bengal
-
షమీకి విశ్రాంతి.. టీమిండియా రీ ఎంట్రీ అప్పుడే!
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో తొలి మ్యాచ్‌కు ఈ బెంగాల్ బౌలర్ దూరం కానున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.మోకాలు ఉబ్బిపోయింది!ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ పదకొండు వికెట్ల తీశాడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా షమీ మరోసారి గాయపడినట్లు సమాచారం. అతడి మోకాలు ఉబ్బిపోయినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.అందుకే షమీని హడావుడిగా తిరిగి జట్టులోకి చేర్చుకునే పరిస్థితి లేదని.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు మొత్తంగా దూరమయ్యాడనే సంకేతాలు ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌కు ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీ పేరు కనిపించింది.విశ్రాంతినిచ్చాంఇక డిసెంబరు 21 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో బెంగాల్ తొలుత ఢిల్లీ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు. ‘‘విజయ్ హజారే ట్రోఫీలో మా తొలి మ్యాచ్‌కు షమీ అందుబాటులో ఉండడు. ఈ టీమిండియా వెటరన్ బౌలర్‌కు విశ్రాంతినిచ్చాం’’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధంఈ పరిణామాల నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడు ఫిట్ లేని కారణంగా.. టీమిండియా మేనేజ్మెంట్ మరికొన్నాళ్లపాటు అతడిని పక్కన పెట్టనుందట.ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. అప్పుడే షమీ.. భారత జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా మూడు టెస్టులు ముగిసే సరికి 1-1తో సమంగా ఉంది. తదుపరి మెల్బోర్న్, సిడ్నీల్లో భారత్- ఆసీస్ మధ్య మిగిలిన రెండు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
BGT: మహ్మద్ షమీకి బైబై!
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేలా కనిపించడం లేదు. ఆసీస్‌తో మూడో టెస్టు నుంచే ఈ బెంగాల్ బౌలర్ భారత జట్టుకు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇటీవల... వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడాయి.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పూర్తి కాగానే‘‘షమీ టీమిండియా కిట్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పూర్తి కాగానే అతడు కూడా కంగారూ గడ్డపై అడుగుపెట్టనున్నాడు’’ అని పేర్కొన్నాయి. అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైపోయింది.బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం ఈ మ్యాచ్ ఆరంభమైంది. మరోవైపు.. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే బెంగాల్ జట్టులో షమీ పేరును చేర్చారు సెలక్టర్లు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది.షమీతో పాటు ముకేశ్ కుమార్ ఎంపికఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనబోయే తమ జట్టులో ఇరవై మంది ఆటగాళ్లకు చోటిచ్చింది. సుదీప్ కుమార్ ఘరామీ కెప్టెన్సీలో ఆడబోయే ఈ టీమ్‌కు టీమిండియా స్టార్లలో మహ్మద్ షమీతో పాటు ముకేశ్ కుమార్‌ను కూడా ఎంపిక చేసింది. అదే విధంగా షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ కూడా ఈ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.చీలమండ గాయానికి సర్జరీకాగా 34 ఏళ్ల షమీ చివరగా వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. స్వదేశంలో జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో షమీ 24 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత అతడు చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు.దేశీ టీ20 టోర్నీలో షమీ అదుర్స్ఈ నేపథ్యంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందిన షమీ.. దాదాపు ఏడాది తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నమెంట్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 7.85 ఎకానమీతో పదకొండు వికెట్లు తీశాడు.టీమిండియా తలుపులు తెరిచే ఉన్నాయి.. కానీతద్వారా టీ20 క్రికెట్లో 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు షమీ. ఈ క్రమంలో షమీ ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి అనుకున్న తరుణంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ కోసం టీమిండియా తలుపులు తెరిచే ఉన్నాయని.. అయితే, అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని పేర్కొన్నాడు.షమీకి బైబై చెప్పేశారా?కాగా షమీ ఫిట్‌గానే ఉన్నప్పటికీ ఐదు రోజుల క్రికెట్(టెస్టు) ఆడేందుకు అతడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే బీసీసీఐ అతడిని ఆసీస్ పర్యటన నుంచి పూర్తిగా పక్కనపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు షమీ సిద్ధం కావడం విశేషం.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా.. బ్రిస్బేన్(డిసెంబరు 14-18), మెల్బోర్న్(డిసెంబరు 26-30), సిడ్నీ(జనవరి 3-7)లో మిగిలిన మూడు టెస్టులు ఆడనుంది. మరోవైపు.. షమీ భాగమైన బెంగాల్ జట్టు.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 21న ఢిల్లీతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు బెంగాల్ జట్టుసుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), మహ్మద్ షమీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, కరణ్ లాల్, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), సుమంత గుప్తా, శుభమ్ ఛటర్జీ, రంజోత్ సింగ్ ఖైరా, ప్రదీప్తా ప్రామాణిక్, కౌశిక్ మైటీ, వికాస్ సింగ్, ముకేశ్ కుమార్, సక్షీమ్ చౌదరి, రోహిత్ కుమార్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయాన్ ఘోష్, కనిష్క్ సేథ్.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
షాబాజ్ అహ్మద్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా.. సెమీస్‌లో బరోడా
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో మరో సెమీ ఫైనలిస్టు ఖరారైంది. బెంగాల్‌పై 41 పరుగుల తేడాతో గెలిచిన బరోడా టాప్-4లో అడుగుపెట్టింది. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతడి తమ్ముడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఈసారి దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు.ప్రపంచ రికార్డుకాగా కృనాల్ సారథ్యంలో బరోడా జట్టు ఈసారి అద్భుతాలు సృష్టించింది. లీగ్ దశలో భాగంగా సిక్కిం జట్టుపై పరుగుల విధ్వంసానికి పాల్పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.ఇదే జోరులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న బరోడా జట్టు.. బుధవారం బెంగాల్ జట్టుతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.రాణించిన ఓపెనర్లుపాండ్యా బ్రదర్స్ హార్దిక్(10), కృనాల్(7) పూర్తిగా విఫలమైనా.. ఓపెనర్లు శశ్వత్ రావత్(40), అభిమన్యు సింగ్(37) ఆకట్టుకున్నారు. వీరికి తోడు శివాలిక్ శర్మ(24), భాను పనియా(17), విష్ణు సోలంకి(16 నాటౌట్) రాణించారు. ఇక బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ తలా రెండు వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన బెంగాల్‌కు ఓపెనర్ అభిషేక్ పోరెల్(13 బంతుల్లో 22) మెరుపు ఆరంభం అందించినా.. మరో ఓపెనర్ కరణ్ లాల్(6), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సుదీప్ కుమార్ ఘరామి(2) పూర్తిగా విఫలమయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన రితిక్ ఛటర్జీ సైతం డకౌట్‌గా వెనుదిరిగాడు.షాబాజ్ మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలో రిత్విక్ చౌదరి(18 బంతుల్లో 29)తో కలిసి టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 36 బంతుల్లోనే 55 పరుగులతో షాబాజ్ చెలరేగాడు. అయితే, రితిక్‌ను హార్దిక్ పాండ్యా, షాబాజ్‌ను అతిత్ సేత్ అవుట్ చేయడంతో బెంగాల్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. బరోడా బౌలర్ల ధాటికి.. మిగతా వాళ్లలో ప్రదీప్త 3, సాక్షిమ్ చౌదరి 7, షమీ 0, కనిష్క్ 5(నాటౌట్), సయాన్ ఘోష్(0) చేతులెత్తేశారు.ఫలితంగా 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయిన బెంగాల్.. 41 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు.. బరోడా సెమీ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో బరోడాబరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లుక్మాన్ మెరివాలా, అతిత్ సేత్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. అభిమన్యు ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ సౌరాష్ట్రను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.చదవండి: అతడికి ఆసీస్ జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్ -
హార్దిక్ పాండ్యా విఫలం.. షమీకి రెండు వికెట్లు
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్ ముగింపునకు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌కు చేరే క్రమంలో ఎనిమిది జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్, బరోడా- బెంగాల్, ముంబై- విదర్భ, ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి.ఇందులో భాగంగా తొలుత సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్(క్వార్టర్ ఫైనల్-3) మ్యాచ్ ఫలితం వెలువడింది. కర్ణాటకలోని ఆలూర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచింది. తద్వారా సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.బరోడా ఓపెనర్లు భళాఇక క్వార్టర్ ఫైనల్-1లో భాగంగా బరోడా బెంగాల్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శశ్వత్ రావత్(26 బంతుల్లో 40), అభిమన్యు సింగ్ రాజ్‌పుత్(34 బంతుల్లో 37) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు.పాండ్యా బ్రదర్స్ విఫలంమొత్తంగా 11 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక అతడి అన్న, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా సైతం పూర్తిగా నిరాశపరిచాడు. పదకొండు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేసి నిష్క్రమించాడు. శివాలిక్, విష్ణు మెరుపు ఇన్నింగ్స్మిగతా వాళ్లలో శివాలిక్ శర్మ(17 బంతుల్లో 24), భాను పనియా(11 బంతుల్లో 17), విష్ణు సోలంకి(7 బంతుల్లో 16 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది. బెంగాల్ బౌలర్లలో టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గెలుపు కోసం నువ్వా- నేనా అన్నట్లు పోటీపడిన ఈ మ్యాచ్‌లో బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన హార్దిక్ మూడు వికెట్లతో మెరిశాడు.బరోడా వర్సెస్ బెంగాల్ తుదిజట్లుబెంగాల్అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరణ్ లాల్, సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), రిటిక్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, రిత్విక్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కనిష్క్ సేథ్, మహ్మద్ షమీ, సాక్షిమ్ చౌదరి, సయన్ ఘోష్.బరోడాశశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్, భాను పనియా, శివాలిక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విష్ణు సోలంకి (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), అతిత్ షేత్, మహేష్ పితియా, లుక్మాన్ మేరీవాలా, ఆకాష్ మహరాజ్ సింగ్చదవండి: SMAT 2024: వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్ -
బ్యాట్‌తో రాణించిన షమీ.. క్వార్టర్ ఫైనల్లో బెంగాల్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 9) ఉదయం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ చండీఘడ్‌పై 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మొహమ్మద్ షమీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 17 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 33 పరుగులు చేసిన కరణ్ లాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదిప్త ప్రమాణిక్ 30, వ్రిత్తిక్ చట్టర్జీ 28 పరుగులు చేశారు. చండీఘడ్ బౌలర్లలో జగ్జీత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ బవా 2, నిఖిల్ శర్మ, అమృత్ లుబానా, భగ్మేందర్ లాథర్ తలో వికెట్ తీశారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చండీఘడ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. సయాన్ ఘోష్ నాలుగు వికెట్లు తీసి చండీఘడ్ను దెబ్బకొట్టాడు. కనిష్క్ సేథ్ 2, షాబాజ్ అహ్మద్, షమీ తలో వికెట్ పడగొట్టారు. చండీఘడ్ ఇన్నింగ్స్‌లో రాజ్ బవా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదీప్ యాదవ్ (27), మనన్ వోహ్రా (23), నిఖిల్ శర్మ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కాగా, డిసెంబర్ 11న జరిగే క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ బరోడాను ఢీకొంటుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్‌తో తలపడనుంది. -
ఆంధ్రప్రదేశ్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు శుభారంభం చేసింది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 6–1 గోల్స్ తేడాతో బెంగాల్ జట్టును ఓడించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున మునిపల్లి నాగ నందిని (22వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... పరికి లక్ష్మి (15వ నిమిషంలో), చిల్లూరు నాగతేజ (38వ నిమిషంలో), కెపె్టన్ కుప్పా తులసీ (46వ నిమిషంలో), రాగుల నాగమణి (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. బెంగాల్ జట్టుకు శ్రేష్ట ఛటర్జీ (43వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది.గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో గత ఏడాది రన్నరప్ జార్ఖండ్ 5–0తో ఛత్తీస్‌గఢ్ జట్టుపై, ఉత్తరాఖండ్ 3–1తో రాజస్తాన్ జట్టుపై, కర్ణాటక 5–0తో జమ్మూ కశ్మీర్ జట్టుపై, ఒడిశా 5–0తో హిమాచల్ ప్రదేశ్ జట్టుపై గెలిచాయి. గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. -
7 వికెట్లతో సత్తా చాటిన షమీ.. రీఎంట్రీ అదుర్స్..!
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ రీఎంట్రీలో అదరగొట్టాడు. 360 రోజుల తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ.. వచ్చీ రాగానే రంజీ మ్యాచ్‌లో తన ప్రతాపం చూపించాడు. రంజీల్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించే షమీ మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన షమీ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమీ బ్యాట్‌తోనూ రాణించాడు. 36 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది.MOHAMMAD SHAMI PICKED 7 WICKETS IN HIS FIRST COMPETITIVE MATCH IN 360 DAYS. ❤️pic.twitter.com/e231mVfTDM— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ 228 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (92), అనుస్తుప్ మజుందార్ (44) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్మన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది. షమీ (4/54) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సేనాపతి (47), రజత్ పాటిదార్ (41) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.61 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ 276 పరుగులకు ఆలౌటైంది. విృత్తిక్ ఛటర్జీ (52) అర్ద సెంచరీతో రాణించగా.. సుదీప్ ఘరామీ (40), సుదీప్ ఛటర్జీ (40), వృద్దిమాన్ సాహా (44), షమీ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. షమీ (3/102), షాబాజ్ అహ్మద్ (4/48), రోహిత్ కుమార్ (2/47), మొహమ్మద్ కైఫ్ (షమీ తమ్ముడు) (1/50) ధాటికి 326 పరుగులకు ఆలౌటైంది. సేనాపతి (50), శుభమ్ శర్మ (61), వెంకటేశ్ అయ్యర్ (53) మధ్యప్రదేశ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. -
బ్యాట్‌తోనూ సత్తా చాటిన షమీ
360 రోజుల తర్వాత యాక్టివ్ క్రికెట్లోని అడుగుపెట్టిన టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ వచ్చీ రాగానే రంజీ ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించిన షమీ తొలుత బౌలింగ్‌లో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో షమీ 19 ఓవర్లలో 54 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం షమీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు. పదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన షమీ 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. షమీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో బెంగాల్ తమ లీడ్‌ను భారీగా పెంచుకోగలిగింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (92), కెప్టెన్ అనుస్తుప్ మజుందార్ (44) రాణించారు. షమీ 2 పరుగులకే ఔటయ్యాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్మన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే ఆలౌటైంది. షమీ (4/54), సూరజ్ సింధు జైస్వాల్ (2/35), మొహమ్మద్ కైఫ్ (2/41), రోహిత్ కుమార్ (1/27) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాంన్షు సేనాపతి (47), రజత్ పాటిదార్ (41) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.61 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సుదీప్ ఘరామీ (40), సుదీప్ ఛటర్జీ (40), వ్రిత్తిక్ ఛటర్జీ (52), వృద్దిమాన్ సాహా (44), షమీ (37) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 276 పరుగులకు ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ పాండే, సరాన్ష్ జైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ మూడో రోజు టీ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 279 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు సుభ్రాన్షు సేనాపతి (27), హిమాన్షు మంత్రి (29) క్రీజ్‌లో ఉన్నారు. -
బొగ్గు గనిలో పేలుడు..ఏడుగురి మృతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని బీర్భుమ్ జిల్లాలోని ఓ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. సోమవారం(అక్టోబర్7) జరిగిన ఈ పేలుడులో ఏడుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన గనిలో బొగ్గు వెలికితీసేందుకుగాను బాంబులు పెడుతుండగా పేలుడు సంభవించింది.పేలుడు తర్వాత గని ప్రదేశంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. గని వద్ద నిలిపి ఉంచిన వాహనాలు పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. ఇదీ చదవండి: పండుగల వేళ ఢిల్లీలో హై అలర్ట్ -
తెరుచుకున్న జార్ఖండ్- బెంగాల్ సరిహద్దు
కోల్‌కతా/రాంచీ: పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దు దాదాపు 24 గంటల తరువాత తెరుచుకుంది. అంతర్రాష్ట్ర వాణిజ్యం కోసం ట్రక్కుల తరలింపును ఉద్దేశిస్తూ సరిహద్దును తిరిగి తెరిచారు. పశ్చిమ బెంగాల్లో వరదలకు జార్ఖండ్‌లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ దరిమిలా పశ్చిమ బెంగాల్- జార్ఖండ్ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేయాలంటూ మమత అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం సాయంత్రం ఈ రెండు రాష్ట్రాల సరిహద్దును మూసివేశారు.జార్ఖండ్ ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర సరిహద్దు తెరుచుకుందని, ఎన్‌హెచ్ -2, ఎన్‌హెచ్-5 వేలాది ట్రక్కులు పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరాయని తెలిపారు. అయితే అయితే సరిహద్దు వద్ద 20 నుంచి 25 కిలోమీటర్ల పొడవైన క్యూలో ట్రక్కులు ఉన్నాయని, ఇవి ముందుకు కదిలేందుకు కొంత సమయం పడుతుందన్నారు.జార్ఖండ్‌ను సురక్షితంగా ఉంచేందుకు డీవీసీ తన డ్యామ్‌ల నుండి నీటిని విడుదల చేయడం వల్లే తమ రాష్ట్రంలో వరద పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వచ్చే భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. కాగా న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుపీ) సూచనల మేరకు నీటిని విడుదల చేశామని, అయితే ఇప్పుడు దానిని నిలిపివేసినట్లు డీవీసీ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు -
పాత ‘కలకత్తా’ మిగిలే ఉంది!
బెంగాలీ రాజధానిలో బ్రిటన్ రాచరికపు విశేషంగా కొన్ని చక్కటి అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ‘కలకత్తా’ నగరం నడిబొడ్డున, ఒకప్పుడు పార్క్ స్ట్రీట్‌గా వాడుకలో ఉన్న ప్రదేశానికి కొద్ది దూరాన... బ్రిటిష్ హయాంను గుర్తు చేసేలా ‘ద గ్లెన్‌బర్న్’ అనే ఒక ఆహ్లాదకరమైన చిన్న భోజనశాల ఉంది. బ్రిటన్ మారిపోయింది కానీ, కలకత్తాలోని ఈ ప్రదేశం ధిక్కారంగా నేటికీ అలానే ఉండిపోయింది. ఇటీవల ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన విషాదం,ఆ వెంబడి సామూహిక నిరసనలు, ముఖ్యమంత్రి అనిశ్చిత భవిష్యత్తు... వీటన్నిటిపై చర్చలు, వాదనలు ఇక్కడ కూడా జరగకుండా లేవు. కానీ ఇక్కడి నుండి చూస్తే అవి వేరే ప్రపంచానికి చెందిన అంశాలుగా అనిపిస్తాయి.తొలి పరిచయంలోనే ఏర్పరచుకునే అభి ప్రాయాలు తప్పుదారి పట్టించేవిగా ఉండ వచ్చునని నేను అంగీకరిస్తాను. కానీ అవి చెరగని ముద్రలుగా కూడా నిలిచిపోగలవు. గత వారాంతపు నా ‘కలకత్తా’ పర్యటన విషయంలో ఇది నిశ్చయంగా వాస్తవం. నాకు ఆ నగరం గురించి ఏమంత తెలి యదు. కనీసం ఐదేళ్లుగా నేను ఆ నగరాన్ని సందర్శించిందే లేదు. అయితే, ఆ బెంగాలీ రాజధానిలో రాచరికపు విశేషంగా కొన్ని చక్కటి అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయన్న ఒక కాదనలేని భావనకు నేను లోనయ్యాను. నేనక్కడ కలిసిన స్థానికులు కూడా ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని అనుకోను. అందువల్లనే నేను ఆ నగరానికి ఉన్న ‘కలకత్తా’ అనే వలసరాజ్య నామాన్ని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉపయోగిస్తున్నాను. నగరం నడిబొడ్డున, ఒకప్పుడు పార్క్ స్ట్రీట్‌గా వాడుకలో ఉన్న ప్రదేశానికి కొద్ది దూరాన, అనాకమైనదిగా తప్ప మీరు గుర్తించని ఒక భవంతి... బ్రిటిష్ హయాంను గుర్తు చేసేలా ‘ద గ్లెన్‌బర్న్’ అనే ఒక ఆహ్లాదకరమైన చిన్న భోజనశాలను తనలో పొదవుకుని ఉంటుంది. ఒకసారి మీరు ఆ అసహ్యకరమైన పరిసరాలను, జీర్ణావస్థలో ఉన్న ప్రవేశ ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్లారా... 7, 8 అంతస్థులలోని గతకాలపు విస్మృత ప్రపంచంలోకి అడుగు పెడతారు. గ్లెన్బర్న్లోని తొమ్మిది గదులలో రేఖాగణితం నమూనాలో డిజైన్ చేసిన చెక్క పలకల ఫ్లోరింగ్, షాండ్లియర్లు, కలపను మలిచి తీర్చిన సోఫాలు, వార్నిష్ పట్టిన ఒంపుకాళ్ల బల్లలు, వర్ణాలంకరణలను అచ్చు గుద్దిన పత్తి వస్త్రాల పరుపులు, ఇత్తడితో పటం కట్టిన పురాతన పూల కళాకృతులు ఉన్నాయి. అక్కడి విశాలమైన స్నానపు గదులు పాతకాలపు నాటి ఆధునిక శైలిలో రూపొందిన గాజు లోహపు తొట్టెలను కలిగి ఉన్నాయి. వాటిల్లో మీరు మునిగిపోవచ్చు. దేహాన్ని సాధ్యమైనంతగా సాగదీసుకోనూవచ్చు. సూర్యోదయపు తొలి కిరణాలు తొంగి చూసే అక్కడి ఒక గదిలో నేను మూడు రోజుల పాతదైన లండన్ టైమ్స్ దిన పత్రికను చదు వుతూ అల్పాహారం తీసుకున్నాను. అది మన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సమకాలీన సంచిక కన్నా మరింత సందర్భోచితంగా ఉన్నట్లు అనిపించింది. ‘లండన్ టైమ్స్’లోని కోర్ట్ సర్క్యులర్ శీర్షికలో ఆనాటి రాచ కార్యాల వివరాలు ప్రచురించి ఉన్నాయి. రాజు గారు బల్మోరల్ విహారంలో ఉన్నారు, బహుశా గ్రౌస్ పక్షుల్ని వేటాడటం కోసం. పేపర్ నుంచి తలెత్తి చూసినప్పుడు బయట విక్టోరియా మెమోరియల్ నా వైపు తదేకంగా చూస్తూ ఉండటాన్ని గమనించాను. (దాని నిర్మాణ స్ఫూర్తి సారథి) లార్డ్ కర్జన్ తన ప్రాతఃకాల కాఫీ సేవిస్తూ, ఇంతకంటే మెరుగైన దృశ్యాన్ని ఆశించివుండరు!ఇంకో వైపు నుంచి కలకత్తా మైదానం కనిపిస్తోంది. గత ఆదివారం అది హరితపత్రంలా, ఆహ్వానిస్తున్నట్లుగా దర్శనమిచ్చింది. దూరంగా వర్షాకాలపు శీతల ఉషోదయంలో కొంతమంది పురుషులు ఉల్లాసంగా గుర్రాలను దౌడు తీయించటం గమనించాను. గొడుగులు పట్టుకొని ఉన్న మహిళలు, చిన్న పిల్లలు, వారి పెంపుడు కుక్కపిల్లలు అక్కడి పచ్చికలో ఆడుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత వాళ్లు టిఫిన్ చేయటం కోసం గ్లెన్బర్న్కు వస్తారా? వస్తే కనుక వారి విహార యాత్రను ముగించటానికి పింక్ జిన్లు కచ్చితంగా ఒక అత్యంత సముచితమైన మార్గంగా ఉంటాయి. బెంగాల్ క్లబ్బు సభ్యులతో మాట్లాడటానికి నాకు ఆహ్వానం లభించింది. పంజాబీ ధాబాలా మారిపోయిన ఢిల్లీ జింఖానా క్లబ్‌కు భిన్నమైన ప్రపంచం అది. ఇక్కడి బ్రిటిష్ వాసనల్లోని గొప్ప ఆపేక్ష, అమితమైన శ్రద్ధ... ఆహ్లాదాన్ని కలిగి ఉన్నాయి.క్లబ్బుకు వచ్చిన వారిలో షిఫాన్ చీరలు, ముత్యాల కంఠ హారాలు ధరించిన స్త్రీలు; చక్కగా ఇస్త్రీ చేసిన ప్యాంట్లు, హుందాగా ఉండే చొక్కాలు ధరించిన పురుషులు ఉన్నారు. ఎక్కడా కుర్తా–పైజమా కానీ, భద్రలోక్ ధోతీ కానీ కనిపించలేదు. వారికి బెంగాలీ భాష తెలుస నటంలో సందేహం లేదు కానీ, నాకు ఇంగ్లిష్ మాత్రమే విని పించింది... అచ్చంగా నైట్స్‌బ్రిడ్జ్ (లండన్)లో మాట్లాడిన విధంగా. మేము జనరల్ అవుట్రామ్ నిలువెత్తు తైలవర్ణ చిత్తరు వులోని ఆయన చురుకైన చూపుల కింద భోజనం చేశాం. క్లబ్బు పూర్వపు అధ్యక్షుడు ఆయన. ఇప్పుడైతే నిస్సందేహంగా కొత్త సభ్యత్వంపై ఒక కన్నేసి ఉంచేవారు. మెనూలోని ఆహార పదార్థాలు తప్పక ఆయన సమ్మతిని కలిగి ఉండేవి. అది రెండు వైన్లతో కూడిన నాలుగు వంటకాల భోజనం. తళతళ మెరుస్తున్న తెల్లటి చైనా ప్లేట్లకు రెండు వైపులా వెండితో చేసిన స్పూన్లు, ఫోర్కులు అందంగా అమర్చి ఉన్నాయి. క్యారెట్, సెలెరీ కాడల చారు, రాతి పీతలు, క్రాన్బెర్రీ జెల్లీలో మిగుల వేయించిన మాంసం ముక్కలు, చుట్టూతా పుదీనా సాస్ పోసి ఉన్న మృదువైన బ్రాందీ స్నాప్ గొట్టాలు భోజనం బల్లపై ఉన్నాయి. గాజు స్ఫటికాల లోటాలలో వచ్చిన జివ్వనిపించే చల్లని మద్యం, దానికి జతగా ఉన్న సన్నని ఆకుకూరల కాండాలతో మా సాయంత్రం ముగిసింది. ‘‘నేను వారానికి ఒకసారి బ్లెన్హైమ్(బ్రిటన్ రాజప్రాసాదం)లో భోజనం చేస్తాను’’ అని కర్జన్ గొప్పగా చెప్పుకున్న మాటను ఇది నాకు గుర్తు చేసింది. బ్రిటన్ మారిపోయింది కానీ, కలకత్తాలోని ఒక భాగం ధిక్కారంగా అలానే ఉండిపోయింది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన విషాదం, ఆ వెంబడి సామూహిక నిరసనలు, ముఖ్యమంత్రి అనిశ్చిత భవి ష్యత్తు... వీట న్నిటిపై చర్చలు, వాదాలు జరగటం అన్నది నిస్సందే హమే! అయినా, ఈ పరమ పావన గ్లెన్‌బర్న్, బెంగాల్ క్లబ్బు ఆవర ణల నుంచి చూస్తే అవి వేరే ప్రపంచానికి చెందినవిగా అనిపిస్తాయి. కాబట్టి, మీరు కనుక పొగలు కక్కుతున్న ఉడుకుడుకు తృణధాన్య ఆహారం, ఆ తర్వాత గిలకొట్టి వేయించిన గుడ్లు, ఊరబెట్టిన పంది మాంసంతో ఆదివారాలను ప్రారంభించేందుకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి అయుండి, ‘అమృత్ కాల్’తో నాకొచ్చేదేమిటని అనుకుంటూ ఉంటే నేను మీకు గ్లెన్బర్న్ను, బెంగాల్ క్లబ్బును సిఫారసు చేస్తాను. అక్కడ ఎల్లప్పుడూ సమయం నిశ్చలంగా ఉంటుందని మీరు దృఢంగా విశ్వసించవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
షమీ రీ ఎంట్రీ ఖరారు!.. కానీ...
టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది బెంగాల్ తరఫున అతడు రంజీ బరిలో దిగే అవకాశం ఉంది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రకటించిన ప్రాబబుల్స్ జట్టులో షమీకి కూడా చోటు దక్కింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పేస్ బౌలర్ రీ ఎంట్రీ చూడబోతున్నామంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చీలమండ గాయం.. సర్జరీవన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన షమీ.. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నవంబరు 19 తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.కోలుకున్నాడు కానీ..బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న షమీ.. ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అదే విధంగా.. ఇటీవలే బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. ఈ నేపథ్యంలో.. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో షమీ ఆడతాడని భావించినా.. బీసీసీఐ మాత్రం అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత అతడిని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం.బెంగాల్ తరఫున రంజీలోఈ క్రమంలో స్వదేశంలో సెప్టెంబరులో బంగ్లాదేశ్, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా ఆడే టెస్టు సిరీస్‌లకు కూడా షమీ దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ తర్వాత జరుగనున్న రంజీ ట్రోఫీలో మాత్రం షమీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెంగాల్ అసోసియేషన్ ప్రకటన ద్వారా తాజాగా వెల్లడైంది. ఆసీస్‌తో సిరీస్ ద్వారా టీమిండియాలో పునరాగమనం!బెంగాల్ తరఫున రంజీ 2024- 25 సీజన్లో ఆడేందుకు అవకాశం ఉన్న 31 మంది ఆటగాళ్ల జాబితాలో షమీ పేరు కూడా ఉండటంతో.. అతడు ఆస్ట్రేలియాతో సిరీస్ దాకా టీమిండియాకు దూరంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు నవంబరులో ఆసీస్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. అందుకే అప్పటి వరకు షమీకి కావాల్సినంత రెస్టు ఇచ్చి.. రంజీ బరిలో దింపడం ద్వారా మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించి.. ఆపై ఈ సిరీస్‌లో ఆడించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నిరాశపరిచిన శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ -
కోల్‌కతా లో టెన్షన్ టెన్షన్..
-
మనిషితనం మాయమైందా?
సమాజం సహించలేని కొన్ని ఘటనలు ఆవేదన కలిగిస్తాయి. ఆగ్రహం రప్పిస్తాయి. చట్టాలెన్ని ఉన్నా ఆగకుండా సాగుతున్న అకృత్యాలపై ఏమీ చేయలేమా అన్న ఆక్రోశం రగిలిస్తాయి. కోల్‌కతా వైద్యశిక్షణార్థి ‘అభయ’ ఘటన నుంచి దేశం ఇంకా తేరుకోక ముందే, మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో పసిపిల్లల పాఠశాలలో నాలుగేళ్ళ వయసు చిన్నారులు ఇద్దరిపై పాఠశాల పనివాడి అమానుష కృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన వివరాలు వింటుంటేనే మనసు వికలమవుతుంది. ప్రజా నిరసనల రీత్యా మహారాష్ట్ర సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది సరే, పిల్లలకు బడిలోనే భద్రత లేకపోతే ప్రతి ఒక్కరికీ విద్యాహక్కు గురించి చర్చిస్తే ఏమి లాభమన్న బొంబాయి హైకోర్ట్ తాజా వ్యాఖ్యలు నిష్ఠురమైనా నిజమే. ఇప్పుడిక ప్రతి స్కూలులో నెలరోజుల్లోగా సీసీ టీవీ కెమెరాలు పెట్టాలి, వారంలో మూడుసార్లైనా ఆ ఫుటేజ్‌ను పరిశీలించాలి లాంటి సర్కారీ ఆదేశాలు షరా మామూలే. కానీ, కోల్‌కతా నుంచి బద్లాపూర్ దాకా అన్నిచోట్లా రాజ్యవ్యవస్థ చేతిలో ప్రజావిశ్వాసం కుప్పకూలడం సమకాలీన భారత విషాదం. పసిపిల్లలపై అకృత్యం జరిగితే, ఆ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సహకరించడానికి బదులు సదరు ‘ఆదర్శ విద్యాలయం’ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం విషాదం. విద్యాబుద్ధుల కోసం బడికి పిల్లల్ని పంపి, వారు అక్కడ భద్రంగా ఉంటారని భావించే కన్నవారికి ఇది భరించలేని కష్టం. పైగా, ఫిర్యాదు దాఖలుకు వారిని 11 గంటల పైగా వేచి ఉండేలా చేయడం దేనికి సంకేతం? ఇలాంటి ఘటనల్లో పాఠశాల వారినీ బాధ్యుల్ని చేస్తూ, ‘పోక్సో’ చట్టం కింద కేసు కట్టాలి. ఆ కనీస బాధ్యతను సైతం పోలీసులు విస్మరించడం క్షమించరాని దుర్మార్గం. చివరకు బొంబాయి హైకోర్ట్ ఆ లోపాన్ని ఎత్తిచూపాల్సి వచ్చింది. ‘అభయ’ ఘటనలోనూ అచ్చంగా ఇలాంటివే జరిగాయి. ఇలాంటి ఆటవిక చర్యలు ఎక్కడ జరిగినా జెండాలకు అతీతంగా రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాల్సి ఉండగా, స్వీయ రాజకీయలబ్ధికై ప్రయత్నించడం సిగ్గుచేటు. కోల్‌కతా ఘటనపై రచ్చ చేసే పార్టీ బద్లాపూర్పై నోరు మెదపదు. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని బద్లాపూర్పై హంగామా చేసేవారు కోల్‌కతా ఘటనపై కంటితుడుపుకే పరిమితమవుతారు. రాజ్యాంగబద్ధ హోదాలోని బెంగాల్ గవర్నర్ టీవీ డిబేట్లలో కూర్చొని రాష్ట్ర సర్కార్‌ను దూషిస్తూ ఇంటర్వ్యూలిస్తుంటే ఏమనుకోవాలి? సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలపైనా నిజాయతీ వదిలేసి నీచ రాజకీయాలు చేస్తే దేశం ఏటు పోతుంది?ఉవ్వెత్తున ఎగసిపడ్డ భారీ నిరసనల నేపథ్యంలో కోల్‌కతా అంశంపై సుప్రీమ్ కోర్ట్, బద్లాపూర్ ఘటనపై బొంబాయి హైకోర్ట్ తమకు తాము స్వచ్ఛందంగా విచారణ చేపట్టడమే ఒకింత ఊరట. న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల్లో మినుకు మినుకుమంటున్న ఆశాదీపానికి కోర్టు చొరవ ఒక చిన్న కాపుదల. ఇవాళ దేశంలో రోజూ 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆనక హత్య చేసి, అడ్డు తొల గించడాలూ పెరిగిపోతున్నాయి. నోరు విప్పి చెప్పుకోలేని వారి పట్ల నీచప్రవర్తనలూ పెచ్చరిల్లుతున్నాయి. మన మధ్యే మామూలు వ్యక్తుల్లా తిరుగుతున్న మానవ మృగాలను నిరోధించడం కఠిన సమస్యే. అయితే, మనసుంటే మార్గాలుంటాయి. మహిళలు, పిల్లల కోసం ‘మినీ – పోలీస్ స్టేషన్ల’ను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం లాంటివి సిఫార్సు చేస్తున్నాయి. సుప్రీమ్ కోర్ట్ గురువారం బెంగాల్ సర్కార్‌కు ముక్కచీవాట్లు పెట్టిన నేపథ్యంలో సీఎం మమత సైతం తీవ్రతను అంగీకరించారు. అత్యాచార నేరాలపై అత్యంత కఠిన చట్టాలు చేయాలనీ, ఇలాంటి కేసుల్ని 15 రోజుల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టాలనీ ప్రధానిని కోరారు. అంతకన్నా ముందు సమాజంగా మనం ఆత్మశోధన చేసుకోవాలి. 2012 నాటి ‘నిర్భయ’ ఘటన తర్వాత కఠినచట్టాలు చేసినా పరిస్థితులు మారలేదంటే లోపం ఎక్కడున్నట్టు? వావివరుసలు లేవు, వయసులో చిన్నాపెద్దా విచక్షణ లేదు, చట్టం పట్ల భయభక్తులు అసలే లేవు. ఇలా ఉచ్చం నీచం మరిచి, చివరకు చిన్నారులపైనా మనుషులు మృగాలుగా మారడానికి దారి తీస్తున్న సాంఘిక, మానసిక పరిస్థితుల్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన వెనకాలే ఊడలు దిగుతున్న ఈ వికృత ధోరణిని పెంచి పోషిస్తున్న మన వినోద, వినిమయ సంస్కృతులు, వైయక్తిక ప్రవర్తనల్ని సమీక్షించుకోవాల్సి ఉంది. ఈ భూతాన్ని ఆపేదెలా అని సత్వరమే ఆలోచించాల్సి ఉంది. ఇప్పటికీ ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూసే సామాజిక వైఖరి, మగవాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనే ఆధిపత్య భావజాలం లాంటి అనేక అంశాల్లో మనం మారాల్సి ఉంది. కోర్టుల చొరవ, ఆదేశాలతో రానున్న రోజుల్లో కోల్‌కతా కేసు, బద్లాపూర్ కేసులు త్వరితగతినే తేలితే తేలవచ్చు. నిందితులకు కఠిన శిక్షలూ ఖాయం కావచ్చు. కానీ, దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ ఒకటి రెండు కేసుల్లోనే కాదు... వెలుగులోకి రాని వందల ఘటనలకు మూలకారణమైన మౌలిక అంశాలపై మనం ఎప్పటికి కళ్ళు తెరుస్తాం? సాక్షాత్తూ శిష్యులపై రేప్‌తో 20 ఏళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు హర్యానాలో ఎన్నికల వేళ పదేపదే పెరోల్ ఇస్తూ పోతుంటాం. గత నాలుగేళ్ళలో 234 రోజులు ఆయన జైలు బయటే ఉన్నారు. మైనర్ బాలిక రేప్ కేసులో జీవిత ఖైదులో ఉన్న మరో బాబా ఆశారామ్ బాపూను ఆయుర్వేద చికిత్సకై తాజాగా బయటకు వదులుతాం. అన్ని వ్యవస్థలనూ నీరుగార్చి, అధికారం సహా అనేక బలహీనతలతో పాలకులు చేసే ఈ పాపాలన్నీ శాపాలు కాక మరేమవుతాయి? జనం మూడోకన్ను తెరవాల్సిన సమయం వచ్చింది. -
తిరిగి బెంగాల్ గూటికి చేరిన సాహా
వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా దేశవాలీ క్రికెట్లో తిరిగి బెంగాల్ గూటికి చేరాడు. సాహా రెండేళ్ల కింద బెంగాల్ నుంచి త్రిపురకు వలస వెళ్లాడు. తాజాగా మనసు మార్చుకున్న సాహా తిరిగి బెంగాల్ జట్టుతో జత కట్టేందుకు సిద్ధమయ్యాడు. మూడు ఫార్మాట్లలో బెంగాల్ టీమ్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. సుదీర్ఘ అనుబంధం ఉన్న బెంగాల్ జట్టులో తిరిగి చేరడం ఆనందంగా ఉందని, తదుపరి దేశవాలీ సీజన్లో ఆడేందుకు ఆతృతగా ఉన్నానని సాహా తెలిపాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి సాహా ఈ విషయాలను వెల్లడించాడు. సాహా రీఎంట్రీపై స్నేహశిష్ సైతం హర్షం వ్యక్తం చేశాడు. సాహాను బెంగాల్ జట్టులోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు స్నేహశిష్ తెలిపాడు. గతంలో సాహా బెంగాల్ జట్టుకు ఎంతో చేశాడని, అతని చేరిక బెంగాల్ జట్టును మరింత పటిష్ట పరుస్తుందని స్నేహశిష్ అభిప్రాయపడ్డాడు. వయసు మీద పడటంతోపై సాహా స్పందిస్తే.. అది కేవలం అంకెలకు మాత్రమే పరిమితం అని, తనలో క్రికెట్ ఆడే ఓపిక ఇంకా ఉందని అన్నాడు. ప్రస్తుత బెంగాల్ జట్టు యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉందని.. జట్టుకు అవసరమైన ఏ సేవలైనా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సాహా తెలిపాడు.39 ఏళ్ల సాహా టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడి 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. సాహా ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. లేటు వయసులోనూ సాహా ఐపీఎల్లో సత్తా చాటుతున్నాడు. -
అరుణాశయ బుద్ధమూర్తి
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య మృతి ప్రగతిశీల రాజకీయాలు, ప్రజా స్వామిక విలువలు కోరుకునేవారందరికీ విచారం కలిగించింది. రాజకీయ విభేదా లకు అతీతంగా ఆయనకు నేతలు నివాళు లర్పించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన నిబద్ధత, నిజాయితీ, నిరాడంబరత్వం, నిష్కపటత్వం వంటి విశిష్టతలను వారు గుర్తు చేసు కుంటున్నారు. దేశంలో కీలకమైన బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రానికి పదకొండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా సాదాసీదా అపార్ట్మెంట్లోనే ఆఖరి దాకా జీవితం గడిపిన ఆదర్శం ఆయనది. కమ్యూ నిస్టు ఉద్యమం సృష్టించిన త్యాగధనులలో మూడవ తరానికి చెందిన బుద్ధదేవ్ ప్రెసిడెన్సీ కాలేజీలో సాహిత్యం చదువుకుని విద్యార్థి సంఘాల ద్వారా 1966లో వామపక్ష ఉద్యమంలో ప్రవే శించారు. 1977లో తొలి వామపక్ష ప్రభుత్వంలో సమాచార, సాంస్కృతిక మంత్రిగా చేరిన ఆయన 1982లో ఓడిపోయినా 1987లో మళ్లీ గెలిచి బాధ్యతలు చేపట్టారు. 1996లో జ్యోతిబాసు అనా రోగ్యం తర్వాత కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి దేశంలోనే కొత్తరికార్డు నెలకొల్పిన మహానాయకుడు జ్యోతిబాసు తర్వాత వామపక్ష కూటమి భవిష్యత్తు ఏమవుతుందనే సవాళ్లకు సమర్థమైన సమాధానంగా బుద్ధదేవ్ నిలిచారు. 2000 నుంచి పదకొండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1985 నుంచి కేంద్ర కమిటీ, తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడుగా సీపీఎంలో ముఖ్యపాత్ర పోషించారు. యువమంత్రిగా, డివైఎఫ్ఐ నాయకుడుగా 1979లో ఆయన వరంగల్‌లో ఉమ్మడి రాష్ట్ర తొలి మహాసభలకు రావడం ఈ రచయితకు గుర్తుంది. పాతికేళ్ల తర్వాత 2005లో అదే వరంగల్‌లో సీపీఎం మహాసభలలో బుద్ధదేవ్ చేసిన కీలక ప్రసంగంలో అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ మత తత్వ రాజకీయాలపై నిశిత విమర్శలు అనువదించాను కూడా! ‘‘గుజరాత్లో జరిగిన దారుణాలకు సాటి ముఖ్యమంత్రిగా నేను సిగ్గుపడుతున్నాను’’ అని అప్పుడాయన అన్నారు. మృదుభాషిగా పేరొందిన బుద్ధదేవ్ రాజకీయ విషయాల్లో అంత నిక్కచ్చిగా ఉండేవారు. బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో తొలి రెండు ఎన్నికల్లోనూ ఫ్రంట్ విజయాలు కొత్త చరిత్ర సృష్టించాయి. 2006 ఎన్నికలలో వామపక్షాలకు 294కు 235 స్థానాలు వచ్చాయి. దానికన్నా ముందు 2004 లోక్‌సభ ఎన్నికలలోనూ 35 స్థానాలు వచ్చాయి. పార్లమెంటులో మొత్తం 60 స్థానాలతో వామపక్షాలు, అందులో 42 సీట్లతో సీపీఎం పాత్ర, ప్రభావాలు శిఖరాగ్రానికి చేరాయి. ఆ మద్దతే లేకపోతే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఉండేది కాదు. కాంగ్రెస్ ఆ రాజకీయ సందేశాన్ని సవ్యంగా అర్థం చేసుకుని ఉంటే... అణు ఒప్పందం చిచ్చు పెట్టకపోతే చరిత్ర మరోలా ఉండేది. బుద్ధదేవ్ సైద్ధాంతికంగా కొత్తపుంతలు తొక్కుతున్నారనీ, దార్శనికతతో పిడివాదాన్ని వదిలేశారనీ ఒక వైపున లేనిపోని పొగడ్తలు... మరోవైపున భూములు లాక్కొంటున్నారనే ప్రచారా లకు బడా మీడియా వేదికైంది. సరళీకరణ విధానాలను, భూ దోపిడీని వ్యతిరేకించినవే వామపక్షాలు కాగా ఆ ముద్రతో వాటిపైనే దాడి చేయడం బూర్జువా వర్గాల వ్యూహమైంది. వామపక్ష ఫ్రంట్ టార్గెట్‌గా సింగూరు, నందిగ్రావ్ు ఘటనలపై అదేపనిగా ప్రచారాలు జరిగాయి. సింగూర్‌లో టాటా కార్ల ఫ్యాక్టరీ దాదాపు పూర్తవుతుంటే దాన్ని అడ్డుకోవడానికి ఆ రోజుల్లో మమతా బెనర్జీ చేసిన హడావిడి మర్చిపోరానిది. కాంగ్రెస్, మమతా బెనర్జీ బుద్ధదేవ్ ప్రభుత్వాన్ని ఓడించడమే పరమార్థంగా వ్యవహరించాయి. మావోయిస్టు పార్టీ కూడా గొంతు కలిపింది. వాటిలో కొన్ని తప్పొప్పులు లేవని కాదు గాని ప్రజలకు ఉపాధి పెంచాలన్నదే బుద్ధదేవ్ సంకల్పంగా ఉండేది. ఆ పరిణామాలపై చాలా సమీక్షలే జరిగాయి. అనేక అధికారిక నివేదికలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటిని సాకల్యంగా చూస్తే ఎవరికైనా పూర్తి నిజాలు తెలుస్తాయి. ‘‘టాటాలే బెంగాల్ నుంచి తరలిపోవడం వల్ల రాష్ట్రానికి చెప్ప లేని నష్టం జరిగింది. నేను ఎక్కడ తప్పు చేశానా అని కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. భూ సేకరణే తప్పా లేక భూ సేకరణ జరిగిన విధానమా? నేను ప్రతిపక్షాలపై మరీ మెతగ్గా వ్యవహరించానా? ఆ అనుభవాల నుంచి మనం పాఠాలు తీసు కోవాలి’’ అని ఆయన చెప్పారు. బుద్ధదేవ్, జ్యోతిబాసు వంటివారు భద్రలోక్ అనీ, మమతా దీదీ ప్రజల మనిషని ప్రచారం చేసిన వారే ఇప్పుడు ఆమె నిరంకుశ పోకడలపై విరుచుకుపడుతున్నారు. మోదీ ఏకపక్షపాలన ముదిరాక ఆమె కూడా అనేక రాజకీయ విన్యాసాలతో ఉనికి కాపాడుకుంటున్నారు. బుద్ధదేవ్ మాత్రం ‘మోదీ హఠావో, మమతా హఠావో’ నినాదంతోనే రాజకీయ జీవితం ముగించారు. 34 ఏళ్ల పాటు పాలించిన వామపక్ష ప్రభుత్వం 2011లో ఓడి పోయాక నిర్బంధాలు తట్టుకుని బుద్ధదేవ్ గట్టిగా నిలబడ్డారు. ఆరోగ్యం సహకరించినంతవరకూ సమావేశాలలో, సభలలో పాల్గొంటూ, ఉద్యమాన్ని నిలబ్టెడంలో తన పాత్ర నిర్వహిసూ వచ్చారు. 2011లో ఓడిపోయిన తన నియోజకవర్గమైన జాదవ్ పూర్లో 2017లో పెద్ద మెజార్టీతో సీపీఎం అభ్యర్థినే గెలిపించు కోగలిగారు. ఆయన భార్య మీరా భట్టాచార్య, కుమారుడు సుచేతన్ కూడా ఆశయాల బాటలో తోడుగా నిలిచారు. ఎవరు ఎంత చెప్పినా పావ్‌ు అవెన్యూలోని తన నిరాడంబర ‘టు బెడ్ రూవ్‌ు ఫ్లాట్‘ నివాసాన్ని మార్చుకోవడానికి బుద్ధదేవ్ ఒప్పు కోలేదు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పాత అంబాసిడర్ కారునే ఆఖరు వరకూ ఆయన వాడారు.2023లో మోదీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటిస్తే తీసుకోవడానికి నిరాకరించారు. ఆనారోగ్యంలో పరా మర్శించే పేరిట మమతా బెనర్జీ లేదా అప్పటి గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ వంటివారు రాజకీయాలు చేయబోతే సాగనివ్వలేదు. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ ఒరవడికి అద్దం పడతాయి. ఆయన మరణానంతరం అధికారిక గన్ సెల్యూట్‌ను కూడా కుటుంబ సభ్యులు నిరాకరించారు.కళా, సాహిత్య రంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన రచయిత, కవి, నాటకకర్త కూడా! ఇన్ని రాజకీయాల సిద్ధాంత ఘర్షణల మధ్యనా టాగోర్ కవితలను 500 దాకా కంఠోపాఠంగా చెప్పేవారట! సంక్లిష్టమైన ఆధునిక రచయితలు కాఫ్కా, మార్క్వెజ్ వంటి వారి రచనలను ఆయన బెంగాలీలోకి అనువదించారు. సమాంతర చిత్రాలకు పేరెన్నికగన్న కొల్కతాలో నందన్ కానన్ కళాభవన్ పేరిట ఒక శాశ్వత వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిగా చొరవ తీసుకున్నారు. ప్రసిద్ధ బెంగాలీ రచయిత సుకాంత భట్టాచార్య ఆయన బాబాయి. తన ఆత్మకథను రెండు భాగాలుగా వెలువరించారు బుద్ధదేవ్. ‘ఫిర్దేఖా’, ‘ఫిర్దేఖా 2’ అనే ఆ రెండు సంపుటాల్లో జీవితాన్ని రాజకీయ పాలనానుభవాలను నెమరు వేసుకున్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా బెంగాలీలు ఆయనను ఎంత ప్రేమించారు, దేశం ఎంత గౌరవించింది అనడానికి అంతిమఘట్టంలో ప్రదర్శితమైన గౌరవాభిమా నాలే నిదర్శనం. తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు, విశ్లేషకులు -
Bangladesh: నీటిలో నిలుచుని.. భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు
బంగ్లాదేశ్‌లో నూతనప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో ఉంటున్న పలు హిందూ కుటుంబాలకు చెందినవారు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.తాజాగా బంగ్లాదేశ్‌లో ఉంటున్న వెయ్యిమంది హిందూ కుటుంబాలకు చెందినవారు బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లోని రిజర్వాయర్‌లో నిలబడి తమను భారతదేశంలోకి అనుమతించాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)ను అభ్యర్థిస్తున్నారు. వారిలోని కొందరు 'జై శ్రీరామ్', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. సరిహద్దులోని జీరో పాయింట్‌కు 150 గజాల దూరంలో ఉన్న కంచెను దాటకుండా బీఎస్ఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.బారత్ - బంగ్లదేశ్ సరిహద్దుపై నిఘా సారించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సరిహద్దు భద్రతా దళం తూర్పు కమాండ్ ఏడీజీని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు. దీనికిముందు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం నిఘాను మరింతగా పెంచింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
కుర్సియాంగ్ ప్రకృతిలో.. ఏదో తెలియని వికృతి దాగుందట..
ప్రకృతి, వికృతి.. ఇవి ఏనాటికీ ఒకటి కాలేవు. ఎక్కడా ఒకటిగా కానరావు. కానీ కుర్సియాంగ్ ప్రకృతిలో ఏదో తెలియని వికృతి దాగుందట. చిత్రవిచిత్రమైన రూపాల్లో వణికిస్తోందట. ఏంటా మిస్టరీ.?పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్.. పర్యాటకానికి పెట్టింది పేరు. అందులో ‘డౌ హీల్’ మాత్రం.. అతీంద్రియశక్తులపై ఆసక్తి చూపేవాళ్లకు ఇస్తుంది మాంచి జోరు. డార్జిలింగ్ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్సియాంగ్కి సరిగ్గా 10 నిమిషాలే డౌ పర్వతాలు. దీన్ని చాలామంది ‘మోస్ట్ హాంటెడ్ హిల్ స్టేష¯Œ ’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో హారర్ స్టోరీస్ వినిపిస్తారు.ఒక పక్క తేయాకు తోటలు.. మరో పక్క ఆర్కిడ్ పూల తోటలు.. చుట్టూ కొండలు, పెద్దపెద్ద చెట్లతో దట్టమైన అడవిని తలపిస్తుందీ ప్రాంతం. అయితే సాయంత్రం ఐదు దాటితే.. డౌ హిల్ రోడ్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ మధ్య ఎవ్వరూ తిరగరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏవో శక్తులు తిరుగుతూ ఉంటాయని అక్కడివారి నమ్మకం. పైగా ఆ రోడ్ని.. ‘డెత్ రోడ్’ అనీ పిలుస్తుంటారు. అక్కడ ఒక ఆడ దయ్యాన్ని చూశామని కొందరు.. ఏవో అరుపులు, ఆర్తనాదాలు విన్నామని ఇంకొందరు.. గగుర్పాటును కలిగించే వింత రూపాలను చూశామని మరికొందరు.. చెబుతుంటారు.విక్టోరియా బాయ్స్ హై స్కూల్ఇక ఆ సమీపంలోనే ఉన్న ‘విక్టోరియా బాయ్స్ హై స్కూల్’కి కూడా ఈ గాలి సోకిందని వారందరి నమ్మకం. ‘ఒక తల లేని బాలుడు ఆ స్కూల్ నుంచి అడవిలోకి నడిచి వెళ్లడం కళ్లారా చూశాం’ అని.. అడవిలో కట్టెలు కొట్టుకునే బృందం సాక్ష్యం చెప్పింది. అడవికి వనమూలికల కోసం వచ్చే మరో బృందమైతే.. చింతనిప్పుల్లాంటి ఎర్రటి కళ్లు తమని వెంబడించాయని, తరిమేశాయని కొత్తకథను వినిపించింది. అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి వెళితే తప్పకుండా వారు ఆశించినవి ఎదురవుతాయని కొందరి పర్యాటకులు నమ్మకంగా చెబుతుంటారు.‘విక్టోరియా బాయ్స్ హై స్కూల్’ శీతకాలపు సెలవుల్లో.. సాయంత్రం అయితే చాలు.. మూసి ఉన్న స్కూల్ నుంచి పెద్ద పెద్ద గుసగుసలు, అడుగుల చప్పుళ్లు ప్రతిధ్వనిస్తుంటాయట. సూర్యాస్తమయం కాగానే.. పెద్ద హోరుగాలి చుట్టుముడుతుందని.. భవనం కారిడార్లలో అబ్బాయిల నవ్వులు, పరుగెత్తడం స్పష్టంగా వినిపిస్తాయని స్థానికులు పెద్దపెద్ద కళ్లు చేసుకుని వివరిస్తుంటారు. అయితే ఇక్కడ చదువుకునే విద్యార్థులు కానీ.. చదువు చెప్పే ఉపాధ్యాయులు కానీ ఏనాడూ దయ్యాల కథలు చెప్పలేదు. ఎటువంటి అనుమానస్పద స్థితి గురించి నిర్ధారించలేదు. అయితే స్థానికులే కాకుండా ఇక్కడికి వెళ్లిన పర్యాటకులకూ వింత అనుభవాలు ఎదురవ్వడంతో ఈ కొండమలుపుల్లో, చెట్టు చేమల్లో ఏదో శక్తి ఉందనే ప్రచారం మాత్రం విస్తృతంగా సాగుతోంది. దాంతో ఈ ప్రాంతం మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
బెంగాల్లో రైలు ప్రమాదం.. 10కి చేరిన మృతులు
న్యూఢిల్లీ/కోల్‌కతా/ సిలిగురి: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం సంభవించిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో, మృతుల సంఖ్య 9 నుంచి 10కి చేరుకుందన్నారు. సీల్డాకు వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం ఉదయం రంగపాణి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న కాంచనజంగ రైలును వెనుక నుంచి ఢీకొట్టిన విషయం తెల్సిందే.ఘటనలో మృతి చెందిన, గాయాలపాలైన వారిని వదిలేసి ప్రమాదానికి గురవని బోగీలతో 850 మంది ప్రయా ణికులతో సోమవారం మధ్యాహ్నం బయలుదేరిన కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ మంగళవారం వేకువజామున సీల్డాకు చేరుకున్నట్లు ఈస్టర్న్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. సీల్డా నుంచి ప్రయాణికులను వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు 16 బస్సులు, 60 కార్లను ఏర్పాటు చేశామన్నారు.కుమార్తె బర్త్‌డే కోసం వస్తూ...సోమవారం జరిగిన రైలు ప్రమాదం కోల్‌కతాకు చెందిన సృష్టి అనే 11 ఏళ్ల చిన్నారికి తీరని వేదన మిగిల్చింది. ఈమె తండ్రి శుభొజిత్ మాలి(31) ఆఫీసు పని మీద శుక్రవారం సిలిగురి వెళ్లారు. మరికొద్ది రోజులపాటు ఆయన అక్కడే ఉండిపోవాల్సి ఉంది. కానీ, సృష్టి బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు ముందుగానే సోమవారం బయలుదేరారు. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కే ముందు సృష్టికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఎలాగోలా సమయానికి వచ్చేస్తా.బర్త్‌డే ఘనంగా చేసుకుందామని, కేకు తీసుకొస్తానని కూతురికి మాట ఇచ్చారు. కానీ, విధి మరోలా ఉంది. రైలు ప్రమాదంలో మరణించిన వారిలో శుభొజిత్ కూడా ఉన్నారు. అదే రైలులో ప్రయాణించిన ఆయన స్నేహితుడు ఈ విషాద వార్తను కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో, శుభొజిత్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. ఎప్పుడూ బస్సులోనే ప్రయాణించే శుభొజిత్.. ఈసారి మాత్రం కుమార్తె పుట్టిన రోజు వేడుక జరపాలనే తొందరలో రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారని, ఇదే ఆయన ప్రాణాలు తీసిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి: ఖర్గేదేశంలో రైల్వే వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. మోటారు సైకిల్‌పై కూర్చుని ప్రమాద స్థలికి మంత్రి చేరుకోవడంపై స్పందిస్తూ. అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రినా లేక రీల్ మంత్రినా అంటూ ఎద్దేవా చేశారు. -
బెంగాల్లో దీదీ మేజిక్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మేజిక్ మరోసారి పనిచేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో 42 స్థానాలకుగాను 29 చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు, సందేశ్ఖాలీసహా రాష్ట్రంలో పలు చోట్ల అంతర్గత సమస్యలు తలెత్తినా అవేమీ దీదీ నేతృత్వంలో టీఎంసీ విజయయాత్రను ఆపలేకపోయాయి. పశ్చిమబెంగాల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలు ఒడిసిపట్టాలని బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా కాళ్లకు బలపం కట్టుకుని మరీ తెగ ప్రచారంచేశారు.ఎగ్జిట్ పోల్స్ సైతం ఈసారి బెంగాల్లో కమలవికాసం ఖాయమని అంచనాలు వెలువరిచాయి. ఈసారి మోదీ మేనియా ఉండొచ్చన్న రాజకీయ పండితుల లెక్కలూ తప్పు అని మమత మరోసారి నిరూపించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో కొనసాగబోనంటూ వేరుబడి కూడా సార్వత్రిక ఎన్నికల్లో మమత జయకేతనం ఎగరేయడం విశేషం. ‘ బెంగాల్లో బీజేపీ అంతర్గత కలహాలు, వ్యవస్థాగతంగా బలహీనంగా ఉండటం, బలమైన లెఫ్ట్–కాంగ్రెస్ కూటమి నేపథ్యంలో తృణమూల్ వ్యతిరేక ఓటును బీజేపీ తనవైపునకు తిప్పుకోలేకపోయింది’ అని రాజకీయ విశ్లేషకుడు మైదుల్ ఇస్లామ్ చెప్పారు. అందుకే 2019తో పోలిస్తే తృణమూల్ ఓటు షేరు నాలుగు శాతం పెరిగి 47 శాతానికి చేరుకుంది. బీజేపీ 12 చోట్ల విజయం సాధించింది. 2019 ఎన్నికల్లాగే సీపీఐ(ఎం) పార్టీ ఈసారి కూడా బోణీ కొట్టలేక చతికిలపడింది. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. జట్టు కట్టకపోవడంతో పుంజుకుందికాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు ఒప్పందం నుంచి మమత జనవరిలోనే వైదొలగడం టీఎంసీకి బాగా కలిసి వచ్చింది. దీంతో త్రిముఖపోరులో మైనారిటీలు, బీజేపీ వ్యతిరేకులు మరోమార్గంలేక టీఎంసీకే ఓటేశారు. గతంలో బీజేపీ సైతం ఇలాగే టీఎంసీ వ్యతిరేక ఓట్లను ఒడిసిపట్టి 2014లో 17 శాతంగా ఉన్న ఓటు షేరును 2019లో 40 శాతానికి పెంచుకుంది. స్థానిక సమస్యలు, ఎస్ఎస్సీ ఉద్యోగాల రద్దు, సీఏఏ అమలు అంశాలు ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారాయి. మైనారిటీ ఓటుతో పైపైకిమైనారిటీల బలం దీదీ పార్టీకి ఎంతో దోహపడింది. సీఏఏ అమలు, రామకృష్ణమిషన్, భారత్ సేవాశ్రమం సంఘ్‌లను వ్యతిరేకిస్తూ మమత వ్యాఖ్యలు, 77 ముస్లిం ఉపకులాలకు ఓబీసీ హోదా రద్దుచేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పుతో మమత మాత్రమే తమను పట్టించుకుంటారని భావించి మైనారిటీలు టీఎంసీ వెంట నడిచి పార్టీ విజయాన్ని సులభం చేశారు. లక్ష్మీర్ భండార్, కన్యశ్రీ పథకాల లబ్ధిపొందిన మహిళలూ మమతకు మద్దతు పలికారు.మోదీ తక్షణమే రాజీనామా చేయాలి: మమతలోక్సభ ఎన్నికల్లో నైతిక ఓటమిని అంగీకరిస్తూ ప్రధాని మోదీ వెంటనే పదవి నుంచి వైదొలగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ 400కుపైగా సీట్లు సాధిస్తుందంటూ ప్రచారం చేసుకున్న మోదీ వాస్తవానికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన మెజారిటీని సైతం సాధించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. మోదీ విశ్వసనీయత కోల్పో యారు. ఇండియా గెలిచింది. మోదీ ఓడిపోయారు. ఎన్నో రాజకీయ పారీ్టలను ఆయన ముక్కలుచెక్కలుగా చేశారు. ప్రజలే ఆయన్ను నైతికంగా దెబ్బకొట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మోదీ టీడీపీ, నితీశ్ కుమార్ల వద్ద కాళ్లబేరానికి వచ్చారు’అని మండిపడ్డారు. -
కోల్‌కతా మే సవాల్
పోలింగ్ జరిగే లోక్‌సభ స్థానాలు డమ్ డమ్, బారాసత్, బసీర్హాట్, జయనగర్, మథురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్‌పూర్, కోల్‌కతా దక్షిణ్, కోల్‌కతా ఉత్తర్ పశ్చిమ బెంగాల్లో సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. ఆరు విడతల్లో 33 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా 9 స్థానాల్లో జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో చాలా సీట్లు కోల్‌కతా నగర పరిధిలో ఉన్నవే. ఇవన్నీ అధికార తృణమూల్ ఖాతాలోని స్థానాలే. ఈసారి వాటిపై కమలనాథులు కన్నేశారు. దాంతో బీజేపీ, తృణమూల్ మధ్య హోరాహోరీ సాగుతోంది. బెంగాల్లో ఇండియా కూటమికి మమత దూరంగా ఉండటంతో కాంగ్రెస్–సీపీఎం కలిసి పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సీట్లపై ఫోకస్... – సాక్షి, నేషనల్ డెస్క్డైమండ్ హార్బర్... అభిషేక్ హ్యాట్రిక్ గురి బ్రిటిషర్ల కాలంలో నిర్మించిన డైమండ్ హార్బర్ పోర్టు యూరప్‌కు ముడి సరుకుల రవాణా హబ్‌గా వెలుగు వెలిగింది. ఈ నియోజవర్గంలో 2009లో తృణమూల్ జెండా పాతింది. గత రెండు ఎన్నికల్లోనూ మమత మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ గెలిచారు. ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. బీజేపీ ఇక్కడ గత ఎన్నికల్లో రెండో స్థానలో నిలిచినా పోయినసారి 4.7 లక్షల పైగా ఓట్లు దక్కించుకుంది. ఈసారి అభిజిత్ దాస్ (బాబీ)ను రంగంలోకి దించింది. సీపీఎం నుంచి ప్రతీకుర్ రెహా్మన్ పోటీలో ఉన్నారు.కోల్‌కతా ఉత్తర్.. తృణమూల్ వర్సెస్ మాజీ తృణమూల్‌కు మరో కంచుకోట. 2009లో ఉనికిలోకి వచి్చంది. తృణమూల్ సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ్ హ్యాట్రిక్ కొట్టారు. ఈసారీ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి తృణమూల్ మాజీ నేత తపస్ రాయ్ పోటీ చేస్తున్నారు. తృణమూల్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ డిప్యూటీ చీఫ్ విప్‌గా ఉన్న ఆయన ఇటీవల తన ఇంట్లో ఈడీ సోదాలు జరిగిన కొద్ది రోజులకే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం! లెఫ్ట్ మద్దతుతో కాంగ్రెస్ తరఫున ప్రదీప్ భట్టాచార్య బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. 20 శాతం పైగా ఉన్న ముస్లిం ఓటర్లు ఇక్కడ కీలకం.జాదవ్‌పూర్... బరిలో బెంగాలీ నటి ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. కోల్‌కతా పరిధిలోని ఈ స్థానంలో 2009 నుంచీ తృణమూల్ వరుస విజయాలు సాధిస్తోంది. సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ నటి మిమి చక్రవర్తి ఇటీవలే తృణమూల్‌కు, లోక్‌సభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు. దాంతో ఈసారి మరో బెంగాలీ నటి, తృణమూల్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సయానీ ఘోష్‌కు దీదీ టికెటిచ్చారు. బీజేపీ నుంచి అనిర్బన్ గంగూలీ, సీపీఎం నుంచి శ్రీజన్ భట్టాచార్య బరిలో ఉన్నారు.కోల్‌కతా దక్షిణ్... దీదీ అడ్డా ఇది మమత కంచుకోట. 1991, 1996ల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆమె తర్వాత 2009 దాకా సొంత పార్టీ తృణమూల్ తరఫున నెగ్గారు. ఆమె సీఎం అయ్యాక కూడా ఇక్కడ తృణమూల్ జెండాయే ఎగురుతోంది. ఈసారి కూడా సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి దేబశ్రీ చౌదరి, సీపీఎం అభ్యరి్థగా సైరా షా హలీం రేసులో ఉన్నారు. పోటీ ప్రధానంగా తృణమూల్, బీజేపీ మధ్యే నెలకొంది.జయనగర్... టఫ్ ఫైట్ అపార అటవీ సంపదకు నెలవైన ఎస్సీ రిజర్వుడ్ స్థానం. సజ్నేఖాలీ పక్షుల సంరక్షణ కేంద్రం, సుందర్బన్ మాగ్రూవ్ నేషనల్ పార్క్ దీని పరిధిలోవే. 2004 దాకా ఆరెస్పీ కంచుకోట. 2014 నుంచి తృణమూల్ పాగా వేసింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ ప్రతిమా మండల్ హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచి్చన అశోక్ కందారీయే మళ్లీ బరిలో ఉన్నారు. 2019లో ఆయనకు 4.5 లక్షల ఓట్లు వచ్చాయి! కాంగ్రెస్ దన్నుతో సీపీఎం సమేంద్రనాథ్ మండల్‌ను పోటీలో నిలిపింది.మథురాపూర్.. హోరాహోరీ ఈ కూడా ఎస్పీ రిజర్వుడ్ స్థానంలో కమ్యూనిస్టులదే ఆధిపత్యం. 94 శాతం మంది గ్రామీణ ప్రజలే. 30 శాతం మంది ఎస్సీ ఓటర్లు. 2009 తర్వాత ఇక్కడ తృణమూల్ జెండా పాతింది. ఆ పార్టీ నుంచి బపీ హల్దార్ పోటీలో ఉన్నారు. బీజేపీ అశోక్ పురకాయిత్ను బరిలోకి దించింది. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం శరత్ చంద్ర హల్దర్‌ను పోటీలో నిలిపింది. దీంతో త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. -
బెంగాల్, బంగ్లాదేశ్‌లో రెమాల్ తుపాను బీభత్సం
-
కొరడా ఝులిపించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుపై ఈసీ కొరడా ఝులిపించింది. ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల మార్పు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఈసీ తొలిసారి చర్యలు తీసుకుంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం కార్యదర్శులు మారుస్తున్నట్లు ఈసీ పేర్కొంది. మిజోరం జీఏడి కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ సీఎంఓ కార్యదర్శులు ఎన్నికల సంఘం తొలగించింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను ఎన్నికల సంఘం మార్చింది. ముంబై మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల ఈసీ తొలగించినట్లు తెలిపింది. -
తెలంగాణ, ఆంధ్ర జట్లు చిత్తు
జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. పూల్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 11–0 గోల్స్ తేడాతో తెలంగాణపై ఘన విజయం సాధించింది. బెంగాల్ ప్లేయర్ సంజన ‘హ్యాట్రిక్’ సహా ఐదు గోల్స్ సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో సుస్మిత పన్నా కూడా ‘హ్యాట్రిక్’ సాధించగా... మోనికా నాగ్ 2, అంజన డుంగ్‌డుంగ్ ఒక గోల్ చేశారు. ఈ గెలుపుతో బెంగాల్ జాతీయ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో వైపు పూల్ ‘సి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 11–2 గోల్స్‌తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందింది. భారత సీనియర్ జట్టు ప్లేయర్ వందనా కటారియా ‘హ్యాట్రిక్’ సాధించగా... ముంతాజ్ ఖాన్, ఉపాసన సింగ్ చెరో 2 గోల్స్ కొటారు. యూపీ తరఫున శశికళ, రీతూ సింగ్, స్వర్ణిక రావత్, సిమ్రన్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లలో కళ్యాణి స్వర్ణపూడి, గార్లంక వరహాలమ్మ ఒక్కో గోల్ కొట్టారు. అయితే ఈ విజయం తర్వాత కూడా గ్రూప్‌లో రెండో స్థానంలో నిలవడంతో యూపీ నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. -
మహ్మద్ షమీ సంచలన నిర్ణయం.. క్రికెట్ గుడ్‌బై!? రాజకీయాల్లోకి ఎంట్రీ?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. షమీ భారతీయ జనతా పార్టీ తరపున పశ్చిమ బెంగాల్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్దలు షమీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బెంగాల్‌లోని బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే షమీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా బెంగాల్ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే బెంగాల్ మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ, అశోక్ దిండా రాజకీయాల్లో ఉన్నారు. తివారీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా.. దిండా బీజేపీ శాసన సభ్యునిగా ఉన్నాడు. కాగా షమీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇటీవలే తన మడమ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత వేగంగా కోలుకోవాలని ప్రధాని మోదీ సైతం షమీకి విషెస్ కూడా చెప్పారు. దీంతో షమీ రాజీకీయాల్లోకి రావడం ఫిక్స్ అయిపోయిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే షమీ ఒక వేళ రాజకీయాల్లోకి వస్తే అతడి అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్లో యాక్టివ్‌గా లేరు. షమీగా లోక్‌సభ ఎన్నికలో పోటీచేయాలని భావిస్తే అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. షమీ ప్రస్తుతం భారత క్రికెట్లో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో షమీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 24 వికెట్లతో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే వన్డే వరల్డ్‌కప్ తర్వాత షమీ తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. చదవండి: IND vs ENG: ఎందుకంత ఓవరాక్షన్ బాబు.. నీకు రోహిత్ చేతిలో ఉందిలా! వీడియో వైరల్