టైటిల్: తగ్గేదే లే
నటీనటులు: నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా, నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, అయ్యప్ప పి.శర్మ, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్
దర్శకత్వం : శ్రీనివాస్ రాజు
కెమెరా : వెంకట్ ప్రసాద్
నిర్మాత : ప్రేమ్ కుమార్ పాండే, పి. వి.సుబ్బారావు రెడ్డి
బ్యానర్ : భద్ర ప్రొడక్షన్స్
ఎడిటింగ్ : గ్యారీ బి. హెచ్
విడుదల తేదీ: నవంబర్ 4, 2022
దండుపాళ్యం సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ రాజు ఆ సినిమాకు సీక్వెల్ గా రెండు భాగాలు తెరకెక్కించాడు. తాజాగా దండుపాళ్యం సినిమాలోని నటులను తీసుకొని ఒక ఫ్యామిలీ, మర్డర్, మిస్టరీతో రూపొందించిన చిత్రమే " తగ్గేదే లే". ఇందులో నవీన్ చంద్ర హీరోగా దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తాలు హీరోయిన్స్‌గా నటించారు. నవంబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఎంటర్‌టైన్ చేసిందో చూద్దాం..
కథ
మర్డర్, డ్రగ్స్, లవ్ వంటి మూడు కథలతో ఈ సినిమా సాగుతుంది. ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత తాను ఈశ్వర్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న లిజి ఈశ్వర్ ఇంట్లో ఉంటూ... అంతకుముందు తనతో దిగిన ఫొటోలతో ఈశ్వర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈశ్వర్ ఇంట్లో మహిళ శవం దొరుకుతుంది. అప్పటివరకు దండుపాళ్యం బ్యాచ్‌తో ఈశ్వర్‌కు సంబంధం ఉందని అనుమానపడుతున్న పోలీసులకు అతడి ఇంట్లో శవం దొరకడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఆ అమ్మాయిని ఈశ్వర్ చంపాడనే అనుమానంతో పోలీస్ ఆఫీసర్ చలపతి(రవి శంకర్), రాజా రవీంద్ర ఇంటరాగేషన్ చెయ్యాలని అరెస్ట్ చేస్తారు.ఈ ఇంటరాగేషన్‌లో ఈశ్వర్ ద్వారా తెలుసుకున్న నిజాలు ఏమిటి? ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? ఆ హత్య నుంచి అతడు ఎలా బయట పడ్డాడు? ఈశ్వర్ జీవితానికి, దండుపాళ్యం గ్యాంగుకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) దండుపాళ్యం గ్యాంగ్‌ను, డ్రగ్ మాఫియాను ఏం చేశాడు? అనేది తెలుసు కోవాలంటే సినిమా చూడాల్సిందే..
నటీ నటుల పనితీరు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో నవీన్ చంద్ర, హీరో భార్య గా దివ్యా పిళ్ళై బాగా నటించారు. నవీన్ చంద్ర ప్రియురాలిగా అనన్యా సేన్ గుప్తా గ్లామర్ డాల్‌గా కనిపించారు. భార్యకు, ప్రియురాలికి మధ్య నలిగిపోయే ఎమోషన్ పాత్రలో నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. సినిమా ఎక్కువ భాగం నవీన్ చంద్ర చుట్టూ తిరుగుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా రవిశంకర్, డాక్టర్ సమరంగా '30 ఇయర్స్' పృథ్వీ వారి పాత్రలకు న్యాయం చేశారు. 'పోలీస్‌గా రాజా రవీంద్ర,. 'దండుపాళ్యం' గ్యాంగ్ సభ్యులుగా మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, రవి కాలె మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో స్నేహితులుగా 'గెటప్' శీను, 'ఆటో' రామ్ ప్రసాద్‌లు తమ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
ఈ కథ కొత్తదేమీ కాదు. కాకపోతే మర్డర్ మిస్టరీ, డ్రగ్స్, లవ్.. ఇలా మూడు ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌ను సెలక్ట్ చేసుకొని ట్విస్టులు టర్నులతో సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీనివాస్ రాజు. క్లెమాక్స్‌లో దండుపాళ్యం గ్యాంగ్, నవీన్ చంద్ర, రవి శంకర్, అయ్యప్ప, పూజా గాంధీలపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠకు గురి చేస్తాయి. దండుపాళ్యం సినిమాకు మించిన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అలాగే వయలెన్స్‌కు కూడా మరీ ఎక్కువ మోతాదులో ఉంది. సినిమాకు అదే మైనస్‌గా మారింది. నేపథ్య సంగీతం బాగుంది. చరణ్ అర్జున్ చేసిన ఇళయరాజా - భారతిరాజాల 'మాటే మంత్రము' సాంగ్ రీమిక్స్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ అందించిన విజువల్స్ బాగున్నాయి. గ్యారీ బి. హెచ్ కొన్ని సీన్లను ఎడిటింగ్‌లో తీసేయాల్సింది. ఒక్క మాటలో చెప్పాలంటే వయొలెన్స్ ఇష్టపడేవారు తగ్గేదే లే చూసి ఎంజాయ్ చేయొచ్చు.
చదవండి: ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ
ఫ్లైట్ నుంచి దూకేశా: శర్వానంద్
Comments
Please login to add a commentAdd a comment