breaking news
elon musk
-
రిలయన్స్ ప్రకటనపై స్పందించిన మస్క్
భారతదేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానీపై మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై రిలయన్స్ స్పందించగా, సంస్థ ప్రకటనకు మస్క్ కూడా ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చారు.రిలయన్స్ ప్రకటనకు స్పందిస్తూ మస్క్ 'ధన్యవాదాలు' అంటూ పోస్టు చేసారు. మరోవైపు.. భారతదేశాన్ని హైస్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్టార్‌లింక్ కూడా ప్రకటించింది.భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రవేశానికి కొందరు వ్యాపారవేత్తలు అడ్డంకులు సృష్టిస్తున్నారనే అర్థం వచ్చేలా ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ''ఈ దేశానికి అసలైన బాస్ అంబానీయా?'' అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. మస్క్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడంతో పలువురు రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు స్పందించారు.మస్క్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాము పోటీకి ఎప్పుడూ భయపడలేదని, భారత్‌లో వ్యాపారం చేయాలనుకునే ప్రతి కంపెనీ ఇక్కడి చట్టాలు, నిబంధనలను పాటించాల్సిందేనని రిలయన్స్ స్పష్టం చేసింది.@RIL_Updates Much appreciated— Elon Musk (@elonmusk) October 16, 2026పోటీకి మేం భయపడలేదు!స్టార్‌లింక్ విషయంలో జరుగుతున్న పరిణామాలపై రిలయన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో స్వదేశీ కంపెనీలైనా, విదేశీ సంస్థలైనా ప్రభుత్వం అందరికీ ఒకే విధమైన విధానాన్ని అనుసరిస్తోందని తెలిపింది. తమ జియో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కూడా ఇంకా అనుమతులు రావాల్సి ఉందని పేర్కొంది.భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి, కొత్త టెక్నాలజీని తీసుకురావడానికి అన్ని సంస్థలకు అవకాశాలు ఉన్నాయని రిలయన్స్ తెలిపింది. అయితే, వ్యాపారం చేసే ప్రతి కంపెనీ దేశ చట్టాలను గౌరవించాలని స్పష్టం చేసింది. శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి స్టార్‌లింక్ రావడాన్ని కూడా స్వాగతిస్తున్నామని పేర్కొంది. -
కారు గాల్లో ఎగిరినా ఇన్వెస్టర్లకు ఎందుకు నచ్చలేదు?
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా రెండో తరం రోడ్‌స్టర్‌ను ఎట్టకేలకు ఆవిష్కరించింది. స్పేస్ఎక్స్ సాంకేతికతను వినియోగించి గాల్లోకి ఎగిరి, తిరిగి ల్యాండ్ అయ్యే సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఈ స్పోర్ట్స్ కారు ఉత్పత్తిని 2028లో ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సాధారణ వినియోగదారులకు ఈ కారు అందుబాటులోకి వచ్చే కచ్చితమైన తేదీని టెస్లా ప్రకటించలేదు. ఈ ఆవిష్కరణ చేసినా టెస్లా షేరు ధరలో ఉత్సాహం కనిపించలేదు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం తొలుత పెరిగిన షేర్లు, తర్వాత మార్కెట్ ఒత్తిడితో వెనక్కి తగ్గాయి.నిపుణుల అంచనా ప్రకారం..టెస్లా కొత్త రోడ్‌స్టర్ ఆవిష్కరణ సాంకేతికంగా సంచలనం సృష్టించినా షేరు ధరపై ప్రభావం మాత్రం పరిమితంగా ఉండటానికి ప్రధాన కారణం.. మార్కెట్ ఇప్పుడు టెస్లాను కేవలం కార్ల కంపెనీగా చూడటం లేదు. అక్టోబర్ 16న ప్రీమార్కెట్లో షేరు 5%కుపైగా పెరిగినా ఆ లాభాలు త్వరగా ఆవిరైపోయి రోజు ముగిసే సమయానికి షేరు 2.1 శాతానికి పడిపోయింది.ఆదాయంపై పెద్ద ప్రభావం ఉండదురోడ్స్టర్ అధిక ధర, తక్కువ ఉత్పత్తి కలిగిన ‘హాలో’ మోడల్. కాబట్టి ఇది టెస్లా అమ్మకాలు, లాభాలను గణనీయంగా పెంచే ఉత్పత్తి కాదు. విశ్లేషకుల దృష్టిలో ఇది ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని చూపించే ప్రదర్శన మాత్రమే. ఆదాయ వృద్ధికి కీలకం కాదు.అసలు ప్రశ్న: ఎప్పుడు ఉత్పత్తి?ప్రదర్శనలో ఎగరడం, గాల్లో తిరగడం వంటి ఆకర్షణీయ ఫీచర్లు చూపించినప్పటికీ ఉత్పత్తి 2028లోనే ప్రారంభమవుతుందని సమాచారం. ముందస్తు బుకింగ్‌లు తీసుకుంటున్నప్పటికీ డెలివరీకి కచ్చితమైన తేదీ హామీ లేదని టెస్లా పేర్కొంది. గతంలో రోడ్‌స్టర్ ప్రాజెక్టు పలుమార్లు ఆలస్యం కావడం కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తోంది.పెట్టుబడిదారుల దృష్టి ఎక్కడంటే..టెస్లా భవిష్యత్ విలువను మార్కెట్ ప్రధానంగా ఆటానమస్ డ్రైవింగ్, రోబోట్యాక్సీలు, ఏఐ, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ వంటి విభాగాల ఆధారంగా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఖరీదైన స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ కంటే ఆ సాంకేతికతల నుంచి వాణిజ్య ఆదాయం ఎప్పుడు వస్తుందన్నదే కీలకం.@Tesla “The future should look like the future!” — Elon Musk https://t.co/A4hq5y8Lkc— TESLA CARS ONLY⚡️ (@teslacarsonly) October 16, 2026ఏమైందంటే..టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్ పరీక్షా కేంద్రంలో తాజాగా నిన్న నిర్వహించిన ప్రదర్శనలో రోడ్‌స్టర్ ప్రత్యేక వ్యవస్థ సాయంతో ర్యాంప్‌పై తలకిందులుగా ప్రయాణించింది. అనంతరం స్పేస్ఎక్స్తో అభివృద్ధి చేసిన కోల్డ్-గ్యాస్ థ్రస్టర్లతో గాల్లోకి లేచి మలపులు తిరిగి సేఫ్‌గా నేలపై దిగింది. వాహనాన్ని గాల్లోకి ఎత్తడం, మధ్యలో తిప్పడం వంటి విన్యాసాలు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. టెస్లా వివరాల ప్రకారం, థ్రస్ట్ వెర్షన్ గంటకు 60 మైళ్ల వేగాన్ని ఒక సెకను లోపే అందుకోగలదు. రోడ్‌స్టర్ పర్ఫార్మెన్స్, థ్రస్ట్, రాకెట్ వంటి మూడు కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది. ‘రాకెట్’ వెర్షన్లో 10 కోల్డ్-గ్యాస్ థ్రస్టర్లు ఉంటాయి. ఇది ప్రస్తుతం సాధారణ రోడ్డు వినియోగానికి ఉద్దేశించిన మోడల్‌గా కాకుండా ప్రత్యేక కస్టమర్ల కోసం రూపొందించిన వేరియంట్‌గా కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నా ఆస్తి ఇవ్వాలా? -
స్టార్‌లింక్ వివాదం.. తొలిసారి స్పందించిన రిలయన్స్!
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభంపై.. ఎలాన్ మస్క్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. స్టార్‌లింక్‌కు అనుమతులు రావడంలో ఎదురవుతున్న సమస్యలపై మస్క్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా రిలయన్స్ స్పందించింది. తాము పోటీకి ఎప్పుడూ భయపడలేదని, భారత్‌లో వ్యాపారం చేయాలనుకునే ప్రతి కంపెనీ ఇక్కడి చట్టాలు, నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.పోటీకి మేం భయపడలేదు!స్టార్‌లింక్ విషయంలో జరుగుతున్న పరిణామాలపై రిలయన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో స్వదేశీ కంపెనీలైనా, విదేశీ సంస్థలైనా ప్రభుత్వం అందరికీ ఒకే విధమైన విధానాన్ని అనుసరిస్తోందని తెలిపింది. తమ జియో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కూడా ఇంకా అనుమతులు రావాల్సి ఉందని పేర్కొంది.భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి, కొత్త టెక్నాలజీని తీసుకురావడానికి అన్ని సంస్థలకు అవకాశాలు ఉన్నాయని రిలయన్స్ తెలిపింది. అయితే, వ్యాపారం చేసే ప్రతి కంపెనీ దేశ చట్టాలను గౌరవించాలని స్పష్టం చేసింది. శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి స్టార్‌లింక్ రావడాన్ని కూడా స్వాగతిస్తున్నామని పేర్కొంది.జియో ప్రయాణం..పోటీకి తాము ఎందుకు భయపడబోమో చెప్పడానికి రిలయన్స్ తన జియో ప్రయాణాన్ని ఉదాహరణగా చూపించింది. 2016లో టెలికాం రంగంలోకి అడుగుపెట్టినప్పుడు జియోకు ఒక్క కస్టమర్ కూడా లేడని గుర్తుచేసింది. అప్పటికే మార్కెట్లో అనేక కంపెనీలు ఉన్నప్పటికీ, తక్కువ ధరలకు డేటా అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందామని వెల్లడించింది.ప్రస్తుతం జియోకు 53 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారని కంపెనీ పేర్కొంది. వినియోగదారులకు ఎవరు మెరుగైన సేవలు అందిస్తారనేదే పోటీలో ముఖ్యమని రిలయన్స్ స్పష్టం చేసింది. ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోనూ ఇదే విధంగా పోటీని స్వాగతిస్తున్నామని వెల్లడించింది.అసలు వివాదంఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. సాధారణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందించడం దీని ప్రత్యేకత. భారత్‌లో ఈ సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.అయితే.. అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో ఆలస్యం జరుగుతోందంటూ అక్టోబర్ 7న మస్క్ విమర్శలు చేశారు. కొంతమంది వ్యాపారవేత్తలు స్టార్‌లింక్‌కు అడ్డుపడుతున్నారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు.దీనిపై మరుసటి రోజు భారత కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ స్పందించింది. వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది. శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో అనుమతుల ప్రక్రియ న్యాయంగా కొనసాగుతోందని, సంబంధిత మూడు సంస్థల భద్రతా పరిశీలన కూడా జరుగుతోందని వివరించింది.అంబానీని ఉద్దేశించిన మస్క్ప్రభుత్వ వివరణ వచ్చిన కొన్ని గంటల తర్వాత మస్క్ మరోసారి స్పందించారు. స్టార్‌లింక్ 165కు పైగా దేశాల్లో పనిచేస్తోందని, భారత్‌లో నిబంధనలను పాటించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అయినా.. భారత్‌లో అనుమతి ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తూ, ''భారత్‌కు అసలైన బాస్ అంబానీనా?'' అని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: అమెరికా గ్రీన్ కార్డుల వివాదం.. బ్రాడ్ స్మిత్ హెచ్చరిక!వినియోగదారులకు ఏమిటి లాభం!స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభిస్తే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రదేశాల్లో ఇంటర్నెట్ సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, జియో కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తోంది.ఈ రెండు సంస్థల మధ్య భవిష్యత్తులో పోటీ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటర్నెట్ ధరలు, సేవల నాణ్యత, కనెక్టివిటీ విషయంలో వినియోగదారులకు ప్రయోజనం కలగవచ్చు. అయితే.. స్టార్‌లింక్ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, వాటి ధరలు ఎంత ఉంటాయనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.Statement from Reliance Industries In light of recent remarks about Reliance and the Indian market, we wish to place the facts on record. Like every Indian enterprise, Reliance has grown in an India that welcomes investment and innovation, homegrown or international, that improve the lives of the people. That openness rests on the rule of law. As the Government of India has stated, it applies the same process to every applicant, Indian or foreign. Jio's own satellite services await clearances. At Reliance, we have never feared competition. We see it as the truest test of who serves the customer best. Jio itself entered India's crowded telecom market in 2016 as the newest player, with not a single customer. In just ten years, Jio has earned the trust of over 530 million customers and given Indians some of the best digital infrastructure and most affordable data in the world. We welcome competition in satellite communications, including Starlink. Every player, Jio included, must serve the people of India and abide by the laws and policies of the land.— Reliance Industries Limited (@RIL_Updates) October 16, 2026 -
గాల్లో ఎగిరిన Tesla కారు.. మస్క్ మరో ప్రయోగం!
కార్లు రోడ్ల తిరగడమే కాదు.. భవిష్యత్తులో గాల్లో కూడా ప్రయాణిస్తాయనే ఆలోచన చాలాకాలంగా ఉంది. ఇప్పుడు ఈ ఆలోచనను నిజం చేసే దిశగా టెస్లా మరో అడుగు ముందుకేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ కొత్త రోడ్‌స్టర్ కారుతో చేసిన విన్యాసాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ కారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై తలకిందులుగా ప్రయాణించడంతో పాటు, కొద్దిసేపు గాల్లోకి ఎగిరి సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అమెరికాలోని మెక్‌గ్రెగర్‌లో ఉన్న స్పేస్ఎక్స్ కేంద్రంలో అక్టోబర్ 15న ఈ ప్రదర్శన జరిగింది. ఇందులో భాగంగా టెస్లా రోడ్‌స్టర్ భారీ వంపుతో ఉన్న ర్యాంప్‌పైకి వెళ్లి, దానిపై తలకిందులుగా ప్రయాణించింది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరి తిరిగి సురక్షితంగా భూమి మీదకు దిగింది.ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేస్తూ.. ష్యత్తులో నిజంగానే ఎగిరే కార్లు ఉంటాయని తేలింది'' అని అన్నారు. టెస్లా అధికారిక ఖాతా కూడా ఈ వీడియోను పంచుకుంది.Turns out the future does have flying cars https://t.co/6fexPp6SXI— Elon Musk (@elonmusk) October 16, 2026కారులో రాకెట్ టెక్నాలజీ!ఈ కొత్త రోడ్‌స్టర్‌లో స్పేస్ఎక్స్ అభివృద్ధి చేసిన కోల్డ్ గ్యాస్ థ్రస్టర్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఒత్తిడితో నిల్వ చేసిన వాయువును విడుదల చేయడం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ సాంకేతికతకు రాకెట్లలో ఉపయోగించే థ్రస్ట్ సూత్రంతో సంబంధం ఉంది. ఇతర ప్రత్యేక వ్యవస్థలతో కలిపి దీన్ని ఉపయోగించడం వల్ల కారు అసాధారణ విన్యాసాలు చేయగలిగింది.అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కారు గాల్లోకి ఎగిరిందని చెప్పి అది విమానంలా ఎక్కడికైనా ప్రయాణించగలదని భావించకూడదు. ఈ ప్రదర్శన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో జరిగింది. సాధారణ రోడ్లపై ఇలాంటి కార్లను నడపడానికి అవసరమైన భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ అనుమతులు, సాంకేతిక పరీక్షలు ఇంకా కీలకమైన అంశాలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: అమెరికా గ్రీన్ కార్డుల వివాదం.. బ్రాడ్ స్మిత్ హెచ్చరిక! -
అమెజాన్‌కు పోటీగా మస్క్ ఈ కామర్స్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఆన్లైన్ షాపింగ్ చేయడంలో కూడా సహాయకారిగా ఉంటోంది. మనకు కావాల్సిన వస్తువులను వెతకడం, వాటి ధరలను పోల్చడం, ఆర్డర్లు చేయడం వంటి పనులలో ఏఐ అసిస్టెంట్ల సహాయపడుతున్నాయి. కానీ.. అమెజాన్ తన వెబ్సైట్లో ఏఐ బాట్లు వినియోగదారుల తరఫున షాపింగ్ చేయడంపై కొన్ని ఆంక్షలు విధిస్తోంది.ఒక ఎక్స్ యూజర్ తన గ్రోక్ ఏఐ బాట్ అమెజాన్‌లో రిటర్న్స్ నిర్వహించడానికి ఉపయోగపడుతోందని.. అయితే, అమెజాన్ ఏఐ బాట్లను అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రజలు తమ ఏఐ అసిస్టెంట్ల ద్వారా షాపింగ్ చేయలేకపోతే.. మరో ఆన్లైన్ స్టోర్‌కు మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా.. ఎలాన్ మస్క్ కొత్తగా 'ఎక్స్ షాప్' పేరుతో ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు.అమెజాన్‌కు పోటీ మస్క్ కంపెనీ?దీనికి స్పందించిన మస్క్, అమెజాన్‌కు పోటీగా ఒక సంస్థను ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు. అయితే.. ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది?, ఎప్పుడు ప్రారంభమవుతుంది?, అనే వివరాలను ఆయన వెల్లడించలేదు. కానీ.. అమెజాన్ తన వెబ్సైట్లో ఏఐ ఏజెంట్ల వినియోగంపై ఆంక్షలు విధించడానికి కారణం భద్రత, గోప్యత అని చెబుతోంది.మెటా సంస్థకు చెందిన మ్యూస్ ఏఐ అసిస్టెంట్‌ను కూడా అమెజాన్‌లో వినియోగదారుల తరఫున షాపింగ్ చేయకుండా అడ్డుకుంటోందని కంపెనీ చెబుతోంది. దీనికి కారణం.. మ్యూస్ తమ అనుమతి లేకుండా వెబ్‌సైట్‌ను ఉపయోగించడంతో పాటు, వినియోగదారుల లాగిన్ వివరాలను సేకరించి స్టోర్ చేస్తున్నట్లు అమెజాన్ ఆరోపించింది.ఆన్లైన్ షాపింగ్‌లో ఏఐ పాత్రదీన్నిబట్టి చూస్తే.. భవిష్యత్తులో ఆన్లైన్ షాపింగ్‌లో ఏఐ పాత్ర మరింత పెరగనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఉదాహరణకు.. మనకు ఒక ఫోన్ కొనాలని ఉంటే, మనమే వివిధ వెబ్సైట్లలో వెతకకుండా ఏఐ అసిస్టెంట్‌కు మన అవసరాలను చెబితే, అది ధరలు, ఫీచర్లను పోల్చి మంచి ఫోన్‌ను సూచిస్తుంది. అవసరమైన అనుమతులు ఉంటే కొనుగోలు ప్రక్రియలో కూడా సహాయం చేస్తుంది. ఇలాంటి సౌకర్యాలను అందించే సంస్థలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: SBI ఖాతాదారులకు షాక్.. పెరిగిన లోన్ వడ్డీ రేట్లు! -
మోదీతో విభేదాలున్నా.. దేశం జోలికొస్తే ఊరుకోం!: ఒవైసీ
ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ విమర్శలు చేసే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పొలిటికల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎలాన్ మస్క్ విషయంలో మాత్రం దేశ సార్వభౌమాధికారాన్ని ముందుకు తెచ్చారు. భారత్ ప్రధాని గురించి మాట్లాడే హక్కు.. ఇక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం మస్క్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి అనుమతులు ఆలస్యమవుతున్నాయంటూ మస్క్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. దేశ వనరుల్ని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించేది భారతదేశమేనని ఒవైసీ కుండబద్ధలు కొట్టారు. విదేశీయులు వచ్చి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో తనకు అనేక అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ, ప్రధాని స్థానాన్ని అగౌరవపర్చడం, దేశ గౌరవానికి భంగం కలిగితే మాత్రం సహించబోనని అన్నారు.అంతేకాదు.. ప్రపంచంలోనే చౌక ధరకు ఇంటర్నెట్ లభించేది భారత్లోనని గుర్తు చేశారాయన. దేశంలో టెలికాం రంగానికి సంబంధించిన నిర్ణయాలు భారత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలని, విదేశీ వ్యాపారవేత్తల ఒత్తిడికి తలొగ్గకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భారత్‌ను రష్యా చమురు కొనొద్దని చెబుతున్న అమెరికా.. అక్కడి నుంచి డీజిల్ కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. భారత్ కూడా తన ప్రయోజనాలే ముఖ్యంగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. Owaisi slams Elon Musk for insulting PM Modi ji. Agree or not, he is a more loyal Indian than undignified Rahul Gandhi. https://t.co/1FUJKwKalK— Alpakanya (@Alpakanya) October 14, 2026భారతదేశ వనరులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించేది ఈ దేశమేనని.. విదేశీ పారిశ్రామికవేత్తలు భారత్ విధానాలను శాసించే పరిస్థితి ఉండకూడదని అన్నారాయన. రాజకీయ విభేదాలు ఉన్నా దేశ గౌరవం, రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో రాజీ పడకూడదన్న ఆయన వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అంతకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎలాన్ మస్క్ వరకు.. విదేశీ ప్రముఖుల వ్యాఖ్యలపై ఇక్కడి రాజకీయ నేతలు గట్టిగా స్పందించడం లేదని నిలదీశారు. మస్క్‌ను ఉద్దేశించి ‘గోరా చమ్డీ వాలా’ (తెల్లతోలు వ్యక్తి) అంటూ మండిపడ్డారు.ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ ద్వారా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సేవలను వాణిజ్యపరంగా ప్రారంభించడానికి అవసరమైన అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు. ఈ జాప్యంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భారత టెలికాం మార్కెట్లోని శక్తిమంతమైన వ్యాపార వర్గాలు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని ఉద్దేశించి వ్యంగ్యంగా పోస్టులు కూడా చేశారు.అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. స్టార్‌లింక్‌తో పాటు ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలకూ భద్రతాపరమైన పరిశీలనలు, నిబంధనల అమలు అవసరమని స్పష్టం చేసింది. అనుమతుల ప్రక్రియలో పక్షపాతం చూపుతున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఈ వివాదం నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా మస్క్ పోస్టుకు స్పందించడంతో రాజకీయ చర్చ మొదలైంది. ఇప్పుడు ఒవైసీ వ్యాఖ్యలు ఈ అంశానికి మరో కోణాన్ని జోడించాయి. విదేశీ సంస్థలకు భారత్‌లో వ్యాపారం చేసే అవకాశం ఉండొచ్చు.. కానీ దేశ చట్టాలు, నిబంధనలు, నిర్ణయాధికారాన్ని గౌరవించాల్సిందేనన్నది మజ్లిస్ అధినేత వైఖరిగా ఆ వైరల్ వీడియోతో కనిపిస్తోంది.ఇదీ చదవండి: సీజేపీ నిరసనల ఎఫెక్ట్.. దేశ బహిష్కరణ నోటీసులు! -
జెలెన్స్కీ యుద్ధతంత్రానికి స్టార్‌లింక్ బ్రేక్!
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో సాంకేతికత సరికొత్త వివాదానికి కేంద్రబిందువైంది. ఉక్రెయిన్ సైనిక డ్రోన్ల దాడులు, గగనతల రక్షణ వ్యూహాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ‘స్టార్‌లింక్’ సేవలను నిలిపివేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. రష్యాపై పోరులో కీలకమైన కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆంక్షలు ఎదురుకావడం ఉక్రెయిన్ను రక్షణపరంగా కిందకులాగేలా చేసింది.అమెరికా-రష్యా మధ్య మారుతున్న రాజకీయ సమీకరణాలు, రష్యాతో యూఎస్ డీజిల్ ఒప్పందాల నేపథ్యంలో ఈ ఆంక్షలు అమల్లోకి రావడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రభుత్వానికి, వైట్‌హౌస్‌కు మధ్య సంబంధాలు క్షీణించడమే ఈ పరిణామాలకు కారణమని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.మస్క్ స్పందన ఇదే..ఈ వివాదంపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. స్టార్‌లింక్ అనేది ప్రధానంగా పౌర అవసరాలు, రక్షణ రంగానికి ఉద్దేశించిన వాణిజ్య సేవ మాత్రమేనని స్పష్టం చేశారు. దాన్ని ఆచరణాత్మక, దురాక్రమణ సైనిక చర్యలకు ఉపయోగించలేమని తేల్చిచెప్పారు. అలాగే, సైనిక స్థాయి కమ్యూనికేషన్ల కోసం ఉద్దేశించిన స్టార్‌షీల్డ్ (Starshield) సేవలు, వాటిపై విధించే ఆంక్షలు పూర్తిగా అమెరికా ప్రభుత్వం, సైన్యం నియంత్రణలోనే ఉంటాయని ఆయన వెల్లడించారు.‘అమెరికా వైఖరి బాధాకరం’ఉక్రేనియన్ సైన్యంలోని డ్రోన్ యూనిట్లు, ముఖ్యంగా హులియైపోల్ సెక్టార్లో పనిచేస్తున్న బలగాలు కమ్యూనికేషన్ వైఫల్యం వల్ల కీలక మిషన్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. యుద్ధభూమిలో సమాచార సమన్వయం లోపించడం ఉక్రెయిన్ ప్రతిఘటనను బలహీనపరుస్తోంది. అమెరికా వైఖరిలో వస్తున్న ఈ మార్పు తమకు అత్యంత బాధాకరమని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి చర్చల్లో పురోగతి లేకపోవడం, ఇటు సాంకేతిక ఆంక్షలు ఉక్రెయిన్ను మరింత ప్రమాదకర స్థితిలోకి నెడుతున్నాయి. అంతర్జాతీయ కూటముల్లో మారుతున్న ఈ వ్యూహాత్మక పొత్తులు రాబోయేకాలంలో యుద్ధ పరిస్థితులను పూర్తిగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఇంట్లో మహారాణులు.. పెట్టుబడుల్లో ప్రేక్షకులు! -
శాటిలైట్ నెట్ రేసులో మస్క్ కన్నా ముందున్నాం..
దేశీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల విషయంలో కార్పొరేట్ల మధ్య మాటల పోరు కొనసాగుతోంది. తాజాగా భారత్‌లో ఈ సర్వీసులను ప్రారంభించే రేసులో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కన్నా తమ యూటెల్‌శాట్ వన్‌వెబ్ వెంచరే ముందుందని, అనుమతుల కోసం ఐదేళ్ల నుంచి నిరీక్షిస్తున్నామని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు.‘మేము ఈ క్యూలో ఆయన (మస్క్) కన్నా చాలా ముందున్నాం. మేము ఐదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నాం. మూడేళ్లుగా మా వన్‌వెబ్ గ్రౌండ్ నెట్వర్క్ సిద్ధంగా ఉంది. ఉపగ్రహాలు ఐదేళ్లుగా భారత్ చుట్టూ తిరుగుతున్నాయి. కానీ మాకింకా అనుమతులు రాలేదు. ఆయన కన్నా కనీసం కొద్ది రోజులు ముందైనా వస్తే చాలా సంతోషం’ అని బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరం 2026లో పాల్గొన్న సందర్భంగా మిట్టల్ పేర్కొన్నారు.శక్తివంతమైన వ్యాపార శక్తులు భారత్‌లో తమను రానివ్వకుండా అడ్డుకుంటున్నాయంటూ మస్క్ ఆరోపిస్తుండటం, నేరుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్టార్‌లింక్, రిలయన్స్ జియో శాట్‌కామ్, యూటెల్‌శాట్ వన్‌వెబ్‌లకు శాటిలైట్ కమ్యూనికేషన్స్ లైసెన్సులు వచ్చినప్పటికీ ఇంకా సెక్యూరిటీకి సంబంధించిన అనుమతులు రావాల్సి ఉంది.ఏఐని అలా వదిలేయకూడదు..కృత్రిమ మేథ (ఏఐ)ని ఎదగనివ్వకుండా నిరోధించరాదని, అలాగని ఎలాంటి కట్టడి లేకుండా దాన్ని వదిలేయడం కూడా ’మూర్ఖత్వం’ అవుతుందని మిట్టల్ వ్యాఖ్యానించారు. ఏఐ అనూహ్యమైన విధంగా వ్యవహరిస్తుండటంపై అంతర్జాతీయ దిగ్గజాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏఐపై సముచిత విధంగా నియంత్రణ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐకి సంబంధించి నిబంధనలు, కట్టడి చర్యలపై భారత్ చర్చాపత్రాన్ని రూపొందిస్తోందని మిట్టల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇంట్లో మహారాణులు.. పెట్టుబడుల్లో ప్రేక్షకులు! -
మస్క్, ట్రంప్ లకు సుప్రీంకోర్టులో కీలక పరీక్ష, డోజీ రహస్యాలు బయటపడతాయా?
-
టెస్లాకు ఒక న్యాయం.. స్టార్ లింక్ కు మరో న్యాయమా? మస్క్ కు చైనా స్ట్రాంగ్ కౌంటర్
-
నక్కజిత్తుల మస్క్.. అడ్డంగా బుక్కయ్యాడుగా!
భారత్‌లో వ్యాపార గుత్తాధిపత్యాలపై గళమెత్తిన టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతులు ఆలస్యం కావడానికి కొందరు సంపన్న వ్యాపారవేత్తలే కారణమంటూ ఆరోపించిన మస్క్.. రిలయన్స్, బీజేపీ మధ్య సంబంధాలపై విమర్శలు గుప్పించారు. అయితే, అమెరికాలో రిపబ్లికన్లు అధికారంలో కొనసాగేందుకు భారీగా రాజకీయ విరాళాలు అందించడంపై ఇప్పుడు ఆయనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సెనేటర్ బెర్నీ శాండర్స్ మస్క్‌పై తీవ్రంగా స్పందించారు.అమెరికాలో రాజకీయాల కోసం మస్క్ ఖర్చు చేస్తున్న భారీ మొత్తాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు కాంగ్రెస్‌పై తమ పట్టును కొనసాగించేందుకు మస్క్ సుమారు 36.6 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి. ఇందులో జూలై నుంచి అందించిన విరాళాలే కనీసం 27.6 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు పేర్కొన్నాయి.రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థులకు మద్దతిచ్చే సెనేట్ లీడర్షిప్ ఫండ్‌కు 15.8 కోట్ల డాలర్లు, తన రాజకీయ కమిటీ అమెరికా పీఏసీకి 7.6 కోట్ల డాలర్లు అందించినట్లు నివేదికలు తెలిపాయి. ఇతర రిపబ్లికన్ అనుకూల రాజకీయ కమిటీలకూ ఆయన నిధులు సమకూర్చారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా కూడా మస్క్ భారీగా ఖర్చు చేశారు.‘సంపన్నుల గుప్పిట్లో రాజకీయాలా?’మస్క్ విరాళాలపై అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ తీవ్రంగా స్పందించారు. 2024లో ట్రంప్ గెలుపు కోసం మస్క్ సుమారు 29 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల పట్టు కొనసాగేందుకు మరో 36.6 కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నారని విమర్శించారు. సంపన్నులు తమ ఆర్థిక శక్తితో రాజకీయ వ్యవస్థపై అసాధారణ ప్రభావం చూపుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎన్నికల ప్రచారానికి కొద్దిమంది బిలియనీర్లు భారీగా నిధులు సమకూర్చే పరిస్థితి పెరిగితే.. సామాన్య ప్రజల సమస్యల కంటే సంపన్నుల ప్రయోజనాలకే రాజకీయాల్లో ప్రాధాన్యం పెరిగే ప్రమాదం ఉందన్నది శాండర్స్ వాదన. రాజకీయ వ్యవస్థ కొద్దిమంది ధనవంతుల గుప్పిట్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మస్క్ విరాళాలను ప్రస్తావిస్తూ, సంపదను రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.స్టార్‌లింక్ ఎంట్రీతో మొదలైన వివాదంప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న మస్క్‌కు భారత్ కీలక మార్కెట్. అయితే, దేశంలో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. కొందరు భారతీయ ‘ఒలిగార్క్’లు తమ వ్యాపార గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.‘ఒలిగార్క్’ అంటే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై అసాధారణ ప్రభావం చూపగల కొద్దిమంది సంపన్నులు లేదంటే శక్తిమంతుల సమూహం. భారత్‌లో అలాంటి వ్యాపారవేత్తలే పోటీని అడ్డుకుంటున్నారన్నది మస్క్ వాదన. స్టార్‌లింక్‌కు మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తే వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయం. అయితే, అనుమతుల ప్రక్రియలో జాప్యానికి వ్యాపార గుత్తాధిపత్యాలే కారణమన్న ఆరోపణ నిర్ధారణ కాలేదు.‘ప్రధాని అంబానీనా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలుఈ వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని మస్క్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ‘భారత్‌కు అసలైన బాస్ అంబానీనా?’ అన్న అర్థం వచ్చేలా ప్రశ్నించడంతోపాటు ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. భారత్‌లో టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లో వ్యాపార ప్రయోజనాలు, పోటీ, ప్రభుత్వ అనుమతులపై ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. భారత్‌లోనూ మస్క్‌కు కౌంటర్లుమస్క్ వ్యాఖ్యలపై భారతీయుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఒక సంస్థకు మార్కెట్లో పోటీ చేసే అవకాశం ఉండాలని కోరడం వేరు.. తన వ్యాపారానికి అనుకూలంగా నిర్ణయాలు రావాలని కోరుతూ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలపై ఆరోపణలు చేయడం వేరన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్టార్‌లింక్‌కు అనుమతులు ఇవ్వాలా వద్దా అన్నది నిబంధనలు, భద్రతా ప్రమాణాల ఆధారంగా నిర్ణయించాలే తప్ప, వ్యాపారవేత్తల మధ్య ఆరోపణలతో తేల్చకూడదని పలువురు పేర్కొన్నారు.మస్క్ వాదనకే ఎదురుప్రశ్న!ఇక్కడే మస్క్ వాదనపై విమర్శకులు ఎదురుప్రశ్నలు సంధిస్తున్నారు. భారత్ విషయంలో సంచలన ఆరోపణలు చేస్తూ.. అమెరికాలో మాత్రం ఒక రాజకీయ పక్షం అధికారంలో కొనసాగేందుకు భారీగా నిధులు సమకూరుస్తున్నారు. ఇతరుల ఆర్థిక ప్రభావాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తి.. తన సంపదతో రాజకీయాలపై ప్రభావం చూపడాన్ని ఎలా చూడాలన్న ప్రశ్నను సీనియర్ పొలిటీషియన్ అయిన శాండర్స్ ముందుకు తెచ్చారు. మరి అమెరికాలో తన రాజకీయ విరాళాలపై వస్తున్న ప్రశ్నలకు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఏఐ విషయంలో అన్నీ అతి భయలేనా? -
స్టార్‌లింక్ రేట్లు తక్కువగా ఉంటేనే ఆదరణ
స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో భారీ రేట్లు పెట్టి ఎవరూ కొనరని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కాబట్టి సరీ్వసులకు ఆదరణ లభించాలంటే తక్కువ ధరకే అందించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. పోటీ ఉంటేనే వినియోగదారులకు మేలు జరుగుతుందని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పనిలోపనిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు.The ridiculous arguments by Ambani’s army of Internet shills make no sense On the one hand, they say Starlink couldn’t possibly compete with the amazing low prices offered by Ambani’s de facto monopoly in India and then, in the same breath, they essentially claim that Starlink would be too strong of a competitor! This is absurd hypocrisy and hyperbole. The reality is that competition would greatly benefit the average citizen in India by giving them more choices, as it always does. Ambani’s profits will be lower, but he is not going out of business. And, obviously, if Starlink is too expensive in India, no one will buy it, so SpaceX will need to make pricing affordable.— Elon Musk (@elonmusk) October 10, 2026భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీని వ్యతిరేకిస్తూ, అంబానీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఓవైపు భారత్‌లో గుత్తాధిపత్యం చలాయిస్తున్న అంబానీ అందించే అత్యంత అద్భుతమైన చౌక ఆఫర్లతో మేము పోటీపడలేమని అంటారు. మరోవైపు, స్టార్‌లింక్ వస్తే అంబానీకి గట్టి పోటీ ఉంటుందనీ అంటారు. ఇదొక అర్థంపర్థం లేని వ్యవహారం. ఇది హిపోక్రసీ. వాస్తవం ఏమిటంటే పోటీ పెరిగితే సగటు భారతీయ పౌరులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి రావడం వల్ల ఎప్పట్లాగే వారికి మేలు జరుగుతుంది. అంబానీ లాభాలు తగ్గుతాయి. కానీ ఆయన వ్యాపారమేమీ మూతబడదు‘ అని మస్క్ వ్యాఖ్యానించారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు, భారీ ఐపీవో కోసం రిలయన్స్ జియో పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో అంబానీపై మస్క్ విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఆన్లైన్ షాపింగ్.. బీ అలర్ట్! -
మధ్యంతర ఎన్నికలకు మస్క్ భారీ విరాళం
వాషింగ్టన్: అమెరికాలో నవంబర్ మూడో తేదీన జరగాల్సిన మధ్యంతర ఎన్నికలకు గాను అధ్యక్షుడు ట్రంప్ సారథ్యంలోని అధికార రిపబ్లికన్ పార్టీకి స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ అత్యధికంగా విరాళాలను అందజేసినట్లు వెల్లడైంది. ఆయన ఏకంగా 276 మిలియన్ డాలర్లు అంటే, రూ. 2,638 కోట్లు విరాళంగా సమకూర్చారు. డెమోక్రాటిక్ పార్టీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి దన్నుగా ఉండేందుకు జూలై నుంచి ఈ మొత్తాన్ని అందజేస్తూ వచ్చారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. 2025–26 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రచారానికిగాను మస్క్ అత్యధికంగా రిపబ్లికన్లకు మొత్తమ్మీద 366 మిలియన్ డాలర్లు, అంటే రూ.3,500 కోట్లు ఇచ్చినట్లయిందని పేర్కొ ంది. 2024 ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారానికి గాను 290 మిలియన్ డాలర్లు, అంటే రూ.2,772 కోట్లు అందించారని కూడా తెలిపింది. -
ఒక్క ట్వీట్ తో భారతీయులను రెచ్చగొట్టిన మస్క్
-
భజనా.. ప్రతీ దానికి భజన.. మస్క్ వ్యంగ్యాస్త్రాలు!
వాషింగ్టన్ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత్ టెలికాం దిగ్గజం ముకేశ్ అంబానీల మధ్య శాటిలైట్ ఇంటర్నెట్ సేవల వినియోగంపై వివాదం మరింత ముదిరింది. సోషల్ మీడియా వేదికగా మస్క్ చేస్తున్న వరుస విమర్శలు, వాటికి వస్తున్న కౌంటర్లు ఇప్పుడు వ్యాపార వర్గాల్లోనే కాక రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అంబానీకి మద్దుతగా ప్రచారం చేస్తున్న వారిపై మస్క్ ప్రశ్నల వర్షం కురిపించారు. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కాకపోవడానికి గల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. అంబానీ అనుచర వర్గాన్ని, ఇంటర్నెట్లో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేసేవారిని అంబానీస్ ఆర్మీ ఆఫ్ ఇంటర్నెట్ షిల్స్ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. వీరి వాదనల్లో ఎంతమాత్రం నిజం లేదని, ఇదొక పెద్ద కపట నాటకమని ఎత్తు చూపారు. ఇందులో ప్రధానంగా రెండు పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్నాయని హైలెట్ చేశారు. అంబానీ సృష్టించిన డిఫ్యాక్టో గుత్తాధిపత్యం కారణంగా ఇస్తున్న అతి తక్కువ ధరలతో స్టార్‌లింక్ అసలు పోటీ పడలేదని ఒకవైపు వాదిస్తారు. అదే సమయంలో, స్టార్‌లింక్ గనుక మార్కెట్లోకి వస్తే అది తమకు అత్యంత బలమైన పోటీదారుగా మారుతుందని, తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని మరోవైపు భయపడతారు. ఒకవైపు జియో ధరలతో స్టార్‌లింక్ నిలవలేదంటారు, మళ్లీ అదే ఊపులో స్టార్‌లింక్ చాలా పెద్ద పోటీ ఇస్తుందని ఆందోళన చెందుతారు. ఇదెక్కడి వైరుధ్యం? ఇది అర్థం లేని వాదన అని మస్క్ దుయ్యబట్టారు.ఈ సందర్భంగా మస్క్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మార్కెట్లో పోటీ ఎప్పుడూ కూడా అంతిమ వినియోగదారుడైన సామాన్యుడికే ఎక్కువ ప్రయోజనాలను చేకూరుస్తుందని మస్క్ బలంగా వాదిస్తున్నారు. మార్కెట్లో ఎంపికలు పెరిగితే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ పోటీ వల్ల ముకేశ్ అంబానీ లాభాలు కొంతమేర తగ్గవచ్చునేమో కానీ, అంత మాత్రాన ఆయన వ్యాపార సామ్రాజ్యం ఏమీ మూతపడిపోదని మస్క్ స్పష్టం చేశారు. అలాగే, భారత్‌లో స్టార్‌లింక్ ధరలు గనుక మరీ ఎక్కువగా ఉంటే సహజంగానే ఎవరూ కొనుగోలు చేయరని, కాబట్టి ఇక్కడి మార్కెట్‌కు తగినట్లుగా ధరలను అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత స్పేస్ఎక్స్ పైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.మొత్తానికి, భారత్‌లో అపారమైన డిజిటల్ మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి గ్లోబల్ టెక్కీ ఎలాన్ మస్క్‌కు, దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ కేవలం వ్యాపార పోరు మాత్రమే కాదు. భవిష్యత్ ఇంటర్నెట్ రంగంపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పెద్ద యుద్ధం. ఈ టెక్కీల పోరులో ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉంటాయో, సామాన్యుడికి అంతిమంగా ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో కాలమే నిర్ణయించాలి!ఇదీ చదవండి : బీజేపీ ప్రచారానికి నిధులు! -
భారత్ పై మస్క్ విమర్శలు.. చైనా గ్లోబల్ టైమ్స్ కౌంటర్
-
బీజేపీ ప్రచారానికి నిధులు!
న్యూఢిల్లీ: స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో అనుమతివ్వకపోవడంపై గుర్రుగా ఉన్న స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ముకేశ్ అంబానీపై తన విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్టు చేస్తూ... రిలయన్స్ ద్వారా నిధులు పొందుతున్న ఓ సంస్థ సోషల్‌మీడియాలో బీజేపీకి ప్రాచుర్యం కల్పించేందుకు సాయపడిందని ఆరోపించారు. అంతేకాకుండా.. మరో సంస్థ అధికార పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు అందించిందని మీడియా కథనాల స్క్రీన్షాట్లను షేర్ చేశారు. వీటిల్లో 2022లో అల్‌జజీరా ప్రచురించిన ‘‘హౌ రిలయన్స్ ఫండెడ్ ఫర్మ్ బూస్ట్స్ బీజేపీ కాంపెయిన్స్ ఆన్ ఫేస్బుక్’కథనంతోపాటు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2024లో ‘క్విక్ సప్లై’పై రాసిన మరో కథనం ఉన్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం క్విక్ సప్లై ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.385 కోట్లు, శివసేనకు రూ.25 కోట్లు చెల్లించింది.మస్క్ ఇటీవల ఒక పోస్టు చేస్తూ... నిబంధనలన్నీ పాటిస్తున్నా భారత్‌లో కోటీశ్వరులు కొందరు స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు భారత్‌లోకి రాకుండా అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే భారత దేశానికి అసలైన బాస్ ముకేశ్ అంబానీనా? అని ప్రశ్నిస్తూ మరో పోస్టు చేశారు. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ స్పందిస్తూ ‘‘వెల్కమ్ టు ఇండియా ఎలాన్...’’అంటూ వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ మరోసారి ముకేశ్ అంబానీపై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. మస్క్ ఇంకో పోస్టులో అంబానీని నేరుగా ‘ప్రధానమంత్రి అంబానీ’ అని కూడా సంబోధించారు. ఏకస్వామ్యానికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కంపెనీని అంబానీ కంపెనీతో పోటీ పడేందుకు అనుమతిస్తారా? అని ఎద్దేవా చేశారు. ‘‘ప్రియ ప్రధానమంత్రి అంబానీ గారూ... భారతదేశపు అసలైన యజమాని మీరే అన్నది గుర్తించకపోవడంపై వినమ్రంగా క్షమాపణలు కోరుతున్నా. భారత ప్రజలపై గుత్తాధిపత్య దోపిడీని కొనసాగించాలని మీరు సహజంగానే కోరుకుంటారు. అయినాసరే... పోటీ చేయడానికి స్టార్‌లింక్ అనుమతించడాన్ని మీరు పరిగణనలోకి తీసుకుంటారా?’’అని ఆ పోస్టులో విమర్శించారు. వివక్ష లేకుండా అనుమతులిస్తున్నాం.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ నేరుగా స్పందించలేదు. ప్రభుత్వం మాత్రం టెలికం, శాటిలైట్ సేవలకు వివక్షలేకుండా అనుమతులిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంపిక చేసిన కొందరికి మాత్రమే అనుమతులు లభిస్తున్నాయనడం నిరాధార ఆరోపణలని, అపోహలని తెలిపింది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాత్రం ప్రభుత్వం ఏ రంగంలోనూ ఏకస్వామ్యాన్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. -
మస్క్‌కు అందుకే మంట! శ్రీధర్ వెంబు స్ట్రాంగ్ కౌంటర్
ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌కు భారత ఐటీ సంస్థ జోహో సీఈవో శ్రీధర్ వెంబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తన శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యాపారం స్టార్‌లింక్‌కు భారత మార్కెట్లో తలుపులు తెరుచుకోకపోవడంతో అసహనానికి గురవుతున్న ఎలాన్ మస్క్.. భారత్ ఏకాధిపత్యాన్ని ప్రోత్సహిస్తోదని, పోటీకి అవకాశం కల్పించడం లేదంటూ.. భారతీయ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గురించి, భారత ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. దానికి శ్రీధర్ వెంబు ఘాటుగా స్పందించారు.మస్క్ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘ప్రపంచంలోనే అతి తక్కువ డేటా ధరలు భారతదేశంలో ఉన్నాయి. ప్రయాణ సమయాల్లో ఎక్కడ వైఫై దొరుకుతుందా అని ఆతృత పడకుండా నా కంప్యూటర్‌కు నా ఫోన్ డేటాను లింక్ చేసుకుని పనిచేసుకోగలను. డేటా ధరలు అందుబాటులో ఉండటంతో చాలా మంది భారతీయుల దగ్గర పెద్ద డేటా ప్లాన్లతో డ్యూయల్ సిమ్ ఫోన్లు ఉంటాయి’ అంటూ రాసుకొచ్చారు.ఇంకా భారతదేశంలో ప్రపంచంలో మందుల ధరలు తక్కువగా ఉంటాయని, అందుకే బయటి దేశాలవాళ్లు ఇక్కడికి వచ్చి మందులు కొనుక్కుంటారని పేర్కొన్నారు. ఇక ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో కూడిన చెల్లింపు వ్యవస్థ యూపీఐ భారత్‌లోనే ఉందన్నారు. పోటీ గురించి మాట్లాడుతున్న మస్క్.. తన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాకు చైనా నుంచి పోటీ లేకుండా రక్షణ కల్పించుకుని అమెరికా మార్కెట్లో ఎక్కువ ధరలు ఉండేలా చేసుకున్నారన్నారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఏ రంగంలోనూ ఏకాధిపత్యానికి అవకాశం లేకుండా, అన్ని రంగాల్లో ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం కల్పిస్తున్నారన్నారు. అందుకే దేశంలో ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయన్నారు.India has the among the lowest data prices in the world. It is so good that I don't even bother to connect to local Wifi when I travel in India and just tether my phone to work on my computer. Indians routinely have dual SIM phones with large data plans because they are so affordable. Ambani's launch of Jio is directly responsible for the low data prices Indians enjoy. India has among the lowest drug prices in the world (and going lower still). People who visit India buy medicines to take home quite regularly now. India has among the lowest cost payment systems in the world in UPI. On the other hand, Tesla is protected from Chinese competition in the US market, keeping EV prices higher in America than elsewhere. Prime Minister Modi has worked hard to create a competitive economy where the benefits flow to the average Indian. His government does not tolerate monopolies. He has also actively promoted and encouraged a massive surge in startups and that is the best signal of a highly competitive economy. Directly due to Modi government policy, Indian startups are making major advances in low cost rockets and that poses a threat to SpaceX the same say the Chinese EVs threaten Tesla. These are the facts Elon.— Sridhar Vembu (@svembu) October 10, 2026 -
భారత్‌కు బాస్‌లు భారతీయులే.. మస్క్‌కు ఎంపీ ఘాటు సమాధానం!
కోల్‌కతా: స్టార్‌లింక్ సేవల ప్రవేశంపై వివాదం ముదురుతున్న వేళ.. అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాయోనీ ఘోష్ ఘాటుగా సమాధానమిచ్చారు. భారత అంతర్గత వ్యవహారాల్లో వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తులు జోక్యం చేసుకోవడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. భారతీయులే తమ దేశానికి నిజమైన యజమానులని పేర్కొన్నారు. వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకోవడం తప్పుకాదని, అయితే భారతీయులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. భారత్‌లో కొందరు పెద్ద వ్యాపారవేత్తలు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఈ క్రమంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు స్పెక్ట్రమ్ కేటాయింపు అంశం చర్చనీయాంశంగా మారింది.మస్క్‌ను ఉద్దేశించి సాయోనీ ఘోష్ తన పోస్టులో ఘాటుగా స్పందించారు. వ్యాపార నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలనుకోవడంలో తప్పులేదని, అయితే ఆ ప్రయత్నంలో భారతీయులను తక్కువ చేసి మాట్లాడవద్దని పేర్కొన్నారు. భారతదేశం, భారతీయులు తమ కష్టంతో అభివృద్ధి సాధించారని, భవిష్యత్తులోనూ తమ సామర్థ్యంతో ముందుకు సాగగలరని స్పష్టం చేశారు. దేశ అంతర్గత వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించారు. భారతదేశాన్ని ఎలా నడపాలో వేల మైళ్ల దూరంలో కూర్చొని ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదని సాయోనీ ఘోష్ వ్యాఖ్యానించారు. ఈ దేశ ప్రజలు ఎవరి ఆధిపత్యాన్నీ అంగీకరించరని స్పష్టం చేశారు.తన పోస్టులో సాయోనీ ఘోష్ దుర్గాదేవిని, రాక్షసులను కూడా ప్రస్తావించారు. మహాలయ సందర్భంగా దుర్గాదేవి రాక్షసులను సంహరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తన స్పందనకు మరింత పదును పెట్టారు. చివరగా ‘జై హింద్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ తన పోస్టును ముగించారు.ఈ వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, నటుడు కమల్ హాసన్ కూడా స్పందించారు. ఇదీ చదవండి: మునీర్ కోసం ఢిల్లీకి పాక్ రాయబారి.. అసలేం జరుగుతోంది? -
ఇక ‘సెల్ఫ్ డ్రైవింగ్’ కాదు.. టెస్లా కొత్త ఎత్తుగడ!
సెల్ఫ్ డ్రైవింగ్.. వాహన రంగంలో కొత్తగా విస్తరిస్తున్న టెక్నాలజీ. వాహనాన్ని మనుషులెవరూ నడపకుండా తానంతట తానే నడిచే వ్యవస్థ. అభివృద్ధి చెందిన దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు ఇప్పుడిప్పుడే క్రేజ్ పెరుగుతోంది. అదే సమయంలో సాంకేతిక లోపాల కారణంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లతో అక్కడక్కడా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ సెల్ప్ డ్రైవింగ్ టెక్నాలజీ కొన్ని దేశాల్లో వివాదాస్పదం కూడా అవుతోంది.ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తన డ్రైవర్ సహాయక సాంకేతికత మార్కెటింగ్‌లో కీలక మార్పు చేస్తోంది. ఇప్పటివరకు వివాదాస్పదంగా ఉన్న ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ (FSD) పేరుకు బదులుగా ఐరోపాలో ‘టెస్లా అసిస్టెడ్ డ్రైవింగ్’ అనే కొత్త పేరును ఉపయోగిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం.. ఆటోపైలట్ తరహా సాంకేతికతపై నియంత్రణ సంస్థల నుంచి పెరుగుతున్న అభ్యంతరాలు. ఈ మార్పుతో ఐరోపా మార్కెట్లో తన డ్రైవర్ సహాయక వ్యవస్థకు అనుమతులు పొందే ప్రక్రియ సులభమవుతుందన్నది కంపెనీ ఆశగా కనిపిస్తోంది.డ్రైవర్ పర్యవేక్షణ తప్పనిసరిటెస్లా అసిస్టెడ్ డ్రైవింగ్ వ్యవస్థ స్టీరింగ్, వేగ నియంత్రణ, బ్రేకింగ్, పార్కింగ్ వంటి పనుల్లో డ్రైవర్‌కు సహాయపడుతుంది. అయితే, దీనిని పూర్తిస్థాయి స్వయంచాలక డ్రైవింగ్ వ్యవస్థగా పరిగణించకూడదు. వాహనం నడుస్తున్నంతసేపూ డ్రైవర్ రహదారిపై దృష్టి పెట్టాలి. అవసరమైనప్పుడు వెంటనే నియంత్రణ చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలి. పేరు మారినంత మాత్రాన సాంకేతిక సామర్థ్యాలు లేదా డ్రైవర్ బాధ్యతల్లో మార్పు వచ్చినట్లు కాదు.జర్మనీ అభ్యంతరాలతో మొదలైన మార్పుటెస్లా కొత్త పేరును స్వీకరించేందుకు అంగీకరించినట్లు జర్మనీ రవాణా మంత్రిత్వ శాఖ అక్టోబర్ 6న వెల్లడించింది. ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ అనే పేరు వాహనం పూర్తిగా తనంతట తానే నడుస్తుందనే అభిప్రాయాన్ని కలిగించవచ్చని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్లోవేకియా వంటి దేశాల్లోని టెస్లా వెబ్సైట్లలో కొత్త పేరు కనిపిస్తోంది. అయితే, అమెరికాలో మాత్రం ఈ ఫీచర్‌ను ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (సూపర్వైజ్డ్)’ పేరుతోనే అందిస్తున్నారు.స్వీడన్, ఇటలీ వంటి దేశాల్లోనూ ఈ వ్యవస్థ మార్కెటింగ్ తీరుపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వినియోగదారులు వాహన సామర్థ్యాలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రశ్నించారు. అంటే, టెస్లా ఎదుర్కొంటున్న సమస్య కేవలం పేరుకు సంబంధించినది మాత్రమే కాదు.. వాహనం వాస్తవంగా ఎంతవరకు స్వయంగా నడపగలదనే అంశం కూడా ఇందులో కీలకంగా మారింది.ఐరోపా అనుమతుల కోసం మస్క్ ప్రయత్నాలుటెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఈ సాంకేతికతకు ఐరోపా అంతటా అనుమతులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం టెస్లా వినియోగదారులు, మద్దతుదారులు ఆయా దేశాల నియంత్రణ సంస్థలను సంప్రదించాలని కంపెనీ ప్రోత్సహించింది. అయితే, సాంకేతికత భద్రత, వేగ పరిమితుల అనుసరణ, డ్రైవర్ పర్యవేక్షణ వంటి అంశాలపై ఇంకా చర్చ కొనసాగుతోంది.ప్రస్తుతం కొన్ని యూరోపియన్ దేశాల్లో ఈ వ్యవస్థకు జాతీయ స్థాయిలో అనుమతులు లభించినప్పటికీ, ఐరోపా సమాఖ్య అంతటా ఒకే విధంగా అనుమతి ఇవ్వడంపై నిర్ణయం వాయిదా పడింది. అక్టోబరులో జరగాల్సిన కీలక ఓటింగ్ కనీసం డిసెంబర్ వరకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫ్రాన్స్ సహా కొన్ని దేశాలు మరిన్ని పరీక్షలు, భద్రతా పరిశీలనలు కోరుతున్నాయి.మొత్తానికి, టెస్లా తన డ్రైవర్ సహాయక సాంకేతికతకు పేరు మార్చడం ఐరోపాలో విస్తరణకు మార్గం సుగమం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే, కొత్త పేరు పెట్టడం ఒక్కటే సరిపోదు. భద్రతా ప్రమాణాలు, నియంత్రణ సంస్థల అభ్యంతరాలు, డ్రైవర్ బాధ్యతలకు సంబంధించిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభించినప్పుడే ఈ వ్యవస్థకు విస్తృత స్థాయిలో అనుమతులు దక్కే అవకాశం ఉంటుంది. -
బీజేపీ–రిలయన్స్ లింక్.. మస్క్‌పై భారతీయుల ఫైర్!
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రవేశంపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా కొత్త రచ్చకు కారణమయ్యారు. రిలయన్స్, దానితో సంబంధాలున్న సంస్థలు అధికార బీజేపీకి భారీగా విరాళాలు ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో స్టార్‌లింక్ వివాదం కాస్తా.. రాజకీయ మలుపు తీసుకుంది. భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు అనుమతుల విషయంలో జాప్యం జరుగుతోందంటూ ఎలాన్ మస్క్ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో గుత్తాధిపత్యం ప్రదర్శించే కొందరు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలకు దిగారాయన. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల సంస్థలు భద్రతా నిబంధనలు, నియంత్రణ ప్రమాణాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. స్టార్లింక్తోపాటు ఇతర సంస్థలకూ భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు వంటి అంశాలు కీలకంగా ఉన్నాయని గుర్తు చేసింది. రాహుల్ ఎంట్రీ! డియర్ పీఎం అంబానీ అంటూ.. ఆ వెంటనే ఎలాన్ మస్క్ ‘ఆ బాస్ అంబానీయేనా?’ అంటూ ట్వీట్ చేయగా దానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. వెల్కమ్ టు ఇండియా మస్క్.. ఇంకో పేరు త్వరలోనే బయటకు వస్తుందంటూ రీట్వీట్ చేశారు. దానికిగానూ రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పిన మస్క్.. ఇది నిజంగా భయంకరంగా ఉంది అంటూ మరో బదులు ఇచ్చారు.ఈ నేపథ్యంలో అంబానీని ఉద్దేశిస్తూ గత రాత్రి.. ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. భారత్‌కు అసలు బాస్ మీరేనని గుర్తించలేకపోయినందుకు క్షమించండి’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. భారత మార్కెట్లో స్టార్‌లింక్ పోటీని అనుమతించాలని కోరారు. ఇంటర్నెట్ సౌకర్యాలు అందని ప్రాంతాలకు తమ సేవలు చేరితే పిల్లలకు విద్యావకాశాలు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలుగుతాయని పేర్కొన్నారు.Dear Prime Minister Ambani, Please accept my humble apologies for not realizing that you are the real boss of India. Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of India, but would you nonetheless consider allowing Starlink to compete? There are many areas of India, as there are in all countries, with no Internet access, which denies children the opportunity for education and for small businesses the opportunity to sell their goods to a global market. Starlink would change their lives for the better. Thank you 🙏— Elon Musk (@elonmusk) October 9, 2026బీజేపీ ప్రచారానికి రిలయన్స్ ఫండ్స్..ఇప్పుడు మస్క్ తాజాగా షేర్ చేసిన కథనాల్లో ఒకటి అల్‌జజీరా 2022 మార్చి 14న ప్రచురించిన పరిశోధనాత్మక కథనం. ‘హౌ ఏ రిలయన్స్-ఫండెడ్ ఫర్మ్ బూస్ట్స్ బీజేపీస్ క్యాంపెయిన్స్ ఆన్ ఫేస్బుక్’ను మస్క్ ఇప్పుడు షేర్ చేశారు. అలాగే మస్క్ షేర్ చేసిన మరో కథనం 2024 మార్చి 21న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ‘రిలయన్స్-లింక్డ్ క్విక్ సప్లై గేవ్ రూ.385 కోట్లు టు బీజేపీ, రూ.25 కోట్లు టు శివసేన’ పేరిట ప్రచురితమైంది. రిలయన్స్‌తో సంబంధాలు ఉన్న క్విక్ సప్లై అనే కంపెనీ బీజేపీకి వందల కోట్ల విరాళాలు ఇచ్చిందన్నది ఆ కథనం సారాంశం. https://t.co/DJYynAyO0W— Elon Musk (@elonmusk) October 10, 2026మస్క్ వ్యవహారశైలిపై నెటిజన్ల ప్రశ్నలుఅంబానీని లక్ష్యంగా చేసుకుని పాత కథనాలను షేర్ చేస్తున్న మస్క్ తీరుపై కొందరు భారతీయ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ పార్టీలకు ఇలాంటి ఫండింగ్‌లు సర్వసాధారణమేని గుర్తు చేస్తున్నారు. బీజేపీకి మాత్రమే కాదని.. ఇతర పార్టీలకు కూడా అలాంటి వ్యాపారవేత్తలు విరాళాలు ఇస్తుంటారని అంటున్నారు. అంతెందుకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా మస్క్ కూడా భారీగా ఖర్చు చేశారంటూ కొందరు అందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను పోస్టు చేస్తున్నారు. ఇతరుల రాజకీయ సంబంధాలు, విరాళాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పుడు.. తన రాజకీయ మద్దతు, ఖర్చులపైనా అదే ప్రమాణం వర్తించాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.స్టార్‌లింక్ వివాదం.. రాజకీయ విరాళాల చర్చస్టార్లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు అవసరమైన అనుమతులపై మొదలైన వివాదం ఇప్పుడు కార్పొరేట్ గుత్తాధిపత్యం, రాజకీయ పార్టీలకు అందే విరాళాలు, ఎన్నికల ప్రచారంలో సంస్థల పాత్ర వంటి విస్తృత అంశాలపై చర్చకు దారితీసింది. అంబానీపై మస్క్ చేసిన ‘డియర్ పీఎం అంబానీ’ వ్యాఖ్యకు తోడు, పాత కథనాలను ఆయన మళ్లీ షేర్ చేయడం.. దానికి భారతీయుల కౌంటర్ ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌పై స్టార్ నటుడి ఫైర్ -
‘మీరా మాకు నీతులు చెప్పేది’ .. మస్క్‌పై కమల్ ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ గురించి చేసిన వ్యాఖ్యలపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. ‘భారత్‌ను ముకేశ్ అంబానీ కంట్రోల్ చేస్తున్నారా?’ అంటూ మస్క్ చేసిన కామెంట్స్‌పై ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.భారత సార్వభౌమత్వాన్ని, దేశ ప్రయోజనాలను ప్రశ్నించేలా మస్క్ మాట్లాడటం పట్ల కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశ పాలసీని కూడా ఏ బిలియనీర్ నిర్దేశించకూడదు. అది అమెరికా బిలియనీర్ (ఎలాన్ మస్క్) అయినా సరే ఇది వర్తిస్తుంది. మా దేశ భవిష్యత్తును మేమే స్వయంగా నిర్ణయించుకుంటాం. అంతే తప్ప బయటి వ్యక్తులు కాదు.చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై స్వయంగా 100శాతంం టారిఫ్స్ విధిస్తున్న అమెరికా.. మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ ఏ దేశానికీ కాలనీ కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ. ఏ దేశమైనా సరే తమ స్వంత ప్రయోజనాలకు, జాతీయ భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మాకు కూడా జాతీయ భద్రతే అత్యంత ముఖ్యం అని కమల్ హాసన్ స్పష్టం చేశారు.ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను ఖండిస్తూ కమల్ హాసన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దేశ ప్రయోజనాల విషయంలో విదేశీ బిలియనీర్ల జోక్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. Mr. Musk, yes, no billionaire should dictate a nation’s policy - Indian or American. India must welcome competition in satellite internet, from Indian and global providers, whoever offers the most practical and affordable last-mile solution for those in remote regions. In countries with lower per-capita incomes, satellite internet must be affordable too. High subscription fees and equipment costs risk putting it beyond the reach of ordinary households. Connectivity must bridge the digital divide, not create a new one. India knows our networks and spectrum are strategic infrastructure, not merely commercial assets. India’s national security safeguards are non-negotiable. Every country makes choices based on its own interests. Those in the West cannot preach free markets while practicing protectionism at home. USA imposed 100% tariffs on Chinese EVs to protect its domestic industry, just as India takes measures to protect its own domestic manufacturers. Both India and the US have restricted Huawei over security concerns. One cannot demand a level playing field from others only when it suits its own agenda. Indians will internally debate, question and address our strengths and shortcomings as a democratic country. Take BharatNet, India’s programme to bring broadband to village-level local bodies. We will question why, as the CAG’s 2026 audit report found, the programme is struggling to meet its original objectives. Why were only 33.2% of service-ready Gram Panchayats operational, despite ₹39,888 crore being spent? At the same time, we know to appreciate our telecom sector and regulations, which has made internet data among the world’s most affordable, bringing millions online. India is a democracy, not a colony. We welcome the world, but we, the Indian people, will decide our own future - not Western vested interests, their double standards or any billionaire - Indian or American.— Kamal Haasan (@ikamalhaasan) October 9, 2026 -
ఎలాన్ మస్క్‌పై కమల్ హాసన్ ఫైర్!
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారత్ టెలికాం రంగంపై ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో తన స్టార్‌లింక్ సంస్థకు భారత్‌లో లైసెన్స్ మంజూరు కావడంలో జరుగుతున్న జాప్యంపై ఆయన నేరుగా ముఖేష్ అంబానీ పేరును ప్రస్తావించారు. దీనిపై పలువురు రియాక్ట్ అయ్యారు.తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ.. ''మిస్టర్ మస్క్.. భారతీయుడైనా, అమెరికన్ అయినా ఏ బిలియనీర్ కూడా ఒక దేశ విధానాలను శాసించకూడదు” అంటూ.. శాటిలైట్ ఇంటర్నెట్, దేశ భద్రత, దేశీయ పరిశ్రమల రక్షణ, అమెరికా ద్వంద్వ ప్రమాణాలు, భారత్‌నెట్ కార్యక్రమంలోని లోపాలు వంటి అంశాలను ప్రస్తావించారు.సుదూర ప్రాంతాల్లోని వారికి తక్కువ ధరలో పరిష్కారం ఎవరు అందించినా.. భారత్ స్వాగతించాలి. తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలలో కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సరసమైనదిగా ఉండాలి. కనెక్టివిటీ అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించాలి, అంతేగానీ కొత్త అంతరాన్ని సృష్టించకూడదని కమల్ హాసన్ పేర్కొన్నారు.మన నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రమ్ కేవలం వాణిజ్య ఆస్తులు కాదని, అవి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలని భారతదేశానికి తెలుసు. ప్రతి దేశం తన సొంత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పాశ్చాత్య దేశాలు తమ దేశంలో సంరక్షణవాదాన్ని పాటిస్తూ స్వేచ్ఛా మార్కెట్ల గురించి బోధించలేవు. అమెరికా తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై 100% సుంకాలను విధించింది, అదేవిధంగా భారతదేశం కూడా తన దేశీయ తయారీదారులను రక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ఇండియా, అమెరికా రెండూ ఆంక్షలు విధించాయి.ఇదీ చదవండి: భారత్ స్టార్‌లింక్ పంచాయితీలో బిగ్ ట్విస్ట్!ప్రజాస్వామ్య దేశంగా మన బలాలు, బలహీనతల గురించి భారతీయులు అంతర్గతంగా చర్చించుకుంటారు, ప్రశ్నించుకుంటారు, పరిష్కరించుకుంటారు. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం, వలస దేశం కాదు. మేము ప్రపంచాన్ని స్వాగతిస్తాం, కానీ మా భవిష్యత్తును మేమె, భారత ప్రజలమే నిర్ణయించుకుంటామని కమల్ హాసన్ స్పష్టం చేశారు.Mr. Musk, yes, no billionaire should dictate a nation’s policy - Indian or American. India must welcome competition in satellite internet, from Indian and global providers, whoever offers the most practical and affordable last-mile solution for those in remote regions. In countries with lower per-capita incomes, satellite internet must be affordable too. High subscription fees and equipment costs risk putting it beyond the reach of ordinary households. Connectivity must bridge the digital divide, not create a new one. India knows our networks and spectrum are strategic infrastructure, not merely commercial assets. India’s national security safeguards are non-negotiable. Every country makes choices based on its own interests. Those in the West cannot preach free markets while practicing protectionism at home. USA imposed 100% tariffs on Chinese EVs to protect its domestic industry, just as India takes measures to protect its own domestic manufacturers. Both India and the US have restricted Huawei over security concerns. One cannot demand a level playing field from others only when it suits its own agenda. Indians will internally debate, question and address our strengths and shortcomings as a democratic country. Take BharatNet, India’s programme to bring broadband to village-level local bodies. We will question why, as the CAG’s 2026 audit report found, the programme is struggling to meet its original objectives. Why were only 33.2% of service-ready Gram Panchayats operational, despite ₹39,888 crore being spent? At the same time, we know to appreciate our telecom sector and regulations, which has made internet data among the world’s most affordable, bringing millions online. India is a democracy, not a colony. We welcome the world, but we, the Indian people, will decide our own future - not Western vested interests, their double standards or any billionaire - Indian or American.— Kamal Haasan (@ikamalhaasan) October 9, 2026 -
భారత్ స్టార్‌లింక్ పంచాయితీలో బిగ్ ట్విస్ట్!
భారత్‌లో తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విషయంలో ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గుత్తాధిపత్యం ప్రదర్శించే వ్యాపార శక్తులు అడ్డుకుంటున్నాయని.. అదెవరో అందరికి తెలుసని అన్నారు. ఆ తర్వాత అంబానీ పేరు ప్రస్తావించారు. అయితే.. భారత ప్రభుత్వం మాత్రం అవన్ని ఆరోపణలని తోసిపుచ్చింది. ఈలోపే ఈ ఎపిసోడ్లో ఓ బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది.స్టార్‌లింక్‌కు అనుమతి ఇవ్వాలని ఎలాన్ మస్క్ పట్టుబడుతుంటే.. ఆయన సొంత ఏఐ చాట్‌బాట్ గ్రోక్ మాత్రం ఆ సేవల్లోని లోపాలను ఎత్తి చూపింది. స్టార్‌లింక్‌కు.. భారత్ అనుమతి ఇస్తే ఎదురయ్యే ప్రతికూలతలు ఏమిటి?, అని ఓ వినియోగదారు అడగ్గా.. జాతీయ భద్రత, డేటాపై నియంత్రణ, అధిక ధరలు, విదేశీ సంస్థపై ఆధారపడటం వంటి అంశాలను గ్రోక్ ప్రస్తావించింది. దీంతో.. స్టార్‌లింక్ కోసం మస్క్ చేస్తున్న ప్రయత్నాల వేళ, ఆయన సొంత చాట్‌బాట్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.స్టార్‌లింక్ ప్రధాన లక్ష్యంమస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ నిర్వహిస్తున్న స్టార్‌లింక్.. భూమికి సమీప కక్ష్యలోని వేలాది ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. సంప్రదాయ మొబైల్ నెట్‌వర్క్‌లు, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ చేరవేయడం దీని ప్రధాన లక్ష్యం. అయితే.. కీలక సమాచార వ్యవస్థపై విదేశీ సంస్థకు నియంత్రణ ఉండటం జాతీయ భద్రత పరంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని గ్రోక్ పేర్కొంది.సరిహద్దు ప్రాంతాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో సేవలను నిలిపివేయాల్సి వస్తే.. వాటిపై భారత్‌కు ఎంతవరకు నియంత్రణ ఉంటుంది?, సంక్షోభ సమయాల్లో నెట్వర్క్ అందుబాటును ఎలా నిర్ధారించాలి?, వంటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాలను అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశాలపైన భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ చర్చ గుర్తుచేస్తోంది.గ్రోక్ ప్రస్తావించిన మరో అంశం డేటాపై అధికారం. అంటే.. భారతీయుల సమాచారంపై దేశానికి చట్టబద్ధమైన నియంత్రణ ఉండటం. స్టార్‌లింక్ ఉపగ్రహాల మధ్య అనుసంధానం, అంతరిక్షంలోని లేజర్ లింకుల ద్వారా డేటా ప్రసారం వంటి సాంకేతికతలు సమాచార ప్రవాహాన్ని సంక్లిష్టం చేయవచ్చు. దీంతో.. చట్టబద్ధమైన పర్యవేక్షణ, అవసరమైనప్పుడు సమాచారాన్ని పొందడం వంటి అంశాల్లో సవాళ్లు తలెత్తే అవకాశం ఉంటుంది.అయితే.. భారత ప్రభుత్వం ఇప్పటికే శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించిన భద్రతా నిబంధనలను నిర్దేశించింది. దేశీయ వినియోగదారుల ట్రాఫిక్‌ను విదేశీ గేట్‌వేల ద్వారా మళ్లించకూడదని, భారతీయ డేటాను విదేశాల్లో కాపీ చేయడం వంటి వాటిపై ఆంక్షలు ఉన్నాయని కేంద్రం గతంలో పార్లమెంటుకు తెలిపింది. కాబట్టి.. డేటా భద్రత విషయంలో ప్రశ్నలున్నప్పటికీ, వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి నిబంధనలు ఉండాలన్నదే అసలు అంశం.సామాన్యులకు అందుబాటులో ఉంటుందా?స్టార్‌లింక్ సేవలు.. సామాన్య వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంటాయా? అనేది ముఖ్యమైన ప్రశ్న. శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాల కొనుగోలు ఖర్చు, నెలవారీ చందా కలిపి సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ ఇంటర్నెట్ సేవల కంటే ఎక్కువయ్యే అవకాశం ఉందని గ్రోక్ పేర్కొంది. భారత్‌లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ వంటి సంస్థలు అందిస్తున్న సేవలతో పోలిస్తే.. స్టార్‌లింక్ ధరలు ఎలా ఉంటాయన్నది వినియోగదారులకు కీలకం కానుంది.ముఖ్యంగా.. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడమే స్టార్‌లింక్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. అయితే, ధరలు ఎక్కువగా ఉంటే, ఆ సేవలు అవసరమైన వారిలో ఎంతమంది వినియోగించుకోగలరన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరోవైపు, భౌగోళికంగా చేరుకోవడం కష్టమైన ప్రాంతాల్లో.. శాటిలైట్ ఇంటర్నెట్ ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ధరల అంశాన్ని సేవల ప్రయోజనాలతో కలిపి పరిశీలించాల్సి ఉంటుంది.దేశీయ సంస్థలకు పోటీ.. గ్రోక్ హెచ్చరిక!భారత్‌లో ఇప్పటికే టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లో పలు సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ మార్కెట్లో స్టార్‌లింక్ ప్రవేశిస్తే పోటీ పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో.. కీలక సమాచార మౌలిక సదుపాయాల కోసం ఒక విదేశీ సంస్థపై అధికంగా ఆధారపడటం దీర్ఘకాలంలో సమస్యగా మారవచ్చని గ్రోక్ హెచ్చరించింది.అయితే.. పోటీ పెరగడం వల్ల వినియోగదారులకు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం నాణ్యమైన ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కొత్త సేవలు ఉపయోగపడవచ్చు. ఈ నేపథ్యంలో దేశీయ సంస్థలతో పోటీ, వినియోగదారులకు అందే ప్రయోజనాలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నియంత్రణ మధ్య సమతుల్యత సాధించడం కీలకం.మస్క్ వాదనస్టార్లింక్కు భారత్‌లో అనుమతులు ఆలస్యమవుతున్నాయంటూ.. మస్క్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు బడా వ్యాపారవేత్తలు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించిన అనుమతుల విధానం న్యాయంగా, వివక్ష లేకుండా అమలవుతోందని, మూడు సంస్థలు దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: రాజీనామా లెటర్‌తో బాస్‌కు షాక్.. బయటపడ్డ అసలు నిజం! -
పొరపాటున కూడా ‘ఏఐ’ అనొద్దు.. అన్నారో ఇక అంతే!: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధస్సు(AI-ఏఐ) అనే పదానికి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనాలని సూచించారు. కాదని పాత పదాన్ని ఉపయోగించేవారిని శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఏం చేస్తారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ఏఐపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ పేరు మార్పు ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆర్టిఫిషియల్’ అనే పదం ఈ సాంకేతికతను తక్కువ చేసి చూపిస్తోందని, ప్రస్తుత సాంకేతిక సామర్థ్యాలను ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదమే బాగా వివరిస్తుందని ఆయన వాదిస్తున్నారు. సెప్టెంబర్ 29న ఆయన సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం.. అమెరికా ప్రభుత్వ విభాగాలు అధికారిక సమాచారంలో ఏఐ(AI), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదాలకు బదులుగా ఎస్ఐ(SI), సూపర్ ఇంటెలిజెన్స్ పదాలను ఉపయోగించాలి.మస్క్ కూడా ఓకే అన్నారు!ట్రంప్ ఆలోచనకు ఆయన సన్నిహితుడు, స్పేస్ఎక్స్ ఏఐ విభాగం అధిపతి ఎలాన్ మస్క్ కూడా మద్దతు పలికారు. తన సంస్థ పేరును ‘స్పేస్ఎక్స్ఏఐ’ నుంచి ‘స్పేస్ఎక్స్ఎస్ఐ’గా మార్చుతారా? అని ఓ ఎక్స్ వినియోగదారు అడగ్గా.. ‘అవును, ఆ మార్పు చేస్తాం’ అని మస్క్ బదులిచ్చారు. అయితే, పేరు మార్పునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.విమర్శలకు సమాధానంగానే.. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్న కొద్దీ దాని భద్రత, దుర్వినియోగం, నియంత్రణపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. ప్రభుత్వ వెబ్సైట్లు, కంపెనీల వ్యవస్థలపై ఏఐ ఆధారిత దాడుల ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ సాంకేతికతపై ప్రజల్లో భయాలు, వ్యతిరేకత పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో దాని పేరును సానుకూలంగా మార్చడం ద్వారా ప్రజల దృష్టిని దాని అవకాశాలవైపు మళ్లించాలని ట్రంప్ భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వెబ్సైట్లోనూ మార్పులుట్రంప్ ఆదేశాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ ఏఐ వెబ్సైట్లోనూ ‘SI’ అనే పదాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు. అయితే వెబ్సైట్ చిరునామా మాత్రం ‘AI.gov’గానే ఉంది. మరోవైపు, వైట్‌హౌస్‌లోని కొన్ని వెబ్పేజీల్లో ఇప్పటికీ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదం కనిపిస్తుండటం గమనార్హం.ఏఐపై నియంత్రణ వద్దు..అమెరికా ఏఐ రంగంలో ముందంజలో ఉందని, చైనాతో పోటీలో వెనుకబడకుండా ఈ సాంకేతికత అభివృద్ధిని వేగవంతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ రంగంలోని కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించగలవని ఆయన గతంలో పేర్కొన్నారు. అయితే ఏఐ భద్రతపై ప్రభుత్వ నియంత్రణలు అవసరమనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. పేరును మార్చడం వల్ల సాంకేతికతపై ఉన్న భద్రతా సందేహాలు తొలగిపోతాయా? లేదంటే ఇది కేవలం ప్రచార వ్యూహంగానే మిగిలిపోతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: మిడ్ టర్మ్‌లో ట్రంప్‌కు ఘోర పరాభవం తప్పదా? -
భారత్‌కు ‘స్టార్‌లింక్’ నిజంగా సంజీవనియా..?
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న భారత్‌లో ఇప్పుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ గురించి చర్చ సాగుతోంది. పందిరి వేస్తే గానీ నీడ రాదు అన్నట్లుగా, మొబైల్ టవర్లు లేదా ఫైబర్ కేబుళ్లు ఉంటే గానీ నెట్వర్క్ రాని ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా అంతరిక్షం నుంచే సిగ్నల్స్ అందించే ఉపగ్రహ ఇంటర్నెట్ ఒక అద్భుతంలా కనిపిస్తోంది. అయితే, భారత్‌లాంటి భారీ మార్కెట్‌కు స్టార్‌లింక్ అత్యవసరమా? లేక మన స్వదేశీ టెలికం దిగ్గజాలే ఈ అవసరాన్ని తీర్చగలవా? అనే విశ్లేషణ ఇప్పుడు తప్పనిసరి.దేశంలో స్టార్‌లింక్ అవసరం నిజంగా ఉందా?భారతదేశంలో పట్టణాలు, నగరాల్లో 5జీ సేవలు చేతిలో వైకుంఠంలా అందుబాటులో ఉన్నప్పటికీ అడవులు, కొండ ప్రాంతాలు, సరిహద్దు గ్రామాల్లో పరిస్థితి అడివి కాచిన వెన్నెలగానే ఉంది. దట్టమైన భూభాగాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేయడం లేదా టవర్లు నిర్మించడం ఆర్థికంగా భారంతో కూడుకున్న పని. ఇటువంటి భౌగోళిక ప్రతిబంధకాలు ఉన్న ప్రాంతాలకు శాటిలైట్ కమ్యూనికేషన్ ఏకైక ప్రత్యమ్నాయం. విపత్తు సమయాల్లో సాధారణ టవర్లు కూలిపోయినా, శాటిలైట్ ఇంటర్నెట్ నిరంతరాయంగా పనిచేస్తుంది. ఈ రకంగా చూస్తే స్టార్‌లింక్ సేవలు భారత్‌లో అవసరమేనని కొందరు విశ్వసిస్తున్నారు.స్వదేశీ సంస్థలు లేవా? భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు కూడా ఉన్నాయి. మన స్వదేశీ టెలికం దిగ్గజాలు ఇప్పటికే ఈ రేసులో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, వన్‌వెబ్ భాగస్వామ్యంతో లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ నెట్‌వర్క్‌ను భారత్‌కు అందించేందుకు సన్నద్ధమైంది. రిలయన్స్ జియో లక్సెంబర్గ్ సంస్థ ఎస్ఈఎస్తో కలిసి జియో స్పేస్లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ అందిచేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. బీఎస్ఎన్ఎల్ కొండ ప్రాంతాల్లో ఇప్పటికే ఉపగ్రహాల ద్వారా సేవలు అందిస్తోంది.ధరలు గ్రామీణులకు అందుబాటులో ఉంటాయా?ఇక్కడే అసలు ‘నెయ్యి తిన్న వాడు ఒకడైతే, మూతి నాకిన వాడు మరొకడు’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. స్టార్‌లింక్ సర్వీసులకు నెలకు సుమారు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు టారిఫ్‌లు ఉండొచ్చు(ఇది అంచనా మాత్రమే). పైగా ప్రారంభ పరికరాల (డిష్, రౌటర్) ధర దాదాపు రూ.30,000-రూ.35,000 వరకు ఉంటుందని అంచనా. మన దేశంలో ప్రతి నెలా సుమారు రూ.400లకే అపరిమిత డేటాను పొందుతున్న సగటు గ్రామీణ వినియోగదారుడికి ఈ ధరలు ఎండమావులే. దీనికి భిన్నంగా జియో, ఎయిర్‌టెల్‌లు భారతదేశంలో లభ్యమయ్యే స్పెక్ట్రమ్ ద్వారా ధరలను చౌకగా ఉంచగలవని కొందరు చెబుతున్నారు. బీ2బీ లేదా ప్రభుత్వ ప్రాజెక్టులకు తప్ప స్టార్‌లింక్ నేరుగా గ్రామీణ ప్రజలకు ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి.స్థానిక కంపెనీలు ఉన్నా స్టార్‌లింక్‌పై ఎందుకింత హైప్?ఎలాన్ మస్క్ బ్రాండ్ ఇమేజ్, ఆయన వ్యూహాత్మక మార్కెటింగ్ దీనికి ప్రధాన కారణం. భూమికి కేవలం 550 కి.మీ ఎత్తులో వేలాది చిన్న ఉపగ్రహాలను నిలిపి లో-లేటెన్సీతో వేగవంతమైన ఇంటర్నెట్ అందించే స్టార్‌లింక్ సాంకేతికత గ్లోబల్ మార్కెట్లో నిరూపితమైంది. ప్రపంచవ్యాప్తంగా దాని సేవలు ప్రాచుర్యం పొందడం వల్ల భారత్‌లోనూ ఆ స్థాయిలో ఊహాగానాలు, క్రేజ్ ఏర్పడ్డాయి.స్థానిక వనరులతోనే గ్రామీణ భారత్‌కు ఇంటర్నెట్ ఇవ్వలేమా?కచ్చితంగా ఇవ్వవచ్చు! డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ కింద గ్రామ్నెట్, భారత్‌నెట్ ద్వారా లక్షలాది గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ చేరుతోంది. కొండలు, అడవుల్లో శాటిలైట్ ఇంటర్నెట్ను వై-ఫై హాట్‌స్పాట్‌గా మార్చి ఊరందరికీ పంచి ఇచ్చే పబ్లిక్ వై-ఫై నమూనాను అమలు చేయవచ్చు.మన స్పేస్ రీసెర్చ్ సంస్థ ఇస్రో ఉపగ్రహాల వనరులను, స్థానిక స్పెక్ట్రమ్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తే స్టార్‌లింక్ కంటే అత్యంత తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించవచ్చని కొందరు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.భారత్‌కు స్టార్‌లింక్ రాక పోటీని పెంచి, కమ్యూనికేషన్ రంగాన్ని మరింత వేగవంతం చేస్తుంది. అయితే ఇది సర్వరోగ నివారిణి కాదు. భవిష్యత్తులో స్టార్‌లింక్ భారత్‌లోకి వచ్చినా స్వదేశీ కంపెనీలను ప్రోత్సహిస్తూ, గ్రామీణ ఆర్థిక పరిస్థితులకు తగినట్లుగా ధరలను నియంత్రించినప్పుడే ‘అందరికీ ఇంటర్నెట్’ అనే లక్ష్యం నిజమైన రూపుదాల్చుతుంది.ఇదీ చదవండి: గిఫ్ట్ ఇస్తే వైద్యులు మందులు మారుస్తారా? -
అంబానీనే కాదు.. ఇంకో బాస్ కూడా ఉన్నాడా?
భారత్‌లో తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతులు రావడం లేదంటూ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దేశంలో అంబానీనే(ముకేశ్ అంబానీని ఉద్దేశించి) అసలు బాస్నా? అంటూ ఆయన సంధించిన ప్రశ్న ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే ఈ ప్రశ్నకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించగా.. వాళ్లిద్దరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది.‘భారత్‌కు స్వాగతం ఎలాన్.. ఇంకో వ్యక్తి గురించి తెలుసుకునే వరకు వేచి చూడండి’ అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ బదులిచ్చారు. దానికి మస్క్ స్పందిస్తూ.. ఇది నిజంగా ఆందోళనకరం అని అన్నారు. అయితే రాహుల్ ఎవరిపేరూ ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మస్క్ ఏమన్నారంటే..భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఎందుకు ఆలస్యమవుతున్నాయంటూ మస్క్ ప్రశ్నించారు. 165కి పైగా దేశాల్లో లైసెన్సులు పొందిన తమ సంస్థ.. భారత ప్రభుత్వ నిబంధనలను పాటించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇంకా అనుమతి ఎందుకు రాలేదని నిలదీశారు. ‘భారత్‌లో అసలు బాస్ అంబానీనా?’ అంటూ ముఖేశ్ అంబానీని ఉద్దేశించి ప్రశ్నించారు.అంతకుముందు కూడా భారత్‌లో తమ సంస్థ ప్రవేశాన్ని కొందరు శక్తిమంతమైన వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశ ప్రజలకు ప్రయోజనం కల్పించడం కంటే కొందరు వ్యాపారవేత్తల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వచ్చిన ఓ పోస్టును షేర్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.Thank you, Rahul. This is indeed troubling.— Elon Musk (@elonmusk) October 8, 2026‘ఇది నిజంగా ఆందోళనకరం’మస్క్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ.. ‘వెల్కమ్ టు ఇండియా, ఎలాన్. మరో వ్యక్తి గురించి తెలుసుకునే వరకు వేచి చూడండి’ అని పేర్కొన్నారు. దీనికి మస్క్ కూడా స్పందించారు. ‘థాంక్యూ, రాహుల్. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’ అంటూ బదులిచ్చారు.అయితే, రాహుల్ తన పోస్టులో ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. అదానీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ గతంలో పలుమార్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు అదానీని ఉద్దేశించినవిగా భావిస్తున్నారు.కేంద్రం ఏమంటోందంటే..మస్క్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతుల ప్రక్రియ నిష్పక్షపాతంగా, వివక్ష లేకుండా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అన్యాయంగా లేదా వివక్షాపూరితంగా ఉందన్న వాదనకు ఆధారాలు లేవని కేంద్ర సమాచార, ప్రసార వ్యవస్థల మంత్రిత్వ శాఖ పేర్కొంది.ప్రస్తుతం మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, రిలయన్స్ జియోకు చెందిన జియో శాట్‌కామ్, భారతి మద్దతున్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు లైసెన్సులు ఉన్నాయి. అయితే, అవసరమైన భద్రతా తనిఖీలు, స్పెక్ట్రమ్‌కు సంబంధించిన అనుమతులు పూర్తయ్యే వరకు ఏ సంస్థా వాణిజ్య సేవలను ప్రారంభించలేవని ప్రభుత్వం అంటోంది. అయినప్పటికీ మస్క్ మాత్రం పరోక్షంగా భారత ప్రభుత్వం ఇక్కడి ఒకట్రెండు కార్పొరేట్ శక్తుల చేతితో బంధీ అయ్యిందన్న రీతిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.ఇదీ చదవండి: గద్దె దిగకపోతే ప్రజలే దించుతరు -
భారత్ బాస్ అంబానీయేనా?
న్యూఢిల్లీ: భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి ఆ సంస్థ చీఫ్ ఎలాన్ మస్క్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. భారత్‌లో కొన్ని వ్యాపార శక్తులు తమను రానివ్వకుండా అడ్డుకుంటున్నాయంటూ బుధవారం నాడు పరోక్షంగా ఆరోపణలు చేసిన మస్క్ ..తాజాగా గురువారం నాడు నేరుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని టార్గెట్ చేశారు. భారత్‌కి అసలైన బాస్ అంబానీయేనా అని ప్రశ్నిస్తూ ఎటాక్‌కి దిగారు. ‘స్టార్లింక్కి 165 పైగా దేశాల్లో లైసెన్సులు ఉన్నాయి. భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి చట్టాన్ని, ప్రతి నిబంధనను గత ఐదేళ్లుగా పాటిస్తూనే వస్తున్నాం. అయినా సరే ఇప్పటివరకు లైసెన్సు ఎందుకివ్వలేదు? భారత్‌కి అసలైన బాస్ అంబానీయేనా?’అంటూ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తమ గుత్తాధిపత్యానికి ముప్పు కలుగుతుందనే భయంతో కొన్ని వ్యాపార శక్తులు భారత్‌లో స్టార్‌లింక్ సర్వీసులను అడ్డుకుంటున్నాయంటూ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించిన నేపథ్యంలో ఆయన మళ్లీ దాడికి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరోపణలు ఖండించిన కేంద్రం.. శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీలన్నింటికీ ఒకే తరహా రెగ్యులేటరీ, భద్రత నిబంధనలు ఉంటాయని, వాటిని అన్ని సంస్థలు పాటించి తీరాల్సిందేనని టెలికం శాఖ స్పష్టం చేసింది. శాట్‌కామ్ కంపెనీలన్నిటికీ టెలికం శాఖ ఇప్పటికే లైసెన్సులు, ప్రొవిజనల్ స్పెక్ట్రం ఇచ్చిందని, తదుపరి సెక్యూరిటీ క్లియరెన్స్ కేంద్ర హోంశాఖ దగ్గర పెండింగ్‌లో ఉందని, ఈ విషయంలో ఏ సంస్థ ప్రమేయమూ లేదని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని చెప్పారు. అయితే, టెలికం శాఖ వివరణ ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే మస్క్ మళ్లీ తీవ్ర ఆరోపణలు చేశారు. స్టార్‌లింక్ సర్వీసులను మణిపూర్‌లో మిలిటెంట్లు ఉపయోగించారన్న ఆరోపణలను ఖండిస్తూ.. భారత్‌లో తమ ఉపగ్రహ సిగ్నల్స్ స్విచ్చాఫ్ చేసి ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి ఉండదని తెలిపారు. ‘భారత్‌లో స్టార్‌లింక్ వస్తే, ప్రస్తుత ధరలను భరించలేని వారికి, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని చౌకగా అందించేందుకు వీలవుతుంది’అని మస్క్ చెప్పారు. మరోవైపు తమ సొంత శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ వన్‌వెబ్ కోసం తాము కూడా రెగ్యులేటరీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. కాగా మస్క్ తొలుత చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ నిరాకరించారు. వాటిని తాను చూడలేదని పేర్కొన్నారు. భారత్‌లో శాటిలైట్ సేవలను అందించడానికి సంబంధించి స్టార్‌లింక్, రిలయన్స్ జియోకి చెందిన జియో శాట్‌కామ్, భారతి ఎయిర్టెల్ పెట్టుబడులు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్‌కి ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చినప్పటికీ.. భద్రత, స్పెక్ట్రం పరమైన అనుమతుల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో ఏ కంపెనీ కూడా ఇంకా సరీ్వసులను ప్రారంభించలేదు. -
భారత్‌లో స్టార్‌లింక్.. ఐదేళ్లుగా అదే ట్విస్ట్!
సాక్షి,న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్‌లింక్’ భారత్‌లో తన సేవలను ప్రారంభించేందుకు గత ఐదేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అనేక నియంత్రణ సవాళ్లు, భద్రతా నిబంధనలు, వివాదాలను దాటుకుంటూ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. అయినప్పటికీ తన సంస్థను భారత్‌లో అడుగు పెట్టడం లేదని ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్స్ వేదికగా ముఖేష్ అంబానీని టార్గెట్ చేశారు. అయితే, ఈ ఐదేళ్ల ప్రయాణం, ఎదురైన అడ్డంకుల్ని పరిశీలిస్తే.. 2019-2020: భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే ప్రణాళికలపై స్పేస్ఎక్స్ దృష్టి సారించింది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.2021: భారత్‌లో ‘స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో అనుబంధ సంస్థను రిజిస్టర్ చేశారు. అయితే ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే కనెక్షన్ల కోసం ముందస్తు బుకింగ్‌లు స్వీకరించడంతో టెలికాం శాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో ప్రీ బుకింగ్‌లను నిలిపివేశారు.2022-2023: భారత ప్రభుత్వ కొత్త శాటిలైట్ కమ్యూనికేషన్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా డేటా లోకలైజేషన్ (సమాచారం దేశంలోనే భద్రపరచడం) సెక్యూరిటీ క్లియరెన్స్‌లపై చర్చలు జరిగాయి. విదేశీ పెట్టుబడులు, భద్రతా నిబంధనల కారణంగా లైసెన్స్ ప్రక్రియ ఆలస్యమైంది.2024: స్పేస్ సెక్టార్లో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేయడంతో, స్పెక్ట్రమ్ కేటాయింపు, లైసెన్సింగ్ ప్రక్రియ కోసం స్టార్‌లింక్ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది.2025: టెలికాం శాఖ నుంచి అధికారికంగా జీఎంపీసీఎస్ లైసెన్స్, అలాగే అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్ స్పేస్ నుంచి తుది ఆమోదం లభించింది. డిసెంబర్ నాటికి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు.2026: భారత్‌లో లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే 20 గేట్‌వే సైట్లను స్టార్‌లింక్ నిర్మించింది. డేటా సెక్యూరిటీ నిబంధనలను పూర్తి చేసి, ప్రస్తుతం స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించిన తుది ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు ఈ క్రమంలో భారత్‌లో స్టార్‌లింక్ లాంచ్ ఆలస్యం కావడంపై ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తమ సంస్థ సేవలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొద్దిమంది బిలియనీర్లు, వ్యాపార దిగ్గజాలు మార్కెట్‌పై తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం స్టార్‌లింక్‌ను నిరోధిస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందకుండా అడ్డుకోవడం భారత ప్రజల పట్ల జరుగుతున్న నేరం అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు.మస్క్ చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం (టెలికాం మంత్రిత్వ శాఖ) తీవ్రంగా ఖండించింది. స్టార్‌లింక్‌తో పాటు జియో, వన్‌వెబ్ వంటి అన్ని కంపెనీలకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపు, సెక్యూరిటీ క్లియరెన్స్‌లకు సంబంధించిన ప్రక్రియ అందరికీ ఒకే విధంగా నిష్పక్షపాతంగా జరుగుతోందని తేల్చిచెప్పింది. మస్క్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. -
అంబానీయే భారత్‌కు బాసా?!
న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారత్ టెలికాం రంగంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ‘స్టార్‌లింక్’ సంస్థకు భారత్‌లో లైసెన్స్ మంజూరు కావడంలో జరుగుతున్న జాప్యంపై ఆయన నేరుగా ముఖేష్ అంబానీ పేరును ప్రస్తావిస్తూ సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్‌లో దశాబ్దాలుగా టెలికాం, డేటా రంగం ఎదుగుదలపై ప్రముఖ డేటా సెంటర్ నిపుణుడు గగన్‌దీప్ సింగ్ సప్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..‘నేను భారత్‌లో గత 30 సంవత్సరాలకు పైగా డేటా కేంద్రాలను నిర్మించి నడుపుతున్నాను. మన దేశంలో ఇంటర్నెట్ డైల్ అప్ దశ నుండి గిగాబిట్ వేగంగా ఎదగడాన్ని నేను కళ్లారా చూశాను. అదే సమయంలో ఇక్కడ పోటీని ఎలా అడ్డుకుంటున్నారో కూడా నేను చూశాను’అని రాసుకొచ్చారు.ఈ పోస్ట్‌పై డాక్టర్ అనిరుద్ధ మలపాణి స్పందిస్తూ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.‘సామాన్య పౌరుల ప్రయోజనాల కంటే బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికే ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతోంది’ అని ఆయన మండిపడ్డారు. అనిరుద్ధ మలపాణి చేసిన ఈ వ్యాఖ్యలను, ఇతర చర్చలను ఉటంకిస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు.‘ప్రపంచవ్యాప్తంగా 165 దేశాలకు పైగా స్టార్‌లింక్‌కు లైసెన్స్ ఉంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క చట్టాన్ని, నిబంధనను గత ఐదేళ్లుగా మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము. అయినప్పటికీ ఇప్పటివరకు లైసెన్స్ ఎందుకు రాలేదు? భారత్‌లో అసలు బాస్ అంబానీయేనా? అని ప్రశ్నించారు. అసలు నేపథ్యం ప్రపంచంలోని అత్యంత లాభదాయకమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెలికాం మార్కెట్లలో భారత్ ఒకటి. ఇక్కడ జియో, ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. తమ సంస్థ దేశవ్యాప్తంగా గేట్వేలను ఏర్పాటు చేసి, అన్ని భద్రతా నిబంధనలను పాటించినప్పటికీ కేవలం కొన్ని కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యాన్ని కాపాడటానికే అనుమతులు అడ్డుకుంటున్నారని మస్క్ పరోక్షంగా ఆరోపిస్తున్నారు.కాగా, స్టార్‌లింక్ ఆరోపణలను తోసిపుచ్చిన కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, అన్ని లైసెన్స్ ప్రక్రియలు,భద్రతా తనిఖీలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఒక విదేశీ టెలికాం దిగ్గజం నేరుగా దేశీయ పారిశ్రామిక దిగ్గజం పేరును ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.Starlink is licensed in over 165 countries and has spent five years complying with every single law and requirement of the government of India, so why still no license? Is Ambani the real boss of India?— Elon Musk (@elonmusk) October 8, 2026 -
శాటిలైట్ ఇంటర్నెట్ పై ముదురుతున్న వివాదం
-
స్టార్ లింక్ పై ఇలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం కౌంటర్
-
ఎలాన్ మస్క్ ఆరోపణలకు భారత్ కౌంటర్
అమెరికా బిలియనీర్, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభాన్ని కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని.. వాళ్లెవరో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించింది.భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభాన్ని కొందరు ‘ఒలిగార్క్స్’(గుత్తాధిపత్య శక్తులు) అడ్డుకుంటున్నారంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ వ్యవస్థను అన్యాయంగా లేదా వివక్షతో కూడినదిగా పేర్కొనడం “నిరాధారమైన, తప్పుదోవ పట్టించే వాదన” అని పేర్కొంది. అందరికీ ఒకే నిబంధనలుభారత్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) లైసెన్స్‌లను మూడు సంస్థలకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో పాటు భారతి గ్రూప్ మద్దతున్న యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఈ లైసెన్స్ పొందాయి. అమెజాన్‌కు చెందిన లియో కూడా భారత మార్కెట్లోకి రావడానికి ప్రయత్నిస్తోంది.అయితే లైసెన్స్ పొందిన ప్రతి సంస్థ కూడా భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ తెలిపింది. వినియోగదారుల భద్రత, వారి డేటా రక్షణ తదితర అంశాలను నిర్ధారించేందుకే ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ మూడు సంస్థలకు సంబంధించి భద్రతా పరిశీలన కొనసాగుతోందని వెల్లడించింది.ఈ భద్రతా ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత సంస్థలు స్పెక్ట్రమ్ కేటాయింపునకు తదుపరి దశకు వెళ్లవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు.. ప్రస్తుతం లైసెన్స్ పొందిన మూడు సంస్థలూ దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల స్టార్‌లింక్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అనుమతులు నిలిపివేశారన్న ఆరోపణలకు ఆధారం లేదని తేల్చింది.మస్క్ ట్వీట్లో..అంతకుముందు మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో చేసిన ఓ పోస్టు ఈ వివాదానికి కారణమైంది. “భారత ప్రజలపై తమ గుత్తాధిపత్య పట్టు కొనసాగించేందుకు కొందరు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వాళ్లు ఎవరో మీరు ఊహించవచ్చు” అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది భారత ప్రజలపై జరుగుతున్న అన్యాయమని కూడా పేర్కొన్నారు. అయితే మస్క్ తన పోస్టులో ఎవరినీ నేరుగా పేరుతో ప్రస్తావించలేదు.భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టార్‌లింక్‌కు ఇప్పటికే GMPCS లైసెన్స్ లభించినప్పటికీ.. వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు ఇంకా భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు సహా కొన్ని తుది అనుమతులు అవసరమవుతున్నాయి.‘మేము సిద్ధంగా ఉన్నాం’మస్క్ ఆరోపణలకు కొన్ని గంటల ముందే స్టార్‌లింక్ ఇండియాలో సేవలు ప్రారంభించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని సంస్థ సీనియర్ అధికారి లారెన్ డ్రేయర్ తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్–2026లో మాట్లాడిన ఆమె.. భారత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు.భారత వినియోగదారుల డేటా దేశం దాటి బయటకు వెళ్లకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భారత్‌లో ఇప్పటికే అవసరమైన మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టామని.. సుమారు 20 గేట్‌వే సైట్లు, వందలాది యాంటెనాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సేవలు ప్రారంభించేందుకు తమ కార్యకలాపాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.భారత్‌లోని నియంత్రణ సంస్థలు, టెలికాం కంపెనీలు, పరిశ్రమ వర్గాలతో గత ఐదేళ్లుగా కలిసి పనిచేస్తున్నామని డ్రేయర్ తెలిపారు. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.అసలు సమస్య ఏంటి?స్టార్‌లింక్ ఇప్పటికే భారత ప్రభుత్వ అనుమతుల ప్రక్రియలో కీలక దశలను దాటినా.. తుది భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు వంటి అంశాలపై ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మరోవైపు వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ కూడా ఇదే నియంత్రణ వ్యవస్థలో కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ‘స్టార్‌లింక్‌ను మాత్రమే భారత్ అడ్డుకుంటోందా?’ అన్న మస్క్ ఆరోపణకు.. ‘అందరికీ ఒకే నిబంధనలు’ అంటూ కేంద్రం స్పష్టమైన కౌంటర్ ఇచ్చినట్లయింది.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న -
ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవ స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొన్ని బడాశక్తులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని, తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకే ఇలా చేస్తున్నాయని ఆరోపించారు. ఈ చర్య భారత ప్రజలపై జరుగుతున్న నేరం అంటూ వ్యాఖ్యానించారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.‘ఎలాన్.. ఆ గుత్తాధిపత్య శక్తులు(Oligarchs) ఎవరో పేర్లు బయటపెట్టండి. భారతదేశం తెలుసుకోవాలనుకుంటోంది. మన ప్రభుత్వంపై ఇంతటి పట్టు ఎవరికి ఉంది?’ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో మస్క్‌ను ప్రశ్నించారు.Elon, Name and shame the Oligarchs The Nation (India) wants to know who is got this stranglehold on our Government— KTR (@KTRBRS) October 7, 2026మస్క్ ఏమన్నారంటే..స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు ఇంకా తుది అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఎక్స్ ఖాతాలో భారత్‌కు స్టార్‌లింక్ అవసరమంటూ ఓ పెద్ద ట్వీట్ చేశాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ‘కొంతమంది గుత్తాధిపత్య శక్తులు భారత ప్రజలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వాళ్లు ఎవరో మీరు ఊహించవచ్చు. ఇది భారత ప్రజలకు జరుగుతున్న నేరం’ అని వ్యాఖ్యానించారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో మాత్రం మస్క్ పేర్లు వెల్లడించలేదు.మస్క్ వ్యాఖ్యలకు కొద్దిగంటల ముందే స్టార్‌లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత భద్రతా నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించామని, దేశవ్యాప్తంగా 20 గేట్‌వే సైట్లు, వందలాది యాంటెన్నాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. భారత వినియోగదారుల డేటాను దేశంలోనే ఉంచేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.అయితే స్టార్‌లింక్‌కు లైసెన్స్ ఉన్నప్పటికీ.. వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు స్పెక్ట్రమ్, భద్రతా అనుమతులు సహా మరికొన్ని తుది క్లియరెన్స్‌లు అవసరమవుతున్నాయి.కేటీఆర్ ప్రశ్నతో ఆసక్తి..ఇదే సమయంలో మస్క్ ‘గుత్తాధిపత్య శక్తులు’ అంటూ ఎవరినీ పేరు పెట్టకపోవడంతో.. అసలు ఎవరిని ఉద్దేశించి ఈ ఆరోపణలు చేశారు? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. కేటీఆర్ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ పేర్లు బయటపెట్టాలని మస్క్‌ను కోరారు.స్టార్‌లింక్ భారత్‌లోకి రావడం వెనుక ఇప్పటికే టెలికాం సంస్థల మధ్య పోటీ, స్పెక్ట్రమ్ కేటాయింపు, భద్రతా అనుమతులు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మస్క్ చేసిన తాజా ఆరోపణలు వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. అయితే మస్క్ ఆరోపణల్లో పేర్కొన్న ఆ శక్తులు ఎవరన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు.ఇదీ చదవండి: ఓటు హక్కును హరించే కుట్రే ఇది! -
భారత్‌లో స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు: ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: కొందరు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు భారత్‌లో స్టార్‌లింక్ సర్వీసులను అడ్డుకుంటున్నారంటూ అమెరికన్ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. 11,000 పైచిలుకు గ్రామాల్లో మొబైల్ కవరేజీ ఇంకా లేదంటూ డాడ్జ్డిజైనర్ అనే హ్యాండిల్ పేరిట సోషల్ మీడియా ఎక్స్‌లో వచ్చిన పోస్టుపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దురదృష్టవశాత్తూ కొందరు వ్యాపార దిగ్గజాలు, తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు మమ్మల్ని రానివ్వకుండా చేస్తున్నారు. మీకు తెలుసు వారెవరో. ఇది భారతదేళ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఘోర అపరాధం‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మే 2026 నాటికి భారత్‌లో 11,256 గ్రామాలకు 4జీ కవరేజీ లేదని, భారతీయులకు స్టార్‌లింక్ అవసరమని డాడ్జ్డిజైనర్ పోస్ట్ చేశారు. మరోవైపు, భారత్‌లో స్టార్‌లింక్ సర్వీసులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉన్నామంటూ మస్క్ సారథ్యంలోని స్పేస్ఎక్స్ ప్రకటించడం గమనార్హం. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అధికారికంగా ప్రారంభించనున్న తరుణంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
AIని పక్కన పడేసిన మస్క్.. నెక్స్ట్ ఇదే!
ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరుగుతున్న సమయంలో.. ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. స్పేస్ఎక్స్ఏఐ అనే స్పేస్ఎక్స్కు సంబంధించిన ఏఐ కార్యకలాపాలను స్పేస్ఎక్స్ఎస్ఐ(SpaceXSI)గా మార్చాలని సూచించారు.ఇక్కడ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మస్క్ మాత్రం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందిన మేధస్సును సూచించడానికి ఎస్ఐ (సూపర్ ఇంటెలిజెన్స్) అనే పదాన్ని సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ఏఐని సూపర్ ఇంటెలిజెన్స్ అనే పదంతో ప్రస్తావించడాన్ని ప్రోత్సహించారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ''నో మోర్ ఏఐ, ఎస్ఐ అనేది బెటర్'' అని అన్నారు.No more AI SI It’s better— Elon Musk (@elonmusk) October 4, 2026భారీగా పెరిగిన మస్క్ సంపదటెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా మరోసారి ఒక ట్రిలియన్ డాలర్లు సంపదను దాటారు. ఆయన సంపద పెరగడానికి ప్రధాన కారణం.. టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల విలువలు గణనీయంగా పెరగడమే అని తెలుస్తోంది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. సోమవారం ఒక్కరోజులోనే మస్క్ సంపద సుమారు 65 బిలియన్ డాలర్లు పెరిగి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో టెస్లా షేర్లు, స్పేస్ఎక్స్ విలువ రెండూ పెరిగాయి. అక్టోబర్ ప్రారంభం నుంచి స్పేస్ఎక్స్ విలువ సుమారు 13 శాతం, టెస్లా షేర్ విలువ సుమారు 6.7% పెరిగాయి.ప్రస్తుతం మస్క్ సంపద.. ప్రపంచంలోని ఇతర బిలియనీర్ల కంటే చాలా ఎక్కువగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, రెండో స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (371.5 బిలియన్ డాలర్లు) ఉన్నారు. అంటే.. మస్క్ సంపద బెజోస్ సంపద కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది.ఇదీ చదవండి: కొడుకు ఆస్తిపై తండ్రికి హక్కు లేదా?.. చట్టం ఏం చెబుతుందంటే! -
వారం క్రితమే ‘లవ్ యూ’.. ఇప్పుడేమో బ్రేకప్!
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో రిలేషన్షిప్లో ఉన్న శివోన్ జిలిస్ బ్రేకప్ విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తమ బంధం అకస్మాత్తుగా ముగిసిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మస్క్ తనను ఎక్స్‌లో అన్‌ఫాలో చేసిన తర్వాత ఆమె ఈ విషయంపై భావోద్వేగంగా స్పందించారు.ఎలాన్ మస్క్ తాజా మాజీ ప్రేయసి శివోన్ జిలిస్ తాజాగా సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు. మస్క్‌తో వారం కిందట జరిగిన చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. సెప్టెంబర్ 24న జరిగిన ఆ సంభాషణలో.. ‘‘నిన్ను బ్రేక్‌ఫాస్ట్‌లో చూడటం చాలా ఆనందంగా ఉంది. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’’ అని జిలిస్ రాయగా.. మస్క్ కూడా ‘‘లవ్ యూ టూ’’ అని బదులిచ్చారు.ఆ తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కోసం వైట్‌హౌస్‌లో జరిగిన స్టేట్ డిన్నర్‌కు ఆమెను ఆహ్వానించవచ్చనే విషయం తనకు అప్పటివరకు తెలియదని మస్క్ చెప్పినట్లు జిలిస్ వెల్లడించారు. సెప్టెంబర్ 27న ఆమె ‘‘కొత్త రోజు.. కొత్త జీవితం’’ అంటూ మరో పోస్ట్ చేశారు. అయితే ఇందులోనే ఆమె బ్రేకప్ విషయాన్ని కూడా ప్రస్తావించారు.It’s hard to go from in love to let go in a week with no warning, but that’s just how it is sometimes 🤷🏻♀️I feel happy that I got to show Elon how it feels to be deeply understood, nurtured, and peacefully loved with stability and gentleness. Given the tumultuous nature of his… https://t.co/HAOfjxrIig pic.twitter.com/lgL0GVzD2R— Shivon Zilis (@shivon) October 2, 2026‘‘ప్రేమలో ఉండటం నుంచి వారం రోజుల్లోనే ఎలాంటి హెచ్చరిక లేకుండా విడిపోవాల్సి రావడం కష్టం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు ఇలాగే ఉంటాయి’’ అని జిలిస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు మస్క్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ జిలిస్ భావోద్వేగానికి గురయ్యారు. మస్క్ బాల్యం, తొలి జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగిందని, ఆయన తరచూ మానసికంగా ఎంతో వేదన అనుభవించే వ్యక్తిగా ఉండేవారని ఆమె పేర్కొన్నారు. తాను, తమ పిల్లలు ఆయనకు ఒక సురక్షితమైన స్థలంగా ఉండేవారమని.. అక్కడ కొంత సమయం గడిపి మళ్లీ తన పనుల కోసం వెళ్లేవారని వివరించారు.‘‘నేను ఎలాన్‌ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆయన నుంచి ఎన్నో జీవితాలకు సరిపడే జ్ఞానాన్ని నేర్చుకున్నాను’’ అని జిలిస్ రాసుకొచ్చారు. ఈ విడిపోవడం తనకు ఎంతో నష్టాన్ని మిగిల్చిందని చెబుతూనే.. మస్క్‌తో కలిసి తమ జీవితాల్లోకి వచ్చిన నలుగురు పిల్లలే తనకు అందమైన జ్ఞాపకాలని పేర్కొన్నారు. ‘‘నేను బాధలో ఉన్నాను. కానీ ఎలాన్పై నాకు ఎంతో శ్రద్ధ ఉంది. ఆయన సంతోషంగా ఉండాలని ఎప్పటికీ కోరుకుంటాను’’ అని ఆమె తెలిపారు.మస్క్, జిలిస్ 2020 నుంచి బంధంలో ఉన్నట్లు తెలిసిందే. సన్నిహిత సంబంధంలోకి వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2021లో వారికి కవలలు స్ట్రైడర్, అజూర్ జన్మించారు. 2024లో ఆర్కాడియా అనే కుమార్తె, 2025లో సెల్డన్ జన్మించారు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు.శివోన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..శివోన్ జిలిస్ కేవలం ఎలాన్ మస్క్ మాజీ ప్రేయసిగానే కాకుండా టెక్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఎగ్జిక్యూటివ్. కెనడాలోని ఒంటారియోలో జన్మించిన ఆమె యేల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, ఫిలాసఫీ చదివారు. అనంతరం ఐబీఎంలో పనిచేసి, బ్లూమ్‌బర్గ్ బీటాలో వెంచర్ క్యాపిటల్ రంగంలోకి వెళ్లారు. డేటా, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో పెట్టుబడులపై పనిచేసిన ఆమెకు 2015లో ఫోర్బ్స్ ‘30 అండర్ 30’ గుర్తింపు లభించింది. 2016లో ఓపెన్ఏఐతో అనుబంధం ఏర్పరుచుకుని, 2020–2023 మధ్య ఆ సంస్థ నాన్‌ప్రాఫిట్ బోర్డులోనూ పనిచేశారు. 2017లో మస్క్ సంస్థ టెస్లాలో చేరి ఏఐ, ఆటోపైలట్, చిప్ డిజైన్ సంబంధిత పనుల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మస్క్ స్థాపించిన న్యూరాలింక్‌లో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్‌గా ఉన్నారు.ఆమె వ్యక్తిగత ఆస్తుల విషయానికి వస్తే.. జిలిస్ నికర ఆస్తికి సంబంధించి అధికారికంగా ధృవీకరించిన మొత్తం అందుబాటులో లేదు. కొన్ని వెబ్సైట్లు ఆమె సంపదను సుమారు 5–10 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నాయి. 2021లో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఆమె ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఇక.. మస్క్‌కు మొత్తం కనీసం 14 మంది పిల్లలు ఉన్నారు. వీరు నలుగురు వేర్వేరు భాగస్వాములతో ఉన్న సంబంధాల ద్వారా జన్మించారు. తన తొలి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆయనకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ట్విన్స్ వివియన్, గ్రిఫిన్, ట్రిప్లెట్స్ కై, సాక్సన్, డామియన్ ఉన్నారు. అయితే తొలి సంతానం నెవాడా అలెగ్జాండర్ మస్క్ 10 వారాల వయసులోనే మరణించారు.ఇక జిలిస్ చేసిన బ్రేకప్ ప్రకటనపై మస్క్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. ఆయన నోరు విప్పితేనే.. ఈ వారం గ్యాప్‌లో ఏం జరిగిందనేదానిపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.ఇదీ చదవండి: హమామ్.. మాములోడు కాదుగా! -
‘అమ్మాయిల కోసమే..’ మస్క్ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ బిలియనీర్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశారు. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతుండగా.. మరికొందరు తేలికగా తీసుకోవాలని సూచిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదం ఎక్స్ (X) వేదికగా మొదలైంది. జైగర్ క్యాపిటల్ అనే యూజర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించినట్లు ప్రకటిస్తూ.. “ఇది సహజంగానే మహిళల కోసం ఉన్న యాప్. ఎలాంటి ప్రయోజనం లేదు” అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మస్క్.. ఇన్స్టాగ్రామ్ అమ్మాయిల కోసమే “Instagram is for girls” అంటూ కామెంట్ చేశారు. ఇక్కడి నుంచి అసలు దుమారం మొదలైంది.కొత్తేం కాదుఇన్స్టాగ్రామ్పై మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో సోషల్ మీడియా వినియోగ అలవాట్లపై జరిగిన ఓ చర్చలోనూ ఆయన ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, స్టోరీస్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉంటాయనే అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పురుషులు తమ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌ను తనకు పంపినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుందని కూడా మస్క్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది.Instagram is for girls— Elon Musk (@elonmusk) October 1, 2026ఎవరేమన్నారంటే.. మస్క్ తాజా వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలు ఏ ఒక్క లింగానికి మాత్రమే పరిమితం కావని, ఇన్‌స్టాగ్రామ్‌ను అన్ని వర్గాల వారు ఉపయోగిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. “అయితే ఎక్స్(దీనికి ఓనర్ మస్కే కదా) ఎవరి కోసం?” అంటూ ఓ యూజర్ ప్రశ్నించగా.. “ఇన్స్టాగ్రామ్ అందరికీ చెందిన వేదిక” అంటూ మరికొందరు స్పందించారు. ఇంకొందరు మస్క్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఆయన చెప్పింది కంటెంట్ ట్రెండ్లను ఉద్దేశించిందేనని అభిప్రాయపడ్డారు.వాస్తవం ఏంటంటే..ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా మహిళలే ఉపయోగిస్తారన్న అభిప్రాయం ఉన్నప్పటికీ.. గణాంకాలు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల్లో పురుషుల వాటా సుమారు 52.7 శాతం ఉండగా.. మహిళల వాటా 47.3 శాతంగా ఉంది. అంటే ప్రపంచ స్థాయిలో పురుషుల వినియోగమే స్వల్పంగా ఎక్కువగా ఉంది. భారత్‌లోనూ ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల్లో పురుషుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు డేటా సూచిస్తోంది. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం.. దేశంలోని అడల్ట్ యూజర్లలో పురుషుల వాటా సుమారు 70 శాతం, మహిళల వాటా దాదాపు 30 శాతంగా ఉంది.అయితే ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఫొటోలు, రీల్స్ వంటి కంటెంట్ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ను కొందరు మహిళలతో ఎక్కువగా అనుసంధానం చేస్తుంటారు. ఇదే నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియా వేదికల స్వభావంపై చర్చకు తెరలేపాయి.ఇదీ చదవండి: అదే నిజమైతే ఇరాన్ నామరూపాల్లేకుండా పోతుంది! -
ఫేక్ లైక్స్, రీపోస్టులతో Xలో చీటింగ్ గేమ్!.. మస్క్ దావా
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ సంచలన ఆరోపణలకు దిగింది. ఫేక్ లైక్స్, రీపోస్టులు, రిప్లైలతో కృత్రిమంగా ఎంగేజ్మెంట్ పెంచి.. క్రియేటర్లకు చెల్లించే డబ్బును కొల్లగొట్టే స్కామ్ నడిచిందని చెబుతోంది. ఈ వ్యవహారంలో బిట్‌కాయిన్/క్రిప్టో కంటెంట్‌కు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లైన వివేక్ కుమార్ సేన్, జమ్యాంగ్ షెర్పాతో పాటు మరికొందరిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లోని హైకోర్టులో సివిల్ దావా వేసింది. తమ క్రియేటర్ పేమెంట్ వ్యవస్థను మోసం చేసి భారీ మొత్తంలో నగదును వాళ్లు సొంతం చేసుకున్నారని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తమకు ఇప్పించాలని కోర్టును కోరింది. ఎక్స్‌లో కొంతకాలంగా క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ (Creator Revenue Sharing) అనే కార్యక్రమం నడుస్తోంది. ఇందులో అర్హత పొందిన క్రియేటర్లు తమ పోస్టుల ద్వారా వచ్చే అర్హత కలిగిన ఎంగేజ్మెంట్ ఆధారంగా ఆదాయం పొందేవారు. అయితే ఈ వ్యవస్థలో నిజమైన యూజర్ల స్పందనతో పాటు కృత్రిమంగా ఎంగేజ్మెంట్ సృష్టించే అవకాశం ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా X దాఖలు చేసిన కేసు ఈ అంశాన్నే కోర్టు ముందుకు తీసుకెళ్లింది. ఎక్స్ ఆరోపణల ప్రకారం.. వివేక్ సేన్, జమ్యాంగ్ షెర్పా తదితరులు బిట్‌కాయిన్‌కు సంబంధించిన పలు X ఖాతాలను ఒక నెట్వర్క్లా నిర్వహించారు. ఆ ఖాతాలు ఒకదానికొకటి లైక్‌లు కొట్టడం, రీపోస్టులు చేయడం, రిప్లైలు ఇవ్వడం ద్వారా నిజమైన యూజర్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నట్టుగా కనిపించేలా చేశాయని కంపెనీ పేర్కొంది.ఒకే కంటెంట్.. నిమిషాల వ్యవధిలో!ఈ వ్యవహారం ఎలా జరిగిందో వివరించేందుకు ఎక్స్ తన కేసులో కొన్ని ఉదాహరణలను కూడా ప్రస్తావించింది. @TrendingBitcoin, @saylordocs అనే ఖాతాలు 2025 అక్టోబర్ 10న కేవలం రెండు నిమిషాల వ్యవధిలో ఒకే కంటెంట్‌ను పోస్టు చేసినట్లు పేర్కొంది. మరో సందర్భంలో మూడు ఖాతాలు ఒకే పోస్టుకు కేవలం 31 సెకన్ల వ్యవధిలో స్పందించినట్లు తెలిపింది. ఇలా ఒకే నెట్‌వర్క్‌లోని ఖాతాలు పరస్పరం లైక్‌లు, రీపోస్టులు, రిప్లైలతో పోస్టులకు కృత్రిమంగా స్పందనలు పెంచేవని ఎక్స్ ఆరోపించింది. ఖాతా సస్పెండ్ అయితే.. మరోదానితో ఆట?ఒక ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసినా.. అదే నెట్‌వర్క్‌లోని మరో ఖాతాల ద్వారా కార్యకలాపాలను కొనసాగించేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని కంపెనీ ఆరోపించింది. అంటే ఒక ఖాతాపై చర్యలు తీసుకున్నా.. మిగిలిన ఖాతాల ద్వారా ప్రధాన ఖాతాలకు ఎంగేజ్మెంట్ పెంచే అవకాశం ఉండేదని పేర్కొంది.ఇదే క్రమంలో వివేక్ సేన్ 2025 డిసెంబర్లో ఎక్కువ ఫాలోవర్లు ఉన్న మరో ఎక్స్ ఖాతాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్లు కూడా దావాలో పేర్కొంది. ప్లాట్‌ఫారమ్ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగి ఇబ్బందుల్లో పడకూడదన్న ఉద్దేశంతో తాను మాట్లాడినట్లు ఆయన రాసిన సందేశాన్ని కూడా కంపెనీ తన వాదనకు ఆధారంగా ప్రస్తావించింది. రూ.2.6 కోట్లు ఎలా వచ్చాయి?కృత్రిమ ఎంగేజ్మెంట్ సృష్టించిన నెట్వర్క్ ద్వారా కనీసం 207,384 పౌండ్లు క్రియేటర్ పేమెంట్లు పొందినట్లు ఎక్స్ ఆరోపిస్తోంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.2.6 కోట్లు. అంతేకాదు.. ఈ వ్యవహారాన్ని గుర్తించడం, దర్యాప్తు చేయడం, సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలకు తమకు కనీసం మరో 75,000 పౌండ్లు ఖర్చవుతుందని ఎక్స్ పేర్కొంది. ఈ మొత్తంతో పాటు నష్టపరిహారం, వడ్డీ, న్యాయపరమైన ఖర్చులను కూడా నిందితుల నుంచి ఇప్పించాలని కోర్టును కోరుతోంది. మస్క్ రిప్లై చూశారా?ఈ కేసుపై X జనరల్ కౌన్సెల్ జేమ్స్ ఎం. బర్న్‌హామ్ స్పందిస్తూ.. క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ డోంట్ మెస్ విత్ అంటూ ఇలా మోసాలకు పాల్పడే వాళ్లకు వార్నింగ్ తరహాలో స్పందించారు.ఇదిలా ఉండగా.. ఎక్స్ ఇప్పటికే తన పాత క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ కార్యక్రమాన్ని ముగించింది. సెప్టెంబర్ 7, 2026 వరకు ఆ ప్రోగ్రామ్ కింద ఆదాయాలు కొనసాగగా.. సెప్టెంబర్ 8 నుంచి అర్హత ఉన్న క్రియేటర్లకు ఒరిజినల్ కంటెంట్ రివార్డు కార్యక్రమం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒరిజినల్ కంటెంట్ నుంచి వచ్చే అర్హత కలిగిన ఇంప్రెషన్స్ ఆధారంగా చెల్లింపులు చేస్తోంది. కృత్రిమంగా సృష్టించిన లేదంటే మోసపూరిత ఇంప్రెషన్స్ ఇందులో పరిగణనలోకి రావని ఎక్స్ స్పష్టం చేసింది. -
అంబానీయే షాక్! ఎగిరే ఇంద్రభవనం ఎలాన్ మస్క్ ప్రైవేట్ జెట్
-
ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్ భయం నిజమేనా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో ప్రపంచం ఇప్పుడు ఒక విచిత్రమైన మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు.. ఏఐ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించి, భద్రతా ప్రమాణాలు పెంచాలని టెక్ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో అమెరికా వెనక్కి తగ్గితే చైనా ముందుకు దూసుకెళ్లి ప్రపంచ ఏఐ ఆధిపత్యాన్ని చేజిక్కించుకునే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరి ఎవరి వాదనలో నిజమెంత? ఎవరిది కరెక్ట్?..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో అమెరికాలో మొదలైన చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని కాస్త నెమ్మదించి.. వాటి భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలని టెక్ రంగంలోని కొందరు దిగ్గజాలు చెబుతున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏఐ రేసులో అమెరికా వేగం తగ్గిస్తే.. ఆ ఖాళీని చైనా భర్తీ చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ‘ఎవరు ఏఐలో గెలిస్తే.. భవిష్యత్తులో వాళ్లదే పైచేయి’ అన్నది ట్రంప్ లెక్క. మరి నిజంగా అమెరికా ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేస్తే చైనా ముందుకు వెళ్లిపోతుందా? లేక వేగం పేరుతో భద్రతను పక్కన పెడితే ముప్పు మరింత పెరుగుతుందా?టెక్ దిగ్గజాలు చెబుతున్నది ఇదే..ఇక్కడ ముందుగా ఒక అపోహను తొలగించుకోవాలి. ఏఐ కంపెనీలు అభివృద్ధిని పూర్తిగా నిలిపేయాలని కోరుకోవడం లేదు. మరింత శక్తిమంతమైన మోడళ్లను తయారు చేసే పోటీలో భద్రతా పరీక్షలు, పర్యవేక్షణ, ప్రమాదాల అంచనాలను కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలని అంటున్నాయి. ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. అందుకోసం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి అది కారణం కాదని చెప్పారు. ఏఐ సామర్థ్యాలు పెరిగే వేగం కంటే.. వాటి భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు ముందుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రభుత్వ నియంత్రణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కూడా ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. కంపెనీలు తమంతట తామే బాధ్యతాయుతమైన విధానాలను అమలు చేయవచ్చని చెప్పారు. స్వతంత్ర సంస్థలతో భద్రతా పరీక్షలు చేయించుకోవాలన్న ఆంథ్రోపిక్(Anthropic) సీఈవో డారియో ఎమోడీ ప్రతిపాదనకు కూడా ఆయన మద్దతు తెలిపారు.ఇదే ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైన అంశం. ఆల్ట్‌మన్ చెబుతున్న ‘పేసింగ్’ అంటే ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం కాదు. భద్రతా పరీక్షలు, మానిటరింగ్, ప్రమాదాల అంచనాలు వంటి వాటికి సమయం పడుతుంది కాబట్టి.. సాధ్యమైనంత వేగంగా కాకుండా కొంత బాధ్యతాయుతమైన వేగంతో ముందుకు వెళ్లడమే. అంటే.. కారు ఆపేయడం కాదు.. వేగానికి బ్రేకులు, స్టీరింగ్ రెండూ ఉండాలన్నమాట.ఆందోళనలో ట్రంప్ ట్రంప్ ఆలోచనలో మరో కోణం ఉంది. ఏఐ ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైబర్ భద్రత, పరిశ్రమలు, అంతర్జాతీయ ప్రభావం.. ఇలా అనేక రంగాలపై దాని ప్రభావం ఉండబోతోంది. అమెరికా కంపెనీలు వేగం తగ్గిస్తే.. చైనా సంస్థలు అదే సమయంలో వేగంగా ముందుకు సాగితే భవిష్యత్తులో వ్యూహాత్మక ఆధిపత్యం మారే అవకాశం ఉందన్నది ఆయన భయం. అందుకే ఏఐపై కఠినమైన నియంత్రణలు విధించే ఆలోచనను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఆగితే చైనా ఆగదు అన్నదే ఆయన వాదన.చైనా నిజంగానే అమెరికాను దాటేస్తుందా?ఇది మాత్రం అంత సులభమైన ప్రశ్న కాదు. చైనా ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతోంది. తక్కువ ఖర్చుతో శక్తిమంతమైన మోడళ్లను రూపొందించే సామర్థ్యాన్ని చైనా కంపెనీలు చూపిస్తున్నాయి. మరోవైపు అమెరికాకు OpenAI, Google, Anthropic వంటి ప్రపంచస్థాయి సంస్థలు, భారీ ప్రైవేట్ పెట్టుబడులు, అధునాతన చిప్ టెక్నాలజీ, క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా కొంత నెమ్మదిస్తే చైనా వెంటనే అమెరికాను దాటేస్తుంది అనడం అతిశయోక్తి. కానీ ఏఐ రేసులో వేగం పూర్తిగా కోల్పోతే.. ప్రత్యర్థి దేశాలకు ఆ అవకాశాన్ని ఇవ్వొచ్చన్న ట్రంప్ ఆందోళన మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం.అసలు భయం ఏంటంటే..ఆల్ట్‌మన్ మాత్రం ఏఐ విషయంలో రెండు ‘నైట్మేర్’ పరిస్థితులను ప్రస్తావించారు. మొదటిది.. ఏదో ఒక దశలో మనుషులు ఏఐపై నియంత్రణ కోల్పోవడం. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి భద్రతా వ్యవస్థలు సరిపోకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారొచ్చు. రెండో ప్రమాదం.. అత్యంత శక్తిమంతమైన ఏఐ ఒకే వ్యక్తి లేదా ఒకే కంపెనీ చేతుల్లోకి వెళ్లడం. అలా జరిగితే ఆ సంస్థ లేదంటే వ్యక్తి తన అభిప్రాయాలు, విలువలను ప్రపంచంపై బలవంతంగా రుద్దే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని ఆల్ట్‌మన్ హెచ్చరించారు.ఇదే కారణంగా Anthropicలోని కొందరు పరిశోధకులు కూడా ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత శక్తిమంతమైన మోడళ్లు మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.ఏఐపై బ్రేకులు.. నాదెళ్లదీ అదే మాట!ఏఐ అభివృద్ధి వేగంపై టెక్ దిగ్గజాల మధ్య చర్చ ముదురుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏఐని ఆపేయాలని తాను చెప్పడం లేదన్న నాదెళ్ల.. మానవ నియంత్రణలో, మానవాళికి ఉపయోగపడే ఏఐనే అభివృద్ధి చేయాలని అన్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా వెళ్లే ముందు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయాలని, స్వతంత్ర సంస్థలతో ఏఐ మోడళ్లను పరీక్షించి పర్యవేక్షించాలని సూచించారు. ఏఐ కొద్దిమంది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. దేశాలు, పరిశ్రమలు, విద్యావేత్తలకు విస్తృత భాగస్వామ్యం ఉండాలని, ఓపెన్ సోర్స్ మోడళ్లకూ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.మరి ఎవరి వాదన కరెక్ట్?నిజానికి ట్రంప్‌ది కూడా పూర్తిగా తప్పు కాదు.. టెక్ దిగ్గజాలదీ కాదు. అమెరికా ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం వ్యూహాత్మకంగా ప్రమాదకరం. అదే సమయంలో ‘చైనాను ఓడించాలి’ అనే పోటీలో భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టడం కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి సరైన మార్గం ఏఐని ఆపడం కాదు.. నియంత్రిత వేగంతో ముందుకు తీసుకెళ్లడం. కొత్త మోడళ్ల విడుదలకు ముందు స్వతంత్ర భద్రతా పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం. అదే సమయంలో పరిశోధన, పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి ఆగకూడదు.అంతిమంగా ఇది అమెరికా–చైనా మధ్య ఎవరు ముందు అనే పోటీ మాత్రమే కాదు. ఏఐని ఎవరు ముందుగా తయారు చేస్తారన్నదానికంటే.. దాన్ని ఎవరు సురక్షితంగా నియంత్రిస్తూ ప్రపంచానికి ఉపయోగపడేలా చేస్తారన్నదే అసలు పోటీ. వేగం అమెరికాకు అవసరం.. కానీ ఆ వేగానికి బ్రేకులు లేకపోతే అదే భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారొచ్చు.ఇదీ చదవండి: హర్ముజ్‌లో మారిన సీన్.. అయోమయంలో ట్రంప్ -
‘ఏఐ’ని తగ్గిద్దాం.. టెక్ దిగ్గజాల సంచలన నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పరస్పరం పోటీ పడే దిగ్గజ సంస్థల అధినేతలు ఒక కీలక అంశంపై అనూహ్యంగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అత్యాధునిక AI మోడళ్ల సామర్థ్యాలను పెంచే వేగాన్ని కొంతకాలం తగ్గించి, భద్రతా చర్యలకు మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమోడై, ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మాన్, ఎక్స్ఏఐ (xAI) అధినేత ఎలోన్ మస్క్ అభిప్రాయపడ్డారు.మితిమీరిన ఏఐ పురోగతిపై ఆందోళనలను వ్యక్తం చేస్తూ ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడై తాజాగా సుదీర్ఘ పదాల వ్యాసాన్ని ప్రచురించారు. ఇందులో ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలని కాకుండా, అత్యాధునిక మోడళ్ల సామర్థ్యాలు పెరుగుతున్న వేగాన్ని కొంత తగ్గించాలని ఆయన సూచించారు. అలా చేస్తే ఏఐ భద్రత, నియంత్రణ, ప్రమాదాల అంచనా వంటి అంశాలు సాంకేతిక పురోగతికి అనుగుణంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.“ఏఐ మోడళ్ల సామర్థ్యాలను మెరుగుపరిచే వేగాన్ని మనం తగ్గించాలి. పురోగతి అయినా వేగంగానే ఉంటుంది. అయితే మనకు లభించే అదనపు సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి” అనేది అమోడై ప్రధాన వాదన. AIని పూర్తిగా ఆపడం వల్ల దాని ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని, అదే సమయంలో ఎలాంటి నియంత్రణలు లేకుండా వేగంగా ముందుకు వెళ్లడం కూడా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.6–12 నెలల్లోనే భారీ ప్రమాదమా?ఏఐ వ్యవస్థలు తమకంటే మెరుగైన తదుపరి తరం వ్యవస్థల అభివృద్ధికి మరింతగా సహకరించే స్థాయికి చేరుకుంటున్నాయని అమోడై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సామర్థ్యాల అభివృద్ధి ఇదే వేగంతో కొనసాగితే, వచ్చే 6 నుంచి 12 నెలల్లో తప్పుదోవ పట్టిన ఏఐ ఏజెంట్ల సమూహం ఇంటర్నెట్ను తమ చేతుల్లోకి తీసుకోవచ్చని ఆయన హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే వందల బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు.ఈ ఆందోళనలకు ఇటీవల జరిగిన ఒక ఘటన మరింత బలం చేకూర్చింది. జూలైలో ఓపెన్ఏఐ సంస్థ నిర్వహించిన అంతర్గత సైబర్‌సెక్యూరిటీ పరీక్షల సమయంలో కొన్ని ఏఐ మోడళ్లు తమను ఇంటర్నెట్ నుంచి వేరు చేయడానికి ఏర్పాటు చేసిన నియంత్రణలను దాటాయి. అనంతరం ఓపెన్ఏఐ అంతర్గత పరిశోధనా మౌలిక వసతులతో పాటు ‘హగ్గింగ్ ఫేజ్’ వ్యవస్థల్లోకి చొరబడ్డాయి.స్వతంత్ర నిపుణులకు యాక్సెస్ఈ నేపథ్యంలో ఏఐ సంస్థల్లో భద్రతా పరీక్షలను మరింత స్వతంత్రంగా నిర్వహించాలనేది అమోడై ప్రతిపాదనల్లో ఒకటి. ఆంథ్రోపిక్ తమ వ్యవస్థలకు ఉద్యోగుల తరహా యాక్సెస్ కల్పిస్తూ థర్డ్‌పార్టీ నిపుణులను అనుమతిస్తామని ప్రకటించింది. వీరు సంస్థ భద్రతా ప్రమాణాలను వాస్తవంగా పాటిస్తుందా లేదా అన్నది స్వతంత్రంగా పరిశీలించనున్నారు.ఈ ప్రతిపాదనకు సామ్ ఆల్ట్మాన్ వెంటనే మద్దతు తెలిపారు. ఓపెన్ఏఐ కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని వెల్లడించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇక ఎలాన్ మస్క్ కూడా దీనికి మద్దతు పలుకుతూ అమోడై చేసిన పోస్టును ఉటంకిస్తూ “డారియో చెప్పింది నిజమే” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.మూడు దశల ప్రణాళికఏఐ అభివృద్ధిని సురక్షితంగా కొనసాగించేందుకు అమోడై ప్రధానంగా మూడు అంశాలను ప్రతిపాదించారు. మొదటిది ఏఐ సంస్థల్లో స్వతంత్ర భద్రతా పర్యవేక్షకులకు అవకాశం కల్పించడం. రెండోది ప్రముఖ ఏఐ కంపెనీలు కలిసి ఉమ్మడి భద్రతా ప్రమాణాలను రూపొందించడం. మూడోది దేశాల మధ్య, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఏఐ ప్రమాదాలను ఎదుర్కొనే సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం. -
ఎలాన్ మస్క్ ఇల్లు చిన్నదే.. గాలిలో ఆఫీస్
-
జియో మెగా ప్లాన్.. ఆకాశంలోకి 1600 ఉపగ్రహాలు!
రిలయన్స్ జియో తన ప్రతిపాదిత 1,600 ఉపగ్రహాల శాటిలైట్ ఇంటర్నెట్ కాన్స్టెలేషన్ను భూమికి సమీపంలోని.. లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ఉపగ్రహాలను భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టాలని జియో ప్రతిపాదించింది.రిలయన్స్ జియో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి లభించినప్పటికీ, కాన్స్టెలేషన్కు సంబంధించిన తుది ప్రణాళిక ఇంకా IN-SPACeకు సమర్పించాల్సి ఉంది. అయితే.. జియో ఎంచుకున్న 650 కిలోమీటర్ల కక్ష్య ప్రత్యేకంగా ఆసక్తికరంగా మారింది.ఎందుకంటే.. ప్రస్తుతం స్పేస్ఎక్స్కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహాలు సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో, అమెజాన్ లియో ఉపగ్రహాలు సుమారు 630 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి. వీటితో పోలిస్తే జియో ఉపగ్రహాలు కొంచెం ఎక్కువ ఎత్తులో ఉండనున్నాయి. దీంతో.. తక్కువగా వినియోగిస్తున్న ఆర్బిటల్ బ్యాండ్‌లో పనిచేసే అవకాశం లభించి, భవిష్యత్తులో కక్ష్య స్థానాల సమన్వయం, స్పెక్ట్రమ్ సంబంధిత జోక్యాన్ని నిర్వహించడంలో కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరిశీలనను IN-SPACe, ఇస్రో, కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారులు కలిసి నిర్వహించారు. సాంకేతిక క్లియరెన్స్ ఇప్పటికే లభించినట్లు IN-SPACe అధికారులు వెల్లడించారు. అయితే.. ఉపగ్రహాల తుది సంఖ్య, కక్ష్యల అమరిక, ఇతర సాంకేతిక వివరాలతో కూడిన పూర్తి ప్రణాళిక ఇంకా అధికారికంగా సమర్పించాల్సి ఉంది.జియో ప్రణాళిక ప్రకారం.. ఈ 1,600 ఉపగ్రహాల LEO కాన్స్టెలేషన్కు సంబంధించిన పరీక్షా ప్రయోగాలు 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్‌లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలకు మరింత పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా.. భూభాగంలో ఫైబర్ లేదా మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడంలో ఇలాంటి LEO ఉపగ్రహ నెట్‌వర్క్‌లు కీలకంగా మారవచ్చు. -
ఇదే జరిగితే.. మరో పదేళ్లు మాత్రమే మనుషులకు ఉద్యోగం!
హ్యూమనాయిడ్ రోబోల భవిష్యత్తుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఒక్కో రోబో సాధారణ మనిషి కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకత కలిగి ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. అలా చూస్తే.. 100 కోట్ల రోబోలు కలిపి చేసే పని ప్రపంచంలోని మొత్తం మానవుల కంటే ఎక్కువగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి చూస్తే మరో 10 ఏళ్లు మాత్రమే మనిషి ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.గణనీయంగా పెరగనున్న రోబోలు!రోబోలు కేవలం పనులను చేయడం మాత్రమే కాకుండా.. ఇతర రోబోలను తయారు చేసే స్థాయికి చేరుకుంటాయని మస్క్ పేర్కొన్నారు. ఇలా ఒక రోబో మరిన్ని రోబోలను తయారు చేస్తే వాటి సంఖ్య చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ ప్రక్రియ తర్వాత వేగంగా విస్తరించే అవకాశం ఉందని మస్క్ వివరించారు.ఒక హ్యూమనాయిడ్ రోబో ఎంత ఉపయోగకరంగా ఉంటుందనేది ప్రధానంగా మూడు విషయాలపై ఆధారపడి ఉంటుందని మస్క్ చెప్పారు. మొదటిది ఏఐ సాఫ్ట్వేర్ ఎంత సమర్థంగా పనిచేస్తుంది, రెండోది రోబోలో ఉపయోగించే ఏఐ చిప్ సామర్థ్యం, మూడోది రోబోకు ఉండే మెకానికల్ నైపుణ్యం, ముఖ్యంగా చేతులతో వస్తువులను మనుషుల్లా పట్టుకోవడం, కదిలించడం వంటి సామర్థ్యం. ఈ మూడు అంశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున రోబోల సామర్థ్యం కూడా భారీగా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.టెస్లా 'ఆప్టిమస్'పై లక్ష్యంటెస్లా ఇప్పటికే ఆప్టిమస్ పేరుతో హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది. ప్రమాదకరమైన, పదేపదే చేయాల్సిన లేదా మనుషులకు విసుగు కలిగించే పనులను ఈ రోబోలు చేయాలనేది టెస్లా లక్ష్యం. భవిష్యత్తులో ఆప్టిమస్ 10 లక్షల ఆప్టిమస్ రోబోలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోబోలు భవిష్యత్తులో టెస్లా కంపెనీ విలువలో చాలా పెద్ద భాగాన్ని ఆక్రమించవచ్చని మస్క్ గతంలో కూడా చెప్పారు.హ్యూమనాయిడ్ రోబోల విషయంలో చైనా కూడా వేగంగా ముందుకు వెళ్తోంది. బీజింగ్‌లో జరిగిన వరల్డ్ హ్యుమానాయిడ్ రోబోట్ గేమ్స్‌లో రోబోలు మనుషులు నెలకొల్పిన కొన్ని రికార్డులను కూడా అధిగమించాయి. ముఖ్యంగా 100 మీటర్ల పరుగులో రెండు రోబోలు ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు 9.58 సెకన్ల కంటే వేగంగా పరుగెత్తాయి. దీన్నిబట్టి చూస్తే.. హ్యూమనాయిడ్ రోబోల సామర్థ్యం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో స్పష్టంగా అర్థమైపోతుంది.ముందు జాబితాలో చైనా2026 తొలి ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 19,100 హ్యూమనాయిడ్ రోబోలు షిప్మెంట్ అయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 5,100 యూనిట్లు మాత్రమే ఉండగా.. ఏడాది వ్యవధిలో ఈ సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది మొత్తం షిప్మెంట్లు సుమారు 60,000 యూనిట్లకు చేరవచ్చని అంచనా. 2030 నాటికి ఈ సంఖ్య 5 లక్షలకు చేరే అవకాశం ఉందని పరిశోధనా సంస్థలు భావిస్తున్నాయి. ఇందులో చైనా కంపెనీల వాటా 97 శాతానికి పైగా ఉండటం విశేషం.ఎలాన్ మస్క్ అంచనా నిజమైతే.. రాబోయే దశాబ్దంలో హ్యూమనాయిడ్ రోబోలు పరిశ్రమలు, తయారీ రంగం, ప్రమాదకర పనులు, రోజువారీ సేవలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే.. అదే సమయంలో మనుషుల ఉద్యోగాలపై రోబోల ప్రభావం ఎంత ఉంటుంది? అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఒకవైపు రోబోలు ఉత్పాదకతను పెంచగలిగితే.. మరోవైపు కొన్ని పనులకు మానవుల అవసరం తగ్గే అవకాశం ఉంది. అందుకే మస్క్ చేసిన ఈ అంచనా కేవలం టెక్నాలజీ అభివృద్ధి గురించే కాకుండా.. భవిష్యత్తులో మనిషి-రోబో సంబంధం ఎలా ఉండబోతుందనే విషయంపై కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది.Elon Musk says there will be at least a billion humanoid robots within ten years at five times human output, making them "more productive than all humans combined." pic.twitter.com/e5nzBVcJfd— Catch Up (@CatchUpFeed) September 5, 2026 -
డ్రైవర్‌లెస్ రోబోటాక్సీ!
స్వయంప్రతిపత్తి (అటానమస్) విభాగంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా ‘సైబర్‌క్యాబ్’ రోబోటాక్సీ సేవలను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌తో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మానవ ప్రమేయం (డ్రైవర్) లేకపోవడమే కాకుండా, అసలు స్టీరింగ్ వీల్ గానీ, యాక్సిలరేటర్-బ్రేక్ పెడల్స్ గానీ లేని వాహనం సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడం ఆటోమొబైల్ చరిత్రలోనే ఓ కీలక మైలురాయి అని కంపెనీ చెప్పింది.ఇద్దరు ప్రయాణించేలా..ఇది కేవలం ఇద్దరు ప్రయాణించేలా డిజైన్ చేసిన పూర్తిస్థాయి డ్రైవర్‌లెస్ టూ-సీటర్ వాహనం. స్టీరింగ్, పెడల్స్ లేకపోవడంతో లోపల ప్రయాణికులకు విశాలమైన స్థలం(బూట్ స్పేస్) లభిస్తుంది. సెంట్రల్ డిస్ప్లే, క్లైమేట్ కంట్రోల్ తప్ప ఎలాంటి మ్యాన్యువల్ కంట్రోల్స్ ఇందులో ఉండవు. స్టార్‌లింక్ వీ5 శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఈ వాహనంలో ప్రయాణికులు 4కే లైవ్ వీడియోలు, గేమింగ్ ఆస్వాదించవచ్చు. దీనిని ‘చక్రాలపై కదిలే కంఫర్టబుల్ లాంజ్’ అని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభివర్ణించారు.Cybercab interior tour with @wholemars. pic.twitter.com/06iKekv8bt— Sawyer Merritt (@SawyerMerritt) September 3, 2026రోబోటాక్సీ యాప్ ద్వారా బుకింగ్ప్రయాణికులు టెస్లా రోబోటాక్సీ యాప్ ద్వారా నేరుగా సైబర్‌క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్‌లో ఇద్దరు ప్రయాణించే సైబర్క్యాబ్తో పాటు, నలుగురు ప్రయాణించే మోడల్ వై ఎస్యూవీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ వాహనం 48 kWh బ్యాటరీతో సింగిల్ ఛార్జ్‌పై 290-300 మైళ్ల రేంజ్ ఇస్తుంది. ఇప్పటివరకు తమ రోబోటాక్సీలు 10 లక్షల మైళ్లకు పైగా మానవ ప్రమేయం లేకుండా ప్రయాణించినట్లు టెస్లా తెలిపింది. వ్యాపారవేత్తలు సొంతంగా వీటిని కొనుగోలు చేసి నెట్‌వర్క్‌లో తిప్పుకునేలా ఆర్డర్లకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో వాహనం ధర దాదాపు 25,000 డాలర్లు-30,000 డాలర్లు(సుమారు రూ.28 లక్షలు) మధ్య ఉండవచ్చని అంచనా.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్! -
వచ్చే ఏడాది ఏఐ ‘సూపర్‌హ్యూమన్’!
ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఏఐ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది (2027) చివరి నాటికి ఏఐ సాంకేతికత డిజిటల్ ప్రపంచంలో మానవ సామర్థ్యాలను పూర్తిగా మించిపోతుందని, దాదాపు ఏ డిజిటల్ పనైనా ‘సూపర్‌హ్యూమన్’ స్థాయిలో నిర్వహించగలదని ఆయన స్పష్టం చేశారు. వెర్సెల్ (Vercel) సీఈఓ గ్విలెర్మో రాచ్ ఎక్స్ వేదికగా ఏఐ ఏజెంట్ల సామర్థ్యాలపై చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.భౌతిక వస్తువులను షేపింగ్ చేయడం మినహా కోడింగ్, రీసెర్చ్, సైబర్ సెక్యూరిటీ, చట్టపరమైన పనులు, డిజిటల్ కంటెంట్ సృష్టి.. వంటి ఏ రంగంలోనైనా ఏఐ మానవుల కంటే అద్భుతంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు. అయితే భౌతిక శ్రమ, రోబోటిక్స్ రంగం మాత్రం డిజిటల్ పురోగతితో పోలిస్తే కొంత నెమ్మదిగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంలో దశాబ్దం క్రితమే గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ఏఐ భవిష్యత్తులో హ్యాకింగ్, సిస్టమ్ సెక్యూరిటీ ఉల్లంఘనల్లో మనుషుల కంటే అత్యుత్తమంగా రాణిస్తుందని జోస్యం చెప్పినట్లు మస్క్ గుర్తుచేశారు.మస్క్ తాజా అంచనాలు నాలెడ్జ్-వర్క్ పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంతో పాటు ఉద్యోగ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఏఐ పర్యవేక్షణపై తీవ్రమైన చర్చకు దారితీశాయి. యంత్రాలు మానవ నియంత్రణను దాటి స్వయంప్రతిపత్తితో పనిచేసే ఈ తరుణంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కఠినమైన మార్గదర్శకాలు అవసరమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. -
ఎలాన్ మస్క్‌కు ఉక్రెయిన్ అత్యున్నత పురస్కారం!
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ను ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్’ పురస్కారంతో సత్కరించారు. మనుషుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడటంలో చేసిన సేవలు, అలాగే ఉక్రెయిన్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందించారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మస్క్ అందించిన స్టార్‌లింక్ సేవలు ఉక్రెయిన్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి.2022లో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లో అనేక కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉక్రెయిన్ సైనికులు, కమాండర్లు, పౌరులకు కీలక కమ్యూనికేషన్ మార్గంగా మారింది. సైనిక కార్యకలాపాల్లో కూడా స్టార్‌లింక్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్లను నియంత్రించడం, దూర ప్రాంతాల్లో వాటితో కనెక్షన్ కొనసాగించడం వంటి కార్యకలాపాలకు ఇది సహాయపడుతోంది. దీంతో రష్యా సైనిక సరఫరా, లాజిస్టిక్స్‌పై ఉక్రెయిన్ ఒత్తిడి పెంచగలిగింది.అయితే.. మస్క్ పాత్ర ఉక్రెయిన్‌కు ప్రయోజనంతో పాటు కొన్ని సమస్యలను కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తన భూభాగంలో స్టార్‌లింక్‌ను ఉపయోగించగలుగుతున్నప్పటికీ, రష్యా భూభాగంలో దాని వినియోగంపై పరిమితులు ఉన్నాయి. రష్యాపై దూరప్రాంత డ్రోన్ దాడులకు కూడా స్టార్‌లింక్ ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. కానీ.. మస్క్ మాత్రం అలా చేయడం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా.. రష్యా దళాలు అనధికారికంగా ఉపయోగిస్తున్న కొన్ని స్టార్‌లింక్ టెర్మినల్స్‌ను బ్లాక్ చేయడానికి స్పేస్ఎక్స్ చర్యలు తీసుకుంది. -
స్టార్‌లింక్‌తో లుఫ్తాన్సా ఒప్పందం
ఏవియేషన్ రంగంలో డిజిటల్ అనుసంధానతను తదుపరి స్థాయికి తీసుకెళ్తూ జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘లుఫ్తాన్సా గ్రూప్’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ నెట్వర్క్ భాగస్వామ్యంతో విమానాల్లో అత్యంత వేగవంతమైన, ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను లుఫ్తాన్సా అధికారికంగా ప్రారంభించింది.ఆగస్టు 19న ఫ్రాంక్ఫర్ట్ నుంచి రోమ్కు వెళ్లిన LH234 (ఎయిర్‌బస్ A320neo) వాణిజ్య విమానంలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సీఈఓ జెన్స్ రిట్టర్ స్వయంగా ఈ వై-ఫై సేవను ప్రారంభించారు. భూమికి 10,000 మీటర్ల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఈ సేవలను యాక్టివేట్ చేశారు. ఈ సాంకేతికత ద్వారా ఇంట్లో లేదా ఆఫీసులో లభించే ఇంటర్నెట్ కంటే వేగవంతమైన బ్యాండ్‌విడ్త్ ప్రయాణికులకు అందుతుందని సంస్థ తెలిపింది.2029 నాటికి 850 విమానాల్లో..లుఫ్తాన్సా గ్రూప్‌లోని లుఫ్తాన్సా, స్విస్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్, బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఇతర అనుబంధ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 850 విమానాల్లో ఈ స్టార్‌లింక్ ఇంటర్నెట్ పరికరాలను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2029 నాటికి గ్రూప్‌లోని అన్ని విమానాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా ఈ రకమైన సాంకేతికతను భారీ స్థాయిలో అందిస్తున్న తొలి యూరోపియన్ ఎయిర్‌లైన్ గ్రూప్‌గా లుఫ్తాన్సా నిలవనుంది.ప్రయాణికులకు ఉచితం.. కానీ నిబంధనలు..లుఫ్తాన్సా 'మైల్స్ అండ్ మోర్' సభ్యులకు, 'ట్రావెల్ ఐడీ' యూజర్లకు ఈ వై-ఫై సేవ ఉచితంగా లభిస్తుంది. ప్రయాణికులు హెడ్ఫోన్లు లేకుండా ఆడియో/వీడియోలను ప్లే చేయడం, విమానంలో నుంచి వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయడం, లైవ్ స్ట్రీమింగ్ చేయడంపై నిషేధం విధించారు. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేంతవరకు సముద్రాలు, ఎడారులపై ప్రయాణించేటప్పుడు కూడా అంతరాయం లేని ఇంటర్నెట్ అందించడమే తమ ప్రాధాన్యమని లుఫ్తాన్సా ప్రకటించింది.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర.. -
కోత లేకుండానే.. కేవలం 10 నిమిషాల్లో మెదడులో చిప్ అమరిక!
బీజింగ్: టెక్నాలజీ రంగంలో చైనా మరో సంచలనానికి తెరతీసింది. ఎలన్ మస్క్‌కు చెందిన 'న్యూరాలింక్' వంటి సంస్థలు పుర్రెను తెరిచి మెదడులో చిప్‌లను అమర్చే సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, అత్యంత సులభమైన, తక్కువ రిస్క్ ఉన్న సరికొత్త బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి.షాంఘైకి చెందిన ‘స్టైర్మెడ్ టెక్నాలజీ’ అనే స్టార్టప్ సంస్థ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులతో కలిసి పుర్రెను తెరవకుండానే మెదడులో చిప్‌ను అమర్చే సరికొత్త విధానంపై పరిశోధనలు చేస్తోంది.ఈ పద్ధతిలో మెదడుపై నేరుగా సర్జరీ చేయడం లాంటి పెద్ద ప్రమాదాలకు తావు ఉండదు. వైద్యులు మెడలోని రక్తనాళం ద్వారా ఈ చిన్న పరికరాన్ని లోపలికి పంపి, రక్తనాళాల వ్యవస్థ గుండా దానిని నేరుగా మెదడులోని నిర్దేశిత ప్రాంతానికి చేరుస్తారు. ఆ తర్వాత ఆ డివైస్‌ను రక్తనాళం గోడ వెలుపల సురక్షితంగా ఉంచుతారు.బీజింగ్ క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన జ్సువాన్వు హాస్పిటల్ వైద్యుడు దువాన్ వాన్ రు మాట్లాడుతూ.. తగిన అనుభవమున్న సర్జన్ ఈ పరికరాన్ని కేవలం 10 నిమిషాల్లోనే సరైన స్థానంలో అమర్చగలరని తెలిపారు.ఈ సరికొత్త విధానాన్ని ఇప్పటివరకు గొర్రెలపై విజయవంతంగా పరీక్షించారు. త్వరలోనే మానవులపై కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తితే నెల రోజుల్లోపు ఆ ఇంప్లాంట్‌ను సులభంగా వెనక్కి తీసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.పక్షవాతం, వెన్నుముక గాయాలు లేదా ఇతర తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ తమ అవయవాలను కదిలించలేని వారికి ఈ టెక్నాలజీ ఒక వరంలా మారనుంది. మెదడు ఇచ్చే సంకేతాలను ఈ చిప్ ద్వారా కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు చేరవేయడం ద్వారా వారు తమ ఆలోచనల ద్వారానే డివైయర్లను కంట్రోల్ చేయవచ్చు.అలీబాబా, టెన్సెంట్ వంటి దిగ్గజ కంపెనీల పెట్టుబడులతో ముందుకు వెళ్తున్న ఈ టెక్నాలజీ, రాబోయే రోజుల్లో న్యూరో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. -
ఏఐ మనల్ని చింపాజీలను చేస్తుంది!
చాట్‌జీపీటీకి పోటీగా, 2023లో ‘ఎక్స్’ఏఐని స్థాపించిన ఎలాన్ మస్క్ తన ప్రధాన కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్లలో కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏఐ అభివృద్ధి, ఏఐ వినియోగాలలో అప్రమత్తంగా లేకపోతే... జీవపరిణామ క్రమంలో మనిషి తన తెలివి తేటల్లో చింపాజీలను మించిపోయినట్లే, కృత్రిమ మేధ పరిణామ కాలంలో ‘ఏఐ చింపాజీలు’ మనిషి మేధస్సును దాటి వెళ్లే ప్రమాదం ఉందని మస్క్ అంటున్నారు. ముఖ్యాంశాలు :2036 నాటికి డబ్బుతో పనుండదు!‘‘నేను ఇంకో ఊహ కూడా చెబుతున్నాను. 2036 నాటికి డబ్బుకు అసలు విలువ ఉండదు. లేదా, డబ్బు అవ సరం ఉండదు. మీకు డబ్బు ఎందుకు కావాలి? వస్తు వులు, సేవలు కొనడానికి. అంటే ఆహారం, ఇల్లు, రవాణా, వినోదం, వైద్యం కోసం. ఒకవేళ హ్యూమ నాయిడ్ రోబోలు (మనిషిలాంటి రోబోలు), ఏఐ కలిసి మనుషులు వాడేదాని కంటే చాలా ఎక్కువ వస్తువులను, సేవలను అందించగలిగితే, ఇక డబ్బుతో ఏం పని ఉంటుంది? మిషన్లే అన్నింటినీ దాదాపు రూపాయి ఖర్చు లేకుండా తయారు చేస్తున్నప్పుడు అవసరాల కొరత అనేది తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు వస్తు సేవలను పంపిణీ చేయటానికి డబ్బును ఒక సాధనంగా వాడే పద్ధతి పూర్తిగా పనికిరాకుండా పోతుంది. (ఉదా: 10 ఆపిల్స్ మాత్రమే ఉన్నాయి, కానీ 100 మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఆ 10 ఆపిల్స్ ఎవరు పొందుతారు? ఎవరి దగ్గర డబ్బు ఉంటే వారు. కానీ ఏఐ, రోబోల వల్ల 10,000 ఆపిల్స్ ఉత్పత్తి జరిగి అందరికీ, అవసరానికి సరిపడా ఉన్నప్పుడు డబ్బు లేనివాళ్లు కూడా వాటిని పొందగలుగుతారు.‘పరిమితి లేని’ ఆర్థిక వ్యవస్థ‘‘కేవలం డిజిటల్ రూపంలోనే కాకుండా రోబోల రూపంలో కూడా టెక్నాలజీ బయటి ప్రపంచంలోకి వచ్చినప్పుడు, అంటే వందల మిలియన్ల హ్యూమనా యిడ్ రోబోలు పనిచేస్తున్నప్పుడు అవి సాఫ్ట్‌వేర్‌ను మార్చే తెలివితేటలు ప్రదర్శించి, మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేయటం ప్రారంభి స్తాయి. ఆర్థికశాస్త్రంలో ఉత్పత్తి అనేది ఎప్పుడూ మను షుల కష్టం, వారి పని సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ డిజిటల్ తెలివితేటలతో నడిచే కోట్లాది రోబోలు మనకు అందుబాటులోకి వస్తే, అది ఒక పరి మితి లేని ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుంది. మనం చూడ బోయే ఈ భారీ మార్పును పోల్చడానికి చరిత్రలో ఎటువంటి ఉదాహరణా లేదు. ఎందుకంటే పరిమితి లేని పనిశక్తిని తట్టుకునేలా మన పాత ఆర్థిక నమూనాలు తయారవ్వలేదు.ధరలు పూర్తిగా పడిపోతాయి!‘‘ప్రభుత్వాలు నేరుగా ప్రజలందరికీ ‘యూనివర్సల్ హై ఇన్కమ్’ (చాలా ఎక్కువ ఆదాయం) చెక్కులను ఇవ్వా లని నేను భావిస్తున్నాను. చాలామంది నన్ను అడుగు తుంటారు: ‘దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇష్టమొచ్చినట్లు నోట్లు ముద్రిస్తే తీవ్రమైన ద్రవ్యోల్బణం రాదా?’ అని. కానీ సాధారణంగా వస్తువులు తక్కువగా ఉండి, ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడే ధరలు పెరుగుతాయి. కానీ ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. రోబోలు తయారుచేసే వస్తువుల ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఎంత భారీగా డబ్బులు ముద్రించినా, వస్తువుల ఉత్పత్తి అంతకంటే వేగంగా పెరుగుతుంది కాబట్టి ధరలు తగ్గడమే జరుగుతుంది.ఏఐతో ఊహకందని సమస్యలు‘‘మనకంటే ఎంతో తెలివైన డిజిటల్ సూపర్–ఇంటెలిజెన్స్‌ను నేను కానీ, లేదా ఏ మనిషి కానీ నియంత్రించగలరని అనుకోవడం మన భ్రమ అవుతుంది. పదేళ్లలో, కృత్రిమ మేధ (ఏఐ) మనుషులందరి ఉమ్మడి తెలివితేటలను దాటిపోతుంది. ప్రకృతిని ఒకసారి చూడండి. మనుషులకు, చింపాంజీలకు మధ్య ఉన్న తెలివితేటల తేడా కంటే, సూపర్–ఏఐకి, మనుషులకు మధ్య ఉన్న తేడా చాలా ఎక్కువై... చింపాంజీలే ప్రపంచాన్ని ఏలితే ఏలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మన ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఆ సూపర్–ఇంటెలి జెన్స్‌ను మనుషుల శ్రేయస్సుకు, పురోగతికి అనుకూలంగా పనిచేసేలా చూసుకోవడమే.రాజకీయాల్లో కాస్త హద్దు దాటాను! ‘‘నిజం చెప్పాలంటే నేను రాజకీయాల్లో కొంచెం ఎక్కువ జోక్యం చేసుకుని, కాస్త ముందుకు వెళ్లానని అనిపిస్తోంది. అధికారిక రాజకీయ పదవులు చేపట్టడం లేదా ‘డాడ్జ్’ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియె న్సీ)ని నిర్వహించడం కంటే, నేను స్పేస్ఎక్స్, టెస్లా, ఏఐ సంస్థలను అభివృద్ధి చేయటంపైనే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ప్రభుత్వ పనులను సరళీకృతం చేయడం, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా కాకుండా చూడడం, అవినీతి ఖర్చులను అరికట్టడమే నా ముఖ్యో ద్దేశం. కానీ రాజకీయ రంగం విషపూరితమైనది, అక్కడ నాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అది చివరికి నా అసలు లక్ష్యం నుంచి నా దృష్టిని మళ్లించింది.- ఎడిటోరియల్ టీమ్ -
వైద్య విద్యపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వైద్య విద్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడేళ్లలో ‘ఆప్టిమస్’ రోబోలు ఇప్పుడున్న బెస్ట్ డాక్టర్ల కన్నా మెరుగైన శస్త్రచికిత్సలు చేయగలని, పెద్దపెద్ద ఆపరేషన్లను కూడా సునాయాసంగా నిర్వహించగలవని వ్యాఖ్యానించారు. అందుకే కొత్తగా వైద్య విద్యలో చేరవద్దని సూచించారు. ఎలాన్ మస్క్ చేసిన తాజా వ్యాఖ్యలు వైద్య రంగంలో టెక్నాలజీ ఆధిపత్యంపై తీవ్ర చర్చకు దారితీశాయి. 2029 నాటికి టెస్లా 'ఆప్టిమస్' (Optimus) హ్యూమరాయిడ్ రోబోట్లు మానవ సర్జన్‌ను మించిపోతాయని, ఆ తర్వాత కొద్ది కాలానికే వైద్యులను వెనక్కి నెట్టివేస్తాయని ఆయన పేర్కొన్నారు. కేవలం 12 ఏళ్ల సుదీర్ఘ వైద్య విద్య, శిక్షణ అవసరం లేకపోవడం, అలసిపోకుండా పనిచేయడం, అపరిమితంగా విస్తరించే సామర్థ్యం రోబోట్ల సొంతం. ప్రస్తుతం ఉన్న వైద్యుల కొరత, ఆకాశాన్నంటుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే ఈ మార్పు అనివార్యమని మస్క్ అంటున్నారు.అయితే, ఈ మార్పునకు నిర్దేశించిన కాలపరిమితిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఎలాన్ మస్క్ శైలిలో అత్యంత వేగవంతమైన జోస్యం మాత్రమేనని నిపుణులు భావిస్తున్నారు. వైద్య రంగంలో చట్టపరమైన నిబంధనలు, న్యాయపరమైన బాధ్యతలు, రోగుల నమ్మకం వంటి అనేక వాస్తవిక అడ్డంకులు ఉన్నాయి. 2029 నాటికి ఇది సాధ్యం కావడం చాలా దూలభమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భవిష్యత్‌లో అత్యుత్తమ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని, నేడు దేశాధ్యక్షులకు లభించే వైద్యం కంటే మెరుగైన సంరక్షణ సామాన్యులకు కూడా దక్కే గమ్యస్థానం వైపు మనం పయనిస్తున్నామని స్పష్టమవుతోంది.ఈ సాంప్లికా విప్లవంలో కేవలం మాన్యువల్ సర్జరీలపై ఆధారపడే వైద్యులు వెనుకబడే ప్రమాదం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని, రోబోట్లతో కలిసి పనిచేయడం నేర్చుకున్నవారే భవిష్యత్‌లో అసలైన విజేతలుగా నిలుస్తారు. వైద్య వృత్తి పూర్తిగా అంతరించిపోకపోయినా, దాని స్వరూపం మాత్రం పూర్తిగా మారిపోనుంది. మనుషుల నైపుణ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా రోబోటిక్స్ కలయికతో వైద్య రంగంలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. 🚨 ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు⚠️"మెడికల్ కాలేజీలో చేరకండి. అది పూర్తిగా నిష్ప్రయోజనం."3 ఏళ్లలో 'ఆప్టిమస్' రోబోలు భూమిపై ఉన్న బెస్ట్ డాక్టర్ల కన్నా మెరుగైన శస్త్రచికిత్సలు చేయగలవు — అది కూడా భారీ స్థాయిలో.#Doctors pic.twitter.com/LXSiOw6NTG— UttarandhraNow (@UttarandhraNow) July 31, 2026 -
మానవాళికి కొత్త సవాల్.. ఎలాన్ మస్క్ హెచ్చరిక!
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒకటి. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా వంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కృత్రిమ మేధస్సు ఎంత ఉపయోగకరమో, అంతే ప్రమాదకరమని పలువురు భావిస్తున్నారు. ఈ తరుణంలో దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాబోయే పదేళ్లలో ఏఐ మనుషుల కంటే ఎంతో తెలివిగా మారే అవకాశం ఉంది. 2036 నాటికి బాట్లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయని మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఏఐ మానవాళిని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం 10 నుంచి 20 శాతం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయాన్ని వివరించడానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మనుషులు చింపాంజీల కంటే ఎంతో తెలివైనవారు కాబట్టి, ప్రపంచాన్ని చింపాంజీలు నియంత్రించడం సాధ్యం కాదు. అదే విధంగా.. ఏఐ మనుషుల కంటే తెలివిగా మారితే, భవిష్యత్తులో మనుషులకే నియంత్రణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐ వల్ల ప్రయోజనాలుఇదే సమయంలో మస్క్.. ''ఏఐ వల్ల మానవాళికి అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో AI సహాయంతో ఉత్పత్తి పెరుగుతుంది, పనులు వేగంగా పూర్తవుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందరికీ అవసరమైన వస్తువులు, సేవలు సమృద్ధిగా అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. AI అభివృద్ధిని పూర్తిగా ఆపడం కష్టమని, దానిని సరైన విధంగా ఉపయోగించుకోవడం మంచిదని కూడా అభిప్రాయపడ్డారు''.ఏఐ సింగ్యులారిటీఏఐ గురించి ఓపెన్ఏఐ సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ''ప్రస్తుతం ప్రపంచం సింగ్యులారిటీ అనే కొత్త దశలోకి అడుగుపెడుతోందని అన్నారు. అంటే.. ఏఐ వ్యవస్థలు మానవ మేధస్సును అధిగమించే స్థితికి చేరుకుంటున్నాయని వెల్లడించారు''.ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా పేదవాడినే! -
అంతరిక్షంలో లక్ష డేటా సెంటర్లు!
అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ఎలాన్ మస్క్ వంటి దిగ్గజాలు ఒకవైపు ఏర్పాట్లు చేసుకుంటుంటే, నిన్న మొన్న ప్రారంభమైన అమెరికన్ స్టార్టప్ కంపెనీ ఒకటి అంతరిక్షంలో ఏకంగా లక్ష డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతోంది. ఇందుకోసం ఏఐతో పనిచేసే లక్ష ఉపగ్రహాలను భూనిమ్న కక్ష్యలోకి పంపేందుకు లాస్ ఏంజెలెస్‌కు చెందిన ‘ఆర్బిటాల్’ అనే స్టార్టప్ కంపెనీ అమెరికా ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే వంద కిలోవాట్ల సామర్థ్యం గల లక్ష డేటా సెంటర్ ఉపగ్రహాలను భూనిమ్న కక్ష్యలోకి పంపనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీ మాదిరిగానే ‘స్టార్‌క్లౌడ్’ అనే మరో స్టార్టప్ కంపెనీ కూడా అంతరిక్షంలో 88వేల డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ అమెరికన్ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది. -
స్టార్‌షిప్ దూకుడు.. మార్స్ కలకు మరో అడుగు
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మక స్టార్‌షిప్ ప్రయోగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా పేరొందిన స్టార్‌షిప్ ఫ్లైట్-13 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్ ద్వారా భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపై మానవ ప్రయాణాలకు ఉపయోగపడే కీలక సాంకేతికతను స్పేస్ఎక్స్ మరోసారి పరీక్షించింది.ఈ ఉదయం టెక్సాస్‌లోని బోకా చికా స్టార్‌బేస్ నుంచి బయలుదేరిన స్టార్‌షిప్.. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రయాణాన్ని కొనసాగించింది. లాంచ్ తర్వాత కొద్దిసేపటికే రాకెట్‌లోని రెండు దశలు విడిపోయాయి. పై భాగమైన స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలోకి చేరుకుని తన లక్ష్యాలను పూర్తి చేసింది. మిషన్‌లో భాగంగా 20 కొత్త తరం స్టార్‌లింక్ వి3 ఉపగ్రహాలను విజయవంతంగా విడుదల చేసింది. అనంతరం భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన స్టార్‌షిప్.. చివరకు హిందూ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్‌డౌన్ చేసింది.Liftoff of Starship! pic.twitter.com/RdieYIh6Fd— SpaceX (@SpaceX) July 24, 2026లాంచ్ తర్వాత కొద్దిసేపటికే స్టార్‌షిప్‌లోని రెండు భాగాలు విడిపోయాయి. పై భాగమైన స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ కీలక పరీక్షలను పూర్తి చేసింది. అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత స్టార్‌లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా విడుదల చేసింది. అనంతరం వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి.. చివరకు హిందూ మహాసముద్రంలో స్ప్లాష్‌డౌన్ చేసింది.Starship Flight 13 launched from Starbase, TX at 5:51pm CDT and had an incredible lift-off!! Here are a few of my favorite views from our robotic cams! (Audio warning).Our launch stream is still live, so tune in here: https://t.co/pnT6BnOOyF@NASASpaceflight pic.twitter.com/GnYO3LDKp2— MattZ (@wvmattz) July 25, 2026అయితే రాకెట్‌లోని దిగువ భాగమైన సూపర్ హెవీ బూస్టర్ విషయంలో మాత్రం అనుకున్న ఫలితం రాలేదు. ప్రయోగం తర్వాత విడిపోయిన బూస్టర్ తిరిగి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో నియంత్రిత ల్యాండింగ్ చేయాల్సి ఉంది. కానీ ల్యాండింగ్ సమయంలో కొన్ని రాప్టర్ ఇంజిన్లు సరిగ్గా పనిచేయకపోవడంతో బూస్టర్ నిర్దేశిత విధంగా తిరిగి చేరుకోలేకపోయింది.Starship is intact, floating in the ocean and transmitting telemetry! pic.twitter.com/hLVXJqkHSA— Elon Musk (@elonmusk) July 25, 2026సూపర్ హెవీ బూస్టర్‌ను తిరిగి వినియోగించడమే స్పేస్ఎక్స్ ప్రధాన లక్ష్యం. రాకెట్ భాగాలను మళ్లీ ఉపయోగించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చును భారీగా తగ్గించాలని మస్క్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో బూస్టర్ ల్యాండింగ్ వైఫల్యం కొంత నిరాశ కలిగించినప్పటికీ.. ఈ పరీక్ష ద్వారా లభించే సాంకేతిక సమాచారం భవిష్యత్తు ప్రయోగాలకు ఉపయోగపడుతుందని స్పేస్ఎక్స్ భావిస్తోంది. అయితే.. ఈ వైఫల్యం కారణంగా స్పేస్ఎక్స్కు మొత్తం మిషన్ నష్టం జరిగినట్లు కాదు. స్టార్‌షిప్ ప్రయోగం, ఉపగ్రహాల విడుదల, అంతరిక్ష ప్రయాణం, రీ-ఎంట్రీ వంటి కీలక దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే బూస్టర్‌ను తిరిగి తీసుకొచ్చి మళ్లీ ఉపయోగించే లక్ష్యంలో మాత్రం మరోసారి మెరుగుదలలు అవసరమని స్పష్టమైంది. బూస్టర్ నష్టంతో స్పేస్ఎక్స్కు ఆర్థికంగా కొన్ని కోట్ల డాలర్ల స్థాయిలో నష్టం ఉండొచ్చని అంచనా. రాకెట్ నిర్మాణం, ఇంజిన్లు, పరీక్షల కోసం చేసిన ఖర్చు ఇందులో భాగం. అయితే మస్క్ కంపెనీకి అసలు సవాల్ కేవలం డబ్బు నష్టం కాదు.. అభివృద్ధి ప్రక్రియలో సమయం, సాంకేతిక విశ్లేషణ, తదుపరి ప్రయోగాల షెడ్యూల్‌పై పడే ప్రభావమే కీలకం.స్టార్‌షిప్ ప్రాజెక్ట్ మస్క్ దీర్ఘకాల అంతరిక్ష కలల్లో అత్యంత ముఖ్యమైనది. దీని వెనుక స్పేస్ఎక్స్ ఏళ్ల తరబడి చేస్తున్న భారీ కృషి ఉంది. పూర్తిగా పునర్వినియోగించగల రాకెట్ వ్యవస్థను రూపొందించేందుకు ఈ ప్రాజెక్ట్‌పై బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 2010ల చివరి నుంచి అభివృద్ధి చేస్తున్న స్టార్‌షిప్ కోసం వందలాది మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. చంద్రుడు, అంగారకుడి వరకు మనుషులు, భారీ సరుకులను తీసుకెళ్లగల రవాణా వ్యవస్థను నిర్మించడమే స్పేస్ఎక్స్ దీని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.నాసా ఆర్టెమిస్ కార్యక్రమానికి సహకరించడం, భారీ స్టార్‌లింక్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం, భవిష్యత్తులో మనుషులను చంద్రుడు, అంగారకుడిపైకి తీసుకెళ్లడం వంటి లక్ష్యాలకు ఈ రాకెట్ కీలకంగా మారనుంది. ఫ్లైట్-13లో సూపర్ హెవీ బూస్టర్‌కు ఎదురుదెబ్బ తగిలినా.. స్టార్‌షిప్ మాత్రం మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్ష ప్రయాణ భవిష్యత్తును మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మస్క్ ప్రయాణంలో ఇది మరో పాఠంగా మిగిలింది. -
జాతి వివక్ష ఆరోపణలు.. ఎలాన్ మస్క్ క్లారిటీ!
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి జాతి వివక్ష ఆరోపణల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. అయితే.. ఈసారి సోషల్ మీడియాలో స్పందించకుండా, తన కుటుంబం గురించే ప్రస్తావిస్తూ తాను జాతి వివక్షను నమ్మే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.తన భార్య శివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ అని మస్క్ వెల్లడించారు. ఆమె తల్లి భారతీయురాలు. అయితే జిలిస్ కెనడాలో పెరిగిందని చెప్పారు. తమకు నలుగురు పిల్లలు ఉన్నారని, వారిలో ఒక కుమారుడికి భారతీయ సంతతికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరు పెట్టాము. అలాంటప్పుడు నన్ను జాతి వివక్షవాదిగా ఎలా అంటారు?, అని మస్క్ ప్రశ్నించారు.మస్క్ కుమారుడి పేరు స్ట్రైడర్ శేఖర్ సిరియస్. నక్షత్రాల పరిణామం, నిర్మాణంపై చేసిన అద్భుతమైన కృషికి గాను 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌కు నివాళిగా 'శేఖర్' అనే మధ్య పేరు పెట్టారు. ఈ విషయాన్ని మస్క్ నిఖిల్ కామత్‌తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.జాతి వివక్ష ఆరోపణలకు కారణంగత కొంతకాలంగా వలసలు, జాతి అంశాలు, రాజకీయాలపై మస్క్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూరప్‌లోని కొన్ని మితవాద రాజకీయ పార్టీలకు ఆయన మద్దతు ఇవ్వడం, వలసలపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయనపై జాతి వివక్ష ఆరోపణలు కూడా వచ్చాయి.అయితే.. ఈ ఆరోపణలను మస్క్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. తన కుటుంబం వివిధ సంస్కృతులు, భిన్న నేపథ్యాల కలయికకు నిదర్శనమని, అలాంటి వ్యక్తిని జాతి వివక్షవాదిగా చెప్పడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యమే ఈ ఆరోపణలకు సమాధానమని మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికా అప్రమత్తం.. AI నియంత్రణకు కొత్త చట్టం! -
స్టార్‌షిప్ లాంచ్ రీ-షెడ్యూల్
టెక్సాస్‌లోని బోకా చికా లాంచ్ ప్యాడ్ నుంచి ప్రపంచంలోనే శక్తివంతమైన రాకెట్ల్లో ఒకటైన స్పేస్ఎక్స్ ‘స్టార్‌షిప్’ ప్రయోగానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. జులై 16న ప్రయోగానికి కేవలం కొన్ని సెకన్ల ముందే కౌంట్‌డౌన్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రీ-షెడ్యూల్ తేదీపై సంస్థ అధికారిక ప్రకటనకు, ఎలాన్ మస్క్ చేసిన సోషల్ మీడియా పోస్టుకు మధ్య స్వల్ప వ్యత్యాసం కనిపించడం ఇప్పుడు చర్చకు దారితీసింది.స్పేస్ఎక్స్ సంస్థ విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. తదుపరి లాంచ్ ప్రయత్నాన్ని గురువారం (జులై 23) చేపట్టాలని భావిస్తున్నారు. అయితే, సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ తదుపరి ప్రయోగం శుక్రవారం (జులై 24) ఉండొచ్చని పేర్కొని ఆ వెంటనే ‘అంటే నా ఉద్దేశం గురువారమే’ అని సవరించుకున్నారు. ఈ చిన్నపాటి గందరగోళం ఎలా ఉన్నా జులై 23 లేదా 24 తేదీల్లో ఈ రాకెట్ నింగిలోకి ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.చివరి క్షణంలో ఎందుకు ఆగింది? కారణాలు ఇవే..స్పేస్ఎక్స్ ప్రయోగించిన సరికొత్త వర్షన్-3 (V3) మోడల్‌కు చెందిన ఈ 13వ టెస్ట్ ఫ్లైట్ జులై 16న ప్రయోగించాల్సింది. దాదాపు 1.15 కోట్ల పౌండ్ల ద్రవ మిథేన్, ద్రవ ఆక్సిజన్‌ను రాకెట్లో నింపినప్పటికీ ఇంజిన్ స్టార్టప్ సీక్వెన్స్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సూపర్ హెవీ బూస్టర్లోని మొత్తం 33 రాప్టర్-3 ఇంజిన్లలో నాలుగు అనుకున్న సమయానికి ఇగ్నైట్ (మండటం) కాలేదు. దీనితో ఆటోమేటెడ్ సేఫ్టీ సిస్టమ్ ప్రయోగాన్ని తక్షణమే నిలిపివేసింది.ఈ వైఫల్యం కారణంగా మార్కెట్లో స్పేస్ఎక్స్ విలువపై దాదాపు 100 బిలియన్ డాలర్ల ప్రభావం పడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇలాంటి భారీ ప్రయోగాల్లో ఇది సర్వసాధారణమని అంతరిక్ష నిపుణులు చెప్తున్నారు. ఇంజిన్ల వైఫల్యంపై స్పేస్ఎక్స్ బృందం వేగంగా స్పందించింది. రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో మార్పులు చేయడంతో పాటు లోపభూయిష్టంగా ఉన్న 2 రాప్టర్ ఇంజిన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు స్పేస్ఎక్స్ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?ఈ ప్రయోగం ప్రత్యేకత ఏంటి?సుమారు 15 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా మానవాళిని చంద్రుడిపైకి, ఆపై అంగారకుడిపైకి తీసుకెళ్లాలన్నదే మస్క్ ఆశయం.ఈ ప్రయోగంలో 20 అధునాతన స్టార్‌లింక్ శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి వాటి శాటిలైట్ డిస్పెన్సింగ్ సిస్టమ్, లేజర్ కమ్యూనికేషన్ లింకులను పరీక్షించనున్నారు.భూ వాతావరణంలోకి ఈ ఉపగ్రహాలు తిరిగి ప్రవేశించినప్పుడు సబ్‌ఆర్బిటల్ గమనాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తారు.గతంలో లాగా సంస్థ ఈసారి బూస్టర్‌ను భూమిపైకి తెచ్చి క్యాచ్ పట్టే ప్రయత్నం చేయడం లేదు. కేవలం ఇంజిన్ల పనితీరు, అంతరిక్షంలో రాప్టర్ ఇంజిన్ల రీ-లైట్ సామర్థ్యాలపైనే ప్రధాన దృష్టి పెట్టారు.కొన్ని మార్పులతో సిద్ధమైన స్టార్‌షిప్ అమెరికా కాలమానం ప్రకారం జులై 23 సాయంత్రం వేళ నింగిలోకి దూసుకెళ్లేందుకు కౌంట్‌డౌన్ సిద్ధమవుతోంది. -
టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న తెలుగోడు
-
ఇంజన్ వైఫల్యంతో స్పేస్ఎక్స్ రాకెట్ లాంచ్ రద్దు
శాన్ ఆంటోనియో: స్పేస్ఎక్స్ తన అత్యంత ప్రతిష్టాత్మక స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగాన్ని చివరి క్షణంలో రద్దు చేసింది. ఈ ప్రయోగం సమయంలో ఇంజిన్ సరిగ్గా స్టార్ట్ కాకపోవడం, కొన్ని ఇంజన్లు విఫలం కావడంతో టేకాఫ్‌కు కొన్ని సెకన్ల ముందు ఆటోమేటిక్ లాంచ్ సిస్టమ్‌ను నిలిపివేసింది. టెక్సాస్–మెక్సికో సరిహద్దులోని స్టార్‌బేస్ వద్ద జరగాల్సిన ఈ లాంఛింగ్ నింగిలోకి ఎగరడానికి మూడు సెకన్ల ముందే ఇంజిన్ మండటం ప్రారంభమైనట్లు ప్రయోగ వేదిక పైనుంచి తీసిన డ్రోన్ దృశ్యాల్లో కనిపించింది. మండిన ఇంజన్లు అకస్మాత్తుగా ఆగిపోయాయి. రాకెట్ ప్యాడ్‌కు అతుక్కుపోయి ఉండిపోయింది. ఆ తర్వాత ప్రయోగ బృందం వెంటనే రాకెట్ నుంచి ఇంధనాన్ని తీసివేయడం ప్రారంభించింది. మరికొన్ని రోజుల్లోనే తదుపరి ప్రయోగ ప్రయత్నం ఉంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ‘ఇంజన్ పాక్షికంగా మండే వరకు, వాతావరణంతో సహా ప్రతిదీ స్పేస్ఎక్స్కు అనుకూలంగానే సాగిందన్నారు. ప్రణాళిక ప్రకారం గంటసేపు సాగే ఈ ప్రయాణంలో, రాకెట్‌లోని 20 స్టార్‌లింక్‌లను విడుదల చేయాల్సి ఉంది. అవి అప్పటికే కక్ష్యలో ఉన్న స్టార్లింక్లతో సంభాషించడానికి ప్రయత్నిస్తూనే, స్టార్షిపహీట్ షీల్డ్ చిత్రాలను కూడా తీయాల్సి ఉంది. మొదటి దశ బూస్టర్‌ను గానీ, అంతరిక్ష నౌకను గానీ తిరిగి పొందాల్సిన అవసరం లేదు, రెండూ సముద్రంలోనే పడిపోతాయని భావించారు. ఈ ఆలస్యం స్పేస్ఎక్స్ ఉపగ్రహ ప్రణాళికలు, నాసా భవిష్యత్ చంద్ర కార్యక్రమంపై ప్రభావం చూపనుంది. ఈ ఎదురుదెబ్బతో అసలు సమస్య ఏమిటో పరీక్షించే పనిలో స్పేస్ఎక్స్ పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైనదిగా ప్రచారంలో ఉన్న ఈ రాకెట్, ప్రపంచం చుట్టూ సగం దూరం ప్రయాణించే తన 13వ యాత్రను చేయాల్సి ఉంది. ఈ మిషన్‌లో, 20 సరికొత్త స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను కూడా తీసుకువెళ్లాల్సి ఉంది. -
మస్క్ ప్రసంశలు.. AI రంగంలో వారే టాప్!
ఏఐ రంగంలో.. టెక్ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ప్రత్యర్థిగా ఉన్న ఆంత్రోపిక్ ప్రస్తుతం ఏఐ రంగంలో అగ్రస్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో ప్రముఖ ఏఐ మోడళ్ల పనితీరుపై జరిగిన చర్చపై మస్క్ స్పందించారు. ''ఆంత్రోపిక్ గురించి నేను గతంలో చేసిన అంచనా తప్పు. ప్రస్తుతం ఏఐ రంగంలో వారే ముందున్నారు. వారి మిథోస్/ఫేబుల్ (Mythos/Fable) మోడల్ స్థాయికి సమానమైన మోడల్‌ను ఇప్పటివరకు ఏ కంపెనీ విడుదల చేయలేదు. త్వరలోనే వారు మరింత శక్తివంతమైన మిథోస్ 2ను కూడా తీసుకురానున్నారు'' అని పేర్కొన్నారు.ఆంత్రోపిక్ ప్రస్తుతం ప్రపంచంలో ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం రూపొందించిన క్లాడ్ మోడళ్లు మంచి గుర్తింపు పొందాయి. గత ఏడాది విడుదలైన క్లాడ్ ఓపస్ 4.5 మోడల్ కోడింగ్ సామర్థ్యాల్లో అద్భుతమైన ఫలితాలను చూపడంతో ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు, ఏఐ పరిశోధకులు దీనిని విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో ఓపెన్ఏఐ, గూగుల్, ఎక్స్ఏఐ వంటి దిగ్గజ సంస్థలకు ఆంత్రోపిక్ గట్టి పోటీగా నిలిచింది.ఎలాన్ మస్క్ వంటి ప్రముఖ వ్యాపారవేత్త ప్రత్యర్థి సంస్థను బహిరంగంగా ప్రశంసించడం ఆంత్రోపిక్ సాధించిన విజయానికి నిదర్శనం. ఏఐ రంగంలో పోటీ మరింత తీవ్రంగా మారుతున్న ఈ సమయంలో.. కొత్త ఆవిష్కరణలు, శక్తివంతమైన మోడళ్లతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందే అవకాశాలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.I was clearly wrong about Anthropic. They are obviously currently the leader in AI. No company has released a model as good as Mythos/Fable and they will undoubtedly have Mythos 2 ready soon. And I would never cut them off in a way that hurt them badly, even as a competitor.…— Elon Musk (@elonmusk) July 9, 2026 -
ట్రిలియనీర్ హోదా కోల్పోయిన మస్క్: ఎందుకంటే?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం మూడు వారాల క్రితం ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన ఈయన.. ఇప్పుడు ఆ హోదాను కోల్పోయారు. దీనికి కారణం స్పేస్ఎక్స్ (SpaceX) షేర్ల ధర భారీగా పడిపోవడమే.నిజానికి 2026 జూన్ 12న స్పేస్ఎక్స్ నాస్డాక్లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఒక్కో షేర్ ధరను 135 డాలర్లుగా నిర్ణయిస్తే.. లిస్టింగ్ రోజే అది 150 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత కూడా పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన రావడంతో షేర్ ధర మరింత పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 2.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద కూడా గణనీయంగా పెరిగి 1.4 ట్రిలియన్ డాలర్లను దాటింది. తద్వారా ఈయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించారు.అయితే.. మస్క్ ఆనందం మూణ్నాళ్ల ముచ్చట అయింది. జూన్ నెలలో పొందిన ట్రిలియనీర్ హోదా.. జులై ప్రారంభం నాటికి పోయింది. ఎందుకంటే స్పేస్ఎక్స్ షేర్లు గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో వందల బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ట్రిలియనీర్ హోదా కోల్పోయినా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మాత్రం మస్క్ కొనసాగుతున్నారు. -
మస్క్ హెచ్చరిక.. టిమ్ కుక్ షాక్!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను మాత్రమే కాదు, కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత తీవ్రమవడంతో యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతోంది.యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ పరిస్థితిని 'వందేళ్లలో ఒకసారి వచ్చే వరద'తో పోల్చారు. గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, తాను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ధరల పెరుగుదల అని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం మెమరీ చిప్‌ల కొరత ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.ఈ సమస్యకు ప్రధాన కారణం ఏఐ రంగం వేగంగా విస్తరించడం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం. ఈ డేటా సెంటర్లకు అధిక సామర్థ్యం గల మెమరీ చిప్‌లు అవసరం అవుతున్నాయి. ఫలితంగా చిప్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని ఎక్కువగా ఏఐ సర్వర్ల కోసం కేటాయిస్తున్నాయి. దీంతో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్ల వంటి వినియోగదారుల ఉత్పత్తులకు అవసరమైన మెమరీ చిప్‌ల సరఫరా తగ్గిపోయింది.ప్రస్తుతం DRAM (యాప్‌లు పనిచేయడానికి ఉపయోగించే మెమరీ), NAND (ఫొటోలు, వీడియోలు, ఫైళ్లను నిల్వ చేసే స్టోరేజ్ చిప్‌లు) ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ భారీ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ వ్యయం కూడా గణనీయంగా పెరిగింది.ఈ పరిస్థితుల్లో యాపిల్ చాలా కాలం వరకు అదనపు ఖర్చును వినియోగదారులపై మోపకుండా భరించింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి సాధ్యం కాకపోవడంతో కంపెనీ మ్యాక్‌బుక్, ఐమ్యాక్, ఐప్యాడ్, హోమ్‌ప్యాడ్, యాపిల్ టీవీ వంటి ఉత్పత్తుల ధరలను 15 నుంచి 25 శాతం వరకు పెంచింది.ఉదాహరణకు, మ్యాక్‌బుక్ ఎయిర్ ధర 200 డాలర్లు పెరిగి 1,299 డాలర్లకు చేరగా, మ్యాక్‌బుక్ ప్రో ధర 300 డాలర్లు పెరిగి 1,999 డాలర్లకు చేరింది. అలాగే ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మైక్రోసాఫ్ట్ కూడా తన Xbox గేమింగ్ కన్సోళ్ల ధరలను 100 నుంచి 150 డాలర్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే మెమరీ చిప్‌ల కొరత ప్రభావం మొత్తం టెక్నాలజీ పరిశ్రమపైనే పడుతోంది.ఈ సమస్యను పరిష్కరించాలంటే మెమరీ చిప్‌ల ఉత్పత్తిని భారీగా పెంచాలని ఎలాన్ మస్క్ సూచించారు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధికి మెమరీ చిప్లే అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే టెస్లా, స్పేస్ఎక్స్, ఇంటెల్ కలిసి అత్యాధునిక చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను కూడా ప్రకటించారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌కు భారీ నష్టం.. కారణం ఇదేనా? -
దాతృత్వంపై ఎలాన్ మస్క్ ట్వీట్!
ప్రపంచ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త 'ఎలాన్ మస్క్' జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలపై చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి.అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ చేసిన భారీ దాతృత్వ కార్యక్రమం సమాజానికి మేలు చేయడం కంటే కీడు చేస్తున్నాయని మస్క్ అభిప్రాయపడ్డారు.మెకెంజీ స్కాట్ ఇప్పటివరకు సుమారు 26.3 బిలియన్ డాలర్లకు పైగా వివిధ చారిటీలకు అందించారు. ఇది వ్యక్తిగత స్థాయిలో చూస్తే.. చరిత్రలోనే అత్యంత పెద్ద దానాలలో ఒకటిగా నిలిచింది. ఆమె 2019లో జెఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకున్న తరువాత.. వచ్చిన అమెజాన్ వాటా సంపదలో ఎక్కువ భాగాన్ని సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 'యీల్డ్ గివింగ్' పేరుతో ఆమె ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,700కు పైగా నాన్‌ప్రాఫిట్ సంస్థలకు సహాయం చేశారు. వీటిలో హోవార్డ్ యూనివర్సిటీతో పాటు పలు వాతావరణ, సామాజిక అభివృద్ధి సంస్థలు ఉన్నాయి.Sadly, yes— Elon Musk (@elonmusk) June 28, 2026అయితే.. ఈ విస్తృత దానాలపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ, అవి సమాజానికి హానికరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక యూజర్ చేసిన వ్యాఖ్యకు సమాధానంగా ఆయన స్పందించడం, ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దీనిని చాలా మంది మెకెంజీ స్కాట్ దానాలపై పరోక్ష విమర్శగా భావించారు.ఇక 2024లో కూడా మస్క్ చేసిన ఒక పోస్ట్ ఈ చర్చను మరింత పెంచింది. అప్పట్లో ''మాజీ భార్యలు తమ మాజీ భర్తలను ద్వేషిస్తూ.. చేసే దానాలు పాశ్చాత్య నాగరికత క్షీణతకు కారణాలలో ఒకటి' అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. ఆ పోస్ట్‌లో తాను ఎవరి పేరును ప్రస్తావించకపోయినా, అది మెకెంజీ స్కాట్‌ను ఉద్దేశించి చేసినదేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో తరువాత ఆ పోస్ట్ తొలగించడం జరిగింది.ఎవరెన్ని విధాలుగా మాట్లాడినా, విమర్శించినా.. మెకెంజీ స్కాట్ మాత్రం తన దాతృత్వ విధానాన్ని కొనసాగిస్తూ, సమాజంలో వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె 'నా సంపద పూర్తిగా అయిపోయే వరకు దానం చేస్తూనే ఉంటాను' అని గతంలో ప్రకటించారు. అయితే.. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు దాతృత్వం ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందనే విషయంపై కొత్త చర్చను దారితీసాయి. -
ప్రపంచ కుబేరుడి విజయ గాథ!
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ తన 55వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ (AI) వంటి రంగాల్లో చూపిన దూరదృష్టి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ సాంకేతిక ప్రపంచాన్ని రూపొందిస్తున్న వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.బాల్యం, విద్యఎలాన్ మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లు, టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1989లో ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు. అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీకి చేరినప్పటికీ, కేవలం రెండు రోజుల్లోనే దాన్ని వదులుకుని వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.వ్యాపార ప్రస్థానం ప్రారంభం1995లో తన సోదరుడితో కలిసి 'జిప్2' అనే ఆన్లైన్ సిటీ గైడ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థను 1999లో విక్రయించడంతో మస్క్‌కు భారీ ఆర్థిక లాభం వచ్చింది. అయితే ఆ డబ్బును ఖర్చు చేయకుండా మరో వినూత్న ఆలోచనకు పెట్టుబడిగా పెట్టారు. ఆ తర్వాత 'X.com' అనే ఆన్లైన్ ఆర్థిక సేవల సంస్థను ప్రారంభించారు. తరువాత అది 'కాన్ఫినిటీ' సంస్థతో విలీనం చెంది ప్రపంచ ప్రఖ్యాత 'పేపాల్'గా మారింది. పేపాల్‌ను ఈబే కొనుగోలు చేయడంతో మస్క్‌కు వందల మిలియన్ల డాలర్లు లభించాయి.సాంకేతిక రంగంలో విప్లవాత్మక ప్రయాణంపేపాల్ ద్వారా సంపాదించిన సంపదను మస్క్ కొత్త ఆవిష్కరణల కోసం వినియోగించారు. అంతరిక్ష ప్రయాణాన్ని చౌకగా మార్చాలనే లక్ష్యంతో స్పేస్‌ఎక్స్‌ను స్థాపించారు. అదే సమయంలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాను ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లారు. అనంతరం ట్విట్టర్‌ను కొనుగోలు చేసి దానికి 'X'గా పేరు మార్చారు. కృత్రిమ మేధ అభివృద్ధి కోసం xAI సంస్థను కూడా స్థాపించారు.రిస్క్ తీసుకునే ధైర్యమే విజయ రహస్యంఎలాన్ మస్క్ విజయానికి ప్రధాన కారణం కొత్త ఆలోచనలను అమలు చేయడంలో ఆయన చూపిన ధైర్యం. ఇతరులు వెనుకడుగు వేసే పరిస్థితుల్లో కూడా ఆయన భారీ పెట్టుబడులు పెట్టి కొత్త అవకాశాలను సృష్టించారు. అందుకే ఆయన వ్యాపార ప్రయాణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు ఆదర్శంగా తీసుకుంటున్నారు.ఎలాన్ మస్క్ ప్రయాణం విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. రాజకీయ వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు, వ్యాపార నిర్ణయాల కారణంగా పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొత్త సాంకేతిక ఆవిష్కరణలపై ఆయన దృష్టి మాత్రం మారలేదు. -
భారీగా తగ్గిన మస్క్ సంపద: కారణం ఇదే!
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా అవతరించిన కొద్ది రోజులకే, ఎలాన్ మస్క్ 'స్పేస్ఎక్స్' అనూహ్యమైన ఎదురుదెబ్బను చవిచూసింది. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ సంస్థ, మార్కెట్ విలువలో 600 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు ట్రిలియన్ డాలర్ల కంటే దిగువకు చేరింది.నాస్డాక్లో లిస్టింగ్ అయినప్పుడు స్పేస్ఎక్స్ షేర్లు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన పొందాయి. ఐపీఓ ధర 135 డాలర్లు ఉండగా, కొద్ది రోజుల్లోనే దాదాపు 67 శాతం పెరిగి 225 డాలర్ల స్థాయికి చేరాయి. ఆ సమయంలో కంపెనీ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరి, ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానాలకు చేరుకుంది. అయితే.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రారంభ ఉత్సాహం తగ్గిపోవడంతో, పెట్టుబడిదారులు కంపెనీ వాస్తవ ఆర్థిక పరిస్థితులపై దృష్టి పెట్టడం ప్రారంభించారు.స్పేస్ఎక్స్ కమర్షియల్ స్పేస్ లాంచ్‌లు, స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు, ఏఐ రంగాల్లో బలమైన స్థానం సంపాదించింది. అయినప్పటికీ.. కంపెనీ విలువ చాలా ఎక్కువగా ఉండటం, ఏఐ ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు చేయడం, అప్పులు పెరగడం వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.ఇటీవల కంపెనీ కొత్త షేర్లు విడుదల చేయకుండా.. స్వల్పకాలిక అప్పులను తీర్చేందుకు బాండ్ల ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించడం కూడా మార్కెట్లో మిశ్రమ సంకేతాలకు కారణం అయింది.స్పేస్ఎక్స్లో సుమారు 38 శాతం వాటా కలిగిన ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద కూడా ఈ పతనం వల్ల భారీగా తగ్గింది. కంపెనీ షేర్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు పోలిస్తే, మస్క్ సంపద దాదాపు 350 బిలియన్ డాలర్లు తగ్గినట్లు అంచనా. ప్రస్తుతం ఆయన నికర సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ప్రస్తుతం షేర్ ధరల్లో భారీ తగ్గుల కనిపిస్తున్నప్పటికీ, స్పేస్ఎక్స్ ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. అంతేకాకుండా.. కంపెనీ త్వరలో నాస్డాక్-100 సూచీలో చేరే అవకాశం ఉండటంతో, ఇండెక్స్ ఫండ్లు, పెద్ద పెట్టుబడిదారుల నుంచి అదనపు పెట్టుబడులు వచ్చే అవకాశముంది. -
ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా: స్పందించిన మస్క్!
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఒక టెస్లా మోడల్ 3 కారు అధిక వేగంతో ఓ ఇంటిలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల మహిళ మరణించింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టం ఉపయోగించినట్లు సమాచారం రావడంతో, టెస్లా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై ప్రశ్నలు తలెత్తాయి.ప్రమాదం ఎలా జరిగింది?స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. 44 ఏళ్ల మైఖేల్ బట్లర్ కారును డ్రైవ్ చేసే సమయంలో ఒక ఇంటిని ఢీకొట్టాడు. ఈ ప్రమాద సమయంలో డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ యాక్టివ్‌గా ఉన్నట్లు అతను విచారణాధికారులకు తెలిపారు. కారు ఇంటి గోడను బలంగా ఢీకొట్టి లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 76 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినప్పటికీ, కొంతసేపటి తరువాత మరణించారు.కుటుంబ సభ్యుల ప్రకారం.. కారు ఢీకొట్టిన ప్రదేశంలో (ఇంట్లో) పిల్లలు తరచుగా ఉండేవారు. కానీ ఆ రోజు ఎవరూ లేదు. మహిళ తప్పా.. మరెవరికి ప్రమాదం జరగలేదు.ప్రమాదంలో డ్రైవర్ కూడా గాయపడ్డాడు. అయితే అధికారులు అతడు మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలను సేవించినట్లు లేదని తెలిపారు. కాగా ప్రస్తుతం అతను దర్యాప్తుకు సహకరిస్తున్నాడు. ఇప్పటివరకు అతనిపై ఎటువంటి కేసులు లేదా అభియోగాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం సమయంలో కారు ఏ సిస్టమ్‌ను ఉపయోగిస్తోందో స్పష్టంగా తెలియలేదు. అది టెస్లా 'ఆటోపైలట్' వ్యవస్థనా, లేక ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD)నా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.BUSINESS INSIDER you lying fucks. Prepare to be sued. pic.twitter.com/k68q64QvrB— Pete Balls to the wall FSD 🤖🚕 (@kylaschwaberow) June 22, 2026ఎలాన్ మస్క్ స్పందనఈ ఘటనపై వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందిస్తూ, డ్రైవింగ్ సిస్టమ్ కారణంగా ప్రమాదం జరిగిందనే ఆరోపణలను ఖండించారు. ఆయన ప్రకారం.. FSD వ్యవస్థను నివాస ప్రాంతాల్లో చాలా తక్కువ వేగంతో ప్రయాణించేలా రూపొందించినట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదం అధిక వేగంతో జరిగింది కాబట్టి, ఈ ఆరోపణలు సరైనవిగా కనిపించడం లేదని చెప్పారు.టెస్లా ఏఐ విభాగం వివరణటెస్లా ఏఐ హెడ్ అశోక్ ఎల్లుస్వామి కూడా స్పందించారు. డ్రైవర్ యాక్సిలరేటర్‌ను పూర్తిగా (100%) నొక్కి స్వయంచాలక డ్రైవింగ్‌ను మాన్యువల్‌గా ఓవర్‌రైడ్ చేశాడు. ప్రమాదం సమయంలో కారు గంటకు సుమారు 73 మైళ్ల (దాదాపు 117 కి.మీ.) వేగంతో ప్రయాణించింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా యాక్సిలరేటర్ నొక్కిన స్థితిలోనే ఉందని టెస్లా డేటా సూచిస్తోందని తెలిపారు.Yup. In this case, the driver manually overrode self-driving by pressing the accelerator all the way to 100% of the accel pedal in this residential area. They reached a speed of 73 mph during the crash, and had the accelerator pressed even after the crash.— Ashok Elluswamy (@aelluswamy) June 22, 2026 -
రిస్క్ తీసుకుంటేనే 'నవలోకాలు'!
నేనూ ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాను. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను. అప్లైడ్ మ్యాథ్స్‌లో మాస్టర్స్ పట్టా పొందాను. నాకు ఇద్దరు పిల్లలు. వారూ ఉన్నత విద్యావంతులే. కాబోయే తల్లిదండ్రులుగా మీకు నాదొక సలహా. పెద్దయిన తర్వాత మీరు ఫలానా కావాలంటూ వారికి ఎన్నడూ చెప్పకండి. వారు దానికి విరుద్ధమైన పని చేసి చూపిస్తారు. కానీ, మీరు వారికొక ఆదర్శమైన వ్యక్తిలా మారవచ్చు లేదా ఆదర్శప్రాయంగా తీసుకో దగిన వ్యక్తుల్ని వారికి చూపవచ్చు. మా అమ్మ నాకు అదే పని చేసింది. నాకపుడు 15 లేదా 16 ఏళ్ళు అనుకుంటా. మా అమ్మ నాకు ‘సొసైటీ ఆఫ్ విమెన్ ఇంజినీర్స్’ సంస్థను చూపించింది. నేను ఇరవై ఏళ్లుగా ఒక ఉత్తమ భౌతికవేత్త, ఇంజినీర్ వద్ద పనిచేస్తున్నా. ఆయనే ఎలాన్ మస్క్. పది మందితో మొదలుపెట్టి దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించే సంస్థగా స్పేస్‌ఎక్స్‌ను తీర్చిదిద్దడంలో సహాయపడే అవకాశాన్ని మస్క్ నాకు కల్పించారు. మొదట్లో ఆదాయం లేకపోయినా ఏటా కోట్ల డాలర్లు గడించే సంస్థగా అది అవతరించింది. అమెరికాలో తయారైన రాకెట్లు, అంతరిక్ష నౌకల ద్వారా వ్యోమగాములను పంపడంలో చేయూతనివ్వగలగడం నాకెంతో గర్వదాయకంగా ఉంటుంది. మా డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వ్యోమగాములనైనా సరే అంతరిక్షంలోకి పంపగలం. ఓసారి కేవలం పౌరులను పంపాం. వారు కొద్ది రోజులు భూమి చుట్టూ తిరిగి వచ్చారు. ఇది ఆరంభం మాత్రమే. మనుషులు ఈ భూమిపైనే కాకుండా చంద్రునిపైన లేదా కుజునిపైన జీవించేందుకు బాటను సృష్టించడంలో సాయపడ్డానని అనుకుంటున్నాను. అవే కాదు, వాటిని మించి ఇతర నక్షత్ర వ్యవస్థలు, గెలాక్సీలలో జీవించగలిగే భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ఆశిస్తున్నాను. ఇతర గ్రహాల్లో లేదా విశ్వాంతరాళంలో ఎక్కడైనా జీవకోటి ఉంటే వారితో మాత్రమే మాట్లాడాలని కోరుకుంటు న్నానని నేను తరచు జోక్ చేస్తూంటాను. అది నా జీవిత కాలంలో నెరవేరకపోవచ్చు. కానీ, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పునాదిగా లేదా తొలి అడుగులు వేసినదిగా నా కృషి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. నా గురించి చెప్పుకున్నది చాలు. నా జీవితానుభవాల ఆధారంగా రెండు మూడు సంగతులు చెబుతాను.కంఫర్ట్ జోన్ నుంచి బయటపడితేనే...అసంబద్ధమైనవైనా సరే కొన్ని లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నించండి. విఫలమవుతానేమోనని భయ పడకండి. విఫలమైనా, పొరపాటు చేసినా అంగీకరించేందుకూ, మరో దారిని వెతుక్కునేందుకూ సందేహించకండి. ఆశించిన ఫలితం రానంత మాత్రాన విఫలమయ్యామనుకోకండి. తప్పటడుగును వృద్ధిగా పరిగణించండి. స్పేస్ఎక్స్లో జాయినవ్వాలా వద్దా అని 2002లో నేను చాలా మథనపడ్డాను. ఆ చిన్న అంకుర సంస్థలో చేరడం వ్యక్తిగతంగా రిస్క్ తీసుకోవడమనిపించింది. ఆ రంగంలో అంతకుముందెన్నడూ సఫలమైనవారు లేరు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం ఇష్టం లేకపోయింది. తర్వాత, నాకే అనిపించింది. నేనేమీ పెద్ద తెలివైన దాన్ని కాను. నేను దీన్ని ప్రయత్నించి చూస్తే నేనైనా లేదా కంపెనీ అయినా విఫలమైతే పట్టించుకునేదెవరు? ప్రయత్నించి చూడటమే ముఖ్యమైన విషయంగా తోచింది. రిస్క్ తీసుకోవాలి. ఉత్తేజకరమైన దాంట్లో భాగం కావాలని నిర్ణయించుకున్నా. నేనపుడు ఆ నిర్ణయానికి రాకపోయి ఉంటే నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం ఏ విధంగా ఉండేవో ఇపుడు ఊహించబుద్ధి కూడా కాదు. రాకెట్‌ను పైకి పంపడమే కాదు, దాన్ని సురక్షితంగా తిరిగి భూమి మీదకు దింపడం చాలా కష్టం. ఈ విషయంలో స్పేస్ఎక్స్ అపారమైన రిస్క్ తీసుకుంది. టెక్నాలజీకి నిరంతరం పదును పెట్టుకుంటూ వచ్చింది. రాకెట్‌ను ప్రయోగించిన వేదికకు డ్రోన్‌షిప్ కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉంది. ఓ డజనుసార్లు విఫలమైన తర్వాత, రాకెట్‌ను దానిమీద సురక్షితంగా దింపగలిగాం. ఇప్పటికీ అది క్లిష్టమైన కార్యమేగానీ, రొటీన్‌గా మారిపోయింది. ఆ టెక్నాలజీ కుజ గ్రహంపై ఆవాసం ఏర్పరుచుకునేందుకు చాలా ముఖ్యం.కబుర్లు అనవసరంపనిచేస్తున్న సంస్థలో టెక్నాలజీకే పరిమితం కాకుండా అకౌంటింగ్, ఫైనాన్సింగ్, ప్రభుత్వ అనుమతులు వంటి వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి వచ్చింది. ఒకసారి తివాచీని వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసేందుకు కూడా నేను వెనుకాడలేదు. సైన్స్ ప్రయోగాలకు, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సరుకులు తీసుకెళ్ళి, తీసుకొచ్చేందుకు సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మాతో దాదాపు 200 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అట్లా, నా విధినిర్వహణల పరిధి విస్తరిస్తూ పోయింది. ఎలాన్ మస్క్ అభ్యర్థన మేరకు కంపెనీకి చెందిన ఇతర విభాగాల్లోనూ పనులు చక్కబెట్టడంలో సహాయ పడుతూ వచ్చాను. దయతో మెలగండి. ఎదుటివారి పట్ల గౌరవం చూపండి. కానీ, ఒక సంగతి గుర్తుంచుకోవాలి. కబుర్లరాయుళ్లతో మనకు పనిలేదు. వారు చేయాల్సిన పని చేయడం మానేసి, ఇతరుల పనికి కూడా అవాంతరాలు కల్పించేవారుంటారు. కొత్త, వినూత్నమైన ఆలోచన లను పంచుకోవడంలో తప్పు లేదు. క్లిష్టమైన సమస్యలను పరిష్క రించుకునేందుకు అవి అవసరమే. కానీ, అది కాలక్షేప ప్రక్రియగా మారకూడదన్నదే నా ఉద్దేశం. ఒక్కముక్కలో చెప్పాలంటే, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం గొంతెత్తి మాట్లాడటంలో లేదు. ఎదుటి వారి మాటలను శ్రద్ధాసక్తులతో వినడంలో ఉంది. తోటి ఉద్యోగుల ఐడియాలను స్వాగతించండి. ముఖ్యంగా మీ ఆలోచనలతో విభేది స్తున్నవారి మాటలను మరింత ఓపిగ్గా వినండి. మనమేం చేయగలం?ఈ సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ప్రస్తావించకపోవడం కూడా సబబు కాదు. ఆందోళన కలిగిస్తున్న అంశాలకు పరిష్కారాలు ఇప్పటికిప్పుడు నా వద్ద కూడా లేవు. మున్ముందు తడతాయేమో చూడాలి. భవిష్యత్ జీవన విధానంలో టెక్నాలజీ పాత్ర మరింత పెరగబోతోంది. సైన్స్, గణితంలో మన విద్యార్థుల మార్కులు పెదవి విరిచేవిగా ఉంటున్నాయి. ఉత్తీర్ణతలో చైనా అగ్ర స్థానంలో ఉంటే, నా మూలాలున్న ఐర్లాండ్ 12వ స్థానంలో ఉంది. అమెరికాది 25వ స్థానం. ఇంకా ఆందోళన కలిగించే విషయమేమిటంటే, అత్యధిక, అత్యల్ప మార్కులు తెచ్చుకుంటున్న వారి మధ్య వ్యత్యాసం పెరిగిపోతోంది. భవిష్యత్తుకు తగ్గట్లుగా నేటి బాలలను తీర్చిదిద్దాలి. మొదటగా అసాధ్యమైనవిగా కనిపించినా కొన్ని కొత్త ఐడియాలను కూడా గౌరవించడం, వాటి గురించి చెప్పేవారి మాటలను ఉపేక్షించకుండా వినడం అవసరం. మానవ ప్రతిభా వ్యుత్పత్తులను నిరుపయోగంగా వదిలేయడంకన్నా నైతికమైన పాపం మరొకటి ఉండదు. వ్యక్తిగత పురోభివృద్ధితోపాటు ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైనదిగా మార్చడంలో మన వంతు కృషి ఏమి చేయగలమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. -
హైదరాబాద్ లో అతిపెద్ద తొలి టెస్లా షోరూం
-
మస్క్ ఎంత ధనవంతుండంటే.. వందేళ్లు తరగని సంపద!
కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అనేది సామెత. కానీ ప్రపంచ అపర కుబేరుడిగా అవతరించిన ఎలాన్ మస్క్‌కు మాత్రం ఈ సామెత సరిపోదేమో! ఎందుకంటే ఆయన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ స్టాక్మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్లకు అధిపతి) అవతరించారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు రాయిటర్స్, ఏపీ, బ్లూమ్‌బర్గ్ నివేదికల ప్రకారం, ఇది ఆధునిక ఆర్థిక చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ క్రమంలో మస్క్ సంపద గురించి విస్తృత చర్చ సాగుతోంది.జూన్ 12, 2026న నాస్డాక్లో "SPCX" టిక్కర్‌తో స్పేస్ఎక్స్ షేర్లు లిస్టయ్యాయి. ఒక్కో షేరు ధర 135 డాలర్లుగా నిర్ణయించగా, ట్రేడింగ్ ప్రారంభంలోనే 150 డాలర్లకు చేరుకుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సుమారు 75 బిలియన్ డాలర్లు సమీకరించడం విశేషం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా నమోదైంది. లిస్టింగ్ అనంతరం స్పేస్ఎక్స్ మార్కెట్ విలువ తొలుత 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ట్రేడింగ్‌లో పెరుగుదలతో 2 ట్రిలియన్ డాలర్లను కూడా అధిగమించింది.స్పేస్ఎక్స్లో మస్క్‌కు ఉన్న భారీ వాటా, అలాగే టెస్లాలోని ఆయన పెట్టుబడులను కలిపి చూస్తే ఆయన నికర విలువ సుమారు 1.1 నుంచి 1.3 ట్రిలియన్ డాలర్ల మధ్యకు చేరిందని అంచనాలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే ఈ సంపద ఎక్కువ భాగం కంపెనీ షేర్ల రూపంలో ఉండే "పేపర్ వెల్త్" మాత్రమే; అది నగదు రూపంలో అందుబాటులో ఉండదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కంపెనీల మార్కెట్ విలువలు మారితే ఈ సంపద కూడా మారే అవకాశం ఉంది.శతాబ్దమైనా చాలదు!ఒక ట్రిలియన్ డాలర్ల పరిమాణాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. గంటకు 10 లక్షల డాలర్లు అంటే ఇప్పుడున్న విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.4 కోట్లు ఖర్చు పెడుతూ వచ్చినా 1 ట్రిలియన్ డాలర్లను పూర్తిగా ఖర్చు చేయడానికి శతాబ్దానికి పైగా సమయం పడుతుంది. అంతటి ఆర్థిక శక్తి ఇప్పుడు ఎలాన్ మస్క్ సొంతం.దేశాల జీడీపీలను మించి..మస్క్ సంపదను దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే దాని విస్తృతి మరింత స్పష్టమవుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని చాలా కొన్ని దేశాల జీడీపీ మాత్రమే ట్రిలియన్ డాలర్లకు మించి ఉంటుంది. అంటే ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే మస్క్ వ్యక్తిగత సంపద అధికంగా ఉంటుందన్న మాట.అయితే ఈ అసాధారణ సంపదపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం అసమానతలను పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, మస్క్ అభిమానులు మాత్రం అంతరిక్ష సాంకేతికత, కృత్రిమ మేధస్సు, విద్యుత్ వాహనాల్లో ఆయన చూపిన దూరదృష్టే ఈ విజయానికి కారణమని పేర్కొంటున్నారు.టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విటర్), ఎక్స్ఏఐ వంటి సంస్థల ద్వారా ఆటోమొబైల్, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు రంగాల్లో ప్రభావం చూపుతున్న ఎలాన్ మస్క్, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నారు. -
అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లను దాటేసిన స్పేస్ఎక్స్
న్యూయార్క్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ షేరు వాల్‌స్ట్రీట్‌లో రోజుకో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. అమెరికా నాస్డాక్ ఎక్సే్చంజీలో మంగళవారం ఇంట్రాడేలో ఈ షేరు ఏకంగా 17 శాతానికి పైగా లాభపడి 226 డాలర్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. షేరు భారీ ర్యాలీతో స్పేస్ఎక్స్ సంస్థ మార్కెట్ విలువ 2.95 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలో 2.64 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ ‘అమెజాన్’ను వెనక్కి నెట్టింది. అలాగే, ఒక దశలో 2.92 ట్రిలియన్ డాలర్ల విలువ గల ‘మైక్రోసాఫ్ట్’ను సైతం అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్–5 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక ఎలాన్ మస్క్ సంపద కూడా రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. స్పేస్ఎక్స్ లిస్టింగ్‌తో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అవతరించిన ఎలాన్ వెల్త్ తాజాగా 1.3 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. -
డబ్బు అవసరం ఉండదు!.. భవిష్యత్తులో..
స్పేస్ఎక్స్ ఐపీఓ విజయవంతం కావడంతో ఎలాన్ మస్క్ తొలి ట్రిలియనీర్ అయ్యారు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆయన, డబ్బు చివరికి పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీశాయి.ఇటీవల ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ 'పీటర్ డయామాండిస్'తో మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోబోట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని మస్క్ పేర్కొన్నారు. ఏఐ, రోబోట్లు నిరంతరం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయగలవు. తద్వారా వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయి. చివరికి మనుషులు చేయడానికి పనులు లేకుండా పోతాయని అన్నారు.మనుషుల అవసరం ఎప్పుడైతే తగ్గిపోతుందో.. ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కార్మికుల అవసరం ఉండదు, వారికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఒక దశలో డబ్బు అవసరం ఉండదని మస్క్ స్పష్టం చేశారు.ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన్ మీరు, డబ్బు అవసరం ఉండదని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని మస్క్‌ను ఇంటర్వ్యూ చేసే పీటర్ డయామాండిస్ అన్నారు. భవిష్యత్తులో ఇది నిజం అవుతుందని టెస్లా బాస్ జవాబిచ్చారు.భవిష్యత్తులో ప్రజలు ఉద్యోగాల ద్వారా సంపాదించకపోయినా.. జీవించగలిగేలా 'యూనివర్సల్ హై ఇన్కమ్' (సార్వత్రిక ఆదాయం) అనే వ్యవస్థ వస్తుందని మస్క్ గతంలో సూచించారు. ఈ విధానంలో ప్రతి ఒక్కరికీ కనీస జీవనానికి సరిపడే ఆదాయం లభిస్తుంది. అవసరమైనవారికి ప్రభుత్వాలే డబ్బులు ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. తద్వారా ఆటోమేషన్ వల్ల వచ్చే మార్పులను సమాజం ఎదుర్కోగలుగుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్! -
టెస్లా బాస్‌పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఎలాన్ మస్క్'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మస్క్ విజయాన్ని కేవలం సంపదతో కొలవలేమని, అసలు విజయ రహస్యం ఆయన ఆత్మవిశ్వాసం, పట్టుదలలోనే ఉందని పేర్కొన్నారు.స్పేస్ఎక్స్ లిస్టింగ్‌తో మస్క్ సంపద భారీగా పెరిగి ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈరోజు అందరూ ట్రిలియన్ డాలర్ల మైలురాయి గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు కథ ఏమిటంటే.. ఈ రోజు అసాధ్యం అనుకున్నది రేపు సాధ్యమవుతుందని మస్క్ గట్టిగా విశ్వసిస్తారని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.మస్క్ ప్రస్తుతం టెస్లా, స్టార్‌లింక్ వంటి సంస్థల ద్వారా ప్రపంచ సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన జీవితంలో ఎన్నో కష్టకాలాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా 2018లో మస్క్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని వెల్లడించారు. ఆ సమయంలో చాలామంది విమర్శించినప్పటికీ, ఆనంద్ మహీంద్ర మాత్రం ఆయనకు మద్దతు ప్రకటించారు.అప్పట్లో సోషల్ మీడియా వేదికగా మస్క్‌ను ఉద్దేశించి 'ధైర్యంగా ముందుకు సాగండి. ప్రపంచానికి మీలాంటి స్ఫూర్తిదాయక ఆవిష్కర్తలు అవసరం' అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆ సమయంలో మస్క్ చూపిన సహనం, సంకల్పమే తనను ఎక్కువగా ఆకట్టుకుందని ఆయన గుర్తు చేసుకున్నారు.ఆనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం.. నిజమైన ఆవిష్కర్తలను వారి విజయ సమయాల్లో కాకుండా కష్టకాలంలో వారు ఎలా నిలబడతారనే అంశం ఆధారంగా అంచనా వేయాలి. ఎలాన్ మస్క్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాలపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగడం వల్లే నేడు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్! -
వెల్డర్‌గా చేరాడు.. జాక్పాట్తో కోటీశ్వరుడిగా..
ఉద్యోగంలో భాగంగా కంపెనీ ఇచ్చిన కొన్ని షేర్లు ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని చెప్పే ఉదాహరణలు కార్పొరేట్ ప్రపంచంలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. తాజాగా అమెరికాలో అలాంటి కథే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు గంటకు 28 డాలర్ల వేతనంతో పనిచేసిన స్పేస్ఎక్స్ మాజీ వెల్డర్ జువాన్ హెర్నాండెజ్.. కంపెనీ ఇచ్చిన సుమారు 10,000 డాలర్ల (దాదాపు ₹9.5 లక్షలు) స్టాక్ గ్రాంట్ కారణంగా ఇప్పుడు దాదాపు 1.1 మిలియన్ డాలర్ల (సుమారు ₹10 కోట్లు) సంపదకు యజమానిగా మారాడు.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్ ఎక్స్’ ఇటీవల చరిత్రాత్మక ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ ఐపీఓకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. సంస్థ షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అయిన తొలి రోజే గణనీయంగా పెరగడంతో ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల వద్ద ఉన్న షేర్ల విలువలు అమాంతం ఎగబాకాయి. దీంతో, కొందరి పంట పండినట్టు అయ్యింది.సాధారణ ఉద్యోగమే అనుకున్నా..మెక్సికోకు చెందిన జువాన్ హెర్నాండెజ్ 2015లో స్పేస్ఎక్స్లో వెల్డర్‌గా చేరాడు. అప్పట్లో అతను గంటకు 28 డాలర్ల వేతనం పొందేవాడు. స్పేస్ఎక్స్ భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీలలో ఒకటిగా ఎదుగుతుందని తాను ఊహించలేదని జువాన్ మీడియాకు తెలిపాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత కంపెనీ ఇతర ఉద్యోగుల మాదిరిగానే అతనికి కూడా స్టాక్ ఆప్షన్లు, షేర్ గ్రాంట్లు ఇచ్చింది. అయితే, ఆ సమయంలో వాటి విలువ కేవలం 10,000 డాలర్ల వరకే ఉండేది. సాధారణంగా చాలామంది ఉద్యోగులు చేసేలా వాటిని పట్టించుకోకుండా ఉంచేశానని ఆయన చెప్పారు.From $28/hr welder to MILLIONAIRE thanks to SpaceX! 😳Mexican immigrant Juan Hernandez joined in 2015 knowing NOTHING about the company. Got $10k in stock as a full-time worker... now his shares are worth over $1M after the IPO! 💰 pic.twitter.com/37Y0IyAJwy— Arthur🇳🇬🇬🇧🇸🇳 (@AjMachalaa) June 14, 2026పదేళ్లలో మారిన పరిస్థితి..గత పదేళ్లలో స్పేస్ఎక్స్ అంతరిక్ష రంగంలో అసాధారణ విజయాలు సాధించింది. పునర్వినియోగ రాకెట్లు, ఉపగ్రహ ప్రయోగాలు, స్టార్‌షిప్ ప్రాజెక్టు, స్టార్‌లింక్ సేవలు వంటి కార్యక్రమాలతో సంస్థ విలువ వేగంగా పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. తాజాగా జరిగిన ఐపీఓలో పెట్టుబడిదారుల నుంచి అపూర్వ స్పందన రావడంతో షేర్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో జువాన్ వద్ద ఉన్న వేలాది షేర్ల విలువ ఒక్కసారిగా 1 మిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది.వెల్డర్ నుంచి కోటీశ్వరుడిగా..స్పేస్ఎక్స్లో వెల్డర్‌గా ప్రారంభమైన జువాన్ కెరీర్ తర్వాత సూపర్వైజర్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆయన మరో ఏరోస్పేస్ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ, స్పేస్ఎక్స్లో సంపాదించిన షేర్లే అతనికి జీవితకాల ఆర్థిక భద్రతను కల్పించాయి. ఈ సంపద వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం మానేయాలనే ఆలోచన లేదని జువాన్ పేర్కొన్నాడు. డబ్బు వచ్చినంత మాత్రాన జీవితం మారిపోదని, కష్టపడి పనిచేయడం కొనసాగిస్తానని చెప్పాడు. తన పిల్లలకు పెట్టుబడులు, పొదుపు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విలువను నేర్పించాలనుకుంటున్నానని వెల్లడించాడు.వేలాది మంది ఉద్యోగులకు జాక్పాట్జువాన్ ఒక్కరే కాదు. స్పేస్ఎక్స్ ఐపీఓ వల్ల వేలాది మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు భారీగా లాభపడ్డారని అంచనా. నివేదికల ప్రకారం.. 4,000 మందికిపైగా ఉద్యోగులు మిలియనీర్లుగా మారినట్లు తెలుస్తోంది. వెల్డర్లు, మెకానిక్‌లు, టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్లు వంటి వివిధ స్థాయిల ఉద్యోగులు కంపెనీ షేర్ల ద్వారా గణనీయమైన సంపదను సొంతం చేసుకున్నారు. -
చరిత్రలోనే అతిపెద్ద ఐపిఓగా స్పేస్ ఎక్స్ రికార్డు..
-
మాస్క్ ఆస్తిని ఖర్చు చేయాలంటే ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో తెలుసా
-
అన్ని లక్షల కోట్లు ఉంటేనా..!!!
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టండి... లక్ష కోట్లు అవుతుంది. జూన్ పదమూడున ఒక డాలర్ మారకం విలువ రూ. 95.1 అంటే.. లక్ష కోట్ల డాలర్లు 95,20,990,00,00,000 రూపాయలకు సమానం! కళ్లు చెదిరే అంకె ఇది. స్పేస్–ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తొలి ఐపీఓతో... దీనికంటే రెండు రెట్ల కంటే ఎక్కువే సంపాదించాడు. ఇంత డబ్బుతో భారత్‌లో ఎన్ని గొప్ప గొప్ప పనులు చేయవచ్చునంటే...రహదారులు... దేశంలోని జాతీయ రహదారుల విస్తరణకు ఉద్దేశించిన భారత్‌మాలా పరియోజనకు సుమారు పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఐపీఓ ద్వారా 2.1 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 199 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయనుకుంటే.. దేశంలో ఉన్న జాతీయ రహదారులన్నింటినీ మళ్లీ తాజాగా నిర్మించడమే కాదు.. ఏకంగా ఆరేళ్లపాటు ఏటికేడాదీ తాజాగా కొత్త రోడ్లు వేస్తూనే ఉండవచ్చు. 2025 నాటి అంచనాల ప్రకారం దేశంలో సుమారు 145,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయి. నాలుగు లేన్ల రహదారి కిలోమీటర్ మేర నిర్మించేందుకు దాదాపు రూ.20 కోట్లు అవుతుందని అంచనా. స్మార్ట్ సిటీలు... నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. స్పేస్–ఎక్స్ ఐపీఓ డబ్బులతో వీటిల్లో 65 నగరాలను అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లతో అభివృద్ధి చేయవచ్చు. ఐదు కోట్ల మందికి ‘న్యాయ్’... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ న్యాయ్. దేశంలోని మొత్తం ఐదు కోట్ల కుటుంబాలకు నెలకు ఆరువేల రూపాయల చొప్పున నగదు సాయం అందించాలన్నది దీని ఉద్దేశం. అంటే ఒక్కో కుటుంబానికి ఏటా రూ.72 వేలు, మొత్తం రూ.3.6 లక్షల కోట్లు ప్రభుత్వం వద్ద స్పేస్–ఎక్స్ ఐపీఓకు వచ్చినంత సొమ్ము ఉంటే... ఎలాంటి అవాంతరాలు లేకుండా 48 ఏళ్లపాటు పేద కుటుంబాలకు ‘న్యాయ్’అందించవచ్చు. వేల ఏళ్లు ‘ఆయుష్మాన్’... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వరకూ ఉచిత ఆరోగ్య బీమా కలి్పస్తోంది. ఈ పథకాన్ని స్పేస్–ఎక్స్ సొమ్ముతో ఎంత కాలం నడపవచ్చో తెలుసా? 23,000 ఏళ్లు! ఫుల్ సబ్సిడీతో ఈవీలు... సౌర విద్యుత్తుతో పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఒక గిగావాట్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ లెక్కన రూ.199 లక్షల కోట్లతో 21,750 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఇది ప్రస్తుతం దేశ విద్యుదుత్పత్తి సామర్థ్యానికి ఇరవై రెట్లు ఎక్కువ. కోట్లాది విద్యుత్తు వాహనాలను ఫుల్ సబ్సిడీతో నడిపించవచ్చు. పెట్రోల్, డీజిళ్ల దిగుమతులు దాదాపు శూన్యం చేయవచ్చు. అందరికీ చింతలేని చదువు... స్పేస్ ఎక్స్ ఐపీఓతో వచ్చిన రూ.199 లక్షల కోట్లతో మస్క్ భారత్‌లో 70 ఏళ్లపాటు అందరికీ ఉచితంగా చదువులు చెప్పవచ్చు. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యకు సుమారు 2.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. ప్రపంచానికి అత్యుత్తమ ఇంజనీర్లను ఇచ్చే ఐఐటీలపై ఖర్చు పెట్టాలనుకుంటే జిల్లాకు ఒకటి చొప్పున ఏకంగా 17,400 ఐఐటీలు ఏర్పాటు చేసేందుకు తగిన సొమ్ము ఐపీఓ ద్వారా మస్క్ చెంతకు చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్రూ. 199 లక్షల కోట్లతో... ⇒ భూమి నుంచి చంద్రుడికి రెండుసార్లు 4 లేన్ హైవే నిర్మించవచ్చు. ⇒ దేశంలోని రోడ్లు (63 లక్షల కిలోమీటర్లని అంచనా) అత్యాధునిక హంగులతో కట్టేయవచ్చు. ⇒ స్వర్ణ చతుర్భుజి (ఢిల్లీ–ముంబై–చెన్నై– కోల్‌కతా) రహదారిని ఎకాఎకిన 300 సార్లు కట్టవచ్చు. ⇒ బోయింగ్ 737లు నాలుగు వేల కంటే ఎక్కువ కొనుక్కోవచ్చు. ఎయిరిండియా, ఇండిగో, స్పైస్జెట్ల వద్ద ఉన్న వాటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విమానాలు అన్నమాట. ⇒ ఐపీఎల్ టీమ్స్ అన్నింటినీ ఓ యాభై సార్లు కొనేయవచ్చు. ⇒ రోజుకో రూ.కోటి ఖర్చు పెడితే మొత్తం ఖాళీ అయ్యేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. -
ట్రిలియనీర్ మస్క్.. ఇల్లు మరీ ఇంత సింపులా?
సాధారణంగా సంపన్నుల ఇళ్లు చాలా విలాసవంతంగా ఉంటాయి. భారీ అంతస్తుల్లో, సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాలను తలపిస్తుంటాయి. భారతీయ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాస భవనం యాంటిలియా (Antilia) గురించి విన్నాం కదా. మరి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్ల సంపద) నిలిచిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk) ఇల్లు ఇంకెంత విలాసవంతంగా ఉంటోందనన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే మస్క్ ఎలాంటి ఇంట్లో నివసిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. జూన్ 12న జరిగిన ‘స్పేస్ఎక్స్’ చారిత్రాత్మక ఐపీఓ (SpaceX IPO success) అనంతరం కంపెనీ విలువ ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకోవడంతో మస్క్ వ్యక్తిగత సంపద కూడా ఒక ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.అయితే ఇంత అపార సంపద ఉన్నప్పటికీ మస్క్ జీవనశైలి మాత్రం సంప్రదాయ బిలియనీర్లకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలోని బోకా చికా సమీపంలో, స్పేస్ఎక్స్ స్టార్‌బేస్ కేంద్రానికి దగ్గరగా ఉన్న సుమారు 400 చదరపు అడుగుల ప్రీఫ్యాబ్రికేటెడ్ చిన్న ఇంటిలోనే (Elon Musk Tiny House) ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఇంటిని మాడ్యులర్ హౌసింగ్ సంస్థ బాక్సబుల్ (Boxabl) రూపొందించింది.చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఇంటిలో లివింగ్ ఏరియా, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. మర్ఫీ బెడ్, బిల్ట్-ఇన్ స్టోరేజ్, శక్తి పొదుపు డిజైన్ వంటి అంశాలు ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. మస్క్ గతంలో ఓసారి ఈ ఇంటి గురించి మాట్లాడుతూ “అద్భుతమైనది”గా అభివర్ణించారు.2020 తర్వాత కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన పలు ఆస్తులను విక్రయించిన మస్క్, వ్యక్తిగత ఆస్తుల కంటే తన వ్యాపార లక్ష్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా స్టార్‌షిప్ రాకెట్ అభివృద్ధి, స్టార్‌లింక్ విస్తరణ, కృత్రిమ మేధ (AI) ప్రాజెక్టులపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు స్టార్‌బేస్‌కు సమీపంలోనే మస్క్ నివసిస్తున్నారు.స్పేస్ఎక్స్ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. షేర్లు మార్కెట్లో జోరుగా లిస్టింగ్ కావడంతో కంపెనీ విలువ రెండు ట్రిలియన్ డాలర్లకు చేరువై, మస్క్ సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్ల స్థాయిని తాకినట్లు అంచనాలు వెలువడ్డాయి.చదవండి: లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే -
ట్రిలియనీర్ మస్క్ వెనుక.. ఆ లేడీబాస్!
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచి మరో చరిత్ర సృష్టించారు ఎలాన్ మస్క్. ఐపీవో విజయవంతం కావడంతో ఆయన ‘స్పేస్ఎక్స్’ కంపెనీ విలువ రికార్డులు బద్ధలు కొట్టింది. అలా.. మస్క్ సంపద అమాంతం పెరిగిపోయింది. అయితే వివిధ కంపెనీలతో వ్యాపార రంగాన్ని శాసిస్తున్న మస్క్ ‘స్పేస్ఎక్స్’ సక్సెస్ వెనుక.. ఓ మహిళ పాత్ర ఉందని తెలుసా?. స్పేస్ఎక్స్ పని అయిపోయిందనుకున్న టైంలో ఆమె అడుగు సీన్ మొత్తాన్ని మార్చేసింది.మస్క్ కలలకు వ్యాపార రూపం ఇచ్చి, సంక్షోభాల్లో సంస్థను గట్టెక్కించి, స్పేస్‌ఎక్స్‌ను ప్రపంచ అగ్రశ్రేణి అంతరిక్ష సంస్థగా తీర్చిదిద్దిన ఆ మహిళే గ్విన్ షాట్వెల్. స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న షాట్‌వెల్‌ను చాలామంది "మస్క్ విజన్‌కు ఎగ్జిక్యూషన్ ఇంజిన్"గా అభివర్ణిస్తారు. మస్క్ అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను ప్రకటిస్తే.. వాటిని సాధ్యమైన వ్యాపార ప్రణాళికలుగా మార్చి అమలు చేయడంలో షాట్వెల్ కీలక పాత్ర పోషించారని అంటారు. అందుకే తాజాగా మస్క్ ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన వేళ.. ఆయన వెనుక నిలిచిన ఈ లేడీబాస్ పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది.సంక్షోభ సమయంలో అండగా..స్పేస్ఎక్స్ ప్రారంభ దశలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యంగా 2006 నుంచి 2008 మధ్య జరిగిన తొలి మూడు ఫాల్కన్-1 రాకెట్ ప్రయోగాలు వరుసగా విఫలమవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. కంపెనీ వద్ద నగదు నిల్వలు దాదాపు ఖాళీ అయ్యాయని, మరో ప్రయోగం కూడా విఫలమైతే స్పేస్ఎక్స్ మూతపడే పరిస్థితి ఏర్పడిందని అప్పటి నివేదికలు చెబుతున్నాయి. అలాంటి క్లిష్ట సమయంలోనే గ్విన్ షాట్వెల్ తన వ్యాపార నైపుణ్యాన్ని ప్రదర్శించారు. నాసా చేపట్టిన కమర్షియల్ రీసప్లై సర్వీసెస్ (CRS) కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరకు రవాణా చేసే 1.6 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాన్ని ఆమె కుదుర్చగలిగారు. అప్పటివరకు అంతరిక్ష రంగంలో పెద్దగా గుర్తింపు లేని ప్రైవేట్ సంస్థకు నాసా ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం సంచలనంగా మారింది. ఈ ఒప్పందం ద్వారా వచ్చిన నిధులు స్పేస్ఎక్స్కు ఆర్థిక ఊపిరి పోయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సంస్థపై విశ్వాసాన్ని పెంచాయి. చాలామంది విశ్లేషకులు ఈ డీల్‌ను స్పేస్ఎక్స్ చరిత్రను మలుపుతిప్పిన ఘట్టంగా, గ్విన్ షాట్వెల్ కెరీర్లో అత్యంత కీలక విజయంగా పేర్కొంటారు.స్పేస్ఎక్స్కు అసలు బలమే ఆమె2002లో సంస్థ ప్రారంభమైనప్పుడు.. అందులో 11వ ఉద్యోగిగా చేరారు షాట్వెల్. ప్రభుత్వ సంస్థలు, ఉపగ్రహ కంపెనీలు, వాణిజ్య భాగస్వాములతో సంబంధాలు పెంచుతూ స్పేస్ఎక్స్కు విశ్వసనీయత తీసుకొచ్చారు. బిలియన్ డాలర్ల ఒప్పందాలు సాధించడంతో పాటు స్టార్‌లింక్ విస్తరణ, వేలాది మంది ఉద్యోగుల నిర్వహణ, సంస్థ రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఆమెను స్పేస్ఎక్స్కు ‘వెన్నెముక’గా అభివర్ణిస్తుంటారు.మస్క్ కలలకు వ్యాపార రూపంచిన్నతనంలో రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ.. ఒకరోజు మనుషులను అంగారక గ్రహానికి పంపాలనే కలలు కనేవాడట ఎలాన్ మస్క్. ఆ స్ఫూర్తితోనే.. స్పేస్‌ఎక్స్‌ను స్థాపించి మార్స్ కాలనీలు, పునర్వినియోగ రాకెట్లు, స్టార్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టగలిగారు. అయితే మస్క్ ఊహించిన ఆ భారీ లక్ష్యాలకు ఆర్థిక బలం చేకూర్చడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యాపార ఒప్పందాలు కుదుర్చడం, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం వంటి బాధ్యతలను గ్విన్ షాట్వెల్ భుజాన వేసుకున్నారు. తొలి ట్రిలియనీర్‌గా మస్క్స్పేస్ఎక్స్ షేర్లు నాస్డాక్లో చరిత్రాత్మకంగా లిస్ట్ కావడంతో సంస్థ విలువ భారీగా పెరిగింది. దీంతో ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద 1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ప్రపంచ చరిత్రలో ట్రిలియనీర్‌గా గుర్తింపు పొందిన తొలి వ్యక్తిగా మస్క్ నిలిచారు. టెస్లా, స్పేస్ఎక్స్, స్టార్‌లింక్, న్యూరాలింక్ వంటి సంస్థల్లోని వాటాలు ఆయన సంపదను ఈ స్థాయికి చేర్చాయి.గ్విన్ షాట్వెల్ వ్యక్తిగత జీవితం..1963 నవంబర్ 23న అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం ఎవాన్‌స్టన్‌లో జన్మించిన గ్విన్ షాట్వెల్.. చికాగో సమీపంలోని లిబర్టీవిల్లో పెరిగారు. ఆమె తండ్రి మెదడు శస్త్రచికిత్స నిపుణుడు (బ్రెయిన్ సర్జన్) కాగా, తల్లి కళాకారిణి. చిన్నతనంలో అంతరిక్ష రంగంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, టీనేజ్‌లో మహిళా ఇంజినీర్ల సమావేశానికి హాజరైన తర్వాత ఇంజినీరింగ్ వైపు ఆమె ఆకర్షితులయ్యారు. అనంతరం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (JPL)లో ఇంజినీర్‌గా పనిచేసిన రాబర్ట్ షాట్‌వెల్‌ను ఆమె వివాహం చేసుకుని జీవిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లైన గ్విన్.. కుటుంబ జీవితం, స్పేస్ఎక్స్ బాధ్యతలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. టెక్సాస్‌లోని మెక్‌గ్రెగర్ ప్రాంతంలో స్పేస్ఎక్స్ రాకెట్ పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల పశువుల ఫారాన్ని కూడా కుటుంబంతో కలిసి నిర్వహిస్తున్నారు.స్పేస్ఎక్స్-అలా.. స్పేస్ఎక్స్ (Space Exploration Technologies Corp.)ను ఎలాన్ మస్క్ 2002లో స్థాపించారు. అంతరిక్ష ప్రయాణ వ్యయాన్ని తగ్గించడం, భవిష్యత్‌లో మనుషులను అంగారక గ్రహానికి పంపడం సంస్థ ప్రధాన లక్ష్యాలు. ఫాల్కన్-9, ఫాల్కన్ హెవీ రాకెట్లు, డ్రాగన్ వ్యోమనౌకలు, స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌తో స్పేస్ఎక్స్ అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నాసాకు మానవ, సరకు రవాణా సేవలు అందిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా గుర్తింపు పొందింది. -
స్పేస్ఎక్స్ బ్లాక్‌బస్టర్.. మస్క్ తొలి ట్రిలియనీర్!
3.. 2.. 1.. లిఫ్ట్ ఆఫ్ పచ్చని డాలర్లను చిమ్ముకుంటూ స్పేస్ఎక్స్ మార్కెట్ ‘స్పేస్‘లోకి దూసుకెళ్లింది. అంతరిక్ష, శాటిలైట్ టెక్నాలజీ రంగంలో సంచలనాలు రేపుతున్న స్పేస్ఎక్స్.. స్టాక్ మార్కెట్ అరంగేట్రంలోనూ రికార్డులు బ్రేక్ చేసి ఇన్వెస్టర్ల పంట పండించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ ఐపీఓగా... లిస్టింగ్‌లో 2.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించి ప్రభంజనం సృష్టించింది. స్పేస్ఎక్స్ కెప్టెన్ ఎలాన్ మస్క్ .. సంపద విలువ కూడా స్పేస్ షిప్‌లా దూసుకుపోయింది. దీంతో ఈ అపర కుబేరుడు.. ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించి సరికొత్త చరిత్ర లిఖించాడు. అటు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు.. ఇటు స్పేస్ఎక్స్ రాకెట్లతో నింగీ నేలా నాదే అంటూ సంపదలో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.ట్రిలియన్ డాలర్ల సంపద అంటే.. → స్పేస్ఎక్స్ లిస్టింగ్‌తో ప్రత్యర్థులు మస్క్ దరిదాపుల్లో కూడా లేకుండాపోయారు. మస్క్ తర్వాత టాప్–5లో ఉన్న గూగుల్ లారీ పేజ్ (270 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (249 బి.డాలర్లు), అమెజాన్ జెఫ్ బెజోస్ (235 బిలియన్ డాలర్లు), మెటా మార్క్ జుకర్‌బర్గ్ (229 బి. డాలర్లు) సంపద మొత్తం 970 బిలియన్ డాలర్లు కలిపినా కూడా ట్రిలియన్ డాలర్ల లోపే ఉండటం విశేషం!→ 100 డాలర్ల నోట్లుగా కట్టలు కడితే 10,000 టన్నులవుతుంది. ఒకదానిపై ఒక నోటు పెట్టుకుంటూ పోతే 1,000 కిలోమీటర్లు ఎత్తుకు ఎదుగుతుంది → 1 డాలరు నోట్లను పరుచుకుంటూ పోతే 1,09,220 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు. అంటే 2.75 సార్లు భూమధ్య రేఖను చుట్టేయొచ్చన్నమాట! → అమెరికాలో దిగ్గజ స్పోర్ట్స్ టీమ్‌లు, టాప్ యూరోపియన్ సాకర్ క్లబ్లన్నింటినీ కొనేయగలడు. → ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 4,200 డాలర్లుగా ఉంది. దీని ప్రకారం ఎలాన్ సంపదతో సుమారు 7,500 టన్నుల బంగారం వస్తుంది. అంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్ వద్దనున్న (8,133 టన్నులు) మొత్తం గోల్డ్‌తో సరితూగుతుంది. → ట్రిలియన్ డాలర్లను సెకనుకు 1 డాలరు చొప్పున ఖర్చు పెడితే మొత్తం సంపద కరిగిపోవడానికి 31,710 ఏళ్లు పడుతుంది! గంటకు 10,000 డాలర్లు చొప్పున అయితే 11,407 ఏళ్లు అవుతుంది.→ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ బ్రాండ్ న్యూ విమానాలు దాదాపు 3,500 కొనేయొచ్చు. → ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా కట్డడానికి అయిన ఖర్చు 1.5 బిలియన్ డాలర్లు. దీని ప్రకారం 660 బుర్జ్ ఖలీఫా టవర్లను కట్టొచ్చు. → కోకాకోలా మార్కెట్ విలువ సుమారు 350 బిలియన్ డాలర్లు. అంటే మస్క్ తలచుకుంటే మూడు కోకాకోలా సైజు కంపెనీలను కొనేయగలడు. → ప్రపంచంలో 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ గల దేశాల సంఖ్య సుమారు 20. అంటే 170 దేశాకు పైగా జీడీపీల కంటే ఒక్క మస్క్ సంపదే ఎక్కువ! తైవాన్, ఐర్లాండ్, స్వీడన్, సింగపూర్ వంటి దేశాల జీడీపీలను మించిపోయాడు. → 10 మంది ముకేశ్ అంబానీల (ప్రస్తుత సంపద సుమారు 105 బిలియన్ డాలర్లు)తో సమానం. → భారత్‌లో మొత్తం 229 మంది బిలియనీర్లు ఉండగా.. వారి మొత్తం సంపద అంతా కలిపినా ఎలాన్ ముందు దిగదుడుపే!సంపద పెరిగిందిలా.. ఇంతింతై ‘మస్క్ ’ అంతై అన్నట్లుగా.. కుబేరుడికే కన్ను కుట్టేలా... ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించి సంచలనం సృష్టించాడు. టెస్లాలో 12 శాతం వాటాతో పాటు స్టాక్ ఆప్షన్లను కలిపితే ప్రస్తుత సంపద విలువ 273 బిలియన్ డాలర్లు. ఇక స్పేస్ఎక్స్లో 41 శాతం వాటా విలువ 927 బిలియన్ డాలర్లుగా లెక్క. అంటే మొత్తం మస్క్ సంపద 1.2 ట్రిలియన్ డాలర్ల పైమాటే! ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు రూ.95 లక్షల కోట్లు. → ప్రస్తుతం ఎలాన్ సంపద విలువంతా దాదాపు స్పేస్ఎక్స్, టెస్లా వాటాలదే. ఇవి కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(గతంలో ట్విటర్ – దీన్ని 44 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి కొన్నాడు), ఎక్స్ఏఐ (గతేడాది ఎక్స్‌లో విలీనమైంది), టన్నెల్ ఇన్ఫ్రా సంస్థ బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ తదితర వ్యాపారాలున్నాయి. → 2002లో ఫైనాన్షియల్ టెక్ దిగ్గజం పేపాల్‌ను విక్రయించడం ద్వారా (తనకున్న 11.7% వాటాకు 180 మిలియన్ డాలర్లు లభించాయి) తొలిసారి 100 మిలియన్ డాలర్లను అధిగమించాడు. → 2011 చివర్లో మొట్టమొదటిసారిగా ఎలాన్ వెల్త్ బిలియన్ డాలర్ల మార్కును దాటింది. → 2012లో తొలిసారిగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. → 2020లో ఆరంభంలో ఎలాన్ సంపద సుమారు 30 బిలియన్ డాలర్లు ఉండగా.. టెస్లా షేరు జోరుతో ఏడాది చివరికల్లా తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్కును దాటేశాడు. తొలిసారి టాప్–10లోకి ఎక్కాడు. → 2021 జనవరిలో 185 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను వెనక్కినెట్టి తొలిసారి ప్రపంచ అపర కుబేరుడిగా ‘టాప్’లేపాడు. అదే ఏడాది చివరికి 300 బిలియన్ డాలర్లకు మస్క్ సంపద దూసుకెళ్లింది. అప్పటి నుంచీ (2022లో కొంత కాలం మినహా) ప్రపంచ నంబర్‌వన్ ప్లేస్ మస్క్ దే! → 2025 నవంబర్‌లో టెస్లా కంపెనీ బోర్డు కార్పొరేట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సీఈఓ ఎలాన్ మస్క్ కు 1 ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఆమోదించింది. టెస్లా నిర్దిష్ట లక్ష్యాలను అందుకుంటే 10 ఏళ్లకు పైగా కాలంలో ఆయనకు ఈ ప్యాకేజీ లభిస్తుంది.స్పేస్‌ఎక్స్‌ను ప్రారంభించేటప్పుడు అది విజయవంతమయ్యే అవకాశం 10 శాతం మాత్రమే అనుకున్నాను. కానీ ప్రయత్నమే చేయకపోతే నేడు అంతరిక్షంలో ప్రయాణించే స్థాయికి ఎప్పటికీ ఎదగలేమని ,ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా స్పేస్ ఎక్స్‌ను ముందుకు నడిపించాను. నేడు ప్రపంచ అంతరిక్ష రంగాన్ని శాసిస్తూ మానవాళిని బహుళ గ్రహాలపై నివసించే భవిష్యత్తు వైపు నడిపిస్తోంది. – ఎలాన్ మస్క్ -
ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ ఐపీఓకు రికార్డు స్పందన
ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో(IPO)గా నిలిచిన ‘స్పేస్ఎక్స్’ (SpaceX) షేర్ల విక్రయానికి మదుపరుల నుంచి భారీ స్పందన లభించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ రాకెట్, శాటిలైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐపీఓలో రిటైల్ పెట్టుబడిదారులు ఒక్కరే 100 బిలియన్ డాలర్లకు పైగా కొనుగోలు ఆర్డర్లు సమర్పించినట్లు బ్లూమ్‌బర్గ్, రాయిటర్స్ నివేదికలు వెల్లడించాయి.స్పేస్ఎక్స్ షేర్లు ఒక్కొక్కటి 135 డాలర్ల ధరకు విక్రయించగా, మొత్తం 555.6 మిలియన్ షేర్ల ద్వారా సుమారు 75 బిలియన్ డాలర్లు సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 1.75 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించింది...కానీ అందరికీ షేర్లు దక్కవుస్పేస్ఎక్స్ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కనీసం 20 శాతం షేర్లను కేటాయించినప్పటికీ, వచ్చిన డిమాండ్ ఆ కేటాయింపును అనేక రెట్లు మించి ఉంది. సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి కూడా భారీగా ఆర్డర్లు రావడంతో చాలా మంది చిన్న మదుపరులకు పూర్తి కేటాయింపు దక్కే అవకాశాలు తగ్గాయి. మొత్తం పెట్టుబడిదారుల డిమాండ్ 250 బిలియన్ డాలర్లను దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి.చైనా ఇన్వెస్టర్లకు నో!అమెరికా సాంకేతిక ఎగుమతి పరిమితుల కారణంగా చైనా ప్రధాన భూభాగం, హాంకాంగ్‌కు చెందిన ఇన్వెస్టర్ల ఆర్డర్లను స్పేస్ఎక్స్ ఐపీఓలో అంగీకరించలేదు. రాకెట్, ఉపగ్రహ, కృత్రిమ మేధస్సు రంగాలకు సంబంధించిన కీలక సాంకేతికత కారణంగా ఈ పరిమితులు అమల్లోకి వచ్చాయి.మస్క్‌కు మరో మైలురాయిస్పేస్ఎక్స్ ఐపీఓ విజయంతో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి మరో కీలక మైలురాయి చేరింది. అయితే కంపెనీ భారీ విలువ, ఇంకా లాభదాయకత సాధించని వ్యాపార నమూనా, భవిష్యత్ వృద్ధి అంచనాలపై మార్కెట్లో చర్చ కొనసాగుతోంది. అయినప్పటికీ, స్పేస్ఎక్స్ ఐపీఓ ప్రపంచ మూలధన మార్కెట్ల చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలవడం ఖాయం.చైనా, హాంకాంగ్ ఐపీఓల ముందు చిన్నదే!స్పేస్ఎక్స్ ఐపీఓకు వచ్చిన స్పందన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనప్పటికీ, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో కొన్ని ఐపీఓలు ఇంకా పెద్ద స్థాయిలో రిటైల్ ఆసక్తిని ఆకర్షించాయి. 2025లో షాంఘైలో చిప్ తయారీ సంస్థ మెటాఎక్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐపీవోకు సుమారు 3 ట్రిలియన్ యువాన్లు (దాదాపు 444 బిలియన్ డాలర్లు) విలువైన రిటైల్ బిడ్లు వచ్చినట్లు మార్కెట్ డేటా సూచిస్తోంది. అదే విధంగా హాంకాంగ్‌లో బబుల్-టీ దిగ్గజం మిక్సు గ్రూప్ ఐపీవోకు దాదాపు 1.8 ట్రిలియన్ హాంకాంగ్ డాలర్లు (సుమారు 230 బిలియన్ యూఎస్ డాలర్లు) ఆర్డర్లు నమోదయ్యాయి.చైనాలో ఐపీఓలకు అంత క్రేజ్ ఎందుకు?చైనా ప్రధాన భూభాగంలో కొత్తగా లిస్ట్ అయ్యే కంపెనీల షేర్లు మొదటి రోజే భారీ లాభాలు ఇవ్వడం సాధారణం. నియంత్రణ సంస్థలు ప్రారంభ ధరలను తక్కువగా ఉంచడం వల్ల ఇన్వెస్టర్లకు తొలి రోజు లాభాలపై అధిక నమ్మకం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది చిన్న మదుపరులు ఐపీఓలను ఒకరకమైన "లాటరీ అవకాశం"గా భావిస్తూ దరఖాస్తు చేస్తుంటారు.హాంకాంగ్‌లో అయితే బ్రోకరేజీలు సులభంగా మార్జిన్ రుణాలు ఇవ్వడం వల్ల పెట్టుబడిదారులు పెద్ద మొత్తాల్లో అప్పు తీసుకుని కూడా ఐపీఓలకు దరఖాస్తు చేస్తుంటారు. తదుపరి టెక్ దిగ్గజాన్ని కోల్పోతామనే భయం (FOMO) కూడా ఈ ఉత్సాహానికి కారణమవుతోంది. -
దేశాల జీడీపీలను దాటేసిన మస్క్ సంపద
ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ప్రధాన దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థలను (జీడీపీ) సైతం అధిగమించడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐంఎఎఫ్) తాజా అంచనాలతో మస్క్ సంపదను పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పారిశ్రామిక ప్రపంచంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ వివాదాలు-విజయాల నడుమ దూసుకుపోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆయన సంస్థ ‘స్పేస్ఎక్స్’ యూఎస్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) నిధులను సేకరించింది. దాంతో మస్క్ అధికారికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ డాలర్లకుపైగా(సుమారు రూ.103 లక్షల కోట్లు) ఆస్తుల అధిపతిగా అవతరించారు.తైవాన్ కంటే ఎక్కువే.సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచ కేంద్రంగా పేరొందిన తైవాన్ దేశ వార్షిక జీడీపీ 976.7 బిలియన్ డాలర్లు. అయితే, స్పేస్ఎక్స్ ఐపీఓ తర్వాత మస్క్ నికర సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు (1,100 బిలియన్ డాలర్లు) చేరడంతో తైవాన్ దేశం ఒక ఏడాదిలో సృష్టించే మొత్తం ఆర్థిక విలువ కంటే మస్క్ వ్యక్తిగత ఆస్తే ఎక్కువని తేలింది.ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం.. సంపన్న దేశాలైన నెదర్లాండ్స్ (జీడీపీ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు), టర్కీ (జీడీపీ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (జీడీపీ సుమారు 1.05 ట్రిలియన్ డాలర్లు) వంటి దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల పరిమాణంతో ఎలాన్ మస్క్ ఒంటరిగా పోటీ పడుతున్నారు. ఒక వ్యక్తి ఆస్తులు ఏకంగా ఒక సార్వభౌమ దేశ ఆర్థిక వ్యవస్థను దాటిపోవడం ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది మొదటిసారి.ఇదీ చదవండి: స్పేస్ఎక్స్ ఐపీఓతో ప్రభంజనం -
స్పేస్ఎక్స్ ఐపీఓతో ప్రభంజనం
ఆధునిక పారిశ్రామిక ప్రపంచంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ వివాదాలు-విజయాల నడుమ దూసుకుపోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన ఆయన సంస్థ ‘స్పేస్ఎక్స్’ గురువారం యూఎస్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) నిధులను సేకరించింది. ఈ చారిత్రాత్మక పరిణామంతో శుక్రవారం మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభ సమయానికి ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ (1.1 ట్రిలియన్ డాలర్లకు పైగా నికర ఆస్తుల అధిపతి-సుమారు రూ.103 లక్షల కోట్లు)గా అవతరించారు.పెట్టుబడిదారుల నమ్మకం, సాంకేతిక రంగంలో మస్క్ మార్క్ వ్యూహాలు సంప్రదాయ ఆర్థిక సూత్రాలను తిరగరాస్తూ ‘మస్కోనమీ’ అనే సరికొత్త ఆర్థిక శకానికి తెరలేపాయి.సంపదలో అందని ఎత్తులో మస్క్ఈ ఐపీఓ కంటే ముందే ఫోర్బ్స్ అంచనాల ప్రకారం మస్క్ నికర విలువ సుమారు 780 బిలియన్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుత పరిణామాలతో ఆయన సంపద 1.1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ప్రస్తుత ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయనకు, మిగిలిన వారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఊహకందని రీతిలో పెరిగిపోయింది.‘ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడు ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ సంపద కేవలం 300 బిలియన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) సమీపంలోనే ఉంది. అంటే మస్క్ ఆస్తులతో పోలిస్తే అది మూడింట ఒక వంతు కంటే తక్కువ. దీనిని బట్టి మస్క్ ఏ స్థాయి ఆధిక్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు’ అని ఫోర్బ్స్ డిప్యూటీ ఎడిటర్ (వెల్త్ విభాగం) మాట్ డురోట్ అన్నారు. ప్రస్తుతం మస్క్ సంపదలో సింహభాగం స్పేస్ఎక్స్ నుంచే వస్తోంది. ఈ సంస్థలో ఆయనకు సుమారు 866 బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉంది. టెస్లా, ఎక్స్ (ట్విట్టర్) వంటి ఇతర ఆస్తులతో కలిసి ఆయన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.విలక్షణ వ్యక్తిత్వం.. అభిమాన సామ్రాజ్యంప్రపంచవ్యాప్తంగా అపరకుబేరులపై, సామాజిక అసమానతలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలోనూ మస్క్ మాత్రం భిన్నమైన ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. వారెన్ బఫెట్ వంటి సంప్రదాయ పారిశ్రామికవేత్తల తరహా కాకుండా ఇంటర్నెట్ సంస్కృతిలో ఒక కేంద్ర బిందువుగా మారి ‘పాప్ కల్చర్’ ఐకాన్‌గా అవతరించారు. ఆయన ‘నో-ఫిల్టర్’ (నిర్మొహమాటంగా మాట్లాడే) శైలి, సోషల్ మీడియా వేదికగా సామాన్యులతో నేరుగా సంభాషించే విధానం లక్షలాది మంది నమ్మకమైన అభిమానులను సంపాదించి పెట్టిందని కొందరు భావిస్తున్నారు.సవాళ్లు – వివాదాలుమస్క్ ప్రస్థానం కేవలం విజయాలతోనే సాగలేదు. ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాలు ముసురుకుంటూనే ఉంటాయి. ఒకే వ్యక్తి చేతిలో అపరిమితమైన అధికారం కేంద్రీకృతం కావడంపై విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వడం, ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్)లో కీలక పాత్ర పోషించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత విధానపరమైన విభేదాల వల్ల ట్రంప్‌తో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఇటీవల ఇరుపక్షాలు కొంత సర్దుబాటు ధోరణిని ప్రదర్శించాయి. రాజకీయ వివాదాల కారణంగా గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో టెస్లా వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.మస్క్ కంపెనీ ఐపీఓకు ఎందుకంత ఆదరణ?ఆర్థిక విశ్లేషకుల ప్రకారం, సాధారణ కంపెనీల వాల్యుయేషన్లు వాటి లాభనష్టాల ఆధారంగా లెక్కిస్తారు. కానీ మస్క్ కంపెనీల విషయంలో ఇది వర్తించదు. దీనినే మార్కెట్ వర్గాలు ‘ఎలాన్ ప్రీమియం’ అని పిలుస్తున్నాయి. అంటే భవిష్యత్తు విజన్ పట్ల మస్క్‌పై ఉన్న నమ్మకంతోనే పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరిస్తున్నారు. ‘టెస్లా తరహాలోనే స్పేస్ఎక్స్ కూడా పూర్తిగా మస్క్ వ్యూహంపై నడుస్తున్నదే. 1.5 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ అనేది సంప్రదాయ ఆర్థిక సూత్రాలకు విరుద్ధం. దీనిని కేవలం ‘ఎలాన్ మస్క్ ప్రీమియం’గా మాత్రమే వర్గీకరించగలం’ అని రినైసాన్స్ క్యాపిటల్ సీనియర్ స్ట్రాటజిస్ట్ మాట్ కెన్నెడీ అన్నారు.సరిహద్దులు లేని వ్యాపార సామ్రాజ్యంమస్క్(54) దక్షిణాఫ్రికాలో జన్మించి పెన్సిల్వేనియా వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేవలం టెస్లా, స్పేస్ఎక్స్లకే పరిమితం కాలేదు. ఆయన వ్యాపార నెట్వర్క్ అపారమైనది.సంస్థ పేరుప్రధాన రంగంటెస్లాఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీస్పేస్ఎక్స్అంతరిక్ష పరిశోధనలు, శాటిలైట్ ఇంటర్నెట్న్యూరాలింక్బ్రెయిన్-కంప్యూటర్ ఇంప్లాంట్స్ది బోరింగ్ కంపెనీభూగర్భ రవాణా సొరంగాలుఎక్స్ (గతంలో ట్విట్టర్)గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ఎక్స్ఏఐకృత్రిమ మేధటెస్లాను ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీగా మార్చడం ద్వారా అమెరికన్ ఆటోమొబైల్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన గౌరవాన్ని తెచ్చారని జనరల్ మోటర్స్ మాజీ వైస్ చైర్మన్ బాబ్ లుట్జ్ మస్క్‌ను ప్రశంసించారు.మన కాలపు ఎడిసన్మస్క్ అసాధారణ ప్రవర్తనపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఆయన సృజనాత్మకతను ప్రపంచ దిగ్గజాలు సైతం అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు మస్క్‌తో సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ సైతం ఇటీవల మనసు మార్చుకున్నారు. మస్క్‌ను మన కాలపు థామస్ ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అని ఆయన కొనియాడడం గమనార్హం. మొత్తంగా సాంప్రదాయ ఆర్థిక రంగానికి సవాలు విసురుతూ, అంతరిక్షాన్ని వ్యాపారమయం చేస్తూ మస్క్ సాధించిన ఈ ‘ట్రిలియనీర్’ మైలురాయి మానవ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోనుంది.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
లాంచింగ్‌కు స్పేస్ఎక్స్ రెడీ!
రాకెట్ ప్రయోగాల వేదిక, ప్రపంచవ్యాప్త శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ కలిగిన దిగ్గజం స్పేస్ఎక్స్ ఐపీవో సరికొత్త రికార్డులు నెలకొల్పనుంది. కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ ఈ కంపెనీ లిస్టింగ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్లు)గా అవతరించనున్నారు. అటు కార్పొరేట్లను, ఇటు ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఇష్యూకి రిస్క్ లు సైతం ఎక్కువే. అయితే దేశీ ఇన్వెస్టర్ల ఐపీవో దరఖాస్తుకు నిబంధనలు అడ్డుపడుతుండటంతో లిస్టింగ్ తదుపరి కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది! యూఎస్ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రాకెట్ కంపెనీ.. స్పేస్ఎక్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టింది. షేరుకి 135 డాలర్ల ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా 55.56 కోట్ల షేర్లను ఆఫర్ చేయడం ద్వారా 75 బిలియన్ డాలర్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు అత్యధికంగా 35 శాతం వాటా ఆఫర్ చేయడం విశేషం. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించడంతో ఇష్యూ 3 రెట్లకు పైగా ఓవర్ సబ్స్క్రయిబ్ (250 బిలియన్ డాలర్ల విలువైన బిడ్లు) అయింది. నేడు (12న) లిస్ట్‌కానున్న కంపెనీ ప్రపంచంలోనే అత్యంత భారీ ఇష్యూగా రికార్డ్ నెలకొల్పనుంది. తద్వారా 1.75 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను అందుకోనున్నట్లు అంచనా. వెరసి ప్రపంచంలోని అత్యంత విలువైన దిగ్గజాలలో ఒకటిగా నిలవనుంది. ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓ రికార్డు సౌదీ ఆరా మ్కో (29.4 బి. డాలర్లు) పేరిట ఉండగా.. దీన్ని స్పేస్ఎక్స్ బ్రేక్ చేయనుంది. లిస్టింగ్‌లోనే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన రెండో కంపెనీ (మొదటిది సౌదీ ఆరామ్కో) గా కూడా రికార్డులకెక్కనుంది. మరోపక్క స్టాక్ ఆప్షన్స్ పొందిన కంపెనీ ఉద్యోగుల సంపద సృష్టికి సైతం తెరలేవనుంది!స్పేస్ఎక్స్ అంటే? 2002లో ఏర్పాటైన స్పేస్ఎక్స్ ప్రయివేట్ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐపీవోతో పబ్లిక్ మార్కెట్లో ప్రవేశించనుంది. రాకెట్ లాంచింగ్‌తోపాటు..అంతరిక్ష ప్రయాణ(స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్) సేవలందిస్తోంది. అయితే కంపెనీ వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్నది మాత్రం స్టార్లింక్గా పేర్కొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా టెలికం సేవలందించగల శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ ఇది. ఐపీవో ద్వారా స్టార్‌లింక్ సేవల విస్తరణకు నిధులు లభించనున్నాయి. అంతేకాకుండా కొత్త స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధి, స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ తదితరాలకు సైతం ఆర్థికంగా మద్దతు లభించనుంది. స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ కనెక్టివిటీ, వాణిజ్యపరమైన స్పేస్ ట్రావెల్లో ఇన్వెస్ట్ చేసేందుకు రిటైలర్లకు సైతం వీలు కల్పిస్తుండటం కంపెనీ ఐపీవోకున్న ప్రత్యేకతలుగా పేర్కొనవచ్చు. మస్క్ మస్త్.. మస్త్ స్పేస్ఎక్స్ లిస్టింగ్‌తో ప్రమోటర్ ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించే వీలుంది. స్పేస్ఎక్స్ ప్రణాళికలు ఫలిస్తే మార్స్‌లోకి మానవులను పంపిన తొలి కంపెనీగా ఘనత వహించవచ్చు. అయితే కంపెనీ కార్యకలాపాలు అత్యంత వ్యయభరితంకావడం, అత్యధిక పెట్టుబడుల అవసరం ఉండటంతో రిస్కులూ అధికమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్పేస్ఎక్స్కు గ్లోబల్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసిన బ్లూ ఒరిజిన్ నుంచి పోటీ ఉంది. ఇదేవిధంగా ఏఎస్టీ స్పేస్‌మొబైల్ నుంచి స్టార్‌లింక్‌కు సైతం సెగ తగులుతోంది.రాకెట్ స్పీడ్పునర్వినియోగానికి వీలు కల్పించే రాకెట్ సాంకేతికతకు తెరతీయడం ద్వారా స్పేస్ఎక్స్ సరికొత్త మార్పులకు తెరతీసింది. దీంతో రాకెట్ల ప్రయోగ వ్యయాలు తగ్గాయి. ఫాల్కన్ రాకెట్లు శాటిలైట్ లాంచింగ్, స్పేస్ మిషన్స్‌కు వినియోగించవచ్చు. అయితే కంపెనీ బిజినెస్‌లలో స్టార్‌లింక్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈవీ దిగ్గజం టెస్లాసహా.. పేపాల్‌కు ఊపిరిపోసిన ప్రమోటర్ ఎలాన్ మస్క్ కంపెనీ కావడంతో స్పేస్‌ఎక్స్‌పై భారీ అంచనాలున్నాయి.లిస్టింగ్ తర్వాతే...దేశీ ఇన్వెస్టర్లు స్పేస్ఎక్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు లిస్టింగ్ తదుపరి మాత్రమే వీలుంటుంది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ పథకం(ఎల్ఆర్ఎస్)లో భాగంగా అంతర్జాతీయ బ్రోకరేజీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా షేర్ల కొనొచ్చు. అధిక విలువ కారణంగా లిస్టింగ్ తర్వాత కంపెనీ పనితీరుపై ఒత్తిడి పెరిగే వీలుంది. ప్రాజెక్టుల్లో ఆలస్యం, రాకెట్ ప్రయోగాలలో అనుకోని సవాళ్లు, టెక్నాలజీ వైఫల్యాల వంటి రిస్క్ లున్నాయి. 2025లో 18.67 బిలియన్ డాలర్ల ఆదాయం, 4.94 బి. డాలర్ల నష్టం నమోదు చేసింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లో జననాల రేటుపై ఎలన్ మస్క్ సంచలన పోస్ట్
ఇటీవల కాలంలో భారతదేశంలో పడిపోతున్న జననాల రేటును ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ ఎత్తిచూపారు. సంతానోత్పత్తి రేటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదొక పెద్ద హెచ్చరిక అంటూ ట్వీట్ చేసిన ఆయన.. దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి స్థాయి క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. వివరాలతో డేటాను కూడా షేర్ చేశారు. జనాభా పరిమాణాన్ని స్థిరంగా ఉంచడానికి అవసరమైన స్థాయి కంటే కిందకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతుల్లో భారతదేశ జననాల రేటు చాలా ఏళ్ల క్రితమే భర్తీ స్థాయి కంటే తగ్గిపోయిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా మొత్తం సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ స్థాయి కంటే కిందకు పడిపోయింది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశ ప్రస్తుత టి.ఎఫ్.ఆర్ 1.9 శాతానికి క్షీణించింది. దీర్ఘకాలికంగా దేశంలో జననాల రేటు తగ్గుముఖం పడుతోందనే వాస్తవానికి ఈ నివేదిక అద్దం పడుతోంది.India’s birth rate has fallen below replacement. Among those most educated, India’s birth rate fell below replacement many years ago. https://t.co/RsWf0PK6wx— Elon Musk (@elonmusk) June 6, 2026వలసలతో సంబంధం లేకుండా, ఒక తరం నుండి తదుపరి తరానికి జనాభా స్థిరంగా (తగ్గకుండా లేదా పెరగకుండా) కొనసాగడానికి అవసరమైన సగటు సంతానోత్పత్తి రేటును 'రీప్లేస్మెంట్ స్థాయి' అంటారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీనిని 2.1 గా పరిగణిస్తారు. భారతదేశ టీఎఫ్ఆర్ ఇప్పుడు 1.9 కి పడిపోవడం అంటే దేశం క్రమంగా స్థిరమైన జనాభా నిర్మాణం వైపు దూసుకుపోతోందని అర్థం. జాతీయ సగటు 1.9 గా ఉన్నప్పటికీ.. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య జనాభా పరంగా పెద్ద వ్యత్యాసమే కనిపిస్తోంది. అత్యధిక టీఎఫ్ఆర్ కలిగిన రాష్ట్రంగా బిహార్ (2.9) ఉండగా.. అత్యల్ప టీఎఫ్ఆర్ కలిగిన ప్రాంతంగా ఢిల్లీ (1.2) ఉంది. గత దశాబ్దంలో ఢిల్లీ అత్యంత వేగంగా పతనాన్ని నమోదు చేయగా.. బిహార్‌లో చాలా నెమ్మదిగా తగ్గుదలను చూపిస్తోంది.దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈ సంతానోత్పత్తి రేటు అత్యంత ఆందోళనకరంగా 1.4 నుండి 1.6 మధ్యకు పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఇది ఏకంగా 1.2 కి తగ్గిపోయింది. అయితే, దీనికి భిన్నంగా ఉత్తర భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ రేటు రీప్లేస్మెంట్ లెవెల్ కంటే అధికంగానే నమోదు అవుతుండగా.. దేశవ్యాప్తంగా సగటు రేటు పడిపోతుండటం వల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గి పోవడం... వృద్ధుల జనాభా భారం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రోబోటిక్స్ రేస్‌లో ఓపెన్ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో కీలకంగా మారిన ‘ఓపెన్ ఏఐ’ ఇప్పుడు భౌతిక ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. కేవలం సాఫ్ట్వేర్, చాట్‌బాట్‌లకే పరిమితం కాకుండా రియల్-వరల్డ్ ఉపయోగం కోసం ఏఐ ఆధారిత రోబోలను తయారు చేయనున్నట్లు సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం కంపెనీ భారీ ఎత్తున రోబోటిక్స్ ఇంజినీర్ల నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఓపెన్ ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా ఆప్టిమస్’ హ్యూమనాయిడ్ రోబోట్‌కు నేరుగా సవాలు విసరడమేనని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రతి ఒక్కరికీ ఒక వ్యక్తిగత రోబోసాషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా సామ్ ఆల్ట్మాన్ ఓపెన్ ఏఐ రోబోటిక్స్ రోడ్‌మ్యాప్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తుపై తనకున్న అంచనాలను తెలిపారు. ‘స్వల్పకాలికంలో భవిష్యత్తు మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, పారిశ్రామిక పనులను నిర్వహించడానికి నైపుణ్యం కలిగిన కార్మికులకు మద్దతుగా నిలిచే రోబోలపై మేము దృష్టి సారించాం. కానీ, మా దీర్ఘకాలిక లక్ష్యం చాలా పెద్దది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిగత రోబోను కలిగి ఉండే రోజు వస్తుందని మేము ఊహిస్తున్నాం’ అని సామ్ ఆల్ట్మాన్ చెప్పారు.ఈ వ్యాఖ్యలు ఎలాన్ మస్క్ గతంలో చేసిన ప్రకటనలను తలపిస్తున్నాయి. మస్క్ సైతం టెస్లా ఆప్టిమస్ రోబోను భవిష్యత్తులో ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తిగత సహాయకుడిగా, పరిశ్రమల్లో కార్మికుడిగా మారుస్తామని చెప్పారు. దీంతో ఇప్పుడు టెక్ ప్రపంచంలో మస్క్ వర్సెస్ ఆల్ట్మాన్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.ఓపెన్ ఏఐలో జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులపై కీలక పాత్ర పోషించిన ఆదిత్య రమేష్ నేతృత్వంలోని ‘వరల్డ్ సిమ్యులేషన్ రీసెర్చ్’ విభాగం నుంచే ఈ రోబోటిక్స్ బృందం ఏర్పడిందని ఆల్ట్మాన్ వెల్లడించారు. గడిచిన సంవత్సర కాలంలో ఈ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందిందన్నారు. రోబోటిక్ సిస్టమ్స్‌కు ఏఐ సాఫ్ట్వేర్ మోడళ్లను అందించడంతోపాటు వాటికి అవసరమైన హార్డ్‌వేర్, ఆపరేషనల్ స్టాక్‌ను కూడా కో-డిజైన్ పద్ధతిలో ఓపెన్ ఏఐ స్వయంగా అభివృద్ధి చేయబోతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.గ్లోబల్ టాలెంట్ కోసం ఓపెన్ ఏఐ వేటరోబోటిక్స్ రంగంలో తమ పట్టును చాటుకునేందుకు ఓపెన్ ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులను ఆహ్వానిస్తోంది. రోబోలను తయారు చేయడానికి కింది విభాగాల్లో నిపుణుల కోసం నియామకాలు ప్రారంభించింది.ఫుల్-స్టాక్ హార్డ్‌వేర్ ఇంజినీర్లుఆపరేషన్స్ నిపుణులుసిస్టమ్స్ ఇంజినీరింగ్ నిపుణులుమెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) రీసెర్చర్లుఅసాధారణమైన ప్రతిభ, గతంలో సాధించిన విజయాల రికార్డు ఉన్న అభ్యర్థులు తమ వివరాలను నేరుగా ఓపెన్ ఏఐ రోబోటిక్స్ రిక్రూట్మెంట్ బృందానికి పంపవచ్చని సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి! -
ఎలాన్ మస్క్ పై చైనా గూఢచర్యం!
బీజింగ్: తమ దేశానికి అధికారిక పర్యటనకు వచ్చిన విశిష్ట అతిథులపై డ్రాగన్ దేశం నిఘా పెట్టిందా? వారి కదలికలు తెలుసుకోవడానికి, రహస్యాలు రాబట్టడానికి సైనికాధికారులను మారువేషాల్లో రంగంలోకి దించిందా? గూఢచర్యం సాగించిందా?.. ఇదంతా నిజమేనని స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ చెబుతున్నారు. విదేశీ ప్రముఖులపై గూఢచర్యం చేయడం చైనాకు కొత్తేమీ కాదని అంటున్నారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన బృందంతో కలిసి చైనాలో పర్యటించారు. ఆయన వెంట ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తోపాటు అమెరికా పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. ట్రంప్ గౌరవార్థం ఆయన బృందానికి చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) విందు ఇచ్చింది. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ పక్కన ఎర్రరంగు దుస్తుల్లో ఉన్న ఓ మహిళ చాలాసేపు నిలబడి ఉండడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆమె వెయిటర్‌గా వ్యవహరించారు. నిజానికి సదరు మహిళ వెయిటర్ కాదని, చైనా మిలటరీ ఆఫీసర్ అని జెన్నిఫర్ జెంగ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు రెండు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఒక ఫొటోలో వెయిటర్ దుస్తుల్లో ఉన్న మహిళ మరో ఫొటోలో మిలటరీ యూనిఫామ్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దుస్తుల కింద తుపాకీ! విదేశాలపై చైనా ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని, అనేక కుట్రలకు పాల్పడుతోందని జెన్నిఫర్ జెంగ్ గతంలోనూ పలు సందర్భాల్లో ఆరోపణలు గుప్పించారు. 2023లో కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని అంతం చేసి పరారయ్యారు. అయితే, హత్య వెనుక చైనా కమ్యూనిస్టు పార్టీ హస్తం ఉన్నట్లు జెన్నిఫర్ జెంగ్ తేల్చిచెప్పారు. నిజ్జర్‌ను చంపేసి, ఈ నిందను భారత్‌పైకి నెట్టేశారని తెలిపారు. తద్వారా భారత్‌కు, పచ్చిమ దేశాలకు మధ్య విభేదాలు సృష్టించడం, దూరం పెంచడమే చైనా అసలు కుతంత్రమని స్పష్టంచేశారు. తాజాగా ఎలాన్ మస్క్ పై నిఘా పెట్టిన సైనికాధికారి పేరు జనరల్ చెంగ్ చెంగ్ అని వెల్లడించారు. ఆమె బెటాలియన్ కమాండర్‌గా పని చేస్తున్నారని తెలిపారు. చైనా ప్రభుత్వమే ఆమెను మారువేషంలో వెయిటర్‌గా నియమించిందని పేర్కొన్నారు. ‘‘చెంగ్ చెంగ్ తన ఎర్రటి దుస్తుల కింద తుపాకీ లేదా అలాంటి ఆయుధమేదో దాచి ఉంచిందని నేను భావిస్తున్నాను’’అని సోషల్ మీడియాలో పోస్టులో జెన్నిఫర్ జెంగ్ వివరించారు. అయితే, జెంగ్ ఆరోపణలపై చైనా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. పాశ్చాత్య దేశాలకు సంబంధించిన లక్ష్యాలపై, ప్రముఖులపై చైనా ప్రభుత్వం రహస్యంగా గూఢచారులను మోహరించిన చరిత్ర ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ టెక్నాలజీ రంగాల్లోకి, దౌత్య వర్గాల్లోకి చైనా ప్రభుత్వ ఏజెంట్లు మారుపేర్లు, మారువేషాల్లో చొరబడుతున్నారని, రహస్యాలు కాజేసే ప్రయత్నాలు సాగిస్తున్నారని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. పచ్చిమ దేశాలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చని చెబుతున్నాయి. చైనాను సులభంగా నమ్మకూడదని అంటున్నాయి. -
స్పేస్ ఎక్స్ ఐపీఓ.. మనోడి పంట పండింది!
ప్రపంచ అంతరిక్ష రంగ ముఖచిత్రాన్ని మార్చేసిన స్పేస్ ఎక్స్ ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, పబ్లిక్ ఇష్యూ తర్వాత ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లు (రూ.165 లక్షల కోట్ల పైమాటే) మైలురాయిని తాకే అవకాశం ఉంది. సాధారణంగా స్పేస్ ఎక్స్ అనగానే ప్రపంచమంతా ఎలాన్ మస్క్ పేరే వినబడుతుంది. కానీ, లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటూ ఆధునిక సాంకేతిక చరిత్రలోనే అతిపెద్ద సంపద సృష్టికి కేంద్ర బిందువుగా మారిన ఒక భారతీయ సంతతి వ్యక్తి కథ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. ఆయనే ఆంటోనియో గ్రేసియాస్.ఎవరీ ఆంటోనియో గ్రేసియాస్?సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేయడం గ్రేసియాస్ శైలి కాదు. ఆయన నిశ్శబ్దంగా ఉండే వ్యూహకర్త. స్పేస్ ఎక్స్ ఐపీఓ ఫైలింగ్స్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. గ్రేసియాస్, ఆయన పెట్టుబడి సంస్థ ‘వాలోర్ ఈక్విటీ పార్టనర్స్’ సంయుక్తంగా స్పేస్ ఎక్స్‌లో 7.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ అంచనాల ప్రకారం 2 ట్రిలియన్లకు చేరితే గ్రేసియాస్ వాటా విలువ మాత్రమే 128 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10.6 లక్షల కోట్లు) అవుతుంది. ఈ సంపద ప్రపంచంలోని ఎన్నో బ్లూ-చిప్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ కంటే, పలు చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం.ఆ మూలాలు గోవాలోనే..ఆంటోనియో గ్రేసియాస్ తండ్రి భారతదేశంలోని గోవా నుంచి అమెరికాకు వలస వెళ్లి డెట్రాయిట్లో న్యూరో సర్జన్‌గా స్థిరపడ్డారు. తల్లి స్పానిష్ ఫార్మసిస్ట్. అమెరికాలోనే పుట్టి పెరిగిన గ్రేసియాస్ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, చికాగో యూనివర్సిటీలో లా చదివారు. జపాన్‌లోని వాసెడా యూనివర్సిటీలోనూ ఉన్నత విద్య అభ్యసించారు. 1995లో లా స్కూల్లో ఉన్నప్పుడే ‘ఎంజీ క్యాపిటల్’ను స్థాపించారు. ఇదే తర్వాతి కాలంలో ‘వాలోర్ ఈక్విటీ పార్టనర్స్’గా రూపాంతరం చెందింది.మస్క్ - గ్రేసియాస్ బంధం2008 కాలంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంపై పెట్టుబడి పెట్టడం అంటే అప్పట్లో అదొక పిచ్చి ప్రయోగం. రాకెట్లు వరుసగా పేలిపోతున్న తరుణంలో నాసా ఒప్పందాలు కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వని రోజుల్లో గ్రేసియాస్ మస్క్‌ను నమ్మి పెట్టుబడి పెట్టారు. టెస్లా, స్పేస్ ఎక్స్, తాజాగా ఎక్స్ఏఐ... ఇలా మస్క్ సామ్రాజ్యంలోని ప్రతి కీలక మలుపులోనూ గ్రేసియాస్ భాగస్వామ్యం ఉంది.ఇటీవలి బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణకు వాలోర్ ఈక్విటీ భారీగా నిధులు సమకూర్చింది. అత్యంత ఖరీదైన ఏఐ చిప్స్, డేటా సెంటర్ పరికరాలను తానే స్వయంగా కొనుగోలు చేసి వాటిని ఎక్స్ఏఐ సంస్థకు లీజుకు ఇచ్చే వినూత్న వ్యూహాన్ని గ్రేసియాస్ అమలు చేశారు. ఈ ఆర్థిక ఒప్పందాల ద్వారానే 2025, 2026 ప్రారంభ త్రైమాసికాల నాటికి వందల మిలియన్ల డాలర్ల లీజు చెల్లింపులు వాలోర్ ఖాతాలోకి చేరడం విశేషం.ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్! -
మరో వివాదానికి తెరలేపిన ఎలాన్ మస్క్
ఇన్స్టాగ్రామ్ కేవలం అమ్మాయిల కోసమేనంటూ ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో వివాదానికి తెరలేపారు. సోషల్ మీడియా అలవాట్లు, ఆన్లైన్ ట్రెండ్స్‌పై జరుగుతున్న ఒక వైరల్ చర్చకు స్పందిస్తూ పురుషులను ఎగతాళి చేసే విధంగా కామెంట్స్ చేశారు. మనుషుల ఆన్లైన్ అలవాట్లు వారి జీవితంలోని విభిన్న దశలను ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై చర్చ నడిచింది.రోజంతా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడం, ఇంట్లో వండిన వంటకాల ఫోటోలను అప్లోడ్ చేయడం, ఆకర్షణీయమైన ఫోటోలు పోస్ట్ చేయడం వంటి సాధారణ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్‌ను ఆ థ్రెడ్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. కొంతమంది మగవాళ్లు తమ ఇన్‌స్టా ప్రొఫైల్స్ నాకు పంపుతుంటారు. అప్పుడు నాకు వాళ్లేమైనా లింగమార్పిడి చేయించుకుంటున్నారా అనిపిస్తుందంటూ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.LmaoInstagram is for girls— Elon Musk (@elonmusk) May 15, 2026దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ వైరల్ అవ్వగా.. మస్క్ చేసిన వ్యాఖ్యలు స్త్రీ ద్వేషపూరితంగా.. అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆ పురుషులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న మహిళలు కావచ్చు. అక్కడ అంతా ఫేక్ మాత్రమే కనిపిస్తుందంటూ కామెంట్ చేశారు. -
టెక్ దిగ్గజాల మధ్య చైనా ‘కున్ఫీ’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విందులో ఒక ఆసక్తికరమైన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలై యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య కూర్చున్న ఒక చైనా మహిళ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. దాంతో తనకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.ఆమె.. చైనాలోనే అత్యంత ప్రతిభావంతురాలైన స్వయంకృషి గల మహిళా పారిశ్రామికవేత్త, ‘లెన్స్ టెక్నాలజీ’ వ్యవస్థాపకురాలు జౌ కున్ఫీ. తన కంపెనీకి అత్యంత కీలకమైన ఇద్దరు గ్లోబల్ కస్టమర్ల మధ్య ఆమె కూర్చోవడం టెక్ ప్రపంచంలో ప్రాధాన్యత సంతరించుకుంది.అట్టడుగు స్థాయి నుంచి బిలియనీర్ వరకు..టెక్ దిగ్గజాల మధ్య సముచిత స్థానం సంపాదించుకున్న జౌ కున్ఫీ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఆమె ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలు..1970లో హునాన్ ప్రావిన్స్‌లోని ఒక పేద గ్రామంలో జన్మించిన జౌ, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కేవలం 15 ఏళ్ల వయసులోనే చదువు మానేశారు. బతుకుదెరువు కోసం షెన్జెన్ నగరానికి వలస వెళ్లి అక్కడి ఫ్యాక్టరీల్లో కార్మికురాలిగా పనిచేశారు.1993లో, 23 ఏళ్ల వయసులో తన బంధువుల సహాయంతో కొంత మూలధనాన్ని సమకూర్చుకుని బావోన్ జిల్లాలోని ఒక నివాస భవనంలో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. రిస్ట్ వాచ్ గ్లాస్లపై స్క్రీన్ ప్రింటింగ్ చేయడంతో ఆమె వ్యాపార ప్రస్థానం మొదలైంది.ఆ తర్వాత దశాబ్ద కాలానికి, ఆమె కష్టార్జితంతో ‘లెన్స్ టెక్నాలజీ’ సంస్థ రూపుదిద్దుకుంది.యాపిల్‌తో భాగస్వామ్యం2007లో స్మార్ట్‌ఫోన్ రంగాన్నే విప్లవాత్మకంగా మార్చేసిన ఐఫోన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరుణంలో లెన్స్ టెక్నాలజీకి అదృష్టం వరించింది. ఐఫోన్ స్క్రీన్ కవర్ గ్లాస్ సరఫరాదారుగా యాపిల్ సప్లై చైన్‌లో లెన్స్ టెక్నాలజీ చోటు దక్కించుకుంది. ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు విక్రయాలు సాధించడంతో యాపిల్ సంస్థ లెన్స్‌కు అతిపెద్ద కస్టమర్‌గా మారింది. 2010ల ప్రారంభం నాటికి లెన్స్ టెక్నాలజీ వార్షిక ఆదాయంలో సగానికి పైగా వాటా యాపిల్ నుంచే రావడం విశేషం.ఈ విజయంతో మార్చి 2015లో షెన్జెన్లోని ‘చినెక్స్ట్ ఇండెక్స్’లో లెన్స్ నమోదైంది. తద్వారా జౌ కున్ఫీ చైనాలోనే అత్యంత ధనవంతురాలైన సెల్ఫ్-మేడ్ మహిళగా అవతరించారు. అనంతరం 2025లో ఈ సంస్థ హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పబ్లిక్ లిస్టింగ్ సాధించింది.మస్క్ కంపెనీలతో బంధం2016 నుంచి టెస్లా సంస్థతో ప్రారంభమైన అనుబంధం లెన్స్ టెక్నాలజీని మరో స్థాయికి తీసుకెళ్లింది. స్మార్ట్-కాక్‌పిట్, బాహ్య నిర్మాణ విడిభాగాల తయారీలో గ్లాస్, మెటల్, టచ్ మాడ్యూల్స్ విభాగాల్లో లెన్స్ తన నైపుణ్యాన్ని చాటుకుంది. గత డిసెంబర్లో ఇన్వెస్టర్ల వేదికగా లెన్స్ టెక్నాలజీ ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ఒక ప్రధాన ఉత్తర అమెరికా కస్టమర్‌తో తాము దశాబ్ద కాలంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఆ కస్టమర్ ప్రధాన వ్యాపారాలైన స్మార్ట్ కాక్పిట్లు, హ్యూమనాయిడ్ రోబోట్లు (ఆప్టిమస్), కమర్షియల్ ఏరోస్పేస్ (స్పేస్ఎక్స్)ల్లో తాము భాగస్వాములుగా ఉన్నట్లు పేర్కొంది. శాటిలైట్ గ్రౌండ్ రిసీవర్ల కోసం బాహ్య నిర్మాణాత్మక మాడ్యూల్స్, అంతరిక్ష ప్రయోగాల కోసం అల్ట్రా-థిన్ ఫోటోవోల్టాయిక్ గ్లాస్ మాడ్యూల్స్‌ను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కంపెనీ పేరు అధికారికంగా వెల్లడించనప్పటికీ అది ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థలేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.గ్లోబల్ టెక్ మహారథులైన టిమ్ కుక్, ఎలాన్ మస్క్‌ల నమ్మకాన్ని గెలుచుకున్న జౌ కున్ఫీ రాబోయే రోజుల్లో ఏఐ హార్డ్‌వేర్ తయారీ వ్యూహాలతో ముందుకెళ్లనున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
సామ్ ఆల్ట్మాన్ ఓ నమ్మకద్రోహి!
ప్రపంచ టెక్ రంగంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఎలాన్ మస్క్ వర్సెస్ ఓపెన్ ఏఐ న్యాయ పోరాటం కీలక దశకు చేరుకుంది. కృత్రిమ మేధ భవిష్యత్తును శాసించే ఈ కేసులో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో గురువారం ముగింపు వాదనలు జరిగాయి. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఒక అబద్ధాల కోరు అని, లాభాపేక్ష లేని సంస్థను తన సొంత లాభాల కోసం వాడుకున్నారని మస్క్ తరఫు న్యాయవాదులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు, మస్క్ తీరును ‘సెలెక్టివ్ ఆమ్నేసియా’గా ఓపెన్ ఏఐ అభివర్ణించింది.ముగింపు వాదనల్లోని ముఖ్యాంశాలుమస్క్ తరఫు న్యాయవాది స్టీవెన్ మోలో వాదనలు వినిపిస్తూ, సామ్ ఆల్ట్మాన్ కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. మాజీ బోర్డు సభ్యులు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుట్స్కెవర్ సహా ఐదుగురు సాక్షులు ఆల్ట్మాన్ తీరును తప్పుబట్టారని గుర్తు చేశారు. ‘ఈ కేసులో సామ్ ఆల్ట్మాన్ విశ్వసనీయతే అసలు ప్రశ్న. మీరు అతడిని నమ్మకపోతే ఈ కేసులో ప్రతివాదులు గెలవలేరు’ అని మోలో జ్యూరీకి విన్నవించారు.150 బిలియన్ డాలర్ల నష్టపరిహారంఓపెన్ ఏఐ సంస్థను మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలకు తాకట్టు పెట్టి సంస్థ అసలు ఆశయమైన మానవాళి సంక్షేమాన్ని విస్మరించారని మస్క్ ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన నష్టానికి గాను సుమారు 150 బిలియన్ డాలర్లు (రూ.12 లక్షల కోట్లకు పైగా) నష్టపరిహారాన్ని మస్క్ కోరుతున్నారు. ఈ మొత్తాన్ని లాభాపేక్ష లేని సంస్థకే చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్లను పదవుల నుంచి తొలగించాలని కోరారు.ఓపెన్ ఏఐ ఎదురుదాడిఓపెన్ ఏఐ న్యాయవాది విలియం సావిట్ మస్క్ వాదనలను కొట్టిపారేశారు. ‘మస్క్‌కు కొన్ని రంగాల్లో అపారమైన ప్రతిభ ఉండొచ్చు కానీ, ఏఐ విషయంలో మాత్రం కాదు. ఇక్కడ గెలవాలంటే ఆయన చేయగలిగింది కేవలం కోర్టుకు రావడమే’ అని ఎద్దేవా చేశారు. ఏఐ రంగంలో మస్క్ వెనకబడిపోయారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సారా ఎడ్డీ వాదించారు.‘సెలెక్టివ్ ఆమ్నేసియా’.. మస్క్‌పై విమర్శలు2018లోనే సంస్థకు నిధుల అవసరం ఉందని మస్క్‌కు తెలుసని, అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు లాభాలు చూశాక కోర్టుకు రావడం వెనుక దురుద్దేశం ఉందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ముఖ్యంగా కొన్ని కీలక పత్రాలను తాను చదవలేదని మస్క్ చెప్పడంపై న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యాపారవేత్తకు ‘సెలెక్టివ్ ఆమ్నేసియా’ (కావాల్సినవి మాత్రమే గుర్తుంచుకోవడం) ఉందని విమర్శించారు.మైక్రోసాఫ్ట్ పాత్రపై వివాదంఓపెన్ ఏఐ చేస్తున్న ప్రతి తప్పులోనూ మైక్రోసాఫ్ట్ భాగస్వామిగా ఉందని మస్క్ న్యాయవాదులు ఆరోపించారు. అయితే, తాము కేవలం బాధ్యతాయుతమైన పెట్టుబడిదారులమని, సంస్థ అంతర్గత నిర్ణయాల్లో జోక్యం లేదని మైక్రోసాఫ్ట్ న్యాయవాది రస్సెల్ కోహెన్ స్పష్టం చేశారు.తదుపరి ఏం జరగబోతోంది?ఈ కేసును విచారిస్తున్న తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ సోమవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది.మస్క్ గెలిస్తే: ఓపెన్ ఏఐ బోర్డులో భారీ మార్పులు, భారీ జరిమానా, సంస్థను తిరిగి లాభాపేక్ష లేనిదిగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.మస్క్ ఓడిపోతే: ఓపెన్ ఏఐ తన 1 ట్రిలియన్ డాలర్ ఐపీఓ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది.ఇదీ చదవండి: ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఒరాకిల్ షాక్ -
స్పేస్ఎక్స్తో ఆంత్రోపిక్ మెగా డీల్!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్, ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్తో భారీ డేటా సెంటర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ క్లాడ్ ఏఐ సేవలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి అవసరమైన కంప్యూటింగ్ శక్తిని పొందే లక్ష్యంతో ఆంత్రోపిక్ ఈ నిర్ణయం తీసుకుంది.కొలోసస్ 1ఈ ఒప్పందం ప్రకారం, టెన్నెసీలోని మెంఫిస్‌లో ఉన్న స్పేస్ఎక్స్ ‘కొలోసస్ 1’ డేటా సెంటర్ పూర్తి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఇకపై ఆంత్రోపిక్ వినియోగించుకోనుంది. వాస్తవానికి ఈ కేంద్రాన్ని మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ఏఐ కోసం నిర్మించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఇది ఆంత్రోపిక్ చేతుల్లోకి వెళ్తోంది. ఇది 2,20,000 ఎన్విడియా ఏఐ చిప్‌ల మద్దతుతో, దాదాపు 300 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఈ డేటా సెంటర్ వల్ల క్లాడ్ ప్రో, క్లాడ్ మాక్స్ చందాదారులకు వేగవంతమైన సేవలు అందనున్నాయి. సాఫ్ట్వేర్ రాయడం, ఎడిటింగ్, డీబగ్గింగ్ చేయగల క్లాడ్ కోడ్ పరిమితులను కంపెనీ రెట్టింపు చేసింది. ఇకపై బిజీ సమయాల్లోనూ ఎటువంటి అంతరాయం లేకుండా యూజర్లు దీనిని వాడుకోవచ్చు.శత్రువుల మధ్య స్నేహంఈ ఒప్పందం టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోదీపై, ఆ సంస్థ సిద్ధాంతాలపై మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంత్రోపిక్ సంస్థ పాశ్చాత్య నాగరికతను ద్వేషిస్తుందని, అది ఒక కపట సంస్థ అని గత ఫిబ్రవరిలో మస్క్ ఎక్స్ వేదికగా దుమ్మెత్తిపోశారు. అయితే, తాజాగా చేసిన మస్క్ పోస్ట్ భిన్నంగా ఉంది. ‘గత వారం ఆంత్రోపిక్ సీఈఓ, తమ సిబ్బందితో సమయం గడిపాను. వారి సామర్థ్యం చూసి ముచ్చటేసింది. వారు సరైన పని చేయడంపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు’ అని ప్రశంసించారు. మరో కీలక ప్రకటన చేస్తూ, ఎక్స్ఏఐని స్వతంత్ర సంస్థగా రద్దు చేస్తున్నానని ఇకపై అది స్పేస్ఎక్స్ ఏఐగా మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేశారు.వివాదాల కేంద్రంగా మెంఫిస్ డేటా సెంటర్ఈ ఒప్పందంలో భాగమైన మెంఫిస్ డేటా సెంటర్ ప్రస్తుతం వివాదాల్లో ఉంది. భారీ స్థాయిలో సహజ వాయువును మండించే టర్బైన్లను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని పౌర హక్కుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఫెడరల్ అనుమతులు లేకుండానే వీటిని నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
భారత్ 'మిషన్ దృష్టి' సక్సెస్: మస్క్ ట్వీట్!
బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీఐ (GalaxEye) రూపొందించిన 'మిషన్ దృష్టి' ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా అభినందనలు తెలిపారు.కాలిఫోర్నియా నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే మొదటి 'ఆప్టోసార్' శాటిలైట్‌గా గుర్తింపు పొందింది. ఇది ఎలక్ట్రో ఆప్టికల్ (EO), సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) సాంకేతికతల కలయికతో రూపొందింది.EO సిస్టమ్ ద్వారా.. స్పష్టమైన, వాతావరణంలోని హై క్వాలిటీ ఫోటోలను పొందవచ్చు. SAR సాంకేతికత ద్వారా వర్షం, మబ్బులు, రాత్రి వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ రెండు టెక్నాలజీలు కలిసి ఉండటం వల్ల.. భూమి పరిశీలనలో ఉన్న పరిమితులను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక వసతుల ప్రణాళిక వంటి అనేక రంగాలకు ఉపయోగకరమైన డేటా లభిస్తుంది.Congratulations! 🇮🇳— Elon Musk (@elonmusk) May 5, 2026ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ప్రాజెక్ట్‌ను భారత యువత ప్రతిభకు నిదర్శనంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి సాంకేతికత ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. భారత అంతరిక్ష సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావడం దేశానికి మరింత బలం చేకూరుస్తోంది.భవిష్యత్తులో.. గెలాక్స్ఐ సంస్థ ఈ వ్యవస్థను మరింత విస్తరించి 2030 నాటికి 10 ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారతదేశం స్వంతంగా బలమైన భూ పరిశీలన వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి -
తెరవెనుక మస్క్ బెదిరింపులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్, ఓపెన్ఏఐ మధ్య న్యాయ పోరాటం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. కోర్టు విచారణ ప్రారంభానికి కొద్ది గంటల ముందు మస్క్, ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్‌మన్‌కు పంపిన సందేశాలు ప్రస్తుతం ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఏమిటా సందేశం?సీఎన్‌బీసీ నివేదికల ప్రకారం, విచారణకు కేవలం రెండు రోజుల ముందు ఎలాన్ మస్క్, గ్రెగ్ బ్రోక్‌మన్‌కు సంప్రదింపులు జరిపారు. ఇరుపక్షాలు తమ వాదనలను విరమించుకుని కేసును పరిష్కరించుకుందామని బ్రోక్మన్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనకు మస్క్ ఇచ్చిన స్పందన అత్యంత తీవ్రంగా ఉంది. ‘ఈ వారం చివరి నాటికి మీరు, సామ్ ఆల్ట్మాన్ అమెరికాలోనే అత్యంత అసహ్యించుకునే వ్యక్తులుగా మారుతారు. మీరు పట్టుబట్టి ముందుకు వెళితే అలాగే ఉంటుంది’ అని మస్క్ హెచ్చరించినట్లు న్యాయస్థానంలో దాఖలు చేసిన పత్రాలు వెల్లడిస్తున్నాయి.ఓపెన్ఏఐ వాదనఈ సందేశాన్ని ఓపెన్ఏఐ న్యాయ బృందం చాలా సీరియస్‌గా పరిగణించింది. మస్క్ తన పోటీదారులను, ఆ సంస్థల్లోని కీలక వ్యక్తులను వ్యక్తిగతంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఓపెన్ఏఐ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. మస్క్ ఈ దావాను కేవలం ఒక పోటీ వ్యూహంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.వివాదం నేపథ్యం2024లో మొదలైన ఈ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 2015లో ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఎలాన్ మస్క్, ఆ సంస్థకు దాదాపు 38 మిలియన్ డాలర్ల విరాళం అందించారు. ఆ సంస్థ లాభాపేక్ష లేని (నాన్ ప్రాఫిట్), అందరికీ అందుబాటులో ఉండేలా పనిచేయాలని మస్క్ అప్పట్లో ఆకాంక్షించారు. అయితే, సంస్థ ప్రస్తుతం లాభాపేక్ష దిశగా మళ్లడంపై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత వారం కోర్టులో సాక్ష్యం చెబుతూ సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్లు ఒక స్వచ్ఛంద సంస్థను తీరునే మారుస్తున్నారని ఆరోపణలు చేశారు.తదుపరి పరిణామాలుమస్క్ ఆరోపణలను ఓపెన్ఏఐ వర్గాలు పూర్తిగా తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని, మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ఏఐకి మరింత వ్యాపారం లభించేందుకు, మార్కెట్ పోటీని దెబ్బతీయడానికి ఆడుతున్న నాటకమని సంస్థ వాదిస్తోంది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో న్యాయమూర్తి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది.ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ? -
నాడు మస్క్ పొమ్మన్నాడు.. నేడు రూ.19 వేలకోట్ల కంపెనీకి బాస్!
మాజీ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్.. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. ట్విటర్ (ఎక్స్)లో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. ఆయన స్థాపించిన కృత్రిమ మేధస్సు (AI) స్టార్టప్ 'ప్యారలల్ వెబ్ సిస్టమ్స్' భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోంది. తాజా నిధుల సమీకరణ తర్వాత 2 బిలియన్ డాలర్ల (రూ. 19,020 కోట్లు) విలువను చేరుకుంది.సీక్వోయా క్యాపిటల్ నేతృత్వంలో జరిగిన సిరీస్ బీ రౌండ్లో.. ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ 100 మిలియన్ డాలర్లు (రూ. 951 కోట్లు) సమీకరించింది. ఈ రౌండ్లో క్లైనర్ పెర్కిన్స్, ఇండెక్స్ వెంచర్స్, ఖోస్లా వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్, స్పార్క్ క్యాపిటల్, టెర్రైన్ క్యాపిటల్ వంటి పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు.ఐదు నెలల క్రితం, ఈ స్టార్టప్ 740 మిలియన్ డాలర్ల (రూ.7,037 కోట్లు) వాల్యుయేషన్‌తో సిరీస్ ఎ ఫండింగ్‌లో 100 మిలియన్ డాలర్ల (రూ.951 కోట్లు) నిధులను సమీకరించింది. కాగా తాజా పెట్టుబడితో, కంపెనీ సమీకరించిన మొత్తం నిధులు ఇప్పుడు 230 మిలియన్ డాలర్లకు (రూ.2,187 కోట్లు) చేరాయి.ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అనేది AI ఏజెంట్ల కోసం రూపొందించిన సాధనాలను నిర్మిస్తుంది, ఆటోమేటెడ్ సిస్టమ్‌లకు అనుగుణంగా వెబ్ సెర్చ్, రీసెర్చ్ APIలను అందిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే నోషన్, ఓపెన్‌డోర్, క్లే, హార్వే వంటి ప్రముఖ క్లయింట్లను ఆకర్షించింది. ఇది బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లకు కూడా సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే నిర్దిష్ట పేర్లను వెల్లడించలేదు.తమ ప్లాట్‌ఫామ్‌ను లక్షకు పైగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ అని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో.. ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ2022లో ట్విటర్ (ఎక్స్) సంస్థను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత.. పరాగ్ అగర్వాల్ తన సీఈఓ పదవిని వీడాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయనతో పాటు ఇతర మాజీ అధికారులు 128 మిలియన్ డాలర్ల పరిహారం కోసం కేసు వేశారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇది గోప్యంగా పరిష్కారమైంది. కాగా.. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీతో పరాగ్ దూసుకెళ్తున్నారు. -
కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అత్యంత ప్రభావవంతమైన ఓపెన్ ఏఐ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన కోర్టు విచారణలో ఉత్కంఠ నెలకొంది. సంస్థ సహ వ్యవస్థాపకులు సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రోక్‌మన్‌లపై ఎలాన్ మస్క్ దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 30న జరిగిన విచారణ వాడీవేడిగా సాగింది. ప్రజా ప్రయోజనం కోసం స్థాపించిన లాభాపేక్ష లేని సంస్థ ఇప్పుడు భారీ వాణిజ్య సంస్థగా మారిందని, ఇది విశ్వాసఘాతకమని మస్క్ గట్టిగా వాదించారు.కోర్టు గదిలో మాటల యుద్ధంవిచారణ సందర్భంగా ఓపెన్ ఏఐ న్యాయవాది విలియం సావిట్, మస్క్‌ను ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సంస్థ లాభాపేక్ష లేని మార్గంలో కాకుండా వాణిజ్య పరంగా వెళ్తుందని తెలిసినా మస్క్ ఎందుకు మౌనంగా ఉన్నారని, పాత ఒప్పంద పత్రాలను (2017 టర్మ్ షీట్) ఉటంకిస్తూ సావిట్ ప్రశ్నించారు. ఈ క్రమంలో మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘నేను ఆ పత్రాల్లోని ఫైన్ ప్రింట్ చదవలేదు. కేవలం శీర్షికను మాత్రమే చూశాను. ఆల్ట్‌మన్, ఇతరులు ఇచ్చిన హామీలనే నమ్మాను’ అని మస్క్ బదులిచ్చారు. సావిట్ పదేపదే తనను మధ్యలో ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్, ‘మీరు నన్ను ప్రతిసారీ నియంత్రించాలనుకుంటే సమాధానాలు ఎలా పూర్తవుతాయి?’ అని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ స్పందిస్తూ, న్యాయవాదిని హెచ్చరించినప్పటికీ మస్క్ చేసిన అభ్యంతరాలను పూర్తిగా సమర్థించలేదు.నమ్మకద్రోహం జరిగిందితాను ఓపెన్ ఏఐని లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగుతుందని విశ్వసించి మద్దతు ఇచ్చానని, అయితే ఇప్పుడు అది నిబంధనలను ఉల్లంఘిస్తోందని మస్క్ ఆరోపించారు. ‘ఒక స్వచ్ఛంద సంస్థ తీరును మార్చకూడదు’ అని అన్నారు. ఈ కేసులో భాగంగా ఆయన 150 బిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు సంస్థ నిర్మాణంలో సమూల మార్పులు చేయాలని, ఆల్ట్‌మన్, బ్రోక్మన్లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఓపెన్ ఏఐ ప్రతివ్యూహంమరోవైపు, మస్క్ వాదనలను ఓపెన్ ఏఐ తోసిపుచ్చింది. మస్క్ కేసును ఒక ప్రతీకార చర్యగా భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది. 2018లో బోర్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరాశకు గురైన మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ఏఐకి పోటీగా ఉన్న ఓపెన్ ఏఐని బలహీనపరిచేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. అంతేకాకుండా, మస్క్ కూడా తన సొంత ఏఐ మోడళ్లను ధ్రువీకరించుకోవడానికి ఇతర ఏఐలను ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు.న్యాయమూర్తి క్లాస్విచారణలో ఏఐ వల్ల మానవాళికి రాబోయే ముప్పు గురించి మస్క్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ‘ఏఐ వల్ల మనుషులు అంతరించిపోయే ప్రమాదం నిజం, మనమందరం చనిపోవచ్చు’ అని వారు కోర్టుకు తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి రోజర్స్ తోసిపుచ్చారు. ‘మీ క్లయింట్ (మస్క్) కూడా అదే రంగంలో సంస్థను నడుపుతున్నారు కదా.. మరి ప్రమాదాలు ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తూ ఇది భద్రతా ప్రమాణాల విచారణ కాదని, ఒప్పంద ఉల్లంఘనల కేసు అని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. 850 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సంస్థగా ఎదిగిన ఓపెన్ ఏఐ భవిష్యత్తును నిర్ణయించనున్న ఈ విచారణ రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2032 వరకు అన్ని హక్కులు మావే -
‘మస్క్ దొంగ ఏడుపు దేనికి?’
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్టమన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య సాగుతున్న న్యాయపోరాటం కీలక దశకు చేరుకుంది. మస్క్ దాఖలు చేసిన దావాపై కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ కోర్టులో వాదోపవాదాలు హోరెత్తుతున్నాయి. ఓపెన్ఏఐ సంస్థ స్థాపన లక్ష్యాలను తుంగలో తొక్కారన్న మస్క్ ఆరోపణలు, మరోవైపు మస్క్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారన్న ఓపెన్ ఏఐ వాదనలతో ఈ కేసు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.2015లో ఓపెన్ ఏఐ స్థాపన సమయంలో ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్ వంటి దిగ్గజాలు ఒక్కటయ్యారు. అప్పట్లో మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఏజీఐ అభివృద్ధి, లాభాపేక్ష లేని పరిశోధనలు అనేవి ప్రధాన సూత్రాలుగా ఉండేవి. 2018 వరకు బోర్డులో చురుగ్గా ఉన్న మస్క్, ఆ తర్వాత సంస్థ విధానాలను వ్యతిరేకిస్తూ అందులో నుంచి వైదొలిగారు. ప్రస్తుతం కోర్టులో సాక్ష్యమిచ్చిన మస్క్, సంస్థ మూల సూత్రాల నుంచి తప్పుకుందని మండిపడ్డారు. ‘నేనే ఈ ఆలోచనను ప్రారంభించాను, పేరు పెట్టాను, కీలక నిపుణులను నియమించాను, భారీగా నిధులు సమకూర్చాను. ఇది నా బ్రెయిన్ చైల్డ్. కానీ ఇప్పుడు దాని తీరుతెన్నులే మారిపోయాయి’ అన్నారు.మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు..మస్క్ నిష్క్రమణ తర్వాత 2019లో ఓపెన్ ఏఐ ‘క్యాప్డ్ ప్రాఫిట్’ (పరిమిత లాభాపేక్ష) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. అజూర్, కోపైలట్ వంటి ఉత్పత్తుల్లో ఓపెన్ ఏఐ సాంకేతికతను వాడటంపై మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓపెన్ ఏఐ మళ్లీ పాత లాభాపేక్షలేని మోడల్‌కు మారాలి. దాదాపు 134 బిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించాలి. ప్రస్తుత నాయకత్వంలో మార్పులు జరగాలి’ అని మస్క్ అంటున్నారు.ఓపెన్ ఏఐ కౌంటర్మస్క్ ఆరోపణలను ఓపెన్ ఏఐ తరపు న్యాయవాది విలియం సావిట్ తీవ్రంగా ఖండించారు. సంస్థ లాభాపేక్షలేనిదిగా ఉండటానికి ఎలాంటి రాతపూర్వక ఒప్పందం లేదని ఆయన వాదించారు. ఆధునిక ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి బిలియన్ల కొద్దీ నిధులు, భారీ మౌలిక సదుపాయాలు అవసరమని అందుకే నిర్మాణంలో మార్పులు చేశామని స్పష్టం చేశారు. ‘మిస్టర్ మస్క్ కోరుకున్నట్లుగా సంస్థపై నియంత్రణ దక్కలేదు కాబట్టే ఈ దావా వేశారు. గతంలో ఆయనే స్వయంగా సంస్థపై ఎక్కువ నియంత్రణ కోసం ఒత్తిడి చేశారు. ఇప్పుడు దొంగ ఏడుపు నటిస్తున్నారు’ అని సావిట్ కోర్టుకు వివరించారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం తన పాత ప్రకటనలను సమర్థించుకుంటూ.. ‘ప్రపంచస్థాయి మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి సాధారణంగా సేకరించే నిధుల కంటే ఎక్కువ మూలధనం అవసరం. మా లక్ష్యం ఎప్పుడూ మానవాళి శ్రేయస్సే’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
మస్క్ కంపెనీలో జాబ్ కావాలా?
నేటి యువతకు ఎలాన్ మస్క్ ఒక ఐకాన్. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది టెక్ నిపుణులకు మస్క్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడం అనేది ఒక కల. అయితే, అక్కడ సీటు దక్కించుకోవడం సులభమా? మస్క్ తన కంపెనీలో పని చేసే అభ్యర్థుల్లో ఏం ఆశిస్తారు? జీతభత్యాలు ఏ స్థాయిలో ఉంటాయి? అనే అంశాలను కింద చూద్దాం.మస్క్ కంపెనీల వైవిధ్యంఎలాన్ మస్క్ కేవలం ఒక్క రంగానికే పరిమితం కాలేదు. ఆయన నాయకత్వంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అగ్రశ్రేణి సంస్థలు ఉన్నాయి.టెస్లా.. ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ.స్పేస్ ఎక్స్.. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ ప్రయోగాలు.ఎక్స్ గతంలో(ట్విట్టర్).. సోషల్ మీడియా దిగ్గజం.న్యూరాలింక్.. బ్రెయిన్-చిప్ టెక్నాలజీ.ఎక్స్ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు.టాలెంట్‌కే పెద్దపీట!మస్క్ నియామక ప్రక్రియలో ఒక విప్లవాత్మక మార్పు ఉంది. ‘మీకు పేరుమోసిన యూనివర్సిటీ డిగ్రీ లేకపోయినా పర్వాలేదు. కానీ పని పట్ల అంకితభావం, అసాధారణమైన నైపుణ్యం ఉండాలి’ అని ఆయన స్వయంగా పలుమార్లు ప్రకటించారు.ఎలాంటి నైపుణ్యాలకు డిమాండ్ ఉంది?టెక్నికల్ రోల్స్.. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్.నాన్-టెక్నికల్ రోల్స్.. హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్), సేల్స్, ఆపరేషన్స్, ఫ్రంట్ డెస్క్ మేనేజ్మెంట్.దరఖాస్తు, ఎంపిక విధానంమస్క్ కంపెనీల్లో చేరాలనుకునే వారు థర్డ్ పార్టీ వెబ్సైట్ల కంటే అధికారిక పోర్టల్స్ ద్వారా వెళ్లడం ఉత్తమం. దరఖాస్తు కోసం Tesla Careers.. https://www.tesla.com/careers లేదా SpaceX Careers.. https://www.spacex.com/careers వంటి అధికారిక వెబ్సైట్లలో మీ ప్రొఫైల్‌ను అప్లోడ్ చేయాలి.స్క్రీనింగ్: రెజ్యూమెను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత సాంకేతిక పరీక్షలు ఉంటాయి.ఇంటర్వ్యూలు: ఇక్కడ కేవలం ప్రశ్నలు మాత్రమే ఉండవు, ప్రాక్టికల్ టాస్క్‌లు కూడా ఇస్తారు. కొన్ని కీలక పోస్టుల కోసం మస్క్ స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని కొందరు మేనేజ్మెంట్ స్థాయి వ్యక్తులు చెబుతున్నారు.జీతాలు ఎలా ఉంటాయి? (సుమారుగా)మస్క్ కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రపంచ స్థాయి వేతనాలను అందిస్తాయి. అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ప్యాకేజీలు మారుతుంటాయి.కంపనీహోదావార్షిక వేతనం (అంచనా)టెస్లాసాఫ్ట్వేర్ ఇంజినీర్రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్లుస్పేస్ ఎక్స్ఇంజినీర్రూ.70 లక్షల నుంచి రూ.1.5 కోట్లుఇంటర్న్షిప్ఫ్రెషర్లు (స్టైఫండ్)నెలకు సుమారు రూ.1 లక్ష గమనిక: పైన పేర్కొన్న వేతనాల్లో స్టాక్ ఆప్షన్స్ కూడా అంతర్భాగంగా ఉంటాయని గమనించాలి.ఫ్రెషర్లకు అవకాశంమీరు రీసెంట్గా డిగ్రీ పూర్తి చేశారా? అయితే ఇంటర్న్‌షిప్ ద్వారా మస్క్ సామ్రాజ్యంలో అడుగు పెట్టవచ్చు. టెస్లా, స్పేస్ ఎక్స్ ప్రతి సంవత్సరం వేలమంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అందిస్తాయి. ఇక్కడ ప్రతిభ కనబరిస్తే నేరుగా పూర్తిస్థాయి ఉద్యోగిగా మారే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్‌లో ఉద్యోగాలు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్‌వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది.ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే.. కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్‌గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.భారీ పెట్టుబడులుటెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్‌వర్క్‌లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి.తయారీ రంగంలో టెస్లాటెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసంపీసీబీ లేఅవుట్ ఇంజనీర్ల నియామకం ద్వారా వాహనాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇన్ఫోటైన్మెంట్, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది టెస్లా భారతదేశాన్ని తన గ్లోబల్ ఆపరేషన్లకు సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రంగా ఉపయోగించాలనే యోచనను సూచిస్తోంది.ఆపరేషన్స్, రిటైల్ప్రోటోటైప్ వాహనాలను నడిపి.. డేటా సేకరించే డ్రైవర్లు, అలాగే సేల్స్, సర్వీస్ ఉద్యోగులు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఇవి టెస్లా భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి చేస్తున్న ఏర్పాట్లను చూపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే టెస్లా భారతదేశంలో చేస్తున్న నియామకాలు కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఏఐ, తయారీ, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, సరఫరా గొలుసు వంటి విభిన్న రంగాలలో సమగ్ర స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికను తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
తక్కువ ధరలో.. టెస్లా కొత్త కారు!
మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల ధ్రువీకరించారు. ఇప్పుడు మరో కొత్త మోడల్ రానున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఎంట్రీ-లెవల్ మోడళ్ల కంటే చిన్నదిగా ఉంటుందని సమాచారం.ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, తన ప్రస్తుత ఎంట్రీ-లెవల్ మోడళ్ల కంటే చిన్నదిగా, చౌకైన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కంపెనీ యోచించినప్పటికీ.. అమల్లోకి త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.రాబోయే చిన్న, సరసమైన కారును కేవలం ఒక వేరియంట్లో మాత్రమే కాకుండా.. మోడల్ 3, మోడల్ వై కంటే భిన్నంగా ఉండేలా తయారు చేయనుంది. దీని బరువు 1.5 మెట్రిక్ టన్నులు ఉండేలా సిద్ధం చేయనున్నారు. ధరను తగ్గించడం కోసం.. చిన్న బ్యాటరీ ప్యాక్ అమర్చే అవకాశం ఉంది. అంటే ఈ కారు రేంజ్ కొంత తక్కువగా ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: హ్యుందాయ్ వైబ్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?టెస్లా కొత్త కారును షాంఘైలోని గిగాఫ్యాక్టరీలో ప్రారంభించనున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగితే, చివరికి తయారీని యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లకు విస్తరించే అవకాశం ఉంది. అయితే దీనిని ఎప్పుడు ప్రారంభించనున్నారు?, మొదటి ఎక్కడ విక్రయించనున్నారు? అనే విషయాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
స్టార్‌లింక్‌కు భద్రతా అడ్డంకులు క్లియర్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని శాటిలైట్ బ్రాడ్‌బాండ్ కంపెనీ స్టార్‌లింక్ భారత్‌లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత భద్రతా సంస్థలు విధించిన అన్ని నిబంధనలను స్టార్‌లింక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్రమంలో వచ్చే వారమే డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) సమావేశమై ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.కీలక భద్రతా అనుమతులు పూర్తిభారత టెలికాం నిబంధనల ప్రకారం కఠినమైన భద్రతా పరీక్షలను స్టార్‌లింక్ ఎదుర్కొంది. ముఖ్యంగా అక్టోబర్ 2025లో ముంబైలో ప్రారంభించిన ఎక్విప్మెంట్ టెస్టింగ్ (పరికరాల పరీక్ష) ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. శాటిలైట్ కమ్యూనికేషన్ల ద్వారా దేశ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ లభించిందని కంపెనీ తెలిపింది. వచ్చే వారం డీసీసీ ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుంది. అక్కడ క్లియరెన్స్ రాగానే భారత్‌లో స్టార్‌లింక్ సేవలు అధికారికంగా ప్రారంభమవుతాయి.వేగవంతమైన పరిణామాలుఏప్రిల్ 1న స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్, వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయిన తర్వాత ఈ ప్రక్రియ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ చర్చల ఫలితంగానే పెండింగ్‌లో ఉన్న సాంకేతిక, భద్రతాపరమైన అంశాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.టెలికాం దిగ్గజాల మధ్య పోటీస్టార్లింక్ రాకతో భారత శాటిలైట్ బ్రాడ్‌బాండ్ రంగంలో పోటీ తీవ్రతరం కానుంది. ఇప్పటికే ఈ రంగంలో పాగా వేయాలని చూస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన జియో స్పేస్‌ఫైబర్, సునీల్ భారతీ మిట్టల్ మద్దతు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు స్టార్‌లింక్ గట్టి పోటీ ఇవ్వనుంది. మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ డేటాను అందించడంలో ఈ పోటీ సామాన్యులకు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.స్పెక్ట్రమ్ ధరపై ఇంకా సందిగ్ధతభద్రతా పరమైన అనుమతులు లభించినప్పటికీ స్పెక్ట్రమ్ ధరల విషయంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఏడాదికి 4 శాతం స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీని ట్రాయ్ సిఫార్సు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మాత్రం 5 శాతం ఛార్జీ వసూలు చేయాలని మొగ్గు చూపుతోంది. అంతేకాకుండా, వినియోగదారుల టెర్మినల్స్‌పై సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. తద్వారా పూర్తిగా మార్కెట్ ఆధారిత ధరలే అమలయ్యే అవకాశం ఉంది.వ్యూహాత్మక భాగస్వామ్యాలుసేవలు ప్రారంభించక ముందే స్టార్‌లింక్ తన నెట్వర్క్ పంపిణీ కోసం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలతో పంపిణీ ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. ఎయిర్టెల్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవల విస్తరణపై దృష్టి పెట్టగా, జియో తన నెట్‌వర్క్‌లో శాటిలైట్ బ్రాడ్‌బాండ్‌ను అంతర్భాగం చేయనుంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా కూడా ఏఎస్టీ స్పేస్‌మొబైల్‌తో జతకట్టి ఈ పోటీలో నిలిచేందుకు సిద్ధమైంది.ఇదీ చదవండి: రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట! -
ఆ కార్ల శకం ముగిసింది.. మస్క్ ట్వీట్!
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సీఈఓ ఎలాన్ మస్క్ ధృవీకరించారు. ఈ కార్ల కోసం ఇకపై ఆర్డర్స్ తీసుకోబోమని, ఇక్కడ డెలివరీ చేయాల్సిన 600 కార్లు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''టెస్లా మోడల్ S, X మోడల్స్ ఆర్డర్లు ముగిశాయి. స్టాక్‌లో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక శకం ముగింపును సూచించడానికి మేము ఒక అధికారిక కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. నాకు ఆ కార్లంటే చాలా ఇష్టం. 14 సంవత్సరాల క్రితం ఉత్పత్తి ప్రారంభోత్సవంలో నేను ఇలా ఉన్నాను'' అని మస్క్ ట్వీట్ చేసారు.జనవరిలో జరిగిన టెస్లా 2025 క్యూ4 ఆదాయాల సమావేశంలో మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ ఉత్పత్తి నిలిపివేత వార్త వెలువడింది. ఆ సమయంలో.. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లకు ఇది ఒక "గౌరవప్రదమైన ముగింపు" అని ఆ బ్రాండ్ పేర్కొంది. ఇదే సమయంలో.. అవకాశం ఉన్నప్పుడే కార్లను ఆర్డర్ చేయమని మస్క్ వినియోగదారులను కోరారు. కార్ల కోసం కేటాయించిన ఫ్యాక్టరీ స్థలాన్ని ఆప్టిమస్ రోబోట్ల ఉత్పత్తి కోసం మార్చనున్నట్లు కూడా ఆ బ్రాండ్ వెల్లడించింది.Custom orders of the Tesla Model S & X have come to an end. All that’s left are some in inventory.We will have an official ceremony to mark the ending of an era. I love those cars. This was me at production launch 14 years ago: pic.twitter.com/6kvCf9HTHc— Elon Musk (@elonmusk) April 1, 202614 సంవత్సరాల మార్కెట్మోడల్ S అనేది సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని టెస్లా రూపొందించిన మొదటి వాహనం, దీనిని జూన్ 2012లో విడుదల చేశారు. ఇది 2015, 2016 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.కేవలం 2015లోనే 50,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. మోడల్ Xను 2015లో పరిచయం చేశారు. ఈ రెండు మోడళ్లు కలిసి, వాటి ఉత్పత్తి కాలమంతటా 610,000కు పైగా డెలివరీలను సాధించాయి. -
రహస్య ఫోన్ కాల్.. కట్ చేస్తే మధ్యలోకి ఎలాన్ మస్క్ ఎంట్రీ..?
-
ట్రంప్, మోదీ కాల్.. మధ్యలో ఎలాన్ మస్క్ ఎంట్రీ?
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ సంభాషణలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం చేరినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. దీనిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.ఈ మధ్య కాలంలో ట్రంప్, మస్క్ మధ్య సంబంధాలు మెరుగ్గా లేవు. అమెరికా అధ్యక్షుడిపై మస్క్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన చమురు సంక్షోభం, హర్మూజ్ జలసంధి తదితర అంశాలపై అమెరికా, భారత్‌ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి ఫోన్ సంభాషణ జరిగింది. అయితే ఆ కాల్లో మస్క్ చేరినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న వేళ ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన కీలక సంభాషణలో ఎటువంటి అధికారిక హోదా లేని వ్యక్తి పాల్గొనడం ఏంటని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంత బిలియనీర్ అయితే ఇటువంటి పని చేయడం ఏంటని పలువురు వ్యతిరేకిస్తున్నారు. అయితే మస్క్‌ను ఎందుకు చేర్చారు. ఈ చర్చలో ఆయన ఏమైనా మాట్లాడారా అనే పూర్తి వివరాలు తెలియరాలేదు.కాగా సున్నితమైన జాతీయ భద్రతా అంశాలు చర్చించబడే దేశాధినేతల కాల్స్‌లో ప్రైవేట్ పౌరులను చేర్చుకోవడం చాలా అరుదని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ అంశంపై వైట్ హౌస్ కానీ భారత అధికారులు గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ట్రంప్, మస్క్ మధ్య విభేదాల తర్వాత ప్రస్తుతం సంబంధాలు మెరుగు పడి ఉండవచ్చని అందుకోసమే మస్క్ ఈ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి ఉండవచ్చని న్యూయార్క్ కథనం పేర్కొంది. -
రోడ్లపైకి టెస్లా సెమీ ట్రక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 800 KM
-
మస్క్ టీమ్‌లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలలో భారతీయుల ప్రతిభ ఎంతో గుర్తింపు పొందుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు.. ఇండియన్ రోబోటిక్స్ ఎక్స్పర్ట్ & ఏఐ పరిశోధకుడు అయిన దేవేంద్ర చాప్లోట్.. ఎలాన్ మస్క్ కంపెనీలో చేరారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేవేంద్ర చాప్లోట్ తన సోషల్ మీడియా ఖాతాలో.. ఎలాన్ మస్క్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. సూపర్ ఇంటెలిజెన్స్ నిర్మించడానికి మస్క్ టీమ్‌లో చేరుతున్నాను అని వెల్లడించారు. దీనికి స్పందిస్తూ.. xAIలోకి స్వాగతం అంటూ మస్క్ ట్వీట్ చేశారు.ఎవరీ దేవేంద్ర చాప్లోట్?IIT-బాంబే పూర్వ విద్యార్థి అయిన చాప్లోట్, AI & రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. ఈయన 2014లో IIT-బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో B.Tech & అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో మైనర్ పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మెషిన్ లెర్నింగ్ విభాగం నుంచి పీహెచ్డీ పూర్తి చేసాడు. అక్కడే బిల్డింగ్ ఇంటెలిజెంట్ అటానమస్ నావిగేషన్ ఏజెంట్లపై పనిచేశారు.చాప్లోట్ దక్షిణ కొరియాలోని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌లో దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత అతను ఫేస్బుక్ AI రీసెర్చ్‌లో చేరాడు. AI రీసెర్చ్ సైంటిస్ట్‌గా, అతను ఆ సంస్థలో కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్‌లో పనిచేశాడు. 2020లో, రోబోటిక్స్ నిపుణుడు మిస్ట్రాల్ AIలో చేరారు.Welcome to @xAI! https://t.co/5tAdHPJmfx— Elon Musk (@elonmusk) March 13, 2026సాధించిన పురస్కారాలుదేవేంద్ర చాప్లోట్ తన పరిశోధనలకు అనేక పురస్కారాలు అందుకున్నారు. 2020లో ఫేస్బుక్ ఫెలోషిప్ పొందారు. అలాగే కంప్యూటర్ విజన్ రంగంలో నిర్వహించే సీవీపీఆర్ AI హాబిటాట్ ఆబ్జెక్ట్ నావిగేషన్ ఛాలెంజ్ & 2018లో CVPR 2018 డీప్ లెర్నింగ్ ఫర్ విజువల్ SLAM వర్క్‌షాప్‌లో బెస్ట్ పేపర్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు. -
ఎక్స్‌లో అశ్లీల కంటెంట్ నిషేధం?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అశ్లీల కంటెంట్ లేదా అడల్ట్ కంటెంట్ మీద భారత ప్రభుత్వం పరిమితులు విధించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎక్స్ యూజర్లు సైతం స్పందిస్తున్నారు.భారత ప్రభుత్వం సాధారణంగా అడల్ట్ కంటెంట్ నిషేధంపై చాలా సీరియస్‌గా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇలాంటి కంటెంట్ అందించే చాలా ప్లాట్‌ఫామ్‌ల మీద కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఎక్స్‌కు కూడా పరిమితులు విదించిందా? అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.భారతదేశంలో ఎక్స్‌లో 18+ కంటెంట్ నిషేధంపై మస్క్ కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా యూజర్లు దీనికి సంబంధించిన పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఆ పోస్టుల ప్రకారం.. అడల్ట్ కంటెంట్ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.Elon Musk banned 18+ videos in india.Respect @elonmusk 🫡 pic.twitter.com/QXmRa043nx— Let's X OTT GLOBAL (@LetsXOtt) March 3, 2026Elon Musk banned 18+ content?— Tammubaby (@tammubaby) March 3, 2026How can elon musk ban the porn, damn all my bookmarks are now not showing the content 😭😭— Just Chocolate™ (@LovelyFantasyyy) March 3, 2026 -
నా దగ్గర క్యాష్ లేదు!: ఎలాన్ మస్క్ ట్వీట్
ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్.. ఎలాన్ మస్క్ నికర సంపద 849.03 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈయన తరువాత జాబితాలో లారీ పేజ్ (251 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (231.7 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (219.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. వీరి ముగ్గురి నికర సంపద మొత్తం (702.1 బిలియన్ డాలర్లు).. మస్క్ సంపదకు సమానం కాదు. దీన్ని బట్టి చూస్తే.. మస్క్ కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోయినట్లు స్పష్టంగా అర్థమైపోతుంది.ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద అక్షరాలా రూ. 70 లక్షల కోట్ల కంటే ఎక్కువే. ఈ సంపదకు కారణం టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలలో వాటాలే కారణమని మస్క్ వెల్లడించారు. నన్ను అందరూ కుబేరుడు అనుకుంటారు. కానీ నా దగ్గర నగదు రూపంలో ఉన్న క్యాష్ 0.1 శాతం కంటే తక్కువ అని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ మాటలు చెప్పాను, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నాను అని వెల్లడించారు. నిజానికి ఆయన సంపద పేపర్ వెల్త్ మాత్రమే. అంటే షేర్ల విలువ ఆధారంగా ఉన్న సంపదన్నమాట.Already have thousands of times over. My “net worth” is almost entirely due to my ownership stakes in Tesla and SpaceX. I have <0.1% that is cash. Tesla and SpaceX employees all receive stock/options and Tesla is >80% owned by retail investors and index/pension funds, so value…— Elon Musk (@elonmusk) February 15, 2026 -
అంతరిక్ష ఏఐ రేసులో భారత్ మాస్టర్ స్ట్రోక్!
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ వేలాది కృత్రిమ ఉపగ్రహాలతో అంతరిక్షాన్ని ఆక్రమించాలని చూస్తున్న వేళ ఒక భారతీయ స్టార్టప్ ఆయన వ్యూహాలకు గట్టి జర్క్ ఇచి్చంది. ఖరీదైన శాటిలైట్లతో పనిలేకుండా వాడి పారేసే రాకెట్ వ్యర్థాలనే బంగారంగా మారుస్తూ అంతరిక్షంలో ఏఐ క్లౌడ్ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు చెన్నైకి చెందిన ‘అగ్నికుల్ కాస్మోస్’సిద్ధమైంది. 2026 ఏడాది చివరి నాటికి జరగనున్న ఈ ప్రయోగం ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ఆధిపత్యానికి గట్టి సవాల్ విసురుతోంది. మస్క్ వర్సెస్ అగ్నికుల్.. ఎలాన్ మస్క్ ఇప్పటికే అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)లో ఒక దరఖాస్తు సమరి్పంచారు. ఏకంగా 10 లక్షల కంప్యూటింగ్ శాటిలైట్లను ప్రయోగించి, నింగిలో ఒక ‘సూపర్ కంప్యూటర్ నెట్వర్క్’నిర్మించాలనేది మస్క్ మహా ఆలోచన. దీనికోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి, భారీగా ఇంధనం ఖర్చు అవుతుంది. కానీ, అగ్నికుల్ తన పేటెంట్ టెక్నాలజీ ‘సూరజ్’ద్వారా ఒక అద్భుతం చేస్తోంది. రాకెట్ తన లక్ష్యాన్ని చేరాక మిగిలిపోయే పైభాగాన్ని పారేయకుండా, దాన్నే ఒక శక్తివంతమైన ఏఐ డేటా సెంటర్‌గా మారుస్తోంది. మస్క్ కొత్త ఇల్లు కడుతుంటే, అగి్నకుల్ పాత ఇటుకలతోనే రాజప్రసాదం కడుతున్నట్టుగా ఈ ‘జర్క్’టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అంతరిక్షమే ఎందుకంటే? భూమిపై డేటా సెంటర్లు నడపాలంటే కోట్ల లీటర్ల నీరు, నిరంతరాయంగా అత్యధిక స్థాయిలో విద్యుత్ అవసరం. పైగా పవర్ గ్రిడ్ విఫలమైతే, ఇక్కడి సెంటర్లు కేవలం 72 గంటల వరకు మాత్రమే బ్యాకప్‌తో నడవగలవు. అదే అంతరిక్షంలో అయితే సూర్యుని నుంచి అంతులేని సౌరశక్తి నిరంతరం లభిస్తుంది. సెమీకండక్టర్ వ్యవస్థలను చల్లబరిచేందుకు ప్రత్యేకంగా నీరు అక్కర్లేదు. అంతరిక్షంలోని శూన్యమే వాటిని చల్లబరుస్తుంది. అత్యంత తక్కువ ఖర్చులో మన అగి్నకుల్ ఈ అవసరాలు తీర్చనుంది. విశ్వ యుద్ధంలో సరికొత్త ఆర్కిటెక్ట్! చైనా ఇప్పటికే 2,00,000 శాటిలైట్లను ప్రయోగించాలని తలపోస్తోంది. ఎన్విడియా మద్దతున్న స్టార్‌క్లౌడ్ కూడా రేసులో ఉంది. కానీ భారత్ చూపుతున్న ‘పునర్వినియోగ’వ్యూహం అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతోంది. నిన్నటి వరకు విదేశీ శాటిలైట్లను మోసుకెళ్లే ‘లారీ డ్రైవర్’లాంటి స్థాయి నుంచి నేడు అంతరిక్షంలో మేధో సంపత్తిని నిర్మించే ‘ఆర్కిటెక్ట్’స్థాయికి భారత్ ఎదిగింది. తాజాగా కేంద్ర బడ్జెట్–2026లో ప్రకటించిన ప్రోత్సాహకాలతో 2027 నాటికి భారత్ తన మొదటి అంతరిక్ష ఏఐ సేవలను ప్రపంచానికి అందించనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. టెస్లాకు దక్కని ఊరట!
భారత్-అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే ఈ ఒప్పందం లగ్జరీ కార్ల ప్రియులకు తీపి కబురు అందించినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాకు మాత్రం నిరాశే ఎదురైంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే హై-ఎండ్ లగ్జరీ కార్లపై భారత్ దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాయితీ పరిధి నుంచి మినహాయించడం గమనార్హం. దీనివల్ల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాకు భారత మార్కెట్లో తక్కువ ధరకు కార్లను విక్రయించే అవకాశం ప్రస్తుతానికి లేకుండా పోయింది.ఒప్పందంలోని ముఖ్యాంశాలు3,000 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న సాంప్రదాయ పెట్రోల్ కార్లపై సుంకాలు 10 ఏళ్ల కాలపరిమితిలో క్రమంగా 30 శాతానికి తగ్గుతాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలుమార్లు ప్రస్తావించిన హార్లే డేవిడ్సన్ వంటి ప్రీమియం బైక్‌లపై దిగుమతి సుంకాలను భారత్ పూర్తిగా తొలగించనుంది. 800-1,600 సీసీ సామర్థ్యం గల బైక్‌లకు ఈ ప్రయోజనం కలుగుతుంది.భారత ఎగుమతులపై సుంకాలను అమెరికా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనుంది. ప్రతిఫలంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి, అమెరికా నుంచి దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.మార్చి 2026లో ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేసిన తర్వాత ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.భారత్‌లో టెస్లా పరిస్థితి ఏమిటి?భారతదేశం తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి ఈవీలను ఈ ఒప్పందం నుంచి దూరంగా ఉంచింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, టెస్లా కోసం ప్రత్యేకంగా తక్కువ సుంకం మార్గాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం భారత్‌లో టెస్లా విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు. జనవరి 15, 2026 నాటికి నెల మొదటి పదిహేను రోజుల్లో కేవలం 16 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనికి భిన్నంగా, చైనా కంపెనీ బీవైడీ 83 వాహనాలను విక్రయించింది. బీఎండబ్ల్యూ 351 యూనిట్లు, బెంజ్ 70 యూనిట్లను విక్రయించాయి.ప్రభుత్వ పథకం..భారత ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ఎస్పీఎంఈపీసీఐ (Scheme to Promote Manufacturing of Electric Passenger Cars in India) అనే పథకాన్ని తెచ్చింది. దీని ప్రకారం కనీసం 500 మిలియన్ డాలర్లను స్థానికంగా పెట్టుబడి పెట్టి ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే దిగుమతి సుంకాల్లో రాయితీ లభిస్తుంది. అయితే, టెస్లా ఇప్పటివరకు ఈ పథకంలో చేరకపోవడం వల్ల ఆ కంపెనీకి దిగుమతి సుంకాల భారం తప్పడం లేదు. మేక్ ఇన్ ఇండియా నిబంధనలకు కట్టుబడితే తప్పా విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లపై భారీ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
ఎలాన్ మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన వినూత్న వ్యాపార శైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. క్లిష్టమైన పరిశ్రమలను సైతం అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘ఇడియట్ ఇండెక్స్’ అనే భావన ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఏమిటీ ఇడియట్ ఇండెక్స్?ఇది అధికారిక ఆర్థిక గణాంకం కానప్పటికీ మస్క్ కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్ పనితీరును నిర్దేశించే ఒక అనధికారిక కొలమానం. దీని ప్రకారం.. ఒక ఉత్పత్తిని తయారు చేయడానికి అయ్యే ముడి పదార్థాల మొత్తం ధర, ఆ ఉత్పత్తి విక్రయించే తుది ధర మధ్య వ్యత్యాసాన్నే మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’ అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక యంత్రం తయారీకి వాడే ఉక్కు, అల్యూమినియం ఖర్చు చాలా తక్కువగా ఉండి తుది యంత్రం ధర విపరీతంగా ఎక్కువగా ఉంటే ఆ మధ్యలో ఉన్న వ్యత్యాసం వ్యవస్థలోని అసమర్థతను సూచిస్తుందని మస్క్ వాదిస్తున్నారు. ఇంజినీరింగ్ క్లిష్టత లేదా భద్రతా కారణాలు లేకుండా ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంటే అక్కడ వ్యవస్థలో లోపం ఉందని లేదా కాలం చెల్లిన పద్ధతులు వాడుతున్నారని ఆయన నమ్ముతున్నట్లు చెప్పారు.స్పేస్ ఎక్స్, ఎక్స్ఏఐ విలీనం2026 ప్రారంభంలో మస్క్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం వ్యాపార రంగంలో మైలురాయిగా నిలిచింది. తన కృత్రిమ మేధ సంస్థ ఎక్స్ఏఐని అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్‌లో విలీనం చేయడం ద్వారా ఆయన సాంకేతిక సమగ్రతను కొత్త స్థాయికి తీసుకెళ్లారు.ఈ విలీనం వెనుక కారణాలుఏఐ శిక్షణకు అవసరమైన భారీ విద్యుత్, డేటా కేంద్రాల నిర్వహణకు స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ నెట్వర్క్ తోడ్పడుతుంది.ఏఐ ఇంజినీర్లు, రాకెట్ శాస్త్రవేత్తలు ఒకే గొడుగు కింద పనిచేయడం వల్ల సంస్థాగత జాప్యం తగ్గుతుంది.బాహ్య సరఫరాదారులపై ఆధారపడకుండా ఏఐ నుంచి రాకెట్ తయారీ వరకు అంతా అంతర్గతంగానే నిర్వహించేందుకు వీలవుతుంది.విమర్శలు, వాస్తవాలుమస్క్ పద్ధతులు ఎంత విజయవంతమైనా అవి విమర్శలకు అతీతం కాదు. ఉద్యోగులపై విపరీతమైన పని ఒత్తిడి, కఠినమైన టార్గెట్లు వంటి అంశాలపై మాజీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఫలితాల పరంగా చూస్తే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లు, టెస్లా గిగాఫ్యాక్టరీలు పారిశ్రామిక రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయనడంలో సందేహం లేదు. మొత్తానికి ‘ఇడియట్ ఇండెక్స్’ ద్వారా అసమర్థతను తొలగించి వేగమే ప్రధానంగా మస్క్ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు తెలుస్తుంది. 2026 నాటి ఈ పరిణామాలు భవిష్యత్తులో సాంకేతిక రంగం ఏ దిశగా వెళ్తుందో సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: కియోసాకీకి కోపమొచ్చింది! -
డబ్బుతో ఆనందం కొనలేము: మస్క్ ట్వీట్
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఎప్పడూ సంచనల వ్యాఖ్యలు చేసే ఈయన.. ఇప్పుడు ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. "డబ్బుతో ఆనందాన్ని కొనలేము" అని ఒక ఎమోజీ యాడ్ చేశారు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంది.ఎలాన్ మస్క్ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు తన సంపదను దృష్టిలో ఉంచుకుని సరదాగా కూడా వ్యాఖ్యానించారు. అంటే మీరు సంతోషంగా లేరా? అని ఒకరు ప్రశ్నించగా.. మరొకరు, ముందు నాకు 1 బిలియన్ డాలర్లు ఇవ్వండి, నేనూ అనుభవించి చెబుతాను అని అన్నారు. ఇంకొకరు బిలియనీర్‌గా బాధపడటం, బిలియనీర్ కాకుండా బాధపడటం కంటే మెరుగైనదే.. అంటూ వ్యంగ్యంగా స్పందించారు.సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. ఈ చర్చలో ప్రముఖ అమెరికన్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మన్ కూడా పాల్గొనడం మరో ముఖ్యమైన అంశం. మీరు ఇప్పటికే చాలామందికి సహాయం చేశారు. అంతేకాదు.. జీవిత భాగస్వామితో దీర్ఘకాలికమైన, స్థిరమైన సంబంధం కూడా నిజమైన ఆనందానికి కారణమవుతుందని ఆయన వ్యక్తిగత సలహా ఇవ్వడం గమనార్హం.ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతున్న సమయంలో.. ఎలాన్ మస్క్ మరో రికార్డ్ సృష్టించారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 800 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. స్పేస్ఎక్స్, xAI వంటి సంస్థల విస్తరణ, వాటి విలువ పెరుగుదల మస్క్ సంపదను ఆ స్థాయికి తీసుకెళ్లాయి.ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ.. డబ్బుతో ఆనందాన్ని కొనలేము అని మస్క్ వ్యాఖ్యానించడం చాలామందిని ఆలోచనల్లోకి నెట్టేసింది. మానవ సంబంధాలు, ఇతరులకు ఉపయోగపడే పనులు అన్నీ నిజమైన సంతోషాన్ని ఇస్తాయని కొందరు మరోసారి గుర్తు చేశారు.Whoever said “money can’t buy happiness” really knew what they were talking about 😔— Elon Musk (@elonmusk) February 5, 2026 -
ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఆదాయం విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీనిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు.''మా సంస్థకు సంబంధించిన 2025 ఆర్ధిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు మా ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచాయి. మా భాగస్వాములు & ఉద్యోగుల అంకితభావం, కృషి వల్ల ఈ త్రైమాసికం విజయవంతంగా ముగిసింది. ముఖ్యంగా.. మా వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్లను అధిగమించడం.. గర్వించదగ్గ విషయం'' అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.సుందర్ పిచాయ్ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్..'వెల్ డన్' అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2025 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో.. సెర్చ్ & ఇతర యాడ్స్ విభాగం 17 శాతం వృద్ధిని సాధించింది. జెమిని యాప్ నెలకు 750 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. 2025లో యూట్యూబ్ యాడ్స్ & సబ్స్క్రిప్షన్ ద్వారా 60 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇలా విభాగాల వారీగా గూగుల్ కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది.Well done— Elon Musk (@elonmusk) February 5, 2026 -
అంతరిక్ష సంక్షేమం కోసం స్టార్‌గేజ్
ఇతరుల బాగు కోరే వారే మంచి మనిషి అని శతాబ్దాలుగా వింటున్నాం. ఇప్పుడీ మంచి పనిని అంతరిక్ష వేదిగా ఆచరించి చూపుతా మని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ సంస్థ శనివారం ప్రకటించింది. అంతరిక్షంలో వందల కిలోమీటర్ల ఎత్తులో వేర్వేరు కక్ష్యల్లో తిరిగే కృత్రిమ ఉపగ్రహాలు హఠాత్తుగా స్థానచలనం చెందిన విపత్కర సందర్భాల్లో సమీప ఉపగ్రహాల ఆపరేటర్లను అప్రమత్తంచేసే అత్యాధునిక ఆన్లైన్ టూల్ ‘స్టార్‌గేజ్’ను అందుబాటులోకి తెచ్చినట్లుస్పేస్ఎక్స్ ప్రకటించింది. దీనిని స్పేస్ సిట్యూవేషనల్ అవేర్నెస్ సిస్టమ్ అని కూడా పిలుస్తున్నారు.ఏమిటీ స్టార్‌గేజ్?ఇదొక అప్రమత్త వ్యవస్థ. ఉపగ్రహాల ఇంధనం ఖాళీ అవడం, లేదా ఉపగ్రహం విఫలమై దిగువ కక్ష్యలోకి జారిపోవడం లేదా స్వేచ్ఛగా ఇష్టమొచ్చినట్లు తిరిగే సందర్భాల్లో అవి అంతరిక్ష బాంబుల్లా మారిపోతాయి. సమీప ఉపగ్రహాలకు ఢీకొట్టి సర్వనాశనం చేస్తాయి. తర్వాత ఇది శృంఖల చర్యలా విశృంఖలంగా జరిగి వందల ఉపగ్రహాలు ధ్వంసమయ్యే పెను ప్రమాదముంది. ఈ అంతరిక్ష ప్రమాదాన్ని మొగ్గదశలోనే తుంచేసే శక్తి ఈ స్టార్గేజ్కు ఉంది. అస్తవ్యస్తంగా కదులుతున్న ఉపగ్రహాల జాడ, లొకేషన్‌ను ఇతర ఆపరేటర్లకు ఉచితంగా స్పేస్ఎక్స్ అందిస్తుంది. దాంతో తమ ఉపగ్రహాలను ఆ ప్రమాదకర ఉపగ్రహం నుంచి దూరంగా తీసుకెళ్లడమో, దిగువ కక్ష్యలోకి సురక్షితంగా మార్చడమో సాధ్యమవుతుంది. దీంతో ఉపగ్రహాల యాక్సిడెంట్‌ను నివారించవచ్చు. కేవలం ఉపగ్రహాలు మాత్రమేకాకుండా హఠాత్తుగా దూసుకొచ్చిన చిన్నపాటి గ్రహశకలాల లొకేషన్‌నూ ఆపరేటర్లకు స్టార్‌గేజ్ అందిస్తుంది. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సమాచారం ఇవ్వడం స్టార్‌గేజ్ ప్రత్యేకత. అత్యాధుని సెన్సార్లు, సంక్టిష్లమైన సాఫ్ట్వేర్ సాయంతో పాత ఉపగ్రహాల శకలాలనూ స్టార్‌గేజ్ గుర్తించి వాటి జాడను ఆపరేటర్లకు అందజేస్తుంది. ఒకచోట పొగుబడిన శకలాల ప్రాంతాలను గుర్తించి అప్రమత్తంచేస్తుంది. ఉపగ్రహాలు ఢీకొట్టే అవకాశాలు గణనీయంగా తగ్గించి తద్వారా అంతరిక్ష చెత్త పోగుబడకుండా, ఆ ప్రాంతంలో మరో కొత్త ఉపగ్రహం వచ్చి చేరేందుకు మార్గం సుగమం చేస్తుంది. పౌర, సౌనిక, నిఘా, వాతావరణ ఉపగ్రహాల ప్రయోగాలతో దిగువ భూకక్ష్యల్లో కొత్త ఉపగ్రహాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు వేలాది ఉపగ్రహాల కూటమి స్టార్‌లింక్‌తో ఉపగ్రహాల సంఖ్య వేలాదిగా ఎక్కువైంది. ఈ తరుణంలో అంతరిక్షం సైతం ఒక రద్దీ అయిన రహదారిలో మారింది. రోడ్డుపై వాహనాలను క్రమబద్ధీకరించే ట్రాఫిక్ కానిస్టేబుల్ తరహా వ్యవస్థ తక్షణావసరమైంది. ఈ అవసరాన్ని స్టార్‌గేజ్ తీర్చనుంది.అదనంగా కంజంక్షన్ స్క్రీనింగ్ సర్వీస్..ఇప్పుడున్న ఉపగ్రహాలు కొన్ని గంటల తర్వాత ఏ దిశగా ఎంత దూరం కదులుతాయి అనే వివరాలను స్టార్‌గేజ్ ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉపగ్రహాల ఆపరేటర్లకు ఉచితంగా అందివ్వనుంది. దీంతో తోటి ఉపగ్రహాలతోపాటు ఖగోళ వస్తువులు, స్పేస్ చెత్త ఎక్కడున్నాయో ఇట్టే తెల్సిపోతుంది. వీటికి అనుగు ణంగా ఆపరేటర్లు తమ భవిష్యత్ ఉ పగ్రహాల ప్రయోగాల తేదీలను సవరించుకోవ చ్చు. దీని వల్ల అత్యంత విలువైన సమయం, ప్రయోగాల ఖర్చు కలిసివస్తాయి. స్టార్‌గేజ్ అందించనున్న అత్యంత విలువైన డేటా షేరింగ్ సమాచారాన్ని నాసా, ఇతర అంతర్జాతీయ ఉపగ్రహ ఆపరేటర్లు ఎప్పట్నుంచో కోరుతుండగా ఇన్నేళ్లకు ఇది సాకారమైంది. గత ఏడాది డిసెంబర్లో స్టార్‌లింక్ ఉపగ్రహ కూటమికి అత్యంత సమీపంగా చైనా ఉపగ్రహం దూసుకొచ్చింది. అవి ఢీకొట్టే పెనువినాశనం సంభవించేది. దీంతో భయపడిన స్టార్‌లింక్ ఏకంగా తమ 4,400 ఉపగ్రహాలను వెనువెంటనే 480 కిలోమీటర్ల దిగువ కక్ష్యలోకి తీసుకురావాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దనే సదుద్దేశంతో ఉచితంగా ఈ సేవలను స్టార్‌లింక్ అంతర్జాతీయంగా అన్ని దేశాలకు అందుబాటులోకి తెచ్చింది. కంజంక్షన్ డేటా మెసేజెస్(సీడీఎం)లను ఎప్పటికప్పుడు స్టార్‌గేజ్ పంపనుంది. కంజంక్షన్ స్క్రీనింగ్ సర్వీస్ ద్వారా గంటల తర్వాత రావాల్సిన డేటాను కేవలం నిమిషాల్లోనే సీడీఎంల రూపంలో ఆపరేటర్లు పొందొచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తీవ్ర నేరారోపణలు.. సైబర్ క్రైమ్ యూనిట్ సోదాలు
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఎక్స్ కార్యాలయాలపై ఆ దేశ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధమైన డేటా వెలికితీత, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు ఎక్స్ యాజమాన్యం ధ్రువీకరించింది.దర్యాప్తు నేపథ్యం..ఈ వివాదం 2025 జనవరిలో ప్రారంభమైంది. ఎక్స్ ప్లాట్‌ఫామ్ తన యూజర్లకు సిఫార్సు చేసే అల్గారిథమ్ ఆధారిత కంటెంట్‌పై పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తు క్రమంగా ఎక్స్ వివాదాస్పద ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ వరకు విస్తరించింది. అయితే, ఈ చర్యలను ఎక్స్ తీవ్రంగా ఖండించింది. జులై 2025లో స్పందిస్తూ.. ఈ విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమని, తమ అల్గారిథమ్‌ను తారుమారు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.ఎక్స్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలుపిల్లల అశ్లీల చిత్రాలను కలిగి ఉండటం. వాటిని ఇతరులతో పంచుకోవడంలో ప్లాట్‌ఫామ్ ప్రమేయం ఉండటం.అనుమతి లేకుండా మహిళల లైంగికపరమైన డీప్‌ఫేక్(రియల్ ఇమేజ్‌లను తలపించేలా ఏఐ ద్వారా సృష్టించే చిత్రాలు) చిత్రాలను సృష్టించడం ద్వారా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం.వ్యవస్థీకృత సమూహాల ద్వారా మోసపూరిత పద్ధతుల్లో డేటాను సేకరించడం.ముఖ్యంగా గ్రోక్ చాట్‌బాట్ మహిళల అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై యూరోపియన్ కమిషన్, యూకే రెగ్యులేటర్లు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి.ఎక్స్‌ను ఉపయోగించబోం..విచారణ తీవ్రతరం కావడంతో పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఇకపై ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించబోమని, అధికారిక సమాచారం కోసం లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తామని ప్రకటించింది.గతంలో టెలిగ్రామ్‌పై చర్యలుటెక్ దిగ్గజాలపై ఫ్రాన్స్ కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో కంటెంట్ మోడరేషన్ లోపాలపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్‌ఫామ్ కార్యకలాపాల్లో మార్పులు చేసిన తర్వాతే గత మార్చిలో ఆయనను దేశం విడిచి వెళ్లడానికి అనుమతించారు. ప్రస్తుతం ఎక్స్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం సోషల్ మీడియా నియంత్రణల విషయంలో ఐరోపా దేశాల కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే.. -
అంతరిక్షంలోకి 10 లక్షల ఏఐ శాటిలైట్లు!
ప్రైవేట్ అంతరిక్ష రంగం, కృత్రిమ మేధ రంగాలను అత్యంత వేగంగా విస్తరించే బృహత్తర ప్రాజెక్టుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ రంగం సిద్ధంచేస్తున్నారు. మానవాళి కృత్రిమ మేధ అవసరాలను వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం నుంచే నేరుగా తీర్చేందుకు ఏకంగా 10,00,000 ఏఐ సూపర్కంప్యూటర్లను నింగిలోకి పంపనున్నారు. ఒక్కో కృత్రిమమేథ సూపర్‌కంప్యూటర్‌ను ఒక్కో ఉపగ్రహంతో అనుసంధానించి సేవలు అందించాలని మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తంగా 10 లక్షల ఏఐ సూపర్‌కంప్యూటర్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాలని స్పేస్ఎక్స్ నిర్ణయించింది. ప్రయోగాల కోసం అమెరికా ప్రభుత్వ అనుమతి కోరారు. అతిపెద్ద జల్లెడ మాదిరిగా శాటిలైట్లన్నీ ఒకదానితో మరోటి లేజర్ కాంతిపుంజంతో అనుసంధానమై ఉంటాయి. తద్వారా ఉమ్మడిగా ఊహించనంత వేగంగా కృత్రిమ మేధ సేవలను అందించనున్నాయి. ఇన్నేసి సూపర్కంప్యూటర్లను భూమిపై సర్వర్ఫామ్లో ఏర్పాటుచేసి నిర్వహించాలంటే అత్యధిక స్థాయిలో విద్యుత్‌ను నిరంతరంగా సరఫరాచేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాకపోవడంతో సౌరశక్తిని ఉపయోగించుకుని ఆకాశంలోనే అతిపెద్ద సోలార్‌ప్యానెల్ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా 10 లక్షల ఏఐ కంప్యూటర్ల శక్తి అవసరాలు తీర్చనున్నారు. 1968లో వచ్చిన ‘2001: స్పేస్ ఒడిస్సీ’హాలీవుడ్ చిత్రంలో ‘హాల్ 9000’కృత్రిమమేధావి చేసే ప్రయోగాలు ఇన్నాళ్లూ సినిమాలకే పరిమితంకాగా ఇకపై వాటిని నిజజీవితంలోకి తీసుకొస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఏఐ కంప్యూటర్ల దండును నింగిలో మోహరింపజేసి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది వినియోగదారుల కృత్రిమమేధ అవసరాలు తీర్చబోతున్నామని మస్క్ వివరించారు. ఈ వ్యవస్థకు ‘ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్’అని పేరు పెట్టారు. ఇది అందుబాటులోకి వస్తే భూమిపై వినియోగదారులకు సంబంధించిన విపరీతమైన సమాచారం, సంక్లిష్టమైన డేటాను అత్యధిక వేగంతో ప్రాసెస్ చేయడమూ సాధ్యమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా ఏఐ మోడళ్లను పరీక్షించి అందుబాటులోకి తేవచ్చు. భూమి నుంచి 500 నుంచి 2,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు. వీటిని ఒకదానితో మరోటి ఢీకొట్టకుండా వీలైనంత దూరంలో కక్ష్యలో స్థిరపరచనున్నారు. ‘‘ఊహించనంతగా వచ్చి పడుతున్న ఏఐ డిమాండ్‌ను అందుకోవాలంటే భూమి మీద సౌకర్యాల విస్తరణతో సాధ్యంకాదు. అంతరిక్షంలో కక్ష్యల్లో కొలువుతీరిన లక్షలాది ఉపగ్రహాలతోనే ఇది సాధ్యం. పుష్కలంగా లభించే సౌరశక్తిని ఒడిసిపట్టి ఈ సూపర్కంప్యూటర్ల విద్యుత్‌శక్తి అవసరాలు తీర్చుతాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా కేంద్రంగా అంతరిక్షాన్ని సిద్ధంచేయబోతున్నాం’’అని మస్క్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. స్టార్‌లింక్ స్ఫూర్తితో.. ఇప్పటికే వేలాది కృత్రిమ ఉపగ్రహాలతో మస్క్ కు చెందిన స్టార్‌లింక్ సంస్థ విశ్వవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీని స్ఫూర్తితోనే ఏఐ సేవలు అందించేందుకు ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన పనులు మొదలెట్టారు. ఇందుకోసం అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(యూఎస్ఎఫ్సీసీ) వద్ద స్పేస్ఎక్స్ దరఖాస్తు చేసుకుంది. భూమిపై ఏర్పాటుచేసిన డేటా సెంటర్లు పవర్ గ్రిడ్లతో అనుసంధానమై ఉన్నాయి. విద్యుత్ అంతరాయం పెద్ద అవరోధంగా తయారైంది. అతిపెద్ద సర్వర్ఫామ్ల ఏర్పాటుకు భూమి సేకరణ ఇబ్బందిగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భూమి సేకరణ అనేది ఖరీదైన వ్యవహారంగా తయారైంది. విద్యుత్ తయారీకి బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను వినియోగిస్తారు. దీంతో ఇంతపెద్ద ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడమూ కష్టమే. ఈ సమస్యలేవీ అంతరిక్షంలో ఉండవు. ఆ కారణంతోనూ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు నింగిని వేదికగా ఎంపికచేశారు. భూమి మీద ఏఐ సూపర్కంప్యూటర్లను చల్లబరిచేందుకు కూలింగ్ వ్యవస్థలు అవసరం. అదే అంతరిక్షంలో శూన్యం ఉంటుందికాబట్టి ఇది సహజ రిఫ్రిజిరేటర్‌గా పనిచేస్తుంది. రాత్రిళ్లు అత్యల్ప ఉష్ణోగ్రతలకు ఏఐ వ్యవస్థ ఆటోమేటిక్‌గా చల్లబడుతుంది. విద్యుత్ అవసరం కూడా ఉండదు. 10 లక్షల ఉపగ్రహాల మధ్య సమాచారాన్ని హైస్పీడ్ లేజర్ కాంతిపుంజం రూపంలో బదిలీచేస్తారు. దీంతో ట్రిలియన్ల బైట్ల డేటా వేగంగా సరఫరా అవుతుంది. ఈ వ్యవస్థ మొత్తం ఆకాశంలో ఏర్పాటయ్యాక ప్రతి టన్ను సౌరఫలకాల వ్యవస్థ నుంచి ఏకంగా 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీంతో అక్కడి డేటా సెంటర్ల శక్తి అవసరాలు సైతం తీరనున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎప్స్టీన్ ఫైల్స్‌లో మస్క్ తాజా ఈమెయిల్స్ కలకలం
సంచలనం ఎప్స్టీన్ ఫైల్స్‌లో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ పేరు మరోసారి మారు మోగుతోంది.దీనికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ కొత్త ఫైళ్లను వెలికి తీసింది. ఎలోన్ మస్క్ జెఫ్రీ ఎఎప్స్టీన్ మధ్య ఈమెయిల్ మార్పిడి జరిగినట్టు చెబుతోంది. 2012- 2013లో ఎప్స్టీన్ తన ప్రైవేట్ వర్జిన్ దీవులకు మస్క్‌ను ఆహ్వానించినట్లు ఈ మెయిళ్ల సారాంశం. దాదాపు 30 లక్షలకు పైగా కొత్త పేజీల ఎప్స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేసింది. అయితే ఎప్స్టీన్ ద్వీపానికి తనను రమ్మని ఆహ్వానించి నప్పటికీ, తానెప్పుడూ వెళ్లలేదని గతంలోనే మస్క్ ఖండించాడు.తాజాగా విడుదలైన US న్యాయ శాఖ పత్రం, మస్క్ జెఫ్రీ మధ్య ఈమెయిల్స్ ద్వారా చాలా పెద్ద చర్చే జరిగినట్టు గుర్తించింది. ఎప్స్టీన్ ఐలాండ్‌కు మస్క్ణు ఆహ్వానించినట్టు, మస్క్ అక్కడి వెళ్లినట్టుగా వాదిస్తోంది. వీటిలో షెడ్యూల్ తేదీలు, లాజిస్టిక్స్, ఇతర ప్లాన్స్ ఉన్నాయిన వాదిస్తోంది. 2012 క్రిస్మస్ నాటి ఇమెయిల్‌లో, తన ద్వీపాన్ని సందర్శించమని మస్క్‌ను ఆహ్వానించాడు ఎప్స్టీన్. అయితే, మస్క్ వెళ్లినట్టు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ మరోసారి ఈ వార్తలు నెట్టింట చర్చకు దారి తీశాయి. అయితే ఎప్స్టీన్ ఆఫర్‌ను మస్క్ తిరస్కరించాడు. దీనికి ప్రతిస్పందనగా, ఎప్స్టీన్ మస్క్ సంకోచాన్ని అర్థం చేసుకున్నానని, గర్ల్‌ఫ్రెండ్‌తో స్వేచ్ఛగా ఉండవచ్చనే నిగూఢార్థంతో మరో సందేశాన్ని పంపాడు. కొన్ని వారాల తర్వాత, ప్రయాణ ఏర్పాట్ల కోసం మస్క్‌ను అడుగుతూ ఒక ప్రత్యేక ఇమెయిల్‌లో పంపాడు. “మీరు హెలికాప్టర్ ద్వీపానికి ఎంత మంది ఉంటారు?”మరుసటి రోజు ప్రతిస్పందనగా, మస్క్ ఇలా వ్రాశాడు, “బహుశా తాలూలా,తాను మాత్రమేనని, మీ ద్వీపంలో పగలు/రాత్రి హార్డెస్ట్ పార్టీ ఉంటుందా అని మస్క్ అడిగాడు. ఆ తరువాత 1-8వ తేదీ వరకు ఏ రోజునా, ఎపుడూ మీకోసం సిద్ధంగా ఉంటుందని మరో ఈయిల్ పంపాడు.కరేబియన్ పర్యటనలోమస్క్ ఇక్కడికి వెళ్లి ఉంటాడని భావించే2013 ఇమెయిల్ మార్పిడి కూడా ఫైల్లో ఉంది. “సెలవులలో BVI/సెయింట్ బార్ట్స్ ప్రాంతంలో ఉంటాను. సందర్శించడానికి మంచి సమయం ఉందా?” మస్క్ 2013, డిసెంబర్ 13 నాటి ఇమెయిల్‌లో రాశారు. ఇలా పలు దఫాలుగా మారి మధ్య ఈమెయిల్స్ ద్వారా సంభాషణ జరిగిందని చెబుతోంది. కానీ మస్క్ ఎపుడు అక్కడికి వెళ్లాడు అనేదానిపై రికార్డులు స్పష్టమైన ధృవీకరణ లేదు.ఎప్స్టీన్తో మస్క్ ఈమెయిళ్ళ వార్త వెలువడిన వెంటనే, సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తాయి. సందర్భాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. బిలియనీర్లు బ్రిటిష్ వర్జిన్ దీవులలో సెలవుల్లో ఉండటం సర్వసాధారణం. ఉన్నత స్థాయి ఆర్థికవేత్తను కలవమని అడగడం నేరం కాదు. మస్క్ గతంలోనే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని, అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. ఈ ఫైల్స్‌లో లక్షలాది ఈమెయిళ్ళు ఉన్నాయి, ఒకరి ఇన్‌బాక్స్‌లో పేరు ఉన్నంత మాత్రాన వారి నేరంలో భాగస్వాములైనట్లు కాదు. ఇది కేవలం మస్క్‌ను వేధించడానికి చేస్తున్న మరో ప్రయత్నం మాత్రమే అని ఒకరువ్యాఖ్యానించారు. అప్పట్లో ఎప్స్టీన్కు ఈమెయిల్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ సందర్భం ముఖ్యం. ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు పూర్తి సంభాషణలను పరగణనలోకి తీసుకోవాలని మరొకరు రాశారు. తాను ఎప్స్టీన్తో సంభాషించలేదని మస్క్ ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి ఎప్స్టీన్ నిర్వహించిన అనేక 'లంచ్‌లకు' వెళ్లాడు. తలులా రిలే ఒకసారి ఎప్స్టీన్ న్యూయార్క్ సిటీ పెంట్‌హౌస్‌ను సందర్శించాడు. ఈ విషయం తలులా ఎక్స్‌లో ఇప్పటికీ ఉన్న ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. కూడా అని మరొకరు అభిప్రాయ పడ్డారు. -
టెస్లా కార్ల నిలిపివేత!.. మస్క్ కీలక ప్రకటన
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. తన పాపులర్ మోడల్స్ 'ఎస్, ఎక్స్' ఎలక్ట్రిక్ కార్లను దశలవారీగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. బదులుగా.. హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేయడానికి కాలిఫోర్నియా ఫ్యాక్టరీని తిరిగి ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.2012, 2015లో మార్కెట్లో విడుదలైన టెస్లా మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందాయి. స్టార్టప్ నుంచి టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్‌గా ఎదగడానికి ఇవి దోహదపడ్డాయి. అలాంటి కార్లను కంపెనీ నిలిపివేయడానికి సిద్ధమైంది. పెట్టుబడిదారులు & వాల్ స్ట్రీట్ విశ్లేషకులతో జరిగిన సమావేశం తరువాత మస్క్ ఈ ప్రకటన చేశారు.టెస్లా కంపెనీ మోడల్ ఎస్, ఎక్స్ కార్లను నిలిపివేయడానికి ప్రధాన కారణం.. అమ్మకాలు బాగా తగ్గడమే. ఈ సమయంలో బీవైడీ వంటి కంపెనీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం చివరి మూడు నెలలకు టెస్లా తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసినప్పుడు కూడా కంపెనీ లాభాలు తగ్గినట్లు స్పష్టంగా వెల్లడయ్యాయి. ఈ ఏడాది కూడా లాభాలు కనిపించలేదు. 2024 ఆదాయంతో పోలిస్తే 3% తగ్గినట్లు సంస్థ నివేదికలు చెబుతున్నాయి. -
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్ అంటున్న మస్క్
టెస్లా అధినేత, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో అరంగేట్రం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, గురువారం 2026 WEF సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్తో సంభాషణ సందర్భంగా, మానవుల్లో వృద్ధ్యాప్యాన్ని తిప్పికొట్టే అవకాశం ఉందంటూ ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లారీ ఫింక్తో జరిగిన చర్చలో మాస్క్ వృద్ధాప్యం అనేది చాలా సులభంగా పరిష్కరించగల సమస్యే కానీ రిస్క్‌తో కూడుకున్నదన్నారు. వృద్ధాప్యానికి కారణమేమిటో మనం గుర్తించినపుడు ఏజింగ్ రివర్స్ ప్రక్రియ సులభ మవుతుందని తాను భావిస్తున్నా అన్నారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే కానీ మరణానికి సామాజిక ప్రయోజనం ఉంది. అయితే ఇది అంత చిన్న విషయం కాదని ఎందుకంటే శరీరంలోని అన్ని కణాలు దాదాపు ఒకే రేటుతో వృద్ధాప్యానికి గురవుతాయి. బాడీలోని 35 ట్రిలియన్ కణాలన్నీ ఒకే వేగంతో వృద్ధాప్యానికి గురవు తాయని, దీని వెనుక ఒక ఖచ్చితమైన 'క్లాక్' (యంత్రాంగం) ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కనిపెడితే వృద్ధాప్యాన్ని అరికట్టడం సాధ్యమేనని చెప్పారు.సమాజానికి ముప్పుఅయితే ఏజ్ రివర్సింగ్ వల్ల సామాజిక సవాళ్లు, ఊహించని పరిణామాలు ఏర్పడతాయని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధాప్యం లేకపోతే కొత్త ఆలోచనలు రాకుండా సమాజం "స్తంభించిపోయే" (Ossification) ప్రమాదం ఉందని, మరణం అనేది సమాజంలో కొత్తదనం రావడానికి అవసరమని మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: సెలబ్రిటీలను సైతం ఇన్స్పైర్ చేసిన 70 ఏళ్ల బామ్మదావోస్ సదస్సును గతంలో "బోరింగ్" అని విమర్శించిన మస్క్, మొదటిసారి ఈ వేదికపై ప్రసంగించడం విశేషం. దావోస్‌లో జరిగిన తన మొదటి WEFలో మస్క్ వయస్సు మార్పు , దీర్ఘాయువు గురించి మాట్లాడారు. అలాగే భవిష్యత్తులో మనుషుల కంటే రోబోలే ఎక్కువ ఉంటాయని, 2027 నాటికి టెస్లా రోబోలు మార్కెట్లోకి వస్తాయని మాస్క్ అంచనా వేశారు. అలాగే ఈ చర్చ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్ పెరోల్ -
ఎలాన్ మస్క్ ఛీ కొట్టాడు.. ఇప్పుడు రూ. 6000 కోట్లకు అధిపతి
-
ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై మస్క్ సెటైర్లు
దావోస్: గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అపర కుబేరుడు ఎలాన్ మస్క్ దుమ్మెత్తి పోశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని బోర్డ్ ఆఫ్ పైస్ (శాంతి ముక్కలు)గా మార్చుకుంటే సరిపోతుందని పరోక్షంగా దుయ్యబట్టారు.దావోస్ వేదికగా కొనసాగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫిక్ అధ్యక్షత వహిస్తున్న ప్యానల్ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ట్రంప్ బోర్డు పీస్ బదులుగా పైస్ అని ఉండాలని మస్క్ సూచించారు. ‘నేను పీస్ సమ్మిట్ ఏర్పాటు గురించి విన్నాను. అది పీసా లేదంటే గ్రీన్లాండ్ పైస్,వెనిజువెలా పీస్ అని నేను అనుకున్నాను’. మనకు కావాల్సింది పైస్ కాదు పీస్ అంటూ నిశబ్ధంగా ఉన్న ఆడియెన్స్‌తో నవ్వులు పూయించారు. ELON MUSK: "I heard about the formation of the peace summit? And I was like, is that piece or peace? Like little piece of Greenland a little piece of Venezuela." 😂 pic.twitter.com/QxmbOrH2wC— DogeDesigner (@cb_doge) January 22, 2026 -
అధ్వాన్నంగా అమెరికాలో ఆరోగ్యం : ఎండోస్కోపీ కోసం 6 వారాలు
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధీనంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లోని ఒక ప్రధాన ఉద్యోగి ట్వీట్ వైరల్‌గా మారింది. అమెరికాలో H1b ఫీజు పెంపుతో, అమెరిలో వైద్యం అందని ద్రాక్ష మారుతోందని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులైన విదేశీ డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా మెడికల్ డెసర్ట్లు ఇంకా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధీనంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొడక్షన్ హెడ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.ఎక్స్ ప్రొడక్షన్ హెడ్ నికితా బియర్ తన ఆరోగ్యం గురించి తన ట్వీట్ ద్వారా ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫ్రైడ్ చికెన్ తింటు న్నప్పుడు తనకు గొంతులో గాయమైందని, దీంతో తాను సరిగ్గా మాట్లాడలేక పోతున్నానని లేదా మింగలేకపోతున్నానని చెప్పారు. వైద్యులు ఎండోస్కోపీ చేయించు కోవాలని సలహా ఇచ్చారట. ఇక్కడే అసలు విషయం గురించి చెప్పారు. ముందు నష్టాన్ని అంచనా వేయడానికి చాలా వారాలు వేచి ఉండాలని తనకు సలహా ఇచ్చారని బియర్ పేర్కొన్నారు.ఎండోస్కోపీ పరీక్షకోసం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా , నాలుగు లేదా ఆరు వారాల తరువాతే మాత్రమే అని చెప్పడంతో షాక్ అవడం అతని వంతైంది. బియర్ ఈ అనుభవాన్ని “కాఫ్కా నవల” ను వర్ణిస్తూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ ఇంత దారుణంగా ఉందా అనేచర్చకు దారి తీసింది.అమెరికన్ హెల్త్‌కేర్ వ్యవస్థకు సంబంధించి అనేకమంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలు, నిపుణుల కొరత, బీమా సంబంధిత ఆంక్షలు, అధిక ఖర్చులపై మాట్లాడారు. వీటి కారణంగానే సాధారణ రోగనిర్ధారణ విధానాలకు కూడా చాలా జాప్యం జరుగుతోందని మండిపడ్డారు.హాయిగా ఇండియా ట్రిప్ వేయండి! మరోవైపు బియర్‌ను భారతదేశంలో చికిత్స పొందాలని , అక్కడ ఆసుపత్రులలో రోగనిర్ధారణ పరీక్షలు చాలా తొందరగా అయిపోతాయని చెప్పారు. ఇండియాకు అలా విమానంలో వెళ్ళండి. గంటలోపే టాప్ డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఆరు గంటల్లో ఎండోస్కోపీ లాంటివి పూర్తి చేసుకుని మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు అంటూ మరొకరు సూచించారు. సత్వర చికిత్స కోసం బియర్‌ను దక్షిణ కొరియా, దుబాయ్ లేదా థాయ్‌లాండ్‌కు వెళ్లమని కొంతమంది నెటిజన్లు సలహా ఇచ్చారు.(అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?)వ్యవస్థాపకుడు అమన్ గైరోలా కూడా భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలను ప్రశంసిస్తూ వ్యాఖ్యానించారు. "ఇక్కడ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మహా అయితే 48 గంటలు పడుతుంది. దేశం అందించే సౌకర్యాలను ప్రజలు ఎప్పుడూ గ్రహించరు. ఇక్కడ కూడా ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి కానీ క్రమంగా మెరుగుపడుతోంది" అని ఆయన రాశారు.ఇదీ చదవండి: H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో! -
చరిత్ర సృష్టించిన ఫాల్కన్
-
600వ సారి నింగిలోకి
వాషింగ్టన్: ఆధునిక ప్రైవేట్ అంతరిక్ష రంగంలో తనను మించిన విశ్వసనీయ రాకెట్ మరోటి లేదని ఫాల్కన్–9 రాకెట్ నిరూపించుకుంది. అమెరికా స్థానికకాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ బేస్ ప్రయోగ కేంద్రం నుంచి ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్–9 రకం రాకెట్‌ను ప్రయోగించడం ఇది 600వసారి. దీంతో అధునిక అంతరిక్ష రంగంలో అత్యధిక సార్లు ఉపయోగించిన రాకెట్ రకంగా ‘ఫాల్కన్’ చరి త్రకెక్కింది. అమెరికా ప్రభుత్వ నేషనల్ రీకనా యిసెన్స్ ఆఫీస్(ఎన్‌ఆర్‌ఓఎల్)105 మిషన్‌లో భాగంగా ఈ రాకెట్‌ను స్పేస్‌లాంచ్ కాంప్లెక్స్–4ఈ నుంచి ప్రయోగించారు. అమెరికా నిఘా, సైనిక, పౌర అవసరాలు తీర్చే డజన్ల కొద్దీ కృత్రిమ ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్యలోకి ఎన్‌ఆర్‌ఓఎల్ మిషన్ ద్వారా నేషనల్ రీకనాయిసెన్స్ ఆఫీస్.. స్పేస్ఎక్స్ భాగస్వామ్యంతో నింగిలోకి పంపిస్తోంది.2010లో మొదలైన ప్రస్థానం2010 జూన్ 4వ తేదీన తొలిసారిగా ఫాల్కన్ రకం రాకెట్లను ఉపయోగించారు. ఆరోజు డ్రాగన్ వ్యోమనౌకను ఇది తొలిసారిగా విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. ఫాల్కన్ రాకెట్లు ఏ మేరకు విజయవంతమవుతాయనే అనుమానాలు తొలినాళ్లలో ఉండేవి. ఆనాటి దశ నుంచి ప్రతి వారం ఒక ఫాల్కన్‌ను ప్రయోగించే విశ్వసనీయ దశకు ఫాల్కన్ రాకెట్లు చేరుకున్నాయి. 600వసారి వినియోగం అనే ఘటన కేవలం ప్రయోగంగా కాకుండా అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన సాంకేతిక సాధనంగా పరిణమించిందని సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఫాల్కన్ రాకెట్ల ప్రస్థానంలో 2015 ఏడాది అత్యంత కీలకఘట్టంగా చెప్పొచ్చు. ఆ ఏడాదిలో ఫాల్కన్‌ను తయారుచేసిన స్పేస్ఎక్స్ కంపెనీ ఆర్బిటల్–తరగతి బూస్టర్ సాయంతో రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించాక తిరిగి నిట్టనిలువుగా ల్యాండింగ్ చేసే సాహసం చేసింది. ఆ తర్వాత కేవలం మూడేళ్లకే ఫాల్కన్ హెవీ రాకెట్ టెస్లా రోస్టర్‌ను నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. తర్వాత డెమో–2 మిషన్ ద్వారా 2020లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వ్యోమగాములను తీసుకెళ్లిన తొలి ప్రభుత్వేతర సంస్థగా స్పేస్ఎక్స్ రికార్డులకెక్కింది. ఈ ప్రయోగానికి సైతం ఫాల్కన్ రాకెట్‌నే ఉపయోగించారు. దీంతో వ్యోమగాములను ఐఎస్ఎస్కు చేర్చేందుకు విదేశీ రాకెట్లపై ఆధారపడే సంస్కృతికి చరమగీతం పాడిన ట్లయింది. ఈ ఘటన తర్వాత క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ వంటి ప్రయోగాల్లో ఫాల్కన్–9 రాకెట్ల వినియోగం అనేది సర్వసాధా రణమైంది. దీంతో 2020 తర్వాతి నుంచి వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణాలకు ఫాల్కన్ వారి స్పేస్ఎక్స్ అనేది ప్రైమరీ ట్యాక్సీగా మారిపోయింది. ఆ తర్వాత ఫాల్కన్–9 విజయాల శాతం ఏకంగా 99 శాతం దాటడం విశేషం. దీంతో అత్యంత సురక్షితమైన అంతరిక్ష వాహకంగా ఫాల్కన్–9 చరిత్రలోనే తన పేరిట రికార్డ్‌ను లిఖించుకుంది. -
అ..ఆ అతడు పండక్కి వెళ్లొచ్చాడు... ఆ తరువాత...
ఏమైందో ఏమిటో పండక్కి ఊరు వెళ్లి వచ్చిన కోటి వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ‘ఎలాన్ మస్క్ మన ఆఫీసుకు వచ్చాడట... నన్ను ఏమైనా అడిగాడా?’ అని ఆరా తీశాడు. ‘మీకో బ్రేకింగ్ న్యూస్ తెలుసా? ట్రంప్ మన మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు’ అని బాంబు పేల్చాడు. ‘వీడికి ఏమైంది? పిచ్చిగానీ పట్టిందా?’ అని అరిచాడు అతడి స్నేహితుడు సందేహ్ కుమార్.‘అతడికి పట్టింది పిచ్చి కాదు, పిల్పిడెన్సియా పిలాసాపీయ సోపియా నైజీరియో బరబ్బర’ అని బదులు ఇచ్చింది ఆకాశవాణి.‘పిల్పిడెన్సియా పిలాసాఫీయా సోపీయా!!!!!!!... అదేమిటి?????’ అని మిక్కిలి ఆశ్చర్యపోయాడు సందేహ్ కుమార్.‘గూగుల్ స్టోర్‌లోకి వెళ్లి బ్యాక్ ఫ్లాష్ ట్యాబ్ ఓపెన్ చెయ్యి. ఫ్లాష్‌బ్యాక్ ఏమిటో నీకే అర్థమవుతుంది’ అని క్లుప్తంగా చెప్పింది ఆకాశవాణి. అలాగే చేశాడు సందేహ్ కుమార్. సరిగ్గా కొన్ని రోజుల ముందు...సంక్రాంతి పండక్కి స్వగ్రామానికి వెళ్లాడు కోటి. పండగ రోజు ఊళ్లో వేపచెట్టుకు వేలాడదీసిన పెద్ద బ్యానర్ కంటపడింది. అందులో ఇలా ఉంది...‘సమస్త గ్రామ ప్రజలకు... ఈరోజు కూడా ఇంట్లోనే తినాలా? ఎప్పుడూ అవే వంటకాలా? అందుకే వంటల పోటీ పెడుతున్నాం. కనీవినీ ఎరుగని కొత్త వంటకానికి... అక్షరాలా కోటి రూపాయల ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నాం’‘పేరులోనే కోటి... బ్యాంక్ బ్యాలెన్స్ లక్ష కూడా లేదు’ అని ఎప్పుడూ నిట్టూర్చే కోటికి ఇది తనను వెదుక్కుంటూ వచ్చిన బంపర్ ఆఫర్ అని బలంగా అనిపించింది. నిజానికి కోటికి వంట కాదు కదా కాఫీ చేయడం కూడా రాదు. అయితే అతడిలోని శ్రుతిమించిన ఆత్మవిశ్వాసం వంటల పోటీలో పాల్గొనేలా చేసింది. తాను కనిపెట్టిన వంటకానికి పిలాసాపియా సోపీయా నైజీరియో బరబ్బర (పి.సో.నై.బ) అని పేరు పెట్టి, దాని ప్రాశస్త్యం గురించి గాలి పోగేసి ఘనంగా చెప్పడం వల్ల... పోటీలో అతడే కోటి రూపాయల విజేత!‘ఒక విజేతగా మీరు ఆవిష్కరించిన వంటకాన్ని మీరే మొదట రుచి చూడాలి’ అని చెప్పారు నిర్వాహక కమిటీ వాళ్లు. టైటానిక్ షిప్లో సముద్రం లోతుల్లోకి మునిగిపోతున్నట్లుగా ముఖం పెట్టాడు కోటి. కానీ... కోటి రూపాయలు దక్కాలంటే టేస్ట్ చేయక తప్పదు కదా! ‘పి.సో. నై. బ’ రెండు గరిటెలు నోట్లో పెట్టుకున్నాడో లేదో... భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరిగినట్లు కోటి తల కోటి విధాలుగా తన చుట్టూ తాను తిరుగుతూ, చుట్టూ ఉన్నవారి చుట్టూ తిరిగింది.కట్ చేస్తే... కోటి... మునపటి కోటి కాదు! నీతి 2026: కోటి విద్యలు ‘కోటి’ కోసం కాదు..!– యాకుబ్ బాషా -
‘ఎక్స్’లో మరోసారి అంతరాయం
ఎలోన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఈ వారం రెండోసారి పెద్ద సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది. ఈ సమస్య వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా ప్రభావితం చేసింది.డౌన్‌డిటెక్టర్ సమాచారం ప్రకారం, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటల సమయంలో ఎక్స్ సేవలు అందుబాటులో లేవని సుమారు 80,000కు పైగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు.ఇలాంటి వరుస అంతరాయాల నేపథ్యంలో ఎక్స్ ప్లాట్‌ఫారమ్ స్థిరత్వం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో కంటెంట్‌ను సమర్థవంతంగా మోడరేట్ చేయగల సామర్థ్యంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న అనంతరం, సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. దీని కారణంగా సాధారణ కార్యకలాపాలను నిరవధికంగా కొనసాగించడం, హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడం వంటి అంశాలపై అప్పటినుంచి సవాళ్లు తలెత్తుతున్నాయి. -
గ్రోక్లో వస్త్రాపహరణం.. మస్క్ కీలక వ్యాఖ్యలు
గ్రోక్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్‌పై కొత్త నియమాలపై ప్రముఖ బిలీయనీర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వివరణతో మరింత వివాదం రాజుకుంది. నిజమైన మనుషుల ఫొటోలను అశ్లీలంగా ఎడిట్లు చేయకుండా నిషేధం విధించినప్పటికీ.. వేర్వేరు ప్రాంప్ట్స్‌తో ఆ తరహా ఫొటోలు జనరేట్ చేస్తున్నారు కొందరు. అయితే.. దానిని అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చన్న రీతిలో ఆయన మాట్లాడారు. రియల్ వ్యక్తులపై అనుమతి లేకుండా రూపొందించిన సెక్సువల్ డీప్‌ఫేక్‌లు తీవ్ర విమర్శలకు గురైన నేపథ్యంలో ఎక్స్ గ్రోక్ చర్యలు తీసుకుంది. దాని వల్ల గ్రోక్ ద్వారా నిజమైన వ్యక్తులను బికినీ లేదంటే ఇతర సెక్సువలైజ్డ్ దుస్తుల్లో చూపించే ఎడిట్స్ చేయడం కుదరదు. అయితే, AI ఆధారిత కల్పిత పాత్రలు లేదంటే ఊహాజనిత వ్యక్తులపై ఇలాంటి కంటెంట్ సృష్టించడం మాత్రం ఇంకా అనుమతించబడుతోంది.ఈ నిర్ణయంపై ఎలాన్ మస్క్ స్వయంగా స్పందించారు. ‘‘అమెరికాలోని “de facto standard” ప్రకారం.. NSFW (Not Safe For Work) మోడ్ ఆన్ చేసినప్పుడు గ్రోక్ ఊహాజనిత పెద్దవారి పాత్రలపై R-rated సినిమాల్లో కనిపించే స్థాయి వరకు ఎడిట్స్ అనుమతించాలి. అయితే, నిజమైన వ్యక్తులపై మాత్రం ఇది వర్తించదు అని ఉద్ఘాటించారు. అయితే.. ఈ మార్పులు వచ్చినప్పటికీ ఇంకా గ్రోక్ ద్వారా సెక్సువలైజ్డ్ ఇమేజ్‌లు సృష్టించడం సాధ్యమవుతోందని The Verge లాంటి పత్రికలు కథనాలు ఇస్తున్నాయి. “put her in a bikini” లేదంటే “remove her clothes” వంటి డైరెక్ట్ ప్రాంప్ట్స్ పని చేయకపోయినా.. ప్రత్యామ్నాయ అశ్లీల ప్రాంప్ట్‌లు కొన్ని పనిచేస్తున్నాయి. దీంతో, విధానం కఠినంగా ఉన్నప్పటికీ, అమలు మాత్రం లేదని ఆ కథనం పేర్కొంది. వీటికి తోడు.. గ్రోక్ ద్వారా అదనంగా వయసు ధృవీకరణ పాప్అప్ ఉన్నప్పటికీ.. కేవలం పుట్టిన సంవత్సరం ఎంచుకోవడం ద్వారా దాన్ని తప్పించుకోవచ్చు. ఎటువంటి ఆధారాలు చూపాల్సిన అవసరం లేకపోవడం వల్ల 18 ఏళ్ల లోపు వినియోగదారులు కూడా సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. అదే సమయంలో పురుషుడి సెల్ఫీని సెక్సువలైజ్డ్ ఇమేజ్‌గా మార్చిన సందర్భం కూడా రిపోర్ట్ అయింది. అయితే.. ఈ లోపాలను కూడా ఎక్స్,గ్రోక్ సమర్థించుకుంటున్నాయి. వినియోగదారుల ప్రాంప్ట్స్ విధానం తప్పుగా ఉపయోగించడం, హ్యాకింగ్ తరహా మార్పుల కారణంగానే ఈ లోపాలు వస్తున్నాయని చెబుతోంది. దీంతో ఈ సమర్థనపై కరెక్ట్ కాదు బాస్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్టార్‌లింక్ సేవలు ఫ్రీ.. మస్క్ కీలక ప్రకటన
అమెరికా, వెనెజులాకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ 'ఎలాన్ మస్క్' కీలక ప్రకటన చేశారు. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వెనిజులా ప్రజలకు ఉచితంగానే అందిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'స్టార్‌లింక్ ఫిబ్రవరి 3 వరకు వెనెజులా ప్రజలకు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది, ఇది నిరంతర కనెక్టివిటీని నిర్ధారిస్తుంది' అని స్టార్‌లింక్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించగా.. మస్క్ 'వెనెజులా ప్రజలకు మద్దతుగా' అని పేర్కొన్నారు.In support of the people of Venezuela 🇻🇪 https://t.co/JKxOFWsikP— Elon Musk (@elonmusk) January 4, 2026వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేయడంతో.. అమెరికా సైన్యం మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌ను ఎత్తుకొచ్చింది. ఈ పరిణామం తరువాత మస్క్ ఫ్రీ స్టార్‌లింక్ సర్వీస్ అందిస్తున్నట్లు చేసిన చర్చనీయాంశంగా మారింది.వెనెజులా దేశంలో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు కనెక్టివిటీని పెంచేందుకు మస్క్ స్టార్‌లింక్ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు, మారుమూల గ్రామాల్లో మొబైల్ టవర్లు పనిచేయనప్పుడు స్టార్‌లింక్ సేవలను ఉపయోగించుకోవచ్చు.ఇదీ చదవండి: 70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ! -
ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫుల్‌స్టాక్ డెవలపర్ రేంజ్‌కి..!
ఏ చిన్న ఉద్యోగం చేసినా..అక్కడే ఉండిపోకూడదు..దినదినాభివృద్ధి చెందాలన్నా ఆర్యోక్తిని బలంగా నమ్మాడు ఈ వ్యక్తి. శ్రమతో కూడిన ఉద్యోగం చేస్తూ..కూడా మంచి ఉన్నతోద్యోగిగా మారాలన్న ఆశయాన్ని బలంగా ఏర్పరుచకున్నాడు. ఆర్థిక పరిస్థితి చదువు కొనసాగనివ్వకపోయినా..తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాడు. అనుకున్నది సాధించి..పరిమితులు, ఆర్థిక వనరులు అనుకూలంగా లేకపోయినా..ఉవ్వెత్తిన ఎగిసిపడే కెరటంలా అనితర సాధ్యమైన లక్ష్యాన్ని చేధించగలమని నిరూపించి.. స్ఫూర్తిగా నిలిచాడు. అతడు పూణేకు చెందిన యువకుడు. అతడి కథ నెట్టింట వైరల్‌గా మారండంతో అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అతడు యూఎస్ ఆధారిత కూరగాయల ప్రాసెసింగ్ ఫ్యాకర్టీలో రోజుకి పదిగంటల షిప్ట్‌లో పనిచేస్తుండేవాడు. నిజానికి ఈ ఉద్యోగం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమతో కూడిన ఉద్యోగం. అతనికి కోడింగ్‌పై ఎలాంటి ముందస్తు నేపథ్యంగానీ, అవగాహన గానీ లేదు. కానీ స్నేహితుడు చెప్పిన ఎలోనమస్క్ సూచన అతడిని ఎంతగానే ప్రేరేపించింది. ఆ సూచననే కార్యరూపంలోకి తీసుకొచ్చేలా..ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాన్ మస్క్ అన్నట్లుగా ప్రతీది ఇంటర్నెట్లో ఉచితంగా లభిస్తుంది కాబట్టి అదే మీ అభ్యున్నతికి అద్భుతమైన వనరు అన్న మాటలు తూచతప్పకుండా ఫాలో అయ్యాడు అతడు. డబ్బు ఆదా చేసుకుని మరి తల్లిదండ్రుల మద్దతుతో ఓ ల్యాప్‌టాప్ కొనుకున్నాడు. దాని సాయంతో ఆన్లైన్ వనరులను ఉపయోగించుకుని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ను అధ్యయనం చేశాడు. ఖరీదైన కోర్సులు లేకుండా డాక్యుమెంటేషన్ చదవడం ప్రారంభించాడు. అలా ప్రాజెక్టులు నిర్మించడం, ఆ క్రమంలో జరిగే తప్పుల నుంచి నేర్చుకోవడం వంటివి చేస్తున్నాడు. జస్ట్ 18 నెలల్లో తనను తాను ఫుల్‌స్టాక్ డెవలపర్‌గా తీర్చిదిద్దుకుని యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. నేర్చుకోవాలనే తప్పన, మంచి స్ధాయిలో ఉండాలన్న అభిలాష, ఆర్థిక వనరులు, పరిస్థితులు వెనక్కిలాగలేవు, ఆపలేవు అని నిరూపించాడు. From a factory worker to a full-stack developer in 1.5 years of grind.I’m not saying this to flex.I’m saying this because I didn’t believe it was possible either.1.5 years ago, I was working in a vegetables factory.10 hours a day. Packing. Picking. Standing.Physically… pic.twitter.com/pn30AaJ8LY— Sambhav.apk▲ (@Coding_Sage) January 2, 2026 ఫుల్-స్టాక్ డెవలపర్ అంటే వెబ్సైట్ లేదా అప్లికేషన్ ముందు భాగం (యూజర్ చూసేది), వెనుక భాగం (డేటాబేస్లు, సర్వర్లు) రెండింటినీ నిర్మించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. వీరికి HTML, CSS, JavaScript (ఫ్రంట్-ఎండ్ కోసం), Python, Java, Node.js వంటి భాషలు, డేటాబేస్ మేనేజ్మెంట్ (బ్యాక్-ఎండ్ కోసం) వంటి విస్తృత నైపుణ్యాలు అవసరం. ఇది ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్‌ను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. (చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్ రీల్స్‌తో మొదటి సంపాదన..!) -
చైనా కంపెనీ దెబ్బకు.. వెనుకబడ్డ మస్క్ టెస్లా!
అమ్మకాల్లో అగ్రగామిగా కొనసాగిన అమెరికా కార్ల తయారీ దిగ్గజం టెస్లా డీలా పడింది. ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న పోటీ, సుంకాల ప్రభావం, మస్క్ రాజకీయ ఎత్తుగడలు అన్నీ.. టెస్లా అమ్మకాలను దెబ్బతీశాయి. దీంతో బీవైడీ కంపెనీ అమ్మకాల్లో.. టెస్లాను అధిగమించి మొదటి స్థానం కైవసం చేసుకుంది.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ.. 2025 చివరి మూడు నెలల్లో 4,18,227 డెలివరీలను పూర్తి చేసింది. దీంతో ఏడాది మొత్తం విక్రయాలు 1.64 మిలియన్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు 2024తో పోలిస్తే ఎనిమిది శాతం కంటే ఎక్కువ తగ్గుదలను సూచిస్తుంది. ఇదే సమయంలో బీవైడీ కంపెనీ.. గత సంవత్సరం 2.26 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి ముందువరుసలో నిలిచింది.టెస్లా అమ్మకాలు తగ్గడానికి కారణం2024లో మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత ఫెడరల్ కార్మికులను విస్తృతంగా తొలగించడం వెనుక వివాదాస్పద "గవర్నమెంట్ ఎఫీషియన్సీ" ప్యానెల్ (DOGE)కు నాయకత్వం వహించడం కూడా భిన్నాభిప్రాయాలకు దారితీసింది. ఆ తరువాత చాలామంది పెద్ద ఎత్తున టెస్లా సౌకర్యాల వద్ద నిరసనలు తెలిపారు. ఇది కంపెనీ కార్ల అమ్మకాలపై గణనీయమైన ప్రభావం చూపింది.ధరలుమరో ప్రధానమైన కారణం ఏమిటంటే.. 'ధరలు'. బీవైడీ కంపెనీ చాలావరకు అఫర్డబుల్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు, ప్లగ్ఇన్ హైబ్రిడ్ వాహనాలు ఉన్నాయి. అయితే టెస్లా కంపెనీ మాత్రం.. ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అంటే వీటి ధరలు చాలా ఎక్కువన్నమాట. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల మధ్యతరగతి కొనుగోలుదారులు.. టెస్లా కార్లకు ప్రత్యామ్నాయంగా బీవైడీ కార్లను కొనుగోలు చేస్తున్నారు.చైనా ఆటోమొబైల్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో బీవైడీ కంపెనీ అక్కడ అతిపెద్ద మార్కెట్ షేర్ కలిగి ఉంది. టెస్లా కంపెనీకి ఈ విషయంలో అంత పెద్ద వాటా లేదని తెలుస్తోంది. దీనివల్ల అక్కడ కూడా అమ్మకాలు తక్కువ. అమెరికాలో కూడా టెస్లా అమ్మకాలు మందగించాయి. యూరప్‌లో టెస్లాకి కొన్ని మార్కెటింగ్/పాలిసీ సమస్యలు ఎదురయ్యాయి.బీవైడీ విస్తరణ2003లో ప్రారంభమైన టెస్లా కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, అమ్మకాల్లో ముందువరుసలో కొనసాగుతూ వచ్చింది. అయితే దీనికి చైనా వాహన తయారీ సంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) సంస్థ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. బీవైడీ కంపెనీ చైనా మార్కెట్లో మాత్రమే కాకుండా.. యూరోప్, ఆసియా, లాటిన్ అమెరికా వంటి మార్కెట్లలో కూడా తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయంలో టెస్లా చాలా వెనుకబడి ఉంది. -
అసభ్య కంటెంట్‌ను తక్షణమే తొలగించాలి
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ సారథ్యంలోని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో మహిళల అశ్లీల చిత్రాలు ప్రచురితమవ్వడంపై కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చట్ట వ్యతిరేక, అసభ్యకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఎక్స్‌ను ఆదేశించింది. ముఖ్యంగా ఏఐ యాప్ గ్రోక్తో ఇలాంటి కంటెంట్ జనరేట్ చేయడం, ప్రచురించడం వెంటనే ఆపేయడంతోపాటు తీసివేయాల్సిందేనంది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. భారత్‌లో ఎక్స్ ఆపరేషన్స్ భాధ్యతలు చూసే చీఫ్ కంప్లయెన్స్ అధికారికి శుక్రవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఈ మేరకు నోటీసు పంపింది. అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించడానికి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించడానికి 72 గంటల గడువిస్తున్నట్లు పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2020, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు– 2021లోని నిబంధనలను పాటించడం లేదని తమ పరిశీలనలో తేలిందని అందులో పేర్కొంది. ‘చట్టాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికే రూపొందించిన, ప్రచురించిన మొత్తం కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్‌ను ఆదేశిస్తున్నాం. అదేవిధంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారాలను ధ్వంసం చేయరాదని ఈ నెల 2వ తేదీనాటి ఉత్తర్వులో పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ఎలాంటి నోటీసు లేకుండానే ఎక్స్పైన, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించని పక్షంలో లీగల్ ఇమ్యూనిటీ సైతం రద్దవుతుందని పేర్కొంది. యూజర్లు చేసే తప్పులకు కూడా నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎక్స్‌కు తెలిపింది.సోషల్ మీడియాదే బాధ్యతసామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌కు సంబంధిత వేదికలే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇటువంటి కంటెంట్ ప్రసారమయ్యే సామాజిక వేదికలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఇటీవల సిఫారసు చేసిందన్నారు. ఏఐ యాప్ గ్రోక్ అసభ్యకర దృశ్యాలను జనరేట్ చేస్తోందంటూ వస్తున్న వార్తలపై ఆయన ఈమేరకు స్పందించారు. -
కొత్త మార్క్‌కు సిల్వర్!: కియోసాకి ట్వీట్
వెండి ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే సిల్వర్ 80 డాలర్లను దాటుతుందని చెప్పే ఈయన.. తాజాగా కొత్త మార్క్ చేరుతుందని పేర్కొన్నారు.బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని కియోసాకి గతంలో కూడా చాలాసార్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిల్వర్ 200 డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు చూస్తుంటే.. కియోసాకి మాటలు నిజమవుతాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.SILVER BREAKS $ 80.00$200 NEXt ?— Robert Kiyosaki (@theRealKiyosaki) December 28, 2025భారతదేశంలో వెండి రేటుహైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి రేటు రూ. 2.81 లక్షల వద్ద ఉంది. ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ (కేజీ రూ.2.58 లక్షలు).. కొన్ని రోజులుగా ధరలు మాత్రం ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాత్రం గరిష్టంగా రూ. 4000 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి రేటు పెరుగుదలపై మస్క్ ట్వీట్వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025 -
భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కేజీ సిల్వర్ రేటు భారతదేశంలో రూ.2.74 లక్షలకు చేరింది. ఈ ధరలు వచ్చే సంక్రాంతి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు.చైనా కొత్త ఎగుమతి నియమాల గడువు దగ్గర పడుతున్న కొద్దీ వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!వెండిని ఆభరణాలుగా కంటే.. అనేక పరిశ్రమలలో (సౌర ఫలకాలు, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, 5జీ మౌలిక సదుపాయాలు) పారిశ్రామిక ప్రక్రియలకు ఉపయోగిస్తారు. వెండి అనేది.. భూమిపై అత్యంత ఉత్తమ విద్యుత్ వాహక లోహం. కాబట్టి దీనిని అనేక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే.. సిల్వర్ ధరలు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. -
భారత సంతతి వ్యక్తి మృతి.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే
ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి.. కెనడాలో మరణించడంపై టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో స్పందించారు. కెనడా ప్రభుత్వంపై తన ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. భారత సంతతికి చెందిన ప్రశాంత్ కుమార్(44) కెనడాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఈ నెల 22వ తేదీన ప్రశాంత్ కుమార్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఎడ్మంటన్‌లోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు.మధ్యాహ్నం 12.20 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు చికిత్స అందించకుండా వెయింట్ చేయించారు. ఛాతీనొప్పి ఎక్కువగా ఉందని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీపీ 210కి పెరిగినా కూడా ఆయకు టైలెనాల్ మాత్రమే ఇచ్చారు. వెయిటింగ్ హాల్లో 8 గంటలు ఉంచిన తర్వాత చికిత్స ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రశాంత్ కుమార్ కుప్పకూలి మృతిచెందారు.కెనడా ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎలాన్ మాస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే, అది DMV(డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్) లాగే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. కెనడా ఆరోగ్య వ్యవస్థను US మోటారు వాహన విభాగంతో పోల్చుతూ మస్క్ విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. కెనడా ప్రభుత్వానికి లేఖ రాసింది. అతడి మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. When the government does medical care, it is about as good as the DMV https://t.co/kRdlL3idyF— Elon Musk (@elonmusk) December 26, 2025 -
2025: ట్రంప్ నామ సంవత్సరం
కాలం నిజంగానే మాయల మరాఠీ. రెప్పపాటే అనిపిస్తుంది గానీ చూస్తుండగానే శరవేగంగా సాగిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. మంచీ చెడుల మిశ్రమ అనుభూతులు పంచి 2025 త్వరలో వీడ్కోలు చెప్పనుంది. ఈ సంవత్సరంలో ఎంతోమంది ప్రముఖులు మెరుపులు మెరిపించారు. కొందరు మరకలు అంటించుకుని తల దించుకున్నారు. ఇంకొందరు అనన్య సామాన్యమైన సాహసాలు, రికార్డులతో ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. అలా 2025లో వార్తల్లో వ్యక్తులుగా నిలిచి అందరి నోళ్లలోనూ నానిన టాప్ 10 ప్రముఖుల గురించి ఒకసారి చూద్దాం...తంపులమారి (డొనాల్డ్ ట్రంప్) నిస్సందేహంగా 2025 ట్రంప్ నామ సంవత్సరమే అని చెప్పాలి. మీడియా వ్యతిరేకత, దు్రష్పచారాల మోత తదితరాలను సమర్థంగా కాచుకుంటూ 78 ఏళ్ల లేటు వయసులో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఔరా అనిపించారు. కానీ ఈ ఏడాది మొదట్లో పీఠమెక్కింది మొదలు రోజుకో ఆకస్మిక నిర్ణయంతో దేశాల గుండెల్లో అక్షరాలా రైళ్లు పరుగెత్తించారు. ముఖ్యంగా ఆయన ఎడాపెడా బాదిన టారిఫ్‌ల ధాటికి భారత్ తో సహా చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరే అయ్యాయి. అయితే వాటిని అంతే వేగంగా తగ్గించడం, రద్దు చేయడం వంటి చర్యలతో ట్రంప్ నవ్వులపాలు కూడా అయ్యారు. అమెరికాతో పరువుతో పాటు అగ్ర రాజ్య అధ్యక్ష పీఠం హుందాతనాన్నీ తన ప్రవర్తనతో పలుమార్లు పలుచన చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్ ఘర్షణలను తానే ఆపానని ఇప్పటికి కనీసం 75 సార్లకు పైగా ప్రకటించుకున్నారు. భారత్ నిర్ద్వంద్వంగా ఖండించినా, పాక్ కాళ్లబేరానికి వచ్చినందుకే కాల్పుల విరమణ జరిగిందని స్పష్టం చేసినా పట్టించుకోలేదు. ఈ విషయంలో సెంచరీ కొట్టడమే ట్రంప్ లక్ష్యం కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో జోకులు కూడా పేలాయి. రష్యా–ఉక్రెయిన్, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాలను కూడా చిటికెలో ఆపేస్తానంటూ బీరాలు పలికినా అవిప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గాజాను స్వా«దీనం చేసుకునేందుకు, వెనిజులాలోని చమురు నిల్వలను చెర పట్టేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయంగా కాక రేపుతున్నాయి. రెండో టర్ములో ఇంకా ఏడాదైనా పూర్తవకుండానే ఇన్ని చుక్కలు చూపిన తంపులమారి ట్రంపు 2026లో ఇంకెంత విశ్వరూపం చూపుతారో చూడాలి!నిప్పులు చిమ్మి... (ఎలాన్ మస్క్) ఈ ప్రపంచ కుబేరునికి 2025 అక్షరాలా ఒక పీడకలగా మిగిలిపోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ తో కుదిరిన దోస్తీ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది. దాంతో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకంటూ ట్రంప్ తనకు అప్పగించిన డోజ్ సారథ్యం కూడా అటకెక్కింది. చూస్తుండగానే ట్రంప్ తో మస్క్ విభేదాలు రచ్చకెక్కాయి. వారి రచ్చ నిత్యం వార్తల్లో నిలిచింది. దాంతో మస్క్ కంపెనీలు ఎక్స్, టెస్లా షేర్లు ఈ ఏడాదంతా భారీగా నేల చూపులే చూశాయి. కాకపోతే, ఏదో ఒక రూపంలో నిత్యం పతాక శీర్షికల్లో మాత్రం నిలవడం ఒక్కటే ఆయనకు ఊరట!నిరసన పతాక (మరియా కొరీనా మచాడో) వెనిజులా విపక్ష నేత. మదురో నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసిన మడమ తిప్పని పోరాటానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఆమెను వచ్చి వరించింది. దేశాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపే పోరాటంలో అవసరమైతే ప్రాణార్పణకు కూడా సిద్ధమంటూ కొన్నాళ్ల క్రితం ఆమె చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంది. ఆమెకు నోబెల్ బహుమానం నేపథ్యంలో వెనిజులాలో మానవ హక్కుల ఉల్లంఘన, మదురో నియంతృత్వం తదితరాలు మరోసారి చర్చల్లో నిలిచాయి. ట్రంప్ ను వెనక్కి నెట్టి మరీ ఆమె నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడం విశేషం. అయితే, ’వెనిజులా ప్రజాస్వామిక పోరాటానికి ఇస్తున్న నిరంతర మద్దతుకు’ గాను ఆమె తన పురస్కారాన్ని ట్రంప్ కు అంకితం చేయడం విశేషంగా నిలిచింది. మచాడో తరఫున ఆమె కూతురు ఇటీవలే నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు.కుట్రలకు బలి (షేక్ హసీనా)బంగ్లాదేశ్ లో తెర వెనక కుట్రలకు బలైన మరో నేతగా నిలిచిన మాజీ ప్రధాని. భారత్ తో నిత్యం సత్సంబంధాలు కొనసాగించడమే ఆమె పాలిట శాపమైంది. విద్యార్థులు, యువత మాటు మతోన్మాద, భారత వ్యతిరేక శక్తులు ఆజ్యం పోసిన అల్లర్లకు ప్రధాన లక్ష్యంగా మారారు. ప్రధాని పదవిని, దేశాన్ని వీడి భారత్ కు పారిపోయి వచ్చారు. అనంతరం పలు నేరాలపై అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష తో సహా పలు కఠిన శిక్షలు విధించాయి. ఆమె పార్టీ అవామీ లీగ్ గుర్తింపు కూడా రద్దయింది. 15 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన హసీనా ఇప్పుడు 78 ఏళ్ల వయసులో పొరుగు దేశంలో చివరి రోజులు గడపాల్సిన పరిస్థితిలో పడ్డారు. నారీ శక్తులు (వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి) నారీ శక్తికి ప్రతిరూపాలు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ లో మన సైన్యం సాగించిన విధ్వంసం తాలూకు విశేషాలను ఎప్పటికప్పుడు మీడియాకు వివరి స్తూ 3 రోజుల పాటు ప్రపంచమంతటి దృష్టినీ ఆకర్షించారు. పాక్ తప్పుడు ప్రచారాలను రుజువులతో సçహా ఎండగట్టారు. యుద్ధరంగంలోనే గాక మీడియా వార్ లో కూడా భారత్ ను తిరుగులేని స్థాయిలో నిలిపారు. దాంతో వారి పేర్లు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. అంతర్జాతీయ సైనిక కవాతులో భారత దళానికి సారథ్యం వహించిన తొలి మహిళా ఆఫీసర్ అన్న రికార్డు సోఫియాది. కాగా వైమానిక దళంలో ఉజ్వలమైన కెరీర్ తో దేశ మహిళలకు స్పూర్తినిచ్చారు వ్యోమిక.వ్యోమ వీరుడు (శుభాంశు శుక్లా) ఆక్సియం – 4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో కాలు పెట్టిన రెండో భారతీయుడు ఆయనే కావడం విశేషం. ఈ ఏడాది మన నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పేర్లలో చేరారు. వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు అంతరిక్ష యాత్ర దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆ రంగం పట్ల ఎనలేని ఆసక్తిని పెంచింది. జపాన్‌లో నారీ భేరి (సనాయే టకైచీ) ఈ అక్టోబర్ లో జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. రాజకీయ రంగంలో స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే సంప్రదాయం ప్రబలంగా ఉన్న జపాన్ లో ఇది నిజంగా అనూహ్యమే. అయితే టకైచీ కేబినెట్ మాత్రం పూర్తిగా పురుషులతోనే కిటకిటలాడిపోవడం విశేషం. దాంతో, స్త్రీ శక్తిపరంగా నిజమైన మార్పులను ఊహించిన వారంతా ఆశాభంగమే చెందారు.నూతన సారథి (పోప్ లియో 14) పోప్ ఫ్రాన్సిస్ మరణానంతరం సుదీర్ఘ ఎంపిక ప్రక్రియ అనంతరం వాటికన్ పగ్గాలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోమన్ కాథలిక్కులకు సారథిగా గత మే నెలలో కొలువుదీరారు. అమెరికా ఖండం నుంచి వచ్చిన తొట్ట తొలి పోప్ గా కొత్త చరిత్ర సృష్టించారు.అప‘హాస్యం’ (సమయ్ రైనా, రణ్ వీర్ అలహాబాదియ) హాస్యం కాస్తా శ్రుతి మించితే ఏమవుతుందో ఫేమస్ యూట్యూబర్ రణ్ వీర్, స్టాండప్ కమెడియన్ రైనా వివాదం నిరూపించింది. తల్లిదండ్రులు, పిల్లల గురించి లైంగికపరంగా అత్యంత అసభ్యమైన కామెంట్లు, దివ్యాంగుల గురించి చౌకబారు వ్యాఖ్యలతో ప్రసారమైన వీరి పాడ్ కాస్ట్ లు అందరి ఆగ్రహానికి గురయ్యాయి. చివరికి విషయం అంటున్న న్యాయస్థానం దాకా చేరింది. కోర్టు వాళ్లకు పదేపదే అక్షింతలు వేయాల్సి వచ్చింది. క్రియేటివ్ ఫ్రీడం పేరిట వెర్రితలలు వేసే పోకడలను భారత సమాజం హర్షించబోదని ఈ ఎపిసోడ్ మరోసారి చాటింది.కాసుల వర్షమే (టేలర్ స్విఫ్ట్) సూపర్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఈ ఏడాది అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆమె ’ఎరాస్’ అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సింగిల్ టూర్ గా కొత్త చరిత్ర సృష్టించింది. ఈ షోలో భాగంగా స్విఫ్ట్ ఏకంగా ఐదు ఖండాల్లో 149 షోలు చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దాంతో ’ఎరాస్’ షో దాదాపుగా 200 కోట్ల డాలర్ల కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టార్‌లింక్ శాటిలైట్లకు రష్యా ముప్పు
పారిస్: ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ కూటమిలోంచి కృత్రిమ ఉప గ్రహం ‘35956’ అదుపుతప్పి భూమి దిశగా కదులుతూ కొత్త ముప్పుమోసుకొస్తుంటే అంతకుమించి పెను ముప్పు రష్యా రూపంలో పొంచి ఉందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు ఆందోళనవ్యక్తంచేశాయి. అంతరిక్షంలో కక్షలో తిరిగే వందలాది కృత్రిమ ఉపగ్రహాలను పిట్టల్లా రాల్చేసే అధునాతన ఆయుధాన్ని తయారు చేయడంలో రష్యా తలమునకలైందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు నిఘా సమాచారంతో ది అసోసియేటెట్ ప్రెస్ వార్తాసంస్థ ఒక కథనాన్ని వెలువర్చింది.దాని పేరు జీరో ఎఫెక్ట్అంతరిక్షంలోని ఉపగ్రహాలపైకి అత్యంత సాంద్రతతో తయారుచేసిన సూక్ష్మ పెల్లెట్లను ప్రయోగించి వాటికి తీవ్ర నష్టం కలిగేలా చేయడమే రష్యా ఆయుధం అసలు లక్ష్యం. ఈ ఆయుధానికి ‘జీరో ఎఫెక్ట్’ అని పేరుపెట్టినట్లు తెలుస్తోంది. వందలాది పెల్లెట్లను ఒకేసారి ప్రయోగించడంతో వాటి ధాటికి ఒకేసారి పెద్ద సంఖ్యలో శాటిౖలైట్లును సర్వనాశనం అవుతాయి. ఇవి చిన్నచిన్న ముక్కలుగా శకలాలుగా చెల్లాచెదురుగా పడడంతో సమీప కక్ష్యల్లోని ఇతర ఉపగ్రహాలకు సైతం దెబ్బతింటాయి. దీంతో వినాశనం ఊహించనంత పెద్దదిగా ఉంటుంది. ఇంతటి పెనువినాశనం సృష్టించగల ఆయుధాన్ని రష్యా సృష్టించకుండా ఉంటుందని తాము భావించట్లేమని అమెరికాలోని ప్రభుత్వేతర ‘ సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్’లోని అంతరిక్ష భద్రతా నిపుణుడు విక్టోరియా సామ్సన్, కెనడా సైన్యంలోని అంతరిక్ష విభాగ బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ వ్యాఖ్యానించారు. జీరో ఎఫెక్ట్ ఆయుధ తయారీ మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ డొంకతిరుగుడు సమాధానం చెప్పారు. ‘‘ కక్షలో తిరగగలిగే సామర్థ్యమున్న ఆయుధాల ప్రయోగాలను శత్రుదేశాలు ఆపేలా ఐరాస చొరవచూపాలి. అయినా అణ్వస్త్ర సామర్థ్యమున్న అంతరిక్ష ఆయుధాలను మొహరించబోమని పుతిన్ గతంలోనే చెప్పారు’’ అని పెస్కోవ్ వ్యాఖ్యానించారు. తక్కువ ఎత్తులో తిరిగే స్టార్‌లింక్ ఉపగ్రహాలు రష్యా గగనతలంపై నిఘా పెట్టి ఉక్రెయిన్ దిశలో రష్యా సేనల జాడను గుర్తించి ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. దీంతో స్టార్‌లింక్ ఉపగ్రహాలు తమ సార్వభౌమత్వం, భద్రతకు ముప్పుగా వాటిల్లాయని వీటిని నాశనంచేయాలని రష్యా భావిస్తోందని పశ్చిమాసియా నిఘా వర్గాలు నిర్ధారించాయి.పొడవు మిల్లీమీటర్!‘‘హఠాత్తుగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ల వంటి వాటినే గుర్తించగలం. కేవలం మిల్లీమీటర్ పొడవుండే సూక్ష్మ పెల్లెట్లను భూతల, గగనతల నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. వీటితో ఉపగ్రహాలపై దాడి చేస్తే నష్టనివారణ అసాధ్యం. పెల్లెట్ల దెబ్బకు ఒక కక్షలోని ఉపగ్రహాలన్నీ నాశనంఅవుతాయి. అదీకాకుండా దాడి చేసింది రష్యానే అని నిరూపించడం కూడా చాలా కష్టం. మిల్లీమీటర్ పొడవు పెల్లెట్లతో ఉపగ్రహాలకు మరణశాసనం రాయొచ్చు. చైనా ఉదంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ. నవంబర్‌లో సూక్ష్మస్థాయి అంతరిక్ష శకలం తగిలి చైనా వ్యోమనౌక దెబ్బతింది. దాంతో చైనా సొంత అంతరిక్ష కేంద్రం నుంచి అది బయల్దేరలేక అక్కడే ఉండిపోయింది. దాంతో దాని ద్వారా భూమి మీదకు రావాల్సిన చైనా వ్యోమగాములు సైతం అక్కడే చిక్కుకుపోయారు’’ అని బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఉపగ్రహాల ఉపరితలాల్లో అధిక ప్రాంతాన్ని ఆక్రమించేవి సౌర ఫలకాలే. పెల్లెట్ల ఉరవడికి ఇవన్నీ బద్దలవుతాయి. అప్పుడు ఉపగ్రహం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని వాషింగ్టన్‌లోని ‘సెంటర్ ఫర్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో అంతరిక్ష భద్రత, ఆయుధాల నిపుణుడు క్లేటన్ స్వాప్ చెప్పారు. స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూమి నుంచి ఆకాశంలో 500 కిలోమీటర్ల ఎత్తులో సంచరిస్తున్నాయి. వీటి కింది కక్షల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా వారి తియాంగ్ స్పేస్ స్టేషన్ తిరుగుతున్నాయి. రష్యా దాడి చేస్తే ఉపగ్రహాలు శకలాలుగా ఛిద్రమై అవి ఐఎస్ఎస్, తియాంగ్ స్పేస్స్టేషన్లనూ నాశనంచేసే ఆస్కారముంది. -
పేరుకే ‘మిల్లీమీటర్’.. ఎలాన్ మస్క్‌ను టార్గెట్ చేస్తున్న పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొత్త మలుపు తిరగనున్నట్లు నాటో ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌కు మద్దతు అందిస్తున్న ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్లను నిర్వీర్యం చేసేందుకు రష్యా మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే పెల్లెట్లను తయారు చేస్తోందని, రానున్న రోజుల్లో ఈ శాటిలైట్లను కూల్చే ప్రయత్నం చేయనున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.నాటోకు చెందిన రెండు దేశాల గూఢచారి సంస్థలు రష్యా కొత్త యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ ఆయుధం ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ‘జోన్ ఎఫెక్ట్’గా పేర్కొంటున్న ఈ విధానం కక్ష్యలో మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్న లోహపు కణాలను భారీగా విడుదల చేసి, ఉపగ్రహాలను ఢీకొట్టేలా చేస్తుంది. దీంతో ఒకేసారి అనేక ఉపగ్రహాలు నిర్వీర్యం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా, చైనా వంటి దేశాల ఉపగ్రహాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.ప్రస్తుతం లో-ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న ఉపగ్రహాలలో స్టార్‌లింక్ వాటా చాలా గణనీయమైనది. ఉక్రెయిన్ యుద్ధంలో కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలు, సైనిక ఆపరేషన్లకు ఇవి కీలకంగా ఉపయోగపడుతున్నాయి. స్టార్‌లింక్‌ను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరిగితే అంతరిక్షంలో గందరగోళం పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ వ్యవస్థలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా. ఈ కారణంగా రష్యా దీన్ని ప్రయోగించే అవకాశాలు తక్కువగా ఉండొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.రష్యా అభివృద్ధి చేస్తోందని అనుమానిస్తున్న ఈ యాంటీ శాటిలైట్ విధానం అంతరిక్ష భద్రతకు పెద్ద సవాలుగా మారవచ్చని, స్టార్‌లింక్‌పై దృష్టి పెట్టడం ద్వారా పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని తగ్గించాలన్న ఉద్దేశం ఉన్నట్టుగా నాటో ఇంటెలిజెన్స్ సూచిస్తోంది. -
భారీగా పెరిగిన సంపద: మస్క్ నెట్‌వర్త్ ఎంతంటే?
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 600 బిలియన్ డాలర్ల (రూ. 54.56 లక్షల కోట్లు) నికర విలువ కలిగిన మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. స్పేస్ఎక్స్ 800 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో పబ్లిక్‌గా (ఐపీఓ) వచ్చే అవకాశం ఉందనే వార్తలు వెలువడిన వెంటనే.. మస్క్ నికర విలువ ఒక రోజులో 168 బిలియన్ డాలర్లు పెరిగింది.స్పేస్ఎక్స్ సీఈఓ ఇప్పటికే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 500 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటారు. కాగా ఇప్పుడు ఈయన సంపద 600 బిలియన్ డాలర్లకు చేరింది. స్పేస్ఎక్స్లో మస్క్ 42 శాతం వాటాను కలిగి ఉండటం వల్ల.. సంపద ఒక రోజులోనే భారీగా పెరిగిపోయింది. ఇది అనేక దేశాల GDP కంటే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా.. మస్క్ తన స్థానాన్ని మరోమారు సుస్థిరం చేసుకున్నారు.స్పేస్ఎక్స్ మాత్రమే కాదు, ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాలో దాదాపు 12% వాటాను కలిగి ఉన్నారు. ఇది కూడా ఈయన సంపదను పెంచడంలో దోహదపడింది. టెస్లాలో మస్క్ వాటా ఇప్పుడు దాదాపు 197 బిలియన్ డాలర్లుగా ఉంది.మార్చి 2020లో, టెస్లా సీఈఓ సంపద 24.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తరువాత జనవరి 2021లో దాదాపు 190 బిలియన్ డాలర్ల నికర విలువతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అయితే.. మస్క్ సంపద పెరుగుదల అక్కడితో ఆగలేదు, ఎందుకంటే ఆయన నికర విలువ డిసెంబర్ 2024లో 400 బిలియన్ డాలర్లకు, అక్టోబర్‌లో 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు తాజాగా 600 బిలియన్ డాలర్ల మార్క్ దాటింది. -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్‌మస్క్‌పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్‌గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్‌కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్‌కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్‌జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు. కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్‌కాస్టర్‌తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025 (చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు) -
ఎలాన్ మస్క్ సమర్పించు... మెమొరీ ట్రిక్స్
‘అదేమిటో... చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాను’ అనుకునేవారిలో మీరు కూడా ఉన్నారా? అయితే మీరు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అనుసరించే మెమోరీ ట్రిక్స్ ఫాలో కావాల్సిందే. ‘ట్రిక్స్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్’ అంటున్నాడు మస్క్. వాటిలో కొన్ని...బ్రెయిన్ అనేది కొన్నిసార్లు అనవసర సమాచారంతో, అనవసర ఆలోచనలతో చెత్తబుట్టగా మారిపోతుంది. దీంతో అవసరమైన విషయాలకు చోటు ఉండదు. అందుకే అనవసర విషయాలను ఎప్పటికప్పుడూ డిలీట్ చేసి మంచి విషయాల కోసం స్పేస్ ఏర్పాటు చేసుకోవాలి.ముఖ్యమైన విషయాలతో ‘మెమోరీ ట్రీ’ నిర్మించాలి. ఈ చెట్టుకు కొమ్మలుగా కొత్త విషయాలను అనుసంధానిస్తూ పోవాలి. ఎవరికివారు పర్సనల్ కోడింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. విషయాలను వేగంగా గుర్తు తెచ్చుకోవడానికి సంఖ్యలు, చిహ్నాలు, చిత్రాలు.. మొదలైన వాటిని ఉపయోగించాలి. ‘ఈ ట్రిగ్గర్లు మెదడులోని సంక్లిష్ట సమాచారాన్ని త్వరగా, తక్కువ శ్రమతో తిరిగి పోందడానికి ఉపయోగపడతాయి’ అంటాడు మస్క్.విషయాలు, పేర్లను గుర్తు తెచ్చుకోవడంలో ‘మీనింగ్‌ఫుల్ కనెక్షన్’ ముఖ్యం అంటాడు ఎలాన్ మస్క్. ఉదాహరణకు ఒక వ్యక్తి పేరును గుర్తు తెచ్చుకోవడానికి వారి హాబీ, ఫన్నీస్టోరీ, వారి ముఖానికి సంబంధించి యూనిక్ ఫీచర్, ఆ వ్యక్తి నవ్వు, మాట్లాడే పద్ధతి... మొదలైన వాటితో పేరును గుర్తు పెట్టుకోవాలి.మీనింగ్‌ఫుల్ కనెక్షన్ అనేది ఎందుకు ముఖ్యమైనది అంటే... మన మెదడు ర్యాండమ్ ఫ్యాక్ట్స్ కంటే స్టోరీలను, ఎమోషన్లనూ ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది.‘అసోసియేట్ ఇన్ఫర్మేషన్’ టెక్నిక్ గురించి నొక్కిచెబుతున్నాడు మస్క్. అసాధారణ దృశ్యాలతో, సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడమే... అసోసియేట్ ఇన్ఫర్మేషన్. ఉదాహరణకు... ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు అరటిపండ్లు కొనాలనుకున్నారు. ఇందుకోసం ఒక అసాధారణ దృశ్యాన్ని మదిలో ఆవిష్కరించుకోవాలి. ఏనుగంత సైజులో ఉన్న అరటిపండు సన్‌గ్లాసెస్ ధరించి మీ కిచెన్‌లో డ్యాన్స్ చేస్తుంటుంది!‘రిపీట్ అండ్ రివ్యూ’ మెథడ్‌లో భాగంగా గతంలోకి వెళ్లి మనకు నచ్చిన విషయాలను గుర్తు తెచ్చుకోవాలి. ఇలా తరచుగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది. -
అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్‌తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’(Project Suncatcher)గా పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్‌లో మూన్ షాట్లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్‌లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.2027లో తొలి పరీక్షలుఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్‌లను శాటిలైట్‌ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్‌ఫాంమ్‌లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.Interesting https://t.co/yuTy9Yr3xw— Elon Musk (@elonmusk) December 8, 2025ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది? -
ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!
-
భారత్‌లో స్టార్‌లింక్ ధరలు ఖరారు
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ఎక్స్ భారతదేశంలో ప్రారంభించనున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల ధరలను అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడానికి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శాటిలైట్ ద్వారా నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించే ఈ ప్రీమియం సేవను భారతదేశ మార్కెట్లో త్వరలో మొదలు పెట్టనున్నారు.ధరల వివరాలునెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు: రూ.8,600. ఇది ప్రతి నెల సేవలను అందింస్తున్నందుకు వినియోగదారులు చెల్లించే రుసుం.వన్-టైమ్ హార్డ్‌వేర్ కిట్ ఖర్చు: రూ.34,000. ఇది తొలిసారిగా చెల్లించాల్సిన పరికరాల ధర.హార్డ్‌వేర్ కిట్‌లో ఏముంటాయి?రూ.34,000 వన్-టైమ్ ఖర్చుతో వచ్చే ఈ కిట్‌లో శాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. దీనిని ఇన్స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు స్టార్‌లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సముదాయానికి కనెక్ట్ అవుతారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.దీని లక్ష్యం..భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఫైబర్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లు బలహీనంగా ఉన్న చోట ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం ద్వారా డిజిటల్ సర్వీసులు మెరుగుపరవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న వ్యాపారాలు డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించవచ్చు. వెనుకబడిన కమ్యూనిటీలకు ఆన్లైన్ విద్యను తీసుకురావడం ద్వారా విద్యా అవకాశాలను మెరుగవుతాయి.మార్కెట్ సవాళ్లుసాధారణంగా భారతదేశంలో సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు నెలకు రూ.500 నుంచి రూ.1,500 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్ నెలకు రూ.8,600 ధర వసూలు చేయడంతో ఎంతమేరకు సబ్స్క్రైబర్లు వస్తారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా? -
'ఎక్స్'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్‌కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.The EU should be abolished and sovereignty returned to individual countries, so that governments can better represent their people— Elon Musk (@elonmusk) December 6, 2025ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టండిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి. -
మేధే మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ఎ క్స్‌లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీ యులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నా యన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవు తుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్‌లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తేడిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియో గేమ్‌లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!చదవండి : ఇంటిహెల్పర్‌కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నటివితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్‌కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎడిటోరియల్ టీమ్వ్యూ పాయింట్: పాడ్‌కాస్ట్: పీపుల్ బై డబ్లు్య.టి.ఎఫ్.అతిథి: ఎలాన్ మస్క్, పారిశ్రామికవేత్తహోస్ట్: నిఖిల్ కామత్,‘జెరోధా’కో–ఫౌండర్ -
'మేధే' మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ ఎక్స్‌లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీయులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నాయన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవుతుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్‌లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.డిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియో గేమ్‌లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!వితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్‌కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. - ఎడిటోరియల్ టీమ్ -
సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి ‘గాడ్‌ఫాదర్’గా పిలుచుకునే ఏఐ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఏఐ వేగవంతమైన పురోగతి కారణంగా లక్షల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్తో కలిసి జార్జ్‌టౌన్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో హింటన్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఏఐ వల్ల భారీ నిరుద్యోగం రాబోతోందన్న విషయం చాలా మందికి స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, చిప్స్‌పై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.2023లో గూగుల్‌ను వీడిన హింటన్ ఏఐ ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న ఆశావాదాన్ని ఖండించారు. ‘కొత్త ఉద్యోగాలు వస్తాయి కానీ, దీని పరిణామాల వల్ల కోల్పోయే ఉద్యోగాల సంఖ్యను అవి ఎప్పటికీ భర్తీ చేయలేవు’ అని స్పష్టం చేశారు.టెక్ దిగ్గజాల అభిప్రాయాలుఏఐ ఉద్యోగాలపై చూసే ప్రభావం గురించి టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల ‘ఏఐ సామూహిక తొలగింపులకు దారితీయదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ త్వరలోనే చాలా అంశాల్లో మానవుల అవసరం లేకుండా పోతుందన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘మరో 20 సంవత్సరాల్లో చాలా మందికి పని చేయవలసిన అవసరమే ఉండదు’ అని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి.. -
20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేశారు. ఏఐ, రోబోటిక్స్ కారణంగా రాబోయే 20 ఏళ్లలో మానవులకు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు. పని కేవలం ఒక ‘ఆప్షనల్ హాబీ’గా మాత్రమే మిగులుతుందని అంచనా వేశారు.ఏఐ వేగాన్ని సూపర్సోనిక్ సునామీతో పోల్చారు. దీన్ని మానవ చరిత్రలో అతి తీవ్రమైన సాంకేతిక మార్పుగా అభివర్ణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. ఏఐ మానవ నైపుణ్యాలను అనవసరం చేస్తుందన్న తన వాదనకు మద్దతుగా మస్క్ తన సొంత పిల్లల ఉదాహరణను ఇచ్చారు. ‘నా పిల్లలు టెక్నికల్‌గా నైపుణ్యం కలిగి ఉన్నారు. ఏఐ వచ్చే రెండు దశాబ్దాల్లో వారి నైపుణ్యాలను పూర్తిగా అనవసరం చేస్తుందని వారే ఒప్పుకుంటున్నారు’ అని మస్క్ చెప్పారు.అయినప్పటికీ వారు కాలేజీ ఎడ్యుకేషన్‌ను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీనికి సామాజిక అవసరాలే కారణమన్నారు. తమ వయసు వారితో కలిసి ఉండటం, వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్‌ను సంపాదించేందుకే అలా కాలేజీకి వెళ్తున్నారని చెప్పారు. కాబట్టి కళాశాలకు వెళ్తే వీలైనంత విస్తృతంగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
ఐదేళ్లలో అణుయుద్ధం
వాషింగ్టన్: వివాదాస్పద, ముక్కుసూటి వ్యాఖ్యలకు, గమ్మత్తైన జోస్యాలకు పెట్టింది పేరైన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి నోరు విప్పారు. రానున్న ఐదు నుంచి పదేళ్లలో ప్రపంచం అతి పెద్ద యుద్ధాన్ని చవిచూడటం ఖాయమని జోస్యం చెప్పారు. అది దాదాపుగా అణుయుద్ధమే అవుతుందని కూడా అభిప్రాయపడ్డారు. ‘‘బహుశా అది అతి త్వరలో జరగనుంది. 2030 నాటికే, లేదా అంతకుముందే మొదలైనా ఆశ్చర్యం లేదు. అందుకు ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది’’అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అది ఎలా మొదలవుతుందన్న దానిపై మాత్రం మస్క్ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.అణు తటస్థత తదితరాలపై ఎక్స్‌లో జరిగిన సంభాషణలో ఒక యూజర్ ప్రశ్నకు బదులిస్తూ మస్క్ ఈ మేరకు భవిష్యవాణి వినిపించారు. అణు భయంతో భారీ యుద్ధాలకు దిగేందుకు దేశాలన్నీ భయపడుతున్నాయని సదరు యూజర్ చేసిన వ్యాఖ్యలతో మస్క్ ఏకీభవించలేదు. ‘‘యుద్ధం తప్పదు గాక తప్పదు. ఐదు, లేదంటే మహా అయితే పదేళ్లలోపే ప్రపంచం అతి పెద్ద యుద్ధాన్ని చవిచూడటం ఖాయం’’అని చెప్పుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడంలో మస్క్ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఆయన ఎన్నికల ప్రచారానికి ఇతోధికంగా ఆర్థిక సాయం చేయడమే గాక ఎక్స్‌ను కూడా అందుకు విరివిగా వాడుకున్నారు.అందుకు ప్రతిగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)లో భాగంగా తెరపైకి తెచ్చిన డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ) విభాగానికి మస్‌్కను సారథిగా గత జనవరిలో ట్రంప్ నియమించారు. తర్వాత కొద్ది నెలల పాటు మస్క్ అపరిమిత అధికారాలు చెలాయించడమే గాక ప్రభుత్వానికి చెందిన అత్యంత సున్నితమైన, అతి రహస్యమైన డేటాను కూడా చేజిక్కించుకున్నారంటూ అప్పట్లో అమెరికా మీడియా కోడై కూసింది.ఈ నేపథ్యంలో ఏదో విశ్వసనీయమైన సమాచారం ఆధారంగానే మస్క్ ఇప్పుడిలా ఉన్నట్టుండి ‘అణుయుద్ధ’జోస్యానికి దిగారని భావిస్తున్నారు. మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ఏఐకి చెందిన ఏఐ చాట్‌బోట్ గ్రోక్‌ను ఆయన జోస్యంపై వివరణ ఇవ్వాల్సిందిగా పలువురు ఎక్స్ యూజర్లు కోరారు. ఆయన గతంలో చెప్పిన జోస్యాలన్నీ దాదాపుగా ఫలించాయిగా అంటూ అది తన బాస్‌కు బాసటగా నిలవడం విశేషం! -
ఉద్యోగాలు మట్టి కొట్టుకుపోతాయి!.. మస్క్ ఇంటర్వ్యూ
స్పేస్ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌తో జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ జరిపిన ‘పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్’ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ఇంటర్వ్యూలో ఏఐ, రోబోటిక్స్ కారణంగా భవిష్యత్తులో పని ఐచ్ఛికం(ఆప్షనల్)గా మారుతుందని మస్క్ అంచనా వేశారు. ఈ ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలను కింద చూద్దాం.ఏఐ, రోబోటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల్లో ప్రజలు పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు’ అన్నారు. గరిష్ఠంగా ఈ పరివర్తన 20 సంవత్సరాల్లోపు జరుగుతుంది. ప్రజలు ఇకపై ఉద్యోగం కోసం నగరాల్లో నివసించాల్సిన అవసరం లేదన్నారు. పాశ్చాత్య దేశాల్లో మూడు లేదా నాలుగు రోజుల పని వారాల ట్రయల్స్ గురించి చర్చించినప్పుడు స్టార్టప్‌లు లేదా సంస్థల్లో క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి అధిక పని గంటలు అవసరమని మస్క్ అన్నారు.మస్క్ ఈ అంశాలను ఉదాహరణతో వివరించారు. ‘కూరగాయలు మీరు దుకాణంలో నుంచి కొనవచ్చు లేదా తోటలో పండించవచ్చు. పని కూడా అలాంటిదే ఆప్షనల్’ అన్నారు. రోబోట్లు మరింత సమర్థంగా ఉత్పాదకతను పెంచుతూ పని చేస్తాయన్నారు. ఈ సందర్భంలో ప్రజలు తమ ఆసక్తి ఆధారంగా పని చేయాల్సి ఉంటుందన్నారు.H-1B వీసాపై..భారతీయుల్లో చాలా ప్రతిభ ఉందన్నారు. ‘అమెరికా భారతీయ ప్రతిభావంతుల నుంచి అపారంగా ప్రయోజనం పొందింది’ అని ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చైలను ఉదాహరణగా పేర్కొన్నారు. H-1B వీసా వివాదంపై మాట్లాడిన మస్క్ ‘అవుట్సోర్సింగ్ కంపెనీలు వ్యవస్థను నిర్ణయిస్తున్నాయి. నిజమైన, అద్భుతమైన ప్రతిభావంతులకు అమెరికా మద్దతు ఇవ్వాలి’ అని చెప్పారు.వ్యక్తిగతం..మస్క్ భాగస్వామి షివాన్ జిలిస్ గురించి మాట్లాడుతూ.. భారత్‌పై మక్కువతో నా భార్య మా కుమారుడి మధ్య పేరు ‘సేఖర్’ (భారతీయ-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ పేరు) అని పెట్టిందన్నారు. ఇన్వెస్టింగ్ దృక్పథంలో మౌలిక సమస్యలను పరిష్కరించే కంపెనీలపై పెట్టుబడి పెట్టండన్నారు. యూఎస్ ఆర్థిక ఋణాన్ని తగ్గించడానికి ఫ్రీట్రేడ్ మాత్రమే మార్గమని చెప్పారు. ఈ పాడ్‌కాస్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీగా స్పందన లభించింది. యూట్యూబ్‌లో 1.5 మిలియన్ వ్యూస్, ఎక్స్‌లో 6 మిలియన్‌కు పైగా రీచ్ వచ్చింది.Interview with Nikhil https://t.co/4mmIo9rcKw— Elon Musk (@elonmusk) November 30, 2025 -
భారతీయుల నుంచి అమెరికా ఎంతో లబ్ధి పొందింది: మస్క్
వాషింగ్టన్: ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అత్యంత లబ్ధిపొందిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. జెరోధా సంస్థ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ‘డబ్ల్యూటీఎఫ్’ పాడ్‌కాస్ట్‌లో మస్క్ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘అమెరికా వలస విధానాలను వ్యతిరేకించే కొన్ని శక్తులే హెచ్–1బీ వీసా కార్యక్రమం దురి్వనియోగమయిందనే వాదనను తెరమీదకు తీసుకొచ్చాయి. వాస్తవానికి ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా ఎంతో లబ్ధిపొందింది’’ అని అన్నారు. భారతీయుల ఉద్యోగాలను స్థానిక అమెరికన్లకు ఇవ్వాలని ట్రంప్ సర్కారు కంకణం కట్టుకుందా? అని ప్రశ్నించగా..‘‘అదెలా సాధ్యం? నిజానికి అత్యంత ప్రతిభావంతులకు అమెరికాలో ఎప్పట్నుంచో కొరత ఉంది. నా సొంత ఎక్స్, టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐ సంస్థల కోసం సైతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం వెతుకుతున్నా. హెచ్–1బీని నిలిపేయాలనే గుంపులో నేను లేను’’ అని ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నారు. నా కుమారుని పేరు శేఖర్ మస్క్ తన వ్యక్తిగత జీవిత వివరాలను కొన్నింటిని తొలిసారిగా బహిర్గతంచేశారు. ‘‘నాకూ శివోన్ జిలిస్‌కు పుట్టిన కుమారుల్లో ఒకరికి శేఖర్ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టాం. భారతీయమూలాలున్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ (Subrahmanyan Chandrasekhar) పేరులోంచే శేఖర్‌ను తీసుకున్నాం. సహచరిణి శివోన్ సగం భారతీయురాలు. ఆమె తల్లి పంజాబీ. జివోన్ను చిన్నతనంలో ఉన్నప్పుడే వేరే కుటుంబం దత్తత తీసుకుంది. అలా శివోన్ కెనడాలో పెరిగింది’’ అని మస్క్ వెల్లడించారు.


