టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు.
హిట్‌మ్యాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా 181 పరుగులకే ( 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరిమితమై 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ట్రవిస్ హెడ్ (76) ఆసీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ (3/37), కుల్దీప్ యాదవ్ (2/24) ఆసీస్ విజయాన్ని అడ్డుకున్నారు. బుమ్రా, అక్షర్ తలో వికెట్ తీశారు. సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగి టీమిండియాను గెలిపించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ సాధించిన రికార్డులు..
అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) ఒకే ప్రత్యర్థిపై (ఆస్ట్రేలియాపై) అత్యధిక సిక్సర్లు (132 సిక్సర్లు) కొట్టిన బ్యాటర్‌గా రికార్డు
బాబర్ ఆజమ్‌ను (4145) అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు (4165)
టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్ (92) సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు
పొట్టి ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత కెప్టెన్‌గా రికార్డు
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు (529)
అంతర్జాతీయ క్రికెట్‌లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డు
టీ20 వరల్డ్‌కప్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (8) బాదిన భారత బ్యాటర్‌గా రికార్డు
ప్రస్తుత ప్రపంచకప్ (2024)లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి (19 బంతుల్లో) రికార్డు
Comments
Please login to add a commentAdd a comment