ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ట్రెండ్ కొనసాగుతుంది. క్రిప్టోకరెన్సీకు భారీగానే ఆదరణ లభిస్తోంది. క్రిప్టోకరెన్సీలో అత్యంత ఆదరణను పొందిన బిట్‌కాయిన్ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ 15 న బిట్‌కాయిన్ 60 వేల డాలర్ల మార్కును దాటింది. దాదాపు ఆరు నెలల తర్వాత బిట్‌కాయిన్ మార్కును తాకింది. అదే రోజు ఒకానొక సమయంలో 62,535.90 డాలర్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అంతలోనే తిరిగి క్షీణించి 61 వేల డాలర్లకు చేరుకోగా ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 60,847.50 వద్ద ట్రేడ్ అవుతోంది.
చదవండి: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..!
గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ 2.48 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు వారంతో పోలిస్తే పలు క్రిప్టోకరెన్సీలు 4.52 శాతం లాభపడింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత 24 గంటల్లో 132.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారిగా 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అదేనెలలో బిట్‌కాయిన్ సుమారు 53 శాతం మేర పడిపోయింది. దీంతో బిట్‌కాయిన్ విలువ సుమారు 30 వేల డాలర్లకు చేరుకుంది. తిరిగి ఆర్నెల్ల తరువాత బిట్‌కాయిన్ మరోసారి 60 వేల మార్కును దాటింది. ఎలన్ మస్క్ వ్యాఖ్యలు, చైనాలో క్రిప్టోకరెన్సీపై నిర్ణయాలు బిట్‌కాయిన్ క్రాష్‌కు కారణాలుగా నిలిచాయి.
చదవండి: గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి గుడ్‌న్యూస్..!
Bitcoin: ఆర్నెల్లలో తిరిగి మళ్లీ అదే స్థానం..!
Published Sun, Oct 17 2021 8:02 PM | Last Updated on Sun, Oct 17 2021 8:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment