
రాత్రి వేళ శ్రీవారి ఆలయ సౌందర్యాన్ని ప్రతిభింబించే ఫొటో (జాతీయ అవార్డు పొందిన ఫొటో ఇదే)
తిరుపతి కల్చరల్ : తిరుపతికి చెందిన సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ కేతారి మోహన్ క్రిష్ణకు రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫొటో గ్రాఫర్స్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ ఫొటో గ్రాఫర్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఫొటో కాంటెస్ట్ నిర్వహించారు. ఫొటో ట్రావెలర్ విభాగంలో రాత్రి వేళ తిరుమల శ్రీవారి ఆలయ సౌందర్యం ఫొటోకు, ఫొటో జర్నలిజం విభాగంలో తిరుమలకు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నడుçస్తూ వస్తున్న సమయంలో ఆయనను చూసిన ఓ అభిమాని వెళుతున్న బస్సు కిటికీలోనుంచి దూకుతుండగా తీసిన మరో ఛాయా చిత్రానికి బహుమతులు లభించాయి. అమరావతిలో ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ ఫొటో గ్రాఫర్స్ దినోత్సవాల్లో కేతారి మోహన్ క్రిష్ణ ఈ అవార్డులను అందుకోనున్నారు.