
నాగరాజు తీసిన ఫొటో
సాక్షి, బాపట్ల : మండలంలోని ముత్తాయిపాలెం గ్రామానికి చెందిన పీవీఎస్ నాగరాజుకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఛాయాచిత్ర అవార్డు లభించింది. పాట్నాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రపీ వారు నేషనల్ డిజిటల్ సర్క్యూట్ నిర్వాహకులు నాగరాజును తృతీయ బహుమతికి ఎంపిక చేశారు. మహిళా వంట చేస్తున్నప్పుడు తీసిన ఫొటోకు అవార్డు లభించింది. ఈ సందర్భంగా బాపట్ల ప్రగతి ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు నాగరాజుకు అభినందనలు తెలిపారు.

జాతీయ స్థాయిలో ఉత్తమ ఛాయాచిత్ర అవార్డు తీసుకుంటున్న నాగరాజు