Aadavaallu Meeku Johaarlu Movie Music Director Details In Telugu - Sakshi
Sakshi News home page

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’కు దేవీశ్రీ సంగీతం

Published Thu, Jul 22 2021 1:40 PM | Last Updated on Thu, Jul 22 2021 3:33 PM

Aadavaallu Meeku Johaarlu Movie Music Director Details In Telugu - Sakshi

శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. 

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల  ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండ‌నున్నాయని, కిశోర్‌ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement