Sakshi Media Group
-
సాక్షి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కు అనూహ్య స్పందన
-
డ్రగ్స్ లేని సమాజం మన లక్ష్యం.. సాక్షితో అంజాద్ భాషా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
-
ఒక్కసారి బానిసైతే.. మీ లైఫ్ క్లోజ్..
-
సాక్షి మీడియా చేపట్టిన Say No To Drugs క్యాంపెయినకి విశేష స్పందన
-
దేశం మరువలేని దార్శనికుడు
చరిత్ర సృష్టించటం, దాన్ని తిరగరాయటం, వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టడం అందరివల్లా కాదు. ప్రపంచాన కోట్లమందిలో ఒక్కరికి కూడా ఆ అవకాశం అంత సులభంగా దక్కదు. కొన్ని తరాలకు ఒకరైనా అలాంటివారు ఉద్భవిస్తారంటే నమ్మలేం. అలాంటి అరుదైన విశిష్ట వ్యక్తుల్లో గురువారం రాత్రి కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. పేదింట పదిమంది సంతానంలో ఒకరిగా, కిరోసిన్ లాంతరు దగ్గర చదువుకున్న మన్మోహన్ జీవితంలో అధిరోహించిన శిఖరాలు ఉన్నతమైనవి. 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ఆర్థికమంత్రిగా ప్రకటించినప్పుడు అందరూ విస్తుపోయారు. ఆయనే నమ్మలేదు. అప్పటికే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనా మిక్స్‌లో అధ్యాపకుడిగా పనిచేశారు. జెనీవా కేంద్రంగా పనిచేసే స్వతంత్ర ఆర్థిక మేధావుల బృందం సౌత్ కమిషన్‌కు సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నారు. యూజీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించటానికి అవసరమైన వాగ్ధాటి, సులభంగా చొచ్చుకుపోయే తత్వంలేని ఒక విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు దేశానికి ఆర్థికమంత్రేమిటని ఆశ్చర్యపోయారు. కానీ అందరూ అనుకున్నట్టు ఆయన సాధారణ వ్యక్తి కాదని త్వరలోనే అర్థమైంది. దేశాన్ని ప్రగతి పట్టాలెక్కించి శరవేగంతో పరుగులెత్తించగల నూతన ఆర్థిక విధానాలను సృజించటంలో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు గలవాడని సర్వులూ గ్రహించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వతంత్ర భారతంలో ఎన్నడూ ఎరుగనిది. ఫేబియన్ సోషలిజం భావనల ఆధారంగా నెహ్రూ విరచించిన సామ్యవాద ఆర్థిక విధానాల నుంచి లేశమాత్రం వైదొలగినా దేశం అధోగతి పాలవుతుందని అప్పట్లో కాంగ్రెస్ విశ్వసించేది. మరోపక్క రకరకాల నియంత్రణలతో ‘లైసెన్స్ రాజ్’గా అపకీర్తి పాలైంది మన వ్యవస్థ. ఎన్నో ఆర్థిక క్లేశాలతో, మరెన్నో ఒడుదొడుకులతో ఉన్న ఆ వ్యవస్థకు తన వినూత్న బడ్జెట్‌తో సంపూర్ణ జవసత్వాలిచ్చినవారు మన్మోహన్. అన్యుల కీర్తిని అపహరించటానికి ససేమిరా ఇష్టపడని పీవీ... ఆర్థిక సంస్కరణల కర్త, కర్మ, క్రియ కూడా ఆయనేనని చాటారు. అందువల్లే సారథిగా పీవీయే ఉన్నా సంస్కరణల ఆద్యుడిగా మన్మోహన్‌నే గుర్తిస్తారు. ఆయన విధానాల పర్యవసానంగా అంతవరకూ నిలువెల్లా ఆవరించిన నిర్ణయ రాహిత్యత కనుమరుగైంది. ఒక్కుమ్మడిగా ప్రైవేటు పెట్టుబడి రెక్కలు విప్పుకుంది. లాభార్జన మాత్రమే ధ్యేయంగా భావించే విదేశీ పెట్టుబడులు వెల్లు వెత్తాయి. పబ్లిక్ రంగ సంస్థలు సైతం పోటీలో దీటుగా నిలిస్తే తప్ప మనుగడ లేదని గ్రహించాయి.‘చరిత్ర అయినా నన్ను దయతో గుర్తుపెట్టుకుంటుందని ఆశిస్తాను’ అని ఒక సందర్భంలో అన్నారాయన. తనపై వచ్చిపడుతున్న విమర్శల జడికి ఆ హృదయం ఎంతగా తల్లడిల్లిందో చెప్పే మాట అది. నిజం... ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడైనా, పార్టీలోనూ వెలుపలా వచ్చిన అవాంతరాలను అధిగమించి దృఢంగా అమలు చేసినప్పుడైనా ఆయనకు శాపనార్థాలు ఎదుర య్యాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకులు తయారయ్యారు. తొలినాళ్లలోనే ఏదోరకంగా పక్కకు తప్పించాలన్న ప్రయత్నాలూ జరిగాయి. మన రహస్యాలను ఐఎంఎఫ్‌కు చేరేస్తున్నారనీ, ఆ సంస్థ కనుసన్నల్లో విధానాలు రూపొందిస్తున్నారనీ ఎలాంటి ఆధారాలూ లేకుండానే కొందరు వండి వార్చారు. పార్లమెంటులో అలజడి ఖాయమనుకున్నారు. కానీ అప్పటికే మన్మోహన్ నిజాయితీ, నైతిక నిష్ఠ, నిష్కాపట్యత, సచ్ఛీలత అందరికీ అర్థమయ్యాయి గనుక అవన్నీ దూదిపింజñ ల్లా తేలిపోయాయి. వాటిని విపక్షం సభలో ప్రస్తావించినా పెద్దగా పట్టుబట్టలేదు. ఆ తర్వాత పీవీ సహచర మంత్రుల్లో కనీసం 20 మందిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా మన్మోహన్‌ను వేలెత్తిచూపే సాహసం ఎవరూ చేయలేదు. ఆ సుగుణాలే మన్మోహన్‌ను అనంతర కాలంలో ప్రధానిగా ఎంచుకునేందుకు దోహదపడ్డాయి. దేన్నయినా సాధించటంలో ఆయన పట్టుదల ఎంత టిదో చెప్పటానికి అమెరికాతో కుదిరిన అణు ఒప్పందమే ఉదాహరణ. మద్దతునిస్తున్న వామ పక్షాలూ, ఇతర పార్టీలూ ససేమిరా కాదన్నా ఆ ప్రతిపాదనను పార్లమెంటు ముందుంచి ఆమోదింపజేసుకున్న సాహసి ఆయన.మన్మోహన్ అత్యున్నత స్థాయి ఆర్థిక నిపుణుడు కావొచ్చు... ఆ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం విప్పిచెప్పిన అనేకానేక విశ్లేషణాత్మక గ్రంథాల రచయిత కావొచ్చు. కానీసిద్ధాంత రాద్ధాంతాల్లో కూరుకుపోకుండా కళ్లెదుటి వాస్తవాలను ఆచరణీయ దృక్పథంతో పరిశీలించి సరిగా స్పందించగల విశాల దృక్పథం ఉన్న నాయకుడు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ఉచిత విద్యుత్ ప్రతిపాదన చేసినప్పుడు మొదట్లో దాన్ని ఇష్టపడకున్నా సాగు సంక్షోభాన్ని అధిగమించటానికి అది తోడ్పడిన తీరు గుర్తించాక మన్మోహన్ దాన్ని స్వాగతించిన తీరు మరువలేనిది. ప్రజాజీవన రంగంలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించే విద్యాహక్కు చట్టం, రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవులకు కరువురోజుల్లో పని కల్పన కోసం ఉపాధి హామీ చట్టం వంటివి తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినా ఏనాడూ ఆయన కీర్తిప్రతిష్ఠలను ఆశించలేదు. తన విధానాలతో దేశాన్ని వైభవోజ్జ్వల శకానికి తీసుకెళ్లినా చివరివరకూ నిగర్విగా, వినమ్రుడిగా జీవించిన దార్శనికుడు మన్మోహన్‌ను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు. ఆ అసాధారణ, అపురూప విజ్ఞాన ఖనికి ‘సాక్షి’ నివాళులర్పిస్తోంది. -
ఆమే ఆకాశమై
కాలం ముందుకు సాగుతూనే ఉంటుంది. 24 గంటలకో రోజు పుడుతుంది. కలకాలం గుర్తుండే పని చేసిన వాళ్లతో రోజుకో కొత్త చరిత్ర పుడుతుంది. చరిత్ర సృష్టించిన స్త్రీశక్తిని సాక్షి ఫ్యామిలీ నిరంతరం పట్టిచూపుతోంది. ఈ ఏడాది సాక్షి గౌరవించిన మహిళామణుల్లో మరికొన్ని ఆణిముత్యాలు.మండే కండలుగుంటూరు జిల్లా, వేమూరుకి చెందిన ఎస్తేర్రాణికి తల్లిదండ్రులు లేరు. అండదండలు లేవు. నానమ్మ ఆకుకూరలు అమ్ముతుంది. ఇవేవీ ఆమెను పెద్ద కల కనకుండా ఆపలేకపోయాయి. బాడీ బిల్డర్ కావాలనే ఆకాంక్ష ఆమెతోపాటు పెరిగి పెద్దదైంది. హైదరాబాద్‌లో జిమ్‌లో ట్రైనర్‌గా ఉద్యోగం చేస్తూ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటోంది. చెన్నైలో జరిగిన మిస్టర్ అండ్ మిసెస్ హిందూస్థానీ పోటీలో పాల్గొని మెడల్ సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో బాడీ బిల్డింగ్ చేసిన మహిళలు లేరు. ఆ రికార్డును తాను సాధించాలనే పట్టుదల ఆమెను విజేతను చేసింది.శవాల గదిలో ఉద్యోగమా?!పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు.ప్రాణం పోవడం ఒక వేదన అయితే మార్చురీ నుంచి తన వాళ్ల పార్థివ దేహాన్ని తీసుకువెళ్లే వాళ్ల దుఃఖానికి అంతే ఉండదు. మార్చురీలో ఉద్యోగం చేయడం అంటే రోజుకు ఐదారుసార్లు గుండెను చిక్కబట్టుకోవాల్సిందే. అలాంటిది రామ్ ప్రసన్న అనే మహిళ మార్చురీలో ఉద్యోగం చేస్తోంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రితో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్‌గా పని చేస్తోందామె. ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగం చేయడమేమిటి’ అనే వెక్కిరింతలను పట్టించుకోలేదామె. ‘చేయడానికి నీకు ఈ ఉద్యోగమే దొరికిందా’ అనే మాటలకు వెనక్కి తగ్గలేదు. వృత్తిమీద గౌరవాన్ని తగ్గించుకోనూలేదు.అమ్మ గీసిన బొమ్మఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మలకుంట గ్రామానికి చెందిన దళవాయి శివమ్మ తోలుబొమ్మల చిత్రకారిణి. తోలు మీద అపురూపమైన చిత్రాలను గీస్తారు. ఆమె ఈ ఏడాది ‘శిల్పగురు’ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇది వందల ఏళ్ల నుంచి పరంపరగా వస్తున్నప్రాచీన కళ. తోలు బొమ్మలాటలు తగ్గిపోయాయి. కానీ బొమ్మలను చిత్రించేకళ కొత్త రూపు సంతరించుకుంది. రామాయణఘట్టాలు, శ్రీకృష్ణలీలల చిత్రాలను ల్యాంప్సెట్లు, వాల్ పెయింటింగ్స్, డోర్ హ్యాంగర్స్ మీద చిత్రిస్తూ అనేక రాష్ట్రాల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తున్నారు. యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ కళ అంతరించిపోకూడదనే ఆకాంక్షతో కొత్త తరానికి శిక్షణనిస్తున్నారు శివమ్మ.యాంటీ రెడ్ ఐఅది ఆగస్టు 29. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరా పట్టుబడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అసాంఘిక కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తున్నది విద్యావంతులే. సభ్యసమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి దారుణాలను అరికట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్, షీ టీమ్స్, భరోసా టీమ్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఉమెన్ క్యాడెట్లు విద్యాసంస్థల్లో వర్క్‌షాపులు నిర్వహించాలి. షాపింగ్ మాల్స్, హోటళ్లు, సినిమా థియేటర్లలో తనిఖీలు జరగాలి. అలాగే స్పై కెమెరాల కొనుగోళ్ల మీద నిఘా ఉంచాలని సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నారు యాంటీ రెడ్ ఐ యాక్టివిస్ట్ అడపా వరలక్ష్మి.కిడ్స్‌కు పాఠం క్వీన్ స్విమ్మర్గంధం క్వీనీ విక్టోరియా ఆరేళ్ల కిందటి వరకు సాధారణ గృహిణి. లండన్‌లోని ఇంగ్లిష్ చానెల్ ఈది రికార్డు సాధించారు. పిల్లలు స్మిమ్మింగ్ క్లాసులకు సరిగ్గా వెళ్లక పోవడం, ‘స్విమ్మింగ్ చేస్తే తెలుస్తుంది’ అని నిష్ఠూరంగా మాట్లాడడంతో ఈదడం అంత కష్టమా అనుకున్నారామె. ‘అంత కష్టమా! సరే చూద్దాం పదండి’ అని తల్లిగా పిల్లల ప్రశ్నలకు సమాధానం వెతకడంలో కోసం నీటిలో దిగారు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ తన పిల్లలకే కాదు మహిళాలోకానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు.తెలుగు నేల మీద తుళు అడుగులుహైదరాబాదులో నివసిస్తున్న మైత్రీరావుది దక్షిణ కర్నాటకలోని ధర్మస్థల. మాతృభాష తుళు. ఆమె ఇన్ఫర్మేషన్ సైన్స్ గ్రాడ్యుయేట్. నోకియా కంపెనీలో ఉద్యోగం చేశారు. నాట్యం మీద అభిరుచితో భరతనాట్యం, కలరిపయట్టు, అట్టక్కలరి, వ్యాలికవర్ నాట్యరీతులను సాధన చేశారు. నాట్యం ఇతివృత్తంగా ఆమె చిత్రీకరించిన రెండు సినిమాలకు అంతర్జాతీయ పురస్కారం లభించింది. శాస్త్రీయ నాట్యం అంటే పౌరాణిక ఇతిహాసాల ప్రదర్శన అనే పరిధిని చెరిపివేశారామె. స్త్రీ శక్తిని సమాజానికి చాటి చెప్పడానికి తాను ఎంచుకున్న మాధ్యమం నాట్యమే అంటారు స్త్రీశక్తి పురస్కార గ్రహీత, ప్రముఖ నాట్యకారిణి మైత్రీరావు.కథల అమ్మమ్మకోరుపోలు కళావతి రచయిత్రి. ఆమెది విజయనగరం జిల్లా. నాగరకత ముసుగులో ఆదివాసీ బిడ్డలకు పెట్టే పరీక్షలు, అడవి బిడ్డల చుట్టూ ఊహకందని ప్రమాదాలు, పల్లెపదాలు, జానపద జావళులకు అక్షరం ఆమె. అలాగే అమెరికా ప్రకృతి అందాలు, అక్కడ మనవాళ్ల ప్రగతి సుమగంధాలకు అక్షరరూపమిచ్చారామె. ఆధునిక సమాజంలో పిల్లలకు కథలు చెప్పే అమ్మమ్మలు, నానమ్మలు కరవయ్యారని గ్రహించిన కళావతి కథల పుస్తకాలు రాస్తూ కథల అమ్మమ్మ అయ్యారు.సరళ వైద్యం... ఇంటింటా డాక్టర్డాక్టర్ సరళది కాకినాడ. ఆమె హోమియో డాక్టర్. ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ కూడా ఉండాలంటారు. తల్లే ఆ డాక్టర్ అయితే ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారామె. ఇందుకోసం వారం రోజుల హోమియో కోర్సులు నిర్వహిస్తున్నారు. కోర్సులో భాగంగా సాధారణంగా వచ్చే 24 రకాల అనారోగ్యాల గురించి, వాటికిప్రాథమికంగా తీసుకోవాల్సిన ఔషథాలగురించి శిక్షణనిచ్చి హెల్త్ అడ్వైజర్లను తయారు చేస్తున్నారు. ఆమె స్వయంగా 76 రుగ్మతలకు మందులు కనుక్కున్నారు. డాక్టర్లు ఆరోగ్యవంతమైన సమాజం కోసం తమ వంతు బాధ్యతగా పనిచేయాలన్నారు డాక్టర్ సరళ. ఇప్పటికీ గ్రామాల్లో తగినంత మంది డాక్టర్లు అందుబాటులో లేని గ్యాప్‌ను ఇలా భర్తీ చేస్తున్నారామె.స్వావలంబనకు చుక్కాని హైదరాబాద్. దారుల్షిఫాలో మహిళలు, బాలికల సంక్షేమం కోసం స్వచ్ఛందసేవ అందిస్తున్నారు రుబీనా నఫీస్ ఫాతిమా. మిలిటరీ కుటుంబంలో పుట్టిన రుబీనా అభ్యుదయపథంలో పెరిగారు. మహిళలు చదువుకోవాలని, ఎవరి మీదా ఆధారపడకూడదని నమ్మిన కుటుంబం కావడంతో ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆమె బాడ్మింటన్ప్లేయర్ కూడా. పెళ్లి తర్వాత భర్తతోపాటు సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ మంత్రిత్వశాఖలో ఉద్యోగం చేశారు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత జీవితాన్ని సమాజసేవకి అంకితం చేశారు. సఫా సంస్థ ద్వారా 2008 నుంచి ముస్లిం మహిళల ఆర్థిక సామాజిక పురోగతి కోసం పని చేస్తున్నారు. అభివృద్ధి అనేది పరిపూర్ణంగా ఉండాలని, ఆడపిల్లలకు చదువుతోపాటు ఆటలు కూడా అవసరమంటారామె. అయితే ఆడపిల్లలను ఆటలకు పంపించడానికి కూడా నిషేధం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రులను చైతన్యవంతం చేసి, బాల్షెట్టీ ఖేత్ గ్రౌండ్లో ఆడపిల్లలు ఆడుకోవడానికి ఒక టైమ్ స్లాట్ కేటాయించి క్రీడలను ప్రోత్సహిస్తున్నారు రుబీనా నఫీస్ ఫాతిమా.యర్రంపల్లి నుంచి దిల్లీకిమహిళల ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించిన మినీ వేలంలో శ్రీ చరణిని ఎంపిక చేసుకోవడానికి ఫ్రాంచైసీలు పోటీ పడ్డాయి. దిల్లీ క్యాపిటల్స్ 55 లక్షలతో శ్రీ చరణిని ఎంపిక చేసుకుంది. కడప జిల్లా యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి సామాన్య కుటుంబంలో పుట్టింది. జిల్లాలోని వీరనాయుని పల్లెలోని వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తున్న శ్రీచరణి తల్లిదండ్రులప్రోత్సాహంతో ఆటల్లో రాణిస్తోంది. 2021లో అండర్ 19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా– సి జట్టుకిప్రాతినిధ్యం వహించిన శ్రీ చరణి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించింది. ఉమెన్ టీ ట్వంటీలో ఆంధ్రాజట్టుకుప్రాతినిధ్యం వహించి తన బౌలింగ్ తీరుతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.ఇదీ చదవండి: భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్ -
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో స్పెల్ బీ పరీక్ష
-
సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ మూక దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి బృందంపై శుక్రవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. వేముల తాశీల్డార్ కార్యాలయం వద్ద నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై 50 మంది టీడీపీ మూకలు విచక్షణా రహితంగా రాళ్ళు, కర్రలతో దాడి చేశాయి. దాడిలో సాక్షి రిపోర్టర్లు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములకు గాయాలయ్యాయి. కెమెరా ధ్వంసమైంది. జర్నలిస్టులపై దాడి దుర్మార్గంపులివెందుల నియోజకవర్గం, వేముల మండల కేంద్రం లో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్తుల పై దాడి చేయడం దుర్మార్గమని, దాడికి పాల్పడిన వారిపై హత్యా యత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ డైమండ్ చేశారు.కవరేజీకి వెళ్లిన సాక్షి టివి కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము , సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గం అన్నారు. అంతేకాక కెమెరాలను, సెల్ ఫోన్లను కూడా పగులగొట్టారన్నారు. అనంతరం జర్నలిస్టులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, అలాగే వారిని సురక్షితంగా ఇంటికి పంపాలని పోలీసులను కోరారు.కూటమి ఆగడాలపై ఫిర్యాదుఇప్పటికే జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కూటమి ఆగడాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరగకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గురువారం సాయంత్రం ఆయన ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ, డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నోడ్యూస్ సర్టిఫికెట్ వీఆర్ఓలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారన్నారు.పెద్దముడియం, మైలవరం, జమ్మలమడుగు మండలాలకు సంబంధించి వీఆర్ఓలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. కొంతమంది వీఆర్ఓలను సస్పెండ్ చేయిస్తామంటూ బెదిరించారన్నారు. ప్రస్తుతం చాలామంది అభ్యర్థులు ఉన్నారని వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. దీనిపై ఆర్డీఓ మాట్లాడుతూ శుక్రవారం అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.సాగునీటి సంఘాల ఎన్నికలపై హైకోర్టు కాలువలకు సాగు నీరు ఎప్పుడు కావాలి? ఎంత కావాలి అనేది రైతులకు పూర్తి అవగాహన ఉంటుంది. నీటి సంఘాల్లో వీరిని భాగస్వామ్యుల్ని చేసేలా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరగని సందర్భాల్లో చేతులెత్తి ఎన్నుకునే విధానాన్ని అనుసరిస్తే ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అభ్యర్థులకు తెలిసిపోతుంది. అందువల్ల వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ (ఎన్నికల నిర్వహణ) రూల్స్, 118 ప్రకారం చేతులెత్తే పద్ధతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. అందువల్ల ఏకాభిప్రాయం కుదరని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటామనే రైతులను.. అందుకు అనుమతించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.👉చదవండి : ప్రశాంతంగా నీటి సంఘాల ఎన్నికలు -
Sakshi Little Stars: తారే జమీన్ పర్
‘మేం పాటలు పాడతాం. డైలాగ్స్ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాం. పొడుపుకథలు వేస్తాం, ప్రశ్నలతో తికమక పెట్టేస్తాం. స్కూల్లో చదువుకుంటాం, సినిమాల్లో నటిస్తాం, డ్యాన్స్‌లే కాదు అల్లరి కూడా చేస్తాం ...’ అంటూ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ‘సాక్షి’ మీడియా హౌస్ హైదరాబాద్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా పలువురు బాల తారలు తమ ఆనందాలను పంచుకున్నారు. స్కూల్ విద్యార్థులు అడిగిన పొడుపు కథలకు ఈ ‘లిటిల్ స్టార్స్’ ఆన్సర్ చేయడం, లిటిల్ స్టార్స్ కోరిన పాటలను స్కూల్ విద్యార్థులు పోటీ పడుతూ పాడటంతో కార్యక్రమం సందడిగా మారింది.స్కూల్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డి, క్రికెట్, బాస్కెట్ బాల్... వంటి ఆటలన్నీ ఆడతాం అంటూ మొదలు పెట్టిన పిల్లలు కరెంట్ షాక్ ఎందుకు తగులుతుంది? బాల్ని కొడితే ముందుకు ఎలా వెళుతుంది? అంటూ సైన్స్ పాఠాలనూ వినిపించారు. లెక్కలు ఇష్టం అంటూనే డాక్టర్లం అవుతాం అనే భవిష్యత్తు ప్రణాళికలనూ చెప్పారు. సోషల్ మీడియాలో తమకున్న ఫాలోవర్స్ గురించి, చేస్తున్న రీల్స్ గురించి వివరించారు. ‘సాక్షి’ మీడియా హౌస్ వారం రోజుల పాటు జరిపిన ‘లిటిల్ స్టార్స్’ కార్యక్రమంలో భాగంగా కలిసిన చిన్నారులను గుర్తుకు తెచ్చుకొని, ‘మరో ప్రపంచం తెలుసుకున్నాం’ అంటూ తమ స్పందనను తెలియజేశారు బాల తారలు. టీవీ చానల్‌కి సంబంధించిన న్యూస్‌రూమ్, పీసీఆర్ వంటి వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలను వెలిబుచ్చారు.మేమిద్దరం కవలలం. కలిసే చదువుకుంటాం. సినిమాల్లోనూ కలిసే వర్క్ చేస్తాం. మేం ఇద్దరం పెద్దయ్యాక సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఈ ్రపోగ్రామ్ ద్వారా మా ఇద్దరి ఆలోచనలను, మా ప్రతిభను షేర్ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఈ చిల్డ్రన్స్ డే మాకు వెరీ వెరీ స్పెషల్. – అర్జున్, అర్విన్నాకు నటుడిగా గుర్తింపు వచ్చిందంటే మా అమ్మే కారణం. ఇప్పటి వరకు పది సినిమాల్లో బాల నటుడిగా నటించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన తరువాత స్కూల్లో ఫ్రెండ్స్ నీ క్యారెక్టర్ సూపర్‌గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. రెండు మూడు పేజీల డైలాగ్‌లు కూడా ఒకేసారి చెప్పగలను. ఈ కార్యక్రమం ద్వారా నేను సినిమాల్లోని డైలాగ్స్ చెప్పే అవకాశం లభించింది. అలాగే, న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకున్నాను. ఈ పోగ్రామ్ మాకు పాఠంలా కొత్తదనాన్ని పరిచయం చేసింది. థాంక్యూ సాక్షి.– కె. హర్షచదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!ఏడేళ్ల వయసు నుంచి సినిమాలలో నటిస్తున్నాను. చదువు, సినిమాలతో పాటు బాస్కెట్ బాల్, క్రికెట్, డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. స్కూల్, సినిమా షూటింగే కాదు ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ‘లిటిల్‌స్టార్స్’లో భాగంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలను కలిసినప్పుడు చాలా బాధపడ్డాను. తలస్సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను చూసి, అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. అలాగే ఈ ఫైనల్ ఈవెంట్లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని డైలాగ్ చెప్పినప్పుడు అందరూ గ్రేట్ అంటూ మెచ్చుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ ్రపోగ్రామ్ చాలా బాగుంది. అందరికీ థ్యాంక్స్. – మోక్షజ్ఞతలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను కలవడానికి ‘సాక్షి’ మీడియా ద్వారా వెళ్లాను. చిన్న చిన్న పిల్లలు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి, చాలా బాధగా ఫీలయ్యాను. కాసేపు వాళ్ల బాధని మరచిపోయేలా చేయాలని వాళ్లు అడిగిన డైలాగ్స్ చెప్పాను. వాళ్లను ఎంకరేజ్ చేసేలా మాట్లాడాను. మామూలుగా నేను చదువుకుంటాను, సినిమాలు చేస్తుంటాను. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడం ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్లినట్లు అనిపించింది. ఇక ‘సాక్షి మీడియా’ హౌస్‌లో ఏర్పాటు చేసిన ‘‘లిటిల్‌స్టార్స్’లో నాతోటి యాక్టర్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. – అనన్య ఈగ3చేసే పనిపై ఇష్టం ఉంటుంది కాబట్టి చదువు–సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను. ఈ ్రపోగ్రామ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్పర్శ్’ హాస్పిస్ కేంద్రంలో సేవలు పొందుతున్న చిన్నారులను కలిశాం. వారి పరిస్థితి చూశాక చాలా బాధ అనిపించింది. వారి ముఖాల్లో నవ్వులు తెప్పించాలని డ్యాన్స్‌లు చేశాం, పాటలు పాడాం... ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిల్డ్రన్స్ డే మాకు సాక్షి ఇచ్చిన ఓ పెద్ద గిఫ్ట్. – సయ్యద్ ఫర్జానారైతు స్వరాజ్య వేదిక ద్వారా అక్కడి పిల్లలను కలిసినప్పుడు వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. వాళ్ల నాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ బాగా చదువుకుని, అమ్మను బాగా చూసుకుంటాం అని వారు చెప్పినప్పుడు ‘గ్రేట్’ అనిపించింది. అలాగే కలెక్టర్ అవుతామని, డాక్టర్ అవుతామని వాళ్లు తమ భవిష్యత్తు గురించి, తమ ప్లాన్స్ గురించి చెప్పినప్పుడు వారి ధైర్యం చూసి భేష్ అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూశాం. – హనీషఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పిల్లలను చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. తర్వాత వాళ్లను హ్యాపీగా ఉంచాలనిపించింది. అందుకే మాటలు, పాటలతో వారితో కలిసిపోయాను. ఇంటికి వెళ్లాక మా నాన్నతో ఆ విషయాలన్నీ పంచుకున్నాను. ‘సాక్షి మీడియా’ వల్ల వాళ్లను కలిసి, నా వంతుగా కాసేపు వాళ్లని సంతోషపెట్టడానికి ట్రై చేశాను. ఈ చిల్డ్రన్స్ డే నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. – సాన్వికమూడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. నేను కోపం, బాధ, హ్యాపీ సీన్లలో బాగా నటిస్తాను అని చెబుతారు. ఏడుపు సీన్లలో గ్లిజరిన్ లేకుండా నటించడం చూసి, అందరూ మెచ్చుకున్నారు. టీవీలో అందరి ముందు నా టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇప్పుడు స్వయంగా టీవీ న్యూస్‌రూమ్, స్టూడియో... ఇవన్నీ చూడటం కొత్తగా అనిపించింది. – ఖుషీ రెడ్డిమూడేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు 25 యాడ్స్, 30 సినిమాల్లో నటించాను. హిందీ మూవీలో కూడా నటించాను. డ్యాన్స్, సంగీతం నేర్చుకుంటున్నాను. బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ‘సాక్షి’ మీడియాతో కలిసి రైతు స్వరాజ్య వేదికకి వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడటం బాగా అనిపించింది. ‘మా నాన్న లేరు’ అని వాళ్లు చెప్పినప్పుడు ఏడుపొచ్చింది. ఇక ఫైనల్ ఈవెంట్లో గోగో (బొమ్మ)తో మాటలు బాగా నచ్చాయి. ఎంత టైమ్ స్పెండ్ చేశామో తెలియనే లేదు. – శ్రేష్ట కోటకేంద్రీయ విద్యాలయాలో చదువుకుంటున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. తబలా వాయిస్తాను. డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సీరియల్స్‌లో కూడా నటిస్తున్నాను. ‘బాలోత్సవం’లో నాకు వచ్చిన పాటలు పాడాను. అందరూ సూపర్ అని మెచ్చుకున్నారు. – శ్రేయాన్ కోటఈ కార్యక్రమం ద్వారా తలసేమియాతో బాధపడుతున్నవారిని కలిశాను. వారిని నవ్వించాను కూడా... పాటలు పాడాను, డ్యాన్సులు చేశాను. అలాగే బుధవారం జరిగిన వేడుకలో నాలా సినిమాల్లో నటిస్తున్న మిగతా అన్నయ్యలు, అక్కలను కలుసుకోవడం హ్యాపీగా అనిపించింది. మా ఇష్టాలు, చదువు, ఆటలు, పాటలు, డైలాగ్స్ మీ అందరికీ చెప్పడం.. అన్ని విషయాలను షేర్ చేసుకోవడం బాగుంది. గోగో (బొమ్మ)తో బాగా ఎంజాయ్ చేశాం. – తనస్విఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్లని చూడగానే ఫస్ట్ చాలా ఏడుపొచ్చింది. అయితే మేం వాళ్లని హ్యాపీ చేయడానికి వెళ్లాం కాబట్టి, వాళ్లతో జోక్‌గా మాట్లాడాను. వాళ్లు నవ్వడం హ్యాపీ అనిపించింది. అలాగే ‘సాక్షి’ టీవీకి వచ్చి, అందరితో మాకు క్లాసులు చెప్పినవి, మేం సినిమాల్లో చేసినవి షేర్ చేసుకోవడం హ్యాపీ. పెద్దయ్యాక మహేష్‌బాబులాగా పెద్ద హీరోని అవుతాను. ఇక్కడ గోగో (బొమ్మ)తో కలిసి చేసిన అల్లరి బాగుంది. అలాగే, మాకు అన్ని న్యూస్ రూమ్‌లు చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. – స్నితిక్చిన్ని మనసులు కదిలిన వేళ...పసి హృదయాలు కదిలిపోయాయి. చిన్న మనసులే అయినప్పటికీ తోటి చిన్నారులు పడుతున్న బాధ చూసి, చలించిపోయాయి. బాలల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ‘సాక్షి’ మీడియా హౌస్ జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కేన్సర్, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను, మృత్యువుతో పోరాడుతున్న పసిబాలలకు, తండ్రిని కోల్పోయిన వారిని, అనాథ బాలలను కలిశారు పలువురు బాల తారలు. కాసేపు ఆ చిన్నారులు తమ కష్టాన్ని మరచిపోయేలా చేసి, వారితో ఆడి పాడారు... నవ్వించారు. చివరగా ‘సాక్షి’ మీడియా హౌస్‌లో జరిగిన వేడుకలో స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ బాల తారలు సందడి చేశారు. ఈ ‘బాలల దినోత్సవం’ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.టీవీలో న్యూస్ చదువుతారు కదా.... ఆ రూమ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఎడిటింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? అసలు టీవీ స్టూడియో ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అనడమే ఆలస్యం ‘ఓ’ అంటూ ఆసక్తి కనబరిచారు లిటిల్ స్టార్స్. ‘సాక్షి టీవీ’ న్యూస్ రూమ్, పీసీఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) వంటివి చూసి, ఆశ్చర్యపోయారు. టీవీ స్టూడియోలో జరుగుతున్న పనులను నిశితంగా గమనించారు.ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి ఈ QRకోడ్‌ను స్కాన్ చెయ్యండి -
Sakshi Little Stars: ఆశీస్సులే ఆయువు
ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.– జశ్వంత్మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్‌కు వెళ్లాలనుంది. – రిషి ప్రియ, సిద్దిపేటచాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను. – ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్నాకు ఫుట్‌బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్‌కు తీసుకెళతానని కూడా చె΄్పారు. – చేతన్విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్‌లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం. – అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్అవగాహన వచ్చిందికేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్‌కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.– కార్తీక, నేషనల్ ప్లేయర్హెయిర్ డొనేట్ చేస్తానుఈ హాస్పిటల్లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. –ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను. – సాన్విక, సరిపోదా శనివారంవీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను. – స్నితిక్, పొట్టేల్ ఫేమ్భయం లేదు చికిత్సలు ఉన్నాయిఅనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్‌కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి QR కోడ్‌ను స్కాన్ చెయ్యండి – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
Sakshi Little Stars: ఇదీ రక్త బంధమే!
మన సంస్కృతి, సంప్రదాయలు, కుటుంబ విలువల్లో ‘రక్త సంబంధం’ అనే మాట పవిత్రమైనది. సానుకూల శక్తికి నిలువెత్తు అద్దంలాంటిది. సానుకూల శక్తి అనుకున్నది ప్రతికూల శక్తిగా మారితే? వరం అనుకున్నది శాపం అయితే? అది అనుభవిస్తే కాని తెలియని బాధ.చిన్నారుల ఆనందప్రపంచాన్ని జన్యు సంబంధిత వ్యాధి తలసేమియా దూరం చేస్తుంది. ఎప్పుడూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తుంది. ‘అందరిలా నేనెందుకు ఉండకలేకపోతున్నాను’ అనే ఆవేదనను వారిలో కలిగిస్తుంది. ‘లేదు... మీరు అందరిలాగే ఉండాలి. నవ్వాలి. ఆడాలి. ఇంద్రధనుస్సుల పల్లకీలో ఊరేగాలి’ అంటూ నడుం కట్టారు చైల్ట్ ఆర్టిస్ట్‌లు.నవంబర్ 14 బాలల దినోత్సవం నేపథ్యంలో... తలసేమియా బారిన పడిన చిన్నారులకు ప్రతి నెల ఉచితంగా రక్తం ఎక్కిస్తూ (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్), మందులు అందిస్తూ విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్‌లోని ‘తలసేమియా సికిల్ సెల్ సొసైటీ’కి బాలతారలను తీçసుకువెళ్లింది సాక్షి. సలార్, పుష్ప–2లో నటించిన మోక్షజ్ఞ, పొట్టేల్ సినిమాలో నటించిన తనస్వీ, సరిపోదా శనివారంలో నటించిన అనన్యలు తలసేమియా బారిన పడిన చిన్నారులను ఆత్మీయంగా పలకరించడమే కాదు వారిని నవ్వించారు. తమ డ్యాన్స్‌లతో హుషారెత్తించారు. వారిలో ఆత్మస్థైర్యం నింపారు...వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధ వ్యాధి (జెనెటికల్ బ్లడ్ డిజార్డర్) తలసేమియా. నివారణ మార్గాలున్నా అవగాహన లేమితో ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులు వేల సంఖ్యలో ఉన్నారు. వారు ప్రతీ రెండు, మూడు వారాలకు ఒకసారి తప్పనిసరిగా వారు రక్తం ఎక్కించుకోవాలి. ఇది అత్యంత ఖరీదైనది. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ‘తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ’ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. ఇక్కడకి వచ్చిన చైల్డ్ ఆర్టిస్టులు తమలాంటి పసిహృదయాలకు ఎందుకు ఇంతటి కష్టం వచ్చిందని విలవిలలాడిపోయారు. లోపలి నుంచి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకొని వారికి సంతోషాలను పంచే ప్రయత్నం చేశారు. వారి ఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందుల గురించి ఆరా తీశారు. ‘మీకు మేమున్నాం. మీ సమస్యలపై మా సినిమాల ద్వారా అవగాహన కల్పిస్తాం’ అన్నారు. తల్లడిల్లిపోయే తల్లులు ఎందరో...తన బిడ్డ కోసం ప్రతి నెలా ఖమ్మం నుంచి నుంచి హైదరాబాద్‌కు వస్తుంది ఒక తల్లి. ఆమె ఇద్దరు బిడ్డలకూ తలసేమియా సంక్రమించింది. పెద్దపాప బోన్ మ్యారో చికిత్స విఫలమై చనిపోయింది. చిన్నపాపను కాపాడుకోవాలనే ధృఢసంకల్పం ఆ తల్లిలో కనిపిస్తోంది. ‘ఈ వేదిక నాకు దేవాలయంతో సమానం’ అంటుంది. తన చెల్లి కోసం ప్రతీ నెల కడప జిల్లా నుంచి ఇక్కడికి వస్తుంది అర్ఫాన్. ఇలాంటి తల్లులు ఎంతో మంది తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో కనిపిస్తారు. వారి కన్నీళ్లతో మన మనసు తడిసిపోతుంది.డాక్టర్ కావాలని ఉంది...‘‘నేను ఏడో క్లాస్ చదువుతున్నాను. మూడు నెలల నుంచి రక్తం అందిస్తున్నారు. ఈ అవస్థలు చూస్తుంటే..భవిష్యత్‌లో నేను డాక్టర్ అయిపోయి, నాలాంటి పిల్లలకు మంచి వైద్యం అందించాలని ఉంది. గేమ్స్ కూడా బాగా ఆడతాను’ అంటుంది ఖమ్మంకు చెందిన దీపిక.మా గురించి ఆలోచించండి...‘‘నేను ఆరేళ్ల నుంచి ఈ సేవలు పొందుతున్నాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాను. మా భోజనం అందరిలానే ఉంటుంది, కానీ పండ్లు తక్కువగా తినాలి. శరీరంలో రక్తం తగ్గినప్పుడు నీరసంగా ఉంటుంది. జ్వరం వస్తుంది. ఒక్కోసారి లేవలేనంతగా కాళ్ల నొప్పులు వస్తాయి. రక్తం తీసుకున్న తరువాత బాగానే ఉంటాం. దయచేసి మా గురించి ఆలోచించండి. మాకు రక్తం అందుబాటులో ఉండాలి. రక్తదాతలు సహకరిస్తేనే మాకు సరిపడా రక్త నిల్వలు ఉంటాయి. ఈ విషయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమం సాక్షి నిర్వహిస్తున్నందుకు మనసారా కృతఙ్ఞతలు’’ అంటుంది గౌసియా.భయపడితే బతకలేము...నాకు 6 నెలల వయసులోనే తలసేమియా ఉందని గుర్తించారు. గత 21 ఏళ్లుగా ప్రతీ 15, 20 రోజులకు ఒకసారి ఇక్కడ రక్తం ఎక్కించుకుంటున్నాను. మాకు ఐరెన్ లెవల్స్ పెరగకుండా ట్యాబ్లెట్లు ఇస్తారు. దీని గురించి ఆలోచిస్తూ బాధ పడితే జీవితాన్ని ముందుకు సాగించలేను. అందుకే ధైర్యంగా ఉంటాను. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాను. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. కొన్ని డ్యాన్స్ పోటీల్లో కూడా పాల్గొన్నాను. మాకు ఈ సెంటర్ అండగా ఉంటోంది. – మెహవీన్ ఫాతిమానేను యూకేజీ చదువుతున్నాను. వారం వారం నాన్న రక్తం కోసం ఇక్కడికి తీసుకువస్తాడు. మొదట్లో చాలా భయమేసేది. ఇప్పుడు భయం లేదు. – నిహారికప్రతి 3 వారాలకు రక్తం ఎక్కించుకోవడం అలవాటైంది. భయం లేదు. 7వ తరగతి చదువుతున్నాను. డ్యాన్సింగ్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. నా వ్యాధి గురించి స్కూల్లో టీచర్లకు కూడా తెలుసు. చాలా విషయాల్లో సహాయం చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఇక్కడి వచ్చినప్పుడల్లా ఎందుకొచ్చానని బాధగా అనిపిస్తూనే ఉంటుంది. – సంకీర్తన, కరీంనగర్రక్తదాతలు ముందుకు రావాలి...తలసేమియాతో నాకు బాబు పుట్టాడు. ఆ సమయంలో దక్షిణాదిలో డాక్టర్లకు కూడా ఈ వ్యాధిపైన అంతగా అవగాహన లేదు. దేశంలోని ఎన్నో హాస్పిటల్లు, మెడికల్ కాలేజీలు తిరిగి దీని గురించి తెలుసుకుని మళ్లీ నగరంలోని డాక్టర్లకు అవగాహాన కల్పించి బాబుకు చికిత్ప అందించాను. నాలాంటి మరో 20 కుటుంబాల వారు కలిసి 1998లో డా. ఏఎన్ కృష్ణకుమారి సహాయంతో ఈ సెంటర్‌ను స్థాపించాం. మా ప్రయత్నంలో ఎందరో సామాజికవేత్తలు, డాక్టర్లు సహకారం అందించారు. విరాళంగా అందించిన స్థలంలో దాతల సహాయంతోనే ఈ సెంటర్‌ను నిర్మించాం. ఇప్పటికి 4199 మంది చికిత్న పొందుతున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్ల రక్తం అందించాం. ఇంతమందికి సేవలందిస్తున్న ప్రపంచంలో అతి పెద్ద సంస్థ మాదే అని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రస్తుతం నా బాబు లేడు. కానీ నాకు 4199 మంది పిల్లలున్నారు. వీరికి మా సేవలు ఇలానే అందాలంటే రక్తదాతల అవసరం ఎంతో ఉంది. స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. – రత్నావళి, ఫౌండర్, తలసేమియా సికిల్ సెల్ సొసైటీఏడుపొచ్చింది...ఇక్కడి రాగానే ఏడుపొచ్చేసింది. నాలాంటి చిన్నారులే సెలైన్లు పెట్టుకుని రక్తం ఎక్కించు కుంటుంటే బాధగా అనిపించింది. వారికి సంతోషాలను పంచాలని, వారితో ఆడుకున్నాను. నా పొట్టేల్ సినిమాలోని ‘చీమ కాటుకే ఓర్చుకోలేవు ఈ నొప్పి ఎలా భరిస్తావ్’ అనే డైలాగ్ చెప్పాను. వర్షిత నాతో చాలా బాగా ఆడుకుంది, జానీ జానీ రైమ్స్ చెప్పింది. వీరందరినీ దేవుడు మంచిగా చూసుకోవాలి. – తనస్వీ, చైల్డ్ ఆర్టిస్ట్పెద్దయ్యాక సహాయం చేస్తాను...తలసేమియా పిల్లలతో సరదాగా ఆడుకుని ధైర్యం నింపాలని వచ్చాను. ఛత్రపతి డైలాగ్ చెబితే అందరూ చప్పట్లు కొట్టారు. ఇక్కడి అబ్దుల్ నన్ను టీవీలో చూశానని చెప్పాడు. ముఖేష్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. తను డాక్టర్ అవుతాడంట. వీరి కోసం నేను డ్యాన్సులు కూడా చేశాను. నేను పెద్దయ్యాక ఇలాంటి వారికి సహాయం చేస్తాను. – మోక్షఙ్ఞ, చైల్డ్ ఆర్టిస్ట్ప్రభుత్వం ఆదుకోవాలి...ఇది జెనెటిక్ డిసీజ్ అయినప్పటికీ నివారించగలిగేదే. ఈ వ్యాధుల్లో నివారించగలిగే అవకాశముండటం చాలా అరుదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎంతో ఖరీదైన ప్రక్రియ. ఈ విషయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు అందించాలి. – సుమాంజలి, సెక్రటరీ– సీఈఓఈ టెస్ట్ తప్పనిసరి చేయాలి...మేము ఆశ వర్కర్లు, పీహెచ్‌సీలతో కలిసి గర్భిణీ స్త్రీలకు హెచ్‌బీఏ2 టెస్ట్ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు 30 వేల మందికి ఈ టెస్టులు చేయించాం. ప్రభుత్వం తరపున ఈ టెస్ట్‌లు అందరికీ తప్పనిసరి చేయాలి. – చంద్రకాంత్ అగర్వాల్, ప్రెసిడెంట్సినిమా ద్వారా అవగాహన కలిగిస్తాను...ఈ పిల్లలను చూడగానే కన్నీళ్లు ఆగలేదు. వీరికి ఏదైనా సహాయం చేయాలని «గట్టిగా అనుకుంటున్నాను. అందరు పిల్లలతో మాట్లాడాను. సరిపోదా శనివారం.. డైలాగ్ చెప్పాను. నా షూటింగ్స్ గురించి వారు అడిగారు. నాకు రక్తం అంటేనే భయం..అలాంటిది వీరు ప్రతీ నెలా ఎక్కించుకుంటుంటే ఊహించడానికే కష్టంగా ఉంది. నా సినిమాల్లో ఈ వ్యాధి గురించే అవగాహన కల్పించే క్యారెక్టర్ చేసే ప్రయత్నం చేస్తాను.– అనన్య, చైల్డ్ ఆర్టిస్ట్ తలసేమియా నివారణకు... హెచ్‌బీఏ–2 అనే పరీక్షను మహిళకు పెళ్లి తర్వాత, గర్భధారణకు ముందు చేయిస్తే తలసేమియాను తేలిగ్గా నివారించవచ్చు.గమనిక: ఈ రోజు రావలసిన ‘సన్నిధి’ పేజీకి బదులుగా బాలల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘లిటిల్ స్టార్స్’ పేజీ ఇస్తున్నాం.– డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనీల్ మోర్ల -
Sakshi Special: మొక్కవోని మట్టిబిడ్డలు
మట్టి ఎవరికీ అపకారం చేయదు. నాగలితో దున్నినప్పుడల్లా రైతుకు పంట ఇవ్వాలనే అనుకుంటుంది. కాని ఒక్కోసారి రుతువులు మోసం చేస్తాయి. మరోసారి మార్కెట్ మోసం చేస్తుంది. ఇంకోసారి అకాల వర్షం. అప్పుడు ఏమవుతుంది?ప్రతిరోజూ పొలానికి వెళ్లి తిరిగొచ్చే నాన్న ఆ రోజు రాడు. ‘నా పంటను ఎందుకు నాకు దక్కకుండా చేశావ్’ అని దేవుడితో పోట్లాడటానికి వెళ్లిపోతాడు. అప్పుడు అమ్మ ఉంటుంది. ధైర్యం నింపుకో అని చెప్పే మట్టి ఉంటుంది. ఆ పిల్లలు నిలబడతారు. నిలబడాలి. అందరూ తోడైతే వారి ముఖాలలో ఇంద్రధనువులు సాధ్యమే. ఆత్మహత్యలు చేసుకుని మరణించిన రైతుల పిల్లలను రానున్న ‘బాలల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేకంగా కలిసింది సాక్షి. ఇక సందడి మొదలైంది.‘మీరు ఫ్రెండ్స్‌తో కలిసి నిద్రపోతారా?’‘సెలవుల్లో పొలానికి వెళ్లి వ్యవసాయం చేస్తారా?’‘నైట్‌టైమ్ స్కై అంతా క్లియర్‌గా ఉండి స్టార్స్ కనపడతాయా?‘మీకు లోన్లీగా అనిపించినప్పుడు ఏం చేస్తారు’‘విలేజస్‌లో ఏమేమి ఇంటెరెస్టింగ్‌గా ఉంటాయి’...సినిమాల్లో అందరూ మెచ్చేలా నటించిన లిటిల్ స్టార్స్ జీవితంలో సవాళ్లతో పోరాడుతున్న రియల్స్టార్స్ను ‘సాక్షి’, ‘రైతు స్వరాజ్యవేదిక’ ఉమ్మడి ప్రయత్నం వల్ల కలిశారు. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్‌లోని తార్నాకలో రానున్న ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన ఐదు రైతు కుటుంబాలకు చెందిన 11 మంది పిల్లలు ముగ్గురు లిటిల్ స్టార్స్‌ను కలిశారు. ‘వాల్తేరు వీరయ్య’లో నటించిన శ్రేష్ట, ‘కేజీఎఫ్’లో నటించిన భాను ప్రకాశ్, స్పైడర్, స్వాగ్ వంటి మూవీస్‌లో చేసిన హనీషాలు ఈ చిన్నారులతో కలిసి కబుర్లు చెప్పారు. ఆ పిల్లలు ఈ పిల్లలు పరస్పరం మాట్లాడుకున్నారు. లిటిల్ స్టార్స్ తమ సినిమాల్లో తాము చెప్పిన డైలాగులు చెప్పారు. డాన్సులు చేశారు. షూటింగ్‌కు తీసుకెళతామన్నారు. అలా ఆ పిల్లల మనసు తేలిక చేశారు. కారణం? వారి నాన్నలు వారితో లేరు. వారి నాన్నలంతా రైతులు. వ్యవసాయంలో వచ్చిన కష్టాలు ఆ నాన్నలను హటాత్తుగా లేకుండా చేశాయి. ఆ క్షణం నుంచి ఆ పిల్లలకు ఆమ్మే నాన్నయినా అమ్మయినా. అయితే పిల్లలు కూడా ధైర్యం తెచ్చుకున్నారు. ఇలాంటి పిల్లలకు సాయం అందించడానికి ‘రైతు స్వరాజ్యవేదిక’ అనే సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ, సాక్షి కలిసి ఈ పిల్లల సందడిని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఆ రైతుబిడ్డలు ఏమన్నారు?జీవితం అంటే ఏమిటో తెలిసిందిరైతు బిడ్డలను చూసిన స్టార్ సెలబ్రిటీలు ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. వారి పట్ల స్నేహహస్తం సాచారు. వారి స్పందన తెలియచేశారు. ‘చిన్న చిన్న కష్టాలకే ఎంతో బాధ పడతాం, కానీ వీరి జీవితకాలవేదన చూశాక మేమెంత మంచి జీవితంలో ఉన్నామో తెలుస్తుంది. ఈ ఒక్కరోజు నాకు జీవితాన్ని పరిచయం చేసింది. భవిష్యత్‌లో కూడా వీరి సమస్యలపై దృష్టి సారిస్తాను. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని భాను ప్రకాశ్ అంటే ‘నాన్న లేకుంటే జీవితం ఎంత చీకటి మయమో తెలిసింది. నాలాంటి పిల్లలే వారు. కానీ నాకున్న సౌకర్యాల్లో ఒక్కశాతం కూడా వారికి లేవు. వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండిపోవాలనుంది’ అన్నది హనీషా రెస్పాన్స్. ‘నా కన్నా పెద్దగా ఉన్న ఆ అక్కలు, అన్నలు ఏడుస్తుంటే నాకు చాలా బాధేసింది. వారి కోసం నేను డ్యాన్స్ చేశాను. ‘నా సినిమా షూటింగ్‌లకు తీసుకెళతానని చెప్పాను. వారి ఊరికి కూడా వెళతాను తొందరలో’ అంది శ్రేష్ట.వారి కాళ్ల మీద వాళ్లే నిలబడాలి‘మాది కౌలు వ్యవసాయం., పంట పండకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాం. అవి కట్టలేక అదే పత్తి చేనులో పత్తి మందు తాగి చనిపోయడు నా భర్త. అప్పటి నుంచి మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నా కూలీ, ఈ ఆవు పాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను’ అని దేవరకొండకు చెందిన సరోజ చెప్తే, ‘గుంట భూమి లేదు. 8 లక్షల అప్పు మిగిలింది. అప్పులోళ్ల్ల బాధ భరించలేక ఆయన తనువు చాలించాడు. ఇద్దరూ పాపలే.. వారి కాళ్ల మీద వారు నిలబడి బతకగలగాలనే లక్ష్యంతో చదివిస్తున్నాను’ అని మరో తల్లి అంది. ‘మాది కౌలు వ్యవసాయం. మిర్చి పంటలో వచ్చిన నష్టాలకు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నా కొడుక్కు 2 నెలలు. ఎన్ని ఆఫీసులు తిరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. వ్యవసాయం పై మక్కువ ఉన్నా నా బిడ్డను మాత్రం రైతుగా మారనివ్వను’ జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చెందిన మానస అన్నారు.‘ఒక్కసారన్నా లాభం రాకపోతుందా అని ఎనిమిదేళ్లు కౌలు చేశాం. ఒక్కసారి మిర్చి పంట పండినా ధర లేదు. దాంతో నా భర్త 2019 ఆత్మహాత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. ఇల్లు కూడా లేక నాన్న వాళ్లింట్లో ఉంటున్నాను’ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సుమలత అంటే ‘7,8 ఏళ్లు కౌలు చేశాం. రేటు ఉన్నప్పుడు పంట పండలేదు, పండినప్పుడు «దర లేదు. రెండూ ఉంటే వర్షాలు లేవు. ఆయన ఆత్మహాత్య చేసుకున్నప్పుడు నా గుండె కూడా ఆగినంత పనైంది. కానీ రెండేళ్ల బాబు, నాలుగేళ్ల పాప. వారి కోసం బతికి ఉన్నాను’.యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మమత అన్నారు.చదువుకుని ఎంతో ఎదుగుతున్నారు‘రైతు స్వరాజ్య వేదిక’ రైతుల సంక్షేమం కోసం 2011లో ఏర్పడింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అత్యంత సంక్షోభంలో ఉన్నాయని మా అధ్యయనంలో తెలుసుకుని వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. తెలంగాణ వచ్చాక ఈ పదేళ్లలో 7600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 80 శాతం కౌలు రైతులే. కౌలు రేట్లు పెరగడం, ప్రభుత్వ సహకారం పట్టాదారులకే ఉండటం వంటి కారణాలతో ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ 7600 మందిలో 1600 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగతా వారివి రైతు ఆత్మహత్య కాదంటారు. దీనికి కౌలు డాక్యుమెంట్లు, అప్పుల కాగితాలు అడుగుతారు. ఇది భార్యభర్తల గొడవ, బిడ్డ పెళ్లి ఖర్చువల్లే, కొడుకు చదువు, ఇల్లు కట్టుకున్నారు.. ఇలాంటి కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ వ్యవసాయ సంబంధ అంశాన్ని దూరం చేస్తున్నారు. కానీ వారి ఆదాయ వనరు మాత్రం వ్యవసాయం అని పరిగణించట్లేదు. వివిధ సంస్థల సహకారంతో ఈ కుటుంబాలకు ఉపాధి కోసం బర్రెలు, మేకలు కొనిస్తున్నాం. పిండి గిర్నీ, షాప్‌లు పెట్టిస్తున్నాం. పిల్లల చదువులకూ సహకారం అందిస్తున్నాం. ఇలా సహకారం అందుకుని ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్లుగా, ఉత్తమ క్రీడా కారులుగా ఎదిగిన రైతు బిడ్డలు ఉన్నారు.– కొండల్ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్లాయర్ అవుతాను8వ తరగతి చదువుతున్నాను. అందరూ వారి నాన్నలతో హాయిగా ఆడుకుంటుంటే నేను మాత్రం హాస్టల్లో ఆహారం, నీరు పడక ఎలర్జీలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మా నాన్న ఉంటే నన్ను కూడా మంచి ప్రైవేటు స్కూల్లో చదివించేవారు అని బాధగా ఉంటుంది. అయినప్పటికీ అమ్మ కష్టాలను దూరం చేయడానికి లాయర్ అవ్వాలనే ఆశయంతో ఉన్నాను. సినిమాల్లో చూసే సెలబ్రిటీలతో ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంది. – మింటూఅమ్మను బాగా చూసుకుంటానాన్న మరణం నన్నెంతగానో కుంగదీసింది. కానీ ఆ ఆవేదనను చదువులపై చూపించలేదు. బాగా చదువుకుంటున్నాను. అమ్మను బాగా చూసుకోవాలి అనేది నా కోరిక. నాన్న ఉండగా ఎప్పుడూ పనికెళ్లని అమ్మ నా కోసం కూలి పనికి వెళుతోంది. పైగా తనకు కిడ్నీ ఆపరేషన్ అయ్యింది. మా కష్టాలను తట్టుకునే శక్తి మాకుంది. మీరంతా మాతో ఉన్నారనే భరోసా ఇస్తే చాలు. – తేజస్వినిమేమే తయారవుతాంఉదయాన్నే నాన్న గుర్తుకొస్తాడు. అందరు నాన్నలు వారి పిల్లల్ని స్కూలుకు తీసుకెళుతుంటే చూసి. అమ్మ పొలం పనికి తొందరగా వెళ్లాలని మేమే త్వరగా తయారయ్యి మా స్కూల్‌కు వెళతాం. నాన్నలా కావొద్దని బాగా సంపాదించాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. నాన్న చేసిన అప్పుల కష్టాల్లో అమ్మ ఉంది. అందుకే ఎలాంటి అతి ఖర్చులు చేయం. పెద్దయ్యాక అమ్మను బాగా చూసుకోవాలి. – చింటూ అమ్మ కోసం నవ్వుతాహాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. డాక్టర్ అవ్వాలి, నాన్న చేసిన అప్పులు తీర్చి అమ్మకు భారం తగ్గించాలి. మా హాస్టల్లో ఫ్రెండ్స్ దగ్గరికి అమ్మానాన్నలు వస్తే.. మా దగ్గరికి అమ్మ మాత్రమే వస్తుంది. అప్పుడు ఏడుపొస్తుంది. కాని అమ్మ బాధపడుతుందని నవ్వుతా. – అక్షిత– హనుమాద్రి శ్రీకాంత్– డి.జి. భవానిఫొటోలు: పి. మోహనాచారి -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
-
యెల్లో జ్యోతి... ఇదేం పైత్యం?
చంద్రబాబు భజన చేస్తూ... వార్తలను, వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరోసారి తనవంకర బుద్ధిని బయటపెట్టుకుంది. టీడీపీ సేవలో తరిస్తూ సాక్షి మీడియాపై పడి ఏడ్చే ఆ పత్రిక, టీవీ యాజమాన్యం డిజిటల్ మీడియాపై కనీస అవగాహన లేకుండా ‘సాక్షి’కి వ్యతిరేకంగా వార్తలను వండి వార్చుతోంది. వ్యూస్‌ను, ట్రాఫిక్‌ను పెంచుకొనేందుకు ‘సాక్షి’ కుట్ర పన్నిందనీ... సాక్షి వెబ్సైట్ వార్తల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌లైన్ వాడుతున్నారనీ ఎల్లో పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించడమే కాకుండా... రెండు రోజులపాటు ఏబీఎన్ చానల్లో అర్థంపర్థం లేని చర్చలను నడిపించింది. డిజిటల్ జర్నలి జంలో ట్యాగ్ లైన్స్ ఎందుకు వాడతారు? ఏ సందర్భంలో ఎలాంటి ట్యాగ్ లైన్స్ వాడతారు? అసలు గూగుల్ ఎనలటిక్స్, వెబ్సైట్ మెట్రిక్స్ ఎలా పనిచేస్తాయన్న పరిజ్ఞానం లేకుండా ‘సాక్షి’పై విషం చిమ్మే ప్రయత్నం మొదలుపెట్టింది.ఎవరైనా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వాళ్లకు సాక్షి వార్తలు కనిపించేలా సాక్షి డాట్ కామ్‌లో ఏర్పాటు చేసుకున్నారంటూ బుర్ర తక్కువ వాదనను తెరపైకి తెచ్చింది ఎల్లో మీడియా. ఇలా చేయడం ద్వారా ఏబీఎన్ ట్రాఫిక్ మొత్తం ‘సాక్షి’కి వచ్చేస్తుందట. ఇంతకంటే అవగాహనా రాహిత్యం ఇంకేమైనా ఉంటుందా? వినేవాళ్లు ఉంటే పచ్చ పత్రికలు, చానళ్లు ఏదైనా చెబుతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. వాస్తవానికి సాక్షి డాట్ కామ్ వెబ్ ట్రాఫిక్ ఎప్పుడూ ఆంధ్రజ్యోతికి అందనంత ఎత్తులో ఉంటుంది. ప్రజల ముందు వార్తలతోపాటు వాస్తవాలను మాత్రమే అందించే సాక్షి డాట్ కామ్‌కు ఉన్న ఆదరణ ఆంధ్రజ్యోతికి ఎప్పుడూ లేదు. వెబ్సైట్ ఎనలటిక్స్‌ను బేరీజు వేసుకుంటే ఆ అంకెలే చెబుతాయి సాక్షి స్థాయి ఏమిటో. అలాంటిది పచ్చ పత్రిక నుంచి వెబ్ ట్రాఫిక్‌ను డైవర్ట్ చేసుకొనేందుకు కుట్రలు చేయాల్సిన ఖర్మ సాక్షి మీడియాకు లేనేలేదు. అసలు టెక్నికల్‌గా, లాజికల్‌గా చూసుకున్నా అలా జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు. సాధారణంగా ఏదైనా న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేయాల్సి వస్తే ఆ వార్తకు సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థల పేర్లను ట్యాగ్ లైన్స్‌గా జత చేస్తారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసే రాజకీయ విష ప్రచారానికి కౌంటర్‌గా సాక్షి డాట్ కామ్‌లో ఏదైనా వార్తను ప్రచురిస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం అనైతికం, కుట్ర అని ఏబీఎన్ ఆంధ్ర జ్యోతికి అనిపిస్తే... డిజిటల్ మీడియా గురించి వాళ్లకు ఓనమాలు కూడా తెలియవనే అనుకోవాలి. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు, సంస్థలకు చెందిన పేర్లు, ట్యాగ్‌లను సహజంగా ఉప యోగించదు అన్నది నిజమేగానీ... ఆ పత్రికా సంస్థకు సంబంధించిన వార్తను ప్రజలకు చేర్చాలనుకున్నప్పుడు ఆ పేర్లు లేకుండా... వాటిని ట్యాగ్ లైన్స్‌లో పెట్టకుండా ఎలా పబ్లిష్ చేస్తారో ఏబీఎన్ మేధావులకే తెలియాలి.ఏ మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తు న్నాయో పాఠకులకు, వీక్షకులకు తెలియనిది కాదు. ఎల్లో మీడియా చేస్తున్న రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ప్రజల ముందుంచుతోంది. అందులో భాగంగా ఏబీఎన్ మాత్రమే కాదు... ఏ ఇతర మీడియా సంస్థ అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినా వాటిని ఖండిస్తూ పాఠకులకు, వీక్షకులకు నిజం చెప్పడంలో ‘సాక్షి’ ముందుంటుంది. ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టే ఆంధ్ర జ్యోతి కంటే సాక్షి డాట్ కామ్ డిజిటల్ రేటింగ్స్‌లో ముందుంది. కేవలం సాక్షి మీడియాపై బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఆంధ్ర జ్యోతి చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ విశ్వసించరు.– వర్ధెల్లి మురళి ఎడిటర్, సాక్షి -
‘సాక్షి’ ఓ పక్క.. మరోపక్క మొత్తం పచ్చమంద
నిజం నిప్పులాంటిది అంటారు. ఆ నిప్పును ఎంత దాచిపెట్టాలన్నా అది సాధ్యం కాదు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందిన విషయాన్ని సాధ్యమైనంత మేర బయట ప్రజలకు తెలియకుండా చేయాలని టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి విశ్వ ప్రయత్నం చేశాయి.కానీ, జనం నుంచి వచ్చిన ఆగ్రహావేశాల నేపధ్యంలో ఆ మీడియా సైతం ఎంతో కొంతమేర ప్రజల కష్టాలను కవర్ చేసి తమ మీడియాలో ఇవ్వక తప్పలేదు. వరద బాధితులు పడుతున్న బాధలు, కష్టాలను సాక్షి మీడియా విస్తారంగా ఇవ్వడంపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మిగిలిన మీడియాలో చాలా భాగం వరకు ఆయన మేనేజ్ చేయగలిగారు. అందువల్లే ఏపీలో ముఖ్య నగరం అయిన విజయవాడలో ప్రజలు వరదకు గురై తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమాచారాన్ని ఆంగ్ల పత్రికలు సైతం అంతంత మాత్రంగానే ఇచ్చాయి. హైదరాబాద్ ఎడిషన్లలో ఏపీ ప్రభుత్వ వైఫల్యంపై వార్తలు రావడం లేదు.సాధారణంగా ఇలాంటి పరిస్థితులను జాతీయ స్థాయిలో కవర్ అయితే కేంద్రం కూడా బాగా స్పందించే అవకాశం ఉంటుంది. కానీ, దేశ స్థాయిలో చంద్రబాబు పరువు పోతుందన్న భావనతో ఈ వార్తలు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. సాక్షి మీడియా కనుక లేకపోతే విజయవాడ వరద బాధితుల కష్టాలు వెలుగులోకి వచ్చేవి కావు. చంద్రబాబు ఆగ్రహావేశాలు, టీడీపీకి చెందిన కొందరు చేసిన దాడులను తట్టుకుని ‘సాక్షి’ మీడియా విస్తారంగా వార్తలు కవర్ చేసింది. దాని ఫలితంగానే ప్రభుత్వం కొంత దిగి వచ్చింది. బాధితులకు సాయం చేయడానికి చివరికి గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో వలంటీర్లుగా పనిచేసినవారి సేవలను వినియోగించుకోక తప్పలేదు.వైఎస్ జగన్ అప్పట్లో ప్రతీ బాధితుడికి ఇంటి వద్దే సాయం అందించాలని స్పష్టంగా ఆదేశించేవారు. ఆ ప్రకారమే వలంటీర్లు, సిబ్బంది పనిచేసేవారు. కానీ, ఇప్పుడు పాల ప్యాకెట్ల కోసం, ఆహార పొట్లాల కోసం ప్రజలు వాహనాల వద్ద ఎగబడే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. అయినా అనేక ప్రాంతాలలో ప్రజలకు ఆహారం అందలేదు. పాలు దొరకలేదు. నీటి సమస్య అయితే అంతా ఇంతా కాదు. పారిశుద్ద్యం క్షీణించడంతో వరద ప్రాంతాలలో ప్రజలు నివసించడమే గండంగా ఉంది. ఎక్కడ అంటు రోగాలు వస్తాయోనని అంతా భయపడుతున్నారు. ఇప్పటికైనా వలంటీర్లను వాడుకోవాలన్న ఆలోచన రావడం గుడ్డిలో మెల్ల.ప్రజలకు అలాగే గత ప్రభుత్వం ప్రజలకు రేషన్ అందించడానికి వేల సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేసి వారి ఇళ్ల వద్దకే సరఫరా చేసేది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ వాహనాలను ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. అవన్ని వృథా అని భావించారు. కానీ, ఇప్పుడు అవే వాహనాల ద్వారా బాధితులకు సరుకులు సరఫరా చేస్తున్నారు. బుడమేరు వరద కారణంగా విజయవాడలో మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఎంత మంది మరణించారో ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం లేదు. అస్వస్థతకు గురైన వారిని కానీ, మరణించిన వారి శవాలను కానీ తరలించడానికి అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. దాంతో ఒక వ్యక్తి తన భార్య మృతదేహాన్ని తోపుడు బండిపై తోసుకువెళుతూ కనిపించిన దృశ్యం అందరిని కలచివేసింది. పద్నాలుగు మంది కుటుంబం ఒక ఇంటిలో నిలబడిపోతే ఒక్క ఆహార పొట్లాన్ని మాత్రమే ఇచ్చారని, దీనిని ఎలా సర్దుకోవాలని ఒక మహిళ ప్రశ్నించింది.ఈ కథనాలను అత్యధికంగా సాక్షి మీడియానే ఇస్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తోంది. ఇతర ప్రాంతాల ప్రజలకు తెలియ చేస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లోమీడియా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ కాకూడదన్న లక్ష్యంతో పనిచేస్తూ ప్రజల బాధలను విస్మరించాయి. దాంతో విజయవాడ ప్రాంతంలో ప్రజలలో ఈ మీడియా పత్రికలు, టీవీలపై అసంతృప్తి ఏర్పడింది. ఆ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. తెలుగుదేశం యువగళంలో పనిచేసిన ఒక కార్యకర్త సాక్షి టీవీ రిపోర్టర్ వద్దకు వచ్చి వరద పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం అసలు పనిచేస్తున్నట్లు లేదని, తాను టీడీపీ వ్యక్తిని అయినా ఈ విషయం చెప్పడానికి వచ్చానని కెమెరా ముందు తెలిపారు.గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు జాగ్రత్తలు తీసుకున్నా, బాధితులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా వలంటీర్ల మొదలు, అధికార యంత్రాంగం అంతా వేగంగా పనిచేసేలా చర్యలు చేపట్టినా, ఈనాడు, జ్యోతి తదితర టీడీపీ మీడియా విపరీతమైన ద్వేషంతో వ్యతిరేక వార్తలు ఇచ్చేవి. అత్యధిక భాగం అవాస్తవాలను వండివార్చేవి. వాటి ఆధారంగా చంద్రబాబు అప్పట్లో తీవ్రంగా విమర్శలు చేసేవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు వ్యతిరేక వార్తలు రాకూడదని శాసించాలని చూస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా అదంతా అధికారుల తప్పే కాని తనది కాదని ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే రీతిలో వార్తలను ఇస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సుమారు పాతిక మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు వైఎస్సార్సీపీ అని ముద్రవేసి పక్కనబెట్టారు. మిగిలిన వారంతా తమకు అనుకూలమైన వారిగా భావించి పోస్టింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు వీరు కూడా వైఎస్సార్సీపీ భక్తులని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అసలు ముఖ్యమంత్రి చేయవలసిన విధులను నిర్వర్తించకుండా, అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వకుండా, తనతో పాటు వరదలలో తిప్పుకుని, ఇప్పుడేమో వారిపైన విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగులు సరిగా పనిచేయలేదని అంటున్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ కుట్రలు అన్నట్లుగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు తీరుతో అధికారులు, ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమపై ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీడీపీ మీడియా కూడా రెండు రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను కొంతమేర అయినా కవర్ చేయక తప్పలేదు. ఆంధ్రజ్యోతి పత్రిక 'కష్టాలు కన్నీళ్లు’ హెడింగ్తో బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. హాహాకారాలు, ఆర్తనాదాలు, ప్రధాన ప్రాంతాలకే పరిమితం అయినా సాయం అంటూ కొన్ని వాస్తవాలను రాయకతప్పలేదు. ఈనాడు పత్రిక బుధవారం నాడు 'మూడో రోజూ ముంపులోనే’ అన్న హెడ్డింగ్ పెట్టింది. అదే సమయంలో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు అని సబ్ హెడింగ్ పెట్టింది. పునరావాస శిబిరాలకు వేల మందిని తరలించారని, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యవేక్షిస్తున్నారని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు శనివారం రాత్రికి రాత్రే ఎత్తడంతో విజయవాడ మునిగిపోయిందని ఈనాడులో స్థానికంగా ఒక వార్త ఇచ్చారు. బుడమేరు వరద కృష్ణాలో అధికంగా కలిస్తే నీరు వెనక్కి తన్నుతుందన్న భావనతో షట్టర్లు ఎత్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇల్లు ముంపునకు గురి కాకుండా ఉండడానికి అని మాత్రం రాయకుండా వీటీపీఎస్‌కు ఇబ్బంది రాకూడదని గేట్లు ఎత్తారని పేర్కొంది. ఈనాడుకు, చంద్రబాబుకు మధ్య ఉన్న లింక్ అందరికి తెలిసిందే. మార్గదర్శి అక్రమాలకు సంబంధించి హైకోర్టులో ఉన్న అప్పీళ్లను ప్రభుత్వం ఉపసంహరించుకుని ఆ సంస్థ యాజమాన్యానికి గిప్ట్ ఇచ్చింది. దీనిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. ఏది ఏమైనా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కొన్న వైనాన్ని ప్రజలంతా గుర్తు చేసుకోవడమే కాకుండా , ఈ ఐదేళ్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనలో తమకు ఈ బాధలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘సాక్షి’ చొరవ.. 31 మంది సురక్షితం
ఏలూరు (మెట్రో): ‘సాక్షి’ చొరవతో వరద నీటిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 31 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉంది. నారాయణపురం, బచ్చువారిగూడెం మధ్య కట్టమైసమ్మ గుడి వద్ద ఉన్న పెద్ద వాగు బ్రిడ్జి మీదుగా కొయిదా ఆసుపత్రికి పలువురు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గురువారమూ పలువురు వైద్య సిబ్బంది, ప్రజలు కొయిదా బయల్దేరారు. వారు పెద్ద వాగు బ్రిడ్జి పైకి చేరుకున్న సమయంలోనే వాగులోకి ఒక్కసారిగా వరద రావడంతో గేట్లు ఎత్తేశారు. దీంతో భారీగా వరద నీరు బ్రిడ్జిమీదుగా ప్రవహించింది. మరోపక్క గోదావరి వరద కూడా పెరగడంతో నది బ్యాక్ వాటర్ కూడా మరోపక్క నుంచి బ్రిడ్జిని చుట్టుముట్టింది. దీంతో కొయిదా ఆస్పత్రి సిబ్బంది సహా 31 మంది బ్రిడ్జిపైన వరద నీటి మధ్యలో చిక్కుకుపోయారు. వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. స్థానికులు ఈ విషయాన్ని ‘సాక్షి’ మీడియాకు తెలిపారు. తక్షణమే స్పందించిన ‘సాక్షి’ సిబ్బంది జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణికి సమాచారం అందించారు. కలెక్టర్ వెంటనే స్థానిక ఏపీ, తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, పాల్వంచ ఆర్డీవో, అశ్వారావుపేట తహసీల్దార్‌తోనూ మాట్లాడి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళం, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపారు. బోట్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంటనే ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడి, నౌకా దళం హెలికాప్టర్‌ను రప్పించారు. నౌకాదళం సిబ్బంది సాయంత్రం నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రమించి అందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. -
రేపే ‘సాక్షి’ని మూసేయిస్తా
అనంతపురం క్రైం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మరోసారి నోటికి పనిచెప్పారు. బుధవారం మీడియా సమక్షంలో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఆయన.. ఆ వార్తను ప్రచురించిన, ప్రసారం చేసిన ‘సాక్షి’ మీడియాపై గురువారం నోరుపారేసుకున్నారు. సాక్షి ఆఫీసుకు రేపు ఉదయం 10 గంటలకు మూతేయకపోతే చూడండ్రా.. ఎవరూ అడ్డుకోలేరంటూ బెదిరించారు. గురువారం అనంతపురంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం పేరిట కొందరు పాత్రికేయులను పిలిపించి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. ‘వాళ్లని, వీళ్లని కాదు. మిమ్మల్నే (సాక్షి) బెదిరిస్తున్నా. ఏం పీకుతారు’ అంటూ బరితెగించి మాట్లాడారు. బ్రేక్ ఇన్స్పెక్టర్లను కాదు.. నేరుగా మీకే చెబుతున్నా.. సాక్షిని మూతేయిస్తా. నేను బంద్ చేయించేందుకు వస్తే పోలీసులు కూడా అడ్డుకోలేరు’ అంటూ బెదిరింపులకు దిగారు. ‘మీ కార్యాలయంపై దాడి చేస్తే దిక్కొచ్చే వారెవరున్నారు? నోరు మూసుకుని ఉండాలి. దర్బేష్.. నా కొ.. ల్లారా’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఊగిపోయారు. ‘ఆయమ్మను బెదిరించాడు.. ఈయమ్మను బెదిరించాడు అన్నారు కదా.. ఇప్పుడు మిమ్మల్నే అంటున్నా.. మీకెవరు దిక్కున్నారు? మీ సీతారామాంజనేయులు, మీ పేర్ని నాని, మా ఎమ్మెల్యే (పెద్దారెడ్డి) వస్తారా? వాళ్లెవరూ రారు. నేను ఎవరికీ భయపడను. అంతకు ముందు కూడా నేను ‘సాక్షి’ ముందే కూర్చున్నా. మీకు వెనకాల, ముందు ఏముంది? నేను అనుకుంటే అనంతపురం సాక్షి ఆఫీసు మూసేయిస్తా’ అంటూ రెచ్చిపోయారు. ‘వాన్నీ.. వీన్ని బెదిరించను. నేరుగా మిమ్మల్నే బెదిరిస్తున్నా. అప్పట్లో మాకు ఎవరూ ప్రొటెక్షన్ రాలేదు. ఈ రోజు మీపైకి వస్తే మీకు అండగా ఎవరూ రారు. మేమొస్తే ఎవడూ అడ్డుకోలేరు. లక్షలాది మంది జనం మీ కార్యాలయంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు ఎవడూ లేడు. నాకు జన బలం ఉంది’ అంటూ బెదిరించారు. -
T20 WC 2024 Trophy At Sakshi: సెమీస్ చేరే జట్లు ఇవే: పీయూశ్ చావ్లా
టీ20 ప్రపంచకప్-2024 టూర్ భారత్‌లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న స్టార్ స్పోర్ట్స్ బృందం ఆదివారం ‘సాక్షి’ ఆఫీస్‌కు విచ్చేసింది.హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో.. ప్రముఖ క్రికెటర్, టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 విజేత పీయూశ్ చావ్లా ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాక్షి జర్నలిస్టులతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఈ క్రమంలో ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు పీయూష్ చావ్లా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టులపై మీ అంచనా?ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్.. ఈ మూడింటితో పాటు ఇంగ్లండ్ లేదంటే న్యూజిలాండ్ జట్లను టాప్-4లో చూసే అవకాశం ఉంది.స్పిన్నర్‌గా మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరు?వీరూ భాయ్(వీరేంద్ర సెహ్వాగ్), రాహుల్ భాయ్(రాహుల్ ద్రవిడ్).కీలక సమయంలో ముఖ్యంగా డెత్ ఓవర్లలో మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారు?కెరీర్ ఆరంభంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురికావడం సహజం. అయితే, అనుభవం గడిస్తున్న కొద్దీ మేనేజ్ చేసుకోగలుగుతాం.టీ20 వరల్డ్‌కప్-2024లో పేసర్లు, స్పిన్నర్లలో ఎవరు కీలకం కానున్నారు?వెస్టిండీస్ పిచ్‌లు స్లోగా ఉంటాయి. నాకున్న సమాచారం ప్రకారం అమెరికాలోనూ పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. కాబట్టి స్పిన్నర్లు ఈసారి కీలక పాత్ర పోషిస్తారని అనుకుంటున్నా.టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఎదుర్కొనబోయే కఠినమైన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు?ఆస్ట్రేలియా. ఎందుకంటే ఐసీసీ టోర్నీలో ఒత్తిడిని ఎలా జయించాలో వాళ్లకు బాగా తెలుసు.టీమిండియా స్పిన్నర్లలో ఈసారి ఎవరు కీలక పాత్ర పోషించనున్నారు?కుల్దీప్ యాదవ్.జస్ప్రీత్ బుమ్రా వరల్డ్‌కప్‌నకు సిద్ధంగా ఉన్నాడా?అవును. మెగా టోర్నీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కచ్చితంగా ఈసారి అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో తను ఐపీఎల్లో ఆఖరి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఇలా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ పీయూశ్ చావ్లా సరదాగా గడిపారు. కాగా ఐపీఎల్-2024లో పీయూశ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టారు.చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ -
సాక్షి ఆఫీస్‌లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
-
కోర్టు ఉత్తర్వులకూ తప్పుడు భాష్యం
సాక్షి– అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ప్రతీ రోజూ తప్పుడు కథనాలు వండివారుస్తున్న ఈనాడు దినపత్రిక, తాజాగా కోర్టు ఉత్తర్వుల విషయంలోనూ అదే వైఖరిని బయటపెట్టుకుంది. కోర్టు ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్లు ప్రచురించి, ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది. ‘సాక్షి’ దినపత్రిక సర్క్యులేషన్ వివరాలను వెల్లడించవద్దంటూ ఆడిట్బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్‌ను (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా తప్పుడు కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. వాస్తవానికి సర్క్యులేషన్ వివరాలను తనకు సీల్డ్ కవర్లో సమర్పించాలని ఏబీసీని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు... ఈ నెల 27వరకూ ఏ తెలుగు దినపత్రిక సర్క్యులేషన్ వివరాలనూ వెల్లడి చేయవద్దని స్పష్టంగా తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు ‘ఈనాడు’తో సహా తెలుగు దినపత్రికలన్నింటికీ వర్తిస్తాయి. కానీ ‘ఈనాడు’ మాత్రం... ఒక్క సాక్షి పత్రిక సర్క్యులేషన్ వివరాలను మాత్రమే వెల్లడించవద్దని ఏబీసీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా కథనాన్ని ప్రచురించటంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీని వివరాలు చూస్తే... విస్తృత సర్కులేషన్ ఉన్న ఏదైనా పత్రికను కొనుగోలు చేసుకోవటానికి గ్రామ, వార్డు వలంటీర్లకు, సచివాలయాలకు నెలకు రూ.200 ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. ఆ మేర బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా ఏ పత్రికను కొనాలన్నది చెప్పలేదు. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసుకోవచ్చునని వలంటీర్లకు ఛాయిస్ ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రై వేట్ లిమిటెడ్ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే వలంటీర్లు, సచివాలయాలు ఒకవేళ ‘సాక్షి’ దినపత్రికను కొనుగోలు చేస్తే ఆ సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్కులేషన్ను (ఏబీసీ) ఆదేశించడంతో పాటు నిర్ధిష్ట కాలాల్లో సాక్షి పత్రికు ఇచ్చిన సర్కులేషన్ సర్టిఫికేషన్‌ను పునస్సమీక్ష చేయాలని కూడా ఏబీసీని ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ.వెంకట్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక ప్రభుత్వ జీవోల అమలును నిలిపేయడంతో పాటు, 2022 జూలై– డిసెంబర్, ఆ తరువాత కాలానికి సాక్షి సర్కులేషన్ను ఆడిట్ చేయకుండా ఏబీసీని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. సీజే ధర్మాసనం మొదట ఈ అనుబంధ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. అటు ఈనాడు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్నది. అనంతరం ఉషోదయ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేసింది. దీనిపై ఉషోదయ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై గత ఏడాది ఏప్రిల్ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉషోదయ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉషోదయ వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు గత ఏడాది జూలై నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వక వాదనల సమర్పణకు సైతం ఆదేశాలిచ్చింది. అయితే సర్క్యులేషన్ వివరాలను వెల్లడి చేయకుండా ఏబీసీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని బుధవారం (మార్చి 13) ఉషోదయ మరో పిటిషన్ వేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏబీసీ తరఫు న్యాయవాది ఎవరూ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తాజా సర్కులేషన్ వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలంటూ ఏబీసీకి నోటీసులిచ్చింది. అంతేకాక ఈ నెల 27 వరకూ తెలుగు దినపత్రికలన్నింటి సర్కులేషన్ వివరాలను వెల్లడి చేయవద్దని కూడా ఏబీసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉంటే, ఈనాడు మాత్రం ఆ ఉత్తర్వులను దురుద్దేశాలతో తప్పుగా ప్రచురించింది. ఢిల్లీ హైకోర్టు ‘సాక్షి’ సర్కులేషన్ వివరాలను, గణాంకాలు ప్రచురించవద్దంటూ ఏబీసీని ఆదేశించినట్లు తప్పుడు కథనాన్ని ప్రచురించి తన నైజాన్ని చాటుకుంది. -
రామోజీకి వణుకు.. అసలు కథ ముందుంది?
వృద్ధాప్యంలో ఉన్న ఈనాడు మీడియా యజమాని రామోజీరావుకు పెద్ద సవాలే ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవని ఆయన భయపడుతున్నారనిపిస్తోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఇష్టారాజ్యంగా నడిపారు. వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని మీడియా రాజ్యాన్ని సృష్టించారు. ఆ మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారంలో తనకు ఎదురులేదన్నట్లుగా ప్రవర్తించారు. కానీ, సీఎం జగన్ రూపంలో తనకు ఇంత ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన ఊహించలేకపోయారు. తన మార్గదర్శి సంస్థలో జరిగిన పలు అక్రమాలు, అవినీతిని, నల్లధనం తదితర విషయాలన్నిటినీ ఏపీ సీఐడీ బహిర్గతం చేసింది. దాంతో సీఎం జగన్‌పై కక్ష కట్టిన రామోజీ ఇప్పుడు తన మీడియాను పూర్తి స్థాయిలో టీడీపీ కరపత్రంగా, బాకాగా మార్చేశారు. ఈసారి ముఖ్యమంత్రి జగన్ పోటీ పడుతున్నది చంద్రబాబు కాదని, రామోజీరావు అని అంతా భావించే దశకు వెళ్లారు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని, ఎవరో ఒకరు తగులుతారని అంటారు. అలాగే రామోజీ సంస్థలలోని ఆర్దిక అరాచకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనిపెట్టింది. తత్ఫలితంగా ఆయన ప్రతిష్ట మసకబాసింది. దాంతో ఆయనకు సీఎం జగన్‌పై ఎక్కడ లేని ద్వేషం ఏర్పడింది. నిజానికి సీఎం జగన్‌పై రామోజీరావుకు ఉన్న పగ ఈనాటిది కాదు. ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ నుంచే రామోజీ బొడ్డుకు సున్నం రాసుకున్నట్లు వ్యవహరించేవారు. దానికి కారణం అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనను రాజగురువుగా భావించి, నిత్యం సంప్రదింపులు చేస్తూ ఆయనను సంతృప్తిపరుస్తుండేవారు. 1989-1994 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలతో మరీ ఈ స్థాయిలో గొడవపడేవారు కారు. వారు కూడా చూసి చూడనట్లు పోతుండేవారు. రామోజీ మీడియాకు వారు కొంత భయపడేవారు. 1994లో ఎన్.టి.రామారావు అంత మెజార్టీతో అధికారంలోకి వస్తారని రామోజీ ఊహించలేదు. అయినా ఎన్టీఆర్ భారీ ఆధిక్యతతో అదికారంలోకి రావడంతో కొద్దికాలం సర్దిపెట్టుకున్నారు. కానీ, ఆ తర్వాత పరిణామాలలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిని సాకుగా చూపుతూ ఆయనను దారుణంగా చిత్రీకరిస్తూ వ్యంగ్య కార్టూన్లు వేయించేవారు. చంద్రబాబుకు కొమ్ముకాసి ఎన్టీఆర్‌ను దించడంలో రామోజీ తనదైన పాత్రను పోషించారు. అప్పటి నుంచి తానే షాడో ముఖ్యమంత్రి అన్నట్లు సంతోషపడుతుండేవారు. ఆయనకు ప్రభుత్వపరంగా ఏది కావాలన్నా ఎదురులేని పరిస్థితి సృష్టించుకున్నారు. ఆ పరిస్థితిలో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీని ఓడించి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. ఎందువల్లో వైఎస్ పట్ల మొదటి నుంచి అంత సానుకూలంగా ఉండేవారు కాదు. అయినా వైఎస్సార్ పెద్దగా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోయేవారు. కాకపోతే ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేసేవారు. వాటికి పోటీగా కాంగ్రెస్‌కు కూడా ఒక పత్రిక ఉండాలని, ఒక టీవీ ఉండాలని తలపోశారు. అందుకు అనుగుణంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి మీడియాను ఏర్పాటు చేశారు. అది రామోజీకి పుండుమీద కారం చల్లినట్లయింది. తన మీడియాకే పోటీకి వస్తారా అన్న అహంభావంతో వైఎస్ ప్రభుత్వంపై చెలరేగడం ఆరంభించారు. చివరికి సీఎంగా ఉన్న వైఎస్సార్‌పై ఒక సంపాదకీయం రాస్తూ ‘ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే’ అంటూ హెడింగ్ పెట్టి వైఎస్‌ను ఘోరంగా అవమానించారు. అదే తరుణంలో రామోజీ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌తో జరుగుతున్న అక్రమ డిపాజిట్ల సేకరణపై అప్పట్లో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణకుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో రివర్స్ కథ మొదలైంది. రామోజీ అంతవరకు తాను ఏమీ తప్పు చేయడం లేదన్నట్లుగా ప్రజల దృష్టిలో పడుతూ, మరోవైపు అక్రమంగా డిపాజట్ల సేకరణకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయడంలో ఉండవల్లి సఫలం అయ్యారు. అయితే, తీసుకున్న డిపాజిట్లను రామోజీ సకాలంగా చెల్లిస్తున్నారుగా అన్న ప్రచారం జరిగేది. కానీ, అసలు డిపాజిట్లు సేకరించడమే అక్రమమని, నేరమని ఆర్బీఐ ప్రకటించడంతో రామోజీ తన టీవీ చానళ్లు కొన్నిటిని విక్రయించి సుమారు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను తిరిగి చెల్లించవలసి వచ్చింది. అది ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది. 2009లో రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ కేసుకు బ్రేక్ పడింది. ఆయన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలు రామోజీతో రాజీపడిపోయారు. అంతలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రామోజీ స్నేహం చేస్తూ, కాదు.. కాదు... భజన చేస్తూ.. తన ఆస్తులవైపు, తన సంస్థల లావాదేవీల వైపు రాకుండా చూసుకోగలిగారు. అదే సమయంలో విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. చంద్రబాబును భుజాన వేసుకుని వైఎస్ కుమారుడు జగన్మోహన్రెడ్డి యువకుడు అన్న ఆలోచన కూడా లేకుండా దాడి ఆరంభించారు. సోనియాగాంధీ, చంద్రబాబులకు రామోజీ తోడై సీబీఐ పెట్టిన అక్రమ కేసులపై తన మీడియా ద్వారా విపరీత వ్యతిరేక ప్రచారం చేసేవారు. అయినా.. జగన్మోహన్రెడ్డి మాత్రం వీరిని పట్టించుకునేవారుకారు. 2014 ఎన్నికలలో రామోజీ మీడియా చేసిన అబద్దపు ప్రచారం కొంత పనిచేసింది. కారణం ఏమైనా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాలేకపోయారు. అయినా ఆయన పట్టువదలకుండా రాజకీయాలు నడిపారు. అది ఈనాడుకు నచ్చలేదు. జగన్మోహన్రెడ్డిని దెబ్బతీశాం కదా అనుకుంటే మళ్లీ కెరటంలా లేస్తున్నారని గమనించారు. 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్రెడ్డిపై దారుణమైన కథనాలు అల్లారు. కానీ, జనం నమ్మలేదు. రామోజీ రాతలను ఖాతరు చేయకుండా ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్‌కు పట్టం కట్టారు. అప్పటి నుంచి మళ్లీ రామోజీలో అసూయ పెరిగింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనపై దాడి ఆరంభించారు. కొంతకాలం ఓపికగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేచి చూసింది. అయినా రామోజీ తన వైఖరిని మార్చుకోకుండా, ఈనాడు మీడియాను టీడీపీ ప్రచార బాకాగా వాడడం ఆరంభించారు. అంతవరకు అయితే ఫర్వాలేదు. సీఎం జగన్‌పై ఉన్నవి, లేనివి కలిపి పచ్చి అబద్దాలు రాయడం ఆరంభించారు. ఈ దశలో మార్గదర్శి చిట్స్‌లో జరిగిన అక్రమాలు, అక్రమ డిపాజిట్ల వసూలు కొనసాగించడం సీఐడీ దృష్టికి వెళ్లి, వారు రంగంలో దిగారు. దాంతో ఒక్కసారిగా రామోజీ బిత్తరపోయారు. తాను ఎవరికి దొరకనని, ఎవరూ తన జోలికి రావడానికి సాహసం చేయరని అనుకునే రామోజీరావుకు ముఖ్యమంత్రి జగన్ రూపంలో సవాల్ ఎదురైంది. మార్గదర్శి చిట్స్‌లో సభ్యుల చేరిక మొదలు, చిట్టీలు పాడుకున్నవారికి సకాలంలో చెల్లించకపోవడం, డిపాజిట్ల అక్రమ సేకరణ, నల్లధనం చలామణి మొదలైనవాటిని ఏపీ సీఐడీ కనిపెట్టడంతో రామోజీకి సినిమా మొదలైంది. చివరికి ఆయన సీఐడీ అధికారుల విచారణను ఎదుర్కున్నారు. అప్పటికీ న్యాయ వ్యవస్థలో తనకు ఉన్న పట్టుతో ఈ కేసులన్నీ వేగంగా సాగకుండా అడ్డుపడుతున్నారు. ఏపీ కేసులకు కూడా తెలంగాణ హైకోర్టులో స్టేలు తెచ్చుకుని తప్పించుకోచూస్తున్నారు. మార్గదర్శి చిట్స్‌లో సుమారు 800కోట్ల నల్లధనం లావాదేవీలు జరిగాయని సీఐడీ గుర్తించింది. చిట్స్ నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించడంతో ఏపీలో సంస్థ బ్రాంచ్‌లలో వ్యాపారం స్తంభించడం ఆరంభమైంది. టర్నోవర్‌పై దాని ప్రభావం పడింది. తాజాగా సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం చిట్స్రూపేణా కాని, అక్రమ డిపాజిట్ల రశీదుల రూపేణా కాని సుమారు 4800 కోట్ల రూపాయల మేర బకాయిలు పడ్డారని అధికారులు అంచనా వేసినట్లు రావడం సంచలనాత్మకంగా మారింది. రామోజీ మరీ రెచ్చిపోయి, బరితెగించి వైఎస్ ప్రభుత్వంపై ఎందుకు ఇంత నీచంగా వార్తలు రాస్తున్నారు అని ఆలోచించేవారికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. తన వ్యాపార లావాదేవీల అరాచకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం బహిర్గతం చేసిందన్న కోపం ఒకవైపు, మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే, తన ఆట కట్టినట్లే అవుతుందన్న భయం మరోవైపు రామోజీ బృందాన్ని వేటాడుతున్నాయి. దాంతో ఈనాడు మీడియాను పణంగా పెట్టి ముఖ్యమంత్రి జగన్‌పై విపరీతమైన ధోరణిలో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అదికారంలోకి వస్తే ఈ కేసులేవీ ముందుకు సాగవు అన్న భావన. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకన్నా, రామోజీకే అతి పెద్ద సవాలుగా మారాయనిపిస్తుంది. అంతే తప్ప తనపై వచ్చిన కథనాలకు సమాధానం ఇవ్వడానికి, మార్గదర్శిలో జరిగిన అవకతవకలకు సంజాయిషీ ఇవ్వడానికి బదులు సీఎం జగన్ ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ఆయన మార్గంగా ఎంచుకున్నారు. నిజానికి జర్నలిజంలో ఒక సూత్రం ఉంది. తన సొంత వ్యాపార ప్రయోజనాలకోసం మీడియాను అడ్డు పెట్టుకోరాదు. ఆ పరిస్థితిని మనం ఆశించలేకపోయినా, ఒక రాజకీయ పార్టీని అనైతికంగా భుజాన వేసుకుని రామోజీ తన మీడియాను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు రాస్తూ సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ సైతాన్ మాదిరి ప్రవర్తిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. అయినా ఈ విమర్శలన్నిటి కన్నా తన సంస్థపై వచ్చిన కేసులను కప్పిపుచ్చుకోవడానికి గాను ఆయన తన మీడియాను ఫణంగా పెట్టి మరీ దుష్ప్రచారం సాగిస్తున్నారని చెప్పాలి. అందుకే టీడీపీ గెలుపు చంద్రబాబుకన్నా, రామోజీకే ఎక్కువ అవసరంగా మారింది. అయినా ఆయన ఆశలు నెరవేరే సూచనలు కన్పించడం లేదు! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
నేటి నుంచి ప్రజల ముందుకు సాక్షి లైఫ్
-
సాక్షి మీడియా నుంచి సాక్షి లైఫ్ హెల్త్ పోర్టల్
-
‘సాక్షి’ పెట్టుబడులు సక్రమమే..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని 2022 డిసెంబర్లో ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. జగతి పబ్లికేషన్‌లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్మెంట్లు స్వీకరించడంలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్ పాటించిందని ఐటీ శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కంపెనీలోకి పెట్టుబడులన్నీ క్విడ్–ప్రో–కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా పరిగణించి, ఆ మొత్తం పై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఐటీ విభాగం తమ వాదనకు మద్దతుగా సమర్పించిన సీబీఐ ఛార్జిషీట్లను... అసలు సాక్ష్యంగానే పరిగణించలేమని తెగేసి చెప్పింది. సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిïÙట్లకు లేవని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ‘ఆ ఛార్జిషిట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్మెంట్ ఇయర్ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా? క్విడ్ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలేమైనా సంపాదించారా? సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా? సీబీఐ ఛార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదు. ఈ కేసులో అవి అనవసరం, అప్రస్తుతం కూడా‘ అని జ్యుడిషియల్, అకౌంటింగ్ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ తేల్చిచెప్పింది. తద్వారా... సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై రామోజీరావు, టీడీపీ అధిపతి చంద్రబాబునాయుడు, మిగిలిన ఎల్లో గ్యాంగ్ పనిగట్టుకుని చేస్తున్న దు్రష్పచారానికి విలువ లేదని, అదంతా బూటకమని స్పష్టమయింది. సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలూ సమగ్రంగా విన్న అనంతరం 2022 డిసెంబరు 23న బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. ఒక్కొక్కరికీ ఒక్కో’లా’ ఎలా? ‘‘కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. వారి విషయంలో ఎలాంటి క్విడ్ ప్రో కో లావాదేవీలూ జరగలేదని స్పష్టంగా చెప్పింది. పోనీ... మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని కూడా ఆ మెమోలో చెప్పలేదు. మరి క్విడ్ ప్రో కో అని మీరెలా అంటారు?‘ అని బెంచ్ తన ఉత్తర్వుల్లో ఐటీ విభాగాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు లిమిటెడ్‌లో షేరు ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయమవుతుందని పేర్కొంది. ఇన్వెస్టర్ల వాదనను గమనించారా? సాక్ష్యాలుగా సమరి్పంచిన పలు వాదనల్లో నిమ్మగడ్డ గ్రూపు సంస్థల డైరెక్టరు నిమ్మగడ్డ ప్రకాశ్ చేసిన వాదనను బెంచ్ ప్రస్తావించింది. ‘‘ఈనాడులో పెట్టుబడులకోసం బ్లాక్‌స్టోన్ అనుకున్న విలువలో 20 శాతం డిస్కౌంట్‌కే సాక్షిలో వాటా దొరికింది. ఐదు ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నాం. అందులో మీడియా ఒకటి. అందుకే సాక్షిలో పెట్టాం’’ అనే ప్రకాశ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ వ్యాఖ్యానించింది. వచి్చన పెట్టుబడులను ఆదాయంగా పరిగణించలేమని విస్పష్టంగా తేల్చిచెప్పింది. తెలియని మార్గాలంటే ఎలా? కోల్‌కతాలోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన రూ.15 కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొత్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్ తప్పుబడుతూ... కోల్‌కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీ పాన్, రిజిస్ట్రేషన్ నెంబరు, అడ్రసు వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నప్పుడు ’గుర్తు తెలియని ఆదాయం’ ఎలా అవుతుందని ప్రశ్నించింది. వాల్యుయేషన్ నివేదిక నిజమేగా? ‘‘వాల్యుయేషన్ రిపోర్టును అస్సలు తప్పు బట్టడానికి లేదు. అందులో పేర్కొన్న అంశాలన్నీ సాక్షి పత్రిక విషయంలో నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే సర్క్యులేషన్ పెరిగింది. పోటీపత్రిక ఈనాడు గుత్తాధిపత్యం తగ్గింది. పోటీపత్రిక 30 ఏళ్లలో సాధించిన సర్క్యులేషన్‌ను సాక్షి ఏడాదిన్నరలోనే సాధించింది. కనుక వాల్యుయేషన్ నివేదికను తప్పుబట్టలేం. సాక్షి యాజమాన్యానికి అనుభవం లేకున్నా అంత ప్రీమియం తీసుకున్నారనే వాదన అర్థరహితం. వారి లీడర్‌షిప్‌లో ఆ పత్రిక అంచనాలన్నిటినీ అందుకుంది. కాబట్టి క్విడ్ ప్రో కో వాదనకు అర్థమే లేదు’’ అని బెంచ్ పేర్కొంది. ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇంత విస్పష్టంగా తీర్పునిచ్చినా... రామోజీ, చంద్రబాబు గ్యాంగ్ మాత్రం ఇప్పటికీ పాత పాటే పాడుతూ... పాచి కథనాలనే మళ్లీ మళ్లీ ప్రచురిస్తూ ఏదో చేసేయాలని ఆరాటపడుతుండటమే విచిత్రం. -
అబద్ధాల గురువు.. బాబుకు దరువు
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) : ‘ఈనాడు’కు 50 ఏళ్లు. రామోజీకైతే 87. కానీ ఏం లాభం? పత్రికేమో అబద్ధాలకు కేరాఫ్. ఈయనేమో మోసాలకు గురువు. అయినా సిగ్గుండక్కర్లా? 17 ఏళ్లుగా తన ఇన్కమ్ ట్యాక్స్, మార్గదర్శి కేసుల్ని నానబెడుతూ... సాగదీస్తూ... కోర్టులకు అడ్డంపడుతూ వస్తున్న రామోజీ రావు... ‘సాక్షి’లో పెట్టుబడుల కేసుల్ని వాయిదాలతో నెట్టుకొచ్చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేయటమేంటి? మరీ ఇంత పచ్చి అబద్ధాలతో ఈ వయసులో ఏం సాధిస్తావయ్యా రామోజీరావ్!!. చంద్రబాబు కోసం మరీ ఇంత దిగజారిపోవాలా!?. అసలు ఈ కేసుల్లో వైఎస్ జగన్ తరఫున లాయర్లు ఎన్నడైనా కావాలని ఒక్క వాయిదానైనా అడిగారా? ఒక్కసారైనా హాజరుకాకుండా ఉన్నారా? ఎందుకిన్ని అబద్ధాలు? ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు కోర్టు మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు తప్పనిసరిగా ప్రతి వాయిదాకూ హాజరవుతున్నారు. రామోజీ కేసుల్లో కూడా హాజరయ్యేది లాయర్లేగా? మరెందుకు ఈ అరుపులు? ఎన్నికలు వస్తున్నాయనే కదా? గత ఎన్నికల ముందు కూడా ఇంతే. ఈ కేసులు నిరూపణ అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి శిక్ష పడుతుందని పదేపదే రాసి... జనాన్ని భయపెట్టాలని చూస్తే ఏమయింది? మీ అబద్ధాలను నమ్మబోమని మొహమ్మీద ఫెడేల్మని కొట్టి 151 సీట్లతో అఖండ విజయం కట్టబెట్టారు. అయినా బుద్ధి రాలేదా? ఇప్పుడూ అవే రాతలా? ఇంకెన్నాళ్లు రామోజీ!!. అసలు ఈ కేసులేంటి? ఎవరు వేసినవి? ఎప్పటివి? రాష్ట్రంలో ఎల్లో మీడియా అబద్ధాలకు అంతులేకుండా పోతోందని, రెండో కోణాన్ని చూపించే పత్రిక అత్యవసరమని భావించటంతో పుట్టుకొచ్చిన పత్రిక ‘సాక్షి’. పత్రిక భవిష్యత్తుపై నమ్మకం ఉండటంతోనే పలువురు ఇన్వెస్టర్లు దీన్లో పెట్టుబడులు పెట్టారు. వారి నమ్మకం గెలిచింది. ‘సాక్షి’ ఒక మీడియా సంస్థగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. తమ పెట్టుబడులు అనుకున్నదానికన్నా ఎక్కువ సక్సెస్ అయ్యాయని ఇన్వెస్టర్లు కూడా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు– రామోజీ మాత్రం దీన్ని తట్టుకోలేకపోతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లూ ఏ కేసులూ లేవు. ఆ పార్టీని వీడటంతోనే కక్ష సాధింపులు మొదలయ్యాయి. తమకు రాజకీయ ప్రత్యర్థిగా అవతరించవచ్చనే భయంతో కాంగ్రెస్... టీడీపీతో చేతులు కలిపి మరీ కుట్రలకు దిగింది. ఇదీ.. బాబు–కాంగ్రెస్ కుట్రకు మూలం అసలు ‘సాక్షి’లోకి వచ్చిన పెట్టుబడులు పెట్టుబడులే కాదని... అదంతా ఆ సంస్థకు వచ్చిన ఆదాయమని, కాబట్టి దానిపై పన్ను కట్టాలంటూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఓ ఐటీ అధికారి ‘సాక్షి’కి అడ్డగోలు నోటీసులిచ్చారు. ఇదే... ఈ కేసుకు మూలం. తమకిలా ఉపకారం చేసినందుకు ఆ అధికారికి తాను అధికారంలోకి రాగానే చంద్రబాబు తగిన కానుక ఇచ్చుకున్నారు. ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి మరీ దానికి సీఈఓను చేశారు. ఈ నోటీసుల్ని ఓ పత్రిక ప్రచురిస్తే... ఆ పత్రిక కథనాన్ని జతచేసి కాంగ్రెస్ నేత శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు. దాన్ని పిటిషన్‌గా కోర్టు స్వీకరించింది. తమనూ చేర్చాలని టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతి కోరారు. కోర్టు చేర్చింది. నిజానికి అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ కాదు. ఏ మంత్రితోనూ మాట్లాడింది లేదు. నాటి రాజధాని హైదరాబాద్‌లో కూడా ఉండేవారు కాదు. కాంగ్రెస్ బెదిరింపులకు లొంగకపోవటంతో ఎక్కడో బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్‌పై కేసులు పడ్డాయి. కోర్టు తీర్పుతో దర్యాప్తు మొదలయింది. మూకుమ్మడి సోదాలతో భయోత్పాతం ఇక సీబీఐ దర్యాప్తు మొత్తాన్ని తనే నిర్దేశిస్తూ ఎల్లో మీడియా శివాలెత్తింది. నాటి దర్యాప్తు అధికారులు సైతం వందల బృందాలతో వైఎస్ జగన్ ఇల్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, ఇన్వెస్టర్ల ఇళ్లు సోదాలు చేసి భయోత్పాతం సృష్టించారు. చివరకు ఏమీ దొరక్క... ఐటీ అధికారి నోటీసులో ఏమయితే పేర్కొన్నారో... దాదాపుగా అవే అంశాలు పేర్కొంటూ 11 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఈడీ కూడా సీబీఐని కాపీ చేసి... అది వేసిన 11 ఛార్జిషీట్లనూ తనూ యథాతథంగా వేసేసింది. అదీ కథ. అంటే అన్నిటికీ మూలం.. బాబు కోసం... ఓ అధికారి ఇచ్చిన ఐటీ నోటీసు. కానీ చివరకు ఏమయిందో తెలుసా? ఆ ఐటీ నోటీసును ఐటీ ట్రిబ్యునల్ కొట్టేసింది. ఆ పెట్టుబడులన్నీ సక్రమమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో... తెలుగుదేశం– కాంగ్రెస్ అధిష్ఠానం కలిసి చేసిన కుట్ర స్పష్టంగా బయటపడింది. పెట్టుబడులు సక్రమమేనని ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునలే చెప్పినపుడు... దాని ఆధారంగా వేసిన ఛార్జిషీట్లు నిలబడతాయా? మరి ఈ కేసులో ఏం ఉందని రామోజీరావు దిగజారి రాస్తున్నారు? చంద్రబాబుకు జీవితాంతం జైలే... స్కిల్ డెవలప్మెంట్ అంటూ సీమెన్స్ కంపెనీకి సంబంధం లేకుండానే ఆ కంపెనీతో నకిలీ ఒప్పందం చేసుకుని... ఏకంగా రూ.241 కోట్లను తన సొంత ఖాతాల్లోకి మళ్లించేసుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు. ఈ కుంభకోణంలో ఇటీవలే 52 రోజులు జైల్లో ఉండి... ఆరోగ్యం బాగాలేదని, పరీక్షలు చేయించుకోవాలని చెప్పి బెయిలు తెచ్చుకున్నాడు. మరోవైపు విజయవాడలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను తమ భూముల మీదుగా మళ్లించి స్కామ్‌కు పాల్పడ్డారనే కేసు కూడా ఈయనపై ఉంది. రాజధాని పేరిట దళితుల అసైన్డ్ భూములను అక్రమంగా హస్తగతం చేసుకున్న కేసు మరొకటి... ఫైబర్‌నెట్ పేరిట తన బినామీ సంస్థ టెరాసాఫ్ట్‌కు అడ్డగోలు కాంట్రాక్టు కట్టబెట్టి నిధులు కాజేసిన కేసు ఇంకొకటి. వీటిలో ఏ ఒక్కకేసు నిరూపణ అయినా... ఏడేళ్లకన్నా ఎక్కువే శిక్ష పడుతుంది. అంటే.. 73 ఏళ్ల చంద్రబాబు ఏ కేసులో నిజం నిరూపణ అయినా జీవితాంతం జైల్లోనే ఉంటారు. మరి ఈ నిజాన్ని మీ పత్రికలో చెప్పరెందుకు రామోజీ? ఎందుకంటే ఆయన మీ.. చంద్రబాబు కాబట్టి!!. అంతేగా? షేరు విలువపై మీరా.. మాట్లాడేది? ‘సాక్షి’ మీడియా సంస్థ 10 రూపాయల విలువైన షేరును రూ.350 చొప్పున ఇన్వెస్టర్లకు విక్రయించిందని, ఇంత ప్రీమియం చెల్లించటమే కుంభకోణమని ప్రతిసారీ రామోజీరావు రాని ఆవేశాన్ని తెచ్చుకుని మరీ ఊగిపోతుంటారు. మరి ‘ఈనాడు’ పత్రిక తన 100 రూపాయల విలువైన షేరును ఏకంగా రూ.5,28.630 చొప్పున విక్రయించింది. పైపెచ్చు ఆ సమయంలో ‘ఈనాడు’ రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉంది. దీనికితోడు పనికిమాలిన పాత సినిమా రీళ్లను రూ.700 కోట్లుగా లెక్కగట్టి అమ్మేసింది. ఇది అసలు ఏ స్థాయి కుంభకోణం? ‘ఈనాడు’ కన్నా మెరుగైన పత్రికను, మెరుగైన డిజైన్, ఆధునిక యంత్రాలతో తీసుకువచ్చినపుడు... షేరును రూ.350కి విక్రయించటం అక్రమమెలా అవుతుంది? పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లంతా సంతోషంగానే ఉన్నారుకదా? ఈ కేసులు గనక లేకుంటే ఏనాడో వారి వాటాలకు పెట్టుబడికన్నా ఎక్కువ విలువ వచ్చి ఉండేది. మరి ఈ వాస్తవాలన్నీ దాచి అబద్ధాల కథనాలెందుకు? ఎన్నికల సమయంలో ఏదో ఒకరకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లాలనుకునే దౌర్భాగ్యపు రాతలు ఇంకెన్నాళ్లు?