ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీ ఆదరణనే లభిస్తోంది. ఎలన్ మస్క్, మార్క్ క్యుబాన్ లాంటి బిలియనీర్లు సైతం క్రిప్టోకరెన్సీలను ఆదరిస్తున్నారు. ఎలన్ మస్క్ ఐతే మరీను..! డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎలన్‌మస్క్‌ను డోగీకాయిన్ ఫాదర్‌గా ఇన్వెస్టర్లు ముందుగా పిలుస్తారు. కాగా తాజాగా ఎలన్‌మస్క్ డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానే విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు.
చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...!
ప్రజల క్రిప్టోకరెన్సీ...!
అమెరికాలో ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో అమెరికాలో 33 శాతం మంది పౌరులు డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను సపోర్ట్ చేస్తున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ప్రముఖ డోగికాయిన్ మిలియనీర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ విషయంపై ఎలన్‌మస్క్ స్పందిస్తూ...అవును నిజమే..డోగీ కాయిన్ క్రిప్టోకరెన్సీ ప్రజలది. టెస్లా, స్పేస్‌ఎక్స్‌లో పనిచేసే వారు కూడా డోగీకాయిన్ ఎక్కువగా కల్గిఉన్నారు. వారు అంత పెద్ద ఆర్ధిక నిపుణులు మాత్రం కాదు. అందుకనే నేను డోగీకాయిన్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని’ మస్ తన ట్విట్‌లో వెల్లడించారు. అప్పడప్పుడు తన పెంపుడు కుక్క షిభా ఫ్లోకీను ఫోటో పెడితే చాలు షిభా ఇను క్రిప్టోకరెన్సీ రయ్‌మని పెరుగుతాయి. అసలు ఎలన్‌మస్క్ దగ్గర షిబా ఇను క్రిప్టోకరెన్సీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం డోగీ కాయిన్, బిట్‌కాయిన్, ఈథిరియం క్రిప్టోకరెన్సీలనే కల్గి ఉన్నట్లు వెల్లడించారు.
Lots of people I talked to on the production lines at Tesla or building rockets at SpaceX own Doge. They aren’t financial experts or Silicon Valley technologists. That’s why I decided to support Doge – it felt like the people’s crypto.
— Elon Musk (@elonmusk) October 24, 2021
శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ అదే..!
గతంలో అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబాన్ క్రిప్టోకరెన్సీలో డోగీకాయిన్ మీడియం ఆఫ్ ఎక్సేచేంజ్‌లో అత్యంత శక్తివంతమైన కమ్యూనీటీ కలిగి ఉందని చేసిన వ్యాఖ్యలకు ఎలన్ మస్క్ మద్దతు పలికారు. మార్క్ క్యూబాన్‌కు రిప్లే ఇస్తూ... నేను విషయాన్ని ఎప్పటినుంచో చెప్తున్నాను..అంటూ ఎలన్ రిప్లే ఇచ్చారు.
చదవండి: తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు
Comments
Please login to add a commentAdd a comment