records
-
’గోల్డెన్ డేస్’ ఆగని రేస్!
సాక్షి, స్పెషల్ డెస్క్: పుత్తడి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ‘గోల్డెన్ డేస్’నడుస్తున్నాయి. తొలిసారిగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం రేటు 3,000 డాలర్లు దాటింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఔన్స్ పసిడి ధర 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు..అంటే కేవలం 7 నెలలు మాత్రమే పట్టడం. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. అంటే దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు. దీనినిబట్టి పుత్తడి పరుగు ఏ స్థాయిలో వేగం అందుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే తదుపరి రికార్డు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. 2025లోనే ఔన్స్ ధర 4,000 డాలర్లను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర గురువారం రూ.91,650 పలికింది. ఈ నెల 19న రూ.91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. రికార్డులే రికార్డులు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాల ప్రకారం.. 2024లో బంగారం 40 కంటే ఎక్కువసార్లు సరికొత్త ఆల్–టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు మరో 16 కొత్త గరిష్టాలను చేరుకుంది. అంతర్జాతీయంగా 2005 డిసెంబర్లో పసిడి ఔన్స్ ధర తొలిసారిగా 500 డాలర్ల మార్కును తాకింది. ఆ తదుపరి 500 డాలర్లకు.. అంటే 1,000 డాలర్ల స్థాయిని 2008 మార్చిలో చేరుకుంది. 2011 ఏప్రిల్‌లో 1,500 డాలర్లకు, 2020 ఆగస్టులో 2,000 డాలర్లు, 2024 ఆగస్టులో 2,500 డాలర్ల మార్కును తాకింది. 500 నుంచి 1,000 డాలర్లను చేరుకోవడానికి 834 రోజులు పట్టింది. అక్కడి నుంచి 1,500 డాలర్లకు 1,132 రోజులు, 1,500 నుంచి 2,000 డాలర్లకు 3,394 రోజుల సమయం తీసుకుంది. 2,000 నుంచి 2,500 డాలర్లను అందుకోవడానికి 1,473 రోజులు పట్టింది. సురక్షితమైన ఆస్తిగా బంగారం పుత్తడి 3,000 డాలర్ల కంటే అధిక ధర వద్ధ స్థిరంగా ఉంటే అదనపు కొనుగోళ్లు ధరను మరింత ప్రేరేపించవచ్చని డబ్ల్యూజీసీ జోస్యం చెబుతోంది.కన్సాలిడేషన్‌కూ అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారని వివరించింది. గతంలో ప్రతి అదనపు 500 డాలర్ల మార్కును చేరుకున్న తరువాత సగటున తొమ్మిది రోజుల తరువాతే పుత్తడి ధర వెనక్కి వచ్చిందని, అయితే అయిదింటిలో నాలుగు సందర్భాల్లో కొన్ని రోజుల్లోనే బంగారం అదే స్థాయి కంటే పైకి పుంజుకుందని తెలిపింది. భౌగోళిక రాజకీయ, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, బలహీనమైన యూఎస్ డాలర్.. వెరసి పుత్తడిలో పెట్టుబడి డిమాండ్‌కు బలమైన ప్రోత్సాహకాలను అందిస్తూనే ఉందని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. ధర ఎగసినా డిమాండ్ తగ్గలేదు అధిక పసిడి ధరలు ఆభరణాల డిమాండ్‌కు ప్రతికూలతలను సృష్టించవచ్చని డబ్ల్యూజీసీ అంటోంది. ‘ఆభరణాల రీసైక్లింగ్ స్థాయిలను పెంచవచ్చు. పెట్టుబడిదారులలో కొంత లాభాల స్వీకరణకు దారితీయవచ్చు. ఈ అంశాలు బంగారం దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు ఇచ్చే విస్తృత ఆర్థిక, ఆర్థిక చోదకాలను అధిగమించే అవకాశం లేదు’అని వివరించింది. 2024లో పుత్తడి ధర 27 శాతం ఎగిసినా డిమాండ్ తగ్గలేదు. భారత్‌లో 808.8 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగాయి. -
పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఛావా..
-
బద్దలు అవుతున్న పుష్ప2 రికార్డ్స్
-
ఎనిమిదేళ్లకే పర్వతాలు అధిరోహిస్తున్న చిచ్చర పిడుగు..!
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హనుమతండాకి చెందిన జాటోత్ తిరుపతి నాయక్, వాణి దంపతుల కుమారుడు విహాన్ రామ్ 4వ తరగతి చదువుతున్నాడు. పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించిన ఎంతోమంది సాహసికుల కథలను పెద్దల నోటినుంచి వినేవాడు. ఆ సాహసాల నుంచి స్ఫూర్తి పొందిన విహాన్ ‘నేను కూడా’ అని రెడీ అయ్యాడు.‘ఈ వయసులో ఎందుకులే’ అని తల్లిదండ్రులు అనలేదు. ఓకే అన్నారు. లెంకల మహిపాల్ రెడ్డి దగ్గర మూడు నెలల పాటు ట్రెక్కింగ్‌లో విహాన్ శిక్షణ తీసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్ మనాలీలో 15రోజుల పాటు బేసిక్ మౌంట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోగల మౌంట్ పాతాల్పు పర్వతం 4,250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గత సంవత్సరం ఈపర్వతాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించాడు.టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతం 5,895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 10న మొదలుపెట్టి 5 రోజుల్లో మైనస్ 20 డిగ్రీల వాతావరణంలో పర్వతాన్ని అధిరోహించాడు.చిన్న వయస్సులోనే పర్వతాలను అధిరోహిస్తున్న విహాన్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించి, చేతి గడియారం బహుమతిగా అందజేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు సాధించాడు విహాన్. ‘ప్రపంచంలో ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది నా లక్ష్యం’ అంటున్నాడు విహాన్ రామ్. విజయోస్తు...విహాన్!– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
రికార్డ్స్ సృష్టించిన పుష్ప 2
-
దూసుకెళ్తున్న సాక్షి
-
బాక్సాఫీస్ వసూళ్లు.. 'దేవర' సరికొత్త రికార్డులు
ఎన్టీఆర్ 'దేవర' సరికొత్త రికార్డులు సెట్ చేసేలా ఉంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఓ మాదిరి ట్రోలింగ్కి గురైన ఈ సినిమా ఇప్పుడు తొలిరోజు ఏకంగా రూ.172 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇన్నాళ్లు పాన్ ఇండియా సినిమా అంటే ప్రభాస్ మాత్రమే అనే దగ్గర నుంచి లిస్టులో తారక్ కూడా చేరిపోయాడు అనేంత వరకు వెళ్లింది. అలానే 'దేవర' పలు రికార్డులు కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది.టాప్-5లోకి 'దేవర'పాన్ ఇండియా అంటే తెలుగు, దక్షిణాది సినిమాలు మాత్రమే అనేలా ఉన్నాయి. ఎందుకంటే తొలిరోజు వసూళ్లలో తొలి ఐదు స్థానాల్లో మనమే ఉన్నాం మరి. ఆర్ఆర్ఆర్ (రూ.223.5 కోట్లు), బాహుబలి 2 (రూ.214.5 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.191.5 కోట్లు), సలార్ (రూ.178.8 కోట్లు) ఇప్పటివరకు టాప్-4లో కొనసాగుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో దేవర (రూ.172 కోట్లు) వచ్చి చేరింది. అనంతరం కేజీఎఫ్ 2 (రూ.164.2 కోట్లు), ఆదిపురుష్ (రూ.136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) ఉన్నాయి.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)తెలుగు రాష్ట్రాల్లోనూఇక తెలుగు రాష్ట్రాల్లోనూ తొలిరోజు వసూళ్లలో 'దేవర' సరికొత్త రికార్డ్ సెట్ చేసిందనే చెప్పాలి. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' రూ.74.11 కోట్లు సాధించగా.. ఇప్పుడు 'దేవర' రూ.54.21 కోట్ల షేర్‌తో రెండో స్థానంలోకి వచ్చింది. అంతకు ముందు ప్రభాస్ సలార్ రూ.50.49 కోట్లతో ఈ ప్లేసులో ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే టాప్-2లోని రెండు మూవీస్ కూడా తారక్వే కావడం విశేషం.ప్రభాస్ తర్వాత ఎన్టీఆరే?ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పాన్ ఇండియా రేంజులో ప్రభాస్ తర్వాత సిసలైన స్టార్ ఎన్టీఆరే అనిపిస్తున్నాడు. ఎందుకంటే సోలో హీరోగా తొలిరోజే రూ.172 కోట్ల కలెక్షన్ రాబట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతానికి తారక్ ఉన్నప్పటికీ 'పుష్ప 2', 'గేమ్ ఛేంజర్' తదితర చిత్రాలు రిలీజైతే లెక్కలు మారే ఛాన్సులు ఉంటాయి. (ఇదీ చదవండి: 'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?) -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థానానికి లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ తెలిపారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని దేవస్థానం ఈవోకి అందజేశారు. ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్ర ప్రత్యేకతలను వివరించారు. శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసిన క్షేత్రం కావడం, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధాన ఆలయాల ఎత్తు, వెడల్పు, ప్రధానాలయం చుట్టూగల అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు, నందీశ్వరుడు సైజు, ఆలయ నిర్మాణం మొదలైన అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేర్చినట్లు ఉల్లాజి ఇలియాజర్ చెప్పారు. దక్షిణ భారత్‌లో ఈ తరహా క్షేత్రాలు ఉంటే 9000798123 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
Paris 2024 Paralympics: పారాలింపిక్స్‌లో... ప్యారే అథ్లెట్స్
కొన్ని విజయాలు ఆనందంతో ముడిపడినవి మాత్రమే కాదు. వ్యక్తిగత విజయానికే పరిమితమైనవి కావు. దారి లేని వారికి దారి చూపే విజయాలు. ధైర్యం లేని వారికి అసాధారణ ధైర్యం ఇచ్చే విజయాలు. పారాలింపిక్స్‌లో ఈ ప్యారే’ అథ్లెట్లు సాధించిన విజయాలు అలాంటివే. చరిత్ర సృష్టించిన విజయాలే కాదు నిస్సహాయులం, అశక్తులం అనుకునే వారికి స్ఫూర్తినిచ్చి శక్తిమంతం చేసే విజయాలు...బతకడమే కష్టం అంటే ... పతకం తెచ్చిందిపరుగు ఏం చేస్తుంది?‘మనం ఊహించని శక్తి మనలో ఉంది అని గుర్తు తెస్తుంది’ అంటుంది ఒక ప్రసిద్ధ మాట. ఈ మాట ప్రీతి పాల్‌కు అక్షరాలా సరి΄ోతుంది. ‘ఈ అమ్మాయి బతకడం కష్టం. బతికినా మంచానికే పరిమితం అవుతుంది’ అనుకున్న అమ్మాయి ‘పరుగు’ను బలం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై విజేతగా మెరిసింది. తాజాగా...పారిస్ పారాలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో 100 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించిన ఆనంద క్షణాలలో...‘ఇది కలా నిజామా!’ అనుకుంది ప్రీతి.ఆ ఆనందం నుంచి ఇంకా పూర్తిగా బయటపడక ముందే 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకంతో మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక రైతు కుటుంబంలో పుట్టిన ప్రీతికి కష్టాలు పాత చుట్టాలు. బలహీనమైన కాళ్లతో పుట్టింది. ఫలితంగా ఆమె వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. కాళ్లను బలోపేతం చేయడానికి వివిధ సంప్రదాయ చికిత్సలు చేయించారు. అయిదు నుంచి ఎనిమిదేళ్ల వరకు కాలిపర్లు ధరించింది ప్రీతి. ‘ఈ అమ్మాయి ఇక మంచానికే పరిమితం అవుతుంది’... ఇలాంటి బలహీనమైన మాటలు ఆమె ఆత్మబలం ముందు వెల వెల బోయాయి. ప్రాణాంతక పరిస్థితులను అధిగమించి శక్తిమంతురాలిగా రూపుదిద్దుకోవడానికి తనలో ఆశావాదమే కారణం. ‘నా పరిస్థితి ఇలా అయింది ఏమిటి’ అనే బాధ కంటే ఏదో సాధించాలనే ఉత్సాహం తనలో ఉరకలు వేసేది. ‘ఈ బలహీనమై కాళ్లతో నేను ఏం సాధించగలను’ అనే ఆమె సందేహానికి టీవీలో కనిపిస్తున్న పారాలింపిక్స్ దృశ్యాలు సమాధానం చెప్పాయి. ఇక అప్పటి నుంచి పారాలింపిక్స్‌పై ప్రీతికి ఆసక్తి పెరిగింది. పారాలింపిక్ అథ్లెట్ ఫాతిమ పరిచయం ప్రీతి జీవితాన్ని మలుపు తిప్పింది. ‘నీలో ప్రతిభ ఉంది’ అని ప్రీతిని ప్రోత్సహించడమే కాదు ఆటలోని మెలకువలు నేర్పింది. ఫాతిమ మార్గదర్శకత్వంలో రాష్ట్ర,జాతీయ స్థాయి ఈవెంట్స్‌లో పాల్గొంది ప్రీతి. మీరట్‌లో ప్రాథమిక శిక్షణ తరువాత దిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రు స్టేడియంలో కోచ్ గజేంద్ర సింగ్ దగ్గర శిక్షణ తీసుకున్న ప్రీతి పాల్‌కు రన్నింగ్ టెక్నిక్‌లు నేర్చుకొని తన ప్రతిభకు సానపెట్టుకునే అవకాశం వచ్చింది.గత సంవత్సరం చైనాలో జరిగిన ఆసియా పారా చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల ఈవెంట్లలో రెండో స్థానం, నాల్గో స్థానంలో నిలిచినప్పటికి ప్రీతి నిరాశపడలేదు. పారిస్ పారాలింపిక్స్ టీ35 100 మీటర్ల ఈవెంట్లో 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్యాన్ని సాధించింది. తొలి పారాలింపిక్స్‌లోనే పతకం సాధించినందుకు తనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘పారిస్‌కు రాక ముందు పతకం సాధించాలని గట్టిగా అనుకున్నాను. నా కల నిజమైంది’ అన్న ప్రీతి పాల్ రెండో పతకాన్ని కూడా సాధించి చరిత్ర సృష్టించింది. ‘పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి ట్రాక్ మెడల్ సాధించినందుకు గర్వంగా ఉంది’ అంటుంది ప్రీతి.శరణార్థి... సీక్రెట్ జిమ్రెఫ్యూజీ పారాలింపిక్ టీమ్ నుంచి పతకం సాధించిన తొలి పారా తైక్వాండో అథ్లెట్‌గా జకియా ఖుదాదాది చరిత్ర సృష్టించింది. మహిళల 47 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ‘ఇక్కడికి రావడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఈ పతకం ఆఫ్గానిస్తాన్‌లోని మహిళలందరికీ, ప్రపంచంలోని శరణార్థులందరికీ దక్కుతుంది. ఏదో ఒకరోజు నా దేశంలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను’ అంటుంది జకియ. ముంజేయి లేకుండా జన్మించిన జకియ పదకొండు ఏళ్ల వయసులో ఆఫ్గానిస్తాన్‌లోని తన స్వస్థలమైన హెరాత్‌లోని రహస్య జిమ్‌లో రహస్యంగా తైక్వాండో ప్రాక్టీస్ చేసేది. టోక్యో ఒలింపిక్స్ తరువాత జకియ ఖుదాదాది ΄్యారిస్‌లో స్థిరపడింది. ఆమె గెలుపు చారిత్రాత్మకం. ఆమె జీవితం ఆసక్తికరం.కాలు, చెయ్యి లేకున్నా చేపలాగా...‘సగౌరవంగా కనిపించాలి. గెలుపుపై మెరవాలి’ అంటుంది పందొమ్మిది ఏళ్ల చైనీస్ స్విమ్మర్ ఇయాంగ్ యుయాన్. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్6 ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న ఇయాంగ్ దివ్యాంగులు తమ కలలను సాకారం చేసుకోవడానికి తన వంతుగా స్ఫూర్తి నింపాలని అనుకుంటుంది. టోక్యో పారాలింపిక్స్ ఎస్6 50 మీటర్ల బట్టర్ఫ్లై ఈవెంట్లో కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించి స్వర్ణం గెలుచుకుంది. తాజాగా... 32.59 సెకన్లతో మరోసారి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. నాలుగు సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో కుడి చేయి, కాలును కోల్పోయింది ఇయాంగ్. ‘నువ్వు ఎలాగైనా గెలవాల్సిందే...అంటూ నాపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. ఈ గేమ్స్‌లో నేను పోటీ పడటాన్ని చాలా మంది దివ్యాంగులు చూస్తారని నాకు తెలుసు. నా గెలుపు వారి గెలుపు కావాలనుకున్నాను’ అంటుంది ఇయాంగ్. ‘మీరు కలలు కనండి. వాటిని సాకారం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయండి’ అని దివ్యాంగులకు పిలుపు ఇస్తుంది.వీల్ చైర్ రగ్బీలో చక్రం తిప్పి...టీమ్ యూఎస్ వీల్‌చైర్ రగ్బీ అథ్లెట్ సారా ఆడమ్ అమెరికా వీల్‌చైర్ రగ్బీ జట్టులో ఆడిన తొలి మహిళగా, పారాలింపిక్స్‌లో స్కోర్ చేసిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర నృష్టించింది. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి కెనడా జట్టుపై అమెరికా వీల్‌చైర్ రగ్బీ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో సారా ఆడామ్ కీలక పాత్ర ΄ోషించింది. 2016లో సారా ఆడమ్‌కు మల్టీపుల్ స్లె్కరోసిస్గా నిర్దారణ అయింది. ‘క్రీడారంగంలో ఉన్న మహిళలకు నిజంగా ఇది ఉత్తేజకరమైన కాలం. అభిమానులు ఆటలో మేము చూపించే నైపుణ్యాలను ప్రశంసించడమే కాదు మా నేపథ్యాలు, మేము పడిన కష్టాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎలిట్ అథ్లెట్‌గా ఎదగడానికి బాగా కష్టపడ్డాను’ అని అంటుంది సారా. ఆటల్లోకి అడుగు పెట్టకముందు సారా ఆడమ్ మిస్సోరిలోని సెయింట్ లూయిస్ యూనివర్శిటీలో ఆక్యుపేషనల్ ప్రొఫెసర్. -
వండర్బోయ్స్! ఎవర్రా మీరు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు..?
కనిపెట్టాలేగాని పిల్లల్లో వేయి రకాల టాలెంట్స్ఉంటాయి. వాటిని ప్రోత్సహిస్తే వారు వండర్బోయ్స్ అవుతారు. వండర్స్ సృష్టిస్తారు. ఇక్కడ ఉన్నపిల్లలు అలాంటి వారే. వారు చేసిన పని వారిని రికార్డ్ బుక్స్‌లో ఎక్కించింది. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఏదైనా టాలెంట్‌ని ప్రదర్శిద్దామా?ఇక్కడ కనిపిస్తున్న చిరుత పేరు శరణ్ గొరజాల. వయసు ఒక సంవత్సరం 9 నెలల 28 రోజులు (ఏప్రిల్ 30, 2024– రికార్డు సాధించే సమయానికి). ఈ బుడతడు ఏం చేశాడో తెలుసా? ‘పరిగెత్తు’ అనగానే పరిగెత్తాడు. 50 మీటర్ల దూరాన్ని 28 సెకన్లలో పూర్తి చేశాడు. ఇంతకు ముందు ఇదే వయసు బుడతడు ఈ దూరాన్ని 29 సెకన్లలో పూర్తి చేస్తే మనవాడు ఒక సెకను ముందే పూర్తి చేసి రికార్డు సాధించాడు.‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాడు. శరణ్ గొరజాలది చిత్తూరు జిల్లా. తండ్రి స్వరూప్, తల్లి ప్రియాంక. చిన్నప్పటి నుంచి బలే హుషారు. ఇంట్లో ఆడుకోమంటే పరిగెత్తడం నేర్చాడు. హాల్లో, వరండాలో, ప్లేగ్రౌండ్‌లో పరిగెత్తడమే పని. అందుకే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు. ఏముంది... 50 మీటర్లు లాగించేశాడు. పెద్దయ్యి 100 మీటర్ల పరుగులో రికార్డు సాధించాలని కోరుకుందాం.ఈ గంభీర వదన మహానుభావుని పేరు గోకుల్ పోఖ్రాజ్ పథ్. వయసు 3 సంవత్సరాల 3 నెలలు. కాని మైండు నిండా సమాచారం... ఏదడిగితే అది టక్కున సమాధానం. వీడి మెమొరీ చూసి వీళ్లమ్మ కొన్ని సంగతులు నేర్పింది. వాటిని మర్చి΄ోతేనా? ఎప్పుడు అడిగినా చెబుతాడు. వీడి వయసు పిల్లలు చిట్టి చిలకమ్మా... అమ్మ కొట్టిందా చెప్పమంటే మర్చి΄ోతారు. వీడు? శరీరంలో 33 భాగాల పేర్లు, 23 రకాల వాహనాలు, కంప్యూటర్లో ఉండే 19 రకాల పార్ట్‌ల పేర్లు, 12 పండుగలు, 17 పెంపుతు జంతువుల పేర్లు, 16 జలచరాల పేర్లు, 16 చారిత్రక స్థలాల పేర్లు, 8 మంచి అలవాట్లు, 6 నర్సరీ రైములు కాకుండా ఏబీసీడీలు అన్నీ వాటితో వచ్చే పదాలు చెబుతాడు. ఇంకా ఏమేమి చెబుతాడో మనకెందుకు... ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఇతడి పేరు రాసి చల్లగా జారుకోక.హరియాణలోని ఝుజ్జర్కు చెందిన పద్నాలుగు సంవత్సరాల కార్తికేయ జాఖర్ పన్నెండు సంవత్సరాల వయసులోనే ఎవరి గైడెన్స్ లేకుండా మూడు లెర్నింగ్ అప్లికేషన్లను డెవలప్ చేసి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సం΄ాదించాడు. కార్తికేయ నాన్న రైతు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆయన మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. తండ్రి దగ్గర ఉన్న ఫోన్ సహాయంతో బడి ΄ాఠాలు వినడమే కాదు టెక్నాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు కార్తికేయ. అలా అని కొత్త విషయాలు తెలుసుకోవడానికే పరిమితం కాలేదు.‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అంటూ ఏవేవో ప్రయోగాలు చేసేవాడు. అలా చేస్తూ చేస్తూ మూడు యాప్‌లను సొంతంగా డెవలప్ చేశాడు. అవి: 1.జనరల్ నాలెడ్జీ యాప్: లుసెంట్ జీకే2. కోడింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ యాప్: రామ్ కార్తిక్ లెర్నింగ్ సెంటర్3. డిజిటల్ ఎడ్యుకేషన్ యాప్: శ్రీరామ్ కార్తిక్.‘కార్తికేయలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ప్రభుత్వ సహకారం ఉంటే మా అబ్బాయి మరెన్నో సాధించగలడు. డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి కార్తికేయ దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను’ అంటున్నాడు కార్తికేయ తండ్రి అజిత్. -
అమర్నాథ్ యాత్ర రికార్డులు బద్దలు!
అమర్నాథ్ యాత్రికులు గత రికార్డులను బద్దలుకొట్టారు. యాత్ర ప్రారంభమైన తొలిరోజు నుంచే అమర్నాథ్ దర్శనానికి భక్తులు బారులు తీరారు. యాత్ర ముగియడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే అమర్నాథ్ సందర్శకుల సంఖ్య గత 12 సంవత్సరాల రికార్డును అధిగమించింది.జూన్ 29 నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటివరకు 5.10 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహను సందర్శించారు. 2011లో యాత్రా సమయంలో మొత్తం 6.34 లక్షల మంది భక్తులు, 2012లో 6.22 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని సందర్శించుకున్నారు. ఈసారి యాత్ర ఆగస్ట్ 19న రక్షాబంధన్ రోజున ముగియనుంది.అమర్నాథ్ను ఇప్పటి వరకు సందర్శించిన భక్తుల సంఖ్య 5,11,813 దాటింది. వర్షం కారణంగా పహల్గామ్, బాల్తాల్ మార్గంలో యాత్ర ఒక్కసారి మాత్రమే వాయిదా పడింది. గత ఏడాది జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నాలుగుసార్లు వాయిదా పడింది. యాత్ర సాగే రెండు మార్గాల్లో 125 లంగర్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు ఆహారానికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. జమ్మూలోని యాత్రి నివాస్, చంద్రకోట్ యాత్రి నివాస్, శ్రీనగర్‌లోని పాంథా చౌక్‌లలో తాత్కాలిక శిబిరంలో యాత్రికులకు వసతి, వైద్య సదుపాయాలు కల్పించారు. గత 12 ఏళ్లలో అమర్నాథ్ను సందర్శించుకున్న భక్తుల సంఖ్య ఇలా ఉంది.సంవత్సరం యాత్రికుల సంఖ్య2011 6.34 లక్షలు2012 6.22 లక్షలు2013 3.53 లక్షలు2014 3.73 లక్షలు2015 3.52 లక్షలు2016 2.20 లక్షలు2017 2.60 లక్షలు2018 2.85 లక్షలు2019 3.42 లక్షలు2020, 2021లలో కరోనా కారణంగా యాత్ర జరగలేదు.2022 3.04 లక్షలు2023 4.50 లక్షలు2024 ఇప్పటివరకు 5.10 లక్షలు -
బ్రదర్స్.. అదుర్స్
నాలుగున్నరేళ్లకే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వంద దేశాలు, రాజధానులు, కరెన్సీ పేర్లు టకటకా చెప్పేస్తారు ప్రఖ్యాత ప్రదేశాలు, ప్రముఖ వ్యక్తుల పేర్లు, జీకే ప్రశ్నలకు కూడా..అద్భుతమైన జ్ఞాపక శక్తి ఆ ఇద్దరి అన్నదమ్ముల సొంతం. ఒక్కసారి చదివినా, చెప్పింది విన్నా ఇట్టే గుర్తుంటుంది. ఏడాదిన్నర వయసులోనే విషయం గ్రహించిన తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. సాధారణంగా భారతదేశం రా్రష్టాలు, రాజధానులు, చిత్రపటంలో గుర్తించడం వంటివి చెప్పారు. అవి ధారాళంగా పలకడం, గుర్తుంచుకుని చెప్పడం చూసిన తల్లిదండ్రులు ప్రపంచపటం వైపు అడుగులు వేశారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం... వంద దేశాలను లక్ష్యంగా చేసుకుని దేశాలు, రాజధానులు, కరెన్సీల పేర్లను ప్రాక్టీస్ చేయించారు. ఆ బుడతలకు మూడేళ్లకే వంద దేశాల సమాచారం నాలుకమీద నడయాడుతుంది. అసాధారణ ప్రతిభను చూసిన తల్లిదండ్రులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను సంప్రదించారు. ఇంకేముంది పిల్లల తెలివితేటలను గుర్తించిన ఆయా సంస్థల ప్రతినిధులు రికార్డుల్లో స్థానం కలి్పంచారు. అయితే ఇంత సమాచారాన్ని గుక్కతిప్పుకోకుండా చెప్పడం అందరికీ సాధ్యం కాదనే చెప్పాలి. భాగ్యనగరానికి చెందిన బుడుమూరు గౌతం నంది మాత్రం నాలుగున్నరేళ్లకే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. 3.59 నిమిషాల్లో..దేశాలు, రాజధానులు, భారత దేశంలోని రాష్ట్రాలు, రాజధానులు, 25 జంతువుల పేర్లు, 30 మంది చారిత్రక వ్యక్తుల పేర్లు, 12 జనరల్ నాలెడ్జ్ వంటి ప్రశ్నలకు సమాధానాలు కేవలం 3.59 నిమిషాల్లో టకటకా చెప్పేశాడు. ఇంకేముంది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. దీంతో పాటు పాటలు పాడటం, రామాయణం, భగవద్గీత, కొన్ని ఆధ్యాతి్మక శ్లోకాలు ఇట్టే చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాడు. దీంతో పాఠశాల స్థాయిలో వివిధ రకాల పోటీల్లో చురుగ్గా పాల్గొనడం అలవాటుగా మార్చుకున్నాడు. యాజమాన్యాలు సైతం గౌతం ప్రతిభను గుర్తించి ఎక్కడ ప్రతిభ పోటీలు నిర్వహించినా తమ పాఠశాల నుంచి పాల్గొనేందుకు అవకాశం కలి్పస్తున్నాయి. ప్రస్తుతం మూడో తరగతికి వెళుతున్న గౌతం నంది తల్లిదండ్రుల ప్రోత్సాహం, యూ ట్యూబ్ సాయంతో సెల్ఫ్ లెరి్నంగ్ స్కిల్స్‌లో దూసుకుపోతున్నాడు. అన్న బాటలో తమ్ముడు... అన్న గౌతం నంది అలవాట్లు, తెలివితేటలు తమ్ముడు కౌస్తవ్ నందికి కూడా అబ్బాయి. మూడేళ్ల వయసులోనే 50 మంది ఆవిష్కర్తల పేర్లు, భారత రాష్ట్రాలు, 10 శ్లోకాలు, 6 ఇంగ్లి‹Ù, 5 తెలుగు నర్సరీ రిథమ్స్, 50 రకాల పండ్లు, 50 జంతువులు, 30 మంది చారిత్రక వ్యక్తుల పేర్లు, 20 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన బుడుమూరు కౌస్తవ్ నంది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. ఈ పిల్లాడు ఇంకా పాఠశాలలో చేరకపోవడం విశేషం.తల్లిదండ్రులు శ్రద్ధవహించాలి.. గౌతం నంది తెలివితేటలను ఏడాదిన్నర వయసులోనే గుర్తించాం. అందుకే ఎక్కువ సమయం కేటాయించేవాళ్లం. చెప్పేకొద్దీ తెలివితేటలు ఆశ్యర్యం కలిగించేవి. దీంతో తల్లి కల్పన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను సంప్రదించాం. వారు గౌతం ప్రతిభకు గుర్తించారు. మరో ఏడాది తరువాత ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. కౌస్తవ్ సైతం అదే బాటలో వెళుతున్నాడు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చని నమ్ముతా. – వెంకట అప్పలనాయుడు, విద్యార్థి తండ్రి -
Kalki2898AD ‘నవ్వొస్తోంది.. మేం రికార్డులకోసం చేయలేదు’! షాకింగ్ ట్వీట్
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి2898 ఏడీ అంచనాలకు మించి ఆదరణను సంపాదించు కుంటోంది. నాగ్ కథను ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే, టెక్నికల్ విలువలు, విజువల్స్ అన్నీ అద్భుతంగా అమరి పోవడం ప్రేక్షకులు చాలా థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నారు. అద్భుతమైన సినిమా అంటూ కితాబిస్తున్నారు. దీంతో వసూళ్లు , రికార్డులపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు సి. అశ్వినీదత్ కుమార్తె , నిర్మాత స్వప్నాదత్ చలసాని చేసిన ట్వీట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.#Kalki2898AD pic.twitter.com/85X4CYqNij— Swapnadutt Chalasani (@SwapnaDuttCh) June 28, 2024 ‘చాలామంది కాల్ చేసి మీరు రికార్డులను బ్రేక్ చేశారా అని అడగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నవ్వొస్తోంది.. ఎందుకంటే ఆ రికార్డులను సాధించినవారు, లేదా రికార్డులు సృష్టించిన వారు .. రికార్డుల కోసం ఎపుడూ సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ఉన్న ప్రేమతో సినిమాలు తీసారు. మేమూ అదే చేశాం’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు మంచిమాట అంటూ కమెంట్ చేశారు. ఎవరూ ఉచితంగా ఏమీ చేయరు అక్కా. మీరు నిజంగా సినిమాపై ఉన్న ప్రేమ కోసం దీన్ని రూపొందించినట్లయితే, తొలి వారంలోనే రెట్టింపు వసూళ్ల కోసంలా కాకుండా సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించండి. అందరూ చూడగలిగేలా సరసమైన ధరలో ఉండేలా చూడండి అని వ్యాఖ్యానించారు. -
ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా!
డార్లింగ్ ప్రభాస్ మరికొన్ని గంటల్లో 'కల్కి'తో రాబోతున్నాడు. మూవీ లవర్స్ మధ్య ఇప్పుడంతా దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు టికెట్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సరిగా ప్రమోషన్ చేయనప్పటికీ మూవీపై హైప్ ఉహించిన దానికంటే బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే 'కల్కి'తో ప్రభాస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.(ఇదీ చదవండి: 'కల్కి' థీమ్ సాంగ్ రిలీజ్.. మొత్తం స్టోరీ ఒకే పాటలో!)'కల్కి' సినిమాకి మన దగ్గర ఫుల్ క్రేజ్ ఉందని తెలిసిందే. అమెరికాలోనూ ఈ మూవీకి మామూలు డిమాండ్ లేదు. ఎందుకంటే ఇప్పటికే లక్ష 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అలానే 3 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ జరిగింది. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అమెరికాలో 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' వసూళ్ల రికార్డులు కొట్టుకుపోవడం గ్యారంటీ.ఇక మన దగ్గర కూడా టికెట్స్ బాగానే సేల్ అవుతున్నాయి. అలానే తొలిరోజు వసూళ్లలో 'ఆర్ఆర్ఆర్' అందుకున్న రూ.223 కోట్ల వసూళ్లని 'కల్కి' బ్రేక్ చేయడం కచ్చితం అనిపిస్తోంది. ఎందుకంటే షోల దగ్గర నుంచి టికెట్ రేట్ల వరకు అన్ని పెంచారు. ఇలా విడుదలకు ముందే పలు రికార్డుల్ని సాధిస్తున్న 'కల్కి'.. థియేటర్లకి వచ్చిన తర్వాత ఇంకెన్ని ఘనతలు సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?) -
T20 World Cup 2024: ఆసీస్‌పై టీమిండియా విజయం.. హిట్‌మ్యాన్ ఖాతాలో రికార్డుల వెల్లువ
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. హిట్‌మ్యాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా 181 పరుగులకే ( 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరిమితమై 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ట్రవిస్ హెడ్ (76) ఆసీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ (3/37), కుల్దీప్ యాదవ్ (2/24) ఆసీస్ విజయాన్ని అడ్డుకున్నారు. బుమ్రా, అక్షర్ తలో వికెట్ తీశారు. సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగి టీమిండియాను గెలిపించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్‌లో రోహిత్ సాధించిన రికార్డులు..అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డుఅంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) ఒకే ప్రత్యర్థిపై (ఆస్ట్రేలియాపై) అత్యధిక సిక్సర్లు (132 సిక్సర్లు) కొట్టిన బ్యాటర్‌గా రికార్డుబాబర్ ఆజమ్‌ను (4145) అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు (4165)టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్ (92) సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డుపొట్టి ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత కెప్టెన్‌గా రికార్డుఅంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు (529)అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డుటీ20 వరల్డ్‌కప్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (8) బాదిన భారత బ్యాటర్‌గా రికార్డుప్రస్తుత ప్రపంచకప్ (2024)లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి (19 బంతుల్లో) రికార్డు -
T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్ విశేషాలు, రికార్డులు
2007లో అరంగేట్రం చేసిన పొట్టి ప్రపంచకప్ ఎనిమిది సీజన్ల పాటు విజయవంతంగా సాగి తొమ్మిదో సీజన్వైపు అడుగులు వేస్తుంది. భారతకాలమానం ప్రకారం రేపటి నుంచి పొట్టి ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్, యూఎస్ఏ వేదికలు ఈ మెగా టోర్నీ జరుగనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ-కెనడా జట్లు తలపడనున్నాయి.తొమ్మిదో ఎడిషన్ వరల్డ్‌కప్ ప్రారంభ నేపథ్యంలో ఈ టోర్నీ విశేషాలు, రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే టీ20 ప్రపంచకప్ ఇప్పటివరకు ఎనిమిది సీజన్ల పాటు సాగింది. టోర్నీ అరంగేట్రం సీజన్లో (2007) టీమిండియా విజేతగా నిలువగా.. పాకిస్తాన్ (2009), ఇంగ్లండ్ (2010), వెస్టిండీస్ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్ (2016), ఆస్ట్రేలియా (2021), ఇంగ్లండ్ (2022) ఆతర్వాత ఎడిషన్లలో విజేతలుగా అవతరించాయి.రెండేళ్లకు ఓసారి జరిగే ఈ టోర్నీకి కోవిడ్, ఇతరత్రా కారణాల వల్ల మధ్యలో ఐదేళ్లు (2016-2021) బ్రేక్ పడింది. టీ20 ప్రపంచకప్‌లో ఈ సీజన్ నుంచే రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు అత్యధికంగా రెండు సార్లు టైటిల్‌ను అందుకున్నాయి. డారెన్ సామీ వెస్టిండీస్‌కు విజయవంతంగా రెండు సార్లు టైటిల్‌ను అందించాడు.టోర్నీలో అత్యధిక పరుగుల రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (1141) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల రికార్డు షకీబ్ అల్ హసన్ (47) ఖాతాలో ఉంది. కెనడా, ఉగాండ, యూఎస్ఏ జట్లు తొలిసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.టోర్నీ బ్యాటింగ్ రికార్డులు..అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి (1141)అత్యధిక స్కోర్- బ్రెండన్ మెక్కల్లమ్ (123)అత్యధిక సగటు- విరాట్ కోహ్లి (81.50)అత్యధిక స్ట్రయిక్‌రేట్- సూర్యకుమార్ యాదవ్ (181.29)అత్యధిక సెంచరీలు- క్రిస్ గేల్ (2)అత్యధిక హాఫ్ సెంచరీలు- విరాట్ కోహ్లి (14)అత్యధిక సిక్సర్లు- గేల్ (63)ఓ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు- విరాట్ (319)టోర్నీ బౌలింగ్ రికార్డులు..అత్యధిక వికెట్లు-షకీబ్ (47)అత్యధిక బౌలింగ్ సగటు- హసరంగ (11.45)అత్యధిక స్ట్రయిక్‌రేట్- హసరంగ (11.8)అత్యుత్తమ గణాంకాలు- అజంత మెండిస్ (6/8)సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు- హసరంగ (16)జట్ల రికార్డులు..అత్యధిక టీమ్ టోటల్-శ్రీలంక (260/6)అత్యల్ప టోటల్- నెదర్లాండ్స్ (39)భారీ విజయం- శ్రీలంక (కెన్యాపై 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
ఐపీఎల్ 17లో బద్దలైన రికార్డ్‌లు
-
సూపర్ మామ్స్! రికార్డులు సృష్టించిన తల్లులు
తల్లిగా మారిన ప్రతి స్త్రీ పిల్లల పనిని ఇష్టంగానూ అదే సమయంలో కష్టంగానూ భావిస్తుంటుంది. తన బాగు గురించి తాను చూసుకోవడం మరచిపోతుంటుంది. తల్లిగా మారిన తర్వాత కూడా తమ జీవితాన్ని అర్థవంతంగా ఎలా మార్చుకోవాలో క్రీడాస్ఫూర్తితో నిరూపిస్తున్నారు కొందరు తల్లులు. ఇటీవల అమెరికా వాసి కైట్లిన్ డోనర్ స్ట్రోలర్‌తో రన్నర్ మామ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ముంబై వాసి అయిన వినీత్ సింగ్ గర్భవతిగా ఉన్నప్పటి నుంచే రన్నింగ్‌తో తన ప్రపంచాన్ని ఎంత ఆరోగ్యంగా మార్చుకుందో రుజువు చేస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న ఇద్దరు పిల్లల తల్లి అయిన 34 ఏళ్ల కైట్లిన్ డోనర్ ఇటీవల చేసిన ప్రయత్నం అందరినీ ఆకర్షించింది. తన 20 నెలల కొడుకును స్ట్రోలర్ (లాగుడు బండి)లో కూర్చోబెట్టుకొని, ఆ స్ట్రోలర్‌ను నెడుతూ మైలు దూరాన్ని కేవలం ఐదు నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారిక గుర్తింపు పొదింది. తల్లుల్లో ఉన్న శక్తిని ఎలా పెంచుకోవచ్చో తన సాధన ద్వారా నిరూపిస్తోంది.సాధనమున సమకూరు.. రెండవ గర్భధారణ సమయంలో ప్రసవానంతరం తన లక్ష్యాన్ని ప్రపంచానికి చాటాలనుకుంది. రన్నింగ్ గోల్‌ని ఏర్పరుచుకునే క్రమంలో ఆమెకు రన్నర్ స్నేహితులు ఉత్సాహం కలిగించారు. ఇది ఆమెను మరింత ముందుకు వెళ్లేలా చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ్రపాసెస్లో భాగంగా సెప్టెంబర్ 2022లో తన బిడ్డకు కేవలం నెల వయసు ఉన్నప్పుడే క్లైటిన్ దరఖాస్తు చేసింది. కానీ, అది తిరస్కరణకు గురైంది. కిందటేడాది మళ్లీ దరఖాస్తు చేసింది. ఒలింపిక్ మారథాన్ ట్రయల్స్‌లోనూ వెనకబాటుకు లోనైంది. అయినా నిరుత్సాహపడకుండా మరింతగా కఠినమైన శిక్షణా విధానాన్ని పాటించింది. లెగ్ టర్నోవర్‌ని పెంచడానికి కొన్ని స్పీడ్ వర్కవుట్లను నిర్వహించింది. సాధనలో 1600 మీటర్ల వర్కౌట్‌ను స్ట్రోలర్‌తో సాధన చేసింది. ఈ ఎక్స్‌పీరియెన్స్ ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపింది. కిందటి నెలలో బాబ్ గేర్ రివల్యూషన్ 3.0 స్ట్రోలర్‌తో ట్రాక్‌లోకి ప్రవేశించింది. దీనికి ఆమె కుటుంబం, సన్నిహితులు అందించిన మద్దతు తనకీ విజయం సాధించడానికి తోడ్పడింది అని తెలియజేస్తుంది. కఠినమైన లక్ష్యాలనే ఎంచుకోవాలి.. ట్రాక్‌పై పరిగెత్తుతున్నప్పుడు ప్రతి అడుగుతోనూ ఆమె ఈ లక్ష్యాన్ని అధిగమించడంతో చుట్టూ ఉన్న వారి చప్పట్ల హోరు కన్నా తన లక్ష్యానికి ఆమె ఇచ్చి ప్రాముఖ్యానికి అందరూ కొనియాడారు. మైలు దూరాన్ని 5 నిమిషాల 11.13 సెకన్ల సమయంలో ముగించి, మునుపటి 5 నిమిషాల 13 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి విజేతగా నిలిచింది. ఆమె ట్రాక్‌పై పరిగెత్తుతున్నప్పుడు అందరి దృష్టి ఆమెపై అలాగే బాబ్గేర్ రివల్యూషన్ 3.0 స్ట్రోలర్లోని బిడ్డపై కూడా ఉంది. ‘సులువైన వాటిని కాదు భయానకమైన లక్ష్యాలనే ఎంచుకోండి. ఎందుకు సాధించలేం? అనే ప్రశ్న ఎవరికి వారు వేసుకోండి. ఆశించిన ఫలితం వస్తుందో రాదో చెప్పలేం. కానీ, ప్రయత్నించినందుకు ఏ మాత్రం చింతించరు’ అని బోసినవ్వుల కొడుకును ఎత్తుకుంటూ చెబుతుంది డోనర్. మన వినీత్ సింగ్ ముంబై వాసి వినీత్ సింగ్‌కి తల్లిగానే కాదు విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్‌గా... ఫిట్నెస్ ఔత్సాహికురాలుగా కూడా ఎంతో పేరుంది. ఆరు నెలల గర్భవతిగా ఉండీ వైద్యుల అనుమతితో ఈ ఏడాది జనవరిలో జరిగిన 30 కి లోమీటర్ల మారథాన్‌లో పాల్గొంది. ‘నా ప్రపంచం ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ మార థాన్ నాకు పరిచయం చేసింది’ అని ఈ సందర్భంగా తెలియజేసింది. వినీత్ సింగ్ కుటుంబం క్రీడలు, ఫిట్ నెస్ అంటే చాలా ఇష్టపడుతుంది.అప్పటికే వినీత్‌కి అల్ట్రా మారథాన్, హాఫ్ మారథాన్ వంటి వాటిల్లో పాల్గొన్న అనుభవం ఉంది. 3.8 కిలోమీటర్ల ఈత, 180 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42 కిలోమీటర్ల మారథాన్లలోనూ పాల్గొంది. మోస్ట్ పవర్ఫుల్ ఉమన్‌గా అవార్డులూ గెలుచుకుంది. గర్భవతులుగా ఉన్నప్పుడు, ప్రసవానంతరమూ తల్లులు తమ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపాలో, తమ ప్రపంచాన్ని ఎంత ఉత్సాహకరంగా మార్చుకోవాలో ఈ తల్లులు తమ జీవనశైలితో నిరూపిస్తున్నారు.(చదవండి: నాసా ఏరో స్పేస్ ఇంజనీర్‌గా తొలి భారతీయ యువతి!) -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పనితీరు, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయిస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులు, రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. ఈ వారం ఈక్విటీ ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఆకర్షణీయమైన క్యూ3 జీడీపీ డేటా నమోదు, ఫిబ్రవరి తయారీ రంగ, ఆటో అమ్మకాలు మెప్పించడంతో గతవారం సూచీలు సరికొత్త గరిష్టాలను అధిరోహించాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. బ్యాంకులు, ఆటో, మెటల్ షేర్లు రాణించాయి. ‘‘స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల రక్షణ దృష్ట్యా తగిన విధివిధానాలను అమలు చేయలంటూ సెబీ ఏంసీఏలను ఆదేశించడంతో చిన్న, మధ్య తరహా షేర్లలో దిద్దుబాటు మెదలైంది. రానున్న రోజుల్లోనూ కొనసాగే వీలుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలూ స్వల్పంగా పెరిగాయి. ఏవైనా ప్రతికూల సంకేతాలు నెలకొంటే మార్కెట్లో ప్రస్తుత సానుకూలతను దెబ్బతీయగలవు. అయితే ప్రతికూలతను మార్కెట్ విస్మరిస్తే బుల్లిష్ మూమెంటం కొనసాగొచ్చు. రెండు నెలల స్థిరీకరణ తర్వాత నిఫ్టీ బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తోంది. తాజాగా శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ నాడు కీలకమైన నిరోధం 22,400 స్థాయిని చేధించి 22,420 వద్ద ముగిసింది. లాభాల కొనసాగితే 22,500 స్థాయిని పరీక్షింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే 22,200 స్థాయి వద్ద కీలక మద్దతు ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింఘ్ తెలిపారు. 3 ఐపీఓలు రూ.1,325 కోట్లు ప్రాథమిక మార్కెట్లో ఈ వారమూ ఐపీఓల సందడి కొనసాగనుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా గోపాల్ స్నాక్స్, జేజీ కెమికల్స్, ఆర్కే స్వామి కంపెనీలు రూ.1,325 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సరీ్వసెస్ సంస్థ ఆర్కె స్వామీ 4–6 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 173 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ నుంచి మరో రూ. 250.56 కోట్లను మొత్తం రూ.423.56 కోట్ల వరకు నిధుల సమీకరించనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 270–288 మధ్య నిర్ణయించింది. జింక్ ఆక్సైడ్ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్ 5–7 తేదీల మధ్య రూ. 251.2 కోట్ల నిధులను సమీకరించనుంది. రూ. 210–221 శ్రేణిలో ధరలను నిర్ణయించగా, కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 165 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ రూ. 86.2 కోట్లను సేకరించనుంది. రాజ్‌కోట్ కేంద్రంగా కార్యకలాపాలను సాగించే గోపాల్ స్నాక్స్ కంపెనీ ఈ నెల 6–11 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు అందుబాటులో ఉండనుంది. రూ. 650 కోట్ల వరకు నిధుల కోసం సిద్ధమవుతున్న కంపెనీ రూ. 381–401 శ్రేణిలో షేర్ల ధరలను నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 16 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ. 13 వేల కోట్ల వరకు సేకరించాయి. దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు దేశీయంగా మంగళవారం ఫిబ్రవరి సేవారంగం గణాంకాలు విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ఫిబ్రవరి 23 తేదీతో ముగిసిన బ్యాంకు రుణ, డిపాజిట్ వృద్ధి డేటా, మార్చి ఒకటో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వలు వెల్లడి కానున్నాయి. -
నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్!
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం (మార్చి 1) నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెండింగ్‌లో ఉన్న సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణ కోసం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిట్టల్ గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ చూపి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ‘ధరణి’దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు తహసీల్ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ►తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ టీమ్‌లలో తహసీల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న రెవెన్యూ సిబ్బందితోపాటు పారాలీగల్ వలంటీర్లు, కమ్యూనిటీ సర్వేయర్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించాలి. వారికి దీనికి అవసరమైన శిక్షణను కూడా ఇప్పించాలి. ►పెండింగ్ దరఖాస్తులను మాడ్యూళ్లు లేదా గ్రామాల వారీగా ఈ బృందాలకు అప్పగించాలి. ►దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని వీఆర్వోల ద్వారా లేదంటే వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా సదరు దరఖాస్తుదారులకు పంపాలి. ►సేత్వార్, ఖస్రా, సీస్లా పహాణి, ఇతర పాత పహాణీలు, పాత 1బీ రిజిస్టర్లు, ధరణిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పెండింగ్ దరఖాస్తులను, వాటితోపాటు వచి్చన డాక్యుమెంట్లను ఈ బృందాలు పరిశీలించాలి. అసైన్డ్, ఇనామ్, పీవోటీ, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల వివరాలను కూడా క్షుణ్నంగా తనిఖీ చేయాలి. ►అవసరమనుకుంటే ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరపాలి. స్థానికంగా సదరు భూముల గురించి విచారించాలి. చివరిగా నివేదికను రూపొందించి.. సదరు దరఖాస్తును ఆమోదించాలా, తిరస్కరించాలా అన్నది పొందుపర్చాలి. ► ప్రత్యేక బృందాల నివేదికలను తహసీల్దార్లు పైస్థాయి అధికారులకు పంపాలి. వారు వాటిని పరిశీలించి దరఖాస్తు ఆమోదానికి లేదా తిరస్కారానికి గల కారణాలను తెలియజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ►ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి. ఒక్కటి కూడా పెండింగ్‌లో ఉండకూడదు. ఇందుకు కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
చరిత్రపుటల్లోకెక్కిన మధ్యప్రదేశ్ బౌలర్
మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా చరిత్రపుట్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ ఆఖరి రోజు 95వ ఓవర్ వేసిన కుల్వంత్.. రెండు, మూడు, నాలుగు, ఐదు బంతులకు వికెట్లు తీసి, రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కుల్వంత్‌కు ముందు ఢిల్లీ బౌలర్ శంకర్ సైనీ (1988), జమ్మూ కశ్మీర్ బౌలర్ మొహమ్మద్ ముదాసిర్ (2018) మాత్రమే రంజీల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. కుల్వంత్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో విరుచుకుపడటంతో (5/34) మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో బరోడాపై ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో ఢిల్లీ, కేకేఆర్ జట్ల తరఫున ఆడిన కుల్వంత్.. మధ్యప్రదేశ్ తరఫున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా, రంజీ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 80వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నాలుగో బంతుల్లో నాలుగు వికెట్ల ఘనతను అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎక్కువ మంది సాధించలేదు. ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. లసిత్ మలింగ, ఆండ్రీ రసెల్, షాహీన్ అఫ్రిది, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు మంత్రి (111) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. అనుభవ్ అగర్వాల్, సరాన్ష్ జైన్ బరోడా పతనాన్ని శాశించారు. కుల్వంత్ 2 వికెట్లు తీశాడు. ఆతర్వాత ఫాలో ఆన్ ఆడిన బరోడా.. కుల్వంత్ ధాటికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు చాపచుట్టేసి ఇన్నింగ్స్ పరాజయాన్ని ఎదుర్కొంది. రావత్ (105) సెంచరీ చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. -
IND VS ENG 2nd Test: అరుదైన క్లబ్లో చేరిన జైస్వాల్
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారీ సెంచరీ (179) చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న టీమిండియా భవిష్యత్ తార, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్న 16వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. Reaching a Test Hundred with a SIX for India Umrigar Kapil Dev Tendulkar (6 times) Azharuddin Dravid Sehwag Irfan Pathan Gambhir (2 times) MS Dhoni Harbhajan KL Rahul (twice) Rohit (3 times) Ashwin Pujara Pant (2 times) JAISWAL pic.twitter.com/ExOjCFhUQR — Cricketopia (@CricketopiaCom) February 2, 2024 సిక్సర్‌తో సెంచరీ మార్కును తొలుత పాలీ ఉమ్రిగర్ అందుకోగా.. అత్యధిక సార్లు ఈ ఫీట్‌ను సాధించిన రికార్డు సచిన్ టెండూల్కర్ ఖాతాలో ఉంది. సచిన్ ఏకంగా ఆరు సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్నాడు. సచిన్ తర్వాత ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా మూడు సార్లు ఇలా సెంచరీ మార్కును తాకాడు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తలో రెండు సార్లు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశారు. విశేషమేమిటంటే హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఫుల్‌టైమ్ బౌలర్లు కూడా సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశారు. వీరిద్దరూ తలో సారి ఇలా సెంచరీ మార్కును అందుకున్నారు. ఈ జాబితాలో పైపేర్కొన్న వారు కాకుండా కపిల్ దేవ్, మొహమ్మద్ అజారుద్దీన్, రాహల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఎంఎస్ ధోని, పుజారా ఉన్నారు. సిక్సర్‌తో సెంచరీ మార్కును ఓసారి తాకిన సెహ్వాగ్.. డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ మార్కును కూడా సిక్సర్‌తో చేరుకుని చరిత్రపుటల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27), రజత్ పాటిదార్ (32), అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17) తక్కువ స్కోర్లకే ఔటైనా యశస్వి కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేశాడు. యశస్వితో పాటు అశ్విన్ (5) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం బౌలర్ షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, టామ్ హార్ట్లీ తలో వికెట్ దక్కించకున్నారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
IND VS ENG 1st Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండోసారి ఇలా..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఓలీ పోప్ (సెకెండ్ ఇన్నింగ్స్‌లో 196 పరుగులు), స్పిన్నర్ టామ్ హార్ట్లీ (2/131, 7/62) అద్భుతంగా రాణించి టీమిండియా ఓటమికి ప్రధాన కారకులయ్యారు. వీరిద్దరూ అత్యుత్తమంగా రాణించి టీమిండియాకు స్వదేశంలో (100కి పైగా లీడ్ సాధించినప్పటికీ) ఓటమి రుచి చూపించారు. ఈ మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన హార్ట్లీ.. తన కెరీర్ తొలి మ్యాచ్‌లోనే ఓ చెత్త రికార్డును, ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హార్ట్లీ తాను సంధించిన తొలి బంతికే సిక్సర్ సమర్పించుకుని చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అనంతరం హార్ట్లీ ఇదే మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ అరంగేట్రంలో తొలి బంతికే సిక్సర్ సమర్పించుకుని అదే మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో (3/145, 6/73) చెలరేగిన రెండో ఆటగాడిగా హార్ట్లీ చరిత్ర పుటల్లోకెక్కాడు. ఇతనికి ముందు బంగ్లాదేశ్ ఆటగాడు సోహగ్ ఘాజీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2012లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘాజీ కూడా ఇలాగే తొలి బంతికే (అరంగేట్రం) సిక్సర్ సమర్పించుకుని, అదే మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ ఘాజీ పేరు మీద ఇప్పటికీ చెక్కుచెదరని ఓ ప్రపంచ రికార్డు కూడా ఉంది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి హ్యాట్రిక్ సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఘాజీ నేటికీ చలామణి అవుతున్నాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో కలుపుకుని ఈ ఘనత రెండుసార్లు సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఘాజీ చరిత్ర పుటల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ లీడ్ సాధించినప్పటికీ ఓటమిపాలైంది. ఓలీ పోప్ మూడో ఇన్నింగ్స్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచాడు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన భారత్ 202 పరుగులకు ఆలౌటై, స్వదేశంలో ఘోర అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతుంది. -
గ్లోబల్ మూవీగా సలార్..అరుదైన ఘనత సాధించిన ప్రభాస్
-
రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్..దెబ్బకు రికార్డులన్నీ బద్దలు !
-
12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం.. చరిత్రపుటల్లోకెక్కిన బీహార్ ఆటగాడు
12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలోకి అరంగేట్రం చేయడం ద్వారా బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ చరిత్రపుటల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ముంబైతో ఇవాళ (జనవరి 5) మొదలైన మ్యాచ్‌లో బీహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ క్లాస్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్నవయస్కుడైన భారతీయుడి రికార్డు అలీముద్దీన్ పేరిట ఉంది. అలీముద్దీన్ 1942-43 రంజీ సీజన్లో రాజ్‌పుటానా తరఫున 12 ఏళ్ల 73 రోజుల వయసులో తొలిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అలీముద్దీన్ తర్వాత అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రికార్డు ఎస్కే బోస్, మొహమ్మద్ రంజాన్ పేరిట ఉంది. బోస్.. 1959-60 రంజీ సీజన్లో 12 ఏళ్ల 76 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వగా.. రంజాన్.. 1937 సీజన్లో 12 ఏళ్ల 247 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి డెబ్యూ చేశాడు. ఈ ముగ్గురు వైభవ్ కంటే చిన్నవయసులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. వైభవ్.. రంజీ అరంగేట్రానికి ముందు 2023 ఎడిషన్ కూచ్ బెహార్ ట్రోఫీలో బీహార్ తరఫున ఓ మ్యాచ్ ఆడాడు. జార్ఖండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వైభవ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 151, 76 పరుగులు చేశాడు. వైభవ్‌కు లోకల్ క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్‌గా పేరుంది. ముంబైతో ఇవాళ మొదలైన రంజీ మ్యాచ్‌లో వైభవ్ ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో బుపేన్ లాల్వాని (65), సువేద్ పార్కర్ (50), తనుశ్ కోటియన్ (50) అర్దసెంచరీలతో రాణించారు. బీహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్ 4, సకీబుల్ గనీ, హిమాన్షు సింగ్ తలో 2 వికెట్లు, అషుతోష్ అమన్ ఓ వికెట్ పడగొట్టారు. -
ఆర్బీఐ అండతో మళ్లీ రికార్డుల మోత
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి మెప్పించడంతో స్టాక్ మార్కెట్లో మళ్లీ రికార్డుల మోత మోగింది. రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 –24) వృద్ధి రేటు అంచనాలు పెంచడం, వరుసగా అయిదోసారి కీలక వడ్డీ రేట్ల జోలికెళ్లకపోవడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకులు, ఫైనాన్స్ సరీ్వసులు, రియల్టీ షేర్లకు భారీ డిమాండ్ లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త రికార్డులు నమోదు నమోదు చేశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు లాభపడి 69,826 వద్ద వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 20,969 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ సమీక్షా సమావేశ నిర్ణయాలు వెల్లడి(ఉదయం 10 గంటలు) తర్వాత కొనుగోళ్లు మరింత పెరిగాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 372 పాయింట్లు బలపడి 69,894 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి తొలిసారి 21 వేల స్థాయిపై 21,006 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ► బ్లాక్ డీల్ ద్వారా 75.81 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా వెల్లడి కావడంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ షేరు 12% లాభపడి రూ.69 వద్ద ముగిసింది. -
ఎడారి రాష్ట్రంలో ఓటింగ్ సునామీ!
జైపూర్: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ఈసారి ఓటింగ్ శాతం మునుపటి ఓటింగ్ శాతాన్ని మించిపోనుంది. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 68 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 81.12 శాతం, పాలి జిల్లాలోని మార్వార్ జంక్షన్లో అత్యల్పంగా 57.36 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో 74.06 శాతం రాజస్థాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతానికి పైగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ స్టేషన్ వెలుపల ఓటర్లు పొడవాటి క్యూలలో నిల్చోవడం చూస్తుంటే, ఓటింగ్ శాతం 75 శాతానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్లో ఓటింగ్‌పై బీజేపీ ఫిర్యాదు ఓటింగ్ శాతం బాగా నమోదవుతుందని భావిస్తున్నప్పటికీ, ప్రతిపక్ష బీజేపీ మాత్రం స్లో ఓటింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. స్లో ఓటింగ్ కోసం అధికార యంత్రాంగంపై సీఎం అశోక్ గెహ్లాట్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్పర్సన్ నారాయణ్ పంచారియా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, పోలింగ్ ముగిసే సమయంలోపు పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించిన ఓటర్లందరినీ ఓటు వేసేందుకు అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 5.25 కోట్ల మంది ఓటర్లు రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మృతితో ఒక నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. 199 నియోజకవర్గాల్లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరు 1,862 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తమ ఓటు ద్వారా నిర్ణయించారు. నువ్వా.. నేనా.. రాజస్థాన్‌లో జరుగుతున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు ప్రత్యక్ష పోటీ నెలకొంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్వుళ్లూరుతుండగా.. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయానికి చెక్ చెప్పి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ బీజీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పట్లో కాంగ్రెస్ 100, బీజేపీ 73 సీట్లు గెలుచుకున్నాయి. -
CWC 2023: 31 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..!
వన్డే వరల్డ్‌కప్-2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి, లీగ్ దశ అనంతరం అజేయ జట్టుగా నిలిచిన భారత్.. ఆదివారం నెదర్లాండ్స్‌పై గ్రాండ్ విక్టరీతో పలు ప్రపంచకప్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇందులో ఓ రికార్డును భారత్ 31 ఏళ్ల అనంతరం సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించి, వరల్డ్‌కప్ రికార్డును సమం చేశాడు. వరల్డ్‌కప్ చరిత్రలో కేవలం మూడుసార్లు మాత్రమే ఓ మ్యాచ్‌లో తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించారు. 1987 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఇలా జరిగింది. నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ చేయించింది. అనంతరం 1992 వరల్డ్‌కప్‌లో రెండోసారి ఇలా జరిగింది. పాకిస్తాన్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించింది. తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించడంతో వరల్డ్‌కప్ చరిత్రలో 31 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా, విరాట్, రోహిత్, షమీ, గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేయగా.. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు, విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. షమీ, గిల్, సూర్యకుమార్ యాదవ్‌లకు వికెట్ దక్కలేదు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. -
CWC 2023: ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఇలా..
2023 వన్డే ప్రపంచకప్ రికార్డుల అడ్డాగా మారింది. ఈ ఎడిషన్‌లో నమోదైనన్ని రికార్డులు బహుశా ఏ ఎడిషన్‌లోనూ నమోదై ఉండకపోవచ్చు. ప్రతి మ్యాచ్‌లో పదుల సంఖ్యలో రికార్డులు నమోదవుతున్నాయి. ప్రపంచ రికార్డులు సైతం ఈ ఎడిషన్‌లో సులువుగా బద్దలవుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పలు వ్యక్తిగత, టీమ్ రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఓ ప్రధానమైన రికార్డు ఉంది. అదేంటంటే.. ప్రపంచకప్ చరిత్రలో ఓ ఎడిషన్‌లో అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. నెదర్లాండ్స్‌పై గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండో విజయాన్ని (బంగ్లాదేశ్, నెదర్లాండ్స్) నమోదు చేసింది. నెదర్లాండ్స్ ఇదివరకే రెండు విజయాలు (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్) సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో పాల్గొన్న మిగతా జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించాయి. ఈ ఎడిషన్‌లో భారత్ అందరికంటే ఎక్కువగా, ఆడిన 8 మ్యాచ్‌ల్లో 8 వరుస విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చెరి 6 విజయాలు (8 మ్యాచ్‌ల్లో) సాధించాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలో 4 విజయాలు (8 మ్యాచ్‌ల్లో) నమోదు చేశాయి. మొత్తంగా ఈ ఎడిషన్‌లో పాల్గొన్న పది జట్లు కనీసం రెండ్రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి వరల్డ్‌కప్ రికార్డు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే, బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ గెలుపుతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అర్హత దృష్ట్యా కీలకంగా పరిగణించడుతుంది. వరల్డ్‌కప్ లీగ్ దశ తర్వాత టాప్-7లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. -
విరాట్ కోహ్లి= సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవాలంటే మళ్లీ సచినే దిగి రావాలి... మాస్టర్ బ్యాటర్ ఘనతల గురించి ఒకప్పుడు వినిపించిన వ్యాఖ్యల్లో ఇదొకటి. సచిన్ రికార్డుల స్థాయి, అతను అందుకున్న అసాధారణ మైలురాళ్లను చేరుకోవడం దాదాపు అసాధ్యమనే భావన ఇందులో కనిపించింది... కానీ వాటిలో ఒక అరుదైన రికార్డును విరాట్ కోహ్లి ఇప్పుడు అందుకున్నాడు... తనకే సాధ్యమైన అద్భుత ఆటతో వన్డే క్రికెట్‌కు ముఖచిత్రంగా మారిన కోహ్లి 49వ సెంచరీని సాధించడం అనూహ్యమేమీ కాదు... ప్రపంచకప్‌కు ముందు 47 వద్ద నిలిచిన అతను మెగా టోర్నీలో కనీసం రెండు సెంచరీలు సాధించగలడని అందరూ నమ్మారు... బంగ్లాదేశ్‌పై సెంచరీ తర్వాత మరో రెండుసార్లు చేరువగా వచ్చీ శతకానికి దూరమైన అతను ఈసారి విజయవంతంగా ఫినిషింగ్ లైన్‌ను దాటాడు. విరాట్ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు... అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు... కోహ్లి శతకం అందుకున్న క్షణాన కామెంటేటర్ అన్న ఈ మాట అక్షరసత్యం. ప్రపంచకప్ మ్యాచ్‌లో తన 35వ పుట్టిన రోజున సచిన్ సెంచరీల సరసన నిలవడంవంటి అద్భుత స్క్రిప్ట్ నిజంగా కోహ్లికే సాధ్యమైంది. ప్రపంచకప్ గెలిచిన క్షణంలో సచిన్‌ను భుజాల మీదకు ఎత్తుకున్న కోహ్లి... పుష్కరం తర్వాత భుజం భుజం కలుపుతూ అతని సరసన సమానంగా నిలిచాడు. సాక్షి క్రీడా విభాగం : వన్డే క్రికెట్‌ను విరాట్ కోహ్లి చదువుకున్నంత గొప్పగా మరెవరి వల్లా సాధ్యం కాలేదేమో! ఇన్నింగ్స్‌ను ఎలా ప్రారంభించాలి, మధ్య ఓవర్లలో ఎలాంటి ఆట ఆడాలి, చివర్లో ఎంతగా దూకుడు జోడించాలి... సరిగ్గా తాసులో కొలిచి లెక్కించినట్లుగా అతను ఈ ఫార్మాట్లో తన ఆటను ప్రదర్శించాడు. రుచికరమైన వంటకం కోసం వేర్వేరు దినుసులను సరిగ్గా ఎలా కలపాలో బాగా తెలిసిన షెఫ్ తరహాలో వన్డేల్లో విజయం కోసం ఎలాంటి మేళవింపు ఉండాలో అతను ఆడి చూపించాడు. ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా...లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా తన వ్యూహంపై ఉండే స్పష్టత కోహ్లిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగా ఉండే లక్ష్య ఛేదనలో గొప్ప గొప్ప ఆటగాళ్ల రికార్డులు కూడా పేలవంగా ఉంటాయి. కానీ కోహ్లికి మాత్రం పరుగుల వేటలోనే అసలు మజా. ఎంత లక్ష్యాన్నైనా అందుకోవడంలో తనను మించిన మొనగాడు లేడన్నట్లుగా అతని బ్యాటింగ్ సాగింది. తొలి ఇన్నింగ్స్‌లతో (51.15 సగటు, 22 సెంచరీలు) పోలిస్తే ఛేదనలో కోహ్లి రికార్డు (65.49 సగటు, 27 సెంచరీలు) ఘనంగా ఉందంటే అతని ఆట ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ 27లో 23 సార్లు భారత్ విజయం సాధించడం విశేషం. తన బ్యాటింగ్‌పై అపరిమిత నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం కోహ్లిని ‘ది బెస్ట్’గా తీర్చిదిద్దగా... అసాధారణ ఫిట్నెస్, విశ్రాంతి లేకుండా సుదీర్ఘ సమయం పాటు సాగే కఠోర సాధన అతడి ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కోల్‌కతాలో శతకంతో మొదలై... ఆగస్టు 18, 2008... కోహ్లి తొలి వన్డే మ్యాచ్ ఆడిన రోజు. కొద్ది రోజుల క్రితమే భారత్‌కు అండర్–19 ప్రపంచకప్ అందించిన కెపె్టన్‌గా కోహ్లికి గుర్తింపు ఉండగా... సచిన్, సెహ్వాగ్‌లు విశ్రాంతి తీసుకోవడంతో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అతనికి తొలి అవకాశం దక్కింది. ఐదింటిలో ఒక మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసినా సీనియర్ల రాకతో తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత దేశవాళీలో, ఆ్రస్టేలియా గడ్డపై ఎమర్జింగ్ టోర్నీలో భారీ స్కోర్లతో చెలరేగిన తనను మళ్లీ ఎంపిక చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. దాంతో ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం దక్కింది. మూడు అర్ధసెంచరీల తర్వాత తన 14వ వన్డేలో శ్రీలంకపై 114 బంతుల్లో చేసిన 107 పరుగుల ఇన్నింగ్స్‌తో అతని ఖాతాలో తొలి సెంచరీ చేరింది. ఈ సెంచరీ కోల్‌కతాలోనే ఈడెన్ గార్డెన్స్‌లో నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్ తర్వాత మరో మూడు వన్డేలకే మళ్లీ సెంచరీ నమోదు చేసిన కోహ్లికి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వన్డే టీమ్‌లో అతను పూర్తి స్థాయిలో రెగ్యులర్ మెంబర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెహ్వాగ్‌తో పాటు కోహ్లి కూడా సెంచరీ సాధించాడు. అయితే ఫైనల్లో అతని ఇన్నింగ్స్ (35 పరుగులు) కూడా ఎంతో విలువైంది. 31 పరుగులకే సెహ్వాగ్, సచిన్ అవుటైన తర్వాత గంభీర్‌తో మూడో వికెట్‌కు జోడించిన కీలకమైన 83 పరుగులు చివరకు విజయానికి బాట వేశాయి. ఒకదాన్ని మించి మరొకటి... విరాట్ కెరీర్లో అప్పటికే ఎనిమిది సెంచరీలు వచ్చి చేరాయి. జట్టులో స్థానానికి ఢోకా లేకపోగా, జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పరుగు జత చేస్తూ ఇన్నింగ్స్ నిరి్మంచే ‘క్లాసిక్’ ఆటగాడిగా కోహ్లికి అప్పటికి గుర్తింపు వచ్చింది. కానీ అతనిలోని అసలైన దూకుడుకు హోబర్ట్ మైదానం వేదికైంది. శ్రీలంకతో మ్యాచ్‌లో 40 ఓవర్లలో 321 పరుగులు ఛేదిస్తేనే టోర్నీలో నిలిచే అవకాశం ఉన్న సమయంలో కోహ్లి నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. 86 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 133 పరుగులు చేయడంతో 37వ ఓవర్లోనే భారత్ లక్ష్యాన్ని చేరింది. పరిస్థితిని బట్టి కోహ్లి తన ఆటను ఎలా మార్చుకోగలడో ఈ ఇన్నింగ్స్ చూపించగా, తర్వాతి రోజుల్లో ఇలాంటివి ఎన్నో వచ్చాయి. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై చేసిన అత్యధిక స్కోరు 183, కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 160 నాటౌట్, నేపియర్‌లో కివీస్‌పై 123, పుణేలో ఇంగ్లండ్‌పై 123, మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై 117... ఏది గొప్పదంటే ఏమి చెప్పాలి? జైపూర్‌లో ఆ్రస్టేలియాపై 52 బంతుల్లోనే చేసిన శతకం ఇప్పటికీ భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీగా నమోదై ఉంది. అతని ఒక్కో వన్డే ఇన్నింగ్స్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ శతకాలు అభిమానులకు పంచిన ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పాలా! -
న్యూజిలాండ్‌పై ఆసీస్ గెలుపు.. స్టార్క్ జైత్రయాత్రకు ముగింపు.. పలు రికార్డుల వివరాలు
ఆసీస్‌తో ఇవాళ (అక్టోబర్ 28) జరిగిన ఉత్కంఠ సమరంలో న్యూజిలాండ్ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 389 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన కివీస్.. ప్రత్యర్ధికి ఓటమిని పరిచయం చేసి పరాజయంపాలైంది. రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో జేమ్స్ నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచితంగా పోరాడి కివీస్‌ను గెలిపించినంత పని చేశారు. చివరి బంతికి ఆరు కావాల్సి ఉండగా.. స్టార్క్ కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో కివీస్ కనీసం ఒక్క పరుగు కూడా రాబట్టలేక ఓటమిపాలైంది. ఆసీస్ గెలిచినా.. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిచినా, ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మాత్రం చెత్త గణాంకాలను నమోదు చేయడంతో పాటు వరల్డ్‌కప్‌లో తన వికెట్ల జైత్రయాత్రకు ముగింపు పలికాడు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయకుండా 89 పరుగులు సమర్పించుకుని వరల్డ్‌కప్‌లో ఆసీస్ తరఫున అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ మరో చెత్త రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో గత 23 మ్యాచ్‌లుగా సాగుతున్న తన వికెట్ల జైత్రయాత్రకు (మ్యాచ్‌లో కనీసం ఓ వికెట్ తీయడం) ఈ మ్యాచ్‌తో ఎండ్ కార్డ్ పడింది. పై రికార్డులతో పాటు ఈ మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో రెండో అత్యధిక సిక్సర్ల సంఖ్య (32) రికార్డు ఈ మ్యాచ్‌లో నమోదైంది. ఈ విభాగంలో 2019 వరల్డ్‌కప్ ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ టాప్‌లో ఉంది. ఆ మ్యాచ్‌లో 33 సిక్సర్లు నమోదయ్యాయి. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో రెండో అత్యధిక బౌండరీల సంఖ్య (97) రికార్డు ఈ మ్యాచ్‌లో నమోదైంది. ఈ జాబితాలో టాప్‌లో ఇదే వరల్డ్‌కప్‌లో జరిగిన సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 105 బౌండరీలు నమోదయ్యాయి. వన్డేల్లో ఛేదనలో నాలుగో అత్యధిక స్కోర్ (383/9) రికార్డును న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో నమోదు చేసింది. ఈ విభాగంలో 2006 సౌతాఫ్రికా-ఆసీస్ మ్యాచ్ టాప్‌లో ఉంది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ నిర్ధేశించిన 435 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదించి సంచలనం సృష్టించింది. ఈ విభాగంలో 2009లో జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్ రెండో స్థానంలో నిలిచింది. నాటి మ్యాచ్‌లో భారత్ నిర్ధేశించిన 415 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ శ్రీలంక 411 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓటమిలో (వరల్డ్‌కప్‌లో) అత్యధిక స్కోర్ (383/9) చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. ఇదే వరల్డ్‌కప్‌లో లంకేయులు 344/9 స్కోర్ చేయగా.. పాక్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున ఆత్యధిక క్యాచ్‌లు (3) అందుకున్న నాన్ వికెట్‌కీపర్ స్టార్క్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో అలెన్ బోర్డర్, రికీ పాంటింగ్, ఆరోన్ ఫించ్ (నాన్ వికెట్కీపర్స్) కూడా వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో 3 క్యాచ్‌లు పట్టారు. వన్డేల్లో అత్యధిక పరుగులు నమోదైన విభాగంలో ఈ మ్యాచ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 771 పరుగులు చేశాయి. ఈ విభాగంలో 2006 సౌతాఫ్రికా-ఆసీస్ మ్యాచ్ (872) టాప్‌లో ఉండగా.. 2009 భారత్-శ్రీలంక మ్యాచ్ (825) రెండో స్థానంలో నిలిచింది. ఇవే కాక ఈ మ్యాచ్‌లో పలు చిన్నా చితక రికార్డులు కూడా నమోదయ్యాయి. -
CWC 2023: శ్రీలంక-సౌతాఫ్రికా మ్యాచ్.. రికార్డులు బద్దలు
2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-సౌతాఫ్రికా జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో పలు ప్రపంచకప్ రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ వరల్డ్‌కప్ హయ్యెస్ట్ టీమ్ స్కోర్ (428) నమోదు చేసింది. దీంతో పాటు వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు చేయడం (వాన్ డర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్ డి కాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు)) లాంటి అత్యంత అరుదైన రికార్డు కూడా ఈ మ్యాచ్‌లోనే నమోదైంది. అలాగే ఈ మ్యాచ్‌లో సుడిగాలి వేగంతో శతక్కొట్టిన ఎయిడెన్ మార్క్రమ్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (49 బంతుల్లో) రికార్డును నమోదు చేశాడు. ఈ మూడు రికార్డులతో పాటు ఈ మ్యాచ్‌లో మరో వరల్డ్‌కప్ రికార్డు కూడా నమోదైంది. 429 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా 102 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. లంక ఇన్నింగ్స్‌లో చరిత్ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), దసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక.. సౌతాఫ్రికాకు అంత సునయాసంగా విజయాన్ని దక్కనీయలేదు. లంకేయులు ఓడిపోతామని తెలిసి, ఎదురుదాడి చేశారు. వికెట్లు ఉండి ఉంటే వారు కూడా 400 మార్కును రీచ్ అయ్యేవారు. లంకన్లు సైతం భారీ స్కోర్ చేయడంతో ఈ మ్యాచ్‌లో వరల్డ్‌కప్ హైయెస్ట్ మ్యాచ్ స్కోర్ రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌లో సఫారీలు, లంకేయులు కలిపి 754 పరుగులు చేశారు. ప్రపంచకప్ టోర్నీల్లో ఇదే అత్యధిక మ్యాచ్ స్కోర్. 2019లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 714 పరుగులు చేశాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక మ్యాచ్ స్కోర్‌గా చలామణి అయ్యింది. -
కొడితే బంతి ఎవరెస్ట్‌కు...
హంగ్జౌ: ఆసియా క్రీడల్లో నేపాల్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో పనికూనలాంటి ఆ జట్టు ఆటలో ఇప్పుడే నడక మొదలుపెట్టిన టీమ్‌పై తమ ప్రతాపాన్ని ప్రదర్శించింది. పరుగుల వాన, పరుగుల వరద అనే విశేషణాలు ఈ మ్యాచ్‌కు సరిపోవు... విధ్వంసం, దూకుడు అనేవి కూడా చిన్న పదాలు... ఒకదాని తర్వాత మరో కొత్త మరో రికార్డు... పరుగులు, బంతులు, బౌండరీలు... ఇలా అన్నింటిలోనూ కొత్త ఘనతలే. ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో నేపాల్ ఏకంగా 273 పరుగుల తేడాతో మంగోలియాను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో టి20ల్లో పలు రికార్డులు తమ ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. రోహిత్ పౌడెల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), దీపేంద్ర సింగ్ ఐరీ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్స్‌లు) అతనికి అండగా నిలిచారు. అనంతరం మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. దవాసురెన్ (10) ఒక్కటే రెండంకెల స్కోరు చేయగా, ఎక్స్‌ట్రాలదే (23) అత్యధిక స్కోరు. మంగోలియా జట్టుకు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే కాదు, ఓవరాల్‌గా కూడా ఆ జట్టుకు ఇదే తొలి టి20 మ్యాచ్. తుది జట్టులోని 11 మందీ తొలిసారి టి20 మ్యాచ్ బరిలోకి దిగినవారే. దాంతో కాస్త అనుభవం ఉన్న నేపాల్ ముందు ఈ జట్టు కనీసం నిలవలేకపోయింది. మ్యాచ్‌లో నమోదైన రికార్డులు... 314 అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఏ జట్టూ 300 పరుగులు చేయలేదు. 278 పరుగులతో ఉన్న రికార్డును (2019లో ఐర్లాండ్ జట్టుపై అఫ్గానిస్తాన్, 2019లో తుర్కియే జట్టుపై చెక్ రిపబ్లిక్) నేపాల్ బద్దలు కొట్టింది. 273 టి20ల్లో అతి పెద్ద విజయం. గతంలో చెక్ రిపబ్లిక్ 257 పరుగులతో తుర్కియేని ఓడించింది. 34 అంతర్జాతీయ టి20ల్లో కుశాల్ మల్లా 34 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. గతంలో 35 బంతుల్లో రోహిత్ శర్మ (భారత్; 2017లో శ్రీలంకపై), డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా; 2017లో బంగ్లాదేశ్‌పై), విక్రమశేఖర (చెక్ రిపబ్లిక్; 2019లో తుర్కియేపై) నెలకొల్పిన సెంచరీ రికార్డు తెరమరుగైంది. 9 అంతర్జాతీయ టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని దీపేంద్ర సింగ్ నమోదు చేశాడు. గతంలో 12 బంతులతో ఈ రికార్డు భారత స్టార్ యువరాజ్ సింగ్ (2007లో ఇంగ్లండ్‌పై) పేరిట ఉంది. 26 ఇన్నింగ్స్‌లో నేపాల్ అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదు చేసింది. గతంలో అఫ్గానిస్తాన్ జట్టు ఐర్లాండ్‌పై (2019లో), వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికాపై (2023లో) 22 సిక్స్‌లు చొప్పున కొట్టింది. -
ప్రభాస్ రికార్డు బద్దలు కొట్టాలంటే ప్రభాస్ రావాల్సిందే
-
Asia Cup 2023: టీమిండియా స్టార్లను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఆసియా కప్-2023 ప్రారంభానికి ముందు పలువురు స్టార్ క్రికెటర్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మెగా టోర్నీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వేర్వేరు విభాగాల్లో పలు రికార్డులను బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఆ రికార్డులు ఏవంటే.. విరాట్ కోహ్లి: ఆసియా కప్-2023లో విరాట్ మరో 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఫార్మాట్లో 13000 పరుగుల మార్కును అందుకున్న ఐదో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12898 పరుగులు ఉండగా.. అతనికి ముందు సచిన్ (18426), సంగక్కర (14234), పాంటింగ్ (13734), జయసూర్య (13430) ఈ ఘనత సాధించారు. ఈ రికార్డుతో పాటు విరాట్ మరో భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఆసియా కప్‌లో అతను 13000 పరుగుల మార్కును అందుకుంటే, వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు సాధించిన రికార్డు సచిన్ (321 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండగా.. విరాట్ (265 ఇన్నింగ్స్‌లు) సచిన్ కంటే చాలా ముందే ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. విరాట్ పై పేర్కొన్న రెండు భారీ రికార్డులతో పాటు మరో అత్యంత భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఆసియా కప్-2023లో అతను మరో 4 సెంచరీలు చేస్తే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ (49) రికార్డును బద్దలు కొట్టి, సెంచరీల హాఫ్ సెంచరీని పూర్తి చేస్తాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 46 వన్డే సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ: ఆసియా కప్ 2023లో రోహిత్ మరో 163 పరుగులు చేస్తే వన్డేల్లో 10000 పరుగుల మార్కును అందుకుంటాడు. తద్వారా ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 15వ క్రికెటర్‌గా.. ఆరో భారత క్రికెటర్ రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 9837 పరుగులు ఉన్నాయి. ప్రస్తుత టోర్నీలో రోహిత్ మరో 255 పరుగులు చేస్తే, ఆసియా కప్‌లో (వన్డే ఫార్మాట్) 1000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. భారత క్రికెటర్లలో సచిన్ అత్యధికంగా ఆసియా కప్ వన్డే టోర్నీల్లో 971 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జయసూర్య, సంగక్కర మాత్రమే 1000 పరుగుల మైలురాయిని దాటారు. రవీంద్ర జడేజా: ఆసియా కప్ 2023లో జడేజా (194) మరో 6 వికెట్లు తీస్తే, వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఐదో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ విభాగంలో జయసూర్య అత్యధికంగా 323 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ అల్ హసన్: ప్రస్తుత ఆసియా కప్‌లో షకీబ్ మరో 168 పరుగులు చేస్తే, విదేశాల్లో 4000 పరుగుల మార్కును రెండో బంగ్లాదేశీగా రికార్డు సృష్టిస్తాడు. షకీబ్‌కు ముందు తమీమ్ ఇక్బాల్ (4323) ఈ ఘనత సాధించాడు. అలాగే ప్రస్తుత టోర్నీలో షకీబ్ (305) మరో వికెట్ తీస్తే, అత్యధిక వికెట్లు సాధించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో డేనియల్ వెటోరీని (305) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకతాడు. ఇమామ్ ఉల్ హాక్: ఇమామ్ ఈ ఆసియా కప్‌లో తదుపరి 4 మ్యాచ్‌ల్లో మరో 116 పరుగులు చేస్తే, వన్డేల్లో హషీమ్ ఆమ్లా ఝ(61) తర్వాత అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఇమామ్ ఖాతాలో ప్రస్తుతం 62 ఇన్నింగ్స్‌ల్లో 2884 పరుగులు ఉన్నాయి. -
Kokapet Land Auction: రికార్డుల కోకాపేట.. ఒక్క ఫ్లాట్ రూ.22.50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట సరికొత్త రికార్డులను సృష్టించింది. గురువారం హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2 వేలంలో అత్యధిక బిడ్ వేసి ప్లాట్ నంబరు–11ను ఏపీఆర్ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎకరం రూ.67.25 కోట్ల చొప్పున రూ.506.39 కోట్లతో మొత్తం 7.53 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో హైదరాబాద్‌కు, ఏపీఆర్ గ్రూప్ తలమానికంగా నిలిచే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేస్తున్నామని డైరెక్టర్ ఆవుల సంజీవ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. నాలుగు టవర్లు, ఒక్కోటి 50 అంతస్తులలో ఉంటుంది. ఫ్లోర్‌కు ఒక ఫ్లాట్ చొప్పున ఒక్క ఫ్లాట్ 15 వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 200 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ధర చ.అ.కు రూ.15 వేలు చొప్పున ఒక్క ఫ్లాట్ ప్రారంభ ధర రూ.22.50 కోట్లుగా ఉంటుంది. ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్స్ నుంచి మొదలుపెడితే క్లబ్ హౌస్, వసతులు, మెటీరియల్స్ ప్రతీది హైఎండ్గా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉంటుంది. ఇప్పటికే సింగపూర్ ఆర్కిటెక్చర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్లాట్ నంబరు–11 ఉన్న ప్రాంతం ఇతర మిగిలిన ప్లాట్ల కంటే ఎత్తులో ఉండటం, గండిపేట వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటం దీని ప్రత్యేకతలు. అతి తక్కువ ధర ఈ ప్లాటే.. నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2లో అతి తక్కువ ధర పలికింది కూడా ఈ 11 నంబరు ప్లాటే కావటం గమనార్హం. ఎకరం రూ.67.25 కోట్లతో ఏపీఆర్ గ్రూప్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. అయితే గతంలో కోకాపేట ఫేజ్–1 వేలంలో గరిష్ట ధర రూ.60 కోట్లు. గోల్డ్‌మైన్ లేఅవుట్లో రాజపుష్ప ప్రాపరీ్టస్ ఎకరం రూ.60.2 కోట్ల చొప్పున మొత్తం రూ.99.33 కోట్లతో 1.65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. -
పది రోజుల్లో నాలుగింతల వాన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా గత పది రోజుల పాటు కురిసిన వానలు వర్షపాతం రికార్డులను తారుమారు చేశాయి. పది రోజుల క్రితం 54% లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరడం గమనార్హం. ఏటా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సగటున 73.91 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. ఇందులో జూలై 28వ తేదీ నాటికి 33.64 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాలి. అయితే ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 55.75 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే సాధా రణం కంటే 22.11 సెంటీమీటర్లు (65 శాతం) అధికంగా వానలు పడ్డాయి. కేవలం గత పదిరోజుల వర్షపాతాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. సాధారణం కంటే ఏకంగా నాలుగింతలు అధికంగా వర్షాలు కురిశాయి. లోటు నుంచి అధికం వైపు వాస్తవానికి ఏటా నైరుతి సీజన్ జూన్ 1 నుంచి ప్రా రంభమవుతుంది. ఆ నెల తొలి లేదా రెండో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి, వానలు మొదలవుతాయి. కానీ ఈసారి జూన్ నాలుగో వారంలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఒకట్రెండు రోజులు మోస్తరు వానలు పడ్డాయి. తర్వాత రుత పవనాల కదలికలు మందగించి వర్షాలు జాడ లే కుండాపోయాయి. దీనితో లోటు పెరుగుతూ వచ్చింది. ఈ నెల 18 నాటికి 19.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 54శాతం లోటు. కానీ 18వ తేదీ నుంచి వానలు మొదలయ్యాయి. తర్వాతి పది రోజులకుగాను 8రోజులు వానలు పడ్డాయి. దీనితో వర్షపాతం 54 శాతం లోటు నుంచి ఏకంగా 65 శాతం అధికానికి చేరింది. అంతటా కుండపోత వానలతో.. గత పది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అయితే 64.98 సెంటీమీటర్ల అతిభారీ వర్షం రికార్డు సృష్టించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది కూడా. ఇక తొమ్మిది జిల్లాల్లో అయితే 50 సెంటీమీటర్లపైన సగటు వర్షపాతం నమోదవడం గమనార్హం. -
‘అడ్రస్’లేని భూములకు సర్వేనంబర్
ఏ భూమి అయినా ధరణిలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా స్లాట్ బుక్ చేయాలి. పట్టాదారు పాస్‌బుక్, ఖాతా నంబర్, సర్వే నంబర్, క్రయ విక్రయాలు చేసే వ్యక్తుల పేర్లు, వారి ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్లు ఆ స్లాట్‌లో పొందుపరచాలి. కానీ ఇక్కడ ఆ భూమికి సంబంధించి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోయినా, సర్వే నంబర్, ఖాతా నంబర్‌తో పనిలేకుండా స్లాట్ ఎలా బుక్ అయ్యింది? రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఏకంగా ‘బిలా దాఖలా’ భూమికి ఎసరు పెట్టారు. రికార్డులు లేవనే సాకుతో పొజి షన్లో ఉన్న రైతులను మభ్యపెట్టి బహిరంగ మార్కెట్ కంటే.. చౌకధరకు ఈ భూములు కొట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వెంటనే వాటికి సర్వే నంబర్ సృష్టించి, ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, వారు దరఖాస్తు చేసిందే తడవుగా అధికారు లు ఈ భూములను వారి పేరున బదలాయిస్తున్నారని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని.. చాలా తక్కువ రేటుకు కొనేస్తున్నారని సమాచారం. కోకాపేట సమీపంలో ఉండడంతోనే... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ గ్రామాల మధ్యన కొండకల్ రెవెన్యూ పరిధిలో 76.24 ఎకరాల ఏ అడ్రస్ లేని(బిలా దాఖలా) భూమి ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవు. 45 మంది స్థానిక రైతులు ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. పొజిషన్లో ఉన్నా వారి పేర్లు కూడా రికార్డుల్లో లేవు. పహాణీలు, పట్టాదారు పాసు పుస్తకాలు అసలే లేవు. కనీసం వీటి సర్వే నంబర్ ఏమిటో కూడా చాలామందికి తెలియదు. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.15 కోట్ల పైమాటే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్‌కు ముఖ్యంగా కోకాపేటకు అతిసమీపంలో ఉన్న ఈ భూములపై కొంతమంది ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాగైనా వీటిని చేజిక్కించుకోవాలని భావించి తెరవెనుక కథ నడిపించారు. ఏ అడ్రస్ లేని ఈ మిగులు భూములు ప్రభుత్వానికి చెందుతాయని, ఈ విషయం బయటకు చెబితే..వాటిని సర్కారు లాగేసుకుంటుందని చెప్పి రైతుల నోరు మూయిస్తున్నారు. అంతా కలిసి.. ఓ వైపు రికార్డులు లేవని, ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తూ పొజిషన్లో ఉన్న రైతులను భయాందోళనకు గురి చేస్తూ.. మరోవైపు రెవెన్యూ అధికారులతో ఈ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయించారు. తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పాత రికార్డులను పరిశీలించి ఏడీ రిపోర్టు జారీ చేశారు. దీని ఆధారంగా కలెక్టర్ సూచన మేరకు సీసీఎల్ఏ ఈ భూములకు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటికే ఈ భూములపై కన్నేసిన బడా నేతలు, రియల్టర్లు, వ్యాపారులు పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే నంబర్, ఖాతా నంబర్లు లేవనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే తాము చూసుకుంటామని నమ్మ బలికారు. భూములు అమ్మాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసు కొచ్చారు. చేసేది లేక రైతులు కూడా తలవంచక తప్ప లేదు. రైతుల్లో ఉన్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని రూ.2 కోట్లకు ఎకరం చొప్పున 21 ఎకరాలకుపైగా కొల్లగొట్టారు. అంతేకాదు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించకుండానే ‘ధరణి’లో స్లాట్ బుక్ చేసి.. గుట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. సర్వే నంబరు 555..దానికి బై నంబర్లు వేసి... ఇప్పటి వరకు ఏ అడ్రస్ లేని ఈ భూములకు రైతుల నుంచి చేతులు మారిన వెంటనే కొత్త అడ్రస్ సృష్టించారు. సర్వే నంబర్ 555గా నామకరణం చేసి..బై నంబర్లతో ఆయా భూములను బడాబాబులకు కట్టబెడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే.. ఎక్కడ తన ఉద్యోగానికి ఎసరు వస్తుందోననే భయంతో ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తుత తహసీల్దార్ సెలవులో వెళ్లి.. డిప్యూటీ తహసీల్దార్లతో పని కానిచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం. శేరిగూడ భూములపైనా కన్ను సంగారెడ్డి– రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని శేరిగూడ రెవెన్యూ పరిధిలోనూ 90 ఎకరాలకు పైగా బిలా దాఖలా భూములు ఉన్నాయి. వీటిని కూడా కొల్లగొట్టేందుకు రెవెన్యూ అధికారులు, నేతలు, రియల్టర్లు, వ్యాపారులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. విచిత్రమేమంటే.. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి.. సాగు చేస్తున్న రైతుల పేర్లు మాత్రం ఇప్పటికీ ధరణిలో కనిపించడం లేదు. కానీ వారి నుంచి కొనుగోలు చేసిన నేతలు, వ్యాపారులు, రియల్టర్ల పేర్లు మాత్రం ఆ వెంటనే నమోదవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల కొంత మంది రైతులు మండల ఆఫీసులో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అనుమతించింది కొండకల్ రెవెన్యూ పరిధిలో ‘బిలా దాఖలా’ భూములు ఉన్న మాట వాస్తవమే. వీటికి సంబంధించి గతేడాది ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేయించింది. ఆ నివేదిక ఆధారంగా భూ రికార్డులు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాత రికార్డులను పరిశీలించి, వాటికి సర్వే నం.555గా నిర్ధారించింది. కలెక్టర్ సిఫార్సు మేరకు సీసీఎల్ఏ ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.’ అని చెప్పిన తహసీల్దార్ నయీమొద్దీన్.. పొజిషన్లో ఉన్న రైతుల వివరాలు ధరణిలో ఎందుకు నమోదు చేయడం లేదని ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేయడం విశేషం. – తహసీల్దార్, నయీమొద్దీన్ -
IND VS WI 1st ODI: భారీ రికార్డులపై కన్నేసిన హిట్‌మ్యాన్, కోహ్లి
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు భారీ రికార్డులపై కన్నేశారు. హిట్‌మ్యాన్ మరో 175 పరుగులు చేస్తే వన్డేల్లో 10,000 పరుగుల మైలురాయిని చేరుకోనుండగా.. విరాట్ మరో 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13,000 పరుగుల క్లబ్లో చేరతాడు. బార్బడస్ వేదికగా విండీస్‌తో రేపు (జులై 27) జరుగబోయే తొలి వన్డేలో విరాట్, రోహిత్‌లకు ఈ మైలురాళ్లను చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రోహిత్ 243 వన్డేల్లో 30 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీల సాయంతో 9825 పరుగులు చేయగా.. కోహ్లి 274 వన్డేల్లో 46 సెంచరీ, 65 హాఫ్ సెంచరీల సాయంతో 12898 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, విండీస్‌తో ఇటీవల ముగిసిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో సునాయస విజయం సాధంచగా.. ట్రినిడాడ్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ఆఖరి రోజు మరో 8 వికెట్లు తీసి ఉంటే భారత్ విజయం సాధించేదే. అయితే ఎడతెరిపి లేని వర్షం టీమిండియా విజయావకాశాలకు భారీ గండికొట్టింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. దీని ప్రభావం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్‌పై కూడా పడింది. విండీస్‌తో రెండో టెస్ట్ గెలిచుంటే భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునేది. విండీస్ పర్యటన విషయానికొస్తే.. 27న తొలి వన్డే ఆడే భారత్, ఆతర్వాత 29, ఆగస్ట్ 1 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఆగస్ట్ 3, 6, 8, 12, 13 తేదీల్లో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ట్రినిడాడ్ వేదికగా జరుగనుండగా.. రెండు, మూడు మ్యాచ్‌లు గయానాలో.. చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనున్నాయి. అనంతరం టీమిండియా ఫ్లోరిడా నుంచి నేరుగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ భారత్ 3 టీ20లు ఆడుతుంది. -
యాషెస్ సిరీస్‌లో అత్యుత్తమ రికార్డులు ఇవే..!
141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్‌లో రికార్డులకు కొదవ లేదు. అంతర్జాతీయ క్రికెట్లో నెలకొల్పబడిన రికార్డులన్నీ దాదాపుగా యాషెస్‌లో సాధించినవే ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్‌కీపింగ్.. ఏ విభాగంలో చూసినా టాప్ రికార్డులన్నీ యాషెస్ సిరీస్‌కే దక్కుతాయి.340 టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ చరిత్రలో అత్యుత్తమ రికార్డులపై ఓ లుక్కేద్దాం. అత్యధిక స్కోర్ (టీమ్ టోటల్): 903/7 (ఇంగ్లండ్, 1938) అత్యల్ప స్కోర్: 36 (ఆస్ట్రేలియా, 1902) అత్యధిక పరుగులు: డాన్ బ్రాడ్‌మన్ (5028 పరుగులు, ఆస్ట్రేలియా) అత్యధిక వ్యక్తిగత స్కోర్: లెన్ హటన్ (364, ఇంగ్లండ్) అత్యధిక సెంచరీలు: డాన్ బ్రాడ్‌మన్ (19, ఆస్ట్రేలియా) అత్యధిక హాఫ్ సెంచరీలు: డాన్ బ్రాడ్‌మన్ (31, ఆస్ట్రేలియా) అత్యధిక డకౌట్లు: ఎస్ గ్రెగరీ (11, ఆస్ట్రేలియా) అత్యధిక సిక్సర్లు: బెన్ స్టోక్స్, కెవిన్ పీటర్సన్ (24, ఇంగ్లండ్) అత్యధిక వికెట్లు: షేన్ వార్న్ (36 మ్యాచ్‌ల్లో 195 వికెట్లు) అత్యుత్తమ గణాంకాలు (ఇన్నింగ్స్‌లో): జిమ్ లేకర్ (10/53) అత్యుత్తమ గణాంకాలు (మ్యాచ్‌లో): జిమ్ లేకర్ (19/90) అత్యధిక ఫైఫర్లు (ఇన్నింగ్స్‌లో): ఎస్ బర్న్స్ (12) అత్యధిక సార్లు 10 వికెట్ల ఘనత (మ్యాచ్‌లో): షేన్ వార్న్ (4) అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌కీపర్‌గా): ఇయాన్ హీలీ (33 మ్యాచ్‌ల్లో 135 డిస్మిసల్స్) అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్‌గా): ఇయాన్ బోథమ్ (32 మ్యాచ్‌ల్లో 54 క్యాచ్‌లు) -
ఒక షేరు ధర లక్ష రూపాయలు.. ఇండియన్ స్టాక్ మార్కెట్ లో రికార్డు..
-
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
ఎన్టీఆర్ అవార్డ్స్‌కు అరుదైన గౌరవం.. !!
నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ వేడుకను నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 8 రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు మురళీ మోహన్ పాల్గొని అవార్డులు అందజేశారు. తెలుగు సినీ నటులు మురళి మోహన్, కోట శ్రీనివాస్ రావు, బాబు మోహన్, దర్శకులు సురేష్ కృష్ణ, అశోక్, సత్యానంద్, సీనియర్ జర్నలిస్టులు వినాయక రావు, ధీరజ అప్పాజీ, కూనిరెడ్డి శ్రీనివాస్‌లకు ఈ అవార్డులు దక్కాయి. (ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!) ఈ వేడుకను ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంయుక్తంగా నిర్వహించారు. ఈ వేదికపై 101 మందికి అవార్డులు అందజేయగా.. వరల్డ్ బుక్ అఫ్ రికార్డులో చోటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన ఎఫ్టీపీసీ సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా - కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి లకు వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లండన్ సీఈఓ రాజీవ్ శ్రీవాత్సవ్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. మురళి మోహన్ మాట్లాడుతూ.. 'జాతీయ స్థాయిలో ఇంతమందిని ఒక వేడుకలో భాగస్వామ్యం చేయడం ఎంతో కష్టసాధ్యం. అయినప్పటికీ యుగపురుషుడు ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ సంస్థలు ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించారని.' అని అన్నారు. నటన, సేవా రంగాలలో ఎన్టీఆర్ ఎందరికో ఆదర్శ ప్రాయులని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు. (ఇది చదవండి: Kiara Advani: ఖరీదైన కారు కొన్న కియారా.. ధర ఎన్ని కోట్లంటే?) ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, జెన్కో చైర్మన్ ప్రభాకర రావు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, సినీ ప్రముఖులు బసిరెడ్డి, దామోదర్ ప్రసాద్, కాశీ విశ్వనాధ్, ఎన్టీఆర్ మనవడు నందమూరి యశ్వంత్, తుమ్మల ప్రసన్న కుమార్, గౌతమ్ రాజు తదితరులు విచ్చేసి గ్రహీతలకు అవార్డులను బహూకరించారు. -
మరో డైరెక్టర్ ని పాన్ ఇండియా కి తీసుకు వెళ్లనున్న అల్లు అర్జున్
-
జియో సినిమా రికార్డ్ బద్దలు!
IPL 2023 CSK-GT match: జియో సినిమా (JioCinema) యాప్ తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో మే 23న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జియో సినిమాలో అత్యధిక వీక్షకుల సంఖ్యను సాధించింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో జియోసినిమా యాప్ ఏకకాల వీక్షకుల సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంది. కాగా ఈ ప్లేఆఫ్ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. జియో సినిమాలో ఇంతకుముందున్న వీవర్స్ రికార్డు 2.4 కోట్లు. ఇది ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మ్యాచ్ సందర్భంగా నమోదైంది. భారతదేశంలోని వీక్షకులందరికీ జియో సినిమా ఐపీఎల్ 2023ని ఉచితంగా ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 1300 కోట్ల వీవ్స్ వీక్షకుల ఎంగేజ్మెంట్ పరంగా జియో సినిమా రోజూ కొత్త మైలురాళ్లను దాటుతూనే ఉంది. ఈ యాప్‌లో మొత్తం వీక్షణలు ఇప్పటికే 1300 కోట్లను దాటాయి. ఇది ప్రపంచ రికార్డు అని ఆ కంపెనీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్ట్రీమింగ్ యాప్ ఐపీఎల్ కారణంగా రోజూ లక్షల కొద్దీ కొత్త వీక్షకులను సంపాదిస్తూనే ఉంది. ఒక్కో ప్రేక్షకుడికి ఒక్కో మ్యాచ్‌కి సగటు స్ట్రీమింగ్ సమయం ఇప్పటికే 60 నిమిషాలు దాటిపోయిందని కంపెనీ పేర్కొంది. ఇక స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనదారుల పరంగా జియో సినిమా 26 మార్క్యూ స్పాన్సర్లను సాధించగలిగింది. ఏ క్రీడా ఈవెంట్‌కైనా ఇదే అత్యధికం. ఇదీ చదవండి: జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ విలవిల.. టాటా చెప్పేస్తున్న లక్షల సబ్స్క్రైబర్లు -
గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఎవరి బలమెంత..?
-
ఒరిజినల్ రికార్డులు సమర్పించండి: సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: తెలుగు దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షపడిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ శిక్షాకాలం తగ్గింపునకు సంబంధించి మొత్తం ఒరిజినల్ రికార్డులు సమర్పించాలని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఆనంద్ మోహన్ నేర చరిత్ర వివరాలు సైతం అందజేయాలని సూచించింది. ఈ కేసులో విచారణకు ఇక వాయిదా వేయలేమని, రికార్డులన్నీ సమర్పించాల్సిందేనని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన ధర్మాసనం బిహార్ సర్కారు తరపు న్యాయవాది మనీశ్ కుమార్‌కు తేల్చిచెప్పింది. శిక్షాకాలం ముగియక ముందే ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి విడుదల చేస్తూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జి.కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. తమ ప్రతిస్పందనను తెలియజేసేందుకు కొంత గడువు ఇవ్వాలన్న మనీశ్ కుమార్ విజ్ఞప్తిని తిరస్కరించింది. నిబంధనల్లో సవరణలు చేసి మరీ ఆనంద్ మోహన్ శిక్షాకాలాన్ని తగ్గించి అతన్ని విడుదల చేస్తూ నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సింహాద్రి రీరిలీజ్ రికార్డులు ఎన్ని..?
-
మార్గదర్శిలో భారీగా నల్లధనం చలామణీ జరిపినట్టు సీఐడీ అంచనా
-
IPL 2023, Mohali: పంజాబ్-లక్నో మ్యాచ్‌లో నమోదైన రికార్డులు
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మొహాలి వేదికగా నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే.. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక టీమ్ స్కోర్ (257-5). అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఆర్సీబీ (2013లో పూణేపై 263-5) పేరిట ఉంది. ఓ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక బౌండరీల రికార్డు (41).. లక్నో ఈ మ్యాచ్‌లో- 41 (27 ఫోర్లు, 14 సిక్సర్లు). అత్యధిక బౌండరీలు రికార్డు ఆర్సీబీ పేరిట ఉంది. 2013లో పూణేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 42 (21 ఫోర్లు, 21 సిక్సర్లు) బౌండరీలు సాధించింది. ఓ మ్యాచ్‌లో రెండో అత్యధిక బౌండరీల రికార్డు (67).. పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్‌లో 67 (45 ఫోర్లు, 22 సిక్సర్లు, 458) బౌండరీలు నమోదయ్యాయి. 2010 సీజన్లో సీఎస్కే వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌లో అత్యధికంగా 69 బౌండరీలు (39 ఫోర్లు, 30 సిక్సర్లు) నమోదయ్యాయి. ఓ సీజన్లో అత్యధిక 200 ప్లస్ స్కోర్ల రికార్డు (20).. ప్రస్తుత సీజన్లో 20 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. 2022లో 18, 2018లో 15 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. అత్యధిక బౌలర్ల వినియోగం (9)- పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 9 మంది బౌలర్లను ప్రయోగించింది. 2016లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 మంది బౌలర్లను మార్చింది. -
మూడొంతులు గల్లంతు!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దులో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్ దర్గాకు సుమారు 500 ఎకరాల భూమి ఉంది. చాలావరకు భూమి సాగులో ఉంది. 2008లో వక్ఫ్‌బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఇలావుండగా సర్వే నంబర్ 82/అ/1/1లోని ఆరు ఎకరాలకు సంబంధించి ఒక రైతు పేరిట 2018లో పట్టాదారు పాస్‌బుక్ జారీ అయింది. తర్వాత తప్పిదాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2021లో పాస్‌బుక్‌ను రద్దు చేశారు. అయితే అప్పటికే సదరు రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన రియల్టర్లు రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించగా నిషేధిత జాబితా కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు హెచ్ఎండీఏఅధికారులు అవగాహన రాహిత్యంతో భూమికి లే అవుట్ పర్మిషన్స్ (ఎల్పీ) నంబర్ జారీ చేయడంతో, ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కోసం సదరు రియల్టర్లు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వక్ఫ్ భూములు యథేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వక్ఫ్‌బోర్డు సిబ్బందే స్థిరాస్తి వ్యాపా రులతో కుమ్మక్కై రికార్డులు తారు మారు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వం కూడా వీటిని రెవెన్యూ భూములుగా పేర్కొంటూ అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందనే విమర్శలున్నాయి. మరోవైపు లీజులకు ఇచ్చిన భూములు సైతం క్రమంగా చేజారిపోతున్నాయి. నిజాం కాలం నుంచి వక్ఫ్ ఆస్తుల రికార్డులు ఉర్దూ, పార్సీ భాషల్లో ఉండగా, భద్రపరచాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన పర్మినెంట్ సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం అక్రమార్కులకు కలిసి వస్తోంది. నామమాత్రపు చర్యలే.. వక్ఫ్‌బోర్డు రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని దర్గాలు, మసీదులు, ఆషూర్ ఖానాలు, చిల్లాలతో పాటు స్మశానవాటికలు తదితరాల (మొత్తం 33,929) కింద సుమారు 77,588.07 ఎకరాల భూమి ఉంది. అందులో మూడొంతులు అంటే.. ఏకంగా 57,423.91 ఎకరాలు (74 శాతం) ఆక్రమణలో ఉండటం విస్మయం కలిగించే అంశం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అధిక శాతం భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. మెదక్‌లో దాదాపు పూర్తిగా పరాధీనమయ్యాయి. బోర్డు సుమారు 2,186 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినా తదుపరి చర్యలు ముందుకు సాగలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో కబ్జాలపై ఉక్కుపాదం కోసం రెవెన్యూ, పోలీసు, వక్ఫ్ బోర్డు అధికారులతో కూడిన ఒక టాస్‌్కఫోర్స్ ఏర్పాటైనా చలనం మాత్రం లేదు. మరోవైపు రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని రికార్డుల గదికి ఐదేళ్లుగా తాళం చిప్ప వేలాడుతోంది. అవినీతి ఆరోపణలు దష్ట్యా సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కీలక రికార్డులను స్వా«దీనం చేసుకొని రికార్డు రూమ్‌ను సీజ్ చేశారు. అది ఇప్పటివరకు తెరుచుకోక పోవడంతో సుమారు 3,400 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు కేసులు సరైన ఆధారాలు లేక వీగిపోయాయి. కబ్జాల పర్వం.. ♦ నల్లగొండ జిల్లా దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూమిలో సుమారు 83 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ♦ మల్కాజిగిరిలో హజరత్ మీర్ మెహమూద్ సాహబ్ పహాడి దర్గాకు సర్వే నంబర్ 659, 660లో సుమారు మూడు ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఈ భూమిపై తిష్ట వేశాడు. ఫెన్సింగ్ వేసి ప్లాటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. ♦ చిల్లా కోహ్–ఎ–మౌలా–అలీకి మల్లాపూర్, కీసర రాంపల్లిలో సుమారు 232 ఎకరాల భూమి ఉండగా సగానికి పైగా భూబకాసురుల ఆక్రమణలో ఉంది. ♦ మణికొండ దర్గాకు 1,654 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులుండగా ప్రస్తుతం ఎకరం భూమి కూడా కన్పించడం లేదు. ♦ హకీముల్ మునవీ అల్ మారూఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్‌షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4,448 గజాలు, దర్గా నిర్వహణ కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని వక్ఫ్ చేయగా, ప్రస్తుతం దర్గా మినహా మిగతా భూమి ఉనికి లేకుండా పోయింది. ధారాదత్తం ఇలా.. ♦ ఐదో నిజాం రాజు అఫ్జల్ దౌలా మణికొండ గ్రామ పరిధిలో హుస్సే¯న్ షావలి దర్గాకు 1,898 ఎకరాలు రాసిచ్చారు. 1959లో గెజిట్ కూడా విడుదల అయ్యింది. అయితే రికార్డుల్లో సర్కారీ పేరుతో ఉన్న వక్ఫ్ భూముల్ని రెవెన్యూగా పేర్కొంటూ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ♦ పహడీషరీఫ్‌లో బాబా షర్ఫొద్దీన్ దర్గాకు మామిడిపల్లిలో 2,131 ఎకరాల భూమి ఉండగా, దీంట్లోంచి 1,051 ఎకరాల భూమిని వక్ఫ్‌బోర్డు అనుమతి లేకుండానే ప్రభుత్వం విమానాశ్రయానికి, మరో 91 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ♦ సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో ఈద్గాకు చెందిన సర్వే నంబర్ 290లోని 9.20 ఎకరాల భూమిని ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. న్యాయాధికారాలు ఉండాలి వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక న్యాయాధికారాలు ఉండాలి. వక్ఫ్, రెవెన్యూ భూములపై స్పష్టత రావాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. రికార్డులు గల్లంతు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అక్రమణలను తొలగించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలి. – అబుల్ పత్హే బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, పాలక మండలి సభ్యుడు, వక్ఫ్‌బోర్డు. హైదరాబాద్ రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి వక్ఫ్ భూముల రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి. కోర్టు వివాదాల్లోని భూములపై సమగ్ర ఆధారాలు సమర్పించే విధంగా చర్యలు అవసరం. అప్పుడే వక్ఫ్ భూముల పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. – సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేనీ, వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ గద్వాలలోని హజరత్ సయ్యద్ షా మరూఫ్ పీర్ ఖాద్రీ దర్గాకు 39.8 ఎకరాల భూమి ఉంది. సంగాలలోని సర్వే నంబర్ 95, 96, 97, 98లోని 27.9 ఎకరాల భూమిని దర్గా ముతవల్లి ద్వారా స్థానిక రైతు ఒకరు సాగు కోసం లీజుపై తీసుకున్నారు. తర్వాత ఆ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటంతో అతని సోదరుడు రెవెన్యూ శాఖ ద్వారా యాజమాన్య హక్కు సర్టిఫికెట్ (ఓఆర్సీ) పొందాడు. తర్వాత తన పేరిట మారి్పడి చేసుకొని ప్లాటింగ్‌కు ప్రయత్నించాడు. దర్గాకు చెందినవారి ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ కోర్టు ఓఆర్సీపై స్టే ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే విధించింది. -
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ వన్
-
పుష్ప రూలింగ్ స్టార్ట్
-
మరోసారి భారీగా కరోనా కేసులు.. గడిచిన 5 నెలల్లో ఇదే తొలిసారి
దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,435 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 15 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కు చేరుకుంది. గత అయిదు నెలల్లో(163 రోజులు) ఇంత భారీస్థాయిలో కేసులు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.పేర్కొంది. తాజా కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 4,41,79,712 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో రికవరి రేటు 98.76కాగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో నాలుగు మరణాలు సంభవించగా, చత్తీస్‌గఢ్‌్, ఢిల్లీ, గుజరాత్ , హర్యానా, కర్ణాటక, పుదుచ్చేరి, రాజస్తాన్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణాలు నమోదయ్యాయి. (చదవండి: ఆ విషయాల్లో మోదీని విడిచిపెట్టలేదు! ఐనా రివేంజ్ తీర్చుకోలేదు! గులాం నబీ అజాద్) -
పండిట్ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు!
దేశంలో ఒక ప్రధాని వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడం గొప్ప విషయంగా మారిన రోజులివి. 2004లో అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన డా.మన్మోహన్ సింగ్ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో పార్టీ బలం పెరిగాక రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసి పదేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత బీజేపీ నేత నరేంద్ర మోదీ.. డా.మన్మోహన్ మాదిరిగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఊహించని పరిణామాలు జరగకపోతే మన్మోహన్ జీ మాదిరిగానే 21వ శతాబ్దంలో వరుసగా పదేళ్లు భారత ప్రధానిగా పని చేసిన రికార్డును మోదీ సమం చేస్తారు. వీరిద్దరి కంటే ముందు వరుసగా ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. లాంగ్ రికార్డ్ నెహ్రూదే స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూది. భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి 2 ఏళ్ల 4 నెలల ముందు అంటే–1947 ఆగస్ట్ 15న ప్రధానిగా ప్రమాణం చేసిన నెహ్రూజీ 1964 మే 27న కన్నుమూసే వరకూ పదవిలో కొనసాగారు. ఆయన దేశ ప్రధానిగా 16 ఏళ్ల 286 రోజులు పదవిలో ఉండి సృష్టించిన రికార్డును ఈరోజుల్లో తిరగరాయడం కష్టమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నందా 13 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రీ 1966 జనవరి 11న గుండెపోటుతో మరణించడంతో ఆయన పదవిలో ఉన్నది ఏడాది 216 రోజులే. శాస్త్రీ జీ తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రధానిగా 13 రోజుల జీఎల్ నందా సర్కారు దిగిపోయాక 1966 జనవరి 11న తొలిసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నెహ్రూ జీ కుమార్తె ఇందిరాగాంధీ వరుసగా 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. ఇందిరమ్మ 1977 మార్చి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయే వరకూ పదవిలో కొనసాగారు. తండ్రి తర్వాత కుమార్తెదే రికార్డు: ఇందిరమ్మ వరుసగా 11 ఏళ్ల 59 రోజులు ప్రధానిగా అధికారంలో కొనసాగి, తండ్రి నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన రికార్డు స్థాపించారు. 1980 జనవరి 14న చివరిసారి ప్రధాని అయిన ఇందిరమ్మ 1984 అక్టోబర్ 31న హత్యకు గురికావడంతో ఆమె చివరి పదవికాలం 4 ఏళ్ల 291 రోజులకే ముగిసింది. ఇందిరమ్మ వారసుడిగా అధికారంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 డిసెంబర్ లోక్ సభ ఎన్నికల తర్వాత రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. కాని క్లిష్ట రాజకీయ పరిణామాల కారణంగా ప్రధానిగా ఆయన కొనసాగిన మొత్తం కాలం 5 ఏళ్ల 32 రోజులే. రాజీవ్ తర్వాత ప్రధానులైన వి.పి.సింగ్, చంద్రశేఖర్ లలో ఏ ఒక్కరూ ఏడాది పాటు ప్రధానిగా కొనసాగలేకపోయారు. వారి తర్వాత ప్రధాని అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు మరుసటి ఎన్నికల వరకూ దాదాపు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. కమల సారథ్యం 1990లో దేశంలో బీజేపీ బలపడిన క్రమంలో ఈ పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి మొదటిసారి 1996లో ప్రధానిగా ప్రమాణం చేసి మెజారిటీ లేక రెండు వారాలకే దిగిపోవాల్సివచ్చింది. ఆయన తర్వాత ప్రధానులైన జనతాదళ్ నేతలు హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ లలో ఏ ఒక్కరూ కూడా ఏడాది కాలం పదవిలో కొనసాగలేకపోయారు. 1998, 1999 పార్లమెంటు మధ్యంతర ఎన్నికల తర్వాత వరుసగా రెండుసార్లు బీజేపీ నేతగా ప్రధాని అయిన వాజపేయి ఈ రెండు సార్లు కలిపి మొత్తం 6 ఏళ్ల 64 రోజులు అధికారంలో ఉన్నారు. చదవండి: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: సుస్థిరత నుంచి సుస్థిరతకు! వాజపేయి పదవీకాలాన్ని డా.మన్మోహన్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇద్దరూ దాటేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఏడాది మే నెలలో పదేళ్లు పూర్తిచేసుకుని మన్మోహన్ రికార్డును సమం చేసే అవకాశాలు సుస్పష్టమే. అయితే, వరుసగా 11 సంవత్సరాల 59 రోజులు ప్రధాని పదవిలో కొనసాగిన (నెహ్రూ తర్వాత రెండో రికార్డు) ఇందిరాగాంధీ రికార్డును దాటిపోయే అవకాశం బీజేపీ రెండో ప్రధానికి 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు కల్పిస్తాయా? అనే విషయం ఏడాదిలో తేలిపోతుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
ఐపీఎల్-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో పలు రికార్డులు బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి లుక్కేద్దాం. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు: ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. ఈ సీఎస్కే మాజీ ఆల్‌రౌండర్ 183 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ రికార్డును రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. చహల్ ఖాతాలో ప్రస్తుతం 166 వికెట్లు ఉన్నాయి. రానున్న సీజన్లో అతను మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవుతుంది. అత్యధిక సెంచరీలు: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ ఖాతాలో 6 సెంచరీలు ఉండగా.. ఆర్ఆర్ జోస్ బట్లర్, ఆర్సీబీ విరాట్, పంజాబ్ రాహుల్, ఢిల్లీ వార్నర్ ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అత్యధిక సిక్సర్ల రికార్డు: రాబోయే సీజన్లో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న సెకెండ్ హైయ్యెస్ట్ సిక్సర్స్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఏబీడీ ఖాతాలో 251 సిక్సర్లు ఉండగా.. ఈ రికార్డును రోహిత్ శర్మ (240) బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్ గేల్ (357) ఉన్నాడు. అత్యధిక డక్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రానున్న సీజన్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. హిట్‌మ్యాన్ మరో మ్యాచ్‌లో డకౌటైతే మన్దీప్ సింగ్ (14)ను అధిగమించి హోల్ అండ్ సోల్‌గా చెత్త రికార్డుకు ఓనర్ అవుతాడు. ఇవే కాకుండా రానున్న సీజన్లో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎవరికీ సాధ్యపడని పలు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. అవేంటంటే.. అత్యధిక మ్యాచ్‌లు: సీఎస్కే సారధి ఎంఎస్ ధోని రానున్న ఐపీఎల్ సీజన్లో 250 మ్యాచ్‌ల మార్కును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో 234 మ్యాచ్‌లు ఆడి టాప్‌లో ఉన్నాడు. అత్యధిక పరుగులు: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ రానున్న సీజన్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 6624 పరుగులుండగా.. ధవన్ ఖాతాలో 6244 రన్స్ ఉన్నాయి. అలాగే వార్నర్ (5881), రోహిత్ శర్మ (5879)లు 6000 పరుగుల క్లబ్లో చేరే అవకాశం ఉంది. అత్యధిక క్యాచ్‌లు: ఐపీఎల్లో ఇప్పటివరకు 97 క్యాచ్‌లు అందుకున్న రోహిత్ శర్మ, 93 క్యాచ్‌లు అందుకున్న విరాట్ కోహ్లి 100 క్యాచ్‌ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సురేశ్ రైనా (109) పేరిట ఉంది. -
ఐపీఎల్ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్ బాస్‌వే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ మరికొద్ది రోజుల్లో (మార్చి 31) ప్రారంభంకానున్న నేపథ్యంలో లీగ్‌లో ఇప్పటిదాకా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం. అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లి (ఆర్సీబీ తరఫున 223 మ్యాచ్‌ల్లో 6624 పరుగులు) అత్యధిక వ్యక్తిగత స్కోర్: క్రిస్ గేల్ (ఆర్సీబీ తరఫున పూణే వారియర్స్‌పై 66 బంతుల్లో 175 నాటౌట్) అత్యధిక సెంచరీలు: క్రిస్ గేల్ (6) అత్యధిక సగటు: కేఎల్ రాహుల్ (48.01) అత్యధిక స్ట్రయిక్ రేట్ (ఆండ్రీ రసెల్, 177.88) అత్యధిక హాఫ్ సెంచరీలు: డేవిడ్ వార్నర్ (55) ఫాస్టెస్ట్ ఫిఫ్టి (కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ 14 బంతుల్లో) ఫాస్టెస్ట్ సెంచరీ (క్రిస్ గేల్, పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో) అత్యధిక ఫోర్లు (శిఖర్ ధవన్, 701) అత్యధిక సిక్సర్లు (క్రిస్ గేల్, 357) ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (పాల్ వాల్తాటి, ఏబీ డివిలియర్స్-19) ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (క్రిస్ గేల్, 17) ఓ సీజన్లో అత్యధిక పరుగులు (విరాట్ కోహ్లి, 2016లో 973 పరుగులు) ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (క్రిస్ గేల్, రవీంద్ర జడేజా-36 పరుగులు) అత్యధిక డకౌట్లు (రోహిత్ శర్మ, మన్దీప్ సింగ్-14) అత్యధిక వికెట్లు (డ్వేన్ బ్రావో- 183) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (అల్జరీ జోసఫ్- 6/12) అత్యుత్తమ ఎకానమీ (రషీద్ ఖాన్- 6.37) అత్యధిక మెయిడిన్లు (ప్రవీణ్ కుమార్-14) అత్యధిక డాట్ బాల్స్ (భువనేశ్వర్ కుమార్-1406) అత్యధిక సార్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు (సునీల్ నరైన్-8 సార్లు) లీగ్ మొత్తంలో హ్యాట్రిక్‌లు: 21 అత్యధిక డిస్మిసల్స్ (వికెట్‌కీపర్‌గా): ధోని (170) అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌కీపర్): ధోని (131) అత్యధిక స్టంపౌట్లు: ధోని (39) అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్): సురేశ్ రైనా (109) ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్): నబీ (5) అత్యధిక మ్యాచ్‌లు: ధోని (234) కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు: ధోని (210) కెప్టెన్‌గా అత్యధిక విజయాలు: ధోని (123) అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు: ఏబీ డివిలియర్స్ (25) అత్యధిక టీమ్ స్కోర్: ఆర్సీబీ (263/3) అత్యల్ప టీమ్ స్కోర్: ఆర్సీబీ (49 ఆలౌట్) అత్యధిక టైటిల్స్: ముంబై ఇండియన్స్-5 -
అరుదైన క్లబ్లో చేరిన తమీమ్ ఇక్బాల్.. తొలి బంగ్లాదేశీగా రికార్డు
బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన 34వ పుట్టిన రోజున ఓ అరుదైన క్లబ్లో చేరాడు. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా, ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 40వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సిల్హెట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో తమీమ్ ఈ మైలురాయిని అధిగమించాడు. Congratulation Tamim Iqbal on becoming the first Bangladeshi batsman to complete 15000 runs in International Cricket. 🔥🏏#BCB | #Cricket pic.twitter.com/J4mj5W8k9T — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి రనౌటైన తమీమ్ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 15000 పరుగుల మైలురాయిని టచ్ చేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తమీమ్.. ఇప్పటికే అత్యధిక సెంచరీలు, అత్యధిక వన్డే పరుగులు, టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశీగా రికార్డు, బంగ్లాదేశ్ తరఫున 3 ఫార్మట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా పలు రికార్డులు కలిగి ఉన్నాడు. తమీమ్ ఖాతాలో 3 ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 25 సెంచరీలు ఉన్నాయి. మరే బంగ్లాదేశీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో ఇన్ని సెంచరీలు చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 383 మ్యాచ్‌లు ఆడిన తమీమ్ 15009 పరుగులు చేశాడు. తమీమ్.. 69 టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 5082 పరుగులు, 235 వన్డేల్లో 14 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీల సాయంతో 8146 పరుగులు, 78 టీ20ల్లో సెంచరీ, 7 హాఫ్ సెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో రెండో వన్డేలో ముష్ఫికర్ రహీం సునామీ శతకంతో (60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్), లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. బంగ్లాదేశ్‌కు ఇది వన్డేల్లో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
అంతర్జాతీయ టీ20 మ్యాచ్.. కేవలం 2 బంతుల్లోనే ఖేల్ ఖతం, అత్యంత చెత్త రికార్డులు
స్పెయిన్-ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యంత చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు ఐజిల్ ఆఫ్ మ్యాన్ 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయకపోగా.. ఏకంగా 6 మంది డకౌట్ అయ్యారు. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా నమోదు కాకపోగా.. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 4గా ఉంది. జోసఫ్ బుర్రోస్ 4 పరుగులు చేయగా.. జార్జ్ బుర్రోస్, లూక్ వార్డ్, జాకబ్ బట్లర్ తలో 2 పరుగులు చేశారు. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఆటతీరు ఎంత చెత్తగా సాగిందో ఈ గణంకాలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. స్పెయిన్ బౌలర్లలో మహ్మద్ కమ్రాన్ (4-1-4-4), అతీఫ్ మెహమూద్ (4-2-6-4) తలో 4 వికెట్లు పడగొట్టగా, లోర్న్ బర్న్స్ (0.4-0-0-2) 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 11 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్పెయిన్.. కేవలం 2 బంతుల్లోనే ఆటను ముగించింది. తొలి బంతిని జోసఫ్ బుర్రోస్ నో బాల్ వేయగా.. ఆ తర్వాత రెండు బంతులను అవైస్ అహ్మద్ సిక్సర్లుగా మలిచి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ పలు చెత్త రికార్డులకు వేదికైంది. పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ (10 ఆలౌట్), ఛేదనలో ఫాస్టెస్ట్ రన్‌రేట్ (39), బంతుల తేడా పరంగా విజయం (118 బంతులు) లాంటి చెత్త రికార్డులు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి. -
NZ VS ENG 2nd Test: న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ అరుదైన రికార్డు
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఆట మూడో రోజు 45 పరుగుల వద్ద సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న లాథమ్.. ఆండర్సన్ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా టెస్ట్‌ల్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. గతంలో కివీస్ తరఫున కేవలం ఆరుగురు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. కెరీర్లో 72వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న 30 ఏళ్ల లాథమ్.. ఈ మ్యాచ్‌లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ తరఫున 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో రాస్ టేలర్ (7683) అగ్రస్థానంలో ఉండగా.. కేన్ విలియమ్సన్ (7680), స్టీఫెన్ ఫ్లెమింగ్ (7172), బ్రెండన్ మెక్కల్లమ్ (6453), మార్టిన్ క్రో (5444), జాన్ రైట్ (5334) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఫాలో ఆన్ ఆడుతున్న న్యూజిలాండ్‌ను లాథమ్‌తో పాటు డెవాన్ కాన్వే (61) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే 6 పరుగుల వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో న్యూజిలాండ్ కష్టాలు మొదలయ్యాయి. 12 పరుగుల తేడాతో మరో వికెట్ (విల్ యంగ్ (8)) కూడా పడటంతో కివీస్ కష్టాలు రెట్టింపయ్యాయి. క్రీజ్‌లో కేన్ విలియమ్సన్ (25), హెన్రీ నికోల్స్ (18) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 24 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ (176 బంతుల్లో 186; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీతో శివాలెత్తగా.. రూట్ (153 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడుతుంది. కెప్టెన్ సౌథీ (49 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోతే న్యూజిలాండ్ ఈ మాత్రం కూడా స్కోర్ చేయలేకపోయేది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి 24 పరుగులు వెనుకంజలో ఉంది. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
‘ధరణి’ ఇలా దారిలోకి! రంగంలోకి నవీన్ మిత్తల్
సాక్షి, హైదరాబాద్: సమస్యల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ‘ధరణి’ని దారిలోకి తెచ్చేందుకు కొత్త భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ కసరత్తు మొదలుపెట్టారు. మొదటగా ధరణి సమస్యలపై అధ్యయనం చేయాలని భావించారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. రైతులు, రెవెన్యూ వర్గాలు ధరణి పోర్టల్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. మరోవైపు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) ధరణి సమస్యలు, పరిష్కారాలపై తయారు చేసిన నివేదికను కొత్త సీసీఎల్ఏకు అందజేయాలని భావి స్తోంది. మొత్తం 25 అంశాలతో రూపొందించిన నివేదికలోని అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా చాలా వరకు ‘ధరణి’సమస్యలను పరిష్కరించవచ్చని చెబుతోంది. ధరణి పోర్టల్ సమస్యలపై ట్రెసా నివేదికలోని అంశాలివే... –వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారం తర్వాత కూడా తహసీల్దార్/ఆపరేటర్ లాగిన్లకు సమాచారం రావడంలేదు. సదరు దరఖాస్తులు చేసుకున్న సమయంలోనే తహసీల్దార్/ఆపరేటర్ లాగిన్లలో నోటీసు వచ్చేలా ఆప్షన్ ఇవ్వాలి. –ఒక సర్వే నంబర్లోని కొంతభాగం భూమిని గతంలో ఉన్న తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసి ఉంటే, ఆ భూమిని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే ఆ సర్వే నంబర్లోని అన్ని భూములకూ ప్రస్తుత తహసీల్దార్ డిజిటల్ సంతకం కనిపిస్తోంది. అలాకాకుండా ఏ తహసీల్దార్ డిజిటల్ సంతకం చేస్తే వారి సంతకమే కనిపించేలా సరిచేయాలి. –తహసీల్దార్ లాగిన్లలో ప్రస్తుత పహణీ/ భూహక్కుల అంతర్గత పుస్తకం/ పాసు పుస్తకాలు కనిపించడంలేదు. దీంతో రికార్డుల పరిశీలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భూసేకరణ ద్వారా ప్రభుత్వం తీసుకున్న భూములను పరిశీలించే క్రమంలో సమస్యలు వస్తున్నాయి. తహసీల్దార్ లాగిన్‌లో ప్రస్తుత పహాణీలు, ఆర్‌వోఆర్‌ఐబీలు, పాసుపుస్తకాలు అందుబాటులో ఉంచాలి. –ఉన్న భూమి కంటే ఎక్కువ, తక్కువగా రికార్డయిన వివరాలను సరిచేసే ఆప్షన్ ఇవ్వాలి. –రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్లకు సర్టిఫైడ్ కాపీలు తీసుకునే అవకాశం ప్రస్తుతం ధరణిలో లేదు. కానీ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రం సర్టిఫైడ్ కాపీలిస్తున్నారు. వీటి కోసం ప్రజలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నందున మీసేవా ద్వారా వాటిని తీసుకునే అవకాశం కల్పించాలి. –ధరణి ప్రాజెక్టు అందుబాటులోకి రాకముందు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లను రద్దు చేసుకునేందుకు, వాటిల్లోని తప్పులను సరిచేసుకునేందుకు ఆప్షన్ ఇవ్వాలి. –కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాకముందు తహసీల్దార్లు, ఆర్డీవోలు జారీ చేసిన ప్రొసీడింగ్ కాపీలను అమలు చేసే ప్రొవిజన్ ఇవ్వాలి. –వివాదాల్లో ఉన్న ఇనాం భూములను ప్రాసెస్ చేసేందుకు, ఓఆర్సీలు జారీ చేసేందుకు ధరణిలో అవకాశం కల్పించాలి. –రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మ్యుటేషన్ జరిగేలోపు పట్టాదారుడు చనిపోతే ఆ పట్టాదారువారసులకు మ్యుటేషన్ చేసే అవకాశం ఇవ్వాలి. –అసలైన పట్టాదారులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో కొందరు మీసేవా కేంద్రాల ద్వారా పట్టాభూములను నాలా కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీంతో అసలైన పట్టాదారులకు ఇబ్బంది అవుతోంది. అలాంటి థర్డ్ పార్టీ దరఖాస్తులను రద్దు చేసే ఆప్షన్ ఇవ్వాలి. –సిటిజన్ పోర్టల్ ద్వారా భూముల నిర్వహణ, సేల్ సర్టిఫికెట్, ఎక్సే్చంజ్ డీడ్లు చేసుకునే అవకాశం పవర్ ఆఫ్ అటారీ్నలకు ఇవ్వాలి. –ధరణిలో తప్పుగా నమోదై, డిజిటల్ సంతకాలు కాని ఎంట్రీలను తొలగించే ఆప్షన్ ఇవ్వాలి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్లలో పొరపాటున పడిన చిన్న, చిన్న తప్పులను సవరించుకునే అవకాశం కూడా ఇవ్వాలి. – కొన్ని అసైన్డ్ భూముల రికార్డుల్లో భూమి స్వభావాన్ని పొరపాటున పట్టా అని నమోదు చేశారు. ఈ కారణంతో ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. ఈ రికార్డులను సరిచేసే ఆప్షన్ టీఎం–33లో కనిపించడం లేదు. దీంతో అసైన్డ్ భూములకు వారసత్వహక్కులు కూడా కల్పించలేకపోతున్నాం. –రెండు ఖాతాలు కలిగిన రైతులు ఒక ఖాతాలో ఆధార్ నమోదు చేసుకోకపోతే మళ్లీ నమోదు చేసుకునేందుకు ధరణి పోర్టల్ అనుమతించడం లేదు. మీరు నమోదు చేసిన ఆధార్ నంబర్ ఇప్పటికే ఉందని చూపిస్తోంది. ఈ సమస్యను సవరించాలి. –ఆర్డీవో స్థాయిలో ఇప్పటికే ప్రొసిడీంగ్స్ వచ్చిన భూములకు వ్యవసాయ కేటగిరీ నుంచి నాలా కేటగిరీకి మార్చుకునే అవకాశం కల్పించాలి. –వీలునామాలను అమలు పరిచే ఆప్షన్ ఇవ్వాలి. -
IND VS AUS 2nd Test: కేవలం ఒక్క పరుగు లీడ్.. 35 ఏళ్ల రికార్డు బద్దలు
న్యూఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేవలం ఒక్క పరుగు దూరంలో (262 ఆలౌట్) నిలిచిపోయింది. దీంతో ఆసీస్ పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత్‌పై లీడ్‌పై పరంగా ఇదీ ఓ రికార్డే. 1958లో కాన్పూర్ వేదికగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఒక్క పరుగు ఆధిక్యం కూడా లేకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు ఒకే స్కోర్ సాధించాయి. ఇదే సీన్ 1986లో జరిగిన బర్మింగ్హమ్ టెస్ట్‌లో మరోసారి రిపీటైంది. భారత్, ఇంగ్లండ్ జట్లు తొలి ఇన్నింగ్స్‌లో సమానమైన స్కోర్లు సాధించాయి. దీని తర్వాత 1988లో ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు 2 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. తాజాగా ఢిల్లీ టెస్ట్‌లో ఆసీస్‌కు ఒక్క పరుగు ఆధిక్యం లభించడంతో పై పేర్కొన్న మూడు టెస్ట్‌ల మధ్యలో చోటు దక్కించుకుంది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 263 పరుగులు చేయగా.. భారత్ 262 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసి 62 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఖ్వాజా (6) జడేజా బౌలింగ్‌లో ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (39 నాటౌట్), లబూషేన్ (16 నాటౌట్) క్రీజ్‌లో కొనసాగుతున్నారు. కాగా, రెండో రోజు ఆటలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను.. అక్షర్ పటేల్ (74), కోహ్లి (44), అశ్విన్ (37), జడేజా (26) ఆదుకున్నారు. వీరిలో ముఖ్యంగా అశ్విన్-అక్షర్ జోడీ 100కి పైగా పరుగుల జోడించి టీమిండియాను తిరిగి మ్యాచ్‌లో నిలబెట్టింది. అక్షర్ స్పెషలిస్ట్ బ్యాటర్లా రెచ్చిపోవడంతో మ్యాచ్‌పై పట్టుసాద్దామనుకున్న ఆసీస్ ఆశలు అడియాసలయ్యాయి. ఆసీస్ బౌలర్లలో లియోన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి 5 వికెట్లు పడగొట్టగా.. కున్నేమన్, మర్ఫీ తలో రెండు వికెట్లు, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు ఖ్వాజా (81), హ్యాండ్స్కోంబ్ (72) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
