Dogecoin
-
పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!
ఎలాన్ మస్క్ ట్విటర్లో మరో మార్పు చేశాడు. ఈ సారి లోగోపై పడ్డాడు. ఇప్పటి వరకూ ఉన్న పక్షి (బ్లూబర్డ్) లోగోను పీకేసి దాని స్థానంలో కుక్క (డాగీ) లోగోను పెట్టాడు. అయితే ఇది మొబైల్ యాప్‌లో కాదులెండి.. డెస్క్‌టాప్ వెర్షన్లో మాత్రమే ఇలా చేశాడు. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) pic.twitter.com/wmN5WxUhfQ — Elon Musk (@elonmusk) April 3, 2023 ట్విటర్ వెబ్సైట్లో హోం బటన్‌గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డాగీ కాయిన్ (Dogecoin) క్రిప్టోకరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్ ప్రత్యక్షమైంది. ఏప్రిల్ 3న దాన్ని గమనించిన యూజర్లు అవాక్కయ్యారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్ లోగోలో ఉపయోగించిన డాగీ (షిబా ఇను డాగ్) చిత్రం చాలా కాలంగా అనేక వైరల్ మీమ్స్‌లో కనిపిస్తోంది. (జొమాటో డెలివరీ పార్ట్నర్స్కు ఎలక్ట్రిక్ స్కూటర్లు!) ట్విటర్ లోగో మార్పుపై ఎలాన్ మస్క్ తనదైన శైలిలో ఓ హాస్యభరితమైన మీమ్‌ను జోడిస్తూ ట్విటర్లో షేర్ చేశారు. అలాగే 2022 మార్చి 26 నాటి తన ట్విటర్ చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. అందులో ఓ అజ్ఞాత యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను ‘డాగ్’గా మార్చమని అడగ్గా దానికి మస్క్ సరే అని బదులిచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్‌ను నిర్వహిస్తున్నారని ఎలాన్ మస్క్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. మస్క్ ట్విటర్ లోగోను డాగీ లోగోగా మార్చిన తర్వాత డాగీకాయిన్ విలువ 20 శాతం వరకు పెరిగింది. As promised pic.twitter.com/Jc1TnAqxAV — Elon Musk (@elonmusk) April 3, 2023 -
తిక్క కుదిరిందా ఎలన్ మస్క్? అదిరిపోయే పంచ్ !
నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో.. నరులెవరు నడవనిది ఆ దార్లో నడిచెదరో అనే పాటకే కాదు నాకొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అనే పాపులర్ డైలాగ్‌కి కానీ పర్ఫెక్ట్గా సూటయ్యే పేరు ఎలన్‌మస్క్. భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేయడం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చూపిన నేర్పు అతన్ని ప్రపంచ కుబేరుడిని చేసింది. అయితే తన అలవాటు ప్రకారం ఏ మాట్లాడినా.. ఏ పని చేసినా వెటకారం జోడించడం ఎలన్‌మస్క్‌కి అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ వెటకారానికి మంచి రిటార్ట్ పడింది. కొంటె ట్వీట్ క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో వందల కొద్దీ కాయిన్స్ ఉన్నాయి. ఇందులో మీమ్స్ కాయిన్‌గా వచ్చింది డోజ్కాయిన్. ఎలన్‌మస్క్ ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఇది వరల్డ్ ఫేమస్ అయ్యింది. తాజాగా టెస్లా కార్లు కొనే సమయంలో డోజ్ కాయిన్ క్రిప్టో కరెన్సీని సైతం అంగీకరిస్తామంటూ మరింత పాపులర్ చేశారు ఎలన్‌మస్క్. తాను పెట్టుబడి పెట్టిన డోజ్ కాయిన్‌కు మరింత పాపులారిటీ తీసుకొచ్చే పనిలో మరో ట్వీట్ చేశాడు. డోజ్కాయిన్ తీసుకుంటారా? ఫేమస్ ఫుడ్ సప్లై చెయిన్ మెక్‌డొనాల్ట్స్ కనుక డోజ్ కాయిన్‌ను అంగీకరిస్తే నేను ఎంతో హ్యాపీగా మెక్‌డొనాల్డ్స్ అందించే ఫుడ్ తింటాను అంటూ కొంటెగా ట్వీట్ చేశారు. ఒకరోజు సమయం ఇచ్చిన మెక్‌డొనాల్డ్ ఎలన్‌మస్క్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తీసుకుంటాం.. కానీ క్రిప్టో కరెన్సీలో బాగా పాపులరైన బినాన్స్ స్మార్ట్ చెయిన్ నుంచి గ్రిమాకే కాయిన్స్ అంటూ కొత్త రకం మీమ్ కాయిన్ని రెడీ చేయించింది. ఆ తర్వాత ట్విట్టర్‌కి వెళ్లి డోజ్‌కాయిన్‌ని మెక్‌డొనాల్డ్‌లో అంగీకరిస్తాం. కానీ ఒక్క షరతు టెస్లా కార్లు కొనేప్పుడు మీరు గ్రిమాకే కాయిన్స్‌ను తీసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చింది. only if @tesla accepts grimacecoin https://t.co/CQrmAFelHR pic.twitter.com/to9HmYJhej — McDonald's (@McDonalds) January 25, 2022 ఎలన్‌మస్క్‌కి మెక్‌డొనాల్డ్ కంపెనీ ఇచ్చిన కౌంటర్ నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారింది. క్రిప్టో కరెన్సీ గురించి టెక్ వరల్డ్‌లో బోలెడంత చర్చ జరుగుతోంది. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ లాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఐనప్పటికీ క్రిప్టో కరెన్సీ ఇంకా జనసామాన్యంలోకి చొచ్చుకుపోలేదు. చదవండి:క్రిప్టో.. తగ్గేదేలే! -
2021లో జరిగిన క్రిప్టోకరెన్సీ లావాదేవీల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు భారీ ఆదరణను నోచుకున్నాయి. 2021లో క్రిప్టో ట్రేడర్స్ పెద్ద ఎత్తున లావాదేవీలను జరిపినట్లు ప్రముఖ గ్లోబల్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ఓకేఎక్స్ఛేంజ్ (OKEx) ఒక నివేదికలో వెల్లడించింది. 21 ట్రిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు..! ప్రపంచవ్యాప్తంగా ఓకేఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ను అనువైన ప్లాట్‌ఫాంగా మారింది. కేవలం ఈ ప్లాట్‌ఫాంలోనే 2021లో సుమారు 21 ట్రిలియన్ డాలర్ల విలువైన 25 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే క్రిప్టోలావాదేవీలు ఆల్‌టైం రికార్డుగా నిలిచిందని కంపెనీ వెల్లడించింది. 2022 క్రిప్టో భవితవ్యం ఎలా ఉంటుందంటే..! OKEx.com అంచనాల ప్రకారం..2022లో క్రిప్టో మార్కెట్ స్థిరమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తుందని విశ్వసించింది. క్రిప్టోకరెన్సీలతో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ప్లాట్‌ఫామ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయని అభిప్రాయపడింది. 2022లో పెట్టుబడిదారుల క్రిప్టో పోర్ట్‌ఫోలియోలో స్టేబుల్కాయిన్లు ప్రముఖ స్థానాన్ని సృష్టిస్తాయని ఓకేఎక్స్ఛేంజ్ తెలిపింది. స్టేబుల్‌కాయిన్ అనేది యూఎస్ డాలర్ వంటి జాతీయ కరెన్సీ లేదా బంగారం వంటి విలువైన లోహం వంటి అంతర్లీన ఆస్తికి అనుసంధానించబడిన డిజిటల్ కరెన్సీ. ఇక క్రిప్టోకరెన్సీలపై ఆయా దేశాల నిర్ణయాలు ఎలా ఉన్నా.... క్రిప్టోకరెన్సీ 2022లో స్థిరమైన ఒడిదుడుకులతో వృద్ధిని సాధిస్తాయని వెల్లడించింది. ఓకేఎక్స్ఛేంజ్ టాప్-5లో ఒకటి..! స్పాట్ అండ్ డెరివేటివ్స్ విభాగాలలో ట్రేడింగ్ వాల్యూమ్ల పరంగా ప్రపంచంలోని మొదటి ఐదు క్రిప్టో ఎక్స్ఛేంజీలలో ఓకేఎక్స్ఛేంజ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 20 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ప్లాట్‌ఫారమ్ ఓకేఎక్స్ఛేంజ్. 2021లో సుమారు 220 కొత్త క్రిప్టో కరెన్సీలు ఈ ప్లాట్‌ఫాంలో లిస్టింగ్ అయ్యాయి. చదవండి: The Most Popular Crypto In 2021: అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..? -
2021లో అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..?
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. 2021లో చూసుకుంటే క్రిప్టో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్ అత్యంత ప్రజాదరణను పొందింది. అయితే గత ఏడాదిలో బిట్‌కాయిన్ కాకుండా ఇతర ఆల్ట్ కాయిన్స్ భారీ ఆదరణను పొందాయి. బిట్‌కాయిన్ కంటే దీనిపైనే..! క్రిప్టోకరెన్సీల్లో బిట్‌కాయిన్ కంటే షిబా ఇను గత 12 నెలల్లో సుమారు 188 మిలియన్లకు పైగా ఇన్వెస్టర్లు వీక్షించినట్లు కాయిన్‌మార్కెట్‌క్యాప్ వెల్లడించింది. అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ 145 మిలియన్ల వీక్షణలతో రెండవ స్థానంలో ఉంది. షిబా ఇను అనేది ఇప్పటికే ఉన్న మీమ్ కాయిన్ డోజ్‌కాయిన్‌కు స్పిన్-ఆఫ్. ఎలన్ మస్క్ అపారంగా నమ్మే డోజీకాయిన్ సుమారు 107 మిలియన్ వీక్షణలతో జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. కారణం అదే..! క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్ అత్యంత విలువను కల్గి ఉంది. ఒకానొక సమయంలో బిట్‌కాయిన్ సుమారు 50 లక్షలకు కూడా చేరింది. ఈ కాయిన్ ఇన్వెస్ట్ చేయాలంటే పెట్టుబడిదారులు కొంతమేర భయపడ్డారు. బిట్‌కాయిన్ కంటే ఆల్ట్‌కాయిన్స్ విలువ తక్కువగా ఉండడంతో వీటిపై ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. ఇకపోతే షిబా ఇను వచ్చి కేవలం 15 నెలలు అయినప్పటికీ, ప్రస్తుతం 18 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే 13వ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉంది. అక్టోబర్‌లో ఈ క్రిప్టోకరెన్సీ నాలుగు రోజుల్లోనే 133 శాతం పెరిగి, ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 0.000088 డాలర్లకు చేరింది. రాబిన్ హుడ్ యాప్‌లో షిబా ఇను ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ యాప్, రాబిన్‌హుడ్‌లో జాబితా చేయబడే అవకాశం ఉందనే పుకార్లు ఈ కాయిన్ విలువ భారీగా పెరిగింది. షిబా ఇను ఇన్వెస్టర్లు రాబిన్ హుడ్ లో లిస్ట్ చేయాలని ఆన్లైన్లో సంతకాల సేకరణ కూడా చేపట్టారు. షిబా ఇను కాయిన్‌ను ఇప్పటికే ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ కాయిన్‌బేస్‌లో లిస్ట్ అయ్యింది. చదవండి: క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్.. -
బిట్‌కాయిన్ గాలి తీసేసిన బిలియనీర్ కింగ్
క్రిప్టోమార్కెట్లో అతిపెద్ద డిజిటల్ కరెన్సీగా బిట్‌కాయిన్‌కి పేరుంది. అలాంటిది బిట్‌కాయిన్ కంటే.. ఎక్కడో క్రిప్టోకరెన్సీ జాబితాలో అట్టడుగున ఉండే మీమ్ కాయిన్ డోజ్‌కాయిన్‌కు ప్రయారిటీ ఇవ్వాలంటున్నాడు ఎలన్ మస్క్. బిలియనీర్ ఎలన్ మస్క్ టైమ్ మ్యాగజైన్ వారి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ ఘనత దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో టైమ్ ఇంటర్వ్యూలో క్రిప్టోకరెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎలన్ మస్క్. క్రిప్టో కరెన్సీని ప్రచారం చేసే ఎలన్ మస్క్.. బిట్‌కాయిన్ వరెస్ట్ అని, దీంతో పోలిస్తే డోజ్కాయిన్ చాలా బెస్ట్ అని చెప్తున్నాడు. అందుకు కారణాలేంటో కూడా వివరించాడాయన. రోజూవారీ ట్రాన్జాక్షన్స్ పరంగా చూసుకుంటే.. డోజ్‌కాయిన్‌ను బెటర్ క్రిప్టోకరెన్సీగా అభివర్ణించాడు. ‘బిట్‌కాయిన్ ట్రాన్జాక్షన్ వాల్యూ తక్కువ. ట్రాన్జాక్షన్కు అయ్యే ఖర్చు ఎక్కువ. ఒకానొక స్థాయిలో దాచుకోవడానికి ఇది పర్వాలేదనిపించొచ్చు. కానీ, ప్రాథమికంగా ట్రాన్జాక్షన్ కరెన్సీకి బిట్‌కాయిన్ ప్రత్యామ్నాయం కాదు’ అని పేర్కొన్నాడు ఎలన్ మస్క్. డోజ్‌కాయిన్‌ను హైలెట్ చేయడం జోక్‌గా మీకు అనిపించొచ్చు. కానీ, ట్రాన్జాక్షన్స్ పరంగా చూసుకుంటే ఇదే బెస్ట్. బిట్‌కాయిన్ ఒకరోజులో చేసే ట్రాన్జాక్షన్స్ కంటే డోజ్కాయిన్ చేసే ట్రాన్జాక్షన్స్ ఎక్కువ. పైగా డోజ్కాయిన్ అనేది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. బిట్కాయిన్లలాగా నిల్వ గురించి కాకుండా.. జనాల చేత ఖర్చు చేయిస్తుంది. అలా ఇది ఎకామనీకి మంచిదే కదా అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఎలన్ మస్క్. ఇదిలా ఉంటే క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ విలువ నష్టాల్లోనే నడుస్తోంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో పాటు భారత్‌లో క్రిప్టో పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నేపథ్యంలో బిట్‌కాయిన్ విలువ పడిపోతూ ట్రేడ్ అవుతోంది. Watch: TIME's 2021 Person of the Year @elonmusk discusses cryptocurrency #TIMEPOY https://t.co/FfwEGxW7LX pic.twitter.com/5BXAZky0LS — TIME (@TIME) December 13, 2021 చదవండి: కనిపించని కరెన్సీ గురించి తెలుసా..! -
Cryptocurrency: ఒమిక్రాన్ పేరులోనే మ్యాజిక్ ఉంది
ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన పేరు.. ఒమిక్రాన్. కరోనా వైరస్ వేరియెంట్లలో ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాప్తిస్తుండడంతో ఎంతటి విపత్తుకు దారితీస్తుందోనని హడలిపోతున్నారంతా. అయితే ఈ పేరు మాత్రం అక్కడ లాభాలు కురిపిస్తోంది. ఒమిక్రాన్ ఇదే పేరుతో క్రిప్టో స్పేస్‌లో ఓ కాయిన్ ఉంది. నవంబర్ 27న ఈ క్రిప్టోకరెన్సీ విలువ 64 డాలర్లుగా ఉండింది. అయితే డబ్ల్యూహెచ్‌వో ‘ఒమిక్రాన్’ వేరియెంట్ ఆందోళన ప్రకటన తర్వాత వేరియెంట్ గురించి విస్తృత స్థాయిలో జరిగిన చర్చ.. ఈ కాయిన్ విలువను అమాంతం పెంచేసింది. నవంబర్ 29న ఒమిక్రాన్ మార్కెట్ వాల్యూ 692 డాలర్లకు చేరుకోగా.. నవంబర్ 30న ప్రారంభ విలువకు 900 శాతం పెరిగి 689 డాలర్లకు చేరుకుంది. చివరికి మంగళవారం 420 డాలర్ల వద్ద ఉండిపోయి.. క్రిప్టో మార్కెట్లో తన జోరు కొనసాగిస్తోంది. ఒమిక్రాన్ కరెన్సీకి ఎలాంటి మద్దతు లేదు. డోజ్కాయిన్ లాగే ఇది కూడా అంచనాల నడుమే తన విలువను పెంచుకోవడం, పడిపోవడం జరుగుతోంది కూడా. ఇక ఒమిక్రాన్ అలర్ట్ పరిణామాల తర్వాత డిజిటల్ ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్, ఇతరత్ర కాయిన్స్ విలువ లాభాలతో కొనసాగుతుండడం విశేషం. కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్ B.1.1.529కు గ్రీకు 24 అక్షరాల్లోని 15వ అక్షరం ఒమిక్రాన్ ఆధారంగా పేరును నిర్ణయించింది ఫైలోజెనెటిక్ ఎసైన్మెంట్ ఆఫ్ నేమ్డ్ గ్లోబల్ ఔట్‌బ్రేక్ కంపెనీ. చదవండి: చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు! -
క్రిప్టో.. తగ్గేదేలే!
బిట్‌కాయిన్.. ఎథీరియమ్.. షిబా ఇను, డోజికాయిన్.. ఇన్వెస్టర్ల ప్రపంచం క్రిప్టోల గురించి తెగ చర్చించుకుంటోంది. స్పెక్యులేటివ్ మద్దతుతో ఉన్నట్టుండి ఏదో ఒక క్రిప్టో టోకెన్ 24 గంటల్లోనే వందలు, వేల రెట్లు పెరిగేస్తోంది. దీంతో ఇన్వెస్టర్లలోనూ, ముఖ్యంగా యువ ఇన్వెస్టర్లలో చెప్పలేనంత ఆసక్తి ఏర్పడుతోంది. క్రిప్టోల గురించి పెద్దగా తెలియకపోయినా.. ఫోన్ నుంచే డిజిటల్‌గా క్రిప్టో ట్రేడింగ్ ఖాతా తెరిచేసి ఎంతో కొంత పెట్టుబడితో తమ దృష్టిలో పడిన క్రిప్టోను కొనుగోలు చేసే వాతావరణం నెలకొందనడంలో సందేహం లేదు. మనదేశంలోనే అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెట్టుబడులన్నీ క్రిప్టోలను వెతుక్కుంటూ వెళుతున్నాయి. సామాన్య ఇన్వెస్టర్లకే ఈ ధోరణి పరిమితం కాలేదు. ప్రముఖ కంపెనీల దగ్గర్నుంచి, ఫండ్ మేనేజర్ల వరకు అందరూ క్రిప్టోల్లో పెట్టుబడుల అవకాశాలను వెతుక్కుంటున్నారు. కాకపోతే, వీటితో ఎలా వేగాలో ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులకు అర్థం కాకుండా ఉంది. క్రిప్టో కరెన్సీ అంటే..? క్రిప్టోకరెన్సీలు అనేవి డిజిటల్ ఆస్తులు. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే క్రిప్టో కాయిన్లు, టోకెన్లను క్రిప్టోకరెన్సీలుగా పిలుస్తున్నారు. వీటిని పెట్టుబడి సాధనాలుగాను, ఆన్లైన్లో కొనుగోళ్లకు చెల్లింపుల సాధనాలుగానూ వినియోగిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ అన్నది భౌతికంగా ఉండదు. డిజిటల్లోనే ఉంటుంది. రూపీ, డాలర్, యూరో మాదిరిగా ఇవి ఫియట్ కరెన్సీలు కావు. ఎవరో ఒకరు నియం త్రించేవి కావు. వీటిపై సెంట్రల్ బ్యాంకుల నియంత్రణ ఉండదు. కనుక వీటిని డీసెంట్రలైజ్డ్గా పేర్కొంటారు. ఇంటర్నెట్ వేదికగా యూజర్ల మధ్య ఇవి చెలామణి అవుతుంటాయి. ప్రతీ కాయిన్ లేదా టోకెన్ ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ లేదా కోడ్‌తో రూపొందించబడి ఉంటాయి. కనుక వీటిని ట్రాక్ చేయడం, గుర్తించడం సులభతరం. క్రిప్టోగ్రఫీ, కరె న్సీ రెండింటి కలయికే.. క్రిప్టోకరెన్సీగా వాడుకలోకి వచ్చింది. క్రిప్టోకరెన్సీ లు క్రిప్టోగ్రఫిక్ సాంకేతికత ఆధారంగా లావాదేవీలను ధ్రువీకరిస్తుంటాయి. బ్లాక్ చైన్.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్‌చైన్ వేర్వేరు. క్రిప్టోకరెన్సీల అస్తిత్వానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీ తోడ్పడుతుంది. బ్లాక్‌చైన్ అన్నది డిజిటల్ లెడ్జర్. మొత్తం కంప్యూటర్ల నెట్వర్క్ పరిధిలో ప్రతి ఒక్క లావాదేవీని రికార్డెడ్‌గా నిర్వహిస్తుంటుంది. ప్రతీ నూతన లావాదేవీ నెట్వర్క్ పరిధిలోని ప్రతీ భాగస్వామి లెడ్జర్లో నమోదవుతుంది. ఎవరో ఒకరు నియంత్రించేది కాకుండా అవతరించిన సాంకేతికతే బ్లాక్‌చైన్. దీనికి ఉన్న ప్రత్యేకత ఇదే. బ్లాక్‌చెయిన్ అన్నది సమాచారాన్ని ప్యాకెట్ల రూపంలో కలిగి ఉంటుంది. దీన్ని బ్లాక్‌లుగా పిలుస్తారు. ఈ బ్లాక్‌లు ఒక చైన్ (గొలుసుగా)గా అనుసంధానమై ఉంటా యి. ఈ బ్లాక్‌లతో కూడిన చైన్‌ను ఎడిట్ చేయడానికి (దిద్దడానికి), మార్చడానికి అవకాశం ఉండదు. ఎంతో పటిష్టంగా ఉంటుంది. బ్లాక్ చైన్‌లో ప్రతీ లావాదేవీ సురక్షితంగా నమోదై ఉంటుంది. అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. బిట్‌కాయిన్, ఎథీరియమ్ ఇవన్నీ బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారంగా ఏర్పడినవే. కాకపోతే వీటిల్లో ఎథీరియమ్, సొలానా తదితర బ్లాక్ చెయిన్లు.. తమ నెట్‌వర్క్‌పై స్మార్ట్ కాంట్రాక్టుల (కోడ్)ను సృష్టించి, నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో నాన్ ఫంగిబుల్ టోకెన్లను ఏర్పాటు చేసుకుని విక్రయించుకోవచ్చు. ఈ నెట్ వర్క్‌ల సాయంతో ఎన్నో క్రిప్టో టోకెన్ల సృష్టికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పాలిగాన్ (మేటి క్) అన్నది ఎథీరియమ్ బ్లాక్ చైన్‌పై ఏర్పడిందే. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం క్రిప్టో ఇన్వెస్టర్లు 18–34 ఏళ్లలోపు వారే. మరో 20 శాతం మంది 35–44 ఏళ్ల వయసులోపు వారున్నట్టు ఫైండర్స్ క్రిప్టోకరెన్సీ నివేదిక స్పష్టం చేస్తోంది. టెస్లా, ఫేస్బుక్, పేపాల్, వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్, మైక్రో స్ట్రాటజీ, బ్లాక్‌రాక్, ఏఆర్కే ఇన్వెస్ట్మెంట్స్ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టడం, ఈ టెక్నాలజీపై పనిచేయడం మొదలు పెట్టాయి. టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ సైతం బిట్‌కాయిన్, డోజికాయన్ తదితర క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసినట్టు స్వయంగా ప్రకటించారు. ఏది చేస్తే మెరుగు..? క్రిప్టోలను అధికారిక కరెన్సీలుగా ఆమోదించే పరిస్థితి లేదు. పెట్టుబడి సాధనాలుగా వీటిని పరిగణించి, పన్నుల రూపంలో ఆదాయం రాబట్టుకోవాలన్న యోచనను కేంద్రంలోని కొందరు సీనియర్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వినూత్న సాంకేతికతకు దారిచూపుతున్న క్రిప్టోలను పూర్తిగా నిషేధించినట్టయితే భారత్ మంచి అవకాశం కోల్పోయినట్టు అవుతుందని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గత శనివారం క్రిప్టోలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ టెక్నాలజీపై నిపుణులు, భాగస్వాములతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా క్రిప్టోలపై ప్రచారం, ప్రకటనలను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, క్రిప్టోలను అనుమతించడానికి ఆర్బీఐ సుముఖంగా లేదు. స్థూల ఆర్థిక పరిస్థితులకు వీటితో పెద్ద సమస్య వచ్చి పడుతుందని, ప్రపంచవ్యాప్తంగా నియంత్రణల పరిధిలో లేని ఇవి పెట్టుబడి సాధనాలుగా ఆమోదనీయం కాదని ఆర్బీఐ తన అభిప్రాయంగా కేంద్రానికి తెలియజేసింది. క్రిప్టోల్లో పెట్టుబడులకు అనుమతిస్తే.. అవి ఉగ్రవాదులకు, మనీలాండరింగ్ కార్యకలాపాలకు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళలను కూడా దర్యాప్తు సంస్థలు, ఆర్బీఐ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. క్రిప్టో లావాదేవీలపై కఠిన నియంత్రణలు ఉండాలని, లేదంటే ఇంటి పొదుపులు అనియంత్రిత సాధనాల్లోకి మళ్లితే ప్రమాదంలో పడినట్టు అవుతుందన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. దేశంలో క్రిప్టోల నిషేధం లేదా నియంత్రణకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చట్టం లేనందున రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఎన్ని క్రిప్టోలు ఉన్నాయి? బిట్ కాయిన్‌ను మొదటి క్రిప్టోకరెన్సీగా చెబుతారు. 2009లో ఇది ఏర్పడింది. దీని ఆవిష్కర్త సతోషి నకమొటో. ఎవరైనా ఇందులో పాల్గొనే విధంగా డీసెంట్రలైజ్డ్ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశారు. ఎవరో ఒకరికి పరిమితం కాకుండా.. అందరికీ చెందేలా దీన్ని రూపొందించడం విశేషం. క్రిప్టో కరెన్సీ యూనిట్లను మైనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టిస్తారు. క్లిష్టమైన మ్యాథమేటికల్ ఆల్గోరిథమ్‌ల కంప్యూటేషన్తో వర్చువల్ కాయిన్లను మైనింగ్ చేస్తుంటారు. క్రిప్టోలకు సంబంధించి అపరిమిత మైనింగ్‌కు అవకాశం లేకుండా పరిమితి ఉంటుంది. బిట్కాయిన్లను 21 మిలియన్లకు మించి మైనింగ్ చేయకుండా సతోషి నకమొటో పరిమితి విధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి 6,000కు పైగా క్రిప్టోలున్నాయని అంచనా. మన దేశంలో సుమారు 10 కోట్ల మంది ఇప్పటికే క్రిప్టోల్లో పెట్టుబడులు కూడా పెట్టేశారు. క్రిప్టో ఇన్వెస్టర్ల పరంగా భారత్ మిగతా దేశాలను వెనక్కి నెట్టేసింది. అగ్రరాజ్యం అమెరికాలోనూ క్రిప్టో ఇన్వెస్టర్ల సంఖ్య 2.74 కోట్లుగానే ఉంది. మొత్తం జనాభాలో క్రిప్టో ఇన్వెస్టర్ల శాతం (7.30) పరంగా భారత్ ఐదో స్థానంలో ఉంది. ఉక్రెయిన్ 12.73 శాతంతో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. భారతీయుల క్రిప్టో పెట్టుబడులు సుమారు 10 బిలియన్ డాలర్లు (రూ.75,000 కోట్లు) చేరి ఉంటాయని ఒక అంచనా. మనదేశంలో సుమారు 100కు పైనే క్రిప్టో కాయిన్లు కొనుగోళ్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. బిట్‌కాయిన్, ఎథీరియమ్, టెథర్ (యూఎస్డీటీ), షిబా ఇను, డోజికాయన్, పాలీగాన్ (మ్యాటిక్), కార్డనో, సొలాన, పోల్కడాట్, లైట్‌కాయిన్ వీటికి మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ ఆదరణ ఉంది. కాయిన్ డీసీఎక్స్, వాజిర్ఎక్స్, యునోకాయిన్, కాయిన్‌స్విచ్ కుబేర్, జెబ్‌పే సంస్థలు మన దేశంలో క్రిప్టో సేవలు అందిస్తున్నాయి. వీటి ల్లో వ్యాలెట్‌ను తెరిచి ట్రేడింగ్ చేసుకోవచ్చు. -
పేరు మార్చుకున్న ఎలన్‌మస్క్.. కారణం ఇదేనా?
ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్ ట్విట్టర్లో తన డిస్ప్లే పేరును మార్చుకున్నాడు. టెస్లా కంపెనీలో తన షేర్లను అమ్మేయాలనుకుంటున్నాను అని ప్రకటించిన రెండు రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేమ్ ఛేంజ్ టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల యజమాని అయిన ఎలన్‌మస్క్ తీరు మిగిలిన బిజినెస్ టైకున్లకు భిన్నంగా ఉంటుంది. సంప్రదాయ పద్దతులకు ఎప్పుడు సవాల్ విసరడం ఎలన్‌మస్క్‌కి అలవాటుగా మారింది. ఆ పరంపరలోనే అకస్మాత్తుగా ట్విట్టర్లో తన డిస్ప్లే నేమ్‌ని ఎలన్ మస్క్ బదులుగా లార్డ్ ఎడ్జ్ (Lorde Edge)గా మార్చేసుకున్నారు. Much is made lately of unrealized gains being a means of tax avoidance, so I propose selling 10% of my Tesla stock. Do you support this? — Lorde Edge (@elonmusk) November 6, 2021 తికమక పడ్డ యూజర్లు ఎలన్‌మస్క్‌కి ట్విట్టర్లో 60.20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఉన్నట్టుంటి తమ లిస్టులో ఈ లార్డే ఎడ్జ్ ఎవరా అని విస్తుపోయారు. అయితే డిస్ప్లే పేరును మాత్రమే మార్చుకున్న మస్క్ డిస్ప్లే పిక్చర్‌గా రాకెట్‌ను ఉంచుకోవడంతో కొద్ది సేపటికే ఎలన్‌మస్క్ అకౌంటే అని పోల్చుకున్నారు. షేర్లు అమ్ముతానంటూ మొదలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో ఎలన్‌మస్క్‌కి 17 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయి. ట్యాక్స్ ఇబ్బందులు తొలగించుకునేందుకు ఇందులో పది శాతం షేర్లను అమ్మలని ఆలోచిస్తున్నట్టు.. ఈ నిర్ణయానికి మీరు మద్దతిస్తారా ? అంటూ నవంబరు 6న ట్విట్టర్లో ఎలన్ మస్క్ తన ఫాలోవర్లను కోరారు. ఎలన్ మస్క్ ప్రశ్నకు ఫాలోవర్లు భారీ స్థాయిలో స్పందిస్తున్న క్రమంలో ఆయన డిస్ప్లే పేరు మార్చేశారు. పేరు మార్పుకు గల కారణాలను ఎక్కడా వివరించలేదు. ఆ పద్దతిలో ప్రచారం అయితే డాగీకాయిన్ కో ఫౌండర్ షిబేతోషి నకమోటో ఈ పేరు మార్పుపై స్పందించారు. డాగీ కాయిన్ (Dogecoin)కి అనగ్రామ్ ( ఒక పదంలో ఉన్న అక్షరాలతో మరో పదం రాయడం)గా ఎలన్‌మస్క్ లార్డ్ ఎడ్జ్ (Lorde Edge) అని పెట్టుకున్నట్టు విశ్లేషించారు. బిట్‌కాయిన్, ఇథరమ్ తదితర క్రిప్టోకరెన్సీలు రాజ్యమేలుతున్న సమయంలో ఎలన్‌మస్క్ కొత్తగా వచ్చిన డాగీకాయిన్లో పెట్టుబడులు పెట్టారు. దీంతో డాగీకాయిన్ విలువ అమాంతం పెరిగిపోవడమే కాకుండా ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. lorde edge is an anagram for elder doge — Shibetoshi Nakamoto (@BillyM2k) November 8, 2021 గతంలో తను పెట్టుబడులు పెట్టిన డాగీ కాయిన్‌కి మరింత ఊతం ఇచ్చేందుకు వీలుగా ఎలన్‌మస్క్ అనాగ్రామ్ పద్దతిలో లార్డ్ ఎడ్జ్ అని పేరు పెట్టుకున్నాడనే వివరణ సరిగానే ఉందని అంతా నమ్ముతున్నారు. గతంలో 2019లో కూడా ట్విట్టర్ డిస్ప్లే నేమ్‌ని 1గా పెట్టుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఎలన్ మస్క్. షేర్లు అమ్మేయండి ఇక టెస్లా కంపెనీలో తన షేర్లను అమ్మాలా అంటూ ఎలన్ మస్క్ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ యూజర్లు పెద్ద సంఖ్యలో స్పందిపంచారు. ఇందులో ఎక్కువ మంది అంటే 57 శాతం మంది షేర్లు అమ్మేయాలంటూ సూచించారు. చదవండి:వెహికల్స్ ఎన్ని ఉన్నా, టెస్లా కార్ల తర్వాతే ఏదైనా -
ఎలన్‌మస్క్ కూడా ఏం చేయలేకపోయాడే..! రయ్‌రయ్‌మంటూ..
క్రిప్టోకరెన్సీలో మీమ్ డిజిటల్ కరెన్సీ భారీ లాభాలను పొందుతూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. షిబా ఇను ఐతే మరీను...! ఒక్కసారిగా గరిష్టలాభాలను గడించింది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. డోగీకాయిన్ స్ఫూర్తితో వచ్చిన షిబా ఇను మీమ్ క్రిప్టోకరెన్సీ సరికొత్త రికార్డులను నమోదుచేస్తోంది. తాజాగా షిబా ఇను మీమ్ క్రిప్టోకరెన్సీ విలువ ఆల్‌టైమ్ గరిష్టాలను తాకింది. చదవండి: టెస్లా కార్లపై ఎలన్ వ్యాఖ్యలు, ఇప్పుడు వైరల్ ఆన్లైన్ పిటిషన్స్‌తో రయ్...! రాబిన్‌హుడ్ లిస్టింగ్‌లో షిబా ఇను ట్రేడ్ చేయాలని ఆన్లైన్లో వస్తోన్న దరఖాస్తులతో ఈ మీమ్ క్రిప్టోకరెన్నీ సరికొత్త రికార్డులను తాకింది. ఇప్పటికి వరకు సుమారు 4 లక్షలకు పైగా యూజర్లు ఆన్లైన్లో పిటిషన్స్ దాఖలు చేశారు. షిబా ఇను మార్కెట్ క్యాప్ విలువ బుధవారం రోజున సుమారు 38 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాయిన్‌మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రకారం..షిబా ఇను 0.00008456 డాలర్లకు చేరుకుంది. ముందురోజు కంటే 72.62 శాతం మేర పెరిగింది. ఎలన్ మస్క్ ప్రభావం అంతంతే..! కొద్ది రోజుల క్రితం ఎలన్ ట్విటర్లో తన దగ్గర ఉన్న క్రిప్టోకరెన్సీ హోల్డింగ్స్ గురించి ఒక నెటిజన్ అడిగాడు. మీరు షిబా ఇను క్రిప్టోకరెన్సీ కలిగి ఉన్నారా..అని అడిగినందుకు సమాధానంగా..ఎలన్ మస్క్ తన దగ్గర కేవలం బిట్‌కాయిన్, ఈథిరియం, డోగీ కాయిన్ ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా డోగీకాయిన్ ప్రజల కరెన్సీ అంటూ ట్విటర్లో సమాధానమిచ్చారు. షిబా ఇను క్రిప్టోకరెన్సీను సపోర్ట్ చేసే లిస్ట్‌లో లేదని తెలిసిన ఎలన్ మస్క్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు కొంతమేర షిబా ఇను ఇన్వెస్టర్లకు భయాన్ని కల్గజేశాయి. ఎందుకంటే డోగీకాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలను శాసించడంలో మస్క్ ముందుంటాడు. కాగా ఈ మీమ్ క్రిప్టోకరెన్సీపై ఎలన్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాడు. చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..! -
Elon Musk: అది ప్రజల క్రిప్టోకరెన్సీ ..! అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీ ఆదరణనే లభిస్తోంది. ఎలన్ మస్క్, మార్క్ క్యుబాన్ లాంటి బిలియనీర్లు సైతం క్రిప్టోకరెన్సీలను ఆదరిస్తున్నారు. ఎలన్ మస్క్ ఐతే మరీను..! డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎలన్‌మస్క్‌ను డోగీకాయిన్ ఫాదర్‌గా ఇన్వెస్టర్లు ముందుగా పిలుస్తారు. కాగా తాజాగా ఎలన్‌మస్క్ డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానే విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...! ప్రజల క్రిప్టోకరెన్సీ...! అమెరికాలో ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో అమెరికాలో 33 శాతం మంది పౌరులు డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను సపోర్ట్ చేస్తున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ప్రముఖ డోగికాయిన్ మిలియనీర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ విషయంపై ఎలన్‌మస్క్ స్పందిస్తూ...అవును నిజమే..డోగీ కాయిన్ క్రిప్టోకరెన్సీ ప్రజలది. టెస్లా, స్పేస్ఎక్స్లో పనిచేసే వారు కూడా డోగీకాయిన్ ఎక్కువగా కల్గిఉన్నారు. వారు అంత పెద్ద ఆర్ధిక నిపుణులు మాత్రం కాదు. అందుకనే నేను డోగీకాయిన్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని’ మస్ తన ట్విట్లో వెల్లడించారు. అప్పడప్పుడు తన పెంపుడు కుక్క షిభా ఫ్లోకీను ఫోటో పెడితే చాలు షిభా ఇను క్రిప్టోకరెన్సీ రయ్‌మని పెరుగుతాయి. అసలు ఎలన్‌మస్క్ దగ్గర షిబా ఇను క్రిప్టోకరెన్సీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం డోగీ కాయిన్, బిట్‌కాయిన్, ఈథిరియం క్రిప్టోకరెన్సీలనే కల్గి ఉన్నట్లు వెల్లడించారు. Lots of people I talked to on the production lines at Tesla or building rockets at SpaceX own Doge. They aren’t financial experts or Silicon Valley technologists. That’s why I decided to support Doge – it felt like the people’s crypto. — Elon Musk (@elonmusk) October 24, 2021 శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ అదే..! గతంలో అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబాన్ క్రిప్టోకరెన్సీలో డోగీకాయిన్ మీడియం ఆఫ్ ఎక్సేచేంజ్లో అత్యంత శక్తివంతమైన కమ్యూనీటీ కలిగి ఉందని చేసిన వ్యాఖ్యలకు ఎలన్ మస్క్ మద్దతు పలికారు. మార్క్ క్యూబాన్కు రిప్లే ఇస్తూ... నేను విషయాన్ని ఎప్పటినుంచో చెప్తున్నాను..అంటూ ఎలన్ రిప్లే ఇచ్చారు. చదవండి: తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు -
ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుంది.. వచ్చింది
ప్రపంచ అపర కుబేరుడిగా, టెస్లా బాస్‌గా, స్పేస్ఎక్స్ సీఈవోగా.. పరిచయం ఉన్న ఎలన్ మస్క్.. ఇంటర్నెట్లో మీమ్స్ పోస్ట్ చేయడంతో పాటు అప్పుడప్పుడు క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను సైతం ప్రభావితం చేస్తుంటాడు. నమ్మరా?.. అయితే ఏప్రిల్‌లో మీమ్ క్రిప్టోకరెన్సీ డోజ్కాయిన్ విలువను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చిన విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు తన పెంపుడు కుక్క పోస్ట్‌తో మరోసారి అంతర్జాతీయ క్రిప్టోకరెన్సీ విలువలో తీవ్రమార్పులు తీసుకొచ్చాడు. డోజ్‌కాయిన్లను రెగ్యులర్‌గా ప్రమోట్ చేసే మస్క్.. ఇప్పుడు తన కోసం రంగంలోకి దిగాడు. సోమవారం ఉదయం మస్క్ తన పెంపుడు కుక్క ఫ్లోకి(షిబా ఇను జాతికి చెందిన పప్పీ) ఫొటోను షేర్ చేశాడు. దీంతో డోజ్కాయిన్, ఫ్లోకి ఇను కాయిన్ విలువలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే రెండు రోజులు గడిచినప్పటికీ ఈ విలువలో ఎలాంటి పతనం కనిపించకపోవడం విశేషం. Floki Frunkpuppy pic.twitter.com/xAr8T0Jfdf — Elon Musk (@elonmusk) October 4, 2021 తన పెంపుడుకుక్క మీద క్రిప్టోకరెన్సీ మొదలుపెట్టిన మస్క్.. ఇప్పుడు వాటిని తెలివిగా ప్రమోట్ చేస్తుండడం విశేషం. అయితే క్రిప్టోకరెన్సీ మీద జనాల ఫోకస్ మళ్లేలా చేస్తున్న ఎలన్ మస్క్ మీద గతకొంతకాలంగా నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. నమ్మించి తెలివిగా జనాల్ని ముంచేస్తున్నాడంటూ తిట్టిపోస్తున్నారు. ఈ తరుణంలో మస్క్‌ను ఉల్టా పెద్ద షాక్ ఇచ్చారు. #స్టాప్ఎలన్ (#StopElon) పేరుతోనూ క్రిప్టోకరెన్సీని డిజిటల్ లావాదేవీల్లోకి తీసుకురావడం విశేషం. చదవండి: సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్‌కాయిన్..! ఇక గత ఇరవై నాలుగు గంటల్లో ఫ్లోకి ఇను కాయిన్.. 22.13 శాతం పెరగ్గా.. ఆ క్రిప్టోకరెన్సీ విలువ 0.00006116డాలర్‌గా ఉంది. ఇక షిబు ఇను కాయిన్(SHIB) విలువ ఏకంగా 55 శాతం పెరిగి, 0.00001312డాలర్‌గా నిలిచింది. ఇదంతా మస్క్ చేసిన మాయాజాలం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే గుర్తతెలియని బయ్యర్(అది ఎలన్ మస్క్ ఏమో అని ఒక అనుమానం కూడా) ఒకరు SHIB కాయిన్స్‌ను 6.3 ట్రిలియన్ కాయిన్స్(సుమారు నాలుగున్నర కోట్ల డాలర్ల విలువచేసేవి) కొనుగోలు చేయడం విశేషం. చదవండి: చిలిపి మస్క్.. ‘అడల్ట్’ కరెన్సీ ప్రమోషన్