
... అవును. ఎవరూ ఊహించని కాంబినేషన్ కుదిరిందని ఫిల్మ్‌నగర్ టాక్. ఫ్యామిలీ, లవ్, కామెడీ మిక్స్ మూవీస్ చేస్తూ సెపరేట్ ట్రాక్‌లో దూసుకెళుతున్నారు శర్వానంద్. ‘దండుపాళ్యం’ వంటి మాస్ మసాలా మూవీ ద్వారా దర్శకుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు శ్రీనివాసరాజు. నిజజీవిత కథ ఆధారంగా ఆయన తీసిన ‘దండుపాళ్యం’ రెండు భాగాలు హిట్. త్వరలో ‘దండుపాళ్యం 3’ రిలీజ్ కానుంది.
ఈయనదో సెపరేట్ ట్రాక్. ఇప్పుడు ఈ టూ డిఫరెంట్ ట్రాక్స్ ఒక సినిమాకి ప్రయాణం చేయబోతున్నాయట. శర్వానంద్‌ని కలసి శ్రీనివాసరాజు కథ చెప్పారని భోగట్టా. శర్వాకి నచ్చిందని సమాచారం. ఇప్పటివరకూ చేయని పాత్ర కావడంతో శర్వా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
Comments
Please login to add a commentAdd a comment