చరిత్ర సృష్టించేందుకు 64 పరుగుల దూరంలో ఉన్న కింగ్ కోహ్లి
Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించేందుకు 64 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో ఇప్పటి దాకా 546 ఇన్నింగ్స్‌ల్లో 24936 పరుగులు చేసిన కింగ్.. BGT 2023లో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభంకాబోయే తొలి టెస్ట్‌లో మరో 64 పరుగులు చేస్తే, అత్యంత వేగంగా పాతిక వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. Virat Kohli just 64 runs away to becomes fastest player in history to have completes 25000 runs in international cricket. — CricketMAN2 (@ImTanujSingh) February 6, 2023 సచిన్‌కు 24000 పరుగులు పూర్తి చేసేందుకే 543 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రికీ పాంటింగ్‌కు 565, జాక్ కలిస్‌కు 573, సంగక్కరకు 591 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇక, అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లికి ముందు 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులు) మొదటి స్థానంలో ఉండగా.. కుమార సంగక్కర (666 ఇన్నింగ్స్‌ల్లో 28016 పరుగులు), రికీ పాంటింగ్ (688 ఇన్నింగ్స్‌ల్లో 27483 పరుగులు), మహేళ జయవర్ధనే (725 ఇన్నింగ్స్‌ల్లో 25957 పరుగులు), జాక్ కలిస్ (617 ఇన్నింగ్స్‌ల్లో 25534) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, BGT 2023 సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. భారత్-ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్‌పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
కివీస్‌తో మూడో టీ20లో గిల్ సెంచరీ.. రికార్డుల రారాజు కోహ్లి రికార్డుకే ఎసరు
IND VS NZ 3rd T20I: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో బ్లాస్టింగ్ హండ్రెడ్‌తో పేలిన టీమిండియా యంగ్ డైనమైట్ శుభ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో పొట్టి ఫార్మాట్లో తన తొట్టతొలి శతకం నమోదు చేసిన గిల్.. కోహ్లి రికార్డుకు పంగనామం పెట్టడంతో పాటు మరిన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 35 బంతులు ఆడిన గిల్.. సెంచరీ కంప్లీట్ చేసేందుకు మరో 19 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇది కూడా ఓ రికార్డే. 23 ఏళ్ల గిల్.. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా, ఈ ఫీట్ సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికటర్ రికార్డు కూడా గిల్ ఖాతాలోనే చేరింది. అలాగే న్యూజిలాండ్‌పై టీమిండియా తరఫున వన్డేలు, టీ20ల్లో అత్యధిక స్కోర్ (208, 126 నాటౌట్) చేసిన ఆటగాడిగానూ గిల్ రికార్డు నెలకొల్పాడు. వీటితో పాటు గిల్ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడు గిల్ రికార్డు సృష్టించాడు. గిల్‌కు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి (122 నాటౌట్) పేరిట ఉండేది. కాగా, ఈ మ్యాచ్‌లో గిల్ సుడిగాలి శతకానికి రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు కూడా తోడవ్వడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (1) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్, టిక్నర్, సోధీ, డారిల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 235 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 2.4 ఓవర్లలో కేవలం 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి, ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. తొలి ఓవర్లోనే హార్ధిక్.. ఫిన్ అలెన్ (3) పెవిలియన్‌కు పంపగా.. రెండో ఓవర్లో అర్షదీప్ కాన్వే (1), చాప్మన్ (0)లను, ఆ వెంటనే మూడో ఓవర్లో హార్ధిక్ గ్లెన్ ఫిలిప్స్ (2)ను ఔట్ చేశాడు. -
చైనాలో కోవిడ్ మరణ మృదంగం..అంతకంతకూ పెరిగిపోతున్న కేసులు
చైనాలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులతో కుదేలవుతోంది. దీనికి తోడు రోజుకు వేల సంఖ్యలో మరణాల సంభవించడంతో తీవ్ర భయాందోళనలతో సతమతమవుతోంది చైనా. అదీగాక బీజింగ్ కోవిడ్ ఆంక్షలు సడలించాక కేసులు ఘోరంగా పెరగడం ప్రారంభమై అందర్నీ విస్మయపర్చింది. ఈ క్రమంలో ఇటీవలే ఒక వారంలోనే దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో దాదాపు 13 వేల మరణాలు సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. మరణించిన వారిలో చాలామంది వైరస్ బారిన పడినవారేనని ఆరోగ్య అధికారి తెలిపారు. ఈ మేరకు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) కేవలం కరోనాతో ఆస్పత్రుల్లో చేరి శ్వాసకోస వైఫల్యంతో 681 మంది మరణించారని, కరోనా తోపాటు ఇతర వ్యాధుల కారణంగా సుమారు 11,977 మంది మరణించినట్లు పేర్కొంది. కానీ హోం క్వారంటైన్‌లోనే ఉండి చనిపోయిన వారి సంఖ్యను వెల్లడించలేదు. ఆంక్షలు సడలించాక జనవరి12 నాటికి ఒక్క నెలరోజుల్లోనే దాదాపు 60 వేల మరణాలు సంభవించాయని ఒక వారం ముందు వెల్లడించింది. అంతేగాదు కోవిడ్ ఆంక్షలను ఎత్తేసిన డిసెంబర్ నుంచి అంతకు ముందు కలిపి మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షలకు పైగా ప్రజలు మరణించినట్లు తెలిపింది. చైనాలో జరుపుకునే లూనార్ న్యూ ఈయర్ వేడుకలకు ముందుగానే సుమారు 36 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వేడుకలను పురస్కరించుకుని మిలియన్ల మంది ప్రజలు తమ సొంతగ్రామాలకు రావడంతో ఈ కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని భయాలు ఎక్కువయ్యాయి. ఐతే దేశంలో ఇప్పటికే 80 శాతం మంది ఈ వైరస్ బారిన పడ్డారు, కాబట్టి ఇప్పట్లో కరోనా సెకండ్‌వేవ్ వచ్చే అవకాశం లేదని చైనా సీడీసీలోని చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జున్ యూ అన్నారు. (చదవండి: కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో కాల్పులు.. పలువురి మృతి) -
కొత్త కొలువుకు ఇరకాటం!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్‌రెడ్డి (పేరు మార్చాం) ఇటీవల ఆ కాలేజీలో కొలువుకు రాజీనామా చేశారు. అదే ప్రాంతంలో మరో కాలేజీలో మంచి వేతనానికి ఉద్యోగంలో చేరారు. అయితే ఇదివరకు పనిచేసిన కాలేజీ ఆన్లైన్ రికార్డులో వెంకట్‌రెడ్డి పేరు తొలగించలేదు. ఈ ప్రొఫైల్ తొలగింపు అధికారం కాలేజీ యాజమాన్యానికి మాత్రమే ఉండటంతో పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఆ కాలేజీ రికార్డులో ఆయన పేరు తొలగించలేదు. పూర్వపు కాలేజీలో పేరు తొలగిస్తే తప్ప కొత్త కాలేజీలో కొలువులో చేరే అవకాశం లేదు. దాదాపు ఆర్నెల్లు కావస్తున్నా ఆయన ప్రొఫైల్ డిలీట్ కాకపోవటంతో కొత్త కాలేజీ యాజమాన్యం అతనికి ఇచ్చిన అవకాశాన్ని వెనక్కు తీసుకుంది. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో వెంకట్‌రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అనేకమంది బోధన సిబ్బంది ఎదుర్కొంటున్న సంకటస్థితి. ఈ సమస్యతో మెరు గైన అవకాశాలు వచ్చినా వెళ్లలేకపోతున్నట్లు పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్య, ఉన్నత విద్యాసంస్థల్లో బోధన సిబ్బందికి సంబంధించిన నియామక నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం.. ప్రతి బోధకుడి వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయడంతోపాటు రోజువారీ హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ నంబర్సహా బోధకుడి పూర్తి సమాచారాన్ని ఆయా కాలేజీ యాజమాన్యాలు కంప్యూటరీకరించి.. వివరాలను వర్సిటీ లేదా సంబంధిత బోర్డు పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తున్నాయి. ఈ విధానంతో ఒక వ్యక్తి ఒకేచోట మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి కాలేజీ మారితే అతని వివరాలను పాత యాజమాన్యం వెబ్సైట్నుంచి తొలగిస్తేనే మరో కాలేజీలో చేరేందుకు వీలుంటుంది. కొత్త కాలేజీలో కూడా ఆన్లైన్ రికార్డుల్లో వివరాలు నమోదు చేశాక కొలువులో చేరాల్సి ఉంటుంది. కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చి న ఈ అధికారం తమకు కొత్త అవకాశాలు రాకుండా చేస్తోందని అధ్యాపకులు గగ్గోలు పెడుతున్నారు. నిర్లక్ష్యంతో ఇబ్బందులు.. రాష్ట్రంలో మూడు వందలకుపైగా ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 7.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో దాదాపు 80 వేల మంది బోధన సిబ్బంది అవసరం. కానీ చాలాచోట్ల సిబ్బందిని రికార్డుల్లో మాత్రమే కాలేజీ యాజమాన్యాలు చూపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో 30 వేల నుంచి 35 వేల మంది మాత్రమే పనిచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు చెపు తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్నవారికి యాజమాన్యాలు తగిన వేతనాలు ఇవ్వకపోవడం, కొందరికి మంచి అవకాశాలు రావడంతో ఇతర సంస్థల్లో చేరడం వంటి ఘటనలు సహజంగా జరిగిపోతుంటాయి. కాలేజీ మారాలనుకున్న వారి వేతనాన్ని పూర్తిగా చెల్లించి, వారి వివరాలను తమ వెబ్సైట్ నుంచి తొలగించాలి. కానీ, పలు కాలేజీలు ఉద్యోగుల వివరాలను తొలగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పట్టించుకోని వర్సిటీ అధికారులు.. కొలువు మారాలనుకున్న కొందరు ఉద్యోగులు రాజీనామాలు సమర్పించినప్పటికీ కాలేజీ యాజమాన్యాలు మాత్రం తమ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించడం లేదంటూ ఇటీవల పెద్ద సంఖ్యలో జేఎన్టీయూహెచ్కు ఫిర్యాదులు వచ్చాయి. కొందరైతే నేరుగా వర్సిటీ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి కాలేజీ అనుబంధ గుర్తింపు ప్రక్రియ సమయంలో వర్సిటీ అధికారుల తనిఖీలో కాలేజీ వెబ్సైట్లో పేర్కొన్న ఉద్యోగులంతా ప్రత్యక్షంగా హాజరు కావాలి. జాబితా ప్రకారం ఉద్యోగులు పనిచేయకుంటే గుర్తింపును నిలిపివేయాలి. కానీ పలు కాలేజీల యాజమాన్యాలు వర్సిటీ అధికారులకు తాయిలాలిస్తూ మొక్కుబడి తనిఖీ చేయించి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. తాము ఆ కాలేజీలో పనిచేయడం లేదని ఉద్యోగులు వర్సిటీకి ఫిర్యాదు చేస్తే.. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాల్సిన అధికారులు అలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తనిఖీలతోనే నిజాలు వెల్లడి ఉద్యోగుల సంఖ్య, హాజరు, పనితీరుపైన ఇంజనీరింగ్, వృత్తివిద్యా కాలేజీల్లో జేఎన్టీయూ, సంబంధిత అధికారులు తనిఖీ లు నిర్వహించాలి. వీటిల్లో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఫిర్యాదులు వచ్చిన కాలేజీల్లోనైనా తనిఖీలు చేపడితే బాగుంటుంది. ఉద్యోగుల ప్రొఫైల్ యాడింగ్ ఆప్షన్ యాజమాన్యానికి ఇచ్చి, డిలీషన్ ఆప్షన్ ఉద్యోగికే ఇవ్వాలి. దీంతో యాజమాన్యాలు సైతం బాధ్యతగా వ్యవహరిస్తాయి. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ప్రొఫైల్ డిలీట్ చేయడం లేదనే అంశంపై వర్సిటీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం శోచనీయం. – డాక్టర్ శ్రీనివాస్ వర్మ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
‘నోట్ల రద్దు’పై కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ(డిమానిటైజేషన్) 2016లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 58 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కొంతకాలంగా విచారణ కొనసాగిస్తోంది. ఆర్బీఐ తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్లు పి.చిదంబరం, శ్యామ్ దివాన్ బుధవారం వాదనలు వినిపించారు. ఈ నెల 10వ తేదీ నాటికి లిఖితపూర్వకంగా వాదనలు తెలియజేయాలని ధర్మాసనం సూచించింది. తీర్పును రిజర్వు చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీలో బీజేపీకి బ్రేక్.. ఫలించిన కేజ్రీవాల్ ప్లాన్స్ -
న్యూజిలాండ్‌పై సెంచరీ.. రికార్డుల మోత మోగించిన సూర్యకుమార్
పొట్టి క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఆడింది తక్కువ మ్యాచ్‌లే (41) అయినా రికార్డుల రారాజుగా తయారయ్యాడు. మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 20) జరిగిన రెండో టీ20లో విధ్వంసకర శతకం (51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 నాటౌట్) బాదిన సూర్య.. మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్లో రెండో శతకం బాదిన సూర్యకుమార్.. ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండు సెంచరీలు సాధించిన రెండో టీమిండియా బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. హిట్‌మ్యాన్ 2018లో ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్ గడ్డపై టీ20ల్లో శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు (11) సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో స్కై.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను అధిగమించాడు. ఈ జాబితాలో మహ్మద్ రిజ్వాన్ (13) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ రికార్డును సమం చేశాడు. రాహుల్ 72 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు చేయగా, సూర్యకుమార్ 41 మ్యాచ్‌ల్లోనే 2 శతకాలు బాదాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (4 సెంచరీలు) వీరిద్దరి కంటే ముందున్నాడు. సూర్య.. తన తొలి సెంచరీని సైతం విదేశీ గడ్డపైనే చేశాడు. అతను ఇంగ్లండ్‌పై నాటింగ్హమ్లో మొదటి సెంచరీ (117 పరుగులు) బాదాడు. ఇలా టీ20ల్లో చేసిన రెండు శతాకలు కూడా విదేశీ గడ్డపైనే నమోదు కావడం కూడా ఓ రికార్డే. సూర్యకుమార్.. తన టీ20 కెరీర్లో 39 ఇన్నింగ్స్‌ల్లో 181.64 స్ట్రయిక్ రేట్‌తో 45 సగటున 1395 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, సూర్యకుమార్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా తొలి టీ20 పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేదనలో ఆది నుంచే తడబడిన కివీస్.. దీపక్ హుడా (4/10), చహల్ (2/26), సిరాజ్ (2/24), సుందర్ (1/24), భువనేశ్వర్ (1/12) ధాటికి 18.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. -
సూపర్ స్టార్ కృష్ణ సాధించిన ఈ రికార్డులు టచ్ చేయడం అసాధ్యం..
-
అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ
సూపర్‌స్టార్ కృష్ణ అంటే తెలుగు సినీ ప్రపంచంలో తెలియని వారుండరు. అంతలా ఆ పేరు ప్రేక్షకుల గుండెల్లో అంతలా పాతుకుపోయింది. ఆయన నటనకు ప్రతిరూపం. అలనాటి తెలుగు సినిమాల్లో ఆయన ముద్ర చెరిగిపోని స్వప్నం. ఎన్నో అరుదైన రికార్డులు ఆయన సొంతం. టాలీవుడ్ నటుల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఏ హీరో సాధించని అరుదైన రికార్డును సాధించిన ఏకైక స్టార్ కృష్ణ మాత్రమే. అందుకే ఆయన పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. (చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే.. వైద్యులు) తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘట్టమనేని కృష్ణ.. నటనతోనే ఆగిపోకుండా దర్శకుడు, నిర్మాతగా, ఎడిటర్‌గానూ పని చేశారు. సినీ పరిశ్రమలో కృష్ణ కెరీర్ దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగిందంటే ఆయన నటనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో తెలుస్తోంది. దాదాపు 350 సినిమాల దాకా నటించారాయన. హ్యాట్రిక్ రోల్స్‌తో అబ్బురపరిచిన స్టార్ సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం పోషించే నటులను చూస్తాం. కానీ ఒకే సినిమాలో ఒకే నటుడు బహుళ పాత్రల్లో నటించడం అనేది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. అలాంటి పాత్రల్లో అవలీలగా నటించడం ఒక్క సూపర్ స్టార్కే సాధ్యమైంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ త్రిపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించడం ఆయనకే సాధ్యమైంది. ఇలా మూడు పాత్రల్లో కనిపించడం ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. కుమారరాజా, డాక్టర్-సినీ యాక్టర్, రక్త సంబంధం, పగపట్టిన సింహం.. ఇలా మూడు కంటే ఎక్కువ సినిమాల్లో ఆయన త్రిపాత్రాభియనంతో అలరించారు. ఆ చిత్రాలు ఇవే.. ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా టాలీవుడ్లో అరుదైన రికార్డు సృష్టించారు. ఆపై త్రిపాత్రాభినయ చిత్రాల్లో.. మొదటి సినిమా కుమారరాజాలో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారాయన. ఇది కన్నడ చిత్రం శంకర్ గురుకి రీమేక్. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్లో కృష్ణ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలు ఆయనే పోషించారు. ఈ చిత్రం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కృష్ణ తన ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన రెండో చిత్రం విజయనిర్మల దర్శకత్వం వహించిన డాక్టర్ సినీ యాక్టర్. సినిమాలో తండ్రి పాత్రతో పాటు కొడుకుగా, మేనల్లుడి పాత్రల్లో ఆయనే నటించారు. ఆ తర్వాత 'పగపట్టిన సింహం' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మళ్లీ అదే ట్రెండ్ రిపీట్ చేశాడు. ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విలన్‌గా, పోలీసాఫీసర్‌గా, లాయర్‌గా మూడు పాత్రల్లో మెప్పించారు. సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, బొబ్బిలి దొర వంటి ఇతర చిత్రాలలో కూడా బహుళ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు సూపర్ స్టార్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సెంటిమెంట్ తప్పిస్తే రికార్డులన్నీ ఇంగ్లండ్వైపే.. పాక్‌కు కష్టమే
టి20 ప్రపంచకప్‌లో ఆదివారం(నవంబర్ 13న) మెల్బోర్న్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. మరి పొట్టి ప్రపంచకప్‌లో విజేత ఎవరనేది ఒక్క రోజులో తేలనుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే పాక్ గెలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ రికార్డులన్నీ ఇంగ్లండ్‌కే అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఇంగ్లండ్‌దే విజయమని.. పాక్ టైటిల్ కొట్టడం కష్టమేనని కొంతమంది పేర్కొంటున్నారు. ► ఇక ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు 28 టి20ల్లో ఎదురుపడితే.. వాటిలో ఇంగ్లండ్ 18 విజయాలు నమోదు చేయగా.. పాక్ ఖాతాలో తొమ్మిది విజయాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కదానిలో ఫలితం రాలేదు. ► టి20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన రెండు సందర్భాల్లోనూ ఇంగ్లండ్‌నే విజయం వరించింది. ► 2019 నుంచి చూసుకుంటే ఇరుజట్ల మధ్య 14 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 8 మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలవగా.. ఐదు పాక్ గెలిచింది. ఒక్క దానిలో ఫలితం రాలేదు. ► చివరగా టి20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరిగింది. సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. 4-3 తేడాతో ఇంగ్లండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ► పాకిస్తాన్ ఇది ఫైనల్‌కు చేరడం మూడోసారి కాగా.. ఇంగ్లండ్‌కు కూడా మూడో ఫైనల్ కావడం విశేషం. ఇక రెండు జట్లు ఒక ఫైనల్ గెలిచి.. మరొక ఫైనల్ ఓడి సమానంగా ఉన్నాయి. ► పాకిస్తాన్ 2009లో టి20 చాంపియన్స్‌గా నిలిస్తే.. ఆ మరుసటి ఏడాది అంటే 2010లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించింది. ► ఒకవేళ ఇంగ్లండ్ ఈసారి టి20 ప్రపంచకప్ గెలిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏకకాలంలో వన్డే వరల్డ్‌కప్, టి20 వరల్డ్‌కప్ సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించనుంది ► ఇక ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అన్ని మ్యాచ్‌లు కలిపి 669 పరుగులు చేస్తే.. అందులో ఓపెనర్లు బట్లర్, హేల్స్ ద్వయం 410 పరుగులు చేయడం విశేషం. ► ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లపై మంచి రికార్డు ఉంది. బాబర్ మూడుసార్లు ఔట్ చేసిన రషీద్.. రిజ్వాన్‌ను రెండుసార్లు పెవిలియన్ చేర్చాడు. అదే సమయంలో బాబర్ ఆజం, రిజ్వాన్ జంటకు ఇంగ్లండ్‌పై మంచి స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉంది. పాక్ తుదిజట్టు అంచనా: మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ వసిం జూనియర్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హారీస్ రవూఫ్ ఇంగ్లండ్ తుదిజట్టు అంచనా: జోస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ -
KGF రికార్డ్స్ పై కన్నేసిన " కాంతారా "
-
అయ్యా! బతికే ఉన్నాను అని వేడుకుంటున్న వృద్ధుడు: వీడియో వైరల్
ఒక వృద్ధుడికి తాను బతికే ఉన్నానని నిరూపించకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకోసం ఏకంగా పెళ్లికొడుకులా రథంలో ఊరేగుతూ వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకొంటున్నాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే....హర్యానాలోని 102 ఏళ్ల వృద్ధుడు ప్రభ్తత్వ రికార్డులో చనిపోయినట్లు ఉంది. అతను రోహ్తక్ జిల్లాలోని గాంధ్రా గ్రామానికి చెందిన దులిచంద్ అనే వృద్ధుడు. ఆ వృద్ధుడు ప్లకార్డులు పట్టుకుని, మెడలో కరెన్సీ దండను ధరించి మానసరోవర్ నుంచి కెనాల్ రెస్ట్ హౌస్‌కి రథంపై ఊరేగుతూ....బతికే ఉన్నానని చెబుతున్నాడు. తాను మార్చిలో చివరిసారిగా వృద్ధాప్య ఫించన్‌ను తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయి ఉండటంతో తన ఫెన్షన్ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. తన మనవడు ఈ విషయమై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేసిన ప్రయోజనం కనిపించలేదని వాపోయాడు. ఆ వృద్ధుడు తాను బతికే ఉన్నానంటూ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఇతర గుర్తింపు పత్రాలను చూపిస్తున్నాడు. అతను హర్యానా ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ని కలిని తన గోడును వినిపించారు. ఆయన ఆ వృద్ధుడికి తిరిగి ఫెన్షన్ పొందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలా వృద్ధుల ఫించన్‌ని నిలిపి ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరమని అన్నారు. తాను సీఎంకి ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు నవీన్ జైహింద్ ఆ వృద్ధుడిని తీసుకుని బీజేపీ నాయకుడు మనీష గ్రోవర్ని కలిసి అతనికి రావాల్సిన ఫించన్‌ని ఇప్పించవలిసిందిగా కోరారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. हरियाणवी फिल्म, थारा फूफा जिन्दा है अभिनेता -दुलीचंद ज़िंदा ( 102 वर्षीय ) निर्माता निर्देशक, नवीन जयहिंद गीत संगीत, बेरोजगार बैंड पार्टी रोहतक कहानी-हरियाणा सरकार के कुछ अधिकारी जिन्होंने ज़िंदा दुलीचंद को मृत बता काट दी बुढ़ापा पेंशन @NaveenJaihind @DeependerSHooda pic.twitter.com/EtZVA4qvMh — Puspendra Singh Rajput हरियाणा अब तक (@psrajput75) September 8, 2022 (చదవండి: వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వైద్యురాలు... ఆశ్చర్యపోతున్న వైద్యులు) -
Asia Cup 2022: మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్ మరీ ఘోరంగా!
Asia Cup 2022 India Vs Pakistan:ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభమైంది. అంతకంటే ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ యావత్ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నేడు(ఆదివారం) జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2021లో కనీవినీ ఎరుగని రీతిలో కోహ్లి సేనకు పాకిస్తాన్ చేతిలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్లో ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ శర్మ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. టీమిండియాతో మ్యాచ్‌లో మరోసారి పైచేయి సాధించాలని బాబర్ ఆజం బృందం ఆశపడుతోంది. మరి ఆసియా కప్ టోర్నమెంట్ చరిత్రలో భారత్- పాకిస్తాన్ ముఖాముఖి రికార్డులు ఎలా ఉన్నాయో గమనిద్దాం. మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్ మరీ ఘోరంగా.. 1984 నుంచి ఆసియా కప్ నిర్వహణ ఆరంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రౌండ్ రాబిన్ పద్ధతిలో వన్డే ఫార్మాట్లో ఈ ఈవెంట్ జరిగింది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్ పోటీపడ్డాయి. భారత్- లంక ఫైనల్ చేరాయి. మొత్తంగా రెండు విజయాలతో టీమిండియా విజేతగా నిలిచింది. శ్రీలంక రన్నరప్ కాగా.. పాక్ రెండు మ్యాచ్‌లు ఓడి భంగపాటుకు గురైంది. టీమిండియా చేతిలో 54 పరుగులు, శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొత్తంగా ఎన్నిసార్లు తలపడ్డాయంటే.. ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మొత్తం 14 మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడ్డాయి. వీటిలో టీమిండియా 8 సార్లు గెలవగా.. పాకిస్తాన్ ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. టీ20 ఫార్మాట్లోనూ మనదే పైచేయి.. ఆసియా కప్ టోర్నీని 2016లో టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. అప్పటి నుంచి ఓ దఫా వన్డే.. మరో దఫా పొట్టి ఫార్మాట్లో.. ఇలా రొటేషన్ పద్ధతిలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా టీమిండియా భారత్- పాకిస్తాన్ మధ్య వన్డే ఫార్మాట్లో 13 మ్యాచ్‌లు జరుగగా.. భారత్ ఏడు గెలిచింది. అయితే 1997 నాటి వన్డే మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఇక 2016లో జరిగిన ఏకైక టీ20లోనూ విజయం భారత్‌నే వరించింది. ఐదు వికెట్ల తేడాతో ధోని సేన.. ఆఫ్రిది బృందాన్ని మట్టికరిపించింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు సార్లు చాంపియన్‌గా నిలవగా.. శ్రీలంక ఐదుసార్లు టైటిల్ గెలిచింది. పాకిస్తాన్ కేవలం రెండుసార్లు ట్రోఫీ అందుకుంది. వేదిక స్టేడియం ఫార్మాట్ విజేత తేది దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ విజయం 23 సెప్టెంబరు 2018 దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ గెలుపు 19 సెప్టెంబరు 2018 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం టీ20 ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం 27 ఫిబ్రవరి 2016 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం వన్డే ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం 2 మార్చి 2014 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం వన్డే 6 వికెట్ల తేడాతో భారత్ విజయం 18 మార్చి 2012 డంబుల్లా రంగిరి ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే 3 వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం 19 జూన్ 2010 కరాచి కరాచి నేషనల్ స్టేడియం వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో పాక్ గెలుపు 2 జూలై 2008 కరాచి కరాచి నేషనల్ స్టేడియం వన్డే 6 వికెట్ల తేడాతో భారత్ విజయం 26 జూన్ 2008 కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియం వన్డే 59 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు 25 జూలై 2004 ఢాకా బంగబంధు నేషనల్ స్టేడియం వన్డే 44 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం 3 జూన్ 2000 కొలంబో ఎస్ఎస్సీజీ వన్డే ఫలితం తేలలేదు 20 జూలై 1997 షార్జా షార్జా క్రికెట్ స్టేడియం వన్డే 97 పరుగుల తేడాతో పాక్ గెలుపు 7 ఏప్రిల్ 1995 ఢాకా బంగబంధు నేషనల్ స్టేడియం వన్డే 4 వికెట్ల తేడాతో భారత్ విజయం 31 అక్టోబరు 1988 షార్జా షార్జా క్రికెట్ స్టేడియం వన్డే 54 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు 13 ఏప్రిల్ 1984 చదవండి: Asia Cup 2022: కళ్లన్నీ కోహ్లి మీదే! తిరుగులేని రన్‌మెషీన్.. టోర్నీలో ఎన్ని సెంచరీలంటే? ASIA CUP 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు! -
చైనాలో రికార్డు స్థాయిలో వరదలు...వందల ఏళ్లలో లేని విధంగా..
బీజింగ్: చైనా భారీ వర్షాల కారణంగా రికార్డు స్థాయిలు వరదలు ముంచెత్తాయి. వందల ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయిలో భారీ వరదలు సంభవించాయి. దక్షిణ చైనా ఈ వరదల కారణంగా అతలాకుతలమైంది. చైనా టెక్ రాజధాని షెనజెన్, లాజిస్టిక్స్ హబ్ అయిన గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ప్రజలను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షితప్రాంతాలకు తరలించారు. గ్వాంగ్డాంగ్లోని ప్రమాదంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను, పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే తీర ప్రాంత ఫుజియాన్ ప్రావిన్స్, గ్వాంగ్జితో సహా ఇతర ప్రాంతాలు ఈ నెలలో కురిసిన భారీ వర్షాలకు బాగా ప్రభావితమయ్యాయి. ఐతే చైనాలో కొన్ని ప్రాంతాల్లో వేసవి వరదలు సర్వసాధారణం. కానీ ఇటీవల కొన్ని సంవత్సరాలలో ఇవి మరింత తీవ్ర తరమవుతున్నాయి. పైగా ఈ వరద బీభత్సాన్ని 'శతాబ్దానికి ఒకసారి వచ్చే వరదలు'గా చైనా మీడియా సంస్థలు పిలుస్తున్నాయి. పైగా నీటి మట్టాలు 1931లో నమోదైన రికార్డును అధిగమించాయని, 1951 నాటి ఘటన పునరావృతమైందని చైనా అధికారులు వెల్లడించారు. -
16 రోజుల్లో రూ. 300 కోట్లు.. బాహుబలి 2 రికార్డు బద్దలు..
సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి సూపర్ బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'విక్రమ్'. కమల్‌తోపాటు విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. అయితే ఈ మూవీ విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లలో సగం అంటే రూ. 150 కోట్లు ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే వచ్చాయట. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఉన్న బాహుబలి 2 సినిమా కలెక్షన్ల రికార్డును విక్రమ్ బద్దలు కొట్టినట్లయింది. వచ్చే రోజుల్లో విక్రమ్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా సక్సెస్ సాధించిన సంతోషంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది మూవీ యూనిట్. మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. చదవండి: 'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే.. చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ కామంతో కళ్లు మూసుకుపోతే.. -
క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మొదటి బౌలర్ షేన్ వార్న్
క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లు ఎందరో ఉంటారు.. కానీ తమ ఆటతో ప్రత్యర్థులనే ఓ ఆటాడించి, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని లెజెండ్‌గా మారేది మాత్రం కొందరే. అటువంటి దిగ్గజ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా స్పిన్నింగ్ దిగ్గజం షేన్ వార్న్ ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వార్న్ తన క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాయిలు అధిగమించాడు. అలానే చెరిగిపోని రికార్డులు మరెన్నో తన పేరుమీద లిఖించుకున్నాడు. ఇలాంటివి బోలెడు ఉన్నా షేన్ వార్న్‌కి క్రికెట్ కెరీర్లో మర్చిపోలేని రోజు ఏదైనా ఉందంటే 2006 ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 700వ వికెట్ సాధించడమనే చెప్పాలి. విక్టోరియన్ గ్రౌండ్లో 89,155 మంది ప్రేక్షకుల మధ్య ఇంగ్లాండ్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ వికెట్ తీసి అంతవరకు ఎవరికీ సాధ్యపడని ఘనతను సాధించి చూపాడు. ఆ వికెట్‌తో ప్రపంచ క్రికెట్ చరిత్రోలో 700 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా ఈ మైలురాయిని చేరుకున్నాడు. అనంతరం అదే మ్యాచ్‌లో వార్న్ నలుగురు బ్యాట్స్మెన్లను పెవిలియన్‌కు తన టెస్ట్ కెరీర్లో ఐదు వికెట్లను పడగొట్టడం ద్వారా 37వ చివరి ఐదు వికెట్ల హాల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. -
శ్రీలంకతో మూడో టీ20.. టీమిండియా రికార్డుల మోత!
ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా రికార్డుల మోత మోగించింది. అఖరి టీ20లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ షనకా(74) తప్ప మిగితా ఎవరూ రాణించలేదు. ఇక 147 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.5 ఓవర్లలోనే చేధించింది. శ్రేయస్ అయ్యర్ మరో సారి చెలరేగి ఆడాడు. 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో టీమిండియా సాధించిన రికార్డులేంటో పరిశీలిద్దాం. ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్లుగా అఫ్గానిస్తాన్, రొమేనియా (12 చొప్పున) పేరిట సంయుక్తంగా ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. ►అంతర్జాతీయ టి20ల్లో శ్రీలంకపై భారత్‌కిది 17వ విజయం. ఈ గెలుపుతో టి20ల్లో ఒక జట్టుపై అత్యధిక మ్యాచ్‌ల్లో నెగ్గిన జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును (జింబాబ్వేపై 16 విజయాలు) భారత్ సవరించింది. ►అంతర్జాతీయ టి20ల్లో సొంతగడ్డపై భారత్‌కిది 40వ గెలుపు. 39 విజయాలతో న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును భారత్ తిరగరాసింది. చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా -
ముద్దులొలికే చిన్నారులు.. మూడు రికార్డులు!
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని మారుతీ నగర్‌కు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ రాడ సురేష్, ప్రమీల దంపతుల కవలలు ప్రార్ధన, సాధన నాలుగు రోజుల వ్యవధిలో మూడు బుక్ ఆఫ్ రికార్డులు సాధించి ఔరా అనిపించారు. నాలుగేళ్ల నాలుగు నెలల వయసు కలిగిన వీరి జ్ఞాపక శక్తిని 22 నెలల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు గుర్తించారు. వర్చువల్ పద్ధతిలో వీరి జ్ఞాపక శక్తిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు చెందిన ప్రతినిధులు పరిశీలించారు. ఈ బాలికలు 118 రసాయనిక శాస్త్ర మూలకాల పేర్లు, 195 దేశాలు, వాటి రాజధానుల పేర్లు నిమిషాల వ్యవధిలో చెప్పడంతో ఈ మూడు రికార్డులను సాధించారని తండ్రి సురేష్ తెలిపారు. ఈ నెల 21న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, 22న కలాం వరల్డ్ రికార్డ్స్, 24న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినట్లు ఆయా సంస్థలు సమాచారం ఇచ్చాయని సురేష్ తెలిపారు. వేమన పద్యాలు, గణిత గుర్తులు, ఆకృతులు, చరిత్రకు సంబంధించిన కట్టడాలు, వ్యక్తుల పేర్లు కూడా వారు చెప్తారని తెలిపారు. కన్నడ, గుజరాతీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో అంకెలు చెబుతారన్నారు. -
Bitcoin: ఆర్నెల్లలో తిరిగి మళ్లీ అదే స్థానం..!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ట్రెండ్ కొనసాగుతుంది. క్రిప్టోకరెన్సీకు భారీగానే ఆదరణ లభిస్తోంది. క్రిప్టోకరెన్సీలో అత్యంత ఆదరణను పొందిన బిట్‌కాయిన్ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ 15 న బిట్‌కాయిన్ 60 వేల డాలర్ల మార్కును దాటింది. దాదాపు ఆరు నెలల తర్వాత బిట్‌కాయిన్ మార్కును తాకింది. అదే రోజు ఒకానొక సమయంలో 62,535.90 డాలర్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అంతలోనే తిరిగి క్షీణించి 61 వేల డాలర్లకు చేరుకోగా ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 60,847.50 వద్ద ట్రేడ్ అవుతోంది. చదవండి: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..! గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ 2.48 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు వారంతో పోలిస్తే పలు క్రిప్టోకరెన్సీలు 4.52 శాతం లాభపడింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత 24 గంటల్లో 132.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారిగా 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అదేనెలలో బిట్‌కాయిన్ సుమారు 53 శాతం మేర పడిపోయింది. దీంతో బిట్‌కాయిన్ విలువ సుమారు 30 వేల డాలర్లకు చేరుకుంది. తిరిగి ఆర్నెల్ల తరువాత బిట్‌కాయిన్ మరోసారి 60 వేల మార్కును దాటింది. ఎలన్ మస్క్ వ్యాఖ్యలు, చైనాలో క్రిప్టోకరెన్సీపై నిర్ణయాలు బిట్‌కాయిన్ క్రాష్‌కు కారణాలుగా నిలిచాయి. చదవండి: గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి గుడ్‌న్యూస్..! -
కియా కా కమాల్... రికార్డు సృష్టిస్తోన్న ఆ మోడల్ కారు అమ్మకాలు
Kia Sub Compact SUV Car Sonet Sales: అతి తక్కువ కాలంలోనే ఆటోమొబైల్ మార్కెట్‌పై చెదరని ముద్ర వేసిన కియా.. తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఆ కంపెనీ నుంచి వస్తున్న ప్యాసింజర్ వెహికల్స్ ఒకదాని వెంట ఒకటిగా అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏడాదిలోనే కియా కంపెనీ కార్లు ఇండియన్ రోడ్లపై రివ్వుమని దూసుకుపోతున్నాయి. ఇప్పటికే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో సెల్టోస్ అమ్మకాలు అదుర్స్ అనే విధంగా ఉండగా ఇప్పుడు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. గతేడాది సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చిన కియా సోనెట్ అమ్మకాల్లో అప్పుడే లక్ష మార్కును అధిగమించింది. ఈ మోడల్ రిలీజైన ఏడాదిలోగానే లక్షకు పైగా అమ్మకాలు జరుపుకుని రికార్డు సృష్టించింది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొని వాస్తవానికి కరోనా ఫస్ట్ వేవ్ ముగిసన తర్వాత ఆటోమైబైల్ రంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంది. మార్కెట్ ఇంకా గాడిన పడకముందే 2020 సెప్టెంబరు 20న సొనెట్ మోడల్ని మార్కెట్లోకి తెచ్చింది కియా. ఆ కంపెనీ అంచనాలను సైతం తారు మారు చేస్తూ 12 నెలల వ్యవధిలోనే లక్ష కార్లు అమ్ముడయ్యాయి. కియా అమ్మకాల్లో ఒక్క సోనెట్ వాటానే 32 శాతానికి చేరుకుందని ఆ కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ చీఫ్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టియో జిన్ పార్క్ తెలిపారు. టెక్నాలజీ అండతో.. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వంటి ప్యాసింజర్ వెహికల్స్ నుంచి పోటీని తట్టుకుంటూ కియో సోనెట్ భారీగా అమ్మకాలు సాధించడం వెనుక టెక్నాలజీనే ప్రముఖ పాత్ర పోషించినట్టు మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ సెగ్మెంట్లో టెక్నాలజీలో సోనెట్ మెరుగ్గా ఉన్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబులిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎమ్), బ్రేక్ అసిస్ట్ (బీఏ), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), పెడల్ షిప్టర్స్, వాయిస్ కమాండ్ ఆపరేటెడ్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఈ కారుకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రారంభ ధర రూ. 6.79 లక్షలు కియా సోనెట్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తోంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్లు అందిస్తోంది. ఈ కారు ప్రారంభం ధర రూ. 6.79 లక్షల నుంచి గరిష్టంగా రూ. 8.75 లక్షలు(షోరూమ్)గా ఉంది. గత సెప్టెంబరులో తొలి మోడల్ రిలీజ్ అవగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2021 మేలో మార్కెట్లోకి వచ్చింది. మొత్తంగా 17 రంగుల్లో ఈ కారు లభిస్తోంది. చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
ఉస్మానియా.. 3 ప్రపంచ రికార్డులు
అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్): ఉస్మానియా ఆస్పత్రి మూడు ప్రపంచ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి లయన్ కె.వి. రమణారావు, దక్షిణ భారత ప్రతినిధి శ్రీవిద్య, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి రాజు తదితరులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్‌కు భారత్ వరల్డ్ రికార్డ్స్, డాక్టర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్లను అందజేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ...అరుదైన శస్త్రచికిత్సలతోపాటు ప్రపంచానికి అనస్థీషియాను పరిచయం చేసిన ఘనత ఉస్మానియా ఆస్పత్రిదేనని పేర్కొన్నారు. కరోనా విజృంభణలోనూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించిందని, రోగుల రద్దీ, పనిభారం పెరిగినా ఇక్కడి వైద్యులు ఒత్తిడికి గురికాకుండా సహనంతో వైద్య సేవలు అందించారని కొనియాడారు. ఆస్పత్రిలో 700 పైగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ నిర్వహించి తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. -
రికార్డుల బ్రాండ్ బాబు.. సంపాదనెంతో తెలుసా?
సెలబ్రిటీలను ఆరాధించడానికి.. అభిమానించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండనక్కర్లేదు. నచ్చితే.. బ్లయిండ్‌గా ఫాలో అయిపోవడమే. ఫుట్‌బాల్ ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. అత్యధిక గోల్స్ రికార్డుకు అడుగు దూరంలో ఉన్న రొనాల్డో.. సోషల్ మీడియాలోనూ రికార్డుల బ్రేకర్ కూడా. వెబ్‌డెస్క్: సాకర్ వీరుడు రొనాల్డోకు ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 92.4 మిలియన్లు. ఫేస్బుక్లో 148 మిలియన్ల ఫాలోవర్లు. ఇక ఈమధ్యే ఇన్‌స్టాలో 30 కోట్ల మిలియన్ ఫాలోవర్స్ రికార్డు దక్కించుకున్నాడు. కేవలం ఇన్‌స్టా అకౌంట్ ద్వారానే దాదాపు 2 మిలియన్ల పౌండ్ల ఆదాయం వెనకేసుకుంటున్నాడు. అతను వేసే ఒక్కో పోస్టుకి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుంటాడని తెలుస్తోంది(మోడల్ కైలీ జెన్నర్ పోస్ట్‌కి ఎనిమిది కోట్లకుపైనే). ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న రెండో ఆటగాడు ఇతనే. మరో విశేషం ఏంటంటే.. లాక్డౌన్ టైంలోనూ అత్యధికంగా సంపాదించిన అథ్లెట్‌గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. కాస్ట్లీ యవ్వారం ఈ జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడి.. విలాసాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఎప్పుడూ ఒకే తరహా డైట్‌ను ఫాలో అయ్యే 36 ఏళ్ల రొనాల్డో.. ఫిట్నెస్ విషయంలో అభిమానులకు ఆరాధ్యుడే. దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డుల కార్యక్రమానికి రొనాల్డో ఒక రోలెక్స్ వాచీతో హాజరయ్యాడు. ఇక అభిమానులు ఊరుకుంటారా? దానిని స్కాన్ చేసి ధరెంతో కనుక్కునే ప్రయత్నం చేశాడు. రీసెంట్గా ఆ వాచీ కంపెనీ ‘స్విస్’.. దాని ధరెంతో ప్రకటించింది. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారుచేసిన వాచీ అది. అందులో 30 క్యారెట్ల వైట్ డైమండ్లు పొదిగిన ఆ వాచీ ఖరీదు 3,71,000 పౌండ్లు (మన కరెన్సీలో 3 కోట్ల 82 లక్షలపైనే) విలువ ఉందని ప్రకటించింది. పైగా ఇలాంటి పీస్ ఇప్పటివరకు ఈ ఫుట్‌బాల్ స్టార్ దగ్గర మాత్రమే ఉందని వెల్లడించింది. బ్రాండ్ బాబు రొనాల్డ్ బ్రాండ్ అంబాసిడరింగ్ వాల్యూ ఏటా దాదాపు 105 మిలియనల డాలర్లు అంటే ఆశ్చర్యం కలగకమానదు. అందులో నైక్ నుంచే 45 మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇక సొంతంగా సీఆర్7 బ్రాండ్ ఉంది. ఓవరాల్ ఆటగాళ్ల ఆదాయం జాబితాలో మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ కనోర్ మెక్‌గ్రెగోర్(180 మిలియన్ల డాలర్లు), లియోనెల్ మెస్సీ(130 మిలియన్ల డాలర్లు).. ఉండగా మూడో ప్లేస్‌లో రొనాల్డో 120 మిలియన్ల డాలర్లతో నిలిచాడు. చిరకాల ప్రత్యర్థి మెస్సీ కంటే టోటల్ ఆదాయంలో వెనుకంజలో ఉన్నప్పటికీ.. బ్రాండ్ ఆదాయంలో ఓ అడుగు ముందే ఉన్నాడు రొనాల్డో. ఫిబ్రవరి 5, 1985 సాంటో అంటోనియోలో పుట్టాడు రొనాల్డో. స్కూల్ ఎడ్యుకేషన్‌లో పెద్దగా చదువుకోని రొనాల్డో.. 17వ ఏట స్పోర్ట్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. ది సుల్తాన్ ఆఫ్ ది స్టెప్ఓవర్ బిరుదు అందుకున్నాడు. మెర్చ్ రొమిరో, గెమ్మా అటిక్సన్, ఇరినా షాయ్క్లతో డేటింగ్ చేసి.. మోడల్ జార్జినా రోడ్రిగుజ్ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు. చదవండి: రొనాల్డో వల్లే కోకా కోలా 29వేల కోట్లు నష్టపోయిందా?.. అందులో నిజమెంత? -
రికార్డు దిశగా భారత విదేశీ మారక నిల్వలు...!
ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. జూన్ 11తో ముగిసిన వారంలో వరుసగా రెండవవారమూ 600 బిలియన్ డాలర్ల ఎగువన సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదుచేసుకున్నాయి. వారంవారీగా నిల్వలు 3.074 బిలియన్ డాలర్లు పెరిగి 608.081 బిలియన్ డాలర్లకు చేరాయి (డాలర్ మారకంలో రూపాయి ప్రస్తుత విలువ ప్రకారం దాదాపు రూ.45 లక్షల కోట్లు) . శుక్రవారం ఆర్బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2020 జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ మార్క్దాటి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్ డాలర్లు పెరిగాయి. జూన్ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్ డాలర్లను దాటి 605.008 డాలర్ల స్థాయికి చేరాయి. తాజా సమీక్షా వారంలో ఈ దూకుడు కొనసాగింది. ప్రస్తుత నిల్వలు భారత్ 20 నెలల దిగుమతులకు దాదాపు సరిపోతాయన్నది అంచనా. అంతర్జాతీయంగా భారత్ ఎకానమీకి వచ్చే కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ప్రస్తుత స్థాయి నిల్వలు దోహదపడతాయని ఈ నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష విశ్లేషించిన సంగతి తెలిసిందే. గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే.. మొత్తం నిల్వల్లో డాలర్ల రూపంలో చూస్తే ప్రధానమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ విలువ తాజా సమీక్షా వారంలో 2.567 బిలియన్ డాలర్లు పెరిగి 563.457 బిలియన్ డాలర్లకు చేరింది. పసిడి నిల్వలు 496 మిలియన్ డాలర్లు ఎగసి 38.101 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్స్ రైట్స్ విలువ 1 మిలియన్ డాలర్లు తగ్గి 1.512 డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్ వద్ద భారత్ ఫారెక్స్ నిల్వల పరిమాణం 11 మిలియన్ డాలర్లు పెరిగి 5.011 బిలియన్ డాలర్లకు చేరాయి. చదవండి: యూట్యూబ్ చూసి.. దెబ్బకి సెలబ్రిటీ అయిపోయాడు! -
రాహుల్‌ను ఊరిస్తున్న ఆ రికార్డులేంటో తెలుసా..?
ముంబై: గత మూడు ఐపీఎల్ సీజన్లలో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. నేడు ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో మరో 78 పరుగులు సాధిస్తే, పంజాబ్ తరఫున 2000 పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. గతంలో షాన్ మార్ష్ మాత్రమే పంజాబ్ తరఫున 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2018 నుంచి 2020 వరకు జరిగిన ప్రతి సీజన్లో 500కుపైగా పరుగులు సాధించిన రాహుల్.. పంజాబ్ తరఫున 42 ఇన్నింగ్స్‌ల్లో 140.08 స్ట్రయిక్ రేట్‌తో 1922 పరుగులు సాధించాడు. 2018లో తొలిసారి పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్.. ఆ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 158.41 స్ట్రయిక్ రేట్‌తో 659 పరుగులు సాధించి, టోర్నీలో మూడో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 6 అర్ధసెంచరీలున్నాయి. అనంతరం జరిగిన 2019 సీజన్లో కూడా రాహుల్ తన హవాను కొనసాగించాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన అతను.. సెంచరీ, 6 అర్ధసెంచరీల సాయంతో 593 పరుగులు స్కోర్ చేశాడు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్‌లోనూ రాహుల్ పరుగుల వరద పారించాడు. తాను ఆడిన 14 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 670 పరుగులు సాధించాడు. రాహుల్ ప్రస్తుత సీజన్లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించి మరో 555 పరుగులు సాధిస్తే, ఐపీఎల్లో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలుస్తాడు. ఓవరాల్ టీ20 క్రికెట్లో రాహుల్ 139 ఇన్నింగ్స్‌ల్లో 137.51 స్ట్రయిక్ రేట్‌తో 4842 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ సీజన్లో అతను మరో 158 పరుగులు సాధిస్తే టీ20 క్రికెట్లో యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్ తర్వాత 5000 పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. రాహుల్ మరో 8 సిక్సర్లు బాదితే టీ20 ఫార్మాట్లో 200 సిక్సర్ల అరుదైన జాబితాలో చోటు సంపాదిస్తాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 2647 పరుగులు(72 ఇన్నింగ్స్) సాధించిన రాహుల్.. మరో 353 పరుగులు చేస్తే ఐపీఎల్ 3000 పరుగుల క్లబ్లో చేరతాడు. ఇదిలా ఉంటే ముంబైలోని వాంఖడే స్టేడియంలో కూడా రాహుల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో అతనాడిన 4 మ్యాచ్‌ల్లో 80.67 సగటుతో 242 పరుగులు సాధించాడు. ఈ వేదికపై శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యకు(105.5) మాత్రమే రాహుల్ కంటే ఉత్తమ సగటు ఉంది. -
రికార్డులను షేక్ చేస్తున్న బాలీవుడ్ ‘లక్ష్మీ'
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, రాఘవ లారెన్స్ కాంబినేషన్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘లక్ష్మీ' రికార్డులను షేక్ చేస్తోంది. ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌పై బ్లాక్‌బస్టర్ రేటింగ్‌ను నమోదు చేసిన అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. 2.51 కోట్లకు పైగా వ్యూయర్ షిప్‌తో అతిపెద్ద ప్రీమియర్ రికార్డును కొట్టేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దూసుకుపోతూ 2.50 కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అత్యధిక ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ఇంప్రెషన్స్ సాధించిన మూవీగా ‘లక్ష్మీ' నిలవడంపై సంతోషంగా ఉందని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అక్షయ్‌కు, రాఘవేంద్రస్వామికి ధన్యవాదాలు తెలిపాడు. (టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘లక్ష్మీ’ ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌కు ప్రేక్షకుల నుంచి దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా మార్చి 21 న స్టార్ గోల్డ్‌లో రిలీజైన ఈ మూవీకి టెలివిజన్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో బాలీవుడ్ చిత్రాల చరిత్రను తిరగరాసింది రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన తొలి హిందీ మూవీ ఇది. రాఘవ లారెన్స్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో సౌత్‌లో హిట్టైయిన ‘కాంచన’ సినిమాను హిందీలో అక్షయ్ కమార్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా ‘లక్ష్మీ’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. This is huge #Laxmii clocking 2.51cr impressions on first run is just outstanding, beating #Housefull4 numbers is itself a big task but Laxmii has gone way ahead of it.. congrats @akshaykumar @advani_kiara & @offl_Lawrence & lord @farhad_samji 🤗 pic.twitter.com/SqYJnHbMFD — Ajju 🎭 (@The_EvilGuy) April 2, 2021 More the Social Media negativity more will be the support by neutral audience for @akshaykumar ❤#Laxmii breaks all the previous Television records Yes!!! Highest impression any Bollywood movie has ever got🔥#AkshayKumar pic.twitter.com/3j1FSxiImt — AKSHAY KUMAR FAN B.T.💫 (@Akkians_BT) April 2, 2021 Happy to share, #Laxmii world tv premiere impression is 2.51 crore. One of the Highest World Television Premier Impression for a Bollywood Movie Thanking @akshaykumar Sir & Ragavendra Swamy at this moment.@advani_kiara @Shabinaa_Ent @tusshkapoor @foxstarhindi @ZeeMusicCompany pic.twitter.com/pITG503yuH — Raghava Lawrence (@offl_Lawrence) April 3, 2021 -
త్వరలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామాలకు సంబంధించి భూయజమానులకు త్వరలోనే క్రమబద్ధీకరించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వనున్నట్టు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం పద్దులపై చర్చ సందర్భంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లకు సంబంధించి సభ్యుల సందేహాలను నివృత్తి చేసే క్రమంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. తెలంగాణలో భూ వివాదాలకు అవకాశం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సాదాబైనామాలకు సంబంధించి క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ విక్రయ లావాదేవీలకు సంబంధించి తెల్లకాగితాలపై రాసుకున్నవారి వివరాలు రికార్డుల్లోకెక్కలేదని, యజమానులైనప్పటికీ రికార్డుల్లో వారి పేర్లు లేకపోవడంతో వివాదాలకు అవకాశం కలుగుతోందన్నారు. ఇలాంటి వారు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా తొలుత 15.68 లక్షల దరఖాస్తులు వచ్చా యని, వీటిల్లో 6.18 లక్షలను క్లియర్ చేసినట్లు వెల్లడిం చారు. ఆ తర్వాత 2 దఫాలు గా అవకాశం ఇవ్వగా మరో 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశానికి సంబంధించి కోర్డులో కేసు దాఖలు కావటంతో క్రమబద్ధీకరణ పెండింగ్‌లో పడిందన్నారు. కోర్టు కేసు క్లియర్ కాగానే రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని సభకు వివరించారు. భూ రిజిస్ట్రేషన్‌లో ఎవరి జోక్యం లేకుండా, అంతా ఆన్లైన్ విధానంతో జరిగేలా రూపొందించిన ధరణి పోర్టల్ రైతులకు పెద్ద వరంలాంటిదన్నారు. ధరణి వ్యవహారం ఓ చరిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు అద్భుతం.. రాష్ట్రంలో ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చిపెట్టే మూడు ప్రధాన శాఖల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు అద్భుతమని మంత్రి కొనియాడారు. కేవలం 1,300 సిబ్బందితో ఈ శాఖ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సజావుగా సాగేందుకు వీలుగా నిధులను సమకూర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కోవిడ్‌తో గత ఆర్థిక సంవత్సరం ఇబ్బంది ఉండగా, అంతకుముందు యేడు 1,300 మంది సిబ్బంది, 141 కార్యాలయాల ద్వారా 15.34 లక్షల భూలావాదేవీలతో రూ.6,620 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిం దన్నారు. త్వరలో రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించనున్నామని, పార్ట్–బీలో ఉన్న వివాదాలను మొదటి దశలోనే పరిష్కరిస్తామని, ఇందుకు బడ్జెట్లో రూ.400 కోట్లు ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. -
ఒక్క శతకంతో ఐదు రికార్డులు..
లాహోర్: పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లాహోర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అజేయమైన సెంచరీతో కదం తొక్కిన పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్(104 నాటౌట్; 64 బంతుల్లో 6x4, 7x6), అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్న రిజ్వాన్.. పాక్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మట్లలో (వన్డే, టెస్టు, టీ20ల్లో) శతకం బాదిన రెండో వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ ఫీట్‌ను న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్రెండన్ మెక్కల్లమ్ మాత్రమే సాధించాడు. మెక్కల్లమ్ టెస్ట్‌ల్లో 5, వన్డేల్లో 3, టీ20ల్లో ఒక శతకం నమోదు చేయగా, రిజ్వాన్ వన్డేల్లో 2, టెస్టుల్లో 1, టీ20ల్లో1 సెంచరీ చేశాడు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన ఐదో వికెట్ కీపర్‌గా రిజ్వాన్ నిలిచాడు. మెక్కల్లమ్, అహ్మద్ షాజాద్, మోర్న్ వాన్ విక్, లెస్లీ డన్బార్ తరువాత రిజ్వాన్ ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్ కూడా రిజ్వానే కావడం విశేషం. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన రెండో పాక్ ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. అంతకుముందు అహ్మద్ షాజాద్ మత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించాడు. మొత్తానికి రిజ్వాన్ ఒక్క సెంచరీతో ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, పాక్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను కోల్పోయింది. -
శశి సమయం
కవి సమయం అనే మాట ఉంది. సృజనాత్మకత జనియించే క్షణాలవి! అతిరా శశికి లాక్డౌన్ కాలమంతా ‘కళా సమయం’ అయింది. ఆ తీరిక వేళ ప్రాచీన మండల కళతో ఆమె తన భావాలకు రూపం ఇచ్చి రికార్డులు నెలకొల్పారు. అందుకే లాక్డౌన్లో ఆమె సద్వినియోగం చేసుకున్న సమయాన్ని శశి సమయం అనాలి. కరోనా మహమ్మారి కొన్నాళ్లపాటు అందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఇంటి గడప దాటి బయటకు రావడానికి వీల్లేని పరిస్థితుల్లో కొందరు విసుగ్గా రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపేస్తే, మరికొందరు తమలోని కళానైపుణ్యాలను వెలికితీసే పనిలో పడ్డారు. రెండవ కోవలోకి వస్తారు కేరళలోని మున్నార్‌లో ఉంటున్న అతిరా శశి. లాక్డౌన్ టైమ్‌లో ఆమె ఓ కొత్త ఆర్ట్ నేర్చుకోవడమే కాకుండా ఆ కళలో రాణించి ఏకంగా రికార్డులే తన ఖాతాలో వేసుకున్నారు! మండల ఆర్ట్ అనేది మన భారతీయ ప్రాచీన కళ. మండలం అంటే సంస్కృతంలో ‘వలయం’ అని అర్థం. వలయాకారంలోఉండే జామెట్రీ డిజైన్ ఈ ‘మండల ఆర్ట్’. మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర రాష్ట్రాలలో వస్త్ర ముద్రణలో ఈ మండల కళను ఉపయోగిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలోనూ ఈ కళ ప్రాచుర్యంలో ఉంది. ఇందులో శశి రికార్డులు నెలకొల్పారు. మండల ఆర్ట్ ఆధారంగా అతిరా శశి పెయింట్స్ వేయడం సాధన చేశారు. భారతీయ రాష్ట్రాలు, వాటి రాజధానులు, వర్ణమాల, పర్యావరణం, రాశీచక్ర గుర్తులు సహా వంద రకాల పెయింట్స్ వేసినందుకు 21 ఏళ్ల శశి పేరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్‌లలో నమోదయ్యింది. ఆమె వేసిన పెయింటింగ్స్‌లో గౌతమ బుద్ధ సంస్కృతి మూలాలు లోతుగా పాతుకుపోయిన టిబెట్, భూటాన్, మయన్మార్ వంటి ప్రదేశాలు సైతం ఉండటం విశేషం. అతిరా శశి ఈ కళను ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ‘నా చిన్నతనంలో నాన్న ఉద్యోగరీత్యా మేము గుజరాత్లో ఉండేవాళ్లం. మొదట అక్కడే ఈ ఆర్ట్‌ను చూశాను. వాటిని పరిశీలించినప్పుడు దుపట్టా, చీరలపై ఈ ఆర్ట్‌ను అక్కడి కళాకారులు ఎంతో శ్రద్ధగా వేసినట్లుగా అనిపించింది. గుజరాత్ నుంచి మున్నార్ తిరిగి వచ్చాక కాలేజీ చదువులో పడిపోయాను. ఎప్పుడైనా రిలాక్స్ అవడానికి మాత్రం మండల ఆర్ట్‌ని వేయడానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. లాక్డౌన్ సమయంలో వంద రకాల భిన్నమైన మండల ఆర్ట్‌ను పెయింటింగ్‌గా రూపుకట్టడంతో అవార్డులు వరించాయి’’ అని శశి చెప్పారు. బిబిఎలో మాస్టర్స్ డిగ్రీ పొందిన అతిరా శశిని చూస్తే ఒక విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ‘అందరికీ సమయం ఒకటే. దానిని సరిగ్గా ఉపయోగించుకున్నవారినే విజయం వరిస్తుంది’ అని.. -
మహేంద్రుడి మాయాజాలం
‘19:29 గంటల సమయం నుంచి నన్ను రిటైర్ అయినట్లుగా పరిగణించగలరు’... వీడ్కోలు చెబుతున్నప్పుడు కూడా అందరికంటే అదే భిన్నమైన శైలి. లేదంటే ఈ తరహాలో ఎవరైనా ఇలా ప్రకటించినట్లు మీకు గుర్తుందా! ధోనిపై ఇప్పటికే ఒక బయోపిక్ వచ్చేసింది. అయినా సరే అంతకు మించి మరో సినిమాకు సరిపడే డ్రామా అతని కెరీర్లో ఉంది. ఎక్కడో వెనుకబడిన రాంచీనుంచి వచ్చిన నేపథ్యం... రైల్వేలో టికెట్ ఇన్స్పెక్టర్గా పని చేయడం... ఆ తర్వాత అనూహ్యంగా అంది వచ్చిన అవకాశం... జులపాల జుట్టుతో టార్జాన్ లుక్...బెదురు లేని బ్యాటింగ్, భీకర హిట్టింగ్...కొద్ది రోజులకే కెప్టెన్‌గా మారి టి20 ప్రపంచ కప్ గెలిపించడం... ఇలా ధోని కథలో ఆసక్తికర మలుపులెన్నో. గణాంకాలను అందని ఘనతలెన్నో... బ్యాట్స్‌మన్‌గా అద్భుత టెక్నిక్ లేకపోయినా...వికెట్ కీపింగ్ సాంప్రదాయ శైలికి భిన్నంగా ఉన్నా తను మారలేదు, మారే ప్రయత్నం చేయలేదు. అదే ధోనిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. వన్డే బ్యాట్స్‌మన్‌గా పది వేలకు పైగా పరుగులు సాధించినా... ధోని అందరి మదిలో ‘కెప్టెన్ కూల్’గానే ఎక్కువగా నిలిచిపోయాడు. అతని నాయకత్వ లక్షణాలు భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించాయి. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్ కప్ (2011)లతో తన ఘనతను లిఖించుకున్న ఎమ్మెస్ 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. మైదానంలో ధోని కెప్టెన్సీ ప్రతిభకు ఉదాహరణగా నిలిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యర్థి జట్లపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మైదానంలో ప్రశాంతంగా జట్టును నడిపించడంలో అతనికి అతనే సాటి. 5 ఏప్రిల్ 2005...మన విశాఖపట్నంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ధోని సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో పాక్‌పై అతను చేసిన 148 పరుగులకు ప్రపంచం ఫిదా అయిపోయింది. అప్పటినుంచి ఆ బ్యాట్నుంచి ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు జాలువారాయి. అదే ఏడాది జైపూర్‌లో ఏకంగా 10 సిక్సర్లతో విరుచుకు పడి అజేయంగా చేసిన 183 పరుగులు కెరీర్లో అత్యుత్తమంగా నిలిచిపోగా...మరెన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు మహిని మన మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి. ఒక వీడ్కోలు మ్యాచ్ కావాలని... ఆఖరి రోజు మైదానంలో సహచరుల జయజయధ్వానాల మధ్య తప్పుకోవాలనే కోరికలు ధోనికి ఎప్పుడూ లేవు. అతను ఏదో రోజు నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడని అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే జరిగింది. టెస్టులనుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఏకవాక్యంతో అతను తన అంతర్జాతీయ ఆటను ముగించాడు. అందుకు ఈ ‘లెఫ్టినెంట్ కల్నల్’ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంచుకున్నాడు. ఇక అతని మెరుపులు ఐపీఎల్‌లోనే చూసేందుకు సిద్ధం కండి! 2008, 2009లలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు సాధించాడు. వరుసగా రెండేళ్లు ఈ అవార్డు గెల్చుకున్న తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఘనతలు, అవార్డులు ► 2007లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అందుకున్నాడు. ► 2009లో దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’... 2018లో దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’ అందుకున్నాడు. ధోని ఫినిషర్ 66 విజయవంతమైన లక్ష్య ఛేదనలో 66 సార్లు నాటౌట్‌గా నిలిచాడు (47 వన్డేల్లో; 15 టి20ల్లో; 4 టెస్టుల్లో) 43 మ్యాచ్‌లో 43 సార్లు విన్నింగ్ రన్స్ కొట్టాడు (30 వన్డేల్లో; 10 టి20ల్లో; 3 టెస్టుల్లో) 13 మ్యాచ్‌ను 13 సార్లు సిక్సర్‌తో ముగించాడు (9 వన్డేల్లో; 3 టి20ల్లో; ఒకసారి టెస్టులో) ధోని కెప్టెన్సీ రికార్డు ఆడిన వన్డేలు: 200, గెలిచినవి: 110, ఓడినవి: 74; టై: 5, ఫలితం రానివి: 11 ఆడిన టెస్టులు: 60, గెలిచినవి: 27, ఓడినవి: 18; డ్రా: 15 ఆడిన టి20లు: 72, గెలిచినవి: 42, ఓడినవి: 28 ధోని పేరిట ప్రపంచ రికార్డులు... ► వన్డేల్లో అత్యధికసార్లు నాటౌట్‌గా నిలిచిన ప్లేయర్ (84) ► వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ (183 నాటౌట్) ► వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్ (123) ► అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్ (195) ► అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్ (332 మ్యాచ్‌లు) ► టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టుకు అత్యధికంగా ఆరుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక ప్లేయర్ (6 సార్లు; 2007, 2009, 2010, 2012, 2014, 2016). ► ‘అద్భుత కెరీర్ ముగించిన ఎమ్మెస్ ధోనికి అభినందనలు. మీరు వదిలి వెళుతున్న క్రికెట్ వారసత్వం క్రికెట్ ప్రేమికులు, ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. భవిష్యత్తులో అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’ – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ► ‘భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివి. నీతో కలిసి 2011 వరల్డ్ కప్ సాధించిన నా జీవితంలో మధుర ఘట్టం. నీ రెండో ఇన్నింగ్స్ బాగా సాగాలని కోరుకుంటున్నా’ – సచిన్ టెండూల్కర్ ► ‘ప్రతీ క్రికెటర్ ఏదో ఒక రోజు తన ప్రయాణం ముగించాల్సిందే. అయితే నీకు అత్యంత ఆత్మీయులు అలా చేసినప్పుడు భావోద్వేగాలు సహజం. నీవు దేశానికి చేసింది ప్రతీ ఒక్కరి మదిలో గుర్తుండిపోతుంది. కానీ మన మధ్య పరస్పర గౌరవం నా హృదయంలో నిలిచిపోయింది. ఈ ప్రపంచం ఎన్నో ఘనతలను చూసింది. అయితే దాని రూపాన్ని నేను చూశాను’ –విరాట్ కోహ్లి ► ‘భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. ప్రపంచ క్రికెట్లో అతనో అద్భుతమైన ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని నాయకత్వ లక్షణాలకు మరెవరూ సాటి రారు. వన్డేల్లో అతని బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే’ – సౌరవ్ గంగూలీ ► ‘ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ధోని కెరీర్ ముగిస్తున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ సహచరుడిగా నీలాంటి ప్రొఫెషనల్‌తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన ధోనికి సెల్యూట్’ –రవిశాస్త్రి ► ‘ధోని లాంటి ఆటగాడు రావడం అంటే మిషన్ ఇంపాజిబుల్. ఎమ్మెస్ లాంటి వాడు గతంలోనూ, ఇప్పుడూ లేరు. ఇంకెప్పుడూ రారు. ఆటగాళ్లంతా వచ్చి పోతుంటారు కానీ అతనంత ప్రశాంతంగా ఎవరూ కనిపించరు. ఎందరో క్రికెట్ అభిమానుల కుటుంబ సభ్యుడిగా ధోని మారిపోయాడు. ఓం ఫినిషాయనమ’ –వీరేంద్ర సెహ్వాగ్ ► ‘గొప్ప కెరీర్‌ను ముగించినందుకు ధోనికి నా అభినందనలు. నీతో కలిసి ఆడటం నాకూ గౌరవకారణం. నాయకుడిగా నీ ప్రశాంత శైలితో అందించిన విజయాలు ఎప్పటికీ మధురానుభూతులే’ – అనిల్ కుంబ్లే ► ‘చిన్న పట్టణంనుంచి వచ్చి మ్యాచ్ విన్నర్‌గా, గొప్ప నాయకుడిగా ఎదిగిన ధోని ప్రయాణం అద్భుతం. నువ్వు అందించిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను’ –వీవీఎస్ లక్ష్మణ్ -
‘దిల్ బేచారా’ మరో రికార్డు
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా దిల్ బేచారా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఏ భారతీయ చిత్రానికి రాని రేటింగ్స్ పొందిన ఈ మూవీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ మూవీ విడుదలైన 24 గంటల్లోనే 75 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. దీంతో భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన ఓటీటీ చిత్రంగా నిలిచింది. ముఖేష్ చబ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే ఐఎండీబీలో 10కి 10 రేటింగ్స్ సొంతం చేసుకొని టాప్ రేటేడ్ ఇండియన్ ఫిల్మ్ గా నిలిచింది. కాగా 2014లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. (దిల్ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్) -
సూరీడే కాదు గాలీ సుర్రుమంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడు భగభగమన్నాడు. శుక్రవారం నాలుగు చోట్ల తీవ్ర వడగాడ్పులు, పలుచోట్ల వడగాడ్పులు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగా ప్రకటిస్తారు. 47 డిగ్రీలు, ఆపైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారు. ఆ ప్రకారం శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపాలెం మండలం పెంట్లాం, నల్లగొండ జిల్లా అనుములు హాలియా మండలం హాలియా, అదే జిల్లా కనగల్, పెద్దపల్లి జిల్లా మంథనిలలో ఏకంగా 47 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. అలాగే ఖమ్మం, కొల్వి, ధర్మపురి, దామరచర్ల, దుమ్ముగూడెం, మొగుళ్లపల్లి, జైనా, జూలూరుపాడు, ఏన్కూరు, పాత ఎల్లాపూర్, సోన్ ఐబీ, మామిడాల, జన్నారం, భోరాజ్, నామాపూర్, బొమ్మిరెడ్డిపల్లె, ఉర్లుగొండల్లో 46 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌లలో 45 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, హన్మకొండ, మహబూబ్‌నగర్, మెదక్, రామగుండంలలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాలులతో రాష్ట్రంలో జనం ఇబ్బందులు పడ్డారు. అనేకమంది విలవిలలాడిపోయారు. నేడు, రేపు వడగాడ్పులు.. ఉత్తర బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, సూర్యాపేట.. మొత్తంగా 17 జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. -
‘సచిన్ ఔట్ అవ్వాలని కోరుకునేవాడిని కాదు’
హైదరాబాద్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడు ఔటవ్వాలని తన అంతరాత్మ అస్సలు కోరుకునేది కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుధవారం వీడియో చాట్‌లో పాల్గొన్న ఈ మాజీ వికెట్ కీపర్ సచిన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. యువ క్రికెటర్లకు అతడొక మార్గనిర్దేశకుడని, ఆట పట్ల సచిన్‌కు ఉన్న మక్కువ మరే ఇతర ఆటగాళ్లలో చూడలేదన్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో చోటుచేసుకున్న వివాదాల్లో సచిన్ పేరు ఎక్కడా వినిపించని విషయాన్ని గుర్తుచేశాడు. ఈ విషయంలో సచిన్ నుంచి ఎంతో స్పూర్థి పొందాలని యువ ఆటగాళ్లుకు రషీద్ సూచించాడు. ‘200 టెస్టులు, 400కి పైగా వన్డేలు ఆడటం మామూలు విషయం కాదు. క్రికెట్ చరిత్రలో ఏ రికార్డు చూసినా, అత్యుత్తమ 11 మంది క్రికెటర్ల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు సచిన్. ఇక నేను కీపింగ్ చేస్తున్న సమయంలో అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదించేవాడిని, అతడు ఔటవ్వాలని నా మనస్సు అస్సలు కోరుకునేది కాదు. అయితే ఇదే క్రమంలో బ్రయాన్ లారా, పాంటింగ్, కలిస్ వంటి ప్లేయర్స్ అవుటవ్వాలని గట్టిగా ప్రయత్నించేవాడిని. ఇక ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సచిన్ వ్యక్తిత్వం చాలా విభిన్నమైనది. స్లెడ్జింగ్ చేసినా, ప్రత్యర్థి బౌలర్లు కవ్వించినా ఏకాగ్రత కోల్పోకుండా నవ్వుతాడు, తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. అనేక మంది ఆటగాళ్లు సచిన్‌ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకున్నారు’ అని రషీద్ లతీఫ్ వ్యాఖ్యానించాడు. చదవండి: 'ఆరోజు పాంటింగ్ చెత్త నిర్ణయం తీసుకున్నాడు' 'ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లి ముందుంటాడు' -
కోహ్లి సాధిస్తాడా!.. అనుమానమే?
హైదరాబాద్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అనేక రికార్డులను టీమిండియా సారథి విరాట్ కోహ్లి బద్దలుకొట్టగలడా అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మజీ సారథి, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్. కోహ్లి అత్యుత్తమ బ్యాట్మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదని కానీ సచిన్‌తో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను నెలకొల్పాడాడని గుర్తుచేసిన అక్రమ్.. సచిన్ పేరిట ఉన్న పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తాడా లేడా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలన్నాడు. ‘నేను మనసులో ఏది అనుకుంటే అది నిర్మోహమాటంగా బయటకు చెబుతాను. సచిన్, కోహ్లి ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు, ఇప్పటికే కోహ్లి అనేక రికార్డులను నెలకొల్పాడు. కానీ వీరిద్దరిని పోల్చడం సరికాదు. ఇద్దరి బ్యాటింగ్‌లో, బాడీ లాంగ్వేజీలో చాలా తేడాలు ఉన్నాయి. అయితే సచిన్, కోహ్లిలు దూకుడైన ఆటగాళ్లు. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంది. సచిన్‌ను స్లెడ్జింగ్ చేస్తే నవ్వుతూ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్తాడు. ప్రత్యర్థి బౌలర్ కవ్వింపు చర్యలకు దిగితే సచిన్ మరింత ఏకాగ్రతతో వ్యవహరిస్తాడు. కానీ కోహ్లి ఏకాగ్రతను దెబ్బతీయం చాలా సులువు. అతడిని స్లెడ్జింగ్ చేస్తే చాలా సులువుగా తన సహనాన్ని కోల్పోతాడు. అయితే ఇలా సహనం కోల్పోతే వికెట్ కోల్పోయే ప్రమాదం ఉంది’ అని వసీం అక్రమ్ వ్యాఖ్యానించాడు. చదవండి: ‘కెప్టెన్సీ పంచుకోవడం కోహ్లికి నచ్చదు’ 'పాంటింగ్ నిర్ణయం మా కొంప ముంచింది' -
సచిన్ రికార్డుల్ని కోహ్లి సవరిస్తాడు: బ్రెట్ లీ
ముంబై: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరి కొన్నేళ్లలో అందుకుంటాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. సచిన్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును కోహ్లి మరో ఏడెనిమిదేళ్లలో సవరిస్తాడని పేర్కొన్నాడు. తన నైపుణ్యం, ఫిట్నెస్, మానసిక బలంతో కోహ్లి ఏ రికార్డులైనా అందుకుంటాడని బ్రెట్ లీ అన్నాడు. ‘బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నైపుణ్యం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక ఫిట్‌నెస్‌లో అతనికి తిరుగు లేదు. ఇక మానసిక బలంతో కఠిన మ్యాచ్‌ల్లోనూ రాణిస్తున్నాడు. అందుకే మరో ఏడెనిమిదేళ్లలో సచిన్ పేరిట ఉన్న రికార్డులను కోహ్లి బద్దలు కొడతాడు’ అని లీ పేర్కొన్నాడు. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా... ప్రస్తుతం విరాట్ 248 మ్యాచ్‌ల్లో 43 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో ‘మాస్టర్’ 51 సెంచరీలు చేయగా... కోహ్లి 86 మ్యాచ్‌ల్లో 27 సెంచరీలు బాదాడు. సచిన్ ఓవరాల్ సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 30 సెంచరీల దూరంలో ఉన్నాడు. -
కోహ్లి అంటే నాకూ ఇష్టమే
కరాచీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటను అభిమానించే మాజీల జాబితాలో మరో క్రికెటర్ చేరాడు. పాకిస్తాన్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జావేద్ మియాందాద్ కూడా కోహ్లి ఆటంటే తనకు ఇష్టమని వెల్లడించాడు. విరాట్ గొప్పతనం ఏమిటో అతని ఘనతలే చెబుతాయని మియాందాద్ అన్నాడు. ‘భారత జట్టులో అత్యుత్తమ ఆటగాడు ఎవరని నన్ను కొందరు ప్రశ్నించారు. అప్పుడు నేను కోహ్లి పేరే చెప్పాను. నేను కొత్తగా అతని గురించి వివరించాల్సిందేమీ లేదు. అతని ప్రదర్శన, గణాంకాలు చూస్తే ఎవరైనా అంగీకరించాల్సిందే. దక్షిణాఫ్రికాలో అనూహ్యంగా స్పందించిన పిచ్‌పై కూడా అతను సెంచరీ చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ అంటే భయపడతాడని, బౌన్సీ పిచ్‌లపై ఆడలేడని, స్పిన్‌ను ఎదుర్కోలేడని... ఇలా ఏ విషయంలోనైనా కోహ్లి గురించి ఎవరూ ప్రశ్నించలేరు. అతని సత్తా ఏమిటో అందరికీ తెలుసు. కోహ్లి చూడచక్కగా ఆడతాడు. అతని బ్యాటింగ్‌ను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది’ అని మియాందాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 124 టెస్టులు ఆడిన మియాందాద్ 52.57 సగటుతో 8832 పరుగులు చేసి పాక్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. -
పవర్ ‘ఫుల్’
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌లో నిర్వహిస్తున్న 1,200 (2 గీ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వి ద్యుత్ కేంద్రానికి సంబంధించిన 600 మెగావాట్ల రెండు యూనిట్లు గత ఫిబ్రవరిలో 100.18 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సాధించాయి. విద్యుత్ కేంద్రం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే ఓ నిర్దిష్ట కాలంలో జరిగిన వాస్తవ విద్యుదుత్పత్తిని సాంకేతిక పరిభాషలో పీఎల్ఎఫ్ అంటారు. ఫిబ్రవరిలో సింగరేణి విద్యుత్ కేంద్రం 836.70 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా, అందులో ప్లాంట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్ పోను మిగిలిన 791.79 మిలియన్ యూ నిట్ల విద్యుత్‌ను గ్రిడ్ ద్వారా రాష్ట్రానికి సరఫరా అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్లాంట్ ఇప్పటివరకూ 8,398 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా 7,895 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా చేసింది. కాగా, ఈ ఘనతపై సంస్థ సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఐదో స్థానం: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గత రెండేళ్లలో మూడుసార్లు 100 శా తం పీఎల్ఎఫ్ సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2017–18లో జాతీయ స్థాయిలో అత్యధిక పీఎల్ఎఫ్ కలిగిన అత్యుత్తమ 25 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఐదో స్థానాన్ని సాధించింది. విడివిడిగా 15 సార్లు..: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని చెరో 600 మెగావాట్ల రెండు యూనిట్లు విడివిడిగా 15 సార్లు 100 శాతం పీఎల్ఎఫ్ సాధించాయి. 2వ యూనిట్ 9 సార్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. 2017లో ఫిబ్రవరి, మే, నవంబర్, 2018లో జూలై, సెప్టెంబర్ అక్టోబర్, 2019లో జనవరి, ఫిబ్రవరి, 2020లో ఫిబ్రవరిలో రెండో యూనిట్ 100 శాతం పీఎల్ఎఫ్ సాధించింది. -
నెవర్ బిఫోర్... 5-0
అంతర్జాతీయ టి20లు ప్రారంభమై 15 ఏళ్లు గడిచాయి. ఇప్పటివరకు 1037 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఈ క్రమంలో గతంలో ఏ జట్టుకూ సాధ్యంకాని ఘనతను భారత్ సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో ఐదో మ్యాచ్‌లో సమష్టిగా మెరిపించిన టీమిండియా ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకుంది. మౌంట్‌మాంగని: న్యూజిలాండ్‌లో భారత్ ‘పొట్టి’ చరిత్రకెక్కింది. టీమిండియా టి20ల్లో తొలిసారి 5–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి బుమ్రా (4–1–12–3) తన పేస్ పదునుతో న్యూజిలాండ్ గెలుపు దారిని ఓటమి వైపు మళ్లించాడు. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 60 రిటైర్డ్ హర్ట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ (33 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కుగ్లిన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓడింది. రాస్ టేలర్ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), సీఫెర్ట్ (30 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. శార్దుల్, సైనీ చెరో 2 వికెట్లు తీశారు. బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. మూడు వన్డేల సిరీస్ హామిల్టన్‌లో ఈనెల 5న జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. రాహుల్ మళ్లీ జిగేల్... ఈసారి టాస్ భారత్ నెగ్గింది. గత రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు కివీస్‌ను అనూహ్యంగా కట్టడి చేయడం దృష్ట్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. చివరకు ఇక్కడ అదే జరిగింది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు వచ్చిన సంజూ సామ్సన్ (2) సువర్ణావకాశాన్ని చేజార్చుకోగా... ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి స్థానంలో పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ... వన్‌డౌన్‌లో విరాట్ పాత్ర పోషించాడు. అయితే రోహిత్ ఆరంభంలో కాస్త నింపాదిగా ఆడగా... రాహుల్ తన జోరు కొనసాగించాడు. సౌతీ వేసిన 3వ ఓవర్లో ఎక్స్ట్రా కవర్స్‌లో 6, కవర్ పాయింట్, డీప్‌స్క్వేర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. దీంతో 5.1 ఓవర్లోనే భారత్ 50కి చేరింది. ధాటిగా ఆడుతున్న రాహుల్‌ను 12వ ఓవర్లో బెన్నెట్ పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్లో రోహిత్ ఫోర్ బాదడంతో జట్టు స్కోరు 100కు చేరింది. రోహిత్ 35 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఇతని అండతో శ్రేయస్ అయ్యర్ (31 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అడపాదడపా షాట్లు ఆడాడు. కాసేపటికే రోహిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగ్గా... శివమ్ దూబే (5) నిరాశపరిచాడు. మనీశ్ పాండే (4 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బాదడంతో జట్టు స్కోరు 163కు చేరింది. రాణించిన సీఫెర్ట్... లక్ష్యఛేదనలో ఓపెనర్లు గప్టిల్ (2), మన్రో (15) సహా... బ్రూస్ (0) వికెట్లను 17 పరుగులకే కోల్పోవడంతో భారత్ శిబిరంలో ఉత్సాహం పెరిగింది. బుమ్రా, సుందర్ ఓపెనర్లను ఔట్ చేస్తే, బ్రూస్ రనౌటయ్యాడు. అయితే సీఫెర్ట్, టేలర్‌ల జోడీ టీమిండియా ఉత్సాహంపై నీళ్లుచల్లింది. 12.3 ఓవర్ల దాకా మరో వికెట్ ఇవ్వకుండా కివీస్‌ను 116 స్కోరుకు తెచ్చింది. ఈ క్రమంలో సీఫెర్ట్ (29 బంతుల్లో), టేలర్ (42 బంతుల్లో) అర్ధసెంచరీలను పూర్తిచేసుకున్నారు. భారత్ క్లీన్‌స్వీప్‌కు అడ్డుగా నిలిచిన ఈ జోడీని సైనీ విడగొట్టాడు. దీంతో నాలుగో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత మిచెల్ (2)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. జట్టు స్కోరు 16 ఓవర్లలో 129/5. ఇక 24 బంతుల్లో 35 చేస్తే కివీస్ గెలుస్తుంది. ఆఖరికి పరువు నిలుస్తుంది. కానీ తర్వాత ఓవర్ వేసిన శార్దుల్ మూడు బంతుల వ్యవధిలో సాన్‌ట్నర్ (6), కుగ్లిన్ (0)లను పెవిలియన్ చేర్చడంతో గెలుపు కథ అడ్డం తిరిగింది. మరుసటి ఓవర్లో సైనీ క్రీజులో పాతుకుపోయిన టేలర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. 19 ఓవర్ వేసిన బుమ్రా కెప్టెన్ సౌతీ (6)ని అవుట్ చేసి 3 పరుగులే ఇచ్చాడు. దీంతో 12 బంతుల్లో 24 పరుగుల సమీకరణం కాస్త ఆఖరి ఓవర్‌కు వచ్చేసరికి 6 బంతుల్లో 21 పరుగులుగా పెరిగిపోయింది. శార్దుల్ బౌలింగ్‌లో సోధి 2 సిక్సర్లతో మెరిపించాడే కానీ గెలిపించలేకపోయాడు. దూబే ఓవర్లో 34.... అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా, భారత్ నుంచి తొలి బౌలర్‌గా శివమ్ దూబే చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో అతను 6, 6, 4, 1, నోబ్+4, 6, 6లతో మొత్తం 34 పరుగులు సమర్పించుకున్నాడు. కివీస్ ‘గేర్’ మార్చిన ఈ ఓవర్లో సీఫెర్ట్, టేలర్లు చెరో 2 సిక్సర్లు బాదేశారు. అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఓవర్లో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ రికార్డు స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్... 2007లో భారత్‌పై 36 పరుగులు; యువరాజ్ 6 సిక్స్‌లు) పేరిట ఉంది. మ్యాచ్ మొత్తంలో బుమ్రా 4 ఓవర్లేసి 12 పరుగులే ఇస్తే... దూబే ఒకే ఒక్క ఓవర్‌తో 3 రెట్లు ఎక్కువ పరుగులిచ్చుకున్నాడు. దీంతో మళ్లీ అతన్ని బౌలింగ్‌కు దించలేదు. ►1 ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కిదే తొలిసారి. విదేశీ గడ్డపై సిరీస్‌లను వైట్‌వాష్ చేయడం భారత్‌కిది మూడోసారి. 2016లో 3–0తో ఆస్ట్రేలియాను, గతేడాది 3–0తో వెస్టిండీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ►3 ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ 100 అంతర్జాతీయ టి20లు ఆడిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో షోయబ్ మాలిక్ (113–పాకిస్తాన్), రోహిత్ శర్మ (108–భారత్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ►1 అంతర్జాతీయ టి20ల్లో ఇన్నింగ్స్‌లో 50 అంతకంటే ఎక్కువ స్కోరు అత్యధికసార్లు చేసిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ (25) నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లి (24 సార్లు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు. ►8 అంతర్జాతీయ టి20ల్లో భారత్ వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో మూడుసార్లు భారత్ వరుసగా ఏడేసి మ్యాచ్‌ల్లో గెలిచింది. సూపర్... సామ్సన్ న్యూజిలాండ్‌తో ఐదో టి20 మ్యాచ్‌లో భారత ఆటగాడు సంజూ సామ్సన్ ఓపెనర్‌గా విఫలమయ్యాడు. కానీ ఫీల్డర్‌గా సూపర్ సామ్సన్ అయ్యాడు. మెరుపు విన్యాసంతో భారీ సిక్సర్‌ను ఆడ్డుకున్నాడు. 8వ ఓవర్లో శార్దుల్ వేసిన ఆఖరి బంతిని టేలర్ మిడ్‌వికెట్ మీదుగా భారీషాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద కాచుకున్న సామ్సన్ ఎంతో ఎత్తులో సిక్సర్‌గా వెళ్తున్న బంతిని అమాంతం ఎగిరి అందుకున్నాడు. నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ అవతల పడబోతున్న అతను మెరుపు వేగంతో బంతిని మైదానం లోపలకు విసిరాడు. 6 పరుగులొచ్చే చోట కేవలం 2 పరుగులే వచ్చాయి. అయితే ఇదంతా రెప్పపాటులో జరిగిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇదే పెద్ద హైలైట్! మా వాళ్లంతా అత్యుత్తమ స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక. మా అంచనాలకు తగ్గట్లే జట్టుకు అవసరమైనపుడు వందకు 120 శాతం ప్రదర్శన కనబరిచేందుకు సిద్ధంగా ఉండటంవల్లే ఇప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. మా అందరి లక్ష్యం విజయమే. అందుకే గత మూడేళ్లుగా జట్టులో ఎంతో మార్పు వచ్చింది. ఎంతో ప్రగతి సాధించింది. ఇక న్యూజిలాండ్ గురించి చెప్పాల్సి వస్తే ఆ జట్టు వైట్‌వాష్ అయినప్పటికీ ఓ సమర్థ సారథి చేతుల్లోనే ఉంది. కేన్ విలియమ్స్‌ది, నాది ఒకే విధమైన ఆలోచన. మా దేశాలు వేరు కావొచ్చేమో కానీ మా ఇద్దరి మైండ్సెట్లు ఒక్కటే. –భారత కెప్టెన్ కోహ్లి స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) సాన్‌ట్నర్ (బి) బెన్నెట్ 45; సంజూ సామ్సన్ (సి) సాన్‌ట్నర్ (బి) కుగ్లిన్ 2; రోహిత్ (రిటైర్డ్ హర్ట్) 60; శ్రేయస్ (నాటౌట్) 33; శివమ్ దూబే (సి) బ్రూస్ (బి) కుగ్లిన్ 5; మనీశ్ పాండే (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–8, 2–96, 3–148. బౌలింగ్: సౌతీ 4–0–52–0, కుగ్లిన్ 4–0–25–2, బెన్నెట్ 4–0–21–1, సోధి 4–0–28–0, సాన్‌ట్నర్ 4–0–36–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా 2; మన్రో (బి) వాషింగ్టన్ సుందర్ 15; సీఫెర్ట్ (సి) సామ్సన్ (బి) సైనీ 50; బ్రూస్ (రనౌట్) 0; రాస్ టేలర్ (సి) రాహుల్ (బి) సైనీ 53; మిచెల్ (బి) బుమ్రా 2; సాన్‌ట్నర్ (సి) పాండే (బి) శార్దుల్ 6; కుగ్లిన్ (సి) సుందర్ (బి) శార్దుల్ 0; సౌతీ (బి) బుమ్రా 6; సోధి (నాటౌట్) 16; బెన్నెట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–7, 2–17, 3–17, 4–116, 5–119, 6–131, 7–132, 8–133, 9–141. బౌలింగ్: సుందర్ 3–0–20–1, బుమ్రా 4–1–12–3, సైనీ 4–0–23–2, శార్దుల్ 4–0–38–2, చహల్ 4–0–28–0, దూబే 1–0–34–0. -
నవంబర్‌లో పెరిగిన మారుతీ సుజుకీ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది నవంబర్‌లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి గతనెల్లో 1,39,084 యూనిట్లు కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలోని 1,34,149 యూనిట్లతో పోల్చితే 3.67 శాతం వృద్ధి ఉందని కంపెనీ వివరించింది. అక్టోబర్ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించి 1,19,337 యూనిట్లకే పరిమితం చేసిన సంస్థ.. గతనెల్లో పెంపును ప్రకటించింది. -
టెలికం షేర్ల జోరు
ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే తక్కువకే పరిమితం చేయాలన్న ప్రతిపాదన వచ్చే క్యాబినెట్ సమావేశంలోనే చర్చకు రానున్నదన్న వార్తల కారణంగా మంగళవారం కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో స్టాక్ మార్కెట్ లాభపడింది. అమెరికా–చైనాల మధ్య కనీసం మినీ ఒప్పందమైనా కుదిరే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు పెరగడం కలసి వచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు లాభపడటం, ముడి చమురు ధరలు 0.8 శాతం తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 186 పాయింట్లు పెరిగి 40,470 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 11,940 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్, ఇన్ఫ్రా, ఇంధన, టెలికం షేర్లు లాభపడ్డాయి. వాహన, లోహ, కన్సూమర్ షేర్ల పతనంతో లాభాలు పరిమితమయ్యాయి. కొనసాగిన టెలికం పరుగు.. టెలికం షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. వచ్చే నెల నుంచి డేటా, వాయిస్ టారిఫ్‌లను పెంచనున్నామని ప్రకటించడంతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల లాభాలు కొనసాగాయి. ఇంట్రాడే లో ఏడాది గరిష్ట స్థాయి, రూ.445కి ఎగసిన ఎయిర్టెల్ చివరకు 7.3% లాభంతో రూ.439 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా షేర్ 35 శాతం లాభంతో రూ.6 వద్దకు చేరింది. టారిఫ్‌లు పెరిగితే టెలికం కంపెనీలు భారీగా ఉన్న తమ రుణాలను తీర్చివేసే అవకాశం ఉంటుందని, ఫలితంగా బ్యాంక్ బకాయిలు తగ్గుతాయనే అంచనాలతో బ్యాంక్ షేర్లు కూడా లాభపడ్డాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి కాగా, ప్రమోటర్లు తమ వాటా షేర్లను పూర్తిగా అమ్మేయడంతో యెస్ బ్యాంక్ షేర్ 2.6% నష్టంతో రూ.64 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే కావడం గమనార్హం. రిలయన్స్ రికార్డ్... రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) షేర్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,515ను తాకింది. చివరకు 3.5% లాభం తో రూ.1,510 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసేనాటికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,57,086 కోట్లకు పెరిగింది. మార్కెట్ క్యాప్ విషయంలోనూ ఈ కంపెనీ కొత్త రికార్డ్ సృష్టించింది. రూ.9.5 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ సాధంచిన తొలి భారత కంపెనీ ఇదే. మరోవైపు అత్యధిక మార్కెట్క్యాప్ ఉన్న భారత కంపెనీ కూడా ఇదే. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 34 శాతం ఎగసింది -
జగమెరిగిన చిన్నారులు
వీక్షిత, మౌనికాశ్రీ అక్కాచెల్లెళ్లు. వీక్షిత ఆరో తరగతి, మౌనిక రెండో తరగతి చదువుతున్నారు. ఇప్పటికే వీళ్లు జ్ఞాపకశక్తిలో అనేక రికార్డులు, అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీక్షిత ఇప్పటివరకు 48 రికార్డులు, 35 అవార్డులు అందుకుంది. మౌనికాశ్రీ 22 రికార్డులతోపాటు 15 పురస్కారాలను కైవసం చేసుకుంది. వీక్షిత ఈ వయసుకే ఇంటర్మీడియట్ గణిత సూత్రాలు (220), రసాయన శాస్త్ర ఆవర్తన పట్టికలోని మూలకాల పేర్లు, వాటి సంఖ్యలు, ఫార్ములాలు (200), రామాయణ. మహాభారతాలలోని పర్వాల పేర్లు, అబ్రివేషన్స్ (100), శాస్త్రవేత్తలు–వాళ్లు కనిపెట్టిన యంత్రాలు, డ్యామ్‌లు, ప్రాజెక్టులు, త్రికోణమితి, ఆల్జీబ్రా, ఘాతాలు, ఘాతాంకాలు, వర్ణాలు, ఘనాలు, భగవద్గీత శ్లోకాలు, తెలుగు సంవత్సరాల పేర్లు (60) తదితరాలను కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే చెప్పేస్తుంది. దీంతోపాటు అబాకస్, స్పెల్–బీ, కుంగ్ఫూలలోనూ ప్రతిభ కనబరుస్తోంది. మౌనికాశ్రీ కూడా అక్క అడుగుజాడల్లోనే.. జ్ఞాపకశక్తికి ప్రతీక అయింది. మెడికల్ టెర్మినాలజీ, రాష్ట్రాలు, నాట్యాలు, శాస్త్రవేత్తల పేర్లు, దేశాలు–వాటి రాజధానులు, ఆయా దేశాల జాతీయ క్రీడలు, రైల్వే జోన్ల పేర్లు, అమెరికాలోని రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లు, భారతదేశానికి సంబంధించిన అనేక రకాల అంశాలు, గణిత శాస్త్రజ్ఞులు, వారు కనుగొన్న సూత్రాలు, పాఠ్యాంశాలు, సంఖ్యలు, పద్యాలు తదితరాలను ఐదు నిమిషాల 26 సెకండ్ల వ్యవధిలో చెప్పేస్తుంది. వీరిరువురూ జ్ఞాపకశక్తి పోటీలలో రాణిస్తుండటంతో వీరు చదువుతున్న ‘అక్షర’ పాఠశాల యాజమాన్యం వీరికి ఉచితంగా విద్యాబోధన చేస్తోంది. హైదరాబాద్‌లోని చింతల్లో నివసిస్తున్న బోడేపూడి రామారావు, నాగస్వప్న దంపతుల కుమార్తెలు ఈ ఆణిముత్యాలు. – కొల్లూరి. సత్యనారాయణ, సాక్షి, స్కూల్ ఎడిషన్ -
చెన్నై చెక్కిన చాహర్
2018 ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంతర్గత సమావేశం జరుగుతోంది. ‘పేసర్ దీపక్ చాహర్ రాబోయే లీగ్‌లో 14 మ్యాచ్‌లూ ఆడతాడు. ఇక మనం వేరే ఆటగాళ్ల గురించి మాట్లాడుకుందాం’... ఒక యువ బౌలర్‌పై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకం అది. అంతటి నాయకుడే విశ్వాసం వ్యక్తం చేసిన తర్వాత ఆ బౌలర్ ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఖాయం. తనపై ఉంచిన నమ్మకాన్ని చాహర్ వమ్ము చేయలేదు. పదునైన స్వింగ్ బౌలింగ్‌ను ప్రదర్శిస్తూ కేవలం 7.28 ఎకానమీతో కీలక సమయాల్లో వికెట్లు తీసి చెన్నైని విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరో రెండు నెలలకే అతనికి భారత జట్టులో చోటు దక్కడం... ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించడం వరకు మిగతావన్నీ అతని ఐపీఎల్ ప్రదర్శనకు కొనసాగింపులాంటివే. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే దీపక్ చాహర్ సంచలన ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. ఇన్నింగ్స్‌లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ తరఫున 18 ఏళ్ల చాహర్ బరిలోకి దిగగా... 21 పరుగులకే ఆలౌటై రంజీల్లో అతి చెత్త రికార్డు నమోదు చేసిన ఆ జట్టు హైదరాబాద్. అంతటి అద్భుత ఆరంభం తర్వాత కూడా అంతర్జాతీయ క్రికెటర్ అనిపించుకోవడానికి చాహర్‌కు ఎనిమిదేళ్లు పట్టింది. అయితే ఆదివారం బంగ్లాదేశ్‌తో ప్రదర్శన తర్వాత ఇకపై చాహర్ పేరును మాత్రం ఎవరూ మరచిపోకపోవచ్చు. గాయాల సమస్యలతో... తొలి రంజీ సీజన్లో 30 వికెట్లు సాధించి ఘనంగా మొదలైన దీపక్ కెరీర్ తర్వాతి ఏడాది వచ్చేసరికే తలకిందులైంది. వరుసగా ఎదురైన గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. ఫలితంగా 2011–12 రంజీ సీజన్లో 4 మ్యాచ్‌లకే అతను పరిమితమయ్యాడు. అతని ఫిట్నెస్ సమస్యలను గుర్తించడం వల్లే కావచ్చు... ‘ఎనిమిది వికెట్ల ఘనత’కు రెండేళ్ల ముందు రాజస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్‌గా ఉన్న ఆసీస్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ నువ్వు బౌలర్‌గానే పనికి రావంటూ చాహర్‌ను తిరస్కరించాడు. నాటి 50 అత్యుత్తమ ఆటగాళ్లలో కూడా అతనికి చోటివ్వలేదు. దేశవాళీ క్రికెట్లో ఒక్క సంవత్సరానికే ఇలా కావడం దీపక్‌ను మానసికంగా కూడా దెబ్బ తీసింది. అయితే అతని తండ్రి, ఎయిర్‌ఫోర్స్ అధికారి అయిన లోకేంద్ర సింగ్ కుమారుడికి అండగా నిలిచి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఈ కుటుంబం స్వస్థలం ఆగ్రా అయినా... ఉద్యోగరీత్యా వారు జైపూర్‌లో స్థిరపడటంతో మొదటి నుంచి చాహర్ రాజస్తాన్ జట్టునే ఎంచుకున్నాడు. వారి సొంత అకాడమీలోనే అతను స్వింగ్ బౌలర్‌గా ఎదిగాడు. కొత్త బంతిని స్వింగ్ చేయడంపైనే అతను పూర్తిగా శ్రద్ధ పెట్టాడు. ఇందు కోసం తండ్రి ఖర్చుకు వెనుకాడకుండా ప్రతీ ప్రాక్టీస్ సెషన్‌కు కొత్త బంతులను సిద్ధం చేసేవాడు. కెరీర్ ఆరంభంలో 125 కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్ చేసిన దీపక్... ఆ తర్వాత రాటుదేలి, ఫిట్నెస్ మెరుగుపర్చుకొని 150 కిలోమీటర్ల స్పీడ్‌కు తన వేగాన్ని పెంచుకోవడం విశేషం. ధోని అండదండలతో... 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పుణే సూపర్ జెయింట్స్ జట్టులో చాహర్ ఉన్నాడు. తనని ఆడిస్తానంటూ ధోని అప్పుడే మాట ఇచ్చాడు. అయితే లీగ్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడటంతో పక్కన పెట్టాల్సి వచ్చింది. చివరి 3 మ్యాచ్‌లు మాత్రం ఆడగలిగాడు. మరుసటి ఏడాది స్మిత్ కెప్టెన్ కావడంతో అతని ప్రణాళికల్లో చాహర్ పనికి రాలేదు. దాంతో 2 మ్యాచ్‌లే దక్కాయి. ధోని మాత్రం మాటంటే మాటే అంటూ 2018లో చెప్పి మరీ చెన్నై జట్టులోకి తీసుకున్నాడు. ఐపీఎల్లో సూపర్‌కింగ్స్ విజేతగా నిలిచిన తర్వాత అంతా మారిపోయింది. రెండు నెలలకే భారత్ తరఫున ఆడే అవకాశం లభించింది. బుమ్రా గాయపడటంతో ఇంగ్లండ్‌తో బ్రిస్టల్‌లో చాహర్ అరంగేట్రం జరిగింది. భువనేశ్వర్ తరహాలో కొత్త బంతితో స్వింగ్ రాబట్టడం, డెత్ ఓవర్లలో పాత బంతితో కట్టడి చేయడం దీపక్‌కు బాగా అబ్బిన విద్య. సాధారణంగా ఐపీఎల్లో పవర్‌ప్లేలోని ఆరు ఓవర్లలో మూడు ఓవర్లను చాహర్‌తో ధోని వేయించేవాడు. మొత్తంగా 80 శాతం బంతులు అతను పవర్‌ప్లేలో వేసినవే. ఐపీఎల్–2019లో ఒక మ్యాచ్‌లో వరుసగా రెండు ఫుల్ టాస్ నోబాల్స్ వేయడంతో చాహర్‌పై ధోని ఆగ్రహోదగ్రుడైన విషయం అందరూ చూసిందే. అందులో ఒక కెప్టెన్‌గా తన జూనియర్‌పై కోపంకంటే తాను తీర్చిదిద్దిన బౌలర్ బాగా ఆడాలనుకునే సాన్నిహిత్యం కనిపించిందంటే తప్పు లేదు! రెండో మ్యాచ్‌లోనే... బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ప్రపంచ రికార్డుకు ముందే దాదాపు ఇదే తరహా ప్రదర్శన దీపక్ నుంచి వచ్చినప్పుడే అతనిపై అందరికీ నమ్మకం పెరిగింది. ప్రొవిడెన్స్‌లో వెస్టిండీస్‌తో ఆడిన తన రెండో టి20లో 3 ఓవర్లలో 4 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన చాహర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కెరీర్లో తొలి మ్యాచ్ మినహా మిగిలిన 6 మ్యాచ్‌లలోనూ అతను ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు. ఆసియా కప్‌లో భాగంగా ఏకైక వన్డే ఆడిన చాహర్, టెస్టుల్లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాడు. ప్రపంచ రికార్డు ప్రదర్శనతోనే ఆగిపోకుండా మున్ముందు మరిన్ని అద్భుతాలు చేయగల సత్తా 27 ఏళ్ల దీపక్ చాహర్‌లో ఉందనేది మాత్రం వాస్తవం. ప్రపంచ రికార్డు సాధిస్తానని ఏమాత్రం ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా నేను కొత్త బంతితోనే బౌలింగ్ చేస్తాను. కానీ నన్ను బుమ్రా తరహాలో వాడుకుంటామని, కీలకమైన ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుందని రోహిత్ భాయ్ చెప్పాడు. ఒత్తిడిలో నాపై నమ్మకముంచి బాధ్యత అప్పగించడం సంతోషంగా అనిపించింది. బంతి తడిగా ఉండటంతో పట్టు సాధించడం కష్టమైంది. అయితే చెన్నైలో మ్యాచ్‌లు ఆడిన అనుభవం పనికొచ్చింది. అక్కడ సాయంత్రం తేమతో పాటు చేతులకు బాగా చెమట పట్టేస్తుంది. చేతులను ఎలా పొడిగా ఉంచుకోవాలో నాకు తెలుసు. సీనియర్లు తిరిగి వచ్చినా... రాబోయే టి20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవడమే ప్రస్తుతానికి నా ముందున్న లక్ష్యం. –దీపక్ చాహర్ అదే మలుపు... రాజస్తాన్ జట్టు వరుసగా రెండు సంవత్సరాలు రంజీ ట్రోఫీ విజేతగా నిలవగా, రెండు సార్లూ చాహర్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ గాయాలతో గతి తప్పిన తర్వాత రెగ్యులర్‌గా అతనికి టీమ్‌లో చోటు లేకుండా పోయింది. అడపాదడపా ఒక్కో మ్యాచ్ లభించినా... చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ చాహర్ నుంచి రాలేదు. జట్టు రాజకీయాలు కూడా అతడిని ఇబ్బంది పట్టాయి. కొత్త బంతితో కాకుండా నాలుగో బౌలర్‌గా అవకాశం కల్పించడం, పచ్చిక ఉన్న పిచ్‌లపై కాకుండా స్పిన్ వికెట్లపైనే మ్యాచ్ ఆడించడం, ఒక్కోసారి టీమ్ 100కు పైగా ఓవర్లు బౌలింగ్ చేసినా ఐదు ఓవర్లే వేసే అవకాశం ఇవ్వడం కూడా చాహర్‌ను గందరగోళ స్థితిలో పడేశాయి. ఈ దశలో 2016లో జరిగిన ‘రాజస్తాన్ క్రికెటర్స్ డెవలప్మెంట్ క్యాంప్’ అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. క్యాంప్‌లో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, టి20 స్పెషలిస్ట్ కోచ్ ఇయాన్ పాంట్ పర్యవేక్షణలో దీపక్ బౌలింగ్ పదునెక్కింది. మరో మాజీ క్రికెటర్ కాథరీన్ డాల్టన్ కూడా అతనికి సహకరించింది. తెల్ల బంతిపై చక్కటి నియంత్రణ రావడంతో పాటు అతనిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. సరిగ్గా చెప్పాలంటే దీని తర్వాతే అతను పవర్ ప్లే స్పెషలిస్ట్‌గా ఎదిగాడు. -
మిర్చి@రూ.20 వేలు!
ఖమ్మం వ్యవసాయం: రాష్ట్రంలో ‘తేజ’రకం మిర్చి ధర రూ.20 వేలు దాటింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజ రకం మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం రూ.20,021 ధర పలికింది. మిర్చి పంట సాగు చరిత్రలో ఈ ధర అత్యధికం. గురువారం మిర్చి ధర రూ.18,600 పలకగా, ఆ ధర రూ.1,400లకు పైగా పెరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నర్సింహాపురానికి చెందిన రామా రావుకు చెందిన మిర్చికి వ్యాపారులు ఈ ధర పెట్టారు. ఈ ఏడాది ఆయా దేశాల్లో వర్షాలు, వాతావరణ కారణాలతో మిర్చి పంట ఆశించిన స్థాయిలో లేదని, దీంతో ఇక్కడ పండించిన పంటకు డిమాండ్ పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు. మన దేశంలో కూడా పంట అంత ఆశాజనకంగా లేకపోవడంతో గతేడాది పండిన పంటకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది పండించిన పంట ను వ్యాపారులు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు పెట్టారు. ఆ నిల్వలకు జూన్ నుంచి ధర పెరుగుతూ వస్తోంది. జూన్‌లో రూ.11 వేలు పలికిన ధర నవంబర్ నాటికి రూ.20 వేలకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో కూడా రికార్డు స్థాయిలో క్వింటా మిర్చి ధర రూ. 19,500 పలికింది. -
వెలుగు నీడల నివేదిక
దేశంలో నేరాల తీరెలా ఉన్నదో... ఏ రకమైన నేరాలు తగ్గాయో, ఏవి పెరిగాయో తెలుసుకోవడానికి సాధారణ ప్రజానీకం మొదలుకొని ప్రభుత్వ విభాగాల వరకూ అందరూ జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) వెలువరించే నివేదికలపై ఆధారపడతారు. సామాజిక పరిశోధకులకు సైతం అవి ప్రధాన వనరు. అలాంటి నివేదిక ఆలస్యమైందంటే అందుకు తగిన కారణాలుండాలి. కనీసం అలా ఆలస్యంగా వచ్చినందుకైనా అంతక్రితం నివేదికలతో పోలిస్తే సమగ్రంగా ఉండాలి. కానీ మంగళవారం వెలువడిన 2017నాటి ఎన్సీఆర్బీ నివేదిక ఆ విషయంలో కొంత నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఇందులో కొత్త వర్గీకరణలు లేకపోలేదు. ముఖ్యంగా తొలిసారి మహిళలు, పిల్లలపై జరుగు తున్న అఘాయిత్యాలను మరిన్ని విధాల వర్గీకరించారు. అలాగే దళితులపై సాగుతున్న దమన కాండకు సంబంధించి అయినా, అవినీతి ఉదంతాలనైనా ఈ విధంగానే వివరించారు. చర్య తీసుకోవ డానికి పోలీసులకు పట్టిన సమయం, అనంతరం న్యాయస్థానాల్లో నేరగాళ్లకు శిక్ష పడటానికి పట్టిన సమయం తదితరవివరాలిచ్చారు. దళితవర్గాలపై దాడులకు సంబంధించి జరిగే నేరాల తీరుతెన్ను లిచ్చారు. అలాగే తొలిసారి అత్యాచారాలకు సంబంధించి కూడా వేర్వేరు వర్గీకరణలిచ్చారు. మహి ళలపై అత్యాచారం చేసి హతమార్చిన సందర్భాలు, వారిపట్ల, పిల్లలపట్ల సాగుతున్న సైబర్ నేరాలు ఇవ్వడంతోపాటు పిల్లలపై జరిగిన అఘాయిత్యాలు ఏ ఏ సెక్షన్ల పరిధిలోకొచ్చాయో తెలిపారు. బెది రింపు కేసులు, నేరాన్ని ప్రోత్సహించిన వైనాలు, వేధింపులు, గాయపర్చడం వంటివి సైతం ప్రస్తా వించారు. మరో విశేషమేమంటే ఆన్లైన్ మోసాలు, డెబిట్/క్రెడిట్ కార్డు మోసాలు, ఇంటర్నెట్ నేరాలు, బిచ్చమెత్తించడం కోసం అపహరణలు వంటివి ఇందులో ఉన్నాయి. ఇలాంటి వివరాలు పోలీసులు మరింత జాగ్రత్తగా విధులు నిర్వర్తించడానికి దోహదపడతాయి. తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలేమిటన్న అంశంలో స్పష్టతనిస్తాయి. అయితే దేశాన్నంతా కలవరపరిచి, చివరకు సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తపరిచి, ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించిన మూకదాడుల విషయంలో నివేదిక మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ దేశంలో ఏనాటినుంచో ఉన్నవే అయినా ఈమధ్య కాలంలో అవి ఒక్కసారిగా పెరిగిన తీరు ఆందోళనకరం. మూకదాడులకు ఫలానా కారణమని చెప్పడానికి లేదు. పశువుల్ని తరలి స్తున్నారన్న ఆరోపణలు మొదలుకొని పసిపిల్లల్ని అపహరించడానికి వచ్చారనే అనుమానాల వరకూ అందుకు సవాలక్ష సాకులున్నాయి. ఇంకా పశు మాంసం దగ్గరుంచుకున్నారని, ఇష్టం లేని పెళ్లి చేసు కుని కుటుంబం పరువు తీశారని, తమ ఇష్ట దైవాన్ని కించపరిచారని–ఒకటేమిటి ఏదో ఒక కారణం చెప్పి ఉన్మాద మూకలు వ్యక్తుల్ని తీవ్రంగా గాయపరిచి ప్రాణాలు తీసిన ఉదంతాలున్నాయి. అలాంటి దాడుల్లో నిలువెల్లా గాయపడి నెత్తురోడుతున్నవారిపట్ల పోలీసులు కనికరం లేకుండా, వారిని వైద్య చికిత్సకు పంపకుండా జాప్యం చేసిన ఘటనలున్నాయి. వాటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి మనిషన్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి. ఆ దృశ్యాలు చూసినా, అలా చూసినవారు చెప్పగా విన్నా మనసు వికలమవుతుంది. అంతటి ఘోరాల విషయంలో ఎన్సీఆర్బీ మౌనం వహిం చడం సబబు కాదు. ఇతర నేరాల విషయంలో పలు వర్గీకరణలు, అందులో మరిన్ని ఉప వర్గీకరణలు చేసిన నివేదిక ఖాప్ పంచాయతీల గురించి కూడా చెప్పలేదు. సాగు సంక్షోభం పర్యవసానంగా దేశవ్యాప్తంగా ఉసురుతీసుకుంటున్న రైతుల ప్రస్తావన కూడా ఈ నివేదికలో లేదు. రైతులు ప్రాణాలు తీసుకోవడానికి రకరకాల కారణాలు కనబడతాయి. పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, ప్రకృతి సహకరించక పంట ఎండిపోవడం, వడ్డీ వ్యాపారుల వేధింపులు, పిల్లల్ని చదివించలేక పోవడం తదితరాలు ప్రస్తావనకొస్తుంటాయి. కానీ వీటి మూలాలు సాగు సంక్షోభంలోనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలపై గణాంకాలు అందుబాటులో ఉంటే ఈ సాగు సంక్షోభ నివారణకు ఇంకేమి చర్యలు అవసరమో ఆలోచించడానికి ప్రభుత్వాలకు వీలవుతుంది. మరింత మెరుగైన పరిష్కారాల కోసం అన్వేషణ సాగుతుంది. సైబర్ నేరాలు 77శాతం పెరిగాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది. అందులో దేశంపై ద్వేషాన్ని పెంచేవి, రాజకీయ నేరాలు, ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల నేరాలు ఉన్నాయి. అవి ఎక్కడ అధికంగా జరుగుతున్నాయో వివరాలివ్వడం ఇందులో కనబడుతుంది. రాజ ద్రోహ నేరాల సంఖ్య 45 శాతం పెరగడం, ఆ ఏడాది 228మంది ఈ నేరం కింద అరెస్టుకావడం గమనించదగ్గది. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల తీరుపైనా, అందుకు దారితీస్తున్న కారణాలపైనా నివేదిక దృష్టి సారించింది. ఐపీసీ సెక్షన్ల కింద నమోదయ్యే కేసుల్లో మూడు నెలల్లో చార్జిషీటు దాఖలు చేయాలన్న నిబంధన ఉన్నా 60 శాతం కేసుల్లో అది జరగటం లేదు. పర్యవసానంగా ఏడాదికి మించి జాప్యం జరిగిన కేసులు 3 లక్షలకు పైగా ఉన్నాయని నివేదిక చెబుతోంది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లోనూ ఈ కార ణంగా వేలాది కేసులు పెండింగ్‌లో పడుతున్నాయి. దళితులపై సాగుతున్న అఘాయిత్యాలు అంత క్రితం సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఈ నేరాల్లో సగానికిపైగా అవమానాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ కేసుల్లో అత్యధిక భాగం దళితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసినవే కావడం చూస్తే వారిలో గతంతో పోలిస్తే ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందన్న సంగతి అర్ధ మవుతుంది. దేశంలో వెంటవెంటనే శిక్షలు పడే వ్యవస్థ ఉంటే నేరాల నియంత్రణ సులభమవుతుంది. అందులో విఫలమైనప్పుడే అవి ఉగ్రరూపం దాలుస్తాయి. ఇంకా ఎలాంటి చట్టాలు తీసుకురావాలో అధ్యయనం చేయడానికి, ఉన్నవాటిని పటిష్టపరచడానికి ఈ మాదిరి నివేదికలు ఎంతో దోహద పడతాయి. కానీ అవి సకాలంలో వచ్చినప్పుడే, సవిస్తరంగా ఉన్నప్పుడే అన్నివిధాలా ఉపయోగ పడుతుంది. అందువల్ల ప్రభుత్వాల పనితీరు పదునుదేరుతుంది. ఈ సంగతి ఎన్సీఆర్బీ పెద్దలతో పాటు కేంద్రం కూడా గుర్తించాలి. -
కోహ్లి ‘ఏకాదశి’
సాక్షి, ఆంటిగ్వా: క్రికెట్ రికార్డులకు కొత్త పాఠాలు నేర్పుతూ ఎన్నో ఘనతలను తన ఖాతాలో వేసుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2008 ఆగస్టు 18న అతను తన తొలి మ్యాచ్ ఆడాడు. ఈ సందర్భంగా తన భావోద్వేగాలను పంచుకున్నాడు. నాటి తొలి మ్యాచ్ ఫోటో, తాజా ఫోటోలను తన స్పందనకు కలిపి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘2008లో సరిగ్గా ఇదే రోజు ఒక టీనేజర్‌గా కెరీర్ మొదలు పెట్టడం నుంచి 11 ఏళ్ల తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... దేవుడు నాపై తన ఆశీస్సులు ఇంతగా కురిపిస్తాడని కలలో కూడా అనుకోలేదు. సరైన దిశలో నడుస్తూ మీ అందరూ కలలు నెరవేర్చుకునేలా శక్తినివ్వాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ కృతజ్ఞుడిని’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. 11 ఏళ్ల కెరీర్లో మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 386 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 20,502 పరుగులు చేశాడు. -
రెవెన్యూ అధికారుల లీలలు
సాక్షి, బెల్లంపల్లి: నియోజకవర్గంలో కాశీపేట మండల రెవెన్యూ అధికారుల లీలలతో స్థానికులు విస్మయ వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని మాయమైన రెవెన్యూ రికార్డులు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. రికార్డులు మాయం కావడంతో శనివారం రాత్రి 11 గంటలకు ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీపేట మండలంలో 22 గ్రామాలు ఉండగా.. రియల్ ఎస్టేట్‌తో భూముల ధరలు అమాంతం పెరిగాయి. అటు ఓసీపీ నిర్వాసిత గ్రామాలు కూడా ఉండటంతో పెద్దఎత్తున చేతివాటం ప్రదర్శించేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతకు ముందే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత వారం రోజులుగా పోలీసులు విచారిస్తునట్లు సమాచారం. శనివారం కూడా కాశీపేట మండల పరిధిలోని వీఆర్వోలను పోలీసులు విచారించారు. అయితే మాయమైన రికార్డులు అనూహ్యంగా ఆదివారం ప్రత్యక్షం అయ్యాయి. రికార్డులను ఇవాళ ఉదయం ఎమ్మార్వో కార్యాలయం వద్ద పడేసి వెళ్లినట్లు సమాచారం. ఉదయం అయిదు గంటలకే ఇద్దరు వీఆర్ఏలు అక్కడకు రావటంతో ...వాళ్లే ఆ రికార్డులు తెచ్చి అక్కడ పడేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
గోదాముల్లో రికార్డుల గందరగోళం
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు): శనగ రైతుల వివరాల సేకరణలో స్పష్టత కరువవుతోంది. గోదాముల్లో రికార్డులు గందరగోళంగా ఉండడంతో సన్న, చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహానికి తాము దూరం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న శనగ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 330 కోట్లు నిధులు మంజూరు చేసిన విషయం విదితమే. ప్రోత్సాహకానికి అర్హులైన రైతుల వివరాలు మార్కెట్‌యార్డు అధికారులు సేకరిస్తున్నారు. జిల్లాలో ప్రతి ఏటా రబీలో 2.20 లక్షల హెక్టార్లలో శనగ సాగవుతోంది. ఇందులో అత్యధికంగా కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, నంద్యాల వ్యవసాయ సబ్ డివిజన్లలో సాగు చేస్తున్నారు. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి శనగకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పంట ఉత్పత్తులను గోదాముల్లో భద్రపరుచుకుని మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో పప్పుశనగ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది. క్వింటాకు రూ.1500 చొప్పున, ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు ఐదు ఎకరాల వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా రూ. 45 వేలు ప్రోత్సాహం అందించేందుకు నిధులు కేటాయించారు. అయోమయంలో సన్న, చిన్నకారు రైతులు.. పంట ఉత్పత్తులు భద్రపరిచిన గోదాము రికార్డుల ఆధారంగా అధికారులు..శనగ రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. దీంతోపాటు పంట ఉత్పత్తుల నిల్వలపై వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు వివరాలు సేకరిస్తున్నారు. రెండు, మూడు ఎకరాలు ఉండి పది, ఇరవై క్వింటాళ్లకు మించి దిగుబడులు రాని సన్న చిన్నకారులు దిగుబడులను.. పెద్ద రైతుల పేరున భద్రపరుకున్నారు. దీంతో వీరి వివరాలు గోదాము రికార్డుల్లో నమోదు కాలేదు. దీనికి తోడు ఎక్కువశాతం మంది సన్న, చిన్నకారు రైతులు పంట ఉత్పత్తులపై బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం దరి చేసే అస్కారం లేకపోవడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు గోదాముల్లో ఎంత మంది రైతులకు సంబంధించిన పంట ఉత్పత్తులు నిల్వ ఉన్నాయన్న పూర్తిస్థాయి సమాచారం లేకపోవడం సమస్యగా మారింది. గోదాముల్లో వ్యాపారులు సైతం రైతుల పేరున శనగ బస్తాలను నిల్వ చేసుకున్నారు. కొన్నిచోట్ల వ్యవసాయ, రెవెన్యూ రికార్డుల్లో పంటలసాగు నమోదు వివరాలు కూడా లేకపోవడం, అరకొరగా ఉన్న రికార్డుల్లో ఆ వివరాలు స్పష్టంగా లేకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వివరాలు సేకరించాలి.. వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో వివరాలు సేకరిస్తే అన్ని విధాలా న్యాయం జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు, గత, రెండు మూడేళ్లలో ఆ పొలాల్లో రైతులు సాగు చేసిన పంటల వివరాల ఆధారంగా వివరాలు సేకరించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం అందజేసే ప్రోత్సాహంలో సన్న, చిన్న కారు రైతులకు అన్యాయం జరుగకుండా సంబంధిత జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
హిస్టరీ క్రియేట్ చేసిన రోహిత్
లీడ్స్ : టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతకం బాది పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే నాలుగు సెంచరీలను తన ఖాతాలో వేసుకున్న రోహిత్ తాజాగా శ్రీలంకపై మరో శతకం సాధించాడు. దీంతో ఒక ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు(5) సాధించిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర పేరిట ఉన్న అత్యధిక సెంచరీల(4) రికార్డును తిరగరాశాడు. అంతేకాకుండా ప్రపంచకప్ లీగ్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇదే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్(586) రికార్డ్‌ను షకీబుల్(606) బ్రేక్ చేశాడు. తాజాగా శ్రీలంక మ్యాచ్‌లో రోహిత్ షకీబుల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక వరల్డ్ కప్‌లో 600పైకి పైగా పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా మరో ఘనతను రోహిత్ అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్(673) తొలి స్థానంలో ఉన్నాడు. -
ఒక్క సెంచరీ.. రికార్డులే రికార్డులు
లీడ్స్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముంగిట నిలిచింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇప్పటికే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు శతకాలు బాదిన రోహిత్ శర్మ 544 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే లీగ్ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడితే ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కాని పలు రికార్డులను రోహిత్ నెలకొల్పె అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నాలుగు శతకాలు బాది శ్రీలంక మాజీ దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర(4 శతకాలు, 7 ఇన్నింగ్స్‌ల్లో) సరసన చేరాడు. మరొక శతకం సాధిస్తే ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా హిట్ మ్యాన్ నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు శతకాలు బాదిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త రికార్డును సృష్టించాడు. (చదవండి: రోహిత్ సిక్స్ కొడితే.. ఆమెను తాకింది!!) అంతేకాకుండా ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(673; 2003 ప్రపంచకప్‌లో) రికార్డుపై కూడా రోహిత్ కన్నేశాడు. ఈ టోర్నీలో మరో 129 పరుగులు సాధిస్తే రోహత్ సచిన్ రికార్డును బద్దలుకొడతాడు. ఇక శ్రీలంకపైనే ఈ పరుగులు సాధిస్తే ప్రపంచకప్ లీగ్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో సచిన్(586; 2003లో), మాథ్యూ హెడెన్(580; 2007లో)తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. (చదవండి: సచిన్ తర్వాత రోహిత్ శర్మనే) ఇక రోహిత్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 90.66 సగటుతో 96.96 స్రైక్ రేట్‌తో 544 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లో 500పైకి పైగా పరుగులు సాధించి అత్యధిక సగటు కలిగి ఉన్న రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సంగక్కర(108.20 సగటు; 2015) ఆగ్ర స్థానంలో ఉన్నాడు. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లో తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే సంగక్కర రికార్డును కూడా రోహిత్ అధిగమించే అవకాశం ఉంది. (చదవండి: రోహిత్ ఔట్.. రితిక అసహనం) లంక అంటే చెలరేగడమే.. ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తలపడబోయే శ్రీలంకపై రోహిత్‌కు ఘనమైన రికార్డే ఉంది. హిట్ మ్యాన్ తాను సాధించిన మూడు డబుల్ సెంచరీల్లో రెండు(264, 208 నాటౌట్) లంకేయులపైనే కావడం విశేషం. దీంతో లంకపైనే భారీ శతకం బాది ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. శనివారం శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌తో సంబంధంలేకుండా టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. -
కోహ్లి.. నువ్ కిరాక్
ఏమని చెప్పినా.. ఎంతని పొగిడినా అతని గురించి తక్కువే.. క్రికెట్ కోసమే అతడు పుట్టాడేమో అనే అనుమానం కలిగించే ఆట అతడి సొంతం.. అతడి ఆట చూసి అసూయపడని క్రికెటర్ ఉండకపోవచ్చు. ఇక ఈ ఆటగాడి శకంలో మేము ఆడనందుకు సంతోషిస్తున్నామని అనుకోని మాజీ దిగ్గజ బౌలర్లు ఉండకపోవచ్చు. అతడికి సాధ్యం కానిది ఏమీ లేదు అంటే అతిశయోక్తి కాదు. మరికొంత కాలం అతడి ఆట ఇలాగే కొనసాగితే సాధించేందుకు రికార్డులు, భవిష్యత్‌లో సాధించే ఆటగాళ్లు బహుశా ఉండకపోవచ్చు. ప్రపంచకప్‌లో భాగంగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో అద్భుతమైన ఘనతను అందుకున్నాడు. మాంచెస్టర్ : టీమిండియా సారథి విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల రారాజు. అతడి రికార్డులు, ఘనతల గురించే చెప్తే ఒడిసేది కాదు.. రాస్తే పుస్తకం సరిపోదు. ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా పరుగుల యంత్రం తాజాగా మరో ఘనతన తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 11,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను కోహ్లి బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 11 ఏళ్లలోపే ఈ మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా.. తాజాగా విరాట్ కోహ్లి కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకుని ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. సచిన్ తర్వాత రికీ పాంటింగ్ (286 ఇన్నింగ్స్‌లు), సౌరవ్ గంగూలీ (288) టాప్-4లో కొనసాగుతున్నారు. ఇప్పటికే 10వేల పరుగుల మైలురాయిని కూడా వేగంగా(205 ఇన్నింగ్స్‌లు) అందుకున్న క్రికెటర్‌గా రికార్డుల్లో కోహ్లీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి ఇప్పటికే అందుకున్న రికార్డులను పరిశీలిస్తే.. కింగ్ కోహ్లి ఖాతాలో ఇప్పటికే చేరిన పలు రికార్డులు.. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్. పదివేల పరుగులు పూర్తిచేసిన అతిచిన్న వయస్కుడిగా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక, వెస్టిండీస్‌లతో జరిగిన వేర్వేరు సిరీస్‌ల్లో మూడు వరుస సెంచరీలు చేసిన తొలి క్రికెటర్. ఒక క్యాలెండ్ సంవత్సరంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(11) వెయ్యి పరుగులు చేసిన తొలి ఆటగాడు కోహ్లి. గతంలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా(15 ఇన్సింగ్స్‌లు)పేరిట ఈ రికార్డు ఉంది. సారథిగా కోహ్లి టెస్టుల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగులు సాధించిన ఆటగాడు. అది కూడా అతితక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే(65). గతంలో బ్రయాన్ లారా(71 ఇన్నింగ్స్‌లు)పేరిట ఆ రికార్డు ఉండేది. ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డబుల్ సెంచరీ సాధించిన తొలి సారథి. ఒక క్యాలెండ్ సంవత్సరంలో ఆరు సెంచరీలు సాధించిన ఫస్ట్ కెప్టెన్. సారథిగా ఆరు డబుల్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్. ఓవరాల్‌గా అంతర్జాతీ క్రికెట్లో యాభైకి పైగా సగటుతో అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించిన తొలి ఢిల్లీ క్రికెటర్. ఆరు ద్విశతకాలు బాదిన తొలి రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ద్విశతక భాగస్మామ్యాలు నమోదు చేసిన ఆటగాడు. రోహిత్ శర్మతోనే నాలుగు ద్విశతక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. -
మార్చి 16.. మర్చిపోలేని రోజు!
క్రికెట్ అభిమానులు ఈ రోజు(మార్చి 16)ను మర్చిపోలేరు. క్రికెట్ చరిత్రలో రెండు సరికొత్త రికార్డులు నమోదయిన రోజు. అందులో ఒకటి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద శతకాలు సాధించింది కాగ, మరొకటి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ హెర్షల్ గిబ్స్ తొలి సారి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి నయా రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద అంతర్జాతీయ శతకాలు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది ఇదే రోజున. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌పై చేసిన శతకం సచిన్‌కు వన్డేల్లో 49వ సెంచరీ కాగా, టెస్టులు(51), వన్డేల్లో కలుపుకుని వంద సెంచరీలను సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఈ "లిటిల్ మాస్టర్" సరికొత్త రికార్డును సృష్టించాడు. సచిన్ సాధించిన ఈ అరుదైన ఘనతతో యావత్ క్రికెట్ అభిమానులు తెగ పండగ చేసుకున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్(71) సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇప్పటివరకు 66 అంతర్జాతీయ సెంచరీలు సాధించి సచిన్ ‘వంద శతకాల’పై కన్నేశాడు. సిక్సర్ల సునామీ ఇక పన్నెండేళ్ల క్రితం సిరిగ్గా ఇదే రోజున దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు హెర్ష్లీ గిబ్స్ అద్భుతం చేశాడు. వన్డేల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగీ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిబ్స్ అతడికి చుక్కలు చూపించాడు. అప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రవిశాస్త్రి, గార్ఫీల్డ్ సోబర్స్ సాధించిన రికార్డే(ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు) అత్యుత్తమం కావడం విశేషం. గిబ్స్ ఈ ఘనత అందుకున్న కొద్ది నెలల అనంతరం టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ రికార్డు సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఈ ఫీట్ అందుకున్నాడు. -
"లిటిల్ మాస్టర్" వంద సెంచరీకి ఏడేళ్లు
-
తొమ్మిదేళ్ల రికార్డును తిరగరాసిన రోహిత్ సేన
వెల్లింగ్టన్: ‘అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి’ఇది టీమిండియా ప్రదర్శణకు పక్కా సెట్ అయ్యే సామెత. గెలుపు ఎంత ఘనంగా ఉంటుందో.. ఓటమి కూడా అంతే ఘోరంగా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే మామూలుగా కాకుండా చిత్తుచిత్తుగా ఓడిపోవడం భారత జట్టుకు అలవాటయింది. ఈ మధ్యకాలంలోని టీమిండియా ఓటములను పరిశీలిస్తే అర్థమవుతోంది. తాజాగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ సేన 80 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అయితే టీ20ల్లో టీమిండియాకు పరుగుల పరంగా ఇదే అతి పెద్ద ఓటమి. 2010లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో అప్పటి భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇప్పటివరకు అదే పెద్ద ఓటమి కాగా తాజాగా తొమ్మిదేళ్ల తర్వాత ఆ రికార్డును టీమిండియా తిరగరాసింది. అడితే అందరూ కలిసికట్టుగా ఆడటం లేకుంటే సమిష్టిగా విఫలమవ్వడం చాంపియన్ జట్టు తత్వం కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాపార్డర్ విఫలమైన ప్రతీసారి భారత జట్టు ఘోరంగా ఓడిపోతుందని.. మిడిలార్డర్ గురించి సెలక్షన్ కమిటీ ఆలోచించాలని మాజీ క్రికెటర్లు సలహాలిస్తున్నారు. ఇప్పటివరకు టీమిండియా 111 టీ20 మ్యాచ్‌లు ఆడగా 69 విజయాలు సాధించగా, 38 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక రెండో సారి బ్యాటింగ్ చేసి ఓడిపోయిన మ్యాచ్‌లు 17, ఇందులో 11 మ్యాచ్‌లు భారీ లక్ష్యాలను చేదించే క్రమంలో ఓడిపోయినవే కావడం గమనార్హం. -
బతికుండగానే చంపేశారు!
