బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో దేవాంగ్ గాంధీ(ఫైల్‌ఫొటో)
కోల్‌కతా: ఆంధ్రాతో రంజీ మ్యాచ్‌లో బెంగాల్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి జాతీయ సెలక్టర్ దేవాంగ్ గాంధీ వెళ్లడం పెద్ద దుమారమే రేపింది. జాతీయ క్రికెట్ జట్టుకు సెలక్టర్‌గా ఉండి ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి నిబంధనల్ని ఉల్లంఘించాడనే వాదన తెరపైకి వచ్చింది. తమ డ్రెస్సింగ్ రూమ్‌లోకి దేవాంగ్ రావడాన్ని బెంగాల్ ఆటగాడు మనోజ్ తివారీ ప్రశ్నించడంతోనే అతను అక్కడ్నుంచి వెళ్లాడని వార్తలు వచ్చాయి. దీనికి ముగింపు పలికాడు దేవాంగ్ గాంధీ. ‘ నేను నిబంధనల్ని ఏమీ ఉల్లంఘించలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి మ్యాచ్ రిఫరీ అనుమతి తీసుకునే వెళ్లా.
గత మూడేళ్ల కాలంలో నేను ఏ విధమైన ప్రొటోకాల్‌ను అతిక్రమించలేదు. నేను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళితే ఎవరూ ఒక క్రికెటర్ నన్ను ప్రశ్నించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. నన్ను ఎవరూ అక్కడ్నుంచి పొమ్మనలేదు. చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడి మ్యాచ్‌లకు దూరం కావడంతో ఫిజియోనే డ్రెస్సింగ్ రూమ్‌కు రమ్మన్నాడు. అప్పుడు రిఫరీ అనుమతి తీసుకునే వెళ్లా. నేను నిబంధనల్ని అతిక్రమిస్తే మూడేళ్లుగా సెలక్టర్‌గా ఉండలేను కదా. నన్ను అక్కడ్నుంచి వెళ్లమని ఒక క్రికెటర్ డిమాండ్ చేశాడనడం అది కేవలం కల్పితమే’ అని దేవాంగ్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment