Manoj Tiwary
-
‘గంభీర్ నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్‌కు నోటి దురుసు ఎక్కువని.. తన కుటుంబంతో పాటు ఓ టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ను కూడా అసభ్యకరంగా తిట్టాడని ఆరోపించాడు. తనకు నచ్చిన వాళ్లకు పెద్దపీట వేయడం గంభీర్‌కు అలవాటని.. అందుకే ఆస్ట్రేలియా పర్యటనలో ఆకాశ్ దీప్(Akash Deep)ను బలిచేశాడని మండిపడ్డాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గంభీర్- మనోజ్ తివారి కలిసి ఆడారు. గతంలో దేశవాళీ క్రికెట్లోనూ ఢిల్లీ తరఫున గంభీర్- బెంగాల్ జట్టు తరఫున తివారి ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్‌కు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.గంభీర్ హయాంలో చేదు అనుభవాలుతొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ ఓడిపోయింది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి పదేళ్ల తర్వాత ట్రోఫీని ఆసీస్‌కు చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక, గంభీర్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో మనోజ్ తివారి సైతం తన అభిప్రాయాలను పంచుకుంటూ.. గంభీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతడొక మోసగాడు అని.. గౌతీ చెత్త నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించాడు. అయితే, నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి యువ ప్లేయర్లు ఈ విషయంలో మనోజ్ తివారిని తప్పుబడుతూ.. గంభీర్‌కు మద్దతుగా కామెంట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి.హర్షిత్ రాణాను ఎందుకు ఆడించారు?ఈ విషయాలపై మనోజ్ తివారి తాజాగా స్పందించాడు. అర్హత లేకున్నా.. కేవలం గంభీర్ చెప్పడం వల్ల అవకాశాలు పొందిన వారు ఇలాగే మాట్లాడతారని నితీశ్, హర్షిత్‌లను ఉద్దేశించి కౌంటర్లు వేశాడు. ‘‘నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి వాళ్లు గౌతం గంభీర్‌కు ఎందుకు సపోర్టు చేయరు? తప్పకుండా చేస్తారు.ఎందుకంటే పెర్త్ టెస్టులో ఆకాశ్ దీప్‌ను కాదని హర్షిత్ రాణాను ఆడించింది ఎవరో మనకు తెలియదా? అయినా.. ఆకాశ్ ఏం తప్పు చేశాడని అతడిని మొదటి టెస్టుకు పక్కనపెట్టారు? బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టుల్లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు.ఒక ఫాస్ట్ బౌలర్‌గా తనకు సహకరించే పిచ్‌లపై వీలైనంత ఎక్కువగా బౌలింగ్ చేయాలని అతడు కోరుకోవడం సహజం. కానీ కారణం లేకుండా అతడిని జట్టు నుంచి తప్పించారు. హర్షిత్ కోసం ఆకాశ్‌పై తొలి టెస్టులో వేటు వేశారు. హర్షిత్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ గణాంకాలు కూడా అంతంతమాత్రమే. ఆకాశ్ దీప్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు.నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..అయినా.. సరే అతడిని పక్కనపెట్టారంటే.. సెలక్షన్లో ఎంతటి వివక్ష ఉందో అర్థం కావడం లేదా?.. అందుకే గంభీర్‌కు ఇలాంటి వాళ్లు మద్దతు ఇస్తారు. అయినా నేనేమీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఉన్న విషయాల్నే నిర్భయంగా చెప్పాను.రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో మ్యాచ్ జరిగినపుడు గౌతం గంభీర్ నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయో.. అప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా విన్నారు. సౌరవ్ గంగూలీ గురించి అతడు అన్న మాటలు.. నా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అందరూ విన్నారు. అయినా.. వారిలో కొంతమంది అప్పుడు అతడికే సపోర్టు చేశారు. జనాలు ఇలాగే ఉంటారు.అతడిని తొక్కేయాలని చూశారుహర్షిత్ కంటే ఆకాశ్ దీప్ బెటర్ అని మేనేజ్మెంట్ త్వరగానే గ్రహించింది. అందుకే రెండో టెస్టు నుంచి అతడిని పిలిపించారు. ఇక్కడ కొంతమంది స్వార్థం వల్ల జట్టుకు చెడు జరిగే అవకాశం ఉంది. పాపం ఆకాశ్ దీప్ తన సెలక్షన్ గురించి నోరు విప్పలేడు. అందుకే అతడిని తొక్కేయాలని చూశారు’’ అని మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: నవశకం.. కొత్త కెప్టెన్ అతడే!.. ఆర్సీబీ హెడ్‌కోచ్ వ్యాఖ్యలు వైరల్ -
‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) ఘాటు విమర్శలు చేశాడు. గంభీర్‌ను మోసకారిగా అభివర్ణిస్తూ.. అతడొక కపట మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు గెలిచినపుడు విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు మాత్రమే ముందుంటాడని.. ఓడితే మాత్రం ఏవో సాకులు చెబుతాడంటూ మండిపడ్డాడు.పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకున్నాడుఅసలు గంభీర్ నాయకత్వంలోని కోచింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మనోజ్ తివారి విమర్శించాడు. కాగా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్థానంలో గతేడాది గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డష్కటేలను పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకున్నాడు.ఘోర వైఫల్యాలుఅయితే, గంభీర్ హయాంలో టీమిండియా ఇప్పటి వరకు పెద్దగా సాధించిందేమీ లేకపోగా.. ఘోర వైఫల్యాలు చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ 3-0తో వైట్‌వాష్‌కు గురికావడంతో పాటు.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఆసీస్ పర్యనటలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్ ఒక మోసకారి. అతడు చెప్పేదొకటి. చేసేదొకటి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ అభిషేక్ నాయర్.. ఇద్దరూ ముంబైవాళ్లే. ఓటముల సమయంలో రోహిత్‌ను ముందుకు నెట్టేలా ప్లాన్ చేశారు. అసలు జట్టుకు బౌలింగ్ కోచ్ వల్ల ఏం ప్రయోజనం కలిగింది?వారి వల్ల ఏం ఉపయోగం?ప్రధాన కోచ్ ఏది చెబితే దానికి తలాడించడం తప్ప బౌలింగ్ కోచ్ ఏం చేస్తాడు? మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి వచ్చాడు. ఇక అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందినవాడు. ఈ ఇద్దరూ గంభీర్‌తో కలిసి పనిచేశారు. గంభీర్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్. వీరు అతడి అసిస్టెంట్లు. గంభీర్ హాయిగా తనదైన కంఫర్ట్జోన్లో ఉన్నాడు’’ అని న్యూస్18 బంగ్లా చానెల్‌తో పేర్కొన్నాడు.సమన్వయం లేదుఅదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్‌కు సమన్వయం లోపించిందన్న మనోజ్ తివారి.. వారిద్దరు ఇక ముందు కలిసి పనిచేస్తారా? అనే సందేహం వ్యక్తం చేశాడు. ‘‘రోహిత్ ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్. మరోవైపు.. గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా టైటిల్స్ అందించాడు. నాకు తెలిసి వీరిద్దరికి ఏకాభిప్రాయం కుదరడం లేదు’’ అని మనోజ్ తివారి పేర్కొన్నాడు.క్రెడిట్ అంతా తనకే అంటాడుకాగా ఐపీఎల్-2024లో గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. అతడికి కోచ్‌గా పనిచేసిన అనుభవం లేకపోయినా బీసీసీఐ ఏకంగా టీమిండియా హెడ్‌కోచ్‌గా పదవిని ఇచ్చింది. ఈ విషయం గురించి మనోజ్ తివారి ప్రస్తావిస్తూ..‘‘గంభీర్ ఒంటిచేత్తో ఎన్నడూ కోల్‌కతాకు టైటిల్ అందించలేదు. జాక్వెస్ కలిస్, సునిల్ నరైన్.. నేను.. ఇలా చాలా మంది సహకారం ఇందులో ఉంది. అయితే, క్రెడిట్ అంతా ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసు’’ అంటూ గంభీర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం? -
సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్
టీమిండియా మిడిలార్డర్లో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్‌కు ఉద్వాసన పలకాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులో కొనసాగిస్తూనే.. . రాహుల్ స్థానంలో ఇతడిని ఆడించాలంటూ ఓ ‘దేశవాళీ క్రికెట్ హీరో’పేరు మనోజ్ తివారీ సూచించాడు.కాగా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 53 టెస్టులు ఆడి 2981 పరుగులు చేశాడు. సగటు 33.88. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయాడు.తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ సొంతగడ్డ బెంగళూరులో కివీస్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగులే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాట్లాడుతూ.. రాహుల్ ఆట తీరును విమర్శించాడు. ‘‘91 ఇన్నింగ్స్ ఆడి కేవలం 33.88 సగటుతో బ్యాటింగ్ చేసే వాళ్లు మనకు అవసరమా?స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీభారత్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. అలాంటపుడు కేఎల్ రాహుల్ స్థానం గురించి మనం ఎందుకు పునరాలోచించకూడదు? టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ను నాలుగో స్థానంలో పంపించాలి. నా అభిప్రాయం ప్రకారం.. అభిమన్యు ఈశ్వరన్‌ను కూడా మిడిలార్డర్లో ట్రై చేస్తే బాగుంటుంది.అతడిపై ఓపెనర్ అనే ట్యాగ్ వేసి పక్కనపెడుతున్నారు. అతడు స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీ మిడిలార్డర్లో ప్రయత్నించి చూస్తే తప్పేంటి? గత కొంతకాలంగా అతడు సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు’’ అని మనోజ్ తివారీ క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా మనోజ్ మాదిరే దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ ఇటీవల ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వరుసగా నాలుగు శతకాలు బాది జోరుమీదున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో బెంగళూరు టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. తదుపరి ఇరుజట్ల మధ్య అక్టోబరు 24న రెండో టెస్టు మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-‘ఎ’ జట్టును ఇటీవల ప్రకటించారు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో అభిమన్యుకు చోటు దక్కింది.చదవండి: WTC 2023-25 Points Table: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..? -
టైమ్‌కి చెక్ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం?
‘‘అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో ఎంతో అనుభవం గడించాడు. ఆస్ట్రేలియా తరఫున ఎల్లప్పుడూ అద్భుతంగా ఆడతాడు. కానీ ఐపీఎల్‌కు వచ్చే సరికి.. అతడికి ఏమవుతుందో తెలియడం లేదు.బహుశా ఐపీఎల్ పట్ల అతడికి ఆసక్తి లేదేమో?!.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు తాను అవుటైనా పర్లేదనకుంటాడేమో!.. అతడి బ్యాంకు బ్యాలెన్స్ నిండుగా ఉంది.సమయానికి చెక్ అందుతుంది. సహచర ఆటగాళ్లతో కలిసి రాత్రుళ్లు పార్టీలు.. నవ్వులు.. సరదాలు.. ఫొటోలకు ఫోజులు.. ఇంతే’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ గ్లెన్ మాక్స్వెల్ ఆట తీరును విమర్శిస్తూ అతడిపై మండిపడ్డాడు. ఫ్రాంఛైజీ నుంచి టైమ్‌కు చెక్కులు తీసుకోవడం మాత్రమే అతడికి తెలుసని.. ఆటపై అసలు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ఆసీస్ ఆల్‌రౌండర్ మాక్సీని ఆర్సీబీ రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, ఈ సీజన్లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్ ఆడి కేవలం 52 పరుగులు చేశాడు. అదే విధంగా.. ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు ఈ ఆర్థోడాక్స్ బౌలర్.కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లోనూమానసికంగా అలసిపోయానంటూ కొన్నాళ్లు సెలవు కూడా తీసుకున్నాడు. ఇక కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ మాక్స్వెల్ తేలిపోయాడు. రాజస్తాన్ రాయల్స్‌తో అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో మాక్సీ డకౌట్ అయ్యాడు.టాపార్డర్‌లో విరాట్ కోహ్లి(33) ఒక్కడు ఫర్వాలేదనిపించగా.. ఫాఫ్ డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్(27) త్వరగానే నిష్క్రమించారు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రజత్ పాటిదార్ 34 పరుగులతో ఆకట్టుకోగా.. ఐదో స్థానంలో వచ్చిన మాక్సీ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.క్వాలిఫయర్-2లో రాజస్తాన్మిగతా వాళ్లలో మహిపాల్ లామ్రోర్(17 బంతుల్లో 32) చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని రాజస్తాన్ 19 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఆర్సీబీ యథావిథిగా ఇంటిబాట పట్టింది.ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాక్సీ ఆట తీరును విమర్శిస్తూ పైవిధంగా స్పందించాడు. అదే విధంగా ఆర్సీబీ స్థాయికి తగ్గట్లు రాణించలేదని.. వరుసగా ఆరు విజయాలు సాధించినా.. అసలు పోరులో ఓడిపోతే లాభం ఉండదంటూ పెదవి విరిచాడు.చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!🎥 𝐓𝐡𝐞 𝟏% 𝐜𝐡𝐚𝐧𝐜𝐞 ❤️They were down and out. But what followed next was a dramatic turnaround and comeback fuelled with belief and emotions 🙌 Well done, Royal Challengers Bengaluru 👏 👏 #TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall | @RCBTweets pic.twitter.com/PLssOFbBvf— IndianPremierLeague (@IPL) May 23, 2024 -
టీ20 వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్‌కు నో ఛాన్స్.. అతడికే అవకాశం?
ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన వెంటనే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జాన్ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్-2024 షురూ కానుంది. ఈ ఏడాది పొట్టిప్రపంచకప్నకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఎవరుండాలన్న అన్న విషయంపై మాజీలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేరాడు. వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్ పాండ్యాకు కాకుండా ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు ఛాన్స్ ఇవ్వాలని తివారీ సూచించాడు. "హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్‌గా భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ చేయాలి. గత మూడు మ్యాచ్‌ల నుంచి హార్దిక్ బౌలింగ్ చేయడం లేదు. అంతకముందు బౌలింగ్ చేసినా దాదాపు 11 పైగా ఏకనామీతో పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పుకోవాలి. అగార్కర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా ఉన్నాడు కాబట్టి కచ్చితంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. శివమ్ దూబే కచ్చితంగా సెలక్టర్ల దృష్టిలో ఉంటాడని నేను భావిస్తున్నాను. ఒక వేళ టీ20 ప్రపంచకప్ జట్టులో దూబేకు చోటు దక్కకపోతే అందుకు బాధ్యత సీఎస్కే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై అతడికి బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వడం లేదు. హార్దిక్‌కు ప్రత్నామ్యాయంగా దూబేను సెలక్టర్లు ఎంపిక చేస్తారని నేను ఆశిస్తున్నానని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో శివమ్ దూబే దుమ్ములేపుతున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లలో బ్యాటింగ్‌కు వచ్చి సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
హార్దిక్ పాండ్యాపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్
ముంబై ఇండియన్స్ సారధి హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ ప్లేయర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్‌తో హార్దిక్ టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం కష్టమని మనోజ్ అన్నాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబేను ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్లో హార్దిక్ బౌలర్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే హార్దిక్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఐపీఎల్లో హార్దిక్ గత మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఒకే ఒక ఓవర్ వేశాడని.. ఈ సీజన్లో అతని ఎకానమీ రేట్ 11కు పైగా ఉందని గుర్తు చేశాడు. భారత జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడాలంటే హార్దిక్ బౌలింగ్‌లో తప్పక రాణించాల్సి ఉందని అన్నాడు. బౌలర్‌గా సత్తా చాటకపోతే భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హార్దిక్‌కు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయడని చెప్పాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక కావాలంటే దూబే కూడా బౌలింగ్‌లో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు. కేవలం బ్యాటింగ్ మెరుపులతో శివమ్ దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాలేడని అన్నాడు. దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కావాలంటే ఐపీఎల్లో ఎక్కువగా బౌలింగ్ చేయాలని సూచించాడు. ఒకవేళ దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాలేదంటే అది సీఎస్కే తప్పే అవుతుందని అన్నాడు. సీఎస్కే కెప్టెన్ దూబేను బౌలర్‌గా కూడా వాడుకోవాలని సూచించాడు. ఈ సీజన్లో దూబే బౌలింగ్ సేవలను సీఎస్కే పెద్దగా వినియోగించుకోలేదని గుర్తు చేశాడు. దూబే చాలా తెలివైన బౌలర్ అని మనోజ్ కితాబునిచ్చాడు. ఇలాంటి స్మార్ట్ బౌలర్‌ను సీఎస్కే ఎందుకు వినియోగించుకోవడం లేదో అర్దం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దూబే, వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్ ఆల్‌రౌండర్) లాంటి ఆల్‌రౌండర్లతో ఆయా జట్లు ఎందుకు బౌలింగ్ చేయించట్లేదో అంతు చిక్కడం లేదని అన్నాడు. కాగా, ఈ ఏడాది జూన్ 1 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టును ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. టీమిండియా బెర్తులు ఎవరెవరికి ఖరారవుతాయనేది ఐపీఎల్ ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. శివమ్ దూబేను సెలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. -
IPL 2024: ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్.. ? రియాక్ట్ అయిన సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌ను ఓసారి ఛాంపియన్, మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్.. ఈసారి మాత్రం తన కెప్టెన్సీ మార్క్ చూపించలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. మళ్లీ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా చేరాడు. ఈ మెగా ఈవెంట్లో తమ తదుపరి మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్సీ నుంచి వైదొలగతాడని తివారీ జోస్యం చెప్పాడు. అంతేకాకుండా రోహిత్ శర్మనే తిరిగి మళ్లీ ముంబై సారథ్య బాధ్యతలు చేపడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ విరామంలోనే ముంబై కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని తివారీ చెప్పుకొచ్చాడు. "హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తీవ్రమైన ఒత్తడిలో ఉన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో బౌలర్లను హార్దిక్ సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. ఆరంభంలో బౌలర్లు విఫలమవుతున్నప్పటికి మళ్లీ వారినే ఎటాక్‌లో తీసుకువచ్చి హార్దిక్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌లో అద్బుతమైన బౌలర్లు ఉన్నారు. సరిగ్గా రోటాట్ చేయడంలో పాండ్యా విఫలమయ్యాడు. స్వింగ్ అవుతున్న పిచ్‌లపై బుమ్రాను కాదని తొలుత తను బౌలింగ్ చేయడం కూడా హార్దిక్ తప్పిదమే అని చెప్పుకోవాలి. హార్దిక్ కూడా బంతిని స్వింగ్ చేయగలడు. కానీ ముంబై తరపున ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో హార్దిక్ బౌలర్‌గా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది. ఈ విరామంలో ముంబై ఫ్రాంచైజీ నుంచి ఓ బిగ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించేస్తాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా చాలా ఫ్రాంచైజీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు ముంబై కెప్టెన్సీ విషయంలో కూడా అదే జరిగే అవకాశముందని" క్రిక్‌బజ్ షోలో తివారీ పేర్కొన్నాడు. ఇదే షోలో పాల్గోన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. మనోజ్ తివారీ కామెంట్స్‌పై స్పందించాడు. "హార్దిక్ కెప్టెన్సీపై మనోజ్ కాస్త తొందపడి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కూడా జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆ ఏడాది సీజన్లో వారు ఛాంపియన్లుగా నిలిచారు. కాబట్టి మనం కాస్త ఓపిక పట్టాలి. మనం మరో రెండు మ్యాచ్‌ల కోసం వేచి ఉండాలి. ఆ తర్వాతే మన అభిప్రాయాలను వెల్లడిస్తే బాగుంటుందని సెహ్వాగ్ రిప్లే ఇచ్చాడు. -
అంపైర్లపై సంచలన ఆరోపణలు చేసిన మనోజ్ తివారి.. తాగొచ్చేవారంటూ కామెంట్స్..!
టీమిండియా మాజీ క్రికెటర్, ఇటీవలే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి దేశవాలీ అంపైర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం జరిగిన కార్యక్రమంలో అతను మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆటగాళ్లు డోప్ పరీక్షలకు వెళ్లవలసి వస్తే, దానిని దేశీయ అంపైర్లకు కూడా విస్తరించాలి. నేను చాలాసార్లు అంపైర్లు నిద్రపోతున్నట్లు చూశాను. అలా అంపైర్లను చూసిన సందర్భాల్లో.. సార్ నిన్న రాత్రి మీరు ఏమి తాగారని వారిని అడిగేవాడిని. అందుకు వాళ్లు నవ్వుతూ.. నేను విస్కీని ఇష్టపడతానంటూ సమాధానం ఇచ్చేవారు. అలా జరగకుండా దేశీయ అంపైర్లలో సీరియస్‌నెస్ రావాలంటే బీసీసీఐ తగిన చర్యలు తీసుకుని, వారికి కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని తివారి అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేయకముందు తివారి దేశవాలీ క్రికెట్‌పై, ముఖ్యంగా రంజీలపై, టీమిండియాలో తన కెరీర్ అర్దంతరంగా ముగియడంపై, ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాగా రాణిస్తున్నా టీమిండియాలో తనను తొక్కేశారంటూ ధోనిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత క్రికెటర్ల మాదిరి తనకూ ప్రోత్సాహం లభించి ఉంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలా ఉన్నత శిఖరాలకు చేరుకునేవాడినని అన్నాడు. కాగా, రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తివారి తన 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 148 మ్యాచ్‌లు ఆడిన తివారి.. 10,195 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ లో 169 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 5581 రన్స్ చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 183 టీ20ల్లో 3436 పరుగులు సాధించిన తివారి.. 2008-2015 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడి 287, 15 పరుగులు చేశాడు. వన్డేల్లో తివారి అత్యధిక స్కోరు 104 నాటౌట్‌గా ఉంది. -
సెంచరీ చేసినా.. ధోని నన్ను ఎందుకు తప్పించాడో?
'I Had The Potential To Be A Hero': టీమిండియాలో తనకు తగినన్ని అవకాశాలు రాలేదని బెంగాల్ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి వాపోయాడు. అందరు క్రికెటర్ల మాదిరిగానే తనకూ ప్రోత్సాహం లభించి ఉంటే కచ్చితంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఉన్నత శిఖరాలకు చేరుకునేవాడినని పేర్కొన్నాడు. మెరుగ్గా ఆడినప్పటికీ తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో అర్థంకాలేదని మనోజ్ తివారి ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా మాజీ బ్యాటర్, దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మనోజ్ ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ తర్వాత... 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో తన అంతర్జాతీయ క్రికెట్ గురించి మాట్లాడిన మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశాడు. తొక్కేశారు! ‘‘2011లో నేను సెంచరీ బాదాను. అయితే, తర్వాతి మ్యాచ్‌లోనే నన్ను తుదిజట్టు నుంచి తప్పించారు. నాపై ఎందుకు వేటు వేశారని ధోనిని అడగాలనుకున్నా! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలా రాణించగల సత్తా నాకుంది. కానీ వాళ్లలా నాకు అవకాశాలు రాలేదు. కానీ.. ఈరోజుల్లో యువ ఆటగాళ్లకు ఎన్నో ఛాన్సులు ఇస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు నా గురించి తలచుకుంటే బాధగా అనిపిస్తుంది’’ అని తివారి ఉద్వేగానికి లోనయ్యాడు. కోల్‌కతా స్పోర్ట్స్' జర్నలిస్టు క్లబ్లో తనకు సన్మానం జరిగిన సమయంలో మనోజ్ తివారి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా.. యువ క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న అతడు.. రంజీ ట్రోఫీ ఆడాల్సిన ఆవశ్యకతను వారు అర్థం చేసుకోవాలని సూచించాడు. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపాడు కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 148 మ్యాచ్‌లు ఆడిన మనోజ్ తివారి.. 10,195 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ లో 169 మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 5581 రన్స్ చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా 183 టీ20లలో 3436 పరుగులు సాధించిన మనోజ్ తివారి.. 2008- 2015 మధ్య కాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 12 వనేడ్లు, 3 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 287, 15 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో మనోజ్ తివారి అత్యధిక స్కోరు 104*. చెన్నైలో వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు స్కోరు సాధించాడు. అయితే, ఆ తదుపరి మ్యాచ్‌లో మాత్రం అతడికి ఆడే అవకాశం రాలేదు. ఇక 38 ఏళ్ల మనోజ్ తివారి బెంగాల్ రాష్ట్ర క్రీడామంత్రి కూడా! చదవండి: IPL All Time Greatest Team: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టు కెప్టెన్‌గా ధోని.. రోహిత్‌కు చోటే లేదు! Few moments bring tears to your eyes, few moments make you emotional... 🙌#GoodByeCricket pic.twitter.com/d4Pd8nSXbZ — MANOJ TIWARY (@tiwarymanoj) February 19, 2024 -
ఒకేసారి ఐదుగురు క్రికెటర్లు రిటైర్మెంట్.. అందులో ధోని ఫ్రెండ్ కూడా!?
భారత దేశీవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2023-24 తుది అంకానికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక టోర్నీ ఎలైట్ గ్రూపు లీగ్ మ్యాచ్‌లు సోమవారంతో ముగిశాయి. ప్రస్తుతం ప్లేట్ గ్రూపు ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్లేట్ గ్రూపు ఫైనల్ మ్యాచ్‌లో మిజోరం, హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. అయితే ఫైనల్ పోరులో హైదరాబాద్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. హైదరాబాద్ విజయానికి ఇంకా 127 పరుగులు కావాలి. ఇక ఇది ఇలా ఉండగా.. నాలుగు ఎలైట్ గ్రూపుల నుంచి మొత్తం 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి మధ్యప్రదేశ్ (32 పాయింట్లు), బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది రంజీట్రోఫీ సీజన్‌తో ఐదుగురు దేశవాళీ టాప్ క్రికెటర్లు రిటైర్ కానున్నారు. వారుఎవరో ఓ లూక్కేద్దం. మనోజ్ తివారీ.. టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. బిహార్‌తో మ్యాచ్ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు తివారీ ముగింపు పలికాడు. తన కెరీర్లో బెంగాల్ తరపున 148 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తివారీ.. 47.86 సగటుతో 10,195 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 30 సెంచరీలు ఉన్నాయి. తివారీ గతంలో భారత జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. ధవల్ కులకర్ణి.. భారత ఫాస్ట్ బౌలర్, ముంబై వెటరన్ పేసర్ ధవల్ కులకర్ణి సైతం డొమాస్టిక్ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ అనంతరం కులకర్ణి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పకోనున్నాడు. తన కెరీర్లో ముంబై తరపున ఇప్పటివరకు 95 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ధవల్.. 281 వికెట్లు పడగొట్టాడు. 2016లో ధోని సారథ్యంలోనే భారత తరపున కులకర్ణి అరంగేట్రం చేశాడు. కులకర్ణికి ధోని నుంచి ఫుల్ సపోర్ట్ కూడా ఉండేది. అయితే తరువాత కులకర్ణి విఫలమకావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఫైజ్ ఫజల్.. టీమిండియా ఓపెనర్, విధర్బ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా హర్యానాతో మ్యాచ్ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఫజల్ తప్పుకున్నాడు. ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 137 మ్యాచ్‌లు ఆడిన ఫజల్.. 24 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో 9,183 పరుగులు చేశాడు. ఇక 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ధోని సారథ్యంలో భారత తరపున ఫజల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సౌరభ్ తివారి.. టీమిండియా వెటరన్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ సౌరభ్ తివారి కూడా ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా రాజస్తాన్‌తో మ్యాచ్ అనంతరం తన 17 ఏళ్ల కెరీర్‌కు విడ్కోలు పలికాడు. సౌరభ్ తివారీ జార్ఖండ్ తరఫున 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. భారత్ తరఫున 3 వన్డేలు కూడా తివారీ ఆడాడు. వరుణ్ ఆరోన్ టీమిండియా ఫాస్ట్ బౌలర్, మరో జార్ఖండ్ క్రికెట్ వరుణ్ ఆరోన్ సైతం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాజస్తాన్‌తో మ్యాచ్ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఆరోన్ తప్పుకున్నాడు. 2008లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన వరుణ్ 65 మ్యాచ్‌లు ఆడి 168 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి. -
శతక్కొట్టిన బెంగాల్ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా అసోం జట్టుపై బెంగాల్ ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని.. ఏకంగా ఇన్నింగ్స్ 162 పరుగుల తేడాతో రియాన్ పరాగ్ సేనను మట్టికరిపించింది. గువాహటి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అసోం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ 405 పరుగులకు ఆలౌట్ అయింది. అనుస్తుప్ మజుందార్(125), కెప్టెన్, బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారి(100) శతకాలకు తోడు.. లోయర్ ఆర్డర్లో కరణ్ లాల్(52), సూరజ్ సింధు జైస్వాల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ మేరకు భారీ స్కోరు నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అసోం.. బెంగాల్ బౌలర్ల దెబ్బకు 103 పరుగులకే చాపచుట్టేసింది. దినేశ్ దాస్(50), సాహిల్ జైన్(40) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 5 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ ఆబ్సెంట్ హర్ట్(0)గా వెనుదిరిగాడు. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(మహ్మద్ షమీ తమ్ముడు) నాలుగు వికెట్లతో చెలరేగగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, అంకిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ అసోంను ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌట్ అయి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈసారి సూరజ్ సింధు జైస్వాల్ 5 వికెట్లతో చెలరేగగా... అంకిత్, కరణ్ లాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈసారీ రియాన్ ఆబ్సెంట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక ఆదివారమే ముగిసిన ఈ మ్యాచ్‌లో బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన సూరజ్ సింధు జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్.. తన అన్నలాగే సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు కాకుండా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది అరంగేట్రం చేసిన అతడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో తనదైన ముద్ర వేయడం విశేషం. చదవండి: శివమ్ దూబే మెరుపు శతకం -
షమీ తమ్ముడి దెబ్బ.. 60 పరుగులకే యూపీ ఆలౌట్! భువీ కూడా తగ్గేదేలే..
