Aadavaallu Meeku Joharlu Movie
-
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్!
కంటెంట్ బాగుంటే టికెట్ రేట్ ఎక్కువైనా సరే సినిమా చూసేందుకు ఏమాత్రం వెనుకాడరు జనాలు. అందుకు ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల సునామీనే అతి పెద్ద నిదర్శనం. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ చూసేందుకు ఎగబడుతున్నారు సినీప్రియులు. ఈ పాన్ ఇండియా మూవీ దూకుడు చూస్తుంటే మరో వారం రోజులదాకా దీని ప్రభంజనం ఆగేట్లు కనిపించడం లేదు. ఈ కలెక్షన్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి ఏప్రిల్ మొదటివారంలో అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ ఏంటో చూసేద్దాం.. మిషన్ ఇంపాజిబుల్ బాలీవుడ్లో పాగా వేసిన తాప్సీ చాలాకాలానికి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఆర్ఎస్జె స్వరూప్ తెరకెక్కించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దావూద్ ఇబ్రహీంని పట్టుకోవాలన్న ముగ్గురు పిల్లలకు తాప్సీ ఎలా సాయం చేసింది? ఈ మిషన్‌ను వారు పూర్తి చేశారా? లేదా? అన్నది కథ. రాధేశ్యామ్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన రాధేశ్యామ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కేవలం 20 రోజుల్లోనే ఓటీటీ బాట పడుతోందీ మూవీ. ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రవీన్ తాంబే ఎవరు? స్పోర్ట్స్‌లో ఎక్కువమంది ఇష్టపడే గేమ్ ఏంటి అంటే క్రికెట్ అని టపీమని సమాధానం వస్తుంది. క్రికెట్ అంటే జనాలకు పిచ్చి ఉంది కాబట్టే ఈ క్రీడా నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా భారత క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవిత కథ ఆధారంగా ప్రవీన్ తాంబే ఎవరు? అనే సినిమా తెరకెక్కింది. శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. హలో జూన్ తెలుగువారికి కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది ఆహా. ఇతర భాషాచిత్రాలను తెలుగులోకి డబ్ చేస్తూ ప్రేక్షకుడికి కొత్త కథలను పరిచయం చేస్తోంది. తాజాగా మలయాళ మూవీ జూన్‌ను తెలుగులోకి తీసుకొస్తోంది ఆహా. రాజిష విజయన్ ప్రధాన పాత్రలో నటించిన జూన్ 2019లో విడుదలై హిట్ కొట్టింది. ఏప్రిల్ 1 నుంచి హలో జూన్ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సోనీలివ్ ► ఆడవాళ్లు మీకు జోహార్లు - ఏప్రిల్ 2 హాట్‌స్టార్ ► మూన్ నైట్ - మార్చి 30 ► భీష్మపర్వం - ఏప్రిల్ 1 అమెజాన్ ప్రైమ్ ► శర్మాజీ నమ్కీన్ - మార్చి 31 నెట్‌ఫ్లిక్స్ ► హే సినామిక - మార్చి 31 ► స్టోరీస్ ఆఫ్ విట్ అండ్ మ్యాజిక్ అనే యానిమేషన్ టీవీ షో - మార్చి 31 ► ది లాజ్ బస్(వెబ్ సిరీస్) - ఏప్రిల్ 1 చదవండి: రూ.15 కోట్లు ఇస్తామని చెప్పి మోసం.. కోర్టునాశ్రయించిన హీరో -
ఒక్కరు కూడా మా సినిమా బాలేదని అనలేదు: శర్వానంద్
‘‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాని నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా చూసి, బాగుందన్నారు. మా సినిమా చూసినవారిలో ఒక్కరు కూడా బాగోలేదని అనడం నేను వినలేదు’’ అని శర్వానంద్ అన్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలయింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో నవ్విస్తామని ముందే చెప్పాం.. అన్నట్లుగానే థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేస్తున్నామని వారు చెబుతుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘మా అమ్మానాన్న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చూసి, ఒక మంచి సినిమా చూశామన్నారు. కుటుంబమంతా కలిసి మా సినిమా చూస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు రష్మిక. ‘‘నేను శైలజ’ కంటే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’తో మీకు మంచి గుర్తింపు వచ్చింది’’ అని ఈ సినిమా చూసిన మా వీధిలోని వారందరూ చెప్పడం సంతోషంగా ఉంది’’ అన్నారు కిశోర్ తిరుమల. ‘‘ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు సహనిర్మాత శ్రీకాంత్. కెమెరామేన్ సుజిత్, నటీమణులు రుచిత, దీప్తి మాట్లాడారు. చదవండి: Aadavallu Meeku Johaarlu Review: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ఎలా ఉందంటే? -
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆడవాళ్లు మీకు జోహార్లు నటీనటులు : శర్వానంద్, రష్మిక, ఖుష్భూ, రాధిక, ఊర్వసి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నిర్మాణ సంస్థ :శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: ధాకర్ చెరుకూరి దర్శకత్వం : శోర్ తిరుమల సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ విడుదల తేది : మార్చి 04, 2022 యంగ్ హీరో శర్వానంద్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ‘మహానుభావుడు’ తర్వాత ఆయనకు మరలా సక్సెస్ దక్కలేదు. ఇటీవల ఆయన తీసిన ‘శ్రీకారం’, ‘మహాసముంద్రం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలనే కసితో ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎంచుకున్నాడు.రష్మిక మందన్నతో కలిసి కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను క్యూరియాసిటీని పెంచేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(మార్చి 4)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన చిరంజీవి అలియాస్ చిరుకి(శర్వానంద్)ఏజ్ బార్ అయినా.. ఇంకా పెళ్లి కాదు. తనతో పాటు తన కుటుంబం మొత్తానికి నచ్చే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన లక్ష్యం. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి చూపులకు వెళ్లి వచ్చిన ప్రతి అమ్మాయిని ఏదో ఒక వంక చెప్పి రిజెక్ట్ చేస్తారు. దీంతో తన జీవితంలో ఇక ‘మాంగళ్యం తంతునానేనా ’అనే మంత్రాన్ని ఉచ్చరించనేమోనని బాధపడుతున్న క్రమంలో ఆద్య(రష్మిక) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆద్యకు కూడా చిరుపై ప్రేమ ఉన్నప్పటికీ.. అతని ప్రపోజ్‌ని రిజెక్ట్ చేస్తుంది. దానికి కారణం తన తల్లి వకుళ(కుష్బూ)కు పెళ్లి అంటే నచ్చకపోవడం. వకుళను ఒప్పిస్తేనే ఆద్య తనకు దక్కుతుందని భావించిన చిరు.. ఓ చిన్న అబద్దం చెప్పి ఆమెకు దగ్గరవుతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు వకుళకు పెళ్లి అంటే ఎందుకు నచ్చదు? ఆమె నేపథ్యం ఏంటి? చివరకు చిరు, ఆద్యలు ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. ఉమ్మడి కుటుంబంలో పెట్టి పెరిగిన యువకుడు చిరంజీవిగా శర్వానంద్ ఆకట్టుకున్నాడు. వధువు కోసం అన్వేషించి, విసిగిపోయిన ఏజ్ బార్ బ్యాచిలర్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆద్య పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది. హీరో తల్లి ఆదిలక్ష్మీగా రాధిక పర్వాలేదనిపించింది. పద్మమ్మగా ఊర్వశి తనదైన కామెడీతో నవ్వులు పూయించింది. ఇక హీరోయిన్ తల్లి వకుళ పాత్రకు ఖుష్భూ న్యాయం చేసింది. సినిమాలో చాలా బలమైన పాత్ర తనది. హీరో స్నేహితుడిగా వెన్నెల కిశోర్ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్‌తో నవ్వించాడు. పెళ్లి కూతురు తండ్రి బుజ్జిగా బ్రహ్మానందం తళుక్కున మెరిసి వెళ్లాడు. మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. రాధిక, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్ నటీమణులు, శర్వానంద్ లాంటి టాలెంటెడ్ హీరో, రష్మిక లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్.. వీళ్లంతా కలిసి నటించిన చిత్రం కావడంతో తొలి నుంచి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఇటీవల కాలంలో టాలీవుడ్లో ఫ్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రాకపోవడంతో... ఈ సినిమా కచ్చితంగా ఆ లోటుని తిరుస్తుందని భావించారు అంతా. కానీ ప్రేక్షకుల అంచనాలు కొంతమేర తప్పాయి. సినిమాలో కొత్తదనం కొరవడింది. రోటీన్ స్టోరీకి కామెడి, ఎమోషన్స్‌ని జోడించి ‘ఆడవాళ్లు జోహార్లు’సినిమాను తెరకెక్కించాడు కిశోర్ తిరుమల. చెప్పుకోవడానికి పెద్ద పేరున్న నటీ,నటులను తీసుకున్నాడు తప్పా.. వారి పాత్రలకు తగిన ప్రాధాన్యత మాత్రం సినిమాలో లేదు. ఉన్నంతలో ఖుష్బు పాత్ర పర్వాలేదు. గత సినిమాలే మాదిరే సున్నితమైన హాస్యభరితమైన సన్నివేశాలతో ఫస్టాఫ్ అంతా కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. పెళ్లి కోసం హీరో పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కూడా నవ్వులు పూయిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీని వెనక్కినెట్టి.. ఎమోషన్స్‌ని ముందుకు తీసుకోచ్చాడు దర్శకుడు. అయితే అది వర్కౌట్ కాలేదు. పాత సినిమాలే మాదిరే.. హీరోయిన్ ప్యామిలీని ఒప్పించడానికి హీరో.. హీరోయిన్ ఇంటికి వెళ్లడం, క్లైమాక్స్‌లో నిజం తెలిసి పోవడం, చివరకు వారి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడం.. ఇలానే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’మూవీ సాగుతుంది. సెకండాఫ్‌లో ప్రతి చోట.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ‘నేను శైలజ’ ఛాయలు కనిపిస్తాయి. ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగుతుంది. అలా అని పూర్తిగా బోర్ కొట్టించే చిత్రం అయితే కాదు. కానీ కొత్తదనం మాత్రం ఆశించొద్దు. ఊర్వశితో వచ్చే ‘టిఫిన్ బాక్స్’జోక్ అయితే థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కిశోర్ తిరుమల డైలాగ్స్ ఆకట్టుకోవడమే కాదు.. ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇక సాంకెతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. చక్కటి నేపథ్య సంగీతం అందించాడు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్విటర్ రివ్యూ
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నేడు(మార్చి 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. దానికి తోడు ఈ మూవీలో ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి లాంటి సీనియర్ నటీమణులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండడంతో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’పై భారీ అంచనాలు పెరిగాయి. ఇక పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూద్దాం. Decent First half 👍🏼 Decent family entertainer so far, with laughs throughout Dsp music blends with the mv #AadavalluMeekuJohaarlu — Manoj Rahul (@DHFM_endlessly) March 3, 2022 మొత్తంగా ఈ సినిమాకు నెటిజన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంతమంది బాగుంది అని చెబుతుంటే.. మరికొంతమంది ప్లాప్ మూవీ అంటున్నారు. సినిమాలో ఎలాంటి కొత్త ఎలిమెంట్స్ లేవని చెబుతున్నారు. రొటీన్ కథకు కామెడీ, రొమాన్స్ అందించి తెరకెక్కించారని చెబుతున్నారు. అయితే వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు కలిసొచ్చిందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాప్ యావరేజ్ అని చెబుతున్నారు. ఓవరాల్‌గా గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కామెంట్ చేస్తున్నారు. #AadavalluMeekuJohaarlu A Typical Family Entertainer that ends up as an ok watch! Nothing new and boring in parts but dialogues have worked for the most part. Better music would’ve made a big difference. The comedy had a lot of scope but only worked few times Rating: 2.5/5 — Venky Reviews (@venkyreviews) March 3, 2022 Ilanti movies aapesei bro RAPO laaga track marchu @ImSharwanand You are such a fine actor#AadavalluMeekuJohaarlu Rey Thirumala #NenuSailaja ne thippi thippi malli teesav kada ra 🙏 One of the sodhest movie @vennelakishore lekapothe madyalonche vellevadni thank you anna https://t.co/Z2vT1reo64 — Gopi (@_GTweets_) March 4, 2022 #AadavalluMeekuJohaarlu Movie good family entertainer ..hit movie . — JMB (@EmiratesBabu) March 4, 2022 2.75/5 Better ending vuntey baagundedhi One time watchable family entertainer after long time #AadavalluMeekuJohaarlu — Manoj Rahul (@DHFM_endlessly) March 3, 2022 #AadavalluMeekuJohaarlu Review First Half: Routine story presented in an feel good and entertaining way, the family drama sentiments are effective. Direction works 👍#Sharwanand #RashmikaMandanna chemistry 👍 All the female leads are entertaining 👍#AMJNowInTheatres#AMJ pic.twitter.com/kbebaYxANw — Swayam Kumar (@SwayamD71945083) March 3, 2022 #AdavalluMeekuJoharlu truly average family drama Avg 1st half Below Avg 2nd half Good Production values 2.25/5 ( not suggesting ) 👎 — InsidetalkZ (@InsideTallkz) March 4, 2022 -
అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా: రష్మిక
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా మార్చి 4న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. 'పాండమిక్ తర్వాత పిల్లలతో చూసే సినిమాను మిస్ అయ్యాం. ఆ వాతావరణాన్ని మా సినిమా వంద శాతం ఇస్తుందని నమ్ముతున్నా. థియేటర్లు ఫ్యామిలీలతో కళకళలాడాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు నేను చేసిన 'ఉన్నది ఒక్కటే జిందగి' సినిమా చూసి యూత్ చాలామంది తమను తాము చూసుకున్నామని చెప్పారు. 'నేను శైలజ' ఫాదర్, డాటర్ రిలేషన్‌పై తీశాను. అందులో చెప్పినట్లుగా నా స్నేహితుడు కనెక్ట్ అయి పెద్దగా మాటలు లేని అతను తప్పు తెలుసుకుని నన్ను పలుకరించాడు. ఇందులో అన్ని సీన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ సీన్‌కు మహిళలు చప్పట్లు కొడతారు' అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ.. 'చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమా చేశాం. థియేటర్‌కు వచ్చి చూడండి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. కొన్ని సంఘటనలు మన ఇంటిలో జరిగేవిగా కనిపిస్తాయి. మా ఇంటిలో కూడా అమ్మ, నాన్న, చెల్లి ఈ సినిమా విడుదల రోజు తొలి ఆట చూస్తానన్నారు. మీరు కుటుంబంతో ఎంజాయ్ చేయండి' అన్నారు. అనంతరం రష్మిక పలు ప్రశ్నలకు ఇలా సమాధానాలిచ్చారు. పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేశాక మహిళగా డ్రెస్సింగ్‌లో చాలా కష్టం అనిపించింది. అందుకే వచ్చే జన్మంటూ వుంటే మగవాడిగా పుడతానంటూ చలోక్తి విసిరారు. నిజజీవితంలో పెండ్లి గురించి చెబుతూ.... మంచి మనసున్న వ్యక్తి లభిస్తే చేసుకుంటానని, ఇప్పటి వరకు ఎవరితోనూ పెండ్లి ఫిక్స్ కాలేదని తేల్చిచెప్పింది. దర్శకుడు కిశోర్ ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లు తీశాం. ముందు ముందు మగాళ్ళ పేరుతో మీద కూడా చేస్తానన్నారు. -
వీడియో: సెట్స్‌లో రష్మిక అల్లరి మామూలుగా లేదుగా!
కుటుంబ కథాచిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో శర్వానంద్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చి 4న ఈ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా గురువారం ఆడవాళ్లు మీకు జోహార్లు మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో రష్మిక ఫస్ట్ క్లాప్ కొట్టినట్లు చూపించారు. సెట్స్‌లో ఉన్నవాళ్లను ఆటాడిస్తూ తెగ అల్లరి చేసిందీ హీరోయిన్. సీనియర్ నటీమణులు ఖష్బూ, రాధిక, ఊర్వశిలు కూడా కెమెరా ఆఫ్‌లో ఉన్నప్పుడు సరదాగా నవ్వుతూ షూటింగ్‌ను తెగ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. వీళ్ల అల్లరిని, సెట్స్‌లో సరదాగా గడిపిన క్షణాలను మీరూ చూసేయండి.. -
అమెరికాలో 300 స్క్రీన్లలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, శర్వానంద్ జంటగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. మహిళలు ఎక్కువగా ఉండే ఉమ్మడి కుటుంబంలో వారసుడిగా ఒకే మగాడు ఉంటే అతనిపై వారి ఆప్యాయతలు, అనురాగాలు ఎలా వుంటాయనే పాయింట్‌తో `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం రూపొందిందని చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈనెల 4న శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి బుధవారం (మార్చి 2) మీడియా సమావేశంలో పలు విషయాలను తెలియజేశారు. డేట్స్ వల్ల ఆలస్యమైంది `పడి పడి లేచె మనసు` తర్వాత చక్కటి ఫ్యామిలీ సినిమా చేయాలనుకున్నాం. ఆ సమయంలో కిశోర్ దగ్గర కథ ఉందని తెలిసి విన్నాం. మేం ఏదైతే అనుకుంటున్నామో అదే ఈ కథ అనిపించింది. వెంటనే సినిమాను ప్రారంభించాలనుకున్నాం. కానీ రష్మిక, ఖుష్బూ, రాధిక డేట్స్ వల్ల ఆరు నెలలు ఆలస్యమయింది. అందరికీ కనెక్ట్ అవుతాయి ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు కథ కాబట్టి నాకు బాగా నచ్చింది. పది మంది మహిళలు ఉన్న కుటుంబంలో ఒకే మగాడు ఉంటే అతనిపై ఉన్న ప్రేమతో అతనికి తెలీకుండా ఇబ్బంది పెట్టే సన్నివేశాలు బాగా చూపించాం. ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పగలను. మా సినిమా పాయింట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబసభ్యులతో ఉన్నట్లు అనిపించింది ఒకరకంగా ఇంతమంది నటీనటులతో సినిమా చేయడం సాహసమే అని చెప్పాలి. ఇంతమంది సీనియర్స్‌తో చేస్తానని అనుకోలేదు. నా కుటుంబసభ్యులతోనే ఉన్నట్లు అనిపించింది. కిశోర్ తిరుమల వినోదంతోపాటు కుటుంబ విలువలను బాగా ఎలివేట్ చేస్తాడు. కిశోర్ అనుకున్న సమయంలో పూర్తి చేయగలడు. అందుకే నటీనటులు డేట్స్ కుదిరాక చేయగలిగాం. కొవిడ్ టైంలోనూ నటీనటుల ప్రోత్సాహంతో పూర్తి చేయగలిగాం. మన పని మనం నిక్కచ్చిగా చేసుకోవాలి శర్వానంద్‌తో ఇది రెండో సినిమా. తను నిర్మాతగా కాకుండా సోదరిడిలా ట్రీట్ చేశాడు. పడిపడి లేచె మనసు అనుకున్నంతగా ఆడలేదు. అందుకే అప్పటినుంచి మంచి సినిమా ఉంటే చేద్దామని అనుకున్నాం. సినిమా సక్సెస్ కాకపోయినా బెటర్‌మెంట్‌గా చేయాలని మరో సినిమా చేశాం. ఏదైనా మన పని మనం నిక్కచ్చిగా చేసుకోవాలి. నిర్మాణంలో పలు విషయాలను నేర్చుకుని ముందుకు సాగుతున్నాను. నేను సినిమారంగంలోకి ఇష్టంతోనే వచ్చాను. యు.ఎస్‌లో ఐటీ కంపెనీ ఉండేది. కుమార్తె పుట్టాక ఇండియా వచ్చేశాం. ఎర్నేని నవీన్, 14 రీల్స్ వారు అంతా స్నేహితులే. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్.. `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం కొవిడ్ తర్వాత కుటుంబాలను థియేటర్‌కు తీసుకువస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ పెద్దమ్మలు, చిన్నమ్మలు, బామ్మలు, తల్లిదండ్రులు ఉంటారు. నా కుటుంబంలోనూ ఇటువంటి వారున్నారు. నేనూ కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా చూశాక ప్రతివారూ ఎక్కడోచోట కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ డ్రామాతో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హీరోహీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలు వినోదాన్ని పండిస్తాయి. ఇక సత్య, వెన్నెల కిశోర్, ప్రదీప్ రావత్ పాత్రలు మరింత ఎంటర్టైన్ చేస్తాయి. మంచి సినిమా చేయడమే నా కల ఈ చిత్ర కథ రాజమండ్రిలో జరిగేది. అందుకే ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన అన్నవరం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో షూట్ చేశాం. ఇంతకుముందు `పడిపడి..` సినిమాను రూ. 33 కోట్లతో తీశాం. ఆ తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నా. మరో మంచి సినిమా తీయాలనే ముందడుగు వేస్తున్నా. అందుకే వరుసగా నాలుగు సినిమాలను తీయగలుగుతున్నా. ప్రొడక్షన్ పరంగా శ్రీకాంత్ సహకారం ఎంతో ఉంది. నిర్మాతగా డ్రీమ్ అనేవి వుంటాయి. మంచి సినిమా చేయడమే ప్రస్తుతం ముందున్నది. రష్మికను కథ ప్రకారమే తీసుకున్నాం నేను చేయబోయే సినిమాలు ఒక్కోటి ఒక్కో భిన్నమైన కథలతో రూపొందుతున్నాయి. రవితేజతో `రామారావు ఆన్ డ్యూటీ` సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్ నేపథ్యంలో సాగుతుంది. రానా `విరాటపర్వం` 1945 నక్సల్స్ బ్యాక్‌డ్రాప్, నాని దసరా చిత్రం వినూత్నమైన అంశం. గోదావరిఖని బ్యాక్‌డ్రాప్ కథ. సెట్ కూడా వేస్తున్నాం. రష్మికను కథ ప్రకారం ఆమె బాగుంటుందని ఎంపిక చేశాం. దేవీశ్రీ ప్రసాద్ నాలుగు పాటలు అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు. ఆదరణ పొందాయి. ఐదో పాట కూడా ఉంది. అది నేరుగా సినిమాలో చూస్తే మరింత బాగుంటుంది. సినిమాను అమెరికాలో 300 స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణలోనూ ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అని ముగించారు. -
ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ స్టిల్స్ (ఫోటోలు)
-
ఈ టైమ్‌లో ఇలాంటి సినిమా చేయడం సూపర్బ్: రష్మిక మందన్నా
హీరో శర్వానంద్ నటించిన కొత్త సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సకుటుంబ కథా చిత్రంగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించారు. మార్చి 4న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపింది రష్మిక మందన్నా. అప్పుడు సంతోషపడ్డాను.. ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ఇంత మంది లేడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో ఎవరు నటిస్తారనే ఉత్సుకతనే మొదట కలిగింది. ఆ పాత్రలకు ఎవరెవరిని అనుకుంటున్నారో చెప్పాక సంతోషపడ్డాను. ఈ సినిమా ప్రధానంగా ఇంటర్వెల్ సీన్ ఒకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా ఎలాగైనా చేయాలని అనిపించింది. డైలాగ్ ప్రధానంగా సాగే పాత్రలే.. ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆద్య. ఆమె ముక్కుసూటి మనిషి. మొహమాటంగా ఉండదు. అనుకున్నది చెప్పేస్తుంది. మనసులో ఏదో దాచుకుని డ్రామా క్రియేట్ చేయడం ఇష్టముండదు. సినిమా నిండా ఆడవాళ్లమే ఉంటాం కాబట్టి సెట్ లో మగవాళ్లంతా మమ్మల్ని చూసి ..వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో అంటూ ఇబ్బంది పడేవారు. ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్నీ డైలాగ్ ప్రధానంగా సాగుతుంటాయి. అందరూ మాట్లాడుతుంటారు. అవన్నీ మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నట్లు సహజంగా ఉంటాయి. చాలా సరదాగా ఉండేది.. దర్శకుడు కిషోర్ తిరుమలతో పనిచేయడం చాలా సరదాగా ఉండేది. ఆయనకు దైవభక్తి ఎక్కువ. మాల వేసుకునేవారు. ఏం కోరుకున్నారు సార్ అని అడిగితే.. ఇంతమంది మహిళలతో సినిమా చేస్తున్నాను కదా అన్నీ సవ్యంగా జరగాలని కోరుకున్నా అని నవ్వుతూ చెప్పేవారు. అలా ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ నవ్వుకునేవాళ్లం. సినిమా విషయంలో చాలా స్ఫష్టత ఉన్న దర్శకుడాయన. కిషోర్ తిరుమల మహిళలకు ఎంత విలువ ఇస్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. కమర్షియల్ సినిమాలు, హీరోయిజం ఉన్న సినిమాలు వస్తున్న ఈ టైమ్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సినిమా చేయడం సూపర్బ్. శర్వా ఇంటి నుంచి ఫుడ్ తెచ్చేవాడు.. శర్వానంద్ తో కలిసి నటించడం హ్యాపీ. నేను పుష్ప సెట్ లో నుంచి ఆడవాళ్లు..షూట్ కు వచ్చినప్పుడు చాలా రికాక్స్ అయ్యేదాన్ని. అక్కడ అడవుల్లో షూటింగ్ చేసి ఇక్కడికొస్తే పిక్నిక్ లా అనిపించేది. ఇంటి నుంచి శర్వా ఫుడ్ తెచ్చి పెట్టేవాడు. ఒక ఫ్యామిలీలా అంతా కలిసి ట్రావెల్ చేశాం. శర్వాను మిగతా ఆడవాళ్లు ఈ సినిమాలో ఇబ్బంది పెడుతుంటారు. నేనూ వాళ్లతో కలిసిపోయాను. అంతమంది మహిళల మధ్య ఆయన ఎలా వ్యవహరించారు అనేది సినిమాలో చూడాలి. చాలా ఫన్ గా ఉంటుంది. అది మర్చిపోలేని అనుభవం.. ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. వాళ్లు అప్పటిదాకా మనతో నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు. షాట్ రెడీ అనగానే ఆశ్చర్యపోయేలా మారిపోతారు. ఆ క్యారెక్టర్ లోకి వెళ్తారు. సెట్ లో ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలన్నీ వాళ్లను చూసి నేర్చుకున్నా. నేను ఉన్నందుకే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది అని ఉర్వశి గారు అనడం నామీదున్న ప్రేమతోనే. మళ్లీ చేయాలని ఉంది శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ కు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మళ్లీ ఈ సంస్థలో వర్క్ చేయాలని ఉంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్. దేవి టాలెంట్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ సినిమా ఆల్బమ్ లోని అన్ని పాటలు హిట్ చేశాడు. ఆర్ఆర్ కూడా సినిమాను బాగా ఎలివేట్ చేస్తుంది. వాళ్ల నటనతో ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కీర్తి, సాయిపల్లవి ఉండటం ఎంతో హ్యాపీ అనిపించింది. వాళ్లను చూస్తుంటే మహిళా శక్తిని చూసినట్లు ఉంది. కీర్తి, పల్లవి వాళ్ల వాళ్ల నటనతో ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు. నాకు వాళ్లను చూస్తే ఆనందంగా ఉంటుంది. నా తదుపరి సినిమాల వివరాలు త్వరలో వెల్లడిస్తా. -
సాయి పల్లవి యాడ్ రిజెక్ట్ చేయడంపై స్పందించిన సుకుమార్
Sukumar Intresting Comments On Sai Pallavi: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ హీరోయిన్ సాయి పల్లవిపై ప్రశంసల వర్షం కురిపించాడు. నిన్న(ఫిబ్రవరి 27) జరిగిన ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్, సాయి పల్లవి, కీర్తి సురేశ్‌లు ముఖ్య అతిథులుగా హజరైన సంగతి తెలిసిందే. శాంతం కామెడీగా జరిగిన ఈ వెంట్లో సుక్కు మాట్లాడుతూ.. కీర్తి సురేశ్, రష్మికలపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. అనంతరం స్టేజ్‌పై సాయి పల్లవి పేరు ఎత్తగానే శిల్పాకళ వేదిక ఒక్కసారిగా ఫ్యాన్స్ అరుపులతో మారుమోగింది. దీంతో సాయి పల్లవి సుకుమార్ చెవిలో ఎదో చెప్పింది. చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ ఆ తర్వాత సుక్కు.. ‘‘ఆమె నా చెవిలో ఏం చెప్పిందో తెలుసా? ‘నా గురించి చెప్పేదేమైనా ఉంటే నాతోనే చెప్పండి’ అంటుంది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే లేడి పవన్ కల్యాణ్ అనిపిస్తోంది’ అంటూ సాయి పల్లవిని ఆటపట్టించాడు. అలాగే ‘ఇన్నాళ్లకు సాయి పల్లవి గరించి మాట్లాడే అవకాశం వచ్చింది. వ్యక్తిగతంగా తనకు ఒక విషయం చెప్పాలనుకున్నా. కానీ అది ఇప్పుడు కుదరింది. బెసిగ్గా సాయి పల్లవి అంటే ఓ నటి అని అందరికి తెలిసిందే. కానీ ఓ యాడ్ రిజెక్ట్ చేసిన అర్టిస్ట్‌గా ఆమె ఎప్పటికి గుర్తుండిపోతుంది. అంతటి హ్యుమన్ బీయింగ్‌తో(మానవత్వంతో) ఉండటం చాలా కష్టమైన విషయం’’ అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్. చదవండి: బ్యాడ్ న్యూస్ చెప్పిన శ్రుతి, త్వరలోనే కలుస్తానంటూ ట్వీట్ కాగా టాలెంటెడ్ హీరో శర్వానంద్-రష్మిక మందన్నా జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని మార్చి 4న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర బృందం నిన్న శిల్పకళా వేదికలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, పాటలు, వీడియోస్ మూవీపై ఆసక్తిని పెంచగా.. ఆదివారం విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటీమణులు ఖష్బు సుందర్, రాధిక శరత్ కుమార్, ఊర్వశీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ వారం థియేటర్/ ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!
వరుస సినిమాలతో బాక్సాఫీస్‌లు దద్దరిల్లుతున్నాయి. చిన్నాపెద్దా సినిమాలన్నీ రిలీజ్‌కు సై అంటూ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని థియేటర్లో హిట్ కొడుతుండగా మరికొన్ని ఓటీటీలో సూపర్ హిట్ అందుకుంటున్నాయి. ఇక ఈ వారం భారీ సినిమాలు కాకుండా యంగ్ హీరోల మూవీస్ సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలు కూడా కొత్త సరుకుతో స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. మరి అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏంటో చూసేయండి. హే సినామిక - మార్చి 3 ఆడవాళ్లు మీకు జోహార్లు - మార్చి 4 సెబాస్టియన్ పీసీ 524 - మార్చి 4 అశోకవనంలో అర్జున కళ్యాణం - మార్చి 4 ఓటీటీలో వస్తున్న సిత్రాల లిస్ట్.. ఆహా ► డీజే టిల్లు - మార్చి 4 జీ 5 ► సామాన్యుడు- మార్చి 4 అమెజాన్ ప్రైమ్ ► నో టైమ్ టు డై - మార్చి 4 ► ద బాయ్స్ ప్రజెంట్స్: డయాబాలికల్ - మార్చి 4 హాట్‌స్టార్ ► బెటర్ థింగ్స్ ఐదో సీజన్ - మార్చి 1 ► రుద్ర: ద ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ (వెబ్ సిరీస్) - మార్చి 4 ► సుత్ లియాన్ (వెబ్ సిరీస్)- మార్చి 4 నెట్‌ఫ్లిక్స్ ► ఎగైన్స్ ద ఐస్ - మార్చి 2 ► ద వీకెండ్ ఎ వే - మార్చి 3 ► పీసెస్ ఆఫ్ హర్ (వెబ్ సిరీస్) - మార్చి 4 ► అవుట్‌లాండర్ ఆరో సీజన్ - మార్చి 7 సోనీ లివ్ ► అన్ దేఖీ (వెబ్ సిరీస్)- మార్చి 4 ఎంఎక్స్ ప్లేయర్ ► వాండర్లస్ట్ (వెబ్ సిరీస్) - మార్చి 4 -
అందుకే ఈ సినిమా సూపర్ హిట్
‘‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చూసి సినిమా అదిరిపోయిందని దేవిశ్రీ చెప్పాడు.. తన జడ్జిమెంట్‌పై నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అని ఇప్పుడే చెబుతున్నా’’అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ–‘‘సమంత, కీర్తీ సురేశ్, సాయిపల్లవి, రష్మికలు అందమైన, మంచి నటన కనబరుస్తున్నారు. సాయిపల్లవి మంచే నటే కాదు.. తనకు మంచి మనసు కూడా ఉంది. కిషోర్ చాలా సున్నితమైన మనసు ఉన్నవాడు.. ఈ సినిమాతో చాలా పెద్ద సక్సెస్ రావాలి. శర్వానంద్‌కి నేను పెద్ద అభిమానిని. తన గత రెండు సినిమాలు కొంచెం సీరియస్‌గా ఉన్నా ఈ సినిమా మాత్రం సరదాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీతో సుధాకర్‌గారికి పెద్ద హిట్ రావాలి. కుష్బూగారిని ఒక రోజు డైరెక్ట్ చేసే అవకాశం రావడం సంతోషం.. ఆమె ముందు నేను స్టూడెంట్‌ని అయిపోయాను’’ అన్నారు. కీర్తీ సురేశ్ మాట్లాడుతూ–‘‘కిశోర్‌గారి ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగులో నా ప్రయాణం ప్రారంభమైంది. పంచ్‌లు, డైలాగులు చూస్తే ఇది ఆయన సినిమా అని తెలుస్తుంది. రష్మిక ప్రతిభ గురించి నేను చెప్పేదేముంది.. కెరీర్ బిగినింగ్ నుంచే నువ్వు(రష్మిక) తగ్గేదే లే. మీరంతా హాయిగా థియేటర్లకు వెళ్లి ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చూసి, ఎంజాయ్ చేయండి’’ అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘శర్వానంద్‌గారితో నేను ఓ ఫ్రెండ్‌లా మాట్లాడేస్తాను. మంచి కథల కోసం ఆయన ఎప్పుడూ తాపత్రయ పడుతుంటారు. ‘పడి పడి లేచే మనసు’ చిత్రంలో శర్వానంద్‌తో కలిసి నటించడాన్ని గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ‘ఆడవాళ్ళు..’ ట్రైలర్ బాగుంది. రష్మిక కెరీర్లో ఈ సినిమా మరో హిట్‌గా చేరాలి. ఈ సినిమా చుట్టూ ఓ పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. నిర్మాతలకు పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘ఈ వేడుకను జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడండి.. మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు కిషోర్ తిరుమల. శర్వానంద్ మాట్లాడుతూ–‘‘సుకుమార్‌గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయన, కీర్తీ సురేశ్‌గారు ఈ వేడుకకి రావడం సంతోషంగా ఉంది. సాయిపల్లవి మనసుతో చూస్తుంది.. మనసుతో మాట్లాడుతుంది.. అందుకే ఇంతమంది అభిమానం సొంతం చేసుకుంది. మా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ప్రాణం పోశారు.. బ్లాక్ బస్టర్ పాటలిచ్చినందుకు థ్యాంక్స్. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ నా కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది.. రాసి పెట్టుకోండి’’ అన్నారు. ‘‘చాలా కాలం తర్వాత వస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన శ్రీకాంత్ అన్నారు. రష్మికా మందన్నా మాట్లాడుతూ – ‘‘శర్వానంద్‌ని ఎంత విసిగించినా చాలా కూల్‌గా ఉంటాడు. ఈ సినిమాలో చాలామంది ఆడవాళ్ళు యాక్ట్ చేశారు. ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, వెంకట్ బోయనపల్లి, సూర్యదేవర నాగవంశీ, చిత్ర కెమెరామేన్ సుజిత్ సారంగ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటీమణులు కుష్బు, రజిత, ఝాన్సీ, డైరెక్టర్ వేణు ఊడుగుల, కెమెరామేన్ సత్యన్ సూర్యన్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోయిన్లతోపాటు సూపర్ గెస్ట్
Adavallu Meeku Joharlu Movie Prerelease Event: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, శర్వానంద్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను మొదటగా ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించి తర్వాత మార్చి 4కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ నెల 27న హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ప్రిరిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్లు కీర్తి సురేష్, సాయి పల్లవి ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రకటించింది. అయితే టైటిల్‌కు తగినట్లు మహిళల గొప్పతనాన్ని చాటేందుకే ఇద్దరు ప్రముఖ హీరోయిన్లను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆద్యంతో వినోదాత్మకంగా, కుటుంబంతో కలిసి చూడగలిగే సినిమా అని చెబుతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. #AadavalluMeekuJohaarlu grand Pre Release Event on 27th FEB 💥 Blockbuster Director @aryasukku garu, The most talented & fan favourites @KeerthyOfficial & @Sai_Pallavi92 will grace the event. #AMJOnMarch4th@ImSharwanand @iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @LahariMusic pic.twitter.com/P3YJVmtYVn — SLV Cinemas On Duty (@SLVCinemasOffl) February 25, 2022 -
ఆడవాళ్లు మీకు జోహార్లు న్యూ వీడియో సాంగ్ రిలీజ్
-
మరో రిలీజ్ డేట్‌ను ప్రకటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీం
శర్వానంద్ - రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఒక వారం ఆలస్యంగా వస్తామంటూ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. మార్చి 4న విడుదల చేయాలనుకుంటున్నట్లు శనివారం చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రకటించారు. చదవండి: నోయల్‌తో విడాకుల తర్వాత రెట్టింపు సంతోషంగా ఉన్నా: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ఈ మేరకు చిత్రం బృందం ‘‘సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మార్చి 4న గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. ఇప్పటివరకూ విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మంచి సంగీతం ఇచ్చారు’’ అని పేర్కొంది. మహిళల ప్రాధాన్యత నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో సీనియర్ నటి ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. #AadavalluMeekuJoharlu is all set to entertain 'U' and your family in Theaters Worldwide from MARCH 4th ❤️#AMJOnMarch4th @iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl @LahariMusic @TSeries pic.twitter.com/DC6JnqFZFk — Sharwanand (@ImSharwanand) February 19, 2022 -
అలా రాయగలగడం నా అదృష్టం, వెంకటేశ్‌తో సినిమా నిజమే..
‘‘ఒక్కో సినిమాకు ఒక్కో ప్రయత్నం చేస్తుండాలి. నేను అదే చేస్తాను. ‘నేను.. శైలజ’ చిత్రంలో తండ్రీ కూతుళ్ల కథను చెప్పా. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రంలో స్నేహం గురించి చెప్పాను. ‘చిత్రలహరి’ ఓ లూజర్ కథ. స్క్రిప్ట్‌లో నిజాయతీ ఉన్నప్పుడు సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో మహిళల ప్రాముఖ్యతను చెప్పే ప్రయత్నం చేశాను’’ అన్నారు కిశోర్ తిరుమల. శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వెంకటేశ్‌గారితో ఓ సినిమా అనుకున్న మాట వాస్తవమే కానీ ఆ కథ ఇది కాదు. నేపథ్యం ఒకటే అయినా కథ మారింది. మన కుటుంబాల్లోని మహిళలు మనకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ మన జీవితాలను తీర్చిదిద్దాలనుకుంటుంటారు. కొందరు మహిళలు చిన్న చిన్న ఆనందాలకే సంతోషపడిపోతుంటారు. వారు తమ పురుషులపై భారీ డిమాండ్స్ చేయరు. అలాంటి మహిళలకు గుర్తుగా ఓ సినిమా తీయాలనిపించి ఈ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ తీశాను. శర్వాకు ఈ కథ వినిపించినప్పుడు హ్యాపీ ఫీలయ్యాడు. ఐదుగురు అక్కాచెల్లెళ్ళు ఉన్న ఓ యువకుడి కథే ఈ చిత్రం. ఆ ఐదుగురి అక్కాచెళ్లళ్ళ భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా కథ విని రష్మిక బాగా ఎంజాయ్ చేశారు. ఓ అమ్మాయిలా మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు? అని అడిగారు. అలాగే ‘ఉన్నది ఒకటే జీవితం’ సమయంలో కూడా ‘ఒక అమ్మాయి మాత్రమే ఇలాంటి డైలాగ్స్ చెప్పగలదు. మీరు అలానే రాస్తున్నారు’ అని అనుపమ అన్నారు. ఇలా స్క్రిప్ట్ రాయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘ఆడవాళ్లు..’లో ప్రతి పాట కథను ముందుకు నడుపుతుంది. దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలిచ్చారు. మా సినిమా రిలీజ్ అనేది నిర్మాతల చేతుల్లో ఉంటుంది. (‘భీమ్లానాయక్’ ఈ నెల 25న వస్తోంది కాబట్టి ‘ఆడవాళ్లు..’ విడుదల వాయిదా పడుతుందా? అనే ప్రశ్నకు సమాధానంగా) నా తర్వాతి చిత్రం నాగచైతన్య హీరోగా ఉంటుంది’’ అన్నారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆడవాళ్లు మీకు జోహర్లు’
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంతవరకూ కూడా ఎప్పటి పనులను అప్పుడు పూర్తిచేస్తూ వచ్చారు. ఈ కారణంగానే ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. దేవిశ్రీ ప్రసాద్ నుంచి వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ ను బట్టే ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమైపోతోంది. హీరో పెళ్లి చూపుల ఎపిసోడ్ ఈ సినిమాలో ప్రధానమైన హాస్యాన్ని పండించనుంది. ఈ సినిమాలో రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో వెనుకబడిన శర్వానంద్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి. #AadavalluMeekuJoharlu From Feb 25th 😍😍 pic.twitter.com/Q9sLRfClB2 — siddu (@UrsViswanadh) February 14, 2022 -
ఆకట్టుకుంటున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ టీజర్
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది. ప్రతి మోగాడి జీవితం పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అనే శర్వానంద్ డైలాగ్‌తో టీజర్ ముదలవుతోంది. ఎంతో మంది పెళ్లి చూపులు చూసిన హీరో వారందరిని రిజెక్ట్ చేస్తాడు. చివరకు హీరోయిన్ను ఒకే చేస్తాడు. కానీ హీరోని హీరోయిన్ రిజెక్ట్ చేస్తుంది. ఈ లైన్ పైనే కామెడీని వర్కౌట్ చేశాడు దర్శకుడు. ఇక చివరిసారిగా హీరో .. హీరోయిన్ పైనే ఆశలు పెట్టుకుంటాడు. కానీ ఆమె కూడా ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడనేదే కథ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, ఖుష్బూ సందర్, ఊర్వశిలు ముఖ్యమైన పాత్రలో నటించారు. -
'నీ మొగుడేమన్నా మహేశ్బాబా? నువ్వేమైనా కత్రినా కైఫా'?..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, యంగ్ హీరో శర్వానంద్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది. -
'ఆడవాళ్లు మీకు జోహార్లు' నుంచి లేటెస్ట్ అప్డేట్
Aadavallu Meeku Johaarlu Title Song To Be Released: యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25నప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని వచ్చేనెల4న, సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇక ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు -
'ఆడవాళ్లు మీకు జోహార్లు' విడుదల ఎప్పుడంటే ?
Sharvanand Aadavallu Meku Joharlu Movie 2022 Release In February: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతుంది. ఒక పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో సినిమా ప్రమోషన్స్ చేయనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పక్కింటి కుర్రాడి పాత్రలో నటిస్తుండగా, రష్మిక పాత్ర మంచి అనుభూతిని ఇస్తుందని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యతను టైటిల్ తెలియజేసేలా ఉంది. ఖుష్బు, రాధిక శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్‌లు అందించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. #AadavalluMeekuJohaarlu Releasing in Theaters on February 25 💥💥#AMJOnFEB25 @iamRashmika @DirKishoreOffl @realradikaa @khushsundar #Urvashi @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl pic.twitter.com/Z8I7ssvapf — Sharwanand (@ImSharwanand) January 28, 2022 -
రాధిక, ఊర్వశి ‘నవరాత్రి’ పాట.. సిగ్గు పడిన రష్మిక
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా నవరాత్రి సందర్భంగా ఈ మూవీ షూటింగ్ స్పాట్లో రాధిక, ఊర్వశితో కలిసి రష్మికతో చేసిన వీడియో వైరల్‌గా మారింది. అందులో.. శివాజీ గణేశన్, ‘మహానటి’ సావిత్రి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘నవరాత్రి’ లోని పాపులర్ సాంగ్ ‘నవరాతిరి.. శుభరాతిరి’ని సీనియర్ నటీమణులు పాడారు. ఆ సమయంలో మధ్యలో ఉన్న రష్మిక సిగ్గు పడుతూ ఉన్న ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: శర్వానంద్ చిత్రంలో ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ A #Navaratri special with the doll @iamRashmika a #favourite song reminiscing #savithri #amj aadavallu meeku joharllu special😀😀😀 pic.twitter.com/ACMCiEbVw5 — Radikaa Sarathkumar (@realradikaa) October 7, 2021 -
శర్వానంద్ చిత్రానికి దేవీశ్రీ సంగీతం
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండనున్నాయని, కిశోర్ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.