Bitcoin
-
దుమ్ము రేపుతున్న... ట్రంప్ మీమ్ బిట్‌కాయిన్
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష పీఠంపై కూర్చోడానికి ఒక్కరోజు ముందే సొంత (Bitcoin)బిట్‌కాయిన్‌ను ట్రంప్ మార్కెట్లోకి తెచ్చారు. $TRUMP పేరిట తెచ్చిన ఈ కాయిన్ (టోకెన్)కు మార్కెట్లో అనూహ్య డిమాండ్ నెలకొంది. ఔత్సాహిత పెట్టుబడిదారులు దాన్ని ఎగబడి కొనుగోలు చేశారు. దాంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ గంటల్లోనే ఏకంగా 5.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వార్తలొచ్చాయి. ‘‘మొత్తంగా 100 కోట్ల టోకెన్లు తెస్తాం. ప్రారంభం రోజున 20 కోట్ల కాయిన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాం. మూడేళ్లలో దశలవారీగా 80 కోట్ల కాయిన్లను తీసుకొస్తాం’’ అని $TRUMP మీమ్ కాయిన్లను జారీచేసిన వెబ్సైట్ ప్రకటించింది. (Trump)ట్రంప్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ ఈ కాయిన్ విక్రయాల బాధ్యతలను చూసుకుంటోంది. సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ గతంలో ట్రంప్ బ్రాండ్‌నేమ్‌తో పాదరక్షలు, సుగందద్రవ్యాలు విక్రయించింది. ట్రంప్ పేరుతో గతంలో బైబిళ్లు, బంగారు బూట్లు, వజ్రాల వాచీలు కూడా అమ్ముడవడం తెలిసిందే. మీమ్ కాయిన్లను సాధారణంగా స్కామర్లు వినియోగిస్తారు. అధిక లాభా లు గడించాలన్న అత్యాశపరులైన పెట్టుబడిదారుల నుంచి సంపదను కాజేసేందుకు వాటిని వాడతారని క్రిప్టో కరెన్సీ మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
క్రిప్టో కరెన్సీకి జాతీయ ప్రాధాన్యత.. ట్రంప్ యోచన!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలిచాక క్రిప్టో కరెన్సీకి (cryptocurrency) కొత్త ఊపు వచ్చింది. ట్రంప్ మొదటి నుంచి కూడా క్రిప్టో కరెన్సీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా క్రిప్టో కరెన్సీని మార్చేందుకు ఉత్తర్వులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది.ఈ చర్య అమెరికా విధాన మార్పును సూచిస్తుందని, ప్రభుత్వ నిర్ణయాలను రూపొందించడంలో క్రిప్టో పరిశ్రమకు మరింత ప్రాముఖ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. నివేదికలో పేర్కొన్న మూలాల ప్రకారం.. ఈ ఉత్తర్వులు క్రిప్టోకరెన్సీని జాతీయ ఆవశ్యకతగా నిర్దేశిస్తాయి. క్రిప్టో పరిశ్రమకు ప్రభుత్వ ఏజెన్సీలు సైతం సహకారం అందిస్తాయి. అంతేకాకుండా పరిశ్రమ విధాన అవసరాల కోసం క్రిప్టోకరెన్సీ సలహా మండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కాయిన్‌బేస్, రిపుల్ వంటి ప్రముఖ సంస్థల నుండి విరాళాలతో సహా క్రిప్టోకరెన్సీ పరిశ్రమ నుండి గణనీయమైన మద్దతును పొందారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో రానున్న కొత్త ప్రభుత్వంతో తమ బంధాన్ని సూచించేలా వాషింగ్టన్లో క్రిప్టో పరిశ్రమ వేడుకలకు సిద్ధమైందిజాతీయ బిట్‌కాయిన్ నిధియూఎస్లో జాతీయ బిట్‌కాయిన్ (Bitcoin) నిధిని సృష్టించడం పరిశీలనలో ఉన్న మరో కీలక అంశంగా నివేదిక పేర్కొంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్‌ను కలిగి ఉంది. నవంబర్ ఎన్నికల నుండి బిట్‌కాయిన్ ధర దాదాపు 50% పెరిగింది. భవిష్యత్తులో క్రిప్టో నిల్వలు పెరుగుతాయన్న ఊహాగానాల కారణంగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు చేరుకుంది.ప్రతిపాదిత నిధి ప్రభుత్వం బిట్కాయిన్లను కలిగి ఉండటాన్ని లాంఛనప్రాయంగా మారుస్తుంది. క్రిప్టోకరెన్సీ పట్ల ప్రభుత్వ వైఖరిలో వ్యూహాత్మక మార్పును ప్రతిబింబిస్తుంది. బిట్‌కాయిన్ 2024లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. దాని విలువ సంవత్సరంలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది.బైడెన్ పాలనలో ఒడుదొడుకులుఅధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో అనేక నియంత్రణ సవాళ్లను ఎదుర్కొన్న క్రిప్టో రంగానికి ఈ చొరవ భారీ మార్పును సూచిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)తో సహా ఫెడరల్ ఏజెన్సీలు ఇటీవలి సంవత్సరాలలో క్రిప్టో కంపెనీలకు వ్యతిరేకంగా 100 కుపైగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాయి. -
2024లో 120 శాతం: 2025లో బిట్‌కాయిన్ వృద్ధి ఎలా ఉంటుందంటే?
ఒకప్పుడు క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ (Bitcoin) విలువ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ 'బిట్‌కాయిన్' అనే స్థాయికి చేరిపోయింది. 2024లో ఇది ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదు చేసింది.యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందు.. వరుస ర్యాలీని అనుసరించి పెట్టుబడిదారులు లాభాలను పొందడం ప్రారంభించడంతో, డిసెంబర్లో బిట్‌కాయిన్ 3.2 శాతం పడిపోయింది. అయితే ఈ ఏడాది దీని విలువ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.83 లక్షల కంటే ఎక్కువ. ఇది బంగారం & గ్లోబల్ ఈక్విటీలను సైతం అధిగమించింది. 2025 జనవరి 20 వరకు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు.. బిట్‌కాయిన్ విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉంది.2025లో బిట్కాయిన్డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. బిట్‌కాయిన్ విలువ మరింత పెరుగుతుందని క్రిప్టో ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు, యూనివర్సిటీ ఎండోమెంట్ ఫండ్స్ కూడా బిట్‌కాయిన్‌ను స్వీకరిస్తున్నాయి. దీంతో బిట్‌కాయిన్ మరింత బలపడే అవకాశం ఉందని QCP క్యాపిటల్స్ వెల్లడించింది.2024లో కంటే ఈ ఏడాది బిట్‌కాయిన్ విలువ గణనీయంగా పెరుగుతుందని.. బినాన్స్ రీజనల్ మార్కెట్స్ హెడ్ 'విశాల్ సచీంద్రన్' అన్నారు. అధికారులతో బలమైన సహకారాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా.. వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బ్లాక్‌చెయిన్ యుటిలిటీని పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో భారతదేశం యొక్క పాత్ర పట్ల ఆయన ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: హార్డ్ డ్రైవ్‌లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాటక్రిప్టో రంగం కీలకమైన దశలోకి ప్రవేశిస్తోందని.. మెరుగైన వృద్ధిని ఆశించవచ్చని కాయిన్ డీసీఎక్స్ కో ఫౌండర్ 'సుమిత్ గుప్తా' వెల్లడించారు. బిట్‌కాయిన్ షేర్ కూడా 10-15 శాతం పెరుగుతుందని అన్నారు. క్రిప్టో & వెబ్3 కంపెనీల IPOల ద్వారా నడిచే సంస్థాగత పెట్టుబడి గురించి గుప్తా ఆశాజనకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2025 కీలకమైన సంవత్సరంగా ఉంటుందని వివరించారు.జెబ్ పే సీఈఓ 'రాహుల్ పగిడిపాటి', పీఐ42 కో ఫౌండర్ అండ్ సీఈఓ 'అవినాష్ శేఖర్', సీఐఎఫ్డీఏక్యూ ఛైర్మన్ & ఫౌండర్ 'హిమాన్షు మరడియా', డెల్టా ఎక్స్ఛేంజ్ కో ఫౌండర్ అండ్ సీఈఓ 'పంకజ్ బాలని' వంటి వారు కూడా బిట్‌కాయిన్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు. -
రెండే రెండు పిజ్జాలు.. రూ. 8 వేల కోట్లు
ఒక బిట్‌కాయిన్ ధర ఈ రోజు సుమారు రూ. 80 లక్షల కంటే ఎక్కువే. కాబట్టి ఎవరైనా 10,000 బిట్కాయిన్లను కలిగి ఉంటే.. అతడు పెద్ద సంపన్నుడనే చెప్పాలి. అయితే కొన్ని సంవత్సరాలకు ముందు ఓ వ్యక్తి 10వేల బిట్కాయిన్లు (Bitcoins) చెల్లించి కేవలం రెండు పిజ్జాలను కొనుగోలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.అమెరికాకు చెందిన ఐటీ ప్రోగ్రామర్ 'లాస్లో హనిఎజ్' (Laszlo Hanyecz) 2010 మే 17న తన దగ్గరున్న 10వేల బిట్కాయిన్లను డాలర్లలోకి మార్చుకున్నాడు. ఆ డాలర్లతో 2 డామినోస్ పిజ్జాలను ఆర్డర్ చేసుకుని తినేసాడు. ఆ బిట్కాయిన్ల విలువ నేడు రూ. 8వేల కోట్లు. అయితే హనిఎజ్ ఇప్పుడు పశ్చాతాప పడిన ఏం ప్రయోజనం లేదు.బిట్‌కాయిన్2010లో ఒక బిట్‌కాయిన్ విలువ 0.05 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.29 రూపాయలకు సమానమన్నమాట. అయితే ఈ రోజు ఒక బిట్‌కాయిన్ విలువ రూ. 80 లక్షల కంటే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే బిట్‌కాయిన్ విలువ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.అమెరికా ఎన్నికల్లో 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) గెలిచిన తరువాత బిట్‌కాయిన్ విలువ భారీగా పెరిగింది. కొన్నాళ్ల కిందట తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఇప్పుడు లక్ష డాలర్ల మార్కుని దాటేసింది. కాగా ఇటీవల కాలంలో బిట్‌కాయిన్ కొంత తగ్గుముఖం పట్టింది. ట్రంప్ గెలుపు తరువాత బిట్‌కాయిన్ విలువ తగ్గడం ఇదే మొదటిసారి. -
హార్డ్ డ్రైవ్‌లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాట
ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకున్న తరువాత.. దాని విలువ హఠాత్తుగా పెరిగితే, దాని కోసం ఎక్కడపడితే అక్కడ వెతికేస్తాం. అంతెందుకు జేబులో ఉన్న ఓ వంద రూపాయలు ఎక్కడైనా పడిపోతేనే మనం ఎక్కడెక్కడ తిరిగామో.. అక్కడంతా వెతికేస్తాం. అయితే ఓ వ్యక్తి వేలకోట్ల విలువ గలిగిన బిట్కాయిన్లు ఉన్న హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడు. దాన్ని వెదకడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో.. ఈ కథనంలో చూసేద్దాం.జేమ్స్ హోవెల్స్ అనే వ్యక్తి 2013లో అనుకోకుండా.. 7500 బిట్కాయిన్లు ఉన్న ఒక హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడు. అయితే దాని విలువ ఇప్పుడు 771 మిలియన్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 65 వేలకోట్ల కంటే ఎక్కువ.తన హార్డ్ డ్రైవ్ స్థానిక స్థానిక ల్యాండ్‌ఫిల్ (డంప్‌యార్డ్) ప్రాంతంలో ఉంటుందని, డ్రైవ్ కోసం త్రవ్వడానికి అనుమతించమని న్యూపోర్ట్, వేల్స్ కౌన్సిల్‌ని ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అనుమతిస్తే.. బిట్‌కాయిన్‌లో 10% లేదా దాదాపు 77 మిలియన్లను స్థానిక కమ్యూనిటీకి విరాళంగా ఇస్తానని పేర్కొన్నాడు.హార్డ్ డ్రైవ్‌ను వెదకడానికి హోవెల్స్ తన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాడు. మొత్తం సమయాన్ని కేవలం ఆ డ్రైవ్‌ను వెదకడానికే కేటాయించాడు. దీనిని వెదకడంలో అతనికి సహాయం చేయడానికి నిపుణుల బృందాన్ని కూడా నియమించుకున్నాడు. అంతటితో ఆగకుండా.. హోవెల్స్ ల్యాండ్‌ఫిల్‌ను శోధించే హక్కు కోసం నగరంపై దావా వేసి 629 మిలియన్ల నష్టపరిహారం కోరాడు.హోవెల్స్ కేసు ఇటీవల న్యాయమూర్తి ముందుకు వచ్చింది. హైకోర్టులో పూర్తిస్థాయి విచారణకు రాకముందే కేసును కొట్టివేయాలని న్యూపోర్ట్ అథారిటీ ప్రయత్నిస్తోంది. ల్యాండ్‌ఫిల్‌లోకి వెళ్ళేదంతా కౌన్సిల్ యాజమాన్యంలోకి వస్తుందని చెప్పారు. తవ్వకానికి అనుమతి ఇస్తే సంఘానికి డబ్బు అందజేస్తామని ఇచ్చిన ప్రతిపాదనను.. కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేమ్స్ గౌడ్ కేసీ.. లంచం అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వేల సంవత్సరాలు పనిచేసే డైమండ్ బ్యాటరీ ఇదే..హోవెల్స్ అభ్యర్థన మేరకు ల్యాండ్‌ఫిల్ తవ్వకాలు జరిపితే.. పర్యావరణానికి ప్రమాదం అని అన్నారు. అంతే కాకుండా తవ్వకాలకు అనుమతిస్తే, పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం చెత్తలో ఉన్న హార్డ్ డ్రైవ్‌లో డేటా ఉంటుందా? అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఎవరెన్ని చెప్పినా హోవెల్స్ మాత్రం హార్డ్ డ్రైవ్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. -
ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టేసిన బిట్‌కాయిన్
ప్రముఖ క్రిప్టో కరెన్సీల్లో ఒకటైన బిట్‌కాయిన్ ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను కొట్టేసింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో ఆయన పరిపాలన క్రిప్టోకరెన్సీలకు స్నేహపూర్వక నియంత్రణ వాతావరణాన్ని సృష్టిస్తుందనే అంచనాల క్రమంలో గురువారం మొదటిసారిగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు పైగా పెరిగింది.బిట్‌కాయిన్ విలువ ఈ ఏడాదిలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన ఈ నాలుగు వారాల్లోనే దాదాపు 45 శాతం ఎగిసింది. "మనం ఒక నమూనా మార్పును చూస్తున్నాం. నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రక్షాళన తర్వాత, బిట్‌కాయిన్‌తోపాటు మొత్తం డిజిటల్ అసెట్ ఎకోసిస్టమ్ ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి ప్రవేశించే అంచున ఉన్నాయి" అని యూఎస్ క్రిప్టో సంస్థ గెలాక్సీ డిజిటల్ వ్యవస్థాపకుడు, సీఈవో మైక్ నోవోగ్రాట్జ్ అన్నారు."బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లు దాటడం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఫైనాన్స్, టెక్నాలజీ, జియోపాలిటిక్స్‌లో మారుతున్న ఆటుపోట్లకు ఇది నిదర్శనం" అని హాంకాంగ్‌కు చెందిన స్వతంత్ర క్రిప్టో విశ్లేషకుడు జస్టిన్ డి'అనేతన్ అన్నారు. చాలా కాలం క్రితం ఫాంటసీగా కొట్టేసిన ఈ ఫిగర్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందన్నారు.ట్రంప్ తన ప్రచార సమయంలో డిజిటల్ అసెట్స్‌ను ప్రోత్సహిస్తామని, యునైటెడ్ స్టేట్స్ను "క్రిప్టో రాజధాని"గా చేస్తానని వాగ్దానం చేశారు. దీంతో క్రిప్టో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. కాగా ప్రస్తుతం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న గ్యారీ జెన్స్లర్.. ట్రంప్ అధికారం చేపట్టాక జనవరిలో పదవీవిరమణ చేస్తానని గత వారం చెప్పారు. ఈ పదవికి ఎస్ఈసీ మాజీ కమిషనర్ పాల్ అట్కిన్స్ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. -
మహారాష్ట్రలో వేల కోట్ల బిట్‌కాయిన్ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు
ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్‌కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్మీట్లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్‌లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. -
బంగారం Vs బిట్‌కాయిన్.. ఏది బెస్ట్..?
-
బిట్ కాయిన్ కి ట్రంప్ కిక్కు.. ఇన్వెస్టర్లు ఫుల్ ఖుష్..! ఇక కోట్లే..!
-
ట్రంప్ మాట.. అమాంతం ఎగిసిన బిట్ కాయిన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక యూఎస్ డాలర్ దూసుకెళ్తోంది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ మంగళవారం నాలుగు నెలల గరిష్ట స్థాయికి దగ్గరగా బలపడింది. మరోవైపు రానున్న ట్రంప్ పాలనలో ప్రయోజనం ఉంటుందన్న భావనతో ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వైపు దృష్టి సారించడంతో బిట్ కాయిన్ విలువ మంగళవారం అమాంతం పెరిగి సరికొత్త ఆల్‌టైమ్ హైకి చేరింది.యూరో విలువ రాత్రికి రాత్రే దాదాపు ఏడు నెలల పతనానికి చేరుకుంది. అలాగే చైనీస్ యువాన్ కూడా మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. యూరోతో సహా ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే యూఎస్ డాలర్ ఇండెక్స్.. జూలై 3 తర్వాత మొదటిసారి సోమవారం నాడు 105.70కి చేరగా ఇప్పుడు (0037 GMT) 0.07% పెరిగి 105.49కి చేరుకుంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్కాబోయే అధ్యక్షుడు ట్రంప్ క్రిప్టోకరెన్సీకి అత్యధిక ప్రాధన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ మంగళవారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 89,637 డాలర్లు (రూ. 7.44 లక్షలు)కి చేరుకుంది. తాను గెలిచాక అమెరికాను " క్రిప్టో రాజధాని"గా మారుస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఏడాది ముగిసేలోపు బిట్‌కాయిన్ లక్ష డాలర్ల మార్కును తాకుతుందని క్యాపిటల్ డాట్ కామ్ (Capital.com) సీనియర్ ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు కైల్ రోడ్డా అంటున్నారు. -
శిల్పాశెట్టి దంపతులకు భారీ ఊరట కల్పించిన కోర్టు
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ కేసు విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి , రాజ్‌కుంద్రా దంపతులకు కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ మోసాలకు పాల్పడ్డారని వారి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా, ఫామ్‌హౌస్‌ను అక్టోబర్ 13వ తేదీలోపు ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో వాటిని సవాలు చేస్తూ.. కొద్దిరోజుల క్రితం ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. దీంతో శిల్పాశెట్టి దంపతులకు కాస్త ఊరట లభించింది.ఈ కేసు గురించి తాజాగా శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది ఇలా వివరణ ఇచ్చారు. 2017లో జరిగిన 'గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. శిల్పాశెట్టి దంపతుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. అయినా ఈడీ పరిధిలో ఈ కేసు లేదని చెప్పారు. అయినప్పటికీ తమ క్లయింట్స్ ఈ కేసు విషయంలో ఈడీ అధికారులకు సహకరిస్తారని పేర్కొన్నారు.బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం వాటి విలువ రూ. 150 కోట్లు పైమాటేనని అంచనా ఉంది. ఈ క్రమంలోనే వారి ఆస్తులను ఈడీ జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేసింది. -
శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు జప్తు.. ఆ మోసం వల్లే!
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాకు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. ఇందులో శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉంది. అలాగే రాజ్‌కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్ చేసినట్లు వెల్లడించింది. అమాయక జనాలను మోసం చేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ తనవద్దే బిట్కాయిన్లు ఈ ముగ్గురూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ మోసం వెనక ఉన్న మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్(ఈయన 2022లోనే చనిపోయారు) గతంలో రాజ్‌కుంద్రాకు 285 బిట్కాయిన్లు ఇచ్చాడు. దీనితో రాజ్‌కుంద్రా ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావించాడు. ఇప్పటికీ ఆ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, దాని విలువ రూ.150 కోట్లుగా ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను జప్తు చేసింది. చదవండి: కొత్తింట్లోకి బుల్లితెర జంట గృహప్రవేశం -
బిట్‌కాయిన్ సరికొత్త రికార్డ్‌లు..రెండేళ్ల తర్వాత తొలిసారి
ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. వరుసగా ఐదవ రోజు మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒక్కో బిట్ కాయిన్ ధర 60వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. ఫలితంగా ఈ ఫిబ్రవరి నెలలో బిట్‌కాయిన్ విలువ 39.7శాతం పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా ట్రేడింగ్‌తో బిట్‌కాయిన్ 4.4శాతం వృద్దిని సాధించింది. దీంతో డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయిలో ఉన్న ఒక్కో బిట్ కాయిన్ విలువ 59,259వేల డాలర్లకు పైకి చేరుకుంది. అదే సమయంలో మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ 2.2శాతం పెరిగి 3,320కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి 26న బిట్‌కాయిన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుని 57,000డాలర్లను దాటింది. కాయిన్ డెస్క్ ప్రకారం నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా గణనీయంగా 57,000డాలర్ల మార్కును తాకింది. అయితే, మార్కెట్లో నెలకొన్న భయాలతో ఇది ఆ తర్వాత సుమారు 56,500 డాలర్లకు తగ్గింది. తాజాగా మరోసారి తిరిగి పుంజుకుని 60వేల డాలర్ల మార్క్‌ను దాటి రికార్డ్‌లు సృష్టించింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ బిట్సేవ్ సీఈఓ జఖిల్ సురేష్ ప్రకారం.. ఎఫ్‌టీఎక్స్ సంఘటన తర్వాత నవంబర్ 2022లో బిట్‌కాయిన్ దాని కనిష్ట స్థాయిల నుండి 200 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు. -
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం!
అమెరికా స్పేస్ రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2021 నుంచి 2022 మధ్య కాలంలో బిట్ కాయిన్లలో పెట్టిన పెట్టుబడుల మొత్తాన్ని అమ్మినట్లు తెలుస్తోంది. ఆ మొత్తం విలువ 373 మిలియన్ డాలర్లుగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో బిట్‌కాయిన్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. స్పేస్ఎక్స్ బిట్‌కాయిన్ పెట్టుబడుల్ని అమ్మిన కేవలం అరగంట వ్యవధిలో బిట్‌కాయిన్ మార్కెట్ క్రాష్ అయ్యింది. 800 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. స్పేస్ఎక్స్ తన బిట్‌కాయిన్‌లోని ఇన్వెస్ట్మెంట్లను అమ్మడం బిట్ కాయిన్ మార్కెట్లో అలజడి సృష్టించింది. అయినప్పటికీ, స్పేస్ ఎక్స్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. టప్ మని పేలిన బిట్‌కాయిన్ బుడగ పలు నివేదికల ప్రకారం, బిట్‌కాయిన్ బుడగ పేలింది. కేవలం రెండు నెలల్లో తొలిసారి $26,000 కంటే తక్కువకు పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 72 శాతం పెరుగుదల తర్వాత మార్చి నెల చివరి నుండి బిట్‌కాయిన్ 9 శాతం క్షీణించింది. చదవండి👉 : ‘X.COM’లో డబ్బు సంపాదించేయండి.. మీకు కావాల్సిన అర్హతలివే! -
బిట్ కాయిన్లతో, మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం
ప్రముఖ దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు బిట్ కాయిన్లతో బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది. స్విట్జర్లాండ్ దేశం లుగానో నగరంలో బిట్‌కాయిన్, అసెట్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ టెథర్ చెల్లింపులకు మెక్ డొనాల్డ్స్ అంగీకరించింది. ఈ ఏడాది మార్చి నెలలో లుగానో అధికారులు టెథర్ ఆపరేషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా డిజిటల్ కరెన్సీలను ఉపయోగించి ట్యాక్స్ చెల్లింపులు పన్నులు, వస్తువుల కొనుగోలు చేసేలా లుగానో నివాసితులకు అనుమతించింది. 🇨🇭 Paying at McDonald's with #Bitcoin in Lugano, Switzerland. pic.twitter.com/8IdcupEEKQ — Bitcoin Magazine (@BitcoinMagazine) October 3, 2022 బిట్ కాయిన్ చెల్లింపుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రకారం..మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో ఫుడ్ లవర్స్ డిజిటల్ కియోస్క్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి, ఆపై మొబైల్ యాప్ సహాయంతో బిల్ పే చేస్తున్న దృశ్యాల్ని మనం గమనించవచ్చు. -
క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. కొత్త తరహా సాధనాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఎక్సే్ఛంజ్‌లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50–60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30–40 చిన్న ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10–15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. నియంత్రణలు.. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్సే్ఛంజ్‌ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తం మీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థించే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017–2021 మధ్య ఈక్విటీలు–క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30–40% నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. -
భారత దేశ చరిత్రలో 90వేల కోట్ల బిట్ కాయిన్ స్కాం..చేసింది ఎవరంటే!
ఈ ఏడాది మార్చి నెలలో భారీ బిట్ కాయిన్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కాం వెనుక మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్‌పై కోర్ట్‌లో కేసు నడుస్తుండగా.. తాజాగా ఆ మొత్తం కుంభ కోణం విలువ సుమారు రూ.90,500 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. అమిత్ భరద్వాజ్ అనే నిందితుడు పోంజి స్కాం చేశాడు.ఇక, బిజినెస్ వాడుక భాషలో పూంజి స్కాం అంటే..ఉదాహరణకు..నిందితుడు లక్షమందిని మోసం చేయాలని అనుకుంటే..ఆ డిజిట్‌కు రీచ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తాడు.ఇందుకోసం తన మాట విని బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని, అలా చేస్తే పెట్టిన మొత్తాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇస్తాడు. ఆ మాటలు నమ్మిన మదుపర్లు బిట్ కాయిన్లపై భారీగా ఇన్వెస్ట్ చేస్తారు. చెప్పినట్లుగానే అమాయకులైన ఇన్వెస్టర్లకు మొదట్లో లాభాలు చూపిస్తారు. ఆ లాభాలతో నిందితులకు పబ్లిసిటీ పెరుగుతుంది. దీంతో అనతి కాలంలో స్కాం టార్గెట్‌ను రీచ్ అవ్వొచ్చు. అలా టార్గెట్ రీచ్ అయితే ఇన్వెస్టర్లకు ఆదాయం చూపించడం మానేస్తారు. ప్రతినెలా డబ్బులే డబ్బులు సేమ్ ఇలాగే పైన అమిత్ భరద్వాజ్ కుంభకోణం విషయంలో జరిగింది. భారీ ఎత్తున మల్టీ లెవల్ మార్కెటింగ్‌తో 18 నెలల పాటు బిట్కాయిన్లపై పెట్టుబడి పెడితే ప్రతినెలా డిపాజిట్లలో 10శాతం ఆదాయం చూపిస్తానని హామీ ఇచ్చాడు. ఆ కాలంలో తమ పెట్టుబడులు పెరుగుతాయని హామీ ఇస్తూ బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరారు. ఇలా అమిత్ పెట్టు బడిదారుల్ని భారీ ఎత్తున మోసం చేసి, చివరకు బిచాణా ఎత్తేశాడు. దీంతో ప్రతి నెల ఒక్కసారి వచ్చి పడుతున్న ఆదాయం కనుమరుగు కావడంతో పెట్టుబడిదారులకు అనుమానం రావడం, కేసు ఈడీ అధికారుల చేతుల్లోకి వెళ్లడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణలో ఉండగా..ఈడీ బిట్‌కాయిన్ కుంభకోణానికి పాల్పడిన నిందితుల క్రిప్టో వాలెట్‌కు యాక్సెస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరింది. అంతేకాదు వివేక్ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్ తదితరుల సహకారంతో అమిత్ భరద్వాజ్ (ఈ ఏడాది జనవరిలో మరణించాడు) 80వేలకు పైగా బిట్కాయిన్లు సేకరించినట్లు తాము నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. రూ.90వేలకోట్ల స్కాం ఈ నేపథ్యంలో తాజాగా ఈ బిట్‌కాయిన్ స్కాంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో తీగలాగితే డొంక కదిలినట్లుగా అమిత్ చేసిన పోంజి కుంభ కోణం విలువ రూ.90వేల కోట్లకు పైగా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పోంజీ స్కాం సూత్రధారి అమిత్ భరద్వాజ్ మదుపర్ల నుంచి వచ్చిన వేల కోట్లతో 385,000 నుండి 600,000 మధ్య బిట్ కాయిన్లను సేకరించారు. వాటి విలువ సుమారు వన్ ట్రిలియన్ కంటే ఎక్కువేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ స్కాంలో నిందితుడిపై 40 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 40ఎఫ్ఐఆర్లు ఈడీ విచారణతో బాధితులు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోయింది. మహారాష్ట్ర, పంజాబ్, ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు బిట్ కాయిన్ కుంభ కోణంలో బాధితులు సంపాదించిన మొత్తాన్ని కోల్పోయారు. దాదాపు ప్రస్తుత బిట్ కాయిన్ ధరను పరిగణనలోకి తీసుకుంటే? ప్రతి బిట్ కాయిన్ విలువు రూ. 23,57,250గా ఉంది.పూణే పోలీసులు 60వేల మందికి పైగా యూజర్లు, ఐడీ, ఈమెయిల్ అడ్రస్‌ల ఆధారాలకు అనుగుణంగా ఆ బిట్ కాయిన్ స్కాం రూ.90,500 కోట్లని అంచనా. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా..బాధితులు తమకు న్యాయం చేయాలని కోర్ట్‌లను కోరుతున్నారు. చదవండి👉 యూట్యూబ్‌లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం! -
కుప్పకూలిన క్రిప్టో మార్కెట్లు..నష్టం మామూలుగా లేదుగా!
లాభాలే..లాభాలని బిట్ కాయిన్ ట్రేడింగ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. అనుభవంతో పనిలేకుండా, డబ్బులున్నాయని పెట్టుబడులు పెట్టారా? అంతే సంగతులు. మీ జేబుకు చిల్లు తప్పదిక! మొన్నటి దాకా మంచి లాభాలను తెచ్చిపెట్టిన క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు భారీ నష్టాలతో ఇన్వెస్టర్లను రోడ్డున పడేస్తుంది. ఇన్నిరోజులు లాభాలతో ఇన్వెస్టర్లకు స్వర్గదామంగా మారిన బిట్‌కాయిన్ ఇప్పుడు నష్టాలతో కుదేలవుతుంది. ఇందులో పెట్టుబడులు పెడుతున్న మదుపర్లు విలవిల్లాడుతున్నారు. క్రిప్టో మార్కెట్లు నేడు (జూన్ 13) జనవరి 2021 తరువాత తొలిసారి 1ట్రిలియన్ డాలర్లు నష్టపోయినట్లు క్రిప్టో డేటా బ్లాగ్ 'కాయిన్ మార్కెట్ క్యాప్' తెలిపింది. 2021 నవంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ 2.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కానీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, కొత్తగా పుట్టుకొచ్చిన మంకీ పాక్స్ లాంటి వైరస్లు, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, సెంట్రల్ బ్యాంకుల (మన దేశంలో ఆర్బీఐ) వడ్డీ రేట్ల పెంపు, వివిధ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభంతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు క్రిప్టో మార్కెట్ భారీగా పడిపోయింది. ఎంతలా అంటే గత రెండు నెలల వ్యవధిలో ఇన్వెస్టర్లు 1 ట్రిలియన్ వ్యాల్యును కోల్పోయింది. 18నెలల్లో లక్షల కోట్లు ఉఫ్ ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ గడిచిన 18నెలల కాలంలో రోజులో 10 శాతానికి పైగా క్షీణించి, 18 నెలల కనిష్ట స్థాయి $23,750కి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 50 శాతం తగ్గింది. చిన్న కాయిన్ ఈథర్ 15 శాతం పైగా పడిపోయి $1,210కి చేరుకుంది. -
యూట్యూబ్‌లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం!
మీరు బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం యూట్యూబ్‌లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీ వీడియో ప్రిడిక్షన్‌ను నమ్ముతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. యూట్యూబ్‌లో ఎలన్ మస్క్ స్కామ్ జరుగుతోంది. జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిట్కాయిన్లపై ఎంతమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి? ఎంత ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ రోజుల్లో భారీ లాభాల్ని ఎలా అర్జిస్తామో? వివరిస్తూ ఎలన్ మస్క్‌కు చెందిన వీడియోలు, టెస్లా యూట్యూబ్ ఛానల్‌కు చెందిన వీడియోలతో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతోంది. వాస్తవానికి ఆ లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించేది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈజీ మనీ కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్న సైబర్ నేరస్తులే ఆ వీడియోల్ని టెలికాస్ట్ చేస్తున్నట్లు తేలింది. ఎలన్ మస్క్ వీడియోలతో లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి కేటుగాళ్లు భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. ఫేక్ క్రిప్టో ట్రేడింగ్ వెబ్సైట్లను తయారు చేస్తున్నారు. ఎలన్ మస్క్ చెప్పినట్లుగా ఆ వెబ్సైట్లో క్రిప్టో ట్రేడింగ్ నిర్వహిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవ్వొచ్చని నకిలీ యాడ్స్‌తో ఊదరగొట్టేస్తున్నారు. దీంతో టెక్నాలజీ సాయంతో ఎలన్ మస్క్ వీడియోల్ని ప్రసారం చేయడంతో ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. అలా వారం రోజుల వ్యవధిలో బిట్ కాయిన్లపై పెద్దమొత్తంలో 23 ట్రాన్సాక్షన్లు, ఎథేరియంపై 18 ట్రాన్సాక్షన్లు నిర్వహించారు. ఇలా 243,000 డాలర్లు మోసపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విచిత్రం ఏంటంటే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ క్రిప్టో ట్రేడింగ్ నిజమని నమ్మి ప్రముఖ చిలీ సంగీతకారుడు ఐసాక్ సైతం మోసపోయాడు. లైవ్ స్ట్రీమింగ్ వీడియో లింకుల్ని క్లిక్ చేయడంతో హ్యాకర్లు ఐసాక్ య్యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేశారు. తాము అడిగినంత ఇస్తే ఛానల్‌ను తిరిగి ఇచ్చేస్తామంటూ ఐసాక్ను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో తన పేరుమీద జరుగుతున్న మోసాలపై ఎలన్ మస్క్ స్పందించారు. తన వీడియోలు, టెస్లా యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ వీడియోలతో తన పేరుతో స్కామర్లు అమాయకుల్ని దోచుకుంటున్నారని, అలాంటి స్కామ్ యాడ్స్‌ను యూట్యూబ్ సంస్థ కట్టడి చేయలేకపోతుందంటూ మండిపడ్డారు. వెంటనే లైవ్ స్ట్రీమింగ్ వీడియోలపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేయాలని ఎలన్ మస్క్ యూట్యూబ్‌కు విజ్ఞప్తి చేశారు. చదవండి👉 ‘ఇదే..తగ్గించుకుంటే మంచిది’! -
బిట్ కాయిన్ క్రాష్: మార్కెట్ క్యాప్ ఢమాల్!
సాక్షి, న్యూఢిల్లీ: క్రిప్టో మార్కెట్ మరోసారి ఘోరంగా కుప్పకూలింది. గత 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్రాష్ అయ్యి 1.24 ట్రిలియన్ల డాలర్లకు పరిమితమైంది. బిట్‌కాయిన్, ఎథరమ్ వంటి టాప్ క్రిప్టో కరెన్సీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం బిట్‌కాయిన్ 6.14 శాతం తగ్గి 29,823 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథరమ్ కూడా మేజర్ డౌన్ట్రెండ్ని నమోదు చేసింది. 5.63 శాతం కుప్పకూలి 1,826 డాలర్ల వద్ద ఉంది. బీఎన్బీ టోకెన్ 5.59 శాతం క్షీణించింది. సోలానా గణనీయంగా 12.73 శాతం పడిపోయింది. ఫలితంగా సోలానా బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌ను గత రాత్రి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసి, 4 గంటల తర్వాత పునరుద్ధరించారు. అటు ఎక్స్ఆర్పీ కూడా గత 24 గంటల్లో 5.98 శాతం పడిపోయింది. ఏడీఏ టోకెన్ 7.47 శాతం తగ్గింది. డాజీకాయిన్ 5.95 శాతం క్రాష్ అయింది. మొత్తంమీద, ప్రధాన టాప్ టోకెన్లు గత 24 గంటల్లో భారీగా పతనాన్ని నమోదు చేయడం గమనార్హం అయితే యూఎస్డీటీ టెథర్ గత 24 గంటల్లో దాని విలువలో 0.02 శాతం అప్‌ట్రెండ్‌ని, యూఎస్డీసీ స్టేబుల్కాయిన్లు 0.01 శాతం అప్‌ట్రెండ్‌ని కనబర్చాయి. కాగా ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇపుడు అందరిపైనా కనిపిస్తోందినీ, ఇది క్రిప్టోల కదలికలపై కూడా ఉంటుందని ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ సూచించారు. -
క్రిప్టో ఢమాల్.. భారీగా నష్టోతున్న బిట్‌కాయిన్..
భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీదే రాజ్యం అంటూ ఓ వైపు భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నా... మరోవైపు చాలా దేశాలు క్రిప్టో లావాదేవీలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దీంతో క్రిప్టోలపై అనిశ్చిత్తి పకూర్తిగా వీడటం లేదు. కాగా ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సైతం డిజిటల్ కరెన్సీపై నమ్మకం కోల్పోతున్నారు. ఫలితంగా క్రిప్టో కరెన్సీ విలువలు పడిపోతున్నాయి. క్రిప్టో కరెన్సీలో లార్జెస్ట్ కాయిన్‌గా పేరొందని బిట్ కాయిన్ విలువకి భారీ ఎత్తున కోత పడుతోంది. గడిచిన ఐదు రోజుల్లో బిట్ కాయిన్ విలువ 14 శాతం క్షీణించింది. మే 5న బిట్‌కాయిన్ విలువ ఇండియన్ కరెన్సీలో రూ. 30.14 లక్షలు ఉండగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రూ. 25.90 లక్షలకు పడిపోయింది. ద్రవ్యోల్బణం కారణంగా డిజిటల్ ఆస్తుల కంటే రెగ్యులర్ ఆస్తులపై ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మరోవైపు రెండో అతి పెద్ద డిజిటల్ కాయిన్ అయిన ఈథెరమ్ సైతం తన విలువను గత ఐదు రోజుల్లో 15 శాతం కోల్పోయింది. ప్రస్తుతం ఈథేమర్ విలువ రూ.1.89 లక్షలుగా ఉంది. ఐదు రోజుల్లో ఏకంగా రూ. 33.64 వేల మేరకు కోత పడింది. చదవండి: భారత్‌లో క్రిప్టో కరెన్సీ! నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! -
'హలో కమాన్ 'మైక్' నువ్వు సింగిలా!..అయితే నాతో మింగిల్ అవ్వు'!
టెక్నాలజీ! రెండంచుల కత్తి అనేది నూటికి నూరుపాళ్లు నిజం. సవ్యంగా వాడుకోవడం తెలియాలే కానీ అద్భుతాలు చేయోచ్చు. అదే సమయంలో స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటే 'కథ వేరేలా ఉంటుంది'. డేటింగ్ యాప్స్ కూడా అంతే! మీటింగ్, డేటింగ్, సింగిల్, మింగిల్ అని మొదలై రియలైజ్ అయ్యేలోపు వీలైనంత సొమ్ము చేసుకుంటాయి. అలా ఓ యువకుడు 'టిండర్' యాప్‌లో 'జెన్నీ'తో చాట్ చేశాడు. చివరికి తాను జీవిత కాలంలో సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. నిజానికి ట్విట్టర్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియా నెట్ వర్క్‌లు ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేశాయి. వేల కిలోమీటర్ల దూరం ఉన్నవారిని కూడా ఫ్రెండ్స్‌గా మార్చేస్తున్నాయి. కానీ రెగ్యులర్ సోషల్ మీడియాతో పెద్ద మజా ఏముంది. నచ్చితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. మాట్లాడుతారు. స్నేహితుల్లా కనెక్ట్ అవుతారు. అంతకు మించి ఉండే ఛాన్స్ తక్కువ. ఈ పాయింట్‌తోనే కొత్త కొత్త డేటింగ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. అలా పుట్టుకొచ్చిన టిండర్ యాప్‌లో అమెరికాకు చెందిన మైక్ చాట్ చేసి జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్ము రూ.20లక్షలు పోగొట్టుకున్నాడు. అమెరికాకు చెందిన మైక్ సరదాగా గడిపేందుకు టిండర్ యాప్‌లో లాగిన్ అయ్యాడు. అంతే అలా లాగిన్ అయ్యాడో లేదో..వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు..'హలో కమాన్ మైక్ మీరు సింగిలా, అయితే మింగిల్ అవ్వండి' అంటూ మెసేజ్ చేసిన జెన్నీకి అడ్డంగా దొరికి పోయాడు. తాను మలేషియాకు చెందిన జెన్నీ'ని అంటూ ఓ యువతి మైక్‌ను పరిచయం చేసుకుంది. ఆ టిండర్ యాప్ పరిచయం వాట్సాప్‌కు మారింది. నిమిషాలు, గంటలు కాస్తా రోజులయ్యాయి. పలకరింపులు మారిపోయాయి. ఎంతలా అంటే పేరు ఊరు తెలియకుండానే బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టేంతలా. వాస్తవానికి మైక్‌కు బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేదు. కానీ జెన్నీ "మైక్ మా మామయ్య ఎంఎన్సీ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్‌లో పనిచేస్తున్నాడు. బిట్ కాయిన్లో పెట్టుబడులు ఎలా పెట్టాలో సలహా ఇవ్వడంలో దిట్ట.కావాలంటే నువ్వూ పెట్టుబడులు పెట్టు మైక్. భారీగా లాభాలొస్తాయ్" అంటూ కవ్వించే మాటలతో మెల్లగా ముగ్గులోకి దించింది. జెన్నీ మాట విని చట్టబద్దమైన బిట్‌కాయిన్ సంస్థలో 3వేల డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. అవి కాస్త పెరగడంతో..యువతి తన ప్లాన్‌ను మెల్లగా అమలు చేసింది. మైక్ నాకు తెలిసిన సంస్థ ఉంది. అందులో ఆ 3వేల డాలర్లు ట్రాన్స్ఫర్ చేయి. అంతకంతకూ పెరిగిపోతాయి అంటూ నమ్మించింది. అలా జెన్నీ చెప్పిన ఓ ఫేక్ బిట్ కాయిన్ కంపెనీ వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టాడు. అవి కాస్తా డబుల్ అవ్వడంతో జెన్నీ మాటమీద నమ్మకంతో రూ.20లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సీన్ కట్ చేస్తే 4నెలల తరువాత బాధితుడి అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది. అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెబ్సైట్ ఫేక్ అని, జెన్నీ మోసం చేసిందని నిర్ధారించారు. దీంతో తాను మోసపోయానని, న్యాయం చేయాలని మైక్ పోలీసులతో మొరపెట్టుకున్నాడు. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి రావడం కష్టమని, టెక్నాలజీ పట్ల, ముఖ్యంగా ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
అనూహ్య నిర్ణయం! ఏటీఎంలు అన్నీ బంద్..!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రిప్టోకరెన్సీలు బిట్‌కాయిన్, ఈథిరియం, డోజీకాయిన్ విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయా క్రిప్టోకరెన్సీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా అమాంతం పెరిగాయి. ఇదిలా ఉండగా బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీ ఏటీఎంలపై యుకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్దమైనవే..! యూకేలోని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఆ దేశ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) గట్టి షాక్‌ను ఇచ్చింది. క్రిప్టో ఎక్సేఛేంజ్స్పై కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. క్రిప్టో ఏటీఎం ఆపరేటర్లు వారి మెషీన్లు క్లోజ్ చేయాలని ఆదేశించింది. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్ సర్వీసులు అందించే క్రిప్టో కరెన్సీ ఏటీఎంలు అన్నీ ఎఫ్సీఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఏటీఎంలు అన్నీ యూకే మనీ ల్యాండరింగ్ నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుంది. చట్టవిరుద్దంగా క్రిప్టో కరెన్సీ ఏటీఎం సర్వీసులు అందిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలను జారీ చేసింది. క్రిప్టో లావాదేవీలు సులువు..! యుకేతో పాటుగా పలు దేశాల్లో ఇన్వెస్టర్లకు సులవుగా క్రిప్టోలను కొనుగోలు లేదా సేల్ చేసేందుకుగాను క్రిప్టో ఎటీఎంలను ఎక్సేఛేంజ్స్ ఏర్పాటుచేశాయి. ఇవి సాధారణ ఎటీఎం వలె కన్పిస్తాయి. ప్రజలు తమ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి బిట్‌కాయిన్ వంటి క్రిప్టో-కరెన్సీ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.కాగా యుకేలోని క్రిప్టో-కరెన్సీ సేవలను అందించే ఏ కంపెనీకి క్రిప్టో-ATMని ఆపరేట్ చేయడానికి లైసెన్స్ లేదు. క్రిప్టో ఏటీఎం డైరెక్టరీ కాయిన్ ఎటీఎం రాడార్ ప్రకారం..యుకేలో సుమారుగా 81 ఫంక్షనల్ క్రిప్టో ఎటీఎంలు ఉన్నాయి.ఎఫ్సీఏ నిర్ణయంతో ఆ దేశ క్రిప్టో ఇన్వెస్టర్లకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుంది. చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
బిట్‌కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: బిట్ కాయిన్ చట్ట విరుద్ధమో కాదో వైఖరి చెప్పాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనపై కేసు రద్దు చేయాలంటూ గెయిన్ బిట్‌కాయిన్ కుంభకోణం నిందితుల్లో ఒకరైన అజయ్ భరద్వాజ్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బిట్‌కాయిన్‌పై కేంద్రం వైఖరి చెప్పాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. త్వరలోనే చెప్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి తెలిపారు. పెట్టుబడి దారులకు భారీ మొత్తం రిటర్న్‌లు ఇస్తామంటూ అజయ్ భరద్వాజ్, అతని సోదరుడు అమిత్ మల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రారంభించారు. ఐఎన్‌సీ 42 సంస్థ వివరాల ప్రకారం తొలుత రూ.2వేల కోట్ల కుంభకోణం కాస్తా బిట్‌కాయిన్ విలువ పెరగడంతో అది రూ.20వేల కోట్ల కుంభకోణంగా మారింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని, 87వేల బిట్ కాయిన్ల వ్యవహారానికి సంబంధించిందని ఐశ్వర్యభాటి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పలు సమన్లు జారీ చేశామని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. నిందితులను అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ కల్పించింది. నాలుగు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
భారీగా పడిపోతున్న క్రిప్టో కరెన్సీ ధరలు..!
దేశీయ స్టాక్ మార్కెట్ మాదిరిగానే క్రిప్టో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 3.10 శాతం తగ్గి రూ.29.73 లక్షల వద్ద కొనసాగుతుంటే.. మార్కెట్ విలువ రూ.54.97 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ గత 24 గంటల్లో 4.14 శాతం తగ్గి రూ.2,05,119 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.24.24 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇతర కరెన్సీ వీలువ కూడా భారీగా పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావం వీటి మీద కూడా పడింది. క్రిప్టో కరెన్సీల వంటి వాటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ అస్థిరంగా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ ఆస్తి. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. (చదవండి: అదిరిపోయిన హైపర్ స్పీడ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకులు..!)