National Award
-
నిండు చందమామలా నేషనల్ అవార్డ్ హీరోయిన్ (ఫోటోలు)
-
ఊరు ఉమెన్ అనుకున్నారా... నేషనల్!
ఆ ఊరి జనాభా పదకొండు వందలు కూడా ఉండదు. ‘గ్రామాభివృద్ధికి జనాభా కాదు... చైతన్యం ప్రమాణం’ అనుకుంటే చిల్లపల్లి చిన్న ఊరు కాదు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పెద్ద ఊరు. కేంద్ర ప్రభుత్వం ‘దీన్ దీయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్’ పురస్కారాలు ప్రకటించింది. అందులో ‘ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయితీ’ విభాగంలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయితీకి రెండో ర్యాంకు వచ్చింది. నేడు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముచేతుల మీదుగా చిల్లపల్లి గ్రామపంచాయతీ ఈ అవార్డులను అందుకోనుంది...చిల్లపల్లి గ్రామంలో 1081 మంది జనాభా ఉండగా, అందులో 508 మంది మహిళలు ఉన్నారు. గ్రామంలో ఉన్న 33 స్వశక్తి సంఘాలలో 335 మంది సభ్యులు ఉన్నారు. వీరందరూ ‘శ్రీజ్యోతి గ్రామ సమైక్య సంఘం’ ఏర్పాటు చేసుకుని రూ.3.35కోట్ల వరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. రుణవాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించడమే కాకుండా ΄పొదుపు ఖాతాల్లో సైతం డబ్బును జమ చేస్తున్నారు. కిరాణాషాపులు, కుట్టు మిషన్లు, కోళ్ల పెంపకం, పాడిగేదెలు, కంగన్ హాల్, చికెన్ షాప్, బ్యూటీపార్లర్, టిఫిన్ సెంటర్లు, డ్రాగన్ ప్రూట్స్ తోట, పిండిగిర్ని, కూరగాయల సాగు, విక్రయం, మెడికల్ షాపు, ఐకేపీ సెంటర్ నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడం... మొదలైన పనులతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.సక్సెస్ మంత్రం ఇదే...కొన్ని గ్రామాల్లో మహిళ సంఘాలలోని సభ్యులు డబ్బులు ΄పొదుపు చేసి, రుణాలు తీసుకొని బయట అధిక వడ్డీకి ఇవ్వడానికి ఇష్టపడతారు. దీనివల్ల సంఘాలకు, సభ్యులకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని గ్రహించిన చిల్లపల్లి గ్రామ మహిళలు ΄పొదుపు చేసిన డబ్బులతో పాటు, ప్రభుత్వం ఇచ్చే రుణాలను ఉపాధి కల్పన కోసం ఉపయోగిస్తున్నారు. దీనివల్ల తాము ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి చూపించగలుగుతున్నారు. రుణాలు తీసుకోవడంతో పాటు జీరో బకాయిలతో ముందుకు వెళుతున్నారు.ఆర్థిక స్వావలంబన నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకు చిల్లపల్లి ఆదర్శగ్రామంగా నిలుస్తోంది.‘గ్రామాల్లో ఉండడం దండగ’ అనుకుంటూ ఉపాధి కోసం పట్నం బాట పడుతున్న ఎన్నో కుటుంబాలకు చిల్లపల్లి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. పట్టణంలో బతుకీడుస్తున్న వాళ్లను కూడా ‘నేను నా ఊళ్లో హాయిగా బతక వచ్చు’ అనుకునేలా భరోసా ఇస్తోంది. ఇంతకు మించిన విజయం ఏమిటి!– గుడ్ల శ్రీనివాస్ సాక్షి, పెద్దపల్లి ఫోటోలు: మర్రి సతీష్రెడ్డిరైతు మిత్రులురమాదేవి, సరోజన, సౌజన్య... ముగ్గురు కలిసి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ధాన్యం వచ్చినప్పటి నుంచి తూకం వేసి మిల్లుకు తరలించే వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతి క్వింటాకు ప్రభుత్వం ఇచ్చే రూ.32 కమీషన్ తో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రైతులకు చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు ఐకేపీ సెంటర్ల ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఆ ఊళ్లో రోజూ పండగే!ఆర్థిక స్వావలంబనలోనే కాదు ఆరోగ్యం, పారిశుద్ధ్యంలోనూ చిల్లపల్లి ముందు ఉంటుంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉంది. బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ పై, తల్లిదండ్రులకు పేరెంటింగ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఈ చిన్న ఊళ్లో గాఢమైన నిశ్శబ్దం రాజ్యమేలేది. పెద్ద సందడి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ‘ప్రతిరోజూ మా ఊళ్లో పండగే. సందడే’ అన్నట్లుగా కనిపిస్తుంది. అది మహిళా చైతన్యానికి సంకేతమైన సందడి!మినీ ఏటీఎంతో....డ్వాక్రా సంఘంలో చేరిన తరువాత సుమారు ఐదుసార్లు లోన్ తీసుకున్నాను. మొదటిసారి తీసుకున్నప్పుడు గేదెలు కొనుగోలు చేశాను. ఆ ఆప్పు తీర్చి మళ్లీ లోను ఎత్తుకుని పిల్లల చదువులకు ఉపయోగించాను. మరోసారి లోన్ ఎత్తుకొని సెంట్రింగ్ కర్రలు కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నా. తరువాత మినీ ఏటీఎం నిర్వహించేందుకు ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు లోన్ తీసుకున్నా. మినీ ఏటీఎం నిర్వహణతో నెలకు పదమూడు నుంచి పదిహేను వేల వరకు ఆదాయం వస్తుంది. – కూర వనిత మినీ ఏటీఎం నిర్వాహకురాలుఅందుకే ఆదర్శంగా నిలిచిందిపన్నెండేళ్ల క్రితం మహిళ సంఘంలో చేరాను. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు రుణం తీసుకున్నా. మొదట్లో అయిదువేలు ఎత్తుకోని కుట్టుమిషన్ కొన్నాను. తరువాత లోన్లు తీసుకుంటూ మగ్గం, మెడికల్ షాపు ఏర్పాటు చేసుకున్నాను. స్త్రీనిధి కింద రూ.75వేలు తీసుకుని కిరాణాషాపు ఏర్పాటు చేసుకున్నాం. సంఘంలో లోన్ తీసుకోవడం, ఆ పైసలను సద్వినియోగం చేసుకోవడం, తిరిగి సకాలంలో చెల్లించడంలో మా గ్రామ సమాఖ్య ఆదర్శంగా నిలుస్తుంది. – అరె.శ్వేత మెడికల్ షాపు యజమానిఎన్నో గ్రామాలకు గెలుపు పాఠంనలుగురు కలిస్తే ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో నిరూపించింది చిల్లపల్లి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఏ వ్యాపారానికైనా ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఈ విషయంలో చిల్లపల్లి మహిళలు పర్ఫెక్ట్గా ఉన్నారు. ‘ఫ్రెండ్లీ ఉమెన్ విభాగం’లో జాతీయ అవార్డు రావటం సంతోషంగా ఉంది. అయితే ఇది ఒక ఊరి విజయం మాత్రమే కాదు ఎన్నో గ్రామాలకు గెలుపు పాఠం. ‘మనం కూడా ఇలా చేసి విజయం సాధించవచ్చు’ అని ప్రతి గ్రామం ధైర్యం తెచ్చుకునే విజయం. – సంతోషం పద్మ, ఏపీఎం, మంథని -
ఏడోసారి జాతీయ అవార్డు అందుకున్న సంస్థ
వంటనూనెల తయారీ సంస్థ గోల్డ్‌డ్రాప్ తన ఉత్పత్తుల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించినందుకు జాతీయ అవార్డు అందుకున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈమేరకు గోల్డ్‌డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియాకు కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ (సీఐటీడీ) అవార్డును ప్రదానం చేశారు. గోల్డ్‌డ్రాప్ సంస్థ ఈ అవార్డు అందుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం.అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం, పరిశుభ్రత, పోషకాల పరంగా మెరుగైన వంట నూనెగా గోల్డ్‌డ్రాప్ నిబద్ధత చాటుకుంటోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మితేష్ లోహియా మాట్లాడుతూ ‘మరోసారి ఈ జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. సంస్థ ఉత్పత్తుల్లో నాణ్యతను పాటించడం, కొత్తగా ఆవిష్కరణలు చేయడం పట్ల దృష్టి సారిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: అందుబాటు ధరల్లో ఇళ్లు... విలువ రూ. 67 లక్షల కోట్లుఆహార ఉత్పత్తుల తయారీలో నిబంధనల ప్రకారం భద్రత, సరైన నాణ్యత పాటించే సంస్థలకు కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ ఇండియా (సీఐటీడీ) అవార్డులు అందిస్తోంది. గోల్డ్ డ్రాప్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1984 ఏప్రిల్ 28న స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇది ఉత్పత్తులను తయారు చేస్తోంది. సన్‌ప్లవర్, రైస్ బ్రాన్ ఆయిల్, పామోలిన్ నూనె.. వివిధ ఆయిల్ ఉత్పత్తులను అందిస్తోంది. -
అవార్డుల కోసం నటించను: నిత్యామీనన్
‘‘అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నాపాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను’’ అంటున్నారు హీరోయిన్ నిత్యామీనన్. కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఈ మలయాళ బ్యూటీ. ఇక ధనుష్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రంబళం’ (తెలుగులో ‘తిరు’). మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నిత్యామీనన్.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ– ‘‘తిరు’కి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంటానని ఊహించలేదు. అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నేనుపోషించిన ప్రతిపాత్రకు గుర్తింపు రావాలనుకోను. ఆపాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలనుకునే ఎంపిక చేసుకుంటాను. భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో చాన్స్ వచ్చినా మొహమాటం లేకుండా చేయనని చెబుతాను. అలాంటిపాత్రలపై నాకు ఆసక్తి లేదు. మంచిపాత్ర అయితే చిన్న సినిమా అయినా అంగీకరిస్తాను. అందరూ అనుసరిస్తున్న మార్గంలోనే నేను కూడా వెళ్లాలనే రూల్ లేదు కదా?’’ అని పేర్కొన్నారు. -
నా మధ్యంతర బెయిల్ రద్దు చేయండి: జానీ మాస్టర్
రంగారెడ్డి కోర్టులు: లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో నృత్య దర్శకుడు జానీ మాస్టర్ చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తనకు ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు వచ్చిందని, అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఈ నెల 6నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత సోమవారం రంగారెడ్డి జిల్లా ప్రధాన పోక్సో కోర్టు కమ్ 9వ అదనపు జిల్లా కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు గత గురువారం జానీ మాస్టర్‌కు ఈ నెల 6నుండి 9వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా జానీ మాస్టర్ అందుకోబోయే పురస్కారాన్ని రద్దు చేసినట్లు తెలియడంతో ఆయన తనకు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను వినియోగించుకోబోనని కోర్టులో మెమో దాఖలు చేశాడు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ సాధారణ బెయిల్ పిటిషన్ బుధవారానికి వాయిదా పడింది. -
బెయిల్ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ విషయంలో ఎదురుదెబ్బ తగలనుంది. అక్టోబర్ 8న జాతీయ అవార్డు అందుకునేందుకు బెయిల్ కోసం జానీ మాస్టర్ పిటీషన్ వేశారు. దీంతో రంగారెడ్డి కోర్టు ఈనెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడా బెయిల్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.2022లో తమిళ సినిమా 'తిరుచిత్రబలం' తెలుగులో 'తిరు' చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే జానీ మీద పోక్సో చట్టం కింద వచ్చిన ఆరోపణలతో కేసు నమోదు అయింది. ఈ కారణంతో అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది. దీంతో జానీమాస్టర్‌కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ అనంతరం ఆయన బెయిల్ రద్దు చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదుతో జానీ మాస్టర్ రిమాండ్‌లో ఉన్నారు. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దు
-
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు ఇటీవలే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు గానూ తనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే జానీ పోక్సో కేసు నమోదు కావడంతో పలువురు తనకు నేషనల్ అవార్డు రద్దు చేయవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దాంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేస్తున్నట్టు కేంద్ర అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుంది. 2022 బెస్ట్ కొరియోగ్రఫీకి గాను ఈ నెల 8న ఢిల్లీలో జతీయ అవార్డు అందుకోవలసి ఉంది. అందుకు గాను అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 9 వరకు జానీ మాస్టర్‌కు కోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ జానీపై పోక్సో కేసు కారణంతో అవార్డు రద్దు అయింది. దీంతో అతని బెయిల్‌పై అనిశ్చితి నెలకొంది. -
నేషనల్ అవార్డు తీసుకోవాలి బెయిల్ ఇవ్వండి..
-
దాదాకు ఫాల్కే
బాలీవుడ్లో తెల్లరంగు హీరోల మధ్య మొదటిసారి ఒక నల్లరంగు హీరో జెండా ఎగరేశాడు. పంజాబీ హీరోల మధ్య మొదటిసారి ఒక బెంగాలీ సూపర్‌స్టార్ అవతరించాడు. దక్షిణాదిలో కమల్ హాసన్, చిరంజీవి డాన్స్‌ను అట్రాక్షన్ గా పూర్తిగా మలచక ముందే ‘డిస్కో డాన్సర్’తో మిథున్ చక్రవర్తి డాన్సింగ్ సూపర్‌స్టార్ అయ్యాడు. వెండితెర మెరుపులను పూర్తిగా నమ్మక ‘మోనార్క్’ బ్రాండ్‌తో హోటెలింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించి స్థిరపడ్డాడు. ఇండస్ట్రీకి అతను ‘మిథున్‌దా’! దాదాకు దాదాసాహెబ్ ఫాల్కే!! నటించిన తొలి సినిమాకే నేషనల్ అవార్డు వస్తుందా ఎవరికైనా? మిథున్ చక్రవర్తికి వచ్చింది. మృణాల్‌సేన్ దర్శకత్వంలో మిథున్ నటించిన బెంగాలీ చిత్రం ‘మృగయా’ (1976) అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. అందులో అతను నేర విచారణను ఎదుర్కొనే అమాయక గిరిజనుడిగా నటించాడు. ఈ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన మిథున్, అవార్డు అందుకున్నాక బయటకు రాగానే జర్నలిస్టులు చుట్టుముట్టి ఇంటర్వ్యూ అడిగారు. ‘ఇస్తాను.. ఇస్తాను.. ముందు నాకు భోజనం పెట్టించండి’ అన్నాడు మిథున్ . జేబులో రూపాయి దారి ఖర్చులు లేని పేదరికం అతడి చేతి అవార్డు కంటే ఆకలి తీరడమే ముఖ్యమనిపించింది.∙∙ మిథున్ చక్రవర్తికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మిథున్ ఇప్పుడు వందల కోట్ల ఆస్తి కలిగినవాడు. కాని అతను పుట్టిన ఇల్లు ఎలా ఉంటుంది అని నార్త్ కోల్‌కతాలో ఇప్పటికీ అలాగే ఉన్న ఆ ఇంటిని రెండో కొడుకు ఉష్‌మయ్ చక్రవర్తి సందర్శించాడు. ‘ఇంటి వాకిలిలోనే మురుగునీటి కాలువ ఉంది. దానిని దాటి లోపలికి వెళితే ఆయన పెరిగిన ఇంట్లో కనీసం సూర్యకాంతి రావడం లేదు. ఈ చీకటి కొట్టం నుంచి వచ్చిన మా నాన్న అంత పెద్ద స్వ΄్నాన్ని కన్నాడా అని ఆయన పట్ల నా గౌరవం వందరెట్లు పెరిగింది’ అన్నాడతను.∙∙ మిథున్ చక్రవర్తి అసలు పేరు వేరు. అదేంటనేది మనకు అక్కర్లేదు. కాని అతను కాలేజీ రోజుల్లో రాడికల్ స్టూడెంట్‌గా మారాడు. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమంలోనే అతడి సొంత తమ్ముణ్ణి పోగొట్టుకున్నాడు. ఇక కోల్‌కతాలో ఉండేందుకు ఏ మాత్రం వీలు లేని పరిస్థితి వచ్చింది. ఉద్యమంలో ఉన్నప్పుడు మిథున్ చక్రవర్తి వీథి నాటకాలు హుషారుగా వేసేవాడు. అది గమనించిన ఒక మిత్రుడు నువ్వు దాక్కున్నట్టు ఉంటుంది, నటన నేర్చుకున్నట్టు ఉంటుంది అని పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో చేర్పించాడు. అక్కడే అతను సొంతపేరు దాచి మిథున్ గా మారాడు. కోర్సు పూర్తయిన వెంటనే సినిమా కూడా దొరికింది. విడుదలైంది. నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక దిగుల్లేదు... బాలీవుడ్లో బతికిపోవచ్చు అని ముంబై చేరుకున్నాడు మిథున్ . అక్కడ అతి కర్కశమైన జీవితం అతడికి ఎదురుపడింది.∙∙ ‘నలుపు నలుపు అనేరు నలుగురు నవ్వేరు నలుపు నారాయణమూర్తే గాదా’ అనే పాట మనం పాడుకుంటాంగానీ బాలీవుడ్ వాళ్లు విని అర్థం చేసుకునే అవకాశం లేదు. బాలీవుడ్లో హీరోలంటే తెల్లరంగు పంజాబీవారు. అంతే! దక్షిణాదిలో బాలచందర్ ఎలాగో అప్పటికే రజనీకాంత్‌ను ప్రవేశపెట్టాడు కాని బాలీవుడ్లో నల్లరంగు హీరో అసాధ్యం. మిథున్ నల్లగా ఉంటాడు. పైగా హిందీ కూడా సరిగ్గా రాదు. దానికి తోడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఒకటి తెచ్చుకున్నాడు. ఇక ఎవరు రానిస్తారు? తినడానికి తిండి, ఉండటానికి గది ఏమీ లేని దారుణమైన రోజులు చూశాడు. చాలారోజులు పార్కుల్లో పడుకున్నాడు. ఒక స్నేహితుడు మాతుంగాలోని జిమ్‌ఖానాలో మెంబర్షిప్ ఇప్పిస్తే ఉదయాన్నే కాలకృత్యాల కోసం అక్కడకు వెళ్లేవాడు. మిగిలిన సమయం అంతా రోడ్డు మీదే. ప్రసిద్ధ దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ దగ్గరకు వెళితే ఆయన తన జేబులో ఉన్న పది రూపాయల నోటు ఇచ్చి పంపించేయడం ఇప్పటికీ చెప్పుకుంటారు. మరో దర్శకుడు ‘ఇతను కనుక హీరో అయితే నేను ఇండస్ట్రీ వదిలేసి పోతాను’ అని ముఖానే చె΄్పాడు. 1980ల కాలం అది. అప్పటికే అమితాబ్ సూపర్‌స్టార్ అయ్యాడు. యువ ప్రేక్షకుల కోసం రిషికపూర్ లాంటి వారు ఉన్నారు. నె΄÷టిజం ఉంది. ఏ తలాతోకా లేని మిథున్ ఎలా హీరో అవుతాడు? ∙∙ కాని దేవుడు కూడా ఏదో ఒక వేళలో ఎదురు పడతాడు. ఈసారి దేవుడు బి.సుభాష్ అనే పేరుతో వచ్చాడు. ‘నేను నీతో సినిమా తీస్తాను. దాని పేరు డిస్కో డాన్సర్’ అన్నాడు బి.సుభాష్. అప్పటికే బప్పి లాహిరి కూడా ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. బి.సుభాష్, మిథున్, బప్పి లాహిరి కలిసి ‘డిస్కో డాన్సర్’ తయారు చేశారు. డిసెంబర్ నెల 1982లో విడుదల అయిన ఆ సినిమా దేశమంతా అగ్గి పుట్టించింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ కుర్రకారు నుంచి గృహిణుల వరకూ అందరి నోటా ‘ఐయామే డిస్కో డాన్సర్’ పాటే. ఏ పెళ్లిలో కాలేజీ ఫంక్షన్ లో చూసినా ఆ పాటే. రష్యాలో ఆ సినిమా 1000 ప్రింట్లతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ రోజుల్లో 100 కోట్లు సంపాదించిన తొలి సినిమా అది. ఇప్పటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! మిథున్ ఇప్పుడు సూపర్‌స్టార్ అయ్యాడు. ఆ తర్వాత బి.సుభాష్‌తోనే తీసిన ‘కసమ్ పైదా కర్నేవాలేకీ’, ‘డాన్స్ డాన్స్’ కూడా భారీ హిట్లే. అమితాబ్, జితేంద్ర, శశి కపూర్, వినోద్ ఖన్నా అందరూ ఇప్పుడు మిథున్ వైపు కళ్లప్పగించి చూస్తున్నారు. అమితాబ్‌కు ప్రధాన పోటీదారు వచ్చినట్టే.∙∙ మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో మాస్ పాత్రలు పోషించినా బెంగాలీలో తనకు నచ్చిన పాత్రలు పోషిస్తూ అక్కడా తన ప్రాభవం కాపాడుకున్నాడు. ‘స్వామి వివేకానంద’ (1998)లో రామకృష్ణ పరమహంసగా నటిస్తే దానికి మళ్లీ నేషనల్ అవార్డ్ వచ్చింది. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా తీసిన ‘΄్యార్ ఝక్తా నహీ’ (1985) సంవత్సరాల తరబడి ఆడింది. ఇది తెలుగులో కృష్ణ, శ్రీదేవిలతో ‘పచ్చని కాపురం’ పేరుతో రీమేక్ అయ్యింది. పద్మినీ కొల్హాపురి, రంజిత, శ్రీదేవిలతో మిథున్ చేసిన సినిమాలు ప్రేక్షకులకు హిట్ జోడీగా నచ్చాయి. ∙∙ మిథున్ చక్రవర్తి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా హిట్ అయ్యాడు. అమితాబ్ ‘అగ్నిపథ్’లో వేసిన అయ్యర్ పాత్ర అతడికి చాలా పేరు తెచ్చింది. మణిరత్నం తీసిన ‘గురు’లో పత్రికాధిపతిగా (గోయెంకా) నటించి ఆశ్చర్యపరిచాడు. ‘ఓ మైగాడ్’ (గోపాల గోపాల)లో స్వామీజీగా వేసిన పాత్ర మిథున్ లోని మరో పార్శా్వన్ని చూపింది. టెలివిజన్ షోస్ చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మిథున్ అనుక్షణం బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.∙∙ ప్రారంభాలు మర్చిపోనివాడి గమనం స్థిరంగా ఉంటుంది. ఒకరోజు ఊటీలో షూట్ జరుగుతుంటే అక్కడొక మురికి కాలువ పారుతూ ఉంది. పక్కన ఉన్న నటిని పిలిచి ‘నా ఫ్లాష్‌బ్యాక్ చెప్పమని అడుగుతావుగా. ఇదే నా ఫ్లాష్‌బ్యాక్’ అన్నాడతను ఆ కాలువ చూపుతూ.మురుగు నీటి నుంచి వెలిసిన వెండితెర వేల్పు మిథున్ . కుప్పతొట్టిలో ఉన్న అమ్మాయిని కూతురిగా1996 డిసెంబర్ 1న కోల్‌కతాలో న్యూస్ పేపర్ చదువుతున్న మిథున్ కి ఒక వార్త కలుక్కుమనిపిం చింది. తన భార్య యోగితా బాలి (ఒకప్పటి హీరోయిన్ )ని పిలిచి ఆ వార్త చూపించాడు. అందులో కుప్పతొట్టిలో ఎవరో ఆడపిల్లను వదిలేసి పోయారు అని ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. బాధపడ్డారు. ఆ పాపను తెచ్చి పెంచుకోవాలని వెంటనే నిశ్చయించుకున్నారు. ఒక ఎన్ .జి.ఓ ద్వారా ప్రయత్నిస్తే కుప్పతొట్టిలో ఉండటం వల్ల పాప చాలా సీరియస్ కండిషన్ లో ఉందని చె΄్పారు. అయినా సరే మిథున్, యోగితా ఆ పాపను తెచ్చుకుని కంటికి రెప్పలా కాపాడారు. చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారు. దిశానీ చక్రవర్తి అని పేరు పెట్టారు. అమెరికాలో చదివించారు. మిథున్ కు ఎంతో ప్రాణం ఈ కూతురు.నవ్వలేను...సంతోషంతో ఏడవలేను‘దాదాసాహెబ్ వచ్చిందన్న వార్త నన్ను చేష్టలుడిగేలా చేసింది. నేను నవ్వలేను... ఆనందంతో ఏడ్వలేను. ఫుట్‌పాత్ నుంచి వచ్చిన నేను ఇక్కడ దాకా చేరుకున్నానంటే ఈ పురస్కార ప్రకటన నాలో ఇంకా రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం. నేను ఈ అవార్డు ΄÷ందానంటే ప్రతిభ, అంకితభావం ఉన్న ఎవరైనా ΄÷ందవచ్చు’ అన్నారు మిధున్ చక్రవర్తి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన తర్వాత! కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ఈ వార్తను సోమవారం ప్రకటించారు. దాదాసాహెబ్ పురస్కారం సందర్భంగా మిథున్ చక్రవర్తికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. -
Dalavai Shivamma: అమ్మ గీసిన బొమ్మ
దళవాయి శివమ్మ... తోలుబొమ్మల చిత్రకారిణి. తోలు మీద అపురూప చిత్రాలను గీస్తూ ‘శిల్పగురు’ జాతీయ పురస్కారానికి ఎంపికైన తెలుగు మహిళ శివమ్మ.దళవాయి శివమ్మది ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మల కుంట గ్రామం. తోలుబొమ్మలపై అద్భుతమైన చిత్రాలను సృజనాత్మకంగా చిత్రీకరిస్తోంది. శ్రీకృష్ణ చరిత్ర, విశ్వరూప హనుమ ఘట్టాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కళాకారులకు అందించే శిల్పగురు అవార్డుకు ఈ ఏడాది శివమ్మను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలో ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక మహిళ ఆమె. కేంద్ర చేనేత, జౌళి, హస్త కళల శాఖ ఆమెకు శిల్పగురు అవార్డును ప్రకటించింది. ఈమె ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ అవార్డు ప్రధానం చేసింది.తోలుబొమ్మల తయారీ దళవాయి శివమ్మ కుటుంబవృత్తి. భర్త ్ర΄ోత్సాహంతో ఆమె తోలుబొమ్మలను తయారు చేయడంలో నైపుణ్యాన్ని సాధించారు.. తాతముత్తాతల కాలం నాటినుండి వారికి ఈ కళపై పట్టు ఉండటంతో మారుతున్న ఫ్యాషన్ ΄ోటీ ప్రపంచానికి ధీటుగా వైవిధ్యమైన బొమ్మలను చిత్రిస్తున్నారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న ల్యాంప్సెట్లు, పెయింటింగ్స్, డోర్హ్యాంగర్స్, రామాయణ ఘట్టాలు, సుందరకాండ, శ్రీకృష్ణలీలలు, విశ్వరూప హనుమల ఘట్టాలు ్ర΄ాచుర్యం ΄÷ందాయి.విదేశాల్లో మన బొమ్మలుశివమ్మ తయారు చేస్తున్న తోలుబొమ్మలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో΄ాటు యూరప్, అమెరికా దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ కళ తనతో ΄ాటే అంతరించి ΄ోకుండా నాలుగు తరాల ΄ాటు కొనసాగాలని ఆమె ఆకాంక్ష. అందుకోసం కొత్తతరానికి శిక్షణ ఇస్తోంది. గ్రామీణ మహిళలకు ఉ΄ాధిని కల్పిస్తోంది. ఈ తోలుబొమ్మలను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. దళవాయి శివమ్మ కుమారుడు కుళ్లాయప్ప తోలుబొమ్మల తయారీలో జాతీయ స్థాయి అవార్డులు, వియత్నాం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వీరి కుటుంబం ఎంతో మంది కళాకారులకు ప్రేరణగా నిలుస్తోంది. ఇది కళకు దక్కిన గౌరవంకేంద్ర ప్రభుత్వం తనకు శిల్పగురు అవార్డును ప్రకటించడం యావత్ హస్తకళలకు, కళాకారులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. వందల యేళ్లనాటి పురాతన కళ అయిన తోలుబొమ్మలను తాతల కాలం నుండి తయారు చేస్తున్నాం. దేశ, విదేశాల్లో తమ ఉత్పత్తులకు ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉంది. మా కళ అంతరించి ΄ోకుండా ఎంతో మందికి నేర్పాలన్నదే నా జీవిత లక్ష్యం. – దళవాయి శివమ్మ, తోలుబొమ్మల చిత్రకారిణి, జాతీయ అవార్డు గ్రహీత – కొత్త విజయ్‌భాస్కర్‌రెడ్డి, సాక్షి, ధర్మవరం, శ్రీసత్యసాయి జిల్లా -
చూసేందుకు సాధారణంగానే..!
కాస్త పొగరుబోతు నటిగా ముద్ర వేసుకున్న నటి నిత్యామీనన్. అది ఈమెలోని నటనా ప్రతిభ నుంచి వచ్చింది కావచ్చు. ఈమెను పొట్టి, బొద్దు అమ్మాయి అని కూడా అంటారు. అయితే వాటిని అస్సలు పట్టించుకోదు. అందుకే ఈ మలయాళ భామ తెలుగు, తమిళం భాషల్లోనూ కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తిరుచ్చిట్రఫలం అనే తమిళ చిత్రంలోని నటనకుగానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ అవార్డుల పట్టికలో ఉత్తమ నటి అవార్డుకు నిత్యామీనన్ పేరు చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ‘‘చాలా సంతోషంగా ఉంది. ఇది నేను గెలుచుకున్న తొలి జాతీయ అవార్డు. చూడడానికి సాధారణంగా ఉన్నా, నటన వెనుక ఉన్న శ్రమ సాధారణం కాదని అర్థం చేసుకున్న జాతీయ అవార్డుల కమిటీకి ధన్యవాదాలు. ఉత్తమ నటన అనేది బరువు తగ్గడమో, పెరగడమో, సహజ సిద్ధమైన శరీరాకృతిని మార్చుకోవడంలోనే ఉండదు. అవంతా నటనలో ఒక భాగం మాత్రమే కానీ అవే నటన కాదు. దీన్ని నిరూపించడానికే నేను ప్రయతి్నస్తున్నాను. ఈ అవార్డు నాకు, దర్శకుడు భారతీరాజా, ప్రకాశ్‌రాజ్,ధను‹Ùకు చెందుతుంది. ఎందుకంటే ఒక చిత్రంలో నటుడికి సరిసమానంగా నటికీ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నేను ఇంతకు ముందెప్పుడూ నటించలేదు. అది తిరుచ్చిట్రంఫలం చిత్రంలో జరిగింది. మరో విషయం ఏమిటంటే నిజాల కంటే వదంతులు అధికంగా ప్రచారం అవుతుంటాయి. ఒక రంగంలో ఎదగడం చాలా కష్టం’’ అని నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును ప్రకటించిన విషయం ముందుగా ధనుష్ ఫోన్ చేసి చెప్పారన్నారు. ఆయన ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో విషయం ఏమిటని అడిగానన్నారు. అప్పుడు ఆయన ఈ అవార్డు గురించి వివరించారని నిత్యామీనన్ చెప్పారు. -
ఆ పెద్దలు వేసిన బాటలో నడుస్తున్నాం: కొరియోగ్రాఫర్ జానీ
‘‘ప్రభుదేవాగారు చేసిన ‘వెన్నెలవే.. వెన్నెలవే’ (‘మెరుపు కలలు’ సినిమాలోనిది) పాట నాకు చాలా ఇష్టం. ఈ పాటకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ తరహా పాటను నేనూ చేయాలని కల కనేవాడిని. ఆ అవకాశం ధనుష్‌గారి ‘తిరుచిత్రాంబలమ్’తో దక్కింది. అక్కడ (తమిళం) ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసేందుకు ధనుష్‌గారు నన్నే పిలిపించారు’’ అని జానీ మాస్టర్ అన్నారు. ఇటీవల 70వ జాతీయ సినీ అవార్డ్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ అవార్డ్స్‌లో కొరియోగ్రఫీ విభాగంలో ‘తిరుచిత్రాంబలమ్’ సినిమాలోని ‘మేఘం కరుక్కుద’ పాటకు గాను జాతీయ అవార్డు గెల్చుకున్నారు జానీ మాస్టర్. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు చిత్ర ప్రముఖుల సమక్షంలో సన్మానం జరిగింది. జానీ మాస్టర్ మాట్లాడుతూ– ‘‘మేము ఇలాంటి విజయాలు సాధిస్తున్నామంటే అందుకు ముక్కురాజు మాస్టర్, డ్యానర్స్ అసోసియేషన్ నాయకుల కృషే కారణం.ఎన్నో అవమానాలు ఎదుర్కొని మద్రాస్ నుంచి తెలుగు డ్యాన్సర్స్‌ను ఇక్కడికి తీసుకొచ్చి, అసోసియేషన్ స్థాపించి నిలబెట్టారు ముక్కురాజు మాస్టర్. ఆ పెద్దలు వేసిన బాటలో మేమంతా ముందుకెళ్తున్నాం’’ అని తెలిపారు. ‘‘నేను, గణేశ్, జానీ... ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చింది’’ అన్నారు శేఖర్ మాస్టర్. -
నిత్యా మీనన్ ఎమోషనల్.. ఈ నేషనల్ అవార్డ్ మా నలుగురిది (ఫొటోలు)
-
జాతీయ అవార్డ్.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి సన్మానం (ఫొటోలు)
-
తీయ ఉత్తమ తెలుగు చిత్రం.. సంచలనం సృష్టించిన కార్తికేయ 2
-
జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?
కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా 'ఆట్టం' (మలయాళం) నిలిచింది. దీంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అవార్డ్ వచ్చేంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఏ ఓటీటీలో ఉందోనని తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.'ఆట్టం' విషయానికొస్తే.. కేరళలో ఓ నాటక బృందం. పనిచేసుకుంటూ వీలు దొరికినప్పుడు నాటకాలు ప్రదర్శించే 12 మంది. వీళ్లకి తోడు అంజలి (జరీన్ షిబాబ్) అనే అమ్మాయి. ఓసారి వీళ్ల ప్రదర్శన ఓ విదేశీ జంటకి తెగ నచ్చేస్తుంది. దీంతో తమ రిసార్ట్‌లో వీళ్లకు ఆతిథ్యమిస్తుంది. రాత్రంతా ఫుల్‌గా ఎంజాయ్ చేసి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. తన గదిలో కిటికీ పక్కన పడుకున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అంజలితో అలా ప్రవర్తించింది ఎవరు? దీన్ని ఎలా బయటపెట్టింది అనేదే స్టోరీ?(ఇదీ చదవండి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?)మనుషులు పైకి కనిపించేంత మంచోళ్లు కాదు. ప్రతిఒక్కరిలోనూ రెండు ఫేస్‌లు ఉంటాయి. పైకి మంచిగా కనిపిస్తుంటారు కానీ కొన్నిసార్లు అవసరానికి తగ్గట్లే ప్లేట్ ఫిరాయించేస్తుంటారు. మంచోడిని అనిపించుకోవడం కోసం పక్కనోడిని తక్కువ చేసేలా మాట్లాడటానికైనా అస్సలు మోహమాటపడరు. ఇలా మనకు బాగానే తెలిసిన కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ఆట్టం'.ఇందులో హీరోయిన్‌తో ఎవరు అసభ్యంగా ప్రవర్తించారో చెప్పే క్రమంలో మనిషి నైజం, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు దర్శకుడు స్టోరీ చెప్పిన విధానం.. వ్యక్తి మనకు నచ్చకపోతే అతడేం చేసినా మనకు నచ్చదని చూపించిన వైనం అలరిస్తుంది. అలానే అందరూ ఎవరికీ వాళ్లు ఆలోచిస్తారు కానీ బాధింపబడ్డ అమ్మాయి మానసిక పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోకపోవడం లాంటి సీన్లు మనిషి ఇప్పుడున్న కాలంలో ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పకనే చెబుతాయి. (ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
టాలీవుడ్: జాతీయ అవార్డ్ గ్రహీత 'దాసి' సుదర్శన్ కన్నుమూత
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి నేషనల్ అవార్డ్ అందుకున్న దాసి సుదర్శన్ (73) మరణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చిత్రకారుడు దాసి సుదర్శన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. మిర్యాలగూడ స్వస్థలమైనప్పటికీ వృత్తిరీత్య నాగార్జున్‌సాగర్‌లోని హిల్ కాలనీలోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్ టీచర్‌గా తన జర్నీని ప్రారంభించారు. 1988లో 'దాసి' సినిమాకు గాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న పిట్టంపల్లి సుదర్శన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆ సినిమా వల్ల 'దాసి' సుదర్శన్‌గా గుర్తింపు పొందారు. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన ఆయన ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణించారు. అంతేకాకుండా రచయితగా, పాత్రికేయుడిగా, ఫొటోగ్రాఫర్‌గా,కార్టూనిస్టుగా కూడా ప్రసిద్ధికెక్కారు. 1988 లో విడుదలైన తెలుగు సినిమా దాసి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు తెరకెక్కించారు. అలనాటి తెలంగాణలో దొరల నిరంకుశ పాలనలో చితికిపోయిన గ్రామ ప్రజల జీవితాలను ప్రతిబింబించిన చిత్రం. భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తూ ఆద్యంతం వాస్తవికధోరణిలో రూపొందించబడింది. ఈ చిత్రానికి దు జాతీయ అవార్డులను దక్కించుకోగా అందులో సుదర్శన్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవార్డు పొందారు. ఆ తర్వాత జాతీయ అవార్డుల జ్యూరీలో సభ్యులుగా కూడా ఆయన పనిచేశారు. సుదర్శన్ అంత్యక్రియలు మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రూపశిల్పికి జాతీయ పురస్కారం!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: ఉద్యాన పంటల సాగులో నీటిని అతితక్కువగా వినియోగించే వినత్న భూగర్భ డ్రిప్ ‘స్వర్’ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సిఇసి) డైరెక్టర్ కే.ఎస్. గోపాల్ ‘నీటి సుస్థిరత పురస్కారం 2023–24’ విజేతగా నిలిచారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి, సీఈఓ భరత్ లాల్ చేతుల మీదుగా గోపాల్ పురస్కారాన్ని అందుకున్నారు. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి), కేంద్ర జలశక్తి శాఖ, యుఎన్‌డిపి ఇండియా సంయుక్తంగా వాటర్ సస్టయినబిలిటీ అవార్డ్స్‌ను వరుసగా మూడో ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు. ‘ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫీషియన్సీ – అగ్రికల్చర్ సెక్టార్’ విభాగంలో ప్రధమ బహుమతిని సిఇసి డైరెక్టర్ గోపాల్ గెల్చుకున్నారు. సాధారణ డ్రిప్ భూమి పైనే బిందువులుగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్ రూపొందించిన స్వర్ డ్రిప్ భూమి లోపల మొక్కల వేరే వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇవి చదవండి: Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం! -
Hetvi Khimsuriya: బంగారంలాంటి బిడ్డ
గుజరాత్‌లోని వడోదరకు చెందిన హెత్వి ఖిమ్సూరియా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పీఎం నేషనల్ చైల్డ్ అవార్డ్ (ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్–పీఎంఆర్బీపి) అందుకుంది. వివిధ రంగాలలో పిల్లలు సాధించిన అద్భుత విజయాలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారం ఇది. పదమూడు సంవత్సరాల హెత్వి సెరిబ్రల్ పాల్సీని అధిగమించి పెయింటింగ్, పజిల్ సాల్వింగ్‌లో అసా«ధారణ ప్రతిభ చూపుతోంది. తనకు వచ్చే పెన్షన్‌ను దివ్యాంగుల సంక్షేమ నిధికి ఇస్తోంది. తన ఆర్ట్‌పై యూట్యూబ్ చానల్ నడుపుతోంది.... వడోదరలోని 8–గ్రేడ్ స్టూడెంట్ హెత్వి ఖిమ్సూరియాకు పురస్కారాలు కొత్త కాదు. ప్రశంసలు కొత్తకాదు. గత సంవత్సరం ఫ్రీహ్యాండ్ పెయింటింగ్, క్రాఫ్ట్, పజిల్ సాల్వింగ్‌లో చూపుతున్న ప్రతిభకు ‘గుజరాత్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. ‘వరల్డ్స్ ఫస్ట్ సీపీ గర్ల్ విత్ ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్’ టైటిల్ సాధించింది. వంద ఎడ్యుకేషనల్ పజిల్స్ సాల్వ్ చేసిన ఫస్ట్ సీపీ గర్ల్‌గా ఆమెను ‘ది లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు సాధించిన హెత్వి గీసిన చిత్రాలు యాభై ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శితమయ్యాయి. చిత్రకళలపై పిల్లల్లో ఆసక్తి కలిగించడానికి ‘స్పెషల్ చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ–హెత్వి ఖిమ్సూరియా’ అనే యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. హెత్వి విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. కూతురు ప్రస్తావన వచ్చినప్పుడు ‘అయ్యో! మీ అమ్మాయి’ అంటూ ఎంతోమంది సానుభూతి చూపే సమయాల్లో ‘బాధ పడాల్సిన అవసరం ఏముంది. మా అమ్మాయి బంగారం. భవిష్యత్‌లో ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడండి’ అనేవారు. ఆ మాట అక్షరాలా నిజమైంది. చిన్నప్పటి నుంచి బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. హెత్విని చూసుకోవడానికి ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది. రంగులు, పజిల్స్‌తో బేసిక్స్ ప్రారంభించారు. రంగులు, పజిల్స్ అంటే హెత్విలో ఇష్టం ఏర్పడేలా చేశారు. బొమ్మలు వేస్తున్నప్పుడు, పజిల్స్ పరిష్కరిస్తున్నప్పుడు ఆ అమ్మాయి కళ్లలో శక్తి కనిపిస్తుంది. ఆ శక్తితో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని తల్లిదండ్రులలో నింపింది. హెత్వి మోములో ఎప్పుడూ చెరగని చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వే ఈ చిన్నారి బలం. హెత్వి ఖిమ్సూరియా మర్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. -
ఏపీ మైనింగ్‌కు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: మేజర్ మినరల్స్ మైనింగ్ లీజుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయస్థాయి అవార్డు లభించింది. భోపాల్‌లో మంగళవారం జరిగిన స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేతులు మీదుగా రాష్ట్ర గనుల శాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సమక్షంలో ‘అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్’ను వీజీ వెంకటరెడ్డికి ప్రహ్లాద్ జోషి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకువచ్చిన పలు సంస్కరణలను కేంద్ర మంత్రి అభినందించారు. మైనింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత పారదర్శకంగా అవలంభిస్తున్న విధానాల వల్ల అనతికాలంలోనే జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలవడం ప్రశంసనీయమని కొనియాడారు. మొదటి స్థానం సాధించడమే లక్ష్యం: వీజీ వెంకటరెడ్డి అవార్డును అందుకున్న సందర్భంగా గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనింగ్ రంగంలో సీఎం వైఎస్ జగన్ అనేక సంస్కరణలను తీసుకువచ్చారని చెప్పారు. గతంలో ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా లీజు జారీ చేసే విధానం ఉండేదని, దీనివల్ల అనేక ఇబ్బందులు రావడమే కాకుండా ఎక్కువ శాతం మైనింగ్ బ్లాక్‌ల్లో ఆపరేషన్స్ జరగకుండా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మైనింగ్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆక్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. 2022–23లో 146 మైనర్ మినరల్ బ్లాక్ లకు, 2023–24లో ఇప్పటివరకు 134 మైనర్ మినరల్స్ బ్లాక్‌లకు ఆక్షన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. -
జగనన్న గోరుముద్దకు జాతీయ పురస్కారం ఇచ్చిన కేంద్రం
-
‘జగనన్న గోరుముద్ద’కు జాతీయ పురస్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ‘జగనన్న గోరుముద్ద’ పేరిట పౌష్టికాహారం అందిస్తున్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కౌమార దశ విద్యార్థుల్లో రక్తహీనత నివారణ కోసం చేస్తున్న విశేష సేవలకు జాతీయస్థాయి ప్రథమ బహుమతిని ఏపీకి అందజేసింది. అవార్డును స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ చేతుల మీదుగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ పి.హేమారాణి, ఆరోగ్య శాఖ నోడల్ అధికారి దేవి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోడల్ ఆఫీసర్ ఎన్.శ్రీదేవి అందుకున్నారు. విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు రాగి జావ, కోడిగుడ్డు, చిక్కీ వంటి పోషకాహారం అందించి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధమిక లక్ష్యంగా ఉందని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది. దేశంలో ఇదో అద్భుతమైన కార్యక్రమంగా ప్రకటించింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్లు పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ (వేరుశనగ బార్) పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని కేంద్ర అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం లోపం తగ్గడంతో పాటు రక్తహీనత సైతం చాలావరకు నివారించారని కితాబిచ్చింది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం కోసం జగనన్న గోరుముద్ద పథకంలో రోజుకో మెనూ చొప్పున స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రూపొందించిన విషయం తెలిసిందే. -
AP: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: ప్రతినెలా ఠంచనుగా ఒకటో తేదీనే ఇచ్చే సామాజిక పింఛన్ల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక రీతిలో మన రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా మార్టులకు గోల్డ్ అవార్డు, పొదుపు సంఘాల బలోపేతానికి జరుగుతున్న కార్యక్రమాలకు సిల్వర్ అవార్డును స్కోచ్ సంస్థ అందించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అందుకున్నారు. దిగులు లేని అవ్వాతాతలు ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగులు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరికీ రూ. 2,750 నుంచి రూ.10 వేల దాకా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికే వచ్చి డబ్బులు అందజేస్తుండటంతో గతంలో లాగా పింఛన్ అందుకోవడానికి పడే తిప్పలు వారికి తప్పాయి. గత టీడీపీ సర్కార్ హయాంలో పింఛనుకు అర్హత ఉండీ దానిని అందుకోవాలంటేనే ఓ ప్రహసనం. ప్రభుత్వ ఆఫీసులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుడు కూడా అయిన వారికే పింఛన్లు మంజూరయ్యేవి. పింఛన్ తీసుకునేవాళ్లు నడవలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, కొత్తగా పింఛన్ల మంజూరు సహా ప్రభుత్వం అందజేసే అన్ని సంక్షేమ పథకాలు సంతృప్తస్థాయిలో అమలు చేస్తున్నారు. వలంటీరు, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పథకాలు అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా 65.54 లక్షల మంది లబ్ధిదారులకు నాలుగున్నర ఏళ్లలో రూ. 81,947 కోట్లు పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 23 లక్షల మందికి కొత్త పింఛన్ల మంజూరు చేసింది. దేశంలో ఎక్కడా లేని ఈ విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేగాక మనరాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్ పంపిణీ విధానాన్ని పలు రాష్ట్రాలు చూసి అక్కడ కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మహిళా సాధికారతకు పట్టం.. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు కూడా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో పొదుపు సంఘాల మహిళలు కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా సూపర్ మార్కెట్ (వైఎస్సార్ చేయూత మహిళామార్ట్)లు ఏర్పాటు చేసుకొని వాటిని లాభదాయకంగా నిర్వహిస్తున్నారు. 2022 ఆగస్టు 22న మొట్టమొదటిగా కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో చేయూత మార్ట్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45 మార్టులు ఏర్పాటయ్యాయి. శుక్రవారం వరకు ఆయా మార్టుల్లో రూ. 58.18 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో మన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సంఘటిత శక్తి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పొదుపు సంఘాల వ్యవస్థ బలోపేతం పొదుపు సంఘాల వ్యవస్థను అవసరాలకు తగిన విధంగా బలోపేతం చేయడానికి శిక్షణతో పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.49 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 90 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా 3,648 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు మాస్టర్ ట్రైనర్లగా శిక్షణ ఇచ్చి వారి ద్వారా రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల మహిళలందరికీ రాబోయే ఒకటిన్నర సంవత్సరం కాలంలో యూపీఐ పేమెంట్ తదితర డిజిటల్ లావాదేవీలు, ఆరి్థక భద్రత అంశాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పొదుపు సంఘాల సభ్యుల లావాదేవీలను ఆన్లైన్లో పర్యవేక్షించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. -
మై నేమ్ ఈజ్ శృతి ఆలోచింపజేస్తుంది
‘‘ప్రేక్షకులు థ్రిల్లర్ చిత్రాలను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. స్కిన్ (చర్మం) మాఫియా ముప్పును చూపించే డార్క్ థ్రిల్లర్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఈ నేపథ్యంలో ఓ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని హీరోయిన్ హన్సిక మోత్వాని అన్నారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక మోత్వాని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హన్సిక మోత్వాని మాట్లాడుతూ.... ► మా అమ్మ డెర్మటాలజిస్ట్(చర్మ వైద్య నిపుణురాలు). ‘మై నేమ్ ఈజ్ శృతి’ సమయంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. ‘ఇలాంటి ఘటన ఎక్కడో జరిగినట్లు చదివాను’ అని చెప్పింది అమ్మ. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్‌లతో చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ మూవీ థ్రిల్ ఇస్తుంది. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. ►ఈ సినిమాలో నా పాత్ర పేరు శృతి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న శృతి స్కిన్ మాఫియా ట్రాప్‌లో పడుతుంది. ఆ మాఫియా నుంచి తను ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రతి కుటుంబాన్ని ఈ చిత్ర కథ కదిలిస్తుంది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. రమ్యగారు ఈ సినిమాని ఎంతో ఫ్యాషన్‌తో తీశారు. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. ►2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా తర్వాత నేను నటించిన తెలుగు చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. అయితే తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉండటం వల్లే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒక నటిగా సంతృప్తి చెందలేదు.. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నాను. వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపిస్తూ పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు అభినందనలు తెలిపాను. -
జాతీయ అవార్డ్ విన్నర్స్‌కు మైత్రి మూవీ మేకర్స్ పార్టీ.. పాల్గొన్న అల్లు అర్జున్ (ఫొటోలు)
-
20 ఏళ్లుగా అంటున్న మాట నిజమైంది: బన్నీ ఆసక్తికర కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు పుష్ప ది రైజ్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం వరించింది. సుకుమార్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కించిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే జాతీయ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులకు మైత్రీ మూవీ మేకర్స్ విందు ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి హాజరైన బన్నీ అవార్డ్ రావడం పట్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు. జాతీయ అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. నా మిత్రుడు దేవిశ్రీతో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటనకు గుర్తింపు వచ్చేందుకు సుకుమార్ ఎంతో శ్రమించారని బన్నీ వెల్లడించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ..'బాలీవుడ్‌కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్‌కు చాలా సార్లు చెప్పా. కానీ ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు వస్తా అనేవాడు. అలాంటిది మేమిద్దరం ఒకేసారి పుష్ప సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టాం. అక్కడా సక్సెస్ అందుకున్నాం. 20 ఏళ్లుగా దేవితో నేను అంటున్న మాట నిజమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. జాతీయ అవార్డులకు మా పేర్లు ప్రకటించినప్పుడు నాన్న చాలా సంతోషించారు. ఇద్దరు కుమారులకు జాతీయ అవార్డులు వచ్చినట్లు ఉందన్నారు. ప్రిన్సిపల్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోలేని మేము.. ప్రెసిడెంట్ దగ్గర మెడల్స్ తీసుకుంటామని అనుకున్నావా?’ అని ఆయన్ని అడిగా' అని నవ్వుతూ అన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే.. ఏరా? ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి టీసీలు తీసుకోవడమే తప్పా? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి మెడల్ తీసుకుంటుంటే నాకెంతో బాధగా ఉందో తెలుసా? అని అన్నారు. డైరెక్టర్ సుకుమార్ గురించి మాట్లాడుతూ..' జీవితంలోని ప్రతి దశలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటూనే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ అవార్డు రావాలని సుకుమార్ నాకంటే ఎక్కువగా కోరుకున్నారు. ఆయనే అఛీవర్.. నేను కేవలం అఛీవ్మెంట్ మాత్రమే.' అని అల్లు అర్జున్ తెలిపారు. -
Allu Arjun-69th National Film Award: అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం.. ఇంటివద్ద ఫ్యాన్స్ కోలాహలం!(ఫొటోలు)
-
నాకు అవార్డు రావడానికి కారణం ఆయనే: బన్నీ ట్వీట్ వైరల్
జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆయనకు జాతీయ అవార్డు రావడం పట్ల ట్వీట్ చేశారు. నా ఈ విజయానికి కారణం ఆయనేనంటూ పోస్ట్ చేశారు. బన్నీ తన ట్వీట్లో రాస్తూ..'జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. నాకు గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. మన సినిమాను ఆదరించిన వారందరికీ చెందుతుంది. ముఖ్యంగా సుకుమార్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా విజయానికి కారణం ఆయనే.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. ఎర్రచందనం నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. Honoured to receive the National Award. I want to thank the jury, the ministry, the Government of India, for this recognition. This award is not only a personal milestone, but belongs to all people who have supported and cherished our cinema. Thank you, Sukumar garu. You are the… pic.twitter.com/moX9e0hTSy — Allu Arjun (@alluarjun) October 17, 2023 -
జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. సరికొత్త చరిత్ర
జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. (ఇదీ చదవండి: లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!) ఈసారి జాతీయ అవార్డులతో తెలుగు సినిమా కళకళలాడిపోయింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోగా.. 'ఉప్పెన'కి బుచ్చిబాబు, 'పుష్ప' సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, 'ఆర్ఆర్ఆర్' సినిమాకుగాను నేపథ్య సంగీతానికి కీరవాణి, కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కి శ్రీనివాస్ మోహన్, ప్లే బ్యాక్ సింగర్ కాలభైరవ, స్టంట్ కొరియోగ్రఫీకి కింగ్ సోలమన్ అవార్డులు అందుకున్నారు. అలానే 'కొండపొలం' పాటకు చంద్రబోస్ కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) జాతీయ అవార్డుల పూర్తి జాబితా ఇదే ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ) ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా) ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ) ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ) బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం) బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ) బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం) బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి) బెస్ట్ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా) బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్) బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ఆర్ఆర్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) భాషల వారీగా ఉత్తమ చిత్రాలు బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్ బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్ బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్ బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్ బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777 బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్ బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్ బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్) బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష్య (ద వెయిట్) బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్) బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన నాన్ ఫీచర్ ఫిలింస్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ) బెస్ట్ వాయిస్ ఓవర్: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ) బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ఇషాన్ దీవేచా (సక్కలెంట్) బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్) బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా) బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ) ఉత్తమ డైరెక్షన్: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్) ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ) ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: దాల్ బాత్ (గుజరాతీ) స్పెషల్ జ్యూరీ అవార్డ్: రేఖా మూవీ (మరాఠీ) బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం) బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్) బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ) బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ) బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మున్నం వలవు (మలయాళం) బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్) బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్నెస్ (హిందీ-బెంగాలీ) బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్ బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి) బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా) బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ) -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్‌గా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్‌లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్‌లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్‌లో మా కుటుంబం అంతా హైదరాబాద్‌లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్‌గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్‌ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్‌ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్‌కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్‌ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్‌కి కమిటీ మెంబర్‌గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విశాఖ పశు వైద్యుడికి జాతీయ అవార్డు
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ జిల్లా పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పథకాలు, పశు పోషణలో నూతన ఆవిష్కరణలపై ఆయన పాడి రైతులకు అవగాహన కల్పించడంలో చేసిన విశేష కృషికి గాను ‘ఉత్తమ విస్తరణ అధికారిగా’ జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ నెల 27న హైదరాబాద్‌లో భారత ప్రభుత్వ సంస్థ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ సదస్సులో ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రస్తుతం డాక్టర్ ప్రసాదరావు విశాఖ జిల్లా పశు సంవర్థకశాఖ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడ శిక్షణ విభాగంలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకునేలా చేయడం, పాడి పశువులు, కోళ్ల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడంలో కృషి చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పథకాలపై ఆయన లఘు చిత్రాలు, స్వీయ రచనలు చేయడంతో పాటు వీడియోలు రూపొందించారు. వాటి ద్వారా పాడి రైతులకు సులువైన పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంతవరకు ఆయన ఆరు పుస్తకాలు, 200 పైగా వ్యాసాలు రాశారు. ప్రసాదరావు మాట్లాడుతూ యూ ట్యాబ్ చానల్ పెట్టి 140 వీడియోలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
పీవీ సత్యనారాయణకు స్వామినాథన్ అవార్డు ప్రదానం
ఏజీ వర్సిటీ: ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2021–2012 ఏడాదికి రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దైవార్షిక జాతీయ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు బంగారు పతకం అందజేశారు.హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కృషికి గాను సత్యనారాయణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్–ఐఐఆర్‌ఆర్‌లోని రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఈ అవార్డును కూడా అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇప్పటివరకు 8 మందికి ప్రకటిస్తే అందులో నలుగురు తెలుగురాష్ట్రాల వారే కావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ డీజీ డీఏఆర్ఈ కార్యదర్శి హిమాన్షు పాఠక్, డీఏఆర్ఈ కార్యదర్శి ఆర్ఎస్ పరోడా, ఐసీఏఆర్ మాజీ డీడీజీ ఈఏ సిద్దిఖ్, నూజివీడ్స్ సీఏండీ ఎం.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?
తెలుగులో దిగ్గజాలు, అద్భుతమైన నటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లెవరి వల్ల కానిది అల్లు అర్జున్ చేసి చూపిస్తున్నాడు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. 'పుష్ప' హిట్ అయిందనో, నేషనల్ అవార్డు వచ్చిందనో ఇలా అనట్లేదు. రియాలిటీలో జరుగుతున్నదే చెబుతున్నాం. రీజనల్ మూవీస్ చేసే ఓ హీరోని.. ఏకంగా ఇన్స్టాగ్రామ్ ఫాలో కావడం ఏంటి.. స్పెషల్‌గా ఓ వీడియో రిలీజ్ చేయడం ఏంటి.. అసలు బన్నీకి ఎక్కడ కలిసొచ్చింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? (ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!) స్టైల్ ప్లస్ గెటప్స్ తండ్రి అల్లు అరవింద్ నిర్మాత. దీంతో టీనేజీలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. తొలి సినిమా 'గంగోత్రి'లో బాగానే నటించాడు. కానీ బన్నీ లుక్స్‌పై విమర్శలు. వీడు హీరో ఏంట్రా? అన్నవాళ్లు కూడా ఉన్నారు. దీంతో రెండో సినిమాకే పూర్తిగా ఛేంజ్ అయ్యాడు. లవర్ బాయ్ 'ఆర్య'గా డిఫరెంట్ మేకోవర్‌తో మెస్మరైజ్ చేశాడు. అప్పటినుంచి మొదలు 'పుష్ప' వరకు ఏ మూవీకి ఆ మూవీకి డిఫరెంట్ స్టైల్- గెటప్స్‌తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. వచ్చారు. యాక్టింగ్ పరంగానూ తనని వేలెత్తి చూపని విధంగా ఇంప్రూవ్ అయ్యాడు. డ్యాన్సుల్లో టాప్ తెలుగు హీరోల్లో చిరంజీవి తర్వాత బాగా డ్యాన్స్ చేసేవాళ్ల లిస్ట్ తీస్తే అల్లు అర్జున్ కచ్చితంగా ఉంటాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కూడా బాగానే చేస్తారు. కానీ బన్నీకి సరైన మాస్ సాంగ్స్ చాలానే పడ్డాయి. సినిమా ఎలా ఉన్నాసరే పాటలు, వాటిలో అల్లు అర్జున్ డ్యాన్సుల వల్ల పాన్ ఇండియా ట్రెండ్ లేని రోజుల్లోనే డబ్బింగ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. (ఇదీ చదవండి: అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్) టర్నింగ్ పాయింట్ అల్లు అర్జున్ అంటే ఓ తెలుగు హీరో మాత్రమే. ఇతడి సినిమాలు ఆంధ్రా, తెలంగాణ వరకే పరిమితం. అయితే 'అల వైకుంఠపురములో' సూపర్ హిట్ అయిన తర్వాత ఆ సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఈ మూవీ వచ్చిన రెండు నెలలకే కరోనా లాక్డౌన్ రావడం. అందరూ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలా కొన్ని నెలలపాటు నార్త్ నుంచి విదేశీయుల వరకు ఎక్కడ చూసినా ఈ పాటలకే రీల్స్ తెగ చేశారు. అలా తనకు తెలియకుండానే అల్లు అర్జున్.. గ్లోబల్ వైడ్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 'పుష్ప' విత్ నేషనల్ అవార్డ్ ముందు అనుకున్న ప్రకారం 'పుష్ప' సినిమాని తెలుగులో మాత్రమే రిలీజ్ అనుకున్నారు. కానీ రాజమౌళి సూచించడంతో ప్రమోషన్స్ చేయకుండానే నార్త్‌లోనూ రిలీజ్ చేశారు. తెలుగులో ఓకే అనిపించుకుంది. కానీ అక్కడ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. నార్త్‌లో కలెక్షన్స్ దుమ్మరేపింది. అల్లు అర్జున్ అంటే ఎవరో దాదాపు ప్రతి ఉత్తరాది ప్రేక్షకుడి తెలిసేలా 'పుష్ప' చేసింది. దీంతో వాళ్లందరూ ఇప్పుడు 'పుష్ప 2' కోసం తెలుగు ఆడియెన్స్ కంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా బన్నీకి తాజాగా నేషనల్ అవార్డు రావడం మరో ప్లస్ పాయింట్. (ఇదీ చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. ఫొటో వైరల్!) వార్నర్ హెల్ప్! మిగతా సెలబ్రిటీలు సంగతేమో గానీ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. బన్నీకి గ్లోబల్ వైడ్ గుర్తింపు తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఎందుకంటే లాక్డౌన్ టైంలో అల్లు అర్జున్ పాటలకు సరదా కోసం వార్నర్ రీల్స్ చేశాడు. కానీ అవి చాలామందికి రీచ్ అయ్యాయి. అలా కొంతలో కొంత వార్నర్ కూడా అల్లు అర్జున్‌కి ప్లస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇన్ స్టా వీడియోతో మిగతా హీరోలందరూ పాన్ ఇండియా ట్రెండ్ వెనకాల పడుతుంటే.. బన్నీ మాత్రం గ్లోబల్ వైడ్ పాపులారిటీ ఆల్రెడీ దక్కించేసుకున్నాడు. ఎందుకంటే ప్రఖ్యాత ఇన్స్టాగ్రామ్.. బన్నీని ఫాలో అవుతోంది. భారతీయ నటుల్లో ఆ సంస్థ ఫాలో అవుతున్న ఫస్ట్ పర్సన్ అల్లు అర్జున్. తాజాగా ఇతడి దినచర్యని స్పెషల్‌గా ఓ వీడియో తీసి మరీ, తన అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇది చాలదా బన్నీ.. జాక్‌పాట్ కొట్టాడని చెప్పడానికి! (ఇదీ చదవండి: 48 ఏళ్ల వయసులో పెళ్లిపై స్పందించిన నగ్మా.. త్వరలోనే..) View this post on Instagram A post shared by Instagram (@instagram) -
బన్నీని కలిసిన కార్తికేయ.. అవార్డు గెలిచినందుకు విషెస్
కార్తికేయ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'బెదురులంక 2012' సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఆనందంలో ఉన్న కార్తికేయ.. నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ని కలిశాడు. తన తరఫున విషెస్ చెప్పాడు. (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్‌బాబు సందడి) ఈ సందర్భంగా హీరో కార్తికేయ బన్నీని కలవడానికి వెళ్లగా, బన్నీ- కార్తికేయ ఒకరికొకరు అభినందనలు చెప్పుకొన్నారు. 'బెదురులంక' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని, త్వరలో తన ఫ్యామిలీతో కలిసి మూవీ చూస్తానని బన్నీ చెప్పడం కార్తికేయ తెగ ఆనందపడుతున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. రొటీన్‌కి భిన్నంగా ఉండే కథ కథనాలు ఆద్యంతం అలరించడంతో పాటు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా చిత్రంలోని చివరి 40 నిముషాలు థియేటర్లు నవ్వులతో నిండిపోతున్నాయని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. (ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) Congratulated our Icon Star @alluarjun garu for winning the Iconic National Award 😇 As always, he humbly congratulated me for the Blockbuster success of #Bedurulanka2012 😍 pic.twitter.com/nEEipuk9Na — Kartikeya (@ActorKartikeya) August 27, 2023 -
మహేశ్‌బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?
స్టార్ హీరో అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. 'పుష్ప' మూవీ రిలీజైనప్పుడు బన్నీ గురించి ఎంత మాట్లాడుకున్నారో.. అవార్డు రావడంతో అంతకంటే ఎక్కువగానే మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో హీరో మహేశ్ బాబు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ ఛాయిస్ మహేశ్ 'రంగస్థలం' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మహేశ్‌తో సినిమా చేయాలని డైరెక్టర్ సుకుమార్ ఫిక్సయ్యాడు. ముందుగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో ఓ స్టోరీ అనుకున్నారట. కొన్నాళ్లకు ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై సుక్కు.. ఓ లైన్ రెడీ చేశాడు. మహేశ్‌తో ఈ మూవీ చేయాలనుకుని.. ఏడాది పాటు దీనిపై వర్క్ చేశారట. కానీ మహేశ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. అప్పట్లో దీనిపై మహేశ్ ట్వీట్ కూడా పెట్టాడు. Due to creative differences, my film with Sukumar is not happening. I wish him all the best on the announcement of his new project. Respect always for a film maker par exellence. 1 Nenokkadine will remain as a cult classic. Enjoyed every moment working on that film. — Mahesh Babu (@urstrulyMahesh) March 4, 2019 (ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) లైన్లోకి బన్నీ మహేశ్‌తో సినిమా అనుకున్నప్పుడు ఓ లైన్ రెడీ చేసిన సుకుమార్.. దాన్ని బాగా డెవలప్ చేసి అల్లు అర్జున్ కి వినిపించాడట. అలా ఈ కాంబో సెట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు 'పుష్ప' అనేది మూవీ కాదు బ్రాండ్ అనేంతలా మారిపోయింది. అల్లు అర్జున్ కి నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఛాన్స్ మిస్? ఇప్పుడు 'పుష్ప' సినిమాకుగానూ అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు రావడంతో మహేశ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే సుక్కు.. మహేశ్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు హీరోగా పోలీస్ క్యారెక్టర్ అనుకున్నారట. కానీ బన్నీ లైన్ లోకి వచ్చేసరికి అది కాస్త కూలీ టూ డాన్ పాత్రగా మారింది. కాబట్టి మహేశ్ ఎలాంటి అవకాశం మిస్ చేసుకోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండు వేేర్వేరు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ చేసుంటే అప్పుడు మహేశ్‌కి జాతీయ అవార్డు వచ్చుండేదా లేదా అనేది అప్పుడు తెలిసేది తప్పు ఇప్పుడు ఈ డిస్కషన్ అనవసరం. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) -
బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?
స్టార్ హీరో అల్లు అర్జున్.. జాతీయ అవార్డు తనని వరించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ విషెస్ చెబుతూ నిన్నంతా గడిపేశాడు. ఇప్పుడు సడన్‌గా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికెళ్లి మరీ ఆయన్ని కలిశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇంతకీ కారణమేంటి? (ఇదీ చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?) అల్లు అర్జున్-బ్రహ్మానందం బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భం దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉంటారు. అయితే గతవారం బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లి జరిగింది. దీనికి హాజరు కాలేకపోయిన బన్నీ.. ఇప్పుడు స్వయంగా ఇంటికెళ్లి మరీ బ్రహ్మీ ఫ్యామిలీని కలిశారు. వాళ్లతో టైమ్ స్పెండ్ చేశారు. అయితే గత వారం మిస్ అయినప్పటికీ, గుర్తుపెట్టుకుని మరీ ఇప్పుడు బ్రహ్మీని ఆయన ఇంట్లోనే బన్నీ కలిశాడు. అలానే తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 'పుష్ప' సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నిలిచాడు. ఈ విషయమై బన్నీతో మాట్లాడిన బ్రహ్మీ.. తన ఇంట్లో అతడిని సన్మానించాడు. ప్రస్తుతం బ్రహ్మీ కుటుంబం, కొడుకు-కోడలుతో అల్లు అర్జున్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?) -
'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?
అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఐకాన్ స్టార్, 'పుష్ప' హీరో అనే పదాలు గుర్తొచ్చేవి. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడంతో ఆలోవర్ ఇండియా.. బన్నీ ఫుల్ ట్రెండ్ అవుతున్నాడు. అందరూ ఇతడి గురించే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు 'పుష్ప 2' ఎలా ఉండబోతుందో అని ఇప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు రావడం మాటేమో గానీ.. పుష్ప 2 మూవీపై ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ అవార్డు వల్ల సీక్వెల్లో ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. (ఇదీ చదవండి: 'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?) పెరిగిన అంచనాలు 2021 డిసెంబరులో 'పుష్ప' సినిమా రిలీజైంది. విడుదలైన రోజు.. మిక్స్డ్ టాక్ వచ్చింది. డబ్బింగ్, సినిమాటోగ్రఫీ విషయంలో కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరైతే మూవీ బాలేదన్నారు. కానీ వీకెండ్ అయ్యేసరికి టాక్ మొత్తం మారిపోయింది. బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్‌తో సౌత్-నార్త్ అనే తేడా లేకుండా దూసుకుపోయింది. రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు బన్నీకి అవార్డు రావడంతో సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. మరోసారి తగ్గేదేలే అంటాడా? 'పుష్ప' సినిమా హిట్ అవడానికి స్టోరీ, అల్లు అర్జున్ యాక్టింగ్, హిట్ సాంగ్స్ ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఈ అవార్డుల వల్ల సీక్వెల్ చూసేందుకు బీభత్సమైన అంచనాలతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాబట్టి బన్నీ-సుక్కు ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది చూడాలి. అలానే ఫస్ట్ పార్ట్‌లో 'తగ్గేదే లే' అనే డైలాగ్ బాగా కలిసొచ్చింది. సీక్వెల్లో అలాంటిది ఇంకేమైనా ప్లాన్ చేశారేమో తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ) రాబిన్‌హుడ్ స్టోరీ ఎలా? 'పుష్ప' తొలి భాగంలో పుష్పరాజ్ అనే ఓ వ్యక్తి.. డాన్ ఎలా అయ్యాడనేది మాత్రమే చూపించారు. సీక్వెల్లో డాన్‌గా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొబోతున్నాడనేదే స్టోరీ. బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. పుష్పరాజ్ పాత్రని రాబిన్‌హుడ్ తరహాలో చూపించారు. అంటే పెద్దోళ్ల దగ్గర దోచుకున్నది పేదలకు పంచడం అనమాట. ఈ తరహా కాన్సెప్ట్‌తో గతంలో పలు సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే 'పుష్ప 2'లో కొత్తగా ఏం చూపిస్తారనేది బిగ్ క్వశ్చన్. 'పుష్ప'కి మూడో పార్ట్? గతంలో సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పుష్ప' కథని తొలుత వెబ్ సిరీస్‌గా తీయాలనుకున్నానని, కానీ సినిమా తీశానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పుష్ప చిత్రాన్ని రెండు భాగాలు అనుకున్నారు. ఇప్పుడు అవార్డు రావడంతో అంచనాలు పెరిగాయి. దీంతో మూడో భాగానికి ఏమైనా స్కోపు ఉందా అనేది సుకుమార్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే తొలిపార్ట్‌లో ఊహించని మలుపులతో కిక్ ఇచ్చిన సుక్కు.. సీక్వెల్‌ని ఇంకెన్ని మలుపులు తిప్పబోతున్నాడో? రిలీజ్ డేట్ అదేనా? పుష్ప 2 షూటింగ్ ఇప్పటివరకు 40 శాతం పూర్తయింది. జాతీయ అవార్డు వచ్చిన ఊపులో మరింత ఎనర్జీతో అల్లు అర్జున్ సెట్స్ లో అడుగుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు. నవంబరు కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారట. వచ్చే ఏడాది మార్చి 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇలా 'పుష్ప' సీక్వెల్ విషయంలో టీమ్ ముందు బోలెడన్ని సవాళ్లు ఉన్నాయి. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. (ఇదీ చదవండి: ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ) -
ఏపీ రైతుకు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువ అభ్యుదయ రైతు నందం రఘువీర్‌ను జాతీయ స్థాయి అవార్డు వరించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆదీనంలోని ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ సంస్థ రెండేళ్లకు ఒకసారి ఈ రంగంలో విశేష సేవలందిస్తున్న రైతులు, సంస్థలకు వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేస్తుంది. ఇందులో భాగంగా 2023–25 సంవత్సరానికి గాను అత్యంత అరుదైన విత్తనాలను సంరక్షిస్తున్న కేటగిరీలో రఘువీర్‌ను జాతీయ మొక్కల జన్యురక్షకుని అవార్డుకు ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రఘువీర్ అవార్డు, ప్రశంసాపత్రంతోపాటు రూ.1.50లక్షల నగదు బహుమతిని అందుకున్నారు. 257 రకాలు సేకరించిన రఘువీర్ అత్యంత పురాతన ధాన్యపు సిరులను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో రఘువీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం వైపు వచ్చారు. దేశవ్యాప్తంగా తిరిగి ఇప్పటి వరకు 257 రకాల అత్యంత పురాతన వరి వంగడాలను సేకరించారు. వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్ కలిగిన వంగడాలు ఉన్నాయి. తాను సేకరించిన పురాతన విత్తనాలను పెనమలూరులోని సొంత పొలం 1.3 ఎకరాల్లో సంరక్షిస్తున్నారు. వీటిని భవిష్యత్ తరాల కోసం భద్రపరిచేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో దేశీయ విత్తన నిధి(సీడ్ బ్యాంక్)ను ఏర్పాటు చేశారు. మరో 8 జిల్లాల్లో ‘విత్తన నిధి’ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. పురాతన వరి విత్తనాలను అందించడమే కాదు... వాటి సాగులో మెళకువలపై అవగాహన కలి్పంచి ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు నాలుగు రకాల పురాతన వరి వంగడాలను సాగు చేస్తున్నారు. -
సీనియర్ పాత్రికేయుడు నాగిళ్ల వెంకటేష్‌కు జాతీయ అవార్డు
గత రెండు దశాబ్దాలుగా జర్నలిజంలో అందిస్తున్న ఉత్తమ సేవలకు సీనియర్ పాత్రికేయుడు నాగిళ్ల వెంకటేష్‌ను ‘భారత్ కే అన్మోల్’ జాతీయ అవార్డు వరించింది. ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో పద్మశ్రీ డాక్టర్ విజయకుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. దేశంలో వివిధ రంగాలలో అమూల్యమైన సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను గౌరవించేందుకు డాక్టర్ మొహమ్మద్ నిజాముద్దీన్ మరికొంత మందితో కలిసి 'భారత్ కే అన్మోల్' అవార్డులను నెలకొల్పారు. అలాగే జీకేపీఆర్ మీడియా హౌస్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ వెంకట కె గంజాం ఇందులో కీలక పాత్ర పోషించారు. -
ఈ గౌరవం జాతికి అంకితం.. ప్రధాని మోదీ
పూణే: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో గౌరవం దక్కింది. స్వాతంత్ర సమరయోధుడు బాలాగంగాధర్ తిలక్ పేరిట నెలకొల్పిన లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పుణేలో అందుకున్నారాయన. ఈ సందర్భంగా ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. స్వాతంత్ర సమరంలో తిలక్ పాత్ర మరువలేనిది. ఎనలేని సేవలు అందించారాయన. అలాంటి వ్యక్తి గురించి కొంతే మాట్లాడి తక్కువ చేయలేం. తిలక్‌కు.. అలాగే అన్నా బాహూ సాథేలకు నా గౌరవ వందనాలు అంటూ పేర్కొన్నాయాన. VIDEO | PM Modi receives Lokmanya Tilak National Award in Pune, on the 103rd death anniversary of freedom fighter Bal Gangadhar Tilak. (Source: Third Party) pic.twitter.com/2KKNgqrCJW — Press Trust of India (@PTI_News) August 1, 2023 బాలాగంగాధర్ తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా.. లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును ఇవాళ పుణేలో నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. నాయకత్వ పటిమ, పౌరుల్లో దేశభక్తి పెంపొందించినందుకుగానూ ఈ ఏడాది ఆ పురస్కారాన్ని మోదీకి ‘ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్’’ అందించింది. మెమెంటోతో పాటు లక్ష రూపాయల ప్రైజ్ మనీ అందించారు. ఆ ప్రైజ్‌మనీని నమామీ గంగ ప్రాజెక్టుకు ఇచ్చేశారాయన. ప్రతీ ఏడాది ఆగష్టు 1వ తేదీన ఆయన వర్థంతి సందర్భంగా ఈ అవార్డును బహుకరిస్తారు. 1983 నుంచి ఈ అవార్డును అందిస్తున్నారు. దేశ పురోగతి, అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేయబడుతుంది. ఇప్పటివరకు 40 మంది ఈ పురస్కారం అందుకోగా.. ప్రధాని మోదీ 41వ వ్యక్తి. పవార్‌తో ఆప్యాయ పలకరింపు ఇదిలా ఉంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరుకాగా.. ప్రధానిమోదీ ఆప్యాయంగా పలకరించారు. ఇండియా కూటమి తరపున విపక్షాలు.. ముఖ్యంగా థాక్రే శివసేన వర్గం ఆయన్ని కార్యక్రమానికి హాజరు కాకూడదని కోరిన సంగతి తెలిసిందే. #WATCH | Maharashtra | Prime Minister Narendra Modi holds a candid conversation with NCP chief Sharad Pawar in Pune. (Source: Maharashtra Dy CM Devendra Fadnavis YouTube) pic.twitter.com/JPowJFgVWT — ANI (@ANI) August 1, 2023 పలు ప్రాజెక్టులు సైతం.. మెట్రో రైళ్ల ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనలో శంకుస్థాపన చేశారు. -
జలవనరుల నిర్వహణలో ఉత్తమ మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
-
దేశంలోనే ఉత్తమ పల్లె జగన్నాథపురం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు మంచినీటి వనరుల విభాగంలో మరో జాతీయ అవార్డు లభించింది. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామం నిలిచింది. ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. దీంతోపాటు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లను సరిగ్గా వినియోగించుకున్న విద్యాసంస్థల కేటగిరీలో రెండో స్థానాన్ని పొందింది. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు సాధించడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. అవార్డు ప్రకటించిన కేంద్రానికి, ఈ అవార్డులు రావడానికి ప్రేరణగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జగన్నాథపురం గ్రామ పంచాయతీకి, పాలకవర్గం, సిబ్బంది, అధికారులను మంత్రి అభినందించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీలలో 41 మంది విజేతలను ప్రకటించింది. ఇందులో ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్, ఉత్తమ జిల్లాగా ఒడిశాలోని గంజాం, ఉత్తమ గ్రామ పంచాయతీగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం నిలిచాయి. నీటి వనరుల నిర్వహణకు... జలవనరులు, నదుల అభివృద్ధి గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులను అందజేస్తున్నారు. ’జల సంపన్న భారత్’అనే ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డ్రైవ్‌లో భాగంగా జాతీయ నీటి అవార్డులు వివిధ వ్యక్తులు, సంస్థలు చేసిన మంచి పని, ప్రయత్నాలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తాయి. ఇది నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పనకు, ఉత్తమ నీటి వినియోగ పద్ధతులను అవలంబించేలా వారిని ప్రేరేపించడానికి దోహదపడుతుంది. -
సూక్ష్మ సేద్యంలో ఏపీకి జాతీయ పురస్కారం
సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యం ద్వారా అత్యుత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. సూక్ష్మ సేద్యం అమలులో ఏపీ జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాలను రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర దక్కించుకున్నాయి. బోర్ల కింద వంద శాతం బిందు, తుంపర పరికరాలను అమర్చడంతోపాటు ఉత్తమ యాజమాన్య పద్దతులను పాటిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్న పంచాయతీగా జాతీయ స్థాయిలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి ఎంపికైంది. రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు సేద్యం, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. మరో 28 లక్షల ఎకరాలు అనువైనవిగా గుర్తించగా 2022–23లో రూ.636 కోట్లతో 2.27 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించారు. 2023–24లో రూ.902 కోట్ల అంచనాతో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఉత్తమ పంచాయతీగా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైన వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లిలో 630 మంది రైతులకు బోర్ల కింద 1405 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 1,152.50 ఎకరాల్లో బిందు, 252.50 ఎకరాల్లో తుంపర పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. వీటి ద్వారా అరటి, కూరగాయలు, వేరుశెనగ పంటలు పండిస్తూ జాతీయ స్థాయిలో అధిక దిగుబడులను సాధిస్తున్న పంచాయతీగా ఈ.కొత్తపల్లి గుర్తింపు సాధించింది. ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’పై ఢిల్లీలో బుధవారం జరిగిన జాతీయ స్థాయి సదస్సులో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజా చేతుల మీదుగా ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం పీవో డాక్టర్ సీబీ హరినాథ్‌రెడ్డి, ఈ.కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ బాలనాగప్రసాద్ అవార్డులను అందుకున్నారు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మనోజ్ ఆహూజా ప్రశంసించారు. జాతీయ స్థాయిలో 30 మిలియన్ హెక్టార్లలో బిందు, తుంపర పరికరాలను రాయితీపై అందించామని, వచ్చే ఏడేళ్లలో 70 మిలియన్ హెక్టార్లలో విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కార్యదర్శి అహ్మద్ కిద్వాయి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు, ఎన్ఆర్ఎం జాతీయ కార్యదర్శి ప్రాంక్లిన్, ఏపీ ఉద్యాన శాఖాధికారులు వెంకటేశ్వరరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతో సాధించాం.. ఆర్బీకేల ద్వారా ఎలాంటి సిఫార్సులు లేకుండా నూరు శాతం బిందు, తుంపర పరికరాలను పొందగలిగాం. అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధిస్తూ రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నాం. మా గ్రామానికి జాతీయ స్థాయి పురస్కారం లభించడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహం వల్లే దీన్ని సాధించగలిగాం. – బాలనాగప్రసాద్, సర్పంచ్, ఈ.కొత్తపల్లి, వైఎస్సార్ జిల్లా ప్రభుత్వ కృషి ఫలితం.. ఎలాంటి సిఫార్సులు, పైరవీలకు తావు లేకుండా అర్హత కలిగిన వారందరికీ ఆర్బీకేల ద్వారా బిందు, తుంపర సేద్యం పరికరాలను అందిస్తున్నాం. సామాజిక తనిఖీ కోసం అర్హుల జాబితాలను ప్రదర్శిస్తున్నాం. బోర్ల కింద నూరు శాతం సూక్ష్మ సేద్యం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలు జాతీయ స్థాయిలో టాప్ 5లో నిలిచాయి. ప్రభుత్వ కృషి ఫలితంగా రాష్ట్రానికి జాతీయ పురస్కారం లభించింది. – సీబీ హరినాథ్‌రెడ్డి, పీవో, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం. -
డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ అధికారులను సీఎం జగన్ అభినందించారు. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్‌కు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా అందజేశారు. ఈరోజు(శుక్రవారం) వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్‌లు సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి భారత ప్రభుత్వం అందజేసిన జ్ఞాపికను చూపించారు. దీనిలో భాగంగా అధికారులను అభినందించిన సీఎం జగన్.. భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పని చేయాలని, దిగుబడులు అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. కాగా, సాగుచేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్ నమోదు ఆధారంగా అమలుచేయడం ద్వారా యూనివర్శల్ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించింది. -
జాతీయ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు
సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు దక్కింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన డిజిటల్ టెక్నాలజీ పోటీల్లో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు లభించింది. ఇటీవల ప్రవేశపెట్టిన (UTS) డిజిటల్ చెల్లింపులకు గానూ ఈ అవార్డు దక్కింది. కాగా ఏపీఎస్ఆర్టీసీకి ఈ అవార్డు దక్కడం వరుసగా అయిదోసారి. కొచ్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (ఐటీ) శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు. ప్రయాణీకులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఆర్టీసీకి ప్రశంసలు -
వెండితెర బంగారం.. రవీనా టాండన్
రవీనా టాండన్ సుపరిచిత నటి. అయితే చాలామందికి ఆమెలో తెలియని కోణం సామాజిక స్పృహ. స్త్రీల హక్కులు, చైతన్యం, సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో రవీనా టాండన్ చురుగ్గా పాల్గొంటుంది. జీ–20కి సంబంధించిన ఉమెన్స్ ఎంపర్మెంట్ వింగ్–డబ్ల్యూ20 డెలిగేట్‌గా రవీనాకు సామాజిక స్వరాన్ని మరోసారి వినిపించే అవకాశం లభించింది. డైరెక్టర్ రవీ టాండన్ కుమార్తెగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన రవీనా టాండన్ భిన్నమైన పాత్రలు చేసి తనను తాను నిరూపించుకుంది. నటిగా జాతీయ అవార్డ్‌తోపాటు ఎన్నో అవార్డ్లు అందుకుంది.‘కాలం కంటే కాస్త ముందుగా ఆలోచించే వ్యక్తి’గా గుర్తింపు సంపాదించింది. తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు 21 సంవత్సరాల వయసులో ‘సింగిల్ మదర్’గా పదకొండు సంవత్సరాల పూజా, ఎనిమిది సంవత్సరాల చయ్యలను దత్తత తీసుకుంది. సింగిల్ మదర్‌గా పిల్లలను దత్తత తీసుకోవడం ఆ తరువాత ట్రెండ్‌గా మారింది. మహారాష్ట్రలోని వసై నగరంలో కొందరి దుర్మార్గం వల్ల 30 మంది అమ్మాయిలు నిరాశ్రయులయ్యారు. అందరూ ‘అయ్యో!’ అనే సానుభూతికే పరిమితమైన ఆ కాలంలో రవీనా వారికి అండగా నిలబడింది. తన ఇంట్లోనే 30 మందికి ఆశ్రయం కల్పించింది. ఆ తరువాత వసైలో సొంత ఖర్చులతో అనాథాశ్రమం కట్టించి అందులో వారికి ఆశ్రయం ఇచ్చింది. ఇక అప్పటి నుంచి సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే ఉంది. సినిమాల్లో తన నటన కంటే 30 మంది అమ్మాయిలకు ఆశ్రయం కల్పించిన విషయం గురించే రవీనాతో చాలామంది మాట్లాడుతుంటారు. ఆ సందర్భం నుంచి తాము ఎలా స్ఫూర్తి పొందిందీ చెబుతుంటారు. మంచి పనికి లభించే గుర్తింపు అది! స్త్రీల హక్కులు, చైతన్యం, సాధికారతకు సంబంధించి యూనిసెఫ్‌తో... క్రై, వైట్ రిబ్బన్ (సేఫ్ మదర్‌హుడ్), స్మైల్ ఫౌండేషన్... మొదలైన స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రవీనా. ‘పెటా’తో పాటు హైజీన్ ఆఫ్ యంగ్‌గర్ల్స్, మిషన్ సాహసి (ఆత్మరక్షణ)... మొదలైన కార్యక్రమాలకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంగేజ్మెంట్ వింగ్–జీ20 డెలిగేట్‌గా నియామకం అయిన రవీనా టాండన్....‘భారతీయ మహిళ ప్రతినిధిగా ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది మహిళలు విశేష కృషి చేశారు. సామాజిక, ఆర్థిక రంగాలలో మహిళల హక్కులు, అవకాశాల గురించి చర్చించడానికి ఇదొక మంచి అవకాశం’ అంటోంది. -
Best Newspaper Art: మహాత్మా గాంధీ 150వ జయంతి.. సాక్షి కార్టూన్‌కు జాతీయ అవార్డు..
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీజీ 150వ జయంతి సందర్భంగా 2019 అక్టోబర్ 2న సాక్షి దినపత్రికలో ప్రచురించిన బాపు కార్టూన్‌ను ప్రతిష్టాత్మక ప్రెస్ కౌన్సిల్ జాతీయ అవార్డు వరించింది. సాక్షి దినపత్రిక చీఫ్ కార్టూనిస్టు శంకర్ ఈ కారికేచర్‌ను గీశారు. 'భారత భాగ్య విధాతా!' పేరుతో బాపు బొమ్మను ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమానికి అద్దం పట్టేలా చిత్రీకరించారు. బక్కపల్చటి గాంధీ రూపానికి సమున్నత స్వాతంత్య్ర ఆకాంక్షను కలిపి స్వేచ్ఛాభారతం కోసం మరికొందరు నాయకులతో వేస్తున్న అడుగులను ఈ కారికేచర్‌లో శంకర్ తీర్చిదిద్దారు. "ఐదున్నర అడుగుల ఆ రూపం ఈ దేశానికి చెక్కు చెదరని ప్రతిరూపం అయ్యింది. ఆ పెదాల మీది బోసినవ్వు బ్రిటీష్ సామ్రాజ్యాన్నే హడలెత్తించగలిగింది. ఆయన వేసిన ప్రతి అడుగూ చెదిరి ఉన్న మతాలను, జాతులను, భాషలను, సంస్కృతులను ఒక్క చోటుకు చేర్చగలిగింది. సమస్త భారతీయుల దీక్షను చేతికర్రగా ధరించి ఆయన ఈ దేశాన్ని స్వతంత్ర భారతదేశం చేశారు. దేశీయతను భారతీయతగా మలిచారు. ప్రజలను జాతిగా సంఘటితం చేశారు. మొలన ఉన్న గడియారంలోని పెద్దముల్లు లక్ష్యంగా, చిన్నముల్లు కర్తవ్యంగా ఆయన చేసినది మహా పరిశ్రమ. ఆయన కప్పుకున్న ధవళ వస్త్రం స్వచ్ఛతకు చిహ్నం. ఆయన అహింసను గెలిచే ఆయుధం లేదు. ఆయన సత్యాగ్రహాన్ని ఓడించేదే లేదు. తన సులోచనాలతో అనునిత్యం దర్శించినది ఒకే ఒక స్వప్నం" స్వేచ్ఛాభారతం.. సహన భారతం.. జ్ఞాన భారతం.. ఆధ్యాత్మిక భారతం.. సాక్షి ప్రచురించిన భారత భాగ్య విధాత ప్రజంటేషన్ను బెస్ట్ న్యూస్‌పేపర్ ఆర్ట్ : కవరింగ్ కార్టూన్స్, కారికేచర్స్ అండ్ ఇల్లస్ట్రేషన్ కేటగిరీ కింద 'నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం 2020'కి గాను ప్రెస్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ అవార్డు ఒక్క సాక్షి మీడియా గ్రూపుదే కాదు.. సాక్షిని ఆదరిస్తున్న పాఠకులు, అభిమానిస్తున్న సాక్షి కుటుంబానిది. ఫిబ్రవరి 28 న డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, రఫీ మార్గ్, న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్దు ప్రదానోత్సవం జరుగుతుంది. భారత భాగ్య విధాతా! పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ సీడ్స్‌కు గ్లోబల్ అగ్రి అవార్డు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా మూడేళ్లుగా గ్రామ స్థాయిలోనే రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు మరో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు దక్కింది. వ్యవసాయ రంగంలో అత్యుత్తమ విధానాలు పాటిస్తూ ఉత్పత్తి, ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్, అదనపు విలువ జోడింపు, మౌలిక సదుపాయాలు, ఎగుమతుల్లో విశేష ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) ఏటా ఇండియా అగ్రి బిజినెస్ అవార్డులను ప్రదానం చేస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విత్తన పంపిణీ కేటగిరీలో ఏపీ సీడ్స్‌కు ‘గ్లోబల్ అగ్రి అవార్డు–2022’ను ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను పంపిణీ చేయడంలో ఏపీ సీడ్స్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రైతులకు సేవలందించిన ప్రభుత్వరంగ సంస్థగా ఏపీ సీడ్స్‌కు గుర్తింపు లభించింది. గతేడాది స్కోచ్ సంస్థ సిల్వర్ స్కోచ్ అవార్డు అందించగా.. గవర్నన్స్ నౌ అనే అంతర్జాతీయ సంస్థ జాతీయ స్థాయిలో పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్Š (పీఎస్‌యూ) కేటగిరీలో గవర్నెన్స్ నౌ నేషనల్ అవార్డుకు ఎంపిక చేసింది. తాజాగా ఏపీ సీడ్స్‌ను గ్లోబల్ అగ్రి అవార్డు వరించింది. ఈ అవార్డును ఈ నెల 9న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ప్రతిష్టాత్మక అవార్డును పొందిన ఏపీ సీడ్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విత్తన పంపిణీలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. మూడేళ్లలో 35 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు మూడేళ్లలో 50.95 లక్షల మంది రైతులకు 34.97 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా ఏపీ సీడ్స్ పంపిణీ చేసింది. రైతుల నుంచి సేకరించిన వరి, అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పశుగ్రాసం, పచ్చిరొట్ట విత్తనాలను ఏపీ సీడ్స్ సొంతంగా ప్రాసెస్ చేసి సబ్సిడీపై అందిస్తోంది. వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా ప్రతి సీజన్లోనూ 20వేల శాంపిల్స్ పరీక్షించి, వాటి నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే సీజన్‌కు ముందుగా ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతోంది. మూడేళ్ల సేవలకు గుర్తింపుగా.. మూడేళ్లుగా ఏపీ సీడ్స్ రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగానే ఈ అవార్డు దక్కింది. ఇది నిజంగా అరుదైన గౌరవం. గతంలో విత్తనాల కోసం రోజులు, నెలల తరబడి రైతులు ఎదురు చూసేవారు. ప్రస్తుతం బుక్ చేసుకున్న వెంటనే పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతులకు ఏపీ సీడ్స్ చేస్తున్న సేవలకు గత ఏడాది సిల్వర్ స్కోచ్, గవర్నెన్స్ నౌ అవార్డులు దక్కాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఆనందంగా ఉంది. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్ -
ఆంధ్రప్రదేశ్ కు జాతీయ అవార్డులు
-
సత్తాచాటిన ఏపీ.. వరుసగా రెండో ఏడాది జాతీయ అవార్డు
సాక్షి, ఢిల్లీ: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటుకుంది. వరుసగా రెండో ఏడాది కూడా స్వచ్చ సర్వేక్షన్లో జాతీయ అవార్డులు అందుకుంది. కాగా, స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్‌కు జాతీయ అవార్డు లభించింది. అలాగే, విశాఖ, విజయవాడ, పుంగనూరు, పులివెందులకు కూడా స్వచ్చ సర్వేక్షన్ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్‌తో పాటుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పాల్గొన్నారు. -
పుట్టినరోజుకి ముందు అవార్డు అందుకున్నాను: నటి ఆశా పారేఖ్
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డులను ప్రదానం చేశారు. 2020కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నటి ఆశా పారేఖ్ అందుకున్నారు. ‘‘నా 80వ పుట్టినరోజుకు ముందు ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా పారేఖ్. జాతీయ ఉత్తమ నటులుగా సూర్య (‘సూరరై పోట్రు’), అజయ్ దేవగన్ (తన్హాజీ) అవార్డులు అందుకున్నారు. తమిళ ‘సూరరై పోట్రు’ ఉత్తమ సినిమా అవార్డుతో పాటు ఐదు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును ఈ చిత్రదర్శకురాలు సుధ కొంగర, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవార్డును జీవీ ప్రకాష్ కుమార్, ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి అవార్డులు అందుకున్నారు. ‘అల వైకుంఠపురములో..’కి గాను జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా ఎస్ఎస్ తమన్, బెస్ట్ తెలుగు ఫిలిం ‘కలర్ ఫొటో’కు దర్శకుడు అంగిరేకుల సందీప్ రాజు, నిర్మాత సాయి రాజేశ్ అవార్డులు అందుకున్నారు. ‘నాట్యం’ సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును నటి సంధ్యారాజు, బెస్ట్ మేకప్ ఆరి్టస్ట్ అవార్డును రాంబాబు అందుకున్నారు. ⇔ సినీ రంగంలో ప్రస్తుతం సృజనాత్మకతకు స్వేచ్ఛ ఉంది. సినీ నిర్మాణం, కథా రచయితలు సినిమాను చూసే విధానానికి ఇది స్వర్ణ యుగంలాంటిది -సుధ కొంగర ⇔ ‘అల వైకుంఠపురములో..’ అనుకున్న మొదటి రోజు నుంచి త్రివిక్రమ్, బన్నీ (అల్లు అర్జున్) ఇచి్చన ఎనర్జీ వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ఈరోజు ఇక్కడ అవార్డు అందుకోవడం గ్రేట్‌గా అనిపిస్తోంది. ఇదంతా దేవుడి దయ- ఎస్.ఎస్. తమన్ ⇔ వర్ణ వివక్ష గురించి తీసిన మా ‘కలర్ ఫొటో’కు అవార్డు రావడం ఆనందంగా ఉంది. కోవిడ్ వల్ల థియేటర్లలో సినిమా విడుదల చేయలేదు. ఆ బాధ ఈ జాతీయ అవార్డు రావడంతో పోయింది -నీలం సాయి రాజేష్ ⇔ ప్రతీ మూడు నెలలకోసారి మా సినిమాకు ఏదో ఒక రూపంలో అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. – సందీప్ రాజు ⇔ లాక్డౌన్ కారణంగా రెండేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. – రాంబాబు -
జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఏపీ.. టూరిజం అభివృద్ధిలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ టూరిజం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. రాష్ట్రాలకు అవార్డులను ప్రదానం చేశారు. కాగా, వీటిలో ఏపీకి పలు అవార్డులు వచ్చాయి. అవార్డుల లిస్ట్ ఇదే.. - సమగ్ర టూరిజం అభివృద్ధిలో ఏపీకి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు. - బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్. - విదేశీ భాషలో ఏపీ కాఫీ టేబుల్ బుక్కు అవార్డ్. - విజయవాడ ది గేట్ వే హోటల్‌కు బెస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ అవార్డు . - బెస్ట్ టూరిజం గోల్ఫ్ కోర్సుగా హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌కు అవార్డు. - అపోలో హెల్త్ సిటీకి బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ అవార్డు - సమగ్ర టూరిజం అభివృద్ధిలో తెలంగాణకు మూడో బహుమతి లభించింది. -
తెలంగాణలో నూకలంపాడు గ్రామానికి జాతీయ అవార్డు.. ఏం చేశారంటే?
ఏన్కూరు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలానికి చెందిన నూకలంపాడు గ్రామం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రూపొందించిన లఘుచిత్రం (షార్ట్ ఫిలిం) జాతీయ స్థాయిలో రెండో బహుమతి గెలుచుకుంది. ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయ స్వచ్ఛతా దివస్ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ ఇంజం శేషయ్య అవార్డు అందకోనున్నారు. ఏటా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఫేస్–2లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ విభాగంలో గ్రామపంచాయతీల్లో మరుగుదొడ్ల వాడకం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, తదితర అంశాలపై జాతీయ స్థాయిలో లఘుచిత్రాల పోటీలు నిర్వహిస్తారు. గత ఏడాది జిల్లాలోని ముదిగొండ మండలం పమ్మి పంచాయితీ ఎంపికైంది. ఈ ఏడాది ఏన్కూరు మండలం నూకలంపాడు పంచాయతీ ఎంపిక కావడం విశేషం. అందరి సహకారంతో.. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి వెనుక సర్పంచ్ ఇంజం శేషయ్య ప్రధాన పాత్ర పోషించారు. గ్రామంలోని ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించి గ్రామాభివృద్ధి వైపు నడిపించారు. ఇప్పటికే గ్రామంలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, వాడకం జరుగుతుండగా, వ్యక్తిగత పరిశుభ్రత, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నారు. తడి చెత్తను ఎరువుగా మార్చడం, పొడి చెత్తను విక్రయిస్తుండడంతో పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. అలాగే, గ్రామంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలుచేస్తున్నారు. ఇలా గ్రామాభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న పనులతో రూపొందించిన లఘుచిత్రం జాతీయ స్థాయిలోనే రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు ఉపసర్పంచ్.. ఇప్పుడు సర్పంచ్ నూకలంపాడు గ్రామపంచాయితీలో 1,260 మంది జనాభా, 950 మంది ఓటర్లు ఉన్నారు. ఏజెన్సీ మండలం అయినందున ఎస్టీ అభ్యర్థిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలి. కానీ ఎస్టీలు లేకపోవడంతో ఎనిమిది వార్డులకు గాను నాలుగు వార్డులకే ఎన్నిక నిర్వహిస్తారు. గత ఎన్నికలో నాలుగు వార్డులకు గాను మూడు వార్డులు గెలిచిన పార్టీ అభ్యర్థిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకోగా, ఆయనే సర్పంచ్‌గా విధులు నిర్వర్తించారు. ఇక 2019 ఎన్నికల్లో నాలుగు వార్డులకు రెండు పార్టీల అభ్యర్థులు రెండేసి వార్డులు గెలుచుకున్నారు. ఈ మేరకు లాటరీ పద్ధతిలో సర్పంచ్‌ను ఎన్నుకోగా ఇంజం శేషయ్యకు అవకాశం దక్కింది. గతంలో ఉపసర్పంచ్‌గా అనుభవం ఉండడంతో ఇంజం శేషయ్య గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయడమే కాక సొంత ఖర్చుతో గ్రామంలో బోర్లు, రహదారులు, కాల్వ రోడ్డుకు గ్రావెల్ తోలకం చేపట్టారు. ఇంకా వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, రోడ్ల వెంట మొక్కలు నాటించడంతో గ్రామం పచ్చగా కళకళలాడుతోంది. అందరూ ఆదర్శంగా తీసుకోవాలి జాతీయస్థాయిలో ఉత్తమ లఘుచిత్రం అవార్డు సాధించిన నూకలంపాడు గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యారాములు సూచించారు. నూకలంపాడు గ్రామాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన సర్పంచ్ ఇంజం శేషయ్య – స్వరూప దంపతులను సత్కరించి మాట్లాడారు. కొన్నేళ్లుగా గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కితాబిచ్చారు. కలెక్టర్ అభినందనలు.. ఇక, జాతీయ స్థాయి షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో రెండో స్థానం దక్కించుకున్న నూకలంపాడు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ అభినందించారు. ఈమేరకు సర్పంచ్ శేషయ్య, పాలకవర్గం, సిబ్బందిని ఆయన శుక్రవారం సన్మానించి మాట్లాడారు. మిగతా గ్రామాల పాలకవర్గాలు స్ఫూర్తిగా తీసుకుని అవార్డులు సాధించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత, డీఆర్డీఓ విద్యాచందన, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాపై బాధ్యత పెరిగింది నూకలంపాడు సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాను. గతంలో జిల్లాస్థాయి అవార్డులు వచ్చినా, ఇప్పుడు జాతీయస్థాయిలో పేరు రావడం ఆనందంగా ఉంది. ఈ అవార్డుతో మాపై ఇంకా బాధ్యత పెరిగినట్లయింది. ఎమ్మెల్యే కేటాయించనున్న నిధులతో డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతాం. –ఇంజం శేషయ్య, సర్పంచ్ -
ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు వస్తుందనుకుంటున్నా : తమన్నా
తమిళసినిమా: గ్లామరస్ పాత్రలతో తన సినీ కెరీర్‌ను ప్రారంభింన తమన్నా భాటియా ఆ తర్వాత బాహుబలి వంటి పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఐటెం సాంగ్స్‌లోనూ తన ప్రతిభ చాటుకుంది. నటిగా రెండు దశబ్దాలు పూర్తి చేసుకోనున్న తమన్నా ఇప్పటికీ అవకాశాలను పొందడంలో తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే ఆదిలో ఈ అమ్మని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు మళ్లీ అక్కున చేర్చుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఇప్పుడు హిందీలో ఏకంగా మూడు చిత్రాలను పూర్తి చేసింది. అందులో ఒకటి బబ్లీ బౌన్సర్. ఈ చిత్రం ద్వారా తన కెరీర్లో తొలిసారి జాతీయ అవార్డు వస్తుందని గట్టిగా నమ్ముతోంది. దీని గురించి ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మదుర్ బండార్కర్ దర్శకత్వం వహింన ఈ చిత్రానికి కచ్చితంగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. తాను ఇందులో హర్యానాకు చెందిన యువతిగా నటించానని తెలిపింది. మొట్టమొదటిసారిగా లేడీ బౌన్సర్ ఇతివృత్తంతో రూపొందింన కథా చిత్రం ఇదని చెప్పింది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని పేర్కొంది. తన సినీ జీవితంలో ఉత్తమ చిత్రం అని చెప్పింది. ఇంతకు ముందు మదుర బండార్కర్ దర్శకత్వంలో నటింన హీరోయిన్లకు ఉత్తమ అవార్డులు లభించాయని, ఈ చిత్రంతో తనకు కూడా ఉత్తమ జాతీయ నటి అవార్డు లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఈ అవార్డు రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొంది. అయితే ఈ చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోండటం గమనార్హం. కాగా చిన్న గ్యాప్ తరువాత ఈమె కోలీవుడ్‌లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. -
నెల్లూరు జిల్లాకు జాతీయ అవార్డు
నెల్లూరు (పొగతోట): అజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా 780 జిల్లాలో120 రోజులపాటు ఈ కార్యక్రమాల అమలు తీరును కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. ఉత్తమ పనితీరు కనబర్చిన టాప్ 10 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 4వ స్థానంలో నిలిచింది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారు. చదవండి: (దశాబ్దాల స్వప్నం సాకారం) -
అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం!
‘‘ఆమె పతివ్రత, పవిత్రమైనది. ఆమె చెడిపోయింది... ఇలా చెప్పే శాస్త్రాలు పవిత్రులైన, అపవిత్రులైన పురుషుల గురించి ఎందుకు మాట్లాడవు? పురుషుల మనసులు బంగారంతో తయారయ్యాయా? పాపం వారిని తాకదా? శాస్త్రాలు స్త్రీల పాపాల్నే చిత్రించాయా?’’ అని మహాభారతంలో ద్రౌపది ప్రశ్నించినట్లు రచించిన ప్రతిభా రాయ్ తన ప్రశ్న ద్వారా ఆధునిక సమాజంలో కూడా స్త్రీ, పురుషులు అవలంబించాల్సిన విలువలపై కొనసాగుతున్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించారు. ఒడియాలో ఆధునిక సాహిత్యానికి రూపురేఖలు దిద్దిన ప్రతిభా రాయ్ రచనల్లో ‘యాజ్ఞసేని’ పురుషాధిక్య సమాజం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన గొప్ప నవల. ఈ నవలలో ద్రౌపది శ్రీకృష్ణుడికి రాసిన లేఖల్లో తన బాధలు, వేదనలు, పడిన హింస, త్యాగాలు, విశ్వాసాలు, ఆకాంక్షలు, నిస్పృహలను పంచుకుంటుంది. 1944 జనవరి 15న జగత్ సింగ్ పూర్ జిల్లాలోని అలబేలా కుగ్రామంలో జన్మించిన ప్రతిభా రాయ్ ఉన్నత విద్యాధికురాలు. ఒడిషాలోని బోండో జాతిపై పోస్ట్ డాక్టొరల్ పరిశోధన చేశారు. ఒక స్కూలు టీచర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఒడిషాలోని వివిధ ప్రభుత్వ కళా శాలల్లో 30 ఏళ్ల పాటు బోధన చేశారు. తన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ, మూర్తి దేవి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు. సాహిత్యంలో అత్యుత్తమమైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న ఘనత అమెది. ఆధునికానంతర ఒడియా సాహిత్యంలో కథా కథన శిల్పంలో చేయితిరిగిన రచయిత్రి ఆమె. సమానత్వం, ప్రేమ, శాంతి, సమైక్యత అడుగడుగునా ఆమె రచనల్లో గోచరిస్తాయి. కుల, మత, లింగ వివక్షలు ఎక్కడా కన పడవు. సామాజిక న్యాయం కోసం పోరాడుతూ సమ కాలీన సామాజిక సమస్యలపై ఆమె చేసిన రచనలు అనేక సామాజిక సంస్కరణలకు దారితీశాయి. బర్సా బసంత బైశాఖ, పరిచయ, పుణ్యతోయ, అసబరి, నీలా తృష్ణ, శిలాపద్మ, ఉత్తర మార్గ, ఆదిభూమి, మహా మోహ, మగ్నమతి, మహారాణి పుత్ర వంటి నవలలతో ఆమె జన హృదయాల చేరువలోకి వెళ్లారు. అంతేగాక ఆమె దాదాపు 260 కథల్ని రచించారు. అవి 20 సంకలనాలుగా వెలువడ్డాయి. మధ్యతరగతి జీవితాలు, దాని సమస్యలు, వ్యక్తుల మనస్తత్వాలు, సామాజిక, రాజకీయ వ్యవస్థల స్థితిగతులు ఆమె కథల్లో ప్రతిబింబిస్తాయి. ప్రజల నమ్మకాలు, ఆచారాలు, వారి యాసలు, భాషలు, ప్రేమలు, పరిణయాలు, గ్రామీణ జీవన సౌందర్యం ఆమె రచనల్లో మనకు గోచరిస్తాయి. వీటన్నిటి మధ్యా ప్రతిభా రాయ్ తాత్విక దృక్పథం, బలమైన స్త్రీవాద చిత్తశుద్ధి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సానుభూతితో అర్థం చేసుకోవడం కనిపిస్తుంది. ‘బర్సా బసంత బైశాఖ’ ఆమె తొలి నవల. శృంగా రాన్ని, ప్రేమను మార్కెట్లో వాణిజ్య వస్తువులుగా చూసే సమాజం పట్ల నిరసన వ్యక్తం చేసిన కళాత్మక రచన ఇది. రెండో నవల ‘పరిచయ’లో గ్రామీణ, పట్టణ జీవన శైలుల మధ్య సంఘర్షణను చిత్రించారు. యాజ్ఞసేని, శిలా పద్మ, ఉత్తర మార్గ, ఆదిభూమి నవలల్లో మానవ జాతి పరిణామం; స్త్రీలు, వారి సామాజిక అంశాలను స్పృశిం చారు. పురుష పాత్రల కంటే మహిళా పాత్రలు ఈ నవల్లో ఆధిపత్య పాత్రలుగా వ్యవహరిస్తాయి. ‘ఉత్తర మార్గ’ ఒక జాతీయవాద చారిత్రక నవల. ఆదిభూమి, మహామోహ, మగ్నమతి, మహారాణి పుత్ర అన్న నాలుగు నవలలను ఒడియా సాహిత్యంలో మహా నవలలుగా పరిగణిస్తారు. వచనంలో కావ్యాలు రాయడంలో ఆమెను మించిన వారు లేరని రాయ్ ఈ నవలల ద్వారా నిరూపించుకున్నారు. చారిత్రక వాస్తవాలను ఈ నవలలు మనముందుంచుతాయి. ‘ఆది భూమి’ కొద్దిగా భిన్నమైన నవల. ఆదిమ జాతి గిరిజనులైన బోండా జీవన శైలిని, కర్మకాండను ఈ నవలలో చిత్రించారు. ‘మహామోహ’ భారతీయ సాహిత్యంలోనే ఒక చెప్పు కోదగ్గ తాత్విక, కళాత్మక నవల. ఆధునికానంతర స్త్రీవాద ధోరణికి ఈ నవల అద్దంపడుతుంది. ఒక స్త్రీమూర్తి పూర్తి రూపాన్ని ఈ నవల బహిర్గతం చేస్తుంది. ‘మహారాణి పుత్ర’ ఒక ఆసక్తికరమైన చారిత్రక నవల. చరిత్రలోని ఘటనలను ఆమె నాటకీయంగా, మానవ సంఘర్షణలో భాగంగా చిత్రించారు. కియోంజార్ వలసవాద చరిత్రలో ప్రజా విప్లవం ఈ నవలలో మనకు ఆవిష్కృతమవుతుంది. 1979లో ఒడిషాలో బీభత్సం సృష్టించిన తుఫానుపై ఆమె ‘మగ్నమతి’ రాశారు. ఒక ప్రకృతి వైపరీత్యం బీభత్సం మాత్రమే కాదు, భూమాత ఆవేదన, సర్వ మానవ సౌభ్రాతృత్వం ఈ నవల ద్వారా చిత్రించారు. స్వతంత్ర భారతంలో జరిగిన పరిణామాలు, ప్రపంచీ కరణ ఫలితాలు కళాత్మకంగా ప్రదర్శించారు. సామాజిక, రాజకీయ అంశాలపై రచించిన ‘ఉత్తర మార్గ’ కూడా ఒక జాతీయవాద నవలే. సి. నారాయణ రెడ్డి ఆధునిక తెలుగు కవిత్వాన్ని కొన్ని దశాబ్దాల పాటు నిర్దేశించారు. సినారె, ప్రతిభా రాయ్ ఇద్దరూ అధ్యాపక రంగం నుంచి వచ్చిన వారే. ఇద్దరి సాహిత్య ప్రక్రియలు వేరైనా, తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని తెచ్చేందుకు ప్రయత్నించిన వారే. సినారెకు పద్మశ్రీ పురస్కారం 1972లోనూ, పద్మభూషణ్ 1992లోను లభించగా, ప్రతిభా రాయ్‌కి పద్మశ్రీ 2007 లోనూ, పద్మభూషణ్ 2022లోనూ లభించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అటువంటి రచయిత్రికి మహా రచయితా, కవీ, విద్యాధికుడూ, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతా అయిన డాక్టర్ సి. నారాయణరెడ్డి (సినారె) జన్మదినం నాడు... ఆయన పేర నెలకొల్పిన జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయడం తెలుగు జాతికి గర్వకారణం. - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు (జూలై 29న ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్‌కు సినారె జాతీయ పురస్కార ప్రదానం) -
సూర్య సినిమాకు జాతీయ అవార్డుల పంట
న్యూఢిల్లీ: భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతీయ అవార్డులను (National Awards) ఇవ్వడం ఆనవాయితి. ఈ ఏడాది కూడా 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలు ఈ పురస్కారాలను దక్కించుకున్నాయి. సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం 'సూరయై పొట్రు' తెలుగులో ఆకాశం నీ హద్దురా' సినిమాకు అవార్డుల పంట పండింది. నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘సూరరై పొట్రు’ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అదే సినిమాలో హీరోయిన్గా నటించిన అపర్ణ మురళి జాతీయ ఉత్తమ నటి అవార్డుని కైవసం చేసుకుంది. వీటితో పాటు.. ఉత్తమ సంగీత దర్శకుడు( జీవీ. ప్రకాష్ కుమార్), ఉత్తమ స్క్రీన్‌ప్లే (సుధా కొంగర, షాలిని ఉషాదేవి) అవార్డులను దక్కించుకున్నారు. చదవండి: Rakhi Sawant: అభ్యంతరకర సీన్లే ఎందుకు? ఒక్కటైనా మంచి రోల్ ఇవ్వండి -
ఎంపీ సంతోష్‌కు ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డ్’
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ అందుకున్నారు. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించు కొని బెంగళూరు డా‘‘బి.ఆర్.అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వృక్ష మాత ఆమె చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. సాలుమారద తిమ్మక్క ఇంటర్నేషనల్ ఫౌండేషన్, శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీ (కర్ణాటక) సంయుక్తంగా ఇచ్చే ఈ అవార్డుకు ప్రకృతి పరిరక్షణ విభాగంలో 2020 సంవత్సరానికి సంతోష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ.. ఈ నేల భవిష్యత్ తరాలకు అందకుండా పోతుందేమోనని ఆవేద నతో స్పందించే ప్రతీ హృదయానికి, ఈ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ప్రతీ ఒక్క రికి ఈ అవార్డును అంకితం చేస్తున్న. ఇది నా బాధ్యతను మరింత పెంచింది’ అని చెప్పారు. తనతోపాటు అవార్డు అందుకున్న ఇస్రో మాజీ చైర్మన్, పద్మశ్రీ ఎ.ఎస్.కిరణ్ కుమార్, ప్రముఖ నిర్మాత రంగనాథ్ భరద్వాజ్, ప్రముఖ విద్యా వేత్త గురురాజా కరజ్జయిని, సత్యామోర్గానీలకు శుభాకాం క్షలు తెలిపారు. -
శాస్త్రవేత్త హరికాంత్‌కు పురస్కారం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలోని మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త పోరిక హరికాంత్ జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఉద్యాన పంటలపై చేసిన పరిశోధనలకు ఆయన ఫెలో ఆఫ్ కాన్ఫడరేషన్ ఆఫ్ హార్టీకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీహెచ్ఏఐ)–2022 పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ హెచ్.పి.సింగ్ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ములుగు జిల్లా అన్నపల్లి గ్రామానికి చెందిన హరికాంత్ ప్రస్తుతం సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈయన ఇజ్రాయిల్ మీషావ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా. ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ దేశాల్లో ఉద్యాన పంటలపై పరిశోధనలు చేశారు. 2018లో ఆయన యువ శాస్త్రవేత్త పురస్కారాన్ని ప్రొఫెసర్ స్వామినాథన్ నుంచి అందుకున్నారు. కేవలం ఆస్ట్రేలియా వంటి దేశాలకే పరిమితమైన రెడ్‌గ్లోబ్ అనే ద్రాక్ష రకాన్ని భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసినందుకు హరికాంత్‌కు గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. -
రాష్ట్ర వైద్య శాఖకు మరో జాతీయ పురస్కారం
సాక్షి, అమరావతి: మలేరియా నిర్మూలనలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పాజిటివ్ కేసుకు మించకుండా ఉండేలా మలేరియాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. దీంతో మన రాష్ట్రం ప్రీ ఎలిమినేషన్ దశ (కేటగిరీ–2) నుంచి ఎలిమినేషన్ దశ (కేటగిరీ–1)కు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర కమ్యూనికబుల్ డిసీజస్ అడిషనల్ డైరెక్టర్ రామిరెడ్డి అవార్డును సోమవారం అందుకోనున్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో మలేరియా నిర్మూలనకు ప్రభుత్వం గత మూడేళ్లుగా నిరంతరాయంగా చేసిన కృషి చేస్తోంది. 2018లో 6,040 కేసులు నమోదు కాగా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది 1,139కి కేసులు తగ్గాయి. 2021లో 75,29,994 రక్త నమూనాలను పరిశీలించగా 1,139 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణయింది. మలేరియా కేసులు వెలుగు చూసిన హైరిస్క్ ప్రాంతాలలో ఏటా ఇళ్లలో దోమల నిరోధం కోసం ఇండోర్ రెసిడ్యుయల్ (ఐఆర్ఎస్) కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత ఏడాది మొత్తం 9.22 లక్షల జనాభా కలిగిన 3,027 గ్రామాలలో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించారు. మలేరియా కేసుల నిరోధక కృషిలో భాగంగా గత ఏడాది ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో దోమల నియంత్రణకు తలుపులు, కిటికీలకు మెష్లను ఏర్పాటు చేసింది. ‘ఫ్రై డే–డ్రై డే’ పేరుతో అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో దోమల కట్టడి, మలేరియా నిరోధం కోసం వైద్య, మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా ఏడాది ఇప్పటివరకూ కేవలం 117 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని మలేరియా రహిత (కేటగిరీ–0) చేయడానికి కృషి చేస్తామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. -
సీబీఐ అధికారి పెద్దిరాజుకు జాతీయ అవార్డు
పాలకోడేరు: న్యూఢిల్లీ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రధాన కార్యాలయం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్లో పనిచేస్తున్న డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ బండి పెద్దిరాజు 2019 సంవత్సరానికి ‘కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్’ పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేతులమీదుగా సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ సమక్షంలో శనివారం న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన ఆల్ ఇండియా సీబీఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ సమావేశంలో అవార్డును అందుకున్నారు. పెద్దిరాజు పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం (బంటుమిల్లి) గ్రామానికి చెందినవారు. ఆయన 1993లో సీబీఐలో కానిస్టేబుల్‌గా చేరారు. 2008లో ఇండియా ఉత్తమ దర్యాప్తు అధికారి గోల్డ్ మెడల్, 2017లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్–ఐపీఎం, 2014–2018లో రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు, 2019లో డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లెన్స్ అవార్డు పొందారు. -
హైదరాబాద్ డీఈఓకు జాతీయ పురస్కారం
గన్‌ఫౌండ్రీ: కరోనా కష్టకాలంలో విద్యార్థుల కోసం రూపొందించిన డిజిటల్ లైబ్రరీ వెబ్‌సైట్‌కు వచ్చిన విశేష స్పందనకు చక్కటి గుర్తింపు దక్కింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఈ మేరకు శనివారం హైదరాబాద్ డీఈఓ రోహిణీకి పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ పాఠశాల విద్యాశాఖ విభాగం నగర అధ్యక్షుడు కేఆర్.రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం.భాస్కర్ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఉద్యోగులు ఆమెను ఘనంగా సన్మానించారు. -
ఏపీ ఎస్పీడీసీఎల్కు జాతీయ అవార్డు
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలతో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్)కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం 15వ ఇంధన సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించారు. విద్యుత్ పంపిణీలో ఆవిష్కరణల అంశంలో చేస్తున్న కృషిలో ఏపీ ఎస్పీడీసీఎల్ జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచినట్లు ఈ సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో భాగంగా జరిగిన ఐసీసీ అవార్డులు–2022 ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా జ్యూరీ సభ్యుల నుంచి ఈ అవార్డును ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాథరావు అందుకున్నారు. ఎస్పీడీసీఎల్కు జాతీయ అవార్డు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా సంస్థ మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు. -
'భజరంగీ భాయిజాన్' మున్నీకి ప్రతిష్టాత్మక అవార్డు.. వారికి అంకితం
Harshaali Malhotra Receives Bharat Ratna Dr Ambedkar Award: ఆంజనేయ స్వామి భక్తుడిగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన మూవీ 'భజరంగీ భాయిజాన్'. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 2015లో విడుదలైన ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందించారు. స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటీనటుల యాక్టింగ్‌కు ఫిదా కావాల్సిందే. అందులో ముఖ్యంగా మున్నీగా అలరించిన హర్షాలీ మల్హోత్ర మైండ్‌లో నుంచి పోదు. అంతలా ఆకట్టుకుంది చిన్నారి హర్షాలీ. తాజాగా హర్షాలీకి అరుదైన గౌరవం దక్కింది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) 13 ఏళ్ల హర్షాలీని మహరాష్ట్ర ప్రభుత్వం 'భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్' అవార్డుతో సత్కరించింది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ నుంచి ఈ పురస్కారాన్ని అందుకుంది ఈ బాల నటి. ఈ విషయాన్ని సోషల్ మీడియా అయిన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఈ బహుమతిని సల్మాన్ ఖాన్, కబీర్ ఖఆన్, చిత్ర నిర్మాతలకు అంకితం ఇస్తున్నట్లుగా పోస్ట్ పెట్టింది హర్షాలీ. ఈ పోస్ట్‌కు అనేకమంది నెటిజన్స్ స్పందించారు. హర్షాలీని చూస్తుంటే గర్వంగా ఉందని, ఇలాంటి విజయాలు మరెన్నో దక్కాలని కోరారు. 'మున్ని ఈ అవార్డు నీది మాత్రమే. ఎందుకంటే నీ యాక్టింగ్‌తోనే ఈ అవార్డు గెలుచుకున్నావ్' అని ఒక యూజర్ అభిమానం చూపించారు. ఇదిలా ఉంటే 'భజరంగీ భాయిజాన్' సినిమా సమయంలో హర్షాలీకి ఎనిమిదేళ్లు. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు -
కృష్ణా జిల్లా ఎస్పీకి జాతీయ స్థాయి అవార్డు
సాక్షి, కోనేరు(విజయవాడ): కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు డీజీ.బీపీఆర్–డీ (డైరెక్టర్ జనరల్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) డిస్క్ అవార్డు లభించింది. కోవిడ్ కంటే ముందే వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అందరికీ పరిచయం చేసి, స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. నేషనల్ పోలీస్ మిషన్‌లో భాగంగా గతేడాది డిసెంబర్ 4వ తేదీన డీజీ, ఐజీలకు నిర్వహించిన కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ లెవల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా నలుగురు ఎస్పీ స్థాయి అధికారులను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఎంపికయ్యారు. వీరు తమ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రదర్శించగా, అందులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రదర్శించిన ‘వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – స్పందన ప్రాజెక్టు’ మైక్రోమిషన్ కింద ఎంపికైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు స్వయంగా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి చేసిన కృషికి గానూ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించటంతో పాటు డిస్క్ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డుకు ఎంపికైన జిల్లా ఎస్పీని పలువురు అధికారులు అభినందించారు. జిల్లాలోని పోలీస్ సిబ్బంది ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
టెన్నిస్ క్రీడాకారిణి జాఫ్రీన్‌కు జాతీయ పురస్కారం
సాక్షి, అమరావతి: బధిరుల (డెఫ్) ఒలింపిక్స్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జాఫ్రీన్ జాతీయ పురస్కారానికి ఎంపికైంది. విభిన్న ప్రతిభావంతుల సాధికారత–2020లో భాగంగా ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ నెల 3వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాఫ్రీన్ అవార్డును అందుకుంటారు. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ లేఖ పంపినట్టు జాఫ్రీన్ తండ్రి జాకీర్ ఆదివారం తెలిపారు. కర్నూలుకు చెందిన జాఫ్రీన్ అంతర్జాతీయ స్థాయిలో 9 పతకాలు, జాతీయ స్థాయిలో 8 బంగారు పతకాలు సాధించింది. 2017లో టర్కీలో జరిగిన బధిరుల (డెఫ్) ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. భారత డెఫ్ టెన్నిస్ జట్టు సారథిగా ఉన్న ఆమె ర్యాంకింగ్స్ పరంగా దేశంలో 1వ, అంతర్జాతీయంగా 12వ స్థానంలో కొనసాగుతోంది. 2022లో బ్రెజిల్లో జరిగే డెఫ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్టు జాఫ్రీన్ ‘సాక్షి’తో చెప్పింది. తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం జాఫ్రీన్ హైదరాబాద్‌లో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదవండి: హరిత టపాసులతో కాలుష్యానికి చెక్ -
ధనుష్ ఓ సెన్సేషన్
-
The Singing Ringing Tree: ఈ చెట్టు మధురంగా పాడుతుందట..!.. వినాలంటే..
చెట్లు పలికే స్వరమాధుర్యాన్ని ఎప్పుడైనా విన్నారా? చెట్లు పాటలు పాడటమేంటి? ఇదేం పిచ్చి ప్రశ్న అని కోప్పడిపోకండి. చెట్టు పలికే వాయుగీతాన్ని వినాలంటే మీరు ఇంగ్లాండ్ వెళ్లాల్సిందే. అక్కడ లాంకషైర్ కౌంటీలోని బర్న్లీ పట్టణానికి చేరువలో కనిపించే చెట్టు రోజంతా వాయుగీతాలను వినిపిస్తుంది. నెమ్మదిగా పిల్లగాలులు వీచేటప్పుడు మంద్రంగా, గాలులు ఒకమోస్తరుగా వీచేటప్పుడు కాస్త మధ్యమంగా, శరవేగంగా పెనుగాలులు వీచేటప్పుడు తారస్థాయిలోను స్వరాలాపన చేసే ఈ వృక్షం అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇది సహజమైన వృక్షం కాదు, ఉక్కుతో రూపొందించిన పది అడుగుల లోహ కళాఖండం ఇది. దీనికి కొమ్మల్లా వివిధ పరిమాణాల్లో వేణువు మాదిరి లోహపు గొట్టాలను ఏర్పాటు చేయడంతో, ఈ గొట్టాల గుండా గాలి వెళ్లేటప్పుడల్లా చిత్రవిచిత్రమైన స్వరధ్వనులు వినిపిస్తాయి. మైక్ టాంకిన్, అన్నాలియు అనే లోహశిల్పులు ఈ లోహవృక్షాన్ని స్వరాలు పలికేలా తీర్చిదిద్దారు. బెర్న్‌లీ పట్టణానికి చేరువలోని ఖాళీ మైదానంలో దీనిని 2006లో ఏర్పాటు చేశారు. బీబీసీలో ప్రసారమైన 1960ల నాటి ఫాంటసీ సీరియల్ స్ఫూర్తితో దీనికి ‘ద సింగింగ్ రింగింగ్ ట్రీ’ అనే పేరు పెట్టారు. ఈ లోహవృక్ష రూపకల్పనలో కనపరచిన అమోఘ శిల్పనైపుణ్యానికి గుర్తింపుగా 2007లో దీనిని రూపొందించిన శిల్పులకు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఏటా ఇచ్చే జాతీయ అవార్డు కూడా లభించింది. చదవండి: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో.. -
వారిపై పగ తీర్చుకుంటా: తాప్సీ
తెలుగుతో పాటు దాదాపు అన్ని సౌతిండియా ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ తాప్సీ పన్ను. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. తాను త్వరలోనే పగ తీర్చుకుంటానని ఓ ఇంటర్వూలో తెలిపింది. ఎవరిపై అనుకుంటున్నారా సినిమా అవార్డులు ఇచ్చేవారిపై. ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో ‘రష్మి రాకెట్’ అనే మూవీలో లీడ్‌రోల్ నటిస్తోంది. అయితే ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వూలో మాట్లాడింది. అందులో ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అడగగా..‘నాకో అవార్డు ఇవ్వండని ఎవరిని అడగాలి. ఏం చేయాలో నాకు తెలీదు. నేను నటనలో నా బెస్ట్ చూపిస్తూ వెళ్లడం మాత్రమే నా చేతుల్లో ఉంది. అయినా రెగ్యులర్ అవార్డే ఇంత వరకు రాలేదు. నేషనల్ అవార్డు కోసం ఎలా లాబియింగ్ చేయగలను’ అని తెలిపింది. నిజానికి ‘పింక్’ సినిమాలో తన నటనకి గుర్తింపుతో పాటు అవార్డు వస్తుందని తాప్పీ అనుకుంది. కానీ అలాంటిదేమి జరగలేదు. కొన్నింట్లో నామినేషన్ కూడా రాలేదు. ఈ తరుణంలో తన పర్మామెన్స్‌కి పదును పెట్టుకుంటూ.. ప్రతిభ ఉన్న వారికి కాకుండా కాకా పట్టేవారికి అవార్డులు ఇచ్చే వారిపై పగ తీర్చుకుంటానని ఈ బ్యూటీ చెప్పింది. అయితే తాప్సీ నటించిన తాజా చిత్రం ‘రష్మీ రాకెట్’ అక్టోబర్ 15న ఓటీటీ విడుదల కానుంది. కాగా ఈ భామ ప్రస్తుతం ఇండియన్ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్‌గా వస్తున్న ‘శభాష్ మిథు’తోపాటు ‘లూప్ లపేటా’, ‘దోబారా’ వంటి వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతుంది. చదవండి: ఇలాంటి శరీరం తాప్సీకి మాత్రమే ఉంటుంది.. నటి ఘాటు రిప్లై -
జీసీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 5 సాధించి సత్తా చాటింది. రెండు విభాగాల్లో మొదటి ర్యాంకు, ఒక విభాగంలో రెండో ర్యాంకు, మరో రెండు విభాగాల్లో మూడో ర్యాంకు లభించాయి. ► ప్రతిస్పందన విభాగంలో.. గిరిజనుల కోసం ప్రధానమంత్రి వన్ ధన్ వికాస్ యోజన కేంద్రాలు, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల (ఎంఈపీ)కు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను అందించడంలోను దేశంలోనే టాప్‌లో నిలిచి మొదటి ర్యాంకు సాధించింది. ► రిటైల్ అండ్ మార్కెటింగ్ విభాగంలో.. సేంద్రియ, సహజ ఆహార ఉత్పత్తుల సరఫరాలోను జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు గెల్చుకుంది. ► కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4 కోట్ల 50 లక్షల 74 వేల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు దక్కింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.9 కోట్ల 76 లక్షల, 27 వేల విలువైన చిన్న తరహా అటవీ ఫలసాయాలు (ఎంఎఫ్పీ) సేకరించినందుకు జాతీయ స్థాయిలో 3 వ ర్యాంకు సాధించింది. ► 2020–2021లో అత్యధికంగా రూ.12 కోట్ల 86 లక్షల 12 వేలను వినియోగించినందుకు దేశంలోనే 3 వ ర్యాంకు దక్కించుకుంది. సీఎం మార్గనిర్దేశం.. సిబ్బంది అంకితభావంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశం, అధికారులు, సిబ్బంది అంకితభావం వల్లే జీసీసీకి 5 అవార్డులు దక్కాయి. కరోనా కష్టకాలంలోను ఉత్తమ పనితీరుతో జీసీసీ అధికారులు, సిబ్బంది అధికంగా వ్యాపార వ్యవహారాలను నిర్వహించగలిగారు. అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు 2019–20లో రూ.13.18 కోట్లు, 2020–21లో రూ.76.37 కోట్లు ఖర్చుచేశాం. జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు 2019–20లో రూ.24.22 కోట్లు జరగ్గా, 2020–21లో రూ.33.07 కోట్లకు పెరిగాయి. 2019–20లో జీసీసీ రూ.368.08 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేయగా, 2020–21లో తీవ్రమైన కరోనా నేపథ్యంలోను రూ.450.68 కోట్ల మేరకు వ్యాపారం చేయగలిగింది. – పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి జాతీయస్థాయిలో సత్తా చాటింది జాతీయస్థాయి ర్యాంకింగ్ల్లో జీసీసీ సత్తా చాటింది. పలు విభాగాల్లో ఏకంగా 5 జాతీయ అవార్డులు రావడం ఎంతో గర్వకారణం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జీసీసీలు పలు విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు కేంద్ర ట్రైఫెడ్ సంస్థ ఈ అవార్డులను అందిస్తుంది. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల్లోను అటవీ ఉత్పత్తుల సేకరణలో జీసీసీ పటిష్టమైన కార్యాచరణ చేపట్టింది. అటవీ ఉత్పత్తుల అమ్మకాల్లో రాష్ట్రంలోని గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమన్వయం, పర్యవేక్షణతోనే ఇంత గొప్ప రికార్డును సాధించడానికి సాధ్యమైంది. – పీఏ శోభ, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్, విశాఖపట్నం -
AP: ఏపీ సీడ్స్‌కు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు సామజిక బాధ్యత కింద జాతీయ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సర్టిఫైడ్ విత్తనాలను ఖరీఫ్ సీజన్‌కు ముందే పంపిణీ చేసి.. రైతుల ఆదరణను ప్రభుత్వం చూరగొందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా ఖర్చుల భారం లేకుండా ఊళ్లోనే విత్తనాలు అందాయని చెప్పారు. విత్తన పంపిణీ వల్ల 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకురిందన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, కమిషనర్ అరుణ్ కుమార్, సీడ్స్ ఎండి శేఖర్ బాబు ఇతర సిబ్బందిని మంత్రి కన్నబాబు అభినందించారు. -
టెస్కాబ్‌కు జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్)కు జాతీయ అవార్డు దక్కింది. వ్యవసాయ రంగానికి ఆరి్థకదన్నుగా నిలవడం, రైతాంగానికి వేగంగా రుణాలు మంజూరు చేయడంతో ఈ అవార్డు వరించింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డు) జాతీయస్థాయిలో వ్యవసాయ రంగానికి అత్యుత్తమ సేవలందించిన బ్యాంకులకు అవార్డులివ్వడం తెలిసిందే. జిల్లా బ్యాంకు కేటగిరీలో దక్షిణ భారతదేశం నుంచి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది. నాబార్డు వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ముంబైలోని నాబార్డ్ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. ఈ అవార్డును అందుకున్న టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ, ఒకే రాష్ట్రం నుంచి రెండు జాతీయ అవార్డులను ఒకే సంవత్సరంలో కైవసం చేసుకోవ డం చాలా అరుదైన విషయమని, ఈ రెండు బ్యాం కులకు తనే అధ్యక్షుడిగా ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ ఘనత సాధించినందుకు గాను టెస్కాబ్ ఎండీ డా.నేతి మురళీధర్, సిబ్బందిని ఆయన అభినందించారు. -
చిత్తశుద్ధి.. సమన్వయం: అభివృద్ధిలో ‘చక్రాపూర్’ ఆదర్శం
సాక్షి, మహబూబ్‌నగర్: పాలకవర్గం చిత్తశుద్ధి.. గ్రామస్థుల సంపూర్ణ సహకారం.. అధికారుల ప్రోత్సాహం వెరసి చక్రాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోయింది. జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకుంది. పరిశుభ్రత, పారిశుధ్యం, పచ్చదనానికి ఆ గ్రామం ఇప్పుడు కేరాఫ్‌గా మారింది. ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామసర్పంచ్, వార్డు సభ్యులపై అభినందనలు వెల్లువెత్తున్నాయి. చక్రాపూర్ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలో ఉంది. 1638 మంది జనాభా ఉంది. నిన్నమొన్నటి వరకు ఈ గ్రామ పంచాయతీ కూడ అన్ని పంచాయతీల మాదిరిగానే ఉండేది. కాని అభివృద్ధి పథకంలో సాగిన ఈ గ్రామం.. ఇప్పుడు జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయితీ సశక్తి కరణ్ కింద జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. 2019లో సర్పంచ్‌గా కొండపల్లి శైలజా ఎన్నికైన తర్వాత వార్డు సభ్యులు, గ్రామస్థులతో సమన్వయంతో వ్యవహరించి అధికారులు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సహకారంలో గ్రామాభివృద్ధికి బాటలు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించారు. 7 లక్షల 50 వేలతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 12 లక్షల 50 వేలతో వైకుంఠ ధామం, 2 లక్షల 50 వేలతో డంపింగ్ యార్డ్, 2లక్షలతో ప్రభుత్వ నర్సరీ, లక్షా 40 వేలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. గ్రామంలో కంపోస్టు ఎరువు తయారు చేసే విధానాన్ని ప్రారంభించారు. త్వరలో ఎరువును సైతం బ్యాగుల్లో నింపేందుకు సిద్ధం అయ్యారు. ఆ ఎరువును గ్రామంలో పెంచుతున్న మొక్కలకు ఎరువుగా వాడనున్నట్టు సర్పంచ్ శైలజా తెలిపారు. అధికంగా ఉంటే ఇతరులకు విక్రయించి వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆమె తెలిపారు. ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. పొడిచెత్తా, తడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి ఎరువును తయారు చేస్తున్నారు. ఎరువు తయారీలో ఈ గ్రామంలో మండలంలోనే మొదటి గ్రామంగా నిలిచింది. గ్రామంలోని రహదారులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం, మురుగుకాల్వల్లో చెత్తను తీసివేయటం చేస్తూ పారిశుధ్యం లోపించకుండా చూస్తున్నారు. వీధి దీపాల ఏర్పాటు, మొక్కల పెంపుదల వంటి వాటిలో కూడ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. గ్రామస్దులు కూడ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఇంటిపన్నులు సకాలంలో చెల్లిస్తుండటంతో వందశాతం ఇంటిపన్ను వసూలు అవుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తమ గ్రామం భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో సర్పంచ్ శైలజా వార్డు సభ్యులు ఆసక్తిగా పాల్గొంటుండటంతో అభివృద్ది సాధ్యమవుతుందని అంటున్నారు. అయితే 44వ జాతీయ రహదారి నుంచి ఈ గ్రామం 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందులో సగం వరకు రహాదారి బాగున్నా మిగిలిన సగం గతుకుల మయంగా మారిందని ఆ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. తమ గ్రామానికి దేశస్థాయియిలో గుర్తింపు రావటంపై గ్రామస్దులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయితీ సశక్తి కరణ్ కింద జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా చక్రాపూర్ ఎంపిక కావటం సర్పంచ్‌గా తనకు ఎంతో గర్వంగా ఉందని సర్పంచ్ శైలజా తెలిపారు. ఈ అవార్డు రావటం తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈ అవార్డు రావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో గ్రామాభివృద్ది శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అవార్డు రావటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్పంచ్ శైలజను ప్రగతి భవన్‌కు పిలిచి సత్కరించి అభినందించారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సర్పంచ్,గ్రామవార్డు సభ్యులను అభినందించారు. చదవండి: ‘మొక్క’వోని దీక్ష.. అంత పెద్ద చెట్టును మళ్లీ నాటాడు! Telangana: డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల -
Pareshamma: ఒప్పించి.. మెప్పించింది!
ఐదేళ్ల శ్రమకు దక్కిన గౌరవం ఇది. నేలతల్లి గొంతు తడిని నిలిపిన ఫలితం. గ్రామీణ మహిళకు అందిన ఈ పురస్కారం. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె కరువుకు కేరాఫ్. భూగర్భ జలాలు అడుగంటిపోవడం ఇక్కడ రైతులకు కొత్తేమీ కాదు. సాగు చేయడానికి నేల ఉంది, పంట పండడానికి నీరు లేదు. తంబళ్లపల్లెతోపాటు చుట్టుపక్కల పదహారు గ్రామాలు ఇప్పుడు ఆ దుస్థితి నుంచి గట్టెక్కాయి. ఆ గట్టెక్కడంలో వేల అడుగులు నడిచింది పారేశమ్మ. ఆమె శ్రమకుగాను యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ వాటర్ మిషన్లు బుధవారం నాడు నేషనల్ ఉమెన్ వాటర్ చాంపియన్ అవార్డును ప్రకటించాయి. తంబళ్లపల్లె మండలం, గోపిదిన్నెకు చెందిన పారేశమ్మ ఐటీఐ పూర్తి చే సింది. గోపిదిన్నెకు చెందిన ఎరుకులప్పను కులాంతర వివాహం చేసుకుంది. అతడు తంబళ్లపల్లె పంచాయతీలో పారిశుద్ద్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. పారేశమ్మ తల్లిదండ్రులకు రెండున్నర ఎకరాల పొలం ఉన్నప్పటికీ సాగునీటి ఇబ్బందులతో వ్యవసాయం చేయడం కుదరలేదు. బతుకుతెరువు కోసం తంబళ్లపల్లెలో స్థిరపడ్డారు. వెంటపడి వినిపించింది! తంబళ్లపల్లి వచ్చిన తర్వాత తాను కూడా ఏదో ఒక పని చేయాలి, ఏ పని దొరుకుతుందా అని ఆలోచిస్తున్నప్పుడు 2015లో ‘ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ’ సంస్థ పర్యావరణం, నీటి సంరక్షణ, రైతుల కోసం పనిచేస్తున్న విషయం తెలిసి పని అడిగింది. నెలకు రూ. 4,500 గౌరవ వేతనంతో తంబళ్లపల్లె పంచాయతీ లో రీసోర్స్‌పర్సన్‌గా నియమితురాలైంది. తంబళ్లపల్లె పరిసరాల్లోని 16 పల్లెల్లో విధులు నిర్వహించాలి. వ్యవసాయంలో ఎంతో అనుభవం కలిగిన రైతులకు సూచనలివ్వాలి. చెప్పడానికి పారేశమ్మ సిద్ధంగా ఉన్నప్పటికీ వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వాళ్లు అలవాటు పడిన పద్ధతిలో మార్పు తీసుకురావడం మాటలు కాదు. అందులోనూ సేద్యంలో అనుభవం లేని పారేశమ్మ చెప్తుంటే పట్టించుకునేదెవరు? ఆమె ప్రయత్నం అంతా తాతకు దగ్గులు నేర్పించడం వంటిదే అన్నమాట. కొన్నిరోజుల్లోనే పారేశమ్మకు పరిస్థితి అర్థమైపోయింది. అయితే ఆమె ఆ రోజు ఈ పని తనవల్ల కాదని వదిలేసుంటే పారేశమ్మ గురించి రాయడానికి ఏమీ ఉండేది కాదేమో! ఆమె పట్టుదలతో కొనసాగింది. ఒక్కొక్క పల్లెకు ఒకటికి పదిసార్లు వెళ్లింది. ఉదయం ఆరున్నరకు వెళ్తే మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తిరిగొచ్చేది. మళ్లీ సాయంత్రం నాలుగింటికి వెళ్తే రాత్రి 8 గంటల దాక పల్లెల్లోనే. వాస్తవ నీటి పరిస్థితులు, అధిక నీటి వినియోగమయ్యే పంటలసాగుతో కలిగే ఇబ్బందులను వివరిస్తూ వచ్చింది. చెవినిల్లు కట్టుకుని చెప్పినట్లే చెప్పింది. చెప్పగా చెప్పగా రైతులు వినడం మొదలైంది. ఆ తర్వాత వారిలో ఆలోచన రేకెత్తింది. నిజమే కదా! అని సమాధానపడ్డారు. అలా పారేశమ్మ రైతులను పంటల సాగులో మార్పుకు ఒప్పించింది. రైతులకు అవగాహన కల్పిస్తున్న పారేశమ్మ చాంపియన్ పొలాల్లో కందకాలు తవ్వుకుంటే నీరు పొలంలోనే ఇంకిపోయి తేమ శాతం పెరుగుతుందని వివరించింది. భుగర్భజలాలు పెరగడంపై అవగాహన కల్పించేది. ఉపాధి హామీ పథకం పనుల్లో అధికంగా నీటినిల్వ పనులు చేసేలా ప్రోత్సహించింది. ఇప్పుడు ఈ పల్లెల్లో ఒక వర్షానికే కుంటలు నిండిపోతున్నాయి. రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి పారేశమ్మ ఒంటరిపోరాటం చేసింది. ఆమె కృషికి గుర్తింపుగా వాటర్ చాంపియన్ అవార్డు ఆమెను వరించింది. – టైలర్ షామీర్ బాషా ,బి. కొత్తకోట, చిత్తూరు జిల్లా పదహారు పల్లెలు తంబళ్లపల్లె, పులసవాండ్లపల్లె, గోళ్లపళ్లోపల్లె, చెవిటివారిపల్లె, ఎగువబోయపల్లె, బలకవారిపల్లె, చెన్నప్పగారిపల్లె, నాయనప్పగారిపల్లె, దబ్బలగుట్టపల్లె, కురవపల్లె, మట్టావాండ్లపల్లె, బురుజు, బోడికిందపల్లె, కొండకింద మేకలవారిపల్లె, ఇట్నెనివారిపల్లె, చేలూరివాండ్లపల్లెల్లో ఇంటికి ఒకరిని సంఘంలో చేర్చాను. వారితో నిత్యం పొలాల్లో, గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఏయే పల్లెల్లో భూగర్భజలాల మట్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేసి వివరించాను. ఏయే పంటలకు ఏ మేరకు నీటి వినియోగం అవుతుందో చెప్పేదాన్ని, నీటివనరును బట్టి ఏ పంటలు సాగు చేయాలనే అవగాహన కల్పిస్తూ అందుకు అనువైన పంటల గురించి వివరించాను. అందరూ కలిసిరావడంతోనే విజయం సాధించాం. – పారేశమ్మ, రీసోర్స్ పర్సన్,ఎఫ్ఈఎస్ ఇదీ ప్రణాళిక! ఈ పల్లెల చుట్టూ కొండలు, గుట్టలు ఉంటాయి. పల్లెల చుట్టూ సహజంగా ఉన్న ప్రకృతి వనరులను కాపాడుకోవడం. భూమికోత నివారణ, మొక్కల పెంపకం ద్వారా అడవుల సంరక్షణ, భూగర్భజలాల వృద్ధికి నష్టం కలిగించే పనులు చేపట్టకపోవడం కార్యక్రమాలను సంఘాల ద్వారా అవగాహన కల్పించింది పారేశమ్మ. ఈ గ్రామాల్లో రైతులు వరి, టమాట పంటలనే ఎక్కువగా సాగు చేస్తారు. సగం పొలంలో రైతుకు ఇష్టమైన పంట వేసుకుని, మిగిలిన సగం పొలంలో కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు లాంటి చిరుధాన్యాలు, సజ్జలు, రాగులు, వేరుశెనగ సాగు చేశారు. గత ఏడాది 60 మంది రైతుల చేత 75 ఎకరాల్లో చిరుధాన్యాలను సాగు చేయించారు. ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడితో 480 టన్నులు వచ్చింది. కోవిడ్ ప్రభావంతో ధరలు తగ్గాయి. కొందరు రైతులు పంటను అమ్మకుండా మార్కెట్ మెరుగయ్యే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫొటోలు: షేక్ మహ్మద్ రఫీ, సాక్షి, తిరుపతి -
‘పెద్దకడుబూర్’కు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా పెద్దకడుబూర్ పోలీస్ స్టేషన్‌కు జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకు సంబంధించిన రూ.25 వేల నగదు రివార్డును మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెలి్లకి డీజీపీ గౌతమ్ సవాంగ్ సోమవారం అందజేశారు. కేంద్ర హోంశాఖ ఇటీవల నిర్వహించిన డీజీపీల కాన్ఫరెన్సులో 2020 ఏడాదికి సంబంధించి ఈ అవార్డును ప్రకటించారు. ఏపీలో అత్యత్తమ పోలీసు స్టేషన్‌గా కర్నూలు జిల్లా పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ను ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు’కు ఎంపిక చేశారు. ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపిక చేయడానికి పది ప్రధాన అంశాలను కేంద్ర హోంశాఖ పరిగణనలోకి తీసుకుంది. నేరాలను ముందస్తుగా నిరోధించడం, క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం, వేగవంతంగా దర్యాప్తు చేసి పరిష్కరించడం, త్వరితగతిన ఛేదించడం, కమ్యూనిటీ పోలీసింగ్, శాంతిభద్రతలను పరిరక్షించడం, శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహార శైలి గురించి ప్రజల స్పందన (ఫీడ్ బ్యాక్), నేర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఆన్లైన్ చేయడం, డేటాను భద్రపరచడం, మహిళలు, ఎస్సీ, ఎస్టీ ప్రజలపై నేరాలు, ఆస్తులకు సంబంధించిన నేరాలపై అవగాహన కల్పించి నియంత్రించడం, సకాలంలో ఎఫ్ఐఆర్లు, చార్‌్జషీట్లు దాఖలు చేయడం వంటి వాటిని పరిశీలించిన అనంతరం పెద్దకడుబూర్ పోలీస్ స్టేషన్‌ను ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడం కర్నూలు జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణమని డీజీపీ సవాంగ్ అన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను, సిబ్బందిని డీజీపీ సవాంగ్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అభినందించారు. డీజీపీ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. పోలీసింగ్‌లో ఆధునిక, సాంకేతిక టెక్నాలజీని వినియోగించి శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించాలన్నారు. -
పీఎం కిసాన్ అవార్డు అందుకున్న ‘అనంత’ కలెక్టర్
ఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అందుకున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా బుధవారం ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డుకు అనంతపురం జిల్లా ఎంపికైన సంగతి తెలిసిందే. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద రైతులకు రూ. 6వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుంది. ఈ పథకం అమలులో అనంతపురం జిల్లా ముందు వరుసలో నిలిచింది. కేంద్ర వ్యవసాయశాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో 5శాతం మంది లబ్దిదారులకు సంబంధించి భౌతిక ధృవీకరణ చేశారు. అసలు వీరు పథకానికి అర్హులేనా? సరైన వివరాలే నమోదు చేశారా? అనే అంశాలను పరిశీలించారు. 2018 డిసెంబర్ 1న ప్రారంభించిన ఈ పథకం కింద జిల్లాలో మొత్తం 63 మండలాల్లో 28,505 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మరే జిల్లాలో లేని విధంగా లబ్ధిదారుల భౌతిక ధృవీకరణను 99.6 శాతం పూర్తి చేసింది. ఈ ఘనత సాధించడం పట్ల కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాను ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. చదవండి : (రూ.2.65 లక్షల టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికే) (భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు) -
ఏపీ ఐపీఎస్‌లకు జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ‘అంత్రిక్ సురక్ష సేవ పతకం–2020’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులను కేంద్రం ఈ మెడల్స్‌కు ఎంపిక చేసింది. వీటిని డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అందజేశారు. మెడల్స్ అందుకున్న వారిలో డీఐజీ పాలరాజు(ఏపీ పోలీస్ టెక్నికల్ చీఫ్), అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా, పోలీస్ ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్‌బాబు, నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఉన్నారు. -
మరోసారి సత్తా చాటిన టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో తెలంగాణ ఆర్టీసీ మరోసారి సత్తా చాటింది. డీజిల్ వినియోగంలో పొదుపు పాటించి మైలేజీలో మెరుగుదల సాధించటం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్–2020 సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ ఢిల్లీలో బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 4,001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. 2019లో ఆర్టీసీ సగటు మైలేజీ (కిలోమీటర్ పర్ లీటర్–కేఎంపీఎల్) 5.16 ఉండగా, 2020లో 5.28కి పెరిగింది. అంటే 0.12 మేర మెరుగుపడింది. ఏయేటికాయేడు కేఎంపీఎల్‌ను మెరుగుపరుచుకుంటూ వస్తున్న ఆర్టీసీ, జాతీయ స్థాయిలో ఇంధన పొదుపులో ఉత్తమ సంస్థగా మొదటి రెండు స్థానాల్లో నిలుస్తు వస్తోంది. తాజాగా మరోసారి దాన్ని నిలబెట్టుకుంది. చదవండి: హమ్మయ్యా! బ్యాటరీ బస్సు ఆశలు సజీవం ఈ మెరుగుదల ఆధారంగా సంవత్సర కాలంలో ఆర్టీసీ 24 లక్షల లీటర్ల ఇంధనాన్ని పొదుపు చేసినట్టయింది. ప్రసుతం బహిరంగ మార్కెట్లో ఉన్న డీజిల్ ధర ప్రకారం చూస్తే ఈ పొదుపు మొత్తం విలువ దాదాపు రూ.19 కోట్లు అవుతుంది. జనవరి 16న వర్చువల్ పద్ధతిలో జరిగే సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలంగాణ ఆర్టీసీ ఎండీకి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. పురస్కారంతోపాటు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని హయత్‌నగర్–1, ఉప్పల్, దిల్సుఖ్నగర్ డిపోలు ఇంధన పొదుపులో ఉత్తమ డిపోలుగా నిలిచాయి. కేంద్రమంత్రి ఈ మూడు డిపోలకు కూడా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. నగదు ప్రోత్సాహకం కింద ఒక్కో డిపోకు రూ.50 వేల చొప్పున అందించనున్నారు. చదవండి: సంస్కృతి కళ్లకు కట్టేలా నాగోబా ఆలయం -
కామారెడ్డికి అరుదైన గౌరవం
సాక్షి, కామారెడ్డి : జాతీయస్థాయిలో కామారెడ్డి జిల్లాకు అత్యుత్తమ పురస్కారం లభించింది. డిజిటల్ గవర్నెన్స్‌లో వెబ్‌రత్న –2020 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని కలెక్టర్ శరత్ శనివారం తెలిపారు. అవార్డుకు ఎంపికవడానికి కారణాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో జిల్లా గురించి సంక్షిప్తంగా మ్యాప్, చరిత్ర, పరిపాలన విభాగం, జనాభా తదితర అంశాలను వివరణాత్మకంగా రూపొందించి వెబ్సైట్లో సమాచారాన్ని నమోదు చేశామన్నారు. జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారుల వివరాలు, ఫోన్‌నెంబర్లు, ఇతర అన్ని రకాల సమాచారాన్ని పొందుపరిచామని తెలిపారు. వెబ్సైట్లో జిల్లా పరిపాలన, చారిత్రక, భౌగోళిక నేపథ్యం గురించి చిత్రాలతో వివరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జీఐజీడబ్ల్యూ నిబంధనల ప్రకారం నవీకరించిన సమాచారం అందుబాటులో ఉందన్నారు. కలెక్టర్ శరత్ పర్యాటక సమాచారం, ప్రదేశాలు, వసతి, సంస్కృతి, పండుగలు, ఉత్పత్తులు, ముఖ్యమైన దేవాలయాల సమాచారాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో జిల్లా వెబ్సైట్లో నమోదు చేశామని వివరించారు. ఆసక్తికర సంఘటనలు, మతపరమైన ప్రదేశాల ఫొటో గ్యాలరీలు, పథకాలు, ప్రాజెక్టులు లాంటి వివరాలతో వెబ్సైట్ సమగ్ర సమాచారాన్ని కలిగి ఉందన్నారు. హోంపేజీలో తాజా రోజువారి సంఘటనలు, ప్రెస్నోట్లు, కోవిడ్–19 సమాచారం ఉంచుతున్నామని తెలిపారు. జిల్లా వెబ్‌సైట్‌ను బలమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని, ఎప్పటికప్పుడు నవీకరిస్తున్నామని వివరించారు. కామారెడ్డి జిల్లా https://kamareddy.telangana.gov.in వెబ్సైట్ సేవలను ప్రజలందరూ వినియోగించుకుని అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈనెల 30 వతేదీన ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు.