Half Stories Movie Review And Rating In Telugu, Cast, Highlights - Sakshi
Sakshi News home page

Half Stories Review: ‘హాఫ్‌ స్టోరీస్‌’ మూవీ ఎలా ఉందంటే..?

Jan 7 2022 10:00 PM | Updated on Jan 8 2022 5:01 PM

Half Stories Movie Review And Rating In Telugu - Sakshi

కొన్ని కథల, పాత్రల సంకలనమే ‘హాఫ్‌ స్టోరీస్‌’కథ.  అసిస్టెంట్‌ డెరెక్టర్‌గా పనిచేసే శివ(రాకెందు మౌళి), తన స్నేహితులు లక్ష్మీ(శ్రీజ), చిన్నా(జబర్దస్థ మహేశ్‌) మధ్య జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.

టైటిల్‌ : హాఫ్‌ స్టోరీస్‌
నటీ,నటులు: రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, సంపూర్ణేష్‌ బాబు, కోటి, కంచరపాలెం రాజు, టీఎన్ఆర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: వెన్నెల క్రియేషన్స్
నిర్మాత: యం. సుధాకర్ రెడ్డి  
దర్శకత్వం :  శివ వరప్రసాద్ కె.
సంగీతం : కోటి
సినిమాటోగ్రఫీ : చైతన్య కందుల
ఎడిటర్‌: సెల్వ కుమార్‌
విడుదల తేది : జనవరి 7,2022

ఒమిక్రాన్‌ దెబ్బతో సంక్రాంతి బరిలో నుంచి పెద్ద సినిమాలు తప్పకున్నాయి. దీంతో చిన్న సినిమాలు పుంజుకున్నాయి.  విభిన్నమైన కాన్సెప్టులతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అలా ఢిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘హాఫ్‌ స్టోరీస్‌’.ఈ మూవీలో రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కోటి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. ఓ మోస్తరు అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హాఫ్‌ స్టోరీస్‌’ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
కొన్ని కథల, పాత్రల సంకలనమే ‘హాఫ్‌ స్టోరీస్‌’కథ.  అసిస్టెంట్‌ డెరెక్టర్‌గా పనిచేసే శివ(రాకెందు మౌళి), తన స్నేహితులు లక్ష్మీ(శ్రీజ), చిన్నా(జబర్దస్థ మహేశ్‌) మధ్య జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బ్యాంక్‌ క్యాష్‌ వ్యాన్‌ ప్రమాదానికి గురికావడం.. ఆ డబ్బును కాసేయడానికి ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు మోసానికి పాల్పడుతుంటారు. చివరికి ఆ డబ్బులు ఎవరికి సొంతం చేసుకున్నారు? ఆ డబ్బును చేజిక్కుంచుకునే క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ముగ్గురిలో దెయ్యాలు ఎవరు? మనుషులు ఎవరు? ఈ కథలోకి సంపూర్ణేష్‌ బాబు ఎలా ఎంటర్‌ అయ్యాడు? అనేదే మిగతా కథ. 

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో పాత్రలు అన్ని ఇలా వచ్చి అలా వెళ్తుంటాయి. యువ దర్శకుడు శివగా రాకెందు మౌళి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గౌతమ్‌గా రాజీవ్‌,  చిన్నగా మహేశ్‌, సినిమా రచయిత సంపూగా సంపూర్ణేశ్‌ బాబు,  రాఘవ్‌గా జెమిని సురేశ్‌, ఎస్సై శశికాంత్‌గా టీఎన్‌ఆర్‌, లక్ష్మీగా శ్రీజ, ఆధ్యాగా అంకిత ఇలా... అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

ఎలా ఉందంటే.. 
తెలుగులో దెయ్యాల కాన్సెఫ్ట్‌తో చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో చాలా వరకు హిట్‌ కొట్టాయి కూడా. ‘హాస్‌ స్టోరీస్‌’కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. కథ నేపథ్యం పాతదే అయినప్పటికీ.. చాలా కొత్తగా, డిఫరెంట్‌గా తెరకెక్కించాడు దర్శకుడు శివ వరప్రసాద్. వరుస ట్విస్ట్‌లో సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా నడిపించాడు. శివ అనే అప్‌కమింగ్‌ డైరెక్టర్‌ తన స్నేహితులకు స్టోరీ చెప్పడం.. ఆ స్టోరీలో ఇంకో స్టోరీ రావడం..ఇదంతా ఓ బాలుడు సినిమాగా చూడడం.. ఇలా వరుస ట్విస్ట్‌లతో ‘హాఫ్‌ స్టోరీస్‌’సినిమా సాగుతుంది.  సినిమాలో మనుషులు ఎవరో, దెయ్యాలు ఎవరో తెలియకుండా.. క్షణ క్షణానికి ఓ ట్విస్ట్‌ ఇచ్చి ప్రేక్షకుడి సీటుకే కడ్డిపడేశాడు.

అయితే అది సినిమాకు ఎంత ప్లస్‌ అయిందే.. అంతే మైనస్‌ అయింది కూడా. సగటు ప్రేక్షకుడికి సినిమాలోని ట్విస్టులన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. అసలు స్టోరీ ఏంటనేది తెలియక అయోమయానికి గురవుతాడు. అయినప్పటికీ.. సినిమా మాత్రం ఎక్కడా బోర్‌ కొట్టించకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అయితే టైటిల్‌ మాదిరే ఒక్కో స్టోరీని పూర్తిగా చూపించకుండా హాఫ్‌, హాఫ్‌గా చూపించి.. సగం సినిమా మాత్రమే చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా చేశారు. క్లైమాక్స్‌లో అయినా ఈ ట్విస్ట్‌లన్నింటికీ పుల్‌స్టాఫ్‌ పెడిగే బాగుండేది. పార్ట్‌-2 ఉంది కాబట్టి ఆ చిక్కుముడులన్నీ అలానే వదిలేశాడేమో దర్శకుడు. మొత్తగా ఈ సినిమా ఓటీటీలో వెబ్‌ సిరీస్‌గా వస్తే ఇంకా బాగుండేది. ఇక సాంకేతిక విషయానికొస్తే.. కోటి సంగీతం బాగుంది. ముఖ్యంగా రీ రికార్డింగ్‌ అదిరిపోయింది. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. చైతన్య కందుల సినిమాటోగ్రఫీ బాగుంది. సెల్వ కుమార్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement