Rakendu Mouli Kranthi Movie Review In Telugu - Sakshi
Sakshi News home page

Kranthi Movie Review: క్రాంతి సినిమా రివ్యూ

Published Fri, Mar 3 2023 8:22 PM | Last Updated on Fri, Mar 3 2023 8:35 PM

Rakendu Mouli Kranthi Movie Review In Telugu - Sakshi

టైటిల్: క్రాంతి
నటీనటులు: రాకేందు మౌళి, ఇనయ సుల్తానా, శ్రావణి, యమునా శ్రీనిధి, కార్తిక్, భవాని తదితరులు 
డైరెక్టర్: వి.భీమ శంకర్
ఎడిటర్: కేసీ హరి
మ్యూజిక్ డైరెక్టర్: గ్యాన్ సింగ్  
సినిమాటోగ్రాఫర్: కిషోర్ బొయిదాపు 
ప్రొడ్యూసర్: భార్గవ్ మన్నె  
బ్యానర్: స్వాతి పిక్చర్స్
విడుదల తేదీ: మార్చి 3, 2023

రాకేందు మౌళి నటుడు మాత్రమే కాదు సింగర్, రైటర్, లిరిసిస్ట్ కూడా! నిఖిల్ 'కిరిక్ పార్టీ', నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', సూపర్ ఓవర్ సినిమాల్లో అతడు సపోర్టింగ్ యాక్టర్ గా చేసి మెప్పించాడు. అటు హీరో గాను కొన్ని సినిమాలు చేశాడు. తాజాగా ఆయన వి. భీమ శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'క్రాంతి'. భార్గవ్ మన్నే నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'ఆహా'లో మార్చి 3న విడుదలైంది. మరి ఈ సినిమా జనాలను ఏమేరకు మెప్పించిందో చూద్దాం..

కథ
'రామ్'(రాకేందు మౌళి) చురుగ్గా ఉండే వ్యక్తి. భవిష్యత్తులో పోలీస్ కావాలనేదే తన లక్ష్యం. రామ్ ప్రేయసి 'సంధ్య'(ఇనయా సుల్తానా) తన తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడమని కోరుతుంది. పెళ్లి సంబంధం కోసం బయలుదేరిన రామ్.. సంధ్య మృతదేహం చూసి తల్లడిల్లిపోతాడు. కట్‌ చేస్తే ఏడాది తరువాత 'రామ్ కుటుంబానికి' తెలిసిన 'రమ్య' (శ్రావణి) అమ్మాయి మిస్ అవుతుంది. ఒకప్పుడు ఆమె రామ్ చేతికి రాఖీ కూడా కట్టింది. అప్పటికే కొంత మంది అమ్మాయిలు కాకినాడలో కనిపించడం లేదని కంప్లైంట్స్ వస్తాయి. ఆ విషయం తెలిసిన రామ్ ఏం చేశాడు? మహిళలు ఎలా మిస్ అవ్వుతున్నారు? ఈ మిస్సింగ్ కేసుల వెనుక పెద్ద మనుషులు ఎవ్వరైనా ఉన్నారా? అనేది మిగతా సినిమా. 

విశ్లేషణ
గత కొన్ని సంవత్సరాలు నుంచి ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎన్ని థ్రిల్లర్ సినిమాలు వచ్చినా సగటు ఆడియన్‌ను మెప్పించడం అంటే అంత ఆషామాషీ కాదు. పైగా వెబ్ సిరీస్‌లకు అలవాటు పడిన ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటున్నారు. క్రాంతి ప్రారంభ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపించినా, ఎప్పుడైతే హీరో రామ్(రాకేందు మౌళి) రమ్య మిస్సింగ్ కేసు ప్రారంబిస్తాడో కథలో వేగం మొదలవుతుంది. అక్కడక్కడా వచ్చే సెన్సిటివ్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతాయి. ముఖ్యంగా 'కడుపు నొప్పి వస్తే కంగారు పడే మగాడు గొప్పా? పురిటినొప్పులు భరించే ఆడది గొప్పా?' వంటి డైలాగులు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. 'క్రాంతి' సినిమాలోని ఎమోషన్స్‌ పర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం బాగుంటుంది. 

దర్శకుడు 'భీమ శంకర్' ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ పలు సన్నివేశాల్లో బడ్జెట్ పరంగా రాజీ పడ్డాడని అనిపిస్తోంది. పైగా తొమ్మిది రోజుల్లోనే ఇంత అవుట్‌పుట్‌ ఇచ్చాడు. అలాగే కొన్ని సీన్స్‌లో కాస్త తడబడినట్టు అనిపించినా కథను చెప్పడంలో డైరెక్టర్ కొంత సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి తన అనుభవాన్నంతా రామ్‌ పాత్రలో కనిపించేలా చేశాడు. ఇనయ సుల్తానా మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చాలా సాంప్రదాయంగా పక్కింటి అమ్మాయి పాత్రలో గుర్తుండిపోయేలా నటించింది. శ్రావణి శెట్టి, యమునా శ్రీనిధి తమ పాత్రల పరిధి మేర నటించారు.

తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ అవుట్‌పుట్‌ ఇవ్వొచ్చు అని ఈ సినిమాతో దర్శకుడు ప్రూవ్ చేశాడు. కానీ కాస్త ఎక్కువ సమయం తీసుకునైనా కొన్ని సీన్ల మీద మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది. 'గ్యాన్ సింగ్' ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ కిషోర్ బొయిదాపు మంచి విజువల్స్‌ అందించాడు. కేసీ హరి ఎడిటింగ్‌కు ఇంకాస్త పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు మరింత మెరుగ్గా ఉండాల్సింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement