t20 world cup
-
ముంబై టీ20లో అభిషేక్ శర్మ సెంచరీ
-
సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌కు అభిమానిగా ఉండటం చాలా కష్టం..!
టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా గ్రాము అదృష్టం కూడా లేని క్రికెట్ జట్టు ఏదైనా ఉందా అంటే అది దక్షిణాఫ్రికా (South Africa) జట్టే అని చెప్పాలి. ఇటీవలికాలంలో ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే ఇది వందకు వంద శాతం నిజం అనిపిస్తుంది. జెండర్‌తో, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆ జట్టు ఇటీవలికాలంలో వరుసగా మెగా టోర్నీల ఫైనల్స్‌లో ఓడుతుంది. రెండేళ్ల వ్యవధిలో సౌతాఫ్రికా పురుషుల, మహిళల జట్లు నాలుగు టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఓడాయి. 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ఫైనల్స్‌లో తొలిసారి ఓడిన సౌతాఫ్రికా... ఆ మరుసటి ఏడాది పురుషులు, మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్ ఓటమి చవిచూసింది. తాజాగా ఆ దేశ మహిళల అండర్-19 జట్టు.. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ (Team India) చేతిలో పరాజయంపాలైంది.టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్లపై సానుభూతి వెల్లువెత్తుతుంది. నెటిజన్లు సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లపై తెగ జాలి చూపుతున్నారు. ఏ జట్టుకైనా అభిమానిగా ఉండవచ్చు కానీ.. వరుస ఫైనల్స్‌లో ఓడుతున్న సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లకు అభిమానిగా ఉండటం మాత్రం చాలా కష్టమని అంటున్నారు. సౌతాఫ్రికా క్రికెట్ జట్లకు గతంలో సెమీఫైనల్ ఫోబియా ఉండేది. ప్రస్తుతం అది పోయి ఫైనల్ ఫోబియా పట్టుకున్నట్లుంది. సౌతాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు త్వరలో మరో మెగా ఈవెంట్ ఫైనల్స్‌లో (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్‌లో) ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈసారైనా సౌతాఫ్రికా ఫైనల్ ఫోబియాను అధిగమించి టైటిల్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.కాగా, 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. ఆ మరుసటి ఏడాది జరిగిన పురుషుల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. అదే ఏడాది జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పొట్రిస్ జట్టు.. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన 2025 అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో యంగ్ ఇండియా చేతిలో చావుదెబ్బతింది.ఇదిలా ఉంటే, మలేసియాలో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్లో యంగ్ ఇండియా సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీ ఇనాగురల్ ఎడిషన్‌లోనూ (2023) భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) 3, పరునిక సిసోడియా, ఆయూశి శుక్లా, వైష్ణవి శర్మ తలో 2, షబ్నమ్ షకీల్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మికీ వాన్ వూర్స్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జెమ్మా బోథా (16), కరాబో మెసో (10), ఫే కౌలింగ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు.83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 11.2 ఓవర్లలో (వికెట్ కోల్పోయి) ఆడుతూపాడుతూ విజయం సాధించింది. బంతితో మెరిసిన త్రిష బ్యాటింగ్‌లోనూ చెలరేగి 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 22 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసింది. ఈ టోర్నీ మొత్తంలో భారత్ అజేయంగా నిలిచింది. టోర్నీ ఆధ్యాంతం బ్యాట్‌తో, బంతితో రాణించిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
ఒకటే లక్ష్యం... రెండో ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్ సై
కౌలాలంపూర్: రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మొట్టమొదటి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు జగజ్జేతగా అవతరించింది. రెండేళ్ల తర్వాత అదే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేందుకు ఈసారి దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా ఫైనల్ సంగ్రామానికి సిద్ధమైంది. అజేయంగా తుది పోరుకు అర్హత సాధించిన నికీ ప్రసాద్ నాయకత్వంలోని భారత అమ్మాయిల జట్టు విజయవంతంగా ‘రెండో ప్రపంచకప్ మిషన్’ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. భారత్ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్‌కప్ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో జోరు మీదున్న రెండు అజేయ జట్ల మధ్య నేడు జరిగే అండర్–19 ప్రపంచకప్ టైటిల్ పోరుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారీ భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందా! లేదంటే కొత్త చాంపియన్ ఆవిర్భవిస్తుందా! మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ వనరులతో పూర్తిస్థాయి ఆల్‌రౌండ్ సామర్థ్యంతో ఉన్న టీనేజ్ టీమిండియాను ఎదుర్కోవడమే ఎవరికైనా అతిపెద్ద సవాల్. ఇక అలాంటి అబేధ్యమైన జట్టును ఓడించాలంటే మాత్రం దక్షిణాఫ్రికా మైదానంలో పెద్ద ‘ప్రపంచ’ యుద్ధమే చేయాలనడంలో అతిశయోక్తే లేదు! ఆ ఇద్దరిని కట్టడి చేస్తే... తెలంగాణ స్టార్ బ్యాటర్ గొంగడి త్రిష! మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో తనను విస్మరించిన ఫ్రాంచైజీల కళ్లకు కట్టుకున్న గంతల్ని తన అసాధారణ బ్యాటింగ్‌తో విప్పేసింది. ఇప్పుడు ‘ఫైనల్ మిషన్’ ముంగిట అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ఈ టోర్నీలో ఓపెనర్ త్రిష ఫామ్, క్రీజులో ఆమె కనబరుస్తున్న పోరాటపటిమ ప్రత్యర్థి బౌలర్లకు కఠిన సవాళ్లు విసురుతున్నాయి. మరో ఓపెనర్ కమలిని, సనిక చాల్కెలతో కూడిన భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. దక్షిణాఫ్రికా విజయంపై ఆశలు పెంచుకోవాలంటే మాత్రం ముఖ్యంగా త్రిష, కమలినిలను తక్కువ స్కోరుకు పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో త్రిష 265 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా... కమలిని 135 పరుగులతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్ నుంచి అత్యధిక పరుగులు సనిక చాల్కె (6 మ్యాచ్‌ల్లో 69) చేసింది.భారత బౌలింగ్ విభాగానికొస్తే ఆయుశి శుక్లా, పారుణిక సిసోడియా, వైష్ణవి శర్మలతో కూడిన స్పిన్ త్రయం విశేషంగా రాణిస్తోంది. సహజంగానే సఫారీలకు స్పిన్ అంటేనే కష్టం. అలాంటి జట్టుపై ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు స్పిన్నర్లు తప్పకుండా ప్రభావం చూపిస్తారు. అలాగని ఫైనల్‌కు చేరిన సఫారీ జట్టును తక్కువ అంచనా వేయలేం.కేలా రెనెకి కెప్టెన్సీ లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్లో గట్టి ప్రత్యర్థి ఆ్రస్టేలియాను బౌలింగ్‌తో కట్టడి చేసి... బ్యాటింగ్‌తో చుట్టేసింది. జెమ్మా బోతా, లౌరెన్స్, కరబొ మెసోలతో కూడిన బ్యాటింగ్ లైనప్, ఆష్లే వాన్విక్, ఎన్‌తబిసెంగ్ నిని, శేషిని నాయుడులతో కూడిన బౌలింగ్ దళం కూడా మెరుగ్గా ఉంది.పిచ్, వాతావరణం భారత్‌కు బాగా అలవాటైన పిచ్. అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. సాధారణ వాతావరణమే. వాన ముప్పు దాదాపుగా లేదు. -
T20 World Cup 2025: సూపర్ సిక్స్‌లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన శ్రీలంక
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ 2025 (ICC Under 19 Women's T20 World Cup 2025) చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka) ఆస్ట్రేలియాకు (Australia) షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో ఓటమి ఎరుగని ఆసీస్‌కు శ్రీలంక ఓటమి రుచి చూపించింది. మలేసియాలోకి బంగి వేదికగా ఇవాళ (జనవరి 29) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆసీస్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు శ్రీలంక సైతం ఈ టోర్నీలో అద్భుతంగా రాణించినప్పటికీ.. ఆ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ దశలో శ్రీలంక.. మలేసియా, వెస్టిండీస్ జట్లపై విజయాలు సాధించినప్పటికీ భారత్ చేతిలో ఘోరంగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆతర్వాత సూపర్-6లో తప్పక గెలుస్తుందనుకున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఈ మ్యాచ్ రద్దు కావడం శ్రీలంక సెమీస్ ఆశలను గల్లంతు చేసింది. తాజాగా శ్రీలంక ఆసీస్‌పై గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. శ్రీలంక ఉన్న గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఫైనల్ ఫోర్కు చేరాయి. జనవరి 31న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ ఢీకొట్టనుండగా.. అదే రోజు జరిగే రెండ సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ భారతకాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ ఎడిషన్‌లో (2023) టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో శ్రీలంక ఆసీస్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సంజన కవిండి (19), సుముదు నిసంసల (18), కెప్టెన్ మనుడి ననయక్కార (15), హిరుని హన్సిక (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో లిల్లీ బాస్సింగ్వైత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. హస్రత్ గిల్, టెగాన్ విలియమ్సన్‌లు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి చెరి రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. లంక బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో ఒక్కో పరుగు చేసేందుకు నానా ఇబ్బందులు పడింది. చమోది ప్రబోద, ప్రముది మెత్సర, అసేని తలగుణే తలో రెండు వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. లిమాంస తిలకరత్న ఓ వికెట్ పడగొట్టింది. లంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కూడా 8 వికెట్ల నష్టానికి 87 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బే (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెక్కియోన్ (10), కెప్టెన్ హ్యామిల్టన్ (10), వికెట్ కీపర్ గ్రేస్ లయన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. -
నాన్న కల నెరవేర్చింది
‘కలలు కనడం కష్టం కాదు. కాణీ ఖర్చు కాదు’ లాంటి వెటకారాల మాట ఎలా ఉన్నా.... ఆ కలలే భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.వందమందిలో ఒకరిగా ప్రత్యేకతతో వెలిగిపోయేలా చేస్తాయి. ‘నా కూతురు ఆడితే పరుగులు వెల్లువెత్తాల్సిందే’ ‘మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం... అంటూ నా కూతురు గురించి అందరూ ఘనంగా చెప్పుకోవాలి’... ఇలాంటి కలలు ఎన్నో కనేవాడు భద్రాచలానికి చెందిన రామిరెడ్డి.అయితే ఆయన కలలకు మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం తన కలల సాకారానికి ప్రయత్నించాడు. ఆ ఫలితమే స్టార్ క్రికెటర్... త్రిష గొంగడి(Trisha Gongadi). మలేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్ అండర్ 19, టీ 20 వరల్డ్ కప్(Women World Cup)లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి రామిరెడ్డి క్రికెట్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశించినా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల నెరవేరలేదు. దీంతో ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తూనే పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించేవాడు. ‘మా అమ్మాయిని బాగా చదివించాలి’... అనేది సగటు తండ్రి కోరిక.రామిరెడ్డి మాత్రం అలా కాదు... ‘మా అమ్మాయిని బాగా ఆడించాలి. క్రికెట్లో స్టార్‌ని చేయాలి’ అనుకునేవాడు. సినిమాలు, కామేడీ షోలు కాకుండా టీవీలో క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ ఎక్కువగా చూపించేవాడు. చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల బ్రెయిన్, మజిల్స్ ఆటకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతాయని ఫిటెనెస్ ట్రైనర్‌గా ఆయన బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చిన్నతనం నుంచే త్రిష క్రికెట్లో ప్రతిభ కనబరిచేది. దీంతో తన కల విషయంలో మరింత పట్దుదల పెరిగింది. కూతురిని ప్రోఫెషనల్ క్రికెటర్‌గా చూడాలనే లక్ష్యంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు రామిరెడ్డి. అప్పుడు త్రిష వయసు ఏడేళ్లు. సికింద్రాబాద్‌లోని ‘సెయింట్ జాన్ ్స క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకునేది.ఎంతో ఆశ... చివరికి నిరాశ!్రపోఫెషనల్ ట్రైనింగ్‌లో ఆరితేరిన త్రిష పన్నెండేళ్ల వయస్సులో హైదరాబాద్ అండర్ 19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్ 19 ఇండియా తరఫున సౌత్ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్ర పోషించింది. అయితే త్రిషకు ఈ టోర్నీలో ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. ఆ ఫలితం ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో స్పష్టంగా కనిపించింది. విమెన్ ఐపీఎల్ వేలంలో త్రిషాను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. అ గెలుపులో తాను ఒకరిగా ఉండటం కంటే ‘గెలుపుకు మూలం’ అనిపించేలా ప్రదర్శన చేయాలనే పట్టుదల త్రిషలో పెరిగింది.ఇక చూస్కోండివిమెన్ ఐపీఎల్లో ఎదురైన చేదు అనుభవం ‘పవర్ హిట్టింగ్’పై పట్టు సాధించేందుకు త్రిషకు తోడ్పడింది. గత డిసెంబరులో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో వరుసగా 58 నాటౌట్, 32, 52 పరుగులు సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసిన త్రిష 230 పరుగులు సాధించింది. ఇందులో స్కాట్లాండ్పై చేసిన 110 నాటౌట్ సెంచరీ కూడా ఉంది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ సెంచరీతో అండర్ 19 టోర్నీలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీసింది.అందనంత ఎత్తులో...టోర్నీలో మిగతా అమ్మాయిలకు అందనంత ఎత్తులో బ్యాటింగ్ యావరేజ్ 76.77తో త్రిష కొనసాగుతోంది. ఆమె తర్వాత రెండోస్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ డావినా పేరిన్ ఉంది. ఈ టోర్నీలో రెండుసార్లు త్రిష 40కి పైగా స్కోర్లు సాధించింది. అయితే అప్పటికే ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించే అవకాశం త్రిషకు దక్కలేదు. కానీ స్కాట్ల్యాండ్తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో త్రిష బ్యాట్ నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ (53 బంతుల్లో) జాలువారింది. బ్యాటింగ్ యావరేజ్‌తో పాటు మోస్ట్ రన్స్, హయ్యెస్ట్ స్కోర్ విభాగంలోనూ త్రిష టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ మహిళల అండర్ 19 జట్టు సెమీస్‌కు చేరుకుంది.ఏజెన్సీప్రాంతం నుంచి మొదలైన త్రిష విజయపరంపర అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవిమెన్ వరల్డ్ కప్‌లో ఇండియాకు ఆడాలి అండర్ 19, విమెన్ టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. విమెన్ అండర్ 19 టోర్నీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇండియా మహిళల జట్టుకు ఎంపిక కావాలి. రాబోయే వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో నా పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చాను. నా లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నాను. – గొంగడి త్రిష -
T20 World Cup: త్రిష ఆల్‌రౌండ్ షో.. భారత్ ఖాతాలో వరుసగా ఐదో గెలుపు
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో (ICC Under 19 Women's T20 World Cup 2025) భారత్ (India) వరుసగా ఐదో విజయం సాధించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్, తెలుగమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాట్‌తో విధ్వంసకర శతకం బాదిన త్రిష.. ఆతర్వాత బంతితోనూ చెలరేగి మూడు వికెట్లు పడగొట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న త్రిష.. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.అనంతరం 209 పరుగల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. భారత బౌలర్లు విజృంభించడంతో 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఆయూషి శుక్లా 4, వైష్ణవి శర్మ, గొంగడి త్రిష తలో మూడు వికెట్లు తీసి స్కాట్లాండ్ పతనాన్ని శాశించారు. ఆయూషి, వైష్ణవి శర్మ, త్రిష వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. ఆయూషి 3 ఓవర్లలో 8 పరుగులు.. వైష్ణవి శర్మ 2 ఓవర్లలో 5 పరుగులు.. త్రిష 2 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కరు కూడా 12 పరుగులకు మించి చేయలేదు. కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించింది. గ్రూప్ దశలో వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్లపై ఘన విజయాలు సాధించింది. ఈ మెగా టోర్నీలో భారత్‌తో తలపడిన ఒక్క ప్రత్యర్థి కూడా కనీసం మూడంకెల మార్కును చేరుకోలేకపోయింది. వెస్టిండీస్ 44, మలేసియా 31, శ్రీలంక 58, బంగ్లాదేశ్ 64, తాజాగా స్కాట్లాండ్ 58 పరుగులకు ఆలౌటైంది. -
చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. టీ20 వరల్డ్‌కప్‌లో తొలి శతకం
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో భారత ఓపెనర్ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసర శతకం బాదిన త్రిష.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రికార్డు నెలకొల్పింది. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. HISTORY BY TRISHA 🇮🇳- Trisha becomes the first Player to score a Hundred in Women's U-19 T20I World Cup History 🏆 pic.twitter.com/05mJwdtbMQ— Johns. (@CricCrazyJohns) January 28, 2025ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. సెమీస్‌లో భారత్గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు, సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్.. స్కాట్లాండ్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయాయి..!ఈ టోర్నీలో భారత్‌తో ఇప్పటివరకు తలపడిన ఒక్క జట్టు కూడా కనీసం మూడంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. వెస్టిండీస్ (44), మలేషియా (31), శ్రీలంక (58), బంగ్లాదేశ్ (64) జట్లు 70 పరుగుల లోపే తోకముడిచాయి. -
T20 World Cup 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-205లో భారత్ మరో విజయం సాధించింది. గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన టీమిండియా సూపర్-6లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (జనవరి 26) జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ సుమయ్యా అక్తెర్ 21 నాటౌట్, జన్నతుల్ మౌకా 14 పరుగులు చేశారు. భారత బౌలర్లందరూ చాలా పొదుపుగా బౌల్ చేశారు. వైష్ణవీ శర్మ 3, షబ్నమ్ షకీల్, విజే జోషిత్, గొంగడి త్రిష తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ గొంగడి త్రిష (31 బంతుల్లో 40; 8 సిక్సర్లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపుకు గట్టి పునాది వేసింది. జి కమలిని 3, సనికా ఛల్కే 11 (నాటౌట్), కెప్టెన్ నికీ ప్రసాద్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అనిస అక్తెర్ శోభా, హబిబా ఇస్లాం పింకీ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ సిక్స్‌లో భారత్ తదుపరి స్కాట్లాండ్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ జనవరి 28న జరుగనుంది. కాగా, సూపర్ సిక్స్‌లో భారత్ గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండిటిలోనూ విజయాలు సాధించింది. గ్రూప్-1లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, నైజీరియా, యూఎస్ఏ, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా టాపర్‌గా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, గ్రూప్-1లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ (శ్రీలంక, స్కాట్లాండ్) జరగాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది. -
అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియ జోరు
-
T20 World Cup 2025: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్‌లోకి ఎంట్రీ
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 23) జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేసింది. త్రిషతో పాటు భారత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నికీ ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), వీజే జోషిత (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జి కమలిని 5, సినిక ఛల్కే 0, భవిక అహిరే 7, ఆయుషి శుక్లా 5, పరునిక సిసోడియా ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. షబ్నమ్ షకీల్ (2), వైష్ణవి శర్మ (1) అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో ప్రముది మెత్సర, లిమాంస తిలకరత్న, అసెని తలగుణే తలో 2 వికెట్లు పడగొట్టగా... రష్మిక సేవండి, చమోది ప్రభోద, కెప్టెన్ మనుడి ననయక్కార తలో వికెట్ దక్కించుకున్నారు.119 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వైష్ణవి శర్మ (4-1-3-1), షబ్నమ్ షకీల్ (4-1-9-2), పరునిక సిసోడియా (4-0-7-2), విజే జోషిత (3-0-17-2), ఆయుషి శుక్లా (4-0-13-1) ధాటికి శ్రీలంక నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైష్ణవి శర్మ సంధించిన బంతులను ఎదుర్కోలేక లంక బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు. లంక ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (రష్మిక (15)) రెండంకెల స్కోర్ చేశారు. మిగతా 10 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ టోర్నీలో భారత్.. వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించి సూపర్-6లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగతా గ్రూప్‌ల విషయానికొస్తే.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, యూఎస్ఏ, ఐర్లాండ్.. గ్రూప్-సిలో సౌతాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్.. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్ రెండో విజయం సాధించింది. మలేసియాతో ఇవాళ (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియాను భారత బౌలర్లు 31 పరుగులకే (14.3 ఓవర్లలో) కుప్పకూల్చారు. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో (4-1-5-5) చెలరేగింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా (3.3-1-8-3) మూడు వికెట్లు తీసింది. వీజే జోషిత్ (2-1-5-1) ఓ వికెట్ పడగొట్టింది. HISTORY IN U-19 WORLD CUP 📢Vaishnavi Sharma becomes the first Indian bowler to take the Hat-trick in Women's U-19 WC history. pic.twitter.com/s9ziyvZjpm— Johns. (@CricCrazyJohns) January 21, 2025మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన 11 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధికం. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు 5 పరుగులు, ఇద్దరు 3 పరుగులు, ఒకరు 2, ఇద్దరు ఒక్క పరుగు చేశారు.అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 17 బంతుల్లోనే ఆట ముగించేసింది. ఓపెనర్లు గొంగడి త్రిష, జి కమలిని కళ్లు మూసి తెరిచే లోగా ఖేల్ ఖతం చేశారు. త్రిష పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి 12 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసింది. కమలిని 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో తిరుగులేని రన్‌రేట్‌తో (+9.148) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో భారత్ సహా శ్రీలంక (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో రెండో స్థానం), వెస్టిండీస్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో మూడో స్థానం), మలేసియా (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో నాలుగో స్థానం) జట్లు ఉన్నాయి.కాగా, భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు చెలరేగి వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలనే ఛేదించింది. గొంగడి త్రిష 4 పరుగులకే ఔటైనా.. కమలిని (16 నాటౌట్), సనికా ఛల్కే (18 నాటౌట్) భారత్‌ను గెలుపు తీరాలు దాటించారు. అంతకుముందు భారత బౌలర్లు పరుణిక సిసోడియా (2.2-0-7-3), ఆయూషి శుక్లా (4-1-6-2), వీజే జోషిత్ (2-0-5-2) విజృంభించడంతో వెస్టిండీస్ 44 పరుగులకే ఆలౌటైంది. -
10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం
అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికా జట్టు 10 అంటే 10 బంతుల్లోనే మ్యాచ్ ముగించేసింది. ఇన్నింగ్స్ బ్రేక్‌కు వెళ్లొచ్చేలోగా ఖేల్ ఖతమైంది. గ్రూప్ ‘సి’లో భాగంగా సమోవా జట్టుతో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సమోవా 9.1 ఓవర్లలో 16 పరుగులకే కుప్పకూలింది.సమోవా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. నాలుగు ఒకట్లు (1), రెండు మూడులు (3 పరుగులు) నమోదయ్యాయి. ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 6 పరుగులే సమోవా తరఫున అత్యధిక స్కోర్‌గా ఉంది. సమోవా బ్యాటర్లు చేసిన పరుగులకంటే సఫారీ బౌలర్లు తీసిన వికెట్లే అంకెల్లో టాప్‌గా ఉన్నాయి. ఎన్‌తబిసెంగ్ నిని 3, ఫే కొలింగ్, కేలా రేనెకె, శేషిని నాయుడు తలో 2 వికెట్లు తీశారు.అనంతరం దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఇద్దరే... పలువురు ప్రేక్షకులు బ్రేక్‌కు వెళ్లొచ్చే లోగా 10 బంతుల్లో 17 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. ఓపెనర్లు సిమోన్ లారెన్స్ (6 నాటౌట్), జెమ్మా బోతా (6 నాటౌట్) 1.4 ఓవర్లలోనే మ్యాచ్‌నే ముగించారు. పెను సంచలనంనిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. న్యూజిలాండ్‌పై నైజీరియా 2 పరుగుల తేడాతో గెలుపొందింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది. -
పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-2025లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. ఇవాళ (జనవరి 20) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో నైజీరియా న్యూజిలాండ్‌పై 2 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైజీరియా తరఫున కెప్టెన్ లక్కీ పెటీ (22 బంతుల్లో 18; ఫోర్, సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ లిల్లియన్ ఉడే (25 బంతుల్లో 19; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో నంబర్ బ్యాటర్ ఒమోసిగో ఎగువాకున్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించింది. నైజీరియా ఇన్నింగ్స్ మొత్తంలో 4 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి. న్యూజిలాండ్ తరఫున బౌలింగ్ చేసిన ఆరుగురిలో ఐదుగురు తలో వికెట్ తీశారు.అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పసికూన నైజీరియా విజయవంతంగా కాపాడుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయినా, ఆతర్వాత నిలదొక్కుకున్నట్లు కనిపించింది. ఆ జట్టుకు చెందిన ముగ్గరు మిడిలార్డర్ బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ముగ్గురు ఔట్ కావడంతో న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. నైజీరియా బౌలర్ లిల్లియన్ ఉడే అద్భుతంగా బౌల్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో నైజీరియా సంచలన విజయం నమోదు చేసింది. బ్యాట్‌తో రాణించిన నైజీరియా కెప్టెన్ బంతితోనూ పర్వాలేదనిపించింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆమెకే దక్కింది. ఈ గెలుపుతో నైజీరియా గ్రూప్-సి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ గ్రూప్‌లో నైజీరియాతో పాటు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, సమోవా జట్లు ఉన్నాయి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ నిన్ననే బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం భారత బ్యాటర్లు 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
టి20 ప్రపంచకప్‌లో నేడు (జనవరి 19) భారత్, వెస్టిండీస్ మ్యాచ్
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు తొలి రోజు వర్షం ఆటంకం కలిగించింది. శనివారం మొత్తం 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... అందులో మూడింట మాత్రమే ఫలితం వచ్చింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో స్కాట్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 15.1 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేమీ బ్రే 1 పరుగే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎలెనార్ లరోసా 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ఆ్రస్టేలియా 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి గెలిచింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. మొదట నేపాల్ 18.2 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లాదేశ్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.గ్రూప్ ‘సి’లో భాగంగా దక్షిణాఫ్రికా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా... మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులకు పరిమితమైంది.పాకిస్తాన్, అమెరికా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్... నైజీరియా, సమోవా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా... ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు.మన అమ్మాయిలకు తొలి పరీక్ష డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్–19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ తొలి పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలవగా... ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టులో గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లోనూ భాగస్వాములు కావడం భారత జట్టుకు కలిసిరానుంది. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు టి20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ అమ్మాయిలు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనుకుంటున్నారు. -
యువ సమరం... నేడే ఆరంభం
రెండేళ్ల క్రితం నిర్వహించిన ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన యువ భారత్... ట్రోఫీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. మహిళల క్రికెట్‌కు మరింత తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి నేటి నుంచి తెరలేవనుండగా... రేపు జరగనున్న తొలి పోరులో వెస్టిండీస్‌తో యువ భారత్ తలపడనుంది. షఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి సీనియర్ స్థాయిలో ఆడిన ప్లేయర్లతో బరిలోకి దిగి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్... ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంటే... తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తహతహలాడుతున్నాయి. 2023 వరల్డ్‌కప్ జట్టులోనూ ఆడిన తెలుగు ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నమ్‌లపై ఈసారీ భారీ అంచనాలు ఉన్నాయి. మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరిగే ఆరు మ్యాచ్‌ల్లో స్కాటాండ్తో ఆస్ట్రేలియా (ఉదయం గం. 8 నుంచి); ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ (ఉదయం గం. 8 నుంచి); సమోవాతో నైజీరియా (ఉదయం గం. 8 నుంచి); నేపాల్‌తో బంగ్లాదేశ్ (ఉదయం గం. 8 నుంచి); అమెరికాతో పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి); దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ (మధ్యాహ్నం గం. 12 నుంచి) తలపడతాయి. కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ రెండో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌కు శనివారం తెరలేవనుంది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి వరల్డ్‌కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ట్రోఫీ కైవసం చేసుకోగా... ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న యంగ్ ఇండియా టైటిల్ నిలబెట్టుకుంటుందా చూడాలి. ఫార్మాట్ ఎలా ఉందంటే... మొత్తం 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. వెస్టిండీస్, శ్రీలంక, ఆతిథ్య మలేసియాతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. ఒక్కో గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు (12) ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకుంటాయి. ఈ 12 జట్లను ‘సూపర్ సిక్స్’లో రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్–1లో ఆరు జట్లు... గ్రూప్–2లో మరో ఆరు జట్లు ఉంటాయి. ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్–1, గ్రూప్–2లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సీనియర్ జట్టులోకి దారి... సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్లేయర్లు ఈ టోర్నీలో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. గత ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలిచిన షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా... ఈసారి కూడా అదే ఆధిపత్యం కనబర్చాలని చూస్తోంది. 2023 అండర్–19 ప్రపంచకప్‌లో రాణించడం ద్వారా టిటాస్ సాధు, శ్వేత సెహ్రావత్... ఆ తర్వాతి కాలంలో భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే బాటలో పయనించి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది భారత్‌లో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని యంగ్ ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు. త్రిష రెండోసారి... గత ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. గత నెల మహిళల అండర్–19 ఆసియాకప్‌లో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన త్రిష... ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేసి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతోంది. శనివారం స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా... ఆదివారం జరగనున్న తమ తొలి పోరులో వెస్టిండీస్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. సమోవా, నైజీరియా, నేపాల్, మలేసియా జట్లు తొలిసారి ఐసీసీ టోర్నీలో ఆడనున్నాయి. ఈ టోర్నీలో ప్రధానంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి యంగ్ ఇండియాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఆసియాకప్ నెగ్గి మంచి జోరుమీదున్న అమ్మాయిలు కలసి కట్టుగా కదంతొక్కితే టైటిల్ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత మహిళల అండర్–19 టి20 క్రికెట్ జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సానిక చల్కె, త్రిష, కమలిని, భవిక అహిరె, ఐశ్వరి అవసారె, మిథిలా, జోషిత, సోనమ్, పరుణిక, కేసరి ధ్రుతి, ఆయుషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి. -
టి20 ప్రపంచకప్.. టీమిండియా ఘన విజయం
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వార్మప్ మ్యాచ్‌లో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన ఈ సన్నాహక పోరులో భారత్ ఏకంగా 119 పరుగుల భారీ తేడాతో స్కాట్లాండ్పై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కమలిని (23 బంతుల్లో 32) టాప్‌స్కోరర్ కాగా, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (26), కెప్టెన్ నికీ ప్రసాద్ (25) సనిక చల్కే (17) సహచరులకూ బ్యాటింగ్ ప్రాక్టీస్ అవకాశమిచ్చేందుకు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు.ప్రత్యర్థి బౌలర్లలో అమీ బల్డీ (2/13) కాస్త ప్రభావం చూపింది. 3 ఓవర్లు వేసిన ఆమె 13 పరుగులే ఇచి్చంది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ను భారత బౌలర్లు 18.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌట్ చేశారు. వైజాగ్‌కు చెందిన షబ్నమ్ షకీల్, వైష్ణవి శర్మ, సోనమ్ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు.సోమవారం జరిగిన మిగతా వార్మప్ మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా 140 పరుగుల తేడాతో ఆతిథ్య మలేసియాను ఓడించగా, వెస్టిండీస్ 9 పరుగుల తేడాతో నేపాల్‌పై గట్టెక్కింది. అమెరికా జట్టు 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌కు షాక్ ఇచి్చంది. బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందగా, ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో సమోవాపై ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్ 11 పరుగులతో నైజీరియాను ఓడించింది.ప్రధాన టోర్నీ ఈనెల 18 నుంచి జరుగుతుంది. అయితే భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం వెస్టిండీస్‌తో ఆడుతుంది. రెండేళ్ల క్రితం 2023లో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నిర్వహించిన మహిళల అండర్–19 మెగా ఈవెంట్లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది. -
భారత్‌లో మహిళల అంధుల టీ20 ప్రపంచకప్.. పాక్ మ్యాచ్‌లు నేపాల్‌లో!
మహిళల విభాగంలో తొలిసారిగా భారత్ అంధుల టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. భారత్‌లో ఆడేందుకు మహిళల పాకిస్తాన్ అంధుల జట్టుకు ఏమైనా వీసా సమస్యలు వస్తే... నేపాల్ లేదంటే శ్రీలంకలో వారి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) తమ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయించింది.ముల్తాన్‌లో సమావేశంముల్తాన్లో జరిగిన ఈ ఏజీఎంలో 11 సభ్య దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ బోర్డుల ప్రతినిధులు వర్చువల్ (ఆన్లైన్)గా పాల్గొన్నారు. పురుషుల విభాగంలో అంధుల టీ20 ప్రపంచకప్‌ను 2027లో నిర్వహించనున్నారు. ఇక వేదిక, తేదీలను వచ్చే ఏడాది జరిగే ఏజీఎమ్‌లో ఖరారు చేస్తారు. గతేడాదే ఆతిథ్య హక్కుల్ని భారత్‌కు కట్టబెట్టారని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ) అధ్యక్షుడు జీకే మహంతేశ్ తెలిపారు.ఖర్చులన్నీ భారత బోర్డు భరిస్తుందిఅయితే, తటస్థ వేదికపై పాక్ ఆడితే ఇందుకు సంబంధించిన ఖర్చులన్నీ భారత బోర్డు భరిస్తుందని ఆయన వెల్లడించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు సీఏబీఐ అనుబంధ సంఘం కాదు. ఇది పూర్తిగా ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) గొడుగుకింద పనిచేస్తుంది.ప్రపంచం చాంపియన్‌గా తొలిసారి పాక్ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై పురుషుల అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2024 టైటిల్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా డిఫెండింగ్ చాంపియన్ భారత్ పాక్ పర్యటనకు వెళ్లలేదు. పాకిస్తాన్‌కు ఇది సానుకూలాంశంగా మారింది. ఈ క్రమంలో ముల్తాన్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాక్ కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఇప్పటికి నాలుగు సార్లు ఈ టోర్నీని నిర్వహించగా మూడుసార్లు భారత్ ట్రోఫీని గెలుచుకుంది. తొలి రెండు ప్రయత్నాల్లో ఫైనల్లో పాక్‌ను, ఆఖరిగా బంగ్లాను ఓడించి విజేతగా నిలిచింది. -
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా పాకిస్తాన్
పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన ఫైనల్లో పాక్ బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ముల్తాన్ (పాకిస్తాన్) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆరిఫ్ హుస్సేన్ (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో బాబర్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ సల్మాన్, మతివుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. కేవలం 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ నిసార్ అలీ అజేయమై అర్ద సెంచరీతో (72) సత్తా చాటగా.. మరో ఓపెనర్ మొహమ్మద్ సఫ్దార్ అజేయమైన 47 పరుగులు చేసి తన జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 12 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పాక్ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. ఈ టోర్నీ జరిగిన మూడు ఎడిషన్లలో (2012, 2017, 2022) టీమిండియా విజేతగా నిలిచింది.టోర్నీ తొలి ఎడిషన్ ఫైనల్లో పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో ఎడిషన్ ఫైనల్లోనూ పాక్‌పై 9 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 2022 ఎడిషన్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించి హ్యాట్రిక్ టైటిళ్లు సొంతం చేసుకుంది. ఎట్టకేలకు పాక్ నాలుగో ప్రయత్నంలో సొంతగడ్డపై టైటిల్ సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్ పాల్గొనలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం టీమిండియాను పాక్‌కు పంపలేదు. -
అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్.. కేవలం 7 పరుగులకే ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదైంది. టీ20 వరల్డ్‌కప్ 2026 ఆఫ్రికా సబ్ రీజియనల్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ కేవలం 7 పరుగులకే ఆలౌటైంది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్. దీనికి ముందు టీ20 అత్యల్ప స్కోర్ రికార్డు ఐసిల్ ఆఫ్ మ్యాచ్, మంగోలియా జట్ల పేరిట ఉండేది. ఈ రెండు జట్లు గతంలో 10 పరుగులకే ఆలౌటయ్యాయి.నైజీరియా-ఐవరీ కోస్ట్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. వికెట్‌కీపర్ సెలిమ్ సలౌ విధ్వంసకర శతకం (53 బంతుల్లో 112 రిటైర్డ్ ఔట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది నైజీరియా భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. నైజీరియా ఇన్నింగ్స్‌లో ఐసక్ ఓక్పే (23 బంతుల్లో 65 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సులేమాన్ (29 బంతుల్లో 50; 8 ఫోర్లు) మెరుపు అర్ద శతకాలు బాదారు. ఐవరీ కోస్ట్ బౌలర్లలో పంబా దిమిత్రి, విల్ఫ్రైడ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐవరీ కోస్ట్.. 7.3 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా నైజీరియా 264 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఐవరీ కోస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్లు కాగా.. ముగ్గురు బ్యాటర్లు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్ మొహమ్మద్ చేసిన నాలుగు పరుగులే టాప్ స్కోర్‌గా నిలిచాయి. ఈ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. -
T20 WC: పాకిస్తాన్ పర్యటనకు అనుమతించిన క్రీడా మంత్రిత్వ శాఖ!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా వేదిక విషయంలో ఇంత వరకు స్పష్టత రాలేదు. ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. తమ జట్టును అక్కడికి పంపేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కరాఖండిగా చెప్పేసింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.సౌతాఫ్రికాలో టోర్నీని నిర్వహించాలనే ఆలోచన!ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి చెప్పిన ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానాన్ని సూచించింది. అయితే, ఇందుకు పీసీబీ ససేమిరా అంటున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ నుంచి మొత్తంగా వేదికను తరలించి.. సౌతాఫ్రికాలో టోర్నీని నిర్వహించాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆ జట్టుకు గ్రీన్ సిగ్నల్ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత క్రికెట్ జట్టు ఒకటి పాకిస్తాన్లో పర్యటించేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చిందనే వార్త ఆసక్తికరంగా మారింది. నవంబరు 23- డిసెంబరు 3 వరకు పాక్ వేదికగా అంధుల టీ20 మెన్స్ వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు క్రీడా శాఖ భారత జట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. నిరభ్యంతర పత్రాన్ని(NOC) జారీ చేసినట్లు స్పోర్ట్స్ తక్ కథనం వెల్లడించింది.క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(CABI) ఈ విషయాన్ని తమకు తెలిపినట్లు పేర్కొంది. అయితే, క్రీడా శాఖ నుంచి భారత జట్టుకు అనుమతి లభించినా.. తదుపరి హోం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది.తొలిసారిగా పాక్ ఆతిథ్యం ఈ విషయం గురించి CABI జనరల్ సెక్రటరీ శైలేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘పదిహేను రోజులుగా క్లియరెన్స్ కోసం మేము ఎదురుచూస్తున్నాము. ప్రభుత్వం అంతిమంగా ఏది చెప్తే అదే చేస్తాం. 2014లో చివరిసారిగా మేము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాము. అక్కడ ద్వైపాక్షిక సిరీస్ ఆడాము.అయితే, 2018 నుంచి ప్రభుత్వం మాకు క్లియరెన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అదే విధంగా.. 2023లో భారత్‌లో టోర్నీ జరిగినపుడు పాక్ జట్టు పాల్గొనలేదు’’ అని పేర్కొన్నారు. కాగా అంధుల క్రికెట్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి తొలిసారిగా పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది.ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నేపాల్, అఫ్గనిస్తాన్ దేశాల జట్లు ఇందుకు అర్హత సాధించాయి. పాకిస్తాన్‌లోని లాహోర్, ముల్తాన్ వేదికగా జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనాలంటే భారత జట్టుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కాగా ఇప్పటి వరకు మూడుసార్లు(2012, 2017, 2022) జరిగిన ఈ టోర్నీలో భారత్ మూడుసార్లూ టైటిల్ గెలిచింది.చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్
-
మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ
దుబాయ్: యూఏఈలో త్వరలోనే జరగబోయే మహిళల టి20 ప్రపంచకప్ టికెట్ల విక్రయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రారంభించింది. కేవలం 5 యూఏఈ దిర్హామ్ (రూ. 114)లకే ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు 18 ఏళ్లలోపు వయసున్న బాలబాలికలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అందరు వెచి్చంచగలిగే స్థితిలో టికెట్లను అందుబాటు ధరలో ఉంచాం. ప్రారంభ టికెట్ ఐదు దిర్హామ్‌లకే కొనుగోలు చేయొచ్చు. అత్యధికంగా ప్రీమియం సీట్ల ధర 40 దిర్హామ్ (రూ. 910)లుగా ఉంది. ఒక వేదికపై ఒకే రోజు రెండు మ్యాచ్‌లుంటే ఒక టికెట్‌తోనే ఆ రెండు మ్యాచ్‌ల్ని వీక్షించవచ్చు’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఆఫ్లైన్లోనూ టికెట్లను విక్రయించేందుకు దుబాయ్, షార్జా క్రికెట్ స్టేడియాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. భారత్ సహా 10 దేశాల జట్లు పోటీపడే ఈ మెగా ఈవెంట్ వచ్చే నెల 3 నుంచి యూఏఈలోని రెండు వేదిక (దుబాయ్, షార్జా)ల్లో జరుగుతుంది. -
నేను హార్డ్ హిట్టర్‌ని.. వచ్చే వరల్డ్‌కప్‌లోనూ ఆడతా!
మరో రెండేళ్ల పాటు తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ అన్నాడు. మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్‌గా ఉన్నానని.. టీ20 ప్రపంచకప్-2026లోనూ తనను చూస్తారని పేర్కొన్నాడు. తమ కోచ్ డారెన్ సామీ తనను మరికొన్నాళ్లపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాల్సిందిగా కోరాడని.. అలాంటపుడు తానెలా జట్టుకు దూరమవుతానని ప్రశ్నించాడు.హార్డ్ హిట్టర్కాగా 2010లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన రసెల్.. టీ20 స్పెషలిస్టుగా గుర్తింపు పొందాడు. జాతీయ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొట్టిలీగ్లలో భాగమవుతూ హార్డ్ హిట్టర్‌గా పేరొందాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 82 టీ20లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 60 వికెట్లు తీయడంతో పాటు 1033 పరుగులు చేశాడు.విధ్వంసకర వీరుడుఇక ఐపీఎల్లో అయితే తనబ్యాటింగ్ తీరుతో విధ్వంసకర వీరుడిగా పేరొందిన ఆండ్రీ రసెల్ 126 మ్యాచ్‌లలో.. 2484 పరుగులు చేశాడు. ఇందులో 170 ఫోర్లు, 209 సిక్సర్లు ఉన్నాయి. ఇక మొత్తంగా 115 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడుఇక.. వెస్టిండీస్ తరఫున టీ20 ప్రపంచకప్-2012, 2016 ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడైన రసెల్.. చివరగా టీ20 వరల్డ్‌కప్-2024 సందర్భంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఐసీసీ టోర్నీలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆఖరిగా ఆడాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024తో బిజీగా ఉన్న రసెల్.. ట్రింబాగో నైట్ రైడర్స్‌కు ఆడుతున్నాడు.ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో 207కు పైగా స్ట్రైక్‌రేటుతో 56 పరుగులు రాబట్టిన రసెల్.. కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ త్వరలోనే శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని 36 ఏళ్ల రసెల్ స్పష్టం చేశాడు.బంతిని బాదగల సత్తా నాకు ఉందిఇండియా టు డేతో మాట్లాడుతూ.. ‘‘2026 వరల్డ్‌కప్‌లో నేను కచ్చితంగా ఆడతాను. ఎందుకంటే నాలో క్రికెట్ ఆడగల సత్తా ఇంకా మిగిలే ఉందని మీకు కూడా తెలుసు. నేను ఇప్పటికే అంతర్జాతీయక్రికెట్ నుంచి తప్పుకొని ఉండవచ్చు. అలా చేస్తే యువ ఆల్రౌండర్లకు అవకాశాలు రావచ్చు.అయితే, నేను ఇప్పటికీ బంతిని అనుకున్న చోటకు బాదగలను. అద్భుతమైన పేస్‌తో బౌలింగ్ చేయగలను. ఇంకా ఫిట్‌గానే ఉన్నాను. కాబట్టి ఇక్కడితో ఎందుకు ఆగిపోవాలి’’ అంటూ రసెల్ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. తమ కోచ్ ఈ విషయం గురించి తనతో చర్చించాడని.. మరికొన్నాళ్లపాటు విండీస్‌కు ఆడతానని తెలిపాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ డ్రాప్ చేశా.. నా కెరీర్ అంతటితో ఖతం! -
టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
యూఏఈ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలైసా హీలీ ఎంపిక కాగా.. వైస్ కెప్టెన్‌గా తహిల మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. సీనియర్ స్పిన్నర్ జెస్ జొనాస్సెన్ను పక్కన పెట్టిన ఆసీస్ సెలెక్టర్లు.. పేస్ బౌలర్ తైలా వ్లేమింక్కు చోటు కల్పించారు. ఈసారి ప్రపంచకప్ బరిలో ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. సీనియర్లంతా అంతా జట్టుకు అందుబాటులో ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఈసారి కూడా టైటిల్ సాధించి, వరుసగా నాలుగు టీ20 వరల్డ్‌కప్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతుంది.టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు..అలైసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హ్యారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహిళ మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లిస్ పెర్రీ, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్, తైలా వ్లేమింక్కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్-బిలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్
మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 25) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఫాస్ట్ బౌలర్ ఫాతిమా సనా ఎంపికైంది. మాజీ కెప్టెన్ నిదా దార్ స్థానంలో ఫాతిమాను ఎంపిక చేశారు పాక్ సెలెక్టర్లు. 22 ఏళ్ల సనాకు గతంలో దేశవాలీ జట్లకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. సనా.. నిదా గైర్హాజరీలో అప్పుడప్పుడు పాక్ కెప్టెన్‌గానూ వ్యవహరించింది. 2023 డిసెంబర్లో జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో సనా నేతృత్వంలోని పాక్ థ్రిల్లింగ్ సూపర్ ఓవర్ విక్టరీ సాధించింది.త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ కోసం పాక్ సెలెక్టర్లు పెద్దగా మార్పులు చేయలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లోని జట్టునే యధాతథంగా కొనసాగించారు. 2024 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన వారిలో 2023 టీ20 వరల్డ్‌కప్ సభ్యులు 10 మంది ఉండటం విశేషం. అన్క్యాప్డ్ పేసర్ తస్మియ రుబాబ్ కొత్తగా జట్టులో చోటు దక్కించుకుంది. ఈ టోర్నీ కోసం పాక్ సెలెక్టర్లు ఓ ట్రావెలింగ్ రిజర్వ్, ఇద్దరు నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేశారు.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ ఇటీవలే బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ వేదికను మార్చింది. ఈ మెగా టోర్నీ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి 30వ తేదీ వరకు జరుగనుంది.పాకిస్థాన్ జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ (వికెట్ కీపర్), నష్రా సుంధు, నిదా దార్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్, తుబా హసన్ట్రావెలింగ్ రిజర్వ్: నజిహా అల్వీ (వికెట్ కీపర్)నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రమీన్ షమీమ్, ఉమ్-ఎ-హాని -
అలాంటి ఇన్నింగ్స్ నా కెరీర్లో చూడలేదు
-
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్-ఏ పోటీల్లో భాగంగా సమోవా దేశంతో జరిగిన మ్యాచ్‌లో వనుఅటు దేశ సీమర్ నలిన్ నిపికో ఒకే ఓవర్లో 39 పరుగులు సమర్పించుకున్నాడు. నిపికో బౌలింగ్‌లో సమోవా దేశ బ్యాటర్ డేరియస్ విస్సర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. నిపికో మూడు నో బాల్స్ వేశాడు. ఫలితంగా ఓ ఓవర్లో 39 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఇది సరికొత్త ప్రపంచ రికార్డు.2007 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, 2021లో శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ, 2024 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ టీ20 టోర్నీలో ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ ఒకే ఓవర్లో 36 పరుగులు (6 సిక్సర్లు) సమర్పించుకున్నారు. బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్, ధనంజయ బౌలింగ్‌లో కీరన్ పోలార్డ్, కమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్ ఎయిరీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల ఘనత సాధించారు.మొత్తం 14 సిక్సర్లు..నిపికో బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన డేరియస్ విస్సర్.. ఇన్నింగ్స్ మొత్తంలో ఏకంగా 14 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లో 132 పరుగులు చేసిన విస్సర్.. సమోవా దేశం తరఫున శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. -
ఆస్ట్రేలియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
సిడ్నీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... మహిళల టి20 ప్రపంచకప్ కోసం అక్కడికి వెళ్లడం సరికాదని ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ అభిప్రాయపడింది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న దేశంపై ఇది మరింత ఒత్తిడి కలిగిస్తుందని హీలీ వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ అస్థిరత హింసకు దారితీయగా... వందలాది మంది మృత్యువాత పడ్డారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడగా... మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 19 వరకు బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. మొత్తం 10 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో హీలీ మాట్లాడుతూ... ‘ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆడటం కష్టంగా ఉంది. నైతికంగా ఇది సరైంది కాదనిపిస్తోంది. టోర్నీ అక్కడే నిర్వహించాలా వద్దా అనే విషయం ఐసీసీ పరిధిలోకి వస్తుంది. మా వరకైతే టి20 వరల్డ్‌కప్ కోసం మెరుగ్గా సిద్ధమవుతున్నాం. టోర్నీ ఎక్కడ జరిగినా సత్తా చాటగలమనే నమ్మకం ఉంది’ అని పేర్కొంది. 2014 టి20 ప్రపంచకప్ తర్వాత.. ఇటీవలే ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా ఆడిన 3 వన్డేలు, మూడు టి20ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్‌లో టి20 వరల్డ్‌కప్ నిర్వహించాలా వద్దా అనే విషయంపై ఈరోజు ఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ వేదిక మార్చాలనుకుంటే మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిథ్య రేసులో ముందుంది. -
అండర్ 19 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల
మలేషియాలో జరగబోయే మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 18) ప్రకటించింది. ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. నాలుగు జట్లు ఓ గ్రూప్‌గా విభజించబడి పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.Here's the schedule for the ICC U19 Women's T20 World Cup 2025, which will take place in Malaysia.🏆𝐆𝐫𝐨𝐮𝐩 𝐀: India, West Indies, Sri Lanka, Malaysia𝐆𝐫𝐨𝐮𝐩 𝐁: England, Pakistan, Ireland, USA𝐆𝐫𝐨𝐮𝐩 𝐂: New Zealand, South Africa, Africa Qualifier, Samoa𝐆𝐫𝐨𝐮𝐩… pic.twitter.com/8Z690tEO3K— CricTracker (@Cricketracker) August 18, 2024భారత్ గ్రూప్-ఏలో వెస్టిండీస్, శ్రీలంక మలేషియాలతో పోటీపడనుంది. గ్రూప్-బిలో ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవా దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫయర్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. భారత్.. జనవరి 19న వెస్టిండీస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’
సంజూ శాంసన్.. ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌కు అంతర్జాతీయ క్రికెట్లో తగినన్ని అవకాశాలు రావడం లేదనేది అతడి అభిమానుల వాదన. ప్రతిభ ఉన్నా ఈ కేరళ ఆటగాడి పట్ల సెలక్టర్లు వివక్ష చూపుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి.అందుకు తగ్గట్లుగానే వన్డే ప్రపంచకప్-2023 సమయంలో మెరుగైన గణాంకాలున్న సంజూను కాదని.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు ఇచ్చారు. అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించారు. ఈ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోవడంతో జట్టు యాజమాన్యం విమర్శలపాలైంది. ఈ క్రమంలో ఐపీఎల్-2024 రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా సత్తా చాటిన సంజూ ఎట్టకేలకు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.అయితే, రిషభ్ పంత్ రూపంలో గట్టి పోటీ ఎదురుకావడంతో అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన సంజూకు.. తదుపరి శ్రీలంక టూర్‌కు వెళ్లబోయే జట్టులో చోటు దక్కుతుందో లేదోనన్నది ఆసక్తికరంగా మారింది. వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమేఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంజూ శాంసన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. శుభంకర్ మిశ్రా యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో అమిత్ మిశ్రా టీ20 ప్రపంచకప్-2026 జట్టులో సంజూకు చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు మరో వరల్డ్‌కప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే అతడికి వయసు మీద పడింది. టీ20 జట్టులో యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తామనే సంప్రదాయాన్ని విరాట్ కోహ్లి ప్రవేశపెట్టాడు.వాళ్లే బాగా ఆడతారని అతడి నమ్మకం. అయితే, తనకు 35 ఏళ్లు వచ్చినా కోహ్లి ఆడాడనుకోండి. అది వేరే విషయం. ఒకవేళ శాంసన్ గనుక టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే అత్యద్భుతంగా ఆడాలి.వారి నుంచి తీవ్రమైన పోటీఅలా అయితే, రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు దక్కుతుంది. లేదంటే కష్టమే. నిజానికి ఇషాన్ కిషన్ అత్యంత ప్రతిభ ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్.కానీ అతడిని టీ20ల నుంచి పక్కనపెట్టేశారు. ఇక రిషభ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అతడొక అత్యుత్తమ ప్లేయర్. ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ.. ఇలా వికెట్ కీపర్ల లిస్టు పెద్దగానే ఉంది. కాబట్టి సంజూ శ్రమించక తప్పదు’’ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.కాగా 29 ఏళ్ల సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడి 510 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 28 అంతర్జాతీయ టీ20లలో సంజూ 444 రన్స్ సాధించాడు. చదవండి: హార్దిక్ పాండ్యాకు షాక్!.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే! -
భారత జట్టును ఒక్క మాట అన్నా ఊరుకోం..
-
సిరాజ్‌కు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
-
సంద్రం.. జనసంద్రం
పొట్టి ఫార్మాట్లో 17 ఏళ్ల క్రితం ఆరంభించిన తొలి టి20 ప్రపంచకప్‌ను ధోని బృందం గెలుచుకొచ్చింది. దేశమంతా వరల్డ్‌కప్ విజయంతో పెద్ద పండగే చేసుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రోహిత్ శర్మ జట్టు రెండో టి20 ప్రపంచకప్‌ను తెచ్చి పెట్టింది. మరి అ‘ద్వితీయ’ చాంపియన్‌షిప్ సంబరాలు మామూలుగా ఉండవుగా! ఢిల్లీలో ప్రత్యేక విమానం ల్యాండ్ అవగానే గ్రాండ్‌గా మొదలైన సంబరాలు సాయంత్రం ముంబైలో మెరైన్‌డ్రైవ్‌ను ముంచెత్తాయి. రాత్రయ్యేసరికి వాంఖెడేలో ఆటగాళ్లకు రూ. 125 కోట్ల నజరానా, ఘన సన్మానంతో కనులవిందుగా ముగిసింది. న్యూఢిల్లీ/ముంబై: గత శనివారం టీమిండియా టి20 ప్రపంచకప్ గెలిచింది. యావత్ భారతం చిందేసింది. 17 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచకప్ గెలవడం... ఆ కప్ రాక ఆలస్యం కావడంతో దాని కోసం ఇన్నాళ్లూ వేచి చూసిన అభిమానగణం రాగానే ఊరుకుంటారా? ‘పూనకాలు లోడింగ్’ అని హోరెత్తించరు! అవును సరిగ్గా అదే చేశారు. అడుగడుగునా అ‘ద్వితీయ’ ప్రపంచకప్‌నకు అపూర్వ స్వాగతం పలికారు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానుల్లో కొందరు ‘త్రివర్ణ’ పతాకాలతో... మరికొందరు ‘కంగ్రాట్స్’ ప్లకార్డులతో ఆటగాళ్లను అభినందిస్తూ తెగ సందడి చేశారు. క్రికెట్‌కు మతమైన భారత్‌లో అభిమానులు కప్‌నకు, కప్ కార్యసాధకులకు అడుగడుగునా నీరాజనం పలికారు. ఉదయం ఢిల్లీలో ఆగమనంతో మొదలైనపుడు ఎంతటి జోష్ కనబడిందో... ముంబైలో ఘన సన్మానం పూర్తయ్యేసరికి రాత్రిదాకా అభిమానోత్సాహం అలాగే కొనసాగడం విశేషం! అభిమాన ప్రవాహం ప్రత్యేక విమానంలో 16 గంటల పాటు ఏకబిగిన 14 వేల కిలోమీటర్ల ప్రయాణం బహుశా ఇదే మొదటిసారేమో! ఎందుకంటే 14,000 వేల కి.మీ. అంటే సగం ప్రపంచాన్ని చుట్టేసే దూరమన్న మాట! ఇంత ప్రయాణ బడలిక ఎవరికైనా అసౌకర్యంగానే ఉంటుంది. వెంటనే తనువు–మనసు విశ్రాంతి కోరుతుంది. కానీ అభిమాన ప్రవాహం ముందు ఆటగాళ్లలో ఎలాంటి అలసటే కనిపించలేదు. కిక్కిరిసిన మెరైన్ డ్రైవ్ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక బస్‌లో బయలుదేరిన భారత క్రికెటర్లు నారీమన్ పాయింట్‌కు రాగానే ప్రత్యేకంగా ముస్తాబు చేసిన ఓపెన్ టాప్ బస్‌లో ఎక్కారు. మెరైన్ డ్రైవ్ తీరం వెంట సాగరం (అరేబియా సముద్రం) పక్కన సాగరం (ప్రేక్షకులతో) కనిపించింది. వానచినుకులు పడుతున్నా ఇసుకేస్తే రాలనంత జనం ఎక్కడికీ కదల్లేదు. తమ దేశానికి కప్ సాధించిపెట్టిన క్రికెటర్ల అభివాదాల కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూశారు తప్ప వెనక్కి తగ్గలేదు. ఓపెన్ టాప్ బస్‌లో ప్రపంచకప్‌తో ఉన్న ఆటగాళ్లను క్రికెట్ వీరాభిమానులంతా తమతమ ఫోన్ కెమెరాల్లో అదేపనిగా బంధించేపనిలో పడ్డారు. దారిపొడవునా సాగిన ఈ విజయోత్సవ ర్యాలీ మెరైన్ డ్రైవ్‌కే కొత్త శోభ తెచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కడే సమీపంలో ఉన్న వాంఖెడే స్టేడియంలో సీట్ల సామర్థ్యానికి సరిపడా అభిమానుల్ని అనుమతించగా, ప్రత్యేకంగా నీలిరంగులో ఏర్పాటు వేదికపై తెలుపు రంగులో ‘చాంపియన్స్’ అక్షరాలు ప్రముఖంగా కనిపించేలా తీర్చిదిద్దారు. కోహ్లి, రోహిత్, హార్దిక్ ఇతర సభ్యులందరూ డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రకటించిన నజరానాను ఒక్కొక్కరిగా కాకుండా టీమ్ సాధించిన విజయానికి సూచికగా రూ. 125 కోట్ల చెక్‌ను ఆటగాళ్లకు అందజేసి ఘనంగా సన్మానించారు. ఇక నిష్క్రమించే సమయంలో టీమిండియా ఆటగాళ్లంతా టెన్నిస్ బంతులపై ఆటోగ్రాఫ్ చేసి ప్రేక్షకుల గ్యాలరీ దిశగా కొట్టారు. జగజ్జేతలకు మోదీ జేజేలు కరీబియన్ గడ్డపై టి20 ప్రపంచకప్ సాధించిన భారత క్రికెటర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయ ఆతిథ్యమిచ్చారు. ఉదయం అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని ప్రతి ఒక్క క్రికెటర్ కప్ కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ ఇద్దరు కలిసి మోదీ చేతిలో ప్రపంచకప్‌ను పెట్టారు. ఇరువైపులా జట్టు సభ్యులంతా నిల్చొని ఫొటోకు ఫోజిచ్చారు. ‘చాంపియన్స్‌తో జరిగిన ఈ మీటింగ్ చాలా అద్భుతంగా గడిచింది. వారికి ఇచ్చిన ఆతిథ్యం ఎంతో ఆనందాన్ని పంచింది. కప్ వేటలో వాళ్లు పడిన పాట్లు, చేసిన పోరాటాలు.మొత్తం టోర్నీ జర్నీపై వారు నాతో పంచుకున్న అనుభవాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నా మదిలో పదిలంగా ఉంటాయి’ అని మోదీ ‘ఎక్స్’లో ఫొటోలను జతచేసి ట్వీట్ చేశారు. క్రికెటర్లతో పాటు ప్రధానిని కలిసిన బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షా ఈ సందర్భంగా మోదీకి ‘నమో’ పేరిట నం.1 జెర్సీని అందజేశారు. ఇంతటి జనసందోహం చూస్తుంటే మాలాగే ఈ ప్రపంచకప్ కోసం వాళ్లు ఎంతగా ఆరాటపడ్డారో... టీమిండియా గెలవాలని ఎంత బలంగా కోరుకున్నారో అర్థమవుతోంది. –కెప్టెన్ రోహిత్ శర్మ కిక్కిరిసిన రోడ్లపై ఈ రాత్రి మీరు కురిపించిన ప్రేమాభిమానాల్ని ఇకపై మిస్ అవుతాను. ఈ అనిర్వచనీయ ఆనందాన్ని నేనెప్పటికీ మరచిపోను. –కోచ్ రాహుల్ ద్రవిడ్ 2011లో వన్డే ప్రపంచకప్ నెగ్గినపుడు సీనియర్లు వెలిబుచ్చిన భావోద్వేగాలకు, కన్నీళ్లకు నేను చలించలేదు. కానీ ఇప్పుడు అవే... నన్ను నేను అదుపు చేసుకోలేనంతగా బయటికి వస్తున్నాయి. –విరాట్ కోహ్లి -
జనసంద్రలా ముంబై తీరం.. విశ్వవిజేతల విక్టరీ పరేడ్ (ఫోటోలు)
-
జగజ్జేతల ఆగమనం
ఇక్కడేమో అభిమానులు... అక్కడేమో ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లు... ఎన్నాళ్లీ నిరీక్షణ, ఎందుకీ పరీక్ష అని చూసే ఎదురుచూపులకు నేడు తెర పడనుంది. ప్రతికూల వాతావరణంతో బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయిన టి20 వరల్డ్ చాంపియన్ భారత జట్టు గురువారం తెల్లవారగానే న్యూఢిల్లీకి చేరుకుంటుంది. వీరికి ఘనస్వాగతం పలికేందుకు బోర్డుతో పాటు వీరాభిమానులు తెగ ఆరాటం కనబరుస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సంబరాల్లో మునిగితేలనున్నాయి. ముంబై: టి20 ప్రపంచకప్‌ను జయించిన భారత క్రికెట్ జట్టు సభ్యులు కాస్త ఆలస్యంగా నేడు స్వదేశానికి చేరుకుంటున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఎయిరిండియా సమన్వయంతో చార్టెర్డ్ ఫ్లయిట్లో చాంపియన్లు, జట్టు సహాయక సిబ్బంది, బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షాలతో పాటు భారత్‌కు చెందిన మీడియా ప్రతినిధులు బార్బడోస్‌లోని గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం బయలుదేరారు.ఫ్లయిట్ షెడ్యూల్ టైమ్ ప్రకారం గురువారం ఉదయం గం. 6:20 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. కాసేపు ఆటగాళ్లు ప్రయాణ బడలిక నుంచి సేదతీరాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో 6 గంటలకు ఫ్లయిట్ ల్యాండ్ అవుతుంది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆటగాళ్లు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో భేటీ అవుతారు. ఇదివరకే విజేత సభ్యులను సోషల్ మీడియా ద్వారా, ఫోన్లో అభినందించిన ప్రధాని కాసేపు క్రికెటర్లతో గడుపుతారు’ అని బోర్డు సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ భేటీ ముగిసిన వెంటనే మరో ప్రత్యేక విమానంలో టీమిండియా ముంబైకి పయనమవుతుంది. ముంబైలోనే బోర్డు అంబరాన్నంటే సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడికి చేరుకోగానే ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలు ఘనస్వాగతం పలుకుతాయి. ‘సాయంత్రం 5 గంటలకు నారీమన్ పాయింట్ వద్ద ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓపెన్ టాప్ బస్‌లో క్రికెటర్ల రోడ్‌షో మొదలవుతుంది. అక్కడి నుంచి విఖ్యాత వాంఖెడే స్టేడియం వరకు సుమారు రెండు గంటలపాటు సాగే ఈ షోలో అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతారు. రాత్రి 7 గంటల సమయంలో స్టేడియంలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని ఒక్కోక్కరిగా ఘనంగా సన్మానిస్తారు. బోర్డు ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని కూడా అందజేస్తారు’ అని శుక్లా పూర్తి బిజీ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ విక్టరీ పరేడ్‌లో అభిమానులంతా పాల్గొనాల్సిందిగా బోర్డు కార్యదర్శి జై షా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రోడ్ షో 17 ఏళ్ల క్రితం తొలి టి20 ప్రపంచకప్ గెలిచిన ధోని బృందానికి నిర్వహించారు. కానీ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన అదే ధోని సేనకు ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉండటంతో రోడ్ షోను నిర్వహించలేదు. న్యూయార్క్ టు న్యూఢిల్లీ.. వయా బార్బడోస్ గత నెల 29న రోహిత్ శర్మ బృందం టి20 వరల్డ్‌కప్ గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి లేదంటే సోమవారం ఉదయానికల్లా జగజ్జేతలు భారత్‌కు రావాలి. కానీ కరీబియన్‌లో భీకరమైన హరికేన్ తుఫాన్ వల్ల బార్బడోస్ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా అక్కడే ఇరుక్కుపోయారు. ఎట్టకేలకు కరీబియన్‌లో టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యులు కప్‌తో వచ్చేస్తున్నారు. ఎయిరిండియా చొరవ, న్యూయార్క్‌లోని ప్రయాణీకుల సహకారంతో దారి మళ్లించిన విమానంలో టీమిండియా క్రికెటర్లు, మీడియా సంస్థల ప్రతినిధులు గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంటారు. అయితే వాతావరణ పరిస్థితిలో మార్పురావడంతో న్యూయార్క్ (అమెరికా) నుంచి న్యూఢిల్లీకి ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానాన్ని వయా బార్బడోస్ మీదుగా దారి మళ్లించారు. ఈ విమానం కోసం టికెట్లు బుక్ చేసుకున్న సాధారణ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చి అసౌకర్యం కలుగకుండా చూశారు. ఇంకొందరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక విజేతల కోసం ‘ఏఐసీ24డబ్ల్యూసీ’ (ఎయిరిండియా చాంపియన్స్ 24 ప్రపంచకప్) పేరిట ఈ విమానాన్ని ముస్తాబుచేసి బార్బడోస్‌లో క్రికెటర్లను ఎక్కించుకొని బుధవారం బయలుదేరింది. అయితే నిర్ణీత రూట్ కాకుండా మరో రూట్ మారడంపై డీజీసీఏ (విమానయాన నియంత్రణ సంస్థ) ఎయిరిండియాను నివేదిక కోరింది. -
భారత్, శ్రీలంకల వేదికగా టీ20 వరల్డ్‌కప్ 2026..
దాదాపు నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉరుత్రూలూగించిన టీ20 వరల్డ్‌కప్-2024 ఘనంగా ముగిసింది. జూన్ 29న బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డ్ పడింది.తుది పోరులో విజయం సాధించిన భారత్.. ఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ వరల్డ్‌కప్ విజయంతో 13 ఏళ్ల భారత అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఇక వరల్డ్‌కప్ ముగిసి వారం రోజుల తిరగకుముందే టీ20 వరల్డ్‌కప్-2026కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. టీ20 వరల్డ్‌కప్-2026 భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్నట్లు ఐసీసీ తెలిపింది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్ కప్‌లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.ఇక వచ్చే పొట్టి వరల్డ్‌కప్‌కు 12 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంక, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాలు నేరుగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి. సూపర్-8కు అర్హత సాధించిన అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, అమెరికా వచ్చే ప్రపంచ కప్‌నకు క్వాలిఫై అయ్యాయి. అదే విధంగా ఈ ఏడాది జూన్ 30 నాటికి ఐసీసీ టీ20 ర్యాంక్స్ ఆధారంగా మరో మూడుజట్లు ఈ మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. అంటే న్యూజిలాండ్ (6వ ర్యాంకు), పాకిస్తాన్ (7వ ర్యాంకు), ఐర్లాండ్ (11వ ర్యాంక్) వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్నాయి. మిగితా 8 జట్లు క్వాలిఫియర్స్ ఆడి అర్హత సాధించనున్నాయి. -
17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో తొలి జట్టుగా టీమిండియా
నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది. 17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో భారత్‌తో (2007, 2024) పాటు వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లండ్ (2010, 2022) మాత్రమే రెండేసి సార్లు టైటిల్స్ సాధించాయి. ఈ వరల్డ్‌కప్ విజయంతో భారత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఈ ప్రపంచకప్‌లో అజేయ జట్టుగా నిలిచిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా (సింగిల్ ఎడిషన్) టైటిల్ సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ జట్టు అజేయంగా టీ20 ప్రపంచకప్ గెలవలేదు.కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం భారత ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. తొలుత భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఆనంద బాష్పాలు కార్చిన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని సంబురాలు చేసుకున్నారు.11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ, 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్, 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ గెలవడంతో యావత్ భారతావణి పులకించిపొయింది. ఊరు వాడా విజయోత్సవ సంబురాలు జరిగాయి. టీమిండియా కృష్ణార్జునులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచి టీ20 ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలకగా.. భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్‌కప్ విక్టరీతో ముగిసింది. భారత క్రికెట్ అభిమానులు ఓ పక్క టీమిండియా విజయాన్ని ఆస్వాధిస్తూనే.. మరోపక్క దిగ్గజాల రిటైర్మెంట్ ప్రకటనను తలచుకుంటూ కుమిలిపోయారు. మొత్తంగా నిన్నటి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. -
వరల్డ్ కప్ విక్టరీ.. టీమిండియాకు టాలీవుడ్ తారల విషెస్!
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 2007 తర్వాత పొట్టి ఫార్మాట్లో మరోసారి జగజ్జేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచకప్‌ను ముద్దాడింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వరల్డ్ కప్ గెలిచిన వేళ టాలీవుడ్ సినీతారలు సైతం మన జట్టుకు అభినందనలు తెలిపారు.దర్శకధీరుడు రాజమౌళి విన్నింగ్ మూమెంట్ ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను హత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ అద్భుతమైన విజయాన్ని గుర్తుండిపోయేలా చేసిన టీమిండియాకు, రోహిత్ శర్మకు నా ప్రత్యేక అభినందనలు అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందలు తెలిపారు.🥹🥹🥹 pic.twitter.com/UMojgkRs2U— rajamouli ss (@ssrajamouli) June 29, 2024 Incredible win for Team India! 🇮🇳 Well done, team! Hurrah for @Jaspritbumrah93 👍🏼 and outstanding performances by @imVkohli and @hardikpandya7 ! Kudos to our captain @ImRo45 and all the people behind the scenes for making this win so memorable.#TeamIndia #T20WorldCup #INDvSA…— Ram Charan (@AlwaysRamCharan) June 29, 2024పొట్టి ప్రపంచకప్ గెలిచిన వేళ సూపర్ స్టార్ మహేశ్‌బాబు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ రోజు మనదే.. హీరోస్-ఇన్-బ్లూ.. కొత్త ప్రపంచ ఛాంపియన్స్.. సూర్యకుమార్ క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. జై హింద్' అంటూ పోస్ట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు నా అభినందనలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. Congratulations to the Indian Cricket team on winning the T20 World Cup 🇮🇳— Allu Arjun (@alluarjun) June 29, 2024 It's ours!! 🏆 The Heroes-in-Blue are the new 'World Champions'! Take a bow #TeamIndia for your relentless efforts on the field today! @surya_14kumar, your catch will be etched in history… what a stunner 😍😍😍 Super proud of this historic win. Jai Hind! 🇮🇳 #T20WorldCup… pic.twitter.com/7EI1oQ2ngw— Mahesh Babu (@urstrulyMahesh) June 29, 2024 -
మీరు జీవితకాల ప్రేమ పొందారు: యూపీ పోలీసు వినూత్న ట్వీట్
లక్నో: భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 7 ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడిచింది. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టీ20 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలో రెండో టీ20 ప్రపంచ కప్‌ను అందుకుంది. భారత్ టీ 20 ప్రపంచం కప్ సాధించటంతో ప్రధాని మోదీ నుంచి మొదలు.. సెలబ్రిటీలు అంతా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా భారత జట్టుకు అభినందనలు తెలిపారు. యూపీ పోలీసులు.. తమ ‘ఎక్స్’అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు.‘బ్రేకింగ్ న్యూస్.. భారత జట్టు బౌలర్లు దక్షిణాఫ్రికా హృదయాలను బద్దలు కొట్టడంలో దోషులుగా మిగిలారు. అలాగే భారత్‌లోని బిలియన్ క్రికెట్ అభిమానుల నుంచి జీవితకాల ప్రేమను పొందారు!’ అని పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సరిగా చెప్పారు. భారత జట్టు బిలయన్ అభిమాను జీవితం కాలం పొందారు’అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 𝑩𝒓𝒆𝒂𝒌𝒊𝒏𝒈 𝑵𝒆𝒘𝒔: Indian bowlers found guilty of breaking South African hearts.𝑺𝒆𝒏𝒕𝒆𝒏𝒄𝒆: Lifelong love from a billion fans! ❤️🏏 #INDvSAFinal#T20WorldCupFinal pic.twitter.com/UPaCzgf6vm— UP POLICE (@Uppolice) June 29, 2024 -
టీమిండియా విక్టరీ.. పూనకంతో ఊగిపోయిన టాలీవుడ్ హీరో!
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. బార్బడోస్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ప్రపంచకప్ విన్నింగ్ మూమెంట్‌ను ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలిపారు.అయితే సినీతారలు సైతం విన్నింగ్ మూమెంట్ తనదైన స్టెల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా పూనకంతో ఊగిపోయారు. చివరి ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేస్తుండగా.. వరల్డ్ కప్ మనదే అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు విష్ణు ట్విటర్లో పంచుకున్నారు. మ్యాచ్ ఓవర్ అంటూ విష్ణు సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు పలువురు అగ్రతారలు కనిపించనున్నారు. ఇటీవలే కన్నప్ప టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. Yahooooo! India! India! ❤️❤️❤️❤️ @ImRo45 🙏@imVkohli 🙏 What a memorable night @PDdancing anna ❤️❤️❤️ pic.twitter.com/k8q7WlmroL— Vishnu Manchu (@iVishnuManchu) June 29, 2024 -
T20 World Cup 2024: కసితీరా కప్ కొట్టారు.. టి20 విశ్వ విజేత భారత్
ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు... టైటిల్ వేటలో దక్షిణాఫ్రికా వేగంగా దూసుకుపోతోంది... 30 బంతుల్లో 30 పరుగులు, చేతిలో 6 వికెట్లతో సునాయాసంగా గెలిచే స్థితిలో నిలిచింది. తర్వాత ఓవర్లో బుమ్రా 4 పరుగులే ఇవ్వగా సమీకరణం 24 బంతుల్లో 26 పరుగులుగా మారింది. క్లాసెన్, మిల్లర్‌లాంటి హిట్టర్లు ఉండటంతో భారత్ ఆశలు కోల్పోయింది. కానీ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లో మ్యాజిక్ మొదలైంది. తొలి బంతికే క్లాసెన్ వెనుదిరగ్గా... 18 బంతుల్లో 10 పరుగులే వచ్చాయి. కథ క్లైమాక్స్‌కు చేరింది. 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. మిల్లర్ ఉండటంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. కానీ పాండ్యా వేసిన తొలి బంతికే బౌండరీ వద్ద సూర్యకుమార్ అత్యద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అంతే... తర్వాతి ఐదు బంతులు లాంఛనమే అయ్యాయి... భారత్ప్రపంచ విజేతగా హోరెత్తే సంబరాల్లో మునిగిపోయింది. ఎన్నాళ్లయింది భారత క్రికెటర్లలో ఈ ఆనందాన్ని చూసి... ఎన్నేళ్లయింది భారత క్రికెట్ అభిమానులు ఇలాంటి గెలుపు సంబరాలు చేసుకొని... అందినట్లే అంది చేజారిపోతున్న ఐసీసీ ట్రోఫీ విజయాలు... ఆఖరి మెట్టుపై తడబడిన ప్రపంచ కప్ సమరాలు... అన్నీ దాటి ఇప్పుడు ఆహా అనిపించే ప్రదర్శనతో భారత జట్టు సగర్వంగా నిలిచింది. ఏడు నెలల క్రితం రాల్చిన కన్నీటి చుక్కల స్థానే ఇప్పుడు ఆనంద బాష్పాలు... నియంత్రించలేని భావోద్వేగాలు... ఎన్నోసార్లు చేరువగా వచ్చిన ట్రోఫీని దూరమైన బాధను పూర్తిగా మరిచేలా ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌గా చేతిలో వాలిన కప్... సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ చేజారిన తర్వాత ఈ సారైనా టి20 ప్రపంచకప్ ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా అజేయంగా అద్భుతాన్ని చేసి చూపించింది. రెండోసారి విశ్వ విజేతగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 2007లో తొలి టైటిల్ నెగ్గిన తర్వాత ఆరు ప్రయత్నాల్లో విఫలమైన టీమిండియా ఇప్పుడు మళ్లీ ట్రోఫీని అందుకుంది.అప్పుడెప్పుడో కపిల్ వన్డే కప్ (1983) తెచ్చినపుడు మనలో చాలామందికి తెలీదు. అదొక వార్తగానే తెలుసుకున్నాం. కానీ ధోని తొలి టి20 ప్రపంచకప్‌ను టీవీల్లో చూశాం. తెగ సంబరపడ్డాం. సొంతగడ్డపై మళ్లీ అదే అదే ధోని (2011) వన్డే విశ్వవిజేతను చేస్తే పెద్ద పండగ చేసుకున్నాం. మళ్లీ... మళ్లీ మళ్లీ ఎంత ప్రయత్నించినా సెమీస్ లేదంటే ఫైనల్స్‌తోనే సరిపెట్టుకున్నాం. కానీ ఇప్పుడు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టి20 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కరీబియన్ గడ్డపై సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. రెండోసారి టి20 ప్రపంచకప్‌ను అందుకుంది. రోహిత్ బృందం జగజ్జేతగా అవతరించడంతో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది. బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): భారత జట్టు టి20 వరల్డ్ కప్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా... డికాక్ (31 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టబ్స్ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హార్దిక్ పాండ్యా (3/20) మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా... బుమ్రా, అర్ష్ దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించగా... బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. తదుపరి టి20 ప్రపంచకప్‌కు 2026లో భారత్–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తాయి. కీలక భాగస్వామ్యాలు... టోర్నీలో వరుసగా విఫలమైన కోహ్లి తుది పోరులో మాత్రం తన స్థాయి ఆటను ప్రదర్శించాడు. జాన్సెన్ వేసిన తొలి ఓవర్‌ను కోహ్లి జోరుగా మొదలు పెట్టాడు. అతను 3 ఫోర్లు బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్లో అనూహ్యంగా దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. కేశవ్ మహరాజ్ వేసిన ఈ ఓవర్లో తొలి రెండు బంతులను ఫోర్లుగా మలచినా... నాలుగో బంతికి రోహిత్ శర్మ (9) వెనుదిరిగాడు. చివరి బంతికి రిషభ్ పంత్ (0) కూడా అవుట్ కాగా, సూర్యకుమార్ (3) కూడా విఫలం కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఐదో స్థానంలో వచ్చిన అక్షర్ చక్కటి బ్యాటింగ్‌తో నిలిచాడు. మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో కోహ్లి మరో ఎండ్‌లో నెమ్మదించాల్సి వచ్చింది. పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు చేసింది. నలుగురు వేర్వేరు బౌలర్లు మార్క్రమ్, మహరాజ్, షమ్సీ, రబాడ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టిన అక్షర్ పటేల్ ధాటిగా ఆడి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడు. 13.1 ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే అదే ఓవర్లో అక్షర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి, అక్షర్ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించారు. ఆ తర్వాత కోహ్లి, శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మధ్య 57 పరుగుల భాగస్వామ్యం (33 బంతుల్లో) స్కోరు వేగాన్ని తగ్గకుండా చేసింది. కోహ్లి 48 బంతుల్లో తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. 17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 134/4. చివరి 3 ఓవర్లలో భారత్ 42 పరుగులు (వరుసగా 16, 17, 9) పరుగులు రాబట్టింది. తొలి 13 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసి కోహ్లి తర్వాతి 35 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకుండా 29 పరుగులే చేశాడు. అయితే తన ఆఖరి 11 బంతుల్లో 26 పరుగులు సాధించి మెరుగైన స్ట్రయిక్ రేట్‌తో ముగించాడు. చివరి 8 బంతుల్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్ మెరిసినా... ఛేదనలో దక్షిణాఫ్రికా 12 పరుగులకే హెన్డ్రిక్స్ (4), మార్క్రమ్ (4) వికెట్లు కోల్పోయింది. అయితే డికాక్, స్టబ్స్ ధాటిగా ఆడుతూ స్కోరును నడిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 38 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. 10 ఓవర్లలో స్కోరు 81 పరుగులకు చేరింది. ఒకవైపు డికాక్ చక్కటి బ్యాటింగ్‌తో నిలబడగా... మరోవైపు క్లాసెన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.తర్వాతి 6 ఓవర్లలో దక్షిణాఫ్రికా 51 పరుగులు చేసింది. ఇందులో క్లాసెన్ ఒక్కడే 44 పరుగులు సాధించాడు. మధ్యలో డికాక్ వెనుదిరిగినా క్లాసెన్ తగ్గలేదు. ముఖ్యంగా అర్షద్ వేసిన 15వ ఓవర్లో క్లాసెన్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 24 పరుగులు వచ్చాయి. ఈ దశలో భారత్ ఓటమి ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లాసెన్ (బి) మహరాజ్ 9; కోహ్లి (సి) రబడ (బి) జాన్సెన్ 76; పంత్ (సి) డికాక్ (బి) మహరాజ్ 0; సూర్యకుమార్ (సి) క్లాసెన్ (బి) రబడ 3; అక్షర్ పటేల్ (రనౌట్) 47; శివమ్ దూబే (సి) మిల్లర్ (బి) నోర్జే 27; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 5; జడేజా (సి) మహరాజ్ (బి) నోర్జే 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–34, 4–106, 5–163, 6–174, 7–176. బౌలింగ్: జాన్సెన్ 4–0–49–1, మహరాజ్ 3–0–23–2, రబడ 4–0–36–1, మార్క్రమ్ 2–0–16–0, నోర్జే 4–0–26–2, షమ్సీ 3–0–26–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్డ్రిక్స్ (బి) బుమ్రా 4; డికాక్ (సి) కుల్దీప్ (బి) అర్ష్ దీప్ 39; మార్క్రమ్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 4; స్టబ్స్ (బి) అక్షర్ 31; క్లాసెన్ (సి) పంత్ (బి) పాండ్యా 52; మిల్లర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 21; జాన్సెన్ (బి) బుమ్రా 2; కేశవ్ మహరాజ్ (నాటౌట్) 2; రబడ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 4; నోర్జే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–7, 2–12, 3–70, 4–106, 5–151, 6–156, 7–161, 8–168. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–20–2, బుమ్రా 4–0–18–2, అక్షర్ 4–0–49–1, కుల్దీప్ 4–0–45–0, పాండ్యా 3–0–20–3, జడేజా 1–0–12–0. ఆటగాడిగా... కెప్టెన్‌గా...ఐపీఎల్లో నాయకుడిగా ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన ఘనత ఉన్నా అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు నాయకత్వం అంత సులువు కాదని రోహిత్‌పై చాలా సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్, టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లలో ఓడిన తర్వాత అతని కెపె్టన్సీపై సందేహాలు కూడా వచ్చాయి. కానీ బీసీసీఐ మరోసారి రోహిత్‌నే నమ్మింది. వరల్డ్ కప్‌లో జట్టును గెలిపించగలిగిన సామర్థ్యం ఉందంటూ అప్పజెప్పింది. ఈ అవకాశాన్ని అతను సమర్థంగా వాడుకున్నాడు. 2007లో తొలి టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ 17 ఏళ్ల తర్వాత సారథిగా మరో వరల్డ్ కప్ గెలిపించాడు. 2007 నుంచి 2024 వరకు వరుసగా 9 వరల్డ్ కప్‌లలోనూ ఆడిన రోహిత్ రెండు సార్లు విజేతగా నిలిచాడు. అధికారికంగా ప్రకటించకపోయినా రోహిత్‌కు కూడా ఇదే ఆఖరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ కావచ్చు. మరో వైపు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో ఉన్న కోహ్లి టి20 వరల్డ్ కప్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూశాడు. అద్భుత ప్రదర్శనలతో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచినా...ట్రోఫీ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఈ గెలుపుతో ఆ ఆనందం దక్కింది. పైగా మూడు పరిమిత ఓవర్ల ఐసీసీ ట్రోఫీలు గెలిచినవాడిగా కెరీర్‌ను సంపూర్ణం చేసుకున్న అతను అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ పలికాడు. వీరిద్దరు మినహా 15 మంది సభ్యుల జట్టులో మిగతా 13 మందికి ఇదే తొలి వరల్డ్ కప్ కావడం విశేషం. హైదరాబాద్ పేసర్ సిరాజ్ కూడా అరుదైన జాబితాలో భాగమయ్యాడు. గతంలో అజహర్ సహా హైదరాబాద్ నుంచి భారత్‌కు వరల్డ్ కప్ ఆడినవారెవరూ విజేత జట్టులో లేరు. ఇప్పుడు సిరాజ్ ఆ అదృష్టాన్ని దక్కించుకున్నాడు. కల నిజమాయెగా... ఫైనల్లో తీవ్ర ఒత్తిడి మధ్య బౌండరీ సూర్యకుమార్ పట్టిన క్యాచ్‌కు వెలకట్టగలమా? అతడిని ఏ అవార్డుతో సన్మానించినా తక్కువే? బుమ్రా తన చివరి 2 ఓవర్లలో చేసిన అద్భుత బౌలింగ్‌కు సలామ్ చేయకుండా ఉండగలమా? టోరీ్నలో కేవలం 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీసిన బుమ్రా తన స్థాయి ఏమిటో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. క్లాసెన్‌ను అవుట్ చేసి ఆటను భారత్ వైపు తిప్పిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ తర్వాత కన్నీళ్లపర్యంతం కావడం మరచిపోగలమా? ఐపీఎల్ సమయంలో ఎంతో వేదన అనుభవించిన తర్వాత భారత్ తరఫున తన విలువేంటో చూపించిన పాండ్యాను రోహిత్ ముద్దాడిన దృశ్యం ఎప్పటికీ హైలైట్స్‌గా ఉండిపోదా! బ్యాటింగ్‌లోనూ తన సత్తా ఏమిటో చూపించిన గుజరాతీ ‘బాపు’ అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ విలువ అమూల్యం కాదా...! చావును దగ్గరగా చూసి ఇక ఆడలేనేమో అనుకున్న క్షణం నుంచి కప్‌ను ఎత్తుకోవడం వరకు రిషభ్ పంత్ సాగిన ప్రస్థానం అసాధారణం కాదా...! అనుభవం లేకపోయినా అర్ష్ దీప్ పదునైన బంతులతో గెలిపించి చూపించిన భాంగ్రాకు బల్లే బల్లే అనకుండా ఉండగలమా? కుల్దీప్, శివమ్ దూబే కీలక దశలో జట్టు విజయాల్లో ఇరుసుగా నిలిచినవారే... ఇక కోహ్లి గురించి చెప్పడం అంటే కొత్త పుస్తకం రాయడమే. ఫైనల్‌కు ముందు మొత్తం 75 పరుగులు మాత్రమే చేసిన అతను అసలు పోరు కోసం తన ఆటను దాచి ఉంచాడు. 76 పరుగుల ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుకు బాటలు వేసి విజయగర్వంతో అంతర్జాతీయ టి20 కెరీర్‌ను ముగించాడు. బ్యాటింగ్‌లో రోహిత్ దూకుడు మంత్రం భారత్ విజయాలకు పునాది వేసింది. తనదైన శైలిలో నాయకుడిగా జట్టును నడిపించిన అతను భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. కపిల్, ధోనిల తర్వాత వరల్డ్ కప్ గెలిపించిన సారథిగా శిఖరాన నిలిచాడు. కొన్నాళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది... అందరిలోనూ వేదన, తీవ్రమైన బాధ... గెలుపు కోసం ఇంకా ఏం చేయాలనే నైరాశ్యం... కెప్టెన్ రోహిత్ సహా ఇతర సభ్యులందరికీ కూడా ఆ బాధనుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. కాలం గిర్రున తిరిగింది... చూస్తుండగానే టి20 వరల్డ్ కప్ వచ్చేసింది. ఒక ఫార్మాట్లో చేజారినా... మరో ఫార్మాట్లోనైనా తమ స్థాయిని ప్రదర్శించే విజేతగా నిలిచే అవకాశం వచ్చింది. ఎలాగైనా ఈ సారి పట్టు వదలరాదని గట్టిగా నిశ్చయించుకొని మరో సారి తమ వేటను మొదలు పెట్టింది. లీగ్ దశలో వరుసగా మూడు విజయాలు, ఆ తర్వాత సూపర్–8లో కూడా మూడు విజయాలు. ఆస్ట్రేలియాలాంటి గట్టి ప్రత్యర్థి ని కుప్పకూల్చిన ఉత్సాహంతో సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కూడా ఘన విజయం. తుది పోరుకు ముందు అజేయంగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇలాగే వరుసగా పది విజయాల తర్వాత అజేయంగా ఫైనల్ చేరిన టీమ్ నిరాశచెందాల్సి వచ్చింది. అద్భుతంగా సాగిపోతున్న ఆటలో ఎక్కడైనా ఒక బ్రేక్ వస్తే... అదీ ఫైనల్లో అయితే ఎంతటి బాధ ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సారీ అలాంటిదే జరిగితే అనే ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ భారత్ అలాంటి స్థితిని అధిగమించింది...ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధగమించింది. కెపె్టన్‌గా 2007 వన్డే వరల్డ్కప్నాటి బాధను కోచ్‌గా రూపంలో మర్చిపోయే ప్రయత్నం చేసిన దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. గెలుపు ఖాయమైన క్షణాన గాల్లో ఎగురుతూ అతను విసిరిన పంచ్ ఈ విజయం విలువేమిటో చూపించింది. –సాక్షి క్రీడా విభాగం గడిచిన మూడు, నాలుగేళ్లు ఎంతో కష్టపడ్డాం. కానీ ఆఖరి ఫలితాలే అందుకోలేకపోయాం. ఈసారి మాత్రం ఏ అవకాశాన్ని వదులుకోవద్దనుకున్నాం. జట్టుగా సమష్టిగా రాణించి ప్రపంచకప్‌ను అందుకున్నాం. నాకే కాదు విరాట్ కోహ్లి ఫామ్‌పై మాలో ఎవరిరికి ఏ సందేహం లేదు. అతను ఆడాల్సిన సమయం వస్తే కచ్చితంగా నిలబడతాడు. జట్టును నిలబెడతాడు. వికెట్ అంత సులువుగాలేని చోట కోహ్తి చేసిన 76 పరుగులు, అక్షర్ మెరుపులు చాలా కీలకమయ్యాయి. బుమ్రా గురించి చెప్పాల్సిన పనిలేదు. హార్దిక్ పాండ్యా తీసిన వికెట్లు, సూర్య క్యాచ్ అన్ని కుదిరాయి కాబట్టే విజేతలమయ్యాం. - రోహిత్ శర్మ, భారత్ కెప్టెన్ భారత జట్టుకు రూ. 20 కోట్ల 42 లక్షల ప్రైజ్‌మనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తొమ్మిదో టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి ఒక కోటీ 12 లక్షల 50 వేల డాలర్ల (రూ. 93 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీని కేటాయించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 24 లక్షల 50 వేల డాలర్లు (రూ. 20 కోట్ల 42 లక్షలు) లభించాయి. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 12 లక్షల 80 వేల డాలర్లు (రూ. 10 కోట్ల 67 లక్షలు) దక్కాయి.సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ ఖాతాలో 7,87,000 డాలర్ల చొప్పున (రూ. 6 కోట్ల 56 లక్షల చొప్పున) చేరాయి. ‘సూపర్–8’ నుంచి సెమీఫైనల్ చేరుకోలేకపోయిన నాలుగు జట్లకు 3,82,500 డాలర్ల చొప్పున (రూ. 3 కోట్ల 18 లక్షల చొప్పున) లభించాయి. 9 నుంచి 12 స్థానాల్లోపు నిలిచిన నాలుగు జట్లకు 2,47,500 డాలర్ల చొప్పున (రూ. 2 కోట్ల 6 లక్షల చొప్పున) దక్కాయి. 13 నుంచి 20వ స్థానాల్లోపు నిలిచిన ఎనిమిది జట్లకు 2,25,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 87 లక్షల చొప్పున) అందజేశారు. సెమీఫైనల్స్, ఫైనల్ మినహా సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 31,154 డాలర్ల చొప్పున (రూ. 25 లక్షల 97 వేలు) లభించాయి. 2022 టి20 ప్రపంచకప్‌ను 56 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహించగా, విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు 16 లక్షల డాలర్లు లభించాయి. -
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ ఫైట్
-
ఈసారి వదలొద్దు!
2013లో చాంపియన్స్ ట్రోఫీ విజేత... ఆ తర్వాత ఐదుసార్లు ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు... అన్నింటా నిరాశే... 2014 టి20 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2021 టెస్టు చాంపియన్‌షిప్, 2023 టెస్టు చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్... ఈ ఐదు సందర్భాల్లో బరిలో నిలిచిన భారత జట్టు సభ్యులకే కాదు... గెలుపును ఆశించిన అభిమానులకు కూడా తెలుసు ఆ వేదన ఎలాంటిదో! ముఖ్యంగా గత ఏడాది నవంబర్ 19న లక్ష మంది సొంత అభిమానుల సమక్షంలో ఆస్ట్రేలియా చేతిలో మన జట్టు ఓడిన క్షణాలు ఇంకా కళ్ల ముందే నిలిచాయి. వరుసగా 10 మ్యాచ్‌లలో విజయాల తర్వాత తుది మెట్టుపై రోహిత్ బృందం తడబడింది. ఇప్పుడు ఆ బాధను మరచి కాస్తంత ఉపశమనం పొందే అవకాశం వచ్చింది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను అందుకునే అరుదైన సందర్భం మళ్లీ టీమిండియా ముందు నిలిచింది. ఈసారి కూడా టోర్నీలో అజేయంగా భారత్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ గా వన్డే వరల్డ్ కప్‌లో చేజారిన ట్రోఫీని టి20ల్లో అందుకొని రోహిత్ శర్మ సగర్వంగా నిలుస్తాడా? తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న టి20 ప్రపంచ కప్‌తో విరాట్ కోహ్లి సంబరాలు చేసుకుంటాడా ఈరోజు రాత్రికల్లా తేలిపోతుంది..!మరోవైపు దక్షిణాఫ్రికా అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉంది. సఫారీ బృందం కూడా విజయం కోసం కసిగా, ఆకలిగా ఉంది... ఆ జట్టుకు కూడా వరల్డ్ కప్ టైటిల్ అనేది 32 ఏళ్ల కల... ఎప్పుడో 1998లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినా ఆ లెక్క వేరు... మొత్తంగా ఐదుసార్లు వన్డే వరల్డ్ కప్‌లలో, రెండుసార్లు టి20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ వరకు రాగలిగినా ఆ గండం దాటి ముందుకు వెళ్లలేకపోయింది. ఇప్పుడు మొదటిసారి ఫైనల్ వరకు వచ్చిన టీమ్ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. కీలక సమయాల్లో తడబడే ‘చోకర్స్’ ముద్రను చెరిపేసుకునే విధంగా సౌతాఫ్రికా టీమ్ చెలరేగింది. టోర్నీలో అక్కడక్కడా కాస్త ఇబ్బంది పడ్డా చివరకు ఫలితాన్ని తమవైపు మార్చుకొని వరుసగా ఎనిమిది విజయాలతో ఓటమి లేకుండా తుది పోరుకు అర్హత సాధించింది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమష్టి ప్రదర్శనతో టీమ్ దూసుకుపోతోంది. దశాబ్దం క్రితం అండర్–19 కెప్టెన్‌గా దక్షిణాఫ్రికాకు ఇప్పటి వరకు ఏకైక ప్రపంచకప్ ట్రోఫీని అందించిన మార్క్రమ్ గతంలో తమ దేశపు దిగ్గజాలకు సాధ్యం కాని ఘనతను నాయకుడిగా అందుకుంటాడా ఈరోజు రాత్రికల్లా తేలిపోతుంది...! బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): టి20 క్రికెట్లో ప్రపంచ చాంపియన్‌ను తేల్చే సమయం ఆసన్నమైంది. 27 రోజులు, 54 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొమ్మిదో టి20 వరల్డ్ కప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో నేడు జరిగే తుది పోరులో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.గతంలో భారత్ ఒకసారి ఈ టోర్నీని గెలుచుకోగా, దక్షిణాఫ్రికా ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఆఖరి సమరానికి ముందు ఇరు జట్లు టోర్నీలో ఓటమి లేకుండా అజేయంగా ఉన్నాయి. భారత్ తాము ఆడిన ఏడు మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికా తాము ఆడిన ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి సమరోత్సాహంతో ఫైనల్‌కు ‘సై’ అంటున్నాయి. ఎవరు విజయం సాధించినా... ఓటమి లేకుండా టైటిల్ అందుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. గతంలో జరిగిన డే అండ్ నైట్ ఫైనల్ మ్యాచ్‌లకు భిన్నంగా తొలిసారి టైటిల్ పోరు డే మ్యాచ్‌గా జరగనుండటం విశేషం. మార్పుల్లేకుండా... టీమిండియా ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌లలో 12 మంది బరిలోకి దిగారు. న్యూయార్క్ వేదికగా జరిగిన తొలి మూడు మ్యాచ్‌లలో పేసర్ సిరాజ్ ఆడగా, వెస్టిండీస్‌లో జరిగిన మ్యాచ్‌లలో అతని స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడాడు. ఇది మినహా మిగతా 10 మంది విషయంలో ఎలాంటి మార్పూ జరగలేదు. ఇప్పుడు కూడా సెమీఫైనల్ ఆడిన టీమ్‌తోనే భారత్ తుది పోరుకు వెళ్లే అవకాశముంది. ఒక్క శివమ్ దూబే బ్యాటింగ్ విషయంలోనే కాస్త ఆందోళన కనిపించినా... మిడిలార్డర్లో అతనికి బదులు సంజూ సామ్సన్ను నేరుగా ఫైనల్లో ఆడించే సాహసం చేయకపోవచ్చు. రోహిత్ శర్మ బ్యాటింగ్ పదును ఏమిటో గత రెండు మ్యాచ్‌లలో కనిపించింది. అతను ఇదే జోరు సాగిస్తే ఆరంభంలోనే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేస్తుంది. కోహ్లి వరుసగా విఫలమైనా... రోహిత్ ఆశించినట్లుగా ఫైనల్లో అతని స్థాయి ప్రదర్శన కనబరిస్తే చాలు. సూర్యకుమార్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు పంత్, పాండ్యాలు ధాటిగా ఆడితే జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో టీమిండియా మరింత బలంగా కనిపిస్తోంది. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్‌లను సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రత్యర్థి ఆటగాళ్లు విఫలమవుతుండగా... స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెలరేగితే సఫారీలు కుప్పకూలడం ఖాయం. ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్‌లో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడగా, బుమ్రా ముందు అంతా తలవంచారు. సమష్టితత్వంతో... దక్షిణాఫ్రికా ఇద్దరు ప్రధాన పేసర్లు రబాడ, నోర్జే ఆరుకంటే తక్కువ ఎకానమీతో ప్రత్యర్థి వికెట్లను పడగొట్టారు. వీరు ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటర్లను కట్టడి చేయగల సమర్థులు. జాన్సెన్ రూపంలో లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆ జట్టులో ఉండటం అదనపు ప్రయోజనం. ఇద్దరు స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, షమ్సీ కూడా అన్ని పిచ్‌లపై చెలరేగారు.అయితే పిచ్ పేస్‌కు అనుకూలంగా కనిపిస్తే ఒక స్పిన్నర్ స్థానంలో బార్టన్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఓపెనర్ డికాక్ బ్యాటింగ్‌కు మూల స్థంభంలా ఉండగా, మరో ఓపెనర్ హెన్డ్రిక్స్ చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేదు. టోరీ్నలో ఆకట్టుకోని కెపె్టన్ మార్క్రమ్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఫైనల్లో రావాలని జట్టు ఆశిస్తోంది. మిడిలార్డర్లో క్లాసెన్, మిల్లర్లపైనే జట్టు ఆధారపడుతోంది. ఇప్పటి వరకు అంచనాలకు తగినట్లుగా ఆడకపోయినా స్టబ్స్ దూకుడుగా ఆడగలడు. విడిగా చూస్తే ఒక్కొక్కరి ప్రదర్శన గొప్పగా లేకపోయినా... జట్టుగా తాము ప్రభావం చూపగలమని టీమ్ విశ్వాసంతో ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లి, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్ దీప్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెన్డ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, షమ్సీ, రబాడ, నోర్జే. పిచ్, వాతావరణం కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో తాజా ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్ రద్దు కాగా, మరో మ్యాచ్ స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’ వరకు వెళ్లింది. మిగిలిన వాటిలో 3 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు, 3 సార్లు ముందుగా బౌలింగ్ చేసిన జట్టు గెలిచాయి. కాబట్టి పిచ్ పెద్ద విషయం కాకపోవచ్చు. డే మ్యాచ్ కాబట్టి మంచు ప్రభావం ఉండదు. తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. భారత్ ఇప్పటికే ఈ పిచ్‌పై అఫ్గానిస్తాన్‌తో ఆడగా, దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఆడలేదు. మ్యాచ్ రోజున వర్ష సూచన ఉంది. అయితే సెమీస్ తరహాలోనే అక్కడక్కడా అంతరాయాలు కలగవచ్చు కానీ పూర్తిగా మ్యాచ్‌కు ఇబ్బంది ఉండదు. మ్యాచ్‌ను శనివారమే పూర్తి చేసేందుకు నిర్ణీత సమయంకంటే అదనంగా మరో 190 నిమిషాల సమయం కేటాయించారు. ఫైనల్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు పూర్తయితే శనివారమే ఫలితం తేల్చేస్తారు. అది కూడా సాధ్యం కాకపోతేనే ఎక్కడ ఆట ఆగిందో అక్కడి నుంచి రిజర్వ్ డే రోజు ఆట కొనసాగుతుంది. అదీ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 2 వన్డే, టి20 ఫార్మాట్లలో కేవలం రెండుసార్లు మాత్రమే రెండు జట్లు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరాయి. 1979 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు... 2024 టి20 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ ఘనత సాధించాయి.2 కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) తర్వాత మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) ప్రపంచ చాంపియన్íÙప్లలో జాతీయ జట్టుకు సారథ్యం వహించిన రెండో కెపె్టన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందనున్నాడు.1 నేటి ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు అరుదైన ఘనత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పుతుంది. వన్డే వరల్డ్‌కప్‌లో మాత్రం వెస్టిండీస్ (1975, 1979), ఆస్ట్రేలియా (2003, 2007) జట్లు రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించాయి. 26 అంతర్జాతీయ టి20ల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు జరిగాయి. 14 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... 11 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయింది. టి20 ప్రపంచకప్‌లలో ఈ రెండు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. 4 మ్యాచ్‌ల్లో భారత్, 2 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలుపొందాయి.ఫలానావారి కోసం కప్ గెలవాలనే నినాదాలకు నేను వ్యతిరేకం. బాగా ఆడి మ్యాచ్ గెలవడం ముఖ్యం తప్ప ఇతర విషయాలు పట్టించుకోను. 12 నెలల వ్యవధిలో మూడు ఐసీసీ ఫైనల్స్‌కు చేరడం అదీ మూడు వేర్వేరు ఫార్మాట్లు కావడం మా జట్టు నిలకడను చూపించింది. ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ కోసం సమయం లేకపోయినా ఆటగాళ్లంతా సిద్ధమయ్యే ఉన్నారు. మానసికంగా కూడా ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా తుది పోరుకు రెడీ అయ్యాం. ఇక్కడ ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడటం మాకు సానుకూలాంశమే. వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌నుంచి పాఠాలు నేర్చుకోవడం వంటిదేమీ లేదు. దాని కోసం కూడా బాగా సిద్ధమయ్యాం కానీ ఆ రోజు ప్రత్యర్థి మాకంటే మెరుగ్గా ఆడింది. అయినా పరాజయాలు మరచి ముందుకు సాగిపోవడం ఆటగాళ్ల లక్షణం. రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరగబోతున్న ఈ ఫైనల్ మాకు అనుకూలంగా సాగాలని కోరుకుంటున్నా. –రాహుల్ ద్రవిడ్, భారత హెడ్ కోచ్ వ్యూహాలు... ప్రతివ్యూహాలు... ఆరంభంలో లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో రోహిత్ ఇబ్బంది పడే బలహీనతను సొమ్ము చేసుకునేందుకు జాన్సెన్ను దక్షిణాఫ్రికా ఉపయోగించవచ్చు. ఫామ్‌లో లేని కోహ్లిపై రబాడ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తాడు. డికాక్‌ను బుమ్రా నిలువరించగలిగితే భారత్‌కు ఆధిపత్యం ఖాయం. పంత్ జోరును ఆపేందుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను వాడే అవకాశం ఉంది. మిడిలార్డర్లో అక్షర్, కుల్దీప్, జడేజాల స్పిన్‌ను క్లాసెన్, మిల్లర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది. ఇద్దరికీ చివరి మ్యాచా? భారత్ క్రికెట్‌కు సంబంధించి ఆల్‌టైమ్ గ్రేట్‌లుగా రోహిత్, కోహ్లిలది ప్రత్యేక స్థానం. గత 11 ఏళ్లుగా భారత్ ఓడిన ఐసీసీ ఫైనల్స్‌లో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ చేజారాక టి20 వరల్డ్ కప్ విజయంతోనైనా ముగించాలనే పట్టుదలతోఈ టోర్నీకి సిద్ధమయ్యారు. టెస్టు, వన్డేలను పక్కన పెడితే ఈ ఫార్మాట్లో కొత్త కుర్రాళ్లు దూసుకొచ్చేశారు.సత్తా చాటి తమదైన అవకాశం కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా కొనసాగడం అనేది ఇద్దరికీ మేలు చేయకపోవచ్చు. కాబట్టి గెలిచినా, ఓడినా వీరికి ఇదే చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ అయ్యే చాన్స్ ఉంది. రోహిత్ 2007 టి20 వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యుడు కాగా, కోహ్లి 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్. -
T20 World Cup: ‘ఫైనల్’ అడుగు ఎవరిదో! నేడు ఇంగ్లండ్‌తో భారత్ సెమీఫైనల్
టీమిండియా ఏడు నెలల్లో మరో ప్రపంచకప్ ఫైనల్‌పై గురి పెట్టింది. 2022 టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో తమను ఓడించి తుది పోరుకు అర్హత పొందిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పై బదులు తీర్చుకునేందుకు భారత జట్టు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది.‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్లు ఈ ఒక్క నాకౌట్ విజయంతో ఇంగ్లండ్ ను కసిదీరా ఇంటికి పంపొచ్చు... మనమేమో 10 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో మరోసారి ఫైనల్ చేరవచ్చు. బ్యాటింగ్ ఫామ్, బౌలింగ్ నిలకడ భారత్‌ను ఓ మెట్టుపైనే నిలబెడుతోంది. జార్జ్‌టౌన్: భారత్ ఇక అసలైన పోరుకు సిద్ధమైంది. గడిచిన 26 రోజులుగా ఆడిన మ్యాచ్‌లు వేరు, నేటి సెమీఫైనల్ పోరాటం వేరు. లీగ్, సూపర్–8 దశలు కావడంతో ఇన్నాళ్లూ కచ్చితంగా గెలవకపోయినా... ముందుకెళ్లే అవకాశమైతే ఉండింది. కానీ ఇది నాకౌట్ పోరు. అన్నీ గెలిచామన్న ధీమా కుదరదు. అలాగే ఇదీ గెలుస్తామన్న గ్యారంటీ లేదు. ఇంకా చెప్పాలంటే కప్ గెలవాలన్నా... ఆఖరి మెట్టుపై నిలవాలన్నా... ఈ రెండో మెట్టే గట్టిగా వేయాలి. లేదంటే అమీతుమీకి ముందే మన జైత్రయాత్రకు చెక్ పడుతుంది. పైగా ఇది టి20 ఫార్మాట్. ఈ మెరుపుల ఫార్మాట్‌ను బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లే కాదు... వరుణ దేవుడు కూడా శాసిస్తోంది. ఇది ఒక్కోసారి పెద్ద జట్లకు శాపంగా... ఉన్నపళంగా జఠిలంగా కూడా మారుతోంది. ఏడు జట్లను ఓడించాం కానీ... ఒక వార్మప్ మినహాయిస్తే... నాలుగు లీగ్ దశ పోటీలు, మూడు సూపర్–8 మ్యాచ్‌ల్లో ఏడు వేర్వేరు జట్లనైతే ఓడించాం. కానీ గట్టిగా జయించింది ఇద్దరినే! లీగ్ దశలో పాకిస్తాన్, ‘సూపర్–8’లో ఆ్రస్టేలియా ఈ రెండు మేటి జట్లపై గెలుపే ప్రపంచకప్ స్థాయి గెలుపని చెప్పొచ్చు. ఐర్లాండ్, అమెరికా, కెనడా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించడం టీమిండియా స్థాయికి ఏమాత్రం విషయం కానేకాదు. ఆ్రస్టేలియా లాంటి మేటి జట్టుపై కెపె్టన్ రోహిత్ శర్మ విధ్వంసం భారత బ్యాటింగ్‌ను మరోస్థాయిలో నిలబెడుతోంది. కానీ విరాట్ కోహ్లి వైఫల్యమే జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. బహుశా ఈ సెమీస్‌లో ఆ కరువు తీర్చు కుంటే అభిమానులకు ‘ఫైనల్ పండగే’ మిగులుతుంది. సూర్యకుమార్, దూబే, హార్దిక్ పాండ్యాలు దంచేయడం, బౌలింగ్‌లో బుమ్రాతో పాటు అర్‡్షదీప్ నిప్పులు చెరుగుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్పిన్నర్లు కుల్దీప్, జడేజా, అక్షర్ పటేల్‌లు కూడా జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. తడబడుతూ ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో మెగా ఈవెంట్ ను మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టు ఇక్కడిదాకా వచ్చేందుకు తడబడింది. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడింది కూడా! కానీ ఏ జట్టుపై, ఏ వేదికపై సాధికారికంగా ఆడిన దాఖలాలైతే లేవు. అయితే అసలైన ఈ నాకౌట్ సమరంలో కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్‌లు బ్యాట్ ఝుళిపిస్తే మాత్రం భారత్‌కు కష్టాలు తప్పవేమో! బౌలింగ్‌లో స్పిన్నర్ ఆదిల్ రషీద్ అద్భుతంగా రాణిస్తుండటం ప్రత్యర్థి బౌలింగ్ దళానికి బలంగా మారింది. 23 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 23 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. 12 మ్యాచ్‌ల్లో భారత్, 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. ప్రపంచకప్‌లో నాలుగుసార్లు తలపడగా... చెరో రెండు విజయాలతో సమంగా ఉన్నాయి.వర్షార్పణమైతే..గయానాలో బుధవారం వాన కురిసింది. మ్యాచ్‌కు వరుణ గండమైతే ఉంది. తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్ ఉదయం జరగనుండటంతో నిర్ణీత సమయం కటాఫ్ లేకుండా పొడిగింపు మాత్రం ఉంటుంది. భారీ వర్షంతో సెమీఫైనల్స్ రద్దయితే లీగ్, సూపర్–8 దశల్లో టాపర్‌గా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ చేరుతాయి. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), కోహ్లి, సూర్యకుమార్, రిషభ్ పంత్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్‡్షదీప్, బుమ్రా. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), సాల్ట్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, స్యామ్ కరన్, జోర్డాన్, ఆర్చర్, ఆదిల్ రషీద్, టాప్లీ. పిచ్, వాతావరణం గయానా పిచ్ బౌలర్లకు స్వర్గధామం. ఈ వేదికపై తొలుత బ్యాటింగ్ చేసిన జట్ల సగటు స్కోరు 127. అయితే లక్ష్యఛేదన మరీ దారుణం. సగటు స్కోరు 95 పరుగులే! కాబట్టి మెరుపుల్ని ఆశించడం అత్యాశే! మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. -
చరిత్రకు చేరువలో..
తరూబా (ట్రినిడాడ్): ఓ ఆసక్తికర సెమీస్ సమరం, ఓ కొత్త ఫైనలిస్టుకు వేదికైన ఈ ప్రపంచకప్‌లో అటు దక్షిణాఫ్రికా, ఇటు అఫ్గానిస్తాన్ ఎవరు ఫైనల్ చేరతారో గురువారం మధ్యాహ్నంలోపు తెలిసిపోతుంది. మెగా ఈవెంట్లోనే మేటి జట్లను తోసిరాజని బాగా ఆకట్టుకున్న ఏకైక జట్టు అఫ్గానిస్తాన్. తమ ఆట ఆషామాషీగా లేదని, సంచలన విజయాలు గాలివాటం కానేకాదని రషీద్ ఖాన్ బృందం నిరూపిస్తోంది. ఆతిథ్య విండీస్, పటిష్ట న్యూజిలాండ్ ఉన్న గ్రూప్ ‘సి’లో లీగ్ దశనే అఫ్గానిస్తాన్ దాటడం గొప్పనుకుంటే... ‘సూపర్–8’లో ఏకంగా 2021 చాంపియన్ ఆ్రస్టేలియానే కంగుతినిపించడం, బంగ్లాదేశ్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్న ఆఖరి మ్యాచ్‌లో పోరాడి గెలవడం క్రికెట్ చరిత్రలోనే నిలిచేలా చేసింది. అఫ్గాన్ సెమీస్ చేరడంతోనే రికార్డుల్లోకెక్కింది. ఇప్పుడు ఫైనల్ చేరి చరిత్ర పుటల్లోకెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమష్టిగా రాణిస్తుండటం అఫ్గాన్ పెను సంచలనాలకు కారణం కాగా... మరోవైపు గట్టి జట్టయిన దక్షిణాఫ్రికా మాత్రం ప్రతి మ్యాచ్‌ను కష్టపడుతూనే గెలుపొందడం విడ్డూరం. నెదర్లాండ్స్‌పై 103 పరుగుల లక్ష్యాన్ని 19వ ఓవర్లో ఛేదించడం, బంగ్లాదేశ్‌పై 4 పరుగులు, నేపాల్‌తో ఒక పరుగు తేడాతో గట్టెక్కడం సఫారీ స్థాయిని తక్కువ చేస్తోంది. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన అమెరికాపై 194/4లాంటి భారీస్కోరు చేసినా కేవలం 18 పరుగులతోనే గెలుపొందడం... ఇలా ప్రతీ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా పెద్ద పెద్ద పోరాటాలే చేసింది. ఇలాంటి జట్టుపై జోరుమీదున్న అఫ్గాన్ గెలిస్తే సంచలనమైతే అవుతుందేమో కానీ ఇందులో పెద్ద విశేషమైతే ఉండదు. మొత్తం మీద తొలి ఫైనల్ అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది. జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కేశవ్, రబాడ, నోర్జే, షమ్సీ.అఫ్గానిస్తాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), గుర్బాజ్, ఇబ్రహీమ్, అజ్మతుల్లా, గుల్బదిన్, నబీ, కరీమ్, నంగేయలియా, నూర్ అహ్మద్, నవీనుల్ హక్, ఫరూఖీ. 2 దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు టి20 మ్యాచ్‌లు జరగ్గా... రెండింటిలోనూ దక్షిణాఫ్రికానే గెలిచింది. 2010 ప్రపంచకప్‌లో 59 పరుగులతో, 2016 ప్రపంచకప్‌లో 37 పరుగులతో దక్షిణాఫ్రికా నెగ్గింది. -
T20 World Cup: అఫ్‘గన్’ పేలింది
కన్నీళ్లు ఆగడం లేదు... భావోద్వేగాలను నియంత్రించుకోవడం సాధ్యం కావడం లేదు... పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించేందుకు పదాలు దొరకడం లేదు... ఒకరు కాదు, ఇద్దరు కాదు అందరి ఆటగాళ్లది ఇదే పరిస్థితి... తాము సాధించిన ఘనత ఎంత అసాధారణమైనదో వారికి తెలుస్తున్నా ఇంకా నమ్మశక్యంగా అనిపించని స్థితి... సొంత దేశంలో క్రికెట్ మైదానంలో అడుగు పెట్టడమే కష్టంగా మారిపోగా... జట్టు సభ్యులంతా కలిసి సాధన చేసే అవకాశం లేకపోగా... ఎప్పుడో టోర్నీకి ముందు కలిసి ప్రాక్టీస్ చేయడమే... కానీ తమ పోరాటం, పట్టుదల ముందు వాటన్నంటినీ చిన్న విషయాలుగా మార్చేసింది. అగ్రశ్రేణి జట్లు క్రికెట్‌ను శాసిస్తున్న చోట అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ అసాధారణ ఆటను చూపించింది... అద్భుత ఆటతో సత్తా చాటుతూ ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.టోర్నీకి ముందు అంచనాలు లేవు... అండర్డాగ్ కిందే లెక్క.. కానీ లీగ్ దశలో న్యూజిలాండ్‌పై భారీ విజయం గాలివాటం కాదని, సూపర్–8లో ఆ్రస్టేలియాను చిత్తు చేసిన వైనం అదృష్టం వల్ల కాదని అఫ్గానిస్తాన్ నిరూపించింది... గత టి20 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయానికి కూడా నోచుకోని జట్టు ఇప్పుడు ఏకంగా సెమీస్ చేరింది. బంగ్లాదేశ్‌తో చివరి సూపర్–8 పోరులో విజయం దోబూచులాడింది. 115 పరుగులు మాత్రమే చేసి దానిని కాపాడుకోవడం అంత సులువు కాదు. కానీ అఫ్గాన్ ఆటగాళ్లంతా ప్రాణాలు పణంగా పెట్టినట్లు మైదానంలో పోరాడారు... మళ్లీ మళ్లీ పలకరిస్తూ వచ్చిన వర్షంతో కూడా పోటీ పడాల్సి వచ్చి0ది... చివరకు తాము అనుకున్నది సాధించారు. బంగ్లాపై పైచేయి సాధించి తొలిసారి ఓ ఐసీసీ టోర్నీలో సగర్వంగా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోగా, తాము ఎప్పటికీ మారమన్నట్లుగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు నిష్క్రమించారు. కింగ్స్టౌన్ (సెయింట్ విన్సెంట్): ‘కమాన్ బంగ్లాదేశ్’... భారత్‌తో ఓటమి తర్వాత ఆ్రస్టేలియా కెప్టెన్ మిచెల్ మార్‡్ష మాట ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ జట్టు కూడా మరో టీమ్ ప్రదర్శనను నమ్ముకుంటూ అదృష్టం పలకరిస్తుందేమోనని ఆశపడింది. బంగ్లాదేశ్ గెలిస్తే తాము సెమీఫైనల్ చేరవచ్చని కంగారూలు కలగన్నారు. కానీ అఫ్గానిస్తాన్ ఆ అవకాశం ఇవ్వలేదు. మంగళవారం జరిగిన గ్రూప్–1 చివరి సూపర్–8 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ టీమ్... రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడతాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. రహ్మనుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం రావడంతో ఒక ఓవర్ తగ్గించి లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (49 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం వృథా కాగా... జట్టులో నలుగురు డకౌటయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవీన్ ఉల్ హక్ (4/26), కెపె్టన్ రషీద్ ఖాన్ (4/23) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తాజా ఫలితంతో గ్రూప్–1 నుంచి 2 విజయాలతో 4 పాయింట్లు సాధించిన అఫ్గానిస్తాన్ రెండో స్థానంతో సెమీస్ చేరింది. బంగ్లాదేశ్ ఓటమితో ఆస్ట్రేలియా జట్టు కూడా ‘సూపర్–8’ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆద్యంతం ‘డ్రామా’ సాగి... స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్ పలు మలుపులతో ఆసక్తికరంగా సాగింది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో విజయం దోబూచులాడింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ మినహా అంతా విఫలమయ్యారు. అతను కూడా తన శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. చివర్లో రషీద్ ఖాన్ (10 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్స్‌లు) మెరుపులతో స్కోరు 100 పరుగులు దాటింది. రన్‌రేట్‌లో అఫ్గాన్, ఆసీస్‌లను దాటి సెమీస్ చేరాలంటే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ మైదానంలోకి దిగింది. అయితే సెమీస్ సంగతేమో కానీ ఆ జట్టు మ్యాచ్ గెలిచే అన్ని అవకాశాలను కూడా వృథా చేసుకుంది. ఫజల్ తన తొలి ఓవర్లోనే తన్జీద్ (0)ను అవుట్ చేయగా, నవీన్ వరుస బంతుల్లో నజు్మల్ (5), షకీబ్ (0)లను అవుట్ చేయడంతో స్కోరు 23/3 వద్ద నిలిచింది. ఈ దశలో వాన వచ్చి ఆగిన తర్వాత రషీద్ వరుస ఓవర్లలో సౌమ్య సర్కార్ (10), తౌహీద్ (14)లను వెనక్కి పంపించాడు. అయినా సరే చేతిలో 5 వికెట్లతో 56 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ గెలిచే స్థితిలో నిలిచింది. కానీ రషీద్ మళ్లీ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నాడు. 81/7 నుంచి బంగ్లా డక్‌వర్త్ లూయిస్ స్కోరుతో పోటీ పడుతూ వచ్చింది. ఒక ఎండ్‌లో నిలిచిన దాస్ ఎంతో ప్రయత్నించినా... మరోవైపు మిగిలిన మూడు వికెట్లు తీసేందుకు అఫ్గాన్ బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ముస్తఫిజుర్‌ను నవీన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో అఫ్గాన్ ఆటగాళ్లు, అభిమానుల సంబరాలతో మైదానం హోరెత్తిపోగా... అక్కడి నుంచి దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరంలో కాబూల్‌లో కూడా ఆ విజయధ్వానం బ్రహ్మాండంగా వినిపించింది! ఉత్తమ నటుడు గుల్బదిన్! 11.4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోరు 81/7 వద్ద వానతో మ్యాచ్ ఆగినప్పుడు ఒక ఆసక్తికర ఘటన జరిగింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆ సమయానికి బంగ్లా 2 పరుగులు వెనుకబడి ఉంది. అక్కడే మ్యాచ్ ముగిసిపోతే అఫ్గాన్ గెలుస్తుంది. ఈ దశలో పరిస్థితి మెరుగ్గా ఉంది, తొందరపడ వద్దన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ సైగ చేశాడు. అప్పటి వరకు స్లిప్‌లో చక్కగా ఫీల్డింగ్ చేస్తున్న గుల్బదిన్ ‘అలా అయితే ఓకే’ అన్నట్లుగా ఒక్కసారిగా కండరాలు పట్టేశాయంటూ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే పిచ్‌పై కవర్లు వచ్చేశాయి. అయితే ఆ తర్వాత మళ్లీ చక్కగా మైదానంలోకి దిగిన గుల్బదిన్ తర్వాతి వికెట్ కూడా తీశాడు. దాంతో ఇదంతా నటన అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మ్యాచ్ తర్వాత రషీద్ మాత్రం తన ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. నిజానికి అక్కడే మ్యాచ్ ముగిసి ఉంటే వివాదం జరిగేదేమో కానీ ఆట కొనసాగి ఆలౌట్ వరకు వెళ్లడంతో ఇది సమస్యగా మారలేదు.‘వెల్డన్’ అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్తాన్ ప్రస్థానం అసాధారణంఅగ్రశ్రేణి జట్లకు దీటుగా ఎదిగిన వైనం‘మిమ్మల్ని నిరాశపర్చము, మీ నమ్మకాన్ని నిలబెడతాం’... టి20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు జరిగిన వెల్కమ్ పార్టీలో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాతో రషీద్ ఖాన్ అన్న మాట ఇది. ఎందుకంటే ఈ టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్ల పేర్లు చెప్పమని మాజీలు, విశ్లేషకులతో అడిగితే ఒక్క లారా మాత్రమే అఫ్గానిస్తాన్ పేరు చెప్పాడు. వారి ఆటపై అతనికి ఉన్న నమ్మకాన్ని ఇది చూపించింది. రేపు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలోనే రషీద్ బృందం సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది! గత కొన్నేళ్లుగా అటు వన్డే, ఇటు టి20 ఫార్మాట్లలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన అఫ్గానిస్తాన్ ఇప్పుడు ‘సంచలనాల’ జట్టు నుంచి సమర్థమైన జట్టుగా ఎదిగింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేంద్రంగానే తమ హోం మ్యాచ్‌లు ఆడుతోంది. ఆటగాళ్లంతా కూడా అక్కడే దాదాపుగా స్థిరపడ్డారు. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనే అఫ్గానిస్తాన్ పదును ఏమిటో ప్రపంచానికి తెలిసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్లను ఓడించిన టీమ్, ఆ్రస్టేలియాను కూడా ఒకదశలో 91/7తో ఓటమి దిశగా నెట్టింది. ఆసీస్ అదృష్టవశాత్తూ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ జట్టును గెలిపించినా... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్ లో నాటి పనిని అఫ్గాన్ పూర్తి చేసింది. –సాక్షి క్రీడా విభాగం10 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్ (వన్డే/టి20) టోర్నీల చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన పదో జట్టుగా అఫ్గానిస్తాన్ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (1975), ఇంగ్లండ్ (1975), న్యూజిలాండ్ (1975), వెస్టిండీస్ (1975), పాకిస్తాన్ (1979), భారత్ (1983), దక్షిణాఫ్రికా (1992), శ్రీలంక (1996), కెన్యా (2003) జట్లు ఉన్నాయి. 1 ప్రపంచకప్ టోర్నీల్లో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ తొలిసారి విజయం అందుకుంది. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో (టి20; 2014లో...వన్డే వరల్డ్‌కప్; 2015, 2019, 2023) అఫ్గానిస్తాన్ ఓడిపోయింది.9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం రషీద్ ఖాన్కిది తొమ్మిదిసారి. షకీబ్ అల్ హసన్ (8 సార్లు) పేరిట ఉన్న రికార్డును రషీద్ బద్దలు కొట్టాడు.న్యూజిలాండ్, ఆ్రస్టేలియావంటి జట్లను ఓడించి సెమీస్ వరకు సాగిన మీ ప్రయాణం అద్భుతం. మీ శ్రమకు, పట్టుదలకు ఫలితమే ఈ విజయం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. దీనిని ఇలాగే కొనసాగించండి. – సచిన్ టెండూల్కర్ మైదానంలో దృశ్యాలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. అఫ్గాన్‌కు గొప్ప విజయమిది. తొలిసారి సెమీస్ చేరిన పఠాన్లలో భావోద్వేగాలు బలంగా కనిపిస్తున్నాయి. అత్యుత్తమ క్రికెట్ ప్రదర్శన ఇది. –యువరాజ్ సింగ్ -
జోరు కొనసాగించాలని...
గ్రాస్ ఐలెట్: టి20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు ఆస్ట్రేలియా రూపంలో నేడు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్–1లో టాప్‌లో ఉన్న భారత జట్టు ఆసీస్‌పై నెగ్గితే దర్జాగా సెమీఫైనల్ చేరుకుంటుంది. రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ రాణిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. బుమ్రా, అర్‡్షదీప్ పేస్‌కు తోడు కుల్దీప్ స్పిన్ తోడైతే ఆ్రస్టేలియాకు కష్టాలు తప్పవు. మరోవైపు భారత్‌పై గెలిచి సెమీఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలని ఆ్రస్టేలియా పట్టుదలతో ఉంది. అయితే భారత్, ఆ్రస్టేలియా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్ ఐదు పాయింట్లతో సెమీఫైనల్ చేరుకుంటుంది. ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశాలన్నీ అఫ్గానిస్తాన్–బంగ్లాదేశ్ మధ్య మంగళవారం ఉదయం కింగ్స్టౌన్లో జరిగే మ్యాచ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే ఆ్రస్టేలియా 3 పాయింట్లతో సెమీఫైనల్ చేరుతుంది. అఫ్గానిస్తాన్ గెలిస్తే ఆ జట్టు 4 పాయింట్లతో సెమీఫైనల్ చేరుకొని ఆ్రస్టేలియాను ఇంటిదారి పట్టిస్తుంది. ఒకవేళ భారత జట్టుపై ఆ్రస్టేలియా 41 పరుగుల తేడాతో గెలిచి... అఫ్గానిస్తాన్ జట్టు 81 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే మాత్రం రన్‌రేట్‌లో వెనుకబడి టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. టి20 ప్రపంచకప్‌లో నేడుదక్షిణాఫ్రికా X వెస్టిండీస్వేదిక: నార్త్‌సౌండ్; ఉదయం గం. 6 నుంచిభారత్ X ఆ్రస్టేలియావేదిక: గ్రాస్ ఐలెట్; రాత్రి గం. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
AUS vs AFG : ఉత్కంఠ పోరులో ఆసీస్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్ (ఫొటోలు)
-
T20 World Cup: బంగ్లాపై విజయభేరి.. భారత్ సెమీ ఫైనల్ చేరడం లాంఛనమే!
నార్త్‌సౌండ్: భారత్ ఆల్‌రౌండ్ షోకు బంగ్లాదేశ్ తెల్లమొహం వేసింది. బ్యాటింగ్‌లో కలిపికొట్టి, తర్వాత పేస్, స్పిన్‌తో వికెట్లను చెదరగొట్టింది. టి20 ప్రపంచకప్ సూపర్–8 రెండో మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా ఇక సెమీస్‌కు చేరడం లాంఛనమే. టాస్ నెగ్గిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (28 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (24 బంతుల్లో 34; 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. కెప్టెన్ నజు్మల్ హుస్సేన్ (32 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కొద్దిగా ప్రతిఘటించగలిగాడు. కుల్దీప్ 3, బుమ్రా, అర్ష్ దీప్ చెరో 2 వికెట్లు తీశారు. సూపర్–8 దశలో తమ చివరి మ్యాచ్‌లో సోమవారం ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. కలిసిమెలిసి దంచేసి... కోహ్లితో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ (11 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో ఓవర్లోనే అవుటయ్యాడు. ఈ కాసేపట్లోనే వేయాల్సినంత వేగవంతమైన పునాదిని వేసి వెళ్లాడు. ఇక కోహ్లి, పంత్ తమ కెపె్టన్ వేగాన్ని అందిపుచ్చుకోవడంతో పవర్‌ప్లేలో భారత్ 53/1 స్కోరు చేసింది. పవర్‌ప్లే ఆఖరి ఓవర్ (6)లో కోహ్లి కొట్టిన సిక్సర్‌తోనే జట్టు స్కోరు 50కి చేరింది. రిషాద్ వేసిన 8వ ఓవర్లో కోహ్లి మరో సిక్స్ బాదాడు. పంత్ కూడా బౌండరీ కొట్టడంతో 8 బంతుల ఈ సుదీర్ఘ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇది భారత శిబిరాన్ని ఉత్సాహపరిస్తే... మరుసటి 9వ ఓవర్ భారత్‌ను దెబ్బమీద దెబ్బ తీసింది. తొలి బంతికే కోహ్లి, మూడో బంతికి సూర్యకుమార్ (6)లను తన్జీమ్ పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ వికెట్ల ప్రభావం ఇన్నింగ్స్‌పై పడకుండా తర్వాత వచి్చన బ్యాటర్లు చెలరేగారు. హార్దిక్ మెరుపు ఫిఫ్టీ 11వ ఓవర్ నుంచి శివమ్ దూబే అండతో రిషభ్ పంత్ బ్యాట్ ఝుళిపించాడు. ముస్తఫిజుర్ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్ బాదాడు. మరుసటి ఓవర్లో రిషాద్పై విరుచుకుపడే క్రమంలో 6, 4 కొట్టిన పంత్ అదే జోరులో ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. 14 ఓవర్లలో భారత్ 120/4 స్కోరు చేసింది. ఆ తర్వాత 6 ఓవర్లలోనే (36 బంతులు) 76 పరుగులు చేసింది.ఇంత స్కోరుకు, ఇన్నింగ్స్ జోరుకు హార్దిక్ పాండ్యా కారణమయ్యాడు. 15వ ఓవర్లో 6, 4తో 14 పరుగులు, 16, 17 ఓవర్లలో దూబే ఒక్కో సిక్సర్‌తో వరుసగా 12 పరుగులు, 9 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో సిక్స్ కొట్టిన దూబే అవుట్ కాగా, హార్దిక్ మరో భారీ సిక్సర్ బాదడంతో 15 పరుగులొచ్చాయి. తన్జిమ్, ముస్తఫిజుర్ సహా బౌలర్లందరినీ చితకబాదిన హార్దిక్ 27 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. నజు్మల్ ఒక్కడే... టాప్–3 బ్యాటర్లలో లిటన్ దాస్ (13) విఫలమవగా, తన్జీద్ హసన్ (31 బంతుల్లో 29; 4 ఫోర్లు), కెపె్టన్ నజు్మల్ మెరుగ్గానే ఆడారు. ఒక వైపు నజు్మల్ పోరాడినా... మరోవైపు తౌహీద్ హ్రిదయ్ (4), ప్రతీ ప్రపంచకప్ ఆడిన విశేషానుభవజు్ఞడు షకీబ్ (11), మహ్ముదుల్లా (13) చేతులెత్తేయడంతో బంగ్లా పరాజయం తప్పలేదు. ఆఖర్లో రిషాద్ (10 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు . స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) జాకీర్ (బి) షకీబ్ 23; కోహ్లి (బి) తన్జీమ్ హసన్ 37; పంత్ (సి) తన్జీమ్ హసన్ (బి) రిషాద్ 36; సూర్యకుమార్ (సి) లిటన్ దాస్ (బి) తన్జీమ్ హసన్ 6; దూబే (బి) రిషాద్ 34; పాండ్యా నాటౌట్ 50; అక్షర్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–39, 2–71, 3–77, 4–108, 5–161. బౌలింగ్: మెహదీ హసన్ 4–0–28–0, షకీబ్ 3–0–37–1, తన్జీమ్ హసన్ 4–0–32–2, ముస్తఫిజుర్ 4–0–48–0, రిషాద్ హుస్సేన్ 3–0–43–2, మహ్ముదుల్లా 2–0–8–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 13; తన్జీద్ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 29; నజు్మల్ (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 40; తౌహీద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 4; షకీబ్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 11; మహ్ముదుల్లా (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 13; జాకిర్ అలీ (సి) కోహ్లి (బి) అర్ష్ దీప్ 1; రిషాద్ (సి) రోహిత్ (బి) బుమ్రా 24; మెహిది హసన్ నాటౌట్ 5; తన్జీమ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–35, 2–66, 3–76, 4–98, 5–109, 6–110, 7–138, 8–145. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–30–2, బుమ్రా 4–0–13–2, అక్షర్ 2–0–26–0, హార్దిక్ పాండ్యా 3–0–32–1, జడేజా 3–0–24–0, కుల్దీప్ 4–0–19–3. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: కింగ్స్టౌన్; ఉ.గం.6.00 నుంచి ఇంగ్లండ్ X అమెరికా వేదిక: బ్రిడ్జ్‌టౌన్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2024: సెమీఫైనల్ లక్ష్యంగా...
నార్త్‌సౌండ్ (ఆంటిగ్వా): టి20 వరల్డ్ కప్‌లో ఓటమి లేకుండా అజేయంగా సాగుతున్న భారత్ సెమీఫైనల్ వేటలో మరో కీలక సమరానికి సిద్ధమైంది. సూపర్–8 దశలో భాగంగా గ్రూప్–1లో నేడు జరిగే పోరులో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై అలవోకగా నెగ్గిన టీమిండియా అమితోత్సాహంతో ఉండగా... తమ మొదటి మ్యాచ్‌లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడి మధ్య మరో మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమవుతుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ ఓడితే బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే మరో సందేహం లేకుండా భారత జట్టే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. రోహిత్, కోహ్లి రాణిస్తే... టోరీ్నలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లను బట్టి చూస్తే ఓపెనర్లు రోహిత్, కోహ్లిల బ్యాటింగ్‌పై మాత్రమే కాస్త ఆందోళన కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై రోహిత్ అర్ధ సెంచరీ చేసినా, తర్వాతి మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమైన కోహ్లి...అఫ్గాన్‌పై 24 పరుగులు చేసినా అది అతని స్థాయికి తగిన ఇన్నింగ్స్ కాదు. ఈ నేపథ్యంలో బంగ్లాపై వీరిద్దరు చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. శివమ్ దూబే కూడా ఆశించిన రీతిలో ఆడటం లేదు. మిడిలార్డర్లో లెఫ్ట్ హ్యాండర్‌గా ఏకైక ప్రత్యామ్నాయం కావడంతో అతనికి మరో అవకాశం దక్కవచ్చు. ఇది మినహా ఇతర అంశాల్లో జట్టు పటిష్టంగా ఉంది. సూర్యకుమార్, పంత్‌ల బ్యాటింగ్‌తో పాటు పాండ్యా కూడా దూకుడుగా ఆడటం భారత్‌కు సానుకూలాంశం. బౌలింగ్‌లో అఫ్గాన్‌పై కుల్దీప్ ఆకట్టుకున్న నేపథ్యంలో తుది జట్టులో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. అన్నింటా తడబాటు... సూపర్–8కు చేరినా లీగ్ దశలోనూ బంగ్లాదేశ్ ఆట అంతంతమాత్రమే. ఆసీస్‌తో పోరులో కూడా అది కనిపించింది. టాపార్డర్‌లో ఒక్క దూకుడైన బ్యాటర్ కూడా లేకపోవడం జట్టు ప్రధాన బలహీనత. తౌహీద్ ఫర్వాలేదనిపించడం మినహా ప్రధాన బ్యాటర్లు తన్జీద్, దాస్, కెపె్టన్ నజు్మల్ వరుసగా విఫలమయ్యారు. సీనియర్ మహ్ముదుల్లా కూడా ప్రభావం చూపలేదు. రికార్డు స్థాయిలో 9వ టి20 వరల్డ్ కప్ ఆడుతున్న షకీబ్ ఒక్క మ్యాచ్ మినహా బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. 4 ఇన్నింగ్స్‌లలో కలిపి 2 వికెట్లు తీశాడు. భారత్‌పై అతను ఏమైనా ఆకట్టుకోగలడా అనేది చూడాలి. బౌలర్లు ముస్తఫిజుర్, తన్జీమ్, తస్కీన్ నిలకడగా రాణించడం వల్లే బంగ్లా ఇక్కడి వరకు వచ్చింది. వీరు టీమిండియా స్టార్ బ్యాటర్లను ఎంత వరకు నిలువరిస్తారనేది ఆసక్తికరం. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X అమెరికావేదిక: బ్రిడ్జ్‌టౌన్; ఉదయం గం. 6 నుంచి భారత్ X బంగ్లాదేశ్వేదిక: నార్త్‌సౌండ్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
SA Vs ENG: దక్షిణాఫ్రికా సూపర్...
గ్రాస్ ఐలెట్: టి20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా దాదాపు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో శుక్రవారం చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే అమెరికాను ఓడించింది. ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (38 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిల్లర్ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. డికాక్ దూకుడుతో పవర్‌ప్లేలోనే 63 పరుగులు చేసిన సఫారీ టీమ్ ఆ తర్వాత తడబడింది. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తర్వాతి 84 బంతుల్లో 100 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. హ్యారీ బ్రూక్ (37 బంతుల్లో 53; 7 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 42 బంతుల్లోనే 78 పరుగులు జోడించారు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ 46 పరుగులు చేయాల్సి ఉండగా... బార్త్‌మన్ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 18 బంతుల్లో 25గా మారింది. బ్రూక్, లివింగ్‌స్టోన్ క్రీజ్‌లో ఉండటంతో పాటు చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ గెలిచే స్థితిలో నిలిచింది. అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ, జాన్సెన్, నోర్జే ఒక్కసారిగా ఆటను మార్చేశారు. తర్వాతి 3 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 17 పరుగులే ఇచ్చారు. దాంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. -
T20 World Cup 2024 Super 8: అఫ్గాన్‌పై అలవోకగా...
టి20 ప్రపంచ కప్ ‘సూపర్–8’ దశలో భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. అఫ్గానిస్తాన్ చక్కటి బౌలింగ్‌తో టీమిండియా ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా ఆపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించింది. ఈ ఫార్మాట్లో తన నంబర్‌వన్ హోదాకు న్యాయం చేస్తూ, తనేంటూ నిరూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఛేదనలో అఫ్గాన్ టీమ్ ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. టీమిండియా పదునైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను సమర్పించుకుంది. ఇక మరో ఆసియా జట్టు బంగ్లాదేశ్‌తో శనివారం భారత్ తర్వాతి సమరానికి సిద్ధమైంది. బ్రిడ్జ్‌టౌన్: వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ చేరే దిశగా భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. సూపర్–8 గ్రూప్–1లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రషీద్ ఖాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. బుమ్రా (3/7), అర్‡్షదీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కీలక భాగస్వామ్యం... ఆరంభం నుంచే తడబడుతూ ఆడిన రోహిత్ శర్మ (13 బంతుల్లో 8; 1 ఫోర్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత రషీద్ రెండు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. నబీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో జోరు ప్రదర్శించిన రిషభ్ పంత్ (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోగా...రషీద్ తర్వాతి ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో విరాట్ కోహ్లి (24 బంతుల్లో 24; 1 సిక్స్) అవుటయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు వేగంగా సాగింది. రషీద్ ఓవర్లో సూర్య ఫోర్, సిక్స్ కొట్టగా... అదే ఓవర్లో మరో ఎండ్‌లో శివమ్ దూబే (7 బంతుల్లో 10; 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో సూర్యకు పాండ్యా జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో జట్టు మెరుగైన స్థితికి చేరింది. నూర్ ఓవర్లో పాండ్యా వరుసగా 4, 6 కొట్టగా... ఫజల్ ఓవర్లో సూర్య వరుసగా 6, 4 బాది 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి బంతికే అతను అవుట్ కాగా, మరుసటి ఓవర్లో పాండ్యా ఆట ముగిసింది. జడేజా (5 బంతుల్లో 7; 1 ఫోర్) ప్రభావం చూపలేకపోగా, ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ (6 బంతుల్లో 12; 2 ఫోర్లు) కీలక పరుగులు రాబట్టాడు. తొలి 10 ఓవర్లలో జట్టు 79 పరుగులు చేయగా, తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. మరోవైపు గురువారం మరణించిన భారత మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్‌కు నివాళిగా మన ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బుమ్రా తొలి ఓవర్లో అనవసర షాట్‌కు ప్రయత్నించి గుర్బాజ్ (11; 1 ఫోర్, 1 సిక్స్) అవుట్ కావడంతో మొదలైన జట్టు పతనం వేగంగా సాగింది. ఎవరు కూడా భారత బౌలింగ్ ముందు పట్టుదలగా నిలవలేకపోయారు. చెప్పుకోదగ్గ బౌలింగ్ వనరులు ఉన్నా ...ఎప్పటిలాగే బ్యాటర్ల వైఫల్యం దెబ్బ తీసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ఫజల్ 8; కోహ్లి (సి) నబీ (బి) రషీద్ 24; పంత్ (ఎల్బీ) (బి) రషీద్ 20; సూర్యకుమార్ (సి) నబీ (బి) ఫజల్ 53; దూబే (ఎల్బీ) (బి) రషీద్ 10; పాండ్యా (సి) అజ్మతుల్లా (బి) నవీన్ 32; జడేజా (సి) గుల్బదిన్ (బి) ఫజల్ 7; అక్షర్ (రనౌట్) 12; అర్‡్షదీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–11, 2–54, 3–62, 4–90, 5–150, 6–159, 7–165, 8–181. బౌలింగ్: ఫజల్ హక్ 4–0–33–3, నబీ 3–0–24–0, నవీన్ ఉల్ హక్ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–26–3, నూర్ అహ్మద్ 3–0–30–0, అజ్మతుల్లా 2–0–23–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) పంత్ (బి) బుమ్రా 11; హజ్రతుల్లా (సి) జడేజా (బి) బుమ్రా 2; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 8; గుల్బదిన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 17; అజ్మతుల్లా (సి) అక్షర్ (బి) జడేజా 26; నజీబుల్లా (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 19; నబీ (సి) జడేజా (బి) కుల్దీప్ 14; రషీద్ (సి) జడేజా (బి) అర్ష్ దీప్ 2; నూర్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 12; నవీన్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 0; ఫజల్హక్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–23, 4–67, 5–71, 6–102, 7–114, 8–121, 9–121, 10–134. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–36–3, బుమ్రా 4–1–7–3, అక్షర్ పటేల్ 3–1–15–1, హార్దిక్ పాండ్యా 2–0–13–0, కుల్దీప్ 4–0–32–2, జడేజా 3–0–20–1. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా X బంగ్లాదేశ్వేదిక: నార్త్‌సౌండ్; ఉదయం గం. 6 నుంచి ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికావేదిక: గ్రాస్‌ఐలెట్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కోహీకి షాక్..ఓపెనర్ గా యశస్వి..?
-
‘ఎయిట్’లో సమరానికి సై!
ఎలాంటి విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శనలు లేవు...ఎలాంటి అసాధారణ బౌలింగ్ గణాంకాలు లేవు...ఐర్లాండ్, అమెరికాలపై సులువుగా గెలిస్తే పాక్ పోటీనిచ్చినా ఫలితం మన వైపే నిలిచింది. పెద్దగా ప్రతిఘటన లేకుండా ముందంజ వేసిన భారత జట్టు ఇప్పుడు దానిని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అప్పుడప్పుడు సంచలనాలతో అలరించే అఫ్గానిస్తాన్ ఎదురుగా నిలిచింది. బ్రిడ్జ్‌టౌన్: టి20 వరల్డ్ కప్‌లో లీగ్ దశతో పోలిస్తే కాస్త బలమైన ప్రత్యర్థులతో తలపడే అవకాశం ఉన్న సూపర్–8లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ కోసం సన్నద్ధమైంది. నేడు జరిగే పోరులో అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. లీగ్ దశలో ఓటమి లేకుండా సాగిన భారత జట్టే ఇక్కడా ఫేవరెట్‌గా కనిపిస్తుండగా...అఫ్గాన్ తమ బౌలింగ్ బలాన్నే నమ్ముకుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 8 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరగ్గా...భారత్ 7 గెలిచింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. అదే జట్టుతో... సూపర్–8లో పిచ్‌లు స్పిన్‌ను అనుకూలించే పరిస్థితి ఉంది కాబట్టి భారత్ కుల్దీప్ను తీసుకోవచ్చనే చర్చ జరిగింది. అయితే అక్షర్ అటు స్పిన్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌తో కూడా కీలక పరుగులు సాధిస్తుండటంతో మేనేజ్మెంట్ ఆ సాహసం చేయకపోవచ్చు. రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా చెలరేగితే జట్టుకు తిరుగుండదు. కోహ్లి అన్ని మ్యాచ్‌లలో విఫలమైనా...ఒక్క సరైన ఇన్నింగ్స్ అతని స్థాయిని చూపించగలదు. పంత్ మూడో స్థానంలో చక్కగా నిలదొక్కుకున్నాడు. అఫ్గాన్ స్పిన్నర్లపై ఎదురుదాడికి మిడిలార్డర్లో సూర్యకుమార్, దూబే సరైనవాళ్లు కాగలరు. ఆ తర్వాత కూడా పాండ్యా, జడేజా, అక్షర్ రూపంలో బ్యాటింగ్ బలగం ఉంది కాబట్టి సమస్య లేదు. బుమ్రా అద్భుత బౌలింగ్‌ను అఫ్గాన్ ఏమాత్రం ఎదుర్కోగలదనేది చూడాలి. స్పిన్నర్లు రాణిస్తే... గత మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడినా...అఫ్గానిస్తాన్ టీమ్‌లో ఆత్మస్థైర్యానికి లోటు లేదు. జట్టు ప్రధానంగా బౌలింగ్‌పైనే ఆధారపడుతోంది. టోరీ్నలో అత్యధిక వికెట్లు తీసిన ఫజల్ హక్ తన పదునైన పేస్, స్వింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. మధ్య ఓవర్లలో కెపె్టన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌పైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.గతంలో 2 సార్లే భారత్‌తో ఆడిన రషీద్ ఒక్క వికెట్ తీయకపోయినా...అతడిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. చైనామన్ స్పిన్నర్ నూర్ అతడికి అండగా నిలుస్తాడు. ఐపీఎల్ అనుభవంతో చెలరేగుతున్న గుర్బాజ్, మరో ఓపెనర్ ఇబ్రహీమ్ జట్టుకు మంచి ఆరంభాలు అందించారు. ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ను 212 పరుగుల స్కోరుతో అఫ్గాన్ ‘టై’ చేసిన విషయం మరచిపోవద్దు. పిచ్, వాతావరణం న్యూయార్క్‌లో పరుగులే రావడం గగనమైన పిచ్‌తో పోలిస్తే ఇది బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. టోర్నీలో ఒక సారి 200కు పైగా స్కోరూ నమోదైంది. వర్షసూచన లేదు. -
సఫారీ సూపర్ విక్టరీ
నార్త్‌సౌండ్: ప్రపంచ కప్ లీగ్ దశలో పెద్ద జట్లలో కనిపించిన అలసత్వం, చిన్న స్కోరుకే పడిన ఆపసోపాలు సూపర్–8కు వచ్చేసరికి దూరమైనట్లున్నాయి. బోర్ కొట్టించిన స్కోర్ల స్థానంలో ఆసక్తికర ధనాధన్ సమరం టి20 మజాను పంచింది. దీంతో ఆడుతున్న తొలి టి20 ప్రపంచకప్‌లోనే ముందంజ వేసిన అమెరికా ఆటలు ఈ దశ (సూపర్–8)లో సాగలేదు. పటిష్టమైన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్ దెబ్బకు ఆతిథ్య అమెరికా ఓడింది. బుధవారం జరిగిన తొలి సూపర్–8 పోరులో సఫారీ టీమ్ 18 పరుగుల తేడాతో అమెరికా జట్టుపై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డికాక్ (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ షో చేశాడు. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్ (11) విఫలమైనా... వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మార్క్రమ్ (32 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) అండతో రెండో వికెట్‌కు చకచకా 110 పరుగులు జోడించాడు. తర్వాత 126 పరుగుల స్కోరు వద్ద డికాక్, మిల్లర్ (0) అవుటయ్యారు. అయితే హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 36 నాటౌట్; 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 20 నాటౌట్) ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. అనంతరం అమెరికా కొంత పోరాడినా లక్ష్యానికి దూరంగా ఉండిపోయింది. ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ అండ్రియెస్ గూస్ (47 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు.అతనికి జోడీగా దిగిన స్టీవెన్ టేలర్ (14 బంతుల్లో 24; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా వేగంగా పరుగులు సాధించడంతో 3.2 ఓవర్లలోనే అమెరికా 33 పరుగులు చేసింది. కానీ మరుసటి బంతికి టేలర్ అవుటయ్యాక జట్టు నిలబడలేకపోయింది. నితీశ్ కుమార్ (8), కెపె్టన్ ఆరోన్ జోన్స్ (0), కోరీ అండర్సన్ (12), జహంగీర్ (3) ఇలా వచ్చి అలా వెళ్లి పోయారు.హర్మీత్ దేశాయ్ (22 బంతుల్లో 38)తో గూస్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరు కాసేపు భారీ షాట్లతో వణికించారు. అయితే హర్మీత్‌ను రబాడ (3/18) అవుట్ చేయడంతో ఆశలు ఆవిరయ్యాయి. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X ఇంగ్లండ్‌వేదిక: గ్రాస్ ఐలెట్; ఉ.గం.6.00 నుంచి భారత్ X అఫ్గానిస్తాన్ వేదిక: బ్రిడ్జ్‌టౌన్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టీ20 వరల్డ్ కప్‌లో నేటి నుంచి సూపర్-8
-
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాటర్ జో బర్న్స్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున సెంచరీలు (ఆస్ట్రేలియా, ఇటలీ) చేసిన ఆరో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే ఇటలీకి వలస వెళ్లిన బర్న్స్.. టీ20 వరల్డ్‌కప్ 2026 యూరోపియన్ క్వాలిఫయర్‌లో భాగంగా రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు.ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న బర్న్స్ 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. బర్న్స్ శతక్కొట్టుడుతో పాటు జస్టిన్ మోస్కా (30 బంతుల్లో 72; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రొమేనియా 17.4 ఓవర్లలో 84 పరుగులకే చాపచుట్టేసి 160 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..కెప్లెర్ వెసెల్స్- ఆస్ట్రేలియా (5 సెంచరీలు), సౌతాఫ్రికా (2 సెంచరీలు)ఇయాన్ మోర్గాన్- ఐర్లాండ్ (1), ఇంగ్లండ్ (15)ఎడ్ జాయ్స్- ఐర్లాండ్ (5), ఇంగ్లండ్ (1)గ్యారీ బ్యాలెన్స్- ఇంగ్లండ్ (4), జింబాబ్వే (1)మార్క్ చాప్మన్- హాంగ్‌కాంగ్ (1), న్యూజిలాండ్ (2)జో బర్న్స్- ఇంగ్లండ్ (4), ఇటలీ (1) -
2026 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే..!
భారత్, శ్రీలంక వేదికగా 2026లో జరిగే టీ20 వరల్డ్‌కప్ అర్హత సాధించే జట్లేవో తేలిపోయాయి. 2026 టీ20 వరల్డ్‌కప్ కూడా ప్రస్తుత ఎడిషన్ (2024) లాగే 20 జట్లతో జరుగుతుంది. ఇందులో 12 జట్లు నేరుగా అర్హత సాధించనుండగా.. మిగతా ఎనిమిది బెర్త్‌లు వివిధ రీజియనల్ పోటీల ద్వారా ఖరారు కానున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్‌లో సూపర్-8కు అర్హత సాధించిన జట్లు (భారత్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్) నేరుగా తదుపరి ఎడిషన్‌కు అర్హత సాధించనుండగా.. ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంక తొమ్మిదో జట్టుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.మిగతా మూడు స్థానాలు జూన్ 30, 2024 నాటి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రస్తుతం వరల్డ్‌కప్ నడుస్తుండటంతో ఈ టోర్నీ ఫలితాలు ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేయవు కాబట్టి ప్రస్తుతమున్న ర్యాంకింగ్సే జూన్ 30 వరకు యధాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ వరుసగా ఒకటి నుంచి పదకొండు స్థానాల్లో ఉన్నాయి.ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సూపర్-8కు చేరకుండా నిష్క్రమించిన న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ తదుపరి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే 10, 11, 12 జట్లవుతాయి. ఓవరాల్‌గా 2026 టీ20 వరల్డ్‌కప్‌కు భారత్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు అర్హత సాధిస్తాయి. మిగతా ఎనిమిది బెర్త్‌లు క్వాలిఫయర్ పోటీల ద్వారా నిర్ణయించబడతాయి. -
నేపాల్‌పై ఘన విజయం.. సూపర్‌కు 8 చేరిన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూపు-డి బంగ్లాదేశ్ తమ సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన గ్రూపు-డి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ బౌలర్లు సోమ్‌పాల్ కామి, దీపేంద్ర సింగ్ ఐరీ, రోహిత్ పౌడౌల్, లమచానే తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్(17) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అదరగొట్టిన బంగ్లా బౌలర్లు..బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. బంగ్లా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 85 పరుగులకే కుప్పకూలింది.బంగ్లా యువ పేసర్ టాంజిమ్ హసన్ షకీబ్ 4 వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ముస్తఫిజుర్ రెహ్మన్ 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు. నేపాల్ బ్యాటర్లలో కుశాల్ మల్లా(27) పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక సూపర్-8కు అర్హత సాధించిన బంగ్లాదేశ్ గ్రూపు-1లో ఆస్ట్రేలియా, భారత్, అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. -
T20 World Cup 2024: పాకిస్తాన్ చచ్చీ చెడి...
లాడర్‌హిల్ (ఫ్లోరిడా): పేలవ ఆటతో ‘సూపర్–8’ అవకాశాలు కోల్పోయిన పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ అతి కష్టమ్మీద నెగ్గి టి20 వరల్డ్ కప్‌ను ముగించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గారెత్ డెలానీ (19 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, జోష్ లిటిల్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాహిన్ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా... ఆమిర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. ఒకవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయినా... కెప్టెన్ బాబర్ ఆజమ్ (34 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) చివరి వరకు నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాహిన్ అఫ్రిది (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్‌లు) జట్టును గట్టెక్కించాడు. టి20 ప్రపంచకప్‌లో నేడుబంగ్లాదేశ్ X నేపాల్వేదిక: కింగ్స్టౌన్; ఉదయం గం. 5 నుంచినెదర్లాండ్స్ X శ్రీలంక వేదిక: గ్రాస్ ఐలెట్; ఉదయం గం. 6 నుంచిన్యూజిలాండ్ X పాపువా న్యూగినీవేదిక: ట్రినిడాడ్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 World Cup 2024: సూపర్-8లో గ్రూప్-2 బెర్త్‌లు ఖరారు
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-2కు సంబంధించిన సూపర్-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. నమీబియాపై ఇంగ్లండ్.. స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా విజయాలు సాధించడంతో గ్రూప్-బిలో రెండో బెర్త్ ఖరారైంది. ఈ గ్రూప్ నుంచి నెట్ రేట్ ఆధారంగా ఇంగ్లండ్ సూపర్-8 రెండో బెర్త్ ఖరారు చేసుకుగా.. ఆసీస్ ఇదివరకే గ్రూప్-బి నుంచి సూపర్-8కు అర్హత సాధించింది.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి. గ్రూప్-2లోని ఈ నాలుగు జట్లు మిగతా మూడు జట్లతో తలో మ్యాచ్ ఆడతాయి. అన్ని మ్యాచ్‌లు ముగిశాక మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)ఇదిలా ఉంటే, సూపర్-8 గ్రూప్-1కు సంబంధించిన బెర్త్‌లు కూడా దాదాపుగా ఖరారయ్యాయి. గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ (D2) జట్లు ఉంటాయి. ఇవాళ (జూన్ 16) జరిగే గ్రూప్-డి మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధిస్తే బంగ్లాదేశ్ సూపర్-8కు (గ్రూప్-1) అర్హత సాధిస్తుంది.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (సెయింట్ విన్సెంట్) -
భారత్ పోరు వర్షార్పణం
లాడర్‌హిల్: టి20 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్రను వరుణుడు అడ్డుకున్నాడు. గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం కెనడాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. భారత కాలమానం ప్రకారం ముందుగా రాత్రి 7.30 గంటలకు తొలిసారి మైదానాన్ని పరిశీలించారు. మైదానం సిద్ధం కాకపోవడంతో టాస్ ఆలస్యమైంది. అయితే ఆ తర్వాతా పరిస్థితి మెరుగుపడలేదు. చివరి సారిగా రాత్రి 9 గంటలకు పిచ్, అవుట్ ఫీల్డ్‌ను పూర్తి స్థాయిలో సమీక్షించిన ఫీల్డు అంపైర్లు ఇక ఆట జరిగే పరిస్థితి లేదని తేల్చేశారు. మరో సమీక్షకు తావు లేకుండా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి సంపూర్ణ విజయం సాధించే అవకాశం రాకపోయినా... ఇదివరకే సూపర్–8కు చేరిన భారత్ 7 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. కెనడా లీగ్ దశలో ఐర్లాండ్‌పై ఏకైక విజయాన్ని అందుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన సంతృప్తికరమనే చెప్పొచ్చు. కోహ్లి (1, 4, 0) మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచినా... దీన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. సూపర్–8లో అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కెపె్టన్ రోహిత్ ఒక అర్ధ సెంచరీ బాదగా, రిషభ్ పంత్ వన్‌డౌన్‌లో మెరుగ్గా ఆడాడు. ఐర్లాండ్, పాక్‌లతో విఫలమైన హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలిద్దరు అమెరికాతో జరిగిన పోరులో టచ్‌లోకి వచ్చారు. ఇక బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన బుమ్రా, హార్దిక్, సిరాజ్‌లతో పాటు అర్‡్షదీప్ రాణించాడు. స్పిన్నర్లు ఫర్వాలేదనిపించారు. దీంతో విజయాల జట్టును మార్చకుండానే బరిలోకి దిగింది. సూపర్–8లోనూ ఇదే పంథా కొనసాగించే అవకాశాలే ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్‌తో పాటు అమెరికా ముందంజ వేయగా, గత రన్నరప్ పాక్ లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా X స్కాట్లాండ్ వేదిక: గ్రాస్ ఐలెట్; ఉ.గం.6.00 నుంచి పాకిస్తాన్ X ఐర్లాండ్ వేదిక: లాడర్‌హిల్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంసూపర్–8లో భారత్ మ్యాచ్లుజూన్ 20 – అఫ్గానిస్తాన్‌తో (బ్రిడ్జ్‌టౌన్) జూన్ 22 – బంగ్లాదేశ్ (లేదా) నెదర్లాండ్స్‌తో (నార్త్‌సౌండ్) జూన్ 24 – ఆ్రస్టేలియాతో (గ్రాస్ ఐలెట్) -
IND Vs CAN: కోహ్లి చెలరేగితేనే... ‘సూపర్–8’ కోసం టీమిండియా సాధన!
అమెరికా గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి న్యూయార్క్‌లోనే ప్రాక్టీస్ మ్యాచ్, మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడిన భారత బృందం ఇప్పుడు అమెరికాలోనే మరో వేదికపై తమ సత్తాను చాటేందుకు సిద్ధమైంది. వరుసగా మూడు విజయాలతో ఇప్పటికే ‘సూపర్–8’ దశకు చేరిన జట్టు అప్రధాన్య పోరులో మరో పసి కూనను ఎదుర్కోనుంది.ఫామ్‌లో ఉన్న టీమిండియాకు కెనడా పోటీనివ్వడం కష్టమే అయినా తర్వాతి ప్రధాన మ్యాచ్‌లకు ముందు రోహిత్ బృందానికి మరో ప్రాక్టీస్ మ్యాచ్‌లాంటిదే. అయితే వర్షంతో ఆట జరుగుతుందా అనేది సందేహమే. లాడర్‌హిల్ (ఫ్లోరిడా): అమెరికాలో గత మూడు మ్యాచ్‌లలో పరుగుల కోసం మొఖం వాచిన భారత జట్టుకు కాస్త తెరిపినిచ్చే మైదానం సిద్ధమైంది. గతంలో పరుగుల వరద పారిన బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో కెనడాతో భారత్ తలపడుతుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయాలు సాధించిన భారత తమ స్థాయిని ప్రదర్శించగా... రెండు ఓటములతో కెనడా ఇప్పటికే ముందుకు వెళ్లే అవకాశాలు కోల్పోయింది. కోహ్లి చెలరేగితే... భారత జట్టుకు సంబంధించి ఈ మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా... తుది జట్టులో మార్పులు ఉంటాయా అనేది చూడాలి. ఫామ్‌పరంగా చూస్తే ఎవరినీ తప్పించే పరిస్థితి లేదు. కానీ ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం జడేజాకు బదులుగా కుల్దీప్ను ప్రయత్నించవచ్చు. జడేజా గత మ్యాచ్‌లో కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. అమెరికాతో పర్వాలేదనిపించిన దూబే స్థానంలో సామ్సన్‌కు మేనేజ్మెంట్ అవకాశం కల్పిస్తే సూపర్ –8కు ముందు ప్రాక్టీస్ లభిస్తుంది. ప్రస్తుత స్థితిలో యశస్వి, చహల్‌లు పెవిలియన్‌కే పరిమితం కావాల్సి రావచ్చు. అయితే అన్నింటికి మించి కోహ్లి ఫామ్‌లోకి రావాలని అంతా కోరుకుంటున్నారు. మూడు మ్యాచ్‌లలోనూ అతను సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లూ ఆకట్టుకున్నారు. రోహిత్, పంత్, సూర్య దూకుడైన బ్యాటింగ్‌ను నిలువరించడం కెనడాకు అంత సులువు కాదు. సమష్టిగా రాణించాలని... పాక్‌తో మ్యాచ్‌లో ఓడినా కెనడా గట్టి పోటీనిచ్చింది. విడిగా చూస్తే ఎవరికీ పెద్దగా పేరు లేకున్నా సమష్టి గా ఆ జట్టు వరల్డ్‌కప్‌లో తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్ దూకుడుగా ఆడగల సమర్థుడు. నికోలస్ కీర్తన్, మొవ్వ శ్రేయస్ కూడా ప్రధాన బ్యాటర్లు. వీరిలో ఏ ఇద్దరైనా రాణిస్తే జట్టుకు మంచి స్కోరు అందించగలరు. కెప్టెన్, ఆల్‌రౌండర్ సాద్ బిన్ జఫర్ మరో ప్రధాన ఆటగాడు కాగా... లెఫ్టార్మ్ పేసర్ కలీమ్ ప్రభావం చూపగల బౌలర్. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఐర్లాండ్‌ను ఓడించగలిగిన కెనడా... టాప్ టీమ్‌ను ఎలా ఎదుర్కోగలదో చూడాలి.టి20 ప్రపంచకప్‌లో నేడుదక్షిణాఫ్రికా X నేపాల్వేదిక: కింగ్స్టౌన్; ఉదయం గం. 5 నుంచిన్యూజిలాండ్ X ఉగాండావేదిక: ట్రినిడాడ్; ఉదయం గం. 6 నుంచిభారత్ X కెనడావేదిక: ఫ్లోరిడా; రాత్రి గం. 8 నుంచిఇంగ్లండ్ X నమీబియావేదిక: నార్త్‌సౌండ్; రాత్రి గం. 10:30 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అమెరికా ముందుకు... పాక్ ఇంటికి
లాడర్‌హిల్ (ఫ్లోరిడా): టి20 ప్రపంచ కప్‌లో అత్యంత కీలక ఫలితం! తొలిసారి ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆతిథ్య అమెరికా జట్టు సూపర్–8 దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఈ గ్రూప్ నుంచి భారత్ (6 పాయింట్లు), అమెరికా (5 పాయింట్లు) ముందంజ వేశాయి. ఆడిన 3 మ్యాచ్‌లలో ఒకటే గెలిచిన 2009 చాంపియన్ పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. గత రెండు టి20ల్లో వరల్డ్ కప్‌లలో వరుసగా సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరిన పాక్ ఈసారి పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. భారత్‌తో పాటు అమెరికా చేతిలో ఓడిన ఆ జట్టు కెనడాపై మాత్రం గెలవగలిగింది. ఈ గ్రూప్‌లో బలహీన కెనడాపై నెగ్గిన అమెరికా... పాక్‌పై సంచలన విజయం సాధించి తమ అవకాశాలు మెరుగుపర్చుకుంది. తాజా ఫలితంతో ఆదివారం ఐర్లాండ్‌తో తమ చివరి మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్‌లో పాక్ ఆట ముగిసింది. లాడర్‌హిల్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శుక్రవారం కూడా తెరిపినివ్వలేదు. నిర్ణీత సమయం నుంచి దాదాపు మూడు గంటల సుదీర్ఘ సమయం పాటు వేచి చూసినా ఫలితం లేకపోయింది. వర్షం తగ్గినా మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేయడం సాధ్యం కాలేదు. పదే పదే తనిఖీల తర్వాత కనీసం 5 ఓవర్ల ఆట అయినా నిర్వహించాలని ఆశించినా... మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆతిథ్య జట్టు హోదాలో బరిలోకి దిగి సూపర్–8కు చేరడం ద్వారా అమెరికా 2026 టి20 వరల్డ్ కప్‌కు కూడా నేరుగా అర్హత సాధించింది. -
T20 WC 2024: గెలిచి నిలిచిన బంగ్లాదేశ్
కింగ్స్టౌన్: టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ గెలిచి నిలిచింది. సూపర్–8 అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు గురువారం జరిగిన పోరులో బంగ్లా 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్ గెలుపుతో గ్రూప్ ‘డి’లోని మరో జట్టు శ్రీలంక అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ నెగ్గిన డచ్ జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గుచూపగా... తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (46 బంతుల్లో 64 నాటౌట్; 9 ఫోర్లు) రాణించాడు. టాపార్డర్‌లో కెపె్టన్ నజ్ముల్ హోస్సేన్ (1), లిటన్ దాస్ (1)ల వైఫల్యంతో 23 పరుగులకే బంగ్లా 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ తంజిద్ హసన్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి షకీబ్ మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.ఆఖర్లో మహ్మూదుల్లా (21 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాకిర్ అలీ (7 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. సైబ్రాండ్ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), విక్రమ్‌జీత్ సింగ్ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (23 బంతుల్లో 25; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడినప్పటికీ కీలకమైన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు. రిషాద్ హోస్సేన్ 3, టస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. టి20 ప్రపంచకప్‌లో నేడుఅఫ్గానిస్తాన్ X పాపువా న్యూగినీ వేదిక: ట్రినిడాడ్; ఉదయం గం. 6 నుంచిఅమెరికా X ఐర్లాండ్ వేదిక: లాడెర్‌హిల్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
106 రోజుల్లో నిర్మాణం... మరికొన్ని రోజుల్లో నేలమట్టం!
న్యూయార్క్: ప్రస్తుత టి20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్‌లో కేవలం 106 రోజుల్లో శరవేగంగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. ఆ్రస్టేలియా (అడిలైడ్)లో తయారు చేసిన ‘డ్రాప్ ఇన్’ పిచ్‌లతో న్యూయార్క్‌లో నాసా స్టేడియాన్ని 34 వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలికంగా నిర్మించింది. వెస్టిండీస్‌తో కలిసి మెగా ఈవెంట్‌కు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్ వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. కేవలం ఇక్కడ లీగ్ దశనే జరుగుతుంది. న్యూయార్క్‌లోని నాసా స్టేడియం 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఇండో–అమెరికన్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఇక్కడ భారత్... బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ సహా నాలుగు మ్యాచ్‌ల్ని ఆడింది. 9న భారత్, పాక్ సమరం ఇక్కడే జరిగింది. ఐసీసీ ఊహించినట్లుగానే భారత అభిమానుల కోలాహలంతో స్టేడియం నిండిపోయింది. ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణ పూర్తి కావడంతో నేటి నుంచి కూల్చివేత పనులు ప్రారంభించి ఆరు వారాల్లో గతంలో ఎలా ఉందో అలాంటి యథాతథస్థితికి తీసుకొస్తారు. ఇక వేదిక విషయానికొస్తే ఆగమేఘాల మీద నిర్మించిన ఈ స్టేడియం పిచ్ అత్యంత పేలవం. టి20లకు ఏమాత్రం కుదరని పిచ్‌లపై బ్యాట్ డీలా పడటంతో మెరుపులు, ధనాధన్ లేక టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లే చిన్నబోయేలా చేసింది. క్రికెటర్లు, మాజీలే కాదు... విశ్లేషకులు, వ్యాఖ్యాతలు అంతా ఈ పిచ్‌పై దుమ్మెత్తి పోశారు. కొసమెరుపు ఏమిటంతే ఈ నెల 1న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌తో ప్రారంభోత్సవం జరిగిన ఈ స్టేడియానికి 14 (నేటి)తో కాలం చెల్లబోతుంది. -
IND Vs USA: 7 వికెట్లతో అమెరికాపై గెలుపు.. ‘సూపర్–8’కు భారత్
బ్యాటింగ్‌కు బద్ధ విరోధిలా నిలిచిన న్యూయార్క్ పిచ్‌పై భారత్ మరోసారి తమ స్థాయి ఆటను చూపించింది. వరుసగా మూడో విజయంతో టి20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు చేరి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పట్టుదలగా పోరాడి అమెరికా కొంత ఇబ్బంది పెట్టినా... చివరకు టీమిండియా ముందు తలవంచక తప్పలేదు. అర్ష్ దీప్తో పాటు ఇతర బౌలర్ల పదును ముందు యూఎస్ అతి కష్టమ్మీద 100 పరుగులు దాటింది. ఛేదనలో భారత బ్యాటింగ్ కాస్త తడబడి ఉత్కంఠను పెంచినా... సూర్యకుమార్, శివమ్ దూబే జోడీ మరో 10 బంతులు మిగిలి ఉండగా జట్టును గెలుపు తీరం చేర్చింది. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్ వేటలో ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకున్న భారత్ సూపర్–8లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో యూఎస్ఏపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టీవెన్ టేలర్ (30 బంతుల్లో 24; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్ దీప్ (4/9) ప్రత్యర్థిని దెబ్బ తీయగా... హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (35 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 65 బంతుల్లో అభేద్యంగా 67 పరుగులు జోడించారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శనివారం లాడర్‌హిల్‌లో కెనడాతో తలపడుతుంది. తలా ఓ చేయి.. గత రెండు మ్యాచ్‌లలో ఆకట్టుకున్న అమెరికాకు ఈసారి సరైన ఆరంభం లభించలేదు. అర్‡్షదీప్ వేసిన ఓవర్లో మొదటి బంతికే జహాంగీర్ (0) వికెట్ల ముందు దొరికిపోగా, చివరి బంతికి గూస్ (2) అవుటయ్యాడు. పవర్‌ప్లేలో యూఎస్ 18 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఇన్నింగ్స్ తడబడుతూనే సాగినా... చిన్న చిన్న భాగస్వామ్యాలు ఇన్నింగ్స్‌ను నడిపించాయి.ఫామ్‌లో ఉన్న జోన్స్ (11)ను పాండ్యా వెనక్కి పంపించగా, దూకుడుగా ఆడబోయిన టేలర్‌ను అక్షర్ బౌల్డ్ చేశాడు. పాండ్యా ఓవర్లో సిక్స్, ఫోర్‌తో కొంత ధాటిని ప్రదర్శించిన నితీశ్ ఇన్నింగ్స్ బౌండరీ వద్ద సిరాజ్ అద్భుత క్యాచ్‌తో ముగిసింది. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో అండర్సన్ (15), హర్మీత్ (10) వెనుదిరిగారు. 18వ ఓవర్ ఐదో బంతికి యూఎస్ స్కోరు వంద పరుగులకు చేరింది. కోహ్లి మళ్లీ విఫలం... లెఫ్టార్మ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ పదునైన బౌలింగ్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టాడు. గత రెండు మ్యాచ్‌లలో 1, 4 పరుగులే చేసిన కోహ్లి (0) ఈసారి తొలి బంతికే వెనుదిరిగి టి20 వరల్డ్ కప్‌లో తొలిసారి డకౌట్ నమోదు చేశాడు. ఆ తర్వాత నేత్రావల్కర్ బౌలింగ్‌లోనే రోహిత్ శర్మ (3) కూడా అవుట్ కాగా, కుదురుకుంటున్నట్లు అనిపించిన రిషభ్ పంత్ (18; 1 ఫోర్, 1 సిక్స్)ను చక్కటి బంతితో అలీఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో సూర్య, దూబే కలిసి జట్టును ఆదుకున్నారు. మరీ ధాటిగా ఆడకపోయినా పిచ్‌ను బట్టి సింగిల్స్‌తో పరుగులు రాబట్టారు. 22 పరుగుల వద్ద సూర్య ఇచ్చిన క్యాచ్‌ను నేత్రావల్కర్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆ తర్వాత మరో అవకాశం ఇవ్వకుండా భారత ద్వయం ఆటను ముగించింది. అమెరికాకు పెనాల్టీ... తొలి వరల్డ్ కప్ ఆడుతున్న అమెరికా ఓవర్‌రేట్ నిబంధనల అమలు విషయంలో ఇంకా పరిణతి చెందలేదు. అనూహ్య రీతిలో మ్యాచ్‌లో ఆ జట్టుకు అంపైర్లు 5 పరుగులు పెనాల్టీగా విధించారు. ఓవర్ల మధ్యలో ఆ జట్టు ఒక నిమిషంకంటే ఎక్కువ సమయం తీసుకోవడం మూడుసార్లు జరిగింది. దాంతో కేవలం హెచ్చరికతో వదిలి పెట్టకుండా శిక్ష వేయడంతో భారత్‌కు 5 అదనపు పరుగులు వచ్చాయి. స్కోరు వివరాలు అమెరికా ఇన్నింగ్స్: జహాంగీర్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; టేలర్ (బి) అక్షర్ 24; గూస్ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్ 2; జోన్స్ (సి) సిరాజ్ (బి) 11; నితీశ్ (సి) సిరాజ్ (బి) అర్ష్ దీప్ 27; అండర్సన్ (సి) పంత్ (బి) పాండ్యా 15; హర్మీత్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 10; షాడ్లీ (నాటౌట్) 11; జస్దీప్ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–0, 2–3, 3–25, 4–56, 5–81, 6–96, 7–98, 8–110. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–9–4, సిరాజ్ 4–0–25–0, బుమ్రా 4–0–25–0, పాండ్యా 4–1–14–2, దూబే 1–0–11–0, అక్షర్ 3–0–25–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హర్మీత్ (బి) నేత్రావల్కర్ 3; కోహ్లి (సి) గూస్ (బి) నేత్రావల్కర్ 0; పంత్ (బి) ఖాన్ 18; సూర్యకుమార్ (నాటౌట్) 50; దూబే (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.2 ఓవర్లలో 3 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–39. బౌలింగ్: సౌరభ్ నేత్రావల్కర్ 4–0–18–2, అలీ ఖాన్ 3.2–0–21–1, జస్దీప్ సింగ్ 4–0–24–0, షాడ్లీ 4–0–25–0, అండర్సన్ 3–0–17–0. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X న్యూజిలాండ్వేదిక: ట్రినిడాడ్, ఉదయం గం. 6 నుంచిబంగ్లాదేశ్ X నెదర్లాండ్స్ వేదిక: కింగ్స్టౌన్, రాత్రి గం. 8 నుంచిఇంగ్లండ్ X ఒమన్‌వేదిక: నార్త్‌సౌండ్, అర్ధరాత్రి గం. 12:30 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘హ్యాట్రిక్’పై భారత్ గురి
న్యూయార్క్: ‘హ్యాట్రిక్’ విజయంపై గురి పెట్టిన భారత్ దీంతో పాటే టి20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు దర్జాగా చేరుకోవాలనుకుంటుంది. గ్రూప్ ‘ఎ’లో బుధవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా... ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. ఈ గ్రూప్‌లో ఇరు జట్లు కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా ఉన్నాయి. రోహిత్ బృందం వరుస విజయాలు సాధించడంలో పెద్ద విశేషమైతే లేదు కానీ... అమెరికాలాంటి కూన ఓ మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను అదికూడా... ‘సూపర్ ఓవర్’ దాకా లాక్కొచ్చి మరీ ఓడించడమే పెద్ద సంచలనం. ఎప్పుడైనాగానీ సూపర్ ఓవర్ అనేది మేటి జట్టుకే ఎక్కువ సానుకూలంగా ఉంటుంది. అలాగని భారత్‌పై కూడా మరో సంచలనం కొనసాగిస్తుందని చెప్పలేం. కానీ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా వారికి ‘హ్యాట్రిక్’ విజయంతో పాటు ‘సూపర్–8’ బెర్త్ కూడా దక్కుతుంది. సూపర్ ఫామ్‌లో... బంగ్లాదేశ్‌తో మొదలుపెట్టిన ప్రాక్టీస్ మొదలు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ దాకా భారత్ విజయవంతమైంది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి లీగ్‌లో ప్రత్యర్థి తక్కువ లక్ష్యం నిర్దేశించడంతో కెపె్టన్ రోహిత్, రిషభ్ పంత్‌ల జోరుతో సులువుగానే ఛేదించారు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ‘కింగ్’ కోహ్లి, టి20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం మెరిపించలేకపోయారు. గత రెండు మ్యాచ్‌లకు బాకీ పడిన పరుగుల వానను బహుశా ఈ మ్యాచ్‌లో వడ్డీతో సహా తీర్చేస్తారేమోనని అమెరికాలోని భారత అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్‌లతో కూడిన పేస్ త్రయానికి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ల స్పిన్ ద్వయానికి అమెరికా ఎదురునిలవడం అంత సులువు కాదు. సర్వశక్తులతో... ఆడుతోంది తొలి వరల్డ్‌కప్పే అయినా అమెరికా ఆట మాత్రం అద్భుతం. కెనడా, పాక్‌లపై సాధించిన విజయాలు ఏమాత్రం గాలివాటం కాదు. మొదట కెనడాపై 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మరీ గెలిచింది. ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మళ్లీ పాక్‌తో రెండో మ్యాచ్‌లో కెప్టెన్ మోనంక్ పటేల్ అర్ధసెంచరీతో ఆకట్టుకుంటే గౌస్, జోన్స్ ‘టై’ అయ్యేదాకా పటిష్టమైన పాక్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. ఇటు బౌలింగ్‌లోనూ కెంజిగే, సౌరభ్ నేత్రవాల్కర్, అలీఖాన్, జస్దీప్లు ఫామ్‌లో ఉండటంతో భారత్‌పై పైచేయి సాధించలేకపోయినా... ఆల్‌రౌండ్ వనరులతో గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో అమెరికా బృందం ఉంది. పిచ్, వాతావరణం న్యూయార్క్ పిచ్‌లో ఏ మార్పు లేదు. తక్కువ స్కోర్లే తప్ప మెరుపులకు అంతగా అవకాశమైతే ఉండదు. చేజింగ్ కష్టం కావడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపడం ఖాయం. వర్షంతో పూర్తిగా ముప్పయితే లేకపోయినా... అంతరాయం తప్పదు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), కోహ్లి, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్.అమెరికా: మోనంక్ పటేల్ (కెప్టెన్ ), స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీశ్ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, కెంజిగె, సౌరభ్, అలీఖాన్. 10 అమెరికాలో భారత జట్టు ఆడిన మొత్తం టి20 మ్యాచ్‌లు. ఇందులో ఎనిమిది మ్యాచ్‌లు ఫ్లోరిడా రాష్ట్రంలోని లాడర్‌హిల్ పట్టణంలో వెస్టిండీస్‌తో జరిగాయి. ఆ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదింటిలో భారత్ గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో, పాకిస్తాన్‌తో భారత్ ఒక్కో మ్యాచ్ విజయం సాధించింది. టి20 ప్రపంచకప్‌లో నేడుశ్రీలంక X నేపాల్వేదిక: ఫ్లోరిడా; ఉదయం గం. 5 నుంచిఆ్రస్టేలియా X నమీబియా వేదిక: నార్త్ సౌండ్; ఉదయం గం. 6 నుంచిభారత్ X అమెరికావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
గెలిచి నిలిచిన పాక్
న్యూయార్క్: హమ్మయ్య... పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. టి20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు చేరుకునే అవకాశాన్ని సజీవంగా నిలబెట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో కెనడాపై విజయం సాధించింది. టాస్ నెగ్గిన పాక్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. తర్వాత బ్యాటింగ్ వరుసలో నవ్‌నీత్ (4), పర్గత్ (2), నికోలస్ (1), మొవ్వ శ్రేయస్ (2), రవీందర్‌పాల్ (0) పాక్ బౌలర్లకు దాసోహమయ్యారు. జాన్సన్ 39 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 14వ ఓవర్లో జట్టు స్కోరు 73 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా నిష్క్రమించిన ఆరోన్ ఒక్కడి స్కోరే 52 పరుగులుండటం విశేషం! కెప్టెన్ సాద్ బిన్ జాఫర్ (10), కలీమ్ (13 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో హారిస్ రవూఫ్, మొహమ్మద్ ఆమిర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో సయిమ్ అయూబ్ (6) విఫలమవగా.... ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను మొహమ్మద్ రిజ్వాన్ (53 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆఖరి దాకా మోశాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (33 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. ఫఖర్ జమన్ (4)తో జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. 52 బంతుల్లో రిజ్వాన్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. గెలుపు వాకిట ఫఖర్ నిష్క్రమించగా, ఉస్మాన్ ఖాన్ (2 నాటౌట్)తో కలిసి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో భారత్, అమెరికా చెరో 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. పాక్ (2), కెనడా (2) మూడు, నాలుగో స్థానంలో ఉన్నాయి. -
T20 World Cup 2024: పాక్‌పై విక్టరీ.. చరిత్ర సృష్టించిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్ 9) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్.. పాక్‌పై తమ గెలుపు రికార్డును (టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో) మరింత మెరుగుపర్చుకుంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్-పాక్‌లు ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. భారత్ 7 సార్లు విజయం సాధించి పొట్టి ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఏ జట్టు ఓ ప్రత్యర్ధిపై ఇన్ని విజయాలు (7) సాధించలేదు. పాక్‌పై గెలుపుకు ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండిది. శ్రీలంక పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్‌పై 6 సార్లు విజయం సాధించింది. తాజాగా భారత్.. శ్రీలంక రికార్డును తిరగరాసి పాకిస్తాన్‌పై 7 మ్యాచ్‌ల్లో విజయబావుటా ఎగురవేసింది.ఇరు ఫార్మాట్ల ప్రపంచకప్ టోర్నీల్లో చూస్తే పాక్‌పై భారత్ విజయాల రికార్డు మరింత మెరుగ్గా ఉంది. ప్రపంచకప్ టోర్నీల్లో ఇరు ఫార్మాట్లలో (వన్డే, టీ20) భారత్-పాక్‌లు ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో తలపడగా.. పాక్ ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది. 2021 టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో పాక్.. భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఒక్క మ్యాచ్ మినహా ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌పై పాక్ ఎప్పుడూ గెలవలేదు.వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అయితే పాక్‌పై భారత్ గెలుపు రికార్డు వంద శాతంగా ఉంది. ఈ ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇరు జట్లు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్ అన్ని మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక వరుస విజయాల విభాగంలో ఇదే రికార్డు. ఓవరాల్‌గా చూస్తే ఫార్మాట్ ఏదైనా ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్ డామినేషన్ ఓ రేంజ్లో కొనసాగుతుంది.కాగా, న్యూయార్క్ వేదికగా నిన్న (జూన్ 9) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒత్తిడికిలోనైన పాక్ 113 పరుగులకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.తొలుత పాక్ పేసర్లు భారత బ్యాటింగ్ లైనప్‌కు కకావికలం చేయగా.. ఆతర్వాత భారత పేసర్లు మరింత చాకచక్యంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టగా.. భారత బౌలర్లు బుమ్రా (4-0-13-3), హార్దిక్ (4-0-24-2), సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ చేతుల్లో నుంచి గెలుపును లాగేసుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేయగా.. పాక్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ రిజ్వాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
న్యూయార్క్‌లో నమో భారత్
పాకిస్తాన్‌తో ప్రపంచకప్ పోరు... భారత్ చేసింది 119 పరుగులే... బ్యాటింగ్‌కు అనుకూలించని పిచ్ అయినా సరే ఈ మాత్రం స్కోరును కాపాడుకోవడం కష్టంగానే అనిపించింది... లక్ష్యం ఎదురుగా కనిపిస్తుండగా... పాక్ నెమ్మదిగా అడుగులు వేసింది. 12 ఓవర్లు ముగిసేసరికి బంతికో పరుగు చొప్పున 72 పరుగులు వచ్చేశాయి.మిగిలిన 48 బంతుల్లో చేయాల్సింది 48 పరుగులే... చేతిలో 8 వికెట్లున్నాయి. కానీ అప్పుడు ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగింది. పాండ్యా, బుమ్రా బౌలింగ్ దెబ్బకు పాక్ పరుగు తీయడమే గగనంగా మారిపోయింది. ఒక్కో పరుగు కోసం శ్రమించి ఆ జట్టు వరుసగా వికెట్లూ కోల్పోయింది. అద్భుతమైన ఆటతో ఒత్తిడి పెంచిన భారత్ చివరి వరకు దానిని కొనసాగించింది. ఫలితంగా వరల్డ్ కప్‌లో మరో విజయం మన ఖాతాలో చేరింది. పాక్‌పై మనదే పైచేయి అని నిరూపితమైంది. బ్యాటింగ్‌లో కఠిన పరిస్థితుల్లో కీలక పరుగులు చేసిన పంత్, కీపింగ్‌లో చక్కటి క్యాచ్‌లతో గెలిపించాడు. మ్యాచ్ ఏకపక్షంగా సాగకపోయినా... ఉత్కంఠకు లోటు లేకపోయింది. వరల్డ్ కప్ మెల్బోర్న్ నుంచి న్యూయార్క్‌కు చేరినా... అక్కడా మన గెలుపు పిలుపు వినిపించింది. న్యూయార్క్: టి20 ప్రపంచకప్‌లో ఆసక్తి రేపిన మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. అనంతరం పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేయగలిగింది. రిజ్వాన్ (44 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24) ప్రత్యర్థిని పడగొట్టారు. పంత్ మినహా... అనూహ్యంగా దూసుకొస్తున్న బంతులు, బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్, నెమ్మదైన అవుట్‌ఫీల్డ్... అన్నీ వెరసి భారత ఆటగాళ్లు ప్రతీ పరుగు కోసం ఇబ్బంది పడ్డారు. పాక్ బౌలర్లంతా కట్టుదిట్టమైన బంతులతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్లు కోహ్లి (4), రోహిత్ శర్మ (13) ఏడు పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... నాలుగో స్థానంలో వచ్చిన అక్షర్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో పంత్ బాధ్యత తీసుకున్నాడు. సాధారణ షాట్లకు పరుగులు రాలేని స్థితిలో తనదైన శైలిలో భిన్నమైన షాట్లతో స్కోరును నడిపించాడు. ఈ క్రమంలో అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. తన తొలి 14 బంతుల్లో 4 సార్లు పంత్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పాక్ వదిలిన క్యాచ్‌లు సుయాయాసమైనవి కాకపోయినా అసాధ్యమైనవి కూడా కాదు! రవూఫ్ ఓవర్లో అతను వరుసగా 3 ఫోర్లతో ధాటిని ప్రదర్శించగా, 89/3 వద్ద భారత్ కాస్త మెరుగైన స్థితిలో కనిపించింది. అయితే ఇక్కడి నుంచి జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. సూర్యకుమార్ (7) ప్రభావం చూపలేకపోగా, దూబే (3) విఫలమయ్యాడు. పంత్, జడేజా (0) వరుస బంతుల్లో వెనుదిరగ్గా... పాండ్యా (7), బుమ్రా (0) కూడా వరుస బంతుల్లో అవుటయ్యారు. అర్‡్షదీప్ (9) రనౌట్‌తో మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టపటపా... స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయింది. తడబడుతూనే ఆడిన బాబర్ ఆజమ్ (13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... ఉస్మాన్ ఖాన్ (13), ఫఖర్ జమాన్ (13) కూడా విఫలమయ్యారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన రిజ్వాన్‌ను కీలక సమయంలో బుమ్రా బౌల్డ్ చేయడంలో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. షాదాబ్ (4), ఇఫ్తికార్ (5) ప్రభావం చూపలేకపోగా, ఇమాద్ వసీమ్ (23 బంతుల్లో 15; 1 ఫోర్) బంతులు వృథా చేసి జట్టు ఓటమిని ఆహ్వానించాడు. వర్షంతో అంతరాయం మ్యాచ్‌కు అనూహ్యంగా వర్షం దెబ్బ పడింది. చిరు జల్లులు కురవడంతో టాస్ ఆలస్యం కాగా, నిర్ణీత సమయంకంటే 50 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. అయితే భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ పూర్తి కాగానే మళ్లీ వాన రావడంతో ఆటను నిలిపివేశారు. మరో 35 నిమిషాల తర్వాత ఇన్నింగ్స్ కొనసాగింది. విరామం తర్వాత నసీమ్ వేసిన తొలి ఓవర్లోనే కోహ్లి వెనుదిరగడంతో భారత్‌కు నిరాశాజనక ఆరంభం లభించింది. 12 భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన 12వ దేశంగా అమెరికా గుర్తింపు పొందింది. 1952లో భారత్‌లో తొలిసారి పాక్ జట్టు ఆడగా... 1955లో పాకిస్తాన్లో భారత జట్టు ఆడింది. ఆ తర్వాత ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లకు యూఏఈ (1984లో), ఆ్రస్టేలియా (1985లో), బంగ్లాదేశ్ (1988లో), సింగపూర్ (1996లో), కెనడా (1996లో), శ్రీలంక (1997లో), ఇంగ్లండ్ (1999లో), దక్షిణాఫ్రికా (2003లో), నెదర్లాండ్స్ (2004లో), అమెరికా (2024లో) ఆతిథ్యమిచ్చాయి.1 విరాట్ కోహ్లి అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశాక భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో టాప్ స్కోరర్‌గా నిలవకపోవడం ఇదే తొలిసారి. గతంలో భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో కోహ్లి (2012లో; 78 నాటౌట్), (2014లో 36 నాటౌట్), (2016లో 55 నాటౌట్), (2021లో 57), (2022లో 82 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 1 టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరు ప్లేయర్లు ‘గోల్డెన్ డక్’ (ఆడిన తొలి బంతికే అవుటవ్వడం) కావడం ఇదే తొలిసారి. 1 టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగాక ఆలౌట్ కావడం భారత జట్టుకిదే తొలిసారి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రవూఫ్ (బి) అఫ్రిది 13; కోహ్లి (సి) ఉస్మాన్ (బి) నసీమ్ 4; పంత్ (సి) బాబర్ (బి) ఆమిర్ 42; అక్షర్ (బి) నసీమ్ 20; సూర్యకుమార్ (సి) ఆమిర్ (బి) రవూఫ్ 7; దూబే (సి అండ్ బి) నసీమ్ 3; పాండ్యా (సి) ఇఫ్తికార్ (బి) రవూఫ్ 7; జడేజా (సి) ఇమాద్ (బి) ఆమిర్ 0; అర్ష్ దీప్ (రనౌట్) 9; బుమ్రా (సి) ఇమాద్ (బి) రవూఫ్ 0; సిరాజ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 119. వికెట్ల పతనం: 1–12, 2–19, 3–58, 4–89, 5–95, 6–96, 7–96, 8–112, 9–112, 10–119. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–29–1, నసీమ్ షా 4–0–21–3, ఆమిర్ 4–0–23–2, ఇఫ్తికార్ 1–0–7–0, ఇమాద్ 3–0–17–0, రవూఫ్ 3–0–21–3. పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (బి) బుమ్రా 31; బాబర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 13; ఉస్మాన్ (ఎల్బీ) (బి) అక్షర్ 13; ఫఖర్ (సి) పంత్ (బి) పాండ్యా 13; ఇమాద్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 15; షాదాబ్ (సి) పంత్ (బి) పాండ్యా 4; ఇఫ్తికార్ (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 5; అఫ్రిది (నాటౌట్) 0; నసీమ్ షా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–26, 2–57, 3–73, 4–80, 5–88, 6–102, 7–102. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–31–1, సిరాజ్ 4–0–19–0, బుమ్రా 4–0–14–3, పాండ్యా 4–0–24–2 జడేజా 2–0–10–0, అక్షర్ పటేల్ 2–0–11–1. -
T20 World Cup 2024: అదే జరిగితే పాక్ క్వాలిఫయర్స్ ఆడక తప్పదు..!
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్ గడ్డుకాలం ఎదుర్కొంటుంది. పసికూన యూఎస్ఏతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఫలితంగా గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఒకవేళ పాక్ సూపర్-8కు చేరకుండా నిష్క్రమిస్తే మరింత హీన స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొట్టి ప్రపంచకప్ తదుపరి ఎడిషన్‌కు (2026) అర్హత సాధించాలంటే క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ సభ్య దేశమైన పాకిస్తాన్ గతంలో ఎప్పుడూ క్వాలిఫయర్స్ ఆడలేదు. ఒకవేళ ఇదే జరిగితే ఆ జట్టుకు ఘోర అవమానం జరిగినట్లవుతుంది. ఈ ప్రపంచకప్‌లో పాక్ సూపర్-8కు చేరాలంటే ఇవాళ (జూన్ 9) భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌తో పాటు మిగతా మ్యాచ్‌లన్నీ (గ్రూప్ దశలో) గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగినా పాక్ సూపర్-8కు చేరుతుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే యూఎస్ఏ ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్-ఏ నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్.. ఐర్లాండ్‌పై విక్టరీతో రెండో స్థానంలో ఉంది. యూఎస్ఏ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా సూపర్-8కు చేరుకోనుండగా.. భారత్ పాక్‌తో మ్యాచ్‌లో ఓడినా ఆడాల్సిన మిగతా రెండు మ్యాచ్‌ల్లో (యూఎస్ఏ, కెనడా) గెలిస్తే సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఇలా ఏ లెక్కన చూసినా పాక్ ఈ ప్రపంచకప్‌లో సూపర్-8కు అర్హత సాధించడం అసాధ్యంగా కనిపిస్తుంది. పాక్ ఇక్కడ సూపర్-8కు చేరుకోకపోతే 2026 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో తప్పక పోటీపడాల్సి ఉంది. ఐసీసీ సవరించిన నిబంధనల ప్రకారం ఈసారి ప్రపంచకప్‌లో సూపర్-8 అర్హత సాధించిన జట్లే వచ్చే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. గతంలో ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించడం టీ20 ర్యాంకింగ్స్‌పై ఆధారపడి ఉండేది. ఐసీసీ 2026 ప్రపంచకప్ నుంచి ఈ నిబంధనను సవరించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 9) దాయాదుల సమరం జరుగనుంది. న్యూయార్క్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఫైట్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. -
నేడు టీ20 వరల్డ్‌కప్‌లో హైవోల్టేజ్ మ్యాచ్
అక్టోబర్ 23, 2022...మెల్బోర్న్ మైదానంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్...రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి రెండు అద్భుత సిక్సర్లతో టీమిండియాను గెలిపించిన తీరును మన అభిమానులెవరూ మరచిపోలేరు. ‘గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ టి20 వరల్డ్ కప్ హిస్టరీ’ అంటూ తొలి సిక్స్‌కు కితాబిచ్చింది. ఇప్పుడు మళ్లీ టి20 వరల్డ్ కప్‌లో అలాంటి అద్భుత క్షణాల కోసం ఇరు జట్ల మధ్య మరో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. నాటి పోరు తర్వాత టి20 ఫార్మాట్లో ఇరు జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్‌లో మాజీ చాంపియన్లు, దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నాసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్‌లో పాక్‌ను టీమిండియా ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సునాయాసంగా నెగ్గిన భారత్ ఉత్సాహంగా కనిపిస్తుండగా... చిన్న జట్టు అమెరికా చేతిలో ఓడిన పాక్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఐసీసీ ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది. న్యూయార్క్ అభిమానుల కోసం తక్కువ సమయంలో 34 వేల సామర్థ్యం గల స్టేడియాన్ని నిరి్మంచింది. పిచ్‌పై ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. అక్షర్ స్థానంలో కుల్దీప్! ఐర్లాండ్‌పై సునాయాసంగా గెలిచిన భారత జట్టులో ఎలాంటి ఆందోళన లేదు. టాపార్డర్‌లో రోహిత్, కోహ్లి, పంత్ ఖాయం కాగా...సూర్యకుమార్, దూబే, పాండ్యాలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైనా...అసలు సమయంలో ఎలా చెలరేగాలో కోహ్లికి బాగా తెలుసు. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం లేకుండా టీమ్ విజయాన్ని పూర్తి చేసుకుంది.టాప్–7 వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది కాబట్టి జట్టు ఒక మార్పు చేయవచ్చు. అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత కొంత కాలంగా కుల్దీప్ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు పాక్‌పై మంచి రికార్డు కూడా ఉంది. పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంటే మాత్రం ముగ్గురు పేసర్లు బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్‌లలో ఒకరిని తప్పించి కుల్దీప్ను ఎంపిక చేస్తారు. గందరగోళంలో... మరో వైపు పాకిస్తాన్ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. యూఎస్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్నాయి. ఓటమికంటే ఆ మ్యాచ్‌లో పేలవ ఆటతీరు చూస్తే జట్టులో సమస్య ఏమిటో అర్థమవుతుంది. ఓపెనర్లుగా రిజ్వాన్, బాబర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. అటు కెప్టెన్సీ లో కూడా లోపాలతో బాబర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మిడిలార్డర్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. యూఎస్‌తో కేవలం 159 పరుగులకే పరిమితమైంది. సుదీర్ఘకాలంగా ఈ ఫార్మాట్లో ఆడుతున్నా బౌలర్లు షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వడం లేదు. 2021 వరల్డ్ కప్ మ్యాచ్‌లో మినహాయిస్తే ప్రతీ సారి భారత్ చేతిలో భంగపడిన టీమ్ ఈ సారి ఏం చేస్తుందనేది చూడాలి. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X ఉగాండావేదిక: ప్రొవిడెన్స్; ఉదయం గం. 6 నుంచిఒమన్ X స్కాట్లాండ్ వేదిక: నార్త్ సౌండ్; రాత్రి గం. 10:30 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
న్యూయార్క్: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చెమటోడ్చి రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన పోరులో సఫారీ 4 వికెట్లతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ నెగ్గిన సఫారీ ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు మైకేల్ లెవిట్ (0), మ్యాక్స్ ఓ డౌడ్ (2) సహా టాపార్డర్‌లో విక్రమ్‌జీత్ (12) కూడా నిరాశపరిచారు. ఈ దశలో సైబ్రాండ్ (45 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్స్) దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ లొగాన్ వాన్ బిక్ (23; 3 ఫోర్లు) అండతో జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఐదో ఓవర్ ముగియకముందే 12 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోవడంతో వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్ ఫలితం పునరావృతమవుతుందేమో అనిపించింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్ (37 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్)కు జతయిన మిల్లర్ (51 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించి పరిస్థితి చక్కబెట్టాడు. అనంతరం అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. -
T20 World Cup 2024: రషీద్ ఖాన్ ఈజ్ ద బెస్ట్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (జూన్ 7) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి తమకంటే చాలా రెట్లు మెరుగైన న్యూజిలాండ్‌ను ఖంగుతినిపించారు. తొలుత బ్యాటింగ్‌లో చెలరేగిన ఆఫ్ఘన్ ప్లేయర్లు.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి కివీస్‌కు ఊహించని షాకిచ్చారు. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి పటిష్టమైన న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కివీస్ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది. న్యూజిలాండ్‌ను ఈ స్థితికి దిగజార్చడానికి ముఖ్య కారకుడు ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్. ఈ మ్యాచ్‌లో రషీద్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. రషీద్‌తో పాటు ఫజల్ హక్ ఫారూఖీ (3.2-0-17-4), మొహమ్మద్ నబీ (4-0-16-2) కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. రషీద్, ఫజల్ హక్, నబీల దెబ్బకు 15.2 ఓవర్లలో 75 పరుగులకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (18), మ్యాట్ హెన్రీ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిద్దరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌కే టపా కట్టేసి ఉంటే న్యూజిలాండ్ 50 పరుగుల మార్కు కూడా దాటేది కాదు. దీనికి ముందు రహ్మానుల్లా గుర్బాజ్ (80), ఇబ్రహీం జద్రాన్ (44) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్, జద్రాన్‌తో పాటు అజ్మతుల్లా (22) రాణించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, మ్యాట్ హెన్రీ తలో 2 వికెట్లు తీయగా.. ఫెర్గూసన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో కలిసికట్టుగా రాణించి కివీస్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చేశారు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడటం ఇదే తొలిసారి.రషీద్ ఈజ్ ద బెస్ట్..ఈ మ్యాచ్‌లో అద్భుత గణాంకాలు నమోదు చేసి కివీస్ పతనాన్ని శాశించిన ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ప్రపంచకప్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4-0-17-4) నమోదు చేసిన కెప్టెన్‌గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. రషీద్‌కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ వెటోరీ పేరిట ఉండేది. వెటోరీ 2007 వరల్డ్‌కప్‌లో ఇండియాపై 4 ఓవరల్లో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో రషీద్, వెటోరీ తర్వాత ఒమన్ బౌలర్ జీషన్ మక్సూద్ (2021లో పపువా న్యూ గినియాపై 4-0-20-4), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (2012లో శ్రీలంకపై 4-0-24-3) ఉన్నారు. -
‘సూపర్’ సాఫ్ట్వేర్ ఇంజినీర్
డాలస్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ను అద్భుతంగా బౌల్ చేసి అమెరికాను గెలిపించిన లెఫ్టార్మ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్‌కు చెందిన అతను చదువు, ఉద్యోగరీత్యా యూఎస్‌కు వెళ్లి ఇప్పుడు తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న తమ టీమ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 32 ఏళ్ల సౌరభ్ 2013లో తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, వసీం జాఫర్ ఆ మ్యాచ్‌లో అతని సహచరులు. అయితే ఎన్నో ఆశలతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతనికి అదే చివరి రంజీ మ్యాచ్ కూడా అయింది. అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, అవిష్కార్ సాల్వి, ధావల్ కులకరి్ణలాంటి పేసర్లు ఉన్న ముంబై టీమ్‌లో అతనికి చోటు దక్కడం కష్టమైపోయింది. అంతకు మూడేళ్ల క్రితమే అండర్–19 వరల్డ్ కప్‌లో ఆడి భారత్ తరఫున అత్యధిక వికెట్లు (9) తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే అతను ఆశించినట్లుగా దేశవాళీ కెరీర్ ఊపందుకోకపోగా, ఐపీఎల్ అవకాశం కూడా దక్కలేదు. నిజానికి 2009లోనే సౌరభ్ వెలుగులోకి వచ్చాడు. ఎయిరిండియా ప్రతిభాన్వేషణలో భాగంగా బెంగళూరు ఎన్సీఏలో అద్భుత బంతితో యువరాజ్ సింగ్‌ను బౌల్డ్ చేయడంతో అతనికి స్కాలర్షిప్ లభించింది. కొద్ది రోజులకే అదే ఎయిరిండియా తమ ప్రధాన జట్టులోకి తీసుకోవడంతో యువరాజ్, రైనాలతో కలిసి కార్పొరేట్ టోర్నీ కూడా ఆడాడు. తర్వాతి ఏడాది కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఉనాద్కట్, హర్షల్ పటేల్‌లలో కలిసి అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు. అయితే ఏకైక రంజీ మ్యాచ్ తర్వాత మళ్లీ ఆశించిన అవకాశాలు రాలేదు. మరో రెండేళ్లు క్రికెట్లో గట్టిగా ప్రయత్నిస్తానని, లేదంటే ఆటను ఆపేస్తానని సౌరభ్ తన తండ్రికి చెప్పాడు. చివరకు అదే జరిగింది. కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతను ఎమ్మెస్ చేసేందుకు 2015లో అమెరికాకు వెళ్లిపోయాడు. న్యూయార్క్‌లో ప్రతిష్టాత్మక కార్నెల్ యూనివర్సిటీలో అవకాశం లభించింది. చదువులో ప్రతిభతో పాటు క్రికెట్ పరిజ్ఞానంతో ‘క్రిక్‌డీకోడ్’ అనే యాప్‌ను తయారు చేయడంతో ప్రత్యేక స్కాలర్íÙప్ కూడా లభించింది. చదువు పూర్తి కాగానే అతనికి ఒరాకిల్ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. అమెరికా చేరాక సరదాగా వారాంతపు క్రికెట్ ఆడుతూ వచ్చిన సౌరభ్... ఆ తర్వాత ఆటపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన యూఎస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో ఆడటంతో మరింత గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో అమెరికా తరఫున 2018లో తొలి వన్డే ఆడిన నేత్రావల్కర్ గత ఏడాది జరిగిన మేజర్ లీగ్‌లో ఆకట్టుకోవడంతో టి20 టీమ్‌లో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. అండర్–19 వరల్డ్ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజమ్‌తో తలపడిన సౌరభ్... ఇప్పుడు బాబర్ టీమ్‌ను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఆఫీసుకు సెలవు పెట్టిన సౌరభ్ ప్రదర్శన తర్వాత సౌరభ్ కంపెనీ ‘ఎక్స్’ ద్వారా తమ ఇంజినీర్‌ను అభినందించింది. -
ఐర్లాండ్‌కు కెనడా షాక్
న్యూయార్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శాశ్వత సభ్య దేశం ఐర్లాండ్ జట్టుకు తొలిసారి టి20 ప్రపంచకప్‌లో ఆడుతున్న కెనడా జట్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం జరిగిన పోరులో కెనడా తక్కువ లక్ష్యాన్ని కాపాడుకొని 12 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను కంగుతినిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.ఓపెనర్లు ఆరోన్ జాన్సన్ (14), నవ్‌నీత్ ధలివాల్ (6) సహా పర్గత్ సింగ్ (18), దిల్‌ప్రీత్ (7) నిరాశపరిచారు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ కిర్టన్ (35 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మొవ్వ శ్రేయస్ (36 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించడంతో కెనడా కోలుకుంది. ప్రత్యర్థి బౌలర్లలో క్రెయిగ్ యంగ్, మెకార్తి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి ఓడిపోయింది. హేలిగెర్ (2/18), గొర్డాన్ (1/13), సిద్ధిఖీ (1/27), జాఫర్ (1/22) సమష్టిగా దెబ్బ కొట్టారు. దీంతో 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో డాక్రెల్ (23 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్ అడైర్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా చివరకు ఐర్లాండ్‌కు ఓటమి తప్పలేదు. -
స్కాట్లాండ్ బోణీ
బార్బడోస్: టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో స్కాట్లాండ్ తొలి విజయం నమోదు చేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఐదు వికెట్ల తేడాతో నమీబియాపై నెగ్గింది. ఇంగ్లండ్–స్కాట్లాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... ఈ గెలుపుతో స్కాట్లాండ్ మూడు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలోకి వెళ్లింది.స్కాట్లాండ్ తో పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెపె్టన్ ఎరాస్మస్ (31 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. బ్రాడ్ వీల్ 3, బ్రాడ్ కరీ 2 వికెట్లు తీశారు. అనంతరం స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ బెరింగ్టన్ (35 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మైకేల్ లీస్క్ (17 బంతుల్లో 35; 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి స్కా ట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. టి20 ప్రపంచకప్‌లో నేడున్యూజిలాండ్ X అఫ్గానిస్తాన్వేదిక: గయానా; ఉదయం గం. 5 నుంచిబంగ్లాదేశ్ X శ్రీలంక వేదిక: డాలస్; ఉదయం గం. 6 నుంచిదక్షిణాఫ్రికా X నెదర్లాండ్స్వేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిఆ్రస్టేలియా X ఇంగ్లండ్ వేదిక: బ్రిడ్జ్‌టౌన్; రాత్రి గం. 10:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2024 : సంచలనం..పాక్‌ను చిత్తు చేసిన అమెరికా (ఫొటోలు)
-
టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన అమెరికా
డాలస్: టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం... టోర్నీ 11వ మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ ద్వారా అనూహ్య ఫలితం వచి్చంది. తొలిసారి వరల్డ్ కప్ బరిలోకి దిగిన ఆతిథ్య అమెరికా జట్టు అద్భుతం చేసింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటి మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. 20 ఓవర్ల సమరంలో ఇరు జట్లు సమంగా నిలవడంతో ‘సూపర్ ఓవర్’ అనివార్యమైంది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో యూఎస్ఏ ‘సూపర్ ఓవర్’లో 5 పరుగులతో పాక్‌ను ఓడించింది. 2009 విజేత పాకిస్తాన్ సమష్టి వైఫల్యం కారణంగా పరాభావంతో టోర్నీని మెుదలు పెట్టగా...తొలి మ్యాచ్‌లో కెనడాపై నెగ్గిన యూఎస్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. పాక్ తరఫున ఆమిర్ వేసిన సూపర్ ఓవర్లో అమెరికా 18 పరుగులు చేయగా... గెలవాలంటే ‘సూపర్ ఓవర్’లో 19 పరుగులు చేయాల్సిన పాక్... అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ వేసిన సూపర్ ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (43 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్ ఖాన్ (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించగా... షాహిన్ అఫ్రిది (16 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో కీలక పరుగులు చేశాడు. అమెరికా బౌలర్లలో నాస్తుష్ కెన్జిగే 3 వికెట్లు పడగొట్టగా, సౌరభ్ నేత్రావల్కర్ 2 వికెట్లు తీశాడు. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు సాధించింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్), ఆరోన్ జోన్స్ (26 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గూస్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఒక దశలో చేతిలో 9 వికెట్లతో 8 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన మెరుగైన స్థితిలో నిలిచిన అమెరికా ఆ తర్వాత పాక్ బౌలింగ్ ముందు తడబడింది. అయితే 19వ ఓవర్ వరకు పట్టు బిగించిన పాక్...చివరి ఓవర్లో వెనుకంజ వేసింది. రవూఫ్ వేసిన ఈ ఓవర్లో గెలుపు కోసం 15 పరుగులు చేయాల్సి ఉండగా యూఎస్ ఫోర్, సిక్స్ సహా 14 పరుగులు రాబట్టింది. టి20 ప్రపంచకప్‌లో నేడుఐర్లాండ్ X కెనడావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టి20 వరల్డ్ కప్ : తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
T20 World Cup 2024: ఆడుతూ పాడుతూ...
భారీ అంచనాలతో టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ తొలి పోరులో తమ స్థాయి ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్‌పై ఏమాత్రం ఉదాసీనత కనబర్చకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించని పిచ్‌పై ప్రత్యరి్థని 96 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరింది. మన బౌలర్లలో ఐదుగురు కనీసం ఒక్కో వికెట్‌తో తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్, పంత్ చక్కటి బ్యాటింగ్ టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్ రూపంలో తర్వాతి సవాల్‌కు భారత్ సిద్ధమైంది. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్‌లో రోహిత్ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెన్ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)దే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/6), అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 52 రిటైర్డ్‌హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు. టపటపా... స్వింగ్‌కు అనుకూల వాతావరణం, అనూహ్య బౌన్స్, నెమ్మదైన అవుట్‌ఫీల్డ్... ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మూడో ఓవర్లో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (2), బల్బర్నీ (5)లను అవుట్ చేసి అర్‡్షదీప్ ముందుగా దెబ్బ కొట్టడంతో మొదలైన ఐర్లాండ్ పతనం వేగంగా సాగింది. పవర్‌ప్లేలో 26 పరుగులు రాగా, వాటిలో 9 ఎక్స్‌ట్రాలే ఉన్నాయి. పాండ్యా తన తొలి రెండు ఓవర్లలో టకర్ (10), కాంఫర్ (12)లను వెనక్కి పంపించగా, టెక్టర్ (4)ను బుమ్రా అవుట్ చేశాడు. సిరాజ్ ఖాతాలో డాక్రెల్ (3) వికెట్ చేరడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 49/6 వద్ద నిలిచింది. అక్షర్ పటేల్ కూడా తన తొలి ఓవర్లో మెక్‌కార్తీ (0) పని పట్టగా, బుమ్రా బౌలింగ్‌లో లిటిల్ (14) బౌల్డయ్యాడు. అయితే చివర్లో డెలానీ కొన్ని పరుగులు జోడించగలిగాడు. అర్‡్షదీప్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను అదే ఓవర్ చివరి బంతికి రనౌట్ కావడంతో ఐర్లాండ్ ఆట ముగిసింది. ఆకట్టుకున్న పంత్... ఓపెనర్‌గా వచి్చన విరాట్ కోహ్లి (1) ప్రభావం చూపలేకపోగా, మరోవైపు రోహిత్ ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన పంత్ కూడా అదే తరహాలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. లిటిల్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో జోరు పెంచిన రోహిత్ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకుముందు లిటిల్ వేసిన ఓవర్లో బంతి భుజానికి బలం తగిలిన కారణంగా నొప్పితో మైదానం వీడాడు. 21 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు వచి్చన సూర్యకుమార్ (2) విఫలమైనా... మెక్‌కార్తీ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ సిక్సర్‌తో పంత్ మ్యాచ్ ముగించాడు. ఇటీవలే ఐపీఎల్లో ఆడిన పంత్‌కు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బర్నీ (బి) అర్‡్షదీప్ 5; స్టిర్లింగ్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 2; టకర్ (బి) పాండ్యా 10; టెక్టర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 4; కాంఫర్ (సి) పంత్ (బి) పాండ్యా 12; డాక్రెల్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 3; డెలానీ (రనౌట్) 26; అడెయిర్ (సి) దూబే (బి) పాండ్యా 3; మెక్‌కార్తీ (సి అండ్ బి) అక్షర్ 0; లిటిల్ (బి) బుమ్రా 14; వైట్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్) 96. వికెట్ల పతనం: 1–7, 2–9, 3–28, 4–36, 5–44, 6–46, 7–49, 8–50, 9–77, 10–96. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–2, సిరాజ్ 3–0–13–1, బుమ్రా 3–1–6–2, పాండ్యా 4–1–27–3, అక్షర్ పటేల్ 1–0–3–1, జడేజా 1–0–7–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రిటైర్డ్‌హర్ట్) 52; కోహ్లి (సి) వైట్ (బి) అడెయిర్ 1; పంత్ (నాటౌట్) 36; సూర్యకుమార్ (సి) డాక్రెల్ (బి) వైట్ 2; దూబే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.2 ఓవర్లలో 2 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–22, 2–91. బౌలింగ్: అడెయిర్ 4–0–27–1, లిటిల్ 4–0–42–0 మెక్‌కార్తీ 2.2–0–8–0, కాంఫర్ 1–0–4–0, వైట్ 1–0–6–1. 600: 600 రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టి20ల్లో 193 సిక్స్‌లు బాదాడు. 4000: రోహిత్ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు (4026) దాటాడు. కోహ్లి (4038), బాబర్ (4023) తర్వాత ఈ మైలురాయిని చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు. -
T20 World Cup 2024: అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఉగాండతో ఇవాళ (జూన్ 4) జరిగిన మ్యాచ్‌లో ఫజల్ హక్ 4 ఓవర్లు బౌల్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఓ ఫాస్ట్ బౌలర్‌కు ఇవి రెండో అత్యుత్తమ గణాంకాలు. 2009లో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ న్యూజిలాండ్‌పై కేవలం 6 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఓ ఫాస్ట్ బౌలర్‌కు ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు శ్రీలంక స్పిన్నర్ అజంత మెండిస్ పేరిట నమోదై ఉన్నాయి. 2012 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెండిస్ 8 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మెండిస్ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు కూడా లంక బౌలర్ పేరిటే నమోదై ఉన్నాయి. 2014 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక స్పిన్నర్ రంగన హెరాత్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే, ఉగాండతో జరిగిన నేటి మ్యాచ్‌లో ఫజల్ హక్ ఫారూఖీ విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (76), ఇబ్రహీం జద్రాన్ (70) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. ఉగాండ బౌలర్లలో కోస్మాస్ క్యేవుటా, మసాబా తలో 2 వికెట్లు పడగొట్టారు.184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ.. ఫజల్ హక్‌తో పాటు నవీన్ ఉల్ హక్ (2-0-4-2), రషీద్ ఖాన్ (4-0-12-1), ముజీబ్ (3-0-16-1) విజృంభించడంతో 16 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. ఉగాండ ఇన్నింగ్స్‌లో రియాజత్ అలీ షా (11), రాబిన్సన్ ఒబుయా (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
T20 WC 2024: ‘విశ్వ’ వేదికపై ధనాధన్
పదిహేడేళ్ల క్రితం... ఐసీసీ తొలి టి20 ప్రపంచకప్‌ను నిర్వహించింది. ఆ మెగా ఈవెంట్లో విజేతగా నిలిచిన భారత్ టి20 ఫార్మాట్‌కు కొత్త దశ, దిశను చూపించింది. కానీ ఆ తర్వాత ఏడు ప్రయత్నాల్లోనూ మరో టైటిల్ సాధించడంలో విఫలమైంది. ఇప్పుడైనా మన అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడుతుందా! మరో వైపు విధ్వంసక బ్యాటింగ్‌తో ఆట రూపు మార్చిన వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండేసి ట్రోఫీలతో అగ్ర స్థానంలో నిలిచాయి. ఈ రెండు జట్లు తమకు తెలిసిన అదే విద్యతో మూడో టైటిల్‌పై కన్నేశాయి. ఆల్‌రౌండర్ల అడ్డా ఆస్ట్రేలియా, మరో మాజీ చాంపియన్ శ్రీలంక రెండో ట్రోఫీపై గురి పెట్టాయి. ఈ సారైనా తొలి టైటిల్ అందుకోవాలని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా విశ్వప్రయత్నం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక గత ఫైనలిస్ట్ పాకిస్తాన్ కూడా అనూహ్య ప్రదర్శనతో మరో సారి విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరం. ఈ ఎనిమిది అగ్రశ్రేణి జట్లకు తోడు మరో 12 టీమ్‌లు విశ్వ వేదికపై తమ ముద్ర చూపాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో టి20 ప్రపంచ కప్ సంగ్రామానికి నేటితో తెర లేవనుంది. న్యూయార్క్: తొలి సారి అగ్రరాజ్యం అమెరికా వేదికగా క్రికెట్ ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. వెస్టిండీస్‌తో కలిసి ఈ సారి అమెరికా టి20 వరల్డ్ కప్ టోరీ్నకి ఆతిథ్యం ఇస్తోంది. వెస్టిండీస్‌లో 2010లోనే ఈ మెగా పోరు జరిగింది. క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరింపజేయడంలో భాగంగా ఐసీసీ తొలి సారి 20 జట్లతో వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. ర్యాంకింగ్, ఆతిథ్య జట్టు హోదాలో టీమ్‌లు ముందుగా అర్హత సాధించగా...క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఇతర జట్లు బరిలో నిలిచాయి. ఈ టోర్నీ కోసం అమెరికాలో ప్రత్యేకంగా క్రికెట్ మైదానాలను సిద్ధం చేశారు. అప్పటికి మల్టీ పర్పస్ స్టేడియాలుగా ఉన్నవాటిని బయటినుంచి తీసుకొచ్చిన ‘డ్రాప్ ఇన్’ పిచ్‌లతో క్రికెట్ మ్యాచ్‌ల వేదికలుగా మార్చారు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగంగా ఉండటంతో ఈ వరల్డ్ కప్ ద్వారా అక్కడి అభిమానులను ఆకర్షించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. తొలి పోరులో ఆతిథ్య అమెరికా జట్టు తమ చిరకాల ప్రత్యర్థి కెనడాతో తలపడనుంది. నాలుగు గ్రూప్‌లుగా... మొత్తం 20 జట్లను 5 జట్ల చొప్పున 4 గ్రూప్‌లుగా విభజించారు. ఆయా జట్లు తమ గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో తలపడతాయి. టాప్–2లో నిలిచిన రెండు టీమ్‌లు ముందంజ వేస్తాయి. ఆ దశలో ఎనిమిది టీమ్‌లతో రెండు గ్రూప్‌లుగా విడదీసి సూపర్ ఎయిట్ నిర్వహిస్తారు. ఇక్కడ మరో మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. ఆపై సెమీస్, ఫైనల్ జరుగుతాయి. వెస్టిండీస్‌లో ఆరు, అమెరికాలలో మూడు వేదికలలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. భారత్ ఎంత వరకు... తొలి వరల్డ్ కప్ విజయాన్ని మినహాయిస్తే భారత్ మరో మూడు సార్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చింది. 2014లో ఫైనల్లో ఓడిన జట్టు...2016, 2022లలో సెమీ ఫైనల్ చేరింది. మిగిలిన నాలుగు సందర్భాల్లో లీగ్ దశకే పరిమితమైంది. ఈ సారి కూడా దాదాపుగా రెండేళ్ల క్రితం బరిలోకి దిగిన జట్టుతోనే టీమిండియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రోహిత్ శర్మ కెపె్టన్సీ, రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఈ బృందం తమ అత్యుత్తమ ఆటతీరును కనబరిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. మన జట్టు స్థాయి, ఆటగాళ్ల ఫామ్‌ను చూస్తే సెమీఫైనల్ వరకు వెళ్లడం ఖాయం. మిగిలిన రెండు నాకౌట్ మ్యాచ్‌లే కీలకమైనవి. వరల్డ్ కప్‌లో నేటి మ్యాచ్లుఅమెరికా X కెనడాఉదయం.గం.6.00 నుంచివెస్టిండీస్ X పపువా న్యూగినియా రాత్రి.గం. 8.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం -
‘సాధన’ సరిపోయింది.. వామప్ మ్యాచ్‌లో భారత్ విజయం
న్యూయార్క్: బ్యాటింగ్‌లో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా తమదైన శైలిలో దూకుడుగా ఆడారు...సూర్యకుమార్, రోహిత్ శర్మ కూడా కీలక పరుగులు సాధించారు. దూబే, సామ్సన్ మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు...బౌలింగ్‌లో కూడా ప్రధాన బౌలర్లంతా బరిలోకి దిగి ఆకట్టుకున్నారు...ఓవరాల్‌గా టి20 వరల్డ్ కప్‌లో ప్రధాన టోర్నీకి ముందు ఏకైక వామప్ మ్యాచ్‌లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. దీని ద్వారా టీమ్ తుది జట్టుపై ఒక అంచనా కూడా వచ్చింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఆడలేదు. యశస్వికి మ్యాచ్ ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తే ప్రధాన జట్టులో అతను ఉండే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో పాటు రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగవచ్చు. ఇక్కడ విఫలమైనా...టాపార్డర్‌లో సామ్సన్ పేరును టీమ్ మేనేజ్మెంట్ పరిశీలిస్తుండగా, దూబే బౌలింగ్ చేయడాన్ని బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా జట్టుకు మంచి ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నట్లే. మరో వైపు కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్ మాత్రం వరల్డ్ కప్ స్థాయికి తగినట్లుగా కనిపించలేదు. అవుట్‌ఫీల్డ్ బంతి పడ్డ ప్రతి చోటా దుమ్ము రేగడం చూస్తే ఈ స్టేడియంను సిద్ధం చేయడంలో ఐసీసీ తొందరపడినట్లు అనిపించింది. ఇదే వేదికపై భారత్ లీగ్ దశలో తమ తొలి మూడు మ్యాచ్‌లు ఆడనుంది. మ్యాచ్ ఫలితంతో సంతృప్తి చెందినట్లు, తాము అనుకున్న రీతిలో ప్రాక్టీస్ లభించినట్లు విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. శనివారం జరిగిన వామప్ పోరులో భారత్ 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (32 బంతుల్లో 53 రిటైర్డ్ అవుట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించగా, రోహిత్ శర్మ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... శివమ్ దూబే (14), సంజు సామ్సన్ (1) విఫలమయ్యారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది. మహ్మదుల్లా (28 బంతుల్లో 40 రిటైర్డ్ అవుట్; 4 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ అల్ హసన్ (34 బంతుల్లో 28; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్‡్షదీప్ సింగ్, శివమ్ దూబే చెరో 2 వికెట్లు పడగొట్టగా...అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. -
T20 WORLD CUP 2024 సెమీస్ కు చేరే జట్లు ఇవే..!
-
T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్ విశేషాలు, రికార్డులు
2007లో అరంగేట్రం చేసిన పొట్టి ప్రపంచకప్ ఎనిమిది సీజన్ల పాటు విజయవంతంగా సాగి తొమ్మిదో సీజన్వైపు అడుగులు వేస్తుంది. భారతకాలమానం ప్రకారం రేపటి నుంచి పొట్టి ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్, యూఎస్ఏ వేదికలు ఈ మెగా టోర్నీ జరుగనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ-కెనడా జట్లు తలపడనున్నాయి.తొమ్మిదో ఎడిషన్ వరల్డ్‌కప్ ప్రారంభ నేపథ్యంలో ఈ టోర్నీ విశేషాలు, రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే టీ20 ప్రపంచకప్ ఇప్పటివరకు ఎనిమిది సీజన్ల పాటు సాగింది. టోర్నీ అరంగేట్రం సీజన్లో (2007) టీమిండియా విజేతగా నిలువగా.. పాకిస్తాన్ (2009), ఇంగ్లండ్ (2010), వెస్టిండీస్ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్ (2016), ఆస్ట్రేలియా (2021), ఇంగ్లండ్ (2022) ఆతర్వాత ఎడిషన్లలో విజేతలుగా అవతరించాయి.రెండేళ్లకు ఓసారి జరిగే ఈ టోర్నీకి కోవిడ్, ఇతరత్రా కారణాల వల్ల మధ్యలో ఐదేళ్లు (2016-2021) బ్రేక్ పడింది. టీ20 ప్రపంచకప్‌లో ఈ సీజన్ నుంచే రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు అత్యధికంగా రెండు సార్లు టైటిల్‌ను అందుకున్నాయి. డారెన్ సామీ వెస్టిండీస్‌కు విజయవంతంగా రెండు సార్లు టైటిల్‌ను అందించాడు.టోర్నీలో అత్యధిక పరుగుల రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (1141) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల రికార్డు షకీబ్ అల్ హసన్ (47) ఖాతాలో ఉంది. కెనడా, ఉగాండ, యూఎస్ఏ జట్లు తొలిసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.టోర్నీ బ్యాటింగ్ రికార్డులు..అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి (1141)అత్యధిక స్కోర్- బ్రెండన్ మెక్కల్లమ్ (123)అత్యధిక సగటు- విరాట్ కోహ్లి (81.50)అత్యధిక స్ట్రయిక్‌రేట్- సూర్యకుమార్ యాదవ్ (181.29)అత్యధిక సెంచరీలు- క్రిస్ గేల్ (2)అత్యధిక హాఫ్ సెంచరీలు- విరాట్ కోహ్లి (14)అత్యధిక సిక్సర్లు- గేల్ (63)ఓ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు- విరాట్ (319)టోర్నీ బౌలింగ్ రికార్డులు..అత్యధిక వికెట్లు-షకీబ్ (47)అత్యధిక బౌలింగ్ సగటు- హసరంగ (11.45)అత్యధిక స్ట్రయిక్‌రేట్- హసరంగ (11.8)అత్యుత్తమ గణాంకాలు- అజంత మెండిస్ (6/8)సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు- హసరంగ (16)జట్ల రికార్డులు..అత్యధిక టీమ్ టోటల్-శ్రీలంక (260/6)అత్యల్ప టోటల్- నెదర్లాండ్స్ (39)భారీ విజయం- శ్రీలంక (కెన్యాపై 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
సన్నాహక సమయం
న్యూయార్క్: టి20 వరల్డ్ కప్‌లో అసలు సమరానికి ముందు ఏకైక సన్నాహక మ్యాచ్ కోసం భారత జట్టు సిద్ధమైంది. నేడు జరిగే ‘వామప్’ పోరులో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. లీగ్ దశలో తమ తొలి మూడు మ్యాచ్‌లు ఆడే నాసా కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే రోహిత్ బృందం ఈ మ్యాచ్ ఆడనుంది. కొత్తగా నిర్మించిన ఈ స్టేడియం పిచ్‌తో పాటు అటు వాతావరణంపై కూడా ఒక అంచనాకు వచ్చేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్‌లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతాయి. అందువల్ల అలాంటి స్థితికి అలవాటు పడటం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఏకైక వామప్ మ్యాచ్ కీలకం కానుంది. మ్యాచ్‌కు ముందు శుక్రవారం ఆటగాళ్లు చివరి నెట్ సెషన్లో పాల్గొన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ ఈనెలలో జరిగే విఖ్యాత బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏ ఫైనల్స్‌లో విన్నర్స్ జట్టుకు ఇచ్చే ట్రోఫీతో, టి20 వరల్డ్‌కప్‌తో ఫొటో సెషన్లో పాల్గొన్నాడు. అందరూ బరిలోకి... వామప్ మ్యాచ్ కావడంతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆటగాళ్లందరినీ పరీక్షించేందుకు భారత్‌కు అవకాశం ఉంది. 15 మంది సభ్యుల టీమ్‌లో విరాట్ కోహ్లి మాత్రం శుక్రవారం ఆలస్యంగా చేరాడు. అయితే అతను ఈ మ్యాచ్‌లో ఆడేది సందేహంగానే ఉంది. దాంతో కోహ్లి మినహా ఇతర కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టనుంది. ఐపీఎల్ కారణంగా అంతా మ్యాచ్ ప్రాక్టీస్‌లోనే ఉన్నారు. జట్టులోని సభ్యులంతా తమ టీమ్‌లలో రెగ్యులర్‌గా దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడారు. ప్రధాన టోర్నీలో యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకోవడం, బుమ్రాకు తోడుగా రెండో పేసర్‌గా ఎవరికి అవకాశం కల్పించాలనేదానిపై మేనేజ్మెంట్ ప్రధానంగా దృష్టి పెడుతోంది. రెండో పేసర్‌గా సిరాజ్, అర్ష్ దీప్‌లలో ఒకరికే అవకాశం దక్కుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ టీమ్ పరిస్థితి గొప్పగా లేదు. ఇటీవలే అనూహ్యంగా అమెరికా జట్టు చేతిలో 1–2తో బంగ్లాదేశ్ టి20 సిరీస్ కోల్పోయింది. పైగా ఈ టోర్నీలో బలమైన ‘డి’ గ్రూప్‌లో ఆ జట్టు ఉంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ మ్యాచ్‌తో కాస్త ఆత్మవిశ్వాసం ప్రోదిచేసుకోవడంపై బంగ్లాదేశ్ బృందం దృష్టి సారించింది. -
T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)
-
నిఘా నీడలో... భారత్–పాకిస్తాన్ టి20 ప్రపంచకప్ మ్యాచ్
న్యూయార్క్: అమెరికా గడ్డపై తొలిసారి జరగనున్న టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జూన్ 9న భారత్, పాకిస్తాన్ మధ్య ఇక్కడి ‘నాసా కౌంటీ క్రికెట్ స్టేడియం’లో జరిగే మ్యాచ్ భద్రతకు సంబంధించి అదనపు దృష్టి పెట్టారు. ఈ మ్యాచ్‌కు తీవ్రవాద ముప్పు ఉన్నట్లు సమాచారం ఉంది. దాంతో అన్ని వైపుల నుంచి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘గతంలో ఎన్నడూ చూడని భద్రతా ఏర్పాట్లు ఇక్కడ కనిపించబోతున్నాయి’ అని ఒక పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో జనాలను లక్ష్యంగా చేస్తూ ఏకవ్యక్తి చేసే ‘వుల్ఫ్ అటాక్’ తరహా దాడులకు ఆస్కారం ఉందని భావిస్తుండటంతో వాటిని నివారించేందుకు అడుగడుగునా పోలీసులను మోహరిస్తున్నారు. మ్యాచ్ జరిగే రోజు ఐసన్ హోవర్ పార్క్ పరిసరాలన్నీ పోలీసుల ఆ«దీనంలో ఉంటాయి. ఈ వివరాలను నాసా కౌంటీ ఎగ్జిక్యూటివ్ బ్రూస్ బ్లేక్‌మన్, పోలీస్ కమిషనర్ ప్యాట్రిక్ రైడర్ వెల్లడించారు. తాము ఏ విషయంలో కూడా ఉదాసీనత ప్రదర్శించబోమని వారు స్పష్టం చేశారు. ‘ప్రతీ రోజూ నాసా కౌంటీ సహా ఇతర నగరాలకు కూడా బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. మేం ఏ ఒక్కదాన్ని తేలిగ్గా తీసుకోం. అన్నింటినీ సీరియస్‌గా పరిశీలిస్తాం. అందుకే భారత్, పాక్ మ్యాచ్ జరిగే రోజు అదనంగా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాం. ఆ రోజు స్టేడియంలో కనీవినీ ఎరుగని భద్రతతో అభిమానులంతా సురక్షితంగా ఉంటారని హామీ ఇస్తున్నా’ అని రైడర్ చెప్పారు. మరోవైపు ఐసీసీ కూడా ప్రేక్షకుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో స్థానిక పోలీసులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది. సుదీర్ఘ సాధన... తొలి రోజు ఫిట్నెస్ ట్రెయినింగ్‌పైనే దృష్టి పెట్టిన భారత క్రికెట్ జట్టు రెండో రోజు పూర్తి స్థాయి నెట్ ప్రాక్టీస్‌కు హాజరైంది. ఆటగాళ్లంతా దాదాపు మూడు గంటల పాటు సాధన చేశారు. నాసా కౌంటీ గ్రౌండ్‌కు దాదాపు ఐదు మైళ్ల దూరంలో ఉన్న కాంటియాగ్ పార్క్‌లో ఈ ప్రాక్టీస్ సాగింది. ఇక్కడ ఆరు డ్రాప్ ఇన్ పిచ్‌లు ఉండగా భారత్ మూడు పిచ్‌లను వినియోగించుకుంది. రెండు పిచ్‌లపై బ్యాటర్లు సాధిన చేయగా, మరో పిచ్‌ను బౌలింగ్ కోసమే టీమిండియా కేటాయించింది. రోహిత్, గిల్, సూర్యకుమార్, పాండ్యా, దూబే, పంత్, జడేజా బ్యాటింగ్‌లో శ్రమించారు. కోహ్లి ఇంకా జట్టుతో చేరకపోగా... ఆలస్యంగా అమెరికాకు వచ్చిన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రింకూ సింగ్, యుజువేంద్ర చహల్ మాత్రం సాధనకు దూరంగా ఉన్నారు. -
ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
ప్రపంచ క్రికెట్లో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటివరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్‌ల్లో పాల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ ఇద్దరు జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే తొమ్మిదో ఎడిషన్‌లోనూ పాల్గొని సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 2007 నుంచి వరుసగా 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ఎడిషన్లలో పాల్గొని ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. పొట్టి ప్రపంచకప్‌లో వీరిద్దరి ప్రస్తానం 17 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగింది.ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్‌కప్ అరంగేట్రం ఎడిషన్ (2007) సమయానికి క్రికెట్లో ఒనమాలు దిద్దుతుండేవాడు. ఇప్పుడు అదే హిట్‌మ్యాన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు. రోహిత్ ఇప్పటివరకు జరిగిన ఎనిమిది వరల్డ్‌కప్ ఎడిషన్లలో 39 మ్యాచ్‌లు ఆడి 34.39 సగటున, 127.88 స్ట్రయిక్‌రేట్‌తో 963 పరుగలు సాధించాడు. రోహిత్ ఖాతాలో తొమ్మిది ప్రపంచకప్ హాఫ్ సెంచరీలు ఉన్నాయి.షకీబ్ విషయానికొస్తే.. ఈ బంగ్లాదేశీ వెటరన్ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడి 23.93 సగటున 122.44 స్ట్రయిక్‌రేట్‌తో 742 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన షకీబ్ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. షకీబ్ 36 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టి, టీ20 వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వయసు పైబడిన రిత్యా రోహిత్, షకీబ్‌లకు ఇదే చివరి టీ20 వరల్డ్‌కప్ కావచ్చు. రోహిత్ తొలి ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉండగా.. షకీబ్‌కు టీ20 ప్రపంచకప్ కలగా మిగిలిపోవచ్చు.2024 ఎడిషన్ విషయానికొస్తే.. ఈసారి రికార్డు స్థాయిలో 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. భారత్ గ్రూప్-ఏలో పాకిస్తాన్‌తో పాటు మరో మూడు జట్లతో పోటీపడనుంది. బంగ్లాదేశ్ గ్రూప్-డిలో సౌతాఫ్రికా, శ్రీలంకతో పాటు మరో రెండు చిన్న జట్లతో తలపడనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న (ఐర్లాండ్) ఆడనుండగా.. బంగ్లాదేశ్ జూన్ 7న (శ్రీలంక) తమ వరల్డ్‌కప్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనుంది. -
కసరత్తులు షురూ!
న్యూయార్క్: టి20 ప్రపంచకప్ వేటలో అమెరికా గడ్డపై అడుగు పెట్టిన భారత క్రికెట్ బృందం మొదటి రోజు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. కోహ్లి ఇంకా న్యూయార్క్ చేరుకోలేదు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఈ ట్రయినింగ్ సెషన్‌ను పర్యవేక్షించారు. ముఖ్యంగా భారత్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన యూఎస్ వాతావరణానికి అలవాటు పడటంపై ఆటగాళ్లు దృష్టి సారించారు.ఐపీఎల్ కారణంగా మన క్రికెటర్లంతా 90 శాతంకి పైగా డే అండ్ నైట్ మ్యాచ్‌లే ఆడారు. కానీ వరల్డ్ కప్ లీగ్ దశలో అమెరికా వేదికపై జట్టు 25–27 డిగ్రీల వాతావరణంలో అన్నీ డే మ్యాచ్‌లే (ఉదయం గం. 10:30 నుంచి) ఆడబోతోంది. ట్రయినింగ్ సెషన్లో క్రికెటర్లు స్వల్ప జాగింగ్, రన్నింగ్‌తో పాటు కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడారు.‘టైమ్ జోన్‌కు అలవాటు పడటం అన్నింటికంటే ముఖ్యం. జట్టు సభ్యులంతా కూడా దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఒక్క చోటికి చేరారు. వారి ఫిట్నెస్ స్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిని బట్టి మున్ముందు రోజుల కోసం ప్రణాళికలు రూపొందిస్తాను’ అని దేశాయ్ చెప్పారు. వాతావరణం చాలా బాగుందని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడగా... న్యూయార్క్‌లో తొలిసారి ఆడనుండటం పట్ల రవీంద్ర జడేజా ఉత్సాహంగా ఉన్నాడు. నగర శివార్లలోని నాసా కౌంటీ స్టేడియంలో జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ వరకైనా కోహ్లి జట్టుతో చేరతాడా లేదా అనే విషయంలో బీసీసీఐ స్పష్టతనివ్వలేదు. జూన్ 5న అసలు పోరులో ఐర్లాండ్‌తో భారత్ ఆడుతుంది. ‘నంబర్‌వన్’ ర్యాంక్‌తో ప్రపంచకప్‌లోకి... టి20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా నంబర్‌వన్ ర్యాంకర్‌గా బరిలోకి దిగనుంది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ 264 రేటింగ్ పాయింట్లతో తమ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను వెస్టిండీస్ 3–0తో క్లీన్‌స్వీప్ చేయడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగైంది. దక్షిణాఫ్రికా నాలుగు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. -
క్రికెట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్.. T20 సంగ్రామంకి సర్వం సిద్ధం..
-
ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్పే లక్ష్యంగా..(ఫొటోలు)
-
జూన్ 2 నుంచి క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్
-
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జో బర్న్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సొంతదేశాన్ని వీడి ఇటలీ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. ఇటలీని టీ20 వరల్డ్‌కప్ 2026కు అర్హత సాధించేలా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే ఈ ఏడాది తనువు చాలించిన తన సోదరుడు డొమ్నిక్ బర్న్స్‌కు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. డొమ్నిక్ గౌరవార్ధం తన జెర్సీపై 85 నంబర్‌ను ధరించనున్నట్లు వెల్లడించాడు. డొమ్నిక్ తన చివరి మ్యాచ్‌లో ఇదే సంఖ్య గల జెర్సీని ధరించినట్లు చెప్పుకొచ్చాడు. తన తల్లి ఇటలీ పౌరసత్వం కలిగి ఉండటంతో బర్న్స్ ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు అర్హత సాధించాడు. పై పేర్కొన్న కారణాలే కాకుండా బర్న్స్ ఆస్ట్రేలియాను వీడేందుకు మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అతనికి ఈ ఏడాది (2024-25) తన సొంత దేశవాలీ జట్టైన క్వీన్స్లాండ్ జట్టు కాంట్రాక్ట్ లభించలేదు. అలాగే బిగ్‌బాష్ లీగ్‌తోనూ బర్న్స్ కాంట్రాక్ట్ ముగిసింది. పై పేర్కొన్న కారణాలన్నిటినీ చూపుతూ బర్న్స్ ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా తన సందేశాన్ని పంపాడు. 34 ఏళ్ల బర్న్స్ 2014-2020 మధ్యలో ఆస్ట్రేలియా తరఫున 23 టెస్ట్‌లు, 6 వన్డేలు ఆడి 1608 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు (టెస్ట్‌లు), 8 హాఫ్ సెంచరీలు (7 టెస్ట్, ఒకటి వన్డే) ఉన్నాయి.ఇదిలా ఉంటే, ఇటలీ ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. ఈ దేశానికి 2026 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. జూన్ 9 నుంచి జరిగే వరల్డ్‌కప్ రీజియనల్ క్వాలిఫయర్స్‌లో ఇటలీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ పోటీల్లో ఇటలీ.. ఫ్రాన్స్, ఐసిల్ ఆఫ్ మ్యాన్, లక్సంబర్గ్, టర్కీ జట్లతో పోటీపడుతుంది. -
పొట్టి ప్రపంచకప్‌పై ఐపీఎల్ ప్రభావమెంత..?
రెండు నెలలకు పైగా జరిగిన క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిన్నటితో (మే 26) ముగిసింది. ఈ సీజన్ ఫైనల్లో కేకేఆర్.. సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్ ముగిసిన ఐదు రోజుల్లోనే మరో మహా క్రికెట్ సంగ్రామం మొదలుకానుంది. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ దాదాపుగా నెల రోజుల పాటు అభిమానులకు కనువిందు చేయనుంది.పొట్టి ప్రపంచకప్ ఐసీసీ ఈవెంట్ కావడంతో అభిమానుల్లో అమితాసక్తి నెలకొని ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే టోర్నీ కావడంతో తీవ్ర భావోద్వేగాలు ఉంటాయి. ఈ సారి వరల్ఢ్‌కప్‌లో గతంలో ఎన్నడూ లేనట్లుగా 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌కు ఐదు జట్ల చొప్పున మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారత్.. చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో భారత్, పాక్‌లతో పాటు యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా దేశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ రెండు నెలల సుదీర్ఘ కాలంపాటు సాగిన నేపథ్యంలో ఓ ఆసక్తిర ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు (దాదాపుగా) చెందిన ఆటగాళ్లు ఇన్ని రోజుల పాటు ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో ఈ లీగ్ ప్రభావం పొట్టి ప్రపంచకప్‌పై ఏమేరకు పడనుందనే ప్రశ్న తలెత్తుతుంది. ఐపీఎల్ ముగిసి వారం రోజులు కూడా గడువక ముందే పొట్టి ప్రపంచకప్ ప్రారంభంకావడం మంచిదేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఐపీఎల్ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల ఆటగాళ్లు అలసిపోయుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ ప్రభావం ఆటగాళ్లపై నెగిటివ్‌గా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లలో సీరియస్‌నెస్ కొరవడిందని కొందరంటున్నారు. ఐపీఎల్లో ఆడి కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడిన విషయాన్ని ఇంకొందరు ప్రస్తావిస్తున్నారు. ఐపీఎల్లో లభించే డబ్బును చూసుకుని కొందరు ఆటగాళ్లు దేశీయ విధులపై ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్ ముగిసి వారం కూడా గడవక ముందే మెగా టోర్నీ నిర్వహించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఐపీఎల్ వల్ల మంచే జరిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ వల్ల తమ దేశ ఆటగాళ్లకు మంచే జరిగిందని ఆసీస్ అభిమానులు అనుకుంటున్నారు. కిక్కిరిసిన జనాల మధ్య ఐపీఎల్ ఆడటం వల్ల తమ దేశ క్రికెటర్లకు ఒత్తిడిని ఎదుర్కోవాలో తెలిసొచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం ఏకీభవించాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా తప్పుచేసిందని అతను అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే పొట్టి ప్రపంచకప్ ఇంకాస్త ఎక్కువగా సన్నద్దమయ్యేవారని వాన్ అన్నాడు.భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. ఐపీఎల్ ప్రతిభే కొలమానంగా ప్రపంచకప్ జట్టు ఎంపిక జరిగింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ప్రపంచకప్ బెర్త్ దక్కింది. జట్టులో స్థానం విషయంలో సెలెక్టర్లు ఎలాంటి ములాజలకు పోకుండా అర్హులైన వారినే ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు సంబంధించి వ్యూహాలు వేరుగా ఉన్నప్పటికీ.. ఐపీఎల్ వల్ల భారత ఆటగాళ్లకు మేలే జరిగిందని చెప్పాలి. ఈ ఐపీఎల్ సీజన్లో కీలక ఆటగాళ్లెవరు గాయాల బారిన పడలేదు. టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యులైన ఆటగాళ్లందరూ మాంచి ఫామ్‌లో ఉండటంతో జట్టు ఎంపిక కూడా చాలా కష్టమైంది. కొన్ని సమీకరణల కారణంగా కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తే పొట్టి ప్రపంచకప్‌పై ఐపీఎల్ ప్రభావం అనే అంశంపై ఎవరి అభిప్రాయాలను వారు వినిపిస్తున్నారు. -
సాక్షి ఉద్యోగులతో పీయూష్ చావ్లా
-
జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ వార్మప్ మ్యాచ్
దుబాయ్: ఇప్పుడైతే భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఆడుతున్నారు. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు కలిసి కట్టుగా, భారత జట్టుగా రోహిత్ శర్మ బృందం ఏకైక వార్మప్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగే ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశ పోటీలన్నీ అమెరికాలోనే షెడ్యూల్ చేశారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అక్కడే ఆడుతుంది. అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది. పోటీపడే మొత్తం 20 జట్లలో 17 జట్లు మే 27 నుంచి జూన్ 1 వరకు వార్మప్‌లో పాల్గొంటుండగా... డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్‌లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే నేరుగా టోర్నీలోనే బరిలోకి దిగనున్నాయి. ఈ మూడు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల వల్లే బహుశా వార్మప్ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చు. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. -
అవును... నలుగురు స్పిన్నర్లు ఉండాల్సిందే
ముంబై: వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శన చాలా పరిమితమని చెప్పాడు. ఇటీవల ప్రకటించిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్‌లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు చోటు దక్కింది. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ ‘నలుగురు స్పిన్నర్లు ఎందుకు అవసరమనేది ఇప్పుడే వెల్లడించలేను. కానీ కచ్చితంగా ఉండాలనే అనుకున్నాం. ఇందులో ఇద్దరు ఆల్‌రౌండర్లు (జడేజా, అక్షర్) అవసరమైనపుడు బ్యాటింగ్‌లో ఎదురుదాడికి దిగుతారు. పిచ్, ప్రత్యర్థి జట్లను బట్టి మా ‘నలుగురి’ ప్రణాళిక జట్టును సమతూకంగా ఉంచుతుంది. మిడిల్ ఓవర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకే శివమ్ దూబేలాంటి హిట్టర్‌ను ఎంపిక చేశాం. ఈ ఐపీఎల్‌తో పాటు గతంలో టీమిండియా తరఫున దూబే బాగా ఆడాడు. ఐపీఎల్ కంటే ముందే 70, 80 శాతం జట్టు ఎంపిక కూర్పు జరిగిపోయింది. ఎందుకంటే ఐపీఎల్ ప్రదర్శన ఏరోజుకు ఆరోజు మారిపోతూనే ఉంటుంది. దానినే ప్రామాణికంగా తీసుకోలేం. కేవలం కొన్ని స్థానాల కోసమే లీగ్‌ను పరిగణనలోకి తీసుకున్నాం’ అని వివరించాడు. జూన్ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లలో టి20 ప్రపంచకప్ జరుగుతుంది. లీగ్ దశ మ్యాచ్‌లన్నీ భారత్... అమెరికాలోనే ఆడుతుంది. ఆ తర్వాత సూపర్–8 దశ మ్యాచ్‌ల కోసం కరీబియన్ దీవులకు టీమిండియా వెళుతుంది. -
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...
రానున్న టీ20 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు ఎంపిక జరిగింది. అమెరికా, వెస్టిండీస్‌లు వేదికగా జూన్ 2 నుంచి జరిగే పోటీలకు రోహిత్ శర్మ సారథిగా 15 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. మరో నలుగురు ఆటగాళ్ళను రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ ప్యానెల్ చేసిన ఎంపికలో కొందరు స్టార్ ఆటగాళ్ళకు చోటు దక్కలేదు. అలాగని, ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన ఎంపికలూ లేవు. విధ్వంసకర బ్యాట్స్ మన్ రింకూ సింగ్‌కు చోటివ్వకపోవడం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయ్ ఇండియన్స్ (ఎంఐ) జట్టు సారథిగా విఫలమైనా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌ను చేయడం విమర్శలకు తావిచ్చాయి. అలాగే, స్పిన్నర్లనేమో నలుగురిని తీసుకొని, జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో ముగ్గురు పేసర్ల బృందానికే పరిమితం కావడమూ ప్రశ్నార్హమైంది. కొంత ఇష్టం, కొంత కష్టం, మరికొంత నష్టాల మేళవింపుగా సాగిన ఈ ఎంపికపై సహజంగానే చర్చ జరుగుతోంది.గత ఏడాదంతా టీ20లలో పాల్గొనకపోయినా సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీలకు సెలక్షన్ ప్యానెల్ పెద్దపీట వేసింది. నాలుగు గ్రూపుల్లో 20 జట్లతో, మొత్తం 55 మ్యాచ్‌లు సాగే ఈ స్థాయి భారీ పోటీలో, అమెరికాలోని అలవాటు లేని పిచ్‌లలో సీనియర్ల అనుభవం అక్కరకొస్తుందని భావన. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అబ్బురపరిచేలా ఆడుతున్న వికెట్‌కీపర్ – బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఎంపికతో గత రెండు వరల్డ్‌కప్‌లలో లేని విధంగా మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ ఆప్షన్ జట్టుకు దక్కింది. ఈసారి ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తూ, రాజస్థాన్ రాయల్స్‌ను అగ్రపీఠంలో నిలిపిన సంజూ శామ్సన్‌కు జట్టులో స్థానం దక్కింది. వెరపెరుగని బ్యాటింగ్‌తో, అలవోకగా సిక్స్‌లు కొట్టే అతడి సత్తాకు వరల్డ్ కప్ పిలుపొచ్చింది. మిడిల్ ఆర్డర్లో అతడు జట్టుకు పెట్టని కోట. స్పెషలిస్ట్ వికెట్ కీపర్లుగా శామ్సన్, పంత్‌లను తీసుకోవడంతో కె.ఎల్. రాహుల్‌కు మొండి చేయి చూపక తప్పలేదు. ఒకప్పుడు ఎగతాళికి గురైన ముంబయ్ కుర్రాడు శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో మిడిల్ ఆర్డర్లో సిక్సర్ల వీరుడిగా, ప్రస్తుతం భారత వరల్డ్ కప్ టీమ్‌లో కీలక భాగస్వామిగా ఎదగడం గమనార్హం.క్లిష్టమైన వేళల్లో సైతం బ్యాటింగ్ సత్తాతో జట్టును విజయతీరాలకు చేర్చే సత్తా, స్వభావం ఉన్న ఆటగాడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాతికేళ్ళ రింకూ సింగ్‌కు పేరు. అయితే, ఏ స్థానంలో ఆడించా లని మల్లగుల్లాలు పడి, చివరకు ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్‌కు జట్టులో చోటే ఇవ్వలేదు. రిజర్వ్ ఆట గాడిగా మాత్రం జట్టు వెంట అమెరికా, వెస్టిండీస్‌లకు వెళతాడు. పరుగుల సగటు 89, స్ట్రయిక్‌రేట్ 176 ఉన్న రింకూ లాంటి వారికి తుది జట్టులో స్థానం లేకపోవడం తప్పే. ఈ ఏడాది ఐపీఎల్లో బాగా ఆడుతున్న స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు జట్టులోకి మళ్ళీ పిలుపు వచ్చింది. అయితే, నలు గురు స్పిన్నర్లతోటి, అందులోనూ ఇద్దరు ముంజేతితో బంతిని తిప్పే రిస్ట్ స్పిన్నర్లతోటి బరిలోకి దిగడంతో మన బౌలింగ్ దాడిలో సమతూకం తప్పినట్టుంది. ప్రధాన పేసర్లు ముగ్గురే కావడం, బౌలింగ్‌లో హార్దిక్ ఫామ్‌లో లేకపోవడం, సీఎస్కేలో శివమ్‌కు గతంలో బౌలింగ్ ఛాన్స్ ఆట్టే రాకపోవడంతో టీ20 వరల్డ్ కప్‌లో మన పేసర్ల విభాగం బలహీనంగా కనిపిస్తోంది. వివరణలేమీ ఇవ్వకుండానే మే 23 వరకు ఈ ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకొనే అవకాశం సెలక్టర్లకుంది. కానీ, ఫైనల్ 15 మందిని మార్చడానికి అగర్కర్ బృందం ఇష్టపడుతుందా అన్నది అనుమానమే. అది అటుంచితే, 2007 తర్వాత భారత్ టీ20 టైటిల్స్ ఏవీ గెలవలేదు. నిజానికి, ధోనీ సారథ్యంలోని యువకుల జట్టు 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌లో గెలిచిన తీరు మన క్రికెట్లో కొత్త మలుపు. టీ20లకు భారత్ అడ్డాగా మారిందంటే దాని చలవే. ఆ వెంటనే 2008లో ఐపీఎల్ ఆరంభంతో కథే మారిపోయింది. ఇవాళ ప్రతి వేసవిలో పేరున్న అంతర్జాతీయ ఆటగాళ్ళు భారత్‌కు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్స్ వచ్చినా, ఐపీఎల్‌దే హవా. ఇంతవున్నా 2014లో ఒక్కసారి శ్రీలంకతో ఫైనల్స్‌లో ఓడినప్పుడు మినహా ఎన్నడూ విజయం అంచుల దాకా మనం చేరింది లేదని గమనించాలి. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. యువ ప్రతిభను ప్రోత్సహించడం, ఆటకు తగ్గ ఆటగాళ్ళను ఎంచుకోవడమనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతే కష్టం. ఆ సూత్రాన్ని పాటించడం వల్లే 2007లో మనకు కప్పు దక్కిందని గుర్తుంచుకోవాలి.గమనిస్తే, దశాబ్దిన్నర పైగా క్రికెట్ స్వరూప స్వభావాలే మారిపోయాయి. మిగతావాటి కన్నా టీ20లు పాపులరయ్యాయి. బంతిని మైదానం దాటించే బ్యాటింగ్ విధ్వంసాలు, స్కోర్ బోర్డ్‌ను పరి గెత్తించే పరుగుల వరదలు, మైదానంలో మెరుపు లాంటి ఫీల్డింగ్ ప్రతిభలు సాధారణమై పోయాయి. టెస్ట్, వన్డే క్రికెట్లు సైతం తమ పూర్వశైలిని మార్చుకోవాల్సి వచ్చింది. ఆర్థికంగానే కాక అనేక విధా లుగా వాటిని టీ20 మింగేసే పరిస్థితీ వచ్చింది. బ్యాట్స్మన్ల వైపు మొగ్గుతో ఈ పొట్టి క్రికెట్ పోటీలు బౌలర్లకు నరకంగా మారి, ఆటకు ప్రాణమైన పోటీతత్వాన్ని హరిస్తున్నాయి. అందుకే, 2008లో ఆరంభమైన ఐపీఎల్ ఏటికేడు క్రమంగా మునుపటి ఆసక్తినీ, ఆదరణనూ కోల్పోతోంది. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌ల తయారీ మొదలు టీ20 ఫార్మట్‌లో, ఐపీఎల్లో కొన్ని నియమ నిబంధనల సవరణ దాకా అవసరమైన చర్యలు చేపట్టాలి. తద్వారా పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపిరులూదాలి. టీ20 వరల్డ్ కప్‌లో విజయం సాధించాలంటే ఆటలోనే కాదు... ఎంపికలోనూ దూకుడు అవసరం. రిస్క్ లేని సేఫ్ గేమ్‌తోనే పొట్టి క్రికెట్లో కప్పు కొట్టగలిగితే అది ఓ కొత్త చరిత్ర! -
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
టీ20 వరల్డ్‌కప్-2024కు ప్రకటించిన భారత జట్టులో నయా ఫినిషర్ రింకూ సింగ్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో రింకూకు ఛాన్స్ ఇవ్వని సెలక్టర్లు.. నామమాత్రంగా స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అద్బుత ఫామ్‌లో రింకూను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టులో అదనపు బౌలర్ అవసరం ఉండటంతోనే రింకూను సెలక్ట్ చేయలేదని అగార్కర్ తెలిపాడు.రింకూ సింగ్ అద్బుతమైన ఆటగాడని మాకు తెలుసు. దురుదృష్టవశాత్తూ రింకూను సెలక్ట్ చేయలేకపోయాం. అతడిని ఎంపిక చేయకపోవడానికి వెనుక ఓ కారణముంది. మేము ఎక్స్ట్రా స్పిన్నర్‌ను ఎంపిక చేయాలనుకున్నాం. అందుకే రింకూకు ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. మా నిర్ణయం రింకూను బాధపెట్టవచ్చు. కానీ జట్టు బ్యాలెన్స్ కారణంగా అతడిపై వేటు వేయక తప్పలేదు. అయినప్పటికి అతడు ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టుతో పాటు వెళ్తాడని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ పేర్కొన్నాడు. -
స్మిత్‌కు దక్కని చోటు
మెల్బోర్న్: కెరీర్లో ఐదో టి20 ప్రపంచకప్ ఆడాలని ఆశించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే ఆ్రస్టేలియా జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష సారథ్యం వహిస్తాడు. గత 14 ఏళ్లలో ప్రపంచకప్ జట్టులో స్మిత్‌కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 2021లో టి20 ప్రపంచకప్‌ను తొలిసారి సాధించిన ఆ్రస్టేలియా జట్టులో స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు. 34 ఏళ్ల స్మిత్ ఇప్పటివరకు ఆసీస్ తరఫున 67 టి20 మ్యాచ్‌లు ఆడి 125.45 స్ట్రయిక్‌రేట్‌తో 1094 పరుగులు సాధించాడు. ఆ్రస్టేలియా జట్టు: మిచెల్ మార్‡్ష (కెప్టెన్), వార్నర్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, కమిన్స్, హేజల్‌వుడ్, స్టార్క్, ఆష్టన్ అగర్, ఆడమ్ జంపా. -
ప్రపంచ కప్ వేటకు సిద్ధం
-
టీ20 వరల్డ్‌కప్ వేటగాళ్లు.. భారత్ ప్లేయర్స్ బయోడేటా (ఫొటోలు)
-
India T20 WC Squad: ప్రపంచకప్ వేటకు సిద్ధం
టి20 ప్రపంచకప్ సమరాన్ని గెలిచేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరోసారి అనుభవాన్నే నమ్ముకుంది. ఐపీఎల్లో అద్భుత బ్యాటింగ్‌తో కొందరు కుర్రాళ్లు అదరగొడుతున్నా... సీనియర్లకు ప్రాధాన్యతనిచ్చింది. దీంతో పాటు ప్రస్తుతం ఫామ్ గొప్పగా లేకున్నా... అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇప్పటికే ఎంతో కొంత ప్రభావం చూపించిన వారిపైనే కమిటీ విశ్వాసం ఉంచింది. గత టి20 వరల్డ్ కప్‌లో ఆడిన 9 మందికి ఈసారి మళ్లీ అవకాశం కర్నీచింది. అందుకే వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ దాదాపుగా అంచనాలకు తగినట్లుగానే సాగింది. ఒకరిద్దరు ఆటగాళ్ల ఎంపిక విషయంలో కాస్త ఆశ్చర్యకర నిర్ణయాలు కనిపించినా... మొత్తంగా అర్హత కలిగిన వారికే అమెరికా–వెస్టిండీస్ వీసా లభించింది. గత వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత పూర్తిగా కుర్రాళ్లతో టి20ల్లో బోర్డు కొత్త ప్రయోగాలు చేసినా... తర్వాతి మెగా టోర్నీకి వచ్చేసరికి మళ్లీ తమ పాత ప్రణాళికకే కట్టుబడటం చెప్పుకోదగ్గ అంశం. అహ్మదాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 9వ టి20 ప్రపంచకప్ కోసం భారత సెలక్టర్లు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బోర్డు సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశమై ఆటగాళ్లను ఎంపిక చేసింది. రోహిత్ శర్మ వరుసగా రెండో టి20 ప్రపంచకప్‌లో కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనుండగా... 2022లో ఆ్రస్టేలియా గడ్డపై టి20 వరల్డ్ కప్‌లో ఆడిన వారిలో 9 మంది ఈసారీ టీమిండియా చాన్స్ దక్కించుకున్నారు. గత టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. సెలక్టర్లు ప్రకటించిన జట్టులో నలుగురు బ్యాటర్లు, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. మరో నలుగురు ఆటగాళ్లను ‘రిజర్వ్’లుగా కూడా ఎంపిక చేశారు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే వరల్డ్ కప్‌లో గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్ జూన్ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.ఆ తర్వాత జూన్ 9, 12, 15 తేదీల్లో వరుసగా పాకిస్తాన్, అమెరికా, కెనడా జట్లను టీమిండియా ఎదుర్కొంటుంది. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరని జట్ల ఆటగాళ్లతో కూడిన మొదటి బృందం ఈ నెల 21న ముందుగా కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు అమెరికాకు బయల్దేరుతుంది. జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్‡్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. రిజర్వ్ ఆటగాళ్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్. ఐపీఎల్ ప్రదర్శనతోనే... జట్టు ఎంపికలో తాజా ఐపీఎల్ ప్రదర్శనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారా అంటే అవునని, కాదని కూడా సమాధానం వస్తుంది. చెన్నై తరఫున మిడిలార్డర్లో సిక్సర్లతో చెలరేగిపోతున్న శివమ్ దూబేకు ఐపీఎల్ కారణంగానే పిలుపు దక్కింది. ఈ టోర్నీలో అతను ఏకంగా 172.41 స్ట్రయిక్‌రేట్‌తో 350 పరుగులు సాధించాడు. భారత్‌కు ఆడిన 21 టి20ల్లో కూడా అతను ఆకట్టుకున్నాడు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకొని ఐపీఎల్లో రాణిస్తున్న రిషభ్ పంత్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. లీగ్‌లో అతను 158.58 స్ట్రయిక్‌రేట్‌తో 398 పరుగులు చేశాడు. అయితే పరుగులకంటే పూర్తి ఫిట్‌గా పంత్ కనిపించడం కూడా సానుకూలాంశంగా మారింది. మరోవైపు రెండో వికెట్ కీపర్‌గా కేరళకు చెందిన సంజూ సామ్సన్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా రాజస్తాన్ రాయల్స్ టీమ్‌ను సమర్థంగా నడిపించడంతో పాటు 161.08 స్ట్రయిక్‌రేట్‌తో సామ్సన్ 385 పరుగులు సాధించాడు. ఎవరు... ఎందుకు... ఎలా? 2022 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన ఆడిన జట్టుతో పోలిస్తే రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, హార్దిక్, అక్షర్, అర్‡్షదీప్, చహల్, బుమ్రా (టోర్నీకి ముందు గాయంతో తప్పుకున్నాడు) తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. 2021, 2022లో వరల్డ్ కప్‌లలో ఆడిన జట్టులో దాదాపు అదే టాప్–6 ఇప్పుడు కూడా మళ్లీ ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్ స్థానంలో యశస్వి రావడం మినహా ఎలాంటి మార్పూ లేదు. యశస్వి ఈ సీజన్ ఐపీఎల్లో వరుస వైఫల్యాల తర్వాత సెంచరీతో ఆకట్టుకోవడంతో అతనికి అవకాశం దక్కింది. బ్యాటింగ్‌లో ఇప్పుడు కావాల్సిన ‘ఫైర్’ లేదని ఎన్ని విమర్శలు వస్తున్నా అగ్రశ్రేణి బ్యాటర్లుగా రోహిత్, కోహ్లిల స్థానం ఎప్పుడూ ప్రశ్నార్ధకం కాదు. సూర్యకుమార్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రవీంద్ర జడేజా కూడా గొప్ప ప్రదర్శన చేయకపోయినా ఆల్‌రౌండ్ నైపుణ్యం అతనికి కలిసొచ్చింది. జడేజా ఉన్న తర్వాత అక్షర్ పటేల్ ఎంపిక కూడా కాస్త ఆశ్చర్యకరమే. హార్దిక్ మళ్లీ... ఇటీవల ఆటలో వైఫల్యాలతో పాటు ముంబై కెప్టెన్సీ వ్యవహారాలతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకు సెలక్టర్లు మాత్రం అండగా నిలిచారు. వన్డే వరల్డ్ కప్‌లో గాయపడి కోలుకున్న తర్వాత భారత్‌కు ఆడకపోయినా అతనిపై నమ్మకముంచారు. ఐపీఎల్‌లోనూ విఫలమైనా... అతని తరహాలో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్థానం కోసం ప్రత్యామ్నాయం లేక ఎంపిక చేయక తప్పలేదు. దూబే అస్సలు బౌలింగ్ చేయకపోవడం, హార్దిక్ ఎన్నో కొన్ని ఓవర్లు వేస్తుండటం వల్ల కూడా అతని స్థానానికి ఢోకా లేకుండా పోయింది. నలుగురు స్పిన్నర్లతో... అమెరికాలో తొలిసారి వరల్డ్ కప్ జరుగుతుండంతో కొత్తగా అక్కడ తయారు చేస్తున్న పిచ్‌లు ఎలా ఉంటాయో సరిగ్గా ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. అయితే స్పిన్‌కు అవకాశం ఉంటే తమ అన్ని అస్త్రాలను వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. జడేజా, అక్షర్‌లతో పాటు కుల్దీప్, యుజువేంద్ర చహల్‌లు జట్టులో ఉన్నారు. కుల్దీప్ చాలా కాలంగా మంచి ఫామ్‌లో ఉండగా... గత రెండు సిరీస్‌లలో భారత జట్టులో చోటు దక్కించుకోని చహల్ పునరాగమనం చేసి తొలిసారి టి20 వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వీరిని వాడుకోవచ్చు. బుమ్రాకు తోడుగా అర్‡్షదీప్, సిరాజ్‌లను ఎంపిక చేశారు. ఈ ఫార్మాట్లో గొప్ప ప్రదర్శన లేకపోయినా, ఐపీఎల్‌లోనూ పెద్దగా రాణించలేకపోతున్నా... ప్రస్తుత స్థితిలో అనుభవం ఉన్న పేసర్ అతనే కావడంతో సిరాజ్‌కు తొలిసారి టి20 ప్రపంచకప్ ఆడే చాన్స్ లభించింది. లెఫ్టార్మ్ పేసర్ కావడమే అర్‡్షదీప్ బలం. కొంత కాలంగా లయ కోల్పోయి ఇబ్బంది పడుతున్నా అర్‡్షదీప్‌ను సెలక్టర్లు మళ్లీ నమ్మారు. గత వరల్డ్ కప్‌లో సెమీస్ ఓటమి తర్వాత మళ్లీ అంతర్జాతీయ టి20 ఆడని రాహుల్‌ను తప్పించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతని స్ట్రయిక్‌రేట్ కూడా అంతంత మాత్రమే. రాహుల్ తరహాలోనే శుబ్‌మన్ గిల్ కూడా ఈ ఫార్మాట్లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు. పాపం రింకూ సింగ్... వరల్డ్ కప్ జట్టు ఎంపికలో అన్ని రకాలుగా చర్చకు దారి తీసిన విషయం రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడం. విధ్వంసకర బ్యాటింగ్‌తో గత ఏడాది ఐపీఎల్ నుంచి అతను తానేంటో నిరూపించుకున్నాడు. లోయర్ మిడిలార్డర్లో ఫినిషర్‌గా సత్తా చాటాడు.భారత్ తరఫున లభించిన పరిమిత అవకాశాల్లో (11 ఇన్నింగ్స్‌లు) ఏకంగా 176.23 స్ట్రయిక్ రేట్, 89 సగటుతో పరుగులు సాధించాడు. కానీ చివరకు వచ్చేసరికి అతనికి వరల్డ్ కప్ చాన్స్ లభించలేదు. ఈసారి ఐపీఎల్లో గొప్పగా ఆడకపోవడం వాస్తవమే అయినా కోల్‌కతా టాపార్డర్ రాణిస్తుండటంతో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. 9 మ్యాచ్‌లలో కేవలం 82 బంతులే ఆడే చాన్స్ దక్కింది. మిడిలార్డర్లో భారీ షాట్లు కొట్టే సామర్థ్యం ఉన్న బ్యాటర్ కోసం జరిగిన చర్చలో రింకూపై దూబేదే పైచేయి అయింది. ఒకవేళ తుది జట్టులో హార్దిక్‌ను తప్పించాల్సి వచ్చినా... దూబే బౌలింగ్ ఎంతో కొంత ఉపయోగపడగలదని సెలక్టర్లు భావించారు. రోహిత్ శర్మవయసు: 37 ఆడిన టి20లు: 151 చేసిన పరుగులు: 3974 అత్యధిక స్కోరు: 121 నాటౌట్ సెంచరీలు: 5 అర్ధ సెంచరీలు: 29 స్ట్రయిక్‌రేట్: 139.97 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 8 విరాట్ కోహ్లి వయసు: 35 ఆడిన టి20లు: 117 చేసిన పరుగులు: 4037 అత్యధిక స్కోరు: 122 నాటౌట్ సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 37 స్ట్రయిక్‌రేట్: 138.15 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 5సూర్యకుమార్వయసు: 33 ఆడిన టి20లు: 60 చేసిన పరుగులు: 2141 అత్యధిక స్కోరు: 117 సెంచరీలు: 4 అర్ధ సెంచరీలు: 17 స్ట్రయిక్‌రేట్: 171.55 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2 హార్దిక్ పాండ్యా వయసు: 30 ఆడిన టి20లు: 92 చేసిన పరుగులు: 1348 అత్యధిక స్కోరు: 71 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 స్ట్రయిక్‌రేట్: 139.88 తీసిన వికెట్లు: 73 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 3 రిషభ్ పంత్ వయసు: 26 ఆడిన టి20లు: 66 చేసిన పరుగులు: 987 అత్యధిక స్కోరు: 65 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 స్ట్రయిక్‌రేట్: 126.37 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2 శివమ్ దూబే వయసు: 30 ఆడిన టి20లు: 21 చేసిన పరుగులు: 276 అత్యధిక స్కోరు: 63 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 తీసిన వికెట్లు: 8 స్ట్రయిక్‌రేట్: 145.26 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ అర్‡్షదీప్ సింగ్వయసు: 25 ఆడిన టి20లు: 44 తీసిన వికెట్లు: 62 ఉత్తమ బౌలింగ్: 4/37 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 1 యుజువేంద్ర చహల్ వయసు: 33 ఆడిన టి20లు: 80 తీసిన వికెట్లు: 96 ఉత్తమ బౌలింగ్: 6/25 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ కుల్దీప్ యాదవ్ వయసు: 29 ఆడిన టి20లు: 35 తీసిన వికెట్లు: 59 ఉత్తమ బౌలింగ్: 5/17 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ రవీంద్ర జడేజావయసు: 35 ఆడిన టి20లు: 66 చేసిన పరుగులు: 480 అత్యధిక స్కోరు: 46 నాటౌట్ స్ట్రయిక్‌రేట్: 125.32 తీసిన వికెట్లు: 53 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 5 సంజూ సామ్సన్ యశస్వి జైస్వాల్ వయసు: 22 ఆడిన టి20లు: 17 చేసిన పరుగులు: 502 అత్యధిక స్కోరు: 100 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 4 స్ట్రయిక్‌రేట్: 161.93 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ జస్ప్రీత్ బుమ్రావయసు: 30 ఆడిన టి20లు: 62 తీసిన వికెట్లు: 74 ఉత్తమ బౌలింగ్: 3/11 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2 మొహమ్మద్ సిరాజ్ వయసు: 30 ఆడిన టి20లు: 10 తీసిన వికెట్లు: 12 ఉత్తమ బౌలింగ్: 4/17 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ అక్షర్ పటేల్ వయసు: 30; ఆడిన టి20లు: 52 చేసిన పరుగులు: 361 తీసిన వికెట్లు: 49ఉత్తమ బౌలింగ్: 3/9 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ -
SA T20 WC Squad: మార్క్రమ్ సారథ్యంలో బరిలోకి దక్షిణాఫ్రికా
టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. గత ఏడాది మార్చిలో తొలిసారి దక్షిణాఫ్రికా టి20 జట్టుకు కెపె్టన్‌గా ఎంపికైన మార్క్రమ్ సారథ్యంలోనే సఫారీ బృందం ఈ మెగా టోర్నీలో పోటీపడనుంది.వికెట్ కీపర్ రికెల్టన్, పేసర్ బార్ట్‌మన్ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. డికాక్, కొయెట్జీ, ఫోరŠూట్యన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, నోర్జే, రబడ, షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ ప్రచారకర్తగా బోల్ట్
దుబాయ్: అథ్లెటిక్స్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు కొత్తగా క్రికెట్‌కు ప్రచారం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. జమైకాకు చెందిన బోల్ట్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో జరిగే టి20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. జూన్ 1 నుంచి జరిగే ఈ టోర్నీ వెస్టిండీస్, అమెరికాలలో జరగనున్న నేపథ్యంలో విండీస్ జట్టులో భాగమైన జమైకా దేశ ప్లేయర్ బోల్ట్‌ను ఎంచుకుంది.కొన్నేళ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలికిన ఫాస్టెస్ట్ స్ప్రింటర్ బోల్ట్ పేరిటే ప్రస్తుతం 100 మీటర్లు, 200 మీటర్లు ప్రపంచ రికార్డులు నమోదై ఉన్నాయి. ‘ఈ కొత్త పాత్ర పట్ల చాలా సంతోషంగా ఉంది. అంబాసిడర్ హోదాలో ప్రపంచకప్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. క్రికెట్‌ను ఎంతో ప్రేమించే కరీబియన్ దేశం నుంచి వచ్చిన నా మదిలో క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది.వరల్డ్ కప్ అమెరికాలో జరగడం క్రికెట్ మార్కెట్‌ను మరింత విస్తరించేలా చేస్తుంది. అయితే టోర్నీలో మాత్రం నేను వెస్టిండీస్ జట్టుకు మద్దతు పలుకుతా’ అని బోల్ట్ వెల్లడించాడు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. -
హార్దిక్ పాండ్యాపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్
ముంబై ఇండియన్స్ సారధి హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ ప్లేయర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్‌తో హార్దిక్ టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం కష్టమని మనోజ్ అన్నాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబేను ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్లో హార్దిక్ బౌలర్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే హార్దిక్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఐపీఎల్లో హార్దిక్ గత మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఒకే ఒక ఓవర్ వేశాడని.. ఈ సీజన్లో అతని ఎకానమీ రేట్ 11కు పైగా ఉందని గుర్తు చేశాడు. భారత జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడాలంటే హార్దిక్ బౌలింగ్‌లో తప్పక రాణించాల్సి ఉందని అన్నాడు. బౌలర్‌గా సత్తా చాటకపోతే భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హార్దిక్‌కు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయడని చెప్పాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక కావాలంటే దూబే కూడా బౌలింగ్‌లో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు. కేవలం బ్యాటింగ్ మెరుపులతో శివమ్ దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాలేడని అన్నాడు. దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కావాలంటే ఐపీఎల్లో ఎక్కువగా బౌలింగ్ చేయాలని సూచించాడు. ఒకవేళ దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాలేదంటే అది సీఎస్కే తప్పే అవుతుందని అన్నాడు. సీఎస్కే కెప్టెన్ దూబేను బౌలర్‌గా కూడా వాడుకోవాలని సూచించాడు. ఈ సీజన్లో దూబే బౌలింగ్ సేవలను సీఎస్కే పెద్దగా వినియోగించుకోలేదని గుర్తు చేశాడు. దూబే చాలా తెలివైన బౌలర్ అని మనోజ్ కితాబునిచ్చాడు. ఇలాంటి స్మార్ట్ బౌలర్‌ను సీఎస్కే ఎందుకు వినియోగించుకోవడం లేదో అర్దం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దూబే, వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్ ఆల్‌రౌండర్) లాంటి ఆల్‌రౌండర్లతో ఆయా జట్లు ఎందుకు బౌలింగ్ చేయించట్లేదో అంతు చిక్కడం లేదని అన్నాడు. కాగా, ఈ ఏడాది జూన్ 1 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టును ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. టీమిండియా బెర్తులు ఎవరెవరికి ఖరారవుతాయనేది ఐపీఎల్ ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. శివమ్ దూబేను సెలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. -
టీ20 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌ను.. అందుకే కోట్ల డబ్బు: ధోని
చెన్నై సూపర్ కింగ్స్ అంటే మహేంద్ర సింగ్ ధోని.. ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్ అంటూ ఉంటారు తలా అభిమానులు. సీఎస్కేతో ధోని అనుబంధం ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ఐపీఎల్లో చెన్నైకి ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన ఘనత ధోని సొంతం. క్యాష్ రిచ్ తొలి సీజన్లో జట్టును ఫైనల్ వరకు తీసుకువచ్చిన ధోని.. 2010, 2011, 2018, 2021, 2023 ఎడిషన్లలో విజేతగా నిలిపాడు. అదే విధంగా.. తలా సారథ్యంలో 2012, 2013, 2015, 2019లో రన్నరప్‌గా నిలిచింది సీఎస్కే. ఈ క్రమంలో ధోనితో తమ బంధాన్ని సెలబ్రేట్ చేస్తూ మా గుండెల్లో నీ స్థానం పదిలం అంటూ అభిమానాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ధోని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్లో తన ఆగమనం గురించి చెబుతూ.. ‘‘తొలుత ఐదుగురి పేర్లను మార్క్యు ప్లేయర్లు(ఐకాన్)గా ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని ఫ్రాంఛైజీలు నన్ను సంప్రదించాయి. ఐకాన్ ప్లేయర్‌గా ఉండాలని కోరాయి. అందుకు ఒక మిలియన్ డాలర్ల మేర ఆఫర్ చేశాయి. నాకు నిర్ణయం తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. అయితే, నేను మాత్రం రిస్క్ తీసుకోవాలనే నిర్ణయించుకున్నా. 2007లో ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌ను నేను. కాబట్టి నేను వేలంలోకి వెళ్తే కచ్చితంగా మిలియన్ డాలర్ కంటే ఎక్కువ మొత్తమే పలుకుతానని భావించా. అందుకే వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. నిజానికి.. మార్క్యు ప్లేయర్‌ని ముందే పెట్టుకుంటే వారికి 10 -15 శాతం ఎక్కువగా చెల్లించాలి. అలాంటి ప్లేయర్‌తో పాటు ఇంకో కీలక ఆటగాడిని కొనుగోలు చేయాలంటే ఫ్రాంఛైజీల యజమానులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయినా సరే.. నేను వెనక్కి తగ్గొద్దనే నిర్ణయించుకుని వేలంలోకి వెళ్లాను. మార్క్యు ప్లేయర్ లేని జట్టు నన్ను కొనుగోలు చేస్తే గనుక నాకు ఎక్కువ మొత్తం లభిస్తుందనే ఆలోచనతో ముందడుగు వేశాను. అప్పుడు నన్ను సీఎస్కే 1.5 మిలియన్ డాలర్లు(సుమారు 6 కోట్ల రూపాయలు) పెట్టి కొనుక్కుంది. ఏ రకంగా చూసినా నాకు ఇది లాభమే’’ అని ధోని చెప్పుకొచ్చాడు. అదండీ సంగతి.. సీఎస్కే సహా తనను ఇతర ఫ్రాంఛైజీలు సంప్రదించి ఆఫర్లు ఇచ్చినా.. తనకున్న క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ధోని వేలంలో అడుగుపెట్టాడన్న మాట. చెన్నై కాకుండా ఇతర జట్లు తనను కొన్నా తాను ఇలాగే ఉండేవాడినని.. ఆ సమయంలో డబ్బే తనకు ముఖ్యమని చెప్పకనే చెప్పాడు 42 ఏళ్ల ధోని! కాగా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్ ధోని. టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 అతడి ఖాతాలో ఉన్నాయి. చదవండి: శ్రేయస్ అయ్యర్ నాటకం?.. బండారం బయటపెట్టిన ఎన్సీఏ! -
India's Squad For Afghanistan T20Is: రోహిత్, కోహ్లి వచ్చేశారు
ముంబై: ఈ ఏడాది జరగబోయే టి20 ప్రపంచకప్ టోర్నీలో భారత సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బరిలోకి దిగే అవకాశాలు మెరుగయ్యాయి. 14 నెలల తర్వాత ఈ దిగ్గజాలిద్దరు మళ్లీ టి20 జట్టులోకి ఎంపికయ్యారు. చివరిసారిగా 2022 నవంబర్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో వీరిద్దరు ఆడారు. తదనంతరం పూర్తిగా టెస్టు, వన్డే ప్రపంచకప్ కోసం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యారు. అఫ్గానిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం ప్రకటించగా... విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జట్టులోకి వచ్చారు. తాజా ఎంపికతో వీరిద్దరు ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగమవుతారని సీనియర్ సెలక్షన్ కమిటీ సూచనప్రాయంగా తెలిపింది. టి20 ఫార్మాట్లో ఇటీవల భారత జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లతోపాటు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయాల కారణంగా అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు దూరమయ్యారు. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జనవరి 11న తొలి టి20 మొహాలీలో... 14న ఇండోర్‌లో రెండో టి20... 17న బెంగళూరులో మూడో టి20 మ్యాచ్ జరుగుతాయి. ఈ ఏడాది వెస్టిండీస్–అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి అంతర్జాతీయ సిరీస్ ఇదే అవుతుంది. అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్‌తో మ్యాచ్ ప్రాక్టీస్ పొందుతారు. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెపె్టన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ సామ్సన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్‡్షŠదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. -
జూన్ 9న... న్యూయార్క్‌లో...
దుబాయ్: అమెరికా అభిమానుల సాక్షిగా టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్ నగరం వేదికగా జూన్ 9న టి20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో దాయాది జట్లు తలపడతాయి. ఈ ఏడాది జరిగే మెగా టోర్నీ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక ఐసన్ హోవర్ పార్క్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ పార్క్‌లో ఇప్పటి వరకు సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, ఫుట్‌బాల్ ఫీల్డ్‌లు మాత్రమే ఉండగా... ప్రపంచకప్ కోసం కొత్తగా క్రికెట్ మైదా నాన్ని సిద్ధం చేస్తున్నారు. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరిగే ఈ ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడనుండగా... వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ♦ గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్ లీగ్ దశలో తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో, జూన్ 9న పాకిస్తాన్‌తో, జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో తలపడుతుంది. ♦ గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, మాజీ విజేత ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ జట్లు ఉన్నాయి. ♦ గ్రూప్ ‘సి’లో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినీ జట్లకు చోటు కల్పించారు. ♦ గ్రూప్ ‘డి’లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి. ♦ లీగ్ దశ తర్వాత ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు ముందంజ వేస్తాయి. ఆ తర్వాత ఎనిమిది టీమ్‌లతో ‘సూపర్ ఎయిట్’ దశ జరుగుతుంది. ఆపై సెమీఫైనల్స్, ఫైనల్‌ను నిర్వహిస్తారు. ♦ వెస్టిండీస్‌లో 6 వేదికల్లో (బార్బడోస్, ట్రినిడాడ్, గయానా, ఆంటిగ్వా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్)... అమెరికాలోని 3 వేదికల్లో (న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్) కలిపి మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. ♦ టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి) జరుగుతాయి. -
టీమిండియా టీ20 వరల్డ్‌కప్-2007 హీరోపై కేసు! కారణమిదే..
టీమిండియా మాజీ క్రికెటర్, 2007 ప్రపంచకప్ హీరో జోగీందర్ శర్మ చిక్కుల్లో పడ్డారు. హరియాణా పోలీస్ శాఖలో ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జోగీందర్ శర్మపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హిసార్‌కు చెందిన పవన్ అనే వ్యక్తి జనవరి 1న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి తల్లి.. ఆస్తి తగాదాల వల్ల తలెత్తిన సమస్య కారణంగానే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకే ఆయన పేరు కూడా చేర్చారు! ఇందులో భాగంగా జోగిందర్ శర్మ సహా ఆరుగురి పేర్లను తన ఫిర్యాదులో ఆమె ప్రస్తావించింది. ప్రస్తుతం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న తమ ఆస్తి కేసు విషయంలో ఐదుగురు వ్యక్తులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పినా.. డీఎస్పీగా ఉన్న జోగీందర్ శర్మ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన ఫిర్యాదులో జోగీందర్ శర్మ పేరును కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో నిందితులతో పాటు జోగీందర్ శర్మపై కూడా హరియాణా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం కాగా పవన్ బలవన్మరణం నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయానికి బదులుగా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ కేసు పక్కదారి పట్టకుండా లోతుగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అతనెవరో నాకు తెలియదు ఈ నేపథ్యంలో బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే, ఈ విషయంపై స్పందించిన జోగీందర్ శర్మ.. ‘‘నాకు అసలు ఈ కేసు గురించి తెలియదు. పవన్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. అతడిని ఒక్కసారి కూడా కలవలేదు’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియా టుడే కథనం ప్రచురించింది. ధోని నమ్మకం నిలబెట్టి.. ప్రపంచకప్‌ను ముద్దాడి టీ20 ఫార్మాట్లో 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా గెలవడంలో జోగీందర్ శర్మది కీలక పాత్ర. సౌతాఫ్రికా వేదికగా దాయాది పాకిస్తాన్‌తో నువ్వా- నేనా అన్నట్లు పోటాపోటీగా సాగిన ఫైనల్లో.. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆఖరి ఓవర్లో బంతిని జోగీందర్‌కు ఇచ్చాడు. అప్పటికి పాక్ గెలవాలంటే నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. అలాంటి సమయంలో జోగీందర్ తెలివిగా బౌలింగ్ చేశాడు. అతడు సంధించిన బంతిని పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ఆడగా.. శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పాక్ ఓడింది.. టీమిండియా ప్రపంచకప్‌ను ముద్దాడింది. సీఎస్కేకు ఆడిన జోగీందర్ శర్మ ఇక నాటి మ్యాచ్‌లో జోగీందర్ శర్మ మొత్తంగా 3.3 ఓవర్ల బౌలింగ్‌లో 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఐపీఎల్లో 2010, 2011 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించి రెండు సందర్భాల్లోనూ విజేతగా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. 2011 తర్వాత ఆటకు దూరమైన జోగీందర్ శర్మ క్రికెట్‌కు అందించిన సేవల నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం ఆయన డీఎస్పీగా ఉన్నట్లు సమాచారం. ఇక టీమిండియా తరఫున 4 వన్డే, 4 టీ20లు ఆడిన రైటార్మ్ పేసర్ జోగీందర్ శర్మ ఆయా ఫార్మాట్లలో ఒకటి, నాలుగు వికెట్లు తీశారు. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com. చదవండి: తరానికొక్క ఆటగాడు.. ముంబై అలా చేయకపోతే టీమిండియాకు నష్టం -
ప్రపంచకప్‌కు నమీబియా క్వాలిఫై
-
బీసీసీఐ అలా చేస్తే.. అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు: రసెల్
తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పడంలో కరేబియన్ క్రికెటర్లు ముందు వరుసలో ఉంటారు. ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి అతడు ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత విరాహిత్ ద్వయం టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్-2023 తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబరులో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఈ విషయంపై పూర్తి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో హిందుస్తాన్ టైమ్స్‌తో సంభాషించిన ఆండ్రీ రసెల్‌కు రోహిత్, కోహ్లిల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. "అసలు రోహిత్, కోహ్లిల విషయంలో ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్ల నైపుణ్యాల గురించి చర్చలు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. రోహిత్ అనుభవజ్ఞుడైన ఆటగాడు.. ఇక విరాట్ విరాట్(బిగ్) ప్లేయర్ అని ప్రత్యేకంగా చెప్పేదేముంది? వీళ్లిద్దరిని గనుక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయకపోతే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటం అత్యంత ముఖ్యం. యుద్ధ క్షేత్రానికి 11 మంది యువ సైనికులను పంపలేరు కదా! సీనియర్లకే కచ్చితంగా పెద్దపీట వేయాల్సి ఉంటుంది" అంటూ ఈ విండిస్ వీరుడు కుండబద్దలు కొట్టాడు. యువ ఆటగాళ్లు ఇలాంటి మేజర్ టోర్నీల్లో ఒత్తిడిని జయించలేక చిత్తవుతారు కాబట్టి.. అనుభవం ఉన్న ఆటగాళ్లను బరిలోకి దింపడం ముఖ్యమని రసెల్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!? -
ఇక చాలు.. టీమిండియా తప్పులు తెలుసుకోవాలి.. 2007 తర్వాత..
గత దశాబ్దకాలంగా టీమిండియా ఐసీసీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నా ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. ప్రపంచకప్-2015లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత జట్టు.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఇక 2019లో లీగ్ దశలో ఒకే మ్యాచ్ ఓడిపోయి సెమీస్ చేరిన టీమిండియాకు అక్కడ.. న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. అయితే, ఈసారి సొంతగడ్డపై పొరపాట్లకు తావివ్వకుండా కచ్చితంగా మరోసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లే రోహిత్ సేన ఫైనల్ వరకు అజేయంగా దూసుకువచ్చింది. టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిన భారత జట్టు గెలుపు లాంఛనమే అని అభిమానులు సంబరపడుతున్న వేళ.. ఫైనల్లో ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చింది. దీంతో మరోసారి టీమిండియాకు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం కాగా ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశమంతా భారత జట్టుకు అండగా నిలిచారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనైనా సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఈ పరిణామాలపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తనదైన శైలిలో స్పందించాడు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే మరోసారి చేదు అనుభవం ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. జట్టుకు అండగా నిలవడం మంచిదే అని.. అయితే, ప్రతిసారి ఏదో ఒక కారణం చూపి క్షమించేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. టీమిండియా 2007 తర్వాత ఇప్పటి వరకు ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా గెలవకలేకపోవడాన్ని ప్రస్తావించిన గావస్కర్... "టీమిండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడది గతం. ఆ ఓటమి బాధ నుంచి త్వరగా తేరుకోవాలి. గత నాలుగు వరల్డ్ కప్ ఈవెంట్లలో రెండుసార్లు ఫైనల్ వరకు రాగలిగినా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది టీమిండియా. మిగతా జట్లతో పోలిస్తే ఈసారి మరింత గొప్పగా రాణించినా ఫలితం లేకుండా పోయింది. అయితే.. ఇప్పటికైనా టీమిండియా తమ తప్పులను తెలుసుకుని విశ్లేషించుకోవాలి. ట్రోఫీ ఎందుకు గెలవలేకపోయారో ఆలోచించుకోవాలి. పొరపాట్లను అంగీకరించే గుణం అలవరచుకోవాలి. అప్పుడే పురోగతి కనిపిస్తుంది. రానున్న వారం రోజుల్లో సెలక్షన్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. 2007 తర్వాత మనం టీ20 ప్రపంచకప్ గెలవనేలేదు. ఐపీఎల్ రూపంలో ఇంత మంది యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నా ఇలా జరగడం విచారకరం" అని మిడ్ డేకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండాలని భావిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ల నిర్ణయాలు గౌరవించి.. వరల్డ్ కప్-2024 నాటికి యువ జట్టును సన్నద్ధం చేయాలని పరోక్షంగా సూచించాడు గావస్కర్. కాగా వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: అదే అతడి బలం.. టీమిండియా కెప్టెన్ కాగలడు: అంబటి రాయుడు -
వరల్డ్ కప్ ముందుంది.. బీసీసీఐ నిర్ణయం సరైంది: గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను కొనసాగించాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సమర్థించాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న నేపథ్యంలో బీసీసీఐ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి తర్వాత... కాగా 2021లో రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత అతడి స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. జాతీయ క్రికెట్ అకాడమీ పెద్దగా.. అండర్-19 జట్టుకు మార్గదర్శనం చేసిన మిస్టర్ డిఫెండబుల్ను ఒప్పించి మరీ నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పగ్గాలు అప్పజెప్పాడు. ఈ క్రమంలో ద్రవిడ్ శిక్షణలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొట్టింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరింది. కానీ టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. సొంతగడ్డపై వరల్డ్ కప్-2023లో ఫైనల్ చేరినప్పటికీ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఇక టోర్నీతోనే తన పదవీకాలం కూడా ముగిసిపోవడంతో ద్రవిడ్ కోచ్‌గా వైదొలగాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ మాత్రం రాహుల్ ద్రవిడ్‌ను ఒప్పించి హెడ్‌కోచ్‌గా కొనసాగేలా చేసింది. ఇందుకు సంబంధించి బుధవారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. బీసీసీఐ నిర్ణయం సరైంది ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ స్పందించాడు. “బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ రూపంలో మెగా ఈవెంట్ ముందుంది. ఇలాంటి సమయంలో కోచింగ్, సహాయక సిబ్బందిని మార్చడం సరికాదు. నిజానికి రాహుల్ బీసీసీఐ ప్రతిపాదనను అంగీకరించడం శుభపరిణామం. టీమిండియా ఇలాగే తమ ఆధిపత్యం కొనసాగిస్తూ మున్ముందు మరింత గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా” అని గౌతీ హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీ.. విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సమం -
ప్రపంచకప్‌కు నమీబియా క్వాలిఫై
వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌కు నమీబియా జట్టు అర్హత సాధించింది. ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించి అగ్ర స్థానం ఖాయం చేసుకోవడంతో ఆ జట్టు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయింది. మంగళవారం జరిగిన పోరులో నమీబియా 58 పరుగుల తేడాతో టాంజానియాను ఓడించింది. నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. జేజే స్మిట్ (40), మైకేల్ లింజెన్ (30) రాణించారు. అనంతరం టాంజానియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. అమాల్ రాజీవన్ (41 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. వరుసగా మూడో టి20 ప్రపంచకప్‌కు (2021, 2022, 2024) నమీబియా అర్హత సాధించడం విశేషం. ఇదే టోర్నీలో జరిగిన మరో మ్యాచ్‌లో రువాండాపై 144 పరుగులతో గెలిచిన జింబాబ్వే తాము కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 2024 జూన్‌లో వెస్టిండీస్, అమెరికా ఈ టి20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. కోహ్లి రికార్డు సమం
టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా రువాండతో నిన్న (నవంబర్ 27) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు (కెప్టెన్) సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో (2.4-0-3-3) పాటు బ్యాట్‌తోనూ (36 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా టీ20ల్లో జింబాబ్వేకు ఇదే అత్యుత్తమ విజయం. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన రజా.. ఈ ఏడాది రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును కూడా సమం చేశాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా.. నిన్నటి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో రజా విరాట్ రికార్డును (6) సమం చేశాడు. ఈ టోర్నీలో ఉగాండ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమిపాలైన జింబాబ్వే తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి వరల్డ్‌కప్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనుండగా.. నమీబియా, ఉగాండ, కెన్యా జట్లు రేసులో ముందున్నాయి. ఈ మూడు జట్ల తర్వాతి స్థానంలో జింబాబ్వే ఉంది. ఈ టోర్నీలో జింబాబ్వే మరో రెండు మ్యాచ్‌లు (నైజీరియా, కెన్యా) ఆడాల్సి ఉంది. కాగా, రువాండతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సికందర్ రజాతో పాటు మరుమణి (50), ర్యాన్ బర్ల్ (44 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రువాండ.. రిచర్డ్ నగరవ (3/11), సికందర్ రజా (3/3), ర్యాన్ బర్ల్ (2/7) ధాటికి 71 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. -
రోహిత్, కోహ్లి ఓపెన్‌గా మాట్లాడితేనే: టీమిండియా మాజీ బౌలర్
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీలో ఆడతారా? లేదా? అన్న చర్చ క్రీడావర్గాల్లో జోరుగా నడుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నారనే వార్తల నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా చేరాడు. తమ టీ20 భవితవ్యం గురించి రోహిత్, కోహ్లి బోర్డుతో ఓపెన్‌గా మాట్లాడిన తర్వాతే ఈ విషయంపై ఓ స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వాళ్లిద్దరు ఇప్పటికే తమ భవిష్యత్తు గురించి మేనేజ్మెంట్తో చర్చలు మొదలుపెట్టి ఉంటారు. అయితే, సెలక్షన్ కమిటీ కూడా వాళ్ల అభిప్రాయాలను కచ్చితంగా గౌరవిస్తుంది. వాళ్ల భవిష్యత్ ప్రణాళికల గురించి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. ఏ క్రికెట్ బోర్డు అయినా సరే ప్రతి ఆటగాడి విషయంలో ఇలాగే ఆలోచిస్తుంది. వరల్డ్‌కప్- వరల్డ్‌కప్ సైకిల్ మధ్య ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలో ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్ అన్నీ దృష్టిలో పెట్టుకుని అంతిమ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు వన్డే వరల్డ్‌కప్ ముగిసిపోయింది. తదుపరి వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఆడాల్సి ఉంది. అందుకోసం ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలి. కాబట్టి రోహిత్, విరాట్‌తో మాట్లాడి వీలైనంత త్వరగా వాళ్ల నిర్ణయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్లిద్దరు సీనియర్ మోస్ట్ క్రికెటర్లు. దేశం కోసం ఎంతో చేశారు. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్లకు కాస్త ఎక్కువగానే టైమ్ ఇస్తుంది. చర్చలు ముగిసిన తర్వాతే రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లు ఆడతారా లేదా అన్నది తెలుస్తుంది’’ అని ఓజా అభిప్రాయపడ్డాడు. కాగా 36 ఏళ్ల రోహిత్ శర్మ టీ20లకు స్వస్తి పలికితే హార్దిక్ పాండ్యా పొట్టి ఫార్మాట్లో టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. 35 ఏళ్ల కోహ్లి మాత్రం ఈ ఫార్మాట్లో ఇంకొన్నాళ్లు కొనసాగుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి.. స్పందించిన హార్దిక్ పాండ్యా -
కోహ్లిలా ఉంటే రోహిత్ మరో వరల్డ్‌కప్ ఆడతాడు: లంక స్పిన్ దిగ్గజం
Rohit Sharma- T20I Future: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో వరల్డ్‌కప్ ఆడే సత్తా ఉన్నవాడేనని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. విరాట్ కోహ్లి మాదిరి ఫిట్నెస్ కాపాడుకుంటే కచ్చితంగా టీ20 ప్రపంచకప్-2024లో అతడు ఆడతాడని అభిప్రాయపడ్డాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ దాకా అజేయంగా నిలిచిన టీమిండియా.. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తప్పక అందుతుందనుకున్న ట్రోఫీ చేజారడంతో కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఇతర ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి సంసిద్ధమయ్యే క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గత ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరమయ్యారు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఓటమి తర్వాత వీరిద్దరు ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకొనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుతంగా ఆడాడు ఈ నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ రోహిత్ కెరీర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. మెరుగైన స్ట్రైక్‌రేటుతో అతడి బ్యాటింగ్ సాగింది. ఈవెంట్ మొత్తంలో అతడు ఒక్కసారిగా వైఫల్యం చెందిన సందర్భం లేదు. అతడికి ఇప్పుడు కేవలం 36 ఏళ్లే.. అంటే ఇంకా యువకుడనే అర్థం. విరాట్ కోహ్లి మాదిరి ఫిట్నెస్ కాపాడుకుంటే కచ్చితంగా ఇంకో వరల్డ్‌కప్ ఆడే అవకాశం ఉంది. ఇంకా యువకుడే.. కోహ్లిలా ఫిట్నెస్ కాపాడుకుంటే వన్డేల్లో అతడి స్ట్రైక్‌రేటు 130కిపైగానే.. టీ20లలో కూడా మెరుగైన గణాంకాలే కలిగి ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా తనకెంతో అనుభవం ఉంది. ఏ ఆటగాడైనా 35 ఏళ్ల తర్వాత కూడా కొనసాగాలనుకుంటే ఫిట్నెస్ కాపాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రోహిత్ ఆడాలని భావిస్తే తప్పక ఆ దిశగా మరింత కష్టపడతాడు. నాకు తెలిసి తను మరో వరల్డ్‌కప్ ఆడటానికి కచ్చితంగా సిద్ధమవుతాడు’’ అని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. కాగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్తగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 4న మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. యంగ్ టీమిండియా ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది. చదవండి: వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప: ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు -
వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప: ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు
Rohit Sharma- Virat Kohli: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వారిద్దరు ఇంకొన్నాళ్లు పొట్టి ఫార్మాట్లో కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది ప్రపంచకప్-2022 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. గత సీజన్లో ఐపీఎల్ ఆడిన ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు.. టీమిండియా తరఫున మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సీనియర్ ప్లేయర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్‌కప్‌నకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై? ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత.. 36 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. 35 ఏళ్ల కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వదంతులపై ఆశిష్ నెహ్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక క్యాలెండర్ ఇయర్లో విరాట్ కోహ్లి 800- 1000 పరుగులు చేస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే ఏ సెలక్టర్ అయినా అతడి ఎంపిక విషయంలో టెంప్ట్ కాకుండా ఎలా ఉంటాడు? వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప కోహ్లి, రోహిత్ ఈ ఫార్మాట్లో కొనసాగుతారో లేదో తెలియదు కానీ.. రెస్ట్ తీసుకోవాలని మాత్రం భావిస్తున్నారని చెప్పవచ్చు. తమకు తాముగా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప.. వాళ్లను దూరం పెట్టే ప్రసక్తే లేదు. వాళ్లిద్దరు ఇంకొన్నాళ్లు పొట్టి ఫార్మాట్లో కొనసాగే సత్తా ఉన్న వాళ్లే’’ అని ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్ ఆరంభం సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక రోహిత్ శర్మ గైర్హాజరీ, హార్దిక్ పాండ్యా గాయం నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తొలిసారి భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన తొలి టీ20లో సూర్య సేన 2 వికెట్ల తేడాతో గెలిచింది. చదవండి: యూట్యూబర్‌ను పెళ్లాడిన టీమిండియా పేసర్.. సిరాజ్ విషెస్ -
T20 WC 2024: టి20 ప్రపంచకప్.. తొలిసారి 20 జట్లు బరిలోకి
కీర్తిపూర్ (నేపాల్): వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 పురుషుల ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు నేపాల్, ఒమన్ జట్లు అర్హత సాధించాయి. ఇక్కడ జరుగుతున్న ఆసియా రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి టి20 ప్రపంచకప్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఒమన్ జట్టు 10 వికెట్ల తేడాతో బహ్రెయిన్ జట్టును ఓడించగా... నేపాల్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుపై గెలిచింది. టి20 ప్రపంచకప్ టోర్నీకి నేపాల్ జట్టు అర్హత సాధించడం ఇది రెండోసారి కాగా... ఒమన్ జట్టు మూడోసారి ఈ మెగా టోర్నీలో పోటీపడనుంది. నేపాల్ 2014లో, ఒమన్ 2016, 2021 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్నాయి. మరో రెండు బెర్త్‌ల కోసం... వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు వెస్టిండీస్–అమెరికాలలో జరిగే తొమ్మిదో టి20 ప్రపంచకప్‌లో తొలిసారి 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికి 18 జట్లు అర్హత పొందాయి. ఆతిథ్య దేశాల హోదాలో వెస్టిండీస్, అమెరికా నేరుగా అర్హత సంపాదించాయి. 2022 ప్రపంచకప్ ద్వారా భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లకు బెర్త్‌లు లభించాయి. ర్యాంకింగ్ ఆధారంగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు బెర్త్‌లు దక్కాయి. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా నేపాల్, ఒమన్... యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా స్కాట్లాండ్, ఐర్లాండ్... తూర్పు ఆసియా–పసిఫిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా పాపువా న్యూగినీ... అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా కెనడా అర్హత సాధించాయి. ఈనెల 22 నుంచి 30 వరకు నమీబియాలో ఏడు దేశాల మధ్య (జింబాబ్వే, కెన్యా, నమీబియా, నైజీరియా, రువాండా, టాంజానియా, ఉగాండా) జరిగే ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు బెర్త్‌లు ఖరారవుతాయి. -
టీమిండియా చరిత్రకు నేటికి 16 ఏళ్లు.. పాకిస్తాన్‌పై అద్భుతం
2007 సెప్టెంబర్ 24.. భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. సరిగ్గా ఇదే రోజున మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో భారత జట్టు.. ప్రపంచక్రికెట్ చరిత్రలో తమ పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడి అద్బుతం సృష్టించింది. దాయాది పాకిస్తాన్‌తో ఆఖరి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించిన ధోని సేన.. విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపాలపడించింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి సీనియర్ ఆటగాళ్ల లేకుండానే అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లను భారత్ మట్టికరిపించింది. భారత సాధించిన ఈ చారిత్రత్మక విజయానికి నేటికి నేటితో 16ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పొట్టి కప్ గెలిచిన మన భారత క్రికెట్ హీరోల గురించి ప్రత్యేక కథనం మీకోసం. భారత కెప్టెన్‌గా ధోని.. 2007 సెప్టెంబర్ 11న ఆతిథ్య దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌తో తొలి టీ20 ప్రపంచకప్‌కు తేరలేచింది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు అదే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో వెస్టిండీస్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఘోర ప్రదర్శన కనబరిచింది. బంగ్లాదేశ్ వంటి పసికూన చేతిలో ఓటమి పాలై గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌కు సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్‌గా సత్తాచాటుతున్న మహేంద్ర సింగ్ ధోనికి భారత జట్టు పగ్గాలు అప్పగించారు. జట్టులో గంభీర్, సెహ్వాగ్, యువరాజ్, జహీర్ ఖాన్, హర్భజన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఆరంభ మ్యాచ్‌లోనే దయాదితో పోరు.. ఈ టోర్నీలో షెడ్యూల్ ప్రకారం భారత తమ తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్తో ఆడాల్సింది. కానీ వర్షం కారణంగా స్కాట్లాండ్ తో మ్యాచ్ రద్దవటంతో.. టీమిండియా ఆరంభ మ్యాచే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 141 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప అర్ధ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ ఎంఎస్ ధోని 33 పరుగులతో పర్వాలేదనపించాడు. పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆసీఫ్ నాలుగు వికెట్లతో భారత్‌ను దెబ్బకొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కూడా సరిగ్గా 141 పరుగులే చేసింది. మ్యాచ్ టై కావడంతో విజేతను నిర్ణయించేందుకు బాలౌట్ విధానాన్ని అంపైర్లు ఎంచుకున్నారు. బాలౌట్ లో భారత్ మూడు బంతుల్లో 3 వికెట్లు పడగొట్టగా.. పాక్ బౌలర్లు ఒక్కరు కూడా వికెట్ తీయలేకపోయారు. దీంతో భారత్ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌పై ఓటమి.. టీమిండియా తమ తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 10 పరుగుల తేడాతో అనుహ్యంగా ఓటమి పాలైంది.190 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు గంభీర్(51),సెహ్వాగ్(40) అద్బుతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ.. మిడిలార్డ్ విఫలమం కావడంతో భారత్ ఓటమి చవిచూసింది. యువీ స్పెషల్.. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు న్యూజిలాండ్‌తో ఓటమి పాలైన భారత్ సూపర్-8 స్టేజిలో ఇంగ్లండ్‌తో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ వరుసగా ఆరు బంతుల్లో 6 సిక్స్‌లు బాది చరిత్రపుటలకెక్కాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ కవ్వించటంతో రెచ్చిపోయిన యువీ.. బ్రాడ్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. కేవలం 12 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా యువీ రికార్డులకెక్కాడు. ఇప్పటికీ ఈ రికార్డు యువీ పేరటే ఉంది. యువరాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా చిత్తు.. ఆ తర్వాత సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. సెమీఫైనల్లో అడుగుపెట్టింది. దక్షిణాఫ్రికాపై 32 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. సెమీఫైనల్లో భారత్-ఆసీస్ లీగ్ స్టేజ్‌ను అధిగమించిన భారత్.. సెమీఫైనల్లో మాత్రం పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడాల్సి వచ్చింది. సెమీఫైనల్‌తో టీమిండియా కథముగుస్తుందని అంతా భావించారు. కానీ సెమీస్‌లో భారత్ అద్భుతం చేసింది. ఆస్ట్రేలియాను 15 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. భారత జట్టు ఫైనల్ చేరడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆసీస్‌పై కేవలం 30 బంతుల్లో 70 పరుగులు చేసి తన జట్టుకు 188 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు. ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధిల పోరు.. ఇక తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయంతో పాకిస్తాన్ కూడా ఫైనల్‌కు చేరింది. దీంతో తుది పోరులో దయాదులు తాడోపేడో తెల్చుకోవాడని సిద్దమయ్యారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ను ఇరు దేశాల అభిమానుల మాత్రమే కాకుండా యావత్తు క్రికెట్ ప్రపంచం వీక్షించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌కు సెహ్వాగ్ దూరం కావడంతో గంభీర్ జోడిగా యూసఫ్ పఠాన్ బరిలోకి దిగాడు. అయితే ఓపెనర్‌గా వచ్చిన పఠాన్ నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వెంటవెంటనే ఉతప్ప(8), యువరాజ్(14), ధోని(6) తక్కువే స్కోర్లకే పరిమితమయ్యారు. గంభీర్ వీరోచిత పోరాటం.. ఒకవైపు వరసక్రమంలో వికెట్లు పడతున్నప్పటికీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రం అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. వీలుచిక్కినప్పుడు బౌండరీలు కొడుతూ.. ఆచితూచి ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఓవరాల్‌గా 54 బంతులు ఎదుర్కొన్న గంభీర్ 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. గంభీర్‌తో పాటు రోహిత్ శర్మ(30) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మలుపు తిప్పిన శ్రీశాంత్ ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ భారత బౌలర్ల ధాటికి కేవలం 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో భారత్ సులభంగా టైటిల్‌ను అందుకుంటుందని అంతా భావించారు. కానీ అప్పటికీ క్రీజులో ఉన్న మిస్బా-ఉల్-హక్ మాత్రం భారత్‌కు కొరకరాని కోయ్యగా మారాడు. అప్పటివరకు నెమ్మదిగా ఆడిన మిస్బా..14 ఓవర్ల తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు. పాకిస్తాన్ విజయానికి చివరి ఆరు బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ వస్తాడని అంతా భావించారు. కానీ భారత కెప్టెన్ ధోని మాత్రం అనుహ్యంగా పేసర్ జోగిందర్ శర్మ చేతికి బంతి ఇచ్చాడు. తొలి రెండు బంతుల్లో 7 పరుగులు వచ్చేసాయి. పాకిస్తాన్ విజయానికి 4 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి. దీంతో భారత ఓటమి ఖాయమైందని అంతా భావించారు. కానీ ఇక్కడే ధోని తన మాస్టర్ మైండ్‌ను ఉపయెగించాడు. జోగిందర్ శర్మ వేసిన మూడో బంతిని మిస్బా స్కూప్ షాట్ ఆడాడు. అంతే గాల్లో లేచిన బంతిని షార్ట్ ఫైన్ లెగ్ లో శ్రీశాంత్ ఒడిసి పట్టాడు. షార్ట్ ఫైన్ లెగ్ లో ధోని ఫీల్డర్‌ను పెట్టి ఉంటాడని ఎవరూ ఊహించలేదు. ఈ వికెట్‌తో పాక్ 152 పరుగులకు ఆలౌటైంది. దీంతో పొట్టి ప్రపంచకప్ భారత సొంతమైంది. చదవండి: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! యువ పేసర్ ఎంట్రీ -
2024 టీ20 వరల్డ్‌కప్ వేదికలను ఖరారు చేసిన ఐసీసీ
వచ్చే ఏడాది (2024) వెస్టిండీస్, యూఎస్ఏల్లో జరిగే టీ20 వరల్డ్‌కప్ వేదికలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 22) ఖరారు చేసింది. కొద్ది రోజుల కిందట యూఎస్ఏ వేదికలను ప్రకటించిన ఐసీసీ.. తాజాగా వెస్టిండీస్ వేదికలను వెల్లడించింది. కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా అండ్ బర్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా,సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్ నగరాల్లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగుతాయని ఐసీసీ కన్ఫర్మ్ చేసింది. కాగా, ఐసీసీ ముందుగా ప్రకటించిన విధంగా యూఎస్ఏలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదిలా ఉంటే, 2024 టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొననున్న విషయం తెలిసిందే. వీటిలో 12 జట్లకు ఐసీసీ నేరుగా అర్హత కల్పించగా.. మిగతా 8 బెర్త్‌లు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా నిర్ణయించబడతాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్ అర్హత సాధించగా.. గత ఎడిషన్‌లో టాప్-8లో నిలిచిన జట్లు (డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్).. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాయి. 13, 14, 15వ జట్లుగా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ జట్లు యూరప్, ఈస్ట్ ఏసియా పసిఫిక్ రీజియన్స్ క్వాలిఫయింగ్ పోటీల ద్వారా అర్హత సాధించాయి. -
అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్?
MS Dhoni: మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత అతడి సొంతం. అంతేకాదు.. మొహమాటానికి తావు లేకుండా జట్టు ఎంపిక మొదలు.. మైదానంలో వ్యూహాల అమలు వరకు ఆటకు సంబంధించిన ప్రతీ విషయంలో పక్కాగా ఉండటం తనకు అలవాటు. ఈ క్రమంలో కొన్నిసార్లు ధోని విమర్శల పాలయ్యాడు కూడా! ముఖ్యంగా ఒకప్పటి స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ధోని అన్యాయం చేశాడంటూ.. అతడి తండ్రి యోగ్రాజ్ బాహాటంగానే మండిపడిన విషయం తెలిసిందే. అదే విధంగా వన్డే వరల్డ్‌కప్-2011 జట్టులో రోహిత్ శర్మను కాదని.. పీయూశ్ చావ్లా వైపే మొగ్గు చూపడం ధోనికే చెల్లింది. అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకూ ఒకప్పుడు ధోనితో విభేదాలు ఉన్నాయంటూ వార్తల్లోకెక్కాడు. కాగా ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో ఈ కేరళ బౌలర్ సభ్యుడన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తొట్టతొలి పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్ పట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చడంలో శ్రీశాంత్ పోషించిన పాత్రను ఎవరూ మరువలేరు. ఈ నేపథ్యంలో ధోనితో విభేదాలు అంటూ అతడు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అది నిజం.. కానీ ధోని భాయ్ స్టైలే వేరు ‘‘ధోని భాయ్‌తో నాకు విభేదాలున్న మాట వాస్తవమే. అయితే.. క్రికెట్ పరంగా గత కొన్నేళ్లలో మనం సాధించిన విజయాలు చూస్తే.. ధోని తమకు మద్దతుగా నిలవలేదని ఒక్క ఆటగాడు కూడా చెప్పలేడు. అయితే.. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల కారణంగా కెప్టెన్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సారథ్య బాధ్యతలు మోయడం అంత తేలికేమీ కాదు’’ అని మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు. ధోని ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి రావాలని కోరుకోలేదు అదే విధంగా.. ‘‘నేను మాట్లాడే మాటలు వివాదానికి దారితీయొచ్చు.. చాలా మంది.. ‘‘అదేంటి ఒకరిద్దరు గురించే ఎక్కువగా మాట్లాడతారు? జట్టుమొత్తం కలిస్తేనే కదా విజయాలు సాధించేది’’ అని అంటూ ఉంటారు. కానీ ధోని ఎప్పుడూ తాను లైమ్‌లైట్‌లోకి రావాలని కోరుకోలేదు. జట్టునే ముందుంచే వాడు. అంతేకాదు జట్టులో కొత్త సభ్యుల చేతికి ట్రోఫీని ఇచ్చే సంప్రదాయాన్ని కూడా తనే మొదలుపెట్టాడు. జట్టు బాగుంటే చాలని భావిస్తాడు ధోని. మేము రెండుసార్లు వరల్డ్‌కప్ గెలవడంలో ప్రతి ఒక్క ఆటగాడి పాత్ర ఉంది. ఇది కాదనలేని సత్యం. గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్? అయితే.. పడవలో ఎంత మంది సెలబ్రిటీలు ఉన్నా.. దానిని గమ్యస్థానానికి చేర్చడంలో కెప్టెన్‌దే ప్రధాన పాత్ర కదా! ఫ్లైట్‌లో ఆటోపైలట్ ఆప్షన్ ఉన్నంత మాత్రాన పైలట్ అవసరం లేకుండా పోదు కదా!’’అని ధోనికి క్రెడిట్ ఇచ్చాడు శ్రీశాంత్. కాగా ఇటీవలి కాలంలో 2007, 2011 వరల్డ్‌కప్ విన్నర్ గౌతం గంభీర్.. తామంతా కష్టపడినా ధోనికి మాత్రమే ఎక్కువ హైప్ వచ్చిందంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్ -
T20 WC 2024: ఐసీసీ ప్రకటన.. ఆ 3 నగరాలకు గుడ్‌న్యూస్
3 USA venues locked in for ICC Men's T20 WC 2024: ఐసీసీ మెన్స్ వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన నగరాలు ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్‌లను టీ20 ప్రపంచకప్ వేదికలుగా ఎంపిక చేసినట్లు బుధవారం ధ్రువీకరించింది. మొట్టమొదటిసారి కాగా వెస్టిండీస్‌తో కలిసి యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈసారి పొట్టి ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమైన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను అమెరికా దక్కించుకోగా.. వేదికల ఎంపికలో ఐసీసీ తాజాగా తుది నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌లోని నసౌవ్ కౌంటీ, డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రొవార్డ్ కౌంటీ అసోసియేషన్లకు ఈ మేరకు శుభవార్త చెప్పింది. ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. సీటింగ్ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఫ్యాన్స్ కోసమే ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గాఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. అతిపెద్ద ఐసీసీ ఈవెంట్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతుండటం సంతోషంగా ఉందన్నాడు. అమెరికాలో క్రికెట్ పట్ల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుండటం.. ఫ్యాన్‌బేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. సొంత నగరాల్లోనే మేటి క్రికెట్ మ్యాచ్‌లు నేరుగా వీక్షించేందుకు యూఎస్ఏలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం దొరకనుంది. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో నిర్వహించిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా.. ఏకంగా.. -
చరిత్ర మరచిపోలేని రికార్డుకు 16 ఏళ్లు..!
క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 19కి ఓ ప్రత్యేకత ఉంది. 2007లో ఈ రోజున టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో యువీ చేసిన 12 బంతుల హాఫ్ సెంచరీ నేటికీ పొట్టి క్రికెట్లో ఫాస్టెప్ట్ హాఫ్ సెంచరీగా కొనసాగుతుంది. సౌతాఫ్రికాలో జరిగిన తొట్టతొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఉతికి 'ఆరే'శాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. యువీ సిక్సర్ల సునామీకి ముందు ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అతనితో అనవసర గొడవకు దిగాడు. దీని ప్రభావం బ్రాడ్‌పై పడింది. ఫ్లింటాఫ్‌పై కోపాన్ని యువీ బ్రాడ్‌పై చూపించాడు. యువీ.. బ్రాడ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, నేటికీ చెక్కుచెదరని టీ20 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. Look out in the crowd! On this day in 2007, @YUVSTRONG12 made #T20WorldCup history, belting six sixes in an over 💥 pic.twitter.com/Bgo9FxFBq6 — ICC (@ICC) September 19, 2021 ఆ ఇన్నింగ్స్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్ కేవలం 14 నిమిషాలు క్రీజ్‌లో ఉండి 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి, ఫ్లింటాఫ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. యువీకి ముందు గంభీర్ (58), సెహ్వాగ్ (68) సైతం అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్పీ సింగ్ 2, హర్భజన్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇదే మ్యాచ్ ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20ల్లో తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్.. పాక్‌ను మట్టికరిపించి తొట్టతొలి టీ20 ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. -
అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను భయపడ్డాను: గంభీర్
Gautam Gambhir reveals the only time when he felt pressure: టీ20 వరల్డ్‌కప్-2007.. సౌతాఫ్రికా గడ్డపై దాయాది పాకిస్తాన్‌తో ఫైనల్లో 54 బంతుల్లో 75 పరుగులు.. టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టు విశ్వవిజేతగా అవతరించడంలో కీలక పాత్ర.. వన్డే ప్రపంచకప్-2011లోనూ అలాంటి ఫలితమే పునరావృతం.. సొంతగడ్డపై శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. 275 పరుగుల లక్ష్యం స్టార్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్.. సచిన్ టెండుల్కర్ 18 పరుగులకే వెనుదిరగడం టీమిండియా అభిమానులను ఉసూరుమనిపించింది. కానీ తానున్నానంటూ ఆ వన్‌డౌన్ బ్యాటర్ ఫ్యాన్స్ ఆశలకు ఊపిరినిచ్చాడు. అప్పుడలా.. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న వేళ 122 బంతులు ఎదుర్కొని విలువైన 97 పరుగులు సాధించాడు.. ఇక ఐదో స్థానంలో వచ్చిన నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 91 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో భారత్‌ను మరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ రెండు సందర్భాల్లో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ.. ఒత్తిడిని అధిగమించిన ఆ బ్యాటర్ మరెవరో కాదు గౌతం గంభీర్. ఐసీసీ ఈవెంట్లలో తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయపథంలో నడపడంలో ముందుండి కోట్లాది మంది అభిమానానికి గౌతీ పాత్రుడయ్యాడు. అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లలో రాణించిన ఈ స్టార్ ఓపెనర్ తీవ్రమైన ఒత్తిడికి లోనైన సందర్భంగా ఒకటే ఒకటి ఉందట. 2014 ఐపీఎల్ సందర్భంగా తన ప్రదర్శన తనకే సిగ్గు అనిపించిందట. ‘‘నా జీవితంలో నేను అత్యంత ఒత్తిడికి గురైన సందర్భం అదే. 2014లో దుబాయ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మూడుసార్లు వరుసగా డకౌట్ అయ్యాను. నాలుగో మ్యాచ్ అంటే నాకు కాస్త భయం వేసింది. నా బదులు మనీశ్ పాండేను ఓపెనింగ్ చేయమని అడిగాను. నాలో ఉన్న భయం కారణంగానే.. నేను మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని చెప్పాను. నిజానికి నాలో ఉన్న భయం కారణంగానే నేను అతడిని ప్రమోట్ చేశాను. ఈ పని చేసినందుకు నేను సిగ్గుపడుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ మ్యాచ్‌లో మనీశ్ పరుగుల ఖాతా తెరవలేదు. నేను ఒక్క పరుగు చేసి అవుటయ్యాను. ఆ తర్వాత మనీశ్‌ను పిలిచి ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పాను. ఇంకెప్పుడూ అలా చేయనని చెప్పా.. అదే నేనే ఇన్నింగ్స్ ఆరంభిస్తానని చెప్పాను. ఎప్పుడూ లేనిది ఆరోజు నేను తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఆ తర్వాతి మ్యాచ్‌లో కేన్ రిచర్డ్సన్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఫోర్ కొట్టాను. నా ఐపీఎల్ కెరీర్ పొడిగించుకోవడంలో ఆ ఒక్క బౌండరీ ఎంతగా ఉపయోగపడిందో మాటల్లో చెప్పలేను’’ అని గౌతం గంభీర్ రెవ్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో తన చేదు అనుభవం గురించి వెల్లడించాడు. ఇక ఐపీఎల్-2014లో గంభీర్ సేన చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: అయ్యో రాయుడు.. తొలి మ్యాచ్‌లోనే ఇలా? వీడియో వైరల్ -
రిటైర్మెంట్పై కీలక కామెంట్ చేసిన రోహిత్ శర్మ
భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (36) రిటైర్మెంట్పై గతకొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరికి తోచిన విధంగా వారు హిట్‌మ్యాన్ రిటైర్మెంట్పై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ అంశంపై హిట్‌మ్యాన్ తాజాగా అమెరికాలో జరిగిన కార్యక్రమం సందర్భంగా స్పందించాడు. తాను ఇప్పట్లో రిటైర్ కావట్లేదని అతను క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు వచ్చే ఏడాది అమెరికా, కరీబియన్ దీవుల్లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు కూడా అందుబాటులో ఉంటానని చెప్పకనే చెప్పాడు. ఇది తెలిసి అతని అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. Captain Rohit Sharma said, " We've a T20I world cup coming in June 2024. It'll be pretty exciting and we're looking forward to it." There's a hope Rohit Sharma will decide to play next t20i world cup 🤞pic.twitter.com/1aYQRATlP4 — Nisha (@NishaRo45_) August 6, 2023 రోహిత్ తన రిటైర్మెంట్పై క్లారిటీ ఇస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసి రోహిత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, అతని వ్యతిరేకులు పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు రోహిత్ వయసు 36.. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ నాటికి అతనికి 37 వస్తాయి.. ఆ వయసులో అతను బరిలోకి దిగుతాడని అనుకోవట్లేదంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రోహిత్.. వన్డే, టెస్ట్ కెప్టెన్సీలకు పరిమితం అయిన నేపథ్యంలో హార్ధిక్ పాండ్యా భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. రోహిత్, విరాట్లు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ.. సెలెక్టర్లు వారిని ఎంపిక చేయకుండా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు సైతం సెలెక్టర్లు ఈ ఇద్దరిని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో రోహిత్, విరాట్లు వచ్చే టీ20 వరల్డ్‌కప్ ఆడతారన్నది అనుమానమేనని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. -
ఒకే ఓవర్లో 6 సిక్సర్లు! రియల్ లెజెండ్ అంటూ బ్రాడ్‌పై యువీ ట్వీట్.. వైరల్
Yuvraj Singh Tweet On Stuart Broad Retirement: ‘‘టేక్ ఏ బో.. స్టువర్ట్ బ్రాడ్! టెస్టుల్లో అసాధారణ రీతిలో సాగింది నీ ప్రయాణం. అందుకు నా అభినందనలు. రెడ్ బాల్ క్రికెట్లో బ్యాటర్లను భయపెట్టే అత్యద్భుతమైన బౌలర్లలో ఒకడివి నువ్వు. నువ్వు.. రియల్ లెజెండ్. నీ సుదీర్ఘ ప్రయాణం సాఫీగా సాగడానికి ఆట పట్ల నీకున్న అంకితభావమే కారణం. సూపర్ ఇన్స్పైరింగ్. నీ జీవితంలోని తదుపరి దశకు గుడ్‌లక్ బ్రాడీ!!’’ అంటూ టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడికి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా అతడితో ఉన్న అరుదైన ఫొటోను యువీ అభిమానులతో పంచుకున్నాడు. కాగా 17 ఏళ్ల కెరీర్‌కు స్వస్తి పలుకుతూ స్టువర్డ్ బ్రాడ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పీడకలను మిగిల్చిన యువీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్టు తనకు చివరిదని పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టెస్టుల్లో 600 దాకా వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్ 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక 2014లో ఇంగ్లండ్ తరఫున చివరి టీ20 ఆడిన బ్రాడ్‌కు.. యువరాజ్ సింగ్ ఓ పీడకలను మిగిల్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతర్జాతీయ టీ20లలో 2006లో అడుగుపెట్టిన బ్రాడ్.. 2007లో పొట్టిఫార్మాట్లో జరిగిన మొట్టమొదటి ప్రపంచకప్ ఈవెంట్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్ అతడికి కోలుకోలేని షాకిచ్చింది. బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సాధించి అతడికి కాళరాత్రిని మిగిల్చాడు. అందుకే వైరల్‌గా యువీ ట్వీట్ ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్.. 37 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్‌ను ఉద్దేశించి ఈ మేరకు లెజెండ్ అంటూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో బ్రాడ్ మూడు ఫార్మాట్లలో కలిపి 850 వికెట్ల దాకా పడగొట్టాడు. ఇంగ్లండ్ మేటి పేసర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. చదవండి: పిచ్చి ప్రయోగాలకు చెక్.. జట్టులోకి జట్టులోకి వారిద్దరూ! 9 ఏళ్ల తర్వాత Take a bow @StuartBroad8 🙇🏻♂️ Congratulations on an incredible Test career 🏏👏 one of the finest and most feared red ball bowlers, and a real legend! Your journey and determination have been super inspiring. Good luck for the next leg Broady! 🙌🏻 pic.twitter.com/d5GRlAVFa3 — Yuvraj Singh (@YUVSTRONG12) July 30, 2023 -
కోహ్లి రేంజ్ వేరు! రోహిత్ కూడా తక్కువేమీ కాదు.. కెప్టెన్‌గా కాకపోయినా.. కనీసం..
Rohit Sharma, Virat Kohli Absence From India T20I Team: ‘‘టీ20 ప్రపంచకప్-2024 నాటికి హార్దిక్ పాండ్యా సారథ్యంలో పూర్తిస్థాయిలో యువ ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కనుంది. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల టీ20 కెరీర్ ఇక ముగిసిపోయినట్లే! 36 ఏళ్ల హిట్‌మ్యాన్, 34 ఏళ్ల రన్‌మెషీన్ కోహ్లి ఇక పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోవాల్సిందే! వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టుతో ఈ విషయం సుస్పష్టమైంది. చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అజిత్ అగార్కర్ రోహిత్, కోహ్లిల టీ20 కెరీర్ భవితవ్యం తేల్చనున్నాడన్న వార్తలు నిజమయ్యాయి’’.. వాళ్లే తప్పుకొన్నారా? విండీస్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో నిండిన జట్టును ఎంపిక చేసిన తర్వాత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయాలివీ! ఇంతకీ రోహిత్, కోహ్లిలకు విశ్రాంతినిచ్చారా? లేదంటే తమంతట తామే మొత్తానికే పక్కకు తప్పుకొనేందుకు ఈ ఇద్దరు స్టార్లు సిద్ధమయ్యారా? అన్న సందేహాలు నెలకొన్నాయి. వాళ్లిద్దరు జట్టులో ఉంటేనే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లి లేని టీమిండియాను ఊహించడం కష్టమన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది. కోహ్లి రేంజ్ వేరు! రోహిత్ కూడా తక్కువేమీ కాదు! వీళ్లిద్దరు లేకుండా టీమిండియా ఐసీసీ ఈవెంట్‌కు సిద్ధమవుతుందని నేను అనుకోవడం లేదు. వాళ్లు ఆల్‌టైమ్ గ్రేట్స్. ఇప్పటికే తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి రేంజ్ వేరు. ప్రతి చిన్నపిల్లాడు కూడా అతడిని ఫాలో అవుతాడు. ఆట పట్ల తనకున్న అంకితభావంతో వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా ఎదిగాడు కోహ్లి. రోహిత్ శర్మ కూడా తక్కువేమీ కాదు. టీ20 క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు బాదాడు. అలాంటిది వీరిద్దరిని పక్కన పెడితే మాత్రం టీమిండియా ఇబ్బందుల పాలవడం ఖాయం. ఐసీసీ టోర్నమెంట్లో వాళ్లిద్దరు కచ్చితంగా ఆడాల్సిందే. ఒకవేళ కెప్టెన్సీ లేకపోయినా(రోహిత్‌ను ఉద్దేశించి) జట్టులో మాత్రం భాగంగా ఉండాలి’’ అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు. విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా? -
T20 WC: ప్రపంచకప్‌నకు ముందు పాక్ కీలక సిరీస్.. షెడ్యూల్ విడుదల
Pakistan Men And Women To Tour England 2024: టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్ వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. వెస్టిండీస్, యూఎస్ఏలో జరుగనున్న ఈ మెగా టోర్నీకి ముందు పాక్ పురుష, మహిళా జట్లు ఇంగ్లండ్ టీమ్‌తో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. స్వదేశంలో పాకిస్తాన్‌తో వరుస సిరీస్‌లకు సంబంధించిన తేదీలు ఖరారైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. మే 22, 2024 నుంచి ఇంగ్లండ్- పాకిస్తాన్ పురుష జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఇక అంతకంటే ముందుగానే అంటే.. మే 11 నుంచి మహిళా జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ సమరం మొదలుకానుంది. ఇంగ్లండ్- పాకిస్తాన్ వుమెన్ టీమ్‌లు మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్- పాకిస్తాన్ తలపడగా.. జో రూట్ బృందం జగజ్జేతగా నిలిచింది. ఇంగ్లండ్‌లో పాకిస్తాన్ పర్యటన-2024 పూర్తి వివరాలు మహిళా జట్ల టీ20, వన్డే సిరీస్ ►తొలి టీ20 మే 11- ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హాం ►రెండో టీ20 మే 17- ది కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్ ►మూడో టీ20 మే 19- హెడ్డింగ్లీ, లీడ్స్ ►మొదటి వన్డే మే 23- డెర్బీ ►రెండో వన్డే మే 26- టాంటన్ ►మూడో వన్డే మే 29- చెల్మ్స్ఫోర్డ్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ మెన్స్ నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ►తొలి టీ20- మే 22- హెడ్డింగ్లీ, లీడ్స్ ►రెండో టీ20- మే 25- ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హాం ►మూడో టీ20- మే 28- సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ ►నాలుగో టీ20- మే 30- ది ఓవల్, లండన్. చదవండి: 'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే! -
BCCI: అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్..
Virat Kohli And Rohit Sharma’s T20I Career To End?: ‘‘భవిష్యత్ ప్రణాళికల గురించి ఆటగాళ్లతో చర్చించడం చీఫ్ సెలక్టర్ ముఖ్య విధుల్లో ఒకటి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుకు అతీతులు కారు. వాళ్లు కోరుకుంటే సుదీర్ఘకాలం పాటు జట్టులో కొనసాగవచ్చు. అయితే, ఎంతటి గొప్ప ఆటగాళ్లైనా సరే సమయం వచ్చినపుడు సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడటంతో పాటు.. ఐపీఎల్ కూడా ఆడటం అంటే అంత తేలికేం కాదు’’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20 కెరీర్‌ను ఉద్దేశించి ఇన్సైడ్ స్పోర్ట్‌తో మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ నియామకం తర్వాత పొట్టి ఫార్మాట్లో వీరిద్దరి భవితవ్యం తేలనుందనే సంకేతాలు ఇచ్చారు. కోహ్లి అలా.. రోహిత్ ఇలా కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా వైదొలగగా.. రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో కోహ్లి జట్టులో కేవలం బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ కరువు తీర్చుకుంటూ ఆసియా కప్-2022 సందర్భంగా టీ20లలో తొలి శతకం బాదాడు. ఆ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూసుకోలేదు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 4 టీ20 సెంచరీలు బాదిన రోహిత్.. ప్రస్తుతం తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను భవిష్యత్ టీ20 కెప్టెన్‌గా ప్రమోట్ చేస్తోంది బీసీసీఐ. భవిష్యత్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహకాల్లో భాగంగా త్వరలోనే హార్దిక్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ రాజీనామా నేపథ్యంలో మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అజిత్ అగార్కర్ రాగానే ఇప్పటికే అగార్కర్ చీఫ్ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోగా.. త్వరలోనే అతడి నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ సెలక్టర్ రాగానే కోహ్లి, రోహిత్ టీ20 కెరీర్ భవిష్యత్తుపై స్పష్టత రానుందంటూ బీసీసీఐ అధికారి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక వెస్టిండీస్ పర్యటనలోనూ టెస్టు, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లి, రోహిత్ స్వదేశానికి తిరిగి రానుండగా.. హార్దిక్ టీ20 సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించనున్నట్లు సమాచారం. చదవండి: Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి విరాట్ కోహ్లి!? CWC Qualifiers 2023: నెదర్లాండ్స్ ఆశలు సజీవం -
కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ
Yuvraj Singh: టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. అండర్-19 వరల్డ్‌కప్ మొదలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 టోర్నీల్లో భారత్ గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2007లో ఒకే ఓవర్లో యువీ ఆరు సిక్సర్లు బాదిన ఫీట్‌ను క్రికెట్ అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్లోనూ యువీ తన అద్భుత ఆట తీరుతో అభిమానులకు వినోదం పంచాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో క్యాన్సర్ రూపంలో యువీ కెరీర్‌కు బ్రేక్ పడింది. మహమ్మారి బారిన పడినప్పటికీ ఆత్మవిశ్వాసం సడలనివ్వని యువరాజ్.. క్రమక్రమంగా కోలుకున్నాడు. అంతేకాదు 2017లో టీమిండియా తరఫున రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్‌కప్‌లో ఆడాలని యువీ భావించినప్పటికీ సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది జూన్ 10న యువరాజ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాల గురించి గతంలో న్యూస్18 ఇంటర్వ్యూలో మాట్లాడిన యువీ పంచుకున్న ఆసక్తికర విషయాలను నెటిజన్లు తాజాగా తెరమీదకు తెచ్చారు. నాటి విషయాలు యువీ పంచుకుంటూ.. పునరాగమనంలో కోహ్లి తనకు పూర్తి మద్దతుగా నిలిచాడని.. అదే విధంగా మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధం ఎలా ఉండేదో వివరించాడు. ఈ మేరకు.. ‘‘నేను తిరిగి జట్టులోకి వచ్చినపుడు విరాట్ కోహ్లి నాకు అండగా నిలబడ్డాడు. ఒకవేళ తన సహకారమే గనుక లేకుండా నేనసలు జట్టులోకి వచ్చేవాడినే కాదు. అదే సమయంలో ధోని నాకు వాస్తవాలేమిటో కళ్లకు కట్టినట్లు చూపాడు. 2019 ప్రపంచకప్ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు నా పేరును పరిశీలించడం లేదన్న నిజాన్ని ధోని నాకు చెప్పాడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నువ్వే నా ప్రధాన ప్లేయర్‌వి.. గుర్తుపెట్టుకో 2011 ప్రపంచకప్ టోర్నీ నాటి పరిస్థితుల గురించి చెబుతూ.. ‘‘ధోనికి నాపై నమ్మకం ఎక్కువ. ప్రతిసారి.. ‘‘నువ్వే నా ప్రధాన ప్లేయర్‌వి.. గుర్తుపెట్టుకో’’ అని చెప్పేవాడు. కానీ 2015 ప్రపంచకప్ నాటికి పరిస్థితులు మారిపోయాయి. కానీ అప్పుడు మాత్రం నేను ఎవరినీ వేలెత్తిచూపాలని అనుకోవడం లేదు. కెప్టెన్‌గా ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. సారథిగా ఉన్నపుడు జట్టు ప్రదర్శన మొత్తానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిసారి తమను తాము సమర్థించుకునే అవకాశం ఉండదు’’ అని యువీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా ధోని వల్లే తన కుమారుడి కెరీర్ నాశనమైందంటూ యువీ తండ్రి యోగ్రాజ్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాను ధోని ఆటకు అభిమానినే అయినా.. తన కుమారుడి విషయంలో అతడు చేసిన పని ఆమోదయోగ్యనీయం కాదంటూ మండిపడ్డాడు. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! -
ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్
మనం అనుకున్న కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో.. ఒక్కోసారి అనూహ్య రీతిలో జీవితం మలుపు తిరుగుతుంది. నీ మజిలీ ఇది కాదు.. ఇంకేదో ఉందనే సంకేతాలు ఇస్తుంది. అందుకు తగ్గట్లుగానే మనం కూడా మారాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్-2007 టీమిండియా ‘హీరో’ జోగీందర్ శర్మ జీవితంలో ఇలాగే జరిగింది. మొట్టమొదటి విజేతగా భారత్ 2007లో పొట్టి ఫార్మాట్లో ప్రవేశపెట్టిన వరల్డ్‌కప్ టోర్నీలో ధోని సేన ఫైనల్‌కు చేరుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తుదిపోరులో తలపడింది. సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో ఉన్న ది వాండరర్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దాయాదిని మట్టికరిపించింది. ఆఖరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ధోని సేన 5 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి తొట్టతొలి టీ20 ప్రపకంచప్ విజేతగా నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఈ మేరకు సరికొత్త చరిత్ర సృష్టించి రికార్డుల్లోకెక్కింది. ధోని నమ్మకం నిలబెట్టాడు ఇక ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అనుభవం లేని జోగీందర్ శర్మకు ఆఖరి ఓవర్లో ధోని బంతినివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, అతడు ఏమాత్రం తడబడలేదు. పాక్ గెలవాలంటే నాలుగు బంతుల్లో 6 పరుగులు అవసరమైన వేళ తెలివిగా బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్‌లో పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ఆడగా.. శ్రీశాంత్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ క్రమంలో ధోని జట్టులో భాగమై విన్నింగ్ వికెట్ తీసిన జోగీందర్ శర్మకు మంచి పేరు వచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు ఐపీఎల్ విన్నర్ ఇక ఆ మరుసటి ఏడాది.. ఐపీఎల్లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు జోగీందర్. 2008- 2012 వరకు అదే ఫ్రాంఛైజీతో కొనసాగాడు. 2010, 2011లో సీఎస్కే ట్రోఫీ గెలిచిన సందర్భాల్లో భాగమయ్యాడు. పోలీస్ ఉన్నతాధికారిగా 1983, అక్టోబరు 23న హర్యానాలో జన్మించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ జోగీందర్ శర్మ ప్రస్తుతం పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు. టీమిండియా టీ20 ప్రపంచకప్ హీరోగా నిలిచిన జోగీందర్‌ను హర్యానా ప్రభుత్వం ఈ మేరకు సముచిత గౌరవంతో సత్కరించింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ హోదాలో ఉన్నట్లు సమాచారం. కాగా కోవిడ్ విజృంభణ సమయంలో జోగీందర్ ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా హిసార్‌లో సేవలు అందించారు కూడా! కాగా జోగీందర్ 2007లో ఆడిన ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ మ్యాచే జోగీందర్ ఆడిన చివరి అంతర్జాతీయ టీ20 కూడా!! ఎన్ని మ్యాచ్‌లు అంటే ఇక టీమిండియా తరఫున మొత్తంగా 4 వన్డేలు, 4 టీ20లు ఆడిన జోగీందర్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 289 వికెట్లు తీయడంతో పాటు 2689 పరుగులు చేశారు. అంతర్జాతీయ కెరీర్లో వన్డేల్లో ఒకటి, టీ20లలో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. రైట్ఆర్మ్ పేసర్ అయిన జోగీందర్ 2007లో చివరి అంతర్జాతీయ మ్యాచ్.. 2011లో ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడారు. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ -
Womens T20 World Cup: మరో విజయమే లక్ష్యంగా...
కేప్‌టౌన్: టి20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు వరుసగా మరో విజయంపై దృష్టి సారించింది. బుధవారం గ్రూప్ ‘బి’లో జరిగే లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన... వెస్టిండీస్‌తో తలపడుతుంది. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఓడిన కరీబియన్ అమ్మాయిలు బోణీ కొట్టేందుకు చూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాక్ ఎదురైన గత మ్యాచ్‌లో భారత జట్టు ఆరంభంలో తడబడినా... తర్వాత పుంజుకుంది. డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన గాయంతో అందుబాటులో లేకపోయినా... లక్ష్యఛేదనలో భారత్ ఆడిన తీరు బాగుంది. ఇప్పుడైతే స్టార్ ఓపెనర్ స్మృతి తుది జట్టులోకి రావడంతో బ్యాటింగ్ దళం మరింత పటిష్టమైంది. గత జనవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో భారత జట్టు వెస్టిండీస్‌తో తలపడిన రెండుసార్లు విజయం సాధించింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఫామ్‌లో ఉండటంతో భారత టాపార్డర్‌కు ఏ ఢోకా లేదు. మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌లు కూడా బ్యాట్ ఝుళిపించగలరు. దీంతో భారీస్కోర్లు సాధించే సత్తా మన జట్టుకుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్ తన పదును చూపాల్సి ఉంది. పాక్‌తో పోరులో తొలి పది ఓవర్ల పాటు బౌలర్లు చక్కగానే కట్టడి చేశారు. కానీ తర్వాతి 10 ఓవర్లే కట్టుదిట్టంగా వేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో అలాంటి తడబాటుకు అవకాశమివ్వకుండా రాణిస్తే భారత్‌కు వరుస విజయం కష్టమేం కాదు. మరోవైపు విండీస్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. వరుసగా 14 మ్యాచ్‌ల్లో హేలీ మాథ్యూస్ సేన గెలుపొందలేకపోయింది. ఇందులో ఒక మ్యాచ్ ‘టై’కాగా... 13 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవడం జట్టును కుంగదీస్తోంది. మెగా ఈవెంట్లో\ ముందంజ వేయాలంటే కరీబియన్ జట్టుకు ప్రతీ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి లీగ్ మ్యాచ్‌లో విండీస్ ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. 12:ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 20 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్‌ల్లో, వెస్టిండీస్ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు రెండుసార్లు తలపడగా...ఇరు జట్లకు ఒక్కో మ్యాచ్‌లో విజయం దక్కింది. -
ఇండియా-పాకిస్తాన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఘోర తప్పిదం
మహిళల టీ20 వరల్డ్‌కప్-2023లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన కీలక సమరంలో జరగరాని ఓ ఘోర తప్పిదం జరిగిపోయింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన ఈ మ్యాచ్‌లో యువ ఫీల్డ్ అంపైర్ లారెన్ అగెన్‌బ్యాగ్ ఓ ఘోర తప్పిదం చేసింది. పాక్ నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించే క్రమంలో నిదా దార్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో లారెన్ 6 కాకుండా 7 బంతులు వేయించింది. ఏడవ బంతికి జెమీమా రోడ్రిగెస్ బౌండరీ బాదింది. దీని వల్ల టీమిండియాకు ఒరిగింది ఏమీ లేనప్పటికీ, పాక్ మాత్రం తమకు నష్టం వాటిల్లిందని వాపోతుంది. భారత బ్యాటర్లు జెమీమా రోడ్రిగెస్ (38 బంతుల్లో 53 నాటౌట్), రిచా ఘోష్ (20 బంతుల్లో 31 నాటౌట్) మరో 6 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు. ఒకవేళ అదనంగా వేసిన ఏడవ బంతిని క్యాన్సిల్ చేసి, పరుగులు (ఫోర్) మైనస్ చేసినప్పటికీ టీమిండియా ఈజీగా విక్టరీ సాధించేది. చేతిలో 7 వికెట్లు, క్రీజ్‌లో ఉన్న బ్యాటర్లు అప్పటికే జోరుమీద ఉండటాన్ని బట్టి చూస్తే ఆఖరి ఓవర్ తొలి బంతికే టీమిండియా విజయం సాధించేది. ఏదిఏమైనప్పటికీ ఇలాంటి తప్పిదాలు జరగడం మాత్రం విచారకరం. చేయని తప్పుకు టీమిండియాను నిందించడం మాత్రం సరికాదు. పాక్ అభిమానులు విషయం తెలిసి కూడా తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. ఏదో ఆఖరి బంతికి తాము ఓడామన్న రేంజ్లో వారు ఫీలవుతున్నారు. ఈ తప్పిదం జరగకపోయి ఉంటే తాము గెలిచే వాళ్లమని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ విషయంలో టీమిండియా ప్రమేయం ఏమీ లేనప్పటికీ మన సివంగులపై నోరు పారేసుకుంటున్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే దానికి టీమిండియాను బాధ్యుల్ని చేయడం సమంజసం కాదని భారత అభిమానులు అంటున్నారు. ఈ విషయంలో భారత జట్టుకు ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. కాగా, టెక్నాలజీ, అనువణువు మానిటరింగ్ ఉన్న నేటి ఆధునిక క్రీడాయుగంలో ఇలాంటి ఘోర తప్పిదం జరగడం నిజంగా విచారకరమని విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. -
T20 Cricket: టీమిండియాకు తొలి ఓటమి.. ఆస్ట్రేలియా ఘన విజయం
ICC Womens T20 WC Warm Up Matches 2023: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లు ఇవాల్టి (ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ (32 పరుగుల తేడాతో), రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక (2 పరుగుల తేడాతో), మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ (18 పరుగుల తేడాతో), నాలుగో మ్యాచ్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా (44 పరుగులు), ఐదో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ (6 వికెట్ల తేడాతో) విజయాలు సాధించాయి. వార్మప్ మ్యాచే కదా అని తేలిగ్గా తీసుకున్న భారత్.. ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ జర్నీని ఓటమితో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. భారత బౌలర్లు శిఖా పాండే (3-0-9-2), పూజా వస్త్రాకర్ (3-0-16-2), రాధా యాదవ్ (3-0-22-2), గైక్వాడ్ (3-0-21-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (28), ఆష్లే గార్డనర్ (22) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో వేర్హామ్ (32 నాటౌట్), జొనాస్సెన్ (22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం 130 పరుగులు సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేసి 15 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ (3.1-0-17-4), ఆష్లే గార్డనర్ (3-0-16-2) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. కిమ్ గార్త్, ఎలైస్ పెర్రీ, జెస్ జొనాస్సెన్ తలో వికెట్ తీసి టీమిండియాకు ప్యాకప్ చెప్పారు. భారత ఆటగాళ్లు చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో హర్లీన్ డియోల్ (12), దీప్తి శర్మ (19 నాటౌట్), అంజలీ శ్రావణి (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. భారత ఇన్నింగ్స్‌లో ఎక్స్ట్రా పరుగులే (18) రెండో అత్యధికం కావడం విశేషం. భారత్ తమ తదుపరి వార్మప్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. -
టాపార్డరే కీలకం: మిథాలీ
న్యూఢిల్లీ: ఈనెల 10 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే సీనియర్ మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత అవకాశాలు టాపార్డర్ రాణించడంపైనే ఆధారపడి ఉంటాయని దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ తెలిపింది. ‘భారత టాపార్డరే కీలకం. ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్‌లో ఉంది. ఆమె మ్యాచ్ విన్నర్. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా బాగా ఆడుతోంది. ఇటీవలే సఫారీలో అండర్–19 మెగా ఈవెంట్ గెలుచుకొచ్చిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌ల అనుభవం కూడా భారత సీనియర్ జట్టుకు ఉపకరిస్తుంది. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి మేటి జట్లను ఓడిస్తే మిగతా జట్లపై విజయం సులువవుతుంది. బౌలింగ్‌లో సవాళ్లు ఎదురవుతాయి. ఈ కఠిన పరీక్షను ఎదుర్కోవాలంటే బౌలర్లు తమ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాల్సిందే’ అని మిథాలీ విశ్లేషించింది. -
మన అమ్మాయిలదే ‘ప్రపంచం’
మన అమ్మాయిలు అదరగొట్టారు... అద్భుతమైన ఆటతో ఆది నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన మహిళా బృందం చివరకు అగ్రభాగాన నిలిచింది... సీనియర్ స్థాయిలో ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ గెలవని నిరాశను దూరం చేస్తూ ‘యువ’బృందం చిరస్మరణీయ ఫలితాన్ని సాధించింది. తొలిసారి నిర్వహించిన అండర్–19 ప్రపంచకప్‌లో కొత్త చరిత్రను సృష్టిస్తూ టీమిండియా మహిళలు విశ్వవిజేతగా నిలిచారు. ఏకపక్షంగా సాగిన తుది పోరులో ఇంగ్లండ్ ఆట కట్టించిన మన బృందం జగజ్జేతగా అవతరించింది... మహిళల క్రికెట్లో కొత్త తరానికి ప్రతినిధులుగా దూసుకొచ్చిన అమ్మాయిలు మొదటి ప్రయత్నంలోనే శిఖరాన నిలిచి మన మహిళల క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉందనే భరోసాను మరింత పెంచారు. పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): మహిళల తొలి అండర్–19 ప్రపంచకప్ విజేతగా భారత్ తమ పేరును ఘనంగా లిఖించుకుంది. 16 జట్లు పాల్గొన్న ఈ టి20 టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ అండర్ –19పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 14 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ప్రస్తుతం పురుషుల అండర్–19 వరల్డ్‌కప్ విజేత భారత్ కాగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా జత చేరడం విశేషం. ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో తెలంగాణ నుంచి గొంగడి త్రిష, యశశ్రీ, ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయి షబ్నమ్ సభ్యులుగా ఉన్నారు. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో కూడా 99 పరుగులకే కుప్పకూలి అదృష్టవశాత్తూ విజయంతో బయటపడ్డ ఇంగ్లండ్ బ్యాటింగ్ బలహీనత ఫైనల్లోనూ కనిపించింది. ఒకరితో మరొకరు పోటీ పడి విఫలం కావడంతో జట్టు సాధారణ స్కోరు కూడా చేయలేకపోయింది. టిటాస్ సాధు, అర్చన, పార్శవి ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ర్యానా మెక్‌డొనాల్డ్ (24 బంతుల్లో 19; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా... ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లే నమోదయ్యాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దూసుకుపోయింది. షఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్ (5) విఫలమైనా... గొంగడి త్రిష (29 బంతుల్లో 24; 3 ఫోర్లు), సౌమ్య (37 బంతు ల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన టిటాస్ సాధు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ అండర్–19 ఇన్నింగ్స్: స్క్రివెన్స్ (సి) త్రిష (బి) అర్చన దేవి 4; హీప్ (సి అండ్ బి) టిటాస్ సాధు 0; హాలండ్ (బి) అర్చన దేవి 10; సెరెన్ స్మేల్ (బి) టిటాస్ సాధు 3; ర్యానా మెక్‌డొనాల్డ్ (సి) అర్చన దేవి (బి) పార్శవి 19; పేవ్లీ (ఎల్బీ) (బి) పార్శవి 2; స్టోన్‌హౌస్ (సి) సోనమ్ (బి) మన్నత్ 11; గ్రోవ్స్ (రనౌట్) 4; బేకర్ (సి) రిచా ఘోష్ (బి) షఫాలి 0; సోఫియా స్మేల్ (సి అండ్ బి) సోనమ్ 11; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.1 ఓవర్లలో ఆలౌట్) 68. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–16, 4–22, 5–39, 6–43, 7–53, 8–53, 9–68, 10–68. బౌలింగ్: టిటాస్ సాధు 4–0–6–2, అర్చనా దేవి 3–0–17–2, పార్శవి చోప్రా 4–0–13–2, మన్నత్ కశ్యప్ 3–0–13–1, షఫాలీ 2–0–16–1, సోనమ్ 1.1–0–3–1. భారత్ అండర్–19 ఇన్నింగ్స్: షఫాలీ (సి) స్టోన్‌హౌస్ (బి) బేకర్ 15; శ్వేత (సి) బేకర్ (బి) స్క్రివెన్స్ 5; సౌమ్య (నాటౌట్) 24; త్రిష (బి) స్టోన్‌హౌస్ 24; రిషిత (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 3 వికెట్లకు) 69. వికెట్ల పతనం: 1–16, 2–20, 3–66. బౌలింగ్: బేకర్ 4–1–13–1, సోఫియా స్మేల్ 2–0–16–0, స్క్రివెన్స్ 3–0–13–1, గ్రోవ్స్ 2–0–9–0, స్టోన్‌హౌస్ 2–0–8–1, అండర్సన్ 1–0–10–0. -
WC 2023: అలా అయితే వరల్డ్‌కప్-2024 వరకు కెప్టెన్‌గా రోహిత్: డీకే
Rohit Sharma- Hardik Pandya: టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత టీమిండియా ఆడిన పలు ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి పేరిట ఆయా మ్యాచ్‌లకు దూరమవుతూ ఉన్నాడు. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్ నేపథ్యంలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్లో పూర్తి స్థాయి కెప్టెన్ చేస్తారంటూ గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘అవును.. పాండ్యాకు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా ఆడితే తప్ప అయితే, ఇప్పుడే అది జరుగుతుందనుకోను. ఎందుకంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 కంటే ముందు టీమిండియా మూడు టీ20 సిరీస్‌లు మాత్రమే ఆడనుంది. ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్. నిజానికి ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాతే కెప్టెన్సీ మార్పు అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ సేన ఈ ఐసీసీ ఈవెంట్లో అద్భుతం చేస్తే పర్లేదు. అలా అయితే రానున్న వరల్డ్‌కప్‌లోనూ లేదంటే కచ్చితంగా కెప్టెన్సీ రోహిత్ చేజారే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడితే.. రోహిత్ టీ20లలో కొనసాగాలనుకుంటే.. వరల్డ్‌కప్-2024లోనూ తనే కెప్టెన్‌గా ఉంటాడనటంలో అతిశయోక్తి లేదు’’ అని డీకే అభిప్రాయపడ్డాడు. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి చెబుతూ.. ‘‘ఇప్పటి వరకైతే హార్దిక్ నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. శ్రీలకంతో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో తన కెప్టెన్సీ ఎలా ఉంటుందో మనం చూశాం’’ అని దినేశ్ కార్తిక్ అతడిని ప్రశంసించాడు. కాగా ఇటీవల ముంబై మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి: Rahul Tripathi: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' Washington Sundar: 'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్‌కు వెళ్లడం మానేస్తామా' -
తిప్పేసిన స్పిన్నర్లు.. శ్రీలంకపై టీమిండియా ఘన విజయం
Under 19 Womens T20 World Cup 2023: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచిన భారత్.. సూపర్ సిక్స్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, మరుసటి మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుని శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. A thumping win for India as they move up in the Super 6 table 😍 Watch the Women's #U19T20WorldCup for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝: https://t.co/b2qCbfrjIX pic.twitter.com/PD9U2zJ59t — ICC (@ICC) January 22, 2023 ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లు పర్శవి చోప్రా (4-1-5-4), మన్నత్ కశ్యప్ (4-1-16-2), అర్చనా దేవీ (4-0-15-1) అద్భుతమైన గణాంకాలు నమోదు చేసి లంకేయులను తిప్పేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగింది. పర్శవి, మన్నత్, అర్చనాతో పాటు టిటాస్ సాధు (3-0-10-1) ఓ వికెట్ పడగొట్టగా.. సోనమ్ యాదవ్ (3-0-7-0), షెఫాలీ వర్మ (2-0-6-0) వికెట్లు పడగొట్టకున్నా పొదుపుగా బౌలింగ్ చేశారు. A solid bowling performance from India led by Parshavi Chopra's economical spell 🙌 Watch the Women's #U19T20WorldCup for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝 https://t.co/b2qCbfrjIX pic.twitter.com/oRj6gKtDXz — ICC (@ICC) January 22, 2023 అనంతరం 60 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 7.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అడుతూ పాడుతూ విజయం సాధించింది. షెఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్ (13), రిచా ఘోష్ (4) తక్కువ స్కోర్లకే ఔటైనప్పటికీ సౌమ్య తివారి (15 బంతుల్లో 28; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చింది. లంక బౌలర్లలో దేవ్మీ విహంగ 3 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో భారత్.. సూపర్ సిక్స్ గ్రూప్-1లో రెండో స్థానానికి ఎగబాకింది. -
టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. యూఏఈపై భారీ విజయం
ICC U19 Women T20 WC 2023: తొలిసారి జరుగుతున్న ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఖంగుతినిపించిన భారత అమ్మాయిలు.. ఇవాళ (జనవరి 16) యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 122 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఫలితంగా 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో గ్రూప్-డిలో అగ్రస్థానంలో నిలిచారు. యూఏఈతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు శ్వేత సెహ్రావత్ (49 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు), షఫాలీ వర్మ (34 బంతుల్లో 78; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్ల) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (5 బంతుల్లో 11; 2 ఫోర్లు) భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్ కోల్పోగా.. సోనియా మెంధియా 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. యూఏఈ బౌలర్లలో ఇందుజ నందకుమార్, మహిక గౌర్, సమైరా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు షబ్నమ్ (1/21), టిటాస్ సాధు (1/14), మన్నత్ కశ్యప్ (1/14), పర్శవి చోప్రా (1/13) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 97 పరుగులకు మాత్రమే పరిమితమైంది. యూఏఈ ఇన్నింగ్స్‌లో లావణ్య కెనీ (24), తీర్థ సతీష్ (16), మహిక గౌర్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత ఓపెనర్లు శ్వేత సెహ్రావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో (జనవరి 18) స్కాట్లాండ్ను ఢీకొట్టనుంది. -
టీ20 వరల్డ్‌కప్ షురూ.. దక్షిణాఫ్రికాను ఢీకొట్టనున్న భారత్
Under 19 Women T20 WC: తొట్ట తొలి అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ దక్షిణాఫ్రికా వేదికగా నేటి నుంచి ప్రారంభంకానుంది. 16 జట్లు తలపడుతున్న ఈ టోర్నీ ఈనెల 29న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా; గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, పాకిస్తాన్, జింబాబ్వే, రువాండా; గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్; గ్రూప్ ‘డి’లో భారత్, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, యూఏఈ జట్లున్నాయి. నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష, వైజాగ్‌కు చెందిన షబ్నమ్ సభ్యులుగా ఉన్నారు. భారత జట్టు: షెఫాలి వర్మ (కెప్టెన్), శ్వేత సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), జి త్రిష, సౌమ్య తివారి, సోనియా మెహ్దియా, హుర్లీ గాలా, హ్రిశిత బసు (వికెట్‌కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చనా దేవీ, పర్శవీ చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. జనవరి 14న సౌతాఫ్రికాతో (భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభం) జనవరి 16న యూఏఈతో (మధ్యాహ్నం 1:30 గంటలకు) జనవరి 18న స్కాట్లాండ్తో (సాయంత్రం 5:15 గంటలకు) -
టీ20ల్లో కోహ్లి, రోహిత్‌ల శకం ముగిసినట్లే..!
పుణే: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం జట్టును తీర్చిదిద్దే పనిలో ఉన్నామని, కుర్రాళ్ల ప్రదర్శన విషయంలో కాస్త సహనం ప్రదర్శించాలని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లకు మరింత అనుభవం కావాలని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. గురువారం శ్రీలంక చేతిలో 16 పరుగుల తేడాతో భారత్ ఓడిన తర్వాత ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ‘భారత జట్టులోని కుర్రాళ్లలో మంచి ప్రతిభ ఉంది. అయితే ఇంకా నేర్చుకునే దశలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతూ ఉంటేనే నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే వారి విషయంలో మనం కాస్త ఓపిక ప్రదర్శించాలి. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసమే ఈ టీమ్‌ను సిద్ధం చేస్తున్నాం. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఆడిన టీమ్‌తో పోలిస్తే జట్టులో చాలా మారింది. ముగ్గురు, నలుగురు మాత్రమే ప్రస్తుత తుది జట్టులో ఉన్నారు’ అని ద్రవిడ్ చెప్పాడు. ఈ వ్యాఖ్యతో టీ20 క్రికెట్లో కోహ్లి, రోహిత్ శర్మవంటి సీనియర్ల ఆట ముగిసిందని ద్రవిడ్ పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌పైనే అందరి దృష్టీ ఉంటుంది కాబట్టి కొత్త కుర్రాళ్లకు టి20ల్లో అవకాశం ఇచ్చేందుకు ఇదే సరైన సమయంగా ద్రవిడ్ భావిస్తున్నాడు. ‘వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్‌ల గురించి అంతా ఆలోచిస్తున్నారు. అందుకే ఈ ఫార్మాట్లో కొత్తవారికి అవకాశాలు అవసరం. వారికి తగినన్ని మ్యాచ్‌లు ఇచ్చి అండగా నిలవడం అవసరం. కుర్రాళ్లు ఉన్న టీమ్‌లకు ఇలాంటి మ్యాచ్‌లలో ఓటములు సహజమని అర్థం చేసుకోవాలి’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. -
2023 sports: ఏడాదంతా ఆడేద్దాం!
వచ్చేసింది 2023... క్రీడాభిమానులకు ఆటల విందు మోసుకొని వచ్చేసింది.... ఆద్యంతం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేందుకు వచ్చేసింది... ముందుగా హాకీ ప్రపంచకప్ మెగా ఈవెంట్‌తో కొత్త ఏడాది మొదలుకానుంది... ఆ తర్వాత తొలిసారి అమ్మాయిలకు నిర్వహిస్తున్న అండర్–19 టి20 ప్రపంచకప్ కనువిందు చేయనుంది... అనంతరం మహిళల టి20 ప్రపంచకప్‌తో ధనాధాన్ ధమాకా కనిపించనుంది... మండే వేసవిలో వినోదం పంచడానికి ఐపీఎల్ టోర్నీ... శీతాకాలంలో వన్డే వరల్డ్‌కప్.... కేవలం క్రికెట్టే కాదు... పంచ్ పవర్ చాటిచెప్పడానికి ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్... ‘పట్టు’పట్టడానికి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్... ‘రాకెట్’తో రఫ్ఫాడించేందుకు బ్యాడ్మింటన్, టెన్నిస్ టోర్నీలు... ‘రయ్ రయ్’ అంటూ సాగిపోయే ఫార్ములావన్ రేసులు... ఇంకా ఎన్నో... ఎన్నెన్నో టోర్నీలు మనను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం... మీ క్యాలెండర్‌లోనూ ఈ ఈవెంట్స్‌ను జత చేయండి... తప్పకుండా చూడండి! అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ జనవరి 14 నుంచి 29 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 16 ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 10 భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ భారత్‌లో శ్రీలంక పర్యటన జనవరి 3 నుంచి 15 వరకు 3 టి20లు, 3 వన్డేలు భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు 3 వన్డేలు, 3 టి20లు భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు 4 టెస్టులు, 3 వన్డేలు ఐపీఎల్ టి20 టోర్నీ ఏప్రిల్–మే వెస్టిండీస్‌లో భారత్ పర్యటన జూలై–ఆగస్టు 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ జూలై 20 నుంచి ఆగస్టు 20 వరకు వేదిక: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొత్తం జట్లు: 32 ఆసియా క్రీడలు వేదిక: హాంగ్జౌ (చైనా) సెప్టెంబర్ 23– అక్టోబర్ 8 ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు వేదిక: చెంగ్డూ (చైనా) జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఫార్ములావన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో మొత్తం 23 రేసులు ఉన్నాయి. మార్చి 5న బహ్రెయిన్ గ్రాండ్‌ప్రితో సీజన్ మొదలవుతుంది. అనంతరం వరుసగా బహ్రెయిన్ (మార్చి 5), సౌదీ అరేబియా (మార్చి 19), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 2), అజర్బైజాన్ (ఏప్రిల్ 30), మయామి (మే 7), ఎమిలియా రొమాగ్నా (మే 21), మొనాకో (మే 28), స్పెయిన్ (జూన్ 4), కెనడా (జూన్ 18), ఆస్ట్రియా (జూలై 2 ),బ్రిటన్ (జూలై 9), హంగేరి (జూలై 23), బెల్జియం (జూలై 30), డచ్ (ఆగస్టు 27), ఇటలీ (సెప్టెంబర్ 3), సింగపూర్ (సెప్టెంబర్ 17), జపాన్ (సెప్టెంబర్ 24), ఖతర్ (అక్టోబర్ 8), యూఎస్ఎ (అక్టోబర్ 22), మెక్సికో (అక్టోబర్ 29), సావోపాలో (నవంబర్ 5), లాస్‌వేగస్ (నవంబర్ 18) రేసులు జరుగుతాయి. నవంబర్ 26న అబుదాబి గ్రాండ్‌ప్రితో ఎఫ్1 సీజన్ ముగుస్తుంది. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీ వేదిక: భువనేశ్వర్, రూర్కెలా (భారత్) జనవరి 13 నుంచి 29 వరకు మొత్తం జట్లు: 16 బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీ వేదిక: న్యూఢిల్లీ జనవరి 17 నుంచి 22 వరకు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: బర్మింగ్‌హామ్ మార్చి 14 నుంచి 19 వరకు సుదిర్మన్ కప్ టోర్నీ వేదిక: సుజౌ (చైనా) మే 14 నుంచి 21 వరకు ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: జకార్తా జూన్ 13 నుంచి 18 వరకు చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: చెంగ్జూ సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు ప్రపంచ చాంపియన్‌షిప్ వేదిక: కోపెన్‌హాగెన్ (డెన్మార్క్) ఆగస్టు 21 నుంచి 27 వరకు ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు ఆసియా చాంపియన్‌షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఏప్రిల్ 25 నుంచి 30 వరకు సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ వేదిక: లక్నో (భారత్) నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వేదిక: బుడాపెస్ట్ (హంగేరి) ఆగస్టు 19 – 27 పురుషుల వన్డే ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్ వేదిక: భారత్ మొత్తం జట్లు: 10 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక: మెల్బోర్న్; జనవరి 16 – 29 ఫ్రెంచ్ ఓపెన్ వేదిక: పారిస్; మే 28 – జూన్ 11 వింబుల్డన్ వేదిక: లండన్; జూలై 3 –17 యూఎస్ ఓపెన్ వేదిక: న్యూయార్క్; ఆగస్టు 28 –సెప్టెంబర్ 10 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వేదిక: బెల్గ్రేడ్ (సెర్బియా); సెప్టెంబర్ 16 –24 ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: న్యూఢిల్లీ మార్చి 15 –31 ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్) మే 1 – 14 –సాక్షి క్రీడావిభాగం -
టీ 20 అండర్ 19 వరల్డ్ కప్‌లో మన చిచ్చర పిడుగులు
త్రిష, షబ్నమ్... ‘తెలుగుతేజాలు’ అంటూ వార్తల్లో పతాక శీర్షికలో వెలుగుతున్న క్రీడాకారిణులిద్దరూ. మహిళల అండర్ 19 కేటగిరీలో టీ 20 వరల్డ్ కప్ క్రికెట్‌కు ఎంపికైన ఇండియా జట్టులో స్థానం సంపాదించుకున్న తెలుగమ్మాయిలు వీళ్లు. త్రిష భద్రాచలం అమ్మాయి, షబ్నమ్ వైజాగ్ అమ్మాయి. నేను భద్రాచలంలో ఫిట్నెస్ కోచ్‌గా ఉండేవాడిని. త్రిష మాకు ఏకైక సంతానం. త్రిష అమ్మ తనకు కావల్సిన పోషకాహారంపై దృష్టి పెడితే, నేను తను క్రీడల్లో శిక్షణ ఎలా ఉందో చూసేవాడిని. తనని మంచి క్రీడాకారిణిగా చూడాలనుకున్నాను. ఇంకెన్నో విజయాలు సాధించాలన్నదే మా కల. – గొంగడి రామిరెడ్డి ఇటీవల ముగిసిన దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో తన బ్యాట్‌తో అందరినీ ఆకట్టుకున్న హైదరాబాద్ క్రికెటర్ త్రిష దక్షిణాఫ్రికాలో జనవరి 14 నుంచి 29 వరకు జరగనున్న టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత అండర్ –19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. డిసెంబరు 17 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టీ 20 సీరీస్‌లో పాల్గొనే జట్టులో కూడా చోటు దక్కించుకుని తెలంగాణ నుంచి మరో మిథాలీ రాజ్ అంటూ ప్రశంసలు అందుకుంటోంది త్రిష. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. తండ్రే గురువు వృత్తిరీత్యా ఫిట్నెస్ కోచ్ అయిన తండ్రి నుంచి త్రిష క్రికెట్లో ఓనమాలు దిద్దింది. భద్రాచలంలో తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులో క్రికెట్‌కు పరిచయమైన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్ –16 జట్టులో చేరింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు హైదరాబాద్ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో ఆమెను చేర్చారు, అక్కడ ఆమె కోచ్‌లందరినీ ఆకట్టుకుంది. సెయింట్ జాన్స్‌లో కోచ్ ఆధ్వర్యంలో తనను తాను మేటి క్రీడాకారిణిగా తీర్చిదిద్దుకుంది. ఆమె తన 12 సంవత్సరాల వయస్సులో సీనియర్స్ రాష్ట్ర జట్టులో చేరింది. మిథాలీకి అభిమానిని.. ‘భారత జట్టులో చోటు దక్కించుకోవడంతో సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా..’ అని ఆనందాన్ని వ్యక్తం చేసింది ఈ ఓపెనింగ్ బ్యాట్ ఉమెన్, లెగ్ స్పిన్నర్. కిందటి నెలలో విశాఖపట్నంలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్‌లో స్థానం దక్కించుకుంది. వెస్టిండీస్, శ్రీలంక, ఇండియా ‘ఎ’ , ఇండియా ‘బి’ జట్లతో కూడిన సిరీస్‌లో ఇండియన్ జెర్సీ ధరించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది అంటోంది త్రిష. ‘‘తొలి మహిళా క్రికెట్ సంచలనం మిథాలీ రాజ్, ఎం.ఎస్ ధోనీకి పెద్ద అభిమానిని. వారి నుంచే ఎంతో నేర్చుకున్నాను. వారి వల్లే నా ఆటను అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటాను. ఉదాహరణకు ఒక విషయం చెబుతాను... ఒకరోజు మిథాలీని ఓ అబ్బాయి ప్రశ్నిస్తూ గ్రౌండ్లో ఎవరు బౌలింగ్ చేస్తుంటారని అడిగాడట. ఎవరు బౌలింగ్ చేస్తున్నారో తాను ఎప్పుడూ చూడనని, తన వద్దకు వచ్చే బంతిని మాత్రమే చూస్తానని మిథాలీ అతనితో చెప్పారట.. ఈ విషయం ఆమే చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఆమెను చూసి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’’ అంటున్న త్రిష... తన దృష్టి మొత్తం ప్రపంచకప్‌లో రాణించడంపైనే ఉందని తెలిపింది. తన విజయంపై ఆమె దృష్టి మాత్రమే కాదు తెలుగు మహిళల అందరి దృష్టీ ఉందని చెబుతూ బెస్టాఫ్ లక్. – నిర్మలారెడ్డి ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలవాలి... టీ 20 వరల్డ్ కప్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. క్రీడాకారులు ఎప్పుడూ ప్రాక్టీస్‌లోనూ, మ్యాచ్ పెర్ఫార్మెన్స్లోనూ కాంప్రమైజ్ కాకూడదు. మన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనేది నా నమ్మకం. ఆడేటప్పుడు మ్యాచ్‌ని ఎంజాయ్ చేయాలి. ప్రెషర్ తీసుకోకూడదు. ప్రతి రోజూ మన బెస్ట్ కాకపోవచ్చు. కానీ మనం అంకితభావంతో ఆడడమే మనవంతు. ఫాస్ట్ బౌలర్‌గా... ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలవడం నా లక్ష్యం. – షబ్నమ్, క్రికెట్ క్రీడాకారిణి 2016లో ఎనిమిదేళ్ల వయసులో క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన షబ్నమ్ 2019లో స్టేట్‌ని రిప్రజెంట్ చేసింది. చాలెంజర్స్ ట్రోఫీ, జడ్సీఏ, ఎన్సీఏ హై పెర్ఫార్మెన్స్ క్యాంప్, రంజీట్రోఫీలో ఒక మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసుకున్న షబ్నమ్‌కి బౌలింగ్ ఇష్టం. న్యూజిలాండ్ సీరీస్‌లో మూడు వికెట్లు తీసుకుంది. ఆమె110– 115 స్పీడ్‌తో బౌలింగ్ చేస్తుంది, బౌలింగ్‌కి 20 మీటర్స్ నుంచి రన్ అప్ తీసుకుంటుంది. క్వాడ్రాంగులర్ సీరీస్‌లో శ్రీలంక, వెస్ట్ ఇండీస్ దేశాలతో ఆడిన షబ్నమ్ నిన్నటి వరకు (డిసెంబర్ 6) టీ20 సీరీస్‌లో న్యూజిలాండ్‌తో ఆడింది. వరల్డ్ కప్‌కి ఎంపిక అయిన సందర్భంగా ఆమె ముంబయి నుంచి సాక్షితో తన సంతోషాన్ని పంచుకుంది. ప్రాక్టీస్ మానదు షబ్నమ్ క్రికెట్ జర్నీ గురించి ఆమె తల్లి ఈశ్వరమ్మ మాట్లాడుతూ ‘‘మా పెద్దమ్మాయి. తను రోజూ ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు, సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రాక్టీస్ చేస్తుంది. క్రికెట్ ప్రాక్టీస్ కాక ఫిట్నెస్ కోసం మరో గంట వర్కవుట్ చేస్తుంది. ఏడాదిలో 365 రోజులూ ఇదే తన డైలీ రొటీన్. ఒక్క రోజు కూడా ప్రాక్టీస్ ఆపదు. వైజాగ్, ఎన్ఏడీ అకాడమీలో మొదలైన ప్రాక్టీస్ వీడీసీఏ, ఏసీఏలో కొనసాగుతోంది. తనిప్పుడు టెన్త్ క్లాస్. షబ్నమ్ కోసం స్కూల్ వాళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ సహకరిస్తున్నారు. అండర్ 19, టీ 20 వరల్డ్ కప్‌కు ఆడే అవకాశం రావడం కీలకమైన సోపానం. సీనియర్ కేటగిరీలో మనదేశం తరఫున ఆడడం తన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరడానికి మధ్య ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఇక నుంచి ఇంకా దీక్షగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తనకు ఫాస్ట్ బౌలింగ్ ఇష్టం. నేను ఎంపైర్ని పిల్లలు ఏదైనా సాధించాలంటే పేరెంట్స్ సహకారం చాలా అవసరం. మేమిద్దరం డిఫెన్స్ ఉద్యోగులమే. ఆయన లీడింగ్ ఫైర్‌మ్యాన్, నేను ఆఫీస్ క్లర్క్‌ని. మా వారికి క్రికెట్ చాలా ఇష్టం. అప్పట్లో తనకు అంత సహకారం, ప్రోత్సాహం లేకపోవడంతో విశాఖపట్నానికే పరిమితమయ్యారు. పిల్లలను క్రీడాకారులుగా తయారు చేయాలనే కోరిక మా వారిదే. చిన్నమ్మాయి షాజహానాబేగం కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోంది. ముగ్గురూ ప్రాక్టీస్ చేస్తుంటే ఎంపైర్‌గా వ్యవహరిస్తూ ఆటను ఎంజాయ్ చేయడం నా వంతు. మాకు వేడుకైనా, పిక్నిక్ అయినా క్రికెటే. బంధువుల ఇళ్లలో వేడుకలకు వెళ్లే అవకాశం ఉండదు. షబ్నమ్ ఎక్కడ ఆడుతుంటే ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్లిపోతాం. మాకదే పిక్నిక్’’ అన్నారు షబ్నమ్ తల్లి ఈశ్వరమ్మ. – వాకా మంజులారెడ్డి -
వచ్చే టి20 వరల్డ్‌కప్‌పై హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు
వెల్లింగ్టన్: టి20 ప్రపంచకప్ ముగిసి వారం రోజులు కూడా కాలేదు. గత గురువారమే సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడి భారత్ నిష్క్రమించింది. అయితే 2024లో జరిగే టి20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే జట్టు సన్నాహాలు మొదలు పెట్టినట్లు, అందుకు తగిన ప్రణాళికలు తమ వద్ద ఉన్నట్లు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు. రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోవడంతో శుక్రవారం నుంచి విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్‌కు పాండ్యా భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘మా ప్రపంచకప్ నిరాశాజనకంగా ముగిసిందనేది వాస్తవం. అయితే ప్రొఫెషనల్ క్రీడాకారులుగా మేం దానిని అధిగమించి ముందుకు సాగాలి. మా వద్ద ఇప్పుడు తగినంత సమయం ఉంది. వచ్చే రెండేళ్లలో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు. చాలా మ్యాచ్‌లు ఆడతాం కాబట్టి చాలా మందికి తగిన అవకాశాలు కూడా లభిస్తాయి. సరిగ్గా చెప్పాలంటే దాని కోసం మా వద్ద ప్రణాళిక లు సిద్ధంగా ఉన్నాయి’ అని హార్దిక్ పేర్కొన్నాడు. -
టీ ట్వంటీ ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్