Srinivas Raju
-
ఇదంతా మీ వల్లే సాధ్యమైంది: రవితేజ అసిస్టెంట్ ఎమోషనల్
మాస్ మహారాజ రవితేజ ఫుల్ స్పీడు మీదున్నాడు. గ్యాప్ లేకుండా వరుస సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం రవితేజ నటించిన ధమాకా మూవీ ఈ నెల 23న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే రవితేజ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీనివాస రాజు సొంతంగా ఓ కారు కొన్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఎమోషనలయ్యాడు. 'ఊరిలో సైకిల్ తొక్కిన నేను ఇప్పుడు కారు కొనుక్కున్నాను. అంతా మీ వల్లే జరిగింది. మీతో కలిసి ఎన్నో మైళ్లు ప్రయాణించి ఉండొచ్చు. కానీ మీరు నా కారు నడుపుతున్నప్పుడు మీ పక్క కూర్చుని ప్రయాణించిన ఆ కొన్ని కిలోమీటర్లు నాకెంతో ప్రత్యేకం. నా సర్వస్వం మీరే అయిన మాస్ గాడ్ రవితేజకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఈ జీవితం మీకు అంకితం' అని రాసుకొచ్చాడు. From riding a bicycle in my village To Owning my Car.This all happened just bcoz of you. I might have travelled many miles with u but the few kms sitting beside u while u were driving my car is the best one of all.Thank u for being my everything dear Mass God @RaviTeja_offl ❤️🙏 pic.twitter.com/uuBzzy9z06 — Srinivas Raju (@srinu10477) December 6, 2022 చదవండి: ఆ సౌత్ హీరోకి ఫోన్ చేసి ఒక్క ఛాన్స్ అడిగా: జాన్వీ -
నవీన్ చంద్ర 'తగ్గేదే లే' సినిమా రివ్యూ
టైటిల్: తగ్గేదే లే నటీనటులు: నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా, నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, అయ్యప్ప పి.శర్మ, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ దర్శకత్వం : శ్రీనివాస్ రాజు కెమెరా : వెంకట్ ప్రసాద్ నిర్మాత : ప్రేమ్ కుమార్ పాండే, పి. వి.సుబ్బారావు రెడ్డి బ్యానర్ : భద్ర ప్రొడక్షన్స్ ఎడిటింగ్ : గ్యారీ బి. హెచ్ విడుదల తేదీ: నవంబర్ 4, 2022 దండుపాళ్యం సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ రాజు ఆ సినిమాకు సీక్వెల్ గా రెండు భాగాలు తెరకెక్కించాడు. తాజాగా దండుపాళ్యం సినిమాలోని నటులను తీసుకొని ఒక ఫ్యామిలీ, మర్డర్, మిస్టరీతో రూపొందించిన చిత్రమే " తగ్గేదే లే". ఇందులో నవీన్ చంద్ర హీరోగా దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తాలు హీరోయిన్స్‌గా నటించారు. నవంబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఎంటర్టైన్ చేసిందో చూద్దాం.. కథ మర్డర్, డ్రగ్స్, లవ్ వంటి మూడు కథలతో ఈ సినిమా సాగుతుంది. ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్వేర్ ఉద్యోగి. మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత తాను ఈశ్వర్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న లిజి ఈశ్వర్ ఇంట్లో ఉంటూ... అంతకుముందు తనతో దిగిన ఫొటోలతో ఈశ్వర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈశ్వర్ ఇంట్లో మహిళ శవం దొరుకుతుంది. అప్పటివరకు దండుపాళ్యం బ్యాచ్‌తో ఈశ్వర్‌కు సంబంధం ఉందని అనుమానపడుతున్న పోలీసులకు అతడి ఇంట్లో శవం దొరకడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఆ అమ్మాయిని ఈశ్వర్ చంపాడనే అనుమానంతో పోలీస్ ఆఫీసర్ చలపతి(రవి శంకర్), రాజా రవీంద్ర ఇంటరాగేషన్ చెయ్యాలని అరెస్ట్ చేస్తారు.ఈ ఇంటరాగేషన్‌లో ఈశ్వర్ ద్వారా తెలుసుకున్న నిజాలు ఏమిటి? ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? ఆ హత్య నుంచి అతడు ఎలా బయట పడ్డాడు? ఈశ్వర్ జీవితానికి, దండుపాళ్యం గ్యాంగుకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) దండుపాళ్యం గ్యాంగ్‌ను, డ్రగ్ మాఫియాను ఏం చేశాడు? అనేది తెలుసు కోవాలంటే సినిమా చూడాల్సిందే.. నటీ నటుల పనితీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో నవీన్ చంద్ర, హీరో భార్య గా దివ్యా పిళ్ళై బాగా నటించారు. నవీన్ చంద్ర ప్రియురాలిగా అనన్యా సేన్ గుప్తా గ్లామర్ డాల్‌గా కనిపించారు. భార్యకు, ప్రియురాలికి మధ్య నలిగిపోయే ఎమోషన్ పాత్రలో నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. సినిమా ఎక్కువ భాగం నవీన్ చంద్ర చుట్టూ తిరుగుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా రవిశంకర్, డాక్టర్ సమరంగా '30 ఇయర్స్' పృథ్వీ వారి పాత్రలకు న్యాయం చేశారు. 'పోలీస్‌గా రాజా రవీంద్ర,. 'దండుపాళ్యం' గ్యాంగ్ సభ్యులుగా మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, రవి కాలె మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో స్నేహితులుగా 'గెటప్' శీను, 'ఆటో' రామ్ ప్రసాద్‌లు తమ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. సాంకేతిక నిపుణుల పనితీరు ఈ కథ కొత్తదేమీ కాదు. కాకపోతే మర్డర్ మిస్టరీ, డ్రగ్స్, లవ్.. ఇలా మూడు ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌ను సెలక్ట్ చేసుకొని ట్విస్టులు టర్నులతో సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీనివాస్ రాజు. క్లెమాక్స్‌లో దండుపాళ్యం గ్యాంగ్, నవీన్ చంద్ర, రవి శంకర్, అయ్యప్ప, పూజా గాంధీలపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠకు గురి చేస్తాయి. దండుపాళ్యం సినిమాకు మించిన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అలాగే వయలెన్స్‌కు కూడా మరీ ఎక్కువ మోతాదులో ఉంది. సినిమాకు అదే మైనస్‌గా మారింది. నేపథ్య సంగీతం బాగుంది. చరణ్ అర్జున్ చేసిన ఇళయరాజా - భారతిరాజాల 'మాటే మంత్రము' సాంగ్ రీమిక్స్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ అందించిన విజువల్స్ బాగున్నాయి. గ్యారీ బి. హెచ్ కొన్ని సీన్లను ఎడిటింగ్‌లో తీసేయాల్సింది. ఒక్క మాటలో చెప్పాలంటే వయొలెన్స్ ఇష్టపడేవారు తగ్గేదే లే చూసి ఎంజాయ్ చేయొచ్చు. చదవండి: ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ ఫ్లైట్ నుంచి దూకేశా: శర్వానంద్ -
నాకు ఆ తొందర లేదు.. అందుకే కథ విషయంలో రాజీ పడను
‘‘కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో కొత్త మార్పులు వచ్చాయి. లిప్‌లాక్ సీన్స్ ఉన్నంత మాత్రాన థియేటర్స్‌కు వస్తారనుకోవడం లేదు. సహజత్వంతో కూడిన వాస్తవిక కథలను చూసేందుకే ఇప్పుడు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. వెంటవెంటనే సినిమాలు చేయాలనే తొందర నాకు లేదు.. అందుకే కథ విషయంలో నేను రాజీ పడను’’ అని ‘దండుపాళ్యం’ ఫేమ్ దర్శకుడు శ్రీనివాస్ రాజు అన్నారు. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ–‘‘ప్రేమ, ప్రతీకారం మిళితమై ఉన్న కథ ఇది. స్వామిజీల ముసుగులో కొందరు చేసే అక్రమాలు, మనీ లాండరింగ్ అంశాన్ని చూపించాం. ‘దండుపాళ్యం’ గ్యాంగ్‌కు సంబంధించిన ఏపిసోడ్ ఈ మూవీలో కీలకంగా ఉంటుంది. మా సినిమాలోని పాత్రలు వేటికవే పోటాపోటీగా ఉంటాయి. అందుకే ‘తగ్గేదే లే’ అని టైటిల్ పెట్టాం. మా టైటిల్‌కు మేము ఊహించిన దానికన్నా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. -
‘కుటుంబరావు ఒక బ్రోకర్’
సాక్షి, విజయవాడ : కుటుంబరావు ఒక బ్రోకర్.. ఆయన నోటీసులకు భయపడమంటూ ఆర్టీఐ మాజీ కమిషనర్, బీజేపీ నేత విజయ్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీల మీద బెట్టింగ్ కాయడానికి కుటుంబ రావుకి రూ.1.30 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము తింటూ టీడీపీ తరఫున మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కుటుంబరావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి అపఖ్యాతి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బెట్టింగ్ గురించి మాట్లాడటం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆర్థిక నేరాలు చేసిన కుటుంబ రావుకు బీజేపీ నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై కుటుంబ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మరో బీజేపీ నాయకుడు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ కుమ్మక్కయ్యి ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపించారు. పాల్‌కు చంద్రబాబు డబ్బులిచ్చి మరి వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులను నిలబెట్టారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు కోరిక మేరకు ఎన్నికల కమిషన్ ఎస్ ఎస్ సీ యాదవ్‌ను మార్చారని గుర్తు చేశారు. ఏబీ వెంకటేశ్వర రావు మీద చంద్రబాబుకు ఎందుకంత ప్రేమని ప్రశ్నించారు. ఆయన లేక పోతే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరా ఏంటి అంటూ ఎద్దేవా చేశారు. -
వేడుకగా వెంకన్న చక్రస్నానం
తిరుమల: తిరుమలలో ఈ నెల 10 నుంచి 18 వరకు జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీవారి చక్రస్నానంతో గురువారం ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం 6 నుండి 9 గంటల నడుమ చక్రస్నానం వేడుకగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో చివరిదైన చక్రస్నానం యజ్ఞా ంతంలో ఆచరించే అవభృతస్నానమే. అవభృత స్నానంలో చక్రత్తాళ్వార్లకు పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిం చారు. ఇందులో ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేశారు. ఈ అభిషేక ౖðం కర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడయ్యాడు. అంతకుముందు తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. అదే రోజు రాత్రి 7.00 నుంచి 9 గంటల మధ్య బం గారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. కార్యక్ర మాల్లో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్, టీటీడీ ఈవో సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, తిరుపతి ఈవో భాస్కర్, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు. శ్రీవారి సేవలో న్యాయమూర్తులు తిరుమలలో గురువారం పలువురు న్యాయమూర్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చక్రస్నానంలో పాల్గొన్నారు. ఈఓ అనిల్కుమార్సింఘాల్ ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ ధ్వజస్తంభానికి మొక్కుకుని, స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కార్యదర్శి భాస్కర్ గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. -
పుష్పక విమానంపై సప్తగిరీశుని దివ్య దర్శనం
తిరుమల: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం పుష్పక విమానంలో శ్రీవారు ఊరేగారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి సంప్రదాయబద్ధంగా చామంతి, వృక్షం, గన్నేరు, మల్లెలు, కనకాంబరాలు వంటి పుష్పాలతో తయారుచేసిన పల్లకీ పై విహరిస్తూ భక్తకోటికి తన దివ్యమంగళ రూప దర్శనంతో సాక్షాత్కరించారు. ఈ పుష్ప పల్లకీకి మొత్తం 300 కేజీల పూలను ఉపయోగించారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అశేష భక్త జన గోవింద నామ స్మరణల మధ్య మంగళ వాయిద్యాలు, వేద పండితుల గోష్ఠి, జానపద కళా బృందాల సంగీత, గాన కచేరీలు కనువిందు చేయగా ఆద్యంతం ఉత్సవం వేడుకగా సాగింది. ఇక ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్ప స్వామి తన భక్తశిఖామణి హనుమంతుని వాహనంగా మలుచుకుని ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్బాణాలు చేతపట్టిన శ్రీరామచంద్రుడిని ఆంజనేయుడు తన భుజంపై ఉంచుకుని ఆలయ పురవీధుల్లో అశేష భక్త జనులకు కనువిందు చేశారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ముగ్ధమనోహరుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై ఆశీనుడై రాజసంగా నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే తను శరణు కోరే వారిని ఎల్లవేళలా కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఈ వాహనంపై విహరించారు. ఆదివారం రాత్రి శ్రీవారి గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. సోమవారం వారు మీడియా తో మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులు, విజిలెన్స్, పోలీసులు సమష్టిగా పనిచేసి వాహన సేవల్ని వైభవంగా నిర్వహించారని కొనియాడారు. గజవాహనంపై శ్రీనివాసుడు -
ఫోర్త్ గ్యాంగ్‌తో సంబంధం లేదు!
భయానికి కేరాఫ్ అడ్రస్ అనేలా సిల్వర్‌స్క్రీన్‌పై నటించి ప్రేక్షకుల మెప్పుపొందారు దండుపాళ్యం గ్యాంగ్. శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో దండుపాళ్యం గ్యాంగ్‌గా పూజా గాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే, రవి శంకర్ ముఖ్య పాత్రలుగా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం’. ఈ సినిమా హిట్ కావడంతో దండుపాళ్యం 2, దండుపాళ్యం 3 చిత్రాలను తెరకెక్కించారు శ్రీనివాస్ రాజు. ‘దండుపాళ్యం 3’ రిలీజ్‌కు రెడీ అయింది. దండుపాళ్యం సిరీస్‌లో ఇదే చివరిదని ఆయన ఇటీవల తెలిపారు. కానీ సడన్‌గా వెంకట్ అనే నిర్మాత సారథ్యంలో ‘దండుపాళ్యం 4’ తెరపైకి వచ్చింది. ‘‘ఈ దండుపాళ్యం 4తో నాకు ఎలాంటి సంబంధం లేదు. పోస్టర్‌పై నా ఫొటో ఉంది. అయితే నేను ఇందులో నటించడంలేదు. నటించమని నన్నెవరూ సంప్రదించలేదు. ‘దండుపాళ్యం 4’ పోస్టర్స్‌పై నా అనుమతి లేకుండా నా ఫొటోలను ఎలా వాడతారు’’ అని పూజగాంధీ పేర్కొన్నారు. మకరంద్ దేశ్‌పాండే అండ్ రవికాలే కూడా ‘దండుపాళ్యం 4’లో నటించడం లేదని స్పష్టం చేశారు. -
నేనా సినిమా చేయట్లేదు..!
శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన దండుపాళ్యం సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తరువాత ఆ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిన దండుపాళ్యం 2 ఆ స్థాయిలో విజయం సాధించకపోయినా.. చిత్రయూనిట్ మరో సీక్వల్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం దండుపాళ్యం 3 రిలీజ్ అవుతుండగా చిత్రయూనిట్ దండుపాళ్యం 4 పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో గత చిత్రాల్లో నటించిన వారే కనిపించారు. కానీ ఈ విషయంపై నటి పూజా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దండుపాళ్యం 4లో నటించటం లేదని తెలిపారు. తనను ఈ సినిమాలో నటించాల్సిందగా ఎవరూ అడగలేదని. తన అనుమతి లేకుండానే తన ఫొటోనూ పోస్టర్లో వేశారని తెలిపారు. తనను గాని తనకు సంబంధించిన వ్యక్తులను కానీ సంప్రదించకుండా తన పేరు వాడుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
టీడీపీకి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి : బీజేపీ
విజయవాడ : టీడీపీ నేతలకు దమ్ముంటే నిధులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్, బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రాజు సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఏమిచ్చారనే దానిపై బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు వాస్తవాలు వెల్లడించారన్నారు. అయినా టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు కోరిక మేరకే కేంద్రం రాష్ట్రానికి అప్పగించిందని తెలిపారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందంటూనే, టీడీపీ నేతలు వారితో కలిసి బంద్‌లో ఎలా పాల్గొంటారని శ్యామ్ కిషోర్ నిప్పులు చెరిగారు. విభజన చట్టంలో క్లారిటీ లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌కి అన్నిఇస్తున్నామని చెప్పారు. మిత్రధర్మాన్ని టీడీపీ నాయకులు పాటించకుండా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి ఉన్న రాజకీయ అవసరాల కోసం బీజేపీపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. టీడీపీ ఎంపీల హెచ్చరికలను పట్టించుకోమని స్పష్టం చేశారు. బడ్జెట్ లో కేటాయిస్తేనే నిధులు వస్తాయనుకోవడం టీడీపీ నాయకుల అవివేకం అని మండిపడ్డారు. ముష్టి, బిక్షం వంటి పదాలను టీడీపీ నాయకులు కట్టిపెట్టాలని సూచించారు. రాజధానికి సంబంధించిన డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రాష్ట్రం నుంచి ఇంకా కేంద్రానికి అందలేదని శ్రీనివాస్ రాజు అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన రూ.లక్ష కోట్ల లెక్కలు టీడీపీ నాయకులు చెప్పడానికి తాము సిద్దంగా ఉన్నామని, తమ అధ్యక్షుడు హరిబాబు చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. హరిబాబు చెప్పిన లెక్కలపై టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. -
‘దండుపాళ్యం’ దర్శకుడితో శర్వానంద్
విభిన్న చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. సౌత్ లో సంచలనం సృష్టించిన దండుపాళ్యం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రాజుతో శర్వా ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనివాస్ రాజు స్వయంగా ప్రకటించారు. ఇటీవల దండుపాళ్యం 3 ట్రైలర్ ను రిలీజ్ చేసిన శ్రీనివాస్ రాజు, త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నానని వెళ్లడించారు. తన తొలి తెలుగు సినిమాను విలక్షణ నటుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ రాజు ‘ప్రస్తుతం శతమానం భవతి, మహానుభావుడు లాంటి ఫ్యామిలీ సినిమాలు చేస్తున్న శర్వా, దండుపాళ్యం లాంటి క్రైం థ్రిల్లర్ తెరకెక్కించిన నా కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. మా కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఆ అంచనాలు అందుకుంటుంది. అంతేకాదు ఈసినిమా శర్వానంద్ కెరీర్ లోనే భారీ చిత్రమవుతుంద’ని తెలిపారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పూర్తియిన వెంటనే శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో సినిమా ప్రారంభకానుంది. -
తెరపైకి మరో వివాదాస్పద చిత్రం
ఇటీవల సినిమాలు వివాదాలతోనే ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి. కొన్ని సినిమాలు అనుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటే, కొంత మంది మేకర్స్ వివాదాస్పద అంశాలనే సినిమాలకు ఎంచుకుంటున్నారు. తాజాగా అలాంటి వివాదాస్పద సంఘటనతో తమిళ కన్నడ భాషల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. దండుపాళ్యం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శ్రీనివాస రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2004లో కంచిపీఠంలో జరిగిన ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య, ఆ తరువాత పరిణామాలు పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్ట్ నేపథ్యంలో ఆచార్య అరెస్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కథ కోసం శంకర రామన్‌ను హత్య చేసిన గ్యాంగ్ కు చెందిన వారిని కూడా కలిసినట్టుగా తెలిపాడు దర్శకుడు శ్రీనివాస రాజు. అంతేకాదు త్వరలోనే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి మరిన్ని అంశాలపై చర్చిస్తానని, సినిమాలో అప్పటి సంఘటనకు సంబంధించిన రాజకీయ కోణంతో పాటు ప్రచారంలో ఉన్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేసే విధంగా సినిమా తెరకెక్కిస్తానని తెలిపారు. -
టిఆర్ఎస్ లీడర్ శ్రీనివాస్ రాజుతో సాక్షి వేదిక