Ranji Trophy 2023-24: టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీ-2024 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఈ రైటార్మ్ పేసర్ తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం బెంగాల్‌తో మొదలైన టెస్టులో భువీ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి 1.90 ఎకనామీతో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అరవై పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకున్న యూపీ జట్టుకు కాస్త ఊరట చేకూరేలా తన బౌలింగ్ నైపుణ్యాలతో బెంగాల్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. మహ్మద్ కైఫ్‌నకు నాలుగు వికెట్లు కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మనోజ్ తివారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి దెబ్బకు యూపీ కేవలం 20.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 60 పరుగుల వద్దే చాపచుట్టేసింది. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తమ్ముడు) అత్యధికంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, ఇషాన్ పోరెల్ రెండు వికెట్లు పడగొట్టారు. యూపీ బ్యాటర్లలో ఓపెనర్ సమర్థ్ సింగ్ 13 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. భువీ కూడా తగ్గేదేలే ప్రత్యర్థిని అల్ప స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషంలో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్‌కు భువీ వరుస షాకులు ఇచ్చాడు. ఈ యూపీ బౌలర్ దెబ్బకు ఓపెనర్ సౌరవ్ పాల్ 13, సుదీప్ కుమార్ ఘరామి 0, అనుస్తుప్ మజుందార్ 12, మనోజ్ తివారి 3, అభిషేక్ పోరెల్ 12 పరుగులకే పరిమితమయ్యారు. ఇలా మొదటి రోజు ఆట పూర్తయ్యే సరికి భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు కూల్చగా.. బెంగాల్ బ్యాటర్లు శ్రేయాన్ష్ ఘోష్ 37, కరణ్ లాల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సరికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసిన బెంగాల్ 35 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అన్న షమీ బాటలో తమ్ముడు కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీకి దేశవాళీ క్రికెట్లో సొంత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో బెంగాల్ తరఫున ఎంట్రీ ఇచ్చిన అతడు.. టీమిండియా స్టార్ పేసర్ స్థాయికి ఎదిగాడు. అన్న బాటలోనే నడుస్తున్న తమ్ముడు మహ్మద్ కైఫ్ సైతం ప్రస్తుతం బెంగాల్‌కే ఆడుతున్నాడు. ఇలా ఈరోజు అతడు అత్యుత్తమ ప్రదర్శనతో తన సొంత రాష్ట్రానికి చెందిన యూపీ జట్టును 60 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. మరోవైపు.. చాలా కాలంగా టీమిండియాకు దూరమైన భువనేశ్వర్ కుమార్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. కానీ.. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో షమీ, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్లు.. అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ వంటి జూనియర్లు జట్టులో పాతుకుపోవడంతో భువీకి మొండిచేయే ఎదురవుతోంది. అయితే, తాజా రంజీ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. చదవండి: IND Vs AFG: రోహిత్ రనౌట్.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్ .@BhuviOfficial on fire 🔥 A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0 — BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024 -
టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం..
టీమిండియా క్రికెటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సూచన మెరకు మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ విషయాన్ని తివారి మంగళవారం విలేకరుల సమావేశంలో అధికారింగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా మనోజ్ తివారీ గత గురువారం(ఆగస్టు3)న అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహసిస్ గంగూలీ మాత్రం తన నిర్ఱయాన్ని మార్చుకోవాలని మనోజ్‌ను అభ్యర్దించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లపాటు జట్టులో కొనసాగమని తివారిని గంగూలీ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రెండు గంటల పాటు క్యాబ్ అధికారులతో మనోజ్ చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గత కొన్నేళ్లుగా బెంగాల్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అతడి సారధ్యంలోని బెంగాల్ జట్టు గత రంజీ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. తివారి తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవడంతో మళ్లీ వచ్చే ఏడాది రంజీ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. ఇక మనోజ్ అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు భారత్ తరపున 12 వన్డేలు, మూడు టి20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. కానీ మూడు టి20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్ అవకాశం దక్కగా 15 పరుగులే చేశాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మాత్రం అతడికి మంచి రికార్డు ఉంది. దేశవాళీ క్రికెట్లో 141 మ్యాచ్‌ల్లో 48.56 సగటుతో 9908 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్ పుణేలకు ఆడాడు. చదవండి: రోహిత్ మంచి కెప్టెన్.. కానీ అలా అయితే వరల్డ్‌కప్‌లో కష్టమే: యువరాజ్ -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇన్‌స్టా వేదికగా తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. గత రంజీ సీజన్లో బెంగాల్‌ను ఫైనల్ వరకు చేర్చిన తివారి.. ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దేశవాలీ టోర్నీల్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2008-15 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20 ఆడిన 37 ఏళ్ల తివారి.. సెంచరీ, హాఫ్ సెంచరీ (వన్డేల్లో) సాయంతో 302 పరుగులు చేశాడు. తివారి టీమిండియాకు ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా జట్టుపై తనదైన ముద్ర వేశాడు. 2011లో విండీస్‌తో జరిగిన చెన్నై వన్డేలో సెంచరీ (104 నాటౌట్) చేయడం ద్వారా తివారి గుర్తింపు తెచ్చుకున్నాడు. తివారి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి 2018 వరకు ఆడిన తివారి.. 98 మ్యాచ్‌ల్లో 7 అర్ధసెంచరీల సాయంతో 117 స్ట్రయిక్‌రేట్‌తో 1695 పరుగులు చేశాడు. తివారి ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్లకు ఆడాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నాను. కష్టకాలంలో క్రికెట్ నన్ను అన్ని విధాల ఆదుకుంది. నేను కలలో కూడా ఊహించనివి ఇచ్చింది. ఈ ఆటకు ఎంతో రుణపడి ఉన్నాను. అన్ని సందర్భాల్లో తనతో ఉన్న దేవుడికి కృతజ్ఞుడనై ఉంటాను అంటూ తివారి తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by MANOJ TIWARY (@mannirocks14) -
ఉనద్కత్ ఉగ్రరూపం.. రంజీ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర అవతరించింది. గత మూడో సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండో సారి. 2019-20 సీజన్లో సైతం జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గత నాలుగు రోజులుగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర.. లోకల్ టీమ్ బెంగాల్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆఖరి రోజు (ఫిబ్రవరి 19) లోకల్ హీరో, బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (68) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. That Winning Feeling 🏆 😊 Congratulations to the @JUnadkat-led Saurashtra on their #RanjiTrophy title triumph 🙌 🙌 #BENvSAU | #Final | @saucricket | @mastercardindia Scorecard 👉 https://t.co/hwbkaDeBSj pic.twitter.com/m2PQKqsPOG — BCCI Domestic (@BCCIdomestic) February 19, 2023 ఉనద్కత్ ఉగ్రరూపం దాల్చడంతో బెంగాల్ టీమ్ చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్‌కు జతగా చేతన్ సకారియా (3/76) కూడా రాణించడంతో సౌరాష్ట్ర.. బెంగాల్‌ను సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. కేవలం 2.4 ఓవర్లలో జై గోహిల్ (0) వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జై వికెట్‌ను ఆకాశ్‌దీప్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర.. తొలుత బెంగాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఉనద్కత్ (3/44), చేతన్ సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), డి జడేజా (2/19) చెలరేగడంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ ఆహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వసవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీలతో రాణించడంతో 404 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ తలో 3 వికెట్లు పడగొట్టారు. 230 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌటైంది. మజుందార్ (61), మనోజ్ తివారి (68) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉనద్కత్ (6/85), సకారియా (3/76) బెంగాల్ పతనాన్ని శాశించారు. 12 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర.. వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. -
Manoj Tiwary: పుష్ప డైలాగ్ కొట్టాల్సింది కాదు!
కోల్‌కతా: సినిమా డైలాగులు పేల్చడం రాజకీయ నాయకులకు ఈమధ్య బాగా అలవాటైంది. అయితే పంచ్ కోసం పేలుస్తున్న ఆ డైలాగులు.. ఒక్కోసారి బెడిసి కొడుతున్నాయి కూడా. తృణమూల్ కాంగ్రెస్ నేత మనోజ్ తివారీ తాజాగా అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలోంచి కొట్టిన డైలాగ్.. బీజేపీకి బాగా కోపం తెప్పించింది. మొత్తం బెంగాల్ ప్రభుత్వం తీరే పుష్ప సినిమాలాగా ఉంది. ఎర్ర చందనపు స్మగర్ల సినిమాలో ఏవో డైలాగులు కొడితే.. ఇక్కడి టీఎంసీ నేత కూడా అలాగే డైలాగులు కొడుతున్నాడు. ఒకరేమో యువత హక్కులను దోచుకుంటున్నారు. మరొకరేమో స్కామ్‌లు చేసి వాళ్ల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. టీఎంసీ నేతల తీరు.. ఆ సినిమాలోని ఎర్ర చందనపు స్మగ్లర్లలాగే ఉంది. వాళ్లతో పాటు ఆ పార్టీ ఒరిజినల్ క్యారెక్టర్లను బయటపెడుతోంది అంటూ బీజేపీ నేత ఉమేశ్ రాయ్ మండిపడ్డారు. క్రికెటర్ నుంచి రాజకీయ నేత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా ఎదిగిన మనోజ్ తివారీ.. ఆదివారం ఓ ర్యాలీలో పార్టీ కార్యకర్తలంతా సంఘటితంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ సాలా' (తెలుగులో నీయవ్వ.. తగ్గేదే లే) అంటూ బీజేపీకి సవాల్ విసిరాడు. ఈ వ్యాఖ్యలపైనే బీజేపీ భగ్గుమంది. అయితే.. ర్యాలీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మీడియా ప్రతినిధులు ఆయన తీరును ప్రశ్నించారు. దీంతో ఆయన నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. ఆ డైలాగ్ కొట్టాల్సింది కాదు అని తివారీ క్షమాపణలు చెప్పారు. -
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన బెదిరిస్తున్నారని, తివారీ హెచ్చరికలు చూస్తుంటే కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరగుతున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఆయనను ఏమీ చెయ్యలేక హత్య చేయాలనుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌పై ఎవరైనా దాడి చేయవచ్చని తివారీ అన్న మాటలకు అర్థమేంటని సిసోడియా ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, పోలీసు కేసు కూడా పెడతామని పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు మనోజ్ తివారీ ఈ ఆరోపణలను ఖండించారు. ఎన్నికల్లో ఆప్ టికెట్లు అమ్ముకుందని ఆరోపించారు. ఆప్ నేత సందీప్ భరద్వాజ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆయన మరణానికి కారణాలేంటో వెలికి తీయాలన్నారు. చదవండి: గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని
బెంగాల్ క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారి ఈ ఏడాది రంజీ ట్రోపీలో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ముఖ్యంగా జార్ఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో.. ఆపై మధ్య ప్రదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తివారి సెంచరీలతో కథం తొక్కాడు. అయితే బెంగాల్ ప్రదర్శన సెమీస్‌తోనే ముగిసింది.మనోజ్ తివారి టీమిండియా తరపున 12 వన్డేల్లో 287 పరుగులు, 3 టి20ల్లో 15 పరుగులు చేశాడు. ఇక 23 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన మధ్య ప్రదేశ్.. ముంబైతో అమితుమీ తేల్చుకోనుంది. రంజీల్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన మనోజ్ తివారి బెంగాల్ రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాగే రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఇటీవలే మనోజ్ తివారిని ఒక చానెల్ ఇంటర్య్వూ చేసింది. మంత్రిగా ఉంటూనే ఆటను ఎలా బ్యాలెన్స్ చేశారని ప్రశ్నించగా.. తన డ్యుయల్ రోల్‌పై మనోజ్ తివారి ఆసక్తికరంగా స్పందించాడు. ''ఒక రాష్ట్రానికి మంత్రిని కావొచ్చు.. కానీ టైంను మేనేజ్ చేసుకుంటే రెండు పనులు ఒకసారి చేయొచ్చనేది నా మాట. రంజీలో అడుగుపెట్టడానికి ముందే నా నియోజకవర్గంలో ఒక టీంను ఏర్పాటు చేసుకున్నా. వారితో నా ప్రజల సమస్యలకు సంబంధించిన పేపర్ వర్క్‌ను నేను ఉంటున్న హోటల్ రూంకు తెప్పించుకునేవాడిని. ఇలా పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గ పనులు పూర్తి చేసి తిరిగి పేపర్ వర్క్‌ను కొరియర్ ద్వారా పంపించేవాడిని. ఇక క్రీడాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నాకు అదనంగా మరొక మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. రంజీ క్రికెట్ ఆడినన్ని రోజులు ఆయన.. నేను చేయాల్సిన పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక బెంగాల్ క్రికెట్ కూడా నాకు అండగా నిలబడింది. జట్టు ఆటగాళ్లు కూడా ఒక మంత్రిగా కాకుండా తమలో ఒక ఆటగాడిగా చూస్తూ చక్కగా సహకరించారు. కొన్నిసార్లు రాత్రిళ్లు ఎమర్జెన్సీ ఫోన్‌కాల్స్ వచ్చినప్పుడు నాతో పాటు ఉన్న తోటి క్రికెటర్లు పరిస్థితిని అర్థం చేసుకునేవారు. వ్యక్తిగత జీవితంలో నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంది. నాలుగేళ్ల నా బిడ్డను.. ఇంటికి సంబంధించిన పనులను స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది. ఆమె చేసేది చిన్న పనే కావొచ్చు.. కానీ నా దృష్టిలో అది చాలా గొప్పది. ఇక బెంగాల్‌కు రంజీ ట్రోపీ అందించాలనే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగాను. సెమీ ఫైనల్ వరకు ఈసారి కప్ మాదే అనే ధీమా కలిగింది. కానీ అనూహ్యంగా మా ప్రదర్శన సెమీస్‌తోనే ముగిసింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు! బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్‌కు హక్కు ఉంటుందా? -
క్రీడా మంత్రి పోరాటం వృధా.. భారీ ఆధిక్యం దిశగా మధ్యప్రదేశ్
Bengal Vs Madhya Pradesh 1st Semi Final: రంజీ ట్రోఫీ 2022 సీజన్లో బెంగాల్ పోరాటం ముగిసేలా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకే ఆలౌట్ కావడంతో ప్రత్యర్ధికి 68 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బెంగాల్‌ను సీనియర్ ఆటగాడు, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (211 బంతుల్లో 12 ఫోర్లతో 102), బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ (209 బంతుల్లో 12 ఫోర్లతో 116) శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ అద్భుతమైన పోరాటపటిమను కనబర్చి బెంగాల్‌ను తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ ఔటవ్వడంతో బెంగాల్ లీడ్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ను.. రజత్ పాటిదార్ (63 నాటౌట్), కెప్టెన్ ఆధిత్య శ్రీవత్సవ (34 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి 231 పరుగుల ఓవరాల్ ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు ఆటలో మధ్యప్రదేశ్ మరో 150, 200 పరుగులు చేసినా, తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ఫైనల్‌కు చేరుకుంటుంది. స్కోర్ వివరాలు: మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 341 ఆలౌట్ బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 273 ఆలౌట్ మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్ 163/2 చదవండి: న్యూజిలాండ్ జట్టులో కల్లోలం.. మరో స్టార్ క్రికెటర్‌కు కరోనా -
మరో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. గట్టెక్కడం కష్టమే
రంజీ ట్రోపీ 2022 సీజన్లో బెంగాల్ క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారి మరో సెంచరీతో మెరిశాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్ పోరులో మనోజ్ తివారి కీలక సమయంలో శతకం సాధించాడు. 12 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించిన మనోజ్ తివారి.. శతకం అందుకున్న వెంటనే 102 పరుగుల వద్ద శరన్ష్ జైన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మనోజ్ తివారీకి సహకరించిన షాబాజ్ అహ్మద్ కూడా సెంచరీతో మెరవడం విశేషం. 209 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 116 పరుగులు చేసిన షాబాజ్ అహ్మద్ ఔట్ కాగానే బెంగాల్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మధ్యప్రదేశ్‌కు 68 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్యప్రదేశ్ ఒక వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. చదవండి: '14 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ను జయించి.. అరంగేట్రంలోనే సెంచరీతో -
మరో శతకం దిశగా దూసుకెళ్తున్న క్రీడా మంత్రి
రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు ఎదురీదుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన బెంగాల్‌ను సీనియర్ ఆటగాడు, రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (84 నాటౌట్), బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ (72 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌ను అబేధ్యమైన 143 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 341 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్‌కీపర్, బ్యాటర్ హిమాన్షు మంత్రి (165) మధ్యప్రదేశ్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ ఇంకా 144 పరుగులు వెనుక పడి ఉంది. మధ్యప్రదేశ్ బౌలర్లు కుమార్ కార్తీకేయ (2/43), పూనీత్ దాటే (2/34) బెంగాల్‌ను దారుణంగా దెబ్బ తీశారు. మరో శతకం దిశగా దూసుకెళ్తున్న బెంగాల్ క్రీడా మంత్రి ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మైదానంలోనూ సత్తా చాటుతున్నాడు బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి. జార్ఖండ్‌తో జరిగిన తొలి క్వారర్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (73), రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (136) బాదిన తివారి.. తాజాగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌లోనూ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ మరో శతకం దిశగా దూసుకెళ్తున్నాడు. అతనికి మరో ఎండ్‌లో షాబాజ్ అహ్మద్ సహకరిస్తున్నాడు. వీరిద్దరు మూడో రోజు కూడా ఇదే ఫామ్‌ను కొనసాగించి మధ్యప్రదేశ్‌పై ఆధిక్యం సాధించగలిగితే, తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా బెంగాల్ ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో ముంబై-ఉత్తర్ ప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. చదవండి: భారత టీ20 జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా -
రంజీలో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. సెమీఫైనల్‌కు బెంగాల్
రంజీట్రోపీ 2022లో భాగంగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. జూన్ 14-18 మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్లో బెంగాల్, మధ్యప్రదేశ్‌లు అమితుమీ తేల్చుకోనున్నాయి. మరో సెమీఫైనల్లో ముంబై, ఉత్తర్ ప్రదేశ్ తలపడనున్నాయి. కాగా ఆటకు శుక్రవారం ఆఖరి రోజు కాగా.. ఫలితం వచ్చేలా కనబడకపోవడంతో గంట ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. టీమిండియా క్రికెటర్.. బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి సూపర్ సెంచరీతో మెరిశాడు.129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను మనోజ్ తివారి తన ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. 152 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అభిషేక్ పోరెల్(34) పరుగులతో కలిసి ఐదో వికెట్‌కు అమూల్యమైన 92 పరుగులు జోడించాడు. ఆ తర్వాత షాబాజ్ అహ్మద్(46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. ఓవరాల్‌గా మనోజ్ తివారి 185 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగులు చేశాడు. అంతకముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌ను 773 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్‌కు 475 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. చదవండి: రంజీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు -
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్.. బెంగాల్ జట్టు ప్రపంచ రికార్డు
రంజీ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఫీట్ చోటుచేసుకుంది. జట్టులో ఉన్న టాప్-9 మంది ఆటగాళ్లు కనీసం హాఫ్ సెంచరీతో మెరిశారు. బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బుధవారం ఈ అద్భుతం జరిగింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో టాప్-9 మంది బ్యాటర్స్ ఒకే ఇన్నింగ్స్‌లో కనీసం అర్థసెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకముందు 1893లో ఆస్ట్రేలియాకు చెందిన 8 మంది బ్యాటర్లు ఆక్స్ఫర్డ్ అండ్ కేమ్బ్రిడ్జ్ యునివర్సిటీ జట్టుపై అర్థసెంచరీలు సాధించారు. ఈ 8 మంది వరుసగా టాప్-8 బ్యాటర్స్ మాత్రం కాదు. కానీ తాజాగా బెంగాల్ జట్టు మాత్రం ఈ విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. బెంగాల్ జట్టులో వరుసగా తొమ్మిది మంది బ్యాటర్స్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్ సాధించారు. ఈ తొమ్మిది మందిలో సుదీప్ గరామీ(380 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 186 పరుగులు), అనుస్తుప్ మజుందార్(194 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 117 పరుగులు) సెంచరీలతో మెరవగా.. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 65, మరో ఓపెనర్ అభిషేక్ రమణ్ మొదట 41 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మజుందార్ ఔటైన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 61 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఐదో స్థానంలో వచ్చిన ఎంపీ మనోజ్ తివారి 73 పరుగులతో ఆకట్టుకోగా.. వికెట్ కీపర్ అభిషేక్ పొరేల్ 68 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్‌లో చివరి వికెట్‌గా వెనుదిరిగిన షాబాజ్ అహ్మద్ 78 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిదో స్థానంలో వచ్చిన మోండల్ 53 నాటౌట్, ఆకాశ్‌దీప్( 18 బంతుల్లో 8 సిక్సర్లతో 53 పరుగులు) టి20 తరహాలో అలరించాడు. ఇలా తొమ్మిది మంది బ్యాటర్లు కనీసం హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో బెంగాల్ జట్టు 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జార్ఖండ్ 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ సౌరబ్ తివారీ 25, విరాట్ సింగ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ నిజామ్ సిద్దికీ 53 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్ కుమార్ డియోబ్రాత్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చదవండి: Ranji Trophy 2022: నమ్మశక్యం కాని క్యాచ్.. వీడియో వైరల్ రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర; ఎవరీ సువేద్ పార్కర్ Bengal Creates History!#Cricket #FirstClassCricket #Bengal #RanjiTrophy pic.twitter.com/BN8gziQNrB — CRICKETNMORE (@cricketnmore) June 8, 2022 -
రాహుల్ కాదు, పంత్ కాదు.. టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే..!
Manoj Tiwary: టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరనే అంశంపై బెంగాల్ క్రీడా మంత్రి, మాజీ టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు(పరిమిత ఓవర్లు) పగ్గాలు చేపట్టే అర్హత హార్ధిక్ పాండ్యాకు మాత్రమే ఉందని సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌కు కాని, భవిష్యత్తు టీమిండియా కెప్టెన్‌గా ఫోకస్ అవుతున్న రిషబ్ పంత్‌కు కాని సారధ్య బాధ్యతలు దక్కే అవకాశం లేదని, ప్రస్తుత ఐపీఎల్లో కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడి గానూ అద్భుతంగా రాణిస్తున్న హార్ధిక్ పాండ్యాకే మెరుగైన అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో హార్ధిక్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్ (87, వికెట్)తో చెలరేగడాన్ని ఇందుకు ఉదహరిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. మున్ముందు హార్ధిక్ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తాడని, గుజరాత్ కెప్టెన్‌గా అతని వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయని, ఈ లక్షణాలే అతన్ని రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ను చేస్తాయని జోస్యం చెప్పాడు. మొత్తంగా ఐపీఎల్లో హార్ధిక్ ప్రదర్శనకు ఫిదా అయ్యానని ట్విటర్ వేదికగా గుజరాత్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. చదవండి: IPL 2022: ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆటగాళ్లంతా సేఫ్..! -
మీతో కాకపోతే చెప్పండి.. నేనొస్తా..! సన్‌రైజర్స్, లక్నో జట్లకు బెంగాల్ మంత్రి ఆఫర్
Manoj Tiwary: క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగక ముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాష్ట్ర మంత్రిగా మారిన టీమిండియా మాజీ ఆటగాడు మనోజ్ తివారి క్రమం తప్పకుండా క్రికెట్‌ను ఫాలో అవుతూ, దానికి సంబంధించిన అప్డేట్స్తో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తాజాగా (ఏప్రిల్ 4) ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌కు ముందు మనోజ్ తివారి ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. Still available 😊 #LSGvSRH — MANOJ TIWARY (@tiwarymanoj) April 4, 2022 ఇంకా అందుబాటులోనే ఉన్నా (స్టిల్ అవైలబుల్) అంటూ ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ జట్లను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. మనోజ్ ట్వీట్‌ను బట్టి చూస్తే.. మీతో కాకపోతే చెప్పండి.. ఇప్పుడు రమ్మన్నా వస్తా..! అంటూ సదరు ఫ్రాంచైజీలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మంత్రి గారు ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అతనిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. తివారి 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శివ్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. ఆల్‌రౌండర్ ఆయిన తివారి 2008-15 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 302 పరుగులు, 5 వికెట్లు సాధించాడు. వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. తివారి ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 98 మ్యాచ్‌ల్లో 1695 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. కేఎల్ రాహుల్ (68), దీపక్ హుడా (51) అర్ధ శతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేదనలో ఆవేశ్ ఖాన్ (4/24), జేసన్ హెల్డర్ (3/34), కృనాల్ పాండ్యా (2/27) ధాటికి ఎస్ఆర్హెచ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్ త్రిపాఠి 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: శ్రీలంకలో ఎమర్జెన్సీ.. నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న క్రికెటర్లు -
IPL 2022 Auction: మెగా వేలం బరిలో రాష్ట్ర మంత్రి
బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఓ రాజకీయ ప్రముఖుడు షార్ట్ లిస్ట్ కావడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి, మాజీ టీమిండియా ఆటగాడు మనోజ్ తివారి వేలంలో తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. 36 ఏళ్ల మనోజ్ తివారి రూ.50 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో వేలం బరిలోని నిలిచాడు. తివారి 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శివ్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. కుడి చేతి మిడిలార్డర్ బ్యాటర్, లెగ్ స్పిన్ బౌలర్ ఆయిన తివారి 2008-15 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 302 పరుగులు, 5 వికెట్లు సాధించాడు. తివారి వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. తివారికి టీమిండియా తరఫున పెద్దగా అవకాశాలు లభించనప్పటికీ ఐపీఎల్లో మాత్రం దాదాపు 10 ఏళ్ల రెగ్యులర్‌గా కొనసాగాడు. అతను 2008-18 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 98 మ్యాచ్‌ల్లో 117 స్ట్రయిక్ రేట్లో 1695 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 మెగా వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. వీరిలో ప్రస్తుతం అండర్-19 వరల్డ్‌కప్ ఆడుతున్న భారత కుర్రాళ్లతో పాటు పలువురు దేశీయ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొంటున్న వారిలో సౌతాఫ్రికా వెటరన్ ప్లేయర్ ఇమ్రాన్ తాహీర్(42) అతి పెద్ద వయస్కుడు కాగా, అఫ్ఘాన్ ప్లేయర్ నూర్ అహ్మద్(17) అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు. ఈసారి వేలంలో వీరితో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(20 లక్షల బేస్ ప్రైజ్), సౌతాఫ్రికా యంగ్ సెన్సేషన్, ‘బేబీ ఏబీడీ’ డివాల్డ్ బ్రేవిస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలువనున్నారు. చదవండి: IPL 2022 Auction: మెగా వేలంలో పాల్గొనబోయేది వీళ్లే: బీసీసీఐ -
అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్
టీమిండియా సెలక్టర్ల తీరును టీమిండియా వెటరన్ ఆటగాడు, పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారి తప్పుబట్టారు. అసలు కేఎల్ రాహుల్‌లో ఏ లక్షణాలు చూసి అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేశారని మండిపడ్డారు. కాగా ఇటీవల టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో విరాట్ కోహ్లిని తప్పించి.. వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు గాయపడటంతో... వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమిండియాకు ఎంతటి ఘోర పరాభవం ఎదురైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రొటిస్ చేతిలో ఏకంగా 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఈ నేపథ్యంలో రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం అతడి నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పోర్ట్స్‌కీడాతో ముచ్చటించిన మనోజ్ తివారి సైతం ఈ విషయంపై స్పందించారు. నాయకుడిని తయారు చేయడం కాదని, అతడిలో సహజంగా ఆ లక్షణాలు ఉండాలంటూ చురకలు అంటించారు. సెలక్టర్ల తీరు సరిగా లేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... ‘‘అసలు రాహుల్‌లో కెప్టెన్సీ మెటీరియల్ మీకేం కనిపించింది? భవిష్యత్తు కెప్టెన్‌ను తయారు చేస్తున్నాం అంటారు. కెప్టెన్సీ సహజసిద్ధంగా అలవడాలి. వాళ్లు చెప్పినట్లు సారథిని తయారు చేయడం సాధ్యమే. కానీ... ఆ ప్రక్రియ అంత సులభమేమీ కాదు. అందుకు చాలా సమయం పడుతుంది. కనీసం 20 నుంచి 25 మ్యాచ్‌లు ఆడిన తర్వాత గానీ... స్వతహాగా నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అయినా కూడా కెప్టెన్‌గా విజయం సాధిస్తారన్న గ్యారెంటీ లేదు. ఇండియాకు ప్రతి అంతర్జాతీయ ముఖ్యమే కదా! అలాంటపుడు ఇలాంటి రిస్క్ ఎందుకు?’’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఐపీఎల్లో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ రికార్డును మనోజ్ తివారి పరోక్షంగా ప్రస్తావించారు. కాగా పంజాబ్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరించిన రాహుల్ జట్టును కనీసం ప్లేఆఫ్స్‌నకు కూడా చేర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో... ‘‘మనకు మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయాం. సెలక్టర్ల తప్పుడు నిర్ణయాల వల్లే ఇంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వారి తీరు నిరాశ పరిచింది. కెప్టెన్‌గా రాహుల్ నిరూపించుకున్నది లేదు. అయినా... అతడిలో ఏ లక్షణాలు చూసి సారథ్య బాధ్యతలు అప్పగించారో అర్థం కావడం లేదు. సెలక్టర్ల నిర్ణయం నిజంగా నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది’’ అని మనోజ్ తివారి పేర్కొన్నారు. ఇక టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. చదవండి: Ravi Bishnoi: ఐపీఎల్లో 4 కోట్లు... ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టులో చోటు.. అదిరిందయ్యా రవి.. అంతా ఆ దిగ్గజ క్రికెటర్ వల్లే! -
రంజీ జట్టులో రాష్ట్ర మంత్రి..
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో పాల్గొనే 22 మంది సభ్యుల బెంగాల్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో వెటరన్ ఆటగాడు, బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారీకు చోటు దక్కింది. రాజకీయ అరంగేట్రం చేసిన ఏడాది లోపే జట్టులోకి రావడం గమనార్హం. తివారీ తన చివరి మ్యాచ్‌ను గత రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరష్ట్రాపై ఆడాడు. ఇక రంజీ ట్రోఫీలో భాగంగా జనవరి 13న బెంగాల్ తమ తొలి మ్యాచ్‌లో త్రిపురతో తలపడనుంది. అయితే జట్టులో 7గురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో బెంగాల్ శిబిరంలో గందరగోళం నెలకొంది. బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (సి), మనోజ్ తివారీ, సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ రామన్, సుదీప్ ఘరామి, అభిషేక్ దాస్, రిత్టిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, అభిషేక్ పోరెల్, షాబాజ్ అహ్మద్, సయన్ శేఖర్ దేరెప్, సయన్ శేఖర్ దేరెప్, ఐ. కాజీ జునైద్ సైఫీ, సకీర్ హబీబ్ గాంధీ, ప్రదీప్త ప్రమాణిక్, గీత్ పూరి, నీలకంఠ దాస్ మరియు కరణ్ లాల్. చదవండి: Nz Vs Ban 1st Test: అత్యంత చెత్త రివ్యూ ఇదే... అనవసరంగా.. -
క్రీడా శాఖ మంత్రిగా మనోజ్ తివారి
మాజీ క్రికెటర్ మనోజ్ తివారికి కొత్తగా ఏర్పడిన బెంగాల్ కేబినెట్లో చోటు దక్కింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అతను ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్ చేశాడు. తివారి శివ్పూర్ నియోజకవర్గంనుంచి విజయం సాధించాడు. భారత్ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారి... 16 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 50.36 సగటుతో 8965 పరుగులు చేశాడు. 2012లో ఐపీఎల్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో మనోజ్ తివారి కూడా సభ్యుడు. -
కంగనాకు బాసటగా బెంగాల్ బ్యాట్స్‌మన్
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో తీవ్రస్థాయిలో వివాదాలు నెలకొంటున్నాయి. ఇండస్ట్రీలోని నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ వివాదం మరింత ముదిరింది. ఆమె వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఖండిస్తుండగా మరికొందరు ఆమెకు మద్దతునిస్తున్నారు. తాజాగా ఆమెకు మద్దతు పలికే వారిలో బెంగాల్ క్రికెటర్ కూడా చేరాడు. బ్యాట్స్‌మన్ మనోజ్ కుమార్ తివారి ట్విటర్ వేదికగా కంగనాకు మద్దతు నిచ్చాడు. బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘భారతదేశం సుశాంత్ మృతికి కారణం తెలుసుకోవాలని అనుకుంటోందని పేర్కొన్నాడు. (చదవండి: ‘నటించమని ఎవరూ బెదిరించలేదు కదా’) #Kangana Vs rest will go on forever but let's hope d focus is not shifted to other subjects. Conveniently people woke up from sleep and started attacking #Kangana only after she came out openly. Y can't they keep their mouth shut if they cant support her #IndiaWantsSushantTruth — MANOJ TIWARY (@tiwarymanoj) July 21, 2020 ‘సుశాంత్ మృతిపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతి ఒక్కరూ ఆమెపై దాడి చేస్తున్నారు. అయితే అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలని. మనం చేసిన కర్మ ఎప్పటికైనా తిరిగి మన వద్దకే వచ్చి చేరుతుంది’ అంటూ #IndiaWantsSushantTruth అనే హ్యష్ ట్యాగ్‌ను జత చేశాడు. మరో ట్వీట్లో ‘‘తనపై దాడి చేసే వారిపై కంగనా పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. ఇతర విషయాలపైకి మళ్ళకుండా కంగనా ఇలాగే పోరాటం కొనసాగించాలని ఆశిస్తున్నా. కంగనా దీనిపై నోరు విప్పినందుకే ఆమెపై దాడులు జరుగుతున్నాయని అయితే ఆమెకు మద్దతు ఇవ్వకపోతే నోరు మూసుకుంటారా’’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. అంతకు ముందు కూడా తివారి, సుశాంత్ ఫొటోని షేర్ చేస్తూ ‘‘చివరికి శత్రువు మాటలను కాదు, స్నేహితుల నిశ్శబ్దాన్ని గుర్తుంచుకుంటాం’’ అంటూ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలను ఉటంకించాడు. (చదవండి: కంగనాకు సమీర్ సోని కౌంటర్) ”In the end, V will remember not the words of our Enemy, but the SILENCE of our friends.” Martin Luther King Jr. So so relevant in his case 👍#sushantsinghrajputdeath #SushantInOurHeartsForever pic.twitter.com/RDkon0HgJr — MANOJ TIWARY (@tiwarymanoj) July 17, 2020 -
మీకేంత ధైర్యం.. విమర్శకులపై సుస్మిత ఫైర్
కోల్కత్తా : క్రికెటర్ మనోజ్ తివారీపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై అతని భార్య సుస్మితా రాయ్ మండిపడ్డారు. తన భర్తను విఫలమైన క్రికెటర్‌గా పేర్కొనడంపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడానికి ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. టీమిండియాలో విఫలమైన ఆటగాళ్లు వీళ్లేనంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది. అందులో మనోజ్ తివారీ పేరు కూడా ఉంది. తాజాగా ఈ పోస్ట్‌పై స్పందించిన సుస్మిత అందుకు సంబంధించిన క్లిప్‌ను షేర్ చేశారు. తన భర్త పేరును ఆ జాబితాలో చేర్చడానికి ఎంత ధైర్యం అని ప్రశించారు. ఇటువంటి అర్థం లేని పోస్ట్‌లు క్రియేట్ చేసే ముందు నిజాలు చెక్ చేసుకోవడం మంచిదని హెచ్చరించారు. ఇతరుల గురించి చెడు ప్రచారం చేసే బదులు.. ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలని హితవు పలికారు. కాగా, 2008లో టీమిండియాలో స్థానం దక్కించుకున్న తివారీ.. తన కేరీర్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొత్తంగా టీమిండియా తరఫున కేవలం 12 వన్డేలు, 3 టెస్టులు మాత్రమే ఆడారు. మరోవైపు ఐపీఎల్ విషయానికి వస్తే.. 2012లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు. 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో తివారీని పంజాబ్ జట్టు దక్కించుకోగా.. 2019లో మాత్రం అతడికి నిరాశే మిగిలింది. ఇక, దేశవాలీ క్రికెట్‌కు సంబంధించి బెంగాల్ జట్టులో తివారీ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. ఇటీవల బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరడంలో తివారీ కీలక భూమిక పోషించారు. 11 మ్యాచ్‌ల్లో 707 పరుగులు సాధించారు. మళ్లీ తిరిగి సత్తా చాటడానికి తివారీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. సుస్మిత కూడా తన భర్తకు చాలా మద్దతుగా నిలుస్తున్నారు. (చదవండి : ఏది ఏమైనా వదలడు.. కుంబ్లేపై లక్ష్మణ్ ప్రశంసలు) View this post on Instagram Who so ever created dis profile How dare u bloody dragged my husband’s name in it. U better do ur bloody facts check. Do something in ur shit ugly life rather dan posting shit about people. Go n get a life 👎🏻👊 A post shared by 𝕾𝖚𝖘𝖒𝖎𝖙𝖆𝕽𝖔𝖞𝕿𝖎𝖜𝖆𝖗𝖞 (@roy_susmita7) on May 31, 2020 at 1:01pm PDT -
నన్ను అవమానించారు.. లేదు మనోజ్!
కోల్‌కతా: ఎనిమిదేళ్ల క్రితానికి సంబంధించిన మధుర స్మృతులను గుర్తుచేస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) చేసిన ట్వీట్ వివాదస్పదమైంది. ఐపీఎల్-12 ట్రోఫీని కేకేఆర్ ముద్దాడి నిన్నటికి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రతి నైట్‌రైడర్స్ మనసును తాకిన రాత్రి. తొలిసారి అందుకున్న ట్రోఫీ ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో మధురానుభూతులను మిగిల్చింది. మరి మీ జ్ఞాపకాలేంటి?’ అని ప్రశ్నిస్తూ మాజీ సారథి గౌతమ్ గంభీర్, బ్రెండన్ మెకల్లమ్, సునీల్ నరైన్, బ్రెట్‌లీలను కేకేఆర్ ట్యాగ్ చేసింది. ఈ ట్వీట్‌పై కేకేఆర్‌కు చెందిన అప్పటి ఆటగాడు మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అందరితో పాటు.. ఆ రోజుతో నాకు ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఈ ట్వీట్లో నన్ను, షకీబుల్‌హసన్‌ను ట్యాగ్ చేయకపోవడం మమల్ని అవమానించినట్టే. మా పేర్లను మరిచిపోవడం నాకు బాధను కలిగించింది’ అంటూ మనోజ్ తివారీ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై స్పందించిన కేకేఆర్ ‘అలా కాదు మనోజ్.. నీలాంటి స్పెషలిస్టు ప్లేయర్‌ను మేమెలా మర్చిపోతాం. ఐపీఎల్-2012 ట్రోఫీని కేకేఆర్ గెలుచుకోవడంలో నువ్ కీలక పాత్ర పోషించావు, నువ్వే మా హీరోవి’ అంటూ బదులిచ్చింది. (మురళీ విజయ్ హీరో అయిన వేళ!) ఇక ఐపీఎల్-2012లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో కేకేఆర్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకొని తొలిసారి ట్రోఫీని అందుకుంది. నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ సీజన్లో మనోజ్ 15 ఇన్నింగ్స్‌ల్లో 260 పరుగులతో రాణించాడు. ఇక ఐపీఎల్ 2020 సీజన్ కోసం జరిగిన వేలంలో మనోజ్ తివారీ ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చినా ఎవరూ ఆసక్తికనబర్చకపోవడం గమనార్హం. (ధోని రిటైర్మెంట్పై సాక్షి ట్వీట్.. డిలీట్) Yes I, along with others have too many memories, emotions and that will remain forever but after seeing this tweet where u all forgot to mention n tag me and @Sah75official is insulting and this mrng tweet of urs will remain close to every knight Rider’s 💓 #disappointed https://t.co/FF53pqP1pE — MANOJ TIWARY (@tiwarymanoj) May 27, 2020 No way, Manoj 🙂 We would never miss tagging such a special 'knight' to our special night. You were, and always be a hero of that 2012 victory 💜 pic.twitter.com/0D0KgUDeGq — KolkataKnightRiders (@KKRiders) May 27, 2020 -
‘నన్ను ఎందుకు తీశావని ధోనిని అడగలేదు’
న్యూఢిల్లీ: టీమిండియా తరఫున తాను సెంచరీ చేసిన తర్వాత వరుసగా పధ్నాలుగు మ్యాచ్‌ల్లో రిజర్వ్ బెంచ్‌లో కూర్చోబెట్టిన విషయాన్ని వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారీ గుర్తు చేసుకున్నాడు. ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన తర్వాత రిజర్వ్ బెంచ్‌లో ఉంటానని అనుకోలేదన్నాడు. అప్పటి టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంతోనే తనకు వరుస మ్యాచ్‌ల్లో చోటు దక్కలేదన్నాడు. తనను ఎందుకు తీశావనే విషయాన్ని ఇప్పటివరకూ ధోని అడగలేదన్నాడు. 2011 వరల్డ్‌కప్‌కు జట్టును సమయాత్తం చేసే క్రమంలో అలా చేశాడని అతని నిర్ణయాన్ని గౌరవించానన్నాడు. (ఐసీసీ ట్రోల్స్‌పై అక్తర్ సీరియస్ రియాక్షన్) మరొకవైపు ధోని ప్రశ్నించే ధైర్యం తనకు లేకపోవడం కూడా ఒక కారణమన్నాడు. 2008లో అరంగేట్రం చేసిన మనోజ్ తివారీ.. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి జట్టు విజయంలో భాగమయ్యాడు. ఆ తర్వాత వరుసగా 14 మ్యాచ్‌ల్లో తివారీ ఆడే అవకాశం రాలేదు. 2012లో మళ్లీ అవకాశం వచ్చిన తివారీ ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో 21 పరుగులు సాధించిన తివారీని రెండు సంవత్సరాలు పక్కన పెట్టేశారు. 2015లో భారత్ తరఫున చివరిసారి కనిపించాడు. ‘విండీస్‌పై సెంచరీ సాధించడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కానీ ఆ తర్వాత 14 మ్యాచ్‌ల్లోనూ నాకు తుది జట్టులో అవకాశం లభించలేదు. అయినప్పటికీ నేను అప్పటి కెప్టెన్ ధోనిని ప్రశ్నించలేదు. కెప్టెన్, కోచ్, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాల్ని అప్పుడు గౌరవించాలనే ఆలోచనతో అడగలేకపోయా. ఆ మ్యాచ్‌లకు టీమ్ సమతూకం అలా ఉండాలని వారు నిర్ణయించారు. నాపై వేటు గురించి ధోనిని ఇంతవరకూ అడగలేదు’ అని తివారీ పేర్కొన్నాడు. టీమిండియా తరఫున 12 వన్డేలను తివారీ ఆడగా, మూడు అంతర్జాతీయ టీ20లు ఆడాడు.(‘రిచర్డ్స్.. నన్ను చంపేస్తానన్నాడు’) -
60 ఏళ్ల వయసులో మాజీ కేంద్రమంత్రి పెళ్లి
న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. ముకుల్ వాస్నిక్, ఆయన స్నేహితురాలు రవీనా ఖురానాలు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమానికి రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్ మరికొందరు నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముకుల్ వాస్నిక్ గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఒకానొక దశలో రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కాంగ్రెస్ పార్టీలో ముకుల్ అనేక బాధ్యతలు నిర్వర్తించారు. కాగా.. ముకుల్ వాస్నిక్, రవీనా పెళ్లిపై రాజస్థాన్ సీఎం స్పందిస్తూ.. 'మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నందుకు అభినందనలు. రాబోయే రోజులు మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు. మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ స్పందిస్తూ.. 'ముకుల్ వాస్నిక్, రవీనా ఖురానా పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను 1984లో ముకుల్‌ను, 1985లో రవీనాను మొదటిసారిగా కలిశాను. వారిద్దరు పెళ్లి చేసుకోవడం సంతోషించదగ్గ విషయం. మేమంతా కలిసి గతంలో మాస్కోలో జరిగిన వరల్డ్ యూత్ స్టూడెంట్స్ ఫెస్టివల్‌కు హాజరయ్యామంటూ' తివారీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
‘నన్ను వెళ్లమని ఎవరూ ప్రశ్నించలేదు’
కోల్‌కతా: ఆంధ్రాతో రంజీ మ్యాచ్‌లో బెంగాల్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి జాతీయ సెలక్టర్ దేవాంగ్ గాంధీ వెళ్లడం పెద్ద దుమారమే రేపింది. జాతీయ క్రికెట్ జట్టుకు సెలక్టర్‌గా ఉండి ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి నిబంధనల్ని ఉల్లంఘించాడనే వాదన తెరపైకి వచ్చింది. తమ డ్రెస్సింగ్ రూమ్‌లోకి దేవాంగ్ రావడాన్ని బెంగాల్ ఆటగాడు మనోజ్ తివారీ ప్రశ్నించడంతోనే అతను అక్కడ్నుంచి వెళ్లాడని వార్తలు వచ్చాయి. దీనికి ముగింపు పలికాడు దేవాంగ్ గాంధీ. ‘ నేను నిబంధనల్ని ఏమీ ఉల్లంఘించలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి మ్యాచ్ రిఫరీ అనుమతి తీసుకునే వెళ్లా. గత మూడేళ్ల కాలంలో నేను ఏ విధమైన ప్రొటోకాల్‌ను అతిక్రమించలేదు. నేను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళితే ఎవరూ ఒక క్రికెటర్ నన్ను ప్రశ్నించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. నన్ను ఎవరూ అక్కడ్నుంచి పొమ్మనలేదు. చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడి మ్యాచ్‌లకు దూరం కావడంతో ఫిజియోనే డ్రెస్సింగ్ రూమ్‌కు రమ్మన్నాడు. అప్పుడు రిఫరీ అనుమతి తీసుకునే వెళ్లా. నేను నిబంధనల్ని అతిక్రమిస్తే మూడేళ్లుగా సెలక్టర్‌గా ఉండలేను కదా. నన్ను అక్కడ్నుంచి వెళ్లమని ఒక క్రికెటర్ డిమాండ్ చేశాడనడం అది కేవలం కల్పితమే’ అని దేవాంగ్ తెలిపాడు. -
డ్రెస్సింగ్ రూమ్‌లోకి సెలక్టర్.. సరికొత్త వివాదం
కోల్‌కతా: జాతీయ క్రికెట్ జట్టు సెలక్టరైన దేవాంగ్ గాంధీ రంజీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లడంతో సరికొత్త వివాదానికి తెరలేపింది. నగరంలోని ఈడెన్ గార్డెన్లో ఆంధ్రాతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెంగాల్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి దేవాంగ్ గాంధీ వెళ్లి నిబంధనలను అతిక్రమించాడు. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా దేవాంగ్ గాంధీ.. బెంగాల్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. దీనిపై బెంగాల్ ఆటగాడైన మనోజ్ తివారీ దీన్ని ఖండించాడు. జాతీయ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో సభ్యుడైన దేవాంగ్ గాంధీ ఇలా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటూ నిలదీశాడు. ఈ వివాదంపై ఫిర్యాదు చేయడంతో దేవాంగ్ గాంధీని డ్రెస్సింగ్ రూమ్ నుంచి పంపించేశారు. ‘ మేము అవినీతి నిరోధక కోడ్‌ను ఫాలో కావాలి. ఒక జాతీయ సెలక్టర్ అయిన దేవాంగ్ గాంధీ ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాకూడదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో పాటు జట్టుకు సంబంధించిన వారు మాత్రమే ఉండాలి. మరి దీన్ని దేవాంగ్ ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది’ అని ప్రశ్నించాడు. దాంతో దేవాంగ్ గాంధీని ఆ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు పంపించేశారు. తొలి రోజు ఆటలో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ 281/7 వద్ద ఉండగా మ్యాచ్‌కు బ్యాడ్‌లైట్ అంతరాయం కల్గించింది. కాగా, రెండో రోజు ఆటలో బెంగాల్ 289 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఆటగాడు అభిషేక్ రామన్(112) శతకంతో మెరిశాడు. -
నన్నూ, మోదీని చంపుతామంటున్నారు!
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీని, తనను చంపుతామని గుర్తుతెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి హిందీలో తన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఈ మెసేజ్‌ను శనివారం సాయంత్రం చూసినట్టు చెప్పారు. అందులో ‘‘ నేను మిమ్మల్ని, ప్రధానిని చంపాలనుకోవట్లేదు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వస్తోంది. నన్ను క్షమించండ’’న్న అని పేర్కొని ఉంది. ఈ మెసేజ్ గురించి పోలీసులకు తెలియజేశానని ఆయన ఆదివారం వెల్లడించారు. కాగా, గత నెలలో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణస్వీకారానికి ముందురోజు కూడా ఇలాగే బెదిరింపులు వచ్చాయి. మోదీని చంపుతామంటూ జైపూర్‌లోని బీజేపీ ఆఫీసుకు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ చిరునామాలోని నలుగురు వ్యక్తులను విచారిస్తే, వారికేం తెలియదని తేలిందని జైపూర్ పోలీసు డిప్యూటీ కమిషనరు యోగేశ్ దధీచ్ తెలిపారు. -
మూడుసార్లు సీఎం.. ఈసారి విజయం సాధించేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్.. ఈఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా సీనియర్ నేతైన షీలాను బరిలో ఉంచింది. కాంగ్రెస్‌కు కీలకంగా మారిన ఈఎన్నికల్లో షీలా విజయంపై కాంగ్రెస్ గంపెడు ఆశలు పెట్టుకుంది. కనీసం నాలుగు స్థానాల్లోనైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈశాన్య ఢిల్లీలో ఆమెపై బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మనోజ్ తీవారి గట్టిపోటిని ఇస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఉత్కంఠ పోటీ నెలకొంది. మరోవైఉ ఆప్ కూడా విజయం కోసం ప్రయత్నిస్తోంది. 1998 నుంచి 2013 వరకు ఏకధాటిగా మూడుసార్లు ఢిల్లీ సీఎం పిఠాన్ని అధిరోహించిన చరిత్ర ఆమెకు ఉంది. జాతీయ రాజధానిలో కాంగ్రెస్ పార్టీని వరుసగా మూడుసార్లు అధికారంలోకి తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. న్యూఢిల్లీ శాసన సభ నుంచి ప్రాతినిథ్యం వహించి సీఎం అయిన షీలా గత ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశారు. తీవ్ర కష్టాల్లో ఉన్న పార్టీని ఆదుకునేందుకు షీలా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆమెపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత వరకు నిజంచేయగలరనేది ఆసక్తికరంగా మారింది. ఏడు స్థానాలున్న ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని మొదటి నుంచి ప్రచారం జరిగినా నేతల మధ్య అవగహనలేకపోవడంతో చివరికి విడివిడిగానే బరిలోకి దిగక తప్పలేదు. కేజ్రీవాల్‌తో పొత్తుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నా షీలా మాత్రం వ్యతిరేకిస్తున్నారని స్థానిక నేతలు చెపుతున్నారు. అయితే జాతీయ రాజధాని ఢిల్లీలో షీలా ఎన్నిక ఆసక్తికరంగా మారింది. -
పొత్తులు లేవు.. త్రిముఖ పోరు
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం నామినేషన్ల పర్వం ముగియడంతో లోక్‌సభ ఎన్నికల పోటీ చిత్రం స్పష్టమైంది. పొత్తుపై గత కొద్ది నెలలుగా ఊగిసలాడిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీచేస్తుండడంతో నగరంలో ముక్కోణపు పోటీ ఖాయమైంది. పొత్తుపై కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుతూనే ఆప్ ఏడు సీట్లకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో ఆప్ అభ్యర్థుల నామినేషన్ల పర్వం మిగతా రెండు పార్టీల కన్నా ముందే ముగిసింది. కాంగ్రెస్ సోమవారం అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ అభ్యర్థులందరు ఆఖరి రోజునే నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థులలో మనోజ్‌తివారీ, డా.హర్షవర్థన్, పర్వేష్ వర్మ సోమవారం నామినేషన్ దాఖలు చేయగా మిగతా నలుగురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు సమర్పించారు. బీజేపీ మంగళవారం వాయవ్య ఢిల్లీ అభ్యర్థిని ప్రకటించింది. వాయవ్య ఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీ ఉదిత్‌రాజ్‌కు టికెట్ ఇవ్వకుండా గాయకుడు హన్స్ రాజ్ హన్స్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఢిల్లీ నుంచి పోటీచేసే సెలబ్రిటీల సంఖ్య మూడుకు పెరిగింది. బాక్సర్ విజేందర్ సింగ్‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా, గాయకుడు హన్స్‌రాజ్‌తోపాటు క్రికెటర్ గౌతం గంభీర్‌ను బీజేపీ బరిలోకి దింపింది. అనుభవానికి కాంగెస్ర్.. యువతకు ఆప్ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రె‹స్ రాజకీయ అనుభవానికే ప్రాధాన్యాన్ని ఇచ్చింది. దక్షిణ ఢిల్లీ నుంచి పార్టీ బరిలోకి దింపిన 33 సంవత్సరాల బాక్సర్ విజేందర్ సింగ్ మినహా ఆ పార్టీ అభ్యర్థులంతా రాజకీయంలో తలపండినవారే. మూడు పార్టీల అభ్యర్థులలో కాంగ్రెస్ అభ్యర్థులే పెద్ద వయసు వారు. వారి సగటు వయసు 57 సంవత్సరాలు. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న 81 సంవత్సరాల షీలాదీక్షిత్ ఈ ఎన్నికల్లో అభ్యర్థులందరిలోకి పెద్ద వారు. ఇక, మిగతా పార్టీలతో పోల్చుకుంటే అతి తక్కువగా ఆరు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న యువ అభ్యర్థులతోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచింది. వయసులోనూ మిగతా పార్టీల అభ్యర్థుల కన్నా ఆప్ అభ్యర్థులు తక్కువ వయసు కలిగి ఉన్నారు. వారి సగటు వయకు 45 సంవత్సరాలుగా ఉంది. దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న 30 సంవత్సరాల రాఘవ్ చద్దా మూడు పార్టీల అభ్యర్థులలో అతి పిన్న వయçస్కుడు. సిట్టింగ్ అభ్యర్థులు, సెలెబ్రిటీలతో బరిలో బీజేపీ మోడీ బలం నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ఐదుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇచ్చింది. తూర్పు ఢిల్లీ నుంచి పోటీచేస్తున్న 37 సంవత్సరాల గౌతం గంభీర్, వాయవ్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న గాయకుడు హన్స్ రాజ్ హన్స్ మినహా మిగతా ఐదుగురు అభ్యర్థులు గత ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసినవారే. ఈ ఇద్దరు కూడా తమ తమ రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగిన సెలబ్రిటీలే. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో మూడు పార్టీలు కంటితుడుపు వైఖరినే పాటించాయి. ఆప్ తూర్పు ఢిల్లీ నుంచి అతిషీని, కాంగ్రెస్ ఈశాన్య ఢిల్లీ నుంచి షీలాదీక్షిత్‌ను, బీజేపీ న్యూఢిల్లీ నుంచి మీనాక్షి లేఖిని నిలబెట్టాయి. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే నియోజకవర్గం ఆప్ బీజేపీ కాంగ్రెస్ న్యూఢిల్లీ బ్రజేష్ గోయల్ మీనాక్షి లేఖి అజయ్ మాకెన్ తూర్పుఢిల్లీ అతిషీ గౌతం గంభీర్ అర్విందర్ సింగ్ లవ్లీ వాయవ్య ఢిల్లీ గూగన్ సింగ్ హన్స్ రాజ్ హన్స్ రాజేష్ లిలోఠియా ఈశాన్య ఢిల్లీ దిలీప్ పాండే మనోజ్ తివారీ షీలాదీక్షిత్ దక్షిణ ఢిల్లీ రాఘవ్ చద్దా రమేష్ బిధూడీ విజేందర్ సింగ్ చాందినీ చౌక్ పంకజ్ గుప్తా డా.హర్షవర్థన్ జేపీ అగర్వాల్ పశ్చిమ ఢిల్లీ బల్బీర్ సింగ్ ఝాకడ్ పర్వేష్ వర్మ మహాబల్ మిశ్రా -
ఐపీఎల్ వేలంపై మనోజ్ తివారీ అసహనం!
జైపూర్ : ఐపీఎల్ తాజా వేలంపై భారత క్రికెటర్ మనోజ్ తివారీ అసహనం వ్యక్తం చేశాడు. 2019 సీజన్ కోసం మంగళవారం జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ తివారీని కనుకరించలేదు. అతని కనీస ధర రూ.50 లక్షలకు కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబర్చలేదు. దీంతో అతను ఈ సీజన్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. దీనిపై మనోజ్ తివారీ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘నా జీవితంలో అసలేం జరుగుతుందో.. దేశం తరపున సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అందుకున్న తరువాత కూడా 14 మ్యాచ్‌ల వరకు అవకాశం రాలేదు. 2017 ఐపీఎల్ సీజన్లో ఇన్ని అవార్డులు గెలుచుకున్నా(అవార్డుల ఫొటోను ఉద్దేశిస్తూ) కూడా ఏం జరిగిందో అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. Wondering wat went wrong on my part after getting Man of a match award wen I scored a hundred 4 my country and got dropped for the next 14 games on a trot ?? Looking at d awards which I received during 2017 IPL season, wondering wat went wrong ??? pic.twitter.com/GNInUe0K3l — MANOJ TIWARY (@tiwarymanoj) 18 December 2018 తివారీ గత సీజన్లో విఫలమైనప్పటికీ 2017లో రైజింగ్ పుణె తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 15 మ్యాచ్‌ల్లో 32.4 సగటుతో 324 పరుగులు చేశాడు. కానీ గత సీజన్లో కింగ్స్ పంజాబ్ తరఫున 5 మ్యాచ్‌ల్లో 37 పరుగులే చేశాడు. దీంతో అతన్ని తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అంతే కాకుండా ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ తరుఫున డబుల్ సెంచరీ కూడా సాధించాడు. అయినా అవకాశం దక్కపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 2011 సీజన్లో కోల్‌కతా టైటిల్ నెగ్గడంలో తివారీ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 51 సగటుతో 359 పరుగులు చేశాడు. సీజన్ ప్రారంభమయ్యేలోపు ఏ ఫ్రాంచైజీ అన్న కరుణిస్తదో లేదో చూడాలి! -
‘అసలైన అర్బన్ నక్సల్ అరవింద్ కేజ్రీవాల్’
రాయ్‌పూర్ : అర్బన్ నక్సల్స్‌కి అసలైన ఉదాహరణ ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారి వ్యాఖ్యానించారు. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ నక్సల్స్‌కు మద్దతుగా నిలుస్తామని ఆయన విమర్శించారు. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా తివారి శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. దేశ గణతంత్ర దినోత్సవం రోజున ధర్నా నిర్వహించిన ఘనత కేజ్రీవాల్‌కే దక్కుతుందని, ఆయన విధానాలు నక్సల్స్ మాదిరిగానే ఉంటాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో దేశంలో నక్సల్స్‌పై ఉక్కుపాదం మోపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి అర్బన్ నక్సల్స్‌కు మద్దతుగా నిలుస్తున్నారని, సంఘ విద్రోహులను వారు విప్లవకారులుగా కీర్తిస్తారని విమర్శించారు. కశ్మీర్ సరిహద్దుల్లో భారత సైనికులపై తూటలతో దాడులు చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ అధికారిని కాంగ్రెస్ మంత్రి సిద్దూ ఆలింగనం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని 72 స్థానాలు రెండో దశ ఎన్నికలు ఈనెల 20న జరగునున్న విషయం తెలిసిందే. -
స్టోక్స్‌కు స్ట్రోక్ ఇచ్చిన మయాంక్, తివారీ
-
స్టోక్స్‌కు అదిరిపోయే స్ట్రోక్
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదుర్స్ అనిపించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో భాగంగా లాంగాఫ్‌లో మయాంక్ బంతిని అందుకున్న తీరు ఒక ఎత్తైతే, అక్కడ తనను తాను నియంత్రించుకుంటూ బంతిని గాల్లోనే వేరే ఫీల్డర్ మనోజ్ తివారీకి అందివ్వడం మరొక ఎత్తు. చివరకు ఈ ఇద్దరూ కలిసి స్టోక్స్‌కు అదిరిపోయే స్ట్రోక్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 84 పరుగుల వద్ద మూడో వికెట్‌గా సంజూ శాంసన్‌ను కోల్పోయిన తర్వాత ఐదో స్థానంలో స్టోక్స్ బ్యాటింగ్‌కు దిగాడు. రెండు ఫోర్లతో మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. కాగా, కింగ్స్ పంజాబ్ స్పిన్నర్ ముజిబ్ ఉర్ రహ్మాన్ వేసిన 13 ఓవర్ ఐదో బంతిని లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్.. బంతిని బౌండరీ లైన్‌కు కొద్ది దూరంలో అందుకున్నాడు. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద నియంత్రణ కోల్పోతున్నట్లు భావించిన మయాంక్.. అక్కడకు సమీపంలో ఉన్న మనోజ్ తివారీకి అందించి బౌండరీ లైన్ లోపలకి పడిపోయాడు. కాగా, మనోజ్ తివారీ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో మయాంక్ చేసిన ప్రయత్నం స్టేడియంలోని ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. -
తివారి బౌలింగ్ యాక్షన్‌పై జోకులే జోకులు
హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గా కొత్త అవతారమెత్తాడు.. కింగ్స్‌పంజాబ్ ఆటగాడు మనోజ్ తివారి. యువరాజ్ సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వినూత్న శైలితో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం తివారి బౌలింగ్ యాక్షన్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు. టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్, శ్రీలంక పేసర్ మలింగాల యాక్షన్ల కలయికగా తివారి బౌలింగ్ యాక్షన్ ఉందని అభిప్రాయపడుతున్నారు. తివారి బౌలింగ్ చూస్తే నవ్వు ఆగడం లేదని.. ఇది మలింగా స్పిన్ వర్షన్ అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఇది సరైన బౌలింగేనా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి బౌలింగ్‌ను ఐపీఎల్లో అనుమతించ కూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒకే ఓవర్ వేసిన తివారి 10 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 13 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. Manoj Tiwari bowl like Malinga pic.twitter.com/49mWCCUUvG — Rashid Ibrar Khan (@Rashid_Ibrar14) April 26, 2018 This Manoj Tiwari's bowling action shouldn't be allowed !! IPL is ruining technic and class !! 😕 — sarvesh sambare (@sarvesh555) April 26, 2018 -
ఐపీఎల్–10 విజేత ముంబై ఇండియన్స్
-
ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర
-
ముంబై మహాన్
♦ ఐపీఎల్–10 విజేత ముంబై ఇండియన్స్ ♦ మూడోసారి టైటిల్ సాధించిన రోహిత్ సేన ♦ ఫైనల్లో పరుగు తేడాతో పుణేపై అద్భుత విజయం ♦ కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన ♦ స్మిత్ పోరాటం వృథా డ్రామా... చివరి బంతి వరకు డ్రామా... తక్కువ స్కోర్ల మ్యాచే అయినా ఐపీఎల్ ఫైనల్ అంటే ఎంత ఉత్కంఠగా సాగాలో అలాగే సాగింది. అనూహ్య రీతిలో మలుపులు తిరిగి ఆటను చివరి క్షణం వరకు రక్తి కట్టించింది. ఈ అద్భుత పోరులో చివరకు ముంబై అనుభవం గెలిచింది. ఒకే ఒక్క పరుగుతో ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరం. తొలి బంతిని మనోజ్ తివారీ చక్కటి ఫోర్‌గా మలిచాడు. అయితే తర్వాతి రెండు బంతుల్లో తివారీ, స్మిత్‌లను అవుట్ చేసిన జాన్సన్ మ్యాచ్‌ను ముంబై చేతుల్లోకి తెచ్చాడు. చివరి 3 బంతుల్లో 5 పరుగులు చేసినా పుణేకు ఓటమి తప్పలేదు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా, మూడో పరుగు తీసే ప్రయత్నంలో సుచిత్ త్రోకు క్రిస్టియాన్ అవుటయ్యాడు. పాపం రైజింగ్ పుణే సూపర్ జెయింట్... అతి జాగ్రత్త జట్టు కొంప ముంచింది. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని 129 పరుగులకే పరిమితం చేయగలిగినా... టి20 తరహా దూకుడు ఎక్కడా చూపించకుండా ఒత్తిడి పెంచుకుంది. 20 ఓవర్లలో ఏ దశలోనూ జట్టు రన్‌రేట్ కనీసం 7 పరుగులు దాటలేదు. చివరి వరకు నిలిచి విజయం వైపు నడిపించగలడని నమ్మిన స్టీవ్ స్మిత్ చివరకు ఈ పాపంలో భాగమయ్యాడు. సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్–2017 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ముంబై ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. తక్కువ స్కోరే అయినా పట్టుదలగా ఆడిన రోహిత్ సేన ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (38 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ రోహిత్ శర్మ (22 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం పుణే సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (50 బంతుల్లో 51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు లభించింది. కీలక భాగస్వామ్యం... ఆరంభంలో ముంబై ఇండియన్స్ ప్రదర్శన గత మ్యాచ్‌లో కోల్‌కతా ఆటను తలపించింది. పుణే పదునైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కాగా, చివర్లో కృనాల్ ఇన్నింగ్స్ ఆ జట్టును నిలబెట్టింది. ఐపీఎల్ ఫైనల్లో 31వ బంతికి గానీ తొలి ఫోర్ రాలేదు... ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మందగమనానికి ఇది ఉదాహరణ. తొలి రెండు ఓవర్లలో 7 పరుగులే రాగా... మూడో ఓవర్లో ఉనాద్కట్ రెండు వికెట్లతో దెబ్బ తీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి పార్థివ్ (4) అవుట్ కాగా, అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో సిమన్స్ (3) ఆటను ఉనాద్కట్ ముగించాడు. తొలి 5 ఓవర్లలో 16 పరుగులే చేయగలిగిన ముంబై, ఆరో ఓవర్లో మరో 16 పరుగులతో పవర్‌ప్లేను 32 పరుగులతో ముగించింది. ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో రోహిత్ నాలుగు ఫోర్లు బాదడం విశేషం. అయితే ఈ జోరు ఎంతో సేపు నిలవలేదు. స్మిత్ చక్కటి త్రోకు అంబటి రాయుడు (12) రనౌట్ కాగా, జంపా ఒకే ఓవర్లో రోహిత్, పొలార్డ్ (7) వికెట్లు తీశాడు. శార్దుల్ ఠాకూర్ సమయస్ఫూర్తితో బౌండరీ వద్ద క్యాచ్ పట్టి రోహిత్‌ను వెనక్కి పంపగా, జంపా బౌలింగ్‌లో తివారీ చేతికి పొలార్డ్ చిక్కాడు. క్రిస్టియాన్ బంతికి హార్దిక్ పాండ్యా (10) అవుట్ కాగా, అతని అద్భుత ఫీల్డింగ్‌కు కరణ్ శర్మ (1) రనౌటయ్యాడు. ఈ దశలో కృనాల్, జాన్సన్ జోడి ముంబైని ఆదుకుంది. ఫలితంగా చివరి మూడు ఓవర్లలో జట్టు 37 పరుగులు సాధించింది. క్రిస్టియాన్ వేసిన చివరి ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన కృనాల్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. కృనాల్, జాన్సన్ ఎనిమిదో వికెట్‌కు 36 బంతుల్లో 50 పరుగులు జోడించారు. అతి జాగ్రత్త... పుణే ఇన్నింగ్స్ కూడా నెమ్మదిగానే ప్రారంభమైంది. రాహుల్ త్రిపాఠి (3)ని బుమ్రా అవుట్ చేయగా... రహానే, స్మిత్ కలిసి జాగ్రత్తగా ఆడారు. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోలేదు. మధ్యలో రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడినా... స్మిత్ తన 23వ బంతికి గానీ తొలి బౌండరీ కొట్టలేదు. అయితే 14 పరుగుల వద్ద రహానే ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కృనాల్ వదిలేయడం పుణేకు కలిసొచ్చింది. అయితే ఈ భాగస్వామ్యం మాత్రం మరీ నెమ్మదిగా సాగింది. చివరకు 57 బంతుల్లో 54 పరుగులు జోడించిన తర్వాత రహానేను అవుట్ చేసి జాన్సన్ ఈ జోడీని విడదీశాడు.ఆ తర్వాతి ముంబైకి ఒక్కసారిగా పట్టు చిక్కింది. ధోని (10), తివారి (7) విఫలం కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది. చివరి వరకు ఒంటరిగా పోరాడిన స్మిత్ జట్టును గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమన్స్ (సి అండ్ బి) ఉనాద్కట్ 3; పార్థివ్ పటేల్ (సి) శార్దుల్ (బి) ఉనాద్కట్ 4; రాయుడు రనౌట్ 12; రోహిత్ శర్మ (సి) శార్దుల్ (బి) జంపా 24; కృనాల్ పాండ్యా (సి) రహానే (బి) క్రిస్టియాన్ 47; పొలార్డ్ (సి) తివారీ (బి) జంపా 7; హార్దిక్ పాండ్యా ఎల్బీడబ్ల్యూ (బి) క్రిస్టియాన్ 10; కరణ్ శర్మ రనౌట్ 1; జాన్సన్ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1–7, 2–8, 3–41, 4–56, 5–65, 6–78, 7–79, 8–129. బౌలింగ్: ఉనాద్కట్ 4–0–19–2, వాషింగ్టన్ సుందర్ 4–0–13–0, శార్దుల్ ఠాకూర్ 2–0–7–0, ఫెర్గూసన్ 2–0–21–0, జంపా 4–0–32–2, క్రిస్టియాన్ 4–0–34–2. రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) పొలార్డ్ (బి) జాన్సన్ 44; రాహుల్ త్రిపాఠి ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా 3; స్మిత్ (సి) రాయుడు (బి) జాన్సన్ 51; ధోని (సి) పార్థివ్ పటేల్ (బి) బుమ్రా 10; మనోజ్ తివారీ (సి) పొలార్డ్ (బి) జాన్సన్ 7; క్రిస్టియాన్ రనౌట్ 4; సుందర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–17, 2–71, 3–98, 4–123, 5–123, 6–128. బౌలింగ్: కృనాల్ 4–0–31–0, జాన్సన్ 4–0–26–3, బుమ్రా 4–0–26–2, మలింగ 4–0–21–0, కరణ్ శర్మ 4–0–18–0. ఐపీఎల్–10 అవార్డీలు అరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు; రూ.10 లక్షలు): వార్నర్ (641 పరుగులు; హైదరాబాద్) పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు; రూ.10 లక్షలు): భువనేశ్వర్ (26 వికెట్లు; హైదరాబాద్) ఫర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ (రూ.10 లక్షలు): సురేశ్ రైనా ఎమర్జింగ్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): బాసిల్ థంపీ ఫెయిర్ ప్లే అవార్డు : గుజరాత్ లయన్స్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): బెన్ స్టోక్స్ రన్నరప్ (రూ. 10 కోట్లు): రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ విన్నర్ (రూ. 15 కోట్లు): ముంబై ఇండియన్స్ -
మైదానంలో మన క్రికెటర్ల మాటల యుద్ధం
న్యూఢిల్లీ: ఐపీఎల్ చిత్రమైనది. మన ఆటగాళ్లే ప్రత్యర్థులుగా మారి తలపడతారు. విదేశీ ఆటగాళ్లతో కలసి ఓ జట్టుగా ఆడుతారు. ఇందులో జాతీయతకు తావు లేదు. దేశం కోసం కలసి కట్టుగా ఆడిన ఆటగాళ్లే ప్రత్యర్థులుగా మారి మాటల యుద్ధానికి దిగారు. ఐపీఎల్-2017 సీజన్లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్, పుణె బ్యాట్స్‌మన్ మనోజ్ తివారి మాటలకు పదును పెట్టారు. కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 15వ ఓవర్లో గంభీర్.. మనోజ్‌ను దూషిస్తున్నట్టుగా మాట్లాడాడు. దీంతో మనోజ్ కూడా వెనక్కు తగ్గలేదు. ఫీల్డింగ్ స్థానం నుంచి ముందుకు పరిగెత్తి గంభీర్‌ను ఉద్దేశిస్తూ ఒకటి రెండు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్నంత వరకూ ఈ తతంగం సాగింది. కాగా గంభీర్, మనోజ్ ఇద్దరూ మైదానంలో తిట్టుకోవడం ఇదే తొలిసారి కాదు. 2015లో రంజీ ట్రోఫీలో వీరిద్దరూ గొడవపడ్డారు. క్రమశిక్షణ చర్యల కింద మ్యాచ్ ఫీజులో గంభీర్‌కు 70 శాతం, మనోజ్‌కు 40 శాతం చొప్పున జరిమానా వేశారు. -
ఆ గొడవలో గంగూలీ ప్రస్తావన!
న్యూఢిల్లీ: ఢిల్లీలో రంజీమ్యాచ్ సందర్భంగా శనివారం బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ, ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవలో సౌరవ్ గంగూలీ ప్రస్తావన కూడా వచ్చింది. ఈ గొడవలో బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన గంగూలీ గురించి కూడా వ్యాఖ్యలు చేశారని మనోజ్ తీవారి ఆదివారం విలేకరులకు తెలిపాడు. 'గొడవ అనంతరం నిన్న నేను గంగూలీతో మాట్లాడాను. మైదానంలో గొడవ సందర్భంగా ఆయన పేరు కూడా వినిపించింది. కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందుకే నేను చాలా అప్సెట్ అయ్యాను. మేం బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు వస్తే మేం వినలేం. స్లెడ్జింగ్ మంచిదే కానీ ఎంతమేరకు మాట్లాడాలి? గీత దాటకుండా ఎలా ఉండాలి క్రీడాకారులకు తెలిసి ఉండాలి' అని మనోజ్ తివారీ పేర్కొన్నారు. సమయం వృథా చేయడంతోనే మైదానంలో ఈ గొడవ జరిగిందని, దానివల్లే గంభీర్ కల్పించుకోవాల్సి వచ్చిందని తనపై వస్తున్న ఆరోపణలను మనోజ్ తివారీ తోసిపుచ్చారు. ఆటలో జాప్యం జరిగిన సంగతి వాస్తవమేనని, అయితే అది ఉద్దేశపూరితంగా చేసింది కాదని పేర్కొన్నారు. -
మనోజ్ తివారీతో గంభీర్ వాగ్వాదం
న్యూఢిల్లీ:దేశవాళీ క్రికెట్ లీగ్ లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బెంగాల్-ఢిల్లీ జట్ల జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో మనోజ్ తివారీపై గౌతం గంభీర్ దూషణలకు పాల్పడ్డాడు. తొలుత గంభీర్-తివారీలు మధ్య చోటుచేసుకున్నమాటల యుద్ధం కాస్త ఉద్రికత్త పరిస్థితులకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ జట్టుకు గంభీర్ నేతృత్వం వహిస్తుండగా, బెంగాల్ జట్టుకు మనోజ్ తివారీ సారథ్యం వహిస్తున్నాడు. అయితే ఢిల్లీ పేసర్ మనన్ శర్మ బౌలింగ్ లో బెంగాల్ ఆటగాడు పార్థసారధి భట్ట ఛటర్జీ అవుటైన తరువాత మనోజ్ తివారీ కేవలం క్యాప్ పెట్టుకుని మాత్రమే బ్యాటింగ్ కు వచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి క్రీజ్ లోకి వచ్చిన తివారీ గార్డ్ తీసుకున్న అనంతరం బ్యాటింగ్ కు సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే బౌలర్ మనన్ శర్మ బౌలింగ్ వేయబోతుండగా అతన్ని తివారీ ఆపాడు. డ్రెస్సింగ్ రూమ్ లో సహచరులకు సైగ చేస్తూ హెల్మెట్ తేవాల్సిందిగా తివారీ కోరాడు. దీంతో ఫస్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న గంభీర్ రెచ్చిపోయాడు. క్రీజ్ లోకి వచ్చేటప్పుడు హెల్మెట్ తెచ్చుకోవాలని తెలియదా?అంటూ మనోజ్ తివారీపై దూషణలకు దిగాడు. తివారీ కూడా దీటుగా స్పందించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. దాంతో సహనం కోల్పోయిన గంభీర్.. జాగ్రత్త ఉండకపోతే తన చేతుల్లో దెబ్బలు తినాల్సి వస్తుందంటూ తివారిపై నోరు పారేసుకున్నాడు. ఆ గొడవను సద్దుమణిచేందుకు యత్నించిన అంపైర్ శ్రీకాంత్ ను కూడా గంభీర్ తోసుకుంటూ వెళ్లి మరీ తివారీని హెచ్చరించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై మనోజ్ తివారీ స్పందిస్తూ.. ఫీల్డ్ లో ఏం జరిగిందనేది వీడియోలో ఉంటుందని, గౌతం గంభీర్ ను ఒక సీనియర్ గా తాను ఎప్పుడూ గౌరవమిస్తానన్నాడు. కాగా, గంభీర్ తన లైన్ ను దాటడం పట్ల తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు. -
లక్ష్మణ్ సలహాలు ఉత్తేజాన్నిచ్చాయి
క్రికెటర్ మనోజ్ తివారీ న్యూఢిల్లీ: మాజీ టెస్టు ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన విలువైన సలహాలతో జింబాబ్వే సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతున్నట్టు క్రికెటర్ మనోజ్ తివారీ చెప్పాడు. అయితే దీని కోసం ఎలాంటి ప్రణాళికలు పెట్టుకోదలుచుకోలేదని స్పష్టం చేశాడు. ‘ఇటీవలి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) విజన్ 2020 శిబిరంలో లక్ష్మణ్‌తో చాలా సమయం గడిపాను. ఈ సందర్భంగా మాకు అమూల్యమైన బ్యాటింగ్ మెళకువలను చెప్పాడు. ఇక నా వరకైతే వర్తమానంపైనే దృష్టి పెడుతూ ముందుకెళ్లాలని సలహా ఇచ్చాడు. నా కెరీర్‌ను అతడు చాలా దగ్గరగా చూశాడు. ‘చాలాసార్లు గాయాలపాలై జట్టులోకి కమ్‌బ్యాక్ కావడం అంత సులువు కాదు. ఇప్పటికే చాలా కఠినంగా శ్రమించావు. ఇక ఇప్పుడు చేయాల్సిందల్లా నెగెటివ్ ఆలోచనలను దగ్గరికి రానీయకు. ప్రస్తుతం ఉత్తమ క్రికెటర్‌గా మారేందుకు ఏం చేయాలో దృష్టి సారించు’ అని లక్ష్మణ్ సూచించాడు. ఈ మాటలు నాకు ఎంతగానో ఉత్తేజాన్నిచ్చాయి’ అని 29 ఏళ్ల తివారి తెలిపాడు. ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేది తెలీదు కాబట్టి జింబాబ్వే పర్యటనకు ఎలాంటి అంచనాలు లేకుండా వెళుతున్నానని చెప్పాడు. వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోకుండా జట్టులో శాశ్వత చోటు కోసం ప్రయత్నిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
ఫైనల్లో ఈస్ట్‌జోన్
- మనోజ్ తివారీ సెంచరీ - సెమీస్‌లో నార్త్పై గెలుపు - దేవధర్ ట్రోఫీ ముంబై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఈస్ట్‌జోన్ జట్టు... దేవధర్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ మనోజ్ తివారీ (121 బంతుల్లో 151; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో ఈస్ట్ 52 పరుగుల తేడాతో నార్త్‌జోన్‌పై విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. తివారీ మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. నార్త్ జోన్ బౌలర్లలో సందీప్ శర్మ 3, రిషీ ధావన్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన నార్త్‌జోన్ 47.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. గురుకీరత్ సింగ్ (99 బంతుల్లో 83; 10 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. మన్దీప్ సింగ్ (40), రిషీ ధావన్ (38) రాణించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. యువరాజ్ సింగ్ (4) మరోసారి నిరాశపర్చాడు. లాహిరి 3, దిండా, సామంత్రే చెరో రెండు వికెట్లు తీశారు. సౌత్, వెస్ట్‌జోన్‌ల మధ్య రెండో సెమీస్ ముంబైలో నేడు జరగనుంది. -
జార్ఖండ్ లో బీజేపీకే పట్టం: మనోజ్ తివారి
జమ్షెడ్పూర్: జార్ఖండ్ లో బీజేపీ సానుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని ఆ పార్టీ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పారు. జార్ఖండ్ లో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత 14 ఏళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ముగింపు పలకాలని జార్ఖండ్ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తాను ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అనుకూలంగా వాతావరణం ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. -
బెంజ్ నుంచి పోర్షే దాకా..!
న్యూఢిల్లీ: కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు ఇప్పుడు రాజకీయ దర్పానికి చిహ్నం గా మారిపోయూరుు. సంపద సమృద్ధిగా ఉన్న రాజకీయ నాయకులు మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ లేదా లీటర్ల కొద్దీ పెట్రోలు తాగే విలాసవంతమైన ఎస్వీయూలపైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు వారు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లను బట్టి స్పష్టమవుతోంది. ఇక స్కార్పియో, టాటా సఫారీ వంటి కార్లు సర్వసాధారణమై పోయూరుు. వృత్తిరీత్యా లాయర్, అమృత్సర్ బీజేపీ అభ్యర్థి అరుున అరుణ్ జైట్లీకి ఓ మెర్సిడెజ్, మరో బీఎండబ్ల్యూతో పాటు పోర్షే, హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్ ఉన్నారుు. ఇక భోజ్‌పురి నటుడు, ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి ఉన్న కార్ల శ్రేణిని చూసినా ఆశ్చర్యం వేస్తుంది. ఆడి క్యూ7, మెర్సిడిస్ బెంజ్, టయోటా ఫార్చ్యూనర్, హోండా సిటీ వాటిలో కొన్ని. మథుర బీజేపీ అభ్యర్థి నటి హేమామాలినికి మెర్సిడిస్ బెంజ్, టయోటా ఇన్నోవా కార్లుండగా, ఆమె భర్త, సినీ నటుడు ధర్మేంద్రకు రేంజ్ రోవర్ ఉంది. ఇక హర్యానా జనహిత్ కాంగ్రెస్ అధినేత కుల్దీప్ బిష్ణోయ్‌కు ఏకంగా ఐదు కార్లు (జాగ్వార్ ఎక్స్ఎఫ్, ఆడి క్యూ7, రేంజ్ రోవర్ తదితరాలు), కాంగ్రెస్ అభ్యర్థి (టోంక్-సవారుు మాధోపూర్) అజారుద్దీన్‌కు రెండు కార్లు (బీఎండబ్ల్యూ 650ఐ, హోండా సీఆర్వీ) ఉన్నారుు. -
ఈశాన్య ఢిల్లీ ఎన్నికల చిత్రం కాంగ్రెస్ వ్యతిరేక పవనాల జోరు
అనుభవం, నిరాడంబరత, స్థానికుల్లో మంచి పేరున్నా ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జైప్రకాశ్ అగర్వాల్ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తుండడమే. ఇదే బీజేపీ అభ్యర్థి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ గెలుపు అవకాశాలను మెరుగుపర్చవచ్చంటున్నారు. ఇక ఆప్ అభ్యర్థి ఆనంద్‌కుమార్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై కొంతమేర ప్రభావం చూపవచ్చని రాజకీయ పండితులు చెబుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం 2008లో డీలిమిటేషన్ కమిషన్ సిఫారసు మేరకు ఏర్పాటైంది. ఈస్ట్ ఢిల్లీ నియోజవర్గంలోని ప్రాంంతాలతో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 2009లో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు చెందిన జైప్రకాశ్ అగర్వాల్, బీజేపీకి చెందిన బి.ఎల్. శర్మ ప్రేమ్‌ను 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. అయితే కొత్తగా ఢిల్లీ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి జేఎన్‌యూ ప్రొఫెసర్ అనంద్కుమార్ను అభ్యర్థిగా నిలబెట్టింది. సమాజశాస్త్ర నిపుణుడిగా ఆనంద్‌కుమార్‌కు విద్యారంగంలో మంచి పేరుంది. ఆయన ఆప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, ఆప్ జాతీయ కార్యవర్గంలోనూ సభ్యుడు. అయితే సైద్ధాంతిక ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞుడైన ఆనంద్‌కుమార్ ఈశాన్య ఢిల్లీలోని కుల, మత రాజకీయాలలోఎలా నెట్టుకురాగలరన్న సందేహం ఆప్ కార్యకర్తలను వేధిస్తోంది. అదీకాక బయటి వ్యక్తిని లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని కొందరు స్థానిక కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఆనంద్‌కుమార్‌కు రాజకీయాలలో అనుభవం లేకపోవడం కూడా ఆప్ విజయానికి ప్రతికూలాంశమని అంటున్నారు. అయితే నిజాయితీపరుడన్న పేరు, ఆమ్ ఆద్మీ పార్టీ పాపులారిటీ ఆనంద్‌కుమార్‌ను గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముస్లిం ఓటర్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజవర్గం ఇదే. ఇక్కడి ఓటర్లలో 27 శాతం మంది ముస్లింలున్నారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నందున ఇక్కడి నుంచి ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కానీ పార్టీ వారి డిమాండ్‌ను పట్టించుకోలేదు. సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్‌కు టికెట్ ఇచ్చింది. ఆయన అభ్యర్థిత్వం ప్రైమరీ ఎన్నికల ద్వారా ఖరారైంది. కాంగ్రెస్ ఢిల్లీలో ప్రైమరీ ఎన్నికల ద్వారా అభ్యర్థులను ఖరారు చేసిన రెండు నియోజకవర్గాలలో ఇదొకటి. జేపీ అగర్వాల్ సరళస్వభావం, నిరాడంబరత, అనుభవం ఈశాన్య ఢిల్లీ ఓటర్లకు నచ్చినప్పటికీ నగరంలో తీవ్రంగా వీస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు, స్థానిక సమస్యలు ఆయన విజయానికి అడ్డంకిగా మారవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలో అనధికార కాలనీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గం మిగతా ఢిల్లీ నుంచి దూరంగా ఉన్నట్లు ఉంటుంది. మెట్రో సదుపాయం లేదు. ఇతర ప్రజారవాణా సదుపాయాల లభ్యత కూడా తక్కువే. బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుతం దేశమంతటా రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని, మైనారిటీల ఓట్లు దక్కకపోయినా పూర్వాంచలీయుల ఓటర్లను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో ఆపార్టీ భోజ్‌పురి గాయకుడు, నటుడు మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చింది. ఈ నియోజవర్గం జనాభాలో 45 శాతం మంది పూర్వాంచలీయులున్నారు. పూర్వాంచలీ ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బయటివాడన్న వ్యతిరేకతను ఖాతరు చేయకుండా ఆనంద్‌కుమార్‌కు టికెట్ ఇచ్చిందని కొందరు రాజకీయ పండితులు అంటున్నారు. ఆనంద్‌కుమార్ వారణాసిలో జన్మించారని, ఆయన కొంతకాలం బెనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా పనిచేశారని వారు అంటున్నారు. ముస్లిం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని హజ్ కమిటీ సభ్యుడు సమీ సల్మానీకి బీఎస్పీ టికెట్ ఇచ్చింది. బురాడీ, తిమార్పుర్, సీమాపురి, రోహతాస్‌నగర్, సీలంపూర్, ఘోండా, బాబర్పూర్, గోకుల్పూర్, ముస్తఫాబాద్, కరావల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధి కిందకు వస్తాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఈ పది నియోజకవర్గాలలో ఐదింటిలో బీజేపీ, మూడింటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, రెండింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది.