Sharwanand
-
మురారి వినోదం
శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 37వ సినిమా ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి శుభాకాంక్షలతో హీరోలు బాలకృష్ణ, రామ్‌చరణ్ కలిసి విడుదల చేశారు. ‘‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రీకరణ జరుగుతోంది. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియన్స్ ను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సహ–నిర్మాత: అజయ్ సుంకర. -
త్వరలో సెట్స్‌లోకి...
కొత్త సినిమా సెట్స్‌లోకి వెళ్లడానికి శర్వానంద్ రెడీ అవుతున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల బ్యాక్‌డ్రాప్‌లో 1960 కాలమానంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని, అప్పటి సంస్కృతిని ప్రతిబింబించేలా హైదరాబాద్‌కు సమీపంలో 15 ఏకరాల విస్తీర్ణంలో భారీ బడ్జెట్‌తో కళా దర్శకుడు కిరణ్ కుమార్ మన్నె ఓ పెద్ద సెట్‌ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం శర్వానంద్ మేకోవర్ అవుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్. -
పల్లె బాట పట్టిన టాలీవుడ్ హీరోలు.. హిట్ కొట్టేనా?
పల్లె కథలు, మట్టి కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. గత ఏడాది థియేటర్స్‌లోకి వచ్చిన నాని ‘దసరా’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’, కార్తికేయ ‘బెదురు లంక 2012’, ప్రియదర్శి ‘బలగం’ వంటి పూర్తి స్థాయి పల్లెటూరి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల హిట్స్‌గా నిలిచిన ‘ఆయ్, కమిటీ కుర్రోళ్ళు’ కూడా పల్లె కథలే. దీంతో ఓ హిట్‌ని ఖాతాలో వేసుకోవడానికి పల్లెకు పోదాం చలో... చలో అంటూ కొందరు హీరోలు పల్లె కథలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక ఏయే హీరోలను పల్లె పిలిచిందో తెలుసుకుందాం. పల్లె ఆట రామ్‌చరణ్ కెరీర్‌లోని పర్ఫెక్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ‘రంగస్థలం’. 2018లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘రంగస్థలం’కు దర్శకత్వం వహించిన సుకుమార్ వద్ద ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన బుచ్చిబాబు సాన ఇప్పుడు రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకు ఓ పల్లెటూరి కథను రెడీ చేశారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనులతో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కథ రీత్యా పాత్ర కోసం బరువు పెరుగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారు. దసరా తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న చిత్రం ఇది. జాన్వీకపూర్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.తెలంగాణ కుర్రాడు తెలంగాణ పల్లెటూరి అబ్బాయిలా హీరో శర్వానంద్‌ను రెడీ చేస్తున్నారు దర్శకుడు సంపత్ నంది. వీరి కాంబినేషన్లో ఓ పల్లె కథ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్ నిర్మిస్తారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం 1960 కాలంలో సాగుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో కథనం ఉంటుంది. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 38వ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా లుక్కు సంబంధించిన మేకోవర్ పనుల్లో ఉన్నారు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తారు. బచ్చల మల్లి కథ వీలైనప్పుడల్లా సీరియస్ కథల్లోనూ నటిస్తుంటారు హీరో ‘అల్లరి’ నరేశ్. అలా ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ సన్నివేశాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగగా పేరుగాంచిన బచ్చలమల్లి అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. పల్లె బాటలో తొలిసారి... హీరో విజయ్ దేవరకొండ పల్లెటూరి బాట పట్టారు. కెరీర్లో తొలిసారిగా పల్లెటూరి కుర్రాడిగా సెట్స్‌కు వెళ్లనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. పక్కా పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతారు విజయ్ దేవరకొండ. పల్లెటూరి పోలీస్ పల్లెటూరి రాజకీయాల్లో విశ్వక్ సేన్ జోక్యం చేసుకుంటున్నారు. విశ్వక్ సేన్ హీరోగా ఓ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ తెరకెక్కనుంది. విశ్వక్ కెరీర్‌లోని ఈ 13వ సినిమాతో శ్రీధర్ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్గా కనిపిస్తారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. విశ్వక్ కెరీర్లో పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అమ్మాయి కథ యాక్షన్... లవ్‌స్టోరీ... పొలిటికల్... ఇవేవీ కాదు... భార్యాభర్తల అనుబంధం, స్త్రీ సాధికారత వంటి అంశాలతో సరికొత్తగా ఓ సినిమా చేస్తున్నారు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఈషా రెబ్బా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాను సంజీవ్ ఏఆర్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, వివేక్ కృష్ణ, సాధిక్, ఆదిత్య పిట్టీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రానుంది. కాగా మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ హే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిందనే టాక్ వినిపిస్తోంది. కాలేజ్ సమయంలో ప్రేమించి, మోస΄ోయిన ఓ అమ్మాయి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అత్తింట్లో కొత్త సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత భర్తకు ఎదురు తిరిగి, సొంతంగా వ్యాపారం పెట్టుకుని జీవితాన్ని ఎలా లీడ్ చేస్తుంది? అనే అంశాలతో ‘జయ జయ జయ జయ హే’ సినిమా కథనం సాగుతుంది. పోస్ట్‌మ్యాన్ స్టోరీ‘క’ అనే ఓ డిఫరెంట్ టైటిల్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేశారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఓ గ్రామంలో సాగే ఈ సినిమా కథలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్ రోల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హీరో క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఇలా పల్లెటూరి కథలతో రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
అరవయ్యేళ్లు వెనక్కి...
పల్లెకు పోదాం అంటున్నారు హీరో శర్వానంద్. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రం అధికారిక ప్రకటన గురువారం వెలువడింది. ‘‘ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల నేపథ్యంలో 1960 కాలంలో జరిగే గ్రామీణ చిత్రం ఇది.ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ మూవీ కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు సంపత్ నంది. మునుపెన్నడూ చూడని ఓ కొత్త పాత్రలో శర్వానంద్ కనిపిస్తారు. 1960 నాటి క్యారెక్టర్లో కనిపించేందుకు శర్వానంద్ మేకోవర్ అయ్యారు.యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ ఇది. దీంతో ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎస్. సౌందర్ రాజన్. -
జాను సీక్వెల్ కు సమంత ఓకేనా !
-
శర్వానంద్ 'మనమే' సినిమా విషయంలో మోసపోయాం: నిర్మాత
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టిందని ప్రచారం అయితే జరిగింది. కానీ ఈ సినిమా విషయంలో భారీగా నష్టపోయామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. కొందరు చేసిన మోసంతో ఇప్పటికీ ఓటీటీలో కూడా సినిమాను విడుదల చేయలేకపోయామని ఆయన పేర్కొన్నారు.బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని శర్వానంద్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల అయ్యి మూడు నెలలు అవుతున్నా ఓటీటీలోకి ఈ చిత్రం అందుబాటులోకి రాలేదు. అందుకు కారణాలను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఇలా తెలిపారు. మనమే సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో మోసపోయానని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. ఇండస్ట్రీలో ఒక సంస్థకు సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను అప్పగిస్తే.. ఆ సంస్థ మోసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పలు కారణాలు చెబుతూ మనమే చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమ్మలేదని ఆయన అన్నారు. దీంతో మనమే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల తమకు భారీగా నష్టం వచ్చిందని విశ్వప్రసాద్ తెలిపారు.మనమే సినిమాకు సంబంధించి హక్కులను కొనుగోలు చేసిన వారు తమకు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదని నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడించారు. దీంతో సుమారు 70 శాతం వరకు నష్టం వచ్చినట్లు ప్రకటించారు. వారు చేసిన మోసంపై తాము కోర్టును కూడా ఆశ్రయించామని ఆయన అన్నారు. మనమే సినిమాను మాత్రమే ఆపేసి ఇతర సినిమాలను మాత్రం వారు ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. దీనిని బట్టి చూస్తే మనమే సినిమా ఓటీటీ విడుదల విషయంలో మరింత జాప్యం తప్పదని తెలుస్తోంది. -
ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా?: మండిపడ్డ శర్వానంద్
టాలీవుడ్ రెబల్ స్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడిపై మన హీరోలంతా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ యంగ్ హీరోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభాస్‌పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసిన విష్ణు.. సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్‌కు లేఖ రాశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో, అభిమానులలో చాలా మంది మనోభావాలను దెబ్బతీశాయని లేఖలో పేర్కొన్నారు.తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా చేరిపోయారు. ఒక నటుడు మరో నటుడిని విమర్శించడని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రాథమిక విలువల్లో ఒకటని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర జోకర్లా ఉందంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ప్రభాస్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. An actor should never criticize another actor. It’s a basic ethic.— Sharwanand (@ImSharwanand) August 23, 2024 -
ఓటీటీ బాటలో శర్వానంద్ 'మనమే'
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా, ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టింది.శర్వానంద్, కృతీ శెట్టి జోడికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరి నటనే సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్‌కు ప్లస్ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే, ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. జూలై 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలపుతున్నాయి. కానీ, అధికారికంగా సమాచారం వెలువడలేదు.శర్వానంద్ ఇప్పుడో మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. తన తదుపరి ప్రాజెక్ట్ అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 90స్ బ్యాక్ డ్రాప్లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుందని సమాచారం. త్వరలో ఈ సినిమా గురించి మరిన్నీ వివరాలు రానున్నాయి. -
ఆర్కిటెక్ట్ నిత్య ఆన్ సెట్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శర్వా 37’ (వర్కింగ్ టైటిల్). ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్గా సాక్షీ వైద్యని ఖరారు చేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఏజెంట్, గాండీవధారి అర్జున’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సాక్షీ వైద్య సుపరిచితురాలే. తాజాగా శర్వానంద్‌కి జోడీగా నటిస్తున్నారామె. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా బుధవారం(జూన్ 19) సాక్షీ వైద్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సెట్లోకి స్వాగతించింది యూనిట్. ‘శర్వా 37’లో ఆర్కిటెక్ట్ నిత్య పాత్రలో సాక్షీ వైద్య నటిస్తున్నారు. ‘‘పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్. -
హీరో శర్వానంద్ తమ్ముడి రెస్టారెంట్ రీ లాంచ్.. (ఫొటోలు)
-
ఆమె కోసమే కాఫీ: శర్వా
బంజారాహిల్స్: ‘నేను పెళ్లి కాకముందు టీ, కాఫీలు తాగేవాడిని కాదు.. పెళ్లయ్యాక నా భార్యకు కాఫీ అంటే ఇష్టమని తనకోసమే కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను’ అని హీరో శర్వానంద్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో తన సోదరుడు ఏర్పాటు చేసిన బీన్జ్ కాఫీ షాప్‌ను వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఏపీ రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. 2008 సమయంలో తన కాఫీ షాప్‌లో అప్పట్లో హీరోలు రామ్‌చరణ్, అఖిల్‌తో పాటు చాలా మంది కలిసేవాళ్లమని, వారితో ఎన్నో మెమొరీలు ఉన్నాయన్నారు. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నహీరోలు ఈ వ్యాపారంలోకొస్తే క్వాలిటీ ఫుడ్ ఇస్తారని, తనకు వంట రాదని, కానీ ఏం నచి్చనా వండించుకొని తినేస్తానంటూ చెప్పుకొచ్చారు. విభిన్న రుచులతో పాటు కాంటినెంటల్ రెసిపీలను అందిస్తున్నట్లు నిర్వాహకులు అర్జున్ మైనేని తెలిపారు. పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, డి.వంశీకృష్ణం రాజు, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
శర్వానంద్, కృతిశెట్టి ‘మనమే’ మూవీ స్టిల్స్
-
'మనమే' సినిమా రివ్యూ
యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ చాలామందికి ఇష్టమైనవి ఫీల్ గుడ్ మూవీసే. తెలుగులో అప్పుడప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు వస్తుంటాయి. అలాంటి ఓ సినిమా 'మనమే'. శర్వానంద్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. తాజాగా జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో? టాక్ ఏంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విక్రమ్(శర్వానంద్) లండన్‌లో ఉంటాడు. అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఇతడికి అనురాగ్ (అదిత్) అనే ఓ ఫ్రెండ్. ఇండియా వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరగడంతో అనురాగ్, అతడి భార్య చనిపోతారు. వీళ్ల కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) ప్రాణాలతో బయటపడతాడు. ఈ పిల్లాడిని కొన్ని నెలల పాటు చూసుకోవాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)పై పడుతుంది. లండన్‌లో అనురాగ్ ఇంట్లోనే ఉంటూ పిల్లాడిని చూసుకుంటారు. మరి ఖుషిని చూసుకునే క్రమంలో విక్రమ్ ఏం తెలుసుకున్నాడు? ఇంతకీ సుభద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఎలాంటి ప్రేమ-బాండింగ్ ఉండాలి? అనేదే 'మనమే' కాన్సెప్ట్. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ స్టోరీ అని చెప్పుకొచ్చారు కానీ సినిమాలో ఎమోషన్ అక్కడక్కడే వర్కౌట్ అయింది. అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ జాలీగా ఉండే హీరో.. ఫ్రెండ్ చనిపోవడంతో అతడి కొడుకు బాధ్యత చూసుకోవాల్సి రావడం, ఇతడు ఒక్కడే కాకుండా అప్పటికే ఎంగేజ్మెంట్ అయిన ఓ అమ్మాయి కూడా పిల్లాడ్ని చూసుకోవాల్సి రావడం.. ఇలా సీన్స్ సరదాగా వెళ్తుంటాయి. హీరో ఫ్రెండ్ చనిపోవడానికి అతడి బిజినెస్ పార్ట్నర్ కారణం అని హీరోహీరోయిన్ తెలుసుకోవడం, ఫ్రెండ్ మరణంతో మూతపడిన రెస్టారెంట్‌ని హీరోహీరోయిన్ కలిసి మళ్లీ సక్సెస్ చేయడం లాంటి వాటితో ఫస్టాప్ ఓ మాదిరిగా ఉంటుంది.సెకండాఫ్ వచ్చేసరికి సినిమా పూర్తిగా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎటేటో పోయింది. తెరపై సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి. ఏం జరుగుతుందిరా అని చూస్తున్న ప్రేక్షకుడు కాస్త కన్ఫూజ్ అవుతాడు. కానీ చివరకొచ్చేసరికి హీరో-అతడి తల్లిదండ్రుల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్, పెద్దగా ట్విస్టులేం లేకుండా క్లైమాక్స్‌లో ఎండ్ కార్డ్ పడుతుంది. ఏం జరుగుతుందో మనం ఊహించేయొచ్చు. సినిమాలో ఖుషి అనే పిల్లాడిది కీలక పాత్ర. కానీ అతడి క్యారెక్టర్ ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. ఎందుకంటే ఒకటి రెండు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి తప్పితే చాలావరకు మనం పూర్తిగా ఆ పిల్లాడికి కనెక్ట్ కాలేకపోతాం. సినిమా అంతా రిచ్‌గా చూడటానికి కలర్ ఫుల్‌గా ఉంటుంది. కానీ ఎమోషన్ కాస్త మిస్ అయింది. నిడివి రెండున్నర గంటలు.. కాకపోతే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్, స్పెషల్ సాంగ్ ట్రిమ్ చేసినా పర్లేదు! ఇదే స్టోరీని లండన్‌లో కాకుండా ఇండియాలో ఉన్నట్లు రాసుకున్నా సరే పెద్దగా మార్పులుండవేమో? విలన్ ట్రాక్ అయితే అసలు ఎందుకు పెట్టారో, మధ్యలో ఎందుకు వదిలేశారో అర్థం కాదు.ఎవరెలా చేశారు?విక్రమ్‌గా చేసిన శర్వానంద్.. తన పాత్రకు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే గ్లామరస్‌గా కనిపించాడు. సుభద్రగా చేసిన కృతిశెట్టికి ఫెర్ఫార్మెన్స్‌తో పర్వాలేదనిపించింది. ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొడుకే.. ఇందులో ఖుషి అనే పిల్లాడిగా చేశాడు. డైలాగ్స్ లాంటివి లేకుండా హావభావాలతోనే దాదాపు సీన్స్ అన్నీ ఉంటాయి. పిల్లాడితో ఇంకాస్త ప్రాక్టీస్ చేయించుంటే బాగుండేది. ఎందుకంటే చాలాచోట్ల మేనేజ్ చేసినట్లు తెలిసిపోతుంది. మిగిలిన యాక్టర్స్ తమకు ఇచ్చిన పనికి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. లండన్ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే తడబడ్డాడు. సినిమాని చాలా సాగదీశాడు.రేటింగ్: 2.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి: శర్వానంద్
‘‘ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు ఇంకా గుర్తున్నాయి. ఇరవయ్యేళ్లు ... ముప్పైఐదు సినిమాలు ఎలా అయ్యాయో తెలియదు. స్టార్ స్టేటస్ రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది. నాకు ‘చార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇచ్చినందుకు విశ్వగారికి థ్యాంక్స్. నేను చేసిన సినిమాల పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ప్రోడక్షన్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మనమే’.ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘మనమే’ ప్రీ రిలీజ్ వేడుకలో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘మనమే’ సినిమాలో నేను కొత్తగా కనిపించినా, కొత్తగా పెర్ఫార్మ్ చేసినా ఆ క్రెడిట్ శ్రీరామ్‌కే వెళ్తుంది. ప్రతి ఒక్కరం చాలా కష్టపడి గొడవలు పడుతూ ఈ సినిమాను పూర్తి చేశాం. ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి. ఒక మనిషికి మరో మనిషి ఇవ్వగలిగే గొప్ప బహుమతి టైమ్. ఈ పాయింట్‌నే శ్రీరామ్ ఈ సినిమాలో చెప్పారు’’ అని అన్నారు.‘‘శర్వానంద్ తన ఎనర్జీతో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకు వెళ్లారు’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ‘‘శర్వానంద్ నటన అద్భుతంగా ఉంటుంది. తన చార్మింగ్ లుక్స్, పెర్ఫార్మెన్స్ చూసి తనకి ‘చార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇస్తున్నాను’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ఇంకా డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి కూడా మాట్లాడారు. -
Manamey : శర్వానంద్ ‘మనమే’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మనీ కాదు...మానసిక తృప్తి ముఖ్యం: హేషమ్ అబ్దుల్ వహాబ్
‘ఖుషి, హాయ్ నాన్న’ వంటి చిత్రాల్లోని బీట్స్ ప్రేక్షకుల హార్ట్ బీట్‌ని టచ్ చేశాయి. అందుకే జస్ట్ రెండు మూడు చిత్రాలతో సంగీతదర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాగలిగారు హేషమ్ అబ్దుల్ వహాబ్. ఇప్పుడు ‘మనమే’కి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు హేషమ్. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ ప్రోడక్షన్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘మనమే’ గురించి, ఇతర విశేషాలను సంగీతదర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ విధంగా పంచుకున్నారు. ⇒ సంగీతానికి ప్రాధాన్యం ఉన్న సినిమా చేయడం ఏ సంగీతదర్శకుడికైనా ఆనందంగా ఉంటుంది. ‘మనమే’లో 16 పాటలు ఉన్నాయి. నా గత చిత్రాలకన్నా ఈ చిత్రానికి ఎక్కువ హార్డ్‌వర్క్ చేశాను. ముందు 16 పాటలు ఉంటాయని ఊహించలేదు. కానీ శ్రీరామ్ ఆదిత్య కథని మలిచిన తీరు ఎక్కువ పాటలకు స్కోప్ ఇచ్చింది. ఫస్టాఫ్‌లో పది, సెకండాఫ్‌లో ఆరు పాటలు అవసరం అవుతాయని కంపోజ్ చేసేటప్పుడు అర్థం అయింది. పదకొండు ఫుల్ సాంగ్స్, మిగతావి బిట్ సాంగ్స్‌లా వస్తాయి ∙నా గత చిత్రం ‘హాయ్ నాన్న’లో తండ్రీ కూతురు ఎమోషన్ ఉంటుంది. ‘మనమే’లో కూడా పేరెంటింగ్ ప్రాధాన్యమైన అంశం. అయితే రెండు కథలు పూర్తిగా వేరు. ‘మనమే’లో పేరెంటింగ్ అనే ఎమోషన్‌తో పాటు ఇంకా చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి ⇒ ‘మనమే’లో 16 పాటలు ఉన్నాయి కాబట్టి మిగతా సినిమాలకన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్నారా? అని అడిగితే... ఓ క్రియేటర్‌గా మనీ గురించి కాకుండా మానసిక తృప్తి ముఖ్యం అనుకుంటాను. ఆ విధంగా చూస్తే ‘మనమే’ నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది. సంగీతం పట్ల నాకు ఉన్న అవగాహనను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం దక్కింది. అలాగే నా పనికి తగ్గ పారితోషికం కూడా దక్కింది (నవ్వుతూ). నా గత చిత్రాలు, ఇప్పుడు ‘మనమే’ వంటి మంచి ప్రాజెక్ట్‌కి చాన్స్ దక్కడం ఆశీర్వాదంలా భావిస్తున్నాను ⇒ ఫలానా సినిమాలో ఉన్న అలాంటి బీట్ ఇవ్వండి అంటూ ఇప్పటివరకూ ఏ దర్శకుడూ అడగకపోవడం నా లక్. మంచి ట్యూన్‌ని ఆదర్శంగా తీసుకోవడం తప్పేం కాదు. కానీ నా వరకూ ఒరిజినల్ ట్యూన్ ఇవ్వాలనుకుంటాను. ఒకవేళ డైరెక్టర్ అడిగితే... ఆయన చెప్పిన ట్యూన్ కథలోని సందర్భానికి తగ్గట్టుగా ఉందనిపిస్తే అప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుని చేయడానికి ట్రై చేస్తాను ∙ప్రస్తుతం రష్మికా మందన్నా నటిస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’కి వర్క్ చేస్తున్నాను. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లో సాగే సినిమా చేయడం నాకు ఇదే ఫస్ట్ టైమ్. ఇదో కొత్త అనుభవం. ఇక తెలుగు పరిశ్రమ చాలా గొప్పది. ఎంతమంది వచ్చినా ఇక్కడ అవకాశం ఉంటుంది... ్రపోత్సాహం ఉంటుంది. అందుకే కేరళ నా ఫస్ట్ హోమ్ అయితే హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అంటాను. -
మనమే నా గ్రాఫ్ పెంచుతుంది: దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య
‘‘ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే మన కెరీర్ గ్రాఫ్ పెరుగుతుంటుంది. నా గత చిత్రం ‘హీరో’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ కాలేదు. కొంత కరోనా ప్రభావం కూడా ఉంది. ఇప్పుడు ‘మనమే’ సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నాను. నా కెరీర్ గ్రాఫ్ మళ్లీ పెరుగుతుంది’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ – ‘‘పేరెంటింగ్ ఎమోషన్స్ గురించి కొంచెం వినూత్నంగా చెప్పాలన్న ఉద్దేశం నాకు ఎప్పట్నుంచో ఉంది. కాకపోతే ఈ ఎమోషన్స్‌కు ఫన్ జోడించి, ఫుల్ ఎనర్జీతో చెప్పాలనుకున్నాను. అదే ‘మనమే’ కథ. ఈ సినిమాలో శర్వానంద్–కృతీ శెట్టిల క్యారెక్టర్స్ టామ్ అండ్ జెర్రీలా ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘మనమే’ నా ఫేవరెట్.ఈ సినిమాలో నా కొడుకు చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడని నేను ఇలా చెప్పడం లేదు. అందమైన భావోద్వేగాలు ఉన్న మంచి సినిమా ఇది. ఈ సినిమాలో శివ కందుకూరి పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. ‘మనమే’లో 16 పాటల వరకూ ఉన్నాయి. ఇవి సినిమా ఫ్లోకు ప్లస్గానే ఉంటాయి కానీ అడ్డుగా అనిపించవు. హేషమ్ మంచి సంగీతం అందించారు’’ అని చెప్పుకొచ్చారు. -
మనమే తో బ్లాక్ బస్టర్.. ప్రామిస్ చేస్తున్న శర్వానంద్
-
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
‘‘మనమే’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా. ఈ చిత్రాన్ని తల్లితండ్రులకు అంకితం ఇస్తున్నాం. ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ’’ అన్నారు హీరో శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది.ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రామ్‌చరణ్ లాంచ్ చేశారు. అనంతరం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఈ సినిమా ఓ మ్యాజిక్.. ఆ మ్యాజిక్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘మనమే’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూఛిబొట్ల. ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ కృతీ ప్రసాద్, అసోసియేట్ప్రోడ్యూసర్ ఏడిద రాజా మాట్లాడారు. -
ఎమోషనల్‌గా శర్వానంద్ 'మనమే' ట్రైలర్
శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మనమే’. శర్వానంద్ 35వ సినిమాగా వస్తున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ జానర్లో వస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. లండన్ నేపథ్యంలో, కొత్తతరం ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించి. ఈ సినిమాలో శర్వానంద్, కృతి డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తారు. ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమని చెప్పవచ్చు. -
సుభద్రలా ఉండలేను!: కృతీ శెట్టి
‘‘మనమే’ మూవీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి సన్నివేశంలో వినోదం ఉంటుంది. అలాగే వండర్ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. అది గ్లోబల్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మొత్తం మా ముగ్గురి పాత్రల (శర్వా, కృతి, విక్రమాదిత్య) చుట్టూ తిరుగుతుంది.. అందుకే ‘మనమే’ అనే టైటిల్ పెట్టాం’’ అని హీరోయిన్ కృతీ శెట్టి అన్నారు. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమాదిత్య కీలక పాత్ర చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై రామ్సే స్టూడియోస్ ప్రోడక్షన్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి పంచుకున్న విశేషాలు... ∙‘మనమే’లో నా పాత్ర పేరు సుభద్ర. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి ఇది వైవిధ్యంగా ఉంటుంది. నేను క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ, తొలిసారి ‘మనమే’లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండే పాత్ర చేశాను. నిజ జీవితంలో నాకు పెద్దగా కోపం రాదు.. గట్టిగా అరవను. చాలా కామ్‌గా ఉంటాను. చెప్పాలంటే సుభ్రద్రలా స్ట్రిక్ట్‌గా ఉండలేను. అందుకే ఈ పాత్ర చేయడం నాకు పూర్తిగా కొత్తగా అనిపించింది. ఈ పాత్ర కోసం డైరెక్టర్ శ్రీరామ్‌గారి విజన్‌ని ఫాలో అయ్యాను. నా తొలి మూవీ ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. ‘ఉప్పెన’ రస్టిక్ లవ్ స్టోరీ. ‘మనమే’ రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను చేసిన సుభద్ర పాత్రలో చాలా భావోద్వేగాలున్నాయి. అది ప్రేక్షకులకి నచ్చుతుందనే ఆశిస్తున్నాను. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ మన చేతుల్లో ఉండదు. నా వరకూ పాత్రకి న్యాయం చేస్తాను. మన చేతిలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి, ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ కమిట్మెంట్స్ వల్లే తెలుగులో గ్యాప్ వస్తోంది. పైగా రొటీన్ పాత్రలు కాకుండా వైవిధ్యంగా ఉన్నవి మాత్రమే చేయాలనుకుంటున్నాను. ‘బాహుబలి’ చిత్రంలో అనుష్కగారిలా నాకు మహారాణి పాత్ర చేయడం ఇష్టం. అలాగే యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్ రోల్స్ కూడా చేయాలని ఉంది. నాకు వీలు కుదిరినప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటాను. -
టప్పా టప్పా.. పెళ్లి పాటప్పా
టప్పా టప్పా.. అంటూ పాట అందుకున్నారు శర్వానంద్, కృతీ శెట్టి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మనమే’ చిత్రంలో పెళ్లి సమయంలో వచ్చే ‘టప్పా టప్పా..’ అంటూ సాగే పాట విడుదల అయింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. కాగా చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన యూనిట్ గురువారం ‘టప్పా టప్పా..’ అంటూ సాగే మూడవ పాటని విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల, హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ‘‘అందరూ ఎంజాయ్ చేసే వెడ్డింగ్ సాంగ్‌ని అందించారు హేషమ్. ఈ పాటలో శర్వానంద్, కృతీ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
'భజే వాయు వేగం' ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
జూన్‌లో మనమే
జూన్‌లో థియేటర్స్‌కు వస్తోంది ‘మనమే’ అని శర్వానంద్ అంటున్నారు. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది.ఈ సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించి, శర్వానంద్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘ఈ సినిమాలో శర్వానంద్, కృతి డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తారు. ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రం ఇది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరకర్త. -
పిచ్చి పట్టిందా నీకు...
‘మంచిగా కనపడేవాళ్లందరూ మంచివాళ్లు కాదురా... ఫర్ ఎగ్జాంపుల్ నేను’ అంటూ మొదలవుతుంది ‘మనమే..’ సినిమా టీజర్. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్లేబాయ్ మనస్తత్వం ఉండే అబ్బాయి, బాధ్యతగా జీవించాలనుకునే ఓ అమ్మాయి జీవితాల్లోకి విక్రమాదిత్య అనే ఓ పిల్లవాడు వచ్చినప్పుడు వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ చిత్రం కథాంశమన్నట్లుగా యూనిట్ చెబుతోంది. ‘వాడప్పట్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలేం చేశావ్... (కృతీ శెట్టి), ‘తాగటానికెళ్లొచ్చా..’ (శర్వానంద్), ‘ఇల్లు చూసుకోవడం రాదు... పిల్లవాడిని చూసుకోవడం రాదు... పిచ్చిపట్టిందా నీకు...’ (కృతీ శెట్టి), ‘ఇద్దరిలో ఒకళ్లు ఏడ్వండి’ (శర్వానంద్) వంటి సంభాషణలు విడుదలైన టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల.