సదుపాయం అందుబాటులో ఉంటే తమకెంతో కలిసొచ్చేదని అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్
గాయపడ్డాను కాబట్టి దృఢంగా మారా: చద్ధా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధా మధ్య రగడ మరింత ముదురుతోంది. తనపై పార్టీ నాయకత్వం చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అంటూ ఆయన కొట్టిపారేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావించడానికే పార్లమెంట్‌కు వెళ్తున్నాను తప్ప గొడవలు సృష్టించడానికి కాదని తేల్చిచెప్పారు. ఆప్ అబద్ధాల అసలు రంగు కచ్చితంగా బయటపడుతుందన్నారు. ‘ధురంధర్’చిత్రంలోని డైలాన్‌ను ప్రస్తావిస్తూ.. గాయపడ్డాను కాబట్టి మరింత దృఢంగా మారానని స్పష్టంచేశారు. ఈ మేరకు రాఘవ్ చద్ధా శనివారం ‘మూడు ఆరోపణలు, సున్నా నిజాలు’పేరిట ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తనను టార్గెట్ చేస్తూ ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం సాగుతోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వం పట్ల రాఘవ్ చద్ధా సానుకూలంగా ఉంటున్నారని ఆప్ నాయకత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. దీనిపై రాఘవ్ చద్ధా అభ్యంతరం వ్యక్తంచేశారు. తన గొంతు నొక్కగలరు కానీ ఓడించలేరని ఆప్ నాయకత్వానికి తేల్చిచెప్పారు.
చుట్టూ వారు మన ఏజ్ బారు
సాక్షి, హైదరాబాద్: మన చుట్టూ ఉండే వ్యక్తులు మన మనసుపై మాత్రమే కాదు, శరీర ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతారని నిపుణులు ఎప్పటినుంచో చెబుతుండగా.. తాజా అధ్యయనం దీన్ని మరింత బలపరుస్తోంది. ఎప్పుడూ ఒత్తిడి కలిగించే లేదా ప్రతికూల (నెగెటివ్) ధోరణితో ప్రవర్తించే (టాక్సిక్) వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే వృద్ధాప్యం త్వరగా వచ్చే అవకాశం ఉందని ఈ పరిశోధన స్పష్టం చేసింది. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు బ్యుంక్యులీ సారథ్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్ఏ)లో ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా 18–104 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2300 మందికి పైగా వ్యక్తులను పరిశీలించారు. వారి సామాజిక సంబంధాలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, నెట్‌వర్క్‌ను విశ్లేషించారు. ముఖ్యంగా ఎవరి వల్ల ఎక్కువగా భావోద్వేగ ఒత్తిడికి గురవుతున్నారో లేదా సమస్యలు ఎదురవుతున్నాయో గుర్తించారు. పాల్గొన్న వారి లాలాజలం నమూనాలను తీసుకుని డీఎన్ఏ మైథెలేషన్ అనే విధానం ద్వారా ‘బయోలాజికల్ ఏజ్’ను కొలిచారు. సాధారణంగా మన పుట్టిన తేదీ ఆధారంగా చెప్పే వయసు క్రోనాలాజికల్ ఏజ్ కాగా, శరీర కణాల స్థితి ఆధారంగా చెప్పే వయస్సును బయోలాజికల్ ఏజ్ అంటారు. ఇది ఆరోగ్య పరిస్థితిని ప్రతిబింబిస్తుందన్న మాట. అధ్యయనం తేల్చిన కీలకాంశాలివే.. ఒక వ్యక్తి జీవితంలో కీలకంగా లేదా అత్యంత సన్నిహితంగా ఎవరైనా టాక్సిక్ వ్యక్తి ఉంటే వృద్ధాప్య వేగం సుమారు 1.5% పెరుగుతుంది. అటువంటి సంబంధాలు ఉన్నవారి బయోలాజికల్ వయస్సు సగటున 9 నెలలు ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఉన్న నెగటివ్ సంబంధాలు శరీరంపై ఎక్కువ ప్రభావం చూపాయని పరిశోధకులు గుర్తించారు. టాక్సిక్ వ్యక్తులు దీర్ఘకాలిక ఒత్తిడికి (క్రానిక్ స్ట్రెస్)కు కారణమవుతారు. దీనివల్ల కార్టిసోల్ వంటి హార్మోన్లు పెరిగి శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది కణాల నష్టం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి వాటికి కారణమై అంతిమంగా వేగవంతమైన వృద్ధాప్యం ప్రాప్తించేందుకు కారణమవుతుంది. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం... టాక్సిక్ వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం వల్ల కేవలం శరీర ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆందోళన, నిరాశ, భావోద్వేగ అలసట వంటి మానసిక సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో నిద్రలేమి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు కూడా మీద పడవచ్చు. మన చుట్టూ ఉన్న సంబంధాలు భావోద్వేగాలపై అంతిమంగా శరీర వృద్ధాప్య ప్రక్రియపై ప్రభావం చూపుతాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సానుకూల సంబంధాలే ఆరోగ్యానికి మేలు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మంచి సంబంధాలు కలిగి, మద్దతు ఇచ్చే వ్యక్తులతో కలిసి జీవించడం ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలంటే టాక్సిక్ వ్యక్తులతో సంబంధాలను తగ్గించుకుని సానుకూల సంబంధాలను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. నెగటివ్ ఆలోచనలతో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండడం, అవసరమైన చోట భావోద్వేగ హద్దులు పెట్టుకోవడం, వ్యాయామం, ధ్యానం వంటి కార్యకలాపాలతో ఒత్తిడిని తగ్గించుకోవాలని, సానుకూల ఆలోచనలు కలిగిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలని సూచిస్తున్నారు.
ఎన్ఆర్ఐ
న్యూయార్క్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్‌లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్‌ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్‌స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్‌ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్‌లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్‌తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
అమెరికాలో ఘనంగా మహిళా దినోత్సవం
అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శివరాత్రితో పాటు మహిళా దినోత్సవం రెండు వేడుకలను కలిపి నైటా సంబరాలను అద్వితీయంగా జరిపారు. న్యూయర్క్, న్యూజెర్సీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ కన్సర్ట్ అందరినీ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ&టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాల ఫెర్మార్మెన్స్లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్లు ఆహా అనిపించాయి. నైటా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల సమాహారంతో రూపొందించిన ప్రత్యేక నైటా సంబరాల సావనీర్-2026ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, వితరణశీలి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా న్యూయార్క్ వేదికగా నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేక సందేశాలు పంపారు. అమెరికాలో స్థిరపడినా పుట్టినప్రాంత పండగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగిస్తున్నామని, వేడుకల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహకరించిన అందరికీ నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ హరిచరణ బొబ్బిలి, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ సౌమ్య శ్రీ, ఇతర కార్యకవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.(చదవండి: లండన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
చాయ్‌వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్‌వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్‌లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్‌లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్‌కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్‌కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్‌కి. భోపాల్‌లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్‌లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్‌లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్‌లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్‌వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్‌లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)
క్రైమ్
వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చేదారిలేక..
గాలివీడు: అధిక వడ్డీలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చే దారిలేక.. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ ఇద్దరూ తనువు చాలించారు. దీంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. వివరాలు.. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని శెట్టివారిపల్లెలో నివాసం ఉంటున్న మారువేణి మల్లికార్జున (35), అతని భార్య రాణి (30) కుటుంబ అవసరాల కోసం పరిసర ప్రాంతాల వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నారు. భారీ మొత్తాలు చెల్లించినప్పటికీ అప్పుల భారం తగ్గ లేదు. వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరగడం.. అప్పులు తీర్చేదారి లేక శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో భార్యభర్తలిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి 108 ద్వారా రాయచోటి ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం ఉదయం మల్లికార్జున మృతి చెందాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతూ రాణి కూడా శనివారం రాత్రి తుది శ్వాస విడిచింది. కాగా తాము ఆత్మహత్య చేసుకోవడానికి వడ్డీకి ఇచ్చినవారి వేధింపులే కారణమని చికిత్స పొందుతున్న సమయంలో రాణి వీడియో ద్వారా వెల్లడించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పిల్లలకు ఎవరు దిక్కుఅంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
కుప్పంలో దళిత కుటుంబంపై దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతుండడంతో దళితులనే టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డప్పు కొడుతున్న ఓ దళితున్ని కొట్టిన ఘటన మరువక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దళిత కుటుంబంపై టీడీపీ మూకలు దాడి చేసిన దారుణ ఘటన బయటపడింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయ ఉత్సవాల్లో గత శుక్రవారం ఐదుగురు చిన్న పిల్లలు గొడవపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార టీడీపీ వర్గీయులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన దళితుడు మంజునాథ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. భార్య అమృత, పిల్లలపై విచక్షణ లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కులం పేరుతో దూషించి, ఊరు వదలి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంజునాథ్ భార్య అమృత టీడీపీ నేతల దాడిపై రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ ఇంటిపై దాడి చేసి కొట్టి, కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, దళిత సంఘాలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
వైఎస్సార్సీపీ నాయకురాలిపై హత్యాయత్నం
పుత్తూరు: తిరుపతి జిల్లా గేట్ పుత్తూరులో కొందరు దుండగులు వైఎస్సార్సీపీ మహిళ నాయకురాలి కుటుంబంపై శుక్రవారం రాత్రి రెండు దఫాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి లో పుత్తూరుకు చెందిన వైఎస్సార్సీపీ అంగన్వాడీ మహిళా అధ్యక్షురాలు ఎం.వాణి(40), ఆమె తమ్ముడు శ్రీకాంత్(26), మేనమామ చొక్కలింగం(56), చెల్లెళ్లు సుమతి(36) లోకేశ్వరి(28) పవిత్ర(28) తీవ్రంగా గాయపడ్డారు. వాణి తలకు రక్తగాయం కావడంతో 6 కుట్లు, చొక్కలింగానికి 11 కుట్లు పడ్డాయి. మిగిలిన వారికి రక్తగాయాలయ్యాయి. పథకం ప్రకారం జరిగిన ఈ హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఓ దశలో రాజీ చేసుకోవాలంటూ హుకుం జారీచేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా శనివారం పుత్తూరు పోలీస్ స్టేషన్‌కు నేరుగా వచ్చి మహిళలపై జరిగిన హత్యాయత్నం కేసుపై సీఐ శేఖర్‌రెడ్డితో మాట్లాడారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని.. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తొరూరు రోడ్డులో మోటర్ సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న శ్రీకాంత్ అనే యువకుడిని ఆనంబట్టు రోడ్డుకు చెందిన శీన, మదన్, నోమేష్, మురళి అడ్డుకుని తీవ్రంగా గాయపరిచారు. తనపై జరిగిన దాడి విషయాన్ని శ్రీకాంత్.. తన మేనమామ చొక్క లింగం, అక్కలకు చెప్పి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారు తమపై మళ్లీ కూడా దాడి చేస్తారని వారు పోలీసులను ప్రాధేయపడ్డారు. అయినా కూడా భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో మరోమారు వారిపై దాడికి తెగబడ్డారు. వాణి ఇంటి ముందు ఉన్న వీధి లైట్లు ఆఫ్ చేసి ఇంట్లో ఉన్న శ్రీకాంత్, చొక్కలింగం, వాణి, సుమతి, లోకేశ్వరి, పవిత్రపై ఇనుప రాడ్లతో మరోమారు దాడి చేశారు. తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? ఎవరు అండగా వస్తారో చూస్తామంటూ బెదిరించారు. గాయపడిన వాణి కుటుంబ సభ్యులను చుట్టుపక్కల వారు 108 ద్వారా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి రోజా మండిపాటు ‘‘మహిళలనే కనీస మానవత్వం లేకుండా ఇనుప రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడితే కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. మీ నిర్లక్ష్యం కారణంగానే రెండో దఫా దాడి జరిగింది. తమ సోదరుడు శ్రీకాంత్‌పై నలుగురు దాడి చేశారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ నలుగురు మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసం ? ఇంత జరిగినా కేసు నమోదు చేయకపోతే ఏమనుకోవాలి? జరిగిన దారుణం కంటి ముందు కనిపిస్తోంది’’ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా సీఐ శేఖర్‌రెడ్డిని నిలదీశారు.
కట్టుకున్నవారే కాలయముళ్లు
అడ్డాకుల/పటాన్చెరు టౌన్: రక్షణ గా ఉండాల్సిన భర్తలే భార్యల పాలిట కాలయముళ్లు అయ్యారు. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఈ సంఘ టనలు కలకలం రేపాయి. ఒకచోట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే మనస్పర్థలతో భార్య ప్రా ణం తీస్తే.. మరోచోట అనుమానంతో పెళ్లయిన ఏళ్ల తర్వా త భార్యను కిరాతకంగా గొంతు కోసి చంపాడొక భర్త. వివరా లివి. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన నర్సు కె.శ్రీదేవి (21).. అదే గ్రామా ని కి చెందిన చందుతో ప్రేమలో పడింది. కులాలు వేరైనా ఎని మిది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి గ్రామంలో చందు ఇంట్లోనే ఉంటూ కాపు రం చేస్తున్నారు. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగాయి. చందు నిత్యం తన భార్యను హింసించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి భార్యను కొట్టి గొంతు నులిమి చంపాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కుందనేలా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరికి గ్రామస్తు ల సమాచారంతో ఎస్ఐ ఎం.వేణు పొలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి భర్త చందును అదుపులోకి తీసుకుని విచారించారు. యువతి మృతదేహానికి జిల్లా ఆస్ప త్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. చందు అక్కడికి వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతురాలి బంధువులు పట్టుబట్టారు. మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అడ్డాకుల, దేవరకద్ర ఎస్ఐలు శ్రీనివాస్, నాగన్న బందోబస్తు చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చందుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. అనుమానమే పెనుభూతమై..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీ మ జిల్లా, అల్లవరం మండలం మొగలమూరుకు చెందిన పరమేశ్వరరావు, లీలా వతి (54) దంపతులు పటా న్చెరు ఏపీఆర్ కాలనీలో కుమారుడు మహావీర్ ఆరు ద్ర, కోడలు సుజాతతో కలి సి ఉంటున్నారు. కాగా కొంతకాలంగా పరమేశ్వరరావు, లీలావతి పై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతు న్నాడు. శనివారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కుమారుడు, కోడలు తమ కుమారునికి వ్యాక్సిన్ వేయించేందుకు ఉదయం 10 గంటల సమయంలో బయటికి వెళ్లారు. ఈ క్రమంలో పరమేశ్వరరావు కూరగా యలు కోసే కత్తితో లీలావతి గొంతుకోసి పరారయ్యాడు. కుమారుడు, కోడలు వచ్చి చూసేసరికి లీలావతి రక్తపు మడు గులో చనిపోయి ఉండటంతో అరుస్తూ బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న సీఐ రాజు సిబ్బందితో కలిసి ఘట నా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. పరారైన పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీడియోలు
ధురంధర్ పై కాపీ ఆరోపణలు.. నా స్టోరీనే అంటోన్న కన్నడ డైరెక్టర్
మీ వల్లే హర్ష వీణ ప్రెగ్నెంట్ అయిందా.. రిపోర్టర్ ప్రశ్నకి పారిపోయిన అరవ శ్రీధర్
అమరావతి కాదు కమ్మరావతి.. రేణుకా చౌదరికి అంబటి అదిరిపోయే కౌంటర్
ట్రంప్ కు గుండెపోటు?
36 గంటల తర్వాత.. గల్లంతైన పైలట్ ఆచూకీ
గ్యాస్ సిలిండర్ల మీద వంట చేయడం నేర్పింది నేనే.. చంద్రబాబు గ్యాస్ కబుర్లు
పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా..!
అడ్డుకున్న పోలీసులు.. లైవ్ లో కౌంటర్ ఇచ్చిన అభినయ్ రెడ్డి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
జగన్ మావిగన్.. ఇది కదా అసలైన విజన్


