Dandupalyam
-
పెళ్లి పీటలెక్కనున్న దండుపాళ్యం హీరోయిన్.. వరుడు ఎవరంటే?
ముంగారు పర్మ సినిమాతో శాండల్‌వుడ్‌లో ఫేమస్ అయిన నటి పూజా గాంధీ. ఆమె త్వరలోనే పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని ఓ లాజిస్టిక్స్ కంపెనీ యజమాని విజయ్ను నవంబర్ 29న పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే పెళ్లికి సంబంధించి పూజా గాంధీ నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కాగా.. దండుపాళ్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది పూజా. అయితే పూజా గాంధీకి విజయ్ స్వయంగా కన్నడ నేర్పించారట. బెంగాలీ అమ్మాయి అయినా పూజా సినిమా రంగంలోకి రావడానికి బెంగళూరు వచ్చినప్పుడు విజయ్ ఆమెకు కన్నడ మాట్లాడటం నేర్పించాడని అంటున్నారు. విజయ్ సహకారంతోనే పూజా గాంధీ కన్నడ నేర్చుకుని సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం వల్లే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారని శాండల్‌వుడ్ లేటేస్ట్ టాక్. కాగా.. ముంగారు వర్మ సినిమాలో గోల్డెన్ స్టార్ గణేష్‌తో కలిసి పూజా గాంధీ నటించింది. ఆ తరువాత పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించింది, శాండల్‌వుడ్‌లో ఫేమస్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. 2012లోనే పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో పూజా గాంధీకి నిశ్చితార్థం జరిగింది. కాని అనివార్య కారణాలతో నిశ్చితార్థం జరిగిన నెల రోజులకే వీరి బంధం విడిపోయింది. అంతకుముందే సినిమా డిస్ట్రిబ్యూటర్ కిరణ్‌ను పూజా గాంధీ పెళ్లి చేసుకున్నారనేది వార్త బయటకొచ్చింది. పూజా గాంధీ కెరీర్... పూజా గాంధీ ప్రధానంగా కన్నడ, తమిళ, బెంగాలీ, హిందీ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఖత్రోన్ కీ ఖిలాడీ, దుష్మణి, తమోకే సలామ్, కొక్కి వంటి చిత్రాల్లో కనిపించారు. 2006లో మాన్సూన్ రైన్ సినిమా ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మిలన్, కృష్ణ, మన్మథ చిత్రాల్లో నటించారు. తమిళంలో తోతల్ పో మలరం, వైతేశ్వరన్ చిత్రాల్లో నటించారు. కన్నడలో పాయా, హనీ హనీ, యాక్సిడెంట్, కామన్న కొడుకులు, నీ టాటా నా బిర్లా, తాజ్ మహల్, కొడగన్నా కోలి నుంగిట్టా వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన దండుపాళ్యం, దండుపాళ్యం 2, దండుపాళ్యం 3, చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. -
దండుపాళ్యం తరహాలో దొంగతనం, హత్య
అనంతపురం క్రైం: అనంతపురం జిల్లా కదిరి ఎన్జీవో కాలనీలో సంచలనం రేకెత్తించిన టీచర్ ఉషారాణిని హత్య చేసి.. మరో వివాహిత శివమ్మను తీవ్రంగా గాయపర్చి నగలు, నగదు ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. కరుడుగట్టిన దోపిడీ దొంగ షేక్ షఫీవుల్లా అలియాస్ షఫీ (35)ని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.30 లక్షల విలువైన 58 తులాల బంగారం, రూ.97 వేల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్ప బుధవారం వెల్లడించారు. కర్ణాటకలోని దేవనహళ్లికి చెందిన షేక్ షఫీవుల్లా (షఫీ) 2004 నుంచి 2009 వరకు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడ్డాడు. పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన నిందితుడు 2010లో జిల్లాలోని ఓబుళాపురానికి చెందిన మహిళను వివాహం చేసుకుని కదిరిలో స్థిరపడ్డాడు. అప్పటి నుంచి వాహనాల్లో పెట్రోల్ దొంగిలిస్తూ.. ఎర్ర చందనం రవాణా వాహనాలకు డ్రైవర్‌గా పని చేసేవాడు. ‘దండుపాళ్యం’ చూసి.. దండుపాళ్యం సినిమా చూసిన తర్వాత అందులో చూపిన తరహాలో ఇళ్లలోకి ప్రవేశించి మహిళలను హతమార్చి చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్టు షఫీ పోలీసులకు తెలిపాడు. హత్యలు చేయడానికి బరువైన రాడ్‌ను తీసుకున్నాడు. 2019 ఆగస్టులో కదిరిలోని హిందూపురం రోడ్డులో నివాసముండే సావిత్రి, 2021లో అదే పట్టణంలోని హరూన్ వీధిలో ఉండే గంగాదేవి అనే మహిళలపై రాడ్‌తో దాడి చేయగా.. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. 2019 జనవరిలోనూ స్థానిక రెవెన్యూ కాలనీలో ఇదే తరహాలో ఒకరిపై దాడి చేశాడు. అదును చూసి మరీ.. గత ఏడాది నవంబర్‌లో కదిరి ఎన్జీవో కాలనీలో దోపిడీకి పాల్పడటానికి ఐదు రోజుల ముందు షఫీ ఆ వీధిలో రెక్కీ నిర్వహించాడు. టీస్టాల్ నిర్వాహకుడు రమణ వేకువజామునే వ్యాపారానికి వెళ్లడం, ఆ ఇంటి పక్కనే ఉండే ఉపాధ్యాయుడు శంకర్‌రెడ్డి మార్నింగ్ వాక్కు వెళ్లడం గమనించాడు. శంకర్‌రెడ్డి వాకింగ్‌కు వెళ్లే ముందు ఇంటి తాళం చెవి షూలో ఉంచేవాడు. దీన్ని గమనించిన షఫీ గతేడాది నవంబర్ 16 తెల్లవారుజామున దొంగతనానికి వెళ్లాడు. మొదట టీస్టాల్ రమణ ఇంటికి వెళ్లి అతని భార్య శివమ్మపై రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఆమె మెడలోని 5 తులాల చైన్, బీరువాలోని రూ.1.50 లక్షల నగదు చోరీ చేశాడు. ఆ తరువాత పక్కనే ఉన్న శంకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి షూలో ఉన్న తాళం చెవితో తలుపులు తెరిచి లోనికి ప్రవేశించాడు. నిద్రలో ఉన్న శంకర్‌రెడ్డి భార్య, ప్రభుత్వ ఉపాధ్యాయిని ఉషారాణి తలపై రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. ఆమె మెడలోని నగలతోపాటు బీరువాలోని నగలు, నగదు ఎత్తుకెళ్లాడు. మార్నింగ్ వాక్ నుంచి తిరిగివచ్చిన శంకర్‌రెడ్డి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి లోనికి వెళ్లి చూడగా.. అప్పటికే ఉషారాణి ప్రాణాలొదిలింది. టీ స్టాల్ యజమాని రమణ ఇంట్లోనూ దోపిడీ జరిగినట్టు గుర్తించిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న అతడి భార్య శివమ్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించటంతో ఆమె కోలుకుంది. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు 90 రోజుల్లో ఛేదించి షఫీని అరెస్ట్ చేశారు. -
దండుపాళ్యం సినిమా స్ఫూర్తితో టీచర్ దారుణ హత్య, కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, అనంతపురం: దండుపాళ్యం సినిమా స్ఫూర్తితో ఓ తీవ్రమైన నేరానికి పాల్పడిన నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది నవంబర్ లో అనంతపురం జిల్లా కదిరిలో టీచర్ ఉషారాణి హత్య జరిగింది. సుమారు ఐదు వేల మందిని విచారించిన పోలీసులు.. కదిరికి చెందిన షఫీవుల్లాను నిందితుడిగా తేల్చారు. దండుపాళ్యం సినిమా చూసి షఫీ ఇంతటి ఘెరానికి పాల్పడినట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ ఫక్కీరప్ప దండుపాళ్యం చిత్రయూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. (చదవండి: చుక్క గొరక.. సాగు ఎంచక్కా!) నిందితుడి కోసం ఐదు రాష్ట్రాల్లో గాలింపు నిందితుడు షఫీవుల్లా నుంచి పోలీసులు 58 తులాల బంగారం, 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ 11న కదిరి ఎన్జీవో కాలనీలో జరిగిన టీచర్ ఉషారాణి దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడి కోసం ఐదు రాష్ట్రాల్లో 8 ప్రత్యేక బృందాలు గాలించాయి. కేసును ఛేదించేందుకు పోలీసులు లక్ష ఫోన్ కాల్స్ పరిశీలించారు. ఐదు వేల మంది అనుమానితుల విచారించారు. ఈమేరకు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప మీడియా కు వివరాలు వెల్లడించారు. (చదవండి: అలలు చెక్కిన శిల్పాలు) -
దండుపాళ్యం ముఠా కన్నుపడితే అంతే..
సాక్షి, చీరాల (ప్రకాశం): పగలు లేదు..రాత్రి లేదు.. ఎప్పుడైనా వారి టార్గెట్ ప్రేమ జంటలే. అందులోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వారినే టార్గెట్ చేస్తారు. రాత్రి వేళ్లల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే దంపతులను కూడా వదలరు. చీకట్లో మాటు వేసి అందినంత దోచుకోవడం ఆపై విచక్షణ మరిచి సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. వీలుకాకుంటే చితకబాది జేబులో ఉన్న డబ్బులు, ఒంటిపై ఉన్న నగలు దోచేస్తారు. వీరి అకృత్యాలు దండుపాళ్యం సినిమాలో ఘటనలు తలదన్నేలా ఉంటాయి. గతంలోనూ విచ్చల విడిగా అరాచకాలకు పాల్పడ్డారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పలు రకాలు కేసులు బనాయించి కొందరిని జైలుకు పంపడంతో కొద్ది రోజులుగా మిన్నకున్నారు. మళ్లీ ఈ బ్యాచ్ కొద్ది నెలలుగా తమ వికృత చేష్టలకు పదును పెట్టింది. దండుబాటలో దారి దోపిడీలకు పాల్పడుతోంది. కారంచేడు బ్రిడ్జి సమీపంలో లైంగిక దాడులకు తెరలేపింది. రామాపురం బీచ్‌లో ప్రేమజంటలను టార్గెట్ చేస్తోంది. ఉజిలీపేటకు చెందిన ఈ ముఠా కొద్ది రోజులు వ్యవధిలోనే ఏడు జంటలపై లైంగిక దాడులకు పాల్పడిందంటే నిందులు ఎంతటి దుర్మార్గులో ఆర్థం చేసుకోవచ్చు. దాడులు, ఆపై లైంగిక దాడులు చీరాల విఠల్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన శివారెడ్డితో ఆమెకు పరిచయమైంది. వీరు చీరాల సమీపంలోని కారంచేడు సరిహద్దుల్లోని ఏకాంత ప్రాంతానికి వెళ్లారు. కొద్దికాలంగా అనుసరిస్తున్న ఉజిలిపేటకు చెందిన ముఠా వీరిపై కన్నేసింది. చీకట్లో కాలువ కట్టపైకి వెళ్లిన కొద్ది సేపటికి వారి వెనుకే వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రియుడి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ దోచుకున్నారు. తనపై కూడా దాడి చేస్తారనే భయంతో అతడు కూడా దూరంగా ఉండిపోయాడు. విషయం బయటకు వస్తే చంపేస్తామని, మీ పరువే పోతుందని ఆమెను భయపెట్టారు. బాధితురాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న ఎస్పీ కూడా కేసును సీరియస్‌గా తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ సమయంలో విస్తుకొల్పే విషయాలు వెల్లడయ్యాయి. కొద్ది రోజుల్లోనే మొత్తం ఏడు జంటలపై దాడులు, లైంగిక దాడులకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. అందులో విఠల్‌నగర్‌కు చెందిన మహిళ తప్ప మిగిలిన ఆరు జంటల్లో ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందు రాలేదు. పోలీసులు, మరెవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని, కుటుంబంలో వివాదాలు ఏర్పడి తమ కాపురాలు ఎక్కడ పోతాయనే మౌనం దాల్చారు. ఎక్కువగా వీరు వివాహేతర సంబంధాలు ఉన్నవారు కావడంతో ముందుకు వచ్చి నోరు మెదపకలేక పోతున్నారు. దండుబాటే డేంజర్ దండుబాట రోడ్డులో రెండు ముఠాలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాయి. చీరాల నుంచి స్వర్ణకు దండుబాట మీదగా రాత్రి 11 గంటల వరకు ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. స్వర్ణకు వెళ్లే రోడ్డులో మలుపు వద్ద వాహనాలను వేగం తగ్గిస్తారు. ఇక్కడే మాటు వేసిన ముఠాలు వాహనదారులను చితకబాది నగదు దోచుకుంటున్నాయి. వారం రోజుల క్రితం ఓ మోటార్ సైకిల్ నుడుపుతున్న వ్యక్తిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ దోచుకున్నారు. ఈ ఘటనపై ఒన్టౌన్పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దండుబాట నుంచి చీరాల నగర్‌కు వెళ్లే దారిలో సరివితోటలతో పాటు పొలాలు ఉండడంతో వివాహేతర సంబంధం ఉన్న జంటలు ఆ చీకటి ప్రాంతాలకు వెళ్తుంటాయి. అక్కడే మాటు వేసి ఉండే ఈ ముఠాలు నిశితంగా పరిశీలించి వారిపై లైంగిక దాడులతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. అరాచాకాలకు అంతే లేదు వాడరేవు సముద్ర తీర ప్రాంతాని పర్యాటకులు, నూతనంగా పెళ్లయిన వారు, కొందమంది ప్రేమికులు జంటలుగా వాడరేవుకు వస్తుంటారు. ఇదే అదునుగా భావించిన కొందరు అగంతకులు పర్యాటకులపై మానవత్వాన్ని మరిచి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తీరంలో జంటగా వెళ్లిన వారిని అటకాయించి వారి వద్ద ఉన్న నగదు, బంగారం, సెల్ఫోన్లు బలవంతంగా లాక్కుంటున్నారు. ప్రతిఘటించిన వారిపై దాడులకు దిగి గాయపరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒకటా..రెండా? వాడరేవు నుంచి రామాపురం తీరానికి వెళ్లే దారిలో ఉన్న తీరానికి ఓ ప్రేమజంట వెళ్లింది. తీరం వెంట ఉండే అటవీ శాఖకు చెందిన సరివి తోపుల వద్ద జంట ఉంది. వెళ్లిన కొద్ది సేపటికే చీరాల ప్రాంతంలోని పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు ఆరుగురు ఆ జంట వద్దకు వెళ్లి తాము పోలీసులమని బెదిరించడంతో పాటు ప్రియుడిని కట్టేసి అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌తో పాటు ప్రియురాలి చెవులకు ఉన్న దుద్దులు దోచుకున్నారు. సొత్తు దోచుకోవడంతో పాటు ఆరుగురూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఊరుకోకుండా మానవ మృగాళ్లుగా మారి ఆమె నగ్న దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఆమె సెల్ నంబర్ తీసుకుని ఆ తర్వాత జంటను వదిలేశారు. ఆ ప్రేమ జంటది వివాహేతర సంబంధం కావడంతో బయటపడితే తమ పరువు పోవడంతో పాటు కాపురాలు దెబ్బతింటాయని మౌనంగా ఉంది. చివరకు ఆమెకు బెదిరింపులు అధికం కావడంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు కేసు వద్దని, పోయిన బంగారాన్ని ఇప్పించాలని కోరడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు. నిందితుల్లో కొందరిపై మాత్రం దోపిడీ కేసు మాత్రమే నమోదు చేశారు. తీరంలో జోరుగా దోపిడీలు జిల్లాలోనే సముద్ర తీర పర్యాటక ప్రాంతంగా పేరుగంచిన చీరాల వాడరేవులో ప్రస్తుతం పర్యాటకులకు అశాంతి, అభద్రత నెలకొంది. అరాచక ముఠాలు ఎప్పుడు లైంగిక దాడులు, దొంగతనాలు చేస్తాయో తెలియక పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చీరాల వాడరేవు తీరానికి విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వరంగల్ జిల్లాలతో పాటుగా బెంగళూరు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు. చీరాల వాడరేవు, రామాపురంలో వసతి సౌకర్యాలతో పాటు సముద్రంలో స్నానాలు చేసేందుకు మంచి అనువైన ప్రదేశం కావడంతో నిత్యం పర్యాటకులతో వాడరేవు కళకళలాడుతుంటుంది. పెట్రోలింగ్‌ను వేగవంతం చేశాం దండుబాట నుంచి స్వర్ణ వేళ్లే రోడ్డులో రాత్రి 12 గంటల వరకు పెట్రోలింగ్ చేస్తున్నాం. ఇక్కడ గతంలో దాడులు జరిగాయి. నిందితుల ఆట కట్టించేందుకు త్వరలోనే వెహికల్ చెకింగ్, ప్రత్యేకంగా సిబ్బందితో గస్తీ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించాలి. వివరాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. - నాగమల్లేశ్వరరావు, ఒన్‌టౌన్ సీఐ, చీరాల -
ఆగస్ట్ 15న దండుపాళ్యం 4
బెనర్జీ, వెంకట్, ముమైతఖాన్, సంజీవ్‌కుమార్, సుమన్ రంగనాథన్ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం తెరకెక్కిన సినిమా ‘దండుపాళ్యం 4’. ఈ సినిమాకు వెంకట్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా ఖచ్చితంగా ఆగస్ట్ 15 విడుదల చేస్తామని చిత్ర దర్శకనిర్మాతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ చిత్రం ‘దండుపాళ్యం’ ట్రయాలజీకి సీక్వల్ కాదని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాలో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ రూపొందిందని తెలిపారు. ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. ‘ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. అనేక ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు. అనంతరం దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ.. ‘దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్, ముమైత్‌ఖాన్, సంజీవ్‌కుమార్, సుమన్ రంగనాథన్ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు. -
‘కోర్టుకి వెళ్లయినా సినిమా విడుదల చేస్తాం’
బెనర్జీ, వెంకట్, ముమైతఖాన్, సంజీవ్‌కుమార్, సుమన్ రంగనాథన్ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం తెరకెక్కిన సినిమా ‘దండుపాళ్యం 4’. ఈ సినిమాకు వెంకట్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ‘దండుపాళ్యం’ ట్రయాలజీకి సీక్వల్ కాదని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాలో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ రూపొందిందని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత వెంకట్ మాట్లాడుతూ ‘సినిమా షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇటీవల సెన్సార్ అప్లై చేశాను. కంటెంట్ పరంగా సినిమాలో ఏదన్నా సమస్య ఉంటే ఆ సన్నివేశాన్ని, డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది. నా సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి.. లేదంటే రిజక్ట్ చేస్తానని చెప్పారు. సినిమాలో సమస్య ఏంటో చెప్పకుండా సినిమాను రిజెక్ట్ చేస్తాననడం మొదటిసారి చూశా. ఆ తర్వాత నేనీ సినిమా సెన్సార్ చెయ్యను. రివైజ్ కమిటీకి వెళ్లండన్నాడు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నా. రివైజ్ కమిటీనే కాదు.. ట్రిబ్యునల్ అదీ కాకపోతే.. కోర్టు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో సినిమా విడుదల చేస్తాం’ అనని తెలిపారు. ‘ఇంతకన్నా క్రైమ్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విజయవంతంగా ఆడి థియేటర్స్ నుంచి కూడా వెళ్లిపోయాయి. మా సినిమాతో సెన్సార్ బోర్డ్‌కి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చిలో సినిమా విడదల చేస్తాం’ అని దర్శకుడు చెప్పారు. కన్నడలో దండుపాళ్యంలో నటించడం వల్ల అక్కడ మరో రెండు సినిమాల్లో అవకశం వచ్చిందని డి.ఎస్.రావు చెప్పారు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దండుపాళ్యం4కి సెన్సార్ షాక్
కర్ణాటక , యశవంతపుర: బెంగళూరు సమీపంలోని దండుపాళ్యకు చెందిన దోపిడీదొంగల స్వైర విహారానికి దృశ్యరూపమైన దండుపాళ్యం సినిమాల గురించి తెలియనివారుండరు. అందులో 4వ చిత్రానికి అనుకోని షాక్ తగిలింది. మోడల్, నటి సుమన్ రంగనాథ్, పూజాగాంధీ తదితరులు నటించిన ‘దండుపాళ్యం–4’ సినిమాను రాష్ట్ర సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి అర్హత లేదంటూ తిరస్కరించింది. సినిమాలోని సన్నివేశాలు చాలా హింసాత్మకంగా, అసభ్యంగా ఉన్నందున ప్రజలు ఈ సినిమాను చూడడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. దీంతో సెన్సార్ బోర్డ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ చిత్ర నిర్మాత వెంకటేశ్ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, కేంద్ర సెన్సార్ బోర్డ్‌కు ఫిర్యాదు చేయడంతో పరిణామాలు ఉత్కంఠగా మారాయి. కోర్టుకు వెళ్లే విషయంలో నిపుణులతో చర్చిస్తానని నిర్మాత ప్రకటించారు. బోర్డుపై నిర్మాత ఆరోపణలు నిర్మాత మాట్లాడుతూ గత నవంబర్ 7న దండుపాళ్యం–4 సినిమాను చూసి సర్టిఫికెట్ మంజూరు చేయాలని చిత్ర బృందం ఆన్లైన్లో దరఖాస్తు చేసింది. జనవరి 2న తమ సినిమాను చూడకుండానే తరువాత వచ్చిన సినిమాలకు సర్టిఫికెట్లను కేటాయించారు. తాము ఒత్తిడితేవటంతో సినిమాను చూసిన సెన్సార్‌బోర్డ్ సభ్యులు ఎలాంటి కారణాలను చూపకుండానే సినిమాను తిరస్కరించినట్లు ఆరోపించారు. అభ్యంతకర సన్నివేశాలు ఏమైనా ఉంటే తొలగించాలని ఆదేశించాలి, లేదా మళ్లీ షూటింగ్ చేయాలని సూచించాలి, అలా కాకుండా సెన్సార్‌బోర్డ్ తమను వేధిస్తోందని నిర్మాత విమర్శించారు. కోట్లు ఖర్చుచేసి తీసిన సినిమాను సెన్సార్‌బోర్డ్ తిరస్కరించడం సరికాదన్నారు. సినిమాను ఐదు బాషల్లో విడుదల చేయాలని నిర్ణయించామని, అంతలోనే ఇలా జరిగిందని అన్నారు. ఇవేనా కారణాలు దోపిడీ దొంగల కథతో దండుపాళ్యం ఇప్పటివరకు మూడు పార్టులు విడుదలైంది. ఈ మూడు సినిమాలకూ సెన్సార్ బోర్డ్ పెద్దలకు మాత్రమేనని ‘ఎ’ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. 4వ సినిమాలో మహిళలను వేధిస్తున్న సన్నివేశాలు భయపెట్టేలా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళా పాత్రధారుల వస్త్రధారణ, ఒక ఇంట్లో చొరబడి మహిళను మహిళను లైంగికంగా వేధించటం లాంటి సన్నివేశాలు జుగుప్సాకరంగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. సినిమా ప్రారంభం నుండి ఇలాంటి భయంకరణమైన సన్నివేశాలు ఉండటంతో సెన్సార్‌బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నరకటం, చంపటం, వేధించటం తప్ప సమాజానికి అవసరమైన మంచి సందేశమే సినిమాలో లేదనే భావన బోర్డ్ సభ్యులకు కలిగినట్లు ఉందని పేరు రాయటానికి ఇష్టపడని సినీ దర్శకుడు ఒకరు అన్నారు. దండుపాళ్యంకు సెన్సార్‌బోర్డ్ నిరాకరణ శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. -
పావగడలో ‘దండుపాళ్యం’
కర్ణాటక, పావగడ: పళవల్లి, నాగలమడక గ్రామాల పరిసర ప్రాంతాల్లో దండుపాళ్యం చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్న దండుపాళ్యం చిత్రం కన్నడలో విజయవంతమైన దండుపాళ్యం 1,2,3లకు కొనసాగింపుగా ఉంటుందని చిత్ర నిర్మాత వెంకట్ తెలిపారు. స్థానిక రాయల్ హెరిటేజ్ రిసార్ట్‌లో చిత్ర యూనిట్ ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైం, థ్రిల్లర్ కథాంశాలతో కూడిన దండుపాళ్యం చిత్రం షూటింగ్‌కు అనువైన ప్రాంతంగా పావగడను గుర్తించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో తెలుగు విలక్షణ నటుడు బెనర్జీ మాస్టర్ మైండ్‌గా ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. చిత్ర దర్శకుడు కేటీ నాయక్ మాట్లాడుతూ ఈ సినిమాకు బెనర్జి ఎనర్జీ అని చమత్కరించారు. బెనర్జి మాట్లాడుతూ బాలివుడ్, హాలివుడ్ సినిమాల షూటింగ్‌లకు పావగడలోని లొకేషన్లు బాగున్నాయన్నారు. సుమన్ రంగనాథ్, రాక్‌లైన్ సుధాకర్, సంజీవ్ కుమార్, బులెట్ సోము, అరుణ్ బచ్చన్, విఠల్ రంగాయన, స్నేహనాయర్, రిచా శాస్త్రి ముఖ్య తారాగణం. -
యువతులపై మూకుమ్మడి లైంగిక దాడి
ఒంగోలు క్రైమ్: ప్రకాశం జిల్లాలో పొలాల్లోకి, కాలువ గట్లపైకి సరదాగా గడుపుదామని వచ్చే జంటలను, ప్రేమికులను బెదిరించి, లైంగిక దాడులు చేస్తున్న ముఠాను ఒంగోలు సబ్ డివిజన్, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. జిల్లాలో చీమకుర్తిలోని శిద్ధానగర్‌కి చెందిన పాలపర్తి ఏసు (28) తన తల్లిదండ్రులతో కలిసి పరిసర ప్రాంతాల్లో రైతుల పొలాల్లో ఎలుకలు పట్టుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో సాగర్ కాలువ వెంట పొలాలకు వెళ్లే సమయంలో ద్విచక్రవాహనాలపై, ఆటోల్లో జంటలు, ప్రేమికులు వస్తుండటం గమనించేవాడు. ఏకాంతంగా గడపడానికి వచ్చే వీరిని ఏంచేసినా ఎవరికీ చెప్పుకోలేరని అనుకున్నాడు. చీమకుర్తికే చెందిన నల్లబోతుల శ్రీనివాసులు, మరో వ్యక్తి సాగర్ కాలువలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగించేవారు. వీరిద్దరితోపాటు మరో ఐదుగురు, ఒక బాల నేరస్తుడ్ని కలిపి ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా ఏకాంత ప్రదేశాలకు వచ్చే జంటలను, ప్రేమికులను అత్యంత దారుణంగా హింసించి, పురుషులను కట్టేసి మహిళలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడేవారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న బంగారు నగలను, నగదును, ద్విచక్రవాహనాలను సైతం దోచుకునేవారు. ఏకాంతం కోసం వచ్చే జంటలే లక్ష్యం సాగర్ కాలువపై ఎప్పుడూ ఏసు ముఠాలోని ఇద్దరు సభ్యులు రెండు వాహనాలపై పహారా కాస్తూ ఉండేవారు. ఏకాంతంగా వచ్చిన జంటలను గుర్తించి ఆ సమాచారాన్ని వెంటనే ఏసుకు చేరవేసేవారు. ఆ తర్వాత ఈ ముఠా.. జంట, ప్రేమికులు ఉన్న ప్రదేశానికి వెళ్లి బెదిరించి పురుషులపై దాడి చేసి కొట్టి చెట్లకు కట్టేసేవారు. తర్వాత ఒకరి తర్వా ఒకరు మహిళ/యువతిపై లైంగికదాడి చేసేవారు. వారి వద్ద దోచుకున్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి సొమ్ము చేసుకునేవారు. ఈ ముఠా గత రెండేళ్లలో ఒంగోలుతోపాటు సాగర్ కాలువ, మల్లవరం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 17 మందిపై ఈ రాక్షస కాండ సాగించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇంకా వెలుగుచూడని అరాచకాలు మరో 13 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. బాధితులు పరువు పోతుందని బయటకు చెప్పుకోలేకపోయేవారు. ఇదే అవకాశంగా తీసుకున్న కిరాతకులు రెండేళ్లపాటు ఈ రాక్షసత్వాన్ని కొనసాగించారు. 15 ఏళ్ల క్రితం ఒంగోలు పట్టణ శివారు ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు జరిగేవి. ఆ తర్వాత చీరాల ప్రాంతంలోని దండుబాటలో ఇలాంటి కిరాతకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మళ్లీ ఏసు ముఠా ఈ దారుణాలకు ఒడిగట్టింది. దొంగతనం కేసులో ఒక చిన్న దొంగను పట్టుకొని విచారిస్తుంటే ఈ ముఠా చేసిన అకృత్యాలు వెలుగుచూశాయి. దీంతో ఒంగోలు సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావుల ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందాలు కిరాతక ముఠా గుట్టును రట్టుచేసి పాలపర్తి ఏసుతోపాటు చీమకుర్తికి చెందిన నల్లబోతుల శ్రీనివాసులు, కొమరగిరి కొండయ్య, బొజ్జా దుర్గాప్రసాద్, మన్నెం అంకమరావు, మన్నెం నరసింహారావు, మన్నెం గంగయ్య, తుపాకుల అంజయ్యలను అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మంది కాకుండా ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నట్టు తెలిపారు. -
ఫోర్త్ గ్యాంగ్‌తో సంబంధం లేదు!
భయానికి కేరాఫ్ అడ్రస్ అనేలా సిల్వర్‌స్క్రీన్‌పై నటించి ప్రేక్షకుల మెప్పుపొందారు దండుపాళ్యం గ్యాంగ్. శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో దండుపాళ్యం గ్యాంగ్‌గా పూజా గాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే, రవి శంకర్ ముఖ్య పాత్రలుగా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం’. ఈ సినిమా హిట్ కావడంతో దండుపాళ్యం 2, దండుపాళ్యం 3 చిత్రాలను తెరకెక్కించారు శ్రీనివాస్ రాజు. ‘దండుపాళ్యం 3’ రిలీజ్‌కు రెడీ అయింది. దండుపాళ్యం సిరీస్‌లో ఇదే చివరిదని ఆయన ఇటీవల తెలిపారు. కానీ సడన్‌గా వెంకట్ అనే నిర్మాత సారథ్యంలో ‘దండుపాళ్యం 4’ తెరపైకి వచ్చింది. ‘‘ఈ దండుపాళ్యం 4తో నాకు ఎలాంటి సంబంధం లేదు. పోస్టర్‌పై నా ఫొటో ఉంది. అయితే నేను ఇందులో నటించడంలేదు. నటించమని నన్నెవరూ సంప్రదించలేదు. ‘దండుపాళ్యం 4’ పోస్టర్స్‌పై నా అనుమతి లేకుండా నా ఫొటోలను ఎలా వాడతారు’’ అని పూజగాంధీ పేర్కొన్నారు. మకరంద్ దేశ్‌పాండే అండ్ రవికాలే కూడా ‘దండుపాళ్యం 4’లో నటించడం లేదని స్పష్టం చేశారు. -
మమ్మల్ని దండుపాళ్యం గ్యాంగ్ అంటున్నారు – పూజా గాంధీ
‘‘దండుపాళ్యం 3’ తర్వాత మరో రెండు మూడేళ్ల వరకూ ఈ జానర్లో సినిమాలు చేయను. రెండు భాగాల్లో కీలక పాత్రలు చేసిన నటీనటులే మూడో భాగంలోనూ చేశారు. కొన్ని పాత్రలకు మాత్రం వేరేవాళ్లను తీసుకున్నాం. ఈ మూడు భాగాలకు నాతో పాటు వర్క్ చేసిన డైలాగ్ రైటర్ రమేశ్, కెమెరామేన్ వెంకట్‌ప్రసాద్, ఎడిటర్ రవిచంద్రన్‌లకు థ్యాంక్స్. ‘దండుపాళ్యం’ సిరీస్‌లో ఇదే చివరిది’’ అని శ్రీనివాసరాజు అన్నారు. బొమ్మాళి రవిశంకర్, పూజా గాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘దండుపాళ్యం 3’ని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో సాయికృష్ణ ఫిలింస్ సమర్పణలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషపై శ్రీనివాస్ మీసాల, సాయికృష్ణ పెండ్యాల తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఇప్పటికి మేం 365 చిత్రాలకి రాసాం. ఇప్పుడు మేము, శ్రీనివాసరాజు ఓ సినిమాకి పని చేస్తున్నాం. తను ఏ సినిమా గురించైనా 365 రోజులు డిస్కస్ చెయ్యగలడు. అంత నాలెడ్జ్ ఉంది. వరుసగా సీక్వెల్స్‌తో హిట్స్ సాధిస్తున్నాడు. ఇప్పడు ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మేం ఇంతకుముందు చేసిన పాత్రలను మరచిపోయి, ‘దండుపాళ్యం’లో చేసిన పాత్రలను గుర్తుపెట్టుకుంటున్నారు. మమ్మల్ని ‘దండుపాళ్యం’ గ్యాంగ్ అంటున్నారు. ఈ సినిమాలో చేసిన లక్ష్మీ పాత్ర కోసం నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు మార్చుకోవాల్సి వచ్చింది’’ అని పూజా గాంధీ అన్నారు. ‘‘ఈ సినిమాలో మేం భయంకరమైనవాళ్లలా కనిపించినా రియల్‌గా అమాయకులం’’ అని మకరంద్ అన్నారు. ‘‘తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది’’ అని రవి కాలే చెప్పారు. ఈ వేడుకలో దర్శకుడు నక్కిన త్రినాథరావు, వీఐ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
‘దండుపాళ్యం’ దర్శకుడితో శర్వానంద్
విభిన్న చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. సౌత్ లో సంచలనం సృష్టించిన దండుపాళ్యం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రాజుతో శర్వా ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనివాస్ రాజు స్వయంగా ప్రకటించారు. ఇటీవల దండుపాళ్యం 3 ట్రైలర్ ను రిలీజ్ చేసిన శ్రీనివాస్ రాజు, త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నానని వెళ్లడించారు. తన తొలి తెలుగు సినిమాను విలక్షణ నటుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ రాజు ‘ప్రస్తుతం శతమానం భవతి, మహానుభావుడు లాంటి ఫ్యామిలీ సినిమాలు చేస్తున్న శర్వా, దండుపాళ్యం లాంటి క్రైం థ్రిల్లర్ తెరకెక్కించిన నా కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. మా కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఆ అంచనాలు అందుకుంటుంది. అంతేకాదు ఈసినిమా శర్వానంద్ కెరీర్ లోనే భారీ చిత్రమవుతుంద’ని తెలిపారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పూర్తియిన వెంటనే శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో సినిమా ప్రారంభకానుంది. -
ఎవరూ ఊహించరు గురూ
... అవును. ఎవరూ ఊహించని కాంబినేషన్ కుదిరిందని ఫిల్మ్‌నగర్ టాక్. ఫ్యామిలీ, లవ్, కామెడీ మిక్స్ మూవీస్ చేస్తూ సెపరేట్ ట్రాక్‌లో దూసుకెళుతున్నారు శర్వానంద్. ‘దండుపాళ్యం’ వంటి మాస్ మసాలా మూవీ ద్వారా దర్శకుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు శ్రీనివాసరాజు. నిజజీవిత కథ ఆధారంగా ఆయన తీసిన ‘దండుపాళ్యం’ రెండు భాగాలు హిట్. త్వరలో ‘దండుపాళ్యం 3’ రిలీజ్ కానుంది. ఈయనదో సెపరేట్ ట్రాక్. ఇప్పుడు ఈ టూ డిఫరెంట్ ట్రాక్స్ ఒక సినిమాకి ప్రయాణం చేయబోతున్నాయట. శర్వానంద్‌ని కలసి శ్రీనివాసరాజు కథ చెప్పారని భోగట్టా. శర్వాకి నచ్చిందని సమాచారం. ఇప్పటివరకూ చేయని పాత్ర కావడంతో శర్వా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
దండుపాళ్యం ముఠాకు జీవిత ఖైదు
బనశంకరి(కర్ణాటక): బందిపోటు ముఠా దండుపాళ్యం గ్యాంగ్ నేరాలు రుజువు కావడంతో ఐదుమందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ పరప్పన అగ్రహార ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు... 2000 సంవత్సరంలో నగరంలోని అగ్రహారదాసరహళ్లిలో దొడ్డహనుమ, మునికృష్ణ, లక్ష్మీ, నల్లతిమ్మ, వెంకటేశ్ అనే ఐదుమంది దండుపాళ్య గ్యాంగ్ సభ్యులు గీతా అనే మహిళ ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు కావాలని అడుగుతూ చాకుతో ఆమె గొంతు కోసి చంపారు. బంగారు నగలు, చీరలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై దండుపాళ్య గ్యాంగ్ పై కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా పోలీసులు నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు. ఈ కేసుపై పరప్పన అగ్రహార ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. గత 17 ఏళ్లుగా సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు దండుపాళ్యం గ్యాంగ్ చేసిన హత్య రుజువు కావడంతో న్యాయమూర్తి శివనగౌడ ఐదుగురికీ జీవితఖైదుతో పాటు తలా రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
తెరపైకి మరో వివాదాస్పద చిత్రం
ఇటీవల సినిమాలు వివాదాలతోనే ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి. కొన్ని సినిమాలు అనుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటే, కొంత మంది మేకర్స్ వివాదాస్పద అంశాలనే సినిమాలకు ఎంచుకుంటున్నారు. తాజాగా అలాంటి వివాదాస్పద సంఘటనతో తమిళ కన్నడ భాషల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. దండుపాళ్యం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శ్రీనివాస రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2004లో కంచిపీఠంలో జరిగిన ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య, ఆ తరువాత పరిణామాలు పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్ట్ నేపథ్యంలో ఆచార్య అరెస్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కథ కోసం శంకర రామన్‌ను హత్య చేసిన గ్యాంగ్ కు చెందిన వారిని కూడా కలిసినట్టుగా తెలిపాడు దర్శకుడు శ్రీనివాస రాజు. అంతేకాదు త్వరలోనే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి మరిన్ని అంశాలపై చర్చిస్తానని, సినిమాలో అప్పటి సంఘటనకు సంబంధించిన రాజకీయ కోణంతో పాటు ప్రచారంలో ఉన్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేసే విధంగా సినిమా తెరకెక్కిస్తానని తెలిపారు. -
జిల్లాలో ‘దండుపాళ్యం’ ముఠా..!
నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్: ఎక్కడో కర్నాటక రాష్ట్రంలోని ఓ కుగ్రామం దండుపాళ్యం. ఆ గ్రామంలో నేరాలు చేసే ముఠా నివాసం ఉంటుంది. వారి ప్రవృత్తి నేరాలు చేయ డం. ఇటీవల ఆ గ్రామం పేరుతో ఓ చిత్రం కూడా వచ్చింది. దీనికి తోడు సీక్వెల్‌గా ‘దండుపాళ్యం పోలీసు’ పేరుతో మరో చిత్రం కూడా విడుదలైంది. ఈ చిత్రాల్లో చూపించే తరహా నేరాలు జిల్లాలో ఇటీవల జరుగుతున్నాయి. ‘దండుపాళ్యం చిత్రం’లో చూపించిన విధంగా జిల్లాలో ఒక బృందం నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఇంత వరకు పట్టుకోలేక పోవడంతో వారి రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ బృందంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నట్లు ఇటీవల జరిగిన తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ ముఠా ముఖ్యంగా శివారు ప్రాంతాలను ఎన్నుకుని చోరీలకు పాల్పడుతోంది. పగలు ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలు, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. రాత్రి ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఒంటరిగా కనిపించే మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లుతున్నారు. రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వృద్ధురాలిని పింఛన్ ఇప్పిస్తామని మోసం చేసి ఆమె వద్ద నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించారు. ఈ మోసంలో ఒక మహిళతో పాటు పురుషుడు కూడా ఉన్నాడు. ఈ బృందానికి శివారు, పట్టణ ప్రాంతం అనే బేధం లేకుండా చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇలాంటి నేరాలు రోజురోజుకు పెరుగులతున్నా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారీ దొంగతనాలు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న సీసీఎస్, ఆర్‌సీసీఎస్ పోలీసు బృందాలు, మిగతా వాటిపై దృష్టి సారించలేక పోతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద విధుల్లో ఉన్న పోలీసులు దొంగతనాలను, మోసాలను నియంత్రించడంలో ఏ మాత్రం శ్ర ద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. గత రెండు వారాల్లో ఆర్టీసీ బస్టాండ్‌లో దాదా పు ఆరుకు పైగా దొంగతనాలు జరిగాయి. ఇతర మోసాలు జరిగినా ఏ నాడు నిందితులను పట్టుకోవడంపై దృష్టి సారించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.బాధితులు మాత్రం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులతోనే సరిపెట్టుకోవాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఎస్పీ సార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.