
చరిత్రలో ఇది బెంగాల్ కరవుగా కూడా ప్రసిద్ధి. బిహార్ ప్రావిన్స్‌లో మొదలైన దుర్భిక్ష పరిస్థితులు కరవు కాటకాలకు దారి తీసి.. పొరుగున్న ఉన్న బెంగాల్, వాయవ్య, ఔద్ ప్రావిన్స్‌లకు కూడా ప్రబలాయి. లక్షా నలభై వేల చదరపు కిలోమీటర్ల మేర, 2 కోట్లకు పైగా జనాభా దుర్భిక్ష ప్రభావాలకు గురైంది. ఎటు చూసినా ఆకలి అలమటింపులు, సహాయం కోసం ఆక్రందనలు. ఆ సమయంలో బెంగాల్‌కు కొత్తగా వచ్చిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సర్ రిచర్డ్ టెంపుల్ శాయశక్తులా సహాయక చర్యలకు కృషి చేసి భారతీయుల అభిమాన పాత్రుడు అయ్యారు. మరణాలు తక్కువే కానీ, కరువు పెట్టిన మరణయాతన తక్కువేం కాదు.
చట్టాలు
ఇండియన్ ఓత్స్ యాక్ట్, గవర్నమెంట్ సేవింగ్స్ ప్రమోషన్ యాక్ట్, గవర్నమెంట్ సేవింగ్స్ బ్యాంక్ యాక్ట్, ఈస్ట్ ఇండియా స్టాక్ డివిడెండ్ రిడెంప్షన్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, ఇండియన్ రైల్వే కంపెనీస్ యాక్ట్, ఎక్‌స్ట్రాడిషన్ యాక్ట్, స్లేవ్ ట్రేడ్ యాక్ట్.
జననాలు
ఉపేంద్ర బ్రహ్మచారి : సైంటిస్టు, మెడికల్ ప్రాక్టీషనర్ (బెంగాల్ ప్రెసిడెన్సీ), ఎ.కె.ఫజ్నుల్ హక్ : బ్రిటిష్ ఇండియన్. పాకిస్తానీ లాయర్. గ్రంథకర్త. షేర్–ఎ–బంగ్లా గా ప్రసిద్ధి (బంగ్లాదేశ్), మార్ థామస్ కురియలఛెరి : కేరళ క్యాథలిక్ బిషప్. చంగనస్సెరి ఆర్చ్‌డయోసిస్ తొలి బిషప్.