Devang Gandhi
-
'విండీస్ సిరీస్‌లో అతడు అదరగొట్టాడు.. అయినప్పటికీ ఓపెనర్‌గా నో ఛాన్స్'
ఆసియా కప్-2022కు ముందు టీమిండియా జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జింబాబ్వే చేరుకున్న భారత జట్టు.. ఆగస్టు 18న తొలి వన్డే ఆడేందుకు సన్నద్ధమవుతోంది. కాగా ఈ పర్యటనలో సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. కాగా ఈ సిరీస్‌కు తొలుత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పటికీ.. రాహుల్ ఫిట్నెస్ సాధించడంతో తిరిగి అతడినే సారధిగా బీసీసీఐ నియమించింది. రాహుల్ తిరిగి జట్టులోకి రావడంతో ధావన్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఈ క్రమంలో విండీస్ పర్యటనలో అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకున్న శుభ్‌మాన్ గిల్ ఏ స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్ 205 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో గిల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై భారత మాజీ ఆటగాడు దేవాంగ్ గాంధీ తన అభిప్రాయాలను వెల్లడించాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది అని గాంధీ తెలిపాడు. "శుభ్‌మన్ గిల్‌కు రానున్న రోజుల్లో భారత జట్టు మేనేజ్మెంట్ మరిన్ని అవకాశాలు ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకుంటే అతడు వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్ భారత ప్రణాళికలలో భాగంగా ఉన్నాడు. గిల్ కరేబియన్ సిరీస్‌లో అద్భుతంగా రాణించప్పటికీ.. జింబాబ్వేతో వన్డేలలో మాత్రం అతడికి ఓపెనర్‌గా అవకాశం దక్కదు. రాహుల్ గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. త్వరలో ఆసియా కప్ జరగనుండడంతో రాహుల్ తన రిథమ్‌ను తిరిగి పొందాలంటే ఈ సిరీస్ ఎంతో ముఖ్యం. కాబట్టి రాహుల్ ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవాంగ్ గాంధీ పేర్కొన్నాడు. చదవండి: Martin Guptill- Rohit Sharma: రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన గప్టిల్.. మరోసారి అగ్రస్థానంలోకి! -
‘రాయుడ్ని ఎంపిక చేయకపోవడం మా తప్పే’
న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో అంబటి రాయుడుకు చోటు ఇవ్వకపోవడం తాము చేసిన తప్పిదాల్లో ఒకటని అప్పుడు సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న దేవాంగ్ గాంధీ పేర్కొన్నారు. గత సెప్టెంబర్‌లో తన పదవీ కాలం ముగిసిన తర్వాత తొలిసారి వరల్డ్‌కప్ సెలక్షన్‌పై పెదవి విప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనకు సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడంపై ఇప్పటికే వరుస చర్చలు కొనసాగుతుండగా, అంబటి రాయుడ్ని వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడాన్ని తమ తప్పిదంగానే దేవాంగ్ గాంధీ పేర్కొన్నారు. ‘ అవును.. అది మా తప్పిదమే. తప్పు జరిగింది. కానీ మేము కూడా మనుషులమే. ఏది సరైన కాంబినేషన్ అనే విషయంలోనే పొరపాటు చేశాం. ఆ కోణంలోనే ఆలోచించాం. ఆ తర్వాత చేసిన పొరపాటు తెలుసుకున్నాం. (‘ఐపీఎల్‌కు వెళ్లకుండా ఆపండి’) భారత జట్టు సెమీస్‌లోనే నిష్క్రమించింది. ఇక్కడ రాయుడు లేని లోటు కనిపించింది. కేవలం ఒక్క మ్యాచ్‌తో టీమిండియా అప్పటివరకూ ఆడింది అంతా పోయింది. సెమీస్ తప్పితే మిగతా టోర్నీ అంతా భారత్ బాగా ఆడింది. ఇక్కడ రాయుడు కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను. అతని రియాక్షన్‌ను సమర్థించక తప్పదు. ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు’ అని దేవాంగ్ గాంధీ తెలిపారు. ఆ సమయంలో రాయుడ్ని పక్కకు పెట్టడంతో పెద్ద వివాదమే చెలరేగింది. రాయుడు స్థానంలో విజయ్ శంకర్‌కు చోటివ్వడమే కాకుండా అతనొక త్రీడీ ప్లేయర్ అని అప్పటి చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ విశ్లేషించాడు. దీనికి చిర్రెత్తుకొచ్చిన అంబటి రాయుడు.. వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడటానికి తాను త్రీడీ కళ్లద్దాలను ఆర్డర్ చేశానంటూ సెటైర్ వేశాడు. దాంతో వివాదం మరింత పెద్దదైంది. విజయ్ శంకర్ గాయం కారణంగా స్వదేశానికి వచ్చేసినా రాయుడుకు పిలుపు రాలేదు. అతని స్థానంలో రిషభ్ పంత్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించారు. ఇది రాయుడికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఆ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రాయుడు వీడ్కోలు చెప్పడం, మళ్లీ నాటకీయ పరిణామాల మధ్య తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. -
‘నన్ను వెళ్లమని ఎవరూ ప్రశ్నించలేదు’
కోల్‌కతా: ఆంధ్రాతో రంజీ మ్యాచ్‌లో బెంగాల్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి జాతీయ సెలక్టర్ దేవాంగ్ గాంధీ వెళ్లడం పెద్ద దుమారమే రేపింది. జాతీయ క్రికెట్ జట్టుకు సెలక్టర్‌గా ఉండి ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి నిబంధనల్ని ఉల్లంఘించాడనే వాదన తెరపైకి వచ్చింది. తమ డ్రెస్సింగ్ రూమ్‌లోకి దేవాంగ్ రావడాన్ని బెంగాల్ ఆటగాడు మనోజ్ తివారీ ప్రశ్నించడంతోనే అతను అక్కడ్నుంచి వెళ్లాడని వార్తలు వచ్చాయి. దీనికి ముగింపు పలికాడు దేవాంగ్ గాంధీ. ‘ నేను నిబంధనల్ని ఏమీ ఉల్లంఘించలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి మ్యాచ్ రిఫరీ అనుమతి తీసుకునే వెళ్లా. గత మూడేళ్ల కాలంలో నేను ఏ విధమైన ప్రొటోకాల్‌ను అతిక్రమించలేదు. నేను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళితే ఎవరూ ఒక క్రికెటర్ నన్ను ప్రశ్నించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. నన్ను ఎవరూ అక్కడ్నుంచి పొమ్మనలేదు. చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడి మ్యాచ్‌లకు దూరం కావడంతో ఫిజియోనే డ్రెస్సింగ్ రూమ్‌కు రమ్మన్నాడు. అప్పుడు రిఫరీ అనుమతి తీసుకునే వెళ్లా. నేను నిబంధనల్ని అతిక్రమిస్తే మూడేళ్లుగా సెలక్టర్‌గా ఉండలేను కదా. నన్ను అక్కడ్నుంచి వెళ్లమని ఒక క్రికెటర్ డిమాండ్ చేశాడనడం అది కేవలం కల్పితమే’ అని దేవాంగ్ తెలిపాడు. -
డ్రెస్సింగ్ రూమ్‌లోకి సెలక్టర్.. సరికొత్త వివాదం
కోల్‌కతా: జాతీయ క్రికెట్ జట్టు సెలక్టరైన దేవాంగ్ గాంధీ రంజీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లడంతో సరికొత్త వివాదానికి తెరలేపింది. నగరంలోని ఈడెన్ గార్డెన్లో ఆంధ్రాతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెంగాల్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి దేవాంగ్ గాంధీ వెళ్లి నిబంధనలను అతిక్రమించాడు. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా దేవాంగ్ గాంధీ.. బెంగాల్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. దీనిపై బెంగాల్ ఆటగాడైన మనోజ్ తివారీ దీన్ని ఖండించాడు. జాతీయ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో సభ్యుడైన దేవాంగ్ గాంధీ ఇలా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటూ నిలదీశాడు. ఈ వివాదంపై ఫిర్యాదు చేయడంతో దేవాంగ్ గాంధీని డ్రెస్సింగ్ రూమ్ నుంచి పంపించేశారు. ‘ మేము అవినీతి నిరోధక కోడ్‌ను ఫాలో కావాలి. ఒక జాతీయ సెలక్టర్ అయిన దేవాంగ్ గాంధీ ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాకూడదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో పాటు జట్టుకు సంబంధించిన వారు మాత్రమే ఉండాలి. మరి దీన్ని దేవాంగ్ ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది’ అని ప్రశ్నించాడు. దాంతో దేవాంగ్ గాంధీని ఆ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు పంపించేశారు. తొలి రోజు ఆటలో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ 281/7 వద్ద ఉండగా మ్యాచ్‌కు బ్యాడ్‌లైట్ అంతరాయం కల్గించింది. కాగా, రెండో రోజు ఆటలో బెంగాల్ 289 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఆటగాడు అభిషేక్ రామన్(112) శతకంతో మెరిశాడు. -
బంగర్... ఏమిటీ తీరు?
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనంతరం సంజయ్ బంగర్ ప్రవర్తించిన తీరు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మిగతా కోచింగ్ సిబ్బందికి పొడిగింపు ఇచ్చి తనను విస్మరించినందుకు రగిలిపోయిన బంగర్... ఇటీవలి వెస్టిండీస్ పర్యటనలో జట్టుతో పాటు ఉన్న జాతీయ సెలక్టర్ దేవాంగ్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించాడు. హోటల్లోని దేవాంగ్ గాంధీ గదికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఓ దశలో మరింత కోపోద్రిక్తుడయ్యాడు. ఈ విషయమంతా బోర్డు దృష్టికి వచ్చింది. దీంతో బంగర్‌ను ప్రశ్నించాలని నిర్ణయించింది. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రమణియన్, చీఫ్ కోచ్ రవిశాస్త్రిలను ఘటనపై నివేదిక కోరింది. బంగర్ ఆవేదనలో అర్థం ఉన్నా సెలక్టర్లను ప్రశ్నించే హక్కు అతడికి లేదని స్పష్టంచేసింది. ‘రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ల పనితీరు బాగున్నందుకే కొనసాగింపు ఇచ్చాం. అదేమీ లేని బంగర్ మళ్లీ అవకాశం దక్కుతుందని ఎలా అనుకుంటాడు? ఎవరైనా సరే నిబంధనలు పాటించాల్సిందే. జట్టు మేనేజ్మెంట్ నివేదిక వచ్చాక దానిని క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) ముందుంచుతాం’ అని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇటీవలి ప్రక్రియలో హెడ్ కోచ్ నియామకాన్ని క్రికెట్ సలహా మండలి చూసుకోగా, సహాయ కోచ్‌లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మరోవైపు జట్టులోకి తీసుకోకపోవడంపై ఆటగాళ్లు సోషల్ మీడియాలో సెలక్టర్లపై కామెంట్లు చేస్తుండటం పైనా చర్చ నడుస్తోంది. గత సీజన్లో 850 పైగా పరుగులు చేసినా దులీప్ ట్రోఫీకి పరిగణనలోకి తీసుకోని వైనాన్ని సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్ ప్రశ్నించాడు. ఇలాంటివాటిపై చర్యలు తీసుకునేలా సీవోఏ ఓ విధానం రూపొందించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. -
సెలక్టర్‌గా దీప్‌దాస్ గుప్తా!
న్యూఢిల్లీ : భారత మాజీ వికెట్ కీపర్ దీప్‌దాస్ గుప్తా భారత జట్టు సెలక్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈస్ట్‌జోన్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సాబా కరీం పదవీకాలం సెప్టెంబర్‌లో ముగియనుంది. అతడి స్థానంలో ఈసారి ఈస్ట్ జోన్ తరఫున సెలక్టర్ అభ్యర్థిని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో రేసులో దీప్‌దాస్ గుప్తా గట్టి అభ్యర్థిగా ఉండగా... మరోవైపు బెంగాల్ మాజీ కెప్టెన్ దేవాంగ్ గాంధీ పేరు కూడా పరిశీలనలో ఉంది. దాల్మియా, గంగూలీ కలిసి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.