గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు భారీ ఆదరణను నోచుకున్నాయి. 2021లో క్రిప్టో ట్రేడర్స్ పెద్ద ఎత్తున లావాదేవీలను జరిపినట్లు ప్రముఖ గ్లోబల్ క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాం ఓకేఎక్స్‌ఛేంజ్ (OKEx) ఒక నివేదికలో వెల్లడించింది.
21 ట్రిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు..!
ప్రపంచవ్యాప్తంగా ఓకేఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫాం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ను అనువైన ప్లాట్‌ఫాంగా మారింది. కేవలం ఈ ప్లాట్‌ఫాంలోనే 2021లో సుమారు 21 ట్రిలియన్ డాలర్ల విలువైన 25 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే క్రిప్టోలావాదేవీలు ఆల్‌టైం రికార్డుగా నిలిచిందని కంపెనీ వెల్లడించింది.
2022 క్రిప్టో భవితవ్యం ఎలా ఉంటుందంటే..!
OKEx.com అంచనాల ప్రకారం..2022లో క్రిప్టో మార్కెట్ స్థిరమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తుందని విశ్వసించింది. క్రిప్టోకరెన్సీలతో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ప్లాట్‌ఫామ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయని అభిప్రాయపడింది. 2022లో పెట్టుబడిదారుల క్రిప్టో పోర్ట్‌ఫోలియోలో స్టేబుల్‌కాయిన్‌లు ప్రముఖ స్థానాన్ని సృష్టిస్తాయని ఓకేఎక్స్‌ఛేంజ్ తెలిపింది. స్టేబుల్‌కాయిన్ అనేది యూఎస్ డాలర్ వంటి జాతీయ కరెన్సీ లేదా బంగారం వంటి విలువైన లోహం వంటి అంతర్లీన ఆస్తికి అనుసంధానించబడిన డిజిటల్ కరెన్సీ. ఇక క్రిప్టోకరెన్సీలపై ఆయా దేశాల నిర్ణయాలు ఎలా ఉన్నా.... క్రిప్టోకరెన్సీ 2022లో స్థిరమైన ఒడిదుడుకులతో వృద్ధిని సాధిస్తాయని వెల్లడించింది.
ఓకేఎక్స్‌ఛేంజ్ టాప్-5లో ఒకటి..!
స్పాట్ అండ్ డెరివేటివ్స్ విభాగాలలో ట్రేడింగ్ వాల్యూమ్‌ల పరంగా ప్రపంచంలోని మొదటి ఐదు క్రిప్టో ఎక్స్ఛేంజీలలో ఓకేఎక్స్‌ఛేంజ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 20 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ప్లాట్‌ఫారమ్ ఓకేఎక్స్‌ఛేంజ్. 2021లో సుమారు 220 కొత్త క్రిప్టో కరెన్సీలు ఈ ప్లాట్‌ఫాంలో లిస్టింగ్ అయ్యాయి.
చదవండి: The Most Popular Crypto In 2021: అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..?
Comments
Please login to add a commentAdd a comment