సింగిల్‌ డేలో...ఒక లక్షను కాస్త రూ. 26 లక్షలు చేసిన మీమ్‌ కాయిన్‌..! | Alien Shiba Inu Another Meme Coin Turns Rs 1 Lakh To Rs 26 Lakh Plus In A Day | Sakshi
Sakshi News home page

Alien Shiba Inu: సింగిల్‌ డేలో...ఒక లక్షను కాస్త రూ. 26 లక్షలు చేసిన మీమ్‌ కాయిన్‌..!

Published Tue, Jan 11 2022 3:29 PM | Last Updated on Tue, Jan 11 2022 5:35 PM

Alien Shiba Inu Another Meme Coin Turns Rs 1 Lakh To Rs 26 Lakh Plus In A Day - Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీలో అగ్రగణ్యుడైన బిట్‌కాయిన్‌తో సరిసమానంగా ఆయా ఆల్ట్‌ కాయిన్స్‌ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చి పెడుతున్నాయి. డోజీ కాయిన్‌, షిబా ఇను లాంటి మీమ్‌ కాయిన్స్‌ కూడా భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. వీటితో పాటుగా కొత్తగా వచ్చిన ఎలియన్‌ షిబా ఇను కాయిన్‌ కూడా సింగిల్‌ డేలోనే భారీ లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. 

ఒక్కరోజులోనే 26 రెట్లు..!
బిట్‌కాయిన్, ఈథెరియం వంటి అన్ని ప్రధాన క్రిప్టోకరెన్సీలు గత కొద్ది రోజుల నుంచి నేలచూపులు చూస్తున్నాయి. కాగా ఆల్ట్‌ కాయిన్స్‌ మాత్రం భారీ లాభాలను గడిస్తున్నాయి. క్రిప్టోమార్కెట్‌లోకి  కొత్తగా వచ్చిన ఎలియన్‌ షిబా ఇను కాయిన్‌ ఆదివారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏలియన్ షిబా ఇను లేదా ASHIB కాయిన్‌ విలువ దాని మునుపటి విలువ కంటే 26 రెట్లు పెరిగింది.

అంటే ఒక్క రోజులో ఏలియన్ షిబా ఇనులో శనివారం నాడు రూ. 1 లక్ష ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఆదివారం మధ్యాహ్నానికి రూ. 26 లక్షలకు పైగా రాబడిని తెచ్చి ఇచ్చింది. షిబా ఇను ఆదరణను క్యాష్‌ చేసుకునేందుకుగాను ఏలియన్‌ షిబా కాయిన్‌ను కొందరు డెవలప్‌ చేసినట్లు తెలుస్తోంది. షిబా ఇను బుల్‌రన్‌ను కోల్పోయిన ఇన్వెస్టర్ల కోసం ఎలియన్‌ షిబా కాయిన్‌ అవకాశం కల్పిస్తోందని ఈ కాయిన్‌ డెవలపర్స్‌ అన్నారు. అంతేకాకుండా...ది ఏలియన్‌ ఇన్వేషన్‌ ఈజ్‌ఫైనల్‌ హియర్‌...! అనే ట్యాగ్‌లైన్‌ కూడా టాగ్‌ చేస్తూ ఇటీవల ఐలాండ్‌  బాయ్స్‌ పాడిన పాట కొద్ది రోజుల క్రితం సంచలనమైంది. 

CoinMarketCap డేటా ప్రకారం...Alien Shiba Inu ధర ఆదివారం మధ్యాహ్నం USD 0.009869 ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతకుముందు USD 0.000376 గా ఉంది. కాగా మళ్లీ కొద్ది క్షణాల్లోనే  ఏలియన్ షిబా ఇను బుల్ రన్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ కాయిన్‌ దాదాపు USD 0.0025 వద్ద ట్రేడవుతోంది.

చదవండి: మళ్లీ అదే అంధకారమా..! తెరపైకి మరోసారి Y2K సమస్య..! ప్రభావమెంతంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement