‘దండుపాళ్యం’ దర్శకుడితో శర్వానంద్ | Dandupalyam director Tollywood debut with Sharwanand | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 23 2017 1:47 PM | Last Updated on Sat, Dec 23 2017 1:48 PM

Dandupalyam director Tollywood debut with Sharwanand - Sakshi

విభిన్న చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. సౌత్ లో సంచలనం సృష్టించిన దండుపాళ్యం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రాజుతో శర్వా ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనివాస్ రాజు స్వయంగా ప్రకటించారు. ఇటీవల దండుపాళ్యం 3 ట్రైలర్ ను రిలీజ్ చేసిన శ్రీనివాస్ రాజు, త‍్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నానని వెళ్లడించారు. తన తొలి తెలుగు సినిమాను విలక్షణ నటుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ రాజు ‘ప్రస్తుతం శతమానం భవతి, మహానుభావుడు లాంటి ఫ్యామిలీ సినిమాలు చేస్తున్న శర్వా, దండుపాళ్యం లాంటి క్రైం థ్రిల్లర్ తెరకెక్కించిన నా కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. మా కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఆ అంచనాలు అందుకుంటుంది. అంతేకాదు ఈసినిమా శర్వానంద్ కెరీర్ లోనే భారీ చిత్రమవుతుంద’ని తెలిపారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పూర్తియిన వెంటనే శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో సినిమా ప్రారంభకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement