ritesh deshmukh
-
బిగ్‌బాస్ విన్నర్‌గా కంటెంట్ క్రియేటర్.. ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలంటే?
ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ షో సినీ ప్రియులను అలరిస్తోంది. ఇప్పటికే బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షో తాజాగా తమిళంలో సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. తాజాగా బిగ్‌బాస్ మరాఠీ సీజన్-5 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. ఈ రియాలిటీ షో విజేతగా కంటెంట్ క్రియేటర్ సూరజ్ చవాన్ నిలిచారు. బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు రూ.14.6 లక్షలు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. ఈ సీజన్లో రన్నరప్ అభిజీత్ సావంత్ నిలిచాడు. మూడో స్థానంలో నటి నిక్కీ తంబోలి నిలిచింది.ఈ గ్రాండ్ ఫీనాలేలో జిగ్రా మువీ టీమ్ సందడి చేసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ఆలియా భట్, వేదాంగ్ రైనా, దర్శకుడు వాసన్ బాలా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ మరాఠీ సీజన్- 5 విజేత సూరజ్ చవాన్‌కు ట్రోఫీని అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. మరాఠీ సీజన్-5కు జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ హోస్ట్‌గా వ్యవహరించారు. విన్నర్‌తో దిగిన ఫోటోలను రితేశ్ దేశ్‌ముఖ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Riteish Deshmukh (@riteishd) -
అర్ధరాత్రి బ్రేకప్ అంటూ మెసేజ్.. పిచ్చిదాన్నయ్యా: జెనీలియా
జెనీలియా.. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ కనిపించే ఈ బ్యూటీ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. నటుడు రితేశ్ దేశ్ముఖ్తో లవ్‌లో ఉన్నప్పుడు ఓసారి తను అనుభవించిన బాధను పంచుకుంది. ఇంతకీ ఏమైందో జెనీలియా మాటల్లోనే విందాం.. రితేశ్, నేను ప్రేమించుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇది. తను చాలా లేట్‌గా నిద్రపోతాడు, నేనేమో ముందుగానే పడుకునేదాన్ని. ఒంటిగంటకు ఆ మెసేజ్ఓ రోజు అతడు ఇంతటితో ఆపేద్దాం అంటూ బ్రేకప్ మెసేజ్ పెట్టాడు. రాత్రి ఒంటిగంటకు ఆ మెసేజ్ పెట్టి పడుకున్నాడు. నేను అది తెల్లవారుజామున రెండున్నరకు చూశాను. నాకేం అర్థం కాలేదు. అసలెందుకిలా మెసేజ్ చేశాడని చాలా ఒత్తిడికి లోనయ్యాను. రాత్రంతా నిద్రపట్టలేదు. పొద్దున తొమ్మిదింటికి అతడు ఎప్పటిలా ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? అని చాలా సాధారణంగా మాట్లాడాడు. ఏప్రిల్ ఫూల్..అప్పటికే టెన్షన్, బాధలో ఉన్న నేను.. ఇకపై మనం మాట్లాడుకోకూడదు, నేను నీతో మాట్లాడను అని చెప్పాను. అందుకతడు ఏమీ తెలియనట్లు ఏమైంది? ఎందుకలా కోప్పడుతున్నావ్? అని అడిగాడు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావ్? రాత్రి బ్రేకప్ అని మెసేజ్ చేశావ్‌గా అని నిలదీశాను. రితేశ్ నవ్వుతూ.. ఈరోజు ఏప్రిల్ ఫూల్స్ డే. అందుకే అలా చెప్పానన్నాడు. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా? అని చాలాసేపు క్లాస్ పీకాను.నా అదృష్టంరితేశ్కు మహిళలంటే చాలా గౌరవం. నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. నేను షూటింగ్‌కు వెళ్లినప్పుడు పిల్లలను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోతాడు. మనసస్ఫూర్తిగా ఇంట్లో పనులన్నీ చేస్తాడు. ఇలా అన్నీ చూసుకునే పార్ట్నర్ దొరకడం నిజంగా నా అదృష్టం అని జెనీలియా చెప్పుకొచ్చింది.చదవండి: ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్ -
నూతన ఓటీటీ హిమాన్షు..
సాక్షి, సిటీబ్యూరో: నగర వేదికగా ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాతో పాటు హిమాన్షు గ్రూప్ ఎండీ సంజీవ్ పూరి ప్రారంభించారు. ఈ వేదికగా ప్రకటనలకు సంబంధించిన షూట్లు, భారీ–బడ్జెట్ సినిమా నిర్మాణాలు, దర్శకత్వం ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు సంస్థ కేంద్రంగా పనిచేయనుంది. భారీ సినిమాలకు, పలు వినోద కార్యక్రమాలకు వేదికైన హైదరాబాద్ కేంద్రంగా.. పరిశ్రమలో అధునాతన సౌకర్యాలతో మరిన్ని సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపకులు హిమాన్షు దేవ్కేట్ తెలిపారు. హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్, నెట్ ఫ్లిక్స్ సహా పలు వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో, స్టార్హీరోలతో నిర్మిస్తున్న తెలుగు సినిమాల్లో పని చేస్తోందని వివరించారు. -
అభిమాని కాళ్లు పట్టుకున్న స్టార్ హీరో.. ఫోటో వైరల్
సినిమా స్టార్స్‌కు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్‌తో ఒక్క ఫోటో అయినా దిగాలని చాలామంది కలలు కంటారు. అదే గనుక నిజమైతే వారి ఆనందానికి అవధులు ఉండవు. సరిగ్గా ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం వేద్. తెలుగులో మజిలీ చిత్రానికి రీమేక్ ఇది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఓ కాలేజీ క్యాంపస్‌కు వెళ్లారు చిత్ర యూనిట్. ఆ సమయంలో ఓ యువతి స్టేజ్‌పైకి వచ్చి రితేష్‌తో డ్యాన్స్ చేయాలని ఉందని చెప్పింది. అభిమాని కోరిక మేరకు వెంటనే రితేష్ ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీంతో ఆమె ఆనందం తట్టుకోలేక ఏడుస్తూ అతడి కాళ్లు పట్టుకుంది. వెంటనే రితేష్ ఆమెను పైకి లేపి ఆమె కాళ్లు తాకడంతో అతని బిహేవియర్‌కు ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం రితేష్‌ను చూస్తే అర్థమవుతుందంటూ అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
భర్త రితేష్ దర్శకత్వంలో జెనీలియా రీ ఎంట్రీ
పదేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకున్నాక ఓ మరాఠీ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారామె. ఇప్పుడు మరాఠీ సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ షురూ అయింది. మరాఠీలో జెనీలియా కథానాయికగా చేస్తున్న తొలి చిత్రం ఇది. అది కూడా ఆమె భర్త రితేష్ దర్శకత్వం వహించనున్న సినిమా కావడం విశేషం. దర్శకుడిగా రితేష్‌కి ఇది తొలి సినిమా కావడం మరో విశేషం. ‘వేద్’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఆ కొరత తీరుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు జెనీలియా. వచ్చే ఏడాది ఆగస్ట్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. -
అమితాబ్ ముందు కంటతడి పెట్టిన జెనీలియా దంపతులు
బాలీవుడ్లో అందమైన కపుల్స్‌లో రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా జంట ఒకటి. ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతున్న ఈ దంపతులు తాజాగా అమితాబ్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 13’ షోకి ప్రత్యేక అతిథులుగా వచ్చారు. అయితే తాజాగా కేబీసీ 13లో పాల్గొన్న ఈ దంపతులు కంటతడి పెట్టారు. కేబీసీ 13 కొత్త ఎపిసోడ్‌కి సంబంధించిన ఈ వీడియోని సోనీ టీవీ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో పోస్ట్ చేసింది. మామూలుగా ఈ షోలో పాల్గొన్న సెలబ్రీటీలు గెలుచుకున్న మనీని క్యాన్సర్ బారిన పడిన పిల్లల వైద్యానికి ఉపయోగిస్తారు. దాని కోసం సహాయం చేయమని కోరుతూ క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు సంబంధించిన వీడియోని రితేష్, జెనీలియా దంపతులకు చూపించారు. అది చూసిన ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నారని జెన్నీ కంటతడి పెట్టింది. అది చూసిన రితేష్ సైతం ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయమై ఇలాంటి మంచి పని కోసం కృషి చేస్తున్న అమితాబ్‌ని వారు ప్రశంసించారు. అయితే ఇంతకుముందు ఎపిసోడ్స్‌లో దీపికా పదుకొనే, ఫరా ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, జాకీ ష్రాప్, సునీల్ శెట్టి వంచి బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు పాల్గొన్నారు. షోలో వారు గెలుచుకున్న మొత్తాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల చికిత్స కోసం ఇచ్చారు. చదవండి: ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోలింగ్.. జెనీలియా ఘాటు రిప్లై View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
బీఎంసీ పీఠమే లక్ష్యం.. సినీ నటులపై దృష్టిపెట్టిన కాంగ్రెస్
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటోంది. ఈసారి బీఎంసీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా ఆధిపత్యం చలాయిస్తున్న శివసేనను ఎలాగైనా గద్దె దింపి తమ బలం పెంచుకోవాలని చూస్తోంది. దీనికోసం సినీనటుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటోంది. అవసరమైతే రితేశ్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది. ఈ మేరకు ముంబై కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బీఎంసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు కచ్చితంగా ఓట్లు పడతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఎంసీ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్‌ల మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్య పారీ్టలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, బీఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై ఈ మిత్ర పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని శివసేన అంటుంటే, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ బలపడుతుందని ముంబై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు సంకేతాలిచ్చారు. అంతేగాక, దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి వస్తారని చర్చ జరుగుతోంది. అది ఈ ఎన్నికల్లోనే జరగవచ్చని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఊహాగానాలను ఇప్పటికే సోనూ సూద్ తోసిపుచ్చారు. చదవండి : స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్: సోనూ సూద్‌కు అరుదైన గౌరవం బీఎంసీలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఉత్తర భారతీయులు, మైనారిటీ ఓట్లు ముఖ్యం కానున్నాయి. ప్రజల్లో నటీనటులపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో రితేష్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు ఖాయమని ముంబై కాంగ్రెస్ భావిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా శివసేనదే ఆధిపత్యం. దీంతో ఈసారి ఎలాగైనా శివసేన ఆధిపత్యానికి చెక్ పెట్టి, తమ పట్టు నిలుపుకోవాలని ముంబై కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు. -
నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్, హీరో రితేశ్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న "యారోంకి బారాత్" అనే చాట్ షోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషి.. తన చిన్నతనంలో జరిగిన ఆసక్తికర సంఘటనను వెల్లడించింది. తన సోదరుడు, బాలీవుడ్ నటుడు సకీబ్ సలీంకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణమని, ఓ సందర్భంలో అతనితో గొడవ పడ్డప్పుడు కోపంలో అతని ఆరాధ్య దైవమైన సచిన్ పోస్టర్లను చించేశానని పేర్కొంది. దీనికి బదులుగా అతను తన ఫేవరెట్ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిది ఫోటోలను చించేశాడని వివరించింది. అయితే షో హోస్ట్‌లు.. నువ్వు సచిన్ పోస్టర్లను చించావా అని ప్రశ్నించడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. తను కూడా సచిన్ వీరాభిమానినేనని.. చిన్నతనంలో అన్న చెల్లెల్ల మధ్య ఇటువంటి సంఘటనలు తరుచూ జరుగుతుంటాయని కవర్ చేసుకుంది. తను క్రికెట్‌ను ఫాలో అవుతున్న రోజుల్లో పాక్ ఆటగాడు అఫ్రిది అరంగేట్రం చేశాడని, అతని దూకుడైన ఆటతీరు, అతని హెయిర్ స్టైల్ తనను బాగా ఇంప్రెస్ చేశాయని చెప్పుకొచ్చింది. 90వ దశకంలో ఆఖర్లో అఫ్రిదికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదని, కాబట్టి తాను కూడా అతనికి అకర్షితురాలినయ్యానని తెలిపింది. కాగా, హ్యూమా ఖురేషి 2012లో విడుదలైన "గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్" సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చదవండి: ఆర్సీబీ అభిమానినే కానీ, కోహ్లి నా ఫేవరెట్ క్రికెటర్ కాదు: రష్మిక -
ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్
ముంబై : ఓ అవార్డు ఫంక్షన్లో నటి ప్రీతి జింటాను హీరో రితేష్ దేశ్‌ముఖ్ ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన భర్త రితేష్..తన కళ్ల ముందే నటి ప్రీతి జింటా చేతులకు ముద్దు పెట్టుకోవడంతో తెగ ఫీల్ అవుతుంటుంది. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై జెనీలియా ఇటీవలె మరో వీడియోను రిలీజ్ చేసింది. ఆ ఫంక్షన్ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ రితేష్‌ను చితకబాదుతూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించింది. దీనిపై నటి ప్రీతి జింటా స్పందించారు. 'చాలా ఫన్నీగా ఉంది..రితేష్- జెనీలియా మీరు ఇలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు తీయండి. లవ్ యూ బోత్' అంటూ కామెంట్ చేసింది. ఇక జెనీలియా- రితేష్‌ల వీడియోపై నటులు టైగర్ ష్రాఫ్, మాధురి దీక్షిత్, సంజయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) సామాన్యులకూనా, సెలబ్రిటీలకైనా తన ముందే భర్త మరో మహిళతో క్లోజ్‌గా ఉంటే తట్టుకోలేరు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్లోనే ఎలాంటి కంట్రవర్సీలు లేకుండా హ్యాపీగా సాగిపోతున్న జంటల్లో రితేష్- జెనీలియా ముందు వరుసలో ఉంటారు. ఓ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరు 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటికప్పుడు క్రేజీ వీడియోలతో ఆకట్టుకునే ఈ జంటకు బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా పేరుంది. చదవండి : వైరల్ : నటిని ముద్దుపెట్టుకున్న బాలీవుడ్ హీరో హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ -
నటిని ముద్దుపెట్టుకున్నహీరో ...జెనీలియా ఎక్స్ప్రెషన్స్
-
నటి ప్రీతికి హీరో ముద్దులు..చిర్రెత్తిన భార్య ఏం చేసిందంటే..
ముంబై : భర్త తన ముందే వేరే మహిళతో క్లోజ్‌గా ఉంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. దీనికి సినిమా స్టార్స్ కూడా అతీతం కాదు. ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నా, భర్త తన కళ్లముందే మరో నటితో సన్నిహితంగా ఉంటే ఈర్వ్స, చిరాకు, కోపం..ఇలా అన్నీ వస్తాయి. హీరోయిన్ జెనీలియాకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ అవార్డు ఫంక్షన్లో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్..నటి ప్రీతి జింటాను కలిశారు. ఈ సందర్భంగా రితేష్..ప్రీతి చేతులకు ఫ్రెండ్లీగా ముద్దు పెట్టాడు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా చాలా అసౌకర్యానికి ఫీల్ అవుతుంటుంది. మీ సంభాషణ ఎప్పుడు ముగిస్తారురా బాబు..అన్నట్లు ఇద్దరినీ చాలా జలస్‌గా చూస్తుంటుంది. నిజానికి ఇది 2019లో ఐఫా అవార్డుల సందర్భంగా జరిగిన సన్నివేశం. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో బయటికొచ్చొంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనిపై పలు స్పూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన జెనీలియా..ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటికి రాగానే జెనీలియా..భర్త రితీష్‌ను కొడుతున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీన్ని రితేష్- ప్రీతి జింటాలకు సైతం ట్యాగ్ చేసింది. ఈ ఫన్నీ వీడియోపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందిచారు. కాగా జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా..సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ వీడియాలు చేస్తూ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. చదవండి :జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటుడు, పిక్స్ వైరల్ -
జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు
ఇటీవల హీరోయిన్ జెనీలియా చేతికి స్వల్ప గాయమైన విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజులుగా ఆమె చేతికి బ్యాండ్‌తోనే కనిపిస్తున్నారు. గాయంతో చేయి పైకి లేపడానికి కూడా కష్టంగా ఉన్న భార్యకు సపర్యలు చేస్తున్నాడు బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్. ఆమె తనంతట తాను జుట్టు వేసుకోవడం కష్టమని అనుకున్నాడో ఏమో కానీ జెనీలియాకు దగ్గరుండి మరీ జుట్టు వేశాడు. శ్రీవారి సేవలకు మురిసిపోయిన ఈ భామ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు సో స్వీట్, బెస్ట్ కపుల్స్ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. ఇక ఎప్పుడూ క్రేజీ పనులు చేసే జెనీలియా హీరో రామ్‌తో ఇన్‌స్టా రీల్స్ చేయించేందుకు ట్రై చేసింది. అయ్యో అయ్యో అయ్యో దానయ్య అంటూ రామ్‌తో స్టెప్పులు వేయించాలని చూసింది. కానీ రామ్ మాత్రం నో అన్నట్లుగా కదలకుండా ఉండిపోవడంతో ఈ రీల్ వీడియో ఫన్నీగా మారిపోయింది. దీంతో 'బాబు గారు ఫస్ట్ టైమ్ రీల్ చేస్తున్నారు కదా, సిగ్గు పడుతున్నారు' అంటూ ఈ వీడియోను సైతం అభిమానులతో పంచుకుంది. చదవండి: హాలీవుడ్‌కి తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ -
ఆ మాటలకు నా ఇగో హర్ట్ అయ్యింది: జెనీలియా భర్త
పాపులర్ టీవీ ప్రోగ్రాం ‘ది కపిల్ శర్మ కామెడీ షో’కు ఈ వారం జెనీలియా డిసుజా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ అతిధులుగా రాబోతున్నారు. అయితే ఈ షోలో రితేష్ దేశ్‌ముఖ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. బెంగుళూరులో ఒకసారి క్రికెట్ లీగ్ చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ ఇద్దరు క్రికెటర్లు గుసగుసలాడుకొని ‘మీరు జెనీలియా భర్త కదా’ అని అడిగారని తెలిపారు. ఆ మాటకు తన ఇగో కొంచెం హర్ట్ అయ్యిందని రితేష్ తెలిపారు. ఇక అప్పుడు తను వారితో ‘చూడండి ఇక్కడ నేను జెనీలియా భర్తను అయితే మహారాష్ట్రలో ఆమె రితేష్ భార్య’ అని తెలిపాను. అప్పుడు వారు చూడండి ఒక్క రాష్ట్రం, మహారాష్ట్రలోనే ఆమెను రితేష్ భార్య అంటారు, కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని జెనీలియా భర్త అనే అంటారు అని సమాధానం ఇచ్చారు అని రితేష్ చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ గట్టిగా నవ్వారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను సోని ఛానల్ వారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. View this post on Instagram Bollywood ke cute aur talented couple Riteish-Genelia ke saath hogi dher saari romanchak baatein jab aayenge woh Kapil ke ghar. Dekhiye #TheKapilSharmaShow iss Sat-Sun raat 9:30 baje. @kapilsharma @kikusharda @krushna30 @bharti.laughterqueen @sumonachakravarti @banijayasia @archanapuransingh @chandanprabhakar @riteishd @geneliad A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on Oct 20, 2020 at 12:30am PDT చదవండి: సుశాంత్ కేసు: రూ. 10 లక్షలు ఇప్పించండి! -
కోవిడ్ పర్సనాలిటీ.. మీరు ఏ టైప్?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ తప్పనిసరి. అయితే మనలో చాలా మంది మాస్క్‌ను సరిగా ధరించరు. కొందరు చెవులకు తగిలించుకుంటే.. మరి కొందరు ముక్కును కవర్ చేయరు. కొందరు మహానుభావులు అసలు మాస్కే ధరించరు. ఈ క్రమంలో నటుడు రితేష్ దేశ్‌ముఖ్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాకుండా, పడి పడి నవ్వేలా చేస్తుంది. ఈ ట్వీట్లో రితేష్ దేశ్‌ముఖ్ ఓ ఫోటోని షేర్ చేశారు. ‘కోవిడ్ పర్సనాలిటీ రకాలు’ పేరుతో షేర్ చేసిన ఈ ఫోటోలో నాలుగు రకాల వ్యక్తులు ఉన్నారు. మాస్క్ సరిగ్గా ధరించిన వ్యక్తిని విజ్ఞాన శాస్త్రవేత్తగా పేర్కొనగా.. మాస్క్ ధరించని వ్యక్తిని శాస్త్రాన్ని తిరస్కరించేవాడిగా పేర్కన్నారు. (చదవండి: మాస్క్ ఎలా పెట్టుకోవాలో నేర్పించింది) Covid Personality Types pic.twitter.com/XB2PtDGhfs — Riteish Deshmukh (@Riteishd) September 18, 2020 ఇక మూడవ వ్యక్తి ముక్కును కవర్ చేసేలా మాస్క్ ధరించలేదు. అతడిని సైన్స్ అర్థం కాని వ్యక్తిగా.. గడ్డం మీదుగా మాస్క్ ధరించేవారిని మ్యాజిక్‌ని నమ్మే వ్యక్తిగా పేర్కొన్నారు. మీరు ఏ కోవకు చెందుతారో చూడండి. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవ్వడమే కాక మరింత ఫన్ని కామెంట్లు చేస్తున్నారు నెటిజనులు. -
‘సంజయ్ జీవితమంతా పోరాడుతూనే ఉన్నారు’
ముంబై: సంజయ్‌దత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఆయనతో పాటు నటించిన ఊర్మిళ, రితేష్‌దేశ్ ముఖ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మంగళవారం ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి కారణంగా సంజయ్ దత్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఊపిరితిత్తుల కాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. హీరోయిన్ ఊర్మిళ.. సంజూ భాయ్‌తో 1997లో కలిసి నటించిన దౌడ్ చిత్రంలోని ఒక ఫోటోను షేర్ చేస్తూ... ‘సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చేరారనే భయంకరమైన, బాధాకరమైన వార్తను విన్నాను. ఆయన తన జీవితమంతా పోరాడుతూనే ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. అదే విధంగా రితేష్ దేశ్‌ముఖ్ కూడా సంజయ్‌దత్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంజయ్‌దత్ అలియా భట్ నటిస్తున్న సడక్ 2లో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. View this post on Instagram Such an upsetting n horrible news that @duttsanjay has been diagnosed of cancer..but then again he has been such a fighter all his life..here is wishing him a speedy recovery 👍🏻 #prayersforspeedyrecovery #getwellsoon 🤗❤️ A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) on Aug 11, 2020 at 7:30pm PDT చదవండి: 'సంజయ్.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు' -
కూటి కోసం
-
చికెన్ వితౌట్ చికెన్: ఊరిస్తున్న బాలీవుడ్ జంట
సాక్షి, ముంబై : బాలీవుడ్ జంట రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. మొక్కల ఆధారిత మాంసాహార సంస్థను ప్రారంభించనున్నారు. ‘ఇమేజిన్ మీట్స్’ పేరుతో ఈ వెంచర్‌ను త్వరలో ప్రారంభించనున్నామని అధికారింగా ఈ జంట ప్రకటించింది. ఇందుకు అమెరికాకు చెందిన గ్లోబల్ సంస్థ ఆర్చర్ డేనియల్స్ మిడ్‌ల్యాండ్ (ఎడిఎమ్) గుడ్ ఫుడ్స్ ఇనిస్టిట్యూట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు వివరాలను రితీష్, జెనీలియా ట్విటర్లో షేర్ చేశారు. ‘ఇమేజిన్ మీట్స్’ బ్రాండ్ కింద మొక్కల ఆధారంగా రూపొందించే మాంసాహార ఉత్పత్తులను అందించనుంది. ఈ ఉత్పత్తుల వాసన, రుచి నిజమైన మాంసాహారాన్ని పోలి ఉంటాయట. ఈ మొక్కల ఆధారిత ఆహారాలు బఠానీ ప్రోటీన్, కొబ్బరి నూనె వంటి మొక్కల పదార్ధాల నుండి తయారు చేస్తారట. ముఖ్యంగా బిర్యానీ, కబాబ్, కూరలు ఇతర ఉత్పత్తులను రాబోయే నెలల్లో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా దాదాపు మూడేళ్ల క్రితం ఈ జంట పూర్తి శాకాహారిగా మారిన సంగతి తెలిసిందే. And our journey begins @ImagineMeats @geneliad pic.twitter.com/4nE IEIJy2G — Riteish Deshmukh (@Riteishd) July 21, 2020 Nice to MEAT you .. @ImagineMeats pic.twitter.com/uq8hVI8KoX — Genelia Deshmukh (@geneliad) July 20, 2020 -
మిసెస్ శివాజీ
కెరీర్లో మంచి సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమించి పెళ్లాడారామె. వివాహం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ రితేష్ దేశ్‌ముఖ్ నటించి, నిర్మించే సినిమాల్లో సరదాగా అతిథి పాత్రల్లో మెరుస్తుంటారు. రితేష్ నటించిన ‘లాయి బహారీ, మౌళి’ సినిమాల్లో తళుక్కున మెరిశారు జెనీలియా. ప్రస్తుతం ఓ పూర్తి స్థాయి పాత్రతో తన కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రితేష్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాలో శివాజీ భార్య పాత్రలో కనిపించనున్నారట జెనీలియా. నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది. -
ఛత్రపతి శివాజీగా రితేష్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి బుధవారం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శివాజీ జీవితం ఆధారంగా మూడు భాగాల సినిమాను ప్రకటించారు బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్. మరాఠీ చిత్రం ‘సైరాట్’ ఫేమ్ నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అజయ్–అతుల్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. మొదటి భాగానికి ‘శివాజీ’, రెండో భాగానికి ‘రాజా శివాజీ’, మూడో భాగానికి ‘ఛత్రపతి శివాజీ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. మొదటి భాగం 2021లో విడుదల కానుంది. ‘‘శివాజీ జయంతికి ఈ సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు చిత్రబృందం. సుమారు నాలుగైదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
గుమ్మడికాయ కొట్టారు
‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో సినిమా ‘భాగీ3’. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. హీరోయిన్గా శ్రద్ధాకపూర్ కనిపిస్తారు. అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇందులో రితేష్, టైగర్ ష్రాఫ్ బ్రదర్స్‌లా నటించారు. ‘భాగీ’ తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా ‘భాగీ 3’ కోసం తిరిగి కలిశారు. అలాగే ‘భాగీ 2’లో హీరోయిన్గా నటించిన దిశా పటానీ ‘భాగీ 3’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది. -
అమ్మడు..కాపీ కొట్టుడు!
‘చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది..’అని ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రం ట్రైలర్ మొదలవుతుంది. అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, రితేశ్ దేశ్‌ముఖ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. పునర్జన్మల ఆధారంగా ఈ చిత్రకథ నడుస్తుంది. ట్రైలర్లో పునర్జన్మలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి లీడ్ క్యారెక్టర్స్. కానీ ఈ ట్రైలర్ చూసే సమయంలో తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు..’ ట్యూన్. ‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్లో వాడిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ‘ఖైదీ నంబర్ 150’లో పాపులర్ అయిన మాస్ సాంగ్ ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు..’కు దగ్గర పోలిక ఉందని విన్నవారు అంటున్నారు. మరి పర్మిషన్ లేకుండా ట్యూన్‌ని పునరావృతం చేయడం ఏంటి? ‘అమ్మడు.. కాపీ కొట్టుడు’ అంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. -
తిరిగొచ్చి తిప్పలు పెడతారు
1419వ సంవత్సరంలో క్రూరమైన ఆలోచనలున్న రాజకుమారుడు బాలా. అదే రూపంతో 2019లో అమాయకపు హ్యారీగా పుడతాడు. ఆరొందల ఏళ్ల బాలా ఆత్మ హ్యారీను ఎలాంటి ఇబ్బందుల్లో పడేసిందో తెలియాలంటే ఆ క్రేజీ హౌస్‌లోకి ఎంటర్ కావాల్సిందే. అక్షయ్‌కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా, పూజా హెగ్డే, కృతీ సనన్, కృతీ కర్భందా ముఖ్యపాత్రల్లో ఫర్హాద్ సంజీ రూపొందించిన కామెడీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం ఇది. ఈ సినిమా కథాంశం పునర్జన్మల చుట్టూ తిరుగుతుంది. ఇందులోని ప్రతి పాత్రకి 600 ఏళ్ల క్రితం పాత్రలతో సంబంధం ఉంటుందట. వాళ్లందరూ ఆత్మల రూపంలో తిరిగొచ్చి తిప్పలు పెడతారట. ఈ సినిమాలో నటీనటుల లుక్స్‌ను రిలీజ్ చేశారు అక్షయ్ కుమార్. రాజకుమారుడు బాలా, లండన్ రిటర్న్ హ్యారీగా రెండు లుక్స్‌లో అక్షయ్ కనిపిస్తారు. అక్షయే కాదు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. -
పగ ఎత్తు ఎంతో చూపిస్తా
‘‘ఏ వస్తువుని కొలవడానికి అయినా ఎత్తును ప్రమాణంగా చూస్తారు. ఇప్పుడు నా పగ ఎత్తెంతో చూపిస్తాను’’ అంటున్నారు రితేష్ దేశ్‌ముఖ్. ‘మర్జావాన్’ సినిమాలో మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు రితేష్. ‘నా ఎత్తు సంగతి తర్వాత.. నేను వేసే ఎత్తుల గురించి చూడండి’ అన్నట్టు ఆయన పాత్ర ఉంటుందట. మిలాప్ జావేరి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మర్జావాన్’. రకుల్‌ప్రీత్ సింగ్, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రితేష్ మూడు అడుగుల ఎత్తు ఉండే విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను శుక్రవారం విడుదల చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. గతంలో ఈ కాంబినేషన్లో (మిలాప్– సిద్ధార్థ్ – రితేష్) ‘ఏక్ విలన్’ సినిమా వచ్చింది. -
టైమింగ్ ముఖ్యం
‘పర్ఫెక్ట్ టైమింగ్‌లో కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే కామెడీ పండదు. కామెడీ పాత్రలు చేయడం అంత సులువేం కాదు’ అంటున్నారు కృతీసనన్. హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’లో ఆమె పాత్రలో మంచి కామిక్ యాంగిల్ ఉందట. ఈ విషయం గురించి కృతీ చెబుతూ– ‘‘ఇవాళ్టి పరిస్థితుల్లో అందరి జీవితాల్లోనూ ఏదో రకమైన స్ట్రెస్ ఉంటోంది. అందుకే మా సినిమాలకు వచ్చే ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసి బాగా నవ్వించాలి. ఇప్పుడు నేను చేస్తున్న ‘హస్‌ఫుల్ 4, అర్జున్ పటియాలా’ చిత్రాల్లోని నా పాత్రలో మంచి కామిక్ యాంగిల్ ఉంది. మనలో ఎంత యాక్టింగ్ స్కిల్ ఉన్నప్పటికీ కామెడీ చేయడానికి మాత్రం టైమింగ్ చాలా ముఖ్యం. లొకేషన్లో అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌ల కామెడీ టైమింగ్‌ను చూసి ఎంతో నేర్చుకున్నాను’’ అన్నారు కృతీ సనన్. -
‘ఏడేళ్ల క్రితం అడిగితే సమాధానం చెప్పేవాడు’
ముంబై : తన తండ్రిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ఆరోపణల పట్ల రితేష్ దేశ్‌ముఖ్ స్పందించారు. మన మధ్యలేని వారి గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు రితేశ్. ఇంతకు విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. ‘26/11 దాడులు జరిగినప్పుడు దివంగత మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తన కుమారుడు రితేశ్‌కు సినిమా అవకాశాలు ఇప్పించే ప్రక్రియలో బిజీగా ఉన్నార’ని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రితేష్.. ట్విటర్లో ఓ లేఖను పోస్ట్ చేశారు. ‘గౌరవనీయులైన మంత్రి.. 26/11 దాడులు జరిగినప్పుడు మా నాన్నతో కలిసి తాజ్ హోటల్ని సందర్శించిన మాట వాస్తవమే. కానీ మీరు ఆరోపించినట్లు ఆ సమయంలో నేను షూటింగ్లో బిజీగా ఉన్నానన్నది అబద్ధం. ఆయనకున్న పలుకుబడితో నాకు సినిమా అవకాశాలు ఇప్పించలేదు. నన్ను సినిమాలోకి తీసుకోవాలని ఏ దర్శకుడితో, నిర్మాతతో కానీ మా నాన్న చర్చించింది లేదు. ఆ విషయంలో నేను ఇప్పటికీ చాలా గర్వపడతాను. ప్రశ్నించే హక్కు మీకు కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ లోకంలో లేని వ్యక్తి గురించి మీరు ఇలా ఆరోపించడం సరికాదు. ఏడేళ్ల క్రితం మీరు ఈ ప్రశ్న అడిగి ఉంటే మా నాన్న సమాధానం ఇచ్చేవారు. మీ ఎన్నికల ప్రచారాలకు ఆల్ ది బెస్ట్ సర్’ అని పేర్కొన్నారు రితేశ్. pic.twitter.com/5NHzYQATNs — Riteish Deshmukh (@Riteishd) May 13, 2019 2004 నుంచి 2008 వరకు విలాస్‌రావ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012 ఆగస్టులో అనారోగ్యంతో ఆయన మరణించారు. -
రాజాధిరాజా
విభిన్న సినిమాలు, విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుంటారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఇటీవల రిలీజైన ‘కేసరి’లో అక్షయ్ తలపాగా కట్టుకున్న సిక్కు పాత్రలో కనిపిస్తే తదుపరి చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’లో గుండుతో కనిపిస్తారట. ‘హౌస్‌ఫుల్’ కామెడీ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ఇది. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేశ్ దేశ్‌ముఖ్, రానా, కృతీ సనన్, కృతీ కర్బందా, పూజా హెగ్డే, బొమ్మన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. పునర్జన్మల ఆధారంగా ఈ చిత్రకథ ఉండబోతోందని టాక్. సినిమాలో అక్షయ్ కుమార్ 16వ శతాబ్దపు రాజుగా నటించారట. గుండు, మెలి తిరిగిన మీసాలతో అక్షయ్ లుక్ ఉండబోతోంది. పొడుగు జుట్టుతో బాబీ డియోల్ గెటప్ ఉండబోతోందట. గత జన్మలో జరిగిన కథను రాజస్థాన్‌లో, ప్రస్తుత కథను లండన్‌లో షూట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడంతో నానా పటేకర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అతని స్థానంలో రానా నటించారు. -
సేమ్ మ్యాజిక్
‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా అలరించిన జెనీలియాను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన జెనీలియా ఆరేళ్ల క్రితం తెలుగులో రానా హీరోగా వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత తెలుగుతెరపై కనిపించలేదు. అదే ఏడాది బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నారామె. ఆ తర్వాత ఇప్పటి వరకు మూడు హిందీ సినిమాల్లో గెస్ట్‌గా మెరిసిన ఆమె ‘మౌళి’ అనే మురాఠి చిత్రంలో ఓ పాటలో నర్తించారు. ఈ సినిమాలో ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ హీరో కావడం విశేషం. ‘‘జెనీలియాతో నటించే అవకాశాన్ని వదులుకోవాలనుకోను. ఈ సాంగ్‌లో నటించమని తనని అడిగా. నాలుగు సంవత్సరాల తర్వాత మేమిద్దరం కలిసి ఓ డ్యాన్స్ నంబర్‌కు కాలు కదపడం హ్యాపీగా ఉంది. ఇంతకుముందు జెనీలియా డ్యాన్స్‌లో ఎలాంటి మ్యాజిక్ ఉందో సేమ్ మ్యాజిక్ ఇప్పుడు కూడా ఉంది’’ అన్నారు రితేష్. ఈ సినిమాకు జెనీలియా నిర్మాతగా వ్యవహరించారు. నాలుగేళ్ల క్రితం ‘లయ్ భారీ’ అనే సినిమాలోని ఓ సాంగ్‌కు కలిసి నటించారు రితేష్ అండ్ జెనీలియా. -
గేమ్స్ ఆడొద్దు
షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్. దర్శక ద్వయం ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించిన చిత్రమిది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, కృతీసనన్, కృతీ కర్భందా, బాబీ డియోల్, రానా, పూజా హెగ్డే కీలక పాత్రలు చేశారు. ‘‘హౌస్‌ఫుల్ 4 షూటింగ్ పూర్తయింది. ఇంత పెద్ద మల్టీస్టారర్‌లో నటిస్తానని ఊహించలేదు. మంచి క్వాలిటీస్ ఉన్న అక్షయ్ సార్‌తో కలిసి నటించడం ఫుల్ హ్యాపీ. ఆయనతో గేమ్స్ ఆడకండి. ఎందుకుంటే ఎక్కువ శాతం గెలుపు ఆయనదే అవుతుంది’’ అని పేర్కొన్నారు పూజా. ‘‘షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు అక్షయ్. ఈ సినిమాకు తొలుత సాజిద్ ఖాన్ దర్శకుడిగా వ్యవహరించారు. కానీ ‘మీటూ’ ఆరోపణల వల్ల ఆయన తప్పుకున్నారు. అలాగే నానా పటేకర్ ప్లేస్‌లో రానా నటించారు. -
కొత్తగా కనిపిస్తా
రకుల్ ప్రీత్‌సింగ్ ఇంటి డోర్‌ని ఈ మధ్య తట్టిన అవకాశాలన్నీ బాలీవుడ్, కోలీవుడ్ నుంచే వచ్చినట్టున్నాయి. అందుకే ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో పాత్ర తప్ప ఆమె చేస్తున్న మిగతావన్నీ హిందీ, తమిళ సినిమాలే. ‘వెంకీమామ’ సినిమా కమిట్ అయ్యారనే వార్త ఉంది. ఇప్పటికే హిందీ చిత్రం ‘దేదే ప్యార్ దే’ షూటింగ్ పూర్తి చేసిన రకుల్ తాజాగా మరో హిందీ సినిమా కూడా ఓకే చేశారు. మిలాప్ జవేరీ దర్శకత్వంలో ‘మర్జావా’ చిత్రంలో హీరోయిన్గా ఎంపికయ్యారామె. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలుగా నటిస్తారు. తారా సుతారియా మరో హీరోయిన్. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్గా రకుల్ కనిపిస్తారట. ఈ సినిమాలో తన పాత్ర గురించి రకుల్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు మిలాప్ నాకీ స్క్రిప్ట్ వినిపించగానే నచ్చింది.నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఏదైనా చేయాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి పాత్ర అది. అలాగే నా పాత్రకు మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ఇలాంటి పాత్ర పోషించలేదు. ఇందులో కొత్తగా కనిపిస్తాను. సిద్ధార్థ్‌తో ‘అయ్యారే’ తర్వాత మళ్లీ యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఇక అజయ్ దేవగన్, రకుల్, టబు తదితరులు నటించిన ‘దేదే ప్యార్ దే’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. తమిళంలో సూర్యతో ‘ఎన్జీకే’, కార్తీ సరసన ‘దేవ్’ చిత్రాలతో పాటు శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు రకుల్. -
మరో బాలీవుడ్ చాన్స్ కొట్టేసిన రకుల్
ఇటీవల సౌత్ లో కాస్త జోరు తగ్గించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. బాలీవుడ్ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయిన రకుల్ ఇటీవల అయ్యారితో మరోసారి ఆకట్టుకుంది. తాజాగా మరో బాలీవుడ్ మూవీకి రకుల్ సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న మర్జావాన్ సినిమాతో రకుల్ హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమా కోసం సిద్ధార్థ్ మల్హాత్రాతో రెండో సారి జత కడుతోంది రకుల్. అయ్యారి సినిమాలోనూ వీరిద్దరు జంటగా నటించిన విషయం తెలిసిందే. మిలప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మర్జావాన్ సినిమాను టీ సిరీస్‌తో కలిసి నిఖిల్ అద్వాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. -
‘తమ్ముడు నువ్వు ఎంతో ఎదిగిపోయావ్’
బడా హీరోల సినిమాలు.. చిన్న హీరోల సినిమాలు ఒకేసారి రావు. ఒకవేళ అలాంటి పరిస్థితే ఎదురయితే చిన్న హీరోలు రేస్ నుంచి తప్పుకుంటారు. ఎప్పుడో.. ఎక్కడో కథ మీద బాగా నమ్మకం ఉంటే తప్ప చిన్న హీరోలు, బడా హీరోలతో పోటికి దిగరు. ప్రస్తుతం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘జీరో’.. రితేష్ దేశ్ముఖ హీరోగా వస్తోన్న మరాఠీ చిత్రం మౌలీ చిత్రం రెండు ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద బరిలో దిగునున్నాయి. ఈ క్రమంలో షారుక్ కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు రితేష్ దేశ్‌ముఖ్. ఎందుకంటే షారుక్ ఖాన్ ‘జీరో’ చిత్రం ఇండియావైడ్‌గా విడుదలవుతోంది. ఈ క్రమంలో అదే రోజు ‘మౌలీ’ సినిమా కూడా వస్తే మరాఠీ ప్రజలు వారి మాతృభాష చిత్రానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. దాంతో ఆ ప్రభావం షారుక్ ‘జీరో’ చిత్రం మీద పడుతోంది. ఇవన్ని ఆలోచించిన రితేష్, షారుక్ కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన షారుక్, రితేష్ మంచి మనసుకు మురిపిపోయి ట్విట్టర్ వేదికగా తన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘నా చిన్న తమ్ముడు చాలా పెద్దవాడు అయ్యాడు. నీ విశాల హృదయానికి.. ప్రేమకు, గౌరవానికి నా ధన్యవాదాలు. నీ అవసరం కన్నా నా ఆత్మాభిమానానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చావ్. ఈ విషయం నిజంగా నా హృదయాన్ని కదిలించింది. చాలా సంతోషంగా ఉంది’ అంటూ షారుక్ ట్వీట్ చేశారు. @Riteishd jab chota bhai bahut bada ho jaata hai. Thank you baby for the love respect and largesse of heart you showed me today. Grateful. Touched. I am so happy to have ‘asked’ something of a friend who kept my self respect higher than his own need. — Shah Rukh Khan (@iamsrk) November 5, 2018 ‘మౌలీ’ రితేష్ దేశ్‌ముఖ్ నటిస్తోన్న రెండో మరాఠీ చిత్రం. రితేష్ ‘లయి భారి’ అనే మరాఠి చిత్రంతో 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రితేష్ హిందీలో ‘హౌస్‌ఫుల్ 4’లో అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి, బాబి డియోల్‌తో కలిసి నటిస్తున్నాడు. -
మెరుపులా మెరిసి..
రానా కేవలం తెలుగు హీరోనే కాదు. టాలీవుడ్, బాలీవుడ్ అటు తమిళం కూడా కవర్ చేస్తూ బిజీగా ఉన్న నటుడు. కథ బావుంటే హీరో, విలన్ అని పట్టించుకోరు. సినిమాలో తన స్క్రీన్ టైమ్ ఎంత సేపు అని కూడా ఆలోచించరు. అతిథి పాత్రలో ఇలా కనిపించి అలా మాయమవుతుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ మెరుపులా మెరుస్తా అంటున్నారు రానా. చక్రి తోలేటి దర్శకత్వంలో సోనాక్షి సిన్హా, కరణ్ జోహార్, రితేష్ దేశ్‌ముఖ్, బొమన్ ఇరానీ ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వెల్కమ్ న్యూయార్క్’. ప్రస్తుతం రానా ‘మడై తిరందు’, ‘హాతీ మేరా సాథీ’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘వెల్కమ్ న్యూయార్క్’ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. -
చారిత్రక చిత్రంలో సల్మాన్ ఖాన్
వరుస బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న కండలవీరుడు సల్మాన్ ఖాన్, ఓ చారిత్రక చిత్రానికి అంగీకిరంచాడు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సల్మాన్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో నటించడం లేదట. అసలు తన పాత్ర ఏంటో కూడా తెలుసుకోకుండా సల్మాన్ ఈ సినిమాకు ఓకె చెప్పాడట. బాలీవుడ్ యంగ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ లీడ్ రోల్లో నేషనల్ అవార్డ్ సాధించిన రవి జాదవ్ దర్శకత్వంలో శివాజీ జీవితకథ ఆధారంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు సల్మాన్‌ను సంప్రదించగా వెంటనే ఒప్పేసుకున్నాడు. సల్మాన్ లాంటి సూపర్ స్టార్ తమ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తుండటంపై హీరో రితేష్‌తో పాటు చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
హీరో - హీరోయిన్ జంటకు రెండో కొడుకు
బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్, హీరోయిన్ జెనీలియా డిసౌజా జంటకు మళ్లీ కొడుకు పుట్టాడు. ఇంతకుముందే వీళ్లకు రియాన్ అనే ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. తన పెద్దకొడుకు రియాన్‌కు ఇప్పుడు ఓ తమ్ముడు పుట్టాడని చెప్పాడు. ''హే గయ్స్, మా ఆయి, బాబా (అమ్మ, నాన్న) నాకు ఇప్పుడే ఓ చిన్నారి తమ్ముడిని బహుమతిగా ఇచ్చారు. ఇక నా బొమ్మలన్నీ వాడివే.. రియాన్'' అంటూ తన పెద్ద కొడుకు చెబుతున్నట్లుగా రితేష్ ట్వీట్ చేశాడు. వెంటనే బాలీవుడ్ ప్రముఖులంతా ఒకరి తర్వాత ఒకరుగా రితేష్ - జెనీలియా జంటకు తమ అభినందనలు తెలిపారు. హుమా ఖురేషి, బొమ్మన్ ఇరానీ, అదితి రావు హైదరీ, రాజ్‌నాయక్, బాబా సెహగల్, సచిన్ జోషి, కమాల్ ఆర్ ఖాన్, వరుణ్ ధావన్, ఆలియా భట్... ఇలా చాలామంది రితేష్, జెనీలియాలను అభినందించారు. Hey guys, my Aai & Baba just gifted me a little brother. Now all my toys are his...- Love Riaan pic.twitter.com/H8JSKE0A3d — Riteish Deshmukh (@Riteishd) 1 June 2016 -
'నాన్న..' తొలిసారి ఆ పిలుపెంత మధురం!
'నాన్న'.. మధురమైన పిలుపు అది. పెళ్లయ్యాక ప్రతి పురుషుడు తపించేది ఆ పిలుపు కోసమే. తమ పిల్లలు నోరారా 'నాన్న' అని పిలిస్తే.. పులకించని తండ్రి హృదయం ఉండదు. అలాంటి మధురానుభూతి నూతన సంవత్సరం సందర్భంగా బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌కు లభించింది. జనవరి 1నాడు రితేశ్, జెనీలియా దంపతుల గారాల కొడుకు రియాన్ 'బాబా' అని పిలిచాడట. ఆ మ్యాజికల్ మోమెంట్స్‌ను రితేశ్ ఎంతో సంబురపడుతూ ట్విట్టర్లో పంచుకున్నాడు. 'నా కొడుకు నన్ను చూస్తూ 'బాబా' (నాన్న) అన్నాడోచ్.. 2016కు ఇంతకంటే గొప్ప స్వాగతం ఏముంటుంది' అంటూ రితేశ్ ట్విట్టర్లో తెలిపాడు. 2016లో 'బ్యాంక్ చోర్', 'గ్రేట్ గ్రాండ్ మస్తీ', 'హౌస్‌ఫుల్ 3' సినిమాలతో రితేశ్ ప్రేక్షకులను పలుకరించనున్నాడు. What a start to 2016 - My Son looks at me n calls out 'Baba' for the first time. #magical — Riteish Deshmukh (@Riteishd) January 1, 2016 -
హీరోయిన్ కొడుకు 'ఫస్ట్' లుక్
ముంబయి : సోషల్ మీడియాలో మరో హీరో, హీరోయిన్ కొడుకు ఫస్ట్‌లుక్ హల్చల్ చేస్తోంది. బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తన ముద్దుల తనయుడు రియాన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరు నెలల ఈ బుడతడు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌లు 2014 నవంబర్‌లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. పుత్రోత్సాహంతో ఉన్న ఈ జంట ఎప్పటికప్పుడు బుజ్జాయి వార్తలను ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా అబిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ తన కుమారుడి ఫోటోలను తొలిసారిగా సోషల్ మీడియాలో పెట్టి అభిమానులకు ఆనందం కలిగించారు. ఆమధ్య హీరో అల్లు అర్జున్ కూడా ఇదేవిధంగా తన ముద్దుల కొడుకు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిచేశారు. -
ఇప్పుడు మా అమ్మ గుర్తుకొస్తోంది! - జెనీలియా
జెనీలియా... ఈ పేరు చెప్పగానే ‘బాయ్స్’ చిత్రంలోని టీనేజ్ అమ్మాయి దగ్గర నుంచి ‘బొమ్మరిల్లు’లోని హాసిని పాత్రధారిణి దాకా ఎన్నో వెండితెర దృశ్యాలు గుర్తుకొస్తాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్రస్థాయికి చేరుకొని, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్ళి చేసుకున్న ఈ అందాల నటి కొద్ది నెలల క్రితమే ఒక బాబుకు తల్లి అయ్యారు. అమ్మగా కొత్త బాధ్యతలు మీద పడ్డ జెనీలియా ఈ కొత్త పాత్రను కూడా బాగా ఆస్వాదిస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లల డయాపర్ల బ్రాండ్ ‘ప్యాంపర్స్’ ప్రకటనకు ఎండార్స్మెంట్ చేసిన జెనీలియా తన తల్లి పాత్ర గురించి తొలిసారిగా పంచుకున్న విశేషాలు... ♦ ఏకకాలంలో ఇంటి పని, చంటిబాబు పని చూసుకోవడం కొద్దిగా కష్టమే. కానీ, నా తొలి ప్రాధాన్యం బాబుకే! ఆ తరువాతే ఇంటి వ్యవహారాలు. మా బాబు రియాన్‌కు మూడు నెలలే. అదృష్టం ఏమిటంటే - రియాన్ రాత్రంతా నిద్రపోతాడు. అందువల్ల తల్లిగా నేను హ్యాపీ. నేను సంతోషంగా ఉండడం వల్ల అన్ని పనులూ సవ్యంగా చేసుకోగలుగుతున్నా. సానుకూలంగా స్పందించగలుగుతున్నా. బాబును హాయిగా ఆడించగలుగుతున్నా. ♦ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాబు పనులన్నీ స్వయంగా నేనే చేసుకోవడం వల్ల బాగా అలసిపోతున్నా. అయితే, కొత్తగా వచ్చిన ఈ తల్లి పాత్రను బాగా ఆస్వాదిస్తున్నా. తల్లి కావడం ఒక అద్భుతమైన అనుభూతి. నాకు పదే పదే మా అమ్మ గుర్తుకొస్తుంటుంది. మనకంటూ ఒక బిడ్డ పుట్టాక, మనకు మన అమ్మ మీద అమితంగా ప్రేమ పెరుగుతుందంటే నమ్మండి. ♦ చంటిపిల్లాణ్ణి పెంచడంలో మా అమ్మ నుంచి, మా అత్త గారి నుంచి బోలెడన్ని సలహాలు తీసుకుంటూ ఉంటా. అయితే, నా బుద్ధికి తోచినట్లు చేస్తా. చంటిపిల్లాడికి ఏం కావాలన్నది తల్లికి తెలిసినట్లుగా వేరెవరికీ తెలియదు. అయినా ఎవరో అన్నట్లు, చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ, చెడ్డ తల్లులు మాత్రం ఉండరు! ♦ మా ఆయన రితేశ్ దేశ్‌ముఖ్ కూడా పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారు. నేను గర్భవతినన్న సంగతి తెలిసిన క్షణమే ఆయన ఒక మాట అన్నారు... ‘నిజానికి, నువ్వొక్కదానివే కాదు, మన ఇద్దరం ఇప్పుడు ప్రెగ్నెంటే!’ జీవిత భాగస్వామి నుంచి ఏ స్త్రీకైనా అంతకు మించి ఇంకేం కావాలి! తండ్రి కాబోతున్న క్షణంలో ఆయనకొచ్చిన గొప్ప ఆలోచన అది. ఇలాంటి ఆలోచన వల్ల జీవిత భాగస్వాములిద్దరూ ఆ గర్భధారణ సమయాన్నీ, ప్రసవాన్నీ కలసి ఆస్వాదిస్తారు. అలాగే, తల్లితండ్రులుగా వచ్చిపడ్డ కొత్త బాధ్యతల్ని పంచుకుంటారు. రితేశ్ కూడా మా బాబుకి డయాపర్స్ మారుస్తారు, స్నానం చేయిస్తారు. బాబు నిద్రపోకపోతే, నాతో పాటే రాత్రంతా మెలకువగా ఉంటారు. పసిపిల్లల్ని పెంచడం కేవలం తల్లి బాధ్యతే కాదు, తండ్రి బాధ్యత కూడా అని గ్రహిస్తే, ఆ సంసారంలో అంతకన్నా ఆనందం ఏముంటుంది! ♦ నన్నడిగితే తల్లులకు మాతృత్వపు సెలవు ఇచ్చినట్లే, తండ్రులకు ‘పేటర్నిటీ లీవ్’ ఇవ్వాలి. దాన్ని చట్టబద్ధం చేయాలి. లేకపోతే, ఇతర పనుల్లో పడిపోయి, భార్యాబిడ్డలతో గడిపే తీరికే వాళ్ళకు ఉండదు. ♦ పెళ్ళయ్యాక మీలో వచ్చిన మార్పేమిటి? తల్లయ్యాక వచ్చిన మార్పేమిటి? అని నన్ను అందరూ అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే, మనం మనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకొంటూ పిల్లల్ని పెంచాలి. అది చంటిపిల్లల పెంపకంలో ప్రతిఫలిస్తుంది. అలా కాకుండా మరొకరిలా ఉండడానికి ప్రయత్నిస్తే అప్పుడిక మొత్తం కుప్పకూలిపోతుంది. హుషారుగా, ఆనందంగా ఉండే అమ్మాయి మా అమ్మ అని గుర్తించేలా మా అబ్బాయి పెరగాలనుకుంటున్నా. ♦ పసిబిడ్డకు తల్లి అయ్యాక సెలబ్రిటీలకే కాదు, ఎవరికైనా శారీరక మార్పులు తప్పవు. గర్భవతిగా ఉన్నప్పుడు మనం ఎంతైనా లావు కావచ్చు. బిడ్డ పుట్టాక మళ్ళీ క్రమంగా అందం మీద దృష్టి పెట్టక తప్పదు. అలాగే, తల్లి పాత్ర వల్ల నటిగా లైమ్‌లైట్‌కు దూరమయ్యానని అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, జీవితంలో నేనేమీ మిస్సవడం లేదు. తల్లి పాత్ర అలవాటయ్యాక ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నా. మొన్నటిదాకా నటిగా, నిన్న గర్భవతిగా, ఇప్పుడు తల్లిగా - ఇలా ప్రతి దశనూ ఆస్వాదిస్తూనే ఉన్నా. -
మా అబ్బాయిని మీరు చూశారా?
హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన జెనీలియా డిసౌజా ఇటీవలే తల్లి అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న జెనీలియా.. గుమ్మడిపండు లాంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చుక్కల చుక్కల చొక్కా వేసుకున్న తన కొడుకు పొటోను జెనీలియా స్వయంగా ట్విట్టర్లో షేర్ చేసింది. రియాన్ రితేష్ దేశ్‌ముఖ్ అనే పేరు పెట్టిన ఈ చిన్నారితో జెనీలియా తీయించుకున్న ఫొటో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రస్తుతం శరవేగంగా వ్యాపిస్తోంది. బాలీవుడ్లోనే అందమైన జంటగా పేరొందిన జెనీలియా, రితేష్ 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు పదేళ్ల పాటు వారి ప్రేమాయణం సాగింది. ఆ తర్వాతే మూడు ముళ్లు పడ్డాయి. -
రితీష్-జెనీలియాల బుడ్డోడికి భలే పేరు!
ముంబై:బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్, నటి జెనీలియాల జంటకు జన్మించిన మగబిడ్డకు రియాన్ గా నామకరణం చేశారు. నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు ఏ పేరు పెట్టాలనే అంశంపై రితీష్ దేశ్ ముఖ్ ల జంట తీవ్రంగా చర్చించిన అనంతరం శనివారం రియాన్ గా నామకరణం చేశారు. తనకు బాబు పుట్టినప్పట్నుంచీ రితీష్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది. -
డిసౌజా..దేశ్‌ముఖ్‌ల మూడు తరాలు
ముంబయి : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి జెనీలియా డిసౌజా శనివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమెకు బాబు పుట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది. తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేసిన జెన్నీ, రితేష్ దేశ్‌ముఖ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళుతూ మీడియా కంటికి చిక్కారు. ఈ సందర్భంగా వీరిద్దరూ తల్లి, అత్తగార్లతో కలిసి తమ ముద్దుల కొడుకుతో ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. కొడుకు పుట్టిన ఆనందాన్ని మాత్రం రితేష్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటున్నాడు. #Thank you all for your Love, Prayers & Blessings - the mother @geneliad n the lil one are doing great. అంటూ ట్విట్ చేశాడు. -
జెనీలియా అమ్మ అయింది..
ప్రముఖ నటి జెనీలియా డిసౌజ గత నెల 25న ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆదివారం ముంబైలో తమ ముద్దుల బాబుతో జెనీలియా. చిత్రంలో ఆమె భర్త, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్, ఇతర కుటుంబ సభ్యులు. -
మెగాఫోన్ పట్టనున్న బాలీవుడ్ హీరో
త్వరలోనే తాను మెగాఫోన్ పట్టుకుని ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెబుతున్నాడు.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్. జెనీలియాను పెళ్లి చేసుకుని త్వరలో ఓ బిడ్డకు తండ్రి కూడా కాబోతున్న రితేష్.. సినిమా తీయడం అద్భుతమైన కళ అని, అటు దర్శకత్వం, ఇటు నిర్మాణం రెండూ కూడా తనకు అత్యంత ఇష్టమైన విషయాలని చెప్పాడు. నిర్మాతగా అయితే సినిమా మన సొంతం అనే భావన వస్తుందని, దర్శకుడంటే సృజనాత్మకంగా ఉండాలని.. భవిష్యత్తులో తాను తప్పక దర్శకత్వం వహిస్తానని తెలిపాడు. నిర్మాతగా రితేష్ తీసిన 'ఎల్లో' అనే మరాఠీ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రితేష్ దేశ్‌ముఖ్ కుమారుడైన రితేష్.. తాను రాజకీయాల్లోకి వెళ్తానో లేదో మాత్రం చెప్పలేనన్నాడు. అయితే, ఒక పౌరుడిగా మాత్రం దేశం గురించి తప్పకుండా తెలుసుకోవాలని తెలిపాడు. -
జెనీలియా స్కర్ట్‌తో రితేష్
‘‘నీ మినీ స్కర్ట్ ఒకసారి నాకు ఇస్తావా... వేసుకోవాలనిపిస్తోంది’’ అని భార్యను భర్త అడిగితే... ఖంగు తినడం ఖాయం. ఇటీవల జెనీలియాకు అలాంటి షాకే తగిలింది. అయితే, తన భర్త స్కర్ట్ ఎందుకు అడిగాడో తెలుసుకున్న తర్వాత హాయిగా నవ్వుకున్నారు జెనీలియా. సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, రామ్‌కపూర్, బిపాసా బసు, ఇషా గుప్తా, తమన్నా ముఖ్య తారలుగా రూపొం దిన చిత్రం ‘హమ్ షకల్స్’. ఇందులో సైఫ్ ఆడవేషంలో కనిపించనున్న విషయం తెలిసిందే. రితేష్ కూడా ఈ అవతారంలో కనిపించి, అలరించనున్నారు. మినీ స్కర్ట్, పైకి మడిచి ముడివేసిన షర్ట్‌తో వీలైనంత గ్లామరస్‌గా కనిపించాలనుకున్నారు ఆయన. అందుకే తన శ్రీమతి స్కర్ట్ అడిగి తీసుకున్నారు. జెన్నీ, రితేష్‌ల నడుము కొలత ఒకటే కావడం విశేషం. అందువల్లే రితేష్ తన భార్య స్కర్ట్ ధరించి నటించడానికి కుదిరింది. ఆడవేషంలో రితేష్‌ని చూసి, చాలా హాట్‌గా ఉన్నావ్ గురూ అని లొకేషన్లో అన్నారట. జెన్నీకి కూడా ఈ లుక్ బాగా నచ్చిందట. ఈ నెల 20న సినిమా రిలీజ్ అవు తోంది. -
కోకలు కట్టి.. కేక పెట్టించారు..
టాలీవుడ్ భామ తమన్నా చీరలో మెరిసిపోతుంటే.. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తమన్నాకు పోటీగా చీర కట్టి చూపించా రు బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్‌లు. బుధవారం ముంబైలో ఓ టీవీ షో షూటింగ్లో భాగంగా వీరిలా అల్లరి చేసి.. అందరినీ అలరించారు. -
తప్పు చేస్తే డబ్బులిస్తానన్నాడు!
‘మంచి పనులు చేస్తే.. బహుమతి ఇస్తా’ అని కొంతమంది పందెం కడతారు. కానీ, తప్పు చేస్తే, డబ్బులిస్తానని తమన్నాతో పందెం కట్టారు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్. తను జెనీలియా భర్త. సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, తమన్నా తదితరుల కాంబినేషన్లో ‘హమ్ షకల్స్’ అనే చిత్రం రూపొందుతోంది. సాజిద్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల రితేష్, తమన్నాలపై ఓ సన్నివేశం తీశారు. అది క్లిష్టమైన సీన్ కావడంతో తమన్నా తడబడ్డారు. దాంతో, సీన్‌ని మరోసారి విపులంగా వివరించి, ‘ఈసారి సరిగ్గా చెయ్యాలి’ అన్నారట సాజిద్. కానీ, ఆయనకు తెలియకుండా ‘నువ్వు కనుక ఈసారి కూడా తప్పుగా చేస్తే, నీకు వెయ్యి రూపాయలిస్తా’ అని రితేష్ అన్నారట. కోట్లు సంపాదిస్తున్న తమన్నాకి వెయ్యి రూపాయలు చాలా తక్కువే అయినా, ఊరికే వచ్చింది ఎందుకు వదులుకోవాలని, తప్పుగా చేశారట. దాంతో రితేష్ పది వంద నోట్లు లంచం ఇచ్చుకున్నారు. ఇదంతా చేసింది జస్ట్ తమాషా కోసం అని, సైఫ్, రితేష్ లొకేషన్లో ఉంటే ఇలాంటి తమాషాలు బోల్డన్ని చేస్తారని, ఒక్కోసారి వాళ్లు వేసే జోకులకు కుర్చీల్లోంచి కిందపడి మరీ నవ్వి నంత పని చేస్తామని తమన్నా పేర్కొన్నారు. -
రెండు సంప్రదాయాల జోడి... నిండు హృదయాల సవ్వడి
నవ్వుల హాసిని ‘జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కిందటేడాది ఫిబ్రవరి 3న దంపతులయ్యారు. ఇద్దరి మతాలు వేరు. కుటుంబ నేపథ్యాలు వేరు. దీంతో మొదట ఇరువైపు పెద్దలు ససేమిరా అన్నారు. అయినా ఎవరినీ నొప్పించకుండా ఒప్పించి ఒక్కటైన ఈ జంట విశేషాలే ఈ మనసే జతగా! ప్రేమికులుగా ఉన్నప్పుడు కులాలు, మతాలు అడ్డు రావు. కాని పెళ్లి అనగానే ఎవరి సంప్రదాయాలు వారికి గుర్తుకు వస్తాయి. పెద్దలు ఒప్పుకుంటారో లేదో అని కొంతమంది చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు తమ ప్రేమను తమలోనే దాచుకుని కుమిలిపోతుంటారు. కొందరు మాత్రమే ధైర్యంగా పెద్దలకు తెలియజేసి, వారిని ఒప్పించి మరీ జంటకడతారు. ఈ వరసలోనే చేరుతారు 26 ఏళ్ల జెనీలియా డి సౌజా, 35 ఏళ్ల రితేష్ దేశ్‌ముఖ్‌లు. రితేష్ సినిమాల్లోకి రాకముందు ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ ్జకుమారుడు. అప్పటికి జెనీలియా మోడల్! రితేష్ 2003లో తుఝే మేరీ కసమ్ సినిమాలో నటించడానికి ఓకే చేశారు. కో స్టార్ జెనీలియా! ఇద్దరికీ అది మొదటి సినిమా. ఆ సినిమాతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా వీరి అనుబంధం మాత్రం పెద్ద హిట్ అయ్యింది అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరికి వారు కెరియర్లో బిజీగా ఉంటూనే తమ మధ్య ఆత్మీయతను పెంచుకున్నారు. అనుబంధానికే ప్రాముఖ్యం జెనీలియా: రితేష్‌తో ఉంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. మా మధ్య ప్రేమ చిగురించిందని తెలిశాక ఇరువైపు కుటుంబాల వారికి చెప్పాం. అయితే రితేష్ నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో ఎనిమిదేళ్లపాటు వారి అనుమతి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో రితేష్ చాలా కష్టపడ్డారు. మా మధ్య బంధం మొదలైన నాటి నుంచి వారి ఇంట్లో చెబుతూనే ఉండేవారు. నేనూ అంతే! అమ్మనాన్నలకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉండేదాన్ని. మా మధ్య దీర్ఘకాలంగా కొనసాగిన ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి ఓకే చేశారు. అంతే! మా ఆనందానికి హద్దుల్లేవు. అయితే ఇరువైపులవారికి నచ్చినట్టుగా రెండు మతాల పద్ధతుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా మా ఇంట్లో వారికి నచ్చినట్టుగా చర్చిలోనూ, రితేష్ ఇంట్లో వారికి నచ్చినట్టుగా మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలోనూ మా పెళ్లి అయ్యింది. రితేష్ పెద్ద అన్నయ్య టీవీ నటి అదితి ప్రతాప్‌ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అదితి నటనకు ఫుల్స్టాప్ పెట్టేసింది. దాంతో నేనూ అలాగే నా నటనకు స్వస్తి చెబుతానని చాలా మంది అనుకున్నారు. కాని రితేష్ మాత్రం ఆ నిర్ణయం నాకే వదిలేశారు. అందుకే ఇంకా సినిమాల్లో నటిస్తున్నాను. నేను రితేష్ కలిసి గుళ్లు, గోపురాలు సందర్శిస్తుంటాం. అలాగే చర్చ్‌కీ వెళుతుంటాం. మా పెళ్లయిన కొద్దిరోజులకే ముంబైలో మంచి ఫ్లాట్ కొనుక్కున్నాం. మేం ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్‌ను దగ్గర ఉండి డిజైన్ చేయించారు రితేష్! దేవుడికి నేను చాలా ఇష్టమైన బిడ్డను అని నమ్ముతాను. అందుకే నా జీవితం ఇంత బాగుంది. నాకే చిన్న సమస్య వచ్చినా దేవుడితోనే ముందు చెప్పుకుంటాను...’ అంటూ చిరునవ్వులు చిందిస్తూ, ఎంతో సంబరంగా చెబుతారు ఆమె! విలువ తెలిపిన బంధం రితేష్: మా పెద్దలు పెళ్లికి ఒప్పుకోనప్పుడు జీవితాంతం స్నేహితులుగానే ఉందామని చెప్పింది జెనీలియా! పెద్దల పట్ల గౌరవం, సంప్రదాయాల పట్ల మన్నన ఉన్న వ్యక్తి తను. ఆమె నా జీవితంలోకి వచ్చాకే జీవితం విలువ అంటే ఏంటో తెలిసింది. ప్రేమ, పని రెండూ తనతో పాటే నడుస్తూ నన్ను వ్యక్తిగా నిలబెట్టాయి. నా పుట్టినరోజు కూడా కిందటి వారమే (డిసెంబర్ 17). క్రిస్ట్మస్ కూడా ఈ నెలలోనే! దీంతో మా ఇంట రెండు పండుగల సందడి ఉంటుంది. అంధేరిలోని సెయింట్ క్యాథరీన్ హోమ్ బాలల మధ్య కిందటేడాది క్రిస్ట్మస్ వేడుకలు జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతి’ అంటూ ఆనందంగా వివరిస్తారు రితేష్! ఇద్దరూ సెలబ్రిటీలు. కాంట్రవర్సీ కామన్! సమస్యలూ సహజమే! అయినా ప్రేమను కాపాడుకోవడానికి పెద్దలను ఒప్పించిన ఈ జంటకు అవన్నీ దూదిపింజెల్లాంటివే! పెళ్లయ్యాక నా నటనకు ఫుల్స్టాప్ పడుతుంది అన్నారంతా! కానీ రితేష్ మాత్రం ఆ నిర్ణయాన్ని నాకే వదిలేశారు. - జెనీలియా జెనీలియా నా జీవితంలో కి వచ్చాకే జీవితం విలువ అంటే ఏంటో తెలిసింది. ప్రేమ, పని రెండూ తనతో పాటే నడుస్తూ నన్ను వ్యక్తిగా నిలబెట్టాయి. - రితేష్