త్వరలో సెట్స్‌లోకి... | Sharwanand Epic 1960s Action Drama Begins Production | Sakshi
Sakshi News home page

త్వరలో సెట్స్‌లోకి...

Published Thu, Oct 17 2024 2:30 AM | Last Updated on Thu, Oct 17 2024 2:30 AM

Sharwanand Epic 1960s Action Drama Begins Production

కొత్త సినిమా సెట్స్‌లోకి వెళ్లడానికి శర్వానంద్‌ రెడీ అవుతున్నారు. శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల బ్యాక్‌డ్రాప్‌లో 1960 కాలమానంలో ఈ సినిమా కథనం సాగుతుంది. 

ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని, అప్పటి సంస్కృతిని ప్రతిబింబించేలా హైదరాబాద్‌కు సమీపంలో 15 ఏకరాల విస్తీర్ణంలో భారీ బడ్జెట్‌తో కళా దర్శకుడు కిరణ్‌ కుమార్‌ మన్నె ఓ పెద్ద సెట్‌ను క్రియేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం శర్వానంద్‌ మేకోవర్‌ అవుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలను కుంటున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సౌందర్‌ రాజన్‌ .ఎస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement