హార్దిక్‌ పాండ్యాపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్‌ | With This Form, Hardik Pandya Won't Be Picked For T20 World Cup 2024: Manoj Tiwary | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ పాండ్యాపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్‌

Published Sun, Apr 14 2024 3:24 PM | Last Updated on Sun, Apr 14 2024 3:33 PM

With This Form, Hardik Pandya Wont Be Picked For T20 World Cup 2024 Said Manoj Tiwary - Sakshi

ముంబై ఇండియన్స్‌ సారధి హార్దిక్‌ పాండ్యాపై టీమిండియా మాజీ ప్లేయర్‌, బెంగాల్‌ క్రీడా మంత్రి మనోజ్‌ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్‌తో హార్దిక్‌ టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం కష్టమని మనోజ్‌ అన్నాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్‌ కోటాలో శివమ్‌ దూబేను ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌ బౌలర్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు.

వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే హార్దిక్‌ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌ గత మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఒకే ఒక ఓవర్‌ వేశాడని.. ఈ సీజన్‌లో అతని ఎకానమీ రేట్‌ 11కు పైగా ఉందని గుర్తు చేశాడు. భారత జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడాలంటే హార్దిక్‌ బౌలింగ్‌లో తప్పక రాణించాల్సి ఉందని అన్నాడు. బౌలర్‌గా సత్తా చాటకపోతే భారత చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ హార్దిక్‌కు వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక​ చేయడని చెప్పాడు.

హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక కావాలంటే దూబే కూడా బౌలింగ్‌లో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు. కేవలం బ్యాటింగ్‌ మెరుపులతో శివమ్‌ దూబే వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక​ కాలేడని అన్నాడు. దూబే వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక కావాలంటే ఐపీఎల్‌లో ఎక్కువగా బౌలింగ్‌ చేయాలని సూచించాడు. ఒకవేళ దూబే వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక కాలేదంటే అది సీఎస్‌కే తప్పే అవుతుందని అన్నాడు. సీఎస్‌కే కెప్టెన్‌ దూబేను బౌలర్‌గా కూడా వాడుకోవాలని సూచించాడు.

ఈ సీజన్‌లో దూబే బౌలింగ్‌ సేవలను సీఎస్‌కే పెద్దగా వినియోగించుకోలేదని గుర్తు చేశాడు. దూబే చాలా తెలివైన బౌలర్‌ అని మనోజ్‌ కితాబునిచ్చాడు. ఇలాంటి స్మార్ట్‌ బౌలర్‌ను సీఎస్‌కే ఎందుకు వినియోగించుకోవడం లేదో అర్దం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దూబే, వెంకటేశ్‌ అయ్యర్‌ (కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌) లాంటి ఆల్‌రౌండర్లతో ఆయా జట్లు ఎందుకు బౌలింగ్‌ చేయించట్లేదో అంతు చిక్కడం లేదని అన్నాడు.

కాగా, ఈ ఏడాది జూన్‌ 1 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టును ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. టీమిండియా బెర్తులు ఎవరెవరికి ఖరారవుతాయనేది ఐపీఎల్‌ ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. శివమ్‌ దూబేను సెలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement