kranthi
-
అమ్మానాన్నల మాట.. సివిల్స్‌కు బాట
చదువుకోవాలి.. చదువుకొని తన కాళ్లపై తాను నిలబడి, ఆదర్శంగా ఉండాలని చెప్పిన అమ్మ మాట.. సమాజంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజాసేవలో ఉండాలని చూపిన నాన్న బాట.. ఇలా తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలోచనలో పడేశాయి. అప్పుడే తాను ఒక ఉన్నతాధికారిగా ప్రజాసేవ చేయాలని సంకల్పంతో 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించారు. దేశంలోనే యువ ఐఏఎస్‌లలో ఒకరిగా నిలిచి పాలనలో పరుగులు పెట్టిస్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సక్సెస్ స్టోరీ మీకోసం..బాల్యం.. విద్యాభ్యాసంవల్లూరు క్రాంతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ని కర్నూలు పట్టణం. తండ్రి డా.రంగారెడ్డి, తల్లి డాక్టర్ లక్ష్మి. ఇద్దరూ కూడా వైద్యులే. అక్క కూడా వైద్యురాలే, అమెరికాలో స్థిరపడ్డారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కర్నూల్లోనే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నారు. బీటెక్ ఢిల్లీ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలోనే..అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఓ వైపు వచ్చిన జాబ్‌ను వదలకుండా ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తొలిసారిగా 2013లో సివిల్స్‌కు హాజరై 562 ర్యాంకు రావటంతో (ఐఆర్టీఎస్) ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చింది. అయినా నిరాశ చెందకుండా రెండోసారి 2014లో సివిల్స్ పరీక్ష రాసి 230 ర్యాంకు సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో ఉద్యోగం సాధించారు. ఐఏఎస్ కావాలని పట్టుదల, నాన్న సూచన సలహా మేరకు 2015లో జరిగిన సివిల్స్‌లో 65 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారు. 24 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించి యువ ఐఏఎస్‌గా నిలిచారు. ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసి, 2016 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు ఎంపిక అయ్యారు.శిక్షణలో క్షేత్రస్థాయి సమస్యలుముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ తీసుకోవడం జరిగింది. శిక్షణలో భాగంగా వారం రోజుల పాటు ఓ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో నేర్పించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాను. ట్రెక్కింగ్ నేర్పించారు.కొత్త ఆశల ఉగాది అంటే ఇష్టంపండుగలలో కొత్త ఆశ ఆశయాలతో ప్రారంభమయ్యే ఉగాది పండుగ అంటే నాకెంతో ఇష్టం. చదువుతోపాటు ఆటలు కూడా ఆడేవాళ్లం.ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టంప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముందుగానే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా నిరాశ చెందకుండా లక్ష్యం వైపు ముందుకు సాగాలి. లక్ష్యం సాధించే వరకు అదే పనిగా ఉంటూ ఆత్మస్థైర్యం, నమ్మకంతో ఉండాలి. ప్రణాళికబద్ధంగా సిలబస్ ప్రిపేర్ అవుతూ పరీక్షలకు సన్నద్ధం కావాలి. విజయం అనేది ఊరికే రాదు. ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టం ఉంటుందనేది గుర్తు పెట్టుకోవాలి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి.అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..ఇంట్లో అందరూ సైన్స్ పై ఎక్కువగా ఇష్టం.. తనకు మాత్రం మ్యాథ్స్‌పై ఇష్టం ఎక్కువ. తనకు చిన్నప్పటి నుంచే లీడర్ షిప్ లక్షణాలపై ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది. ఒక ఉన్నత స్థానంలో ఉంటేనే ప్రజాసేవ చేయగలుగుతామనే ఆలోచన, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పిన మాట లు మ్యాథ్స్ ఉన్న ఇంట్రెస్ట్‌తోనే ఐఏఎస్ సాధించేలా చేశాయి. ప్రైవేటుగా ఉండి ఎంత సంపాదించినా సరైన విధంగా ప్రజాసేవ సాధ్యం కాదు. అందుకే ఉన్నతమైన ఐఏఎస్‌ను సాధించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో ట్రైనీగా, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జోగులాంబ కలెక్టర్‌గా నిర్వహించి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు.భార్యాభర్తలిద్దరూ కలెక్టర్లువల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. భర్త ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరికి పాప(ఆర్యన్) ఉంది. -
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
-
కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల..
సూర్యపేట: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్‌జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. ఇవి చదవండి: New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం! -
9 రోజుల్లో తీసిన 'క్రాంతి' సినిమా రివ్యూ
టైటిల్: క్రాంతి నటీనటులు: రాకేందు మౌళి, ఇనయ సుల్తానా, శ్రావణి, యమునా శ్రీనిధి, కార్తిక్, భవాని తదితరులు డైరెక్టర్: వి.భీమ శంకర్ ఎడిటర్: కేసీ హరి మ్యూజిక్ డైరెక్టర్: గ్యాన్ సింగ్ సినిమాటోగ్రాఫర్: కిషోర్ బొయిదాపు ప్రొడ్యూసర్: భార్గవ్ మన్నె బ్యానర్: స్వాతి పిక్చర్స్ విడుదల తేదీ: మార్చి 3, 2023 రాకేందు మౌళి నటుడు మాత్రమే కాదు సింగర్, రైటర్, లిరిసిస్ట్ కూడా! నిఖిల్ 'కిరిక్ పార్టీ', నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', సూపర్ ఓవర్ సినిమాల్లో అతడు సపోర్టింగ్ యాక్టర్ గా చేసి మెప్పించాడు. అటు హీరో గాను కొన్ని సినిమాలు చేశాడు. తాజాగా ఆయన వి. భీమ శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'క్రాంతి'. భార్గవ్ మన్నే నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో మార్చి 3న విడుదలైంది. మరి ఈ సినిమా జనాలను ఏమేరకు మెప్పించిందో చూద్దాం.. కథ 'రామ్'(రాకేందు మౌళి) చురుగ్గా ఉండే వ్యక్తి. భవిష్యత్తులో పోలీస్ కావాలనేదే తన లక్ష్యం. రామ్ ప్రేయసి 'సంధ్య'(ఇనయా సుల్తానా) తన తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడమని కోరుతుంది. పెళ్లి సంబంధం కోసం బయలుదేరిన రామ్.. సంధ్య మృతదేహం చూసి తల్లడిల్లిపోతాడు. కట్ చేస్తే ఏడాది తరువాత 'రామ్ కుటుంబానికి' తెలిసిన 'రమ్య' (శ్రావణి) అమ్మాయి మిస్ అవుతుంది. ఒకప్పుడు ఆమె రామ్ చేతికి రాఖీ కూడా కట్టింది. అప్పటికే కొంత మంది అమ్మాయిలు కాకినాడలో కనిపించడం లేదని కంప్లైంట్స్ వస్తాయి. ఆ విషయం తెలిసిన రామ్ ఏం చేశాడు? మహిళలు ఎలా మిస్ అవ్వుతున్నారు? ఈ మిస్సింగ్ కేసుల వెనుక పెద్ద మనుషులు ఎవ్వరైనా ఉన్నారా? అనేది మిగతా సినిమా. విశ్లేషణ గత కొన్ని సంవత్సరాలు నుంచి ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎన్ని థ్రిల్లర్ సినిమాలు వచ్చినా సగటు ఆడియన్ను మెప్పించడం అంటే అంత ఆషామాషీ కాదు. పైగా వెబ్ సిరీస్‌లకు అలవాటు పడిన ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటున్నారు. క్రాంతి ప్రారంభ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపించినా, ఎప్పుడైతే హీరో రామ్(రాకేందు మౌళి) రమ్య మిస్సింగ్ కేసు ప్రారంబిస్తాడో కథలో వేగం మొదలవుతుంది. అక్కడక్కడా వచ్చే సెన్సిటివ్ డైలాగ్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా 'కడుపు నొప్పి వస్తే కంగారు పడే మగాడు గొప్పా? పురిటినొప్పులు భరించే ఆడది గొప్పా?' వంటి డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి. 'క్రాంతి' సినిమాలోని ఎమోషన్స్ పర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం బాగుంటుంది. దర్శకుడు 'భీమ శంకర్' ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ పలు సన్నివేశాల్లో బడ్జెట్ పరంగా రాజీ పడ్డాడని అనిపిస్తోంది. పైగా తొమ్మిది రోజుల్లోనే ఇంత అవుట్‌పుట్ ఇచ్చాడు. అలాగే కొన్ని సీన్స్‌లో కాస్త తడబడినట్టు అనిపించినా కథను చెప్పడంలో డైరెక్టర్ కొంత సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి తన అనుభవాన్నంతా రామ్ పాత్రలో కనిపించేలా చేశాడు. ఇనయ సుల్తానా మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చాలా సాంప్రదాయంగా పక్కింటి అమ్మాయి పాత్రలో గుర్తుండిపోయేలా నటించింది. శ్రావణి శెట్టి, యమునా శ్రీనిధి తమ పాత్రల పరిధి మేర నటించారు. తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వొచ్చు అని ఈ సినిమాతో దర్శకుడు ప్రూవ్ చేశాడు. కానీ కాస్త ఎక్కువ సమయం తీసుకునైనా కొన్ని సీన్ల మీద మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది. 'గ్యాన్ సింగ్' ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ కిషోర్ బొయిదాపు మంచి విజువల్స్ అందించాడు. కేసీ హరి ఎడిటింగ్‌కు ఇంకాస్త పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు మరింత మెరుగ్గా ఉండాల్సింది. -
అమెరికాలో రోడ్డుప్రమాదం.. అన్నారం యువకుడి మృతి
సాక్షి, మిర్యాలగూడ టౌన్: అమెరికాలో ఈనెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి(24) మృతిచెందడంతో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి–అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు సారెడ్డి చంద్రకాంత్‌రెడ్డి, సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు క్రాంతికిరణ్‌రెడ్డి హైదరాబాద్‌లోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీ.టెక్ పూర్తి చేశాడు. అదే సమయంలో టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు 2021 జూలై 23వ తేదీన సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి వెళ్లాడు. ఆ తర్వాత తన అన్న సారెడ్డి చంద్రకాంత్‌రెడ్డి 2021 నవంబర్‌లో వెళ్లాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే దగ్గర ఉంటూ ఎంఎస్ చదువుతున్నారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు ఈ నెల 7వ తేదీన తన స్నేహితులతో కలిసి క్రాంతికిరణ్‌రెడ్డి బయటికి వెళ్లగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయాన్ని వెంటనే చెబితే తన తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని భయపడి.. అన్న చంద్రకాంత్‌రెడ్డి మంగళవారం ఈ సమాచారం అందించాడు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పరిసరాల ప్రజలు పెద్దఎత్తున వారి ఇంటికి తరలివచ్చారు. తల్లి అరుణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. చదవండి: (పెళ్లి సంబధాలను చేడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని..) మా కుమారుడి మృతదేహాన్ని తీసుకురండి.. క్రాంతికిరణ్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మృతుడి తల్లిదండ్రులు సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. తన కుమారుడి మృతదేహాన్ని తమకు అప్పగిస్తే కళ్లారా చూసుకుంటామని బోరునవిలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు స్పందించి విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మృతదేహం తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని తెలిపారు. -
పాములను పట్టేందుకు సొంత ఖర్చులతో
పాము కనపడగానే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో దానిని చంపేయాలని చూస్తాం. మరోవైపు పాము కాటుకు అనేక మంది మృత్యువాత పడుతుండటం చూస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి అనే యువకుడికి పాము నుంచి మనిషికి, మనిషి నుంచి పాముకు రక్షణ కల్పించాలనే ఆలోచన కలిగింది. దీంతో అతను స్నేక్ సేవియర్‌గా మారాడు. జంగారెడ్డిగూడెం: క్రాంతి జనావాసాల మధ్యకు వచ్చిన వేలల్లో పాములను పట్టుకుని రక్షించాడు. ఇతను స్నేక్ సేవియర్స్ సొసైటీ స్థాపించి నాలుగేళ్లు పూర్తయింది. క్రాంతి ప్రస్థానాన్ని చూస్తే.. పేరంపేటకు చెందిన కూలీలైన చదలవాడ రాజారావు, వెంకాయమ్మ దంపతుల కుమారుడు క్రాంతికుమార్. తల్లితండ్రుల అండతో అతను బీఎస్సీ పూర్తిచేశాడు. చిన్ననాటి నుంచి వన్య ప్రాణులపై మక్కువ ఎక్కువ. దీంతో 2008లో పాములను పట్టుకోవటంలో శిక్షణ పొందాడు. శిక్షణ అనంతరం విశాఖపట్టణంలోని స్నేక్ సేవియర్స్ సొసైటీలో పాములపై పరిశోధన చేశాడు. అతి తక్కువ కాలంలోనే పాములను సురక్షితంగా పట్టుకోవడంలో అనుభవం గడించాడు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా ప్రజలు వారి ప్రాణాలు ఎలా రక్షించుకోవచ్చనే విషయంపై అనేక గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాడు. 2016 డిసెంబర్ 30న స్నేక్ సేవియర్స్ సొసైటీని క్రాంతి స్థాపించారు. ఇప్పటివరకు అతను జనావాసాలు, ఇళ్లలోకి వచ్చిన 10,900 పాములను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. జిల్లాలో అనేక మండలాల్లో ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాము కనిపిస్తే గుర్తుకొచ్చేది క్రాంతి పేరు. ఫోన్ చేయగానే ఆ ప్రాంతానికి వెళ్లి పామును పట్టుకుని అటవీ శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమక్షంలో అటవీ ప్రాంతాల్లో విడిచి పెడుతుంటాడు. దూర ప్రాంతాలకు పాములను పట్టేందుకు సొంత ఖర్చులతో వెళుతుంటాడు. పామును పట్టినందుకు ఫోన్ చేసిన వ్యక్తులు ఖర్చులకు డబ్బులు ఇస్తే తీసుకుంటాడేగానీ డిమాండ్ మాత్రం చేయడు. క్రాంతి చేస్తున్న ఈ పనికి ప్రజలతోపాటు అటవీశాఖాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. స్నేక్ సేవియర్స్ సొసైటీ వార్షికోత్సవంలో భాగంగా పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతున్నాడు క్రాంతి. కార్యాలయానికి స్థలం కేటాయించండి ఆర్థిక వనరుల విషయంలో స్నేక్ సేవియర్స్ సొసైటీకి ఇబ్బందులున్నా అధిగమిస్తూనే ఇంతకాలం సంస్థను ముందుకు తీసుకెళుతున్నాం. ప్రభుత్వ సహకారం ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందించటానికి సిద్ధంగా ఉన్నా. స్నేక్ సేవియర్స్ సొసైటీ కార్యాలయ భవనానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నా. కార్యాలయం ఏర్పడితే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. పాము కనిపిస్తే 83869 84869, 80998 55153 నంబర్లకు ఫోన్ చేయండి. – చదలవాడ క్రాంతి, డైరెక్టర్, స్నేక్ సేవియర్స్ సొసైటీ -
దర్శకత్వం అంటే పిచ్చి
క్రాంతి, కె. సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పిచ్చోడు’. హేమంత్ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ –‘‘మాది కామారెడ్డి. ఇంతకుముందు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాను. దర్శకుడిగా ఇదే నా తొలి సినిమా. జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిని ఇష్టాన్ని మించి ప్రేమిస్తారు. నాకు డైరెక్షన్ అంటే పిచ్చి. మా సినిమాలో హీరోకి తన కోసం పుట్టిన సోల్‌మేట్‌ను వెతుక్కోవడమే పిచ్చి. అందుకే ‘పిచ్చోడు’ అనే టైటిల్ పెట్టాం. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించాను. ప్రేక్షకులకు చిన్న సందేశం కూడా ఉంది. ఈ సినిమా నిర్మాణంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది. కొన్ని కథలు రాసుకుంటున్నాను. ఓ మల్టీస్టారర్ కథ కూడా ఉంది’’ అని అన్నారు. -
ముక్కోణపు ప్రేమకథ
క్రాంతి, పృథ్వీ హీరోలుగా, అవంతిక హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎటువైపో నీ పరుగు’. మద్దినేని రమేష్ బాబు దర్శకత్వంలో సాయిశాన్వి క్రియేషన్స్ పతాకంపై వి.అలేఖ్య, పి.రాంబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై తీసిన తొలి సన్నివేశానికి నిర్మాత దామోదరప్రసాద్, డైరెక్టర్ శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు క్లాప్ ఇచ్చారు. మరో దర్శకుడు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. మద్దినేని రమేష్ బాబు మాట్లాడుతూ– ‘‘ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి మధ్య సాగే ముక్కోణపు ప్రేమకథా థ్రిల్లర్ చిత్రమిది. హైదరాబాద్, వైజాగ్‌లలో షూటింగ్ జరుపుతాం. డిసెంబర్‌కి చిత్రీకరణ పూర్తిచేసి, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ‘‘మంచి కథాబలం ఉన్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు పృ«థ్వీ, క్రాంతి. అవంతిక, చదలవాడ శ్రీనివాసరావు, పోకూరి బాబూరావు, కల్యాణ్‌కృష్ణ, టి.ప్రసన్నకుమార్, సంగీత దర్శకుడు వి.కిరణ్ కుమార్, మాటల రచయితలలో ఒకరైన శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ మన్నం. -
సొమ్ము కేంద్రానిది.. సోకు కేసీఆర్‌ది
పెద్దపల్లిటౌన్: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను దారి మళ్లీస్తూ తానే అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అక్కెపల్లి క్రాంతి అన్నారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమానికి ఆయుశ్మాన్ భవా పేరుతో నూతన ఉచిత బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా కుటుంబం మొత్తానికి వర్తించేలా సుమారు ఐదు లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుందన్నారు. ఈ పథకంలో లబ్ధిదారుల తరపున కేంద్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తోందన్నారు. పొగరహిత వంటలతో గ్రామీణ మహిళలు ఆరోగ్య రక్షణ కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలందరి సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అధిక నిధులను అందిస్తుండగా, కేసీఆర్ ప్రభుత్వం ప్రచార ఆర్బాటాల్లో మునిగి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కేంద్రం అందిస్తున్న పథకాలు, నిధులపై గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పించి, వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఆయన వెంట నాయకులు ఎర్రోళ్ల శ్రీకాంత్, యాంసాని వేణు, జంగ శ్రీనివాస్‌రెడ్డి, ముప్పిడి సమ్మయ్య, తూముల మల్లారెడ్డి, సిలివేరు మధు, కీర్తి శ్రీనివాస్, బుషనవేని వేణు తదితరులు ఉన్నారు. -
క్రాంతీభవ
గురి తప్పడం మంచిదే. మళ్లీ సరిగా గురి చూడటం తెలుస్తుంది. ఒక్కసారి విఫలమైతే అంతా అయిపోయినట్టు కాదు. పర్వత పాదానికి చేరడం అంటే శిఖరం అందినట్టు కాదు. క్రాంతి ఐ.ఏ.ఎస్ కావాలనుకుంది. రెండుసార్లు తక్కువ ర్యాంకులొచ్చి రెండు పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. కాని తను ఐ.ఏ.ఎస్ కాదల్చుకుంది. మూడవసారి కచ్చితంగా అయ్యే తీరింది. యంగ్ ఐ.ఏ.ఎస్. వల్లూరు క్రాంతిరెడ్డితో సాక్షి ఎక్స్‌క్లూజివ్. వల్లూరు క్రాంతి ఎనిమిది నెలల కిందట తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాకు వచ్చారు. వచ్చిన కొత్తలో ఎవరో ట్రైనీ కలెక్టరట అని అందరూ అనుకున్నారు కానీ నిత్యం జిల్లాలో ఏదో ఒక మండలానికి వెళ్తూ తన శిక్షణలో భాగంగా కొత్త అంశాలను నేర్చుకుంటూ స్థానిక ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొత్త విషయాలను చెబుతున్న ఆమెను చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఐఐటీ చదివినా, పాతికేళ్లు నిండకముందే ఐఏఎస్ సాధించినా నిరాడంబరంగా కనిపిస్తూ వృత్తిగతమైన స్థిరచిత్తాన్ని ప్రదర్శిస్తున్న వల్లూరు క్రాంతిరెడ్డితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే... ముందుగా కుటుంబం గురించి.. నేను పుట్టి పెరిగింది కర్నూలులో. అమ్మ వల్లూరు లక్ష్మి, నాన్న రంగారెడ్డి. వీళ్లిద్దరూ డాక్టర్లే. మా అక్కయ్య నీలిమకూడా డాక్టరే. అమ్మ నాన్న కర్నూలులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కయ్య మాత్రం అమెరికాలో ఉంది. టెన్త్‌క్లాస్ వరకు కర్నూలులోనే. ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తిచేశాను. ఇంట్లో అందరూ వైద్యులే అయినా నేను ఆ వైపుగా ఆలోచించలేదు. నాన్న ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలంటే ఐఏఎస్ సాధించాలని చెబుతుండేవారు. ఆ క్రమంలో ఇంటర్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులో చేరిపోయాను. అలా ఐఐటీలో సీటు సాధించడం.. ప్రతిష్టాత్మక ఢిల్లీ ఐఐటీలో చదవడం జరిగిపోయాయి. నాన్న మాటలే నడిపించాయి.. ఐఐటీలో ఉన్నప్పుడే ‘నెక్ట్స్ ఏంటీ..’ అన్న నాన్న మాటలు గుర్తుకు వచ్చేవి. శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని అనేవారు. నాన్న మాటలే నన్ను ఐఏఎస్ ప్రిపరేషన్‌కు సిద్ధం చేశాయి. ఢిల్లీలో ఉన్నప్పుడే సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. అక్కడి శ్రీరామ్ ఇన్స్టిట్యూట్లో ఆరునెలలు కోచింగ్ తీసుకున్నాను. అందులో చాలా అనుభవజ్ఞులైన మన తెలుగువాళ్లే ఎక్కువగా పాఠాలు చెప్పేవారు. ఆరునెలల్లో సివిల్స్‌పై ఓ అవగాహన వచ్చింది. ఆ తర్వాత కోచింగ్ మానేసి, సొంతగా ప్రిపరేషన్ మొదలు పెట్టాను. రెండుసార్లు ఓడిపోయినా.. తొలిసారి 2013లో రాసిన సివిల్స్‌లో 562 ర్యాంకు వచ్చింది. దీంతో ఐఆర్టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)లో జాబ్ పొందాను. ఇందులో జాయిన్ కావడంతో పాటు వడోదర, లక్నోల్లో ట్రైనింగ్ కూడా పూర్తి చేశాను. మళ్లీ రెండోసారి 2014లో సివిల్స్ యుద్ధంలో పాల్గొన్నాను. ఈసారి 230 ర్యాంక్ సాధించాను. కానీ ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. లక్ష్యసాధనలో రెండుసార్లూ ఓడిపోయినా ఐఏఎస్ కోసం 2015లో మళ్లీ సిద్ధమయ్యాను. ఈసారి గురి తప్పలేదు. ఏకంగా 65వ ర్యాంకు వచ్చింది. నా లక్ష్యం నెరవేరింది. 2016లో ప్రకటించిన ఫలితాల్లో 24 ఏళ్లకే ఐఏఎస్‌గా ఎంపికయ్యాను. ఇక ఐఏఎస్ కోసం ముస్సోరిలో చేసిన శిక్షణ ఓ అద్భుతంగా చెప్పవచ్చు. జీవితంలో దేనినైనా ఎదుర్కొనే తత్వాన్ని నేర్పించారు. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో చూపించారు. కొండలు, గుట్టలు ఎక్కేందుకు ట్రెక్కింగ్ నేర్పించారు. పచ్చని అడవుల్లో గంటల పాటు నడవడం చేయించారు. ఇలా ఎన్నో అనుభవాల సమాహారం. ‘భారత్ దర్శన్’లో భాగంగా ఎల్.ఓ.సికి వెళ్లి సైనికులను కలవడం గొప్ప అనుభవం. జిల్లాకు రావడం అదృష్టం.. తెలంగాణ క్యాడర్ కేటాయించిన తర్వాత శిక్షణ కోసం నిర్మల్‌కు రావడం అదృష్టంగా భావిస్తుంటాను. కర్నూలులో పుట్టి పెరిగిన నాకు నిర్మల్ అంటే అప్పట్లో తెలియదు. శిక్షణ కోసం కేటాయించగానే నిర్మల్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. పక్కనే ఉన్న మంచిర్యాలలో ఫ్రెండ్ జాబ్ చేస్తుండటంతో తన ద్వారా వివరాలు సేకరించాను. తను చెప్పినట్లుగానే ఇక్కడ నిర్మలత్వం కనిపిస్తోంది. ప్రజల సహకారం చాలా బాగుంది. సాదాసీదాగా తమ పని తాము చేసుకుంటూ కష్టపడేతత్వం ఆకట్టుకుంటుంది. మొత్తం శిక్షణలో భాగంగా జిల్లాలోని దాదాపు అన్ని మండలాలకు వెళ్తున్నాను. ఒక్కోవారం ఒక్కో డిపార్ట్మెంట్కు సంబంధించిన పనుల గురించి పరిశీలిస్తున్నాను. దాదాపు అన్ని శాఖలూ బాగానే ఉన్నాయి. ఆటలన్నా.. తెలంగాణ పాటలన్నా.. నాకు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటలు ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువగా బాస్కెట్‌బాల్ ఆడేదాన్ని. ఆ తర్వాత టెన్నిస్.. ఇప్పుడు బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నాను. ఆటలతో పాటు ప్రముఖుల బయోగ్రఫీ పుస్తకాలను చదవడం ఇష్టం. నాకు చాలా నచ్చేవంటే తెలంగాణ పాటలు. ఉద్యమం నేపథ్యంలో, సంస్కృతిపైనా వచ్చిన జానపద పాటలు చాలా బాగుంటాయి. మా రాయలసీమ సంస్కృతికి ఇక్కడి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. తెలంగాణ మహిళలు ఆటపాటలతో ఆడే బతుకమ్మ చాలా బాగుంటుంది. నేను వరంగల్ వెళ్లినప్పుడు అక్కడ బతుకమ్మ ఆడాను. బాలికావిద్య..వైద్యానికి ప్రాధాన్యం.. ఐఏఎస్ సాధించిన తర్వాత ప్రజాసేవలో భాగంగా నాకంటూ నిర్ధేశించుకున్న లక్ష్యాలు బాలికావిద్య, వైద్యం, ఉపాధి కల్పన అంశాలు. బాలికలకు విద్యను అందించడం చాలా అవసరం. అలాగే ప్రజలందరికీ వైద్యం తప్పనిసరి. అలాగే యువతకు ఉపాధి చూపాలన్న లక్ష్యాన్నీ నిర్దేశించుకున్నాను. జిల్లాలో ప్రధానంగా పర్యాటకాభివృద్ధికి చాలా ఆస్కారం ఉంది. పాజిటివ్ మైండ్‌సెట్‌తో చదవాలి.. రెండుసార్లు లక్ష్యసాధనలో ఓడిపోయినా.. నన్ను నిలబెట్టింది పాజిటివ్ మైండ్‌సెట్. సానుకూల దృక్పథం ఉంటేనే ఏదైనా సాధించగలం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇదే దృక్పథంతో ఉండాలి. ఓటమిని తట్టుకుని విజయం సాధించే వరకు మొండిగా పోరాటం సాగించాలి. ఆల్ ది బెస్ట్. సంక్రాంతి శుభాకాంక్షలు. – రాసం శ్రీధర్, నిర్మల్ -
క్వార్టర్స్‌లో క్రాంతి, శ్యామ్
సాక్షి, విశాఖపట్నం: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కె.క్రాంతి... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో క్రాంతి 5–0తో వీర్ సింగ్ (హిమాచల్‌ప్రదేశ్)పై గెలుపొందగా... శ్యామ్ 4–1తో హిమాంశు శర్మ (పంజాబ్)ను ఓడించాడు. 60 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వి.దుర్గా రావు (ఆంధ్రప్రదేశ్) 3–2తో సచిన్ (చండీగఢ్)పై నెగ్గగా... వన్‌లాల్‌రియత్‌కిమా (మిజోరం) చేతిలో లలిత్ కిశోర్ (తెలంగాణ) ఓడిపోయాడు. -
బెయిల్‌పై నయీం అనుచరుడి విడుదల
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు నగేష్ అలియాస్ క్రాంతి శనివారం ఉదయం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. నయీం ఎన్కౌంటర్ అనంతరం ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు నేత కొనపురి రాములు, జడల నాగరాజు, పోచయ్య తదితర హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. ఇతనిపై 45 కేసులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో దుబ్బాక ఏరియా మావోయిస్టు కమాండర్ గా పనిచేసిన నగేష్ 1996లో పోలీసులకు లొంగిపోయాడు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
జమ్మికుంట: గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న క్రాంతి(25), శ్రీనివాస్(23) బైక్ పై వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వారధి మూవీ స్టిల్స్
-
'వారధి' మూవీ ట్రైలర్ లాంచ్..!
-
'ఆ ఐదుగురు' మూవీ ట్రైలర్ లాంచ్
-
జగమే మాయ
‘జగమే మాయ...’ పేరుతో శ్రీ సాయి తిరుమల ప్రొడక్షన్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. జాహ్నవి కటకం సమర్పణలో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ప్రసాద్ ఉప్పుటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 6న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘కామెడీ, యాక్షన్ సమాహారంతో సాగే సినిమా ఇది. ‘జగమే మాయ’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటలు, సినిమా కూడా అందరి ఆదరణ పొందుతాయనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. శివబాలాజీ, సిద్ధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: షాబీర్ షా, లైన్ ప్రొడ్యూసర్: భీమనేని తిరుపతిరాయుడు.