Rakendu Mouli
-
'Maa Oori Polimera 2': ‘మా ఊరి పొలిమేర -2’ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
9 రోజుల్లో తీసిన 'క్రాంతి' సినిమా రివ్యూ
టైటిల్: క్రాంతి నటీనటులు: రాకేందు మౌళి, ఇనయ సుల్తానా, శ్రావణి, యమునా శ్రీనిధి, కార్తిక్, భవాని తదితరులు డైరెక్టర్: వి.భీమ శంకర్ ఎడిటర్: కేసీ హరి మ్యూజిక్ డైరెక్టర్: గ్యాన్ సింగ్ సినిమాటోగ్రాఫర్: కిషోర్ బొయిదాపు ప్రొడ్యూసర్: భార్గవ్ మన్నె బ్యానర్: స్వాతి పిక్చర్స్ విడుదల తేదీ: మార్చి 3, 2023 రాకేందు మౌళి నటుడు మాత్రమే కాదు సింగర్, రైటర్, లిరిసిస్ట్ కూడా! నిఖిల్ 'కిరిక్ పార్టీ', నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', సూపర్ ఓవర్ సినిమాల్లో అతడు సపోర్టింగ్ యాక్టర్ గా చేసి మెప్పించాడు. అటు హీరో గాను కొన్ని సినిమాలు చేశాడు. తాజాగా ఆయన వి. భీమ శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'క్రాంతి'. భార్గవ్ మన్నే నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో మార్చి 3న విడుదలైంది. మరి ఈ సినిమా జనాలను ఏమేరకు మెప్పించిందో చూద్దాం.. కథ 'రామ్'(రాకేందు మౌళి) చురుగ్గా ఉండే వ్యక్తి. భవిష్యత్తులో పోలీస్ కావాలనేదే తన లక్ష్యం. రామ్ ప్రేయసి 'సంధ్య'(ఇనయా సుల్తానా) తన తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడమని కోరుతుంది. పెళ్లి సంబంధం కోసం బయలుదేరిన రామ్.. సంధ్య మృతదేహం చూసి తల్లడిల్లిపోతాడు. కట్ చేస్తే ఏడాది తరువాత 'రామ్ కుటుంబానికి' తెలిసిన 'రమ్య' (శ్రావణి) అమ్మాయి మిస్ అవుతుంది. ఒకప్పుడు ఆమె రామ్ చేతికి రాఖీ కూడా కట్టింది. అప్పటికే కొంత మంది అమ్మాయిలు కాకినాడలో కనిపించడం లేదని కంప్లైంట్స్ వస్తాయి. ఆ విషయం తెలిసిన రామ్ ఏం చేశాడు? మహిళలు ఎలా మిస్ అవ్వుతున్నారు? ఈ మిస్సింగ్ కేసుల వెనుక పెద్ద మనుషులు ఎవ్వరైనా ఉన్నారా? అనేది మిగతా సినిమా. విశ్లేషణ గత కొన్ని సంవత్సరాలు నుంచి ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎన్ని థ్రిల్లర్ సినిమాలు వచ్చినా సగటు ఆడియన్ను మెప్పించడం అంటే అంత ఆషామాషీ కాదు. పైగా వెబ్ సిరీస్‌లకు అలవాటు పడిన ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటున్నారు. క్రాంతి ప్రారంభ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపించినా, ఎప్పుడైతే హీరో రామ్(రాకేందు మౌళి) రమ్య మిస్సింగ్ కేసు ప్రారంబిస్తాడో కథలో వేగం మొదలవుతుంది. అక్కడక్కడా వచ్చే సెన్సిటివ్ డైలాగ్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా 'కడుపు నొప్పి వస్తే కంగారు పడే మగాడు గొప్పా? పురిటినొప్పులు భరించే ఆడది గొప్పా?' వంటి డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి. 'క్రాంతి' సినిమాలోని ఎమోషన్స్ పర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం బాగుంటుంది. దర్శకుడు 'భీమ శంకర్' ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ పలు సన్నివేశాల్లో బడ్జెట్ పరంగా రాజీ పడ్డాడని అనిపిస్తోంది. పైగా తొమ్మిది రోజుల్లోనే ఇంత అవుట్‌పుట్ ఇచ్చాడు. అలాగే కొన్ని సీన్స్‌లో కాస్త తడబడినట్టు అనిపించినా కథను చెప్పడంలో డైరెక్టర్ కొంత సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి తన అనుభవాన్నంతా రామ్ పాత్రలో కనిపించేలా చేశాడు. ఇనయ సుల్తానా మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చాలా సాంప్రదాయంగా పక్కింటి అమ్మాయి పాత్రలో గుర్తుండిపోయేలా నటించింది. శ్రావణి శెట్టి, యమునా శ్రీనిధి తమ పాత్రల పరిధి మేర నటించారు. తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వొచ్చు అని ఈ సినిమాతో దర్శకుడు ప్రూవ్ చేశాడు. కానీ కాస్త ఎక్కువ సమయం తీసుకునైనా కొన్ని సీన్ల మీద మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది. 'గ్యాన్ సింగ్' ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ కిషోర్ బొయిదాపు మంచి విజువల్స్ అందించాడు. కేసీ హరి ఎడిటింగ్‌కు ఇంకాస్త పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు మరింత మెరుగ్గా ఉండాల్సింది. -
‘హాఫ్ స్టోరీస్’మూవీ రివ్యూ
టైటిల్ : హాఫ్ స్టోరీస్ నటీ,నటులు: రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, సంపూర్ణేష్ బాబు, కోటి, కంచరపాలెం రాజు, టీఎన్ఆర్ తదితరులు నిర్మాణ సంస్థ: వెన్నెల క్రియేషన్స్ నిర్మాత: యం. సుధాకర్ రెడ్డి దర్శకత్వం : శివ వరప్రసాద్ కె. సంగీతం : కోటి సినిమాటోగ్రఫీ : చైతన్య కందుల ఎడిటర్: సెల్వ కుమార్ విడుదల తేది : జనవరి 7,2022 ఒమిక్రాన్ దెబ్బతో సంక్రాంతి బరిలో నుంచి పెద్ద సినిమాలు తప్పకున్నాయి. దీంతో చిన్న సినిమాలు పుంజుకున్నాయి. విభిన్నమైన కాన్సెప్టులతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అలా ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘హాఫ్ స్టోరీస్’.ఈ మూవీలో రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కోటి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. ఓ మోస్తరు అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హాఫ్ స్టోరీస్’ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కొన్ని కథల, పాత్రల సంకలనమే ‘హాఫ్ స్టోరీస్’కథ. అసిస్టెంట్ డెరెక్టర్‌గా పనిచేసే శివ(రాకెందు మౌళి), తన స్నేహితులు లక్ష్మీ(శ్రీజ), చిన్నా(జబర్దస్థ మహేశ్) మధ్య జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బ్యాంక్ క్యాష్ వ్యాన్ ప్రమాదానికి గురికావడం.. ఆ డబ్బును కాసేయడానికి ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు మోసానికి పాల్పడుతుంటారు. చివరికి ఆ డబ్బులు ఎవరికి సొంతం చేసుకున్నారు? ఆ డబ్బును చేజిక్కుంచుకునే క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ముగ్గురిలో దెయ్యాలు ఎవరు? మనుషులు ఎవరు? ఈ కథలోకి సంపూర్ణేష్ బాబు ఎలా ఎంటర్ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో పాత్రలు అన్ని ఇలా వచ్చి అలా వెళ్తుంటాయి. యువ దర్శకుడు శివగా రాకెందు మౌళి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గౌతమ్‌గా రాజీవ్, చిన్నగా మహేశ్, సినిమా రచయిత సంపూగా సంపూర్ణేశ్ బాబు, రాఘవ్‌గా జెమిని సురేశ్, ఎస్సై శశికాంత్‌గా టీఎన్ఆర్, లక్ష్మీగా శ్రీజ, ఆధ్యాగా అంకిత ఇలా... అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. తెలుగులో దెయ్యాల కాన్సెఫ్ట్‌తో చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో చాలా వరకు హిట్ కొట్టాయి కూడా. ‘హాస్ స్టోరీస్’కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. కథ నేపథ్యం పాతదే అయినప్పటికీ.. చాలా కొత్తగా, డిఫరెంట్‌గా తెరకెక్కించాడు దర్శకుడు శివ వరప్రసాద్. వరుస ట్విస్ట్‌లో సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా నడిపించాడు. శివ అనే అప్‌కమింగ్ డైరెక్టర్ తన స్నేహితులకు స్టోరీ చెప్పడం.. ఆ స్టోరీలో ఇంకో స్టోరీ రావడం..ఇదంతా ఓ బాలుడు సినిమాగా చూడడం.. ఇలా వరుస ట్విస్ట్‌లతో ‘హాఫ్ స్టోరీస్’సినిమా సాగుతుంది. సినిమాలో మనుషులు ఎవరో, దెయ్యాలు ఎవరో తెలియకుండా.. క్షణ క్షణానికి ఓ ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకుడి సీటుకే కడ్డిపడేశాడు. అయితే అది సినిమాకు ఎంత ప్లస్ అయిందే.. అంతే మైనస్ అయింది కూడా. సగటు ప్రేక్షకుడికి సినిమాలోని ట్విస్టులన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. అసలు స్టోరీ ఏంటనేది తెలియక అయోమయానికి గురవుతాడు. అయినప్పటికీ.. సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టించకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అయితే టైటిల్ మాదిరే ఒక్కో స్టోరీని పూర్తిగా చూపించకుండా హాఫ్, హాఫ్‌గా చూపించి.. సగం సినిమా మాత్రమే చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా చేశారు. క్లైమాక్స్‌లో అయినా ఈ ట్విస్ట్‌లన్నింటికీ పుల్‌స్టాఫ్ పెడిగే బాగుండేది. పార్ట్-2 ఉంది కాబట్టి ఆ చిక్కుముడులన్నీ అలానే వదిలేశాడేమో దర్శకుడు. మొత్తగా ఈ సినిమా ఓటీటీలో వెబ్ సిరీస్‌గా వస్తే ఇంకా బాగుండేది. ఇక సాంకేతిక విషయానికొస్తే.. కోటి సంగీతం బాగుంది. ముఖ్యంగా రీ రికార్డింగ్ అదిరిపోయింది. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. చైతన్య కందుల సినిమాటోగ్రఫీ బాగుంది. సెల్వ కుమార్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
అప్పుడే నిండుదనం వస్తుంది
‘‘ఆర్టిస్టులు సినిమా పబ్లిసిటీకి కూడా రావాలి. అప్పుడే సినిమాకు నిండుదనం వస్తుంది. లేకపోతే మన సినిమాను మనమే కిల్ చేసుకున్నవాళ్లం అవుతాం. హరీష్‌కు ఓపిక ఎక్కువ. సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమ కోసమైనా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నటుడు పృథ్వీ. హరీష్ కె.వి దర్శకత్వంలో పృథ్వీ, రాకేందు మౌళి, కల్పిక, కల్యాణ్, కృష్ణభగవాన్, తాగుబోతు రమేష్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో మా అబ్బాయి రాకేందు మౌళి హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా దర్శకుడు హరీష్ తపన ఉన్న వ్యక్తి. చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద హిట్ చేయగలరు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హీరోగా నా తొలి సినిమాలోనే ఇంతమంది ఆర్టిస్టులతో పని చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రాకేందు మౌళి. ‘‘హరీష్ వల్ల ఈ సినిమాలో నాకు మంచి రోల్ వచ్చింది’’ అన్నారు కల్యాణ్. ‘‘మాకు పెద్ద దిక్కు పృ«థ్వీగారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. కోర్టు డ్రామాతో పాటు సినిమాలో మంచి కామెడీ ఉంది’’ అన్నారు హరీష్. -
డిసెంబర్ 29న ‘మై డియర్ మార్తాండం’
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి ప్రధాన పాత్రల్లో కోర్టు రూమ్ డ్రామా కామెడి ఇంటరాగేషన్స్ జోనర్లో తెరకెక్కిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. పృథ్వి కామెడీ టైమింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్రిస్మస్కు సినీ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ ‘మా సినిమా పుల్ లెంగ్త్ కామెడి సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కించాం. చాలా బాగుంటుంది’ అని తెలిపారు. దర్శకుడు హరీష్ కె.వి మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగా వచ్చింది, కోర్టు రూమ్ డ్రామా, కామెడి ఇంటరాగేషన్స్ బ్యాక్ డ్రాప్లో కథ నడుస్తుంది, సినిమాలో పృథ్వి గారి కామెడి చాలా బాగా వచ్చింది, ఈ డిసెంబర్ 29 న వస్తున్నాం. ప్రేక్షకులు ఆధరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు. -
నేను లాయర్ని.. మంచి లాయర్ని కాదు
రచయిత రాకేందు మౌళి హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. హరీష్ కేవీని దర్శకుడిగా పరిచయం చేస్తూ మేజిన్ మూవీ మేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కల్పిక కథానాయిక. రాకేందుమౌళి–కల్పిక–కృష్ణ భగవాన్‌లపై చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి నటి సోనీ చరిష్టా కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) క్లాప్ ఇచ్చారు. నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘మాకొక మంచి లాయర్ కావాలని అడిగితే మీ పేరు చెప్పారు’ అని హీరో, హీరోయిన్ అంటే... ‘అయితే మీకెవరో తప్పు చెప్పారు. నేను లాయర్ని మాత్రమే. మంచి లాయర్ని మాత్రం కాదు’ అంటూ కృష్ణ భగవాన్ చెప్పే సన్నివేశాన్ని మొదటి షాట్‌గా చిత్రీకరించారు. సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ– ‘‘నెల్లూరు నేపథ్యంలో కథ ఉంటుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో సాగే క్రైమ్ కామెడీగా రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘నన్ను, నా కథను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన సయ్యద్ నిజాముద్దీన్‌కి థ్యాంక్స్’’ అన్నారు హరీష్. రాకేందు మౌళి, కల్పిక, నటులు ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీ, కళ్యాణ్ విట్టల (‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్) పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి. -
'మూడు ముక్కల్లో చెప్పాలంటే' మూవీ స్టిల్స్
-
మూడు ముక్కల్లో..
‘మిథునం’ చిత్రంలో ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం, లక్ష్మిల అభినయం దాంపత్య జీవితానికి అద్దం పట్టింది. మళ్లీ ఈ జంట కలిసి నటిస్తున్న చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే..’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ నిర్మాత. మధుమిత దర్శకురాలు. రచయిత వెన్నెలకంటి రెండో తనయుడు రాకేందుమౌళి హీరోగా పరిచయమవుతు న్నారు. అదితి హీరోయిన్. పాటలు మినహా పూర్తయిన ఈ చిత్రం గురించి చరణ్ చెబుతూ -‘‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తమిళంలో నిర్మాతగా నాకిది 8వ చిత్రం. తెలుగులో ఇదే తొలి సినిమా. కథ, కథనాలు ఆసక్తిగా, వినోదాత్మకంగా ఉంటాయి. తమిళంలో మంచి డెరైక్టర్‌గా పేరు సంపాదించిన మధుమిత ఈ చిత్రాన్ని సమర్థంగా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: శ్రీనివాస్, సంగీతం: కార్తికేయమూర్తి.