‘సాక్షి’ గెస్ట్‌ ఎడిటర్‌గా వల్లూరు క్రాంతి | IAS Officer Kranthi Valluru Guest Editor Of Sakshi Media On The Occasion Of Womens Day | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ గెస్ట్‌ ఎడిటర్‌గా వల్లూరు క్రాంతి

Published Sat, Mar 8 2025 11:45 AM | Last Updated on Sat, Mar 8 2025 12:23 PM

IAS Officer kranthi Valluru guest editor of sakshi media

మహిళల్లో స్ఫూర్తి నింపే మరిన్ని కథనాలు రావాలని ఆకాంక్ష

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా వచ్చిన వార్తలను పరిశీలించి.. వాటిని క్షుణ్ణంగా చదివి.. ఆ వార్తల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేశారు సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి. పాలన పరమైన విధుల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్‌ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలోని  సంగారెడ్డి జిల్లా ఎడిషన్‌కు గెస్ట్‌ ఎడిటర్‌గా వ్యవహరించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, ప్రతిభ చూపుతున్న మహిళలకు సంబంధించి విలేకరులు రాసిన ప్రత్యేక కథనాలు ఆమె చదివారు. 

వాటి ప్రాధాన్యతను కూడా గుర్తించి సబ్‌ ఎడిటర్‌లతో చర్చించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా పేజీల డిజైన్‌లను పరిశీలించారు. అలాగే వివిధ మండలాలు, పట్టణాల నుంచి వచి్చన వార్తలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ క్రాంతి మాట్లాడుతూ ఈ కథనాలు మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కితాబిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా వారిని ప్రోత్సహిస్తూ.. స్ఫూర్తిదాయక కథనాలు మరిన్ని రావాలని ఆకాక్షించారు. 

దినపత్రికకు గెస్ట్‌ ఎడిటర్‌గా వ్యవహరించడం తనకు ఎంతో మంచి అనుభూతిని ఇచి్చందన్నారు. పత్రిక నిత్యం ప్రజాసమ స్యలను వెలికి తీస్తుండటంతో.. ఆ సమస్యలు అధికార యంత్రాంగం దృష్టికి వస్తాయని.. తద్వారా అధికార యంత్రాంగం వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. అధికారుల దినచర్య న్యూస్‌పేపర్లతోనే ప్రారంభమవుతందని చెప్పారు. పత్రిక పాఠకునికి చేరడం వెనుక ఆయా విభాగాలు ఎలా పనిచేస్తాయో తెలిసిందని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement