Devisri Prasad
-
'పుష్ప2' ప్రతి సీన్ ఇంటర్వెల్లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్
అల్లు అర్జున్- సుకుమార్‌ల హిట్ కాంబోలో తెరకెక్కుతోన్న 'పుష్ప2' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ గురించి ఏ వార్త కనిపించినా అది క్షణాల్లో వైరలవుతోంది. 'పుష్ప: ది రైజ్'కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే 'పుష్ప: ది రూల్' (పుష్ప 2). ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 19న దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'పుష్ప 2' సినిమా ఎలా ఉందో చెప్పారు.పుష్ప2 అదిరిపోతుంది: దేవిశ్రీ ప్రసాద్పుష్ప పార్ట్ 2 'అస్సలు తగ్గేదే లే' అనేలా ఉండబోతుందని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. 'నేను పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూశాను. సినిమా అదిరిపోయేలా వచ్చింది. ఇందులోని సీన్స్ అన్నీ చూశాక నా దిమ్మ తిరిగిపోయింది. పుష్ప వరల్డ్ ప్రారంభమయ్యాక ప్రతి సన్నివేశం ఇంటర్వెల్లా ఉంటుంది. ప్రేక్షకులను ఏమాత్రం నిరాశ పరిచేలా సీన్లు ఉండవు. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే తెగ నచ్చేసింది. అంతే స్థాయిలో దానిని తెరకెక్కించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టైల్లొ అదరగొట్టేశాడు.' అని మూవీపై భారీ అంచనాలు పెంచేశాడు. పుష్ప2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.హైదరాబాద్‌లో తొలిసారి మ్యూజికల్ కాన్సర్ట్‌ను దేవిశ్రీ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 19న గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే విదేశాల్లో ఇలాంటి ఎన్నో ప్రదర్శనలిచ్చిన దేవిశ్రీ ప్రసాద్.. తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొననున్నారు. -
పనైపోయిందన్నారు.. కానీ వీళ్లిద్దరూ మాత్రం వేరే లెవల్!
ఏ సినిమా తీసుకున్నా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కీలకమే. కానీ యాక్టర్స్ ఎంత ఫెర్ఫార్మ్ చేసినా సరే దానికి సరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ లేకపోతే అసలు ఆ సినిమాలో జీవమే ఉండదు. అలా గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోసిన వాళ్ల లిస్ట్ తీస్తే అందులో కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ కచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వాళ్లకు జాతీయ అవార్డులు రావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) ఆస్కార్ ప్లస్ ఈ అవార్డ్ కీరవాణి పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు, గూస్బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తుంది. అప్పట్లో అందరూ హీరోల సినిమాలకు పనిచేసిన ఈయన.. కొన్నాళ్ల నుంచి మాత్రం ఎందుకో బయట సినిమాలు బాగా తగ్గించేశారు. ఒకవేళ చేసినా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ బాహుబలి రెండు పార్ట్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచారు. ఇప్పుడు అదే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో జాతీయ అవార్డు సాధించారు. (ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్) మాస్ కమ్‌బ్యాక్ మాస్, క్లాస్, రొమాంటిక్.. ఇలా ఏ పాటలకు ట్యూన్స్ కట్టాలన్నా అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ పేరు వినిపించేది. కానీ తమన్‌తోపాటు మిగతా సంగీత దర్శకుల హవా ఎక్కువ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ పడిపోయింది. దీంతో చాలామంది డీఎస్పీ పనైపోయిందనుకున్నారు. కానీ 'పుష్ప' పాటలతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించాడు. ఆ సాంగ్స్ వల్లే ఇప్పుడు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. సీనియర్ల అనుభవం అయితే పైన ఇద్దరికీ జాతీయ అవార్డులు రావడం విశేషమే. కానీ వీళ్ల గురించి జనాలు మెల్లమెల్లగా మరిచిపోతున్న టైంలో అవార్డులు గెలిచి చూపించారు. సీనియర్ల అనుభవం.. ఇలాంటప్పుడు ఎలా పనికొస్తుందనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపించారు. ఇప్పటి జనరేషన్ మాటల్లో చెప్పాలంటే.. ఇది కదా అసలైన కమ్‌బ్యాక్ అంటే అని అనొచ్చు. ఇక ఈ అవార్డులు ఇచ్చిన ఊపుతో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు చేస్తూ మంచి మ్యూజిక్ ఇవ్వాలని.. తెలుగు సంగీత ప్రియులు కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!) -
'అమెరికాలో పూనకాలు లోడింగ్'.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
డీఎస్పీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పేరు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను ఊర్రూతలూగించడం ఆయన టాలెంట్. టాలీవుడ్లో మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల సినిమాల దాకా తన మ్యూజిక్‌తో అభిమానులను అలరించాడు. అందుకే టాలీవుడ్లో అతన్ని ముద్దుగా డీఎస్పీ అని పిలుస్తారు. అయితే తాజాగా తన టాలెంట్‌ను అమెరికాలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు డీఎస్పీ. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి డీఎస్పీ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'అమెరికాలో పూనకాలు లోడింగ్' అంటూ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) అమెరికాలోని నాసా ఆధ్వర్యంలో నిర్వహించే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా మెగాస్టార్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాసా అధ్వర్యంలో దేవి శ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. జులై 2న డల్లాస్, జులై 8న ఫిలడెల్ఫియా, జులై 15న సియాటెల్, జులై 22న సాన్ జొస్ , జులై 29న చికాగోలో ఈవెంట్స్ జరగనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్స్‌లో సింగర్ ఇంద్రవతి , సాగర్, గీతా మాధురి , హేమ చంద్ర , రీటా , పృథ్వి , మౌనిక అలరించనున్నారు. ప్రముఖ యాంకర్ నటి అనసూయ ఈ షోస్‌ను హోస్ట్ చేయనున్నారు. గతంలో నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లతో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నాసా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించారు. ఇటీవలే సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!) ℒℴ𝓋ℯ 𝓎ℴ𝓊 𝓂𝓎 𝒷ℴ𝓎 𝐑𝐎𝐂𝐊 𝐓𝐇𝐄 𝐒𝐇𝐎𝐖𝐖𝐖𝐖 Just do KUMMUDU..🎶🕺 Wishing ROCKSTAR @ThisIsDSP & his TEAM All The Very Best for DSP-USA TOUR 2023 *#DSPOoAntavaTourUSA*https://t.co/c6jea4ILUe@sagar_singer @itsvedhem @PrudhviChandrap @geethasinger… pic.twitter.com/8AvvNUZKQi — Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2023 -
పెళ్లిపీటలు ఎక్కబోతున్న దేవీశ్రీ ప్రసాద్? వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లలో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. దేవి సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆయన మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దేవీశ్రీ ప్రసాద్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నాలుగు పదుల వయసు దాటినా దేవీశ్రీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇక అమ్మాయి ఎవరో కాదు దేవిశ్రీప్రసాద్ దూరపు బంధువుల అమ్మాయట. ఆమె వరసకి మరదలు అవుతుందట. వీరిద్దరికి సుమారు 17ఏళ్ల గ్యాప్ ఉందని తెలుస్తుంది. కుటుంబసభ్యుల సమక్షంలో త్వరలోనే వీరి వివాహం జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి నెట్టింట వైరల్ అవుతున్నట్లుగా ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాల్సిందే. గతంలోనూ దేవీ ఓ హీరోయిన్‌తో పీకలదాకా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి వరకు వెళ్లిన వాళ్ల రిలేషన్ మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. -
దేవిశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు
-
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
పాటలు నచ్చలేదు.. దేవిశ్రీకి షాకిచ్చిన సల్మాన్!
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ అంటే సల్మాన్ ఖాన్‌కు చాలా ఇష్టం. అందుకే గతంలో దేవి కంపోజ్ చేసిన కొన్ని ట్రాక్స్ ను బాలీవుడ్ కు తీసుకెళ్లాడు. ఆర్య 2లోని రింగా రింగా, అలాగే డీజేలోని సీటీమార్ మ్యూజిక్ ను బాలీవుడ్ లో రిపీట్ చేశాడు. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్పకు దేవి అందించిన ట్రాక్స్ సల్మాన్ కు ఇంకా బాగా నచ్చాయి. దీంతో ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త సినిమా కభీ ఈద్ కభీ దివాళీకి దేవిశ్రీ ప్రసాద్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నాడు భాయ్ జాన్. కాని ఇప్పుడు ఈ చిత్రం నుంచి రాక్ స్టార్ తప్పుకున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్రాక్స్ సల్మాన్‌కు నచ్చకపోవడమే అట. ఇక దేవిశ్రీని తప్పించి ఆ అవకాశం కేజీయఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌కు ఇచ్చాడట. (చదవండి: ఆస్కార్ నుంచి సూర్యకు ఆహ్వానం.. తొలి సౌత్ ఇండియా హీరోగా రికార్డు) భాయ్ జాన్ నుంచి బిగ్ ఫిల్మ్ ఆఫర్ రావడంతో వెంటనే ఒకే అనేసాడు రవిబస్రూర్. అంతే కాదు కభీ ఈద్ కభీ దివాళి టైటిల్ కంపోజ్ చేసి సల్మాన్ ను ఇంప్రెస్ చేశాడట. ఈ చిత్రంలో సల్మాన్, వెంకీ, రామ్ చరణ్ తేజ్, పూజా హెగ్డే కలసి స్టెప్పులేసే స్పెషల్ సాంగ్ కోసం కూడా రవినే సెన్సేషనల్ ట్రాక్ అందించబోతున్నాడట. -
సుకుమార్‌కి దేవీశ్రీ స్పెషల్ బర్త్‌డే విషేస్.. సాంగ్ విన్నారా?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌లు ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. సుక్కు నుంచి ఒక సినిమా వస్తే..దానికి కచ్చితం దేవినే సంగీతం అందించాలి. పాటలు కూడా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఆర్య నుంచి మొదలు మొన్నటి పుష్ప వరకు.. సుక్కు ప్రతి సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు దేవీశ్రీ ప్రసాద్. నేడు(జనవరి 11)సుకుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన స్నేహితుడికి పాట రూపంలో బర్త్‌డే విషెస్ తెలియజేశాడు డీఎస్పీ. పుష్ప మూవీలోని ‘శ్రీవల్లీ’పాటకుపేరడీగా ఈ బర్త్‌డే సాంగ్ సాగుతుంది. -
పుష్ప టీమ్ భారీ ప్లాన్.. ‘దాక్కో దాక్కో మేక’ కు మించేలా సెకండ్ సింగిల్!
అల్లు అర్జున్ సంగతి తెలిసిందే. ఒక కొత్త సినిమా స్టార్ట్ అయితే చాలు ఆ వెంటనే ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు. తన మూవీ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే విధంగా ప్లాన్ చేస్తాడు. అల.. వైకుంఠపురములో పాటలతో బన్ని చేసిన ప్రమోషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ పుష్పకు అప్లై చేస్తున్నాడు. పుష్ప మూవీ నుంచి రిలీజై ఫస్ట్ ప్యాన్ ఇండియా సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో తెల్సిందే. ఇప్పటికిప్పుడు యూట్యూబ్ చూసినా, ఏదో ఒక రికార్డ్ బద్దలవుతూ కనిపిస్తుంది. అందుకే వేడి తగ్గకుండా, మరో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది. ఆగస్ట్ లో దాక్కో దాక్కో దుమ్మురేపడంతో, సెప్టెంబర్ లో మరో న్యూ సింగిల్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు బన్ని. అందుకు సంబంధించి ఇప్పటికే ప్లానింగ్ జరిగిపోయింది. ఈసారి డ్యూయెట్ సాంగ్ ను సింగిల్ రూపంలో విడుదల చేస్తారట. క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి, ఇకపై ప్రతీ నెల ఒక సింగిల్ రిలీజ్ కానుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. దాక్కో దాక్కో ట్యూన్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దేవి త్వరలో విడుదల కానున్న కొత్త డ్యూయెట్ తో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. అసలే బన్ని ప్రాజెక్ట్ అంటే ఇంకా రెచ్చిపోతాడు రాక్ స్టార్. -
‘పుష్ప’ అప్డేట్: దాక్కొ దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’.అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలై టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ పుట్టిన రోజు (ఆగస్ట్ 2)సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్‌ని ప్రటకించింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్ ఆగస్ట్ 13న విడుదల కానున్నట్టు తెలియజేశారు. ఐదు భాషల్లో ఐదుమంది సింగర్స్‌తో ఈ పాటను పాడించారు. హిందీలో ఈ పాటను విశాల్ దడ్లాని, కన్నడలో విజయ్ ప్రకాశ్, మలయాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం,తమిళంలో బెన్నీ దయాల్ పాటని ఆలపించారు. తెలుగులో దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొడుతుంది పీక పేరుతో ఈ పాట రూపొందింది. 5 Languages, 5 singers & One Rocking Tune by @ThisIsDSP 🎵 Icon Staar @alluarjun's #PushpaFirstSingle on AUG 13th🔥#HBDRockStarDSP#DaakkoDaakkoMeka #OduOduAadu #OduOduAade #JokkeJokkeMeke #JaagoJaagoBakre#Shivam @benny_dayal @RahulNOfficial @rvijayprakash @VishalDadlani pic.twitter.com/aqzKCrcg62 — Pushpa (@PushpaMovie) August 2, 2021 -
దేవిశ్రీ ప్రసాద్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఆయన మ్యూజిక్ వింటే ఎవరికైనా స్టెప్పులేయాలనిపిస్తుంది. రొమాంటిక్, సెంటిమెంటల్, దుమ్మురేపే మాస్ బీట్స్, హుషారెత్తించే ఐటమ్స్ సాంగ్స్.. ఏదైనా తనదైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు. ఆయన మరెవరోకాదు.. అభిమానులచే ముద్దుగా డీఎస్పీ అని పిలవబడే దేవిశ్రీ ప్రసాద్. స్వచ్ఛమైన సంగీతానికి కేరాఫ్‌గా నిలిచే పేరు అది. ఎనర్జీ అనే పదానికి నిర్వచనం ఆయన. తన మ్యూజికల్ మ్యాజిక్‌తో ఎన్నో చిత్రాలకు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 2). ఈ సందర్భంగా ‘డీఎస్పీ’గురించి.. దేవీశ్రీ ప్రసాద్.. 1979, ఆగస్ట్ 2న గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోని వెదురుపాక వీరి స్వగ్రామం.దేవీకి ఒక తమ్ముడు సాగర్, చెల్లి పద్మిణి ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిన్ననాటి నుండి సంగీత ప్రపంచంలోనే పెరిగారు. ఆయన తండ్రి గొర్తి సత్యమూర్తి గొప్ప కథా రచయిత. దేవత’‘ఖైదీ నంబర్ 786’, ‘అభిలాష’, ‘పోలీస్ లాకప్’, ‘ఛాలెంజ్’ వంటి విజయవంవతమైన చిత్రాలకి ఆయన కథలు అందించారు. ఒక రకంగా దేవీ సినిమాల్లోకి రావడానికి కారణం ఆయనే. అసలు దేవిశ్రీప్రసాద్ అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేవిశ్రీ ప్రసాద్ అమ్మమ్మ పేరులోని దేవి.. తాతయ్య పేరులోని ప్రసాద్ ను తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ గా కూర్చి ఆ పేరు పెట్టారు.చెన్నైలో ఇంటర్ వరకు చదువుకున్న దేవిశ్రీ ప్రసాద్ చిన్న వయసులోనే మాండొలిన్ నేర్చుకున్నాడు. మాండొలిన్ శ్రీనివాస్ ఈ సంగీత దర్శకుడి గురువు. టీనేజ్ లోనే మ్యూజిక్ దర్శకుడిగా దేవిశ్రీకి చిన్నప్పటి నుంచే సంగీత దర్శకుణ్ణి కావాలని కోరికట. ఆరో తరగతిలో ఉండగానే, పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్లో అడిగితే, ‘మ్యూజిక్ డెరైక్టర్ని అవుతా’చెప్పాడట. ఇంట్లో కూడా అతని ఇష్టాలను గౌరవించేవాళ్లు. ఒక రోజు ఎంఎస్ రాజు దేవీశ్రీ ప్రసాద్ ఇంటికి వచ్చారట. ఆ సమయంలో దేవీశ్రీ గదిలో నుంచి సంగీత వాద్యాల శబ్దాలు విని, ఒక సందర్భానికి ట్యూన్ ఇవ్వమని అడిగారు. రెండు రోజుల్లోనే ట్యూన్ ఇచ్చి ఎంఎస్ రాజు ఫిదా అయ్యాడట. వెంటనే ‘దేవి’సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడట. అప్పుడు దేవిశ్రీ ప్లస్ 2 చదువుతున్నాడు. అలా టీనేజ్‌లో మ్యూజిక్ డైరెక్టరై రికార్డును సృష్టించాడు. మెగా ఫ్యామిలీతో మ్యూజికల్ బాండ్ డీఎస్పీ కెరీర్ ను గమనిస్తే మెగా కాంపౌండ్ తో అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ - ఇలా ఫ్యామిలీలోని అందరికీ మ్యూజికల్ హిట్స్ అందించాడు. చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, అందరివాడు, ఖైదీ150 చిత్రాలకు సంగీతం అందించిన దేవీ... పవన్ కల్యాణ్‌కు 'జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మూడు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించాడు. అలాగే అల్లు అర్జున్ ఆర్య, ఆర్య-2, బన్ని, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, రామ్ చరణ్ ‘ఎవడు’, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’చిత్రాలను స్వరకల్పన చేసి విజయంలో పాలుపంచుకున్నాడు. ఒక మెగా హీరోలకే కాదు.. టాలీవుడ్ టాప్ హీరోలందరితో పనిచేశాడు దేవిశ్రీ. అక్కినేని నాగార్జున ‘మన్మథుడు, మాస్' ఢమరుకం, కింగ్ , భాయ్ చిత్రాలకు, మహేశ్‌బాబు ‘వన్-నేనొక్కడి,శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు మీకెవ్వరు సినిమాలతో పాటు, ప్రభాస్ వర్షం,పౌర్ణమి, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి, జూనియర్ ఎన్టీఆర్ "నా అల్లుడు, రాఖీ, అదుర్స్, ఊసరవెల్లి, జనతా గ్యారేజ్మూవీస్కు కూడా దేవిశ్రీ పసందైన బాణీలు అందించాడు. రెండు దశాబ్దాలుగా సంగీత ప్రియులకు అలరిస్తున్న దేవీ.. మున్ముందు కూడా తనదైన బాణీలలో ప్రేక్షలకు వీనులవిందు అందించాలని ఆశిస్తూ.. ‘సాక్షి’తరపున దేవీశ్రీ ప్రసాద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. -
శర్వానంద్ చిత్రానికి దేవీశ్రీ సంగీతం
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండనున్నాయని, కిశోర్ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. -
థియేటర్స్‌లోనే మాస్ మహరాజా ‘’ఖిలాడి‘’
క్రాక్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్ , పెన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా .. యాక్షన్ కింగ్ అర్జుతో పాటు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు .షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28 న విడుదల కు సిద్దం చేశారు .ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ' ఖిలాడి ' సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుందనే న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తుండగా , ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పష్టతనిచ్చారు . రవితేజ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తమని , ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆస్వాదించేలా రూపొందిస్తున్నామని నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించారు . ఇటలీలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని పేర్కొన్నారు . కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు . కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి , డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు . (చదవండి:టైసన్, అది నువ్వేనా? షాక్‌లో ఫ్యాన్స్!) -
ఆకట్టుకుంటున్న ‘రౌడి బాయ్స్’ మోషన్ పోస్టర్
హుషారు దర్శకుడు హర్ష కొనుగంటి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ మూవీతో ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆశిష్‌కు జోడిగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశ్లో ఉన్న ఈ మూవీ మెషన్ పోస్టర్‌ను తాజా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, మేడికల్ కాలేజీ విద్యార్థుల మధ్య సాగే కథే ఈ రౌడీ బాయ్స్. ‘మా బాయ్స్తోటి ఎంట్రీ ఇస్తే అల్లకల్లోలం.. జర ముట్టుకుంటే అంటుకుంటాం అగ్గిపుల్లలం..’ అంటూ సాగే పాటతో విడుదలైన ఈ మోషన్ పోస్టర్ యువతను వీపరితంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా జూన్ 25న ఈ మూవీ విడుదల కానుంది. -
సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడొద్దు
‘‘ఒకే ఆల్బమ్‌లో ఒకదానికొకటి భిన్నంగా అనిపించే పాటలు ఉండటం అరుదు. దేవిశ్రీ ప్రసాద్ తన ఆల్బమ్‌లోని పాటలన్నీ డిఫరెంట్ వేరియేషన్స్‌తో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ‘రంగ్ దే’ ఆల్బమ్ అలాంటిదే’’ అని పాటల రచయిత శ్రీమణి అన్నారు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలు రాసిన శ్రీమణి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘100% లవ్’ సినిమాతో దేవిశ్రీతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఏప్రిల్‌తో మా ప్రయాణానికి పదేళ్లు పూర్తవుతాయి. ‘తొలిప్రేమ’ చిత్రం నుంచే వెంకీ అట్లూరితో కలిసి పనిచేస్తున్నాను. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్‌కే మేం లిరిక్స్ రాస్తుంటాం. ఒక్కోసారి కాన్సెప్ట్‌కు తగ్గ లిరిక్స్ రాసుకొని, ఆ తర్వాత ట్యూన్స్ కట్టడం జరుగుతుంది. ప్రతి పాటనూ ఓ ఛాలెంజ్‌గానే తీసుకుంటాను. నేను రాసే పాటని మొదట నా భార్యకు లేదంటే నా ఫ్రెండ్ మురళికి, రైటర్ తోట శ్రీనివాస్‌కు వినిపిస్తుంటాను. ఫిలాసఫికల్ సాంగ్స్‌ని మాత్రం సీతారామశాస్త్రిగారికి వినిపించి, సలహాలు తీసుకుంటుంటాను. ‘జులాయి’ నుంచే సితార ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలకు పాటలు రాస్తున్నాను. సినిమా విడుదలకు ముందే పాటలు హిట్టయితే, సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడకూడదు. లవ్ స్టోరీకి పాటలు పాపులర్ అయితే కమర్షియల్‌గా అది సినిమాకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
జల జల జల జలపాతం నువ్వు.. లిరికల్ సాంగ్
జల జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చెర చెర నువు అల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను హే... మన జంటవైపు జాబిలమ్మ తొంగి చూసెనే హే... ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే ‘‘జల జల‘‘ సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుందీ లోపలా ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఎలాగ బైటపడుతోంది ఈవేళా నడి ఎడారి లాంటి ప్రాణం తడి మేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్నూ తెంచలేదు లోకం ‘‘జల జల‘‘ ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజూ ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్లు ఎలాగ దీన్ని గుండెల్లో దా^è డం ఎప్పుడూ లేనిదీ ఏకాంతం ఏక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం ‘‘చలి చలి‘‘ చిత్రం : ఉప్పెన రచన : శ్రీమణి గానం : జస్ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషల్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ -
‘ఉప్పెన’ మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల మందుకు రానుంది. రాక్‌స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా, తాజాగా నాలుగో పాటను రిలీజ్ అయింది. జల జల జలపాతం అంటూ సాగే పాటను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించగా జస్ప్రీత్ జస్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’, ‘రంగులద్దుకున్న’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానే ఆకట్టుకుంది. | -
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ విషెస్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ న్యూ ఇయర్ సందర్భంగా మ్యూజికల్ న్యూఇయర్ శుభాకాంక్షలతో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన వాయిద్యం సితార్ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ సితార్ ప్లేయర్ కిషోర్‌ను పరిచయం చేశారు. అప్ కమింగ్ మూవీ రంగ్‌దే లోని సాంగ్‌ను కిషోర్ ప్లే చేసిన వీడియోను షేర్ చేస్తూ అభిమానులకు మ్యూజికల్ విషెస్ అందించారు. అందమైన సంగీత నూతన సంవత్సరంలో అద్భుతమైన ఆశలు, పప్రేమతో రంగులమయం కావాలంటూ ఆకాంక్షించారు. అలాగే ఈ సాంగ్‌ను రేపు(జనవరి 1, శుక్రవారం) విడుదల చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న రంగ్‌దే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ మ్యాజికల్ మెలోడీ సాంగ్‌ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. A small MUSICAL VIDEO for all of you.. To Step into a BEAUTIFUL MUSICAL NEW YEAR filled with AMAZING HOPE🙏🏻.. LOVE❤️& COLOURS..🌈#RangDe#RangDeRecordingSession#HappyNewYear2021 https://t.co/sBBEtdjEFs — DEVI SRI PRASAD (@ThisIsDSP) December 31, 2020 -
భాష లేని ఊసులాట!
‘‘ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసులాట సాగుతున్నది.. అందుకే ఈ మౌనమే ఓ భాష అయినది.. కోరుకోని కోరికేదో తీరుతున్నది...’’ అంటూ ప్రేయసికి తన ప్రేమను తెలియజేస్తున్నారు నితిన్. ఈ ప్రేమ పాట ‘రంగ్ దే’ చిత్రం కోసమే. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘ఏమిటో ఇది వివరించలేనిది..’ అంటూ సాగే ఈ చిత్రంలోని తొలి పాట వీడియోను విడుదల చేశారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్ కపిలన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. ‘‘ఈ రొమాంటిక్ మెలోడీని వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు వెంకీ అట్లూరి. ఈ నెల చివరి వారం నుంచి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. దుబాయ్‌లో పాటల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ.ప్రసాద్, కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్). -
ఏమిటో ఇది వివరించలేనిది.. మాయ చేసిన దేవిశ్రీ
యంగ్ హీరో నితిన్, ‘మహానటి’ కిర్తి సురేష్ జంటగానటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ వెడ్డింగ్ సందర్భంగా ‘రంగ్ దే` నుంచి విడుదల చేసిన చిన్న వీడియోకి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా తొలి పాటను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. `ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసూలాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష ఐనది’ అంటూ సాగే ఈ మెలోడీ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. హరిప్రియ, కపిల్ కపిలన్ ఆలపించారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చాలా నెమ్మదిగా సాగే ఈ మెలోడీ సాంగ్‌ని వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు కలిగించేలా చిత్రీకరించనట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో డీఎస్పీ నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. (చదండి : ఫ్రెండ్స్‌తో స్టెప్పులేసిన స్టార్ హీరో కూతురు) -
‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రాక్‌స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, తాజాగా మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్‌బాబు విడుదల చేశాడు. ‘ఉప్పెన సినిమా నుంచి అందమైన మెలోడి ‘రంగులద్దుకున్న’ను విడుదల చేస్తున్నాను. నా ఫేవరేట్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కి, సుకుమార్ గారికి, వెండితెరకు పరిచయమవుతోన్న పంజా వైష్ణవ్ తేజ్‌కి, కృతి శెట్టికి, బుచ్చిబాబు సానాకు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. ఇక పాట విషయానికొస్తే.. ఇదొక మెలోడీ సాంగ్. ‘రంగులద్దుకున్నా తెల్లరంగులవుదాం. పూలు కప్పుకున్నా కొమ్మలల్లె ఉందాం..’ అంటూ ప్రకృతి అందాల మధ్య సాగుతున్న ఈ పాట సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందిచగా,యాజిన్ నిజర్, హరిప్రియ ఆలపించారు. ఈ పాటను దివంగత గానగంధర్వుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితమిచ్చారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఈ పాట ఏకంగా140 మిలియన్ వ్యూస్ దాటింది. ఇప్పుడు ఈ మూడో పాట ఎన్ని వ్యూస్ తెచ్చిపెడుతుందో చూడాలి. -
అందుకే దేవిశ్రీని రాక్‌స్టార్ అనేది!
హైదరాబాద్: అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా సంగీత అభిమానులకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి సత్యమూర్తికి, సంగీత పాఠాలు నేర్పిన తన గురువుకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సంగీత ప్రియుల్ని, ముఖ్యంగా మాస్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్‌ను అభిమానించే వారికి బాగా నచ్చుతోంది. (‘హేయ్..సత్తి నా పాట విన్నావా?') ఎలాంటి సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించకుండా తన బృందంతో కలసి ప్లాస్టిక్ కుర్చీలు, ట్రంకు పెట్టెలనే డ్రమ్స్‌గా ఉపయోగించుకొని అందరినీ ఉర్రూతలూగించే సూపర్బ్ ప్రదర్శన చేశారు. అయితే ఈ ప్రదర్శన తాజాగా చేసింది కాదు. గతంలో యూఎస్ఏలో జరిగిన ఓ మ్యూజికల్ షోలో చేసిన పర్ఫార్మెన్స్కు సంబంధించిన వీడియోను తాజాగా తన ట్విటర్లో షేర్ చేశారు. ఇక ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభకు, క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (‘మా నాన్న నవ్వు.. మా బిడ్డ చిరునవ్వు’) రాళ్లు రప్పలతో కూడా సంగీతాన్ని అందించొచ్చని దేవిశ్రీ మరోసారి నిరూపించాడని అందుకే అతడిని రాక్‌స్టార్ అంటారని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇక లాక్డౌన్ సమయంలో తన పాత షోలకు సంబంధించిన వీడియోలను ఒక్కొక్కటి విడుదల చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు దేవిశ్రీ. గతంలో తన తండ్రి సత్యమూర్తి జయంతి సందర్బంగా మ్యూజికల్ విషెస్ తెలుపుతూ విడుదల చేసిన వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. (సీతు పాప సింపుల్ యోగాసనాలు) On #WorldMusicDay2020 tomorrow, Since MUSIC HAS NO LANGUAGE, Hope U all wud like 2 watch this FULL PERFORMANCE, When I, along wit my RHYTHM PLAYERS, turned these LIFELESS OBJECTS into DRUMS filled wit LIFE 💟🥁🎶 FULL VIDEO-9AM..21ST JUNE Subscribe to https://t.co/zuPJJrmU6I pic.twitter.com/D855136wpU — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2020 -
పవన్ కల్యాణ్.. ‘ఇప్పుడే మొదలైంది’?
రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్. ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ డైరెక్షన్లో ‘విరూపాక్ష’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తున్నారు.పీరియాడిక జానర్లో తెరకెక్కుత్ను ఈ చ్రితంలో పవన్ క్యారక్టరైజేషన్ రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. క్రిష్ చిత్రం తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ నటించనున్నారు. గబ్బర్‌సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. పవన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను డైరెక్టర్ సిద్దం చేసి పెట్టుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మలయాళ నటి మానసా రాధాకృష్ణన్ హీరోయిన్గా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్-హరీష్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రానికి ‘ఇప్పుడే.. మొదలైంది’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు లీకువీరులు పేర్కొంటున్నారు. గబ్బర్ సింగ్ విడుదలై 8 ఏళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్ చేసిన ట్వీట్‌తో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఈ ట్వీట్లో ‘ఇప్పుడే మొదలైంది.. మేము మళ్లీ వస్తున్నాం' అని పేర్కొన్నారు. అలాగే, ఆ తర్వాత చేసిన ట్వీట్లలో కూడా ఆ టైటిల్‌ను హైలైట్ చేయడంతో సినిమా పేరు అదే అని అందరూ ఫిక్సయ్యారు. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: ‘జాన్వీ కపూర్’ వెనక ఇంత కథ ఉందా? శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్ Thanks again for the overwhelming appreciations and celebrations.... 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg — Harish Shankar .S (@harish2you) May 11, 2020 -
15 ఏళ్లు : జనాల గుండెల్లో ‘భద్ర’
కొన్ని సినిమాలు టీవీల్లో ఎన్ని సార్లు వచ్చినా చూస్తాం.. ఎన్నేళ్లయినా చూస్తాం. అలాంటి సినిమాల జాబితాలోకి చేరే చిత్రం ‘భద్ర’. రవితేజ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ తొలి చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బోయపాటి రూపంలో టాలీవుడ్‌కు మరో మాస్ డైరెక్టర్ దొరికాడని అందరూ భావించిన ఈ చిత్రం విడుదలై నేటికి పదిహేనేళ్లవుతోంది. మాస్ మహారాజ్ రవితేజలోని ఓ విభిన్న ప్రేమికుడిని బోయపాటి తనదైన స్టైల్లో వైవిధ్యంగా చూపించాడు. ప్రేమ, త్యాగం, యాక్షన్, ఎమోషన్ ఇలా డిఫరెంట్ యాంగిల్స్‌లో కనిపించిన రవితేజ తన నటనతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ఇక పాటలకు మరో ప్రధాన బలం సంగీతం. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ప్రతీ పాట ఓ ఆణిముత్యమే. ‘తిరుమల వాసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గొనవయ్యా’, ‘ఏమైంది సారు ఏంటా హుషారు’, ‘ఓ మనసా’ ఇలా ఈ చిత్రంలోని అన్ని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మీరాజాస్మిన్ మన పక్కింటి అమ్మాయిగా కనిపించి తన నటనతో యువత డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. ఇక రవితేజ, అర్జున్ బజ్వాల మధ్య సీన్స్ స్నేహితులను కట్టిపడేసేలా ఉంటాయి. ఇక ప్రకాష్ రాజ్, మురళీమోషన్, ఈశ్వరీ రావు తదితరులు తమ నటనతో సినిమాకు మరింత జీవం పోశారు. దిల్ రాజ్ నిర్మాత వ్యహరించిన ఈ చిత్రాన్ని తొలుత అల్లు అర్జున్‌తో తీయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే కథ నచ్చినా కొత్త దర్శకుడు అనే కారణంతో బన్ని వెనకడుగు వేశాడు. దిల్ రాజ్ సూచనతో రవితేజను హీరో ఈ సినిమా పట్టాలెక్కించి ఘన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. చదవండి: దేవిశ్రీ ఫిక్స్.. ప్రకటించిన క్రేజీ డైరెక్టర్ శుభశ్రీ జీ.. మీరు ఎంతో మందికి స్పూర్తి: చిరు -
‘నీ కన్ను నీలి సముద్రం’.. మరో రికార్డు
సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. కాగా ఈ చిత్రంలోని తొలి ప్రేమ పాట ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’ సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రతీ ఒక్క ప్రేమజంటను మైమపరిపిస్తున్న ఈ సాంగ్ మరో రికార్డును అందుకుంది. తాజాగా ఈ వీడియో యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అతితక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా ‘నీ కన్ను నీలి సముద్రం’ రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం ఈ పాటకు ఉన్న క్రేజ్ బట్టి మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం ఆకట్టుకోగా.. రక్వీబ్ ఆలమ్ హిందీ లిరిక్స్ మైమరిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. చదవండి: శుభశ్రీ జీ.. మీరు ఎంతో మందికి స్పూర్తి: చిరు చైతూతో కలిసి సాహసయాత్రకు సమంత!