12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలోకి అరంగేట్రం చేయడం ద్వారా బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ చరిత్రపుటల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ముంబైతో ఇవాళ (జనవరి 5) మొదలైన మ్యాచ్‌లో బీహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ క్లాస్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్నవయస్కుడైన భారతీయుడి రికార్డు అలీముద్దీన్ పేరిట ఉంది. అలీముద్దీన్ 1942-43 రంజీ సీజన్‌లో రాజ్‌పుటానా తరఫున 12 ఏళ్ల 73 రోజుల వయసులో తొలిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.
అలీముద్దీన్ తర్వాత అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రికార్డు ఎస్‌కే బోస్, మొహమ్మద్ రంజాన్ పేరిట ఉంది. బోస్.. 1959-60 రంజీ సీజన్‌లో 12 ఏళ్ల 76 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. రంజాన్.. 1937 సీజన్‌లో 12 ఏళ్ల 247 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి డెబ్యూ చేశాడు. ఈ ముగ్గురు వైభవ్ కంటే చిన్నవయసులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు.
వైభవ్.. రంజీ అరంగేట్రానికి ముందు 2023 ఎడిషన్ కూచ్ బెహార్ ట్రోఫీలో బీహార్ తరఫున ఓ మ్యాచ్ ఆడాడు. జార్ఖండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వైభవ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 151, 76 పరుగులు చేశాడు. వైభవ్‌కు లోకల్ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్‌గా పేరుంది. ముంబైతో ఇవాళ మొదలైన రంజీ మ్యాచ్‌లో వైభవ్ ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో బుపేన్ లాల్వాని (65), సువేద్ పార్కర్ (50), తనుశ్ కోటియన్ (50) అర్దసెంచరీలతో రాణించారు. బీహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్ 4, సకీబుల్ గనీ, హిమాన్షు సింగ్ తలో 2 వికెట్లు, అషుతోష్ అమన్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment