Shiba Inu coin
-
సింగిల్ డేలో...ఒక లక్షను కాస్త రూ. 26 లక్షలు చేసిన మీమ్ కాయిన్..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీలో అగ్రగణ్యుడైన బిట్‌కాయిన్‌తో సరిసమానంగా ఆయా ఆల్ట్ కాయిన్స్ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చి పెడుతున్నాయి. డోజీ కాయిన్, షిబా ఇను లాంటి మీమ్ కాయిన్స్ కూడా భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. వీటితో పాటుగా కొత్తగా వచ్చిన ఎలియన్ షిబా ఇను కాయిన్ కూడా సింగిల్ డేలోనే భారీ లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. ఒక్కరోజులోనే 26 రెట్లు..! బిట్‌కాయిన్, ఈథెరియం వంటి అన్ని ప్రధాన క్రిప్టోకరెన్సీలు గత కొద్ది రోజుల నుంచి నేలచూపులు చూస్తున్నాయి. కాగా ఆల్ట్ కాయిన్స్ మాత్రం భారీ లాభాలను గడిస్తున్నాయి. క్రిప్టోమార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎలియన్ షిబా ఇను కాయిన్ ఆదివారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏలియన్ షిబా ఇను లేదా ASHIB కాయిన్ విలువ దాని మునుపటి విలువ కంటే 26 రెట్లు పెరిగింది. అంటే ఒక్క రోజులో ఏలియన్ షిబా ఇనులో శనివారం నాడు రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఆదివారం మధ్యాహ్నానికి రూ. 26 లక్షలకు పైగా రాబడిని తెచ్చి ఇచ్చింది. షిబా ఇను ఆదరణను క్యాష్ చేసుకునేందుకుగాను ఏలియన్ షిబా కాయిన్‌ను కొందరు డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. షిబా ఇను బుల్‌రన్‌ను కోల్పోయిన ఇన్వెస్టర్ల కోసం ఎలియన్ షిబా కాయిన్ అవకాశం కల్పిస్తోందని ఈ కాయిన్ డెవలపర్స్ అన్నారు. అంతేకాకుండా...ది ఏలియన్ ఇన్వేషన్ ఈజ్ఫైనల్ హియర్...! అనే ట్యాగ్‌లైన్ కూడా టాగ్ చేస్తూ ఇటీవల ఐలాండ్ బాయ్స్ పాడిన పాట కొద్ది రోజుల క్రితం సంచలనమైంది. CoinMarketCap డేటా ప్రకారం...Alien Shiba Inu ధర ఆదివారం మధ్యాహ్నం USD 0.009869 ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతకుముందు USD 0.000376 గా ఉంది. కాగా మళ్లీ కొద్ది క్షణాల్లోనే ఏలియన్ షిబా ఇను బుల్ రన్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ కాయిన్ దాదాపు USD 0.0025 వద్ద ట్రేడవుతోంది. చదవండి: మళ్లీ అదే అంధకారమా..! తెరపైకి మరోసారి Y2K సమస్య..! ప్రభావమెంతంటే..? -
2021లో జరిగిన క్రిప్టోకరెన్సీ లావాదేవీల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు భారీ ఆదరణను నోచుకున్నాయి. 2021లో క్రిప్టో ట్రేడర్స్ పెద్ద ఎత్తున లావాదేవీలను జరిపినట్లు ప్రముఖ గ్లోబల్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ఓకేఎక్స్ఛేంజ్ (OKEx) ఒక నివేదికలో వెల్లడించింది. 21 ట్రిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు..! ప్రపంచవ్యాప్తంగా ఓకేఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ను అనువైన ప్లాట్‌ఫాంగా మారింది. కేవలం ఈ ప్లాట్‌ఫాంలోనే 2021లో సుమారు 21 ట్రిలియన్ డాలర్ల విలువైన 25 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే క్రిప్టోలావాదేవీలు ఆల్‌టైం రికార్డుగా నిలిచిందని కంపెనీ వెల్లడించింది. 2022 క్రిప్టో భవితవ్యం ఎలా ఉంటుందంటే..! OKEx.com అంచనాల ప్రకారం..2022లో క్రిప్టో మార్కెట్ స్థిరమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తుందని విశ్వసించింది. క్రిప్టోకరెన్సీలతో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ప్లాట్‌ఫామ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయని అభిప్రాయపడింది. 2022లో పెట్టుబడిదారుల క్రిప్టో పోర్ట్‌ఫోలియోలో స్టేబుల్కాయిన్లు ప్రముఖ స్థానాన్ని సృష్టిస్తాయని ఓకేఎక్స్ఛేంజ్ తెలిపింది. స్టేబుల్‌కాయిన్ అనేది యూఎస్ డాలర్ వంటి జాతీయ కరెన్సీ లేదా బంగారం వంటి విలువైన లోహం వంటి అంతర్లీన ఆస్తికి అనుసంధానించబడిన డిజిటల్ కరెన్సీ. ఇక క్రిప్టోకరెన్సీలపై ఆయా దేశాల నిర్ణయాలు ఎలా ఉన్నా.... క్రిప్టోకరెన్సీ 2022లో స్థిరమైన ఒడిదుడుకులతో వృద్ధిని సాధిస్తాయని వెల్లడించింది. ఓకేఎక్స్ఛేంజ్ టాప్-5లో ఒకటి..! స్పాట్ అండ్ డెరివేటివ్స్ విభాగాలలో ట్రేడింగ్ వాల్యూమ్ల పరంగా ప్రపంచంలోని మొదటి ఐదు క్రిప్టో ఎక్స్ఛేంజీలలో ఓకేఎక్స్ఛేంజ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 20 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ప్లాట్‌ఫారమ్ ఓకేఎక్స్ఛేంజ్. 2021లో సుమారు 220 కొత్త క్రిప్టో కరెన్సీలు ఈ ప్లాట్‌ఫాంలో లిస్టింగ్ అయ్యాయి. చదవండి: The Most Popular Crypto In 2021: అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..? -
2021లో అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..?
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. 2021లో చూసుకుంటే క్రిప్టో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్ అత్యంత ప్రజాదరణను పొందింది. అయితే గత ఏడాదిలో బిట్‌కాయిన్ కాకుండా ఇతర ఆల్ట్ కాయిన్స్ భారీ ఆదరణను పొందాయి. బిట్‌కాయిన్ కంటే దీనిపైనే..! క్రిప్టోకరెన్సీల్లో బిట్‌కాయిన్ కంటే షిబా ఇను గత 12 నెలల్లో సుమారు 188 మిలియన్లకు పైగా ఇన్వెస్టర్లు వీక్షించినట్లు కాయిన్‌మార్కెట్‌క్యాప్ వెల్లడించింది. అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ 145 మిలియన్ల వీక్షణలతో రెండవ స్థానంలో ఉంది. షిబా ఇను అనేది ఇప్పటికే ఉన్న మీమ్ కాయిన్ డోజ్‌కాయిన్‌కు స్పిన్-ఆఫ్. ఎలన్ మస్క్ అపారంగా నమ్మే డోజీకాయిన్ సుమారు 107 మిలియన్ వీక్షణలతో జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. కారణం అదే..! క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్ అత్యంత విలువను కల్గి ఉంది. ఒకానొక సమయంలో బిట్‌కాయిన్ సుమారు 50 లక్షలకు కూడా చేరింది. ఈ కాయిన్ ఇన్వెస్ట్ చేయాలంటే పెట్టుబడిదారులు కొంతమేర భయపడ్డారు. బిట్‌కాయిన్ కంటే ఆల్ట్‌కాయిన్స్ విలువ తక్కువగా ఉండడంతో వీటిపై ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. ఇకపోతే షిబా ఇను వచ్చి కేవలం 15 నెలలు అయినప్పటికీ, ప్రస్తుతం 18 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే 13వ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉంది. అక్టోబర్‌లో ఈ క్రిప్టోకరెన్సీ నాలుగు రోజుల్లోనే 133 శాతం పెరిగి, ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 0.000088 డాలర్లకు చేరింది. రాబిన్ హుడ్ యాప్‌లో షిబా ఇను ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ యాప్, రాబిన్‌హుడ్‌లో జాబితా చేయబడే అవకాశం ఉందనే పుకార్లు ఈ కాయిన్ విలువ భారీగా పెరిగింది. షిబా ఇను ఇన్వెస్టర్లు రాబిన్ హుడ్ లో లిస్ట్ చేయాలని ఆన్లైన్లో సంతకాల సేకరణ కూడా చేపట్టారు. షిబా ఇను కాయిన్‌ను ఇప్పటికే ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ కాయిన్‌బేస్‌లో లిస్ట్ అయ్యింది. చదవండి: క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్.. -
క్రిప్టో.. తగ్గేదేలే!
బిట్‌కాయిన్.. ఎథీరియమ్.. షిబా ఇను, డోజికాయిన్.. ఇన్వెస్టర్ల ప్రపంచం క్రిప్టోల గురించి తెగ చర్చించుకుంటోంది. స్పెక్యులేటివ్ మద్దతుతో ఉన్నట్టుండి ఏదో ఒక క్రిప్టో టోకెన్ 24 గంటల్లోనే వందలు, వేల రెట్లు పెరిగేస్తోంది. దీంతో ఇన్వెస్టర్లలోనూ, ముఖ్యంగా యువ ఇన్వెస్టర్లలో చెప్పలేనంత ఆసక్తి ఏర్పడుతోంది. క్రిప్టోల గురించి పెద్దగా తెలియకపోయినా.. ఫోన్ నుంచే డిజిటల్‌గా క్రిప్టో ట్రేడింగ్ ఖాతా తెరిచేసి ఎంతో కొంత పెట్టుబడితో తమ దృష్టిలో పడిన క్రిప్టోను కొనుగోలు చేసే వాతావరణం నెలకొందనడంలో సందేహం లేదు. మనదేశంలోనే అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెట్టుబడులన్నీ క్రిప్టోలను వెతుక్కుంటూ వెళుతున్నాయి. సామాన్య ఇన్వెస్టర్లకే ఈ ధోరణి పరిమితం కాలేదు. ప్రముఖ కంపెనీల దగ్గర్నుంచి, ఫండ్ మేనేజర్ల వరకు అందరూ క్రిప్టోల్లో పెట్టుబడుల అవకాశాలను వెతుక్కుంటున్నారు. కాకపోతే, వీటితో ఎలా వేగాలో ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులకు అర్థం కాకుండా ఉంది. క్రిప్టో కరెన్సీ అంటే..? క్రిప్టోకరెన్సీలు అనేవి డిజిటల్ ఆస్తులు. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే క్రిప్టో కాయిన్లు, టోకెన్లను క్రిప్టోకరెన్సీలుగా పిలుస్తున్నారు. వీటిని పెట్టుబడి సాధనాలుగాను, ఆన్లైన్లో కొనుగోళ్లకు చెల్లింపుల సాధనాలుగానూ వినియోగిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ అన్నది భౌతికంగా ఉండదు. డిజిటల్లోనే ఉంటుంది. రూపీ, డాలర్, యూరో మాదిరిగా ఇవి ఫియట్ కరెన్సీలు కావు. ఎవరో ఒకరు నియం త్రించేవి కావు. వీటిపై సెంట్రల్ బ్యాంకుల నియంత్రణ ఉండదు. కనుక వీటిని డీసెంట్రలైజ్డ్గా పేర్కొంటారు. ఇంటర్నెట్ వేదికగా యూజర్ల మధ్య ఇవి చెలామణి అవుతుంటాయి. ప్రతీ కాయిన్ లేదా టోకెన్ ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ లేదా కోడ్‌తో రూపొందించబడి ఉంటాయి. కనుక వీటిని ట్రాక్ చేయడం, గుర్తించడం సులభతరం. క్రిప్టోగ్రఫీ, కరె న్సీ రెండింటి కలయికే.. క్రిప్టోకరెన్సీగా వాడుకలోకి వచ్చింది. క్రిప్టోకరెన్సీ లు క్రిప్టోగ్రఫిక్ సాంకేతికత ఆధారంగా లావాదేవీలను ధ్రువీకరిస్తుంటాయి. బ్లాక్ చైన్.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్‌చైన్ వేర్వేరు. క్రిప్టోకరెన్సీల అస్తిత్వానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీ తోడ్పడుతుంది. బ్లాక్‌చైన్ అన్నది డిజిటల్ లెడ్జర్. మొత్తం కంప్యూటర్ల నెట్వర్క్ పరిధిలో ప్రతి ఒక్క లావాదేవీని రికార్డెడ్‌గా నిర్వహిస్తుంటుంది. ప్రతీ నూతన లావాదేవీ నెట్వర్క్ పరిధిలోని ప్రతీ భాగస్వామి లెడ్జర్లో నమోదవుతుంది. ఎవరో ఒకరు నియంత్రించేది కాకుండా అవతరించిన సాంకేతికతే బ్లాక్‌చైన్. దీనికి ఉన్న ప్రత్యేకత ఇదే. బ్లాక్‌చెయిన్ అన్నది సమాచారాన్ని ప్యాకెట్ల రూపంలో కలిగి ఉంటుంది. దీన్ని బ్లాక్‌లుగా పిలుస్తారు. ఈ బ్లాక్‌లు ఒక చైన్ (గొలుసుగా)గా అనుసంధానమై ఉంటా యి. ఈ బ్లాక్‌లతో కూడిన చైన్‌ను ఎడిట్ చేయడానికి (దిద్దడానికి), మార్చడానికి అవకాశం ఉండదు. ఎంతో పటిష్టంగా ఉంటుంది. బ్లాక్ చైన్‌లో ప్రతీ లావాదేవీ సురక్షితంగా నమోదై ఉంటుంది. అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. బిట్‌కాయిన్, ఎథీరియమ్ ఇవన్నీ బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారంగా ఏర్పడినవే. కాకపోతే వీటిల్లో ఎథీరియమ్, సొలానా తదితర బ్లాక్ చెయిన్లు.. తమ నెట్‌వర్క్‌పై స్మార్ట్ కాంట్రాక్టుల (కోడ్)ను సృష్టించి, నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో నాన్ ఫంగిబుల్ టోకెన్లను ఏర్పాటు చేసుకుని విక్రయించుకోవచ్చు. ఈ నెట్ వర్క్‌ల సాయంతో ఎన్నో క్రిప్టో టోకెన్ల సృష్టికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పాలిగాన్ (మేటి క్) అన్నది ఎథీరియమ్ బ్లాక్ చైన్‌పై ఏర్పడిందే. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం క్రిప్టో ఇన్వెస్టర్లు 18–34 ఏళ్లలోపు వారే. మరో 20 శాతం మంది 35–44 ఏళ్ల వయసులోపు వారున్నట్టు ఫైండర్స్ క్రిప్టోకరెన్సీ నివేదిక స్పష్టం చేస్తోంది. టెస్లా, ఫేస్బుక్, పేపాల్, వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్, మైక్రో స్ట్రాటజీ, బ్లాక్‌రాక్, ఏఆర్కే ఇన్వెస్ట్మెంట్స్ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టడం, ఈ టెక్నాలజీపై పనిచేయడం మొదలు పెట్టాయి. టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ సైతం బిట్‌కాయిన్, డోజికాయన్ తదితర క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసినట్టు స్వయంగా ప్రకటించారు. ఏది చేస్తే మెరుగు..? క్రిప్టోలను అధికారిక కరెన్సీలుగా ఆమోదించే పరిస్థితి లేదు. పెట్టుబడి సాధనాలుగా వీటిని పరిగణించి, పన్నుల రూపంలో ఆదాయం రాబట్టుకోవాలన్న యోచనను కేంద్రంలోని కొందరు సీనియర్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వినూత్న సాంకేతికతకు దారిచూపుతున్న క్రిప్టోలను పూర్తిగా నిషేధించినట్టయితే భారత్ మంచి అవకాశం కోల్పోయినట్టు అవుతుందని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గత శనివారం క్రిప్టోలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ టెక్నాలజీపై నిపుణులు, భాగస్వాములతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా క్రిప్టోలపై ప్రచారం, ప్రకటనలను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, క్రిప్టోలను అనుమతించడానికి ఆర్బీఐ సుముఖంగా లేదు. స్థూల ఆర్థిక పరిస్థితులకు వీటితో పెద్ద సమస్య వచ్చి పడుతుందని, ప్రపంచవ్యాప్తంగా నియంత్రణల పరిధిలో లేని ఇవి పెట్టుబడి సాధనాలుగా ఆమోదనీయం కాదని ఆర్బీఐ తన అభిప్రాయంగా కేంద్రానికి తెలియజేసింది. క్రిప్టోల్లో పెట్టుబడులకు అనుమతిస్తే.. అవి ఉగ్రవాదులకు, మనీలాండరింగ్ కార్యకలాపాలకు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళలను కూడా దర్యాప్తు సంస్థలు, ఆర్బీఐ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. క్రిప్టో లావాదేవీలపై కఠిన నియంత్రణలు ఉండాలని, లేదంటే ఇంటి పొదుపులు అనియంత్రిత సాధనాల్లోకి మళ్లితే ప్రమాదంలో పడినట్టు అవుతుందన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. దేశంలో క్రిప్టోల నిషేధం లేదా నియంత్రణకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చట్టం లేనందున రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఎన్ని క్రిప్టోలు ఉన్నాయి? బిట్ కాయిన్‌ను మొదటి క్రిప్టోకరెన్సీగా చెబుతారు. 2009లో ఇది ఏర్పడింది. దీని ఆవిష్కర్త సతోషి నకమొటో. ఎవరైనా ఇందులో పాల్గొనే విధంగా డీసెంట్రలైజ్డ్ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశారు. ఎవరో ఒకరికి పరిమితం కాకుండా.. అందరికీ చెందేలా దీన్ని రూపొందించడం విశేషం. క్రిప్టో కరెన్సీ యూనిట్లను మైనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టిస్తారు. క్లిష్టమైన మ్యాథమేటికల్ ఆల్గోరిథమ్‌ల కంప్యూటేషన్తో వర్చువల్ కాయిన్లను మైనింగ్ చేస్తుంటారు. క్రిప్టోలకు సంబంధించి అపరిమిత మైనింగ్‌కు అవకాశం లేకుండా పరిమితి ఉంటుంది. బిట్కాయిన్లను 21 మిలియన్లకు మించి మైనింగ్ చేయకుండా సతోషి నకమొటో పరిమితి విధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి 6,000కు పైగా క్రిప్టోలున్నాయని అంచనా. మన దేశంలో సుమారు 10 కోట్ల మంది ఇప్పటికే క్రిప్టోల్లో పెట్టుబడులు కూడా పెట్టేశారు. క్రిప్టో ఇన్వెస్టర్ల పరంగా భారత్ మిగతా దేశాలను వెనక్కి నెట్టేసింది. అగ్రరాజ్యం అమెరికాలోనూ క్రిప్టో ఇన్వెస్టర్ల సంఖ్య 2.74 కోట్లుగానే ఉంది. మొత్తం జనాభాలో క్రిప్టో ఇన్వెస్టర్ల శాతం (7.30) పరంగా భారత్ ఐదో స్థానంలో ఉంది. ఉక్రెయిన్ 12.73 శాతంతో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. భారతీయుల క్రిప్టో పెట్టుబడులు సుమారు 10 బిలియన్ డాలర్లు (రూ.75,000 కోట్లు) చేరి ఉంటాయని ఒక అంచనా. మనదేశంలో సుమారు 100కు పైనే క్రిప్టో కాయిన్లు కొనుగోళ్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. బిట్‌కాయిన్, ఎథీరియమ్, టెథర్ (యూఎస్డీటీ), షిబా ఇను, డోజికాయన్, పాలీగాన్ (మ్యాటిక్), కార్డనో, సొలాన, పోల్కడాట్, లైట్‌కాయిన్ వీటికి మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ ఆదరణ ఉంది. కాయిన్ డీసీఎక్స్, వాజిర్ఎక్స్, యునోకాయిన్, కాయిన్‌స్విచ్ కుబేర్, జెబ్‌పే సంస్థలు మన దేశంలో క్రిప్టో సేవలు అందిస్తున్నాయి. వీటి ల్లో వ్యాలెట్‌ను తెరిచి ట్రేడింగ్ చేసుకోవచ్చు. -
ఎలన్‌మస్క్ కూడా ఏం చేయలేకపోయాడే..! రయ్‌రయ్‌మంటూ..
క్రిప్టోకరెన్సీలో మీమ్ డిజిటల్ కరెన్సీ భారీ లాభాలను పొందుతూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. షిబా ఇను ఐతే మరీను...! ఒక్కసారిగా గరిష్టలాభాలను గడించింది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. డోగీకాయిన్ స్ఫూర్తితో వచ్చిన షిబా ఇను మీమ్ క్రిప్టోకరెన్సీ సరికొత్త రికార్డులను నమోదుచేస్తోంది. తాజాగా షిబా ఇను మీమ్ క్రిప్టోకరెన్సీ విలువ ఆల్‌టైమ్ గరిష్టాలను తాకింది. చదవండి: టెస్లా కార్లపై ఎలన్ వ్యాఖ్యలు, ఇప్పుడు వైరల్ ఆన్లైన్ పిటిషన్స్‌తో రయ్...! రాబిన్‌హుడ్ లిస్టింగ్‌లో షిబా ఇను ట్రేడ్ చేయాలని ఆన్లైన్లో వస్తోన్న దరఖాస్తులతో ఈ మీమ్ క్రిప్టోకరెన్నీ సరికొత్త రికార్డులను తాకింది. ఇప్పటికి వరకు సుమారు 4 లక్షలకు పైగా యూజర్లు ఆన్లైన్లో పిటిషన్స్ దాఖలు చేశారు. షిబా ఇను మార్కెట్ క్యాప్ విలువ బుధవారం రోజున సుమారు 38 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాయిన్‌మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రకారం..షిబా ఇను 0.00008456 డాలర్లకు చేరుకుంది. ముందురోజు కంటే 72.62 శాతం మేర పెరిగింది. ఎలన్ మస్క్ ప్రభావం అంతంతే..! కొద్ది రోజుల క్రితం ఎలన్ ట్విటర్లో తన దగ్గర ఉన్న క్రిప్టోకరెన్సీ హోల్డింగ్స్ గురించి ఒక నెటిజన్ అడిగాడు. మీరు షిబా ఇను క్రిప్టోకరెన్సీ కలిగి ఉన్నారా..అని అడిగినందుకు సమాధానంగా..ఎలన్ మస్క్ తన దగ్గర కేవలం బిట్‌కాయిన్, ఈథిరియం, డోగీ కాయిన్ ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా డోగీకాయిన్ ప్రజల కరెన్సీ అంటూ ట్విటర్లో సమాధానమిచ్చారు. షిబా ఇను క్రిప్టోకరెన్సీను సపోర్ట్ చేసే లిస్ట్‌లో లేదని తెలిసిన ఎలన్ మస్క్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు కొంతమేర షిబా ఇను ఇన్వెస్టర్లకు భయాన్ని కల్గజేశాయి. ఎందుకంటే డోగీకాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలను శాసించడంలో మస్క్ ముందుంటాడు. కాగా ఈ మీమ్ క్రిప్టోకరెన్సీపై ఎలన్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాడు. చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..!