చిత్తూరు ,గుడిపాల: బతికుండగానే ఓ వ్యక్తిని అధికారులు ముందుగానే చనిపోయినట్లు రికార్డులకు ఎక్కించారు. తీరా అతను చనిపోయిన తరువాత చంద్రన్న బీమా కోసం కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే.. తమ రికార్డుల్లో అతను ఎన్నడో చనిపోయినట్లు ఉందని చెప్పడంతో కంగుతిన్నారు. వివరాలు.. మొగరాళ్లపల్లె దళితవాడకు చెందిన ధైర్యనాథన్(50) మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా గుండెపోటుకు గురై చనిపోయాడు. కుటుంబ సభ్యులు స్థానిక సంఘమిత్రకు ఫోన్లో సమాచారమిచ్చినా ఆమె స్పందించకపోవడంతో చంద్రన్న బీమా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. ఇతను ఎప్పుడో చనిపోయినట్లు తమ వద్ద రికార్డుల్లో ఉందని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. దీనిపై గుడిపాల వెలుగు కార్యాలయంలో సంప్రదించారు. చంద్రన్న బీమా బాండు వచ్చిందని, అయితే ధైర్యనాథన్ చనిపోయినట్లు సంఘమిత్ర రాతపూర్వకంగా చెప్పడంతో చంద్రన్న బీమా నుంచి అతని పేరు తొలగించారన్నారు. బతికి ఉన్న వ్యక్తిని ముందుగానే ఎలా చంపేస్తారని, చంద్రన్నబీమా రాకపోవడం ఏమిటని వారిని ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం కరువైంది. సంఘమిత్రపై పలు ఆరోపణలు పేయనపల్లె, మొగరాళ్లపల్లె పంచాయతీలకు సంబంధించి పేయనపల్లె వాసి నాగభూషణం సంఘమిత్రగా వ్యవహరిస్తోంది. సంఘంలోని గ్రూపు సభ్యులకు బ్యాంక్ లోన్ తీసిస్తే మామూళ్లు ఇవ్వాలని, లేకుంటే లోన్‌కూడా తీసివ్వదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మొగరాళ్లపల్లె పంచాయతీకి కొత్త సంఘమిత్రను ఎంపికచేస్తే ఆమె అధికార బలంతో ఆ పోస్ట్‌ను కూడా తీయించి ఇన్చార్జ్గా వ్యవహరిస్తోందనే ఆరోపణ వినిపిస్తోంది. అంతేకాకుండా గతంలో కూడా పసుపు–కుంకుమ డబ్బులను కూడా సభ్యులకు ఇవ్వకుండా స్వాహా చేసిందని డ్వాక్రా మహిళల ఆరోపణ. చంద్రన్న బీమాకు సంబంధించి డబ్బులు స్వాహా చేసి మనిషి బతికుండగానే చనిపోయినట్లు చెప్పి ఇలా చేయడం శోచనీయమని మండిపడుతున్నారు. విషాదంలో కుటుంబం ధైర్యనాథన్ మృతితో అతని కుటుంబం వీధిన పడింది. మృతుడికి ప్రియదర్శిని(9వ తరగతి), మాలతి (7వ తరగతి) కుమార్తెలు ఉన్నారు. ధైర్యనాథన్ మృతితో వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా చంద్రన్న బీమా కింద రూ.2లక్షలు వస్తుందనుకుంటే సంఘమిత్ర తీరు వలన ఆ కుటుంబ పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది. -
పెయిడ్ న్యూస్, ప్రకటనలను గుర్తించాలి
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ గ్రామీణ, అర్బన్ నియోజకవర్గాలకు నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు ధీరజ్ కుమార్ గురువారం కలెక్టరేట్లోని ఎన్నికల కార్యాలయాలను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వీవీప్యాట్లు, ఈవీఎంల అవగాహన కేంద్రాన్ని పరిశీలించారు. ఈవీఎంల ఉపయోగం, వీవీప్యాట్ల వినియోగంపై సిబ్బంది ని వివరాలు అడిగారు. అనంతరం ఎన్నికల మీడియా కేంద్రంలో పర్యటించి అభ్యర్థులు, పార్టీలు నిర్వహిస్తున్న ప్రచారం, ప్రకటనల రికార్డింగ్ లోకల్ కేబుల్ టీవీల్లో ఏ విధంగా రికార్డు చేస్తున్నారు? వాటిని ఏ విధంగా పరిశీలిస్తున్నారని ఆరా తీశారు. వార్త పత్రికల్లో ప్రచురణ అవుతున్న అనుమానిత చెల్లింపు వార్తలు, ప్రకటన క్లిప్పింగులను పరిశీలించారు. స్వీప్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నిక ల ముఖ్య సమాచారమంతా మీడియా ద్వారానే తెలుస్తున్నందున, ప్రతి సమాచారాన్ని మీడియా ద్వారానే ప్రజలకు తెలియజేయాలన్నారు. కలెక్టర్ రామ్మోహన్ రావు వివరిస్తూ ఎంసీసీ కమిటీ ఆధ్వర్యంలో ప్రవర్తన నియామావళి ఉల్లంఘన జరగకుండా ఎక్కడికక్కడ టీంల ద్వారా తనిఖీలు చేయిస్తున్నామన్నారు. స్థానిక సెలబ్రెటీల ద్వారా ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేస్తున్నామని, కేబుల్ టీవీల్లో ప్రసారమయ్యే ప్రకటనపై వీడి యో సర్వేలెన్స్ బృందాల ఆధ్వర్యంలో రోజువారి కార్యక్రమాలు పరిశీలించి ప్రకటనలపై రిటర్నింగ్ అధికారులతో అభ్యర్థులకు, పార్టీలకు నోటీసులు జారీకి ఆదేశాలిచ్చామన్నారు. పత్రికల్లో వచ్చే ప్రకటనలు, అనుమానిత చెల్లింపు వార్తపై ఏరోజుకారోజు ఆర్వోలకు వివరాలు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెక్‌పోస్టు వద్ద రవాణా, ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ అధికారులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి జిల్లాకు వచ్చే వాహనా లపై నిఘా పెట్టామని, అనుమానిత డబ్బు, మ ద్యాన్ని సీజ్ చేస్తున్నట్లు వివరించారు. ఎంసీసీ నోడల్ అధికారి సింహాచలం, డీఆర్వో అంజయ్య, సమాచార శాఖ డీడీ మహ్మద్ ముర్తుజా ఉన్నారు. -
మాయలోళ్లు
వరికుంటపాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లోకసాని దుర్గా, లోకసాని రాజ్యలక్ష్మిలకు సర్వే నంబర్ 196లో 4 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమి ఉంది. ఆ భూమిని సాగు చేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. నాలుగు నెలల క్రితం కూడా భూములపై బ్యాంక్‌లో పంట రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు కనిపించడం లేదు. తహసీల్దార్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యలక్ష్మికి భర్త మరణించాడు. ఉన్న భూములు కూడా లేకుండా చేస్తే మా పరిస్థితి ఏమిటని బాధితురాలు రోదిస్తోంది. నెల్లూరు(పొగతోట): జిల్లాలోని దగదర్తి, బోగోలు, అల్లూరు తదితర మండలాల్లో వేల ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములు బినామీల పేర్లతో ఆక్రమణకు గురయ్యాయి. జిల్లాలో 787 సొసైటీలు ఉండగా 99,623 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములు ఉన్నాయి. 65719 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సీజేఎఫ్ఎస్ సొసైటీలను రద్దు చేసి లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసేలా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రెవెన్యూ అధికారులు సీజేఎఫ్ఎస్ భూముల సర్వే పూర్తి చేశారు. లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ భూములు పొందిన వారిలో అనేక మంది భూముల్లో లేరు. భూస్వాములు ఈ భూములను కొనుగోలు చేశారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు భూముల్లో లేకపోవడంతో బినామీ పేర్లతో భూములు స్వాహా చేసేందుకు అధికారపార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు చెప్పిన విధంగా అనేక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు నడుచుకుంటూ వారు సూచించిన పేర్లతో నివేదికలు సిద్ధం చేసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అనేక మంది మరణించారు. వారి వారసులు, కుటుంబ సభ్యులు భూములను సాగు చేసుకుంటున్నారు. మరణించిన వారి పేర్లను రికార్డుల నుంచి తొలగించి బినామీ పేర్లను చేర్చారు. పట్టాలు అర్హులైన వారి వద్ద ఉంటే రెవెన్యూ రికార్డుల్లో మాత్రం బినామీల పేర్లు దర్శనమిస్తున్నాయి. బినామీ పేర్లతో విలువైన పేదల భూములు కాజేసేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దాని ప్రకారం అధికారులతో చర్చించి బినామీల పేర్లు పట్టాలు మంజూరు చేయించేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోంది. రెవెన్యూ ఉద్యోగుల వసూళ్లు సొసైటీలను రద్దు చేసి లబ్ధిదారులకు పట్టాలు అందజేసే ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే మాటను రెవెన్యూ ఉద్యోగులు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. పట్టాలు కేటాయిస్తున్నామంటూ ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. తాము పేద ప్రజలమని, నగదు ఇవ్వలేమని లబ్ధిదారులు ప్రాధేయపడుతున్నా కనీసం రూ.2 వేలైనా ఇవ్వాలని, లేకుంటే పట్టాలు రావంటూ రెవెన్యూ ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో అనేక పంచాయతీల్లో సీజేఎఫ్ఎస్ జాబితాల్లో రెవెన్యూ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. గూడూరు, ఆత్మకూరు, కావలి డివిజన్లలోని మండలాల్లో సీజేఎఫ్ఎస్ జాబితాలో రెవెన్యూ సిబ్బంది పేర్లు కూడా ఉన్నాయి. ఈ విషయంపై కొంతమంది తహసీల్దార్లు మాట్లాడుతూ సిబ్బంది తల్లిదండ్రులకు భూములు ఉంటే వాటిని కుమారులకు కేటాయించడం జరుగుతుందని సమాధానం ఇవ్వడం గమనార్హం. రెవెన్యూ సిబ్బంది తల్లిదండ్రులకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అందరి పేర్లు జాబితాలో ఉండాలి. రెవెన్యూ సిబ్బంది పేర్లు మాత్రమే జాబితాలో ఉండడం గమనార్హం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అక్రమంగా వసూలు చేస్తే కఠిన చర్యలు సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి పట్టాలు కేటాయించే ప్రక్రియ జరుగుతోంది. సర్వే ప్రక్రియ పూర్తయింది. అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. పట్టాల మంజూరు విషయంలో లబ్ధిదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామంలోని సర్వే నంబర్లు 46/3, 46/4, 46/5లలో కొండయ్య, మాల్యాద్రి, వెంకటస్వామిలకు 1976వ సంవత్సరంలో సీజేఎఫ్ఎస్ భూములను కేటాయించారు. లబ్ధిదారులు ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2002వ సంవత్సరానికి ముందు ఈ భూములను ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. భూములు కేటాయించే సమయానికి ఇద్దరు లబ్ధిదారుల వయస్సు ఒకరికి 12, మరొకరికి 8 సంవత్సరాలు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి సీజేఎఫ్ఎస్ భూములు కేటాయించడం గమనార్హం. 1979, 1982లో జన్మించిన వ్యక్తులకు 1992లో భూములు కేటాయించినట్లు అధికారులు రికార్డులు సృష్టించారు. అధికారపార్టీ నాయకులు, అధికారులు తలచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు. భూములు ఆక్రమించిన వారు అధికారపార్టీ నాయకులకు కావాల్సిన వారు కావడంతో అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బాధితులు తమకు న్యాయం చేయాలని 16 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. -
విరాట్ కోహ్లి రికార్డుల పర్వం
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌పై రెండు టెస్టుల ఓటమి తర్వాత జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కసిగా ఆడుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఈ టెస్టులో టీమిండియా సారథి విరాట్ కోహ్లి మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న టెస్టులో విరాట్ కోహ్లి పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో సారథిగా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో కోహ్లి(16) మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అలెన్ బోర్డర్(15), స్టీవ్ వా(15), స్టీవ్ స్మిత్(15)లను అధిగమించాడు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్(25) తొలి స్థానంలో నిలవగా, రికీ పాంటింగ్(19) రెండో స్థానంలో నిలిచాడు. ఆసియా ఖండం బయట అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి(11) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్‌ను రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(18), గవాస్కర్(15), రాహుల్ ద్రవిడ్(14) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో అజారుద్దీన్(22)ను దాటేశాడు. దీంతో కోహ్లి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానాన్ని పంచుకున్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్(51), ద్రవిడ్(36), గవాస్కర్(34)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఒక టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి రెండు వందలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి(12సార్లు) ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సంగక్కర(17), లారా(15), బ్రాడ్‌మన్(14), పాంటింగ్(13) తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగులు సాధించడంతో ఈ సిరీస్‌లో 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై కెప్టెన్‌గా ఆతిథ్య జట్టుపై ఒక్క సిరీస్‌లో 400కి పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా కోహ్లి రికార్డు సాధించాడు. గతంలో అజారుద్దీన్(426) ఈ ఫీట్ సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో తొలి మూడు వికెట్లకు అర్థసెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసి టీమిండియా ఆటగాళ్లు అరుదైన రికార్డును నెలకోల్పారు. 1968లో ఆస్ట్రేలియాపై తొలిసారి ఈ ఘనత సాధించారు. ఇక ఈ మైదానంలో ఇంగ్లండ్ అత్యధిక ఛేజింగ్ 332 పరుగులే(1928లో ఆస్ట్రేలియాపై) కావడం గమనార్హం. -
కుల్దీప్ రికార్డుల మోత..!
నాటింగ్‌హామ్: భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మిగిలిన కుల్దీప్(6/25) ఆతిథ్య జట్టును మరోసారి దెబ్బతీశాడు. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో అదరగొట్టిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా కుల్దీప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌గానూ అరుదైన ఘనత సాధించాడు. వన్డేలో బ్రిటీష్ పిచ్‌లపై ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కుల్దీప్ సరికొత్త రికార్డు లిఖించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ చైనామన్ బౌలర్ బ్రాడ్ హాగ్ రికార్డును తిరగరాశాడు. టీమిండియా తరుపున బౌలింగ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా మరో ఘనత సాధించాడు. గతంలో అనిల్ కుంబ్లే(6/12), అమిత్ మిశ్రా(6/48), మురళీ కార్తీక్(6/27)లు ఈ ఘనత సాధించారు. ఈ ఫీట్ సాధించచిన నలుగురు బౌలర్లు స్పిన్నర్లు కావడం విశేషం. , -
ధోని బర్త్‌డే స్పెషల్.. పదిలం నీ మెరుపులు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. నేటి(జూలై7)తో 37 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ధోని తన కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. భారత క్రికెట్ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న ధోని.. భారత జట్టు తరపును 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టీ 20, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను గెలిచి ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు. ఈ క్రమంలోనే ధోని మెరుపుల్ని ఒకసారి గుర్తు చేసుకుంది. 1. భారత్ తరపున ఆరు వరల్డ్ టీ 20 ఎడిషన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్ 2. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్ ధోని. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్(664), రాహుల్ ద్రవిడ్(509)లు ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 9వ ఆటగాడు ధోని. 3. 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 780 ఔట్లలో భాగస్వామ్యమైన ధోని.. ఈ రికార్డు సాధించిన ఓవరాల్ మూడో వికెట్ కీపర్. అతని కంటే ముందు మార్క్ బౌచర్(998), ఆడమ్ గిల్‌క్రిస్ట్(905)లు ఉన్నారు. 4. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపింగ్‌లు వికెట్ కీపర్‌గా ధోని(178) అగ్రస్థానంలో ఉన్నాడు. 5. అంతర్జాతీయ టీ20ల్లో 82 మందిని ఔట్ చేసిన ధోని టాప్‌లో ఉన్నాడు. 6. తొలి టెస్టు, వన్డే సెంచరీలను పాకిస్తాన్‌పై ధోని సాధించగా, ఈ రెండు సందర్బాల్లోనూ 148 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేయడం మరో విశేషం. 7. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ధోనిది. ఏడో స్థానంలో రెండు శతకాలు నమోదు చేసి ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ధోని ఉన్నాడు. 8. వికెట్ కీపర్‌గా ఉండికూడా అత్యధిక సార్లు బౌలింగ్ చేసిన ఘనత ధోని సొంతం. అతని కెరీర్లో 9సార్లు బౌలింగ్ చేయగా, తొలి వికెట్‌ను 2009లో వెస్టిండీస్‌పై సాధించాడు. 9. 2007లో ఆఫ్రో-ఆసియా కప్‌లో భాగంగా మహేల జయవర్ధనేతో కలిసి ఆరో వికెట్‌కు ధోని 218 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని సాధించాడు. ఇది వన్డేల్లో ఆరో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. 10. వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రెండుసార్లు గెలిచిన ఏకైక క్రికెటర్ ధోని. 11.మూడు ఐసీసీ మేజర్ టోర్నమెంట్లను గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్ (వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ). 12. ప్రతీ ఫార్మాట్లోనూ కనీసం 50 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్. 13. వన్డే ఫార్మాట్లో కెప్టెన్‌గా 110 విజయాలు సాధించిన ధోని.. 74 పరాజయాలను ఎదుర్కొన్నాడు. కనీసం 20 వన్డేలకు సారథ్యం వహించిన భారత ఆటగాళ్ల పరంగా చూస్తే గెలుపు-ఓటముల రికార్డులో ధోనినే అత్యుత్తమ గణాంకాలను కల్గి ఉన్నాడు. 14. ఐదు-అంతకంటే ఎక్కువ జట్లు ఆడిన నాలుగు టోర్నమెంట్లను గెలిచిన ఘనత ధోనిది. ఈ ఘనతను సాధించిన కెప్టెన్ల పరంగా చూస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి ధోని సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 15. ఎనిమిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను ధోని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ తొమ్మిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలిచిన వారిలో కెప్టెన్‌గా రికీ పాంటింగ్ ముందున్నాడు. తొమ్మిది టెస్టు దేశాలపై పాంటింగ్ వన్డే సిరీస్‌లను గెలిచాడు. కాగా, బంగ్లాదేశ్‌పై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సాధించడంలో ధోని విఫలం కావడంతో పాంటింగ్ సరసన నిలవలేకపోయాడు. 16. 43 వన్డే సిరీస్లకుకు ధోని సారథిగా వ్యహరించాడు. ఇది భారత్ తరపున అత్యధికం కాగా, ఓవరాల్‌గా నాల్గోది. 17. భారత్ సాధించిన విజయాల్లో వన్డే కెప్టెన్‌గా ధోని యావరేజ్ 70.83గా ఉంది. కనీసం వెయ్యి పరుగుల సాధించిన ఓవరాల్ కెప్టెన్లలో ఇది మూడో అత్యుత్తమ యావరేజ్. ఇక్కడ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, సచిన్ టెండూల్కర్లు ముందువరుసలో ఉన్నారు. 18. 72 ట్వంటీ 20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్ ధోని 19. భారత జట్టు 110 వన్డే విజయాలకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్ తరపున ఇదే అత్యధికం కాగా, ఒక జాతీయ జట్టుకు అత్యధిక వన్డే విజయాలను అందించిన రెండో కెప్టెన్ గా ధోని నిలిచాడు. అగ్రస్థానంలో పాంటింగ్(165) ఉన్నాడు. 20. కెప్టెన్ గా ధోని కొట్టిన సిక్స్లులు 126. ఓవరాల్ కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత ధోనిది. 21. 199 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక భారత్ ఆటగాడు ధోని. ఓవరాల్‌గా మూడో స్థానంలో ఉన్నాడు. 22. అన్ని ఫార్మాట్లలో 331 మ్యాచ్‌లకు ధోని సారథిగా వ్యవహరించాడు. ఇదే ఓవరాల్‌గా అత్యధికం. -
టీ20ల్లో టీమిండియా అరుదైన రికార్డులు
డబ్లిన్: అప్రతిహత విజయాలతో దూసుకువెళ్తున్న టీమిండియా పసికూన ఐర్లాండ్‌ను వదల్లేదు. చిన్న జట్టని తక్కువ అంచనా వేయకుండా పెద్ద విజయం సాధించింది. రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20లో భారత్ 143 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ షోతో ఆదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐరిష్ జట్టుపై రికార్డుల మోత మోగించారు. *టీ20లో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం(143 పరుగుల భారీ తేడాతో). గతంలో శ్రీలంకపై 93 పరుగుల విజయమే అత్యుతమం.. కాగా ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసింది. *ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20లో పరుగుల పరంగా టీమిండియా సాధించినది రెండో అతిపెద్ద విజయం. ఈ జాబితాలో తొలి స్థానంలో శ్రీలంక ఉంది. 2007లో కెన్యాపై జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. *ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా రెచ్చిపోయారు. టీమిండియా బౌలర్ల ధాటికి ఐరీష్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 70 పరుగులకే ఆలౌటైంది. దీంతో ప్రత్యర్థి జట్టును ఇంత తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడం టీమిండియాకిదే తొలిసారి. గతంలో ఇంగ్లండ్‌ను 80 పరుగులకు ఆలౌట్ చేసిన రికార్డే ఇప్పటివరకు అత్యుత్తమం. -
ఏకైక టెస్టులో రికార్డుల మోత
సాక్షి, బెంగళూర్ : చిన్న స్వామి స్టేడియంలో భారత్ అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన చారిత్రక టెస్టు మ్యాచ్ రికార్డుల సునామీ సృష్టించింది. ఐదు రోజుల మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. దీంతో టీమిండియా రెండ్రోజుల్లోనే మ్యాచ్ ముగించటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అఫ్గాన్‌పై భారత్ ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు టీమిండియాకు ఇన్నింగ్స్ విజయం పరంగా ఇదే అతి పెద్దది. 2007లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో విజయం సాధించింది, ఇదే ఇప్పటివరకు అత్యుత్తమం. ఇక అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అతి తక్కువ ఓవర్లలో ఆలౌటై చెత్త రికార్డును అఫ్గానిస్తాన్ మూటగట్టుకుంది. తొలి రెండు స్థానాల్లో (తొలి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లలో, రెండో ఇన్నింగ్స్‌లో 38.4 ఓవర్లలో ఆలౌటైంది) అఫ్గానే ఉండటం గమనార్హం. ఇంకా పలు రికార్డులను పరిశీలిస్తే అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోని ఒక ఇన్నింగ్స్‌లో అతి తక్కువ పరుగులకు(103) ఆలౌటైన మూడో జట్టుగా అప్గాన్ అపప్రదను మూటగట్టుకుంది. తొలి రెండు స్ధానాలలో (దక్షిణాఫ్రికా (84 రన్స్), బంగ్లాదేశ్ (91 రన్స్)) ఉన్నాయి. టీమిండియా గెలిచిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ప్రత్యర్థి జట్టును అతి తక్కువ పరుగులకు కట్టడి చేసిన మ్యాచ్ ఇదే. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అఫ్గాన్ 212 పరుగులు మాత్రమే చేసింది. 1986లో టీమిండియాపై ఇంగ్లండ్ 230 పరుగుల చేసింది, ఇదే ఇప్పటివరకు అత్యుత్తమం. టెస్టు మ్యాచ్‌లో ఒకే రోజులో అత్యధిక వికెట్లు(24) పడిన మ్యాచ్‌లో ఇది నాల్గోది, 1888లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు ఒకే రోజు 27 వికెట్లు సాధించారు. టీమిండియా గెలిచిన టెస్టు మ్యాచ్‌లో(రెండు ఇన్నింగ్స్‌లు కలిపి) అతి తక్కువ బంతులు బౌలింగ్ చేసిన మ్యాచ్ ఇదే. 399 బంతులు మాత్రమే బౌలింగ్ చేసింది. 2014లో ఆస్ట్రేలియాపై 554 బంతులు వేసిన మ్యాచే ఇప్పటివరకు అత్యుత్తమం. -
ఐపీఎల్లో రాయల్‌ఛాలెంజర్స్ అరుదైన రికార్డు
-
5 సచిన్ రికార్డులను బద్దలు కొట్టలేరు..!!
సాక్షి, స్పోర్ట్స్ : క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సోమవారం 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. 16 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ అరంగేట్రం చేశారు. కెరీర్ తొలినాళ్లలో ఒడిదుడుకులకు గురైన సచిన్.. మెల్లగా నిలదొక్కుకుని క్రికెట్లో డాన్ బ్రాడ్‌మన్ స్థాయికి చేరుకున్నారు. ముంబై నుంచి మొదలైన సచిన్ ప్రస్థానం ఖండాలను దాటుతూ ఆయా దేశాల ప్రధానులు, రాజులు, అధ్యక్షులు మెచ్చుకునే వరకూ వెళ్లింది. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 25 సంవత్సరాల్లో సచిన్ అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి ఎదిగిపోయారు మాస్టర్ బ్లాస్టర్. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 100 సెంచరీలతో 34,357 పరుగులు సాధించారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ రిటైర్ అయ్యారు. విరాట్ కోహ్లి రూపంలో భారత్‌కు ఆయనలాంటి మరో చక్కని బ్యాట్స్‌మన్ దొరికారు. అయితే, సచిన్ ఘన చరిత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. వన్డేల్లో సచిన్ రికార్డును అధిగమించే దిశగా ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సాగుతున్న విషయం తెలిసిందే. 45 ఏళ్ల సచిన్‌కు చెందిన 5 రికార్డులు భవిష్యత్ బ్యాట్స్‌మన్స్‌కు అందనీ ద్రాక్షలే కావొచ్చు. రికార్డులు... 200 టెస్టు మ్యాచ్‌లు : సచిన్ తన క్రికెట్ కెరీర్లో 200 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్‌లు 168 టెస్టులు ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం అల్‌స్టెర్ కుక్ (154 టెస్టులు), జేమ్స్ అండర్సన్ (136 టెస్టులు)లు ఇంకా టెస్టు క్రికెట్లో కొనసాగుతున్నారు. అయితే, వీరు ఇరువురూ 30 ఏళ్లకు మించి వయసు పైబడిన వారే. 200 టెస్టులు ఆడి సచిన్ రికార్డును వీరు బ్రేక్ చేస్తారా? అన్నది అనుమానమే. టెస్టు మ్యాచ్‌లలో 15,921 పరుగులు : టెస్టు క్రికెట్లో ఇన్ని పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు సచిన్ మాత్రమే. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అల్‌స్టెర్ కుక్ మాత్రమే 12,028 పరుగులతో సచిన్‌కు చేరువలో ఉన్నాడు. మిగతా బ్యాట్స్మన్లకు ఆ రికార్డు స్వప్నమే. 100 అంతర్జాతీయ సెంచరీలు : 2012లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. ఆ రికార్డు నెలకొల్పిన ఆరేళ్ల తర్వాత విరాట్ కొహ్లీ 56 సెంచరీలు, హషీమ్ ఆమ్లా 54 సెంచరీలతో దీనిపై కన్నేశారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా నిలకడగా ఆడుతూ వస్తున్న భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ఈ రికార్డును కచ్చితంగా అధిగమిస్తారని నిపుణులు అంటున్నారు. అయితే, మరో 44 సెంచరీలను చేస్తే తప్ప కొహ్లీ ఈ ఫీట్‌ను సాధించలేరు. 18,426 వన్డే పరుగులు : సచిన్ నెలకొల్పిన ఈ రికార్డు కచ్చితంగా ఈతరం ఆటగాళ్లు బ్రేక్ చేస్తారని భావిస్తున్నారు. ఈ రికార్డుకు టాప్ కంటెడర్స్‌గా ఉన్న ప్రస్తుత ఆటగాళ్లు ఎంఎస్ ధోని (9,967 పరుగులు), కోహ్లి (9,588 పరుగులు), క్రిస్ గేల్ (9,585 పరుగులు), ఏబీ డివిలియర్స్ (9,577 పరుగులు). శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 14, 234 పరుగులతో సచిన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. 96 అర్థ సెంచరీలు : తన వన్డే కెరీలో 463 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 96 అర్థసెంచరీలు చేశారు. ఇది ఒక రికార్డు. సాధారణంగా అర్థ సెంచరీల రికార్డుపై ఎక్కువ దృష్టి ఉండదు. అయితే, ప్రస్తుత భారత కెప్టెన్ కోహ్లి ఇప్పటికే 46 అర్థ సెంచరీలను సాధించారు. మరో 50 అర్థ సెంచరీలు చేస్తే గానీ ఈ రికార్డును అధిగమించలేరు. -
సంచలనాల సిరీస్.. రికార్డులు
జొహన్నెస్‌బర్గ్ : ఎన్నో వివాదాలు.. మరెన్నో రికార్డులతో ప్రపంచ క్రికెట్ అభిమానులు దృష్టి సారించిన సిరీస్ దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్. ఈ సిరీస్‌ను 3-1తో ప్రొటీస్ జట్టు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. సిరీస్ ప్రారంభం ముందు నుంచే మాటల యుద్దం నడిచిన ఈ సిరీస్‌లో ఎన్నో కొత్త రికార్డులు, మరెన్నో చెత్త రికార్డులు నమోదయ్యాయి. చివరి టెస్టులో 492 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సఫారీ జట్టు.. 1970లో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక పరుగుల పరంగా 1934 తరువాత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద విజయం. మొత్తంగా చూస్తే పరుగుల పరంగా నాలుగో అతి పెద్ద విజయం. 1928లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటివరకు ఇదే అతి పెద్ద విజయం. కాగా 1934లో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. 1911లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాపై 530 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మధ్య కాలంలో 2004లో ఆసీస్ 491 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై సాధించిన విజయం టెస్ట్ చరిత్రలో పరుగుల పరంగా ఐదో అతిపెద్ద విజయం. వ్యక్తిగత ప్రదర్శనలోనూ ఆటగాళ్లు కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. ప్రొటీస్ బౌలర్ ఫిలాండర్ ఆస్ట్రేలియాపై ఒక ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులిచ్చి ఆరుకు పైగా వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ (15/8) ఇప్పటివరకు అత్యుత్తమం. ఈ సిరీస్‌లో మిచెల్ మార్ష్ వికెట్ తీయడంతో ఫిలాండర్ రెండు వందల వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ ఘనత సాధించిన ఏడో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. పాస్టెస్ట్గా రెండొందల వికెట్లు సాధించిన దక్షిణాఫ్రికా నాలుగో బౌలర్‌గానూ నిలిచాడు. ప్రొటీస్ జట్టు ఓపెనర్ మర్క్రామ్ పది టెస్టుల్లోనే వెయ్యి పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ప్రొటీస్ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 12 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ఇక ఆసీస్ అత్యంత చెత్త ప్రదర్శన చేసిన సిరీస్‌గా ఇది నిలిచిపోతుంది. ఆతిథ్య ఆటగాళ్లు అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేయగా ఆసీస్ మాత్రం చతికిలపడింది. ఈ సిరీస్‌లో ప్రొటీస్ జట్టు ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించగా, ఆసీస్ తరుపున ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయకపోవడం గమనార్హం. -
ఈరోజు మ్యాచ్ కచ్చితంగా చూడాల్సిందే.. ఎందుకంటే?
న్యూల్యాండ్స్‌లో జరిగే వన్డే కోసం ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికా ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. వరుసగా మూడో వన్డేలో గెలిచి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. కనీసం ఈవన్డేలోనైనా గెలిచి సిరీస్ రేస్‌లో ఉండాలని సఫారీలు భావిస్తున్నారు. ఇక ఈ వన్డేపై అందరిలోను ఆసక్తి నెలకొంది. మూడో వన్డేకు పలు అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి. అందుకే మ్యాచ్ చూడాలని క్రికెట్ అభిమానులు ఫిక్సైపోయారు.. మ్యాచ్ చూడటానికి పది కారణాలు 1. న్యూల్యాండ్స్‌లో దక్షిణాఫ్రికా విజయ శాతం 84.85. ఇప్పటి వరకూ టెస్టు హోదా ఉన్న ఏ దేశానికి స్వదేశంలో ఇంత చర్రిత లేదు. 2. డుప్లెసిస్(185) ఇదే గ్రౌండ్లో శ్రీలంకపై గత ఏడాది వ్యక్తిగత అత్యధిక పరుగులు చేశాడు. 3. జింబాంబ్వేకు చెందిన ఒలంగా 2000లో ఇదే మైదానంలో ఇంగ్లండ్‌పై ఆరు వికెట్లు తీశాడు. అది అతని కేరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు 4. శిఖర్ ధావన్ మరో అర్ధసెంచరీ చేస్తే వన్డేల్లో 25 హాఫ్ సెంచరీలు పూర్తవుతాయి. 5. డికాక్ మరొక్క పరుగు చేస్తే దక్షిణాఫ్రికా తరపున అత్యధిక పరుగులు చేసిన 12వ ఆటగాడు అవుతాడు. 6. ఈ వన్డేలో 6 క్యాచ్‌లు పడితే ధోని వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కే అవకాశం ఉంది. 7. ధోని పదివేల పరుగులకు 98 పరుగుల దూరంలో ఉన్నాడు. ఒకవేల సెంచరీ చేస్తే 10వేల పరుగులు చేసిన నాలుగవ భారత ఆటగాడు అవుతాడు. సచిన్(18,426), గంగూలీ(11,363), రాహుల్ ద్రవిడ్ (10,899) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. 8. భువనేశ్వర్ 91 పరుగులు చేస్తే వన్డేల్లో 1000 పరుగుల మార్క్ చేరుకుంటాడు. 9. ఇమ్రాన్ తాహిర్ మరో నాలుగు వికెట్లు తీస్తే స్వదేశంలో జరిగిన వన్డేల్లో 50 వికెట్లు తీసిన తొలి దక్షిణాఫ్రికా స్పిన్నర్ అవుతాడు. 10. విరాట్ కోహ్లీ ఇప్పటికి 54 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశాడు. మరొక్క సెంచరీ ఇక్కడ చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన 5వ క్రికెటర్ అవుతాడు. -
‘బ్యాటింగ్ రికార్డులన్నీ తిరగరాస్తాడు’
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రాబోయే కాలంలో అన్ని బ్యాటింగ్ రికార్డులను తిరగరాస్తాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డారు.‘ ప్రస్తుత తరంలో కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ఇలాగే ఫిట్నెస్ కాపాడకుంటూ.. ఆటను ఆస్వాదిస్తూ.. నైపుణ్య స్థాయిని పెంచుకుంటే ఇది సాధ్యమవుతుందని’ కోహ్లికి సలహా ఇచ్చాడు. గతేడాది ఆయన పాక్ కోచ్ పదవికి రాజీమానా చేసిన విషయం తెలిసిందే. తాను క్రికెట్ ఆడిన రోజుల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడుతూ.. అప్పటికీ ఇప్పటికీ ఆటలో చాలా మార్పులొచ్చాయన్నారు. ప్రస్తుతం తరంలో విరాట్ కోహ్లీకి అత్యధిక రేటింగ్ ఇచ్చారు. సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారాల్లో సచిన్ అత్యుత్తమమని తెలిపాడు. ‘నేను సచిన్‌తో ఎక్కువ క్రికెట్ ఆడాను. అతడు మా జట్టుపైనే అరంగేట్రం చేశాడు. చాలా ఏళ్లుగా ఆయన ప్రొఫెషనల్‌గా ఎదగడం చూశాను. ఆయనలా నిబద్ధతతో ఉన్న ఆటగాడిని ఇప్పటి వరకు చూడలేదు. నేను బౌలింగ్ వేసిన వారిలో సచిన్ అత్యుత్తమం. అతడికి బౌలింగ్ వేయడం ఓ సవాల్‌గా ఉండేది. లారా మాత్రం సహజ సిద్ధ క్రికెటర్. తనదైన రోజున చెలరేగేవాడు’ అని యూనిస్ చెప్పుకొచ్చాడు. తాను కోచ్‌గా ఉన్నప్పుడు క్రమశిక్షణకు పెద్దపీట వేశానని ఎంత ప్రతిభ ఉన్నా సరే క్రమశిక్షణ లేకపోతే వృథా అని పేర్కొన్నాడు. -
కెన్నెడీ హత్య ఎలా జరిగింది?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రోతోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలను అంతమొందించేందుకు సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) పన్నిన కుట్రకు సంబంధించినవి సహా మొత్తం 3వేల రహస్య పత్రాలను అమెరికా శుక్రవారం బహిర్గతం చేసింది. ఈ పత్రాల్లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కెన్నెడీ హత్య తర్వాత హంతకుడిని పట్టుకునేందుకు విచారణ సంస్థలు ఆధారాల కోసం వెతికిన తీరు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై వస్తున్న పుకార్లను తాజా వివరాలు వెల్లడించాయి. కెన్నెడీని ఓస్వాల్డ్ అనే అమెరికా నౌకాదళ సభ్యుడు హతమార్చాడని అప్పటి ఏజెన్సీలు పేర్కొన్నప్పటికీ దీని వెనక భారీ కుట్ర దాగి ఉందని ఇప్పటికీ అమెరికన్లు భావిస్తున్నారు. 2018, ఏప్రిల్ 26 లోపల కెన్నెడీ హత్యలోని మరిన్ని ఆసక్తికర అంశాలను విడుదల చేయనున్నట్లు వైట్ హౌజ్ పేర్కొంది. క్యాస్ట్రోను హతమార్చేందుకు సీఐఏ పాత్ర గురించి తాజా పత్రాల్లో వెల్లడైంది. క్యూబాను హస్తగతం చేసుకోవటం కోసం చేసిన కుట్రకోణాలు వెల్లడయ్యాయి. కెన్నెడీ హత్యకు సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతోనే ఈ వివరాలు వెల్లడించినట్లు నేషనల్ ఆర్కైవ్స్ పేర్కొంది. క్యాస్ట్రోను చంపించేందుకు.. ‘ఫిడేల్ క్యాస్ట్రోను అంతమొందించాలని సీఐఏ ప్రయత్నించింది. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే’ అని తాజా నివేదికలు పేర్కొన్నాయి. ‘క్యాస్ట్రో’ పేరుతో ఉన్న 1975 నాటి ఓ డాక్యుమెంట్లో.. క్యూబా పీఠం నుంచి క్యాస్ట్రోను తప్పించేలా అమెరికా ప్రభుత్వం 1960ల్లో చేసిన ప్రయత్నాలున్నాయి. ఆపరేషన్ బౌంటీ పేరుతో గ్యాంగ్స్టర్ల సాయంతో లేదా మిలటరీ ఆపరేషన్తోనైనా క్యూబాపై పట్టు సంపాదించాలని అమెరికా కుట్రపన్నినట్లు వెల్లడైంది. క్యాస్ట్రో ప్రభుత్వంలోని అధికారులు, ముఖ్యమైన నాయకులను హతమార్చేందుకు.. రెండు సెంట్ల (0.16 డాలర్లు) నుంచి మిలియన్ డాలర్ల వరకు ఒక్కొక్కరి కి ఒక్కో రేటును నిర్ణయించింది. ఈ వివరాలున్న కరప త్రాల్ని విమానం ద్వారా క్యూబా అంతటా వదిలిపెట్టాలని కూడా అమెరికా ప్రణాళికలు రూపొందించింది. తద్వారా క్యూబన్లే క్యాస్ట్రోను, అతని అనుచరులను చంపేందుకు ప్రోత్సహించాలని భావించింది. తమ పక్కలో బల్లెంలా ఉన్న క్యూబా అధ్యక్షుడి అడ్డు తప్పించేందుకు అమెరికా అత్యంత తక్కువ మొత్తాన్ని ఎరగా వేసింది. కెన్నెడీ హత్యకు ముందు.. క్యూబాలో కమ్యూనిజాన్ని అంతమొందించేందుకు ‘ఆపరేషన్ ముంగూస్’ ప్రణాళికలనూ 1962నాటి జాతీయ భద్రత మండలి దస్తావేజులు స్పష్టం చేశాయి. ‘సీఐఏ.. గ్యాంగ్‌స్టర్ సామ్ జియంకానా మధ్యవర్తిత్వంతో క్యాస్ట్రోను హతమార్చేందుకు ఓ షూటర్‌తో లక్షన్నర డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది’ అని అధ్యక్షుడు కెన్నెడీ సోదరుడు, అప్పటి అటార్నీ జనరల్ రాబర్ట్ కెన్నడీ ఎఫ్‌బీఐకి వెల్లడించినట్లు ఈ నివేదిక పేర్కొంది. కెన్నెడీ హత్య వెనక జాన్ ఎఫ్ కెన్నెడీ హంతకుడు లీ హార్వీ ఓస్వాల్డ్ నుంచి హత్యకు కొద్దిరోజుల ముందు ఎఫ్‌బీఐకి బెదిరింపు సందేశం వచ్చినట్లు ఈ రికార్డుల ద్వారా వెల్లడైంది. ఓస్వాల్డ్కు విదేశీ (రష్యా, క్యూబా) ఇంటెలిజెన్స్ సంస్థలతో సంబంధాలున్నాయని ఎఫ్‌బీఐ పేర్కొన్నట్లుగా రిపోర్టుల్లో ఉంది. 1963 మార్చి నుంచి డిసెంబర్ వరకు సంపాదించిన జాబితా ప్రకారం ప్యుర్టోరికన్లు, గ్యాంగ్స్టర్లు, మానసిక ఆరోగ్యం సరిగా లేనివాళ్లు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని ఎఫ్‌బీఐ భావించింది. కెన్నెడీ హత్యకు పదిరోజుల ముందు రాబర్ట్ సీ రాల్స్ అనే వ్యక్తి 100డాలర్ల బెట్టింగ్ పెట్టారని ఆయన్ను సీక్రెట్ సర్వీస్ విచారించిందని వెల్లడైంది. బార్లో ఓ వ్యక్తి కెన్నెడీ హత్య గురించి మాట్లాడుతుండగా విన్నానని.. అయితే చీకట్లో, మద్యం మత్తులో అతని ముఖం చూడలేదని రాల్స్ వెల్లడించారు. కెన్నెడీ హత్యకు కొద్ది ముందు.. జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు కొద్ది సేపటిముందు ‘కేంబ్రిడ్జ్ న్యూస్’ అనే బ్రిటీష్ పత్రికకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని.. అమెరికాకు సంబంధించి పెద్ద వార్త రాబోతోందనే సందేశాన్నిచ్చిందని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. 1969 నవంబర్ 26న ఎఫ్‌బీఐకి సీఐఏ రాసిన రాసిన లేఖలో ఈ వివరాలున్నాయి. ‘కేంబ్రిడ్జ్ న్యూస్ రిపోర్టర్ లండన్‌లోని అమెరికన్ ఎంబసీకి ఈ విషయాలని తెలపాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు’ అని నివేదిక పేర్కొంది. బ్రిటన్ ఎమ్ఐ5 ఇంటెలిజెన్స్ సర్వీస్ వివరాల ప్రకారం హత్యకు 25 నిమిషాల ముందు ఈ కాల్ వచ్చినట్లు తెలిసింది. కాల్ అందుకున్న రిపోర్టర్ మంచివాడని.. ఎలాంటి నేర చరిత్ర లేదని ఎమ్ఐ5 ధ్రువీకరించింది. ట్రంప్ ఆదేశాలతోనే.. 1963, నవంబర్ 22న డాలస్‌లో జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించిన 2,891 రికార్డులను విడుదల చేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో నేషనల్ ఆర్కైవ్స్ వీటిని బహిర్గతం చేసింది. అయితే భద్రత ఏజెన్సీల విన్నపం మేరకు పలు పత్రాలను విడుదల చేయకుండా ఉండేందుకు ట్రంప్ అంగీకరించారు. ‘రక్షణ, భద్రత, ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు, చట్ట బద్ధ సంస్థలకు నష్టం జరగకుండా కాపాడేందుకు, విదేశీ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని పలు వివరాలు వెల్లడి చేయకుండా తాత్కాలిక నిషేధం విధించాం’ అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో కీలకమైన కెన్నెడీ హత్య గురించి ప్రజలకు అన్ని వివరాలు తెలియాలనే ఉద్దేశంతోనే వీటిని బహిర్గత పరిచామని ఆయన తెలిపారు. ‘ఏజెన్సీలు పారదర్శకంగా పనిచేయాలని.. ఆలస్యం చేయకుండా ఈ నివేదికల్లో స్వల్పమైన మార్పులు మాత్రమే చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సరా శాండర్స్ తెలిపారు. -
హమ్మయ్యా.. ఇప్పటికి బయటపడ్డాం !
♦ వాయిదా పడ్డ కేంద్ర బృందం పర్యటన ♦ ఊపిరి పీల్చుకుంటున్న ‘ఉపాధి’ సిబ్బంది ♦ రికార్డుల్లో లొసుగులతో అంతర్గత మధనం ♦ అంతర్గత ఆడిట్లో సంతృప్తికర ఫలితాలు ♦ వచ్చాయంటున్న అధికారులు రికార్డుల పరిశీలనకు కేంద్ర బృందం రానున్నదనే సమాచారంతో ఉపాధి హామీ పథకం సిబ్బందిలో గుబులు మొదలైంది. హడావుడిగా గత కొన్ని రోజులుగా రాత్రనకా, పగలనక రికార్డులు సేకరించే పనిలో పడ్డారు. సంబంధిత జిరాక్సు కాపీలకే వేల రూపాయలు ఖర్చయ్యాయంటే ఏమేరకు సిద్ధపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కేంద్రం బృందం పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందన్న సమాచారంతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు... సాక్షి, మచిలీపట్నం : ఉపాధి హామీ పథకం సిబ్బందికి కాస్త ఉపశమనం కలిగినట్లయింది. ఇప్పటి వరకు పథకంలో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డుల పరిశీలనకు ఈనెలలో రాష్ట్ర, కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారులు హడావుడిగా రికార్డులు సిద్ధం చేసుకున్నారు. తమ తప్పులు ఎక్కడ బహిర్గమవుతాయోనని ఆందోళన చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జిల్లాకు రాష్ట్ర బృందం మాత్రమే తనిఖీలకు వచ్చినట్లు సమచారం. కేంద్ర బృందం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో జిల్లా ఉపాధి అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేంద్ర బృందం పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తే.. ఆ తనిఖీ ల్లో రికార్డుల నిర్వహణ, నిధుల వెచ్చింపుల్లో తేడాలు వస్తే శాఖపరమైన చర్యలకు బలవ్వాల్సిన పరిస్థితి వస్తుందని మదన పడ్డారు. అంతర్గత ఆడిట్లో సంతృప్తికర ఫలితాలు ! ఉపాధి పథకం నిధులతో జిల్లావ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీల్లో రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, ఎన్టీఆర్ గృహాలు తదితర వాటికి రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నాయి. గత ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా రూ.400 కోట్లతో వివిధ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేపట్టినట్లు సమాచారం. కాగా ఈ పనులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ గతంలో గందరగోళంగా ఉండేది. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనుందన్న ఆదేశాలతో అధికారులు రికార్డుల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. ఒక్కో మండలంలో రూ.50 వేలు జిరాక్స్ కాపీలకే వెచ్చించారంటే ఏ మేరకు క్రమబద్ధీకరించారో అర్థం అవుతోంది. గత నెలలోనే బృందం జిల్లాకు రావాల్సి ఉండగా.. వాయిదా పడుతూ వచ్చింది. ఈనెలలో కూడా బృందం వచ్చే సూచనలు కనిపించకపోవడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఐదేళ్లుగా ఉపాధి పథకం నిధుల వ్యయంపై అంతర్గత ఆడిట్ నిర్వహించారు. ఆ ఆడిట్లో ఎలాంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగం బహిర్గతం కాలేదని డ్వామా పీడీ రాజగోపాల్ తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదన్నారు. రికార్డుల నిర్వహణ సైతం పక్కాగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంతర్గత ఆడిట్లో సైతం ఎలాంటి తప్పులు బయటపడలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బాహుబలి 2.. ఆ రెండు దాటితే క్లీన్ స్వీప్
బాహుబలి 2 బాలీవుడ్ టాప్ స్టార్స్‌కు కూడా చెమటలు పట్టిస్తోంది. ఇప్పట్లో బ్రేక్ చేయడం సాధ్యం కాదనిపించే ఎన్నో రికార్డ్ లను బాహుబలి అవలీలాగా చెరిపేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి జోరు మామూలుగా లేదు. ఖాన్ త్రయం సెట్ చేసిన ఎన్నో రికార్డ్లను బాహుబలి ఇప్పటికే బద్ధలు కొట్టింది. అత్యధిక థియేటర్ల రిలీజ్, అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ లాంటి రికార్డ్‌లు బాహుబలి పేరు మీదకు మారిపోయాయి. అయితే ఓవర్ సీస్లో బాహుబలి ముందున్నవి కేవలం రెండు రికార్డ్‌లు మాత్రమే. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పీకే ఓవర్ సీస్లో 10.56 మిలియన్ డాలర్లు వసూళు చేయగా, దంగల్ సినిమా 12.36 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. అయితే పీకే రికార్డ్‌ను సోమవారం దాటేయనున్న బాహుబలి 2, దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి. అత్యంత సమీపంలో ఉన్న ఈ రెండు రికార్డ్లను చెరిపేసి బాహుబలి 2 ఓవర్ సీస్ రికార్డ్లను క్లీన్ స్వీప్ చేయటం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఫుల్ రన్లో బాహుబలి 2, 20 మిలియన్ల మార్క్‌ను సైతం అందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం హాలీవుడ్ సినిమా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ రిలీజ్ అవుతుండటంతో బాహుబలి 2 థియేటర్లకు కోత పడనుంది. కానీ తరువాత మరో నెలన్నర పాటు పెద్ద సినిమాలేవి లేక పోవటం బాహుబలి 2కి కలిసొచ్చే అంశం. మరి ముందు ముందు ఈ విజువల్ వండర్ ఓవర్ సీస్లో ఇంకెన్నీ రికార్డ్‌లు సెట్ చేస్తుందో చూడాలి. -
నిజనిర్ధారణ కమిటీ నియామకం
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ వర్సిటీలో కీలకమైన రికార్డులు మాయం చేసేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులపై విచారణకు వీసీ వై. నరసింహులు త్రిసభ్య కమిటీని నియమించారు. ఎస్కే యూనివర్సిటీ నుంచి డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆర్యూ నుంచి ఈసీ మెంబర్లు ప్రొఫెసర్ జి.టి.నాయుడు, ప్రొఫెసర్ కె.సంజీవరాయుడు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. వీరు విచారణ చేసి మూడు రోజుల్లో నివేదిక అందించనున్నారు. -
అసాధారణ రికార్డులు
చరిత్రలో ఎంతోమంది కొత్త రికార్డులు నెలకొల్పుతుంటారు. వాటిలో కొన్ని అసాధారణమైనవి, వ్యక్తిగతమైనవి ఉంటాయి. అంటే ఇతరులెవరికీ సాధ్యం కానివాటిని, ఒక వ్యక్తి మాత్రమే సొంతం చేసుకోవడం. అలా కొందరు వ్యక్తిగతంగా నెలకొల్పిన కొన్ని రికార్డుల గురించి తెలుసుకుందాం.. ఐ.క్యూ.లో టాప్.. తెలివితేటల్ని ఐ.క్యూ. (ఇంటలిజెంట్ కోషంట్)లో కొలుస్తారు. వివిధ ప్రమాణాల ఆధారంగా ఒక మనిషి ఐ.క్యూ.ని పరీక్షిస్తారు. ఇందులో సాధించే స్కోరును పరిగణనలోకి తీసుకుని వారి తెలివితేటల్ని లెక్కిస్తారు. ఇందులో వయసుని కూడా పరిగణనలోకి తీసుని, సైకాలజిస్టులు ఈ టెస్టును నిర్వహిస్తారు. ఐ.క్యూ.లో వంద స్కోరు సాధిస్తేనే తెలివైన వారని అర్థం. 130 స్కోర్ సాధిస్తే సూపర్ ఇంటలిజెంట్ అని అర్థం. అలాంటిది 160 స్కోరు సాధించడమంటే అరుదైన విషయం. కానీ బ్రిటన్‌కు చెందిన కాష్మీ వాహి అనే పదకొండేళ్ల బాలిక గతేడాది ఐ.క్యూ. టెస్టులో 162 పాయింట్లు సాధించి, ఆశ్చర్యపరిచింది. అత్యంత ఐ.క్యూ.స్కోరు సాధించిన బాలికగా నిలిచింది. 59 భాషల్లో ప్రావీణ్యం.. కనీసం ఆరు భాషలు మాట్లాడగలిగే వాళ్లను బహుభాషా ప్రావీణుడు అంటారు. మనలో చాలా మంది బహుభాషా కోవిదులు ఉండే ఉంటారు. కానీ 59 భాషలు మాట్లాడడం గురించి తెలుసా..? ఒక్క మనిషి అన్ని భాషలు మాట్లాడడం అసాధ్యమంటారేమో కానీ, ఓ వ్యక్తి మాత్రం నిజంగానే 59 భాషలు మాట్లాడగలడు. లెబనాన్‌కు చెందిన జియాద్ యూసుఫ్ ఫజా అనే వ్యక్తి ఈ అసాధారణ ప్రతిభ కలిగి ఉన్నాడు. ప్రస్తుతం బ్రెజిల్లో నివసిస్తున్న జియాద్ పలు టెలివిజన్ షోలలో వివిధ భాషలు మాట్లాడాడు. జియాద్కంటే ముందు ఎమిల్ క్రెబ్స్ అనే ఓ జర్మన్ ఏకంగా 65 భాషలు మాట్లాడగలిగే ప్రతిభ ఉన్నట్లు ఆధారాలున్నాయి. ఒంటరిగా సముద్రయానం.. చాలా మందికి సముద్రంపై ఒంటరిగా ప్రయాణం చేయడమంటే ఇష్టం. ఇలా కొందరు ఒంటరిగా, పడవలపై అనేక దేశాలు తిరిగొస్తుంటారు. అయితే ఒంటరిగా అన్ని దేశాలు చుట్టిరావడమంటే అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ అమెరికాకు చెందిన జోష్వా స్లోకామ్ అనే నావికుడు మాత్రం ఒంటరిగా, పడవపై తిరుగుతూ మొత్తం సముద్రయానాన్ని పూర్తి చేశాడు. 1895 ఏప్రిల్ 24న ప్రారంభమైన జోష్వా నౌకాయనం 1898 జూన్ 27న ముగిసింది. మొత్తం చిన్న పడవపైనే సముద్రంలో దాదాపు 75 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. 51 ఏళ్ల వయసులో జోష్వా ఒంటరిగా తన యాత్ర పూర్తి చేసుకున్నాడు. ఏడు ఖండాల్లో పర్వతారోహణ.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడం చాలా కష్టతరమైన పని. పర్వతారోహకుల్లో కొద్దిమంది మాత్రమే ఈ ఘనత సాధిస్తుంటారు. అలాంటిది సెవెన్ సమ్మిట్స్‌ని అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. మొత్తం ఏడు ఖండాల్లోంచి, ప్రతి ఖండంలోని అత్యంత ఎత్తైన పర్వతం చొప్పున ఏడు పర్వతాలను కలిపి సెవెన్ సమ్మిట్స్ అంటారు. అవి.1. మౌంట్ ఎవరెస్టు 2. అకోంక్వాగ్వా 3. డెనాలి 4. కిలిమంజారో 5. ఎల్బ్రస్ 6. విన్సన్ 7. కార్స్టెన్జ్. ఈ సెవెన్ సమ్మిట్స్‌ని అధిరోహించాడో బాలుడు. అమెరికాకు చెందిన జోర్డాన్ రోమెరో అనే బాలుడు ఏడు ఖండాల్లోని పర్వతాలను అధిరోహించి, అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన బాలుడుగా గుర్తింపు పొందాడు. పదిహేనేళ్ల వయసులోనే, 2011లో ఈ ఘనత సాధించాడు. పదమూడేళ్ల వయసులోనే ఎవరెస్టును అధిరోహించి గిన్నిస్ రికార్డు కూడా జోర్డాన్ సొంతం చేసుకున్నాడు. అన్ని దేశాలు సందర్శించిన ఏకైక మహిళ.. అపర కుబేరులు సైతం సాధించలేకపోయిన అరుదైన రికార్డు ఇది. అదే ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడం. విదేశాలు చుట్టొచ్చే అలవాటు చాలా మందికి ఉన్నా, ప్రతి దేశాన్నీ సందర్శించడం అందరికీ సాధ్యం కాదు. అయితే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ యువతి. అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన 27 ఏళ్ల క్యాసీ డె పెకోల్ అనే యువతి ఏకంగా ప్రపంచంలోని 196 దేశాలను సందర్శించి, అరుదైన రికార్డు నెలకొల్పింది. అన్ని దేశాలను సందర్శించడమే కాకుండా, అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన మహిళగా కూడా గుర్తింపు పొందింది. 2015 జూలైలో ప్రారంభమైన ఆమె ప్రపంచ యాత్ర, ఈ ఏడాది ఫిబ్రవరి 2న ముగిసింది. మొత్తం 18 నెలల 26 రోజుల్లోనే ఈ యాత్ర పూర్తి చేసుకోవడం విశేషం. చివరగా క్యాసీ యెమెన్‌ను సందర్శించింది. ఈమె పర్యటనకు పలు సంస్థలు ఆర్థిక సాయం అందించాయి. ఈ పర్యటనలో ఆమె 255 విమానాల్లో ప్రయాణించింది. దాదాపు 50 దేశాల్లో మొక్కలు నాటింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్
ఏలూరు (మెట్రో) : రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే అవసరమైన ధ్రువీకరణ పత్రా లు అందించే నూతన విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునీత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం మధ్యాహ్నం జిల్లా జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మా ట్లాడారు. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు రెవెన్యూ సమాచారాన్ని ఆన్లైన్లో పొందు పరచామని, ప్రజలు ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా క్షణాల్లో పొందే వెసులుబాటు కల్పించామని, ఈ మేరకు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేశామని, ఈ నేపథ్యంలో రైతులకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో పొందే అవకాశాన్ని కల్పించామన్నారు. డీఆర్వో హైమావతి, సూపరింటెండెంట్లు దొర, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
కలెక్షన్లు కొల్లగొట్టిన ఖైదీ నం.150
చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ కొవ్వూరు రూరల్ (కొవ్వూరు) : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నం.150 సినిమా కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తోందని ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు. సినిమా విజయవంతమైన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని స్వగ్రామం చాగల్లు వచ్చిన ఆయన కొవ్వూరులో చిరంజీవి అభిమానులు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, అమెరికా వంటి ప్రాంతాల్లోని తెలుగువారు చిరుపై తమ అభిమానాన్ని వెల్లువలా చూపిస్తున్నారని అన్నారు. సినిమా విజయవంతం తనకు, తన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నిజమైన సంక్రాంతి పండుగ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. భోగి ముందు రోజు, భోగి రోజు సినిమా థియేటర్లలో కలెక్షన్లు తగ్గుతాయని, అయితే తమ సినిమా భోగి ముందు రోజు తెలంగాణాలో 2.50 కోట్లు షేర్ వసూలు చేసిందన్నారు. అలాగే రూ.4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించిందన్నారు. ముఖ్యంగా సినిమా మహిళలను బాగా అకట్టుకుందన్నారు. ప్రేక్షకుల అభిమానం ఉన్నంత వరకూ మరిన్ని మంచి సినిమాలకు దర్శకత్వం చేస్తానని, 150వ చిత్రం దర్శకత్వం అవకాశాన్ని తనకిచ్చిన మెగాస్టార్ చిరంజీవి, చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌కు తన కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి సిటీ వైడ్, కొవ్వూరు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు కొత్తపేట రాజా, గంటా చిరంజీవి పాల్గొన్నారు. -
బలమైన పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి
గంపలగూడెం : ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఏర్పరచి, మెరుగైన సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు డీఐజీ పీవీఎస్ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా ప్రమాదాలు, అరాచకాలు, నేరాలు నియంత్రించవచ్చని, ఆ కోణంలో ప్రయత్నాలు చేపడుతుతున్నామన్నారు. ఇందులో భాగంగానే గ్రామస్థాయి నుంచి వివిధ అంశాల్లో (నేరాలు, అక్రమాలు, ప్రమాదాలు) సమాచారం ఇచ్చేందుకు , స్వచ్ఛందంగా పోలీసులతో కలిసి విధుల్లో పనిచేసేందుకు ఉత్సాహం ఉన్నవారిని ఎంపిక చేసిన శిక్షణ ఇస్తామని చెప్పారు. టెక్నాలజీ వినియోగం అనేక సమస్యల పరిష్కారం, విచారణకు ఉపయోగపడుతుందని వివరించారు. ఓవర్ లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించామన్నారు. పెద్దనోట్ల రద్దు కారణంగా నోట్ల మార్పిడిలో చోటుచేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో పోలీసులైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. అనంతరం రామకృష్ణ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నూజివీడు డీఎస్పీ వి. శ్రీనివాసరావు, తిరువూరు సీఐ కిషోర్‌బాబు, ఎస్సై శివరామకృష్ణ పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించకపోతే చర్యలు
నూనెపల్లె: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా ఽఎస్పీ రవికృష్ణ అన్నారు. నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. త్వరలో ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సీఐలు శ్రీనివాసరెడ్డి, ప్రతాప్ రెడ్డి ఉన్నారు. -
రికార్డుల్లో నమోదు చేయాలి
భువనగిరి అర్బన్ : గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని డీపీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. గురువారం భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడాలని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించాలన్నారు. గ్రామాల్లో పట్టపగలు కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయని, ఆన్ ఆఫ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. నీటి సమస్య పరిష్కరించాలని, నూరు శాతం పన్ను వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీవరకు అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించాలన్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో రికార్డులను తప్పనిసరిగా సరి చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ ఎ. రవికుమార్, ఎండీపీఓ గోపాలకి షన్‌రావు, భగవన్‌రెడ్డి, రాఘవేంద్రరావు, పంచాయతీ కార్యదర్శులు నర్సింహ, శ్రీనివాస్, దినాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
ఎఫ్‌ఎంబీల డిజటలైజేషన్‌పై సంతృప్తి
కర్నూలు(అగ్రికల్చర్): భూముల పీల్డ్ మెజర్‌మెంటు బుక్(ఎఫ్ఎంబీ)ల డిజిటలైజేషన్ ప్రక్రియపై ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వైస్ చైర్మన్ కే.వెంకటరయణ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు. కలెక్టరేట్ భూమి రికార్డులు, సర్వే విభాగంలో జరుగుతున్న ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. పలువురు డిజిటలైజర్లతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమ వేగవంతానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. అన ంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా, అనంతపురం జిల్లా ముందంజలో ఉన్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఆలస్యంగా మొదలైనా సంతప్తికరంగా ఉందన్నారు. జిల్లాలో 4.80 లక్షల ఎప్‌ఎంబీలుండగా ఇప్పటి వరకు 62 వేల వరకు డిజిటలైజ్ చేసినట్లు వివరించారు. 2017 మార్చి చివరినాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్‌తో మ్యుటేషన్ చేయడం సులభమవుతుందని, దేశంలో ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో భూములను సబ్ డివిజన్ చేయవచ్చన్నారు. సర్వే డీడీ ఝాన్సీరాణి మాట్లాడుతూ 137 మంది డిజటలైజర్లతో కార్యక్రమాన్ని చేపడుతున్నారని, 30 మంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్వే ఏడీ చిన్నయ్య, ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రికార్డుల పరిశీలన వేగవంతం
మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఏర్పా టు నేపథ్యంలో డివిజన్ పరిధిలోని పలు మండలాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లా యి. దీంతో ఆయా మండలాల రికార్డుల పరిశీలన మానుకోట ఆర్డీఓ కార్యాలయం లో ముమ్మరం చేశారు. ఇందుకు సిబ్బంది ని కూడా కేటాయించారు. మానుకోట డివి జన్‌లో మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలతోపాటు తొర్రూరు, నెక్కొండ మండలాలు ఉన్నాయి. మానుకోట జిల్లాలోకి కొత్తగూడ, గూడూరు, బయ్యారం, గార్ల మండలాలు చేరాయి. నర్సంపేట డివిజన్లోని గూడూరు మండలం, ఖమ్మం జిల్లా కొత్తగూడ డివిజన్లోని గార్ల, బయ్యారం మండలాలు రానున్నాయి. మానుకోట డివి జన్ పరిధిలోని నెక్కొండ మండల రికార్డులను నర్సంపేట డివిజన్‌కు అందజేసే పను లు వేగవంతం చేశారు. నర్సంపేట డివిజన్లోని గూడూరు, ములుగు డివిజన్లోని కొత్తగూడ మండలానికి సంబంధించిన భూములు, ఇతర వివరాలను మానుకోట జిల్లా పరిధిలోకి రానున్నాయి. గార్ల, బయ్యారానికి సంబంధించి రికార్డులను త్వరలోనే ఆర్డీఓ కార్యాలయానికి వస్తాయని అధికారులు తెలిపారు. -
రెవెన్యూ రికార్డులను భద్రపరచాలి
మఠంపల్లి : తెలంగాణ ప్రభుత్వం జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను పునర్విభజన చేపట్టినందున రెవెన్యూ రికార్డులను భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని వీఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని బక్కమంతులగూడెంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తున్నామని.. అదే సందర్భంలో ప్రభుత్వం వీఆర్వోలకు పాత సర్వీస్ నిబంధలు పరిగణనలోకి తీసు కోవాలన్నారు. అలాగే మీ సేవా కేంద్రాల్లో ఇస్తున్న పాస్ పుస్తకాలను అమల్లోకి తీసుకోవాలని కోరారు. రెవెన్యూ రికార్డులను భద్రపరచాలని రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోలకు సూచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అ«ధ్యక్ష, కార్యదర్శులు కొప్పోలు సుధాకర్‌రావు, ఠాకూర్‌సింగ్, మండల అధ్యక్షులు నారపు రాజు రామారావు, వీరారెడ్డి, వాసుదేవరావు తదితరులున్నారు. -
ఎల్ఎండీ క్యాంపు క్వార్టర్లలో రికార్డులు చోరీ
తిమ్మాపూర్ : ఎల్ఎండీ క్యాంపులోని రెండు క్వార్టర్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎల్ఎండీలోని క్వార్టర్లు బీ 173, 172లను గతంలో శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సబ్ డివిజన్ 1, 2లకు కేటాయించారు. తర్వాత సబ్ డివిజన్లను ధర్మారం, చందుర్తికి తరలించగా.. ఆ క్వార్టర్లలో రికార్డులను భద్రపరచి, స్టోర్ రూమ్‌గా ఉపయోగిస్తున్నారు. రికార్డుల పరిశీలనకు అప్పుడప్పుడు ధర్మారం సబ్ డివిజన్ నుంచి సీనియర్ అసిస్టెంట్, చందుర్తి సబ్ డివిజన్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వస్తూంటారు. మంగళవారం ధర్మారం సబ్ డివిజన్ రికార్డులున్న క్వార్టర్ బి–173 తాళం ధ్వంసం చేసి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చెక్క బీరువాలో రికార్డులను ఎత్తుకెళ్లారు. మూడు ఎంబీ రికార్డులు, ఇతర పత్రాలు, పరికరాలు కనిపించడం లేదని సీనియర్ అసిస్టెంట్ చెప్పారు. ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. -
వణుకు పుట్టిస్తున్న ‘వెబ్‌ల్యాండ్’
ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు తప్పుల తడకగా రెవెన్యూ వెబ్సైట్ జీవో నెంబరు 271ను రద్దు చేయాలని రైతుల డిమాండ్ కైకలూరు : వెబ్‌ల్యాండ్.. ఇప్పుడు ఆ పేరు చెబితేనే రైతులు వణుకుతున్నారు. గతంలో భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్ రైతుల వద్ద ఉండేవి. అవి వారికి భరోసా కల్పించేవి. ఆపద సమయంలో ఆదుకునేవి. ప్రస్తుతం వాటిని రద్దుచేస్తూ ప్రభుత్వం జీవోనంబర్ 271 విడుదల చేసింది. వెబ్‌ల్యాండ్ ఆధారంగా క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు, పంట రుణాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం భూముల ఆన్లైన్ పక్రియను తెరపైకి తెచ్చింది. ఈ విధానంలో రైతుల భూముల వివరాలను నమోదు చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ మాన్యువల్ రికార్డుల్లో ఒకరి పేరు ఉన్న ఆస్తులు ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరుతో నమోదయ్యాయి. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారసత్వంగా సంక్రమించిన భూములు వెబ్‌ల్యాండ్ ప్రభుత్వ ఖాతాలో కనిపించడం లేదు. పంట రుణాల కోసం బ్యాంకులకు వెళుతుంటే వారి భూమి వివరాలు వెబ్‌ల్యాండ్‌లో కనిపించకపోవడంతో తిరస్కరిస్తున్నారు. కొండూరు కొంప ముంచారు మండలంలోని ఒక్క కొండూరు గ్రామంలోనే190 మంది ఖాతాల్లో తప్పులను గుర్తించారు. గ్రామంలో 135 ఎకరాల భూమి 1బీలో నమోదైనప్పటికి యజమానుల పేర్లు తప్పులు వచ్చాయి. ఖాతాదారుల జాబితాలో రెం డు, అంతకన్నా ఎక్కువ పేర్లు నమోదైన వారు 139 మం ది ఉన్నారు. ఉదాహరణకు గ్రామానికి చెందిన బొర్రా వెంకటలక్ష్మీ పేరుతో 190/2 సర్వే నెంబరులో 4 ఎకరాల 15 సెంట్ల చేపల చెరువు ఉంది. పాస్ బుక్, టైటిల్డీడ్లో ఆమె పేరు ఉంది. తీరా వెబ్‌ల్యాండ్‌లో యజ మానిగా పేరిచర్ల సత్యనారాయణరాజు అని ఉంది. అదే విధంగా గ్రామంలో ఓ 20 కుటుంబాలు 70 ఏళ్ల క్రితం 119/1,2 సర్వే నెంబర్లలో పట్టా భూమిని కొనుగోలు చేసి జీవిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో రుద్రరాజు బాలకుమారి అని ఉంది. ఆమె ఎవరో గ్రామస్తులు చెప్పలేకపోతున్నారు. -
వైద్యులు సమయపాలన పాటించాలి
ఇంద్రవెల్లి : వైద్యులు సమయ పాలన పాటించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉట్నూర్ ఆర్డివో ఐలయ్య అన్నారు.బుదవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు.రోజు వారి వోపీ రికార్డులను పరిశీలించారు.గ్రామలలోని ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బందికి అడిగి తెలుకున్నారు.ఆస్పత్రిలో ఒక్కరే వైద్యురాలు ఉన్నారని, ఇంకోక్కరు వైద్యులు అవసరమని ఆర్డివో దష్టికి తీసుకేల్లారు.వెంటనే జిల్లా వైద్యాధికారి జలపతినాయక్‌కు పోన్లో సంప్రదించి ఇంద్రవెల్లి ఆస్పత్రిలో వైద్యులను నియమించాలని కోరారు.ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న రోగులతో మాట్లాడారు.వైద్యులు విధి నిర్వహనలో సమయపాలన పాటించి,రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.ఈ సందర్బంగా ఎంపీడీవో బానోత్ దత్తారం,ఈజీఎస్ ఏపీవో శ్రీనివాస్,సీహెచ్‌వో రాథోడ్ బాబులాల్,పీహెచ్ఎన్ రాములమ్మ,వైద్య సిబ్బంది తదితరులున్నారు. -
రికార్డులు సృష్టించిన అమెరికా మార్కెట్లు
అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లలో ఏ చిన్న కదలిక కనిపించినా చాలు ప్రపంచమార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అలాంటి స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో సంచనాలు సృష్టించాయి. మొదటిసారి 1999 నాటి గరిష్ట స్థానానికి ఎగిసి రికార్డుల వర్షం కురిపించాయి. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్త, మాకీస్, కోహ్ల్స్ డిపార్ట్మెంట్ స్టోర్లు బలమైన రాబడులు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపర్చాయి. దీంతో అమెరికా మూడు మేజర్ స్టాక్ సూచీలు డౌజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 రికార్డు స్థాయిలో క్లోజ్ అయినట్టు బైస్పోక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు వెల్లడించింది. ఆయిల్ ధరలను స్థిరంగా కొనసాగించడానికి తగిన చర్యలు తీసుకుంటామని సౌదీ ఆయిల్ మంత్రి కామెంట్ల అనంతరం క్రూడ్ ఆయిల్ 5 శాతం మేర జంప్ అయింది. తదుపరి కొన్ని నెలలో క్రూడ్ ఆయిల్ మార్కెట్లు మళ్లీ సమతుల్య స్థానానికి వస్తాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనావేసింది. దీంతో ఎస్ అండ్ పీ ఎనర్జీ ఇండెక్స్ 1.3 శాతం మేర ర్యాలీ కొనసాగించింది. 10 మేజర్ సెక్టార్లలో ఇదే టాప్‌లో నిలిచింది. డిపార్ట్మెంట్ స్టోర్ ఆపరేటర్ మాకీస్ కనీసం ఎనిమిదేళ్ల అనంతరం అంచనావేసిన దానికంటే తక్కువగానే రాబడులు పడిపోయినప్పటికీ, స్టోర్ అమ్మకాలు ఎగిసినట్టు తన త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. దీంతో మాకీస్ షేర్లు 17.09 శాతం దూసుకెళ్లాయి. అదేవిధంగా కోహ్ల్స్ కూడా మార్కెట్ విశ్లేషకలు అంచనాలను అధిగమించి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. దీంతో ఆ స్టోర్ షేర్లు కూడా 16.17 శాతం ఎగిశాయి. ఈ బలమైన ఆదాయాల సంకేతాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుందని వెల్లడవుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్ అండ్ పీ ఇండెక్స్ జూన్ చివరి నుంచి 7.0 శాతం పెరిగింది. అంచనావేసిన దానికంటే అధికంగానే త్రైమాసిక ఫలితాలు, తక్కువ వడ్డీరేట్లు అమెరికా మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ కొంత మంది ఇన్వెస్టర్లు ఎక్కువ వాల్యుయేషన్‌పై భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం ఎస్ అండ్ పీ 500 ముందటి రికార్డులను కొల్లగొట్టింది. అంచనావేసిన దానికంటే 17 టైమ్స్ ఎగిసింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ సగటున 100 పాయింట్లకు పైగా పెరిగి 18,613.52 వద్ద, ఎస్ అంట్ పీ 500 ఇండెక్స్ 0.47 శాతం పెరిగి 2,185.79 దగ్గర, నాస్ డాక్ కంపొజిట్ 0.46 ఎగిసి 5,228.40వద్ద క్లోజ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు రికార్డులు సృష్టించడంతో, ఆసియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ స్టాక్ సూచీలు కూడా శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాలతోనే ఎంట్రీ కానున్నట్టు మార్కెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
‘సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్’లో అవినీతి
ఏడాదిలోనే ఏసీబీకి చిక్కిన ఇద్దరు డీఐలు ఖమ్మం జెడ్పీసెంటర్ : విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి ప్రభుత్వం ఠంచన్‌గా వేతనాలిస్తున్నా.. కొందరు ఉద్యోగులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు.. చేయి తడిపితేనే పనులు మొదలు పెడుతున్నారు.. ఈ తతంగం సర్వే అండ్ ల్యాండ్ రికార్డు విభాగంలో ఇటీవల పెరిగిపోయింది. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన భూ వివాదం పరిష్కరించాల్సిన అధికారులు పారదర్శకంగా సర్వే చేసి.. మ్యాప్‌ల ఆధారంగా నిజమైన వ్యక్తులకు న్యాయం చేయాలి. కానీ.. సర్వే అండ్ ల్యాండ్ రికార్డు అధికారులు పైసలిస్తే.. ప్రభుత్వ భూమినైనా సర్టిఫై చేస్తారనే ఆరోపణలొస్తున్నాయి. ఆక్రమణకు గురైన భూములను గుర్తించడం.. భూముల హద్దులు ఏర్పాటు చేయడం.. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు భూముల హద్దులను ఏర్పాటు చేయడం కోసం సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖలో పని చేస్తున్న సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లకు ప్రతి నెల వేలలో జీతాలు ఇస్తుంది. కానీ.. ప్రభుత్వం ఇచ్చే వేతనాలు సరిపోవంటూ.. నిబం«దనలను తుంగలో తొక్కి.. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ ఏసీబీకి పట్టుపడుతుండటం గమనార్హం. ఏడాదిలోనే ఇద్దరు డీఐలు.. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి ఏడాదిలోనే అవినీతి మరకలు అంటుకున్నాయి. 2015 ఆగస్టులో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న శ్రీనివాసచారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడాడ్డు. మళ్లీ ఏడాదిలోనే ఆయన స్థానంలో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సర్వేయర్ మురళి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గత ఏడాది బాలాజీనాయక్ అనే వ్యక్తి తన భూమికి హద్దులు చూపాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారిని కోరాడు. ఎన్నెస్పీ స్థలంలో భూమి ఉందని, తర్వాత లేదని సర్టిఫై చేయడానికి శ్రీనివాసాచారి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. చారి స్థానంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ మురళి.. గురువారం బోనకల్ మండలం రాయన్నపేటకు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కానూరి గోపికృష్ణ భూమిని సర్వే చేయడానికి రూ.10వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు గోపికృష్ణ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటున్న మురళిని రెడ్‌హ్యాండెడ్‌గా పటుకున్నారు. సమీక్షించిన నాలుగు రోజుల్లోనే.. భూముల సర్వే విషయంలో పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఇన్చార్జి కలెక్టర్ డి.దివ్య గత మంగళవారం సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ సర్వేయర్లకు పలు సూచనలు చేశారు. సర్వే చేసేప్పుడు పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని చెప్పినా.. వారం తిరగకముందే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మీసేవ ద్వారా భూమికి సంబంధించిన అనుభవదారులు సర్వే చేయించాలని దరఖాస్తు చేసుకుంటేనే సర్వే చేయాలని ఆదేశించారు. కాగా, జిల్లావ్యాప్తంగా అనేక దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా వాటిని సర్వే చేసేందుకు సర్వేయర్లు కుంటిసాకులు చెబుతున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్ పర్యవేక్షణలో మండల సర్వేయర్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ పర్యవేక్షణలో డిప్యూటీ ఇన్స్పెక్టర్లు పని చేస్తుంటారు. కానీ.. మండల, డివిజన్ రెవెన్యూ అధికారులు పాలనాపరమైన ఒత్తిడిలో ఉండడంతో కిందిస్థాయి అధికారులపై పర్యవేక్షణ కొరవడింది. భూముల ధరలకు రెక్కలు కొత్త జిల్లాల ఏర్పాటు.. నూతన మండలాల ప్రతిపాదన అంశం తెరపైకి రావడంతో ప్రధాన నగరాలతోపాటు పలు ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో భూ వివాదాలు అధికమయ్యాయి. దీనికి తోడు కొత్త జిల్లాల ప్రతిపాదనలు రావడంతోపాటు ఇటీవల సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గ్రామాల్లో భూ వివాదాలు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా భావించిన రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు అధికారులు అక్రమ వసూళ్లకు తెరలేపారనే ఆరోపణలు వస్తున్నాయి. -
వివరాలు కంప్యూటర్లో నమోదు చేయాలి
జిల్లాపరిషత్ : జిల్లా పరిషత్‌లోని అన్ని సెక్షన్లకు సంబంధించిన రికార్డులు, వివరాలను కంప్యూటరీకరించాలని జెడ్పీ సీఈవో మోహన్‌లాల్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్లో జెడ్పీ సిబ్బందితో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో ఆడిట్ అభ్యంతరాలను అడిగితెలుసుకున్నారు. ఆడిట్లో జరిగిన తప్పిదాలను సవరించుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఆడిట్ రికార్డులను త్వరగా పూర్తిచేసి సకాలంలో అందజేయాలన్నారు. ఆడిట్ పేరాలు ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయని వివరాలు అడిగితెలుసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను వెంటనే సమర్పించి క్లియర్ చేయాలని తెలిపారు. అలాగే అన్ని సెక్షన్లకు సంబంధించిన రికార్డులు, వివరాలను కంప్యూటర్లో నమోదు చేయాలని తెలిపారు. సమీక్షలో అసిస్టెంట్ ఆడిట్ అధికారి విజయలక్ష్మి, సూపరింటెండెంట్లు లక్ష్మీనారాయణ, భారతి, శ్రీనివాస్, రామ్మోహన్, జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కల నిర్వహణపై సూక్ష్మ ప్రణాళిక పంపాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశం ముకరంపుర : హరితహారంలో భాగంగా జిల్లాల్లో నాటిన మొక్కల నిర్వహణపై సూక్ష్మ ప్రణాళికను రూపొందించి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. హరితహారంపై మంగళవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మొక్కలకు నీరు పోయడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకోవాలని, అవసరమైతే అగ్నిమాపకశాఖ సేవలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు మొక్కల నిర్వహణపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతి మొక్కకూ జవాబు చెప్పాల్సి ఉంటుందన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో జియోటాగింగ్ చేయాలని తెలిపారు. మొక్కల నిర్వహణకు వివిధ సంస్థలు ఇస్తున్న విరాళాలపై ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర రోడ్లకిరువైపులా నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మొక్కలు నాటడంలో లక్ష్యాన్ని సాధించిన గ్రామాల వివరాలను పంపించాలని పేర్కొన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో విరివిగా మెుక్కలు నాటి త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో జియోటాగింగ్ సిస్టం ద్వారా మొక్కల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పండ్ల మెుక్కలకు ప్రజల నుంచి డిమాండ్ ఉందని, వాటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మొక్కలు బతికించుకోవడానికి ఆకస్మిక తనిఖీలు చేపడతామని తెలిపారు. సూక్ష్మప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. అవసరమైన చోట బోర్లను వేయించి మెుక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీటి నిర్వహణకు రూ.30లక్షలు గ్రామ పంచాయతీలకు ఇచ్చామని తెలిపారు. కరీంనగర్ నగర పాలకసంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్, అదనపు జేసీ డాక్టర్ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య తదితరులున్నారు. -
ఎలుక మరణం,రికార్డుల దహనం.. అసలు కథ ఏంటి!
► ‘రికార్డుల దహనం’పై విచారణకు ఆదేశం? మల్కాజిగిరి: ఎలుక చనిపోయిందని రికార్డులను తగులబెట్టిన ఘటనపై మల్కాజిగిరి సర్కిల్ ఇన్చార్జి ఉప కమిషనర్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. నల్లా కనెక్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలతో పాటు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన రికార్డులను మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలోని ఆవరణలో ఈనెల 16న కుప్పగా పోసి తగులబెట్టారు. ఎంతో ముఖ్యమైన ఈ రికార్డులను ఎలుక చనిపోయిందనే సాకుతో తగులబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’.. ‘ఎలుక చనిపోయిందని రికార్డులు తగులబెట్టారు’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన ఇన్చార్జి ఉప కమిషనర్ రమేష్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఇంజినీరింగ్ విభాగంలో భద్రంగా ఉండాల్సిన రికార్డులు ఎలా బయటకు వచ్చాయి? వీటిని తగులబెట్టేందుకు పారిశుద్ధకార్మికులను ఎవరు పిలిచారు అనే కోణాల్లో దర్యాప్తు చేయమని ఏఎంహెచ్‌ఓకు ఆదేశించినట్లు తెలిసింది. -
ఊర్లే లేవు.. రోడ్డేశారట..
► రోడ్లు వేయకుండానే వేసినట్లుగా రికార్డులు ► పనులు చేయకుండానే నిధులు స్వాహా ► పంచాయతీలో లేని గ్రామాల పేర్లతో పనులు ఉట్నూర్ : గ్రామ పంచాయతీలో లేని గ్రామాలను సృష్టించారు. ఆ రెండు గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్డు కూడా వేసేశారు. అలా కాంట్రాక్టర్ల ధనదాహానికి అధికారుల అవినీతి తోడైంది. ఫలితంగా రోడ్డు వేయకుండానే వేసినట్లు రికార్డుల్లో చూపిస్తూ నిధులు స్వాహా చేశారు. ప్రభుత్వం రూరల్ కనెక్టివిటి ప్రాజెక్ట్(గ్రామీణ అనుసంధాన రోడ్లు)-1 పథకంలో భాగంగా మొదటి విడతలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్ల పనులు చేపట్టింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 1,066 పనులకు గాను ప్రభుత్వం రూ.53 కోట్ల 90 లక్షల 8 వేలు కేటారుుంచింది. ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం ద్వారా జిల్లా వ్యాప్తంగా గ్రామాలను గుర్తించి పనులు చేపట్టారు. రోడ్డు నిర్మాణమే లేదు ఆర్సీపీ(రూరల్ కనెక్టివిటి ప్రాజెక్టు)-1 పనుల్లో భాగంగా ఉట్నూర్ మండలం దొంగచింత గ్రామం నుంచి సోనాపూర్ వరకు గ్రావెలింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.9.65 లక్షలు కేటారుుంచారు. దొంగచింత నుంచి సోనాపూర్‌కు రోడ్డు నిర్మించాల్సి ఉండగా.. దొంగచింత నుంచి కేవలం 60 నుంచి 70 మీటర్ల వరకు రెండు వైపులా మట్టి పోసి వదిలేశారు. అంతేగానీ సోనాపూర్ వరకు రోడ్డు నిర్మాణమే జరగలేదు. కాని అధికారులు మాత్రం రోడ్డు పూర్తి చేసినట్లు రికార్డుల్లో రాశారు. అదీగాక రోడ్డు నిర్మాణంలో భాగంగా కూలీల చెల్లింపులు రూ.25వేలుగా, మెటీరియల్‌కు రూ.9.23 లక్షలు ఖర్చయినట్లు లెక్కలేశారు. రూ.9.48 లక్షలతో పనులు పూర్తరుునట్లు రికార్డులు సృష్టించారు. కాని ఇంతవర కు సోనాపూర్‌కు రోడ్డు నిర్మాణమే జరగలేదు. ఎన్నో ఏళ్లుగా సోనపూర్ గ్రామస్తులు రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు వేయకుండానే నిధులు కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. పంచాయతీలో గ్రామాలు లేకున్నా.. ఉట్నూర్ గ్రామ పంచాయతీలో దాబా, పూనగూడ అనే గ్రామాలు లేవు. కాని అధికారులు ఆ గ్రామాలు ఉట్నూర్ గ్రామ పంచాయతీలో ఉన్నట్లు సృష్టించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు గ్రామాల మధ్య అనుసంధానంగా గ్రావెలింగ్ రోడ్డు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి లక్షలాది రూపాయలు కాజేశారు. దాబా, పునగూడ గ్రామాలకు గ్రావెలింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఆర్సీపీ మొదటి విడతలో భాగంగా రూ.17.50 లక్షలు కేటారుుంచారు. రూ.10.55 లక్షలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. లేని గ్రామాలకు ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు రోడ్డు ఎలా వేశారో వారికే తెలియూలి. 2010-11 సంవత్సరంలో ఆర్సీపీ మొదటి విడతలో మంజూరైన పనుల్లో భాగంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు వేయకుండానే నిధులు కాజేశారని పలు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నారుు. ఆర్సీపీ ద్వారా నిర్మించిన రోడ్డు పనులన్నింటిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తే వాస్తవాలు బయటపడుతాయని అంటున్నారుు. విచారణ చేపడుతాం 2010-11 సంవత్సరాల్లో నేను ఇక్కడ బాధ్యతలు నిర్వహించలేదు. ఆర్సీపీ మొదటి విడతలో గ్రామాల్లో వేసిన రోడ్లన్నింటినీ పరిశీలిస్తాం. దొంగచింత నుంచి సోనాపూర్ వరకు వేసిన రోడ్డు నిర్మాణం, ఉట్నూర్ గ్రామ పంచాయతీలో దాబా, పూనగూడ అనే గ్రామాల మధ్య వేసిన రోడ్డు నిర్మాణంపై విచారణ నిర్వహిస్తాం. ఉట్నూర్ పంచాయతీలో దాబా, పూనగూడ గ్రామాలు ఉన్నాయా లేవా అనే అంశంపై విచారణ చేపడుతాం. - రమేశ్, ఈఈటీడబ్ల్యూ ఐటీడీఏ -
చైనా నృత్యానికి గిన్నిస్ రికార్డు!
బీజింగ్ః వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలోనూ, అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించడంలోనూ చైనా వాసులు ముందుంటారు. ప్రపంచ రికార్డులను సృష్టించడంలోనూ వారికి వారే సాటి. అదే నేపథ్యంలో ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ తమవైపు తిప్పుకున్నారు. కొన్ని వేలమంది ఒకే వేదికపై చేరి, నృత్య ప్రదర్శన చేసి ఏకంగా గిన్నిస్ రికార్డును సాధించారు. చైనా వాసుల దృష్టి ఈసారి నృత్యం వైపు మళ్ళింది. బీజింగ్, షాంఘైతోపాటు మరో నాలుగు నగరాలను ఎంచుకొని, ఒకేవేదికపైకి చేరడమే కాదు.... ఏకంగా 31,697 మంది ఒకేసారి నృత్య కార్యక్రమంలో పాల్గొని దాదాపు ఐదు నిమిషాల పాటు అడుగులు కలిపి అందర్నీ ముగ్ధుల్ని చేయడంతోపాటు ప్రపంచ రికార్డును సైతం సాధించారు. నగరంలోని ప్రముఖ బర్డ్స్ నెస్ట్ స్టేడియం ముందు చేరి పెద్దా చిన్నా వయోబేధం లేకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమంలో సమయానికి వర్షం నేనున్నానంటూ వచ్చి చేరింది. దీంతో నృత్యకారులంతా రెయిన్ కోట్లు ధరించి మరీ డ్యాన్స్ చేయడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరే ఉండి పర్యవేక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు ధృవీకరణ పత్రాన్ని అందించారు. సాధారణంగా మధ్యవయసు, వయసు మళ్ళిన మహిళలు పార్కులు, ప్లాజాల వంటి పబ్లిక్ ప్లేసుల్లో నృత్యం చేస్తుండటం చైనాలో చూస్తాం. అయితే ఆరోగ్యానికి సహకరించేదిగా భావించి పబ్లిక్ ప్లేసుల్లో చేసే డ్యాన్స్... దానితో పాటు పెట్టే భారీగ మ్యూజిక్ సౌండ్ ఒక్కోసారి చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇప్పుడు వేలమంది స్థానికులు కలసి ఒకేచోట చేపట్టిన నృత్య కార్యక్రమం మాత్రం అందర్నీ ఆకట్టుకోవడమే కాక రికార్డును కూడ తెచ్చి పెట్టింది.