2007లో అరంగేట్రం చేసిన పొట్టి ప్రపంచకప్ ఎనిమిది సీజన్ల పాటు విజయవంతంగా సాగి తొమ్మిదో సీజన్‌వైపు అడుగులు వేస్తుంది. భారతకాలమానం ప్రకారం రేపటి నుంచి పొట్టి ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికలు ఈ మెగా టోర్నీ జరుగనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏ-కెనడా జట్లు తలపడనున్నాయి.
తొమ్మిదో ఎడిషన్ వరల్డ్‌కప్ ప్రారంభ నేపథ్యంలో ఈ టోర్నీ విశేషాలు, రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే టీ20 ప్రపంచకప్ ఇప్పటివరకు ఎనిమిది సీజన్ల పాటు సాగింది. టోర్నీ అరంగేట్రం సీజన్‌లో (2007) టీమిండియా విజేతగా నిలువగా.. పాకిస్తాన్ (2009), ఇంగ్లండ్ (2010), వెస్టిండీస్ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్ (2016), ఆస్ట్రేలియా (2021), ఇంగ్లండ్ (2022) ఆతర్వాత ఎడిషన్లలో విజేతలుగా అవతరించాయి.
రెండేళ్లకు ఓసారి జరిగే ఈ టోర్నీకి కోవిడ్, ఇతరత్రా కారణాల వల్ల మధ్యలో ఐదేళ్లు (2016-2021) బ్రేక్ పడింది. టీ20 ప్రపంచకప్‌లో ఈ సీజన్ నుంచే రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు అత్యధికంగా రెండు సార్లు టైటిల్‌ను అందుకున్నాయి. డారెన్ సామీ వెస్టిండీస్‌కు విజయవంతంగా రెండు సార్లు టైటిల్‌ను అందించాడు.
టోర్నీలో అత్యధిక పరుగుల రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (1141) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల రికార్డు షకీబ్ అల్ హసన్ (47) ఖాతాలో ఉంది. కెనడా, ఉగాండ, యూఎస్‌ఏ జట్లు తొలిసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.
టోర్నీ బ్యాటింగ్ రికార్డులు..
అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి (1141)
అత్యధిక స్కోర్- బ్రెండన్ మెక్‌కల్లమ్ (123)
అత్యధిక సగటు- విరాట్ కోహ్లి (81.50)
అత్యధిక స్ట్రయిక్‌రేట్- సూర్యకుమార్ యాదవ్ (181.29)
అత్యధిక సెంచరీలు- క్రిస్ గేల్ (2)
అత్యధిక హాఫ్ సెంచరీలు- విరాట్ కోహ్లి (14)
అత్యధిక సిక్సర్లు- గేల్ (63)
ఓ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు- విరాట్ (319)
టోర్నీ బౌలింగ్ రికార్డులు..
అత్యధిక వికెట్లు-షకీబ్ (47)
అత్యధిక బౌలింగ్ సగటు- హసరంగ (11.45)
అత్యధిక స్ట్రయిక్‌రేట్- హసరంగ (11.8)
అత్యుత్తమ గణాంకాలు- అజంత మెండిస్ (6/8)
సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు- హసరంగ (16)
జట్ల రికార్డులు..
అత్యధిక టీమ్ టోటల్-శ్రీలంక (260/6)
అత్యల్ప టోటల్- నెదర్లాండ్స్ (39)
భారీ విజయం- శ్రీలంక (కెన్యాపై 172 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment