క్రిప్టోకరెన్సీలో మీమ్ డిజిటల్ కరెన్సీ భారీ లాభాలను పొందుతూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. షిబా ఇను ఐతే మరీను...! ఒక్కసారిగా గరిష్టలాభాలను గడించింది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. డోగీకాయిన్ స్ఫూర్తితో వచ్చిన షిబా ఇను మీమ్ క్రిప్టోకరెన్సీ సరికొత్త రికార్డులను నమోదుచేస్తోంది. తాజాగా షిబా ఇను మీమ్ క్రిప్టోకరెన్సీ విలువ ఆల్‌టైమ్ గరిష్టాలను తాకింది.
చదవండి: టెస్లా కార్లపై ఎలన్ వ్యాఖ్యలు, ఇప్పుడు వైరల్
ఆన్‌లైన్ పిటిషన్స్‌తో రయ్...!
రాబిన్‌హుడ్ లిస్టింగ్‌లో షిబా ఇను ట్రేడ్ చేయాలని ఆన్‌లైన్‌లో వస్తోన్న దరఖాస్తులతో ఈ మీమ్ క్రిప్టోకరెన్నీ సరికొత్త రికార్డులను తాకింది. ఇప్పటికి వరకు సుమారు 4 లక్షలకు పైగా యూజర్లు ఆన్‌లైన్‌లో పిటిషన్స్ దాఖలు చేశారు. షిబా ఇను మార్కెట్ క్యాప్ విలువ బుధవారం రోజున సుమారు 38 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాయిన్‌మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రకారం..షిబా ఇను 0.00008456 డాలర్లకు చేరుకుంది. ముందురోజు కంటే 72.62 శాతం మేర పెరిగింది.
ఎలన్ మస్క్ ప్రభావం అంతంతే..!
కొద్ది రోజుల క్రితం ఎలన్ ట్విటర్‌లో తన దగ్గర ఉన్న క్రిప్టోకరెన్సీ హోల్డింగ్స్ గురించి ఒక నెటిజన్ అడిగాడు. మీరు షిబా ఇను క్రిప్టోకరెన్సీ కలిగి ఉన్నారా..అని అడిగినందుకు సమాధానంగా..ఎలన్ మస్క్ తన దగ్గర కేవలం బిట్‌కాయిన్, ఈథిరియం, డోగీ కాయిన్ ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా డోగీకాయిన్ ప్రజల కరెన్సీ అంటూ ట్విటర్‌లో సమాధానమిచ్చారు.
షిబా ఇను క్రిప్టోకరెన్సీను సపోర్ట్ చేసే లిస్ట్‌లో లేదని తెలిసిన ఎలన్ మస్క్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు కొంతమేర షిబా ఇను ఇన్వెస్టర్లకు భయాన్ని కల్గజేశాయి. ఎందుకంటే డోగీకాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలను శాసించడంలో మస్క్ ముందుంటాడు. కాగా ఈ మీమ్ క్రిప్టోకరెన్సీపై ఎలన్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాడు.
చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..!
Comments
Please login to add a commentAdd a comment