
కుటుంబ కథాచిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో శర్వానంద్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చి 4న ఈ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా గురువారం ఆడవాళ్లు మీకు జోహార్లు మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
ఇందులో రష్మిక ఫస్ట్ క్లాప్ కొట్టినట్లు చూపించారు. సెట్స్‌లో ఉన్నవాళ్లను ఆటాడిస్తూ తెగ అల్లరి చేసిందీ హీరోయిన్. సీనియర్ నటీమణులు ఖష్బూ, రాధిక, ఊర్వశిలు కూడా కెమెరా ఆఫ్‌లో ఉన్నప్పుడు సరదాగా నవ్వుతూ షూటింగ్‌ను తెగ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. వీళ్ల అల్లరిని, సెట్స్‌లో సరదాగా గడిపిన క్షణాలను మీరూ చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment