Telugu Movie Review
-
'మన్యం ధీరుడు' సినిమా రివ్యూ
బ్రిటీష్ వారి బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈయన జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా, వెండితెరపై చూసినా ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. అలాంటి పాత్రలో రంగస్థల నటుడు ఆర్.వి.వి.సత్యనారాయణ నటించడమే కాకుండా తానే సినిమా నిర్మించారు. మన్యం ధీరుడు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకున్నారో చూసేద్దాం..కథబ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన అల్లూరి సీతారామరాజు వారి తుపాకీ గుళ్లకు బలై నేలకొరిగారు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ పోషించారు. సహజసిద్ధంగా లభించిన భూమిని దుక్కి దున్ని చేసుకుంటున్న మన్యం ప్రజలపై పన్నులు వేసి... బలవంతంగా వసూళ్లను చేయడం అల్లూరి సీతారామరాజు వ్యతిరేకిస్తారు. అందుకు ప్రతిగా బ్రిటీష్ వారు ఎలా స్పందించారు? సీతారామరాజు వారిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి ప్రజల తరఫున పోరాడాడు? స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజలను ఎలా మేలుకొల్పాడు? పేద ప్రజలకు ఉన్న మద్యం సేవించడం తదితర అలవాట్లను ఎలా మాన్పించి వారిని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేశారు? లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.విశ్లేషణటెక్నాలజీ యుగంలో కొట్టుకుపోతున్న యువతకు విప్లవ వీరుల కథలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గతంలో అల్లూరి సీతారామరాజు జీవిత కథను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డులు పొందాయి. అలాంటి మన్యం వీరుడి కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను అపహరించడం... వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడంలాంటి సన్నివేషాలన్నీ ఆడియన్స్‌కు గూస్ బమ్స్ తెప్పిస్తాయి.అలాగే మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఎదిరించడం, బ్రిటీష్ వారి మీద పోరాటం చేసే సన్నివేషాలు మాస్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. సత్యనారాయణ రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ స్పష్టంగా వుంది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా వున్నా... సెకెండాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా పరుగులు పెడుతుంది. జబర్దస్థ్ అప్పారావుతో కాసేపు నవ్వించే ప్రయత్నం చేసినా... ఓ యువజంట ప్రేమాయణం గురించి కథకు అవసరం లేకున్నా బలవంతంగా చొప్పించారనిపిస్తుంది.మద్యపానం సేవించడం సమాజానికి, కుటుంబానికి మంచిది కాదని చెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే స్వాతంత్రం భారతదేశానికి ఎంత అవసరమో... బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు చెప్పడం, వారిని కూడా బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, మన భూమిన మనం దుక్కి దున్నితే... వాళ్లకు ఎందుకు పన్ను కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అంశాలను బాగా చూపించారు.రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ టైటిల్ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గుర్రపుస్వారీ, కత్తియుద్ధం కూడా నేర్చుకుని నటించడం విశేషం. బ్రిటీష్ వారిని ఎదిరించే మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ చివరి దాకా బాగా నటించారు.జబర్దస్థ్ అప్పారావు, సత్తి పండు పాత్రలు కాసేపు ఉన్నా... నవ్విస్తాయి. కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది.ఈ చిత్రంలో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది విలేజ్ సెట్టింగ్. మన్యంలో గూడెం ఎలా వుంటుందో చాలా నేచురల్‌గా వేశారు. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రాంతాల అందాలను కెమెరాలో బంధించారు. అల్లూరి సీతారామరాజు ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. రెండుగంటలలోపే నిడివి వుండటం ఈ సినిమాకి ప్రధాన బలం. డైరెక్టర్ కథను బాగానే డీల్ చేశారు. -
Haseena Movie Review: హసీనా మూవీ రివ్యూ
టైటిల్: హసీనా నటీనటులు: థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట దర్శకుడు: నవీన్ ఇరగాని నిర్మాత: తన్వీర్ ఎండీ ఎడిటర్: హరీశ్ కృష్ణ(చంటి) కెమెరామన్: రామ కందా సంగీత దర్శకుడు: షారుక్ షేక్ నేపథ్య సంగీతం: నవనీత్ చారి ప్రియాంక డే టైటిల్ రోల్లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హసీనా. హసీనా మూవీ పోస్టర్ ని ప్రకాష్ రాజ్, పాటను నిఖిల్, టీజర్‌ను అడివి శేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలా టాలీవుడ్ సెలబ్రిటీలు హసీనా సినిమా కోసం ముందుకు రావడం, ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రం మే 19న రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.. కథ హసీనా (ప్రియాంక డే), థన్వీర్(థన్వీర్), సాయి (సాయితేజ గంజి), శివ (శివ గంగా), ఆకాశ్(ఆకాశ్ లాల్) అనాథలు. అందరూ చిన్నప్పటి నుంచి కలిసి కష్టపడి చదువు పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదిస్తారు. అయితే హసీనా పుట్టినరోజున ఓ చేదు అనుభవం ఏర్పడుతుంది. ఆ చేదు ఘటనతో మిగతా నలుగురి జీవితాలు మలుపులు తిరుగుతాయి. వీరి కథలోకి అభి(అభినవ్) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అభి ఏం చేశాడు? హసీనాకు జరిగిన చేదు ఘటన ఏంటి? నలుగురు స్నేహితులు, హసీనాల ప్లాన్ ఏంటి? కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ అనాథలైన నలుగురు అబ్బాయిలు, ఓ అమ్మాయి చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం, చదవటం, ఉద్యోగం చేయడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ లాక్కొచ్చాడు డైరెక్టర్. ఇంటర్వెల్‌కు ముందు ఓ ట్విస్ట్ పెట్టాడు. ఐదుగురు అనాథలు ఓ కేసులో చిక్కుకుంటారు. అక్కడి నుంచి ఏం జరుగుతుందనేది సెకండాఫ్‌లో చూపించారు. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు ముందుగానే తెలిసిపోతాయి. క్లైమాక్స్ వరకు ఏదో ఒక ట్విస్ట్ వస్తూనే ఉండటంతో ఇన్ని ట్విస్టులా అని ఆశ్చర్యం వేయక మానదు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. మాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. నటీనటులు కొత్తవారే అయినా బాగానే నటించారు. కామెడీ సీన్స్‌లో నవ్విస్తూ, యాక్షన్ సీన్స్‌లో ఫైట్స్ చేస్తూ, ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టిస్తూ అందరూ పర్వాలేదనిపించారు. హసీనా పాత్రలో ప్రియాంక డే చాలా వేరియషన్స్ చూపించింది. అభి పాత్రలో హీరోయిజం, విలనిజం చూపించాడు అభినవ్. చదవండి: ఆర్ఆర్ఆర్ నిర్మాత ఇంట మోగనున్న పెళ్లిబాజాలు -
Meter Movie Review: 'మీటర్' మూవీ రివ్యూ
టైటిల్: మీటర్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, ధనుష్ పవన్ నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు :చిరంజీవి ( చెర్రీ), హేమలత పెదమల్లు దర్శకుడు : రమేష్ కడూరి సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: ఏప్రిల్ 07, 2023 టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2019లో రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. ఇటీవలే వినరో భాగ్యము విష్ణుకథ అంటూ అలరించిన ఈ యంగ్ హీరో మరోసారి 'మీటర్'తో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చాడు. కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన 'మీటర్' ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజైంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు రమేశ్ కడూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. అర్జున్ కల్యాణ్( కిరణ్ అబ్బవరం) తండ్రి ఓ కానిస్టేబుల్. వెంకటరత్నం కానిస్టేబుల్‌గా ఎంతో నిజాయితీగా పనిచేస్తుంటాడు. అందువల్ల డిపార్ట్మెంట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. తన కుమారున్ని ఎప్పటికైనా ఎస్సైగా చూడాలనేదే ఆయన కోరిక. కానీ హీరోకు పోలీస్ జాబ్ చేయడం ఇష్టముండదు. కానీ అనూహ్యంగా ఎస్సై జాబ్‌కు సెలెక్ట్ అయి ఉద్యోగంలో చేరుతాడు. ఎప్పుడెప్పుడు జాబ్ మానేయాలా? అని ఎదురుచూసే అర్జున్‌కు ఊహించని విధంగా మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు వస్తుంది. అదే సమయంలో అబ్బాయిలంటేనే ఇష్టం లేని అతుల్య రవితో అతడికి పరిచయం ఏర్పడుతుంది. అబ్బాయిలంటేనే గిట్టని అమ్మాయిని మన హీరో ఎలా పడగొట్టాడు?ఇష్టంలేని పోలీస్ జాబ్‌లో కొనసాగాడా? హోం మినిస్టర్ కంఠం బైరెడ్డి (ధనుశ్ పవన్)తో హీరోకు వివాదం ఎందుకు మొదలైంది? హోం మినిస్టర్‌తో ఉన్న వివాదం నుంచి అర్జున్ కల్యాణ్ ఎలా బయటపడ్డాడు? మరి చివరికి తండ్రి ఆశయాన్ని హీరో నెరవేర్చాడా? లేదా? అన్నదే అసలు కథ. కథనం ఎలా సాగిందంటే.. కథ విషయానికొస్తే హీరో బాల్యంతో కథ మొదలవుతుంది. చిన్నతనంలోనే ఎస్సై కావాలన్న తండ్రి కోరికను కాదనలేడు.. అలా అని ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. ఈ రెండింటి మధ్యలో హీరో నలిగిపోతుంటాడు. ఇష్టం లేకపోయినా ఎస్సై కావడం, ఆ మధ్యలో హీరోయిన్ అతుల్య రవితో పరిచయం రొటీన్‌గా అనిపిస్తుంది. పోలీస్ కమిషనర్‌గా పోసాని కృష్ణమురళి, హీరోకు మామగా సప్తగిరి కామెడీ ఫస్ట్ హాఫ్‌లో నవ్వులు పూయిస్తాయి. హోం మినిస్టర్ కంఠం బైరెడ్డితో అర్జున్ కల్యాణ్‌కు వివాదం రొడ్డకొట్టుడులా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్‌కు ముందు ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. అలా ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లో కథను అదే కోణంలో తీసుకెళ్లాడు డైరెక్టర్ రమేశ్. కథలో ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. హీరోకు, విలన్‌కు మధ్య సీన్స్ సాదాసీదాగా ఉంటాయి. క్లాస్‌కు భిన్నంగా కిరణ్ అబ్బవరాన్ని మాస్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అలాగే తండ్రి, కుమారుల మధ్య ఎమోషనల్ ఎలిమెంట్స్ కాస్త పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఎలాగైనా సరే మళ్లీ అధికారంలోకి రావాలన్న హోంమినిస్టర్ కంఠం బైరెడ్డితో.. హీరో మధ్య జరిగే సన్నివేశాల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. క్లైమాక్స్ కూడా ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు. కథలో చాలా సన్నివేశాలు లాజిక్ లెస్‌గా అనిపిస్తాయి. కిరణ్ అబ్బవరం డైలాగ్ డెలివరీతో పర్వాలేదనిపించాడు. కామెడీ సన్నివేశాల పరంగా డైరెక్టర్ ఓకే అనిపించాడు. పక్కా కమర్షియల్ మూవీ అయినా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు విఫలమైనట్లు కనిపిస్తోంది. ఎవరెలా చేశారంటే.. హీరో కిరణ్ అబ్బవరం క్లాస్‌కు భిన్నంగా ప్రయత్నించాడు. మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతుల్య రవి తన గ్లామర్, పాటలతో అదరగొట్టింది. సప్తగిరి తన కామెడీతో మరోసారి అలరించాడు. పోసాని కృష్ణమురళి పోలీస్ కమిషనర్ పాత్రలో కామెడీ చేస్తూ అదరగొట్టాడె. విలన్‌గా ధనుశ్ పవన్ ఫర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు బాగానే చేశారు. దర్శకుడు రమేశ్ కథపై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గుట్టుగా ఉన్నాయి. సాయి కార్తీక్ సంగీతం పర్వాలేదు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. -
పరారీ మూవీ రివ్యూ
యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి ప్రత్యూష సమర్పణలో జి.వి.వి.గిరి నిర్మించారు. సాయి శివాజీ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు(మార్చి 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మాత్రం నవ్వించిందో చూద్దాం.. కథ ఒకే కాలేజీలో చదువుకుంటున్న యోగి(యోగీశ్వర్), అతిథి(అతిథి) ప్రేమించుకుంటారు. హీరో తండ్రి(షయాజి షిండే) బడా వ్యాపారవేత్త కావడంతో చాలా తీరిక లేకుండా గడిపేస్తుంటారు. హీరోకి మరో ఇద్దరు స్నేహితులు(జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్) ఉంటారు. అందులో భూపాల్ తన తోటి ఆర్టిస్ట్ శివాని సైనిని ప్రేమిస్తుంటారు. వీరు ఐదు మంది కలిసి అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో యోగి తండ్రి పాండే(మకరంద్ దేశముఖ్ పాండే) కిడ్నాప్ అవుతాడు. మరి యోగి... మర్డర్ మిస్టరీ నుంచి ఎలా బయటపడ్డారు? కిడ్నాప్‌కు గురైన తన తండ్రిని ఎలా విడిపించుకున్నాడు? అతిథితో ప్రేమాయణానికి శుభం కార్డు పడిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! కథ... కథనం విశ్లషణ లవ్ క్రైం కామెడీ థ్రిల్లర్ మూవీస్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. దానికి కావాల్సిన స్క్రీన్ ప్లేను గ్రిప్పింగ్‌గా రాసుకుంటే చాలు. ఆడియన్స్‌ను థియేటర్లో రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా కూర్చోబెట్టవచ్చు. దర్శకుడు సాయి శివాజీ ఈ చిత్రానికి ‘రన్ ఫర్ ఫన్’ అనే క్యాచీ ట్యాగ్ లైన్ పెట్టి... ఈ సినిమాలో హీరో అండ్ బ్యాచ్‌ను ఇంటర్వల్ నుంచి పరుగులు పెట్టిస్తుంటాడు. దానిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వల్ బ్యాంగ్ వరకు సరదాగా కాలేజీ లైఫ్.. ఆ తరువాత అత్తాపురం ఎపిసోడ్‌తో కొంత అడల్ట్ కామెడీతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై మర్డర్ మిస్టరీతో సినిమాని పరుగులు పెట్టించాడు. క్లైమాక్స్ సీన్ బాగుంది. మకరంద్ దేశ్ ముఖ్ పాండే అండ్ బ్యాచ్ తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ నవ్వు తెప్పిస్తాయి. హీరో యోగీశ్వర్ కొత్త కుర్రాడైనా... బాగా నటించాడు. హీరోయిన్ అతిథి పాత్ర పర్వాలేదనిపిస్తుంది. హీరోతో పాటు చేసిన భూపాల్ పాత్ర కూడా ఒకే. అతనికి జోడీగా నటించిన శివాని సైని పాత్ర గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ రఘు కారుమంచి... తన కామెడీ టైమింగ్‌తో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆలీ ఇందులో ఉన్నా సైలెంట్‌గానే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారి పాత్రలో సుమన్, హీరో తండ్రిగా షాయాజీ షిండే పర్ఫెక్ట్గా సూటయ్యారు. బాలీవుడ్ నటుడు, థియేటర్ ఆర్టిస్ట్ మకరంద్ దేశ్ ముఖ్ పాండే... అమ్మాయిలను కిడ్నాప్ చేసి... వ్యభిచారం రొంపిలోకి దింపే కామెడీ విలన్ పాత్రలో బాగా చేశాడు. విలన్ శ్రవణ్ కాసేపే ఉన్నా... తన పాత్ర పరిధి మేరకు నటించాడు. దర్శకుడు సాయి శివాజీ సినిమా ఆద్యంతం నవ్వించారు, కానీ కొన్నిచోట్ల అనవసర సన్నివేశాలు బలవంతంగా జోడించినట్లు అనిపిస్తుంది. గరుడ వేగ అంజి అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం పర్వాలేదు. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ మాసీగా ఉన్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. -
PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ
టైటిల్: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్) సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ ఎడిటర్ : కిరణ్ గంటి విడుదల తేది: మార్చి 17, 2023 Rating: 2.5/5 Phalana Abbayi Phalana Ammayi Review: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవరాల కాంబినేష్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000 నుంచి 2010 మధ్యకాలంలో సాగుతుంది. బీటెక్‌లో జాయిన్ అయిన సంజయ్‌ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే.. అతన్ని సేవ్ చేస్తుంది అనుపమ(మాళవికా నాయర్). అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇక ఎంఎస్ కోసం ఇద్దరు కలిసి యూకేకి వెళ్తారు. అక్కడ ఇద్దరు ప్రేమలో పడతారు. సహజీవనం కూడా చేస్తారు. ఎంఎస్ పూర్తవ్వగానే అనుపమకు వేరే సిటీలో ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసిందని అనుపమపై కోపంగా ఉంటాడు సంజయ్. అదే సమయంలో అతనికి పూజ(మేఘా చౌదరి)దగ్గరవుతుంది. ఆమె కారణంగా సంజయ్, అనుపమల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరు విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పూజ ప్రేమను సంజయ్ అంగీకరించాడా? అనుపమ జీవితంలోకి గిరి(అవసరాల శ్రీనివాస్) ఎలా వచ్చాడు? చివరికి సంజయ్, అనుపమలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా భాషలో కాంబినేషన్ అనే మాటకి విలువెక్కువ. ఓ హీరో, డైరెక్టర్ కలిసి చేసిన సినిమా హిట్ అయితే.. అదే కాంబోలో వస్తున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఆ అంచనాలను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఉహాలు గుస గుస లాడే , జ్యో అచ్యుతానంద’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్యతో కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఆ స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా రొటీన్‌గా కథనం సాగుతుంది. కొన్ని సీన్లలో శ్రీనివాస అవసరాల మార్క్ కామెడీ కనిపిస్తుంది. కానీ మొత్తంగా ఎక్కడో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంతో దర్శకుడు విఫలమయ్యాడు. కాలేజీలో హీరోహీరోయిన్ల స్నేహం.. ప్రేమ.. సహజీవనం తదితర సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ఇద్దరి మధ్య మనస్పర్థలు.. విడిపోవడం.. ఇలా భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. అయితే కలిసి జీవించాలనుకున్న ఈ జంట.. విడిపోవడానికి గల కారణాలను బలంగా చూపించలేకపోయారు. పార్ట్ పార్ట్‌లుగా చూస్తే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం అంతగా మెప్పించదు. ఎవరెలా చేశారంటే... సంజయ్గా నాగశౌర్య మెప్పించాడు. లుక్స్ పరంగా చాలా మార్పులు ఉన్న పాత్ర తనది. ఇలాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాలు.. పాత్రలు నాగశౌర్యకు కొత్తేమి కాదు. గత సినిమాల్లో మాదిరే లవర్ బాయ్‌గా సంజయ్ చక్కగా నటించాడు. ఇక అనుపమగా మాళవికా నాయర్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం వీరిద్దరి పాత్రల చుట్టే తిరుగుతుంది. గిరిగా అవసరాల శ్రీనివాస్ ఉన్నంతలో మెప్పించాడు. వాలెంటైన్ గాఅభిషేక్ మహర్షి తనదైన కామెడీతో నవ్వించాడు, కీర్తిగా శ్రీవిద్య, పూజగా మేఘ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
సస్పెన్స్ థ్రిల్లర్ 'టాక్సీ' రివ్యూ
టైటిల్: టాక్సీ నటీనటులు: వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు దర్శకుడు: హరీశ్ సజ్జా సంగీతం : మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ : ఉరుకుండారెడ్డి విఎఫ్ఎక్స్ : ఆనంద్ పల్లకి ఎడిటర్: టి.సి.ప్రసన్న బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: హరిత సజ్జా విడుదల తేదీ: మార్చి 10, 2023 కథ సైంటిస్ట్ ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు) కాలిఫోర్నియం 252 పై ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాడు. దాన్ని దేశం కోసం ఉపయోగించాలనుకుంటాడు. కాలిఫోర్నియం 252తో భూమి లోతుల్లో ఉన్న బంగారం నిల్వలు కనిపెట్టవచ్చు అని, అప్పుడు మన దేశం నెంబర్ వన్ అవుతుందంటూ గనుల శాఖా మంత్రి ముందు ప్రపోజల్ పెడతాడు. మరిన్ని ప్రయోగాల కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వమని అడుగుతాడు. అయితే కాలిఫోర్నియం 252 ఒక్కో గ్రాము ధర రూ.180 కోట్లు. అంతటి విలువైన సంపదను ఎవరు వదులుకుంటారు? పొలిటీషియన్స్, వారిని అంటిపెట్టుకునే మాఫియా రంగంలోకి దూకుతుంది. ఈశ్వర్ లాంటి నిజాయితీ పరుడిని వంచటం కష్టం. అందుకే అతని కుటుంబంపై కుట్ర పన్నుతారు. అక్కడ నుంచి ఈశ్వర్ పై నేరారోపణలు, అతని భార్య (అల్మాస్ మోటివాలా) మిస్సింగ్ లు జరిగిపోతూ ఉంటాయి. వాటి నుంచి ఈశ్వర్ తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం మొదలెడతాడు. మరో ప్రక్క ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) కు కెరీర్ పరంగా ఎదగటానికి మంచి కాంట్రాక్ట్ వస్తుంది. దాంతో స్నేహితులు, సన్నిహితులు నుంచి అప్పులు చేసి మరీ తన సంస్దను డవలప్ చేస్తూ పై మెట్టు ఎక్కాలనుకుంటాడు. కానీ అనుకోని విధంగా తనకు వచ్చిన కాంట్రాక్ట్ సమస్యల్లో పడటం, ప్రాజెక్టు ఆగిపోవటంతో చివరకు అప్పులపాలవుతాడు. ఇలా వేర్వేరు సమస్యలతో ఉన్న ఈశ్వర్, ఉజ్వల్ అనుకోని పరిస్దితుల్లో ఓ క్యాబ్ ఎక్కుతారు. ఆ క్యాబ్ పై కొందరు ఎటాక్ చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకున్న వీళ్లిద్దరు తమపై ఎటాక్ కు ప్లాన్ చేసింది విద్యుత్ (నవీన్ పండిత) అని తెలుసుకుంటారు. అతనెవరు? వీళ్లిద్దరనీ ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఎటాక్ జరిగిన తర్వాత నుంచి వాళ్ల జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి? మిస్సైపోయిన ఈశ్వర్ భార్య తిరిగి కనపడిందా? అతనిపై పడిన పోలీస్ కేసులు, నేరారోపణలు చివరకు ఏమయ్యాయి? ఈ కథలో టాక్సీ డ్రైవర్ (సద్దాం హుస్సేన్) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ సాధారణంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు అనుమానాస్పద మృతి లేదా యాక్సిడెండ్స్తో మొదలవుతాయి. ట్యాక్సీ కథని కూడా ఒక మిస్టరీతో మొదలుపెట్టాడు దర్శకుడు. హీరో మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేయడం.. ఆ తర్వాత ఓ ఎథికల్ హ్యాకర్ వచ్చి ఈ కథలో జాయిన్ అవడంతో ఈ రెండింటికి మధ్య లింక్ ఉందని ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా టైట్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌లో కొంత పట్టు వదిలినట్లనిపించింది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ తరహాలో ఉండి ఉంటే బాగుండేది. సినిమా క్లైమాక్స్ బాగుంది. సినిమాలోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. 'లవ్ స్టొరీ' చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన బి జె శ్రీధర్ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఫైట్ సీక్వెన్స్‌లు సరిగ్గా సరిపోయాయి. కానీ అన్ని వర్గాల వారిని అలరించాలనుకునే క్రమంతో కావాలని మరీ బలవంతంగా కథలో ఇరికించిన లవ్ సన్నివేశాలే విసిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకు హీరోని సమస్యలో పడేయటం... సెకండ్ హాఫ్ లో ఆ సమస్య నుంచి బయిటపడటానికి అతను ఏం ప్రయత్నం చేశాడు.. ఎలా తన సమస్యలను అధిగమనించాడు? అన్న ధోరణిలో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. అయితే ఇలాంటి కథకు అవసరమైన భారీతనం లోపించినట్లు అనిపిస్తుంది. నటీనటుల పనితీరు హీరోగా చేసిన వసంత్ సమీర్ పిన్నమ రాజు పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మెప్పిస్తుంది. అతని భార్య పాత్రలో అల్మాస్ మోటివాలా చక్కగా నటించింది. సౌమ్య మీనన్ కీలకమైన పాత్రలో మెరిసింది. ఇక ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్ పర్వాలేదనిపించారు. మార్క్ k రాబిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సూటైంది. ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపించింది. -
9 రోజుల్లో తీసిన 'క్రాంతి' సినిమా రివ్యూ
టైటిల్: క్రాంతి నటీనటులు: రాకేందు మౌళి, ఇనయ సుల్తానా, శ్రావణి, యమునా శ్రీనిధి, కార్తిక్, భవాని తదితరులు డైరెక్టర్: వి.భీమ శంకర్ ఎడిటర్: కేసీ హరి మ్యూజిక్ డైరెక్టర్: గ్యాన్ సింగ్ సినిమాటోగ్రాఫర్: కిషోర్ బొయిదాపు ప్రొడ్యూసర్: భార్గవ్ మన్నె బ్యానర్: స్వాతి పిక్చర్స్ విడుదల తేదీ: మార్చి 3, 2023 రాకేందు మౌళి నటుడు మాత్రమే కాదు సింగర్, రైటర్, లిరిసిస్ట్ కూడా! నిఖిల్ 'కిరిక్ పార్టీ', నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', సూపర్ ఓవర్ సినిమాల్లో అతడు సపోర్టింగ్ యాక్టర్ గా చేసి మెప్పించాడు. అటు హీరో గాను కొన్ని సినిమాలు చేశాడు. తాజాగా ఆయన వి. భీమ శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'క్రాంతి'. భార్గవ్ మన్నే నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో మార్చి 3న విడుదలైంది. మరి ఈ సినిమా జనాలను ఏమేరకు మెప్పించిందో చూద్దాం.. కథ 'రామ్'(రాకేందు మౌళి) చురుగ్గా ఉండే వ్యక్తి. భవిష్యత్తులో పోలీస్ కావాలనేదే తన లక్ష్యం. రామ్ ప్రేయసి 'సంధ్య'(ఇనయా సుల్తానా) తన తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడమని కోరుతుంది. పెళ్లి సంబంధం కోసం బయలుదేరిన రామ్.. సంధ్య మృతదేహం చూసి తల్లడిల్లిపోతాడు. కట్ చేస్తే ఏడాది తరువాత 'రామ్ కుటుంబానికి' తెలిసిన 'రమ్య' (శ్రావణి) అమ్మాయి మిస్ అవుతుంది. ఒకప్పుడు ఆమె రామ్ చేతికి రాఖీ కూడా కట్టింది. అప్పటికే కొంత మంది అమ్మాయిలు కాకినాడలో కనిపించడం లేదని కంప్లైంట్స్ వస్తాయి. ఆ విషయం తెలిసిన రామ్ ఏం చేశాడు? మహిళలు ఎలా మిస్ అవ్వుతున్నారు? ఈ మిస్సింగ్ కేసుల వెనుక పెద్ద మనుషులు ఎవ్వరైనా ఉన్నారా? అనేది మిగతా సినిమా. విశ్లేషణ గత కొన్ని సంవత్సరాలు నుంచి ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎన్ని థ్రిల్లర్ సినిమాలు వచ్చినా సగటు ఆడియన్ను మెప్పించడం అంటే అంత ఆషామాషీ కాదు. పైగా వెబ్ సిరీస్‌లకు అలవాటు పడిన ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటున్నారు. క్రాంతి ప్రారంభ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపించినా, ఎప్పుడైతే హీరో రామ్(రాకేందు మౌళి) రమ్య మిస్సింగ్ కేసు ప్రారంబిస్తాడో కథలో వేగం మొదలవుతుంది. అక్కడక్కడా వచ్చే సెన్సిటివ్ డైలాగ్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా 'కడుపు నొప్పి వస్తే కంగారు పడే మగాడు గొప్పా? పురిటినొప్పులు భరించే ఆడది గొప్పా?' వంటి డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి. 'క్రాంతి' సినిమాలోని ఎమోషన్స్ పర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం బాగుంటుంది. దర్శకుడు 'భీమ శంకర్' ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ పలు సన్నివేశాల్లో బడ్జెట్ పరంగా రాజీ పడ్డాడని అనిపిస్తోంది. పైగా తొమ్మిది రోజుల్లోనే ఇంత అవుట్‌పుట్ ఇచ్చాడు. అలాగే కొన్ని సీన్స్‌లో కాస్త తడబడినట్టు అనిపించినా కథను చెప్పడంలో డైరెక్టర్ కొంత సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి తన అనుభవాన్నంతా రామ్ పాత్రలో కనిపించేలా చేశాడు. ఇనయ సుల్తానా మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చాలా సాంప్రదాయంగా పక్కింటి అమ్మాయి పాత్రలో గుర్తుండిపోయేలా నటించింది. శ్రావణి శెట్టి, యమునా శ్రీనిధి తమ పాత్రల పరిధి మేర నటించారు. తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వొచ్చు అని ఈ సినిమాతో దర్శకుడు ప్రూవ్ చేశాడు. కానీ కాస్త ఎక్కువ సమయం తీసుకునైనా కొన్ని సీన్ల మీద మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది. 'గ్యాన్ సింగ్' ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ కిషోర్ బొయిదాపు మంచి విజువల్స్ అందించాడు. కేసీ హరి ఎడిటింగ్‌కు ఇంకాస్త పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు మరింత మెరుగ్గా ఉండాల్సింది. -
‘కళ్యాణం కమనీయం’ మూవీ రివ్యూ
టైటిల్: కళ్యాణం కమనీయం నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు నిర్మాణసంస్థ: యూవీ కాన్సెప్ట్స్ దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ల సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని ఎడిటర్: సత్య జి విడుదల తేది: జనవరి 14, 2023 పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘కళ్యాణం కమనీయం’.సంక్రాంతి సందర్భంగా నేడు(జనవరి 14) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శివ(సంతోష్ శోభన్) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం లేకుండా ఖాలీగా తిరుగుతుంటాడు. జాబ్ కోసం వెతుకున్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రుతి(ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత కూడా శివ ఉద్యోగం చేయడు. శ్రుతి ఒక్కతే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే ఒక రోజు సడన్‌గా శివను ఉద్యోగం చేయమని అడుగుతుంది శ్రుతి. దీంతో కథ మలుపు తిరుగుతుంది. శివ ఉద్యోగం సంపాదించే క్రమంలో ఓ అబద్దం చెబుతాడు. ఆ అబద్దం వారికి ఎన్ని కష్టాలను తెచ్చిపెట్టింది? శ్రుతికి ఆఫీస్‌లో ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఇతరుల కారణంగా వారి వైవాహిక జీవితంలోకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? శివ, శ్రుతిలు ఎందుకు దూరమయ్యారు? చివరకు వారిద్దరు మళ్లీ ఎలా ఒకటయ్యారనేదే మిగతా కథ. కొత్తగా పెళ్లైయిన ఓ జంట చుట్టూ తిరిగే కథే ‘కల్యాణం కమనీయం’. వారిద్దరి వైవాహిక జీవితంలో ఎదురయ్యే సంఘటన నేపథ్యంలో కథనం సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయని, వాటిని భార్యాభర్తలు అనుభవాలుగా స్వీకరించి, కలిసి ముందుకు సాగితేనే ఆ బంధం నిలబడుతుందని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. భార్య భర్తల మధ్య వచ్చే సంఘర్షణలను మాత్రం ఆసక్తిగా రాసుకోలేకపోయాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఉద్యోగం చేసే భార్య, ఖాలీగా ఉండే భర్తల నేపథ్యంలో మరింత కామెడీ, ఎమోషన్ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు అంతగా వాడుకోలేదు. కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా, సాగదీత లేకుండా చూసుకున్నాడు. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ ఇప్పటి జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. సెకండాఫ్‌లో కామెడీ కంటే ఎమోషనల్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. సినిమా నిడివి (109 నిమిషాలు) చాలా తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. కథనం ఆసక్తికరంగా సాగకపోయినా..ఎక్కడా బోర్ కొట్టదు. ప్రస్తుతం తరుణంగా ఈ సినిమా థియేటర్స్ ఆడియన్స్‌ని ఏ మేరకు మెప్పింస్తుందో తెలియదు కానీ.. ఓటీటీ ప్రేక్షకులను మాత్ర కచ్చితంగా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. శివ పాత్రలో సంతోష్ శోభన్ చక్కగా నటించాడు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ, భార్య సంపాదన మీద బతికే కుర్రాడి పాత్రలో మెప్పించాడు. ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని రకాలుగా సంతోష్ శోభన్ ఆకట్టుకున్నాడు. ఇక ప్రియా భవానీ శంకర్ సైతం చక్కగా నటించింది. తెరపై ప్రియా భవానీ కనిపించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. కేదార్ శంకర్, దేవీ ప్రసాద్ తమ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. పవిత్రా లోకేష్ అమ్మగా ఆకట్టుకుంది. సద్దాం, సప్తగిరి నవ్వించారు. సత్యం రాజేష్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ
టైటిల్:వాల్తేరు వీరయ్య నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ యెర్నేని,రవిశంకర్ దర్శకత్వం: కేఎస్ రవీంద్ర(బాబీ) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: ఆర్థన్ ఎ.విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమనే విడుదల తేది: జనవరి 13,2023 గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ‘అన్నయ్య’ తర్వాత మెగాస్టార్‌తో కలిసి రవితేజ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై స్టార్టింగ్ నుంచే హైప్ క్రియేట్ అయింది.దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాస్ సాంగ్, పూనకాలు లోడింగ్ పాటలు జనాల్లోకి విపరీతంగా చొచ్చుకెళ్లాయి. సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి సందర్భంగా నేడు(జనవరి 13)విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కారణమైన డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్( బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్‌ని అట్టి పెట్టుకొని అతని అనయ్య మైఖేల్ సీజర్ అలియాస్ కాలా(ప్రకాశ్ రాజ్)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్ సీజర్కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) గతమేంటి? డ్రగ్స్ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. చిరంజీవి సినిమా అనగానే అభిమానులు కొన్ని లెక్కలేసుకుంటారు. మంచి ఫైట్ సీన్స్, డ్యాన్స్, కామెడీ.. ఇవన్నీ ఉండాలని కోరుకుంటారు. అందుకే కథ ఎలా ఉన్నా.. ఈ హంగులన్నీ పెట్టడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. వాల్తేరు వీరయ్యలో కూడా అవన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు బాబీ. అదిరిపోయే ఇంట్రడక్షన్ సీన్, తన మార్క్ కామెడీ, భారీ యాక్షన్ సీన్లతో కథను తీర్చిదిద్దాడు. అలా అని ఇది కొత్తగా ఉంటుందని చెప్పలేం. ఈ తరహా కథలు టాలీవుడ్లో చాలానే వచ్చాయి. కాకపోతే చిరంజీవి ఇమేజ్‌పై దృష్టి పెట్టి.. దానికి తగ్గట్టుగా సన్నివేశాలు డిజైన్ చేసుకోవడంతో ఎక్కడా బోర్ కొట్టిన ఫీలింగ్ రాదు. అలాగే మాస్ మహారాజ రవితేజ ఉండడం సినిమాకు మరింత ప్లస్ అయింది. పోలీస్ స్టేషన్లోనే పోలీసులను సాల్మన్ అతికిరాతంగా చంపడంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఫస్ట్ సీన్లోనే విలన్ పాత్ర ఎంత కిరాతకంగా ఉండబోతుందో చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత నేవీ దళాన్ని కాపాడడానికి సముద్రంలో వీరయ్య చేసే ఓ భారీ ఫైట్‌తో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. వీరయ్య మలేషియాకు షిఫ్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సాల్మన్‌ని కిడ్నాప్ చేయడానికి వీరయ్య టీమ్ వేసే ప్లాన్ నవ్వులు పూయిస్తుంది. అలాగే శ్రుతీహాసన్‌తో చిరు చేసే రొమాన్స్ అభిమానులను అలరిస్తుంది. కానీ కథనం నెమ్మదిగా సాగిందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుంది. ఇక అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. ఏసీపీ విక్రమ్‌గా రవితేజ ఎంట్రీ, అన్నదమ్ముల మధ్య వచ్చే టిట్ ఫర్ టాట్ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో చిరంజీవి సినిమా డైలాగ్ రవితేజ చెప్పడం.. రవితేజ సినిమా డైలాగ్ చిరంజీవి చెప్పడం నవ్వులు పూయిస్తుంది. అయితే ఇవన్ని ఇలా వచ్చి అలా పోతుంటాయి కానీ.. ఎక్కడా వావ్ మూమెంట్స్‌ని ఇవ్వలేకపోతాయి. అలాగే అన్నదమ్ముల మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందనేది బలంగా చూపించలేకపోయాడు. డ్రగ్స్ పట్టుకునే సీన్స్ కూడా పేలవంగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ కారులో చిరంజీవి, రవితేజ మాట్లాడుకోవడం.. చిరు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురిచేస్తాయి. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా సాగుతుంది. ఎలాంటి ప్రయోగాలకు పోకుండా.. అభిమానులు కోరుకునే అంశాలతో ఓ రొటీన్ కథను అంతే రొటీన్‌గా చెప్పాడు డైరెక్టర్. అయితే చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా సన్నివేశాలు డిజైన్ చేసుకోవడంలో మాత్రం బాబీ సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. చిరంజీవి నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. వీరయ్య పాత్రలో ఆయన జీవించేశాడు. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ని మాస్ లుక్‌లో చూస్తారు. ఒకప్పుడు చిరు చేసే కామెడీ, ఫైట్ సీన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. తెరపై చాలా యంగ్‌గా కనిపిస్తాడు. ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టేశాడు. ఇక ఏసీపీ విక్రమ్‌గా రవితేజ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అదితిగా శ్రుతిహాసన్ ఉన్నంతలో చక్కగా నటించింది. అయితే ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ ఫైట్ సీన్లో మాత్రం అదరగొట్టేసింది. డ్రగ్స్ మాఫియా లీడర్ సాల్మన్ సీజర్గా బాబీ సింహా, అతని సోదరుడు మైఖేల్‌గా ప్రకాశ్ రాజ్ తన పాత్రలకు న్యాయం చేశారు. కానీ వాళ్లది రొటీన్ విలనిజమే. వెన్నెల కిశోర్ కామెడీ పంచ్‌లు బాగున్నాయి. పోలీసు అధికారి సీతాపతిగా రాజేంద్రప్రసాద్‌తో పాటు షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. 'బాస్ పార్టీ' నుంచి 'పూనకాలు లోడింగ్' సాంగ్ వరకు డీఎస్పీ కొట్టిన సాంగ్స్ ఓ ఊపు ఊపేశాయి. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆర్థన్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్ డెస్క్ -
‘18 పేజెస్’ మూవీ ట్విటర్ రివ్యూ
కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యంగ్ హీరో నిఖిల్. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. అదే ఊపుతో ఇప్పుడు ‘18 పేజెస్’ అంటూ ఓ ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ ప్రేమ కథా చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 23) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘18 పెజెస్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #18Pages : the movie has a good story and could have been a great feel good movie. However, the cringe moments in the movie ruined the experience. @actor_Nikhil @anupamahere @aryasukku — Telugu Cinemaalaya (@cinemaalayaa) December 23, 2022 #18Pages 18 Pages - A sweet ❤️ Romantic Entertainer..Good one by Sukumar Writings team..👍 — jayaram abishek (@Jayaram_nikhil_) December 23, 2022 All the best self-made pan india star @actor_Nikhil and #anupama for #18Pages release today. Hope you will get huge BB hit with this, chala days tarvata oka movie release kosam chala exiting ga wait chestuna....🤞🤞❤#sukumarwrittings #geethaarts #18PagesOnDec23 pic.twitter.com/EFI8o68DTv — gang_star_saiyadav (@DHF_nikhil) December 23, 2022 Sure you're all set to startle and treat the audience and fans once again. All the best @RaviTeja_offl garu @aryasukku garu & @actor_Nikhil Best wishes to the teams of #Dhamaka & #18Pages@anupamahere @dirsuryapratap @GA2Official@sreeleela14 @TrinadharaoNak1 @peoplemediafcy pic.twitter.com/D9BCFKwROY — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 22, 2022 #18pages @actor_Nikhil Message to USA Audience Huge Grand Release Ever in Recent times with 355+ locations. Bookings open Now Release by @Radhakrishnaen9 🇺🇸@aryasukku @GeethaArts @anupamahere @dirsuryapratap @GopiSundarOffl @SukumarWritings @GA2Official pic.twitter.com/1WNtBeJkJp — Radhakrishnaentertainments (@Radhakrishnaen9) December 23, 2022 -
Latti Review: ‘లాఠీ’ మూవీ రివ్యూ
టైటిల్: లాఠీ నటీనటులు: విశాల్, సునైన, ప్రభు, మనిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా ఘోషల్ తదితరులు నిర్మాణ సంస్థ: రానా ప్రొడక్షన్స్ నిర్మాతలు: రమణ, నంద దర్శకత్వం: ఎ. వినోద్ కుమార్ సంగీతం: యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: బాలసుబ్రహ్మణ్యం విడుదల తేది: డిసెంబర్ 22,2022 ‘లాఠీ’ కథేంటంటే.. మురళీకృష్ణ(విశాల్) ఓ సిన్సియర్ కానిస్టేబుల్. భార్య కవి(సునైన), కొడుకు రాజునే ప్రపంచంగా బతుకుతాడు. ఓ హత్యాచార కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పై అధికారులు అతన్ని సెస్పెండ్ చేస్తారు. తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మురళీ అధికారుల చుట్టూ తిరుగుతుంటాడు. చివరకు డీఐజీ కమల్(ప్రభు) సాయంతో ఉద్యోగంలో చెరతాడు. ఇకపై ఎవరిని లాఠీతో శిక్షించొద్దని భావించిన మురళీ...సిన్సియర్‌గా తన పని తాను చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతుంటాడు. ఓ సారి డీఐజీ కమల్..తన కస్టడీలో ఉన్న ఓ నేరస్తుడిని లాఠీతో కొట్టమని మురళీని కోరతాడు. తన ఉద్యోగం తిరిగి ఇప్పించాడనే కృతజ్ఞతతో నేరస్తుడు ఎవరనేది చూడకుండా.. అతన్ని లాఠీతో కొడతాడు మురళీ. అయితే ఆ నేరస్తుడు పేరు మోసిన రౌడీ సూరా కొడుకు వీరా అని తర్వాత తెలుస్తుంది. తనను తీవ్రంగా కొట్టిన మురళీపై వీరా పగ పడతాడు. పట్టుకున్న డీఐజీ కమల్ని కాకుండా.. లాఠీతో కొట్టిన మురళి కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అప్పుడు మురళీ కృష్ణ ఏం చేస్తాడు? సూరా, వీరాలనుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ సాధారణ కానిస్టేబుల్ కథే ‘లాఠీ’. పై అధికారుల ఒత్తిడితో ఓ ముఠాతో వైరం పెంచుకొని.. ఆ ముఠా తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తే.. కానిస్టేబుల్ ఒక్కడే తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ స్టోరీ లైన్. పాయింట్ కొత్తగా ఉన్నా.. కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా.. యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ సన్నివేశాలతో చాలా సింపుల్‌గా కథ ముందుకు వెళ్తుంది. ఫస్టాఫ్‌లో ఓ సాధారణ కానిస్టేబుల్ జీవితాన్ని చూపించారు. నిజాయతీగా ఉండే ఓ కానిస్టేబుల్ పై అధికారి చెప్పారని ఓ నేరస్తుడిని కొట్టడం..అతను పై అధికారిపై కాకుండా కానిస్టేబుల్‌పై పగపెంచుకోవడం.. సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌తో అతన్ని గుర్తించడం లాంటి సన్నివేశాల ఫస్టాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం చాలా రొటీన్‌గా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. పోరాట ఘట్టాలు అయినా కొత్తగా ఉంటాయా అంటే అదీ లేదు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకోలేవు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. పోలీసు పాత్రలు విశాల్‌కు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లో పోలీసు పాత్ర పోషించారు. అందుకే కానిస్టేబుల్ మురళీ కృష్ణ పాత్రలో విశాల్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు కానీ అది వర్కౌట్ కాలేదు. కవిత పాత్రకు సునైనా న్యాయం చేసింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ప్రభు, తలైవాసన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక విలన్లు సూరా, వీరలుగా సన్నీ పీఎన్, రమణ జస్ట్ తెరపై విలనిజం పండించడంలో విఫలం అయ్యారు. అయితే ఈ తప్పు వారిది కాదు. ఆ పాత్రలు డిజైన్ చేసిన విధానంలోనే లోపం ఉంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. పీటర్ హెయిన్స్ పోరాట ఘట్టాలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాలసుబ్రహ్మణ్యం పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘శాసనసభ’ మూవీ రివ్యూ
టైటిల్ : శాసనసభ నటీనటులు: ఇంద్రసేన, డా.రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య రాజ్ బకుని, సోనియా అగర్వాల్, హెబ్బా పటేల్, వేణు మండికంటి తదితరులు నిర్మాతలు: తులసీరామ్సాప్పని, షణ్ముగం సాప్పని కథ, స్రీన్‌ప్లే, డైలాగ్స్: రాఘవేంద్రరెడ్డి దర్శకత్వం: వేణు మడికంటి సంగీతం: రవి బసూర్ విడుదలతేది: డిసెంబర్ 16, 2022 అసలు కథేంటంటే: ఓ ఫిక్షనల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా.. ఏ పార్టీకి మెజారిటీ రాదు. ఎలాగైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న అనీష్ కురువిల్లా ప్రయత్నించగా.. ఈ సారి తానే సీఎం అవ్వాలని ప్రతిపక్ష పార్టీ నాయకురాలు సోనియా అగర్వాల్ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో స్వతంత్ర ఎమ్మెల్యేలకు డిమాండ్ ఏర్పడుతుంది. వారిని కొనడం కోసం రెండు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటాయి. అందులో భాగంగా బేరసారాల్లో ఆరితేరిన దుర్గా(అమిత్ తివారి)ని జైలులో చంపాలని ఒకరు.. కాపాడాలని మరొకరు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో దుర్గాని సూర్య(ఇంద్రసేన) కాపాడుతాడు. అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్య ఎవరు? స్వతంత్ర ఎమ్మెల్యేలను సూర్య ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న నారాయణ స్వామి( రాజేంద్రప్రసాద్)తో సూర్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. శాసనసభ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది. జర్నలిస్ట్‌గా, శాటిలైట్ కన్సల్టెంట్‌గా ఎంతో అనుభవం ఉన్న రాఘవేంద్రరెడ్డి పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ కథను రాసుకున్నాడు. రాఘవేంద్రరెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దానిని అనుకున్న విధంగా తెరపై చూపించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. ఇక కీలకమైన సెకండాఫ్ నిరాశపరుస్తుంది. కథనం అంతా రొటీన్‌గా సాగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కొన్ని అంశాలు ఎలా నష్టాలు చేకూరుస్తున్నాయి వాటి వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. రాఘవేంద్రరెడ్డి రాసిన డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ‘ఓటేసే రోజునే వాడు రాజు..ఆ తర్వాత ఐదేళ్లు నేనే రాజు..నేనే మంత్రి’, డబ్బులు తీసుకొని ఓటు అమ్ముకున్న ఓటర్ని ప్రశ్నించే అధికారం ఎక్కడుంది’ ప్రతి వాడు యుద్దంలో గెలవాలనే చూస్తాడు. కానీ ఎవరో ఒకడు మాత్రమే గెలుస్తాడు..వాడినే వీరుడు అంటారు’లాంటి డైలాగ్స్ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఫస్టాఫ్ మాదిరే సెకండాఫ్‌ని కూడా కాస్త ఆసక్తికరంగా, ల్యాగ్ లేకుండా తీర్చిదిద్ది ఉంటే.. శాసన సభ ఓ మంచి పొలిటికల్ థ్రిల్లర్‌గా నిలిచేది. ఎవరెలా చేశారంటే: ఇక నటీనటులు విషయానికొస్తే.. సూర్య పాత్రలో ఇంద్రసేన మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో కానీ ఇతర కీలక సన్నివేశాల్లో బాగా నటించాడు. రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నారాయణ స్వామి పాత్రకి ఆయన జీవం పోశాడు. ముఖ్యమంత్రిగా అనీష్ కురువిల్లా, ప్రతిపక్ష నాయకురాలుగా సోనియా అగర్వాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. రవి బసూర్ సంగీతం, రాఘవేంద్రరెడ్డి స్క్రీన్‌ప్లే,మాటలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాన విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
@Love Movie Review: ‘@లవ్’ రివ్యూ
టైటిల్ : @లవ్ నటీనటులు: అభి, సోనాక్షి, రామరాజు తదితరులు నిర్మాణ సంస్థలు: టిఎమ్మెస్, ప్రీతమ్ ఆర్ట్స్ అండ్ ఎస్ఎన్ క్రియేషన్స్ నిర్మాతలు: మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ దర్శకత్వం : శ్రీ నారాయణ సంగీతం: సన్నీ మాలిక్ స్క్రీన్ ప్లే: శ్రీ నారాయణ సినిమాటోగ్రఫీ: మహి ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదలతేది: డిసెంబర్ 9, 2022 కథేంటంటే.. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథగా మొదలవుతుంది ఈ చిత్ర కథ. ఎమ్మెల్యే శర్మ (రామరాజు) తన కూతురు విందు, రామ్ అనే గిరిజన యువకుడిని ప్రేమించిందని తెలిసి.. ఎలాగైనా ఆ ప్రేమను చెడగొట్టాలని ఆ గిరిజన ప్రాంతానికి బయలు దేరతాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య శర్మకి ఓ గిరిజన పెద్దాయన పరిచయం అవుతాడు. ఆయన ఎప్పుడో గతంలో తమ ప్రాంతంలో జరిగిన చంద్ర- మాలచ్చిమి అనే జంట తాలూకు ప్రేమ కథ చెబుతాడు. నిజమైన ప్రేమకు ప్రతిరూపం లాంటి ఆ ప్రేమ కథ విన్న తర్వాత శర్మ లో ఎలాంటి మార్పు వచ్చింది?, చివరకు శర్మ తన కూతురు ప్రేమను అంగీకరించాడా?, లేదా ? అసలు అప్పటి జంట ప్రేమ కథ కు - నేటి జంట ప్రేమ కథకు మధ్య కనెక్షన్ ఏమిటి ? అనేది మిగిలిన కథ. ఎలా ఉందంటే.. '@లవ్'.. సున్నితమైన భావోద్వేగాలతో మడిపడిన ఉన్న ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ. సినిమా చూస్తున్నంత సేపు అందమైన అడవి మధ్యలోకి వెళ్లి అక్కడి పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో ప్రేమ, మరియు కులం, ప్రాంతం, జాతి వంటి సున్నితమైన అంశాలను, వాటి వల్ల ఆడవాళ్ళు పడుతున్న ఇబ్బందలను చూపించటం చాలా బాగుంది. నేటి సమాజంలో కొంతమంది కుల మత పిచ్చితో ఎంత మూర్ఖంగా ఉంటారో అని కొన్ని కఠినమైన వాస్తవాల ఆధారంగా కొన్ని సంఘటనలను చాలా వాస్తవికంగా చూపించడంతో దర్శకుడు సఫలం అయ్యాడు. ఫీల్, ఎమోషన్, ఆడవాళ్ళ కి సంబంధించిన సోషల్ మెసేజ్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. వీటితో పాటు శ్రీ నారాయణ టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది. ఈ సినిమాలోని నటీనటులంతా కొత్తవారైనా..చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సన్నీ మాలిక్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. అడవి అందాలను చక్కడా చూపించారు. శివ.కె మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాతలు మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఈ '@లవ్' చిత్రం భావేద్వేగమైన ప్రేమ కథలతో, సున్నితమైన భావోద్వేగాలతో మెప్పిస్తుంది. -
‘గుర్తుందా శీతాకాలం’మూవీ రివ్యూ
టైటిల్: గుర్తుందా శీతాకాలం నటీనటులు: సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని తదితరులు నిర్మాణ సంస్థలు: వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్ దర్శకత్వం: నాగశేఖర్ సంగీతం: కాలభైరవ సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది: డిసెంబర్ 9 , 2022 కథేంటంటే.. ఈ కథంతా రోడ్ జర్నీలో పరిచమైన ఇద్దరు వ్యక్తులు దేవ్(సత్యదేవ్), దివ్య (మేఘా ఆకాష్) మధ్య సంభాషణగా కొనసాగుతుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన దేవ్ స్కూల్, కాలేజీ డేస్‌లలో ఒక్కో అమ్మాయితో లవ్‌లో పడతాడు. స్కూల్ డేస్లోది అట్రాక్షన్. కానీ కాలేజీలో అమ్ము అలియాస్ అమృత (కావ్యా శెట్టి) ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె కోసం బెంగళూరు కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు. అయితే అతని శాలరీ తక్కువని, ధనవంతులుగా ఉన్న మనం అలాంటి వారితో జీవితాన్ని కొనసాగించలేమని తల్లి చెప్పడంతో అమ్ము మనసు మారుతుంది. ప్రతిసారి దేవ్‌ని తక్కువ చేసి మాట్లాడుతుంది. అనేకసార్లు అవమానిస్తుంది. అయినా కూడా దేవ్ ఆమెను ఒక్కమాట అనడు. చివరకు ఆమే దేవ్‌కి బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత దేవ్ జీవితంలోకి నిధి(తమన్నా) వస్తుంది. నిధిని పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరి జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటి? నిధికి అబార్షన్ ఎందుకు అయింది? దేవ్ ప్రేమ, పెళ్లి విషయంలో స్నేహితులు ప్రశాంత్(ప్రియదర్శి), గీతుల పాత్ర ఏంటి? అసలు తన లవ్‌స్టోరీని అపరిచితురాలైన దివ్యకు ఎందుకు చెప్పాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కన్నడలో విజయవంతమైన లవ్ మాక్‌టెయిల్ తెలుగు రీమేకే గుర్తుందా శీతాకాలం. తెలుగు నేటివిటికి తగినట్టు కొన్ని మార్పులు చేసి ఈ లవ్‌స్టోరీని తెరకెక్కించారు. ఇలాంటి ప్రేమ కథలు ఎన్ని వచ్చినా సరే.. వాటిపై ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ తగ్గదు. అయితే తెరపై చూపించే లవ్‌స్టోరీతో ప్రేక్షకుడు కనెక్ట్ అయితే అది వర్కౌట్ అవుతుంది. పాత్రల్లో లీనమైపోవాలి. కథ ఫ్రెష్‌గా ఉండాలి. అలాంటి లవ్‌స్టోరీని ఆడియన్ ఓన్ చేసుకుంటాడు. కానీ గుర్తుందా శీతాకాలంలో అది మిస్ అయింది. కొత్తదనం ఏమి కనిపించదు. హీరోకి స్కూల్‌డేస్.. కాలేజీ డేస్ లవ్‌స్టోరీ ఉండడం.. వాటిని నెమరేసుకోవడం ..ఈ తరహా కథలు తెలుగు ఆడియన్స్‌కు కొత్తేమి కాదు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'ప్రేమమ్’ సినిమాల మాదిరి కథనం సాగుతుంది. ఫస్టాఫ్‌లో వచ్చే స్కూల్ డేస్, కాలేజీ డేస్ సీన్స్ నవ్విస్తాయి. అయితే కథనం మాత్రం ఊహకందేలా నెమ్మదిగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో సత్యదేవ్, తమన్నాల మధ్య జరిగే సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. బలమైన సన్నివేశాలు ఏవి లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం పెద్ద మైనస్. ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా ప్రధాన బలం సత్యదేవ్ అనే చెప్పాలి. దేవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై ఓ కొత్త సత్యదేవ్‌ని చూస్తాం. రకరకాల వేరియేషన్స్‌ని బాగా పండించాడు. ముఖ్యంగా కాలేజీ ఎపిసోడ్స్‌లో సత్యదేవ్ నటన బాగుంటుంది. నిధి పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా నటించింది. సత్యదేవ్ ప్రియురాలు, డబ్బున్న అమ్మాయి అమృత పాత్రకి కావ్యా శెట్టి న్యాయం చేసింది. హీరో స్నేహితుడు ప్రశాంత్‌గా ప్రియదర్శి తనదైన కామెడీతో నవ్విస్తూనే.. కథకు సపోర్ట్‌గా నిలిచాడు. మేఘా ఆకాష్, సుహాసిని మణిరత్నంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కాలభైరవ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయింది. లక్ష్మీ భూపాల మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘రణస్థలి' మూవీ రివ్యూ
టైటిల్: రణస్థలి నటీనటులు: ధర్మ, అమ్ము అభిరామి, చాందిని, సమ్మెట గాంధీ, ప్రశాంత్, శివ జామి, నాగేంద్ర , విజయ్ రాగం తదితరులు నిర్మాణ సంస్థ: ఏ.జె ప్రొడక్షన్ నిర్మాత: అనుపమ సురెడ్డి దర్శకుడు: పరశురామ్ శ్రీనివాస్ సంగీతం: కేశవ్ కిరణ్ సినిమాటోగ్రఫీ: జాస్టి బాలాజీ విడుదల తేది: నవంబర్ 26, 2022 కరోనా తర్వాత సీనీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్లు ఉంటే చాలు.. ఆ సినిమాను ఆదరించేవారు. కాని ఇప్పుడు హీరో హీరోయిన్లను కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. కథలో కొత్తదనం ఉంటే చాలు.. చిన్న పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో వరుసగా చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే పలు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. నేడు(నవంబర్ 26) మరో చిన్న చిత్రం ‘రణస్థలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. బసవ( ధర్మ) అమ్ములు(చాందినీ రావు) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్ములు.. బసవ ఇంట్లోనే పెరుగుతుంది. బసవ తండ్రి(సమ్మెట గాంధీ) వీరిద్దరికి పెళ్లి చేస్తాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో అమ్ములు హత్యకు గురవుతుంది. చక్రవర్తి తోటలో పని చేయడానికి వచ్చిన కూలీలు..అతనితో పాటు అమ్ములును కూడా చంపేస్తారు. అసలు చక్రవర్తి ఎవరు? వీరిద్దరిని కూలీలుగా వచ్చిన కిరాయి గుండాలు ఎందుకు హత్య చేశారు? వారిని పంపించిదెవరు? భార్య హత్యకు కారణమైన వారిని బసవ ఎలా చంపాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 'రణస్థలి'.. ఒక రివేంజ్ డ్రామా సినిమా. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని హత్య చేసిన ముఠాని ఒక సాదాసీదా వ్యక్తి ఎలా మట్టుబెట్టాడు అన్నదే ఈ సినిమా కథ. దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా నడిపించాడు. చిన్నచిన్న లాజిక్స్ అక్కడక్కడ మిస్ అయ్యాయి కానీ ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేయడంలో కొంతవరకు విజయం సాధించారు. హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. మాస్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే విధంగా ఆ ఎపిసోడ్ ను డిజైన్ చేసుకున్నాడు. అయితే సినిమాలో హింస ఎక్కువగా ఉండడం ఓ వర్గం ఆడియన్స్‌కి ఇబ్బందిగా ఉంటుంది. సస్పెన్స్, రా అండ్ రస్టిక్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే... బసవ పాత్రకి ధర్మ న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. అమ్ములు పాత్రలో నటించిన తెలుగు అమ్మాయి చాందిని రావు ఒదిగిపోయింది. ఈశ్వరిగా అమ్ము తనదైన నటనతో మెప్పించింది. హీరో తండ్రి పాత్రలో సమ్మెట గాంధీ జీవించేశాడు. . విలన్ గా చేసిన శివతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. కేశవ్ కిరణ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ ఎపిసోడ్స్ ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Itlu Maredumilli Prajaneekam: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రివ్యూ
టైటిల్: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నటీనటులు: ‘అల్లరి’ నరేశ్, ఆనంది, వెన్నెల కిశోర్, రఘు బాబు, శ్రీతేజ్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్ నిర్మాత: రాజేశ్ దండు సమర్పణ: జీ స్టూడియోస్ దర్శకుడు: ఏఆర్ మోహన్ సంగీతం: సాయి చరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: చోటా కె. ప్రసాద్ ఎడిటర్: రామ్ రెడ్డి విడుదల తేది: నవంబర్ 25, 2022 కథేంటంటే.. శ్రీపాద శ్రీనివాస్(అల్లరి నరేశ్) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎలక్షన్ల డ్యూటీపై రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి తండాకు వెళ్తాడు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా అభివృద్దికి నోచుకొని తండా అది. అక్కడ చదువుకోవడానికి బడి లేదు. అనారోగ్యం పాలైతే చూపించుకోవడానికి ఆస్పత్రి లేదు. పట్టణం వెళ్లడానికి సరైన దారి లేదు. పాఠశాల, ఆస్పత్రితో పాటు నదిపై వంతెన కట్టించాలని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదు. అందుకే వాళ్లు ఓటేయడానికి నిరాకరిస్తారు. కానీ శ్రీనివాస్ చేసిన ఓ పనికి మెచ్చి అతని కోసం ఓట్లు వేస్తారు. వందశాతం పోలింగ్ జరుగుతుంది. అయితే బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను మార్గమధ్యలో మారెడుమిల్లి తండాకు చెందిన కండా(శ్రీతేజ) బ్యాచ్ కిడ్నాప్ చేస్తుంది. అసలు ప్రభుత్వ అధికారులను కండా ఎందుకు కిడ్నాప్ చేశాడు? అధికారులను విడిపించడానికి కలెక్టర్(సంపత్ రాజ్) ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎన్నికలు నిర్వహించడంలో శ్రీనివాస్‌కు తండాకు చెందిన యువతి లక్ష్మి(ఆనంది) ఎలాంటి సహాయం చేసింది? తండా వాసుల కష్టాలు తీర్చడంలో నరేశ్ ఏ మేరకు సక్సెస్ సాధించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పట్టణాలకు దూరంగా నివసించే తండా వాసుల కష్టాల గురించి మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం. వాళ్లకు సరైన సదుపాయాలు ఉండవు. కనీస అవసరాలైన విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు కూడా ఉండవు. తమ సమస్యలను తీరుస్తేనే ఓటు వేస్తామంటూ ధర్నాలు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి సంఘటలనే కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ఏఆర్ మోహన్. తమ సమస్యలు పరిష్కరించమని ఓ ఊరి ప్రజలంతా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే అదే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా. విద్య, వైద్యం, రవాణా సదుపాలను కల్పించాలని ఏళ్లుగా విజ్ఞప్తి చేసిన పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు అధికారులను నిర్భంధిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ రొటీనే అయినా.. అందరికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సఫలం అయ్యాడు. సినిమాలో కొత్తగా చెప్పిన విషయమేమి ఉండదు కానీ.. అందరిని ఆలోచింపజేస్తుంది. కంప్యూటర్ యుగంలోనూ.. కనీస సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడేవారున్నారని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగడం కాస్త మైనస్. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా ప్రారంభం నుంచే అసలు కథ మొదలవుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎన్నికల చుట్టే కథ సాగుతుంది. తండావాసులు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయానికి శ్రినివాస్ చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వారి సమస్యలు తెలుసుకొని చలించిపోవడం.. ఇలా ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్‌ల కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ మొత్తం తండావాసుల దగ్గర బంధీలుగా ఉన్న అధికారులను విడిపించేందుకు జిల్లా కలెక్టర్ చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే కథనం రోటీన్‌గా సాగినా.. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. 'తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు... సాయం చేసి బాధ పడకూడదు', మనందరం గొప్పవాళ్ళం అయిపోవాలని అనుకుంటున్నాం... కానీ ఎవరూ మనిషి కావడం లేదు' లాంటి అద్భుతమైన సంభాషణలు సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. నరేశ్ చేసిన మరో మంచి అటెంప్ట్‌గా మాత్రం నిలుస్తుంది. ఎవరెలా చేశారంటే.. కామెడీనే కాదు సీరియస్ పాత్రల్లో కూడా అద్భుతంగా నటించే నటుల్లో నరేశ్ ఒకరు. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే.. సీరియస్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ చిత్రంలో నరేశ్ది పూర్తి సిరియస్ రోల్. తెలుగు భాషా ఉపాధ్యాయుడు శ్రీపాద శ్రీనివాస్ పాత్రలో ఒదిగిపోయాడు. అయితే ఇలాంటి పాత్ర కొత్తేమి కాదు. ప్రవీణ్, వెన్నెల కిషోర్, రఘుబాబుల కామెడీ బాగా పండింది. తండా వాసి కండాగా శ్రీతేజ్, ఊరి పెద్దమనిషి ‘పెద్ద’ కుమనన్ సేతురామన్‌లతో పాటు మిగిలిన నటీనటుల తమ పాత్రల పరిధిమేర నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. చోటా కె. ప్రసాద్ కెమెరా పనితీరు బాగుంది. అడవి అందాలను అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
Masooda Review: ‘మసూద’ మూవీ రివ్యూ
టైటిల్: మసూద నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు నిర్మాణసంస్థ: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా రచన, దర్శకత్వం: సాయికిరణ్ సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్ ఎడిటర్: జెస్విన్ ప్రభు విడుదల తేది: నవంబర్ 18, 2022 ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(నవంబర్ 18) విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. కథేంటంటే.. నీలం(సంగీత) ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. భర్త అబ్దుల్(సత్య ప్రకాశ్)కు దూరంగా ఉంటూ.. కూతురు నాజియా(బాంధవి శ్రీధర్)తో కలిసి ఓ అపార్ట్మెంట్లో రెంట్‌కు ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉండే గోపీ(తీరువీర్) ఓ సాఫ్ట్వేర్. తన సహోద్యోగి మినీ(కావ్యా కళ్యాణ్ రామ్)ని ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్మెంట్లో ఉండడంతో నీలం ఫ్యామిలీకి క్లోజ్ అవుతాడు. అప్పుడప్పుడు గోపీతో కలిసి నీలం, నాజియా బయటకు వెళ్తుంటారు. అయితే ఓ రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అర్థరాత్రి వేళ ఏదోదో మాట్లాడుతుంది. కూతురిని అలా చూసి భయపడిన నీలం.. గోపీని సహాయం అడుగుతుంది. నాజియా ప్రవర్తను చూసిన గోపీ.. ఆమెకు దెయ్యం పట్టిందని గ్రహిస్తాడు. ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లా ఉద్దీన్(సత్యం రాజేశ్) సలహాతో పీర్ బాబా(శుభలేఖ సుధాకర్)ను కలుస్తారు. ఈ తర్వాత గోపీ, నీలంలకు ఎదురైన సమస్యలు ఏంటి? నాజియా ఆత్మలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది? అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? మసూదను మీర్ చాచా ఎందుకు చంపాడు? నాజియాను రక్షించడానికి గోపీ చేసిన సాహసం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మసూద’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఒకప్పుడు టాలీవుడ్లో చాలా హారర్ మూవీస్ వచ్చి, విజయం సాధించాయి. కానీ ఈ మధ్య కాలంలో హారర్ అంటే.. కామెడీనే అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులను భయపెట్టడం కంటే నవ్వించడమే తమ లక్ష్యం అనేలా హారర్ మూవీస్ తీస్తున్నారు. కానీ చాలా కాలం తర్వాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చింది ‘మసూద’. ఈ చిత్రం కథ పాతదే అయినా.. కథనం మాత్రం చాలా కొత్తగా, ఢిఫరెంట్‌గా సాగుతుంది. కథంతా ముస్లిం నేపథ్యంలో జరుగుతుంది. ఆత్మలను వదిలించడానికి పీర్ బాబాలు వస్తారు. మసీదులో మంత్రాలు చదువుతారు. అందుకే కథనం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలాంటి సీన్స్ పెడితే ప్రేక్షకులు భయపడతారో..అలాంటి వాటిపై దర్శకుడు సాయికిరణ్ మరింత ఫోకస్ పెట్టాడు. ఫస్టాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు హారర్‌ని చూపిస్తూ.. మరోవైపు గోపీ, మినీల లవ్ట్రాక్ని నడిపించాడు. దీంతో ఎక్కడో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేశాడు. అసలు కథంతా సెకండాఫ్‌లో సాగుతుంది. పీర్‌బాబా ఎంటర్ అవ్వడంతో కథలో వేగం పెరుగుతుంది. అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏమై ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే కథనం సాదాసీదాగా సాగినా.. ఓక్కో సీన్ ప్రేక్షకులను దారుణంగా భయపెడుతాయి. మసూద నేపథ్యం గురించి చెప్పే క్రమంలో కొన్ని సీన్స్ భయానికి గురి చేస్తాయి. ఇక చివరి అరగంట మాత్రం హారర్ అదిరిపోతుంది. ప్రేక్షకుడిని భయపెట్టడమే లక్ష్యంగా కథనం సాగుతుంది. హారర్‌తో పాటు.. తల్లి సెంటిమెంట్‌ని కూడా టచ్ చేశాడు దర్శకుడు. కూతురిని గొలుసులతో కట్టేసినప్పుడు.. తల్లిగా సంగీత పడే బాధ, ఏడుపు హృదయాలను హత్తుకుంటుంది. నిడివి ఎక్కువే అయినా.. హారర్ మాత్రం అదిరిపోయింది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు సంగీత, తిరువీర్, కావ్య, భాందవిల పాత్రలే చాలా కీలకం. గోపీ పాత్రలో తీరువీర్ ఒదిగిపోయాడు. హీరోలా కాకుండా నిజంగా పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఇక సంగీత అయితే మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించింది. నీలం పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో కన్నీళ్లు పెట్టించింది. ఇక సినిమాకు మరో ప్రధాన బలం బాంధవి శ్రీదర్ పాత్ర. నాజియాగా ఆమె తనదైన నటనతో అందరిని భయపెట్టింది. కథంతా నాజియా పాత్ర చుట్టే తిరుగుతుంది. బాలనటిగా పలు సినిమాల్లో కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్.. ఈ చిత్రంలో మిలీ పాత్ర పోషించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ తెరపై అందంగా కనిపించింది. పీర్‌బాబా పాత్రలో శుభలేఖ సుధాకర్ ఒదిగిపోయాడు. అల్లా ఉద్దీన్‌గా సత్యం రాజేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం. ఓ హర్రర్ సినిమాకు సౌండ్, విజువల్స్ చాలా ముఖ్యం. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ జెస్విన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
నవీన్ చంద్ర 'తగ్గేదే లే' సినిమా రివ్యూ
టైటిల్: తగ్గేదే లే నటీనటులు: నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా, నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, అయ్యప్ప పి.శర్మ, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ దర్శకత్వం : శ్రీనివాస్ రాజు కెమెరా : వెంకట్ ప్రసాద్ నిర్మాత : ప్రేమ్ కుమార్ పాండే, పి. వి.సుబ్బారావు రెడ్డి బ్యానర్ : భద్ర ప్రొడక్షన్స్ ఎడిటింగ్ : గ్యారీ బి. హెచ్ విడుదల తేదీ: నవంబర్ 4, 2022 దండుపాళ్యం సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ రాజు ఆ సినిమాకు సీక్వెల్ గా రెండు భాగాలు తెరకెక్కించాడు. తాజాగా దండుపాళ్యం సినిమాలోని నటులను తీసుకొని ఒక ఫ్యామిలీ, మర్డర్, మిస్టరీతో రూపొందించిన చిత్రమే " తగ్గేదే లే". ఇందులో నవీన్ చంద్ర హీరోగా దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తాలు హీరోయిన్స్‌గా నటించారు. నవంబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఎంటర్టైన్ చేసిందో చూద్దాం.. కథ మర్డర్, డ్రగ్స్, లవ్ వంటి మూడు కథలతో ఈ సినిమా సాగుతుంది. ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్వేర్ ఉద్యోగి. మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత తాను ఈశ్వర్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న లిజి ఈశ్వర్ ఇంట్లో ఉంటూ... అంతకుముందు తనతో దిగిన ఫొటోలతో ఈశ్వర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈశ్వర్ ఇంట్లో మహిళ శవం దొరుకుతుంది. అప్పటివరకు దండుపాళ్యం బ్యాచ్‌తో ఈశ్వర్‌కు సంబంధం ఉందని అనుమానపడుతున్న పోలీసులకు అతడి ఇంట్లో శవం దొరకడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఆ అమ్మాయిని ఈశ్వర్ చంపాడనే అనుమానంతో పోలీస్ ఆఫీసర్ చలపతి(రవి శంకర్), రాజా రవీంద్ర ఇంటరాగేషన్ చెయ్యాలని అరెస్ట్ చేస్తారు.ఈ ఇంటరాగేషన్‌లో ఈశ్వర్ ద్వారా తెలుసుకున్న నిజాలు ఏమిటి? ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? ఆ హత్య నుంచి అతడు ఎలా బయట పడ్డాడు? ఈశ్వర్ జీవితానికి, దండుపాళ్యం గ్యాంగుకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) దండుపాళ్యం గ్యాంగ్‌ను, డ్రగ్ మాఫియాను ఏం చేశాడు? అనేది తెలుసు కోవాలంటే సినిమా చూడాల్సిందే.. నటీ నటుల పనితీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో నవీన్ చంద్ర, హీరో భార్య గా దివ్యా పిళ్ళై బాగా నటించారు. నవీన్ చంద్ర ప్రియురాలిగా అనన్యా సేన్ గుప్తా గ్లామర్ డాల్‌గా కనిపించారు. భార్యకు, ప్రియురాలికి మధ్య నలిగిపోయే ఎమోషన్ పాత్రలో నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. సినిమా ఎక్కువ భాగం నవీన్ చంద్ర చుట్టూ తిరుగుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా రవిశంకర్, డాక్టర్ సమరంగా '30 ఇయర్స్' పృథ్వీ వారి పాత్రలకు న్యాయం చేశారు. 'పోలీస్‌గా రాజా రవీంద్ర,. 'దండుపాళ్యం' గ్యాంగ్ సభ్యులుగా మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, రవి కాలె మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో స్నేహితులుగా 'గెటప్' శీను, 'ఆటో' రామ్ ప్రసాద్‌లు తమ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. సాంకేతిక నిపుణుల పనితీరు ఈ కథ కొత్తదేమీ కాదు. కాకపోతే మర్డర్ మిస్టరీ, డ్రగ్స్, లవ్.. ఇలా మూడు ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌ను సెలక్ట్ చేసుకొని ట్విస్టులు టర్నులతో సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీనివాస్ రాజు. క్లెమాక్స్‌లో దండుపాళ్యం గ్యాంగ్, నవీన్ చంద్ర, రవి శంకర్, అయ్యప్ప, పూజా గాంధీలపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠకు గురి చేస్తాయి. దండుపాళ్యం సినిమాకు మించిన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అలాగే వయలెన్స్‌కు కూడా మరీ ఎక్కువ మోతాదులో ఉంది. సినిమాకు అదే మైనస్‌గా మారింది. నేపథ్య సంగీతం బాగుంది. చరణ్ అర్జున్ చేసిన ఇళయరాజా - భారతిరాజాల 'మాటే మంత్రము' సాంగ్ రీమిక్స్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ అందించిన విజువల్స్ బాగున్నాయి. గ్యారీ బి. హెచ్ కొన్ని సీన్లను ఎడిటింగ్‌లో తీసేయాల్సింది. ఒక్క మాటలో చెప్పాలంటే వయొలెన్స్ ఇష్టపడేవారు తగ్గేదే లే చూసి ఎంజాయ్ చేయొచ్చు. చదవండి: ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ ఫ్లైట్ నుంచి దూకేశా: శర్వానంద్ -
Kantara Movie Review: ‘కాంతార’ మూవీ రివ్యూ
టైటిల్: 'కాంతార : లెజెండ్ నటీనటులు: రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే, తదితరులు నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్ నిర్మాత: విజయ్ కిరగందూర్ తెలుగు పంపిణీ - గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ దర్శకత్వం: రిషబ్ శెట్టి సంగీతం - అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రాఫర్ - అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ - ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్ విడుదల తేది: అక్టోబర్ 15,2022(తెలుగులో) ‘కాంతారా’ కథేంటంటే ఈ కథ 1847లో ప్రారంభం అవుతుంది. వేల కోట్ల సంపద, మంచి కుటుంబం ఉన్నా ఓ రాజుకు ప్రశాంతత మాత్రం లభించదు. కావాల్సినవన్నీ ముందున్నా.. ఏదో లోటు ఉందని మదన పడుతుంటాడు. ఓ స్వామిజీ సూచన మేరకు ప్రశాంతత కోసం ఒంటరిగా వెళ్తాడు. ఏ ప్రదేశానికి వెళ్లినా ఆయన మనసుకు ప్రశాంతత లభించదు. చివరిలో ఓ అడవిలోకి వెళ్తుండగా.. అక్కడ ఓ దేవుడి శిల ముందు ఆగిపోతాడు. అది చూడగానే మనసు తేలికైపోతుంది. ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. దీంతో ఆ దేవుడి శిల తనకు కావాలని అక్కడి ప్రజలను కోరతాడు. దానికి బదులుగా ఏం కావాలన్న ఇస్తానంటాడు. అయితే అక్కడ కోలం ఆడే వ్యక్తి ( ఓ వ్యక్తికి దేవుడు పూనడాన్ని కోలం అంటారు).. ఆ శిలకు బదులుగా ఆ అడవినంతా అక్కడ ప్రజలకు ఇవ్వాలని చెబుతాడు. దీంతో ఆ రాజు ఆ అడవి భూమిని అక్కడి ప్రజలకు దానం చేసి దేవుడి శిలను తీసుకెళ్తాడు. కట్ చేస్తే.. 1990లో ఆ అటవీ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమని, దానిని ప్రజలు ఆక్రమించుకున్నారని సర్వే చేయిస్తుంటాడు ఫారెస్ట్ ఆఫీసర్ మురళి(కిశోర్ కుమార్). ఈ నేపథ్యంలో ఆ ఊరి యువకుడు శివ(రిషబ్ శెట్టి)కి , మురళికి గొడవలు జరుగుతాయి. తమకు అండగా రాజ వంశీకులు దేవేంద్ర దొర(అచ్యుత్ కుమార్) ఉంటాడని శివతో పాటు ఆ ఊరంతా నమ్ముతుంది. మరి దేవేంద్ర దొర ఏం చేశాడు? ఆ ఊరిలో కోలం ఆడే దేవ నర్తకుడు గురవను హత్య చేసిందెవరు? శివ కలలో కనిపించే ఆ రూపం ఎవరిది? అటవి భూమిని, దానిని నమ్ముకొని బతుకుతున్న ప్రజలను కాపాడడం కోసం దేవుడు ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కాంతార’ కథ వింటే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. పూర్వీకులు ప్రజలకు ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వారసులు ప్రయత్నించడం.. దానిని అక్కడి ప్రజలు అడ్డుకోవడం.. చివరకు దేవుడు వచ్చి దుండగులను సంహరించడం ఇదే ‘కాంతారా’ కథ. వినడానికి ఇది పాత కథలా ఉన్నా.. కథనం మాత్రం చాలా కొత్తగా, ఆసక్తికరంగా సాగేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు రిషబ్ శెట్టి. హీరోలను, టెక్నీషియన్స్ కాకుండా కేవలం కథ, కథనాన్ని నమ్ముకొని తెరకెక్కించిన సినిమా ‘కాంతారా’. సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. కథంతా కన్నడ ఫ్లేవర్‌లో సాగుతుంది. అయినప్పటికీ అన్ని ప్రాంతాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కథ ఇది. అడవి ప్రాంతంలో ప్రజలు ఎలా ఉంటారు? వారి అలవాట్లు ఎలా ఉంటాయి? వేటాడే విధానం ఎలా ఉంటుంది? ఇలా ప్రతి అంశం కళ్లకు కట్టినట్లు చూపించారు. మొరటు ప్రేమ, కామెడీ బాగా వర్కౌట్ అయింది. అయితే వీటి కోసం ప్రత్యేకంగా ఎలాంటి సీన్స్ ఉండవు.. కథలో భాగంగా సాగుతాయి. దేవ నర్తకుడు కోలం ఆడే ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నీవేశం చాలా నేచురల్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ వరకు ఇది సాధారణ సినిమానే. సెకండాఫ్ స్టార్టింగ్‌లో కొంత నెమ్మదిగా సాగుతుంది. కానీ క్లైమాక్స్ మాత్రం సినిమా స్థాయిని పెంచేస్తుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు రిషబ్ శెట్టి తన విశ్వరూపాన్ని చూపించాడు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి రిషబ్ శెట్టి ఒక్కడే అలా గుర్తిండిపోతాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్ శెట్టి. దర్శకుడిగా, నటుడిగా వందశాతం న్యాయం చేశాడు. ఊరిలో అవారాగా తిరిగే యువకుడు శివ పాత్రలో రిషబ్ పరకాయప్రవేశం చేశాడు. ఆయన నటన సినిమా మొత్తం ఒకెత్తు అయితే.. క్లైమాక్స్ మరో ఎత్తు. ఆ సీన్లో రిషబ్ తప్ప మరొకరు అంతలా నటించలేరనేలా అతని నటన ఉంటుంది. కోలం అడుతున్నప్పుడు రిషబ్ అరిచే అరుపులు థియేటర్స్ నుంచి బయటకు వచ్చాక కూడా మన చెవుల్లో మారుమ్రోగుతాయి. ఇక ఫారెస్ట్ గార్డ్‌గా ఉద్యోగం సంపాదించిన గ్రామీణ యువతి లీలగా సప్తమి గౌడ తనదైన సహన నటనతో ఆకట్టుకుంది. రిషబ్, సప్తమిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. రాజ వంశీకుడు దేవేంద్ర దొరగా అచ్చుత్ కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఫారెస్ట్ ఆఫీసర్ మురళిగా కిషోర్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర అద్భుతంగా నటించారు. సాంకేతిక విషయానికొస్తే...ఈ సినిమాకు మరో ప్రధాన బలం అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం. కోలం ఆడే సమయంలో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అరవింద్ ఎస్.కశ్యప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని ప్రెజంట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
Crazy Fellow Review: ‘క్రేజీ ఫెలో’ మూవీ రివ్యూ
టైటిల్: క్రేజీ ఫెలో నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథన్, నర్నా శ్రీనివాస్, సప్తగిరి తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీసత్యసాయి ఆర్ట్స్ నిర్మాత: కే.కే. రాధామోహన్ దర్శకుడు: ఫణికృష్ణ సిరికి సంగీతం: ఆర్.ఆర్. ధృవన్ సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల ఎడిటర్: సత్య గిడుతూరి విడుదల తేది: అక్టోబర్ 14, 2022 యంగ్ హీరో ఆది సాయికుమార్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇటీవలె ‘తీస్మార్ ఖాన్’తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’అంటూ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటకుల మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(అక్టోబర్ 14) విడుదలైన ఈ ‘క్రేజీ ఫెల్లో’ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అభిరామ్ అలియాస్ నాని ఓ క్రేజీ ఫెలో. చిన్నప్పుడు తల్లిదండ్రులు మరణించడంతో అన్నావదినలు(అనీష్, వినోదిని వైద్యనాథన్) గారాబంగా పెంచుతారు. ఫ్రెండ్స్, పబ్స్, పార్టీలు తప్ప అతనికి వేరే ఏ పని ఉండదు. పైగా ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా కష్టాలను కొని తెచ్చుకుంటాడు. అభి అతి వల్ల స్నేహితుడి పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇక తమ్ముడిని ఇలానే వదిలేస్తే.. పనికిరాకుండా పోతాడని స్నేహితుడి కంపెనీలో ఉద్యోగం పెట్టిస్తాడు అన్నయ్య. అక్కడ మధుమతి(దిగంగనా సూర్యవంశీ)ని చూస్తాడు అభి. వీరిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. గతంలో అభి వేసిన వెధవ వేషాలు తెలిసి మధుమతి అతనికి దూరంగా ఉంటుంది. అయితే అనూహ్యంగా వీరిద్దరు ఓ డేటింగ్ యాప్ ద్వారా స్నేహితులు అవుతారు. అయితే ఆ యాప్‌లో వీరిద్దరు వేరు వేరు పేర్లు, ఫోటోలు అప్లోడ్ చేస్తారు. వారిద్దరు కాస్త క్లోజ్ అయ్యాక మధుమతికి చిన్ని అని ముద్దు పేరు పెడతాడు అభి. ఇలా చాటింగ్ ద్వారా క్లోజ్ అయ్యాక.. ఓ రోజు కలుద్దామని అనుకుంటారు. ఆ సమయంలో మరో అమ్మాయిని(మిర్నా మీనన్) చూసి చిన్ని అనుకొని ప్రపోజ్ చేస్తాడు. అనూహ్యంగా ఆమె పేరు కూడా చిన్ని కావడం.. అతను ప్రపోజ్ చేయడాన్ని ఆమె కుటుంబ సభ్యులు చూడడంతో గొడవలు జరుగుతాయి. కొన్ని కారణాల వల్ల అభి ప్రేమించిన చిన్నిని కాకుండా ప్రపోజ్ చేసిన చిన్నితో పెళ్లికి రెడీ అవుతాడు. మరి తాను చాటింగ్ చేసిన చిన్నియే మధుమతి అని అభికి ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత ఏం జరిగింది? ఇన్నాళ్లు తాను గొడవపడిన అభిరామే తను ప్రేమించిన నాని అని తెలుసుకున్న మధుమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఇప్పుడు డేటింగ్ యాప్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. అలాంటి ట్రెండింగ్ పాయింట్‌ని పట్టుకొని కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు ఫణికృష్ణ సిరికి. కథలో కొత్తదనం లేదు కాని కామెడీ మిక్స్ చేసి కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. డేటింగ్ యాప్ ద్వారా అభి, మధుమతి పరిచయం కావడం.. చూడకుండానే ప్రేమలో పడడం, చివరికి ఒకరికి బదులు మరొకరిని కలవడం..స్టోరీ వినడానికి ఇలా రొటీన్‌గా ఉన్న.. దానికి కామెడీ మిక్స్ చేసి కథనాన్ని నడపడం ‘క్రేజీ ఫెలో’కి ప్లస్ అయింది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఆది, నర్రా శ్రీనివాస్ మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్‌పై కూడా దర్శకుడు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. ఇద్దరి హీరోయిన్లతో చాలా చోట్ల భావోద్వేగాలను పండించోచ్చు. కానీ దర్శకుడు దానిపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. ప్రేమ విషయంలో కూడా అదే చేశాడు. ముఖ్యంగా రెండో హీరోయిన్ మిర్నా మీనన్, హీరోతో లవ్‌లో పడే సన్నివేశాలు మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్. ఏడాదిలో ఆరేడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ప్రతి సినిమాలోనూ ఆది ఒకే లుక్‌లో కనిపించడంతో కొత్తదనం లోపించినట్లు అనిపించేది. కానీ ‘క్రేజీ ఫెలో’తో ఆది తనపై ఉన్న విమర్శకు చెక్ పెట్టాడు. తెరపై కొత్త లుక్‌లో కనిపించి అలరించాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలోనూ మెరుగయ్యాడు. ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా కష్టాలను కొని తెచ్చుకునే అభి పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించడంతో పాటు యాక్షన్స్ సీన్స్, డ్యాన్స్ ఇరగదీశాడు. మధుమతి గా దిగంగనా సూర్యవంశీ ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది కానీ ప్రతి సన్నివేశానికి ఒకే ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. చిన్ని పాత్రలకు మిర్నా మీనన్ న్యాయం చేసింది. ఆఫీస్ అసిస్టెంట్ రమేశ్ పాత్రలో నర్రా శ్రీనివాస్ ఒదిగిపోయాడు. ఆది, నర్రా శ్రీనివాస్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయింది. . హీరో వదినగా వినోదిని వైద్యనాథ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె డబ్బింగ్ కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరో బ్రదర్‌గా అనీష్ కురువిల్లా, స్నేహితులుగా సాయి, సాయితేజ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం బాగుంది. సన్నివేశాలకు తగ్గట్టుగా పాటలు ఉన్నాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ సత్య గిడుతూరి తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘నేను c/o నువ్వు’మూవీ రివ్యూ
టైటిల్: నేను c/o నువ్వు నటీనటులు:రత్న కిషోర్,సన్య సిన్హా,సత్య,ధన, గౌతమ్ రాజ్ ,సాగారెడ్డి, తదితరులు నిర్మాణ సంస్థ: అగపే అకాడమీ కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- దర్శక, నిర్మాత : సాగా రెడ్డి తుమ్మ సంగీతం: ఎన్.ఆర్.రఘునందన్ సినిమాటోగ్రఫీ:జి.కృష్ణ ప్రసాద్ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేది: సెప్టెంబర్ 30, 2022 రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను c/o నువ్వు’.ఈ చిత్రానికి అత్తావలి , శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు సహ నిర్మాతలు.ఈ చిత్రం విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1980లో జరుగుతుంది. గోపాలపురం గ్రామానికి చెందిన మారుతి(రత్న కిషోర్) ఓ సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు. ఆ ఊరిలో కులాల మధ్య విఫరీతమైన వర్గపోరు నడుస్తుంటుంది. అలాంటి సమయంలో మారుతి ఆ ఊరి ప్రెసిడెంట్ ప్రతాప్‌రెడ్డి చెల్లెలు దీపిక(సన్య సిన్హా)తో తొలి చూపుతోనే ప్రేమలో పడిపోతాడు. దీపిక మొదట్లో మారుతిని పట్టించుకోకపోయినా..తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రతాప్‌రెడ్డి..తన కులం అబ్బాయి కార్తీక్‌తో చెల్లెలు పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఆ తరువాత జరిగిన సంఘటనలు ఆ ఊరిని ఎటువైపు తీసుకెళ్లాయి? కార్తీక్ తో దీపికకు పెళ్లి జరిగిందా ? లేక ప్రతాప్ రెడ్డి ని ఎదిరించి దీపిక, మారుతిలు పెళ్లి కున్నారా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పరువు హత్యల నేపథ్యలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. నేను c/o నువ్వు చిత్రం కూడా ఆ కోవలోకి చెందిందే. రొటీన్ కథే అయినా విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సాగారెడ్డి తుమ్మ. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరువు హత్యల నేపథ్యం ఉన్న కాన్సెప్ట్‌ని ఎంచుకొని, తెరపై చక్కగా చూపించాడు. అయితే పెద్ద ఆర్టిస్టులు లేకపోవడం కొంత డ్రా బ్యాక్ అని చెప్పవచ్చు.ఇందులో హీరో ఉన్నంతలో బాగా చేశాడు. కానీ ఆ పాత్రకు ఎవరైనా ఎలివెటెడ్ ఆర్టిస్ట్ ఉండి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రత్న కిషోర్ కొత్తవాడైనా తన పరిధిలో చాలా చక్కగా నటించాడు . సన్య సిన్హా తన నటనతో ఆకట్టుకుంది. గౌతమ్ రాజ్, ధనరాజ్ లు కీలక పాత్రలలో నటించారు.మారుతి కి ఫ్రెండ్స్ గా నటించిన సత్య, రాధాకృష్ణ , బాషా తదితరులు అందరూ తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. దర్శకుడిగా, నటుడుగా సాగారెడ్డి తుమ్మ ప్రతాప్ రెడ్డి పాత్రలో చక్కటి విలనిజం చూపించాడు.చెల్లెలు దీపికను ప్రేమగా చూసుకొనే అన్నయ్యగా అద్భుతంగా నటించాడు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఎన్.ఆర్.రఘునందన్ గారు అందించిన సంగీతం సినిమాకు ప్లస్. ఒక్క క్షణం.. లోన చేరే.. ఒక్క సారి జీవితమూ.. పాట, హే బేబీ మై బేబీ పాటలు ఆకట్టుకుంటాయి. కృష్ణ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
PS-1 Twitter Review: ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ ట్విటర్ రివ్యూ
‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ (PS–1’). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘PS–1’ నేడు(సెప్టెంబర్ 30) విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం నాలుగేళ్ల విరామం తర్వాత చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘పొన్నియన్ సెల్వన్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. Such grand and stunning visuals 🔥😲 Can't imagine how #ManiRatnam sir completed both parts in just 155 days ! May his lifelong dream & efforts get great result 👍🏻#PonniyinSelvan #PonniyanSelvan1#PS1 #PonniyinSelvanFDFS#PonniyinSelvanFDFS pic.twitter.com/6nGSZsmTUd — vamsi Krishna (@vamsi2131) September 30, 2022 విజువల్స్ ఎఫెక్ట్స్ , మ్యూజిక్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. ‘అద్భుతమైన విజువల్స్ ఉన్న ఇలాంటి సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో రెండు భాగాలను ఎలా తెరకెక్కించారో ఊహించుకోవడం కష్టమే. అతని డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది సాధ్యమై ఉండొచ్చు. మణిరత్నం కష్టానికి ఫలితం దక్కిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #PonniyinSelvan #PS1 1st Half Good 2nd Half Flat / Average 2.5-2.75/5 Top Highlights #Vikram #Karthi #Trisha BGM — RR (@rrking99) September 30, 2022 ఫస్టాఫ్ బాగుందని, సెకండాప్ యావరేజ్‌గా ఉందని చెబుతూ 2.5-2.75 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. విక్రమ్, కార్తి, త్రిషల యాక్టింగ్‌తో పాటు ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం బాగుందని చెబుతున్నారు. Better 2nd half Overall one time watch 2.25/5#PS1 #PonniyinSelvan — Albitthar Appanna (@ulfha_reddy) September 30, 2022 #PonniyinSelvanFDFS #PS1 #PonniyinSelvanReview Comparison Between Bahubali and Ponniyin Selvan Bahubali - Mass PS1 - Class That's the tweet. Mani rathnam take a bow. You have satisfied fully. Waiting for part 2. — Santhosh (@Santhos43177339) September 30, 2022 #PS1 1st Half : A Classic of Epic proportions is unfolding in front of your eyes.. Dir #Maniratnam magic.. What a story and screen play.. @Karthi_Offl is brilliant and fun and occupies most screen time.. @chiyaan lives his character.. His acting in pre-interval.. 🔥 — Ramesh Bala (@rameshlaus) September 30, 2022 #PS1 #PonniyinSelvan spectacular movie 5/5 #Maniratnam visualization amazing #ARR rocks #AdhityaKarikalan terror #Vanthiyathevan so sweat #ArunmozhiVarman Majestic #Nadhini no words #kundavai real chola queen — ilangovan chandran (@ilangovanchand2) September 30, 2022 PS is political drama with complex characterisation. This was been said from the start. There won't be any air bending fight sequences and commerical elements. It's pure story based & characters driven movie.#Ponniyinselvan #PS1 — Renu🌠 (@crazy4musics) September 30, 2022 #PS1 Overall A Period Action Film that had potential but ends up as an underwhelming watch! Interesting storyline with good music and visuals but is wasted by flat narration with absolutely no highs/emotional connect needed for this genre Rating: 2.25-2.5/5 #PonniyinSelvan — Venky Reviews (@venkyreviews) September 30, 2022 -
Am Aha Review: అం అః మూవీ రివ్యూ
టైటిల్ : అం అః నటీనటులు : సుధాకర్ జంగం, లావణ్య, సిరి కనకన్, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు తదితరులు నిర్మాణ సంస్థలు: రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ నిర్మాత:జోరిగె శ్రీనివాస్ రావు దర్శకత్వం:శ్యామ్ మండల సంగీతం : సందీప్ కుమార్ కంగుల సినిమాటోగ్రఫీ:శివా రెడ్డి సావనం ఎడిటర్:జె.పి విడుదల తేది: సెప్టెంబర్ 16,2022 ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'అం అః'. సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రాన్ని రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు నిర్మించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కల్యాణ్ (సుధాకర్ జంగం), బల్లు(రాజా),అరవింద్(ఈశ్వర్) ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు. చిలిపి పనులు చేస్తూ సరదాగా గడిపే ఈ బ్యాచ్ అనుకోకుండా నగరంలో పేరు మోసిన డాన్ జీఆర్(రామరాజు) కుమారుడు గౌరవ్ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఈ కేసు నుంచి బయట పడేసేందుకు రూ.20 లక్షలు డిమాండ్ చేస్తాడు సీఐ ఫణీంద్ర(రవి ప్రకాశ్). ఆ డబ్బు కోసం కావ్య(సిరి)అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేస్తారు.మరి అంత డబ్బును కావ్య తల్లిదండ్రులు ఇచ్చారా? మర్డర్ కేసు నుంచి ఈ ముగ్గురు ఎలా బయటపడ్డారు? అసలు హత్య చేసిందెవరు? వారి వెనుక ఉన్నదెవరు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అం అః’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైం థ్రిల్లర్ సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసే కథలను ఎంచుకొని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే చాలు ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. అందుకే కొత్త దర్శకులు ఎక్కువగా సస్పెన్స్ క్రైమ్ కథలను ఎంచుకుంటారు. దర్శకుడు శ్యాం కూడా తన డెబ్యూ ఫిలింని ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్‌ని ఎంచుకున్నాడు.సస్పెన్స్‌తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాధారణ స్టూడెంట్స్ చుట్టూ మలుపులతో కూడిన స్క్రీన్ ప్లేతో కథనాన్ని నడిపించాడు. ఓ వైపు రెండు గ్యాంగ్ స్టార్స్ మధ్య వార్ ను చూపిస్తూనే…మధ్యలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రైంలో ఇన్వాల్వ్ అయిన తీరు, కిడ్నాప్ డ్రామాను ఆసక్తికరంగా చూపించాడు. అయితే ఈ సినిమాలో పేరు మోసిన నటీనటులు ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన ముగ్గురు కొత్త కుర్రాల్లే.అయినప్పటికీ చక్కగా నటించారు. ఎస్పీ పాత్రలో నటించిన రాజేశ్వరీ నాయర్ క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది.విలన్ పాత్రల్లో రామరాజు, శుభోదయం సుబ్బారావు ఆకట్టుకుంటారు. సీఐ పాత్రలో కనిపించే రవిప్రకాశ్ పాత్ర కూడా సస్పెన్స్ కొనసాగుతుంది.కావ్య పాత్రకి సిరి న్యాయం చేసింది. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతో పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే..సందీప్ కుమార్ కంగుల సంగీతం పర్వాలేదు.ఇలాంటి కథలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. అది కొంత మిస్ అయిందనే చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ జె.పి పని తీరు బాగుంది. ట్విస్టులతో కూడిన ఈ కథను చివరిదాకా సస్పెన్స్ కొనసాగించేలా ఎడిటింగ్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మూవీ రివ్యూ
టైటిల్: నేను మీకు బాగా కావాల్సిన వాడిని నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్ తదితరులు నిర్మాణ సంస్థ: కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: కోడి దివ్య దీప్తి దర్శకత్వం : శ్రీధర్ గాదె మాటలు, స్క్రీన్‌ప్లే: కిరణ్ అబ్బవరం సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫి: రాజ్ నల్లి విడుదల తేది: సెప్టెంబర్ 16, 2022 రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణమండపం లాంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యే సమ్మతమే అంటూ ప్రేక్షకులన పలకరించిన కిరణ్.. తాజాగా ‘మీకు బాగా కావాల్సిన వాడిని’అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచాల మధ్య ఈ శుక్రవారం (సెప్టెంబర్16) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వివేక్(కిరణ్ అబ్బవరం) ఓ క్యాబ్ డ్రైవర్.అతనికి ఓ సాఫ్ట్వేర్ అమ్మాయి తేజు(సంజనా ఆనంద్) పరిచయం అవుతుంది. ఆమె ప్రతి రోజు రాత్రి మద్యం సేవించి.. వివేక్ క్యాబ్‌ని బుక్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. అయితే ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న తేజూను ఓ రౌడీ ముఠా ఎత్తుకెళ్తే.. వారి నుంచి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత ఆమె ఎందుకిలా రోజూ అతిగా మద్యం సేవిస్తుందో అడిగి తెలుసుకుంటాడు. తనను సిద్దు(సిధ్ధార్ద్ మీనన్) ప్రేమించి మోసం చేశాడని, తన అక్క చేసిన తప్పుకు తనకు శిక్ష పడిందని బాధ పడుతుంది. వివేక్ తన మాటలతో సంజుని ప్రోత్సహించి ఇంటికి పంపిస్తాడు. ఏడాది తర్వాత ఇంటికి వచ్చిన తేజుని కుటుంబ సభ్యులు ఒక్క మాట అనకుండా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. తానను ఫ్యామిలికి దగ్గరకు చేసిన వివేక్‌పై ఇష్టం పెంచుకుంటుంది తేజు. ఓ రోజు తన ప్రేమ విషయాన్ని అతనితో చెప్పాలనుకుంటుంది. అయితే అదే సమయంలో తేజుకు షాకిస్తాడు వివేక్. తన పేరు వివేక్ కాదని పవన్ అని చెబుతాడు. మలేషియాలో ఉండే పవన్ క్యాబ్ డ్రైవర్ వివేక్‌గా ఎందుకు మారాడు? తేజును ప్రేమించి మోసం చేసిందెవరు? ఆమె అక్క చేసిన తప్పేంటి? చివరకు తేజు, వివేక్‌లు ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ కథ కొత్తదేమి కాదు. పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అందులో కొంతవరకు మాత్రమే దర్శకుడు సఫలం అయ్యాడు. ట్విస్టులు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. కుటుంబానికి దూరమైన బాధలో మద్యానికి అలవాటైన హీరోయిన్ని హీరో తన మాటలతో మార్చి, ఆమెను కుటంబానికి దగ్గరయ్యేలా చేయడమే ఈ సినిమా కథ. అయితే ఇందులో వచ్చే ట్విస్టుల మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా కిరణ్ అబ్బవరం గెస్ట్ రోల్‌గానే కనిపిస్తాడు. ఫ్యామిలీతో తేజుకు ఉన్న అనుబంధం, ఆమె లవ్‌స్టోరి, అందులో వచ్చే ట్విస్ట్‌లతో ఫస్టాప్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో లాయర్ పాపతో వివేక్ లవ్‌స్టోరీ ఫన్నీగా సాగుతుంది. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్ నవ్వులు పూయిస్తుంది. అయితే కొన్ని డైలాగ్స్ మాత్రం సహజంగా కాకుండా తెచ్చిపెట్టినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. లాజిక్కులు వెతక్కుండా చూస్తే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. క్యాబ్ డ్రైవర్ వివేక్ పాత్రకి కిరణ్ అబ్బవరం న్యాయం చేశాడు. గత చిత్రాలలో పోలిస్తే నటన పరంగా ఓ మెట్టు ఎక్కాడనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంజనా ఆనంద్ పాత్ర చాలా కీలకం. తేజుగా ఆమె తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లాయర్ దుర్గగా సోనూ ఠాకూర్ మెప్పించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తెరపై అందంగా కనిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. సంజు తండ్రిగా నటించిన ఎస్వీ కృష్ణారెడ్డి తన పాత్రకు న్యాయం చేశాడు. సెకండాఫ్‌లో బాబా భాస్కర్ తనదైన కామెడీతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మణిశర్మ సంగీతం బాగుంది. పాటలు ఈ సినిమాకు చాలా ప్లస్. నేపథ్య సంగీతం పర్వాలేదు. రాజ్ నల్లి సినిమాటోగ్రఫి బాగుంది. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
‘కొత్త కొత్తగా’ మూవీ రివ్యూ
టైటిల్: కొత్త కొత్తగా నటీనటులు: అజయ్ , వీర్తి వఘాని, ఆనంద్, కాశీ విశ్వనాధ్ ,తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈరోజుల్లో సాయి తదితరులు నిర్మాణ సంస్థ: ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: వెంకట్ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేది: సెప్టెంబర్ 9,2022 అజయ్, వీర్తి వఘాని జంటగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బీజీ గోవింద రాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘కొత్త కొత్తగా’ కథేంటంటే.. రాజీ (వీర్తి వఘాని), సిద్దు (అజయ్) ఇద్దరూ ఒకే కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అబ్బాయికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని రాజీ ని చూడగానే సిద్దు ఇష్టపడతాడు. మరో వైపు రాజీ అన్న కేశవ్ తన చెల్లికి దగ్గరి సంబంధం కాకుండా దూరం సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు.అయితే కేశవ్ బామ్మర్ది రామ్ (పవన్ తేజ్) తన అక్క సత్య (లావణ్య రెడ్డి) తో రాజీ అంటే చాలా ఇష్టం తనని పెళ్లి చేసుకొంటాను అంటాడు. రామ్ తల్లి తండ్రులు రాజీవ్ ఫ్యామిలీ తో మాట్లాడడంతో మొదట కేశవ్ కు ఇష్టం లేకపోయినా చివరికి ఒకే అనడంతో రామ్ తో రాజీకి పెళ్లి ఫిక్స్ చేస్తారు. కానీ రాజీకి మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. ఇంకా చదువుకోవాలని అనుకుంటుంది. అదే సమయంలో తనను సిద్దు ప్రాణంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతన్ని ఇష్టపడుతుంది. మరి రాజీ చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంది? తల్లిదండ్రుల కోసం రామ్‌తో పెళ్లికి సిద్దమైందా? లేదా ప్రేమించిన సిద్దుతోనే జీవితాన్ని పంచుకుందా? తన ప్రేమను దక్కించుకోవడం కోసం సిద్దు ఎలాంటి త్యాగం చేశాడు? అనేదే మితతా కథ. ఎలా ఉందంటే.. నేటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని ‘కొత్త కొత్తగా’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది కలగకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే అనే క్యూరియాసిటీ ప్రేక్షకులకు కలిగిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకున్నప్పటీకీ.. కొన్ని సాగదీత సీన్స్ పంటికింద రాయిలా ఉంటాయి. ఒకటి రెండు కామెడీ సీన్స్ బాగుంటాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక నటీనటుల విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోగా నటించిన అజయ్‌కి ఇది తొలి సినిమా. అయినప్పటికీ సిద్దు పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఒక పెద్దింటి పల్లెటూరు అమ్మాయి రాజీ గా వీర్తి వఘాని అద్భుతమైన నటనను ప్రదర్శించింది.రొమాన్స్ లోను, ప్రేమలోనూ తను అన్ని బావోధ్వేగాలను చాలా బాగా వ్యక్త పరచింది. రాజీ అన్నగా కేశవ్ (అనిరుద్ ) రఫ్ క్యారెక్టర్ లో ఒదిగిపపోయాడు ,రాజీ బావగా రామ్ (పవన్ తేజ్), రాజీ కి వదినగా సత్య (లావణ్య రెడ్డి) లు చక్కటి నటనను ప్రదర్శించారు. బస్ స్టాప్,ఈ రోజుల్లో ఫెమ్ సాయి హీరో ఫ్రండ్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. అలాగే వాసు మంచి రోల్ చేశాడు.. ఇంకా ఈ సినిమాలో నటించిన వారంతా వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదు. ఒకటి రెండు పాటలు బాగున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ప్రియతమా పాట చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. వెంకట్ సినిమాటోగ్రాఫర్ వెంకటర్ మంచి విజువల్స్ ఇచ్చాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Brahmastra Review: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ
టైటిల్: బ్రహ్మాస్త్రం నటీనటులు: రణ్‌బీర్ కపూర్, అలియాభట్, అమితాబచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్, షారుఖ్‌ఖాన్ తదితరులు నిర్మాణ సంస్థలు : స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ దర్శకత్వం : అయాన్ ముఖర్జీ సంగీతం : ప్రీతమ్ సినిమాటోగ్రఫీ:సుదీప్ చటర్జీ, పంకజ్ కుమార్, మణికందన్, వికాష్ నౌలాఖ విడుదల తేది: సెప్టెంబర్ 9, 2022 బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 9) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తుండటంతో ‘బ్రహ్మాస్త్రం’పై టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచాయి. మరి బ్రహ్మాస్త్రలోని మొదటి భాగం ‘శివ’ను ప్రేక్షకులను ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అన్ని అస్త్రాలకు అధిపతి బ్రహ్మాస్త్రం. మూడు ముక్కలైన ఈ శక్తివంతమైన అస్త్రాన్ని తరతరాలుగా బ్రహ్మాన్ష్ సభ్యులు కాపాడుతుంటారు. ఈ మూడు ముక్కల్లో ఒక భాగం సైంటిస్ట్ మోహన్ భార్గవ్(షారుఖ్ ఖాన్), రెండో భాగం ఆర్టిస్ట్ అనీష్(నాగార్జున)దగ్గరు ఉంటాయి. మూడో భాగం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అయితే ఈ బ్రహ్మాస్త్రం స్వాధీనం చేసుకొని ప్రపంచాన్ని శాసించాలని చూస్తుంది జునూన్(మౌనీరాయ్). తన టీమ్‌తో కలిసి మూడు ముక్కలను వెతికి పట్టుకొని వాటిని అతించేందుకు ప్రయత్నిస్తుంది. జునూన్ బృందం ప్రయత్నానికి అడ్డుతగులుతాడు శివ(రణ్‌బీర్ కపూర్). డీజే నడుతూ జీవనం సాగించే శివకి, బ్రహ్మాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి? అతను ఎందుకు జునూన్ టీమ్ చేసే ప్రయత్నానికి అడ్డుతగులుతున్నాడు? శివ నేపథ్యం ఏంటి? అగ్నికి అతనికి ఉన్న సంబంధం ఏంటి? బ్రహ్మాస్త్రంలోని మూడో ముక్క ఎవరి దగ్గరు ఉంది? హిమాలయాల్లో ఉన్న గురు(అమితామ్ బచ్చన్) దగ్గరికి వెళ్లిన తర్వాత శివకు తెలిసి నిజాలు ఏంటి? ప్రియురాలు ఈషా(అలియా భట్)తో కలిసి బ్రహ్మాస్త్రాన్ని శివ ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హిందూ పురాణాలను ఆధారంగా చేసుకొని రాసుకున్న కథే ‘బ్రహ్మాస్త్ర’. పురాణాల ప్రకారం అన్ని అస్త్రాల్లోకెల్లా అంత్యంత శక్తివంతమైనది బ్రహ్మాస్త్రం. దీనిని ఆధారంగా చేసుకొని దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర కథను రాసుకున్నాడు. ప్రపంచానికి మంచి చేసే ఓ శక్తివంతమైన అస్త్రం అది. దానికి అద్భుతమైన శక్తులు ఉంటాయి. దానిని రక్షించడానికి ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. అదేసమయంలో ఆ శక్తిని దక్కించుకొని ప్రపంచాన్ని శాసించాలనుకునే ఓ దుష్టశక్తి ఉంటుంది. ఆ దుష్టశక్తి భారీ నుంచి ఆ అస్త్రాన్ని ఎలా కాపాడారు అనేదే ఈ చిత్ర కథ. ఈ తరహా నేపథ్యం ఉన్న చిత్రాలు హాలీవుడ్లో చాలానే వచ్చాయి. ఇలాంటి చిత్రాలకు అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పాటు తలతిప్పుకోకుండా చేసే స్క్రీన్‌ప్లే కూడా అత్యవసరం. ఈ విషయంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ పూర్తిగా తేలిపోయాడు. గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోదు. బ్రహ్మాస్త్రం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ చిరంజీవి ఇచ్చే వాయిస్ ఓవర్‌తో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. వానారాస్త్రం కలిగి ఉన్న సైంటిస్ట్ మోహన్(షారుఖ్)తో జునూన్ టీమఠ్ చేసే పోరాట ఘట్టంతో కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. డీజే శివగా రణ్‌బీర్ ఎంట్రీ ఇవ్వడం.. ఈషాతో ప్రేమలో పడడం.. తనకు వచ్చే కలల్ని ఆమెతో పంచుకోవడం.. అనీష్ని రక్షించేందుకు వారణాసి వెళ్లడం..అక్కడ నంది అస్త్రాన్ని అనీష్ ప్రయోగించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. తెరపై వచ్చే సీన్స్ మనకు ఎమోషనల్ గా టచ్ అవ్వకుండా అలా వెళ్లిపోతూ ఉంటాయి. శివ, ఈషాల మధ్య ప్రేమ చిగురించడం కూడా పూర్తి సినిమాటిక్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో గురుగా అమితాబ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. శివ గతం..అతనిలో ఉన్న అగ్ని అస్త్రాన్ని బయటకు తీసుకురావడానికి గురు చేసే ప్రయత్నం కొంతమేర ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఈషాతో శివ నడిపించే ప్రేమాయణం కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సన్నీవేశాలు మాత్రం సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్‌పై పెట్టిన శ్రద్ధ.. కథ, కథనంపై పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. శివ పాత్రలో రణ్‌బీర్ చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఈషా పాత్రకు న్యాయం చేసింది అలియా భట్. రణ్‌బీర్, అలియా మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయింది. అయితే వారిద్దరు ప్రేమలో పడిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోదు. వానర అస్త్రం కలిగి ఉన్న సైంటిస్ట్ మోహన్‌గా షారుఖ్, నంది అస్త్రాన్ని కలిగిన ఉన్న ఆర్టిస్ట్ అనీష్‌గా నాగార్జున ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక గురుగా అమితాబ్ బచ్చన్ తెరపై మరోసార తన అనుభవాన్ని చూపించాడు. జునూన్గా మౌనీరాయ్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ప్రీతమ్ నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ వర్క్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘ఒకే ఒక జీవితం’ మూవీ రివ్యూ
టైటిల్: ఒకే ఒక జీవితం నటీనటులు: శర్వానంద్, రీతూవర్మ, అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నిర్మాతలు : ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు డైలాగ్స్: తరుణ్ భాస్కర్ సంగీతం : జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ విడుదల తేది: సెప్టెంబర్ 9, 2022 కథేంటంటే.. ఆది(శర్వానంద్), శ్రీను(వెన్నెల కిశోర్), చైతూ(ప్రియదర్శి) ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆది మంచి గిటారిస్ట్ కానీ స్టేజ్‌పై పాడాలంటే భయం. ప్రియురాలు వైష్ణవి(రీతూ వర్మ) ఎంత ఎంకరేజ్ చేసినా.. ఆది సక్సెస్ కాలేకపోతాడు. కళ్ల ముందు అమ్మ (అమల) ఉంటే బాగుండేది అనుకుంటారు. ఇరవేళ్ల క్రితం(మార్చి 28,1998) రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి ఆదికి స్టేజ్ ఫిగర్ ఇంకా ఎక్కువతుంది. ఇక శ్రీను చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేక హౌస్ బ్రోకర్‌గా మారుతాడు. ఇంగ్లీష్ అస్సలు రాదు. చిన్నప్పుడు మంచిగా చదువుకొని ఉంటే బాగుండేది కదా అని బాధ పడుతుంటాడు. ఇక మూడో వ్యక్తి చైతూకి పెళ్లి సమస్య. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలకుంటాడు. కానీ ఏ అమ్మాయి నచ్చదు. చిన్నప్పుడు తనను ఇష్టపడిన సీతను ఎందుకు ప్రేమించలేదని ప్రతి క్షణం బాధపడుతుంటాడు. ఇలా బాధపడుతున్న ఈ ముగ్గురు స్నేహితుల జీవితంలోకి సైంటిస్ట్ రంగీ కుట్టా పాల్ అలియాస్ పాల్ (నాజర్) ప్రవేశిస్తాడు. అతను టైమ్ మిషన్ కనిపెట్టడానికి 20 ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉంటాడు. చివరకు తను టైమ్ మిషన్‌ని కనిపెడతాడు. ఆ మిషన్‌తో ఆది,శ్రీను, చైతూలను భూత కాలంలోకి పంపుతానని చెబుతాడు. వారు కూడా తాము చేసిన తప్పులను సవరించుకోవాలని భావించి గత కాలంలోకి వెళ్లేందుకు రెడీ అవుతారు. మరి ఆది వెనక్కి వెళ్లి రోడ్డు ప్రమాదం బారిన పడకుండా తన తల్లిని కాపాడుకున్నాడా? శ్రీను, చైతూలు పాత తప్పుల్ని సరిదిద్దుకున్నారా? లేదా? భూతకాలంలో ఈ ముగ్గురికి ఎదురైన వింత సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా ఆదిత్య 369. ఆ మధ్య వచ్చిన ‘24’తో పాటు రీసెంట్గా విడుదలైన ‘బింబిసార’కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రాలే. అలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘ఒకే ఒక జీవితం’. అయితే ఆ సినిమాలతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది టైమ్ ట్రావెల్ చిత్రమే అయినప్పటికీ..ఇందులో ‘అమ్మ’ కథ దాగి ఉంది. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు. టైమ్ మిషన్‌లోకి వెళ్లేంత వరకు కథ నెమ్మదిగా సాగుతుంది..కానీ ఒక్కసారి భవిష్యత్తులోకి వెళ్లాక వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముగ్గురు యువకులు.. చిన్నప్పుడు తామెలా ఉన్నామో చూసుకునేందుకు వెళ్లడం..తాము చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం..ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శర్వానంద్, అమల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. వెన్నెల కిశోర్ పాత్ర సినిమాకు మరో ప్రధాన బలం. ఆ పాత్ర పండించిన కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ప్రియదర్శి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చి దిద్దితే బాగుండేది. భూతకాలంలోకి వెళ్లిన శ్రీను, చైతూలను కూడా తమ ఫ్యామిలీలతో కలిసేలా చూపిస్తే.. కథ ఇంకాస్త ఎమోషనల్‌గా సాగేదేమో. క్లైమాక్స్ కూడా ఊహకి అందేలా ఉంటుంది. టైమ్ ట్రావెల్ సీన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. స్లో నెరేషన్ కూడా సినిమాకు కాస్త మైనస్. సైన్స్ గొప్పదని చెప్తూనే.. విధిని ఎవరు మార్చలేరనే విషయాన్ని బలంగా చూపించిన దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. శర్వానంద్‌ని నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఆది పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. రొటీన్ కమర్షియల్ హీరో పాత్రలకు భిన్నమైన పాత్ర తనది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం వెన్నెల కిశోర్ పాత్ర. బ్రోకర్ శ్రీనుగా వెన్నెల కిశోర్ తనదైన కామెడీతో నవ్వించాడు. అదే సమయంలో కొన్ని చోట్ల అతను చెప్పే డైలాగ్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి. చైతూ పాత్రకి ప్రియదర్శి న్యాయం చేశాడు. తన పాత్రని ఇంకాస్త బలంగా డిజైన్ చేస్తే బాగుండేది. ఇక ఈ సినిమాకు అమల పాత్ర మరో ప్లస్ పాయింట్. అమ్మ పాత్రకు చాలా బాగా సూట్ అయ్యారు. శర్వానంద్, అమల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ఇక ఆది లవర్ వైష్ణవిగా రీతూ వర్మ మెప్పించింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. సైంటిస్ట్ పాల్గా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇలాంటి సీరియస్ పాత్రలు చేయడం నాజర్‌కి కొత్తేమి కాదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం బాగుంది. ఈ చిత్రంలో హీరో గిటారిస్ట్. కాబట్టి సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా గుర్తిండిపోయే పాటలు లేకపోవడం మైనస్. ‘అమ్మ’పాట మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. కానీ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆ పాటని మర్చిపోతాం. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కెప్టెన్’ మూవీ రివ్యూ
టైటిల్ : కెప్టెన్ నటీనటులు : ఆర్య, ఐశ్యర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీశ్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు నిర్మాణ సంస్థ: ది షో పీపుల్, థింక్ స్టూడియోస్, ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల: శ్రేష్ఠ్ మూవీస్ దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్ సంగీతం : డి ఇమాన్ సినిమాటోగ్రఫీ: ఎస్ యువ విడుదల తేది: సెప్టెంబర్8,2022 కథేంటంటే.. భారత్‌లోని ఈశాన్య అటవీ ప్రాంంతంలో, సెక్టార్ 42కి చెందిన అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా పౌర, సైనిక కార్యకలాపాలు లేవు. ఆ ప్రదేశానికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రావడం లేదు. వారికి వారే షూట్ చేసుకొని చనిపోతున్నారు. దీంతో ఈ మిస్టరీని తెలుసుకోవడానికి భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) బ్యాచ్‌ని రంగంతోకి దించుతుంది. కెప్టెన్ విజయ్‌కి ఏ ఆపరేషన్ అయినా విజయవంతంగా పూర్తి చేస్తాడనే పేరుంది. తన టీమ్‌తో కలిసి స్పెషల్ ఆపరేషన్స్ చేపడుతుంటాడు. అందుకే ఈ డేంజరస్ ఆపరేషన్ని కెప్టెన్ విజయ్‌కి అప్పగిస్తుంది ప్రభుత్వం. విజయ్ తన బృందంతో కలిసి సెక్టార్ 42 ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ మినటార్స్(వింత జీవులు) ఉన్నాయని, వాటివల్లే అక్కడికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిగిరి రావడంలేదని విజయ్ గుర్తిస్తాడు. మరి విజయ్ తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఆ వింత జీవులు ఏంటి? సైనికులు తమకు తాము షూట్ చేసుకునేలా మినటార్స్ ఏం చేస్తున్నాయి? సైంటిస్ట్ కీర్తి(సిమ్రాన్) చేసే పరిశోధన ఏంటి? చివరకు కెప్టెన్ విజయ్ మినటార్స్ని అంతం చేశాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కెప్టెన్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అసక్తి పెరిగింది. వింత జీవులతో ఇండియన్ ఆర్మీ ఫైట్ చేయడం అనే కొత్త పాయింట్‌తో సినిమా తెరకెక్కడంతో అందరికి దృష్టి ‘కెప్టెన్’పై పడింది. అయితే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. దానికి తగ్గ కథ, కథనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ హాలీవుడ్ చిత్రాలను చూసి కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్ వర్సస్ క్రియేచర్ జానర్లో ఈ సినిమా సాగుతుంది. అందులో అయినా ఏదైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. సెక్టార్ 42లో వింత జీవులు ఉంటాయి వాటితో కెప్టెన్ విజయ్ యుద్దం చేయాలి అనేది ఫస్టాఫ్ పాయింట్ అయితే.. ఎలా చేశాడనేది సెకండాఫ్. దీనికి కథను అల్లడానికి ఫస్టాఫ్‌లో అసవరమైన సీన్స్ అన్ని బలవంతంగా చొప్పించాడు దర్శకుడు. ఆ సీన్స్ కూడా ఆకట్టుకున్నట్లు ఉంటుందా అంటే అదీ లేదు. ఇక సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు చాలా ఉంటాయి. సెక్టార్ 42కి వెళ్లిన సైనికులు మరణిస్తారని చూపించిన దర్శకుడు.. వారిని తీసుకురావడానికి వెళ్లిన సైనికులకు ఏమి కాలేదన్నట్టు సన్నివేశాలు రూపొందించడం.. గన్‌తో షూట్ చేసే మినటార్స్ మరణించడం లేదని తెలిసినా.. మళ్లీ మళ్లీ సైనికులు గన్స్ పట్టుకొనే ఆ ప్రదేశానికి వెళ్లడం.. సైంటిస్ట్ కీర్తికి కెప్టెన్ జవాన్ సైన్స్ గురించి చెప్పడం.. ఆమె ఆశ్యర్యంగా చూడడం..ఇలా చాలా సన్నివేశాల్లో లాజిక్ మిస్సవుతుంది. అదే సమయంలో హీరో మాత్రం ఎందుకు స్పృహ కోల్పోవడం లేదనడానికి మాత్రం సరైన కారణం చెప్పాడు. వీఎఫ్ఎక్స్ అంతగా ఆకట్టుకోలేదు. కథకు కీలకమైన క్రీచర్ని కూడా సరిగా చూపించలేకపోయారు. మినటార్స్తో వచ్చే ఫైట్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతాయి. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. ఆ చిత్రాలను చూడని ప్రేక్షకులకు ‘కెప్టెన్’ కాస్త కొత్తగా కనిపిస్తాడు. ఎవరెలా చేశారంటే.. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రకు ఆర్య న్యాయం చేశాడు. ఉన్నంతలో యాక్షన్స్ సీన్స్‌ని కూడా అదరగొట్టేశాడు. అతని టీమ్‌లోని సభ్యులు కూడా చక్కటి నటనను కనబరిచారు. ఐశ్వర్య లక్ష్మి రెండు సీన్స్, ఓ పాటలో కనిపిస్తుంది అంతే. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సైంటిస్ట్ కీర్తిగా సిమ్రాన్ పర్వాలేదనిపించింది. అయితే ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. ఎస్ యువ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇమాన్ నేపథ్య సంగీతం ఆట్టుకునేలా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోతాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘బుజ్జి.. ఇలారా’ మూవీ రివ్యూ
టైటిల్ : బుజ్జి.. ఇలారా నటీనటులు :సునీల్, ధన్‌రాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, పోసాని కృష్ణమురళీ, సత్యకృష్ణ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ఎన్ఎస్ క్రియేషన్ నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి దర్శకత్వం:‘గరుడ వేగ’ అంజి సంగీతం : సాయి కార్తిక్ సినిమాటోగ్రఫీ: ‘గరుడ వేగ’ అంజి ఎడిటర్: చోటా కే ప్రసాద్ కథేంటంటే.. వరంగల్ నగరంలో చిన్న పిల్లలు వరసగా కిడ్నాప్‌కి గురవుతుంటారు. ఈ కిడ్నాప్ వ్యవహారం మట్వాడ పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చిన సీఐ కేశవ నాయుడు(ధన్‌రాజ్)కు సవాల్‌గా మారుతుంది. ఈ కేసును ఛేదించే క్రమంలో రెండు వేరు వేరు ముఠాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని గుర్తిస్తారు. అయితే వారిలో ఓ ముఠా పిల్లలను ముంబైకి సరఫరా చేస్తే.. మరో ముఠా మాత్రం ఎనిమిదేళ్ల పిల్లల శరీరం నుంచి గుండెని తీసి, వారి మృతదేహాలను అక్కడక్కడ పడేస్తుంటారు. రెండో ముఠా సభ్యులను పట్టుకునే క్రమంలో కేశవ్‌కు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. పిల్లల కిడ్నాప్ వ్యవహరం వెనుక తన మామ(శ్రీకాంత్ అయ్యంగార్) హస్తం ఉందని గుర్తిస్తాడు. అతన్ని పట్టుకునే క్రమంలో కేశవ్‌ని ప్రమాదానికి గురవుతాడు. పోలీసు అధికారి మహ్మద్ ఖయ్యూం(సునీల్) కావాలనే వ్యాన్‌తో కేశవ్‌పై దాడి చేస్తాడు. అసలు ఈ ఖయ్యూం ఎవరు? సీఐ కేశవ్‌పై ఎందుకు దాడి చేశాడు? ప్రమాదం తర్వాత కేశవ్‌కు తెలిసిన భయంకరమైన నిజాలేంటి? అసలు పిల్లలను కిడ్నాప్ చేస్తుందెవరు? ఎందుకు చిన్నారుల గుండెలను అపహరిస్తున్నారు? ఈ మిస్టరీని మహ్మద్ ఖయ్యూం, కేశవ్ కలిసి ఎలా ఛేదించారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘బుజ్జి.. ఇలారా’.. ఓ సైకలాజికల్ థ్రిల్లర్. టైటిల్, కాస్టింగ్‌ని చూసి ఇదేదో సాఫ్ట్ సబ్జెక్ట్ అనుకొని థియేటర్స్‌కు వెళ్లే ఆడియన్స్‌కి ఢిపరెంట్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. కథలో ఊహించని ట్విస్టులు, మలుపులు ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగిస్తాయి. భార్య అను(చాందిని తమిళరాసన్)తో కలిసి కేశవ్ వరంగల్‌కి రావడం.. అక్కడ పిల్లలు కిడ్నాఫ్ అవడం.. దానిని ఛేదించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. వినడానికి ఇది సింపుల్‌గా ఉన్నా.. ఊహించిన ట్విస్ట్‌లతో ప్రేక్షకుడికి సీటుకే పరిమితమయ్యేలా చేస్తుంది. కిడ్నాప్ వ్యవహారం వెనుక తన మామ ఉన్నాడని కేశవ్ అనుమానించడం, అతన్ని పట్టుకునే క్రమంలో మహ్మద్ ఖయ్యూమ్‌గా సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో సెకడాఫ్పై ఆసక్తి కలుగుతుంది. ఇక సెకండాఫ్ కూడా అంచనా వేయలేని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. అదే క్రమంలో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. క్లైమాక్స్ అన్ని వర్గాల ప్రేక్షకులు హర్షిస్తారని చెప్పలేం. చివరి 10 నిమిషాలు హింసను అతిగా చూపించడం సినిమాకు ప్రతికూలంగా మారినట్టు అనిపిస్తుంది. థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవారికి ‘బుజ్జి ఇలా రా’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే... కమెడియన్ ధన్‌రాజ్ ఇలాంటి పాత్రలో నటించి పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. ఇన్నాళ్లు కామెడీ పాత్రల్లో కనిపించిన ధన్‌రాజ్.. ఇందులో సీరియస్ పోలీసు అధికారి రోల్ చేసి మెప్పించాడు. సీఐ కేశవ్ పాత్రలో ధన్‌రాజ్ ఒదిగిపోయాడు. తెరపై కొత్త ధన్‌రాజ్‌ని చూస్తారు. ఇక సీఐ మహ్మద్ ఖయ్యూంగా సునీల్ ఆకట్టుకున్నాడు. గతంలో కూడా సునీల్ ఇలాంటి పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఇక్కడ హీరోయిన్ చాందినీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీఐ కేశవ్ భార్య అను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా అంత ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్‌తో ఆమె నటన మరో ఎత్తు. శ్రీకాంత్ అయ్యంగార్, భూపాల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సినిమాకు ప్రధాన బలం సాయి కార్తిక్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇటీవల వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను గుర్తు చేస్తుంది. ‘గరుడ వేగ’ అంజి దర్శకుడిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్‌గాను మంచి పనితీరును కనబరిచాడు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సినిమాను చకచక పరుగులు పెట్టించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఆకాశ వీధుల్లో మూవీ రివ్యూ
టైటిల్ : ఆకాశ వీధుల్లో నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ దర్శకత్వం: గౌతమ్ కృష్ణ సంగీతం : జూడా శాండీ సినిమాటోగ్రఫీ:విశ్వనాధ్ రెడ్డి విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022 ఈ మధ్య కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోలు వారి సినిమా కథలను వారే రాసుకుంటున్నారు. కొంతమంది అయితే నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు. ఇలా మల్టీ టాలెంట్‌తో ఇండస్గ్రీలో తమ మార్క్‌ను చూపించుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలోకి వచ్చాడు గౌతమ్ కృష్ణ. ‘ఆకాశ వీధుల్లో’సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 2) థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సిద్దు(గౌతమ్ కృష్ణ)కి మ్యూజిక్ అంటే ప్రాణం. చదువు అంతగా రాదు కానీ..సంగీతంపై మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే సిద్ధు తండ్రి(దేవీ ప్రసాద్)కి మాత్రం అది నచ్చదు. కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటాడు. ఇదే విషయం సిద్దుతో చెబితే..తనకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని, సంగీతం నేర్చుకుంటానని చెబుతాడు. తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడు. ఎప్పటికైనా రాక్ స్టార్ అవుతానని కలలు కంటాడు. మ్యూజిక్ ప్రయత్నాలు చేస్తూనే.. నిషా(పూజితా పొన్నాడ)తో ప్రేమలో పడిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత నిషా తో మనం లివింగ్ లో ఉందామని చెపుతాడు సిద్దు. నిషా మాత్రం తనకు లవ్‌పై నమ్మకం లేదని చెప్పి అతనికి దూరంగా ఉంటుంది.ప్రేమ విఫలం కావడంతో సిద్దు మద్యానికి, డ్రగ్స్‌కి అలవాటు పడతాడు. ఫ్రెండ్స్ చెప్పిన వినకుండా నిత్యం డ్రగ్స్ తీసుకుంటూ సంగీతాన్ని పూర్తిగా పక్కకి పెడతాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినని పరిస్థితుల్లో ఉన్న సిద్దు తన గర్ల్ ఫ్రెండ్ నిషా ప్రేమను తిరిగి పొందగలిగాడా లేదా? సామాన్యుడైన సిద్దు చివరకు రాక్‌స్టార్ అయ్యాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. లవ్ ఫెయిల్యూర్‌తో హీరో డిప్రెషన్లో పడిపోవడం, తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టి విజయం సాధించడం. ఇలాంటి చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. ఆకాశ వీధుల్లో కూడా ఇదే కోవలోకి వస్తుంది. అయితే కథనం మాత్రం కొత్తగా ఉంటుంది. ప్రస్తుత యంగ్‌స్టర్స్ ఎలా ఉంటున్నారు? వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? మనలో మనకు జరిగే సంఘర్షణ ఎలా ఉంటుంది? కుటుంబ పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయనే అంశాలను తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు గౌతమ్. ఇందులో ఆయనే హీరో అవ్వడం కలిసొచ్చింది.కొన్ని లవ్ సీన్స్ మరియు ప్రయాణ సన్నివేశాలు కొత్తగా లేకపోయినా, ఆ సన్నివేశాలు మిమ్మల్ని కాసేపు నిమగ్నం చేస్తాయి హీరో పాత్రని ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. దర్శకుడిగా గౌతమ్‌కి ఇది తొలి సినిమానే అయినా కథనం, సంభాషణలు ఇవన్నీ చక్కగా కుదిరేలా రాసుకున్నాడు. ఎవరెలా చేశారంటే.. గౌతమ్ కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా అది తెరపై కనిపించకుండా..పాత్ర పరిధిమేరకు చక్కగా నటించాడు. అటు రొమాంటిక్ పాత్రలో, ఇటు రాక్ స్టార్ పాత్రలో రెండు షేడ్స్ వున్న పాత్రలలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. నిషా గా పూజిత పొన్నాడ తన లుక్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లలో యూత్ ను ఆకట్టుకుంటుంది. సిద్దు తండ్రిగా నటించిన దేవి ప్రసాద్.. మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. నిషా తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ బాగా యాక్ట్ చేశారు.సిద్దుకు తల్లిగా బాల పరాశర్, చెల్లి గా దివ్య నార్ని తమదైన నటనతో మెప్పించారు. ఫ్రెండ్స్ పాత్రలో నటించిన ఆనంద్ (రిషి),సత్యం రాజేష్ లు తన నటనతో ఆకట్టుకున్నారు . మీర్జాపూర్ ఫెమ్ హర్షిత గౌర్ స్పెషల్ అప్పిరియన్స్ గా అలరించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జూడా శాండీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. సింగర్ కాల భైరవ ఆలపించిన ‘జతగా నువ్వు లేని ఏకాకిగా’ పాట ఆకట్టుకుంటుంది. విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. శశాంక్ నాగరాజు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘డై హార్డ్ ఫ్యాన్’ మూవీ రివ్యూ
టైటిల్ : డై హార్డ్ ఫ్యాన్ నటీనటులు :ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయల్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీహాన్ సినీ క్రియేషన్స్ నిర్మాత: చంద్రప్రియ సుబుద్ది దర్శకత్వం: అభిరామ్ సంగీతం : మధు పొన్నాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి సినిమాటోగ్రఫీ:జగదీష్ బొమ్మిశెట్టి ఎడిటర్: తిరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : తిరుమలశెట్టి వెంకటేశ్ విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022 ప్రియాంక శర్మ, శివ ఆలపాటి జంటగా నటించిన చిత్రం ‘డై హార్డ్ ఫ్యాన్’. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ అభిరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ కితర కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్, ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 2)న విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? శివ(శివ ఆలపాటి) అనే యువకుడికి హీరోయిన్ ప్రియాంక (ప్రియాంక శర్మ) అంటే ఎనలేని అభిమానం. ఒక్కసారైనా తనను ప్రత్యేక్షంగా కలవాలనుకుంటాడు. ఆమె ఏ ఫంక్షన్‌కి వెళ్లినా తను అక్కడికి వెళ్లేవాడు. ఇక తన అభిమాన హీరోయిన్ ప్రియాంక బర్త్‌డేని ఎంతో గ్రాండ్‌గా చేద్దామని ప్లాన్ వేస్తాడు శివ. అయితే అనుకోకుండా ఓ రోజు రాత్రి ఆమె పర్సనల్ మొబైల్ నుంచి శివకు మెసేజ్ వస్తుంది. శివ ఆ షాక్‌లో ఉండగానే.. ప్రియాంక నేరుగా అతని ఇంటికి వస్తుంది. ఆ రాత్రి పూట స్టార్ హీరోయిన్ ప్రియాంక.. తన అభిమాని ఇంటికి రావడానికి కారణం ఏంటి? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి జరిగిన సంఘటన నుంచి శివ ఎలా బయట పడ్డాడు? హత్య కేసులో ఇరుక్కున్న శివ, అతని మామయ్య శంకర్‌ని బయటకు తీసుకురావడానికి లాయర్ కృష్ణకాంత్(రాజీవ్ కనకాల) ఎలాంటి ప్రయత్నం చేశాడు? ఈ హత్య కేసుకు లాయర్ కృష్ణకాంత్‌కు ఏదైనా సంబధం ఉందా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా లో నటించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు. అలాంటి ఓ అభిమాని తను అభిమానించే హీరొయిన్ ని కలవాలనుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ కలిస్తే ఆ రాత్రి ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశం. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు అభిరామ్. సాధారణ కథే అయినా.. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్ పంటికింద రాయిలా అయిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ల్యాగ్ సీన్స్ ఎక్కువయ్యాయి. ఈ సినిమా కథంతా హీరోయిన్ పాత్ర చుట్టే తిరుగుతంది. కథని మరింత పకడ్బందీగా రాసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. హీరోయిన్ ప్రియాంకగా ప్రియాంక శర్మ తనదైన నటనతో ఆకట్టుకుంది. డై హార్డ్ ఫ్యాన్‌గా శివగా శివ ఆలపాటి ఆకట్టుకున్నాడు. షకలక శంకర్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. కాబోయే రాజకీయ నాయకుడు బేబమ్మ పాత్రలో శంకర్ ఒదిగిపోయాడు. లాయర్ కృష్ణకాంత్గా రాజీవ్ కనకాల మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఆదిత్య పాత్రలో నోయల్ చాలా చక్కగా నటించారు. కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే..ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. మధు పొన్నాస్ కంపోజ్ చేసిన పరుగే పరుగు పాట బాగుంది. జగదీష్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ, ఎడిటర్ తిరు పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Cobra Review: ‘కోబ్రా’మూవీ రివ్యూ
టైటిల్ : కోబ్రా నటీనటులు : చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మీనాక్షి , మృణాళిని తదితరులు నిర్మాణ సంస్థ: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్ దర్శకత్వం: అజయ్ జ్ఞానముత్తు సంగీతం : ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ:హరీష్ కణ్ణన్ విడుదల తేది: ఆగస్ట్ 31, 2022 ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు తమిళస్టార్ చియాన్ విక్రమ్. ఫలితాన్ని పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే విక్రమ్ ప్రయోగానికి ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి కానీ..సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. అందుకే ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో విక్రమ్ పది పాత్రలు పోషించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘కోబ్రా’పై హైప్ క్రియేట్ అయింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(ఆగస్ట్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాలిడ్ హిట్ కోసం 17 ఏళ్లు ఎదురుచూస్తున్న విక్రమ్‌కు ‘కోబ్రా’తో ఆ కొరత తీరిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. స్కాట్లాండ్ ప్రిన్స్ బహిరంగ హత్యకు గురవుతారు. ఈ కేసును విచారిస్తున్న ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లామ్(ఇర్ఫాన్ ఫఠాన్).. ఒడిశా ముఖ్యమంత్రి, రష్యా మంత్రి కూడా అదే రీతిలో హత్యకు గురయ్యారని గుర్తిస్తాడు. ఈ హత్యలకు కోల్‌కతాలో ఉన్న లెక్కల మాస్టర్ మది(చియాన్ విక్రమ్)కి సంబంధం ఉందని అనుమానిస్తాడు. అలాగే వేరు వేరు దేశాల్లో జరిగిన ఈ హత్యలతో యువ వ్యాపారవేత్త రిషి(రోషన్ మాథ్యూ)కి కూడా సంబంధం ఉంటుంది. మరి వీరిలో ఎవరు ఆ హత్యలు చేశారు? ఈ కేసు విచారణలో అస్లామ్‌కు ఓ లెక్కల స్టూడెంట్ జూడీ(మీనాక్షీ గోవింద్ రాజన్) ఏ రకమైన సహాయం చేసింది? సాధారణ లెక్కల మాస్టర్‌కు ఈ హత్యలకు ఎలాంటి లింక్ ఉంది? కధీర్కు మదికి ఉన్న సంబంధం ఏంటి? పోలీసుల విచారణలో ఏం తేలింది? అనేదే కోబ్రా కథ. ఎలా ఉందంటే.. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘కోబ్రా’. ఇందులో విక్రమ్ పది రకాల పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఒక్కో పాత్ర కోసం ఐదారు గంటల పాటు మేకప్‌కే సమయం కేటాయించేవాడని మూవీ ప్రమోషన్స్‌లో మేకర్స్ తెలిపారు. అతని కష్టం తెరపై కనిపించింది కానీ..అజయ్ జ్ణానముత్తు కథనే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. గతంలో డిమాంటీ కాలనీ, అంజలి సీబీఐ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అజయ్.. విక్రమ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. విక్రమ్‌కు సెట్ అయ్యే కాన్సెప్ట్నే ఎంచుకున్నాడు కానీ తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేకపోయాడు. వరుస హత్యలతో కథ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రారంభమవుతుంది. మాథ్యమెటిక్స్లో ఉన్న అనుభవంతో ఆ హత్యలను ఎలా చేశారో వివరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఆ తర్వాత మాత్ర కథ పూర్తిగా తేలిపోతుంది. సుదీర్ఘంగా సాగే మది, కధీర్ల ప్లాష్‌బ్యాక్ స్టోరీ సినిమాకు పెద్ద మైనస్. సెకండాఫ్ మొత్తం ప్రేక్షకుడి ఊహకందేలా సాగడమే కాకుండా.. నిడివి మరింత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా చివరి భాగంలో కొన్ని యాక్షన్ సీన్లు మెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. గెటప్పుల స్పెషలిస్ట్ విక్రమ్ నటనకు వంక పెట్టలేం. ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించడం ఆయనకు అలావాటు. మది, కధీర్ పాత్రల్లో విక్రమ్ ఒదిగిపోయాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో 10 రకాల పాత్రల్లో విక్రమ్ కనిపిస్తాడు. అందుకోసం ఈ విలక్షణ నటుడు పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక మదిని ప్రాణంగా ప్రేమించే టీచరమ్మ భావన పాత్రలో శ్రీనిధి శెట్టి జీవించేసింది. జెన్నిఫర్‌గా మృణాళిని మెప్పించింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్ర ఆమెది. ఇక లెక్కల స్టూడెంట్‌గా జూడీ మీనాక్షీ గోవింద్ రాజన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లామ్‌గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పర్వాలేదనిపించాడు. అతనికిది తొలి సినిమా. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. రోషన్ మాథ్యూ విలనిజం బాగుంది. కానీ అతని క్యారెక్టర్‌కు ఓ గోల్ అనేది లేకుండా ఉంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. సినిమాలో అనవసరపు సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కళాపురం’మూవీ రివ్యూ
టైటిల్ : కళాపురం నటీనటులు : సత్యం రాజేష్, ప్రవీణ్ యండమూరి, కాశీమా రఫి, చిత్రం శ్రీను, సన, జబర్దస్త్ అప్పారావు తదితరులు నిర్మాణ సంస్థలు: ఆర్4 ఎంటర్టైన్మెట్స్ నిర్మాతలు: రజనీ తాళ్లూరి దర్శకత్వం: కరుణకుమార్ సంగీతం : మణిశర్మ విడుదల తేది: ఆగస్ట్ 26, 2022 పలాస, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు దర్శకుడు కరుణ కుమార్. ఆయన నుంచి తాజా చిత్రం ‘కళాపురం’. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 26)విడుదలైంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. ‘కళాపురం’ కథేంటంటే.. కుమార్(సత్యం రాజేష్) సినిమా పరిశ్రమలో దర్శకుడిగా రాణించాలని ప్రయత్నిస్తుంటాడు. అతని స్నేహితుడు ప్రవీణ్(ప్రవీణ్ యండమూరి)డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడని తెలుసుకొని హైదరాబాద్ వస్తాడు. ఇద్దరు కలిసి సినిమాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఇదే సమయంలో కుమార్ ప్రాణంగా ప్రేమించిన ఇందు(కాశిమా రఫి)చేతిలో మోసపోతాడు. దీంతో సినిమా ప్రయత్నాలు ఆపి, ఉద్యోగం చేసుకుందామనే సమయంలో అప్పారావు అనే నిర్మాత కలిసి సినిమా చేద్దామని చెప్తాడు. అతని కారణంగానే కుమార్ కళాపురం అనే ఊరికి వెళ్తాడు. అక్కడ కుమార్‌కి ఎదురైన పరిస్థితుల ఏంటి? కళాపురంలో శారద(సంచిత)తో పరిచయం కుమార్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది? చివరకు కుమార్ సినిమాని తెరకెక్కించాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. చిత్ర పరిశ్రమ ఉండే మోసాలు, కష్టాలపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ‘కళాపురం’కూడా అదే కోవకు చెందినదే. కాకపోతే కరుణ కుమార్ ఈ సినిమాతో అంతర్లీనంగా చెప్పిన కథ, చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతారు. అయితే నటీనటుల ఎంపిక విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి, కథను పూర్తి స్థాయిలో విస్తరించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. పేరున్న నటీనటులు లేకపోవడం వల్ల సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను కనెక్ట్ కాలేకపోయింది. ఎలాంటి అశ్లీలత లేకుండా చక్కటి వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. లాజిక్స్ వెతక్కుండా చూస్తే ‘కళాపురం’ఎంజాయ్ చేసేయోచ్చు. ఎవరెలా చేశారంటే.. చాలా కాలం తర్వాత రాజేష్ ఫుల్లెంత్ పాత్ర చేశాడు. కుమార్ పాత్రలో ఆయన మెప్పించాడు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కటి నటనను కనబరిచాడు. కుమార్ స్నేహితుడు ప్రవీణ్ పాత్రలో ప్రవీణ్ యండమూరీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్లుగా సంచిత, కాశీమా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే అయినప్పటికీ.. తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే.. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Liger Review: లైగర్ మూవీ రివ్యూ
టైటిల్ : లైగర్ నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్‌టైసన్, విషురెడ్డి, అలీ తదితరులు నిర్మాణ సంస్థలు: ధర్మా ప్రొడెక్షన్స్,పూరీ కనెక్ట్స్ నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా దర్శకత్వం:పూరి జగన్నాథ్ సంగీతం :సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనీష్ భాగ్చి సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ ఎడిటర్:జనైద్ సిద్దిఖీ విడుదల తేది: ఆగస్ట్ 25, 2022 యావత్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘లైగర్’. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం.. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తొలిసారిగా బాక్సర్ గా వెండితెరపై కనిపించబోతుండడంతో ‘లైగర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘లైగర్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య గురువారం(ఆగస్ట్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లైగర్’ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లైగర్’ కథేంటంటే.. కరీంనగర్‌కు చెందిన బాలమణి(రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్(విజయ్ దేవరకొండ)ని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎమ్.ఎమ్.ఏ)లో నేషనల్ ఛాంపియన్‌గా చూడాలనుకుంటుంది. కొడుకుకి ట్రైనింగ్ ఇప్పించడం కోసం కరీంనగర్ నుంచి ముంబై వస్తుంది. అక్కడ ఓ టీస్టాల్ నడుపుతూ లైగర్కి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పిస్తుంది. జీవితంలో ఏ అమ్మాయి జోలికి వెళ్లొదని, ప్రేమలో పడితే మన లక్ష్యాన్ని మర్చిపోతామని చెబుతుంటుంది. కానీ లైగర్ మాత్రం ముంబైకి చెందిన తాన్య(అనన్యపాండే)తో ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా లైగర్‌ని ప్రేమిస్తుంది కానీ అతనికి నత్తి ఉందని తెలిసి దూరమవుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయిన లైగర్ చివరకు తన గోల్‌ని రీచ్ అయ్యాడా? లేదా? ఇంటర్నేషనల్ చాపియన్‌షిప్‌లో పాల్గొనడానికి లైగర్‌కు సహాయం చేసిందెవరు? తన గురువులా భావించే మైక్ టైసన్‌తో లైగర్ ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈ మధ్య కాలంలో ‘లైగర్’చిత్రానికి వచ్చినంత హైప్ ఏ చిత్రానికి రాలేదు. ఈ సారి పూరీ బలమైన కథలో వస్తున్నాడని అంతా భావించారు. తీరా సినిమా చూశాక.. పూరీ మళ్లీ పాత పాటే పాడరనిపిస్తుంది. ఓ సాధారణ ప్రేమ కథకి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యాన్ని జోడించి ‘లైగర్’ని తెరకెక్కించాడు. ఇది ప్రేమ కథ అని ప్రచారం చేయడం కంటే.. ఎమ్ఎమ్ఏ నేపథ్యంలో వస్తున్న చిత్రమనే ఎక్కువగా ప్రచారం చేశారు. హీరోని కూడా అదే స్థాయిలో చూపించారు. కానీ కథలో మాత్రం ఆ సిరియస్‌నెస్ ఎక్కడా కనిపించలేదు. ఎమ్.ఎమ్.ఏ సంబంధించిన సీన్స్ సాధారణంగా సాగుతాయే తప్ప ఉత్కంఠను రేకెత్తించవు. పోనీ ప్రేమ కథను అయినా ఆకట్టుకునేలా ఉందా అంటే అదీ అనిపించదు.తాన్య, లైగర్ ప్రేమలో పడిన తీరు కూడా ఆకట్టుకునేలా ఉండదు. యూత్‌ని అట్రాక్ చేయడం కోసం బోల్డ్‌నెస్‌ని అతికించడం కొంతమేర ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరోహీరోయిన్ ప్రేమలో పడిన సన్నివేశాలతో పాటు.. వాళ్లు విడిపోవడం, సెకండాఫ్‌లో బ్రేకప్‌కి చెప్పిన రీజన్ అన్ని సిల్లీగా అనిపిస్తాయి. అయితే తెరపై విజయ్‌ని చూపించిన తీరు మాత్రం అందరిని మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ ఎక్కువగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాపింయన్ చుట్టే తిరుగుతుంది. ఇంటర్నేషనల్ ఛాపింయన్‌షిప్ కోసం అమెరికా వెళ్లాల్సిన లైగర్‌కు ప్రభుత్వం సహాయం చేయకపోవడం.. స్పాన్సర్షిప్ వ్యవహారం అంతా సాదాసీదాగా సాగుతుంది. అలాగే కొడుకు అమెరికాలో ఫైట్ చేస్తుంటే.. తల్లి ముంబైలోని ఇంట్లో కూర్చొని ప్రోత్సహించడం లాంటి సీన్‌తో పాటు మరికొన్ని సనివేశాలు వాస్తవికతకు దూరంగా ఉంటాయి. మైక్‌టైసన్, విజయ్‌ల మధ్య వచ్చే ఫైటింగ్ సీన్ అయితే మైక్‌టైసన్ అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. సినిమాలోని మెయిన్ పాయింట్‌కి ఆధారంగా ముగింపు ఉంటే బాగుండేది. హీరో నత్తితో పలికే డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్విస్తాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. పూరీ రాసుకున్న స్టోరీ లైన్, లైగర్ అనే క్యారెక్టర్ బాగున్నప్పటికీ.. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్లుగా కథనాన్ని మాత్రం నడిపించలేకపోయాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ దేవరకొండ యాక్టింగ్. ప్రాణం పెట్టి నటించాడు. లైగర్ పాత్ర కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. నత్తితో ఆయన పలికిన డైలాగ్స్ సహజంగా అనిపిస్తాయి. గత సినిమాలలో కంటే ఇందులో విజయ్ నటన కొత్తగా ఉంటుంది. ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్‌తో విజయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక లైగర్ తల్లి బాలామణిగా రమ్యకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకుంది. తాన్యగా అనన్య పాండే మెప్పించింది. తెరపై అందంగా కనిపించింది. అయితే ఆ పాత్ర సినిమాపై అంతగా ప్రభావం చూపదు. పాటల్లో విజయ్, అనన్య రొమాన్స్ ఆకట్టుకుంటుంది. లైగర్ కోచ్‌గా రోనిత్ రాయ్ మెప్పించాడు. విషురెడ్డి, అలీ, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికిస్తే.. సంగీతం పర్వాలేదు. పాటలు టాలీవుడ్ కంటే బాలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మాటరాని మౌనమిది ’మూవీ రివ్యూ
టైటిల్ : మాటరాని మౌనమిది నటీనటులు : మహేష్ దత్త,శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు నిర్మాణ సంస్థ :రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ దర్శకత్వం: సుకు పూర్వాజ్ సంగీతం : అషీర్ లుక్ సినిమాటోగ్రఫీ:చరణ్ విడుదల తేది: ఆగస్ట్ 19, 2022 మహేష్ దత్త, శ్రీహరి ఉదయగిరి హీరోలుగా, సోనీ శ్రీవాస్తవ హీరోయిన్గా నటించిన చిత్రం ‘మాట రాని మౌనమిది’. ‘శుక్ర’ఫేం సుకు పూర్వాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో మల్టీ జోనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రామ్(మహేశ్ దత్త) చాలా కాలం తర్వాత తన భావ ఈశ్వర్(శ్రీహరి ఉదయగిరి)ని కలవడానికి అరకు వెళ్తాడు. అక్కడ ఓ పెద్ద బంగ్లాలో ఈశ్వర్ ఒక్కడే ఉంటాడు. ఓ రోజు బిజినెస్ పని మీద ఈశ్వర్ బయటకు వెళ్లగా.. రామ్ ఒక్కడే ఆ ఇంట్లో ఉంటాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. దీంతో రామ్ మేడపైకి వెళ్లి అక్కడ గది తలుపులు తెరచి చూడగా.. ఈశ్వర్ శవం కనిపిస్తుంది. భయంతో రామ్ ఇంటి నుంచి బయటకు పరుగులు తీస్తాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియక రాత్రంతా హాల్లోనే గడుపుతాడు. అయితే మరుసటి రోజు ఉదయమే ఈశ్వర్ తిరిగి ఇంటికి వస్తాడు. అతన్ని చూసి రామ్ షాకవుతాడు. నువ్వు చనిపోయావు కదా మళ్లీ ఎలా వచ్చావని అడుగుతాడు. నేను చనిపోవడం ఏంటి.. అసలు ఏం జరిగిందని అడగ్గా.. రాత్రి జరిగిన విషయమంతా చెబుతాడు రామ్. డెడ్‌బాడీ ఎక్కడ ఉందో చూద్దాం పదా అని పైకి వెళ్లి చూడగా..అక్కడ రామ్ శవం కనిపిస్తుంది. రామ్ డెడ్‌బాడీ ఈశ్వర్‌కు, ఈశ్వర్ డెడ్‌బాడీ రామ్‌కి కనిపిస్తుంది. అలా ఎందుకు జరిగింది? నిజంగానే వాళ్లు చనిపోయారా? ఆ ఇంట్లో ఏంముంది? ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ‘మాటరాని మౌనమిది’అనే టైటిల్ ఎందుకు పెట్టారని తెలియాలంటే థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లవ్ స్టోరీ, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం ‘మాటరాని మౌనమిది’. దర్శకుడు సుకుమార్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. సినిమాలో సస్పెన్స్, ట్విస్టులు ఉంటాయి కానీ.. స్లో నెరేషన్ మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో రామ్, సీత మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. రామ్ ఉంగరం ధరించడం..ఇంట్లో ఏదో తిరిగినట్లు కనిపించి.. అది ఏంటో తెలియకుండా క్యూరియాసిటీ పెంచేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే అక్కడ మాత్రం దర్శకుడు కథను కామెడీగా మలిచాడు. అది అంతగా వర్కౌట్ కాలేదు.సెకండాఫ్‌లో సాగదీత సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే సీత ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటంది. మ్యాజిక్‌తో ఇంకో వ్యక్తిని సృష్టించడం.. సీతకు రామ్ ప్రపోజ్ చేయడం లాంటి సీన్లను ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. హారర్ చిత్రాలను ఆస్వాదించేవారిని ‘మాటరాని మౌనమిది’ అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రామ్ పాత్రకి మహేశ్ దత్త న్యాయం చేశాడు. అతనికిది తొలి చిత్రం. ఇక రామ్ భావ ఈశ్వర్‌గా శ్రీహరి ఉదయగిరి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి చుట్టే కథ ఎక్కువగా తిరుగుంది. ఇక క్లాసికల్ డ్యాన్సర్ సీతగా సోనీ శ్రీవాస్తవ మంచి నటనను కనబరిచింది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర తనది. అర్చనా అనంత్,సునీల్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అషీర్ లుక్ నేపథ్య సంగీతం పర్వాలేదు. దంపుడు లచ్చి అనే పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Karthikeya 2 Movie Review: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ
టైటిల్ : కార్తికేయ2 నటీనటులు : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనమ్, కేఎస్ శ్రీధర్, శ్రీనివాసరరెడ్డి నిర్మాణ సంస్థ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: చందూ మొండేటి సంగీతం : కాల భైరవ సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని విడుదల తేది: ఆగస్ట్ 13, 2022 వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. ఆయన కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘కార్తికేయ’. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే టీమ్‌తో ‘కార్తికేయ2’ తీశాడు. ఎన్నో అవంతరాల తర్వాత నేడు(ఆగస్ట్ 13) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో కార్తికేయ2 పై హైప్ క్రియేట్ అయింది. ఈ భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాలికి ధరించిన కంకణం.. నేటి కలియుగంలోని ఎన్నో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆర్కియాలజిస్ట్ రావు తెలుసుకుంటాడు. ఆ కంకణం గురించి అశ్వేషిస్తున్న రావు హత్య చేయబడతాడు. అదే సమయంలో తల్లి (తులసి)తో కలిసి ద్వారక దర్శనానికి వచ్చిన డాక్టర్ కార్తిక్(నిఖిల్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆర్కియాలజిస్ట్ రావును కార్తిక్‌కే హత్య చేశాడని తప్పుడు కేసు నమోదు చేస్తారు. పోలీసు స్టేషన్లో ఉన్న కార్తిక్‌ని రావు రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) తప్పిస్తుంది. అసలు కార్తిక్‌ని ముగ్ఢ ఎందుకు తప్పించింది? ఆమె కార్తిక్‌తో చెప్పిన విషయం ఏంటి? శ్రీకృష్ణుడి కంకణం కనిపెట్టాలని కార్తిక్ ఎందుకు డిసైడ్ అవుతాడు? ఈ క్రమంలో కార్తిక్‌కు డాక్టర్ శాంతను (ఆదిత్యా మీనన్) నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురయ్యయాయి? అధీరుల తెగకు చెందిన వ్యక్తులు కార్తిక్‌ని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరకు కార్తిక్ కంకణ రహస్యాన్ని కనిపెట్టాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. దర్శకుడు చందూ మొండేటి మొదటి నుంచి చెబుతున్నట్లుగా ‘కార్తికేయ’ చిత్రానికి, కార్తికేయ2 కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం హీరో, అతని తల్లి పాత్రలు అలా ప్రవర్తిస్తాయి. కార్తికేయలో మిస్టరీ, థ్రిల్లర్ అంశాలు ఉంటే.. ఇందులో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దైవం, సైన్స్ రెండింటిని కలిపి ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో మొత్తం సాదాసీదాగా సాగుతున్నప్పటికీ.. సెకండాఫ్‌పై మాత్రం క్యూరియాసిటీ పెంచుతుంది. అధీరుల వంశానికి చెందిన ఓ వ్యక్తి కార్తిక్‌పై దాడి చేయడం.. దానికి కారణం ఏంటో యానిమేషన్ ద్వారా చూపించడం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్రీకృష్ణ కంకణం అన్వేషణని ఆసక్తికరంగా తెరపై చూపించాడు. గోవర్థన గిరి గుహలో లభించిన ఆధారంతో కంకణాన్ని కనిపెట్టడం.. దానిని తీసుకొచ్చేందుకు కార్తిక్ చేసిన ప్రయత్నం రక్తి కట్టిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ పరంగా చూస్తే కార్తికేయ2 చాలా సాదారనమైనది..కానీ కథనం మాత్రం కొత్తగా ఆకట్టుకునేలా ఉంటుంది. కార్తికేయలో మాదిరి ఇందులో భయపడే సీన్స్ పెద్దగా ఉండవు. అలాగే హీరోని ఢీకొట్టేందుకు బలమైన విలన్ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు చప్పగా సాగాయనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే విలన్, అధీరుల తెగకు చిక్కిన ప్రతీసారి హీరో సింపుల్‌గా తప్పించుకోవడం లేదా ఆ సీన్‌ని హడావిడిగా ముంగించి వేరే సీన్లోకి తీసుకెళ్లడంతో థ్రిల్ మూమెంట్స్ మిస్ అవుతారు. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి అనుపమ్ ఖేర్‌తో చెప్పించే డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఫోకస్ అంతా కృష్ణతత్వం మీదే పెట్టినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్ హంగుల కోసం సాంగ్స్, కామెడీని జోడించకుండా ఉత్కంఠభరితంగా కథను నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే... డాక్టర్ కార్తికేయ పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రని అల్రెడీ కార్తికేయ చిత్రంలో పోషించిన అనుభవం ఉండటం అతనికి కలిసొచ్చింది. కార్తికేయ మాదిరే కార్తికేయ 2 కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. ఇక ముగ్ధ పాత్రకి అనుపమ పరమేశ్వరన్ న్యాయం చేసింది. కార్తిక్‌ని కాపాడే రెండు సీన్స్ అనుపమా క్యారెక్టర్ని గుర్తిండిపోయేలా చేస్తాయి. ఇక బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. గుర్తిండిపోయే పాత్ర చేశారు. శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్‌లో ఈలలు వేయిస్తాయి. కార్తిక్ మామగా శ్రీనివాస్‌రెడ్డి, ట్రాలీ డ్రైవర్‌గా వైవా హర్ష తమదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్, సత్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రెండూ బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘కార్తికేయ 2’ మూవీ ట్విటర్ రివ్యూ
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘కార్తికేయ 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 13)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కార్తికేయ 2’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘కార్తికేయ 2’ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. నిఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెబుతున్నారు. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. #Karthikeya2 Overall A Satisfactory Mystery Adventure that works in parts! The main storyline is interesting and has parts that are very engaging. However, the rest runs pretty flat and the thrill factor is very less. Still Decent Attempt and a One time Watch! Rating: 2.75/5 — Venky Reviews (@venkyreviews) August 12, 2022 కార్తికేయ 2 ఓవరాల్‌గా బాగుంది. స్టోరీ అంతా ఇంట్రెస్టింగ్ సాగుతుందని, థ్రిల్ ఫ్యాక్టర్ తక్కువగా ఉన్నప్పటికీ టీమ్ మొత్తం మంచి ప్రయత్నం చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 1st half report : Yaagam modhalu... First half bagundamma.. 😉KALA bhairava bgm irakottadu..👌. Konni..Thrilling elements unay.. cinema ippude modalayyindi... 😁@tollymasti #tollymasti . .#Karthikeya2 #Karthikeya2onAugust13th #Karthikeya2Review @actor_Nikhil @AAArtsOfficial — Tollymasti (@tollymasti) August 13, 2022 ఫస్టాఫ్ బాగుందని, కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీశారని, అసలు కథ సెకండాఫ్ నుంచి మొదలు కాబోతుందని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. #Karthikeya2 Overall A Satisfactory Mystery Adventure that works in parts! The main storyline is interesting and has parts that are very engaging. However, the rest runs pretty flat and the thrill factor is very less. Still Decent Attempt and a One time Watch! Rating: 2.75/5 — ABHI Jr.🌊 (@Govind949477) August 13, 2022 #Karthikeya2 Our rating 2.75/5 1st Half Average 2nd Half Good One Time Watchable 👍 #Karthikeya2 — Movies Box Office (@MovieBoxoffice5) August 13, 2022 #Karthikeya2 one Of the Greatest Movie of my life Mind-blowing amazing 😇Rating 5out of 5👍👍 please Watch #karthikeya2review — Shaktimaan7773 (@RichiBanna20) August 13, 2022 ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుందని చెబుతున్నారు. చందూ మొండేటి కథ హ్యండిల్ చేసిన విధానం బాగుందని అంటున్నారు. విజువల్స్, గ్రిప్పింగ్ నేరేషన్ థ్రిల్లింగ్‌కు గురిచేస్తాయని కామెంట్ చేస్తున్నారు. Very good second half.The thrill factor has been sustained throughout this part and the climax is 🔥.Chandoo made the best film of his career and the storyline is great.Anupam Kher cameo was👌🏼. The film has the potential to click big across languages. Sure shot hit #Karthikeya2 — sharat (@sherry1111111) August 12, 2022 #Karthikeya2 1st half: starts of well, Introduction, Mystery reveal, interval. 2nd half: Screenplay, direction, Visuals, BGM, Songs💥 Very good 1st & 2nd half👍 PERFECT SEQUEL 🔥 4.0/5⭐⭐⭐⭐ Because I love the story@anupamahere@actor_Nikhil @AAArtsOfficial pic.twitter.com/boEejnhdBd — Fancy Cinema (@Fancycinema) August 13, 2022 Koteysav bayya very happy for u #Karthikeya2 Ni script selection ey niku ni carrier lo big plus Abba em testav Anna att #blockbusterkarthikeya2@actor_Nikhil @anupamahere — Yeshwanth (@Yeshwan95181393) August 13, 2022 -
‘లాల్‌సింగ్ చడ్డా’ మూవీ రివ్యూ
టైటిల్ : లాల్‌సింగ్ చడ్డా నటీనటులు : ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య, మోనా సింగ్ తదితరులు నిర్మాణ సంస్థలు: వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మాతలు:ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే దర్శకత్వం: అద్వెత్ చందన్ సంగీతం : ప్రీతమ్ సినిమాటోగ్రఫీ: సేతు విడుదల తేది:ఆగస్ట్ 11,2022 దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పించడం.. నాగచైతన్య కీలక పాత్ర పోషించడంతో టాలీవుడ్లో కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అసక్తిని పెంచేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లాల్‌సింగ్ చడ్డా’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లాల్‌సింగ్ చడ్డా’ కథేంటంటే.. ఈ కథంతా 1975 నుంచి మొదలవుతుంది. లాల్‌సింగ్ చడ్డా(ఆమిర్ ఖాన్)..అంగవైకల్యంతో పుడతాడు. సరిగా నడవలేడు. అతనికి ఐక్యూ(IQ) కూడా తక్కువే. కానీ అతని తల్లి (మోనా సింగ్)మాత్రం కొడుకుని అందరి పిల్లలా పెంచాలనుకుంటుంది. ప్రత్యేకమైన పాఠశాలకు పంపకుండా సాధారణ పిల్లలు చదువుకునే స్కూల్‌కే పంపుతుంది. అక్కడ అందరూ హేళన చేస్తు అతనితో దూరంగా ఉంటే..రూప(కరీనా కపూర్) మాత్రం అతనితో స్నేహం చేస్తుంది. తల్లి చెప్పే మాటలు.. రూప ప్రోత్సాహంతో లాల్ సాధారణ వ్యక్తిలాగే ఉంటాడు. తనకు అంగవైకల్యం ఉన్నదన్న విషయాన్నే మర్చిపోతాడు. ఓ సందర్భంలో రూప చెప్పే మాటలతో పరుగెత్తడం మొదలుపెడతాడు. ఎంతలా అంటే.. ప్రతి రన్నింగ్ రేస్‌లో విజయం సాధించేలా. అలాగే కాలేజీ విద్యను పూర్తి చేసి తన తండ్రి, తాత, ముత్తాతల మాదిరే ఆయన కూడా ఆర్మీలో జాయిన్ అవుతాడు. జవాన్‌గా లాల్ దేశానికి చేసిన సేవ ఏంటి? యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన తన స్నేహితుడు బాలు అలియాస్ బాలరాజు(నాగచైతన్య)చివరి కోరిక ఏంటి? ఆ కోరికను లాల్ నెరవేర్చాడా లేదా? చిన్ననాటి స్నేహితురాలు రూప పెద్దయ్యాక పడిన కష్టాలేంటి? ఆపదలో ఉన్న సయమంలో లాల్ ఆమెకు ఎలా తోడుగా నిలిచాడు? తన అమాయకత్వంతో పాకిస్తాన్ ఉగ్రవాది మహ్మద్బాయ్ని ఎలా మంచి వాడిగా మార్చాడు? లాల్ తన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న సత్యాలు ఏంటి? అనేదే తెలియాలంటే థియేటర్స్‌లో లాల్‌సింగ్ చడ్డా’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేకే ‘లాల్‌సింగ్ చడ్డా’. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా..భారతీయ నేటివిటికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అద్వెత్ చందన్. అయితే అది తెరపై వర్కౌట్ కాలేదు. స్క్రీన్‌ప్లే, నిడివి సినిమాకు పెద్ద మైనస్. కథంతా ఒకే మూడ్‌లో సింపుల్‌గా సాగుతుంది. 1975 నుంచి 2018 వరకు భారత్‌లో జరిగిన కొన్ని సంఘటలను గుర్తు చేస్తూ కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభం నుంచే నెమ్మదిగా సాగుతుంది. లాల్ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత కొంచెం ఆసక్తిగా సాగుతుంది. బాలరాజుతో పరిచయం.. బనియన్, చెడ్డి బిజినెస్ అంటూ ఇద్దరు చెప్పుకునే కబుర్లు కొంచెం కామెడీని పండిస్తాయి. కార్గిల్ వార్ సన్నివేశాలు మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథనం నెమ్మదిగా సాగడం, ఎమోషనల్ సీన్స్గా తేలిపోవడంతో ప్రేక్షకులు బోరింగ్ ఫీలవుతారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు అయితే చిరాకు తెప్పిస్తాయి. రొటీన్ స్టోరీకి రొటీన్ క్లైమాక్స్ మరింత మైనస్. స్క్రిప్ట్ రైటర్‌గా అతుల్ కులకర్ణి మాతృకకు ఎలాంటి భంగం కలగకుండా మన దేశ చరిత్రని, సంస్కృతిని సీన్స్ లో నింపే ప్రయత్నం చేసి సక్సెస్ అయితే.. దానిని తెరకెక్కించడంలో దర్శకుడిగా అద్వైత్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయడం ఆమిర్‌కు అలవాటు. ఈ చిత్రంలో కూడా ఆమిర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. లాల్‌సింగ్ చడ్డా పాత్రలో జీవించేశాడు. కథనంతా తన భుజాన వేసుకొని ముందుకు నడిపించాడు. అయితే ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ‘పీకే’సినిమాను గుర్తుచేస్తుంది. రూప పాత్రలో కరీనా కపూర్ ఒదిగిపోయింది. అయితే.. ఆమె పాత్ర పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మధ్య మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్తుంది. ఇక జవాన్ బాలరాజు పాత్రతో నాగచైతన్య ఒదిగిపోయాడు. నటుడిగా మరింత ఇప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. ఇక లాల్ తల్లి పాత్రలో మోనాసింగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ప్రీతమ్ పాటలు బాగున్నాయి. తనూజ్ టికు నేపథ్య సంగీతం జస్ట్ ఓకే.సత్యజిత్ పాండే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాప్లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా ‘ఫారెస్ట్ గంప్’ చిత్రాన్ని చూడకుండా, ఆమిర్ నటనని ఇష్టపడేవారికి మాత్రం ఈ చిత్రం కాస్తో కూస్తో నచ్చే అవకాశం ఉంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘సీతారామం’ మూవీ రివ్యూ
టైటిల్ : సీతారామం నటీనటులు : దుల్కర్ సల్మాన్,మృణాల్ ఠాగూర్, సుమంత్, రష్మిక, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్ తదితరులు నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మాత: అశ్వినీదత్ దర్శకత్వం: హను రాఘవపూడి సంగీతం : విశాల్ చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ - శ్రేయాస్ కృష్ణ ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది:ఆగస్ట్ 05,2022 మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమై, తనదైన స్టైల్లో నటిస్తూ తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇంటెన్స్ లుక్స్ , క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ..లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మలయాళ హీరో అయినప్పటికీ తనదైన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. 'మహానటి' తర్వాత ఈ రొమాంటిక్ హీరో నేరుగా తెలుగులో నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి సీత,రామ్‌ల లవ్‌స్టోరీపై అందరికి ఆసక్తి ఏర్పడింది. ఇక ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి టాక్ని సంపాదించుకోవడమే కాకుండా..సినిమాపై అంచనాలు పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడం, అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి హీరోలను భాగం చేయడంతో ‘సీతారామం’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 5) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? సీత,రామ్‌ల లవ్ స్టోరీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ‘సీతారామం’ కథంతా 1965, 1985 నేపథ్యంలో సాగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ అధికారి(సచిన్ ఖేడ్కర్) మనవరాలు అఫ్రిన్(రష్మిక). లండన్‌లో ఉంటున్న ఆమె తిరిగి వచ్చేసరికి తాతయ్య చనిపోతాడు. ఇంట్లో ఓ ఉత్తరం ఉంటుంది. అది 20 ఏళ్ల క్రితం భారత సైనికుడు లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్) రాసిన లెటర్. దానిని హైదరాబాద్‌లో ఉంటున్న సీతామహాలక్ష్మికి అందజేయాల్సిన బాధ్యతను అఫ్రిన్కి అప్పజెప్పుతాడు. అది తాతయ్య చివరి కోరిక. తాతయ్యపై ప్రేమతో కాకుండా ఆ లెటర్ సీతామహాలక్ష్మికి అందిస్తే తప్ప ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదన్న కండీషన్ ఉండడంతో అఫ్రిన్ ఆ లెటర్ని పట్టుకొని హైదరాబాద్ వెళ్తోంది. సీత గురించి వెతకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సీతా, రామ్‌ల గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. లెఫ్టినెంట్ రామ్ ఓ అనాథ. దేశం కోసం పనిచేయడం తప్ప..ఆయనకంటూ నా అనేవాళ్లు ఎవరూ లేరు. అలాంటి వ్యక్తికి ఓ రోజు లెటర్ వస్తుంది. అది సీతామహాలక్ష్మి రాసిన లేఖ. అడ్రస్ లేకుండా వచ్చిన ఆ ఉత్తరాలను చదివి ఆమెతో ప్రేమలో పడిపోతాడు రామ్. ఓ రోజు సీతను కలుస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం..ఆపై ప్రేమ పుడుతోంది. ఓ రహస్యాన్ని దాచి రామ్ కోసం హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కి వస్తుంది సీత. ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో ఓ కారణంగా వాళ్లిద్దరు దూరమవుతారు. అసలు సీత దాచిన రహస్యం ఏంటి? సీత ఎవరు? సీత కోసం రామ్ రాసిన లేఖ పాకిస్తాన్లో ఎందుకు ఆగిపోయింది? ఆ లెటర్ని ఆఫ్రిన్ సీతకు అందించిందా లేదా? అందులో ఏముంది? అసలు అఫ్రిన్‌కు రామ్ ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ‘సీతారామం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సెన్సిబుల్ లవ్ స్టోరీలకు స్పెషలిస్ట్ హను రాఘవపూడి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా..లవ్ స్టోరీని మాత్రం బాగా హ్యాండిల్ చేస్తారనే పేరుంది. ఇప్పుడు ‘సీతారామం’తో కూడా అదే మ్యాజిక్‌ని రిపీట్ చేశాడు. యుద్దంతో ముడిపడి ఉన్న ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అంతే బ్యూటిఫుల్‌గా తెరకెక్కించాడు. ప్రేమ, యుద్ధం అనే రెండు వేర్వేరు నేపథ్యాల్ని ఉత్తరంతో కలిపి ఓ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీని తెరపై చూపించాడు. పాకిస్తాన్ తీవ్రవాదులు కశ్మీర్లో ఎలా విధ్వంసం సృష్టిస్తున్నారు అనే పాయింట్‌తో కథ మొదలవుతుంది. అయితే ఇది ప్రేమ కథా చిత్రమని మేకర్స్ మొదటి నుంచి ప్రచారం చేయడంతో ప్రేక్షకుల ఆసక్తి అంతా రామ్, సీతల లవ్ స్టోరీపైనే ఉంటుంది. ఎప్పుడైతే రామ్‌కి సీత ఉత్తరాలు రాయడం మొదలు పెడుతుందో అప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. సీత కోసం రామ్ హైదరాబాద్ వెళ్లడం.. అక్కడ వాళ్ల జర్నీ..తనకు ఉత్తరాలు రాసిన ప్రతి ఒక్కరిని రామ్ కలుస్తుండడం.. ఇలా తెలియకుండానే ఫస్టాఫ్ ముగుస్తుంది. మధ్య మధ్యలో వెన్నెల కిశోర్, సునీల్ కామెడీ పండించే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. సెకండాఫ్‌లో సీత, రామ్లా లవ్‌స్టోరీ ఎలా సాగుతుందనేదానిపై ప్రేక్షకులకు మరింత ఆసక్తి కలుగుతుంది. అంతే ఆసక్తిగా సెకండాఫ్ సాగుతుంది. లవ్‌స్టోరీని క్యారీ చేస్తూనే మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్‌ని యాడ్ చేస్తూ సెకండాఫ్‌ని నడిపించాడు. రామ్ తనకు లేఖలు రాసిన ఓ చెల్లి దగ్గరకు వెళ్లడం..ఆమె ఉన్న పరిస్థితిని చూసి ఆ బాధ్యతను తనపై వేసుకోవడం హృదయాలను హత్తుకుంటుంది. ఇక ఆర్మి అధికారి విష్ణుశర్మ(సుమంత్)లోని రెండో కోణం కూడా ఇంట్రెస్టింగ్ చూపించాడు. సినిమా ప్రారంభంలో కశ్మీర్ అల్లర్లకు, యుద్దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో అనేదానికి సెకండాఫ్‌లో మంచి వివరణ ఇచ్చాడు. అలాగే అఫ్రిన్ పాత్ర ఇచ్చిన ముగింపు కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని ప్రతి పాత్రని ఫర్ఫెక్ట్గా వాడుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్ కొంత స్లోగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం ఎమోషనల్‌గా నడిపించి సరికొత్త ప్రేమ కథను చూపించాడు. ఎలాంటి అశ్లీలత లేకుండా ఓ స్వచ్ఛమైన ప్రేమకథ చిత్రం ఇది. ఎవరెలా చేశారంటే. లెఫ్ట్‌నెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన మాటతీరు, యాకింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రకు దుల్కర్ ఫర్ఫెక్ట్ చాయిస్ అనేలా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. ఇక సీత పాత్రకు మృణాల్ న్యాయం చేసింది. తెరపై బ్యూటిఫుల్‌గా కనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించింది. మత పిచ్చి, పొగరు ఉన్న అమ్మాయి అఫ్రిన్‌గా రష్మిక అదరగొట్టేసింది. క్లైమాక్స్‌లో ఆమె పాత్రకు ఇచ్చిన ముగింపు సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో బాగా పండిన పాత్రల్లో సుమత్ది ఒకటి. ఆర్మీ అధికారి విష్ణుశర్మగా సుమంత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర తొలి నుంచి అనుమానంగానే చూపిస్తూ.. ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచారు. ఆయన భార్యగా భూమిక కనిపిస్తుంది. కానీ ఆమె పాత్రలో అంతగా స్కోప్ లేదు. ఇక గోపాల్‌గా తరుణ్ భాస్కర్‌తో పాటు ఆర్మీ చీఫ్లుగా ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్ తమ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం విశాల్ చంద్రశేఖర్ సంగీతం. అద్భుతమైన పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో విజువల్స్ స్థాయిని పెంచడమే కాదు.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ పనితీరు అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై అందంగా చూపించాడు. కశ్మీర్ అందాలను అద్భుతంగా చూపించాడు. అద్భుతమైన విజువల్స్‌ని అందించి ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు. వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Bimbisara Movie: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. (చదవండి: ‘సీతారామం’ ట్విటర్ రివ్యూ) ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బింబిసార’ కథేంటి? త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్ రామ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నార.అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #BimbisaraOnAug5th #BIMBISARA #BimbisaraReview 1-Excellent movie 👍 2-this movie will bring back telugu audience to teatres 3-1st half is bit slow, but 2nd half is rampage 🔥 4-Kalyan ram as bimbisara is super 5- overall rating is 🌟 🌟 🌟 1/2 ( 3.5/5) — VINOD KUMAR E 2691 Batch,PES University (@VinodPes) August 5, 2022 తెలుగు ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కి రప్పించే చిత్రమిదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని, సెకండాఫ్ అదిరిపోయిందని చెబుతున్నారు. బింబిసారగా కల్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుందని చెబుతున్నారు. వన్ మ్యాన్ షోగా సినిమాను తన భుజానా వేసుకొని నడిపించాడట. ఎంఎం కీరవాణి మ్యూజిక్, విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. Showtime: Kalyan Ram in #Bimbisara. A Vasishta directorial and MM keeravani musical. — Day Dreamer!!! (@bunnywrites) August 5, 2022 Bimbisara first half..👌🔥🔥This is going to be Kalyan ram's career biggest movie..Time travel content..🪐New World..🙏What a story..#Bimbisara @tarak9999 @NANDAMURIKALYAN #BimbisaraReview — SAIKUMAR MANNURU (@im_saichowdary) August 4, 2022 #Bimbisara Movie theater response#BimbisaraOnAug5th Movie good reviews every where 👍👍👍👍 video link 👇👇👇 3/5 👍https://t.co/AaHUH2YDQm — Masthan-Tweets (@sm4582579) August 5, 2022 Good First Half 👌 Interval 🔥🔥@NANDAMURIKALYAN 👌👌 Bgm Excellent 🤙🤙#Bimbisara . https://t.co/TWJFMJKn7J pic.twitter.com/pt3uc0Vhdm — #DADA 🙏 #NTR 💗 (@Dada_NTR) August 5, 2022 మరోవైపు బింబిసార టీమ్‌కు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ తమన్, సాయి తేజ్, సత్యదేవ్ తదితరులు ట్వీట్స్ చేశారు. Wishing this whole team of #Bimbisara @NANDAMURIKALYAN anna #Hari gaaru @NTRArtsOfficial #Vasista and Team of #SitaRamam brother @hanurpudi @dulQuer @mrunal0801 @VyjayanthiFilms Dear @SwapnaDuttCh All the Very Best at the #BoxOffice TOMORROW 🏆🥁🥁🥁🥁🥁🥁 pic.twitter.com/xrD6IQTkMz — thaman S (@MusicThaman) August 4, 2022 \ #Bimbisara Looks Promising to bits. All the best @NANDAMURIKALYAN anna.@DirVassishta I know how much you have waited for this day. Wish your hardwork paysoff ra All the best to the entire team@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani garu @ChirantannBhatt @NTRArtsOfficial pic.twitter.com/UIepiaLrX5 — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 4, 2022 Promising right from it's Teaser and a Grandeur of this scale from @DirVassishta is so impressive. Your hardwork and transformation for this @NANDAMURIKALYAN anna 🤗👏 All the best Team #Bimbisara@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial pic.twitter.com/YOfhhUJUqt — Satya Dev (@ActorSatyaDev) August 4, 2022 Wishing @NANDAMURIKALYAN garu and the entire team of #Bimbisara the best for tomorrow. May cinema win and the industry rise! @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial — Hanu Raghavapudi (@hanurpudi) August 4, 2022 -
రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ
టైటిల్ : రామారావు ఆన్ డ్యూటీ నటీనటులు : రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: శరత్ మండవ సంగీతం : సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ విడుదల తేది: జులై 29, 2022 మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. ‘క్రాక్’తర్వాత రవితేజ ఖాతాలో బిగ్ హిట్ పడిందే లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఖిలాడి’ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రవితేజ. తన స్టయిల్ని పక్కన పెట్టి, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల ఈ శుక్రవారం(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామరావు ఆన్ డ్యూటీ’ని ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1993-94 ప్రాంతంలో జరుగుతుంది. రామారావు(రవితేజ) ఓ సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్. కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అవుతాడు. కోర్టు తీర్పుతో చిత్తూరు జిల్లాలోని తన సొంత ప్రాంతానికి ఎమ్మార్వోగా నియమించబడతాడు. అక్కడి ప్రజలను సమస్యలను తనదైన స్టైల్లో తీర్చుతుంటాడు. తను ప్రేమించిన యువతి మాలిని(రజిషా విజయన్)భర్త సురేంద్ర అనుమానస్పదంగా మిస్ అయినట్లు తెలుసుకొని విచారణ మొదలు పెడతాడు. రామారావు ఇన్వెస్టిగేషన్లో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సురేంద్ర మాదిరే ఆ ప్రాంతానికి చెందిన మరో 20 మంది మిస్ అయినట్లు తెలుస్తుంది. దీని వెనక గంధపు చెక్కల స్మగ్లింగ్ ఉన్నట్లు గుర్తిస్తాడు. అసలు గంధపు చెక్కల స్మగ్లింగ్‌కు ఈ 20 మందికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న గంధపు చెక్కల స్మగ్లింగ్ వెనుక ఎవరు ఉన్నారు? ఒక ఎమ్మార్వోగా తనకు ఉన్న అధికారంతో రామారావు ఈ కేసును ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో రామారావుకు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 1993 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు శరత్ మండవ. ఇదొక ఎమోషనల్ ఇన్వెస్ట్ గేటివ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సినిమా ప్రారంభం నుండే ట్విస్ట్ లు మొదలవుతాయి. అడవిలో కప్పిపుచ్చిన ఓ శవం భారీ వర్షానికి బయటకు కనిపిస్తుంటే.. ఓ ముసలాయన ఆ శవం చేతులు నరికేయడంతో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రామారావు ఎంట్రీ.. ఆయన గొప్పతనం, నిజాయితీ, వృత్తిపట్ల ఆయనకు ఉన్న నిబద్దత తదితర అంశాలను చూపిస్తూ.. హీరో ఎలివేషన్లకి ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఇక్కడ సినిమా కాస్త నెమ్మెదిగా సాగినట్లు అనిపిస్తుంది. రామారావు మాజీ ప్రియురాలు మాలిని భర్త సురేంద్ర కేసు విచారణ చేపట్టినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఈ మిస్సింగ్ కేసుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధం ఉందని తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌ని కాస్త ఎమోషనల్ థ్రిల్లర్‌గా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రామారావు తండ్రి(నాజర్) హత్య, దాని వెనక ఓ గ్యాంగ్ ఉండడం తదితర అంశాలను ఇంట్రెస్టింగ్ చూపించాడు. అయితే కొన్ని రీపీటెడ్ సీన్స్ వల్ల సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం దర్శకుడు కొన్ని సీన్లను కావాలనే యాడ్ చేశారనే ఫిలీంగ్ కలుగుతుంది. గంధపు స్మగ్లింగ్ మాఫియా లీడర్ విరాజ్‌తో రామారావు యుద్దం పార్ట్2లో ఉండబోతుంది. ఎవరెలా చేశారంటే.. మాములుగా రవితేజ సినిమాలలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో నడిచింది. ఎమ్మార్వో రామారావు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. పోలీసులకు మాత్రమే కాదు ఎమ్మార్వోకు కూడా ఇన్ని అధికారాలు ఉంటాయా? అనేలా ఆయన పాత్ర ఉంటుంది. రొమాన్స్(పాటలతో మాత్రమే)తో పాటు యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వేణుతొట్టంపూడి ఎస్సైగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఆయన పాత్రకి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం కాస్త మైనస్. రామారావు భార్య నందిని పాత్రలో దివ్యాంశ కౌశిక్ ఒదిగిపోయింది. సాధారణ గృహిణిగా చీరకట్టులో తెరపై అందంగా కనిపించింది. రామారావు మాజీ ప్రియురాలు మాలినిగా రజిషా విజయన్ ఉన్నంతలో బాగానే నటించింది. కథని మలుపు తిప్పే పాత్ర ఆమెది. నాజర్, నరేశ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎటిటర్ ప్రవీణ్ కేఎల్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. యంగ్ డైరెక్టర్ శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాను పెంచేశాయి. ఈ సారి రవితేజ కొంచెం కొత్త ప్రయత్నించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తనదైన స్టైల్లో మాస్ డైలాగ్స్‌తో ట్రైలర్ వదలడంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 29) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల రామారావు డ్యూటీ ఎక్కేశాడు. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #RamaRaoOnDuty #RamaRaoOnDutyFromJuly29th #RamaRaoOnDutyFromTomorrow Blockbuster comeback for ravanna Awesome movie Mainly mass scenes vere level Introduction scene Pre intervel scene Climax scene goose bumbs Songs 💙 Bgm 🔥🔥🔥 Overall rating 3.25/5 pic.twitter.com/BJaalgSfob — vallepu_raghavendra (@vallepuraghav) July 29, 2022 రవితేజకు భారీ హిట్ లభించిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని , క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. మరికొంత మంది ఏమో రామారావు ఆన్ డ్యూటీ యావరేజ్ మూవీ అంటున్నారు. #RamaRaoOnDuty Review: An Above Average Thriller Drama ✌️#RaviTeja performs well in his usual swag 👍 Casting Is Decent 👍 Music is OK but BGM works ✌️ Action Scenes are very good 👍 Decent Story but underwhelming execution 🙏 Rating: ⭐⭐⭐/5#RamaRaoOnDutyReview pic.twitter.com/4uLZVjZEvx — Kumar Swayam (@KumarSwayam3) July 29, 2022 రవితేజ యాక్టింగ్ బాగుందని, పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇంట్రడక్షన్ డీసెంట్‌గానే ఉందని, ఫస్టాఫ్ వరకు కథలో కొత్తదనం ఏం కనిపించడం లేదంటున్నారు. @RaviTeja_offl sir, #RamaRaoOnDuty movie chusanu. Chala bagundi from NJ, USA. — Abhishek (@abhiabhi799) July 29, 2022 #RamaRaoOnDuty Review FIRST HALF: A Decent One 👍#RaviTeja is in his elements & looks perfect ✌️ Songs are average but BGM is Terrific 👏 Production Values Looks Good 👍 Second Half is the key 🙏#RamaRaoOnDutyReview #DivyanshaKaushik #RamaRaoOnDuty — Fancy Motion Pictures (@Fancymotionpic) July 29, 2022 US distrubutor Rating: ⭐️⭐️⭐️2.5/5#RamaRaoOnDutyReview #SarathMandava has picked up the MASSIEST TALE and showcased it on the SILVER screen with his GRAND VISION of presenting #RaviTeja in a massy avatar. #RamaRaoOnDuty reminds you of the olden days. pic.twitter.com/SE0kKP8goB — Praveen Chowdary Kasindala (@PKasindala) July 27, 2022 #RamaRaoOnDuty 1st half way too good...superb interval bang....@RaviTeja_offl in completely mass avatar — Mahesh (@Urkrishh) July 29, 2022 -
Vikrant Rona Review: విక్రాంత్ రోణ మూవీ రివ్యూ
టైటిల్ : విక్రాంత్ రోణ నటీనటులు :కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మధుసూదన్ రావు తదితరులు నిర్మాత: జాక్ మంజునాథ్, అలంకార్ పాండియన్ దర్శకత్వం: అనూప్ భండారి సంగీతం : అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్ విడుదల తేది: జులై 28, 2022 కథేంటంటే.. కొమరట్టు గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ ఊర్లో ఓ పాడుబడ్డ ఇంట్లోని బావిలో శవాలు కనిపిస్తుంటాయి. బ్రహ్మరాక్షసుడే వీరందరినీ చంపుతున్నాడని గ్రామస్తుల నమ్మకం. ఊరిపెద్ద జనార్థన్ గంభీర్(మధుసూదన్‌రావు), అతని తమ్ముడు ఏక్నాథ్ గంభీర్(రమేశ్ రాయ్)కూడా గ్రామ ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పి ఆ ఇంటివైపు ఎవరినీ వెళ్లకుండా చేస్తారు. అయితే ఓ సారి ఆ ఊరి ఎస్సై ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్లగా.. తెల్లారి బావిలో శవమై కనిపిస్తాడు. అతని మొండెం మాత్రమే లభిస్తుంది కానీ తల కనిపించదు. ఈ హత్య కేసును చేధించడానికి ఆ ఊరికి కొత్త ఎస్సై వస్తాడు. అతనే విక్రాంత్ రోణ(కిచ్చా సుధీప్). ఈ కేసు విచారణలో అతనికి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ గ్రామానికి చెందిన స్కూల్ పిల్లలు పదుల సంఖ్యలో హత్యకు గురయ్యారని తెలుస్తుంది. మరి పిల్లల హత్యకు కారకులు ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఆ ఊరికి కొత్తగా వచ్చిన సంజు(నిరూప్ భండారి)ఎవరు? గ్రామస్తులను భయపెడుతున్న బ్రహ్మరాక్షసుడు ఎవరు? ఎస్సై హత్య కేసుతో విక్రాంత్ వ్యక్తిగత జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే విక్రాంత్ రోణ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విక్రాంత్ రోణ..ఇదొక యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రమని తొలి నుంచి చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చింది. ట్రైలర్, టీజర్లో కూడా ఆ విధంగానే చూపించింది. పైగా పాన్ ఇండియా మూవీ అనగానే.. కేజీయఫ్ తర్వాత కన్నడ నుంచి మరో భారీ మూవీ రాబోతుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది కూడా కేజీయఫ్ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ దర్శకుడు అనూప్ భండారి నిరాశపరిచాడు. తెరపై విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. కథలో పసలేదు. అసలు దర్శకుడు ఏ జానర్లో ఈ కథను తెరకెక్కించాలనుకున్నాడో సరైన క్లారిటీ లేదనిపిస్తుంది. ఓ తల్లీకూతుళ్లు అర్ధరాత్రి కొమరట్టుకు బయలుదేరగా.. ముసుగులో ఉన్న కొంతమంది వారిని హత్య చేయడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో ఏదో జరుగుతుంది. ఆ పాడుబడ్డ ఇంట్లో ఎవరు ఉన్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఎస్సై విక్రాంత్ రోణ ఎంట్రీతో కథలో స్పీడ్ పెరుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్ బాగున్నప్పటికీ.. వరుస హత్యల రహస్యాన్ని చేధించే సీన్స్ ఆసక్తికరంగా సాగవు. దానికి తోడు సంజు లవ్‌ట్రాక్, మదర్ సెంటిమెంట్ అంతగా ఆకట్టుకోకపోవడం సినిమాకు పెద్ద మైనస్. మధ్య మధ్య వచ్చే కొన్ని భయంకర సన్నివేశాలు మినహా.. కథ ఎక్కడా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఎవరెలా చేశారంటే.. విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. సంజుగా నిరూప్ బండారి పర్వాలేదు. క్లైమాక్స్‌లో అతని పాత్ర సర్ప్రైజ్ చేస్తుంది. అపర్ణగా నీతా అశోక్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఫక్రూగా కార్తీక్ రావు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక రక్కమ్మగా జాక్వెలిన్ తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటుల పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అజనీష్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. రారా రక్కమ్మ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. శివ కుమార్ ఆర్ట్‌వర్క్ అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. విలినియం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Thank You Review: ‘థాంక్యూ’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘థాంక్యూ’ నటీనటులు :నాగచైతన్య, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్, ప్రకాశ్‌రాజ్ సాయి సుశాంత్ రెడ్డి నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్ సంగీతం :తమన్ సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: జులై 22, 2022 పుష్కరకాలం కింద దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన జోష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అప్పటి నుంచి నాగచైతన్యతో సినిమాలు చేయలేదు దిల్ రాజు. రెండో సారి నాగచైతన్యతో సినిమా తీస్తే అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉండాలని చాలా కాలంగా వెయిట్ చేసి..‘థాంక్యూ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత నాగచైతన్య నటిస్తున్న చిత్రం కావడం, అక్కినేని హీరోలకు మనం లాంటి క్లాసిక్ మూవీని అందించిన విక్రమ్ కే.కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ‘థాంక్యూ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంపై ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అభి అలియాస్ అభిరామ్(నాగచైతన్య) ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు. అక్కడ రావ్ కన్సల్టెన్సీ చీఫ్ రావు (ప్రకాశ్‌రాజ్) అభికి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు ఇప్పిస్తాడు. కానీ అభికి మాత్రం ఉద్యోగం చేయాలని ఉండడు. ఓ యాప్‌ని తయారు చేయాలనుకుంటాడు. రావు గారి ద్వారా పరిచమైన ప్రియ(రాశీఖన్నా) చేసిన ఆర్థిక సహాయంతో ఓ యాప్‌ని తయారు చేసి సక్సెస్ సాధిస్తాడు. దాని ద్వారా అభికి మంచి గుర్తింపు రావడంతో పాటు.. పెద్ద వ్యాపారవేత్తగా మారిపోతాడు. ఆ తర్వాత అభిలో మార్పు మొదలవుతుంది. తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని పట్టించుకోకుండా.. కేవలం డబ్బు, ప్రతిష్టలకే ప్రాధాన్యత ఇస్తాడు. దీంతో అందరూ అతనికి దూరం అవుతారు. చివరకు ప్రేమించిన ప్రియ కూడా అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు అభి రియలైజ్ అవుతాడు. తన మనస్సాక్షితో తాను మాట్లాడుకోవడం మొదలుపెడతాడు. కెరీర్ గ్రోత్ అంటూ తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని వదిలేశానని.. అందుకే అందరూ తనకు దూరమయ్యారని తెలుసుకుంటాడు. తన తప్పును తెలుసుకొని.. ఈ స్థాయిలో ఉండడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా కారణమైన వారందరిని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. స్కూల్, కాలేజీ డేస్‌ని గుర్తు చేసుకుంటాడు. ఇప్పటి వరకు తన జీవితంలోకి వచ్చిన పారు(మాళవికా నాయర్), చిన్నూ(అవికా గోర్), శర్వా(సుశాంత్ రెడ్డి) కలిసి థ్యాంక్స్ చెప్పేందుకై ఇండియాకు వస్తాడు. మరి అభి సక్సెస్‌కు పారు, చిన్నూ, శర్వాల ఎలా కారణమయ్యారు? వీరితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి? వీరిని కలిశాక అతనిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు ప్రియ, అభిలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... జీవితంలో ఇతరుల సపోర్ట్ లేకుండా ఎవ్వరూ సొంతంగా ఎదుగరు. పేరెంట్స్..బంధువులు.. స్నేహితులు.. ఇలా ఎవరో ఒకరు మన ఎదుగుదలకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో సహాయం చేస్తుంటారు. మనం ఓ స్థాయికి చేరాక..అలాంటి వారిని మరచిపోవద్దు’అనే మంచి సందేశంతో ‘థాంక్యూ’మూవీని తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్ కె.కుమార్. డైరక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటీకీ..తెరపై మాత్రం అది అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. గత సినిమాలకు భిన్నంగా కొత్తగా ట్రై చేశాడు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. హీరో తన ఎదుగుదలకు సహకరించిన వారికి ఎమోషనల్‌గా ఎలా థ్యాంక్స్ చెప్పాడన్న పాయింట్ చుట్టే కథ తిరుగుతుంది. సినిమా మొదలైన కొద్ది సేపటికే.. కథ ఎలా సాగుతుందో, క్లైమాక్స్ ఎలా ఉంటుందో సగటు ప్రేక్షకుడు ఊహించుకోవచ్చు. ఎలాంటి ట్విస్ట్‌లు,టర్నింగ్ పాయింట్స్ లేకుండా సింపుల్‌గా అలా.. సాగిపోతుంది. మంచి ఎమోషన్స్, సెంటిమెంట్‌తో ఫస్టాఫ్ సాగుతుంది. స్కూల్ డేస్‌లో పారుతో ప్రేమాయణం, నారాయణపురంలో జరిగే పడవ పోటీల సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇష్టంగా ప్రేమించిన పారు ఎందుకు దూరమైందనేది కూడా ఇంట్రెస్టింగ్ చూపించారు. ఇంటర్వెల్ సీన్ సింపుల్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో అభి కాలేజ్ డేస్‌ని చూపించారు. అక్కడ కూడా కథ ఊహకు అందేలా సింపుల్‌గా సాగుతుంది. మహేశ్‌బాబు ఫ్లెక్సీ సీన్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. అభిరామ్ పాత్రలో నాగ చైతన్య ఒదిగిపోయాడు. ఆయన పాత్రకి చాలా వేరియషన్స్ ఉంటాయి. అన్నింటిని చక్కగా డీల్ చేశాడు. తెరపై చాలా కొత్తగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఒదిగిపోయాడు. కథనంత తన భూజాన వేసుకొని నడిపించాడు. ఇక ప్రియగా రాశీఖన్నా పర్వాలేదనిపించింది. అయితే ఇందులో ఆమె పాత్రకు నిడివి తక్కువ. ఇక అభి స్కూల్‌డేస్ లవర్ పార్వతి పాత్రలో మాళవికా నాయర్ మంచి నటనను కనబరిచింది.చైతూ- మాళవికా నాయర్‌లా కెమిస్ట్రీ తెరపై వర్కౌట్ అయింది. చిన్నూగా అవికా ఘోర్ తన పాత్ర పరిధిమేర నటించింది. ప్రకాశ్‌రాజ్ సాయి సుశాంత్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతీ ఫ్రేమ్ అందంగా కనిపిస్తుంది. తమన్ సంగీతం జస్ట్ ఓకే. టైటిల్ సాంగ్, కాలేజ్ వీడ్కోలు పార్టీ సందర్భంగా వచ్చే పాటలు కొంతమేర ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అనసూయ ‘దర్జా’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘దర్జా’ నటీనటులు :సునీల్, అనసూయ నిర్మాణ సంస్థలు : ఆమని, పృథ్వీ, అక్సాఖాన్,షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్ తదితరులు నిర్మాత: శివశంకర్ పైడిపాటి దర్శకత్వం: సలీమ్ మాలిక్ సంగీతం : రాప్ రాక్ షకీల్ సినిమాటోగ్రఫీ: దర్శన్ ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ విడుదల తేది: జులై 22, 2022 అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు యాంకరింగ్‌తో పాటు ఇటు సినిమాల్లోనూ రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘దర్జా’. సునీల్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకి, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘దర్జా’పై ఆసక్తి పెరిగింది. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22)ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్జా మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మీ(అనసూయ) ఓ సారా వ్యాపారి. బందరులోని కోరుకల్లు, వైవాహ గ్రామ ప్రజలకు ఆమె అంటే హడల్. ఆమె వ్యాపారానికి అడ్డొచ్చిన ఎంతో మంది పోలీసులను హతమార్చింది. తనకు ఎదురు తిరిగిన ఎమ్మెల్యేను సైతం మట్టుబెట్టేంత ధైర్యం ఆమెది. తమ్ముడు బళ్లారి(సమీర్), అనుచరుడు సర్కార్ సపోర్ట్‌తో ఆమె చేపల వ్యాపారంలోకి కూడా దిగుతోంది. కట్ చేస్తే.. కోరుకల్లు గ్రామానికి చెందిన మూగబ్బాయి గణేష్(అరుణ్ వర్మ) తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) మోసం చేసిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఓ కొత్త ఎస్సై వస్తాడు. అతనే శివ శంకర్ పైడిపాటి (సునీల్). వచ్చీ రావడంతోనే కనకం ప్రధాన అనుచరుడు సర్కార్‌ని అరెస్ట్ చేస్తాడు. అంతేకాదు గణేష్ ఆత్మహత్య కేసును కూడా బయటకు తీసి..అది ఆత్మహత్య కాదని, కనకం మనుషులు చేసిన హత్య అని నిరూపిస్తాడు. అసలు గణేష్‌ని కనకం మనుషులు ఎందుకు చంపారు? పుష్పకి కనకంతో ఉన్న సంబంధం ఏంటి? ఎమ్మెల్యేనే చంపేంత ధైర్యం ఉన్న కనకంతో ఎస్సై శివ శంకర్ ఎందుకు వైర్యం పెట్టుకున్నాడు? కనకం చీకటి వ్యాపారాన్ని ఎదురించి, ఆమె చేతిలో బలైన ఎస్సై రవి(రవి పైడిపాటి) నేపథ్యం ఏంటి? చివరకు కనకం మరియు ఆమె సోదరుడు బళ్లారి ఆగడాలకు ఎస్సై శంకర్ ఎలా చెక్ పెట్టాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. అన్నదమ్ములు, తల్లి కొడుకులు, అక్కా చెల్లెల సెంటిమెంట్‌తో పాటు కావాల్సిన యాక్షన్, కమర్షియల్ వ్యాల్యూస్ ఈ చిత్రంలో ఉన్నాయి. దర్శకుడు ఈ కథనంతా బందరుకు కొత్తగా వచ్చిన ఎస్సై, కానిస్టేబుల్ మధ్యన చర్చగా నడిపించిన తీరు బాగుంది. ఎస్సై రవి పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్‌తో కథ మొదలవుతుంది.ఇక బందరు కనకంగా అనసూయ ఎంట్రీతో కథ పరుగులు తీస్తుంది. అనసూయ ఉన్నంత సేపు ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది. అదే ఉత్కంఠను మిగిలిన పాత్రలకు కొనసాగించలేకపోయాడు. ఒకవైపు కనకం అరాచకాలను క్రూరంగా చూపిస్తూనే.. మరోవైపు గణేష్, పుష్పల ప్రేమ కథను చెప్పుకొచ్చిన తీరు బాగుంది. మధ్య మధ్యలో రంగ(షమ్ము), గీత(అక్సాఖాన్) కామెడీ సీన్స్ నవ్వులు పూయించినప్పటికీ..కథంత నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో సునీల్, అనసూయల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీసు స్టేషన్లో సునీల్‌కు అనసూయ వార్నింగ్, ప్రీక్లైమాక్స్‌లో సునీల్ చేసే ఫైట్ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. అయితే సినిమా చాలా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం, చాలా పాత్రల్లో కొత్త ముఖాలు కనిపించడం కాస్త మైనస్. కానీ కొత్త నటులు అయినప్పటికీ.. వారి నుంచి తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరెలా చేశారంటే.. రంగస్థలంలో రంగమ్మత్తగా, 'పుష్ప’లో దాక్షాయణిగా తనదైన నటనతో ఆకట్టుకున్న అనసూయ.. చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి పాత్ర పోషించి మెప్పించింది. బందరు కనకంగా అనసూయ అదరగొట్టేసింది. ఆమె డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఇక పవర్ఫుల్ ఎస్సై శంకర్ పాత్రలో సునీల్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. మూగబ్బాయి గణేశ్‌గా అరుణ్ వర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సర్కార్ పాత్రలో ఎన్. రామ్ బాగా క్రూరత్వం చూపించి మెప్పించారు. కనకం తమ్ముడు బళ్లారిగా సమీర్, డ్రైవర్ జట్కాగా వీరబాబు, ఎస్సై రవిగా రవి పైడిపాటితో పాటు ఆమని, షేకింగ్ శేషు, షకలక శంకర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే... ఈ సినిమాకు ప్రధాన బలం రాప్ రాక్ షకీల్ సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అక్సాఖాన్ స్పెషల్ సాంగ్ తెరపై అదిరిపోయింది. దర్శన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఎమ్.ఆర్. వర్మ పనితీరు మెచ్చుకోవాల్సిందే. కథలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. ఎలాంటి అడ్డంకులు లేకుండా కథను పరుగులు పెట్టించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయి. రొటీన్ స్టోరీనే అయినప్పటికీ.. కథనం ఆకట్టుకుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా, అనసూయ, సునీల్‌ల కోసం అయితే ‘దర్జా’గా థియేటర్స్ వెళ్లి చూడొచ్చు. -
‘పంచతంత్ర కథలు’ మూవీ రివ్యూ
టైటిల్: పంచతంత్ర కథలు నటీనటులు: నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ తదితరులు నిర్మాణ సంస్థ: మధు క్రియేషన్స్ నిర్మాత: డి. మధు రచన-దర్శకత్వం: గంగనమోని శేఖర్ సంగీతం: కమ్రాన్ సినిమాటోగ్రఫి: గంగనమోని శేఖర్, విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్: శ్రీనివాస్ వరగంటి బాల్యంలో మనం పంచతంత్ర కథలు పుస్తకం చదువుకుని... వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. అలాంటి కథల ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన ఆంథాలజీ చిత్రం ‘పంచతంత్ర కథలు’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? ఆ ఐదు కథలు ఏంటి? అవి ప్రేక్షకులను ఎలాంటి నీతిని భోధించాయో రివ్యూలో చూద్దాం. ఈ చిత్రంలో మొత్తం ఐదు కథలు ఉన్నాయి. 1) అడ్డకత్తెర కథేంటంటే.. కృష్ణ(నిహాల్) అనే యువకుడు క్షవర వృత్తి చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అదే వీధిలో ఉంటున్న యువతిని సత్య(సాదియ అన్వర్) ప్రేమిస్తాడు. వేరు వేరు కులాలకు చెందిన వీరిద్దరి ప్రేమకు పెద్దల నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? చివరకు వీరి ప్రేమకు శుభం కార్డు ఎలా పడిందనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఇప్పటికీ సమాజంలో కుల పిచ్చి అనేది ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.కులామ మధ్య ఉండే అంతరాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ కథను తెరకెక్కించారు. మనం చేసే వృత్తుల వల్ల కులాలను నిర్ణయించారని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగంలేదని ఇద్దరి ప్రేమికులను ఒకటి చేసే క్రమంలో పెద్దలకు వివరించి చెప్పారు.ఇందులో నిహాల్, సాదియాల నటన అందరినీ ఆకట్టుకుంటుంది. 2) అహల్య కథేంటంటే.. రేవతి (ప్రణీత పట్నాయక్) ఓ వేశ్య. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పడుపు వృత్తిని ఎంచుకుంటుంది. ఆమెకు పెయింటింగ్ ఆర్టిస్ట్ అయోధ్య(అజయ్ )పరిచయం అవుతాడు. అతని పరిచయంతో ఆమె తనలో మార్పు వస్తుంది. వేశ్య వృత్తిని వదిలేసి మంచి మనిషిగా బతకాలనుకుంటుంది. అలాంటి సమయంలో సమాజం నుంచి రేవతికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆమె జీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. ఈ కథ అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఓ వేశ్య మాములు మనిషిగా బతకాలని చూస్తే ఆమెను సమాజం ఎలా చూస్తుంది? అనేదానిని తెరపై చక్కగా చూపించారు. వేశ్య వృత్తికి ఎంత దూరంగా ఉండాలని చూసినా.. ఆ మార్పును సమాజం అంగీకరించదు. అందు కోసం వాళ్లు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోందనేది ఈ కథ ద్వారా చూపించారు. వేశ్య వృత్తిని వదిలేసి వచ్చిన చిన్నచూపు చోడొద్దనేది ఈ కథ ఇచ్చే సందేశం. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. వేశ్యగా ప్రణీత పట్నాయక్ తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. 3) హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కథేంటంటే: మధ్యతరగతి కుటుంబానికి చెందిన కీర్తిక (నందిని రాయ్)కి డబ్బు అంటే పిచ్చి. బాగా డబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుందని భావించి ప్రాణంగా ప్రేమించిన ప్రశాంత్(నోయల్)ని వదిలేస్తుంది. అనుకున్నట్లే బాగా డబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత కీర్తిక జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. భర్తతో సుఖంగా జీవించిందా లేదా? లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిన కీర్తికకి ప్రశాంత్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. డబ్బుకు ఆశపడి నమ్ముకున్నోళ్లను మోసం చేయొద్దని అనేది ఈ కథ సారాంశం. ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని కాదని, తండ్రి మాట కూడా లెక్క చేయకుండా కేవలం డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన అమ్మాయికి ఓ భగ్న ప్రేమికుడు చెప్పే గుణపాఠం అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథలో రొమాంటిక్ సీన్స్ కాస్త ఎక్కువవడం.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపిస్తుంది. 4 ) నర్తనశాల ఇందులో ఓ వింత లవ్‌స్టోరీని చూపించారు. డ్యాన్స్ స్కూల్ నడిపించే ఓ డ్యాన్స్ మాస్టర్(సాయి రోనక్)కు ఫోన్ ద్వారా శిరీష అనే యువతి పరిచయం అవుతుంది. ఆమెను చూడకుండా ప్రేమలో పడిపోతాడు. కొద్ది రోజుల తర్వాతను ఆమె చూడాలని ఉందని చెప్పి బీజ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. మరి బీచ్‌లో వీరిద్దరు కలిశారా? అసలు ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తి ఎవరు? వీరిద్దరు కలిశాక ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డ్యాన్స్ మాస్టర్‌తో ఫోన్లో మాట్లాడింది ఎవరనే సస్పెన్స్‌ని క్లైమాక్స్ వరకు కొనసాగించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేలా చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. వేగంగా పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా ఎలాంటి మోసాలు జరుగుతాయి? ఫోన్ పరిచయాల ద్వారా మోససోయిన వ్యక్తులను నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారికి ఇది నచ్చుతుంది. 5) అనగనగా వృద్ధురాలు కమలక్క (గీతా భాస్కర్)ది ఇద్దరి కుమారుల మధ్య నలిగిపోయే జీవితం. భర్త ఉన్నప్పుడు ఎంతో హుందాగా బతికిన ఆమె.. వృద్ధాప్యంలో ఇద్దరు కొడుకులు చెరో నెల అని ఆమెను పంచుకుంటారు. దాని వల్ల ఆమెకు ఎదురయ్యే సమస్యలేంటి? వృద్దాప్యంలో ఆమె జీవితం ఎలా సాగిందనేదే ఈ కథ. ఎలా ఉదంటంటే.. ఆస్తులను పంచుకున్నట్లుగా తల్లిదండ్రులను కూడా పంచుకుంటున్నారు నేటి పిల్లలు. చెరో నెల అంటూ వంతులు పెట్టికొని మరీ వారిని పోషిస్తున్నారు. దీని వల్ల పేరెంట్స్ పడే బాధ ఏంటి అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు.సగటు తల్లి పడే బాధ ఏంటో గీతా భాస్కర్ ద్వారా తెరపై చక్కగా చూపించారు. మొత్తంగా ఈ ఐదు కథలుగా తెరకెక్కిన ఈ పంచతంత్రకథలు.. మంచి సందేశాన్ని ఇచ్చాయి. ఒక్కో కథలో ఓక్కో నీతి ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథలు... వాటిని నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి.సయ్యద్ కమ్రాన్ అందించిన సంగీతం చిత్రానికి బాగా ప్లస్ అయింది. మొదటి కథలో వచ్చే మోతెవారి పాటతో ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంది. మిగిలిన పాటలు కూడా బాగున్నాయి. చిత్ర దర్శకుడు గంగనమోని శేఖర్ యే సినిమాటోగ్రాఫర్ కావడంతో మంచి విజువల్స్ తీశారు. దీనికి మరో సినిమాటోగ్రాఫర్ విజయ్ భాస్కర్ సద్దల కూడా తన వంతు సహకారం అందించారు. శ్రీనివాస్ వరగంటి ఎడిటింగ్ పర్వాలేదు. సాధారణంగా ఏ నిర్మాత అయినా తన తొలి చిత్రాన్ని కమర్షియల్ ఫార్మెట్లో నిర్మిస్తాడు. అలాంటి చిత్రాలను నిర్మిస్తే.. సేఫ్ జోన్లోకి వెళ్లొచ్చు. కానీ నిర్మాత డి మధు మాత్రం.. తొలి చిత్రంగా మంచి సందేశాత్మకమైన అంశాలు ఉన్న ‘పంచతంత్రకథలు’ ఎంచుకోవడం అభినందనీయం. -
Gargi Movie Review: సాయిపల్లవి ‘గార్గి’ మూవీ రివ్యూ
టైటిల్: గార్గి నటీనటులు : సాయి పల్లవి, కాళి వెంకట్, కలైమామణి శరవణన్, ఆర్.ఎస్ ఐశ్వర్యలక్ష్మి, జయప్రకాశ్ తదితరులు నిర్మాత: రవిచంద్రన్, రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ రామచంద్రన్ రచన,దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్ సంగీతం : గోవింద్ వసంత సమర్పణ: రానా దగ్గుబాటి(తెలుగులో) విడుదల తేది: జులై 15, 2022 వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చున్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఇటీవల విరాట పర్వం చిత్రంతో అలరించిన ఆమె తాజాగా ‘గార్గి’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచన మధ్య ఈ శుక్రవారం (జులై 15) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. గార్గి(సాయి పల్లవి) ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్.ఎస్ శివాజీ) హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఓ రోజు బ్రహానందం పనిచేసే అపార్ట్మెంట్లో ఓ చిన్నారిపై అత్యాచారం జరుగుతుంది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో బ్రహ్మానందం అరెస్ట్ అవుతారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయడని బలంగా నమ్మిన గార్గి..అతన్ని నిర్ధోషిగా బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటానికి దిగుతుంది. తండ్రి తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాని సమక్షంలో జునియర్ లాయర్ గిరీశం(కాళీ వెంకట్) గార్గికి మద్దతుగా నిలుస్తాడు. బ్రహ్మానందం తరపున వాదించడానికి ముందుకొస్తాడు. ఆ సమయంలో గార్గి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని ఎలా చూసింది? బ్రహ్మానందాన్ని బయటకు తీసుకొచ్చేందుకు లాయర్ గిరీశం చేసిన ప్రయత్నం ఏంటి? చివరకు తన తండ్రిని గార్గి నిర్ధొషిగా బయటకు తీసుకొచ్చిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటంటే.. ‘ఆడ పిల్లగా పుట్టావు కదా..ప్రతి రోజు యుద్దమే’ గార్గి సినిమా ఎండింగ్లో ఓ యువతి చిన్నారికి చెప్పే మాట ఇది. ఇది అక్షర సత్యం. ఆడపిల్ల ప్రతి రోజు తన ఉనికి కోసం సమాజంతో యుద్దం చేయాల్సిందే. సొంతింట్లో సోదరుడు, మామ, చిన్నాన, పెదనాన్న చివరకు కన్న తండ్రిని కూడా అనుమానించాల్సిన దుస్థుతి. ఇక స్కూళ్లు, ఆఫీసులు.. ఇతర పని ప్రదేశాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు. ఒక్కోసారి.. మంచి వాళ్లు అనుకుంటే వారే తమ వికృత చేష్టలతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కేవలం మహిళలు, యువతుల పైనే కాదు వృద్ధులు, చిన్న పిల్లలపై కూడా అత్యాచారానికి ఒడిగడుతున్నారు. అలాంటి ఘటనల్లో బాధిత కుటుంబంతో పాటు నిందితుల కుటుంబ సభ్యులు కూడా పడే మానసిక క్షోభ ఎలా ఉంటుందనేది ‘గార్గి’ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు గౌతమ్ రామచంద్రన్. ఇలాంటి కేసుల్లో బాధితులు మాత్రమే కాదు నిందితుల కుటుంబ సభ్యులు కూడా సమాజం నుంచి ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటారు? ఇలాంటి వారి పట్ల మీడియా ఎలా వ్యవహరిస్తుంది? అనే అంశాన్ని తెరపై చూపించడం ‘గార్గి’స్పెషల్. ఎటువంటి అశ్లీలత లేకుండా సున్నితమైన అంశాలను అతి సున్నినితంగా డీల్ చేస్తూ.. మంచి సందేశాన్ని అందించాడు దర్శకుడు గౌతమ్ రామచంద్రన్. అత్యాచార కేసులో అరెస్ట్ అయిన తండ్రిని నిర్ధొషిగా బయటకు తీసుకొచ్చేందకు ఓ కూతురు పడుతున్న కష్టాన్ని చూపిస్తూనే..మరో పక్క అత్యాచారినికి గురైన చిన్నారి తండ్రి పడే బాధ, మానసిక క్షోభని ప్రేక్షకులను హృదయాలను హత్తుకునేలా తెరపై చూపించాడు. అలాగే కోర్టుకు కావల్సినవి ఆధారాలు..వాటిని కూడా లాజిక్ మిస్ కాకుండా చూపించాడు. అనవసరపు సన్నివేశాలను జోడించకుండా...సినిమా స్టార్టింగ్‌లోనే నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. స్కూల్ టీచర్‌గా సాయి పల్లవిని పరిచయం చేసి.. వెంటనే అత్యాచారం.. తండ్రి అరెస్ట్.. కోర్టు సీన్స్..ఇలా కథను పరుగులు పెట్టించాడు. అయితే ఇదే స్పీడ్‌ని సినిమా ఎండింగ్ వరకు కొనసాగించలేకపోయాడు. కోర్టు సీన్స్ కూడా అంతగా రక్తి కట్టించవు. అయితే జడ్జిగా ట్రాన్స్జెండర్ని తీసుకోవడం.. ఆమెతో ‘ఆడవాళ్లకు నొప్పి ఎక్కడ ఉంటుందో.. మగాళ్లకు ఎక్కడ పొగరు ఉంటుందో నాకే బాగా తెలుసు’లాంటి డైలాగ్స్ చెప్పించడం ఆకట్టుకుంటుంది. ఇక ఇలాంటి సంఘటనలో మీడియా చూపించే అత్యూత్సాహం, దాని వల్ల బాధితులు, నిందితుల కుటుంబాలకు ఎదురయ్యే సమస్యలను కూడా తెరపై అద్భుతంగా చూపించాడు. ‘ఇష్టమొచ్చింది చెప్పడం న్యూస్ కాదు.. జరిగింది చెప్పడం న్యూస్’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటి మాదిరే గార్గి పాత్రలో ఒదిగిపోయింది. గార్గిగా సాయి పల్లవిని తప్ప మరొకరిని ఊహించకోని రీతిలో ఆమె నటన ఉంటుంది. అయితే ఇలాంటి పాత్రల్లో నటించడం సాయి పల్లవికి కొత్తేమి కాదు. తెలుగులో వచ్చిన చాలా సినిమాల్లో ఆమె ఈ తరహా పాత్రలను పోషించారు. అయితే తమిళ్లో ఆమె ఇలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. తమిళ ప్రేక్షకులు కొత్త సాయిపల్లవిని తెరపై చూస్తారు. గార్గి తండ్రి బ్రహ్మానందంగా ఆర్.ఎస్ శివాజీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. లాయర్ గిరీశం పాత్రలో కాళీ వెంకట్ బాగా నటించాడు. తన అమాయకత్వంతో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. అత్యాచారినికి గురైన బాలిక తండ్రిగా కలైమామణి శరవణన్ తనదైన నటనతో కంటతడి పెట్టించాడు. జయప్రకాశ్, ఐశ్యర్యలక్ష్మీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గోవింద్ వసంత నేపథ్య సంగీతం. సినిమా భావాన్ని ప్రేక్షకులను చేరవేయడంతో నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. కొన్ని సన్నివేశాలకు తనదైన బీజీఎంతో ప్రాణం పోశాడు. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫి పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. గార్గి చిన్న చిత్రమే అయినా.. సందేశం మాత్రం చాలా పెద్దది. చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో గార్గి ఒకటని చెప్పొచ్చు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మాయోన్’ మూవీ రివ్యూ
టైటిల్ : మాయోన్ నటీనటులు : సిబి రాజ్, తాన్య రవిచంద్రన్, రాధా, రవి, కె.ఎస్.రవికుమార్ తదితరులు నిర్మాత: అరుణ్ మోళిమాణికర్ రచన,దర్శకత్వం: ఎన్. కిశోర్ సంగీతం : ఇళయరాజా సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్ ఎడిటర్: రామ్ పాండియన్, కొండలరావు విడుదల తేది: జులై 7, 2022 ‘కట్టప్ప’ సత్యరాజ్ కుమారుడు సిబి సత్యరాజ్ హీరోగా యంగ్ డైరెక్టర్ కిశోర్ రూపొందించిన చిత్రం ‘మాయోన్’. అరుణ్ మోజి మాణికం నిర్మించిన ఈ తమిళ చిత్రం తెలుగు హక్కులను మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. కోలీవుడ్‌లో మాదిరే టాలీవుడ్లో కూడా భారీ ప్రమోషన్స్ చేయడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 7) 227 థియేటర్స్‌లో విడుదలైన ‘మాయోన్’ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. మయోన్ కథేంటంటే.. అర్జున్(సిబి సత్యరాజ్) ఆర్కియాలజిస్ట్. పూరాతన వస్తులను కాపాడుకోవడం మన బాధ్యత అని, అది మన పూర్వికుల సంస్కృతి అని తోటి ఉద్యోగులకు చెబుతూనే..తాను మాత్రం విగ్రహాల స్మగ్లింగ్(Idol Smuggling)కు పాల్పడుతాడు. తన సీనియర్ అధికారి దేవరాజ్(హరీష్ పేరడీ)తో చేతులు కలిసి పురాతన వస్తువులను, విగ్రహాలను విదేశాలకు అమ్మెస్తుంటారు. ఈ క్రమంలో వీరికి విజయానందపురంలో ఐదు వేల సంవత్సరాల చరిత్ర గల మాయోన్ ఆలయం, అందులో ఉన్న నిధి గురించి తెలుస్తుంది. ఆ నిధిని ఎలాగైన సొంతం చేసుకోవాలకుంటారు. ఉద్యోగ రిత్యా అక్కడి వెళ్లి నిధివేట మొదలుపెడతారు. మరి ఆ నిధి రహస్యం ఎలా తెలిసింది? మాయోన్ ఆలయం యొక్క చరిత్ర ఏంటి? ఆ నిధిని సొంతం చేసుకునేందుకు అర్జున్, దేవరాజ్ ఎలాంటి ప్రయత్నం చేశారు. అర్జున్ నిజంగానే నిధి కోసం దేవరాజ్‌తో చేతులు కలిపాడా? విదేశాల్లో ఉన్న ఐడియల్ స్మగ్లర్ సాన్స్ ఫెరాడోని ఇండియన్ పోలీసులు ఎలా పట్టుకున్నారు? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘మాయోన్’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాతన ఆలయాలు.. నిధి వేట.. దైవశక్తి, సైన్స్ కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలను ప్రేక్షకులను అలరిస్తాయి. అందుకే ఇప్పటికే ఆ తరహా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు మన దర్శకనిర్మాతలు. అయితే ఇలాంటి కథలను తెరపై ఎంత ఉత్కంఠంగా చూపించామనేదానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠని సినిమా చివరి వరకు ఉంచగలితే అది విజయం సాధిస్తుంది. అలాంటి ఉత్కంఠభరితమైన కథ, కథనంలో తెరకెక్కిన చిత్రమే ‘మాయోన్’. పాత కథే అయినా ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో చాలా కొత్తగా, ప్రెష్‌గా తెరకెక్కించాడు దర్శకుడు కిశోర్. ‘మాతృభూమి గుర్తులు అమ్మడం...కన్న తల్లిని అమ్మడం ఒక్కటే’ సినిమా క్లైమాక్స్ వచ్చే డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్‌తో కథ ఏంటి? కథనం ఎలా సాగుతుందో ఊహించొచ్చు. అయితే ప్రేక్షకుడి ఊహకి ఉత్కంఠను జోడించి సినిమాని ముందుకు నడిపించాడు దర్శకుడు కిశోర్. సినిమా ప్రారంభంలోనే కథనం ఎలా సాగబోతుందో చూపించాడు. హీరో మొదలుకొని.. ప్రతి పాత్రని నెగెటివ్ షేడ్స్‌లో పరిచయం చేసి.. అందరిపై ప్రేక్షకులను అనుమానం కలిగేలా చేశారు. ఫస్టాఫ్‌లో కథను ప్రారంభించడానికి కొంత సమయం తీసుకున్నా.. సెకండాఫ్‌లో మాత్రం కథను చాలా ఉత్కంఠంగా, స్పీడ్‌గా నడిపించాడు. అర్జున్ బృందం ఆలయంలోకి చొరబడిన తర్వాత వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. అయితే క్లైమాక్స్ మాత్రం కాస్త రొటీన్‌గా ఉంటుంది. దైవశక్తి, సైన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కథనాన్ని ముందుకు నడిపారు.మైతలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘మాయోన్’కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సత్యరాజ్ కొడుకు సిబి సత్యరాజ్‌కి ఇది తొలి చిత్రం. అయినా ఆ విషయం తెరపై ఎక్కడా తెలియకుండా నటించాడు యంగ్ హీరో సిబి సత్యరాజ్. ఆర్కియాలజిస్ట్ అర్జున్ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా, చురుగ్గా కనిపించాడు. ఇక హీరో బృందంలో ఉండే మరో ఆర్కియాలజిస్ట్ సంజనగా తాన్య రవిచంద్రన్ మెప్పించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న దేవరాజ్ పాత్రలో హరీశ్ పేరడి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గ్రామ పెద్ద, కృష్ణప్పగా రాధ రవి పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తెలుగు ప్రేక్షకులను పెద్దగా తెలియదు కానీ.. తమ తమ పాత్రల పరిధిమేర నటించి, మెప్పించారు. సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. బాలయ్య నటించిన అఖండ చిత్రానికి ఈయనే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. తమిళ్లో ఇది ఆయనకు తొలి సినిమా. తనదైన కెమెరా పనితనంతో ప్రతి సీన్‌ని ఆసక్తికరంగా చూపించాడు. ఆలయ సన్నివేశాలను తెరపై చాలా అధ్భుతంగా చూపించాడు. గ్రాఫిక్స్ వర్క్ బాగుంది. సాంకేతికతను ఉయోగించి ఆలయంలోకి ఈగను పంపించడం.. మొబైల్ వాచ్, కొత్త పరికరంతో అర్థరాత్రి వచ్చే చెడు శబ్ధాలను ఆపడం లాంటి సీన్స్ ఆకట్టుకుంటాయి.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు చాలా రిచ్‌గా ఉన్నాయి. -
అణగారిన స్త్రీల ఆర్తనాదం..‘నెంజుక్కు నీది’ మూవీ రివ్యూ
‘ముప్పై రూపాయలు మనకు ఎంత ముఖ్యం’ అని ఆలోచిస్తాడు హీరో ‘నెంజుక్కు నీది’ సినిమాలో. ముప్పైరూపాయలతో ఇవాళ సరైన టిఫిన్ కూడా రాదు. అసలు ముప్పై రూపాయలను లెక్క కూడాచేయం. కాని కూలీలో ముప్పై రూపాయలు పెంచమని ముగ్గురు అమ్మాయిలు అడిగితే ఏమవుతుంది? అదీ దళిత అమ్మాయిలు అయితే? వాళ్లను ‘అణిచేయ బుద్ధవుతుంది’. అందుకు ‘అత్యాచారం చేయొచ్చులే’ అనిపిస్తుంది. కాని చట్టం ఉంది. దానిని సరైనవాడు ఉపయోగిస్తే ఇలాంటి ఆలోచనకు కూడా భయం వస్తుందని చెప్తున్న సినిమా ‘నెంజుక్కు నీది’. ‘పుట్టుకతో సమానం’ ట్యాగ్‌లైన్. సోని లివ్‌లో విడుదల. సినిమా దాదాపు క్లయిమాక్స్‌కు వస్తుంది. హీరో ఉదయనిధి స్టాలిన్ సిబిఐ ఆఫీసర్‌తో అంటాడు– ‘ఇద్దరు అమ్మాయిలను రేప్ చేసి చంపేశారు. వారిని కాల్చేయొచ్చు. పూడ్చి పెట్టొచ్చు. కాని వాళ్ల వాడకే తీసుకెళ్లి చెట్టుకు ఉరి వేశారు. ఎందుకో తెలుసా? వారిని హెచ్చరించడం కోసం. మీరు ఇంతలోనే ఉండాలని హెచ్చరించడం కోసం’. ఈ దేశంలో ‘వాడ’ ఉంది. ఊరికి దూరంగా ఆ ‘వాడ’ ఉంటుంది. ఈ దేశంలో ‘కులం’ ఉంది. అది ఎవరు ఎక్కువో ఎవరో తక్కువో, ఎవరితో కలవాలో ఎవరితో కలవకూడదో, ఏది తినాలో ఏది తినకూడదో, ఎవరిని ఈసడించాలో ఎవరిని గౌరవించాలో, ఎవరితో అహంకారంగా వ్యవహరించాలో ఎవరితో అణిగిమణిగి ఉండాలో చెబుతుంది. సంఘనీతి, సంస్కృతి, కట్టుబాట్లు తరతరాలుగా అలా చెప్పేలా చేశాయి. అందుకే ఒక వ్యక్తి కులాన్ని బట్టి అతడితో ‘ఎలా వ్యవహరించాలో’ ఈ దేశ జనులకు ఒక అవగాహన ఉంది. అనుమతి కూడా ఉంది. ‘నెంజుక్కు నీది’ (తెలుగు డబ్బింగ్ ఉంది)లో పెద్ద కులం వాళ్ల కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పని చేసే ముగ్గురు ఆడపిల్లలు తమ రోజు కూలి రేటు పెంచమంటారు. ముప్పై రూపాయలు. ఆ ఫ్యాక్టరీ బాగా బలిసిన వ్యక్తిది. పైగా మంత్రి మేనల్లుడిది. అతనికి 30 రూపాయలు పెంచమని అడగడం– అసలు ఏదైనా డిమాండ్ పెట్టడం నచ్చదు. పైగా కడజాతి వాళ్లు వచ్చి అలా అడగడం నచ్చదు. అతనికి స్కూల్ బస్ ఉంటుంది. దాంట్లో ఆ ముగ్గురు అమ్మాయిలు ఇంటికి వెళుతుంటే కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత స్కూల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేస్తాడు. ఇద్దర్ని చంపేస్తాడు. మరో అమ్మాయి తప్పించుకుంటుంది. ఈ కేసును ఛేదించే బాధ్యత ఏ.ఎస్.పి. ఉదయనిధిపై పడుతుంది. అయితే ఈ దేశంలో ‘నేరము–శిక్ష’ నేరుగా ఉండదు అని విచారణ చేసే కొద్దీ ఉదయనిధికి అర్థం అవుతుంది. ‘ఎవరు’ నేరం చేశారు, ‘ఎవరు’ బాధితులు, ఏ (కులం) పార్టీ అధికారంలో ఉంది, ఏ (కులం) అధికారి విచారణ చేస్తున్నాడు, ఏ ‘కులం’ వాళ్లు దీనికి ఎలా రియాక్ట్ అవుతారు, డిఫెన్స్ లాయర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ వర్గాల వారు ఇవన్నీ ఒక ‘శిక్ష’ను ప్రభావితం చేయగలవని అతడు తెలుసుకుంటాడు. మన దేశంలో కొందరికి వెంటనే శిక్షలు పడటం, కొన్ని కేసులు ఎప్పటికీ తేలకపోవడం ఇందుకే అని తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా చనిపోయింది దళిత అమ్మాయిలు కాబట్టి చట్టంలో ఉండే కొందరు అధికారులు ‘ఇది మామూలే’ అనుకుంటారు. కేసు క్లోజ్ చేయాలని చూస్తారు. కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఉదయనిధిపై ఒత్తిడి తెస్తారు. చివరకు సస్పెండే చేస్తారు. కాని ఉదయనిధి తగ్గడు. రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 15’ని గుర్తు చేస్తాడు. ‘జన్మ వల్లగాని, పుట్టిన ప్రాంతం వల్ల గాని, కులం వల్ల గాని, మతం వల్ల గాని వివక్ష చూపరాదు’ అని చెప్పేదే ఆర్టికల్ 15. రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన అధికారిగా ముందుకు సాగి కేసును ఛేదిస్తాడు. హిందీలో వచ్చిన ‘ఆర్టికల్ 15’కు రీమేక్‌గా తీసిన ఈ సినిమా మొదలైన వెంటనే ప్రేక్షకులను కూడా నిందితులను చేయడంలోనే విశేషం అంతా ఉంది. ప్రేక్షకులకు కూడా ఒక కులం, మతం, భావధార ఉంటాయి కనుక వారు ఆ పాత్రల్లో తాము ఎక్కడ ఉన్నారో తరచి చూసుకుంటారు. జరిగిన నేరంపై తమ వైఖరి ఏమిటో గమనించుకుంటారు. ‘ప్రతి కులంలో బాధ ఉంది’ అని ఒక మంచి అధికారి ఇందులో దళితుడితో అంటాడు. అందుకు జవాబుగా ఆ దళితుడు ‘నిజమే. ప్రతి కులంలో బాధ ఉంది. కాని కులం వల్ల మాత్రమే కలిగే బాధ మాకు ఉంది’ అని జవాబు చెప్తాడు. ఇక ఆ కులంలో పుట్టే స్త్రీల బాధ ఎలాంటిదో ఈ సినిమా చెబుతుంది. ‘విద్యలో, ఉద్యోగాలలో చూపే అంటరానితనం అత్యాచార సమయంలో మాత్రం ఉండదు’ అనే డైలాగ్ కూడా ఉంది. హిందీలో అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంలో సినీ కవి అరుణ్ రాజా కామరాజ్ తీశాడు. తమిళానికి తగినట్టుగా మంచి మార్పులు చేసుకున్నాడు. కథనం ఆసక్తికరంగా మలిచాడు. సినిమా ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది. వ్యవస్థ మారలేదని కాదు. చాలా మారింది. కాని అది సరిపోదని, సరి చేసుకోవాల్సిందేనని చెప్పే సినిమా ‘నెంజుక్కు నీది’. -
‘ఏనుగు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏనుగు నటీనటులు : అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి, కేజీయఫ్ రామచంద్రరాజు తదితరులు నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ దర్శకత్వం: హరి సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: గోపీనాథ్ ఎడిటర్: ఆంథోని విడుదల తేది: జులై 1,2022 హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘యానై’. ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కాకినాడకు చెందిన పీఆర్వీ, ‘సముద్రం’ కుటుంబాల మధ్య శత్రుత్వం ఉంటుంది. పీఆర్వీ రెండో భార్య కొడుకు రవి(అరుణ్) తన కుటుంబానికి, సవతి తల్లికొడుకులు(సముద్రఖని, బోస్ వెంకట్, సంజీవ్)కు అండగా నిలబడతాడు. ‘సముద్రం’కుటుంబానికి చెందిన లింగం( కేజీయఫ్ గరుడ రామ్)తో తన ఫ్యామిలీకి ముప్పు ఉందని తెలుసుకున్న రవి.. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అన్నయ్యలకు ఎలాంటి హానీ కలగకుండా చూసుకుంటాడు. ఈ క్రమంలో తన అన్నయ్య(సముద్రఖని)కూతురు దేవి(అమ్ము అభిరామి)చేసిన పనికి రవి,అతని తల్లి(రాధికా శరత్ కుమార్)ఇంటిని వీడాల్సి వస్తుంది. అసలు దేవి చేసిన తప్పేంటి? దాని వల్ల రవి ఎందుకు అన్నయ్యలకు దూరమయ్యాడు? పీవీఆర్, సముద్రం కుటంబాల మధ్య వైరుధ్యుం ఎందుకు ఏర్పడింది? తండ్రి మరణం అన్నదమ్ముల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ మధ్యలో మేరీ (ప్రియా భవానీ శంకర్)తో రవి ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు రవి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మితగా కథ ఎలా ఉందంటే.. సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు హరి. ఆయన చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. అందుకే తమిళ సినిమా యానైని తెలుగు ఏనుగు పేరుతో విడుదల చేశారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎమోషనల్ కంటెంట్‌తో పాటు మంచి ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా పీవీఆర్, సముద్రం కుటుంబాల మధ్య వైర్యం, మేరి, రవిల ప్రేమాయణంతో రొటీన్‌గా సాగుతుంది. ప్రధాన పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. యోగిబాబుతో వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయిస్తాయి. పీవీఆర్ కుటుంబంలో చీలికలు ఏర్పడడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నింపేశాడు. అన్నయ్య కూతురు దేవిని వెతికే క్రమంలో వచ్చే ట్విస్టులు, ఎమోషన్ సీన్స్ సినిమాని మరోస్థాయి తీసుకెళ్తాయి. రవి తండ్రి చనిపోయిన సీన్ అయితే కంటతడి పెట్టిస్తాయి. అయితే రొటీన్ స్క్రీన్‌ప్లే, కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. అలాగే నిడివి కూడా ఎక్కువగా ఉండడం మైనస్. ఫ్యామిలీ ఎమోషన్స్ కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. రవి పాత్రకు న్యాయం చేశాడు అరుణ్ విజయ్. యాక్షన్, ఎమోషన్స్ సీన్స్‌లో చక్కగా నటించాడు. ఇక మేరి పాత్రలో ఒదిగిపోయింది ప్రియా భవానీ శంకర్. తెరపై తెలుగింటి అమ్మాయిగా, అందంగా కనిపించింది. పీఆర్వీ కుటుంబ పెద్దగా సముద్రఖని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. రవి తల్లిగా రాధిక శరత్ కుమార్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. విలన్ గా గరుడ రామ్ ఆకట్టుకున్నాడు. జిమ్మిగా యోగిబాబు తనదైన కామెడీ పంచ్‌లతో నవ్వించాడు. మిగిలిన నటీటనులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. జీవి ప్రకాశ్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. గోపినాథ్ సినిమాటోగ్రఫి బాగుంది. సముద్ర తీరం అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ ఆంథోని తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. కొన్ని సీన్స్‌కి తొలగించి, నిడివిని తగ్గిస్తే సినిమా స్థాయి మరోరకంగా ఉండేది. నిర్మాణ విలువల చాలా రిచ్‌గా, సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ
టైటిల్ :పక్కా కమర్షియల్ నటీనటులు : గోపిచంద్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్, తదితరులు నిర్మాణ సంస్థలు : జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్ నిర్మాత: బన్నీ వాసు రచన,దర్శకత్వం: మారుతి సంగీతం : జేక్స్ బిజాయ్ సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా ఎడిటర్: ఎన్ పి ఉద్భవ్ విడుదల తేది: జులై 1, 2022 వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో ఈ శుక్రవారం(జులై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉంది ? కమర్షియల్ హిట్ కొట్టేసిందా లేదా రివ్యూలో చూద్దాం. కథేంటంటే... సూర్య నారాయణ (సత్య రాజ్) ఓ సిన్సియర్ న్యాయమూర్తి. వ్యాపారవేత్త వివేక్ (రావు రమేశ్) చేతిలో మోససోయిన యువతికి న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ న్యాయవాద వృత్తికి రాజీనామా చేసి కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తాడు. అతని కొడుకు లక్కీ(గోపిచంద్) కూడా లాయర్ అవుతాడు. కానీ తండ్రిలా నిజాయతీగా కాకుండా మార్కెట్లో అవలీలగా న్యాయాన్ని అమ్మెస్తుంటాడు. తప్పు ఒప్పు చూడకుండా పక్కా కమర్షియల్‌గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ఓ కేసు విషయంలో వివేక్ తరఫున వాదించి.. అతనికి దగ్గరవుతాడు. అయితే వివేక్ వల్ల బాధింపబడిన యువకుడి కోసం, అతని భార్య కోసం మళ్లీ నల్లకోర్టు వేసి కోర్టుమెట్లు ఎక్కుతాడు సూర్య నారాయణ. వివేక్ తరఫున కొడుకు లక్కి రంగంలోకి దిగుతాడు. ఈ న్యాయ పోరాటంలో ఎవరు గెలిచారు? సొంత తండ్రిని కాదని వివేక్ తరఫున లక్కీ ఎందుకు వాదిస్తాడు ? లక్కీ మరీ అంత కమర్షియల్‌గా ఎందుకు మారాడు ? చివరకు సూర్యనారాయణ కోరుకున్నట్లుగా వివేక్కి శిక్ష పడిందా లేదా? తండ్రికొడుకుల న్యాయపోరాటంలో సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’ ఎలాంటి పాత్ర పోషించింది? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. పక్కా కమర్షియల్‌లో కథను పక్కకు పెట్టి కామెడీతో లాక్కోచ్చాడు. హీరోయిజం మీదనే ఎక్కువ దృష్టిపెట్డాడు. టైటిల్‌కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఓ ఎమోషనల్ సీన్‌తో సినిమా మొదలవుతుంది. లాయర్ లక్కీగా గోపిచంద్ ఎంట్రీతోనే టైటిల్ దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌గా సినిమా సాగుతుంది. సీరియల్ నటి ‘లాయర్ ఝాన్సీ’ ఎంట్రీతో కామెడీ డబుల్ అవుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్స్ విషయంలో మారుతి మరోసారి తన మార్క్ చూపించాడు. సీరియల్లో తన క్యారెక్టర్ని చంపారంటూ ‘లాయర్ ఝాన్సీ’ కోర్టు ఆశ్రయించే సీన్ నవ్వులు పూయిస్తుంది. రొటీన్ కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్ అంతా సోసోగా సాగుతుంది. ఇక సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్కి దగ్గరైన లక్కీ చివరకు అతన్ని ఎలా జైలు పాలు చేశాడనేది వినోదాత్మకంగా చూపించాడు. సెకండాఫ్‌లో చాలా ఫ్రెష్ కామెడీతో నవ్వించాడు మారుతి. సినిమాల్లో వచ్చే ఫైట్ సీన్స్‌పై వేసిన సెటైర్, రావు రమేశ్, అజయ్ ఘోష్‌ల మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ ప్రేక్షకుడి ఊహకి అందేట్లుగా ఉంటుంది. కథని, లాజిక్స్‌ని పక్కకు పెట్టి చూస్తే.. ‘పక్కా కమర్షియల్’ పక్కా నవ్విస్తుంది. ఎవరెలా చేశారంటే.. డబ్బు కోసం అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చే పక్కా కమర్షియల్ లాయర్ లక్కీ పాత్రలో గోపిచంద్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత తనదైన కామెడీతో నవ్వించాడు.ఫైట్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. ఒక సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’గా రాశీఖన్నా ఇరగదీసింది. స్క్రీన్‌పై చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. సీరియల్ భాషలో ఆమె చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఇక హీరో తండ్రి సూర్యనారాయణ పాత్రలో సత్యరాజ్ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు చేయడం ఆయనకు కొత్తేమి కాదు. మారుతి గత సినిమాల మాదిరే ఇందులో కూడా రావు రమేశ్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. విలన్ వివేక్‌గా తనదైన నటనతో మెప్పించాడు. సప్తగిరి, వైవా హర్ష, ప్రవీణ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజాయ్ సంగీతం బాగుంది. 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్‌తో పాటు 'అందాల రాశి..'పాట కూడా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా ఫ్రెష్‌గా ఉంది. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ నటీనటులు : ఆర్. మాధవన్, సిమ్రన్ , సూర్య, గుల్షన్ గ్రోవర్, రజిత్ కపూర్, రవి రాఘవేంద్ర తదితరులు నిర్మాణ సంస్థలు : కలర్ ఫిల్మ్స్, వర్ఘీస్ మూలన్ పిక్చరర్స్ నిర్మాతలు: సరితా మాధవన్, మాధవన్, వర్ఘీస్ మూలన్, విజయ్ మూలన్ రచన,దర్శకత్వం : ఆర్ మాధవన్ సంగీతం : శ్యామ్. సీఎస్ సినిమాటోగ్రఫీ : సిర్షా రే ఎడిటర్ : బిజిత్ బాలా విడుదల తేది : జులై 1, 2022 ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరాడు. ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 1)థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? నంబి నారాయణన్‌గా మాధవన్ ఏ మేరకు మెప్పించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమ కథంతా ఇంటర్వ్యూగా సాగుతుంది. ఓ టీవీ చానల్లో హీరో సూర్య నంబి నారాయణన్(మాధవన్)ని ఇంటర్వ్యూ చేస్తూ.. తన జీవితం ఎలా సాగింది? ఇస్రోలో ఎలా చేరారు? తనపై వచ్చిన ఆరోపణలు ఎలా ఎదుర్కొన్నాడు తదితర విషయాలను అడుగుతారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరుతాడు నంబి నారాయణన్. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. అక్కడ సానా ఆఫర్ వచ్చిన సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇండియాకు వచ్చిన మళ్లీ ఇస్రోలో చేరుతారు.. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజన్స్‌ని భారత్ తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత నంబి నారాయణన్ జీవితం ఎలా మలుపు తిరిగింది? అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల చేతిలో నంబి ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను నుంచి ఎలా విముక్తి పొందారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణన్ ఒకరు. దేశం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆఫర్‌ని తిరస్కరించి ఇస్రోలో చేరారు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఆయన దేశ ద్రోహం కేసును ఎదుర్కొన్నారు.తర్వాత ఆయనపై వేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కొట్టి వేసింది.నంబి నారాయణన్ మీద ఆరోపణలూ చెదిరిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇలా ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఆయన జీవితాన్ని మాధవన్ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.ఫస్టాఫ్ అంతా స్వదేశీ రాకెట్లను అభివృద్ది కోసం నంబి నారాయణన్ చేసిన కృషిని చూపించారు. సెకండాఫ్‌లో తప్పుడు కేసు వల్ల ఆయనతో కుటుంబ సభ్యులు ఎలాంటి అవమానాలకు గురయ్యారు? చివరకు నిర్థోషిగా ఎలా బయటకు వచ్చారనే విషయాలను చాలా భావోద్వేంగా చూపించారు.అయితే ఫస్టాఫ్ అంతా అంతరిక్ష పరిశోధన, ప్యూయల్ టెక్నాలజీ, వికాస్ ఇంజన్ అభివృద్ది తదితర అంశాలను లోతుగా చూపించడంతో డ్యాక్యూమెంటరీ ఫీల్ కలుగుతుంది. రాకెట్ సైన్స్ సామాన్య ప్రేక్షకులకు అంతగా అర్థం కాదు..కానీ దానితోనే నంబి నారాయణన్ జీవితం సాగింది కాబట్టి కచ్చితంగా వాటిని చూపించాల్సిందే. దర్శకుడు అదే పని చేశారు. ఇక సెకండాఫ్ మొత్తం చాలా భావోద్వేగంగా సాగుతుంది. దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన నంబి నారాయణన్.. దేశద్రోహి కేసు కింద అరెస్ట్ కావడం.. ఆ సమయంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎలాంటి మానసిక క్షోభని అనుభవించారు, నిర్దోషిగా బయటకు రావడమే కాకుండా దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్న సీన్స్ చాలా భావోద్వేగాన్ని కలిగించేలా అద్భుతంగా తెరకెక్కించారు. ‘ఒక రాకెట్ కూలిపోతే రియాక్ట్ అయ్యే మాకు.. ఒక మనిషి కూలిపోతే రియాక్ట్ అవడం తెలియదు’ అంటూ తోటి సైంటిస్టుల గురించి నంబి చెప్పె డైలాగ్, ఒక వీధి కుక్కను కొట్టి చంపాలనకుంటే దానికి పిచ్చి అన్న పట్టం కడితే సరిపోతుంది..అదేవిధంగా ఒక మనిషిని తనకు తెలియకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పట్టం కడితే సరిపోతుంది’ అని హీరో సూర్య చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి కూడా. దేశం కోసం కష్టపడిన మీ ఓ గొప్ప శాస్త్రవేత్తని అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారే అనే ఫీల్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు కానీ.. మాధవన్ చాలా నిజయతీగా, ఉన్నతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించడం కంటే ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం దర్శకుడిగా, నటుడిగా మాధవన్ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. యంగ్ లుక్‌తో పాటు ప్రస్తుతం నంబి నారాయణన్ ఎలా ఉన్నారో.. అలానే తెరపై చూపించే ప్రయత్నం చేశారు. దాని కోసం మాధవన్ చాలా కష్టపడ్డారు. పొట్టపెంచడం, పంటి వరుసను మార్చుకోవడం.. గెడ్డం పెంచడం ..ఇలా చాలా విషయాల్లో మాధవన్ డేరింగ్ స్టెప్స్ వేశాడు. ఎమోషనల్ సీన్స్‌ని చక్కగా పండించారు. అబ్దుల్ కలాంగా గుల్షన్ గ్రోవర్ , నంబిని ఇంటర్వ్యూ చేసే హీరోగా సూర్య(హిందీలో షారుఖ్) చక్కగా నటించారు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం శ్యామ్. సీఎస్ సంగీతం. చక్కటి నేపథ్య సంగీతంతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు.సిర్షా రే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ మూవీ రివ్యూ
టైటిల్ : గ్యాంగ్‌స్టర్ గంగరాజు నటీనటులు : లక్ష్య్, వేదిక దత్త, వెన్నెల కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్ తదితరులు నిర్మాణ సంస్థ:శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ దర్శకత్వం: ఇషాన్ సూర్య సంగీతం: సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: కణ్ణ పి.సి. ఎడిటర్ : అనుగోజు రేణుకా బాబు విడుదల తేది : జూన్ 24,2022 రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో లక్ష్. 'వలయం' సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. తాజాగా 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ శుక్రవారం(జూన్ 24) విడుదలైన ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. దేవరలంకకు చెందిన గంగరాజు(లక్ష్య్) ఓ గ్యాంగ్‌ని వేసుకొని ఆవారాగా తిరుగుతుంటాడు. తండ్రి నాగరాజు( గోపరాజు రమణ) రైల్వే శాఖలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ కావడానికి సిద్దంగా ఉంటాడు. కొడుకు మాత్రం జులాయిగా తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. గంగరాజు ఉండే ఏరియాలోకే కొత్తగా వస్తుంది ఎస్సై ఉమాదేవి( వేదిక దత్త). ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమె ప్రేమని పొందడం కోసం నానా తిప్పలు పడుతుంటాడు. ఇలా సాధారణ జీవితాన్ని గడుపుతున్న గంగరాజు...అనుకొని సంఘటన వల్ల దేవరలంకలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సిద్దప్పని హత్య చేస్తాడు. ఆ తర్వాత గంగరాజు జీవితమే మారిపోతుంది. ఊరంతా అతన్ని గ్యాంగ్‌స్టర్ గంగరాజు అని పిలవడం స్టార్ట్ చేస్తుంది. అసలు సిద్దప్పని గంగరాజు ఎందుకు హత్య చేశాడు? దేవరలంకకు చెందిన ఎమ్మెల్యే నర్సారెడ్డి(శ్రీకాంత్ అయ్యంగార్) బామ్మర్ది బసిరెడ్డి(చరణ్ దీప్)తో గంగరాజుకు ఉన్న వివాదం ఏంటి? దేవరలంక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న రౌడీ బసిరెడ్డిని గంగరాజు ఎలా మట్టుబెట్టాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’.. ఈ టైటిల్ వినగానే బండ్లు గాల్లోకి ఎగరడాలు, బాంబులు, చేజింగ్ లు, ఫైటింగ్ ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ స్టోరీ అంతా ఒక ఫిక్షనల్ టౌన్లో జరుగుతుంది. ఇందులో కామెడీ, లవ్, ఎమోషన్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. కథంతా కామెడీగా సాగుతూనే అక్కడక్కడ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు ఇషాన్ సూర్య. ఫస్టాఫ్ అంతా ఉమాదేవి, గంగరాజుల ప్రేమ చుట్టే సాగుతుంది. ఉమాదేవి ప్రేమను పొందేందుకు గంగరాజు పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. అలాగే బామ్మగా అన్నపూర్ణమ్మ చేసే ఫైట్ సీన్ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో గ్యాంగ్‌స్టర్ గంగరాజు అసలు రూపం బయటపడుతుంది. బసిరెడ్డి నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే నర్సారెడ్డిని బకరా చేసిన తీరు అందరిఊఈ నవ్విస్తుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో లక్ష్య్. సినిమా సినిమాకి తన పాత్రలో వేరియష్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. ‘వలయం’ వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను మెప్పించిన లక్ష్య్ ఈ సారి తనదైన పంథాలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అనే డిఫరెంట్ మూవీతో వచ్చాడు. గంగరాజుగా లక్ష్య్ అదరగొట్టేశాడు. కామెడీ, ఫైట్స్, ఎమోషనల్.. ఇలా ప్రతి సీన్స్‌లో అద్భుతమైన నటనను కనబరిచాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడు. ఎస్సై ఉమాదేవిగా వేదికదత్త తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. గంగరాజు తండ్రి నాగరాజు పాత్రలో గోపరాజు రమణ ఒదిగిపోయాడు. ఒక ఎమ్మెల్యే నర్సారెడ్డిగా శ్రీకాంత్ అయ్యంగార్ తనదైన కామెడీతో నవ్వించాడు. బసిరెడ్డిగా చరణ్ దీప్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, రవితేజ నన్నిమాల తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సాయి కార్తీక్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునేలా ఉంది. కణ్ణ పి.సి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ చాలా బ్యూటిఫుల్‌గా తీశాడు. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
'సదా నన్ను నడిపే' సినిమా రివ్యూ
'వానవిల్లు ' చిత్రం తర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటించిన మూవీ 'సదా నన్ను నడిపే'. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి హీరో ప్రతీక్ దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించాడు. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.. కథ: ఎమ్.జే అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు. అతడు సాహా(వైష్ణవి పట్వర్దన్)తో ప్రేమలో పడతాడు. ఆమె ఎంత కాదన్నా ఎంతో సిన్సియర్‌గా లవ్ చేస్తూ ఉంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా ఎమ్జే ప్రేమని అంగీకరించడు. అయితే హీరో మాత్రం ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ వుంటాడు. ఎట్టకేలకు సహా ప్రేమను అంగీకరించి అతడిని పెళ్లాడుతుంది సాహా. కానీ పెళ్ళైన మొదటి రోజు నుంచే అతడిని దూరం పెడుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుని కూడా సాహా... ఎమ్జేను ఎందుకు దూరం పెడుతూ ఉంటుంది? ఆమె సమస్య ఏంటి? హీరో దాన్ని ఎలా పరిష్కరించాడు? వీరిద్దరూ చివరికి కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...!!! విశ్లేషణ: హీరో చెప్పినట్టు ఇంతకు ముందు స్వచ్చమైన ప్రేమకథలతో గీతాంజలి, కలిసుందాం రా లాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్‌ను కళకళలాడించాయి. ఇప్పుడీ చిత్రాన్ని కుడా హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్... ఎంతో ఎమోషనల్‌గా సిల్వర్ స్క్రీన్‌పై ఆ విష్కరించాడు. మనకు బాగా తెలిసిన వ్యక్తి చనిపోతున్నారని తెలిశాక వారితో వున్న కొద్దిక్షణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటామో అనేది ఇందులో చూపించారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి త్యాగాన్ని అయినా చెయ్యొచ్చనినే విషయాన్ని ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించాడు. కర్నాటకలో జరిగిన ఓ వాస్తవ సంఘటనను ఆధారంగా తీసుకుని సినిమాటిక్‌గా మార్చిన తీరు బాగుంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా వుంది. ప్రతీక్ ప్రేమ్ చాలా బాగా చేశాడు. హీరోగా నటిస్తూనే.. దర్శకత్వ బాధ్యలను సమర్థవంతంగా నిర్వహించాడు. హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలీ వున్నంత సేపు బాగా నవ్వులు పుయించాడు. నాగబాబు, రాజీవ్ కనకాల తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. నందు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. విజయవాడ, హైదరాబాద్, కొడైకెనాల్, కులుమనాలిలో చిత్రీకరించిన లోకేషన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్‌గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. చదవండి: రణ్‌బీర్ కపూర్ కారుకు యాక్సిడెంట్ ‘సమ్మతమే’ మూవీ రివ్యూ -
Sammathame Movie Review: ‘సమ్మతమే’ మూవీ రివ్యూ
టైటిల్ : సమ్మతమే నటీనటులు : కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ తదితరులు నిర్మాణ సంస్థ : యూజీ ప్రొడక్షన్స్ నిర్మాతలు: కంకణాల ప్రవీణ దర్శకత్వం : గోపినాథ్ రెడ్డి సంగీతం :శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ :సతీష్ రెడ్డి మాసం ఎడిటర్ : విప్లవ్ నైషధం విడుదల తేది :జూన్ 24,2022 కొంతమంది హీరోలు తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుంటారు.అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్ చిత్రాలతో అలరించాడు. తాజాగా ఈ యంగ్ హీరో ‘సమ్మతమే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సమ్మతమే’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్ 24) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ(కిరణ్ అబ్బవరం) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. దీంతో బాల్యంలోనే చాలా అడ్డంకులు ఎదుర్కొంటాడు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోవడం వల్లే ఇవన్ని ఇబ్బందులని భావించిన కృష్ణ.. తల్లిలా చూసుకునే జీవిత భాగస్వామి రావాలనుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక భార్యనే ప్రేమించాలని భావిస్తాడు. అయితే తనకు కాబోయే భార్య మాత్రం పద్దతిగా, అబద్దాలు చెప్పకుండా ఉండాలనుకుంటాడు. ఇలాంటి వ్యక్తి.. తనకు పూర్తి వ్యతిరేకమైన శాన్వీ(చాందిని చౌదరి)తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఎలాగైన తన పద్దతిలోకి తెచ్చుకోవాలనుకుంటాడు. శాన్వీ కూడా కృష్ణని ప్రేమిస్తుంది. కానీ అతని అతిప్రేమ తట్టుకోలేకపోతుంది. దీంతో ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిని కృష్ణ ఎలా పరిష్కరించుకున్నాడు? అసలు పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించను అని చెప్పిన కృష్ణ.. శాన్వీ ప్రేమలో ఎలా పడ్డాడు? తన అతిప్రేమతో శాన్వీని ఎలా ఇబ్బంది పెట్టాడు? చివరకు శాన్విని కృష్ణ పెళ్లి చేసుకున్నాడా లేదా? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే..? పెళ్లి చేసుకునే ప్రతి యువకుడు తనకు కాబోయే భార్య ఇలా ఉండాలి..అలా ఉండాలని అనుకుంటారు. కన్నవాళ్లని వదులుకొని వచ్చిన భార్యకు ఆంక్షలు విధిస్తారు. అది తన భార్యపై తనకున్న ప్రేమ అని భావిస్తారు. కానీ ఆ ఆంక్షల వల్ల అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుంది? పాతికేళ్లు తనకు నచ్చినట్లుగా బతికే అమ్మాయి.. పెళ్లి తర్వాత భర్తకు నచ్చినట్లుగా ఉండాలనడం ఎంతవరకు సమంజసం? తనకంటూ ఓ జీవితం ఉంటుంది కదా? ఇదే విషయాన్ని ‘సమ్మతమే’చిత్రం ద్వారా తెలియజేశాడు దర్శకుడు గోపినాథ్ రెడ్డి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ...కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొత్తం కృష్ణ, శాన్వీల చుట్టే తిరుగుతుంది. ప్రతిసారి కండీషన్స్ పెట్టడం.. అనుమానించడం..చివరకు సారీ చెప్పడం.. కథంతా ఇలానే సాగుతుంది. కృష్ణ హైదరాబాద్‌కు రావడం..శాన్వీని ప్రేమించడం.. తనకు నచ్చే విధంగా మార్చుకోవాలనుకోవడం..ఇలా సోసోగా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథంతా సాగదీసినట్లుగా ఉంటుంది. కృష్ణ, శాన్వీల మధ్య ప్రేమ, గొడవలు..సారీలు చెప్పుకోవడం ఇలానే సాగుతుంది. కృష్ణ సంఘర్షనకు అసలు అర్థమే లేదనిపిస్తుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా కథంతా నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే చివరల్లో గోపరాజు రమణ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. చివరగా ఇది సాధారణ ప్రేమ కథే అయినప్పటికీ.. దర్శకుడి ఇచ్చిన సందేశానికి మాత్రం సమ్మతం తెలుపాల్సిందే. ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రలో కిరణ అబ్బవరం చక్కగా నటించాడు. నేటి తరం యువకులకు ప్రతి రూపంగా అతని పాత్ర ఉంటుంది. అయితే సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో నటించడం కాస్త మైనస్. ఇక శాన్వీగా చాందిని చౌదరి అదరగొట్టేసింది. తెరపై అందంగా కనిపించడమే కాకుండా.. మోడ్రన్ అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా గోపరాజు రమణ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. కథంతా కిరణ్, శాన్వీ పాత్రలే తిరిగినా...క్లైమాక్స్‌లో మాత్రం గోపరాజు రమణ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుడికి అలా గుర్తిండిపోతాయి. సెకండాఫ్‌లో సప్తగిరి తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. శివ నారాయణ, అన్నపూర్ణమ్మ, సద్దాం తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం శేఖర్ చంద్ర సంగీతం. పాటలతో అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. కథకు అనుగుణంగా పాటలు వస్తాయి. ఎక్కడా ఇరికించినట్లు అనిపించదు..అలా అని గుర్తిండిపోయే పాటలు కూడా కాదు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ విప్లవ్ నైషధం తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కిరోసిన్’ మూవీ రివ్యూ
టైటిల్ : కిరోసిన్ నటీనటులు :ధృవ, ప్రీతిసింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, సమ్మెట గాంధీ, మధుసూదన్ రావు, కాంచెరపాలెం రాజు తదితరులు నిర్మాణ సంస్థ :బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ దర్శకత్వం : ధృవ విడుదల తేది: జూన్ 17,2022 టాలీవుడ్లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెప్ట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి వసూళ్లను రాబడుతాయి. అందుకే ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమా ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘కిరోసిన్’ థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (జూన్ 17) థియేటర్లలో విడుదలైంది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘కిరోసిన్’కథేంటంటే.. జనగూడెం తండాకి చెందిన రామప్ప(సమ్మెట గాంధీ)కూతురు గౌరీ(లావణ్య చెవుల) హత్యకు గురవుతుంది. లోకల్ ఎమ్మెల్యే దొరబాబు(బ్రహ్మాజీ) ఒత్తిడితో నిందితులను పట్టుకోకుండానే.. తప్పుడు ఆధారాలు చూపించి ఈ కేసును క్లోజ్ చేస్తాడు ఎస్సై(జీవిన్). కొన్ని రోజుల తర్వాత పైఅధికారులు ఈ కేసు దర్యాప్తుని ఏసీపీ వైభవ్(ధృవ)కి అప్పజెప్పుతారు. వైభవ్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండా సర్పంచ్ రావుల నాయక్(మధుసూదన్ రావు)తో పాటు పలువురి అనుమానితులను విచారిస్తాడు. ఈ హత్య కేసుకు గతంలో జరిగిన మరో ఇద్దరి యువతల హత్యలకు సంబంధం ఉందని ఏసీపీ ధృవ భావిస్తాడు. ఆ దిశగా విచారణ చేపట్టడంతో అసలు నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? గౌరీని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన హత్యలకు గౌరీ హత్య కేసుతో ఎలాంటి సంబంధం ఉంది? చివరకు ఏసీపీ వైభవ్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ చిత్రానికి అసలు కిరోసిన్ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కానీ, సరైన రీతిలో తీస్తేనే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు ధృవ. ఈ చిత్రంలో ఆయనే హీరోగా నటించడం విశేషం. ధృవ ఎంచుకున్న పాయింట్స్, రాసుకున్న స్క్రీన్‌ప్లే, డిజైన్ చేసుకున్న క్యారెక్టర్లు బాగున్నాయి. అయితే కథ కాస్త నెమ్మదిగా సాగడం మైనస్. ఫస్టాఫ్ అంతా గౌరీ కేసు విచారణ చుట్టే తిరుగుతుంది. ఆమెని ఎవరు హత్య చేశారనేది క్లైమాక్స్ వరకు తెలియజేయకుండా సస్పెన్స్‌ని మెయింట్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ధృవ ఎంట్రీతో ఫస్టాప్‌లో వేగం పుంజుకుంటుంది. గౌరీ కేసు కంటే ముందు మరో హత్య కేసుని ఏసీపీ వైభవ్ నిమిషాల్లో చేధించే సీన్ ఆకట్టుకుంటుంది. బిడ్డ చనిపోయిన విషయం తెలిశాక తండ్రి రామప్ప ఏడుస్తూ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. ఎస్సై పట్టించుకోకపోవడం, ఓ అమాయకుడిని ఇరికించి, ఈ కేసుని క్లోజ్ చేయడం పోలీసు వ్యవస్థలో జరిగే అన్యాయాలకు ఎత్తిచూపెడుతోంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. వేరు వేరు ప్రాంతాల్లో జరిగే హత్యలకు గౌరీ కేసుతో ముడిపెడుతూ.. ఏసీపీ చేసిన విచారణ ఆకట్టుకుంటుంది. ఈ వరుస హత్యల వెనుక ఏదో పెద్ద కారణం ఉంటుందని భావించిన ప్రేక్షకుడికి కాస్త నిరాశ కలిగించేలా క్లైమాక్స్ ఉంటుంది.అయితే ఇలాంటి సైకోలు కూడా సాధారన వ్యక్తులుగా మన చుట్టూ ఉంటారా? అనేలా క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘కిరోసిన్’ నచ్చుతుంది. ఇక నటీనటుల ఫెర్పార్మెన్స్ విషయానికొస్తే..ఏసీపీ వైభవ్‌గా ధృవ చక్కటి నటనను కనబరిచాడు. తండావాసి రామప్ప పాత్రలో సమ్మెట గాంధీ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌ని బాగా పండించాడు. ఎమ్మెల్యే దొరబాబుగా బ్రహ్మాజీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్ర నిడివి తక్కువే. సినియర్ నటుడైన బ్రహ్మాజీని ఇంకాస్త వాడుకుంటే సినిమాకు కలిసొచ్చేది. అగర్ బత్తీలు అమ్ముకునే శివయ్య పాత్ర ఈ సినిమాకు హైలైట్. ఈ పాత్రలో రామారావు జాదవ్ ఒదిగిపోయాడు. సైకోగా తనదైన నటనతో మూడు నిమిషాలు హడలెత్తించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘విరాటపర్వం’ మూవీ రివ్యూ
టైటిల్ : విరాటపర్వం నటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్, జరీనా వాహబ్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు దర్శకత్వం : వేణు ఊడుగుల సంగీతం : సురేశ్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ : దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ విడుదల తేది : జూన్ 17, 2022 టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. రానా, సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది.ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ ఆసక్తిని మరింత పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలో సాగుతుంది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెలకు జన్మనిస్తుంది ఆమె తల్లి(ఈశ్వరీరావు). ఆమెకు పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్). ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్ దళ నాయకుడు అరణ్య అలియాస్ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి..ఆయనతో ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్, ఈశ్వరీరావు)ఆమెకు మేనబావ(రాహుల్ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్న కోసం ఊరూరు వెతికి.. అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది. కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? వెన్నెల మావోయిస్టులను కలిసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవన్నపై ప్రేమతో నక్సలైట్‌గా మారిన వెన్నెల చివరకు వారి చేతుల్లోనే చనిపోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో ‘విరాటపర్వం’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్లో నక్సలిజం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో మావోయిస్టులు, రాజకీయ నాయకుల గురించి చెప్పారు. కానీ నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించడం విరాటపర్వం స్పెషల్. 1992లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుకు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వరంగల్‌కు చెందిన మహిళ సరళ(సినిమాలో వెన్నెల అని పేరు మార్చారు)ను మావోయిస్టులు కాల్చి చంపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సంఘటనను కథగా తీసుకోని మంచి సంబాషణలతో అద్భుతంగా విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కించాడు. సరళ హత్య విషయంలో తప్పు పోలీసులదా? లేదా నక్సలైట్లదా? అనే అంశాన్ని దర్శకుడు ఎంతో సున్నితంగా,ఎమోషనల్‌గా తెరపై చూపించాడు. ‘ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల.. ఇది నా కథ’ అంటూ సినిమా స్టార్టింగ్ నుంచే ప్రేక్షకులను వెన్నెల లవ్‌స్టోరీలోకి తీసుకెళ్లాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం వెన్నెల చుట్టే తిరుగుతుంది. వెన్నెల కుటుంబ నేపథ్యం, పెరిగిన విధానం, విప్లవ సాహిత్యానికి ముగ్థురాలై రవన్నతో ప్రేమలో పడడం..అతని కోసం కన్నవారిని వదిలి వెల్లడం.. చివరకు పోలీసుల చేతికి దొరకడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. తన తండ్రిపై పోలీసులు దాడి చేసినప్పుడు.. వారితో వెన్నెల వాగ్వాదం చేయడం ఆకట్టుకుంటుంది. ఇక రవన్నగా రానా ఎంట్రీ అయితే అదిరిపోతుంది. రవన్న కోసం దాచుకున్న బొమ్మను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేస్తే.. దానిని కాపాడుకునేందుకు వెన్నెల చేసే పని అందరిని ఆకట్టుకుంటుంది. రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క సీన్ తెలియజేస్తుంది. పోలీసుల నుంచి రవన్న దళాన్ని తప్పించేందుకు వెన్నెల చేసిన సాహసం ఫస్టాఫ్‌కే హైలెట్. ఫస్టాప్‌లో కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా అనిపించినా.. సాయి పల్లవి తనదైన నటనతో బోర్ కొట్టించకుండా చేసింది. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటుంది. సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. పోలీసు స్టేషన్లో ఉన్న వెన్నెలను రవన్న దళం చాకచక్యంగా తప్పించడం..ప్రొఫెసర్ శకుంతల (నందితా దాస్) అండతో ఆమె దళంలో చేరడంతో కథలో మరింత స్పీడ్ పెగుతుంది. భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర)లతో కలిసి వెన్నెల చేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి. రవన్న తన తల్లిని కలిసి వచ్చే క్రమంలో జరిగే ఎదురుకాల్పుల్లో రవన్న, వెన్నెల కలిసి ఫైరింగ్ చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకునే సన్నివేశం అదిరిపోతుంది. ఇక క్లైమాక్స్ అయితే కంటతడి పెట్టిస్తుంది. చేయని తప్పుకు వెన్నెల బలైపోయిందనే బాధతో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వస్తాడు. దర్శకుడు వేణు స్వతహా రచయిత కావడంతో మాటలు తూటాల్లా పేలాయి. ‘మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్’అని రాహుల్ రామకృష్ణతో చెప్పించి.. అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో చూపించాడు. ‘మీరాభాయి కృష్ణుడు కోసం కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను వదిలేసి ఎలా వెళ్లిపోయిందో! అలానే నేను నీకోసం వస్తున్నాను’ అంటూ వెన్నెలతో చెప్పించి రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి తెలియజేశాడు. ‘తుపాకీ గొట్టంలో శాంతి లేదు... ఆడపిల్ల ప్రేమలో ఉంది’, 'చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు’, ‘రక్తపాతం లేనిదెప్పుడు చెపు.. మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉంది’, నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తల రాతల్లో కచ్చితంగా నేనే ఉన్నా’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే తెలంగాణలో అప్పట్లో ఎలాంటి పరిస్థితులు ఉండోవో, ప్రజల జీవన పరిస్థితి ఏరకంగా ఉండేదో చక్కగా చూపించాడు. మొత్తంగా దర్శకుడు వేణు ఊడుగుల ఓ స్వచ్చమైన ప్రేమ కథను.. అంతే స్వచ్చంగా తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. వెన్నెల పాత్రని రాసుకున్నప్పుడే సాయి పల్లవి ఊహించుకున్నానని సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు వేణు చెప్పాడు. ఆయన ఊహకు పదిరెట్లు ఎక్కువగానే సాయి పల్లవి నటించిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తే.. యాక్షన్ సీన్స్‌లో విజిల్స్ వేయించింది. అచ్చం తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఇక కామ్రేడ్ రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. తెరపై నిజమైన దళనాయకుడిగా కనిపించాడు. తెరపై చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. వెన్నెల, రవన్న క్యారెక్టర్లకే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇక దళ సభ్యులు భారతక్కగా ప్రియమణి, రఘన్నగా నవీన్ చంద్ర తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రీక్లైమాక్స్‌లో ప్రియమణి, నవీన్ చంద్రల కారణంగానే కథ మలుపు తిరుగుతుంది. వెన్నెల తల్లిదండ్రులుగా సాయిచంద్, ఈశ్వరీరావు మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. వారి పాత్రల నిడివి తక్కువే అయినా.. గుర్తుండిపోతాయి.రాహుల్ రామకృష్ణ, నివేదిత పేతురాజ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సురేశ్ బొబ్బిలి సంగీతం. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా.. కథతో పాటు వస్తాయి. నేపథ్య సంగీతం అయితే అద్భుతంగా ఇచ్చాడు. దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది.శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కల్యాణ్ దేవ్ 'కిన్నెరసాని' మూవీ రివ్యూ
టైటిల్: కిన్నెరసాని జానర్: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ నటీనటులు: కల్యాణ్ దేవ్, అన్ షీతల్, రవీంద్ర విజయ్, సత్య ప్రకాష్, మహతి దర్శకుడు: రమణ తేజ నిర్మాతలు: రజనీ తాళ్లూరి, రవి చింతల సంగీతం: మహతి స్వర సాగర్ సినిమాటోగ్రఫీ: దినేశ్ కె.బాబు విడుదల తేది: జూన్ 10, 2022 (జీ5) మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ నటించిన తాజా సినిమా కిన్నెరసాని. మొదట ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గత చిత్రం సూపర్‌మచ్చి థియేటర్లో పెద్దగా ఆడకపోవడంతో ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణతేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం(జూన్ 10) జీ 5లో రిలీజైంది. మరి కిన్నెరసాని చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.. కథ: వెంకట్(కల్యాణ్ దేవ్) తెలివైన లాయర్. ఎంతో ఈజీగా కేసులను పరిష్కరిస్తాడు. కాలేజీ టైంలోనే ఓ అమ్మాయి(కాశిష్ ఖాన్)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో ఆమె చనిపోతుంది. వేద(అన్ షీతల్) లైబ్రరీ నడుపుతుంది. లైబ్రరీలో తనకు దొరికిన కిన్నెరసాని పుస్తకం తన జీవితమే అని తెలుసుకుంటుంది. అందులో తన తండ్రి జయదేవ్(రవీంద్ర విజయ్) చిన్నప్పుడే తనను చంపాలనుకున్నాడని రాసి ఉంటుంది. అయితే అసలు తనను ఎందుకు చంపాలనుకున్నాడో తండ్రినే అడిగి తెలుసుకోవాలనుకుంటుంది వేద. అతడి జాడ కోసం అన్వేషిస్తుంది. ఆమెకు వెంకట్ సాయం చేస్తుంటాడు. అసలు వేదకు, వెంకట్‌కు ఉన్న సంబంధం ఏంటి? వెంకట్ ప్రేయసిని ఎవరు చంపారు? వేదను తండ్రి ఎందుకు చంపాలనుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ మర్డర్ సీన్‌తో మొదలైన సినిమా మర్డర్ సన్నివేశంతోనే ముగుస్తుంది. ఫస్టాఫ్‌లో కథను సస్పెన్స్, ట్విస్టులతో నడిపించారు. సెకండాఫ్‌లో ఫ్లాష్బ్యాక్లతో కొంత థ్రిల్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. రొటీన్ స్టోరీ కావడంతో సినిమా ఫ్రెష్‌గా ఏమీ అనిపించదు. చివర్లో క్లైమాక్స్ పెద్దగా వర్కవుట్ అవలేదనిపిస్తుంది. క్లైమాక్స్ మీద కొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది. సాయి తేజ దేశరాజు అందించిన కథ కథనం మాటలు సరికొత్తగా ఉన్నాయి. కథనం ప్రేక్షకుడ్ని చివరిదాకా కట్టిపడేస్తుంది. ఉత్కంఠగా సాగిన కథనం సినిమాకి మేజర్ హైలైట్. రైటర్‌కు మంచి మార్కులు పడ్డాయి. మర్డర్ మిస్టరీ జానర్ కాబట్టి కామెడీ, కమర్షియల్ హంగులకి జోలికి పోలేదు. ఎదుటివారి కళ్లలోకి కొన్ని క్షణాలు చూసి వారి మనసులో ఏముందో చెప్పగలిగే అరుదైన లక్షణం ఉన్న వేద పాత్రను మరింత అద్భుతంగా మలచడంలో దర్శకుడు కొంత తడబడ్డాడు. ఆ లక్షణం కారణంగానే బాల్యం ఛిద్రమైందని చూపించిన దర్శకుడు ఆ రేర్ క్వాలిటీని ఎక్కువగా హైలైట్ చేయకపోవడం, దాన్ని లైట్ తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. నటన పరంగా కల్యాణ్ దేవ్ పర్వాలేదనిపించాడు. గత సినిమాలతో పోలిస్తే కల్యాణ్ కొంచెం కొత్తగా కనిపించాడు. అతడి ప్రేయసిగా నటించిన కాశీష్ ఖాన్ నిడివి తక్కువే అయినా ఆమె పాత్ర ఎంతో కీలకం. స్క్రీన్‌పై కనిపించే కొద్ది నిమిషాలు కూడా మోడ్రన్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. అన్ షీతల్ తన పాత్రకు తగ్గట్లుగా నటించింది. రవీంద్ర విజయ్ కళ్లతోనే విలనిజం పండించాడు. చివరగా.. నిదానంగా ముందుకు సాగిన ఈ మూవీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రమే నచ్చుతుంది. చదవండి: తమన్నా-సత్యదేవ్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే! అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు -
‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ
టైటిల్ : అంటే..సుందరానికీ నటీనటులు : నాని, నజ్రియా నజీమ్, నరేశ్ హర్షవర్థన్, నదియా, రోహిణి తదితరులు నిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్ నిర్మాతలు:నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. దర్శకత్వం : వివేక్ ఆత్రేయ సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి ఎడిటర్ :రవితేజ గిరిజాల విడుదల తేది : జూన్ 10,2022 ‘శ్యామ్ సింగరాయ్’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమా సినిమాకి తన పాత్ర, కథలో వేరియేషన్ ఉండేలా చూసుకుంటాడు. వరసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వచ్చిన నాని.. ఈ సారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌తో ‘అంటే.. సుందరానికీ’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘అంటే.. సుందరానికీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్ 10) విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే సుందర్(నాని)..సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి(నరేశ్) కుటుంబ ఆచార వ్యవహారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు.తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్‌ని కూడా తనలాగే పద్దతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్నవయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతకంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగారావు(శ్రీకాంత్ అయ్యంగార్)ని సంప్రదిస్తుంది అతని ఫ్యామిలీ. అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగారావు ఈ దోషం, ఆ దోషం అంటూ సుందర్‌తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్‌కి విసుగెత్తి ఇంట్లో అబద్దాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్(నజ్రియా నజీమ్) ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి(అలగం పెరుమాల్) హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్, లీలాలు..ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్దాలు ఆడతారు. ఆ అబద్దాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలానికి దారి తీశాయి? సుందర్, లీలాలు చెప్పిన ఆబద్దాలు ఏంటి? ఇతర మతస్థులతో స్నేహం అంటేనే మండిపడే సుందర్, లీలాల కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అంటే సుందరానికీ’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వేరు వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం.. వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం.. పేరెంట్స్‌ని ఎదురించి, అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం..ఈ కాన్సెఫ్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి.‘అంటే సుందరానికీ’ కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది..అయితే పాత కథకు కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి, కాస్త కామెడీగా చిత్రాన్ని మలిచాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. పద్దతులు ఆచారాల ముసుగులో లోపలి మనిషిని చంపుకోవద్దు. మతం కంటే మానవత్వం గొప్పదనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతూ ఓ అందమైన లవ్‌స్టోరీని చూపించాలనుకున్నాడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు. ఎలాంటి అశ్లీలతకు తావివ్వకుండా..కంప్లీట్ క్లీన్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించినా.. కథనం మాత్రం సాదాసీదాగా సాగుతుంది. ఫస్టాప్‌లో బ్రాహ్మణ కుర్రాడు సుందర్ బాల్యంలో వచ్చే ఒకటి రెండు సన్నివేశాలు తప్పా మిగతావేవి అంతగా ఫన్ని క్రియేట్ చేయలేదు. హీరోయిన్ని పరిచయం చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. దీనికి తోడు హీరో కంటే ముందే ఆమెకు మరో లవ్ స్టోరిని యాడ్ చేసి ఫస్టాఫ్ అంతా సాగదీశాడనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. సుందర్, లీలా ఇద్దరు అమెరికాకు వెళ్లడం.. పెళ్లి కోసం అబద్దం చెప్పి ఇండియాకు రావడంతో అసలు స్టోరీ ముందుకు సాగుతుంది. వీరిద్దరు చెప్పిన అబద్దాలే నిజంగా జరగడంతో అసలేం జరిగిందనే ఉత్కంఠ మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చిన కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్‌లో ‘ప్రెగ్నేన్సీ అనేది చాయిస్ మాత్రమే కానీ. ఆప్షన్ కాదు’ అని హీరో చెప్పే డైలాగ్ హృదయాలను హత్తుకుంటుంది. దాదాపు మూడు గంటల నిడివి ఉండడం సినిమాకు మైనస్. మొత్తంగా అబద్దాలతో కాసేపు నవ్వించి.. చివర్లో చిన్న సందేశం ఇచ్చి ప్రేక్షకులను థియేటర్స్ నుంచి బయటకు పంపాడు దర్శకుడు. ఎవరెలా చేశారంటే.. యాక్షన్ అయినా.. కామెడీ అయినా తనదైన నటనతో మెప్పిస్తాడు నాని. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ చిత్రంలో కూడా అంతే.. సుందర్ ప్రసాద్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించాడు. లీలా థామస్‌గా నజ్రియా ఆకట్టుకుంది. తెలుగులో ఇది ఆమెకు తొలి సినిమా అయినా.. చాలా బాగా నటించింది. పైగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. సుందర్ తండ్రిగా నరేశ్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా, భర్త మాటకు ఎదురు చెప్పలేని భార్యగా రోహిణి తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్ తల్లిగా నదియ, తండ్రిగా అలగం పెరుమాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఎందుకు దాచిపెట్టిందో తెలియదు కానీ.. ఆమె పాత్ర మాత్రం అందరిని ఆకట్టుకుంది. సుందర్ సహోద్యోగి సౌమ్య పాత్రలో అనుపమ మెరిసింది. ఇక సుందర్ బాస్‌గా హర్షవర్ధన్ తనదైన కామెడీతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. వివేక్ సాగర్ సంగీతం పర్వాలేదు. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం కొత్తగా ఉంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది.ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘అంటే..సుందరానికీ’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. బ్రాహ్మణ కుర్రాడు, క్రిస్టియన్ అమ్మాయిల మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత నాని మరోసారి కామెడీ చిత్రంతో వస్తుండటంతో ‘అంటే..సుందరానికీ’కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు(జూన్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘అంటే సుందరానికీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #AnteSundaraniki A Classy Romantic Comedy that is both Entertaining and Emotional! The movie is engaging even though it feels lengthy at times and comedy is natural. The emotions worked well. Nani, Nazriya, and the rest of the cast was perfect. Go for it 👍 Rating: 3.25/5 — Venky Reviews (@venkyreviews) June 9, 2022 ‘అంటే సుందరానికీ’లో కామెడీ, ఎమోషనల్ రెండూ వర్కౌట్ అయ్యాయి. ఒక్కోసారి లెంగ్తీగా అనిపించినా, రొటీన్ కామెడీ సీన్స్ ఉన్నప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది. భావోద్వేగాలు బాగా పనిచేశాయి. నాని, నజ్రియా, మిగతా నటీనటులు పర్ఫెక్ట్గా నటించారు. ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు 1st half just baundi.. 2nd half Chala baundi .. back to back good movies from Vivek athreya.. nani, nazriya, Vivek athreya, Harsha vardhan, naresh 👌👍 #AnteSundaraniki — Indebted to Petla🔔 (@JakDexxter) June 10, 2022 ఫస్టాఫ బాగుంది. సెకండాఫ్ చాలా బాగుంది. వివేక్ ఆత్రేయకు మరో విజయం దక్కింది. నాని, నజ్రియా, హర్షవర్థన్, నరేశ్‌ల యాక్టింగ్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Brilliant n flawless writing in second half esp climax…Sensibilities, emotions chala baga chupinchadu…First half too slow adhokkate complaint..Nani and Nazriya pair, acting, BGM is perfect #AnteSundaraniki — Pandagowwww (@ravi_437) June 10, 2022 సెకండాఫ్, క్లైమాక్స్ అదిరిపోయింది. కానీ ఫస్టాఫ్ చాలా స్లోగా ఉంది.నాని, నజ్రియ జంట తెరపై బాగుంది. వివేక్ సాగర్ చక్కటి బీజీఎం అందించాడు అని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. #AnteSundaraniki is nonstop nonsense, loud unfunny characters with literally no humor with very thin plot. After two great scripts Jersey, Shyam singha roy very bad selection of script by @NameisNani . — Sean (@SimiValleydude) June 10, 2022 #AnteSundaraniki good watch!! Very clean writing by vivek atreya and @NameisNani with unique timing nailed it. Go for it... 3.5/5 — Rahul Reddy (@Rahulreddy118) June 10, 2022 -
ముగ్గురు ఖైదీలు, మూడు దొంగతనాలు.. '9 అవర్స్' రివ్యూ
టైటిల్: 9 అవర్స్ (వెబ్ సిరీస్) నటీనటులు: తారక రత్న, మధుశాలిని, అజయ్, రవిప్రకాశ్, వినోద్ కుమార్, బెనర్జీ, సమీర్ తదితరులు మూల కథ: మల్లాది కృష్ణమూర్తి 'తొమ్మిది గంటలు' నవల సమర్పణ, స్క్రీన్‌ప్లే: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి విడుదల తేది: జూన్ 2, 2022 (డిస్లీ ప్లస్ హాట్‌స్టార్) ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'తొమ్మిది గంటలు' నవల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ '9 అవర్స్'. ఈ వెబ్ సిరీస్‌కు క్రిష్ స్క్రీన్‌ప్లే అందించగా, నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తర్వాత తారక రత్న ఈ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. హాట్‌స్టార్‌లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ '9 అవర్స్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: ఈ వెబ్ సిరీస్ కథ 1985 కాలంలో జరుగుతుంది. ముగ్గురు చొప్పున తొమ్మిది మంది మూడు బ్యాంక్‌లను దొంగతనం చేసేందుకు వెళ్తారు. ఈ మూడు దొంగతనాలకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని ముగ్గురు ఖైదీలు ఒక్కో బ్రాంచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే వాటిలో రెండు దొంగతనాలు విజయవంతగా పూర్తి చేస్తారు. కానీ కోఠి బ్రాంచ్‌లో రాబరీ జరుగుతున్నట్లు పోలీసులకు తెలియడంతో దొంగలు చిక్కుల్లో పడతారు. మరీ ఆ దొంగలు పోలీసుల నుంచి ఎలా బయటపడ్డారు ? బంధీలుగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు, కస్టమర్లు తప్పించుకోడానికి ఏం చేశారు ? ఈ దొంగతనాల వెనుక అసలు ఎవరున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: 1985లో జరుగుతున్న దొంగతనం బ్యాక్‌డ్రాప్‌కు తగినట్లుగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఒకేసారి మూడు చోట్ల మూడు దొంగతనాలు జరగడం అనే అంశం ఆసక్తిగా ఉంటుంది. జైలు నుంచి వెళ్లిన ఖైదీలు 9 గంటల్లో మూడు రాబరీలు చేసుకుని మళ్లీ జైలుకు రావాలి. అయితే ఈ 9 గంటలను 9 ఎపిసోడ్స్‌గా మలిచారు. ఒకేసారి మూడు రాబరీలు చేయాలన్న కాన్సెప్ట్ బాగున్నా సిరీస్ ప్రారంభం ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్‌గా ఉంటాయి. బ్యాంకు ఉద్యోగులు, దొంగతనానికి వచ్చిన వారి జీవిత కథలు ఒక్కో ఎపిసోడ్లో చూపించారు. అవి అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తాయి. భర్త చనిపోతే వితంతు పరిస్థితి ఎలా ఉంటుంది ? భార్యభర్తల బంధం తదితర అంశాలను ఆకట్టుకునేలా చూపించారు. అప్పడప్పుడు వచ్చే ట్విస్ట్‌లు చాలా ఆకట్టుకుంటాయి. బంధీలుగా ఉన్న ఉద్యోగులు బయటపడే మార్గాలు, పోలీసుల అంచనాలను పటాపంచలు చేసే దొంగల తెలివి చాలా బాగా చూపించారు. ఈ సీన్లు బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా సాగుతున్న కథనంలో అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు కావాలని జొప్పించినట్లే ఉంటాయి. సిరీస్‌లో అనేక అంశాలను టచ్ చేశారు. అందుకే కథనం చాలా స్లోగా అనిపిస్తుంది. అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. టైటిల్ 9 అవర్స్ కాబట్టి ఎపిసోడ్లను కూడా 9గా చేశారు. అదే మైనస్ అయింది. అలా కాకుండా 5 ఎపిసోడ్స్‌లో సిరీస్ ముగిస్తే సూపర్ థ్రిల్లింగ్‌గా ఉండేది. ఎవరెలా చేశారంటే? చాలా కాలం తర్వాత తారక రత్నకు మంచి పాత్రే దొరికందని చెప్పవచ్చు. కానీ ఆ పాత్ర హైలెట్‌గా నిలిచే సన్నివేశాలు ఎక్కడా లేవు. జర్నలిస్ట్‌గా మధుశాలిని పాత్ర కూడా అంతంతమాత్రమే. కానీ రాబరీలో బంధీలుగా ఉన్న పాత్రధారులు ఆకట్టుకున్నారు. దొంగతనంలో కూడా తన కామవాంఛ తీర్చుకునే సహోద్యోగి పాత్రలో గిరిధర్ మెప్పించాడు. అజయ్, వినోద్ కుమార్, బెనర్జీ, ప్రీతి అస్రానీ, సమీర్, అంకిత్ కొయ్య, రవివర్మ, జ్వాల కోటి, రవిప్రకాష్ వారి నటనతో బాగానే ఆకట్టుకున్నారు. ఒక్కొక్క అంశాన్ని, జీవిత కథలను చెప్పే కథనం స్లోగా సాగిన మలుపులు, రాబరీ ప్లానింగ్ ఆశ్చర్యపరుస్తాయి. ఓపికతో చూస్తే మంచి డీసెంట్ వెబ్ సిరీస్ ఇది. అయితే ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు అనే తదితర విషయాలపై ముగింపు ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ రానున్నట్లు తెలుస్తోంది. -
‘విక్రమ్’ మూవీ రివ్యూ
టైటిల్: విక్రమ్: హిట్ లిస్ట్ నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు దర్శకత్వం: లోకేష్ కనకరాజ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ నిర్మాణ సంస్థ : రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ విడుదల తేది: జూన్ 3, 2022 యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వెండితెరపై సందడి చేసి సుమారు నాలుగేళ్లయింది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జూన్ 3న 'విక్రమ్'గా సందడి చేసేందుకు వచ్చేశారు కమల్ హాసన్. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇందులో సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్లో అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మరి ఇన్ని అంచనాల మధ్య శుక్రవారం(జూన్ 3) విడుదలైన 'విక్రమ్'ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. విక్రమ్ కథేంటంటే... మాస్క్ మ్యాన్ పేరుతో ఓ ముఠా వరుస హత్యలకు పాల్పడుతుంది. అందులో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్న పోలీసు అధికారి ప్రభంజన్, అతని తండ్రి కర్ణణ్ (కమల్ హాసన్) కూడా ఉంటారు. ఈ ముఠాను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు స్పై ఏజెంట్ అమర్(ఫాహద్ ఫాజిల్). అతని టీమ్‌తో కలిసి ఈ కేసును ఛేదించే క్రమంలో ప్రభంజన్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా లీడర్ సంతానం(విజయ్ సేతుపతి)ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అందరూ అనుకున్నట్లుగా కర్ణణ్ చనిపోలేదనే విషయం కూడా తెలుస్తుంది. మరి కర్ణణ్ చనిపోయినట్లు ఎందుకు నటించాడు? అతని నేపథ్యం ఏంటి? అతనికి ఏజెంట్ విక్రమ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు కర్ణణ్ వేసిన ప్లాన్ ఏంటి? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? చివరకు అమర్ వారికి ఏవిధంగా సహాయం చేశాడు? ఈ కథలోకి సూర్య ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అనేది తెలియాలంటే విక్రమ్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్టైలిష్ యాక్షన్‌కి పెట్టింది పేరు లోకేష్ కనకరాజన్. అలాంటి దర్శకుడికి కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి దిగ్గజ నటులు దొరికితే.. ఎలా ఉంటుంది? యాక్షన్ సీన్స్‌ని వేరే లెవల్లో చూపించొచ్చు. విక్రమ్‌లో కనకరాజన్ అదే చేశాడు. ఫుల్ యాక్షన్స్ సీన్స్‌తో దుమ్ము దులిపేశాడు. కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఎలివేషన్స్ ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా చుట్టూ విక్రమ్ కథ తిరుగుతుంది. భారీ స్థాయిలో డ్రగ్స్‌ని పట్టుకోవడం, దాని ఆచూకీ కోసం సంతానం ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో వరుస హత్యలు.. స్పై ఏజెంట్ అమర్ రంగంలోకి దిగడం.. కర్ణణ్ గురించి కొన్ని నిజాలు తెలియడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్‌లో సాదా సీదాగా అనిపించిన సీన్లను సెకండాఫ్‌కు ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో అయితే యాక్షన్ డోస్ భారీగా పెంచేశాడు. 1987 నాటి ‘విక్రమ్’ సినిమాకు, అలాగే లోకేష్ కనకరాజన్ గత చిత్రాలు ‘ఖైదీ’, ‘మాస్టర్’కి ఈ చిత్రాన్ని లింక్ చేసిన విధానం బాగుంది. ఇక క్లైమాక్స్‌లో అయితే కమల్ హాసన్ చేసే యాక్షన్ సీన్స్.. రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ అదిరిపోతుంది. అంతేకాదు పార్ట్ 2 ఉంటుందని సూర్య పాత్రతో చెప్పించాడు దర్శకుడు. ఎప్పుడెప్పుడు కమల్, సూర్యలను తెరపై పూర్తి స్థాయిలో చూస్తామా అని వెయిట్ చేసేలా చేశాడు. ఎవరెలా చేశారంటే.. విక్రమ్ పాత్రలో లోక నాయకుడు కమల్ హాసన్ ఒదిగిపోయాడు. 67 ఏళ్ల వయసులోనూ ఇలాంటి పాత్రలో నటించడం ఒక్క కమల్‌కే సాధ్యమయింది. యాక్షన్ సీన్స్‌లో కమల్ చూపించే యాటిట్యూడ్ అదిరిపోయింది. అలాగే ఫస్టాఫ్‌లో తాగుబోతుగా, డ్రగ్స్ బానిసగా తనదైన నటనతో ఆదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో కమల్ చేసే ఫైట్స్ సీన్ సినిమాకే హైలైట్. ఇక స్పై ఏజెంట్ అమర్‌గా ఫహద్ ఫాజిల్ మంచి నటనను కనబరిచాడు. యాక్షన్ సీన్స్‌లో దుమ్ము దులిపేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఇక విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రలోనైనా అవలీలగా నటిస్తాడు. డ్రగ్స్ మాఫీయా లీడర్ సంతానం పాత్రలో విజయ్ సేతుపతి పరకాయ ప్రవేశం చేశాడు. అతని గెటప్ కానీ, యాక్టింగ్ కానీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా సూర్య ఎంట్రీ అదిరిపోతుంది. తెరపై ఉన్నది కొద్ది క్షణాలే అయినా.. తనదైన నటనతో అందరినీ మెప్పించాడు. అంతేకాదు పార్ట్2పై ఆసక్తిని కూడా పెంచేశాడు. సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్‌ప్లే చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
F3 Telugu Movie Review: ఎఫ్3 మూవీ రివ్యూ
టైటిల్ : ఎఫ్3 నటీనటులు : వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, రాజేంద్రప్రసాద్, అలీ సునీల్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత: దిల్ రాజు, శిరీష్ దర్శకుడు: అనిల్ రావిపూడి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: మే27,2022 సీనియర్ హీరో వెంకటేశ్, యంగ్ హీరో వరుణ్ తేజ్ మల్టీస్టారర్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్ల ఎంటర్టైన్మెంట్ అందిస్తామంటూ F3ని తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం(మే27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఎఫ్3పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్3 ఏమేరకు అందుకుంది? వెంకటేశ్, వరుణ్‌ల కామెడీ మరోసారి వర్కౌట్ అయిందా? హిట్ కాంబినేషన్‌గా పేరొందిన అనిల్, దిల్‌రాజు ఖాతాలో విజయం చేరిందా లేదా? ప్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఎఫ్2లో భార్యల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించిన అనిల్ రావిపూడి.. ఎఫ్3లో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ను చూపించాడు. ఈ సినిమాలోని పాత్రలన్నింటికీ డబ్బు పిచ్చి ఉంటుంది. వెంకీ(వెంకటేశ్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. సవతి తల్లి పోరుతో పాటు ఇంటినిండా సమస్యలు. వీటీని దూరం చేసేందుకు అడ్డదారుల్లో డబ్బులు సంపాదిస్తుంటాడు. ఇక అవారాగా తిరిగే వరుణ్ యాదవ్(వరుణ్‌తేజ్) కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటాడు. దీని కోసం బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరోవైపు హనీ(మెహరీన్) కూడా తన కుటుంబ సమస్యలు తీర్చడం కోసం ధనవంతున్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలా ఇద్దరు ధనవంతులని అబద్దం చెప్పి ఒకరికొకరు దగ్గరవుతుంటారు. ఇక వరుణ్ని ధనవంతుడిగా నటింపజేసేందుకు వెంకీ తన ఇల్లుని తాకట్టు పెట్టి మరీ డబ్బులు అందిస్తుంటాడు. చివరకు హనీ ధనవంతుడి కూతురు కాదని తెలుస్తుంది. దీంతో ఈజీగా కోటీశ్వరులవుదామనుకునే వారి ఆశ అడియాశలైపోతాయి. అంతేకాదు వెంకీ, వరుణ్ మరింత అప్పుల్లో కూరుకుపోతారు. చివరకు తమకు చావే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో విజయనగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనందప్రసాద్(మురళీ శర్మ)గురించి తెలుస్తుంది. అతని కొడుకు చిన్నప్పుడే పారిపోయాడని, వారసుడి కోసం ఆనందప్రసాద్ 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడని తెలిసి..వెంకీ అతని కుమారుడిగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అదేసమయంలో వరుణ్‌తో పాటు మరో ఇద్దరు కూడా నేనే వారసుడిని అని ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరిలో ఆనందప్రసాద్ వారసుడు ఎవరు? డబ్బు మీద అత్యాశ ఉన్న వీళ్లకు ఆనందప్రసాద్ ఎలా బుద్ది చెప్పాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు అంటే జనాలు పొట్టచెక్కలయ్యే కామెడీ పక్కా అని ఫిక్స్ అయ్యేవారు ప్రేక్షకులు. ఇప్పుడు అదే పంథాలో వెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా దూసుకుపోతున్నాడు. ఎఫ్2తో భార్యల వల్లే వచ్చే ఫ్రస్టేషన్ చూపించి, చివరిలో వారి గొప్పదనం ఏంటో అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. ఇక ఎఫ్3లో డబ్బు వల్ల కలిగే ఫ్రస్టేషన్ చూపించి..చివరిలో మంచి సందేశాన్ని అందించాడు. అయితే ఈ సినిమాలో కామెడీనే ఆస్వాదించాలి తప్ప..స్టోరీ పెద్దగా ఉండదు. ఇక లాజిక్ లెక్కలను అసలే పట్టించుకోవద్దు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ‘లాజిక్ అని, రియలిస్టిక్ అని మమ్మల్ని ఎంతకాలం దూరంపెడతారు రా’ అని పోలీసు వేషంలో ఉన్న తనికెళ్ల భరణితో ఓ డైలాగ్ చెప్పించి.. తమ మూవీలో అవేవి ఉండవని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. స్టోరీని పక్కకు పెట్టి కామెడీనే నమ్ముకున్నాడు. హీరోలకు లోపం ఉన్న క్యారెక్టర్లు ఇచ్చి హాస్యాన్నీ పండించాడు. రేచీకటితో వెంకటేశ్, నత్తితో వరుణ్‌తేజ్ చేసే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఈజీగా డబ్బు సంపాదించేందుకు వెంకీ, వరుణ్ పడే పాట్లతో ఫస్టాఫ్ అంతా రొటీన్ కామెడీతో సాగుతుంది. రేచీకటి లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెంకీ పడే పాట్లు నవ్విస్తాయి. ముఖ్యంగా ‘వెంకట్రావు పెళ్లాన్ని చూశా..’అంటూ వెంకీ చెప్పే డైలాగ్‌కు ప్రేక్షకులు పడిపడి నవ్వుతారు. ఇక సెకండాఫ్‌లో నిజంగానే మూడురెట్ల ఎంటర్టైన్మెంట్ అందించారు. మేమే ఆనందప్రసాద్ నిజమైన వారసులం అంటూ వెంకీ, వరుణ్ పండించే ఫన్ హైలెట్. వీరితో హారిక(తమన్నా) కూడా పోటీ పడడం.. వాళ్లకు రకరకాల పరీక్షలు పెట్టడం ఇలా ప్రతీ సీన్ నవ్విస్తుంది. ముఖ్యంగా ‘ఆంబోతు’ సీన్ అయితే కడుపుబ్బా నవ్విస్తుంది. ఎఫ్3 టాయ్స్ అంటూ టాలీవుడ్ స్టార్ హీరోలను తెరపై చూపించడం సినిమాకు ప్లస్ పాయింట్. ఇక క్లైమాక్స్‌లో వెంకీ, వరుణ్‌ల ఫైట్ సీన్ అయితే అదిరిపోతుంది. వారి గెటప్‌లకు, చెప్పే డైలాగ్స్‌కు ప్రేక్షకుడు నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తాడు. లాజిక్‌ని పక్కకు పెట్టి, హాయిగా నవ్వుకోవడానికి అయితే F3 మూవీ చూడొచ్చు. టికెట్ల రేట్లు పెంచకపోవడం ఎఫ్3(F3)కి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే... వెంకటేశ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడిపించాలన్నా.. నవ్వించాలన్నా వెంకటేశ్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఆయన కామెడీ చేస్తే ప్రేక్షకులు పడిపడి నవ్వాల్సిందే. రేచీకటి సమస్యతో బాధపడుతున్న వెంకీ పాత్రలో వెంకటేశ్ అద్భుతంగా నటించాడు. తన ఇమేజ్‌ని పూర్తిగా పక్కకు పెట్టి.. తనదైన కామెడీతో నవ్వించాడు. ఇక వెంకటేశ్‌తో పోటాపోటీగా నటించాడు వరుణ్ తేజ్. నత్తి ఉన్న వరుణ్ యాదవ్ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ బాగా పేలాయి. మంగ టిఫిన్ సెంటర్ నడిపే యువతి హారికగా తమన్నా, ఆమె చెల్లిగా హనీగా మెహ్రీన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెకండాఫ్‌లో తమన్నా సరికొత్త గెటప్‌లో కనిపిస్తుంది.సీఐ నాగరాజుగా రాజేంద్రప్రసాద్ తనదైన కామెడీతో నవ్వించాడు. వరుణ్ స్న్నేహితుడు కత్తి శీనుగా సునీల్ మెప్పించాడు. చాలా కాలం తర్వాత ఒకప్పటి కామెడీ సునీల్‌ని తెరపై చూడొచ్చు. ఇక వడ్డీ వ్యాపారీ పాల బాజ్జీగా అలీ, వ్యాపారవేత్త ఆనందప్రసాద్‌గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు.పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘సర్కారు వారి పాట’ రివ్యూ
టైటిల్ : సర్కారు వారి పాట నటీనటులు : మహేశ్ బాబు, కీర్తి సురేశ్, సముద్రఖని,వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట దర్శకుడు: పరశురాం సంగీతం: తమన్ సినిమాటోగ్రఫి: ఆర్ మది ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది: మే 12, 2022 భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేశ్ బాబు.. రెండేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీత గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సర్కారు వారి పాట’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మహి అలియాస్ మహేశ్(మహేశ్ బాబు) ‘మహి ఫైనాన్స్ కార్పోరేషన్’ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు . తన దగ్గరు ఫైనాన్స్ తీసుకున్నవారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్దం చెప్పి 10 వేల డాలర్లు అప్పుగా తీసుకుంటుంది కళావతి(కీర్తి సురేశ్). ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేశ్.. ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒక రోజు మహేశ్‌కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తను అప్పుగా ఇచ్చిన 10 వేల డాలర్లు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, `మా నాన్న ఎవరో తెలుసా? నీకు పైసా కూడా ఇవ్వను` అని మహేశ్‌ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్(సముద్రఖని) విఖాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బులు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేశ్. అక్కడకు వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది 10 వేల డాలర్లు కాదని, రూ. పదివేల కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ పదివేల కోట్ల రూపాయాల కథేంటి? మహేశ్ బాబు గతం ఏంటి? చివరకు రూ.10వేల కోట్లను మహేశ్ ఎలా వసూలు చేశాడు అనేదే ‘సర్కారు వారి పాట’ మిగతా కథ. ఎలా ఉందంటే... బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలా మంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్లు అప్పును ఎగగొట్టి, సమాజంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పరశురాం. ఓ మంచి సందేశాత్మక పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు.. దానికి కమర్షియల్ హంగులను జతపర్చి యూత్‌ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి.. ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్టాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిశోర్‌పై మహేశ్ వేసే పంచులు.. కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం 10వేల డాలర్ల కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా.. హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు దర్శకుడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో ‘కాలు వేసి నిద్రించే’ కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేశ్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ శ్రీను కామెడీ, ఫ్లాష్‌బ్యాక్‌తో సెకండాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరికి ఆలోచింపజేస్తాయి. మహేశ్ ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలు ఈ చిత్రంలో బోలెడు ఉన్నాయి. ఎవరెలా చేశారంటే... అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసుకునే మహి పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పరకాయ ప్రవేశం చేశాడు. ఫైట్స్‌తో పాటు డ్యాన్స్ కూడా అద్భుతంగా చేశాడు. ఇక ఆయన కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు.తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ఆకతాయి అమ్మాయి కళావతిగా కీర్తి సురేశ్ మెప్పించింది. ఇక మహేశ్ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర సముద్రఖనిది. నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజేంద్రనాథ్ పాత్రకు ప్రాణం పోశాడు ఆయన. వెన్నెల కిశోర్ కామెడీ ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలతో తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. కళావతి, మ.. మ.. మహేశా పాటలు అయితే థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ని కిర్రెక్కిస్తాయి. మది సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘సర్కారు వారి పాట’మూవీ ట్విటర్ రివ్యూ
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా, ‘గీత గోవిందం’ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చాడు పరశురాం. ఇక కళావతి, పెన్నీ.. మ..మ..మహేశ్ పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. Mahesh carries this movie from start to finish and definitely his best performance in recent times especially the comedy portions👍 Thaman’s BGM was only effective in a few places and thought it could’ve been in some portions especially in the first half and fights #SVP — Venky Reviews (@venkyreviews) May 11, 2022 మహేశ్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీ. ముఖ్యంగా కామెడీ పోర్షన్స్‌లో ఆయన బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తమన్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మెప్పించింది. ఫస్టాఫ్‌తో పాటు కొన్ని ఫైట్స్ సీన్స్‌కి తమన్ బీజీఎం అంతగా వర్కౌట్ కాలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 1st half🔔 :Good 👍 Mahesh Anna in Never before Style 🔥🔥🔥🥵🥵🤙🤙 One man show SSMB Chennai babu Adda 💥💫#SarkaruVaariPaata https://t.co/k28xtDVumd pic.twitter.com/K6OoEKylp1 — ShoLaY🎱 (@sholay9_9) May 12, 2022 ఫస్టాఫ్ గుడ్. మహేశ్ అన్న సరికొత్త లుక్‌లో అదరగొట్టేశాడు. వన్‌మ్యాన్ షో అంటూ ఓ నెటిజన్ తన రివ్యూని పోస్ట్ చేశాడు Mahesh Anna intro ayithe next level with @MusicThaman's music 🙌🙌 Idhi kada kavalsindhi.... Deenikosame andharu Mahesh fans waiting On Screen Penny song visuals 🔥🔥🔥🔥🔥🔥 @urstrulyMahesh Anna next level swag#MaheshBabu𓃵 #SVPCelebrations#SarkaruVaariPaata #SVPMania #SVP — Madhukar Doppalapudi (@urdhfm) May 12, 2022 మహేశ్ అన్న ఎంట్రీని అయితే తమన్ తనదైన బీజీఎంతో నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లాడు. ఇదికదా కావాల్సింది. దీసికోసమే మహేశ్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. పెన్నీ సాంగ్ విజువల్స్ అదిరిపోయాయి’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #SarkaruVaariPaata What a come back to see the @urstrulyMahesh in big screen. The energy and vibe he carries throughout is amazing. Romance and comedy timing is wow till interval right mix of action, romance and comedy 🤩😍❤️🥰💐👏🙌 — Madhusudhanan Varadarajulu (@Madhusu76425277) May 12, 2022 #SarkaruVaariPaata 1st half Routine Rotta...@/petla 💦 Deeniki pokiri range elevations entraa baabu 🤮leaves zero excitement for 2nd half — Nandha (@Nandha95807957) May 11, 2022 #SarkaruVaariPaata Entertaining First Half Two Action Blocks 🔥🔥🔥 Two Songs 👌👌👌 Mahesh Babu Perfect Treat for Fans Blockbuster Loading 💪😎 — Madhav Singh 💙 (@Send4Madhav) May 12, 2022 Okka Expression ledhu Oka proper Plot ledhu Konni konni saarlu idi comedy na Anipinchindi ra thu worst lo worst 1.5 /5 Disaster . Disappointed.#SarkaruVaariPaata — V$K (@RtsChestunta) May 12, 2022 #SarkaruVaariPaata Final Report : NON RRR INDUSTRY HIT. 👉Rating : 3.75/5 ⭐️ ⭐️ ⭐️ ⭐️ 👉BOXOFFICE WILL BLAST 🔥 🌊 👉#MaheshBabu Performance 👉Interval Block 👉Blockbuster First Half & Second Half 👉Mass Fights & #MaMaMahesha Song#SarkaaruVaariPaata #SVP — M@h€$h V@m$i (@maheshvamsi9) May 12, 2022 #SarkaruVaariPaata ...first half average..@KeerthyOfficial scenes and love track is nice...👌@urstrulyMahesh comedy timing..😂👌 — M@HaR$Hi (@MaharshiGollap1) May 12, 2022 #SarkaruVaariPaata 1st off 🔥 2 fights 💣 2 song's 🔥 Comdey 😊 Love 😘 Next level 💥#BlockBusterSarkaruVaaripaata — VEMULA MB 🔔 (@maheshbabu_jr) May 12, 2022 Superb first half @urstrulyMahesh screen presence outstanding, pre- interval 20 minutes 👏👏👌👌 SSMB comedy timing and charm this film 🙏🙏 #SarkaruVaariPaata — Raghava (@Raghava4mahesh) May 12, 2022 #SarkaruVaariPaata Entertaining First Half Two Action Blocks 🔥🔥🔥 Two Songs 👌👌👌 Mahesh Babu Perfect Treat for Fans Blockbuster Loading 💪 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 12, 2022 #SarkaruVaariPaata First half is very good Mahesh babu 👌👌👌👌 Scenes with keerthy suresh in first half and second half are 👌👌👌👌👌👌 Villan role and performance is biggest minus for the movie — Mithun Y (@mithun_y11) May 12, 2022 -
అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ
టైటిల్: అశోకవనంలో అర్జున కళ్యాణం నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ తదితరులు కథ: రవికిరణ్ కోలా దర్శకత్వం: విద్యా సాగర్ చింతా నిర్మాత: బాపీనీడు. బి సంగీతం: జై క్రిష్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ పలనీ ఎడిటింగ్: విప్లవ్ నైషధం విడుదల తేది: మే 6, 2022 మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'అల్లం అర్జున్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విశ్వక్ సేన్ సరసన రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా అలరించిన ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విభిన్నంగా ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన చర్యలు పలు విమర్శలను కూడా మూటగట్టుకున్నాయి. విశ్వక్ సేన్‌కు ఓ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన కాంట్రవర్సీ తెలిసిందే. ఇవన్ని దాటుకోని ఎట్టకేలకు నేడు (మే 6) అశోకవనంలో అర్జున కల్యాణం థియేటర్లలో విడుదలైంది. మరీ అల్లం అర్జున్‌గా విశ్వక్ సేన్ ఏమేరకు అలరించాడు ? రివ్యూలో చూద్దాం. కథేంటంటే సూర్యపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అల్లం అర్జున్ (విశ్వక్ సేన్)కు 33 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. ఇరుగుపొరుగు వారి మాటలు భరించలేక చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన మాధవి(రుక్సార్ దిల్లాన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తుంది. దీంతో అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా పెళ్లి కూతురి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. రెండు వేర్వేరు యాసలు, వేర్వేరు కులాలకు చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి? మాధవి చెల్లెలు వసుధ(రితికా నాయక్) చేసిన చిలిపి పని ఎక్కడికి దారి తీసింది? వీరి మధ్యలో కులాల ప్రస్థావన ఎలా వచ్చింది? అసలు అర్జున్‌కి పెళ్లి అయిందా లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉదంటంటే... 30 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోకపోవడం ఇప్పుడు కామన్. ఇదే పాయింట్‌ని తీసుకొని ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విద్యా సాగర్ చింతా. వయసు మీదపడినా ఇంకా పెళ్లికాలేదు అనే ఆత్మన్యూనతా భావంతో బాధపడేవారందరికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. పెళ్లి అనేది మనకు నచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలని కానీ.. సమాజం కోసమే.. లేదా కుటుంబ గౌరవం కోసమో చేసుకోవద్దనే విషయాన్ని కామెడీగా చూపించాడు. ట్రైలర్లో చూపించినట్లుగా.. సినిమా అంతా కామెడీగా సాగుతుంది. కొన్ని సీరియస్ అంశాలను కూడా ఎంటర్టైన్మెంట్ జోడించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌తో మాట్లాడేందుకు హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే హీరోయిన్ చెల్లెలు చేసే అల్లరి ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండాఫ్‌లో చాలా సీరియస్ అంశాలను సున్నితంగా చూపించాడు దర్శకుడు. అయితే కథలో కావాల్సినంత కామెడీ ఉన్నా.. నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఫస్టాఫ్‌లో చాలా సాగదీత సీన్లు ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకుడి కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకునేలా లేదు. సెకండాఫ్‌లో కూడా ఎంగేజింగ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. క్లైమాక్స్ కూడా రోటీన్ ఉంటుంది. ఎవరెలా చేశారు? కొత్త తరహా చిత్రాలు, పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడు విశ్వక్ సేన్. ఈ చిత్రంలో కూడా సరికొత్త గెటప్‌లో కనిపించాడు. మధ్యవయస్కుడు అల్లం అర్జున్‌గా విశ్వక్ సేన్ మెప్పించాడు. తన వయసుకు మించిన పాత్రను పోషించిన విశ్వక్‌ని అభినందించాల్సిందే. అమాయకుడిగా ఉంటునే..తనదైన కామెడీతో నవ్వించాడు. ఇక మాధవిగా రుక్సార్ దిల్లార్ ఆకట్టుకుంది. చీరకట్టులో తెరపై అందంగా కనిపించింది. ఇక హీరోయిన్ చెల్లెలు వసుధ పాత్రలో రితికా నాయక్ పరకాయ ప్రవేశం చేసింది. ఆమె చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. గోపరాజు రమణ తనదైన పంచ్ డైలాగ్స్‌తో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జై క్రిష్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా ‘ఓ ఆడపిల్ల ..’అనే పాట అందరికి నచ్చుతుంది. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎటిటర్ విప్లవ్ నైషధం తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణవ విలువసు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
భళా తందనాన మూవీ రివ్యూ
టైటిల్: భళా తందనాన నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్, గరుడ రామ్, పొసాని కృష్ణమురళి, సత్య తదితరులు దర్శకుడు: చైతన్య దంతులూరి కథ, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా సంగీతం: మణిశర్మ బ్యానర్: వారాహి చలనచిత్రం నిర్మాత: రజనీ కొర్రపాటి సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్ విడుదల తేది: మే 6, 2022 కొత్తదనం అంటే చాలు రంకెలేస్తాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. డిఫరెంట్ కాన్సెప్టులకు తివాచీ పరుస్తాడు. సినిమా హిట్టా? ఫట్టా అని కాకుండా అది ప్రేక్షకుడి మనసును హత్తుకుందా? లేదా? అన్నదాని మీదే ఎక్కువగా దృష్టి పెడతాడు. అంతేకాదు, తెలుగు భాషపై మమకారంతో తన సినిమాలన్నింటికీ దాదాపు తెలుగు టైటిల్స్ ఉండేలా చూసుకుంటాడు. అలా అన్నమయ్య కీర్తనలో ఉన్న భళా తందనానా అనే పదాన్ని తీసుకుని అదే టైటిల్‌తో సినిమా చేశాడు. ‘బాణం’ఫేం చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు శ్రీవిష్ణు. మరి ఈ మూవీ శ్రీవిష్ణుకి విజయాన్ని అందించిందా? తన సినిమాతో ప్రేక్షకుడికి కొత్తదనం పంచాడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. భళా తందనాన కథేంటంటే.. శశిరేఖ(కేథరిన్) ఓ మీడియా సంస్థలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది. ఓ అనాథాశ్రమంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకొని.. ఆ న్యూస్ కవర్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ అనాథాశ్రమ అకౌంటెంట్ చందు అలియాస్ చంద్రశేఖర్(శ్రీవిష్ణు)తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు దగ్గరయ్యే క్రమంలో సిటీలో వరుస హత్యలు జరుగుతాయి. హత్యకు గురైన వారంతా హవాలా కింగ్ ఆనంద్ బాలి(గరుడ రామ్) మనుషులు కావడంతో.. ఈ కేసుని సీరియస్ తీసుకొని స్టడీ చేస్తుంది శశిరేఖ. ఈ క్రమంలో ఆనంద్ బాలి దగ్గర ఉన్న రూ.2000 కోట్ల హవాలా మనీ ఎవరో దొంగిచించారనే విషయం తెలుస్తుంది. ఈ వార్తను తన మీడియా సంస్థలో ప్రచురించి ప్రపంచానికి తెలియజేస్తుంది శశిరేఖ. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంతకీ రూ.2000 కోట్లను దొంగిలించిదెవరు? ఈ దొంగతనం కేసుతో చందుకి ఉన్న సంబంధం ఏంటి?అనేదే మిగతా కథ ఎలా ఉందంటే.. బాణం, బసంతి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న చైతన్య దంతులూరి.. చాలా గ్యాప్ తర్వాత క్రైమ్ థ్రిల్లర్ కథతో ‘భళా తందనాన’ తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్‌కి కామెడీ, ప్రేమను యాడ్ చేసి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే సినిమాకు కాస్త మైనస్ అయింది. కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఉత్కంఠ రేకెత్తించే సీన్స్ ఉన్నప్పటికీ.. కామెడీ, లవ్ ట్రాక్ కారణంగా రొటీన్ సినిమాగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఓ కిడ్నాప్ జరగడం..దానిని కనెక్ట్ చేస్తూ అసలు కథను ప్రేక్షకులకు చెప్పడంతో దర్శకుడు సఫలమయ్యాడు. వరుస హత్యలు.. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. పాట రూపంలో హీరో చెప్పే లవ్ ఫెయిలర్ స్టోరీ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథంతా రూ. 2000 కోట్ల హవాలా మనీ చుట్టే తిరుగుతుంది. ఆ డబ్బుతో చందుకు ఉన్న సంబంధం ఏంటి? అది ఎక్కడా దాచారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుడికి కలుగుతుంది. క్లైమాక్స్ కొత్తగా ఉన్నప్పటికీ.. సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అసలు హీరో ఎవరు? అతని గతం ఏంటి? రూ. 2000 కోట్లు ఎక్కడ దాచాడు? అనే విషయాలను తెలియజేయకుండా.. రెండో భాగం ఉందని చెప్తూ కథని ముగించాడు. ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా.. క్లీన్ ఎంటర్టైనర్గా సినిమా సాగుతుంది. ఎవరెలా చేశారంటే... ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు తన పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో అమాయక చక్రవర్తిగా, సెకండాఫ్‌లో ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా తనదైన నటనతో మెప్పించాడు. గత సినిమాలతో పోలిస్తే.. ఇందులో శ్రీవిష్ణు నటనలో పరిణితి కనిపించింది. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ మెప్పించే ప్రయత్నం చేసింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేథరిన్.. తెరపై కాస్త బొద్దుగా కనిపించింది. ఇక ఈ సినిమాకు ఆమే డబ్బింగ్ చెప్పుకుంది. అయితే అది కాస్త నప్పలేదు. ‘మేడమ్ మీరు మాట్లాడే తెలుగు.. ఇంగ్లీష్‌లా ఉంటుంది’అని హీరోతో ఓ డైలాగ్ చెప్పించి.. ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇక విలన్‌గా గరుడ రామ్ మెప్పించాడు. అయితే అతనికి బలమైన సీన్స్ లేకపోవడం మైనస్. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న దయామయం పాత్రలో పొసాని కృష్ణమురళి ఒదిగిపోవడమే కాకుండా..తనదైన కామెడీతో నవ్వించాడు. ఫస్టాఫ్‌లో సత్యతో వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. మిగిలిన నటీనటులు తమ, తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధానబలం మణిశర్మ సంగీతం.తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘ఆచార్య’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘ఆచార్య’ నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ దర్శకుడు: కొరటాల శివ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫి: తిరు ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: ఏప్రిల్ 29,2022 మెగాఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆచార్య’. తొలిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రమిది. అందుకే ఈ మూవీ కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూశారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం( ఏప్రిల్ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘ఆచార్య’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆచార్య’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ధర్మస్థలి.. 800 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ టౌన్ అది. పక్కనే జీవధార నది. దానికి అటువైపు పాదఘట్టం అనే చిన్న తండా. అక్కడి ప్రజలకు ధర్మస్థలి టెంపుల్‌తో ఎనలేని సంబంధం ఉంటుంది. ధర్మస్థలిలో ఉండే ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ.. ధర్మంగా ఉంటారు పాదఘట్టం తండా వాసులు. కానీ ధర్మస్థలి మున్సిపల్ చైర్మన్ బసవన్న(సోనూసూద్) చాలా క్రూరుడు. ధర్మస్థలి టెంపుల్లో అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ.. అక్కడి సొమ్మునంతా కాజేస్తాడు. రాజకీయంగా ఎదగడం కోసం.. ధర్మస్థలి అమ్మవారి టెంపుల్‌తో పాటు పాదఘట్టం గ్రామాన్ని కూడా మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్ (జిషు సేన్ గుప్తా)కు అప్పగించే ప్రయత్నం చేస్తాడు. ఇలా ధర్మస్థలిలో అధర్మం పేట్రేగిపోతుండడంతో దాన్ని అడ్డుకోవడానికి ఆ గ్రామానికి వస్తాడు ఆచార్య(చిరంజీవి). బసవన్న గ్యాంగ్ చేసే అరాచకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. అసలు ఆచార్య ఎవరు? ధర్మస్థలిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? ధర్మస్థలితో సిద్ధ(రామ్ చరణ్)కి ఉన్న అనుబంధం ఏంటి? ఆచార్యకి, సిద్ధకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..? కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సక్సెస్ సాధించిన కొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ‘మిర్చి’ మొదలు..‘ భరత్ అనే నేను’వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. అలాంటి దర్శకుడు చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమా తీస్తే.. ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. కొత్త కథని ఆశిస్తారు. కానీ కొరటాల మాత్రం ప్రేక్షకులకు పాత కథే చూపించాడు. అది కూడా అంతగా ఆసక్తిగా సాగలేదు. కథ, కథనం, మాటలు ఇలా ప్రతి అంశంలోనూ కొరటాల తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఒకానొక దశలో అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి కలగక మానదు. కథను పక్కకు పెట్టి.. స్టార్ క్యాస్ట్ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు డైరెక్టర్. మహేశ్ బాబు వాయిస్ ఓవర్‌తో ధర్మస్థలి నేపథ్యాన్ని చెప్పించి కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆచార్య ధర్మస్థలిలోకి అడుగుపెట్టడం.. బసవన్న ముఠా చేసే అరాచాకాలను ఎండగట్టడం, రెండు పాటలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆచార్య చేసే పోరాట ఘట్టాలు చాలానే ఉన్నప్పటికీ... కథపై ప్రేక్షకుడికి అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ ముందు సిద్ధ పాత్ర ఎంటర్ అవుతుంది. దీంతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి పెరుగుతుంది. కానీ అక్కడ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాడు కొరటాల. ఆచార్య, సిద్ధ మధ్య వచ్చే సీన్స్ మినహా మిగతాదంతా సింపుల్‌గా సాగుతుంది. కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు. అయితే నక్సలైట్స్‌గా సిద్ద, ఆచార్య చేసే పోరాట ఘట్టాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక నీలాంబరి(పూజా హెగ్డే), సిద్ధల మధ్య వచ్చే సీన్స్ అయితే కథకు అతికినట్టుగా ఉంటాయి తప్ప..ఎక్కడా ఆసక్తి కలిగించవు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గా, పాత సినిమాల మాదిరి ఉంటుంది. ‘లాహే లాహే’ ‘భలే భలే బంజారా' సాంగ్‌కి రామ్ చరణ్‌తో చిరు వేసే స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించేయడం మెగాస్టార్ ప్రత్యేకత. ‘ఆచార్య’గా తనదైన నటనతో చిరంజీవి అదరగొట్టేశాడు. ఫస్టాఫ్ అంతా కథని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్స్ సీన్స్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. ముఖ్యంగా లాహే లాహే పాటతో పాటు స్పెషల్ సాంగ్‌కి చిరు అదిరిపోయే స్టెప్పులేసి అలరించాడు. ‘భలే భలే బంజారా’ సాంగ్‌కి రామ్ చరణ్‌తో చిరు వేసే స్టెప్పులైతే మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక సిద్ధ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు రామ్ చరణ్. ప్రతి సీన్లోనూ చిరంజీవితో పోటీపడీ నటించాడు. డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండాఫ్‌లో సింహభాగం సిద్ధ పాత్రదే. సిద్ధని ప్రేమించే యువతి, సంగీతం టీచర్ నీలాంబరి పాత్రలో ఒదిగిపోయింది పూజాహెగ్డే. కాకపోతే సినిమాలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిడివి కూడా చాలా తక్కువే. ఇక విలన్‌గా సోనూసూద్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్‌గా జిషు సేన్ గుప్తా, పాదఘట్టంలోని ఆయుర్వేద వైద్యుడు వేదగా అజయ్ చక్కటి నటనను కనబరిచారు. కామ్రేడ్ శంకర్ అన్నగా సత్యదేవ్ చాలా బాగా నటించాడు. ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. సినిమాకి కీలకం. నాజర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం అంతంత మాత్రమేనని చెప్పాలి. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోదు. పాటలు ఓకే. తిరు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ధర్మస్థలి టెంపుల్ టౌన్‌ని తెరపై చక్కగా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీ రివ్యూ
టైటిల్ : కణ్మనీ రాంబో ఖతీజా నటీనటులు : విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, శ్రీశాంత్ తదితరులు నిర్మాణ సంస్థ: రౌడీ పిక్చర్స్ - సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాతలు: విగ్నేశ్ శివన్ - నయనతార - ఎస్.ఎస్.లలిత్ కుమార్ దర్శకుడు: విగ్నేశ్ సంగీతం: అనిరుథ్ సినిమాటోగ్రఫి:ఎస్.ఆర్.కధిర్ - విజయ్ కార్తీక్ కణ్ణన్ విడుదల తేది: ఏప్రిల్ 28,2022 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్'. రొమాంటిక్, కామెడీ ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నేడు (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు సందర్భంగా తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. మరీ ఈ మూవీ ఎలా ఉంది ? ఇద్దరు అమ్మాయిలైన కణ్మనీ, ఖతీజాల మధ్య రాంబో ఎలా నలిగిపోయాడు ? అనేది మూవీ రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? రాంబో(విజయ్ సేతుపతి) పుట్టుకతోనే దురదృష్టవంతుడిగా పేరు తెచ్చుకుంటాడు. అతను పుట్టగానే తండ్రి చనిపోతాడు. తల్లి అనారోగ్యం పాలవుతుంది. దీంతో రాంబో కూడా నిజంగానే తాను దురదృష్టవంతుడినని, తన వల్లనే తల్లి అనారోగ్యపాలైందని భావించి చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. తను ఇష్టపడిన వాళ్లకు కీడు జరుగుతుందని భావించి, మూడు పదుల వయసు వచ్చినా.. ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లడు. అదే సమయంలో అతనికి పరిచయమవుతారు కన్మణి(నయనతార), ఖతీజా(సమంత). ఇద్దరిని సమానంగా ప్రేమిస్తాడు రాంబో. ఒకరితో పగలంతా గడిపితే.. మరొకరికి రాత్రి సమయం కేటాయిస్తాడు. అయితే ఓ రోజు కన్మణి, ఖతీజాలకు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ పెళ్లి దాకా వెళ్లిందా? చివరకు రాంబో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటుడితో సమంత, నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారంటే.. ఆ సినిమాపై కచ్చితంగా భారీ అంచనాలే ఉంటాయి. దర్శకుడు కూడా అదే స్థాయిలో మంచి కథని ఎంచుకొని సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తాడు. కానీ విగ్నేశ్ శివన్ మాత్రం పేలవమైన కథతో ‘కాతు వాకుల రెండు కాదల్’చిత్రాన్ని తెరకెక్కించాడు. స్టోరీని పక్కకు పెట్టి.. కేవలం స్టార్ క్యాస్ట్ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు. కథ, కథనాల్లో పసలేకపోవడం వల్ల ఈ సినిమా పేలవంగా సాగుతుంది. హీరోని ఇద్దరు హీరోయిన్లు ప్రేమించడం.. అతన్ని దక్కించుకునేందుకు ఇద్దరు పోటీపడడం, వాళ్ల వల్ల హీరోకు సమస్యలు రావడం..చివరకు ఇద్దరితో హీరో కలిసి ఉండడం.. ఈ తరహా ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు తెలుగు, తమిళ బాషలో చాలానే వచ్చాయి. ‘కణ్మనీ రాంబో ఖతీజా'లో కొత్తదనం ఏమీ లేకపోవడం.. కథనం చాలా నెమ్మదిగా సాగడంతో ఫస్టాఫ్ అంతో బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ ముందు హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో అక్కడక్కడ కామెడీ, కొన్ని డైలాగ్స్ అలరించినా.. అంత ఆసక్తిగా మాత్రం కథనం సాగదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా.. చాలా సింపుల్‌గా సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు తెరపై స్టార్ క్యాస్ట్ తప్ప కథలో కొత్తదనం కనిపించదు. ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ కాలేదు. రొటీన్ స్క్రీన్‌ప్లే. పాన్ ఇండియా సినిమాలు సందడి చేస్తున్న ఈ సమయంలో ఇలాంటి మూవీని ప్రేక్షకులు ఆదరించడం కాస్త కష్టమే. ఎవరెలా చేశారంటే.. విజయ్ సేతుపతి, నయనతార, సమంత తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రాంబోగా విజయ్ అలరించాడు. సినిమాతో అతనికి పాత్రకే సరైన జస్టిఫికేషన్ ఉంది. అందువల్ల ఆడియన్స్ ఎక్కువగా రాంబో పాత్రకు కనెక్ట్ అవుతారు. ఇక కన్మణిగా నయనతార తనదైన నటనతో అదగొడితే.. ఖతీజాగా సమంత తన అందంతో ఆకట్టుకుంది. టీవీ షో వ్యాఖ్యాతగా ప్రభు, ఖతీజా తొలి బాయ్‌ప్రెండ్ మహ్మద్ మోబీగా శ్రీశాంత్ తమ, తమ పాత్రలకు న్యాయం చేశారు. (చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్ చెప్పిన హీరో) ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుథ్ సంగీతం. సినిమాలో మ్యాటర్ లేకున్నా.. తనదైన నేపథ్య సంగీతంతో లాక్కొచ్చాడు. ఎస్.ఆర్.కధిర్ - విజయ్ కార్తీక్ కణ్ణన్ ఫర్వాలేదు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘వన్ బై టు’మూవీ రివ్యూ
టైటిల్: వన్ బై టు నటీనటులు: సాయి కుమార్, ఆనంద్, శ్రీ పల్లవి , కాశీ విశ్వనాథ్, దేవీ ప్రసాద్ తదితరులు నిర్మాణ సంస్థ : చెర్రీ క్రియేటివ్ వర్క్స్ నిర్మాత: శ్రీనివాసరావు దర్శకుడు: శివ ఏటూరి సంగీతం: లియాండర్ లీమార్టీ & ఆదేశ్ రవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సందీప్ కుమార్ కానుగల ఎడిటర్: జేపీ విడుదల తేది: ఏప్రిల్ 22,2022 గత రెండు నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాల హవే నడుస్తోంది. రాధేశ్యామ్ మొదలుకొని ఆర్ఆర్ఆర్, కేజీయఫ్2.. ఇలా వరుస పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో చిన్న చిత్రాలు కాస్త వెనకడుగు వేశాయి. పాన్ ఇండియా ఫీవర్ ఇప్పుడు కాస్త తగ్గడంతో ఈ శుక్రవారం(ఏప్రిల్ 22) చిన్న సినిమాలు థియేటర్స్‌లో సందడి చేయడానికి వచ్చేశాయి. ఈ వారం టాలీవుడ్లో నాలుగైదు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి ‘వన్ బై టు’. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషించడం, టైటిల్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉండడంతో ‘వన్ బై టు’పై ఆసక్తి పెరిగింది. నేడు థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? హైదరాబాద్‌కు చెందిన పాండు(ఆనంద్) ఓ మధ్యతరగతికి చెందిన యువకుడు. జులాయిగా తిరుగుతూ.. తన కాలనీలోని అమ్మాయిలందరికి సైట్ కొడుతుంటాడు. అదే కాలనీకి తండ్రితో కలిసి వస్తుంది జెన్నీ(శ్రీపల్లవి). ఇంకేముంది.. ఆవారాగా తిరిగే పాండు.. జెన్నీ చూసి ప్రేమలో పడిపోతాడు. అందరి అమ్మాయిలను టైంపాస్‌గా లవ్ చేసే పాండు.. జెన్నీని మాత్రం సీరియస్‌గా ప్రేమిస్తాడు. కానీ జెన్నీ మాత్రం మొదట్లో పట్టించుకోకపోయినా... చివరకు పాండు ప్రేమను అంగీకరిస్తుంది. అదే సమయంలో తనకు సంబంధించిన ఓ నిజాన్ని చెబుతుంది. అది విన్నాక పాండు జెన్నీని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అసలు జెన్నీ చెప్పిన నిజం ఏంటి? ప్రేమించిన అమ్మాయిని పాండు ఎందుకు వదులుకోవాలనుకున్నాడు? అసలు ఈ కథకు ‘వన్ బై టు’అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇది ఒక వైలెంట్ లవ్ స్టొరీ అని చెప్పొచ్చు. దర్శకుడు శివ ఏటూరి ఓ ఢిఫెరెంట్ పాయింట్‌ని ఎంచుకొని ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అందులో కొంతవరకు సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. హిజ్రాలను బాధలను తెరపై చక్కగా చూపించాడు. తమిళ సినిమాల మాదిరి పాత్రలన్నీ చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా సాగుతుంది. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్ స్టార్టింగ్‌లోనే ప్రేక్షకులకు ఓ భారీ ట్విస్ట్ ఇచ్చి షాకిచ్చాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో పరిస్థితి ఏంటి? ఇప్పుడేం చేస్తాడు? అనే క్యూరియాసిటీ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది. అయితే మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. బస్‌లో హిజ్రాని ఏడిపించే సీన్ చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఆకతాయిలను హీరో కొట్టకముందే.. హిజ్రా అతన్ని మెచ్చుకోవడం..హీరోయిన్ సెల్ఫీకి రెడీ అవడం అంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లోని కొన్ని సిల్లీ సీన్స్‌ని.. సెకండాఫ్‌తో ముడిపెట్టిన విధానం బాగుంది. హీరోయిన్ దుస్తులు ఆరేయడం నుంచి.. షాపులో షేవింగ్ కిట్ కొనే వరకు ప్రతి సీన్‌కి సెండాఫ్లో కారణం చూపించాడు. విజయ భారతి రాసిన ‘నొప్పి తెలియకుండా మనిషిని సక్కగా చేయటానికి నేను డాక్టర్ ని కాదు, రోజుకొకలా హింసించే యమధర్మరాజుని’లాంటి డైగాల్ బాగా పేలింది. సాయికుమార్, దేవీప్రసాద్, కాశీ విశ్వనాథ్ లాంటి సీనియర్ నటులను మరింత వాడుకోని, ఫస్టాఫ్‌పై ఇంకాస్త ఫోకస్ పెడితే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఆవారాగా తిరిగే మధ్య తరగతికి చెందిన యువకుడు పాండు పాత్రకు ఆనంద్ న్యాయం చేశాడు. అతని యాక్టింగ్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. తనదైన కామెడీతో నవ్వించాడు కూడా. ఇక హీరోయిన్ శ్రీపల్లవి అయితే జెన్నీ పాత్రకు పూర్తి న్యాయం చేసింది.ఎవరైనా మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ ఒదిగిపోయారు. హీరోయిన్ తండ్రి గా కాశీ విశ్వనాథ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. కొడుకు ప్రేమను అర్థం చేసుకునే మధ్యతరగతి తండ్రిగా దేవీప్రసాద్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. లియాండర్ లీమార్టీ & ఆదేశ్ రవి సంగీతం ఫర్వాలేదు.సందీప్ కుమార్ కానుగల నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటర్ జేపీ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘కేజీయఫ్ 2’ మూవీ రివ్యూ
టైటిల్ : కేజీయఫ్ చాప్టర్ 2 నటీనటులు : యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, అర్చన, ఈశ్వరీరావు, రావు రమేశ్ తదితరులు నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్ నిర్మాత:విజయ్ కిరగందూర్ దర్శకుడు: ప్రశాంత్ నీల్ సంగీతం: రవి బస్రూర్ సినిమాటోగ్రఫి: భువన్ గౌడ విడుదల తేది: ఏప్రిల్ 14, 2022 సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కేజీయఫ్ 2 ఒకటి. 2018లో వచ్చిన ‘కేజీయఫ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఎలాంటి అంచానాలు లేకుండా విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే..భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకు తగ్గట్టే.. కేజీయఫ్ 2 తీర్చిదిద్టినట్లుగా టీజర్, ట్రైలర్‌ని చూపించారు మేకర్స్ . దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు కల్లల్లో ఒత్తులు వేసుకొని వేచి చూశారు. బహుబలి సీక్వెల్ తర్వాత ఓ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు.. అంతా వేచి చూస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే అది కేజీయఫ్ 2 అనే చెప్పవచ్చు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్ట్ 1 సూపర్ హిట్ కావడం, పార్ట్2 టీజర్, ట్రైలర్ అదిరిపోవడంతో ‘కేజీయఫ్ 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీయఫ్ 2ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు. కేజీయఫ్ 1 స్థాయిని కేజీయఫ్2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కేజీయఫ్ మూవీ ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచి కేజీయఫ్ 2 కథ మొదలవుతుంది. మొదటి పార్ట్‌లో రాకీ భాయ్ స్టోరీని ప్రముఖ రచయిత ఆనంద్ వాసిరాజు(అనంత్ నాగ్) చెబితే.. పార్ట్ 2లో ఆయన కుమారుడు విజయేంద్రవాసిరాజు(ప్రకాశ్ రాజ్) కథ చెబుతాడు. గరుడను చంపిన తర్వాత నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్‌ను రాకీ భాయ్ (యశ్) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. గరుడ పెట్టే చిత్రహింసల నుంచి బయట పడడంతో అక్కడి కార్మికులు యశ్ని రాజుగా భావిస్తారు. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇక కేజీయఫ్ సామ్రాజ్యంలో తనకు ఎదురులేదని అనుకుంటున్న సమయంలో ‘నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్’ సృష్టికర్త సూర్యవర్ధన్ సోదరుడు అధీరా(సంజయ్ దత్) తెరపైకి వస్తాడు. అదే సమయంలో రాజకీయంగా కూడా రాకీబాయ్ సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సివస్తుంది. అతని సామ్రాజ్యం గురించి తెలుసుకున్న భారత ప్రధానమంత్రి రమికా సేన్(రవీనా టాండన్)..అతనిపై ఓ రకమైన యుద్దాన్ని ప్రకటిస్తుంది. ఒకవైపు అధీరా నుంచి, మరోవైపు రమికా సేన్ ప్రభుత్వం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో రాకీభాయ్ ఏం చేశాడు? తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు?. శత్రువులు వేసిన ఎత్తులను ఎలా చిత్తు చేశాడు? తనను దేవుడిగా భావించిన కార్మికుల కోసం ఏదైనా చేశాడా? అమ్మకు ఇచ్చిన మాట కోసం చివరికి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటంటే.. 2018లో చిన్న సినిమాగా విడుదలై అతి భారీ విజయం సాధించిన చిత్రం ‘కేజీయఫ్’. తల్లి చెప్పిన మాటలు, ఆ మాటల ప్రభావంతో పెరిగిన కొడుకు, చివరకు ఓ సామ్రాజ్యానికే అధినేతగా ఎదగడం.. ఇలా కేజీయఫ్ చిత్రం సాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కేజీయఫ్ చాప్టర్ 2లో చూపించారు. కేజీయఫ్ మాదిరే పార్ట్2లో హీరో ఎలివేషన్, యాక్షన్ సీన్స్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్ 2లో యాక్షన్ డోస్ మరింత ఎక్కువైందనే చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో రాకీభాయ్ ఎదిగే తీరుని చాలా ఆసక్తికరంగా చూపించాడు. కేజీయఫ్ పార్ట్‌నర్స్‌తో జరిపిన మీటింగ్, ఇయత్ ఖలీల్‌తో జరిపిన డీల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్లో చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌లో పార్లమెంట్‌లోకి వెళ్లి మాజీ ప్రధానిని చంపడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ‘కేజీయఫ్’అభిమానులకు మాత్రం ఆ సీన్‌తో సహా ప్రతి సన్నీవేశం నచ్చుతుంది. బహుశా దర్శకుడు కూడా వారిని మెప్పించడానికే హీరో ఎలివేషన్స్‌లో మరింత స్వేచ్ఛ తీసుకున్నాడేమో. అయితే కథని మాత్రం ఆ స్థాయిలో మలచుకోలేకపోయాడు. కేజీయఫ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమాలోని విలన్లు, వారు ఎలాంటి ఎత్తులు వేస్తారు.. చివరకు ఎం జరుగుతుంది అనేది అంచనా వేస్తారు. వారి అంచనా తగ్గట్టే పార్ట్2 సాగుతుంది. కథలో ట్విస్టులు లేకపోవడం మైనస్. ఇక అధీర పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగున్నప్పటికీ.. రాకీభాయ్, అధిరాకు మధ్య వచ్చే ఫైట్ సీన్స్ మాత్రం అంతగా ఆసక్తికరంగా సాగవు. అధిర పాత్రను మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. అలాగే అతని నేపథ్యం కూడా సినిమాలో చూపించలేదు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే.. ఇందులో మదర్ సెంటిమెంట్ కాస్త తక్కువే అని చెప్పాలి. మధ్య మధ్యలో తల్లి మాటలను గుర్తు చేస్తూ కథను ముందుకు నడిపారు.ఇక హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ కథకి అడ్డంకిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే చివర్లో మాత్రం తల్లి కాబోతున్న విషయాన్ని హీరోకి తెలియజేసే సీన్ హృదయాలను హత్తుకుంటుంది. సముద్రం ఎందుకంత వెలిగిపోతుందని కొడుకు అడిగిన ప్రశ్నకి తల్లి చెప్పిన సమాధానాన్ని, క్లైమాక్స్‌తో ముడిపెట్టడం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. సినిమా స్టార్టింగ్‌లో విలన్లకు సంబంధించిన వ్యక్తి, యశ్ గురించి చెబుతూ.. ‘ఇంట్లో ఉన్న ఎలుకలను బయటకు తోలడానికి పాముని పంపారు.. ఇప్పుడు అది నల్ల తాచు అయింది’ అని అంటాడు. అంటే హీరో మరింత బలపడ్డాడు అనే అర్థంతో ఆ డైలాగ్ చెబుతాడు. కేజీయఫ్2లో యశ్ నటన కూడా అంతే. మొదటి భాగంతో పోలిస్తే.. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్ చెబుతూ..అదరగొట్టేశాడు. రాకీ భాయ్ పాత్రకు యశ్ తప్పితే మరొకరు సెట్ కాలేరు అన్న విధంగా అతని నటన ఉంది. యాక్షన్ సీన్స్‌లో విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా మంచి నటనను కనబరిచాడు. అధీరగా సంజయ్ దత్ ఫెర్పార్మెన్స్ బాగుంది. ఆయన పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఈ సినిమా షూటింగ్‌కి ముందే సంజయ్ దత్‌కి కేన్సర్ అని తేలింది. అయినా కూడా ఆయన అధీర పాత్రలో నటించడం అభినందించాల్సిందే. ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రకి రవీనా టాండన్ న్యాయం చేసింది. రావు రమేశ్, ఈశ్వరి భాయ్, ప్రకాశ్ రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రతి ఒక్కరి పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండడం ఈ సినిమా గొప్పదనం. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం రవి బస్రూర్ సంగీతం. అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. భువన్ గౌడ సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కేజీయఫ్ సామ్రాజ్యాన్ని అందంగా చిత్రీకరించాడు. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. ఉజ్వల్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కేజీయఫ్ 2’ ట్విటర్ రివ్యూ
‘కేజీఎఫ్ చాపర్ట్ 2’ కోసం యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఈ మూవీ మొదటి పార్ట్ ‘కేజీఎఫ్’ భారీ విజయం సాధించడమే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం.. భారతీయ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే.. ప్రేక్షకులను అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అందుకు తగ్గట్టే కేజీఎఫ్ 2 తెరకెక్కించానని దర్శకుడు ప్రశాంత్ నీల్ నమ్మకంగా చెబుతున్నాడు. దీంతో కేజీఎఫ్ 2పై మరింత హైప్ క్రియేట్ అయింది. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #KGFChapter2 The best Don movie in recent times. Masssss... Action packed. A pinch of sentiment and love. @TheNameIsYash stylish look and acting wowww. Worth watching. — Abhi (@abhi_tommi) April 14, 2022 #KGFChapter2 Overall a Superb Action Entertainer that delivers! Neel is the best at giving goosebumps and he delivers once again. The BGM is one of the best in recent years. Apart from a off track 20 minutes in the 2nd half, it delivers as hoped. Rating: 3.5/5#KGF2 — Venky Reviews (@venkyreviews) April 13, 2022 హీరో ఇంట్రడక్షన్ .. ఇంటర్వెల్ సీన్స్ అయితే గూజ్ బమ్స్ వచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు.అలాగే రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం అదరిపోయిందని ట్వీట్ చేస్తున్నారు. #KGF2 is ABSOLUTE FIRE UNTIL INTERVAL! #Yash aka. #RockyBhai is MEANER, LEANER & STRONGER!!! #KGFChapter2 If this pace continues in 2nd half, this will be an UNSTOPPABLE Monster at the Box Office. Solid set up for the premise until the interval block. — Himesh (@HimeshMankad) April 13, 2022 #KGFChapter2 Interval: Fine first half. The intro, Toofan song and the pre-interval sequence provide the much needed goosebumps, with #Yash in terrific form. The BGM by Ravi Basrur is simply superb! — Siddarth Srinivas (@sidhuwrites) April 14, 2022 బయట ప్రచారం చేసినంతగా కేజీయఫ్ 2 లేదని, రెగ్యులర్ మాస్ మూవీలాగే ఉంది. కేజీయఫ్ 2 మ్యాజిక్‌ని రీక్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ విఫలమయ్యాడని చెబుతున్నారు. #KGFChpater2Review RATING - 2/5 ⭐#KGFChpater2 DOESN'T LIVE Up To The HYPE . REGULAR MASALA STYLE OUTDATED, PREDICTABLE PLOT & Just The INTENSITY is the Only GOOD Thing. #PrashanthNeel FAILS To RECREATE The MAGIC of #KGF Part 1. #KGF2#KGF2InCinemas pic.twitter.com/qaSHCRoiHE — Himesh Mankadman. (@HimeshMamkad) April 13, 2022 కేజీఎఫ్ మూవీ ఫస్టాఫ్ అదిరిపోయిందని, యశ్ ఎంట్రీ, ఇంటర్వెల్ సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. #KGF2 1 HALF அய்யய்யோ Ovvoru Scene Goosebumps 🔥🔥 சும்மா பக்கு பக்குன்னு இருக்கு படம் பயங்கரம் 🔥🔥 @TheNameIsYash@prashanth_neel #KGFChapter2 #KGF2onApr14 #KGFChpater2 pic.twitter.com/THa5BUP3bp — VîMãŁ Remo🔥 (@VimalRemoN2) April 14, 2022 #kgf2 1st Half Rocky Rocks BGM🔥 Interval Block 🔥 Not too much Mass loaded for 1st half Some Lag in mid of 1st half#SanjayDutt intro on Fire bridge 👎 Overall decent as expected 1st half 3.25/5#KGF2review #KGFChpater2 #KGFChapter2review #YashBOSS𓃵 #yash #KGFreview #kgf pic.twitter.com/pH7H11MFwz — Shani Sree (@FilmFocus_Live) April 13, 2022 -
‘బీస్ట్’మూవీ రివ్యూ
టైటిల్ : బీస్ట్ జానర్ : యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు : విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్ , విటివి గణేశ్, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్ నిర్మాత: కళానిధి మారన్ దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్ సంగీతం : అనిరుధ్ ఎడిటింగ్: ఆర్.నిర్మల్ సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస విడుదల తేది : ఏప్రిల్ 13, 2022 విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే.. వైవిధ్యం కచ్చితంగా ఉంటుందని సినీ అభిమానులు అంచనా వేస్తారు. అందుకు తగ్గట్టే.. విజయ్ విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పేరుకు కోలీవుడ్ హీరో అయినా.. ఆయన ప్రతి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి మార్కెటింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘బీస్ట్’ కూడా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా భారీ స్థాయిలో నేడు(ఏప్రిల్ 13) విడుదలైంది. ‘కోలమావు కోకిల`, `డాక్టర్` చిత్రాలతో కోలీవుడ్‌లో దర్శకుడిగా నిరూపించుకున్న నెల్సన్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు పాజిటివ్ టాక్ రావడంతో ‘భీస్ట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్‌లోకి వచ్చిన ‘బీస్ట్’ని ప్రేక్షకులు ఏ మేరకు మెప్పించారో రివ్యూలో చూద్దాం. ‘బీస్ట్’ కథేంటంటే.. వీర రాఘవన్ అలియాస్ వీర(విజయ్) భారత ‘రా’ ఏజెంట్. ఏ సీక్రెట్ ఆపరేషన్ని అయినా ఈజీగా చేసే సత్తా ఉన్నోడు. ఓ సారి రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉగ్రవాదుల అధినేత ఉమర్ ఫరూఖ్‌ని పట్టుకునేందుకు ఓ ఆపరేషన్ చేపడతాడు. అది విజయవంతం అయినప్పటికీ.. చిన్న పొరపాటు కారణంగా ఓ చిన్నారి మృతి చెందుతుంది. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన వీర.. వృత్తిని వదిలేసి చెన్నైకి వచ్చేస్తాడు. అక్కడ అనుకోకుండా ప్రీతి(పూజాహెగ్డే)తో పరిచయం ఏర్పడుతుంది. ఓ సారి ఆమెతో కలిసి చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్కి వెళ్తాడు. అదే సమయంలో ఆ మాల్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. తమ లీడర్ ఉమర్ ఫరూఖ్‌ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఆ సమయంలో ఉమర్ ఫరూఖ్‌ని పట్టుకున్న రా ఏజెంట్ వీర ఏం చేశాడు? ఇంటెలిజెన్స్ అధికారి అల్తాఫ్ హుస్సేన్ (సెల్వ రాఘవన్)తో వీర కుదుర్చుకున్న డీల్ ఏంటి? టెర్రరిస్టుల హైజాక్‌కి కేంద్ర హోంశాఖ మంత్రికి ఉన్న సంబంధం ఏంటి? దాన్ని వీర ఎలా బయటపెట్టాడు? చివరకు టెర్రరిస్టుల ఆధీనంలో ఉన్న 150 మంది ప్రజలను ఒక్కడే ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... దాదాపు 190 కోట్ల రూపాయల బడ్జెట్, విజయ్ లాంటి స్టార్ హీరో, పూజా హెగ్డే లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్.. నెంబర్ వన్ టెక్నీషియన్స్ ..ఇలాంటి టీమ్ దొరికితే ఏ దర్శకుడైనా కథను ఓ రేంజ్లో సమకూర్చుకుంటాడు. నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రం చాలా సింపుల్, రొటీన్ స్టోరీని ఎంచుకోవడం నిజంగా విచిత్రమే. ఓ షాపింగ్ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను హీరో ఏ విధంగా రక్షించాడు? ఇదే బీస్ట్ కథ. ఇంతకు మించి కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు. సినిమా అంతా మాల్ చుట్టే తిరుగుతుంది. విజయ్‌ది వన్‌మ్యాన్ షో. పోనీ అతని ప్రత్యర్థులు అంటే ఉగ్రవాదులు అయినా క్రూరంగా వ్యవహరిస్తారా? అంటే అదీ లేదు. తమ సభ్యులు చనిపోతుంటే కూడా ప్రజలకు ఎలాంటి హానీ కలిగించకపోవడం మరో విచిత్రం. విజయ్ ఒక్కడితోనే యాక్షన్ సీన్స్ చేయిస్తే చాలు.. ప్రత్యర్థులు ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాడేమో దర్శకుడు. పైగా సీరియస్ సిచ్యుయేషన్‌లో కామెడీ సీన్స్ చొప్పించాడు. అది అక్కడక్కడ వర్కౌట్ అయినా.. కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ సీన్ కూడా అంతగా ఆసక్తిగా అనిపించదు. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఇట్టే కనిపెట్టగలడు. క్లైమాక్స్ కూడా చాలా రోటీన్. సినిమాలో హీరో కొట్టే ఒకే ఒక్క డైలాగ్ ఏంటంటే..‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’. ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్తదేమి కాదు. పోకిరిలో మహేశ్ బాబు నోట ఆ డైలాగ్ ఎప్పుడో విన్నారు. ఇప్పుడు విజయ్ చెప్తే అంతగా.. ఇంప్రెస్ కాలేరు. ఇక ఈ సినిమాలో లాజిక్ల జోలికి అసలే వెళ్లొద్దు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో మాజీ రా ఏజెంట్ అయిన హీరో పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఉగ్రవాదులపై దాడి చేసి, ఉమర్ ఫరూఖ్‌ని తీసుకురావడం.. ఏ యాంగిల్లో ఆలోచించినా.. లాజిక్ కనిపించదు. ప్రతి సీన్లో విజయ్ స్టైలిష్‌గా కనిపించడం, యాక్షన్ సీన్లో చెలరేగిపోవడం సినిమాకు కలిసొచ్చింది. అలాగే సెల్వరాఘవన్ విటివి గణేశ్ బేస్ వాయిస్‌తో చెప్పే పంచ్‌లు డైలాగులు, కామెడీ కొంతమేర ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. రా ఏజెంట్ వీర రాఘవన్ పాత్రలో విజయ్ ఒదిగిపోయాడు. యాక్షన్స్ సీన్స్‌లో అయితే చెలరేగిపోయాడు. తెరపై చాలా స్టైలిష్‌గా కనిపించాడు. కథనంతా తన భుజాన వేసుకొని ముందుకు నడిపించాడు. తనను తెరపై ఎలా చూస్తే అభిమానులు ఆనందపడతారో అలానే కనిపించాడు. 'అరబిక్ కుత్తు’ పాటలో డ్యాన్స్ ఇరగదీశాడు. ప్రీతిగా పూజా హెగ్డే పర్వాలేదు. అయితే ఆమె పాత్రకు కొంచెం కూడా ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. ఏదో ఉందా ..అంటే ఉంది అన్నట్లుగా తెరపై అలా కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ అధికారి అల్తాఫ్ హుస్సేన్‌గా సెల్వ రాఘవన్ మంచి నటనను కనబరిచాడు. ఆయన వేసే సెటైరికల్ పంచ్‌లు నవ్వులు పూయిస్తాయి. విటివి గణేశ్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికొస్తే.. ఈ మూవీకి ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. ‘అరబిక్ కుత్తు’ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్స్‌లో ఈ సాంగ్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది. నేపథ్య సంగీతం చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఆర్.నిర్మల్ ఎడిటింగ్ పర్వాలేదు. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
బీస్ట్ మూవీ ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 13)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ విడుదలైన తర్వాత కోలివుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా ‘బీస్ట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్..భారత్ తరపు ‘రా’ ఏజెంట్‌గా నటించాడు. ఓ షాపింగ్ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి, ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను ఏ విధంగా రక్షించారనేదే ఈ మూవీ కథ. రా ఏజెంట్‌గా విజయ్ అద్భుతంగా నటించాడనేది ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. విజయ్ అభిమానులకు కావాల్సినంత యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ చిత్రం తమిళం, తెలుగు సహా అన్ని భాషల్లో ‘బీస్ట్’ టైటిల్‌తో విడుదలైతే.. హిందీలో మాత్రం ‘రా’ టైటిల్‌తో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #Beast Overall a Decent Action Comedy Entertainer! A good 1st half followed by an average 2nd half. The film is a perfect blend of comedy and action. On the flipside, the 2nd half feels dragged at parts especially last 20 minutes Will be a Hit at the Box Office 👍 Rating: 3/5 — Venky Reviews (@venkyreviews) April 13, 2022 ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుందని, విజయ్ తనదైన కామెడీతో నవ్వించాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించిన అరబిక్ కుత్తు సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఈలలు వేయిస్తుందట. #Beast - Good first half excluding interval sequences.. Second half falls flat and medicore.. Only saviour @actorvijay and @anirudhofficial ... Comedy works though.. 👍👍 — Venkat.. (@lazyguy_2020) April 13, 2022 విజయ్ తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడని, ‘రా’ ఏజెంట్ వీర రాఘవన్ పాత్రలో ఒదిగిపోయాడని చెబుతున్నారు. కామెడీ, డాన్స్, నేపథ్య సంగీతం చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు. అయితే స్క్రీన్‌ప్లే అంతగా వర్కౌట్ కాలేదట. కథని సీరియస్‌గా గానీ, కామెడీగా కానీ ముందుకు తీసుకెళ్లకుండా గజీబిజీగా తెరకెక్కించాడని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. కథ కూడా రొటీన్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. #Beast - Thalapathy is stylish, energetic & settled act. VTV Ganesh scores well among d huge cast. Songs, BGM, Camera work, Dance gud. Outdated plot, Comedy scenes r enjoyable at parts. No logics. Not so interesting screenplay by Nelson. Neither Serious nor comedy. DISAPPOINTED! — paari (@paripichai) April 13, 2022 #Beast first half slow very slow very very slow but steady in somewhat matters the most in the end. Lot of logical questions need to be answered in the second half. #Valimai️ first half thousand times better than this one. #BeastReview — Rajen De Vijay (@RDVijay45) April 13, 2022 #Beast 👍🔥 4 out of 5 Perfect mix of comedy and action. Exactly what we expect from Nelson! #BeastModeON #BeastMovie — Jagruk Bollywood (@AskJagruk) April 13, 2022 #Beast Review : “Nelson Disappoints” 👉Rating : 2/5 ⭐️ ⭐️ Positives: 👉#ThalapathyVijay 👉Comedy 👉First Half Negatives: 👉No Proper Story & Execution 👉Screenplay 👉Poor Direction 👉Weak Climax#BeastMovie #BeastFDFS #BeastModeON — nature love (@hfyijjgffgyyuu) April 13, 2022 #Beast - #Anirudh music and camera is only good. Strictly for #Thalapathy fans. Ave Movie Bring back Atlee na🥲#BeastModeON#BeastMovie Rating : 2.5/5#BeastFDFS — Suriya Fans Rage (@4006Akash) April 13, 2022 #Beast Below average content which banks more on nelson’s usp rather than heroic stuff..Comedy worked out in parts.. — Ravi (@ravi_437) April 13, 2022 #BEAST Honest Review Thalapathy One Man show💥 Full n full Thalapathy movie💯 First half - Pure mass 🔥 Second half -Verithanam 💥 Especially interval 🥵🔥@anirudhofficial 💯🥁🔥@Nelsondilpkumar pakka Fan boy sambavam💯 Family audience 💜👍 pic.twitter.com/xMaYjo34zz — 🍫𝙉𝙖𝙫𝙚𝙚𝙣 𝙑𝙟💜ᵛᶠᶜ (@Naveen___Vj) April 13, 2022 -
కేజీఎఫ్2 ఫస్ట్ రివ్యూ: వరల్డ్ క్లాస్ మూవీ.. క్లైమాక్స్ చూసి షాకవుతారు!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఎన్నో రికార్డులను సృష్టించింది. దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సినీ చరిత్రలో సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇక ఇప్పుడు అందరి చూపు కేజీఎఫ్ చాప్టర్ 2 పైన పడింది. మరో నాలుగు రోజుల్లో..అంటే ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘కేజీఎఫ్’ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ ఒక్క చిత్రంతోనే యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాలు పెంచుకోవడం సహజం. అందుకు తగ్గట్టుగానే సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించామని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. దీంతో కేజీఎఫ్ 2 విడుదల కోసం సీనీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి సంచనాలు సృష్టిస్తుంది? ఆర్ఆర్ఆర్ రికార్డుని బద్దలు కొడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ ఐదు స్టార్లు ఇచ్చాడు ఓ సినీ క్రిటిక్. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని తనకు తాను డప్పు కొట్టుకునే ఉమైర్ సంధు సినిమా రిలీజ్‌కు ముందే కేజీఎఫ్2 చూశానంటూ సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. కేజీఎఫ్ కేవలం కన్నడ బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదని.. ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ అని ప్రశంసల జల్లు కురిపించాడు. ‘కేజీఎఫ్ 2 కన్నడ ఇండస్ట్రీకి కిరీటం లాంటింది. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు.. ప్రతి సీన్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. డైలాగ్స్ చాలా షార్ప్‌గా, ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. సంగీతం బాగుంది. బీజీఎం అయితే అదిరిపోయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలో ప్రతి ఒక్కరి నటన చాలా టెరిఫిక్‌గా ఉంది. కేజీఎఫ్ 2 కేవలం శాండల్‌వుడ్ బాక్ల్‌బస్టర్ మాత్రమే కాదు.. ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ. యశ్, సంజయ్ దత్‌లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ అయితే అందరికి షాకిస్తుంది’అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
Ghani Movie Review: ‘గని’ పంచ్ అదిరిందా?
-
‘గని’ మూవీ రివ్యూ
టైటిల్ : గని జానర్ : స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియ, నవీన్ చంద్ర, నరేశ్ తదితరులు నిర్మాతలు : అల్లు బాబీ, సిద్దు ముద్ద దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి సంగీతం : తమన్ ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్ సినిమాటోగ్రఫీ : జార్జ్ సి. విలియమ్స్ విడుదల తేది : ఏప్రిల్ 8, 2022 మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో కథల ఎంపిక విషయంలో కాస్త తడపడినా.. ఆ తర్వాత ఢిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా వరుణ్ చేసిన మరో ప్రయోగం ‘గని’. ఇందులో తొలిసారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్నాడీ హీరో. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘గని’ కథేంటంటే ‘గని’(వరుణ్ తేజ్)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ల నాన్న విక్రమాదిత్య(ఉపేంద్ర) విషయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల ‘గని’ బాక్సింగ్‌కు దూరమవుతాడు. దీంతో గనికి తండ్రి మీద విపరీతమైన ద్వేషం ఏర్పడుతుంది. మరోవైపు జీవితంలో ఎప్పుడూ బాక్సింగ్ జోలికి వెళ్లొద్దని గని అమ్మ(నదియ) ఒట్టు వేయించుకుంటుంది. గని మాత్రం తల్లికి తెలియకుండా బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటూనే ఉంటాడు. ఎప్పటికైనా నేషనల్ చాంపియన్‌గా నిలవాలనేదే అతని ఆశయం. అసలు గని బాక్సింగ్‌లో నేషనల్ చాంపియన్ కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాళ్ల నాన్న విషయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటి? తండ్రి గురించి అసలు విషయం తెలుసుకున్న తర్వాత గని ఏం చేశాడు? తన తండ్రికి ఈశ్వర్(జగపతి బాబు)చేసిన అన్యాయం ఏంటి? ఈశ్వర్ అసలు రూపాన్ని గని ఎలా బయటపెట్టాడు? గని చివరకు నేషనల్ చాంపియన్‌గా నిలిచాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్. కానీ ‘గని’ క్యారెక్టర్ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు దర్శకుడు కిరణ్ కొర్రపాటి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా నడిపించి, అసలు కథను సెకండాఫ్‌లో చూపించాడు. ఫస్టాఫ్‌లో వచ్చే కాలేజీ సీన్స్, తల్లి కొడుకుల సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక హీరోయిన్‌తో ప్రేమాయాణం అయితే అతికినట్లే ఉంది తప్ప వారి లవ్‌కి ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్ కాలేడు. కమర్షియల్ సినిమా అన్నాక ఓ హీరోయిన్ ఉండాలి అనే కోణంలో ఆమె క్యారెక్ట్‌ని సృష్టించారు తప్ప.. ఈ కథకి అసలు ఆ పాత్రే అవసరం లేదనిపిస్తుంది. ఇక తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. నవీన్‌చంద్ర, వరుణ్‌ల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా ఫస్టాఫ్ అంతా చాలా చప్పగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్ సీన్‌తో సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది. అది కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కథంతా మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. తండ్రికి అన్యాయం చేసిన ఈశ్వర్ ఇండియన్ బాక్సింగ్ లీగ్(ఐబీఎల్) నెలకొల్పడం.. ఆ ముసుగులో కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించడం..దానిని గని అరికట్టడంతో కథ ముగుస్తుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రతి సీన్ గతంలో స్టోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను గుర్తుకు చేస్తాయి. ప్రేక్షకుడి ఊహకి తగ్గట్టుగా కథనం సాగుతుంది. అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందో, గనిలోనూ అదే ఉంది. కాకపోతే ఎమోషన్ మిస్సయిందనిపిస్తుంది. ప్రతి పాత్రకు పేరున్న నటులను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చింది. ఎవరెలా చేశారంటే.. బాక్సర్ గనిగా వరుణ్ తేజ్ మెప్పించాడు. ఈ పాత్ర కోసం వరుణ్ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. రింగ్‌లోకి దిగే నిజమైన బాక్సర్లాగే కనిపించాడు. మాయ పాత్రలో సాయీ మంజ్రేకర్ పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. ఇక హీరో తండ్రి విక్రమాదిత్యగా ఉపేంద్ర తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. కథను మలుపు తిప్పే పాత్ర అతనిది. గని కోచ్ పాత్రకు సునీల్ శెట్టి న్యాయం చేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈశ్వర్ పాత్రలో జగపతిబాబు పరకాయ ప్రవేశం చేశాడు. హీరో తల్లిగా నదియా, బాక్సర్‌గా నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలు యావరేజ్‌గానే ఉన్నప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని విలీనం చేయడంలో నేపథ్య సంగీతానిది కీలక పాత్ర.. ఆ విషయంలో తమన్‌కి నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. బాక్సాఫీస్‌పై ‘గని’ పంచ్ ఎలా ఉంటుందో ఈ వీకెండ్లో తెలిసిపోతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘గని’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలిసారి బాక్సర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన హీరోగా నటించిన గని మూవీ పలుమార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు నేడు(ఏప్రిల్ 8) థియేటర్స్‌లో విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. అతనికిది తొలి సినిమా. వరుణ్‌కు జోడిగా సయీ మంజ్రేకర్ నటించింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత విడుదలవుతున్న ‘గని’పై టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేశాయి. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రివ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కథేంటి, కథనం ఎలా ఉంది? బాక్సర్‌గా వరుణ్ రాణించాడా లేదా తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #Ghani in UK 🇬🇧 One word Review : “Routine Sports Drama” Positives: Varun Tej Thaman BGM Production Values Negatives: Writing Directing Saiee Manjrekar#VarunTej #SaieeManjrekar #Sunielshetty #Upendra #Thaman #Nadhiya #Jagapathibabu — Manyu Cinemas (@ManyuCinemas) April 8, 2022 బాక్సర్‌గా వరుణ్ తేజ్ వందశాతం మెప్పించాడని చెబుతున్నారు. తమన్ మరోసారి తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. First half report :BGM is the only plus.. Pre interval is ok 👍 Apart from that chaala slow ga undi.. 🏃🤷♂️Ala ala velthadi.. 🙃@tollymasti #tollymasti . .#Ghani #GhaniReview #GhaniFromApril8th #GhaniReleasePunch #VarunTej #GhaniMovie — Tollymasti (@tollymasti) April 8, 2022 కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేషాలు కూడా బాగా పండాయని ట్వీట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్‌లోనే అసలు స్టోరీ ఉందని కామెంట్ చేస్తున్నారు. ఉపేంద్ర ఎంట్రీతో సినిమా టర్న్ అయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Ghani Just Good. Normal Sports Drama.@IAmVarunTej as Boxer is 👌 Easily a good movie for #VarunTej FINAL Word: EASILY WATCHABLE — JD 🏴☠️ (@Tight_Slapz) April 8, 2022 #GhaniReview : “Routine Sports Drama” 👉Rating : 2/5 ⭐️ ⭐️ Positives: 👉#VarunTej 👉Production Values Negatives: 👉Weak Writing & Direction 👉Pointless Drama 👉Outdated Scenes 👉Predictable Narration 👉No high points#GhaniMovie #GHANI — PaniPuri (@THEPANIPURI) April 8, 2022 #Ghani is just a boring mixture all the sports dramas we've seen. One can actually predict every upcoming scene in the movie. The writing and music failed terribly. No notable performances. This one's easily avoidable. — A (@Iwatchfilmsss) April 7, 2022 #Ghani Overall A Routine Sports Drama that offers nothing new except a few good moments in the 2nd Half! The film is predictable from the first few scenes and the entire 1st half is wasted with a love track. 2nd half is somewhat better but still lacks the punch. Rating: 2.5/5 — Venky Reviews (@venkyreviews) April 8, 2022 #Ghani 1st Half Decent with Love scenes, Comedy & Twist..2nd Half Excellent👌@MusicThaman BGM & Songs Highlight🔥@IAmVarunTej Looks, Body Building & Acting Superb Fantastic❤️ On the Whole Very Good Revenge Sports Drama..Watch it with your Family..Rating 3.5/5👍#GhaniReview https://t.co/cZpzQAGZpt — They Call Me #Ghani❤️ (@VakeelSaab26) April 8, 2022 #Ghani 1st half average and love track could have been avoided. 2nd half is better and climax is very good. Fight scenes shot very well. @MusicThaman BGM is superb and elevates scenes. @IAmVarunTej has given his best and he is superb. Overall it is a good sports drama. 3.5/5🔥 — Asim (@Being_A01) April 7, 2022 #Ghani : Well Made Action Drama Good Firsthalf follwed by decent second half @IAmVarunTej scores with his screen presence but acting could have been better #Upendra sir is good #Naveen is decent #Sunilshetty ☹️. BGM from @MusicThaman ❤️🔥.Decent direction from the debutant...3.25/5 — Swathi Cinephile (@Swathi_diva25) April 7, 2022 -
‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ రివ్యూ
టైటిల్ : మిషన్ ఇంపాజిబుల్ నటీనటులు : తాప్సీ, హరీశ్ పేరడీ, రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ తదితరులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : స్వరూప్ ఆర్.ఎస్.జె సంగీతం : మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ : దీపక్ యెరగరా విడుదల తేది : ఏప్రిల్ 01, 2022 టాలీవుడ్లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెఫ్ట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా భారీ విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే చాలు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న చిత్రాలు ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి కూడా. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిన్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. చాలాకాలం తర్వాత తాప్సీ పన్ను తెలుగులో ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 1) రిలీజైన ‘మిషన్ ఇంపాజిబుల్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేటంటే.. శైలజ అలియాస్ శైలు(తాప్సీ) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాపై పరిశోధనలు చేస్తుంటారు. రామ్శెట్టి(హరీశ్ పేరడీ) అనే మాఫియా డాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించాలని ఆమె ప్లాన్ వేస్తారు. బెంగళూరు నుంచి చిన్న పిల్లలను దుబాయ్‌కి తరలించేందుకు రామ్శెట్టి స్కెచ్ వేసినట్లు తెలుసుకున్న శైలు.. పక్కా ఆధారాలతో అతన్ని పోలీసులకు పట్టించి, పిల్లలను రక్షించాలని బయలుదేరుతుంది. కట్‌చేస్తే.. తిరుపతికి చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం(ఆర్.ఆర్.ఆర్) అనే ముగ్గురు కుర్రాళ్లకు చదువు తప్ప అన్ని పనులు వస్తాయి. ఎలాగైనా డబ్బులు సంపాదించి, ఫేమస్ కావలనేదే వాళ్ల లక్ష్యం. డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్న క్రమంలో.. దావూద్‌ని పట్టిస్తే..రూ.50 లక్షల బహుమతి పొందొచ్చు అనే వార్త టీవీలో వస్తుంది. అది చూసి దావుద్‌ని పట్టించి, రూ.50 లక్షల బహుమతి దక్కించుకోవాలని ఆ ముగ్గురు.. ఇంట్లో చెప్పాపెట్టకుండా ముంబైకి బయలు దేరుతారు. మరి ఆ ముగ్గురు ముంబైకి వెళ్లి దావూద్‌ని పట్టుకున్నారా? మాఫియా డాన్ని పోలీసులకు పట్టించాలని చూస్తున్న శైలుకీ, దావూద్‌ని పట్టించి రూ.50 లక్షలు ప్రైజ్ మనీ పొందాలనుకున్న రఘుపతి, రాఘవ, రాజారాంలకు లింకు ఏంటి? అసలు వాళ్లు నిజంగానే ముంబై వెళ్లారా? మాఫియా డాన్ రామ్శెట్టిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంలో.. ఈ ముగ్గురు స్నేహితులు ఎలా సహాయపడ్డారు? శైలు మిషన్కి ఆర్.ఆర్.ఆర్ మిషన్ ఎలా ఉపయోగపడింది? ఈ మిషన్‌లో ఎవరు విజయం సాధించారు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`అనే తొలి మూవీతో అందరి దృష్టి ఆకర్షించాడు దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె. ఆయన నుంచి మరో సినిమా వస్తుందంటే.. కచ్చితంగా ఓ మోస్తరు అంచనాలు ఉంటాయి. దానికి తోడు చాలా కాలం తర్వాత తాప్సీ టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తుండడంతో ‘మిషన్ ఇంపాజిబుల్’పై సినీ ప్రేక్షకులు భారీ హోప్స్ పెంచుకున్నారు. కానీ వారి అంచనాలను రీచ్ కాలేకపోయాడు దర్శకుడు స్వరూప్. కథలో కొత్తదనం లోపించింది. చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలుయే స్వయంగా ఓ పదిహేడేళ్ల కుర్రాడితో డాన్‌ను చంపించడం, దాన్ని సమర్థించేందుకు ఓ అంతుచిక్కని లాజిక్కుని చొప్పించడంతో ‘మిషన్ ఇంపాజిబుల్’ కథ మొదలవుతుంది. రఘుపతి, రాఘవ, రాజారాం పాత్రల కామెడీతో ఫస్టాఫ్ అంతా సరదాగా సాగుతుంది. డబ్బులు సంపాదించే క్రమంలో పిల్లలు చేసిన అమాయకపు పనులు నవ్వులు పూయిస్తాయి. త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాథ్‌లపై వేసిన జోకులు కూడా బాగా పేలాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథంతా ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. అయితే చైల్డ్ ట్రాఫికింగ్, పిల్లలు పడే కష్టాలు.. ఇవన్నీ గత సినిమాల్లో చూసిన సీన్లలాగే అనిపిస్తాయి. కథలో ట్విస్టులు ఉండకపోవడమే కాకుండా.. లాజిక్ లేని సీన్స్ బోలెడు ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ముంబై, బొంబాయి రెండూ ఒకటేనని కూడా తెలియని పిల్లలు.. సెకండాఫ్‌కు వచ్చేసరికి చాలా తెలివిగా వ్యవహరించడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అయిన శైలజ.. ఓ ప్రమాదకరమైన మిషన్కి ముగ్గురు పిల్లలను అడ్డుపెట్టుకోవడం.. సగటు ప్రేక్షకుడికి మింగుడుపడదు. హరీశ్ పేరడీ విలనిజం కూడా అంతగా పేలలేదు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా ఉంది. ఎవరెలా చేశారంటే.. చాలా కాలం తర్వాత తాప్సీ నటించిన తెలుగు సినిమా ఇది. ఓ కొత్త పాత్రతో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు శైలు పాత్రకు తాప్సీ న్యాయం చేసింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో బాగా నటించింది. ఇక సినిమాకు ప్రధాన బలం రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ నటన అనే చెప్పాలి. రఘుపతి, రాఘవ, రాజారాం అనే కుర్రాళ్ల పాత్రల్లో ఈ ముగ్గురు ఒదిగిపోయారు. తమదైన కామెడీతో నవ్వించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మార్క్ కె రాబిన్ సంగీతం బాగుంది. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. దీపక్ యెరగరా సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగ్గట్టుగా ప్రతి సీన్ చాలా సహజంగా తెరపై చూపించాడు. డైలాగ్స్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. చివరగా.. లాజిక్కులు వెతక్కుండా చూస్తే.. మిషన్ ఇంపాజిబుల్ అక్కడక్కడా నవ్విస్తుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆర్ఆర్ఆర్ మూవీ ట్విటర్ రివ్యూ
దర్శకధీరుడు రాజమౌళి మదిలో పుట్టిన అద్భుత సృష్టి ‘రౌద్రం రణం రుధిరం(RRR)’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా పడిన ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఈ చిత్రం తెరకెక్కడంతో ఆర్ఆర్ఆర్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొవిడ్ కష్టాలను ఎదుర్కొంటూ నాలుగేళ్లపాటు శ్రమించి సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. 1st hf over..Bane undi..Both Intros 👌Dosthi Song 👌 Interval Bang Superb...Kreem Sir bgm below par.. #RRR — Gopal (@gopi4_pspk) March 25, 2022 ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీశారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అరెస్ట్ అయిన సీన్ అయితే అదిరిపోయిందట. Interval...#RRR #RRRMoive Theaters box lu baddalu kakunte ottu.. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 just lit... Unexpected twists and anna #RamCharan & #NtrJr 🙏🙏🙏🙏🙏🙏 — TollywoodPolls📽 (@tollywood_polls) March 24, 2022 ఫస్టాఫ్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందట. ఆర్ఆర్ఆర్ ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్. చివరగా ఒక్క మాటలో 'ఆర్ఆర్ఆర్' అబ్బుర పరుస్తోంది అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టేశాడు. ‘నాటు నాటు‘ సాంగ్ అదిరిపోయిందట. #Rajamouli created another action and visual extravaganza with #RRR in a enchanting and mindblowing manner..NTR as Bheem, Ramcharan as Alluri performance’s 👌👌👌👏👏🔥🔥#Ramcharan#jrntr — Maduri Mattaiah (@madurimadhu1) March 25, 2022 Interval shot lo NTR ni alaaa capture chesi frame kattinchukochu 🔥🔥 Out of the world rampage 🔥🔥🔥#RRR #RRRMovie — Cinema Madness 24*7 (@CinemaMadness24) March 25, 2022 Naatu naatu lo kuda oka emotion carry cheyinchadu..mental massss ra ssr #rrr — Msd 🔥💪 (@pspkmaniac7) March 25, 2022 At first you will feel sorry for #AjayDevgn, you will get tears but later on you will understand that @ajaydevgn is the mastermind of #RRRMovie and that he is only giving clues and hits to both #RamCharan & #JrNTR in #RRR. Bumper man he is. Super presence. — Cinema Pointer (@CinemaPointr) March 24, 2022 Ok first half with some highs here n there... Natu natu👌 Relatikaina britishers ki dubbing cheppadamo leda telugu subs veyadamo cheyandi @ssrajamouli saaru anni scenes unnay mottam English ae undi debbaypoddi mass centreslo#RRR — CA_DPR (@prakashraj_Jspk) March 25, 2022 #SSRajamouli is the master of making emotionally gripping movies. And he has done it again with #RRR — SriSri (@3netrudu) March 25, 2022 First half : Below Average Predictable one. Very slow screenplay 👍 Raja mouli's worst one. Eegha>> RRR 👍🙏#RRR #RRRreview #RRRMovie — Vipul Rai (@raivipul233231) March 25, 2022 First Half: Heros intros ❤️🔥 Natu Natu song gives you crazy adrenaline rush. As usual you expect from a rajamouli movie… Interval bang is spectacular 💯#RRR #RRRMovie https://t.co/WJSxjeidu9 — Cinema Brainiac (@CinemaBrainiac) March 25, 2022 Excellent first half…blockbuster already.. Tarak and RC at their best…action episodes rampage @ssrajamouli 🔥 #RRR — Vardhan (@nvr006) March 25, 2022 Totally disappointed. Overrated shit. Worst bgm score.#JuniorNTR's character narration is below expected level. Disaster 😭😭👍👍#RRR #RRRreview #RRRMovie — 𝑺𝒂𝒉𝒊𝒕𝒉 𝑨𝒌𝒆𝒆𝒍 🇦🇺🦘 (@Akeel_offl4) March 24, 2022 Excellent first half @AlwaysRamCharan @tarak9999 iddaru pekata adesaru, Tarak entry, friendship, modati sari iddaru kalise scene, natu song, intervel bang are hilights in first half @ssrajamouli maintain balance very well between tow power houses 👍#RRRMovie #RRR — Cʜᴀʀᴀɴ Dɪᴇʜᴀʀᴅ (@itzSHAFI) March 25, 2022 Bomma adirindi #RRRinUK mind blowing interval.. dummu dulipina #NaatuNaatu song #RRR #RRRMoive #RRRreview @tarak9999 #RamCharan fantastic performances — Harsha V (@harshavrokz) March 25, 2022 It's a #SSRajamouli creation.. the #SSR stamp.. easily expect this movie to gross over 500cr just in weekend.. Ppl will love this movie..#RRRMovie #RRR #RRRreview — Boxofficesutra (@BoxofficeSutra) March 25, 2022 Asalu nenu ippudu unna ee happiness zone ela explain cheyyali kuda teleetle naku. I am proud of you darling @AlwaysRamCharan . Continue to outperform and continue to deliver top class performances. Don't settle for mediocrity #RRRreview — pray for mess and miracle 😢😢😢 (@pavanztweets) March 25, 2022 -
‘నల్లమల’మూవీ రివ్యూ
టైటిల్ : నల్లమల నటీనటులు : అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్ తదితరులు నిర్మాణ సంస్థ : నమో క్రియేషన్స్ నిర్మాత: ఆర్.ఎమ్ దర్శకత్వం :రవి చరణ్ సంగీతం : పీ.ఆర్ సినిమాటోగ్రఫీ : వేణు మురళి ఎడిటర్: శివ సర్వాణి విడుదల తేది : మార్చి 18,2022 పలు సినిమాల్లో విలన్ నటించి,మెప్పించిన అమిత్ తివారి ‘నల్లమల’తో హీరోగా మారాడు. బిగ్‌బాస్ 2 ఫేమ్ భానుశ్రీ ఇందులో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఎమున్నావే.. పిల్లా’సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఒక్క పాట.. ‘నల్లమల’కు హైప్ క్రియేట్ చేసింది. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం(మార్చి 18) ప్రేక్షకుల మధ్యకు వచ్చిన ‘నల్లమల’చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘నల్లమల’కథేంటంటే.. గిరిజన యువకుడు నల్లమల(అమిత్ తివారి)కి ప్రకృతి, సాధుజంతువులపై అమితమైన ప్రేమ. నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉండే ఓ గూడెంలో నివసిస్తూ అక్కడి ప్రజలకు సహాయం చేస్తుంటాడు. మొరటోడులా కనిపించే నల్లమలకు ఆవులంటే చాలా ఇష్టం. అలాగే తన గూడెంలో నివసించే వనమాలి(భానుశ్రీ)అంటే కూడా ఆయనకు ప్రాణం. ప్రకృతి, సాధుజంతువులే లోకంగా భావించే నల్లమలకు అడవిలో జరిగే అక్రమ వ్యాపారం గురించి తెలుస్తోంది. దీంతో ఆయన అక్రమ వ్యాపారం చేస్తున్నవారికి ఎదురు తిరుగుతాడు.మరి నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ వ్యాపారం ఏమిటి? అది ఎందుకు చేస్తున్నారు? గిరిజనుడైన నల్లమల దాన్ని ఎందుకు ఎదిరించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..? ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రవి చరణ్. శాస్త్రవేత్త (నాజర్)ను గిరిజనలు వెంటాడటంతో ఎమోషనల్ నోట్‌తో నల్లమల సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత స్కూల్ పిల్లలకు ఎలాంటి అంశాలతో పాఠ్యాంశాన్ని పుస్తకంలో చేర్చాలనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కథ ఆసక్తిని కలిగిస్తుంది. ఇక మాజీ నక్సలైట్ (చత్రపతి శేఖర్) చెప్పే ఫ్లాష్ బ్యాక్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. సాధారణంగా ప్రతి దర్శకుడు తన డెబ్యూ మూవీకి సేఫ్‌గా ప్రేమ కథను ఎంచుకుంటారు.కానీ రవి చరణ్ మాత్రం తొలి ప్రయత్నంలోనే ఓ మంచి సందేశాత్మక కథను ఎంచుకున్నారు. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. డెబ్యూ డెరెక్టర్‌గా కాకుండా ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. కానీ ఫస్టాప్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగడం.. సెకండాఫ్ వరకు అసలు కథపై క్లారిటీ రాకపోవడం సినిమాకు కాస్త మైనస్. ప్రీ క్లైమాక్స్ లో అసలు విషయం రివీల్ అవుతుంది. దాన్ని మరింత బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది. ఎవరెలా చేశారంటే.. విలన్‌గా పలు సినిమాల్లో నటించి, టాలీవుడ్లో తనకంటే ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాధించుకున్నాడు అమిత్ తివారి. హీరోగా మారి తొలి ప్రయత్నంగా ‘నల్లమల’లాంటి కథను ఎంచుకోవడం అమిత్‌కు ప్లస్ అయింది. ఈ చిత్రంలోని ఆయన పాత్రకు అన్ని రకాల ఎమోషన్స్ పండించే అవకాశం దొరికింది. దీంతో నల్లమల పాత్రలో అమిత్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అమిత్ అదరగొట్టాడు. భాను శ్రీ గ్లామర్ పరంగా, డ్యాన్సుల పరంగా ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో భాను శ్రీ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. శాస్త్రవేత్తగా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, తనికెళ్ల భరణి తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. పీ.ఆర్ సంగీతం అదిరిపోయింది. ‘ఎమున్నావే.. పిల్లా’సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. అలాగే తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫి బాగుంది. అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ వేణు మురళీ తన కెమెరాలో చక్కగా బంధించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
స్టాండప్ రాహుల్ సినిమా రివ్యూ
టైటిల్: స్టాండప్ రాహుల్: కూర్చుంది చాలు నటీనటులు: రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ, మురళీశర్మ, ఇంద్రజ, వెన్నెల కిషోర్ తదితరులు దర్శకుడు: శాంటో మోహన్ వీరంకి నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంగీతం: స్వీకర్ అగస్తి సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవిచంద్రన్ రిలీజ్ డేట్: 18 మార్చి 2022 డిఫరెంట్ కాన్సెప్టులతో కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు అందుకున్నాడు రాజ్‌తరుణ్. రానురానూ కథలపై పట్టు కోల్పోయిన అతడికి సక్సెస్ అందుకోవడం అందని ద్రాక్షే అయింది. తాజాగా స్టాండప్ రాహుల్: కూర్చుంది చాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ యంగ్ హీరో. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అన్నారు. మరి నిజంగానే హీరో స్టాండప్ కమెడియన్‌గా ప్రేక్షకుడిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడా? వరుస అపజయాలతో కూలబడిపోయిన రాజ్‌తరుణ్ ఈ సినిమాతోనైనా లేచి నిలబడ్డాడా? లేదా? అనేది రివ్యూలో చూసేయండి.. కథ స్టాండప్ కామెడీ అనగానే చాలామందికి ఆమధ్య వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో పూజా హెగ్డే పాత్ర గుర్తుకు రావడం ఖాయం. స్టాండప్ కమెడియన్ అంటే గుండెలో కొండంత శోకాన్ని దాచుకుని ఆ విషాదాన్ని ఏమాత్రం పైకి కనిపించనీయకుండా నాలుగు జోకులు చెప్తూ ఎదుటివారిని నవ్విస్తారని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. స్టాండప్ రాహుల్‌లో రాజ్‌తరుణ్ పోషించిన పాత్ర కూడా సేమ్ టు సేమ్. రాహుల్(రాజ్ తరుణ్)కు స్టాండప్ కామెడీ అంటే ప్యాషన్. తండ్రి ప్రకాశ్(మురళీ శర్మ) మనసుకు నచ్చింది చేయమంటాడు. తల్లి ఇందు(ఇంద్రజ) భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయాలంటుంది. వీళ్లిద్దరూ హీరో చిన్నతనంలోనే విడిపోతారు. ఇక రాహుల్ తనకిష్టమైన స్టాండప్ కామెడీతో పాటు ఉద్యోగాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో అదే ఆఫీసులో పనిచేసే శ్రేయారావు(వర్ష బొల్లమ్మ)తో అతడు ప్రేమలో పడతాడు. కానీ పెళ్లంటే గిట్టని రాహుల్ సహజీవనం చేద్దామంటాడు. అతడి ప్రేమను గెలవడం కోసం ఇష్టం లేకపోయినా లివ్ ఇన్ రిలేషన్‌కు సరేనంటుంది శ్రేయ. హీరో పెళ్లి మీద నమ్మకం కోల్పోవడానికి కారణం తన తల్లిదండ్రులే. ఇంతకీ రాహుల్ తల్లిదండ్రుల కథేంటి? వాళ్లెందుకు విడిపోయారు? హీరో ఎందుకు పెళ్లికి నిరాకరిస్తాడు? అసలు వీరి సహజీవనం పెళ్లి దాకా వెళ్లిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ దాన్ని లోతుగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చూపించడంలో కొంత తడబడ్డాడనే చెప్పాలి. కొన్నిచోట్ల భావోద్వేగాలను మరింత పండించగలిగే అవకాశం ఉన్నా ఎందుకో దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు కనిపించింది. కథానేపథ్యం, అందుకు తగ్గట్టుగా పాత్రల్ని సృష్టించడంలో అతడి నైపుణ్యం బాగుంది. హీరో ప్యాషన్ స్టాండప్ కామెడీ అయినప్పటికీ పెద్దగా హాస్యాన్ని పండించకపోవడం గమనార్హం. మురళీ శర్మ వంటి పెద్ద నటుడిని తీసుకున్నారు కానీ ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. పాత్రల మధ్య సంఘర్షణని రేకెత్తించకపోవడం మరో మైనస్ అనే చెప్పుకోవాలి. ఉద్యోగం కోసం హీరో హైదరాబాద్‌కు చేరుకున్నాకే అసలు కథ మొదలువుతుంది. అతడి కుటుంబ నేపథ్యం పరిచయమయ్యాక ప్రేక్షకుడికి కథాగమనం తెలిసిపోతుంది. తర్వాత ఏం జరగబోతుందనేది ప్రేక్షకుడు ముందుగానే పసిగట్టేలా సన్నివేశాలు ఉండటంతో ఆసక్తి సన్నగిల్లుతుంది. దర్శకుడు శాంటో మోహన్ ఎమోషన్స్ మీద కూడా ఇంకాస్త దృష్టి పెట్టుంటే సినిమా మరో రేంజ్లో ఉండేదేమో! చదవండి: రాజ్ తరుణ్, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం: వరుణ్ తేజ్ నటీనటులు కొత్తదనాన్ని కోరుకునే రాజ్‌తరుణ్ స్టాండప్ కమెడియన్ రాహుల్ పాత్రను అవలీలగా చేసేశాడు. లుక్స్ పరంగానే కాదు, పాత్రకు తగ్గట్టుగా ఎమోషన్స్‌లో వేరియన్స్ చూపించాడు. వర్ష బొల్లమ్మ తన క్యూట్‌నెస్‌తోనే కాదు, అభినయంతోనూ ఆకట్టుకుంది. సీనియర్ నటులు ఇంద్రజ, మురళీశర్మల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కోసమే ఆ పాత్రలు డిజైన్ చేసినట్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. సాంకేతికంగా సినిమా మెప్పించింది. శ్రీరాజ్ రవిచంద్రన్ కెమెరాతో జిమ్మిక్కులు చేశాడు. స్వీకర్ అగస్త్య మంచి సంగీతం అందించాడు. డైరెక్టర్ శాంటోకి ఇది ఫస్ట్ మూవీ అయినప్పటికీ అనుభవమున్నవాడిలా తెరకెక్కించాడు. కాకపోతే కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టిన అతడు సంఘర్షణ, భావోద్వేగాల మీద ఫోకస్ చేయలేకపోయాడు. ప్లస్ ► రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ ► సంగీతం ► సినిమాటోగ్రఫీ మైనస్‌లు ► బలమైన ఎమోషన్స్ లేకపోవవడం ► బలహీనమైన పాత్రలు కొసమెరుపు: స్టాండప్ రాహుల్.. కూర్చున్నా, లేచినా పెద్ద తేడా లేదు! -
పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ
Puneeth Rajkumar James Movie Twitter Review In Telugu: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేంకగా చెప్పాల్సిన పనిలేదు. 'అప్పు' అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆర్యాధ్య నటుడాయన. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పునీత్ హఠాన్మరణం యావత్ పరిశ్రమను కదిలించింది. ఆయన మరణవార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే పునీత్ చనిపోవడం కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం జేమ్స్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి17న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కన్నడ, తెలుగు,తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ప్రియా ఆనంద్ పునీత్‌కి జోడీగా నటించింది. పునీత్ నటించిన చివరి చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు. కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. బెనిఫిట్ షో మొదలైనప్పటి నుంచి ఈ చిత్రానికి హిట్ టాక్ వస్తోంది. పునీత్ యాక్షన్ సీన్స్ చూసి ఓవైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే, తమ ఆరాధ్య హీరో చివరి సినిమా ఇదేనంటూ మరికొందరు భావేద్వోగం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈసినిమా ఎలా ఉందన్నది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి అవేంటో చూసేయండి. #James 1st Half - Watch Out For The Massive Performance Of Our Power Star In The Pre Interval Sequence😭❤️Total Goosebumps Stuff❤️Man Literally Nailed That Whole Pre Interval Sequence 💥💥💥#BoloBoloJames #Appu #PuneethRajkumar #AppuLivesOn — Sumanth R (@Itz_Sumanth) March 17, 2022 Celebration began at Urvashi cinemas. APPU❤❤ @Kannada_BO#CelebratePuneethRajkumar #James #Appu #BoloBoloJames pic.twitter.com/z2Jh4NOaDT — ಪ್ರಶಾಂತ್ ವಿ (@prashanthv18) March 17, 2022 Action is his Trademark😭🙏🏻🙏🏻#DrPuneethRajkumar #James @PuneethRajkumar #JamesHistoricEuphoria pic.twitter.com/hmOCCku3Oj — 𝐀𝐩𝐩𝐮 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐇𝐨𝐮𝐬𝐞 ™ (@AppuCelebration) March 17, 2022 Mental mass first half Fights mamuluga levu🔥🔥💥 perfect tribute to appu sir 🙏🙏#James #JamesHistoricEuphoria https://t.co/gCw7uIaxia — Amarnath CA (@CNAmarnath) March 17, 2022 Fans getting emotional seeing after #James movie🥺 Every fan is crying coming out of theatre seeing movie😔#PuneethRajkumar #HappyBirthdayPuneethRajkumar pic.twitter.com/JHlo6XrdB8 — Babu7@అన్నఫ్యాన్ (@Babu9440) March 17, 2022 Couldn’t control tears when ever i see him smile will miss that beautiful simle #PuneethRajkumar #james will cherish every second of all ur time with us fans powerstar ull be missed and forever live in our hearts 😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/01xa65MNJH — Nishanth (@nishantn138) March 17, 2022 #James is a great commercial action entertainer. A fast paced screenplay, good story, fantastic action sequences and also good emotional content make it a perfect commercial entertainer. This movie has nice production value, music and cinematography. A very good job by director. pic.twitter.com/8Zb9c6Smmm — Indian (@Indian1726) March 17, 2022 Watching Him First Time On Screen His action sequence are 💙🙏#James #AppuLivesOn #HappyBirthdayPuneethRajkumar #JamesTelugu pic.twitter.com/YOMVw0fp6T — Teja Maddy (@maddy_teja) March 17, 2022 ST - #James (Telugu) pic.twitter.com/RVBOw2Z4In — Ananth Nithiin (@ImAnanthV) March 17, 2022 Veeresh theatre crowd 💥💥Masssss👌#BoloBoloJames #James #CelebratePuneethRajkumar #DrPuneethRajkumar #DrPuneethRajkumar #JamesHistoricEuphoria pic.twitter.com/Dj4ZNWCbzZ — Mahantesh (@Mahi_Appu75) March 17, 2022 #PuneethRajkumar #James#Powerstar Rampage. That dance, fights, screen presence!!❤ It was immensely emotional and a constant mixture of feeling his presence onscreen and absence offscreen. Yet in our hearts #AppuLivesOn. Go watch him on screen!! — Gagan Gowda (@GaganGo39511084) March 17, 2022 As a director Chethan Wins big time he had challenges he executed things well@BahaddurChethan appreciation tweet for you Sir Exceeds expectations #James #JamesonMarch17 — Yuva | James ® (@Yuva_1234) March 17, 2022 #James - came out of the film with nothing but tears. Can't believe that this is his last commercial film. 'Paramathma' will forever stay in our hearts ❤️ Wishing best to team #James on behalf of Thalaivar @rajinikanth fans...#PuneethRajkumar @PuneethRajkumar — Bangalore RFC (@Bangalore_RFC) March 17, 2022 -
‘రాధేశ్యామ్’మూవీ రివ్యూ
టైటిల్ : రాధేశ్యామ్ నటీనటులు : ప్రభాస్,పూజా హెగ్డే, కృష్ణంరాజు, జగపతిబాబు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు నిర్మాణ సంస్థ : గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టి.సిరీస్ నిర్మాతలు: భూషణ్ కుమార్, వంశీ ప్రమోద్ ప్రసీదా దర్శకత్వం : కె. రాధాకృష్ణ సంగీతం : జస్టిన్ ప్రభాకరన్(తెలుగు,తమిళ, కన్నడ,మళయాళం) నేపథ్య సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది : మార్చి 11,2022 బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం.. దాదాపు నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘రాధేశ్యామ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. ‘రాధేశ్యామ్’ కథేంటంటే.. రాధేశ్యామ్ కథంతా 1976 ప్రాంతంలో సాగుతుంది. విక్రమాదిత్య(ప్రభాస్) ఓ గొప్ప జ్యోతిష్కుడు. హస్తసాముద్రికంలో ఆయన అంచనాలు వందశాతం నిజమవుతుంటాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించబోతుందని ముందే చెప్పి.. ఇండియా నుంచి ఇటలీ వెళ్లిపోతాడు. తన చేతిలో ప్రేమ రేఖలు లేవని, లవ్‌ని కాకుండా ఫ్లటేషన్షిప్ని నమ్ముకుంటాడు. ఇలా కనిపించిన ప్రతి అమ్మాయితో ఎంజాయ్ చేసే విక్రమాదిత్య.. డాక్టర్ ప్రేరణ(పూజా హెగ్డే)తో మాత్రం తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ తన చేతిలో లవ్ లైన్స్ లేవని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక పోతాడు. మరోవైపు ప్రేరణ క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆమె రెండు నెలల కంటే ఎక్కువ కాలం బతకదని వైద్యులు చెప్తారు. కానీ తాను జీవితాంతం బతుకుతుందని విక్రమాదిత్య చెప్తాడు. అది ఎలా సాధ్యం అవుతుంది? విధిని ఎదురించి తన ప్రేమని విక్రమాదిత్య గెలిపించుకోగలిగాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. మన రాత అనేది చేతుల్లో ఉండదు.. చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ ప్రేమ కథతో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఓ అందమైన ప్రేమకథని గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కథలో ఎలాంటి మలుపులు ఉండవు కానీ.. లొకేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ప్రేక్షకుడి మనసు దోచుకుంటాయి. ఇటలీలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో కథ.. అలా సాగిపోతుంది. ప్రభాస్ గత సినిమాల మాదిరి ఫైట్ సీన్స్, మాస్ సాంగ్స్ గానీ ఈ చిత్రంలో ఉండవు. కానీ కథంతా హీరో, హీరోయిన్ల చుట్టే తిరుగుతుంది. మిగతా పాత్రలకు అంతగా స్క్రీన్ స్పేస్ లేదు. భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, జగపతిబాబు, జయరాం,మురళిశర్మ లాంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ.. వారంతా కథలో ఇలా వచ్చి అలా వెళ్లినట్లు అనిపిస్తుంది. ప్రేమ కథకు హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా అవసరం. ఈ సినిమాలో ఆ కెమెస్ట్రీ వర్కౌట్ అయినా.. అందుకు తగినట్లుగా బలమైన సీన్స్ లేకపోవడం మైనస్. ఫస్టాఫ్ అంతా స్లోగా సాగుతుంది. యూరప్ అందాలపైనే దర్శకుడు ఎక్కువ శ్రద్దపెట్టినట్లు అనిపిస్తుంది. ట్రైన్ సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డెత్ ప్రాక్టీస్ సీన్ నవ్విస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ ఆ ఆసక్తిని సినిమా ఎండింగ్ వరకు కొనసాగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సెకండాఫ్‌లో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓడ సీన్.. పలు ఇంటర్యూల్లో చిత్ర యూనిట్ చెప్పినట్లుగా మెస్మరైస్ చేయకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. మొత్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉన్న ప్రభాస్.. ఇలాంటి కథను ఒప్పుకొని, చేయడం నిజంగా ఓ ప్రయోగమే. కానీ అది అంతగా ఫలించలేదు. ఎవరెలా చేశారంటే.. పేరుమోసిన జోతిష్యుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. మాస్ ఇమేజ్‌ని ఉన్న ప్రభాస్.. ఈ సినిమాలో చాలా క్లాస్‌గా కనిపించాడు. ఇక డాక్టర్ ప్రేరణగా పూజా హెగ్డే మెప్పించింది. వీరిద్దరి జోడి తెరపై అందంగా కనిపించింది. విక్రమాదిత్య గురువు పరమహంస పాత్రంలో కృష్ణంరాజు ఆకట్టుకున్నాడు. హీరో తల్లిగా భాగ్యశ్రీ నటించింది. కానీ ఆమె పాత్రకు అంతగా స్క్రీన్ స్పెస్ లేదు. అలాగే హీరోయిన్ పెదనాన్నగా సచిల్ ఖేడ్కర్, ఓడ కెప్టెన్‌గా జయరాం, బిజినెస్ మ్యాన్‌గా జగపతిబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ప్రతి ఫ్రేమ్ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఓ కొత్త ప్రపంచాన్ని కళ్లముందు సృష్టించాడు.అలాగే కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. అవసరానికి మించి విఎఫ్ఎక్స్ ను ఉపయోగించుకోవడంతో ప్రతి ఫ్రేమ్ ఓ విజువల్ వండర్ గా మారిపోయింది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం(సౌత్ వర్షన్) ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. తమన్ నేపథ్య సంగీతం బాగుంది.కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘రాధేశ్యామ్’ మూవీ ట్విటర్ రివ్యూ
రాధేశ్యామ్.. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు ఆల్ ఇండియా మూవీ లవర్స్ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రమిది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపు నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7010 స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. 1st half - More than decent first half Pre-Interval to the last scene, movie went onto a whole different level 2nd half - 👌🏻 One more blockbuster for Prabhas, probably first time without any fights@idlebrainjeevi #RadheyShyam @UV_Creations @hegdepooja #Prabhas𓃵 @director_radhaa pic.twitter.com/CPqu5qI9a5 — Duggu Tej (@duggu_tej) March 10, 2022 సినిమాలో విజువల్స్ అదిరిపోయాయి. ప్రభాస్ లుక్స్, యాక్టింగ్ సరికొత్తగా ఉంది. తమన్ బీజీఎం ఔట్ స్టాండింగ్ అని అంటున్నారు. అలాగే ప్రభాస్ కెరీర్లో ఒక్క ఫైట్ సీన్ లేకుండా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. Decent - First Half Excellent- Second half Mind blowing twist and perfectly executed story 👌 Songs visuals are Top Notch #Prabhas Looks Outstanding and peaks Performance @MusicThaman Bgm outstanding Overall - 👌👌👌 Rating - 4/5 #RadheyShyam #RadheShyamFromTomorrow — PowerStar 🔥 (@powerstarpk007) March 10, 2022 ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లెంది. సినిమా సెకండాఫ్ ఎక్సలెంట్.ప్రభాస్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #RadheShyam #RadheyShyam #RadheShyamReview : ⭐⭐⭐🌟 1st half is artistic and visually splendid. The superficial second half is slow paced and convoluted. Interesting premise,soulful music, and extravaganza production. Superb BGM by #ThamanS @MusicThaman#Prabhas #Poojahegde pic.twitter.com/gU8H9GWVEt — OTTRelease (@ott_release) March 11, 2022 Decent - First Half Excellent- Second half Mind blowing twist and perfectly executed story 👌 Songs visuals are Top Notch #Prabhas Looks Outstanding and peaks Performance @MusicThaman Bgm outstanding Overall - 👌👌👌 Rating - 4/5 #RadheyShyam — 🐰 (@Edgarboy_) March 11, 2022 Good 1st half (With minor glitches)#Prabhas & @hegdepooja chemistry worked out well ❤️ 3 Songs are visually good... 😍 Interval point & shots literally elevated the film. Excited for 2nd Half 🤷🏼♂️#RadheShyam#RadheShyamReview — Rajesh Manne (@rajeshmanne1) March 11, 2022 Finished the show just now #RadheyShyam What a movie , mind blowing. Another milestone movie in the career of #RebelStar #Prabhas Anna. Unbelievable climax 🙏🏼#Blockbuster — DHFM_REAL (@DhfmReal) March 10, 2022 Decent - First Half Excellent- Second half Mind blowing twist and perfectly executed story 👌 Songs visuals are Top Notch #Prabhas Looks Outstanding and peaks Performance @MusicThaman Bgm outstanding Overall - 👌👌👌 Rating - 4/5 #RadheyShyam — 🐰 (@Edgarboy_) March 11, 2022 #RadheShyamReview 1st half ok for visuals 2nd half li8 Climax mehhh but good vfx — Nav🔔 (@maamaekpeglaa) March 11, 2022 -
`ఈటీ` మూవీ ట్విటర్ రివ్యూ
హీరో సూర్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన హీరోగా నటించిన `ఆకాశం నీ హద్దురా`, `జై భీమ్` ఘన విజయం సాధించాయి. అయితే ఈ రెండు చిత్రాలు కరోనా కారణంగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. దాదాపు మూడేళ్ల తర్వాత సూర్య థియేటర్‌కి వస్తున్న చిత్రం `ఈటీ`(ఎవరికి తలవంచడు). పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ గురువారం (మార్చి 10) ఈటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అవేంటో చూద్దాం. #ET First Half 🔥 Interval Fight MARANAMASS 💥💥💥💥 — Rocky Bhai (@RockybhaiOffcl) March 10, 2022 ఫస్టాఫ్ మాస్ జాతరే అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇక సెకండాఫ్ డీసెంట్‌గా సాగుతుందట. 2022లో ఫస్ట్ రియల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే అని పేర్కొంటున్నారు. అలాగే సినిమాలో మహిళలకు సంబంధించిన అంశాలు చాలా బాగున్నాయని, పర్ఫెక్ట్ ఉమెన్స్ డే గిఫ్ట్ అంటున్నారు. #EtharkkumThunindhavan [4.5/5] : @Suriya_offl scores big time.. Any emotions.. He is much needed as he could convincingly sends out a sensitive message. From humor to Mass, he has done enough to satisfy both fans and general audience#EtharkumThunindhavan #ET #ETReview #ETFDFS pic.twitter.com/6njWqWDgkK — Swayam Kumar (@SwayamD71945083) March 10, 2022 #EtharkkumThunindhavan Good first half with same old masala things ... Afterwards very poor writing and full of cringe material... Music is very worst.. totally disaster 😭😭😭😭@Suriya_offl #EtharkkumThuninthavan #ET — Tech பாட்டி... (@Kavin506) March 10, 2022 Half way through #EtharkkumThuninthavan Full on packed entertainment. Loving it !! Suriya in #ET 🔥 — Venkatramanan (@VenkatRamanan_) March 10, 2022 #ET Movie Review.... First Real Blockbuster movie in 2022 💥 Guarantee ah TN la mattum 100cr eduthudum 💥#EtharkkumThunindhavan @Suriya_offl pic.twitter.com/fIHuSkNVi8 — சசிCasio (@Sasicasio) March 10, 2022 #EtharkkumThunidhavan Never expected this from @pandiraj_dir ! Yes it is an emotional family entertainer with mass elements well woved in. Intro, Interval and Climax ...pucca 🔥🔥🔥 Well done @pandiraj_dir ⚔️#ET is feast for mass movie audiences. 4/5#ETReview #ETFDFS — Kerala Boxoffice Stats (Wear Double Mask) (@kboxstats) March 10, 2022 #EtharkkumThunindhavan #ET 2nd half - Into the climax but I would like to write it now . Stamp Mar 10th, 22 as #Suriya’s official comeback . After donkeys years (almost 10 hrs) his muvi wil b celebrated by every1 in theatres 🔥🔥🔥 Hartick blockbusters for @Suriya_offl https://t.co/TWECwXnosn — Zaro (@toto_motto) March 10, 2022 -
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆడవాళ్లు మీకు జోహార్లు నటీనటులు : శర్వానంద్, రష్మిక, ఖుష్భూ, రాధిక, ఊర్వసి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నిర్మాణ సంస్థ :శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: ధాకర్ చెరుకూరి దర్శకత్వం : శోర్ తిరుమల సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ విడుదల తేది : మార్చి 04, 2022 యంగ్ హీరో శర్వానంద్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ‘మహానుభావుడు’ తర్వాత ఆయనకు మరలా సక్సెస్ దక్కలేదు. ఇటీవల ఆయన తీసిన ‘శ్రీకారం’, ‘మహాసముంద్రం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలనే కసితో ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎంచుకున్నాడు.రష్మిక మందన్నతో కలిసి కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను క్యూరియాసిటీని పెంచేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(మార్చి 4)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన చిరంజీవి అలియాస్ చిరుకి(శర్వానంద్)ఏజ్ బార్ అయినా.. ఇంకా పెళ్లి కాదు. తనతో పాటు తన కుటుంబం మొత్తానికి నచ్చే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన లక్ష్యం. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి చూపులకు వెళ్లి వచ్చిన ప్రతి అమ్మాయిని ఏదో ఒక వంక చెప్పి రిజెక్ట్ చేస్తారు. దీంతో తన జీవితంలో ఇక ‘మాంగళ్యం తంతునానేనా ’అనే మంత్రాన్ని ఉచ్చరించనేమోనని బాధపడుతున్న క్రమంలో ఆద్య(రష్మిక) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆద్యకు కూడా చిరుపై ప్రేమ ఉన్నప్పటికీ.. అతని ప్రపోజ్‌ని రిజెక్ట్ చేస్తుంది. దానికి కారణం తన తల్లి వకుళ(కుష్బూ)కు పెళ్లి అంటే నచ్చకపోవడం. వకుళను ఒప్పిస్తేనే ఆద్య తనకు దక్కుతుందని భావించిన చిరు.. ఓ చిన్న అబద్దం చెప్పి ఆమెకు దగ్గరవుతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు వకుళకు పెళ్లి అంటే ఎందుకు నచ్చదు? ఆమె నేపథ్యం ఏంటి? చివరకు చిరు, ఆద్యలు ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. ఉమ్మడి కుటుంబంలో పెట్టి పెరిగిన యువకుడు చిరంజీవిగా శర్వానంద్ ఆకట్టుకున్నాడు. వధువు కోసం అన్వేషించి, విసిగిపోయిన ఏజ్ బార్ బ్యాచిలర్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆద్య పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది. హీరో తల్లి ఆదిలక్ష్మీగా రాధిక పర్వాలేదనిపించింది. పద్మమ్మగా ఊర్వశి తనదైన కామెడీతో నవ్వులు పూయించింది. ఇక హీరోయిన్ తల్లి వకుళ పాత్రకు ఖుష్భూ న్యాయం చేసింది. సినిమాలో చాలా బలమైన పాత్ర తనది. హీరో స్నేహితుడిగా వెన్నెల కిశోర్ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్‌తో నవ్వించాడు. పెళ్లి కూతురు తండ్రి బుజ్జిగా బ్రహ్మానందం తళుక్కున మెరిసి వెళ్లాడు. మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. రాధిక, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్ నటీమణులు, శర్వానంద్ లాంటి టాలెంటెడ్ హీరో, రష్మిక లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్.. వీళ్లంతా కలిసి నటించిన చిత్రం కావడంతో తొలి నుంచి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఇటీవల కాలంలో టాలీవుడ్లో ఫ్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రాకపోవడంతో... ఈ సినిమా కచ్చితంగా ఆ లోటుని తిరుస్తుందని భావించారు అంతా. కానీ ప్రేక్షకుల అంచనాలు కొంతమేర తప్పాయి. సినిమాలో కొత్తదనం కొరవడింది. రోటీన్ స్టోరీకి కామెడి, ఎమోషన్స్‌ని జోడించి ‘ఆడవాళ్లు జోహార్లు’సినిమాను తెరకెక్కించాడు కిశోర్ తిరుమల. చెప్పుకోవడానికి పెద్ద పేరున్న నటీ,నటులను తీసుకున్నాడు తప్పా.. వారి పాత్రలకు తగిన ప్రాధాన్యత మాత్రం సినిమాలో లేదు. ఉన్నంతలో ఖుష్బు పాత్ర పర్వాలేదు. గత సినిమాలే మాదిరే సున్నితమైన హాస్యభరితమైన సన్నివేశాలతో ఫస్టాఫ్ అంతా కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. పెళ్లి కోసం హీరో పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కూడా నవ్వులు పూయిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీని వెనక్కినెట్టి.. ఎమోషన్స్‌ని ముందుకు తీసుకోచ్చాడు దర్శకుడు. అయితే అది వర్కౌట్ కాలేదు. పాత సినిమాలే మాదిరే.. హీరోయిన్ ప్యామిలీని ఒప్పించడానికి హీరో.. హీరోయిన్ ఇంటికి వెళ్లడం, క్లైమాక్స్‌లో నిజం తెలిసి పోవడం, చివరకు వారి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడం.. ఇలానే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’మూవీ సాగుతుంది. సెకండాఫ్‌లో ప్రతి చోట.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ‘నేను శైలజ’ ఛాయలు కనిపిస్తాయి. ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగుతుంది. అలా అని పూర్తిగా బోర్ కొట్టించే చిత్రం అయితే కాదు. కానీ కొత్తదనం మాత్రం ఆశించొద్దు. ఊర్వశితో వచ్చే ‘టిఫిన్ బాక్స్’జోక్ అయితే థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కిశోర్ తిరుమల డైలాగ్స్ ఆకట్టుకోవడమే కాదు.. ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇక సాంకెతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. చక్కటి నేపథ్య సంగీతం అందించాడు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్విటర్ రివ్యూ
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నేడు(మార్చి 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. దానికి తోడు ఈ మూవీలో ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి లాంటి సీనియర్ నటీమణులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండడంతో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’పై భారీ అంచనాలు పెరిగాయి. ఇక పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూద్దాం. Decent First half 👍🏼 Decent family entertainer so far, with laughs throughout Dsp music blends with the mv #AadavalluMeekuJohaarlu — Manoj Rahul (@DHFM_endlessly) March 3, 2022 మొత్తంగా ఈ సినిమాకు నెటిజన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంతమంది బాగుంది అని చెబుతుంటే.. మరికొంతమంది ప్లాప్ మూవీ అంటున్నారు. సినిమాలో ఎలాంటి కొత్త ఎలిమెంట్స్ లేవని చెబుతున్నారు. రొటీన్ కథకు కామెడీ, రొమాన్స్ అందించి తెరకెక్కించారని చెబుతున్నారు. అయితే వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు కలిసొచ్చిందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాప్ యావరేజ్ అని చెబుతున్నారు. ఓవరాల్‌గా గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కామెంట్ చేస్తున్నారు. #AadavalluMeekuJohaarlu A Typical Family Entertainer that ends up as an ok watch! Nothing new and boring in parts but dialogues have worked for the most part. Better music would’ve made a big difference. The comedy had a lot of scope but only worked few times Rating: 2.5/5 — Venky Reviews (@venkyreviews) March 3, 2022 Ilanti movies aapesei bro RAPO laaga track marchu @ImSharwanand You are such a fine actor#AadavalluMeekuJohaarlu Rey Thirumala #NenuSailaja ne thippi thippi malli teesav kada ra 🙏 One of the sodhest movie @vennelakishore lekapothe madyalonche vellevadni thank you anna https://t.co/Z2vT1reo64 — Gopi (@_GTweets_) March 4, 2022 #AadavalluMeekuJohaarlu Movie good family entertainer ..hit movie . — JMB (@EmiratesBabu) March 4, 2022 2.75/5 Better ending vuntey baagundedhi One time watchable family entertainer after long time #AadavalluMeekuJohaarlu — Manoj Rahul (@DHFM_endlessly) March 3, 2022 #AadavalluMeekuJohaarlu Review First Half: Routine story presented in an feel good and entertaining way, the family drama sentiments are effective. Direction works 👍#Sharwanand #RashmikaMandanna chemistry 👍 All the female leads are entertaining 👍#AMJNowInTheatres#AMJ pic.twitter.com/kbebaYxANw — Swayam Kumar (@SwayamD71945083) March 3, 2022 #AdavalluMeekuJoharlu truly average family drama Avg 1st half Below Avg 2nd half Good Production values 2.25/5 ( not suggesting ) 👎 — InsidetalkZ (@InsideTallkz) March 4, 2022 -
‘భీమ్లా నాయక్’మూవీ రివ్యూ
టైటిల్ : భీమ్లా నాయక్ నటీనటులు : పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్,సంయుక్త మీనన్, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ : సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం :సాగర్ కె చంద్ర సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : రవి కె. చంద్రన్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది : ఫిబ్రవరి 25, 2022 ‘వకీల్ సాబ్’ మూవీ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మరో కీలక పాత్రలో యంగ్ హీరో రానా నటించారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కొషియుమ్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం. భీమ్లా నాయక్ కథేంటంటే..? భీమ్లా నాయక్(పవన్ కల్యాణ్).. కర్నూలు జిలా హఠకేశ్వర్ మండలం పోలీస్టేషన్లో నిజాయితిపరుడైన ఎస్సై. డేనియల్ శేఖర్ ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతని తండ్రి(సముద్ర ఖని) వరంగల్ మాజీ ఎంపీ. రాజకీయ పలుకుబడి ఉన్న డేనియల్ శేఖర్ ఓ రోజు రాత్రి పీకల దాకా తాగి, అడవి గుండా వెళ్తూ మద్యం బాటిళ్లతో పోలీసులకు చిక్కుతాడు. ఈ సందర్భంగా డేనియల్‌కు, పోలీసుకు వాగ్వాదం జరుగుంది. పోలీసులపై దాడి చేసిన డేనియల్ను అక్కడే విధులు నిర్వహిస్తున్న భీమ్లా నాయక్ అరెస్ట్ చేస్తాడు. దీంతో డేనియల్ అహం దెబ్బతింటుంది. తనను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్‌ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని భావిస్తాడు. ఆయన చేసిన కుట్రలో భాగంగా భీమ్లా నాయక్ ఉద్యోగం పోతుంది. అంతేకాదు అతని భార్య సుగుణ(నిత్యా మీనన్) కూడా అరెస్ట్ కావాల్సి వస్తోంది. అసలు భీమ్లా నాయక్ ఉద్యోగం ఎందుకు పోయింది? తన ప్రతీకారం తీర్చుకునే క్రమంలో డేనియల్ శేఖర్ ఎలాంటి తప్పులు చేశాడు? సస్పెండ్ అయిన తర్వాత భీమ్లా నాయక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అహంకారి అయిన మాజీ సైనికాధికారికి, ఆత్మ గౌరవం ఉన్న పోలీసు అధికారికి మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? భీమ్లా నాయక్ నుంచి డేనియల్ శేఖర్ని ఆయన భార్య (సంయుక్త మీనన్)ఎలా రక్షించుకుంది? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? నిజాయితీపరుడైన ఎస్సై భీమ్లా నాయక్ పాత్రలో పవన్ ఒదిగిపోయాడు. ఇక బాగా పొగరు ఉన్న రాజకీయ నేత, రిటైర్డ్ ఆర్మీ అధికారి డేనియల్ శేఖర్‌గా రానా అద్భుత నటనను కనబరిచాడు. రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తి ఏవిధంగా అయితే యాటిట్యూడ్ చూపిస్తాడో.. అచ్చం అలానే రానా తెరపై కనిపించాడు. ఈగో దెబ్బతింటే.. ఎంతకైనా తెగించే పాత్ర తనది. ప్రతి సీన్లో పవన్ కల్యాణ్‌తో పోటాపోటీగా నటించాడు. ఇక భీమ్లా నాయక్ భార్య సుగుణ పాత్రలో నిత్యా మీనన్ పరకాయ ప్రవేశం చేసింది. మాతృకతో పోలిస్తే.. ఇందులో సుగుణ పాత్రకు స్క్రీన్ స్పెస్ ఎక్కువ. అంతేకాదు కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఆమె పాత్రకు అతికించారు. డేనియల్ శేకర్ భార్యగా సంయుక్త మీనన్ పర్వాలేదనిపించింది. సీఐ కోదండరాంగా మురళీ శర్మ, బార్ ఓనర్ నాగరాజుగా రావు రమేశ్, డేనియల్ శేఖర్ తండ్రి, మాజీ ఎంపీగా సముద్ర ఖని తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్ మూవీయే ‘భీమ్లా నాయక్’. ఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బ తింటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేదే ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’మూవీ స్టోరీ. ఇదే కథను తీసుకొని, కొన్ని మార్పులు చేసి ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే వాటిలో కొన్ని సినిమాకు అనుకూలంగా మారగా, కొన్ని ప్రతికూలంగా మారాయి. ముఖ్యంగా కొన్ని యాక్షన్స్ సీన్స్ అయితే అతిగా అనిపిస్తాయి. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ప్లాష్ బ్యాక్ స్టోరీ అతికించినట్లుగా అనిపిస్తుంది. మాతృకలో మాదిరే పవన్, రానా పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు.. వారి నేపథ్యాన్ని మాత్రం మరింత బలంగా చూపించారు. తండాకు సంబంధించిన సీన్స్, హీరో ప్లాష్‌బ్యాక్ సీన్స్..మాతృకలో ఉండవు. రావు రమేశ్ కామెడీ పంచులు, నిత్యామీనన్ సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్ అంతా ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. భీమ్లా నాయక్ సస్పెండ్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో ఓరిజినల్ కథలో చాలా మార్పులు చేశారు. పవన్, రానాల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఇరువురి మధ్య వచ్చే డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. అదేసమయంలో కొన్ని యాక్షన్ సీన్స్‌లో డోస్ ఎక్కువైందనే ఫీలింగ్ కలుగుతోంది. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్ అయితే కాస్త సిల్లీగా అనిపించినా.. ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫి బాగుంది. అడవి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘భీమ్లా నాయక్’ ట్విటర్ రివ్యూ
Bheemla Nayak Movie Twitter Review: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గబాటి హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమ్లా నాయక్’.మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేశారు. మాతృకతో పోలిస్తే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇమేజ్‌కి తగినట్లుగా చాలా మార్పులు చేశారు. అహంకారి అయిన సైనికాధికారికి, ఆత్మ గౌరవం ఉన్న పోలీసు అధికారికి మధ్య జరిగిన స్టోరీనే ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు,పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఫిబ్రవరి 25)‘భీమ్లా నాయక్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.‘భీమ్లా నాయక్ ’కథేంటి? పవన్, రానా నటన ఎలా ఉంది? ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది...తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూద్దాం. One word Review of #BheemlaNayak Trivikram + Teddy 🔥🔥🔥 Ah Dialogues uu ah BGM uuu ..... !! Mana Powerstar ki HIT vachindhi royi — SVP🔔 (@Uuudhay1882) February 25, 2022 ‘భీమ్లా నాయక్’గా పవన్ నటన బాగుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే బాగుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుందని కామెంట్ చేస్తున్నారు. క్లైమాక్స్ అంతగా బాలేదని కొంతమంది కామెంట్ చేస్తుండగా, చివరి 30 నిమిషాలు అదిరిపోయిందని చెబుతున్నారు. First half over ,Mark my words guys, No one can such high like Pawan. So far the best of Pawan . #BheemlaNaayak #BheemlaNayakMania Fan in you never allow you to sit. Every scene is excellent. @MusicThaman Thanks for the music . 🔥 — krishna chandaka (@kmnaidu) February 25, 2022 #OneWordReview#BheemlaNayak “ఎంటర్టైనర్” ఇది పూర్తి ఎంటర్టైనర్ ప్యాకేజీ, లేదా మీరు చెప్పగలరు, పూర్తి #PawanKalyan షో. వెళ్లి ఆనందించండి 3.5 ⭐ /5 — MB or AA CULTS🔔 (@SVP61633780) February 25, 2022 Blockbuster report from all over world wide ilanti talk vini enni years ayindo 💥💥💥#BheemlaNayakMania — Thirupal (@ThalariThirupal) February 24, 2022 #BheemlaNayak 1st half was ok but 2 awaited songs were spoiled 2nd half a changed flashback works in favor to movie but climax twist spoils Essense of egotistical characteristics in PK missing. But Rana brought it out good Screenplay is good by Trivi. Bgm is ok @MusicThaman — Anna Yaaru 🐯🌊 (@EV9999_Tarak) February 25, 2022 Completed 1st half Good 1st half. Bgm 🥵🔥 Songs🔥 Dailogues🔥🥵🥵🥵#BheemlaNayakEuphoria #BheemlaNayak pic.twitter.com/s07pwvVUwW — Yash SP (@SPYaswanth) February 25, 2022 #BheemlaNayakReview 🔥 pure mass stuff 🤟 bomma blockbuster roii💯 Final verdict - PANDAGA mundhe ochesindi🙌 #BheemlaNayakOn25thFeb #BheemlaNayakMania #BheemlaNayakOnFeb25th pic.twitter.com/xEoalKEtwg — Nani Naanna (@naanna_nani) February 25, 2022 #BheemlaNayak Good first half Lala song and BGM @MusicThaman 👌👌👌 @RanaDaggubati attitude Alladinchav bro PK fans ki feast title song Picturization bale — KiRRRan Sai NTRRR (@kiransai413) February 25, 2022 Hard core fans eee cinema ni digest chesukoleka potunaru ….below average 🎥but Rana did well #BheemlaNayak pic.twitter.com/LTOF88XAlA — Vinay-Balayya -Tarak 🥁 (@VinayKu54989477) February 25, 2022 -
‘వలిమై’మూవీ రివ్యూ
టైటిల్ :వలిమై నటీనటులు :అజిత్, కార్తికేయ, హ్యూమా ఖురేషీ తదితరులు నిర్మాణ సంస్థలు : బే వ్యూ ప్రాజెక్ట్స్, జి.స్టూడియోస్ నిర్మాత: బోనీ కపూర్ దర్శకత్వం :హెచ్.వినోద్ సంగీతం : యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ :నీరవ్ షా విడుదల తేది : ఫిబ్రవరి 24, 2022 దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి.తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కాకపోవడంతో ‘వలిమై’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ గురువారం(ఫిబ్రవరి 24)ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘వలిమై’కథేటంటే వైజాగ్ కేంద్రంగా ‘సైతాన్ స్లేవ్స్’పైరుతో నేర సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు నరేన్(కార్తికేయ). ఆన్లైన్ వేదికగా జరిగే ఈ చట్ట విరుద్ద కార్యక్రమానికి నిరుద్యోగ యువతనే టార్గెట్‌గా చేసుకుంటాడు. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేసి, చైన్ స్నాచింగ్, హత్యలు వంటి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటాడు. టెక్నాలజీని ఉపయోగించి పోలీసుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడతాడు. వైజాగ్‌లో రోజు రోజుకి బైక్ రేసర్ల దొంగతనాలు, హత్యలు పెరిగిపోవడంతో.. వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగుతాడు అసిస్టెంట్ కమిషనర్ అర్జున్(అజిత్). ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? నేరస్తులను పట్టుకునే క్రమంలో అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతని ఫ్యామిలీని టార్గెట్ చేసిన నరేన్‌కు అర్జున్ ఎలా బుద్ది చెప్పాడు? చివరకు ఆన్లైన్ వేదిక ‘సైతాన్ స్లేవ్స్’ని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే ఏసీపీ అర్జున్ పాత్రలో అజిత్ ఒదిగిపోయాడు.స్వతగా అజిత్ మంచి బైక్ రేసర్ కావడంతో యాక్షన్స్ సీన్స్‌లో అద్భుతంగా నటించగలిగాడు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్‌లో అజిత్ అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రంతో కోలివుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. విలన్‌గా మెప్పించాడు. యాక్షన్స్ సీన్స్‌లో అజిత్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెడ్ సోఫియా పాత్రలో హ్యుమా ఖురేషి జీవించేసింది. సినిమాలో తనది కీలక పాత్ర అనే చెప్పాలి. ఇక ఏసీపీ అర్జున్ తమ్ముడు బుజ్జిగా రాజ్ అయ్యప్ప తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... వలిమై పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం. డ్రగ్స్ సరఫరా, చైన్ స్నాచింగ్, హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ సాగుతోంది. ఆన్లైన్ వేదికగా నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ని, ఆ గ్యాంగ్ లీడర్ని పోలీసులు ఎలా అంతం చేశారనేదే ఈ సినిమా కథ. రోటీన్ కథనే ఎంచుకున్న దర్శకుడు వినోద్.. అజిత్‌కి తగ్గట్లుగా భారీ యాక్షన్ సీన్స్‌ని, బైక్ రేసింగ్ నేపథ్యాన్ని తీసుకొని సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం అజిత్, కార్తికేయ మధ్య వచ్చే బైక్ ఛేజ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలే. యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే సినిమాలో కొత్తదనం లేకపోవడం, నిడివి ఎక్కువ ఉండడం మైనస్. సినిమా మొత్తం చేసింగ్ సీన్లే ఉంటాయి. మధ్య మధ్యలో మదర్ సెంటిమెంట్ చొప్పించే ప్రయత్నం చేసినా.. అది వర్కౌట్ కాలేదు. అంతేకాదు ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఉన్నంతలో ఫస్టాఫ్ అంతో ఇంతో మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ బోరింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా పాత సినిమాల మాదిరి ఉంటుంది. ఓ ఫ్యాక్టరీలో హీరో ఫ్యామిలీని విలన్ బంధించి ఉంచడం.. హీరో వచ్చి ఫైట్ చేసి వారిని విడిపించడం.. ఇలాంటి క్లైమాక్స్ సీన్స్ గతంలో చాలా సినిమాల్లో వచ్చాయి. ఎడిటింగ్ బాలేదు. పాటలు, నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'పుష్ప' ధనుంజయ్ 'బడవ రాస్కెల్' ఎలా ఉందంటే?
టైటిల్: బడవ రాస్కెల్ నటీనటులు: ధనుంజయ్, అమృత అయ్యంగార్, నాగభూషణ్, రంగాయణ రఘు, స్పర్శ రేఖ తదితరులు దర్శకుడు : శంకర్ గురు నిర్మాత : సావిత్రమ్మ ,అడవి స్వామి సహనిర్మాత : ఖుషి బ్యానర్ : రిజ్వాన ఎంటర్టైన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమణారెడ్డి ఎస్, దేవన్ గౌడ సంగీతం: వాసుకి వైభవ్ డిఓపి : ప్రీత జయరామన్ ఎడిటర్ : నిరంజన్ దేవరామనే లిరిక్స్ అండ్ డైలాగ్స్ : రామ్ వంశీకృష్ణ విడుదల తేదీ: ఫిబ్రవరి 18 'పుష్ప` సినిమాలో జాలిరెడ్డి పాత్రలో నటించి మెప్పించాడు నటుడు ధనుంజయ్. కన్నడలో హీరోగా రాణిస్తున్న ఆయన నటించిన తాజా చిత్రం `బడవ రాస్కెల్`. శంకర్ గురు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడలో నటించి నిర్మించాడు ధనుంజయ్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈనెల 18న విడుదలైన బడవ రాస్కెల్ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చదివేయండి.. కథ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శంకర్(ధనుంజయ్) ఆటో డ్రైవర్ రంగనాథ్ (రంగాయణ రఘు) కొడుకు. ఎంబీఏ చదివినప్పటికీ తండ్రికి సాయంగా ఉండాలని ఆటో నడుపుతుంటాడు. ఈ క్రమంలో హీరో ఒక సంపన్న రాజకీయ నాయకురాయాలి కుమార్తె సంగీత (అమృత అయ్యంగార్)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకుంటారు. మీ అమ్మ నాన్నలతో వచ్చి మన పెళ్లి విషయం మా పేరెంట్స్‌తో మాట్లాడమని చెప్తుంది హీరోయిన్. సరేనని శంకర్ తన తల్లిదండ్రులతో వారి ఇంటికి వెళతాడు. ఆ సమయంలో అక్కడ జరిగిన సంఘటన ఇద్దరి జీవితాన్ని మలుపు తిప్పుతుంది, ఆ సంఘటన తర్వాత వాళ్లు దూరం అవుతారు. ఇంతలో హీరో కిడ్నాప్ అవుతాడు. అసలు హీరోహీరోయిన్లు ఎందుకు విడిపోయారు? శంకర్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు? వీళ్ల ప్రేమకథకు శుభంకార్డు పడిందా? లేదా? అంటే బడవ రాస్కెల్ చూడాల్సిందే! విశ్లేషణ బడవ రాస్కెల్ ఒక మామూలు ప్రేమకథ, ఇందులో కొత్త పాయింట్ అంటూ పెద్దగా ఏమీ కనిపించదు. కాకపోతే దర్శకుడు ప్రధానంగా ఫ్యామిలీ సెంటిమెంట్ మీద ఫోకస్ పెట్టాడు. తల్లీ కొడుకు, తండ్రీకొడుకుల అనుబంధాన్ని చాలా బాగా చూపించడంలో సఫలమయ్యాడు. కానీ ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి సెకండాఫ్ మీద కూడా చూపిస్తే బాగుండేది. ఫస్టాఫ్ పరుగులు పెట్టినా సెకండాఫ్ మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా పెద్దగా ట్విస్టులు లేకుండా ఊహించినట్లే ఉంటుంది. స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని తెలుస్తోంది. నటీనటుల పనితీరు మధ్య తరగతి యువకుడు శంకర్‌గా ధనుంజయ్ పాత్రలో లీనమయ్యాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. సంగీతగా హీరోయిన్ అమృత అయ్యంగార్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. శంకర్‌కు స్నేహితుడిగా నటించిన నాగభూషణ్ మంచి కామెడీ పండిస్తూ అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరో తల్లిదండ్రులుగా రంగాయణ రఘు, తారలు మెప్పించారు. హీరోయిన్ తల్లిగా స్పర్ష రేఖ నెగెటివ్ షేడ్స్‌తో అలరించింది. సాంకేతిక నిపుణుల పనితీరు డైరెక్టర్ శంకర్ గురు మధ్యతరగతి విలువలను తెరపై చక్కగా చూపించాడు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా సన్నివేశాలను రూపొందించాడు. కానీ కథ, కథనం విషయంలో కొంత తడబడ్డట్లు కనిపించింది. వాసుకి వైభవ్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. ప్రీతం జయరామన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మీద మరికొంత కసరత్తు చేసుంటే బాగుండేది. -
డీజే టిల్లు ట్విటర్ రివ్యూ: ప్లస్, మైనస్‌లు ఇవే!
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీజే టిల్లు’. దర్శకుడు కథ రాస్తే సిద్ధు డైలాగ్స్ రాశాడు. స్క్రిప్టు విషయంలో సలహాలిచ్చిన త్రివిక్రమ్ ఈ సినిమా హిట్ అవుతుందని ముందే జోస్యం పలికాడు. ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శనివారం (ఫిబ్రవరి 12న) విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉందన్నదానిపై సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి డీజే టిల్లు బాక్సాఫీస్‌లో సౌండ్ మోగిస్తున్నాడా? లేదా? అనేది నెటిజన్ల మాటల్లోనే చూద్దాం.. Kick ass first 1Hr & youthful hilarious entertainer #DjTillu 👌👌 , heroine is 🔥🔥🔥🔥 Hero 🥁🤩👏🎉 https://t.co/xQBBmMIqb5 — Lin (@HereForNothing_) February 11, 2022 ఫస్టాఫ్ అదిరిపోయిందంటున్నారు మెజారిటీ నెటిజన్లు. ఎంటర్టైన్మెంట్ పీక్స్‌లో ఉందని, హీరోహీరోయిన్లు అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాకపోతే సెకండాఫ్‌పై మాత్రం నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి రెండో భాగం మీద కూడా పెట్టాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే ఇంకో లెవల్లో ఉండేదని చెప్తున్నారు. Hilarious first half..rod second half #DJTillu — Ravi (@ravi_t_21) February 12, 2022 సినిమాను వన్‌మ్యాన్ షోలా నడిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. తెలంగాణ యాసతో, పంచ్ డైలాగులతో యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది సిద్ధు పాత్ర. ఇకపోతే సిద్ధు ఎనర్జీకి పోటీపడి నటించింది నేహా శెట్టి. ఈ సినిమాలో ఆమె నటకు మంచి మార్కులే పడ్డాయి. #DJTillu An Enjoyable Youthful Comedy Entertainer@Siddu_buoy as is outstanding and the character is written well. The dialogues are hilarious. The BGM by @MusicThaman elevates perfectly Flipside, 2nd half could use some editing and pace is an issue in latter part Rating: 3/5 — Venky Reviews (@venkyreviews) February 11, 2022 కొద్ది మంది మాత్రం ఔట్ డేటెడ్ కామెడీ అని, టికెట్ డబ్బులు కూడా వృథానే అంటున్నారు. అయితే చాలాచోట్ల అడ్వాన్స్ బుకింగ్స్, పాజిటివ్ టాక్‌తో పర్వాలేదనిపిస్తోందీ మూవీ. ఇక సినిమా రిలీజ్ కాకముందే డీజే టిల్లు హిట్ అయితే సీక్వెల్ చేస్తామని ప్రకటించేసింది చిత్రయూనిట్. ప్రస్తుతానికైతే మిశ్రమ స్పందన అందుకుంటోంది సినిమా. మొత్తానికి పాజిటివ్ ఎనర్జీతో బరిలోకి దిగిన డీజే టిల్లును ఫన్ కోసం చూడొచ్చని తెలుస్తోంది. #DJTillu USA Premieres on pace to touch nearly $100K 🇺🇸 Major centers adding extra night shows. DJ Tillu Mass starts in the US! https://t.co/aT9oud1dV7 pic.twitter.com/ndH6cGGhuY — Venky Reviews (@venkyreviews) February 12, 2022 #DJTillu Outdated comedy 😴😴 Second half is not even worhty for your ticket Dont take risk completely avoidable movie 😩😩 Should have waited for reviews for this kind of movies 🙏🙏 — Sai Meghana (@Meghanaind) February 12, 2022 #DJTillu Dont know from where the hype came....Booked tickets because of frnds and trailer..😭😭 Not even watchable...Silly cringe comedy and outdated and walkout second half 🙏🙏 Should have waited for #Radheshyam and #RRR 🙏🙏 My rating 0.5/5 Strictly avoid it 🙏 — Sunil (@Sunilkingkohli) February 12, 2022 Ichipadesadu 🔥.. done with Premiers #DJTillu .. Go watch it in theatre’s and enjoy comedy and one liners 🕺🏻#DjTillu >>>>>> #khiladi — Trade_Sky (@avinashreddy5) February 12, 2022 Best Friday entertainer #DJTillu @SitharaEnts @Siddu_buoy @iamnehashetty throughly enjoyed the film till the end and best dialogues with more humor.. — ray (@ray_challa) February 12, 2022 #DJTillu First Half Good 👍 Second half bad 👎 Its Only 2 Hours Film - OTT Film 👍#MoviesFolks 🎬 — MoviesFolks (@MoviesFolks) February 12, 2022 #DJTillu Review Tube light is the worst movie i have ever seen .. Now Dj Tillu joins and infact the worst movie i have ever seen... That second half is unbearable...Srtictly avoid it for your time and money 🙏👍 Rating 0.25/5 — Thala (@FinisherDhoni7) February 12, 2022 #DJTillu audience ni killuuuu Strictly avoided — β@$♄a@βⓂD (@basha_bmd) February 12, 2022 #DJTillu A Youth Engaging comedy Movie.🤗 Movie was made with a notice of full entertainment and it somehow did it. Good first half with superb characterisation of Djtillu @Siddu_buoy Bad second half due to lack of flow and edit issues. Overall OK watchable movie👍 Rating: 3/5⭐ — AAshrith 🛑 (@_Aashrith_) February 12, 2022 #DjTillu Senseless film at its best Avoid for your best 🙏🙏 Outdated comedy and cringe scenes...Not worth for your ticket 👍👍 Day wasted for this rod film😭😴 Rating 0.25/5 — Krishh (@Urkrishh) February 12, 2022 -
‘ఖిలాడి’ మూవీ రివ్యూ
సినిమా: ఖిలాడి నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, యాక్షన్ కింగ్ అర్జున్, అనసూయ భరద్వాజ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ముకుందన్, ముఖేశ్ రుషి తదితరులు సింగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు దర్శకత్వం: రమేశ్ వర్మ నిర్మాత: కోనేరు సత్యనారాయణ విడుదల తేదీ: 11.02.2022 Khiladi Movie Review: కరోనా థర్డ్‌వేవ్ కారణంగా బాక్సీఫీసు వద్ద కొత్త సినిమాల సందడి పెద్దగా కనిపించడం లేదు. సంక్రాంతికి రావాల్సిన పాన్ ఇండియా, పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిన్న సినిమాలతోనే ప్రేక్షకుల సరిపెట్టుకున్నారు. అవి కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక కరోనా ఉధృతి తగ్గడంతో పెద్ద సినిమా హవా షూరు అయ్యింది. ఈ క్రమంలో వరసగా సినిమా రిలీజ్ డేట్స్ వస్తున్న క్రమంలో మంచి ‘కిక్’ ఇచ్చేందుకు ముందుగా వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. రమేశ్ వర్మ దర్శకత్వలో ఆయన నటించిన తాజా చిత్రం ఖిలాడి ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ సినిమా అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్, మాస్, కామెడీకి ఏమాత్రం లోటు ఉండదు. పైగా ఈ సారి కొత్త హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. రవితేజ సినిమా కావడం, ఇద్దరు యంగ్ కథానాయికలు నటిస్తున్నారనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే వచ్చిన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరి నేడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా? రవితేజ ఖాతాలో మరో విజయం ఖాయమైనట్లేనా? అసలు కథేంటి చూద్దాం రండి! కథేంటంటే: ‘ఖిలాడి’లో రవితేజ పాత్ర పేరు మోహన్ గాంధీ. ఓ అంతర్జాతీయ క్రిమినల్‌గా కనిపిస్తాడు. అయితే తన కుటుంబాన్ని హత్య చేసిన కేసులో మెహన్ గాంధీ(రవితేజ) జైలు శిక్ష అనభవిస్తుంటాడు. ఈ క్రమంలో పూజాను(మీనాక్షి చౌదరి) కలుస్తాడు. పూజా ఇంటెలిజెన్స్ ఐజీ జయరామ్(సచిన్ ఖేడ్కర్) కుమార్తె. క్రిమినల్ సైకాలజీ చదువుతుంది. క్రిమినల్స్ సైకాలజీని తెలుసుకునే థీసెస్ అనే ప్రాజెక్ట్‌లో భాగంగా పూజా, మెహన్ గాంధీని కలుస్తుంది. అతను జైలుకు ఎలా వచ్చాడు, చేసిన నేరమంటనేది ఆరా తీస్తుంది. దీంతో పూజకు ఓ కట్టుకథ చెప్పి ఆమె ద్వారా జైలు నుంచి బయట పడాలనుకుంటాడు మోహన్ గాంధీ. అతడి కథ విన్న పూజా చలించి అతడికి సాయం చేయాలనుకుంటుంది. దీంతో తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరి అతడు బయటకు రావడానికి రిస్క్ తీసుకుంటుంది. గాంధీ బయటకు వచ్చే సయమంలోనే పూజా ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. మోహన్ గాంధీ అంతర్జాతీయ క్రిమినల్ అని, హోంమంత్రి చెందిన 10 వేల కోట్ల రూపాయల డబ్బును కొట్టేయానికి ఇటలీ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలుసుకుని షాక్ అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడిది? దానిని రవితేజ ఎందుకు కొట్టేయాలనుకున్నాడు? ఆ డబ్బు కొట్టేయానికి రవితేజ ఎలాంటి పన్నాగాలు పన్నాడు అనే దాని చుట్టే కథ నడుస్తుంది. సినిమా ఎలా సాగిందంటే.. ఈ సినిమాలో మాస్ మహారాజా మార్క్‌ను మరోసారి చూపించాడు రవితేజ. ఆయన ఎనర్జీ, మితిమిరిన తెలివితెటలు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో మోహన్ గాంధీగా రవితేజ షెడ్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఓ తెలివైన దొంగ 10 వేల కోట్ల రాబరికి టార్గెట్ పెడితే ఎలా ఉంటుంది, అది ఓ బడా రాజకీయ నాయకుడి వద్ద.. ఆ దొంగను పట్టుకునేందుకు సీబీఐ చేజింగ్‌లు, రన్నింగ్‌తో దర్శకుడు ఫుల్ యాక్షన్, థ్రీల్లర్ సినిమా చూపించాడు. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌లో రవితేజ నటన, ఎనర్జీ నెక్ట్ లెవల్ అని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉంటే భార్య(డింపుల్ హయాతి), అత్త(అనసూయ), మామలను హత్య చేసిన నేరగాడిగా రవితేజను పరిచయం చేసిన తీరు చాలా ఆసక్తిగా ఉంటుంది. మీనాక్షి చౌదరి, రవితేజ కథను వివరించిన తీరు థ్రిల్లింగ్‌గా ఉన్నా.. అక్కడ చూపించిన స్టోరీ రోటిన్ ఫ్యామిలీ డ్రామాగా అనిపిస్తుంది. ఇక రవితేజ బయటకు వచ్చాకా అసలు కథ స్టార్ట్ అవుతుంది. విరామం వరకు మోహన్ గాంధీ పాత్ర అసలు బయటకు రాకపోవడం, సెకండ్ పార్ట్‌లో రివిల్ చేయడంలో థ్రిల్ అవుతారు ప్రేక్షకులు. ఇక సెకండ్ పార్ట్ ఫుల్ యాక్షన్, థ్రిల్లింగ్‌తో నడిచినప్పటికీ కథ ముందుగానే ఊహించేలా ఉంటుంది. ఈ క్రమంలో కథ మొత్తం రోటిన్ అయిపోతుంది. రూ. 10 వేల కోట్లు కొట్టేసే క్రమంలో మోహర్ గాంధీ టీం చేసే ప్రయత్నాలు సిల్లిగా, కామెడీగా ఉంటాయి. ఇక మధ్యలో మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ ఊపునిస్తాయి. ఇలా సినిమాను దర్శకుడు సాగథీయడంతో సినిమా క్లైమాక్స్ కాస్తా విసుగు పుట్టిస్తుంది. అయినప్పటికీ మాస్ మహారాజా ఎనర్జీ ఫ్యాన్స్‌ను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులకు కనులవిందు అందించారు. ఇక డింపుల్ హయాతి పాత్ర అమాయకంగా, రెండోది ఇంటెన్స్‌గా ఉంటుంది. రెండు క్యారెక్టర్ కూ సరిపోయిందీ ఆమె. ఈ సినిమాలోన ఆమెను హీరోయిన్గా ఎందుకు తీసుకున్నారో సెకండాఫ్ లో తెలుస్తుంది. మరో నాయిక మీనాక్షి చౌదరికి కథలో కీలకమైన క్యారెక్టర్ దొరికింది. గ్లామర్ గా కనిపించడంలో ఈ ఇద్దరు నాయికలూ పోటీ పడ్డారు. అనసూయ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ పాత్రలు కూడా రెండు షేడ్స్‌తో సాగుతాయి. తొలి భాగంలో మురళీ శర్మ ప్రకృతి ఆహారం తీసుకునే పాత్రలో నవ్వించారు. మరోవైపు సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ్ ఈ కేసును పక్కాగా విచారణ చేస్తుంటాడు. ఇదంతా జైలులో ఉన్న మోహన్ గాంధీ పూజకు వివరిస్తాడు. నిజంగానే మోహన్ గాంధీ తన భార్యను చంపాడా. ఆ హత్య చేసిందెవరు, ఈ గతంలో రామకృష్ణ (ఉన్ని ముకుందన్) ఎవరు, పదివేల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నుంచి రాజశేఖర్, మోహన్ గాంధీ ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ. బలాలు ⇒ రవితేజ నటన ⇒ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిల గ్లామర్ ⇒ యాక్షన్ సీక్వెన్స్ బలహీనతలు ⇒ కథ(ఊహకు తగ్గట్టుగా సాగుతుంది) ⇒ క్లైమాక్స్ -స్నేహలత, వెబ్‌డెస్క్ -
ఖిలాడీ ట్విటర్ రివ్యూ, ఎలా ఉందంటే?
మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం ఖిలాడీ. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లు. రిలీజ్ డేట్ దగ్గర పడ్డాక ప్రమోషన్ల స్పీడు పెంచి సినిమాకు హైప్ తెచ్చింది చిత్రయూనిట్. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముతానన్న రవితేజ ఈ సినిమా విజయాన్ని అందుకోవడం తథ్యమని ఎంతో ధీమాగా ఉన్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ కమర్షియల్ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 11న) థియేటర్లలో రిలీజైంది. మరి ఈ సినిమా హిట్టయ్యిందా? ఫట్టయ్యిందా? ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కథ ఎలా ఉంది? ఎవరెలా చేశారు? హిట్టా? యావరేజా? పలు అంశాలను ట్వీట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అవేంటో ఓ సారి చూసేద్దాం.. ఖిలాడీ యావరేజ్ సినిమా అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం సూపర్ హిట్ బొమ్మ అని పొగిడేస్తున్నారు. ఫస్టాఫ్ అంతా రొటీన్ కామెడీతో సాగిందని, పెద్దగా కొత్త కంటెంట్ ఏం లేదని పెదవి విరుస్తున్నారు. ఇటలీ చేజింగ్ సీన్లో కెమెరా వర్క్ తప్ప అంతా రోతనే కనిపిస్తుందని విమర్శిస్తున్నారు. కొన్ని సాంగ్స్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయని, దేవిశ్రీప్రసాద్ మిగతా సాంగ్స్ కూడా అదిరిపోయేలా ఇచ్చుంటే బాగుండేదంటున్నారు. మొత్తంగా ఖిలాడి సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్నట్లు కనిపిస్తోంది. #Khiladi Review Routine commercial potboiler with twists adding to it. Director failed to engage. Flop, 2/5 ! — Desi Box Office (@DesiBoxOffice) February 11, 2022 Telugu lo Manchi talk osthundi Hindi lo kuda Manchi talk vaste #Khiladi pic.twitter.com/C9Jaybo7iK — T🇦🇦ʀᴜɴ འaل KᴜᴍⒶR (@TarunRajKumarAA) February 11, 2022 Stuff account lu oka 2 days pandaga. Anasuya in Interval 😂 #Khiladi — Silent GuaRRRdian (@Kamal_Tweetz) February 11, 2022 Not even single point or scene is interesting in entire first half #Khiladi — Team RRR (@kiran_nine) February 11, 2022 Interval ,second half mass action s superhit 💥💥 Mahesh Babu fans #Khiladi — Mahesh Anna (@Vijay12425550) February 11, 2022 40 mins in to the movie…Comedy scenes going on decent so far #Khiladi — Rakita (@Perthist_) February 11, 2022 #Khiladi Hit talk nadustunde 🔥🔥 Weekend vellali 😍 CONGRATULATIONS @RaviTeja_offl annaaaaaaa — పోకిరి🔔 (@Pokiri_Freak) February 11, 2022 Done with the show First half : above average, comedy seems to be routine but internal bang Face screaming in fearCollision symbol Second half: Racy action sequences and twists Fire... blockbuster 2nd half Overall BOMMA HIT @DirRameshVarma @AstudiosLLP#Khiladi — su DHEER Varma ALLURI (@suDheerVarmaAA) February 11, 2022 Positive response from Overseas 💥💥#Khiladi Can't wait to watch 🤩🤩 Evening show planned 😁👍 Krack movie la ne blockbuster avvali 💥💥 — Raghava Reddy (@Raghava_Reddy_) February 11, 2022 #Khiladi@RaviTeja_offl First Half Report: So far, the movie is average and it takes time to get into the main story. Some comedy scenes are good. A decent interval block. Let's see what the film holds in the second half. — Charan (@ursCharanDevil) February 11, 2022 Sandhya 35mm#Khiladi 🔥🔥🤙🤙🤙 pic.twitter.com/6nCiP6DdFJ — Raviteja Era (@RavitejaEra) February 11, 2022 Movie hit @Khiladi 🔥❤ https://t.co/3woXro31KB — Rowdy Kanna (@KannaBangaram7) February 11, 2022 #Khiladi movie pakka hit .. Reasons mass ki connect avutundi 1 hr average ..next movie good to very good Songs baaga nacchutai .. Solo release ..no other movie watch — JMB (@EmiratesBabu) February 11, 2022 -
గుడ్ లక్ సఖి మూవీ ట్విటర్ రివ్యూ
‘నేను శైలజ’మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయింది అందాల భామ కీర్తి సురేశ్. తొలి సినిమాతోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’మూవీతో కీర్తి సురేశ్ జాతకమే మారిపోయింది. ఆ సినిమా తర్వాత కీర్తి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఒకపక్క స్టార్ హీరోలతో నటిస్తూ.. మరో పక్క లేడి ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన మరో లేడి ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన మూవీ పాటలు, ట్రైలర్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ. . కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జనవరి 28)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. #GoodLuckSakhi Overall A Mostly Lackluster Sports Drama! Keerthy did her best and the film had lscope for comedy and emotion but could not engage with a flat screenplay The makers did not even finish dubbing and the dialogues were hard to understand throughout Rating: 2/5 — Venky Reviews (@venkyreviews) January 28, 2022 సినిమా యావరేజ్‌గా ఉందని, కానీ కీర్తిసురేశ్ నటన మాత్రం అద్భుతంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గుడ్ లక్ సఖి కాదు బ్యాడ్ లక్ కీర్తి అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమా అని మరికొంతమంది చెబుతున్నారు. జగపతి బాబు ఆదిపినిశెట్టి పెర్ఫార్మన్స్ కూడా ఈ కథకి ప్లస్ అయిందని చెబుతున్నారు. #GoodLuckSakhi..! Solo release aithe kalisochindi kani NO Luck! Everything happens and ends abruptly with no reason..! Lacks the punch that is needed in sports drama..! Even shooting scenes did not have impact..! Feels like DSP is the only technician that worked honestly..! 2/5.! — FDFS Review (@ReviewFdfs) January 28, 2022 Papa account lo inkokati #GoodLuckSakhi pic.twitter.com/zmFHDvWDI2 — Kaushik🔔 (@ahvkboon) January 28, 2022 -
‘హీరో ’మూవీ రివ్యూ
టైటిల్: హీరో నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య తదితరులు నిర్మాత : పద్మావతి గల్లా దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య టి సంగీతం : జిబ్రాన్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ టాలీవుడ్లోకి వారసుల ఎంట్రీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన కొంత మంది హీరోలు..తమ వారసులను సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. మహేశ్‌బాబు మేనల్లుడు, కృష్ణ మనవడు గల్లా అశోక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘హీరో’.ఈ మూవీ సంక్రాంతి కానుకగా శనివారం (జనవరి 15)న విడుదలైంది. ‘హీరో’మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘హీరో’కథేంటంటే..? మధ్యతరగతి కుటుంబానికి చెందిన అర్జున్(అశోక్) చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని కలలు కంటారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. అదే క్రమంలో తాను ఉంటున్న అపార్ట్మెంట్లోని పక్క ప్లాట్‌లోకి వచ్చిన పశువుల వైధ్యురాలు సుబ్బు అలియాస్ సుభద్ర(నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయాణం సాఫీగా సాగుతున్న క్రమంలో అర్జున్‌కు ఒక కొరియర్ వస్తుంది. అందులో ఓ గన్ ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ లైఫ్ టర్న్ తీసుకుంటుంది. అనుకోకుండా ఓ క్రైమ్ కేసులో ఇరుక్కుంటాడు. ఇంతకీ గన్ ఎక్కడ నుంచి వచ్చింది? క్రైమ్ కేసు నుంచి అర్జున్ ఎలా తప్పించుకున్నాడు? సుబ్బు తండ్రి(జగపతిబాబు)తో ఆ గన్‌కు ఉన్న సంబంధం ఏంటి? సుబ్బు ప్రేమను అర్జున్ ఎలా దక్కించుకున్నాడు? హీరో అవ్వాలనే అర్జున్ కోరిక నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. అశోక్ గల్లాకి ఇది తొలి సినిమా. కానీ ఆ విషయంలో తెరపై ఎక్కడా కనిపించలేదు. అర్జున్ పాత్రలో అశోక్ ఒదిగిపోయాడు. కామెడీ టైమింగ్ బాగుంది. ఫైట్ సీన్స్‌తో పాటు డాన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక సుబ్బుగా నిధి అగర్వాల్ మరోసారి తెరపై తనదైన అందాలతో అలరించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అశోక్ , నిధిల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఇక హరో స్నేహితుడు, రాప్ సింగర్‌గా సత్య తనదైన కామెడీతో నవ్వించాడు. హీరోయిన్ తండ్రిగా జగపతి బాబు నటన ఆటకుంటుంది. చాలా సీరియస్‌గా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు.. క్లైమాక్స్‌లో మాత్రం నవ్వించాడు. హీరో తండ్రిగా నరేశ్ తనదైన నటనతో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్ సలీమ్ భాయ్ పాత్రలో రవికిషన్ జీవించేశాడు. క్లైమాక్స్‌లో సినిమా హీరోగా బ్రహ్మజీ అయితే ఫుల్‌గా నవ్విస్తాడు. కోట శ్రీనివాసరావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? శమంతకమణి, భలేమంచి రోజు, దేవదాస్ చిత్రాలలో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీరామ్ ఆదిత్య.. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘హీరో’ని తెరకెక్కించాడు. ఓ కామెడీ కథకి ముంబై మాఫియా లింకులు కలిపి ఫన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా రోటీన్‌గా సాగినప్పటికీ.. ప్రేక్షకుడికి మాత్రం బోర్ కొట్టించకుండా కామెడీతో మెప్పించాడు దర్శకుడు. ఇంటర్వెల్ ట్విస్ట్.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథ రోటీన్ కామెడీతో సాగడం సినిమాకు కాస్త మైనస్. జగపతి బాబు ప్లాష్ బ్యాక్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించుకున్న ప్రేక్షకుడికి.. ఆయన్ని కామెడీ పీస్‌గా చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కామెడీ పండించడంలో భాగంగానే జగపతిబాబుని అలా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక క్లైమాక్స్‌లో బ్రహ్మాజీ ఎంట్రీ అయితే అదిరిపోయింది. సినిమా హీరోగా బ్రహ్మాజీ పండించిన కామెడీ.. నవ్వులు పూయిస్తుంది. స్క్రీన్‌ప్లే బాగుంది. రోటీన్ కథనే.. డీసెంట్ కామెడీతో కాస్త డిఫరెంట్‌గా చూపించాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. జిబ్రాన్ సంగీతం ఆకట్టుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జుంబారే పాటతో పాటు రాప్ సాంగ్ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది.ఈ సినిమాకి నిర్మాణ విలువలు మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మొత్తంగా కొన్ని లాజిక్స్‌ని పక్కనపెట్టి చూస్తే ఈ సంక్రాంతికి ‘హీరో’ ఎంటర్టైన్ చేస్తాడు. -
బంగార్రాజు మూవీ రివ్యూ
టైటిల్ : బంగార్రాజు నటీనటులు : నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, నాగబాబు రావు రమేశ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్, గోవింద్ పద్మసూర్య తదితరులు నిర్మాణ సంస్థలు : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ నిర్మాత : అక్కినేని నాగార్జున దర్శకత్వం : కల్యాణ్ కృష్ణ కురసాల సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్ ఎడిటర్ : విజయ్ వర్థన్ విడుదల తేది : జనవరి 14, 2022 Bangarraju Movie Review: అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ లో చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’చిత్రం 2016 సంక్రాంతి సీజన్లో విడుదలై సూపర్ హిట్టైంది. ఏకంగా కింగ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ భారీ విజయం సాధించడంతో అందులోని బంగార్రాజు పాత్రతో కథని అల్లుకొని ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కింది. ‘మనం’ తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం శుక్రవారం(జనవరి 14)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన రావడం.. దానికి తోడు ప్రమోషన్స్‌ని గ్రాండ్ చేయడంలో ‘బంగార్రాజు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతి బరిలోకి దిగిన ఏకైన పెద్ద సినిమా ‘బంగార్రాజు’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు? రివ్యూలో చూద్దాం. ‘బంగార్రాజు’కథేంటంటే ‘సోగ్గాడే చిన్ని నాయన’చిత్రం ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచి ‘బంగార్రాజు’కథ స్టార్ట్ అవుతుంది. ఆత్మగా వచ్చిన బంగార్రాజు(నాగార్జున)..తన ఫ్యామిలీ సమస్యలన్నీ చక్కదిద్ది స్వర్గానికి తిరిగి వెళ్తాడు. కొన్నాళ్లకు డాక్టర్ రాము(నాగార్జున), సీత దంపతులకు కొడుకు పుట్టడం..భార్య చిన్నప్పుడే చనిపోవడంతో..అతని బాధ్యలను నాన్నమ్మ సత్య అలియాస్ సత్తెమ్మ(రమ్యకృష్ణ) చూసుకుంటుంది. మనవడు పెద్దయ్యేసరికి.. సత్తెమ్మ కూడా చనిపోయి..స్వర్గంలో ఉన్న బంగార్రాజు దగ్గరకు వెళ్లుంది. చిన్నబంగార్రాజు(నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో ఆవారాగా తిరుతూ.. అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు.. నాగలక్ష్మీ(కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్ అవుతుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరుపడరు. కానీ వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటందని భావిస్తుంది సత్తెమ్మ. తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. చిన్న బంగార్రాజు శరీరంలోకి పెద్ద బంగార్రాజు చేరి.. సర్పంచ్ నాగలక్ష్మీని ప్రేమించేలా చేస్తాడు. మరోవైపు చిన్న బంగార్రాజు హత్య చేయడానికి కొంతమంది ప్లాన్ చేస్తారు. అసలు చిన్న బంగార్రాజుని ఎందుకు హత్య చేయాలనుకున్నారు? హత్యకు కుట్ర చేసిందెవరు? ఆపదలో ఉన్న మనవడిని బంగార్రాజు ఎలా కాపాడుకున్నాడు? ఊరి గుడి కింద ఉన్న నిధులపై కన్నేసిన దుష్టశక్తుల పన్నాగాలను బంగార్రాజు ఎలా తిప్పికొట్టారు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం నాగార్జున, నాగచైతన్యల నటననే. చిన్నబంగార్రాజు, పెద్ద బంగార్రాజు పాత్రల్లో వీరిద్దరు ఒదిగిపోయారు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయి. బంగార్రాజు ఆత్మ దూరిన ప్రతిసారి నాగచైనత్య చేసే సందడి ఆకట్టుకుంటుంది. అయితే సాధారణ సమయంలో చిన్నబంగార్రాజు కామ్‌గా ఉండడం.. ఆత్మ దూరిన తర్వాత రెచ్చిపోవడంతో.. చై కంటే నాగార్జుననే హైలెట్ అయ్యాడని చెప్పాలి. క్లైమాక్స్‌లో వీరిద్దకు కలిసే చేసే ఫైట్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సర్పంచ్ నాగలక్ష్మీగా కృతిశెట్టి తనదైన నటనతో మెప్పించింది. అమాయకపు మాటలతో నవ్వించింది. బంగార్రాజు భార్య సత్య అలియాస్ సత్తెమ్మగా రమ్యకృష్ణ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. సంపత్ రాజ్, రావు రమేశ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. 2016లో సంకాంత్రికి విడుదలైన‘సోగ్గాడే చిన్ని నాయనా’ఎంతటి ఘటన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ అనగానే ‘బంగర్రాజు’కథ ఎలా ఉండబోతుందో అంతా ఊహించుకున్నారు. అనుకున్నట్లుగానే.. పల్లెటూరి వాతావరణం, కలర్‌ఫుల్ సాంగ్స్‌తో ఫన్ అండ్ ఎమోషనల్‌గా ‘బంగార్రాజు’కథ సాగుతుంది. సోగ్గాడే.. సినిమా మాదిరినే.. ఈ చిత్రానికి కూడా గుడికి, బంగార్రాజు కుటుంబానికి ముడిపెట్టి కథను అల్లుకున్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. అందులో కొడుకు,కోడళ్లను కలిపేందుకు బంగ్రారాజు ఆత్మ భూమ్మీదకు వస్తే.. ఇందులో మనవడిని జీవితాన్ని చక్కబెట్టేందుకు కిందకు వస్తాడు. ఇక ఈ సీక్వెల్లో సత్తెమ్మ ఆత్మ అదనం. అయితే సోగ్గాడే.. ఆకట్టుకున్నంతగా.. బంగార్రాజు ఆకట్టుకోలేకపోయాడు. ఫస్టాఫ్ అంతా రోటీన్ సీన్లతో నెమ్మదిగా సాగుతుంది. బంగార్రాజు, సత్యల ఆత్మలు భూమ్మీదకు వచ్చాక కథలో వేగం పెరుగుతుంది. అయినప్పటికీ.. సాదాసీదాగానే సాగిపోతుంది. సర్పంచ్ నాగలక్ష్మీ, చిన్నబంగార్రాజుల మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెద్ద బంగార్రాజు చేసే సందడి మాత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథ ప్రేక్షకుడి ఊహకి అందేలా సాగుతుంది. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ‘వీరి వీరి గుమ్మడి పండు’గేమ్ సీన్ అలరిస్తుంది. ఇక సినిమాను ప్రధాన బలం ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ అనే చెప్పాలి. చివరి 30 నిమిషాలు సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సాంకెతిక నిపుణుల పనితీరు విషయానికొస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకి ప్లస్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చక్కగా అందించాడు. అయితే సినిమాల్లో వచ్చే పాటలు.. కథకు అడ్డంకిగా అనిపిస్తాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ వర్థన్ తన కత్తెర ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘సూపర్ మచ్చి’మూవీ రివ్యూ
టైటిల్ : సూపర్ మచ్చి నటీ,నటులు: కల్యాణ్ దేవ్, రచిత రామ్, వీకే నరేష్, పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, మహేష్ ఆచంట తదితరులు నిర్మాత : రిజ్వాన్ దర్శకత్వం : పులి వాసు సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్ విడుదల తేది: జనవరి 7, 2022 మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా ‘విజేత’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్‌దేవ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఆ ఉత్సాహంతోనే ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యంగ్ హీరో.. లుక్స్, ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సూపర్ మచ్చి’సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే మీనాక్షి (రచిత రామ్).. బార్లో పాటలు పాడుతూ.. ఆవారాగా తిరిగే (రాజు)ని అమితంగా ప్రేమిస్తుంది. అతను ఇష్టం లేదని చెప్పినా అతని వెంటే పడుతుంది. దీంతో ఆమెను వదిలించుకోవడానికి ఒక నైట్ తనతో గడిపితే నీ ప్రేమని అంగీకరిస్తానని కండీషన్ పెడతాడు. దానికి కూడా ఆమె ఒప్పుకుంటుంది. నెలకు లక్షన్నర సంపాదించినే మీనాక్షి.. చదువు సంధ్య లేని రాజుని ఎందుకు ప్రేమించింది? ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? మీనాక్షిని చూడకుండా ప్రేమించిదెవరు? మీనాక్షి తండ్రి(రాజేంద్రప్రసాద్) చివరి కోరిక కోసం ఏంటి? చివరకు మినాక్షి , రాజులు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? బాధ్యతలేని యువకుడిగా, చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడు రాజు పాత్రలో కల్యాణ్ దేవ్ మంచి నటనను కనబరిచాడు. డ్యాన్స్‌తో పాటు ఫైట్స్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించారు. తెరపై చాలా జోష్‌గా కనిపిస్తాడు. ఇక మీనాక్షిగా రచిత రామ్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించింది. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషన్స్ సినిమాలో కూడా అద్భుతంగా నటించింది. హీరో తల్లిదండ్రులుగా నరేశ్, ప్రగతి మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. మీనాక్షి తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ ఒదిగిపోయారు. పొసాని కృష్ణమురళి, మహేష్ ఆచంట, భద్రంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ప్రేమ, ఎమోషన్స్, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్న చిత్రమే సూపర్ మచ్చి. ఇలాంటి కథలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. కానీ చూడకుండా ప్రేమించుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్లో కథను ముందుకు నడిపాడు దర్శకుడు పులి వాసు. ఆయన ఎంచుకొన్న పాయింట్ బాగున్నప్పటీకీ.. తెరపై చూపించడంలో కాస్త తడపడ్డాడు. ఫస్టాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా నడిపించాడు. బాధ్యతలేని రాజుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీనాక్షి ఎందుకు ప్రేమిస్తుందనే విషయాన్ని ఇంటర్వెల్ వరకు ఆపి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగేలా చేశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం కథ కాస్త రోటీన్‌గా సాగుతుంది. తండ్రి, కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఎలాంటి అశ్లీలత, బూతులు లేకుండా సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది. ఇక సాంకెతిక విషయానికొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌ని ఇంకాస్త క్రిస్పీగా కట్ చేస్తే మరింత బాగుండేది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి కథను, దానికి తగిన నటీనటుల ఎంపిక విధానం చూస్తే.. సినిమాపై రిజ్వాన్‌కు ఉన్న అభిరుచి ఏంటో అర్థమవుతుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. -
‘హాఫ్ స్టోరీస్’మూవీ రివ్యూ
టైటిల్ : హాఫ్ స్టోరీస్ నటీ,నటులు: రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, సంపూర్ణేష్ బాబు, కోటి, కంచరపాలెం రాజు, టీఎన్ఆర్ తదితరులు నిర్మాణ సంస్థ: వెన్నెల క్రియేషన్స్ నిర్మాత: యం. సుధాకర్ రెడ్డి దర్శకత్వం : శివ వరప్రసాద్ కె. సంగీతం : కోటి సినిమాటోగ్రఫీ : చైతన్య కందుల ఎడిటర్: సెల్వ కుమార్ విడుదల తేది : జనవరి 7,2022 ఒమిక్రాన్ దెబ్బతో సంక్రాంతి బరిలో నుంచి పెద్ద సినిమాలు తప్పకున్నాయి. దీంతో చిన్న సినిమాలు పుంజుకున్నాయి. విభిన్నమైన కాన్సెప్టులతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అలా ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘హాఫ్ స్టోరీస్’.ఈ మూవీలో రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కోటి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. ఓ మోస్తరు అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హాఫ్ స్టోరీస్’ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కొన్ని కథల, పాత్రల సంకలనమే ‘హాఫ్ స్టోరీస్’కథ. అసిస్టెంట్ డెరెక్టర్‌గా పనిచేసే శివ(రాకెందు మౌళి), తన స్నేహితులు లక్ష్మీ(శ్రీజ), చిన్నా(జబర్దస్థ మహేశ్) మధ్య జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బ్యాంక్ క్యాష్ వ్యాన్ ప్రమాదానికి గురికావడం.. ఆ డబ్బును కాసేయడానికి ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు మోసానికి పాల్పడుతుంటారు. చివరికి ఆ డబ్బులు ఎవరికి సొంతం చేసుకున్నారు? ఆ డబ్బును చేజిక్కుంచుకునే క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ముగ్గురిలో దెయ్యాలు ఎవరు? మనుషులు ఎవరు? ఈ కథలోకి సంపూర్ణేష్ బాబు ఎలా ఎంటర్ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో పాత్రలు అన్ని ఇలా వచ్చి అలా వెళ్తుంటాయి. యువ దర్శకుడు శివగా రాకెందు మౌళి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గౌతమ్‌గా రాజీవ్, చిన్నగా మహేశ్, సినిమా రచయిత సంపూగా సంపూర్ణేశ్ బాబు, రాఘవ్‌గా జెమిని సురేశ్, ఎస్సై శశికాంత్‌గా టీఎన్ఆర్, లక్ష్మీగా శ్రీజ, ఆధ్యాగా అంకిత ఇలా... అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. తెలుగులో దెయ్యాల కాన్సెఫ్ట్‌తో చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో చాలా వరకు హిట్ కొట్టాయి కూడా. ‘హాస్ స్టోరీస్’కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. కథ నేపథ్యం పాతదే అయినప్పటికీ.. చాలా కొత్తగా, డిఫరెంట్‌గా తెరకెక్కించాడు దర్శకుడు శివ వరప్రసాద్. వరుస ట్విస్ట్‌లో సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా నడిపించాడు. శివ అనే అప్‌కమింగ్ డైరెక్టర్ తన స్నేహితులకు స్టోరీ చెప్పడం.. ఆ స్టోరీలో ఇంకో స్టోరీ రావడం..ఇదంతా ఓ బాలుడు సినిమాగా చూడడం.. ఇలా వరుస ట్విస్ట్‌లతో ‘హాఫ్ స్టోరీస్’సినిమా సాగుతుంది. సినిమాలో మనుషులు ఎవరో, దెయ్యాలు ఎవరో తెలియకుండా.. క్షణ క్షణానికి ఓ ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకుడి సీటుకే కడ్డిపడేశాడు. అయితే అది సినిమాకు ఎంత ప్లస్ అయిందే.. అంతే మైనస్ అయింది కూడా. సగటు ప్రేక్షకుడికి సినిమాలోని ట్విస్టులన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. అసలు స్టోరీ ఏంటనేది తెలియక అయోమయానికి గురవుతాడు. అయినప్పటికీ.. సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టించకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అయితే టైటిల్ మాదిరే ఒక్కో స్టోరీని పూర్తిగా చూపించకుండా హాఫ్, హాఫ్‌గా చూపించి.. సగం సినిమా మాత్రమే చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా చేశారు. క్లైమాక్స్‌లో అయినా ఈ ట్విస్ట్‌లన్నింటికీ పుల్‌స్టాఫ్ పెడిగే బాగుండేది. పార్ట్-2 ఉంది కాబట్టి ఆ చిక్కుముడులన్నీ అలానే వదిలేశాడేమో దర్శకుడు. మొత్తగా ఈ సినిమా ఓటీటీలో వెబ్ సిరీస్‌గా వస్తే ఇంకా బాగుండేది. ఇక సాంకేతిక విషయానికొస్తే.. కోటి సంగీతం బాగుంది. ముఖ్యంగా రీ రికార్డింగ్ అదిరిపోయింది. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. చైతన్య కందుల సినిమాటోగ్రఫీ బాగుంది. సెల్వ కుమార్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
'అతిథి దేవో భవ’ మూవీ రివ్యూ
టైటిల్ : అతిథి దేవోభవ నటీ,నటులు: ఆది సాయికుమార్, నువేక్ష, రోహిణి, సప్తగిరి తదితరులు నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల దర్శకత్వం : పొలిమేర నాగేశ్వర్ సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: అమర్నాథ్ బొమ్మిరెడ్డి విడుదల తేది: జనవరి 7, 2022 ‘ప్రేమ కావాలి’,‘లవ్లీ’ సినిమాల తర్వాత యంగ్ హీరో ఆది సాయికుమార్ ఖాతాలో మరో హిట్ లేదు. వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు ఆది. తాజాగా ఈ యంగ్ హీరో 'అతిథి దేవో భవ’ అంటూ శుక్రవారం(జవవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అభి అలియాస్ అభయ్‌రామ్(ఆది సాయికుమార్) చిన్నప్పటి నుంచి మోనో ఫోబియాతో బాధపడుతుంటాడు. ఒంటరిగా ఉండలేదు. ఎక్కడికి వెళ్లినా తోడు ఉండాల్సిందే. ప్రతిసారి స్నేహితుడిని తోడుగా తీసుకు వస్తున్నాడని ఓ అమ్మాయి బ్రేకప్ కూడా చెబుతుంది. దీంతో తనకు ఉన్న లోపం గురించి ఎవరికి చెప్పకుండా దాచేస్తాడు. తర్వాత అతని లైఫ్‌లోకి మరో అమ్మాయి వైష్ణవి(నువేక్ష) వస్తుంది. మరి అభయ్ తన సమస్యను వైష్ణవితో చెప్పాడా?లేదా? మోనోఫోబియా వారి ప్రేమకి ఏవిధంగా అడ్డంకిగా మారింది? అభయ్ ఫ్లాట్‌కి వచ్చిన ప్రియ ఎవరు? ఆమె వల్ల తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తనకున్న భయాన్ని అభయ్ ఎలా అధిగమించాడు?అనేదే మిగతా కథ. ఎలా చేశారంటే..? అభయ్ పాత్రకి న్యాయం చేశాడు ఆది సాయికుమార్. నటనలో కొత్తదనం ఏమీ లేదు. వైష్ణవి పాత్రలో నువేక్ష చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తల్లిగా రోహిణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. హీరో స్నేహితుడిగా సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇమ్మాన్యుయేట్, అదుర్స్ రఘు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' సినిమాల్లో మాదిరే.. ఈ మూవీలో కూడా హీరో ఓ మాససిక రుగ్మతతో(మోనో ఫోబియా) బాధపడుతుంటాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..తెరపై చూపించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. గతంలో వచ్చిన ఆ రెండు చిత్రాలు వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించాయి. ఈ మూవీలో ఆ రెండూ లేవు. ఫస్టాఫ్ అంతా కామెడీగా నడిపించే ప్రయత్నం చేశాడు.. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. సప్తగిరితో వచ్చే కామెడీ సీన్స్ తెచ్చిపెట్టినట్లు ఉంటాయే తప్ప అంతగా హాస్యాన్ని పండించవు. ఇక సెకండాఫ్‌లో కాసేపు థ్రిల్ ఇవ్వాలని ట్రై చేశాడు. అదీ కూడా వర్కౌట్ కాలేదు. సినిమా మొత్తం సాగదీసినట్లు ఉంటుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. సప్తగిరి డ్రంక్డ్రైవ్లో దొరికిన సీన్ కానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌తో వచ్చే సీన్ కానీ సినిమాకు అతికించినట్లు ఉంటాయే తప్ప.. పెద్దగా నవ్వించవు. క్లైమాక్స్‌లో కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇక సాంకెతిక విషయానికొస్తే.. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన 'బాగుంటుంది నువ్వు నవ్వితే' పాట సినిమాకే హైలెట్. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. అమర్నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘ఇందువదన’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇందువదన నటీనటులు : వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘుబాబు, ధన్ రాజ్, ఆలీ, నాగినీడు, సురేఖవాణి, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, పార్వతీశం తదితరులు నిర్మాతలు : మాధవి అదుర్తి దర్శకత్వం : ఎం శ్రీనివాస రాజు (ఎమ్ఎస్ఆర్) సంగీతం : శివ కాకాని సినిమాటోగ్రఫీ : బీ మురళీకృష్ణ విడుదల తేది : జనవరి 1,2022 ‘హ్యపీడేస్’, ‘కొత్త బంగారులోకం’ సినిమాల తర్వాత వరుణ్ సందేశ్ నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని చూపించలేదు. ఇక సినిమాల చాన్స్ రాని సమయంలో ‘బిగ్‌బాస్’రియాల్టీ షోలో పాల్గోని మరోసారి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. ఆ షోతో వరుణ్ సందేశ్‌కి క్రేజ్ వచ్చినప్పటికీ.. పెద్దగా సినిమాలేవి చేయలేదు. చాలా రోజుల తర్వాత వరుణ్ ‘ఇందు వదన’అనే సినిమాలో మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చాడు. వరుణ్ సందేశ్ నటించిన తొలి పీరియాడికల్ మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి స్పందన రావడంతో పాటు మూవీపై అంచనాలను పెంచేసింది. చాలా ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్ నటించిన ‘ఇందు వదన’మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? అగ్రహారం గ్రామానికి చెందిన వాసు(వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ పోలీసాఫీసర్. అతను అడవిలో ఉండే గిరిజన యువతి ఇందు( ఫర్నాజ్ శెట్టి)తో తొలి చూపుతోనే ప్రేమలో పడతాడు. అయితే కులం కారణంగా వారి పెళ్లిని వాసు కుటుంబ సభ్యులు నిరాకరిస్తారు. అనుహ్యా కారణాల వల్ల ఇందు హత్యకు గురవుతుంది. అసలు ఇందుని హత్య చేసిందెవరు? ప్రేమించి, పెళ్లాడిన ఇందు చనిపోయిందని తెలుసుకున్న తర్వాత వాసు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తనను హత్య చేసిన వారిపై ఇందు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. టాలీవుడ్లో వరుణ్ సందేశ్‌కి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. గతంలో ఆయన నుంచి అన్ని ప్రేమ కథా చిత్రాలే వచ్చాయి. కానీ ఇందు వదన మూవీలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. ఫారెస్ట్ ఆఫీసర్ వాసు పాత్రలో తెరపై సరికొత్తగా కనిపించడంతో పాటు యాక్టింగ్ పరంగా కూడా ఇరగదీశాడు. ఫైట్ సీన్స్‌లో కూడా పర్వాలేదనిపించాడు. గిరిజన యువతి ఇందు పాత్రలో ఫర్నాజ్ శెట్టి ఒదిగిపోయింది. తొలి సినిమాయే అయినా.. అద్భుతంగా నటించింది. ఒకవైపు వరుణ్ సందేశ్‌తో రొమాన్స్ చేస్తూనే.. మరోవైపు దెయ్యంగా ప్రేక్షకులను భయపెట్టించింది. వరుణ్, ఫర్నాజ్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే వరుణ్ సందేశ్ స్నేహితులుగా మహేశ్ విట్ట, ధనరాజ్, పార్వతీశం తమదైన కామెడీతో నవ్వించారు. నాగినీడు, అలీ, సురేశ్ వాణిలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... ? టాలీవుడ్లో హారర్ కామెడీ చిత్రాలు ఇప్పటికే చాలా వచ్చాయి. వాటిలో ప్రేమకథా చిత్రమ్, తను వచ్చెనంట, యూటర్న్ చిత్రాలు విజయం సాధించాయి. అలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘ఇందువదన’. లవ్, థ్రిల్లింగ్ అంశాలతో ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్ఎస్ఆర్. దర్శకుడుకు ఎంచుకున్న పాయింట్ పాతతే అయినప్పటికీ.. ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా ఉంది. చక్కటి ప్రేమ కథకి హారర్‌ని జోడించి సినిమాని తెరకెక్కించాడు. అయితే కథలో బలం లేకపోవడంతో సినిమా స్థాయి తగ్గింది. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే ‘ఇందు వదన’ఓ మంచి హారర్-థ్రిల్లర్ మూవీ అయ్యేది. ఫస్టాఫ్‌లో వాసు ఇందుల లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. ఇంటెర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో దెయ్యంతో వచ్చే కామెడీ సీన్స్, అలీ ఎంట్రీ సీన్ నవ్వులు పూయిస్తుంది. సెకండాఫ్ కథని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఇక సాంకేతిక విషయానికొస్తే... శివ కాకాని సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా.. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునేలా అందించాడు. మురళీ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. అడవి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ ఇంకాస్త తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘అర్జున ఫల్గుణ’ మూవీ రివ్యూ
టైటిల్ : అర్జున ఫల్గుణ నటీనటులు : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, నరేశ్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్, ‘రంగస్థలం’మహేశ్ తదితరులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : తేజ మార్ని సంగీతం : ప్రియదర్శన్ సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి విడుదల తేది : డిసెంబర్ 31,2021 వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటూ.. .. విలక్షణ నటనతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘రాజ రాజ చోర’ చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ టాలెంటెండ్ హీరో.. తాజాగా ‘అర్జున ఫల్గుణ’అంటూ మరో డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘అర్జున ఫల్గుణ’ఏ మేరకు అందుకుంది? రివ్యూలో చూద్దాం. ‘అర్జున ఫల్గుణ’కథేంటంటే..? డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటున్న ఐదుగురు స్నేహితులు అర్జున్(శ్రీవిష్ణు), రాంబాబు(రాజ్ కుమార్), తాడి(‘రంగస్థలం’మహేశ్), ఆస్కార్(చైతన్య గరికిపాటి), శ్రావణి(అమృత అయ్యర్)ల చూట్టూ ‘అర్జున ఫల్గుణ’కథ సాగుతుంది. వీరంతా చిన్నప్పటి నుంచి బెస్ట్‌ఫ్రెండ్స్. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే వ్యక్తిత్వం వాళ్లది. వీరంతా ఊర్లోనే సోడా సెంటర్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. దాని కోసం బ్యాంకు లోన్‌కు ట్రై చేస్తారు. రూ. 50 వేలు ఇస్తే లోన్ వస్తుందని చెప్పడంతో.. డబ్బుకోసం వీళ్లు ప్రయత్నాలు చేస్తారు. ఈక్రమంలో ఈ ఐదుగురు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడతారు. అక్కడి నుంచి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? సరదాగా ఊర్లో తిరిగే వీళ్లు గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కేసు నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ. (రాజ్‌కుమార్ ఎలా చేశారంటే..? ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు యాక్టింగ్ ఇరగదీశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన మోసుకొచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో కొన్నిచోట్ల నవ్వించాడు. ఇక శ్రీవిష్ణుకు జతగా శ్రావణి పాత్రలో అమృత అయ్యర్ మంచి నటనను కనబర్చింది. పల్లెటూరి అమ్మాయిలా తెరపై అందంగా కనబడింది. హీరో స్నేహితులుగా రంగస్థలం మహేశ్‌తో పాటు మిగిలిన ఇద్దరు కూడా చక్కగా నటించారు. ఇక కన్నింగ్ కరణంగా నరేశ్, రైతుగా దేవీ ప్రసాద్, హీరో తండ్రిగా శివాజీ రాజా తమ అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. పోలీసాఫిసర్గా సుబ్బరాజ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. సినిమాలో హీరో ఎంత బాగా నటించినా కూడా.. కథ, కథనం బాగుంటేనే అది సక్సెస్ అవుతుంది. రొటీన్ కథనైనా.. దాన్ని తెరపై వైవిధ్యంగా చూపిస్తే దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. కథ తగ్గట్టు సినిమాని డ్రైవ్ చేసే బాధ్యత దర్శకుడిది. ఈ విషయంలో కొత్త దర్శకుడు తేజ మార్ని తడబడ్డాడు. తొలి సినిమా ‘జోహార్’తో మంచి మార్కులు కొట్టేసినా తేజ.. ‘అర్జున ఫల్గుణ’మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. కథ, కథనం రెండూ రోటీన్‌గా ఉన్నాయి. గోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురి నిరుద్యోగుల నేపథ్యాన్ని కథాంశంగా మలచుకొని ‘అర్జున ఫల్గుణ’సినిమాన్ని తెరకెక్కించాడు. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా.. తెరపై మాత్రం రోటీన్‌గా చూపించడం సినిమాకు మైనస్. ఫస్టాఫ్‌లో కామెడీతో కొంతమేర నవ్వించే ప్రయత్నం చేసినా.. సెకండాఫ్ పూర్తిగా తేలిపోయింది. ప్రేక్షకుడి ఊహకందే విధంగా కథనం సాగుతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. థ్రిల్లింగ్ మూమెంట్స్, లవ్, పల్లెటూరి చమత్కారం.. ఇలా కథలో జొప్పించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. వాటిని చేచేతూలా చేజార్చుకున్నాడు. అర్జుణుడు, అభిమన్యుడు, పద్మవ్యూహం అంటూ పెద్ద పెద్ద పదాలతో కథను ప్రారంభించిన దర్శకుడు.. చివరకు గమ్యంలేని ప్రయాణంలా మార్చేశాడు. అయితే సుధీర్ వర్మ డైలాగ్స్ మాత్రం సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ప్రియదర్శన్ సంగీతం కొంతమేర ఆకట్టుకున్నా.. కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అతిగా అనిపిస్తుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కథలను ఎంచుకోవడంతో దిట్ట అయినా శ్రీవిష్ణువు.. ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త బోల్తా పడ్డాడనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘బ్యాక్ డోర్’మూవీ రివ్యూ
టైటిల్ : బ్యాక్ డోర్ నటీనటులు : పూర్ణ, తేజ త్రిపురాన తదితరులు నిర్మాణ సంస్థ : ఆర్చిడ్ ఫిలిమ్స్ నిర్మాత : బి.శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం : కర్రి బాలాజీ సంగీతం : ప్రణవ్ ఎడిటర్ : చోటా కె. ప్రసాద్ సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్ నారోజ్ పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటించిన తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. మంచి సందేశంతో పాటు యూత్‌పుల్ అంశాలతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం శనివారం (డిసెంబర్ 25)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడం.. ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ‘బ్యాక్ డోర్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘బ్యాక్ డోర్’ కథేంటంటే.. అంజలి(పూర్ణ) భర్త ఓ వ్యాపారవేత్త. ఎప్పుడు ఆఫీస్ పనుల్లో బిజీ బిజీగా ఉంటాడు. ఆమె ఇంటి వద్దే ఉంటూ.. ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. ఓ పెళ్లి వేడుకలో ఆమెకు అరుణ్(తేజ త్రిపురాన)పరిచయం అవుతాడు. అతని మాటలకు అంజలి అట్రాక్ట్ అవుతుంది. అంజలి అందాలకు అరుణ్ ఫిదా అవుతాడు. ఇద్దరు రెగ్యులర్‌గా ఫోన్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. భర్త ఆఫీస్‌కి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన సమయంలో అరుణ్‌ని ఇంటికి రప్పించుకుంటుంది. ఆ సమయంలో ఏం జరిగింది? మంచి ఇల్లాలుగా ఉన్న అంజలి గీత దాటిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఈ సినిమాకు హైలైట్ పూర్ణనే. ఇల్లాలు అంజలి పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. వయసు ఏమో హద్దులు దాటమంటుంది.. మనసు ఏమో తప్పని చెప్పుతుంది. ఈ రెండిటి మధ్య నలిగే హౌస్‌వైఫ్‌గా పూర్ణ తన నటనలో అద్భుతమైన హావభావాలు చూపించింది. యువకుడు అరుణ్ పాత్రలో తేజ ఒదిగిపోయాడు. తెరపై చాలా ఉత్సాహంగా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? పెళ్లయ్యాక మహిళ తన మనసుకు, ఆలోచనలకు ఎలాంటి హద్దులు గీసుకోవాలో తెలియజేసే ఓ మంచి సందేశాత్మక చిత్రమే ‘బ్యాక్ డోర్’. ‘చూపు వెళ్లిన ప్రతి చోటుకి మనసు వెళ్లకూడదు.. అలాగే మనసు చెప్పే ప్రతి మాట మనిషి వినకూడదు’అనే ఒకేఒక డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో చెప్పేశాడు దర్శకుడు కర్రి బాలాజీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా అన్ని అంశాలను చూపిస్తూనే.. చివరిలో ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. అటు యువతకు నచ్చేలా, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడకుండా చక్కటి సినిమాను నిర్మించారు నిర్మాత బి శ్రీనివాస రెడ్డి. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ప్రణవ్ సంగీతం బాగుంది. ‘రారా నన్ను పట్టేసుకుని’అనే రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ ఓకే. అంజలి, అరుణ్ కలిసే ఇంటిమేట్ సీన్స్ ను సినిమాటోగ్రఫర్ శ్రీకాంత్ నారోజ్ బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘గూడుపుఠాణి ’ మూవీ రివ్యూ
టైటిల్: గూడుపుఠాణి నటీనటులు: సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచే తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ దర్శకత్వం: కెయమ్ కుమార్ సంగీతం: ప్రతాప్ విద్య విడుదల తేది: డిసెంబర్ 25, 2021 తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హాస్య నటులు హీరోలుగా మారి సినిమాలు చేశారు. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్‌ని అందుకున్నారు. అలాంటి కమెడియన్స్‌లో సప్తగిరి ఒకరు. ఇప్పటికే సప్తగిరి ఎల్ ఎల్ బి, సప్తగిరి ఎక్సప్రెస్ లాంటి చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ యంగ్ కమెడియన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గూడుపుఠాణి ’.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో పాటు మూవీపై అంచనాలను పెంచింది. ఓ మోస్తారు అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సప్తగిరి తొలి చూపులోనే నేహా సొలంకి ప్రేమలో పడతాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఓ పూరాతన అమ్మవారి దేవాలయంలో తమ వివాహాన్ని ఘనంగా జరుపుకోవాలనుకుంటారు. అదే సమయంలో దేవాలయాల్లో వరుసగా అమ్మవారి నగలు దొంగిలించబడతాయి. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో సప్తగిరి పెళ్లి చేసకునే గుడిలో కూడా దొంగలు పడతారు. అసలు ఆ దొంగలు ఎవరు? ఆ గుడిలో ఏం జరిగింది? చివరకు సప్తగిరి, సొలంకిల పెళ్లి జరిగిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఎప్పటి మాదిరే సప్తగిరి మరోసారి తనదైన నటనతో అలరించాడు. తనదైన కామెడీతో నవ్విస్తూనే.. కొన్ని కీలక సన్నివేశాల్లో భయపెడతాడు. హీరోయిన్ నేహా సోలంకి అందం, అభినయంతో ఆకట్టుకుంది. విలన్‌గా రఘు కుంచె నటన సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? తెలిసిన కథనే అద్భుతమైన కథనంతో మంచి ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కుమార్. సప్తగిరి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. కామెడీతో పాటు మంచి కథ, కథనం, అద్భుతమైన డైలాగులు, అందమైన లొకేషన్స్‌తో పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని ప్రేక్షకులకి అందించారు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ మాత్రం కాస్త బోరింగ్ అనిపిస్తాయి. అమ్మవారి నగలు దొంగిలించిది ఎవరనే విషయాన్ని చివరి వరకు చెప్పకుండా ప్రేక్షకులను క్యూరియాసిటీ కలిగించడంతో దర్శకుడు సఫలం అయ్యాడు. ఇక సాకేతిక విషయాలకొస్తే.. ప్రతాప్ విద్య సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. మున్నా (ఫణి ప్రదీప్) మాటలు, పవన్ చెన్నా సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ మూవీ రివ్యూ
టైటిల్: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) నటీనటులు: అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, దివ్య, సందీప్, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ వైవా హర్ష,తదితరులు సమర్ఫణ: సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ: రామంత్ర క్రియేషన్స్ నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల దర్శకత్వం: కె వి గుహన్ సంగీతం: సైమన్ కె. కింగ్ ఎడిటింగ్: తమ్మిరాజు విడుదల తేది: డిసెంబర్ 24, 2021(సోనిలీవ్) సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్లర్ మూవీ 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 24న సోనిలీవ్‌లో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. తెలుగులో వస్తున్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ కావడం, డి. సురేష్ బాబు, దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాకు సపోర్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), సదా సత్యం రాజేష్), చిష్ట్రీ(దివ్య శ్రీపాద) అనే నలుగురు సాఫ్ట్వేర్ టెకీలు మంచి స్నేహితులు. వీరంతా వేరు వేరు నగరాల్లో ఉంటూ కంప్యూటర్ లో నే వర్చువల్ గా మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతూ వుంటారు. చిష్ట్రీ కి మిత్ర(శివాని రాజశేఖర్) మంచి ఫ్రెండ్. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోకి మిత్ర వస్తుంది. చిష్ట్రీ ద్వారా విశ్వకి మిత్ర పరిచయమవుతుంది. దీంతో వీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అదికాస్త ముదిరి ప్రేమగా మారుతుంది. అయితే ఉన్నట్టుండి కరోన కారణంగా రాత్రికి రాత్రే సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారు. దాంతో మిత్ర అక్కడే లాక్ అయిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి (సందీప్, కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్) ఫ్లాట్ లోకి చొరబడి.. చిష్ట్రీని విచక్షణా రహితంగా పొడిచేసి గాయాపరుస్తాడు. మిత్రను కూడా దారుణంగా చంపేస్తా అని ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేస్తాడు. దీన్ని వర్చువల్ గా చూసిన విశ్వ హాతాశుడైపోయి… ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అలానే మిత్రను కూడా దారుణంగా చంపుతానని బెదిరిస్తాడు. ఆమె బతకాలంటే నువ్వు ఉరేసుకుని చస్తే… మిత్రను వదిలేస్తా అంటాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు?, విశ్వని ఎందుకు ఉరివేసుకుని చావమన్నాడు. ఆ వ్యక్తి నుండి విశ్వ మిత్ర, చిష్ట్రిలను కాపాడాడా లేదా అనేది మిగతా సినిమా కథ.. ఎవరెలా చేశారంటే...? ఈ సినిమాలో పాత్రలు చాలా తక్కువ. వాళ్లు కూడా నేరుగా కలుసుకోరు. అంతా వెబ్ కెమెరాల ద్వారానే కలుసుకుంటారు. ఇల్లీగల్ హ్యాకర్ హెడ్ విశ్వగా అదిత్ అరుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చావుబతుకుల కొట్టుమిట్టాడే ప్రియురాలిని ఎలా కాపాడుకోవాలో తెలియక కొట్టుమిట్టాడే ఓ సిన్సియర్ లవర్ పాత్రలో లీనమై నటించాడు. . ‘అద్భుతం’తర్వాత శివానీ రాజశేఖర్ నటించిన మరో చిత్రం ఇదే. ఈ చిత్రంలో ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ లేదు కానీ.. ఉన్నంతలో బాగానే నటించింది. తెరపై చాలా క్యూట్‌గా కనిపించింది. ఇక ప్రియదర్శి, దివ్య, సత్యం రాజేష్ వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ సందీప్ కూడా ఉన్న కాసేపు అయినా భయపెట్టి.. ప్రేక్షకులను అసలు సిసలు థ్రిల్ ను పరిచయం చేశాడు. వైవా హర్ష… తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. రియాజ్ ఖాన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి గా కనిపించి మెప్పించారు. ఎలా ఉందంటే..? ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాటా సైబర్ ఎటాక్. మనకు తెలియకుండా.. మన డేటాని హ్యాకర్లు దొంగిలించి ఇతరులకు అమ్ముకుంటున్నారు. దాని వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఇదే కాన్సెప్ట్‌ని తీసుకొని ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’మూవీని తెరకెక్కించాడు దర్శకుడు కె.వి. గుహన్. సమకాలీన ప్రపంచంలో కంప్యూటర్ టెకీలు ఎలా తమకున్నటాలెంట్ ని దుర్వినియోగం చేసి… విలాసవంతమైన లైఫ్ కి అలవాటు పడి.. సమాజంలో ఎలా దోషులుగా మారుతున్నారనేదాన్ని అందరికి తెలిసేలా ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం… రెండు కంప్యూటర్ల స్క్రీన్ మీదనే సినిమా మొత్తం రన్ కావడం సూపర్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీ ఐడియా దర్శకుడికి రావడమే నిజంగా అభినందిచాల్సిన విషయమే. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంతో కాస్త తడపడ్డాడు. విశ్వ, క్రిస్టీ, అష్రఫ్, సదాలు ఏం చేస్తారన్న దానితో కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఆ తర్వాత విశ్వ-మిత్రల ప్రేమ కథతో సన్నివేశాలను సాగదీశాడు. అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే పట్టింది. ఓ దుండగుడు చిష్ట్రీ, మిత్రలు ఉంటున్న అపార్ట్మెంట్కి రావడం.. చిష్ట్రీని కత్తితో దాడి చేయడంతో సినిమాపై ఆసక్తి పెరుగుంది. ఆ ఆగంతకుడు ఎవరు? అతనికి విశ్వకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే దానికి దర్శకుడు చూపించిన రీజన్ మాత్ర చాలా పేలవంగా ఉంది. ఆగంతకుడి నేపథ్యాన్ని సాదాసీదాగా మాటల రూపంలో చెప్పించాడు అంతే. ఆగంతకుడి ప్లాష్ బ్యాక్‌ని ఇంకాస్త బలంగా చూపిస్తే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. సైమన్ కె. కింగ్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. గుహన్ సినిమాటోగ్రఫి సినిమాకు చాలా ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాల్లో విజువల్స్ గూజ్బమ్స్ తెప్పించేలా ఉన్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ పర్వాలేదు. రామంత్ర క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రయత్నం మాత్రం బాగుంది. -
‘శ్యామ్ సింగరాయ్’మూవీ రివ్యూ
టైటిల్ : శ్యామ్ సింగరాయ్ నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడొన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్ర,జిస్సు సేన్ గుప్తా, అభినవ్ గౌతమ్,మురళీశర్మ తదితరులు నిర్మాణ సంస్థ : నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత : వెంకట్ బోయనపల్లి రచన : జంగా సత్యదేవ్ దర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్ సంగీతం : మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ : సను జాన్ వర్గేసే ఎడిటర్ : నవీన్ నూలి విడుదల తేది : డిసెంబర్ 24,2021 సినిమా ఫలితాలను పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేస్తూన్నాడు నేచురల్ స్టార్ నాని. అయితే గత రెండేళ్లేగా నానికి సరైన హిట్ మాత్రం దక్కలేదు. ఇటీవల విడుదలైన ‘టక్ జగదీష్’కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ‘శ్యామ్ సింగరాయ్’గా దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శ్యామ్ సింగరాయ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం(డిసెంబర్ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘శ్యామ్ సింగరాయ్’కథేంటంటే వాసు అలియాస్ వాసుదేవ్(నాని)కి సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ముందుగా ఓ షార్ట్ ఫిలీం తీయాలని డిసైడ్ అవుతాడు. దాంట్లో నటించేందుకు కీర్తి(కృతిశెట్టి)ని ఒప్పిస్తాడు. అనుకున్నట్లే తాను తీసిన షార్ట్ ఫిలీం ఓ ప్రొడ్యూసర్‌కి నచ్చడం...వెంటనే సినిమా ఆఫర్ ఇవ్వడం.. అది కూడా సూపర్ హిట్ కొట్టడంతో వాసు దశ మారిపోతుంది. తాను తీసిన తొలి సినిమానే హిందీలో రీమేక్ చేసే చాన్స్ వస్తుంది. ఓ నిర్మాణ సంస్థ అతనితో కొత్త సినిమా ఒప్పందం కుదుర్చుకొని, మీడియా సమావేశం పెడుతుంది. ఇదే సమయంలో కాపీ రైట్స్ కేసు కింద వాసు అరెస్ట్ అవుతాడు. ఈ కేసును ఎదుర్కొనే క్రమంలో వాసుకి శ్యామ్ సింగరాయ్, దేవదాసి మైత్రి(సాయి పల్లవి) గురించి తెలుస్తోంది. అసలు శ్యామ్ సింగరాయ్ ఎవరు? వాసుకి, శ్యామ్ సింగరాయ్‌కి సంబంధం ఏంటి? వాసుపై కాపీరైట్స్ కేసు ఎవరు, ఎందుకు వేశారు? మైత్రి, శ్యామ్ సింగరాయ్ల ప్రేమ వ్యవహారం ఎక్కడికి దారి తీసింది? ఈ లీగల్ సమస్యల్లోనుంచి వాసు ఎలా బయటపడ్డాడు?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. వాసు అనే అప్‌కమింగ్ డైరక్టర్ పాత్రతో పాటు విప్లవ రచయిన శ్యామ్ సింగరాయ్ అనే పాత్రలోనూ ఒదగిపోయాడు. ఒకే సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలను అవలీలగా పోషించాడు. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ అనే బరువైన పాత్రలో అద్భుతంగా నటించి.. మరోసారి నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమాలో నాని తర్వాత బాగా పండిన పాత్ర సాయిపల్లవిది. దేవదాసి మైత్రి అలియాస్ రోజీ పాత్రలో సాయి పల్లవి జీవించేసింది. తెరపై సరికొత్తలో లుక్‌లో కనిపించింది. సినిమా ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగా.. తెరపై సాయి పల్లవి కనిపించదు.. కేవలం దేవదాసి మైత్రి మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. వాసు ప్రేయసి కీర్తి పాత్రలో కృతిశెట్టి మెప్పించింది. నాని, కృతిశెట్టిల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్ బాగా పండింది. లాయర్ పద్మావతిగా మడొన్నా సెబాస్టియన్ పర్యాలేదనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. 1969 బ్యాక్ డ్రాప్ కథని నేటికి ముడిపెట్టి చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. ఫస్టాఫ్ అంతా నానీ శైలీలో సరదాగా సాగేలా పాత్రలను తీర్చిదిద్దిన దర్శకుడు.. అసలు కథని సెకండాఫ్‌లో చూపించాడు. టైటిల్ జస్టిఫికేషన్ ప్రకారం చెప్పాలంటే.. సెకండాఫ్ నుంచే ‘శ్యామ్ సింగరాయ్’సినిమా మొదలవుతుంది. సినిమా కథంతా ‘శ్యామ్ సింగరాయ్’చుట్టే తిరుగుతుంది. విప్లవ రచయితగా శ్యామ్ సింగరాయ్ పోరాటం.. దేవదాసి మైత్రితో ప్రేమాయణం, దేవదాసిల వ్యవస్థలోని లోపాలను అద్బుతంగా తెరకెక్కించాడు. జంగా సత్యదేవ్ రాసిన కథని ఎక్కడా డీవియేట్ కాకుండా తెరపై చక్కగా చూపించాడు. ‘ఒక తూటా ఒక్కరికే ...ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది’అనే ఒకే ఒక డైలాగ్‌తో శ్యామ్ సింగరాయ్ వ్యక్తిత్వం ఏంటి? అతని లక్ష్యం ఏంటో ప్రేక్షకులకు తెలియజేశాడు. అయితే కథలో పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం, ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగడం సినిమాకి మైనస్. ద్విపాత్రాభినయం సినిమాలలో ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా నడిపించడం.. అసలు కథని సెకండాఫ్‌లో చూపించడం కామన్. ఈ మూవీ కూడా అలాగే సాగుతుంది. ఇంటర్వెల్ వరకు శ్యామ్ సింగరాయ్ పాత్రని చూపించొద్దు కాబట్టి.. కథంతా వాసు, కీర్తిల చుట్టూ తిప్పారు. దర్శకుడిగా అతను పడే కష్టాలు.. కీర్తితో ప్రేమ.. ఇలా సాదా సీదాగా ఫస్టాఫ్‌ని ముగించాడు. ఇక సెకండాఫ్‌లో పూర్తిగా శ్యామ్ సింగరాయ్ గురించే ఉంటుంది. స్క్రీన్‌ప్లే కూడా అంతంత మాత్రంగా ఉంది. అయితే శ్యామ్ సింగరాయ్ గురించే తెలుసుకోవాలని సినిమా స్టార్టింగ్ నుంచి మనకి అనిపిస్తుంది కాబటి... స్క్రీన్‌ప్లే పెద్దగా ఇబ్బంది అనిపించదు. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా ఉంటుంది. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. సిరివెన్నెల రాసిన ‘నెలరాజుని… ఇల రాణిని కలిపింది కదా… సిరివెన్నెల’అంటూ సాగే పాట మరోసారి సిరివెన్నెలను స్మరించుకునేలా చేస్తుంది. మిగతా పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. సను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ కూడా హైలెట్. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘శ్యామ్ సింగరాయ్’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీలోనాని.. వాసు, శ్యామ్ సింగరాయ్ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శ్యామ్ సింగరాయ్’పై హైప్ క్రియేట్ అయింది. దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి వస్తున్న నాని సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెంచుకున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. శ్యామ్ సింగరాయ్‌గా నాని ఏమేరకు ఆకట్టుకున్నాయి? మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. #ShyamSinghRoy Movie mottam bagundhi okka aah court lo argument tappa .. Adhokkati antha effective anipinchaledhu — Chaitanya (@chaitutarak9999) December 24, 2021 రెండు విభిన్న పాత్రలో నాని ఒదిగిపోయాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.మిక్కీజెమేయర్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయిందట. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని, క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. రెండేళ్ల తర్వాత థియేటర్లోకి వచ్చిన నాని.. హిట్ కొట్టాడని ఎక్కువ మంది కామెంట్ చేశారు. Review: #ShyamSinghRoy Positives: 1. Nani 2. 2nd Half 3. Climax 4. Music Negatives: 1. Slow 1st half 2. Climax Reason why I put climax in both positives and negatives is that not all might like it!! I personally feel the climax is very poetic!!! Rating: 3/5 — AJ890 (@AJ89010) December 24, 2021 #ShyamSinghRoy A Must Watch Film 🔥 @Nani #Nani Performance 👏💥@MickeyJMeyer Bgm 🔥@Rahul_Sankrityn Completely justified This hype 👏🔥@Sai_Pallavi92 #SaiPallavi Brilliant performance👏 ❤ — Yakhub mohd (@mohd_yakhub) December 24, 2021 Jayam manadhera favor la undi cinema #ShyamSinghRoy — HappyGaVundu (@endakalam) December 24, 2021 First half: Decent first half with good introduction of CHARECTERS. Flash back scenes of #ShyamSinghRoy with #mickyjmayer BGM IS AWSOME. JUST going to main theme.@NameisNani awesome always.@IamKrithiShetty has decent role. @madonasbastuan good @rahulsankrity17 bro awesome you 👌 pic.twitter.com/rrqGYl4R5f — Praveen Chowdary Kasindala (@PKasindala) December 23, 2021 #ShyamSinghaRoy 1st 20 min slightly slow then story pickups pre interval scenes are to good 2nd half Nani is at his best Temple flight and dailouge 👌👌 story 👌👌 Direction - avg 2nd half songs 👌 Sai pallavi okok Overall Nani best performance 3/5 hit depends on mass audience https://t.co/NJ3C37ItzI — mithun chowdary (@mithunc39061254) December 23, 2021 #ShyamSinghaRoy - Another Disappointing film from #Nani after Tuck Jagadish. Second half is a total let down😑 Full Review Soon! — Viswa (@Vish_Rish) December 23, 2021 Sai pallavi Sai pallavi saipllavi Chalu @Sai_Pallavi92 🥰 Intha kanna hard core fan emi kavali #ShyamSinghaRoy Reviews 👌👌👌 Happy for Nani 😍 pic.twitter.com/Nl25LEdEuD — Kings (@Observe99945) December 23, 2021 Powerful intro of #SaiPallavi with that NATYAM 👌👌 Her expressions, postures, dance movements are just killing..killing 🔥🔥 That song & visuals are too good on screen.. this gave a good start for 2nd half#ShyamSinghaRoyPremiers #ShyamSinghRoy #Nani #ShyamSinghaRoyOnDec24th pic.twitter.com/TDaaTCIMRg — So Called Cinema (@socalledcinemaa) December 23, 2021 So hit kottesadu nani ayithe 👏🏻 this movie I vl remember as sirivennela gaari chivari sahityam 🙏🏻🙌🏻❤️ #ShyamSinghRoy — Haripriya❤️🔔 (@Priyaa_tweet) December 24, 2021 Show over for #ShyamSinghaRoy. overall a decent movie, only climax was weak. It feels like there is no payoff. 3/5 stars from me. #Nani #SSR #mickeyjmeyer #saipallavi — x0’s Reviews (@ripscrew2nite) December 23, 2021 #ShyamSinghaRoy falls flat in 2nd half😥. Nani was Natural as usual 😎💯. Average watch🙄. 1st half was interesting but second half could have been better. An average outing😅😢. Expected more😭. @MickeyJMeyer must songs & BGM main asset fr sure👌😥. @NameisNani @IamKrithiShetty pic.twitter.com/kRL09ASkVr — Shyam (Love All. Serve All. Help Ever. Hurt Never) (@SaiShyamManohar) December 23, 2021 -
‘పుష్ప’మూవీ రివ్యూ
టైటిల్ : పుష్ప - ది రైజ్ నటీనటులు : అల్లు అర్జున్ , రష్మికా మందన్న, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ, ధనుంజయ్, అజయ్ ఘోష్, బాబీ సింహా తదితరులు నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత : నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ దర్శకత్వం : సుకుమార్ సంగీతం : దేవీశ్రీప్రసాద్ సినిమాటోగ్రఫీ : మీరోస్లా కూబా బ్రోజెక్ విడుదల తేది : డిసెంబర్ 17,2021 టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఫలానా స్టార్ హీరో, డైరెక్టర్ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తమ అభిమాన హీరో.. ఫలానా డైరెక్టర్‌తో సినిమా చేస్తే హిట్ ఖాయమని అభిమానుల ధీమాతో ఉంటారు. అలాంటి కాంబోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌లది ఒకటి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య2’చిత్రాలు సూపర్ హిట్ అవడమే అందుకు కారణం. ఈ ఇద్దరు స్టార్స్లు 12 ఏళ్ల తర్వాత కలిసి చేసిన సినిమానే ‘పుష్ప’.రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్ ‘పుష్ప - ది రైజ్’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.‘అల వైకుంఠపురములో’లాంటి సూపర్ హిట్ తర్వాత బన్నీ... ‘రంగస్థలం’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న ‘పుష్ప’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘తగ్గేదే లే’అంటూ జానాల్లోకి దూసుకొచ్చిన ‘పుష్ప’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘పుష్ప’కథేంటంటే..? పుష్ప అలియాస్ పుష్పరాజ్(అల్లు అర్జున్) ఒక కూలీ. చెప్పుకోవడానికి ఇంటి పేరు కూడా లేకపోవడంతో చిన్నప్పుడే చదువు స్వస్తి చెప్పి ఊరమాస్‌గా పెరుగుతాడు. రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప అతి తక్కువ సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలకమైన వ్యక్తిగా ఉండే కొండారెడ్డి(అజయ్ ఘోష్)కు దగ్గరవుతాడు. సరుకును రోడ్డు దాటించడానికి మంచి ఉపాయాలు చెబుతూ.. ఎర్రచందనం స్మగ్లర్ల సిండికేట్‌లో భాగస్వామి అవుతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటికే సిండికేట్‌కు లీడర్‌గా ఉన్న మంగళ శ్రీను(సునీల్)కు పక్కలో బల్లెంలా తయారవుతాడు. ఈ క్రమంలో కొండారెడ్డి బ్రదర్స్‌తో పాటు మంగళం శ్రీనుతో శత్రుత్వం పెరుగుతుంది. మరి వారిని పుష్ప ఎలా ఎదుర్కొన్నాడు? ఎర్రచందనం సిండికేట్ లీడర్‌గా పుష్ప కు ఎదురైన సవాళ్లు ఏంటి? చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన తనను.. ఆ కారణంగా అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు? పాలు అమ్ముకునే అమ్మాయి శ్రీవల్లితో ప్రేమలో పడిన పుష్ప.. ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా? ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ లీడర్‌గా ఉన్న పుష్పకు.. కొత్తగా వచ్చిన ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్(ఫహాద్ ఫాజిల్)తో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేదే ‘పుష్ప.. దిరైజ్’కథ. ఎవరెలా చేశారంటే.. ‘పుష్ప’సినిమా అల్లు అర్జున్ వన్‌మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా మొదలైన మరు క్షణం నుంచి ప్రేక్షకులకు పుష్ప రాజ్ తప్ప అల్లు అర్జున్ కనిపించడు. మాస్‌లుక్‌లో బన్నీ అదరగొట్టేశాడు. చిత్తూరు యాసలో ఆయన పలికే డైలాగ్స్ అదుర్స్. యాక్షన్ సన్నివేశాలలోనూ బన్నీ విశ్వరూపం చూపించాడు. ప్రతి సన్నీవేశంలోనూ ‘తగ్గేదేలే’అన్నట్లు అల్లు అర్జున్ నటన ఉంది. ఇక పాలు అమ్ముకునే మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీవల్లీ పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. తొలిసారి డీగ్లామర్ పాత్రలో చేసిన ఈ భామ... శ్రీవల్లీ పాత్రకు న్యాయం చేసింది. మంగళం శ్రీనుగా సునీల్ అద్భుత నటనను కనబరిచాడు. ఎర్రచందనం స్మగ్లర్స్ సిండికేట్ నాయకుడిగా సునీల్ సూపర్ గా యాక్ట్ చేశాడు. తెరపై కొత్త సునీల్ కనిపిస్తాడు. కొండారెడ్డిగా అజయ్ ఘోష్, ఎంపీగా రావు రమేశ్ తమ అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. పుష్ఫకు అనుక్షణం అడ్డుపడే డీఎస్పీ గోవిందప్పగా శత్రు బాగా నటించాడు. అతని మేకోవర్ ఆకట్టుకునేలా ఉంది. ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డి తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించారు. ఇక ఎస్పీ భన్వర్ సింగ్ షేకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటించాడు. అతని పాత్ర ద్వితీయార్ధంలోనే వస్తుంది. ఇందులో అతని పాత్ర అంతంత మాత్రంగానే ఉన్నప్పటికే.. పార్ట్ 2లో పుష్ప రాజ్‌తో ఢీకొట్టే బలమైన వ్యక్తి ఇతనేనని హింట్ ఇచ్చారు. స్పెషల్ సాంగ్‌లో సమంత బాగా డాన్స్ చేసింది. వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ఇప్పటి వరకు వెండితెరపై స్మగ్లింగ్ నేఫథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘పుష్ప’కోసం దర్శకుడు సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యాన్ని ఎంచుకోవడం, దాని కోసం అల్లు అర్జున్‌ని పక్కా ఊరమాస్ లుక్‌లో మార్చడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవడంతో దర్శకుడు సుకుమార్ కొంతవరకు సఫలం అయ్యాడు. ఈ యాక్షన్ డ్రామాలో మదర్ సెంటిమెంట్‌తో లవ్ సెంటిమెంట్‌ని మిక్స్ చేసి కథను సాగించిన విధానం బాగుంది. శేషాచలంలో లభించే ఎర్రచందనం గొప్పదనాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభమవుతుంది. కూలీగా ఉన్న పుష్ప రాజ్.. స్మగ్లింగ్ మాఫీయా లీడర్‌గా ఎదిగిన తీరును ఆసక్తిగాకరంగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ నేపథ్యంతో వచ్చే సన్నివేశాలు.. ఇదివరకే వచ్చిన ఓ సినిమాను గుర్తు చేస్తాయి. ఫస్టాఫ్‌లో తండ్రి చనిపోయినప్పుడు.. పుష్ప రాజ్‌కు ఎదురయ్యే పరిస్థితులు ప్రేక్షకులను కాస్త ఎమోషనల్‌కు గురిచేస్తాయి. శ్రీవల్లితో ప్రేమ వ్యవహారం.. సీరియస్‌గా సాగుతున్న సినిమాకి అడ్డంగిగా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. ఎర్రచందనం సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే ఆసక్తికర అంశంతో సెకండాఫ్ మొదలవుతుంది. కానీ కథ సాదాసీదాగా సాగడం.. సినిమాకు కాస్త మైనస్. సిరియస్ మూడ్‌లో సాగుతున్న ఈ కథకి శ్రీవల్లి ప్రేమాయణం బ్రేకుల్లా అనిపిస్తాయి. ఇక చివరిలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాజిల్ పాత్ర పరిచయంతో కథపై ఆస్తక్తి పెరుగుతుందేమోనని ఆశించిన ప్రేక్షకులకు.. అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సాదాసీదాగా సాగుతాయి. ‘ఒకటి తక్కువుంది…’ అంటూ ఫహద్ ఫాజిల్ చేసే ఓవరాయాక్షన్ తట్టుకోవడం కాస్త కష్టమే. అయితే పార్ట్ 2లో అతని పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండేలా కనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. మూడు గంటల రన్ టైమ్ కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. ఈ సినిమాకు రెండో భాగం ఉంది కాబట్టి.. ఫస్టాఫ్‌ని ఇంకాస్త తగ్గిస్తే బాగుండేదేమో. ఇక సాంకేతిక విషయాకొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. అన్ని పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. ఆర్ట్ డిపార్ట్మెంట్ని అభినందిచాల్సిందే. అడవి వాతావరణం చూపించడానికి చాలా కష్టపడ్డారు. వారి కష్టమంతా తెరపై కనిపించింది. మిరోస్లా క్యూబా సినిమాటోగ్రఫీ మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళింది. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చూపించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘పుష్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
Pushpa Movie Review In Telugu: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం హ్యాట్రిక్ చిత్రం ఇది .రష్మిక మందాన్నా హీరోయిన్ నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్ ‘పుష్ప - ది రైజ్’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో రిలీజైంది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పుష్పపై అంచనాలు పెరిగాయి. అల్లు అర్జున్ తొలిసారి పాన్ ఇండియా చిత్రం చేయడం.. దాన్ని సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటంతో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. తానికి తోడు ప్రమోషన్స్‌ని అల్లు అర్జున్ దగ్గర ఉండి చూసుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) One Man Show - @alluarjun🌟 Again Proved He Can Drag Out The Biggest Movement In Theatres.#Pushpa 💥💥💥 — VijayDeverakonda Fans Club (@VJDeverakondaFC) December 17, 2021 ఈ సినిమాకు అల్లు అర్జున్ నటనే హైలెట్ అని చెబుతున్నారు. వన్‌మ్యాన్ షో చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అలాగే యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి అంటున్నారు. AA acting and dialogue delivery too good 👌👏 chithoor slang chithakoduthunnadu#Pushpa https://t.co/50qQfSJPq8 — 🤘 (@Robinh00d7) December 16, 2021 బన్నీ తప్ప ఎవరూ కనిపించలేదని ఇంకొకరు ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా బావుందని... చిత్తూరు యాసలో చిట్టకొడుతున్నాడని ఒకరు పేర్కొన్నారు #PushpaTheRise Review.. 👉 @alluarjun Another Level As #PushpaRaj 🔥 👉 @iamRashmika Lived In Her Charcter😍 👉 Songs,Love Track,Comedy,Visuals,Fights,Emotions🤙 👉 @Samanthaprabhu2 🔥 👉Climax👌 👉Bgm And Dubbing Could Have Been Better👍#Pushpa pic.twitter.com/bpbhxi2Tt7 — NEW UPDATES (@OTTGURUJINITHIN) December 17, 2021 Pushpa one word review: Outstanding. Allu Arjun best ever performance till date,, full mass entertainer.... Racy first half with intense second half... Direction, Music, BGM, DOP top class.. Good end to wait for THE RULEEEE......#Pushpareview #PushpaUSAPremiereOnDec16 #Pushpa — Siva kumar (@sivagvs) December 17, 2021 ST: #Pushpa💥 Thaggedhe Le..!!! pic.twitter.com/FcTbCM9TYr — Naveen Varma🇮🇳 (@naveennigidala) December 17, 2021 Good first half! Works for most of the time. Enough dose of entertainment.#Pushpa — Punisher! (@ranashish) December 17, 2021 #Pushpa fans ke nachatla inka family's ela vastru ra https://t.co/FFOOxW2gD1 — Pokiri (@pokiriee) December 17, 2021 #Pushpa Allu Arjun Mass performance, movie superb — Vamsi Pasupuleti (@vamsipasupuleti) December 17, 2021 #Alluarjun #pushpa #taggedele #blockbustermovie #industryhit 300 crore collection in 3 days. #Alluarjun acting is next level.. he deserves National award for his acting.. #iconstar #Panindiahitmovie https://t.co/h3sZsob29c — Kishore Siddharth (@Kishor_Siddhu) December 17, 2021 Good First Half 💥🔥🤙 Excellent Second Half💥🔥👌 Bunny Is Just 💥🔥👌#Pushpa — Adårsh Prïñçê°♡ (@AlwaysAdarsh_) December 17, 2021 Arey ee rashmik gadini close up shots theeyakandra 😭😭🤢#Pushpa — JN_ Tᴀℝℝℝᴀk (@Its_Me__JN) December 17, 2021 #Pushpa-Winner🔥 Decent/Good reviews, though not expected level from #Sukumar. 2nd Half >> 1st half, and this guarantees the box office success 👌@alluarjun 😍 #FahadhFaasil🔥#Pushpa#Pushpareview #PushpaReleaseDAY #Puspa #AlluArjun #Samantha #Rashmika #ThaggedeLe #PuspaTheRise https://t.co/KrFXkGPvZr pic.twitter.com/bXlHe19o6J — Sharath K Chandran (@ItsmeShk) December 17, 2021 #Pushpa full meals#PushpaRaj #PushpaReview#PushpatwitterReview #PushpaTheRiseOnDec17th pic.twitter.com/1hQIQwkbVc — OTTRelease (@ott_release) December 16, 2021 #pushpa its decent 3/5 - hit mixed reviews from anties or ppl with high expectations,its a Don/Godfather journey and does good justice to it,the grittiness has to be portrayed like in Godfather movies how the rise happens- some may feel low expecting script twists, well done — VJ (@TippaVj) December 16, 2021 Honest review as Bunny's Due hard fan --- First half starting 20 min will feel like some lag... but Trust me ... totally different bunny you are going to see 🔥🔥 mass !!! Mass!!! Mass!!! 🔥🔥🔥 Proud to be a fan of #AlluArjun #Pushpa #PushpaTheRiseFromTMRW #PushpaTheRise — Gundaraghava (@raghava_rohit) December 16, 2021 #PushpaTheRise BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️ Escapist cinema at its best... Aces: Allu Arjun's power-packed act + Swag+ dazzling action pieces + stunning visual appeal + ample thrills, twists, suspense... Dear BO, get ready for the typhoon.#Pushpa #AlluArjun #PushpaReview pic.twitter.com/Ojxg20qpEm — Yash 👑 (@PBSena1) December 17, 2021 1st half @alluarjun Nata vishwaroopam🔥🔥 Pichaaa masssss 🔥 one man show 🔥 #PushpaRaj comedy timing 👌👌🤩@iamRashmika and @alluarjun scenes 😘❤️ Mental masss anthe Waiting for second half #Pushpa ante flower anukuntiva fire 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#PushpaTheRise https://t.co/P0GdA2u7bO — mAdhuArjun_ ಕನ್ನಡಿಗ (@IamMadhuArjun) December 17, 2021 -
‘లక్ష్య’ మూవీ రివ్యూ
టైటిల్ : లక్ష్య నటీనటులు : నాగశౌర్య, కేతిక శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, శత్రు, రవిప్రకాశ్, సత్య తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి సంగీతం : కాలభైరవ సినిమాటోగ్రఫీ :రామ్‌రెడ్డి ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది : డిసెంబర్ 10, 2021 Lakshya Movie Review: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాగశౌర్య .. ఆ మూవీతో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ వైవిధ్యాన్నిచూపిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే ఇరవై పైగా సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ‘ఛలో’సినిమాతో నిర్మాతగా మారి తొలి చిత్రమే హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా, హీరోగా చేసిన నర్తనశాల, అశ్వథ్థామ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో చాలా గ్యాప్ తీసుకొని ఇటీవల లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’తో ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మరోసారి ప్రయోగానికి సిద్దమై.. తన కెరీర్లోనే తొలిసారిస్పోర్ట్స్ బేస్డ్ కాన్సెప్ట్‌తో ‘లక్ష్య’ మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ని కూడా కొత్తగా, చాలా గ్రాండ్‌గా చేయడంతో ‘లక్ష్య’పై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది? మరి ఈ సినిమా నాగశౌర్యను హిట్ ట్రాక్ ఎక్కించిందా? రివ్యూలో చూద్దాం కథేంటంటే.. పార్ధు(నాగశౌర్య) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో.. తాతయ్య రఘురామయ్య(సచిన్ ఖేడేకర్)దగ్గరే పెరుగుతాడు. అతని తండ్రి లాగే పార్దుకు కూడా విలువిద్య అంటే చాలా ఇష్టం. అతనిలోని క్రీడాకారుడిని గుర్తించిన తాతయ్య.. ఎలాగైన తన మనవడిని గొప్ప ఆర్చరీ ప్లేయర్ చేయాలని భావిస్తాడు. దాని కోసం ఊరిని వదిలి సిటీకి వస్తాడు. ఆస్తులన్ని అమ్మి మరీ మనవడి కోచింగ్ ఇప్పిస్తాడు. పార్ధు కూడా కష్టపడి స్టెట్ లెవన్ చాంపియన్ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్ ట్రయల్స్‌కి సన్నద్దం అయ్యే సమయంలో గుండెపోటుతో తాతయ్య మరణిస్తాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పార్ధు.. మత్తు పదార్ధాలకు బానిస అవుతాడు. డ్రగ్స్ తీసుకుంటేనే అతను వదిలిన బాణం గురి తప్పేది కాదు. ఈ విషయం తెలిసి అకాడమీ అతన్ని సస్పెండ్ చేస్తుంది. అసలు పార్థు మత్తు పదార్ధాలకు బానిస కావడానికి కారణం ఎవరు? అతని జీవితంలో రితికా పాత్ర ఏంటి? చనిపోదామనుకున్న సమయంలో పార్ధుని కాపాడిన సారథి(జగపతిబాబు)..ఎవరు? అతని నేపథ్యం ఏంటి? విలువిద్యకు దూరమైన పార్థు మళ్లీ చేత బాణం పట్టి రాణించాడా? వరల్డ్ చాంపియన్‌గా చూడాలనుకున్న తాతయ్య కోరికను నెరవేర్చాడా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారు? ఆర్చరీ ప్లేయర్ పార్థుగా నాగశౌర్య చక్కగా నటించాడు. ఈ సినిమాకు కోసం ఎనిమిది పలకల దేహాన్ని తయారు చేశాడు. అతను పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా నాగశౌర్య చాలా కొత్తగా కనిపించాడు. తాతయ్య చనిపోయినప్పుడు వచ్చిన ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక ‘రొమాంటిక్’భామ కేతికా శర్మ.. రితికా పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్‌తో కాకుండా నటనతో ఆకట్టుకుంది. హీరో తాతయ్యగా సచిన్ ఖేడేకర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. సారథిగా జగపతి బాబు నటన బాగుంది. సత్య, భరత్ రెడ్డి, శత్రులతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో చాలానే వచ్చాయి. ఒక్కడు, సై తో పాటు ఈ ఏడాదిలో వచ్చిన నితిన్ ‘చెక్’, సందీప్ కిషన్ ‘ ఏ1 ఎక్స్‌ప్రెస్’ కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కినవే. అయితే ‘లక్ష్య’ ప్రత్యేకత ఏంటంటే.. పూర్తిగా విలువిద్య నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా ఇది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో పాటు తాత మనవడి సెంటిమెంట్ కూడా ఉంది. అయితే అది తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్టాప్ అంతా సింపుల్‌గా, పాత సినిమాలు చూసినట్లుగా సాగుతుంది. ఎక్కడా వావ్ అనే సీన్స్ కానీ, ట్విస్టులు కానీ ఉండవు. కథంతా ముందే తెలిసిపోతుంది. హీరో డ్రగ్స్‌కి బానిస కావడం, దానికి కారణం ఎవరై ఉంటారనేది కూడా సినిమా చూసే సగటు ప్రేక్షకుడు ఇట్టే పసిగట్టగలడు. ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా కథ సాగడం సినిమాకు మైనస్. ఇంటర్వెల్ సీన్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించదు. సెకండాప్లో జగపతి బాబు ఎంట్రీ తర్వాత కాస్త ఆసక్తి కరంగా సాగుతుంది అనుకుంటే.. అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. కథ డిమాండ్ మేరకే ఎనిమిది పలకల దేహాన్ని తయారు చేశానని ఇంటర్యూల్లో నాగశౌర్య చెప్పారు. కానీ కథకు అది ఏరకంగా అవసరమే తెరపై చూపించలేకపోయాడు. క్లైమాక్స్ సీన్స్ కూడా చప్పగా సాగుతాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ కొత్తగా ఏమీ సాగదు. ఇక కాలభైరవ సంగీతం కూడా అంతంత మాత్రమే అనే చెప్పాలి. గతంలో మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చిన కాలభైరవ లాంటి యంగ్ మ్యూజిక్ డైరక్టెర్ నుంచి దర్శకుడు మంచి సాంగ్స్‌ని రాబట్టుకోలేకపోయాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా వర్కౌట్ కాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. దర్శకుడు వదిలిన బాణం గురి తప్పింది. కలెక్షన్ల పరంగా ‘లక్ష్య’ లక్ష్యం ఏమేరకు నెరవేరుతుంతో వీకెండ్ వరకు వేచి చూడాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘గమనం’మూవీ రివ్యూ
టైటిల్ : గమనం నటీనటులు : శ్రియ సరన్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ , శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు నిర్మాణ సంస్థ: క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ నిర్మాత : రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ దర్శకత్వం: సుజనా రావు సంగీతం : ఇళయరాజా సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ వి.ఎస్ విడుదల తేది : డిసెంబర్ 10, 2021 ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన శ్రియ సరన్.. చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తోంది. కెరీర్‌ని పక్కన పెట్టి పెళ్లి, పిల్లలు.. ఇలా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘గమనం’అనే విభిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గమనం’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘గమనం’కథేంటంటే..? సామాజికంగా వెనుకబడిన ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథే ‘గమనం’. ఇది హైదరాబాద్ మహానగరంలో మూడు ఏరియాల్లో జరిగే కథ. కలమ(శ్రియ సరన్) ఓ దివ్యంగురాలు. వినికిడి లోపంతో బాధపడుతుంది. ఆమెకు ఓ చిన్న పాప ఉంటుంది. తనకు వినికిడి లోపం ఉందని... భర్త కూడా వదిలేస్తాడు. దాంతో నిస్సహాయురాలిగా ఓ బస్తీలో జీవిస్తూ ఉంటుంది. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. మరోవైపు అలీ(శివ కందుకూరి) తల్లిదండ్రులను కోల్పోయి.. తాత, నానమ్మలతో కలిసి ఉంటాడు. క్రికెటర్‌గా రాణించాలని, పట్టుదలతో ప్రాక్టీసు చేస్తుంటాడు. అతన్ని ఇంటిపక్కనే ఉండే జరా(ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తుంది. ముస్లిం కుటుంబానికి చెందిన వీరిద్దరి ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. దీంతో జరా అలీ కోసం ఇంట్లో నుంచి పారిపోయి వస్తుంది. ఇంకోవైపు బస్తీలోని ఓ మురికి కాలువ పక్కన ఉండే ఇద్దరు వీధి బాలురు.. చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తుంటారు. వీరిలో ఒకరికి తన పుట్టిన రోజు వేడుకని జరుపుకోవాలని కోరిక పుడుతుంది. కేక్ కోసం డబ్బును జమ చేయాలని డిసైడ్ అవుతారు. చిత్తు కాగితాలు అమ్ముకోగా కొద్దిగా డబ్బు వస్తుంది. అది సరిపోవడం లేదని మట్టి వినాయకుల విగ్రహాలను అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ మూడు పాత్రలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటారు. ఆ వరదల్లో నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారు? భారీ వర్షాల కారణంగా కమల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అలీ క్రికెటర్ అయ్యాడా లేదా? అలీ, జరా పెళ్లి జరిగిందా? కేక్ కట్ చేసి గ్రాండ్‌గా పుట్టిన రోజు వేడుకను సెలెబ్రేట్ చేసుకోవాలనే వీధి బాలుర ఆశయం నెరవేరిందా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే? వినికిడి లోపం ఉన్న దివ్యాంగురాలు కమల పాత్రలో శ్రియ ఒదిగిపోయింది. ఇప్పటి వరకు తన గ్లామర్ తోనే ఆడియన్స్ ని అలరించిన శ్రియా.. ఈ మూవీతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో చాలా బాగా నటించింది. క్రికెటర్ అవ్వాలని ఆశ పడే ముస్లిం యువకుడు అలీ పాత్రలో శివ కందుకూరి మెప్పించాడు. క్లైమాక్స్‌లో వరదల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడే సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అలీని గాఢంగా ప్రేమించే ముస్లిం యువతి జరాగా ప్రియాంక జవాల్కర్ మెప్పించింది. వీధి బాలురుగా నటించిన ఇద్దరు చిన్నారులు అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే పాత్రలో బిత్తిరి సత్తి, అతిథి పాత్రలో నిత్యామీనన్‌లతో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ఆశయాలు, ఆశలు, ప్రేమ, పేదరికం, ఆకలి, మోసం, పరువు ఇలా మనిషిలోని అనేక భావోద్వేగాల సమాహారమే ‘గమనం’. మూడు భిన్న నేపధ్యాలను ఒక కథగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు సుజనా రావు. భర్త చేతిలో మోసపోయి... నిరాదరణకు గురైన ఓ దివ్యంగురాలు... ఆటతోనే తన కెరీర్ ను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలనే ఓ పట్టుదల ఉన్న యువకుడు.. పేదరికంలో మగ్గిపోయే ఇద్దరు వీధి బాలలు.. ఈ ముగ్గురి చుట్టే కథంతా తిరుగుతుంది. తొలి ప్రయత్నంగానే ఇలాంటి కథ ప్రేక్షకులను అందించాలనే దర్శకురాలి ఆలోచనను మనం అభినందించాల్సిందే. అయితే ఆమె ఎంచుకున్న మూల కథ బాగున్నా.. దాన్ని తెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డారు. కొన్ని సన్నివేశాల్లో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో బాగా చూపించారు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం, కథంతా నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఇళయారాజా నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్. ఈ మూవీలో ఒకటే సిట్యువేషనల్ సాంగ్ ఉంది. అది పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్లుగా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రశంసలు ఉంటాయి కానీ కమర్షియల్‌గా విజయం సాధించడం కష్టమనే చెప్పాలి. -
‘స్కైలాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : స్కైలాబ్ నటీనటులు : సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు నిర్మాణ సంస్థ: బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ నిర్మాతలు : పృథ్వీ పిన్నమరాజు, నిత్యా మేనన్ దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాది ఎడిటింగ్: రవితేజ గిరిజాల విడుదల తేది : డిసెంబర్ 4, 2021 విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సత్యదేవ్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘స్కైలాబ్’.నిత్యామీనన్ హీరోయిన్. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించాడు. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై సినిమాపై ఆసక్తి పెంచింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా భారీగా చేయడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శనివారం(డిసెంబర్ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్కైలాబ్’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘స్కైలాబ్’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1979 నాటికాలంలో సాగుతుంది. కరీంనగర్ జిల్లా బండలింగంపల్లి గ్రామానికి చెందిన గౌరి(నిత్యామీనన్).. జమీందార్ కూతురైనప్పటికీ జర్నలిజంలో తనేంటో నిరూపించుకోవాలనుకుని హైదరాబాద్‌లో ప్రతిబింబం పత్రికలో చేరుతుంది. ఎప్పటికైనా తన పేరుతో వార్త అచ్చువేయించుకుంటానని తండ్రితో సవాల్ చేస్తుంది. అయితే తన రాతల వల్ల పత్రికకు ఇబ్బందులు తప్ప లాభమేమిలేదని పత్రిక ఎడిటర్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేస్తాడు. రైటర్‌గా తనను తాను నిరూపించుకోవడానికి మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది గౌరి. అదే గ్రామానికి చెందిన డాక్టర్ ఆనంద్(సత్యదేశ్) సస్పెండై సొంతూరికి వచ్చి క్లినిక్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే తనకు కాస్త స్వార్థం ఎక్కువ. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తాడు. వీరితో పాటు అదేగ్రామానికి చెందిన సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ) కుటుంబం చేసిన అప్పులు తీర్చడానికి నానా తంటాలు పడుతుంటాడు. వివాదంలో ఉన్న తాత భూమి అమ్మితే చాలు.. అప్పులన్ని తీర్చి హాయిగా బతకొచ్చని భావిస్తాడు. ఇలా వేరు వేరు సమస్యలో సతమతమవుతున్న ఈ ముగ్గురు.. ఒక బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో. అమెరికా అంతరిక్ష ప్రయోగశాల నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వస్తాయి. అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందనే పుకార్లు వస్తాయి. ఆ సమమంలో గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? స్కైలాబ్ నిజంగానే బండలింగంపల్లి గ్రామంలో పడిందా? ఈ సంఘటన కారణంగా గౌరి, డాక్టర్ ఆనంద్, సుభేదార్ జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? అనేదే ‘స్కైలాబ్’మిగతా కథ. ఎవరెలా చేశారంటే... జర్నలిస్ట్ గౌరిగా నిత్య అద్భుతంగా నటించారు. హీరోయిన్లా కాకుండా.. గౌరి అనే పాత్రగా మాత్రమే తెరపై కనిపిస్తారు. ఆమె వాయిస్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక సత్యదేశ్, రాహుల్ రామకృష్ణ నటనకు వంక పెట్టాల్సిన అవసరంలేదు. నటులుగా వారు ఎప్పుడో నిరూపించుకున్నారు. డాక్టర్ ఆనంద్‌గా సత్యదేవ్, సుబేదార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆనంద్ తాతయ్య పాత్రలో తనికెళ్ల భరణి, గౌరి తల్లి పాత్రలో తులసి మరోసారి తమ అనుభవాన్ని చూపించారు. ఇక గౌరి ఇంట్లో పనిచేసే శ్రీను పాత్రలో కొత్త కుర్రాడు విష్ణు బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ? 1979లో సాగే పీరియాడికల్ మూవీ ఇది. అప్పట్లో స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విశ్వక్ ఖండేరావు. తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. అయితే అనుకున్న పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు తెరపై చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. కథ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అయితే కథ ఎప్పటికీ ముందుకుసాగదు. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక సెకండాఫ్‌లో అయినా కథలో వేగం పెరుగుతుందనుకుంటే.. అక్కడ కూడా అంతే. స్లోగా సాగుతూ.. బోర్ కొట్టిస్తుంది. అయితే క్లైమాక్స్ సీన్స్, సంభాషణలు బాగున్నాయి. అలాగే అంతర్లీనంగా అప్పట్లో మనషుల మధ్య ఉన్న వివక్షను చూపించే ప్రయత్నం బాగుంది. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం బాగుంది. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా సందర్భానుసారం వస్తాయి. రీ రికార్టింగ్ కూడా ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫికీ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 1979నాటి పల్లె వాతావరణాన్ని అద్భుతంగా తెరపై చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం మెచ్చుకోవాలి. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు బాగా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. ‘స్కైలాబ్’ప్రయోగం విఫలమైనా.. ప్రయత్నం మాత్రం బాగుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘అఖండ’మూవీ రివ్యూ
టైటిల్ : అఖండ నటీనటులు : బాలకృష్ణ, జగపతిబాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, సుబ్బరాజు, కాలకేయ ప్రభాకర్ తదితరులు నిర్మాణ సంస్థ: ద్వారకా క్రియేషన్స్ నిర్మాత : మిర్యాల రవిందర్ రెడ్డి దర్శకత్వం: బోయపాటి శ్రీను సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : సి రామ్ ప్రసాద్ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది : డిసెంబర్ 2, 2021 నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన `అఖండ`పై తొలి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’తర్వాత ఈ హిట్ కాంబోలో హ్యట్రిక్ మూవీ కావడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘అఖండ’పై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య గురువారం(డిసెంబర్ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. ‘అఖండ’కథేంటంటే అనంతపురం జిల్లాకు చెందిన మురళీకృష్ణ(బాలకృష్ణ) ఓ రైతు. ఊరికి పెద్ద, పేదవారికి అండగా ఉంటాడు. ఫ్యాక్షనిజం బాటపట్టిన యువతను దారి మళ్లీంచి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాడు. పేదవారి కోసం స్కూల్స్, ఆస్పత్రులు కట్టించి సేవ చేస్తుంటాడు. ఈ క్రమంలో అదే జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ శరణ్య(ప్రగ్యా జైశ్వాల్) మురళీ కృష్ణ మంచితనం చూసి మనసు పడుతుంది. తన ప్రేమ విషయాన్ని తెలియజేసి పెళ్లి చేసుకుంటుంది. కట్ చేస్తే.. వరద రాజులు(శ్రీకాంత్) వరదా మైన్స్ పేరుతో మైనింగ్ మాఫియా నడుపుతుంటాడు. తను చేస్తున్న అక్రమాలకు అడ్డొస్తున్నవారిని దారుణంగా హతమారుస్తుంటాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా యురేనియం తవ్వకాలను ప్రారంభిస్తాడు. ఈ తవ్వకాల వల్ల ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. విషయం తెలుసుకున్న మురళీకృష్ణ.. యూరేనియం తవ్వకాలను ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ వరదరాజులు తనకున్న పలుకుబడితో అతనిపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టిస్తాడు. ఈ క్రమంలో అఖండ(బాలకృష్ణ) ఎంట్రీ ఇచ్చి, మురళీకృష్ణ ఫ్యామిలీకి అండగా నిలుస్తాడు. అసలు అఖండ ఎవరు? మురళీకృష్ణ కుటుంబానికి అఖండకు సంబంధం ఏంటి? మైనింగ్ మాఫియా లీడర్ వరదరాజులు వెనుక ఉన్నదెవరు? మురళీకృష్ణ ఫ్యామిలీని అఖండ ఎలా కాపాడాడు? వరదరాజు ఆగడాలకు అఖండ ఎలా అడ్డుకట్ట వేశాడు?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. మరోసారి బాలకృష్ణ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం బాలకృష్ణ వన్‌మేన్ షో అనే చెప్పాలి. గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో కనిపించిన బాలయ్య.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ‘జైబాలయ్య’పాటకు ఆయన వేసిన స్టెప్పులు, అఖండ రూపంలో చేసే ఫైట్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. జిల్లా కలెక్టర్‌గా, మురళీకృష్ణ భార్యగా ప్రగ్యా జైశ్వాల్ ఆకట్టుకుంది. అటవి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పద్మావతి పాత్రలో పూర్ణ అద్భుత నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన శ్రీకాంత్.. తెరపై కొత్తగా కనిపించాడు. వరద రాజులు అనే క్రూరమైన పాత్రకు ఆయన న్యాయం చేశాడు. బాలకృష్ణ, శ్రీకాంత్ మధ్య వచ్చే సీన్స్ అదరిపోతాయి. సన్యాసిగా జగపతిబాబు, నెగెటివ్ షేడ్స్ ఉండే పోలీసు అధికారి రాజన్‌గా కాలకేయ ప్రభాకర్, శక్తిస్వరూపానందగా కనిపించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో సినిమా అంటే.. అభిమానుల అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. దానికి కారణం గతంలో వీరిద్దరు కలిసి ‘సింహా’, ‘లెజెండ్’సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడమే. ఈ సూపర్ హిట్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ అంటే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ‘అఖండ’లో ఉంటాయి. బాలయ్య మాస్ ఇమేజ్, బోయపాటి మార్క్ డైలాగ్స్‌తో ‘అఖండ’మూవీ సాగుతుంది. అడుగడుగున బాలయ్య అభిమానులు ఈలలు కొట్టించే సీన్స్ ఉంటాయి. ఫస్టాఫ్ అంతా మురళీకృష్ణ - శరణ్యల మధ్య ప్రేమాయణం, మైనింగ్ మాఫియా చేసే ఆకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. ఇంటర్వెల్‌కి ముందు అఖండ ఆగమనం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి బాలయ్య రెచ్చిపోతాడు. అఖండగా ఆయన చేసే ప్రతి ఫైట్ సీన్ బాలయ్య అభిమానులను ఈలలు వేయిస్తుంది. అయితే అదే సమయంలో సెకండాఫ్‌లో విపరీతమైన హింసకు తావిచ్చేరనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. పోరాట ఘట్టాలు, డైలాగ్స్‌తోనే సినిమాను లాక్కొచ్చాడు దర్శకుడు బోయపాటి. కథను పట్టించుకోకుండా హీరోయిజంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. బాలయ్య కనిపించే ప్రతి సీన్.. ఎంట్రీ సీన్‌లాగే ఉంటుంది. ఆయన చేసే ప్రతి ఫైట్.. క్లైమాక్స్ సీన్‌ని తలపించేలా ఉంటుంది. మొత్తంగా బాలయ్య అభిమానులకు అయితే బోయపాటి ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. జైబాలయ్య, అఖండ, అడిగా అడిగా.. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదరొట్టేశాడు. ముఖ్యంగా అఘోరా నేపథ్యంలో వచ్చే ప్రతి సీన్‌ని తనదైన బీజీఎంతో మరోస్థాయికి తీసుకెళ్లాడు. సినిమా స్టార్టింగ్ మొదలు.. ఎండింగ్ వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎం.రత్నం డైలాగ్స్ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి.కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. ద్వారకా క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అఖండ మూవీ ట్విటర్ రివ్యూ
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` నేడు(డిసెంబర్ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం, తానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘అఖండ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. బాలయ్య మాస్ డైలాగ్స్ ఏమేరకు ఆకట్టుకున్నాయి? మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. (చదవండి: ‘అఖండ’మూవీ రివ్యూ) Meeru tappu chesthey cell lo vestharu ! Memu hell lo vestham!! Both are not same!! Mass dialogue sequence followed by #Akhanda title song !! #AkhandaRoar !! So far second half 80% filled with action sequences !! — Sasi (@sasidharanne) December 2, 2021 ఫస్టాఫ్ చాలా బాగుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సెకండాఫ్ మాస్ ఎలిమెంట్స్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. తమన్ నేపథ్య సంగీతం అదిరిపోయిందట. బాలయ్య చెప్పే మాస్ డైలాగ్స్‌కి థియేటర్లలో ఫ్యాన్స్ ఈళలు వేయడం పక్కా అని ఓ నెటిజన్ కామెంట్చేశాడు. ఇక ఎప్పటి లాగే బాలయ్య తనదైన నటనతో రెచ్చిపోయాడట. అఘోరాగా బాలయ్య నటన సినిమాకే హైలెట్ అట. ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. Highlights are Balayya intro , interval bang, police station fight , and climax . No one can pull of aghora role better than Balayya . 🔥🔥 bgm leaves you in that trance .. boya mass will leave fans and mass audience fully satisfied movie concept is also very good #akhanda — Super Sampangi (@supersampangi) December 2, 2021 #Akhanda Live Updates FIRST HALF REPORT: Though ridiculously bad at times, the first half is fairly entertaining and engaging! Interval is 🔥🔥🔥 with Aghora Entry!!@MusicThaman Em BGM Raa, ADARAKOTTESAV 🔥🔥🔥. Peaks asalu!#AkhandaOnDec2nd#AkhandaRoaringFrom2ndDec — FDFSLiveAus (@FDFSLiveAus) December 2, 2021 @MusicThaman Dudeeee This is officially your ERA.. Mindblowing work #Akhanda — PST (@PSTtwtz) December 2, 2021 INTERVAL: #AkhandaMassJathara 🙏🏽🔥 Mass combo ki perfect example Balayya - Boya 💥💥#Akhanda — Anna Yaaru 🐯🌊 (@EV9999_Tarakian) December 2, 2021 Comedy lepesinattu next movie lo ee love scenes kuuda lepeyandi Boya gaaru #Akhanda — Sathwik Sriram (@sksathwik) December 2, 2021 Don't expect like legend& simha #Akhanda different masss bomma balaya acting 🔥🔥🔥 Boyapati approached differently & delivered BLOCKBUSTER @MusicThaman Biggest plus point rampage BGM congratulations @dwarakacreation thank you for bringing to ONLY THEATERS — fan of NTR (@Ntrfan999922) December 2, 2021 #Akhanda Review నటసింహం అన్న పదానికి అర్థం చూయించేసాడు ,, 💯🙏🏻 కుమ్మిమోపారదెంగాడయ్యా🤙🌪🌋#AkhandaMassJathara #Balayya 🦁 — Mahesh🖤Kajal (@MaheshKajal3) December 2, 2021 #Akhanda followed by Gopichand ,anil movies manchi linup set chesukunnadu balayya — vikky (@mnopq999) December 2, 2021 Mental ekkesindi ra ayya asalu. Interval fight nunchi start aithadi #Akhanda rampage, climax varaku kummutune untaadu. Bala-Boya-Thaman andaru kalipi duty chestharu, just mind blowing anthe. Every action sequence is still flashing in front of my eyes. — Hulkeshwara Shastry (@casual_babu) December 2, 2021 Kurnool mass jathara shuru 🔥🔥🤙💥💥 jai balaya jai balaya 🔥🙌💥#Akhanda #AkhandaMassJathara pic.twitter.com/jzsCsTlEie — tarak yusuf (@NtrYusuf) December 2, 2021 #Akhanda UK 1st half : ABOVE AVERAGE ( Dragged some love scenes) Boya perfectly targeted akhanda entry in interval and AKHANDA ARRIVES. 2nd half : ONLY ONE WORD BHAM AKHANDA FINALLY YOU WONT GET DISAPPOINTED WITH #BB3 #AkhandaOnDec2nd — tolly_wood_UK_Europe (@PsPk__Europe_UK) December 2, 2021 Balayya and srikanth confrontation💥💥💥💥💥...emi dialogues raa mawa #akhanda — Gangstar GASTINO🔔 (@shannu309) December 2, 2021 Hearing super positive response for #Akhanda from USA premiers. Mass Jathara Shuru 🤙🏻🤙🏻🤙🏻#AkhandaMassJathara #AkhandaFromToday #AkhandaRoar — Telugumovie USA (@TelugumovieUsa) December 2, 2021 #Akhanda 2haff kukka Rod antunaru .... — 𝐍𝐈𝐘𝐀𝐙 ᴋɪɴɢ👑 (@itsniyazKING) December 2, 2021 #Akhanda Roaring in theatres Positive talk #BheemlaNayak #RRR #RadheyShyam https://t.co/DElN4u3bXB — MANA MEMES KA ADDA (arun💥) (@arunakula4) December 2, 2021 This Decade is completely Belongs to @MusicThaman 💥💥💥 His Music & BGMs makes an Average Film as BLOCKBUSTERS A BGM Ka Baap Ban Gaya Rayyyy Kudos to His Hard Work This is Just Begining #Akhanda#BheemlaNayak #SarkaruVaariPataa — Guntur Box Office (@MacherlaMbfc) December 2, 2021 #Akhanda - No one can match #NBK’s Roudhram, aggression and diction. He lived in the role of #Aghora completely Complete Mass action loaded with “balayya elements” Single screens will be on 🔥 and it’s not a film of reviews. One in a while we get to watch this mass films pic.twitter.com/6KgFDBEETD — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 2, 2021 -
భగత్ సింగ్ నగర్ మూవీ రివ్యూ
టైటిల్ : భగత్ సింగ్ నగర్ నటీనటులు : విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, అజయ్ గోష్, ప్రభావతి తదితరులు నిర్మాత : వాలాజ గౌరి, రమేష్ ఉడత్తు దర్శకత్వం: వాలాజ క్రాంతి సంగీతం : ప్రభాకర్ దమ్ముగారి సినిమాటోగ్రఫీ : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి ఎడిటింగ్: జియాన్ శ్రీకాంత్ విడుదల తేది : నవంబర్ 26,2021 ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా ప్రజాదరణ లభిస్తోంది. అయితే చిన్న సినిమాలు అంటే కేవలం బూతు సినిమాలే అని చాలా మంది అనుకుంటారు. కానీ వాటిలో కూడా మంచి సందేశాత్మక చిత్రాలు ఉంటాయి. దానికి నిదర్శనమే ‘భగత్ సింగ్ నగర్’. విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచాల మధ్య విడుదలైన ‘భగత్ సింగ్ నగర్’ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే భగత్ సింగ్ నగర్ అనే మురికివాడలో స్నేహితులతో కలిసి సరదాగా తిరిగే కుర్రాడు శ్రీను(విదార్థ్). ఈ తొట్టి గ్యాంగ్‌లో చంద్రయ్య (ముని చంద్ర) అనే తాత కూడా ఉంటాడు. అతని ఇంట్లో పెరిగే అమ్మాయి లక్ష్మి (దృవీక), శ్రీనుతో ప్రేమలో ఉంటుంది. రోజంతా పనిచేయడం.. సాయంత్రం స్నేహితులతో మందుకొట్టడం శ్రీనుకి అలవాటుగా మారుతుంది. అయితే అదే ఏరియాలో మద్యానికి బానిసై కుటుంబాన్ని పాడు చేసుకున్న కొందరిని చూసి శ్రీను మద్యం సేవించడం మానేస్తాడు. ఆ ఏరియాలో గొడవలకు రాకుండా చూసుకుంటాడు. ఇంతలో భగత్ సింగ్ నగర్ లో కొందరు అమ్మాయిలు అపహరణకు గురవుతుంటారు. ఇలా కిడ్నాప్ అయిన అమ్మాయిలు ఏమవుతున్నారో చంద్రయ్య తెలుసుకుంటాడు. కానీ ఈ విషయం ఎవరకి చెప్పడు. శ్రీను లక్ష్మి ల పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకుని పెళ్లి జరిగే సమయానికి లక్ష్మిపై కొందరు అత్యాచారం చేస్తారు. అడ్డుకున్న శ్రీను కూడా చంపేస్తారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై మూసేసిన ఈ కేసుపై డాక్యుమెంటరీలు తీసుకునే యువకుడు భగత్ పోరాటం మొదలుపెడతాడు. అమాయకులపై జరిగిన ఘోరాలకు ఎమ్మెల్యే వైసీ రావు (అజయ్ ఘోష్ ) ఉన్న సంబంధం ఏంటి? ఈ గ్యాంగ్ పై భగత్ (విదార్థ్) చేసిన న్యాయపోరాటం ఫలించిందా? లేదా? భగత్ పోరాటానికి అనన్య (దృవీక) ఎలా హెల్ప్ చేసింది అనేదే ‘భగత్ సింగ్ నగర్’మూవీ మిగతా కథ. ఎలా చేశారంటే..? శ్రీను, భగత్ అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన విదార్థ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. శ్రీనుగా స్లమ్ బాయ్ గా సహజంగా కనిపించిన విదార్థ్...డాక్యుమెంటరీ మేకర్ గా సిటీ కుర్రాడిగా మారిపోయాడు. క్లాస్, మాస్ కారెక్టర్స్‌లో బాగానే కనిపించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. చూడడానికి తమిళ హీరోలా ఉన్నప్పటికీ.. పక్కా తెలుగింటి కుర్రాడు విదార్థ్. భవిష్యత్తులో హీరోగా రాణించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఇక లక్ష్మి, అనన్య పాత్రల్లో దృవీక కూడా అటు సంప్రదాయంగా, ఇటు మోడరన్ గా నటించి మెప్పించింది. ఎమ్మెల్యే సీవీఆర్ పాత్రలో అజయ్ ఘోష్ ఒదిగిపోయాడు. నెగెటీవ్ షేడ్స్ ఉన్న ఎస్ఐ క్యారెక్టర్లో బెనర్జీ తన అనుభవాన్ని చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే...? భగత్ సింగ్ నగర్లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథే భగత్ సింగ్ నగర్. సినిమా టైటిల్స్ లోనే దేశ భక్తుల ఫొటోలు, అన్యాయాలపై పోరాటం చేసిన ధీరుల చిత్రాలను చూపించారు. తప్పు జరిగితే తిరగబడాలనే స్ఫూర్తిని సినిమా ఆరంభం నుంచే కలిగించారు దర్శకుడు వాలాజ క్రాంతి. ఉన్నంతలో సినిమాను బాగా చేయడానికి తమ వంతు కృషి చేసారు. సొసైటీ మారాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలనే ఆలోచన రేకెత్తించారు. భగత్ సింగ్ నగర్ లో జరిగే అన్యాయాలపై శ్రీను తిరగబడటం చూస్తే ఇదే ఇన్స్ పిరేషన్ కలుగుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్లు మారాలంటే ముందు మార్పు తనలో రావాలనే మద్యపానం మానేస్తాడు శ్రీను. తన వాడలో ఎవరు మహిళలను కించపరిచినా వారికి తగిన బుద్ధి చెబుతాడు. ఇలా హీరోయిజంతో సినిమా సాగుతూనే, శ్రీను లక్ష్మిల మధ్య క్యూట్ లవ్ స్టోరీ చూపించారు దర్శకుడు క్రాంతి. అయితే కొన్ని ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా లేకపోవడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. ప్రభాకర్ దమ్ముగారి సంగీతం పర్వాలేదు. రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ.. ఓ మంచి సందేశాత్మక చిత్రమవుతుందని చెప్పొచ్చు. -
‘అనుభవించు రాజా’ మూవీ రివ్యూ
టైటిల్ : అనుభవించు రాజా నటీనటులు : రాజ్ తరుణ్, కషీష్ ఖాన్, పోసాని కృష్ణ మురళి, ఆడుగలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, అరియానా తదితరులు నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి నిర్మాత : సుప్రియ యార్లగడ్డ దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి సంగీతం : గోపీసుందర్ సినిమాటోగ్రఫీ : నగేశ్ బానెల్ ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్ విడుదల తేది : నవంబర్26, 2021 యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ సాలిడ్ హిట్‌గా చాలా కష్టపడుతున్నాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాజ్ తరుణ్..ఆ తర్వాత ఆ హవాను కొనసాగించడంలో విఫలమం అయ్యాడు. ఇప్పటి వరకు ఆయన డజన్‌కు పైగా చిత్రాలు చేసినప్పటికీ.. కెరీర్ మొదట్లో వచ్చిన ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ‘అనుభవించు రాజా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు.. సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ శుక్రవారం(నవంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనుభవించు రాజా’ను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘అనుభవించు రాజా’ కథేంటంటే పశ్చిమగోదావరి జిల్లా యండగండికి చెందిన బంగార్రాజు అలియాస్ రాజ్ (రాజ్ తరుణ్) పూర్వికులు కోటీశ్వరులు. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటకీ.. రాజ్ మాత్రం సొంత ఊరిని వదిలి హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తుంటాడు. ఇదే సమయంలో అతన్ని హత్య చేసేందుకు గని గ్యాంగ్‌కు ఓ వ్యక్తి పెద్ద ఎత్తున సుపారీ ఇస్తాడు. అసలు రాజ్ హత్య చేయడానికి సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? కోట్ల ఆస్తులకు అధిపతి అయిన రాజ్..సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఎందుకు చేశాడు? అతను గ్రామం నుంచి పారిపోవడానికి గల కారణాలేంటి? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే... జల్సారాయుడు లాంటి బంగార్రాజు పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయాడు. తనదైన కామిక్ టైమింగ్, ఎగతాళితో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఊర్లో అవారాగా తిరిగే బంగార్రాజుగా, సిటీలో సిన్సియర్‌గా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసే రాజ్‌గా రెండు విభిన్న పాత్రలో కనిపించిన రాజ్ తరుణ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కషీష్ ఖాన్ తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటీ.. ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక గ్రామ ప్రెసిడెంట్‌గా ఆడుగలమ్ నరేన్, సెక్యూరిటీ గార్డ్స్ హెడ్‌గా పోసాని మెప్పించారు. హీరో ఫ్రెండ్‌గా నటించిన సుదర్శన్.. తనదైన పంచ్‌లతో నవ్వించాడు. అజయ్, అరియానా, రవిలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? శ్రీను గవిరెడ్డి, రాజ్ తరుణ్ కాంబినేషన్లో ఇప్పటికే ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ’అనే మూవీ వచ్చింది. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సారి మాత్రం రాజ్ తరుణ్‌కు అచ్చొచ్చిన కామెడీ జానర్లో ‘అనుభవించు రాజా’తో మరో ప్రయత్నం చేశాడు దర్శకుడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించామంటూ.. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని మొదటి నుంచి దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. అయితే సినిమాలో మాత్రం మరీ పగలబడి నవ్వేంత సీన్స్ మాత్రం ఏమీ ఉండవు. ఫస్టాఫ్ అంతా హైదరాబాద్‌లో హీరోగా సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేయడం,అక్కడే హీరోయిన్‌తో ప్రేమలో పడడం లాంటి సన్నివేశాలతో ముగించిన దర్శకుడు.. ఇంటర్వెల్ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచేలా చేశాడు. ఇక సెకండాఫ్ మొత్తం పల్లెటూరి నేపథ్యంలో సాగుంది. అక్కడ కామెడీకి మరింత స్కోప్ ఉన్నప్పటికీ.. రోటీన్‌గానే కథను నడిపించారు. ప్రెసిడెంట్ ఎన్నికల సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. రోటీన్ కామెడీ సీన్స్‌తో లాగించాడు. అయితే ప్రెసిడెంట్ కుటుంబంలో జరిగే హత్య వెనుక ఉన్నదెవరనేది మాత్రం ప్రేక్షకుడికి ఆసక్తిరేకెత్తించేలా తెరకెక్కించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక సాంకేతిక విషయానికొస్తే... గోపీసుందర్ సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నగేశ్ బానెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఊహించనంత గొప్ప సినిమా అయితే కాదనే చెప్పాలి. -
‘దృశ్యం 2’ మూవీ రివ్యూ
టైటిల్ : దృశ్యం2 నటీనటులు : వెంకటేష్, మీనా, కృతికా, ఈస్టర్ అనిల్, నదియా, నరేష్, పూర్ణ, వినయ్ వర్మ తదితరులు నిర్మాణ సంస్థలు : సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ కథ, దర్శకత్వం : జీతు జోసెఫ్ సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : సతీష్ కురుప్ ఎడిటర్: మార్తాండ్ కే విడుదల తేది : నవంబర్ 25,2021 ఈ ఏడాది ప్రైమ్ లో చాలా కొత్త చిత్రాలు వచ్చాయి. కాని కొన్ని మాత్రమే నెటిజన్స్ ను మెప్పించడంతో పాటు ప్రైమ్ కు బోల్డంత పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి సినిమాల్లో ఒకటి దృశ్యం 2, మలయాళ వర్షన్. దృశ్యం మొదటి భాగం థియేటర్స్ లో దుమ్మురేపింది. దృశ్యం 2 మలయాళ వర్షన్ ప్రైమ్ లో విడుదలై ఓటీటీ వరల్డ్ ను షేక్ చేసింది. ఇప్పుడు అదే దారిలో తెలుగు వర్షన్ కూడా వెళ్లింది. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం 2 తెలుగు వర్షన్ నేటి (నవంబర్ 25)నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. దృశ్యం 2 కథేటంటే..? దృశ్యం మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి 'దృశ్యం 2' సినిమా మొదలవుతుంది. తన ఇంట్లో హత్యకు గురైన వరుణ్ అనే కుర్రాడి శవాన్ని రాంబాబు (వెంకటేశ్) కన్ స్ట్రక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టడంతో ‘దృశ్యం’ సినిమా ముగుస్తుంది. ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన రాంబాబు ఫ్యామిలీ ఉన్నత జీవితాన్ని గడుపుతుంటుంది. కెబుల్ బిజినెస్ చేసే రాంబాబు.. అంచెలంచెలుగా ఎదిగి సినిమా థియేటర్ ఓనర్ అవుతాడు. అంతేకాదు ఏకంగా ఓ సినిమాను నిర్మించేందుకు రంగంలోకి దిగుతాడు. ఇలా వారి జీవితంగా సాఫీగా సాగుతున్నప్పటీకీ.. వరుణ్ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. పోలీసులు ఎక్కడ కనిపించినా చాలు రాంబాబు భార్య జ్యోతి(మీనా, పిల్లలు అంజు (కృతిక), అను( ఏస్తర్ అనిల్) భయంతో వణికిపోతుంటారు. ఇదే క్రమంలో రాంబాబు జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీతా ప్రభాకర్ (నదియా), ప్రభాకర్ (నరేష్) మళ్లీ ప్రవేశిస్తారు. ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలని భావించిన గీత... తన స్నేహితుడు, ప్రస్తుతం ఐజీపీగా ఉన్న గౌతమ్ సాహు(సంపత్ రాజ్)సహాయంతో మళ్లీ ఆ కేసును రీఓపెన్ చేయిస్తుంది. మరి వరుణ్ కేసులో పోలీసులకు దొరికి ఆధారాలేంటి? కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సరికొత్త సాక్ష్యాలతో రాంబాబు కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చినప్పుడు ఈసారి అతను ఎలా బయటపడ్డాడు అనేదే ‘దృశ్యం 2’కథ. ఎవరెలా చేశారంటే..? రాంబాబు పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయాడు. దృశ్యం మాదిరే.. ఇందులో కూడా కథ మొత్తాన్ని తన భుజానా వేసుకొని నడిపించాడు. ‘దృశ్యం’లో కంటే ఈ సీక్వెల్ లో చాలా ఈజ్ తో ఆ పాత్రను పోషించాడు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌ని అద్బుతంగా పండించాడు. ఈ మూవీతో వెంకటేశ్ నటుడిగా వెంకటేశ్ మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. రాంబాబు భార్య జ్యోతి పాత్రకు మీనా న్యాయం చేసింది. నటన పరంగా బాగానే ఉన్నా.. డబ్బింగ్ అంతగా సూట్ కాలేదు. ఇక రాంబాబు పిల్లలుగా కృతిక, ఎస్తర్ అనిల్ కు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేశ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఐజీగా సంపత్ రాజ్, కానిస్టెబుల్‌గా సత్యం రాజేశ్, రాంబాబు లాయర్ గా పూర్ణ, రచయితగా తనికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. దృశ్యం’కు సీక్వెల్ ఇది. అదే తారాగణం. అదే నేపథ్యం. అదే కొనసాగింది. తల్లీకూతుళ్లు కుర్రాణ్ణి హత్య చేసిన ఆరేళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. ఈ మూవీ మలయాళ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజై, సూపర్ హిట్ అయింది. అయినా.. మళ్లీ తెలుగు ప్రేక్షకుల కోసం దర్శకుడు జీతూ జోసెఫ్ ఫ్రెష్ లుక్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు. మాతృకతో పోలిస్తే.. తెలుగు వర్షన్లో కొన్ని స్వల్ప మార్పులు చేశాడు దర్శకుడు. మలయాళంలో చివరి వరకు చెప్పని కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ని తెలుగులో ముందుగానే చెప్పాడు. మొదట కొంత భాగం బోర్ కొట్టించినా.. వరుణ్ కేసును పోలీసులు సీక్రెట్‌గా విచారిస్తున్నారని తెలియడంతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ పెరుగుతుంది. ఎవరూ ఊహించని ట్విస్టులతో సినిమాపై ఆసక్తి పెంచేశాడు దర్శకుడు. సెకండాఫ్‌లో కథ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు వేసే ఎత్తులు, పైఎత్తులు చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా చివరిలో రాంబాబు ఇచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. కోర్టు సన్నివేశాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్తాయి. మొత్తంగా దృశ్యం 2’ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి. ఇక సాంకేతిక విషయాలకొస్తే..అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ప్రతి ఫ్రేమ్‌ని అందంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు.ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పితే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ వెంకటేశ్ నటన కథ, కథనం సెకండాఫ్, క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘ఊరికి ఉత్తరాన’ మూవీ రివ్యూ
టైటిల్ : ఊరికి ఉత్తరాన నటీనటులు : నరేన్ వనపర్తి, దీపాళ్లీ శర్మ, ఆనంద చక్రపాణి, రామరాజు, అంకిత్ కొయ్య, జగదీష్, ఫణి తదితరులు నిర్మాణ సంస్థ : ఈగల్ ఐ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : వెంకటయ్య వనపర్తి, రాచల యుగేందర్ గౌడ్ దర్శకత్వం : సతీష్ పరమవేద సంగీతం : భీమ్స్ సెసిరోలియో సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ అరుపుల కథలో బలం ఉంటే చాలు.. హీరో ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘ఊరికి ఉత్తరాన’. టైటిలే డిఫరెంట్‌గా ఉండడం, ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘ఊరికి ఉత్తరాన’పై అంచనాలు పెరిగాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 19)థియేటర్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే వరంగల్ జిల్లా పర్వతగిరి పెద్ద పర్వతనేని శంకర్ పటేల్ (రామరాజు) సోదరి ప్రేమ వివాహం చేసుకుంటుంది. తనకి ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో.. ఆ యువకుడిని కాకతీయ తోరణానికి కట్టి ఉట్టి కొట్టిస్తాడు. ఇక ముందు ప్రేమ వివాహాలు చేసుకొనే ప్రతీ ఒక్కరికి ఇలాంటి శిక్షే ఉంటుందని గ్రామ ప్రజలను హెచ్చరిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన మేనకోడలు శైలు ( దీపాళీ శర్మ) పక్క ఊరికి చెందిన రాజు అలియాస్ కరెంట్ రాజు(నరేన్ వనపర్తి)ని ప్రేమిస్తుంది. ఓ కారణంగా వీరిద్దరు ఊరు విడిచి హైదరాబాద్‌కు పారిపోతారు. కానీ తెల్లారేసరికి శైలు పక్కన కనిపించదు. అసలు శైలు ఎక్కడికి వెళ్లింది? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా మోసం చేసి పారిపోయిందా? 30 ఏళ్ల వయసులో కరెంట్ రాజు కాలేజీలో స్టూడెంట్‌గా ఎందుకు చేరాడు? శంకర్ పటేల్ గురించి తెలిసినా వారిద్దరు ప్రేమలో ఎలా మునిగిపోయారు? కరెంట్ రాజు, శైలు ప్రేమను శంకర్ పటేల్ అంగీకరించాడా? లేదా?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. హీరో, హీరోయిన్లు కొత్త వాళ్లు అయినా బాగా నటించారు. అవారాగా తిరిగే కరెంట్ రాజు పాత్రలో నరేన్ ఒదిగిపోయాడు. బాధ్యత తెలియని యువకుడిగా, ప్రేమికుడిగా, కాలేజీ స్టూడెంట్‌గా పలు వేరియన్స్ ఉన్న పాత్రని అవలీలగా పోషించాడు. శైలుగా దీపాళీ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. హీరో తండ్రి కరెంట్ నారాయణగా ఆనంద చక్రపాణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. నెగెటీవ్ షేడ్స్ ఉన్న పర్వతనేని శంకర్ పటేల్ పాత్రలో రామరాజు సరికొత్తగా కనిపించారు. సినిమాలో మరో బలమైన పాత్ర తనది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ప్రేమకు మరణం లేదు కానీ ప్రేమిస్తే మరణమే.. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా ఇది. యూత్‌కి కనెక్ట్ అయ్యే కథను ఎంచుకొని.. అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించడంతో సఫలం అయ్యాడు దర్శకుడు సతీష్ పరమవేద. అతనికిది తొలి సినిమా అయినా ఎక్కడా కన్ఫ్యూజన్ కాకుండా, అనుభవజ్ఞుడు లా సుత్తి లేకుండా చెప్పాల్సిన పాయింట్ చెప్పాడు. రామరాజు, ఆనంద చక్రపాణి పాత్రలను ఎమోషనల్‌గా తీర్చిదిద్ది సినిమా స్తాయిని పెంచాడు. భారీ బడ్జెట్ చిత్రాలనే కాకుండా స్టార్ హీరోలను కూడా లీడ్ చేసే సత్తాను తన తొలి చిత్రంతోనే నిరూపించుకొన్నారు. అయితే సినిమాలో కొన్ని సాగదీత సీన్స్ మాత్రం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తాయి. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. భీమ్స్ సెసిరోలియో బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టేశాడు. శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫి బాగుంది. కాకతీయ తోరణం సెట్టింగును తెరపైన అద్బుతంగా చూపించాడు. ఎడిటర్ శివ శ్రావణి తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని అనవసరపు సీన్స్‌ని కట్ చేస్తే సినిమా మరింత క్రిస్పీగా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘ఛలో ప్రేమిద్దాం’ మూవీ రివ్యూ
టైటిల్ : ఛలో ప్రేమిద్దాం నటీనటులు : సాయి రోనక్, నేహా సోలంకీ, పొసాని కృష్ణమురళి, హేమ, అలీ, బాహుబలి ప్రభాకర్, సూర్య తదితరులు నిర్మాణ సంస్థ : హిమాలయ స్టూడియో మేన్సన్స్ నిర్మాతలు : ఉదయ్ కిరణ్ దర్శకత్వం : సురేష్ శేఖర్ రేపల్లే సంగీతం : భీమ్స్ సిసిరోలియో ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క సినిమాటోగ్రఫీ: అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి విడుదల తేది : నవంబర్ 19, 2021 `బ్లాక్ అండ్ వైట్`, ప్రియుడు సినిమాలతో టాలీవుడ్ లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కుమార్ తాజాగా హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. `ప్రెజర్ కుక్కర్` ఫేమ్ సాయి రోనక్, `90 ఎమ్ ఎల్` ఫేమ్ నేహ సోలంకి జంటగా నటించారు. సురేష్ శేఖర్ రేపల్లె దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అందమైన ప్రేమకథతో పాటు, థ్రిల్లింగ్ అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్సాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచింది. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 19)థియేటర్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన ‘ఛలో ప్రేమిద్దాం’ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. ‘ఛలో ప్రేమిద్దాం’కథేంటంటే.. వైజాగ్‌కు చెందిన ఆత్మరావు అలియాస్ రావు (సాయి రోనక్) ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్‌కు వస్తాడు. అదే కాలేజీలో చదువుతున్న మధుమతి(నేహా సోలంకీ)తో ప్రేమలో పడతాడు. మధుమతికి కూడా రావు అంటే ఇష్టం ఉన్నప్పటీ ఆ విషయం అతనికి చెప్పదు. చిత్తూరులో ఉన్న తన మామయ్య, ఊరిపెద్ద పెద్దప్ప(నాగినీడు), సోదరుడు శివుడు(సూర్య)లకు నచ్చితేనే తన ప్రేమను ఆత్మరావుకు చెప్పాలని ఫిక్స్ అవుతుంది. తన సోదరి పెళ్లికి ఆత్మరావుతో పాటు మిగతా స్నేహితులను ఇంటికి ఆహ్వానిస్తుంది మధుమతి. కట్ చేస్తే.. మధుమతి కిడ్నాప్‌కి గురవుతుంది. ఈ వ్యవహారంలో ఆత్మరావుతో పాటు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు మధుమతిని కిడ్నాప్ చేసిందేవరు? ఎందుకు చేశారు? ఈ కేసులో ఆత్మరావును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రియురాలి కోసం ఆత్మరావు చేసిన సాహసం ఏంటి? చివరకు మధుమతి తన ప్రేమ విషయాన్ని ఆత్మరావుకు చెప్పిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. కాలేజ్ స్టూడెంట్ ఆత్మరావు పాత్రలో సాయి రోనక్ ఒదిగిపోయాడు. డాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్ కూడా అదరొట్టాడు. ఇక అల్లరి పిల్ల మధుమతిగా నేహా సోలంకీ తనదైన నటనతో మెప్పించింది. హే భగవాన్ అల్లా జీసస్ అంటూ నవ్వులు పూయించడంతో పాటు తెరపై అందంగా కనిపించింది. `ఫోన్ ఎక్కువ మాట్లాడకండి.. మ్యాటర్ పనిచేయదు` అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. గ్రామపెద్దగా నాగీనీడు, అతనికి నమ్మదగిన వ్యక్తి శివుడు పాత్రలో సూర్య అద్భుత నటనను కనబరిచారు. కారుమంచి రఘు కామెడీ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఫ్రెండ్స్ గా భరత్,పవన్ ఫర్వాలేదనిపించారు.హీరో తండ్రిగా పోసాని, తల్లిగా హేమతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. సరదాగా జాలీగా ఉండే అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడిన తరువాత వారి ప్రేమ ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కొని నిలబడ్డారు అనేదే ‘ఛలో ప్రేమిద్దాం’కథ. యూత్‌కు నచ్చే పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లే.. అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించాడు. యూత్‌ఫుల్ డైలాగ్స్, కథ, కథనంతో లవ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించాడు. ఒకపక్క కాలేజీ లవ్‌స్టోరి చూపిస్తూనే.. మరోపక్క యాక్షన్ ఎపిసోడ్‌ని నడిపిస్తూ ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. అయితే సినిమా నిడివి మాత్రం ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ‘అత్తారింటికి దారిది’హోటల్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో గేతో వచ్చే సన్నీవేశాలు కూడా యూత్‌ని నవ్విస్తాయి. క్లైమాక్స్ మాత్రం మరింత క్రిస్పిగా రాసుకోవాల్సింది. ఎక్కువ సేపు క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండటంతో ఆడియెన్స్ సహనం పరీక్షించేలా అనిపిస్తుంది.ఇక సాంకేతిక విషయానికొస్తే.. భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగుంది. సురేష్ గంగుల రాసిన‘ఏమైందిరో’,‘జిందగి’పాటలలో పాటు మిగిలిన సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఎడిటర్ ఉపేంద్ర జక్క తన కత్తెరగా ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
రామ్ అసుర్ మూవీ రివ్యూ
టైటిల్ : రామ్ అసుర్ నటీనటులు : అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ తదితరులు నిర్మాత : అభినవ్ సర్ధార్,వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం : వెంకటేష్ త్రిపర్ణ సంగీతం : భీమ్స్ సిసిరోలియో విడుదల తేది : నవంబర్ 19, 2021 ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా ప్రజాదరణ లభిస్తోంది. కథలో బలం ఉంటే చాలు.. హీరో ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తున్నారు ప్రేక్షకులు. అందుకే విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘రామ్ అసుర్’. డైమండ్ చుట్టూ తిరిగే కథకు ఇద్దరి జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమా ప్రత్యేకత. ఇప్పటికే విడుదలైన పోస్టర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్‌గా చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను ‘రామ్ అసుర్’ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే... రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేడు. అదే సమయంలో తను ప్రాణంగా ప్రేమించిన ప్రియ(షెర్రీ అగర్వాల్).. బ్రేకప్ చెబుతుంది. దీంతో రామ్ బాగా డిస్టర్బ్ అవుతాడు. ఎలాగైన జీవితంలో కోలుకోవాలనే ఉద్దేశంతో స్నేహితుడి సహాయంతో తమిళనాడు వైదీశ్వరున్ కోయిల్‌లోని పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. ఆయన సూచన మేరకు సూరి (అభినవ్ సర్దార్) అనే వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూరికి, రామ్ కు సంబంధం ఏంటి? అస్సలు సంబంధం లేని వీళ్లిద్దరి జీవితాలు ఎలా కలిశాయి? సూరి ఎవరు.. అతని నేపథ్యం ఏంటి? చివరగా రామ్ కృత్రిమ వజ్రాలను తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడా? అనేది తెలియాలంటే థియేటర్స్‌కి వెళ్లి ‘రామ్ అసుర్’చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. సినిమాకి కీలకమైన సూరి పాత్రలో అభినవ్ సర్దార్ ఒదిగిపోయాడు. ఓ షేడ్ లో లవర్ బాయ్ గా, మరో షేడ్ లో ఎగ్రెసివ్ లుక్‌లో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక లవర్ బాయ్ రామ్ పాత్రకి రామ్ కార్తీక్ న్యాయం చేశాడు. రొమాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్‌లో కూడా అదరగొట్టేశాడు.షెర్రీ అగర్వాల్ తన గ్లామర్ డోస్ తో ఆకట్టుకోగా.. చాందిని తమిళరాసన్ తన పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన శివ పాత్రలో శాన్వీ సాల్మన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. విభిన్నమైన పాత్రని చాలా అవవోకగా పోషించి మెప్పించాడు. రామాచారిగా శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్‌తో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? కృత్రిమంగా డైమండ్ తయారుచేయడమనే కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘రామ్ అసుర్’.ఈ కాన్సెప్ట్ కు రెండు విభిన్న జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమాకు మరింత కొత్తదనం తీసుకొచ్చాడు దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ. అయితే ఇంత మంచి కాన్సెప్ట్ ను తెరపైకి పకడ్బందీగా తీసుకొచ్చారా అంటే మాత్రం పూర్తిగా అవునని చెప్పలేం. బడ్జెట్ పరిమితులు ఓవైపు, బలమైన స్టార్స్ లేకపోవడం మరోవైపు ఈ సినిమాను కాస్త వెనక్కి లాగినట్టు అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో రామ్ కార్తీక్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అతడి లవ్ ట్రాక్, రొమాన్స్ కు ఎక్కువ స్పేస్ ఇచ్చారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేవరకు కథ స్లోగా సాగుతుంది. అయితే ఎప్పుడైతే సెకెండాఫ్ స్టార్ట్ అవుతుందో ఇక అక్కడ్నుంచి 'రామ్ అసుర్' పరుగులుపెడుతుంది. ఈ విషయంలో దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణను మెచ్చుకోవాలి. తొలి సినిమాకే కాస్త క్లిష్టంగా, కష్టంగా అనిపించే కథను సెలక్ట్ చేసుకున్న వెంకటేష్.. సెకండాఫ్ నుంచి తన రైటింగ్ పవర్ చూపించాడు. స్క్రీన్ ప్లేలో, ట్విస్టుల్లో చమక్కులు చూపించాడు. సినిమాలో ప్రేమ, భావోద్వేగం, యాక్షన్‌తో ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్‌గా డీల్ చేశాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శంకర్ ఫైట్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే రామ్ అసుర్ సినిమా, టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ కొత్త కథను పరిచయం చేస్తుంది. -
‘కపట నాటక సూత్రధారి’ మూవీ రివ్యూ
టైటిల్ : కపట నాటక సూత్రధారి నటీనటులు : విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు నిర్మాత : మనీష్ (హలీమ్) దర్శకత్వం : క్రాంతి సైన సంగీతం : రామ్ తవ్వా నేపథ్య సంగీతం : వికాస్ బడిస ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్ విడుదల తేది : నవంబర్ 12, 2021 వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రలో నటించారు. నవంబర్ 12 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ చూద్దాం. కథేంటంటే..? ఒక బస్తీకి చెందిన యాదగిరి(విజయ్ శంకర్ ), సెంథిల్(సంపత్ కుమార్), పూర్ణ(చందులాల్), పుష్ప(అమీక్ష), కల్పన(సునీత) లు లైఫ్ లో గోల్‌ను అచీప్ కావాలనుకుని ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు.అలాంటి తరుణంలో బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని ఒక వ్యక్తి చెప్పడంతో ఆ లోన్ అమౌంట్ తో లైఫ్‌లో సెట్ అవ్వొచ్చని అప్లై చేస్తారు. అయితే వీరు అప్లై చేసిన బ్యాంకులో ఒక కస్టమర్ తను తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకొని వెళితే అది నకిలీ బంగారం అని తేలుతుంది. బ్యాంకు వాళ్లే ఈ మోసానికి పాల్పడుతున్నారని తెలుసుకున్న కస్టమర్స్.. ఈ విషయంపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణ కోసం సిన్సియర్ అండ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అరవింద్ (రుద్ర )ని రంగంలోకి దించుతుంది. అరవింద్ విచారణ చేపట్టే క్రమంలో బస్తీకి చెందిన ఆ ఐదుగురే 30 ఫెక్ అకౌంట్లను ఓపెన్ చేసి 99 కోట్లు అనగా 200 కేజీల బంగారం స్కాం చేశారని తేలుతుంది. దీంతో పోలీస్ ఆఫీసర్ రుద్ర ఈ బస్తీ గ్యాంగ్ ను అరెస్ట్ చేయడానికి వెళ్తాడు. ఆ తరువాత రుద్ర చేసే ఇన్వెస్టగేషన్ లో ఈ స్కాం వేరేవాళ్లు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో బ్యాంక్ మేనేజర్ కృష్ణ మూర్తి(భానుచందర్)తో పాటు బ్యాంకు ఉద్యోగులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. అసలు ఈ స్కాం ఎవరు చేశారు?ఎందుకు బ్యాంక్ ఎంప్లాయిస్ చనిపోతూ వుంటారు? ఈ స్కామ్ నుంచి ఈ ఐదుగురు బస్తీ వాసులు బయటపడ్డారా.. లేదా..? ఇంతకూ ఈ స్కాం లో అసలైన "కపట నాటక సూత్ర దారుడెవ్వరు? అనేదే మిగతా కథ. ఎలా చేశారంటే...? బస్తీవాసీ యాదగిగిగా విజయ్ శంకర్ తనదైన నటనతో మెప్పించాడు. సెంథిల్ పాత్రలో నటించిన కమెడియన్ శివారెడ్డి తమ్ముడు సంపత్ కుమార్ చక్కటి నటనను కనబరిచాడు. తెలివైన కుర్రాడు పూర్ణగా పాత్రకు చందులాల్ న్యాయం చేశాడు. పూలమ్ముకునే యువతి పుష్ప పాత్రలో అమీక్ష ఒదిగిపోయింది. ట్రాన్స్ జెండర్ కల్పనగా సునీత మెప్పిచింది. పోలీసాఫీసర్ రుద్ర పాత్రలో అరవింద్ అద్భుత నటనను కనబరిచాడు. ఇన్వెస్టగేషన్ చేసే క్రమంలో తన విశ్వరూపాన్ని చూపించాడు. బ్యాంక్ మేనేజర్ గా బాను ప్రసాద్, మేక రామకృష్ణ, విజయ్,మాస్టర్ బాబా ఆహిల్, రవిప్రకాష్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎన్ని వచ్చినా సరే.. ప్రేక్షకులు వాటిని బాగా ఆదరిస్తారు. అందుకే దర్శకుడు క్రాంతి సైన ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథను ఎంచుకున్నాడు. దానికి కొంత ప్రేమను జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రధాన పాత్రల భావోద్వేగాలు, బ్యాక్ డ్రాప్ సెటప్, పాత్రల ఎలివేషన్స్ బాగున్నాయి. మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడు క్రాంతి సైన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక సాంకెతిక విషయానికి వస్తే.. రామ్ తవ్వ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం అదిరిపోయింది. దొంతి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటర్ చోటా కె.ప్రసాద్ పనితీరు బాగుంది. రామకృష్ణ అందించిన మాటలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
తెలంగాణ దేవుడు మూవీ రివ్యూ
టైటిల్ : తెలంగాణ దేవుడు నటీనటులు : శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్, సుమన్, సునీల్, బ్రహ్మాజీ, సంగీత, మధుమిత, సత్యకృష్ణ, అజయ్, వెంకట్, కాశీ విశ్వనాధ్, వడత్యా హరీష్ తదితరులు నిర్మాత : మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ దర్శకత్వం : వడత్యా హరీష్ సంగీతం : నందన్ బొబ్బిలి ఎడిటింగ్: గౌతంరాజు విడుదల తేది : నవంబర్ 12, 2021 ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖుల జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరెకెక్కాయి. తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్సార్జీవిత కథ ఆధారం సినిమాలు వచ్చాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తెలంగాణ దేవుడు’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. తెలంగాణ దేవుడు కథేటంటే..? దర్శకుడు ముందుగా చెప్పినట్టే సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీని ఎమోషనల్ డ్రామాగా రూపొందించారు. విజయ్ దేవ్ (జిషాన్ ఉస్మాన్, శ్రీకాంత్) తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి దారి తీసిన కారణాలేంటి? చదువుకునే టైమ్‌లో విజయ్ దేవ్ ఎలా ఉండేవాడు? ఎలా విజయ్ దేవ్ ఉద్యమంలో అడుగుపెట్టి.. ఉద్యమ నాయకుడు అయ్యాడు? ఉద్యమ నాయకుడు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం అతను చేసిన ప్రయత్నాలేంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా ఆయన చేసిన అభివృద్ది ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘తెలంగాణ దేవుడు’కథ. ఎవరెలా చేశారంటే..? యువ విజయ్ దేవ్‌గా జిషాన్ ఉస్మాన్ అద్భుత నటనను కనబరిచాడు. జీషాన్కి ఇది తొలి సినిమా అయినప్పటికీ.. తెరపై ఎక్కడా జంకకుండా నటించాడు. యవ్వనంలో కేసీఆర్ ఇలానే ఉండేవాడు అన్నట్లుగా జిషాన్ నటన ఉంటుంది. స్టూడెంట్‌గా, కబడ్డీ ప్లేయర్‌గా, పెళ్లి, భూస్వాములను ఎదిరించి ఉద్యమం వైపు అడుగులు వేయడం వంటి ఘట్టాలలో జిషాన్ సమర్థవంతంగా నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుత విజయ్ దేవ్‌గా శ్రీకాంత్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. కేసీఆర్‌ని ఇమిటేట్ చేస్తూ నడక, ఆహార్యం ప్రదర్శించడమే కాకుండా కథనంతా తన భూజానా వేసుకొని నడిపించాడు. ఇక విజయ్ దేవ్‌కి విద్యాబుద్దులు నేర్పే గురువు పాత్రలో బ్రహ్మానందం ఒదిగిపోయాడు. భూస్వామిగా తనికెళ్ల భరణి, ప్రొఫెసర్ జైశంకర్‌గా సుమన్, విజయ్ దేవ్ కొడుకుగా చేసిన వెంకట్, రమేశ్ రావుగా అజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. తెలంగాణ దేవుడు ఎలా ఉందంటే..? ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌గా రూపుదిద్దుకున్న చిత్రమే ‘తెలంగాణ దేవుడు’. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటనేది అందరికి తెలిసిందే. అయితే చిన్నపుడు కేసీఆర్ ఎలా ఉండేవాడు? ఆయన ఉద్యమంలోకి ఎలా వచ్చాడు? అనే అంశాలను తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు వడత్యా హరీష్. తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమంలో కేసీఆర్ పాత్రపై చాలా సినిమాలే వచ్చాయి. కానీ పూర్తిగా ఉద్యమ నాయకుడి నేపథ్యంలో వచ్చిన మూవీ ఇదేనని చెప్పాలి. 1969 నుంచి కథను తీసుకున్నాడు. ముఖ్యంగా కేసీఆర్‌గారి చిన్నతనం నుండి మొదలుకొని తన కాలేజ్ లైఫ్, ఉద్యమం, సీఎం వరకు కథ సాగుతుంది. కేసీఆర్ జీవితం గురించి చెబుతూ.. కమర్షియల్ బయోపిక్‌లా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడనే చెప్పాలి. తండ్రి నడిపే తెలంగాణ ఉద్యమ పార్టీలోకి చేరిన విజయ్ దేవ్.. నేషనల్ పార్టీలోకి వెళ్లడం, ఆ తర్వాత ఓ ప్రాంతీయ పార్టీలోకి వెళ్లడం.. ఇవేవీ తెలంగాణ ఆశయానికి సహకరించడం లేదని అన్నింటికీ రాజీనామా చేసి మళ్లీ సొంతంగా పార్టీ పెట్టడం వంటి వన్నీ కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఈ విషయాలన్ని దాదాపు అందరికి తెలియడం, కథ కూడా నెమ్మదిగా సాగడం సినిమాకు కాస్త మైనస్. సీరియస్‌గా సాగుతున్న సినిమాలోకి మధ్య మధ్య వచ్చే కొన్ని పంచ్ డైలాగ్స్ , సీన్స్ కథలో సీరియస్ నెస్ ని తగ్గించేవిగా ఉన్నాయి. పూతరేకులు సీన్, రోశయ్య పాత్రలో చేసిన దుర్గయ్య సీన్స్ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇక సాంకేతిక విషయానికొస్తే.. నందన్ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతం అందించాడు. ఎడిటర్‌కి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసే అవకాశం అయితే ఉందనిపించింది. ఇక నిర్మాత జాకీర్ ఉస్మాన్ ఈ సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఆయన పెట్టిన ప్రతి పైసా.. సినిమాలో కనిపిస్తుంది. -
‘పుష్పక విమానం’ మూవీ రివ్యూ
టైటిల్ : పుష్పక విమానం నటీనటులు : ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేశ్, హర్థవర్దన్ తదితరులు నిర్మాణ సంస్థ : కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ నిర్మాతలు : గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ని దర్శకత్వం : దామోదర సంగీతం : రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్ విడుదల తేది : నవంబర్ 12, 2021 దొరసాని, మిడిల్ క్లాస్‌మెలోడీస్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ.ఇక ఇప్పుడు ఇక ‘పుష్ఫక విమానం’తో నటుడిగా ఆనంద్ మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎంనో అంచనాల మధ్య ఈ శుక్రవారం (నవంబర్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్పక విమానం’మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. పుష్పక విమానం కథేటంటే..? చిట్టిలంక సుందర్(ఆనంద్ దేవరకొండ) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియని అమాయకపు చక్రవర్తి. అతనికి మీనాక్షి(గీత్ సైని)తో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లైయిన కొద్ది రోజులకే మీనాక్షి వేరొకరితో పారిపోతుంది. ఊహించని ఈ విచిత్ర పరిస్థితిని సుందర్ ఎలా ఎదుర్కొంటాడు? అసలు మీనాక్షి ఎందుకు పారిపోయింది? భార్య పారిపోయిందనే విషయాన్ని సమాజానికి తెలియనీకుండా సుందర్ ఎలాంటి పనులకు ఒడిగట్టాడు? వాటి వల్ల సుందర్‌కు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? వెబ్ సీరీస్, షార్ట్‌ఫిలిం హీరోయిన్ రేఖకు సుందర్‌కు మధ్య సంబంధం ఏంటి? ఈ కథలోకి పోలీసాఫీసర్ రంగా(సునీల్) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? చివరకు మీనాక్షి దొరికిందా లేదా? అనేదే ‘పుష్పక విమానం’ కథ ఎలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండకు మూడో సినిమా ఇది. మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆనంద్ నటన కాస్త మెరుగుపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. అమాయకపు చేష్టలతో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. భార్య పారిపోయిందనే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, దానికి కప్పిపుచ్చడానికి సుందర్ చేసే పనులు అందరిని నవ్విస్తాయి. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆనంద్ అద్భుత నటనను కనబరిచాడు. ఇక మీనాక్షిగా గీత్ సైని మెప్పించింది. కథ మొత్తం తన పాత్ర చుట్టే తిరుగుతుంది. కానీ తెరపై ఆమె చాలా తక్కువ సమయమే కనిపిస్తుంది. అయినప్పటికీ ఉన్నంతతో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక సుందర్ నకిలీ భార్య రేఖ పాత్రలో శాన్వీ మేఘన ఒదిగిపోయింది. వెబ్‌సీరీస్, షార్ట్ ఫిల్మ్‌లు తీసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేఖ పాత్ర తనది. తెరపై మాస్ లుక్‌లో కనిపిస్తుంది.ఇక పోలీసాఫీసర్ రంగగా సునీల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీరియస్ లుక్‌లో కనిపిస్తూనే తనదైన పంచ్‌లతో నవ్వించాడు. స్కూల్ హెడ్మాస్టర్గా నరేశ్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పుష్పక విమానం ఎలా ఉందంటే.. ? పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు దామోదర. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై మాత్రం అంత ఆస్తక్తికరంగా చూపించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఏమీ ఉండదు. భార్య మిస్సయిందనే పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇస్తే పరువు పోతుందని.. తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అదే సమయంలో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపించి ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెడతాయి. కానీ ఇంటర్వెల్ ముందు ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుకుంది. మీనాక్షిని ఎవరు హత్య చేశారనే విషయాన్ని చివరివరకు చెప్పకుండా, సెకండాఫ్‌లో కథను ఆసక్తికరంగా నడిపించాడు. అయితే పోలీసు విచారణ మాత్రం నాటకీయంగా సాగడం సినిమాకు మైనస్. దానికి తోడు కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం బాగుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’అనే సాంగ్ మినహా మిగతా పాటలన్ని అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం చక్కగా అందించారు. కథలో భాగంగానే పాటలు వస్తాయి తప్ప తెచ్చిపెట్టినట్లు ఎక్కడా అనిపించదు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రివ్యూ
టైటిల్ : మంచి రోజులు వచ్చాయి నటీనటులు : సంతోష్ శోభన్, మెహరీన్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు నిర్మాణ సంస్థ : యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ నిర్మాత : ఎస్కేఎన్ దర్శకత్వం : మారుతి సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్ విడుదల తేది : నవంబర్ 4, 2021 Manchi Rojulu Vachayi Review: ఒకవైపు పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో తనకు నచ్చిన కాన్సెప్ట్‌తో చిన్న చిన్న సినిమాలు తీస్తుంటాడు దర్శకుడు మారుతి. అలా ఆయన తెరకెక్కించిన మరో చిన్న చిత్రమే ‘మంచి రోజులు వచ్చాయి’.దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అతి భయస్తుడైన తిరుమలశెట్టి గోపాల్ అలియాస్ గుండు గోపాల్(అజయ్ ఘోష్)కి కూతురు పద్మ తిరుమల శెట్టి అలియాస్ పద్దు(మెహ్రీన్ ఫిర్జాదా) అంటే ప్రాణం. తన కూతురు అందరి ఆడపిల్లలా కాదని, చాలా పద్దతిగా ఉంటుందని భావిస్తాడు. అయితే పద్దు మాత్రం బెంగళూరు సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూ.. సహోద్యోగి సంతోష్(సంతోష్ శోభన్)తో ప్రేమలో పడుతుంది. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సంతోషంగా ఉండే గోపాల్ని చూసి అసూయ పడిన పక్కింటి వ్యక్తులు పాలసీ మూర్తి, కోటేశ్వరరావు.. ఆయనలో లేనిపోని భయాలను నింపుతారు. కూతురు ప్రేమ విషయంలో లేనిపోని అనుమానాలను నింపుతారు. దీంతో గోపాలం కూతురి విషయంలో ఆందోళన చెందడం మొదలుపెడతాడు. ఎలాగైన కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో గోపాల్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రియురాలు పద్దు ప్రేమను దక్కించుకోవడానికి సంతోష్ చేసిన ప్రయత్నాలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఈ సినిమాకు ప్రధాన బలం అజయ్ ఘోష్ పాత్రే. గుండు గోపాల్‌గా అజయ్ అదరగొట్టేశాడు. కథ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా తనదైన కామెడీ యాక్టింగ్‌తో నవ్వించాడు. పద్దుగా మెహ్రీన్, సంతోష్‌గా సంతోష్ శోభన్ పాత్రల్లో పెద్దగా వైవిద్యం కనిపించదు కానీ.. వారిమధ్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పాలసీ మూర్తిగా శ్రీనివాసరావు అద్భుత నటనను కనబరిచాడు. వెన్నెల కిశోర్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి, రజిత తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. ఎలా ఉందంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కంటనీరు పట్టిస్తున్నాడు. ‘మంచి రోజులు వచ్చాయి’కూడా అలాంటి చిత్రమే. ‘భయం’అనే అంశాన్ని తీసుకొని ఎప్పటిలానే ఎమోషన్స్ జోడిస్తూ హాస్యంతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీనికోసం కరోనా పరిస్థితును కూడా వాడుకున్నాడు. ఫస్టాఫ్ అంతా మారుతి మార్క్ కామెడీ, పంచులతో సరదాగా గడిచిపోతుంది. డాక్టర్‌గా వెన్నెల కిశోర్ ఫ్రస్ట్రేషన్, సప్తగిరి అంబులెన్స్ సీన్స్, అప్పడాల విజయలక్ష్మీ ఫోన్ కాల్ సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కరోనా పరిస్థితుల సన్నీవేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా రొటీన్‌గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా ఊహకందే విధంగా ఉంటుంది. క్లైమాక్స్‌లో భయం గురించి సాగిన చర్చ ఆలోచింపజేసేదిగా ఉంటుఉంది. ఇక సాంకెతిక విభాగానికి వస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
పెద్దన్న మూవీ రివ్యూ
టైటిల్ : పెద్దన్న నటీనటులు : రజనీకాంత్, నయనతార, కీర్తి సురేశ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, మీనా, ఖుష్బు తదితరులు నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్ దర్శకత్వం : శివ సంగీతం : డి. ఇమాన్ సినిమాటోగ్రఫీ : వెట్రీ విడుదల తేది : నవంబర్ 4,2021 సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద దీపావళి సంబరాలను ప్రారంభించాడు. ‘అన్నాత్తే’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్లో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే ‘పెద్దన్న’ పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. ఈ సినిమాలో కీర్తి సురేశ్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ‘పెద్దన్న’హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య గురువారం(నవంబర్ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్దన్న’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘పెద్దన్న’కథేంటంటే? తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన వీరన్న(రజనీకాంత్)కు చెల్లి కనకమహాలక్ష్మీ అలియాస్ కనకమ్(కీర్తి సురేశ్) అంటే అమితమైన ప్రేమ. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో చెల్లిని గారాబంగా పెంచాడు. చెల్లి సంతోషం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికైనా వెనకాడడు. అంత ప్రేమగా చూసుకునే అన్నయ్య చూసిన పెళ్లి సంబంధం కాదని.. కనకమహాలక్ష్మీ కలకత్తాకు పారిపోతుంది. అసలు కనకమహాలక్ష్మీ అన్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఎందుకు పారిపోయింది? కలకత్తాలో ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? మరికొద్ది గంటల్లో పెళ్లి ఉండగా పారిపోయిన చెల్లి విషయంలో వీరన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చెల్లికి వచ్చిన సమస్యలను ఎలా తీర్చాడు? చివరకు ఈ అన్నా చెల్లెళ్లు ఎలా కలిశారు అనేదే ‘పెద్దన్న’కథ. ఎవరెలా చేశారు? సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వయసు పెరుగుతున్నా.. స్టామినా మాత్రం తగ్గడంలేదు. తనదైన స్టైల్, యాక్టింగ్‌తో ఇప్పటికీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘పెద్దన్న’కూడా పూర్తిగా రజనీకాంత్ జనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. గ్రామపెద్ద వీరన్న పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. తనదైన పంచ్ డైలాగ్స్, యాక్టింగ్‌తో సినిమా భారాన్ని మొత్తం తనపై వేసుకొని నడిపించాడు. తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం కూడా చేశాడు. ఇక వీరన్న చెల్లెలు కనకమహాలక్ష్మీ పాత్రలో కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రే కీలకం. కథను మలుపుతిప్పే కనకమ్ పాత్రలో కీర్తి పరకాయప్రవేశం చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుత నటనను కనబర్చింది. ఇక లాయర్ పార్వతిగా నయనతార తన పాత్రకు న్యాయం చేసింది. విలన్స్‌గా జగపతిబాబు, అభిమన్యు సింగ్ ఆకట్టుకున్నారు. మీనా, ఖుష్బూలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ‘పెద్దన్న’కథను పక్కా రజనీకాంత్ ఇమేజ్‌కి సరితూగే విధంగా రాసుకున్నాడు దర్శకుడు శివ. రొటీన్ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ అంతా రజనీ అభిమానులు అశించే డైలాగ్స్, ఫైట్స్, స్టైల్‌తో ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథలో ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సింపుల్‌గా సాగుతుంది. ఎన్నో సినిమాల్లో చూసిన చెల్లెలు సెంటిమెంట్ సీన్స్‌తో సెకండాఫ్‌ని నెట్టుకొచ్చాడు. కథలో ఎమోషనల్ సీన్స్ పండించడానికి స్కోప్ ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా కసరత్తు చేయలేదనే అభిప్రాయం కలుగుతుంది. అలాగే మీనా, ఖుష్బుల పాత్రలు కూడా పేలవంగా అనిపిస్తాయి.రజనీకాంత్ సినిమా కాబట్టే వాళ్లు ఆ పాత్రలు చేయడానికి ముందుకొచ్చారేమోనని అనిపిస్తుంది. సినిమా ముగుస్తుందనే సమయంలో విలన్స్‌గా జగపతిబాబు, అభిమన్యు సింగ్ పాత్రలను పరిచయం చేసి కథను సాగదీశాడనే అభిప్రాయం కలుగుతుంది. ఇక క్లైమాక్స్ ఫైట్ సీన్స్‌లో కీర్తిసురేశ్ తనను కాపాడుతున్న దెవరో తెలియక అయోమయంగా ముఖం పెట్టడం.. చెల్లికి కనిపించకుండా విలన్స్‌ని అన్న కొట్టడం... ఇవన్నీ రొటీన్ సీన్స్లాగానే అనిపిస్తాయి. ఇక కమర్షియల్ సినిమా ఎండింగ్ స్టైల్లోనే ఈ సినిమా కూడా ముగించాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉంటుంది. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. ఇమాన్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. హాలీ హాలీ.. సాంగ్ మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నీవేశాలకు ప్రాణం పోశాడు. వెట్రీ సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సన్నివేశాలను తెరపై చాలా బాగా చూపించాడు. ఎడిటర్ రెబెన్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఎనిమి మూవీ ట్విటర్ రివ్యూ
యాక్షన్ హీరోగా తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు విశాల్. ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. తాజాగా విశాల్ నటించిన మరో యాక్షన్ చిత్రం ‘ఎనిమి’.ఈ సినిమాలో విశాల్ తోపాటు మరో హీరో ఆర్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గ నటిస్తున్నాడు. అలాగే ఆర్య నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. నోటా చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మతా మోహన్‌దాస్, మృణాళిని కథానాయికలు. ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. సింగపూర్‌లో లిటిల్ ఇండియా అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్లు ఎలా కలుస్తారు? అన్నది చిత్ర కథాంశం. సినిమాలో యాక్షన్‌తో పాటు డైగాగ్స్ బాగాను ఉన్నట్లు తెలుస్తోంది. #Enemy first half 🔥🔥🔥🔥🔥 Anand Shankar 💥 Aarya 🥵🧨🧨🧨🧨 pic.twitter.com/MvviWtx1Fj — MSR (@itz_chillax) November 4, 2021 #EnemyFDFS fans celebration @RohiniSilverScr 💥💥#Enemy Massive entry thalaivaa @VishalKOfficial One of the finest score points @SamCSmusic bgm is just lit 💥@arya_offl @mirnaliniravi @vinod_offl @anandshank @VffVishal pic.twitter.com/CT0IKPyE5F — Esh Vishal (@Eshvishaloff) November 4, 2021 #Annaatthe Review சரியில்லை நம்ம #ENEMY பார்க்க கிளம்புவோம்... — திண்டிவனத்தான் (@itsmetdm) November 4, 2021 #Enemy Epdi Iruku Frands — Thala Ragav™👑 (@Ragav_Tweetz) November 4, 2021 Million Thanks to my brother @VishalKOfficial for making me a part of this film 🤗🤗Had the best time working with @anandshank 😍🤗 💪 Thank you @vinod_offl darling for believing us and making #Enemy special 😍🤗 @RDRajasekar sir u r 😍😍 Happy Diwali everyone 😘💥💥 pic.twitter.com/ruKT2CYFZk — Arya (@arya_offl) November 4, 2021 #Enemy will be flop. Investment recovery is not guaranteed. #Annaatthe getting rave reviews. Industry Hit record will be sure. Watch it soon in theaters only. — AnnaattheTheFilm (@AnnaattheMovie) November 4, 2021 #Enemy review எப்டீ இருக்குன்னு போய் பார்த்தா அவனுங்க நமக்கு முன்னாடி எனிமி ரிவியூவ் எப்டீ இருக்குன்னு கேக்குறானுங்க😍🙌 — ѕ ι я α н🕊️ᴠᴋ (@Prabhaharish7) November 4, 2021 #Enemy Deepawali Than Pola 🙄🔥🔥🔥🔥 — Salva Reviews😷 (@SalvaReviews) November 4, 2021 தீபாவளி னாலே தளபதி தான் போல... புரட்ச்சி தளபதி மாஸ் #Enemy 🔥 — кαι ρυℓℓα (@KPM_Offi) November 4, 2021 #EnemyDeepavali BlockBuster #Enemy — Ansari (@Ansari0401) November 4, 2021 -
‘పెద్దన్న’మూవీ ట్విటర్ రివ్యూ
సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద దీపావళి సంబరాలను ప్రారంభించాడు. ‘అన్నాత్తే’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్లో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే ‘పెద్దన్న’ పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. ఈ సినిమాలో కీర్తి సురేశ్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ‘పెద్దన్న’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. Old school melodrama of brother sister sentiment didn't work initially with lot of filler scenes but movie picks pace exactly after an hour and gets intense and massy by end of first half #Peddanna #Annaththe #AnnaattheDeepavali #AnnaattheThiruvizha #AnnaattheFDFS — HarveySpector (@PoolaShirt) November 4, 2021 ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా వుంది.. అవుట్ డేటడ్ కామెడీ.. ఓవర్ సెంటిమెంట్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి.. రజిని మార్క్ మాస్ సీన్స్ మాత్రమే హైలెట్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. Just finished FDFS in #melbourne. @directorsiva best till date. It’s a sure shot industry hit. Mark my tweet. #Rajinikanth awesome sir. #Annaatthe — Glitz (@Jesse19100220) November 4, 2021 #Annaatthe first half - Superstar Rajinikanth is in fine form and his sister sentiment with @KeerthyOfficial picks up the momentum only towards the intermission with a twist. The interval bang with a powerful action episode packs a punch. @immancomposer songs are a big plus! — Rajasekar (@sekartweets) November 4, 2021 Basic gaa eedi @rajinikanth divasam yeppudoo chesesaaru..aa Sankarudi valla kona voopiri tho kottukunnaadu Robo nunchi Shivaji varaku..tarvatha aa sankarudu koodaa kaapaadaleka poyyaadu..yendhukuraa Rajini ga distributors ante antha kaksha niku💦💦 #Annaatthe #Peddanna — pSPk (@SimplySukiP) November 4, 2021 Okayish 1st half...Thalaivar pure mass from pre-interval to interval block🔥#Annaatte #Peddanna https://t.co/ehuMGyB9Se — 𝖀𝖕𝖕𝖎 (@__UpendraDhfm) November 4, 2021 One word Review: BLOCKBUSTER #Annaatthe: 🌟🌟🌟🌟 (4/5) 1½ Good in parts,2½ Bang for buck. Tantalizing Post-Interval sequence & climax.#Rajinikanth engages more with his lively emotions than action. Keerthi- Commendable Jaggu bhai- vicious villain role👌@directorsiva 🔥🔥 — Arun Kumar (@Prasannaactor) November 4, 2021 #Peddanna okkati ante okka show kuda fast filling lo ledhu Motham green ye ..oreyy bheemji entha pani chesav ra ayya — Nippu NagaRRRaju (@GopiNagaTeja) November 4, 2021 #Annaatthe First Half Report : “TORTURE UNLIMITED” 👉1950’s Outdated Story 👉Forced Emotions 👉Over-action Scenes & Over-action Comedy 👉ONLY POSITIVE - “MASS INTERVAL FIGHT”#peddanna #Rajini #Rajinikanth #Nayanthara #KeerthySuresh #AnnaattheReview #AnnaattheDeepavali — PaniPuri (@THEPANIPURI) November 4, 2021 #Annaatthe 1st half: #SuperstarRajinikanth's one-man show! @immancomposer songs are a highlight. Story revolves around brother - sister relationship; high on emotional melodrama! Interval block shot - massy & sentimental. — MALAYSIA RJ ARIVU (@MalaysiaRJArivu) November 4, 2021 #Annaatthe - A mashup of Dir Siva's earlier blockbusters with #SuperstarRajinikanth as the Annan who'll go to any lengths to protect his Thangam sister. Heavy sentimental action melodrama with Imman's overpowering score. Valiant #Thalaivar's efforts & evergreen screen presence👍 — Kaushik LM (@LMKMovieManiac) November 4, 2021 Hearing Super Duper Reviews For #Annaatthe Movie.. Congrats And Wishing For Massive BB Hit To Superstar @rajinikanth Sir And Our Dear @directorsiva Sir From THALA AJITH Fans ❤❤#Valimai || #Thala || #AjithKumar pic.twitter.com/RFFefOCuQ5 — EMPEROR AJITH FANS™ (@EmperorAjithFC) November 4, 2021 Trailer Routine Unna Banda Siva Gadu Masssss Audience Ki Min Guarantee Movie Ichi Untadani Anukunnane 😣 Asalu Families Chuse Scope Ivvaleda Kamal ? #Annaatthe #Peddanna https://t.co/m0WAFLk7JC — gupta (@guptanagu8) November 4, 2021 Hyderabad It's #HappyDeepavali morning.. People will be busy. But tickets are still getting booked on #bookmyshow early in the morning#Annaatthe #AnnaattheDeepavali #AnnaattheThiruvizha #Peddanna #PeddannaDeepavali #PeddannaFDFS #AnnaattheFDFS #AnnaattheReview — The Cursed Knight™ (@thecursedknight) November 4, 2021 First Half: Annaatthe is going to be one of the most emotional movies of Thalaivar.. Going to work for B and C like anything.. Siva Hit six in the pitch which works for him🔥🔥🔥🔥#AnnaattheDeepavali #AnnaattheFDFS #Annaatthe #AnnaattheReview#Rajinikanth pic.twitter.com/6dMbt6cIfm — midhun (@midhuntweets4u) November 4, 2021 #Thalaivar and @immancomposer hold the entire movie firmly🙌 Movie is almost similar to Viswasam, Vedalam & Thirupachi.. Will workout big time with family audience and ladies ✌️ 3-4 mass theatre moments for fans🔥 Tamilnadu box office will be on fire🥳#Annaatthe — ரௌடி (@Rowdy_3_) November 4, 2021 -
జై భీమ్ మూవీ రివ్యూ
టైటిల్ : జై భీమ్ నటీనటులు : సూర్య, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రాజిష విజయన్, లిజోమోల్ జోసీ, మణికంఠన్ తదితరులు నిర్మాతలు : సూర్య, జ్యోతిక దర్శకత్వం : టి.జె.జ్ణానవేల్ సంగీతం : షాన్ రొనాల్డ్ ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్ సినిమాటోగ్రఫీ : ఎస్.ఆర్.కాదిర్ విడుదల తేది : నవంబర్ 02, 2021(అమెజాన్ ప్రెమ్ వీడియో సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకే పెద్ద పీట వేస్తుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. విభిన్నమైన కథలతో తెరకేక్కే సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతాడు. కొత్త కొత్త గెటప్ లలో దర్శనం ఇస్తూ సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తాడు. సూర్య కెరీర్లో అత్యధిక విజయాలు ప్రయోగాల ద్వారా వచ్చినవే. తాజాగా ఈ స్టార్ హీరో చేసిన మరో ప్రయోగమే ‘జై భీమ్’.కోర్టు రూమ్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. దళితులపై అగ్ర కులాల ఆకృత్యాల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. (Jai Bhim: దుమారం రేపుతున్న ‘చెంపదెబ్బ’ సీన్) కథేటంటే.. రాజన్న(మణికందన్), సినతల్లి(లిజోమోల్ జోస్) దళిత దంపతులు. పాములు పట్టుకుంటూ జీవనం సాగిస్తారు. ఒక రోజు ఆ ఊరి ప్రెసిడెంట్ ఇంట్లోకి పాము రావడంతో దాన్ని పట్టుకునేందుకు రాజన్న వెళ్తాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఈ కేసులో రాజన్నను అరెస్ట్ చేస్తారు పోలీసులు. పాములు పట్టే క్రమంలో అన్ని గమనించే రాజన్న ఈ చోరీకి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేస్తారు. నేరం ఒప్పుకోమని రాజన్నతో పాటు అతని కుటుంబ సభ్యులను సైతం వేధిస్తారు. అయితే చేయని తప్పుని ఒప్పుకోనని మొండికేస్తాడు రాజన్. కట్ చేస్తే.. జైలు నుంచి రాజన్న తప్పించుకుపోయాడని భార్య సినతల్లికి చెబుతారు పోలీసులు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక ఆమె బాధపడుతుంటుంది. తన భర్త ఆచూకి కోసం లాయర్ చంద్రు(సూర్య)ను కలుస్తుంది సినతల్లి. ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ కేసును టేకాప్ చేస్తాడు చంద్రు. ఈ క్రమంలో చంద్రుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? రాజన్న కోసం చంద్రు వేసిన పిటిషన్ కారణంగా ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి?ఇంతకీ రాజన్న ఏమయ్యాడు? అనేదే ‘జైభీమ్’కథ ఎవరెలా చేశారంటే..? లాయర్ చంద్రు పాత్రలో సూర్య ఎప్పటి మాదిరే అద్భుతంగా నటించాడు. కోర్టు సీన్స్‌లో ఆయన పలికించిన హావభావాలు మనసును తాకుతాయి. ‘ఆకాశం నీ హద్దురా’లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత.. అదే స్థాయి డెప్త్ ఉన్న రోల్ తనది. చంద్రు పాత్రలో సూర్య తప్ప మరొకరని ఊహించుకోలేం. ఇక గిరిజన దంపతులుగా మణికందన్, లిజో మోల్ జోసేలు అద్భుత నటనను కనబరిచారు. ముఖ్యంగా సినతల్లిగా నటించిన లిజోమోల్ జోస్ గురించి చెప్పాలి. సమాజంలోని దాష్టీకాన్ని ఎదిరించే దళిత మహిళగా ఆమె నటన అభినందనీయం. డీజీపీ దగ్గర ఆమె చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సిన్సియర్ పోలీస్ గా ప్రకాష్ రాజ్, పంతులమ్మగా రజిషా విజయన్, రావు రమేశ్ తమదైన నటనతో మెప్పించారు. జై భీమ్ ఎలా ఉందంటే..? పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్’. తమిళనాడులోని కడలూరులో జరిగిన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించాడు దర్శకుడు జ్ణానవేల్. ఇటీవల తెలుగులో వచ్చిన వకీల్ సాబ్, నాంది, తిమ్మరుసు సినిమాల మాదిరే ‘జైభీమ్’ కూడా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ఓ అమాయకుడు చేయని తప్పుకు జైలుపాలవ్వడం.. ఆ కేసును హీరో టేకప్ చేసి, ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొడుతూ.. చివరకు న్యాయం జరిపించడం. దాదాపు కోర్టు డ్రామా నేపథ్యంలో వచ్చే సినిమాలన్ని ఇలానే సాగుతాయి. దర్శకుడు జ్ఞాన్వేల్ అలాంటి పాయింట్‌నే ఎంచుకుని ఉత్కంఠ భరితంగా ‘జై భీమ్’ను తెరకెక్కించాడు. తాను ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో వందశాతం సఫలమయ్యాడు. అమాయకులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు పెట్టి, వారు నేరం ఒప్పుకునేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడతారనే విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. లాయర్ చంద్రుగా సూర్య ఎంట్రీ అయినప్పటి సినిమాపై ఆసక్తి పెరుగుతంది. అరెస్ట్ అయిన రాజన్న జైలులో కనిపించకపోవడం, అతను ఏమయ్యాడే విషయాన్ని చివరి వరకు చెప్పకపోవడంతో సినిమాపై ఉత్కంఠ పెరుతుంది. పోలీసులు అతడిని ఏం చేశారు? అసలు బతికే ఉన్నాడా? అన్న ప్రశ్నలు ప్రేక్షకుడి మదిలో మొదలవుతాయి. చివరకు అసలు విషయం తెలిసి భావోద్వేగానికి లోనవుతారు. ఇక క్లైమాక్స్ అయితే అదుర్స్ అనే చెప్పాలి. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. కట్టిపడేసేలా కథనాన్ని నడిపించాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. షాన్ రొనాల్డ్ సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకి ప్రాణం పోశాడు.ఎస్.ఆర్. కాదిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కోర్టు సన్నివేశాలను తెరపై అద్భుతంగా చూపించాడు. . ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘మిషన్ 2020’ మూవీ రివ్యూ
టైటిల్: మిషన్ 2020 నటీనటులు: నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, స్వాతి, తదితరులు నిర్మాతలు: కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు దర్శకుడు: కరణం బాబ్జి సంగీత దర్శకుడు: ర్యాప్ రాక్ షకీల్ నవీన్‌చంద్ర కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మిషన్ 2020’. కరణం బాబ్జి దర్శకుడు. కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె.వి.ఎస్.ఎస్.ఎల్.రమేష్‌రాజు నిర్మాతలు. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. విశాఖపట్నానికి చెందిన ప్రకాశ్ ఓ తెలివైన ఇంజనీరింగ్ స్టూడెంట్. కాలేజీలో అతనే టాపర్. ముగ్గురు స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తుంటారు. ఆ నలుగురికి చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు. అయితే వారిలో ఒకరు కొత్తగా మొబైల్ ఫోన్ కొనడంతో.. అశ్లీల వీడియోల మత్తులో పడిపోతారు. చదువును పక్కన పెట్టి పోర్న్ వీడియోలు చూస్తుంటారు. . ఆ అశ్లీలతను చూసిన ఉద్రేకంలో అనుకోకుండా తమ స్నేహితురాలు స్వాతి పై వారు అత్యాచారానికి పాల్పడతారు. క్షణికావేశంలో చేసిన ఆ తప్పుతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి. ఈ అత్యాచార కేసును ఏసీపీ జయంత్ (నవీన్ చంద్ర)ఎలా ఛేదించాడు. చివరకు వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది ?అనేదే మిగతా కథ ఎలా చేశారంటే.. ఓ సిన్సియర్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ జయంత్‌గా నవీన్ చంద్ర అదరగొట్టేశాడు. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అదే విధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన సమీర్, చలాకి చంటి, మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు. ఎలా ఉందంటే.. మంచి మార్గంలో స్వేచ్ఛగా చైతన్యవంతులుగా ఎదగాల్సిన యువత... అశ్లీల వీడియోల మత్తులో పడి తమ బతుకును ఎలా దుర్భరం చేసుకుంటున్నారనే కోణంలో సందేశాత్మకంగా తెరకెక్కిన సినిమానే మిషన్ 2020. అశ్లీల వీడియోల ప్రభావం కారణంగా తెలిసీ తెలియని వయసులో కొందరు ఎలా తమ జీవితాన్ని వృధా చేసుకుంటారో లాంటి అంశాలను కూడా చాలా ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కరణం బాబ్జీ. తాను ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో మాత్రం కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పాలి. తన సినిమాతో యువతకు ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలన్న దర్శకుడి ఆలోచనను మనం ప్రశంసించాల్సిందే. ఫస్టాఫ్ అంతా స్లోగా సాగుతుంది. ఇంటర్వెల్ కి గాని కథ ముందుకు కదలదు. సెకండాఫ్‌లో కథ కాస్త ఫాస్ట్‌గా, సీరియస్‌గా నడుస్తుంది. క్లైమాక్స్‌లో అత్యాచార బాధితురాలు మీడియాతో మాట్లాడే సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి.. ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. శ్రీ రాపాక స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ వర్క్ వర్కౌట్ కాలేదు. చాలా చోట్ల తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Romantic Review: రొమాంటిక్ మూవీ రివ్యూ
టైటిల్ : రొమాంటిక్ నటీనటులు : ఆకాశ్ పూరీ, కేతికా శర్మ, రమ్య కృష్ణ, మకరంద్ దేష్ పాండే, సునైన బాదం, రమాప్రభ, ఉత్తేజ్ తదితరులు నిర్మాణ సంస్థలు : పూరీ కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ దర్శకత్వం : అనిల్ పాదూరి సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ : నరేష్ రానా విడుదల తేది : అక్టోబర్ 29,2021 పూరీ జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్ పూరి. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్ ట్రాక్ ఎక్కించాలని ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ప్రభాస్, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్’పై హైప్ క్రియేట్ అయిది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు(అక్టోబర్ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఈ సినిమాతో పూరీ తనయుడు ఆకాశ్ హిట్ కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం. కథేంటంటే... గోవాకి చెందిన వాస్కోడి గామా(ఆకాశ్ పూరీ) పక్కా ఆవారా. ఆయన తండ్రి ఓ సిన్సియర్ పోలీసు అధికారి. ఆయన నిజాయతీ వల్ల ఓ గ్యాంగ్‌స్టర్ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో వాస్కోడిగామా నానమ్మ మేరీ (రమా ప్రభ) దగ్గర బస్తీలో పెరుగుతాడు. డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం మొదలెడతాడు. వచ్చిన డబ్బుతో తన నానమ్మ పేరుతో మేరీ ట్రస్ట్‌ని నెలకొల్పి తన బస్తీ వాసులకు ఇళ్లు నిర్మించి వసతులు కల్పిస్తుంటాడు. పెద్ద పెద్ద నేరాలు చేసైనా సరే.. తన బస్తీవాసులకు ఇల్లు కట్టించాలనుకుంటాడు. దీనికోసం గోవాలో పేరుమోసిన ఓ డ్రగ్స్ ముఠాలో చేరుతాడు. అనూహ్య పరిణామాల వల్ల ఆ గ్యాంగ్‌కే లీడర్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి మోనిక (కేతిక శర్మ) పరిచయం అవుతంది. ఆమెను చూసి మోహంలో పడతాడు. చివరకు అది ప్రేమగా మారుతుంది. మరోవైపు వాస్కోడిగామా గ్యాంగ్ ఆగడాలకు కళ్లెం వేయడానికి గోవాలో కొత్తగా అడుగుపెడుతుంది ఏసీపీ రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ). వాస్కోడిగామాను పట్టుకొని, ఆ గ్యాంగ్‌ని అంతమొందించడమే ఆమె లక్ష్యం. మరి ఏసీపీ రమ్య వలలో వాస్కోడిగామా చిక్కాడా లేదా? మోనికతో మోహం ఏమైంది? నిజానికి అది మోహమా, ప్రేమా? అనేదే ‘రొమాంటిక్’కథ. ఎవరెలా చేశారంటే... గ్యాంగ్ స్టర్ వాస్కోడి గామాగా ఆకాశ్ పూరీ అదరగొట్టేశాడు. కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే.. తన నటనలో మెచ్యూరిటీ ఎంతో కనిపించింది. ఓ పెద్ద హీరో చేయాల్సిన సినిమా ఇది. అయినప్పటికీ.. అకాశ్ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఫైట్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్‌లో కూడా అద్భుత నటనను కనబరిచాడు. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా జనాలకు గుర్తిండిపోతుంది. ఇక మోనిక పాత్రకి పూర్తి న్యాయం చేసింది కేతికాశర్మ. రొమాంటిక్ సీన్స్‌లో అద్భుత నటనను కనబరిచి కుర్రకారుకు చెమటలు పట్టేలా చేసింది. క్లైమాక్స్‌లో ఆమె ఫెర్పామెన్స్ అద్భుతమనే చెప్పాలి. ఇక ఆకాశ్ పూరీ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర రమ్యకృష్ణది. ఏసీపీ రమ్య గోవార్కర్ పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ఆకాశ్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ నువ్వా నేనా? అన్నట్టుగా ఉంటాయి. హీరో బెస్ట్‌ఫ్రెండ్‌గా దేవియాని శర్మ, గ్యాంగ్ శాంసన్‌గా మకరంద్ దేశ్‌పాండే, పోలీసు అధికారిగా ఉత్తేజ్, అతని భార్యగా యాంకర్ సునైనా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే...? పూరీ సినిమాల్లో హీరోలే విలన్స్‌గా ఉంటారు. ఒక మంచి పని చేయడం కోసం చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. ‘రొమాంటిక్’కథ కూడా అంతే. కానీ దీనికి కొంత ‘రొమాంటిక్’టచ్ ఇచ్చాడు దర్శకుడు, పూరీ శిష్యుడు అనిల్ పాదూరి. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, కథణం, స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పూర్తిగా ఆయన సినిమాలాగే అనిపిస్తుంది. పూరి గత సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, ఈసినిమాలోనూ అలానే ఉంటాడు. `కర్లో యా మర్లో` అనే తత్వం హీరోది. ఇంకా మీసాలు కూడా పూర్తిగా మొలవని ఓ కుర్రాడు.. సడన్‌గా డాన్ అయిపోవడం, ఓ గ్యాంగ్ ని మెయింటైన్ చేయడం.. అంతా సినిమాటిక్‌గా ఉంటుంది. అయితే లాజిక్లను పక్కనపెట్టి.. మ్యాజిక్‌ని నమ్ముకునే పూరీ.. ఇందులో కూడా తనకు తగినట్లుగా సీన్స్ రాసుకున్నాడు. ప్రతి సీన్లోనూ, డైలాగ్స్‌లో పూరీ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సినిమాలో కొత్తదనం లేకున్నా.. తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు పూరీ. ఫస్టాఫ్ కొంచెం స్లో అనిపించినప్పటికీ.. సెకండాఫ్ చాలా ఫాస్ట్‌గా ఆసక్తికరంగా సాగుతుంది. సాంకేతికపరంగా చూస్తే..సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్యం సంగీతం అదిరిపోయింది. ఈ సినిమాకి ప్రధానబలం.. పూరి మార్క్ డైలాగులు. ఒక్కో డైలాగ్ బుల్లెట్లలా దూసుకెళ్తాయి. నరేష్ రానా సినిమాటోగ్రఫీ బాగుంది. గోవా నేపథ్యంలో సన్నివేశాల్ని చాలా కలర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా తెరకెక్కించాడు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. చివరగా చెప్పాలంటే.. లాజిక్కులు పక్కనపెట్టి సినిమా చూస్తే.. ఎంజాయ్ చెయ్యొచ్చు. కానీ కొత్తదనం ఆశించి వెళ్తే మాత్రం నిరాశే మిగులుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Natyam Review: ‘నాట్యం’మూవీ రివ్యూ
టైటిల్: నాట్యం నటీనటులు: సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర్, భానుప్రియ తదితరులు నిర్మాణ సంస్థ : నిశృంకళ ఫిల్మ్ నిర్మాతలు: సంధ్యారాజు దర్శకత్వం : రేవంత్ కోరుకొండ సంగీతం :శ్రవణ్ బరద్వాజ్ సినిమాటోగ్రఫీ : రేవంత్ కోరుకొండ విడుదల తేది : అక్టోబర్ 22, 2021 ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాట్యమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? నాట్యం అనే గ్రామానికి చెందిన సితార(సంధ్యారాజు)కు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే పిచ్చి. ఎప్పటికైన గొప్ప నృత్యకారిణి కావాలని, అదే గ్రామంలో కాదంబరి కథను నాట్య రూపంలో చేసి చూపించాలని కలలు కంటుంది. తన గురువు (ఆదిత్య మీనన్)గారికి ప్రియ శిష్యురాలిగా ఉంటూ క్లాసికల్ డ్యాన్స్‌పై పూర్తి పట్టు సాధిస్తుంది. రంగ ప్రవేశం చేసేందుకై కాదంబరి నాట్యం చేయాలనుకుంటుంది. దానికి గురువుగారు ఒప్పుకోరు. ఆ నాట్యం అభ్యసించడానికి ఎవరు ముందుకు వచ్చిన చనిపోతుంటారు. అయినప్పటికీ సితార తన రంగ ప్రవేశానికి ఆ నాట్యమే చేస్తానని పట్టుబడుతుంది. కట్ చేస్తే... సిటీలో ఉండే రోహిత్(రోహిత్ బెహాల్) మంచి వెస్ట్రన్ డ్యాన్సర్. అతను ఓ పనిపై నాట్యం గ్రామానికి వెళ్తాడు. అక్కడ సితారతో పరిచమవుతుంది. రోహిత్ కారణంగా సితార జీవితంలో అనుకోని మలుపులు తిరుగుతాయి. ఆమె చేసిన ఓ పని.. గ్రామస్తుల ఆగ్రహానికి గురిచేస్తుంది.దీంతో సితార ఆ గ్రామం విడిచి సిటీకి వెళ్తుంది. ఆ తర్వాత సితార జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఆమె చిన్నప్పటి నుంచి కలలు కన్న కాదంబరి నాట్య ప్రదర్శన నెరవేరిందా లేదా? అసలు కాదంబరి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే? సితార పాత్రకు పూర్తి న్యాయం చేసింది కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. యాక్టింగ్ పరంగా పర్వాలేదనిపించుకున్నా.. డాన్స్ విషయంలో మాత్రం ఇరగదీసింది. స్వతహాగా ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్ కావడం సినిమాకు కలిసొచ్చింది. గురువుగారిగా ఆదిత్య మీనన్ తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. ఇక క్లాసికల్ డ్యాన్సర్ హరిగా కమల్ కామరాజు, వెస్ట్రన్ డ్యాన్సర్ రోహిత్‌గా రోహిత్ బెహాల్ తమ అధ్భుత నటన, డాన్స్‌తో మెప్పించారు. ఊరి పెద్దగా శుభలేక సుధాకర్, హీరోయిన్ తల్లిగా భానుప్రియ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? తెలుగు తెరపై నాట్యప్రధానమైన సినిమాలు అప్పట్లో బాగానే వచ్చేవి. 'స్వర్ణకమలం' 'సాగర సంగమం' . 'ఆనందభైరవి' లాంటి కొన్ని చిత్రాలు ఆ కోవకు చెందినవే. వాటిని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించేవారు. ఒక కమర్షియల్ సినిమాకు వచ్చే పేరు, కలెక్షన్స్ వీటికి కూడా వచ్చేవి. ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు రాలేదు. చాలా కాలం తర్వాత నృత్యం ప్రధానంగా ‘నాట్యం’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా ఒక క్లాసికల్ డ్యాన్స్ కథాంశంతో వచ్చిన సినిమా ఇది. నాట్యంతో కథ చెప్పడం అనే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు దర్శకుడు రేవంత్ కోరుకొండ. నేటి జనరేషన్‌కి తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసినప్పటికీ.. ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. అలాగే సంధ్యారాజు, రోహిత్‌ల ప్రేమను ఎలివేట్ చేసే బలమైన సీన్స్ కూడా లేవు. పస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినా.. ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే సెకండాఫ్ మొత్తాన్ని ఎమోషనల్‌గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అది వర్కౌట్ కాలేదనిపిస్తుంది. కాదంబరి ప్లాష్ బ్యాక్ తో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయి. చివరి 20 నిమిషాలు సినిమాకు హైలెట్. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం శ్రవణ్ బరద్వాజ్ సంగీతం. పాటలతో పాటు అద్భుత నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలు తెచ్చిపెట్టినట్లుగా కాకుండా కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
పెళ్లి సందD సినిమా రివ్యూ
టైటిల్: పెళ్లి సందD నటీనటులు: రోషన్, శ్రీలీలా, బ్రహ్మానందం, రావు రమేశ్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, తదితరులు దర్శకత్వం: గౌరీ రోనంకి నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్, ఆర్కే ఫిలిం అసోసియేట్స్ బ్యానర్ నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేదీ: అక్టోబర్ 15, 2021 దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన చిత్రం పెళ్లి సందD. ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, యువ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించారు. గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. ఎప్పుడూ తెర వెనుక ఉండే రాఘవేంద్రరావు ఈ సినిమాలో నటించడం విశేషం. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజైందీ చిత్రం. మరి ఇది బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిందా? లేదా? అనేది తెలియాలంటే రివ్యూ చదివేయాల్సిందే! కథ: వశిష్ట(రోషన్) ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అతడి తండ్రి పాత్రలో రావు రమేశ్ నటించాడు. ఎవరో చూసిన సంబంధం కాకుండా మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు వశిష్ట. తన సోదరుడి వివావహంలో సహస్ర (శ్రీలీల)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.ఆమె కూడా అతడి మీద మనసు పారేసుకుంటుంది. అలా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. ఇంతలో వీరి ప్రేమ అనుకోని మలుపులు తిరుగుతుంది. దాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రేమను, ప్రియురాలిని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: హీరో శ్రీకాంత్‌కు జనాల్లో ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్నమైన కథలతో, విలక్షణమైన నటనతో జనాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడీ హీరో. అతడి తనయుడు పెళ్లి సందD సినిమా చేస్తున్నాడనగానే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే నటనతో మెప్పించాడీ హీరో. రెండో సినిమాకే పాత్రలో ఒదిగిపోయిన విధానం మనల్ని ఆశ్చర్యపరచక మానదు. హీరోయిన్ శ్రీలీల గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే కథ, కథనం చాలా వీక్‌గా ఉంది. విజువల్స్ రాఘవేంద్రరావు స్టైల్‌కు తగ్గట్టుగా ఉంటాయి. కానీ కథలో బలం లేకపోవడంతో అవన్నీ తేలిపోతాయి. సెకండాఫ్‌లో డ్రామా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. చాలా సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు వాటికి ఉపశమనం కోసం పెట్టినట్లు అనిపించక మానదు. ఎమోషన్స్ పండించేందుకు ఆస్కారం ఉన్నా డైరెక్టర్ దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు అనిపించింది. సినిమాను ఆసక్తికరంగా మలచడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. టెక్నికల్‌గా.. బలమైన ఎమోషన్స్‌ను పండించడంలో డైరెక్టర్ కొంత తడబడ్డట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. అందమైన లొకేషన్లను కెమెరాల్లో బంధించి మంచి విజువల్స్ రాబట్టడంలో కెమెరామన్ కొంత మ్యాజిక్ చేశాడు. సినిమా ప్రారంభంలోని సన్నివేశాలతో పాటు సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను చాలా అందంగా చూపించాడు కీరవాణి సంగీతం మెప్పించింది. నిర్మాణ విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎడిటింగ్ బాగోలేదు. నటీనటులు: రోషన్ ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. సినిమాను సేవ్ చేసేందుకు అతడు చాలానే ప్రయత్నించాడు. నటన, డైలాగులు, డ్యాన్స్.. ఇలా అన్నింటినీ ఉపయోగించాడు, కానీ వర్కవుట్ కాలేదు. హీరోయిన్ గ్లామర్‌గా కనిపిస్తూ అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నించింది కానీ ఆమె పాత్రకు పెద్దగా నటించే స్కోప్ ఇవ్వలేదు. రావు రమేశ్, రఘుబాబు తమ పాత్రలతో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. రాఘవేంద్రరావు నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చివరగా.. సందడి ఎక్కువ అలజడి తక్కువ అన్నట్లు ఉందీ పెళ్లి సందD. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కూడా ఎందుకో మెప్పించలేదనిపించింది. -
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా రివ్యూ
టైటిల్: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, గెటప్ శ్రీను, మురళీ శర్మ, తదితరులు నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్ నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ దర్శకత్వం : ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సంగీతం : గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్. వర్మ విడుదల తేది : అక్టోబర్ 15, 2021 మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని సరైన హిట్ కోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నాడు. అలాంటిది అతడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మీరు నాకు ఒక హిట్ ఇవ్వడం కాదు.. నేనే మీకు ఓ హిట్ ఇద్దామనుకుంటున్నాను అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు ఎంతో ధైర్యంగా మాటిచ్చాడు. మరి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ద్వారా ఆ మాటను నిలబెట్టుకున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు ఓటీటీ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ థియేటర్లోనే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మరి దానికి ప్రతిఫలంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ దసరా విన్నర్‌గా నిలవనుందా? లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే! కథ: హర్ష(అఖిల్) అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. ఓ మంచి ఇల్లు కొంటాడు. ఖరీదైన వస్తువులన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటాడు. తనకు ఓ జోడీని వెతుక్కునేందుకు హైదరాబాద్ వస్తాడు. ఎంతోమంది పెళ్లి కూతుళ్లను చూస్తాడు. అందులో ఒకరైన విభ(పూజా హెగ్డే) హీరోకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. కానీ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ హర్షను రిజెక్ట్ చేస్తారు. ఇంతలో విభకు పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదన్న విషయం హర్షకు తెలుస్తుంది. అసలు విభకు పెళ్లంటే ఎందుకు విరక్తి? ఆమెను తనతో పెళ్లికి హీరో ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులేంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ: బొమ్మరిల్లు భాస్కర్ ఎప్పుడూ చిన్న లైన్‌తోనే సినిమా తీయాలనుకుంటాడు. కథ కంటే కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టి మ్యాజిక్ సృష్టిస్తాడు. కానీ ఈసారి మళ్లీ పాత ఫార్మెట్‌ను ఫాలో కావడం కొంత ఆశ్చర్యపరిచే అంశమే. ఇక చూపించిందే చూపించి జనాలకు విసుగు పుట్టించాడు డైరెక్టర్. సుమారు పదిసీన్లు పెళ్లి చూపులే ఉంటాయి. అమ్మాయిని చూడటం, ప్రశ్న వేయడం, రిజెక్ట్ కావడం.. అంతా ఇదే తంతు.. ఇది చూసినప్పుడు షాదీ ముబారక్ సినిమా గుర్తుకు రాక మానదు. పెళ్లి చూపుల సీన్లు మొదట్లో ఎంటర్టైనింగ్ అనిపించినా రానురాను.. ఇవి ఇంకా అయిపోలేదా? అని ప్రేక్షకుడు తల పట్టుకుంటాడు. ప్రేమ, రొమాన్స్‌కి తేడా ఏమిటి? అని చర్చించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మరింత కన్ఫ్యూజ్ చేసినట్లు కనిపించింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు బొమ్మరిల్లు సినిమాను గుర్తు చేస్తాయి. మొత్తానికి ఫస్ట్ భాగం అదరహో అనిపించినా సెకండాఫ్ మాత్రం బెదుర్స్ అనిపించక మానదు. సెకండాఫ్‌లో సినిమా ఫ్లో మిస్ అవుతుంది. ఆరెంజ్ సినిమాలో చేసిన తప్పిదాలే ఇక్కడ కూడా సుస్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా ప్రతిదాన్ని సాగదీసి ప్రేక్షకులకు తెగ బోర్ కొట్టించారు. క్లైమాక్స్ కూడా ఊహకందనంత ఎత్తులో ఏమీ లేదు. క్లైమాక్స్ చూశాక ఓస్ ఇంతేనా అని పెదవి విరుస్తారు. ఇంటర్వెల్ సీన్, కోర్టు సన్నివేశాలు మాత్రం ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. రెండు, మూడు పాటలు బాగున్నాయి. అయితే సినిమాను మరీ భూతద్దంలో పెట్టి చూస్తే ఆరెంజ్, గీతా గోవిందం, మిస్టర్ మజ్ను, బొమ్మరిల్లు, షాదీ ముబారక్‌లను మిక్స్ చేస్తే వచ్చిన మిశ్రమ ఫలితంలా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. తనకు సరిగ్గా సూట్ అయ్యే పాత్ర సెలక్ట్ చేసుకుని నటనతో అదుర్స్ అనిపించాడు. పూజా హెగ్డే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. ముందు నుంచి అనుకున్నట్లు ఆమె పాత్ర డిఫరెంట్‌గా ఉండి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. రియల్ కపుల్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీ శర్మ, జేపీలకు అలవాటైపోయిన పాత్రలే పడ్డాయి. టెక్నికల్‌గా సినిమా బాగుందనిపించింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. కొంతమేరకు సంభాషణలు ఆకట్టుకున్నా కొద్ది చోట్ల మాత్రం అవి పెద్ద స్పీచ్‌లా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి వంక పెట్టడానికి లేదు. చివరగా.. భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమా చూసి ఆస్వాదించవచ్చు. అయ్యగారు మొత్తానికి హిట్ కొట్టారనే అంటున్నారు అభిమానులు! -
‘మహా సముద్రం’ మూవీ రివ్యూ
టైటిల్ : మహా సముద్రం జానర్ : యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ నటీనటులు : శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్, జగపతిబాబు, రామ చంద్ర రాజు తదితరుల నిర్మాణ సంస్థ : ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: సుంకర రామబ్రహ్మం దర్శకత్వం : అజయ్ భూపతి సంగీతం : చేతన్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ : రాజ్ తోట ఎడిటింగ్: ప్రవీణ్ విడుదల తేది : అక్టోబర్ 14, 2021 ఆర్ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. ఇప్పుడు ‘మహా సముద్రం’ చిత్రంతో మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతోఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే వైజాగ్ నగరానికి చెందిన అర్జున్(శర్వానంద్), విజయ్(సిద్ధార్థ్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. అర్జున్ ఏదైనా బిజినెస్ ప్రారంభించడానికి ప్రయత్నించగా, విజయ్ మాత్రం పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. మరోవైపు మహాలక్ష్మీ అలియాస్ మహా(అదితిరావు హైదరీ)తో ప్రేమలో ఉంటాడు విజయ్. పోలీసు ఉద్యోగం సంపాదించాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అర్జున్ లైఫ్‌లోకి అనుకోకుండా వస్తుంది లా స్టూడెంట్ స్మిత(అను ఇమ్మాన్యుయేల్). కట్ చేస్తే.. వరుసగా జరిగే కొన్ని సంఘటనల వల్ల విజయ్ వైజాగ్ సిటీ నుంచి పారిపోవాల్సి వస్తుంది. అతని ఆచూకీ కోసం అర్జున్ ఎంత వెతికిన ప్రయోజనం ఉండదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత పారిపోయిన విజయ్ తిరిగి మళ్లీ వైజాగ్‌కు వస్తాడు. అప్పటికీ అర్జున్ డ్రగ్స్ మాఫియా డాన్‌గా ఎదుగుతాడు. అసలు విజయ్ వైజాగ్ సిటీని వదిలి ఎందుకు పారిపోయాడు? బిజినెస్ చేయాలనుకునే అర్జున్ స్మగ్లింగ్, డ్రగ్స్ దందాను ఎందుకు ఎంచుకున్నాడు? ప్రాణ స్నేహితులైన అర్జున్, విజయ్ శత్రువులుగా ఎలా మారారు? విజయ్ ప్రాణంగా ప్రేమించిన మహాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ సమయంలో అర్జున్ ఎలా తోడుగా నిలిచాడు?అనేదే మిగిలి కథ. ఎవరెలా చేశారంటే... అర్జున్‌గా శర్వానంద్, విజయ్‌గా సిద్ధార్థ్ ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. శర్వానంద్ కెరీర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నిజాయితీగా ఉన్న వ్యక్తి అనుకోకుండా అక్రమ వ్యాపారాలు చెయ్యడం, స్నేహితుడి ప్రియురాలిని సొంత మనిషిలా చూసుకోవడం. అతని కూతురి ఆలనా పాలనా చూడడం. చివరకు తన ప్రేమను కూడా వదులుకోవడం.. ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఆకట్టుకున్నాడు. ఇక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న విజయ్‌గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.చాలా రోజుల తర్వాత కొత్త సిద్దార్థ్‌ను చూస్తున్నామన్న ఫీల్ కలిగించాడు. ఇక ఈ మూవీలో చాలా ప్రాధాన్యత ఉన్న మహా పాత్రలో అదితిరావు హైదరి ఒదిగిపోయింది. అందంతో పాటు చక్కటి అభినయంతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. లా స్టూడెంట్‌గా అను ఇమ్మాన్యుయేల్ పర్వాలేదనిపించింది. శర్వా, సిద్ధూల తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్రలు.. జగపతి బాబు, రావు రమేశ్లవి. చుంచూ మామ పాత్రలో జగపతి బాబు పరకాయ ప్రవేశం చేశారు. కండ బలం కన్నా బుద్ధి బలం గొప్పది అని నమ్మే గూని బాబ్జీ క్యారెక్టర్లో రావు రమేశ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. విలన్ ధనుంజయ్‌గా రామచంద్ర రాజు తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’. రెండో సినిమాకే భారీ కథను, అందుకు తగ్గట్లు హెవీ స్టార్ కాస్టింగ్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. క్యారెక్టర్స్ తో తాను అనుకున్న పాయింట్ ని చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా పాత్రల పరిచయానికే సమయం కేటాయించాడు. గూని బాబ్జీగా రావు రమేశ్ ఎంటర్ అయ్యాక కథ పరుగులు తీసుస్తుంది. ఫస్టాఫ్ అంత సోసోగా నడిపించిన డైరెక్టర్.. ఇంటర్వెల్ పాయింట్ కి పీక్ టైంకి తీసుకొచ్చి, ఓ ఫైట్ సీన్‌తో సెకండాఫ్‌పై అంచనాలు పెరిగేలా చేశాడు. కానీ సెకండాఫ్ ఆ అంచనాలను తగ్గట్లు కాకుండా వేరే ట్రాక్ తీసుకుని వెళుతుంది. అలా అని మరీ బోర్ ఏమి కొట్టదు కానీ ఇంటర్వెల్ వరకు ఉన్న కిక్ మాత్రం తగ్గుతుంది. సెకండాఫ్ కి వచ్చేసరికి దర్శకుడు పూర్తిగా ఎమోషన్స్ మీదకి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఎమోషన్స్ తెరపై అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం. పాటలు అంతంత మాత్రమే అయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. కొత్త సౌండ్స్ తో యాక్షన్స్ సీన్స్‌కి ప్రాణం పోశాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్‌గా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కొండ పొలం’మూవీ రివ్యూ
టైటిల్ : కొండ పొలం నటీనటులు : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, హేమ, అంటోని, రవిప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్ వీఎస్ ఎడిటింగ్: శ్రావన్ కటికనేని విడుదల తేది : అక్టోబర్ 8,2021 ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం కథేంటంటే..? కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ అలియాస్ రవీంద్ర(వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్తాడు. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం లేకపోవడంతో అతనికి ఉద్యోగం లభించదు. దీంతో అతను తిరిగి పల్లెకు వస్తాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన రవీంద్రకు తాత రోశయ్య(కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా అల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొంతమంది కొండపొలం(గొర్రెల మందలను తీసుకొని అడవుల్లోకి వెళ్లడం)చేస్తున్నారని, తమ గొర్రెలను కూడా తీసుకొని వారితో నల్లమల అడవుల్లోకి వెళ్లమని చెబుతాడు. పెద్ద చదువులు చదివిన రవీంద్ర.. తాత సలహాతో నాన్న గురప్ప (సాయి చంద్)కు సహాయంగా అడవికి వెళ్తాడు. దాదాపు 45 రోజుల పాటు అడవితో సహజీవనం చేసిన రవీంద్రలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ అడవి అతనికి నేర్పిన పాఠాలేంటి? తన చదువు కోసం తండ్రి పడిన కష్టాలేంటి? ‘కొండపొలం’అనుభవంతో జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని ఏవిధంగా ఫారెస్ట్ ఆపీసర్ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే... మంచి చదువు ఉండి కూడా ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక, గొర్రెల కాపరిగా మారిన యువకుడు రవీంద్ర పాత్రలో వైష్ణవ్ తేజ్ ఒదిగిపోయాడు. ‘ఉప్పెన’లో మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపించి వైష్ణవ్... కొండపొలంలో గొర్రె కాపరుల సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కనిపించాడు. ఇక, అదే సామాజిక వర్గం, వృత్తి కలిగిన అమ్మాయి ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ అద్భుత నటను కనబరిచింది. కొన్ని సన్నివేశాల్లో వైష్ణవ్‌ని డామినేట్ చేసిందనిపిస్తుంది. ఆమె పాత్ర తీరే అలా ఉండడం అందుకు కారణం. అడవికి వచ్చిన రవీంద్రలో పట్టుదల ఏర్పడటానికి పరోక్షంగా కారణమైన ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసింది రకుల్. రవీంద్ర తండ్రి గురప్ప పాత్రలో సాయిచంద్ పరకాయ ప్రవేశం చేశాడు. ఓ గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అచ్చం అలానే తెరపై కనిపించాడు. రవీంద్రతో పాటు అడవికి వెళ్లే ఇతర పాత్రల్లో రవి ప్రకాశ్, హేమ, మహేశ్ విట్ట, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... అడవుల పరిరక్షణ, జంతువులను వేటాడే వేటగాళ్ల మీద, స్మగ్లర్ల మీద తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మృగరాజు’నేపథ్యం కూడా ఇదే. అయితే పశువులు ప్రాణాలను కాపాడుకోవడం కోసం అడవి వెళ్లే గొర్రెకాపరులు, అక్కడ వారి జీవన పద్దతిపై ఇంతవరకు ఏ చిత్రమూ రాలేదు. ఆ రకంగా చూస్తే ‘కొండపొలం’ ఓ కొత్త సినిమా అనే చెప్పాలి. ప్రకృతి పరిరక్షణ, అడవిపై ఆధారపడిన కొన్ని వర్గాల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ, సామాజిక స్పృహతో ‘కొండపొలం’చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా అదే పేరుతో వెండితెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు కూడా సన్నపురెడ్డి అందించడం గమనార్హం. అయితే నవలలో లేని ఓబులమ్మ పాత్రను ఈ సినిమా కోసం రచయిత సన్నపురెడ్డి సృష్టించారు. గొర్రె కాపరుల జీవిత చిత్రాన్ని తెరపై చాలా సహజసిద్దంగా ఆవిష్కరించారు. గొర్రెలను తమ సొంత బిడ్డలుగా భావించే గొర్రెకాపరులు..వాటికి ఆహారం అదించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి కొండపొలం చేయడం అంటే మామూలు విషయం కాదు. అడవితో మనిషికి ఉండే బంధాన్ని చక్కడ చూపించాడు డైరెక్టర్. పిరికి వాడైన హీరో.. తన గొర్రెలను కాపాడుకోవడం కోసం పులితో పోరాటం చేయడం సినిమాకు హైలైట్. అయితే ‘కొండపొలం’నవల చదివినప్పుడు కలిగే ఉత్కంఠ, భావోద్వేగాలు ఈ సినిమాలో పండకపోవడం మైనస్. అలాగే కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. ఫస్టాఫ్‌లో సాగినంత వేగం.. సెకండాఫ్‌లో లేదు. ఓబులమ్మ-రవీంద్ర ప్రేమ కథ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాకి ప్రధాన బలం సన్నపురెడ్డి సంభాషణలు. ‘ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది’,‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో’,‘అడవికి చుట్టంచూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు’లాంటి డైలాగ్స్ హృదయాన్ని తాకడంతో పాటు ఆలోచింప చేస్తాయి. కీరవాణి సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదిరిపోయింది. ‘రయ్ రయ్ రయ్యారే’అంటూ తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. అడవి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ శ్రవణ్ కటికనేని తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ.. ఓ మంచి సందేశాత్మక మూవీని చూశామనే అనుభూతి మాత్రం ప్రేక్షకుడికి కలుగుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Idhe Maa Katha Review: ‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇదే మా కథ నటీనటులు : శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తాన్యా హోప్ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ నిర్మాత : జీ మహేష్ దర్శకత్వం : గురు పవన్ సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ : రాంప్రసాద్ ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది : అక్టోబర్ 2,2021 సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్ నిర్మించిన ఈ సినిమా శనివారం (అక్టొబర్ 2)న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఎందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? మహేంద్ర(శ్రీకాంత్) క్యాన్సర్ బారిన పడిన ఓ బైక్ రైడర్. తన చివరి లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం బైక్‌పై లడఖ్‌కి బయలుదేరుతాడు. లక్ష్మీ (భూమిక) సాధారణ గృహిణి. భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా ఆమె.. తన తండ్రి చివరి కోరికను తీర్చడం కోసం భర్తను ఎదురించి లడఖ్‌కి బయలుదేరుతుంది. మరోవైపు యూట్యూబర్ కమ్ బైక్ రైడర్ అజయ్(సుమంత్ అశ్విన్) ఛాంపియన్ షిప్ సాధించాలని లడఖ్ బయలు దేరుతాడు. ప్రేమ పేరుతో మోసానికి గురైన మేఘన (తాన్యా హోప్) బైక్ రైడింగ్‌కి వెళ్తుంది. వీరంతా అనుకోకుండా మార్గమధ్యలో కలుసుకుంటారు. చావు, బతుకులతో పోరాడుతున్న మహేంద్ర.. బైక్‌పైనే లడఖ్‌కి ఎందుకు వెళ్తాడు? అనుకోకుండా కలిసే ఈ నలుగురు బైక్ రైడర్స్ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నదే ‘ఇదే మా కథ’ స్టోరీ. ఎవరెలా చేశారంటే.. భగ్న ప్రేమికుడు మహేంద్ర పాత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించాడు. సినిమా భారాన్ని మొత్తం తన భూజాన వేసుకొని నడిపించాడు. సాధారణ గృహిణి లక్ష్మీ పాత్రలో భూమిక ఒదిగిపోయింది. కుటుంభ బాధ్యతలు మోస్తూనే.. తండ్రి ఆశయం కోసం మోటార్ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధించే మహిళగా భూమిక తనదైన నటనతో మెప్పించింది. ఇక బైక్ రైడర్ అజయ్‌గా సుమంత్ అశ్విన్ అదరగొట్టేశాడు. చాలా హూషారైన పాత్ర తనది. కొత్తలుక్‌తో చాలా కాన్ఫిడెన్స్‌గా నటించాడు. ఇక మేఘనగా తాన్యా హూప్ పర్వాలేదనిపించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. సప్తగిరి, పృథ్వీ, జబర్దస్త్ రాంప్రసాద్ తమదైన కామెడీతో నవ్వించారు. శ్రీకాంత్ అయ్యంగార్,సుబ్బరాజు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? నలుగురు బైక్ రైడర్స్ జీవితాలకు సంబంధించిన ఎమోషనల్ కథే ‘ఇదే మా కథ’మూవీ. నలుగురు వ్యక్తుల జీవితంతో చోటు చేసుకున్న సమస్యలు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఎలా తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారనే నేపథ్యంలో కథ నడుస్తుంది. కంప్లీట్ రోడ్ జర్నీగా సాగే ఈ కథకి ఎమోషనల్ టచ్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గురు పవన్. రొటీన్ కథే అయినప్పటికీ.. కథనాన్ని ఇంట్రెస్టింగ్ నడిపించాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఫస్టాఫ్‌లో పాత్రలను పరిచయం చెయ్యడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. నలుగురు కలిశాక కానీ సినిమాపై ఆసక్తి పెరగదు. మధ్యలో వచ్చే సప్తగిరి, రాంప్రసాద్, పృథ్వీ ల కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సప్తగరి పంచ్‌లు.. నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ కంటెంట్‌ని ఇంకా ఎలివేట్ చేసి ఉంటే ఈ మూవీ మరోస్థాయికి వెళ్లేది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భోచితంగా వస్తాయి. సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్. బైక్ విన్యాసాలతో పాటు సానా సన్నివేశాలను బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘ది రోజ్ విల్లా’ మూవీ రివ్యూ
టైటిల్ : ది రోజ్ విల్లా నటీనటులు : దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ, రాజా రవీంద్ర, అర్చన తదితరులు నిర్మాణ సంస్థ : చిత్ర మందిర్ స్టూడియోస్ నిర్మాత : అచ్యుత్ రామారావు దర్శకత్వం :హేమంత్ సంగీతం : సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ : అంజి ఎడిటింగ్: శివ విడుదల తేది : అక్టోబర్ 1,2021 ‘కన్నడ `దియా` ఫేమ్ దీక్షిత్ శెట్టి, బిగ్‌బాస్ -5 ఫేమ్ శ్వేతా వర్మ హీరో,హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ది రోజ్ విల్లా. చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్‌పై అచ్యుత్ రామారావు నిర్మించిన ఈ సినిమాకు హేమంత్ దర్శకత్వం వహించాడు. రాజా రవీంద్ర కీలకపాత్రలో నటించారు. అక్టోబర్ 1న ఈ మూవీ తెలుగు, కన్నడలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి), శ్వేత (శ్వేత వర్మ) కొత్తగా పెళ్లి చేసుకున్న యువ జంట. ఇద్దరూ తాము కోరుకున్న విధంగా ఉండాలని.. మున్నార్ అనే అందమైన ప్రాంతానికి కారులో బయలుదేరుతారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగిస్తారు. అయితే వీరిద్దరు అనుకోకుండా నక్సల్స్ ఉన్న డేంజర్ పాయింట్‌కు వెళ్తారు. అక్కడ వారి కారు పాడైపోతుంది. ఎంతకీ స్టార్ట్ అవ్వదు. అలాంటి సమయంలో పోలీసులు వచ్చి వారిని సురక్షితంగా పక్క గ్రామంలో దిగబెడతారు. అక్కడ రెస్టారెంట్లో వీళ్ళు తింటుండగా మిలట్రీ రిటైర్ అయిన సోల్మాన్ (రాజా రవీంద్ర) తన భార్య హెలెన్‌తో (అర్చనా కుమార్)తో అక్కడే ఉంటాడు. అతన్ని ఓ ప్రమాదం నుంచి డాక్టర్ రవి కాపాడతాడు. దీంతో వారిద్దరు స్నేహితులైపోతారు. తనను కాపాడినందుకు ఆ యువ జంటని ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. అలా అక్కడికి వెళ్ళిన ఈ యువజంటకు అక్కడి వాతావరణం వితంగానే కాకుండా భయం కలిగించేలా ఉంటుంది. అలా ఎందుకు అనిపించింది.. ఏం జరిగింది? అప్పుడు ఈ యువజంట ఏం చేశారు? అనేది మిగిలిన కథ ఎలా చేశారంటే.. డాక్టర్ రవి పాత్రకు దీక్షిత్ పూర్తి న్యాయం చేశాడు. బిగ్ బాస్ 5 తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న శ్వేతా వర్మ ఇందులో హీరోయిన్. ఈమె కూడా బాగానే నటించింది. తెరపై అందంగా కనిపించడంతో పాటు తనదైన నటనతో మెప్పించింది. రైటైర్ మిలట్రీ సోల్మాన్ పాత్రలో రాజా రవీంద్ర తన అనుభవాన్ని చూపించాడు. అర్చనతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ ఓ సాధారణ కథకి భావోద్వేగాన్ని అతికించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు హేమంత్. దర్శకుడు తీసుకున్న పాయింట్ చిన్నదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సీన్స్ ప్రేక్షకుడిని థ్రిల్లింగ్ కలిగిస్తాయి. మాటలు కూడా బానే రాసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా కాస్త నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా అర్చన, రాజా రవీంద్ర మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అయితే కొన్ని సీన్స్ పునరావృతం కావడం ప్రేక్షకుడి బోర్ కొట్టిస్తాయి. హీరో హీరోయిన్లు రాజా రవీంద్ర ఇంటికి వచ్చిన తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగిస్తాయి. దీక్షిత్‌ను చూసి తన కొడుకు అనుకుని ఇక్కడే ఉండమని బలవంతం చేయడంతో.. తను అక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత ఏం జరిగిందనేది బాగానే అనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి నేపథ్య బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. అంజి సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలను సహజంగా చిత్రీకరించారు. ఎడిటర్ శివ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Republic Review: ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ
టైటిల్ : రిపబ్లిక్ నటీనటులు : సాయి తేజ్, ఐశ్యర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, ఆమని, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ తదితరులు నిర్మాణ సంస్థ : జీస్టూడియోస్, జె.బి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు : జె.భగవాన్, జె.పుల్లారావు దర్శకత్వం : దేవ్ కట్టా సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : ఎం.సుకుమార్ ఎడిటింగ్: కె.ఎల్.ప్రవీణ్ విడుదల తేది : అక్టోబర్ 1,2021 ‘ప్రస్థానం’మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు దేవ్ కట్టా. ఆ తర్వాత ఇదే సినిమాను 2019లో హిందీలో తెరకెక్కించి బాలీవుడ్లో సైతం గుర్తింపు పొందారు. అలా వైవిధ్యమైన కోణంలో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. చాలా గ్యాప్ తర్వాత తనకు అచ్చొచ్చిన పొలిటికల్ జానర్లోనే ‘రిపబ్లిక్’ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దేవ్ కట్టా. మెగా మేనల్లుడు సాయితేజ్ ఈ మూవీలో కలెక్టర్‌గా కనిపించబోతుండడంతో ‘రిపబ్లిక్’పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ శుక్రవారం(అక్టోబర్ 1)థియేటర్ల ద్వారా ప్రేక్షకులను ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘రిపబ్లిక్’మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? కలెక్టర్‌గా సాయితేజ్ మెప్పించాడా?లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే 1970లో స్వచ్ఛమైన తెల్లేరు సరస్సును రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు కబ్జా చేస్తారు. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఆ సరస్సులో విషపు ఆహారాన్ని వేస్తూ చేపలను పెంచుతారు. దాని కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అయినప్పటికీ ఆంధ్ర ప్రజా పార్టీ అధినేత్రి విశాఖవాణి(రమ్యకృష్ణ) తన వ్యాపారాన్ని వదులుకోదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా ఎదుగుతూ తన కొడుకుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుంది. ఆ ప్రాంతానికి కలెక్టర్‌గా వచ్చిన పంజా అభిరామ్(సాయి తేజ్) తెల్లేరు సరస్సు ఆక్రమించినవారిపై చర్యలు తీసుకుంటాడు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విశాఖవాణితో వైర్యం పెరుగుతోంది. ఇది ఎంతవరకు దారి తీసింది? నిజాయతీపరుడైన కలెక్టర్ అభిరామ్.. అవినీతి నాయకురాలైన విశాఖ వాణికి ఎలా బుద్ది చెప్పాడు? తదనంతర పరిణామాలు ఏమిటీ? అనేదే ‘రిపబ్లిక్’ కథ. ఎవరెలా చేశారంటే? రిపబ్లిక్ మూవీ కోసం సాయితేజ్ ప్రాణంపెట్టి నటించాడు. అవినీతి పరుడైన తండ్రిని కాదని తన కాళ్లమీద తాను నిలబడే వ్యక్తిగా, నిజాయతీ గల కలెక్టర్ అభిరామ్ పాత్రలో సాయి తేజ్ అదరగొట్టేశాడు. ప్రాంతీయపార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించింది. ఇక అవినీతికి పాల్పడే గ్రూప్ 1 అధికారి దశరథ్ పాత్రలో జగపతిబాబు ఎప్పటిమాదిరే పరకాయప్రవేశం చేశాడు. అద్భుత పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తప్పిపోయిన అన్నయ్యను వెత్తుకుంటూ అమెరికా నుంచి ఇండియా వచ్చిన యువతి మైరా(ఐశ్వర్య రాజేశ్) తన పాత్రకు న్యాయం చేసింది. అవినీతి ఎస్పీగా శ్రీకాంత్ అయ్యంగార్, కలెక్టర్‌గా సుబ్బరాజ్, జగపతిబాబు భార్యగా ఆమని, తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. (చదవండి: ‘బిగ్‌బాస్’ఫేమ్ శ్వేత నటించిన ‘ది రోజ్ విల్లా’ ఎలా ఉందంటే..) ఎలా ఉందంటే.. వ్యవస్థలోని లోటుపాట్లని తనదైన శైలిలో తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు దేవ్ కట్టా. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ని ఎక్కడా డీవియేట్ కాకుండా ఫెర్పెక్ట్గా చెప్పాడు. రాజ్యాంగానికి మూల స్థంభాలైన శాసన వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెరపై చక్కగా చూపించాడు. డైలాగ్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఫస్టాఫ్ కాస్త నిదానంగా సాగినట్టు అనిపించినా, హీరో కల్టెర్ అయినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. తెల్లేరు సరస్సు విషయంలో రైతుల పక్షాన ఉంటూ అభిరామ్ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. విశాఖవాణికీ, అభిరామ్‌కీ మధ్య వచ్చే డైలాగ్స్, క్లైమాక్స్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పాలి.అయితే సాధారణ ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో లేకపోవడం సినిమాకు మైనస్. ఈ పొలిటికల్ డ్రామాకు వాణిజ్యపరమైన మెరుగులు అద్ది ఉంటే సినిమా మరోస్థాయికి వెళ్లేది. మణిశర్మ సంగీతం పర్వాలేదు. ఇందులో మూడే పాటలున్నాయి. అవికూడా తెచ్చిపెట్టినట్లుగా కాకుండా సందర్భానుసారంగా వస్తాయి. సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. మొత్తంగా చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన వారి సంగతి పక్కన పెడితే, పొలిటికల్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి ‘రిపబ్లిక్’ నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్ కథ సాయితేజ్, జగపతి బాబు, రమ్యకృష్ణ నటన డైలాగ్స్, క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం సరస్సు చుట్టూనే కథ తిరగడం నిదానంగా సాగే సన్నివేశాలు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ
టైటిల్ : లవ్‌స్టోరి నటీనటులు : నాగ చైతన్య , సాయి పల్లవి, ఈశ్వరీరావు తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాతలు : కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు దర్శకత్వం: శేఖర్ కమ్ముల సంగీతం : పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ : విజయ్.సి.కుమార్ ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది : సెప్టెంబర్ 24, 2021 సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్‌స్టోరి సినిమా చేశాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు( సెప్టెంబర్24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘లవ్‌స్టోరి’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. ‘లవ్‌స్టోరీ’కథేంటంటే? అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్(నాగ చైతన్య) ఏదైనా బిజినెస్ చేయాలని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జుంబా డ్యాన్స్ సెంటర్ నడుపుతుంటాడు. రేవంత్ గ్రామానికే చెందిన మౌనిక(సాయి పల్లవి) బిటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడంతో రేవంత్ జుంబా సెంటర్లో పార్ట్నర్గా జాయిన్ అవుతుంది. ఇలా భిన్నమైన సామాజిక వర్గాలు కలిగిన రేవంత్, మౌనికల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అది కాస్త నిదానంగా ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు మధ్యలో కులం అడ్డు వస్తుంది. ఇక్కడ నుంచి వారిద్దరి ప్రేమ కథా వ్యవహారం ఎలా నడిచింది? కులాల అడ్డంకి దాటుకొని చివరకు మౌనిక, రేవంత్ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగిలిన కథ. ఎలా చేశారంటే.. ? రేవంత్ పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంగా చైతూ చాలా మెరుగయ్యాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కష్టమైన స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇక మౌనిక పాత్రలో సాయి పల్లవి ఎప్పటి మాదిరే పరకాయ ప్రవేశం చేసింది. సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టమైన స్టెప్పులను ఈజీగా వేసి అదరగొట్టేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెరపై రేవంత్, మౌనిక పాత్రలు మాత్రమే కనిపిస్తాయి తప్ప చైతూ, సాయి పల్లవిలు అస్సలు కనిపించరు. హీరో తల్లిపాత్రలో ఈశ్వరీరావు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. మౌనిక బాబాయి నరసింహం పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ తనది. హీరోయిన్ తల్లిగా దేవయాని, ఎస్సైగా ఉత్తేజ్ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ చాలా మంది సంకోచిస్తున్నారు. ఆయా సమస్యలపై వచ్చిన కథనాలు చదివితే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి సున్నితమైన పాయింట్‌ని తీసుకొని, తెరపై అతి సున్నితంగా చూపించాడు శేఖర్ కమ్ముల. పాత్రల నేపథ్యం చాలా నేచురల్‌గా ఉంటుంది. సినిమాల్లో కొన్ని ఎమోషన్స్ బాగా ఎలివేట్ చేసినా.. స్లోగా సాగే సీన్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది, సెకండాఫ్ వచ్చేసరికి కథలో ఎమోషన్స్ ఎక్కువైపోతాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం పవన్ సీహెచ్ సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. విజయ్.సి.కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పల్లెటూరి విజువల్స్‌ని తెరపై అందంగా చూపించాడు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బ్యానర్ స్థాయికి తగినట్లుగా ఉంది. మొత్తంగా చెప్పాలంటే ‘లవ్‌స్టోరి’ ఓ మంచి సందేశాత్మక చిత్రం. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘లవ్ స్టోరీ’ మూవీ ట్విటర్ రివ్యూ
టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు లవ్ స్టోరీ మూవీ టాపిక్కే వినిపిస్తోంది. ప్రేక్షకుల్లో అదో రకమైన ఆసక్తి. సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ సినిమా చేశాడు. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 24)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. (చదవండి: Love story Review: చైతూ, సాయిపల్లవిల ‘లవ్‌స్టోరీ’ హిట్టా? ఫట్టా?) ఇలా భారీ అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 900పైగా థియేటర్లలలో ఈ మూవీ విడుదలైంది. ఇక ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలను ఈ మూవీలో బాగా చూపించారని టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ పంచి, సెకండాఫ్ వచ్చేసరికి సరికి కథపై గ్రిప్పింగ్ తీసుకొచ్చి బాగా ప్రెజెంట్ చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య, సాయి పల్లవిల నటన అయితే అదిరిపోయిందట. సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్ స్పెషల్ అసెట్ టాక్ వినిపిస్తోంది. అయితే రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారని, సినిమాలో చెప్పుకోదగిన కొత్త సన్నివేశాలు ఎక్కడా కనిపించలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #LoveStory movie getting avg reviews..saying that ending is abrupt.They all have watched movie with high expectations.Lets reduce the expectations and prepare our mind for abrupt climax..Then surely will enjoy it😍😍 — Sreeram (@sreeram0106) September 24, 2021 #LoveStory seriou emotional Lead pair @chay_akkineni and @Sai_Pallavi92 are the soul.Chaitu’s acting 👌bgm and songs 😍 sensitive topics raise chesaru but abruptly ended. One time watch! — akhil_maheshfan2 🔔 (@Maheshfan_1) September 24, 2021 #LoveStory Overall an Average Emotional Love Story! NC and Sai Pallavi were great on the screen together! The life of the film is the Music and BGM. Movie had some good moments that were vintage SK but some repetitive scenes that were boring as well. Rating: 2.75/5 — Venky Reviews (@venkyreviews) September 23, 2021 Review & Ratting : #LoveStory Music., LEAD pairs ., 👍 LoveStory is predictable drama .., offers nothing new expect few sequences & fresh music keeps us HOOK !! Have to wait & see how family audience receives . (2.5/5) https://t.co/rxPYriHs7k — Inside talkZ (@Inside_talkZ) September 24, 2021 Too many emotions . . Lead pair done their best . Kammula sir inkoncham gattiga work cheyalsindi. . — Super⭐️ Fan 🦁 (@Ravianenenu) September 24, 2021 Burning issue in the society is being dealt sensibly by Kammula. — TrackTollywood (@TrackTwood) September 23, 2021 #LoveStory Blockbuster 💥💥 Super 1St half ❤ Excellent Second Half 🔥🔥 Class Movie Tho #NagaChaitanya Mass Chupisthadu pakka 💥💥💥💥 Families Tho theatre's Housefulls avuthayi pakka 👍💥 — Balaji (@BaluPKfan) September 24, 2021 #LoveStoryreview : Amazing script. Fantastic acting from Chay and Sai Pallavi. Entire love track was very fresh as you’d expect from Sekhar Kammula. A little dragged second half but a solid message. 3/5 #LoveStory Worth watching in theatres. 👍🏼👍🏼 — Chaitanya Somavajhala (@ChaitanSrk) September 24, 2021 #LoveStory Review... Slow Start But Great End 👏 👉 @chay_akkineni & @Sai_Pallavi92 Nailed The Show 😍 & Dance Moves Are Top Notch💥 👉 @sekharkammula Dealed With sensitive In his way 👌 👉 Music & Bgm Are Soul Of The Movie 🕶#LoveStoryreview #NagaChaitanya #SaiPallavi pic.twitter.com/iFqGphRlpP — NEW UPDATES (@OTTGURUJINITHIN) September 24, 2021 Movie BoxOffice ResultDepends On How Audience Accepts Last 30Mins👍#LoveStory #LoveStoryReview #NagaChaitanya #SaiPallavi #SekharKammula #Cinee_WorlddReview #Cinee_Worldd pic.twitter.com/PFoVjcCE6o — cinee worldd (@Cinee_Worldd) September 24, 2021 BLOCKBUSTER 💥💥💥#loveStory #LoveStoryReview — Akhileeyyy (@iamkrzzy__45) September 24, 2021 #LoveStoryReview 1st Half Report: #LoveStory 1st Half as a whole did not seem to be in the range that the fans were expecting. Some high moments, BGM and songs are entertaining here and there. https://t.co/qrMfDrwxYw#LoveStoryOnSep24th #NagaChaitanya #saipallavi https://t.co/AdikWVGlf5 — Daily Culture (@DailyCultureYT) September 23, 2021 #LoveStory Decent 1st Half 👌 B G M 👍@chay_akkineni & @Sai_Pallavi92 👍 https://t.co/s4B7M9dX3N — koti ! 🎬🎥 (@koti7711) September 24, 2021 Just finished watching #LoveStory @chay_akkineni @Sai_Pallavi92 Wow 🤩! Just brilliant. #Sekhar Kammula Best at storytelling! @chay_akkineni well done 👍🏻 broh! — HK (@khs3737) September 24, 2021 -
‘మరో ప్రస్థానం’ మూవీ రివ్యూ
టైటిల్ : మరో ప్రస్థానం నటీనటులు : తనీష్, ముస్కాన్ సేథీ , భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: మిర్త్ మీడియా నిర్మాతలు : ఉదయ్ కిరణ్ దర్శకత్వం: జాని సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ :ఎంఎన్ బాల్ రెడ్డి ఎడిటింగ్: క్రాంతి (ఆర్కే), విడుదల తేది : సెప్టెంబర్ 24, 2021 చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి ‘నచ్చావులే’తో హీరోగా మారాడు తనీష్. ఆ తర్వాత రైడ్, ‘మౌనరాగం’, ’ఏం పిల్లో ఏం పిల్లడో’ లాంటి సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కెరీర్ పరంగా తనీష్ చాలా వెనుకబడ్డారు. ఆయన చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న తనీష్.. చాలా కాలం తర్వాత ‘మరో ప్రస్థానం’తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మరో ప్రస్థానం’పై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? ఈ సినిమా తనీష్‌ను హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం కథేంటంటే ముంబై క్రిమినల్ గ్యాంగ్ లో సభ్యుడు శివ (తనీష్). గ్యాంగ్ రాణేభాయ్( కబీర్ సింగ్ దుహాన్ ) ఈ గ్యాంగ్ లీడర్. ఆ గ్యాంగ్ నేరాల్లో తనూ భాగమవుతూ నేరమయ జీవితం గడుపుతుంటాడు శివ. ఇలా హత్యలు, కిడ్నాప్‌లంటూ తిరిగే శివ.. నైని (అర్చనా ఖన్నా) అనే అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. నైని కూడా శివను ప్రేమిస్తుంది. తన క్రిమినల్ జీవితానికి, నైని సరదా లైఫ్ కు సంబంధం లేదు. ఈ తేడానే శివను నైని ప్రేమలో పడేలా చేస్తుంది. నైనిని పెళ్లి చేసుకుని క్రిమినల్ లైఫ్ వదిలేసి కొత్త జీవితం ప్రారంభించాలని అనకుంటాడు శివ. గోవాలో కొత్త ఇంటిలోకి మారాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. శివ ఇలాంటి ప్రయత్నాల్లో ఉండగా..రాణె భాయ్ గ్యాంగ్ సీక్రెట్స్ ఎవరో లీక్ చేస్తుంటారు. ఆ బ్లాక్ షీప్ ఎవరో కనుక్కునేందుకు రాణె భాయ్ అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపేస్తుంటాడు. జర్నలిస్ట్ సమీర (భాను శ్రీ మెహ్రా) రాణె భాయ్ నేరాలను ఆధారాలతో సహా డాక్యుమెంట్ చేస్తుంది. ఆమెను కిడ్నాప్ చేసిన రాణె భాయ్ గ్యాంగ్, ఆధారాలు ఇచ్చేయమని హింసిస్తుంటారు. రాణె భాయ్ గ్యాంగ్ లోని బ్లాక్ షీప్ ఎవరు, జర్నలిస్ట్ సమీర ఆధారాలతో గ్యాంగ్ ను పట్టించిందా. తన లీడర్ రాణె భాయ్ తో శివ ఎందుకు గొడవపడ్డాడు అనేది మిగిలిన కథ. ఎలా చేశారంటే.. శివ పాత్రలో తనీష్ నటన మెప్పిస్తుంది. ఎమోషనల్ కిల్లర్ క్యారెక్టర్ కు తనీష్ తన నటనతో న్యాయం చేశాడు. ఇక హీరోని ఇష్టపడే సరదా అమ్మాయిగా ముస్కాన్ సేథి తనదైన నటన, అందంతో ఆకట్టుకుంది. నైని పాత్రలో అర్చనా సింగ్ పర్వాలేదనిపించింది. రాణె భాయ్ గా కబీర్ సింగ్ దుహాన్ సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. మరో ప్రస్థానం మూవీ మేకింగ్ పరంగా ఇన్నోవేటివ్ ప్రయత్నమే అని చెప్పాలి. రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. దర్శకుడు అనుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ, అనుకున్నట్లు తెరపై చూపిండంతో కాస్త తడబడ్డాడు. అయితే ఓ రాత్రిలో జరిగే కథను సింగిల్ షాట్లో చిత్రీకరించాలనుకున్న దర్శకుడి ఆలోచన మాత్రం బాగుంది. అందుకు తగ్గట్లు సన్నివేశాలను ప్లాన్ చేసుకుని సినిమాను చిత్రీకరిస్తూ వచ్చారు. వన్ షాట్ ఫిల్మ్ మేకింగ్ లో కొన్ని చోట్ల సీన్స్ ల్యాగ్ అనిపించవచ్చు. కానీ తన డెసిషన్ కు కట్టుబడి ఫిల్మ్ చేశాడు. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినా.. ఇంటర్వెల్ టిస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్ కూడా రోటీన్‌గా సాగడం కాస్త మైనస్. సునీల్ కశ్యప్ పాటలు కథలో స్పీడుకు బ్రేకులు వేసేలా ఉంటాయి. కానీ నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అంతంత మాత్రంగానే ఉంది. సింగిల్ షాట్ మూవీ కావడం, రీటేక్స్ తీసుకునే అవకాశం లేకపోవడంతో టెక్నికల్‌గా ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కొద్దిగా ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసి ఉంటే మరో ప్రస్థానంలో మరింత రిలీఫ్ దొరికేది. మొత్తంగా సింగిల్ షాట్లో తీసిన మరో ప్రస్థానం టాలీవుడ్లో ఒక కొత్త ప్రయత్నమనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘విజయ రాఘవన్’ మూవీ రివ్యూ
టైటిల్ : విజయ రాఘవన్ నటీనటులు : విజయ్ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు నిర్మాతలు : టి.డి.రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ దర్శకత్వం: ఆనంద కృష్ణన్ సంగీతం : నివాస్ కె.ప్రసన్న సినిమాటోగ్రఫీ : ఎన్.ఎస్.ఉదయ్‌కుమార్ ఎడిటింగ్: విజయ్ ఆంటోని విడుదల తేది : సెప్టెంబర్ 17, 2021 ‘నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈయన హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తెరకెక్కించిన చిత్రం ‘విజయ రాఘవన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కోడియిల్ ఒరువన్’ పేరుతో తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌పై రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుదల చేశారు. ‘విజయ రాఘవన్’ పేరుతో తెలుగులో సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే? అరకులోని ఓ గ్రామానికి చెందిన విజయ రాఘవన్ (విజయ్ ఆంటోని) తన తల్లి ఆశయం కోసం ఐఏఎస్ కావాలనుకుంటాడు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ వచ్చి ఒక పక్క పిల్లలకు ట్యూషన్ చెబుతూ.. మరో పక్క ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా విజయ్ రాఘవన్ లోకల్ రాజకీయాల్లోకి తలదూర్చాల్సివస్తుంది. దాని వల్ల ఐఏఎస్ ఐఏఎస్ ఇంటర్వ్యూ అడ్డంకులు వస్తాయి. ఒకవైపు తల్లికిచ్చిన మాట మరోవైపు రాజకీయనాయకులు ఒత్తిడి. చివరికి ఆ కాలనీకి కార్పొరేట్ గా ఎన్నికవుతాడు. విజయ రాఘవన్ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన కార్పొరేటర్ గా ఎలా గెలిచాడు ? తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చాడా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. విజయ రాఘవన్ పాత్రలో కనిపించిన విజయ్ ఆంటోని తన హావభావాలతో చక్కగా నటించాడు. తల్లికి ఇచ్చిన మాట కోసం పాడుపడే ఓ మంచి కొడుకుగా తనదైన నటనతో సినిమా భారం మొత్తాన్ని భూజాన వేసుకొని నడిపించాడు. పోరాట సన్నివేశాల్లో విజయ్ చక్కగా నటించాడు. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఎలా ఉందంటే? ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రసంసలు అందుకున్న ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమే విజయ రాఘవన్. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకునే ఓ యువకుడి కథే ఇది. జీవితంలో ఎన్నో సాధించాలనుకునే హీరో, తన తల్లి కోరికను తీర్చాలనుకుంటాడు. ఆ క్రమంలో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి తనెలా బయటపడతాడు అనేదే ఈ చిత్రం. సమాజంలో మనకు ఎదురయ్యే రాజకీయ పరమైన ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాలనే సందేశం కూడా ఇస్తుంది. మారుమూల గ్రామం నుంచి సిటీవరకు జరుగుతున్న రాజకీయ నాయకుల అవినీతి, ప్రభుత్వాధికారుల చేతివాటం, బెదిరింపు రాజకీయాలు వంటి అంశాలన్నీ దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించాడు.ముఖ్యంగాభ్రష్టుపట్టినట్లుగా ఉన్న గవర్నమెంట్ కాలజీని హీరో శుభ్రం చేయడం, అక్కడివారిని చైతన్యవంతుల్ని చేయడం అనే అంశాలు, సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి. అలాగే మదర్ సెంటిమెంట్ సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి. కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు ఆనంద కృష్ణన్.. కొన్ని సీన్స్‌లో నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, ఆనంద కృష్ణన్ మాత్రం వాటిని సింపుల్ గా నడిపారు. సెకండాఫ్ చాలా వరకు సినిమాటిక్‌గా సాగుతుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని అనవసరపు సీన్స్ ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టిస్తాయి. నివాస్ కె.ప్రసన్న సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ నేపథ్య సంగీతం అదిరిపోయింది. ఎన్.ఎస్. ఉదయ్‌కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘మ్యాస్ట్రో’ మూవీ రివ్యూ
టైటిల్ : మ్యాస్ట్రో నటీనటులు :నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్, జిషు సేన్ గుప్తా, నరేష్, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రేష్ట్ మూవీస్ నిర్మాతలు : సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి దర్శకత్వం: మేర్లపాక గాంధీ సంగీతం : మహతి స్వర సాగర్ సినిమాటోగ్రఫీ : వై యువరాజ్ ఎడిటింగ్: ఎస్ఆర్ శేఖర్ విడుదల తేది : సెప్టెంబర్ 17, 2021(డిస్నీ+హాట్‌స్టార్) భీష్మ సూపర్ హిట్ కావడంతో అదే జోష్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. కాని భీష్మ రేంజ్ హిట్‌ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఆయన ఇటీవల చేసిన చెక్, రంగ్ దే మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని మాస్ట్రో లుక్‌లోకి మారాడు నితిన్. బాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ అంధాధున్‌కు తెలుగు రీమేక్. ఈ మూవీ శుక్రవారం(సెప్టెంబర్ 17)న ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలిసారి నితిన్ అంధుడి పాత్ర పోషించడంతో మ్యాస్ట్రోపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలు ‘మ్యాస్ట్రో’ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. చూపు ఉన్న అంధుడిగా నటిస్తాడు అరుణ్(నితిన్). అతనిలో ఉన్న గొప్ప టాలెండ్ ఏంటంటే పియానో చక్కగా వాయించడం. ఒకసారి తన పియానో పాడవడంతో కొత్తది కొనాలని చూస్తాడు. ఈ క్రమంలో పెడ్రో అనే రెస్టారెంట్లో పియానో అమ్మకానికి పెట్టినట్లు తెలుసుకొని,చూసేందుకు వెళ్తాడు. అక్కడ తన మ్యూజిక్ ప్రతిభ చూపించి అందరి మన్ననలు పొందుతాడు. అరుణ్ టాలెంట్ నచ్చి అతనితో ప్రేమలో పడిపోతుంది రెస్టారెంట్ ఓనర్ కూతురు సోఫీ(నభా నటేశ్). ఆ రెస్టారెంట్‌కు తరచు వచ్చే సినీ హీరో మోహన్ (వీకే నరేష్).. అరుణ్ పియానో సంగీతానికి ఫిదా అవుతాడు. తన భార్య సిమ్రన్ (తమన్నా భాటియా) బర్త్‌డే సందర్భంగా ప్రైవేట్ కన్సర్ట్ను ఏర్పాటు చేయాలని అరుణ్‌ను తన ఇంటికి పిలుస్తాడు. అరుణ్ మోహన్ ఇంటికి వెళ్లేసరికి అతను హత్యకు గురవుతాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఈ హత్యకు సిమ్రాన్, సీఐ బాబీ ( జిషు సేన్ గుప్తా)లకు సంబంధం ఏంటి? అరుణ్ అంధుడిగా ఎందుకు నటించాలనుకున్నాడు? మోహన్ హత్యతో అరుణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది తెలియాలంటే డిస్నీ+హాట్‌స్టార్‌లో సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నితిన్ తొలిసారి అంధుడిగా నటించిన సినిమా ఇది. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో నితిన్ చేశాడు. ఆయుష్మాన్‌కు సమానంగా అంధుడి పాత్రలో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌లో అంధుడిగా నవ్వించిన నితిన్.. సెకండాఫ్‌లో భావోద్వేగాలపరంగా చక్కటి హావభావాలు పలికించాడు. అంధుడు అరుణ్ పాత్రకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాడు. ఇక ఈ సినిమాలో నితిన్ తర్వాత బాగా పండిన పాత్ర తమన్నాది. సిమ్రన్ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసింది. హిందీలో టబు పోషించిన పాత్ర అది. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన నటన కనబరిచింది. సోఫి పాత్రలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ మెప్పించింది. జిషు సేన్ గుప్త, నభా నటేశ్, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, హర్ష వర్దన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. హిందీలో వచ్చి, సూపర్ హిట్ అయినా ‘అంధాధున్’ మూవీకి తెలుగు రీమేకే‘మ్యాస్ట్రో’.సాధారణంగా రీమేక్ అనగానే మాతృకతో పోల్చి చూస్తారు. అందులో ఉన్నది.. ఇందులో లేనిది ఏంటని నిశితంగా పరిశీలిస్తారు. ఉన్నది ఉన్నట్లు తీస్తే కాపీ అంటారు. ఏదైనా యాడ్ చేస్తే.. అనవసరంగా యాడ్ చేసి మంచి సినిమాను చెడగొట్టారని చెబుతారు. అందుకే రీమేక్ అనేది దర్శకుడికి కత్తిమీద సాము లాంటిదనే చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విజయవంతం అయ్యాడు. మాతృకలోని ఆత్మను ఏమాత్రం చెడకుండా ‘అంధాదున్’ని తెలుగు ప్రేక్షకులు మ్యాస్ట్రోగా అందించాడు. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే లాంటి దిగ్గజ నటులు సెట్ చేసిన టార్గెట్‌ని వందశాతం అందుకోలేకపోయినా.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో అంధుడిగా నితిన్ చేసే సరదా సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సీఐ బాబీ అరుణ్ణి చంపాలనుకోవడం.. దాని నుంచి అరుణ్ తప్పించుకొని గోవాకు వెళ్లేందుకు ప్రయత్నించే సీన్స్ ఆసక్తిని కలిగిస్తాయి. సెకండాఫ్‌లో అరుణ్, సిమ్రన్ మధ్యల వచ్చే కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం సినిమాకు కాస్త మైనస్. ఇక క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. అంధాదున్ సినిమా చూడకుండా డెరెక్ట్‌గా మాస్ట్రో చూసేవారిని థ్రిల్లింగ్ మూవీ చూశామనే అనుభూతి కలుగుతుంది. మహతి స్వర సాగర్ బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. వై యువరాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘గల్లీ రౌడీ’ మూవీ రివ్యూ
టైటిల్ : గల్లీ రౌడీ నటీనటులు : సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్, నాగినీడు, వెన్నెల కిషోర్, పొసాని కృష్ణ మురళి, మైమ్ గోపి తదితరులు నిర్మాణ సంస్థ: కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమాస్ నిర్మాతలు : యమ్.వి.వి సత్యనారయణ, కోన వెంకట్ దర్శకత్వం: నాగేశ్వర రెడ్డి సంగీతం : రామ్ మిరియాల, సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ : సుజాత సిద్ధార్థ్ ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్ విడుదల తేది : సెప్టెంబర్ 17,2021 సినిమా.. సినిమాకి తన నటనతో విలక్షణత చూపిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు యంగ్ హీరో సందీప్ కిషన్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. ప్రయోగాలు చేయడంలో మాత్రం అతను వెనకడుగు వేయడు. అయితే కొద్దికాలంగా ఈ యువ హీరో కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆయన చేసిన సీనిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్.. ‘గల్లీ రౌడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? చొక్కా , బుగ్గ మీద గాటు పెట్టుకొని కాకుండా కొంచం స్టైలిష్‌గా వచ్చిన ఈ ‘గల్లీ రౌడీ’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. గల్లీరౌడీ కథేంటంటే..? విశాక పట్నానికి చెందిన వాసు(సందీప్ కిషన్)ని పెద్ద రౌడీని చేయాలని కలలు కంటాడు తాత మీసాల సింహాచలం(నాగినీడు). దానికి కారణం తన శత్రువు బైరాగి నాయుడు(మైమ్ గోపి)తో ఉన్న పాత కక్షలే. అయితే వాసుకు మాత్రం కొట్లాటలు అంటే అసలు నచ్చదు. కానీ తాత కోరిక మేరకు చదువు మధ్యలోనే ఆపేసి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతాడు. అయినప్పటికీ గొడవలకు దూరంగా ఉంటాడు. అయితే తను ఇష్టపడిన అమ్మాయి సాహిత్య(నేహా శెట్టి) కోసం ఓ వీధి రౌడీని కొట్టడంతో వాసుపై రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఇలా సాహిత్య కోసం రౌడీగా మారిన వాసు.. ఆమె కుటుంబం కోసం బైరాగిని కిడ్నాప్ చేయడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలో అనుకోకుండా బైరాగి హత్యకు గురవుతాడు. ఈ కేసు విచారణ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, సీఐ రవి(బాబీ సింహ) చేతికి వెళ్తుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రవి తనదైన శైలీలో విచారణ సాగిస్తాడు. ఇంతకీ హంతకుడిని సీఐ రవి పట్టుకున్నాడా లేదా? అసలు ఆ హత్య చేసిందెవరు? హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావు(రాజేంద్ర ప్రసాద్) ఫ్యామిలీకి , బైరాగి హత్యకు ఏం సంబంధం? సీఐ రవి ఈ కేసును ఎందుకు సీరియస్‌గా తీసుకున్నాడు? బైరాగికి మీసాల సింహాచలంకు మధ్య ఉన్న పాత కక్షలు ఏంటి? తాత కోరికను వాసు ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే..? గల్లీరౌడీ వాసుగా సందీప్ కిషన్ అదొరకొట్టేశాడు. వంశంపారంపర్యంగా వస్తున్న రౌడీ వృత్తి నచ్చక సాఫ్ట్వేర్ కావాలనుకొని, తాతకోసం మళ్లీ రౌడీగా మారడం, ఇష్టపడిన అమ్మాయి కోసం రిస్క్ చేయడం.. ప్రతి సీన్లో చాలా నేచురల్‌గా నటించాడు. హీరోగా కాకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది అతని పాత్ర. ఫైట్స్ సీన్స్‌లో చక్కగా నటించాడు. ఇక సాప్ట్వేర్ సాహిత్య పాత్రలో నేహా శెట్టి అద్భుత నటనను కనబరిచింది. తెరపై చాలా అందంగా కనిపించింది. హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావుగా రాజేంద్ర ప్రసాద్ తనదైన నటనతో నవ్వులు పూయించాడు. రౌడీ సీఐ రవిగా బాబీ సింహా మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. భూకబ్జాలకు పాల్పడే రౌడీ బైరాగి నాయుడిగా మైమ్ గోపి తనదైన నటనతో మెప్పించాడు. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష, చిత్ర కళాకారుడిగా వెన్నెల కిషోర్ తమదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. పొసాని, నాగినీడు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. ‘గల్లీ రౌడీ’మూవీ అందరికి తెలిసిన పాత కథే. తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిపై పగ తీర్చుకునే కొడుకు, మరో తండ్రికి పుట్టిన ఇద్దరి కొడుకుల మధ్య భిన్నాభిప్రాయలనేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇలాంటి కథలో తెలుగు చాలానే వచ్చాయి. కథలో బలమైన పాయింట్ ఉన్ననప్పటికీ.. కథనం హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావు ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. కిడ్నాప్ డ్రామా కూడా రోటీన్‌గా, సినిమాటిక్‌గా సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది సగటు ప్రేక్షకుడి ఊహకు అందుతుంది. అయినప్పటికీ తనదైన స్క్రీన్‌ప్లేతో కొంతవరకు మ్యానేజ్ చేశాడు కోన వెంకట్. ఇంటర్వెల్ సీన్ కొంత ఆసక్తిని కలిగిస్తుంది. రౌడీలుగా ముసలి బ్యాచ్‌ను పెట్టడం కామెడీకి స్కోప్ దొరికింది.సెకండాఫ్ కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ‘పప్పా వెర్రి పప్పా’అంటూ వెన్నెల కిషోర్ చేసే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. రామ్ మిరియాల, సాయి కార్తీక్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా రీరికార్డింగ్ అదిరిపోయింది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫి పర్వాలేదు. ఎడిటర్ చోటా కె. ప్రసాద్ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌కి కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Plan B Review And Rating: ‘ప్లాన్ బి’ ఎలా ఉందంటే..?
టైటిల్ : ప్లాన్ బి జానర్ :సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ తదితరులు నిర్మాణ సంస్థ : ఏవీఆర్ మూవీ వండర్స్ నిర్మాత : ఏవీఆర్ కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కెవి రాజమహి సంగీతం : స్వర నేపథ్య సంగీతం : శక్తికాంత్ కార్తీక్ డీవోపీ : వెంకట్ గంగాధరి ఎడిటింగ్: ఆవుల వెంకటేష్ విడుదల తేది : సెప్టెంబర్ 17, 2021 గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెప్ట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కథలో కొత్తదనం ఉంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే టాలీవుడ్లో ఇటీవల చిన్న చిత్రాలు ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘ప్లాన్ బి’థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తుండగా డింపుల్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్,టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. పక్కా ప్లాన్‌తో వచ్చిన‘ప్లాన్ బి’ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే? ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలకు సంతానం కలగదు. ఆ గ్రామంలోని పురుషులకు వీర్యకణాలు తగ్గిపోవడం వల్లే పిల్లలకు పుట్టరు. ఈ క్రమంలో ఆ ఊరికి వచ్చిన ఓ డాక్టర్ మంచి వైద్యాన్ని అందించి అందరికి సంతానం కలిగేలా చేస్తాడు. అయితే గ్రామంలోని ఓ జంటకు మాత్రం పిల్లలు పుట్టరు. దీంతో ఆ వైద్యుడు తన వీర్యాన్ని అందించి ‘ఐవీఎఫ్’పద్ధతిలో వారికి బిడ్డను అందిస్తారు. కట్ చేస్తే.. ఓ రిటైర్డ్ పోలీసు అధికారి చనిపోయే ముందు తన కూతుకు రూ. 10 కోట్లు ఇస్తాడు. అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించబడుతుంది. మరోవైపు లాయర్ విశ్వనాథ్(శ్రీనివాస్ రెడ్డి), ప్రైవేట్ టీచర్ రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. ఈ హత్యలకు, రూ. 10 కోట్ల దొంగతనానికి సంబంధం ఏంటి? ఆ డబ్బును ఎవరు దొంగిలించారు? ఈ కేసును పోలీసు అధికారి( మురళీ శర్మ) ఎలా చేధించాడు? అసలు ఈ కథకి డాక్టర్‌కి సంబంధం ఏంటి? ప్లాన్ బి అంటే ఏంటి? అది ఎవరు వేశారు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఎప్పటి మాదిరే శ్రీనివాస్ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాకు కీలకమైన లాయర్ విశ్వనాథ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ప్రేమికుడు గౌతమ్ పాత్రలో సూర్య వశిష్ట తనదైన నటనతో మెప్పించాడు. ఫైట్ సీన్స్‌లో కూడా అవలీలగా నటించాడు. ప్రతినాయకుడిగా కునాల్ శర్మ అధ్బుత నటనను కనబరిచాడు. ఇక ఈ సినిమాలో బాగా పండిన మరో పాత్ర మురళి శర్మది. పోలీసు అధికారి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ ఆకట్టుకుంటుంది. అభినవ్ సర్దార్, నవీనా రెడ్డి, సబీనా తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కానీ, సరైన రీతిలో తీస్తేనే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు కెవి రాజమహి. ఆయన ఎంచుకున్న పాయింట్స్, రాసుకున్న స్క్రీన్‌ప్లే, డిజైన్ చేసుకున్న క్యారెక్టర్లు బాగున్నాయి. ప్లాన్ బి కథ చాలా క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది. అయినప్పటికీ.. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా ప్రతి క్యారెక్టర్ని, సీన్‌ని చాలా క్లియర్‌గా, ప్రేక్షకుడికి కన్ప్యూజన్ లేకుండా తెరపై చూపించాడు. అయితే కాస్త పేరున్న నటులను తీసుకొని ఉంటే ఆయన తపనకు సరైన ఫలితం ఉండేది. కథలో చాలా వరకు ఫేమస్ కానీ నటులు ఉండడం కాస్త మైనస్. పోలీసుల విచారణ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తాయి. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఏం జరిగిందో ముందో ఊహించడం కాస్త సిల్లీగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ అయితే ప్రేక్షకుడి ఊహకు అందనంతగా ఉంటుంది. స్వర సంగీతం, శక్తికాంత్ కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొనేలా ఉంది. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
జీఎస్టీ మూవీ రివ్యూ
టైటిల్ : జీఎస్టీ(గాడ్, సైతాన్, టెక్నాలజీ) నటీనటులు : ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, స్వాతిమండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని, జూనియర్ సంపు తదితరులు నిర్మాణ సంస్థ : తోలు బొమ్మల సిత్రాలు నిర్మాతలు : కొమారి జానయ్య నాయుడు దర్శకుడు: కొమారి జానకి రామ్ తోలు బొమ్మల సిత్రాలు" బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం‘జీఎస్టీ’. గాడ్ (దేవుడు)... సైతాన్ (దెయ్యం)... టెక్నాలజీ (సాంకేతికత) అనేది ఉపశీర్షిక. ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, స్వాతిమండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని, జూనియర్ సంపు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వినాయక చవితి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కథేటంటే.. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుల గ్యాంగ్ లాంగ్ టూర్ ప్లాన్ చేస్తారు. కట్ చేస్తే.. నేవి ఉద్యోగం చేస్తున్న ఒకతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎలాగైనా డబ్బులు సంపాదించి లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఒక రోజు ఈ ప్రేమ జంట సముద్రపు ఒడ్డున ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అక్కడ చేపలు పడుతున్న జాలర్లు కి సముద్రం లో తిమింగలం స్పర్మ్ నుంచి విడుదల అయినా అతి విలువైన వస్తువు దొరుకుతుంది. ఆ వస్తువు మనం బయట వాడే పెర్ఫ్యూమ్ ల లో వాడతారు. అది చూసిన నేవి ఉద్యోగి.. జాలర్లను హతమార్చి దాన్ని తీసుకువెళ్దాం అని ప్లాన్ చేస్తాడు. చివరికి ఆ విలువైన వస్తువు వాళ్ళకి దొరికిందా లేదా? వీరి మధ్యలో దెయ్యం ఎందుకు ఎంటర్ అయ్యింది? టూర్ ప్లాన్ చేసుకున్న కాలేజీ యువతకి, నేవి ఉద్యోగికి మధ్య సంబంధం ఏంటి? అసలు దెయ్యాలు ఉన్నాయా? దేవుడు-దెయ్యాలు నిజమా? సైన్స్ నిజమా? తెలుసుకోవాలంటే థియేటర్స్‌కి వెళ్లి జీఎస్టీ సినిమా చూడాల్సిందే. నటీ నటులు కాలేజీ యువతగా నటించనవారంతా కొత్త వాళ్ళు.అయినా చాలా చక్కగా నటించారు. ఫస్ట్ హాఫ్ అంత చాలా ఆహ్లాదకరంగా సినిమాని వాళ్ళ భుజాలు మీద సినిమాని నడిపించారు అని చెప్పవచ్చు.నేవీ ఆఫీసర్ గా అతని లవర్ వాళ్ళ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. నంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, స్వాతిమండల్, యాంకర్ ఇందు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. సమాజంలో దేవుడు, దెయ్యం,సైన్స్ పైన చాలా అనుమానాలు, అపోహలున్నాయి. వాటిని నిగ్గు తేల్చే కథనంతో వచ్చిన సినిమానే జీఎస్టీ.డైరెక్టర్ జానకి రామ్ ఒక అద్భుతమైన పాయింట్ ని తీసుకొని సినిమాని తెరకెక్కించారు. అయితే ఆయన ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. దెయ్యం ఎంటర్ అయినప్పటి నుంచి కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. యు.వి నిరంజన్ సంగీతం బాగుంది. డి యాదగిరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాన విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
‘సీటీమార్’మూవీ రివ్యూ
టైటిల్ : సీటీమార్ నటీనటులు : గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాతలు : శ్రీనివాస చిట్టూరి దర్శకుడు: సంపత్ నంది సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరోల్లో మ్యాచోస్టార్ గోపిచంద్ ఒకరు. ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలు చేసి ఆకట్టుకున్న గోపిచంద్.. ఇటీవల కాలంలో రొటీన్ సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ‘సీటీమార్’అని టైటిల్ పెట్టడం, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను గోపిచంద్ అందుకున్నాడా? ‘సీటీమార్’సినిమాకు ప్రేక్షకులు సీటీలు కొట్టారా లేదా? రివ్యూలో చూద్దాం. ‘సీటీమార్’ కథేంటంటే..? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తీక్ సుబ్రహ్మణ్యం(గోపిచంద్) స్పోర్ట్స్ కోటాలో బ్యాంకు ఉద్యోగం పొందుతాడు. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన గ్రామంలోని ఆడపిల్లలకు కబడ్డీ కోచింగ్ ఇస్తుంటాడు. వారిని ఎలాగైనా నేషనల్ పోటీల్లో గెలిపించాలని తపన పడతాడు. కప్పు కొట్టి గ్రామంలోని పాఠశాలను మూతపడకుండా చేయాలనేది అతని లక్ష్యం. అనుకున్నట్లే కార్తీక్ టీమ్ నేషనల్ పోటీలకు ఎంపికవుతుంది. కట్‌చేస్తే..గేమ్ కోసం ఢిల్లీకి వెళ్లిన కార్తీక్ టీమ్‌లోని ఆడపిల్లలు కిడ్నాప్‌నకు గురవుతారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రమంలో తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి కార్తీక్‌కి ఎలాంటి సాయం చేసింది. నేషనల్ కప్పు కొట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలన్న కార్తీక్ ఆశయం నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? కబడ్డీ కోచ్‌గా గోపిచంద్ అదరగొట్టేశాడు. తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమా మొత్తాన్ని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఇక తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా మెప్పించింది. హీరోని అభిమానించే లోకల్ న్యూస్ ఛానెల్ యాంకర్‌గా దిగంగన సూర్యవంశీ చక్కగా నటించింది. విలన్ పాత్రలో తరుణ్ అరోరా జీవించేశాడు. తెరపై చాలా క్రూరంగా కనిపించాడు. హీరో అక్కగా భూమిక, పోలీసు అధికారిగా రెహమాన్ ఫర్వాలేదనిపించారు. గ్రామ ప్రెసిడెంట్‌గా రావురమేశ్ మరోసారి తనదైన పంచులతో ఆకట్టుకున్నాడు. ఆయన చేసే సీరియస్ కామెడీకి, పంచులకు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎలా ఉందంటే.. గోపిచంద్ తొలిసారి క్రీడా నేపథ్యంలో నటించిన చిత్రం‘సీటీమార్’. అయితే దీన్ని ఓ స్పోర్ట్స్ డ్రామాగా మలిచి వదిలేకుండా, దానికి పోలీస్ కథను మిళితం చేసి సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాడు దర్శకుడు సంపత్ నంది. ఫస్టాఫ్ అంతా కామెడీ ప్రధానంగా తెరకెక్కించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మలిచాడు. కార్తీక్ కు అతని అక్క, బావలకు ఉండే అనుబంధాన్ని చూపిస్తూనే, కబడ్డి పోటీ కోసం ఢిల్లీ వెళ్ళిన అమ్మాయిలు కిడ్నాప్ కావడం, దానికి పోలీస్ ఆఫీసర్ అయిన అతని బావ గతంతో ముడిపెట్టడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రథమార్థంలో ప్రగతి, అన్నపూర్ణమ్మల గ్యాంగ్.. టీవీ యాంకర్ దిగంగన పెళ్లిని చెడగొట్టే సీన్ అయితే థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ పంచ్ డైలాగ్స్‌కి నవ్వని ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే సెకండాఫ్‌లో ఇలాంటి కామెడీ లేకపోవడం, కొన్నిచోట్ల పాత్రలు అతిగా ప్రవర్తించడం, యాక్షన్ సీక్వెన్స్ కూడా రోటీన్‌గా ఉండడం సినిమాకు మైనస్. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని పాత్రలకు ప్రాణం పోశాడు. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Kangana Ranaut: ‘తలైవి’ మూవీ రివ్యూ
టైటిల్ : తలైవి జానర్: బయోపిక్ నటీనటులు : కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, మధుబాలా తదితరులు నిర్మాణ సంస్థలు: విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : విష్ణు వర్ధన్ ఇందూరి కథ: విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం : ఏఎల్ విజయ్ సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 లేడి ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. వరుసగా నాయికా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా నటించిన మరో లేడి ఓరియెంటెండ్ మూవీ ‘తలైవి’. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రమిది. టైటిల్ పాత్రని కంగనా పోషించగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ‘తలైవి’ప్రేక్షకుల మనసును ఏ మేరకు దోచుకుందో రివ్యూలో చూద్దాం. ‘తలైవి’కథేంటంటే: దర్శకుడు ముందుగా చెప్పినట్టే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సినీ జీవితం ప్రారంభం నుంచి ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు సాగే కథే ‘తలైవి’. ఓ పెద్దింటి కుటుంబంలో పుట్టినా జయలలిత(కంగనా రనౌత్) కొన్ని పరిస్థితుల కారణంగా పేదరికంలోకి వస్తుంది. అయితే వాళ్లమ్మ మాత్రం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. 16 ఏళ్ల వయసులోనే జయను హీరోయిన్ను చేస్తుంది. అతి చిన్న వయసులోనే ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ (అరవింద్ స్వామి) లాంటి స్టార్‌తో నటించే అవకాశం చేజిక్కించుకుంటుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో వాళ్లది సూపర్ హిట్ జోడీ అయిపోతుంది. ఈ క్రమంలో ఎంజీఆర్‌తో జయలలితకు ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? సినీ నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జయ.. రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? తను ఎంతో అభిమానించే ఎంజీఆర్ మరణం తర్వాత తమిళనాడు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి? జయలలిత ముఖ్యమంత్రి పీఠం చేపట్టే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తెలియాలంటే ‘తలైవి’ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. జయలలిత పాత్రలో కంగన ఒదిగిపోయారు. తెరపై జయలలిత కనిపిస్తుందే తప్ప.. కంగాన రనౌత్ ఏ మూలాన కనిపించదు. ఆమెను జాతియ ఉత్తమ నటి అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే అర్థమవుతంది. ఎంజీఆర్‌తో దూరమయ్యే సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాన్ని పలికించింది. ఇక కంగన తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అరవింద్ స్వామిది. ఎంజీఆర్ పాత్రలో ఆయన జీవించేశాడు. స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగాను ప్రత్యేక హావభావాలను పలికించాడు. ఎంజీఆర్ అనుచరుడు వీరప్పన్ పాత్రకు సముద్రఖని ప్రాణం పోశాడు. కరుణ పాత్రలో నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. జయ తల్లి పాత్రలో అలనాటి నటి భాగ్య శ్రీ, ఎంజీఆర్ భార్య పాత్రలో మధుబాల, శశికల పాత్రలో పూర్ణతో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ‘అమ్మ’గా తమిళ ప్రజల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. జయ జీవితంలో అతి కీలకమైన 1965 నుంచి మొదటి సారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 1991 మధ్య జరిగే కథను మాత్రమే తెరపై చూపించాడు దర్శకుడు ఏఎల్ విజయ్. ఓ సినిమాకి కథ ఎంపికతోపాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే జయలలిత పాత్రకు జాతీయ ఉత్తమ నటి కంగనాను ఎంపిక చేశారో.. అప్పుడే ఈ సినిమా సగం సక్సెస్ సాధించింది. ఫస్టాఫ్‌లో జయ లలిత సినీ జీవితాన్ని చూపించిన దర్శకుడు.. సెకండాఫ్ మొత్తం ఆమె రాజకీయ జీవితాన్ని చూపించాడు. ఎంజీఆర్ పాత్రను హైలైట్ చేస్తూనే.. అదే సమయంలో జయలలిత పాత్ర ప్రాధాన్యత తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. జయ-ఎంజీఆర్ మధ్య ఉన్న బంధాన్ని కూడా తెరపై చాలా చక్కగా చూపించారు. రాజకీయాలే వద్దనుకున్న జయ.. పాలిటిక్స్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిపే సీన్స్‌ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే జయలలితను తమిళ ప్రజలు ‘అమ్మ’అని ఎందుకు ముద్దుగా పిలుసుకుంటారో తెలియజేసే సీన్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒక రాజకీయాల్లో వచ్చి తర్వాత జయ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందే విషయాన్ని కూడా ఉన్నది ఉన్నట్లు చూపించారు. సొంత పార్టీ నేతలే జయపై కుట్ర చేయడం, ఆమెను రాజ్య సభకి పంపడం లాంటి సీన్స్ కూడా హత్తుకునేలా తీర్చి దిద్దారు. ఎంజీఆర్ మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ‘నమ్మి వస్తే అమ్మ.. లేదంటే ఆదిశక్తి’ అంటూ జయలో ఉన్న రెండో కోణాన్ని కూడా తెరపై చూపించారు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం అదిరిపోయింది. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌కి కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ
టైటిల్ : టక్ జగదీష్ నటీనటులు : నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, నాజర్, జగపతి బాబు, రావు రమేశ్, నరేశ్ తదితరులు నిర్మాణ సంస్థ : షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది దర్శకత్వం : శివ నిర్వాణ సంగీతం : తమన్ నేపథ్య సంగీతం: గోపీసుందర్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తొలి సినిమా 'అష్టా చమ్మా' మొదలు గత ఏడాదిలో విడుదలైన ‘వి’వరకు ప్రతి సినిమాలోనూ కొత్తదనం, కొత్త తరహా పాత్రలు పోషిస్తూ, తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేచురల్ స్టార్ నటించిన తాజా చిత్రం ‘టక్ జగదీష్’. తరచూ ప్రేమ కథా చిత్రాలతో అలరించే నాని.. తొలిసారి తెలుగింటి కుటుంబ కథను ఎంచుకున్నాడు. నానికి ‘నిన్నుకోరి’ లాంటి సూపర్ హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయకచవితి సందర్భంగా శుక్రవారం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. . టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ఈ ‘టక్ జగదీష్’ ఏ మేరకు అందుకున్నాడో రివ్యూలో చూద్దాం. టక్ జగదీష్ కథేంటంటే భూదేవిపురం గ్రామానికి చెందిన టక్ జగదీష్ అలియాస్ జగదీష్ నాయుడుకి కుటుంబం అంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్)అంటే జగదీష్‌కి ప్రాణం. తన తండ్రి ఆదిశేషు హఠాన్మరణం చెందడంతో ఇంటి బాధ్యలతను అన్నయ్య బోసు (జగపతి బాబు)కి అప్పగించి పై చదువుల కోసం పట్నానికి వెళ్తాడు జగదీష్. అయితే తనకు తెలియకుండా వేరే వ్యక్తితో మేనకోడలు పెళ్లి చేస్తారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసకోని జగదీష్ గ్రామానికి వస్తాడు. ఈ లోగా తన కుటుంబంలో సమస్యలు వచ్చి అందరూ విడిపోతారు. గ్రామ ప్రజలు కూడా జగదీష్ కుటుంబంపై ద్వేషం పెంచుకుంటారు. అసలు తన కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారు? అమితంగా ఇష్టపడే మేన కోడలు పెళ్లి జగదీష్‌కు తెలియకుండా ఎవరితో, ఎందుకు చేశారు? పదిమందికి ఆదర్శంగా ఉండే ఆదిశేషు కుటుంబంలో వచ్చిన సమస్య ఏంటి? దాన్ని జగదీష్ ఎలా పరిష్కరించాడు? ఇందులో రీతు వర్మ పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. జగదీష్ నాయుడు అనే బరువైన పాత్రని అవలీలగా పోషించేశాడు. ముఖ్యంగా ఎమ్మార్వో జగదీష్ నాయుడిగా అదరగొట్టేశాడు. హీరో అన్నయ్య బోసు పాత్రలో జగపతి బాబు జీవించేశాడు. చాలా కాలం తర్వాత జగపతి బాబు అన్నయ్య పాత్రను పోషంచి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో తండ్రి ఆదిశేషు నాయుడిగా నాజర్ తనదైన నటనతో మెప్పించాడు. వీఆర్వో గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో రీతూవర్మ చక్కగా ఒదిగిపోయింది. హీరో మేనకోడలు చంద్ర పాత్రలో ఐశ్యర్య రాజేశ్ పర్వాలేదనిపించింది. అలాగే రావు రమేశ్, నరేశ్, మాలపార్వతి, రోహిని, దేవదర్శిని తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబం కథతో తెరకెక్కిన చిత్రమే ‘టక్ జగదీష్’. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు శివ నిర్వాణ. ఇప్పుడు టక్ జగదీష్‌తో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రుచి చూపించాడు. కుటుంబం, ఆస్తి తగాదాలు, ఊర్లో భూ గొడవలు కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఇలాంటి నేపథ్యం ఉన్న చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. టక్ జగదీష్‌లో కొత్తగా చూపించిదేమి లేదు. పైగా మేనకోడలు బాధ్యత, ఎమ్మార్వో ఉద్యోగం, హీరోకి ఓ ప్రేమ కథ.. అంటూ చాలా పెద్ద స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు. రెండున్నర గంటల్లో ఇంత పెద్ద కథను తెరపై చూపించడం కొంచెం కష్టమే. అయినప్పటికీ.. కథలోని ప్రతి పాత్రకు ఓ జస్టిఫికేష్ ఇస్తూ చాలా క్లారిటీగా చేప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడనే చెప్పాలి. కానీ కమర్షియల్ కంటెంట్ లేకపోవడం సినిమాకు కాస్త మైనస్. ‘అయినోళ్లకంటే ఆస్తులు పొలాలు ఎక్కువకాదు..రక్త సంబంధం విలువ తెలుసుకో’, ‘మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు’ లాంటి డైలాగ్స్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక సాంకేతిక విషయాకొస్తే.. తమన్ పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా.. గోపీసుందర్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రావడం ప్లస్ పాయింటనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఫ్యామిలీ డ్రామాలు వచ్చి చాలా కాలమైంది. పైగా ఓటీటీలో సినిమా అందుబాటులో ఉండడం.. ‘టక్ జగదీష్’కి కలిసొస్తుందనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్