అమ్మడు..కాపీ కొట్టుడు! | Housefull 4 Movie Back Round Score Resembles khaidi no150 | Sakshi
Sakshi News home page

అమ్మడు..కాపీ కొట్టుడు!

Published Sat, Sep 28 2019 5:06 AM | Last Updated on Sat, Sep 28 2019 12:55 PM

Housefull 4 Movie Back Round Score Resembles khaidi no150 - Sakshi

‘చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది..’అని ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రం ట్రైలర్‌ మొదలవుతుంది. అక్షయ్‌ కుమార్, పూజా హెగ్డే, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 4’.  పునర్జన్మల ఆధారంగా ఈ చిత్రకథ నడుస్తుంది. ట్రైలర్‌లో పునర్జన్మలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి లీడ్‌ క్యారెక్టర్స్‌. కానీ ఈ ట్రైలర్‌ చూసే సమయంలో తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మాత్రం దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు..’ ట్యూన్‌. ‘హౌస్‌ఫుల్‌ 4’ ట్రైలర్‌లో వాడిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ‘ఖైదీ నంబర్‌ 150’లో పాపులర్‌ అయిన మాస్‌ సాంగ్‌ ‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు..’కు దగ్గర పోలిక ఉందని విన్నవారు అంటున్నారు. మరి పర్మిషన్‌ లేకుండా ట్యూన్‌ని పునరావృతం చేయడం ఏంటి? ‘అమ్మడు.. కాపీ కొట్టుడు’ అంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement