
నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు
నెల్లూరు (పొగతోట): అజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా 780 జిల్లాలో120 రోజులపాటు ఈ కార్యక్రమాల అమలు తీరును కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. ఉత్తమ పనితీరు కనబర్చిన టాప్ 10 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 4వ స్థానంలో నిలిచింది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారు.
చదవండి: (దశాబ్దాల స్వప్నం సాకారం)
Comments
Please login to add a commentAdd a comment